మాండూక్యోపనిషత్
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.23
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహత్ శ్శంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరిగింది. శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
అష్టమ మంత్రము :
సో>యమాత్మా>ధ్యక్షర మోంకారో>దిమాత్రం /
పాదమాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి //
నవమ మంత్రము.
జాగరితస్థానో వైశ్వానరో>కార : ప్రధమామాత్రా, ఆప్తేరాది మత్త్వాద్వా ఆప్నోతి హ వై సర్వాన్ కామాన్, ఆదిశ్చ భవతి, య ఏవం వేద /
దశమ మంత్రము.
స్వప్నస్థాన తైజస ఉకారో ద్వితీయామాత్రా, ఉత్కర్షాదు భయత్వా ద్వా , ఉత్కర్షతి హ వై, జ్ఞాన సంతతిమ్ సమానశ్చ భవతి, నాస్యా బ్రహ్మ విత్కులే భవతి య ఏవం వేద /
ఏకాదశ మంత్రము:
సుషుప్త స్దాన : ప్రాజ్నో మకార స్తృతీయ మాత్రా మితేరపీ తేర్వా / మినోతి హ వా ఇదం సర్వమపీతిశ్చ భవతి, య ఏవం వేద /
ద్వాదశ మంత్రము చెప్పుకునే లోపు, గౌడపాదులు చెప్పిన 19 నుండి 23 వ కారిక వరకు చెప్పుకుందాం.
పందొమ్మిదవ కారిక : విశ్వస్యాత్త్వ వివక్షాయాం ఆది సామాన్య ముత్కటం /
మాత్రా సంప్రతి పత్తవ్స్యాత్ అతి సామాన్య మేవచ //
ఇరవయ్యవ కారిక : తైజసస్యో త్వ విజ్ఞాన ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం /
మాత్రాసమ్ప్రతి పత్తవ్ స్యాత్ ఉభయత్వం తథావిధం //
ఇరవై ఒకటవ కారిక : మకారభావే ప్రాజ్ఞస్య మాన సామాన్య ముత్కటం /
మాత్రా సమ్ప్రతి పత్తవ్ తు లయ సామాన్యమేవచ //
ఇరవై రెండవ కారిక : త్రిషుధామసు యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చిత: /
స పూజ్య : సర్వభూతానాం వంద్యశ్చైవ మహాముని : //
ఇరవై మూడవ కారిక : అ కారో నయతే విశ్వం ఉకారశ్చాపి తైజసం /
మ కారశ్చ పున ; ప్రాజ్ఞం నామాత్రే విద్యతే గతి : //
( నిన్నటిదానికి కొనసాగింపు )
ద్వాదశ మంత్రము.
అమాత్రశ్చతుర్దో > వ్యవహార్య : ప్రపంచో పశమశ్శివో>ద్వైత : /
ఏవం ఓంకార ఆత్మైవ సంవిశత్యా త్మ నాత్మానం య ఏవంవేద య ఏవంవేద //
మాత్రావిభాగ రహితమైన తురీయ స్థితిలో వుండి, వ్యవహారములకు దూరంగావుంటూ, సర్వానర్ధాలకు కారణమైన ప్రపంచమునకు ఉపశమనంగా పరమానంద
స్వరూపమును ద్వైతరహితంగా భావన చేస్తూ, ఓంకారమును తెలుసుకున్నవాడు తనఆత్మ చేత ఆత్మ స్వరూపాన్ని పొందుతున్నాడు.
అ ఉ మ ఇత్యాది మాత్రలు లేనిది తురీయం. ఏ ధ్వనీ లేని ప్రశాంతమైనది ఓంకారం. అది ఎలాగంటే, ఓంకారమును ఉచ్చరించి నిలిపి మౌనంగా పరిశీలిస్తే, మాత్రారహిత ఓంకారం క్రమక్రమంగా భాసిస్తుంది. ఈ మౌనమునే పెంచుకుంటూ పోతే, నిర్వికల్ప సమాధిఅవుతున్నది.
అదే శుద్ధ ఆత్మ స్థానము. ఇది అవ్యవహార్యము. చెప్పనలవిగానిది అని అర్ధము. ఎందుకనీ ? ఇక్కడ అభిధాన అభిధేయములు నామములు వ్యవహారములు క్షీణిస్తాయి గనుక. అ ఉ మ అనే ధ్వనులు, వాటి ప్రత్యయాలుగా చెప్పబడుతున్న విశ్వ తైజస ప్రాజ్ఞ అధిదేవతలైన వైశ్వానర, హిరణ్యగర్భ ఈశ్వరులు ఇక్కడ కనబడరు కాబట్టి. ఇక్కడ సమస్త ప్రపంచమూ ఉపశమిస్తుంది. త్రాడు అని తెలుసుకున్న తరువాత సర్పభయము ఉపశమించినట్లు.
ఇది శివము, ఆనంద స్వరూపము. ఎందుకంటే, ఇక్కడ దుఃఖాదులు, ఆగ్రహణము వుండవు. ఇది అద్వైతము, సర్వమునకు అధిష్టానం కాబట్టి.
ఈ విధంగా తెలుసుకున్న బ్రహ్మవేత్త, ఓంకారమే ఆత్మ అని గ్రహించి, తన ఆత్మతో తాను పారమార్థికములో ప్రవేశించుచున్నాడు. అనగా లయము చేస్తున్నాడు. అది ఎలా అంటే, విశ్వుని, తైజసుని యందు, తైజసుని ప్రాజ్ఞుని యందు లయము చేసి, ప్రాజ్ఞుని తురీయమునందు లయము చేస్తున్నాడు. అదే విధంగా అ కారమును, ఉకారములో, ఉ కారమును మ కారములో మ కారమును అమాత్ర అయినా ఓంకారమునందు లయము చేస్తున్నాడు.
లయయోగం అంటే, క్రమముగా, మెల్లమెల్లగా భావనలను, ధ్వనులను వెనుకకు లాగుచు శాంతస్థితిని పొందుట. ఇది ప్రాణాయామ అభ్యాసంతో, కేవలం రేచక కుమ్భకాదులతో, బుద్ధియోగముతో, ఏకాంతంలో అభ్యసిస్తే, రెండు మూడు నెలలలో, దానిపై పట్టు నిశ్చయంగా దొరుకుతుంది.
ఇలాంటి మార్గమును పొందిన బ్రహ్మవేత్తలకు, బీజభావము దహించుకుపోయి, స్వస్వరూప ఆత్మ జ్ఞానము కలుగును. అప్పడు తురీయ స్థితి కలిగి తిరిగి జన్మ పొందవలసిన అవసరం వుండదు. బీజభావం నశిస్తే, మరుజన్మకు ఆస్కారం లేదుకదా !
రజ్జువులో సర్పభావము ప్రవేశించిన అజ్ఞానికి బుద్ది సంస్కరింపబడి, అది సర్పము కాదు, రజ్జువు అని తెలిసినట్లు, తురీయస్థితి చేరినవానికి, ప్రాజ్ఞము మరల పుట్టదు.
ఇక జ్ఞాన సముపార్జన తక్కువగా వున్న మంద, మధ్యమ అధికారులకు, తెలుసుకోవాలనే అపేక్ష కలిగినవారికి, సన్మార్గ, సదాచార, సద్బుద్ధి కలవారికి శాస్త్రీయ కర్మ సన్యాసము చేసినవారికీ, మాత్రల పాదములగురించి కొద్ధిజ్ఞానము మాత్రము కలవారికి, పైనచెప్పిన ఓంకారాభ్యాసము అనగా లయయోగ విధానము బ్రహ్మప్రాప్తికై పట్టుకొమ్మనవచ్చును.
ఉత్తమోత్తములకు కేవలం జ్ఞానమే తురీయమును ఆపాదించును. ఇతరులకు ఓంకార పాదోపాసన, అమాత్ర ఓంకారోపాసన విధింపబడినది.
దీనితో మాండూక్యోపనిషత్తులోని పన్నెండుమంత్రములు ముగిసినవి. ఆగమ ( ప్రధమ ) ప్రకరణ లో యింకను 24 వ కారిక నుండి 29 కారిక వరకు మిగిలివున్నవి. .
24 వ కారికను తెలుసుకుందాం.
🕉🌞🌏🌙🌟🚩
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.13
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ
మాండూక్యోపనిషత్ - 13 .
హరి: ఓం.
కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.
ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.
ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.
మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
ఆగమ ప్రకరణం
మాండూక్యోపనిషత్తు.
ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరుగుతుంది, శంకరుల భాష్యముతో సహా.
శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?
ఇక ఈ తొమ్మిది కారికల తరువాత ఏడవ మంత్రము చెప్పుకుందాము.
సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //
అంత; ప్రజ్ఞ కలవాడు కాదు అనగా స్వప్నగత పురుషుడు కాదు. జాగ్రత్ పురుషుడు కాదు, జాగ్రత్ స్వప్న మద్య పురుషుడు కాదు. ప్రాజ్ఞుడుకాదు. అలా అని కేవలం అప్రాజ్ఞుడూ కాదు. ఇంద్రియాలకు గోచరించేవాడు కాదు. వ్యవహరించడానికి నామరూపాలు లేనివాడు. అంత:కరణమునకు అంతుపట్టని వాడు, యుక్తితో పట్టుకోవడం సాధ్యము కానివాడు, జాగ్రద స్వప్న సుషుప్తాదులందు సాక్షిగా ఒక్కడిగా వున్న, సుఖమైన, మంగళకరమైన భేదగుణరహిత అద్వైత స్థితిలోవున్న చతుర్థము ( తురీయము ) అని దేనిని పండితులు తలుస్తారో, అదేఆత్మ. అతడే తెలియదగిన పురుషుడు.
మూడు అవస్థలయందు నిర్వికారంగా ఆత్మీ భూతంగా వున్నది తురీయము. శృతి వాక్య ప్రమాణము ప్రకారము, తురీయుని ఆత్మగా ఉపాసించాలి.
పెట్టెలో మూడు రంగుల గుడ్డ వున్నప్పుడు పెట్టెకు ఏ వికారమూ వుండదు. నీటిలో మూడు వేరు వేరు రంగుల గుడ్డలు ఒక్కొక్కదాని మధ్యలో పుష్కలంగా నీరు వుండడమనేది ఆలోచిస్తే, ఈ రెండింటి మధ్య సమన్వయభేదము. మొదటి సమన్వయంలో జాగ్రద్ స్వప్న సుషుప్తి అవస్థలు కేవలం మిధ్య అనీ, రెండవ సమన్వయంలో, జాగ్రద్ స్వప్న సుషుప్తులు సాధనాలు, అనీ తెలుస్తాయి.
అంత ; ప్రజ్ఞ, బహిర్ప్రజ్ఞ, ఘనప్రజ్ఞలు గల తైజస, విశ్వ ప్రాజ్ఞుల సూక్ష్మ, స్థూల ఆనందములనే భోగములను పూర్వమే ప్రక్కన పెట్టినందువలన, తురీయము ' ప్రపంచోపశమము ' అయింది. ప్రపంచం అనగా విస్తారితము, విశాలము. ఉపశమనం అనగా చల్లారుట. అవిద్య చే విస్తరింపబడిన విశ్వాదులు విద్యచేత తొలగింపబడిరి కాబట్టి, తురీయములో యెలాంటి ప్రపంచము కానరాదు. అందువలననే ఆ మూడుదశల స్థానధర్మములను నెట్టి వేసినది.
తురీయము శాంతము, అవిక్రయము. రాగద్వేషాది విషయములు రహితమవడం వలన దీనిని అవిక్రయము అనాలి. కంసాలి దాగలి ( వస్తువులు పెట్టి దెబ్బలు కొట్టి తయారు చేసే పనిముట్టు ) మీద ఎన్ని వస్తువులను సుత్తి దెబ్బలతో కొట్టి చేస్తున్నా, దాగలి కి యెలాంటి వికారము కలుగదు. అలాగే, తురీయుని ముందు ఎన్ని స్దాన స్థాని ధర్మములు ఈ మూడు అవస్థల ద్వారా కల్పించినా, విషయ వ్యవహారములుచేస్తున్నా, తురీయుడైన కూటస్థుడు ( కూటము అంటే దాగలి ) సర్వదా శాంతుడే !
ఇక తురీయము శివమ్ అనే విషయం చెబుతున్నారు. అది మంగళకరమైనది. పరమానంద కారకమైనది. కాబట్టి అది అద్వైతము. భేదరహితము. అదే చతుర్థము, నాలుగవది. ఇక్కడ నాలుగు అనే సంఖ్య అంత ప్రధానం కాదు. నాలుగవ తత్వము వున్నట్లుగా తురీయము భావింపబడుతుంది. ఎందువలన అంటే, అది పై మూడు అవస్థల కంటే భిన్నమైనది అవడం వలన.
అతడే ఆత్మ. అతడే తెలియదగినవాడు. ఏవిధంగా త్రాడుని పాము కాదని తెలుసుకుంటున్నామో, నేలపగులు చారికలని కర్ర అని భ్రమపడి, ఆతరువాత అది నేలపగులని తెలుసుకుంటున్నామో, అదేవిధంగా కనబడని ఆత్మమాత్రమే మొత్తం విశ్వాన్ని చూస్తున్నాడనే భావం బలపడాలి. చూసేవాడి చూపుకి ఎలాంటి దోషం లేకపోతే, వున్న వస్తువు వున్నట్లుగానే కనబడుతుందనే సూత్రం ఇక్కడ ఆపాదించుకోవాలి.
అవిద్య వలన జీవులందరికీ, త్రిపుటి సంగము కలుగుతున్నది. విద్య సిద్దించిన తరువాత, జ్ఞాన త్రిపుటి యదార్ధంగా లేదనీ, తెలుసుకునేవాడు, తెలియదగినదీ, తెలుసుకునే విధానమూ అంతా ఒక్కటే అనే అద్వైత భావన కలుగుతుంది. త్రాడు అని తెలియగానే, పాము అనే భ్రాంతి పోయినట్లు.
సప్తమ మంత్రమునకు భాష్యము ఇక్కడితో అయిపొయింది. అష్టమ మంత్రము చెప్పుకునే లోపు, పదవ కారికనుండి పద్ధెనిమిదవ కారిక వరకు చెప్పుకుందాము.
పదవ కారిక : నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన : ప్రభురవ్యయ : /
అద్వైత: స్సర్వభావానాం దేవస్తుర్యో విభు : స్మృత : //
సర్వ దుఃఖములకు అనగా విశ్వ తైజస ప్రాజ్ఞ నిమిత్తముగా కలిగించే వికారములకు నివృత్తికి తురీయమగు ఆత్మయే ఈశానుడు అనగా ప్రభువు, సమర్ధుడు. అతడే అవ్యయుడు కూడా. సర్వ వ్యవహార భావనలకు అతడే అద్వైతస్థితి కలుగజేయును. అతడే దైవము. ప్రకాశమానుడు. అతడే తురీయుడు. సర్వవ్యాపకుడు అని బ్రహ్మజ్ఞానులచే అనుభవపూర్వకంగా స్మరింపబడుతున్నాడు. అనగా తురీయజ్ఞానం సర్వదుఃఖ నివృత్తి.
పదవ కారికకు ఆదిశంకరుల భాష్యం తెలుసుకుందాం.
🕉🌞🌏🌙🌟🚩
Comments
Post a Comment