***


01. [దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు..?, 02 నేటి  వింత ఆలయం..!
03. ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై,04. శ్రీ-అంటే, స- అంటే, తి-అంటే...? 
05. : సోహం, 06: భగవద్గీత లో శ్రీకృష్ణుడు, 07. : కాకి అరిస్తే,08. [శ్రీ శివపురాణం ప్రకారం
09.  [🍁మీ జీవితాచరణ ద్వారా...🍁10 [🍁మనసు - అవరోధాలు🍁

01. [దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు..?

🙏 ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో.. అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు ? అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు…>

మన కాళ్ళు.. ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.

మన చేతులు.. కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.

_మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా.. అని మీరు అడగవచ్చు

కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.

మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి. ‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది. మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా ? అన్నదే ఈనాటి మన ప్రశ్న >

పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ… వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే > పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే…
🌫🌫🌫🌫🌫🌫🌫🌫🌫🌫🌫
ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.

వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
అగ్ని కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.
💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦
జలము కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము (రుచి)లు.
🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎
భూమి కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.
💦💦💦💦💦💦💦💦💦💦💦💦
 జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
🌪🌪🌪🌪🌪🌪🌪🌪🌪🌪🌪
 వాయువు…‘రస, గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
🌫🌫🌫🌫🌫🌫🌫🌫
ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

_కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు… ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు ? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.🙏🙏🙏🌹🌹🌹అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే !
*‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే.
అదే దైవ సాక్షాత్కారం అంటే.

🕉🕉🕉🕉🕉🕉


02💐💐 వింత ఆలయం..!  విచిత్ర దేవాలయం...!! 💐💐

ఈ గుడిలో దేవీ రూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం నడి వయస్కురాలిగానూ,
సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది.

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్- శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. దీనికి కూడా నిదర్శనాలు ఉన్నాయి.

ధారీదేవి ఆశీసులతోనే అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు. ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే ధారీదేవి.

భక్తితో కొలిచినవారిని అనుగ్రహించే దేవత. ధిక్కరించిన వారికి అంతే కీడు జరుగుతుంది. క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు.

ఆ రాజు చేసిన అపచారంతో కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలితీసుకుంది. దేవి మహత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని తోకముడిచాడు.

అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది.

2013 మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయాన్ని తొలిగించడమే ప్రధాన కారణం. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని కొండపై ప్రతిష్ఠించింది.

ఆ మరుచటి రోజే ఊహించని కుంభవృష్టి కురిసి అలకనంద మహోగ్రరూపం దాల్చి విలయ తాండవం చేయడంతో సుమారు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయం ఉంది. గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠ్‌లో ఉంది.

ఈ క్షేత్రంలో దేవీ రూపం మారుతుంది. ఉదయం పూట బాలికగానూ, మధ్యాహ్నం నడి వయస్కురాలిగానూ, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది.

కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి కి ప్రతిరూపంగా భావిస్తారు. ఈపీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది.

ఈ ఉత్తరదిక్కుకి అధిపతి బుధుడు. బుధుడు అహింసను ప్రభోదిస్తాడు. ఫలితంగా ఉత్తరదిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిశలో ఉండే కాళీమాత శాంతిస్తుంది.

ఈ దిశ యుద్ధానికి, ఆగ్రహానికి, ఆందోళనకి కారకుడైన కుజుడుకి చెందినదని జ్యోతిష్య శాస్త్రం ఉద్ఘాటిస్తుంది.🙏🙏🙏🌹🌹🌹



--(())--

03. ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై

ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా..............!!

పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో వుంచుకోగలిగిన మహాశక్తిశాలి.. హనుమంతుడు. శ్రీ రాముడు లంకకు చేరుకునేందుకు గాను.. రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై వుండగా.. శనిభగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు. రెండున్నర గంటసేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు.

''రెండున్నర గంట పాటు హనుమా నిన్ను చెరపట్టాలి.
నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వమని అడుగుతాడు. అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా.. చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు. అయినా నీకు నా తలభాగం ఇస్తాను. అక్కడ ఎక్కి కూర్చోమంటాడు. అంతే శని కూడా హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు.

కానీ ఆంజనేయుడు రాళ్లను, కొండలను తన తలపై మోసాడు. భారం తాళలేక శనిభగవానుడు గగ్గోలు పెట్టగా, మాట తప్పకూడదు. రెండున్నర గంట సేపు అలానే వుండాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ రెండున్నర గంటకు తర్వాతే హనుమంతుడు శనీశ్వరుడు తల నుంచి శనీశ్వరుడిని కిందికి దించుతాడు. ఆపై రామ భక్తులను, ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు ఇక్కట్లకు గురిచేయకూడదని హెచ్చరించాడు'' అలా శనీశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు.

అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసీ మాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి. హనుమజ్జయంతి రోజున ''రామ రామ రామ'' అనే మంత్రాన్ని పఠించడం చేయొచ్చు.

''ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్''

అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు. హనుమజ్జయంతి రోజున తులసీమాల సమర్పించడం, తులసీ ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ రోజున వడమాల సమర్పించడం, వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం, అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.

మనోబలం, బుద్ధిబలం, శరీరబలం, ప్రాణ బలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం, వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

--(())--

04. శ్రీ-అంటే, స- అంటే, తి-అంటే...? 

నారదుడికి ముగురమ్మల మంత్రం... ఏంటది..?

ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై ఉండగా, అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంతదూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు.

ఇంకేం.. కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికిందనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి.. వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి 'ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి, విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. త్రిమూర్తులైన భార్యలైన మీరు ముగ్గురూ, సకలలోక వాసులచే స్తుతింపబడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ మీ ముగ్గురిలో ఎవరుగొప్ప? అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు. నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు.. నారదా నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి.. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపేశిస్తుండు. కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు.

ముందు సరస్వతీ దేవి నారదునితో.. నారదా! భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి, అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి, సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో "ఓం శ్రీ సతియే నమః'' అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్ఛరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీ దేవి అంటుంది.

ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్లి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు.. సెల్వ నాథుడికి అక్షరం ముక్క రాదు... వాడితో నా ప్రాణం విసిగిపోయింది. పశువులను మేపాల్సిందిగా పంపేశాను.. వెళ్ళి చూడమంటాడు. నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని.. తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి.. శుచియై వచ్చిన ఆ బాలుడికి ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు. ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు.

పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారదా.. కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ''ఓం శ్రీసతియే నమః'' మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. ఇలా పెరినాయకి ఇంటికి వెళ్లిన నారదుడు.. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. సంతానం లేకపోవడంతో తన భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు.

ఇక మూడో సారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమంటోంది. ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించమంటోంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్లి.. దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు. రాజశేఖరుడు తనవద్ద ఉన్న బియ్యాన్ని మారు వేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా, రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించి 108సార్లు జపించమని చెప్తాడు. ఆ తర్వాత ఆ పేద పండితులు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ..ముగ్గురమ్మలను దర్శింటుకుంటాడు. అమ్మలారా! మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను. ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. బ్రహ్మదేవ పుత్రా.. మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి.

శ్రీ లక్ష్మిలోని ''శ్రీ'' అనే అక్షరాన్ని, సరస్వతిలోని ''స'' అనే అక్షరాన్ని, పార్వతీదేవిలోని తి అనే అక్షరాన్ని బీజాక్షరాలుగా జతచేసి ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రసృష్టికి కారణం నువ్వే అయ్యావన్నారు. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది. అదే ''ఓం శ్రీసతియే నమః' అనే మంత్రం పుట్టిన కథ.
--(())--

05. : సోహం 
: సోహం అంటే అతనే నేను లేదా నేనే అతను, నేనే బ్రహ్మం , బ్రహ్మం నేనే  సః అంటే అతను (బ్రహ్మము ) అహం అంటే నేను. ఈ మంత్రం అన్ని మంత్రాల కంటే గొప్పది.ఇది పరమ హంసలైన యోగుల మంత్రము. ఇది అభేద బోధ వాక్యం అని అంటారు. ఇది జీవ బ్రహ్మ ఏకత్వాన్ని సూచిస్తుంది. ఈ మంత్రం సోహమస్మి అనే  ఈశావాశ్య ఉపనిషద్ నుండి తీసుకొనబడింది .

సోహం ఓం రెండు ఒకటే. సో అనే అక్షరంలో స ని తీసివేస్తే ఓ ఉంటుంది  హం లో హ ని తీసివేస్తే o ఉంటుంది. రెంటిని కలిపితే ఓం అవుతుంది. ఓం కారం కంటే సోహమే సులభమైంది. శ్వాసతో కలిపి మనసుతో భావన చేయాలి. అందుకే ఇది సోహం  ధ్యానం కాదు  సోహం భావన  లేదా హంస  భావన అని అంటారు. ఈ జపాన్ని కష్టపడి చేయాల్సిన పనిలేదు కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి, ఉచ్వాస నిశ్వాసాలను గమనిస్తే చాలు.

హంసోహం అని పునరావృతమవుతూ ఉంటుంది. దానికంటే ముందు నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే వేదాంత వాక్యం ద్వారా  ఈ దేహం నేను కాదని, "నాహం ఇదం శరీరం" దేహాన్ని మరియు  పంచ కోశాలను నేను కాదని  నిరసించాలి. నేను పాంచ భౌతికమైన దేహం కాదు నేను ఆత్మను, పరమాత్మా స్వరూపమని భావించాలి.

ఈ మంత్రాన్ని లోపలున్న జీవుడు లేదా ఆత్మ రోజుకి  21,600 సార్లు పునరావృతం చేస్తూ ఉంటుంది. గాఢనిద్రలో కూడా దానంతట అదే ఈ  అజప జపం జరుగుతూ ఉంటుంది.
 ఉచ్వాస నిశ్వాసాలను ఏకాగ్రతతో గమనిస్తే ఈ మంత్ర శబ్దం వినవచ్చు. గాలి లోపలకి పీల్చినపుడు ఉచ్వాసంలో సో అని  వదిలినపుడు హం అనే శబ్దం వినిపిస్తుంది.
దీనినే అజప జపమని అంటారు ఎందుకంటే నోరు తెరవకుండా పెదవులు కదపకుండా మనసుతో భావన చేసేది.

సహజంగానే పరమాత్మ మనకొక వరం ఇచ్చారు. సంధ్యాకాలంలో మనం కనుక మేలుకొని హంసను గమనిస్తూ వుంటే, మన ప్రాణాన్ని గమనిస్తూ వుంటే, సుషుమ్న నాడిలో హంస కొట్టుకోవడం గమనించవచ్చును. ఇడా పింగళ, మధ్యలో సుషుమ్న నాడి వుంటుందన్నమాట. ఆ సుషమ్నా నాడిలో ఒక్క క్షణం పాటు హంస కొట్టుకుంటుంది. ఎప్పుడూ అందులో కొట్టుకోదు, ఇడాపింగళలో కొట్టుకుంటుందన్నమాట. ఈ సుషుమ్నానాడిలో ఆ క్షణం పాటు ఎప్పుడైతే కొట్టుకుంటుందో, ఆ కొట్టుకునే క్షణంలోనే మనం తెలుసుకోగలమట ఆత్మజ్ఞానాన్ని. ఆత్మసాక్షాత్కారం అప్పుడు జరుగుతుంది. ఒక్క క్షణంలో, ఒక్క రెప్పపాటులో జరిగిపోతుంది అది. ప్రతిరోజూ వుంది మనకు ఆ అవకాశం. ఎవరు చెప్పినా అదే. 6 గంటలకు చేయండి, 5.30కు చేయండి. బ్రహ్మముహూర్తంలో లేవండి, ఏమిటి? లేచి ఏం చేయాలి? ఇది చేయాల్సిన పని. ఐదు గంటలకు లేచానండి, మళ్ళా అటూ ఇటూ దొర్లానండి. అది కాదండీ అక్కడ విషయం.

లేచిన తరువాత ప్రాణాన్ని గమనించవయ్యా! ఇడ, పింగళ, సుషుమ్న పైకి క్రిందకి ఎలా కొట్టుకొంటోంది? కుడిలోంచి వెళ్ళింది. ఎడమకు తిరిగి వచ్చింది. మళ్ళా ఎడమలోంచి వెళ్ళింది, కుడికి తిరిగి రావాలి. కానీ అలా రావడం లేదు. ప్రయత్నం చేసి అలా శ్వాసను త్రిప్పుకో. తిప్పుకుంటే మధ్యలో సుషుమ్నా నాడి అలా తగుల్తుందన్నమాట. తగిలినప్పుడు నీకు ఆ స్పర్శయొక్క భేదం తెలుస్తుంది. ఇడా పింగళలో హంస పనిచేస్తే ఎలా వుంది? సుషుమ్నలో వుంటే ఎలా ఉందొ తెలుస్తుంది? మనలో చాలా మందికి ఉదయం అస్సలు ధ్యానం కుదరడంలేదని సమస్య. అయితే మనం అప్పుడే ధ్యానం వగైరాల జోలికి వెళ్ళకూడదు. ముందు ప్రాథమిక ప్రయత్నం చేయాలి. మన అందరికీ ఏమిటంటే, అక్షరాభ్యాసం లేదు పై క్లాసువుంది. ఈ అక్షరాభ్యాసం లేకుండా ఆ పై క్లాసు రాదు. ముందు మనకు ప్రాధమిక అభ్యాసం set right అవ్వాలి.

 శాన్తాయ దాన్తయ గురుభక్తాయ హంస హంసేతి|| (హంసోపనిషత్)
- హంస హంస అను పరబ్రహ్మ స్వరూపము జితేంద్రియుడగు గురుభక్తునకు తెలియబడుచున్నది.

భావాభావాతీతమైన   సొగసా
ఊపిరిని  వదలని  గొలుసా
నీకు  ముడిపడినది  మనసు తెలుసా
ఈ  కనుల  మెరుపులా  వరస
బాహ్య  మధ్య  అంతర  రభస   
కలమేలకవైనదేమో  బహుశా
ఇది మలుపు  వెలుగుల  దశ
నీవేలే పైకి కిందకి  ఎగిరే  హంస
అందుకొని  గగనపు  కొనలే  చూసా
ఇంకేమి  అవసరం లేదు
 గురువాక్యమిది చాలు

ఇడా  పింగళ  నాడుల  మధ్యన  సుషుమ్న    నాడి  ఉంటుంది.
ఈ  ఇడా  పింగళ  
రెండు నాడులు  రెండు  శబ్దాలను  చేస్తాయి.
నాభి చక్రమైన  అనాహతం  నుండి   ప్రాణ  వాయువు  సుషుమ్న  నాడి  యందు  ప్రవిశించినపుడు , మనకి  జీవుడు  చేసే  శబ్దం  లేదా  అజపం  వినపడుతుంది.
అదే  సోహం.
ఎంతోమంది ఆధ్యాత్మిక  గురువులు  బోధించే  మంత్రమిది.
ఇదే ఆఖరి  మంత్రం , అత్యున్నత  మంత్రం,
అజపా  మంత్రం, హంస  అని అంటారు. జీవాత్మా  పరమాత్మతో  ఐక్యమవడానికి  ఉపయోగపడే  మంత్రమిది.
సోహం = సః + అహం
సః" అంటే  ఆ  పరమాత్మా / తాను , ఇడా  నాడి  చేసే  శబ్దం
అహం" అంటే జీవాత్మ  / నేను.
పింగళ  నాడి  చేసే  శబ్దం.
సః అహం ఈ  రెండు  కలవడమే  జీవబ్రహ్మాఇక్యం.
అదే  చిన్ముద్ర సూచన , చూపుడు  వేలు  బొటన  వేలితో  కలిపి   మౌన  వ్యాఖ్య  చేస్తారు.
జీవుడు  లోపల  నిరంతరం  సోహం సోహం అని ధ్యానిస్తూ  ఉంటాడు.
ఉచ్చ్వాస-  ముక్కులోకి  శ్వాస  పీల్చినపుడు  "సో" అని
నిశ్వాస-  శ్వాస   వదిలినపుడు "  హం"  అని లోపల  వినపడుతుంది , కాబట్టి  మనసులో   నిత్యం  స్మరించాలి , నోటితో  జపించరాదు , పలకరాదు.

ఏమీ  తెలియదని  తెలుసుకోవడమే  జ్ఞానం హంస  భావనే  అభ్యాసం గుర్తెరిగే  శరీరం ఏమి   లేదనుటే  వైరాగ్యం ఆత్మ / పరమాత్మ  నేనని  అనుభవమే  ఆరూఢమ్
చిత్తము  నిలుపుటే  యోగం అంతా   ఉత్తదనుటే  ఉత్తమం
వాదులాడక ఉరుకుంటే  సుఖం
నిశ్శబ్దమే  భజన మౌనమే  బ్రహ్మ  ధ్యానం
నిద్దురలో  నిద్దూరే  బ్రహ్మ  నిర్వాణం
నిర్వికల్ప  సమాధిలోనే  బ్రహ్మ  తత్త్వం
ఆత్మానుసంధానమే  మోక్షం
జన్మ  రహితమే  పరమార్థం
జీవజగదీశులు  స్వప్నం
నీవేకమని  గుర్తెరిగితే  ఆనందం
స్వానుభవమే  సత్యం.
మనసే  బంధం
మరుపే  మరణం
గురువే దైవం.
--(())--

06: భగవద్గీత లో శ్రీకృష్ణుడు అర్జునునకు "స్థితప్రజ్ఞుని" లక్షణాలు ఇలాచెప్పాడు.

దు:ఖములకు కృంగిపోని వాడును, సుఖములకు పొంగిపోని వాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడిన వాడును అయినట్టి మనన శీలుడు స్థితప్రజ్ఞుడు అనబడును. దేనియందును మమతా ఆసక్తులు లేనివాడును అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కాని వాడును స్థితప్రజ్ఞుడు. అట్టివానికి పరమాత్మ సాక్షాత్కారము అయినందు వలన వానికి భగవంతుని సాన్నిధ్యము, మిత్రత అను వాని నుండి కుడా ఆసక్తి తొలగిపోవును. ఇంద్రియములను వశపరచుకొన్న వాని బుద్ది స్థిరముగా ఉండును.ఒకవేళ ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహించుచున్నను, అంత:కరణమును అదుపులో ఉంచుకోనిన వాడు మన:శాంతిని పొందును. వెంటనే అతని దు:ఖములన్నియు నశించును. ఈ విధముగా ప్రసన్న చిత్తుడయిన వాని బుద్ది అన్ని విషయముల నుండి వైదొలగి, పరమాత్మ యందు నిలుచును.( ఇచ్చట విషయములనగా లౌకిక ఆసక్తులు)

ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వానికి నిశ్చయమైన బుద్ది ఉండదు. అట్టి వాని అంత: కరణ యందు ఆస్తిక భావమే ఉండదు.అట్టి వానికి, శాంతి, దాని ద్వారా వచ్చే సంతోషము, సుఖము ఎట్లు వచ్చును? కోరికలన్నిటిని త్యజించి, మమత, అహంకార రహితుడై ఉన్న పురుషుడు శాంతిని బొందును.ఇదియే బ్రహ్మిస్థితి. దీనిని అంత్యకాలమున పొందిన వాడు బ్రహ్మ లోకమును పొందును.
 
--(())--
07. : కాకి అరిస్తే మంచిది.. తాకితే అశుభం.. ఎందుకు ?

నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నావని ఎగతాలి చేస్తారు. గట్టిగా గోలచేస్తే కాకిలా అరుస్తున్నావు అని గేలీ చేస్తారు. కాకి పిల్ల కాకికి ముద్దు అని దీర్ఘాలు తీస్తారు. కాకిని రకరకాల సందర్భాల్లో వాడుతుంటారు. కొన్నిసార్లు పాజిటివ్ గా, మరికొన్ని సార్లు నెగటివ్ గా తీసుకుంటారు. బామ్మలు ఎక్కువగా కాకి ప్రస్తావన తీసుకొస్తుంటారు.

 కుజ దోషం ఉంటే ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఉండాల్సిందేనా ?

 ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే.. ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలా మంది నమ్ముతారు. కానీ.. కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అని చాలా మందికి సందేహం ఉంటుంది.

అలాగే కాకి తలపై తాకితే.. దోషమని చాలా మంది బెంబేలెత్తిపోతుంటారు. మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధి అని కూడా పిలుస్తారు. ఇవన్నీ మూఢనమ్మకాలా ? వాస్తవాలా ? అన్న విషయం మాత్రం ఎవరికి క్లారిటీ ఉండదు.

కాకి అరిస్తే చుట్టాలొస్తారన్న నమ్మకానికి రామాయణానికి సంబంధం ఉంది. ఆంజనేయుడు సీతమ్మని వెతుక్కుంటూ లంకకి వెళ్తాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకి శుభవార్త కాబట్టి, కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు.

శనిగ్రహ దోష నివారణకు ఏం చేయాలి..?

కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయే అంత అపనమ్మకమూ ఉంది. కాకి శని వాహనం కాబట్టి.. కాకి తగిలితే.. శని దోషం జరుగుతుందని, యముడి రాకకి సంకేతమని భయపడతారు. కానీ.. దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. నిత్యం ఏదోఒకటి జరుగుతూ ఉంటుంది. దానికి అనవసరంగా ఖంగారు పడకూడదు. అంతగా అనుమానంగా, భయంగా ఉంటే.. శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం చేసి, అభిషేకం చేయిస్తే దోషం పోతుంది.

08. [శ్రీ శివపురాణం ప్రకారం
శ్రీ శివపురాణం ప్రకారం ప్రధానంగా అష్టభైరవులు వరుసగా చండభైరవ, అసితాంగ భేరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోథ బైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, ఉన్మత్త భైరవ. ఈ ఇస్సన్నపల్లి గ్రామంలో అష్టభైరవులు వెలసినట్లు అక్కడివారు చెబుతారు.

 అష్టబైరవులలో కాశీభైరవుడు
అష్టబైరవులలో కాశీభైరవుడు పైభాగంలో ఉంటాడు, క్రింది ఈశాన్య భాగంలో కాలభైరవుడు ఉంటారు, ఈశ్యాన్య దిక్కును ఈవానుడు పాలించడం వల్ల ఈ గ్రామానికి ఇస్సన్నపల్లి అని పేరు వచ్చింది. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం)కూడా అణిగి ఉంటాడు, కనుకనే కాళబైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.

బ్రహ్మ గర్వం అణచడానికి అవతరించిన కాలభైరవుడు
బ్రహ్మ గర్వం అణచడానికి అవతరించిన కాలభైరవుడు, శివుడి మానసపుత్రుడు కాలభైరవుడు.బ్రహ్మ యొక్క అహాన్ని తగ్గించడంలో బ్రహ్మా యొక్క ఐదవ తలను ఖండిచడం వల్ల అతనికి బ్రహ్మ హత్యా మహాపాతకం తగలడం వల్ల దాన్ని పోగొట్టుకొనడం కోసం బిక్షాటన చేసి, కాశీకి వెళ్ళి అక్కడ విముక్తుడయ్యాడనికి, అప్పటి నుండి అక్కడే కాశీ క్షేత్రపాలకుడుగా ఉన్నాడని పురుణాలు చెబుతున్నాయి. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది.

త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ దేవుడికి
అదేంటేంటే త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ దేవుడికి మొదట ఐదు తలలుండేవట, తను సృష్టికర్త కావడంతో బ్రహ్మలో గర్వం పెరిగిందట. త్రిమూర్తుల్లో తానే అధికుడని చెప్పుకోవడం మొదలు పెట్టాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు వచ్చి ‘నా నాభికమంల నుండి పెట్టినవాడివి, అందువల్ల నేనే గొప్పవాణి అన్నారట. వాళ్లిద్దరూ వాదించుకుంటుండా అక్కడ ఒక జ్యోతి స్థంభం ప్రత్యక్షమైనది. అప్పుడు అది చూసి శ్రీ మహా విష్ణువు ఈ వాదన నుండి విరపించుకున్నాడు , కానీ బ్రహ్మకు మాత్రం అహంకారం పోలేదు.

శివుడినుండి ఓ ఘోరరూపం
అప్పుడు శివుడినుండి ఓ ఘోరరూపం ఆవిర్భవించిందట. నాలాగే తనకూ ఐదు తలలున్నాయి కాబట్టి నాతో సమానుడని గర్వంతో విర్రవీగుతున్నాడు. ఈ ఐదో తలను నీ కొనగోటితో తుంచెయ్. అని ఆ రూపాన్ని ఆదేశించాడట. కొనగోటి బ్రహ్మఐదోతలను తొలగిస్తే కానీ ఆ బ్రహ్మకు తత్వం భోదపడలేదు. అప్పుడు శిశుడు ఆ రూపంతో నువ్వు బ్రహ్మ తలను తెంచావు కాబట్టి కాలం వలె కనిపిస్తున్నావు. అందుకే నిన్ను కాలభైరవుడు అని పిలుస్తారు.

బ్రహ్మతలను ఖండిచినందకు బ్రహ్మ హత్యాపాతకం
అయితే బ్రహ్మతలను ఖండిచినందకు బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకోవడం వల్ల ఈ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండేళ్ళు భిక్షాటన చేసి ఇందులో తింటే పాపం పరిహారమవుతుంది. ఇక పైన నా దేవాలయాల్లో నువ్వే క్షేత్ర
పాలకుడివి . కాశీ పట్టణానికి అధిపతిగా , నా ఆలయాలకు వచ్చే భక్తుల పాపాలను భక్షిస్తావు అని చెప్పాడట.

కాలభైరవుని దేవాలయాలు
కాలభైరవుని దేవాలయాలు మనదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. నేపాల్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లలో కాలభైరవుణ్ణి విశేషంగా పూజిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రమే ఒకటి మన రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలోనూ ఉంది.
🙏🙏🙏🙏🌹🌹🌹🌹

09.  [🍁మీ జీవితాచరణ ద్వారా...🍁

ఆ రోజుల్లో గంగాతీరంలో కేశముక్తం అనే పెద్ద వ్యాపార కూడలి ఉండేది. అది ఆధ్యాత్మికతకు కూడా నిలయం.

దాదాపు అన్ని శ్రమణ సంప్రదాయాలకూ అది కేంద్రం. ప్రతి రోజూ ఏదో ఒక చోట ధార్మిక ప్రసంగాలు జరుగుతూ ఉండేవి. ఎవరి వాదాల్ని వారు బలంగా వినిపిస్తూ ఉండేవారు. ప్రతివారూ తమ సంప్రదాయమే ముక్తికి ఏకైక మార్గం అని నొక్కి చెబుతూ ఉండేవారు. దేన్ని నమ్మాలో తెలియక ప్రజలు గందరగోళపడేవారు. ఏ ఒక్కరిని అడిగినా సరైన సమాధానం దొరికేది కాదు.

ఒకసారి బుద్ధుడు తన బౌద్ధ సంఘంతో కలిసి కేశముక్తం వచ్చాడు. ధమ్మ ప్రసంగం చేశాడు. అనంతరం కాలాములు అనే పెద్దలు  లేచి ‘‘భగవాన్‌ మీరు చెప్పింది బాగానే ఉంది.

మీలాగే ఎందరో శ్రమణులు ఇక్కడ ఉన్నారు. ఎవరి విధానం వారు చెబుతున్నారు. దీనిలో ఏది సరైనదో, మేము దేన్ని ఆచరించాలో మాకేమీ పాలుపోవడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి?’’ అని అడిగారు.

‘‘కాలాములారా! కలవరపడకండి. మీ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుంది’’ అన్నాడు బుద్ధుడు.

‘👉‘అయితే, భగవాన్‌! మేము దేన్ని నమ్మాలో, దేన్ని విడవాలో సెలవియ్యండి’’ అని కోరారు.

‘‘కాలాములారా!

🌿ఏ విషయాన్నయినా సరే... ‘ఇది తరతరాలుగా వస్తోంది కాబట్టి నమ్మాలి’ అని నమ్మకండి.

🌿‘ఎన్నెన్నో గురు పరంపరలుగా దీని బోధన జరుగుతోంది కాబట్టి నమ్మాలి’ అని నమ్మకండి.

🌿‘ఈ సిద్ధాంతం చెప్పేవాడు చాలా గౌరవనీయుడు, గొప్పవాడు. కాబట్టి దీన్ని నమ్మి తీరాలి’ అని నమ్మకండి

🌿‘ఈ విషయం ఒక గొప్ప గ్రంథంలో ఉంది. ఆ గ్రంథం చాలా పవిత్రమైనదిగా పరిగణన పొందుతోంది. కాబట్టి నమ్మాల్సిందే!’ అని నమ్మకండి.

🌿‘ఈ విషయం చెప్పినవాడు చాలా అనర్గళంగా చెప్పాడు. అతని కంఠం గంభీరంగా ఉంది. మధురంగా ఉంది.

🌿అతను చాలా అందగాడు. స్ఫురద్రూపి. అలాంటి వాడు చెప్పాడు కాబట్టి నమ్మాలి’ అని నమ్మకండి.

కాలాములారా! జ్ఞానం మాత్రమే నిజమైనది. దాన్ని మీకు మీరుగా సాధించుకోవాల్సిందే!

నిజాన్ని ఎప్పుడూ సందేశాల ద్వారానో, ప్రవచనాల ద్వారానో నిగ్గు తేల్చుకోలేం. జీవితానుభవం ద్వారానే అది సాధ్యం.

👉కాబట్టి, ఎవరు ఏమి  చెప్పినా మీరు మీ జీవితాచరణ ద్వారా ఏది నిజమైనదో, ఏది నమ్మదగినదో నిర్ణయించుకోండి’ అని చెప్పాడు బుద్ధుడు.

బుద్ధుడు చెప్పిన సమాధానం విని అందరి మనసులూ కుదుటపడ్డాయి. కానీ ఒక యువకుడు లేచి ‘‘భగవాన్‌! మరి మీరు చెప్పే సందేశాల్ని?’’ అని అడిగాడు.

👉‘‘నేను చెప్పినదైనా సరే! మీ అనుభవానికి అందితేనే స్వీకరించండి’’ అన్నాడు బుద్ధుడు.

బుద్ధునికి ఆ యువకుడు ప్రణమిల్లాడు.🍁
--(())--

10 [🍁మనసు - అవరోధాలు🍁

🌿మనసు ఉన్న వాళ్ళం కాబట్టి మనల్ని ‘మనుషులు’ అంటారు.

🌿మనిషి సుఖ దుఃఖాలకూ, ఆవేశకావేశాలకూ, శాంతి అశాంతులకూ మనసే మూలం, మనసే కారణం. మనిషిని అతని మనోస్థితుల్ని బట్టే బుద్ధుడు విశ్లేషించాడు.

👉మనసుకు మొదటి అవరోధం కామవాంఛ. ఈ వాంఛ అల్లుకొని ఉన్న మనసు రంగులు కలిపిన నీటిలాంటిది. రంగుల వల్ల నీటిలో మన ప్రతిబింబాన్ని మనం స్పష్టంగా చూడలేం.

👉అలాగే రెండో అవరోధం ఈర్ష్య. దీనివల్ల మనస్సు కుతకుతా ఉడికిపోతుంది. తెర్లిపోతుంది (సలసల పొంగుతుంది). ఇలాంటి అవరోధం ఉన్న వారి మనసు తెర్లే నీటి లాంటిది. వేడెక్కి తెర్లుతున్న నీటిలో మనం ప్రతిబింబాన్ని మనం చూడలేం కదా!

👉ఇక మనసును ఆవరించే మూడో అవరోధం సోమరితనం. ఈ సోమరితనం ఉన్నవాడు ‘రాజకుంభి’ అనే పురుగులాంటివాడు. ఆ పురుగు రోజంతా కదిలినా రెండంగుళాల దూరమైనా వెళ్ళలేదు. వానపాము కన్నా, నత్త కన్నా సోమరి రాజకుంభి.

🌿ఒకరోజు వేగంగా కదిలే కాళ్ళజెర్రి... రాజకుంభితో ‘‘మిత్రమా! రాజకుంభీ! నీ నడక చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఇంత నెమ్మదిగా నడుస్తున్నావ్‌! ఎప్పుడైనా అడవి అంటుకుంటే ఏం చేస్తావు? ఏమైపోతావు?’’ అని అడిగింది.

‘‘మిత్రమా జెర్రి! నీ అంత కంగారు నేను పడను. అడవి అంటుకుంటే.. ఆ మంటలు నా దాకా వస్తే గదా భయం. గుట్టలు దాటి, నెర్రలు దాటి, చెట్ల గుబుర్లు దాటి వచ్చే లోపే ఆ మంటలు ఎక్కడో ఒక చోట ఆరిపోక చస్తాయా! అవన్నీ దాటుకొని నా దగ్గరకు వచ్చేదెప్పుడు? నన్ను చంపేదెప్పుడు!’’ అని పరిహాసం చేస్తూ తన బద్ధకాన్ని చాటుకుంది. అలాగే సోమరితనం ఆవరించినవాడు కూడా ‘ఆఁ! ఇది జరుగుతుందా? పాడా?’ అంటూ ప్రతిదాన్నీ తేలికగా లెక్కించుకుంటాడు.

🌿అందుకే ఇలాంటివారి మనస్సును పాచిపట్టిన నీటితో పోల్చాడు బుద్ధుడు. నెమ్మదిగా, కదిలీ కదలకుండా ఉండే నీటిలో పాచి పట్టి పేరుకుపోతుంది. ప్రవాహంలో పాచి ఉండదు.

👉మనసును ఆవరించే నాలుగో అవరోధం విశ్రాంతి లేకపోవడం. అవిశ్రాంతంగా మనసుతో పని చేయించడం. శ్రమకు తగిన విశ్రాంతి కావాలంటాడు బుద్ధుడు. ఇలాంటి వాడి మనసు ఎప్పుడూ కల్లోలంగా ఉంటుంది. అందుకే దీన్ని నీటి అలలతో పోల్చాడు. నిరంతరం కదిలే నీటిలో కూడా మన ప్రతిబింబాన్ని చూడలేం.

👉ఇక, అయిదో అవరోధం శంక. అనుమానించడం. ప్రతిదాన్నీ శంకించడం వల్ల మనసు ఎప్పుడూ చెడు భావనలతోనే నిండిపోయి ఉంటుంది. అలాంటి వారు తాము సుఖపడరు, ఎదుటివారిని సుఖపడనీయరు.

🌿 శంకతో పండంటి జీవితాలను పండుటాకుల్లా రాల్చేసుకున్నవారు ఎందరో! ‘‘ఇలాంటి ‘శంక’ అనే అవరోధం ఆవరించినవారి మనసు బురద కలిసిన నీరులాంటిది!’’ అన్నాడు బుద్ధుడు. బురద నీటిలో కూడా మన ప్రతిబింబాన్ని సరిగ్గా చూసుకోలేం.

🌿ఈ అయిదు అవరోధాల నుంచి బయటపడితే మన మనసు తేట నీరులా ఉంటుంది. ఆ నీటిలో మన ప్రతిబింబాన్ని చూసుకోగలం. అలాగే... అలాంటి తేట మనసు ఉంటే మనలోకి మనం చూసుకోగలం.🍁

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ