అష్టావక్రగీత
శ్రీరమణీయం-(514)
🕉🌞🌎🌙🌟🚩
"శైవసిద్ధాంతం నుండి భక్తుడు గ్రహించవలసింది ఏమిటి ?"
ఒక వ్యక్తి తన మెడలో భక్తితో శివుని ప్రతిమను ధరిస్తాడు. ఆ వ్యక్తి జీవుడు, ధరించింది శివుడ్ని, వారిరువురి మధ్య భక్తి బంధంగా ఉంది. 'భక్తి-భక్తుడు-శివుడు' ఈ మూడూ ఒక్కటేనని చెప్పేదే శైవసిద్ధాంతం. జీవుడు-బంధము-శివుడు ఒక్కటేనని తెలియటమే శైవ సిద్ధాంతమని భగవాన్ శ్రీరమణమహర్షి వివరించారు. ఆ భావనతో చేసేది శివదీక్ష. అది ఒక ప్రత్యేక మార్గం కాదు. మనని ఇప్పుడున్న పరిమిత భావన నుండి అపరిమితత్వానికి చేర్చే మార్గం అది. బంధం అంటే ఈ ప్రపంచాన్ని నిన్ను కలిపి మాత్రమే కాదు, నిన్ను-శివుణ్ణి కలిపేది కూడా ఆ బంధమే ! అపరిమితత్వ భావన అంటే అంతటా ఉన్నది దైవమే అని తెలియటం. తాను కూడా ఆ దైవంలోనే ఉన్నానని గ్రహించటం. తాను ఆ దైవానికి భిన్నుడ్ని కాదు అని గుర్తించటం !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
శివైక్య భావన కోసమే ఆధ్యాత్మిక సాధన !'- (అధ్యాయం-65)
🕉🌞🌎🌙🌟🚩
_ 'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (651)_
🕉🌞🌎🌙🌟🚩
మనసుకు సత్యం అర్ధమై సరిగా స్పందించడమే శుభం.! అదే శివం..!!
సామాన్యుడికైనా, మాన్యుడికైనా సంతోషం, దుఃఖం ఒకేలా ఉంటాయి. అయితే స్వస్వరూపం తెలిసిన జ్ఞాని వాటిని అవి అనుభవంలో ఉన్నంతసేపే స్వీకరిస్తారు. సామాన్యులు వాటి తాలూకూ జ్ఞాపకాల్లోనే జీవిస్తూ ఉంటారు. సముద్రంలాగానే హృదయం దేన్నీ కూడా తనలో ఉంచుకోదు. అందుకే నిద్రలో అన్నింటిని వదిలేసి హాయిగా ఉండగలరు. కాలం అన్నింటినీ పరిష్కరిస్తుంది. మనసుకు సత్వగుణం ఉంటేనే ఈ సత్యం తెలుస్తుంది. శివ అంటే శుభం. మనసుకు సత్యం అర్ధమై సరిగా స్పందించడమే శుభం. మన దేహంపైన, మనసుపైనా గమనింపు ఉంచితే చాలు. అదే ఆత్మవిచారణ. ఇందులో ప్రత్యేక సాధన
ఏదీలేదు. ఉన్న గమనింపు శక్తిని అవాంఛనీయ విషయాలకోసం కాకుండా ఆత్మతత్వాన్ని తెలుసుకోడానికి ఉపయోగించటమే !
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(513)
🕉🌞🌎🌙🌟🚩
"ఉపాసన, ధ్యానాలు శివైక్య భావనకు ఏవిధంగా దోహదపడతాయి ?"
ఉపాసన, ధ్యానాలు రెండూ శివైక్యస్ధితికి ముందుండే పూర్వాంగాలని భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పారు. శివైక్యస్ధితినే భగవాన్ మౌనం అన్నారు. ఉపవాసం అంటే దగ్గరగా ఉండటం. ధ్యానం అంటే నిరంతరంగా తలుచుకోవడం. శివ దీక్షలో భక్తుడు తన మెడలో ధరించే శివచిహ్నం అతనితో ఉపాసన, ధ్యానాలను చేయిస్తుంది. తాను శివుడికి దగ్గరగా ఉన్నానన్న భావన అతని తద్వారా కలుగుతుంది. అదే ఉపాసన. ఏది చేస్తున్నా, చూస్తున్నా, తింటున్నా, మాట్లాడుతున్నా తను మెడలోని ఆ 'శివచిహ్నం' ద్వారా దైవం గుర్తుకొస్తుంది. అలా గుర్తుకు రావటమే ధ్యానం. ఒకే ధ్యాసలో ఉండటం ధ్యానం. మనసు దేనిపై ఉందో అదే మన ధ్యాస అవుతుంది. మనసు ఒక విషయంపైన లేదా ఒకే వస్తువుపైన ఉంటే అది ధ్యానమే. ఆ భావనతో చేసే శివదీక్ష సాధకుని మౌనంలోకి తీసుకెళ్తుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
శివైక్య భావన కోసమే ఆధ్యాత్మిక సాధన !'- (అధ్యాయం-65).
🕉🌞🌎🌙🌟🚩
_ 'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (650)_
🕉🌞🌎🌙🌟🚩
దుఃఖానికి అసలు కారణం సంతోషానికి ఎక్కువ విలువ నివ్వడమే !!
మనం సంతోషంగా ఉన్న మనసును, దుఃఖంగా ఉన్న మనసును
మాత్రమే చూడటానికి అలవాటు పడ్డాం. అవి రెండూలేని మనసు, రోజులో అధికసమయం ఉంటున్నా దానికి విలువనివ్వడం లేదు. దుఃఖానికి అసలు కారణం సంతోషానికి ఎక్కువ విలువ నివ్వడమే. సంతోషం కూడా మన సహజస్వరూపంలో లేదని తెలిస్తే సంతోషంగా ఉండాలనే కాంక్ష పోతుంది. విచారణ మార్గంలో మనసును గమనించడం ద్వారా మనసు ఏ అనుభవాన్ని తనతో అంటిపెట్టుకుని ఉండటం లేదని తెలుస్తుంది. మనసు దేన్నైనా జ్ఞాపకంగా తప్ప ఎంత గొప్ప అనుభవమైనా తనలో నిల్వ చేసుకోలేదు. సామాన్యుడికైనా, మాన్యుడికైనా సంతోషం, దుఃఖం సహజం. కానీ అవి అశాశ్వతమైనవని తెలియడమే ఆనందానికి మార్గం !
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(509)
🕉🌞🌎🌙🌟🚩
మనసుకు దేహాన్ని ఉపాధిగా భావించవచ్చా లేదా !?
మనసుకు దేహం ఉపాధి కానేకాదు. అదే నిజమైతే నిద్రలో ఎందుకు మనకు ఆ భావన ఉండటంలేదు ? మనసుకు ఉపాధి దేహం కాదు, దేహభావన. కేవలం దేహభావన ఒకటే కాదు, మనసు ఇప్పుడు దేన్ని ఆలోచిస్తే అదే దానికి ఉపాధి అవుతుంది. మనం, నేను శరీరాన్ని అని ఎప్పుడూ అనుకోము. మన పేరు, ఊరు, ఉద్యోగం ఇలా ఏవైతే మన భావనలో ఉన్నాయో అవన్నీ మన మనసుకు ఉపాధి అవుతున్నాయి. అందరి మనసు ఒక్కటిగానే ఉంది. ఈ ఉపాధి బేధం చేతనే ఎవరికివారు వేరు అవుతున్నారు. మనసును మౌనం నుండి వేరుచేసే ఆలోచనలన్నీ మనసుకు ఉపాధి అవుతున్నాయి. ఎందుకంటే ఉపాధి లేనప్పుడు అసలు మనసుకు ఒక స్వరూపమేలేదు. ఆ స్ధితి మనం రోజూ అనుభవించే నిద్రాస్ధితి. అందుకే నిద్రలో అద్వైత భావనే ఉంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
'మౌనమే అత్యుత్తమ దీక్ష !'- (అధ్యాయం-64)
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (646)
🕉🌞🌎🌙🌟🚩
ఎరుకని గుర్తిస్తే ఇక జీవితంలో ద్వంద్వం ఉండదు !!
మనం నిమిత్తమాత్రులం అని అర్థమై శరణాగతి పొందేకొద్ది మోక్షంతో సహా మన బాధ్యతలన్నీ గురువే స్వీకరిస్తారు. వర్తమానంలో మన పని మనం చేసుకుంటూ పోతే మన భవిష్యత్ విషయంలో ఆయన పని ఆయన చేసుకుంటూ మనతో అంతరంగ సహజీవనం చేస్తారు. ఆయన మన ఎరుకగా ఉంటారు. ఎరుక అంటే బాహ్య ఎరుక, అంతరంగ ఎరుక అని వే
ర్వేరుగా ఉండవు. మన దృక్పథాన్ని బట్టి ఎరుక వర్తిస్తూ ఉంటుంది. మనం మనలోని ఎరుకని గుర్తిస్తే ఇక జీవితంలో ఎక్కడా ద్వంద్వం ఉండదు. అప్పుడు ఏదీ విభజనతో, బేధంతో కనిపించదు. అదే జ్ఞాని అద్వైతస్థితి. అందుకే జ్ఞానికి ఏ విషయంలోనూ ద్వంద్వం ఉండదు. అష్టావక్రుల వారి అనుగ్రహంతో జనకుడు పొందిన స్ధితి అదే !
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(508)
🕉🌞🌎🌙🌟🚩
'ఆత్మను సత్, చిత్, ఆనందం అని ఎందుకు అంటారు ?'
ఇప్పుడు మనం అసత్, అచిత్, అనానందంతో ఉన్నాం కాబట్టి భగవాన్ శ్రీరమణమహర్షి మాటల్లో ద్వైతాద్వైతాలు రెండు మనసుకే కానీ మనలోని ఆత్మకు కాదని స్పష్టమవుతుంది. మనం రోజూ పొందే నిద్ర మనకు తెలియకుండానే లభించే అద్వైత స్థితి. మెలకువ రావటమే మనం పొందుతున్న ద్వైత భావన. నిద్రలోనే కాదు, మనం రోజూ చేసే పనుల్లో లీనమైనప్పుడు కూడా మనకు తెలియకుండానే మౌనాన్ని పొందుతున్నాం. పనిలో మన ఉనికిని మర్చిపోవాలని, మనం ప్రయత్నం చేయటంలేదు. మనసు ఓకే ధ్యాసలో ఉండటం వల్ల ఆ స్థితి కలిగింది. కాబట్టి మనసును ప్రయత్న పూర్వకంగా ఓకే ధ్యాసలో ఉంచేందుకు అనేక విధానాలు అవలంబిస్తున్నాం. విధానాలు ఏవైనా మనసుకు మౌనం రావటం కోసమే. మనకు ఏ ధ్యాస లేనప్పుడు కలిగే స్థితి అదే !
{ఆధార గ్రంథం
[15:58, 26/04/2020] +91 92915 82862: : "శ్రీరమణీయం"}
'మౌనమే అత్యుత్తమ దీక్ష !'- (అధ్యాయం-64)
🕉🌞🌎🌙🌟🚩
[15:58, 26/04/2020] +91 92915 82862: 'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (645)
🕉🌞🌏🌙🌟🚩
గురువుకి అంతరంగంగా దగ్గరయ్యేకొద్ది.. సంతృప్తి, శాంతి నెలకొంటాయి !!
నిజానికి సద్గురువు దృష్టిమాత్రం చేతనే మన జీవన అవసరాలు అన్నీ తీరిపోతాయి. అందుకే గురువుని జ్ఞానం తప్ప మరేదీ అడగాల్సిన అవసరం లేదు. అయినా మనలోని ఆకాంక్షలు, కోరికల చేత ఇంకేదో కావాలని అడుగుతూ ఉంటాం. మనం గురువుకి అంతరంగంగా దగ్గరయ్యేకొద్ది మనసులోని ఈ కొరత తీరి సంతృప్తి, శాంతి నెలకొంటాయి. గురువుని దేహంగానో, రూపంగానో, వరాలిచ్చే దేవతల్లాగానో చూసినంత కాలం ఆయన అలాగే కనిపిస్తారు. మనసుకు వెంపర్లాటలు తగ్గి నెమ్మదించేకొద్దీ ఆయన మనలోనే, మనతోనే, మనగానే ఉన్నారని అర్ధమవుతుంది. మన స్వస్వరూపం ఆయనే అని ఎంతగా అర్ధమైతే ఆయన మన బాధ్యత అంతగా స్వీకరిస్తారు. జీవనంలో శాంతిని, అంతరంగంలో జ్ఞానాన్ని అందిస్తారు !
🕉🌞🌏🌙🌟🚩
శ్రీరమణీయం-(507)
🕉🌞🌎🌙🌟🚩
"మనసుకు మాయ వచ్చి చేరిందా ? మనసే మాయగా ఉందా !?"
మాయ అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించటం. ఆధ్యాత్మిక సాధనలో మనసును ఆవరించిన మాయను విడనాడాలని అంటారు. నిజానికి మనసే మాయ అని శ్రీరమణమహర్షి చెప్తున్నారు. ఎందుకంటే నిద్రలో కేవలం మనం మాత్రమే ఉంటున్నాం. అలా ఉన్నామనే ఆలోచన కానీ అనుకోవటం కానీ లేకుండా కేవలం ఉంటున్నాం అంతే ! కానీ నిద్ర లేవగానే మనసు నేను-అది అనే ద్వైత భావం పొందుతుంది. కనుక మనసుకు మరొక మాయ వచ్చి చేరదు. మెలకువ రాగానే రూపం తీసుకునే మనసే మాయగా ఉంది. సత్య వస్తువుకు ద్వైతం అని, అద్వైతం అని ఏదీలేదు, అది ఉంటుందంతే. మెలకువ రాగానే నేను, ఈ సృష్టి వేర్వేరు అనే ద్వైత భావన వచ్చింది. కాబట్టి అద్వైతం అనే మాట వాడాల్సివచ్చింది. పసి పిల్లవాడికి నీళ్ళకు, నిప్పుకు తేడా తెలియదు. అప్పుడు వాడికున్నది అద్వైత భావన అని చెప్పలేం. ఎందుకంటే అసలు తేడానే వాడికి తెలియదు కాబట్టి. తేడా తెలిసిన తర్వాత అది పోగొట్టుకోవటం కోసం అద్వైతం అనాల్సి వస్తుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
'మౌనమే అత్యుత్తమ దీక్ష !'- (అధ్యాయం-64)
_
🕉🌞🌎🌙🌟🚩
- 'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (644)._
🕉🌞🌎🌙🌟🚩
దైవాన్నీ, గురువునీ... మనం నోరు తెరిచి ఏదీ అడగక్కర్లేదు !!
"గురువు"కి భౌతికంగా చేసే పాదపూజలకన్నా వారి హృదయాన్ని తెలుసుకొని మసలుకుంటే అసలైన ఫలితం ఉంటుంది. అప్పుడే గురువైభవం ఏమిటో తెలుస్తుంది. గురువుకు ఇష్టమైనవి మన సత్ప్రవర్తన, మన మనో దృక్పథాలే. అవే గురువు అంతరంగంలో మనని దగ్గర చేస్తాయి. గురువుకు బాహ్యంగా ఎంత దగ్గరయ్యే ప్రయత్నం చేసినా ఏమీ
ఫలం ఉండదు. అంతరంగ సామీప్యతకు బాహ్య పటాటోపాలు ఏమాత్రం ఉపకరించవు. దైవాన్ని, గురువును మనం భక్తి, ప్రేమ, శ్రద్ధలతో చేరుకోవాల్సిందే. అంతర్యామిగా ఉన్న దైవాన్ని, గురువును మనం నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు. మన అవసరం ఏదో మనకన్నా ముందు అంతర్యామిగా ఉండి మన యోగక్షేమాలు చూసే గురువుకే తెలుస్తుంది !
🕉🌞🌏🌙🌟🚩
శ్రీరమణీయం-(505)
🕉🌞🌎🌙🌟🚩
"సాధనలో మౌనం ఒక భాగమా ? మౌనమే సాధనా ఫలమా !?"
మనసులో ఏ అలజడిలేని మౌనమే అత్యుత్తమ దీక్ష అని భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పారు. మౌనం అంటే మాటలు ఆగటం కాదు. విషయాల కోసం మనసు కదలకుండా ఉండటమే మౌనం ! మహిళలు తమ నివాసాల్లోనే ఎన్నో రకాల పిండి వంటలు చేస్తారు. అలా చేస్తున్నంతసేపు ఒక్క పిండి వంట విషయంలో కూడా వారికి నోరూరదు. అంటే అన్ని వంటకాల మధ్య రుచుల విషయంలో వారి మనసు మౌనంగానే ఉంటుంది. జ్ఞాని కూడా విషయ ప్రపంచంలో తాను చేయాల్సిన పనులన్నీ చేస్తూనే అలా మౌనంగా ఉంటాడు. మనసుకు అలాంటి మౌనాన్ని అలవర్చటమే ఏ దీక్షకైనా ఫలం. నిజానికి మనం ఎంచుకున్న లక్ష్యాన్ని ఫలంగా పొందటమే దీక్ష. మౌనమే అత్యుత్తమ సాధన, దీక్ష !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'మౌనమే అత్యుత్తమ దీక్ష !'-
🕉🌞🌎🌙🌟🚩
[12:12, 23/04/2020] +91 92915 82862: మృత్యుభీతిని అధిగమించేదెట్లా?
🕉🌞🌏🌙🌟🚩
ఈ భీతి నిన్నెప్పుడు ముట్టడిస్తోంది మెలకువలో ఉన్నప్పుడా? గాఢనిద్రలో ఉన్నప్పుడా? మెలుకువలో ఉన్నప్పుడే, ఈ భీతి నిన్ను చుట్టుముడుతోంది.
కనుక మృత్యువు ఎవరికి? అని నిరంతరం ప్రశ్నించుకోండి. మృత్యువు వల్ల "నేను" పోతుందని భయపడుతున్నారు. "నేను" శాశ్వతంగా ఉండాలని ప్రతి వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే ఆత్మ శాశ్వతమైంది. ఆ ఆత్మ తానై ఉన్నాడు కనుక.
ఆత్మ నుండి అహంకారం పుట్టి దేహంలోకి వచ్చి దేహమే తానని తలుస్తోంది. మళ్లీ గాఢనిద్రలో, అహంకారం ఆత్మలో కలిసిపోతుంది. ఇట్లా అహంకారం నిత్యమూ పుడుతూ చస్తూనే ఉంది. మనం ఆత్మానుభవం పొందితే చావుపుట్టుకలు దాటి పోగలం.
🕉🌞🌏🌙🌟🚩
-'అష్టావక్రగీత: 19వ ప్రకరణ (642)_
🕉🌞🌏🌙🌟🚩
ఉన్నదున్నట్లు అర్థంకావడం ప్రమ.. అలా కనిపించకపోతే అది భ్రమ !!
సాధన అంటే ఏదో సాధించి పెట్టేది కాదు. అడ్డుగా ఉన్నదాన్ని తొలిగించేది. ఈ సత్యం గమనించకుండా మనసుకు ఏదో సాధించి పెట్టాలని చేసే సాధనలన్నీ లౌకికమైన క్రియాకలాపాలతో సమానం అవుతాయి. ద్వైతాద్వైతభావంలేని ఆత్మకు ఎదుటివారు మూర్ఖుడిగానూ, బద్ధుడిగానూ.. కనిపించరు. అలా కనిపిస్తే ఇక సిద్ధి, సాధనలకు తాను బద్ధుడు అవుతాడు. ప్రమ అంటే యథార్థ జ్ఞానం. ఉన్నది ఉన్నట్లుగా అర్థం కావడం ప్రమ. అలా కనిపించకపోతే అది భ్రమ. తాను ఆత్మస్వరూపుడనని తెలియడం, ఈ సృష్టిలో జరిగే ప్రతి క్రియాకలాపం ఈశ్వరాధీనం అని గుర్తించడం ప్రమ. మనసులో ప్రేమ... దృష్టిలో ప్రమ... ఇదే సాధన !
🕉🌞🌏🌙🌟🚩
శ్రీరమణీయం-(506)
🕉🌞🌎🌙🌟🚩
"మౌనదీక్ష చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటారా ?"
మౌనమే అత్యుత్తమ దీక్ష అని భగవాన్ శ్రీరమణమహర్షి అన్నారు అంటే మిగిలిన సాధనలన్నీ తిరస్కరించమని కాదు. వాటినే పరమావధిగా భావించి అక్కడే ఆగిపోవద్దని మహర్షి బోధ. విజయవాడ వెళ్ళదలుచుకున్న వారికి అక్కడికి చేరుకోవడం దీక్ష. బస్సు ఎక్కటం, ప్రయాణించటం ఇవన్నీ ఆ దీక్షకు ఉపకరించే విషయాలు మాత్రమే కానీ అవి దీక్ష కాదు. అలాగే సాధనలో ఏ దీక్ష అయినా లక్ష్యంగా ఎంచుకున్న ఆ ఫలం కోసమే. దీక్షలోని మిగిలిన ప్రక్రియలన్నీ ఆ ఫలాన్ని పదేపదే గుర్తుకు తెచ్చేందుకే. మనం ధరించే ప్రత్యేక దుస్తులు కానీ మాలలు కానీ జపించే మంత్రంగాని చేసే ధ్యానంగాని దీక్షకు ఉపకరణాలు మాత్రమే. ఏ మార్గంలోనైనా అందరూ కోరుకునేది మనసు ఆగితే లభించే శాంతినే !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'మౌనమే అత్యుత్తమ దీక్ష !'- (అధ్యాయం-64)-
🕉🌞🌎🌙🌟🚩
- 'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (643)_
🕉🌞🌎🌙🌟🚩
ప్రతి ఆలోచనా రూపనామభావనలతోనే.. సాగుతుంది !!
తాను చేసే పనిలో కర్తృత్వాన్ని, ప్రమేయాన్ని ఆపాదించుకొని ఫలాన్ని ఆకాంక్షించడం భ్రమ. అయితే మనలోని సత్యవస్తువుకు ప్రమ, భ్రమ రెండూ ఉండవు. మనం ఆలోచనలు అని అంటున్నవన్నీ... అంతరంగంలో ఏర్పడే భావ రూపాలే. మన గురించి మనంచేసే ఆలోచనలన్నీ మన నామరూపభావాన్ని బలపరుస్తాయి. ఆత్మభావనస్థానే నామరూపభావన రావడం భ్రమలో భాగమే. అందుకే మన ప్రతి ఆలోచన రూపనామభావనలతోనే సాగుతుంది. అదే ఆలోచనలను మరింత బలపరుస్తాయి. మనం దేనికెంత విలువను ఇవ్వాలో విస్మరించడం వల్లనే ఈ సమస్య ఏర్పడుతుంది. మనం జీవితంలో ధర్మాన్ని సరిగా అనుసరిస్తేనే మనతో అయినా, గురువుతోనైనా, దైవముతోనైనా సరైన సహజీవనం చేయగలుగుతాము !
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(504)
🕉🌞🌎🌙🌟🚩
కర్తృత్వ భావన పోగొట్టుకునేందుకు ఏమిచేయాలో సెలవివ్వండి ?
కర్తృత్వభావన పోవటానికి కర్త ఎవరనేది విచారించాలి. అంతరంగంలో వెతికితే కర్తృత్వభావన పోతుంది. మనగాను, ఏర్పడుతున్న సంఘటనలుగానూ ఉన్నది దైవమే. మనవైపు నుండి కర్తృత్వాన్ని తగ్గించుకుంటే, ప్రతి సంఘటనలోనూ మనకు దైవమే కనిపిస్తుంది. అప్పుడు ఏ అనుభవం మనని బాధించదు. ఈ సృష్టిలో కర్మలు, సంఘటనలు, అనుభవాలు సత్యంగా ఉన్నాయనేది వాటితో మనకున్న సంబంధం. మన ఏర్పరుచుకునే కర్తృత్వం మాత్రం అసత్యంగా ఉంది. అందరిలో, అన్నింటిలో ఉన్న వస్తువు ఒక్కటైనా ఏర్పడిన పరిధిలో తేడాలే అన్ని కర్మలకు కారణమన్న వాస్తవం మనకు అర్థమైన రోజు కర్తృత్వభావన నశించి పరమశాంతి లభిస్తుంది. కర్తృత్వ భావన వేర్లు లాగేస్తే ఫలాలు రాలిపోతాయి. కాబట్టి చేస్తున్నది నేనన్న భావన మానుకోవాలి. అప్పుడు నానాత్వం మాయమవుతుంది. సారసత్వం మిగులుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_పరిధి వల్ల కర్తృత్వం.. కర్తృత్వం వల్ల దుఃఖం!'-(అధ్యాయం-63)-
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (641)_
🕉🌞🌎🌙🌟🚩
ఒక్కటి కూడా లేనిస్థితే.. ద్వంద్వాతీతస్థితి !_
ద్వంద్వాతీతస్థితి వచ్చేవరకూ శాస్త్రాలను, ధర్మాన్ని, సృష్టి నియమాలను అనుసరించాల్సిందే. ద్వంద్వాతీతస్థితి వచ్చిన తర్వాత జ్ఞాని వాటిని విస్మరించడు. వాటికి కూడా అతీతంగా ఉంటాడు. అనుభవంలోకి రాకుండా నేర్చుకున్నదంతా విజ్ఞానమే అవుతుంది. అనుభవంలోకి వస్తేనే అది జ్ఞానంగా పరిమళిస్తుంది. అసంతృప్తి ఉంటేనే తృప్తి అవసరం అవుతుంది. శ్రమ అనుకుంటేనే విశ్రాంతిని కోరుకుంటాం. బంధం ఉంటేనే మోక్షం అవసరం. ఒకటి లేనప్పుడు రెండోది కూడా లేదు. ఆ ఒక్కటి కూడా లేనిస్థితే అదే ద్వంద్వాతీతస్థితి. హృదయంలో కోర్కె లేనివాడికి దైహికమైన కర్తవ్యం ఉంటుంది కానీ మానసిక కర్తృత్వం ఉండదు. కర్తృత్వం లేకపోతే బంధం ఏర్పడదు. అది లేనప్పుడు ప్రత్యేకమైన సాధనలతో సాధించేది కూడా ఉండదు. ఆ స్థితి ఏర్పడటానికే సాధనలన్నీ !
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(503)
🕉🌞🌎🌙🌟🚩
సుస్థిరమైన సుఖానుభూతి, ఏ మాత్రం దుఃఖస్పర్శ లేని స్థితి ఎక్కడుంది ?
అది నిద్రలో ఉంది ! కర్తృత్వం లేని క్షణం ఎంత సుఖంగా ఉంటుందో నిద్ర మనకు తెలియజేస్తుంది. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికి భగవంతుడు శాశ్వతమైన సుఖాన్ని నిద్ర ద్వారా అందిస్తున్నాడు. నిద్రలేచిన తర్వాత పొందే అనుభవాలన్నీ సుఖ, దుఃఖ మిశ్రమాలుగా ఉంటున్నాయి. కేవలం నిద్రా సుఖం మాత్రమే ఏ దుఃఖస్పర్శకు తావులేనిదిగా ఉంటుంది. మన ప్రతి అనుభవానికి, సుఖదుఃఖాలకు మన ప్రమేయాన్ని ఆపాదించుకునే మనం ఒక్కసారి నిద్రానుభవాన్ని పరిశీలిస్తే సత్యం అర్థమవుతుంది. మనం అనుకున్నది సాధిస్తే లేదా అనుకున్నంత సంపాదిస్తే సుఖంగా ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ సుఖానికి ఇవేవీ అవసరంలేదు. అందుకే ప్రతిప్రాణికి దైవం నిద్రను స్థిరమైన సుఖానుభూతిగా అందిస్తుంది. కర్తృత్వం లేని సమయంలో మనంపొందే అఖండ శాంతిని తెలుసుకోమని భగవాన్ శ్రీరమణమహర్షి నిద్రానుభవాన్ని ఉదహరించారు. మెలకువలో కూడా ఈ వివేకంతో మనం కర్తృత్వం లేకుండా ఉండగలిగితే, అదే సుఖం మనను అంటిపెట్టుకుని ఉంటుంది. మన ముందుకు వచ్చిన పనిని కర్తవ్యంగా, ప్రతిఫలంగా లభించే అనుభవాన్ని సంఘటనగా తీసుకుంటే సుఖదుఃఖాలకు అతీతంగా ఉండవచ్చు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
'మార్పును స్వీకరించేదే ధ్యాన జీవితం.!'- (అధ్యాయం-62)
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (640)_
🕉🌞🌎🌙🌟🚩
ఏదో ఆశించి ప్రదర్శించే సద్గుణం కూడా అహంకారానికి ప్రతిరూపమే !!
మనం ఈ ప్రకృతికి లోబడని స్వతంత్రులమని తెలిపేందుకే గురువు అవతరిస్తారు. గురువు ప్రకృతి నియమాలకు అతీతుడు. గురువు సమక్షంలో కాలం ఉండదు. మనలోనే ఉన్న గురువును గుర్తిస్తే అశాంతికి తావులేని శాంతి సామ్రాజ్యానికి రాజుగా ఉండవచ్చు. రాజుగా ఉండాల్సిన మన స్వాతంత్ర్యాన్ని హరించేది మన అహంకారమే. అహంకారం భిన్నరూపాల్లో ఉంటుంది. ఒక్కోసారి అధికారంగా, మరోసారి వినయంగా, ఇంకోసారి నిరాడంబరంగా ఇలా కూడా నాటకాలు ఆడుతుంది. దుర్గుణాలు మాత్రమే కాదు, ఏదో ఆశించి ప్రదర్శించే ఏ సద్గుణమైనా అహంకారానికి ప్రతిరూపమే అవుతుంది. మానసికమైన ఆశ ఉన్నంతకాలం అహంకారపు నీడ ఉన్నట్లే..! అది ముక్తికోసమైనా, మోక్షం కోసమైనా సరే. ముక్తి, మోక్షం ఆశించేవి కావు. ఉన్నస్థితిని గుర్తిస్తే లభించే స్వస్థితి. అలాకాక దాన్ని తన సాధనతోనో స్వశక్తితోనో పొందాలనుకోవడం ఆశే అవుతుంది. సహృదయత, సహనం లేకుండా గురువు బోధ అర్థం కాదు !
శ్రీరమణీయం -(502)
🕉🌞🌎🌙🌟🚩
సంతోషం, దుఃఖం ఈ రెండిటికీ అతీతంగా ఉండాలంటే ఏం చేయాలి ?
సంతోషం, దుఃఖం ఈ రెండిట్లో ఏది కలుగుతున్నా దానికి ప్రధాన కారణం సంబంధం. మనకు సంబంధంలేని విషయాలు మన మనసుని స్పందింప చేయలేవు. అందుకే గౌతమ బుద్ధుడు ప్రపంచాన్ని, వస్తువులను లేకుండా చేయలేము కనుక వాటితో మనము ఏర్పరుచుకున్న సంబంధాన్ని తొలగించుకోవాలని బోధించారు. మనం పడే ఏ తపన అయినా సంతోషం పొందటం కోసం, దుఃఖాన్ని తగ్గించు కోవడం కోసమే. అనునిత్యం మన అనుభవాలు ఈ రెండింటి మిశ్రమంగానే ఉంటున్నాయి. మన ఇద్దరు పిల్లల్లో ఒకరికి మంచి మార్కులు వస్తే సంతోషం. మరొకరికి తక్కువ మార్కులు వస్తే బాధ. మనకిష్టమైన చిన్ననాటి స్నేహితులు కలిస్తే సంతోషం, అప్పులవాడు ఎదురై అరిచాడన్న బాధ దుఃఖంగా సంభవిస్తుంటాయి. కారు ఉందన్న సుఖానుభూతితో పాటు అది రిపేర్ కు వచ్చినప్పుడు కలిగే దుఃఖానుభవం కూడా సిద్ధంగా ఉంటుంది. పూర్తిగా దుఃఖాన్ని లేదా సంతోషాన్ని మాత్రమే అందించే రోజుఏదీ ఉండదు. సంబంధ బాంధవ్యాలే సుఖ-దుఃఖాలను ప్రభావితం చేస్తాయి ! ప్రతి అనుభవంలోనూ మనం ఆపాదించుకునే మన ప్రమేయాన్ని తగ్గించుకుంటే క్రమంగా ఆ సంబంధం తగ్గుతుంది. అంటే పరిధిచేత ఏర్పడే కర్తృత్వభావన పోతేనే మనం సుఖ-దుఃఖాలు నుండి విముక్తులం కాగలం !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_పరిధి వల్ల కర్తృత్వం.. కర్తృత్వం వల్ల దుఃఖం!'- (అధ్యాయం-63)
🕉🌞🌎🌙🌟🚩
శ్రీ గురుచరణ సన్నిధి
🕉🌞🌎🌙🌟🚩
సర్వాంతర్యామి అయిన భగవంతుడు దహరాకాశమునందు (హృదయాకాశమునందు) నివసించుచున్నట్లు ఎట్లుచేప్పినారు?
మనము ఒక చోట నివసించుటలేదా? నీవు దేహమునందున్నావని నీవు చెప్పుటలేదా? అదేవిధముగా భగవంతుడు హృదయపుండరీకమునందు నివసించుచున్నట్లు చెప్పినారు. హృదయపద్మము ఒక స్థానము కాదు. మనము నేహమునందు ఉన్నామని అనుకొనుచున్నాము గనుక భగవంతుని స్థానముగా ఏదో ఒక పేరు చెప్పబడినది. వ్యావహారిక జ్ఞానమును మాత్రమే గ్రహించువారికొఱకు ఈ విధమయిన ఉపదేశము ఉద్దేశింపబడినది.
అంతట అంతర్యామిగా ఉండుటవలన భగవంతునకు ప్రత్యేకస్థానమేదియు లేదు. మనము దేహములో ఉన్నామనుకొనుచున్నాము గనుక మనము పుట్టినామని కూడ నమ్ముచున్నాము. అయినప్పటికీ మనగాఢనిద్రలో మనము దేహమును గూర్చిగాన, దేవుని గూర్చిగానీ, ఆత్మానుభవవిధానమునుగూర్చిగానీ తలంపము. కానీ మన జాగ్రదవస్థలో మనము దేహమును పట్టుకొని మనము దానిలో నున్నట్లు తలంచుచున్నాము.
పరమాత్మనుండి ఈ దేహము పుట్టినది, ఇది ఆ పరమాత్మలో జీవించి లయించును. అయినను మనము దేహములో నివసించుచున్నట్లు తలంచుచున్నాము. అందుకే అట్టి ఉపదేశమీయబడినది. "లోపలకు చూడుము” అనియే ఆ ఉపదేశము యొక్క అర్ధము.
జీవుడు కర్మబద్ధుడు అందురు . అది నిజమా?
కర్మ తన ఫలములను అనుభవించుగాక. నీవు కర్తగా ఉన్నంతకాలము భోక్తవుగూడ అగుదువు.
కర్మమునుండి విముక్తుడగుట ఎట్లు?
అది ఎవరికర్మయో తెలిసికొనుము. అంతట నీవు కర్త కావని గ్రహింతువు. ఇప్పుడు నీవు బంధవిముక్తుడవగుదువు. దీనికి ఈశ్వరానుగ్రహము కావలయును ; దానికొఱకు నీవు ఆయనను ప్రార్థించి, ఆయనను పూజించి, ఆయనను ధ్యానింపవలెను. ప్రయత్నము లేకుండా జరుగు కర్మ, అనగా, మనస్సునకు తెలియని పని బంధకముగాదు.
జ్ఞాని కూడ తన శారీర వ్యాపారములవలన కర్మచేయుచున్నట్లు కనిపించును. ప్రయత్నము లేకుండా లేక సంకల్పములు లేకుండా కర్మ ఉండజాలదు. అందువలన అందరికి సంకల్పములున్నవి. అవి రెండు విధములు: 1.ఒకటి బంధ హేతువు, రెండవది 2. ముక్తి హేతువు. మొదటిదానిని పరిత్యజించి రెండవదానిని అలవరచుకొనవలెను. పూర్వకర్మ లేకుండా ఫలితములేదు; పూర్వ సంకల్పములేకుండా కర్మలేదు. కర్తృత్వభావన నిలిచియున్నంతకాలము ముక్తి సైతము ప్రయత్న ఫలితముగా ఉండితీరవలెను.
🕉🌞🌎🌙🌟🚩
అష్టావక్రగీత' 19వ ప్రకరణ (639)_
🕉🌞🌏🌙🌟🚩
స్వస్థితిని, సత్యాన్నీ.. తెలుసుకోవడం మనిషికి మాత్రమే సృష్టి ఇచ్చిన అవకాశం !!
మనిషికి తెలివి ప్రకృతి ప్రసాదించిన వరం. దానితో తన లాభాన్ని మాత్రమే కాదు క్షేమాన్ని, శాంతిని కూడా కాపాడుకోవాలి. సృష్టిలో ప్రతివిషయానికి వైవిధ్యం, సామర్థ్యం ఉంటాయి. అది తెలిస్తే మన పరిధి, ప్రమేయం మనకు అర్థమవుతాయి. భౌతిక, మానసిక ప్రక్రియలతో సంతోషాభిలాషను, సుఖలాలసను తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ అది ఎన్నటికీ శాంతికి సమానం కాదని గుర్తించకపోతే మనలోనే ఉన్న శాంతి నిధిని మనం ఎన్నటికీ తెలుసుకోలేము, చేరుకోలేము. సుఖం, సంతోషం అనుభవించడం తప్పుకాదు. కానీ అవి కావాలనే కాంక్షలో దేనిపైనో ఆధారపడి స్వాతంత్ర్యాన్ని కోల్పోవడం తప్పు. తన స్వస్థితిని, సత్యాన్ని తెలుసుకోవడం ఈ సృష్టి మనిషికి మాత్రమే ఇచ్చిన అవకాశం !!
🕉🌞🌏🌙🌟🚩
'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (637)
🕉🌞🌏🌙🌟🚩
మనసులో సున్నితత్వం పెరిగే కొద్దీ నిర్మలత్వం వస్తుంది !!
శత్రుత్వం, క్రోధం, ద్వేషం వంటి గుణాలతో మనసును నింపితే ఎదుటివారితో అసహజంగా ఉండాలి. గంభీరంగా, ముభావంగా, పలకరింపులేకుండా ఉండటం అలవాటుగా మారి పవిత్రమైన మనసును మలినం చేసుకుంటాం. అది దైవానికి మనని దూరంచేస్తుంది. మనో నిర్మలత్వమే దైవం. మనసులో సున్నితత్వం పెరిగే కొద్ది నిర్మలత్వం వస్తుంది. సున్నితత్వం అంటే ప్రేమ నిండిన మనసు. మాతృత్వంలో మనకు కనిపించేది ఆ సున్నితత్వమే. అది దైవత్వానికి ప్రతిరూపం. వాస్తవిక దృక్పథంతో అన్వేషిస్తే దైవంలేని చోటును చూడలేము. ఒక మొలకెత్తిన మామిడి టెంకె 100 ఏళ్ల పంటను, లక్షకాయల కాపు తనలో ఇముడ్చుకొని ఉండటం మాతృత్వం. అదే దైవం !
🌺ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌻
సాధువు :
“నేను ఎవరు ?” అని మంత్రంలాగా జపిస్తూ ఉండవలెనా?
మహర్షి :
అవసరం లేదు. 'నేను ఎవరు' అన్నది మంత్రం కాదు. దానికి అర్థం అన్ని ఆలోచనలకు మూలమైన 'నేను' అనే ఆలోచన నీలో ఎక్కడ పుడుతోందో కనుక్కోవాలని.
కానీ నీకు ఈ విచారణా మార్గం కష్టమనిపిస్తే 'నేను', 'నేను' అని మరలా మరలా వల్లెవేస్తూ ఉండు. ఇది ఆ గమ్యానికి చేరుస్తుంది. 'నేను' ను మంత్రంగా ఉపయోగించుకుంటే కలిగే నష్టం ఏమీలేదు. అది దైవానికి మొదటి పేరు.
దైవం అంతటా ఉన్నాడు. కానీ దైవాన్ని ఆ విధంగా ఊహించడం చాలా కష్టం. అందుకే శాస్త్రాలు, “దైవం అంతటా ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, నీవే దైవం; కాబట్టి ఆ సంగతిని సదా జ్ఞాపకం చేసుకుంటూ ఉండు" అంటాయి.
'నేను' అని జపిస్తూ ఉంటే, అదే చివరకు నిన్ను 'నేనే బ్రహ్మాన్ని' అన్న స్థితికి చేరుస్తుంది.
🌺ఓం తత్సత్🌻
శ్రీరమణీయం-(500)
🕉🌞🌎🌙🌟🚩
"నాలో పరిధిభావన పోయి కర్తృత్వం నశించాలంటే ఎలా ?"
కర్తృత్వం అంటే నేను చేస్తున్నానని అనిపించటం. ఎదుటి వస్తువు లేకుండా ఏ పని చేయటం ఎవరికీ సాధ్యంకాదు. సంబంధం చేత ప్రతి అనుభవం సుఖదుఃఖాలను ఇస్తూనే ఉంది. సృష్టి అంతా సమిష్టి కర్మలుగా, అనుభవాలుగా ఉన్నప్పుడు అందులో ఎవరి ప్రమేయం ఉండదన్న సత్యం మనకి అర్థం కావాలి. అప్పుడే మనలో పరిధిభావం పోయి కర్తృత్వం నశిస్తుంది. అన్నం అరిగితే శక్తి వస్తుంది. అరగకుంటే అజీర్తి వస్తుంది. ఈ రెండు అనుభవాలు మనవే అయినా అవి అన్నం అనే మరొక వస్తువుతో ముడిపడి ఉన్నాయి. ఒక వ్యక్తి అన్నదానం చేయాలనుకున్నాడు. అందుకు ఆకలితో ఉన్న వ్యక్తితో పాటు అన్నదాత పండించిన బియ్యం కూడా కావాలి. అందులో ఏది లేకపోయినా తానొక్కడే అన్నదానం నిర్వహించలేడు. ఇలా సృష్టిలోని మరొక వ్యక్తి లేదా ప్రాణి లేదా వస్తువుపై ఆధారపడనిదే కర్మగానీ, అనుభవం గానీ లే…
అష్టావక్రగీత' 19వ ప్రకరణ (632)_
🕉🌞🌎🌙🌟🚩
శుద్ధఎరుక తెలిస్తే.. అంతా స్వామి కార్యమే కానీ... స్వకార్యం ఏదీ లేదని తెలుస్తుంది !!
మనం నిద్రనుండి మేల్కొన్నప్పుడు నిశితంగా పరిశీలిస్తే జీవనక్రియ చూడవచ్చు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎలా ఏర్పడుతున్నాయో గమనించవచ్చు. నిదుర నుండి మెలకువ అంటే... అకార్యం నుండి కార్యంలోనికి చైతన్యం ప్రవహించడం. నెమ్మదించిన మనసుతో నిద్రా-మెలకువల మధ్య మనం దాన్ని తెలుసుకోవచ్చు. అప్పుడు జరిగే కార్యాల్లో వైవిధ్యం ఉన్నా, మూల కార్యం ఒక్కటే ఉంది అని తెలుస్తుంది. అదే మెలకువ. ఎవరు ఏఏ కార్యాల్లో ఉన్నా ఆ సత్యాన్ని గమనించవచ్చు, అనుభవించవచ్చు. మనసుకి ఆలోచన కార్యం, శరీరానికి క్రియలు కార్యం. రెండింటికి మూలకార్యం మెలకువ రూపంలో కలిగే శుద్ధఎరుక. కోరికలు లేకుండా శాంతిగా ఉన్న మనసును గమనించగలిగితే ఆలోచనల వెనుక ఉన్న ఆ తొలి కార్యం మన అనుభవంలోకి వస్తుంది. అప్పుడే జీవితంలో అంతా స్వామికార్యమే కానీ స్వకార్యం ఏదీ లేదని తెలుస్తుంది !
🕉🌞🌎🌟
శ్రీరమణీయం -(497)
🕉🌞🌎🌙🌟🚩
"నేను చేస్తున్నాను' అనే కర్తృత్వ భావన ఏ విధంగా ఏర్పడుతుంది ?"
మన పరిధి విషయంలో అవగాహన లేకపోవటం వలన కర్తృత్వ భావన ఏర్పడుతుంది. ముక్తేశ్వరపురం (ముక్త్యాల) అనే పుణ్యక్షేత్రం కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ గ్రామంలోని పిల్లలు ఊరిని అనుకొని ప్రవహించే కృష్ణానదిని తమ చిన్నతనం నుండి చూస్తుంటారు. కృష్ణానది అనగానే వారికి తన ఊరే గుర్తుకు వస్తుంది. వారి దృష్టిలో ముక్త్యాల ఒడ్డున ఉన్నదే కృష్ణానది అనే భావన ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని వందల మైళ్ళు ప్రవహించే కృష్ణానదికి వారి మనసులో ఒక పరిధి ఏర్పడింది. వయసు పెరిగిన తర్వాత గాని కృష్ణానది ఒడ్డున ఉన్న అనేక గ్రామాల్లో తమ గ్రామం ఒకటన్న విషయం అర్థమవుతుంది. మనలో కర్తృత్వ భావన కూడా అలాగే ఏర్పడుతుంది. చైతన్యశక్తి అనంతంగా నిండి ఉంది. ఆ చైతన్యశక్తికి దేహం అనే పరిధి ఏర్పడింది. ఆ కారణంగానే ప్రతీదీ "నేను చేస్తున్నాను" అనే కర్తృత్వ భావన ఏర్పడటానికి కారణమైంది. అదే మన సుఖదుఃఖాలకు దారితీస్తుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'పరిధి వల్ల కర్తృత్వం.. కర్తృత్వం వల్ల దుఃఖం!'- _
శ్రీరమణీయం-(499)
🕉🌞🌎🌙🌟🚩
"అనుభవం, కర్మ ఈ రెండూ వ్యక్తిగతమేనా లేక సమిష్టిగా భావించాలా ?"
ఈ సృష్టిలో ఎవరైనా సరే ఒకరిగా ఉంటే ఏ అనుభవం లేదు. మరొక ప్రాణి లేదా వస్తువుతో సంబంధం లేకుండా ఏ అనుభవం ఏర్పడదు. మన ప్రతి అనుభవం మనం కాక మరొక విషయంపై ఆధారపడి ఉంటుంది. అలాంటి అనుభవంలో మన ప్రమేయంతో నిమిత్తం ఎలా ఉంటుంది ! కర్మ ఏదైనా సృష్టిలోని అంతర్భాగమే. ప్రతి కర్మ మనతో పాటు మరొక ప్రాణి లేదా వస్తువుతో పాటు ఏర్పడిన సమిష్టికర్మ గానే ఉన్నప్పుడు అది కేవలం మన అనుభవం మాత్రమే అని ఎలా చెప్పగలం ? యజ్ఞం చేసేటప్పుడు రెండు చెక్కలను రాపిడి చేసి అగ్ని పుట్టిస్తారు. ఆ రెండు చెక్కలోనూ పరమాత్మశక్తి అగ్నిరూపంలో దాగి ఉంది. అయినప్పటికీ పరస్పర సంబంధం ఉంటేనే అది కార్యంగా మారి వ్యక్తమైంది. ఇప్పుడు వాటి రాపిడి వల్ల వచ్చిన అగ్ని ఏ చెక్కదని చెప్పగలం ? నిజానికి అది రెండింటిదీ కాదు. వాటి మధ్య ఉన్న సంబంధానిది, వాటిలో దాగి ఉన్న ఆ శక్తిది. అలాగే మనం చేసే ప్రతీ కర్మ మరొకరితో సంబంధం ఉన్న సమిష్టికర్మే. మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం మరొకరితో సంబంధం ఉన్నదే !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_పరిధి వల్ల కర్తృత్వం.. కర్తృత్వం వల్ల దుఃఖం!'-
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (636)_
🕉🌞🌎🌙🌟🚩
మనలో నిష్కామ ప్రేమ సంభవించిన రోజు, హృదయంలోని సర్వాంతర్యామికి దగ్గరవుతాం !
సంతృప్తితో ఉన్న మనసు ప్రేమపూర్వకంగా ఉంటుంది. అది కేవలం తనకిష్టమైన విషయాలు, వస్తువులు, వ్యక్తులపై మాత్రమే కాదు, ఆ మనసులో సర్వత్రా ప్రేమనే పరిమళిస్తుంది. ప్రేమ ఈశ్వర స్వరూపం. పశుపక్ష్యాది జంతువులన్నింటిలోనూ ప్రేమే ఉంటుంది. మనిషికే అదనంగా మోహం ఉంటుంది. మనిషికున్న మోహం వాటికి ఉండదు. కేవలం ప్రేమ పుష్కలంగా ఉంటుంది కనుకనే అవి ఎక్కడా సృష్టి క్రమణికను మనిషిలా అతిక్రమించవు. అలా అతిక్రమించకపోవడమే వాటిలో నిండి ఉన్న ప్రేమకు తార్కాణం. ఒక కుక్క పట్టెడన్నం పెట్టినందుకు యజమానితో పాటు ఇంటిల్లిపాదికి, చివరికి ఇంటి పనివారితో కూడా ప్రేమగా ఉంటుంది. మనలో కూడా అలాంటి నిష్కామ ప్రేమ సంభవించిన రోజు హృదయంలోని సర్వాంతర్యామికి అది మనని దగ్గర చేస్తుంది !
🕉🌞🌎🌙🌟🚩
మనోబుద్ది చిత్త అహంకారాలు? వాటి పని ఏమిటి ?
🕉🌞🌎🌙🌟🚩
శుద్ధ చైతన్యమైన ఆత్మ సహాయం లేకుండా ఏ ఇంద్రియం కూడ పనిచెయ్యలేదు. ఆత్మ యొక్క శక్తి ద్వారానే ఇంద్రియాలన్ని జీవుని ద్వార నడుస్తున్నాయి.
మాయ కమ్మిన ఆత్మే జీవుడు. ఆ జీవుడు నేను నాది అనే అహంకారంతో అంతఃకరణ చతుష్టయం లోనే ఉంది.
మనో బుద్ది చిత్త అహంకారాలు శరీరం లోపల పని చేస్తూ ఉంటాయి, అవి నాలుగు విధాలుగా ఉన్నాయి. అవి:-
1. మనస్సు :- ఇది సంకల్ప వికల్పాలను చేస్తుంది. ఇది బాగుంది, అది బాగుంది అని సంకల్పిస్తుంది. తర్వాత ఇది తగిందా, కాదా అనే అనుమానాలతో, సంశయాలతో, అల్లకల్లోలంగా, ఆశానిరాశాలతో, ఊగిసలాడడం అనేటువంటి వికల్పాలతో నిలుస్తుంది.
2. బుద్ధి :- ఆయా పదార్థాల స్వరూప స్వభావాలను, ధర్మాలను గత అనుభవాల సహాయంతో నిశ్చయాభిప్రయానికి వచ్చి చేయవలసిన పనిని నిర్ణిస్తుంది, ప్రణాలికలను తయారు చేస్తుంది.
3.చిత్తం :- చిత్తం అంటే ప్రయోజనన్నే చింతిస్తుంది. ఏదైనా విషయాన్ని స్మరించేటప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారాలతో కుడి వాటిని పర్యవేక్షిస్తూ రాబోయే వాటికి సలహాలిస్తూ, అభిమాన విషయాలను ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకుంటూ వాటి జ్ఞానంతో సక్రమంగా నడిచేటట్లు చేసేదే చిత్తం.
అందువలన సహజ సిద్దమైన మనస్సుయొక్క చంచలత్వాన్ని తొలగిస్తే మిగిలిన పనులన్నీ బుద్ది నిర్వహించ గలుగుతుంది.
4. అహంకారం:-తర్వాత నేను జీవించటానికి తెలివితేటలతో తెలివిగా నడవగలుగు తున్నాను అని భావన చేసేదే అహంకారం. కార్యానికి సంబందించిన సందేహం నాకే కలిగింది, దాని నివృత్తి కూడ నేనే చేసుకున్నాను, దాని వల్ల వచ్చిన ఫలితాన్ని కూడ నేనే అనుభవించాను అనే వాటిని ఆపాదించుకుంటూ ప్రతి పనిమీద ఒకరకమైన సంతోషాన్ని పొందుతూ గర్వాన్ని ప్రకటిస్తూ అహంభావాన్ని అనుభవించే దాన్నే ‘అహంకారం’ అంటారు.
నేను, నాది అనే అహాన్ని వ్యక్తం చేస్తూ జీవించే విధానాన్నే అహంకారం అన్నారు. అహంకారంలో తనను తాను అభిమానించుకొనే గుణం ప్రధానంగా ఉంటుంది.
మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని గ్రహిస్తామో అప్పుడు మనసు తన యొక్క చంచలత్వం, దానితోనే అహంకారం తొలగిపోతుంది, అప్పుడు మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సే మనకు సాధనలో ఉపకరిస్తూ హృదయంలో ఆ పరమాత్మ స్వరూపుని మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (634)_
🕉🌞🌎🌙🌟🚩
పవిత్ర జీవనంలో శ్రద్ధాభక్తులు ఇనుమడిస్తాయి !!
జాగ్రత్తగా చూస్తే సత్యం, శ్రద్ధ, భక్తి వేరువేరు కాదు. ఆత్మచైతన్యం క్రియాత్మకమైతే మనసుగా వ్యక్తం అవుతుంది. కోరికలు తగ్గే కొద్దీ మనసు శ్రద్ధగా, భక్తిగా పరిణమిస్తుంది. అప్పుడు అది సత్యానుభావంగా ప్రతిఫలిస్తుంది. దీపానికి కాంతి ఎలాగో ఆత్మకు శ్రద్ధ, భక్తి అలాంటివి. ఈ శ్రద్ధాభక్తులే మనసును తన వెలుగు అయిన ఆత్మలో లయించి సత్యాన్ని కనుకునేలా చేస్తాయి. పవిత్ర జీవనంలో శ్రద్ధ, భక్తి ఇనుమడిస్తాయి. మనసు పరిభ్రమించకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడటం శ్రద్ధ. దాని మీదనే మనసు నిలపడం భక్తి. సత్యానికి సోపానంగా నిలిచే భక్తి శ్రద్ధలు మనసుకు అలవడాలంటే మనం చేయవలసినదల్లా పవిత్ర జీవనమే !
🕉🌞🌎🌙🌟🚩
Comments
Post a Comment