సాయం కాల సందేశము
పరీక్షిన్మహారాజు పలికెను- శుకమహర్షీ! ఇట్టి నీచగతి, ఉచ్చగతి ప్రాప్తించుటకు గల కారణమేమి?
ఋషిరువాచ
శుకయోగి వచించెను - జనులకు మూడు విధములైన స్వభావములుండుట సహజము. అవి సాత్త్వికము, రాజసము, తామసము. వారు ఒనర్చుకర్మలు, కలిగియుండు శ్రద్ధలుగూడ మూడు విధములు. శ్రద్ధా స్వభావముల భేదములను అనుసరించి వారి కర్మల గతులు గూడ వేర్వేరుగా ఉండును. ఈ ఉచ్చనీచగతులు కర్మలను ఆచరించు వారందరికిని ఉండుట సహజము.
26.3 (మూడవ స్కంధము)
అదేదానీం ప్రతిషిద్ధలక్షణస్యాధర్మస్య తథైవ కర్తుః శ్రద్ధాయా వైసాద్యశ్యాత్ కర్మఫలం విసదృశం భవతి యా హ్యనాద్యవిద్యయా కృతకామానాం తత్పరిణామలక్షణాః సృతయః సహస్రశః ప్రవృత్తాస్తాసాం ప్రాచుర్యేణానువర్ణయిష్యామః॥4618॥
నిషిద్ధకర్మలనెడి పాపములను ఆశ్రయించెడివారి శ్రద్ధల యందు అసమానత్వము ఉండుటవలన ఫలములు గూడ వేర్వేరుగా ఉండును. అనాదియైన అజ్ఞానమునకు వశులై లోభేచ్ఛతో మనుజులు నిషిద్ధ కర్మలను ఆచరించుచుందురు. వాటి ఫలితముగా వేలకొలది నరకగతులు ప్రాప్తించుచుండును. వాటిని గూర్చి విపులీకరించెదను.
రాజోవాచ
పరీక్షిత్తు ప్రశ్నించెను- మహర్షీ! నీవు వర్ణింపబోవు నరకములు ఈ పృథ్వియందే ఏదైన ప్రత్యేక ప్రదేశమునందు ఉండునా? లేక ముల్లోకములకు ఆవలగాని, వీటిలోపలగాని ఉండునా?
ఋషిరువాచ
శుకయోగి వచించెను- రాజా! ఈ ముల్లోకముల లోపలనే దక్షిణదిశయందు భూతలమునకు క్రిందను, జలములకు పైనను ఈ నరకములు గలవు. ఈ దిక్కునందే అగ్నిష్వాత్తులు మొదలగు పితృదేవతా గణములు వసింతురు. వారు ఏకాగ్రతతో తమ వంశస్థుల శుభములను కోరుచుందురు.
ఆ నరకలోకమున సూర్యపుత్రుడు, పితృగణములకు అధిపతియైన యమధర్మరాజు తన దూతలతో గూడి నివసించుచుండును. అతడు పరమేశ్వరుని ఆజ్ఞను ఎన్నడును ఉల్లంఘింపడు. మరణించిన జీవులను అతని దూతలు ఆ నరకలోకమునకు చేర్చెదరు. వారి పాప కర్మలకు తగిన దండనలను అతడు విధించును.
మహారాజా! నరకముల సంఖ్య ఇరువదియొకటి అని కొందరు పేర్కొందురు. వాటి నామ, రూప, లక్షణములను క్రమముగా వర్ణించెదను. తామిస్రము, అంధతామిస్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, కృమిభోజనము, సందంశనము, తప్తసూర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదము, ప్రాణ రోధము, విశసనము, లాలాభక్షణము, సారమేయాదనము, అవీచి, అయఃపానము అనునవి వాటి పేర్లు. ఇవి గాక క్షారకర్దమము, రక్షోగణభోజనము, శూలప్రోతము, దందశూకము, అవటనిరోధనము,పర్యావర్తనము, సూచీముఖము అని ఏడు నరకములు గలవు. ఇవియన్నియు కలిపి ఇరువది ఎనిమిది నరకములు. వీటి యందు జీవులు వివిధములగు యాతనలను అనుభవింతురు.
ఇతరుల ధనములను, సంతానమును, భార్యలను అపహరించిన జీవుని భయంకరులైన యమదూతలు కాలపాశముతో బంధించి బలవంతముగా తామిస్రనరకమున పడవేయుదురు. అంధకారమయమైన ఆనరకము నందు వారికి ఆహారముగాని, నీరుగాని దొరకవు. యమభటులు వారిని కర్రలతో కొట్టుట, భయపెట్టుట మొదలగు రీతుల పీడించెదరు. ఈ బాధలవలన దుఃఖితుడైన జీవుడు మూర్ఛితుడగును.
అట్లే విశ్వాసఘాతుకముతో వంచించి ఇతరుల భార్యలను, సంపదలను అనుభవించిన జీవుడు అంధతామిస్రనరకమున పడును. అచట యాతనలకు తట్టుకొనలేక మొదలు నరికిన వృక్షమువలె బుద్ధిని, దృష్టిని గూడ కోల్పోవును. అందువలన ఈ నరకమును అంధతామిస్రము అని యందురు.
ఈ లోకమున పురుషుడు ఈ శరీరము నాది, ఈ స్త్రీ, ఈ ధనము మొదలగునవి నావి అను బుద్ధితో (అహంకార మమకారములతో) ఇతర ప్రాణులకు ద్రోహమొనర్చుచు తన కుటుంబపోషణయందే నిమగ్నుడై యుండును. అట్టి వారు శరీరముసు వదలిన పిమ్మట తన పాపముల కారణమున స్వయముగా రౌరవము అను నరకమున పడిపోవును.
(పంచమ స్కంధంలోని ఇరువది ఆరవ అధ్యాయము ఇంకనూ కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నాకు పితామహుడు. శ్రీహరి అతని తండ్రియైన హిరణ్యకశిపుని సంహరించి, నిష్కంటకమైన తన తండ్రి రాజ్యమును ప్రహ్లాదునకు ఇచ్చుచుండెను. అది తనను భగవంతునినుండి దూరము చేయునని భావించి, ఆ రాజ్యమును అతడు స్వీకరింపలేదు. కాని, భగవంతుని భక్తులకు దాసానుదాసునిగా చేయు వరమును కోరుకొనెను.
ప్రహ్లాదుడు గొప్ప మహాత్ముడు. నేనైతే విషయవాసనలు తొలగనివాడను. భగవత్కృపకు దూరమైన నావంటి వాడు ఆ ప్రహ్లాదుని మార్గమును అనుసరించుటకు ఎట్లు సాహసింప గలదు?
పరీక్షిన్మహారాజా! ఆ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతమును మున్ముందు (అష్టమస్కంధమునందు) విపులముగా తెలుపగలను. శ్రీహరి హృదయము భక్తులయెడ దయతో నిండియుండును. అంతేకాదు, స్మరించినంతలోనే కరుణించుటకు సిద్ధమగును. అందువలననే సకల జగత్తునకు పరమపూజ్యుడు, గురువు ఐన శ్రీమన్నారాయణుడు గదను చేబూని, సుతలలోకమున బలిచక్రవర్తియొక్క భవనద్వారము వద్ద సర్వదా నిలచియుండును. ఒకానొక సందర్భమున బలగర్వితుడైన రావణుడు దిగ్విజయయాత్ర చేయుచు అచటికి వచ్చెను. అపుడు శ్రీహరి తనకాలి బొటన వ్రేలితో అతనిని లక్షల యోజనముల దూరమున పడవేసెను.
సుతలలోకమునకు క్రింద తలాతలలోకము కలదు. త్రిపురములకు అధిపతియు, దానవులకు రాజు ఐన మయుడు అచట నివసించును. పూర్వము ముల్లోకములకును శాంతిని చేకూర్చుటకై శంకరభగవానుడు అతని మూడు పురములను భస్మమొనర్చెను. అందుకే పరమ శివుడు త్రిపురాంతకుడు అని నామప్రసిద్ధుడాయెను. మరల ఆ పరమశివుని కృప చేతనే అతనికి తలాతలలోకమునందు స్థానము ప్రాప్తించెను. అతడు మాయావులకు గురువు. మహాదేవుని రక్షణలో సర్వదా భద్రముగా ఉండును. కావున, సుదర్శన చక్రము వలన గూడ అతనికి ఎట్టి భయమూ ఉండదు. ఆ లోకమున ఉండువారు ఆయనను మిగుల ఆదరింతురు.
తలాతలమునకు క్రిందిభాగమున మహాతలలోకము గలదు. అచట కద్రువసంతానమైన సర్పముల సముదాయము ఉండును. వారు క్రోధవశులు, అను పేరుగలరు, పెక్కు పడగలు గలవారు వారిలో కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మున్నగువారు ప్రముఖులు. వారి పడగలు మిగుల విశాలములు. శ్రీహరివాహనమైన గరుత్మంతునకు వారు సర్వదా భయపడుచుందురు. వారు అప్పుడప్పుడు తమ భార్యాపుత్రుల తోడను, బంధుమిత్రులతోడను ప్రమత్తులై విహరించు చుందురు.
మహాతలము క్రింద రసాతలముగలదు. అచట పణులు, అనుపేరుగల దైత్యులు, దానవులు ఉందురు. వారు నివాతకవచులు, కాలేయులు, హిరణ్యపురవాసులు అనియు ప్రసిద్ధి గాంచిరి. వీరు దేవతలకు విరోధులు. పుట్టుకతోడనే వారు బలము, సాహసము గలవారు. ముల్లోకములలోను, వ్యాపించిన శ్రీహరి ప్రభావము వలన, వీరి బలగర్వములు అణగిపోయినవి. కనుక, వీరు సర్పములవలె బిలములలో దాగికొని యుందురు. వీరు ఇంద్రుని దూతికయైన సరమ యొక్క పలుకుల కారణముగ సర్వదా ఇంద్రునకు భయపడు చుందురు.
రసాతలము క్రింద పాతాళలోకముగలదు. అచట శంఖుడు, కులికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలగు నాగజాతివారు ఉందురు. వీరు మిగుల క్రోధస్వభావులు, పెద్ద పెద్ద పడగలు గలవారు. వీరిలో వాసుకి ప్రముఖుడు. వీరికి ఐదు, ఏడు, పది, వంద, వేల సంఖ్యలో పడగలుండును. వీరి పడగలలో ప్రకాశించుచున్న మణులకాంతులచే పాతాళలోకమునందలి చీకట్లు దూరములగును.
పైన ముప్పదియవ శ్లోకములో చెప్పిన పణులు అనగా - పణులు అను పేరుగల దైత్యులు పృథ్విని రసాతలము నందు దాచిరి. అప్పుడు ఇంద్రుడు ఆ భూమిని వెదకుటకై సరమ అను దూతికను పంపెను. దైత్యులు సరమతో సంధిచేసికొనగోరిరి. కాని, ఆమె, వారితో సంధి చేసికొనక ఇంద్రుని స్తుతించుచు హతా ఇంద్రేణ పణయః శ్రయధ్వమ్ (ఓ పణులారా! మీరు ఇంద్రుని చేతిలో మరణించి పృథ్విపై శయనింతురు) అని పలికెను. ఈ శాపకారణముగా వారు (పణులు) సర్వదా ఇంద్రునకు భయపడుచుందురు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే చతుర్వింశోఽధ్యాయః (24)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు ఇరువది నాలుగవ అధ్యాయము (24)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
శ్రీ శుకుడు నుడివెను-పరీక్షిన్మహారాజా! సప్తర్షిమండలమునకు పైన పదమూడు లక్షల యోజనముల దూరములో ధ్రువలోకము గలదు. దానిని శ్రీమహావిష్ణువు యొక్క పర పదమనియు పేర్కొందురు. ఉత్తానపాదునియొక్క పుత్రుడు, భాగవతోత్తముడు ఐన ధ్రువుడు అచట విరాజిల్లుచుండును. అగ్నిదేవుడు, ఇంద్రుడు, కశ్యపప్రజాపతి, ధర్ముడు, అనువారు అందరును కలిసి సాదరముగా అతనికి ప్రదక్షిణమొనర్తురు. ఇప్పుడును కల్పాంతము వరకు ఉండు లోకములకు ఈ ధ్రువమండలమే ఆధారము. దీనిని గూర్చి నేను ఇదివరకే (చతుర్ధస్కంధము నందు) తెలిపియుంటిని.
సర్వదా జాగరూకుడై అవ్యక్తగతి స్వరూపుడై శ్రీహరి కాలచక్రము ద్వారా గ్రహనక్షత్రాది జ్యోతిర్గణములను నిరంతరము త్రిప్పుచుండును. ఆ భగవానుడు వాటి అన్నింటికిని (గ్రహనక్షత్రాదులకు అన్నింటికిని) ధ్రువలోకమును ఆధారస్తంభముగా నిలిపెను. కనుక, ఇది ఒకే స్థానములో నుండి సర్వదా ప్రకాశించుచుండును.
రైతు ధాన్యమును నూర్చుటకై కళ్ళము మధ్యలో ఒక గుంజను పాతి, దాని చుట్టును పశువులను కట్టును. కొన్నింటిని పొడవైన త్రాళ్ళతో, మరి కొన్నింటిని పొట్ట త్రాళ్ళతో, ఇంకను కొన్నింటిని మధ్యమ పరిమాణముగల త్రాళ్ళతో బంధించును. అందువలన ఆ పశువులు గుంజకు దూరముగను, మరికొన్ని దగ్గరగను, ఇంకను కొన్ని మధ్యమదూరము గను తిరుగుచుండును. అట్లే నక్షత్రములు, గ్రహములు ధ్రువమండలమును ఆశ్రయించుకొని, వాయు ప్రేరణచే కల్పాంతము వరకు కాలచక్రమున పరిభ్రమించు చుండును. మేఘములు, గ్రద్దలు మొదలగు పక్షులు, తమ చేష్టలద్వారా వాయువు యొక్క ప్రేరణవలన ఆకాశమున ఎగురుచున్నట్లు జ్యోతిర్గణములు గూడ ప్రకృతి పురుషుల సంయోగవశమున తమ తమ కర్మలను అనుసరించి తిరుగుచుండును. కాని, అవి ఎన్నడును భూమిపై పడిపోవు.
ఈ నక్షత్రమండలము వాసుదేవ భగవంతుని యోగమాయాశక్తిచే నీటికోతి రూపములో నిలబెట్టబడి యున్నదని కొందరు వర్ణింతురు.
ఈ శిశుమార చక్రము వలయాకారములో ఉండును. దీనిముఖము క్రింది వైపునకు ఉండును. తోకయొక్క కొసవైపున ధ్రువుడుండును. మధ్య భాగమున ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉందురు. తోక మొదట ధాత, విధాత అను నక్షత్రములు ఉండును. కటి ప్రదేశమున సప్పర్షులు ఉందురు. వలయాకారముగా ఉన్న శిశుమారమునకు (నీటికోతి) కుడివైపునను యొక వలయము ఉండును. ఉత్తరాయణ నక్షత్రములను (అభిజీత్తు నుండి పునర్వసు వరకు) దానికి కుడీవైపున, దక్షిణాయన సక్షత్రములను (పుష్యమి నుండి ఉత్తరాషాఢ వరకు) ఎడమ వైపునకు భావన చేయవచ్చును. దాని వీపుపై అజవీధి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అను మూడు నక్షత్రముల సమూహము) ఉండును. ఉదరమునందు ఆకాశగంగ ఉండును.
23.6 (ఆరవ శ్లోకము)
రాజా! ఈ శిశుమారమునకు కుడి, ఎడమ, నడుము భాగములయందు క్రమముగా పునర్వసు, పుష్యమీ నక్షత్రములును, వెనుక నుండియే కుడి, ఎడమలుగా పాదముల యందు ఆర్ధ్ర, ఆశ్లేషలును, కుడి, ఎడమ ముక్కుపుటముల యందు అభిజిత్తు, ఉత్తరాషాఢలును, కుడి యెడమ కన్నుల యందు శ్రవణము, పూర్వాషాఢలును, కుడి, యెడమ చెవుల యందు ధనిష్ఠ, మూలానక్షత్రములును ఉండును. ఎడమ ప్రక్కయెముకలయందు మఖతో మొదలైన ఎనిమిది దక్షిణాయన నక్షత్రములును, అట్లే కుడి ప్రక్కటెముకల యందు మృగశీర్షలతో మొదలిడి తలక్రిందులుగా ఎనిమిది ఉత్తరాయణ నక్షత్రములను, కుడి, ఎడమ భుజముల యందు శతభిషము, జ్యేష్ఠా నక్షత్రములును ఉండును.
శిశుమార రూపములో కనబడు నక్షత్రమండలములో పై దవడయందు అగస్త్యుడు, క్రింది దవడయందు యముడు, నోటియందు అంగారకుడు, మర్మస్థానమున శని, మూపురమున బృహస్పతి, వక్షస్థలమున సూర్యుడు, హృదయమున నారాయణుడు, మనస్సున చంద్రుడు, నాభియందు శుక్రుడు, స్తనములయందు అశ్వినీదేవతలు, ప్రాణాపానములయందు బుధుడు, కంఠమున రాహువు, సమస్త అవయవములయందు కేతువు, రోమములయందు సకల తారాగణములు ఉన్నట్లు ఊహింపవలెను.
పరీక్షిన్మహారాజా! ఇది కాలచక్రము. సర్వదేవతా మయుడగు శ్రీమహావిష్ణువు యొక్క స్వరూపము. ప్రతిదినము సాయంకాలము నందు మనుజుడు పవిత్రుడై మౌనముగా ఈ స్వరూపమును దర్శించుచు ధ్యానింపవలెను. ఇంకను ఈ మంత్రమును జపించుచు భగవంతుని యిట్లు స్తుతింపవలెను. పరమపురుషా! నీవు సకల జ్యోతిర్గణములకు ఆశ్రయుడవు. కాలచక్ర స్వరూపుడవు. సకలదేవతలకు అధిపతివి. అట్టి నీకు నమస్కారము!
భగవంతుని ఆధిదైవికరూపము గ్రహ, నక్షత్ర, తారా గణముల రూపమున ప్రకాశించుచున్నది. అది పైన తెలిపిన మంత్రమును జపించు పురుషుల పాపములను నశింప జేయును. ప్రాతః కాలమునందును, మధ్యాహ్నమునందును, సాయం సమయముల యందును ఈ ఆధిదైవికస్వరూపమును నిత్యము ధ్యానించుచు, వందన మాచరించు పురుషుని పాపములన్నియును వెంటనే నశించును.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే త్రయోవింశోఽధ్యాయః (23)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు ఇరువది మూడవ అధ్యాయము (23)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పరీక్షిన్మహారాజు నుడివెను- శుకయోగీంద్రా! సూర్యభగవానుడు రాసులవైపు సంచరించుచున్నప్పుడు మేరువునకు ధ్రువమండలమునకు కుడివైపున పోవుచున్నట్లు కనబడుచుండును. కాని, వాస్తవముగా ఆయన గమనము కుడివైపున కాదని నీవు తెలిపితివి. ఈ విషయమును నేను ఎట్లు గ్రహింపగలను?
స హోవాచ
శ్రీ శుకదేవుడు ఇట్లు చెప్పెను - కుమ్మరివాని చక్రము తిరుగుచుండగా దానిపై చేరి; దానితోపాటు తిరుగుచున్న చీమలు మొదలగువాటి గమనము బయఠ నిలబడియున్నవారికి వ్యతిరేకముగా కనిపించును. ఏలయన, అవి వేర్వేరు సమయములయందు చక్రముయొక్క వేర్వేరు స్థానములలో కనబడుచుండును. అదే విధముగా ధ్రువమండలమును, మేరు పర్వతమును ప్రదక్షిణముగా చుట్టి వచ్చుచుండు కాలచక్రమును ఆశ్రయించి యున్న సూర్యుడు మొదలగు గ్రహముల గమనము విపరీతముగా కానవచ్చును.
వేదములు, విద్వాంసులు, కాలచక్రము గతిని గూర్చి తెలిసికొనుటకు ఉత్సాహమును చూపుదురు. ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు లోకకల్యాణము కొఱకును, జనుల కర్మశుద్ధి కొఱకును, తన వేదమయమైన కాలస్వరూపమును పన్నెండు మాసములుగా విభజించి, వసంతాది - ఆరు ఋతువుల యందు వాటి గుణములను (వాటీ లక్షణములను) నియమించును.
ఈ లోకమునందు వర్ణాశ్రమధర్మములను అనుసరించువారు వేదములచే ప్రతిపాదింపబడిన చిన్న, పెద్ద కర్మలద్వారా ఇంద్రాదిదేవతల రూపములోనున్న భగవంతుని ఆరాధింతురు. యోగులు యోగసాధనలద్వారా అంతర్యామిగా భగవంతుని భక్తి శ్రద్ధలతో ఉపాసింతురు. వీరు అందరును సులభముగా పరమపదమును పొందుదురు.
సూర్యభగవానుడే సకలలోకములకు ఆత్మ. అతడు భూమికిని, స్వర్గమునకు మధ్యమున స్థితుడై, ఆకాశమండలమున కాల చక్రమునందలి పన్నెండు మాసములను నియమించుచున్నాడు. అవి మేషాదిరాసుల పేర్లతో సంవత్సరమునకు అవయవములుగా నున్నవి. చాంద్రమానమును అనుసరించి, ప్రతిమాసము శుక్లపక్షము, కృష్ణపక్షము అని రెండు పక్షములుగా వ్యవహరింపబడును. ప్రతిమాసము, పితృయానమును అనుసరించి ఒకరాత్రి, ఒక పగలు అగును. సౌరమానము ప్రకారము ఒక మాసము (రెండుంబావు నక్షత్రముల కాలమునకు సమానమగును. ఈ సంవత్సర కాలగమనమునందు ఆరవవంతు పూర్తిచేసిన కాలమునకు ఋతువు అనబడును).
ఆకాశమునందు సూర్యభగవానుడు సంచరింఛు కాలములో సగము సమయము (అనగా ఆరుమాసములు) ఆయనము.. ఇది కూడా సంవత్సరము యొక్క అవయవమే అగును.
సూర్యుడు స్వర్గమునకును, భూమండలమునకు మధ్య ఆకాశమునందు సంచరించుచుండును. ఆయన సంచార వేగము ఆయా సమయములందు మందముగను, తీవ్రముగను సమానముగను ఉండును. దానిని బట్టి, సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, వత్సరము, అను భేదములచే వ్యవహరించెదరు.
ఇదే విధముగా సూర్యకిరణములకు పైన లక్షయోజనముల దూరములో చంద్రుడు ఉండును, అతడు మిక్కిలి వేగముగా, నక్షత్రములకంటె ముందుగా పయనించును. సూర్యునియొక్క ఒక సంవత్సర మార్గమును చంద్రుడు ఒక మాసము నందును, సూర్యుని ఒక మాసము మార్గమును రెండుంబాతిక దినములందును, ఒక పక్షము మార్గమును ఒకే దినమునందు తన ప్రయాణమును ముగించును.
కృష్ణపక్షములో చంద్రుని కళలు క్షీణించు చున్నప్పుడు పితృగణములకు రాత్రింబవళ్ళ విభాగము గల్గును. అట్లే శుక్ల పక్షమున వృద్ధి చెందునప్ఫుడు దేవతలకు రాత్రింబవళ్ళు ఏర్పడును. చంద్రుడు ముప్పదిముహూర్తముల కాలములో (ఒక దినములో) ఒక్కొక్క నక్షత్రమును అతిక్రమించును. చంద్రుడు అన్నమయుడు, అమృతమయుడు అగుటవలన అతడు సకల జీవుల ప్రాణములకును, జీవనములకును ఆధారమగును.
(పంచమ స్కంధము లోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
22.10 (పదియవ శ్లోకము)
స ఏషః షోడశకళః పురుషో భగవాన్ మనోమయోన్నమయోఽమృతమయో దేవ పితృమనుష్య భూతపశుపక్షిసరీసృపవీరుధాం ప్రాణాప్యాయనశీలత్వాత్ సర్వమయ ఇతి వర్ణయంతి॥4563॥
మనోమయుడు, అన్నమయుడు, అమృతమయుడు ఐన పరమపురుషుడే పదునారు కళలతో గూడిన చంద్రుని రూపములో విలసిల్లుచున్నాడు. ఆ శ్రీహరియే దేవతల, పితృదేవతల, మనుష్యుల, భూతముల, పశుపక్ష్యాదుల, సరీనృపముల, వృక్షాది సమస్తమును పోషించుచున్నాడు. కనుక, ఆ శ్రీహరిని సర్వమయుడు అని వర్ణించుట జరిగినది.
చంద్రునకు పైన మూడు లక్షలయోజనముల దూరమున అభిజిత్తుతో కూడి ఇరువది ఎనిమిది నక్షత్రములు గలవు. పరమాత్ముడు వీటిని కాలచక్రము నందు నియమించెను. కనుక, ఇవి మేరుపర్వతమునకు కుడివైఫున సంచరించుచుండును.
ఈ నక్షత్రములకు పైన రెండు లక్షలయోజనముల దూరమున శుక్రగ్రహము ఉండును. అతడు సూర్యుని యొక్క శీఘ్ర, మంద, సమానములగు గమనములను అనుసరించుచుండును. అందువలన ఆ శుక్రుడు సూర్యునితో సమానముగా ఒక్కొక్కసారిముందుగను, ఒక్కొక్కసారి వెనుకగను, మరియొక్కసారి అతనితో గూడి సంచరించును. శుక్రగ్రహము సర్వదాలోకములకు అనుకూలముగా వర్షముల గురిపించుచుండును. శుక్రుడు తనగమనముచే వర్షమును స్తంభింపజేయు గ్రహములను ఉపశమింపజేయునని భావింపదగును.
శుక్రగ్రహముసు అనుసరించియే బుధగ్రహము యొక్క గమనముగూడ వివరింపబడినది. చంద్రుని కుమారుడైన బుధుడు శుక్రునకు పైన రెండు లక్షల యోజనముల దూరములో ఉండును. ఇతడు సాధారణముగా శుభంకరుడు. కాని, ఈ సూర్యగతిని ఉల్లంఘించుచు సంచరించునపుడు పెనుగాలిని, మేఘములను, అనావృష్టి మొదలగు భయములను సూచించును.
బుధగ్రహమునకు పైన రెండు లక్షల యోజనముల దూరమున కుజ (అంగారక) గ్రహము ఉండును. ఇతడు వక్రగతిని సంచరింపనిచో, ఒక్కొక్క రాశిని మూడు, మూడు పక్షముల చొప్పున పన్నెండు రాసులను దాటిపోవును. కుజుడు అశుభగ్రహము. సాధారణముగ ఇతడు అమంగళములను సూచించును.
అంగారకగ్రహమునకు పైన రెండు లక్షలయోజనముల దూరమున మహాత్ముడగు బృహస్పతి ఉండును. ఇతడు వక్రగతిలో లేనప్పుడు ఒక్కొక్కరాశిని ఒక సంవత్సర కాలములో దాటుచు పయనించును. సాధారణముగా ఇతడు బ్రాహ్మణులకు అనుకూలుడుగా ఉండును.
బృహస్పతి పైన రెంఢు లక్షల యోజనముల దూరములో శనైశ్చరుడు గోచరించుచుండును. ఇతడు ఒక్కొక్కరాశి యందు ముప్పది మాసములు (రెండున్నర సంవత్సరములు) వరకు ఉండును. కనుక, అన్ని రాసులను దాటుటకు ఇతనికి ముప్పది సంవత్సరములు పట్టును. ఇతడు సాధారణముగా అందరికిని అశాంతికారకుడు.
ఈ గ్రహములకు అన్నింటికి పైన పదకొండులక్షల యోజనములు దూరమున, కశ్యపాదిసప్తర్షులు కనబడుదురు. వీరు అన్నిలోకముల శుభములను కోరుచు, శ్రీమహావిష్ణువుయొక్కాపరమపదమైన ధ్రువలోకమునకు ప్రదక్షిణము చేయుదురు.
శ్రీ శుకుడు వచించెను - పరీక్షిన్మహారాజా! ఈ మండలము యొక్క పరిమాణము, లక్షణములను, విస్తృతిని గూర్చి నీకు వివరించియుంటిని.
ఏతేన హి దివో మండలమానం తద్విదః ఉపదిశంతి యథా ద్విదలయోర్నిష్పావాదీనమ్ తే అంతరేణాంతరిక్షం తదుభయసంధితమ్॥4536॥
విద్వాంసులు ఈ భూమండల పరిమాణమును బట్టి స్వర్గపరిమాణమును గూర్చి తెలుపుదురు. శనగలు, బటానీలు మొదలగువాటియొక్క ద్విదళములు ఒకే స్వరూపమున ఉన్నట్లు తెలియుచుండును. అట్లే భూలోక పరిమాణములను బట్టి స్వర్గలోక పరిమాణమును తెలిసికొనవలెను. ఈ రెండింటి మధ్యగల అంతరిక్షము సంధిస్థానము.
యన్మధ్యగతో భగవాంస్తపతాంపతిస్తపన ఆతపేన త్రీలోకీం ప్రతపతి అవభాసయత్యాత్మభాసా స ఏష ఉదగయనదక్షిణాయనవైషువత సంజ్ఞాభిర్మాంద్య శైఘ్ర్యసమానాభిర్గతిభిరారోహణావరోహణ సమానస్థానేషు యథాసవనమభిపద్యమానో మకరాదిషు రాశిష్వహోరాత్రాణి దీర్ఘహ్రస్వసమానాని విధత్తే॥4537॥
గ్రహములకును, నక్షత్రములకును అధిపతియైన సూర్యభగవానుడు ఈ రెండింటి మధ్య భాగమున ఉండి, తన తాపముచే, ప్రకాశముచే ముల్లోకములను తపింపజేయును, ప్రకాశింపజేయును. ఉత్తరా యణము, దక్షిణాయనము, విషువత్తులు అను వాటియందు క్రమముగా మంద, శీఘ్ర, సమాన గతులతో ప్రయాణించును. సమయానుసారము మకరము మున్నగు రాశులలో పైన, క్రింద, సమానస్థానములలో తిరుగుచు రాత్రింబవళ్ళను దీర్ఘముగను, హ్రస్వముగను, సమానముగను చేయుచుండును.
21.4 (నాలుగవ శ్లోకము)
యదా మేషతులయోర్వర్తతే తదాహోరాత్రాణి సమానాని భవంతి యదా వృషబాదిషు పంచసు చ రాశిషు చరతి తదాహాన్యేవ వర్ధంతే హ్రసతి చ మాసీ మాస్యేకైకా ఘటికా రాత్రిషు॥4538॥
21.5 (ఐదవ శ్లోకము)
యదా వృశ్చికాదిషు పంచసు రాశిషు వర్తతే తదాహోరాత్రాణి విపర్యయాణి భవంతి॥4539॥
21.6 (ఆరవ శ్లోకము)
యావద్దక్షిణాయనమహాని వర్ధంతే యావదుదగయనం రాత్రయః॥4540॥
సూర్యుడు మేషతులరాశులలో ఉన్నప్ఫుడు రాత్రింబవళ్ళు సమానముగ ఉంఢును. వృషభము మొదలగు ఐదు రాసులలో సంచరించు చున్నప్ఫుడు ప్రతి మాసమున ఒక్క గడియ తగ్గుచుండును. పగటి కాలము ఒక గడియ హెచ్చుచుండును. అట్లే వృశ్చికము మొదలగు ఐదు రాసులలో సంచరించుచున్నప్పుడు రాత్రింబవళ్ళు సమయము విపర్యయముగా ఉండును. అనగా రాత్రిసమయములు దీర్ఘములై, పగటి సమయములు హ్రస్వముగ ఉండును. దక్షిణాయనమున పగటికాలము వృద్ధియగుచుండును. ఉత్తరాయణమున రాత్రి సమయములు వృద్ధియగుచుండును.
21.7 (ఏడవ శ్లోకము)
ఏవం నవకోటయ ఏకపంచాశల్లక్షాణి యోజనానాం మానసోత్తర గిరిపరివర్తన స్యోపదిశంతి తస్మిన్నైంద్రీంపురీం పూర్వస్మాత్ మేరోర్దేవధానీం నామ దక్షిణతో యామ్యాం సంయమనీం నామ పశ్చాద్వారుణీం నమ్లోచనీం నామ ఉత్తరతః సౌమ్యాం విభావరీం నామ తాసూదయమధ్యాహ్నాస్తమయనిశీథానీతి భూతానాం ప్రవృత్తినివృత్తినిమిత్తాని సమయ విశేషణ మేరోశ్చతుర్దిశమ్॥4541॥
మానసోత్తర పర్వతముపై సూర్యుడు ప్రదక్షిణము చేయు మార్గము యొక్క నిడివి తొమ్మిది కోట్ల ఏబది యొక్క లక్షల యోజనములు అని పండితుల అభిప్రాయము. ఆ పర్వతముపై మేరుగిరికి తూర్పున ఇంద్రుని దేవధాని నగరము, దక్షిణమున యముని యొక్క సంయమనీ నగరము, పశ్చిమమున వరుణుని నిమ్లోచని పురము, ఉత్తరమున చంద్రుని విభావరి పురములు గలవు. ఈ నగరముల యందు మేరుగిరికి నలువైపుల ఆయా సమయములయందు సూర్యోదయము, మధ్యాహ్నము, సాయంకాలము, అర్ధరాత్రి కలుగుచుండును. అందుచేతనే సకల జీవుల యొక్క ప్రవృత్తి (జాగృతి), నివృత్తి, నిద్ర కలుగుచుండును.
21.8 (ఎనిమిదవ శ్లోకము)
తత్రత్యానాం దివసమధ్యంగత ఏవ సదా ఆదిత్యస్తపతి సవ్యేనాచలం దక్షిణేన కరోతి॥4542॥
సుమేరు పర్వతముపైగల జనులను సర్వదా మధ్యాహ్నకాల సూర్యుడు తపింపజేయుచుండును. అశ్వని మొదలగు నక్షత్రముల వైపు సూర్యుడు మేరు గిరికి ఎడమ వైపున సంచరించుచుండును. ఐనను, జ్యోతిర్మండలమును త్రిప్పుచున్న దక్షిణ వాయుప్రసారము ద్వారా అది కుడివైపే సంచరించుచున్నట్లు కనబడును.
21.9 (తొమ్మిదవ శ్లోకము)
యత్రోదేతి తస్య హ సమాన సూత్రనిపాతే నిమ్లోచతి యత్ర క్వచన స్యందేనాభితపతి తస్య హైష సమాన సూత్రనిపాతే ప్రస్వాపయతి తత్ర గతం న పశ్యంతి యే తం సమనుపశ్యేరన్॥4543॥
సూర్యుడు ఉదయించు నగరమునకు నేరుగా ఆవలి వైపున నున్న నగరమునందు సూర్యుడు అస్తమించుచున్నట్లు గోచరించును. మధ్యాహ్న కాలమున కొన్ని నగరములయందు సూర్యుడు జనులను చెమటలు పట్టునట్లు తపింపజేయుచుండును. అదే సమయమున నేరుగా అటు నిటు ఉన్న జనులకు రాత్రి వేళ యగుట వలన వారు నిద్రలో మునిగియుందురు. మధ్యాహ్న సమయమున సూర్యుని స్పష్టముగా చూచు జనులు, సూర్యుడు ఆవలివైపు చేరగనే ఆయనను దర్శింపజాలరు.
21.10 (పదియవ శ్లోకము)
యదా చైద్ర్యాః పుర్యాః ప్రచలతే పంచదశఘటికాభిర్యామ్యాం సఫాద కోటిద్వయం యోజనానాం సార్ధద్వాదశలక్షాణి సాధికాని చోపయాతి॥4544॥
సూర్యుడు ఇంద్ర నగరము నుండి యముని నగరమునకు వెళ్ళుటకు పదిహేను గడియలలో రెండుంబావు కోట్ల పన్నెండున్నర లక్షల యోజన ముల పైన కొద్ది హెచ్చుదూరము పయనించును (2,
37,75,000 యోజనములు).
(పంచమ స్కంధము లోని ఇరువది యొకటవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

ఆరు ద్వీపముల లోకాలోక పర్వతముల వర్ణనము
శ్రీ శుక ఉవాచ
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! ఇప్పుడు నేను ప్లక్షద్వీపము మొదలగు ఇతర ద్వీపముల పరిమాణములను, లక్షణములను, స్థితులను గూర్చి వర్ణింతును.
మేరుపర్వతము జంబుద్వీపముచే పరివృతమైయున్నట్లు జంబూ ద్వీపము కూడా దానితో సమానమైన పరిమాణము, వైశాల్యము గల లవణ సముద్రముచే పరివేష్టితమై యున్నది. అగడ్తలు, ఉపవనములచే ఆవరింపబడియున్నట్లు లవణ సముద్రను గూడ దానితో సమానమైన వైశాల్యము గల ప్లక్షద్వీపముచే ఆవరింపబడియున్నది. జంబుద్వీపమున పెద్ద పెద్ద నేరేడు వృక్షములు గలవు. ప్లక్షద్వీపము గూడ అంత విస్తారముగల సువర్ణమయమైన ప్లక్ష వృక్షములు (జువ్వి చెట్లు) గలవు. అందువలననే దానికి ప్లక్షద్వీపము అను పేరు ఏర్పడినది. ఇచట సప్తజిహ్వలు గల అగ్ని దేవుడు విరాజిల్లుచుండును. ప్రియమిత్రుని కుమారుడైన ఇధ్మజిహ్వుడు ఈ ద్వీపమునకు అధిపతి. అతడు ఈ ప్లక్షద్వీపమును ఏడు ఖండములుగా విభజించెను. వాటిని తన పుత్రులకు అప్పగించెను. వారి పేర్లతోడనే ఆ ద్వీపములు గూడ వ్యవహరింపబడినవి. అనంతరము ఆ ఇధ్మజిహ్వుడు అధ్యాత్మయోగమును ఆశ్రయించి, సన్న్యాసాశ్రమమును స్వీకరించెను.
వరుసగా ఈ ఖండములను శివము, యవనము, సుభద్రము, శాంతము, క్షేమము, అమృతము, అభయము అని పేర్లు. వీటియందు ఏడు పర్వతములు, ఏడు నదులు పేరుగాంచినవి.
మణికూటము, వజ్రకూటము, ఇంద్రసేనము, జ్యోతిష్మంతము, సుపర్ణము, హిరణ్యష్ఠీనము, మేఘమాలము అనునవి ఈ మహాపర్వతముల పేర్లు. అట్లే అరుణ, నృమణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అనునవి ఏడు మహానదుల పేర్లు. ఇచట హంస-పతంగ-ఊర్ధ్వాయన-సత్యాంగ అను పేర్లతో నాలుగు వర్ణములవారు గలరు. పైన పేర్కొనబడిన నదులలో స్నానమొనర్చుటచే వీరి రజస్తమోగుణములు ప్రక్షాళితములగును. వీరి ఆయుః ప్రమాణము వేయిసంవత్సరములు. దేవతలవలెనే వీరి శరీరములయందు బడలికలుగాని, చెమటలుగాని కలుగవు. సంతానోత్పత్తి విషయములో గూడ వీరు దేవతలతో సమానులు. వేద స్వరూపుడగు సూర్యభగవానుని వీరు వేదోక్త మంత్రముల ద్వారా ఉపాసించుదురు. వీరు సూర్యుని స్వర్గద్వారముగాను, తను ఆత్మస్వరూపునిగాను భావింతురు.
సూర్యభగవానుడు అనాది జగత్కారణుడు (ప్రాచీనుడు) నిర్వికారుడు. వేదములయందు పేర్కొనబడిన శుభాశుభ కర్మలకు అధిష్ఠాత. ఈ స్వామి సాక్షాత్తుగా పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణుస్వరూపుడు. అట్టి సూర్య భగవానుని మేము శరణు వేడుచున్నాము - అని వీరు ప్రస్తుతింతురు.
ప్లక్షము మొదలగు ఐదు ద్వీపములయందలి జనులకు ఆయువు, ఇంద్రియములు, మనోబలము, ఇంద్రియ బలము, శారీరక బలము, బుద్ధి, పరాక్రమము సహజముగనే సమానముగా సిద్ధించును. ప్లక్ష ద్వీపము దానితో సమాన వైశాల్యము గల ఇక్షురస సముద్రముచే పరివృతమైయుండును. ఆ ప్లక్ష ద్వీపమునకు పిమ్మట దానికీ రెట్టింపు పరిమాణము గలా శాల్మలీ ద్వీపము గలదు. దానిని అంతటి విస్తీర్ణము గల మదిరా సముద్రము చుట్టియుండును.
ప్లక్షద్వీపమునందలి జువ్విచెట్లతో సమానముగా శాల్మలీ ద్వీపమునందు బూరుగు వృక్షముల సముదాయము గలదు. తన వేదమయమైన రెక్కలచే విష్ణుభగవానుని స్తుతించునట్టి పక్షిరాజగు గరుత్మంతునకు ఇది నివాస స్థానము
గా విజ్ఞులు పేర్కొందురు. ఈ ద్వీపమునకు ఆ పేరు వచ్చుటకు అదియే కారణము.
(పంచమ స్కంధము లోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
కింపురుష మరియు భారతవర్షము యొక్క వర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ఈ భారతవర్షము నందు అసంఖ్యాకములైన పర్వతములు, నదులు గలవు. మలయ పర్వతము, మంగళ ప్రస్థము, మైనాకము, త్రికూటాచలము, ఋషభము, కూటకము, కోల్లకము, సహ్యాద్రి, దేవగిరి, ఋష్యమూకము, శ్రీశైలము, వేంకటాచలము, మహేంద్రగిరి, వారిధారము, వింధ్యగిరి, శుక్తిమంతము, ఋక్షగిరి, పారియాత్రము, ద్రోణము, చిత్రకూటము, గోవర్ధనము, రైవతకము, కకుభము, నీలగిరి, గోకాముఖము, ఇంధ్రకీలాద్రి, కామగిరి మొదలగు వేలకొలది పర్వతములు ఎన్నియోగలవు. ఈ పర్వతములనుంఢి జాలువారెడి నదీనదములు గూడ అసంఖ్యాకములు.
చంద్రవశ, తామ్రపర్ణి, అవటోరా, కృతమాలా, వైహాయసీ, కావేరి, వేణి, పయస్వినీ, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణ, వేణ్యా, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణి, తాపి, రేవ, సురస, నర్మద, చర్మణ్వతి, సింధూ, అంధము మరియు శోణము అను నదములు, మహానది, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసామ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, రోధస్వతి, సప్తవతి, సుషోమ, శతద్రువు, చంధ్రభాగ, మరుద్వృధ, వితస్త,అసిక్ని, విశ్వ అను ముఖ్యనదులు గలవు.
ఈ దేశమున జన్మించిన మానవులే తామ జన్మజన్మలలో చేసికొనిన సాత్త్విక, రాజస, తామస కర్మలను అనుసరించి, క్రమముగా పలువిధములైన దివ్య, మానుష, నారకజన్మలను పొందుదురు. ఏలయన, జీవులకు తాము చేసికొనిన కర్మలను అనుసరించియే ఆయా జన్మలు ప్రాప్తమగును. ఈ దేశమునందు మానవులు విధ్యుక్తములైన వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి, మోక్షమును గూడ పొందగలరు.
పరీక్షిన్మహారాజా! పరమాత్మయైన వాసుదేవుడు సకలా ప్రాణులలోను అంతరాత్మగా వెలుగొందుచుండును. అతడు రాగాది దోషరహితుడు. అనిర్వచనీయుడు. సర్వాధారుడు. అట్టి భగవంతునియందు అనన్యమైన అ హైతుక భక్తి భావమే మోక్షప్రదము. పలు విధములుగా ప్రకటితమగు అజ్ఞానరూపమైన హృదయ గ్రంథిని ఛేదించి భాగవతోత్తముల సాంగత్యము లభించినప్ఫుడే ఈ భక్తి భావము ప్రాప్తమగును.
దేవతలు ఈ విధముగా గానము చేయుదురు-
ఆహా! ఈ మానవులు ఎంతటి అదృష్టవంతులు. భారతవర్షమున జన్మించిన ఈ మానవులు ఎంతటి పుణ్యమును చేసికొనియుండిరో గదా! వారియెడల స్వయంగా ఆభగవానుడే ప్రసన్నుడయ్యెను. ఈ మానవజన్మము ముకుందుని సేవించుటకు ఎంతయో ఉపయుక్తమైనది. దుర్లభమైనది. ఇంతటి దుర్లభమైన మానవజన్మకై మేముగూడ నిరంతరము ఆశించుచున్నాము
దుష్కరమైన యజ్ఞములు, తపస్సులు వ్రతములు, దానములు మొదలగు కార్యములను ఆచరించుటచే తుచ్ఛమైన ఈ స్వర్గముపై మనకు అధికారము లభించినది. దీని వలన ప్రయోజనము శూన్యము. ఇచట ఇంద్రియ భోగముల ఆధిక్య కారణముగ మన స్వస్వరూపముయొక్క స్మృతిశక్తి నశించినది. అందువలన, మనము ఎన్నడును శ్రీమన్నారాయణుని పాదపద్మములను స్మరించుటయే లేదు.
స్వర్గమునందేగాదు, బ్రహ్మలోకము నందుగూడ ఒక్కొక్క కల్పముమేరకు ఆయువు గలిగి నివసించినను సంసార చక్రమున పడవలసియే యుండును. దీనికంటెను కొద్ది కాలము జీవించినను భారత భూమి యందు జన్మించుటయే మేలు. ఏలయన, ఇచట మానవులు జితేంద్రియులై తమ మర్త్య శరీరములతో చేసిన సకల కర్మలను భగవంతునకు అర్పించి, కొలది క్షణములోనే పరమ పదమును పొందవచ్చును.
(పంచమ స్కంధము లోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
కింపురుష మరియు భారతవర్షము యొక్క వర్ణనము
శ్రీశుక ఉవాచ
శ్రీశుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! భాగవతోత్తముడైన హనుమంతుడు ఆదిపురుషుడు, సీతామనోభిరాముడు, లక్ష్మణాగ్రజుడు ఐన శ్రీరామచంద్ర భగవానుని పాదపద్మముల యందు అత్యంత ప్రీతి గలవాడు. అతడు కింపురుష దేశమునందు కింపురుషులతో గూడి అచంచల భక్తిభావముతో ఆ పరమపురుషుని ఉపాసించును.
అచట గంధర్వ ప్రముఖుడైన ఆర్-ష్టిషేణుడు ఇతర గంధర్వులతో గూడి శ్రీరామచంద్రునియొక్క కల్యాణగుణములను గానము చేయుచుండును. శ్రీహనుమంతుడు వాటిని వినుచుండుటయే గాక, స్వయముగా ఈ మంత్రమును జపించుచు తన ఆరాధ్యదైవమును స్తుతించుచుండును-
"ఓంకార స్వరూపుడైన శ్రీరామచంద్రుడు జగత్ప్రసిద్ధమైన యశోవైభవములు గలవాడు. సత్పురుష లక్షణములు గలవాడు. సౌశీల్యమునకు, సత్ప్రవర్తనకు నెలవైనవాడు. మనోనిగ్రహము గలవాడు. తనను ఉపాసించెడు వారలకు దర్శనమొసగుటకై తత్పరుడగు కృపామూర్తి! సాధువాదమునకు గీటురాయి. బ్రాహ్మణభక్తుడు. అట్టి పరమపురుషుడైన శ్రీరామచంద్ర ప్రభువునకు పదే పదే నమస్కారములు.
పరమాత్మా! నీవు విశుద్ధజ్ఞానస్వరూపుడవు. అద్వితీయుడవు. త్రిగుణములకు కార్యరూపములైన జాగ్రదాది- అవస్థలు నీ దివ్య తేజస్సుచే తిరస్కరింపబడినవి అనగా, జాగ్రత్స్వప్న సుషుప్తి అను అవస్థలకు అందని వాడవు. సర్వాంతర్యామివి. పరమశాంత స్వభావుడవు. పవిత్రాంతః కరణము గలవారిచే తెలియబడువాడవు. నామరూప భేద రహితుడవు. అహంకారము నీ దరిచేరదు. అట్టి నిన్ను శరణు జొచ్చుచున్నాను.
ప్రభూ! నీ మానవావతారము కేవలము రాక్షస సంహారముకొరకే గాదు. మానవులకు నీ ఆచరణ ద్వారా ఉత్తమశిక్షణను ఒసంగుటయు దాని పరమప్రయోజనము. అట్లు కానిచో, ఆత్మస్వరూపమునందే పరమానందమును పొందెడి జగదాత్మవు, జగదీశ్వరుడవు ఐన నీకు సీతాదేవి యెడబాటు వలన ఇంతటి దుఃఖము ఎట్లు కలుగును? అనగా - సీతాదేవి నీకు నిత్యానపాయిని. యెడబాటు కేవలము నీ లీలమాత్రమే.
స్వామీ! నీవు ధీరపురుషులకు ఆత్మ స్వరూపుడవ. అందరికి పరమహృదుడవు. నీవు సకలప్రాణులలో అంతర్యామిగా విరాజిల్లెడు వాసుదేవ భగవానుడవు. ద్వాపర యుగమునందు వసుదేవునకు సుథుడవై అవతరించిన మహానుభావుడవు నీవే. ముల్లోకములలో దేనియందును నీకు ఆసక్తిలేదు. సీతాదేవీ కొఱకై మోహగ్రస్తుడవు అగుట, లక్ష్మణుని పరిత్యజించుట నీ లీలలలో భాగములే.
ఒకసారి శ్రీరామచంద్రుడు ఒక దేవదూతతో ఏకాంతముగా సంభాషించుచుండెను. ఆసమయమున లక్ష్మణుడు ద్వారము దగ్గర కాపలాయుండెను. తాను దేవదూతతో మాట్లాడుచున్నప్పుడు ఎవరినీ లోపలికి రానీయకూడదనియు, అట్లు రానిచ్చినచో మరణదండను ఎదుర్కొనవలసి వచ్చుననియు శ్రీరాముడు లక్ష్మణుని ఆదేశించెను. ఇంతలో దుర్వాసముని వచ్చి తాను శ్రీరాముని సందర్శింవలెనని పట్టుబట్టెను. విధిలేని పరిస్థితిలో లక్ష్మణుడు ఆయనను లోనికి అనుమతించెను. తన ప్రతిజ్ఞానుసారము శ్రీరాముచంద్రుడు అయోమయ స్థితిలో పడిపోయెను. అప్ఫుడు ప్రియమైన వాటిని త్యజించుట మరణదండనతో సమానము అని వసిష్ఠుడు తెలిపెను. అందువలన, శ్రీరాముడు లక్ష్మణుని పరిత్యజింపవలసి వచ్చెను. కాని, శ్రీరాముడు లక్ష్మణుని విడువలేదు. అట్లే లక్ష్మణుడు శ్రీరాముని విడిచియుండలేదు
గొప్ప వంశములో జన్మించుటగాని, మిగుల సౌందర్యముగాని, వాక్చాతుర్యముగాని, బుద్ధికౌశలముగాని, జాతిగాని ఇవేవియూ శ్రీరాముని ప్రసన్నుని చేయుటకు ముఖ్యమైనవికావు. అందుకు నిలిచేది అచ్చమైన ప్రేమ ఒక్కటే. ఏలయన, మేము వనములలో జీవించేవారము. మాయందు ఈ ఉత్తమ లక్షణములలో ఏ ఒక్కటియునూ లేదు. ఐననూ లక్ష్మణాగ్రజుడు, అవ్యాజప్రేమమూర్తి, నిర్హేతుక కృపామూర్తియగు శ్రీరామచంద్రమూర్తి మమ్ములను తన స్నేహితులుగా స్వీకరించెను కదా! ఇది ఆశ్చర్యము".

వేర్వేరు దేశముల వర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
స్వామీ! నీవే అందరికిని శాశ్వతమైన భర్తవు. అనగా అందరిని రక్షించునట్టి ఈశ్వరుడవు. నీవు నిర్భయుడవు. భయముచే వ్యాకులపాటునకు లోనైన జనులను అందరిని అన్నివిధములుగా రక్షించువాడవు. అట్టి జగత్పతివి నీవు ఒక్కడవే ఏకమేవా ద్వితీయం బ్రహ్మా - నీవు దప్ప వేరొకరు లేనేలేరు అను శ్రుతివాక్యమును అనుసరించి ద్వితీయాద్ వై భయం భవతి రెండవదానిని అంగీకరించుటవల్లనే భయము కలుగును. ఉన్నదొకటే అని నమ్మినవానికి భయమే ఉండదు. కనుక ఆత్మలాభమును పొందుటకంటే శ్రేష్ఠమైనది వేరొకటి లేదని మహాత్ములు చెప్ఫుదురు.
శ్రీహరీ! నిష్కామభక్తితో నీ పాదపద్మములను ఆరాధించునట్టి స్త్రీ యొక్క మనోరథములను అన్నింటిని నీవు ఈడేర్తువు. అట్లుగాక ఏదేని ఒక కోరికతో నిన్ను ఉపాసించినచో ఆ స్త్రీకి ఆ కోరికను మాత్రమే తీర్చుదువు. దానిని అనుభవించిన పిమ్మట ఆమెకు దుఃఖమే మిగులును.
అపరాజితా! నీవు పరాజయమును ఎరుగనివాడవు. బ్రహ్మ, శంకరుడు, ఇంద్రియ సుఖాభిలాషులైన సమస్త సురాసురగణములు నన్ను పొందుటకై ఉగ్రమైన తపస్సులు చేయుచుందురు. కానీ, నీ పాదపద్మములను ఆశ్రయించిన భక్తులు తప్ప ఇతరులెవ్వరును నన్ను పొందజాలరు. ఏలయన, నా హృదయమునందు అంతటను నీవే నిండియుందువు.
స్వామీ! నీవు శాశ్వతుడవు. నీవు మిగుల పవిత్రమైన నీ కరకమలమును భక్తుల శిరస్సులపై ఉంచుచుందువు. ఆ హస్తమును నా శిరస్సుపై గూడ ఉంచుము. సర్వశ్రేష్ఠా! నన్ను నీవు కేవలము లాంఛనరూపమున నీ వక్షస్థలమున ధరించుచుందువు. సర్వసమర్థుడవైన నీ యొక్క మాయాలీలా రహస్యములను ఎవ్వరును ఎరుగరు.
పూర్వకాలమున రమ్యకదేశమునకు అధిపతియైస మనువునకు శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత ప్రియమైన మత్స్యరూపమును ప్రదర్శించెను. ఆ మనువు నేటికిని భక్తిభావముతో శ్రీహరియొక్క ఆ మత్స్యరూపమునే ఆరాధించుచు ఈ మంత్రమును జపించుచు స్తుతించుచున్నాడు. మహాత్మా! ప్రాణులందరిలో గల ముఖ్యప్రాణము నీవే. శుద్ధసత్త్వ స్వరూపుడవు అగు నీకు నమస్కారము. మనోబలము, ఇంద్రియబలము, శరీరబలముకూడా నీ స్వరూపమే. ఓంకారస్వరూపము, సర్వశ్రేష్ఠ స్వరూపము అగు నీ మహామత్స్యరూపమునకు పదేపదే నమస్కారములు.
సమస్తలోకములు, లోకపాలకుల లోపల, బయట అంతటా వ్యాపించియున్నావు. అందరి క్రియాకలాపములను అన్నింటినీ అదృశ్యరూపుడవై చూచుచున్నావు. ప్రాణులన్నింటిలోపల ప్రాణరూపముగా, బయటకుకూడ వాయురూపముగా సంచరించుచున్నావు. సూత్రధారుడు చెక్కబొమ్మలను ఆడించునట్లుగా, నీవు చాతుర్వర్ణ్యముల వారికి కర్మలను నిర్దేశించి ఆయా కర్మలలో వారిని నియమించి, జగన్నాటక సూత్రధారుడవై ఆడించుచున్నావు
ఈ జగత్తులో స్థావరజంగమాది ప్రాణులు ఎన్నియో గలవు. ఈ ప్రాణులన్నింటిలో నీవే ప్రాణశక్తిగా ఉన్నావు. అయితే ఒకసారి ఇంద్రియాభిమానులైన ఇంద్రాదిదేవతలు నీయెడల మాత్సర్యము వహించి నిన్ను వీడిపోయిరి. అట్లు వారందరు కలిసిగాని, వేర్వేరుగాగానీ ఎంతగా ప్రయత్నించిననూ ఈ ప్రాణులను రక్షింపలేకపోయిరి. ఏలయన, ప్రాణస్వరూపుడవైన నీవే ప్రాణులను రక్షింపగలవు. కానీ, ఇంద్రియములు రక్షింపలేవుగదా!
18.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
ప్రభూ! నీవు జన్మరహితుడవు. నీవు నాకేగాక (వైవస్వత మనువునగు) సకల ఓషధులకును,లతలకును ఆశ్రయమైనది భూమి. ఆ భూతలమును మోయుచు, ఎగిసిపడుచున్న తరంగములతో గూడిన ప్రళయకాల సముద్రమునందు మిక్కిలి ఉత్సాహముతో విహరించితివి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులను నియంత్రించువాడవు నీవే. నీకు నమస్కారము.
హిరణ్మయ వర్షమునందు శ్రీహరి కూర్మరూపమును ధరించి నివసించుచుండును. ఆ దేశమునందు నివసించు వారితో గూడి పితృ గణములకు అధిపతియైన అర్యముడు తనకు అత్యంత ప్రియమైన ఆ కూర్మరూపమును ఉపాసించుచుండును. మరియు నిరంతరము ఈ మంత్రమును జపించుచు స్తుతించుచుండును-
పంచమ స్కంధము లోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
వేర్వేరు దేశముల వర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీ శుక ఉవాచ
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! భద్రాశ్వదేశమున ప్రసిద్ధి గాంచిన ధర్ముని పుత్రుడగు భద్రశ్రవుడు, అతని వంశపెద్దలు, అతని ముఖ్య అనుచరులు కూడ శ్రీ వాసుదేవ భగవానుని హయగ్రీవుడు అను పేర ఉపాసించెదరు. వారు సమాధినిష్టులై, ధర్మమయము, తమకు అత్యంతము ప్రియమైన ఆ హయగ్రీవమూర్తిని తమహృదయములయందు నిలుపుకొని మంత్రములను జపించుచు ఇట్లు స్తుతించెదరు-
భద్రశ్రవస ఊచుః
భద్రశ్రవుడు మరియు అతని అనుచరులు పలికిరి-"ఓంకార స్వరూపుడు, ధర్మమయుడైన హయగ్రీవుడు మా అంతః కరణములను పరిశుద్ధమొనర్చును. అట్టి ప్రభువునకు నమస్కారము."
"అహో! భగవల్లీలలు ఎంతటి విచిత్రము లైనవి? సకలలోకములను సంహరించు చుండునట్టి మృత్యు దేవతను చూచుచున్నప్పటికిని జీవుడు ఆ విషయమున ధ్యాసను ఉంచుటయేలేదు. తుచ్ఛమైన విషయభోగములను అనుభవించుటకై పాపమయములైన ఆలోచనలను చేయుచునేయుండును. తానే స్వయముగా తన తండ్రియొక్క లేక, పుత్రునియొక్క కళేబరమును దహించు చున్నప్పటికిని తాను మాత్రము జీవించియుండుటకే కోరుకొనుచున్నాడు.
విద్వాంసులు ఈ జగత్తు నశ్వరమని తెలుపుచున్నారు. సూక్ష్మదర్శులైన ఆత్మజ్ఞానులు గూడ అదే విషయమును గమనించుచున్నారు. ఐనను, జనులు నీ మాయచేత మోహితులగుచునే యున్నారు. నీవు జన్మరహితుడవు. నీ లీలలు ఆశ్చర్యజనకములు. నీకు నమస్కారములు.
పరమాత్మ! ఈ జగత్తుయొక్క ఊత్పత్తి, స్థితి, లయములు నీ కార్యములే యని భావింపబడుచున్నది. ఐనను, నీవు అకర్తవు. మాయచే ఆవరింప బడనివాడవు. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు ఆశ్చర్యపడవలసినిది ఏమియు లేదు. ఏలయన, నీవు సర్వాత్మరూపుడవగుటచే సకల కార్యములకును కారణమగుదువు. శుద్ధ స్వరూపుడవగుటచే ఈ కార్యకారణ భావములకు నీవు సర్వధా అతీతుడవు.
ప్రళయకాలమునందు తమోగుణ ప్రధానులైన దైత్యులు వేదములను దొంగిలించిరి. అప్పుడు బ్రహ్మదేవుని ప్రార్థనను మన్నించి, హయగ్రీవరూపుడవై ఆ దైత్యులను సంహరించి, రసాతలము నుండి వేదములను తీసికొని వచ్చితివి. నీ లీలలు అమోఘములు. సత్య సంకల్పుడవైన నీకు నమస్కారము.
హరివర్షమను ఖండమున శ్రీహరి నృసింహరూపములో ఉండును. ఈ రూపమును ధరించుటకు కారణము మున్ముందు (సప్తమ స్కంధమున) వర్ణింపబడును. భగవంతుని యొక్క ఈ నృసింహ రూపమును భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు మరియు, ఆ ఖండమునందలి ఇతర జనులు నిష్కామమైన, అనన్యభక్తీ భావముతో ఉపాసించెదరు. ఈ ప్రహ్లాదుడు మహాపురుష లక్షణములను సమగ్రముగా కలిగియున్నవాడు. అతడు తన శీలముచే, ఆచరణములచే దైత్యదానవుల వంశములను పునీత మొనర్చెను. ఆ ప్రహ్లాదుడు ఈ మంత్రములద్వారా భగవంతుని స్తుతించెను-
ఓంకారస్వరూపుడవైన నరసింహా! నీకు నమస్కారము. అగ్నిమొదలగు తేజోమూర్తులకు గూడ నీవు తేజస్సును అనుగ్రహించెదవు. పరమాత్మా! నీకు నమస్కారము. నీగోళ్ళు, నీకోరలు వజ్రమువలె వాడియైనవి. మా యెదుట సాక్షాత్కరింపుము. తమ దర్శనమును ప్రసాదింపుము. మాకర్మవాసనలను పూర్తిగా దహించి వేయుము. బూడిద చేయుము. మా అజ్ఞానాంధకారమును రూపుమాపుము. ఓమ్ స్వాహా అభయదానమును ఒసంగి మా అంతఃకరణములయందు వెలుగులను నింపుము. ఓమ్ క్ష్రామ్.
జగన్నాథా! ఈ విశ్వమునకు శుభములు చేకూరుగాక! దుష్టుల యొక్క బుద్ధులు పునీతములగు గాక! సకల ప్రాణులమధ్య సద్భావనలు మెదలుచుండుగాక! వారు అందరూ పరస్పరము హితమునే చింతించుదురుగాక! మా మనస్సులు సన్మార్గములలోనే ప్రవృత్తములు అగుచుండును గాక! మా బుద్ధులు నిరంతరము నష్కామభావముతో శ్రీహరి యందే నిలిచి యుండునుగాక!
ప్రభూ! మాకు ఇల్లు, భార్యాపుత్రులు, ధనము, బంధువులు, మిత్రులు మొదలగు వారియందు ఎట్ట ఆసక్తియు లేకుండుగాక! ఆ ఆసక్తి పూర్తిగా భాగవతోత్తముల యందే నిలిచియుండుగాక! జితేంద్రియుడైన పురుషుడు కేవలము ప్రాణములను నిలిచియుండుటకు అవసరమగు ఆహారముతోడనే సంతుష్టి చెందును. అట్టి వానికి శీఘ్రముగా భగవత్ప్రాప్తి కలుగును. ఇంద్రియలోలుడైన వానికి భగవత్ప్రాప్తి కలుగదు.

గంగాదేవి వర్ణనము - పరమశివుడు సంకర్షణుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
అదే విధముగా అలకనంద అను పాయ బ్రహ్మపురమునకు దక్షిణమువైపు పడుచు పెక్కు శిఖరములు దాటి హేమకూట పర్వతమునకు చేరును. అచటి నుండి మిక్కిలి వేగముతో హిమాలయ శిఖరములగుండ ప్రవహించుచు భారతవర్షమున ప్రవహించును. పిమ్మట దక్షిణ దిశగా ప్రవహించుచు, దక్షిణ సముద్రమున కలియును. ఈ అలకనందానది యొక్క వేర్వేరు ఘట్టముల యందు స్నానమాచరించు సత్పురుషులు దుర్లభమైన అశ్వమేధ, రాజసూయ యజ్ఞఫలములను పొందుదురు.
మేరు పర్వతము నుండి వెలువడిన వందల కొలది నదీ నదములు అనేక దేశములలో ప్రవహించు చుండును.
ఈ తొమ్మిది ఖండములలో భారతవర్షమే కర్మభూమి. మిగిలిన ఎనిమిద ఖండములు స్వర్గవాసులైన పురుషులు స్వర్గభోగములను అనుభవించిన పిమ్మట మిగిలిన పుణ్యఫలములను అనుభవించుటకు ఈ స్థానములయందు చేరుదురు. కనుక వీటిని భూలోకస్వర్గము లనియు పిలుతురు.
దేవతాసములైన అచటివారి ఆయుః ప్రమాణము మానవ సంవత్సరముల గణనానుసారము పదివేల సంవత్సరము లుండును. వీరు పదివేల ఏనుగుల బలము కలిగియుందురు. వజ్ర సదృశమై, దృఢముగా నుండెడి వీరి శరీరములయందు శక్తి, యౌవనము, ఉల్లాసము, అపరిమితముగ ఉండును. అందువలన వీరు పెక్కు సంవత్సరములు మైథునాది విషయభోగముల యందే మునిగి తేలుచుందురు. ఆ భోగానుభవములు పూర్తియగు చుండగ మిగిలియున్నప్పుడు వీరి భార్యలు గర్భవతులగుదురు. ఆ విధముగా ఇచటి సమయము త్రేతాయుగముతో సమానముగా నుండును.
17.13 (పదమూడవ శ్లోకము)
అచటి ఆశ్రమములు, భవనములు, పర్వతముల చరియలు అందమైన వనములతోను, ఉపవనములతోను శోభిల్లు చుండును. అన్ని ఋతువులయందును అచటి వృక్షశాఖలు పుష్ప గుచ్ఛములతోను, ఫలములతోను, నవపల్లవములతోను విలసిల్లుచు భూమిని తాకుచున్నట్లుగా ఉండును. అచటి జలాశయములు నిర్మల జలములతోను, వికసిత కమలములతోను నిండియుండును. ఆ పద్మముల పరిమళములకు ఆకర్షితములైన రాజహంసలు, జలకుక్కుటములు, కారండవపక్షులు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు మొదలగునవి వివిధములగు ధ్వనులు చేయుచు అందు విహరించుచుండును. భ్రమరములు మధురముగా ఝంకారములను గావించుచుండును. ఆ ఆశ్రమముల యందును, భవనములయందును, పర్వతలోయలయందును, జలాశయములందును దేవతాగణములు సౌందర్యరాశులైన దేవాంగనలతో గూడి విహరించుచుందురు. కామోద్దీపితులైన ఆ వనితల హాసవిలాసములతోను, లీలా కటాక్షములతోను వారి మనస్సులు, నేత్రములు ఆకర్షితములగు చుండుటవలన వారు జలక్రీడా వినోదములతో స్వేచ్ఛగా విహరించుచుందురు. ప్రముఖులైన ఆ దేవతాగణముల అనుచరులు అనేకములైన సామాగ్రులతో వారికి ఆదర సత్కారములను నెరపుచుంధురు.
ఈ నవద్వీపములయందు పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు అచటివారిని అనుగ్రహించుటకై నేటికిని వేర్వేరు అవతారములతో విరాజిల్లుచుండును.
ఇలావృతఖండమునందు శంకరభగవానుడు ఒక్కడు మాత్రమే పురుషుడు. అచట వేరొక పురుషుడు లేడు. పార్వతీ దేవి శాపకారణముగా ఇతర పురుషులు ఎవ్వరును అచట ప్రవేశింపరు. అచట ప్రవేశించిన పురుషులు స్త్రీలుగా మారుదురు. ఆ కథను మున్ముందు (నవమస్కంధములో) ప్రస్తావించెదను.
అచట పార్వతీ దేవియు, కోట్లకొలది ఆమె యొక్క దాసీజనులు శంకర భగవానుని సేవించుచుందురు. పరమశివుడు వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ నామములతో విరాజిల్లుచుండునట్టి శ్రీమహావిష్ణువు యొక్క మూర్తులలో నాల్గవదియైన సంకర్షణుని ధ్యానించుచుండును. ఏలయన తమః ప్రధానమైన ఆ సంకర్షణమూర్తియే ఆ పరమశివుని ఆవిర్భావమునకు కారణము. ఆ పరమేశ్వరుడు ఆ సంకర్షణుని ఈ విధముగా స్తుతించుచుండెను. (సహజముగా శంకరభగవానుడు శుద్ధ చిన్మయ స్వరూపుడేయైనను, సంహారాది తామసకృత్యములకు హేతువగుటవలన ఆయన తామసమూర్తిగా పేర్కొనబడెను)
పంచమ స్కంధము లోని పదునేడవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
భువన కోశముయొక్క వర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ఆ నదీజలములచే రెండు తీరములుగల మట్టి తడిసి వాయువు మఱియు సూర్యకిరణముల సంయోగముచే ఎండిపోయి అప్పుడు అది దేవలోకమును అలంకరింపచేయు జంబూనదమను ప్రసిద్ధిగల బంగారముగా మార్పు చెందును.
ఈ బంగారమునే దేవతలు గంధర్వాదులు తమతమ భార్యలతోగూడి కిరీటములు, కంకణములు, కటి సూత్రములు మొదలగు ఆభరణముల రూపములో ధరించు చుందురు.
సుపార్శ్వ పర్వతముమీద ఒకవిశాలమైన కదంబవృక్షము గలదు. దీని ఐదు తొర్రలనుండి తేనె ధారలు స్రవించుచుండును. వాటి పరిమాణము ఐదేసి బారలు గలదు. అవి సుపార్శ్వ శిఖరము నుండి జాలువాఱుచు, ఇలావృత వర్షముయొక్క పడమర భాగమును పరిమళ భరితము చేయుచున్నవి.
ఆ తేనె ధారలు పానము చేసినవారి ముఖములనుండి వెలువడు వాయువులు నలుదిశల యందును వందయోజనముల వరకు వ్యాపించుచున్నవి.
16.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
అదేవిధముగా కుముద పర్వతముపై ఒక వటవృక్షము గలదు. ఆ వృక్షము నూఱుకొమ్మలు కలిగియుండుట వలన దానికి శతవల్శము అను పేరు ఏర్పడినది. దాని కొమ్మలనుండి పెక్కు ఊడలు క్రిందికి దిగియున్నవి. అవి జనులకోరికలను అన్నింటిని తీర్చును. ఆ ఊడల వలన పాలు, పెరుగు, తేనె, నేయి, బెల్లము, అన్నము, వస్త్రములు, శయ్యలు, ఆసనములు, ఆభరణములు మొదలగు పదార్థములు లభ్యమగును. ఇవి కుముదపర్వత శిఖరము నుండి క్రీంద పడుచు ఇలావృత దేశము యొక్క ఉత్తరభాగమును నింపుచున్నవి.
ఈ పదార్థమును అనుభవించుచున్న అచటి ప్రజల చర్మములు ముడుతలు పడవు. వెంట్రుకలు నెరయవు, బడలికలు ఉండవు. శరీరముల నుండి చెమటలుగాని, దుర్గంధములు గాన కలుగవు. ముసలితనము, రోగములు, మృత్యుభయము, చలి, వేడి మొదలగు బాధలు ఉండవు. శరీరము కాంతిహీనమగుట, అవయవములు శిథిలములగుట మొదలగు కష్టములు వారికి ఎన్నడును కలుగవు. వారి జీవితములు సుఖమయములు.
కమలముయొక్క దుద్దునకు నాలుగు వైఫుల కేసరములు ఉన్నట్లు ఆ మేరు పర్వతమునకు చుట్టును కురంగము, కురరము, కుసుంభము, వైకంకము, త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషధము, శినీవాసము, కపిలము, శంఖము, వైడూర్యము, జారుధి, హంస, ఋషభము, నాగము, కాలంజరము, నారదము,ఆది అను ఇరువది పర్వతములు గలవు. ( ఆది శబ్దేనాదినామా పర్వత ఏవ| అత ఏవ వింశతీత సంఖ్యానియమ ఉక్తః॥ ఇచట ఆది శబ్దము పర్వతముయొక్క పేరుగా చెప్పబడినది. కావున ఇరువై పర్వతముల సంఖ్య పేర్కొనబడినది - శ్రీధరీయవ్యాఖ్య)
ఇదిగాక, మేరుపర్వతమునకు తూర్పున జఠరము, దేవకూటము అను రెండు పర్వతములు గలవు. అవి ఒక్కొక్కటి పద్దెనిమిది యోజనములు పొడవు, రెండువేల యోజనముల వెడల్పు, అంతే ఎత్తు కలిగి యున్నవి. అదే విధముగా పశ్చిమ దిశయందు పవనము, పారియాత్రము అను పర్వతములును, దక్షిణ దిక్కున కైలాసము, కరవీరము అను గిరులు, ఉత్తరమున త్రిశుంగము, మకరము అను పర్వతములు గలవు. నాలుగు వైపుల ఈ ఎనిమిది పర్వతములచే పరివృతమైన ఈ సువర్ణగిరి (మేరు పర్వతము) అగ్నివలె ప్రకాశించుచుండును.
ఈ మేరు పర్వతమధ్య భాగమున సువర్ణమయమైన నగరము గలదనియు, అది బ్రహ్మదేవునకు నివాస స్థానమనియు తెలుపుదురు. అది సమచతురస్రాకారమును కలిగి కోటి యోజనములు విస్తరించియున్నది.
ఆ నగరము చుట్టును ఎనిమిది దిక్కుల యందు ఇంద్రాదిలోకపాలుర యొక్క నగరములు గలవు. అవి బ్రహ్మనగరమును పోలయున్నవి. వీనిలో ఒక్కొక్కటి బ్రహ్మదేవుని నగర ప్రమాణములో నాల్గవవంతు నిడివి గలిగియున్నవి.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే షోడశోశఽధ్యాయః (16)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు పదునారవ అధ్యాయము (16)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
భువన కోశముయొక్క వర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
రాజోవాచ
16.1 (పదునారవ అధ్యాయము)
పరీక్షిన్మహారాజు పలికెను- శుక మహర్షీ! సూర్యుని కిరణములు ప్రసరించుచున్నంత వరకు, తారాగణములతో సహా చంద్రుడు కనబడుననియు, అంతవరకును భూమండలము విస్తరించియున్నదనియు నీవు ఇదివరలో తెలిపియుంటివి. మహారాజైన ప్రియవ్రతుని రథ చక్రములచే ఏడు కందకములు, ఏడు సముద్రములు ఏర్పడినవనియు, ఆ కారణముగా ఈ మండలము ఏడు ద్వీపము లుగా విభజింపబడిన దనియు నీవు తెలిపియుంటివి. కనుక మహాత్మా! ఈ ఏడు ఖండముల పరిమాణమును, వాటి లక్షణములను నేను తెలియగోరుచున్నాను.
గుణమయమైన భగవంతుని స్థూలవిగ్రహమునందు లగ్నమైన మనస్సు వాసుదేవుడను పేరుగల స్వయం ప్రకాశమానుడైన, నిర్గుణ పరబ్రహ్మరూపుడగు సూక్ష్మ స్వరూపము నందు గూడ లగ్నమగుట సంభవము, కనుక, ఈ విషయమును దయతో విశదపరుచుము.
ఋషరువాచ
శుకయోగి పలికెను - పరీక్షిన్మహారాజా! భగవంతుని యొక్క మాయాగుణ విభూతులు బహు విస్తృతమైనవి. దేవతలతో సమానమైన ఆయువును పొందినప్పటికినీ, మానవుడు మనస్సు చేతగాని, వాక్కు చేతగాని, వాటి అవధిని కనుగొనలేడు. కావున, ఈ భూమండలము యొక్క విశేషములను, వాటి పేర్లను, రూపములను, పరిమాణములను, లక్షణములను వర్ణించెదను.
మనము నివసించునట్టి జంబూద్వీపము భూమండలము అనెడు కమలకోశము వంటి ఏడు ద్వీపముల సముదాయమైన కోశస్థానము లోపల ఒక కోశముగా ఉన్నది. దీని విస్త్రృతి ఒక లక్ష యోఙనములు. అది తామరాకువలె గోళాకారమున ఉన్నది.
యస్మిన్ నవ వర్షాణి నవయోజన సహస్రాయామాన్యష్టభిర్మర్యాదాగిరిభిః సువిభక్తాని భవంతి॥4371॥
ఈ జంబూ ద్వీపమున తొమ్మిది ఖండములు గలవు. వాటిలో ఒక్కొక్కటి తొమ్మిదివేల యోజనముల వైశాల్యమును కలిగి యున్నది. వాటి హద్దులను ఎనిమిది పర్వతములు చక్కగ విభజించుచున్నవి.
వీటి మధ్యలో ఇలా వృతము అను పేరుగల దేశము గలదు. దీనికి మధ్యభాగమునందు కుల పర్వతములలో శ్రేష్ఠమైన మేరు పర్వతము గలదు. అది భూమండలమనెడి కమలమునకు దుద్దువంటిది. ఇది పైనుండి క్రింది వరకు సువర్ణమయమై ఒక లక్ష యోజనముల ఎత్తుగలిగి యుండును. దీని శిఖరము పైన ముప్పది రెండువేల యోజనముల విస్తృతిగలదు. అడుగు భాగముస పదునారువేల యోజనముల విస్తారముతో ఉన్నది. ఇది భూగర్భమున పదునారువేల యోజనముల ప్రమాణములోనున్నది (అనగా భూమిపైనగల విస్తారము నలుబది నాలుగు వేల యోజనముల వరకు విస్తరించి యున్నది.
ఇలావృతదేశమునకు ఉత్తరభాగమున క్రమముగా నీలము, శ్వేతము, శృంగవంతము అను మూడు పర్వతములు గలవు. అవి రమ్యక, హిరణ్మయ, కురుదేశముల హద్దులను నిర్ణయించును. అవి తూర్పునుండి పడమరవరకు లవణ సముద్రమువరకు వ్
యాపించియున్నవి. ఆ మూడు పర్వతములలో ప్రతియొక్క దాని వెడల్పు రెండేసి యోజనముల ప్రమాణము గలిగి యున్నది. పొడవులో మొదటి దానికంటె రెండవది దశాంశమునకు అధికముగా, మూడవది రెండవదాని పొడవులో దశాంశముకంటె అధికముగ ఉండును. వెడల్పులు, ఎత్తులు మూడింటికిని సమానమే.
(పంచమ స్కంధము లోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

Comments
Post a Comment