***
01. శబరి విందు’!
🥀💥🥀💥🥀💥🥀💥🥀
శ్రీరామునకు శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా?
శబరి మతంగమహర్షి శిష్యురాలు. సిద్ధయోగిని.శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు
ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే రాముని
కోసం ఎదురు చూస్తూ ఉండి పోయిన రామ భక్తురాలు.ఎదురు
చూస్తూనే వృద్ధురాలై పోయింది.
రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసిన శబరి వారికి ఎదురు వెళ్లి సంప్రదాయ బద్దంగా అర్ఘ్యపాద్యాదు లందించి ,రామ లక్ష్మణులు సేద తీరిన తరువాత మాగురువులు చెప్పినప్పటినుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావేమిటని చనువుగా ప్రశ్నిస్తుంది.రాముని కోసం ఎంతో కాలం గా సంపాదించి. భద్ర పరచిన ఫల,మూలాదులను ఆయనకు అర్పించింది.
“ మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభే
తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవమ్. “ వా.3-74.17
అని మాత్రమే వాల్మీకం.
దీన్ని వ్యాఖ్యానిస్తూ గోవిందరాజీయం లో -
“ వన్య శబ్దేన ఫలమూలాదికముచ్యతే.”
{ చతుర్వ్యాఖ్య. పు. 1276 .}
దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏజాతి పండు ఎలా ఉంటుందో, ఏచెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం శబరికుంది. అందుకనే మంచిపండ్లను పరీక్షించి రాముని కందించింది శబరి. ఇది వాల్మీకం.
అంటే” ఎంగిలి విందు” ప్రస్తావన వాల్మీకం లో లేదు.
కాని” శబరి “పేరు తో కావ్యాలు రచించిన వారందరు కూడ ఎంగిలి విందు చేయించిన వారే కాని వాల్మీకిని అనుసరించిన వారు
ఒక్కరు లేరు.
మరి ఈ ప్రస్తావన ఎక్కడనుంచి వచ్చింది.
పద్మపురాణం లో మనకు ఈ ** విందు ప్రస్తావన కన్పిస్తోంది.
” ప్రత్యుద్గమ్య ప్రణమ్యాథ నివేశ్య కుశవిష్టరే
పాదప్రక్షాళనం కృత్వా తత్తోయం పాపనాశనం
........................................................
ఫలాని చ సుపక్వాని మూలాని మధురాని చ
స్వయమాసాద్య మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్య చ
పశ్చాన్నివేదయామాస రాఘవాభ్యాం దృఢవ్రతా”
పద్మపురాణ భాగంలో” పరీక్ష్య, పరిభక్ష్య,పశ్చాన్నివేదయామాస” అని ఉన్న భాగాన్ని పరిశీలిస్తే శబరి కంద మూల ఫలాల మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించిందనేది స్పష్టమౌతోంది.
కాని దీనిలో కూడ శబరి తాను తిన్నపండునే రామున కిచ్చినట్లు ఎక్కడాలేదు. రాముడు చిత్రకూటానికి వచ్చినప్పటినుండి, రాముడు తన ఆశ్రమానికి వస్తాడనే గురువుల మాట మీద ప్రత్యయం తో అప్పటి నుండే కందమూలాలను, నిలవఉండే ఫలాలను, సంచితం-అంటే, ఏరి కోయించి సంపాదించి భద్ర పరచింది. ఇప్పుడు రాముడు వచ్చిన తరువాత వానిని బయటకు తీసి పరీక్షించి, జాతికొక దాన్ని తిని, చెడిపోలేదు అని నిర్ధారణ చేసుకొని రామునికి సమర్పించిందనేది లక్ష్యార్ధం.
“ “
శ్రీరాముని శ్రియ:పతి గా నెరింగి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్న మహాతపస్విని శబరి.
అట్టి మహానుభావునకు తాను అర్పించే విందులో మాధుర్యం కొఱవడితే ఓర్వలేక, అపచార భయం చేత ,భక్త్యతి శయం చేత శబరి ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండ వచ్చు.
వృద్ధ, జ్ఞానవైరాగ్య సంపన్న,గురుశుశ్రూషా పరాయణ అయిన శబరి లో పరమభక్తి పరాకాష్ఠకు చేరి , గోదాదేవి తాను ధరించిన మాలలను భగవంతునికి సమర్పించినట్లు, విదురుని విందు లో శ్రీ కృష్ణునకు అరటిపండు ఒలిచి పండు పారవేసి తొక్కుఅందించినట్లు, పండ్లను రుచి చూచి స్వామికి సమర్పించిందని భావించిన జానపదులు
“శబరి విందు’’ను మధురాతి మధురంగా గానం చేసుకుంటున్నారు. భక్తునికి ఇష్టమైన దాన్ని ఎంతకష్టమైనా భరించడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటాడన్నవిషయం బాణాసురుని ఇంటికి కాపలా కాయడం దగ్గరనుండి మానవుడిగా జన్మించి బాధలు పడడం వరకు ఎన్నో విషయాల్లో ఋజువవు తూనే ఉంది..
శబరి శ్రీ రామచంద్రునకే విందునందించిన పరమ భక్తురాలు. కాని శబరి వాగులోకి పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నీటిచే స్పృశించబడుతున్నాయి . ఆ పండ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరిఎంగిలి చేసిన పండ్లను రాముడుతిన్నాడని జానపదకథలుగా పాడుకుంటున్నారని కొందరి వాదన..
శబరి పూర్వజన్మ వృత్తాంతం కంబరామాయణం లో కన్పిస్తోంది.
“ శబరి పూర్వ జన్మ లో” మాలిని” అనే గంథర్వకన్య.గందర్వరాజైన చిత్రకవకుని ఏకైకపుత్రిక. వీతిహోత్రుని పరిణయమాడింది.భర్త యజ్ఞయాగాదులలో మునిగియుండగా మె కల్మాషుడనే బోయవానితో సంబధం పెట్టుకోగా కోపించిన వీతి హోత్రుడు మెను శబరవనిత గా జన్మించమని శపించాడు. రామచంద్రుని దర్శనానంతరం ఆ మహనీయుని ఆశీస్సులతో తిరిగి మాలిని గా మారిపోయి భర్తతో గంధర్వ లోకాన్ని చేరింది. “ అని కంబరామాయణం శబరి పూర్వ చరిత్ర ను ప్రస్తావించింది.[puranic encyclopedia –p.659].
తెలుగు కవులెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.
తులసీ ధాసు వాల్మీకి మార్గంలోనే పయనించాడు.
***శబరీ దత్త ఫలాశన రామ******
--(())--
02. ఉసిరిక చెట్టు
03. *🌺వేయి చేతులతో రక్షించే దేవత." అవలోకితస్వర"మాత🙏
ఓ దేవత. ఈ భూమ్మీద ఉన్న ప్రజలందరి కష్టాలూ చూసి ఆమె మనసు చలించిపోయేది. వారిని తాత్కాలికంగా ఆ కష్టాల నుంచీ, శాశ్వతంగా సంసారమనే వలయం నుంచి తప్పించాలని తపించిపోయేది. అందుకోసం ఆమెకు బుద్ధుడు వేయి చేతులను ప్రసాదించాడు. ఆపదలో కనిపించిన ప్రతి మనిషినీ రక్షించే శక్తిని ప్రసాదించాడు. ఆ దేవత పేరే ‘అవలోకితస్వర’... అంటే ‘మన ఆర్తనాదాలను వినే దేవత’ అని సంస్కృతంలో అర్థం. ఆ పేరు క్రమంగా అవలోకితేశ్వరగా మారిపోయింది.
తొలుత బౌద్ధంలో దేవతల ప్రస్తావన తక్కువ. కానీ హిందూధర్మంతో ఉన్న అనుబంధం వల్లనో, లేక వారి స్వీయ అనుభవాల వల్లనో దేవతారాధన అనేది బౌద్ధంలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ముఖ్యంగా వజ్రయానం, మహాయానం వంటి బౌద్ధ శాఖలలో దేవతార్చనకు, ఆరాధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. అలా బౌద్ధులు కొలిచిన ముఖ్యదేవతలలో ఒకరు అవలోకితేశ్వర. మహాయానం కోసం సంస్కృతంలో రూపొందించిన ‘సద్ధర్మ పుండరీక సూత్రాలు’ అనే పుస్తకంలో అవలోకితేశ్వరుని ప్రసక్తి చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఒకప్పుడు అవలోకితేశ్వర ఆరాధన చాలా విస్తృతంగా ఉండేది. 12వ శతాబ్దానికి ముందర ఎక్కడ చూసినా ఆయన గుడులూ, విగ్రహాలు విస్తృతంగా కనిపించేవి. రాజమందిరాలు మొదల్కొని రహదారుల వరకూ ఎక్కడ చూసినా శుభసూచకంగా ఈ విగ్రహాలు దర్శనమిచ్చేవి. కానీ 12వ శతాబ్దంలో అన్యమతస్తులు చేసిన దండయాత్రల తరువాత ఇవి కనుమరగు కావడం మొదలుపెట్టాయి. క్రమేపీ మన దేశంలో బౌద్ధం క్షీణించడంతో పాటుగా అవలోకితేశ్వర అన్న మాటనే జనం మర్చిపోయారు. కానీ బౌద్ధ మతం విస్తరించిన ఇతర ప్రదేశాలలో ఈ దేవత పేరు, రూపం పలురకాలుగా పూజలనందుకోవడం మొదలుపెట్టింది. చైనీయులు అవలోకితేశ్వరుని, ‘గుయాన్ ఇన్’గా పిలుచుకోసాగారు.
చైనీయుల దృష్టిలో ‘గుయాన్ ఇన్’ జాలి, కరుణలకు ప్రతిరూపం. సంతానం లేనివారికి పుత్రభాగ్యాన్ని ప్రసాదించే తల్లి. సంతానాన్ని అందించడమే కాదు, ఆ బిడ్డలను పెంచడంలో తలమునకలై ఉండే తల్లులకు తోడుగా నిలుస్తుంది. సముద్రం మీదకు వెళ్లే నావికులకు దారి చూపిస్తుంది. అదీ ఇదీ అని ఏముంది? ఎవరికి ఏ ఆపద కలిగినా, ఎలాంటి బాధ మెలిగినా... వెన్నంటి నిలుస్తుంది. ఆపదల నుంచి గట్టెక్కించడమే కాదు, కర్మఫలం నుంచి కూడా తప్పిస్తుంది. కిరీటం మీద బుద్ధుని ప్రతిమతో, పక్కనే తెల్లటి చిలుకతో, డ్రాగన్ మీద ఠీవిగా నిల్చొని ఉన్న ‘గుయాన్ ఇన్’ ప్రతిమలు చైనా అంతటా కనిపిస్తాయి. అయితే గుయాన్ ఇన్‌కు ఒక ప్రత్యేకమైన ప్రతిరూపం అంటూ లేదు. భక్తులను రక్షించేందుకు ఆమె ఏ రూపాన్నైనా ధరిస్తుంది. అందుకే ఆమెను కొందరు యువకునిగాను, మరికొందరు స్త్రీమూర్తిగానూ పూజిస్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, కష్టాన్ని బట్టి ఆమెను వివిధ రూపాలలోను, రకరకాల పేర్లతోను పిలుచుకుంటారు. జపాన్‌లో కనోన్ అనీ, టిబెట్‌లో చెన్‌రెజిక్ అనీ... ‘గుయాన్ ఇన్’కు ఒకో దేశంలో ఒకో పేరు, ఒకో రూపు ఉంటుంది.
మనం తరచూ బౌద్ధానికి సంబంధమైన నృత్యాలను, చిత్రాలను చూసినప్పుడు గుయాన్‌ఇన్ కనిపిస్తూనే ఉంటుంది. మనిషి వెనుక మనిషి నిల్చిని వందలాది చేతులను చాచి చేసే ప్రదర్శన గుయాన్ ఇన్ గురించే! బుద్ధుని పక్కనే తాండవం చేస్తున్నట్లు కనిపించే స్త్రీమూర్తి చిత్రం గుయాన్ఇన్‌దే! అదీ ఇదీ అని ఏముంది. మనల్ని చల్లగా కాచుకునేందుకు ఓ తల్లి ఉందన్న నమ్మకానికి ప్రతిరూపమే గుయాన్‌ఇన్ లేదా
అవలోకితేశ్వర. అందుకే ఒకప్పుడు జపాన్‌లోని నియంతలు క్రైస్తవాన్ని నిషేధించినప్పుడు, అక్కడి క్రైస్తవులు అవలోకితేశ్వర రూపంలో మేరీమాతను కొల్చుకునేవారట. అమ్మ ఎవరికైనా అమ్మే కదా..
🌹శ్రీ మాత్రే నమః🌹
--(())-- 04. 🌹. భగవంతుడు ఏ ఒక్కని పుణ్య, పాప పనులకు భాధ్యుడు కాడు. ఈ విషయంలో భగవానుని యొక్క పని మూడు అంచెలుగా ఉంటుంది. 🌹
✍. తాళపత్ర నిధి - భగవద్గీత 5-15
📚. ప్రసాద్ భరద్వాజ
1. ఆయన జీవాత్మకు కర్మలు చేసే శక్తి ఇస్తాడు.
2. మనకు ఇవ్వబడిన శక్తితో, మనం పనులు చేయగానే మనం చేసినదాన్ని నోట్ చేసుకుంటాడు.
3. మన కర్మ ఫలితములను అందజేస్తాడు.
ప్రతి జీవాత్మకు తన స్వంత నిర్ణయం ద్వారా మంచి లేదా చెడు పనులు చేయటానికి పూర్తి స్వేచ్చ ఉంది. ఆ స్వతంత్రచిత్తమే సృష్టికి మూలాధారము మరియు ఎన్నో జీవాత్మల మధ్య ఉన్న వైవిధ్యానికి మూల కారణం.
ఒక క్రికెట్ మ్యాచ్ లో అంపైర్ లాగ ఉంటుంది భగవంతుని పని. ఫలితములను ఇస్తూనే ఉంటాడు, "నాలుగు పరుగులు!", "ఆరు పరుగులు!", "అతను ఔట్!" అలా. నిర్ణయాలకు అంపైర్ ని దోషుడిగా చేయలేము, ఎందకంటే అవి ఆటగాడి ఆట తీరుని బట్టి ఉంటాయి.
భగవంతుడు, ఎందుకు జీవులకు స్వతంత్ర-చిత్తమును (free-will) ఇచ్చాడు అన్న సందేహము రావచ్చు.
ఇది ఎందుకంటే, భగవంతుడు అభిజ్ఞ స్వరాట్ (సర్వ స్వతంత్రుడు) కాబట్టి జీవాత్మ కూడా, తన ఇంద్రియమనోబుద్ధులను తన ఇష్టానుకూలంగా ఉపయోగించుకోవటంలో అణుమాత్ర స్వతంత్రత కలిగి ఉంటుంది.
అంతేకాక, స్వతంత్ర చిత్తము లేకుండా ప్రేమ ఉండదు. ఒక యంత్రము ప్రేమించలేదు ఎందుకంటే దానికి నిర్ణయించుకునే స్వతంత్రత ఉండదు. స్వతంత్రంగా నిర్ణయించుకునే వ్యక్తిత్వానికే ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది.
ఆయనను మనం ప్రేమించాలానే ఉద్దేశంతోనే మనలను ఆ భగవంతుడు సృష్టించాడు కాబట్టి మనకు స్వతంత్ర చిత్తమును ప్రసాదించాడు. మన స్వతంత్ర చిత్తమును వాడుకోవటం వలన మంచి లేదా చెడు కర్మలు చేయబడుతాయి, అంతేకాని ఎప్పుడూ కూడా భగవంతుడిని తప్పు పట్టరాదు.
అజ్ఞానంతో కొందరు జీవులు, వారికి తమ కార్యకలాపములు చేసుకునే స్వేచ్చ తమకు ఉందని తెలుసుకోక, తమ తప్పులకు భగవంతుడిని భాద్యుడిని చేస్తారు.
మరికొందరు, స్వేచ్చా చిత్తము ఉందని తెలుసుకుంటారు, కానీ, శారీరిక అహంకారం లో కర్తుత్వ భావన కలిగి ఉంటారు (చేసేది నేనే అన్న భావన). ఇది కూడా అజ్ఞానానికి చిహ్నమే.
🌹 🌹 🌹 🌹 🌹
🌹. మూడు స్థాయిల్లో పని చేస్తున్న గురువులు 🌹
🌻. నిమ్న స్థాయి గురువులు:
వీరు బాహ్య కర్మలు చేయడాన్నే ప్రోత్సహిస్తారు.
🌻. మధ్యమ స్థాయి గురువులు:
వీరు మంత్రోపాసనలను చేయిస్తారు. మంత్ర జపం తక్కువ స్థాయి కాదు కానీ పరమ యోగం కూడా కాదు.
🌻. ఉత్తమ స్థాయి గురువులు:
వీరు జ్ఞాన యోగము, ధ్యాన యోగములను మాత్రమే ప్రబోధిస్తూ ఉంటారు.
🌹 🌹 🌹 🌹 🌹
05. 🌹 🌹: 🌹. ద్వాదశ జ్యోతిర్లింగములు - వాటి ప్రత్యేకత, విశిష్టత, దర్శన ఫలితము - 12
🌻. శ్రీ ఘృష్ణేశ్వరుడు (ఘృష్టీశ్వర లింగం) - ఘృష్ణేశ్వరం (మహారాష్ట్ర) :
పన్నెండవ జ్యోతిర్లింగము
📚. ప్రసాద్ భరద్వాజ
ఈ ఆలయాన్ని దేవి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారని చరిత్ర చెబుతోంది.
ఈ యాత్రా స్థలం దౌలతబాద్ నుండి 15 కిలోమీటర్లు, ఔరంగాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బౌద్ధ సన్యాసుల ఎల్లోరా ఆలయం ప్రసిద్ధ గుహలు సమీపంలో ఉన్నాయి.
దక్షిణ భారత దేశంలో సుధామ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతని భార్య పేరు సుదేహ. కానీ వారికి పిల్లలు లేరు. చరిత్ర ప్రకారం సుదేహకు పిల్లలు పుట్టరు అని తేలింది. కానీ సుదేహకు పిల్లల అంటే చాలా ఆసక్తి. అందుకని తన చెల్లలు ధుశ్శను వివాహం చేసుకొమ్మని కోరినిది కానీ సుధామకు ఇష్టం లేదు సుదేహ బలవంతం మీద ఒప్పుకొంటాడు.
కొంతకాలానికి ధుశ్శ గర్భాన్ని ధరించి ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ కొడుకు పెద్దవాడై సంతోషభాగ్యాలతో ఉండడంతో ద్వేషాన్నిపెంచుకున్న సుదేహ, తన చెల్లెలు ధుశ్శ కొడుకును చంపించి, చెరువులో పడవేయించిందట.
శివభక్తురాలైన ధుశ్శ తన కొడుకు మరణించినా చెక్కుచెదరకుండా శివార్చన చేసిందట. శివుడు అనుగ్రహించి ధుశ్శ కొడుకుకి పునర్జీవితం ప్రసాదించాడు.
దీనికి కారణమైన సుదేహను భస్మంచేయడానికి ఉద్యుక్తుడవుతుండగా తన అక్క చేసిన పాపాన్ని క్షమించమని, లోకకళ్యాణం కోసం స్వామిని అక్కడ వెలవమని ప్రార్థించిందట. ధుశ్శ అభీష్టంమేరకు శివుడు అక్కడ ధుశమేశ కామధేయుడై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు.
అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది. ఒకరోజు శివుడు, పార్వతి కామ్యక వనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట.
అపుడు శివుడు పాతాళంనుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹. ద్వాదశ జ్యోతిర్లింగములు - వాటి ప్రత్యేకత, విశిష్టత, దర్శన ఫలితము - 11 🌹
06. 🌻. శ్రీ కేధారేశ్వరుడు ( కేధారేశ్వర లింగం) కేధార్ నాధ్ ( ఉత్తరాఖండ్) :
పదకొండవ జ్యోతిర్లింగము
📚. ప్రసాద్ భరద్వాజ
హిమాలయశిఖరాన ఉత్తరాఖండ్‌లో మందాకిని నదీ తీరంలో ఎద్దుమూపురం ఆకారంలో ఉందీ జ్యోతిర్లింగం. గౌరీకుండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి నవంబరు నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు.
విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ.
కేదారేశ్వర లింగం గురించి ఒకమాట చెప్తారు.
మహాద్రి పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే!!
కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలామలకము అని శివమహాపురాణం, పెద్దలు నిర్ణయం చేశారు. కేదారం వెళ్ళినపుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది.
కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి.
🌹 🌹 🌹 🌹 🌹
ప్రియమైన స్నేహితుల్లారా! నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
ఈ క్రిందివి ముందు జాగ్రత్త కోసము పెడుతున్నాను. ప్రస్తుతము మనకేమి భయము లేదు. కానీ ఇవి కొన్ని రోజులు పాటిస్తే మంచిది.
1) AC Buses లో తిరగకండి.
2) దూర ప్రయాణాలు Trains లో చేయకండి.
3) జనసమ్మర్థమైన హోటల్స్ కు వెళ్ళకండి.
4) తీర్ధ యాత్రలకు, పెళ్లిళ్లకు మొదలైనవాటికి దూరంగా ఉండండి.
5) సినిమా హాళ్లకు వెళ్ళకండి.
ఎందుకంటే అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చెమనుష్యులే కాక AC ఉంటుంది.
6) బాగా వండిన ఆహారము తినండి. పచ్చివి ఈ పరిస్థితుల్లో తినడము మంచిది కాదు.
7) హోటల్స్ లో టిఫిన్స్ కట్టేవాళ్ళు ఎక్కువగా ఉఫ్.. అని ఊది చెట్నీ కడతారు దాని వలన అతని లాలాజలము ద్వారా ఏదైనా రావచ్చు. కాబట్టి జాగ్రత్త.
8) ప్రయాణాలు చేసేటప్పుడు seat కోసము ఎవరైనా కర్చీఫ్ ఇస్తే అది ముట్టుకోకండి. అది అతను ఏ విధముగ వాడాడో తెలియదు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడువాడతారు.
9) చలి వేళల్లో ముఖ్యముగా మంచు వేళల్లో అసలు తిరగవద్దు. అలా తిరిగిన వైరస్ కు చల్లటి వాతావరణము చాలా అనుకూలం.
10) అందరూ మాస్క్ లు వేసుకొని బయటకు వెళ్ళండి.
కనీసము కర్చీఫ్స్ అయిన కట్టుకోండి. తులసి, ఆడించిన పసుపు, కాచిన నీళ్లలో కర్చీఫ్స్ లేదా మాస్క్ లు వేసి అరబెట్టి వాటిని వాడండి.
11) అదేవిధముగా తులసి, ఆడించిన పసుపు నీళ్లలో కాచిన వాటికి కొంచెం వెల్లుల్లి రసము లేదా అల్లము రసము వేసి ఉదయము కొంచెం తీసుకోండి. అదేవిధముగా మిరియాల పాలు కచ్ఛితముగా పిల్లలకు ఇవ్వండి. పాలు దొరికితే పెద్దవారు స్యాంత్రము త్రాగండి.
ఇలా చేసినా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
12) ఇళ్లల్లో కూడా పరిస్థితులను బట్టి AC లను వాడకండి. పరిస్తితులను బట్టి అనుమానం వస్తే ఏమి అర్దరు చేయకండి. అన్ని కొని ఇంట్లో ఉంచుకోండి.
13) Shake hands ఎవరికి ఇవ్వవద్దు. స్నేహితులు లేదా ప్రేమికులు కూడా బయట తిరగ వద్దు. చుట్టాల ఇళ్లకు వెళ్ళకండి. వీలైతే పెళ్లిళ్లు ఎండలు ముదిరాక పెట్టుకోండి.
వీలైతే చేతులకు gloves వాడండి.
14) మీ పిల్లలు చదివే స్కూల్స్, కాలేజ్ లకు వేలు, లక్షలు fees కడుతున్నారు కదా.. దయచేసి వాష్ rooms లాంటివి పేరెంట్స్ చెక్ చేయండి.
15) బలహీనంగా ఉన్న వారు బయట అసలు తిరగవద్దు. ప్రయాణాలు అసలు చేయవద్దు.
16) ఎవరితో నైనా మాట్లాడేటప్పుడు కొంచెం దూరముగా ఉండి మాట్లాడండి.
17) బయటకు వెళ్లి వచ్చే వాళ్లు, ఇంటిలోకి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోండి.
18) బార్స్ కు వెళ్ళేవాళ్ళు జాగ్రత్త. అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చే వాళ్లు ఉంటారు. మీరు ఇంటికి ఏ ప్రమాదం తెస్తారో.. ఆలోజించండి. మీరు మత్తులో ఏమి తింటున్నారో.. ఎవరితో మాట్లాడుతున్నారో..
19) పరిస్థితులను బట్టి లాడ్జిలలో ఉండటం కూడా కొంత కాలం మానండి.
20) కాచి చల్లార్చిన నీటిని వాడండి.
21) విమాన ప్రయాణము కూడా చేయవద్దు.
నా స్నేహితుడు Hari గారు చెప్పినట్టు మన దేశము గొప్పది. విభిన్నమైన పరిస్థితితులు, వాతావరణములు కలిగి ఉన్నది.
అంతేగాక మంచి వనమూలికలు ఉన్న దేశము.
ఇటువంటి దేశములో పుట్టడము మన అదృష్టము.
మనము వ్యక్తిగత, కుటుంబపర మరియు సామాజిక శుభ్రత పాటిస్తే చాలా వరకు ఏ వైరస్ మన దరికి చేరదు. మార్చిలోకి వచ్చేసాము మరికొన్ని రోజుల్లో
ఎండలు ముదురుతాయి. అప్పటి వరకు చాల జాగ్రత్తగా ఉందాము. ముందే మనము జాగ్రత్త గా ఉంటే మన ప్రభుత్వాలపై భారము పడదు. దేవుడు మన దేశమును కాపాడును. జై భారత్.. జై హింద్...
.......జై భారత్.
08. 👌 నిజమైన గుర్తింపు సాధనం👌
👉ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.
రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.
👉కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.
అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.
రాజు చాలా ఆశ్చర్యపోయాడు.
👉అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.
దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.
👉రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.
👉రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది.
అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు.
అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.
👉కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..
రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.
అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.
👉రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది.
ఒక రాణి స్తాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు....
👉రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు
👉కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు.
ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు.
రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.
రాజుకు చాలా కోపం వచ్చింది.
కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు.
తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు.
మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని.
👉రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు.
👉అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు.
ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు...
☘మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!
🌺 మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.🌺
🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿
--(())--
09. ఉడత కధ
🐿ఒక ఉడత నుండి మనం నేర్చుకోగల మంచి నీతి కథ... చదవండి🌷🌹🌷🙏
🐿రామాలయం ప్రాంగణంలో ఉన్న జామ చెట్టెక్కి, పండు కొరికి తింటున్నది చిన్నారి ఉడుత. ఆ రోజున శాస్త్రి గారి ప్రవచనంలో తన పేరు వినిపించింది దానికి! దాంతో చెట్టు దిగి, శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ విన్నది..
"🐿శ్రీరాములవారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు! వాళ్లకంటే చిన్న జంతువు- ఉడుత కూడా ఆ మహత్కార్యంలో తన వంతు సాయం చేసిందిట!
🐿అందుకు రాములవారు సంతోషించి, ఉడుతను దగ్గరకు తీసుకొని, దాని వీపును ప్రేమగా నిమిరాడట! దానికి గుర్తుగానే ఉడుత వీపు మీద చారలు ఉంటాయట" అని శాస్త్రి గారు చెబుతుంటే శ్రోతలతో పాటు ఈ ఉడుత కూడా శ్రద్ధగా విన్నది.
"🐿ఏంటీ! నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా?! రామయ్య వ్రేళ్ల గుర్తులా ఇవి! ఆహా! నేనెంత గొప్పదాన్ని?! నా గురించి నాకు తెలీకుండా ఇట్లా పెరిగానే?! ఇప్పుడు చెబుతాను!" అనే ఆలోచన మనసులోనే కలిగి ఎక్కడలేని సంతోషం వేసింది దానికి. చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి, ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది.
🐿అట్లా ఉబ్బి తబ్బిబ్బైపోతూ పోతున్న ఉడుతకు దాని ఫ్రెండ్స్ ఎలుక, తాబేలు ఎదురయ్యాయి.
వాటిని చూస్తే ఉడుతకు మామూలుగానైతే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇవాళ్ల ఎందుకో, అవి రెండూ ఒట్టి పనికిమాలినవి అనిపించాయి. వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్ధయింది ఉడుతకి.
అది అట్లా పైకి పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలుక, తాబేలు కూడా దాని వెంట పరుగుపెడుతూ "ఆడుకుందామారా?" అని అడిగాయి అనురాగంతో.
"🐿నేనా?! మీతో ఆడాలా?! అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో? నా వీపుపైన ఉన్న ఈ చారలు ఎలాంటివో తెలుసా మీకు? ఇవి మామూలు చారలు కాదు! రామయ్య తండ్రి
వేళ్ళ గుర్తులివి! నాతో ఆడేందుకు మీరేంటి, మీకున్న విలువేంటి?! పోండి, పోండి!" అని ఈసడించుకుంటూ ముందుకు సాగింది ఉడుత.
🐿అంతలో ఎదురుగా కనిపించాడు గున్నేనుగన్నయ్య. "ఏయ్! నీ ఫ్రెండ్స్ ఏరీ, ఆడుకోవడం లేదా?" అన్నాడు.
"లేదు లేదు" అంటూ రాగం తీసి, "ఆ విలువ లేనోళ్ళతో ఆడనన్నాను" అంది ఉడుత.
"అయ్యో! అదేమి? విలువ లేదంటావేమిటి? వాళ్ళు మంచోళ్ళేనే? రోజూ నీతోటి ఆడుకుంటుంటారు కదా?" "నిజమే. ఇప్పుడు నన్నే తీసుకోండి. నా వీపున చారలున్నై. ఇవి ఎలా వచ్చినై? రాముల వారు.. "అంటూ తను విన్నదంతా చెప్పుకున్నది ఉడుత.
🐿అంతా విని ఆగకుండా నవ్వింది గున్న ఏనుగు. "ఎందుకు, నవ్వుతున్నావు?" అని అడిగింది ఉడుత, కోపంతో...
"🐿అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావే, మరి ఇంక ఎలుక ఎంత గర్వపడాలి, ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా?! మరి ఇంక తాబేలు సంగతికొస్తే, విష్ణుమూర్తే స్వయంగా దాని అవతారం ఎత్తాడు గదా?! అసలు ఇప్పుడు ఆ ఎలుక, తాబేలే 'నీతో స్నేహం చెయ్యం పో!’ అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి, చెప్పు?! మరలా పడి పడి నవ్వింది ఏనుగు..
🐿నిజంగా మనస్ఫూర్తిగా చెబుతాను విను తల్లీ, నువ్వు వాటి 'మంచితనాన్నే' 'చేతకానితనం' అనుకున్నావు. అందుకే మంచి నేస్తాలను వదులుకున్నావు- అంతకు మించి ఏమీ లేదు" అంటూ ముందుకు సాగింది ఏనుగు.
🐿దాని మాటలు వినగానే ఉడుత తలకెక్కిన గర్వమంతా టప్పుమని ఎగిరిపోయింది. సృష్టిలోని ప్రతి జీవికీ దానిదైన గొప్పతనం ఉందని అర్థమై, తన నేస్తాలకు క్షమాపణ చెప్పేందుకు వెనక్కు తిరిగి పరుగులు తీసింది..🐿
🌷సర్వే జానాః సుఖినో భవంతు 🌷
🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿
🐿రామాలయం ప్రాంగణంలో ఉన్న జామ చెట్టెక్కి, పండు కొరికి తింటున్నది చిన్నారి ఉడుత. ఆ రోజున శాస్త్రి గారి ప్రవచనంలో తన పేరు వినిపించింది దానికి! దాంతో చెట్టు దిగి, శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ విన్నది..
"🐿శ్రీరాములవారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు! వాళ్లకంటే చిన్న జంతువు- ఉడుత కూడా ఆ మహత్కార్యంలో తన వంతు సాయం చేసిందిట!
🐿అందుకు రాములవారు సంతోషించి, ఉడుతను దగ్గరకు తీసుకొని, దాని వీపును ప్రేమగా నిమిరాడట! దానికి గుర్తుగానే ఉడుత వీపు మీద చారలు ఉంటాయట" అని శాస్త్రి గారు చెబుతుంటే శ్రోతలతో పాటు ఈ ఉడుత కూడా శ్రద్ధగా విన్నది.
"🐿ఏంటీ! నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా?! రామయ్య వ్రేళ్ల గుర్తులా ఇవి! ఆహా! నేనెంత గొప్పదాన్ని?! నా గురించి నాకు తెలీకుండా ఇట్లా పెరిగానే?! ఇప్పుడు చెబుతాను!" అనే ఆలోచన మనసులోనే కలిగి ఎక్కడలేని సంతోషం వేసింది దానికి. చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి, ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది.
🐿అట్లా ఉబ్బి తబ్బిబ్బైపోతూ పోతున్న ఉడుతకు దాని ఫ్రెండ్స్ ఎలుక, తాబేలు ఎదురయ్యాయి.
వాటిని చూస్తే ఉడుతకు మామూలుగానైతే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇవాళ్ల ఎందుకో, అవి రెండూ ఒట్టి పనికిమాలినవి అనిపించాయి. వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్ధయింది ఉడుతకి.
అది అట్లా పైకి పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలుక, తాబేలు కూడా దాని వెంట పరుగుపెడుతూ "ఆడుకుందామారా?" అని అడిగాయి అనురాగంతో.
"🐿నేనా?! మీతో ఆడాలా?! అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో? నా వీపుపైన ఉన్న ఈ చారలు ఎలాంటివో తెలుసా మీకు? ఇవి మామూలు చారలు కాదు! రామయ్య తండ్రి
వేళ్ళ గుర్తులివి! నాతో ఆడేందుకు మీరేంటి, మీకున్న విలువేంటి?! పోండి, పోండి!" అని ఈసడించుకుంటూ ముందుకు సాగింది ఉడుత.
🐿అంతలో ఎదురుగా కనిపించాడు గున్నేనుగన్నయ్య. "ఏయ్! నీ ఫ్రెండ్స్ ఏరీ, ఆడుకోవడం లేదా?" అన్నాడు.
"లేదు లేదు" అంటూ రాగం తీసి, "ఆ విలువ లేనోళ్ళతో ఆడనన్నాను" అంది ఉడుత.
"అయ్యో! అదేమి? విలువ లేదంటావేమిటి? వాళ్ళు మంచోళ్ళేనే? రోజూ నీతోటి ఆడుకుంటుంటారు కదా?" "నిజమే. ఇప్పుడు నన్నే తీసుకోండి. నా వీపున చారలున్నై. ఇవి ఎలా వచ్చినై? రాముల వారు.. "అంటూ తను విన్నదంతా చెప్పుకున్నది ఉడుత.
🐿అంతా విని ఆగకుండా నవ్వింది గున్న ఏనుగు. "ఎందుకు, నవ్వుతున్నావు?" అని అడిగింది ఉడుత, కోపంతో...
"🐿అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావే, మరి ఇంక ఎలుక ఎంత గర్వపడాలి, ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా?! మరి ఇంక తాబేలు సంగతికొస్తే, విష్ణుమూర్తే స్వయంగా దాని అవతారం ఎత్తాడు గదా?! అసలు ఇప్పుడు ఆ ఎలుక, తాబేలే 'నీతో స్నేహం చెయ్యం పో!’ అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి, చెప్పు?! మరలా పడి పడి నవ్వింది ఏనుగు..
🐿నిజంగా మనస్ఫూర్తిగా చెబుతాను విను తల్లీ, నువ్వు వాటి 'మంచితనాన్నే' 'చేతకానితనం' అనుకున్నావు. అందుకే మంచి నేస్తాలను వదులుకున్నావు- అంతకు మించి ఏమీ లేదు" అంటూ ముందుకు సాగింది ఏనుగు.
🐿దాని మాటలు వినగానే ఉడుత తలకెక్కిన గర్వమంతా టప్పుమని ఎగిరిపోయింది. సృష్టిలోని ప్రతి జీవికీ దానిదైన గొప్పతనం ఉందని అర్థమై, తన నేస్తాలకు క్షమాపణ చెప్పేందుకు వెనక్కు తిరిగి పరుగులు తీసింది..🐿
🌷సర్వే జానాః సుఖినో భవంతు 🌷
🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿
10 భజామి త్వాం గౌరీం నగపతికిశోరీమవిరతమ్ .
🍁🍁🍁🍁..
ఎప్పడైనా అమ్మ అనగానే అందరికి గుర్తొచ్చేది శ్రీమాత ఐన లలితామహాత్రిపురసుందరి.
మనం ఎవరివల్ల కలిగామో, మనకి కారణమైనది, పోషణమైనది, మనల్ని రక్షించేది, మన మీద నెపం చూపకుండా ప్రేమ చూపించేది ఎవరో ఆవిడే శ్రీమాత.
తల్లి పిల్లవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? నా బిడ్డ అనే నెపంతోనే ప్రేమిస్తుంది.
తల్లికి బిడ్డపై ఉండేది అవ్యాజమైన ప్రేమ. మాతా అంటే కారణమైనది అని అర్థం. కడుపులో పెట్టుకోనేది అని అర్ధం. ఆవిడ కడుపులోంచే మనందరం వచ్చాం. తల్లి లోంచే వచ్చి.. తల్లిలోనే ఉన్నాం. మిగిలిన తల్లులైతే కడుపులో పోషించి బయటకి వచ్చిన తరువాత నీ పోషణ నీదే..అంటారు. కాని శ్రీమాత లలిత మనల్ని ఎప్పుడూ కడుపులో పెట్టుకొనే పోషిస్తుంది. మనం అమ్మ నుంచి వేరుగా లేం. మనల్ని కన్నతల్లి నుంచి మనం వేరయ్యాంగాని.. ఈ కన్నతల్లిలోనే పుడుతున్నాం, పెరుగుతున్నాం, ఈ కన్నతల్లిలోనే ఈ శరీరం విడిచి పెట్టినా ఉంటున్నాం. కనుక ఎప్పుడూ ఈ తల్లి కడుపులోనే ఉన్నాం.
సర్వజగత్తు ఈవిడ కడుపునే ఆశ్రయించుకొని ఉంది. తల్లి గర్భంలోనే అన్ని ఉన్నాయి.
అమ్మ దగ్గర ఉన్న గొప్పలక్షణం అవ్యాజమైన ప్రేమ. మనం అమ్మా అని పిలిచామంటే యోగ్యులమైనా కాకున్నా కాపాడే తల్లి అని అర్ధం.
మాతా అని పిలిచినపుడు పూర్తి ఆశ్రయభావం ఉంది.
శ్రీమాతాఅనగానే ఆశ్రయమైన తల్లినే ఆశ్రయించాం అని భావన కలుగుతుంది. అజ్ఞానమనే పాపపు బురదలో పొర్లుతూ ఉంటే ఆ బురదని కడిగి మనల్ని ఎత్తుకుని అనుగ్రహించే తల్లి.
అర్థం తెలిసి అనడం ఒకటి. భావనతో అనడం ఒకటి. భావనతో అంటే అమ్మని దొరకబుచ్చుకోగలం.
🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Comments
Post a Comment