||శ్రీమన్నారాయణీయము||
శ్రీమన్నారాయణీయం
9దశకం-5-శ్లోకం*
🕉🌞🌎🌙🌟🚩
శతేన పరివత్సరైర్ధృఢసమాధిబంధోల్లసత్-
ప్రబోధ విశదీకృతః స ఖలు పద్మినీ సంభవః।
అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా
వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగ భాగాశ్రయమ్||
భావము:-
నూరు దివ్యసంవత్సరముల కాలము ధృఢ సమాధి యోగ స్థితి యందు ఉన్న బ్రహ్మదేవుడు, జ్ఞానము వికసించినవాడై - ఇంతకు ముందు తనకు కానరానిది, అద్భుతమైనది మరియు శేషతల్పము పై పవళించి యున్న నీ దివ్యమంగళ రూపమును తన అంతఃర్ దృష్టితో దర్శించి సంతోష భరితుడయ్యెను.
వ్యాఖ్య:-
ఈశ్లోకంలో భట్టతిరి వారు బ్రహ్మ దర్శించిన విష్ణువును స్తుతించారు. ఆ రూపం ఎలావుంది అన్నది పోతనభాగవతంలోని ఒక పద్యంలో వస్తుంది.
2-236-మ
సతతజ్ఞానరమా యశో బల మహైశ్వర్యాది యుక్తున్ జగ
త్పతి యజ్ఞేశు ననంతు నచ్యుతు దళత్పంకేరుహాక్షున్ శ్రియః
పతి నాద్యంతవికారదూరుఁ గరుణాపాథోనిధిన్ సాత్వతాం
పతి వర్థిష్ణు సహిష్ణు విష్ణు గుణవిభ్రాజిష్ణు రోచిష్ణునిన్.
ఎల్ల వేళల జ్ఞానము, సంపద, కీర్తి బలము, ఐశ్వర్యము మొదలైన గుణాలతో కూడినవాడు, భువనాలకు ప్రభువు, యజ్ఞానికి అధీశ్వరుడు, తుది లేనివాడు, చ్యుతి లేనివాడు, వికసించుచున్న పద్మాలవంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీవల్లభుడు, మొదలు తుద వికారము లేనివాడు, దయాసముద్రుడు, సాత్వతులకు అధినాథుడు, వృద్ధిశీలుడు, సహనశీలుడు, అంతటా వ్యాపించిన వాడు, కల్యాణగుణాలతో విరాజిల్లేవాడు, కాంతిమంతుడు అయిన శ్రీహరిని బ్రహ్మదేవుడు దర్శించాడు.
2-240-చ.
ప్రియుఁడగు బొడ్డుఁదమ్మి తొలిబిడ్డఁడు వేలుపుఁబెద్ద భూతసం
చయములఁజేయుకర్త నిజశాసనపాత్రుఁడు ధాత మ్రొక్కినన్
దయ దళుకొత్తఁ బల్కెఁ బ్రమదస్మితచారుముఖారవిందుఁడై
నయమునఁ బాణిపంకజమునన్ హరి యాతనిదేహమంటుచున్ ఇట్లనియె..
తనకు ఇష్ఠుడు, నాభి యందు జనించినవాడు, ప్రథమ సంతానము, దేవతలందరకు అధిదేవుడు, సమస్తమైన భూతజాలమును సృష్టించెడి వాడు, తన ఆజ్ఞానువర్తి, సృష్టి నంతటిని ధరించువాడు అగు బ్రహ్మదేవుడు అలా ప్రణామములు చేయగా శ్రీమహావిష్ణువు పరమ సంతోషంతో కూడిన చిరునవ్వులు చిందించే మోము కలవాడయ్యాడు. అతని దేహమును చనువుగా హస్తపద్మములతో తాకుతు, దయ ఉట్టిపడుచుండగా ఆయనతో ఇలా అన్నాడు.
2-242-తే.
భద్రమగుఁగాక! నీకు నో! పద్మగర్భ!
వరము నిపు డిత్తు నెఱిఁగింపు వాంఛితంబు;
దేవదేవుఁడ నగు నస్మదీయ పాద
దర్శనం బవధి విపత్తిదశల కనఘ!
ఓ పరమ పుణ్యుడ దేవాధిదేవుడనైన నా యొక్క పాదదర్శనం పొందావు. నీ విపత్తి ఆపత్తులు సర్వం తొలగిపోతాయి. జ్ఞనానికి హృదయానికి ప్రతీక యైన పద్మమునందు ఉద్భవించిన ఓ బ్రహ్మదేవుడ! నీకు శుభమగు గాక. నీవు కోరిన వరం ఇస్తాను కోరుకో అన్నాడు విష్ణుమూర్తి.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీమన్నారాయణీయం
9దశకం-6-శ్లోకం*
🕉🌞🌎🌙🌟🚩
కిరీటమకుటోల్లసత్కటకహారకేయూరయుఙ్
మణిస్ఫురితమేఖలం సుపరివీతపీతాంబరం।
కళాయకుసుమప్రభం గళతలోల్లసత్కౌస్తుభం
వపుస్తదయి! భావయే కమలజన్మనే దర్శితమ్||
భావం:-
దేదీప్యమానమైన కిరీటము, భుజకీర్తులు, కడియములు, హారములు, మణిఖచిత మొలనూలు, కంఠమున ప్రకాశించు కౌస్తుభమణి, పసిడివర్ణశోభితమైన పీతాంబరమును ధరించి, నీలికలువ పూల కాంతితో ప్రకాశించు నీ రూపమును బ్రహ్మదేవుడు దర్శించెను. అట్టి నీ అద్వితీయ రూపమును నేనును భావనచేసి ధ్యానింతును.
వ్యాఖ్య:-
ఈరోజు శ్లోకంలో భట్టతిరివారు వంద సంవత్సరాల తపః ఫలంగా విష్ణువు ను దర్శిస్తున్న వైనం చూశాము. మరి మనకీ దర్శించుకోవాలని ఉంది కదా. ఈరోజుల్లో మరి తపస్సు కుదరదాయే. సలభమార్గం ఏముందో చూద్దాం.
భాగవతంలోని పురంధరుడి కధ నించి గ్రహించింది ఎంటంటే వైకుంఠనాథుడైన ఆ శ్రీమన్నారాయణుని నామాన్ని పిల్లలకో లేక ఇంకెవరికో పెట్టి పిల్చినా..పలికినా, లేక ఎవరినైనా వెక్కిరించడానికి పలికినా, ఏదో ఊత పదంగా పలికినా, అది వారి సమస్త పాపాల్ని నశింప చేస్తుంది. ఇంతటి మహత్తరమైన ఆ నారాయణ నామాన్ని స్మరింపక, కీర్తింపక ఎంత నష్టపోతున్నాము. పరమాత్మకి గానమంటే ప్రాణమట. ఆ శ్రీహరి నామం ఎలా తలచినా ఇంత ఫలితం ఇస్తుందంటే స
ఆయనకు ప్రాణమైన గానాన్నే మనం చేస్తే ఇంకెంత ఫలితమో తెలుసుకోవాలి. అది కోరికలు తీర్చటం కాదు.... స్వయంగా పరమాత్మనే మన దగ్గరకు రప్పిస్తుందట. ఆ మాట ఆ పరమాత్మే స్వయంగా నారదునితో చెప్పాడు.
నాహం నాసామి వైకుంఠే యోగినాం హృదయేనచ l
మద్భక్తా యత్రగాయన్నిత తత్ర తిష్టామి నారదా ll
నారదా ! నేను ఎక్కడ ఉంటానో తెలుసునా ? అంతా నేను వైకుంఠములో ఉంటాను అకుంటున్నారు... కానీ నేను వైకుంఠములో లేను, ఉండను.... కొంతమంది నేను తపశ్శక్తి సంపన్నులైన యోగుల హృదయాలలో కనబడుతూ ఉంటానని అనుకుంటుంటారు. అక్కడా నేను కనబడను. ఎక్కడైతే నా నామస్మరణ చేస్తూ, నా భక్తులు గానం చేస్తుంటారో, నేను అక్కడే ఉంటాను...అని.
అందుకే నారదుల వారు ఆ నారాయణ నామస్మరణ గానాన్ని వీడకుండా గానం చేస్తుంటాడు. దానికి మహతి తోడు. ఈ హరినామ గానం చేస్తే ఆయన ప్రసన్నుడై, ముక్తిని ప్రసాదిస్తాడు.
హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం l
కలే నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా ll
ఈ కలియుగంలో సులభంగా మోక్షాన్ని పొందాలి అంటే ఈ హరినామ సంకీర్తన కంటే సులభమైన మరోమార్గం లేనేలేదు.
ఈరోజునుంచే భగవన్నామ సంకీర్తనం ప్రారంభిద్దాం. ప్రస్తుతం ఉన్న విపత్కర రోజుల్లో మనం రేపే ప్రయాణం అవ్వవలసి వస్తుందేమో. అప్పుడు మోక్షాన్ని పొందలేక మళ్ళీ జన్మమెత్తవలసి వస్తుంది. అందుకని ఈ క్షణమే స్మరిద్దాం.
🕉🌞🌎🌙🌟🚩
08-22-గీతా మకరందము
అక్షరపరబ్రహ్మయోగము
🕉🌞🌏🌙🌟🚩
అ|| ఇక నట్టి పరమాత్మను బొందుట కుపాయమును తెలియజేయుచున్నారు-
పురుషః స పరః పార్థ
భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాన్తఃస్థాని భూతాని
యేన సర్వమిదం తతమ్ ||
తా:- ఓ అర్జునా ! ఎవనియం దీ ప్రాణికోట్లన్నియు నివసించుచున్నవో, ఎవనిచే ఈ సమస్త జగత్తున్ను వ్యాపింపబడియున్నదో, అట్టి పరమపురుషుడు (పరమాత్మ) అనన్యమగు (అచంచలమగు) భక్తిచేతనే పొందగలడు.
వ్యాఖ్య:- పరమాత్మ యొక్క స్వరూపము, వారిని పొందుమార్గము అనగా సాధ్యవస్తువు, సాధనము - రెండును ఈశ్లోకమున తెలుపబడినవి. అనేక ప్రాణికోట్లతో నిండి నిబిడీకృతమై ఈ జగత్తంతయు ఎచటనున్నది? దాని కాధారమేమి? పరమాత్మయను ఆధారముపై, అధిష్ఠానముపై ఈ చరాచరప్రపంచమంతయు రజ్జువునందు సర్పమువలె కల్పింపబడియున్నది. ఆరోపితవస్తువుయొక్క స్థానము, నివాసము అధిష్ఠానవస్తువే యనుట సుప్రసిద్ధము. కావున జగత్తంతయు సద్వస్తువగు పరమాత్మలోపల అధ్యస్తమై వెలయుచున్నది.
స్వప్నలోకమంతయు మేలుకొనినవానియందే వర్తించునట్లు ఈ సమస్త స్థావరజంగమప్రాణికోటియుక్తమగు ప్రపంచమంతయు ఆత్మయందే కలదు. కావున ఆత్మచేతనే అది పరివ్యాప్తమైయున్నది. వెన్న ఏ ప్రకారము పాలయందంతట వ్యాపించియున్నదో, ఆ ప్రకారమే పరమాత్మ జగత్తునందంతటను వ్యాపించియున్నారు. (యేన సర్వమిదం తతమ్).
అట్టి సర్వవ్యాపకపరమాత్మ జీవులకు ఏ ఉపాయముచే లభ్యము కాగలరు? అను ప్రశ్నకిచట సూటియైన సమాధానమొసంగబడినది. ‘భక్త్యా లభ్యస్త్వనన్యయా’ - అనన్యభక్తిచేతనే యాతడు పొందబడగలడని వచింపబడినది. ‘అనన్యభక్తి’ అని పేర్కొనుటవలన మోక్షప్రాప్తికి స్వల్పభక్తి చాలదనియు, తీవ్రతరభక్తి అవసరమనియు స్పష్టమగుచున్నది. అన్యముకానిది ‘అనన్యము’ - అనగా భగవంతునిమీద తప్ప ఇతరమగు ఏ పదార్థమందును ఆసక్తిలేకుండుటయని భావము. నశ్వరములగు ప్రాపంచిక విషయములపైని కొంత ప్రీతి, భగవంతునిపై కొంత ప్రీతి అనన్యప్రేమ, అనన్య భక్తి కానేరదు. భక్తిమార్గము సులభతరమైనది. కావున దాదాపు ప్రతి అధ్యాయము యొక్క చివరను దానిని పేర్కొనుచున్నారు. ఏ యోగమును బోధించినను దాని చివర భక్తిని ఉటంకించుచున్నారు. ఏలయనిన అది సులభమైనది యగుటయేకాక, అన్ని యోగములందును అద్దాని సమ్మేళనము ఆవశ్యకమైయున్నది.
ఈ ప్రకారముగ అనన్యభక్తిచే ఆ పరమపురుషుడు (పరమాత్మ) తప్పక పొందబడగలడని భగవాను డిచట స్పష్టముగ తెలియజేసినందువలన, ఇవ్విషయమున జనులే మాత్రము సందేహింపక, అట్టిసాధనను వెనువెంటనే ఆచరించి, మోక్షసామ్రాజ్యాభిషిక్తులు కావలయును. దేవుని పొందుటకు మార్గమేమి? అని అనేకులు ప్రశ్నించుచుందురు.
అట్టివారీశ్లోకమును బాగుగగ్రహించి, అనన్యభక్తియే అందులకు మార్గమని విశ్వసించి అట్టి పరాభక్తిని ప్రయత్నపూర్వకముగ సాధించివేయవలెను.
ఇచట భగవానుని ‘పరమపురుషుడ’ని వర్ణించిరి. తక్కినవారందఱు సామాన్యపురుషులు. ఆతడొక్కడే పరమపురుషుడు. పురుషుడు (జీవుడు) భక్త్యాది సాధన లాశ్రయించి పరమాత్మయం దైక్యమై పరమపురుషుడుగ మారవలెను. అదియే జీవితలక్ష్యమని ప్రతివారును గుర్తుంచుకొనవలెను.
ప్ర:- ఈ సమస్త జగత్తు ఎవనియందు స్థితిగలిగియున్నది?ఎవనిచే వ్యాప్తమైయున్నది?
ఉ:- పరమాత్మయందు స్థితిగల్గియున్నది. ఆతనిచేతనే వ్యాప్తమైయున్నది.
ప్ర:- ఆ పరమాత్మ యెట్లు పొందబడగలడు?
ఉ:- అనన్యభక్తిచే.
🕉🌞🌏🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము /14వ దశకము - కపిలోపాఖ్యానము / 14-3-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
గరుడోపరి కాలమేఘక్రమం విలసత్కేళిసరోజపాణిపద్మమ్।
హసితోల్లసితానావనం విభో! త్వం వపురావిష్కురుషే స్మ కర్దమాయ||
భావం:-
ప్రభూ! నీవు నీలిమేఘచ్ఛాయతో ప్రకాశించుచూ - విలాసముగా కరమున కలువలను ధరించి, హృదయానందమగు మందహసముతో, గరుడవాహనుడవై - తపమాచరించుచున్న “కర్దమునికి” సాక్షాత్కరించితివి.
వ్యాఖ్య:-
కర్ధమ ప్రజాపతి దేవభూతి పుత్రసంతానం కొరకు మహావిష్ణువును ప్రార్థించి విష్ణు అంశతో పుత్రుడిని పొందారు. పుట్టుకతోనే పరిపూర్ణ జ్ఞానంతో ఉద్భవించిన ఆపుత్రుడే కపిలమహర్షి.
కపిలమహర్షి జన్మించి తన తల్లితండ్రుల కోరికను అనుసరించి తన సహోదరీల వివాహం చేసి తన తల్లికి సాంఖ్యయోగబోధను చేసి ఆమెకు సంసారమునందు విరక్తిని కలిగించి మోక్షమార్గం వైపు నడిపించాడు. కపిల మహర్షి సాంఖ్యగోగ ప్రచారం చేసి ప్రజలను జ్ఞానవంతులను చేసాడు. తనకు తపోభంగం కలిగించిన సగరపుత్రులను భస్మంచేసాడు. తల్లికి బిందుసరోవరం వద్ద శ్రాద్ధక్రియలు నిర్వహించి ఆమెకు మోక్షప్రాప్తిని కలిగించాడు.
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము /14వ దశకము - కపిలోపాఖ్యానము / 14-7-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
స పునస్త్వదుపాసనప్రభావాత్ దయితాకామకృతే కృతే విమానే।
వనితాకులసంకులే నవాత్మా వ్యహరద్దేవపథేషు దేవహూత్యా||
భావము:-
కర్దమముని, తన పత్నియగు దేవహూతి కోరికను నెరవేర్చుటకొరకై, నిన్ను ఉపాసించి, ఆ ప్రభావముచే ఒక అద్భుతమైన విమానమును సృష్టించెను. మరియు, దేవహూతికి సపర్యలు చేయుటకై వనితా సమూహమును కూడా సృష్టించెను. తానునూ ఒక నూతన దివ్యరూపమును ధరించి, దేవహూతీ సమేతుడై ఆ విమానము నధిరోహించి, దేవతలు విహరించు ఉద్యానవనమున విహరించెను.
వ్యాఖ్య:-
దేవహూతి కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. ఆయన తపస్సు పాటిస్తున్నాడు. నియమములు పాటిస్తున్నాడు. భర్త ఏమి చేస్తున్నాడో భార్య కూడా అదే చేస్తోంది. ఆయనకు బాహ్యస్మృతి లేదు. ఒకనాడు దేవహూతి చూడడానికి ఎంత అందంగా ఉండేదో, ఇప్పుడు అంత శుష్కించి పోయింది.
ఆమె పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు కర్దముని సేవించింది. కొంతకాలానికి ఒకరోజు కర్దముడు తపస్సులోంచి ఎందుకో ఒకసారి దేవహూతి వంక చూసి ఆశ్చర్యపోయాడు.
నేను ఒకనాడు ఈమె సౌందర్యమును వర్ణన చేశాను. నాకోసం తపించడంలో, పరిశ్రమించడంలో ఇన్ని ఏర్పాట్లు చేయడంలో ఈవిడ ఇలా అయిపొయింది’ అనుకోని దేవహూతీ, నీ సేవలకి నేను సంతోషించాను. నీకు నావలన తీరవలసిన కోరిక ఏమి?’ అని అడిగాడు.
ఒక సౌశీల్యవంతురాలయిన స్త్రీ భర్తవలన తాను సంతానవతియై తల్లి కావాలని కోరుకుంటుంది. ఆవిడ అంది ‘ఈశ్వరా, మీరు నాకు పతిదేవులు. మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యే అదృష్టమును నాకు కటాక్షించండి’ అని కోరింది. అంటే అప్పుడు ఆయన ‘తప్పకుండా కటాక్షిస్తాను’ అని ఒక అందమైన మాట చెప్పాడు.
‘నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమంలో జటలు కట్టుకుని, ఉరఃపంజరము పైకి వచ్చేసి ఒక నారపంచె కట్టుకుని ఎప్పుడూ దండకమండలములు పట్టుకుని చాలా వెర్రివాడిలా, తపస్సు చేసుకుంటున్న వాడిలా ఏ భోగ భాగ్యములు లేని వాడిలా, ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ భూషయనం చేసే వాడిలా కనపడుతున్నాను కదా! నాకు ఉన్న భోగములు ఎటువంటివో తెలుసా? ఈ భూమియందు సార్వభౌములమని సమస్త భూమండలమును ఏలగలమన్న చక్రవర్తులకు లేని భోగములు నాకున్నాయి.
నేను నిరంతరమూ శ్రీమన్నారాయణుని సేవించాను. అపారమయిన భక్తితో యోగమును అవలంబించాను. గొప్ప తపస్సు చేశాను. దానిచేత ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పింపబడవలసిన భోగోపకరణములు ఉన్నాయి. అవి సామాన్యులకు దొరికేవి కావు.
వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. అవి ఇతరులకు కనపడవు. వాటిని చూడడానికి వీలయియా దివ్యదృష్టిని నీకు ఇస్తున్నాను. భోగోపకరణములను చూడవలసినది’ అని దివ్యదృష్టిని ఇచ్చాడు.
ఆవిడ తెల్లబోయింది.
ఒక పెద్ద భవనం వచ్చింది. కర్దముడు తన యోగ శక్తితో దేవహూతి కోసం నిర్మించిన దివ్యమైన విమానంలో (పోతన భాగవతం 3-808-సీ. నుండి3-812-క.లో వివరించినది చూస్తే) అనేక మందిరాలు / గదులు, మణిమయ స్తంభాలు, గరుడపచ్చలు పరచిన నడవలు, వజ్రాల తలుపులు, పగడాల గడపలు, ఇంద్రనీల మణి ఖండాలు, బంగారు కలశాలు, పద్మరాగాల మొగ్గలు, వైఢూర్యపు చూరులు, గుడ్డ జెండాలు, మధుర మధురంగా ఝంకారం చేసే తుమ్మెదలు,పూలదండల తోరణాలు, పలువిధాల వస్త్రాలు, రంగురంగుల పట్టెమంచాలు, కృత్రిమ పక్షుల చిత్రాలు, మెత్తని శయ్యలు, మేలైన గద్దెలు, కేళీగృహాలు,
క్రీడాపర్వతాలు, పాలరాతి భవనాలు & కృత్రిమ వనాలు, గొప్ప గొప్ప శయ్యా మందిరములు ఉన్నాయి.
ఆ శయ్యా మందిరములకు ఏనుగుల దంతములతో చేయబడిన కోళ్ళు, కట్టుకోవడానికి వీలుగా వ్రేలాడుతున్న చీనీ చీనాంబరములు – బంగారము, వెండితో చేయబడిన స్తంభములు, వజ్రవైడూర్య మరకత మాణిక్యములు వాటికి తాపడం చేయబడ్డాయి. లోపల శయనాగారాలు, బయట విశాలమయిన ప్రాంగణములు ఉన్నాయి.
వీటన్నింటినీ చూసి ఆమె అలా నిలబడిపోయింది. ఈ స్థితిలో వున్న దేవహూతికి ఉత్తరక్షణంలో ఇవన్నీ కనబడ్డాయి.
అపుడు కర్దమ ప్రజాపతి “దేవహూతీ, అదిగో బిందు సరోవరము. అందులో దిగి స్నానం చేసి బయటకు రా’ అన్నాడు.
వచ్చేసరికి ఇంతకు పూర్వం దేవహూతి ఎంత సౌందర్యంగా ఉండేదో దానికి పదివేల రెట్లు అధిక సౌందర్యమును పొందింది. అక్కడ ఒక వేయిమంది దివ్యకాంతలు కనపడ్డారు. వాళ్ళు ఆమెకు పట్టు పుట్టములు కట్టి, అంగరాగముల నలది ఆమె చక్కటి కేశపాశమును ముడివేసి అందులో రకరకములయిన పువ్వులు పెట్టి ఒక నిలువుతడ్డంపట్టుకువచ్చి ఆవిడ ముందుపెట్టి సోయగమును చూసుకోమన్నారు.
అద్దంలో తన సోయగమును చూసుకుని, వెంటనే తన భర్తను స్మరించినది. ఉత్తరక్షణం కర్దమ ప్రజాపతి ప్రత్యక్షం అయ్యాడు. మనం ఎవరూ అనుభవించని భోగాలు అనుభవిద్దాం, రావలసింది’ అని విమానం ఎక్కించాడు. ఈ విమానం సమస్త లోకముల మీద ఎవరికీ కనపడకుండా తిరగగలిగిన విమానం. అటువంటి విమానంలో వాళ్లు తిరుగుతున్నారు.
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము /14వ దశకము - కపిలోపాఖ్యానము / 14-8-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
శతవర్షమథ వ్యతీత్య సో౾యం నవకన్యాస్సమవాప్య ధన్యరూపాః।
వనయాసముద్యతో౾పి కాంతాహితకృత్ త్వజ్జననోత్సుకో న్యవాత్సీత్||
బావం:-
కర్దమముని, అట్లు నూరుసంవత్సరములు గడిపిన అనంతరము ఆ దంపతులకు - రూపవతులగు తొమ్మండుగురు కుమార్తెలు జన్మించిరి. తదనంతరము వనవాసమునకు పోవలయునని తలచిననూ, భార్యయగు దేవహూతికి హితము చేకూర్చువలెననని - కర్దముడు, ప్రభూ! సాక్షాత్తు నిన్నే సంతానముగా పొందగోరి, అచటనే మరికొంతకాలము గడిపెను.
వ్యాఖ్య:-
కర్దమ మహర్షి అందరి కన్నా ముందు, అంటే కృత యుగం నాటి వాడు. మహా విష్ణువునే తన కొడుకుగా పొందిన వాడు. తొమ్మిది మంది మునులకు తాతగారు. బ్రహ్మదేముడి మాట మీద సంతానాన్ని అభివృద్ధి చేసినందుకు ఇతనిని కర్దమ ప్రజాపతి అని కూడా అంటారు.
బ్రహ్మ దేముడు గంధర్వులని, అప్సరసలని, సిద్ధులని, కిన్నెరలని, కింపురుషులని సృష్టించాకా ఋషులని సృష్టించాడు. వీరందరినీ ప్రజాసృష్టికి ఉపయోగించు కున్నాడు బ్రహ్మదేముడు. ఒకరోజు బ్రహ్మ కర్దముడిని పిలిచి నువ్వు సృష్టికార్యంలో నాకు సహాయం చెయ్యాలి అని చెప్పగా కాదనలేక సరే అన్నాడు.
కర్దమ మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం కట్టుకుని విష్ణుమూర్తి కోసం పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని స్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి కర్దముడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అది కూడా సుఖాలకోసం కాదు, సృష్టి కార్యానికే, నువ్వు అనుమతినిస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు.
అందుకు విష్ణుమూర్తి మహర్షి నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. బ్రహ్మావర్త దేశపు రాజు, తన భార్య వచ్చి తన కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తారు. నీకు తొమ్మిది మంది కూతుర్లు పుడతారు. ఆ కూతుళ్ళకి తొమ్మిది మంది మునులు పుడతారు. నీ తపస్సు వల్ల నీలో కూడా నేనే ఉన్నానని తెలుసుకుంటావు. నా అంశతో నేనే నీకు కొడుకుగా పుడతాను అని చెప్పి అంతర్ధానమవుతాడు.
తరువాతి కాలంలో స్వాయంభువుడు తన భార్యతో కలిసి వచ్చి తన కూతురు దేవహుతిని పెళ్లి చేసుకోమని కర్దముడిని అడుగుతాడు. అందుకు కర్దముడు పెళ్లి చేసుకుంటా గాని పిల్లలు పుట్టే దాకానే ఉంటాను. తరువాత తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాను అని చెపుతాడు. తన భార్య, కూతురిని అడిగి వాళ్ళు సరే అన్నాకా వారిద్దరికీ పెళ్లి చేస్తాడు స్వాయంభువుడు.
కొంతకాలానికి దేవహుతి తొమ్మిది మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. పిల్లలు కలిగారు కదా ఇక నేను తపస్సు చేయటానికి వెళతాను అని చెప్తాడు కర్దముడు. దానికి బదులుగా ఇంత మంది పిలల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేయటం నా ఒక్కదానివల్ల కాని పని పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి నాకు ఒక మగపిల్లవాడు పుట్టే దాకా ఉండమని కోరుకుంటుంది దేవహుతి. అందుకు సమ్మతించి, విష్ణువుని పూజిస్తే తనకు కొడుకు పుడతాడని చెపుతాడు కర్దముడు.
కొంతకాలానికి వారికి శ్రీ మహావిష్ణువే కొడుకుగా జన్మిస్తాడు. అతనికి కపిలుడు అని నామకరణం చేస్తారు ఆ దంపతులు. భగవంతుడే తనకు కొడుకు రూపంలో పుట్టాడని తెలుసుకున్న కర్దముడు కపిలునికి నమస్కారం చేసి, ప్రదక్షిణ చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. దానికి బదులుగా కపిలుడు, విష్ణుమూర్తి అంశ అయిన నన్నే తలుచుకుంటూ తపస్సు చేసి మోక్షాన్ని పొందు అని చెపుతాడు. అతని ఆదేశానుసారం కర్దమ ప్రజాపతి ఆ జన్మాంతం శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ మోక్షాన్ని పొందుతాడు.
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము /14వ దశకము - కపిలోపాఖ్యానము / 14-9-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
నిజభర్తృగిరా భవన్నిషేవానిరతాయామథ దేవ! దేవహూత్యామ్।
కపిలస్త్యమజాయథా జనానాం ప్రథయిష్యన్ పరమాత్మతత్వ్తవిద్యామ్||
భావం:-
ప్రభూ! భగవంతుని సేవించమని కర్దమునిచే ఆదేశించబడిన దేవహూతి, నిరంతరమూ భక్తితో నిన్నే సేవించుచుండెను. అనంతరము - భగవాన్! “పరమాత్మ తత్వ-విద్య”ను, భోధించుటయే పరమావధిగా దేవహూతికి - నీవు కుమారుడవై జన్మించితివి.
వ్యాఖ్య:-
శ్రీ మధ్భాగవతంలోని 3వ స్కంధము 33వ ప్రకారం కపిలుడి తండ్రి కర్దమ ముని ఇల్లు వదలి వెళ్ళిన తరువాత కపిలముని తన తల్లి అయిన దేవహూతికి యొగ శాస్త్రాన్ని అభ్యసించమని విష్ణువుని ప్రార్థించమని, వాటి వలన దేవుని యెడల నిజమైన భక్తి మోక్షము కలుగుతాయని కపిలుడు సలహా ఇచ్చాడు. ఆవైనం చూద్దాం.
ఈ భూమిపై శ్రీమన్నారాయణుడు రకరకాల అవతారాలలో జన్మించాడు. వాటిలో కపిల మహాముని అవతారం కూడా ఒకటి. ఆయన కర్దమ ప్రజాపతి, దేవహూతిలకు కుమారునిగా జన్మించాడు. ఆయనకు పలువురు సోద రీమణులు కూడా ఉన్నారు. వారు కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఊర్జ, శాంతి, ఖ్యాతి. తనకు శ్రీమన్నారాయణుడు కుమారునిగా కలిగాడని గ్రహించిన కర్దమ ప్రజాపతి కుమారుని అనుమతి మీద ఊర్ధ్వ లోకాల కు వెళ్లిపోయాడు.
కపిలుడే భాగవతంలో ఉదహరించిన సాంఖ్య యోగ లేదా సాంఖ్య కారిక సృష్టికర్త. ఒక రోజు కపిలుని తల్లి దేవహూతి కుమారునితో తనకు సాంసారిక బంధాలకు అతీతమైన, మరుజన్మ రాని యోగాన్ని ప్రసాదించమని కోరింది. అప్పుడు కపిలుడు ఆమెకు సాంఖ్య యోగాన్ని ఉపదేశించాడు. అది కపిల దేవహూతి సంవాదంగా ప్రసిద్ధి పొందింది.
జీవాత్మ పరమాత్మను ఎలా చేరుకోవాలనే భావం గలది ఆ యోగం. ఈ యోగంలో ఆయన పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త్తం, అహంకారం అనే ఇరవై నాలుగు తత్త్వాలే కాక ఇరవై అయిదవ తత్త్త్వమైన కాలాన్ని కూడా స్పృశించాడు.
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము /14వ దశకము - కపిలోపాఖ్యానము / 14-10-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
వనమేయుషి కర్దమే ప్రసన్నే మతసర్వస్వముపాదిశఞ్జనన్యై।
కపిలాత్మక! వాయుమందిరేశ! త్వరితం త్వం పరిపాహి మాంగదౌఘాత్||
భావం:-
పిదప, సంతుష్టుడైన కర్దమముని వనవాసమునకు వెడలెను. భగవాన్! “భగవత్తత్వము యొక్క సర్వస్వమును” నీవు తల్లియైన దేవహూతికి ఉపదేశించితివి. కపిల రూపమున అవతరించిన ఓ పరమాత్మా! గురవాయూరు మందిరేశా! అనారోగ్యమునుండి నన్ను త్వరితగతిని రక్షింపుము.
వ్యాఖ్య:-
ఒక రోజు కపిలుని తల్లి దేవహూతి కుమారునితో తనకు సాంసారిక బంధాలకు అతీతమైన, మరు జన్మ రాని యోగాన్ని ప్రసాదించమని కోరింది. అప్పుడు కపిలుడు ఆమెకు సాంఖ్య యో గాన్ని ఉపదేశించాడు. అది కపిల దేవహూతి సంవాదంగా ప్రసిద్ధి పొందింది.
జీవాత్మ పరమాత్మను ఎలా చేరుకోవాలనే భావం గలది ఆ యోగం. ఈ యోగంలో ఆయన పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త్తం, అహంకారం అనే ఇరవై నాలుగు తత్త్వాలే కాక ఇరవై అయిదవ తత్త్త్వమైన కాలాన్ని కూడా స్పృశించాడు. ఈయన మానవాళిని జాగృత పరిచే అహం తత్త్వం గురిం చి తెలియపరిచాడు.
ఇవేకాక సాధకుడు ఎలా ఉండాలి, యోగం ల క్షణాలు, తత్త్వదర్శన ప్రాప్తి, అష్ట సిద్ధుల సాధన, అహింస, న్యాయార్జిత ధనం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, సృష్టిక్రమం, పిండోత్పత్త్తి, దేహాంతర యానం వంటివి ఈ యోగంలో స్థూలంగా వివరించారు. అలా ఈయన సాంఖ్య యోగం ద్వారా తల్లికి జ్ఞాన మార్గం, భక్తి మార్గం బోధించాడు.
లోకోపకారంతో పాటు తల్లికి కూడా త త్త్వ బోధ చేసి ఆమె ఉత్తమ లోకాలు చేరేందుకు తోడ్పడిన కపిలుడు అందరికీ ఆదర్శం. అనంతరం దేవహూతి కుమారుని అనుమతి తీసుకుని తపోదీక్ష స్వీకరించింది. దానితో ఆమెకు బ్రహ్మ జ్ఞానం సంప్రాప్తమై కృష్ణ నిలయమైన గోలోకం చేరింది. ఆమె ముక్తి పొందిన ప్రదేశం ఇప్పటికీ సిద్ధ పదం అనే పేరుతో విరాజిల్లుతోంది.
ఈశ్లోకంలో భట్టతిరి వారు తమ శారీరకరోగ ఉపశమనం కోసం అర్థించారు. అయితే కపిలగగీత ఇంతకన్నా గొప్పదే ఇవ్వగలదు. ముందు ముందు శ్లోకాలలో రాబోయే కపిలబోధ ప్రాశస్త్యం పోతన భాగవత పదాల్లో చూద్దాం.
3-1041-క.
జీవన్ముక్తి లభించుం
గావున నేమఱక తలఁపు కైకొని దీనిన్
వావిరి నొల్లని వారికి
దావల మగు మృత్యుభయము దవ్వగు సుఖమున్."
భావము:-
కపిలగీతను ఏకాగ్రచిత్తంతో ఏమరుపాటు లేకుండా ఆచరించేవారికి జీవన్ముక్తి లభిస్తుంది. ఈ మార్గాన్ని ఇష్టపడని వారికి మృత్యుభీతి కలుగుతుంది. సుఖం దూరమవుతుంది.
తృతీయ స్కంధము. 14వ దశకము సమాప్తము.

*||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము*
15వ దశకము - కపిలోపదేశము / 15-1-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
మతిరిహ గుణసక్తా బంధకృత్ తేష్వసక్తా
త్వమృతకృదుపరుంధే భక్తియోగస్తు సక్తిమ్।
మహదనుగమలభ్యా భక్తిరేవాత్రసాధ్యా
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః||
భావం:-
“ఇహలోకమున ప్రకృతి గతమైన - సత్వగుణం, రజోగుణం, తమోగుణాలకు - బుద్ధి మరియు ఇంద్రియములు వశమగుట వలన జీవునికి కర్మబంధము ఏర్పడుచున్నది. భక్తియోగము - బుద్ధిని నిగ్రహించి తద్వారా జీవునికి బంధవిముక్తిని, మోక్షమును కలిగించును. సర్వసంగ వివర్జితు లయిన భక్తుల సత్సంగమున మాత్రమే అటువంటి భక్తి సాధ్య మగును” అని - కపిలుడు అను నామమున జన్మించిన నీవు (నారాయణుడు) నీ తల్లి అయిన దేవహూతికి ఉపదేశించితివి.
వ్యాఖ్య:-
భాగవత పురాణంలో తృతీయ స్కంధం (26వ అధ్యాయం)లో కపిల మహర్షి తన తల్లి దేవహుతికి సాంఖ్య యోగాన్ని బోధిస్తూ "త్రిగుణాలు కల్పిస్తున్న మోహం నుంచి బయటపడి ఈ చట్రమే నేననే భ్రమను తొలగించుకొని తన అసలు స్వరూపమైన ఆత్మను, పరమాత్మగా గుర్తించి తన స్వస్వరూప స్థితిని చేరుకోవాలి. అది యోగం చే సే పని" అని చేప్తారం.
సాంఖ్యం ముఖ్యంగా ప్రకృతి, పురుషులను విశ్లేషించి చెబుతుంది. ప్రకృతి అనేది త్రిగుణాత్మకం. అవి సత్వ గుణం, రజోగుణం, తమో గుణం. ఈ ప్రకృతిలో 24 తత్వాలున్నాయి. అవి పంచమహాభూతాలు - ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, భూమి, పంచతన్మాత్రలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, పంచ జ్ఞానేంద్రియాలు - త్వక్ (శరీరం), చక్షు(నేత్రాలు), శ్రోత్ర (చెవులు), జిహ్వ (నాలుక), ఘ్రాణ (నాసిక్), పంచ కర్మేంద్రియాలు - వాక్కు (నోరు), పాణి (చేతులు), పాదాలు (కాళ్లు), పాయువు, ఉపస్థలు (మలమూత్ర విసర్జనా ద్వారాలు). ఇవి మొత్తం ఇరవై. మిగిలిన నాలుగు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ ఇరవై నాలుగు కలిసి దేహం అనే చట్రం ఏర్పడింది. వీటినే చతుర్వింశతి తత్వాలు అంటారు.
వీటిలో చేరి నివసించేవాడు దేహి (ఆత్మ లేక జీవుడు). ఇతనితో కలిపి 25 తత్వాలు. (ఈ జీవుడు ఈశ్వరుని ప్రతిబింబమే. కనుక ఈశ్వరునితో కలుపుకొని 26 తత్వాలు అనడం కూడా కొన్ని సంప్రదాయాల్లో ఉంది. అంటే పంచవింశతి తత్వాలు అవుతాయి. ఈ 24 తత్వాలు ఆవరించుకొని త్రిగుణాలు సత్వ రజ స్తమో గుణాలు మూడు (ప్రకృతి) ఉన్నాయి. ఇవే జీవుడ్ని ఈ 24 తత్వాలలో బంధించి మోహ పరవశుడ్ని చేస్తాయి.
జీవుడు తనకు వేరుగా ఉన్న ఈ తత్వాలతో కలిసిపోయి అవే నేననుకొని ఈ దేహమే నేననుకొనే భ్రమను కల్పించాయి. నిజానికి అవి వేరు తాను వేరు. ఇది సాంఖ్యం. మరి యోగం ఏమిటి? యోగం ద్వారా ఈ త్రిగుణాలు కల్పిస్తున్న మోహం నుంచి బయటపడి ఈ చట్రమే నేననే భ్రమను తొలగించుకొని తన అసలు స్వరూపమైన ఆత్మను, పరమాత్మగా గుర్తించి తన స్వస్వరూప స్థితిని చేరుకోవాలి. అది యోగం చే సే పని.
స్రృష్టిలో త్రిగుణాలు తమ రూపం మార్చుకుంటాయి. సత్వగుణం వెలుగుగా, రజోగుణం శక్తిగా, తమోగుణం శాంతిగా రూపాంతరం చెందుతాయి. ఇంక మనఃప్రాణాలు కూడా తమ స్వభావాలను మార్చుకొని దైవంలోని అనంత వైభవాన్ని ప్రకటితం చేస్తాయి. అప్పుడే దైవసంకల్పం నెరవేరుతుంది. అనేకం అనేది ఏకానికి వ్యతిరేకం కాదు. అవి పరస్పర పూరకాలు.
🕉🌞🌎🌙🌟🚩
*||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము*
15వ దశకము - కపిలోపదేశము / 15-2-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
ప్రకృతిమహదహంకారాశ్చ మాత్రాశ్చ భూతా-
న్యపి హృదపి దశాక్షీ పూరుషః పంచవింశః।
ఇతి విదితవిభాగో ముచ్యతే౾సౌ ప్రకృత్యా
కపిలతనురితి త్వం దేవహూత్తై న్యగాదీః||
భావము:-
“గుణత్రయ సమన్వితమయిన
ప్రకృతి(1).,
మహత్తత్వము1).,
అహంకారము(1).,
పంచభూతములు(5).,
పంచతన్మాత్రలు(5).,
జ్ఞానేంద్రియములు(5).,
కర్మేంద్రియములు(5).,
అంతఃకరణము(1).,
జీవుడు(1) -
అను ఈ ఇరువది ఐదు తత్వములను తెలిసినవారు ముక్తిని పొందుదురు” అని - కపిల నామముతో మానవ దేహమును ధరించిన నారాయణమూర్తీ ! నీవు నీ తల్లి దేవహూతికి ఉపదేశించితివి.
వ్యాఖ్య:-
కపిల మహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. బిందు సరోవరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. కర్దమ ప్రజాపతి తన భోగోపకరణాలు అన్నిటిని భార్యకు ఇచ్చి వెళ్ళాడు.
భర్త వెళ్ళిపోగానే ఇన్ని భోగోపకరణముల మీద దేవహూతికి వైరాగ్యం పుట్టింది. ‘నా భర్త అంతటి స్థితిని పొందాడు. నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండి పోయాను. నేను కూడా ఉద్ధరింపబడాలి’ అని అనుకుంది.
అందుకని ఇప్పుడు దేవహూతి తన కొడుకు అయిన కపిల మహర్షి దగ్గరకు వెళ్ళి ‘నేను ఇంతకాలం మోహాంధకారంలో పడిపోయాను. ఈ ఇంద్రియ సుఖాలే సుఖములు అనుకొని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతున్నది. నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్త్వమును నాకు బోధచెయ్యి’ అని అడిగింది.
అప్పుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీనినే ‘కపిలగీత’ అంటారు. కపిల గీత వినిన వాళ్లకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో, ఆ సత్యము సత్యము కాదన్న వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది.
‘అమ్మా, ప్రపంచంలో అనేకమయిన జీవరాసులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ. ఈ దేహములు పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్ఠములు. చెట్లకి ప్రాణం ప్రాణం ఉన్నా చెట్లకన్నా గొప్పతనము ఒకటి ఉంది. స్పర్శ జ్ఞానము కలుగుట చేత వృక్షములకంటే స్పర్శ జ్ఞానము ఉన్నది గొప్పది. స్పర్శ జ్ఞానము ఉన్నదానికంటే రస జ్ఞానము ఉన్నది గొప్పది. రుచి కూడా చెప్ప గలిగినటువంటి ప్రాణి గొప్పది. దానికంటే వాసన కూడా చెప్పగలిగిన భృంగములు గొప్పవి. వాటికంటే శబ్దమును వినగలిగిన పక్షులు గొప్పవి. శబ్దములు వినగలిగిన దానికన్నా అనేక పాదములు ఉన్న జంతువు గొప్పది. దానికన్నా ఆవు, గేదె, మేక మొదలయిన నాలుగు పాదములు కలిగి సాధుత్వము ఉన్నవి గొప్పవి. నాలుగు పాదములు ఉన్న జీవికంటే శరభము రెండు పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. రెండు పాదములు ఉన్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు.
అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేయలేరు. కాబట్టి ఆ స్వామి పరమ భక్తులయిన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు. ఆ మూర్తిని ధ్యానం చెయ్యి.
ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా! పరమ సంతోషంతో నీ మనస్సును ఆయన పాదారవిందముల దగ్గర చేర్చు. స్వామి సౌందర్యమును అనుభవించడం ప్రారంభిస్తే తెనేమరిగిన సీతాకోక చిలుకలా హృదయము దానియందే రంజిల్లడం మొదలిడుతుంది. అప్పుడు మనస్సుకి భోగములవైపు వెళ్ళాలని అనిపించదు. ప్రయత్నపూర్వకంగా భక్తియోగమును అనుష్ఠానం చేయాలి. చేతకాకపోతే కనీసం శ్రవణం చేయడం మొదలు పెట్టాలి. ఎవరు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవరు ధ్యానము లోపల చేయ గలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరునియందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృతరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతున్నాడు’ అని చెప్పాడు.
ఆ మాటలను విన్న దేవహూతి ఆ భోగములనన్నిటిని తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో నిలిపి ధ్యానము చేయసాగింది. ఈశ్వర స్మరణము వలన జ్ఞానము పొంది, ఈ విషయములు వినిన తరువాత ప్రయత్న పూర్వకముగా భోగములు మనను ఉద్ధరించేవి కావని తెలుసుకుని, వాటిని త్రోసిరాజని వైరాగ్యమును పొంది, భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది, జ్ఞానమువలన మోక్షమును పొంది, శ్రీకృష్ణ భగవానుని యందు చేరి శాశ్వతమును పొందినది.
ఇది జీవులందరినీ ఉద్ధరింప బడవలసిన మహోత్కృష్టం అయిన గాథ.
🕉🌞🌎🌙🌟🚩
*||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము*
15వ దశకము - కపిలోపదేశము / 15-3-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
ప్రకృతిగతగుణౌఘైర్నాజ్యతే పూరుషో౾యం
యది తు సజతి తస్యాం తద్గుణాస్తం భజేరన్।
మదనుభజనతత్త్వాలోచనైః సా౾ప్యపేయాత్
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః||
భావం:-
కపిలముని రూపమున జన్మించిన నారాయణుడు - తన తల్లి అయిన దేవహూతికి మరల ఇట్లు ఉపదేశించెను. “జీవుడు - సుఖ దుఖాదులగు ప్రకృతి గతమైన గుణములను స్వయముగా పొందుటలేదు. కాని వాని ఆకర్షణకు లోనైనచో (తాదాత్మ్యాద్యాస వలన) ప్రకృతి గుణసంగమము కలుగును. బంధమున చిక్కి - జీవుడు ధర్మాధర్మములు మరియు రాగద్వేషముల దోషమునకు గురి యగును. నిరంతరమూ భగవత్ చింతనచేయుచూ తత్వవిచారణ చేసినచో ఆ బంధములు తొలగిపోవును. జీవుడు జీవన్ముక్తు డగును“.
వ్యాఖ్య:-
ఈ శ్లోకాన్ని భగవద్గీతలో ఉన్న శ్లోకాలతో అనుసంధానించి చూద్దాం.
గీత అ.3 శ్లో.27
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః !
అహంకారవిమూఢాత్మా కర్తాపాహమితి మన్యతే !!
“వాస్తవముగా కర్మలన్నియును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావింపుచుచున్నాడు” (అ.3 శ్లో.27).
ఈ జగత్తు లో మన చేత గాని, అన్యులచేత గాని లేదా పరిస్థితుల ద్వారా గాని జరిగే పనులన్ని సత్వ-రజస్- తమో గుణాలలో ఏదో గుణ ప్రకోపం వల్లే జరుగుతూ ఉంటాయి. మన దేహం తయారయింది ఈ మూడు గుణాల మేలవిక తోనే. మనలో ప్రతీ క్షణం జరిగే ఈ మధనం లో ఈ మూడు గుణాలలో ఏదో ఒక గుణం ఎక్కూ ప్రభావితం గా ఉంటూ మిగిలిన రెండు గుణాలని అణచి పెట్టి ప్ర్రకోపిస్తూ ఉంటుంది. ఏ గుణం మనలో ఎక్కువగా ప్రకోపిస్తూ ఉంటుంది అనేది మనం తిన్న ఆహరం, పరిసరాలు, చదివే పుస్తకాలు, చూసే సాహిత్యాలు, అలవాట్లు, సత్సంగాత్యం మొదలైన విషయాల మీద ఆధార పడి ఉంటుంది.
కాపోతే ఏ గుణం ప్రకోపించి ఉందో ఆసమయం లో బయట పడే దాని ప్రతాపం అలాగే ఉంటుంది. అలా మనది అనబడే ఆత్మతో ఎటువంటి సంబంధం లేకుండా, జరుపబడుతున్న పనుల్లో మనం దూరి, ఆ జరుగుతున్న దంతా మన వల్లే జరుగుతోంది, నేనే చేస్తున్నా అన్న భావనతో ఉండి, ఆ మూడుగుణాల వల్ల జరిగిన పనిని కూడా మన నెత్తి మీద వేసుకుని, మనం చేస్తున్నాం అన్న భావనకి పోయి, ఆ కార్యం ద్వారా బయల్పడే పుణ్య, పాప ఫలాలను మనఖాతాలో వేసుకుంటుున్నాము.
దేనివల్ల అంటే అహంకారంవల్ల. అంతా నేనే చేశాను. అన్నిటికి నేనే నియామకుడిని - అని భావించే అజ్ఞానం. మనకు మానసిక శాంతి లభించాలన్న, ఆధ్యాత్మ ప్రగతి కావాలన్న, ఇంట్లో ఆనందం వెళ్లి విరియాలన్న, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలి అనుకున్న, అందరూ మిమ్మల్ని మన వాడు అనుకోవాలి అనుకున్న, శాంతిగా జీవనం గడపాలి అనుకున్న, ముఖ్యంగా వదలాల్సింది ఈ అహం భావననే.
నేను, నాది, నా ఆస్థి, నా పరువు, నా అంతస్థు, నా ఉద్యోగం, నా జీతం, నా ఆధీనం, నా అధికారం, నా గొప్పతనం మొదలైన భావాలు మనం ఎన్ని సార్లు నా.. నా..నా.నా. అనుకుంటూ ఉన్నామో అంతకు పదిరెట్లు మనల్ని కర్మ బంధం లో కి నెడతాయి. దాని బదులు పోతన గారు 'అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ' అంటూ అమ్మ. అమ్మ. అమ్మ. అమ్మ అంటూ పలికి ఎలా తనని తాను ఉద్ధరించుకున్నారో గ్రహించి మనం కూడా అలా ఒక ఓం కారాన్నో, రామ నామాన్నో, కృష్ణ నామాన్నో, శివ నామాన్నో నా అనాల్సి వచ్చినప్పుడల్లా దృష్టి సారించి , దాన్ని నియంత్రించి , ఒక సాధన గా దాన్నించి దూరంగా ఉంచగలమేమో ప్రయత్నించండి.
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః !
గుణా గుణేషు వర్తంత ఇతి ముత్వాన సజ్జతే !! 28
“ఓ మహాబాహో ! అర్జునా ! గుణవిభాగతత్త్వమును, కర్మవిభాగ తత్త్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి, వాటియందు ఆసక్తి నొందడు (అ.3 శ్లో.28).
గుణాలు మూడు విధాలు,
సత్వ గుణం - శాంతం స్వరూపం, మృదు భాషణం, లోక కల్యాణ కాంక్ష వంటి భావాలను కలిగించేది.
రజో గుణం – అధికారం, రాజసం, దర్పం, భోగం, సువాసన, వేట, నాయకత్వం లాంటి భావాలలో బయల్పడేది
తమో గుణం – దొంగతనం, జీవ హింస, మోసం చేయటం, స్త్రీ వ్యామోహం, త్రాగుడు లాంటివి పెంచేది.
అలాగే కర్మ చేసేప్పటి మన భావాన్ని బట్టి కర్మ రెండు విధాలు.
సకామ కర్మ – ఏదో ఒక నిర్దిష్ఠ మైన దానిని పొందాలి అన్న ఆశ తో చేయబడేది,
నిష్కామ కర్మ – ఎటువంటి కోరిక లేక, తాను ఆపనికి నియమించబడి చేస్తున్నా అన్న భావంతో చేయబడేది.
పైన చెప్పిన గుణాలు ప్రక్రృతి మరియు మనలో ఎప్పుడూ ఉంటూ, మూడిట్లో ఏదో ఒకటి వేరే రెండిట్ని కంట్రోల్ చేస్తూ పైకి ఎగబడుతూనే ఉంటుంది. అది దాని వ్యవహారం.
అలాగే చేయ బడే కర్మ విషయంలో కోరికతో చేయడం, కోరిక లేకుండా చేయడం అనేది ఎన్నో జన్మల నించి వస్తున్న ఆ జీవి సూక్ష్మ శరీరం ద్వారా తెచ్చుకున్న సంస్కారాల ద్వారా అతని మనసుని ప్రేరేపించడం, లేదా నిర్లిప్తంగా ఉండడం అన్నది అలవరుస్తుంది.
ఈ పైన చెప్పిన నాలుగు విషయాల్ని క్షుణ్ణంగా, అర్ధం చేసుకున్న జ్ఞాని తనతో సంబంధం లేకుండా జరిగిపోయే వాటి పట్ల అవి వాటి స్వభావాన్ని బట్టి అలా ప్రవర్తిస్తున్నాయి అని గ్రహించి శాంతిగా ఉంటాడు.
🕉🌞🌎
||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము / 15వ దశకము - కపిలోపదేశము / 15-6-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
అహ హ బహుళహింసా సంచితార్థైః కుటుంబం
ప్రతిదినమనుపుష్ణన్ స్త్రీజితో బాలలాళీ।
విశతి హి గృహసక్తో యాతనాం మయ్యభక్తః
కపిలతనురితి త్వం దేవహుత్యై న్యగాదీః||
భావం:-
“నిత్యము దనార్జన చేయుచూ కుటుంబ పోషణ యందే నిమగ్నుడైన జీవుడు, దైవభక్తికి దూరమై, భార్యా సంతాన సంసార లంపట మందు చిక్కుకొని, వారి పోషణార్దము - ధనార్జనకు హింసకు సైతము పాల్పడును. అట్టి మనుజుడు తాను ఆర్జంచిన పాపఫలిత ఫలముగా నరకయాతనకు గురి యగును” అని – కపిలనామధారి యైన నారాయణుడు తల్లి యగు దేవహూతికి తెలిపెను.
వ్యాఖ్య:-
మానవజన్మ చాలా గొప్పది. ప్రాణికోటిలో ఇతర జీవులకు లేని జ్ఞానము మానవునకు ఉన్నందున వివేకంతో తగిన నిర్ణయం తీసికొను శక్తి మానవుడికి ఉంది.
మనిషి ధర్మార్థ కామమోక్షాల సాధనతో బుజువర్తన జీవనం సాగించాలి.
బ్రహ్మచర్యాన్ని పాటించి విద్యను, విజ్ఞానమును పొందవలెను. తరువాత వివాహము చేసుకొని కుటుంబ పోషణం చేయాలి. కొంతమంది గృహస్థుడైన వానికి మోక్షము (ముక్తి) లభించుట కష్టమని అంటారు. ఇది సరియైన అభిప్రాయం కాదు.
మానవుడు సంసారిగా జీవనము సాగించునప్పుడు కుటుంబపరముగను, వృత్తి సంబంధంగా, సామాజికంగా సమస్యలు రావచ్చు. ఈ సమస్యలు జటిలమై, తీవ్రమైన మానసిక వ్యధ కలిగించచ్చు అటువంటి క్లిష్ట సమయాల్లో కూడా సంయమనం పాటిస్తూ ప్రశాంతతను పొంది సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి.
ఇంద్రియాల ప్రభావం వల్ల కామ క్రోదాధి అరిషడ్వర్గాలు దుఃఖాన్ని కలిగిస్తాయి. దానిని ఇంద్రియనిగ్రహంతో నియంత్రించాలి. అయితే అది అంత సులభం కాదు. సాధన, బ్రహ్మచర్యం, సన్యాసం, యోగం ఇత్యాది సాధనల ద్వారా లేదా సజ్జన సాంగత్యం ద్వారా దైవభక్తితో నిగ్రహశక్తిని సాధించాలి.
మానవజీవితములో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు, కన్నీరు కడగండ్లు ఉన్నాయి. ఏ సమయంలో ఏ విధంగా మానవ్ఞలకు విపత్తు కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ రూపంలో ఏ ప్రాంతంలో ఏవిధంగా మృత్యువు దాపురిస్తుందో తెలియదు. కాబట్టి మానవుడు తాను వచ్చిన పనిని ముగించుకుని ముక్తిని పొందుటకై ప్రయత్నించాలి.
ఇంద్రియజయం, బ్రహ్మచర్యం, సన్యాసం, ఋజువర్తనం ద్వారా చాలావరకు తన జీవనయానాన్ని శాంతితో సాగించి ఆత్మాను సంధానం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు.
మనస్సును భగవంతుని యందు నిలిపి అనుదినం, అనుక్షణం ఆయన నామ స్మరణతో ముక్తి పొఃదాలి.
అన్ని సమస్యలకు మూలకారణం మనస్సు. దీనివల్లే భావనలు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడూ ఇంద్రియ సుఖాలను కోరుతూ ఉండే మనసును అదుపులో పెట్టుకోవడానికి నిగ్రహం అంటే సంయమన భావం కావాలి. గుర్రము వలె పరుగులు తీసే మనసును, నిగ్రహం అనే కళ్లెంతో జాగ్రత్తగా అదుపులో పెట్టాలి. తరువాతనే మనం అనుసరించవలసిన మంచి పనులను సామర్థ్యంతోను, సామరస్యంతోను ఏకాగ్రతతోను, చిత్తశుద్ధితో చేయడం సాధ్యపడుతుంది.
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము / 15వ దశకము - కపిలోపదేశము / 15-7-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
యువతి జఠరఖిన్నో జాతబోధో౾ప్యకాండే
ప్రసవగళిత బోధః పీడయోల్లంఘ్య బాల్యమ్।
పునరపి బత ముహ్యత్యేవ తారుణ్యకాలే
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః!!
భావం:-
“జననమునకు ముందు జీవుడు తల్లిగర్భమున ఖేదము ననుభవించును. ఆ సమయమున పరతత్వ జ్ఞానము కలిగి యుండియు, జననాంతరము అట్టి జ్ఞానమును కోల్పోవును. బాలారిష్టములను దాటి తరుణ వయస్కుడైన పిమ్మట అవిద్యా కర్మబంధ మగు సంసారక్లేశమున చిక్కుకొనును. భగవత్ భక్తిచే ఆ కర్మబంధమును తొలగించుకొనగలిగియు అవివేకుడైన జీవుడు తొలగించుకొనడు” అని - కపిలరూపమున జన్మించిన నారాయణుడు తల్లి యగు దేవహూతికి ఉపదేశించెను.
వ్యాఖ్య:-
సంసారబంధం విషయంలో భాగవతం బోధించిన తత్త్వాన్ని చూద్దాం.
మాయ వల్ల దృఢమైన సంసార బంధాలలో బంధింపబడిన జీవుడు ప్రయోజనాన్ని ఆశించిన వర్తకుని లాగా లాభదృష్టితో కర్మలను ఆచరిస్తూ సంచరిస్తాడు. సంసారమనే అడవిలో కామం, లోభం మొదలైన దొంగలు తిరుగుతూ ఉంటారు. ఆ దొంగలు ఇంద్రియాలను జయించలేని మనిషిని చుట్టుముట్టి పట్టుకొంటారు. వాడు దాచుకున్న ధర్మమనే మహాధనాన్ని దోచుకుపోతారు. అందువల్ల సంసారం పట్ల కోరికలు పెంచుకోకూడదు.
అడవి వంటి సంసారంలో కొడుకులు, స్నేహితులు, భార్యలు మొదలైన వారందరూ తోడేళ్ళు మేకలను భక్షించినట్లు నరునిపీక్కుతింటారు.
సంసార మనేది భయంకరమైన అడవిలోని మందిరం వంటిది. దాని చుట్టూ తీగలు, పొదలు దట్టంగా అల్లుకొని ఉన్నట్లు జీవి చుట్టూ ఆపద లుంటాయి. దుర్జనులనే కందిరీగలు జీవులను బాధిస్తూ ఉంటాయి. ఆ కారణంగా జీవులు ఆపదలకు లోనవుతారు.
ఇంకా ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడతాడు. అతడు విశ్వాన్నంతా ఒక గంధర్వ నగరంగా భావించి సంతోషపడుతూ ఉంటాడు.
అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాన్ని చూచి నిప్పుకోసం దాని వెంటబడి తిరిగినట్లు ధనం కోసం భాగ్యవంతుల ఇళ్ళచుట్టూ ఊరకే రాకపోకలు చేస్తూ వ్యథలకు లోనవుతాడు.
పెరుగుతున్న కుటుంబాన్ని పోషించుకొనడం కోసం ధనం సంపాదించాలనే ఆరాటంలో ఎండమావుల వెంబడి పరుగెత్తే మృగంలాగా మానవుడు పరుగులు పెడుతూ ఒకచోట నిలువక తిరుగుతూ ఉంటాడు.
రాజా! అడవిలో పోతున్నవాడు ఒకచోట ఏమరుపాటు పొంది సుడిగాలి వల్ల రేగిన దుమ్ము కళ్ళనిండా పడగా చూపు తప్పిపోయి దిక్కు తెలియక మరొక దిక్కుకు పోయినట్లు మానవుడు సంసారంలో త్రోవతప్పి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు.
ఇంకా ఒకచోట గుడ్లగూబల కూతలకు, కీచురాళ్ళ రొదలకు సమానమైన విరోధుల తిరస్కారాలకు దుఃఖిస్తూ ఉంటాడు. ఇంకొకచోట ఆకలితో బాధపడుతూ పిచ్చిచెట్ల పళ్ళను తినడానికి సిద్ధపడినట్లు పాపాత్ములైన దరిద్రులను ఆశ్రయిస్తూ ఉంటాడు. మరోచోట దాహంతో బాధపడుతూ వట్టిపోయిన నది దగ్గరికి పోయినట్లు ఇహపరాలకు విముఖులైన పాషండులను సేవిస్తూ ఉంటాడు. వేరొకచోట మంటలు చుట్టుకొన్నవాడు దావాగ్నిలో చిక్కుకొని బాధపడినట్లు దాయాదులను చేరి కష్టాల పాలౌతాడు.
ఇంకొకసారి శత్రుబాధల వలన భవిష్యత్తును కోల్పోయి రాజ్యంమీది కోరికతో తండ్రి, కొడుకులు, సోదరులు, పెద్దవారినైనా చంపుతూ చివరకు బలవంతుల చేత దెబ్బతిని సమస్త సంపదలను పోగొట్టుకొని బాధపడతాడు. గాలిమేడలవంటి సంసార సుఖాలను అనుభవిస్తూ సంతోషంగా ఉన్నా ననుకుంటాడు.
కొండ లెక్కేవాడు ముళ్ళు, రాళ్ళు గుచ్చుకొని పాదాలు బొబ్బలెక్కి బాధపడుతున్నట్లుగా గృహస్థాశ్రమంలో చేపట్ట వలసిన కార్యక్రమాలలో నానావిధాలైన బాధలతో వ్యసనాలతో పీడింప బడతాడు.
ఒక్కొక్కసారి ఆకలి మంటలకు తట్టుకోలేక ఇంట్లో అందరిమీద అనవసరంగా విసుగుకొని కసురుకుంటాడు. అడవిలో కొండచిలువ వాతబడి మెలికలు తిరిగి స్పృహ కోల్పోయినట్లుగా ఇల్లు అనే అడవిలో రాత్రివేళ నిద్రలో మైమరచి పొరలుతూ ఉంటాడు. అడవిలో గడ్డిచేత కప్పబడిన బావిలో పడిపోయి పాముకాటుకు గురి అయినట్లు సంసారంలో దుర్జనులు పెట్టే బాధలకు మనస్సు కల్లోలపడి కనులు గానక అజ్ఞానమనే చీకటిగోతిలో పడతాడు.
ఒక్కొక్కసారి తేనెకోసం తేనెతెట్టెను రేపి తేనెటీగల బారిన పడినట్లు సంసార సుఖాన్ని కోరి ఇతరుల భార్యలను, వస్తువులను కోరుకొని ఇంటి యజమానులచేతనో, రాజులచేతనో దెబ్బలు తింటాడు.
యౌవనంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ముసలితనంలో పరులపాలు చేసినట్లు సంసారి అయినవాడు చలికీ గాలికీ వానకూ ఓర్చుకొని సంపాదించిన సొమ్మును ఇతరులు హరింపగా దిగులుతో క్రుంగిపోతాడు. అంతే కాకుండా అడవిలో లభించిన అల్పజంతువుల మాంసంకోసం బోయలు కొట్లాడుకున్నట్లు సంసారంలో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ కొద్దిపాటి ధనంకోసం తన్నులాడుకొంటారు.
కొద్దిపాటి ధనం కలవాడు తనకున్న ఇల్లువాకిళ్ళతో తృప్తి పడక ఇతరుల ధనం కోరుకొని అందువల్ల అవమానాలను పొంది దుఃఖపడతాడు.
ఇంకా కొందరు వస్తువులను, డబ్బును పరస్పరం మార్చుకొనడలో పెరిగిన వైరంవల్ల ఆత్మచింత లేక అనుదినం అలమటిస్తారు.
మరికొందరు సంసారంలో సంచరిస్తూ ఆ సంసార పోషణకోసం మిక్కిలి ప్రయాసపడుతూ అందుకుగాను సంపదలను సమకూర్చుకొంటూ ఇహలోక సుఖాలనే కోరుకుంటూ శాశ్వతమైన మోక్షాన్ని కోరుకోకుండా చెడిపోతూ ఉంటారు. ఎప్పుడు అవసాన కాలపు యోగాన్ని చూడలేరు. మానధనులు, శౌర్యవంత
ులు పరస్పరం వైరం పెంచికొని యుద్ధంలో ఒకరినొకరు చంపుకొంటారు. అంతేకాని ఆ మూఢులు మోక్షమార్గాన్ని చూడరు.
ఇంకా కాలచక్రాన్నే నియమించిన ఆ విష్ణువును కొలువక కాకులు, గ్రద్దలు, కొంగల వంటి వారైన పాషండులతో స్నేహం పెంచుకొని వారిచేత మోసగింపబడతారు.
కొందరు బ్రాహ్మణకులంలో పుట్టి శ్రౌతం, స్మార్తం మొదలైన వైదిక కర్మలను నియమ నిష్ఠలతో చేస్తున్నా విషయసుఖాలకు లోబడి కాలప్రభావాన్ని తెలుసుకొనక ఉంటారు. చెట్టులాగా ఐహిక ప్రయోజనాలపై ఆసక్తి కలిగి, ఇంద్రియ సుఖాలకోసం భార్యాపుత్రులు మొదలైన వారియందు ఇష్టాన్ని పెంచుకొంటారు. మదపు టేనుగులకు భయపడిన బాటసారి లోతైన బావిలో పడిపోయిన విధంగా సంసారి మృత్యువనే ఏనుగు భయంతో కొండగుహ వంటి అజ్ఞానమనే చీకటిలో పడతాడు.
అందుచేత మాయను తొలగించుకొని, సంసార కారణమయిన నీ రాజభావాన్ని విడిచిపెట్టు. అన్ని ప్రాణుల పట్ల మైత్రి పెంచుకొని ఇంద్రియాలను జయించు. జ్ఞానమనే కత్తి చేపట్టి మార్గం చేసుకొని భయంకరమైన ఆ అడవినుండి బయటపడాలి.
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము / 15వ దశకము - కపిలోపదేశము / 15-8-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
పితృసురగణయాజీ ధార్మికో యో గృహస్థః
స చ నిపతతి కాలే దక్షిణాధ్వోపగామీ।
మయి నిహితమకామం కర్మ తూదక్పథార్థం
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః||
భావము:-
“గృహస్థ ధర్మము నాచరించుచు - దేవతలను, పిత్రుదేవతలను పూజించుచూ - క్రతువులను, కర్మలనూ ఆచరించెడు జీవుడు మరణానంతరమున దక్షిణ మార్గమున పోవును. ఆ మార్గమున చంద్రలోక ప్రాప్తి కలిగి, పుణ్యఫల మనుభవించి మరల జన్మను పొందును. గృహస్ధాశ్రమమున నిష్కామముగా తమ ధర్మమును నిర్వర్తించుచూ - తాము చేయు కర్మలను భగవదర్పితము చేయువారు మరణానంతరమున ఉత్తరమార్గమున పయనించెదరు. వారు సూర్యమండల మార్గము ననుసరించి పరమాత్మను చేరుదురు“ అని - కపిలరూపధారి యైన నారాయణుడు తల్లి యగు దేవహూతికి తెలిపెను.
వ్యాఖ్య:-
భట్టతిరి వారు చెప్పిన విషయాన్నే శ్రీక్రృష్ణులవారు భగవద్గీతలో బోధించిన వైనం చూద్దాం.
యత్ర కాలే త్వనావృత్తిం
ఆవృత్తిం చైవ యోగినః ।
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ।। 23 ।।
అగ్నిర్జ్యోతిరహః శుక్లః
షణ్మాసా ఉత్తరాయణమ్ ।
తత్ర ప్రయాతా గచ్ఛంతి
బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ।। 24 ।।
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ ।
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ।। 25 ।।
శుక్లకృష్ణే గతీ హ్యేతే
జగతః శాశ్వతే మతే ।
ఏకయా యాత్యనావృత్తిమ్ అన్యయావర్తతే పునః ।। 26 ।।
అర్ధం - ఈ లోకం నుండి వెళ్లి పోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను, ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, దీనిలో ఒకటి మోక్షమునకు మార్గము మరియొకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మం గురించి తెలుసుకొని, ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో, శుక్ల పక్షంలో, పగటి పూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమ పదాన్ని చేరుకుంటారు. వైదిక కర్మ కాండలని ఆచరిస్తున్నవారు, దక్షిణాయన ఆరు మాసాల్లో, కృష్ణ పక్షంలో, ధూమ్ర కాలంలో, రాత్రిపూట, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినవారు - స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలని అనుభవించిన తరువాత, తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ రెండు - ప్రకాశవంతమైన మరియు చీకటి, మార్గాలూ ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారి తీస్తుంది.
ఈ శ్లోకాలలో శ్రీ కృష్ణుడు అర్జునుడు అడిగిన, “మృత్యు సమయంలో నీతోనే ఏకమై ఎలా ఉండవచ్చు?” అన్న ప్రశ్నకు సమాధానంగా. రెండు మార్గాలు ఉన్నాయి అని శ్రీ అంటున్నారు.
తేజోవంతమైన మార్గము మరియు అంధకారము తో ఉన్న మార్గము. ఇక్కడ, నిగూఢమైన అర్థంతో ఉన్న ఈ వాక్యాలలో, వెలుగు-చీకటి విషయపరంగా, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవటానికి అద్భుతమైన ఉపమానాన్ని మనం గమనించవచ్చు.
ఉత్తరాయణ కాలము, శుక్ల పక్షము, పగటి పూట – ఇవన్నీ వెలుతురు/ప్రకాశాన్ని సూచించేవే. వెలుతురు జ్ఞానానికి సూచిక. చీకటి అజ్ఞానానికి సూచిక.
దక్షిణాయన కాలము, కృష్ణ పక్షము, రాత్రి పూట – ఇవన్నీ అంధకారానికి నిదర్శనం. ఎవరికైతే అంతఃకరణ భగవంతుని యందే స్థితమై ఉందో, ఇంద్రియ భోగాల నుండి విడిపోయిందో, వారు తేజోమంతమైన మార్గంలో (విచక్షణా బుద్ది మరియు జ్ఞానము) వెళ్తారు. భగవత్ ధ్యాస లోనే స్థితమై ఉండటం వలన వారు భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటారు మరియు ఈ సంసార చక్రం నుండి విముక్తి చేయబడుతారు.
కానీ, మనస్సు ఈ భౌతిక ప్రపంచము యందే మమకారాసక్తితో ఉన్నవారు, అంధకార మార్గంలో (అజ్ఞానము) విడిచి వెళ్తారు. శారీరిక దృక్పథం తోనే గడిపే జీవితంలో చిక్కుకోనిపోయి, మాయలో భగవంతుని నుండి విముఖమై, వారు, జనన మరణ చక్రములో పడి తిరుగుతూనే ఉంటారు.
ఒకవేళ వారు వైదిక కర్మకాండలను చేసి ఉంటే, వారు తాత్కాలికంగా స్వర్గాది లోకాలకు వెళ్ళినా, తిరిగి భూలోకం లోకి రావలసినదే. ఈ ప్రకారంగా, అందరు మానవులు ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక దానిని అనుసరించాల్సిందే. ఇక, వారి వారి కర్మల అనుగుణంగా, వారు ప్రకాశవవంత మార్గంలో పయనిస్తారా లేక చీకటి మార్గంలో పయనిస్తారా అనేది వారి పైనే ఆధారపడి ఉంటుంది.

తృతీయ స్కంధము / 15వ దశకము - కపిలోపదేశము / 15-10-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
పరమ! కిము బహుక్త్యా త్వత్పదాంభోజభక్తిం
సకలభయవినేత్రీం సర్వకామోపనేత్రీమ్।
వదసి ఖలు దృఢం త్వం తద్విధూయామయాన్మే
గురుపవనపురేశ త్వయ్యుపాధత్స్వ భక్తిమ్||
భావం:-
పరమాత్మా! “నీ పాద పద్మముల యందు కలిగిన భక్తి – సకల భయములను తొలగించును. సకల అభీష్టములను నెరవేర్చును” అని నీవే స్వయముగా మరియు ధృఢముగా పలికితివి. ప్రభూ! ఇంతకుమించి స్తుతించలేని వాడను నేను. నా రోగమును తొలగించి - నీ యందు నాకు ధృఢమైన భక్తిని ప్రసాదించు.
వ్యాఖ్య:-
ఈశ్లోకం లో వివరించినట్లు భగవంతుణ్ణి పొందాలంటే భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. ఆ
శ్లోకం:-
శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం!!
'పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధం.
తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!
అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.
కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తిఉత్తమం.
వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.
స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.
పాదసేవన భక్తి : భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.
అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్ఠించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.
వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.
దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. హనుమంతుడు,
లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.
సఖ్య భక్తి : సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.
ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి: ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటి కన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు. తృతీయ స్కంధము పరిపూర్ణము15వ దశకము సమాప్తము.
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము
16వ దశకము - నరనారాయణుల అవతారము వర్ణనము/16-1-శ్లోకం.
🕉🌞🌎🌙🌟🚩
దక్షో విరించితనయో౾ థ మనోస్తనూజాం
లబ్ద్వా ప్రసూతిమిహ షోడశ చా౾ ప కన్యాః।।
ధర్మే త్రయోదశ దదౌ పితృషు స్వధాం చ
స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే త్వదంశే।।
భావము:-
బ్రహ్మపుత్రుడైన దక్షుడు, మనువు కమార్తె అయిన ప్రసూతిని వివాహమాడెను. వారికి పదహారుమంది కుమార్తెలు కలిగిరి. దక్షుడు వారిలో పదముగ్గురును "ధర్మునికి" ఇచ్చి వివాహము చేసెను. "స్వధా" అను కుమార్తెను పితరులకు, "స్వాహా"ను అగ్నిదేవునికి, "సతీ దేవి"ని పరమాత్మ అంశుడైన శివునికి ఇచ్చి వివాహము చేసెను.
వ్యాఖ్య:-
ప్రసూతి ఒక హిందూ దేవత, స్వాయంభువ మనువు, శతరూప యొక్క కుమార్తె, దక్షుడు భార్య, అనేక మంది కూతుర్లకు తల్లి. ఈమెకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకూతి, దేవహూతి తోడబుట్టిన వారు. స్వాయంభువ మనువు, తన మొదటి కుమార్తె అకూతిని రుచి ప్రజాపతికి, మధ్య కుమార్తె అయిన దేవహుతిని కర్దమ ప్రజాపతికి, చిన్న కుమార్తె ప్రసూతిని దక్షప్రజాపతికి అప్పగించాడు.
ఈ వివాహం హిందూమతంలో మొట్ట మొదటి వివాహం. వీరు ఇద్దరూ పదహారు (16) మంది కుమార్తెలకు జన్మనిచ్చారు. వీరిలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి, క్రియ ఈపదిమువ్వురు (13) కుమార్తెలను ధర్ముడుకు ఇచ్చి వివాహం చేశారు. అలాగే స్వాహాదేవిని అగ్నిదేవుడుకు, స్వధను పితృ దేవతలకు, సతి(పార్వతి)ని శివుడుకు
ఇచ్చి వివాహం చేశారు. ఇక 13 మంది పుత్రికల విశిష్ఠత చూద్దాం.
.
శ్రద్ద - శ్రుతము (వినవలసినది), : ధర్మమును శ్రద్దగా వినుము.
మైత్రి - ప్రసాదము (ప్రసన్నత/ అనుగ్రహము) : ధర్మము నందు మైత్రి (స్నేహం) తో ఉండుట వలన ప్రసన్నత కలుగును.
దయ - అభయము : ధర్మముతో కూడిన దయ వలన అభయము కలుగుతుంది.
శాంతి - సుఖము : ధర్మముతో కూడిన శాంతి వలన సుఖము లభిస్తుంది.
తుష్టి (సంతృప్తి) - సంతోషం : ధర్మం తో కూడిన సంతృప్తి వలన సంతోషం.
పుష్టి (బలము) - స్మయం (ఆశ్చర్యం) : ధర్మం తో కూడిన బలం వలన ఆశ్చర్యకరమైన ఫలితములు.
క్రియ (పని) - యోగము : ధర్మం తో చేసిన పని వలన ఆ పని తప్పని సరిగా యోగిస్తుంది.
ఉన్నతి - దర్పము : ధర్మం తో కలిగిన ఉన్నతి వలన దర్పం ప్రప్తిస్తున్నది.
బుద్ధి - అర్ధం (లాభం/ ప్రయోజనం) : ధర్మం తో కూడిన బుద్ధి వలన లాభం కలుగుతుంది.
మేధ - స్మృతి (జ్ఞాపకం) : ధర్మం కలిగిన మేధ వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
తితిక్ష(ఓర్పు) - క్షేమము : ధర్మం తో కూడిన ఓర్పు సర్వదా క్షేమకరం.
హ్రీ (లజ్జ/సిగ్గు)- అనునయము : ధర్మముతో కూడిన సిగ్గుకు సర్వదా అనునయము చేరుతుంది.
మూర్తి (రూపం)- నరనారాయణులు : మనలో ధర్మం సాంతం మూర్తీభవించి మనల్ని కాపాడుతూంటారు.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము
16వ దశకము - నరనారాయణుల అవతారము వర్ణనము/16-9-శ్లోకం.
🕉🌞🌎🌙🌟🚩
దక్షుని యజ్ఞం లో సతీదేవి కి జరిగిన పరాభవం కైలాసంలో ఉన్న శివునికి వామ నేత్రం చలించింది . వీరభద్రుడు భద్రకాళి కలిసి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయటం.
దక్షస్తు ధాతురతిలాలనయా రజోం౾ధో
నాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్।
యేన వ్యరుంధ స భవత్తనుమేవ శర్వం
యజ్ఞే చ వైరపిశునే స్వసుతాం వ్యమానీత్।।
భావము:-
బ్రహ్మకు మిక్కిలి ఇష్ట పుత్రుడైన దక్షుడు రజోగుణము ప్రకోపించి గర్వాంధుడై - పరమాత్మవైన నిన్ను సహితము గుర్తించలేని దుస్థితికి చేరి అశాంతికి లోనయ్యెను. ఆస్థితిలో అతడు నీరూపమే అయిన పరమశివునిపై విరోధముతో శివ రహితమైన యజ్ఞమును తలపెట్టెను. అతడు శివునిపై వైరము పెంచుకుని తన కుమార్తె - శివుని పత్నిఅయిన సతీదేవిని అవమాన పరిచెను. (అవమానమునకు లోనైన సతీదేవి అచటనే తన దేహమును త్యజించెను)
వ్యాఖ్య:-
దక్షుడు ఆమెను శివుని కిచ్చి వివాహం చేశాడు. దక్షప్రజాపతి దక్షుడే. ప్రపంచ సృష్టి కార్యక్రమ నిర్వహణ దక్షుడే. కాని, అహంకారి అజ్ఞానంతో చేయి కలిపి దక్షుని హృదయాన్ని ఆక్రమించింది. అతడు అనుచితాలు ఆచరించసాగాడు.
ఒకసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. బ్రహ్మేంద్రాది దేవతలను, శ్రీ మహావిష్ణువును, మహర్షి బృందాన్ని యజ్ఞానికి ఆహ్వానించాడు. శివునికి మాత్రం ఆహ్వానం పంపలేదు. పైగా శివుడుగాని, అతని పరివారంలో ఎవరైనాగాని వస్తే, వారికి స్వాగత సత్కారాలు చేయరాదని తన పరివారాన్ని శాసించాడు.
కైలాసంలో సతీదేవికి తన తండ్రి యాగం చేస్తున్నాడనే వార్త తెలిసింది తన తండ్రి చేస్తున్న యాగాన్ని చూడాలనే కోరికతో సతీదేవి, దక్షయజ్ఞానికి వెళ్ళడానికి శంకరుణ్ణి అనుమతి కోరింది. ఆహ్వానంలేని చోట అడుగు పెడితే అవమానం జరుగవచ్చునని, ఆహ్వానం లేకపోయినా, యజ్ఞానికి వెళ్ళవచ్చుననే శాస్త్రవాక్యం యథార్థమే అయినా, మమకారం చూపవలసిన పుట్టింటి వారే అహంకారంతో ప్రవర్తించి, ఆహ్వానం పంపని వేళలో స్వతంత్రించి, వెళ్ళి పారాభవం పొందడం మంచిది కాదని శివుడు ఆమెను అనునయించాడు. శివుడు ఎంతగా చెప్పినా, పుట్టింటిపై మమకారంవల్ల ఆమె యజ్ఞానికి వెళ్ళచానికే మొగ్గుచూపి, శివుణ్ణి పరిపరి విధాల ప్రార్ధించింది. చేసేది లేక, శివుడు 'సరే' అన్నాడు.
సతీదేవి యాగశాలకు వచ్చింది. ప్రవేశద్వారం వద్ద నిలబడిన సతీదేవిని ఎవ్వరూ లోనికి ఆహ్వానించలేదు. ఆదరంగా పలుకరించలేదు. దక్షుని ఆజ్ఞకు బద్దులై అందరూ మౌనం వహించారు. తల్లిదండ్రులు తనను కనీసం పలుకరించక పోవడం సతీదేవిని బాధించింది. ఆమె ఎలాగో ఆ బాధను దిగమ్రింగుకొని, ఓపిక పట్టింది. ఆ కథ అంతటితో ముగియ లేదు. శివుడు దిగంబరుడని, విషమనేత్రుడని, కపాల మాలాధరుడని, ఒడలెల్ల బూడిద పూసుకొని, బిచ్చమెత్తుకుంటూ తిరిగే హీనుడని, శ్మశాన సంచారుడు కనుక అపవిత్రుడని, శవుణ్ణి అవహేళన చేశాడు దక్షుడు. అందువల్లనే తాను శివుణ్ణి యాగానికి ఆహ్వానించలేదని అన్నాడు. తనకు స్వాగత సత్కారాలు చేయకుండా ఉపేక్షించినా సహించిన సతీదేవి, దక్షుడు చేసిన శివనిందను భరించలేక పోయింది. తన భర్తకు ఇష్టం లేని చోటుకు తాను వచ్చినందు వల్లనే తనకు ఇలాంటి దు స్ధ్సితి వచ్చిందని భావించింది. ఇకపై తన దేహం శివునకు ప్రీతిపాత్రం కాదని నిర్ణయించుకొని తన మనశ్శక్తితో అగ్నిని కల్పించుకొని, మరుజన్మలో మహేశ్వరుడే తనకు భర్త కావాలని మనసా భావించి, తన దేహాన్ని అగ్నిలో దగ్ధం చేసింది.
కైలాసంలో నిశ్చల ధ్యాన ముద్రలో ఉన్న శివునకు వామనేత్రం చలించింది. సతీదేవికి జరిగిన పరాభవం, ఆమె తనుత్యాగం, ఈశ్వరుని దివ్యచక్షువులకు గోచరించాయి. శివుడు తన జడనొక దానిని పెకలించి నేలపై కొట్టాడు. అందుండి పది చేతులు గల వీరభద్రడు ఆవిర్భవించాడు. అతడు శివుని ఆజ్ఞ మేరకు దక్షయజ్ఞాన్ని ద్వంసం చేయాలని నిశ్చయించుకున్నాడు కాని, తనకు శక్తి సహకారం లేనిదే తాను తన కర్తవ్యాన్ని నిర్వహింప జాలనని విన్నవించాడు అపుడు శివుడు తన జటాజూటంలోని వామభాగం నుండి ఒక జడను నేలపై తాకించగా, భద్రకాళి అనే శక్తి ఆవిర్భవించింది. అపుడు వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై దక్షయజ్ఞాన్ని ద్వంసం చేశాడు.
సతీవియోగ తప్తుడైన శంకరుడు విరాగ భావంతో కైలాస శిఖరం పై తపస్సు ప్రారంభించాడు.
🕉🌞🌎🌙🌟🚩
16-10 శ్రీమన్నారాయణీయం.
వీరభద్రుడు భద్రకాళి చేసిన ధ్వంసం తర్వాత శివుని సాక్షాత్కారం దేవతల కోరిక మేరకు🙏
దక్షునికి శివుడు పునర్జీవనం ప్రసాదించుట🙏
మేక ముఖ దక్షుడు శివునికి అంజలి ప్రకటించుట.
Om Namaha Shivaya:
ఓం నమః శివాయ:
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము
16వ దశకము - నరనారాయణుల అవతారము వర్ణనము/16-10-శ్లోకం.
🕉🌞🌎🌙🌟🚩
కృద్దేశమర్దితమఖః స తు కృత్తశీర్షో
దేవప్రసాదితహరాదథ లబ్ధజీవః।
త్వత్పూరితక్రతువరః పునరాప శాంతిం
స త్వం ప్రశాంతికర! పాహి మరుత్పరేశ।।
భావము:-
మహాశివుడు కోపోద్రిక్తుడై దక్షయజ్ఞమును ధ్వంసము చేసెను. దక్షుని శిరస్సును ఛేదించివేసెను. అప్పుడు దేవతలు ప్రార్ధించగా మహాశివుడు తిరిగి దక్షుని పునర్జీవితుని జేసెను. యజ్ఞేశ్వరుడవైన నీవు సాక్షాత్కరించి - దక్షయజ్ఞమును పూర్తిగావించితివి. దక్షుడు నిర్మలాంతఃకరుణుడై శాంతిని పొందెను. శాంతిని ప్రసాదించు గురవాయూరు పురాధీశా! నారాయణమూర్తీ ! నన్ను రక్షింపుము.
వ్యాఖ్య:-
దక్షయజ్ఞ విధ్వంసం ముగిసి, వీరభద్రుడు వెడలిపోయిన తర్వాత యజ్ఞవాటిక బీభత్సమయంగా తయారైన ఆ ప్రాంతంలో హతులయిన వారిని వెతుక్కుంటూ వారి - వారి బంధుగణాలు అంతులేని ఆక్రోశంతో అక్కడకు చేరుకున్నాయి. ఒకర్నొకరు ఓదార్చుకున్నారు.
అందరూ కూడ బలుక్కొని, ప్రాణాలు దక్కించుకున్నవా రందరూ ఏకమై బ్రహ్మ చెంతచేరి తమకేదో దారి చూపించమన్నారు. ప్రజాపతి మార్గదర్శిగా వైకుంఠవాసి చెంతకు చేరారు.
అందరూ.బాగా యోచించిన మీదట, వైకుంఠడు చెప్పిన ఉపాయం మేరకు అందరూ తిరిగి మహాశ్మశాన వాటిని తలపింపచేసే యజ్ఞ వాటిక చెంతచేరి, అక్కడనుండే పరమశివుని ప్రార్థించసాగారు. భక్తజన సులభుడు ఐనవాడూ; ఆర్తజన వశంకరుడైనవాడు కనుక - వెంటనే శంకరు డక్కడ నిలిచాడు.
నిత్యశ్మశాన వాసికదా! అందులోను సతీదేవి మరణం వల్ల కలిగిన విచారంతో ఉన్నవాడాయె! వైరాగ్యం ఆవరించిన మహాదేవుడి కంట నీరు తెప్పించేలా వున్నాయి అక్కడి హృదయవిదారక దృశ్యాలు. యజ్ఞవాటిక బీభత్సాన్ని కళ్లారా చూశాక, తన ఆవేశం తెచ్చిన అనర్థమే ఇదంతా అని గ్రహించిన పరమశివుడు, మరింత కరుణాంత రంగుడయ్యాడు.
వీరభద్రుడు వినయంగా వెంట నిలుచుని ఉండడాన్ని గమనించిన శూలి, "యాగం కొనసాగకుండా నాశనమయ్యేలా చేయడమంటే, ఇంతమంది వినాశనానికి కారకుడయ్యావు కదయ్యా వీరభద్రా!" అని, అక్కడ మృతులై పడివున్నవా రందరిపైనా తన అమృతదృష్టి ప్రసరించాడు. క్షతగాత్రులు తాము కోల్పోయిన అవయవాలను తిరిగి పొందినప్పటికీ, ఒకరి అవయవా లొకరికి అతికించడం వల్ల అంగవైకల్యం ప్రాప్తించకుండా మిగిలారు.
హస్తాలను కోల్పోయిన అశ్వని దేవతలకు - పూషుడు చేయూత నిచ్చాడు. కనుబొమలను కోల్పోయిన భృగువుకు మేక వెంట్రుకలతో తిరిగి కనుబొమలు అద్దడం జరిగింది.
ఇది చూశాక బ్రహ్మకు కూడా చిరు ఆశ చిగిరించింది. సమస్త విశ్వ సృష్టినీ చేయగలిగినప్పటికీ - దేవతల్ని తన సృజనశక్తితో బతికించగల నేర్పు ఎటూ తనకు లేనందున తన కుమారుడైన దక్షప్రజాపతిని సైతం, ఆ పరమేశ్వరుడే పునర్జీవితుడ్ని చేయగలడని ఆశించాడు బ్రహ్మ. మహేశ్వరుడిని స్తుతించసాగాడు.
"ఓ సర్వేశ్వరుడా! సర్వవ్యాపీ! విశ్వరూపా! విశ్వాత్మా! ఆపద్బాంధవా! జగద్రక్షకా! ప్రపంచంలోని సమస్త ప్రాణుల్నీ సృష్టించడానికీ, పోషించడానికీ లయింప చేయడానికీ కర్తవైన నీకు అనంతకోటి ప్రణామాలు! పుత్రశోక పీడితుడినైన నన్ను కరుణించి, నాకు శరణము ప్రసాదించు మహేశ్వరా!" అని సాష్టాంగపడ్డాడు.
దయాళువైన ఆ బోళాశంకరుడు "సురజ్యేష్ఠా! దక్షుని మరణానికి ఎవరూ కర్తలు కారయ్యా! అతడి అహంకారమనే కర్మమే, అతడిని మట్టుపెట్టినది. తన ఆధిపత్యమును చాట జూచువాడు ఇతరుల అధిపత్యం ఔన్నత్యం గుర్తెరిగి ప్రవర్తించాలి! అది కనీస విచక్షణ. అట్టిదేమీ లేకనే విర్రవీగిన నీ పుత్రునికి హానికలిగినది. సరే! అయిందేదో అయింది.." అని వీరభద్రుని వైపు తిరిగి "వీరభద్రా! దక్షుని కశే బరంలో మొండెంనుంచి పాదాలవరకూ ఇక్కడ పడివుంది. తల మాత్రం కనిపించడం లేదు. కాస్త వెతికి తీసుకురావయ్యా!" అని ఆజ్ఞ ఇచ్చాడు.
"పరమేశా! నన్ను మన్నించాలి! వీరావేశంలో నేను దక్షుని శిరస్సు తెగటార్చినపుడు, అది యజ్ఞగుండమందు ఎగిరిపడింది. ఆనవాలు మిగలకనే భస్మమైపోయింది. తాము సెలవిస్తే, ఒక మేక శీర్షం ఉన్నది కనుక అది తీసుకురాగలను" అని నివేదించాడు వీరభద్రుడు.
ఒక్కక్షణం.. యోచించి, సరేనన్నాడు శివుడు. తక్షణం ఆ పని ఆచరించాడు వీరభద్రుడు. సాక్షాత్తు మహేశ్వరునిచే ప్రాణ ప్రతిష్టాపన గావించబడిన దక్షుడు పునర్జీవితుడై, బ్రహ్మకు బ్రహ్మానందం కలిగించాడు.
తన పునర్జీవానికి కారకుడైన, సర్వేశ్వరుణ్ణి వినయ వందనాలతో వీక్షించి "సనాతనమూర్తీ!ఆదిదేవా!సకలలోక రక్షకా! జగన్మంగళ మూర్తీ! ఈ పేర్లన్నిటికీ ఏకైక అర్హత గలిగియున్న నీపట్ల నేను ఆచరించిన అపరాధమునకు నన్ను మన్నించ పునఃపునః ప్రార్ధన. అన్ని పాపములను పోగొట్టు హరుడను పేరు సార్ధక నామధేయుడవై సదాశివా! నీకిదే అంజలి" అంటూ సాగిలపడ్డాడు ఆ మేషముఖ దక్షుడు.
దయా దృక్కులతో వీక్షిస్తూ "దక్షప్రజాపతీ! ఒక గొప్ప దివ్యోపదేశము గావించుచుంటిని! వినుము! ఈ లోకములో నాభక్తులు నాలుగు విధములుగా నుందురు. వారెవరెవరనగా... ఆర్తులు, జిజ్ఞా సువులు, అర్ధాతురులు, జ్ఞానులు.
వీరిలో మొదటివారైన ఆర్తులు మాయామేయ జగత్తునందు ఆపదలు కలగగానే ఆర్తితో తమ్ముకాపాడ వలసిందిగా వేడుకోగా, వారి పట్ల ఆర్తత్రాణ పరాయణుడ నగుచున్నాను.
రెండవ వారు
జిజ్ఞాసువులు.
వీరికి నాయందు గల అపారమైన భక్తిచేత శివ మయమైనట్లుగానే కనిపించే సర్వపదార్ధముల యందు నన్ను వెతుకుతూనే ఉంటారు. నన్ను శోధిస్తూనే ఉంటారు. వీరిలో ఇంకా జ్ఞానదశ అంకురస్థాయిలోనే ఉంటుంది. అందువల్ల అంతలోనే మాయకు లొంగిపోతూ - దాన్ని పునః చేదిస్తూ నా తత్వ జిజ్ఞాస (తెలుసుకోవాలనే కోరిక)లో పడుతూఉంటారు.
ఇక మూడవ శ్రేణి అర్ధాతురులు. భౌతిక ప్రపంచంలో జీవించడానికి అవసరమైన సకల అర్ధాలను (ధన, విజ్ఞా, భోగాదులు) అతృతతో కోరుతుంటారు.
చివరిదీ - శ్రేష్ఠమయినదీ జ్ఞాన విభాగం. ఈ శ్రేణిలోకి వచ్చే నా భక్తులు సామాన్యులవలె యోచించరు.
జ్ఞానములేకూండా నన్ను పూజించుట - స్మరించుట వృధా! నీవు కేవలం కామ్యకర్మలు ఆచరించ బూనుకొన్నావు. కర్మతో ఈ సంసారమును తరింపదలచావు. జపదాన యజ్ఞాదులు కర్మఫలములుగోరి చేయువారు అజ్ఞానులు. జ్ఞానము కలుగచేసే కర్మ ద్వారానే 'శివతత్త్వం' అని చెప్పబడే నా అఖండతత్త్వం అవగతం కాగలదు" అని బోధచేశాడు.
ఈ మహత్తర ఉపదేశం, సాక్షాత్ శివముఖ నిర్గత భాషణంబైన వాగ్భూషణం. బాగా దీన్ని అవగతం చేసుకున్న మహామునులు మొదలగు వారంతా జ్ఞానులయ్యారు. బ్రహ్మ కూడా తన కుమారునికి ఉచితరీతిని బోధలు చేసి తన లోకానికి పయనమయ్యాడు. అంతటా శాంతి వెల్లి విరిసింది.
వాస్తవానికి సతీదేవి మరణించినట్లుగా భావించరాదు. ఆమె దాక్షాయణిగా, తన అంశ చాలించింది! ఒక గొప్ప పరసాధన కోసం ఆమె సతీదేవి అవతారాన్ని విరమించింది. ఆ సాధనకోసం ఆమె మరొక అవతారం ఎత్తవలసి ఉంది" అంటూ ఆనాటికి సంధ్యచాయ లలము కొనడంతో కథాశ్రవణం చాలించాడు సూతమహర్షి. అంతా తమ - తమ విధి విహిత కృత్యాలలో నిమగ్నమయ్యారు. (శివపురాణం - సతీఖండం).
చతుర్థ స్కంధము 16వ దశకము సమాప్తము.
🕉🌞🌎🌙🌟🚩||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 17వ దశకము - ధ్రువచరితము వర్ణనము 2-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
అంకే పితుస్సురుచిపుత్రకముత్తమం తం
దృష్ట్వాధ్రువః కిల సునీతిసుతో౾ధిరోక్ష్యన్।
ఆచిక్షిపే కిల శిశుః సుతారాం సురుచ్యా
దుస్సంత్యజా ఖలు భవద్విముఖైరసూయా।।
భావం:-
సురుచి కుమారుడగు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చునియుండుట చూచి, ఒకానొక దినమున సునీతి కుమారుడగు ధ్రువుడు తానుకూడా తండ్రిఒడిలో కూర్చుండవలెనని ఉబలాటపడెను. అందుకు ఎంతమాత్రము ఓర్వని సురుచి, బాలుడైన ధ్రువుని అధిక్షేపించెను. ప్రభూ! భగవద్భక్తులు కానిచో వారిని అసూయ వీడదు కదా!
వ్యాఖ్య:-
ప్రపంచంలో అన్ని అనర్థాలకూ ముఖ్యకారణం అసూయ! పక్కవాడు పచ్చగా ఉంటే చూసి ఓర్చలేడు.అవతలివాడు ఆనందంగా ఉంటే అది చూసి సహించలేడు. ఇంకొకరిని నలుగురూ మెచ్చుకుంటే విని భరించలేడు. ఏదో ఒక రకంగా వాడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తాడు.అసూయ, అజ్ఞానం, స్వార్థం, మనిషిని పక్కదారి పట్టిస్తాయి. పతనాన్ని కల్గిస్తాయి ఇట్లాంటి వాటిని దూరం చేసుకోవాలంటే భ్గవంతునిపైన భక్తిని పెంచుకోవాలి. సేవాభావాన్ని పెంపొందించు కోవాలి. మన పూర్వజులు నడచిన బాటలో మనమూ నడవాలి. సత్యాన్నే పలకాలి. ధర్మాన్నే ఆచరించాలి.
ఇక ఈ శ్లోకం విషయానికొస్తే ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య సురుచికి ఉత్తముడనే కుమారుడు, చిన్నభార్య సునీతికి ధృవుడు పుత్రులుగా జన్మించారు. ధృవుడు పుట్టిననాటి నుంచి భక్తి పరాయణుడు. ఒకనాడు ఉత్తానపాదుడు తన పెద్దకుమారుడైన ఉత్తముని తన తొడపై కూర్చోబెట్టుకుని ప్రేమతో లాలించసాగాడు. ధ్రువుడు అది చూసి తాను కూడా తండ్రి ప్రేమాభిమానాలు పొందాలని ఆశగా ఆయన వద్దకు వెళ్ళాడు.
అక్కడే వున్న పెద్దరాణి సురుచి తన సవతిపై గల అసూయ చేత, ధ్రువుని వెనక్కి లాగేసి ”ఒరే… నేను పట్టమహిషిణి అయినందున నా కుమారుడు యీ సామ్రాజ్యానికి వారసుడయ్యాడు. కనుకనే చక్రవర్తి అంకపీఠం మీద కూర్చునేందుకు వాడికి అర్హత వుంది. నువ్వు నా సవతి పుత్రుడవు. రాజ్యార్హత లేనివాడవు. రాజ్యార్హత లేనివాడికి చక్రవర్తి ప్రేమాభిమానాలు పొందే అర్హత, అధికారం లేదు. పో….పో…” అంటూ కసిరికొట్టింది.
ధ్రువుడు చిన్నబుచ్చుకున్నాడు. పసివాడైన అతనికి పెద్దతల్లి చేసిన అవమానం వల్ల భరించరానంత దుఃఖం ముంచుకొచ్చింది. అతడు దుఃఖిస్తూ తన తల్లి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి మొరబెట్టుకున్నాడు. తన కుమారునికి కలిగిన దుఃఖానికి సునీతి చాలా ఆవేదన చెందింది. ఆమె ధ్రువుని ఓదారస్తూ ”నాయనా… ఈ లోకంలోని వారందరికీఅన్ని ప్రసాదించేవాడు శ్రీమన్నారాయణుడు. ఆయన ఎవరెవరి పూర్వకర్మఫలాన్ని బట్టి వారికి అదృష్ట అర్హతలను ప్రసాదిస్తాడు. నీ పెత్తల్లి కుమారుడి పూర్వకర్మననుసరించి రాజ్యార్హతనూ, తండ్రిగారి ప్రేమాభిమానాలనూ ప్రసాదించాడు. నువ్వు నావంటి అభాగ్యురాలి కడుపున పుట్టావుగాన నీకింతే ప్రాప్తం” అని బాధపడింది.
”అయితే నేనా శ్రీహరినే ఆశ్రయించి ఉత్తమోత్తముడినన్న ఖ్యాతి సంపాదించుకుంటాను” అని పలికిన ధ్రువుడు తల్లి అనుమతి పొంది తపస్సుకి బయలుదేరాడు. (విష్ణు పురాణం).
🕉🌞🌎🌙🌟🚩
17-4 శ్రీమన్నారాయణీయం.అడవులకు వెళ్ళిన ధ్రువునకు ఎవరు పంచాక్షరీ మంత్రము బోధిస్తారు? తపస్సు చేసే సమయంలో ధ్రువుడు ఏమి ఆహారంగా స్వీకరించాడు?
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 17వ దశకము - ధ్రువచరితము వర్ణనము 4-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
ఆకర్ణ్య సో ౾ పి భవదర్చననిశ్చితాత్మా
మానీ నిరేత్య నగరాత్ కిల పంచవర్షః।
సందృష్టనారదనివేదితమంత్రమార్గః
త్వామారరాధ తపసా మధుకాననాంతే।।
భావం:-
భగవాన్! ధ్రువుడు - ఐదు సంవత్సరముల బాలుడే అయిననూ అభిమానవంతుడు. సురుచి ఓర్వలేమి వాక్కులను సహించలేక (జీర్ణించుకొనలేక) పోయెను. తల్లి భోదనతో ఉత్తేజితుడై, నిన్ను అర్చించవలెనను ధృఢచిత్తముతో నగరమును వీడి తపోవనమునకు పోసాగెను. మార్గమధ్యమున నారదమహర్షి కనిపించి, మధువనమునకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పి, ధ్రువునికి ‘ద్వాదశాక్షరీ‘ మంత్రమునుపదేశించెను.
వ్యాఖ్య:-
స్వాయంభువ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యల వలన ధ్రువుడు (సునీతి) ఉత్తముడు (సురుచి) అనే ఇద్దరు కుమారులు కలిగారు.
కాలప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి నీకు తండ్రి తొడ పై ఎక్కే అధృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకా అధృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది.
ఆ పరుష భాషణానికి చింతాక్రాంతుడై ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో నాయనా కాలప్రభావం వలన నీ తండ్రి తనను దాసీ కంటే తక్కువగా చూస్తున్నాడని, కష్టం కలిగించే పలుకులైన సవతి సరైన విషయం చెప్పిందని, శ్రీహరి పాదధ్యానము వలన జరగనివి ఉండవని స్వాయంభువ మనువు శ్రీహరిని ధ్యానించి ఉత్తమ గతి పొందాడని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోడానికి రాజధాని నుండి అడవికి బయలు దేరాడు.
మార్గ మధ్యంలో నారదుడు కనిపించి ఎక్కడకు వెళ్ళుతున్నావు అని అడుగగా ధ్రువుడు అప్పడి వరకు జరిగిన వృత్తాంతం తన సవతి తల్లి చేత పొందిన అవమానం చెబుతాడు. నారదుడు ధ్రువుడిని ఓదార్చి రాజధాని నగరము పంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ధ్రువుడి పట్టుదలకు మెచ్చి యమునా నది తీరములో ఉన్న మధువనంలో ధర్భాసీనుడవై ప్రాణాయామ నిష్ఠతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రము ఉపదేశిస్తాడు. ధ్రువుడు యమునానదిలో త్రికరణ శుద్ధిగా స్నానము చేసి దర్భాసీనుడై నారాయణు గురించి తపస్సు చేస్తాడు.
ముందు మూడు రోజులకు ఒకమారు వెలగ పండు లేదా రేగి పండు తినేవాడు తరువాత ఆరు రోజులకు ఒకమారు పండి రాలిన ఆకులు తింటు తపస్సు చేశాడు. ఆ తరువాత మూడు నెలలకు తొమ్మిది రోజులకు ఒకమారు మంచి నీరు త్రాగి తపస్సు చేశాడు. ఆ తరువాత 12 రోజులకు ఒకమారు గాలి పీల్చి తపస్సు చేశాడు. మరికొన్ని రోజులకు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తూండగా సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం సృష్టించబడి దేవతలు నారాయణుడి వద్దకు వెళ్ళి విషయం విన్నవిస్తారు.
అప్పుడు నారాయణుడు ధ్రువుడు తన గురించి తపస్సు చేస్తున్నాడని, వాని వలన ఈ ఉపద్రవం వస్తున్నదని చెప్పి వానికి ప్రత్యక్షం అయ్యి దీక్ష విరమింప జేస్తానని చెబుతాడు.
🕉🌞🌎🌙🌟🚩
17-9 శ్రీమన్నారాయణీయం.
ధ్రువునకు పట్టాభిషేకం,
ధ్రువ నాకు వివాహం జరుగుట మొదలగునవి అన్ని తనకి భవిష్యత్తులో పొందబోయే అర్హతలు అర్హతలు.
ధ్రువుడు చివరి దశలో ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఇచ్చిన వరం ఏమిటి?
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 17వ దశకము - ధ్రువచరితము వర్ణనము 9-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
ఇత్యూచుషి త్వయి గతే నృపనందనో౾సౌ
ఆనందితాఖిలజనో నగరీముపేతః।
రేమే చిరం భవదనుగ్రహపూర్ణకామః
తాతే గతే చ వనమాదృతరాజ్యభారః।।
భావము:-
ప్రభూ! ఆవిధముగా ధ్రువుని అనుగ్రహించి నీవు అంతర్ధానమైతివి. అనంతరము ధ్రవుడు తనరాకకై ఎదురుచూచుచున్న సకలజనులకు ఆనందము కలిగించుచూ నగరమును చేరెను. నీ అనుగ్రహముచే సకలాభీష్టములు నెరవేరగా ధ్రువుడు సంతోషముతో జీవించెను. తండ్రియగు ఉత్తానపాదుడు వానప్రస్థము స్వీకరించి అడవులకేగగా రాజ్యభారమును స్వీకరించి, ధ్రువుడు - చిరకాలము, ఆదరమున ప్రజలను పరిపాలించెను.
వ్యాఖ్య:-
నారదుడి మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలా చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు.
భగవంతుని ఆరాధన చేసేవాడు. అలా అయిదవ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొటన వేలు తీసి భూమిమీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి అలా భూమండలం అటూ ఇటూ ఒరగడం ప్రారంభమయింది. ఇలా అపారమయిన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవతలు అందరూ భూమండలమే కంపించి పోతున్నది అని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇపుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యౌవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చేయమని చెప్పి పంపిస్తారు.
ఐదేండ్ల పిల్లవాడయిన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్లకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరకు వెళ్ళి స్వామీ మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి’ అన్నారు. అపుడు పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి ‘ఎవడురా నా గురించి ఇలా తపించినవాడు. వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నాను’ అని లక్ష్మీ సహితుడై, గరుడవాహనారూఢుడై భూమండలమునకు వచ్చాడు.
ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. కానీ ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ, స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి క్రిందికి క్రిందనుంచి పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అపుడు స్వామి ‘వీడు ఇలానే కూర్చుంటాడు. వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతాను అని సమస్తవేదములు ఉపనిషత్తులు వీనికి భాసించుగాక అని నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ద్రువుని శిరస్సు మీద ఉంచాడు.
ధ్రువుడు ఎటువంటి భాగ్యమును పొందాడో చూడండి. అందుకే ద్వాదశినాడు ధ్రువ చరిత్ర వింటే మీ అజ్ఞానం దగ్ధం అయిపోతుంది అంటారు.
ఆ శంఖం తలకి తగిలింది. అంతే! ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామీ నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మజన్మాంతరములకు నాకు కావలసింది ఏమిటో తెలుసా.
ఎప్పుడూ మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరుకి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మ్రుత్యుభాయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు.
అపుడు స్వామి అన్నారు ‘నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కానీ ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏమిటో తెలుసా.
ధర్మమూ అగ్ని కశ్యపుడు సప్తర్షులు కాలమునక్షత్ర మండలము ఋతువులు సూర్య చంద్రాది గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగులరాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువ మండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువ మండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతూ ఉంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు.
నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్టచివరి జన్మ’ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు.
అపుడు ధ్రువుడు అయ్యో, ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం’ అనుకోని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురువచ్చి స్వాగతం పలిగి అర్ఘ్యం ఇచ్చి లోపలి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తాన పాదుడు కొంచెం బాధగా వున్నాడు. నారదుడు ఉత్తనపాడుడిని ‘అంత బాధగా వున్నావేమిటి” అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ‘ఏమి చెప్పుకోను. నాకు ఇద్దరు భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే, వాడ
ు నా తొడ మీద కూర్చుంటాను అన్నాడు. సురుచిని చూసిన భయం చేత వానిని నా తొడమీద కూర్చోపెట్టుకోలేదు. సురుచి వారిని నారాయణుని గూర్చి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనస్సు గాయమును పొందింది’ అన్నాడు.
అపుడు నారదుడు ‘నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా! ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు’ అని చెప్పాడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు.
ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు.
ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వారములు పొంది వచ్చాడు అని కాదు ఉత్తాన పాదుడి సంతోషం. తనకొడుకు అడవులకి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు.
తండ్రి ‘చిరాయుర్దాయం కలుగుతుంది – ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు.
ఇదీ మర్యాద. అంతేకానీ అమ్మ దగ్గరకు వెళ్ళి ‘అమ్మా ఈయనను ఇన్నాళ్ళనుండి ఎలా భరిస్తున్నావమ్మా’ అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడయిన రచయిత రాసి మనదేశాన్ని నాశనం చేశాడు.
రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు.
ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది.
సురుచి కుమారుడయిన ఉత్తముడు ఉత్తర దిక్కున వున్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు.
కొడుకు మరణించాడన్న వార్తా విని సురుచి అరణ్యములో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టు అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించక పోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది.
తదనంతర కాలమందు ధ్రువుడికి వివాహం జరిగింది.
‘శిశుమారుడు’ అనే ప్రజాపతికి ఒక కుమార్తె, పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమెయందు ద్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకడిపేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తరువాత వాయుదేవుని కుమార్తె అయిన ‘ఇళ’ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెయందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు.
వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు. ఆయన కదలకుండా ధ్రువ పథమై ఉంటాడు. మిగిలినవి అన్నీ కదులుతుంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురుని వివాహం చేసుకున్నాడు.
భ్రమి అంటే కదలుత అని అర్థం. జ్యోతిశ్చక్రము నందు సూర్యమాన చాంద్రమానములచేత తిథులు నక్షత్రంలు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు ‘వత్సర’ – అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతము అయిపోయిన తర్వాత హద్దు కల్పము.
🕉🌞🌎🌙🌟🚩
ధ్రువునికి ధ్రువ నక్షత్రానికి గల సంబంధం ఏమిటి?శ్రీమన్నారాయణుని వరము చేత ఎవ్వరికి ఇవ్వని దృవపదం ధ్రువునికి ఎలా దక్కింది?
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 17వ దశకము - ధ్రువచరితము వర్ణనము 8-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
తావద్విబోధవిమలం ప్రణువంతమేనం
ఆభాషథాస్త్వమవగమ్య తదీయభావమ్।
రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః
సర్వోత్తరం ధ్రువపదం వినివృత్తిహీనమ్।।
భావం:-
ప్రభూ! నీవు శంఖముతో స్పృశించినంతనే ఆ ప్రభావమున ధ్రువుడు తత్వజ్ఞానమును పొంది నిర్మలాంతఃకరుణుడై నిన్ను స్తుతించెను. ధ్రువుని అభీష్టమెరిగిన నీవు అతనితో - “వత్సా! చిరకాలము రాజ్యపాలన గావించి తదనంతరము సర్వోన్నతమైనది మరియు పునరావృత్తరహితమైనది అగు ధృవపదమను పొందెదవు“. అని పలికి ధ్రువుని అనుగ్రహించితివి.
వ్యాఖ్య:-
ఆకాశంలో ఎన్నో నక్షత్రాలున్నా – ఉత్తర దిక్కున సప్తర్షి మండలంపైన ప్రకాశిస్తూ వెలిగే నక్షత్రమే ధ్రువ నక్షత్రం! ఎ ఎత్తైన స్థానంలో ఉన్న ధ్రువనక్షత్రం వెనుక లోతైన కథ ఉంది! తండ్రి తొడమీద కూర్చొనే కనీస స్థానాన్ని నోచుకోని ధ్రువుడు అత్యున్నత స్థానం యెలా చేరాడో చూద్దాం.
ధ్రువునికప్పుడు అయిదేళ్ళ వయసు. తన తండ్రి ఉత్తాన పాదుడు నిండుకొలువులో కూర్చొని ఉన్నాడు. తమ్ముడు ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చొని ఉన్నాడు. తనకీ కూర్చోవాలని అనిపించింది. ఆ ఆశతోనే తండ్రి దగ్గరికి చేరి చేతులుచాచాడు.పెద్దవాడేకాని ఉత్తమునికీ ధ్రువునికీ వయసులో పెద్ద తేడా లేదు.
“నాకొడుకు కూర్చున్న చోట నువ్వు కూర్చో తగవు… నా కడుపున మళ్ళీ పుడితే తప్పనీకు కూర్చొనే హక్కు లేదు. పో… పో అవతలికి” అని ధ్రువుణ్ణి చెయ్యి పట్టుకు ఈడ్చి కసిరి కొట్టింది. ఎవరో కాదు సవతి తల్లి సురుచి. ధ్రువుని తండ్రికి పెద్ద భార్య సునీతి కాగ రెండో భార్య సురుచి. ధ్రువుడు సునీతికి పుట్టినవాడు. సురుచి మాటే చెల్లేది, అంచేత తండ్రి అడ్డు చెప్పలేదు. అది ధ్రువుణ్ణి ఇంకా బాధించింది.
ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళాడు ధ్రువుడు. చెప్పుకొని కుమిలిపోయాడు. తన కడుపున పుట్టడమే దురదృష్టమంది. బాధని దిగమింగి – దేవుణి మీద మనసుపెట్టమంది.
ధ్యానంతో మనశ్శాంతి వస్తుందని, కష్ట సుఖాలను సమదృష్టితో చూడడం వస్తుందనీ చెప్పింది ఆ తల్లి. తండ్రి దగ్గర దొరకని స్థానాన్ని మించిన స్థానం సంపాదిస్తానన్నాడు ధ్రువుడు. దేవుని ధ్యానంలో ఉండడానికి తపస్సు చేసుకోవడానికి తల్లి అనుమతి కోరాడు. వయసుకు మించిన లక్ష్యం గనుక వద్దంది. ధృడ సంకల్పంతో ఎవరైనా సాధించవచ్చన్న తల్లి మాటను తల్లికి చెప్పి అనుమతి తీసుకొని అడవి మార్గం పట్టాడు.
త్రిలోక సంచారి నారదుడు తోవలో ఎదురయ్యాడు. ధ్రువుణ్ణి నిలువరించాలని అమ్మానాన్నలని అర్థం చేసుకోమని కోరాడు. భగవదనుగ్రహం సులభం కాదన్నాడు. ధ్రువుని పట్టుదలకు దారి విడువక తప్పలేదు.
ఇంద్రాది దేవతల అవాంతరాలను చెప్పి, ఆశీర్వదించి పంపాడు. నారదుడు చెప్పినట్టుగా యమునా నదీ తీరంలోని మధువనంలో మంత్రాల్ని జపించాడు. తపస్సుచేస్తూ సప్త ఋషులను దర్శించాడు. తన వృత్తాంతం చెప్పాడు. వారి ఉపదేశం తీసుకొని తపస్సు ప్రారంభించాడు. అయిదేళ్ళ పిల్లాడు అయిదేళ్ళు తపస్సు చేశాడు. ఇంద్రుడు కల్పించిన మాయా మృగాలకూ – తల్లి, పినతల్లి రూపంలో వచ్చిన మాయా మమతలకూ లొంగిపోలేదు. దీక్షతో ఉన్నాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు.
మాటరాని ధ్రువుని మనసులోని కోరికను తెలుసుకున్నాడు. ఎవ్వరికీ ఇవ్వని ధ్రువపదం ఇచ్చాడు. ధ్రువపదం చుట్టూ గ్రహాలు నక్షత్రాలూ తిరుగుతుంటాయి కదా, ప్రళయకాలంలో అన్ని లోకాలు నశించినా ధ్రువలోకమే ఉంటుంది. అయితే ఆ స్థానాన్ని ఇప్పుడే చేరడంకాదని, రాజ్యసుఖాల్ని అనుభవించి జీవితపు చివరిదశలో దివ్యస్థానాన్ని చేరుకుంటావని విష్ణువు చెప్పి మాయమయ్యాడు.

చతుర్ధ స్కంధము / 17వ దశకము - ధ్రువచరితము వర్ణనము 5-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
తాతే విషణ్ణహృదయే నగరీం గతేన
శ్రీనారదేన పరిసాంత్వితచిత్తవృత్తౌ।
బాలస్త్వదర్పితమనాః క్రమవర్ధితేన
నిన్యే కఠోరతపసా కిల పంచమాసాన్।।
భావం:-
ధ్రువుడు నగరము విడిచివెళ్ళిన అనంతరము ఉత్తానపాదుని హృదయము చింతాక్రాంతమయ్యెను., నారదమహర్షి ఊరడించగా - ప్రశాంతచిత్తుడయ్యెను. శ్రీహరీ! బాలుడగు ధ్రువుడు తన మనస్సున నీరూపమును నిలుపుకొని క్రమక్రమముగా కఠోర తపస్సునాచరించెను. అట్లు అయిదు మాసములు గడిచినవి.
వ్యాఖ్య:-
ధ్రువుడికి ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించిన నారదుడు ఆ పిల్లవాడు స్వామి అనుగ్రహానికి పాత్రుడవడం చూసి, అచ్చెరువంది ధ్రువుడితండ్రి అయిన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు.
ఉత్తానపాదుడు ఎదురువచ్చి స్వాగతం పలిగి అర్ఘ్యం ఇచ్చి లోపలి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధగా వున్నాడు. నారదుడు ఉత్తనపాడుడిని ‘అంత బాధగా వున్నావేమిటి” అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ‘ఏమి చెప్పుకోను. నాకు ఇద్దరు భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే, వాడు నా తొడ మీద కూర్చుంటాను అన్నాడు. సురుచిని చూసిన భయం చేత వానిని నా తొడమీద కూర్చోపెట్టుకోలేదు.
సురుచి వారిని నారాయణుని గూర్చి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనస్సు గాయమును పొందింది’ అన్నాడు. అపుడు నారదుడు ‘నీ కుమారుని గురించి నీవు బాధపడుతూ ఉన్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా!
ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింప బడుతున్నాయో దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు’ అని చెప్పాడు.
ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు.
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 17వ దశకము - ధ్రువచరితము వర్ణనము 10-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
17-10 శ్రీమన్నారాయణీయం / ధృవుడు ఎందుకు మరియు ఎవరితో యుద్ధం చేస్తాడు? ఎవరు యుద్ధము నుండి ఆపుతారు?
యక్షేణ దేవ! నిహతే పునరుత్తమే౾ స్మిన్
యక్ష్దైస్సయుద్ధనిరతో విరతో మనూక్త్యా।
శాంత్యా ప్రసన్నహృదయాత్ ధనదాదుపేతాత్
త్వద్భక్తిమేవ సుదృఢామవృణోన్మహాత్మా।।
భావం:-
దేవా! ఇట్లుండగా ఒకనాడు, ధ్రువుని సోదరుడగు ‘ఉత్తముడిని' ఒక యక్షుడు సంహరించెను. అప్పుడు ధ్రువుడు యక్షులతో యుద్ధము చేసెను. భీకరమైన ఆపోరు ధీర్ఘకాలము కొనసాగుచుండగా ‘స్వాయంభువు మనువు‘ తన మనుమడైన ధ్రువుని వద్దకు వచ్చి, యుద్ధమును నిలిపి వేయమని పలికి; "రోషమును - క్రోధమును" త్యజించమని ఉపదేశించెను. పితామహుని ఉపదేశమును స్వీకరించి ధ్రువుడు యుద్ధవిరక్తుడు అయ్యెను. శాంతముతో యుద్ధమునాపిన ధ్రువుడు, యక్షరాజగు కుబేరుని అనుగ్రహమును పొందెను. కుబేరుడు వరముకోరుకో అనగా మహాత్ముడైన ధ్రువుడు నీయందు ధృడభక్తిని మాత్రమే కోరుకొనెను.
వ్యాఖ్య:-
ధ్రువమైన స్థానం కలవాడు గొప కీర్తి కలిగిన పరమాత్మను ఎలా స్తోత్రం చేశాడో చూద్దాం.
నీకు నీవుగా మా హృదయం లోపల చేరి నిదురిస్తున్న శక్తిని మేలుకొలిపి నీ యందు మా దృష్టిని నిలిపేట్లు చేస్తున్నావు. నిదురపోయి ఉన్న నా వాక్కును ఉజ్జీవింపచేసావు. అందరి శక్తినీ అందించేవాడివి, అందరి శ్కతీ నీవే అయిన వాడివి. కేవల వాక్కునే కాదు, చేయీ కాలూ కళ్ళూ నాలికా అన్నీ, వీటిలో ఏది కదలాలన్నా పరమాత్మ వలనే. అన్ని ఇంద్రియాలలోకీ నీవు వెళ్ళి వాటి శక్తిని ఉజీవింపచేస్తావు. అటువంటి నీకు నమస్కారం
నీవొక్కడవే నీ యోగ మాయ అనే శక్తితో ప్రకృతితో మహత్ తత్వాన్ని, దానితో అహంకారమునూ, దానితో ఇంద్రియాలను సృష్టించి, ప్రవేశించి, సత్ అసత్తులోనూ,ప్రకృతిలోనూ మహదహంకారములో ప్రవేశించావు. ఒక్కడివే ఉన్నా చాలా మంది ఉన్నట్లు భాసిస్తావు. కట్టె ఆకారం బట్టి మంట ఆకారం మారుతూ ఉంటే, అగ్నే పలు రకాలుగా మారుతోంది అనిపించినట్లుగా నీవు కూడా పలు రకాలుగా ఉన్నట్లు భాసిస్తావు. వాస్తవముగా నీవు ఒక్కడవే.
పడుకుని లేచిన వాడు ఎలా చూస్తాడో నీవిచ్చిన జ్ఞ్యానముతో సకల ప్రపంచాన్ని చూస్తున్నాము. ప్రపంచం తెలియాలన్నా ప్రపంచాన్ని చూడాలన్న నీ అనుగ్రహమే కావాలి. మోక్షమూలమైనది నీ పాదం. కానీ ఈ విషయాన్ని అన్నీ తెలుసనుకునే జనులు ఎలా మరిచిపోతున్నారు.
పరిశుద్ధమైన బుద్ధికలిగి, బాగా పరిశీలించి మంచి బుద్ధిగా ఉంటున్న వారందరూ నీ మాయతో సంసారాన్నీ మోక్షాన్నీ ఇచ్చేవాడివి అయిన నీ గురించి తెలిసి కూడా మోక్షన్ని కోరక సంసారాన్ని అడుగుతున్నారు. నిన్ను సంసారం కోసం అర్చిస్తున్నారు. కల్పవృక్షాన్ని పట్టుకొని పురుగులు తినే శరీరాన్ని కోరుతున్నారు. దానికి నీ మాయే కారణం.
శరీరధారులకు ఆనందం నీ పాద పద్మాలని ధ్యానం చేయడం వలనా, నీ భక్తుల కథలు వినడం వలనా, కలుగుతుంది. వీటి వలన కలిగే ఆనందం సంసారములో ఉండే జనులు యముని కత్తి వేటు తప్పించుకోవడములో పొందుతున్నారు. కింద పడేసే విమానాలు వద్దు నాకు.
ఏమి చేస్తున్నా మాట్లాడుతున్నా నీ యందే భక్తి కలగాలి. నిరంతరం నిన్ను తలచుకొనే భక్తుల సావాసం చాలు. దాని వలన పరమ తీవ్రమైన మహాకష్టాలతో నిండి ఉన్న సంసారమనే మహా సముద్రాన్ని సులభముగా దాటుతాము. నీ కథలనే మత్తులో ఉన్న మాకు ఈ సంసారములో మునుగుతున్నా కూడా, మునుగుతున్నట్లు తెలియదు.
నిరంతరం నీయందే మనో వాక్కులూ లగ్నం చేసిన వారి పొరపాటున కూడా శరీరాన్ని, మరణ ధర్మం కలిగి ఉన్నదాన్ని స్మరించరు. శరీరాన్నే తలచనప్పుడు, శరీరం కోసం వచ్చేవారు, శరీరముతో వచ్చిన వారు, శరీరం వలన వచ్చేవారైన, భార్యా పిల్లలూ ఇల్లూ వెంట రావు. పుత్రులూ, మిత్రులూ, ఇల్లూ, విత్తం, ధార వీళ్ళంతా శరీరం వెంట తిరిగేవారు. నీ పాదారవింద మకరందాన్ని రుచి చూసిన వారు వీటిని కోరరు.
మేము ఏ ఏ ఆకారాలను కోరతామో ఆ రూపాలలో వచ్చావు. ఆహారముగా తినే మత్స్యాదులలో, పర్వతాలుగా, నదులుగా, పక్షులుగా, సర్పాలుగా, దేవతలుగా (వామనుడు) మనుషులుగా , ఎవరెవరు ఏ ఏ ఆకారలతో నిన్ను భావిస్తారో ఆ ఆకారములలో వచ్చావు. ఇన్ని రూపాలలో ఉన్నా వీటిలో ఉన్న దోషాలు ఏవీ నీకు అంటవు. నీవు సత్ కాదూ అసత్ కాదు. అన్నింటిలో ఉంటావు కానీ దేనిలోనూ ఉండవు. మహదాదులు ఉన్నాయి గానీ అవి నిజానికి లేవు. అవి అన్నీ నీ రూపాలే. ఇంతకంటే ఎక్కువ నేను ఏదీ తెలుసుకోలేను. అక్కడిదాకే నీ వాదాలన్నీ.
ప్రళయకాలములో ఈ సకల జగత్తునీ నీ కడుపులోకి తీసుకుని, సకలప్రపంచాన్నీ నీకు నీవే చూస్తూ పడుకుంటావు. కొంతకాలానికి అలా పడుకొని ఉన్న నీ నాభి నుంచి బంగారు పద్మం పుడుతుంది. అదే లోకపద్మం. దాని మధ్యలో చతుర్ముఖ బ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటారు.
స్థితావధిమఖో- పరమాత్మ జగత్తును రక్షించడానికే పుడతాడు. అధి మఖ అంటే…
-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 17వ దశకము - ధ్రువచరితము వర్ణనము 11-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
అంతే భవత్పురుషనీత విమానయాతో,
మాత్రా సమం ధృవపదే ముదితో ౾ యమాస్తే।
ఏవం స్వభృత్యజనపాలనలోలధీస్త్వం,
వాతాలయాధిప! నిరుంధి మమామయౌఘాన్।
భావం:-
అంత్యకాలమున ధ్రువుని కొరకు నీవు నీ సేవకులను (విష్ణు దూతలను), విమానమునూ పంపితివి. ధ్రువుడు తన తల్లితో కలిసి ఆ విమానమున పయనించి ‘విష్ణు పదమును‘ చేరి అచట ఆనందముతోనుండెను (ధ్రువుడు నెలకొనిన స్థానమగుటచే విష్ణు పదము - ధ్రువ పదమని పేరుగాంచినది). భక్తులపాలిట దయార్ధ్ర హృదయుడవై యుండు గురవాయూరు పురాధీశా! రోగమును నివారించమని నిన్ను ప్రార్దించుచున్నాను.
వ్యాఖ్య:-
భట్టతిరి వారి శ్లోక భావాన్ని చూశారు. అయితే ధ్రువ చరిత్రలో ముఖ్యంగా పట్టుకోవాల్సింది ధ్రువ స్తవం లోని భావాన్ని. అది ఎలా కొనసాగిందో చూద్దాం.
విష్ణుమూర్తి ధ్రృవుడితో అఞటున్నారు. "నీకు రాజ్యాన్నిచ్చి మీ త్రండ్రి అరణ్యానికి వెళ్ళినప్పుడు అన్నిభోగాలూ అనుభవిస్తూ (ఇంద్రియములకు అడ్డులేకుండా)36000 సంవత్సరాలు పరిపాలిస్తావు.
తరువాత కొంతకాలానికి నీ సోదరుడు వేటకు వెళ్ళి మరణిస్తాడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన అతని తల్లి దావాగ్నిలో ప్రవేశిస్తుంది.
నీవు నన్ను మంచి దక్షిణలతో కూడిన అనేక యజ్ఞ్యములతో ఆరాధించి, అన్ని భోగాలను అనుభవించి, చివరికి నన్ను గుర్తు చేసుకుంటావు.
అప్పుడు అందరిచేతా నమస్కరించబడే ధృవస్థానానికి వెళ్ళి, కొంతకాలం ఉండి, నన్ను జ్ఞ్యాపకం చేసుకుని నా లోకానికి వస్తావు".
ఇలా మాట ఇచ్చి పిల్లవాడు చూస్తుండగా గరుడ వాహనుడై తనలోకానికి తాను వెళ్ళాడు
ధృవుడు కూడా శ్రీమన్నారాయణుని పాద సేవన వలన తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నవాడై (లేదా పరమాత్మ సంకల్పాన్ని పొందినవాడై) కూడా ఎక్కువగా సంతోషించలేకపోయాడు. అలా ఎక్కువగా సంతోషించకనే తన నగరానికి వెళ్ళాడు.
మహామహులు కూడా ప్రత్యక్షం కాని స్వామిని ఆరు నెలలలో ప్రత్యక్షం చేసుకుని కూడా ఎందుకు ఎక్కువగా సంతోషించలేకపోయాడు
ఒక్క జన్మలోనే పరమాత్మ యొక్క పాద పూజ చేత, ఎంత గొప్పవరూ పొందలేని పరమాత్మ సనందిహి అయిన పరమపదన్ని పొంది కూడా, అనుకున్నదాన్ని పొందలేనివాడిలాగ
ఎదురుగా పరమాత్మ ప్రత్యక్షమైనా ధృవుని మనసులో పినతల్లి ఆడిన మాటలే వినపడ్డాయి. వాటినే తలచుకుంటూ పరమాత్మ నుండి ముక్తిని కోరలేక పోయాడు. అందుకు ముక్తినాధుడైన స్వామినుండి మోక్షము కోరలేదు. ఆ సంగతి తెలుసుకుని తరువాత బాధపడ్డాడు.
సనందాదులు ఎన్నో జన్మలు తపస్సు చేస్తే ఏ మహానుభావుడిని తెలుసుకుంటారో అలాంటి పరమాత్మను నేను ఆరు నెలలలో పొందాను. ఎదురుగా పరమాత్మను ఉంచుకుని కూడా నేను భేధ భావాన్ని పొందాను.
ఆహా! శరీరం మీద నాకు ఎంత ప్రేమ ఉంది! సంసారాన్ని తొలగించే పరమాత్మ పాదములు వదిలి అంతము గల పదవిని కోరాను.
ఇప్పుడు నాకర్థమయ్యింది. దేవతలు నా బుద్ధిని పాడు చేసారు. దేవతలు పాడు చేయడమంటే, మన ఇంద్రియాలన్నీ దేవతలే. (ఉదా: మనసు చంద్రుడు). మనం గర్వించడానికి ఏదీ లేదు. నేను చూస్తున్నా అంటే సూర్యుడు, వింటున్నా అంటే దిక్కులూ, నాలుకా అంటే వరుణుడు, నాసికా అంటే అశ్వనీ దేవతలు. ఇది వరకు జన్మలో చేసినదానికి పొందవలసిన ఫలితాన్ని పొందాలో, పొందవలసిన ఫలితానికి మనం ఎలా ఫలితాన్ని పొందాలో ఆవిధముగా ఇంద్రియాధిష్ఠాన దేవతలు పని చేయిస్తారు.
మనం పూర్వజన్మలో చేసిన పనికనుగుణముగానే ఇప్పుడు మన బుద్ధి కూడా ఉంటుంది. నారదుడు ముందే చెప్పాడు. పరమాత్మ ప్రసన్నమైనా నీవు పొందాలంకున్నది పొందగలవా, అని చెప్పాడు. నారదుని మాట నిజమే. అప్పుడు నేను గుర్తించలేదే.
తపస్సు చేశానని చెప్పుకుంటున్నాను గానీ, దైవ మాయచేత ఆరు నెలలు నిదుర పోయాను. నిదురపోయినవాడిలాగ భేధ దృష్టి కనపడింది. బాధలన్నీ రావడానికి మూలం, రెండవది ఉన్నది అనుకోవడం వలనే. పరమాత్మకన్నా వేరేదేదీ లేకున్నా నేను బాధపడుతున్నాను.
సోదరులూ, సోదరులపిల్లలు, వీరినే జ్ఞ్యాతులూ అంటారు. అంటే సోదరులలా ఉన్న శత్రువుల వలన హృదయానికి రోగం వచ్చింది. ఈ హృదయ రోగమే శత్రువు. దీని వలన తంపింపబడుతున్నాను.
మనోవ్యాధి అనే శత్రువుచేత భేధ బుద్ధి కలిగి నేను బాధపడుతున్నాను.
జ్ఞ్యాతీ అనేది శత్రువుకు పర్యాయపదం.
వ్యర్థమైన దానిని అడిగాను. ప్రాణము పోయిన వాటికి వైద్యం చేసినట్లుగా పనికి రాని వరాన్ని అడిగాను. తపస్సు చేసి ప్రసన్నం చేసుకోడానికి శక్తిలేని వాడిని, సంసారాన్ని పోగొట్టే వాడైన పరమాత్మను సంసారం అడిగాను. అదృష్టం లేని నేను ఇది కోరాను.
స్వారాజ్యం ఇస్తానన్న పరమాత్మను బిక్షమెత్తుకోవడానికి పాత్రని అడిగాను. డబ్బులే చూడని రైతు దగ్గరకు కోటీశ్వరుడు వెళ్ళి "ఏమి కావాలో అడిగితే" తారు ధాన్యాన్ని అడిగినట్లు పరమేశ్వరున్ని నేను ఇది అడిగాను.
ధృవుని పొరబాటు ఎక్కడ జరిగింది? పరమాత్మ యొక్క పాద ధూళిని పొందిన మీవంటి (విదురుని) వాళ్ళు, పరమాత్మ వచ్చి ఏమి కావాలంటే "నీ కైంకర్యం కావాలి" అంటారు గానీ, ఇంకో సంపద కోరరు. మనము ఏదో ఒక దానిని ఎందుకు కోరతాము? కొరత ఉంటే కోరతాము. పరమాత్మ పాద పరాగ స్పర్శ ఉంటే అన్నీ ఉన్నట్లే. సామాన్యమైన
జీవుడు ప్రకృతిలో వేటి వేటిని పొందగలడో అవి అన్నీ పరమాత్మకు దాసుడైన వాడు పొందుతాడు. వాటితో బాటు అన్నింటికన్నా శ్రేష్టమైన
పరమాత్మ దాస్యం లభిస్తుంది.
అందుకే భగవంతుని దాస్యాన్ని తప్ప మరి దేన్నీ కోరరు. (శ్రీమద్భాగవతం నుంచి)
చతుర్థ స్కంధము
17వ దశకము సమాప్తము.
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 18వ దశకము - పృథు చరిత్రము వర్ణనము 1-శ్లోకం.
🕉🌞🌎🌙🌟🚩
జాతస్య ధ్రువకుల ఏవ తుంగకీర్తేః
అంగస్య వ్యజని సుతస్స వేననామా।
తద్దోషవ్యథితమతిః స రాజవర్యః
త్వత్పాదే నిహితమనా వనం గతో౾ భూత్।।
భావము:-
ధ్రువుడు పరమపదమును సాధించిన మహాత్ముడు. ధ్రువుని తదనంతరము జన్మించిన ‘అంగుడు‘ ఉన్నత కీర్తిని పొందెను. అతని పుత్రుడగు ‘వేనుడు‘ దుశ్శీలుడై తన దుర్గుణములతో తండ్రి అయిన ‘అంగుని‘కి మిక్కిలి వ్యధను కలిగించెను. పుత్రుని దుర్మార్గపు ప్రవర్తనకు విరక్తుడై, అంగుడు - శ్రీహరీ! నీ పాదపద్మములందు తన చిత్తమును నిలిపి, రాజ్యమును త్యజించి -వనవాసమున కేగెను.
వ్యాఖ్య:-
అతి పురాతన కాలంలో, అంటే కృతయుగంలో మనుజులపై దండనీతి అమలు పరచే రాజనేవాడు ఉండేవాడు కాదు. ఒకరికొకరు రక్షకులై జనులు చరించేవారు. అయితే కొంతకాలానికి వారిలో లోభత్వం పెరిగి, ధర్మనిరతిని విడనాడి ఆకార్యాలకు పాలుపడటం మొదలు పెట్టారు. క్రమంగా కామము, రాగము దమము మొదలైన గుణాలు ప్రబలి మదమత్తులై విచ్చలవిడిగా సంచరిస్తూ వేదవిధ్వంసకులయారు.
ఈ విధంగా మనుష్యులు ధర్మం విడిచి వేదవిధులను విడిచిపెట్టడంతో ఇంద్రాది దేవతలు బ్రహ్మపాలికిజని “ఓ!దేవా! భూలోకంలో జనులు ధర్మచ్యుతులవడంవల్ల, వేదవిధులను విడిచిపెట్టి యజ్ఞయాగాది క్రతువులను విసర్జించారు. దానివలన మేము దుర్బలులమై నిన్ను శరణుజోచ్చాము. త్రాహిత్రాహి” అంటూ ఆ నలువను ప్రార్థించారు.
విరించి వారిని ఓదార్చి దీనికి నేను ప్రతివిధానం చేస్తాను. మీరు విచారించకండి అని చెప్పి స్వామ్య, మాత్య, రాష్ర్ట, దుర్గ, కోశ, సుహృద్బలంబులను, అన్వీక్షికీ (తర్కశాస్త్రం) త్రయీవార్త దండ నీతులను, అరిమిత్రోదాసీనాదిక ద్వాదశ రాజమందలములను, సంధి, విగ్రహ, యానాసన ద్వైదీభావ సమాశ్రయములను మొదలైనవానికి ప్రబోధకంగా అనేక విభాగాలు, అవయవాలు కలిగి ధర్మార్థ కామ మోక్షాలకు సాధకమాయి ఉండే విధంగా నీతిశాస్త్రమును నూరువేల ఆధ్యాయాలలో అఖిల లోక హితం కోసం రచించి ఇది లోక చరిత్ర నిర్మలీకరణకు కారణమవుతుంది అని చెప్పి, దానిని సురలకు ప్రసాదించాడు.
ఆ సమయంలో ఆలోక పితామహుడైన బ్రహ్మ లలాటమున అనాది నిధనుడు, విశ్వజగత్కర్త, సర్వభూతాత్ముడు, సనాతనుడు అయిన విరూపాక్షుడు విశాలాక్షుడనే పేరుతో ఆవిర్భవించి, ఆ గ్రంథాన్ని వీక్షించి దీనిని అభ్యసించడాని మానవులకు ఆయువు, బుద్ధి చాలవు. వారికి సుసాధ్యమాయే విధంగా దీనిని సంక్షేపించాలని తలచి, దానిని పదివేల అధ్యాయాలుగా సంక్లిప్తంచేశాడు.
విశాలాక్షునిచే రూపొందించడం వాళ్ళ అది వైశాలాక్షమణి పేరు పొందింది. శివునినుండి దానిని పొందిన దేవేంద్రుడు మానవమేధకు, ఆయువుకు ఆది కూడా అధికమేనని తలచి, దానిని సగానికి కుదించి అయిదువేల ఆధ్యాయాలుగా చేసాడు. అటు పిమ్మట దేవగురువు దానిని మూడువేల ఆధ్యాయాలకు సంక్షేపించాడు. తరువాత మూడువేల అధ్యాయాలకు సంక్షేపించాడు. తరువాత శుక్రుడు దానిని ఒక వేయి అధ్యాయాల పరిమితికి తీసుకువచ్చాడు. మనుష్యుల శక్తి ఎరిగిన ఋషులు దానిని సంక్లిప్తరూపంగా అనేక గ్రంథాలుగా విడదీసి దేనికది తెల్లమయే విధంగా ఏర్పరిచారు.
దేవతలు ఆ గ్రంథ సంచయాన్ని తీసుకుని విష్ణువు పాలికి పోయి, ఆ నీతిశాస్త్రం ఏర్పడిన విధానం ఆయనకు ఎరుకపరచి, ఓ! జగన్నాటక సూత్రదారీ! ఈ నీతి శాస్త్రమును అమలుపరచి లోకకల్యాణం చేయగల మహనీయుడేవరో సెలవోసంగావలసిందని ప్రార్థించారు.
శ్రీహరి తన తేజస్సుతో ఒక మానసపుత్రున్ని సృజించాడు. వానికి విరజుడు అని పేరిడి భూమికి ప్రభువుగా ఉండమన్నాడు. అయితే అతడు ఆ పనికి ఇచ్చగించలేదు. అతని కుమారుడైన కర్దముడు కూడా రాజ్యపాలానాకాంక్షలేక తపస్సుకి వెడలిపోయాడు.
ఆ కర్దాముని కుమారుడైన అనంగుడు శ్రీహరి పనిచిన కార్యాన్ని శిరసావహించి రాజ్యపాలన గావించాడు.
అనంతరం అనంగుని కుమారుడైన ‘నీతి’ ఆ మహాసామ్రాజ్యాన్ని అభిషిక్తుడయ్యాడు. ఇతడు ఇంద్రియలోలుడై యమపుత్రి అయిన ‘సునీథ’ అనే మహా సౌందర్య రాశిని వివాహమాహాడు. ఆమె గుణవిభాసిని అయినా వారికి జన్మించిన పుత్రుడు ‘వేనుడు’ అనేవాడు మాతామహదోషం వలన రాగద్వేషసమన్వితుడై ప్రజాకంటకుడయ్యాడు.
అందుచేత ఋషులు ఏతెంచి మంత్రపూతములైన కుశసంచయంతో అతన్ని ప్రశమతుని చేసి వాని దక్షిణి తోడను మధించారు. దానినుండి కాలిన కొరివి లాగా నల్లగా అతిపోట్టిగా ఎఱ్ఱనికన్నులతో ఒకడు పుట్టుకు వచ్చాడు. వానిని చూచి మునులు ‘నిషీద’ అని పలికి విసర్జించడం వలన వానిసంతానం నిషాదులు అనే పేరుతో విన్ధ్యాదిగిరివనాల్లో సంచరిస్తూ క్రూర స్వభావులై ప్రవర్తిల్లారు.
🕉🌞🌎🌙🌟🚩
*వేనుడు తల్లి సునీధ చేసిన తప్పు ఏమిటి ?
ఎవరి శాపం వల్ల వేనుడు ప్రజా కంటకుడిగా మారాడు?*
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 18వ దశకము - పృథు చరిత్రము వర్ణనము 2-శ్లోకం.
🕉🌞🌎🌙🌟🚩
పాపో౾పి క్షితితలపాలనాయ వేనః
పౌరాద్తైరుపనిహితః కఠోరవీర్యః।
సర్వేభ్యో నిజబలమేన సంప్రశంసన్
భూచక్రే తన యజనాన్యయం న్యరౌత్సీత్।।
భావం:-
‘అంగుడు‘ అరణ్యమునకు వెళ్ళగా - తదుపరి, పురజనులు ‘వేనుడు‘ని రాజ్యపాలకునిగా చేసిరి. పాపాత్ముడగు ‘వేనుడు‘ నిరంకుశుడై ప్రజాకంఠకుడుగా పరిపాలించసాగెను. భూమండలమున ప్రజలెవ్వరూ (శ్రీహరికై) యజ్ఞయాగాదులు చేయరాదని కట్టడి చేసెను.
వ్యాఖ్య:-
వేనుడి విషయంలో ఒక కధ తప్పక తెలుసుకోవాలి. సునీధ చక్కని చుక్క. ఒకరోజు ఆమె తన చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్లింది. ఆ వనంలో సుశంఖుడనే గంధర్వుడు వాగ్ధేవిని గురించి తపస్సు చేసుకుంటున్నాడు.
సునీధ ఆ మునిపుంగవ్ఞని చూసింది. అతని జుట్టు పట్టి లాగింది. అంతటితో ఊరుకోకుండా అతడిని కొట్టింది.
సుశంఖుడు కళ్లు తెరిచి సునీధను చూసి కుమారీ! కోపమెందుకమ్మా.
నేను నీకు ఏం అపకారం చేశాను. తపోభంగం కలిగించావ్ఞ. తాపసులు నీవ్ఞ కొడితే తిరిగి కొట్టరు.
తిడిగే తిరిగి తిట్టరు. ఆ విషయం తెలుసుకో. మా జోలికి రాకు. మా తపోదీక్షకు అంతరాయం కలిగించకు అని ఎంతో సౌమ్యంగా చెప్పాడు.
సునీధ ఇంటికి వెళ్లి వనంలో తాపసికి ఏ విధంగా తపోభంగం చేసి ఆటపట్టించిందో ఆ పాపకృత్యం అంతా తండ్రికి వివరంగా చెప్పింది.
యమధర్మరాజు కూతురుపై గల ప్రేమతో ఆమె చేసిన పని తప్పు పాపకృత్యమని చెప్పలేదు. విని మౌనం వహించాడు.
తండ్రి ఉపేక్షించడంతో సునీధ మర్నాడు మళ్లీ వెళ్లి సుశంఖుడికి తపోభంగం కలిగించింది. అంతేకాదు కొట్టి హింసించింది.
సుశంఖుడు కోపంతో రుద్రకారుడై, పాపాత్మురాలా! నీవ్ఞ చేసిన ఈ పాపకృత్యానికి తగిన ఫలం నీ ప్రథమ గర్భాన మహాపాపి నీకు జన్మించుగాక అని శపించాడు. ఇంటికి వెళ్లి సునీధ జరిగిన వృత్తాంతం తండ్రికి చెప్పింది.
జరిగిన దానికి యమధర్మరాజు ఎంతో విచారించాడు. ఈ విషయం గోప్యంగా ఉంచి కూతురికి పెళ్లి చెయ్యాలని నిశ్చయించాడు.
సునీధ శావ విషయం దేవలోకమంతా వ్యాపించింది. అందుచేత మెను వివాహం చేసుకునేందుకు ఎవరూ అంగీకరించలేదు.
యమధర్మరాజుకు ఆవేదన రోజురోజుకు పెరుగుతూంది. కూతుర్ని చూసినప్పుడల్లా యముడికి దుఃఖం పొంగుకొస్తుంది. మునులను తాపసులను సాధువ్ఞలను బాధించడం హాపాపం. నీ పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. కనుక నీవు వెంటనే తపోదీక్ష చేపట్టు అని కూతురికి చెప్పాడు.
తండ్రి ఆజ్ఞ మేరకు సునీధ తపస్సు చేయ సంకల్పించి అడవికి బయల్దేరింది. ఆమెకు తోవలో రంభ ఇతర అప్సరసలు కనిపించారు. సునీధ వారికి విషయం చెప్పింది. తపస్సు అంటే మాటలు కాదు నీలాంటి సుకుమారి తపస్సు చేయడం చాలా కష్టం. తట్టుకోలేవ్ఞ. ఇంద్రాది దేవతలే ఘోరమైన పాపకృత్యాలు చేసి శాపగ్రస్థులయ్యారు.
వారు చేసిన పాపాలతో పోలిస్తే నీవ్ఞ చేసిన పాపం ఏ పాటిది? ఉత్తమ స్త్రీకి ఉండవలసిన రూపం, శీలం, సత్యం, ఆర్యత్వం, ధర్మం, సతీత్వం, దార్ధ్యం సాహసం, గనం, వ్యవసాయం, కామం మధురవాక్కు అనే ద్వాదశగుణాలు నీలో కనబడుతున్నాయి.
నీవ్ఞ భయపడకు. కీర్తివంతుడైన భర్త నీకు లభిస్తాడు అని సునీధకు ధైర్యం చెప్పింది రంభ. పురుష సన్మోహన విద్య ఉపదేశించింది.
సునీధ తపపస్సు మాట విడిచి వారి వెంట వెళ్లింది. భాగీరథీ తీరంలో ఒక మంచి పుంగవ్ఞని చూసి అతని వివరాలు అడిగింది. బ్రహ్మకుమారుడు అత్రి ప్రజాపతి. ఆ అత్రికుమారుడు ఇతను. పేరు అంగుడు. ఇంద్రవిభుడైన కుమారుని కోసం తపస్సు చేసి శ్రీమహావిష్ణువ్ఞని మెప్పించి వరం పొందాడు.
వివాహం చేసుకునేందుకు తగిన కన్య కోసం అన్వేషిస్తున్నాడు ఇతనే నీకు తగిన భర్త అంది రంభ. వెంటనే సునీధ అతనిపై పురుష సన్మోహన విద్య ప్రయోగించింది. అంగుడు సునీధను చూసి మోహితుడై ఆమె వివారలు రంభ ద్వారా తెలుసుకున్నాడు.
సునీధను గాంధర్వ వివాహం చేసుకున్నాడు అంగుడు.
వారికి వేనుడు అనే పేరు గల పుత్రుడు జన్మించాడు. యుక్తవయసు రాగానే వేనుడు రాజ్యాధికారం చేపట్టాడు.
అతని సునీధకు సుశంఖుడు ఇచ్చిన శాపం వల్ల వేనుడు వేదధర్మాలను విడిచి పెట్టి అధార్మికుడు అయ్యాడు.
పృథువు గొప్ప రాజు ఎలా అయ్యాడు? పృథువు కూడా నారాయణ నీయొక్క అంశం🙏🙏భూదేవి గోవుగా మారి ప్రజల కోరికలు తీరుస్తుంది.
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 18వ దశకము - పృథు చరిత్రము వర్ణనము 5-శ్లోకం.
🕉🌞🌎🌙🌟🚩
విఖ్యాతః పృథురితి తాపసోపదిష్టైః
సూతాద్యైః పరిణుత భావిభూరివీర్యః
వేనార్త్యా కబలితసంపదం ధరిత్రీం
ఆక్రాంతాం నిజధనుషా సమామకార్షీః।।
భావము:-
'జన్మించిన శిశువు శ్రీమన్నారాయణాంశ సంభూతడనియు, పృథువు అను నామమున ప్రఖ్యాతిగాంచు ననియు, ఆ నామమునకు సార్ధకత కలుగుననియు‘ మునీశ్వరులు నిన్ను కీర్తించిరి. వారి ప్రేరణచే సూతాదులు ( సూత మాగధులు - స్తుతి వచనములను పఠించువారు) భవిష్యత్తున ‘పృథుచక్రవర్తి‘ పరాక్రమమున జరగబోవు మహాకార్యములను స్తుతించిరి. అప్పటికే - 'వేనుడి‘ దుష్పరిపాలనతో భూసారమంతయూ హరించవేయబడినది. పృథుచక్రవర్తి నామమున జన్మించిన నారాయణమూర్తీ! నీవు నీధనస్సుతో ప్రథమముగా భూమండలమును సమతలము గావించితివి.
వ్యాఖ్య:-
పృథువు గొప్ప రాజు. ఈటెలు, విల్లంబులు, బాణాలు వంటి ఆయుధాలతో ఆయుధాల శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న ఆయనకు వేదాలు, వాటి శాఖలతో పూర్తిగా పరిచయం ఉంది. గొప్ప బ్రహ్మ జ్ఞానపండితుడు శుక్రాచార్యుడు గురువు అయ్యాడు. వాలఖిల్యాలు ఆయన సలహాదారులు, సరస్వతలు ఆయన సహచరులు అయ్యారు. ప్రసిద్ధ ఋషి గార్గుడు ఆయన జ్యోతిష్కుడు అయ్యాడు.
తన తండ్రి వేనుడు చేసిన కర్మలు, పాపముల ఫలితముగా వర్షములు కురవక పంటలు పండకపోవడంతో ప్రజలు నానా బాధలూ పడటం గమనిమ్ంచాడు పృథు చక్రవర్తి. ఇలా పృకృతి ధర్మంగా ఉండవలసిన భూమి నాశనం కావడంతో ఆగ్రహంతో ధనస్సును ధరించి భూమిని" వెదకుచూ ఉంటాడు.
పృథువు తనకొరకు వెదకుతున్నడని తనను తన శక్తితో నాశనం చేయనున్నాడని భూదేవికి తెలుస్తుంది. రాజు ఆగ్రహిస్తే రాజ్యం, ప్రజలు అన్నీ నశిస్తాయమి పృథువుకు దర్శనమిచ్చి అతడి అభీష్టాన్ని అడిగి తెలుసుకొంటుంది. అతడి కోరికమేరకు తాను గోరూపాన్ని ధరిస్తానని తగిన దూడను ఏర్పరచి కావాల్సిన పంటలను పాలరూపంలో తీసుకోమని భూమాత ఆదేశిస్తుంది. దానికి అతడే తాను దూడగా మారి ప్రజలకు కావాల్సిన పంటలను పాలరూపంలో తీసుకుంటానని దూడగా మారుతాడు.
అలా భివిలో తనకు కావాల్సిన వాటిని తీసుకోవడం ప్రారంభించాడు. అలాగే మిగిలిన వారూ దాడలుగా మారి తమకు కావలసినవి తీసుకోవడం మొదలిడిరి. మేరు పర్వతం దూడగా మారి రత్నాలను, వాసుకి దూడగా మారి విషాన్ని, వృక్షాలు దూడగా మారి ఫలాలను ఇలా నశించిన సకల సంపదలను గోరూపంలో ఉన్న భూదేవి నుండి పృథు చక్రవర్తి ప్రజలకు అందించాడు.
మహా భారతము, విష్ణు పురాణం ప్రకారం పృథువు విష్ణువు యొక్క ఒక అవతారం తదనంతరం పృథువు భూమిని రక్షించడానికి ఆమెకు వాగ్ధానం చేయడం ద్వారా భూమికి "పృథ్వి" అనే పేరు ఏర్పడినది.
అయితే, మను స్మృతి ద్వారా భూమిని పృథువు యొక్క భార్య, అతని కుమార్తెగా చూపబడినది.[కనుకనే ఆమెకు భర్త పేరు తరువాతి పేరుగా "పృథ్వి" అనే పేరు పెట్టారు.
వాయు పురాణమును బట్టి పృథువు జన్మించినపుడు నిలిచి ఉండి చేత ఒక విల్లు, బాణాలు, ఒక కవచంతో సిద్ధంగా భూమిని నాశనం చేయడానికి ఉండటం చూసి చతుర్వేదాలు అందరూ భయభ్రాంతులయ్యారు.
భూమి ఆవు రూపంలో పారిపోయినా చివరకు ఆయనకు తనను కాపాడమని వేడి అతడి అభీష్టాలను తీర్చడానికి అంగీకరించిది.
అతడు తన చేత చక్రం కలిగి ఉండటంతో బ్రహ్మ అతడిని విష్ణు రూపంగా గుర్తించడం జరిగింది, తదనంతర కాలంలో మానుష దేవ చక్రవర్తిగానూ, మొదటి చక్రవర్తిగానూ పూజలందుకొన్నాడు.
శతపధ బ్రాహ్మణం ప్రకారం మొదటి అధిరాజుగా గుర్తించబడ్డాడు.
మహాభారత పురాణగాధ ప్రకారం పృధువే విష్ణువు. అతడు ధర్మ (ధర్మానికి), శ్రీ (సంపద, సౌందర్యం, అర్ధా (ఉద్దేశ్యం, వస్తు సంపద) లకు మూలముగా గుర్తించిది.
పృథువు మొదటి నిజమైన రాజు. అతను తన యొక్క నిరంకుశ తండ్రి కలిగించిన గాయాలను మాపినవాడు గానూ, దేవతల నుండి అనేక బహుమతులను పొందిన తరువాత భూతాలను, దేవతలు, అసురులు, యక్షులు, రాక్షసులు, నాగాలను అందరినీ స్వాధీనం చేసుకుని పాలించారు.
సత్య యుగం దాని పరాకాష్టకు చేరుకుంది. అతడు తన తండ్రినిఅ నరకం నుండి విడుదల చేసాడు. పృథువు వేదాల ఆధారంగా జనరంజక పాలన సాగించాడు.

మునులను ప్రజలను పిలిపించి దానధర్మాలు యజ్ఞయాగాలు చేయకూడదని శాసించాడు. తాను చెప్పిందే ధర్మం అన్నాడు. తన శాసనాన్ని ధిక్కరించిన వారిని కఠినంగా శిక్షించాడు.
ఇటు యమధర్మరాజు తన కూతురి మీద ప్రదర్శించిన అలసత్వ వైఖరి వల్ల జరిగిన అనర్ధం జరిగింది. అదేంటంటే వేనుడికి పృధువ్ఞ అనే కుమారుడు జన్మించిన తరువాత తన ప్రవర్తనకు చింతించి తపస్సుకు ఉపక్రమించాడు.
అతని తపోదీక్షకు శ్రీమహావిష్ణువ్ఞ ప్రసన్నుడై తత్వోపదేశం చేశాడు. ఆ విధంగా వేనుడు అటు తల్లికి ముని ఇచ్చిన శాపం. ఇటు తండ్రికి శ్రీహరి ఇచ్చిన వరం రెండూ అనుభవించాడు. ధర్మదేవత తప్పిదం వల్ల మృత్యుదోషం వల్ల.
🕉🌞🌎🌙🌟🚩
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 18వ దశకము - పృథు చరిత్రము వర్ణనము 4-శ్లోకం.
🕉🌞🌎🌙🌟🚩
వేనుని విగత శరీరమును తన తల్లి ఎలా కాపాడుకుంది?
తన్నాశాత్ ఖిలజనభీరుకైర్మునీంద్రైః
తన్మాత్రా చిరపరిరక్షితే తదంగే।
త్యక్తాఘే పరిమథితాదథోరుదండాత్
దోర్దండే పరిమథితే త్వమావిరాసీః।।
భావము:-
వేనుడు హతమొందిన పిమ్మట, రాజులేని రాజ్యమున, దుష్టజనులు చేయు అరాచకములను చూచి, మునీంద్రులు కలతనొందిదిరి. ‘వేనుని‘ తల్లి వేనుడి (విగత) శరీరమును తన యోగమంత్రశక్తితో కాపాడుకొనుచుండెను. మునీంద్రులు రాజ్యపరిరక్షణకై 'విగత వేనుడి‘ శరీరము నందలి ‘ఊరువు‘ భాగమును మధించి ఆ శరీరమును పవిత్రము చేసిరి. అనంతరము 'బాహువులను' మధించిరి. అంతట ప్రభూ! నీవు (పృథువుగా) జన్మించితివి.
వ్యాఖ్య:-
ఈశ్లోకంలో వచ్చిన ప్రృథువు గురించిన సమాచారం చూద్దాం. పృషదాజ్యమంటే యజ్ఞవేళ హవిస్సును మంత్రించేందుకు ముంచే పవిత్రమైన నేయి. ఆ యజ్ఞగుండంలో పుట్టినవాడు పృషదాజ్యసముత్పన్నుడు. ఆ పృషదాజ్యసముత్పన్నునికి సూతుడని ఎందుకు పేరువచ్చింది? అంటే, అందుకొక కథ.
నైమిశారణ్యంలోని పౌరాణికుల జన్మ కథనాలు
స్వాయంభువ మనువు కాలంలో జన్మించిన చాక్షుష మనువుకు మనుమడైన అంగుని కొడుకు వేనరాజు.
రాజ్యానికి వచ్చాక వేనుడు వేదశాస్త్రాల పట్ల అవిధేయుడయ్యాడు. పాపాలు చెయ్యటం మొదలుపెట్టాడు. అధికారం తలకెక్కి, దురహంకారం పెరిగి, దౌష్ట్యం మితిమీరింది.
అతని అకృత్యాలను చూసి సహింపలేక మునులు దర్భలను దివ్యాస్త్రాలుగా మంత్రించి అతని శరీరంలో నాటారు.
అతను మరణించిన వెంటనే మృతకళేబరంలోని తొడ భాగాన్ని అరణిగా (యజ్ఞంలో అగ్నిని మథించేందుకు వాడే కొయ్యసాధనం) చేసుకొని, ప్రాణోత్సర్గమంత్రాలతో అతనిలోని పాపాలన్నిటినీ ఒక ప్రాణమయతనువుగా బయటికి తీసి, దానిని అడవులకు పంపివేశారు.
పాపాపనోదనం జరిగాక మునులు ఆ కళేబరంలో కుడి భుజాన్ని మళ్ళీ మథించారు. ఆ దక్షిణ భుజాస్తంభారణి నుంచి సత్త్వగుణోపేతుడు, ధర్మశీలుడు, అజేయ పరాక్రమశాలి అయిన పృథు చక్రవర్తి సద్యోయౌవనుడై ఉద్భవించాడు. అతని పాలనలో ధరణి సస్యశ్యామలం అయింది.
పాతకకృత్యాల మూలాన ప్రాభవాన్ని కోల్పోయిన లోకంలో మళ్ళీ ధర్మతేజాన్ని వెలుగొందజేయాలని పృథు చక్రవర్తి పృథుపైతామహం అనే మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. సర్వసమర్థులైన ఋత్విజులను ఆహ్వానించి, తానే యజమానుడై వేదోక్తమంత్రాలతో శాస్త్రోదితక్రమాన యజ్ఞాన్ని అనుష్ఠించాడు.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 18వ దశకము - పృథు చరిత్రము వర్ణనము 7-శ్లోకం.
🕉🌞🌎🌙🌟🚩
*పృథు మహారాజు చేసే నూరవ యజ్ఞం ని ఎవరు అడ్డుకోవడానికి ప్రయత్నించారు?
పృథు మహారాజు పరిపాలన నుండి ఫలములు అనేక రకముల రుచులు ఎలా ఎలా వచ్చాయి? తామర పువ్వు అంత అందంగా ఎలా ఉంది? ఎలా వచ్చింది?*
ఆత్మానం యజతి ముఖైస్త్వయి త్రిధామన్
ఆరబ్దే శతతమ వాజిమేధ యాగే।
స్పర్ధాళుః శతమఖ ఏత్య నీచవేషో
హృత్వా౾శ్వం తవ తనయాత్ పరాజితో౾భూత్।।
భావము:-
పరమాత్మా! త్రిలోకాధిపతివైన నీవు, పృథుచక్రవర్తి రూపమున శతాశ్వమేధ యాగములను ఆచరించుచూ నూరవ యజ్ఞమును ప్రారంభించితివి. అదిచూచి, నూరుయజ్ఞములు చేసి ‘శతమఖుడ‘ని పేరొందిన ఇంద్రుడు నీవు అట్లు యజ్ఞముచేయుట సహించలేకపోయెను. తన మనస్సున ఏర్పడిన స్పర్ధభావముచే (నీ యజ్ఞమును భంగపరచవలెనని) నీచవేషముతో నీ యజ్ఞాశ్వమును అపహరించెను. అయిననూ, నీకుమారుని చేతిలో అతడు పరాజితుడయ్యెను.
వ్యాఖ్య:-
పృథు మహారాజు ఎప్పుడైతే పిండుకున్నాడో దేవతలు అందరూ పరుగెత్తుకు వచ్చారు. సురరాజును దూడగా వదిలారు. అమ్మ వాళ్లకి "వీర్యము", "ఓజము", "ఋతము" అనబడే టటువంటి మూడింటిని విడిచిపెట్టింది. రాక్షసులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకొని లోహ పాత్రలలో మూడు రకముల సుర పిండుకున్నారు.
గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యమును మధువును పిండుకున్నారు. అందుకే పద్మము అంత సౌందర్యంగా ఉంటుంది. పితృగణములు ఆర్యముని దూడగా చేసి పచ్చి మట్టి పాత్రలో దవ్యమును పిండుకున్నారు. సిద్ధులు కపిల మహర్షిని దూడగా చేసి ఆకాశమనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం చేయగలుగుతుంటారు.
కింపురుషులు మయుడిని దూడగా చేసి యోగమనే పాత్రలోనికి ధారణ అనే శక్తిని పిండుకున్నారు. యక్ష భూత పిశాచాది గణములు రుద్రుడిని దూడగా చేసుకుని కపాలంలోకి రక్తమును పిండుకున్నారు.
పాములు తక్షకుడిని దూడగా చెసుకొని తమ పుట్టలనబడే పాత్రలలోకి "పురువులు" "ఫలములు" అనే వాటిని పిండుకున్నాయి. వృక్షములు తమ పట్టలలోనికి రసమును పిండుకున్నాయి. అందుకే మనకి అన్ని రకముల రుచులు చెట్లనుండే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి వుంది మనకు రసపోషణం చేస్తున్నాయి.
అలా పృథు మహారాజు ఆనాడు ఎవ్వరూ పొందనటువంటి విజయమును సాధించి భూమండలమును అద్భుతముగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు అందరూ పరమ సంతోషంగా జీవితములను గడుపుతున్నారు.
ఇటువంటి స్థితిలో ఆయన నూరు అశ్వమేధ యాగములు చేయాలి అని సంకల్పించాడు. బ్రహ్మావర్తము అని స్వాయంభువ మనువు పరిపాలించిన ప్రాంతమునకు వెళ్ళి "సరస్వతి" "తృష ద్వతి" అనబడే రెండు నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టి 99 అశ్వమేధ యాగములు చేశాడు.
నూరవది చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపంతో పెద్ద పెద్ద జడలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వమును ఎత్తుకు పోతున్నాడు. దానిని అత్రిమహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వమును వెనక్కి తెమ్మన్నారు.
పృథు మహారాజు కుమారుడు బయలుదేరాడు. కానీ జడలు కట్టుకుని ఋషి వేషధారియై ఉన్న వాడిమీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. అత్రిమహర్షి అన్నారు "గుర్రమును ఎత్తుకు పోతున్న వాడు ఇంద్రుడే. నువ్వు నిర్భయంగా ఆ బాణం వదిలెయ్యి అన్నాడు.
బాణం వదలడానికి పృథు కుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపమును, అశ్వమును విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రమును వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి "విజితాశ్వుడు" అని పేరు పెట్టారు.

Comments
Post a Comment