కేనోపనిషత్తు (తెలుగు కధలు )దివ్య జ్ఞానము - తలాలు


* మోక్షప్రాప్తిని ఎప్పుడు పొందాలి?

 వ్యాఖ్యానం : 

బ్రహ్మము దేవతలకొరకు విజయాన్ని సాధించింది. ఆ బ్రహ్మము యొక్క విజయముతో దేవతలు  ఉప్పొంగిపోయారు. వారు ఈ విజయం మాదే, ఈ ఘనత మాదే అని అనుకున్నారు.

వేదాంత విషయాలు అర్థం చేసుకోవటానికి ఎంతో కష్టంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఉపమానాలను చెప్పి, లేదా ఆ వేదాంత విషయాన్ని ఒక కథారూపంలో చెప్పి అర్థం కాని దానిని సులభంగా అర్థమయ్యేట్లు చేయటమే శాస్త్ర సంప్రదాయం. 

ఈ కథను చెప్పటంలో అంతరార్థం ఏమిటి? 
1. పరమాత్మ యొక్క అస్థిత్వాన్ని తెలియజెప్పటం. 
2. పరమాత్మ యొక్క మహిమను, ఆధిక్యతను తెలియజెప్పటం;
3. పరమాత్మ వల్లనే మన ఇంద్రియాలు, మనస్సు పనిచేస్తున్నాయని తెలియజెప్పటం. జీవితంలో మన విజయాలకు - గొప్పతనానికి కారణం పరమాత్మ అనుగ్రహమేనని చెప్పటం. 
4. పరమాత్మను సులభంగా తెలుసుకొనటం ఎవ్వరికీ సాధ్యపడదని, దేవతలు కూడా ఆయనను తెలుసుకోలేక పోయారని తెలియజెప్పటం; 
5. అన్నింటికి మించి మానవునిలో జిజ్ఞాసను కలిగించేది కూడా ఆ పరమాత్మే అని నిర్ధారించటం - ఇవి. 

ఒకసారి దేవదానవ యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో దానవులదే పైచేయిగా కనిపిస్తున్నది. దేవతలు బలహీనపడి పోతున్నారు. అట్టి స్థితిలో దేవతల యొక్క రక్షణ కోసం పరబ్రహ్మం - లేదా పరమాత్మ రహస్యంగా - వారికి తెలియకుండా సహాయం చేశాడు. దానితో దానవులంతా పరాజయం పాలయ్యారు. దేవతలు విజయం సాధించారు. అయితే తమ విజయానికి వెనుక పరమాత్మ యొక్క దివ్యశక్తి ఉన్నదని, ఆయన కారణంగానే విజయం సాధించామని వారికి తెలియదు. ఈ విజయానికి, ఈ వైభవానికి తామే కారణమని అహంకరించారు. గర్వించారు. విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వారిలో వారు ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు. విజయానికి విర్ర వీగుతున్నారు. 

పరమాత్మ అందరి హృదయాలలో ఉన్నవాడే గనుక అందరి భావాలు తెలుసుకునే వాడే గనుక వారి యొక్క గర్వాన్ని, అహంకారాన్ని తెలుసుకున్నాడు. అహంకారం, గర్వం పతనానికి దారితీస్తాయి కనుక దేవతలను ఆ పతనం నుండి రక్షించాలనుకున్నాడు. అందుకే 
##################



* ప్రపంచ భ్రమపోతే మిగిలేది?

అసలు అన్నది ఉన్నదా  బ్రహ్మ  మంత 
తెలుసు కొన్నంత కొద్దియు  బ్రాంతి  కల్గు 
ఎవరి కైనను అధ్యాస  తప్పు కాదు 
విలువ ఉండదు  బుద్ధికే భ్రమలు కమ్ము 

ఎవడు అణ్యమై నదియు చూడడో వాడు 
ఎవడు  అన్యమై నదియు  వినడొ  వాడు 
ఎవడు  అన్యమై నదియు తెల్సుకో  నట్టి 
అతడు  పృద్వికి  ఆనంద  కార కుండు  

##### వ్యాఖ్యానం : సూక్ష్మంగా #####
అసలు ఉన్నది బ్రహ్మమొక్కటే. అదే ప్రపంచంగా భ్రమగొల్పుతున్నది. ఈ ప్రపంచ భ్రమలో ఉన్నంతకాలం బ్రహ్మం తెలిసేది గాదు. ప్రపంచ భ్రమపోతే మిగిలేది బ్రహ్మమే గనుక తెలుసుకొనేందుకు వేరే ఏమీ లేదు. తెలుసుకొనే వాడొకడు వేరే ఉండడు. 

ఎవరికైనా బ్రహ్మము తెలిసిందీ అన్నాడా? అది అధ్యాస - భ్రమయే తప్ప బ్రహ్మము కానేకాదు.

అసలు తెలుసు తెలియదు అనే మాటలు బుద్ధిస్థాయిలోనివి. ఆత్మస్థాయిలో వాటికి విలువలేదు. ఆత్మగా అనుభవం ఉన్నదా? లేదా? అనేదే ప్రధానం. అనుభవంలో ఉన్నవాడు తెలియదన్నా తెలిసినట్లే. అనుభవంలో లేక బుద్ధితో గ్రహించినవాడు తెలుసన్నా తెలియనట్లే. అందుకే తెలియదన్నవారు దాని నెరుగుదురు. తెలుసన్న వారు దానినెరుగరు అని చెప్పటం.

ఆత్మజ్ఞానాన్ని అనుభవం ద్వారా పొందినవాడు ఆత్మయే. ఆత్మయైన తాను అనంతుడు, సర్వవ్యాపకుడు, అద్వయుడు. కనుక రెండవ వస్తువు గోచరించదు. 

"యత్ర నాన్యత్ పశ్యతి నాన్యత్ శృణోతి 
నాన్యత్ విజానాతి న భూమా" (ఛాందోగ్య) 

- ఎక్కడ అన్యమైన దానిని చూడడో, అన్యమైనదానిని వినడో, అన్యమైనదానిని తెలుసుకోడో - అదే భూమానందస్థితి.
##################


🌞 ఆత్మను తెలుసుకొని అనుభూతి ఎలా చెందాలో ఆ ఉపా యం?

#
తెలియ బడనిది ఆత్మను తెలుసు కొనవు  
తెలుసు కుందాము అన్నను వీలులేదు 
ఎదుట ఉన్నట్టి  వస్తువు కాదు ఆత్మ   
తెలుసు దృశ్యాన్ని  ఆత్మగ  చెప్పలేవు 

విషయ వాంఛల తోనుండు ఆత్మ కలసి 
వినుట చెప్పుట చూచుట  వెనుక ఆత్మ 
మమసు వస్తువు మీదకు పొవుట ఆత్మ 
తెలివి  చైతన్య  వెంటను  ప్రజ్ఞ  ఆత్మ  

#### వ్యాఖ్యానం : సూక్ష్మంగా #####
ఆత్మ తెలియబడదు అనగానే దానిని తెలుసుకొనే అవకాశం ఎన్నటికీ లేదు అని అర్థం కాదు. కాకపోతే దానిని ప్రత్యక్షంగా తెలుసుకొనే వీలులేదు అనియే భావం. మనం కంటితో మన ఎదుట నున్న వస్తువును - దృశ్యాన్ని చూస్తున్నట్లుగా ఆత్మను చూడలేం. ఎందుకంటే ఆత్మ నీకన్నా వేరుగా నున్న వస్తువు కాదు, దృశ్యం కాదు. అలాగే ఆత్మను ప్రత్యక్షంగా ఒక శబ్దాన్ని విన్నట్లు వినలేము. ఆత్మను ఒక సంఘటనను భావించినట్లు భావించలేం. అయితే 

మనం తెలుసుకొనే ప్రతి విషయజ్ఞానంతోను ఆత్మ తెలియబడుతూనే ఉంటుంది. మనం ఏ వస్తువును చూచినా ఆ చూడటం వెనుక ఆత్మయే ఉన్నది. దేనిని విన్నా ఆ వినటం వెనుక ఆత్మయే ఉన్నది. మనం ఏ విషయాలను భావించినా ఆ భావనల వెనుక ఆత్మయే ఉన్నది. మనస్సు విషయ వస్తువుల మీదకు పరుగెడుతున్నప్పటికీ ఆత్మను తెలుసుకోవటం సాధ్యమే. ప్రతి విషయ జ్ఞానంలోను తెలియబడేది ఆత్మచైతన్యమే. అయితే మనదృష్టి విషయం మీదకు గాక దానికి ఆధారమైన చైతన్యం మీదకు మళ్ళాలి. 

అందుకే ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే అన్నారు. ప్రతి మనోవృత్తి ద్వారా - ప్రతి విషయజ్ఞానం ద్వారా ఆత్మ తెలియబడుతుంది. అలా తెలుసుకున్నవాడు ఆత్మనే పొందుతాడు అని.

అక్కడొక పుస్తకం ఉన్నది. దానిని కన్ను చూచింది. అది పుస్తకము అని మనస్సు నిర్ధారించింది. అదే విషయాన్ని వాక్కు ద్వారా చెబుతున్నాం. అది ఒక పుస్తకం అని. పుస్తకం విషయవస్తువు. అది పుస్తకం అని తెలుసుకున్న తెలివి విషయజ్ఞానం. ఈ తెలివి (విషయజ్ఞానం) ఎలా కలిగింది? కన్ను చూచి మనస్సుకు చెబితే. కన్ను ఎలా చూడగలిగింది? కంటికి వెనక ఉన్న చైతన్యం వల్ల కన్ను చూడగలిగింది. అలాగే మనస్సు వెనకనున్న చైతన్యం కన్ను చూపిన వస్తువుపైబడి ఆ వస్తువుతో కలిసి విషయజ్ఞానమైంది. కనుకనే ఆత్మ ప్రతిబోధ విదితం అన్నారు. మనస్సులో వృత్తులు (ఆలోచనలు) కదులుతున్నాయంటే ప్రతి వృత్తి వెనుక ఉన్నది ఆత్మచైతన్యమే. ఆత్మచైతన్యం యొక్క ఆధారంతోనే మనోవృత్తులు కదులుతున్నాయి. చైతన్యం లేనివానిలో ఏ వృత్తులు కదలవు. అయితే మనం మనస్సులో కదిలే వృత్తులపై దృష్టినుంచక, ఈ కదిలే వృత్తులు దేని ఆధారంగా కదులుతున్నాయి? దేని కారణంగా - ఏది ఉండటం వల్ల ఈ వృత్తులు కదులుతున్నాయి? అని ధ్యానపూరిత హృదయంతో అవగతం చేసుకొనుటకు ప్రయత్నించాలి. అప్పుడే సత్యం స్పష్టంగా అవగతమౌతుంది. 
ఈ మంత్రానికి భాష్యం వ్రాస్తూ శంకరాచార్యులవారు ఒక చక్కని ఉపమానాన్ని అందరికీ అవగతమయ్యే ఉదాహరణను ఇచ్చి మనకు మార్గం చూపారు. మన దృష్టిని కనిపించే వస్తువు పైనుండి కనిపించని ఆధారంవైపుకు ఎలా మరలించాలో తెలియజేస్తున్నారు.

##################


03-06-2020

🌞 ఆత్మను గురించి బుద్ధి ద్వారా తెలుసుకోవటానికి, అనుభూతి చెందటానికి తేడా?

 వ్యాఖ్యానం : సూక్ష్మంగా 

గురువు సూచించిన విషయాలను చక్కగా మననం చేసి, విచారణ చేసి గురుదేవులను సమీపించి నాకు తెలుసుననే అనుకుంటున్నాను అని శిష్యుడు చెప్పగానే అది కేవల పరోక్ష జ్ఞానమో లేక అనుభవజ్ఞానమో అనే శంక గురుదేవుల ముఖంలో ప్రస్ఫుటమైంది. నీవింకా విచారణ చేయవలసినదే అని చెప్పినప్పటికీ శిష్యుడు నేను తెలుసుననే అనుకుంటున్నాను అంటున్నాడు ఏమిటా? అనే సందేహం గురుదేవుల ముఖంలో కనిపించటంతోనే శిష్యుడు తన అనుభవాన్ని ఇంకా స్పష్టంగా తెలియజేయాలనుకున్నాడు. అందుకే అహం సువేద ఇతి న మన్యే - నేను బాగా తెలుసుకున్నాను అని అనుకోవటం లేదు అన్నాడు. ఈ మాట వినగానే గురువులో ఆశ్చర్యం వ్యక్తమైంది. ఇంతకాలం శాస్త్రాన్ని చక్కగా విని, అర్థం చేసుకున్న శిష్యుడు నాకు తెలియదు అంటున్నాడేమిటి? ఇప్పుడే గదా! మన్యే విదితం - నాకు తెలుసుననే అనుకుంటున్నాను అన్నది! 

గురువు యొక్క సంశయాత్మకమైన చూపులను గమనించిన శిష్యుడు వెంటనే అంటున్నాడు; అంటే తెలియదని కాదు తెలుసుకూడాను.

ఇలా పరస్పర విరుద్ధమైన వాక్యాలతో శిష్యుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? శిష్యునిలో కలిగిన జ్ఞానము బుద్ధి ద్వారా తెలుసుకున్నదా? అనుభవం ద్వారా తెలుసుకున్నదా? అని గురువుకు గలిగిన సందేహాన్ని తీర్చాలనుకున్నాడు శిష్యుడు. తనకు కలిగిన జ్ఞానం అనుభవం ద్వారా పొందినదేగాని, బుద్ధి ద్వారా తెలుసుకున్నది కాదని చెప్పాలని ప్రయత్నం. 

ఆత్మను గురించి బుద్ధి ద్వారా తెలుసుకోవటానికి, అనుభూతి చెందటానికి తేడా ఉన్నది. బుద్ధి బయటి విషయాలను తెలుసుకొని జ్ఞానం సంపాదించుకుంటుంది. అయితే ఆత్మ బయటి విషయం కాదు. అది బుద్ధికి లోపలది. బుద్ధికి అతీతమైనది. బుద్ధికే చైతన్యాన్నిచ్చేది ఆత్మ. ఆత్మవల్లనే బుద్ధి పనిచేసి అన్నింటిని తెలుసుకుంటుంది. అందువల్ల తనకు శక్తినిచ్చే ఆత్మను మాత్రం బుద్ధి ఎన్నటికీ తెలుసుకోలేదు. కనుక తెలుసును అనే పదం వాడరాదు.

మరి తెలుసును అనే పదం వాడకుండా, ఆత్మానుభవాన్ని తెలియజేసేదెలా? అందుకే శిష్యుడు ఇక్కడ పరస్పర విరుద్ధ పదాలను వాడి నాకు కలిగిన అనుభవం బుద్ధికి సంబంధించినది కాదు, బుద్ధికతీతమైన ఆత్మానుభవమే అని గురువుకు నివేదిస్తున్నాడు. 
##


02=06-2020

ఆత్మను గురించి బుద్ధి ద్వారా తెలుసుకోవటానికి, అనుభూతి చెందటానికి తేడా?

 వ్యాఖ్యానం : సూక్ష్మంగా 
గురువు సూచించిన విషయాలను చక్కగా మననం చేసి, విచారణ చేసి గురుదేవులను సమీపించి నాకు తెలుసుననే అనుకుంటున్నాను అని శిష్యుడు చెప్పగానే అది కేవల పరోక్ష జ్ఞానమో లేక అనుభవజ్ఞానమో అనే శంక గురుదేవుల ముఖంలో ప్రస్ఫుటమైంది. నీవింకా విచారణ చేయవలసినదే అని చెప్పినప్పటికీ శిష్యుడు నేను తెలుసుననే అనుకుంటున్నాను అంటున్నాడు ఏమిటా? అనే సందేహం గురుదేవుల ముఖంలో కనిపించటంతోనే శిష్యుడు తన అనుభవాన్ని ఇంకా స్పష్టంగా తెలియజేయాలనుకున్నాడు. అందుకే అహం సువేద ఇతి న మన్యే - నేను బాగా తెలుసుకున్నాను అని అనుకోవటం లేదు అన్నాడు. ఈ మాట వినగానే గురువులో ఆశ్చర్యం వ్యక్తమైంది. ఇంతకాలం శాస్త్రాన్ని చక్కగా విని, అర్థం చేసుకున్న శిష్యుడు నాకు తెలియదు అంటున్నాడేమిటి? ఇప్పుడే గదా! మన్యే విదితం - నాకు తెలుసుననే అనుకుంటున్నాను అన్నది! 

గురువు యొక్క సంశయాత్మకమైన చూపులను గమనించిన శిష్యుడు వెంటనే అంటున్నాడు; అంటే తెలియదని కాదు తెలుసుకూడాను.

ఇలా పరస్పర విరుద్ధమైన వాక్యాలతో శిష్యుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? శిష్యునిలో కలిగిన జ్ఞానము బుద్ధి ద్వారా తెలుసుకున్నదా? అనుభవం ద్వారా తెలుసుకున్నదా? అని గురువుకు గలిగిన సందేహాన్ని తీర్చాలనుకున్నాడు శిష్యుడు. తనకు కలిగిన జ్ఞానం అనుభవం ద్వారా పొందినదేగాని, బుద్ధి ద్వారా తెలుసుకున్నది కాదని చెప్పాలని ప్రయత్నం. 

ఆత్మను గురించి బుద్ధి ద్వారా తెలుసుకోవటానికి, అనుభూతి చెందటానికి తేడా ఉన్నది. బుద్ధి బయటి విషయాలను తెలుసుకొని జ్ఞానం సంపాదించుకుంటుంది. అయితే ఆత్మ బయటి విషయం కాదు. అది బుద్ధికి లోపలది. బుద్ధికి అతీతమైనది. బుద్ధికే చైతన్యాన్నిచ్చేది ఆత్మ. ఆత్మవల్లనే బుద్ధి పనిచేసి అన్నింటిని తెలుసుకుంటుంది. అందువల్ల తనకు శక్తినిచ్చే ఆత్మను మాత్రం బుద్ధి ఎన్నటికీ తెలుసుకోలేదు. కనుక తెలుసును అనే పదం వాడరాదు.

మరి తెలుసును అనే పదం వాడకుండా, ఆత్మానుభవాన్ని తెలియజేసేదెలా? అందుకే శిష్యుడు ఇక్కడ పరస్పర విరుద్ధ పదాలను వాడి నాకు కలిగిన అనుభవం బుద్ధికి సంబంధించినది కాదు, బుద్ధికతీతమైన ఆత్మానుభవమే అని గురువుకు నివేదిస్తున్నాడు. 
##################


--(())--


🌞 *వినే విషయాలు బ్రహ్మమా ? *

శ్రేష్ఠవస్తువు  ఇష్ట మైనను చెవ్వులేనిది సంతసం   
అంతరాత్మను  తెల్సుకోలెవు అల్ప బ్రహ్మము తెల్వదే 
శబ్ద గ్రాహ్యము నిత్యజీవిత సత్యభావము తప్పదే 
శక్తియే పలు సార్లు శబ్దము అంతరాత్మకు చెవ్వులే     

 వ్యాఖ్యానం : సూక్ష్మంగా 

చెవి శబ్దాలను గ్రహిస్తుంది. పరమాత్మకు చెందిన అనేక విషయాలను ఉపన్యాసాల రూపంలో వింటూ ఉంటాం. అంత మాత్రాన ఆ విషయాలు పరమాత్మ కాదు. బ్రహ్మము కాదు. వినే విషయాలన్నీ అనాత్మకు చెందినవి. కనుక వినే విషయాలు పరమాత్మ కాదు. ఆ విషయాలను చెవి వినగలుగుతున్నది అంటే దానికి కారణం ఏమిటి? అదే చైతన్యం. ఆత్మ చైతన్యం. ఆత్మచైతన్యం వల్లనే చెవి దేనినైనా వినగలుగుతున్నది. ఆ ఆత్మచైతన్యమే బ్రహ్మం. తదేవ బ్రహ్మత్వం విద్ధి - అదియే బ్రహ్మము. కనుక చెవి ద్వారా వినేది ఏదీ బ్రహ్మము కాదు. చెవి అలా వినటానికి తగిన శక్తిని, చైతన్యాన్ని ఇచ్చేది ఏదో అదే బ్రహ్మము అని తెలుసుకో. 

చెవి చేత వినగలిగేది చెవి కన్న అల్పమైన దానినే. కాని బ్రహ్మము చెవికే చైతన్యానిచ్చే గొప్ప వస్తువు. శ్రేష్ఠ వస్తువు. తనకు చైతన్యాన్నిచ్చే ఆ శ్రేష్ఠవస్తువును చెవి వినలేదు. 

నిరంతరము దృష్టిని బాహ్యం నుండి మరలించి అంతర్ముఖం చేసి ఆత్మకు దగ్గర కావాలి.
##################


31-05-2020

భగవంతుని విగ్రహం ముందుకు వెళ్ళగానే నమస్కారం పెట్టడానికి రెండు కన్నులు మూసుకుంటాం - ఎందుకు?

#### వ్యాఖ్యానం : సూక్ష్మంగా #####
కొందరు భగవంతుని ఉపాసనను ఒక విగ్రహాన్ని ముందుంచుకొనో, ఒక పఠాన్ని పెట్టుకొనో చేస్తారు. అంటే ఒక రూపాన్ని దర్శిస్తూ చేస్తారు. ఇలా చేయటంలో ఆ విగ్రహమే పరమాత్మ అనే భావం అనుకోకుండానే వచ్చేస్తుంది. ఆ విగ్రహాన్ని భగవంతునిగా భావించి సేవలు చేస్తారు. ఇలాంటి భావం వస్తుందనో ఏమో! భగవంతుని విగ్రహం ముందుకు వెళ్ళగానే నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించటంతో బాటు రెండు కన్నులు మూసుకుంటాం. ఎందుకు? నిజంగా భగవంతుడు ఆ విగ్రహం కాదు. ఆయన నీలోనే ఉన్నాడు. కన్నుల ముందున్న విగ్రహాన్నిగాక నీలోనేఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి - గ్రహించటానికి కన్నులు మూసుకొని బుద్ధిని(జ్ఞాననేత్రాన్ని) తెరువు అని చెప్పటమే.

మనం కొలిచే రూపమే పరమాత్మయనే నమ్మకం ప్రబలటంతో కొన్ని రూపాలను ద్వేషించే స్థితి కూడా వస్తుంది. మూఢత్వం పెరిగిపోతున్నది. నిజంగా పరమాత్మకు ఆకారం లేదు. రూపం లేదు. అది నిరాకారం. నిరాకార తత్త్వాన్ని కన్నులు చూడలేవు కనుక కన్నులు చూడగల రూపాన్ని కన్నుల ముందుంచుకొని ఉపాసన చెయ్యటం ఒక ఉపాయంగా మనకు పురాణాలలో సూచించారు. కాని ఎల్లకాలం అదే పట్టుకు ప్రాకులాడ కూడదు. మనం నదిని దాటటానికి పడవను ఏర్పాటు చేశారు. కాని ఎల్లకాలం ఆ పడవను మనతో తీసుకు వెళ్ళాలనుకోరాదు. నది దాటేంత వరకే దాని అవసరం. అలాగే నిరాకార నిర్గుణ పరమాత్మ తత్త్వాన్ని గ్రహించేంత వరకే ఈ సాకారోపాసన చెయ్యాలి గాని అదే లక్ష్యంగా చెయ్యరాదు. నీ దృష్టి విగ్రహం మీద నుండి నిరాకార పరమాత్మ వైపుకు మళ్ళాలి. అలా మళ్ళటానికే కొన్ని పండగ సాంప్రదాయాలు. 

వినాయకచవితినాడు నిరాకారమైన మట్టికి ఒక ఆకారం కల్పిస్తాం. ఆ విగ్రహాన్ని పత్రితో పూజిస్తాం, మరునాడు జల్దిలో కలుపుతాం. ఎందుకు? నిరాకార తత్త్వాన్ని సాకారం చేసి పూజించి, తిరిగి నిరాకారంగా మార్చేందుకే. నిరాకారమే నిత్యం, సత్యం. 

అందుకే ఇక్కడ ఉపనిషత్ ఋషి స్పష్టంగా చెబుతున్నారు. ఈ రూపాలు విగ్రహాలు ఆకారాలు బ్రహ్మము అని భ్రమసిపోతావేమో ఇవేవీ బ్రహ్మము కాదు. తదేవ బ్రహ్మ - అదియే బ్రహ్మ అని చెబుతున్నారు.
##################

--(())--

🌞 *మనస్సు బ్రహ్మమును తెలుసుకోగలదా?*

🙏 *30...05..2020

##### *వ్యాఖ్యానం : సూక్ష్మంగా* #####
భగవంతుని ఉపాసనను కొందరు మనస్సు ద్వారా చేస్తారు. పరమాత్మ తత్త్వాన్ని విచారణ చేసుకుంటారు. లేదా శాస్త్రాలలో చెప్పిన విషయాలను మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ ఆ పరమాత్మను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తారు. అయితే మనస్సు బ్రహ్మమును తెలుసుకోగలదా? లేదు. ఎందువల్ల? బ్రహ్మము వల్లనే మనస్సు ఆలోచనలు చేస్తుంది. మనస్సేమో జడం. దానికి స్వయంగా ఆలోచించే శక్తిలేదు. అది ఆలోచన చేస్తున్నదీ అంటే దాని వెనక ఉన్న బ్రహ్మము వల్లనే. తనకు శక్తినిచ్చే ఆ బ్రహ్మమును మనస్సు ఎన్నటికీ తెలుసుకోలేదు. 
బ్రహ్మమును గురించి ఆలోచించటం వేరు. బ్రహ్మమును తెలుసుకోవటం వేరు. మనస్సు ఆలోచించగలదుకాని తెలుసుకోలేదు. ఆలోచనలు సాగుతున్నంతకాలం బ్రహ్మానికి దూరంగా మనస్సు పోతున్నట్లు. ఆలోచనలు ఆగిపోతే బ్రహ్మము తెలిసిపోతుంది. బ్రహ్మమును గురించి ఆలోచిస్తుంన్నంత కాలం మనస్సు చలిస్తూనే ఉంటుంది. ఆలోచనలు ఆగిపోతే తానే బ్రహ్మము అని తెలిసిపోతుంది. ఆలోచనలు ఆగినపుడు మనస్సుకు వెనకాల ఉన్న బ్రహ్మమే తానుగా తెలిసిపోతుంది. 

తదేవ బ్రహ్మత్వం విద్ధి - అదియే బ్రహ్మము అని నీవు తెలుసుకో. మనస్సు ద్వారా సాగించిన ఆలోచనలు బ్రహ్మము కాదు. మనస్సు ఆలోచించటానికి కారణమైనది, ఆధారమైనది ఏదో అది మాత్రమే బ్రహ్మము. దీనితో మనదృష్ఠి మనస్సు చేసే ఆలోచనల నుండి, ఆ ఆలోచనలు కదలటానికి కారణమైన, మనస్సు వెనకాల ఉన్న బ్రహ్మము వైపుకు మన దృష్టి అంతర్ముఖమవుతుంది. ఆలోచనల వెంటపడ్డంతకాలం బ్రహ్మానికి దూరమైపోతూనేఉంటాం. ఆలోచనలు ఆగితే బ్రహ్మము బట్టబయలు - "భ్రాంతులుడిగిన బ్రహ్మంబు బట్టబయలు".
######


29-05-2020

బ్రహ్మము ఎవరు ?


##### వ్యాఖ్యానం : సూక్ష్మంగా #####
తదేవ బ్రహ్మత్వం విద్ధి యత్ ఇదం ఉపాసతే ఇదం న - అదియే బ్రహ్మము అని నీవు తెలుసుకో. ఏది ఇది అని ఉపాసించబడుతున్నతో ఇది బ్రహ్మము కాదు - అని అంటున్నారు. అంటే వాక్కు ద్వారా పలికిన పలుకలేవీ బ్రహ్మము కాదు. వాక్కు అలా పలకటానికి కారణమైనది - ఆధారమైనది ఏదో అది మాత్రమే బ్రహ్మము అని నీవు తెలుసుకో అంటున్నాడు ఉపనిషత్ ఋషి. 
దీనితో మన దృష్టి పలికే పలుకుల వైపు కాకుండా అలా పలకటానికి కారణమైన వాక్కు వెనకాల ఉన్న బ్రహ్మము వైపుకు మన దృష్టి మళ్ళాలి. అంతర్ముఖం కావాలి. బహిర్ముఖం అయినంతకాలం బ్రహ్మానికి దూరంగా వెళ్తాం. 

వాక్కుతో పరమాత్మను తెలుప వీలులేదు అనటంతో ఇక పరమాత్మను గూర్చి పలకటం మాట్లాడటం చెప్పటం వ్యర్థం అని భావించరాదు. ఎప్పటికైనా వాక్కుకు వెనకాల ఉన్న అనంత సత్యం వైపుకు దృష్టి అంతర్ముఖం కావాలి అని తెలుసుకోవాలి. మార్గాన్ని పట్టుకోకుండా గమ్యాన్ని చేరలేం గదా! అలాగని మార్గమే గమ్యమని భావించి అక్కడే నిలిచిపోరాదు. మార్గంలో ప్రయాణించి గమ్యం చేరాలి. 

--(())--

 *పరమాత్మ ఉపాసనకు మార్గాలు?*


 *వ్యాఖ్యానం : సూక్ష్మంగా* 

1. కొందరు ఎదురుగా ఒక విగ్రహాన్ని పెట్టుకొని స్తోత్రపాఠాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు పఠిస్తూ ఉంటారు. లేదా పరమాత్మ తత్వం గురించి చక్కగా వివరించి చెబుతారు. ఉపన్యాసాలిస్తారు. 

2. మరొకరకంవారు మౌనంగా పరమాత్మగురించి విచారణ చేయటమో నామజపమో చేస్తూ ఉంటారు. 

3. మరికొందరు పరమాత్మ దివ్య స్వరూపాన్ని ఆపాదమస్తకం తన్మయంతో తిలకిస్తూ ఉంటారు. 

4. కొందరు పరమాత్మను గురించి చెప్పే వాక్యాలను వింటూ ఆ తత్త్వాన్ని గ్రహించేందుకు ప్రయత్నిస్తారు. 

5. కొందరు ప్రాణంతో కదలాడే మహాత్ములను పెద్దలను గురువులను దర్శిస్తూ, పూజిస్తూ ఉంటారు. 

ఇవన్నీ సక్రమంగా ఆచరిస్తే పరమాత్మను తెలుసుకొనేందుకు ఉపకరించే సాధనాలు అవుతాయేగాని అవే పరమాత్మ కాదు. ఇవి మార్గములే గాని లక్ష్యం కాదు. ఈ మార్గాలన్నీ చివరకు లక్ష్యంలో విలీనమై పోతాయి. ఇదే సమస్త సాధనల యొక్క, ఉపాసనల యొక్క ఆశయం - ఉద్దేశం.

వాక్కు ద్వారా అనేక స్తోత్రపాఠాలు వల్లిస్తాం, పారాయణలు చేస్తాం, కథలుకథలుగా పరమాత్మను గురించి చెప్పుకుంటాం. అసలు నిరాకార పరమాత్మతత్త్వాన్ని గురించి శాస్త్రవిషయాలను బోధిస్తుంటాం. ఇవన్నీ వాక్కు ద్వారా వెల్లడి అయ్యే విషయాలు. వాక్కు నిజంగా పరిమితమైనది. అది అనాత్మను గురించి వెల్లడించగలదేగాని పరమాత్మను వెల్లడించలేదు. తనకు తెలిసిన విషయాలను మాత్రమే వాక్కు వెల్లడి చేస్తుంది. అసలు ఏ విషయాలనైనా వాక్కు వెల్లడి చేస్తున్నదీ అంటే అది అంతా వాక్కు వెనుక ఉన్న ఆత్మచైతన్యం కారణంగానే. ఆత్మచైతన్యం వల్లనే వాక్కు పలుక గలుగుతున్నది. అట్టి వాక్కు తనకు చైతన్యానిచ్చే ఆత్మను పలుకలేదు. 
##################


*సేకరణ :* : కేనోపనిషత్తు


*ఆత్మను గురించి దాని ఔన్నత్వాన్ని గురించి దానిని అందుకోవటానికి మార్గాల గురించి ఏమని తెలియజేస్తున్నారు?*

##### *వ్యాఖ్యానం : సూక్ష్మంగా* #####
ఆత్మను అందుకోవటం ఎంత కష్టమో తెలియజేస్తున్నారు. నతత్ర చక్షుర్గచ్ఛతి, నా వాక్ గచ్ఛతి, నోమనః అంటే కన్ను అక్కడకు చేరలేదు. వాక్కు చేరలేదు, మనస్సు ఆత్మను చేరలేదు. అంటే కంటితో చూడలేం, వాక్కుతో వర్ణించలేం, మనస్సుతో భావించలేం అని భావం.

ఈ ప్రపంచంలో మనం వస్తువులను కంటితో చూసి తెలుసుకుంటాం. ఇది ఫలానా వస్తువు అని. కంటితో చూడలేని వాటిని తెలిసినవారు వర్ణించి చెబితే విని తెలుసుకుంటాం. ఇక కొన్ని అనుభవాలను కంటితో చూచేవీలులేదు, వాటిని వర్ణించే వీలులేదు. అట్టి వాటిని మన మనస్సుతో అనుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని అనుభూతి చెందుతాం. ఒక పెయింటింగ్ నో, ఒక శిల్పాన్నో మనం కొంతవరకు వర్ణించి చెబుతాం.

కాని మనకు కలిగిన సంతోషాన్ని, దుఃఖాన్ని వర్ణించలేం. అబ్బ ఆ సంతోషాన్ని మాటలతో చెప్పలేను అంటాం. కాని దానిని మనం జ్ఞప్తికి తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ ఆనందించగలుగుతాం.

అయితే *ఈ పద్ధతులేవీ ఆత్మను తెలుసుకోవటానికి పనికి రావు*. ఎందుకంటే ఆత్మ స్థూలవస్తువూ కాదు, సూక్ష్మ విషయమూ కాదు, అనుభవంలోని విషయమూ కాదు. అందుకే ఈ పద్ధతుల ద్వారా ఆత్మను తెలుసుకోలేం.

టార్చిలైటులోని బల్బు బ్యాటరీల సాయంతో అన్నింటిని చూడగలుగుతుంది గాని, తనకు శక్తి నిచ్చిన ఆ బ్యాటరీలను ఎన్నటికీ చూడలేదు. అలాగే జడమైన ఇంద్రియాలు కన్ను, వాక్కు, మనస్సు తమకు శక్తినిచ్చే ఆత్మను చూడలేవు. ఇవి ప్రపంచ విషయాలలో మునిగిపోయి ఉన్నాయి.

మరి ఎలాగూ తెలుసుకొనే వీలులేని ఆత్మను గురించి శిష్యులకు ఎలా బోధించాలి? వారు ఎలా అర్థం చేసుకోవాలి? కళాశాలల్లో విద్యాబోధన చేసినట్లు చేసే వీలులేదు కదా! ఏ ఇంద్రియాలకు అందని ఆత్మను ఎలా వర్ణించి చెప్పాలి? అందుకే ఎలా బోధించాలో మాకు తెలియదు - నవిజానీమః అంటున్నారు. తెలియని దానిని ఎలాగో తెలుసుకోవాలి గదా. మరి ఎలా?

*ఆత్మను తెలుసుకొనుటకు మన దగ్గరున్న పరికరాలలో ఉత్తమమైనది మనస్సే*. కనుక ఎలాగైనా ఆ మనస్సుతోనే ముందుకు పోవాలి. దారి దొరకని చోట ఎలాగో యుక్తితో బయట పడాలి. అందుకే గురువు మనను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. నాయనా! కంటి ద్వారా చూడటానికి వీలులేని, వాక్కు ద్వారా వర్ణించ వీలులేని, మనస్సు ద్వారా ఆలోచించుటకు వీలుపడని ఆత్మను తెలుసుకొనుటకు నేను కొన్ని ఉపాయాలు తెలియజేస్తున్నాను. వాటిని ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్ళు. *ప్రత్యక్ష ప్రమాణాలకు అందని ఆత్మను శబ్ద ప్రమాణం ద్వారా వేదాలు అందించటం జరిగింది. అందుకే ఆత్మ నిగమ వచన సిద్ధం అన్నారు. అట్టి వేదం ఆత్మను ఇలా నిర్వచించినది “తత్ విదితాత్ అన్యదేవ - అధః అవిదితాత్ అధి” అంటే - అది తెలిసిన దానికన్న వేరైనది మరియు తెలియని దానికన్న అధికమైనది*. ఇంద్రియ మనోబుద్ధుల స్థాయిలో ఆత్మ తెలియబడేది కానందున ఆత్మ తెలిసిన దానికన్నా వేరైనది. సమస్త వస్తు జాలము, విషయములు - ఇంద్రియాలకు మనస్సుకు తెలుస్తాయి. ఇలా తెలిసే వానికన్నా ఆత్మవేరైనది. తెలిసిన వాటికన్నా వేరైనది అనగానే అది తెలియనిదేమో అనే సందేహం కలగవచ్చు. అందుకే తెలియనిదీ కాదు. తెలియని దానికన్న అధికమైనది అంటున్నారు. *తెలియటం తెలియకపోవటం అనేవి బుద్ధిలో సమాచారం ఉందా లేదా? అన్నదాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. కాని ఆత్మ బుద్ధికి అతీతం. ఇలా తెలిసినదీ కాని తెలియనిదీ కాని ఆత్మను - బ్రహ్మాన్ని బాహ్యప్రమాణాల ద్వారా ఋజువు చేయలేం. తర్కం ద్వారా స్థిరపరచలేం. మరి ఎలా? దేనికీ అందని ఆత్మ గురూపదేశం ద్వారా మాత్రమే అవగతం. గురువు చేసే బోధ ద్వారా మాత్రమే మనం ఆత్మను చేరగలం - ఆత్మగా అనుభూతి చెందగలం. ఆత్మానుభూతి చెందటానికి తగిన ఉపదేశాలు గురుపరంపరలోనే లభిస్తాయి*.
##################

*సేకరణ :* : కేనోపనిషత్తు



--(())-- 

*మనస్సు కొన్నింటినే ఇష్టపడుతున్నది. కొన్నింటినే కోరుకుంటున్నది. ఎందువల్ల?


*కదిలేశక్తి లేనివాటి వెనుక - జడమైన వాటి వెనుక ఏ శక్తి ఉండి ఉండాలి. ?


* మనస్సు కొన్నింటినే ఇష్టపడుతున్నది. కొన్నింటినే కోరుకుంటున్నది. ఎందువల్ల?

 వ్యాఖ్యానం : సూక్ష్మంగా 
ఉపనిషత్తులోని ప్రథమ మంత్రము శిష్యుని ప్రశ్నతో ప్రారంభమవుతున్నది. భారతీయ వేదాంతం అంతా ప్రశ్నోత్తరాల రూపంలోనే ఉంటుంది. ఇందులో శిష్యుడు వేసిన ప్రశ్నను బాగా అర్థం చేసుకుంటే ఈ శిష్యుడు సామాన్యుడు కాదని, తీవ్ర ముముక్షువని, ఆత్మకన్న అన్యమైన దానిని అభిలషించనివాడని, తీవ్ర వైరాగ్యవంతుడని, ప్రశ్నించి తెలుసుకొనే జిజ్ఞాస గల బుద్ధిశాలియని మనకు అవగతమవుతుంది. 

శిష్యుని ప్రశ్న చాలా గాఢమైనదీ గూఢమైనదీ కూడా. ఈ ప్రపంచం ఎలా ఉన్నదీ అని విశ్లేషణ చేసినంతకాలం మన దృష్టి బాహ్యంగా ఉన్నట్లే. అలాగాక ఈ ప్రపంచాన్ని చూసే నేనెవరిని? అని ప్రశ్నించుకున్నామా? ఇక మనం అంతర్ముఖమైనట్లే. 

కేనేషితం ప్రేషితం మనః పతతి :- దేనిచేత కోరబడి, ప్రేరేపించబడి మనస్సు విషయవస్తువుల పైన, విషయభోగాలపైన పడుతున్నది? అని సూటిగా ఆత్మవిషయాన్ని అడుగుతున్నాడు శిష్యుడు.

అనేక వస్తువులతో, విషయాలతో, భోగాలతో కూడిన ప్రపంచం మన ముందు నిలిచి ఉన్నది. అలా నిలిచి ఉన్న ప్రపంచాన్ని, అందులోని వస్తువులను, విషయాలను, భోగాలను మనం తెలుసుకుంటున్నాం. ఎలా తెలుసుకుంటున్నాం? ఇంద్రియాల ద్వారా - జ్ఞానేంద్రియాల ద్వారా. కన్ను చూస్తున్నది. ముక్కు వాసన చూస్తున్నది. చెవి వింటున్నది. చర్మం స్పర్శించి తెలుసుకుంటున్నది. నాలుక రుచి చూసి తెలుసుకుంటున్నది. నిజంగా ఈ ఇంద్రియాలను నిరోధిస్తే ఈ విషయాల గురించిన సమాచారం మనస్సుకు చేరదు. దానితో ఈ ప్రపంచం మనను ఏమీ చేయలేదు. కాని ఎల్లవేళలా ఇంద్రియాలను నిరోధించటం - అంటే కళ్ళు, చెవులు, ముక్కు మూసుకొని ఉండటం సాధ్యమయ్యే పనికాదు. అంతేకాదు బాహ్యంలో అనేక వస్తువులున్నాయి. అయినా మనదృష్టి కొన్నింటి మీదనే పడుతుంది. కొన్నింటినే ఇష్టపడుతున్నది. కొన్నింటినే కోరుకుంటున్నది. ఎందువల్ల? వాటికి మనకు ఏదో సంబంధం ఉంది. మనకు అంటే - మన మనస్సుకు ఆ వస్తువులకు మధ్య ఏదో సంబంధం ఉంది. మనస్సులో ఒక రకమైన భోగాసక్తి, కోరికలు ఉన్నాయి. ఆ కోరికలకు అనుగుణంగా ఉన్న వస్తువుల పైకి, విషయాల పైకి, భోగాల పైకి మనస్సు పరుగులు తీస్తుంది. ఐతే స్వయంగా పరుగులు తీస్తుందా? లేదు. ఇంద్రియాల ద్వారా పరుగులు తీస్తుంది. ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. కోరుతుంది. అంటే మనస్సు చేత కోరబడి, ప్రేరేపించబడి ఇంద్రియాలు ప్రపంచంలోనికి పరుగులు తీస్తున్నాయి. మరి మనస్సును ఎవరు కోరుతున్నారు అలా పరిగెత్తమని? ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఇదీ ప్రశ్న. 

ఇక్కడ ఈషితం ప్రేషితం అని రెండు పదాలను ప్రయోగించారు. ఎవనిచేత కోరబడి ఎవనిచేత ప్రేరేపించబడి మనస్సు ప్రపంచంపై పడుతున్నది? అని ప్రశ్న. మనస్సు తనకు తానుగానే విషయ ప్రపంచంలోకి వెళుతున్నదా? అలా తనకు తానుగానే వెళ్ళటం లేదు. ఎవరో వెనుకనుండి నెడుతున్నారు. ప్రేరేపిస్తున్నారు. 

మనస్సుకు స్వతంత్రం లేదు. స్వేచ్ఛ లేదు. ఉన్నట్లైతే ఇష్టం లేని విషయాలలో చిక్కుకోదు. తప్పులు చేయటం, దుఃఖాన్ని అనుభవించటం స్వేచ్ఛ ఉంటే ఎలా జరుగుతుంది? కనుక ఎవరో వెనుక నుండి నెడుతున్నారు. ఎవరు? 

పంచభూతాలతో తయారైన ఈ శరీరం జడమైనది. జడమైన ఈ శరీరం కదలాలన్నా పనిచేయాలన్నా, ఇంద్రియాలు వాటి వాటి విధులను నెరవేర్చాలన్నా వీటిని కదిలించే శక్తి ఒకటి కావాలి. అదే ప్రాణశక్తి. ప్రాణం ఉన్నంతకాలమే కన్ను చూస్తుంది. చెవి వింటుంది. కాలు తిరుగుతుంది. వాక్కు పలుకుతుంది, మనస్సు ఆలోచిస్తుంది. ప్రాణం పోయిన తర్వాత ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్ అన్నట్లు అన్నీ ఆగిపోతున్నాయి. జడమై పోతున్నాయి. మరి ఈ జడమైన దేహం లోనికి ఈ ప్రాణాన్ని ఎవరు పంపారు? ఎవరి వల్ల ఇది వచ్చి చేరింది? తల్లి గర్భంలో శరీరం రూపుదిద్దుకొనే ముందే ఈ ప్రాణం వచ్చి చేరింది. ప్రప్రధమంగా ఇది ఎవరి వల్ల వచ్చి చేరింది? అని ప్రశ్న.

అన్నింటిలోకి సున్నితమైన అవయవం నాలుక. కాని దానికి కత్తి కన్న పదునెక్కువ. కత్తితో శరీరాన్ని కోస్తే కలిగే బాధకన్నా నాలుకతో పలికే పలుకు లక్షరెట్లు పదునైంది. లోకంలో మనకొచ్చే బాధల్లో సగానికి పైగా నోటి దురుసుతనం వల్ల వచ్చేవే. నోటిని నిరోధిస్తే చాలా బాధలు తగ్గుతాయి. కాని మనం ఎంత ప్రయత్నించినా అది ఏదో వాగుతూనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఎవరు దానిని ఆడిస్తున్నారు? ఎవరు ప్రేరేపిస్తున్నారు? 

కన్ను రూపాలను చూస్తుంది. వెంటనే అది ఏమిటో, దాని పేరేమిటో, అది ఎందుకు పనికి వస్తుందో మనకు స్ఫురిస్తుంది. ఇక చెవి శబ్దాలను వింటుంది. అవి మంచి మాటలో, చెడు మాటలో బుద్ధి విశ్లేషణ చేస్తుంది. అంతేగాదు, చెవితో వినగానే ఆ వస్తువుల రూపాన్ని, ఆ విషయాల స్వరూపాన్ని కన్ను దర్శించగలుగుతుంది. తాజ్ మహల్ అని వినగానే దాని రూపం కంటి ముందు నిలుస్తుంది. చెవిని కంటినీ ఏ దేవుడు నిజంగా జోడిస్తున్నాడు? ఇదీ శిష్యుని లోతైన ప్రశ్న. 

ఈ ప్రశ్నలను బట్టి శిష్యుడు సామాన్యుడు కాదని, ఎంతో ప్రయత్నము చేసినవాడని, ఆత్మను తెలుసుకోవాలనే తపన గలిగిన వాడని తెలుస్తుంది. ఈ ఉపనిషత్ కేన తో ప్రారంభమైంది గనుక ఈ ఉపనిషత్తుకు ఈ పేరు స్థిరపడిపోయింది. 

నిజంగా కేన అనే పదంలో ప్రశ్నే కాదు. సమాధానం కూడా ఉన్నది. విష్ణు సహస్రనామాలలో కః అంటే పరమాత్మ అని అర్థం ఉన్నది. అందువల్ల ఎవరిచేత అనే ప్రశ్నతో బాటు పరమాత్మ చేతనే అనే సమాధానం కూడా ఈ రెండక్షరాల పదంలో ఇమిడి ఉన్నది. 

ఈ ప్రశ్నకు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన గురువు ఇచ్చిన సమాధానమే ఈ కేనోపనిషత్తు అంతా - 
##################


**, 

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ