శ్రీ ఆదిశంకరాచార్య విరచిత
శ్రీ ఆదిశంకరాచార్య విరచిత
09. సాధన చతుష్టయ సంపత్తి. ( మహావాక్యముల విచారణ - పరబ్రహ్మతత్వము.)ఆదిశంకరుల వివేక చూడామణి నుండి
🕉🌞🌎🌙🌟🚩
ఓం శ్రీగురుభ్యోమ్ నమ:
గురుదేవులు, విదేహముక్తుడు సర్వ దృశ్య రహితుడై వున్నాడని తేటపరుస్తున్నారు.
శ్లో. విలక్షణం యథా ధ్వాన్తం లీయతే భాను తేజసి /
తథైవ సకలం దృశ్యం బ్రహ్మణి ప్రవిలీయతే // 565 .
ఏ విధంగా సూర్యుని తేజస్సును తట్టుకొనలేక, విరుద్ధధర్మము గల తమస్సు ఆ తేజస్సుతో లయించి పోతున్నదో, అదే విధంగా, సమస్త దృశ్యములు నిర్వికార పరబ్రహ్మమునదే పూర్తిగా లీనమై కలిసిపోవుచున్నవి. అనగా వాని అస్థిత్వము అవి కోల్పోయి బ్రహ్మమే అవుతున్నవి.
విదేహముక్తుడు సర్వ దృశ్య రహితుడు. తేజస్సు - చీకటి, దృశ్యములు- పరబ్రహ్మ రెండూ పరస్పర విరుద్ధములైన విషయములు. చీకటి అనేది, సూర్య ప్రకాశము లేనప్పుడు తన పటాటోపమును ప్రదర్శిస్తుంది. బ్రహ్మాండమంతా విస్తరిస్తుంది. అప్పుడు తానే సర్వ వ్యాపకమనే భ్రాంతిని కలిగిస్తుంది. ఒక్కసారి సూర్య దర్శనం అవగానే, సూర్యుని యందే లయమై చీకటి కనిపించకుండా పోతున్నది.
దీపము వున్నప్పుడు దాని నీడ దీపమును ఆశ్రయించి వుండును. దీపమును తీసి వేయగానే దాని నీడ కూడా పోవును. అనగా దీపము కన్నా నీడ వేరు కాదు. దీపము పూర్తిగా గదినిండా ప్రకాశిస్తే, నీడ కనబడదు.
అలాగే దృశ్యమనేది అజ్ఞాన జనితము. జ్ఞానము లేనప్పుడు కలుగు స్థితి. ఈ దృశ్యము చైతన్యము మీద అఆధారపడి వున్నా, తానే సర్వము అనునట్లు తోస్తుంది. ప్రకాశరూప జ్ఞానోదయము కలుగగానే సకల దృశ్యము అవిద్యా కారణమైనది అయినందున పరబ్రహ్మములో లయము నొందుచున్నది. అప్పుడు అంతా పరబ్రహ్మమే !
శ్లో. ఘటే నష్టే యథా వ్యోమ వ్యోమైవ భవతి స్ఫుటం /
తధైవోపాధి విలయ బ్రహ్మయివ బ్రహ్మవిత్స్వయమ్. // 566 .
కుండలోని ఆకాశము ( సూన్య ప్రదేశము ) కుండ పగిలిపోగానే యెలా ఆకాశముగా స్పష్టమై వుంటుందో, అలాగే, శరీరోపాధి నాశమైన తరువాత, స్వ స్వరూప జ్ఞానమును తెలుసుకున్న జ్ఞాని, కర్మ బంధాలు తొలగి బ్రహ్మమే అవుతున్నాడు.
స్వానుభవముగా స్వ స్వరూప పరబ్రహ్మను గుర్తెరిగిన మహానుభావుడు, శరీరముతో వున్నప్పుడూ బ్రహ్మమే, శరీరము విడిచిన తరువాతా బ్రహ్మమే ! శరీరము తో వున్నంత వరకు తనకు తాను బ్రహ్మముగా భాసించినా, నామరూపాలతో వుంటున్నాడు. ఆ ఉపాధి తొలగిన వెంటనే బ్రహ్మముగానే ఉంటాడనే విషయం చెప్పడం కోసం గురుదేవులు ఘటాకాశ దృష్టాంతరం చెప్పివున్నారు.
కుండలో వున్న ఆకాశము కుండ వున్నంతవరకు వేరుగా తోచును. కుండ పగిలిన తరువాత, అఖండ సూన్యములో కలిసిపోవును. అలాగే బ్రహ్మవేత్త బ్రహ్మమే అయివున్నను ప్రజలకు శరీరోపాధి వలన వేరుగా తోచును. శరీరము నాశమవగానే, అతడు బ్రహ్మమే ! బ్రహ్మవేత్తకు ఉపాధీకృత భేదమేమీ లేదు.
కాబట్టి విదేహముక్తుడు అనగా, నిరుపధిక పరబ్రహ్మమే అని అర్ధము.
తరువాతి శ్లోకంలో కూడా గురుదేవులు విదేహముక్తుని లక్షణాలను వివరిస్తున్నారు.
🕉🌞🌎🌙🌟🚩
10. మనీషా పంచకం-వివరణ-4
మనీషా పంచకం.- 4 .
జగద్గురువులు , ఆదిశంకరుల గురించి ఎప్పుడు మననం చేసుకున్నా, వారికి చండాలుని రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, కొంత వాదన తరువాత, బ్రహ్మజ్ఞానం ప్రసాదించడం, అనే విషయం కూడా చదువుకుంటూనే ఉంటాము.
ఒకప్పుడు ఆదిశంకరులు, కాశీక్షేత్రంలో, గంగానదిలో పవిత్ర స్నానం చేసి, కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి బయలు దేరగా, అదే సమయానికి, వారికి ఎదురుగా, నాలుగు కుక్కలను ముందుపెట్టుకుని, ఒక ఛండాలుడు ఎదురు అయ్యాడు. తనకు ఎక్కడ మైల సోకుతుందో అని, శంకరులు కలతచెంది, ఆ చండాలుని దూరంగా పొమ్మని గద్దించారు.
అప్పుడు ఛండాలుడు ఏమాత్రం బెదరకుండా, ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుతో,
శ్లో. అన్నమయా దన్నమయ మథవా చైతన్యమేవ చైతన్యాత్ /
ద్విజవర ( యతివర ) దూరీ కర్తుమ్ వాంచ్ఛసి కిమ్ బ్రూహి గచ్ఛ గచ్ఛేతి...
' ఓ బ్రాహ్మణుడా ( ఓ యతీశ్వరుడా ! ) ! నీవు దేహము నుండి దేహమును దూరంగా వెళ్ళమంటున్నావా ? లేక చైతన్యము నుండి చైతన్యమును తొలగమంటున్నావా ? అన్ని శరీరాలు పాంచభౌతిక నిర్మితములు అయినప్పుడు, ఒకదానికి దూరంగా ఇంకొకటి వెళ్ళవలసిన అవసరం ఏమి వున్నది ? ఒకవేళ ఆత్మను దూరంగా వెళ్ళమని మీ అభిప్రాయం ఐతే, ఆత్మను ఎలా దూరంగా పంపగలను ? దేని నుండి దూరంగా పంపాలి ? ' అని ప్రశ్నల వర్షం గుప్పించాడు. .
ఈవిధమైన జ్ఞాన సంబంధ వచనములు చండాలుని నోటి ద్వారా విన్న శంకరులు, దిగ్భ్రమని చెంది, తన తప్పిదమును గ్రహించి, చండాలునికి శిరస్సు వంచి నమస్కరించారు. ఆశువుగా ఈ అయిదు శ్లోకాలు చెప్పారు. అవే ' మనీషా పంచకం ' గా ప్రసిద్ధికెక్కాయి. ఆశ్లోకాలలో, ఆత్మదర్శి అయిన వాడు, చండాలుడైనా,బ్రాహ్మణుడు అయినా అతడే నాగురువు అని చెప్పారు.
( ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవలసింది, ప్రతి చండాలుడూ తనకు గురువు అని శంకరులు చెప్పలేదు. ఆత్మదర్శి అయినవాడు, ఏ జాతి వాడైనా తన గురువే అని చెప్పినట్లు అర్ధం చేసుకోవాలి. )
వెంటనే నాలుగుకుక్కలతో వున్న ఛండాలుడు, అదృశ్యమయ్యాడు. నాలుగు వేదములతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదిశంకరులను ఆశీర్వదించి, ప్రస్థాన త్రయం పై భాష్యములు వ్రాయమని ఆదేశించి, అంతర్ధానమయ్యాడు. శివునిఆజ్ఞ మేరకు, ఆదిశంకరులు బదరికాశ్రమానికి వెళ్లి, భాష్య రచనకు అంకురార్పణ చేసారు. ,
అసలు ఏమిటి ఈ మనీషా పంచకం ? ఆదిశంకరులకు, ఆ పార్వతీపతి, పరమేశ్వరుడు, శంకరుడు, చండాలుని రూపంలో, తత్వబోధ చేసిన తరువాత, జగద్గురువులు చెప్పిన ఈ అయిదు శ్లోకములో ఏమివున్నది ? అనేజిజ్ఞాస మనకందరకూ కలుగుతూనే వుంటుంది. ఈ అయిదు శ్లోకములు కంఠతా పెట్టవలసినవి. భావము తెలుసుకోవలసినవి. ఉపదేశ వాక్యములుగా స్వీకరించి, ఆచరణలో పెట్టవలసినవి.
ఇందులో వున్న విషయములు, గంభీరమైనవి. అందువలన, మన మేధస్సుకు కొద్దిగా వత్తిడి పెట్టి, ఈ లక్ష్యంలో కృతకృత్యులం కావాలని జగద్గురువు ఆదిశంకరులని ప్రార్ధిస్తూ, ముందుకు అడుగు వేద్దాం.
*
శ్లో. జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్పుటతరా యా సంవిజృమ్భతే
యా బ్రహ్మాది పిపీలికాన్త తనుషు ప్రోతా జగత్సాక్షిణీ /
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్
చ౦డాలోస్తు స తు ద్విజోస్తు గురు : ఇత్యేషా మనీషా మమ // 1
శ్లో. బ్రహ్మయివాహమిదం జగచ్ఛ సకలం చిన్మాత్ర విస్తారితం
సర్వం చైత ద విద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం /
ఇద్హం యస్య దృఢామతి : సుఖతరే నిత్యే పరే నిర్మలే
చ౦డాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషామమ // 2 .
శ్లో. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలంనిశ్చిత్య వాచో గురో
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృ శతా నిర్వ్యాజ శాంతాత్మనా
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ // 3 .
శ్లో. తిర్యజ్ నరదేవతాభి రహమిత్యన్త : స్పుటాగృహ్యతే
యద్భాసా హృదయాక్ష దేహ విషయాభాన్తి స్వతో >చేతనా :
తాం భాస్యై : పిహితార్క మండల నిభామ్ స్ఫూర్తిమ్ సదా భావయ
న్యోగీ నిర్వృత మానసో హి గురురిత్యేషా మనీషామమ // 4 .
( నిన్నటి దానికి కొనసాగింపు.)
జంతువులూ, నరులు, దేవతలు ఏ తత్వమును, ' నేను ' అని అనుభవించుచున్నారో, ఏ చైతన్య ప్రకాశము చేత జడములగు దేహేంద్రియ మనోబుద్ధులు ప్రకాశించుచున్నవో, ఏదైతే, మబ్బులమాటున సూర్యుడు వుండి,సమస్త విశ్వమును ప్రకాశింప జేయుచున్నట్లు ప్రకాశింప జేస్తున్నదో, అట్టి చైతన్యమును, ఏ యోగి భావన చేయుచు, ప్రశాంతచిత్తుడై, వుండెనో, అతడేనా గురువు. ఇది నా నిశ్చితాభిప్రాయము.
క్లుప్త వివరణ : తిర్యజ్ : భూమికి సమాంతరంగా వెన్నెముక గల ప్రాణులు, జంతువులు. జంతువులకు, నరులకు, దేవతలకు అందరకూ చైతన్య ప్రధానమైన ఉపాధులు ఉండడం వలన, గురుదేవులు ఆ అందరిలోని ఆంతర్యములను కలిపి చెప్పారు. చైతన్యము వలననే కదా, వాటివాటి హృదయములు, దృష్టి, దేహములు, లౌకిక పరిజ్ఞానము వాటి పరిధిలో ఉద్దీపనం అవుతున్నవి. ప్రకాశిస్తున్నవి. ఆ చైతన్యమే లేకపోతే జడ పదార్ధాలు కదా !
ఈ నాలుగవ శ్లోకము, అధర్వణ వేదమునందలి, మాండూక్యోపనిషత్తులో, ' అయమాత్మా బ్రహ్మ ' అనే మహావాక్యమును వివరిస్తున్నది. ఈమహావాక్యము, గురువు నుండి ఇంతకుముందు తాను పొందిన జ్ఞానమును అనుసరించి, తన అనుభవాన్ని సాధకుడు చెప్పే అనుభవ వాక్యం.
ఈ మహావాక్యంలో, ' అయం ', ' ఆత్మా ' , ' బ్రహ్మ ' అనేమూడు పదాలు వున్నాయి కదా ! అయం అనగా, ' ఇది ' అని అర్ధం. ఇది సూక్ష్మత్వానికి సంకేతం. అది అంటే ' కనబడేవి అన్నీ. ' అందుకనే ఇది సూక్ష్మ తత్వంతో, పరమాత్మ తత్వంగా చెప్పబడింది.
అన్ని జీవులూ చైతన్య స్వరూపములే. మనందరిలో, కదులుతున్నది అనే భావం తెలియకుండానే, కదులుతూ, మనచేత జీవన కార్యములు చేయిస్తున్నదే, అదే శుద్ధ చైతన్యము. జంతువులలోని, నరులలోని, దేవతలలోని చైతన్యము అంతా పరమాత్మయే. ఇంతకు ముందు శ్లోకములలో చెప్పుకున్నట్లు, ఉపాధులలో భేదమే కానీ, చైతన్యానికి భేదం లేదు.
మనకు భేదము కనబడుచున్నది అంటే, అది మాయాప్రేరేపితమైన మనస్సు. దానినే అవిద్య అనికూడా అంటారు. ' ద్వైతమనేది కేవలం మనో కల్పితమే. ' అని శంకరులు, మాండూక్యకారికా భాష్యంలో చెప్పారు.
మాతృ గర్భంలో వున్న అన్నిరకముల ఉపాధులకు, జడత్వం నుండి ప్రకాశించే ఆత్మ ద్వారా చైతన్యం కలిగించే పరమాత్మ, వాటికి చైతన్యం కలిగేటట్లుగా చేస్తున్నాడు. మృత అమృత తత్వాలకు ఆలంబన అదే !
ఆత్మకు దూరమై ఏ ఉపాధి కూడా మనుగడ సాగించ లేదు. ఇంద్రియ దేహ మనో బుద్దులు ఆత్మ ప్రకాశం లేకుండా ప్రకాశించలేవు. సూర్య చంద్రాదులు కూడా, ఆత్మ తత్వం వలననే ప్రకాశిస్తున్నవి. ఇదం అని పిలువబడే విశ్వం అంతా కూడా, బ్రహ్మము అనబడే, ఆత్మ ప్రకాశము వలననే వెలుగులు ప్రసరిస్తున్నది.
' అయమాత్మా బ్రహ్మ ' : ఈ ఆత్మయే బ్రహ్మం అని తెలుసుకోవడం వలన, బ్రహ్మము ఏకైక ప్రకాశరూపం అయినందు వలన, నీవు ఆ అఖండ పరంజ్యోతివే అనే విషయము అనుభవం లోనికి వస్తుంది. అదే నిత్యముక్తికి సోపానం.
జ్ఞానము వేరు, మోక్షము వేరు కాదు. నేను బ్రహ్మమును అని గుర్తెరిగిన జ్ఞానమే మోక్షము. జ్ఞానము మీద, అవిద్యా, మోహము కప్పబడి వుండి, జ్ఞాన ఆవిష్కరణ కలుగగానే, మబ్బులు వీడిన సూర్యుని వలే, ' అయమాత్మా బ్రహ్మ ' అని స్ఫురణ వస్తుంది. జీవన్ముక్తి లభిస్తుంది. అన్ని ఉపాధులలో, అహం ( నేను ) రూపంలో, ఆత్మ కాంతిమయంగా ఉంటుందని అనువైభవ పూర్వకంగా తెలుస్తుంది. ఆ నేను సమష్టి రూపంలో వ్యక్తమవడమే, మోక్షము.
అట్టివాడు, అన్ని కోరికలు అంతరించినవాడై, ఆప్తకాముడు అవుతున్నాడు. అన్ని విషయములు అవగతం అయినవాడు అయినందున ఆత్మవిదుడు అవుతున్నాడు.. జీవన నాటకంలో, తన పాత్రను ముగించుకుని, శాంతిని అనుభవిస్తున్న మహితాత్ముడు అవుతున్నాడు. అతడు యోగి కాదు, అస్పర్శ యోగి, అని శంకరులు చెబుతున్నారు.
స్పర్శ అనగా సంబంధము. ఏ కాలంలోనూ, దేనితోనూ, సంబంధ, బాంధవ్యములు పెట్టుకోక పోవడమే, అస్పర్శయోగము. అదే బ్రహ్మస్వరూపము. స్పృశించేందుకు తనకు అన్యమైనది ఏదీలేదని గుర్తించిన వాడే కదా బ్రహ్మవిదుడు.
--(())--
శ్రీ ఆదిశంకరాచార్య విరచిత
మనీషా పంచకం-వివరణ-5
మనీషా పంచకం - 5 .
( ముగింపు )
జగద్గురువులు, ఆదిశంకరుల గురించి ఎప్పుడు మననం చేసుకున్నా, వారికి చండాలుని రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, కొంత వాదన తరువాత, బ్రహ్మజ్ఞానం ప్రసాదించడం, అనే విషయం కూడా చదువుకుంటూనే ఉంటాము.
ఒకప్పుడు ఆదిశంకరులు, కాశీక్షేత్రంలో, గంగానదిలో పవిత్ర స్నానం చేసి, కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి బయలు దేరగా, అదే సమయానికి, వారికి ఎదురుగా, నాలుగు కుక్కలను ముందుపెట్టుకుని, ఒక ఛండాలుడు ఎదురు అయ్యాడు. తనకు ఎక్కడ మైల సోకుతుందో అని, శంకరులు కలతచెంది, ఆ చండాలుని దూరంగా పొమ్మని గద్దించారు.
అప్పుడు ఛండాలుడు ఏమాత్రం బెదరకుండా, ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుతో,
శ్లో. అన్నమయా దన్నమయ మథవా చైతన్యమేవ చైతన్యాత్ /
ద్విజవర ( యతివర ) దూరీ కర్తుమ్ వాంచ్ఛసి కిమ్ బ్రూహి గచ్ఛ గచ్ఛేతి...
' ఓ బ్రాహ్మణుడా ( ఓ యతీశ్వరుడా ! ) ! నీవు దేహము నుండి దేహమును దూరంగా వెళ్ళమంటున్నావా ? లేక చైతన్యము నుండి చైతన్యమును తొలగమంటున్నావా ? అన్ని శరీరాలు పాంచభౌతిక నిర్మితములు అయినప్పుడు, ఒకదానికి దూరంగా ఇంకొకటి వెళ్ళవలసిన అవసరం ఏమి వున్నది ? ఒకవేళ ఆత్మను దూరంగా వెళ్ళమని మీ అభిప్రాయం ఐతే, ఆత్మను ఎలా దూరంగా పంపగలను ? దేని నుండి దూరంగా పంపాలి ? ' అని ప్రశ్నల వర్షం గుప్పించాడు. .
ఈవిధమైన జ్ఞాన సంబంధ వచనములు చండాలుని నోటి ద్వారా విన్న శంకరులు, దిగ్భ్రమని చెంది, తన తప్పిదమును గ్రహించి, చండాలునికి శిరస్సు వంచి నమస్కరించారు. ఆశువుగా ఈ అయిదు శ్లోకాలు చెప్పారు. అవే ' మనీషా పంచకం ' గా ప్రసిద్ధికెక్కాయి. ఆశ్లోకాలలో, ఆత్మదర్శి అయిన వాడు, చండాలుడైనా,బ్రాహ్మణుడు అయినా అతడే నాగురువు అని చెప్పారు.
( ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవలసింది, ప్రతి చండాలుడూ తనకు గురువు అని శంకరులు చెప్పలేదు. ఆత్మదర్శి అయినవాడు, ఏ జాతి వాడైనా తన గురువే అని చెప్పినట్లు అర్ధం చేసుకోవాలి. )
వెంటనే నాలుగుకుక్కలతో వున్న ఛండాలుడు, అదృశ్యమయ్యాడు. నాలుగు వేదములతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదిశంకరులను ఆశీర్వదించి, ప్రస్థాన త్రయం పై భాష్యములు వ్రాయమని ఆదేశించి, అంతర్ధానమయ్యాడు. శివునిఆజ్ఞ మేరకు, ఆదిశంకరులు బదరికాశ్రమానికి వెళ్లి, భాష్య రచనకు అంకురార్పణ చేసారు. ,
అసలు ఏమిటి ఈ మనీషా పంచకం ? ఆదిశంకరులకు, ఆ పార్వతీపతి, పరమేశ్వరుడు, శంకరుడు, చండాలుని రూపంలో, తత్వబోధ చేసిన తరువాత, జగద్గురువులు చెప్పిన ఈ అయిదు శ్లోకములో ఏమివున్నది ? అనేజిజ్ఞాస మనకందరకూ కలుగుతూనే వుంటుంది. ఈ అయిదు శ్లోకములు కంఠతా పెట్టవలసినవి. భావము తెలుసుకోవలసినవి. ఉపదేశ వాక్యములుగా స్వీకరించి, ఆచరణలో పెట్టవలసినవి.
దీనిపై స్వామి సుందర చైతన్యుల వారు లఘు వ్యాఖ్య వ్రాసారు. ఇంకా, ఎందరో గురువులు తమ జ్ఞాన యజ్ఞ పరంపరలో శిష్యులకు బోధించారు. వాటిని గౌరవిస్తూ, మనం రోజూ ఒక శ్లోకంతో ముందుకు వెళదాం. భావము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, భక్తి శ్రద్దలతో.
ఇందులో వున్న విషయములు, గంభీరమైనవి. అందువలన, మన మేధస్సుకు కొద్దిగా వత్తిడి పెట్టి, ఈ లక్ష్యంలో కృతకృత్యులం కావాలని జగద్గురువు ఆదిశంకరులని ప్రార్ధిస్తూ, ముందుకు అడుగు వేద్దాం.
*
శ్లో. జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్పుటతరా యా సంవిజృమ్భతే
యా బ్రహ్మాది పిపీలికాన్త తనుషు ప్రోతా జగత్సాక్షిణీ /
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్
చ౦డాలోస్తు స తు ద్విజోస్తు గురు : ఇత్యేషా మనీషా మమ // 1
శ్లో. బ్రహ్మయివాహమిదం జగచ్ఛ సకలం చిన్మాత్ర విస్తారితం
సర్వం చైత ద విద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం /
ఇద్హం యస్య దృఢామతి : సుఖతరే నిత్యే పరే నిర్మలే
చ౦డాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషామమ // 2 .
శ్లో. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచో గురో
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృ శతా నిర్వ్యాజ శాంతాత్మనా
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ // 3 .
శ్లో. తిర్యజ్ నరదేవతాభి రహమిత్యన్త : స్పుటాగృహ్యతే
యద్భాసా హృదయాక్ష దేహ విషయాభాన్తి స్వతో >చేతనా :
తాం భాస్యై : పిహితార్క మండల నిభామ్ స్ఫూర్తిమ్ సదా భావయ
న్యోగీ నిర్వృత మానసో హి గురురిత్యేషా మనీషామమ // 4 .
శ్లో. యత్ సౌఖ్యామ్బుధి లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నివృత :
యస్మిన్ నిత్య సుధామ్బుధౌ : గలిత ధీ బ్రహ్మయివ న బ్రహ్మవిద్
య : కశ్చిత్స సురేంద్ర వందిత పదౌ నూనం మనీషామమ // 5 .
( నిన్నటి దానికి కొనసాగింపు.)
ఏ ఆనంద సాగర కణలేశమును అనుభవించి, ఇంద్రాదులు ఆనందిస్తున్నారో, జ్ఞాని దేనిని ప్రశాంతంగా అనుభవిస్తునాడో, ఏ శాశ్వత ఆనంద సాగరంలో, అతని చిత్తము లయించి పోయిందో, అతడు బ్రహ్మ వేత్తకాదు, బ్రహ్మమే. అతని పాద పద్మములకు ఇంద్రుడు కూడా నమస్కరిస్తాడు. అని నా నిశ్సితాభిప్రాయము .
క్లుప్త వివరణ : సౌఖ్య అంబుధి= సుఖమనే సముద్రం, లేశ లేశ౦= సూక్ష్మాతి సూక్ష్మమైన. సుధ అంబుధి = అమృత మయమైన ఆనంద సముద్రము. సురేంద్ర వందిత పదౌ = ఇంద్రుడు అంతటి వాడు కూడా పూజించే పాదములు.
లౌకిక జీవన వ్యాపారముల నుండి దూరమై, శ్శాశ్వత బ్రహ్మానంద సాగరం లో మునకలు వేసేవాడే జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు అయిన తరువాత, జీవుడు వుండే స్థితిని ఆదిశంకరులు ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణించి, మహత్తరమైన మనీషా పంచకాన్ని ముగిస్తున్నారు. .
మొదటి నాలుగుశ్లోకాలలో, మహావాక్య చతుష్టయం గురించి చెప్పిన జగద్గురువులు, ఈ శ్లోకంలో జ్ఞానియైన వాడు వుండే వైభవాన్ని ప్రస్తుతిస్తున్నారు. ఆత్మ ఆనంద స్థితిని సముద్రంతో పోల్చి, అనంతమైనదనే భావన తీసుకువచ్చారు. సాగరం అనంతమైనది కదా ! అట్టిసాగరం లోని చిన్న బిందువునైనా అనుభవించినట్లైతే సుధాంబుధిలో మునకలు వేసినట్లే, అని మనకు విశ్వాసం కలిగిస్తున్నారు.
' బ్రహ్మ విద్ బ్రహ్మయి వ భవతి ' బ్రహ్మమును తెలియువాడు బ్రహ్మమే అగుచున్నాడు అనే ఉపనిషద్ వాక్యాన్ని అనుసరించి, జ్ఞానము, బ్రహ్మము రెండు కావని విశదీకరించారు, జగద్గురువులు.
జంతు జన్మలో, కర్మలకు కర్తృత్వ భావనలు వుండవు కనుక, వాటికి పాప పుణ్యముల ప్రసక్తి వుండదు. కానీ మానవజన్మలో, సంచిత ప్రారబ్ద ఆగామి కర్మలను అనుభవించ వలసిన పరిస్థితి వున్నది. వెనుకటి జన్మల వాసనలను వెంట బెట్టుకుని వచ్చి, వాటిని అధిగమించి, మోక్షసాధన చేయవలసిన అవసరం వున్నది.
మన శాస్త్రముల ప్రకారము,,
వాసనలు
శరీరం / మనస్సు / బుద్ధి /
దర్శించేవాడు / భావించేవాడు / విచారణ చేసేవాడు
విషయం : వస్తువులు / వుద్రేకములు / ఆలోచనలు.
వీటిని నియంత్రణ చేసుకుంటూ, వాసనలను నిర్మూలన చేసుకోవాలి, ధ్యానమార్గం ద్వారా.
ఇది మనీషాపంచకము. చండాలుని యందును, బ్రాహ్మణుని యందును ఏక వస్తు దర్శనం చేయవలెననే ఉజ్వలస్థితి. మనుష్యులందరూ, మనీషులై ( మహాత్ములు అయి ) మహర్షులై, తరించాలనే అభిలాషతో, ఆదిశంకరులు, చండాలుని రూపంలో వున్న పరమేశ్వర దర్శనం చేసుకుని, మనలను అనుగ్రహించిన జ్ఞాన ప్రసాదం.
ఉపసంహారం :
మనము ఈ అయిదు రోజులుగా మననం చేసుకున్న శ్లోకములు, కంఠతా పెట్టి, పెద్దల దర్శనం చేసుకున్నప్పుడు, ఇందులోని నిగూఢార్థములు వారితో చర్చిస్తూ వుంటే, వేదాంత మార్గం సుగమం అవుతుంది. ఎందుకంటే, ఇందులోని ఒక్కొక్క శ్లోకం, ఒక ఉపదేశ వాక్యం అని తెలుసుకున్నాము కదా !
శ్రద్ధతో నాతో అయిదురోజులూ ప్రయాణించి, స్పందించిన మిత్రులకు ధన్యవాదములు.
మనలో, చాలామందికి ఒక అనుమానం వస్తూ ఉంటుంది, ప్రాధమిక దశలో. ఏమని అంటే, ' వికృతరూపంతో జుగుప్సాకరంగా కనిపించే ఛండాలుని గురువు గా చూడమని గురుదేవులు ఎలా చెప్పారు, అని. ' అవును కదా !
కొద్దిగా లోతుగా వెళ్తే, ఆదిశంకరులు, కనబడిన ప్రతి ఛండాలనీ గురువుగా చూడమని చెప్పలేదని విశదం అవుతుంది. ఛండాలుడు శంకరులను జ్ఞానతత్వం తో ప్రశ్నించిన తరువాత, అతనిలోని, బ్రహ్మభావం తెలుసుకుని, శంకరులు చెప్పిన శ్లోక పంచకం ఇది.
మనకు భగవద్గీతలో, జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ అయిదవ అధ్యాయంలో, 18 వ శ్లోకం లో ఇదే విషయము చెప్పారు.
శ్లో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తినీ /
శుని చైవ స్వపాకే చ పండితా : సమదర్శన : //
జ్ఞాన సంపన్నుడైన పండితుడు, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలైన వాని యందును, ఛండాలుని యందునూ, సమదృష్టితోనే వుండును.
అనగా, చైతన్యము గల ప్రతి దానిలో పరమాత్మను చూడడమనే, అర్ధం చేసుకోవాలి గానీ, పై చెప్పిన అందరినీ తీసుకువచ్చి, ప్రక్క ప్రక్కన నిలబెట్టి, పూజ చేయమని కాదు కదా ! వారిని చూసినపుడు, ఏహ్యభావం కలుగకుండా, పరమాత్మ భావంతో వుండమని అర్ధం.
***

Comments
Post a Comment