. శ్రీ శివ మహా పురాణము
శ్రీ శివ మహా పురాణము - 122 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
29. అధ్యాయము - 4
🌻. నారదునకు విష్ణువు ఉపదేశించుట - 4 🌻
కాయేన మనసా వాచా యశ్శంకరముపైతి భోః | స పండిత ఇతి జ్ఞేయస్స జీవన్ముక్త ఉచ్యతే || 44
శివేతి నామ దావాగ్నే ర్మహాపాతక పర్వతాః | భస్మీ భవన్త్య నాయాసా త్సత్యం సత్యం న సంశయః|| 45
పాపమూలాని దుఃఖాని వివిధాన్యపి తాన్యతః | శివార్చనైక నశ్యాని నాన్యనశ్యాని సర్వథా || 46
స వైదికస్స పుణ్యాత్మా సధన్యస్స బుధో మునే | యస్సదా కాయవాక్చితై శ్శరణం యాతి శంకరమ్ || 47
ఓయీ! శరీరముతో, మనస్సుతో, వాక్కుతో, ఎవడు శంకరుని భజించునో, వాడే పండితుడని తెలియవలెను. అతడే జీవన్ముక్తుడనబడును (44).
శివనామము అనే దావాగ్ని మహాపాతములనే పర్వతములను బూడిత చేయును. ఇది సత్యము. నిస్సంశయముగా సత్యము (45).
వివిధ దుఃఖములకు పాపములే కారణము. అవి శివార్చన చేత మాత్రమే నశిస్తాయి. అవి నశించు మార్గము మరియొకటి లేనే లేదు (46).
ఓ మహర్షీ! ఎవడైతే సర్వదా శరీరముతో, వాక్కుతో, మనస్సుతో శంకరుని శరణు వేడునో, వాడే వైదికుడు; వాడే పుణ్యాత్ముడు; వాడే ధన్యుడు; వాడే పండితుడు (47).
భవంతి వివిధా ధర్మా యేషాం సద్యః ఫలోన్ముఖాః | తేషాం భవతి విశ్వాసస్త్రి పురాంతక పూజనే || 48
పాతకాని వినశ్యంతి యావంతి శివ పూజయా | భువి తావంతి పాపాని న సంత్యేవ మహామునే || 49
బ్రహ్మ హత్యాది పాపానాం రాశయేsప్యమితా మునే | శివస్మృత్యా వినశ్యంతి సత్యం సత్యం వదామ్యహమ్ || 50
శివనామతరీం ప్రాప్య సంసారాబ్ధిం తరంతి తే | సంసారమూలపాపాని తస్య నశ్యంత్య సంశయమ్ || 51
త్రిపురములను నశింపజేసిన శివుని పూజయందు శ్రద్ధ గలవారు ఆచరించే ధర్మములు వెంట వెంటనే ఫలములనిచ్చును (48).
ఓ మహర్షీ! శివపూజచే ఎన్ని పాపములు నశించునో, అన్ని పాపములు భూలోకములో లేనే లేవు (49).
ఓ మహర్షీ! బ్రహ్మ హత్యాది పాపముల అంతులేని రాశులైననూ శివస్మరణచేత నశించును. నేను ముమ్మాటికి సత్యమును పలుకు చున్నాను (50).
శివనామము అనే నావను ఆశ్రయించిన వారి సంసారమూల భూతము లైన పాపము లన్నియూ నశించి, వారు సంసారసముద్రమును దాటుదురు. ఇది నిశ్చయము (51).
సంసారమూలభూతానాం పాతకాం మహా మునే | శివనామకుఠారేణ వినాశో జాయతే ధ్రువమ్ || 52
శివనామామృతం పేయం పాపదావానలార్దితైః | పాపదావాగ్ని తప్తానాం శాంతిస్తేన వినా న హి || 53
శివేతి నామపీయూష వర్ష ధారా పరిప్లుతః | సంసారదవమధ్యేsపి న శోచతి న సంశయః || 54
న భక్తి శ్శంకరే పుంసాం రాగద్వేషరతాత్మనామ్ | తద్విధానాం హి సహసా ముక్తి ర్భవతి సర్వథా || 55
ఓ మహర్షీ! సంసారమునకు మూలమైన పాపములు శివనామమే గొడ్డలిచే నశించుట నిశ్చయము (52).
పాపమనే దావాగ్నిచే పీడింపబడు మానవులు శివనామమనే అమృతమును పానము చేయవలెను. పాపమనే దావాగ్నిచే పీడింప బడు వారికి శివనామము లేకుండా శాంతి లేదు (53).
శివనామమనే అమృతవర్షధారతో తడిసిన మానవుడు సంసారమనే దావాగ్ని మధ్యలో నున్ననూ దుఃఖించడు. దీనిలో సందేహము లేదు (54).
రాగ ద్వేషముల యందు సక్తమైన అంతః కరణముగల వారికి శంకరుని యందు భక్తు కుదరదు. శంకరుని యందు భక్తి కుదిరిన మానవులకు శీఘ్రముగా మోక్షము లభించును (55).
అనంత జన్మభిర్యేన తపస్తప్తం భవిష్యతి | తస్యైవ భక్తిర్భవతి భవానీ ప్రాణవల్లభే || 56
జాతాపి శంకరే భక్తి రస్య సాధారణీ వృథా | పరం త్వవ్యభి చారేణ శివభక్తిరపేక్షితా || 57
యస్యా సాధారణీ శంభౌ భక్తి రవ్యభిచారిణీ | తసై#్యవ మోక్షస్సులభో నాన్యస్యేతి మతిర్మమ || 58
కృత్వాప్యనంతపాపాని యది భక్తిర్మహేశ్వరే | సర్వపాప వినిర్ముక్తో భవత్యేవ న సంశయః || 59
భవంతి భస్మ సాద్యృక్షా దవదగ్ధా యథా వనే | తథా భవంతి దగ్ధాని శంకరాణా మఘాన్యపి || 60
అనంత జన్మల యందు తపము నాచరించిన వానికి మాత్రమే భవానీదేవి యొక్క ప్రాణవల్ల భుడగు శంకరుని యందు భక్తి కుదురును (56).
సంసారములోని ఇతర వస్తువులతో సమానముగా శంకరుని యందు భక్తి కుదిరినా, అది వ్యర్థము . శివుని యందు అచంచలమైన పరాభక్తి మోక్షసాధనమగును (57).
ఎవనికి శంభుని యందు అచంచల, అసాధారణ భక్తి కుదురునో, వానికి మాత్రమే మోక్షము సులభముగా లభించునని నా అభిప్రాయము (58).
అనంత పాపములను చేసిన వాడైననూ మహేశ్వరుని యందు భక్తి గలవాడైనచో, ఆపాపములన్నియూ తొలగిపోవుననుటలో సందేహము లేదు (59).
వనములో వృక్షములు దావాగ్ని చే దగ్ధమైన తీరున, శంకర భక్తుల పాపములన్నియు దగ్ధములగును (60).
సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ శివ మహా పురాణము - 124 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
30. అధ్యాయము - 5
🌻. నారదుడు తండ్రిని ప్రశ్నించుట - 1 🌻
సూత ఉవాచ |
అంతర్హితే హరౌ విప్రా నారదో మునిసత్తమః విచచార మహీం పశ్యన్ శివలింగాని భక్తితః || 1
పృథివ్యా అటనం కృత్వా శివరూపాణ్యనేకశః | దదర్శ ప్రీతితో విప్రా భుక్తిముక్తి ప్రదాని సః || 2
అథ తం విచరంతం కౌ నారదం దివ్యదర్శనమ్ | జ్ఞాత్వా శంభుగణౌ తౌ తు సుచిత్తముపజగ్మతుః || 3
శిరసా సుప్రణమ్యాశు గణావూచతురాదరాత్ | గృహీత్వా చరణౌ తస్య శాపోద్ధారేచ్ఛయా చ తౌ || 4
సూతుడిట్లు పలికెను -
ఓ విప్రులారా! విష్ణువు అంతర్ధానము కాగానే, నారద మహర్షి భక్తితో శివలింగములను దర్శిస్తూ, భూలోకమునంతయూ పర్యటించెను (1).
ఓ విప్రులారా! ఆతడు భూలోకమును పర్యటించి, భుక్తిని ముక్తిని ఇచ్చే అనేక శివరూపములను ప్రీతితో దర్శించెను (2).
దివ్యజ్ఞాని యగు నారదుడు ప్రసన్న మనస్కుడై భూలోకములో సంచరించుచున్నాడని తెలిసి, ఆశంభుభక్తులిద్దరు ఆతని వద్దకు వచ్చిరి (3).
తమకీయబడిన శాపము నుండిఉద్దారమును గోరు వారై వారిరువురు వెంటనే అతనికి తలవంచి నమస్కరించి, పాదములను పట్టుకొని ఆదరముతో నిట్లనిరి (4).
శివగణావూచతుః |
బ్రహ్మపుత్ర సురర్షే హి శృణు ప్రీత్యావయోర్వచః | తవాపరాధకర్తారావావాం విప్రౌ న వస్తుతః || 5
ఆవాం హరగణౌ విప్ర తవాగస్కారిణౌ మునే | స్వయంవరే రాజపుత్ర్యా మాయా మోహితచేతసా || 6
త్వయా దత్తశ్చ నౌ శాపః పరేశ ప్రేరితేన హ | జ్ఞాత్వా కుసమయం తత్ర మౌనమేవ హి జీవనమ్ || 7
స్వకర్మణః ఫలం ప్రాప్తం కస్యాపి నహి దుషణమ్ | సుప్రసన్నో భవ విభో కుర్వను గ్రహ మద్య నౌ || 8
శివభక్తులిద్దరు ఇట్లు పలికిరి -
బ్రహ్మపుత్రా!దేవర్షీ! నీవు ప్రసన్నుడవై మాఇద్దరి మాటను వినుము. విప్రులమగు మేము యథార్థముగా నీయందు అపరాధమును చేయలేదు (5).
హే విప్రా! మేమిద్దరము శివుని అనుచరులము. ఓమహర్షీ! మేము నీయందు తప్పు చేసితిమి. స్వయం వరములో మాయా ప్రాభావముచే నీమనస్సు రాజపుత్రి యందలి మోహముతో నిండియుండెను (6).
అట్టి నీవు మాకిద్దరికి శాపము నిచ్చితివి. పరమేశ్వరుని ప్రేరణ చేతనే అట్లు జరిగినది. అది మాటలాడుటకు సమయము కాదనియు, మౌనమే రక్షక మనియు తెలిసుకొంటిమి (7).
జీవుడు తన కర్మల ఫలమును పొందును. ఇతరులను దూషింప బని లేదు. హే ప్రభో! నీవు మాయందు ప్రసన్నుడవై మమ్ములను గ్రహింపుము (8).
సూత ఉవాచ |
వచ ఆకర్ణ్య గణయో రితి భక్త్యుక్త మాదరాత్ | ప్రత్యు వాచ మునిః ప్రీత్యా పశ్యాత్తాపమవాప్య సః || 9
సూతుడిట్లు పలికెను -
శివుని అనుచరులిద్దరు భక్తితో చెప్పిన ఈ మాటను విని, నారదముని పశ్చాత్తాపమును పొందిన వాడై, ప్రీతితో ఆదరముతో నిట్లు బదులిడెను (9)
నారద ఉవాచ |
శృణుతం మే మహాదేవగణౌ మాన్యతమౌ సతామ్ | వచనం సుఖదం మోహనిర్ముక్తం చ యథార్థకమ్ || 10
పురా మమ మతిర్భ్రష్టాసీచ్ఛి వేచ్ఛావశాత్ ధ్రువమ్ | సర్వథా మోహమాపన్నశ్శప్తవాన్ వాం కుశేముషిః || 11
యదుక్తం తత్తథా భావి తథాపి శృణుతాం గణౌ | శాపోద్ధారమహం వచ్మి క్షమేతామఘమద్య మే || 12
వీర్యాన్ము నివరస్యాప్త్వా రాక్షసే శత్వమా దిశమ్ | స్యాతాం విభవసంయుక్తౌ బలినౌ సుప్రతాపినౌ || 13
నారదుడిట్లు పలికెను -
మహాదేవాను చరులారా! నా మాటను వినుడు. మీరు సత్పురుషులలో మిక్కిలి శ్రేష్ఠులు. మీరు సుఖమును కలిగించు, మోహములేని సత్యవచనమును పలికినారు (10).
కొద్దికాలము క్రితము నాబుద్ధి భ్రష్టమైనది. శివుని ఇచ్ఛ వలననే అట్లు జరిగినదనుట నిశ్చయము. నేను పూర్తిగా మోహమును పొంది, దుష్టబుద్ధి గలవాడై మిమ్ములనిద్దరినీ శపించితిని (11).
నా శాపవచనములు సత్యములయి తీరును. అయిననూ, శివభక్తులారా! నా యీ పాపమును క్షమించుడు (12).
ముని శ్రేష్ఠుని బిడ్డలై పుట్టి, మీరు సంపత్తులు గల వారై బలము, ప్రతాపము గల రాక్షస ప్రభువులు అగుదురు (13).
సర్వ బ్రహ్మాండరాజనౌ శివభక్తౌ జితేంద్రి¸° | శివాపరతనోర్మృత్యుం ప్రాప్య స్వం పదమాప్స్యథః || 14
మీరు ఇంద్రియజయము గల శివ భక్తులై శివుని రెండవ స్వరూపమగు విష్ణువు చేతిలో మృత్యువును పొంది, మీ స్వస్థానమును పొందెదరు (14)
సశేషం....
🌹 🌹
శ్రీ శివ మహా పురాణము - 125 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
30. అధ్యాయము - 5
🌻. నారదుడు తండ్రిని ప్రశ్నించుట - 2 🌻
సూత ఉవాచ |
ఇత్యా కర్ణ్య మునేర్వాక్యం నారదస్య మహాత్మనః |
ఉభౌ హర గణౌ ప్రీతౌ స్వం పదం జగ్మతుర్ము దా || 15
నారదోsపి పరం ప్రీతో ధ్యాయ చ్ఛివమనన్య ధీః | విచచార మహీం పశ్యన్ శివతీర్థాన్య భీక్ణశః || 16
కాశీం ప్రాప్యాథ స మునిస్సర్వోపరి విరాజితామ్ | శివప్రియాం శంభు సుఖం ప్రదాం శంభుస్వరూపిణీమ్ || 17
దృష్ట్వా కాశీం కృతార్థోsభూత్ కాశీనాథం దదర్మహ ఆనర్చ పరమ ప్రీత్యా పరమానందసంయుతః || 18
మహాత్ముడగు నారదముని యొక్క ఈ వాక్యమును విని శివాను చరులిద్దరు సంతసించి, ఆనందముతో తమ స్థానమునకు వెళ్లిరి. (15).
నారదుడు కూడ మిక్కిలి సంతసించి, శివుని ఏకానుగ్రమగు బుద్ధితో ధ్యానిస్తూ, భూలోకములో శివతీర్థములనన్నింటినీ చూస్తూ సంచరించెను (16).
తరువాత ఆ మహర్షి కాశీని చేరెను. కాశీ తీర్థములన్నింటిలో గొప్పది. శివునకు ప్రియమైనది. కాశీ శివుని స్వరూపము (17) .
అతడు కాశీని దర్శించి కృతార్థుడయ్యెను. కాశీనాథుని దర్శించి, పరమానంద భరితుడై పూజించెను (18).
సముదః సేవ్య తాం కాశీం కృతార్థో మునిసత్తమః |నమన్ సంవర్ణయన్ భక్త్వా సంస్మరమ్ ప్రేమవిహ్వలః || 19
బ్రహ్మలోకం జగామాథ శివస్మరణ సన్మతిః | శివతత్త్వం విశేషేణ జ్ఞాతుమిచ్ఛుస్స నారదః || 20
నత్వా తత్ర విధిం భక్త్యా స్తుత్వా చ వివిధై స్త్సవైః | పప్రచ్ఛ సివ తత్త్వం సివ సంభక్తమానసః || 21
ఆ మహర్షి ఆనందముతో ఆ కాశీనగరమును సేవించి, శివునికి నమస్కరించి, భక్తితో శివమహిమను వర్ణించి, ప్రేమవ్యాకులుడై శివుని స్మరించి కృతార్థుడాయెను (19).
శివుని స్మరించుటచే పవిత్రమైన బుద్ధి గల ఆ నారదుడపుడు శివతత్త్వమును అధికముగా తెలియగోరి బ్రహ్మలోకమునకు వెళ్లెను (20).
అచట బ్రహ్మకు భక్తితో నమస్కరించి, వివిధ స్తోత్రములతో స్తుతించి, శివుని యందలి భక్తితో నిండిన మనస్సు గలవాడై శివతత్త్వమును గూర్చి ప్రశ్నించెను(21).
నారద ఉవాచ|
బ్రహ్మాన్ బ్రహ్మ స్వరూపజ్ఞ పితామహ జగత్ర్ప భో | త్వత్ర్పసాదాన్మయా సర్వం విష్ణోర్మాహాత్మ్యముత్తమమ్ || 22
భక్తిమార్గం జ్ఞానమార్గం తపోమార్గం సుదుస్తరమ్ | దానమార్గమం చ తీర్థానాం మార్గం చ శ్రుతవానహమ్ || 23
న జ్ఞాతం శివతత్త్వం చ పూజావిధిమతః క్రమాత్ | చరిత్రం వివిధం తస్య నివేదయ మమ ప్రభో || 24
నిర్గుణోsపి శివస్తాత సగుణ శ్శంకరః కథమ్ | శివతత్త్వం న జానామి మోహితశ్శివ మాయ యా || 25
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! నీవు పరబ్రహ్మ స్వరూపము నెరింగిన వాడవు. హే పితామహా! నీవు జగత్తునకు అధీశుడవు. నేను నీ అనుగ్రహముచే ఉత్తమమగు విష్ణు మహాత్మ్యమును పూర్తిగా వినియుంటిని (22).
భక్తి మార్గమును, జ్ఞానమార్గమును, కఠినమగు తపో మార్గమును, దానమార్గమును, మరియు తీర్థమార్గమును నేను విని యుంటిని (23).
కాని, నాకు శివతత్త్వము తెలియదు. కావున, హే ప్రభో! నాకు శివపూజా విధిని, శివుని వివిధ చరిత్రలను క్రమముగా చెప్పుము (24).
తండ్రీ! శివుడు నిర్గుణుడైననూ సగుణుడు ఎట్లు అయినాడు?నేను శివమాయచే మోహితుడనగుటచే, శివతత్
త్వమును తెలియకున్నాను (25).
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
. శ్రీ శివ మహా పురాణము - 128 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
31. అధ్యాయము - 6
🌻. విష్ణువు జన్మించుట- 2 🌻
సర్వగా సర్వరూపా చ సర్వదృక్సర్వకారిణీ | సర్వైకవంద్యా సర్వాద్యా సర్వదా సర్వసంస్కృతిః || 16
పరికల్ప్యేతి తాం మూర్తిమైశ్వరీం శుద్ధరూపిణీమ్ | అద్వితీయమనాద్యంతం సర్వాభావం చిదాత్మకమ్ || 17
అంతర్దధే పరాఖ్యం యద్బ్రహ్మ సర్వగమవ్యయమ్ | అమూర్తేః యత్పరాఖ్యం వై తస్య మూర్తి స్సదాశివః || 18
అర్వాచీనాః పరాచీనా ఈశ్వరం తం జగర్బుధాః | శక్తిస్తదైకలేనాపి స్వైరం విహరతా తనుః || 19
స్వవిగ్రహాత్స్వయం సృష్టా స్వశరీరానపాయినీ |
ఆ మూర్తి సర్వరూపములను ధరించినదై, సర్వమును పొంది, సర్వమును చూస్తూ, సర్వమును చేయును. సర్వులచే నమస్కరింపదగిన ఆమె సర్వమునకు ఆది; సర్వమును ఇచ్చును. అమోయే సర్వసంస్కృతులకు మూలము (16).
ద్వితీయము లేనిది, ఆద్యంతములు లేనిది, సర్వమును ప్రకాశింపజేయు చిద్ఘనము, సర్వవ్యాపకము, వినాశము లేనిదియగు పరబ్రహ్మ శుద్ధరూపిణి, ఈశ్వరియగు ఆ మూర్తిని సృజించి అంతర్ధానము జెందెను (17).
మూర్తి రహితమైన పరబ్రహ్మ యొక్క మూర్తియే సదాశివుడు (18).
ఆయనయే ఈశ్వరుడని ప్రాచీన, ఆధునిక విద్వాంసులు వాక్రుచ్చినారు. ఏకాకియై స్వేచ్ఛగా సంచరించు సదాశివుడు (19).
తన స్వరూపమునుండి తన కంటె భిన్నముకాని శక్తిని స్వయముగా సృష్టించెను.
ప్రధానం ప్రకృతిం తాం చ మాయాం గుణవతీం పరామ్ || 20
బుద్ధి తత్త్వస్య జననీమాహుర్వికృతి వర్జితామ్ | సా శక్తి రంబికా ప్రోక్తా ప్రకృతిస్సక లేశ్వరీ || 21
త్రిదేవ జననీ నిత్యా మూలకారణమిత్యుత | అస్యా అష్టౌ భుజాశ్చాసన్ విచిత్ర వదనా శుభా || 22
రాకా చంద్ర సహస్రస్య వదనే భాశ్చ నిత్యశః | నానా భరణ సంయుక్తా నానాగతిసమన్వితా || 23
నానాయుధధరా దేవీ పుల్ల పంకజలోచనా |అచింత్య తేజసా యుక్తా సర్వయోనిస్సముద్యతా || 24
ఆమోయే ప్రధానము, ప్రకృతి, మాయ, త్రిగుణాత్మిక (20).
పరాశక్తి, సమష్టి బు ద్దధితత్త్వమునకు జనవి, వికారము లేనిది యని ఋషులు చెప్పుదురు. ఆశక్తియే అంబిక, ప్రకృతి, సర్వమునకు ఈశ్వరియని చెప్పబడును (21).
మరియు ఆమె బ్రహ్మ విష్ణురుద్రులకు జనని, నిత్య, మూల కారణము అని కూడ చెప్పబడెను. ఆమెకు ఎనిమిది భుజములు గలవు. ఆమె యొక్క మంగళకరమగు ముఖము అనేక రంగులతో శోభిల్లును (22).
ఆమె ముఖములో అనంతపూర్ణిమా చంద్రుల కాంతి నిత్యము ప్రకాశించును. ఆమె అనేక ఆభరణములను ధరించును. ఆమె అనేక విధముల గతి కలది (23).
అనేక ఆయుధములను ధరించే ఆ దేవి యొక్క నేత్రములు వికసించిన పద్మములవలె నుండును. ఆమె తేజస్సు ఊహకందనిది. ఉద్యమ శీలియగు ఆమెయే సర్వకారణము (24).
ఏకాకినీ యదా మాయా సంయోగాచ్చాప్యనేకికా | పరః పుమా నీశ్వరస్స శివశ్శంభురనీశ్వరః || 25
శీర్షే మందాకినీధారీ భాలచంద్రస్త్రిలోచనః | పంచవక్త్రః ప్రసన్నాత్మా దశబాహుస్త్రి శూలధృక్ || 26
కర్పూర గౌరసుసితో భస్మోద్ధూలిత విగ్రహః |యుగపచ్చ తయా శక్త్యా సాకం కాలస్వరూపిణా || 27
శివలోకాభిధం క్షేత్రం నిర్మితం తేన బ్రహ్మాణా | తదేవ కాశికేత్యేత త్ర్పోచ్యతే క్షేత్రముత్తమమ్ || 28
ఆమెయ ఏకాకినియే అయిననూ, గుణ సంయోగముచే అనేకముగా అగును. ఆ సదాశివుడే పరమపురుషుడు. ఈశ్వరుడు, శివుడు, శంభువు. ఆయనకు ఈశ్వరులు లేరు (25).
ఆయన తలపై మందాకినిని, ఫాలమునందు చంద్రుని ధరించును. ఆయన మూడు కన్నులు, అయిదు ముఖములు, పది చేతులు గలవాడు. ప్రసన్నమగు మనస్సు గలవాడు. ఆయన త్రిశూలమును ధరించును(26).
ఆయన దేహము కర్పూరము వలె పచ్చగా, తెల్లగా నుండును. ఆయన దేహమంతటా భస్మను ధరించును. కాల స్వరూపుడగు అపర బ్రహ్మ శక్తితో బాటు (27).
శివలోకమును క్షేత్రమును నిర్మించెను. ఆ ఉత్తమక్షేత్రమునకు కాశీ అను పేరు గలదు (28).
పరం నిర్వాణ సంఖ్యానం సర్వోపరి విరాజితమ్ | తాభ్యాం చ రమణాభ్యాం చ తస్మిన్ క్షేత్రే మనోరమే || 29
పరమానందరూపాభ్యాం పరమానందరూపిణి | మునే ప్రలయకాలేsపి న తత్ క్షేత్రం కదాచన || 30
విముక్తం హి శివాభ్యాం యదవిముక్తం తతో విదుః | అస్యానందవనం నామ పురాsకారి పినాకినా || 31
క్షేత్రస్యానందహేతుత్వా దవిముక్త మనంతరమ్ |
కాశీనగరము సర్వశ్రేష్ఠమగు మోక్ష నగరి. తీర్థములలో కెల్లా గొప్పదియై ప్రకాశించుచున్నది. పరమానంద స్థానమగు ఆ సుందరక్షేత్రమునందు పరమానంద రూపులగు శివశక్తులు ఉందురు (29).
ఓ మహర్షీ! పార్వతీ పరమేశ్వరులు ప్రలయకాలమందైననూ ఆ క్షేత్రమును ఏనాడు విడువరు (30).
అందువలననే ఈ క్షేత్రమునకు అవిముక్తము అని పేరు. పూర్వము శివుడు ఆనందమును కలిగించునదగుటచే ఈ అవిముక్త క్షేత్రమునకు ఆనందమని పేరిడెను (31).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Then having inha…. శ్రీ శివ మహా పురాణము - 129 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
31. అధ్యాయము - 6
🌻. విష్ణువు జన్మించుట- 3 🌻
అథానందవనే తస్మిన్ శివయో రమమాణయోః || 32
ఇచ్ఛేత్య భూత్సరర్షే హి సృజ్యః కోప్యపరః కిల | యస్మిన్ యస్య మహాభారమావాం స్వస్వై రచారిణౌ || 33
నిర్వాణధారణం కుర్వః కేవలం కాశిశాయినౌ | స ఏవ సర్వం కురుతాం స ఏవ పరిపాతు చ || 34
స ఏవ సంవృణోత్వంతే మదనుగ్రహతస్సదా | చేతస్సముద్రమాకుంచ్య చింతాకల్లోలలోలితమ్ || 35
సత్త్వరత్నం తమో గ్రాహం రజోవిద్రుమవల్లితమ్ | యస్య ప్రసాదాత్తిష్ఠావస్సుఖమానందకాననే || 36
ఓ దేవర్షీ! శివశక్తులిద్దరు ఆ ఆనందవనమునందు రమించుచుండగా (32),
మరియొకనిని సృష్టించవలెనని వారికి సంకల్పము కలిగెను. మరియొకనిని సృష్టించి, వానియందు సృష్టిభారమునుంచి మనము ఇద్దరము స్వేచ్ఛగా (33)
కాశీనగరము నందున్న వారమై పరమానందమును పొందెదము. ఆ పురుషుడు సదా నా అనుగ్రహముచే సర్వమును సృజించి, ఆతడే పరిపాలించుగాక!(34)
ప్రళయము నందు ఆతడే సర్వమును ఉపసంహరించుగాక!చింతలు అనే తరంగములతో సంక్షుబ్దమై, సత్త్వగుణము అనే రత్నములు, తమోగుణము అనే మొసళ్లు, రజోగుణమనే పగడములు గలచిత్తము అనే సముద్రమును ఉపసంహరించుకొని (35).
ఆ పురుషుని అనుగ్రహము వలన మనమిద్దరము ఆనందకాననములో సుఖముగా నుండెదము (36).
పరిక్షిప్త మనోవృత్తౌ బహిశ్చింతాతురే సుఖమ్ | సంప్రధార్యేతి స విభుస్తయా శక్త్యా పరేశ్వరః || 37
సవ్యే వ్యాపారయాం చక్రే దశమేsగే సుధాసవమ్ | తతః పుమానావిరాసీ దేకః త్రైలోక్య సుందరః || 38
శాంతస్సత్త్వ గుణోద్రిక్తో గాంభీర్యామిత సాగరః | తథా చ క్షమయా యుక్తో మునేsలబ్దోపమోsభవత్ || 39
ఇంద్ర నీలద్యుతి శ్ర్శీమాన్పుండరీ కోత్తమేక్షణః సువర్ణకృతి భృచ్ఛ్రేష్ఠదుకూలయుగలావృతః || 40
లసత్ర్ప చండదోర్దండ యుగలో హ్యపరాజితః |
నా మనోవృత్తులన్నియూ ఈ నగరమునందు లగ్నమగుచున్నవి. ఈ నగరమునుకు బయట చింత, ఆదుర్దా గలవు. కాన, మనమిచట సుఖముగ నుండెదమని నిశ్చయించి, శక్తి సహితుడగు ఆ పరమేశ్వరుడు (37)
తన ఎడమ భాగమునందు జననేంద్రియమునందు అమృతమును చిందించెను. అపుడు ఒక త్రిలోకసుందరుడగు పురుషుడు ఆవిర్భవించెను (38).
ఓ మహర్షీ! ఆతడు శాంతుడు, సత్త్వగుణప్రధానుడు, గాంభీర్యము నందు సముద్రము వంటి వాడు, మరియు క్షమాగుణము కలవాడు, సాటిలేనివాడు (39).
శోభాయుక్తుడగు ఆపురుషుడు ఇంద్రనీలమణుల కాంతి గలవాడు, పద్మముల వలె అందమగు కన్నులు కలవాడు, బంగరు రంగు గల రెండు పట్టు వస్త్రములను ధరించెను (40).
ప్రకాశించే బలమైన భుజదండములు గల నాతడు పరాజితుడు కాడు.
తతస్స పురషశ్శంభుం ప్రణమ్య పరమేశ్వరమ్ || 41
నామాని కురు మే స్వామిన్ వద కర్మ జగావితి | తచ్ఛ్రుత్వా వచనం ప్రాహ శంకరః ప్రహసన్ ప్రభుః || 42
పురుషం తం మహేశానో వాచా మేఘగభీరయా |
అపుడా పురుషుడు పరమేశ్వరుడగు శంభునకు నమస్కరించి (41),
ఓ స్వామీ! నాకు పేరు పెట్టి పనిని ఆదేశించుము' అని పలికెను. ఆ మాటను విని శంకర ప్రభుడు చిరునవ్వు నవ్వి (42),
మేఘ గర్జన వంటి ధ్వనితో ఆ పురుషునితో నిట్లనెను.
శివ ఉవాచ |
విష్ణ్వితి వ్యాపకత్వాత్తే నామ ఖ్యాతం భవిష్యతి || 43
బహూన్యన్యాని నామాని భక్తసౌఖ్య కరాణి హ | తపః కురు దృఢో భూత్వా పరమం కార్యసాధనమ్ || 44
ఇత్యుక్త్వా శ్వాసమార్గేణ దదౌ చ నిగమం తతః | తతోsచ్యుతశ్శివం నత్వా చకార విపులం తపః || 45
అంతర్ధానం గతశ్శక్తా సలోకః పరమేశ్వరః | దివ్యం ద్వాదశసాహస్రం వర్షం తప్త్వాపి చాచ్యుతః || 46
న ప్రాప స్వాభిలషితం సర్వదం శంభుదర్శనమ్ |
శివుడు ఇట్లు పలికెను -
వ్యాపకుడవగుచటచే నీకు విష్ణువు అను పేరు ప్రసిద్ధి చెందగలదు (43).
భక్తులకు ఆనందమును కలిగించు అనేక ఇతర నామములు నీకు కలుగును. కార్యసిద్ధికి తపస్సు గొప్ప సాధనము. కాన నీవు దృఢచిత్తముతో తపస్సు చేయుము (44).
ఇట్లు పలికి శివుడు శ్వాసమార్గము ద్వారా వేదము నొసంగెను. అపుడు విష్ణువు శివునకు నమస్కరించి, గొప్ప తపస్సును చేసెను (45).
పరమేశ్వరుడు శక్తి తో కూడి అంతర్హితుడయ్యెను. శివలోకము కూడ అంతర్థానమయ్యెను. అచ్యుతుడు పన్నెండు వేల దివ్యవర్షములు తపస్సు చేసిననూ (46),
సర్వమును ఇచ్చే, తనకు అభీష్టమైన శివుని సాక్షాత్కారమును పొందలేక పోయెను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
. శ్రీ శివ మహా పురాణము - 130 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
31. అధ్యాయము - 6
🌻. విష్ణువు జన్మించుట- 4 🌻
తత్తత్సంశయమాపన్న శ్చింతితం హృది సాదరమ్ || 47
మయాద్య కిం ప్రకర్తవ్యమితి విష్ణుశ్శివం స్మరన్ | ఏతస్మిన్నంతరే వాణీ సముత్పన్నా శివచ్ఛుభా || 48
తపః పునః ప్రకర్తవ్యం సంశయస్యాపనుత్తయే | తతస్తేన చ తచ్ఛ్రుత్వా తపస్తప్తం సుదారుణమ్ || 49
బహుకాలం తదా బ్రహ్మాధ్యాన మార్గపరేణ హి | తతస్స పురుషో విష్ణుః ప్రబుద్ధో ధ్యానమార్గతః || 50
సుప్రీతో విస్మయం ప్రాప్తః కిం యత్తవ మహా ఇతి |పరిశ్రమవతస్తస్య విష్ణోస్స్వాంగేభ్య ఏవ చ || 51
జలధారా హి సంయాతా వివిధా శ్శివమాయయా |
విష్ణువు మనస్సులో అనేక సంశయములు పొడసూపెను. ఆతడు ఆదరముతో (47)
శివుని స్మరిస్తూ నాకిప్పుడు కర్తవ్యమేమి? అని చింతిల్లెను. ఇంతలో శివుని నుండి 'సంశయములను పోగొట్టుక…🌷
Comments
Post a Comment