శ్రీ యోగ వాసిష్ఠ సారము --2

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  294  🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 90 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 146. కుశద్వీప భూపాల ప్రశ్నలు - 4 🌻

స్వప్న నగరము జాగ్రత్తునందు ఎట్లు లేనిదగునో అట్లే ఈ దృశ్య జగత్తు, ఆత్మజ్ఞానముచే లేనిదే అగుచున్నది.

ముత్యపుచిప్పలో వెండిలేకున్నను ఉన్నట్లు తోచుచున్నది. అట్లే ఈ దృశ్య జగత్తు లేకున్నను ఉన్నట్లే తోచుచున్నది. ఆకాశమున తెలుపు, నలుపు వర్ణములవలె ఈ దృశ్య, స్మరణ, సృష్టి, ప్రళయములు ఈ చిదాకాశ స్వరూపములే అగును.

ఈ జగత్తు సంకల్పానుసారమే కనిపించుచున్నది. తదితరులకు కాదు. జ్ఞానికి బ్రహ్మము సర్వరూపమై, సదా, సర్వదా, సర్వత్రా వెలయుచున్నదగును. అజ్ఞానికి సర్వదా ఎన్నడును, ఎచటను లేనిదేయగును.

ఏకమై ఇచ్ఛమైన పరమాత్మ లేని పదార్ధము, బాహ్యాభ్యంతరమునందును, ఆది మధ్యాంతరములందును, కాలత్రయమందును ఎద్దియును లేదు. ఈ విధముగ పటము, నేత్రము, పర్వతము, మనుజుడు ఇత్యాది సమస్త పదార్ధములును ఈశ్వరుడైయున్నవి.

తదుపరి వాల్మికి మహర్షి భరద్వాజునితో నిట్లనియె.

ఓ భరద్వాజా, యధాప్రకారముగ అనేక యుపాఖ్యానములద్వారా వృద్ధి పొందింపబడినదియు, అనేక దృష్టాంతములతోను,యుక్తులతోను గూడియున్నదియగు, ఈబ్రహ్మతత్వ ప్రతిపాదకమగు మోక్షోపాయమును, నిర్మలశాస్త్రమును, నీ యొక్క బోధకొరకై నేను చెప్పితిని.

దీనిని విని జీవించియున్నను, విముక్తభావముతో గూడుకొని యున్నవాడవై, లోకానుగ్రహము కొఱకై, జ్ఞాన తపఃక్రియ ఫలయుక్తమైనదియును, ప్రారబ్ధభోగ సత్కర్మ ఫలభూతమైనదియు చిరస్థాయిగ యోగజ్ఞాన సిద్థైశ్వర్య లక్ష్మిని అనుభవించి, పిమ్మట దేహసహితుడవై యున్నప్పటికిని, దేహరహితుడవై యున్నను, శాశ్వతమై ప్రశాంతమై నిరతిశయానందరూపమైనట్టి ముక్తిని పూర్ణముగ సంప్రాప్తినొందుము అని పల్కెను.

శ్రీ వాల్మికి:- అరిష్టనేమి రాజా| ఈ ప్రకారముగ వసిష్ఠ మునీంద్రుడు, శ్రీరామచంద్రునకు; అగష్త్య మునీంద్రుడు సుతీష్ణునకు ఉపదేశించినట్టి ఈ మోక్షోపాయమను సుభాషితమును నేను నీకు చెప్పితిని.

తత్వమార్గము బోధించునట్టి ఈ గ్రంధముద్వారా నీవు తప్పక బ్రహ్మపధమును పొందగలవు.

అరిష్టనేమి రాజు:- మహాత్మ| తమ కృపా కటాక్షమే సంసారబంధమును నశింపజేయునదై యున్నది.

నేను సంసార సముద్రమును దాటగల్గితిని. అరిష్టనేమి రాజు దేవదూతకు, అప్సరకు, అగ్నివేశ్యునకు, అతని కుమారులు కారుణుడు; అగష్త్యుడు, సుతీష్ణునకు చెప్పగ; సుతీష్ణుడు అగష్త్యునుద్ధేశించి ఇట్లనియె.

గురుదేవా నాయొక్క అజ్ఞానము సంసారసహితముగ నశించినది. ఆత్మజ్ఞానము పొందితిని. సర్వసాక్షియు, స్వయంజ్యోతియు, నిశ్చలమై, నిష్క్రియమైనట్టి పరమాత్మస్థితి నొందియుండ,దానిచే ప్రకాశింపబడిన, చిత్త దేహాదులు, సమస్త లౌకిక వైదిక క్రియలు, ప్రవర్తించుచున్నవి.

మహాత్మ| తమ అనుగ్రహముచే నేనిపుడు జ్ఞేయమగు ఆత్మనెరిగినవాడనై యున్నాను. నేను కృతార్ధుడనైతిని. నీకివే నా సాష్టాంగ నమస్కారములు, ఆత్మనివేదనలు.

అట్లే బ్రహ్మానందరూపుడు,జ్ఞానరూపుడును, సర్వవ్యాపకుడును, అద్వైతరూపుడును, నిత్యుడును,సంసారమలరహితుడు, నిశ్చలుడు, సమస్త ప్రాణుల సాక్షీభూతుడు, త్రిగుణరహితుడునగు వసిష్ఠ మునీంద్రునకు (బ్రహ్మస్వరూపము) మేమందరమును నమస్కరించుచున్నాము.

ఓంతత్‌సత్

సశేషం....

శ్రీ యోగ వాసిష్ఠ సారము -  293  🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 89 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 146. కుశద్వీప భూపాల ప్రశ్నలు - 3 🌻

స్వప్న సంకల్ప లోకములేనట్లే, అహర్నిశము భావించుచున్నచో అట్టివే సిద్ధలోకములు. యోగధారణచేసి స్థితి యొనర్చబడిన ధ్యానముద్వారా, స్వ సంకల్ప ప్రాప్తములగు లోకములను స్థిరముగ జేయునో, నపుడవియును స్థిరత్వము పొందును.

కాని పూర్వ పుణ్యసంపత్తిచే, ఆయాలోకములు అనాయాసముగ స్థిరత్వము చేయబడినవి. ఇతరులు ధారణద్వారా వాటిని పొందగలరు. ఏ నిశ్చయము,సంకల్పము లేని మనుజునకు; కలదు లేదు అనునదిగాని, కర్త విషయత్వముగాని ఉండవు. ఈ సమస్తము చిదాకాశమే యైయున్నది.

బ్రహ్మముయొక్క అహంభావకల్పనయై,బ్రహ్మదేవుడు,త్త్రైలోక్యమాతని సంకల్పముచే పరిపూర్ణమై యొప్పుచున్నది. కావున జగత్తు బ్రహ్మమే యగును. బ్రహ్మముయొక్క సంకల్పమాత్రమే ఈ సమస్తమును అయిఉన్నది. వాస్తవముగ బ్రహ్మదేవుడుగాని ఈ జగత్తుగాని యొకింతయైనను, జనింపకయున్నది. వాయు చలనమును, అగ్నియుష్ణమును,పూర్ణచంద్రుడు శీతలత్వమును ప్రకాశింపజేయునట్లు బ్రహ్మమును స్వయముగ పదార్ధసత్తను స్ఫురింపజేయుచున్నది. బ్రహ్మము సర్వస్వరూపమైయున్నది. కాన అద్దానియందే జీవుడైన ఒకింత ప్రకాశింపజేయుచు,అది బ్రహ్మమే. ఆ జీవరూపముచే ప్రకాశింపజేయునదగును. ఓ రామచంద్రా| ఆకాశమునుండి వృక్ష పర్వతాదులెన్నడును జనింపనట్లు,బ్రహ్మమునుండి ఈ జగత్తు ఎన్నడును జనించుటలేదని ఎఱిగి పరమశాంతిని పొందుము. జ్ఞానమావిర్భవించిన తదుపరి,నీకు శాస్త్రాదులుగాని,శబ్ధబుద్ధిగాని,అహంకారముగాని,తస్సంకల్పముల జగత్తుగాని , బ్రహ్మదేవునిగూర్చిన ఖేదబుద్ధిగాని నిజస్వరూపమున నుండనేరవు. ఓ రామచంద్రా| శాంతమై జన్మరహితమై,ఏకమై,ఆది మధ్యాంతశూన్యమై, జీవజగద్భావ వర్జితమైనట్టి బ్రహ్మమే, జీవాదికల్పనను భావించి,నిరావరణములు జీవసాక్షిరూపమైన, చిదాకాశముననే, అట్టివిశాలమైన యాదృశ్యమును గాంచుచున్నది. ఆత్మ జ్ఞానము కలుగనంతవరకును, అవ్విధమున నది తన చిత్‌స్వరూపమును,మరియొకదానివలె జూచుచున్నది.

పూర్వకల్పమున,వసిష్ఠుడు గురువుగను,శ్రీరాముడు శిష్యుడుగను జరిగిన చర్చ ఇచట మరల జరుగుచున్నది. ప్రశ్న:- మహాకల్పమున నేది నశించును? నేది నశించకుండును? గురువు:- సుషుప్తిని పొందినపుడు,స్వప్నపురమెట్లు పూర్ణముగ నశించునో, మరియు ఆత్మమాత్రమే శేషించునో,అట్లే మహాప్రళయమున ఈ దృశ్యమంతయు శీఘ్రముగ నశించును. అపుడు పర్వతములు,దశ దిశలు, క్రియలు,కాలక్రమము సమస్తము పూర్ణముగ నశించును. సమస్త భూతములు,జగత్తులు,బ్రహ్మ,విష్ణు,రుద్రాదులు అన్నియు నశించి కేవలము చిదాకాశమే శేషించుచున్నది. ఆ సత్య పదార్ధములకు ఉనికిలేదు. అపుడు జగత్తు ఎచటికేగుచున్నదనగ| ఈ మీయీజగత్తు వాస్తవముగ లేనిదగుటచే,యున్నటువంటి బ్రహ్మమే మిగులుచున్నది. జాగ్రత్‌నందు స్వప్నమును, స్వప్నమునందు జాగ్రత్తును ఎట్లు లేనివో,అట్లే ఈ దృశ్యమంతయు ఆత్మజ్ఞానముచే శమించిపోవుచున్నది.

సశేషం
....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  292  🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 88 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 146. కుశద్వీప భూపాల ప్రశ్నలు - 2 🌻

ఒక మనుజుని గూర్చి యాతని మిత్రుడు''జీవింపవలయునని''; శత్రువు''మరణించవలెనని'' కోరినపుడు, కోరినవారిరువురు మరణించిన, ఆ విరుద్ధ స్వభావయుక్తమగు కార్యములెట్లు సంభవింపగలవు.

 మహాపాపియైనను, శ్రద్ధాళువై ప్రయాగ, కాశీలందు మరణించిన, మహాపాతకములు నశింప, చైతన్యమతని పుణ్యమువలన పాపముల ఒక భాగమును గాని లేక సమస్తముగాని వినాశన మొనర్చి, స్వయముగ తానును ఉపశమించును.

ఈ చిద్వస్తువగు బ్రహ్మమే హిరణ్యగర్భాది సమిష్టి జీవులుగను,వ్యష్టిజీవులుగను చెప్పబడుచున్నవి. అవి ఎచట ఎట్లు సంకల్పించెనో అట్లే స్థితికల్గియుండును. దాని సంకల్పమే ఈ జగత్తు.

మనుజుని కెపుడు, అత్యధికములైన పుణ్యములుగాని, పాపములుగాని యుండునో అపుడాతడు ఆ పుణ్యపాపములవలన, సంక్షుబ్ధులైన మహాత్ములచే, నిగ్రహ అనుగ్రహ దృష్టులచే, జూడబడు ఆ మహాత్ములకు గానుపించునట్టియును, తదితరులకు కానిపించనట్టియునునగు తత్ఫలములైన శరీరాదులు చైతన్యముయొక్క కల్పనావశముచే,నాతనికపుడు కల్గును.

ఆతని బంధువులు,మృత్యురహితునిగ గాంచినను, వారికి ఆలక్ష్యమైనట్టి దేహముచే,నాతడు మరణము ననుభవించుచున్నాడు.

ఇట్లు అతడేక కాలమున, జీవితమును మరణమును కూడ బొందుచున్నాడు. సంకల్ప,స్వప్న నగరములందే భ్రాంతి ఎట్లు అనుభవింపబడుచున్నదో, దానికంటే ఎంతో అధికమైనట్టి భ్రాంతియే, ఆ జగద్రూప స్వప్నమందును అనుభవించబడుచున్నది.

స్వప్న సంకల్ప పురములందెట్లు ఒకే చైతన్యము లక్షల కొలది రూపములు ధరించుచున్నదో, అట్లే ఈ జగత్తనుస్వప్నమందు ననుభవించబడుచున్నది. స్వప్న సంకల్ప పురమునందెట్లు, ఒకే చైతన్యము లక్షలకొలది రూపములను ధరించుచున్నదో, అట్లే ఈ జాగ్రత్తను స్వప్నమందును ఒకే చైతన్యము, గొప్ప సేన రూపమును ధరించుచున్నది.

అనేక రూపములతోగూడిన యా స్వప్న సేనయే,తిరిగి సుషుప్తియందు ఏకరూపమగు చున్నది. దేవతలు వారి భోగ్యవస్తువులను శాస్త్రములద్వారా ఎరిగి,తదనుసారము సంకల్పముగలిగి అమృతమును, సరోవరములను,పర్వత వనవాహికలను, అప్సరసలను పొందుచున్నారు.

ఓ రామా| నీయొక్క సంకల్పనగరమున అసంభవమైన దేదియును ఎట్లు లేదో,అట్లే బ్రహ్మముయొక్క సంకల్ప నగరమగు ఈ జగత్తుయొక్క సమస్త పదార్ధములందును అనుభవమైనదేదియు లేదు.

ఆకాశమున చంద్రబింబమును తానే అని అహంభావముతో ధ్యానించువారు, అట్టి చిరకాలాభ్యాసముచే,ఇతర భావములు మరచుటవలన, చంద్రుని రూపమును తప్పక బొందుదురు. కాని వారు ఆకాశముగాని,ఈ చంద్రునిగాని బొందుటలేదు. ఏలయనిన ఒకని సంకల్పరూపమును మరొకడు పొందడు.

సంకల్ప పదార్ధముల ప్రాప్తియు, సంకల్పించు జీవునియందే కలదుగాని ఇతరునియందు కాదు. కావున తమ తమ సంకల్ప సృష్టియందలి, యాకాశముననే,వారందరు వేర్వేరుగ స్థితి నొందియున్నారు. ఏలన మనుజుడు స్వభావము నేరీతిగ దృఢసంకల్పముతో ధ్యానించునో ఆ స్వరూపమును వారారీతిగనే పొంది అతని సాక్షి, సంవిత్తుల ననుభవించును.

ఓ రాజా| ఏదేహమును నీవు చూచుచున్నావో, అది స్వప్న దేహమువలె చిద్రూపబ్రహ్మమే యైయున్నది. వాస్తవముగ స్వప్నము స్వప్నముకాదు, బ్రహ్మమే అగును. ఎపుడంతట బ్రహ్మమేయైయున్నదో,అపుడిక దేహమేల. స్వప్నమను మిధ్యారూప భ్రమచే జ్ఞాని,అజ్ఞానికి బోధించుచున్నాడు.

జ్ఞానప్రాప్తికి పూర్వము ఈ బ్రహ్మముగనే ఎఱుంగబడిన ఈ జగత్తే,జ్ఞానముచే విలీనమైపోయి బ్రహ్మరూపత్వము పొందుచున్నది. ఇతర పదార్ధములన్నింటిని త్యజించి,బ్రహ్మమునే తదేక నిష్టతో చిరకాలము భావించుటచే,ఆబ్రహ్మము తప్పక పొందబడుచున్నది.

అట్లే లౌకిక పదార్ధములైనను, అనన్యభావముచే తప్పక లభించుచున్నవికదా| కాని లౌకిక పదార్ధములు అసత్యములు.బ్రహ్మము సత్యమునైయున్నది.

సిద్ధ సాద్యాది లోకములను దర్శించుట కుపాయమును చెప్పబడినది. మరల జగత్తంతయు బ్రహ్మమేయని స్పష్టముగా వర్ణించబడుచున్నది. సిద్ధ, సాద్య, యమ, బ్రహ్మలోకములను అందలి మహాత్ములను దర్శించవలెనన్న,ప్రతిరాత్రి పగలు ముందు వెనుక చూడదలచిన, చూడాలోపాఖ్యానములో వచించిన ధారణావిశేషములచే చూడగలవు లేకున్న చూడనేరవు. ఈ సిద్ధాదిలోకములు రెండు విధములు.

దూరస్ధలోకములు, సంకల్ప లోకములు. ఈ రెంటిచేతను,ఈ బ్రహ్మాండమంతయును వ్యాప్తమైయున్నది. వాటిని దర్శించవలెనన్న, ధారణాభ్యాసమవసరము. ఇవియును కల్పనామయములే,కల్పనామయమైనను వాయువెట్లు సర్వత్రా పరిభ్రమించుచున్నదో, అట్లే వారి లోకములును పరిభ్రమించుచున్నవి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము -  291  🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 87 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 146. కుశద్వీప భూపాల ప్రశ్నలు - 1 🌻

బ్రహ్మమే సత్యము, జగత్తులేదు. అను నిశ్చయమునకు కారణమైన కుశద్వీప భూపాల ప్రోక్తమగు ప్రశ్నలు ఇట తెలుపబడుచున్నవి.

ఓ రామచంద్రా| ఈ భూమిపై కుశద్వీపమొకటి కలదు. అందు''జల''యను పట్టణము కలదు. అందు ప్రజ్ఞప్తియను రాజు,స్వర్గమం దింద్రునివలె నుండెను. ఒకప్పుడు నేను ఆకాశమునుండి ఆ రాజు సమీపమునకు చేరితిని. ఆ రాజు నన్ను పూజించి ఇట్లడిగెను.

ప్రళయ కాలమున, సర్వనాశము సంభవింప, ఎల్లెడల శూన్యత్వము వ్యాపింప, చిదాకాశము శేషించియుండ,మరల సృష్ట్యారంభమునకు కారణమేమి? ఈ జగత్తుయొక్క వాస్తవమేమి, లోకములకు కర్త ఎవరు,బీజములేనందున శరీరాదులకు కారణమేమి, చిదాకాశమొకటే యైనను భిన్న భిన్న బీజములెట్లు నుత్పన్నమగుచున్నవి. మిత్రుడు, శత్రువు అను భేదములెట్లు ఏర్పడినవి.

ఒక స్త్రీని పొందుటకై, లక్షల కొలది పురుషులేక కాలమున ధ్యానించుచో, తత్ఫలము వారికి సంప్రాప్తింప, భిన్న భిన్న గృహములందామె ఒకే కాలమున నెట్లు వర్తింపగలదు. ఈ ప్రకారమున అసమంజసములైన విషయములెట్లు సమంజసమగుచున్నవి?

ఈ సందేహములన్నియు తీర్చవలసినదని కోరగ వసిష్ఠుడిట్లు పలికెను. ఓ రామా| చైతన్యముయొక్క అనుభవసారము,ఈ జగత్తునందలి పదార్ధములన్నియు సదా సద్రూపములును, అసద్రూపములును నైయున్నవి.

దేనిని గూర్చి సంవిత్తు''అది కలదు'' అను భావము కలిగియున్నదో, అది సద్రూపమును; ''ఇది లేదు'' అను భావలముచే అసద్రూపమును నైయున్నది. అలానే వర్ణములు,భావనలు, దేహములు, వ్యక్తమగుచున్నవి. అజ్ఞానులు దేహము తానే అనియు, జ్ఞానులు బ్రహ్మము తాను అనియు భావించుచుండగ, అట్లే అగుచున్నది. కావున బ్రహ్మమే ఈ జగత్‌ రూపమున భాసించుచున్నది.

హిరణ్యగర్భుడగు బ్రహ్మముయొక్క సంకల్పనగరమై వ్యాపించియున్న జగత్తు, నీ యొక్క స్వప్న పురమువలె భాసించుచున్నది. నీ యొక్క స్వప్న నగరము, బ్రహ్మయొక్క స్వప్ననగరము అంతయు నిరంతరము చిన్మాత్రయే యగుచున్నది. స్వప్నమందు ఛేతనత్వ భ్రాంతి లేనట్లే, శవాది జఢ వస్తువులందును, ఛేతనత్వము లేదు. బ్రహ్మము స్వయముగనే బ్రహ్మదేవుని రూపముగ భాసించెను.

పిదప చిదాకాశరూపుడగు యా బ్రహ్మదేవుడు స్వతః తన సంకల్ప నగరమును జగత్తుగ నెరిగెను. ఇట్లే జగత్తు వాస్తవముగ చిదాకాశమే యైయున్నది. నేను మరణించితిని, మరల యమలోకమున నరకవాసిగ జన్మించితిని. ఇచట శుభాశుభముల ననుభవించుచున్నాను. ఇట్టి మహాభ్రాంతిని మరణించిన జీవుడు పొందుచున్నాడు.

ఓ రాజా| నీ ఈ సంకల్ప నగరమున ప్రజలు నీయొక్క సంకల్పాను సారముగ ఎట్లుందురో, అట్లే బ్రహ్మముయొక్క సంకల్ప నగరమగు ఈ జగత్తునందును,ప్రజలు బ్రహ్మముయొక్క సంకల్పానుసారముగనే స్ధితిపొంది యుందురు.

ఓ రాజా| నీవు స్వతః సంకల్ప పురమును సృష్టించి మరల తక్షణమే యద్దానిని ప్రళయమును సంకల్పించి ఎట్లు నశింపజేయుచున్నావో, అది నీయొక్క స్వభావము ననుసరించి యున్నదో, అట్లే ఈ చిదాకాశము, సంకల్ప నగర యుత్పత్తి వినాశములు సంభవించుచున్నవి. వాస్తవముగ ఆత్మకు జనన మరణాదులు లేవు. అది ఎన్నడును ఉదయింపదు. అస్తమించదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ యోగ వాసిష్ఠ సారము -  290  🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 86 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 145. దారు(కాష్ట)వైవధికాఖ్యానము  - 4  🌻

చంద్రుని ప్రకాశముచే కలువలు వికసించినట్లు,బ్రహ్మప్రకాశముచే విస్తారమును పొందినవియు, పరమామృతమువలె శీతలమగు తమ వచనములచే మేము వికసింప జేయబడితిమి.

ఇట్లు ఆకాశచారు, పృధివీచారులు, మునీశ్వరులు, సిద్ధులు, దేవతలు బ్రాహ్మణులు రాజులు తమతమ సామర్ధ్యముల ననుసరించి పుష్పార్ఘ్య ప్రధానముతోడ, ఉన్నత స్వరముచే వసిష్ఠ మునీంద్రుని పూజించి, పరస్పరము ఒకినొకరు పూజించుకొనిరి. అంత వసిష్ఠుడు శ్రీరామునుద్ధేశించి, ఓ రామా| నీవిపుడెట్టి స్థితిని పొందితివి. ఈ జగత్తు యొక్క అభాసను గూర్చి తెలిసినది కదా| అని అడుగగా, శ్రీరాముడిట్లు పలికెను.

మహాత్మ| సంసారప్రధమగు భ్రాంతులన్నియు తొలగినవి. నిర్మలమగు ఆత్మతత్వముతో నేనిపుడు ఆకాశమువలె స్వచ్ఛముగా వెలయుచున్నాను. అగ్ని సువర్ణముయొక్క మాలిన్యమును తొలగించునట్లు తాము అజ్ఞానమును సంపూర్ణముగ తొలగించి వైచిరి. పూర్వము దేహమే ఆత్మగ భావించగ,ఇపుడు సమస్త ప్రపంచమును ఆత్మగా గాంచువారమై యున్నాము. ఇపుడు నేను సర్వత్రా, సర్వధా, పరిపూర్ణుడనై, ఆత్మస్వరూపమున మేల్కొనియున్నాను.

కావున అట్టి పరమాత్మ స్వరూపుడనగు నాకు నమస్కారము.
నా హృదయగ్రంధులన్నియు నశించినవి. నేనిపుడు సర్వ విశేషణ రహితడనైయున్నాను.మరియు నిర్మలమగు బ్రహ్మమయ జగత్తునందు, నిర్మలబ్రహ్మరూపమగు బుద్ధిగలనేను స్ధితిపొందియున్నాను.

పరమశాంతిని తృప్తిని పొంది, విషయస్మరణము విషయభోగములందలి అభిలాషయు నశించి, సంకల్పములను త్యజించి,ప్రశాంతముగనున్నాను. నేను జగత్తును, ఆకాశముకంటే నిర్మలమైన చిదాకాశ మాత్రముగనే గాంచుచున్నాను. అంత వసిష్ఠుడిట్లు పలికెను. సౌభాగ్య వశమున నీవిపుడు ఆత్మవేత్తవు; భూత భవిష్యత్‌ వర్తమాన రఘు కులసంతతిని బోధచే పవిత్రమొనర్చినవాడవైతివి.

ఓ రాఘవా| ఇక నీవిపుడు మునిశ్రేష్ఠుడవు విశ్వామిత్రునియొక్క(యజ్ఞవిఘ్న)కోర్కెను పూర్ణమొనర్చి, తండ్రియాజ్ఞచే రాక్షసవధాది కార్యముల గావించి, యాతనితో సహా భూమండలమును పాలింపుము.
తదుపరి మరుసటి దినమున సభప్రారంభముకాగ దశరధుడు, వసిష్ఠుడు,సుమాలి ఇత్యాది మంత్రులతో కూడ సభలో శ్రీరాముడిట్లు పల్కెను. ఓ మహాత్మ| నాకింకను వినదగినదిగాని,ఎరుగదగినదిగాని ఏదైన ఉన్నచో, దానినంతయును వచింప వేడెదను అని వసిష్ఠునితో పల్కగ అంత వసిష్ఠుడిట్లు చెప్పెను.

ఓ రామా| నీవిపుడు పొందవలసినదంతయు పొందితివి. నీవే స్వబుద్ధిచే విచారించి,నీ అంతఃకరణమున నీవెట్టివాడవైయున్నావో, వినదగినది, శేషించినదేదైనాయున్నచో వచింపుము. అంత శ్రీరాముడిట్లు పలికినాడు. నేను పొందవలసిన బ్రహ్మవస్తువును పొందితిని. జగత్తుయొక్క బ్రహ్మైక్యమును ఎరిగితిని. ద్వైతము నశించినది. సంసారమందలి సత్యత్వబుద్ధిని విడనాడితిని అని పల్కెను.

అంతట సభాసదులు దశరధునిచే వీడ్కోలు పొంది వారి వారి పనులందు నిమగ్నులైరి. ఈ జగత్తు స్థితి, స్వప్నమువలె వివర్త మాత్రరూపమై ఎపుడును నుద్భంవించకయు,స్థితినొందకయు,నశింపకయునున్నది. చిన్మాత్రముగ కేవలము వెలయుచున్నది. తదుసరి సభలో శ్రీరాముడిట్లు పల్కెను.

మహాత్మ| దేహరహితమైన చిన్మాత్రను జాగ్రత్‌,స్వప్నములందు దేహయుక్తముగ ఎట్లగుచున్నవి. అందుకు వసిష్ఠుడిట్లు పల్కెను. దృశ్యము జాగ్రత్‌,స్వప్నములందు కారణరహితమై ఉత్పన్నమగుచున్నది. అది శూన్యమే ఆధారముగ నున్నది.

ఆ శూన్యమునకు పరబ్రహ్మమే ఆధారము. సమస్త కారణములకు, కారణములేకపోవుటచే, పంచభూతములెవ్వియును సంభవింపనేరవు. పృధ్వాదులు లేనపుడు దేహమును పంచభూతములు లేవు. మాయచే చిదాకాశమే అట్లు భాసించుచున్నది.

చిదాకాశమున, సూక్ష్మరూపము స్వప్నమని స్థూలరూపము జాగ్రత్తని చెప్పబడినప్పటికిని వాస్తవముగ ఆ రెండును నిర్మల చిదాకాశములే. వాయురూప చలనము వాయువేయైనట్లు,బ్రహ్మమునందు జగత్తు బ్రహ్మముగనే యున్నది.

సశేషం
....
🌹 🌹 🌹 🌹 🌹

289 🌻. 145. దారు(కాష్ట)వైవధికాఖ్యానము  - 3  🌻

కొందరు నిర్జన ప్రదేశములందు, ధ్యానులుగను, కొందరు తీర్ధ,పుణ్యాశ్రమములందు వచించుచున్నారు. కొందరు ఒకేచోటనుండక, ఎప్పటికపుడు వేరొకప్రదశమునకు మారుచున్నారు. కొందరు కాశీ,శ్రీశైలము మున్నగు పుణ్యప్రదేశములందు వసించుచున్నారు.

సంగరహితుడై, నిత్య శుభకర్మలు ఆచరించుచు, అశుభకార్యములను పరిహరించుచున్నప్పటికి అసంగచిత్తుడై మరల సంసారమును పొందకుండును.

నిర్మలత్వము నొందిన యా చిత్తమిపుడు ఆత్మ దర్శన మాత్రముచే తత్వమెరిగినదై, ద్వంద్వరహితమై, అనాసక్తమై, నిర్వికార బ్రహ్మమే అగుచున్నది.

నిర్వాణవాక్యములు గూర్చిన సందర్భము పరిసమాప్తికాగ వసిష్టుడు మౌనము వహించియుండ, సభాసదులందరు ముని వాక్య శ్రవణమువలన నిర్వికల్ప సమాధినొందగ, సమస్థితిని పొందిరి.

సిద్ధులు, సనక సనందనాదులు స్తుతివాక్యములు పల్కుచుండగ విశ్వామిత్రాదుల ప్రశంసలతో, సభనిండియుండ, దేవదుందుభులు మ్రోగగా, పుష్ప వర్షము కురిసినది. ఆ పుష్పవృష్టి, దేవదుందుభులు, సిద్ధుల స్తుతివాక్యములతో సభ మిగుల శోభను పొందెను. పుష్పవర్షము క్షణములో నుపశమింప సిద్ధులవాక్యములిట్లు వినిపించినవి.

కల్పాంతము నుండి మోక్షోపాయమును గూర్చి,అనేక గ్రంధములు, వ్యాఖ్యానములు గావింపబడినను, ఈ యోగవాసిష్టమువంటి గ్రంధమును, మేమెన్నడును కనీ వినీ ఎరుగము. ఈ గ్రంధ శ్రవణము వలన, పశుపశ్వాదులు, స్త్రీలు, బాలురు, నాగులు కూడ పరమ శాంతుని పొందిరి.

జనులందరు నపుడు తత్కాలోచితమగు ప్రసంశా వాక్యములతోగూడ, వసిష్ట మునీంద్రుని పూజింపదొడగిరి. జనులు తమ దోసిళ్ళయందు పుష్పగుచ్చములు గ్రహించి ప్రణామపూర్వకముగ నపుడు వసిష్ఠ మునీంద్రుని పూజించిరి. తదుపరి దశరధమహారాజు వసిష్ఠుని పూజించుచు నిట్లు పల్కెను.

''అరుందతీ నాధుడగు ఓ వసిష్ఠ మునీంద్రా, తమ ఈ దివ్యోపదేశములతో లభించిన బోధవలన, వృద్ధి క్షయ రహితమై, నిర్వికారమై, ఆత్మవస్తువు యొక్క ప్రాప్తిచే అంతఃకరణము సర్వోత్కృష్టమైన పూర్ణత్వముదయించినది. మీకు మేమొసగు వస్తువు ముల్లోకములందును లభించదు. అందువలన నా సమస్త రాజ్యమును తమకర్పించి, తమ్ములను పూజించుచున్నాను.

కావున రాజ్యప్రభువులైన మీరెట్లు ఆదేశించిన అట్లు నడుచుకొనువాడను. అనగా వసిష్ఠుడు, తానొసగిన ప్రణామము నాకు సంతృప్తినొసగినది. రాజ్యమును క్షత్రియులే పాలింతురు కావున ఈ రాజ్యము మీకే శోభించును. అంతట రాచంద్రుడు గురుచరణములపై పుష్పాంజటిని సమర్పించుచు వినమృడై తన గురువగు వసిష్ఠునితో నిట్లనియె.

మీరు ప్రణామ మాత్ర సంతుష్టులగుటచే, ఇవే నాప్రణామములు స్వీకరించుడని అతని చరణారవిందములకు నమస్కరించి పుష్పాంజలి విడిచెను. అనంతరము లక్ష్మణుడు, శతృజ్ఞుడు తదితరులందరును, ఋషిని పూజించిరి. అంతసభ్యులిట్లు ప్రసంగించిరి.

సువర్ణము యొక్క మాలిన్యము అగ్నిచే నశింపజేయబడునట్లు అనేక జన్మరూప దోషములతో గూడిన మాయొక్క మాలిన్యములు తమచే నిచట నశింపజేయబడినవి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

286 🌻. 143. ఐందవోపాఖ్యానము - 6 🌻

అజ్ఞానముచే బ్రహ్మమే జగత్తుగ భాసించుచున్నదనియు, జ్ఞానముచే కేవలము నిర్వాణమగు బ్రహ్మమే మిగులుచున్నదనియు చెప్పబడినది.

స్వప్నాదులందు,ఒకే చైతన్యము ద్రష్ట,దృశ్యాది, త్రిపుటి రూపముగ ఎట్లు ప్రకాశించుచున్నదో, అట్లే జగత్తునందును ఒకే చైతన్యము దృశ్యాది రూపముధరించి, ప్రకాశించుచున్నది. ఈ జగత్తు అజ్ఞానులకే ఆశ్చర్యముగ భాసించునుగాని జ్ఞానులకుకాదు. జ్ఞానులకిది ,బ్రహ్మరూపముగనే భాసించును.

కావున ఓ రామచంద్రా| తత్వానుసంధానోపాయముచే, ఆత్మతత్వమునెరిగి క్రమముగ నది స్వానుభూతయుక్తముగ దృఢపడునంతవరకు, వికల్పరహితుడవై, ఇంద్రియవ్యాపార నిరోధముద్వారా శిలవలె మౌనముధరించి, నిర్వికల్ప సమాధియందు స్థితినొందియుండవలెను. అపుడు విషయసుఖము నశించును.

ఆత్మతత్వము బాగుగ నెరుగబడ, ఈ జగత్‌భ్రాంతి యొకింతయైనను పూర్వముండి యుండలేదనియు, ఇపుడు లేదనియు,ముందు నుండబోదనియు తెలియును. ఈ జగత్తంతయు శాంతమై నిరాలంబమై, విజ్ఞానఘనమై, అనంతమై, కల్పనారహితమై, రాగవర్జితమై,కేవలము బ్రహ్మముగనే స్థితిపొందినది.

నేను స్వర్గమందుగాని, నరకమందుగాని యున్నాను అని భ్రాంతి ఏదికలదో అదియే మనుజునకు నరక బంధమైయున్నది.

విచారింపని కారణముచే, భ్రాంతియొక్క అనుభవమేదికలదో,అది స్వప్నమందలి స్వ మరణమువలె మిధ్యయై యున్నది. ఏలన విచారణచే అది నశించుచున్నది. ఈ జగత్తుయొక్క మూలము జ్ఞానమే యైయున్నది. అది అనుభవము వలన భ్రమ రూపమై యొప్పుచున్నది.

సముద్రమందు జలపరమాణువుయొక్క రసమువలె సర్వత్రా వెలయునదే, సర్వవ్యాపకమై నిత్యమైనట్టి చిద్ఘన పరమాత్మయందు వర్తించు సృష్టి పరంపరలను లెక్కింప నెవరితరము.

మోహనిద్రనుండి మేల్కొనిన చిదాత్మగలవాడను, ధ్యానస్ధుడను కేవల చిత్‌స్వభావమున వర్తించువాడును అగు మహాత్ముడు ఒకింతయైనను దేనిని గ్రహంపడు. నిర్మాణరూపమై, తృష్టారహితమై, స్వచ్ఛమై, శీతలమై (సుఖస్వరూపము)పరమ ప్రేమాస్పదమైనట్టి ఆత్మబోధ సత్తకొరకై బ్రహ్మవిష్ణుమహేశ్వరులు కూడ సదా వాంఛించుచుందురు.

స్వప్నమందు మేల్కొనిన వానికి, స్వప్నమందలి తన బంధువు మరణించినను, అతనియందు సత్యత్వబుద్ధి ఎట్లుదయింపదో,అట్లే తత్వవేత్తకును, దృశ్యపదార్ధములన్నిటి యందును సత్యత్వబుద్ధి ఉదయింపదు. కావున అతనికి హర్షశోకాదులు కలుగనేరవు.

ఈ దృశ్యాది జగత్తంతయును శాంతమై, శివమైనట్టి పరబ్రహ్మ స్వరూపమేయని అంతరంగమున దృఢముగ భావించి ఎరిగినచో మరల భ్రాంతి ఉద్భవించదు. ప్రబుద్ధులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులును, తదితర జీవన్ముక్తులును, వ్యవహారమందున్నను, సమాధియందున్ననను, ఇట్టి నిత్య ,చిద్ఘనమందే వెలయుచున్నారు.

మిధ్యాభూతమగు ఈ జగత్తునందు మిధ్యారూపుడే అగు బ్రహ్మదేవుడు, మిధ్యగనే భూత భువనాది సమాచారమును గావించును. వివర్తభావమును పొందుచున్నాడు. సారాసారములను గూర్చి,వివేకముగల తత్వజ్ఞానులు కొందరు అట్టి పరంపరమగు శుద్ధబ్రహ్మమున, జలబిందువు జలమందువలె,ఏక రసత్వమును పొందుచున్నారు.

నిరాకారమైన పరమాత్మయే, తన చిత్‌ స్వరూపమున, స్థితికల్గి యున్నదై, స్వప్నములవలె వివర్తరూపమగు సృష్ట్యాది వివిధ ఆకారములుగ వర్తించుచున్నదను సిద్ధాంతము ప్రతిష్టింపబడినది. స్వప్నసంకల్ప పట్టణములెట్లు సత్యముకాదో, అందలి పృధ్యాదులు,ఒకింతయైనను సత్యములు కావో,అట్లే ఈ జగత్తును సత్యము కాదు.

ఇది శాంతమై, ఏకమై, నిరహంకారమైనట్టి బ్రహ్మమే అగును. ఈ జగత్తు అజ్ఞానియందు సత్యమై, వివేక దృష్టియందు మిధ్యయై,బ్రహ్మస్వరూపమును గాంచువాని దృషి ్టయందు బ్రహ్మమై, ప్రశాంతినొందు మనుజుని దృష్టియందు క్షయముగ శీలించి, తుదకు మహాకాశమువలె శూన్యముగ పర్యవశించునదై యొప్పుచున్నది.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


285 🌻. 143. ఐందవోపాఖ్యానము - 5 🌻

అద్దమునందు ప్రతిబింబమువలె, ఈ చిత్తదేహము బాహ్యాంభ్యంతరములందు,అనేక జగత్తులు ధరించుచున్నది. మరియు ఆ దేహమందే వార్ధక్య, మరణములు, గుణదోషాదులు, పదార్ధముల ఆది ఆంతముల జ్ఞానము కల్పించబడుచున్నది.
సూర్యరూపుడగు ప్రజాపతియొక్క సంకల్పమున స్ధూలత్వమును గూర్చిన భ్రాంతి వర్ణించబడినది.
భ్రాంతి మాత్రమే అగుటచే ద్రష్టయు,దృశ్యమును,దర్శనమును అసత్యములే యైయున్నవి. అయినను సమస్త వ్యాపకమగు బ్రహ్మరూపమే అగుటచే, ఇవలన్నియు సత్యములే యగును. సూక్ష్మశరీరములయొక్క చిరకాలానుభవము నందు, స్ధూలబుద్ధి ఉదయించుచున్నది. అది స్రష్టయగు బ్రహ్మదేవునియొక్క సూక్ష్మశరీరము,చిరకాలము దృఢభావనచే,తనయందే స్థూలత్వమున పృధ్వాది రూపమును గాంచుచున్నది. అసత్యములగు శరీరాదులందు సత్యబుద్ధియొక్క భావనచే జీవుడు బద్ధుడగుచునాడు. మరియు తన స్వరూపముననే నానాత్వముగ భావించుచున్నాడు.
భూత భవిష్యత్‌ సందేహములన్నింటిని యుక్తులద్వారా నివారించి, జ్ఞానముయొక్క శాంతిచే ముక్తి లభించునని తెలుపబడినది. ఓ రామచంద్రా| శమదమాది సాధనలచే దృఢముగ అభ్యసించి,సమ్యక్‌ జ్ఞానరూపమగు ప్రబోధముచే,విషయ రూఢత్వ భ్రాంతి నివర్తించుచున్నది. అపుడు ముక్తి లభించును. ఈ జగత్తు భ్రాంతి రూపమే యైయున్నది. ఇది కేవలము నాశరహితమై అనిర్వచనీయమైనట్టి జ్ఞానముమాత్రమే కలదు.అట్టి దృఢనిశ్చయమే,సమ్యక్‌ జ్ఞానమని చెప్పబడినది. స్వప్న సంకల్ప పదార్ధములు వాస్తవముగ లేకున్నను,ఎట్లు భాసించుచున్నవో,యధార్ధజ్ఞానముచే నవన్నియు నెట్లు బాధితములగుచున్నవో,అట్లే నీవు నేను ఇత్యాది జగత్తులన్నియు వాస్తవముగ నుత్పన్నముగాకయున్నను భాసించుచున్నవి. అదంతయు తత్వజ్ఞానముచే నివారితమగుచున్నది. వాస్తవముగ భ్రాంతి లేదు. అనంతరూపుడగు పరమాత్మ నిజమాయచే,నిట్లనంతముగ భాసించుచున్నాడు. జీవన్ముక్తులకు పరబ్రహ్మముయొక్క స్వరూపములగు సమస్త వస్తువులతో వ్యవహార ప్రవృత్తి ఎట్లుండునో అట్లే పరమార్ధమున నట్టి చిద్ఘన రూపమే యైనట్టి అభ్యాసముకావలెను. జీవన్ముక్తులకు ఉపదేశరూపమగు సమస్తమును బ్రహ్మమే. పరమాత్మయందు బంధముగాని మోక్షముగాని లేదనుట నిశ్చయమైనది. ఓ రామచంద్రా| పరబ్రహ్మముకంటే భిన్నముగా దృశ్య పదార్ధముయొక్క సత్తయందలి అభినివేశముచేతనే బంధనము కలుగుచున్నది. తత్వవేత్త కట్టిదృశ్యమొకింతయు లేదు. వారికి పరమాత్మయే సర్వపదార్ధాకారముగ భాసించును. కావున ఇక బంధమోక్షముల కల్పన వారికెచట. ఎపుడు ఈ జగత్తు స్థితి స్వప్నమువంటిదని సిద్ధించినదో,అపుడిక మేల్కొనినపుడొక,స్వప్న పదార్ధములు బాదితములగుటచే దుఃఖమెట్లు నివర్తించుచున్నదో అట్లే ఆత్మజ్ఞానముచే, జగత్పదార్ధములందలి సాకారిత్వము బాధితమగుటచే సమస్త దుఃఖము శమించుచున్నది.
అంతట వాసనలెట్లు నశించుచున్నవని శ్రీరాముడడుగగా వసిష్ఠుడిట్లు చెప్పుచున్నాడు.
భ్రాంతి రూపమగు ఈ దృశ్య చక్రము యధార్ధమగు ఆత్మ విజ్ఞానముచే స్థూలత్వ రహితమై,యెపుడుండునో అపుడు క్రమముగ వాసన క్షయించును. ఈ జగత్తు స్థూలత్వ భ్రమ నశించగ,దృశ్యమంతయు చిత్తస్వరూపము పొందగ,జగత్తు శూన్యముకాగ నపుడు మనుజునకు భోగమునందాసక్తి నశించును. పరమ వైరాగ్యముదయించును. చిత్తముయొక్క విచారణగూర్చి చెబుతూ; చిత్తస్వరూపము చైతన్యము వైపు మరలుటకు ఈ యోగవాసిష్ట శ్రవణమే చిత్తముయొక్క విచారణ. వాస్తవమునకు దృశ్యములేదు. అపుడు చైతన్యములేదు. అట్టితరి చిత్తముకూడ లేనట్లే అగును. ఈసాకారజగత్తు అజ్ఞానులకుమాత్రమే గలదు. జ్ఞానులకు సత్యమైన పరబ్రహ్మంకలదు. ఓ రామచంద్రా| కార్యము కారణముకంటే భిన్నముకాదు. కాబట్టి ఈ సంసార సారస్వప్నమునకు కారణమేమియో నీవు మొదట విచారింపుము. అటు పిమ్మట ఆ కారణనాశముచే, ఈ కార్యమగుసంసారము నశించును. ఓ రామా| పామరదృష్టి, యౌక్తికదృష్టి, తత్వదృష్టి దృష్టి మూడు విధములుగనున్నది. అందు మొదటిది రెందవదానిచేతను, రెండవది మూడవదానిచేతను నిరాకరింపబడును. శాస్త్ర,మనన,శ్రవణ,నిధి ధ్యాసలచే పరమతత్వముగ సిద్ధించును. తద్వారా జగత్తు యొక్క శూన్యత్వము భ్ర
మ నశించును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


284 🌻. 143. ఐందవోపాఖ్యానము - 4 🌻

స్మృతి సంస్కారాదులు లేకయే, స్వప్నమందు స్వమరణమువలె, బ్రహ్మదేవునికి ఆ క్షణమున దివ్యజ్ఞానముచే,అతీత అనాగతకమగు, సమస్త జగత్తును,అపూర్వముగను కాన్పించును.

స్మరణములేకనే, జీవునకు చైతన్యముయొక్క ప్రభావముచే స్వప్న సంకల్పాదియందు, కల్పనామాత్రముచే జగత్తుయొక్క స్మృతి అనుభవము కల్గుచుండ, ఇక శుద్ధ చిదాకాశమునకు, సంకల్పమాత్రముచే జగద్రూపనగరము యొక్క స్మృతి ఏల కలగకుండును. కావుననే గుణదోషాదుల గురు స్పరణము వలన, హర్ష, క్రోధ, సుఖ, దుఃఖాదిరహితులగు తత్వవేత్తలు ప్రారబ్ధ వేగముచేతనే అనుసరించి చనుచున్నారు.
క్రమముగ సోదరులు మరణించుట,కుందదంతుడు రామచంద్రుని కలయికతో మోహము నశించుట ఇందు తెలుపబడినది.
కుందదంతుడిట్లు పలుకుచున్నాడు.

ఓ సాధు| నేను సమాధి సాధించి యొక్క క్షణమైన యుండజాలను అని సమాధియందు ప్రవేశించుచున్నాననగ,నీకు నేనొక విషయమును తెలుపుచున్నాననెను. అయోధ్యానగరమున దశరధుడనురాజు పాలించుచుండెను. అతని కుమారుడు శ్రీరాముడు.

నేనతని దగ్గరకు చని,అతని కులగురువు చెప్పునట్టి మోక్షోపాయమును వినుము. అనగ నేను నీ వద్దకు వచ్చితినని రామునితో బ్రహ్మణుడు పల్కెను. ఓ మునీశ్వరా| నా ప్రక్కనున్నయాతడే ఆ కుందదంతబ్రాహ్మణుడు. అపుడు వసిష్ఠుడు కుందదంతునిట్లు ప్రశ్నించెను.

నీవు మోక్షప్రదమైన ఆ యుత్తమ బ్రహ్మపధమునెఱింగితివా? అంత ఆతడు నేను తెలుసుకొనవలసినదంతయు తెలుసుకొంటిని,చూడవలసినది, పొందదగినది పొంది బ్రహ్మపధమున విశ్రాంతి నొందితిని. సర్వవ్యాపకమై, సర్వాత్మకముచే,సర్వరూపమై వెలయు పరమాత్మయందు సర్వత్రా, సర్వదా సర్వవిధముల సమస్తము పూర్ణముగ సంభవమగుచున్నది.

ఏది ఎపుడు ఎట్లు భాసించుచున్నదో ఆ ప్రకారముగ బ్రహ్మమే అట్లు వర్తించుచున్నదగును. దానికంటే భిన్నముగ ననుభూతమగుటలేదు.
అంతయు బ్రహ్మమే యను సిద్ధాంతము యుక్తుల ద్వారా స్థిరమొనర్చబడుట.

ఈ బ్రహ్మము ప్రపంచమున నచట నే వాసనచే రూపమును ధరించుచున్నదో,అచట చిదాకాశముందు,ఆయా రూపుముతోడ వర్తించుచున్నది. దృశ్యమే పరబ్రహ్మము, పరబ్రహ్మమే దృశ్యము. ఇది శాంతముకాదు, అశాంతముకాదు.

అహంకారవంతము,అహంకారరహితముకాదు. ముక్తికలుగునంత వరకు జీవునికి పృధివి, జల,అగ్ని,వాయు,ఆకాశములందు; వాస్తవముగ స్వప్నతుల్యములై అనేక జగత్తులు భాసించుచున్నవి. ఓ రామచంద్రా| మనుష్య,దేవ,అసుర,నాగ పర్వత,పిచాచ, కీటకాదులన్నియు చిత్తమే.

ఈ చిత్తముయొక్క పరిమాణము అనంతము. అందు ఇట్టి జగత్తులు వేలకొలది పరమాణు రూపత్వమునే పొందుచున్నవి. ఆధ్యంత రహితమగు ఈ చిత్తమునే జీవుడందురు.
జగత్తున గర్భమందు దాచినట్టి ఈ చిత్తముయొక్క పరిమాణము, అణురూపమే యైయున్నది.

కావున జీవుని అభ్యంతరమున,జగత్తు వెలయుచున్నది. కాలక్రమమున అభ్యాసయోగముచేతను, తద్విచారణచేతను, శత్రుమిత్రాదులందలి సమదర్శనముచేతను సమ్యక్‌ జ్ఞానము పొంది దేహవర్జితమగు చున్నది.

బ్రహ్మదేవుడు, తపోధ్యానాదులచే వర శాపాదులు, సత్యములగుగాక అని సంకల్పించగ,అది అట్లు అనుభవము పొందుచున్నది. అది సత్యసంకల్పుడగు బ్రహ్మయొక్క నిర్ణయము. అతడు బ్రహ్మముకంటే వేరుకాదు. ఆ ప్రజాపతియే ప్రజలను ధర్మమును దానమును తపస్సు సమస్త భూతములు పంచ జ్ఞానేంద్రియములను సంకల్పించెను.

అతనికి నేను బ్రహ్మమును అను అనుభవము కలదు. ఒకే నిద్రయందు స్వప్నము,సుషుప్తులు ఎట్లు స్థితి కల్గియున్నవో,అట్లే బ్రహ్మమందు సృష్టి ప్రళయములు స్థితి కల్గియున్నవి.

సమస్త పదార్ధముల స్వభావమగు నియతి,జీవత్వప్రాప్తి,శుద్ధ బ్రహ్మత్వరూపము ఇచట వర్ణింపబడినది. సర్వ శక్తివంతుడగు ఈశ్వరుని సంకల్పముచే నేయే పదార్ధమెట్లు సృష్టాదియందు భాసించునో అది ఆ ప్రకారముగనే స్వభావరూపత్వము పొందగలదు.

ఆకాశమున శూన్యత్వము, కర్పూరమందు సుగంధము, అగ్నియందు ఉష్ణత్వము ఎట్లు వేరు కాదో, అట్లే చైతన్యమున,జాగ్రత్‌ స్వప్నములు చైతన్యముకంటే వేరుకాదు. ఈ ప్రకారముగ సంకల్పమను వృక్షమునకు బీజమైనట్టి యా చైతన్యము అహంకారమును పొందుచు,తన కాలములో అహంకారరూపము పొందుచున్నది.

ఈ చైతన్యమే భావికాలమున, నామ, అర్ధ, శబ్ధ, వృక్ష, బీజ, పద, వాక్య, ప్రమాణములచే బూర్ణములగు వేదములకాదార భూతమగుచున్నది. ఆకాశ కోశమున,చైతన్యమే స్వయముగ శబ్ధరూపమై శబ్ధజ్ఞానము పొందుచున్నది. అట్లే రస, తేజో, జల, భూతత్వములను బొందునది ,చైతన్యమే అగును.

ఇట్లు ఓ రామచంద్రా| ప్రతి జీవుని ఆత్మయందు అనంతమైన జాగ్రత్తులు ఊహింపవలయును. వాటికి వేఱుగ ఆత్మయొప్పుచున్నది.
జీవుడు బ్రహ్మమే అనియు లింగ దేహముయొక్క భ్రాంతిచే నాతనికి జీవయుత్పత్తి ఏర్పడినది.

 చిదాత్మస్వరూపుడగు ఈ చిదాభాసునకు అనేక పేర్లు గలవు. ప్రాణము, జీవుడు, చిత్‌, నేను, ప్రకృతి,పుర్యష్టకము మున్నగునవి చిదాభాసుడగు జీవుని నామములు.

కాలము యొక్క వ్యవస్ధననుసరించి, వృక్షమునందు ఫలములవలె,ఈ చిత్తభూమియందు లక్షలకొలది ప్రపంచములు, ప్రాణులు ఉద్భవింపగలవు. ఉద్భవించుచున్నవి. ఉద్భవించినవి.

సశేషం.....



283 🌻. 143. ఐందవోపాఖ్యానము - 3 🌻

ఎపుడు ఈ సోదరులు తపస్సు చేయుచుండిరో, అపుడు పుత్ర వియోగముచే మిగుల దుఃఖితులైన వారి పితామహులు తమ కోడళ్ళలతో తీర్ధ, మున్యాశ్రమమునకు చనిరి. వారు ప్రసిద్ధమగు కలాప గ్రామమునకు తీర్ధమునకేగుటకు యత్నవంతులైరి. మార్గమున వారు ఊర్ధ్వ జఠాధారియగు వృద్ధుని గాంచిరి.

అతడు బాటసారియని, నమస్కార పూజాదులు గావింపక, అనాదరించి వెడలుచుండగ, అతడు కృద్ధుడై, ''దుర్వాసుడనగు నాకు నమస్కరింపకయే, దాటిపోవుచున్నారు. కావున నా కోడళ్ళకును కుమారులకు, తపస్సుచే మహా వరములు లభించినప్పటికిని అవి దుఃఖ ఫలితము లొసంగుగాకయని పల్కగ; వారు అతనిని ప్రసన్నుని గావించుకొనుటకై, ప్రయత్నించగ అతడు అంతర్ధానమయ్యెను.

తదుపరి ఆ పితామహుడు మిగుల దుఃఖితులై, యాత్రనుండి గృహమునకు తిరిగి వచ్చిరి. అంతట ఆ గౌరాశ్రమ తాపసిని,పరస్పర విరుద్ధమైన వర, శాపములు, శుభము, అశుభములెట్లు కలుగజేయునని అనగా| ఇందులో అసమంజసము లేదు. జరుగబోవు విషయమును గ్రహించుము.

నేటికి ఎనిమిది దినముల తదుపరి మీరు మీ బంధువులను చేరి కొంతకాలము సంతోషముతో గడుపుదురు. అనంతరము క్రమముగ, ఆ ఎనిమిది మంది సోదరులు మరణింతురు. బంధువులు వారి శవదహన క్రియలు గావింతురు.

అంతట వారి జీవులు వేరు వేరుగ స్థితినొందినవారై ముహుర్తకాల పర్యంతము సుషుప్తియందుండగ, అంతలో వారి యావర శాపములు అవశ్యము ఫలమునొసంగునట్లు, వారి చిత్తాకాశమందొకచోట, సమావేశమగును. వారి వరములు శాపములు వేరు వేరు శరీరములు ధరించును. అందు వరములు ఉత్తమ శరీరధారులై, చంద్రునివలె అతి శుభ్రమైన శరీరముకల్గి, విష్ణు రూపధారుల అచటికే తెంచిరి. శాపములు త్రినేత్రులై,హస్తమున స్తూలము ధరించి, భయంకరాకారులై, నల్లని దేహములతో, క్రోధముఖులై యచ్చటకు విచ్చేసిరి. అపుడు వరములు శాపములతో ఇట్లనియె. మీరు ఇటనుండి దూరముగపొండు. వసంత ఋతువులవలె, మాకాలమేతెంచినది,దానినెవడు అడ్డుకొనును. అంత శాపములును అట్లే పలికెను. వరములు మేము సూర్యునివలన, మీరు దూర్వాసుని వలన గావింపబడిరి. సూర్యుడు మునులకంటే అధికుడు. అనగా శాపములు మేము రుద్రభగవానుని అంశమున పుట్టిన దూర్వాసుని వలన కావింపబడినాము.

దేవులందరిలో రుద్రుడధికుడు అని త్రిశూలములను వరముల పైకెత్తెను. అంత వరములు నవ్వుచు, ఓ శాపములారా| మీరు మీ పాప ఫలములనుగూర్చి యోచింపుడు. దీనికి తగు పరిష్కారమును బ్రహ్మదేవుడే నొసగునని పల్కగ, వారు సమ్మతించి ఇరువురు బ్రహ్మదేవునికడకేగిరి. బ్రహ్మదేవుడు వారి సమస్యను విని ఇట్లనెను. మీలో ఎవరు లోన దృఢత్వము కల్గియుందురో వారు జయింతురు. అనగా వరములు శాపముల హృదయములందు; శాపములు వరముల హృదయములందు ప్రవేశించెను. వారు పరస్పరము ఎరిగి, బ్రహ్మదేవునితో నిట్లనిరి. శాపములు తాము ఓడితిమని వరములయొక్క దృఢత్వము వజ్రమువలెనున్నదని,మరియు మేమిరువురము చైతన్యముకంటే వేరుకాదనియు, వరము దృఢమై సంకల్పానుగుణముగ విజయము సాధించినదయ్యెను.

ఏది చిరకాలాభ్యాసమున, దృఢత్వము పొందెనో,అది తగిన ఫలమొసంగును. శాపములు అభ్యాసరహితమగుటచే పరాజయము పొందెను.

ఎచట వర శాపములు అభ్యాసమునందు సామ్యముండునో,అచట నీర క్షీరములవలె ఉభయ మిశ్రమ ఫలమే సంభవించును. తదుపరి శాపములు,తమ అవరోధమునకు క్షమించుమని చెప్పి వెడలిపోయెను.

అటు పిమ్మట, ఆ ఎనిమిది మంది సోదరులు, తమ గృహములందే సప్త ద్వీపేశ్వరులైయున్నారు. అది ఎట్లన. ఈ సమస్త జగత్తును, చిదాకాశరూపమేయైయున్నది. ఇది యంతయు చైతన్య పరమాణువు నందు స్థితినొందియున్న స్వప్నమువలె,అచట సప్తద్వీపములు రాజ్యములుగ వెలచినవి. ఎపుడొక అణువునందు బ్రహ్మాండము పుట్టుచున్నదో అపుడిక గృహోదరమున, సప్తద్వీపపతియగు పృధ్వి, స్ఫురించుటలో ఆశ్చర్యమేమి.

అట్లు ఎనిమిది మంది సోదరులు, నట గృహమందు, సప్తద్వీపాధి పతులై, వెలయుచుండిరి. వారు పరస్పరము తెలియబడకయున్నవారై,తత్వజ్ఞాన శూన్యులై, అన్యోన్య బంధువులై వర్తించుచున్నారు. ఇట్లు వారు తమతమ అభిమతములను పొందినవారై, సంతుష్టులై,సప్తద్వీóపేశ్వరులై చిరకాలము వెలయగలరు.

గృహమందు ఎనిమిది జగత్తులేల, వేలకొలది కోట్లకొలది జగత్తులు సంభవమగును. ఈ నానాత్వము వాస్తవము కాదు. భ్రాంతియే యగును. అది స్వప్న సుషుప్తులవలె, విస్తరించబడునట్లు, చిదాకాశముయొక్క నిర్మల యధార్ధస్వరూపమే యగును.

స్వప్నమున వాస్తవముగ అగ్ని లేకున్నను, స్వప్న చైతన్యమే అట్లు ఉష్ణత్వముగ భాసించునట్లు , జాగ్రత్‌నందును,చిదాకాశమున,నిజ చిత్‌ స్వభావమే పదార్ధాకారముగ భాసించుచున్నది.

పుష్ఫమందు,పత్రమందు, ఫలమందు, స్తంభమునందు వృక్షమే ఎట్లు వ్యాపించియున్నదో అట్లే ఈ జగత్తంతయు సర్వత్రా సర్వరూపమగు బ్రహ్మమే యైయున్నది. సంకల్ప నగరమువలె, ఈ జగత్తు, ఎంతవరకు సంకల్పింపబడునో,అంతవరకును ఏఏ ప్రకారముగ సంకల్పింపబడునో, ఆయా ప్రకారముగ స్పురించ బడుచున్నది.

సశేషం.....
🌹 🌹


282🌻. 143. ఐందవోపాఖ్యానము - 2 🌻

అంత నేనిట్లంటిని. ఓ సాధు| నీవు నీ అభీష్టము నెరవేరువరకు సేవచేయుదునంటిని. అంత అతడు శిలవలె మౌనముధరించి, కనులు మూసికొనియుండెను.

నేనట్లే అతని చెంత భయరహితుడనై యారు మాసములుంటిని. అంత ఒకానొక సమయమున ఒక తేజస్వియగు పురుషుడచటికేతెంచెను. అపుడు మేము ఇరువురము అతనిని పూజించి సేవించుచుండ అతడిట్లనియె.

ఓ తపస్వీ నీవిక తపముచాలించి, నీ మనస్సునందలి కోర్కెను గ్రహింపుము. నీ తపస్సు వలన, భూమండలమును ఏడు వేల సంవత్సరముల వరకు పాలింపగలవని పల్కెను.

అతడు అంతర్ధానము కాగా నేనతనితో నిట్లంటిని. ఓ మహాత్మ| నీవిపుడు నీ అభిమతమును పొందితివి. కాన తపంబు చాలింపుము. నీ మనోవాంఛ యీడేరినది. అని అతనిని బంధములనుండి విముక్తుని గావించితిని.

అంతట స్నానమాచరించి, యావృక్షమందలి ఫలములు భుజించి మూడు దినములచట వుండి, మేమిరువురము మధుర కేగుటకై బయలుదేరితిమి.

మేము మార్గములో విశ్రాంతి పొందుచు మూడు దినములు తదుపరి ఒక అరణ్యమును చేరితిమి. అచట గల ఒక గౌరాశ్రమమునకు వెళ్ళి అచటగల తన యేడుగురు సోదరులు తన వలె నిచట తపమొనర్చుచున్నారు. వారినికలియుటకు ఆ,ఆశ్రమమునకు చేరగా అచట శూన్యముగా నున్నది.

వృక్షముగాని, కుటీరమునుగాని లేవు. అది కేవలము మహా శూన్యము. తుదకొకచోట నొకవృక్షమును గాంచితిమి.  ఆ విశాల వృక్షము క్రింద, ఒక వృద్ధ తపస్వి సమాధిష్టుడైయుండెను. మేము చాలా తడవు వేచియుండి తుదకు నేనతనిని సమాధినుండి మేల్కొలిపితిమి. అతడు మేల్కొని ఇట్లు పలికెను.

ఓసాధువులారా| మీరెవరు? గౌరాశ్రమము ఏమైనది? నేనిటకేల వచ్చితిని అని అడుగగా, మేము తెలియదని పల్కగ, అతడు మరల ధ్యానస్ధుడై,తనయొక్క వృత్తాంతమును గ్రహించి ఇట్లు పల్కెను. ఈ కడిమి చెట్లు(కదంబ) నానివాసము.

ఇచట ఒకానొకపుడు ఏదోకారణమువలన గౌరీదేవి సరస్వతి రూపము ధరించి ఇచట పదిసంవత్సరములు జీవించెను. అందుకే దీనికి గౌరీవనమని పేరు.

ఈ వనము సర్వ విధములైన, ఫల పుష్ప లతాదులతోను; హరిత, హంస, శుక, కోకిల, కాక చక్రవాతాది పక్షులతోను, వివిధ జంతువులతోను, గంధర్వ,యక్ష, సుర, సిద్ధాదులతోను అలరాడుచుండెను. ఈ వృక్షము గౌరీనివాసమగుటచే వృద్ధత్వము పొందక,బాలునివలె నున్నది.

గౌరీదేవి వెడలిన పిదప ఈ వనము సామాన్య వనమువలె అయ్యెను. మరియు నేను మాలవమను దేశమునకు రాజును. ఒకానొక సమయమున వైరాగ్యముచే రాజ్యమును త్యజించి ఇచటి కేతెంచితిని.

ఇచట ఆశ్రమ వాసులచే పూజింపబడి,ఇచట ధ్యానస్ధుడనైతిని. తదుపరి నీవు నీ ఏడుగురు సోదరులతో,తపస్సు నిమిత్తము ఇచటికేతెంచితిరి.

వారు తపస్సునందుండగ నీవు శ్రీశైలమునకును, రెండవవాడు కార్తికేయ స్వామియుండు ప్రదేశమునకును, మూడవతను కాశీకి, నాల్గవతను హిమాలయములకు తపస్సుకై వెడలగ,తక్కినవారిచటనే తపమొనర్చిరి. వారిలో ప్రతివారికి రాజుకావలెనను కోరిక గలదు. వారి యభీష్టములు వారు పొందిరి.

నీవింకను తపస్సు చేయుచుండగనే, తక్కినవారు వరములను పొంది, ధర్మప్రధానమగు కృతయుగము ననుభవించి బ్రహ్మదేవుడు బ్రహ్మ లోకమునకేగునట్లు, వారు స్వగృహమునకేగిరి. నేనొక్కడనే ఇచటనుంటిని. ఈ కదంబ వృక్షము తప్ప మిగిలిన వనమంతయు సమీపవాసులచే ఛేదింపబడినది.

ఇది సరస్వతీ నివాసమని, దీనిని వదలిరి. తదుపరి మీరిచటికేతెంచితిరి, అని పల్కెను. మీరిరువురును మీ మీ గృహములకు బొండు. నీ సోదరులు మీకంటే పూర్వమే భార్యాబంధువులతో గూడియున్నారు. అపుడు నేనిట్లంటిని.

ఓ మహాత్మా, సప్తద్వీపవతియగు ఈ పృధివియొకటి మాత్రమే కలదుగదా| అప్పుడొకే సమయమున ఎనిమిదిమంది దానికి ప్రభువులెట్లు కాగలరు.

అంత కందంబాసురుడు ఇట్లు పల్కెను. ఈ ఎనిమిది తాపస సోదరుల దేహములు నశించిన పిదప, వారందరును తమ గృహాకాశమున, ఏక కాముననే సప్తద్వీపవతియగు ఈ భూమికి రాజులగుదురు.

ఈ ఎనిమిదిమంది సోదరులకు, యుత్తమ గుణవతులగు ఎనమండ్రు భార్యలు గలరు. వారు,తమ భర్తలు తపమొనర్చుటకు వెళ్ళగ మిగుల దుఃఖించిరి.

వారు శత ఛాంద్రాయమను తపంబొనర్చిరి. దానిచే భగవతి పార్వతి సంతుష్టురాలై ఇట్లు పల్కెను.వారు ఆ దేవిని సర్వ విధములుగ ప్రార్ధించిరి. అంత ఆ దేవి ఇట్లు పల్కెను.

మీ భర్తలు తపస్సు పూర్తి అయిన అనంతరము ఇచ్చటికేతెంచెదరు. అపుడు మీరు మీ భర్తలతో సుఖంబుందురు గాకయని పల్కెను. అంతేగాక మరొక వృత్తాంతమును వినుడు.


సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


281🌻. 143. ఐందవోపాఖ్యానము  - 1 🌻

ఈ విషయమున ఐందవోపాఖ్యానము వినుము. దానిని పూర్వము జగత్తుయొక్క మనోమయత్వ క్షీణోత్పత్తి కొరకు వచించుచున్నాను. ఇపుడు జగత్తుయొక్క, చిన్మాత్రత్వమును జూపుటకు తెల్పుచున్నాను.

ఉత్పత్తి ప్రకరణమున వర్ణింపబడినట్లు, ఒకానొక జగత్‌ జాతమున తపో, వేదాధ్యయన, కర్మానుష్టాన భూతుడై ఐందవ బ్రాహ్మణు డొకడుండెను. అతనికి మహాత్ములగు పదిమంది పుత్రులు కలరు. కాలవశమున, అతడు మరణించగ, అతనితోపాటు అతని భార్య వైధవ్యభీతిచే అతని ననుగమించెను. వారి పుత్రులు కర్మకాండలు పూర్తిచేసి తపస్సుకొరకై అరణ్యమునకేగెను.

వారొక ప్రశాంతమగు గుహయందు కూర్చుని, తామెట్లు యున్నతస్థితిని పొందగలమని విచారించుచు,వారు తామే బ్రహ్మాండమందలి బ్రహ్మమని తలుస్తూ నిశ్చల ధ్యానముచే,చింతించుచు చిరకాలము ధ్యానము నందుండిరి.

పదునెనిమిది మాసములు వారట్లు నిశ్చలస్థితిలోనుండగ, తదుపరి వారి శరీరములు సుష్కించినవై,ప్రేతాదులచే భక్షింపబడి, శవరూపముబొంది,అచట నశించిపోయిరి. వారట్లు దీర్ఘకాలము ధ్యానములో గడిపిరి. ''నేను బ్రహ్మదేవుడను అనేక లోకములతోగూడిన ఈ జగత్తు నేనే''. అనుకొనుచు, దీర్ఘకాలము గడచిపోయెను.

శరీరశూన్యులగు వారి పరిచిత్తములు, వేరువేరుగ పది బ్రహ్మాండ శరీరములయ్యెను. వారి చైతన్యమే అట్లయినది. ఇట్లు వారి యా సమస్త బ్రహ్మాండములును చిన్మయములే యైయుండుటచే,ఆ భూమి పర్వతాది సమూహము సర్వమును చిద్రూపమని ఎఱుగము. అదంతయు చిదాకాశమే యగును.

ఐందవులచే కల్పించబడిన పది బ్రహ్మాండములు చిన్మయములై ఈ జగత్తునందు సర్వ పదార్ధములు చిన్మయములే యైయున్నవి. ఐందవుల ఈ సంకల్పములే ఎట్లు జగద్రూపము పొందెనో,అట్లే బ్రహ్మదేవునియొక్క సంకల్పమే ఈ జగద్రూపమును పొందినది.

కావున నిక పర్వత, పృధివి,వృక్ష,మేఘము, మహాభూతములన్నియు సర్వవ్యాపకమగు చిన్మాత్ర మయములైయున్నవి. పల్లపు భూమివైపు జలము ప్రవహించునట్లు, చైతన్యము స్వభావముగనే జగద్రూపముగ ప్రవృత్తమగుచున్నది

జాగ్రత్తులన్నింటిని బ్రహ్మదేవుడు స్వయం సంకల్పమయముగనే, స్వయముగ నెఱుగుచున్నాడు. కావున అతని సంకల్పముచే ఉత్పన్నమైన ఈ సమస్త జగత్తును అతని మనోరాజ్యమువలె చిదాకాశరూపమైయున్నది. కావున ఈ ప్రపంచమును చైతన్యదృష్టితో చూచిన, ఈ సంసారదుఃఖము విలీనమైపోవును.

అందువలన ఓ రామచంద్రా| ఈ జగత్తంతయు ఏకమైనట్టి చిన్మాత్ర బ్రహ్మమే యైయున్నది. అజ్ఞానులచే నెఱుగబడిన సాకారభూతములేవియు లేవు.స్వప్నమందువలె ఈ జగత్తంతయు నిరాకారమై చిన్మయమై శాంతమైన బ్రహ్మమే కాన,సాకారమగు ఈ జగత్తు లేనేలేదు.

ఐందవులు సంకల్పరచిత జగత్‌ సమూహములచే, అసంఖ్యాకములైన ప్రాణులయొక్క రూపములు బడసినట్లు, ఒకే చైతన్యమున వేలకొలది రూపములున్నవి. అట్లే బ్రహ్మ,విష్ణు,రుద్రాదులతో సాయుజ్య మొందినపుడు వేలకొలది సంవిత్తులును,ఒకే సంవిత్తుయొక్క రూపమగుచున్నవి. వందలకొలది నదులు సముద్రమగును.

అట్లే అనేక ఋతువులు కాలమగుచున్నవి కదా| స్వప్నమున ఒకే సంవిత్తు అనేక రూపములుగ నెట్లు భాసించుచున్నదో అట్లే సృష్ట్యాదియందు చిదాకాశమున నొకే సంవిత్తు వివిధ పదార్ధరూపములుగ భాసించుచున్నది.

అనేక దీపములుగల గృహమందు, ఆ దీపకాంతులన్నియు ఏకరూపముగ ప్రకాశించునట్లు, సర్వశక్తివంతుడగు పరమేశ్వరుని యొక్క శక్తి అనేక రూపములుగ ప్రకాశించుచున్నది. వేలాడుచుండిన తపస్వియొక్క వరలాభముకొరకై విషయమిచ్చట వర్తింపబడినది.

మునీంద్రా| ఒకానొకపుడు నేను పాఠశాలయందు ఏకాగ్రచిత్తుడనైయుండ, ఒకానొక తాపసి అచటికేతెంచెను. విదేహ దేశమునుండి వచ్చిన ఆ యుత్తమ బ్రాహ్మణుడు, విధ్వాంసుడు, మహాతపస్వి,తేజోధారియై యుండెను.

అతనిని నేను తమరెచటనుండి వచ్చిరి,ఏమి నిమిత్తము వచ్చిరి అని అడుగగా అతడిట్లు పలికెను. భూమిపై సర్వ సౌభాగ్యవంతమైన విదేహ మను దేశముగలదు. నేను అచట ఒక బ్రాహ్మణ కుటుంబమున జన్మించితిని.

నా పేరు కుందదంతుడు. నేను వైరాగ్యముతో తపస్సుకొరకై,అచటచట తిరుగుచు,శ్రీశైలము చేరితిని అచట చాలా కాలము తపమొనర్చితిని. అందు ఒక అరణ్యము కలదు. అచట ఒక చిన్న వృక్షశాఖయందు,ఒక పవిత్రాకారుడైన మనుజుడు వేలాడుచుండెను.

అతడు తలకిందులుగ వేలాడుచుండెను. నేనతనిని సమీపించి పరీక్షించగ అతడు జీవించియున్నట్లు కనుగొంటిని. అతనికి సేవ చేసి,నాయెడ అతనికి విశ్వాసము కలుగునట్లు నడుచుకొంటిని. తదుపరి నేనాతని నిట్లు ప్రశ్నించితిని.

ఇట్టి దారుణ తపస్సుకు కారణమేమిటని అడుగగా| నాయొక్క వివరములతో నీకేమి ప్రయోజనమని చెప్పి,మరల అడుగగా నిట్లు పలికెను. నేను మధురయందు నాతండ్రి వద్దశాస్త్రములనభ్యసించి, యౌవ్వనదశలో భోగలాలసుడనై,ఆ దేశపు,రాజునై సమస్త సౌకర్యములు భోగములు పొందుటకై ఇచట తపంబొనర్చుచున్నానని పల్కెను.

కావున నీవు ఇచటనుండి వెడలుమని పలికెను.

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 145 / Sripada Srivallabha Charithamrutham - 145 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 18
🌴. రావిదాసును గురించిన వర్ణనము - 8 🌴
🌻. .శ్రీపాదుల విరాట్ స్వరూపము 🌻

కొంతసేపైన తదుపరి కండ్లు తెరువవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. తదుపరి శ్రీపాదులవారు "మా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగదు.

సృష్టివిధానము చిత్రవిచిత్రముగా ఉన్నది. నిరాకారుడనయిన నేను నరాకారముగా మీ ముందునకు వచ్చుట కడుచోద్యము. నిర్గుణుడనయిన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము.

అసలు పరిమితులు, అవధులు లేని నేను పరిమితులతో, అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింతను గొలుపు విషయము. సర్వశక్తులునూ నా కరస్ధమయి ఉన్నవి.

ఈ అనంతకోటి బ్రహ్మాండము నందలి ప్రతీ అణువు అణువు లోనూ ఉన్నవాడిని నేనే. అణువణువునూ కలిపి ఉంచెడి సంకల్ప స్వరూపము నేనే! అణువణువునూ విడగొట్టగలిగి నూతన సృష్టిరచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే!

ఇది జ్ఞానమని, ఇది అజ్ఞానమని మీకు బోధచేయుచూ సర్వజీవులనూ అనేక విధముల మాయలలో పడద్రోసి వినోదించుచూ, ఆర్తితో పిలిచినపుడు సహస్ర బాహువులతో మిమ్ములను ఆదుకొని సంరక్షించు అనాది తత్త్వమును నేనే! అన్ని జీవులలోనూ 'నేను' 'నేను' అని తోచుచున్న అసలుసిసలైన 'నేను'ను నేనే! అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము లేకున్నయెడల మీరు ఆశ్చర్యపోవలయునే కాని, అవి మీకు  వ్యక్తమై అనుభవము నిచ్చుచున్నపుడు మీరు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది?" అని శలవిచ్చిరి.

పరబ్రహ్మస్వరూపులైన శ్రీ గురుదేవులు యీ ప్రకారముగా చెప్పుచుండ ఎచ్చటినుండియో ఘంటానాదము వినబడినది. అందరునూ ఆశ్చర్యపడుచుండగా ఆ ఘంట శ్రీచరణముల మ్రోలవాలినది. కొద్దిక్షణముల అనంతరము అందరునూ చూచుచుండగా అది అంతర్హితమైనది.

🌻. స్త్రీల యందు శ్రీపాదుల వారి మాతృభావన 🌻

శ్రీపాదులిట్లనిరి. "ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యః ఫలములను ప్రసాదించు మహావతారము. మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడనూ పూర్ణసిద్ధిని పొందజాలడు. యోగవిఘ్నములను జయించలేడు. ఓయీ! వల్లభేశా! వినుము.

నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలముచేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేకరకముల అగచాట్లకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే! వారి సంతానము కూడా నీ యందు వైరభావమును కలిగియున్న విషయము కూడా మాకు అవగతమే!

చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి, నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు.

నీవు మా స్మరణ చేసినయెడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలముతో ముగ్గురు దొంగలను వధించెదము. నాలుగవ వాడు స్వల్పదోషి గనుక విడిచిపెట్టెదము."*

శ్రీపాదుల వచనములను విని వల్లభేశుని భార్య కండ్లనీరు పెట్టుకొనుచున్నది. అంతట శ్రీపాదులిట్లనిరి. "అమ్మా! శ్రీపాద శ్రీవల్లభుడైన నేను ప్రతీ స్త్రీయందును నాకు జన్మనిచ్చిన అఖండసౌభాగ్యవతి సుమతీ మహారాణినే చూచుచుందును.

ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికినీ పసిబిడ్డనే! నీవు దుఃఖింపకుము. నేనిచ్చెడి యీ పసుపుకోమ్మును భద్రపరచుకొనుము. నీకు సర్వశుభములను అది ప్రసాదించును. నీవు సుమంగళిగానే జీవించెదవు. మా శాసనము శిలాశాసనము. యీ సృష్టిలోనే ఏ శక్తికి కూడ దానిని మార్చుటకు సాధ్యము కాదు.

నాకు గాయత్రీ మంత్రోపదేశమును చేసిన నా మొదటిగురువైన మా తండ్రిగారి పేరు చిరస్థాయిగా చేయదలంచితిని. అందులకు మా తండ్రిగారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడయి నృశింహ సరస్వతి అను పేరా మా తదుపరి అవతారము ఆవిర్భవించనున్నది. మా తాతగారైన బాపనార్యుల రూపమును గూడ చిరస్థాయిగా చేయదలంచితిని.

దానికి ప్రతిగా నృశింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తులా మా తాతగారి రూపమునే పోలియుండును. మా తాతగారు నా రెండవ గురువు. వారి వద్దనే వేదవిద్యను గ్రహించితిని. మీరిప్పుడు చూచిన యీ ఘంట ఒకప్పుడు మా తాతగారింటనుండెడిది.

అది నా సంకల్పమున సాధకులననుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలిపొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును. భూమి పైపొరలలో  నుండి కూడా ప్రయాణించగలదు.

 శంకరభట్టూ! నీవు రచించెడి శ్రీపాద శ్రీవల్లభ చరితాంరుతము తెలుగు ప్రతిలోని జయసంఖ్యారూపమైన పదునెనిమిదవ అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ ఘంట తిరిగి పీఠికాపురము చేరును.

ఈ ఘంట అనేక ఆకారములు మారి, పరిమాణములు మారి నా సంకల్పము ప్రకారము నడచుకొనును. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థాన మేర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయజయధ్వానరూపమైన ఘంటను పీఠికాపురము పంపించెదను."

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
 


280 🌻. 142. బ్రహ్మాండాఖ్యానము 🌻

సృష్ట్యాదియందు అనేక బ్రహ్మాండములు చైతన్యమను అణువునందు స్వప్నమువలె భాసించుచున్నను, నివ్విషయమున బ్రహ్మదేవునిచే చెప్పబడిన బ్రహ్మాండాఖ్యానము ఇచట వర్ణింపబడినది.

శ్రీరాముడు వసిష్ఠుని,వర్తమాన జగత్తును గూర్చి తెల్పుమనగా, వసిష్ఠుడిట్లు పల్కెను.

ఓ రామచంద్రా| ఎరుగబడిన శబ్ధార్ధములతో కథ చెప్పిన అంతఃకరణమున బాగుగ జొచ్చినట్లు, భూత, భవిష్యత్‌లు తెలిసిన వర్తమానము సుబోధకమగును.

ఆ పరమాత్మయొక్క మాయాశక్తిచే ఒక్కొక్క అణువునందును అసంఖ్యాకములగు బ్రహ్మాండములు వర్తించుచున్నవి. ఈ విషయమును మాతండ్రియగు బ్రహ్మదేవుడు నాకు వచించిన ఆఖ్యానమును చెప్పుచున్నాను వినుము.

అతని బ్రహ్మాండాఖ్యానము లేక బ్రహ్మాండ పిండాఖ్యానమనియు నందురు. నిద్రయందు తమస్సుచే నావరింపబడిన జీవుడు, స్వప్నమున నిరాకారమగు చైతన్యమునే, పర్వతముగ గాంచునట్లు, ఆ మనస్సు స్వప్నమునందువలె తన దేహమున పంచేంద్రియములను గాంచెను. చిదాకాశ పరమాణువు త్త్రైలోక్యరూపమగు జగత్తును అవలోకించెను. అందు పెక్కు ప్రాణికోటులు ఆవరించియున్నవి. అందు అంఖ్యాకమగు విశాలమైన మహాజగంబులు గలవు.

అవి జీవ పృధివాది సమూహములచే పూర్ణములైయున్నవి. అజ్ఞానమున్నంత వరకు,పరమాత్మయందు అసంఖ్యాక బ్రహ్మాండ సమూహములున్నవి.

పదార్ధ దృష్టిచే పదార్ధములు అకారణములును, కల్పనాదృష్టిచే సకారణములును అగును. స్వప్న పదార్ధము మిధ్యారూపముగ తెలుసుకొనబడనంత వరకు మహా మోహాతిశయమును కలుగజేయును.

తెలుసుకొనిన పిదప మోహమును కలుగజేయును. అట్లే ఈ జగత్తు మిధ్మయని తెలిసిన దుఃఖప్రధము కాదు. కావున సమస్త పదార్ధములు కారణరహితములై, అజ్ఞాని దృష్టియందు భ్రాంతిచే కారణ సహితములైనట్లు భాసించుచున్నవి.

శుద్ధమైన గాఢనిద్రయందు, స్వప్న సుషుప్తులెట్లు వర్తించుచున్నవో, అట్లే సౌమ్యమై చిద్ఘనమైనట్టి ఆత్మరూపమునందు సృష్టి ప్రళయములు సంభవించుచున్నవి. ఈ ప్రపంచమున నెచట సాకార పదార్ధమొకింతయును లేదు.

ఇదియంతయు నిరాకారమై, శాంతమై, సర్వవ్యాపకమైనట్టి బ్రహ్మమే అగును. భ్రాంతిరూపమైనట్టి, ఈ సమస్త జగత్తు అభ్యంతరమున లేకయే యున్నది. ఈ సమస్త రూపము చైతన్యమే, స్వప్నమున భాసించుచున్నది.

అంతఃకరణ భూతాదులు, మృత్తిక, కాష్ట శిలాదులును, సమస్తము పదార్ధశూన్యమై, శూన్యత్వరహితమైన చైతన్యమే కాని వేరుకాదని ఎఱుగుము.

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 144 / Sripada Srivallabha Charithamrutham - 144 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 18
🌴. రావిదాసును గురించిన వర్ణనము - 7 🌴
🌻. వల్లభేశునకు శ్రీపాదుల కృపతో అక్షయపాత్ర అనుగ్రహము - 2 🌻

శాస్త్రికి వివాహమంత్రములే తెలియునుగాని, ప్రేతసంస్కారకర్మల గురించి, ఆయామంత్రముల గూర్చి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి విననూలేదు, కననూలేదు. శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బణ్ణ బ్రహ్మ స్థానమున కూర్చుండెను.అతని నోట అప్రయత్నముగా మంత్రములు వెలువడుచుండెను.

అది సుబ్బణ్ణకే ఆశ్చర్యము! ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహమంత్రములతో వారికి వివాహము జరిపించబడెను. మంగళసూత్రమునకు బదులుగా పసుపుకొమ్ము కట్టబడెను.

కన్యాదాత నిర్ధనుడు. వరుడు కూడా నిర్ధనుడే. వివాహసందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము …

🌹 🌹 🌹 🌹 🌹



279 🌻. 141. జీవన్ముక్త లక్షణములు - 3 🌻

ఆత్మ ఆనంద స్వరూపముగ ఎరిగినవారు అయిన యోగుల నిర్వికల్ప సమాధి మహాజఢత్వమే అగును. మరియు వారి సంకల్ప సమాధి సంసారమే యైనది. కావున వారి ధ్యాన సమాధులు వలన, మోక్షము లభించదు.

ఆత్మ యొక్క పూర్ణ జ్ఞానముచే, ఏ నిరతి శయానందము లభించుచున్నదో అదియే పరనిర్వాణమని చెప్పబడినది. అపుడు ఈ జగత్తు పూర్ణముగ లయమొందుచున్నది. పరమజ్ఞానమును బోధించినటువంటి యోగవాసిష్టముచే నుత్పన్నమైన వివేక బుద్ధిగల మనుజునకు శుద్ధమైన ఆత్మబోధయను ఉత్తమ జ్ఞానము సంప్రాప్తించు చున్నది.

మోక్షోపాయమగు ఈ శాస్త్రమును నిరంతరము విచారపూర్వకముగ పఠింపవలయును. ఏలయనిన ఆధ్యాత్మ జ్ఞానము,ఉపాయముచే తప్ప మరియే యుపాయము చేతను మనుజునకు(మోక్షము) లభించదు. భ్రాంతియనునది, తపస్సుచే కాని, తీర్ధాలచే గాని ఎన్నడును శమించదు.

ఏలయనిన తపస్సు తీర్ధాదుల వలన, స్వర్గాదిలోకములు ప్రాప్తించును గాని ముక్తికాదు. సూర్యోదయమువలన అంధకారము శమించునట్లు, నిర్మలజ్ఞానప్రకాశమును కలుగజేయు ఆత్మికశాస్త్రమువలన సాంసారిక భ్రాంతియంతయు శమించును.

ఎంతవరకు అజ్ఞానముండునో, అంతవరకు చైతన్యమే జగత్తువలె భాసించుచున్నది. ఆత్మజ్ఞానముద్వారా అజ్ఞానముయొక్క నాశమగుటయే ముక్తియని తెలుపబడుచున్నది. సృష్ట్యాదియందు స్వప్నముచే తప్ప,మరి ఏకారణమువలన ఈ దృశ్యమానమగు సృష్టిగాని, పరలోకముగాని సిద్ధింపనేరదు.

పరమాత్మ యొక్క శుద్ధమైనట్టి యనుభమేది కలదో అదియే స్వప్న పట్టణము. అదియే ఈ జగత్తునైయున్నది. నిర్మలమగు ఆకాశము కంటెను,అతి నిర్మలమైన ఈ మహాచైతన్యము నిజ శక్తిచే స్వయముగనే జగద్రూపమున భాసించు చున్నది. కావున జగత్తను పేరు చిదాకాశమునకు నైయున్నది. బ్రహ్మమే చిద్రూపమగుట వలన, తన యందు జీవత్వము గల్పించుచున్న దాని వలె నున్నదై, తన నిర్మల చిత్‌స్వరూపమును త్యజింపకయే మనోరూపమును పొందిన దానివలె నగుచున్నది.

ఈ చిదాకాశమే సమిష్టి మనోరూపముచే,ఈ సమస్త జగత్తును విస్తరింప జేయుచున్న దానివలె నున్నది. మరియు స్వయముగ నిర్వికార రూపమైనప్పటికిని, వికారివలె నగుచున్నది. సమిష్టి మనస్సే బ్రహ్మదేవుడు. అతడు సృష్టియొక్క హృదయమున నున్నవాడై,నిరంతరము సమస్త సృష్టిని స్వయముగ రచించుచు, సంహరించు చున్నాడు.

ప్రబుద్ధుడగు పురుషోత్తముడు, ఆత్మయందు మౌనముగ నున్నవాడై, అనంతమై అపారమై చిన్మాత్రమై, నిరతిశయానందమును పొందును.

వాయువు కంటే నద్దాని చలనము వేరు కానట్లు, చిదాభాసరూపులగు జీవులును సాక్షియగు పరమాత్మకంటే వేరుకాదు. కాన చిదాకాశము, బ్రహ్మము, చిన్మాత్రము, జీవచైతన్యము, మహాచిద్రూపము, పరమాత్మ అనునవన్నియు పర్యాయపదములే యైయున్నవి.

ఎవని చిత్తము దేని యందాసక్తమై యున్నదో, అది దానినే అనుభవించును. కాబట్టి ఎవని మనస్సు బ్రహ్మమందు అనురక్తమైయుండునో అది జగత్తను బ్రహ్మరూపమునే యనుభవించును.

చిదాకాశమున చిదాకాశమే తాను శుద్ధ సచిదానంద రూపముతో నుండియున్నప్పటికిని, స్వప్నమందువలె యధారీతి స్థితికల్గియున్నది. ఈ దృశ్య జగత్తుగ భాసించుచున్నది.

సేవాదుల ద్వారా సద్గురువును మెప్పించి,యాతని ముఖతః,ఈ మోక్షోపాయమగు యోగవాసిష్ట శాస్త్రముయొక్క బోధను విని, పిమ్మట మనన నిధి ధ్యాసలద్వారా దానినభ్యసించుటయను యుపాయము తప్ప మరియొక యుపాయమెద్దియు ఈ దృశ్యశమనమునకు మార్గము కాదు.

కావున ఈ శాస్త్రాభ్యాసమే చిత్తనిరోధనమునకుపాయము. కాన రామచంద్రా| ఇతర సామాన్య గ్రంధములకంటే,విలక్షణమైనట్టి మోక్షోపాయమునగు యోగవాసిష్టము సంసారభ్రమ వినాశము కొరకు యుత్తమ ఉపాయముగ నెఱుగుము. కావున ఈ గ్రంధపూర్వార్ధ ఉత్తరార్ధములను రెండు భాగములుగాని లేక ఒకభాగము గాని యధాశక్తి బాగుగా విచారింపవలయును. దానిచే దుఃఖక్షయము కల్గును.

కావున రామచంద్రా స్వప్నమున తాను మరణింప,చుట్టునూ బంధువుల రోధన ఆ స్వప్నకాలమున సత్యముగ భాసించినను,వాస్తవముగ ఎట్లు మిధ్యయైయున్నదో అట్లే ఈ దృశ్యమున ప్రత్యక్షముగ అనుభూతమైనప్పటికి జీవుడుద్రష్టతో గూడియున్నను ఇది మిధ్యయైయున్నది.

సశేషం......


278 🌻. 141. జీవన్ముక్త లక్షణములు - 2 🌻

మేల్కొనిన పిదప స్వప్నమందలి విపర్యాదులు రూపరహితములై, ఎట్లాకాశరూపము బొందుచున్నదో,అట్లే తత్వజ్ఞానము కల్గిన పిదప, ఈ ముల్లోకములను శాంతచిన్మాత్రాకాశమే అగుచున్నది.

ఆది సృష్టినుండియు ఈ జగత్తు వాస్తవముగ యుత్పన్నము కాకయే యున్నది. ఏది యుత్పన్నమైనట్లు భాసించుచున్నదో, అది జగన్మాయయొక్క ఇంద్రజాలమై యైయున్నది. వాస్తవముగ దృశ్యమెచటను, నొకింతయైనను నుత్పన్నము కాలేదు. భాసించుటలేదు. ఈ భాసించినదంతయు బ్రహ్మమే,స్వయముగ నట్టి రూపముగ ప్రకాశించుచున్నదగును.

ఓ రామా| సూర్యాదిసహితములగు అనేక సృష్టులు, చిన్మాత్రాకాశమను రత్నముయొక్క కాంతులైయున్నవి. కావున నివి చిద్రూపముకంటే వేరు కావు. స్వప్నమున జీవచైతన్యమువలె,చిదాకాశ…
[09:02, 01/05/2020] +91 98494 71690: 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 142 / Sripada Srivallabha Charithamrutham - 142 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 18
🌴. రావిదాసును గురించిన వర్ణనము - 5 🌴

🌻. భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు - 2 🌻

శ్రీపాదుల వారే "నీ హృదయమునందలి కోరికననుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నాను. నీవు ఉంపుడుకత్తెగా చేసుకున్న రజకవనిత వచ్చే జన్మములో నీ భార్య కావలసి ఉన్నది. కాని యీ జన్మములోనే ఆమెను నీ దానిగా చేసుకుంటివి.

ఏ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు ఆ నియమమును ఉల్లంఘించితివి. వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములనుభవించెదరు. నీవు నపుంసక జన్మనొంది ఆ రజకవనితకు సేవలు చేయుచూ కర్మఫలము ననుభవించెదవు.

నీవు యీ మూడు వర్శములలోనూ కొన్ని సత్కర్మలాచరించిన అన్నవస్త్రములకు లోటులేకుండా రజకవనిత వద్ద సేవచేసుకొనెదవు. దుష్కర్మలనాచరించిన రజక దంపతుల సేవచేయుచూ శ్రమకు తగ్గ ఫలితము లేక నానా యాతనలను అనుభవించెదవు.

మరణము నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రావిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును. ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాద్దత్తావతారమైన నన్ను సేవించు కొనగలడు.

నీవు శీఘ్రముగా ఈ పుణ్యభూమినుండి వైదొలగవలసినది." అని ఆజ్ఞాపించిరి. ఆ పండితుడు వెడలిపోయెను. రావిదాసు శ్రీపాదులవారి దుస్తులను ఉతుకుటయూ, ఆశ్రమ ప్రాంగణమును శుభ్రపరచుటయూ మొదలగు సేవలను చేసుకొను చుండెను.

శ్రీపాదులవారు నదీస్నానానికి వచ్చినప్పుడల్లా రావిదాసు శ్రీగురుదేవులకు సాష్టాంగ నమస్కారము చేసుకొనెడివాడు. శ్రీపాదులవారు ప్రసన్నవదనముతో వాని నమస్కారములను స్వీకరించెడివారు. రావిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను.

శ్రీపాదులవారు సర్వాంతర్యామి గనుక వారికి చేసిన నమస్కారమునకు ప్రతిగా అనేక వందలమంది చేత నమస్కరించబడెడి మహాయోగము కలుగునని తన తండ్రి చెప్పియుండెను.

అయితే యీ నమస్కారములను వారు అంగీకరించినపుడు మాత్రమే ఈ మహాయోగము కలుగుననికూడా తన తండ్రి చెప్పియుండెను. రావిదాసు తన నమస్కారములను శ్రీపాదులవారు అంగీకరించుటవలన అమితానందముతో నుండెను.

రావిదాసు ఒకానొక దినమున ఒక మహారాజు సుందర యువతీజనముతో కలసి జలక్రీడలాడుటను గాంచి తను గూడా మహారాజు జన్మనెత్తిన బాగుండునని మనస్సున తలంచెను. శ్రీపాదులవారు నదీ స్నానమునకు పోవునపుడు వారితో సంభాషించు సందర్భమున ఈ విషయము చర్చకువచ్చి, రావిదాసునకు యవనవంశమందు వైడూర్యనగరమున జన్మించునట్లు వారు వరదానమొసంగిరి.

తాము నృశింహ సరస్వతీ అవతారమందు వానికి దర్శనభాగ్యమి చ్చెదమని అభయమొసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూచిరి. రావిదాసు అక్కడికక్కడే మరణించెను. నా మనోనేత్రములకు అగుపడెడి యీ వింతదృశ్యములను చూచుచూ నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని.

నేను స్వస్థుడనైనంతనే శ్రీపాదులవారు నా వంకచూసి మందహాసము చేసిరి. క్షణక్షణ లీలావిహారి అయిన శ్రీగురుదేవులను ఎంతని ప్రస్తుతించగలము?

ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులయిన తమ భర్తలతో అక్కడికి వచ్చిరి. కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమయిన వరులను కోరి అచ్చటికి వచ్చిరి.

వారందరికీ శ్రీగురుదేవులు పసుపుకొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరునూ మహాదానందముతో అచ్చట నుండి వెడలుచుండిరి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
 


277🌻. 141. జీవన్ముక్త లక్షణములు - 1 🌻

విశ్రాంత చిత్తుడగు జీవన్ముక్తుని యొక్క అనేక లక్షణములు, ఆత్మజ్ఞానియొక్క ఆత్మయందు విశ్రమించుట ఇట వర్ణింపబడినది.

ఓ రామచంద్రా| సదా అంతర్ముఖమైనట్టి ప్రత్యగాత్మయందు ఆసక్తమైనట్టి బుద్ధిగల,ఏ ఆత్మజ్ఞానికి, సుఖహేతువగు విషయసమూహము, సుఖముగాని, దుఃఖహేతువగు విషయ సమూహము, దుఃఖముగాని కల్పింపదో అట్టివాడు జీవన్ముక్తుడు.

అజ్ఞానుల బుద్ధి విశాలభోగములనుండి ఎట్లు చలింపక యుండునో, అట్లు జ్ఞానియొక్కబుద్ధి చిదాకాశమునుండి చలింపక నచ్చోటనే నిశ్చలముగ నుండునో, అతడు జీవన్ముక్తుడు. పరమాత్మయందు విశ్రాంతి పొందినదై, నెవని మనస్సు మరల ఇటనుండి మరలి,దృశ్యమందెన్నటికిని ప్రీతిగొనకయుండునో, అతడు జీవన్ముక్తుడన బడును. అంత శ్రీరాముడిట్లు ప్రశ్నించెను.

 ఓ మునీంద్రా| ఎవరికి సుఖహేతువగు విషయము సుఖముగాను, దుఃఖహేతువగు విషయము దుఃఖముగాని కల్గింపదో,అట్టి మనుజుని నేను చేతన విరహితుడగు జఢునిగ తల్చెదను.

ఓ రామచంద్రా| శుద్ధబోధి స్వరూపుడగు ఎవడు కేవలము చిదాకాశమునందే స్థితి కల్గియుండి, అప్రయత్నముగనే బాహ్యసుఖము ననుభవించకయుండిన అట్టివాడు విశ్రాంత చిత్తుడు,జీవన్ముక్తుడు అగును.

వివేకముచే మూలజ్ఞానము నశింప ఎవనికి వాస్తవముగ సమస్త విషయములందు సందేహములు నశించిపోవును,అతడు పరమాత్మ పధమున విశ్రాంతి పొందినవాడని వచింపబడింది. వ్యవహారము నడుపుచున్నను, ఎవని అంతరంగమున ఏ పదార్ధమందును రాగము లేకయుండునో అతడు పరమాత్మ పధమున విశ్రాంతి పొందిన వాడగును.

ఎవని సమస్త కార్యములు ఫలాపేక్షరహితములై యుండునో, మరియు నెవడు యధాప్రాప్తమగు పదార్ధములందు మాత్రమే వర్తించునో,నతడు విశ్రాంత చిత్తడని ఎంచుము.

సంసారమను దీర్ఘ మార్గమున పరిభ్రమించు నివృత్తుడైనవాడు, ఆత్మయందు విశ్రాంతి పొందినవాడును, బహిర్ముఖ వృత్తిగల అజ్ఞానులతో సంభాషించని వాడునగు జీవన్ముక్తుడు, ఆత్మయందు మౌనముగ నుండువాడే గాని, జఢస్వరూపుడుకాదు. ఎవడు సంసారముయెడ విరక్తుడై సమస్త కర్మ సమూహమును విడిచి స్వాత్మయందే నెలకొనియుండునో అతడు ఆత్మారాముడని చెప్పబడును.

అట్టివాడు జఢుడెన్నటికి కాడు. సంసార మార్గమున అలసిన జీవుడు, సౌభాగ్య వశమున సాధనాసంపత్తి వృత్తుడై, సత్‌శాస్త్ర, సద్గురువుల యనుగ్రహము వలన తత్వమును పొంది,సంసారసముద్రమును దాటి అచట సుఖముగ నిద్రించును.

ఆహా| నేత్రములు మూయకయున్నప్పటికిని ఎవనికి ప్రపంచమంతయు విలీనమైపోవుచున్నదోఅట్టి పరమార్ధ జ్ఞానమధోన్మత్తుడగు ఆత్మజ్ఞాని,సుఖముగ నిద్రించుచున్నాడు.

విషయజనిత సుఖములేకున్నను నిరతిశయ ఆత్మానందముతో గూడియున్నవాడై నాశరహితమైన సుఖము ననుభవించుచు సుఖముగ నిద్రించుచున్నాడు. కామక్రోధాది అంధకారము లేనివాడై,ఆత్మ ప్రకాశ తత్పరుడై,స్వాత్మయందు శయనించుచున్నాడు.

అట్టి సూక్ష్మమగు అనురూపముతోను, విశాలమైన స్థూల చిత్‌ స్వరూపముతోను ప్రతి పరమాణువునందును, అనంతకోటి బ్రహ్మాండములు ధరించుచు ఆత్మజ్ఞాని సుఖముగ నిద్రించుచున్నాడు. అనేక సృష్టి సమూహములను సంహారమొనర్చుచు, వాస్తవముగ సంహారమొనర్చనివాడై, ఆత్మజ్ఞాని సుఖముగ నిద్రించుచున్నాడు.

ఈ ప్రకారముగ జ్ఞాని సదా నిద్రించుచున్నను (ఆత్మయందు)జాగ్రత్‌ స్వప్నమునందు ఇతరులవలె మేల్కొనుచు,నిదిరించుచు జాగ్రత్‌ స్వప్నమునందు క్రీడించుచున్నాడు.
పుత్ర, పుత్రికా, పత్నీ, సేవకాసహితమగు స్వకర్మయే జీవన్ముక్తుని మిత్రుడు. అతని గుణములు సుఖముగ అతనితో క్రీడించుట ఇట వర్ణింపబడుతున్నది.

ఓ రామచంద్రా| స్వకుల పరంపరచే సంప్రాప్తమైన సహజకర్మ, లోకసంగ్రహార్థమై స్వప్రయత్నముచే అభ్యసించబడిన, సత్‌ శాస్త్రాభ్యాస విచార రూపమగు స్వకర్మ అనునది వేరుగనున్నను ఒకటే యైయున్నవి.

అట్టి యుత్తమ కర్మయే జీవన్ముక్తుని సహజమిత్రుడు. అట్టి మిత్రులు,తండ్రివలె ఆడించును, భార్యవలె దుష్కర్మలనుండి నివారించును. సూర్యుడు అంధకారమును తొలగించునట్లు అప్రియమును తొలగించును. ఈతని పుత్రులు దాన, తప, ధ్యానాదులతో కూడియుండును.

ముదిత ఈతని భార్య,కరుణ ఈతని చెలికత్తె. సత్యమనునది ఈతని రెండవభార్య. ఈ ప్రకారమగు పరివారముతో గూడియున్నవాడును,మంత్రిరూపుడును అగు స్వకర్మయను మిత్రునితో గూడ వ్యవహరించుచు జీవన్ముక్తుడు అన్ని విషయములందు సమముగ వర్తించును.

మరియు జీవన్ముక్తుడు పుణ్యకథలు చెప్పువాడు, స్వపర దోషముల నెరుగువాడు, సమదృష్టి గలవాడు, ఉదారచరితుడు, ధానశీలుడై యొప్పును.

జీవన్ముక్తి యొక్క ప్రతిష్టకొరకు, సర్వ సందేహముల నివృత్తికొరకు, తత్వోపదేశముల ద్వారా దృశ్యమును తుడిచివేయుట.

ఓ రామచంద్రా| చిదాకాశముయొక్క అభాసమే ఈ జగత్తుగ స్ఫురింపబడు చున్నది. వాస్తవముగ జగత్తుగాని అభాసముగాని, శూన్యముగాని, వృత్తి చైతన్యముగాని ఎవ్వియునులేవు.

సుషుప్తి దశనుండి స్వప్న దశ ప్రాప్తించునపుడు, మనస్సుయొక్క సంకల్పమే అచట నగరాది రూపములుగ భాసించుచున్నది. సృష్ట్యాదియందు, పరమచిదాకాశమే దృశ్యజగత్తువలె భాసించుచున్నది.

సశేషం....


276🌻. 140.శిలాఖ్యానము  - 1 🌻

ఆత్మఖ్యాతి యొక్క విశేషము, ఇతర ఖ్యాతుల స్థితి, ప్రశ్నోత్తర సహితమగు బ్రహ్మలీల, శిలోపాఖ్యానమున వర్ణింపబడినది.

ఓ రామచంద్రా| ఈ సందర్భమున శిలాఖ్యానమును గూర్చి వినుము. అనేక వేల కోట్ల యోజనములుగల, అంతట వ్యాపించియుండు ఆకాశమువంటి గోడ యుండుచో, దానివలె కఠినమై.నిర్మలమై, విశాలమైనదియు నొక శిలగలదు.

అది అవయవముల సంధులు లేక మిగుల దట్టమైనదియు, వజ్రమువలె దృడమైనదియు నైయున్నది. దానినెవరు ఎరుగకయుండిరి. ఆ శిల చేతనముకాదు, అచేతనముకాదు. అతి దృఢమగు ఆ శిల దేనిచేతను భేదింపబడదు. దానిని భేదించువాడు ఎవడును లేడు.

దానియందు రేఖామయములగు అనంత వృక్షములు, పర్వతములు, గ్రామ నగరములు గలవు. అచట దేవదానవులు గలరు. అందు ఆకాశము, సూర్యచంద్రులు గలరు. అట్టి శిలను, అందలి రేఖలను నేను గాంచితినని వసిష్ఠుడు శ్రీరామునికి తెలిపెను. ఆ శిలాగర్భమున నేనును ఒక రేఖనైయుంటిని. అందువలననే అచట గల సర్వమును నేను గాంచగల్గితిని.

ఓ రామా| ఈ శిలాఖ్యానముద్వారా పరమాత్మయొక్క సర్వ వ్యాపకత్వమును గూర్చియే చెప్పితిని గాని శిలనుగూర్చికాదు. ఆ శిలయందు చిద్రరహితమగు గర్భమును, మనమందరము దాని మాంసము పగిది వర్తించుచున్నాము.

ఆ శిలయందు ఆకాశము వాయువు మున్నగు పంచభూతములు, వాటి తన్మాత్రలు, మనస్సు బుద్ధి అహంకారము లన్నియు, ఆ శిల యొక్క అంగములు. ఆ శిల చిన్మాత్ర రూపమే అదే బ్రహ్మము నైయున్నది.

ఆ బ్రహ్మము తనంతట తానే సృష్టి, స్థితి, జగత్తు, భువనము మున్నగు పర్యాయపధములచే ప్రసిద్ధమగు దృశ్యమను పేరుగల కల్పనను స్వీకరించుచున్నది.

ఈ జగత్తు పలువిధ శబ్దములు చేయుచున్నను, యదార్ధముగ మౌనముగనే యున్నది. నిరంతరము గమనము సల్పుచున్నను, ఆకాశమువలె పర్వతమువలె నొకేస్ధానముననున్నది. పలువిధ అనుభవములున్నను,వాస్తవముగ అనుభూత రహితమైయున్నది.

ఈ బ్రహ్మస్వరూపమగు ఆత్మ తన స్వరూపమును త్యజింపకుండెను. జగత్తు,స్వప్నము,సుషుప్తి,తురీయు,ఆత్మయను నీ ప్రకారమగు నామములను స్వయముగ గాంచెను.

ఈ జగత్తంతయు, చైతన్యము యొక్క స్ఫురణ మాత్రమే యైయున్నది. కావున చైతన్యమెట్లు స్ఫురించుచున్నదో అట్లే ఈ జగత్తు భాసించుచున్నది.

వాస్తవముగ చిద్రూపమై సర్వవ్యాపకమైనట్టి చిదాకాశమందు, చిదాకాశమే ఇట్లు జగత్తువలె భాసించుచున్నది. చైతన్యము చిదాకాశముయొక్క సారమైయున్నది. అది సదా ఏకరూపమై, ఉదయాస్ధమయములు లేక వెలయుచున్నది. చైతన్యముయొక్క అవయవమే ఈ జగత్తు.

కావున జాగ్రత్తు స్వప్న సుషుప్తి, తురీయము, సృతి, ఇచ్ఛ, జాగ్రతాది దృష్టులన్నియు మిధ్యయే యైయున్నవి. జన్మరహితమగు మహాచైతన్యరూప చిదాకాశము, తన యొక్క స్ఫురణమునకే మొదట పృధ్వాది నామములు గల్గించి ఆ పిమ్మట, వానితో వ్యవహరించుచున్నది.

ఓ రామచంద్రా| యుత్తమ విచారణచే, శుద్ధమైన నిర్మల ఉత్కృష్ట బుద్ధిచే, సంకల్పమయమగు, సమస్త వికల్ప సమూహమును, అంతఃకరణనుండి పారద్రోలి, మనస్సును ఆత్మయందు నెలకొల్పి, నిష్టాపరుడవై ఈ సంసారమునుండి ఎగిరి,మోక్షమను ఉత్తమ పధమును పొందుము.

ఓ రామచంద్రా| వృక్షము అబుద్ధిపూర్వకముగనే శాకాది వైచిత్య్రమును గావించునట్లు, వికారరహితుడగు పరమాత్మ తన స్వరూపమున శూన్యములగు విచిత్ర ప్రపంచములయొక్క అభ్యాసములను అబుద్ధిపూర్వకముగనే గావించుచున్నాడు. సముద్రము అబుద్ధిపూర్వకముగనే ఆవర్త తరంగాదులను రచించుచునట్లు సర్వేస్వరుడును చిదాకాశమున జగత్‌ ప్రతిభాసములన్నిటిని గావించు చున్నాడు.

వృక్షమునుండి యుత్పన్నములైన పుష్పగుచ్యాదులకు, మరియొక డెట్లు పేరు పెట్టుచున్నాడో అట్లే చైతన్యమను వృక్షముయొక్క, పుష్పాదిరూపమగు పృధ్వాదులకు సమిష్టిరూపులగు హిరణ్యగర్భాదులు నామములు గల్పించుచున్నను, వృక్షముయొక్క ఫల,పుష్ప పత్రాదులు వృక్షముకంటే వేరుగా ఎట్లున్నవో, అట్లే చిదాకాశరూపుడగు పరమాత్మనుండి జనించిన ఈ పృధ్వాది జగత్తు పరమాత్మకంటే వేరుకాకయున్నది.

పుష్పమందుగల గంధము, ఆకాశమున శూన్యము, వాయువునందు చలనము ఎట్లు విడదీయలేమో అట్లే చైతన్యమున అనేక బ్రహ్మాండములు సృష్టులు అభిన్నములై వెలయుచున్నవి. కారణములేక ఏది జనించుచున్నదో అది జనించినను జనింపనిదేయగును. కావున పృధ్వాదియందు ఈ జగత్తు యుత్పన్నముకానిదే యగును. కాన ఇది ఆదిస్వరూపమగు బ్రహ్మమేయై వెలయుచున్నది.

పద్మాదుల కాంతులు, అబుద్ధిపూర్వకముగ జనించునట్లు, బ్రహ్మసత్తయే జగదాకారముగ అబుద్ధిపూర్వకముగ స్ఫురించుచున్నది. ఈ జగత్తు శూన్యమే అగుచు(లేనిది) యుత్పన్నమగుచున్నది, వృద్ధిపొందుచున్నది.

మరియు అత్యంత శూన్యత్వముతో గూడి,శూన్యరూపమే అగుచు నశించుచున్నది. ప్రధమమున, అబుద్ధి పూర్వక దృశ్యాకార ప్రతిభాసనవలన, దృశ్యరూపమైనట్టి యా చిదాత్మ అటుపిమ్మట స్మృష్ట్యాది, పృధ్వాది, బుధ్ద్యాది కల్పనా రూపములగు సంజ్ఞలను కల్పించు చున్నది.

సృష్ట్యాదియందును, ఆ చైతన్యము ప్రధమమున నిర్వికల్పరూపమేయై పిమ్మట ప్రాణలయొక్క అదృష్టముననుసరించి, యుత్నన్నములైన మనోవికల్పులచే సభావముగ, విచిత్రములైన సృష్టికల్పనలు గావించుచున్నది.

పరబ్రహ్మమెట్టి శుద్ధ చిన్మయస్వరూపమైయున్నదో,ఈ దృశ్యజగత్తును నట్టి శుద్ధ చిన్మయ రూపమై యున్నది. స్వప్నమున ఏది చిదాకాశమో అదియే స్వప్న నగరమును నగును కదా|

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ