గీతా మకరందము విభూతియోగము
10-31-గీతా మకరందము
విభూతియోగము
🕉🌞🌎🌙🌟🚩
పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి
స్రోతసామస్మి జాహ్నవీ ||
తా:- నేను పవిత్రమొనర్చువారిలో (లేక వేగవంతులలో) వాయువును, ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను, చేపలలో మొసలిని, నదులలో గంగానదిని అయియున్నాను.
వ్యాఖ్య:- ఈ శ్లోకమందు తెలుపబడినరీతి గంగానది సాక్షాత్ భగవత్స్వరూపమే. కావున అది మహాపవిత్రముగ, పాపహారకముగ నెన్నుకొనబడుచున్నది. కృష్ణుడు తాను రాముడేయని వచించుటవలన రామకృష్ణు లిరువురును ఒకే భగవత్స్వరూపమని స్పష్టమగుచున్నది.

10-32-గీతా మకరందము
విభూతియోగము
🕉🌞🌎🌙🌟🚩
సర్గాణామాదిరన్తశ్చ
మధ్యం చైవాహమర్జున |
అధ్యాత్మవిద్యా విద్యానాం
వాదః ప్రవదతామహమ్ ||
తా:- ఓ అర్జునా! సృష్టులయొక్క ఆదిమధ్యాంతములు (ఉత్పత్తి, స్థితి, లయములు) నేనే అయియున్నాను. మఱియు, విద్యలలో అధ్యాత్మవిద్యయు, వాదించువారిలో (రాగద్వేషరహితముగ, తత్త్వనిశ్చయముకొఱకు చేయబడు) వాదమును నేనైయున్నాను.
వ్యాఖ్య:- ‘అధ్యాత్మవిద్యా విద్యానామ్’ - ప్రపంచములో అనేక విద్యలున్నప్పటికిని, అధ్యాత్మవిద్యయే తానని భగవానుడు చెప్పుటవలన ఆ విద్యయొక్క శ్రేష్ఠత్వము బాగుగవెల్లడియగుచున్నది. ఏ విద్యవలన మనుజునకు దుఃఖరాహిత్యము, ఆనందప్రాప్తికలుగునో, పరమశాంతి చేకూరునో - అదియే అన్నిటికంటెను గొప్పదియగును. అట్టిశక్తి ఒక్క బ్రహ్మవిద్య (అధ్యాత్మవిద్య)కు మాత్రమే కలదు. కనుకనే అట్టి లోకోత్తరవిద్య తానని శ్రీకృష్ణమూర్తి పలికిరి. మనుజుడు ఏ విద్యను గడించవలెను? అను ప్రశ్నకిచట చక్కటి సమాధానమొసంగబడినది.
అధ్యాత్మవిద్యను జేపట్టి జననమరణరూప సంసారబంధము నుండి విముక్తి నొందుడు - అని పరమాత్మ కరుణతో బోధించుచున్నారు. లౌకికవిద్యయేదియు రానివాడైనను అక్షరమగు పరమాత్మనుగూర్చిన విద్యగలవాడైనచో అతడు అక్షరాస్యుడే. లౌకికవిద్యలు అన్నీ తెలుసుకొనినప్పటికి అక్షరపరమాత్మను గూర్చిన విద్య , జ్ఞానము లేనిచో అతడు నిరక్షరకుక్షియేయగును*.
‘వాదః ప్రవదతామ్’ - వాదము, జల్పము, వితండము - అని వాదము మూడువిధములు.
(1) రాగద్వేషములు లేకుండా కేవలము తత్త్వమును తెలిసికొను నభిలాషతో చేయబడు ప్రశ్నోత్తరాదులు వాదమనబడును.
(2) పరమతములను ఖండించి తనమతమును స్థాపించుకొని, ఇతరులను జయించునిమిత్తము చేయబడు ప్రసంగము జల్పమనబడును.
(3) కేవలము పరమతమును దూషించునుద్దేశ్యముతో చేయబడునది వితండమనబడును.
వీనిలో వాదమును తానని భగవానుడు చెప్పుటవలన తత్త్వనిశ్చయముకొఱకై చేయబడు రాగద్వేషరహితమగు విచారణయే ఉత్తమమని స్పష్టమగుచున్నది. కావున విజ్ఞులద్దానినే యాశ్రయించవలెను.
*నిరక్షరస్యాపితు యస్య కుక్షౌ
బ్రహ్మైవ చాభాతి స ఏవ సాక్షరః |
సర్వాక్షరస్యాపితు యస్యచిత్తే బ్రహ్మైవ నాభాతి సవై నిరక్షరః ||

10-33,34-గీతా మకరందము
విభూతియోగము
🕉🌞🌎🌙🌟🚩
అక్షరాణామకారోఽస్మి
ద్వన్ద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలో
ధాతాహం విశ్వతోముఖః ||
తా:- నేను అక్షరములలో
‘అ’కారమును, సమాసములలో ద్వంద్వసమాసమును అయియున్నాను. మఱియు నాశములేని కాలమును (కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడను), సర్వత్రముఖములుగల కర్మఫలప్రదాతయను (లేక విరాట్స్వరూపుడగు బ్రహ్మదేవుడను) నేనే అయియున్నాను.
వ్యాఖ్య:- ‘విశ్వతోముఖః’ - భగవంతుని సర్వతోముఖుడని వర్ణించుటచే వారి అస్తిత్వము, చూపు (దృష్టి) సర్వత్ర వెలయుచున్నదని భావము. ఈ రహస్యమెఱింగినచో ఇక ఎవరు ఏ పాపమును మనస్సులోగూడ చేయజాలరు.
గీతా మకరందము [10-34]-
మృత్యుస్సర్వహరశ్చాహం
ఉద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిశ్శ్రీర్వాక్చ నారీణాం
స్మృతిర్మేధా ధృతిః క్షమా ||
తా:- సమస్తమును సంహరించునట్టి మృత్యువును, ఇకముందు ఉత్పత్తికాగల సమస్తముయొక్క పుట్టుకయు నేనే అయియున్నాను. మఱియు స్త్రీలలో గల కీర్తి, సంపద, వాక్కు, స్మృతిజ్ఞానము, ధారణాశక్తిగల బుద్ధి, ధైర్యము, ఓర్పు, అను ఈ ఏడుగుణములున్ను నేనే అయియున్నాను.
వ్యాఖ్య:- స్త్రీలలోగల పై ఏడు సద్గుణములు తానేయని భగవానుడు సెలవిచ్చియున్నారు. ఈ యేడుగుణములు పురుషులందును కానవచ్చినను, పురుషులతోబాటు స్త్రీలనుగూడ సముద్ధరింపదలంచినవాడై భగవాను డీ ప్రకారముగ తెలియజేసిరి. స్త్రీలోకముపై భగవానున కెంతటి కరుణయో ఈ వాక్యముచే వెల్లడి యగుచున్నది. దీనినిబట్టి స్త్రీలు అబలలు, శక్తిహీనులు కారనియు; వారున్ను పురుషులవలె మేధాశక్తి, ధైర్యము, విద్య (వాక్కు) మొదలైనవి సంపాదించవచ్చుననియు స్పష్టపరిచినట్లైనది.
ప్రయత్నముచేతను, అభ్యాసముచేతను, శ్రద్ధవల్లను ఎవరైనను అట్టి సుగుణములను సంపాదించుకొనవచ్చును. ధైర్యము, మేధాశక్తి, సహనము మొదలగు సద్గుణములు తానేయని భగవానుడు తెలిపినందువలన వానిని సర్వులును అభ్యాసముచే పొంది తమ హృదయములను భగవన్నిలయములుగా నొనర్చుకొనవలయును . ఎచట అట్టి సుగుణములుండునో అచట సాక్షాత్ భగవానుడు కాపురముండును.
ఈ శ్లోకముయొక్క రెండవపాదమునకు మఱియొక అర్థమున్ను చెప్పవచ్చును - స్వాయంభువమనువుయొక్క కొమార్తెయగు ప్రసూతి దక్షప్రజాపతిని వివాహమాడగా వారిరువురికిని ఇరువదినలుగురు కొమార్తెలు కలిగిరి.
వారిలో కీర్తిదేవి, మేధాదేవి, ధృతిదేవి, స్మృతిదేవి, క్షమాదేవి కలరు. శ్రీదేవి భృగువుయొక్క కొమార్తె, వాగ్దేవి బ్రహ్మదేవునివలన గలిగినది. ఈ యేడుగురును ఆ యా సద్గుణములకు అధిష్ఠానదేవతలు. కావున “స్త్రీలలో ముఖ్యులైనట్టి కీర్తిదేవిని, ఐశ్వర్యదేవిని, వాగ్దేవిని, స్మృతిదేవిని, మేధాదేవిని, ధైర్యదేవిని, క్షమాదేవిని నేనే అయియున్నాను” - ఎట్లు చెప్పినను ఆ సద్గుణములు భగవత్స్వరూపములనియు, వానిని జీవులు తప్పక అవలంబింపవలయుననియు తెలుపు విషయము మాత్రము సుస్పష్టము.
ఈ శ్లోకముద్వారా ముఖ్యముగ స్త్రీలకు ధర్మమార్గావలంబనమునందు, పరమార్థపథగమనమునందు విశేషప్రోత్సాహము లభించుచున్నది. ఇక వారు తమ విద్యావిషయమునుగాని, ధీశక్తివిషయమునగాని, నిరుత్సాహపడవలసిన పనిలేదు. వెనుకంజ వేయవలసినపనిలేదు. పురుషులతోబాటు వారున్ను ఆ సుగుణరాశినంతను తమ ప్రయత్నాతిశయముచే సాధించుకొనవచ్చును. ఏలయనిన అవి కలచోటే భగవన్నిలయము.
🕉🌞🌎🌙🌟🚩
11-38,39-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌎🌙🌟🚩
త్వమాదిదేవః పురుషః పురాణ
స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాఽసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప ||
తా:- అనంతరూపుడగు ఓ కృష్ణా! నీవు ఆదిదేవుడు, సనాతనపురుషుడు, ఈ ప్రపంచమునకు శ్రేష్ఠమైన ఆధారమున్ను, సమస్తమును తెలిసికొనినవాడును, తెలియదగినవాడును, సర్వోత్తమస్థానమును అయియున్నావు. నీచేతనే ఈ ప్రపంచమంతయును వ్యాపింపబడియున్నది.
ప్ర:- పరమాత్మ ఇంకను ఎట్టి లక్షణములు కలవాడు?
ఉ:- (1) ఆదిదేవుడు
(2) ప్రాచీనపురుషుడు
(3) ప్రపంచమునకు ఆధారభూతుడు
(4) సమస్తము తెలిసినవాడు
(5) తెలియదగినవాడు
(6) సర్వోత్తమస్థానము
(7) ప్రపంచమంతటను వ్యాపించియున్నవాడు (8) అనంతరూపుడు.
॥ ఓం - గీతా మకరందము [11-39]॥
వాయుర్యమోఽగ్నిర్వరుణశ్శశాఙ్కః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోఽపి నమో నమస్తే ||
తా:- వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును మీరే అయియున్నారు. మీకనేకవేల నమస్కారములు ! మఱల మఱల మీకు నమస్కారము.
వ్యాఖ్య:- అర్జునునకు భగవానునియెడల కలిగిన అట్టి అపరిమితభక్తి సాధకునకు అత్యంతావశ్యకమైయున్నది.
🕉🌞🌎🌙🌟🚩
11-40-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌎🌙🌟🚩
నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ |
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః |
తా:- సర్వరూపులగు ఓ కృష్ణా! ఎదుటను, వెనుకను మీకు నమస్కారము మఱియు అన్నివైపులను మీకు నమస్కారమగుగాక! అపరిమితసామర్థ్యము, పరాక్రమము గలవారగు మీరు సమస్తమును లెస్సగ వ్యాపించియున్నారు. కనుకనే సర్వస్వరూపులై యున్నారు.
వ్యాఖ్య:- అర్జునుడు తన హృదయమున పొంగిపొరలుచున్న భక్తిభావాతిశయమును వ్యక్తముచేయుచున్నాడు.
‘అనన్తవీర్యామితవిక్రమః’ - భగవానుడు అపరిమిత శక్తిసామర్థ్యములు కలవాడు. ఒక చిన్న విసనకఱ్ఱతో వీచుకొనిన, కొద్దిగాలి వచ్చును. ఒక్కసారి ఝంఝామారుతము వీచినచో అపరితమగుగాలి ఉద్భవించును. మొదటిది మనుష్యశక్తి. రెండవది దైవశక్తి. బిందెలతో గాని, ఏతాముతోగాని, మిషన్లతోగాని నీరు పారగట్టినచో ఒకింత నీరు ప్రవహించును. కుంభవర్షము కురిసినచో వెల్లువలు పారును. వేలకొలది ఎకరములు నేల తడియును. మొదటిది మనుష్యశక్తి, రెండవది దైవశక్తి. మనుజుని శక్తికిని భగవంతుని శక్తికినిగల తేడా ఇదియే. కనుకనే అర్జునుడు భగవానుని ‘అనంతవీర్యామితవిక్రముడ’ని సంబోధించెను. కావున మనుజుడు తన అల్పశక్తినిజూచి గర్వించక, సర్వశక్తిమంతుడగు పరమాత్మయెడల అకుంఠిత భక్తిభావము గలిగియుండవలెను.
ప్ర:- పరమాత్మ ఇంకను ఎట్టివాడు?
ఉ:- (1) అనంతశక్తిగలవాడు
(2) అపరిమిత పరాక్రమశీలుడు
(3) సర్వత్రవ్యాపించి యున్నవాడు
(4) సర్వరూపుడు.
🕉🌞🌎🌙🌟🚩
11-41,42-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌎🌙🌟🚩
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి |
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ప్రణయేన వాపి ||
యచ్చాపహాసా ర్థమసత్కృతోఽసి
విహారశయ్యాసనభోజనేషు |
ఏకోఽతవాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ||
తా:- నాశరహితులగు ఓ కృష్ణా! మీయొక్క ఈ మహిమను తెలియక పొరపాటునగాని, చనువువలనగాని, సఖుడవని తలంచి ‘ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ సఖా’ ఐ అలక్ష్యముగ మిమ్ముగూర్చి నేనెదిచెప్పితినో మఱియు విహారముసల్పునపుడుగాని, పరుండునపుడుగాని, కూర్చుండునపుడుగని, భుజించునపుడుగాని, ఒక్కరుగ నున్నపుడుగాని, లేక ఇతరులయెదుటగాని పరిహాసముకొఱకు ఏ అవమానమును గావించితినో - ఆ యపరాధము లన్నిటిని అప్రమేయులగు మీరు క్షమింపవేడుచున్నాను.
వ్యాఖ్య:- చేసిన తప్పిదమునకు పశ్చాత్తాపపడి మఱల నద్దానిని చేయకుండుట విజ్ఞుల లక్షణము.
🕉🌞🌎🌙🌟🚩
11-43-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ|| విశ్వరూపమును జూచి భయకంపితుడైన అర్జునుడు తిరిగి సౌమ్యరూపమును జూపులాగున భగవానుని ప్రార్థించుచున్నాడు -
పితాఽసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో
లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ||
తా:- సాటిలేని ప్రభావముగల ఓ కృష్ణమూర్తీ! మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునకంతకును తండ్రి అయియున్నారు. మఱియు మీరు పూజ్యులును, సర్వశ్రేష్ఠులగు గురువులను అయి వెలయుచున్నారు. ముల్లోకములందును మీతో సమానమైనవారు లేరు. ఇక మిమ్ములను మించినవారు మఱియొకరు ఎట్లుండగలరు?
వ్యాఖ్య:- చరాచర ప్రపంచమునకు, సమస్తప్రాణికోట్లకు భగవంతుడే తండ్రి, వారే తల్లి, వారే గురువు. గురువులందఱిలోను సర్వోత్తముడగు గురువు. కనుకనే ‘గురుర్గరీయాన్’ అని చెప్పబడినది. వారొకరే సద్వస్తువుగనుకను, తక్కినదంతయు (దృశ్యము) అసద్వస్తువుగనుకను, వారికి సమానుడుగాని, మించినవాడుగాని మఱియొకడు లేనేలేడని స్పష్టమగుచున్నది. కావున సర్వులు వారినే ఆశ్రయించవలెను….
‘గరీయాన్’ అను ఈ పదమును ‘గురువు’నకు విశేషణముగ కాకుండ విడిగాకూడ చెప్పవచ్చును.
(గరీయాన్ = శ్రేష్ఠుడవు - అని).
ప్ర:- పరమాత్మ ఇంకను ఎట్టివాడు?
ఉ:- (1) చరాచరప్రపంచమునకు తండ్రి
(2) పరమపూజ్యుడు
(3) ఉత్తమగురువు
(4) ముల్లోకములందును సాటిలేని ప్రభావముకలవాడు
(5) అతనితో సమానుడుకాని, అతనికంటె అధికుడుగాని లేనివాడు.
🕉🌞🌎🌙🌟🚩
11-44-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌎🌙🌟🚩
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశ మీడ్యమ్ |
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||
తా:- అందువలన నేను శరీరమును భూమిపై సాష్టాంగముగ బడవైచి నమస్కరించి ఈశ్వరుడును, స్తుతింపదగినవాడవును అగు నిన్ను అనుగ్రహింప వేడుచున్నాను. దేవా! కుమారుని అపరాధమును తండ్రివలెను, స్నేహితుని అపరాధమును స్నేహితుడు వలెను, ప్రియురాలి అపరాధమును ప్రియుడువలెను (నాయొక్క అపరాధమును) మీరు క్షమింపుడు.
వ్యాఖ్య:- ‘ప్రణిధాయ కాయమ్’ - పెద్దలకెట్లు నమస్కరింపవలయునో ఆ పద్ధతి ఇచట తెలుపబడినది. శరీరమును భూమిపై పూర్తిగ పడవైచి భక్తితో పెద్దలకు సాష్టాంగవందన మాచరింపవలయునని అర్జునుని నెపమున లోకమునకు చూపబడినది.
అట్టి క్రియచే అహంకారము, గర్వము చచ్చును. దర్పము నశించును. కనుకనే హిందూమత సాంప్రదాయమున సాష్టాంగవందనపద్ధతి ప్రవేశపెట్టబడినది. దానిచే పెద్దల యనుగ్రహమునకు మనుజుడు పాత్రుడు కాగల్గును. అర్జును డాప్రకారమేచేసి భగవానుని యనుగ్రహమును పొందగల్గెను. విశ్వామిత్రు డా ప్రకారమే చేసి వసిష్ఠునిచే ‘బ్రహ్మర్షి’ యనిపించుకొనెను. అయితే శరీరముతోపాటు మనస్సునందు, వాక్కునందుకూడ వినయము ద్యోతకము కావలెను. అపుడు త్రికరణములతోను, దైవమును, పెద్దలను సేవించినట్లగును.
ప్ర:- పరమాత్మ ఎట్టివాడు?
ఉ:- (1) సర్వలోకములకును ఈశుడు, ప్రభువు
(2) సర్వులచే స్తుతింపదగినవాడు.
ప్ర:- భగవంతునకుగాని, పెద్దలకు గాని యే ప్రకారము నమస్కరించవలెను ?
ఉ:- నిర్మలభక్తితో వారిపాదములకు సాష్టాంగవందన మాచరించవలెను.
🕉🌞🌎🌙🌟🚩
11-45-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌏🌙🌟🚩

అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే |
తదేవ మే దర్శయ దేవ రూపం
ప్రసీద దేవేశ జగన్నివాస ||
తా:- ఇదివఱకెన్నడును జూడనట్టి ఈ విశ్వరూపమును జూచి ఆనందమును బొందితిని, కాని భయముచే నాయొక్క మనస్సు మిగుల వ్యథ నొందుచున్నది. కావున దేవా! ఆ మునుపటి (సౌమ్య) రూపమునే నాకు జూపుడు. దేవదేవా! జగదాధారా!అనుగ్రహింపుడు!
వ్యాఖ్య:- అర్జునునకు అపూర్వమగు విశ్వరూపమును గాంచుటవలన హర్షమున్ను , అందలి భయంకర దృశ్యములను పరికించుటవలన కంపమున్ను, భీతియు గలిగెను. ఆ భయమును పోగొట్టుకొనుటకై సౌమ్యరూపమును జూపులాగున భగవానుని అర్థించుచున్నాడు.
‘ప్రసీద దేవేశ జగన్నివాస’ - ఇదే వాక్యమును ఈ అధ్యాయములోని 25వ శ్లోకమున అర్జునుడు పలికియున్నాడు. ‘దేవదేవా! జగదాధారా! కరుణింపుడు! అనుగ్రహింపుడు!’ అని దాని భావము.
‘దేవ,’ ‘రూపమ్’ అను రెండుపదములను కలిపి ‘దేవరూపమ్’ = చతుర్భుజాకారమగు దేవ (విష్ణు) రూపమును జూపుము - అని కొందఱు అర్థము చెప్పిరి.

అ|| అర్జునుని యా ప్రార్థనను విని భగవానుడు తన సౌమ్యరూపముతో తిరిగి ప్రత్యక్షముకానున్నవారై విశ్వరూపముయొక్క మహిమను ముందుగా వెల్లడించుచున్నారు -
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శిత మాత్మయోగాత్ |
తేజోమయం విస్వమనన్త మాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ||
తా:- శ్రీ భగవానుడు చెప్పుచున్నారు - అర్జునా! ప్రకాశముచే పరిపూర్ణమైనదియు, జగద్రూపమైనదియు, అంతములేనిదియు, మొదటిదియు, నీవుతప్ప ఇతరులచే నిదివఱకెన్నడును జూడబడనిదియు నగు ఏ యీ సర్వోత్తమమైన విశ్వరూపముగలదో, అయ్యది ప్రసన్నుడనగు నాచే స్వకీయయోగశక్తివలన నీకు చూపబడినది.
వ్యాఖ్య:- ‘మయా ప్రసన్నేన’ అని చెప్పుటవలన అనన్యభక్తిగలవారియెడల భగవానుడు అనుగ్రహము జూపునని స్పష్టమగుచున్నది.
ప్ర:- భగవంతు డెట్టివాడు?
ఉ:- (1) తేజోమయుడు
(2) విశ్వవ్యాపకుడు
(3) అనంతరూపుడు
(4) ఆద్యస్వరూపుడు.
॥ ఓం - గీతా మకరందము [11-48]॥
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః |
ఏవం రూపశ్శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీరః ||
తా:- కురువంశశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఈ నా విశ్వరూపమును నీవు తప్ప మఱియొక రెవరును ఈ మనుష్యలోకమున చూచియుండలేదు (నా యనుగ్రహముచే నీవు చూడగల్గితివి). మఱియు వేదాధ్యయన, యజ్ఞాధ్యయనములచేగాని, దానములచేగాని, (అగ్నిహోత్రాది శ్రౌతస్మార్తాది) క్రియలచేగాని, ఘోరతపస్సులచేగాని, ఇట్టి (విశ్వరూపుడనగు) నన్నుచూచుటకు శక్యముకాదు.
వ్యాఖ్య:- ఇచట తెలిపిన వేదాధ్యయన, యజ్ఞాదులచే భగవానుని విశ్వరూపమును జూడజాలరని చెప్పినంతమాత్రము
చే అవియన్నియు నిరుపయోగములని అర్థముకాదు. ఆ క్రియలన్నిటితో భక్తి కలియనిచో నవి యెక్కువఫలితము నొసంగజాలవని తెలుపుటయే యగును. ఎంత కృషిచేసినను జలములేనిచో సస్యములు ఫలింపవుగదా ! అట్లే ఆ క్రియలున్ను.
🕉🌞🌎🌙🌟🚩
11-49,50,51-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌎🌙🌟🚩
మాతే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ |
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య ||
తా:- ఇటువంటి భయంకరమైన నా(విశ్వ) రూపమును జూచి నీవు భయమునుగాని, చిత్తవికలత్వముగాని పొందకుము. నీవు నిర్భయుడవును, ప్రసన్నచిత్తుడవును అయి నా యీ పూర్వరూపమునే, మఱల బాగుగ జూడుము.
అ|| ఇట్లు వచించి తదుపరి శ్రీకృష్ణు డేమి యొనర్చెనో సంజయుడు చెప్పుచున్నాడు -
॥ ఓం - గీతా మకరందము [11-50]॥
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః |
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా ||
తా:- సంజయుడు చెప్పెను - (ఓ ధృతరాష్ట్రమహారాజా !) ఈ ప్రకారముగ శ్రీకృష్ణు డర్జునునకు జెప్పి ఆ ప్రకారమే తన (పూర్వపు) రూపమును మఱల జూపెను. మహాత్ముడగు ఆ శ్రీకృష్ణమూర్తి మఱల తన సౌమ్యరూపమును వహించి భయపడియున్న అర్జునుని ఓదార్చెను.
వ్యాఖ్య:-
ఇచట రెండు పర్యాయములు “మఱల తనరూపమును జూపెను” అని చెప్పుటవలన మొదట అర్జునుని కోర్కెననుసరించి చతుర్భుజాకారముతో ప్రత్యక్షమై ఆ పిదప మఱల తన సౌమ్య మానవరూపమును జూపియుండవచ్చునని తోచుచున్నది.
అ|| భగవానుని అవ్విధముగ శాంతరూపమునజూచి అర్జునుడు పలికిన పలుకులను వివరించుచున్నాడు -
అర్జున ఉవాచ :-
॥ ఓం - గీతా మకరందము [11-51]॥
దృష్ట్వేదం మానుషం రూపం
తవ సౌమ్యం జనార్దన |
ఇదానీమస్మి సంవృత్తః
స చేతాః ప్రకృతిం గతః ||
తా:- అర్జునుడు చెప్పెను - ఓ కృష్ణా! మీయొక్క ప్రశాంతమైన ఈ మనుష్యరూపమునుజూచి యిపుడు నా మనస్సు కుదుటపడినది. మఱియు నేను స్వస్థతనుబొందితిని.
🕉🌞🌎🌙🌟🚩
11-52,53-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ|| అర్జునుని యా వాక్యములను విని భగవానుడు తానుచూపిన రూపముయొక్క మహిమాతిశయమును రెండు శ్లోకములద్వారా వెల్లడించుచున్నారు -
శ్రీ భగవానువాచ :-
సుదుర్దర్శమిదం రూపం
దృష్టవానసి యన్మమ |
దేవా అప్యస్య రూపస్య
నిత్యం దర్శనకాంక్షిణః ||
తా:- శ్రీ భగవానుడు చెప్పెను - నా యొక్క ఏ రూపమును నీవిపుడు చూచితివో అది మహాదుర్లభమైనది. దేవతలుకూడ నిత్యమూ నద్దానిని దర్శనము చేయగోరుచుందురు.
వ్యాఖ్య:- భగవంతుని స్వరూపమును సామాన్యులెవరును దర్శింపజాలరు. ఎంతయో హృదయనిర్మలత (చిత్తశుద్ధి), అనన్యభక్తిగలవారు మాత్రమే దానిని దర్శింపగలరు. కనుకనే ‘దుర్దర్శమ్’ అనకుండ ‘సుదుర్దర్శమ్’ అని చెప్పబడినది. భగవద్దర్శనము మహాదుర్లభమని భావము.
॥ ఓం - గీతా మకరందము [11-53]॥
నాహం వేదైర్న తపసా
న దానేన న చేజ్యయా
శక్య ఏవంవిధో ద్రష్టుం
దృష్టవానసి మాం యథా ||
తా:- నన్ను ఏ రీతిగ నీవు చూచితివో, అటువంటి రూపముగల నేను వేదములచే (వేదాధ్యయనపరులచే) గాని, తపస్సుచేగాని, దానముచేగాని, యజ్ఞముచేగాని చూచుటకు శక్యుడనుగాను.
వ్యాఖ్య:- 48వ శ్లోకమున తెలిపిన భావములనే మఱల తెలియజేయుచున్నాను. వేదాధ్యయన, తపో, దాన,యజ్ఞాదిక్రియలు పవిత్రములైనను నిర్మలభక్తి, అచంచల దైవవిశ్వాసము వానితో జోడింపబడినపుడు
మాత్రమే అవి సత్ఫలముల నొసంగగల్గును. (చూ - వ్యాఖ్య - 48 శ్లో) (ఈ విషయము రాబోవు శ్లోకమున తెలియజేయబడును).
🕉🌞🌎🌙🌟🚩
ఓం నమః శివాయ:
11-54-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌏🌙🌟🚩
అ ||భగవత్స్వరూపదర్శనము మఱి దేనివలన లభించునో తెలియజేయుచున్నారు -
భక్త్యా త్వనన్యయా శక్య
అహమేవం విధోఽర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన
ప్రవేష్టుం చ పరన్తప ||
తా:- శత్రువులను తపింపజేయువాడా! ఓ అర్జునా! ఈ విధమగు రూపముగల నేను అనన్యభక్తిచేత మాత్రమే యథార్థముగ తెలిసికొనుటకును, చూచుటకును, ప్రవేశించుటకును, సాధ్యమైనవాడ నగుచున్నాను.
వ్యాఖ్య:- క్రిందటి శ్లోకమున వేదపఠన యజ్ఞాదులవలన భగవద్దర్శనము కాజాలదని చెప్పబడినది. మఱిదేనిచేత భగవద్దర్శనము కాగల్గునో ఈ శ్లోకమందు విపులముగ చెప్పబడినది. భగవత్సందర్శనమునకు ఉపాయము చెప్పబడిన శ్లోకమగుటచే ఇది అతి ముఖ్యమైనది. ముముక్షువు లిద్దానిని బాగుగ మననముచేసి అందలి భావములను కార్యాన్విత మొనర్పవలెను.
అనన్యభక్తివలననే మనుజుడు పరమాత్మను సందర్శింపగల్గునని యిట వచింప బడినది. భక్తి అను పదమునకు ‘అనన్య’ అను విశేషణముచేర్చుటవలన, ఇతరములగు ప్రాపంచిక పదార్థములపై ఆసక్తినుంచక కేవలము పరమాత్మయందే అనన్యమగు ప్రేమ, అనురాగము, ఆసక్తి కలిగియుండవలయునని స్పష్టమగుచున్నది. పంపకములేని భక్తి, మఱియొక వస్తువుపై చెదిరిపోనిభక్తి, పరమాత్మతప్ప, అన్యవస్తువును అభిలషింపని భక్తి యనబడును. సామాన్యముగ జనులయొక్క భక్తి కొంత గృహారామాదులందు, దారాపుత్రులందు, సంపదలయందు, కీర్తిప్రతిష్ఠలయందు విభజింపబడినది యగుటవలన,భగవంతునిపై ఏ కొద్దియో భక్తి మిగులుచున్నది. ఇది అనన్యభక్తికాదు. దృశ్యపదార్థములందు పంపకము లేని భక్తియే అనన్యభక్తి. అదియే భగవత్సందర్శనమునకు ఏకైక ఉపాయమని యిట తెలుపబడినది.
అట్టి అనన్యభక్తి భగవానుని (1) తెలిసికొనుటకు (జ్ఞాతుం), (2) చూచుటకు (ద్రష్టుం), (3) ప్రవేశించుటకు (ప్రవేష్టుం) శక్యమగునని పేర్కొనబడినది. దాని భావమేమి?ఇచట తెలిసికొనుట, చూచుట, ప్రవేశించుట అను మూడు క్రియలు చెప్పబడినవి. ప్రారంభమున మనుజునకు ‘భగవంతుడిట్టివాడు’ అను పరిజ్ఞానము కలుగును. ‘జ్ఞాతుమ్’ ఇది మొదటి అంతస్తు. ఈ స్థితియందు భక్తునకు భగవంతుడొకింత దూరముగనే యుండును. ఇది ద్వైతస్థితి. తదుపరి అభ్యాసవసమున ఆ భక్తుడు భగవంతునకు ఇంకను సమీపమునకు వచ్చి ప్రత్యక్షముగా (face to face) ఆతనిని దర్శింపగల్గును. (ద్రష్టుమ్).
ఇక భగవద్విషయమై అతనికేమాత్రము సందేహము యుండజాలదు. ఇది రెండవ అంతస్తు. ఇది మొదటిదానికంటె పైస్థితి. ఈ స్థితియందు భక్తుడు భగవంతునకు అతిసమీపమున వచ్చి చేరును. అత్తఱి, కరతలమందలి బిల్వఫలమునుగాని, ఆమలకఫలమునుగాని, మనుజుడు ప్రత్యక్షముగ చూడగల్గునట్లు, యాతడు భగవంతుని విస్పష్టముగ గాంచగల్గును. ఇది దాదాపు విశిష్టాద్వైతస్థితికి సమానము.
అటుపిమ్మట అభ్యాసప్రాబల్యముచే ఆ భక్తుడు భగవంతునికింకను సమీపమునకు వెళ్లి క్రమముగ వాఱియందు ప్రవేశించి ఐక్యమైపోవును. (ప్రవేష్టుమ్). ఉప్పుకల్లు సముద్రమునందు లయించినట్లు, వర్షబిందువు నదీజలమున మిళితమైపోవునట్లు, నీళ్లు పాలలో కలిసిపోయినట్లు, అత్తఱి భక్తుడు భగవంతునియందు విలీనమైపోవును. అపుడు భక్తుడు, భగవంతుడు - అను రెండు వస్తువులుండనేరవు. ఒకే భగవద్వస్తువు మిగిలియుండును. ఇది మొదటి రెండంతస్తులకంటెను పరమైనది. ఇది పూర్ణఅద్వైతస్థితి. ప్రతివాడు మొదటి రెండంతస్తుల యనుభవమునుబొంది, అంతటితో తృప్తినొందక సాధనాభ్యాసమును ఇతోధికముగ కొనసాగించుచు మూడవది యగు భగవత్సాయుజ్యమును బొందవలెను.
పైన దెల్పిన మూడుస్థితులలో మొదటిది సామీప్యము, రెండవది సారూప్యము, మూడవది సాయుజ్యము. సామాన్యముగ కొందఱు భగవంతునిగూర్చి శాస్త్రాదులవలన ఒకింతతెలిసికొని అంతయు తెలిసినది తృప్తినొంది సాధనను విరమింతురు. అది సరికాదు. అట్టివాడు పూర్ణత్వమును బొందజాలదు. ఆతడింకను ముందుకుపోయి, భగవానుని ప్రత్యక్షముగ దర్శించుటకు, ఆతనిలో ఐక్యమొందుటకు యత్నింపవలెను. కనుకనే శ్రీకృష్ణమూర్త్తి కేవలము ‘జ్ఞాతుమ్’ అనిచెప్పి ఊరుకొనక, ‘ద్రష్టుమ్’, ‘ప్రవేష్టుమ్’ అనికూడ వచించిరి.
ఒకమంచిఫలము బజారునందు కలదనియు, దానివర్ణము, రుచి, విలువ ఇట్టి దనియు ఒకడు ఇంటివద్ద కూర్చొని మఱియొకని ద్వారా తెలిసికొనెను - అనుకొనుడు.
వెంటనే దానినిగూర్చి యాసక్తిగలిగి బజారునకువెళ్ళి దానిని చూచును. చూచిన పిదప ఇంకను ఆసక్తిగలిగి దానినికొని భుజించును. ఇచ్చోట, మొదటిస్థితి ‘జ్ఞాతుమ్’ అని భగవానుడు చెప్పినదానికి సరిపోవును. (భగవంతునిగూర్చి సద్గురువులవలన, సచ్చాస్త్రముల వలన తెలిసికొనుట). అట్లే రెండవస్థితి ‘ద్రష్టుమ్’ అనుదానికి సరిపోవును. (సాధనాభ్యాసములచే భగవంతుని ప్రత్యక్షముగ గాంచగల్గుట). మూడవస్థితి ‘ప్రవేష్టుమ్’ అను పదమునకు సరిపోవును. (సాధనపరిపక్వతచే భక్తుడు భగవంతుయందైక్యమగుట).
ఇదియే జీవన్ముక్తదశ, మోక్షస్థితి. ఒక ఇంటినిగూర్చి తెలిసికొనుట, తెలిసికొనిన పిమ్మట దానిని సమీపించుట, తదుపరి ఇంటిలో ప్రవేశించుట యెట్లో, అట్లే భగవంతునిగూర్చియు నెఱుంగవలయును. ప్రతివాడును అనన్యభక్తియొక్క సమాశ్రయముచే భగవదైక్యరూపమగు అద్వైత పరాకాష్ఠస్థితిని జీవితములో తప్పక పొందియేతీరవలెను. అపుడే సంసారదుఃఖమంతమగును.
యదాహ్యేవైష ఏతస్మిన్నుదరమన్తరం కురుతే అథ తస్య భయం భవతి’ అను ఉపనిషద్వాక్యానుసారము భగవంతునకు తనకు రవ్వంతైనను ఎడమున్నచో భయము జనించును. భయముగలస్థితి పూర్ణస్థితి యెన్నటికిని కానేరదు. కాబట్టి ‘ప్రవేష్టుమ్’ అను మూడవదశను ప్రతిజీవియు అనన్యభక్తియొక్క సాహాయ్యముచేపొంది కృతార్థుడు కావలయును.
కేవలము వేదపఠనాదులచే ముక్తికలుగునని వచించినచో చదువురానివారు అక్కార్యమును చేయజాలరు. కనుక వారికీ ముక్తిలేకపోవును. కేవలము తపస్సులచేగాని, యజ్ఞములచేగాని ముక్తికలుగునని వచించినచో అవియు సర్వులకు అందుబాటులో లేవు, గనుక అందఱును చేయజాలరు.
కేవలము దానములచే మోక్షము సిద్ధించునని చెప్పినచో బీదవారు దాని నాచరింపలేరు, కావున వారికిన్ని ముక్తిలేకపోవును. భక్తిచేతనే భగవద్దర్శనము, (భగవదైక్యము) చేకూరగలదని ఇచ్చట చెప్పుటవలన, అది సులభముగ నుండుటచేతను, సర్వులకును అందుబాటులో నుండుటచేతను ఎల్లరుకును అవలంబనీయమై యొప్పుచున్నది. కావున జీవరాసులయెడల కరుణగలిగి ఇట్టి సర్వజనసులభమగు మోక్షసాధనమును భగవాను డిచట తెలిపినవారైరి.
ప్ర:- భగవద్దర్శనమున కుపాయమేమి?
ఉ:- అనన్యభక్తి.
ప్ర:- దానివలన జీవునకు ఏ యే ప్రయోజనములు సిద్ధించును?
ఉ:- భగవంతునిగూర్చి తెలిసికొనగల్గును. వారిని చూడగల్గును. వారియందు ప్రవేశింపగల్గును.

11-55-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ|| దేవుని ఎవరు పొందగలరో వచించుచున్నారు-
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తస్సఙ్గవర్జితః |
నిర్వైరస్సర్వభూతేషు
యస్స మామేతి పాణ్డవ ||
తా:- అర్జునా! ఎవడు నాకొఱకే కర్మలజేయునో (లేక నాసంబంధమైన (దైవసంబంధమైన) కార్యములనే చేయునో), నన్నే పరమప్రాప్యముగ నమ్మియుండునో, నాయందే భక్తిగల్గియుండునో, సమస్తదృశ్యపదార్థములందును సంగమును (ఆసక్తిని, మమత్వమును) విడిచివేయునో, సమస్తప్రాణులందును ద్వేషము లేకయుండునో అట్టివాడు నన్ను పొందుచున్నాడు.
వ్యాఖ్య:- భగవంతుని యెవరు పొందగలరో ఇచట చక్కగ వివరింపబడినది. ఐదు సద్గుణములను వచించి, వాని నెవడుగల్గియుండునో అతడు తప్పక భగవత్సాయుజ్యమును బడయగలడని శ్రీకృష్ణపరమాత్మ పేర్కొనిరి. ‘యః’ అని చెప్పుటవలన ఎవడైనను సరియే ఇట్టి మహోన్నతగుణముల నవలంబించియుండినచో మోక్షభాగుడు కాగలడని స్పష్టముచేయబడినది.
ఇట జాతిమతకుల విచక్షణ యేమియును లేదు. యోగ్యతయే ప్రధానము. ఔషధమును ఎవరు త్రాగినను రోగము నయమగునుగదా! ప్రమిద, తైలము,వత్తి నిప్పుపెట్టె తెచ్చుకొనినచో దీపము ఎవరికైనను వెలుగునుగదా! గీతయందిట్టి విశాల భావములే పలుచోట్ల వ్యక్తీకరింపబడినవి. గీతయొక్క ఔన్నత్యమున కిట్టి సార్వజనిక భావములే కారణములు.
‘మత్కర్మకృత్’ - దైవసంబంధములగు పూజ, ధ్యాన, జపాదులను గావించువాడు, లేక ఏ కార్యముచేసినను భగవదర్పితముగ జేయువాడు (పాపకార్యములను జేయక సత్కర్మలనే ఈశ్వరార్పణబుద్ధితో నాచరించువాడని అర్థము). అట్టివాడు క్రమముగ చిత్తశుద్ధినిబడసి, భగవత్కృపకు పాత్రుడై, ఆత్మవిజ్ఞానమును బడసి మోక్షమునొందును. జీవితములో మనుజుడు తన దైనందినకార్యముల నెన్నిటినో ఆచరించును. కాని వానినన్నింటిని భగవదర్పితబుద్ధితో చేయుచో అవి దైవపూజగా పరిణమించిపోవును (work changes into worship). అత్తఱి అవి సామాన్యకారణములుగ నుండక మోక్షహేతువులుగ మారిపోవును. కనుకనే భగవంతుని పొందగల్గువారిలో ‘మత్కర్మకృత్’ (నా కొఱకే కర్మలుచేయువాడు, లేక నా సంబంధమైన కర్మలు చేయువాడు) అనునది చేర్చబడెను.
‘మత్పరమః’ - భగవంతునే పరమప్రాప్యముగ, పరమలక్ష్యముగ దలంచి దైవతత్పరుడైయుండువాడు. సామాన్యముగ జనులలో పెక్కురు ప్రాపంచికవిషయములనే పరమగమ్యములుగ భావించి వానికొఱకే అహోరాత్రములు కృషిసలుపుచునుందురు. కాని దృశ్యపదార్థములన్నియు అసద్వస్తువులు, నశ్వరములు కావున అవి బంధవిముక్తిని గలిగింపజాలవు. పరమాత్మయొకడే ఈ ప్రపంచమునందలి సద్వస్తువు, కావున ఆతనినే తనలక్ష్యముగ, గమ్యముగ జీవుడు తలంచి తల్లక్ష్యప్రాప్తికై యత్నించవలెను. అట్టివాడు భగవంతుని తప్పక పొందగలడు.
‘మద్భక్తః’ - పరమానందప్రదుడగు భగవంతునియందే అతిశయభక్తి కలిగియుండవలెనుగాని తదితర పదార్థములందుగాదు. జననమరణములనుండి తప్పించజాలని పదార్థములయెడల భక్తి (ప్రీతి) యున్నచో నేమి ప్రయోజనము? భగవద్భక్తిచే అచిరకాలములో జీవుడు పరమాత్మపదము నొందగలడను సత్య మిచట వచింపబడినది.
‘సఙ్గవర్జితః’ - సంగమనగా ఆసక్తి, దేహాదిదృశ్యపదార్థములందు మమత్వము. అద్దానిని వదలవలెను. అసంగత్వమును అభ్యసించవలెను. అసంగమను పదునైన కత్తితో సంసార (దుఃఖ)వృక్షమును సమూలముగ ఛేదించివేయవలెనని భగవానుడు (గీత 15వ అధ్యాయమున) ఆనతిచ్చియున్నారు. (అసంగశస్త్రేణ దృఢేన ఛిత్వా). తామరాకు నీటిని అంటనట్లు, దృశ్యపదార్థములందు మెలగుచున్నను, విచారణా బలముచే వానితోనంటక, అసంగుడై మెలగువాడు, అట్టి సంగరాహిత్యమువలన ముక్తిని బడయగలడని యిట పేర్కొనబడినది.
‘నిర్వైరస్సర్వభూతేషు’ - ఇక ఐదవది సమస్తప్రాణికోట్ల యెడల ప్రేమ, దయ, మరియు ద్వేషరాహిత్యము. ‘సర్వభూతేషు’ అని చెప్పినందువలన ఏ ఒకటి రెండు ప్రాణుల యెడలనో దయగల్గియున్న చాలదనియు, సమస్తభూతకోట్లయెడల కరుణ, దయగలిగియుండవలెననియు తేలుచున్నది. సమస్తప్రాణులు భగవత్స్వరూపులు, నారాయణస్వరూపులు. కనుక ఏ ప్రాణికైనను, అపకారముచేసినచో, దేవుని యెడల అపకారము చేసినట్లే యగును.
కాబట్టి నిర్వైరత్వమును లెస్సగ శీలించవలెను. ఈ సత్యమునే ‘అద్వేష్టా సర్వభూతానామ్’ మొదలగు వాక్యముల ద్వారా గీతలో పెక్కుచోట్ల భగవానుడు తెలిపియున్నారు. ఒకప్రక్క ఉపనిషద్వాక్యములను వల్లించుచు, దేవుని పూజాదులను సల్పుచు, వేఱొకప్రక్క ప్రాణికోట్లను దూషించుచు, ద్వేషించుచు, హింసించుచునున్నచో ఆ పూజాదులవలన నేమి ప్రయోజనము?అది ఆచరణ వేదాంతముకానేరదు. మందు తినువాడు పథ్యము కూడ ఆచరించవలెను. పైనతెలిపిన నాలుగు సుగుణములు (మత్కర్మకృత్ - ఇత్యాదులు) మందు వంటివి. ఈ ఐదవ సుగుణమగు సర్వభూతదయ పథ్యమువంటిది. కాబట్టి వానితోబాటు దీనినిగూడ తప్పక అవలంబించవలెను. ఆ నాలుగు సుగుణములలో ప్రతియొక్కటియు ఈ ఐదవ సుగుణముతో చేరియుండవలెను. ఈ ప్రకారముగ భగవద్భక్తి, సర్వభూతదయ కలవాడు తప్పక భగవానుని చేరగలడని (‘మామేతి’) ఈ శ్లోకమందు అసందిగ్ధముగ చెప్పివేయబడెను.
గీతయం దీశ్లోకము చాల ముఖ్యమైనది. శ్రీశంకరాచార్యులవారున్ను గీత మొత్తము మీద ఈశ్లోకము సర్వోత్కృష్టమైనదని, సారభూతమైనదని తెలిపియున్నారు. ఏలయనిన, దీనియందు అన్నియోగములున్ను సంక్షేపముగ బోధింపబడినవి. మఱియు ఆ అన్నియోగ
ములకు ఆవశ్యకమైన సర్వభూతదయయు పేర్కొనబడినది. ఎట్లనిన -
(1) నా కర్మలను చేయుము - (మత్కర్మకృత్) - కర్మయోగము
(2) నా యందు తత్పరుడవైయుండుము (మత్పరమః) - ధ్యానయోగము
(3) నాయెడల భక్తిగలిగియుండుము (మద్భక్తః) - భక్తియోగము
(4) దృశ్యపదార్థములయెడల సంగము లేకుండయుండుము - (సఙ్గవర్జితః) - జ్ఞానయోగము .
పథ్యము :-
(5) సమస్తప్రాణులయెడల దయగలిగియుండుము - (నిర్వైరస్సర్వభూతేషు) - భూతదయ.
కాబట్టి సాధకులు ఈ శ్లోకముయొక్క తాత్పర్యమును పదేపదే చింతించుచు, భక్త్యాది సుగుణములుగల్గి పరమాత్మ సాయుజ్యమును ఈ జన్మయందే పొందేలాగున యత్నించవలెను.
ప్ర:- భగవంతుని యెవడు పొందగలడు?
ఉ:- (1) దైవకార్యములు నాచరించువాడు,
(2) దైవమునే పరమప్రాప్యముగ నెంచువాడు, దైవతత్పరుడై యుండువాడు,
(3) దైవభక్తుడు,
(4) సంగరహితుడు,
(5) సర్వభూతదయగలవాడు - ఇట్టివాడు భగవంతుని పొందగలడు.
ప్ర:- దీనినిబట్టి భగవత్ప్రాప్తికి ఉపాయములేవియని స్పష్టమగుచున్నది ?
ఉ:- (1) దైవకార్యముల నాచరించుట,
(2) దైవమునే పరమప్రాప్యముగ నమ్ముట, దైవతత్పరుడై యుండుట,
(3) దైవభక్తి గలిగియుండుట,
(4) సంగరాహిత్యము నవలంబించుట,
(5) సర్వప్రాణులయందు దయ, వైరములేమి గలిగియుండుట.
ఓమ్
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే విశ్వరూపసందర్శనయోగోనామ
ఏకాదశోఽధ్యాయః
ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విశ్వరూపసందర్శనయోగమను
పదునొకండవ అధ్యాయము
ఓమ్ తత్ సత్...

ఓం శ్రీ రామ్ అనుటే మనస్సు మయమై సంతోష సద్భుధ్ధియే
ReplyDelete