02. శుభోదయం

మనం చంద్రుడిని గురువు గారికి ప్రతీకగా తీసుకోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి గురువు దగ్గర వుండే కాంతి ఆయనది కాదు. పరమాత్మది. గురువు కేవలం ప్రతిఫలించే వాడు. ఆయన కూడా నిమిత్తమాతృడే, ఒక దర్పణమే. మీరు ఎలా అయితే సూర్యుడ్ని ప్రత్యక్షంగా చూడలేరో, అలాగే పరమాత్మని ప్రత్యక్షంగా చూడలేరు.

గురువు ఒక దర్పణము. సూర్యుని వెలుతురుని పట్టుకుని మీకు ఇస్తాడు. ఈ ఇవ్వడం లో ఆ వెలుతురు యొక్క వేడి, తీవ్రత సమాప్తం ఐ పోయి, ఎంతో మధురంగా తయారు అవుతుంది. గురువు ఒక మాధ్యమము. ఏది అసంభవమో దాన్ని సంభవం చేస్తాడు. గురువు దగ్గర తనది అంటూ ఏమీ ఉండదు. ఎవరు శూన్యంగా ఆవుతారో వారే గురువులు.

మీరు ఏ విధంగా తప్పిపోతూ ఉంటారో, శోధిస్తూ ఉంటారో, గురువు గారు కూడా అలాగే తప్పిపోతూ, శోధిస్తూ వుండేవారు. మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో, గురువు గారు కూడా అలాంటి తప్పులే చేశారు. అందుకే ఆయన మీకు తోడు ఉండగలరు, సాయం చేయగలరు. తప్పు చేయని వారు, తప్పులని అర్ధం చేసుకోలేరు, ఇతరులకి సాయం చేయలేరు. గురువు మీ మార్గంలోనే మీ కన్నా కొంచెం ముందు ఉంటాడు కనుక, మీకు సాయం చేయగలుగుతాడు. ఎవరు మీరు చేసే ప్రతి తప్పుని క్షమించ గలుగుతారో, వారినే మీరు  గురువు గా స్వీకరించాలి.  ఎవరు ఆ విధంగా క్షమించలేరో, వారు వారి జీవితాన్ని సరిగ్గా జీవించలేదని మీరు అర్ధం చేసుకోవాలి.
--(())--

03. శ్రీ గాయత్రి దేవి.....

ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః |
యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్ ||

గాయత్రీం వరదా భయాంకుశ కశాశ్శుభ్రమ్కపాలం గదామ్ |
శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే ||

గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం.

తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటారు.. అవి..

ముక్త,
విద్రుమ,
హేమ,
నీల,
ధవళ

..వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం..

ఆమె ముఖంలో అగ్ని,
శిరస్సులో బ్రహ్మ,
హృదయంలో విష్ణువు,
శిఖపలో రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.

అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రి గానూ,
మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను,
సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది.

గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగు వేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.

ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యమ్ |
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ||

..ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగా
లు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది...

|| ఓం నమః శివాయ ||]
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
--(())--
04. కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. ఇక విషయంలోకి వెడితే.... పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి  శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.

హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత  నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై  తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

నర,నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు. నర,నారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’................ సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు  సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నర,నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., ఆ సహస్రకవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.#
🌹🌹🌹🌹🙏🙏🙏🙏
05. 🙏🏼 వికర్ణుడు 🙏🏼

మ‌న‌కి క‌ర్ణుడు తెలుసు! విక‌ర్ణుడి గురించి అంత‌గా తెలీదు! దాన వీర శూర క‌ర్ణుడికి ఉన్న‌ది ధాతృత్వ‌మూ వీర‌త్వ‌మూ శూర‌త్వ‌మూ – అయితే విక‌ర్ణుడికి ఇవి ఏవీ లేవు. వీట‌న్నింటితో స‌రిస‌మాన‌మైన ధ‌ర్మ మార్గాన్ని మాత్రం అనుస‌రించాడు. భారతంలో త‌న‌కంటూ స్థానం సంపాదించాడు. అంచేత గుర్తుపెట్టుకోండి. కర్ణుడు వేరు. విక‌ర్ణుడు వేరు. కౌర‌వులు వంద మంది. వారంద‌రి గురించి ప్ర‌త్యేకించి చెప్పుకోం. ధుర్యోధ‌నుడు దుశ్శాస‌నుడు… ఇలా కొన్ని పేర్లే చెప్పుకుంటాం. అలాగే ప‌దిహేడో వాడిగా పుట్టిన విక‌ర్ణుడి గురించీ చెప్పుకుంటాం. అంద‌రూ గాంధారీ ధృత‌రాష్ట్రుని పుత్రులే అయినా వారి వారి న‌డ‌వడిక‌ను బ‌ట్టి ప్రాధాన్య‌త పొందారు.
పాండ‌వులూ కౌర‌వులూ చిన్నాయ‌న పెద‌నాయ‌న పిల్ల‌లు. జూదంలో ఓడిన పాండ‌వులు తాము ఓడ‌డ‌మే కాదు, ద్రౌప‌దినీ ఓడారు. ద్రౌప‌ది వ‌స్త్రాప‌హ‌ర‌ణ ఘ‌ట్టం మీరెరిగిందే. నిండు కొలువులో ద్రౌప‌ది వ‌స్త్రాన్ని దుశ్శాస‌నుడు లాగి వివ‌స్త్ర‌ను చేస్తున్నప్పుడు కురువంశ పెద్ద‌లెవ్వ‌రూ నోరుతెరవ లేదు. అన్యాయ‌మ‌ని అన‌లేదు. ధృత‌రాష్ట్రుడూ భీష్ముడూ స‌హా ఒక్క‌రు కూడా ధ‌ర్మం మాట్లాడ‌లేదు. నోళ్లుండి త‌ల‌లు దించుకు నిల‌బ‌డ్డారే త‌ప్ప పంచ‌పాండ‌వులు అయిదుగురూ అదేమ‌ని మాట్లాడ‌లేదు.
ద్రౌప‌ది వేసిన ప్ర‌శ్న‌కెవ్వ‌రూ స‌మాధాన‌మివ్వ‌లేదు. నోరు విప్పిందీ – గుండె విప్పిందీ – మాట్లాడిందీ ఒక్క‌డే – విక‌ర్ణుడే! జ‌రుగుతున్న‌ది ధ‌ర్మం కాద‌న్నాడు. అధ‌ర్మ‌మ‌న్నాడు. అన్యాయ‌మ‌న్నాడు. ధుర్యోధ‌నుడికి అంతా బ‌ద్ధులైతే, విక‌ర్ణుడు మాత్రం ధ‌ర్మానికి బ‌ద్ధుడైనాడు. ధుర్యోధనుడినే త‌ప్పుప‌ట్టాడు. మూగ‌గా ఉండిపోయిన కురు పాండ‌వులనంద‌ర్నీ త‌ప్పుబ‌ట్టాడు. ద్రౌప‌ది వేసిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌మ‌న్నాడు. తాను ధ‌ర్మం ప‌క్షం నిలిచాడు. నిల‌దీశాడు. రాజ్య బ‌హిష్కారానికి గురైనాడు విక‌ర్ణుడు.

ద్రౌప‌ది ఆ కృత‌జ్ఞ‌త‌తోనే త‌న భ‌ర్త‌లను ఒక కోరిక కోరింది. పాండ‌వులు కూడా ఆ కోరిక తీర్చ‌డానికి ఒప్పుకున్నారు. అదే విధంగా విక‌ర్ణుడిని చంప‌కుండా విడిచిపెడ‌తామ‌న్నారు. కాని మాట త‌ప్పారు. విక‌ర్ణుడు త‌న త‌ల్లి మాట‌కు బ‌ద్ధుడై కౌర‌వుల ప‌క్షానే యుద్ధంలో నిల‌బ‌డ్డాడు. ధ‌ర్మ నిర‌తి క‌ల‌వాడైనా స‌రే శ‌త్రుప‌క్షంలో ఉండ‌డం వ‌ల్ల భీముని గ‌దా ఘాతానికి గురికాక త‌ప్ప‌లేదు. ప్రాణం విడువ‌కా త‌ప్ప‌లేదు! ధ‌ర్మాన్ని అనుస‌రించి స్త్రీని గౌర‌వించిన విక‌ర్ణుడుని పోలిన మ‌రొక‌రు కౌర‌వ పాండ‌వులలోనే కాన‌రారు!
==(())==

06. 💐💐ధ్యానమే పరమాత్మ..దేహమే..జీవాత్మ..💐💐

మనోమాలిన్యం అనునది జన్మజన్మల నుండి మన మనస్సుకు అంటుకొని ఉంటున్నది. దీనిని పూజలచే పునస్కారాలతో పోగొట్టుట అసంభవం. మాలిన్యం అనగా కొన్ని పూలమొక్కలు పుట్టినపుడు లేతగా మృదువ్ఞగా ఉంటుంది. అది పెరిగి పెద్దదైనా, దాని స్వభావం మృదువ్ఞగా ఉంటుంది. అలాగే కంప మొక్క పుట్టి నపుడు లేతగా మృదువ్ఞగా ఉంటుంది. పెరిగి పెద్దదైనా దాని స్వభావం కఠినంగా ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈవిధంగా చెడు సంస్కారాలు మన మనస్సుకు అంటుకొని యుండుట వలన, పరమాత్మతత్వం తెలియుట లేదు.

కొన్ని సందర్భాలలో మన కంటికి పొర ఏర్ప డుతుంది. ఆ పొర దృశ్యం కనపడకుండా చేస్తుంది. అపుడు ఎంక్వయిరీ చేసి కంటిడాక్టర్‌ ఆపరేషన్‌ ద్వారా కంటికి ఉన్న పొర అనే మాలిన్యం తొల గించుట ద్వారా, స్వచ్ఛమైన దృశ్యాన్ని చూడగలు గుతారు. అలాగే జిజ్ఞాసువ్ఞకు భగవతత్వం తెలి యుట లేదు. అంటే ఒక్క ధ్యానం ద్వారానే మన స్సుకు పట్టిన మాలిన్యం తొలగించుట సంభవం.

ఈ ధ్యానం మన జన్మజన్మల చెడు సంస్కా రాలను తుత్తునియలను చేసే బ్రహ్మాస్త్రం.
ఈ చెడు సంస్కారాలను బాహ్య పూజల ద్వారా పోగొట్టుట అసంభవం. బాహ్య వస్తువ్ఞకు మాలిన్యం తగిలితే చేతితో పోగొట్టవచ్చును. మనస్సుకు తగిలిన మాలిన్యం, మనస్సు ద్వారానే పోగొట్టాలి. అంటే శ్వాసపై మనస్సు పెట్టాలి.

ఇతర మార్గమే లేదు. కాబట్టి మన శరీరావయముల ద్వారా తినగా చేతితోగాని, చెవితో గాని బాహ్య సంబంధమైన వాటి ద్వారా చెడు సంస్కారాలను పోగొట్టలేం.
కనపడని మనస్సుకు తగిలిన చెడు సంస్కా రాన్ని కనపడని శ్వాస ద్వారానే చెడు సంస్కారాన్ని పోగొట్టుట సంభవం.

నీరు, అగ్ని, భూమి, ఆకాశం, గాలి(శ్వాస) వీటిలో ప్రధాన పాత్ర వహించేది గాలి.
మనసు-బుద్ధి-చిత్తం-అహంకారం-జ్ఞానం. వీటిలో ప్రధానపాత్ర వహించేది మనస్సు.
ఇకపోతే ఆత్మ. ఈ మూడు కూడా మనకు కనపడనివి. మనస్సు కనపడదు. గాలి కనపడదు. ఆత్మ కనపడదు. కనపడని ఆత్మను పొందాలంటే కనపడని మనస్సును కనపడని (గాలిపై) అనగా శ్వాసపై ఉంచాలి.

ఈవిధంగా శ్వాసమీద మనసు ఉంచినట్లయితే మార్గం సుగమమౌతుంది. బహిర్ము ఖముగా పరుగెత్తే మనస్సును అంతర్ముఖం చేసి, మౌనముగా శ్వాసపై మనస్సు ఉంచాలి. ఈ విధంగా చేసే ధ్యానం విధానం వలననే మనస్సు స్వాధీన పడవలెననే గాని ఇతరత్రా కాదు.

ఈ విధానమైన ధ్యానం అనగా సర్వ దుఃఖ నివారిణి, రోగాల నుండి విముక్తి కల్గించే మహిమాన్వితమైన అపూర్వ ప్రక్రియ.

ఈవిధమైన ధ్యానం. ఆదిమద్యాంత రహితంగా సాగే ధ్యానం సంభ్రమాశ్చర్యాలతో సాగుతుంది. తాను చైతన్యమై సమస్తాన్ని చైతన్యపరుస్తూ ఉంటుంది. ప్రతి అనుభవం నిత్యనూతనంగా ఉంటుంది. భౌతిక ప్రపంచంలో మనం చూసేవి అనుభవించేవన్నియు గతంలో అనుభవించినవే. ఈరకమైన ధ్యానం చేయుట వలన వెరైటీగా ఉంటుంది. మానవ్ఞడు వెరైటీ కొరకు తాపత్రయపడ్తున్నాడు. దృశ్య ప్రపంచంలో వెదుకుతున్నాడు. ఒక సెకను మాత్రం వెరైటీగా అగుపడుతుంది. తర్వాత వెగటు పుడుతుంది. ధ్యానం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.

మనం పుట్టినప్పటి నుండి అన్నం, చారు, పాయసం ఇవన్నియు మనం అనుభవించినప్పటికి వాటి రుచిమారుట లేదు. తిన్నవే తింటున్నాం. చూసినవే చూస్తున్నాం. వెరైటీ ఏమియు లేదు.
ఉత్కంఠ భరితంగా సాగే ఈ ధ్యానం. సదా సంభ్రమాశ్చర్యాలతో ఎడతెరిపి లేకుండా సాగుతుంది.

ఈ ధ్యానమే 14 లోకాలను తన ఆధీనంలో ఉంచుకొని సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు, ఈ గ్రహాలు ఆయా స్థానాల్లో యుండి వాటి యొక్క విధులు నిర్వహించేటట్లు చేస్తూ తన ఆధీనములో ఉంచుకొంటున్నది.
--(())--

07. 💐💐సుబ్రహ్మణ్యస్వామి..విశిష్టత💐💐
సుబ్రహ్మణ్యునికి వేదమంటే ఎంతో ఇష్టం.
వేదమన్నా, వేదాన్ని అర్ధవంతంగా బాగా చదువుకున్న విధ్వాంసులన్నా సుబ్రహ్మణ్యునికి విశేషమైన ప్రీతి.
వేద విధ్వాంసులను సత్కరించినా, గౌరవించినా, సుబ్రహ్మణ్యుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అందుకే నాదాన్ని వింటే అపరిమితమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు.

సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే పార్వతీపరమేశ్వరులు వినాయకుడు కూడా ఎనలేని ప్రీతి పొందుతారు. ఎందుకంటే వారిద్దరి అపారమైన కోరికలను తీర్చినవాడు సుబ్రహ్మణ్యుడే.
ఆయనను మించిన విధ్వాంసుడు లోకంలో ఇంకొకరు లేరు.

నటరాజస్వామిగా ఆయన సమస్త విద్యలకు ఆలవాలం. చేతిలో ఢమరుకం పట్టుకుంటాడు.
అందులోంచే మహేశ్వర సూత్రాలు, వ్యాకరణం,
శబ్దరాశి వచ్చాయి.
సమస్త విద్యలూ పరమశివుని ఆధీనమై ఉంటాయి. అటువంటి పరమశివునికి ఒక కోరిక ఉండేది.
నాకొక అపురూపమైన సత్కారం జరగాలి.
ఏమిటా సత్కారం-పుత్రాదిచ్చేత్ పరాజయం-
ఒక మహా విధ్వాంసుడైన తండ్రికి జరగాల్సిన సత్కారమేమంటే తన కొడుకు చేతిలో ఓడిపోవడం.
తన కన్న కొడుకు చేతిలో తాను ఓడిపోతే
అబ్బా ఇదిరా సత్కారం... అని పరవశించిపోతాడట. తండ్రికన్నా అధికుడైనవాడు పుడితే ఆయన చేతిలో మరణిస్తానన్నాడు- శూర పద్మాసురుడు.

అందుకే ప్రణవానికి రహస్యం. 💐
ప్రణవ విశేషం చెప్పవలసివస్తే స్వామినాధన్‌గా వెలసిన క్షేత్రంలో తండ్రి అయిన పరమశివుణ్ణి పిలిపించి, నాన్నగారు.. చెప్పవలసినవాడు పైనుండాలి.
వినవలసిన వాడు కిందుండాలని తండ్రిని కింద కూర్చోబెట్టి , ప్రణవ రహస్యాన్ని చెప్పాడు స్వామి.
అబ్బ.. నేను చెప్పిన దానికన్నా గొప్పగా చెప్పాడురా.. ఇవాళ నా కొడుకు పొందిన జ్ఞానానికీ,
నాకన్నా గొప్పగా చెప్పిన తీరుకూ నేను మురిసిపోతున్నానన్నాడు పరమశివుడు.
కాబట్టి పరమ శివుణ్ణి సంతోషపెట్టిన మూర్తి సుబ్రహ్మణ్యుడు.

ఇక ఆయన శక్తి అంతా అమ్మవారే..
ఆయన రూపమంతా అమ్మవారే.
ఆయన మంత్రం ఆరక్షరాలతో అమ్మవారే.
ఆయన పుట్టింది అమ్మవారి శరీర రూపమైన శరవణతటాకంలోంచే.
ఇన్ని
అమ్మవారి పోలికలు కలిసి ఉన్న కారణం చేత , పార్వతీదేవికి ఎనలేని ప్రీతిపాత్రుడు.
అందుకే పార్వతీపరమేశ్వరులు కూర్చొని ఉంటే, ఎప్పుడూ అమ్మవారి తొడమీద కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు.
అలాంటి సుబ్రహ్మణ్యునికి నమస్కరించినా,
రెండు పువ్వులు అర్పించినా,
సుబ్రహ్మణ్య నామం చెప్పినా,
దేవాలయానికి వెళ్ళినా,
ప్రదక్షిణం చేసినా ఆయన విశేషమైన అనుగ్రహాన్ని వర్షిస్తాడు.
అంత గొప్ప స్వరూపం శ్రీ సుబ్రహ్మణ్యస్వామిది.
--(())--

08. స్త్రీ‘ ప్రాముఖ్యత

స్త్రీ లేనిదే మానవ జన్మలేదు అనేది
నిజమైన నానుడి.
ప్రతిమనిషికి ఎల్లవేళలా ఒక స్త్రీ
తోడుగా ఉంటుంది.
అది దేవాలయమైనా, దినచర్య అయినా,
జీవిత గమనమైనా

* దేవాలయంలో
     రామునికి             —       సీత
     కృష్ణునికి              —       రాధ
     శంకరునికి            —       పార్వతి
     మంత్రపఠనంలో   —       గాయత్రి
     గ్రంధ పఠనంలో    —      గీత

* దేవుని యెదుట
     వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన
     వీరికి తోడుగా  శ్రద్ధ

* మన దినచర్యలో భాగంగా
      ఉదయానికే    —   ఉష, అరుణ
      సాయింత్రం     —   సంధ్య
      చీకటైతే           —   జ్యోతి, దీప
      రాత్రి మత్తులో  —   నిషా
      పడుకున్నాక    —   స్వప్న

* చేసే పనిలో మనకి తోడుగా
      చూచేటప్పుడు       —   నయన
      వినేటప్పుడు          —   శ్రావణి
      మాట్లాడునప్పుడు  —  వాణి
      తినేటప్పుడు         —   అన్నపూర్ణ
      నడుస్తున్నప్పుడు   —   హంస
      నవ్వుచున్నప్పుడు  —  హాసిని, ప్రసన్న
      అద్దంలో చూస్తే      —  సుందరి
      చేసేపనికి ముందు —  స్పూర్తి
      పని చేయడానికి    —  స్పందన
      మంచి పనికి          —  పవిత్ర
      ఇష్టంగాచేసే పనికి  —  ప్రీతి
      నీరు త్రాగునపుడు —  గంగ
      ఐస్క్రీమ్ తినేటప్పుడు —  హిమజ
      సినిమా చూస్తున్నప్పుడు —  చిత్ర
      అబద్ధ మాడునపుడు —  కల్పన
      నిజం చెప్పేటపుడు  —   నిర్మల
      ఆలోచనలప్పుడు  —  ఊహా, భావన
      చదువుచున్నప్పుడు  —  సరస్వతి
      వ్యాపారంలో      —   ప్రతిభ , ప్రగతి
      సంతోషంలో      —   సంతోషి
      కోపంలో             —   క్షమ
      ఆటలాడునప్పుడు  —  ఆనంది
      గెలపు కోసం            —   జయ, విజయ
      గెలిచిన తర్వాత       —   కీర్తి
      సరిగమలు నేర్చునపుడు  —  సంగీత
      పాటలు పాడునపుడు  —  శృతి, కోకిల
      తాళం వేయునపుడు  —   లయ
      నాట్యమాడునపుడు   —   మయూరి
      సాహిత్య గోష్టిలో    —   కవిత
      నగరాన్ని కాపాడుతూ  —   ప్రకృతి

 * జీవిత గమనంలో మనతో
      విద్యాభ్యాసంలో    —   విద్య
      సంపాదనప్పుడు  —   లక్ష్మి
      చేసేవృత్తిలో          —   ప్రేరణ
      పని చేసి వచ్చాక   —   శాంతి
      చిన్నతనంలో        —   లాలన
      మధ్యవయస్సులో  —   మాధురి
      ముసలితనంలో- కరుణతోపాటు మమత
      జీవితాంతం మనతో  —  “జీవిత”

ఈ విధంగా మనతో అన్నివేళలా
తోడుగా ఉండే  స్త్రీ లందరికీ
ధన్యవాదాలు అందజేస్తూ

🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
--(())--
09. యుగలక్షణాలన్నీ మనిషిలోనే    
 ఉన్నట్టనిపిస్తుంది , గమనించుకొంటే
                 ****

   కాస్త నిలిచి  , నిథానంగా ఆలోచిస్తే , పురాణాలలొ వర్ణించిన నాలుయుగాల లక్షణాలన్నీ , మనిషి పుట్టుకనుండి , ఆఖరి ఘట్టంవరకూ అనుభవస్తున్నవే అనిపిస్తుంది ..

        సృష్టి ,కృతయుగంతో మొదలయి కలియుగంతో అంతమౌతుందని అంటారు ..కృతయుగాన్ని స్వర్ణయుగంగా పోలుస్తూ , కలియుగం అధర్మంతో , అరాచకాలతో ప్రళయంవొచ్చి అంతమౌతుందని అంటారు .. దర్మం , న్యాయం,జ్ఞానం  అన్నపదాలకు అవగాహనలేని కృత యుగంలోనే ఆదిమానవుడి అవతారం మొదలయింది ...మేథస్సు ఎదిగేకొద్దీ , మారుతున్న మనిషి లక్షణాలనుబట్టి , గడిచేకాలం ఇలా ఉంటుందని యుగలక్షణాలను వర్ణించి ఉండొచ్చనిపిస్తుంది ..

        అజ్ఞానం ఆవరించి , మూడమైన కాలంలొ , జ్ఞానానికి మూలమైన దత్తావతారం ప్రకటమైంది కృతయుగంలో .. జ్ఞానం విస్తరించి థర్మాన్ని అనుసరించిన  రాముడు పుట్టింది త్రేతాయుగంలో .. ధర్మాధర్మాలకు  ప్రతీకగా ధర్మరాజ, దుర్యధనులకు మద్య , దర్మరక్షణ కోసం  పరమాత్ముడు అవతరించింది  ద్వాపరయుగంలోనే .. నీతి నియమాలకు మరచి , అధర్మంగా పెట్రేగిపోతూ , నేను నాదనే  బ్రమలో కూరుకుపోయి , కడదశలో మనోవ్యాకులతతో జన్మ వ్యర్థం చేసుకొంటున్నది ఈ కలికాలంలోనే  ..

         మనిషి జన్మించింది మొదలూ  అవగాహన కుదిరే ఆరు , ఏడేళ్ల ప్రాయంవరకూ అన్యచింతనలేక, కల్మషంలేనిమనసుతో  ఓలలాడే  అమ్మఒడి ప్రతివారికి త్రేతాయుగంలాంటి బంగారుకాలం ..
పలకా ,బలపంపట్టి అక్షరాభ్యాసంతో మొదలయి , నేర్చిన చదువులతో జీవితాన్ని చక్కబడుచుకొనే అవకాశంలో తన  థర్మాన్ని పాటించడం  త్రేతాయుగలక్షణం ...
ఇది దర్మం , ఇది అధర్మమంటూ విచక్షణతో మనసు, రాయభారమనే సంకేతాలుపంపుతున్నా , అనుసరించి
మానవత్వాన్ని ప్రదర్శించడం , ఆదమరచి అధర్మకృత్యాలతో పతనమైపోవడం ద్వాపరయుగం లక్షణాలే ... మనిషి ధర్మాధర్మాలలో వేటిని ఆశ్రయించి , అనుభవాన్ని మూటగట్టుకొంటాడో , చివరి దశలో అవే వాడి మనసుకు స్మరణలుగా మిగులుతుంటాయని అంటారు ..
ధర్మానికి విరుద్ధమైన స్వభావాలకు అవే కడలో  మనసును  కలవరానికి , ఆందోళనకు గురిచేసి , జన్మ అంతరించిపోతుంది .. థర్మాన్ని ఆచరించి , నియమానికి కట్టుబడినవాడు ఆహ్లాదంగా , ప్రశాంతంగా , నిష్కల్మషమైన పసిబిడ్డలాంటి చింతనతో జీవిత చరమాంకాన్ని అనుభవానికి తెచ్చుకోగలడని అంటారు ..

        ఇదే బ్రహ్మ , కలి సంవాదంలో కలిలక్షణాలను అధిగమించి , ఉత్తమ థర్మాన్ని ఆచరించగల విదానం కూడా తెలియజేయబడింది ..యుగాలు
నాలుగున్నట్టే , మనిషి జీవితంకూడా నాలుగు పర్వాలుగా గడిచిపోతుంటుంది ..ఆలొచన ఎలా
 మొదలవుతుందో , అంతంకూడా దానితోనే పూర్తిఅవుతుంది ..ఆ ఆలొచనకు విచక్షణ నేర్పి , ప్రేరణనిచ్చేదే  గురుతత్వసారం .. అనుసరించి , ఆచరించేవారికి త్రేతాయుగలక్షణాలుతప్ప , కలిమాయలు ఎన్నడూ దరిచేరే
సాహసంచేయలేవని విజ్ఞులమాట ..

    సర్వం శ్రీగురు పాదార్పణమస్తు
                  **
శ్రీరమణీయం -(462)
🕉🌞🌎🌙🌟🚩

"మనోశుద్ధి సిద్ధించే మార్గం ఏమిటి ?"

ఆధ్యాత్మికతలో శుచి, శుభ్రత అవసరం. శుచి అంటే మానసిక పవిత్రత. శుభ్రత అంటే శారీరక పవిత్రత. ఏదో ఒక ఆలోచన ఎప్పుడూ తప్పదు. అయితే అప్పటికి అవసరంలేని ఆలోచన చేస్తున్న పనికి ఆటంకం అవుతుంది. శ్రద్ధ లోపించి పని చెడుతుంది. ఒక ఆలోచన ఆపినా మరోక ఆలోచన సిద్ధంగా ఉంటుంది. అందుకే ఎదురుగా ఇప్పుడు చేస్తున్న పనికి సంబంధించిన ఆలోచననే చేయటం అలవాటు చేసుకుంటే మనస్సు శుద్ధి అవుతుంది. ఎప్పటికప్పుడు అప్పటికి అవసరమైన ఆలోచనలోనే ఉంటే పని ఫలవంతమైన శాంతి లభిస్తుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'పవిత్రతే మన ధర్మం-ఆచరిస్తే అదే ధ్యానం !'-

🕉🌞🌎🌙🌟🚩
--(())--
10. 💐💐ముత్తయిదువ లక్షణాలు....పవిత్ర చిహ్నాలు💐💐

మొత్తం అయిదు అలంకారాలు ఉన్న
స్త్రీని ముత్తైదువ అంటారు.అవి..💐

1) కాళ్ళకి పట్టీలు, మెట్టెలు
2) చేతులకి గాజులు
3) మెడలో మంగళసూత్రం
4) తలలో పువ్వులు
చివరగా
5) నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ..

1) మొదటగా కాళ్ళకు పట్టిలు మెట్టెలు ఎందుకో చూద్దాం:💐💐

కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది ..

ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది..
ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.

అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది.

అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి.

ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.
గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది.

అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.

 ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు..💐

గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..

మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు.

ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.

అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి,గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని.పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.

అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది ఈ లోహాలతో చేసినవి  శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి.

అందునా పొలం పనులు , కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.

ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది

మూడవది మెడలో మంగళసూత్రం..💐

దీని చివరున్న  బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.
అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.

ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేదిఉపయోగపడుతుంది.
ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.క్యాన్సర్ కి ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.

ఇక నాల్గవది తలలో పూవులు..💐

వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.కలయసమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.

ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం..💐

పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.
ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.

ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగు
లనూ ధరించేవారు!

అవే పద్ధతులు నేటికీ పాటించడం ద్వారా కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని డెవలప్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవనం కొనసాగించు కోవచ్చు...........

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ