సహో వాచ
వేదాలలో చెప్పబడిన దేవతలు ౩౩ మందే - 1 🌹
‘దా-దానే’,‘దా, ద్త్యుత్, దీప్, దివు’ అనుధాతువులతో ‘దేవ’ శబ్దము ఏర్పడును.
“దేవో దానాద్ వా, దీపనాద్ వా, ద్యోతనాద్ వా, ద్యుస్థానో భవతీతి వా” ఇచ్చునది, ప్రకాశించునది, ప్రకాశింపజేయునది, ద్యుస్థానంలో ఉండునది ‘దేవత’ శబంతో చెప్పబడును.
అనగా జ్ఞానం, ప్రకాశం, శాంతి, ఆనందం, సుఖం మొదలగునవి ఇచ్చు సకల జడచేతన పదార్ధాలను దేవతలనబడును.
యజుర్వేదంలో........
అగ్నిర్దేవతా దేవతా సూర్యోదేవతా చన్ద్రమా దేవతా వసవో దేవతా రుద్రా దేవతా ఆదిత్యా దేవతా మరుతో దేవతా విశ్వేదేవా దేవతా బృహస్పతిర్దేవతేన్ద్రో దేవతా వరణో దేవతా.
అగ్ని, వాయు, సూర్య, చంద్ర, వసు, రుద్ర, ఆదిత్య, ఇంద్ర వరుణాది ప్రకృతి పదార్థాన్ని దివ్యగుణయుక్తాలు కావున ‘దేవ’ శబ్దంచే చెప్పబడును.
“విద్వాంసో వై దేవాః” సత్య(వేద) విద్యల నెరిగినవారు, జ్ఞానదానం చేయుచు ప్రపంచంలో జీవేశ్వర ప్రకృతులు మొదలగు పదార్ధాల యథార్థ జ్ఞానంను లోకంనకు తెలుపుతుంటారు.
‘దివు విజిగీషా వ్యవహార ద్యుతిస్తుతిమోదమద స్వప్నకాంతిగతిషు’ అను ఈ ధాతువుచే కూడా దేవశబ్ధం ఏర్పడును.
విజయంను సాధించు కోరిక గల వీరక్షత్రియులు, పరమేశ్వరుని స్తుతించుచు పదార్థాల యథార్థ స్వరూపంను తెలుపు విద్వాంసులు, జ్ఞానదానమొనర్చు బ్రాహ్మణులు, ప్రకాశించు సూర్యచంద్ర, అగ్ని, విద్యుత్తు మున్నగు పదార్థాలు, సత్యవ్యవహారాలను ఆచరించే వైశ్యులు, సత్యకర్మలనాచరించు శూద్రులు మొదలగు వారందరును దేవతాశబంనకు అర్హులు.
అనగా ప్రపంచంనకు ఉపకారం చేయు జడచేతన పదార్థాలన్నీ దేవతలనబడును. దేవతాపదంనకు అర్థం మంత్రం ప్రతిపాద్య విషయమని తెలుసుకోవలెను.
🌻. దేవతలు ఎందరు? 🌻
నాలుగు వేదాలలో అనేక దేవీదేవతల గుణగణాలు వర్ణించబడ్డాయి. ఆ దేవతలు ప్రకృతి తత్వాలకు చెందినవి.
సూర్యుడు బుద్ధికి, అగ్ని సంకల్పానికి, సోముడు చంద్రుడు భావానికి ప్రతినిధులు.
వేదంలో
1. సూర్యాది ద్యుస్థాన దేవతలు
2. ఇంద్రాది అంతరిక్ష దేవతలు
3. అగ్న్యాది పృథివీస్థాన దేవతలు
4. విశ్వకర్మాది అమూర్త భావ దేవతలు
5. పురంధ్య్రాది స్త్రీదేవతలు
6. అగ్నీషోమాది దేవతాద్వంద్వాలు
7. స్థానరక్షక దేవతల వంటి ద్వితీయశ్రేణి దేవతలు అని ఏడు విధాలుగా అనబడతారు.
ఒక్కొక్క వేదమంత్రంనకు ఆధిభౌతిక, ఆధ్యాత్మిక అధిదైవికం అను మూడు విధాలుగా అర్థం చెప్పుకోవచ్చును.
ఉదాహరణకు ఉషస్సూక్తంలో ఉషశ్శబ్దానికి ప్రతి ఉదయం సాక్షాత్కరించే ‘అరుణోదయ’ మని ఆధిభౌతికార్థం.
మనుష్యులను నిద్రనుండి మేల్కొలిపి జాగృతులను చేస్తూ ఉపకరించే ఉషః కాలాధిపతియైన ‘ఉషోదేవత’ అని ఆధిదైవికార్థం.
మనుష్యులను అహంకార మమకారాదిరూపమైన అజ్ఞానాన్ని నశింపచేసి ఆత్మస్వరూప సాక్షాత్కారానికి ఉపయోగించే ‘ఆత్మతత్తజ్ఞానం’ అని ఆధ్యాత్మిక అర్థం.
ఈ రీతిలో ప్రతిసూక్తంలో ప్రతి మంత్రానికి మూడు రకాలుగా అర్థాన్ని పొందవచ్చును. కొందరు ప్రాకృతిక దేవతలను మూడు వర్గాలుగా విభజించారు. అవే పృథ్వీ, అంతరిక్ష, ద్యుస్థానీయ దేవతలు.
‘కతి వై దేవాః’ దేవతలు ఎందరు? అని నిరుక్త కారుడైన యాస్క మహర్షి ప్రశ్నవేసుకొని ‘త్రయః త్రింశో వై దేవాః’ 33 దేవతలని సమాధానం చెప్పినాడు.
అవి అష్టౌవసవః ఏకాదశ రుద్రాః, ద్వాదశ ఆదిత్యాః, ఇంద్రః ప్రజాపతిశ్చ’
8 వసుదేవతలు, 11 రుద్రదేవతలు, 12 ఆదిత్య దేవతలుత, 1 ఇంద్రుడు, 1 ప్రజాపతి మొత్తం 33 దేవతలు.
‘పంచ భూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు’ ఈ ఎనిమిది వసుదేవతలన బడును.
ఇవి జగత్తును వసింప చేయును కావున వసుదేవతలనబడును.
5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 1 జీవాత్మ ఈ పదకొండు రుద్రదేవతలనబడును. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ప్రాణులను రోదించేలా (ఏడ్పింప) చేస్తుంది కావున రుద్రదేవతలన బడును.
సంవత్సరంనందలి 12 మాసాలు ద్వాదశ ఆదిత్యులు అనబడుదురు. ఇవి మన ఆయుష్‌ను ప్రతిదినం తరిగించును అనగా తీసుకొని పోవును. ఇలా 31 దేవతలయ్యారు. 1 ఇంద్రుడు విద్యుత్తు, 1 ప్రజాపతి ఈ రెండు కలిసి మొత్తం 33 దేవతలయ్యారు.
ఈ 33 దేవతలను పూజించుట అనగా యథాయోగ్యముగ ఉపయోగించుకొనుట అని అర్థం. కేవలం పూజనీయుడు ఆ పరమేశ్వరుడొక్కడే. మిగతావన్ని దివ్యగుణాలు గల వస్తువులు. వీటిని ఉపయోగించుకొని దివ్యత్వాలను పొందును.
సశేషం...
సహో వాచ
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శుకమహర్షి పలికెను- పరీక్షిన్మహారాజా! ఈ జీవుల సముదాయమే వర్తకుల దళము. వీరు దేహమే ఆత్మయను భ్రాంతితో కర్మలను ఆచరించుచుందురు. ఆ కర్మల ఫలములు- పుణ్యము, పాపము, మిశ్రమ అని మూడు విధములుగా నుండును. పుణ్యఫలముగా సత్త్వ గుణ ప్రధానమగు దేవతా దేహములు, పాపముల ఫలితముగా తమోగుణ ప్రధానమగు వృక్ష, పశు, పక్ష్యాదుల దేహములు, మిశ్రమ ఫలముచే రజో గుణ ప్రధానములగు మానవుల దేహములు జీవులకు ప్రాప్తించును. పుట్టుకచే దేహములతో సంయోగము, మరణముతో వియోగము పరంపరగా సంభవించుచునే యుండును. మనస్సు యొక్క ప్రేరణచే ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా భోగానుభవములకై జీవులు కర్మలను ఆచరించుచుందురు. కనుక, ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు అను ఆరును సంసార-అరణ్యమునకు ద్వారములు. భగవంతునకు వశవర్తినియైన మాయచే ఈ ఆరు ఇంద్రియములు జీవుని సంసారారణ్యములో పడవేయును. ఆ అడవిలో బడి తిరుగుచున్న జీవుడు ధనవ్యామోహముచే వివిధకర్మలను చేయుచుండును. అతడు (ఆ జీవుడు) ఎన్నడును శ్రీహరియొక్క, గురువుయొక్క పాదములను ఆశ్రయింపడు. కాని, అట్లు ఆశ్రయించుటవలననే అతని పాపతాపములు అన్నియును నశించును. పరోక్షముగా జీవులను వర్తక సమూహముతో, ఆరు ఇంద్రియములను దోపిడి దొంగలతో పోల్చుట జరిగినది.
జీవులు కష్టపడి సంపాదించిన ధనమును, ధర్మకార్యములకై వినియోగింపవలయును. పరులకై వినియోగింపవలయును. పరమపురుషుడైన భగవంతుని ఆరాధించుట జీవునకు పరమధర్మము. అదియే అతనికి పరలోకమున శ్రేయస్సును గూర్చును. కాని, మానవుని బుద్ధియనెడి వివేకహీనుడగు సారథికి వశమైన మనస్సు, వానిని అధర్మ మార్గమునకు మళ్ళించును. అప్పుడు ధర్మకార్యమునకు వినియోగింపవలసిన ధనమును జీవుని ఇంద్రియములు చూచుట, స్పృశించుట, వినుట, ఆస్వాదించుట, ఆఘ్రాణించుట, సంకల్ప వికల్పములను చేయుట, నిశ్చయించుట అను వృత్తుల ద్వారా గృహస్థోచిత విషయ భోగములలో వినియోగించును.
భార్య, పుత్రులు మొదలగు కుటుంబ సభ్యులు తమ చేష్టలచే సాక్షాత్తు తోడేళ్ళవలె, నక్కలవలె ప్రవర్తింతురు. లోభియైన కుటుంబ యజమాని యొక్క ధనమును, అతని సమ్మతి లేకున్నను అతడు చూచుచుండగనే వారు గుంఫులో సురక్షితముగా నున్న గొర్రెను, తోడేలు వలె లాగి కొందురు.
పొలములోని కలుపుమొక్కల బీజములను అగ్నిద్వారా తగులబెట్టనిచో, ప్రతి సంవత్సరము ఆ పొలమును దున్ను చున్నప్పటికిని పంట వచ్చు సమయమునకు ఆ పొలమున లతలు, గడ్డి పొదలు దట్టముగా పెరుగును. అదే విధముగా కర్మభూమియైన ఈ గృహస్థాశ్రమము నందలి దుష్కర్మలు పూర్తిగా నిర్మూలింపనిచో, మరల లతలు, గడ్డి దుబ్బులవంటి కోరికలు వృద్ధి చెందుచునే యుండును. ఏలయన, గృహము కోరికల పుట్టగదా!
గృహమునందు ఆసక్తి గలవానికి ధన ధాన్యములే బహిః ప్రాణములు. వాని ధనమునకై అడవి యీగలు, దోమల వంటి నీచపురుషులు వానిని బాధింతురు. ధాన్యమును మిడుతలు, పక్షులు, చోరులు, ఎలుకలు మొదలగు వాటిచే పాడై పోవును. అజ్ఞానము, కోరికలు, కర్మలు మున్నగు వాటి కారణముగా ఈ మార్గమున సంచరించుచున్న వానియొక్క చిత్తము కలుషితమగును. ఫలితముగా అప్పుడప్పుడు అతనిలో దృష్టి దోషము ఏర్పడగా, ఈ మర్త్య లోకము గంధర్వ నగరము వలె అసత్యమైనను సత్యముగా భాసించును.
మరల అన్నపానాదులు, స్త్రీసాంగత్యము మొదలగు వ్యసనములలో చిక్కుకొని అతడు ఎండమావుల వంటి విషయభోగములవైపే పరుగెత్తును.
అప్ఫుడప్పుడు ఈ జీవునిబుద్ధి రజోగుణముచే ప్రభావితమగు సకల-అనర్థములకును మూలమైన బంగారమునే సుఖసాధనములుగా భావించుచుండును. దానిపైగల పేరాసతో అడవిలో చలిబాధకు తట్టుకొనలేక కొఱవిదయ్యమును అగ్నిగా భావించి, దానివైపే పరుగెత్తుచుండునట్లు బంగారము కొరకు అర్రులు చాచుచుండును.
శరీరమును కాపాడుట కొరకై గృహము, అన్నపానీయములు, ధనము మొదలగు వాటి యందలి అభినివేశముచే అప్పుడప్పుడు ఈ జీవుడు ఈ సంసారఅరణ్యమున ఇటునటు పరుగులు దీయుచుండును.
(పంచమ స్కంధము లోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
అప్ఫుడప్ఫుడు ఇతడు తేనెకొరకు ప్రయత్నించుచుండగా తేనెటీగలు కుట్టును. అప్పుడు ఇతడు దేహాభిమానమును కోల్పోవును. దానిని ఇతరులు అతనినుండి లాగుకొందురు.
ఒక్కొక్కప్పుడు ఇతడు తీవ్రమైన గాలులకు తట్టుకొని ఎండలకు, చలికి, వాన ముసురులకు లోనగుచుండును. వీటి నుండి రక్షించుకొన లేక బాధపడుచుండును. అప్ఫుడప్పుడు చిన్న వ్యాపారము చేసినను ధనలోభముచే ఇతరులను వంచించుటవలన వారితో వైరమును తెచ్చుకొనును.
ఒక్కొక్కసారి ఇతడు ఈ సంసార అరణ్యమునందు తనవద్దనున్న ధనమంతయును కోల్పోవును. అప్పుడు శయ్య, ఆసనము, గృహము, వాహనము మున్నగునవి ఏవియును మిగులవు. అప్పుడు ఇతరులను యాచించును. యాచనవలన అతనికి కావలసిస వస్తువులు లభింపవు. అప్ఫుడు అతని దృష్టి పరాయివారి వస్తువులు ఆకర్షించును. అందుకుగాను అతడు ఇతరులవలన అవమానముల పాలగును.
ఈ విధమైన వ్యవహార సంబంధముగా ధనమును ఇచ్చిపుచ్చుకొనుటచే పరస్పర వైరభావము ఏర్పడును. వైరమును శాంతింప చేయుటకై వివాహాది సంబంధములతో వారిని కలుపుకొనుచుందురు. ఈ తీరున వారు పలు కష్టముల పాలగుదురు. అందువలన ధనక్షయాది సంకటములకు లోనై మృతప్రాయులగుదురు.
ఈ భవాటవిలో ముందుకు సాగుచున్న ఈ వ్యాపారి దళములో మరణించిన వారిని అచటనే వదలిపెట్టి, కొత్తవారితో పరిచయమును ఏర్పరుచుకొని, ముందునకు సాగుదురు. ఓయీ! వీరా! వీరిలో ఏ ఒక్కరును ఆ మార్గము నుండి తిరిగి రాలేదు. ఎవ్వరును సంకటములతో గూడిన ఈ మార్గమును అతిక్రమించి, పరమానందదాయకమైన యోగ మార్గమును అనుసరింపలేరు.
మహామహా దిక్పాలురను జయించిన ధీరులైన వీర పురుషులుగూడ ఈ భూమండలమున ఇదినాది అను దురభిమానమును కలిగియుందురు. వారు పరస్పరము వైరము పూని, యుద్ధరంగమున మరణించెదరు. అట్టి వారికి శ్రీమన్నారాయణుని పరమపదము లభింపదు. అది కేవలము ద్వేషభావములేనట్టి (రాగద్వేషాదులు లేని) పరమహంసలకు మాత్రమే లభ్యమగును.
ఈ సంసారణ్యములో తిరుగుచుండు వర్తకుల గుంపు అప్పుడు లతలను, కొమ్మలను ఆశ్రయించుచుండును. ఆ కొమ్మలను ఆశ్రయించియుండునట్టి వివిధములగు పక్షులయొక్క మధుర కూజితములకు ఆకర్షితమై వాటి మోహములో పడిపోవుచుండును. అప్పుడప్ఫుడు సింహ సమూహాలకు భీతిల్లి కొంగలను, రాబందులను, గ్రద్దలను ఆశ్రయించును.
ఈ దళము ఆ కొంగలు మొదలగువాటిచేత మోసపోయి హంసలగుంపును చేరును. కాని, ఆ హంసల సదాచారములు ఆ దళము వారికి నచ్చక వానరములతో జత కట్టును. ఆ వానర జాతి తమ స్వభావమును అనుసరించి వారు దాంపత్యములలో మునిగి పోవుదురు. వీరు విషయేంద్రియములను తృప్తిపరచు ప్రయత్నముతో పరస్పర ముఖములను జూచుకొనుచు, తమ ఆయువు క్షీణించుచున్న విషయమునే మరచిపోవుదురు.
వృక్షములపై క్రీడించునట్టి ఆ వర్తకుడు భార్యాపుత్రుల యెడలగల ప్రేమ పాశములచే బంధింప బడును. విషయ వాసనలు క్రమముగా వృద్ధి చెందుటచే వివిధములగు దురభ్యాసముల కారణముగా దైన్య స్థితికి లోనగును. కాని, ఆ బంధము నుండి తప్పించు కొన జాలడు. ఒక్కొక్కప్పుడు ఏమఱు పాటునకు లోనై ఒక పర్వత గుహలో పడిపోవును. అచటను ఏనుగులకు భయపడి ఒక లతను ఆశ్రయించి అందు వ్రేలాడు చుండును.
(పంచమ స్కంధము లోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
అట్టి పూజ్యుడైన ఆ కపిలభగవానుడవు నీవేనా? లోకులయొక్క దీనదశను చూచి, అందుండి వారిని ఉద్ధరించి, నీ నిజరూపమును మరుగుపరచి, నీవు ఇట్లు సంచరించుచుంటివా? గృహాసక్తులైన మావంటి వివేకహీనులు యోగేశ్వరులయొక్క మహత్త్వమును ఎట్లు తెలిసికొనగలరు?
కర్మలను చేయుటవలన ఆత్మకు అనగా దేహమునకు కలుగుశ్రమను నేనును ఎరిగినవాడనే. కావున, పల్లకీ బరువునుమోయునప్పుడును, ఎగుడు దిగుడు మార్గములతో నడచునప్ఫుడును, నీవు శ్రమపడియుండవచ్చునని నేను తలంతును. వ్యవహారమార్గము గూడ మనకు ఎట్లు అనుభవమునకు వచ్చునో, అది అట్లే సత్యమేనని తోచుచున్నది. ఏలయన, కుండ మిథ్యయే యైనచో, వాటితో నీరు తెచ్చుట మొదలగు కార్యములు ఎట్లు సంభవములగును?
దేహహధర్మముల ప్రభావము ఆత్మపై ఉండదనుట సత్యదూరము. పొయ్యిపై బెట్టిన గిన్నె అగ్నిచే వేడిక్కినప్పుడు అందులోని నీరు గూడ వేడియగును. ఆ నీటి యందుంచబడిన బియ్యముగూడ ఉదుకును. అట్లేదేహమనెడు ఉపాధుల ధర్మమును అనుసరించి, దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సుల సమీపమున నుండుటచే ఆత్మకు కూడా వాటి ధర్మములైన శ్రమాదుల అనుభవము కలుగునుగదా!
వాస్తవముగా రాజు ప్రజలకు సేవకుడు. వారిని శాసించుటకును, పాలించుటకును అతడు నియక్తుడు. కావున, అతడు ఉన్మత్తులను దండించుట పిష్టపేషణము (వ్యర్థము) గాదు. స్వధర్మాచరణము భగవత్సేవయే. వాటిని (అధర్మములను) ఆచరించువ్యక్తిని పాపములు అంటవుగదా!
స్వామీ! నీవు దీనజన బాంధవుడవు, నేను రాజునను అభిమాన గర్వముతో సాధుపురుషుడవైన నిన్ను అవమానపరచితిని. నీ కృపా దృష్టిని నా పై ప్రసరింపజేయుము. దానివలన సత్పురుషుని అవమానించిన దోషమునుండి నేను ముక్తుడ నగుదును.
మహాత్మా! నీకు దేహాభిమానము లేదు. జగద్రక్షకుడైన శ్రీహరికి నీవు అనన్య భక్తుడవు. సుఖదుఃఖాది ద్వంద్వముల యెడ నీవు సమదృష్టి గలవాడవు. కనుక, మానావమానముల వలన నీలో ఎట్టి వికారములును కలుగవు. ఐనను, ఒక మహాపురుషుని అవమానపరచినవాడు. సాక్షాత్తుగ త్రిశూలపాణియైన మహాదేవునియంతటి ప్రభావ శాలియైనను తన అపరాధమునకు ఫలితముగా కొలది కాలములోనే తప్పక నశించును.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే దశమోఽధ్యాయః (10)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు పదియవ అధ్యాయము (10)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
కాని, తాను ఇట్లు మందలింఛిన పిమ్మటగూడ పల్లకి అట్లే ఎగుడు దిగుడుగా పోవుచుండుటను చూచి, మహారాజు మిగులక్రుద్ధుడై ఇట్లు పల్కెను- ఓరీ! ఇదియేమి? నీవు జీవచ్ఛవమువలె కనబడుచున్నావు. నా ఆజ్ఞని ఉల్లంఘించుచు నన్ను లక్ష్య పెట్టకున్నావు. పాపకర్మలను చేసినవారిని యమునివలె, పదే పదే తప్పు చేయుచున్న నీకు తగిన చికిత్స చేసెదను. అప్పుడు మాత్రమే నీవు సరియైన దారికి వత్తువు
రహూగణుడు తాను రాజునను గర్వముతో మిడిసిపడుచుండెను. తనను గొప్పపండితునిగ భావించుకొనుచు అబద్ధములను పలుకుచుండెను. అతడు రజస్తమోగుణములు గలిగి, గర్వోన్మత్తుడై యుండెను. ఆయనకు యోగీశ్వరుల యొక్క మహత్త్వము ఏ మాత్రమూ తెలియదు. అందువలన అతడు అవాకులను చవాకులను వాగుచు భాగవతోత్తముడైన జడభరతుని యెడ అమర్యాదగా ప్రవర్తించెను. బ్రాహ్మణోత్తముడైన భరతుడు బ్రహ్మజ్ఞాని, సకల ప్రాణులకును సుహృదుడు. అందరిని పరమాత్మ స్వరూపులనుగా భావించువాడు. అణుమాత్రము గర్వములేనివాడు. కావున అతడు రహూగణుని మాటలను పట్టించుకొనక దరహాసమొనర్చుచు ఆయనతో ఇట్లనెను-
బ్రాహ్మణ ఉవాచ
జడభరతుడిట్లనెను- రాజా! నీవు పలికిన మాటలు యదార్థములే. అట్లు పలుకుట అపహాస్యము కాదు. బరువును మోయునట్టిది దేహమేగాని నేను గాను. దారిలో ముందుకు సాగుచు వెళ్ళునదియు ఆ శరీరమేగాని, నేను కాను. బలిష్ఠముగనున్న ఈ శరీరము పంచభూతముల రాశియే కాని, నేనుగాను. ఆత్మయందు ఎట్టి వ్యవహారమునకు తావులేదు. కనుక, ఆత్మానాత్మ వివేకముగలవారు నీవలె మాట్లాడరు.
బలుపు, చిక్కిపోవుట, రోగముల పాలగుట, మనోవ్యాధికి గుఱి యగుట, ఆకలిదప్పులకు లోనగుట మొదలగునవి శరీరమునకు సంబంధించినవే. అంతేగాదు, భయము, కలహము, కోరికలు, ముసలితనము, నిద్ర, ప్రేమ, కోపము, అహంకారము, గర్వము, శోకము మున్నగునవి అన్నియును దేహాభిమానముగల జీవుని యందు ఉండును. కానీ, ఇవేవీ నాలో లేవు.
రాజా! ఆద్యంతములుగల అన్ని పదార్థములు జనన-మరణ ధర్మములకు లోబడినవే. కావున, ఇవన్నియు వికారలక్షణములను కలిగియున్నవి. ఈ నియమములను ప్రత్యక్షముగా చూచుచున్నాము. ఇట్టి ధర్మము దేహమునకే చెల్లును. కాని, నాలో లేవు. యశస్వీరాజా! స్వామి-సేవకభావము ఉన్నచోటనే ఆజ్ఞాపించుట, దానిని పాలించుట అనే నియమము ఉండుట ఉచితము కాని, ఈ నియమము నా యందు వర్తించదు.
నీవు రాజువు-నేను సేవకుడను అను భేదబుద్ధి లోకవ్యవహారదృష్టికి మాత్రమే. పారమార్థిక దృష్టిలో దీనికీ చోటు లేదు. రాజు ఎవరు? సేవకుడు ఎవరు? ఐనను నీకు రాజును అను అభిమానము ఉన్నచో, ఆజ్ఞాపింపుము. నేను నీకు ఏమి చేయవలెనో తెలుపుము.
(పంచమ స్కంధము లోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
రహూగణుడు తాను రాజునను గర్వముతో మిడిసిపడుచుండెను. తనను గొప్పపండితునిగ భావించుకొనుచు అబద్ధములను పలుకుచుండెను. అతడు రజస్తమోగుణములు గలిగి, గర్వోన్మత్తుడై యుండెను. ఆయనకు యోగీశ్వరుల యొక్క మహత్త్వము ఏ మాత్రమూ తెలియదు. అందువలన అతడు అవాకులను చవాకులను వాగుచు భాగవతోత్తముడైన జడభరతుని యెడ అమర్యాదగా ప్రవర్తించెను. బ్రాహ్మణోత్తముడైన భరతుడు బ్రహ్మజ్ఞాని, సకల ప్రాణులకును సుహృదుడు. అందరిని పరమాత్మ స్వరూపులనుగా భావించువాడు. అణుమాత్రము గర్వములేనివాడు. కావున అతడు రహూగణుని మాటలను పట్టించుకొనక దరహాసమొనర్చుచు ఆయనతో ఇట్లనెను-
బ్రాహ్మణ ఉవాచ
జడభరతుడిట్లనెను- రాజా! నీవు పలికిన మాటలు యదార్థములే. అట్లు పలుకుట అపహాస్యము కాదు. బరువును మోయునట్టిది దేహమేగాని నేను గాను. దారిలో ముందుకు సాగుచు వెళ్ళునదియు ఆ శరీరమేగాని, నేను కాను. బలిష్ఠముగనున్న ఈ శరీరము పంచభూతముల రాశియే కాని, నేనుగాను. ఆత్మయందు ఎట్టి వ్యవహారమునకు తావులేదు. కనుక, ఆత్మానాత్మ వివేకముగలవారు నీవలె మాట్లాడరు.
బలుపు, చిక్కిపోవుట, రోగముల పాలగుట, మనోవ్యాధికి గుఱి యగుట, ఆకలిదప్పులకు లోనగుట మొదలగునవి శరీరమునకు సంబంధించినవే. అంతేగాదు, భయము, కలహము, కోరికలు, ముసలితనము, నిద్ర, ప్రేమ, కోపము, అహంకారము, గర్వము, శోకము మున్నగునవి అన్నియును దేహాభిమానముగల జీవుని యందు ఉండును. కానీ, ఇవేవీ నాలో లేవు.
రాజా! ఆద్యంతములుగల అన్ని పదార్థములు జనన-మరణ ధర్మములకు లోబడినవే. కావున, ఇవన్నియు వికారలక్షణములను కలిగియున్నవి. ఈ నియమములను ప్రత్యక్షముగా చూచుచున్నాము. ఇట్టి ధర్మము దేహమునకే చెల్లును. కాని, నాలో లేవు. యశస్వీరాజా! స్వామి-సేవకభావము ఉన్నచోటనే ఆజ్ఞాపించుట, దానిని పాలించుట అనే నియమము ఉండుట ఉచితము కాని, ఈ నియమము నా యందు వర్తించదు.
నీవు రాజువు-నేను సేవకుడను అను భేదబుద్ధి లోకవ్యవహారదృష్టికి మాత్రమే. పారమార్థిక దృష్టిలో దీనికీ చోటు లేదు. రాజు ఎవరు? సేవకుడు ఎవరు? ఐనను నీకు రాజును అను అభిమానము ఉన్నచో, ఆజ్ఞాపింపుము. నేను నీకు ఏమి చేయవలెనో తెలుపుము.
(పంచమ స్కంధము లోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
Comments
Post a Comment