శ్రీ యోగ వాసిష్ఠ సారము



శ్రీ యోగ వాసిష్ఠ సారము -  275 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 72 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 139. ఇంద్రియజయము, చిత్తనిరోధము  - 2 🌻

ఓ రామా, మాతండ్రి త్రవ్వించిన నూయి అని తలచి నీచులు సమీపముననున్న గంగాజలమును వదలి ఆ నూతియందలి ఉప్పునీటినే త్రాగునట్లు, అజ్ఞానమును బొందకుడు.

తత్వజ్ఞాని విషయమగు, శుద్ధబ్రహ్మము, సర్వావస్థలయందు ఖేద,కళంకరహితమై సదా నిర్మలమై వెలయుచున్నది. వీడు వాడు నేను నీవను, వీడజ్ఞానియను బుద్ధులు, అజ్ఞానియందే సంభవించును గాని జ్ఞానియందు కాదు.

పరస్పరము ఒకదానియందొకటి ప్రవేశించుటచేతను, ఒకదానినుండి మరొకటి యుద్భవించుటచేతను, జాగ్రత్‌ స్వప్నముల యైక్యమిచట చిన్మాత్ర తత్వమును దృఢపర్చుటకొరకై వచింపబడుచున్నది.

ఓ రామా| ఆత్మ, జాగ్రత్‌ స్వప్నరూపమునుండి మేల్కొని స్వస్వరూప జగత్తునందు ప్రవేశించుటవలన,అట్లే స్వప్నరూప జగత్తునుండి మేల్కొని, జగద్రూప స్వప్నమందు ప్రవేశించుటచేతను; ఈ జాగ్రత్‌ స్వప్నముల రెండిటికి పరస్పర కారణత్వము కలదు.

స్వప్నము జాగ్రత్‌నందు పూర్ణముగ శమించి పోవుచున్నది. ఆ స్వప్న పదార్ధములు శూన్యముగ అగుచున్నవి. ఈ జాగ్రత్తునందు, మరణానంతరము పరలోకమందలి జాగ్రత్తున, మరణానంతరముగాను శమించుచునే యున్నది.

కావున, ప్రతిదినము స్వప్నము,జాగ్రత్తు, సుషుప్తులందు, జాగ్రత్‌ పదార్ధములు శూన్యముగనే వర్తించుచున్నది. కావున జాగ్రత్‌ స్వప్నముల రెంటికి భేదము లేదు.

నేడు గాంచిన స్వప్న పదార్ధములు,రేపటి స్వప్నమున లేకున్నవి. కాని నేడు గాంచిన జాగ్రత్‌ పదార్ధములు రేపటి జాగ్రత్‌నందు అట్లే యుండుచున్నవి. రేపటియందు భేదముకలదు, అనవచ్చును. కాని ఈ జాగ్రత్‌ పదార్ధములు పరలోక జాగ్రత్తు. అటులనే మరణానంతర జాగ్రత్తునందు కనిపించుటలేదు.

అటులనే స్వప్నమునందు జాగ్రత్‌ వస్తువులు కనిపించుటలేదు. కావున జాగ్రత్‌ స్వప్నములు రెండిటికిని భేదములేదని తెలియుచున్నది.

జాగ్రత్‌ నందలి సమస్త పదార్ధములన్నియు, విపులముగ భాసించిన్నప్పటికి, స్వప్నమందలి పృధ్వాది పదార్ధములవలె పరమార్ధమున లేకున్నవి. స్వప్నమున నానా పదార్ధములు భాసించిన్నప్పటికి, జగత్తు శూన్యమేయై చిన్మాత్ర రూపముగ నున్నట్లే, జాగ్రత్‌నందును ఈ సమస్త జగత్తు చిదాకాశమే యైయున్నది.

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  274 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 71 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 139. ఇంద్రియజయము, చిత్తనిరోధము  - 1 🌻

ఇంద్రియములు జయించుటకు ఉపాయములు. చిత్త నిరోధము, చిద్రూప సాక్షాత్కారము పొందుట.

ఓ రామా| విషయభోగములందు ఆసక్తిగలవానికి గొప్పతనమును సంపాదించు కోర్కెగలవాడు, ధనార్జనయందాసక్తి గలవాడు,ఇంద్రియములను జయించని వాడునగు మనుజునకు శాస్త్రాది సాధనములు, బ్రహ్మదర్శనమునకు ఉపయోగపడవు. కావున ఇంద్రియ జయముద్వారా స్వప్రయత్నముచే సులభముగ మోక్షసిద్ధి బడయవచ్చు.

ప్రత్యాహారమను యత్నముచే, మనస్సును అభ్యంతరమునకు ఆకర్షించుటద్వారా, యద్దాని బాహ్యమును నిరోధించి, బ్రహ్మత్వ ప్రభోదనమైనను అభ్యాసముద్వారా మనుజుడు ఇంద్రియములు జయింపగల్గును. ఇంద్రియముల నాయకుడు చిత్తము కావున చిత్తమును జయించుటచే సర్వేంద్రియుములపై విజయము సంప్రాప్తించుచున్నది.

ఎవని పాదములకు చెప్పులు గలవో అతనికి భూమియంతయు చర్మముచే గప్పబడినట్లేగదా| ఎవడు తన చిత్తవృత్తిని బ్రహ్మముతో ఐక్యపరచి స్వాత్మయందు స్థితికల్గియుండునో అతని మనస్సు స్వయముగనే శమించును.

విషయాకార చిత్తవృత్తిని బ్రహ్మమందైక్య పరచుటయను యత్నముచే చిత్తము శమించును. కాని తపస్సు, తీర్దము, విద్య, యజ్ఞాది క్రియలచే శమింపనేరదు.

స్వధర్మ విరుద్ధ పదార్థములందు కోర్కెను త్యజించుచు, శమ,సంతోషాదులను సంపాదించుచు ఎవడుండునో అతడు జితేంద్రియుడనబడును. ఎవడు ఆత్మయందు స్థితి కల్గియుండి, బాహ్య చిత్తవృత్తులందు అప్రియము కల్గియుండునో అట్టి వాని మనస్సు శమించును.

జితేంద్రియుడు, వివేకియగు వాడు నిరంతరము సాధుసంసర్గ సత్‌శాస్త్రావలోకనము ద్వారా, జగత్తును యదార్ధరూపములో బ్రహ్మముగ వీక్షింపవలెను. జ్ఞానముచే జయింపబడిన దృశ్యము ఎండిపోయిన జలమువలె నుద్ధరింపదు

అసత్తైనను, అనుభూతమగునదియు, స్వానుభూతమైనను అసత్తైనదియును, స్వప్న దర్శన దృష్టాంతము నెవడు ఖండించగలడు. యధార్ధముగ కారణరహితమైన ఈ జగత్తు భాసింపకయేయున్నది. భాసించుచున్నట్లు తోచుచున్నచో, దానిని తత్వజ్ఞులు బ్రహ్మమనిరి.

జీవాది పదార్ధరూపముగ నెయ్యది స్ఫురించుచున్నదో, అది చిద్రూపమే యైయున్నది. జీవుడు ప్రబుద్ధుడైనను, కాకున్నను, స్వప్నము నుండి జాగ్రత్‌నందు; జాగ్రత్‌నుండి స్వప్నమందు ప్రవేశించుచు, ఏకమైనట్టి చిద్రూపముతోనే వెలయుచున్నాడు.

తత్వజ్ఞునకు జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు, తురీయమే అగును. అతనికి అవిద్య లేనందున, ద్వైతమందున్నప్పటికి అద్వైత రూపుడే అగుచున్నాడు. అజ్ఞానులు మాత్రమే, ద్వైత, అద్వైత భేదములలో క్రీడించుచుండ జ్ఞానులు వారిని గాంచి నవ్వుచున్నారు.

నిరంతరము ప్రీతి పూర్వకముగ, బ్రహ్మతత్వమును విచారించుచు సేవించుచుండు వారికి కాలక్రమమున వివేకము దృఢముగ జన్మించి మోక్షమను బ్రహ్మపధమును పొందుదురు. తత్వజ్ఞానమున పూర్ణముగ విశ్రాంతి లభింప,ఇంద్రునియొక్క రాజ్యపధ సుఖము,తృణమువలె దోచును.

విషయలంపటులు, అజ్ఞానులై దృశ్యములను ఎట్లు ఆసక్తితో చూచుచుందురో, అట్లే శాంతులగు జ్ఞానులు, దృశ్యములయెడ అనాసక్తులై ఆత్మపధమున మేల్కొని, అద్దానినే గాంచుచున్నారు. ఈ జ్ఞానమును అజ్ఞానియైనను మరల మరల శ్రవణము కథలద్వారా చిరకాలము సేవించుచుండిరో, వారు క్రమముగ జ్ఞాని కాగలడు.

మోక్షపధమును కలుగజేయున్నట్టి ఈ యుత్తమ శాస్త్రమును వేదమువలె సదా పఠించవలెను. వ్యాఖ్యానము చేయవలెను. పూజింపవలెను. 

వేదమునుండి ఏది లభించునో అదంతయు ఈ శాస్త్రము, యోగవాసిష్టము వలన లభించును. ఈ యుత్తమ శాస్త్రము, వేదాంత శాస్త్రములందు శ్రేష్టముగ యెంచబడినది.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  272 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 69 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 138. స్వప్నముల భేదములు, ఇంద్రియముల వైభవములు - 6 🌻

ఆ విధూరధుడు ఆ దేవిని తనకు సంసారమునుండి విముక్తి కలుగజేయుమని ప్రార్ధించెడివాడు. అందువలన అతడు నీచే వధింపబడెను.

అట్లే నేను ఆ దేవిని సదా పూజించుచుంటిని ,నాకేల మోక్షమునొసంగకున్నది అని అడుగగా మంత్రి ఓ రాజా నీవు భగవతిని మోక్షమిమ్మని కోరలేదు.

నా చిత్తమందున్న ఆమె నాకు మోక్షముపై ఇచ్ఛ ఏల కల్పింపకున్నది. అపుడు ఓ రాజా| నీకు పూర్వజన్మమున అశుభ అభ్యాసమువలన, నీవు ఆమెను ముక్తి కొరకై ప్రార్ధింపలేదు.

ఉత్తమ ఆత్మ జ్ఞానము ద్వారా ఈ జగత్తు భ్రాంతి మాత్రమే అనియు, భ్రాంతి హతువగు అజ్ఞానావరణ క్షయముచే భ్రాంతి నశించుటవలన ఆత్మ సాక్షాత్కారమగుట వలన వివేకికి జీవన్ముక్త మెయ్యది ఉదయించుచున్నదో, అదియే నిర్వికల్ప సమాధియనియు, అనంతమగు నిర్వాణమనియు జెప్పబడుచున్నది. ఆత్మరూపస్థితియను నిర్వాణమేదికలదో అట్టి శుద్ధ బోధోదయరూపమైన శాంతస్వరూపమునే, పరమపధమని, పరమపురుషార్ధమని ఎఱుగుము.

స్వప్నపురమున చిరకాలము సంచరించినప్పటికిని మనుజుడద్దాని అంతము ఎట్లు పొందజాలడో, అట్లే ఈ జగత్తును స్వప్నపురమున చిరకాలము సంచరించినప్పటికిని దీనియంతము పొందజాలడు.

దృశ్య ప్రపంచమున నున్న దేహాదులను, మరణకాలమున త్యజించునట్టి జీవుల కట్టి మరణ సమయమున, ఈ జగదాకారమగు దృఢచిత్తమందు, దృఢభూతములగు ఏ దృఢసంకల్ప స్వరూపములు గలవో అదియే ఈ జగదేహాది రూపములుగ ప్రతిష్టను పొందుచున్నవి. మనస్సుయొక్క సంకల్పములే చిదాకాశమున, కోశమందు స్థితిపొందియున్నవి.

అత్యంత అసద్రూపములైనప్పటికిని, ఎట్లు ఈ జగద్రూపములన్నియు ఆయా భోగపదార్ధములను, మనస్సు సంకల్పింపబడు చున్నదో ఆయా ప్రకారముగనే అవన్నియు చైతన్యమందు భాసింపబడుచున్నవి.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 


శ్రీ యోగ వాసిష్ఠ సారము -  271 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 68 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 138. స్వప్నముల భేదములు, ఇంద్రియముల వైభవములు - 5 🌻

యధాప్రాప్తములగు కార్యములయొక్క కర్తవైనను వాస్తవముగ నెపుడును ఏ కార్యముయొక్క కర్త కాకనేయున్నాను.

అంతరిక్ష, పృధివి, వాయువు, ఆకాశ,పర్వత, నదులు, సమస్త ప్రాణిరూపము,ఏకమై నిట్టి ఆత్మరూపమగు చిదాకాశమేయైయున్నది. సర్వులకు పరస్పరము ఆత్మ విషయమున అసత్తును అనుభూతమగుచున్నది. ఈ దృశ్యము ఎవరిచే ఏ ప్రకారము ఎరుగబడుచున్నదో ఆ ప్రకారమే అతనిచే అనుభవించ బడుచున్నది.

ఓ వ్యాధుడా| ఈ ప్రకారముగ నేను బోధించిన నీయొక్క బుద్ధి,స్వాభిమతమగు జగత్తు భ్రమయందే విశ్రాంతి పొందియున్నది.

పరమగు ఆత్మయందు క్షణమైనను విశ్రాంతి నొందకున్నది. కేవలము గురు, శాస్త్రాదుల యొక్క సేవనము వలనను అభ్యాసము యొక్క వృద్ధాప్యము వలనను బోధచిత్తమందు స్థిరపడ ద్వైత, అద్వైతములు శమింప,అట్టి చిత్తమే నిర్వాణమని చెప్పబడుచున్నది.
వ్యాధునకు మూఢత్వముచే చిరకాల క్లేశమువలన,బ్రహ్మదేవుని వరముద్వారా సంభవించిన ఆకాశగమనము, అతని శరీర వృద్ధి మరణమును ఇచట చెప్పబడినది.

మునివాక్యములు విన్న వ్యాధుడు వనమధ్యమున జఢభూతుడై నిశ్చలముకాగ, అభ్యాసములేనందున అతని చిత్తము విశ్రాంతి పొందకుండెను. ఈ దృశ్యమెంతవరకు గలదు.

తపస్సు వలన లభించిన దేహముతో, ఆకాశమందు అతి దూరమువరకు జూచెదనని అతడు మూర్ఖునిగానే యుండియుండెను. అభ్యాసములేనిచో జ్ఞానముదయింపదు. అతడు తదుపరి తక్కిన మునులతో తపమాచరింపదొడగెను.

తనకు ఆత్మయందు విశ్రాంతి ఎపుడు కలుగును. అభ్యాసమువలననే ఆత్మయందు విశ్రాంతి లభించును. భవిష్యత్‌లో నీవు ఆత్మ నెఱుగ కుండుటచే పండితుడవు, మూర్ఖుడవు కాక యున్నావు.

నీవు అనేక జన్మలు ఘోరతపమొనర్చగ బ్రహ్మదేవుడు నీవద్ద కరుదెంచగ నీవిట్లు ప్రశ్నింతువు. ఈ దృశ్యము అవిద్యాభ్రమ రూపమని ఎఱిగి,బ్రహ్మమందు ప్రతిరూపముగనున్న ఈ ప్రదేశముతప్ప,ప్రశాంతప్రదేశమెచ్చటను కనిపించుట లేదు.

ఈ దృశ్యమెంత వరకున్నదోకదా? నేను బ్రహ్మమును అవశ్యము చూడదలచితిని. మరియు నీ శరీరము స్వేచ్చామరణము గలదియగుగాక. శరీరము వృద్ధిపొందునట్లు, ఈ దృశ్య సమూహము అంతమును నేను పొందుడనుగాక. ఇదియే నాయొక్క వరము.

ఆ వరము పొంది, వ్యాధుడు తన శరీరము కాంతివంతముకాగ ఆకాశమున కెగిరి పోవును అపుడు ఆకాశముయొక్క అంతము పొందుటకు ఈ శరీరము గరుడ వేగముతో ఆకాశమునాక్రమించి,నీవు అనేక సృషులను గాంచెదవు.

ఒక పరి సృష్టినిగాంచి మరల ఆకాశమును మరల సృష్టిని గాంచుచు దీర్ఘకాలము గడచిపోగ, క్రమముగ వైరాగ్యము పొందెదవు. అంతట ఈ శరీరము పర్వతములు కూడ తృణవలె కనిపించి,ఈ భారమైన శరీరముతో ఆకాశమంతయు వ్యాపించియున్నాను. ఇంకను విస్తరించుచున్నాను.

ఈ దృశ్య ప్రపంచమునకు అంతములేదు. కావున నేను నీదేహమును త్యజించుచున్నాను. దీనివలన నాకు మోక్షము లబించదు. ఇట్లు చింతించి ప్రాణరేచకమగు, ధారణము గావించి దేహమును త్యజించి వైతువు

తదుపరి వాయువుకంటెను సూక్ష్మమైన జీవుడు, ఆకాశమున నుండెను. దేహము మేరు పర్వతమువలె క్రింద పడిపోవును. పర్వతములను చూర్ణమొనర్చును. అపుడు భగవతి తన గణములతో నేతెంచి ఆ దేహమును భక్షించును. భూమి దోషరహితమగును.

ఇట్లు నీ వృత్తాంతమును నీకు వినిపించితిని. ఇక నీవు వనమునకేగి తపమొనరించుము. అంతట తాను మహాదుఃఖమనుభవించ వలసి యుండును అని తలచెను. ఎవరి భవిష్యత్‌ను ఎవరు మార్చలేరు.

కాని ఓ వ్యాధుడా| ఎవరు వర్తమానమును, శమదమాది సాధనములద్వారా బ్రహ్మజ్ఞానము పొంది, నిర్వికారులైయుందురో అట్టి మహాత్ములే దుఃఖదాయకమగు సమస్త కర్మలను సమూలముగ ఛేదించివేసి యున్నతులై యుందురు. తదితరులు కారు.

వాయువు నందు స్థితికలిగియున్న వ్యాధుని జీవుడు సింధు రాజై విరూధుని జంపి, మంత్రముఖత తన రహస్యతత్వమును వినుట. ఆకాశమందున్న తన సూక్ష్మజీవచిత్తము, తనయందున్న వాసనామయ జగత్తును స్వప్నమువలె గాంచును.

సంకల్ప సిద్ధుడగు వ్యాధుడు, తాను రాజు కావలెనని భావించగ సింధురాజుగ నేను మారితిని. నాకపుడు ఎనిమిది సంవత్సరములు. సరిహద్దునందు, విధూరధుడను శత్రురాజు కలడు. నేను రాజునై నూరు సంవత్సరములు గడచినవి. పత్నీ సమేతుడనై సుఖముగనుంటిని కాని విధూరధునితో భయంకరయుద్ధము ప్రారంభమైనది.

ఆ గొప్ప యుద్ధమున నీవు విధూరధుని వధింపగ,తదుపరి చతుస్సాగర పర్యంతమగు భూమండలమునకు చక్రవర్తివగుదువు. అంతట తత్వజ్ఞులగు మంత్రులతో సంభాషణ జరుగును.

ఓ రాజా| ప్రతాపవంతుడగు విధూరధుని జయించితివి. అదెట్లు జరిగినదనగ, విధూరధునికి లీల యను భార్యకలదు. ఆమె తన తపస్సుచే సరస్వతీ దేవిని మాతృభావముద్వారా తన వశము చేసికొనెను.

సరస్వతీ దేవి లీలను కుమార్తెగా భావించి, మోక్షాదికార్యములుకూడ సులభముగ సిద్ధింపజేయుచున్నది. అట్టి భగవతి నిన్ను ఓడించుటకు సందేహమేమి. అట్టి విధూరధుడు నాచే ఎట్లు వధింపబడెను.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 134 / Sripada Srivallabha Charithamrutham - 134 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 17
🌴. శ్రీనామానందుల వారి దర్శనము - 6  🌴

🌻. దత్తారాధనము యొక్క విశిష్టత  - 1 🌻

అంతట నేను, "అయ్యా! అటులయినయెడల మనము వివిధ రూపములలో నున్న దేవతల నారాధింపవలెనా? లేక శ్రీపాదుల వారినే ఆరాధింపవలెనా? దేవతలందరునూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారనుచుంటిరి. నాకు యీ విషయము కాస్త అవగతమగునట్లు తెలుపవలసినది." అని వారిని కోరితిని.

అందులకు శ్రీ నామానందులు ప్రసన్నులై "ఒక కన్యకు వివాహము చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయము ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయెను. చెల్లెలు అత్తగారు అతనితో యిట్లనిరి.

అయ్యా! మీ చెల్లెలు మా యింట ఎన్నియో రకముల దొంగతనములను చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీపరిమాణములో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైన నేను సరిపెట్టుకొందును. ఇన్ని రకముల దొంగతనములా? అని వాపోయునది.

అంతట ఆ అన్నగారు చెల్లెలును పిలిచి యిట్లనెను. ఇన్ని పదార్ధములను దొంగలించుట నేటి నుండి మానుము. నీవు సేవించునవి అన్నియునూ చిక్కటిపాలలో నిబిడీకృతమై యున్నవి.

పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్నిరకముల పదార్ధములలోని సత్తువలు ఒక్క చిక్కటిపాలలో నున్నవి. అందువలన నీవు నీకు కావలసినంత   పరిణామములో చిక్కటిపాలను మాత్రమే సేవించుము.

ఆ ఒక్కవస్తువును సేవించుట వలన నీ అత్తగారి నుండి మాటపడుట తప్పిపోవును. అదే విధముగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్నరుచులు గలవారు గనుక భిన్నభిన్న దేవతారాధనలు చేయుచుందురు.

శివారాధానము చేసిన యెడల విష్ణువు ప్రత్యక్షము కాడు. విష్ణు ఆరాధనము చేసినయెడల శివుడు ప్రత్యక్షము కాడు. అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును. భక్తరక్షణ కూడా ఒకే విధముగా నుండును.

సగుణ, సాకార భక్తితో చేసేది కర్మలకు ఫలితము, ఆయా కర్మలకు అనుగుణ్యముగానే ఉండవలెను గదా! అనేక జన్మలలో చేసేది పాపపురాశి క్షీణదశలో ఉన్నప్పుడు పుణ్యఫలము మహావిశేషముగా ప్రోగవుచున్నపుడు శ్రీదత్తభక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యమనునది లేదు. విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికినీ శక్తిలేదు.

అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీదత్తులవారు తమ భక్తుని నుదుటి వ్రాతను చెరిపివేసి క్రొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక ఆధ్యాత్మిక స్థితులన్నియునూ, ఆయాస్థితులలో నుండుటకునూ స్థితికర్తయైన విష్ణువు కారకుడు.

తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమయిన యెడల శరీరముగాని, మనస్సుగాని, బుద్ధిగాని, ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలలో సజీవముగా దహనమునొందుచున్నట్లు అనుభవము పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమముగా చేయుటకు విష్ణువు తోడ్పడి  వాడి కర్మానుసారముగా ఆయా స్థితుల యందుంచును.

శ్రీకృష్ణులవారు శ్రీదత్తప్రభువుతో అభిన్నత్వము కలవారు. గోవర్ధనగిరి నుద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయము. అయితే గోప, గోపికలందరునూ పూర్వజన్మములలో గొప్పఋషులు. యోగగ్రంధులే గిరులు.

ఆ గ్రంధులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించునపుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందము కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మలనెత్తవలసి యుండును.

శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారమునంతనూ తాను వహించి, వారి గ్రంథి విభేదనమొనరించి జీవన్ముక్తుల చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతికదృష్టితో చూచువారికి గోవర్ధనగిరినెత్తి తనవారిని రక్షించుట మాత్రమే అవగతమగును.

అందువలన తన భక్తుల వివిధస్థితులను మార్చవలెనని శ్రీదత్తులవారు సంకల్పించిన సామాన్యముగా నడువవలసిన పరిణామక్రమమును శీఘ్రతరము చేయవలసినదని  విష్ణువును ఆదేశింప వచ్చును.

ఈ ప్రక్రియలో  తన భక్తునకు అనుభవములోనికి రావలసిన బాధలను అన్నింటిని భక్తునిచేత అజ్ఞాతస్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తులవారు తమ భుజస్కంధములపై వేసుకొనెదరు.

వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారము యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుజ్యస్థితి ననుభవించి యోగులను లక్షాపాతికవేల మందిని తయారుచేయుట, కర్మబంధములన్నింటి యొక్క స్పందనలను లయముచేయు సంకల్పము కలిగిన యెడల శ్రీదత్తులవారిలోని రుద్రాంశ విజ్రుంభించి కోటానుకోట్ల జన్మములు అవి గతించినవయిననూ, రాబోవునవి అయిననూ వాటినన్నింటినీ ధ్వంసముచేసి, ఆ జీవికి మోక్షమును అనుగ్రహింప వచ్చును.

వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణ్వంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తుని సంరక్షించును. ఇది అంతయునూ వారి సంకల్పమును బట్టి యుండును.

వారికి అటువంటి సంకల్పము కలుగుటకు మనము భక్తిమార్గము నవలంబించ వలెను.

సశేషం......
🌹🌹🌹🌹🌹


[07:56, 20/04/2020] +91 98494 71690: శ్రీ యోగ వాసిష్ఠ సారము -  268 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 65 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 138. స్వప్నముల భేదములు, ఇంద్రియముల వైభవములు - 2 🌻

సుషుప్తినుండి స్వప్నమున కేతెంచుటను గూర్చిన దుష్టాంతములతో తన పూర్వ కుటుంబాదులను దర్శించుటను గూర్చిన వివరములు.

ఆ స్వప్న దృశ్యమిపుడు సుషుప్తినుండి ప్రకటితమయ్యెను. నేనా దృశ్యమండలము జూచుటకై ప్రవృత్తుడను కాగ, ఇంతలో నచట నాపూర్వ పరిచితమగు గ్రామము,గృహమును అవలోకించితిని. అందు బంధువులు, పుత్రులు, భార్యయును గాన్పించెను.

పూర్వపు అభిమాన రూపమగు వాసన నాక్రమించగ అందు బద్ధుడనై ఆ బంధు,స్త్రీ పుత్రాదుల యొక్క ఆలింగనముచే, సుఖవంతుడనైతిని. నిర్మల ఆత్మ ప్రబోధము, ఆత్మ బోధ స్మ్రుతి తాత్కాలికముగ నశించుటచే నేనట్లు బంధు సంసర్గమును అపేక్షించితిని. ఆహా| అనేక జన్మలందు,అభ్యాసముచే బాగుగా దృఢపడినట్టి ఈ అవిద్య వాస్తవముగ లేనిదైనను, ప్రకటితమగుచున్నది.

సత్‌శాస్త్ర, సద్గురువు, తత్వవిచారణాదులను, మనోహరములైన అంగములతోగూడిన సత్‌సాంగత్యములచే జనించి, పదార్ధవివేక బుద్ధి అభ్యాసముచే నుత్పన్నమైన ఆత్మజ్ఞానము ద్వారానే,ఈ జగత్‌భ్రాంతి నశించును గాని ఇతర ఉపాయములచే నశింపదు.

స్వప్నము యొక్క సత్యత్వ అసత్యములకు హేతువును సర్వాత్మయొక్క చైతన్యముయొక్క విశ్వరూప శుద్ధితోకూడ, జాగ్రత్‌ స్వప్న సుషుప్తులయొక్క ఏకత్వమును నిరూపింప బడుచున్నది.

ఓ వ్యాధుడా| ఏ స్వప్నము, స్వప్నదేశకాల క్రియలచే, శాస్త్ర ప్రమాణమువలన ఇట్టి స్వప్నమున కిట్టి ఫలము కల్గునని నిర్ణయింపబడినదై, అయ్యది కాకతాళియముగ ఫలించుచు, శకునాదులవలన ఫలముకల్గిన సత్య స్వప్నమని పిలువబడుచున్నది.

మణి, మంత్రౌషదాది దృశ్యములచే గలుగునపుడు, ఆ స్వప్న సంవిత్తు యోగ్యపురుషునియందు సత్యముగను, అయోగ్యునియందు అసత్యముగను అగుచున్నది. రెండిటియందున కాకతాళీయముగ సత్యమగును.

హిరణ్యగర్భాదులు, సంవిత్‌ పూర్వకాల ముపాసనాదుల పరిపాకముచే జనించినదగుటచే, సంకల్పరూప దృఢ నిశ్చయముతో గూడియుండుటచే, అది అట్లే అగుచున్నది.

మరియొక కారణముచే ఫలము లభించనప్పటికి, స్వప్నముయొక్క సత్యత్వ కల్పన వలన అది ప్రాప్తించినదని, లోన సంవిత్‌ అనుభవించుచున్నది. కేవలము చిన్మాత్ర,బ్రహ్మము తప్ప తక్కిన సమస్త జగత్తు సత్యముగను,అసత్యముగను స్థితిపొందును.

కావున నీవు జాగ్రత్‌ను స్వప్నముగను,స్వప్నమును జాగ్రత్‌గను ఎఱుగుము. ఈ రెండును ఏకమైన బ్రహ్మరూపములే. వాస్తవముగ ఇచట నియతిగాని అనియతిగాని లేదు. మిధ్యారూపమగు సంవిత్తుకు నియతి,అనియతి లేదు.

చైతన్యమే జాగ్రత్‌, స్వప్న,సుషుప్తుల రూపమున వర్తించుచున్నది. అదియే శ్రవణ, మనన, నిధిధ్యాసలోవున్న,సమాధి రూపమున వెలయుచున్నది. మరియు అజ్ఞాన నాశముచే, ముక్తిరూపమగు చున్నది.

జాగత్‌ వాస్తవముగ లేదు. ఏది జగత్తని చెప్పబడినదో,అట్టి జగద్రూపము స్వప్నమేయైయున్నది. నిద్రారహితమగు ఆత్మయందు,ఆ జాగ్రత్‌ స్వప్నములు రెండును లేవు. స్వప్నము వాస్తవముగ లేదు.

అది సుషుప్తి,అసుషుప్తి రూపమగు బ్రహ్మముయొక్క బోధరూపమైయున్నది. జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు వాని విషయములు బ్రహ్మముకంటే వేరుగాకున్నను, వేరుగనున్నట్లు స్పష్టముగ స్పురించుచున్నది.

ఈ ఆత్మ స్వరూపము జాగ్రత్‌ స్వప్న, సుషుప్తావస్థరూపమును, తద్‌విరుద్ధమగు తురీయావస్ధ రూపమును వహించినదై,ఆకార రహితమైనను సర్వాకారయుక్తమై, దృశ్యరహితమైనను చిత్‌ శరీరము కల్గియున్నను,దృశ్యమైన ఆకాశమను చిత్రమున వ్యాపించినదై యున్నది.

స్వప్నవృత్తాంతమున గృహమున కేతెంచిన మునియొక్క ముఖమునుండి వినినట్టి అనేక ప్రాణుల సమాన దుఃఖాదుల కారణము వర్ణింపబడినది.

స్వప్నమందు ఆ ప్రాణి హృదయతేజమున నున్న నాకు, గృహస్తాశ్రమమున వసించుచు,భార్యయందనురక్తమైన బుద్ధితో ఆత్మజ్ఞాన రహితుడనగు నాకచట, పదునారు సంవత్సరములు గడిచినది. పిమ్మట ఒక గొప్ప తపస్వియు, పూజనీయుడునగు అతిధి ఆతిధ్యమునకేతెంచెను. భోజనానంతరము విశ్రాంతిగ గడిపిన పిదప, నేనతని నిట్లడిగితిని.

దేవా| ప్రయత్నశీలుడైన ఫలాభిలాషులగు మనుష్యులకు, శరత్కాలమున ధాన్యాదులు లభించునట్లు, కర్మయుక్తులగు జీవులను శుభా శుభ కర్మలచే,సుఖ దుఃఖములు కలుగుచున్నవి. అట్టి దుర్భిక్ష సమయములో సర్వజనులకు అశుభములు కలుగజేయుటకు కారణమేమి.

అది విని ముని ఇట్లు పలికెను. చిత్తముయొక్క అంతఃకరణమున, వివేకముతో కూడినదికాగ, ఈ దృశ్యకారణము సత్తా,అసత్త ఏది సరియని తలచుచున్నావో,అది దేనివలన నెరిగితివో చెప్పుమనగ, నేను మిన్నకుంటిని. అపుడు అతడు నీవు సమస్త వృత్తాంతములతో కూడ, వాని సాక్షియగు ఆత్మను స్మరించుము. యోచన చేయుము. ఈ స్వప్నమంతయు స్వప్నము మాత్రమే అయి భాసించుచున్నది.

నేను నీ స్వప్న మందలి మనుజుడను, నీవు నా స్వప్నమందలి మనుజుడవు. సర్వ వ్యాపకమైనట్టి,ఈ చిన్మాత్రమునకు తానెచట ఎట్లు తలచునో అచట ఆ రూపమే అయి ఉండుట స్వాభావిక లక్షణమైయున్నది.

అందువలన సర్వ కారణత్వ కల్పనచే, కారణ సహితముగను, అకారణత్వ కల్పనచే కారణ రహితముగా నున్నది.
🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ యోగ వాసిష్ఠ సారము -  266 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 63 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 137. జాగ్రత్‌, స్వప్నములు, సుషిప్తి, తురీయము - 6 🌻

ఓ వ్యాధుడా| ఈ ప్రకారముగ, ఈ జగత్తు సత్తైయుండుగాక, లేక అసత్తైయుండుగాక. మరియు నీవిక తుచ్ఛఫలములగూర్చిన ప్రయత్నమును విడువుము. ఏలయనిన, నీవిపుడు నీ ఆత్మస్వరూపము నెఱిగితివి గాన, నిక ఈ సంసారమున తిరిగాడుట వ్యర్ధము.

ఓ వ్యాధుడా| సమస్త భావాభావ పదార్ధములును స్వప్నానుభవ సదృశ్యరూపములై, సదా నాశరహితములై, కేవలము చిన్మాత్ర స్వరూపములైయుండ నిక బంధింప బడినదేది? ముక్తి పొందునదేది?

ఈ జగత్తంతయు స్వప్నమువలె అసద్రూపమైనను, అనుభూతమగుచునేయున్నది. ఎపుడీ జగత్తు లేకయున్నదో అపుడే సమస్త రూపముచే చైతన్యమే స్పురించుచున్నది. మనకు ఈ జగత్తెట్లు గలదో, ఆత్మ ఆకాశమున నితర మనుష్యులకును, లక్షలకొలది జగంబులు కలవనియే నిశ్చయము.  కాని అవన్నియు యోగ్యత లేకపోవుటచే జనులకు ప్రత్యక్షముగ, పరస్పరము అనుభూతము లగుటలేదు.

ఒకే గ్రహమున నివసించుచున్న అనేక మనుజులయొక్క స్వప్నమునందు భాసించు వివిధ నగరాదులు, ఆయా స్వప్న ద్రష్టులకు సత్యముగను, తదితరులకు అసత్యముగనే యున్నట్లు ఆకాశమందును అనేక బ్రహ్మాండములు స్పురించుచున్నవి.

ఒకే చిన్మాత్ర స్వప్నమున లక్షలకొలది రూపములను ధరించుచున్నది. మరల అనేక లక్షల రూపధారియగు స్వప్నమే ఏకమగు సుషుప్తిరూపమున శేషించుచున్నది.

ఏకమగు చిదాకాశము, తన స్వరూపమును త్యజింపకయే సాకారములగు అనేక రూపములను ధరించుట ఏది కలదో,అదియే స్వప్నమువంటి జగత్తు అయియున్నది. కావున నేను పరమసూక్ష్మమైనట్టి ఆత్మయొక్క స్వరూపము గలవాడనై యున్నాను.

సమస్త జగదాకారముగ గూడ వెలయుచున్నాను. మరియు సర్వత్ర స్థితికల్గియున్నాను. పరమాణువునందు విలసిల్లుచున్నాను. చిన్మాత్ర పరమాణువునైయున్నాను. ఈ విశాల జగదాకారముగకూడ స్థితికల్గియున్నాను.

మరియు నేనెచట యున్నానో అచటనే ముల్లోకములను గాంచుచున్నాను. స్వప్నము నందు గాని, జాగ్రత్‌నందు గాని ఎపుడెచట బ్రహ్మమందును అభ్యంతరమందును నేయేదృశ్యము కాన్పించుచున్నదో, అదియంతయు నిజచైతన్యము యొక్క స్ఫురణయే.

ఇట్లు బ్రహ్మముతోడ ప్రపంచముయొక్క ఐక్యమును ప్రతిపాదించినట్టి యుక్తులు, బుద్ధిమంతులకు సదా సర్వ వస్తువులందును స్పటికమణులవలె, ముత్యపు చిప్పలవలె స్వయముగనే స్ఫురించుచున్నవి.

సశేషం.......
🌹 🌹 🌹 🌹 🌹



. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  265 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 62 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 137. జాగ్రత్‌, స్వప్నములు, సుషిప్తి, తురీయము - 5 🌻

ఓ వ్యాధుడా| నీహృదయమున స్వప్ననగరమెట్లు కలదో అట్లే బ్రహ్మదేవుని హృదయమున,ఈ సృష్టియును గలదు. రెంటియందు కార్యకారణ భావమొకటియే యైయున్నది.

సృష్టి మొదలు, దేహపర్యంతముగల,ఏ పదార్ధములెట్లు భాసించుచున్నవో, అవి మోక్షపర్యంతము ప్రవాహముచే నట్లేయుండును. దీని పేరే సృష్టి. శూన్మమై, నిర్మలమైనట్టి, ఆకాశమున భ్రమచే నీలత్వమెట్లు భాసించుచున్నదో, అట్లే చిద్ఘనమైన చిదాకాశమున భ్రమచే సృష్టి సంప్రాప్తమై యున్నది.

నిజస్వప్నమగు మరణానంతరము, జీవులందరును, వారి వారి వాసనల ననుసరించి, వేర్వేరు జాగ్రత్తులందు గాంచుచున్నది. కాని ఇహపరలోకములు, నిరాకార చిదాకాశమే.

సంకల్ప, స్వప్నములందువలె మరణించిన పిదప సంవిద్రూపమగు ఆత్మ నిజ చిదాకాశమున దేహరూపముగ ఎఱుగుచున్నది. మరణించిన వానికి, పరలోక బుద్ధి స్వప్నమువలె స్వయముగనే భాసించును. దానినే అతడు చిరకాలము గాంచును. అంతే గాని అందు సత్యత్వ మేమియును లేదు.

కావున యధార్ధముగ జీవుడు మరణించిన పిదప జనించుటలేదు. కేవలము చిత్తము చేతనే, స్వవాసనావశముననే నిచట జన్మించితిని వ్యర్ధముగ కల్పనచే నెఱుగుచున్నాడు. తన ఆత్మ భావనను ఈతడు చిరకాలము అనుభవించుచున్నాడు. మరియు దాని యందు స్పష్టమగు విశ్వాసము కల్గియుండుటచే పూర్ణత్వముగ నెఱుగుచున్నాడు.

ఈ రీతిగ ప్రతి జీవుని అనుసరించి, కోట్లకోలది జగంబులు వర్తించుచున్నవి. ఎఱుగబడినచో అవన్నియు కేవలము బ్రహ్మరూపములే అగును. ఎఱుగబడనిచో దృశ్యరూపమై యున్నవి.

ఈ అనంతకోటి బ్రహ్మాండముల యొక్కపృధివాది పంచభూతములు, అండజాది చతుర్విధ భూతసముదాయము, ఆయా జీవులయొక్క జాగ్రత్‌ నందు అట్లే వర్తించునుగాని మరియొక విధముగా కాదు.

అది వ్యవహార దృష్టిచే సత్యములు, పరమాత్మ దృష్టిచే బ్రహ్మరూపములై యున్నవి. ఆత్మజ్ఞానముచే, ఈ సమస్త జగత్తును ఏకమై చిన్మాత్రమైనట్టి, చిదాకాశమేయై యున్నది.

ఆత్మనెఱుగని వారికి అనేక జగద్రూపములుగ భాసించుచున్నవి. ఒకే చిన్మాత్రయగు ఆత్మ స్వప్నమున లక్షల కొలది ఆత్మరూపములు ధరించి వర్తించుచున్నది. సుషుప్తియందు ఈ లక్షల ఆత్మలు ఏకరూపముగ చెన్నొందుచున్నవి.

స్వప్న సంకల్పములందు వలె, సృష్ట్యాది యందు, ఒకే నిర్వికారమగు సంవిత్తే, సృష్టియొక్క సిద్ధికొరకై; పృధివి, జల, అగ్ని, వాయువు ఆకాశములు యగుచున్నవి.

ప్రమాణసిద్ధమైన సంకల్పిత పదార్ధము నెవడు చిరకాలము నిరంతరమభ్యసించునో అతడు శ్రమచే నద్దానినుండి విడివడకయున్నచో తప్పక దానిని బొందగలడు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
 



శ్రీ యోగ వాసిష్ఠ సారము -  262 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 59 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 137. జాగ్రత్‌, స్వప్నములు, సుషిప్తి, తురీయము - 2 🌻

శాంతమైన, జనన మరణరహితమైనట్టి, బ్రహ్మమే జగద్రూపము పొందినదని అనుభూతియే తురీయత్వమగును.

తదుపరి ముని వ్యాధునితోనిట్లనెను.

ఈ ప్రకారముగ జాగ్రదాది నాల్గు అవస్ధలయొక్క తత్వవిచారము అనంతరము ఆ ప్రాణము యొక్క చిదారూపుడగు జీవునితో ఐక్యమొందుటకు బ్రవృత్తుడనైతిని.

వెంటనే నాయొక్క ఇంద్రియములు, బహిర్ముఖముగ ప్రవృత్వముకాగ, ఆ చైతన్యమును బలపూర్వకముగ అభ్యంతరమున వ్యాపించినవాడనైతిని.

అంతట నాయొక్కయు, అతనియొక్కయు; రెంటియొక్క అంతర ప్రభావముచే నేను ప్రపంచమునంతటిని ద్విగుణీకృతముగ గాంచితిని. ఎట్లన, దిక్కులు రెండింతలాయెను. ఇరువురు సూర్యులు ప్రకాశించుచుండిరి.  భూమండలము, ఆకాశము రెండింతలాయెను.

ఆ రెండును క్షీర, జలముల వలె కాన్పించుచుండెను. అంతట ఒక నిమిషకాలములో ఆ ప్రాణ సంవిత్తునంతయు నాయొక్క సంవిత్తునంతయు, స్వయం సంవిత్తుచే నశింపజేసి,రెంటిని ఏకముచేసి ఏకత్వరూపమును పొందితిని.

పూర్వము ద్విగుణీకృతమై కన్పట్టు జగత్తు ఇపుడు ఏకత్వము పొందెను. అటు పిమ్మట ఆ ప్రాణియొక్క చైతన్యమందున్న నాయొక్క సంకల్పము అల్పమై ఆతని సంకల్పానుసారము స్థితిపొందెను.

పిదప నేను అతని హృదయమును త్యజింపకయే, యాతని భోగ్యములగు శబ్ధాది విషయములు గ్రహించుచు, అతని హృదయమును త్యజింపకయే యుంటిని. జాగ్రత్‌ వ్యవహార రూపమగు దినాచారమునంతయు ననుభవించితిని.

అంతట ప్రాణి అన్నము భుజించి,జలము త్రాగి శ్రమతో గూడుకొనిన వాడై సాయంకాలమున మెల్లగ నిద్రాయుక్తుడాయెను.
అపుడు చిత్తముతో సహా అతని ఇంద్రియ వృత్తులన్నియు మూయబడినవై,హృదయకోశమున ప్రవేశించెను.

అతని శరీరము మరణించిన దానివలె నుండెను. క్షణకాలము సుషుప్తుననుబవించి ఆ సమయమున సమానమను వాయువు, సూక్ష్మకరమగు గతిలో సంచరించుచునే యుండెను.

అట్టి సుషుప్తి స్థితిలో, ప్రాణము ఆత్మయందు తత్ఫలమగుచో, హృదయమున ''పురూతతి'' అను నాడియందు ప్రవేశించి, తనతోగూడ స్థితిపొందియున్న చిత్తమును, ఆత్మయే పురుషార్ధముగ కల్గి స్వాదీనపర్చుకొనెను.

అట్టి సుషుప్తి దశయందు, ప్రత్యగాత్మయని పరపురుషార్థము కొరకు ఆప్రాణమిక ఇంద్రియాది కార్యములు జేయకుండును. ఏలన ఆత్మయందు నిరతిశయానందముతో ప్రకాశించును గాని దుఃఖాదులు భాసింపవు.

అపుడు శ్రీరాముడు ప్రశ్నింపగా వసిష్ఠుడిట్లు పలికెను.

ఓ రామా| ఈ దేహము మనస్సుయొక్క కల్పనారూపమగుటచే, మనస్సు కంటే వేరుచేయబడిన ఈ దేహము లేనట్లే. అపుడు జాగ్రత్‌లో ఉన్నను, సుషుప్తిలో ఇంద్రియములు లేనివేయగును. కావున ఈ సమస్తము బ్రహ్మమేయైయున్నది.

బ్రహ్మవేత్త యందు చిత్తదేహాదులు బ్రహ్మమే అగును. ఈ ప్రకారము ఈ విశాల ప్రపంచమంతయు మనోమాత్రమే యైయున్నది. మనస్సు చిద్రూపమగు బ్రహ్మమే యైయున్నది కాన ఇదియంతయు వ్యాపకమగు బ్రహ్మమాత్రమే అగును.

సంకల్పాత్మకమైన మనస్సు ''కార్యబ్రహ్మము''. భూలోకమును, తదితర లోకములను ఎట్లు సంకల్పించుచున్నాదో వానినట్లే అనుభవించు చున్నది. కావున, ఆ పరమాత్మయే మొదట మనస్సు ద్వారా ప్రాణియై, దేహధారియై, త్రిలోకరూపుడయ్యెను.

కావున ఓరామా| చిత్తమే జగత్తుయొక్క కర్తయైయున్నది. అది దేనినెట్లు సంకల్పించునో అయ్యది అట్లే స్థితి కల్గియున్నదగుచున్నది. చిత్తమే ప్రాణమును కల్పించినప్పటికి, ప్రాణమే సమస్త వ్యవహారములు నిర్వహించునది. కావున చిత్తము ప్రాణముయొక్క ఆధీనము.

చిత్తముచే ప్రాణ దేహములు కల్పించబడినప్పటికి అది, అవిలేకయే యుండజాలదు. కావున జీవుడు చిద్రూపుడు. శరీరప్రాణములను సందేహముతో దుఃఖితుడగుచున్నాడు. అట్టివారు ఆత్మజ్ఞానమును పొందినపుడు మాత్రమే సంసారము శమించును.

మోక్షోపాయమను ఈ యోగవాసిష్ట గ్రంధము యొక్క విచారణచే, ఆత్మజ్ఞానమెట్లు వర్తించునో అట్లు ఇతర గ్రంధముల విచారణచే విస్తరించదు. కావున ప్రయత్నముతో ఈ గ్రంధమును తప్పక విచారణ చేయవలెను.

శరీరాదులు, ఈ గృహాదులు నావి అను అవిద్య తొలగాలంటే,ఈ గ్రంధము తప్పక అవగాహన చేసుకొనవలెను. ఈ ప్రాణమనంబులు రెండు పరస్పరము ఒకదానికొకటి రధసారధులు.

ఆత్మపధమున అవి నడవనిచో జీవి కష్టముల పాలగును. నాడులు అన్నరసముచే పూర్ణములైయున్నపుడు, లేక శ్రమచే గాని, ఆకలిచేగాని, క్షీణములైనపుడు; ప్రాణము మందగతి కల్గియుండుటచే సుషుప్తియందు దయించుచున్నది.

అంతట తాపసి వ్యాధునితో నిట్లనియె.  ఏ ప్రాణి యొక్క హృదయమందు నేను ప్రవేశించితినో, అతడు రాత్రియందు ఆహారాదులచే పరితృప్తుడై, గాఢసుషుప్తి రూపమగు నిద్రను పొందెను. నేనును అతనితో నిద్రించితిని.

అటు పిమ్మట ఆ ప్రాణియొక్క యుదరమందలి అన్నము జీర్ణము కాగ, స్వాభావిక నాడీమార్గమున, ప్రాణము స్పష్టముగ జనింపదొడగ, అపుడు సుషుప్తియొక్క గాడత్వము తొలగినది.

క్రమముగ సుషుప్తి సూక్ష్మత్వము చెందగ, అపుడు హృదయమునుండి బయల్వెడలిన దానివలె స్వప్నమయ ప్రపంచమును నేను నా హృదమందే గాంచితిని.

సశేషం
...
🌹 🌹 🌹 🌹 🌹


*🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  263 🌹*
*🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 60 🌴*
*✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు*
*📚.  ప్రసాద్ భరద్వాజ*

*🌻. 137. జాగ్రత్‌, స్వప్నములు, సుషిప్తి, తురీయము - 3 🌻*

*ఆ స్వప్న ప్రపంచము, ప్రళయకాలమందు సంక్షోభము చెందిన జగత్తు కన్పించెను. అందులో నేను నా భార్యతో, పుత్రులు, సేవకులతో ప్రళయకాల జలప్రవాహమున కొట్టుకొని పోయితిమి.*

*అపుడు గృహము, పట్టణము మహాతరంగములచే కొట్టుకొని పోవుచున్నది. నేను మునుగుచు తేలుచు, దుఃఖపూరితుడనై నేను అపుడు చూడనట్టియు, అనుభవించనట్టి దుఃఖములేదు.*

*అపుడు నా పూర్వకాలపు, చిరకాలాభ్యాసమున, దుఃఖమును పొందుటచే సమాధిమయ స్వరూపము స్మృతికి వచ్చెను. తదుపరి వర్తమాన స్వప్న ప్రపంచముయొక్క, దృఢాభ్యాసముచే జనించిన తరంగములతో కొట్టుకొని పోవుటచే సమాధి స్మరణమువలన సుఖముగనే యుంటిని. సాక్షివలె ఆ మిధ్యారూప జలప్రళయమును గాంచుచుంటిని.*

*ఆహా| ఎట్టి ఆశ్చర్యము. అట్లు ఈ త్రైలోక్యము, కాలముచే నిర్మూలితమై, జలముచే దొరలింపబడిన, ద్వీప, పర్వత, సురాసుర, మనుష్య, నాగ, చారణులచే భిన్నములగు ప్రళయకాల మహాసముద్రము పోలియున్నది.*

*ఓ వ్యాధుడా| ఆకాశమున అభాసరూపములేయగు వివిధ ప్రకారములైన, నాశమువలన, కల్పాంతమున ఈ భ్రాంతిరూప జగత్తులన్నియు నశించెను. ఈ ప్రళయములు ఒకప్పుడు క్రమముగ, మరొకప్పుడు ఆకస్మికముగ సంభవించును. ఈ కాలము క్రమముగ సమస్తమును నశింపజేయును.*

*ఈ ప్రళయము, జగత్తు అసత్తయినను దీనియందు తత్వబోధనాత్మకము, మోక్షప్రదమైన గొప్ప ప్రయోజనము కలదు.*

*ఎట్లన ఈ దృశ్య ప్రపంచమునుగూడ అటులనే భ్రమాత్మకముగ ఎరుగ గలవు. అపుడు సత్యమైన నీవే శేషింతువు. ఇక ఆ స్వప్నమందలి ప్రళయ మహాసముద్రము యొక్క వేగమున దిరుగాడుచు, ఆ జలమంత ఎచటికో బోవుచున్నట్లు గాంచితిని.*

*నేను అపుడొక శిఖర ప్రాంతమందలి తీరమును, దైవయోగముచే చేరితిని. ఆ తరంగములందు వివిధాకృతులుగల దేవతలు కొట్టుకొని పోవుచుండిరి.*

*తుదకు ఆ జలమంతయు క్షణకాలములో ఎచటికో బోయెను. ఆ సమయమున నేను పర్వత శిఖరముపైగల ఒక మున్యాశ్రమమున చేరి, శ్రమవలన విశ్రాంతి పొంది, ఇంతలో గాఢనిద్రలోకి వెళ్ళితిని.*

*సషుప్తి అనంతరము మేల్కొని ఆ ప్రాణి హృదయముననున్న పర్వత శిఖరమును గాంచితిని. ఉదయము మేల్కొని ప్రపంచమును గాంచితిని.*

*పూర్వానుభవము మరచి, ప్రస్తుత వ్యవహారములతో ప్రవృత్తుడనైతిని. అపుడు నా వయస్సు పదహారు సంవత్సరములు. తల్లి, తండ్రి, గృహము అను బుద్ధి నాకపుడు జనించును. నేనచట నొక చిన్న గ్రామమును, బంధువులను జూచితిని. అది సత్యముగనే తోచినది.*

*నా పూర్వపు బుద్ధి వివేకము మరువబడినవి. నేనాగ్రామవాసినైతిని. దేహాభిమానముతో, భార్య, సంపాదన మొదలగు వానితో నూరు సంవత్సరములు గడిపితిని.*

*అపుడు ఆత్మ జ్ఞానియగు ఒక అతిధి మా గృహమున కరుదెంచెను. అతడు అతిధి సత్కారములు పొంది,విశ్రమించి, భోజనము గావించి,ఆత్మ జ్ఞాని కథనిట్లు వర్ణించెను.*

*అతడు నానావిధ దేశ, పర్వత, పృధివాదుల వ్యవహారములచే,మనోహరమైన ఒకానొక కథయందు ''ఈ జగద్రూపముతో ప్రకాశించుచు భాసించునదంతయు యధారీతి స్థితికల్గినదై వికారవంతమై, అనంతమైన, చిన్మాత్రయగు బ్రహ్మమేయని'' బోధించెను.* 

*ధారణవశముచే, పూర్వపు ప్రాణ ప్రవేశపు వృత్తాంతమంతయు స్మరించితిని. ఏ ప్రాణి హృదయమున నేనుంటినో, అతనిని సర్వ జగత్‌ నిలయములైన విరాట్‌ రూపునిగ అనుమానించి, అతని నుండి బయటకు వెడలుటకై ప్రయత్నించితిని.*

*ఆ ప్రాణి హృదయము పృధివి, సముద్ర, నదులచే తిరిగాడు విశాల బ్రహ్మాండము అని భావించి, అతని ముఖమునందు చేరి, అతని ప్రాణవాయువు నందు ప్రవేశించితిని.*

*అందుండి అతని నిశ్వాసము ద్వారా బయటికేతెంచితిని. తదుపరి నా శిష్యులతో కొంతకాలము గడిపి, అంతట ఆ గ్రామపు ఉత్తరమును గాంచుటకేగగా, అచట నేను ప్రవేశించిన ప్రాణి భోజనానంతరము వెల్లికల పడుకొని , సుఖముగ నిద్రించుచుండెను.*

*అది చూసి నేనద్దానిని ఎవరికి చెప్పకుండ, మరల తిరిగి అతని హృదయమున ప్రవేశించితిని. ఆ పూర్వబంధువులను చూచుట కొరకై అట్లు చేసితిని. ఇంతలో అచట భయంకరమైన యుగాంతము ప్రవృత్తమాయెను.*

*అచట అన్ని విధములైన పర్వతములు, బూమి, జగత్తు స్థితి గోచరించెను. పూర్వపు బంధువుల గృహములు లేవు. భయంకరమైన వాయువు అగ్నితో ఆ విశ్వమంతయు శీఘ్రముగ ఒకే జ్వాలామయమగు రక్తవర్ణమై యొప్పెను.*

*అందు నేను ప్రవేశించి మిడుత వలె తగులుకొనియున్నప్పటికి, సూక్ష్మశరీర భావముతోనుండుటచే, దుఃఖమును పొందకయే యుంటిని. వాయుధారణచే వాయురూపమును పొందిననేను, ఆ జ్వాలామయమునందు మెరుపువలె సంచరించు చుంటిని.*

*ఇంతలో ఒక ప్రచండవాయువు ఏతెంచెను. ఆ వాయువు అతి గంభీరమై, మేఘములతో కూడియున్నది. అంతట నలువైపులనుండి, జ్వాలారూపములైన సంధ్యాకాల మేఘములు బయలుదేరినవి. స్వర్గవాసులు, దేవతలు ఆ జ్వాలలో తగుల్కొనిరి.  అట్లు ప్రళయకాలమున, కాలాగ్ని రుద్రునివలె నృత్యలీల యొనర్చు చుండెను.*

*వ్యాధుడా | అపుడా కష్టదాయకమగు మహాసంభ్రమమున గొట్టుకొనిపోవుచున్న శ్రమచే, మిక్కిలి ఖేదమును పొందితిని. అపుడు జాగృతిని పొంది,ఇతరుల హృదయమందు ప్రవేశించి, ఏల వ్యర్ధముగ ఈ దుఃఖమును పొందవలెనని భావించితిని.*

*సశేషం.....*

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ