నిత్య సందేశములు
🌹. శ్రవణ , మనన , నిధిధ్యాసనములు అను వాటి ద్వారానే ఆత్మ విచారణ స్థిర పడాలి. వేరే మార్గము లేదు. 🌹
అనుభవ జ్ఞానము కలిగిన గురు ముఖత నేను ఆత్మ స్వరూపుడను అను నిశ్చయ జ్ఞానమును శ్రవణము చేయ వలెను.
విన్న వాక్యముల యొక్క అర్ధము బోధ పడు వరకు , ఆ జ్ఞానము బుద్ధి యందు స్థిర పడు వరకు మననము చేయవలెను. ఆ భావము స్మృతిలోని చేరి నిర్ణయమై సహజమై పోవుట నిధిధ్యాస.
నీవు నియమ నిష్ఠలను ఎంత పటిష్టముగా పోషిస్తున్నావో అంత త్వరగా నీకు అనుభవ జ్ఞానము కలుగుతుంది.
ఆత్మానుభవము కలుగుటకు రెప్పపాటు సమయము చాలు. సాధన అంతా దానికొరకు సిద్ధ పడుటయే.
నీవు ఊబిలో పడినప్పుడు ఎంతగా తన్నుకొంటే అంతగా కూరుకు పోతావు. దాని నుండి బయట పడుటకు ఒకటే మార్గము, ఒక బలమైన ఆధారము కావాలి. నేను ఆత్మ స్వరూపుడను అనే భావనయే ఆ బలమైన ఆధారము. నీవు ద…

🌹. శ్రీ దత్తాత్రేయ తత్వ కధలు - అలర్క గీత - 1 🌹
🌻. మమకారం ఆత్మ సాధనకు ఆటంకం 🌻
శ్రీ దత్తాత్రేయుడు చాలా అద్భుతంగా అలర్కుడు అనే మహారాజుకి తన తత్వాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు. వారిద్దరికీ జరిగిన సంభాషణ అలర్కగీత గా చాలా ప్రసిద్దికెక్కినది. దాన్ని మనం చాలా క్లుప్తంగా చెప్పుకుందాం.
పూర్వము కువలయాసుడు అనే చక్రవర్తికి మదాలస అనే జ్ఞానమూర్తి అయిన భార్య ఉండేది. వీరిద్దరికి శత్రుమర్దనుడు, సుబాహువు, విక్రాంతుడు అని వరుసగా ముగ్గురు కుమారులు కలిగారు.
వారిని చిన్నతనంలోనే జ్ఞానమూర్తి అయిన మదాలస తన స్తన్యాన్ని ఇస్తూ తత్వాన్ని ఉపదేశించింది. ఆ తత్వాన్ని గ్రహించిన ఆ శిశువులు చాలా చిన్న వయస్సులోనే గోచీ కట్టుకుని తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్లిపోయారు.
నాల్గవ కుమారుడు అయిన అలర్కునికి కూడా తత్వబోధన చేస్తున్నపుడు కువలయాసుడు ఆమెను వారించాడు. అలర్కుడు యవన దశకు వచ్చాక అతనికి వివాహాన్ని చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా వానప్రస్థానానికి బయలుదేరారు. తల్లి అయిన మదాలస తన కుమారునికి చాలా నీతి బోధలు చేసింది.
“నాయనా ! చక్రవర్తి పదవి అంటేనే అహంకారంతో నిండినటువంటి పదవి. చుట్టూ చేరిన ఆశ్రితులు ఆ అహంకారాన్ని పెంచుతూ తమ పబ్బాన్ని గడుపుకుంటూ వుంటారు. వారంతా శ్రేయోభిలాషులుగా నటిస్తుంటూవుంటారు కానీ వాళ్లకి వాళ్ళ స్వార్ధ చింతనలు ఎన్నో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వుండు.ఇదిగో నీకు నేను ఒక తాయత్తు ఇస్తున్నాను. దీనిలో ఒక సందేశ౦ ఉంది.
నీకు ఎప్పుడైనా ఉపద్రవం వచ్చినప్పుడు, దిక్కు తోచని పరిస్థితి కలిగినప్పుడు అప్పుడు మాత్రమే దీనిని చదివి దాని ప్రకారంగా నడుచుకో !” అని చెప్పి భర్తతో పాటు తాను వానప్రస్థానము గడపటానికి వెళ్ళిపోయింది.
అలర్కుడు చాలా దుఃఖించాడు. తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుని కొన్ని రోజులు బాధపడ్డాడు. కానీ ఐశ్వర్యాలతో, కీర్తిప్రతిష్ఠలతో, చుట్టూ చేరిన వంది-మాగధల స్తోత్ర పఠనములతో అలర్కుడు అనతి కాలంలోనే ఇవన్నీ కూడా మర్చిపోయాడు. భోగ లాలసుడై జీవించసాగాడు. కొన్నాళ్లకి అతని సోదరుడు అయిన సుబాహువు తమ్ముణ్ణి చూడటానికి వచ్చి, తమ్ముడి పరిస్థితి చూసి చాలా బాధ పడ్డాడు.
ఆతను వెంటనే కాశీ రాజు దగ్గరికి వెళ్లి “మహారాజా ! నేను చాలా చిక్కుల్లో వున్నాను, ప్రాణ భీతితో వున్నాను, మీరు నాకు అభయం ఇవ్వాలి” అని తొందరపెట్టగా కాశీ మహారాజు ఎంతో దయాగుణం వున్నవాడు కాబట్టి ముందుగా అభయం ఇచ్చాడు, తరువాత నింపాదిగా సుబాహువు “అలర్కుడు నా తమ్ముడు. నా రాజ్యాన్ని చేజిక్కించుకుని తను పరిపాలిస్తున్నాడు. ఎలాగయినా నా రాజ్యాన్ని నాకు ఇప్పించండి” అని ప్రార్ధించాడు. మొదట కాశీ రాజు కించిత్తు ఆశ్చర్యపడ్డాడు.
మీరు మీ సోదరుడిని అడిగితే రాజ్యాన్ని ఇస్తాడు కదా అంటే, దానికి సుబాహువు “మీకు మా సోదరిని గురించి తెలియదు, వాడు నన్ను సంహరించినా సంహరించవచ్చు, కాబట్టి ఎలాగయినా మీరు ఆ రాజ్యాన్ని ఇప్పించాలి” అని ప్రాధేయపడ్డాడు.
కాశీ మహారాజుకి, అలర్కునికి అంతక మునుపే కొంత వైరం వున్నది. తన వాగ్ధానాన్ని నెరవేర్చుకోవటానికి అతడు అలర్కునికి రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళాడు. అప్పటికే అలర్కునికి అక్కడ అరణ్య వాసులతో యుద్ధం నడుస్తుండటం వల్ల అతడు ఆనతి కాలంలోనే యుద్ధంలో ఓడిపోయాడు. అయితే కోట తలుపులు అన్నీ వేసి అప్పుడు తన తల్లిని గుర్తు తెచ్చుకున్నాడు. తల్లి చేసిన నీతి బోధలు అప్పుడు గుర్తుకు వచ్చాయి. చాలా పశ్చాత్తాపం కలిగింది.
అప్పుడు తల్లి ఇచ్చిన తాయత్తు తెరిచి, తల్లి సందేశం అనుసారంగా రహస్య సొరంగ మార్గం ద్వారా సహ్యాద్రి పర్వతాల్లో గల దత్త మహాప్రభువు దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అయితే సాక్షాత్తు జ్ఞాన మాత అయిన మదాలస పుత్రుడు కాబట్టి దత్తాత్రేయులవారు ఏమీ పరీక్షలు పెట్టలేదు.
అలర్కుడు ఎంతో దుఃఖంతో “ప్రభూ ! నా రాజ్యాన్ని అంతా కోల్పోయాను. నేను చాలా బాధలో వున్నాను. మీరే నన్ను కాపాడాలి. శత్రు రాజులు నా రాజ్యాన్ని పొంచుకొని వున్నారు. నేను పారిపోయి మీ దగ్గరకు వచ్చాను. మీ శరణం కోసం వచ్చాను స్వామీ” అని విలపించాడు.
దానికి చిరునవ్వు నవ్వుతూ దత్త స్వామీ “అలర్కా! నీవు కూడా ఎంతో వివేకవంతుడివి. నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు. నీకు దుఃఖం వచ్చింది అన్నావు కదా ఒక్కసారి ఆలోచించుకో, సమ్యవిచారణ చేసుకో” అని ఎంతో అనుగ్రహంతో అతన్ని తేరిపారా చూడసాగారు.
ఆ చూపులో ఎదో సమ్మోహనా శక్తి ఉంది. అలర్కుడు అంతా మర్చిపోయినాడు. మనస్సులో ఈ విధంగా తర్కించుకున్నాడు. స్వామివారు ఎవరికి దుఃఖం వచ్చింది అని అడిగారు? నిజమే నాకు దుఃఖం దేనికి వచ్చింది? నేను ఎవరిని?
ఈ అంగాలు - కళ్ళు, ముక్కు, చెవులు,కాళ్ళు, చేతులు, పైన వున్న ఈ చర్మము అంగి. నేను అంగిని కాదు. నేను అంగాలను కూడా కాదు. మరి నేను ఎవరిని? పంచతత్వాలతో తయారైనటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాన్ని కూడా నేను కాదు.
సశేషం... నండూరి శ్రీసాయిరాం
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ
.
🌹 🌹 🌹 🌹 🌹
2. 🌻. మమకారం ఆత్మ సాధనకు ఆటంకం 🌻
నేను, నా భార్యా, పిల్లలు, మిత్రులు, ఈ అందరూ కూడా నేను కాదు. మరి నాలో దుఃఖం ఎవరికి కలిగింది? ఈ అంగి, అంగాలు నేను కాదు అన్నపుడు మరి దుఃఖం ఎవరికి కలిగింది? పోనీ నేను ఆత్మ స్వరూపుడుని అని అనుకుంటే మరి ఆత్మకు సుఖం కానీ దుఃఖం కానీ అంటదు కదా? హ!!
నాకు ఇప్పుడు తెలిసింది నేను అంతటా వున్నాను. ఏ విధంగా అయితే సూర్యుడు చిన్న కుండలో, బావిలో, తటాకాల్లో, సముద్రాలలో, మహాసముద్రాలలో ఉంటాడో, అదే విధంగా నేను అంతటా వున్నాను.
కాశీ రాజులో వున్నాను, ప్రజలలో వున్నాను, ఈ దేశం అంతా కూడా నేను వున్నాను. నాకు దుఃఖం కాని సుఖం కాని లేదు. ఈ విధంగా అతని ఆలోచనలు చాలా వేగంగా సాగిపోతున్నాయి. కేవలం స్వామి యొక్క కరుణా పూరితమైన దృష్టి పడటంతోటే అతనిలోని వివేకం బయటకు వచ్చింది.
అతడు కళ్ళు తెరిచి “ప్రభూ! నా కళ్ళు తెరిపించారు. నాకు ఇప్పుడు అర్ధం అయ్యింది. నాకు ఇప్పుడు దుఃఖం లేదు స్వామీ. మీరు నా దుఃఖాన్ని ఒక్క క్షణం లోనే పోగొట్టారు.
స్వామీ ! ఇప్పుడు నా తప్పు నాకు తెలిసింది. నేను ఒక కోడి పిట్టను పెంచుకున్నాను. ఒకసారి పిల్లి దాని మెడ కొరికి చంపేసింది. అప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. మరొక సారి ఆ పిల్లి ఒక ఎలకని చంపివేసింది. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. కానీ ప్రభూ! ఇప్పుడు నాకు తెలిసింది నా అవివేకం ఏమిటో.
కోడిపెట్ట చనిపోయినప్పుడు దుఃఖం కలిగిన నాకు ఎలక చనిపోయినప్పుడు సంతోషం ఎందుకు కలిగింది?దుఃఖం ఎందుకు కలగా లేదు? మరి నాకు ఎందుకు దుఃఖం కలిగింది అన్నది నేను విమర్శించుకుంటే కోడిపెట్ట మీద నేను మమకారాన్ని పెంచుకున్నాను కాబట్టి అది దుఃఖ హేతువు అయ్యింది. ఎలక మీద నాకు ఎటువంటి మమకారం లేదు కాబట్టి నాకు ఎటువంటి దుఃఖం కలగలేదు, పైగా సంతోషం కలిగింది.
ప్రభూ! రెండిటిలో జీవం వున్నది. నిజానికి ఎక్కడ మమకారం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఎక్కడ దుఃఖం ఉంటుందో అది బంధ కారకం అవుతుంది. అది మోక్షానికి అడ్డం వస్తుంది అని తెలుసుకున్నాను” అని అన్నాడు.
దత్తాత్రేయుడు ఎంతో సంతోషంతో “నాయనా అలర్కా ‘మమ’ అంటే దుఃఖం. ‘అమమ’ అంటే దుఃఖం లేనిది. చాలా చక్కగా సంయవిచారించి నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు. నాకు చాలా సంతోషం అని మరికొన్ని నీతి బోధలు చేసి అలర్కుడిని పంపించివేశాడు.
ఎంతో సంతోషంతో తన రాజ్యాన్ని చేరుకొని సరాసరి శత్రుసేనల మధ్య వున్న కాశీ మహారాజు దగ్గరికి వెళ్లి “కాశీ మహారాజా, నువ్వు నాకు శత్రువుడివి కావు, నీవు నాకు మిత్రుడివి.
నీకు నా రాజ్యం కదా కావలిసింది, నువ్వు తీసేసుకో. నాకు రాజ్యం ఏమీ అక్కర్లేదు. నీవల్ల నాకు ఇంకా పెద్ద సామ్రాజ్యమే నాకు దొరికింది. ఆ సామ్రాజ్యాన్ని ఏలుకోవటానికి, దానిని ఆనందించుకోవటానికి నేను వెళ్తున్నాను. నాకు ఈ రాజ్యం ఏమి అక్కరలేదు” అని నిస్సంకోచంగా చెప్పేసరికి సుబాహువు వెంటనే వెళ్లి తమ్ముడిని ఆలింగనం చేసుకున్నాడు.
“సోదరా! నీవు జ్ఞాన మాత అయిన మదాలస కుమారునివి. నేను వచ్చి చూసినప్పుడు నీవు విషయవాసనాలలో తగులుకుని ఉండటంవల్ల నేను చాలా బాధపడ్డాను. అందుకే నిన్ను సన్మార్గంలోకి తీసుకురావటానికి నేను ఈ ఉపాయ౦ పన్నాను.
మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరూ ఎంతో సంతోషంగా వెళ్లిపోతుండగా కాశీ మహారాజు ఎంతో ధర్మాత్ముడు కాబట్టి ఆయన ఇద్దరు సోదరులను ఆపి “మీ సంగతి నాకేమీ అర్ధం కావటం లేదు. నీవు నాదగ్గర అభయం తీసుకుని నీ తమ్ముడి రాజ్యాన్ని జయించి, రాజ్యాన్ని నీకు అప్పగించమని అడిగావు.
ఇప్పుడు మీరిద్దరూ ఏంటి ఇంత సంతోషంగా వున్నారు? మీరు ఏదో సామ్రాజ్యాన్ని పొందాం అని అంటున్నారు. అది ఏమిటో నాకు కూడా చెప్పండి. నేను కూడా మీ మిత్రుడినే కదా, నేను కూడా సంతోషిస్తాను అని చెప్పాడు.
అంతే కాక ఈ రాజ్యం నాకు ఏమి అక్కరలేదు. మీ కుమారునికి పట్టాభిషేకం చేసి మీరు నిశ్చింతగా తపస్సుకి వెళ్ళవచ్చు” అని చెప్పి, అలర్కుని కుమారునికి ఎంతో వైభవంగా పట్టాభిషేకం చేసి వారు తపస్సుకోసం అడవుల్లోకి వెళ్లిపోయారు.
ఈ విధంగా దత్తస్వామి చాలా చక్కగా అలర్కుడుకి మమకారం అనేది ఏ విధంగా ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తుందో, ఎప్పుడయితే ఆ బంధంలో మనిషి చిక్కుకుంటాడో, ఇంకా ఇంకా అనేక బంధాలలో అతను ఇరుక్కుపోతూనే ఉంటాడు. వలలో చిక్కుకున్న పావురం లాగా అతడు ఎంత ప్రయత్నించినా బయటకి రాలేడు. ఆ బంధం ఇంకా బిగుసుకుపోతూ ఉంటుంది.
కాబట్టి ఎవరైతే సమ్యగ్విచారణ చేసుకుని తమ లక్ష్యాన్ని మమకారాలు అనే బంధాన్ని తెంపుకుని ధృఢనిశ్చయంతో ఆత్మ సాధనకోసం, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటం కోసం వెళ్తారో వారు సంసారం నుంచి బంధ విముక్తులై శాశ్వత మోక్షాన్ని పొందుతారు అని మనం గ్రహించాలి.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ దత్తాత్రేయ తత్వ కధలు - అలర్క గీత - 3 🌹
✍️. నండూరి శ్రీసాయిరాం
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. మమకారం ఆత్మ సాధనకు ఆటంకం 🌻
లోగడ మనం శ్రీ దత్తాత్రేయస్వామి వారికి సంబంధించిన రెండు కథలు, ఆయన తత్వము, అవధూత తత్వము, ఆయన ఇచ్చిన సందేశం విన్నాము.
ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ పరిశీలిద్దాం. దీనిని నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఇది సాక్షాత్తు రామకృష్ణ పరమహంస గారికి సంబందించిన జీవిత గాధ.
శ్రీ రామకృష్ణుడు పరమ కాళీ భక్తుడు. ఆయన ఎప్పుడు తలచుకుంటే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షము అయ్యి ఆనందం కలిగిస్తూ ఉండేది. అమ్మవారు ప్రత్యక్షము అయినప్పుడు కూడా ఆయన ఎంతో తన్మయత్వములో నృత్యం చేస్తూ పారవశ్యం తో మునిగి పోయేవాడు. దేహ భ్రాంతిని పూర్తిగా విస్మరించేవాడు.
ఇలా ఉంటుండగా, తాతపురి అనే మహా యోగి శ్రీ రామకృష్ణుని దర్శించి ‘అరే ఏంటి ఈయన కాళికా మాత మమకారములో చిక్కిపోయాడేయ్ ఆత్మ జ్ఞానానికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడేంటి అబ్బా!’ అని ఆలోచించాడు. ఆయన ఒక మహా యోగి.
అందుకని శ్రీ రామకృష్ణుని దర్శించి ఆయనతో “నాయనా రామకృష్ణ! నువ్వు అన్నీ తెలిసిన వాడివి. ఆత్మజ్ఞానికి అడ్డంగా ఉన్న మమకారం అనే బంధాన్ని ఈ కాళికా మాతతో పెట్టుకున్నావు. నువ్వు ఈ మమకారం అనే బంధంతో నువ్వు పైకి వెళ్ళలేవు.
పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవటమే కదా నీలాంటి వాళ్ళ లక్ష్యం. అలాంటప్పుడు నువ్వు ఈ మమకారం అనే బంధం తెంచుకోవాలి అంటే ఒకటే ఒక ఉపాయం చెప్తాను. ఈసారి అమ్మవారి దర్శనం అయినప్పుడు నువ్వు ఒక అద్దంతో ఆమెను ఖండ ఖండాలుగా నరికివేయి.
అప్పుడుగాని ఈ మమకారం అనే బంధం తెగదు. అది తెగితే గాని పై పై మార్గంలో వెళ్లి పరబ్రహ్మ మార్గాన్ని తెలుసుకోలేవు” అని చెప్పారు. రామకృష్ణ గారికి కూడా ఈ విషయం తెలుసు కాబట్టి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు.
ఈసారి కాళికా మాత ప్రత్యక్షము కాగానే అన్నీ మర్చిపోయి ఎంతో తన్మయత్వంతో ఆయన నృత్యం చేయ్యసాగాడు. ఇది గమనించిన ఆ మహా యోగి తాతపూరి మరల ఒక సారి చెప్పారు. ఈవిధంగా మూడు సార్లు జరిగాక నాల్గవ సారి గట్టిగా చెప్పారు.
ఈసారి కాళికా మాత రాగానే ముందు ఒడలు మర్చి నృత్యము చేయబోయిన రామకృష్ణకు తాతపురి చెప్పిన వాక్యాలు గుర్తుకువచ్చాయి. ఆయన ఒక అద్దంతో కాళికా మాతను ముక్కలు ముక్కలు చేసివేసాడు. అప్పుడు గానీ ఆయనకు ఈ మమకారము అనే బంధం తెగలేదు. అప్పుడు మహా యోగి తాతపురి వచ్చి ఎంతో సంతోషించాడు.
“ఇంకా నాయనా నీకు పరబ్రహ్మ స్వరూపము లేక ఆత్మ జ్ఞానము తప్పకుండా సిద్ధిస్తుంది సాధన చేస్తూ ఉండు” అని దీవించి వెళ్లిపోయారు. అప్పుడే రామకృష్ణ పరమ హంసగా మారారు.
ఇక్కడ అద్దంతో నరికి వేయటం అంటే భౌతికంగా నరికి వెయ్యటం కాదు. అంటే మానసికంగా ఆ మమకారాన్ని ముక్కలు ముక్కలు చెయ్యటం అన మాట.
దీని తర్వాతనే రామకృష పరమహంసగా మారి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. దీన్ని బట్టి తెలుసుకునేదేంటి అంటే మహానుబావులు, మహా యోగులు అంతా ఒకటే. ఈ మమకారము అనేది ఉన్నంత కాలం ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళటం చాలా కష్టం.
అయితే ఇక్కడ ఒక ప్రశ్న మన అందరికీ వస్తుంది. సాక్షాత్తు కాళికా మాతనే ఆయన పట్టుకున్నారు కదా మరి ఆవిడ మోక్షాన్ని ఇవ్వలేదా? ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వలేదా? అనే ప్రశ్నలు మనకి వస్తాయి. అయితే దీనికి సమాధానం కూడా మహాయోగుల జీవిత చరిత్రలలోనే దొరుకుతుంది.
నిజాంగా కాళికా మాత గాని, ఏ దేవత కానీ మోక్షం ఇవ్వగల వారు అయితే మరి తాతాపురి ఎందుకు చెప్పవలిసి వచ్చింది అంటే - దీని రహస్యం మనకి త్రిపురా రహస్యంలో దత్తస్వామి వారు సాక్షాతూ పరుశురామునితో చెప్తారు,
అది మళ్ళా మనం ఇంకోక సందర్భంలో పరిశీలిద్దాము. కాబట్టి మనం ఏ దేవతనో పట్టుకొని మనం అక్కడ ఆగి పోవటం కాదు. ఆ దేవతా సాధన వల్ల మనకి ఎంతో కొంత కొన్ని మహిమలో లేక కొంత పుణ్యమో వస్తుంది.
కానీ ఆత్మ జ్ఞానము లేక పరబ్రహ్మ స్వరూపం మనకి తెలియదు. ఎవరి సాధన వాళ్లదే. అయితే ఈ సాధన మనం నిరంతరం చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో ఎన్నో శక్తులు వస్తూ ఉంటాయి, ఎంతో మంది దేవతలు దర్శనం ఇస్తూ ఉంటారు, అక్కడితో మనం ఆగకూడదు.
మనం ఇంకా ఇంకా పైకి వెళ్తూ ఉండాలి. ఊర్ధ్వ ముఖంగా ప్రయాణం చెయ్యటమే యోగి యొక్క సాధన. అలాచేసి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటమే మన లక్ష్యం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
5. 🌻. మమకారం ఆత్మ సాధనకు ఆటంకం 🌻
మనం చేసే చాలా రకాల ధ్యాన పద్దతులలో కేవలం ఒకే ఒక లక్ష్యం ఉంటుంది, అదే మన చైతన్య స్థాయిని పెంచుకోవటం అనమాట. చైతన్య స్థాయి అంటే ఏమిటి అంటే, ఏమీ లేదు - మన ఆలోచనా స్థాయిని పెంచుకోవటం అనమాట.
మన ఆలోచనలకి ఎటువంటి పరిధులు లేకుండా మన చైతన్య స్థాయిని పెంపొందించుకోవడం. ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే మనలో చాలా మందికి మన చైతన్య స్థాయిలో కేవలం మన కుటుంబాన్ని మాత్రమే ఉంచుకొంటాం. తల్లీ, తండ్రీ - తల్లితండ్రుల్ని కూడా ఈమధ్య ఉంచుకోవటం లేదు.
కేవలం భార్య, భర్త, పిల్లలు; ఎంతసేపూ మన ఆలోచనా పరిధులు వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయికానీ వీరిని దాటి పైస్థాయిని వెళ్లవు. ఇటువంటి వారిలో మమకారం ఎక్కువ ఉంటుంది. స్వార్ధ చింతన ఎక్కువగా ఉంటుంది. ఇతర వ్యక్తులతో, ఇరుగుపొరుగు వాళ్లతో పంచుకోవటం అనేది ఉండనేవుండదు.
మనకి ఎక్కువగా ఉన్న వస్తువులు పంచుకోవటం కావచ్చు, ధనాన్ని పంచుకోవటం కావొచ్చు, జ్ఞానాన్ని పంచుకోవటం కావొచ్చు, ప్రేమని పంచుకోవటం కావొచ్చు. ఏ లక్షణాలు అయితే మన కుటుంబం చుట్టూ తిరుగుతూ వుంటాయో పై స్థాయి వాళ్ళకి మాత్రం ఈ లక్షణాలు వర్తించకుండా ఉంటాయి.
చాలామంది తమ కుటుంబమే కాకుండా, ఇరుగుపొరుగు వాళ్లే కాకుండా, సమాజము, గ్రామములోని ప్రజలతో పాటు కష్టాలు సుఖాలు పంచుకోవటం, సమాజ సేవ చెయ్యటం ఉంటుంది.
అంటే వీరి చైతన్య స్థాయిలో ఆ గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇంకా కాస్తా పైస్థాయికి వెళితే ఆ జిల్లా మొత్తం ఉండవచ్చు, ఇంకా కాస్త పైస్థాయికి వెళితే భారత దేశం, ఇంకా మొత్తం ప్రపంచం ఇలా ఉండవచ్చు. దీనినే ఇంగ్లీష్ లో ‘Expansion of human consciousness’ అని అంటాము.
మనం ముచ్చటగా తెలుగులో చెప్పుకోవాలి అంటే ‘మన మానవ చైతన్య వ్యాప్తి ’ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అయితే మనం మన చైతన్య స్థాయిని పెంచుకుంటామో అప్పడు ఈ ప్రపంచంలోని ప్రజలు అందరూ కూడా మన సొంత కుటుంబ సభ్యుల్లాగానే మనం భావిస్తాం.
అలాగే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం కూడా దుఃఖపడతాం, వాళ్ళకోసం ప్రార్దిస్తాం. అలాగే వాళ్ళు సుఖంగా ఉంటే మనంకూడా చాలా సంతోషిస్తాం. ఇటువంటి స్థాయిలో ఉన్న ఒక మహా యోగిని గూర్చి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
వివేకానంద స్వామిగారి గురించి తెలియనివాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే వారి జీవితంలోని కొన్ని ఘట్టాలు చాలామందికి తెలియదు. అందులోని ఒక ప్రధాన ఘట్టాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
వివేకానంద చాలా చిన్న వయస్సులోనే అనగా 39 ఏళ్ల వయస్సులోనే దేహత్యాగం చేశారు. ఆయన తన సహచరునితో ఒకసారి ఈవిధంగా చెప్పారు ‘నాకు ఈమధ్య ఈ భారత దేశం అంతా నాలోనే ఉంది, నేను అంతా నేను భారతదేశమంతటా నిండి వున్నాను అని అనిపిస్తున్నది.
అది మెల్లమెల్లగా మొత్తం ప్రపంచం అంతా కూడా నాలోనే ఉన్నట్టు, నేను ప్రపంచమంతా ఉన్నట్టుగా, ప్రజలందరిలోనూ, ఇక్కడ భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, చెట్లు, కొండలూ, గుట్టలు, మనుషులు, నదులు, అన్నిటిలో నేనే వున్నాను అనే భావం నాలో చాలా తొందరగా వ్యాపిస్తుంది.
ఈ సృష్టించబడిన అన్ని జీవులపై అపారమైన కరుణా ప్రేమా, పొంగి పొరలుతున్నాయి. కనుక నా ఈ దేహం ఈ విధంగా విస్తరిస్తున్నటువంటి చైతన్య స్థాయిని ఇముడ్చుకోలేక పోతున్నది.
ఇది దేహం వదిలి విశ్వమంతా తొందరలో వ్యాపిస్తుంది. కనుక నేను ఇంక ఎంతోకాలం బ్రతకను. ఎందుకంటే ఈ దేహం నా చైతన్య స్థాయిని పూర్తిగా నింపుకోలేకపోతుంది. కాబట్టి నేను దేహత్యాగం చెయ్యక తప్పదు’ అని చెప్పారట.
దీనిలో చాలా అర్ధం వుంది. దీనికి ముందు పైన అర్ధం కావటానికి నేను కొంచం వివరించి చెప్పాను. అంటే స్వామి వివేకానంద సాక్షాత్తుపరబ్రహ్మ జ్ఞానాన్ని పొందిన పరమాత్ముడు. అందుకే ఈ సృష్టిలో వున్న ప్రతి జీవిలో తనను తానే చూసుకోవటం, ఆ జీవి తనలోనే వున్నది అని తలుచుకోవడం దానికి తార్కాణం.
సాక్షాతూ శ్రీ దత్తుడి తత్వాన్ని అర్ధం చేసుకోవటమే కాకుండా దాన్ని సాక్షాత్తు అనుభవించినటువంటి ఒక మహా యోగి అని చెప్పక తప్పదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
స్వర్గానికి రోడ్డు మార్గం
(Road route to SWARGA LOKA)
పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి.
భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు.... అనడానికి, భూమి మీద ఉన్న ఏకైక మార్గం ఇదే....
బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం......⬇️
.....🔚🔚🔚భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. 🔙🔙🔙
ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది.
ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక, అలకనంద నదితో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కూడా ఉంటుంది.
ఈ సరస్వతి నది పక్కన భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది.
పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు.
ఈ రాతిమీద భీమసేనుని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి.
ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది.
ఇక్కడ నుండి చట్మోలి 8km......
మార్గ మధ్యమం లో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది.
తరవాత "మాతమూర్తి ఆలయం" కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కూడా చెప్తారు.
ఈ ప్రాంతం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.
తర్వాత "కుబేర్ మకుట్ "అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.
ఇక్కడినుండి 5km ప్రయాణం చేసాక "వసుధార జలపాతం" వస్తుంది.
ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది.
ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాల పలుచగా నీటి తుంపర లవలె పడుతుంది.
అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.
చట్మోలి:-
తర్వాత చట్మోలి ( 12000 అ ఎత్తులో ) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం.
పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం.
ఇక్కడే "సతోపంత్" మరియు "భగీరధ్ కర్క్" అనే రెండు నదులు ( హిమానీనదాలు ) కలిసి "అలకనంద" గా ఏర్పడతాయి.
అక్కడి నుండి ముందుకు వెళితే "ధనో హిమానీనదం" కు చేరుకుంటాం.
చట్మోలి నుండి లక్ష్మివన్ 1km ( 12600 అ ఎత్తు లో ).........
తర్వాత లక్ష్మి వన్ ప్రాంతం కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
ఇక్కడే లక్ష్మి మాత మరియూ విష్ణు భగవానుడు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని చెప్తారు.
ఇక్కడి నుండి 2km ప్రయాణించాక బంధర్ అనే ప్రాంతం కు చేరుకుంటాం.
ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు.
బంధర్ నుండి సహస్రధార 4km ( 14000 అఎత్తులో).........
సహస్ర ధార నుండి చక్ర తీర్ధం 5km (15000 అ ఎత్తులో)........
చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సు గా చెప్తారు.
ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.
చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km........
ఈ సతోపంత్ అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు.
ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే సరస్సు.
ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని చెప్తారు.
ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చట.
ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.
సతోపంత్ నుండి స్వర్గారోహిణి 8 km......
ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సహం గాను చెప్తారు.
మార్గ మధ్యం లో చంద్రకుండ్ మరియూ సూర్యకుండ్ అనే సరస్సులు...భట్టాచార్య... ఉంటాయి.
ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే, కుక్క తోడు రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు.
నిజానికి స్వర్గారోహిణి అనేది 6 పర్వతాల సమూహం గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది.
ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది.
దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది.
ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి పైకివెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.
"స్వర్గారోహిణి పర్వత సమూహాలు" అన్నవి అతి పురాతనమైన పర్వత సమూహాలు. ఇవి గర్వాల్ హిమాలయాల లోని సరస్వతి హిమ శ్రేణులలో కలవు. నేటి "ఉత్తరాఖండ్" రాష్ట్రం లో గల "ఉత్తర కాశీ" జిల్లాలో కలవు. ఇవన్నీ మరల గంగోత్రి హిమ శిఖరాలు. ఇవి మరల నాలుగు శిఖరాలు. 1. స్వర్గారోహిణి - 1 అన్నది ప్రధాన శిఖరం.
ఈ పర్వతం సముద్ర మట్టానికి 6,247 మీటర్ల ఎత్తులో కలదు.
"స్వర్గారోహణ"....అన్న పదం, మన ఇతిహాసమైన "మహాభారతం" నుండి వచ్చింది. "స్వర్గారోహణ పర్వం"....మహాభారతమందలి పర్వాలలో ఒకటి కదా! మహాభారతంలో....చివరి అంకంలో ధర్మరాజాదులు, తమ రాజ్యాన్ని వదలి స్వర్గం వైపు ప్రయాణం కడతారు. ఈ "స్వర్గారోహిణి" పర్వతాలు, స్వర్గానికి నిచ్చెనలాంటివి అని పురాణ కథనం. కానీ పాండవాగ్రజుడైన, ధర్మ రాజు మాత్రమే స్వర్గాన్ని చేరుకుంటాడు. హిందూ ఐతిహ్యాల ప్రకారం........ఈ స్వర్గారోహిణి పర్వతాలే, స్వర్గానికి సశరీరంగా వెళ్ళడానికి మార్గంగా ఉన్నాయని, ఐతిహ్యాలు చెబుతున్నాయి. ఇందులోని మార్మికత ఏమిటో?
భట్టాచార్య

🌹. శ్రీ దత్తాత్రేయ తత్వ కధలు - అలర్క గీత - 4 🌹
✍️. నండూరి శ్రీసాయిరాం
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. మమకారం ఆత్మ సాధనకు ఆటంకం 🌻
🌷. స్వామీ వివేకానంద జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. 🌷
స్వామీ వివేకానంద ఎల్లప్పుడూ కూడా శ్రీ రామకృష్ణ పరమహంసని అంటిపెట్టుకుని ఉండేయివారు. ఎక్కువ సమయం ఆయనతోనే గడుపుతూ ఉండేయివారు. శ్రీ రామకృష్ణ పరమహంస గారు ఎప్పుడూ తన్మయత్వంలో ఉండి నృత్యం చేస్తూ ఎవరు కనపడితే వారిని ఆలింగనము చేసుకుంటూ ఉండేవారు.
అందరూ ఆయనని పిచ్చి వాడు అని ఒక ముద్ర వేశారు. కానీ స్వామీ వివేకానంద ఎప్పుడూ వారిని పిచ్చివాడు అని అనుకునే వారు కాదు, వారిలో ఆయనకి ఒక దైవత్వం కనిపించేది. సామాన్య మానవులు అయిన మనందరికీ ఇటువంటి వారిని చూసినప్పుడు వారిని పిచ్చివారి వాలే వారిని అనుకుంటాం.
కానీ మనకన్నా కొంచం పై స్థాయి లో వున్నవారికి వారు ఒక మంచి సాధకులుగా, భగవత్ దర్శనం అయితే ఎంత ఆనందం వస్తుందో అటువంటి ఆనందాన్ని వాళ్లు ఎల్లపుడూ పొందుతూ నృత్యం చేస్తూ ఆనందంగా ఉంటారని తెలుస్తుంది.
సాక్షాతూ శ్రీ షిర్డీ సాయిబాబా గారి జీవితంలో కూడా అంతే, ఆయన దేహదారిగా ఉన్నంత కాలం చాలామంది ‘ఆ ఫకీరు పిచ్చి వాడు’ అని అంటూ ఉండేయివాళ్ళు. ఎప్పుడూ కూడా సమకాలిన పరిస్థితులలో తమ పక్కనే వున్న మహాత్ములని గమనించటం అరుదు.
శ్రీ కృష్ణుని జీవిత చరిత్రలో కూడా అంతే కదా, సాక్షాతూ ఆయన భగవంతుడు అయినా కూడా ఆయన తత్వాన్ని గమనించలేని కంసుడు కానీ, జరాసంధుడు కానీ మిగతా ఎంతో మంది కూడా ఆయన్ని ఎంతో అవమానించారు, దూషించారు, సరిగా అర్ధం కూడా చేసుకోలేకపోయారు.
ఎప్పుడయితే దేశము, కాలములలో కొంత ఖాళీ ఏర్పడుతుందో అప్పుడు రాబోయే తరాల వాళ్ళు పిచ్చి వాడిగా ముద్రవేసుకున్న వారిని ఆ తరువాత ‘భగవంతుడు’ అని ముద్ర వేస్తూ వుంటారు.
ఈ విధంగా రోజులు గుడుస్తుంటే వివేకానందుడి ఇంట్లో ఆయన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆవిడ జబ్బు పడి తీవ్ర అస్వస్థతకి గురి అయ్యారు. వివేకానందుడు ఇంటికి వెళ్ళాడు కానీ అతనికి ఏమి చెయ్యాలో తెలియలేదు. మందులు కూడా కొనటానికి అతని దగ్గర పైకం లేదు.
కొంతమంది ‘నీ గురువుగారు చాలా మహిమాన్వితుడు కదా, ఆయన తలుచుకుంటే నీ తల్లికి తొందరగానే స్వస్థత చేకూర్చకలరు, ఆయనని అడుగు’ అని ప్రోత్సహించారు. సరే అని చెప్పి వివేకానందుడు సరాసరి గురువు గారి దగ్గరకి వెళ్లి ‘గురువు గారు! మీరు కాళీ మాత సాక్షాత్కారము పొందారు, మరి దేవతలు వుండి ఏమి లాభము? నా తల్లికి అసలు ఏమీ బాగోలేదు.
ఆమెకు వెంటనే స్వస్థత కలగాలి, ఆరోగ్యం కుదరాలి, మరి మీరే సహాయం చెయ్యాలి ’ అని అనగా, అప్పుడు రామకృష్ణుడు ‘నాయనా, నేను ఎందుకు మధ్యవర్తిత్వం? నువ్వు గర్భగుడిలోకి వెళ్లి ఆమెను ధ్యానించు. ఆమెనే నువ్వు అడుగు’ అని చెప్పి పంపించారు.’ వెంటనే వివేకానందుడు గర్భగుడిలోకి వెళ్లి పద్మాసనంలో ధ్యానం చేసాడు.
ఒక గంట అయినాక ఆయన బయటకి వచ్చాక రామకృష్ణుడు ‘నాయనా అడిగావా?’ అని అడగ్గా ‘లేదు గురువుగారు, నేను మర్చిపోయాను అని చేప్పాడు.’ రెండవ సారికూడా అలాగే ప్రోత్సహించి పంపారు. మళ్ళి రెండు గంటల తరువాత అదే సమాధానం వచ్చింది.
ఈసారి మూడవసారి ఎనిమిది గంటలు ధ్యానము చేసి బయటకి రాగానే గురువు గారు ‘ఏమినాయన! తల్లిని అడిగావా?’ అని అడగ్గా ‘గురువుగారు! నేను అడగదల్చుకోలేదు’ అని జవాబు ఇచ్చాడు. దానికి రామకృష్ణుడు దానికి ఎంతో సంతోషించి ‘నాయనా! నువ్వు గనుక కాళికా తల్లిని ఈ వరం అడిగితే నీకు, నాకు ఇదే ఆఖరి కలయిక అయ్యేది’ అని ఆశీర్వదించారు.
ఈ కధ వల్ల తెలిసింది ఏమిటంటే - వివేకానందుకు ఆ కాళికా మాత అనుగ్రహం వుంది కాబట్టి, వివేకానందుడు అడిగితే కాళికా మాత తప్పకుండా ఆయన తల్లికి స్వస్థత చేకూర్చేది. కానీ వివేకానందుడికి ఏమి అర్ధం అయింది అంటే - పుట్టుకా, చావూ ఎవరికి అయినా తప్పదు.
ఎంతో గొప్పవాళ్ళు అయినా, ఆఖరికి భగవంతుడు అయినా భూమి మీదకి వచ్చినప్పుడు అవతారం చాలించి మల్లి వెనక్కి వెళ్ళటం తప్పదు. ఇది సహజంగా ఉండేటటువంటి భగవంతుని యొక్క సృష్టి రచన.
అటువంటప్పుడు కాళికా మాత స్వస్థత చేకూర్చినా మళ్ళీ తల్లి గారు వెళ్లిపోయే సమయం వస్తుంది. కాబట్టి మమకారం వదిలినప్పుడే ఆయనకి పైకి వెళ్ళగలను అనే ఒక నమ్మకం కుదిరింది, కాబట్టి స్వామీ వివేకానంద కాళికా మాతని ఏమీ కోరనేలేదు.
ఈ విధంగా దత్తాత్రేయుడు చెప్పిన విధానికి ఇటువంటి మహాయోగులు యొక్క అనుభవాలు అయన చెప్పినదాన్ని రుజువు చేస్తూ ఉంటాయి కదా!
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
5. 🌻. మమకారం ఆత్మ సాధనకు ఆటంకం 🌻
మనం చేసే చాలా రకాల ధ్యాన పద్దతులలో కేవలం ఒకే ఒక లక్ష్యం ఉంటుంది, అదే మన చైతన్య స్థాయిని పెంచుకోవటం అనమాట. చైతన్య స్థాయి అంటే ఏమిటి అంటే, ఏమీ లేదు - మన ఆలోచనా స్థాయిని పెంచుకోవటం అనమాట.
మన ఆలోచనలకి ఎటువంటి పరిధులు లేకుండా మన చైతన్య స్థాయిని పెంపొందించుకోవడం. ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే మనలో చాలా మందికి మన చైతన్య స్థాయిలో కేవలం మన కుటుంబాన్ని మాత్రమే ఉంచుకొంటాం. తల్లీ, తండ్రీ - తల్లితండ్రుల్ని కూడా ఈమధ్య ఉంచుకోవటం లేదు.
కేవలం భార్య, భర్త, పిల్లలు; ఎంతసేపూ మన ఆలోచనా పరిధులు వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయికానీ వీరిని దాటి పైస్థాయిని వెళ్లవు. ఇటువంటి వారిలో మమకారం ఎక్కువ ఉంటుంది. స్వార్ధ చింతన ఎక్కువగా ఉంటుంది. ఇతర వ్యక్తులతో, ఇరుగుపొరుగు వాళ్లతో పంచుకోవటం అనేది ఉండనేవుండదు.
మనకి ఎక్కువగా ఉన్న వస్తువులు పంచుకోవటం కావచ్చు, ధనాన్ని పంచుకోవటం కావొచ్చు, జ్ఞానాన్ని పంచుకోవటం కావొచ్చు, ప్రేమని పంచుకోవటం కావొచ్చు. ఏ లక్షణాలు అయితే మన కుటుంబం చుట్టూ తిరుగుతూ వుంటాయో పై స్థాయి వాళ్ళకి మాత్రం ఈ లక్షణాలు వర్తించకుండా ఉంటాయి.
చాలామంది తమ కుటుంబమే కాకుండా, ఇరుగుపొరుగు వాళ్లే కాకుండా, సమాజము, గ్రామములోని ప్రజలతో పాటు కష్టాలు సుఖాలు పంచుకోవటం, సమాజ సేవ చెయ్యటం ఉంటుంది.
అంటే వీరి చైతన్య స్థాయిలో ఆ గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇంకా కాస్తా పైస్థాయికి వెళితే ఆ జిల్లా మొత్తం ఉండవచ్చు, ఇంకా కాస్త పైస్థాయికి వెళితే భారత దేశం, ఇంకా మొత్తం ప్రపంచం ఇలా ఉండవచ్చు. దీనినే ఇంగ్లీష్ లో ‘Expansion of human consciousness’ అని అంటాము.
మనం ముచ్చటగా తెలుగులో చెప్పుకోవాలి అంటే ‘మన మానవ చైతన్య వ్యాప్తి ’ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అయితే మనం మన చైతన్య స్థాయిని పెంచుకుంటామో అప్పడు ఈ ప్రపంచంలోని ప్రజలు అందరూ కూడా మన సొంత కుటుంబ సభ్యుల్లాగానే మనం భావిస్తాం.
అలాగే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం కూడా దుఃఖపడతాం, వాళ్ళకోసం ప్రార్దిస్తాం. అలాగే వాళ్ళు సుఖంగా ఉంటే మనంకూడా చాలా సంతోషిస్తాం. ఇటువంటి స్థాయిలో ఉన్న ఒక మహా యోగిని గూర్చి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
వివేకానంద స్వామిగారి గురించి తెలియనివాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే వారి జీవితంలోని కొన్ని ఘట్టాలు చాలామందికి తెలియదు. అందులోని ఒక ప్రధాన ఘట్టాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
వివేకానంద చాలా చిన్న వయస్సులోనే అనగా 39 ఏళ్ల వయస్సులోనే దేహత్యాగం చేశారు. ఆయన తన సహచరునితో ఒకసారి ఈవిధంగా చెప్పారు ‘నాకు ఈమధ్య ఈ భారత దేశం అంతా నాలోనే ఉంది, నేను అంతా నేను భారతదేశమంతటా నిండి వున్నాను అని అనిపిస్తున్నది.
అది మెల్లమెల్లగా మొత్తం ప్రపంచం అంతా కూడా నాలోనే ఉన్నట్టు, నేను ప్రపంచమంతా ఉన్నట్టుగా, ప్రజలందరిలోనూ, ఇక్కడ భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, చెట్లు, కొండలూ, గుట్టలు, మనుషులు, నదులు, అన్నిటిలో నేనే వున్నాను అనే భావం నాలో చాలా తొందరగా వ్యాపిస్తుంది.
ఈ సృష్టించబడిన అన్ని జీవులపై అపారమైన కరుణా ప్రేమా, పొంగి పొరలుతున్నాయి. కనుక నా ఈ దేహం ఈ విధంగా విస్తరిస్తున్నటువంటి చైతన్య స్థాయిని ఇముడ్చుకోలేక పోతున్నది.
ఇది దేహం వదిలి విశ్వమంతా తొందరలో వ్యాపిస్తుంది. కనుక నేను ఇంక ఎంతోకాలం బ్రతకను. ఎందుకంటే ఈ దేహం నా చైతన్య స్థాయిని పూర్తిగా నింపుకోలేకపోతుంది. కాబట్టి నేను దేహత్యాగం చెయ్యక తప్పదు’ అని చెప్పారట.
దీనిలో చాలా అర్ధం వుంది. దీనికి ముందు పైన అర్ధం కావటానికి నేను కొంచం వివరించి చెప్పాను. అంటే స్వామి వివేకానంద సాక్షాత్తుపరబ్రహ్మ జ్ఞానాన్ని పొందిన పరమాత్ముడు. అందుకే ఈ సృష్టిలో వున్న ప్రతి జీవిలో తనను తానే చూసుకోవటం, ఆ జీవి తనలోనే వున్నది అని తలుచుకోవడం దానికి తార్కాణం.
సాక్షాతూ శ్రీ దత్తుడి తత్వాన్ని అర్ధం చేసుకోవటమే కాకుండా దాన్ని సాక్షాత్తు అనుభవించినటువంటి ఒక మహా యోగి అని చెప్పక తప్పదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
స్వర్గానికి రోడ్డు మార్గం
(Road route to SWARGA LOKA)
పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి.
భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు.... అనడానికి, భూమి మీద ఉన్న ఏకైక మార్గం ఇదే....
బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం......⬇️
.....🔚🔚🔚భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. 🔙🔙🔙
ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది.
ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక, అలకనంద నదితో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కూడా ఉంటుంది.
ఈ సరస్వతి నది పక్కన భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది.
పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు.
ఈ రాతిమీద భీమసేనుని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి.
ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది.
ఇక్కడ నుండి చట్మోలి 8km......
మార్గ మధ్యమం లో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది.
తరవాత "మాతమూర్తి ఆలయం" కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కూడా చెప్తారు.
ఈ ప్రాంతం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.
తర్వాత "కుబేర్ మకుట్ "అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.
ఇక్కడినుండి 5km ప్రయాణం చేసాక "వసుధార జలపాతం" వస్తుంది.
ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది.
ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాల పలుచగా నీటి తుంపర లవలె పడుతుంది.
అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.
చట్మోలి:-
తర్వాత చట్మోలి ( 12000 అ ఎత్తులో ) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం.
పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం.
ఇక్కడే "సతోపంత్" మరియు "భగీరధ్ కర్క్" అనే రెండు నదులు ( హిమానీనదాలు ) కలిసి "అలకనంద" గా ఏర్పడతాయి.
అక్కడి నుండి ముందుకు వెళితే "ధనో హిమానీనదం" కు చేరుకుంటాం.
చట్మోలి నుండి లక్ష్మివన్ 1km ( 12600 అ ఎత్తు లో ).........
తర్వాత లక్ష్మి వన్ ప్రాంతం కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
ఇక్కడే లక్ష్మి మాత మరియూ విష్ణు భగవానుడు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని చెప్తారు.
ఇక్కడి నుండి 2km ప్రయాణించాక బంధర్ అనే ప్రాంతం కు చేరుకుంటాం.
ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు.
బంధర్ నుండి సహస్రధార 4km ( 14000 అఎత్తులో).........
సహస్ర ధార నుండి చక్ర తీర్ధం 5km (15000 అ ఎత్తులో)........
చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సు గా చెప్తారు.
ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.
చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km........
ఈ సతోపంత్ అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు.
ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే సరస్సు.
ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని చెప్తారు.
ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చట.
ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.
సతోపంత్ నుండి స్వర్గారోహిణి 8 km......
ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సహం గాను చెప్తారు.
మార్గ మధ్యం లో చంద్రకుండ్ మరియూ సూర్యకుండ్ అనే సరస్సులు...భట్టాచార్య... ఉంటాయి.
ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే, కుక్క తోడు రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు.
నిజానికి స్వర్గారోహిణి అనేది 6 పర్వతాల సమూహం గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది.
ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది.
దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది.
ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి పైకివెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.
"స్వర్గారోహిణి పర్వత సమూహాలు" అన్నవి అతి పురాతనమైన పర్వత సమూహాలు. ఇవి గర్వాల్ హిమాలయాల లోని సరస్వతి హిమ శ్రేణులలో కలవు. నేటి "ఉత్తరాఖండ్" రాష్ట్రం లో గల "ఉత్తర కాశీ" జిల్లాలో కలవు. ఇవన్నీ మరల గంగోత్రి హిమ శిఖరాలు. ఇవి మరల నాలుగు శిఖరాలు. 1. స్వర్గారోహిణి - 1 అన్నది ప్రధాన శిఖరం.
ఈ పర్వతం సముద్ర మట్టానికి 6,247 మీటర్ల ఎత్తులో కలదు.
"స్వర్గారోహణ"....అన్న పదం, మన ఇతిహాసమైన "మహాభారతం" నుండి వచ్చింది. "స్వర్గారోహణ పర్వం"....మహాభారతమందలి పర్వాలలో ఒకటి కదా! మహాభారతంలో....చివరి అంకంలో ధర్మరాజాదులు, తమ రాజ్యాన్ని వదలి స్వర్గం వైపు ప్రయాణం కడతారు. ఈ "స్వర్గారోహిణి" పర్వతాలు, స్వర్గానికి నిచ్చెనలాంటివి అని పురాణ కథనం. కానీ పాండవాగ్రజుడైన, ధర్మ రాజు మాత్రమే స్వర్గాన్ని చేరుకుంటాడు. హిందూ ఐతిహ్యాల ప్రకారం........ఈ స్వర్గారోహిణి పర్వతాలే, స్వర్గానికి సశరీరంగా వెళ్ళడానికి మార్గంగా ఉన్నాయని, ఐతిహ్యాలు చెబుతున్నాయి. ఇందులోని మార్మికత ఏమిటో?
భట్టాచార్య
🌻. ఆచరణ- ఆధ్యాత్మికత 🌻
కార్యరూపము ధరింపని సత్సంకల్పములు స్వప్నములోని భవనములు. అందు నివసించుట అభిలాషయే గాని అనుభూతి కాదు.
మంచిపనులు చేయవలెనను అభిలాష నిరంతర ధారణలో ఉన్నను, భౌతిక సిద్ధిలేనిదే ప్రయోజనము శూన్యము.
ప్రాచీనుల ఆధ్యాత్మిక వాదమునందు భౌతిక సిద్ధి కూడా పునాదిగా ఇమిడి ఉన్నది. అధి+ఆత్మము అను పదమునకు ఆత్మను అధిష్టించినది అని అర్థము.
ఆత్మ అనగా దేహములోని భౌతిక పదార్థము మొదలు "నా" లోని అనుభూతి వరకు వ్యాపించిన అంతర్యామి తత్త్వము. కనుక ఆధ్యాత్మికము అనగా భౌతిక సిద్ధి వరకు సాధింపబడిన సృష్టి.
ప్రాణమయ, మనోమయాది కోశముల ప్రత్యేక ప్రవర్తనచే చెదరగొట్టబడిన ఆత్మ అనబడు అంతర్యామి అనుభూతి మరల సక్రమము చేయబడిన ప్రాణమయాది కోశములలో రుచి చూడబడుటయే ఆధ్యాత్మిక సాధనము. ఈ రుచియే సిద్ధి. కనుక సత్కర్మ అనగా ఈ సిద్ధిని కలిగించు సాధన ప్రక్రియ.
సత్కర్మల యందు పలువురకు అభిలాష కలదు. మానవులలో పలువురు మంచివారే. అందు ఆచరణ ప్రధానమగు మార్గమే సాధన అనబడును.
ఆచరణ అనగా నిత్యజీవన కార్యక్రమమున నెలకొను సత్కర్మల ఆచరణము, దీనికై జపతపాదులు, ఆసన ప్రాణాయామాదులు, పరిశుద్ధిని కలిగించి అభిలాషను ఉన్ముఖత్వమును కలుగజేయును. అందేదియు పరమావధులు కావు.
జీవితమొక్కటే, అందును ఐహికాచరణము ఒక్కటే పరమావధి. ఇది లేని జపతపాదులు, యజ్ఞయాగాదులు పంటలేని చెట్ల వంటివి. కనుక జపతపాదులచే నిత్యజీవితము నిండినప్పుడే ఆనందానుభూతి కలుగును.

సందేశములు - 1
కలగనుచున్న వానికి కలలోని విషయములపై అధికారము లేదు. కలలో జరుగుచున్న కథ ప్రకారము తాను నడచుకొనునే గాని, తన ఇష్టము ప్రకారము కలను మార్చుకొనలేడు గదా!
అట్లే మూఢుడును తన అభిప్రాయములను మార్చుకొనలేడు.
దీనిని గమనించి , తెలిసినవాడు జీవితములోని సన్నివేశములను, వస్తువుల సాధన సంపత్తిని, తనకు కావలసినంత వరకును గ్రహించి , మిగిలిన వానిని పట్టించుకొనడు.
(ప్రవహించుచున్న నదియందు తనకు కావలసిన నీటిని గ్రహించి , మిగిలిన వానిలో దూకి, మునుగక వర్తించునట్లు బుద్ధిమంతుడు విజ్ఞానము నందు మెలగునని భగవద్గీతలో కృష్ణుడు చెప్పెను.)
. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 51
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03-06-2020
స్వభావము
కర్మఫలమును కాల వశమున పొందు
ప్రజ్ఞ భావము జీవుడు పొంది తెలుపు
వాసు దేవుడే జీవుడు క్రీడ ఫలము
అతడె అంతర్యా మిగకలిసుండె మనిషి
స్వభావమును, కర్మఫలమును కాలవశమున అనుభవించువాడు జీవుడు. జీవుడనగా కేవల ప్రజ్ఞ.
ఈ జీవుడు వాసుదేవుడేయని గుర్తుంచుకొనవలెను. వాసుదేవుడు కానిదేదియును లేదనుట సత్యము. కాలము , కర్మము , ఫలము, స్వభావము వాసుదేవుని క్రీడావస్తువులు.
అతడు అంతర్యామియై వానితో ఆడుకొనుచు , జీవుడై వానియందు జీవించును.
-- భాగవతము 2-8
మోక్షము - 2
గురుపూజలు ధర్మమార్గము జీవనానికి తప్పదే
మేలుకాంచిన శోధనాపర సాధనా కళ సత్యమే
భేదభావాలు దృష్టిదోషాలు మౌనశక్తితొ గెల్చుటే
మెట్టు మెట్టుగ దృక్పధం కళ విస్త రించుట ధర్మమే
క్రమేణ తెచ్చుకున్న బంధాల ఉచ్చు బిగిసిన కొద్దీ పురుషార్థాల నడుమ సమతూకం చెదిరి, మోక్షం అనే ఆనందస్థితి నుండి బంధమనే సంసార స్థితిలోనికి జారి, ఇక్కడి నుండి చూస్తే మోక్షం వేరే సాధించాల్సిన ఒక మెట్టు లాగ కనిపిస్తుంది.
ఈ స్థితిలో ఎవరు చేసేది వారికి సత్యంగాను, సహజంగాను కనిపించడం సహజం. దీని వల్లనే వస్తాయి బేధాభిప్రాయాలు. తన దృష్టి గాక అవతలి వాడి దృక్కోణంలోంచి ఆలోచించగలిగిన కొద్దీ దృక్పథం, మానసిక వైశాల్యం పెరిగి, అందరు చేసేదీ ఒకే దేవాలయానికి ఇటుకలు పేర్చటమేనన్నది అనుభమవుతుంది.
ఆ ఇటుక తానేననీ, పరిపూర్ణమైన ఇటుకగా తయారుకావటానికి చేయవలసినదే సాధన అని కూడ అర్థమవుతుంది.
ఈ సాధన అనే పథంలో కోసురాళ్ళుగా ఉన్న జీవులంతా తమ వ్యక్తిత్వపు పరస్పర రాపిడులలో అంచులు నునుపు దేరి పరిపూర్ణమైన ఇటుకలుగా తయారు కావడమే సాధన యొక్క పరమావధి అనీ, సాధన యెడ మేలుకాంచిన కొలదీ దర్శనమిస్తుంది.
దీనికి బృంద జీవనానికి మించిన సాధన లేదు. బృంద జీవనానికి గురుపూజలు ఒక మంచి ఉదాహరణ.
🌹 🌹 🌹 🌹 🌹
31-05-2020
.
మోక్షమన్నది చెప్పి వచ్చెడి దివ్య మై పురు షార్ధమే
ఉచ్చు బంధము వీడి దానము చేసి దర్పము లేకయే
సమ్మోహమ్మును, జన్మ మాయను తుంచు మెట్టుయు మోక్షమే
దైవపూజతొ శాంతి పొందియు సత్య పల్కుయె మోక్షమే
🌻. మోక్షము 🌻
సాధన యొక్క పరమావధి మోక్షమే! అయితే ధర్మార్థ కామ మోక్షాలను చతుర్విద పురుషార్థాలుగా వ్యవహరింపబడే వాటిలో మోక్షం అనేది ఒక పురుషార్థమనీ, మొదటి మూడింటినీ సమతూకంగా నడిపి వాటిలో సామ్యం సాధించగలిగిన జీవి అనుభవించే స్థితి మోక్షమని పెద్దలు చెప్పారు.
మోక్షమనేది సాధించాల్సిన వేరే స్థితి కాదు. జీవుడు సహజముగా మోక్షస్థితిలోనే ఉంటాడు.
కానీ, క్రమేణ తెచ్చుకున్న బంధాల ఉచ్చు బిగిసిన కొద్దీ పురుషార్థాల నడుమ సమతూకం చెదిరి, మోక్షం అనే అనందస్థితి నుండి బంధమనే సంసార స్థితిలోనికి జారి, ఇక్కడి నుండి చూస్తే మోక్షం వేరే సాధించాల్సిన ఒక మెట్టు లాగ కనిపిస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹
నిత్య సందేశములు (*)
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
ఏమి లేకయు, మానసం, సమ రోగమవ్వుట, ఖచ్ఛితం
దూది పరుపులు, వెండి, బంగారు కంచములు, పట్టు వస్త్రములు, మేడలు, మిద్దెలు మున్నగునవి అప్రయత్నముగా లభించినపుడు అనుభవింప వచ్చును. కాని వానిని సాధించుకొనుటకై శ్రమపడుట అవివేకము.
సుఖమునకై శ్రమపడుట తెలివి తక్కువయే కాని సుఖము కాదు. మరియు శరీరమునకు సుఖము నలవాటు చేసినచో ఎపుడయిన పరుపులు మొదలగునవి లభింపనపుడు మనసు ఏడ్చును. అట్టిది కలుగకుండ తెలివిగా మెలగినచో అనుభవింపవచ్చును.
భాగవతము 2-21 వివరణము
3
🌻. చేయుట - చేయుంచుట 🌻
జీవించుట అనగా జీవుడు ప్రాణమును, దేహమును సద్వినియోగము చేయుట. ఇందు గల సామర్థ్యము జీవుడు కర్మాచరణము చేయుటలో లేదు. ప్రాణ, దేహాదుల చేత చేయించుటలో ఉన్నది.
ఈ చేయించుట సద్వినియోగమైనచో సుఖము లేక మోక్షస్థితి కలుగును. సద్వినియోగము జరగనిచో బంధము, దుఃఖము కలుగును.
లోకమున కూడ మంచి పనిని ఆచరించుటలో కన్నా చేయించుటలో ఎక్కువ సామర్థ్యము కావలెను. ఆచరించనిచో చేయించుటకు సామర్థ్యము కలుగదు. ఆచరించువాడు మాత్రమే మంచి పనులను చేయించగలుగును.
చేయించవలెనన్నచో మనము చేయదలచుకొనిన మంచి పనులను పంచిపెట్టవలెను. దానితో పాటు ఆ పనుల వలన కలుగు సుఖము, లాభము, పేరు ప్రఖ్యాతులను కూడ పంచిపెట్టవలసి యుండును.
దానికి మంచితనము కావలెను. తనకు చెందవలసిన వానిని ఇతరులు విశేషముగా పొందుచున్నప్పుడు అవి తనవి కావని తెలియగల వైరాగ్యబుద్ధి యుండవలెను.
ఇవికలవాడు మాత్రమే లోకమునకు దారి చూపగలవాడగును. అట్లుగాక తానే మంచి పనులన్నియు చేయవలెనని సిద్ధపడువాడు స్వార్థపరుడై దుఃఖించును.

సజ్జ వర్యుని చేరి నంతనె ఎన్నొ మార్పులె వచ్చు నే
దోష మున్నను లోప మున్నను శాంతి కల్గుచు ఉండు నే
వ్యభి చారులు జూద గాండ్లను కాలమే ఇక మార్చు నే
త్యాగ ధన్యుల తండ్రి ఓర్పుతొ అమ్మ వాక్కులు మార్చు నే
🌻. సజ్జనుల సాంగత్యము 🌻
🌻 సజ్జనులతో సాంగత్యము కలిగిన క్షణములలో మనలో ఎన్నో మార్పులు రావచ్చును. ఎన్నో లోపములు సవరింపబడును. దోషములు తొలగింపబడును.
తాను స్వయముగా సరిచేసుకొనలేని, సవరించుకొనలేని దుస్థితినే శాపమందురు. ఇది పూర్వ దుష్కర్మ ఫలితము కనుక స్వయంకృషితో బాగుపడుటకు అవకాశం లేదు.
జూదమునకు అలవాటు పడినవాడు, వ్యభిచారాదులకు అలవాటు పడినవాడు స్వయంకృషితో భయటకు రాలేడు. ఇంకొకరు యత్నించినను చాలా వరకు ఆ జన్మకు లాభము లేదు.
ఒక్కొక్కప్పుడు ఎవరో మహానుభావుని దర్శించినపుడు అప్రయత్నముగా సంకల్పము మార్పు చెందును.
🌹 🌹 🌹 🌹 🌹
నిత్య సందేశములు (*)
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
మంచి నీరును సంద్రమేకలి పాక లక్షణ మే చెడే
మూర్ఖ వాదికి ఎన్ని చెప్పిన బుర్ర కెక్కవు సత్యమే
స్ధర సంపద అంటె బుధ్ధియె కల్సి ఉండెటి బత్కులే
ప్రేమ భుక్తి ని వేదవాక్కును నిత్య సత్యము నమ్మరా
కలగనుచున్న వానికి కలలోని విషయములపై అధికారము లేదు. కలలో జరుగుచున్న కథ ప్రకారము తాను నడచుకొనునే గాని, తన ఇష్టము ప్రకారము కలను మార్చుకొనలేడు గదా!
అట్లే మూఢుడును తన అభిప్రాయములను మార్చుకొనలేడు.
దీనిని గమనించి , తెలిసినవాడు జీవితములోని సన్నివేశములను, వస్తువుల సాధన సంపత్తిని, తనకు కావలసినంత వరకును గ్రహించి , మిగిలిన వానిని పట్టించుకొనడు.
(ప్రవహించుచున్న నదియందు తనకు కావలసిన నీటిని గ్రహించి , మిగిలిన వానిలో దూకి, మునుగక వర్తించునట్లు బుద్ధిమంతుడు విజ్ఞానము నందు మెలగునని భగవద్గీతలో కృష్ణుడు చెప్పెను.)
సశేషం....
🌻. పాత్రత 🌻
🌻తగినవాడు కనిపించినపుడు దానము చేయుము, తగని వారితో కూడా ప్రియముగనే మాట్లాడుము. అంత మాత్రమున అసత్యము మాట్లాడకుము.
ఎవరికిని నీ వలన బాధ కలుగరాదను ప్రయత్నము నిత్యము కలిగియుండుము. ఈ మార్గమున జీవించినచో నరుడు స్వర్గానికి చేరుదురని నా మతము.
పాత్రునకు దానము చేయుట అనగా బీదవారికిచ్చుట ఒక్కటే కాదు. మనము చేయలేని పని ఇంకొకడు చేయగలవాడు కనిపించినచో మన సహకారము, మన దగ్గరున్న సాధన సంపత్తి వానికి ఇచ్చునట్టి బుద్ధి యండవలెను.
అది లేక పోవుట చేతనే ఉత్తమ ప్రభుత్వము స్థాపించ వలెనను బుద్ధితో ప్రజలు వర్గములై చిలిపోయి క్షుద్రులుగా ప్రవర్తించుట జరుగుచున్నది.
అది లేకపోవుట చేతనే మహానుభావులైన స్వాముల వార్లు ఆశ్రమములను స్థాపించి హిందూ మతోద్ధరణకై ఎవనికి వాడుగా వేరుగా ప్రయత్నించుట, ఇంకొకని పొడగొట్టకుండుట, చీలిపోవుట జరుగుచున్నది.
దేశమునకు ఉపయోగించు మహానీయునకు ఆరోగ్యము చెడినప్పుడు స్వయముగా పోయి మందిచ్చుట, అతని క్షేమము గూర్చి బాధ్యత స్వీకరించుట పాత్ర దానమగును.
తనకన్నా తక్కువ వాని యందు జాలి, దానబుద్ధి చాలమందికి ఉండును. తనతో సమానుడు, తాను చేయలేని పనులు సాధించువాడు కనిపించునపుడు తాను సహకరించునట్టి దాన బుద్ధి నిజమైన పాత్రత.
దానిని సాధింపవలెనన్నచో ఈర్ష్య మొదలగునవి దాటవలెను...

Comments
Post a Comment