***

01. మనస్సు , 02. ప్రేమతో - ప్రేమ లేఖ, 03. నేటి ఆధ్యాత్మికం : ,04. ఆలింగనం అంటే ఏమిటి -(?), 05. ఆశ్రయం కోసమో, 06. భగవంతుడు రెండు సార్లు మనిషి, 7. కంచిలోబంగారుబల్లి_కథ,08. నేటి త్రిపురాంతకం............!!, 09. భేదభావం నశిస్తే జీవన్ముక్తుడే 10. ఓం నమె భగవతే శ్రీరమణాయః
01. మనస్సు
శూన్యమగు ఆకాశమునకు పేరు మాత్రమే కలదు. వేరే రూపములేనట్లు, మనస్సుకు కూడ ఎటువంటి రూపము లేదు. అయినను ఆకాశము వలె మనస్సు సర్వత్ర విస్తరించియున్నది. చంచల శక్తితో కూడిన మనస్సొక్కటియే స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది, స్వర్గ, నరకములకు పోవుచున్నది, యోచించుచున్నది. సంసారమున నిమగ్నమగుచున్నది, పతనమగుచున్నది లేక ముక్తి పొందుచున్నది.
ఇదంతయు
మనస్సు యొక్క పనియే గాని, జగత్తు వేరుగ లేదు. సంకల్పమే మనస్సు. చలనము
నుండి వాయువు, ద్రవ్యము నుండి నీరు వేరుకానట్లు, మనస్సు సంకల్పము కంటే వేరు
కాదు. దేహ రూపియగు బ్రహ్మమే మనస్సనిజెప్పబడి, అది భౌతిక బుద్ధిని
సృష్టించుచున్నది. దృశ్య ప్రపంచమే మనస్సు. చిత్త మాలిన్యముల వలెనే నీకీ
దృశ్యమగు విశ్వము కనిపించుచున్నది. ఈ మాలిన్యం తొలగినచో, దృశ్యము అగుపడదు.
అపుడు నిర్మల దర్పణము వలె స్వచ్ఛమగుదుము.
గాలి
వీచనిచో లతాదులు కదలవు. అలానే ఆత్మలో ఏకత్వముఏర్పడిన, చిత్త స్పందన ఆగి,
రాగ ద్వేషములు వాసనలు దొలగిపోవును. అద్దము నందు ప్రతిబింబము లేకున్న అద్దము
స్వచ్చమగునట్లు, నీవు ఈ జగత్తు కాదు అని భావించిన ద్రష్ట కూడ కేవలుడగును.
ఇదంతయు
విన్న శ్రీరాముడు, వసిష్ఠు నీవిధముగా ప్రశ్నించెను. సత్తునకు వినాశము
లేదు. అసత్తునకు ఉత్పత్తి లేదు. ఎడతెగక దోషములతో నిండి సద్వస్తువు వలె
ప్రకాశించు ఈ జగత్తు, అసత్యమని ఎట్లు తెలుసుకొనగలమో తెలుపు మనగా, వసిష్ఠుడు
ఇట్లు పల్కుచున్నాడు. ఈ దృశ్య ప్రపంచము శాంతించు మంత్రమును
చెప్పుచున్నాను. దీని వలన దృశ్య భావము నశించును. ఆకాశాది భూతములు,
వ్యవహారమందు మాత్రమే జగత్తు అనబడును. కాని పరమార్ధ దశ యందు బ్రహ్మమే కలదు.
ఈ
ప్రపంచము స్వప్నమున గాంచు గృహాదుల వలె, మనస్సు యొక్క కల్పనమే. ఈ మనస్సుకు
యుత్పత్తి లేదు, శరీరము లేదు. స్వప్నము, స్వప్నమును గాంచలేనట్లు మనస్సు
అసత్తయ్యి, నిజేచ్చ వలన, నిజ శరీరమును కల్పించుకొని, దాని వలన, ఇంద్రజాలము
వలె జగత్తును విస్తరించుచున్నది. చంచల శక్తితో కూడిన మనస్సోక్కటియే
స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది.
స్వర్గ
నరకములకు బోవుచున్నది. సంసారమున నిమగ్నమగుచున్నది. ముక్తినందుచుచున్నది.
ఇదంతయు మనస్సు యొక్క పనే. మనస్సు గాక మఱి జగత్తులేదు. మహాప్రళయమున దృశ్య
సృష్టి అంతయు లయమగును. అప్పుడు మిగిలేది బ్రహ్మ మొక్కటియే.
వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము

--(())--

02. ప్రేమతో - ప్రేమ లేఖ
చూడు
రాధ నిన్ను మరవలేకున్నాను, నీ జ్ఞాపకాలు నన్ను వెంట బడు తున్నాయి, మనం
కలసిన రాత్రులు గుర్తుకు వస్తున్నాయి, నీ నవ్వును ఒక అక్షర మాలాగా
వర్ణించాలని ఉన్నది, నీ నవ్వే చీకటిలో వెన్నెలను పంచె ఒక నక్షత్రం లాగా
నాకు కనబడింది, నీ అమృత భాష్యం ఎంత మరవాలన్న మరువ లేకున్నా నంటే అంత
అద్భుత శ్రవణా నందముతో, సత్య స్పూర్తితో, కరుణ రసముతో, కావ్య భావాలతో
వక్తపరిచి మనసును దోచిన, జ్ఞాపకాల వలయ సుందరివి నీవు.
తొలిసారి
నిన్ను చూశా, నీ చిరునవ్వులో కలిశా, నీ సౌందర్యాన్ని ఆస్వాదించా, నీ
కళ్ళల్లో నా నీడను చూశా, నీ పెదాల విరుపు చూశా, నా హృదయ స్పందన తెలియ
పరిచా, నీ ఓర కంటిలో నిలిచా, నీ పెదాలలో తడిశా, నిన్ను నేను మరువ లేక నీపై
పెంచుకున్నాను ఆశా
నాకు
తెలుసు నీ కవ్వింత, నేను గమనించా నీ పులక రింత, వలపు చూపుతూ చూపించావు
నాకు తుళ్లింత, నీ పులకరింత నాలో పెంచును తపనంత, నీకె పంచాలని నాలో పరుగును
గిలిగింత, చెప్పాలని ఉన్నది నాకు ఇంకా కొంత, నీ సంతోషము కొరకు వేచి ఉంటాను
జీవితమంతా
నీ
పరిచయముతో పరవశించా, నిను దగ్గరగా పరికించా, నీకు కావలసినవన్నీ చేయించి
ఉంచా, జతగా అందించి తరించా, కలవరింత తొలగించి ఆనంద పరిచా, నీ విచ్చిన
వింతను గ్రహించా, హమేషా నీకు తోడుగా నడిచా, నీ మనసును బట్టి ప్రవర్తించా,
నా తనువును నీకె అర్పించా, నిను వదలి కొంత కాలం జీవించా, ఇక బ్రతుకంతా
నీకోసం వేచి ఉండ దలిచా
ఓ
మాధవా నీ ఉత్తరమునకు నా ప్రత్యుత్తరము నా హృదయాంతరములో ఉన్న
భావాలను ఒక్కసారి నీకోసం వక్త పరుస్తున్నాను, నీవు చదివి నీ ప్రేరణలను నాకు
తెలియ పరుచు
నీవు
నామనసులో నిలిచిన ఒక గిరి, అదే నాకు నిరంతరము కల్పిస్తుంది సిరి, అందుకే
నీవంటే నాకు ఎప్పుడు గురి, నీకోసం నేను వేచి ఉంటా తప్పని సరి, నీవు
నామనసులో నిలిచి పోయిన పోకిరి, గుర్తుకొస్తున్నది నీవు చేసిన అల్లరి, నీతో
వేగ లేక ఎప్పుడూ అంటాను సరి సరి, అందుకే నీతో కలిసే దాకా ఉంటుంది నా
ఊపిరి.
నా
కల్లల్లో ఎప్పుడు ఉంటుంది నీ ఆకృతి, అదే నేర్పింది నాకు సంస్కృతి, అది ఒక
కృతి, అందుకే నాకు నిత్య సంక్రాంతి, నీ తలపుల వల్లే నాకు నిర్మల ప్రకృతి,
అందుకే నన్ను బ్రతికిస్తుంది కొత్త అనుభూతి.
నా
కళ్ళలో నిలిచి పోయినది మెరుపు, నాకు గుర్తు తెస్తుంది తొలివలపు, అదే మన
ఇద్దరి మధ్య నిలిచిన మలుపు, ఇది ఓటమి కాదు మన ఇద్దరి గెలుపు, కాలమే మన మధ్య
చూపుతున్న మేలుకొలుపు
సరసం
మనల్ని త్తేజ పరిచింది, విరహం మనల్ని ఏకం చేసింది, ఆశయాల మార్గంలో
నడిపించింది, మధుర క్షణాల సాఫల్యం ఫలించింది, మధురాతి మధురం మన మధ్య దాపత్య
సుఖం. దాన్నే గుర్తు చేస్తూ మనమధ్య ఎడబాటు ఉన్న ప్రేమలేఖలు మనల్ని
బ్రతికిస్తుంది.
అంటూ ముగించింది రాధ మాధవకు ప్రేమలేఖ.
--(())--
03. నేటి ఆధ్యాత్మికం :
03. నేటి ఆధ్యాత్మికం :
మనం
అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు * ఖాళీ చేయమని
ఆదేశియస్తే, వెంటనే సామను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము.*
ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము. అలాగే ఈ
శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం
రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము.
ఋణం తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటివేయబడుతుంది.
దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు. అప్పడు అది, తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని, వెళుతుంది. అవే సంచితకర్మలు . ప్రారబ్ధ కర్మలు - అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు.
ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఈ కర్మలు అయితే పక్వానికి వస్తాయో , లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలో
అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ.ఈ దేహం ప్రారబ్ధ కర్మ
ఆధారంగా ఏర్పడింది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ
ఫలాలను అనుభవించవలసిందే.
ప్రారబ్ధం
తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని
విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.
ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు, బంధవులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆయ వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము.
ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి ఖర్చయుపోగా , జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయి.
ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభ వించ డాన కి సిద్ధమవుతాయో , అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది . అందుకే ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో
"
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం"
అని అన్నారు.
మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లుగర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు.
ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము,
అంటే ఇదే. మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము.
అలాగే పాపం పండింది అనేమాట కూడా ఉపయోగిస్తాము.
పాపం పండడమేంటి? అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తోంది.
ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోంది.
ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే.
విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు.
అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది.
ప్రాంజలి ప్రభకు గౌరవనీయులైన "శ్రీనివాసరావుగారు గదిరాజు గారు పంపినది ఇందు పొందు పరిచాను ధన్యవాదములు
04. ఆలింగనం అంటే ఏమిటి -(?)
మనసులు
కలసిన వేళ, హృదయం స్పందించిన వేళ, ప్రకృతి కరుణించిన వేళ, ప్రశాంత
వాతావరణంలో, పున్నమి వెన్నెల కాంతులలో, చల్లగా వీచే గాలియందు ఆణువణువూ
తపించే స్పర్శ హృదయాలు ఏకమవుటం లో ఉన్న ఆనందం, స్వర్గం కన్నా మిన్న అని
నేను అనుకుంటాను, స్వర్గాన్ని అయినా వర్ణించగలము కానీ, సుఖాన్ని వర్ణించటం
ఎవరి తరము కాదు. విద్యార్థులతో ఉన్న పెద్దలతో రామకృష్ణ శర్మ పంతులుగారు
ఈవిధముగా చెపుతున్నారు.
ఆలింగనం
మనుషుల మధ్య ఆప్యాయతకు అనురాగానికి గట్టి ఆనవాలు, తోలి వలపునకు అది
ఓనమాలు, జన్మ జన్మ బంధాలకు, ఆత్మీయతకు, జీవిత సాఫల్యానికి, తన్మయత్వ
స్వభావానికి, తరుణం మించకుండా తమకం తగ్గ కుండా, చలామణి అవుతూ, నిత్య ఆశల వలయంలోకి లాగుతూ, మనస్సును నిర్మలంగా ఏరోజుకారోజు మార్చేది ఇది.
ఒక్కో రకం ఆలింగనానికి ఒక్కో రకం అనుభూతి, వాత్సాయన గ్రంధంలో అనేక రకాల అనుభూతులు మనకు తెలియ పరిచారు.
పెద్దలు మనకు దీవెన ఒక ఆలింగనం అట్లాగే లాలన పాలన చూసి ఆనంద పడుతూ ఇచ్చేది ఆలింగనం .
కరచాలనం
చేసి, దరహాసముతో, మెత్తగా ప్రియమార హత్తు కొనుట మర్యాద పూర్వక ఆలింగనం.
దేశాధినేతలు, ప్రముఖులు, జరిపే మర్యాద పూరకముగా, గౌరవ సూచనగా జరిపేది.
ఒకరకం ఆలింగనం.
పాలిండ్లు
పొంగారి యవ్వన గర్వంతో బాహుబలిని ఆకర్షించి అనంత సుఖాలు పొందాలని ఆశించి,
పెదాల రుచిచూడాలని ఘాడంగా ఆలింగనం చేసే శృంగార నెరజానుల ఆలోచనే వేరు, ఇది
ఒక అనుభూతి.
ఆలింగనాన్ని
ఆశించకుండా దూరం దూరం అని మడి కట్టుకు కూర్చున్న, మన:స్పర్ధలు పెరిగి,
ఆరోగ్యము నలిగి, వయసు పెరిగి, ఆలోచనల మనిషి గా, అనుమాన మనిషిగా మారితే
అపార్ధం పెరిగి సంసారం వీధిన పడుటకు ఆలింగనం లేకపోవుట కుడా ఒక కారణం. ఈ
అనుభూతి పొందలేనివాడు సంసారిగా జీవిన్చలేడని నాభావన.
--(())--
--(())--
05. ఆశ్రయం కోసమో,
అనుభందం కోసమో మద పిచ్చితో మగువ, మగవాన్ని రెచ్చగొట్టి కోరిక తెలియచేసి నేను కన్యను నీవు బ్రహ్మ చారివి మనమధ్య లేదు ఎటువంటి సందేహము నా భాహు భాండాలలో చుక్కు మదనా అని వెంబడి పడేవారు, అటువంటి పరిస్థితులలో లొంగి పోయేవారు సహజం.
విశ్వనాధ గారి వర్ణన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం
పుష్కరతీర్థంలో
జలకాలాడిన మేనక నిలువెల్లా తడిసిన బట్టలతో విశ్వామిత్రుడి
దగ్గరకు వచ్చింది. ఆ 'సురవధూటి' జుట్టును ముని తుడవబోయాడు. ఆమే వారించి
తుడుచుకో, ఆమె తివురు ... అతడు వారించి తుడవగా . అతడు తివురు ...
చేతులందేయుచు పెనంగా చివరిదైన ఫలము తడి కౌగిలింతగా పరిణమించే అన్నారు.
అపనలతో తహ తహ లాడే శృంగార ఆలింగనాల పర్యవసానం చప్పుకో నవసరం లేదు.
నల్లని
మేఘాలలో వెలుగుల విరజిమ్మే విద్యుత్తుదాగి వున్నట్లే....మనం చేసే ప్రతి
కష్టంలోనూ సుఖం దాగి వుంటుంది. ఎదో కొత్తదనం మనలో దాగి ఉన్నది, అది
ప్రపంచానికి అందచేయటమే మనలక్ష్యం గా జీవించాలి, అలాగే మనం చేసే పని మనం
చేస్తున్నాము అనుకుంటాము, మనల్ని చేయిన్చేవాడు ఒక పరమాత్ముడు వెనక ఉండి
నడిపిస్తు న్నాడని అనుకోలేము, ఇది నా కష్టార్జితం అని, ఇది నా సుఖాల
సంతతని, నా తోడు ఆలింగన మని అనుకుంటాం, కానీ రుణాల భంధమని గమనించ లేక
పోతాం అయినా ఇది మాయా ప్రపపంచం, భాహు బందాలలో చిక్కి సుఖ సౌఖ్యాలు పొందిన
వానికే మనస్సు ప్రశాంతిగా ఉండ కలుగు తుందని నాభావనా.
తపస్సు
కొకరు, చదువుకు ఇద్దరు, సంగీతానికి ముగ్గురు, ప్రయాణానికి నలుగురు,
వ్యవసాయానికి ఐదు లేక ఏడుగురుండాలి.యుధ్ధానికి మాత్రం ఎక్కువమంది అవసరం.
ప్రతిఒక్కరి జీవితానికి స్త్రీ పురుషుని సంగమం ఒక్కటే ఒక్కటి, ఇరువురికి
నిత్యకల్యాణం పచ్చ తోరరణం, మనస్సు శాంతి కి సునాటికి మనోనిగ్రహ శక్తికి ఇది
ఒక మార్గం అని నా భావనా
ఈరోజు కొన్ని సామెతలను ఉదాహరింస్తున్నాను, మిగతా భాగము రేపు చెప్పుకుందాం
ప్రేమ కలయికకు ఒక నిదర్శనమైతే, దయ, కరుణ, స్నేహము, వాత్సల్యము, బంధము, ఆత్మీయత, అనురాగము అనేవి కుడా ప్రేమకు చిహ్నాలు.
ప్రతి
ఒక్కరు సృష్టి రహస్యానికీ తోడ్పాటుగా ఉండాలి " జోడు లేని బతుకు, తాడూలేని
బొంగరం " అంది ఒక సామెత ఉన్నది. అనగా బ్రహ్మచారి జీవితం తడులేని బొంగరం
ఒకటేనని దీని భావం ప్రతిఒక్కరు తప్పకుండా పెళ్లాడాలని, సమాజ పురోగతికి
తోడ్పడాలనేది మన పూర్వీకుల ఆకాంక్షగా ఈ సామెత చెపుతున్నది. పురుషులు కానీ
స్త్రీ కాని పెళ్లి కాకుంటే పరిపూర్ణులు కాలేరని మన పెద్దల నమ్మిక.
మీరందరూ
అనవచ్చు పెళ్లిళ్లు కావటంలేదు, చదువులు ఉద్యోగాలు అంటూ కాలయాపన చేస్తూ
వయసు ముదిరేదాకా ఉంటున్నారు, ఎంత ఉన్న సంపాదన సరిపోవటంలేదని ప్రతిఒక్కరు
అనుకుంటున్నారు, ప్రపంచ ఆధునిక పోకడలకు బానిసలై భయపడుతున్నారు, ఈవయసులో
చేయాల్సిన పని ఆవయసులో చేయక భాధను తెచ్చుకుంటున్నారు.
ఏది ఏమైనా మన పెద్దలు చెప్పిన సామెత ఒకటి గుర్తు చేస్తాను " కళ్యాణ మొచ్చినా, కక్కొచ్చినా ఆగవు "
పెళ్ళి
సంబందాల కోసం తిరగడం వాళ్ళ ఏడు జతల చెప్పులు అరిగా యంటారు. అంటే సంభందాలు
కుదరటం అంత కష్టమని భావన అయితే కొన్నిసార్లు పెద్దగా ప్రయత్నం లేకుండానే
పిల్లలకు మంచి సంభందాలు వచ్చి వెంటనే ఇరువైపులా అంగీకారం కుదిరి చెకఃచెకా
పెళ్లిళ్లు జరుగుతాయి. కక్కు వస్తే ఆపడం అసాధ్యం అలాగే సమయమొస్తే
ఇబ్బందులన్నీ తొలగి పెళ్లి తథ్యం.
ఆలింగన సుఖం
తెలిసిన వారి మధ్య బంధం విడదీయుట అసాధ్యం. రేపుకొన్ని విషయాలు
తెలుసుకుందాం మీకందరికీ వందనం అంటూ లేచారు తెలుగు మాష్టారు.
06. భగవంతుడు రెండు సార్లు మనిషి అజ్ఞానానికి నవ్వుతాడు.
ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యంచేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో “ఏమీ భయం లేదమ్మా మీ అబ్బాయికి ఏమి కాదు.నేను బతికిస్తాను“ అన్నప్పుడు.
మరోసారి ఇద్దరు అన్నదమ్ములు భూమిని పంచుకొని
“ఇదిగో ఈభూమి నాది ,అదిగో అటువైపు వున్నది నా తమ్మునిది “అన్నప్పుడు. వీడి తండ్రి,తాత,ఇదే మాట అన్నారు పోయారు. ఇప్పుడు వీడు అదే అంటున్నాడు.
రేపు వీడు పోతాడు అయినా “ఇది నాది” అనే భ్రమలో,
మాయలో,అజ్ఞానంలో బతుకుతున్నాడు అని నవ్వుకుంటాడట.
నిజమే...ఏది శాశ్వతం కాదు. మనం ,మన పిల్లలు,మనం సంపాదించుకున్న ఇళ్ళు,భూమి, మన బ్యాంకు బాలన్స్ ఏవి మనవెంట రావు.
ఈ విషయం మనకందరికీ తెలుసు.అయినా “నాది నావి “అనే మాయలోనే ఉండిపోతున్నాము. ప్రతిరోజూ తెల్లవారుతోంది. పగలు వెళ్ళిపోతోంది. రాత్రి మొదలవుతోంది. తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతోంది. పగలు తిరగడం, రాత్రుళ్ళునిద్రపోవడం ఎన్నాళ్ళిలా? ప్రతిరోజూ తిన్నదే తింటున్నాం. తాగిందే తాగుతున్నాం. రోజూ అదే తిండి. అదే నీరు. అదే మంచం.
అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు. దుఃఖం తొలగడమూ లేదు. ఏమాత్రం అర్ధంకాని ఈ పగలు, రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి? ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది.
ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి? ఈ ఆరాటం దేనికి? మనలో ఏర్పడి ఉన్న ఈ “నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా మనకు ఎక్కడినుంచి వచ్చింది? ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం?
డబ్బు సంపాదించాలి.. దాన్ని భద్రంగా దాచుకోవాలి.. అందరికంటే గొప్పవాళ్ళం అయిపోవాలి అని.
ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి.!
ఇలా మనలో మనం ప్రశ్నించుకోవాలి .
ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు ఏదయితే మార్పు అనేదే లేకుండా ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మే నేను' అన్న ఎరుక కలిగిననాడు ఆత్మజ్ఞానం మనలో వుద్భవిస్తుంది. జ్ఞానం కలిగిన తరువాత వైరాగ్యం, దాని తరువాత భక్తి , భక్తికి పరాకాష్ట భగవంతుని దర్శనభాగ్యం, చివరిగా ముక్తి.
ముక్తి పొందడానికెే దైవం మనకు మానవజన్మ ప్రసాదించాడని తెలుసుకున్న తరవాత సాధన చెయ్యాలి.
మనం కోరుకునే జ్ఞానం, ముక్తి మరెక్కడో లేదు మన మనస్సులోనే ఉంది.
మనిషి దేవుణ్ణి కోరుకోవలసిన వరాలు-
"అనాయాసేన మరణం - బాధలేని సుఖమరణం
వినా దైన్యేన జీవనం - ఒకరిపై ఆధారపడని జీవితం
దేహాంతే తవ సాన్నిధ్యం - పోయేముందు నీ దర్శనం
దేహిమాం పరమేశ్వర - ప్రసాదించు పరమాత్మా! "
అని కోరుకోవాలి..
--(())--
07. కంచిలోబంగారుబల్లి_కథ
బంగారు బల్లి అంటే ఎవరికైనా యిట్టె గుర్తొచ్చేది తమిళనాడులోని కంచిలో గల కామాక్షి అమ్మవారి ఆలయం. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని ముట్టుకుంటే దోషం వెళ్లి ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఈ బంగారు బల్లి గురించి ఒక పురాణ గాధ ఉంది. అదేమిటంటే గౌతమ మహర్షి కి ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఎప్పటిలాగే శిష్యులు కుండ పట్టుకొని నది తీరానికి వెళ్లి నీటిని తీసుకొస్తుండగా అందులో బల్లి పడింది. వారు చూసుకోలేదు.
దీన్ని గమనించిన గౌతమ మహర్షి శిష్యులిద్దరినీ బల్లి వలె మారిపొమ్మని శపించెను. శాప విముక్తి కోసం ఇరువురు మహర్షిని వేడుకొనగా, కాంచీపురం లోని వరదరాజపెరుమాళ్ ఆలయానికి వెళ్ళమని, అక్కడ పరిష్కారం లభిస్తుందని చెప్తాడు.
ఇద్దరూ కూడా సరే అనుకోని వరదరాజపెరుమాళ్ ఆలయానికి వెళ్తారు. బల్లుల రూపంలో ఉండి స్వామి వారిని నిత్యం ప్రార్ధించగా, ఒకానొక రోజు శాపం నుండి వారిద్దరికీ విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు సాక్ష్యంగా ఉండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి, భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు.
బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అనే అర్థం వస్తుంది. సరస్వతి దేవి నుండి శాపం పొందిన ఇంద్రుడు దోష నివారణకై పెరుమాళ్ ఆలయంలో బల్లులను ప్రతిష్టించినట్లు మరో కధనం కలదు.
ఇంట్లో బల్లి తిరుగుతున్నప్పుడు అది మీద పడితే ఎట్లా ? అనే అపోహ అందరికీ ఉంటుంది. అలా పడినపుడు వెంటనే కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకొని స్నానం చేసి, ఇష్టదైనవాణ్ణి ఆరాదిస్తే దోషం పోతుందంటారు. ఏమోఇంకా దోషం ఉందేమో అనుకునేవారు కంచి అమ్మవారిని దర్శించుకొని బల్లులను తాకుతారు.
--(())--
08. నేటి త్రిపురాంతకం............!!
ప్రాచీన మంత్రం ,చైతన్య విద్యలకు ప్రతీక,ఓషధీ మూలికల స్తావరం , భ్రమరాంబా మల్లికార్జుల నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది .శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాదాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణం లో శ్రీశైలఖండం లో ‘’త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం ‘’ అని చెప్ప బడిన అతి ప్రాచీన క్షేత్రం .మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరం లో ,గుంటూరు –కర్నూలు మార్గం లో రహదారికి రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్నది .
త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు ,సిద్ధులు తాన్త్రికులకు ఆవాస భూమి .అనేక దివ్యమైన ఔషధాలు నిలయం .రస రత్నాకర ,నాగార్జున సిద్ధ తంత్రం మొదలైన గ్రంధాలు దీని ప్రాభవాన్ని తెలియ జేశాయి .స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయి . ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం ..త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయం గా ఆ పరమ శివుడే చెప్పాడు .త్రిపురాంతక లింగాన్ని ‘’తత్పురుష లింగం ‘’అంటారు
స్థల పురాణం –త్రిపురాసుర సంహారం....
తారాకాసురుడు పూర్వం దేవ, ఋషులను బాధిస్తుంటే శివ కుమారుడైన కుమారస్వామి తారాసురుని మెడలోని ప్రాణ లింగాన్ని చేదించి వాడిని సంహరించాడు .ఈ యుద్ధం లో అలసిన శరవణ భవుడు ‘’ఆదిశైలం’’ అనే పేరున్న ఈ పర్వతం పై విహరించటం వలన’’ కుమార గిరి ‘’ అనే పేరొచ్చింది .తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు ,విద్యున్మాలి ,కమలాక్షుడు .వీరినే త్రిపురాసురులు అంటారు .తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్న తోబ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు .ఆయన ప్రత్యక్షం కాలేదు .పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి .బ్రహ్మ ప్రత్యశమై వరం కోరుకోమన్నాదు .ఎవరి చేతిలోనూ చావు కలాగ కూడదని వరం కోరుకొన్నారు .పుట్టిన వాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకోన్నారో చెప్పండి అని అడిగాడు .తాము ఆకాశం లోమూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణం తో ఆ త్రిపురాలను చేదించిన వాని చేతిలో నే తమకు మృత్యువు రావాలనికోరుకొన్నాడు .సరే నన్నాడు బ్రహ్మ .
తారాక్షుడు బంగారం ,విద్యున్మాలి వెండితో ,కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు .వారు పరమేశ్వరుని ప్రార్ధించారు .అప్పుడాయన త్రిపురాసురలను చంపాలంటే అపూర్వమైన రధం ,అపూర్వ బాణాలు అవసరమనీ చెప్పాడు .వీరు శ్రీహరిని ప్రార్ధిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింప జేశాడు .విశ్వకర్మ జగత్తు తత్త్వం తో రధాన్ని ,వేదం తత్త్వం తో గుర్రాలను ,నాగ తత్త్వం తో పగ్గాలను ,మేరు శఖర తత్త్వం తోధనుస్సును ,వాసుకి తత్త్వం తో వింటి నారిని ,సోమ ,విష్ణు ,వాయు తత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మ రధ సారధి అయ్యాడు ..అ దివ్య రధాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయల్దేరాడు .
త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం....
ఇంత చేసినా త్రిపురాసురుల తపో బలం వలన ,మయుడి నిశ్చల తత్త్వం వలన ఆ దివ్య రధం భూమి లోకి కుంగి పోయింది .గుర్రాలు నిలవ లేకపోయాయి ధనుస్సు పని చేయలేదు .రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్ధమైన రధం నిర్మించ లేక పోయి నందుకు కోప పడ్డాడు .ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు .పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు .పర దేవతను ఆత్మలో ధ్యానించాడు .లీలా వినోదిని బాలా త్రిపురాసుందరి గా ఆమె ఆవిర్భవించింది .శివుని ధనుసులో ప్రవేశించింది .దీనికి ఋగ్వేదం లో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది .
‘’అహం రుద్రాయ ధనురా తనోమి బ్రహ్మ ద్విషే శరవే హంత వా ఉ –అహం జనాయ సమదం క్రుణోమ్య హం ద్యావా ప్రుధివీ ఆవివేశ ‘’.అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం యెక్కు పెట్టాడు .దేవతలు అప్పుడు ‘’నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః ‘’అని స్తుతించారు .త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్ర బాణం తో అవి ఒకే సారి ద్వంసమైనాయి ..
దేవమునులు సంతసిం చారు. బాలా త్రిపుర సుందరి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది .శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు .ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటె తానూ ఆక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది .రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు.ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది .పెద్ద గుట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన ‘’వైడూర్య లింగం ‘’గా ఆవిర్భవించాడు .దీనికి సాక్ష్యం గా వేదమంత్రం ఉంది –‘’స్తుతి శ్రుతం గర్త సదం యువానం –మృగన్నభీమ ముప హత్తు ముగ్రం –మ్రుడా జరిత్రే రుద్రస్తవానో –అన్యంతో అస్మిన్ని వపంతు సేనా’’ . వైడూర్య లింగానికి పై భాగాన బ్రహ్మ దివ్య జల లింగాన్ని ప్రతిస్టించాడు. ఇక్కడ జలలిన్గానికి చేసిన అభిషేక ద్రవ్యం లోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగం లోనే లయమై లోపల ఉన్న త్రిపురాన్తకేశ్వరుని చేరుతుంది .
త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భ విం చిన ఈ దివ్య ప్రదేశమే కుమార గిరి .ఆదిశైలం ,అరుణాచలం ,కుమారాచలం లేబ్రాయపు కొండ అని పేర్లున్నాయి .తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశం లో తపస్సు చేస్తున్నాడు .ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ దేవి ,ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కు మారుడైన కుమారస్వామిని చూసి పోతూఉంటారని శివ పురాణం లోని శ్లోకం తెలియ జేస్తోంది –‘’
అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తరహ –పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం ‘’
పిలిస్తే పలికే దైవం.....
పూర్వం త్రిపురాన్తకేశ్వరుడు పిలిస్తే పలికే వాడట .పాల్కురికి సోమ నాధుడు బసవ పురాణం లో చెప్పిన కిన్నెర బ్రహ్మయ కద తార్కాణం .ఈ ఆలయానికి నలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి . ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరచిఉన్ది. దక్షిణ సోపాన మార్గానికి దగ్గర మూల స్థానేశ్వర స్వామి దేవాలయం ఉంది .ఈయన మహా మహిమ కల దైవం .అనేకమంది రాజులు ఈయనకు భూరి దానాలు సమర్పించారు .దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీ చెన్న కేశవా లయం ఉన్నది .పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు .మూల స్తానేశ్వరునికి ఆగ్నేయం గా పంచ బ్రాహ్మల చే ప్రతిస్టింప బడిన ‘’పంచ లింగ దేవాలయం ‘’ఉన్నది .ఈశాన్యం లో ఆవు పొదుగు ఆకారం తో లింగాలు దర్శన మిస్తాయి .పూజిస్తే ఆయురారోగ్యాలనిస్తాయి .దక్షిణ సోపానాల దగ్గర వీర భద్రాలయం ఉంది .ఇంకొంచెం పైకి ఎక్కితే ఇస్టకామేశ్వారీ దేవాలయం ఉన్నది దీనికి దక్షిణం గా అద్భుత మహిమలున్న ‘’అగస్త్య లింగం ‘’ఉన్నది దీనినే ‘’ విన్ధ్యేశ్వర లింగం అనీ అంటారు .
ముఖ్యదేవాలయం దగ్గరే ‘’అపరాజితెశ్వరుడు ‘’ఉన్నాడు మన్యు సూక్తం తో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది . ఆగ్నేయం లో సూక్ష్మ తేజోమయ ‘’యజ్ఞేశ్వర లింగం ‘’వాయవ్యం లో హనుమంతుడు నెలకొల్పిన ‘’మారుతి లింగం ‘’, ఉన్నాయి వీటిని పూజిస్తే ఆయుస్సు బలం యశస్సులు కలుగుతాయి. వీటి ప్రక్కనే మార్కండేయ ప్రతిష్టిత దివ్య లింగం ఉంది. ఉత్తరం లో చండీశ్వరుడు ,పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిస్తితమైన ‘’ఉగ్రేశ లింగం ‘’ఉన్నాయి . ఉత్తరాన ‘’భేక సోమేశ్వరుడు’’దర్శన మిస్తాడు ఈయన ఆరాధనను చాలా జాగ్రత్తగాచేయాలి. ఆలయం లోని బలిహణలను భక్షిస్తాడు ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకలాశోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేది . ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియం లో ఉంది .గర్భాలయానికి నైరుతి దిశలో ‘’చీకటి మిద్దె ‘’అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడి నుంచి కాశీ ,శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉంది .వృశ్చిక మల్లెశ్వరాలయానికి దగ్గర ‘’లో మఠం ‘’ఉంది .శ్రీ బాలా త్రిపుర సుందరిని అర్చిన్చాటానికి సిద్ధ సాధ్యులు ఈ మార్గం ద్వారా వస్తారని చెబుతారు .ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింత చెట్టు ఉండేది .దాని మూలం లో భైరవుడు ఉంటాడు .దాని ముందు మనిషి లోతు త్రవ్వితే ఒక గుండం కనబడుతుంది .అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ గుండం లో వేస్తె రాళ్ళు చేపలుగా మారుతాయట .ఆ చేపలను వండి తలను తోకను తీసేసి తింటే మూర్చ వచ్చి కొంత సేపటికి లేస్తాడు .ఆ మనిషి వేల సంవత్సరాలు జీవిస్తాడని ‘’నిత్య నాద సిద్ధుడు ‘’అనే యోగి ‘’రస రత్నారం ‘’అనే గ్రంధం లో రాశాడు .చీకటి మిద్దె ప్రకనే ‘’మహా గణపతి మండపం ‘’ఉంది .విగ్రహం శిదిలమైతే ప్రక్కన కింద పెట్టారు.
ప్రధానాలయం శ్రీ చక్రాకారం లో నిర్మించ బడింది శివాలయం ఈ ఆకారం లో నిర్మించటం చాలా అరుదు అలాటి అరుడైన దేవాలయం ఇది .’’శ్రీ చక్రం శివ యొర్వపుః’’అంటే శివ పార్వతుల శరీరమే శ్రీ చక్రం .స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడి పోయాయట .అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు .పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి .లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయం గా ఉంటాడు .జల లింగాన్ని దుండగులు పీకేస్తే కొండడ కిందఉన్న శ్రీరామ ప్రతిష్టిత లింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు .పునః ప్రతిస్టలో మూల విరాట్ ను కదిలించకుండా మూల విరాట్ కు కింద మరొక నర్మదా బాణ లింగాన్ని ప్రతిష్టించారు త్రిపురాన్తకేశ్వరునికి ఉత్తరాన పార్వతీ దేవి అంటే స్కంద మాత ఆలయమున్నది. పై రెండు చేత్రులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం ,డమరుం కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది .అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది .
స్వామి అభిషేకాలకు భక్తజనం త్రాగటానికి గంధవతి తీర్ధం ఉంది ఇందులో స్నానిస్తే పుణ్యం మోక్షం .త్రిపుర సుందరి ఆలయం వెనక పుష్పవతీ తీర్ధం ఉండేది .చెరువులో కలిసిపోయింది .మహా నందిలో లాగానే ఇక్కడ కూడా స్వచ్చమైన జలం తో ఉండే కోనేరుండేది .దీనికి ‘’పాప నాశనం ‘’అనిపేరు .నాలుగు కొండల మధ్య ఉన్న సోమ తీర్ధం పాప నాశిని .కుమార గిరికి పడమర దూర్వా నది లేక దువ్వలేరు ఉన్నది .ఇక్కడ దూర్వాసుడు తపస్సుచేశాడు .దీనికి దక్షిణం లో ‘’ముక్త గుండం ‘లో స్నానం చేస్తే మోక్షమే .
తీర్దాలు-మిగిలిన గుడులు.....
త్రిపురాంతకం అష్ట భైరవ పరి వేష్టితం .కుమార గిరికి దక్షణాన భైరవ గిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం .పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు పడమరలో శ్రీ రామ నాదేశ్వరుడు మిక్కిలి పూజ నీయుడు .ఉత్తరాన ఉన్న కొండడను పూల పూల కొండ అంటారు ఇక్కడే తారకాసురుడు పూజించిన శివ లింగం ఉంది .ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట .దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది .దీనికి దిగువన ఓషధీ సమన్విత సోమ తీర్ధం ఉంది .ఇది సర్వ రోగ నివారిణి .తూర్పున పంచ బ్రాహ్మలు ప్రతిష్టించిన పంచ లింగాలున్నాయి .వాయవ్యం లో లింగాల కొండ ఉంది .ఇక్కడ వెయ్యి నూట ఒక్క లింగాలు ఉన్నాయట .ఇక్కడ అజ్ఞాతం గా మునులు తపస్సు చేస్తూ ఉంటారట .ఇకడే దివ్యౌ షది’’సంజీవిని ‘’ఉన్నాడని జ్ఞానులు చెబుతారు .
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం.....
చిదగ్ని కుండ సంభూత.....
కుమార గిరికి దగ్గరలోఒకప్పటి చెరువు లో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది .ఈ ఆలయం లో ప్రతిదీ విశేషమైనదే .ఆలయ గోపుర గర్భ గుడిపై నిర్మాణ శైలి వైవిధ్యం తో ఉంటుంది .గర్భ గుడిమీద రాజ గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత .’’త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ’’అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు . కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే . అమ్మవారు నిర్గుణ శిలా కారం గా ఆవిర్భవిం చింది .ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసున్దరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం .దీన్ని స్థానికులు ‘’నడబావి ‘’అంటారు అమ్మవారు ఉత్తరాభి ముఖం గా దర్శన మిస్తుంది .చిదగ్నిగుండం లోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి .ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ .అదే నవావరణం లో బాలాత్రిపురసుందరి ఉంటుందన్న మాట
ఈ మెట్లకు అధిదేవతా ప్రత్యది దేవతలుంటారు .తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండం లో నిర్గుణ శిలకార రూపం లో అమ్మవారు కనిపిస్తుంది .దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలా వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది .సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు అలంకారాలన్నీ ఈ విగ్రహానికి .ఈ విగ్రహానికి వెనక ఉన్న శిలమధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్టితమై ఉంది .విగ్రహానికి వేనక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు .అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవ శాస్త్రి గారు –
‘’నూటోక్క శక్తు లెప్పుడు –నాటక మటు లాడు చుండ,నాయక మణియై
కూటంబు నేర్పు త్రిపురక –వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’అని పద్యం చెప్పారు .
సిద్ధి మండపాలు....
చిదగ్ని కుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి .వాటినే ‘’సిద్ధి మండపాలు ‘’అంటారు .ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు శ్రీ వావిలాల మహాదేవయ్య గారు ,శ్రీ గోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుస్టానం చేసేవారట .
శ్రీ చక్ర పాదుకలు....
మెట్లు దాటి బయటికి వస్తే శ్రీ చక్ర మండపం కనిపిస్తుంది .ఇక్కడే శ్రీ చక్ర పాదుకలున్నాయి . అర్చనలన్నీ వీటీకే చేస్తారు . అందరూ వీటిని పూజించ వచ్చు. ఈ చక్ర పాదుకలకు , చిదగ్ని కుండ దేవికి తంత్ర సంబంధ అను సంధానం ఉంది . ధనం కా వాలంటే ఎరుపు రంగు విద్య కావాలంటే తెలుపు ,శత్రు జయం కలగాలంటే నల్లని స్వరూపం తో అమ్మవారిని ధ్యానించాలి .ఈ పాదుకల వెనుక సిద్దేశ్వర పాదుకలుంటాయి .వీటిని ‘’గురుపాదాలు ‘’అంటారు .శ్రీ విద్యా సాంప్రదాయం లో వీటి ప్రాధాన్యం ఎక్కువ .గురుపాదుకలకు ప్రక్కనే బ్రాహ్మీ లిపి లో ‘’గురుపాదకా మంత్రం ఉంది’’.చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణా మూర్తి లింగం ఉంది .స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు .
ఛిన్నమస్తా దేవి......
చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ‘’చిన్న మస్తా దేవి’’చిన్న మండపం లో కనిపిస్తుంది . ఈమెనే ప్రచండ చండిక అని ,వజ్ర వైరోచని అని అంటారు ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు .ఈమె దశ మహా విద్యలలో ఆరవ మహా విద్య .ఈమెను ఉపాశిస్తే కలిగే ఫలితం ‘’యామళం’’అనే గ్రంధం వివరించింది .ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు .ఇవి ఇప్పుడు నిజంగా చిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్ట బడి ఉన్నాయి .
రక్త పాత్రలు....
సాధారణం గా శక్తి ఆలయాలలో సింహ వాహనం ధ్వజస్తంభం ఉండాలి ఈ రెండు ఇక్కడ లేవు .కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని , స్వయంభు అని భావిస్తారు .వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత .’’సవ్యాప సవ్య మార్గస్థా’’.ఒక్కప్పుడు ఈ ఆలయం లో ‘’పంచ మకారార్చన’’జరిగేది .అందుకే గర్భాలయం లో రాతి తో చేయబడిన ‘’రక్త పాత్ర ‘’ఉంది దీనికి ‘’ఉగ్రపాత్ర ‘’అనే పేరుకూడా ఉంది .ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు ,రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది .ఎన్ని దున్నల్ని బలిచ్చినా ,ఒక్కో పొతూరక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు .ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యం లో మామూలు భక్తులు వేరొక రక్త పాత్ర ఉన్నది దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే ‘’యూప స్థంభం ‘’కూడా ఉంది .దీనిపై సంస్కృత శాసనం ఉంది .శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు .దీన్ని ఒక కవి పద్యం లో
‘’మదపు టేనుగు నైన ,కొదమ సింగం బైన –యూప శిలకు దా,సమీప మంద –
మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న –లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’
వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని ‘’దేవతాగ్రణీ’’ అని స్తుతించారు స్కాంద పురాణం శ్రీశైల ఖండం లో-
‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణీ
దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’
కదంబ వనవాసిని......
త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబ వనం .ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి .అతి సున్నితంగా రక్త వర్ణం తో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి.అందుకే ‘’కదంబ కుసుమ ప్రియాయై నమః ‘’అని లలితా సహస్రం లో చెప్పారు .కదంబ వృక్షాలే కల్ప వృక్షాలే శ్రీ శంకర భగవద్పాదులు తెలియ జేశారు .’’కదంబ కాననావాసా ‘’-కదంబ నామా కల్ప వృక్ష యుక్తం యత్కాననం వనం తత్ర గృహం యస్యాః సా తదా ‘’అని భాష్యం చెప్పారు .
వీర శిలలు.....
అమ్మవారి ఉత్తర ద్వారం కు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీర శిలలే .ఇవి భక్తుల వీర కృత్యాలకుప్రతి బింబాలు .ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది .ఇందులో అధికభాగం స్త్రీ శిల్పాలే .వివిధ ఆలం కారాలతో కేశ పాశాలతో వీరులు బల్లాలను తలలో ,గుండెలో ,గొంతులో ,తొడలలో పోడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు .వీరు ఎందుకు వీరక్రుత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి .’’స్వస్తిశ్రీ సోమతుశివ దేవా గురు అల్లడ్డ వీర మల్లునికి మేలుగావలేన్ అని తల త్రిపురా దేవి కిన్ ఇచ్చే ‘’ అని ఒక శాసనం .ఇంకోదానిపై ‘’దేవికి తల ఇస్తున్నాను తెలుంగు నాయని బావ మరది చావుండయ్య వీర’’అని అసంపూర్తి శాసనం కనిపిస్తాయి .ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం .
అపరాదేశ్వరీ ఆలయం – గుహలు....
అమ్మవారి ఆలయానికి దగ్గరలో బయట రోడ్డుమీద ‘’అపరాదేశ్వరీ ‘’లేక బాలమ్మ ఆలయం ఉంది .ఇది శిధిల రూపం లోనే ఉంది.దీనికి దగ్గరలో చింతామణి గుహ ,ఉన్నది ఇది అమ్మవారి ఆలయమే నని భావన ఆధారం ‘’చింతామణి గుహాంతస్త ‘’ అనే నామం .ఇక్కడే పూర్వం లక్ష్మీ గణపతి ఆలయం ఉండేదట అమ్మవారికి వెనక ‘’వైడూర్య శిఖరం .అనే కొండ మీద ధ్యానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట .ఇకడే తమాషా అయిన తెల్లని రాతి వరుస ఉందట .దీని రహస్యం సిద్ధులకు మాత్రమె ఎరుక .
మహా సర్పం – మరికొన్ని విశేషాలు.....
బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంది .అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది .సంతానార్ధులు ,నాగ దోషమున్నవారు ,ఈ పుట్టకు పొంగళ్ళు సమర్పిస్తారు ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్ని గుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట .
అమ్మవారి గుడికి దగ్గరే ఉండే తెల్లని గుండ్రాయి ని ‘’ఈశ్వరుని తల గుడ్డ ‘’అంటారు .ఇది మహత్వం కల శిల అని ఇప్పుడు చెరువులో కూరుకు పోయి కనిపించటం లేదు .త్రిపురాంతక శివునికి పడమర గా పదమూడు కిలో మీటర్ల దూరం లో ఒక కొండ ,దానికి పశ్చిమంగా ఒక ద్వారం ఉన్నాయి అక్కడ నలభై అడుగుల దూరం లో ‘’మండే కాంతులు ‘’అనిపిస్తాయి .అక్కడి మామిడి పండు ఆకారం లో ఉన్న రాళ్ళను గుడ్డలో వేసి మూట కట్టాలి .అది ఎర్రగా మారుతుంది .ఆ గుడ్డను పాలల్లో వేయాలి .పాలు ఎర్రగా మారుతాయి .ఆ పాలను సాధకుడు వారం రోజులు అదే విధం గా తాగితే వజ్ర సమాన శరీరుడు అవుతాడు ,ఆయుస్సు పెరుగుతుంది అని ‘’రస రత్నాకరం ‘’లో నిత్య నాద సిద్ధుడు రాశాడు .
బిలాలు.....
శివాలయానికి ఉత్తరాన ‘’కోకిలా బిలం ‘’ఉంది .సాధకుడు శుచిగా అందులో ప్రవేశించాలి .నలభై అడుగులు లొపలీ వెడితే కోకిల ఆకారపు రాళ్ళు కనిపిస్తాయి .ఆ రాళ్ళను తీసుకొని వాటి వెనక నువ్వులు పెడితే అవిపగిలిపోతాయి .అప్పుడు ఆ రాళ్ళను పాలలో వేస్తె పాలు నల్లగా మారుతాయి .ఈ పాలను గొంతు నిండే దాకా తాగాలి .అప్పుడు దివ్య శరీరం పొంది తెల్లజుట్టు ముడుతలు పోయి ,రోగాలు లేనివాడై మూడు బ్రహ్మ దినాలు జీవిస్తాడు .మహా బలవంతుడై వాయువేగం కలుగుతుంది .
గుండ్ల కమ్మ నదికి తూర్పు కొండపై చంద్ర మౌళీశ్వరాలయం ఉంది .దాని దగ్గరేకాశి కేశుడు ,ఒక కోనేరు ,నృసింహ బిలం ఉన్నాయి బిలం లో ప్రవేశిస్తే యోగసిద్ధి కలుగుతుంది .దానిలో నుంచి కాశీ వెళ్ళచ్చు
ఇస్ట కామేశ్వరీ దేవి ఆలయ.......
శ్రీశైలానికి తూర్పున శిఖరేశ్వరానికి దూరం గా కారడవిలో శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవి విగ్రహాన్ని అందరు తప్పక దర్శించాలి .ఈమె పేరు తెలుగు సాహిత్యం లో ఎక్కడా చోటు చేసుకోక పోవటం ఆశ్చర్యం గా ఉంది. ధ్యాన మగ్నయై పద్మాసనం లో శిలా పీఠం పై దర్శన మిస్తుంది .నాలుగు భుజాలు ఉన్నాయి .పై రెండు చేతులతో కలువ మొగ్గలను కింది కుడి చేతితో రుద్రాక్ష మాల ,ఎడమ చేతిలో శివలింగాన్ని కలిగి ఉంటుంది .పూర్వపు ఆలయం శిధిలమైంది .ఆలయానికి ఎదురుగా ఒక సిద్ధుని విగ్రహం ఉంటుంది . కాపాలికల దేవత అయి ఉండచ్చు .ఉత్తరాన ఒక వాగు నిరంతరం ప్రవహిస్తుంది ..సుమారు ఎనిమిదవ శతాబ్దపు ఆలయం అనుకో వచ్చు జీపులలో అడవిలో ప్రయాణించి ఇష్ట కామేశ్వరిని దర్శించాలి . దీనిని కంచి పరమాచార్యుల వారు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారుమొదటి సారి దర్శించి లోకానికి తెలియ జేశారు .అప్పటిదాకా ఎవరికీ తెలియదు . తర్వాత ఇటీవలికాలం లో శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు వెళ్లి దర్శించి , అమ్మవారి ప్రాభవాన్ని ప్రవచనాలలో తెలియ జేస్తున్నారు . ఇప్పుడే ప్రభుత్వం పక్కారోడ్డ్డు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు
వీరశైవం –మఠాలు.....
త్రిపురాంతకం శైవమత వ్యాప్తికి దోహద పడింది .ఇక్కడి ‘’గోళకీ మఠం’’ప్రసిద్ధి చెందింది .14వ శతాబ్దం లో వీర శైవం విజ్రుమ్భించింది .1312నాటికి పూజారులు 72నియోగాల వారు స్తానాదిపతు శ్రీ అసంఖ్యాత మహా మహేశ్వరులకు లోబడి ఉండాలన్న నిబంధన ఏర్పడింది .ఇక్కడి ‘’విశుద్ధ శైవ మఠం’’ఉచిత అన్న వస్త్రాలిచ్చి వేదం వేదాంగాలు శాస్త్రాలు సాహిత్యం బోధించింది . పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య ‘’కాపాలిక మతం ‘’అభి వృద్ధి చెందింది అప్పుడే ‘’పంచ మకారార్చన ‘’జరిగేది (మద్యం మాంసం మగువ ).
ఉత్సవాలు.....
ప్రతి సోమ ,శుక్రవారాలలో విశేష ఉత్స్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం జరిగేదని వసంత నవరాత్రులు ,శరన్నవ రాత్రులు శ్రావణ మాసం లోప్రత్యెక ఉత్సవాలు కార్తీకం లో అభషెకాలు సంతర్పణలు జరిగేవని శాసనాల వలన తెలుస్తోంది .తర్వాత ఆలయం శిధిలా వస్తకు చేరింది .శ్రీశైలం దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తతకు తీసుకోని పునరుద్ధ రించి మళ్ళీ నిత్య ధూప దీప నైవేద్యాలు ఉత్సవాలు నిర్వహింప జేస్తోంది . దాతలు ముందుకు వచ్చి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు . 2006 లో కరివేన వారి బ్రాహ్మణ అన్నదాన సత్రం అమ్మవారి ఆలయానికి దగ్గరలో ప్రారంభ మైంది .శివరాత్రి నాడు జరిగే రధోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది . ఇంతటి
మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంత కేశ్వరుని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి.
--(())--
09. భేదభావం నశిస్తే జీవన్ముక్తుడే భగవాన్ రమణ మహర్షి
ఆత్మ విచారణవల్ల మాత్రమే 'అహంత లేక మనస్సు' అనేది అసలు లేనేలేదనే సత్యం తెలుస్తుంది. దాని ద్వారానే శుద్ధ నిర్విశేష పరమాత్మ తత్త్వము లేక, బ్రహ్మము సాక్షాత్కరిస్తుంది. ఆత్మయే బ్రహ్మానంద స్వరూపం, సర్వమును అదే అయివున్నది. అట్టి సాక్షాత్కారము పొందినవాడికి, యికపొందవలసినదేదియును లేదు. ఆత్మానందము ఎప్పుడూ మనని అంటిపెట్టుకునే వుంది.
శ్రద్ధతో కూడిన నిరంతర అంతర్ముఖత్వ సాధనతో దానిని కనుగొనవచ్చు. దుఃఖానికి కారణం బయట లేదు. అది అహంత రూపంలో లోపలే వుంది. మనకు పరిమితులు విధించుకొని, ఆశలు, కోర్కెలు పెంచుకుని, వాటిని అధిగమించడానికి, నెరవేర్చుకోవడానికి, నిరర్థకంగా పెనుగులాడుతున్నాము, కష్టపడుతున్నాము, దుఃఖిస్తున్నాము. 'అహంత లేక మనస్సే' వీటన్నిటికి కారణం. ఆ విధంగా దుఃఖానికి కారణం లోపల నుండగా ఆ కారణాన్ని జీవితంలోని సంభవాలకు, సంఘటనలకు ఆపాదించడంవల్ల ఏమి ప్రయోజనముంటుంది. అన్యమైన విషయాలవల్ల ఏమి ఆనందం లభిస్తుంది. ఒకవేళ లభిస్తే మాత్రం ఆ ఆనందమెంత కాలముంటుంది. కాబట్టి 'అహంత'ను ఉపేక్షించి, త్రోసివేసి, ఎండగడితే ముక్తుడవవుతావు. బంధు విముక్తడవవుతావు. అట్లుకాక 'అహంత'కు లొంగి, దాని చెప్పు చేతలలో ఉండి అది ఆడించినట్లు ఆడుతుంటే, అది మనకు పరిమితులు విధించి, వాటిని అధిగమించేందుకు చేసే వృథా ప్రయత్నాలు, పెనుగులాటలోకి మనను పడత్రోస్తుంది. కాబట్టి సర్వదా నీవే అయివున్న ఆనందాన్ని పొందేందుకు ఒకే ఒక దారి, నీవు నిజంగా ఏదైతే అయి వున్నావలో, ఆ 'ఆత్మ'గా ఉండడమేనని భగవాన్ శ్రీ రమణుల ఉవాచ. కఠోపనిషత్తులో నచికేతుడడిగిన మూడవ ప్రశ్నకు (ఆత్మతత్త్వమును వివరించమని) యమధర్మరాజు చెప్పిన సమాధానము కొంత పరిశీలిద్దాం! నజాయతే మ్రియతేవా విపశ్చి న్నాయంతుతర్చిన్న బభూన కశ్చిత్ అజోనిత్యః శార్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అర్థం: జ్ఞాత అయిన ఆత్మ పుట్టదు, చావదు. అది దేని నుండియు పరిణమించదు. దాని నుండి కూడా ఏదీ పరిణామం చెందదు. శరీరం నశిస్తున్నపుడు కూడా జన్మరహితము అనశ్వరము, శాశ్వతము, సనాతనము అయిన ఆత్మకు నాశనమనేది లేనే లేదు. హంతాచేన్మన్యతే హంతుం హతశే్చన్మన్యతే హతమ్ ఉభౌతౌన విజానీతొనాయం, హంతిన హన్యతే! అర్థం:చంపేవాడు, తాను చంపుతున్నానని, చంపబడేవాడు తాను చంపబడుతున్నానని భావిస్తే ఆ యిరువురికి దాని (ఆత్మ) గురించి సరిగా తెలియదన్నమాట. నిజానికి అది చంపదు, చావదు. అణోరణీయా మహతోమహీయా నాత్మా స్వజంతోర్నిహితం గుహోయామ్ తవక్రతుః పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్మ, హిమానమాత్మనః అర్థం:సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుకంటె చిన్నది. బ్రహ్మాండమున కంటె ఘనమైదియగు ఆత్మ ప్రాంల హృదయాలలోనే వన్నది.కామనారహితుడు శోక రహితుడునై ఇంద్రియాలు, మనస్సుల యొక్క పవిత్రత ద్వారా, ఆత్మసాక్షాత్కారము పొందుతాడు. ఆసీనోదూరం వ్రజతి, శయానోయాతి సర్వతః కస్తంమదామదం, దేవ మదన్యో జ్ఞాతు మర్హతి అర్థం: కదలకుండా కూర్చునే ఉన్నా ఆత్మయెంతో దూరం ప్రయాణించగలదు. పడుకునే ఉన్నా సకల ప్రదేశాలకూ పోతాడు. ఆనందమయుడూ, ఆనంద రహితుడును అయిన ఆ జ్యోతిర్మయుని, నేను తప్ప యింకెవరు తెలుసుకోగలరు? అంటాడు యమధర్మరాజు. శ్లో॥ అశరీరం శరీరేష్య నవస్థేష్యవస్థితమ్ మహాంతం విభుమాత్మానం మాత్వాధరో నశోచతి॥ (శ్లో 22) అర్థం:- శరీర రహితుడు, సర్వవ్యాప్తి అయిన పరమాత్మను, అన్ని శరీరాలలోను ఉన్నాడని తెలుసుకున్న ప్రజ్ఞావంతుడు, శోకం నుండి విముక్తుడౌతాడు. శ్లో॥ నాయమాత్మా ప్రవచనేన లభ్య నమేధయాన బహునా శ్రుతేన యమేవైష వృణుతే తేనలభ్య హస్తస్వైష ఆత్మావివృణుతే తనూంస్వామ్॥ (శ్లో 23) అర్థం:- వేదాధ్యయనం వల్ల గాని, బుద్ధి కుశలత చేతగాని, గొప్ప పాండిత్యం వల్లగాని, ఆత్మను తెలిసికొనలేదు. అది ఎవరిని ఎన్నుకుంటుందో, అనుగ్రహిస్తుందో, అట్టి వాని ఆత్మయే, తన నిజ స్వరూపాన్ని వెల్లడిస్తుంది. శ్లో॥ నావిరతో దుశ్చరితాన్నాశాంతోనా సమాహితః నా శాంతమానసోవాపి ప్రజ్ఞానేనైన మాప్నుయాత్॥ అర్థం:- చెడు ప్రవర్తన నుండి, ఇంద్రియలౌల్యము నుండి బయటపడలేని వారు ధ్యానపరులు కాని వారు, ప్రశాంత చిత్తం లేని వారు, జ్ఞానం చేత కూడ ఆత్మ సాక్షాత్కారం పొందలేరు. శ్లో॥ యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభేభవత ఓదనః మృత్యుర్యస్యో పసేచనంక ఇత్థా వేదయత్రసః॥ అర్థం:- పూర్తిగా శరీర బుద్ధిగల అజ్ఞాని, పరమమైన ఏకైక సత్తను గురించి ఎలా తెలుసుకోగలడు. అట్టి సత్త (ఆత్మ)లో జాతి, మతాది బేధాలతో పాటు, దాని భావనలో మృత్యువు కూడ నశిస్తున్నది కదా! జీవ బ్రహ్మ బేధ భావము నశింప చేసుకున్నవాడే జీవన్ముక్తుడు. ఈ ప్రపంచంలో సత్యార్యాచరణ చేయడం చిత్తశుద్ధికే కాని, ఆత్మను తెలుసుకొనుటకు కాదు. ఆత్మజ్ఞానం కేవలం విచారం రిచేతనే దొరుకును. వివేకవంతుడు, శమ, దమాది గుణములు కలవాడే, బ్రహ్మ విచారానికి తగినవాడు. సాధన చతుష్టం అనగా 1. సత్యాసత్య వస్తు వివేకం. 2. ఇహలోక ఫల భోగ విరాగము 3. శమ దమాది షట్క సంపత్తి 4. ముముక్షత్వం కలవానికే బ్రహ్మనిష్ట కలుగును. ''అహం'' మూలానే్వషణయే సర్వార్థ సాధకము. ఆత్మ కాని వానియందు, ఆత్మను భావించుటే బంధమని 'వివేక చూడామణి' చెబుతున్నది. తన నిజ స్వరూపాన్ని తెలుసుకొనుటయే నిజమైన భక్తిగా పెద్దలు చెబుతారు. మోక్షం కొరకు చేసే ప్రయత్నంలో, భక్తిది ప్రముఖ స్థానంగా చెప్పబడింది. మందు పేరు చెప్పినంత మాత్రాన, వ్యాధి ఎట్లు తగ్గదో, అట్లే ''అహం బ్రహ్మాస్మి'' అనే వేద వాక్యాన్ని చెప్పినంత మాత్రాన ఆత్మజ్ఞానం కలుగదు. అలాగే ఆత్మతత్త్వాన్ని, తన స్వీయానుభవంతోనే తెలుసుకోవాలి కానీ, 'బ్రహ్మైవాహం' అనే వాక్యంతో ముక్తిని పొందలేదు. శరీరమే తానన్న భ్రాంతిలో నుండి, శరీర పోషణే ధ్యేయంగా పెట్టుకున్నవాడు ''ఆత్మ'' హత్య చేసుకున్నవాడు అవుతున్నాడు. శరీరంపైగల మోహమే మృత్యువు. ''నేను''అనే స్ఫురణలో రెండు భాగములు ఇమిడ యున్నాయి. మొదటిది కర్తృత్వమైతే, రెండవది మనస్సు యొక్క ప్రసరణము లేక మనోవృత్తియై యున్నది. ''మనయేవ మనుష్యాణామ్ బంధ, మోక్షకారకః'' అని చెప్పుటచే మనిషి యొక్క బంధ మోక్షములకు మనసే కారణమగుచున్నది.
10. ఓం నమె భగవతే శ్రీరమణాయః
తిరుచురాపల్లి...పశువుల కాపరి వేషంలో వినాయకుడు
ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వినాయక దేవాలయం, తమిళరాడు రాష్ర్టంలోని తిరుచ్చి (తిరుచురాపల్లి) పట్టణంలో, కావేరీనదీ తీరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న కొండమీద ఉంది. 83 మీటర్లు ఎత్తుగా ఉండే ఈ కొండమీద ఉన్న ఈ వినాయక దేవాలయాన్ని సుమారు ఏడవ శతాబ్దంలో పల్లవ రాజులు పునర్నిర్మించారని చరిత్రకారులు చెప్తారు. ఈ ఆలయాన్ని ‘ఉచ్చ పిళ్ళైయార్’ ఆలయం అంటారు. తమిళ భాషలో ‘ఉచ్ఛ’ అంటే ‘ఎత్తున’అని అర్థం. ఇక ‘పిళ్ళై..యర్’ అంటే ‘పిల్లవాడు ఎవరు’ అని అర్థం. శివుడు పార్వతీదేవి మందిరంలో ప్రవేశించబోతున్న సమయంలో, పార్వతీదేవి కాపలాగా ఉంచిన బాలుడు అడ్డగించగా, శివుడు కోపగించి ఆ బాలుని తల ఖండించి లోపలకు వెళ్ళడు. శివుడు, పార్వతిని కలవగానే అడిగిన మొదటి ప్రశ్న ‘పిళ్ళైయార్’. అంతవరకూ ఈ బాలునకు పేరే లేదు. ఆనాటి నుండి వినాయకునకు ‘పిళ్ళైయార్’ అనే పేరు స్ధిరపడిపోయింది. అందుకు ఈ ఆలయాన్ని ‘ఉచ్చ పిళ్ళైయర్ ఆలయం’ అంటారు. ఈ ఆలయం ఉన్న కొండ సుమారు 3800 మిలియన్ల సంవత్సరాలకు పూర్వందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయానికీ..శ్రీరంగం లోని రంగనాథస్వామి ఆలయానికీ ఎంతో అవినాభావ సంబంధం ఉంది. దానికి సంబంధించిన కథ ఏమిటంటే.... త్రేతాయుగ కాలంలో, శ్రీరామచంద్రుడు వానరులతో కలసి రావణుని మీదకు యుద్ధానికి వెళ్లినప్పుడు రావణ సోదరుడైన విభీషణుడు ఎంతో సాయం చేసాడు. ఫలితంగా శ్రీరాముడు రావణుని సంహరించాడు. అందుకు కృతఙ్ఞతగా శ్రీరాముడు.. విభీషణునకు శ్రీమహావిష్ణువు అవతారమైన ‘శ్రీరంగనాథస్వామి’విగ్రహాన్ని బహూకరిస్తూ ‘విభీషణా.., లంకలో ఈ విగ్రహం ప్రతిష్ఠిచే వరకూ ఈ విగ్రహాన్ని నేలమీద పెట్టవద్దు’ అని చెప్పాడు . ఆ విగ్రహం తీసుకుని విభీషణుడు లంకకు బయలుదేరాడు. అయితే విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకలో ప్రతిష్ఠించడం దేవతలకు ఇష్టం లేదు. అందుచేత దేవతలంతా వినాయకుని ప్రార్థించి తమ కోరిక చెప్పారు.
వినాయకుడు వారికి సహకరిస్తానని చెప్పి ఒక పశువుల కాపరి వేషం వేసుకుని, విభీషణునికి ఎదురుగా వస్తున్నాడు. అది సాయం సమయం. అస్తమయ సూర్యునకు అర్ఘ్యప్రదానం ఇవ్వాలని విభీషణుడు తలచి తన చేతిలోనున్న విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదని, తనకు ఎదురుగా వస్తున్న పశువుల కాపరిని చూసి, దగ్గరకు రమ్మని పిలిచి, తన చేతిలోనున్న విగ్రహాన్ని ఆ పిల్లవాని చేతిలో ఉంచి ‘ నేను పూజ పూర్తి చేసుకుని వచ్చే వరకూ ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టకు’ అని చెప్పాడు. మాయా గణపతి సరే అన్నాడు. విభీషణుడు కావేరీనదిలో దిగి సంథ్యావందనం చేస్తున్నాడు. ఆ సమయం చూసి, విభీషణుడు ఎంత వద్దని చెప్తున్నా వినకుండా, ఆ విగ్రహాన్ని నేలమీద ఉంచి పరుగు తీసాడు. విభీషణుడు ఆ బాలుని తరుముతున్నాడు. ఆ బాలుడు కావేరీనది ఒడ్డున ఉన్న కొండ ఎక్కాడు. విభీషణుడు ఆ బలుని పట్టుకుని నుదుటి మీద గట్టిగా కొట్టాడు. (ఆ దెబ్బ తాలూకు మచ్చ ఇప్పటికీ ‘ఉచ్చ పిళ్ళైయార్’ విగ్రహానికి ఉండడం భక్తులు గమనించవచ్చు) అప్పుడు వినాయకుడు నిజరూపంతో విభీషణునికి దర్శనమిచ్చి, ‘శ్రీరంగనాథస్వామి విగ్రహం ‘శ్రీరంగ’ క్షేత్రంలో ప్రతిష్ఠితమౌ గాక. మన ఇద్దరి కలయికకూ గుర్తుగా నేను ఈ కొండమీద ఉంటాను’ అని వరమచ్చి ‘సూక్ష్మ గణపతి’గా ఆ కొండమీద వెలిసాడు. విభీషణుడు ఆ ‘సూక్ష్మ గణపతి’కి ఆలయం నర్మించాడు. ఆ ఆలయమే పల్లవుల కాలంలో అభివృద్ధి చెందింది. అదే ప్రపంచంలోని అతి ప్రాచీన వినాయక దేవాలయం. తిరుచ్చిలోని ‘రాక్ ఫోర్ట్’ మీదవున్న ఈ ఆలయాన్ని దర్శించాలంటే 437 మెట్లు ఎక్కి వెళ్లాలి. ఈ మెట్లుకూడా చాలా ఎత్తుగా ఉంటాయి. రాక్ హిల్ ఎక్కి,ఈ ఆలయం దగ్గర నుంచి చూస్తే, తిరుచ్చి నగరం, కావేరీనది, శ్రీరంగం లోని ‘శ్రీరంగనాథస్వామి’ ఆలయం స్పష్టంగా కనిపిస్తాయి. ఇక, వినాయకుడు నేలమీద ఉంచిన ‘శ్రీరంగనాథుని’ విగ్రహాన్ని చోళరాజు కనుగొని ఆ విగ్రహాన్ని ‘శ్రీరంగం’లో ప్రతిష్ఠిచాడు. అదే శ్రీరంగం లోని ‘శ్రీరంగనాథస్వామి’ ఆలయం. ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాతే..‘ఉచ్చ గణపతి’ దేవాలయ ప్రతిష్ఠ జరిగింది. ఈ రెండు దేవాలయాలే ప్రపంచంలోని అతి ప్రాచీన దేవాలయాలు.

Comments
Post a Comment