శ్రీ శివ మహా పురాణము -

 🌷. శ్రీ శివ మహా పురాణము - 120 🌷రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
29. అధ్యాయము - 4
🌻. నారదునకు విష్ణువు ఉపదేశించుట  - 2 🌻

ఇత్థముక్త్వా హరిం సోsథ మునిర్మాయావిమోహితః | శశాప క్రోధనిర్విణ్ణో బ్రహ్మతేజః ప్రదర్శయన్‌ || 14

స్త్రీకృతే వ్యాకులం విష్ణో మామకార్షీర్విమోహకః | అన్వకార్షీ స్స్వరూపేణ యేన కాపట్య కార్యకృత్‌ || 15

తద్రూపేణ మనుష్యస్త్వం భవ తద్దుఃఖభుగ్ఘరే | యన్ముఖం కృతవాన్‌ మే త్వం తే భవంతు సహాయినః || 16

త్వం స్త్రీ వియోగజం దుఃఖం లభస్వ పరదుఃఖదః | మనుష్యగతికః ప్రాయో భవాజ్ఞానివిమోహితః || 17

మాయా మోహితుడగు నారదముని విష్ణువుతో నిట్లు పలికి, బ్రహ్మతేజస్సును ప్రదర్శించుచున్నవాడై, క్రోధావేశముతో శపించెను (14).

హే విష్ణో! స్త్రీ కొరకై నన్ను మోసము చేసి దుఃఖమును కలిగించితివి. హే హరే! నీవు కపటముచేసి నాకు ఏ రూపమును ఇచ్చితివో (15),

అదే రూపముతో మనుష్యుడవై జన్మించి, ఆ జన్మలో దుఃఖము ననుభవింపుము. నీవు నాకు ఏ వానర ముఖమును ఇచ్చితివో, అదే వానరులు నీకు సహాయ కారులగుదురు (16).

ఇతరులకు దుఃఖమును కలిగించిన నీవు స్త్రీ వియోగ దుఃఖమును పొందెదవు. మనుష్య జన్మలో నీవు తరుచు అజ్ఞానముచే మోహితుడవై ఉండెదవు (17).

ఇతి శప్త్వా హరిం మోహాన్నారదోs జ్ఞానమోహితః | విష్ణుర్జగ్రాహ తం శాపం ప్రశంసన్‌ శాంభవీ మజామ్‌ || 18

అథ శంభుర్మహాలీలో నిశ్చకర్ష విమోహినీమ్‌ | స్వమాయాం మోహితో జ్ఞానీ నారదోsప్య భవద్యయా || 19

అంతర్హితాయాం మాయాయాం పూర్వవన్మతి మానభూత్‌ | నారదో విస్మితమనాః ప్రాప్తబోధో నిరాకులః || 20

పశ్చాత్తాపమవాప్యాతి నినింద స్వం ముహూర్ముహుః | ప్రశశంస తదా మాయాం శాంభవీం జ్ఞానమోహినీమ్‌ || 21

అజ్ఞానముచే మోహితుడైన నారదుడు విష్ణువును ఇట్లు శపించగా, విష్ణువు పుట్టుకలేని శివమాయను ప్రశంసించి, ఆ శాపమును స్వీకరించెను (18).

అపుడు గొప్ప లీలలు గల శంభుడు మోహమును కలిగించు తన మాయను ఉపసంహరించెను. ఆ మాయచేతనే జ్ఞానియగు నారదుడు కూడ మోహితుడాయెను గదా! (19).

మాయ తొలగిపోగానే, నారదుడు పూర్వమునందు వలె జ్ఞాని ఆయెను. జ్ఞానము కలుగగానే దుఃఖము తొలగి, నారదుడు ఆశ్చర్యచకితుడాయెను (20).

అతడు పశ్చాత్తాపమును పొంది తాను చేసిన పనులను పునః పునః నిందించుకొనెను. అపుడాతడు, జ్ఞానమును పొగొట్టి మోహింపజేయు శివమాయను కొనియాడెను (21).

అథ జ్ఞాత్వా మునిస్సర్వం మాయావిభ్రమమాత్మనః | అపతత్పాదయోర్విష్ణోర్నారదో వైష్ణవోత్తమః || 22

హర్యుపస్థాపితః ప్రాహ వచనం నష్టదుర్మతిః | మయా దురుక్తయః ప్రోక్తా మోహితేన కుబుద్ధినా || 23

దత్తశ్శాపోsపి తేనాథ వితథం కురు తం ప్రభో | మహత్పాపమకార్షం హి యాస్యామి నిరయం ధ్రువమ్‌ || 24

కముపాయం హరే కుర్యాం దాసోsహం తే తమాదిశ | యేన పాపకులం నశ్యేన్నిరయో న భవేన్మమ || 25

అపుడా మహర్షికి తాను మాయా విమోహితుడై చేసిన పనులన్నియు తెలియవచ్చెను. వైష్ణవోత్తముడగు నారదుడు అపుడు విష్ణువు పాదములపై పడెను (22).

శ్రీహరి అతనిని లేవదీయగా, దుష్టబుద్ధి తొలగిపోయిన నారదుడిట్లు పలికెను. మోహితుడనైన నేను దుర్బుద్ధితో దుష్టవచనములను పలికితిని (23).

పైగా, శాపమును కూడ ఇచ్చితిని. హే ప్రభో! ఆ శాపము అసత్యమగునట్లు చేయుము. నేను మహాపాపమును చేసితిని. నేను నరకమును పొందుట నిశ్చయము (24).

హే హరే! పాపమంతయూ నశించి, నాకు నరకము కలుగకుండునట్లు ఉపాయమేమి గలదు? నేను నీదాసుడను. నాకు అట్టి ఉపాయమును ఉపదేశింపుము (25).

ఇత్యుక్త్వా స పునర్విష్ణోః పాదయోర్మునిసత్తమః | పపాత సుమతిర్భక్త్వా పశ్చాత్తాపము పాగతః || 26

అథ విష్ణుస్తముత్థాప్య బభాషే సూనృతం వచః |

ఇట్లు పలికి నారదమహర్షి పశ్చాత్తాపమునుపొంది, సద్బుద్ధి గల వాడై భక్తితో మరల విష్ణువు పాదములపై పడెను (26).

విష్ణువు అపుడాతనిని లేపి ఈ సత్యవచనమును పలికెను.

విష్ణు రువాచ |

న ఖేదం కురు మే భక్తవరస్త్వం నాత్ర సంశయః|| 27

శృణు తాత ప్రవక్ష్యామి సుహితం తవ నిశ్చయాత్‌ | నిరయస్తే న భవితా శివశ్శం తే విధాస్యతి || 28

యదకార్షీ శ్శివవచో వితథం మదమోహితః | స దత్తవానీదృశం తే ఫలం కర్మఫలప్రదః || 29

శివేచ్ఛయాsఖిలం జాతం కుర్విత్థం నిశ్చితాం మతిమ్‌ | గర్వాపహర్తా స స్వామీ శంకరః పరమేశ్వరః || 30

పరం బ్రహ్మ పరాత్మా స సచ్చిదానంద బోధనః | నిర్గుణో నిర్వికారో చ రజస్సత్త్వతమః పరః || 31

విష్ణువు ఇట్లు పలికెను -

నీవు దుఃఖింపకుము. నీవు నా భక్తులలో శ్రేష్ఠుడవనుటలో సందియము లేదు (27).

వత్సా! నేను నీకు నిశ్చయముగా హితమును చెప్పెదను. వినుము. నీకు నరకము సంప్రాప్తము కాదు. శివుడు నీకు మంగళమును చేయగలడు (28).

నీవు గర్వముచే మోహితుడవై శివుని వచనమును అవమానించితివి. కర్మఫలములనిచ్చు శివుడు నీకీ ఫలమునిచ్చినాడు (29).

సర్వము శివుని ఇచ్ఛచేతనే సంభవించునని నీవు మనస్సులో నిర్ణయించుకొనుము. శంకరస్వామి గర్వమును పోగొట్టును. ఆయనయే పరమేశ్వరుడు (30),

పరబ్రహ్మ, పరమాత్మ, సచ్చిదానందస్వరూపుడు, నిర్గుణుడు, వికార రహితుడు, రజస్సత్త్వ తమోగుణాతీతుడు (31).

సశేషం.....
🌹 🌹 🌹 🌹

🌷. శ్రీ శివ మహా పురాణము - 121 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
29. అధ్యాయము - 4
🌻. నారదునకు విష్ణువు ఉపదేశించుట  - 3 🌻

స ఏవమాదాయ మాయాం స్వాం త్రిధా భవతి రూపతః | బ్రహ్మ విష్ణుమహేశాత్మా నిర్గుణోs నిర్గుణోsపి సః || 32

నిర్గుణత్వే శివాహ్వో హి పరమాత్మా మహేశ్వరః | పరం బ్రహ్మావ్యయోsనంతో మహాదేవేతి గీయతే || 33

తత్సేవయా విధిస్స్రష్టా పాలకో జగతామహమ్‌ | స్వయం సర్వస్య సంహారీ రుద్రరూపేణ సర్వదా || 34

సాక్షీ శివస్వరూపేణ మాయా భిన్నస్స నిర్గుణః |స్వేచ్ఛాచారీ సంవిహారీ భక్తానుగ్రహకారకః || 35

ఆయన మాయను ఈ విధముగా తన వశము చేసుకొని, బ్రహ్మవిష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల రూపములో నుండును. సగుణుడు, నిర్గుణుడు కూడా ఆయనయే (32).

నిర్గుణుడగు పరమాత్మకు శివుడని పేరు. ఆయనయే మహేశ్వరుడు, పరబ్రహ్మ, అవ్యయుడు,అనంతుడు, మహాదేవుడు అని కీర్తింపబడును (33).

శివుని సేవించి బ్రహ్మ సృష్టికర్త అయినాడు. నేను జగద్రక్షకుడనైతిని. శివుడు స్వయముగా రుద్రరూపుడై సర్వమును సంహరించును (34).

పరమాత్మ శివస్వరూపములో సాక్షియై ఉండును. నిర్గుణుడగు పరమాత్మకు, మాయకు భేదము లేదు. ఆయన స్వేచ్ఛగా విహరించును. ఆయన భక్తులను అనుగ్రహించును (35).

శృణు త్వం నారదమునే సదుపాయం సుఖప్రదమ్‌ | సర్వపాపా పహర్తారం భుక్తిముక్తి ప్రదం సదా || 36

త్యక్త్వా స్వసంశయం సర్వం శంకరసద్యశః | శతనామ శివస్తోత్రం సదానన్యమతిర్జప || 37

యజ్ఞపిత్వా ద్రుతం సర్వం తవ పాపం వినశ్యతి | ఇత్యుక్త్వా నారదం విష్ణుః పునః ప్రాహదయాన్వితః || 38

మునే న కురు శోకం త్వం త్వయా కించిత్‌ కృతం న హి | స్వేచ్ఛయా కృతవాన్‌ శంభురిదం సర్వం న సంశయః || 39

ఓ నారదమహర్షీ! సర్వపాపములను పోగొట్టి సుఖమునిచ్చునది, సర్వదా భుక్తిని ముక్తిన ఇచ్చునది యగు మంచి ఉపాయమును నీవు వినుము (36).

నీవు నీ సందేహముల నన్నిటినీ విడనాడి, శంకరుని యశస్సును గానము చేయుము. నీవు మనస్సును లగ్నముచేసి, సర్వదా శివశతనామ స్తోత్రమును జపించుము (37).

దానిని జపించినచో నీ పాపము వెనువెంటనే నశించును. అని నారదునకు బోధించి, దయామయుడగు విష్ణువు మరల ఇట్లు అనుచున్నాడు (38).

ఓ మహర్షీ! నీవు శోకించకుము. నీవు చేసిన దేమియూ లేదు. దీని నంతనూ శంభువు తన ఇచ్ఛ చేతనే నడిపించినాడనుటలో సందియము లేదు (39).

అహార్షీత్త్వన్మతిం దివ్యాం కామక్లేశమదాత్స తే | త్వన్ము ఖాద్దాపయాంచక్రే శాపం మే స మహేశ్వరః || 40

ఇత్థం స్వచరితం లోకే ప్రకటీ కృతవాన్‌ స్వయమ్‌ | మృత్యుంజయః కాలకాలో భక్తోద్ధారపరాయణః || 41

న మే శివసమానోsస్తి ప్రియస్స్వామీ సుఖప్రదః | సర్వశక్తి ప్రోదో మేsస్తి స ఏవ పరమేశ్వరః || 42

తస్యో పాస్యాం కురు మునే తమేవ సతతం భుజ | తద్యశః శృణు గాయ త్వం కురు నిత్యం తదర్చనమ్‌ || 43

నీ మనస్సులో కామము, చిత్తమలములు, గర్వము ప్రవేశించినవి. అందువలననే ఆయన నీ దివ్యమగు బుద్ధిని అపహరించినాడు. ఆ మహేశ్వరుడే నోటినుండి నాకు శాపము నిప్పించినాడు (40).

మృత్యువును జయించిన వాడు, మృత్యువునకు మృత్యువు, భక్తులను ఉద్ధరించుటయే ప్రధానలక్ష్యముగా గలవాడు నగు శివుడు తన చరితమును తానే లోకములో ప్రకటించినాడు (41).

నాకు శివునితో సమముగా సుఖములనిచ్చు ప్రభువు మరియొకడు లేడు. ఆ పరమేశ్వరుడే నాకు శక్తులనన్నింటినీ ఇచ్చినాడు (42).

ఓ మహర్షీ! నీవా శివుని ఉపాసించుము. సర్వదా శివుని మాత్రమే భజించుము. శివుని కీర్తిని వినుము, పాడుము. నిత్యము శివుని పూజింపుము (43).

సశేషం.....


🌷. శ్రీ శివ మహా పురాణము - 119 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
29. అధ్యాయము - 4
🌻. నారదునకు విష్ణువు ఉపదేశించుట  - 1 🌻

ఋషయ ఊచుః |

సూత సూత మహాప్రాజ్ఞ వర్ణితా హ్యద్భుతా కథా | ధన్యా తు శాంభవీ మాయా తదధీనం చరాచరమ్‌ || 1

గతయోర్గణయోశ్శంభోస్స్వయ మాత్మేచ్ఛయా విభోః | కిం చకార మునిః క్రుద్ధో నారదస్స్మరవిహ్వలః || 2

ఋషులిట్లు పలికిరి -

ఓ సూతా! మహాజ్ఞానివగు నీవు అద్భుతమగు కథను చెప్పితివి. శివుని మాయ ధన్యురాలు. స్థావరజంగమాత్మకమగు జగత్తు ఆమె అధీనమునందున్నది (1).

శివుని అనుయాయులిద్దరు శివుని ఇచ్ఛను గ్రహించి తమ స్థానమునకు వెళ్లిపోగా, కామపీడితుడగు నారదముని క్రుద్ధుడై ఏమి చేసెను? (2).

సూత ఉవాచ |

విమోహితో మునిర్దత్వా తయోశ్శాపం యథోచితమ్‌ | జలే ముఖం నిరీక్ష్యాథ స్వరూపం గిరిశేచ్ఛయా || 3

శివేచ్ఛయాన ప్ర బుద్ధస్స్మృత్వా హరికృతచ్ఛలమ్‌ | క్రోధం దుర్విషహం కృత్వా విష్ణులోకం జగామ హ || 4

ఉవాచ వచనం క్రుద్ధస్సమిద్ధ ఇవ పావకః | దురుక్తి గర్భితం వ్యంగ్యం నష్టజ్ఞాన శ్శివేచ్ఛయా || 5

సూతుడిట్లు పలికెను -

మోహితుడై యున్న నారదుడు వారిద్దరికి తగు శాపమునిచ్చి, నీటిలో తన ముఖమును, తన ఇతర స్వరూపమును చూచుకొనెను. ఇది అంతయూ శివుని ఇచ్ఛచే జరుగచుండెను (3).

అతనికి ఇంకనూ జ్ఞానప్రబోధము కాలేదు. అతడు విష్ణువు చేసిన మోసమును స్మరించి, సహింప శక్యము కాని కోపమును పొంది విష్ణులోకమునకు వెళ్లెను (4).

ఇంధనము వేసిన అగ్ని హోత్రమువలె క్రోధముతో మండిపడుచున్నవాడై, అతడు వెటకారముతో నిందావచనములను పలికెను. శివుని సంకల్పముచే నాతడు జ్ఞానమును కోల్పోయి ఉండెను (5).

నారద ఉవాచ |

హే హరే త్వం మహాదుష్టః కపటీ విశ్వమోహనః | పరోత్సాహం న సహసే మాయావీ మలినాశయః || 6

మోహినీ రూపమాదాయ కపటం కృతవాన్‌ పురా | అసురేభ్యోsపాయయస్త్వం వారుణీ మమృతం న హి || 7

చేత్పిబేన్న విషం రుద్రో దయా కృత్వా మహేశ్వరః | భవేన్నష్టాsఖిలా మాయా తవ వ్యాజరతే హరే || 8

గతిస్సకపటా తేsతిప్రియా విష్ణో విశేషతః | సాధుస్వ భావో న భవాన్‌ స్వతంత్రః ప్రభుణా కృతః || 9

హే హరే! నీవు మహాదుష్టుడవు. మోసగాడవు. జగత్తును వ్యామోహపెట్టెదను. మాయావిని. దుష్ట స్వభావముగల నీవు ఇతరుల ఉత్సాహమును సహించలేవు (6).

నీవు పూర్వము మోహినీ రూపమును ధరించి, మోసము చేసి, రాక్షసులచే సురను త్రాగించితివి. వారికి అమృతము దక్కకుండ చేసితివి (7).

మోసము నందు ప్రీతి గల ఓ హరీ! మహేశ్వరుడగు రుద్రుడు దయతో విషమును త్రాగకున్నచో, నీ మాయ ఆనాడే నశించి యుండెడిది (8).

హే విష్ణో! నీకు కపట మార్గము మిక్కిలి ప్రియమైనది. నీ స్వభావము మంచిది కాదు. అయిననూ, శంకరుడు నిన్ను స్వతంత్రుని చేసినాడు (9).

కృతం సముచితం నైవ శివేన పరమాత్మనా | తత్ప్రభావబలం ధ్యాత్వా స్వతంత్రకృతికారకః || 10

త్వద్గతిం సుసమాజ్ఞాయ పశ్చాత్తాపమవాప సః | విప్రం సర్వోపరి ప్రాహ స్వోక్తవేదప్రమాణ కృత్‌ || 11

తద్‌ జ్ఞాత్వాహం హరే త్వాద్య శిక్షయిష్యామి తద్బలాత్‌ | యథా న కుర్యాః కుత్రాపీ దృశం కర్మ కదాచన || 12

అద్యాపి నిర్భయస్త్వం హి సంగం నాపస్తరస్వినా | ఇదానీం లప్ప్యసే విష్ణో ఫలం స్వకృతకర్మణః || 13

నిన్ను స్వతంత్రుని చేయుటలో శివుడు పొరపాటు చేసినాడు. ఆయన తన ప్రభావము చే నిన్ను స్వతంత్రుని చేసినాడు (10).

నీ ప్రవృత్తిని చూసి ఆయన పశ్చాత్తాపమును పొందెను. ఆయన వేదప్రామాణ్యమును నిరూపించి, విప్రుడు సర్వశ్రేష్ఠుడని చెప్పెను (11).

హే హరే! నేనా విషయము నెరింగి ఆ బలము వలన, నీవు మరల ఇట్టి పనిని ఏనాడూ చేయకుండునట్లు నిన్నీనాడు శిక్షించెదను (12).

నీకు ఇప్పటికైననూ భయము కలుగలేదు. నీవు ఇంతవరకు తేజశ్శాలియగు వ్యక్తిని ఎదుర్కొనలేదు. హే విష్ణో! ఈనాడు నీవు, చేసిన పనికి ఫలమునను భవించెదవు (13).

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 39 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 . ఋగ్వేదంలో చెప్పబడిన విశ్వ ఆవిర్భావము - 1 / Origin of the Universe according to Rigveda  - 1 🌴

🌻. నాసదీయ సూక్తము - ఋగ్వేదము / Nasadiya suktham  - 1 🌻

*01. నాసదా సీన్నో సదాసీత్తదానీం నాసీద్రజో నో వ్యోమా పరో యత్ |
కిమావరీవ కుహ కస్య శర్మన్నమ్భ కిమాసీద్గహనం గభీరమ్ ||*

01. नासदासीन्नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमा परो यत् ।
किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद्गहनं गभीरम् ॥1॥

సృష్ట్యాదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అనేది లేదు (సత్ లేదు, అసత్ లేదు). అంతరిక్షం లేదు. అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కాని ఏదీ లేదనటానికి వీలు లేదు. ఏదో ఉంది. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది. కానీ ఇదంతా దేనిచే/ఎవరిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?

02. న మృత్యురాసీ దమృతం న తర్హినరాత్ర్యా అహ్న ఆసీత్ప్రకేతః |
ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్న పరః కిం చనాస ||

02. न मृत्युरासीदमृतं न तर्हि न रात्र्या अह्न आसीत्प्रकेतः ।
आनीदवातं स्वधया तदेकं तस्माद्धान्यन्न परः किं चनास ॥2॥

మృత్యువు లేదు, అమరత్వం లేదు, నామరూపాలు లేవు, రాత్రింబవళ్లు లేవు. అన్నిటికి అతీతమైన తత్వం మాత్రమే ఉంది. అది దేనీ మీద ఆధారపడిలేదు. ఆ బ్రహ్మం తప్ప వెరొకటిలేదు.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ