శ్రీరమణీయం 20/3
🕉🌞🌎🌙🌟🚩
[13:34, 14/07/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (587)
🕉🌞🌎🌙🌟🚩
మనకు నిజానికి ఆలోచనలవల్ల బాధ రావ…
[13:34, 14/07/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
⚡️✨⚡️✨⚡️✨
🕉🌞🌎🌙🌟🚩
[13:34, 14/07/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (587)
🕉🌞🌎🌙🌟🚩
మనకు నిజానికి ఆలోచనలవల్ల బాధ రావ…
[13:34, 14/07/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
⚡️✨⚡️✨⚡️✨
🕉🌞🌎🌙🌟🚩
[14:37, 08/07/2020] +91 6303 400 206: కళ్ళు మూసుకుంటే పదార్ధం అంతా ఏకం అవుతుంది.
మనసు మూసుకుంటే శక్తి అంతా ఏకం అవుతుంది.
కొన్ని చోట్ల, కొన్ని వేళల్లో మాత్రమే చెల్లుబాటు అయ్యే నాణాలు- నామరూపాలు.
అన్ని చోట్లా, అన్ని వేళల్లో చెల్లుబాటయ్యే ఏకైక నాణం - నేను.
*జగదానుభవం, దైవానుభవం రెండూ మాయే.
'అనుభవమే' సత్యం.*
శిష్యుడు:- నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను.
గురువు:- ఏ యాత్ర అయినా సరే ఒక కలలో నుండి మరొక కల లోకి వెళ్లడం లాంటిదే.
🕉🌞🌎🌙🌟🚩
[14:46, 08/07/2020] +91 6303 400 206: శ్రీరమణీయం - (581)
🕉🌞🌎🌙🌟🚩
"వద్దనుకున్న జ్ఞాపకాలను వదిలివేయాలంటే మార్గం ఏమిటి ?"
మనసులోని జ్ఞాపకాలను మనం ప్రత్యేకంగా వదిలివేయనక్కర్లేదు. మనసు జ్ఞాపకాలను వదిలివేసేందుకు ప్రత్యేకంగా మనం చేసే సాధన ఏదీ లేదు. మనకు ఉపయోగంలో లేని జ్ఞాపకాలను మనసే వదిలివేస్తుంది. కాబట్టి మనని ఇబ్బంది పెట్టే జ్ఞాపకాలను వదిలివేయాలంటే వాటికి ఏ విలువ లేదని గుర్తిస్తే చాలు. అప్పుడు వాటంతట అవే మన మనసును వదిలివేస్తాయి. మనసుకు సత్యం అర్ధమైన తర్వాత అది అసత్యాన్ని ఆశ్రయించదు. మనసుకు లాభం అనిపించిన విషయాన్ని పట్టుకుంటుంది. లాభం లేదని తెలిస్తే వదిలివేస్తుంది. లాభం, నష్టం రెండూ లేవని తెలిసిన విషయాన్ని అసలు పట్టించుకోకుండా ఉంటుంది. అప్పుడు ఆ విషయం జ్ఞాపకంగా మారే అవకాశమే లేదు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
మనసుకి, జ్ఞాపకానికి మనను బాధించే శక్తి లేదు !'- (అధ్యాయం -71)
🕉🌞🌎🌙🌟🚩
"అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: గుణములను పెంచుకొనవలెనా..
జవాబు: అది ప్రారంభ సాధకులకు మాత్రమే. పరిణితి చెందిన సాధకులకు తమ స్వరూప విచారణే మంచిది. ఇది సూటి మార్గము. ఇతర మార్గాలలో అహం వుంటుంది. ఈ మార్గమే అహం అంటే ఏమిటో తెలియజేస్తుంది. యోగవాశిష్టంలో కూడా నేనెవరిని అను ఆత్మవిచారము అహం యొక్క మూలం వేళ్ళను నరికే గొడ్డలి వంటిదని చెప్పబడినది.
*యోగసూత్రాలలో చెప్పబడిన లక్షణాలన్నీ కలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో కనిపించకపోవచ్చు. కానీ సాధన మాత్రం వదలకూడదు. మనమెపుడూ ఆత్మస్వరూపులమే. మనకా సంగతి తెలియదు. శరీరంతో తాదాత్మ్యము చెంది బాధలను అనుభవిస్తుంది.
🕉🌞🌎🌙🌟🚩
[14:52, 08/07/2020] +91 6303 400 206: "ఋభుగీత "(48)
🕉🌞🌎🌙🌟🚩
3వ అధ్యాయము [ప్రపంచము చిన్మాత్రము]
మనసుకు అతీతంగా మన ఉనికి ఘనత తెలియాలి !
సద్వస్తువు వద్ద శూన్యత (వెలితి) లేదు. అప్పటి వరకూ వెలితి తప్పదు. అందుకే మనం ఆ వెలితిలేని స్థితికి చేరుకునే వరకు ఏదో ఒకటి మనసుకు వెలితిగానే ఉంటుంది. మనం ఉన్నతంగా భావించే బుద్ధి, వివేకం, వివేచన అన్నీ మనతోనే ముడిపడి ఉన్నాయి. అవన్నీ మిథ్యే అనటంలో ఉద్దేశం, అవి అక్కర్లేదని కాదు. వాటికి అతీతంగా మన ఉనికి యొక్క ఘనతను చెప్పడం. మనవద్ద ఉన్న ఆయుధాలు రెండే.. ఒకటి మనసు, రెండు శుభేచ్ఛ. అవి రెండూ నేను లేకుండా లేవు. సాధకుడు చేసే ధ్యానం, పొందే అత్యున్నత సమాధిస్థితి రెండూ మనసుతో జరిగేవే. శుభేచ్చతో జరిగేవే !
🕉🌞🌎🌙🌟🚩
[15:41, 07/07/2020] +91 6303 400 206: శ్రీరమణీయం - (580)
🕉🌞🌎🌙🌟🚩
"మంచి పనులుచేస్తున్న సందర్భాల్లో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి ! ఎందుకు ఈపరిస్థితి వస్తోంది ?"
పూజ లేదా మంత్రం చేసేప్పుడు వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన మరో ఆలోచన గుర్తుకు వస్తుంది. మనం రోజూ ఒకేరకంగా పూజ, జపం చేస్తున్నాం. కానీ జపంలో, పూజలో వచ్చే ఆలోచనలు మాత్రం ఏరోజుకారోజు మారిపోతూనేవున్నాయి. అలా గుర్తుకు వచ్చే విషయాలన్నీ మన జ్ఞాపకాలే. అవే జ్ఞాపకాలు మనం ఖాళీగా ఉన్నప్పుడు గుర్తుకువస్తే బాధ కలగటం లేదు. కానీ పూజలోనో, జనంలోనో గుర్తుకువస్తే మాత్రం బాధపడుతున్నాం. మనం చేద్దామనుకున్నవి లేదా చేసినవే మనకు గుర్తుకు వస్తుంటాయి. అవసరమైన జ్ఞాపకం గుర్తుకు రాకపోతే బాధపడుతుంటాం. అనవసరంగా (పూజలో) గుర్తుకు వచ్చినప్పుడు కూడా బాధపడతాం. మనం చేద్దామనుకున్న మంత్రం ఒక జ్ఞాపకంగా చేయాలనుకోవటం మరో జ్ఞాపకం. ఆ జపం చేస్తున్నప్పుడు గుర్తుకు వచ్చే పిచ్చి విషయాలు ఇంకో జ్ఞాపకం. అవన్నీ నీవు కావాలనుకుంటేనే జ్ఞాపకాలుగా ఏర్పడ్డాయి. అంతేగానీ మరెవరో వాటిని నీ మనసులోకి జొప్పించలేదు. జ్ఞాపకంగా తీసుకుంటే మంత్రానికీ, ఆలోచనకు తేడాలేదు. ఇకపోతే ఆచరించవలసింది ఏమిటంటే మన పొరపాటు వలన జరిగింది ఏదైనాసరే మరోసారి అలా బాధపెట్టే జ్ఞాపకంగా నిలిచిపోయే పనులు చేయకుండా ఉండాలి. అది మరొకరి పొరపాటుకు సంబంధించినదైతే, మనం మార్చలేని విషయంలో జ్ఞాపకానికి విలువలేదని గుర్తించి వదిలివేయాలి !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
మనసుకి, జ్ఞాపకానికి మనను బాధించే శక్తి లేదు)
🕉🌞🌎🌙🌟🚩
[15:41, 07/07/2020] +91 6303 400 206: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: సాక్షాత్కారము ఎలా సాధ్యము ?
జవాబు: ఆత్మ అనే పెద్దఅగ్ని నుంచి అహం అనే చిన్న అగ్నికణం పుడుతుంది. అహం శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది. అలాంటి తాదాత్మ్యం కాకుండా అది వుండలేదు. ఈ తాదాత్మ్యమే అజ్ఞానము. మన ప్రయత్నాలన్నింటి గమ్యము అహం నాశనమే. అహం దృశ్య తాదాత్మ్యమును నాశనం చేసేస్తే అది తన మూలమైన ఆత్మలో కలిసిపోతుంది.
అహం నాశనానికి నేనెవరను అని ప్రశ్నించుకోవడమే గొడ్డలి.
⚡️✨⚡️✨⚡️✨
ప్రశ్న: అంతిమ గమ్యం చేరుకోవడం సులభమని నేను అనుకోవడం లేదు.
జవాబు: భయము, జయము, అపజయము మొదలగు ఆలోచనలతో నిన్ను ఎందుకు కలవరపరుచుకుంటావు. ముందుకు సాగిపో. గాఢధ్యానం చేయుము. మిగిలిన ఆలోచనలన్నీ విసిరివేయుము. సాధన లేకుండా విజయము సిద్ధించదు.
🕉🌞🌎🌙🌟🚩
మనసు మూసుకుంటే శక్తి అంతా ఏకం అవుతుంది.
కొన్ని చోట్ల, కొన్ని వేళల్లో మాత్రమే చెల్లుబాటు అయ్యే నాణాలు- నామరూపాలు.
అన్ని చోట్లా, అన్ని వేళల్లో చెల్లుబాటయ్యే ఏకైక నాణం - నేను.
*జగదానుభవం, దైవానుభవం రెండూ మాయే.
'అనుభవమే' సత్యం.*
శిష్యుడు:- నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను.
గురువు:- ఏ యాత్ర అయినా సరే ఒక కలలో నుండి మరొక కల లోకి వెళ్లడం లాంటిదే.
🕉🌞🌎🌙🌟🚩
[14:46, 08/07/2020] +91 6303 400 206: శ్రీరమణీయం - (581)
🕉🌞🌎🌙🌟🚩
"వద్దనుకున్న జ్ఞాపకాలను వదిలివేయాలంటే మార్గం ఏమిటి ?"
మనసులోని జ్ఞాపకాలను మనం ప్రత్యేకంగా వదిలివేయనక్కర్లేదు. మనసు జ్ఞాపకాలను వదిలివేసేందుకు ప్రత్యేకంగా మనం చేసే సాధన ఏదీ లేదు. మనకు ఉపయోగంలో లేని జ్ఞాపకాలను మనసే వదిలివేస్తుంది. కాబట్టి మనని ఇబ్బంది పెట్టే జ్ఞాపకాలను వదిలివేయాలంటే వాటికి ఏ విలువ లేదని గుర్తిస్తే చాలు. అప్పుడు వాటంతట అవే మన మనసును వదిలివేస్తాయి. మనసుకు సత్యం అర్ధమైన తర్వాత అది అసత్యాన్ని ఆశ్రయించదు. మనసుకు లాభం అనిపించిన విషయాన్ని పట్టుకుంటుంది. లాభం లేదని తెలిస్తే వదిలివేస్తుంది. లాభం, నష్టం రెండూ లేవని తెలిసిన విషయాన్ని అసలు పట్టించుకోకుండా ఉంటుంది. అప్పుడు ఆ విషయం జ్ఞాపకంగా మారే అవకాశమే లేదు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
మనసుకి, జ్ఞాపకానికి మనను బాధించే శక్తి లేదు !'- (అధ్యాయం -71)
🕉🌞🌎🌙🌟🚩
"అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: గుణములను పెంచుకొనవలెనా..
జవాబు: అది ప్రారంభ సాధకులకు మాత్రమే. పరిణితి చెందిన సాధకులకు తమ స్వరూప విచారణే మంచిది. ఇది సూటి మార్గము. ఇతర మార్గాలలో అహం వుంటుంది. ఈ మార్గమే అహం అంటే ఏమిటో తెలియజేస్తుంది. యోగవాశిష్టంలో కూడా నేనెవరిని అను ఆత్మవిచారము అహం యొక్క మూలం వేళ్ళను నరికే గొడ్డలి వంటిదని చెప్పబడినది.
*యోగసూత్రాలలో చెప్పబడిన లక్షణాలన్నీ కలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో కనిపించకపోవచ్చు. కానీ సాధన మాత్రం వదలకూడదు. మనమెపుడూ ఆత్మస్వరూపులమే. మనకా సంగతి తెలియదు. శరీరంతో తాదాత్మ్యము చెంది బాధలను అనుభవిస్తుంది.
🕉🌞🌎🌙🌟🚩
[14:52, 08/07/2020] +91 6303 400 206: "ఋభుగీత "(48)
🕉🌞🌎🌙🌟🚩
3వ అధ్యాయము [ప్రపంచము చిన్మాత్రము]
మనసుకు అతీతంగా మన ఉనికి ఘనత తెలియాలి !
సద్వస్తువు వద్ద శూన్యత (వెలితి) లేదు. అప్పటి వరకూ వెలితి తప్పదు. అందుకే మనం ఆ వెలితిలేని స్థితికి చేరుకునే వరకు ఏదో ఒకటి మనసుకు వెలితిగానే ఉంటుంది. మనం ఉన్నతంగా భావించే బుద్ధి, వివేకం, వివేచన అన్నీ మనతోనే ముడిపడి ఉన్నాయి. అవన్నీ మిథ్యే అనటంలో ఉద్దేశం, అవి అక్కర్లేదని కాదు. వాటికి అతీతంగా మన ఉనికి యొక్క ఘనతను చెప్పడం. మనవద్ద ఉన్న ఆయుధాలు రెండే.. ఒకటి మనసు, రెండు శుభేచ్ఛ. అవి రెండూ నేను లేకుండా లేవు. సాధకుడు చేసే ధ్యానం, పొందే అత్యున్నత సమాధిస్థితి రెండూ మనసుతో జరిగేవే. శుభేచ్చతో జరిగేవే !
🕉🌞🌎🌙🌟🚩
[15:41, 07/07/2020] +91 6303 400 206: శ్రీరమణీయం - (580)
🕉🌞🌎🌙🌟🚩
"మంచి పనులుచేస్తున్న సందర్భాల్లో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి ! ఎందుకు ఈపరిస్థితి వస్తోంది ?"
పూజ లేదా మంత్రం చేసేప్పుడు వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన మరో ఆలోచన గుర్తుకు వస్తుంది. మనం రోజూ ఒకేరకంగా పూజ, జపం చేస్తున్నాం. కానీ జపంలో, పూజలో వచ్చే ఆలోచనలు మాత్రం ఏరోజుకారోజు మారిపోతూనేవున్నాయి. అలా గుర్తుకు వచ్చే విషయాలన్నీ మన జ్ఞాపకాలే. అవే జ్ఞాపకాలు మనం ఖాళీగా ఉన్నప్పుడు గుర్తుకువస్తే బాధ కలగటం లేదు. కానీ పూజలోనో, జనంలోనో గుర్తుకువస్తే మాత్రం బాధపడుతున్నాం. మనం చేద్దామనుకున్నవి లేదా చేసినవే మనకు గుర్తుకు వస్తుంటాయి. అవసరమైన జ్ఞాపకం గుర్తుకు రాకపోతే బాధపడుతుంటాం. అనవసరంగా (పూజలో) గుర్తుకు వచ్చినప్పుడు కూడా బాధపడతాం. మనం చేద్దామనుకున్న మంత్రం ఒక జ్ఞాపకంగా చేయాలనుకోవటం మరో జ్ఞాపకం. ఆ జపం చేస్తున్నప్పుడు గుర్తుకు వచ్చే పిచ్చి విషయాలు ఇంకో జ్ఞాపకం. అవన్నీ నీవు కావాలనుకుంటేనే జ్ఞాపకాలుగా ఏర్పడ్డాయి. అంతేగానీ మరెవరో వాటిని నీ మనసులోకి జొప్పించలేదు. జ్ఞాపకంగా తీసుకుంటే మంత్రానికీ, ఆలోచనకు తేడాలేదు. ఇకపోతే ఆచరించవలసింది ఏమిటంటే మన పొరపాటు వలన జరిగింది ఏదైనాసరే మరోసారి అలా బాధపెట్టే జ్ఞాపకంగా నిలిచిపోయే పనులు చేయకుండా ఉండాలి. అది మరొకరి పొరపాటుకు సంబంధించినదైతే, మనం మార్చలేని విషయంలో జ్ఞాపకానికి విలువలేదని గుర్తించి వదిలివేయాలి !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
మనసుకి, జ్ఞాపకానికి మనను బాధించే శక్తి లేదు)
🕉🌞🌎🌙🌟🚩
[15:41, 07/07/2020] +91 6303 400 206: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: సాక్షాత్కారము ఎలా సాధ్యము ?
జవాబు: ఆత్మ అనే పెద్దఅగ్ని నుంచి అహం అనే చిన్న అగ్నికణం పుడుతుంది. అహం శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది. అలాంటి తాదాత్మ్యం కాకుండా అది వుండలేదు. ఈ తాదాత్మ్యమే అజ్ఞానము. మన ప్రయత్నాలన్నింటి గమ్యము అహం నాశనమే. అహం దృశ్య తాదాత్మ్యమును నాశనం చేసేస్తే అది తన మూలమైన ఆత్మలో కలిసిపోతుంది.
అహం నాశనానికి నేనెవరను అని ప్రశ్నించుకోవడమే గొడ్డలి.
⚡️✨⚡️✨⚡️✨
ప్రశ్న: అంతిమ గమ్యం చేరుకోవడం సులభమని నేను అనుకోవడం లేదు.
జవాబు: భయము, జయము, అపజయము మొదలగు ఆలోచనలతో నిన్ను ఎందుకు కలవరపరుచుకుంటావు. ముందుకు సాగిపో. గాఢధ్యానం చేయుము. మిగిలిన ఆలోచనలన్నీ విసిరివేయుము. సాధన లేకుండా విజయము సిద్ధించదు.
🕉🌞🌎🌙🌟🚩
[18:17, 04/07/2020] +91 6303 400 206: శ్రీరమణీయం - (577)
🕉🌞🌎🌙🌟🚩
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
మనసుకి, జ్ఞాపకానికి మనను బాధించే శక్తి లేదు !'- (అధ్యాయం -71)
🕉🌞🌎🌙🌟🚩
[18:17, 04/07/2020] +91 6303 400 206: "ఋభుగీత " (44)
🕉🌞🌎🌙🌟🚩
3వ అధ్యాయము [ప్రపంచము - చిన్మాత్రము]
నేనున్నాను అని తెలియడం కోసమే ఈ సుఖ-దు:ఖాల ఏర్పాటు !!
ఈ ప్రపంచం ఏర్పాటే మనని మనం తెలుసుకోవడానికి. మన అనుభవాలు ఏవైనా ఫలితం మాత్రం సుఖమో, దుఃఖమో ఉంటుంది. నేనున్నాను అని తెలియడం కోసమే ఈ సుఖ, దు:ఖాల ఏర్పాటు. అవన్నీ మానసిక ప్రక్రియలు. మనం కావాలనుకునే సుఖం, మనం వద్దనుకునే దుఃఖం రెండూ నిద్రలో ఉండటం లేదు. "నా వల్ల నీవు లేవు. నీ వల్లనే నేనున్నట్లు తెలుసుకుంటున్నావు" అని ప్రపంచం బోధిస్తుంది. ఇది సృష్టిలోని సూత్రం. కాబట్టే పరమసత్యంలో భగవంతుడు అన్న భావంతో సహా అన్నీ మిథ్యేనని చెప్పారు !
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
మనసుకి, జ్ఞాపకానికి మనను బాధించే శక్తి లేదు !'- (అధ్యాయం -71)
🕉🌞🌎🌙🌟🚩
[18:17, 04/07/2020] +91 6303 400 206: "ఋభుగీత " (44)
🕉🌞🌎🌙🌟🚩
3వ అధ్యాయము [ప్రపంచము - చిన్మాత్రము]
నేనున్నాను అని తెలియడం కోసమే ఈ సుఖ-దు:ఖాల ఏర్పాటు !!
ఈ ప్రపంచం ఏర్పాటే మనని మనం తెలుసుకోవడానికి. మన అనుభవాలు ఏవైనా ఫలితం మాత్రం సుఖమో, దుఃఖమో ఉంటుంది. నేనున్నాను అని తెలియడం కోసమే ఈ సుఖ, దు:ఖాల ఏర్పాటు. అవన్నీ మానసిక ప్రక్రియలు. మనం కావాలనుకునే సుఖం, మనం వద్దనుకునే దుఃఖం రెండూ నిద్రలో ఉండటం లేదు. "నా వల్ల నీవు లేవు. నీ వల్లనే నేనున్నట్లు తెలుసుకుంటున్నావు" అని ప్రపంచం బోధిస్తుంది. ఇది సృష్టిలోని సూత్రం. కాబట్టే పరమసత్యంలో భగవంతుడు అన్న భావంతో సహా అన్నీ మిథ్యేనని చెప్పారు !
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(515)
🕉🌞🌎🌙🌟🚩
"శివదీక్ష ద్వారా భక్తుడు కొత్తగా పొందేది ఏమిటి ?"
పరమవస్తువు వైపు సాగే అంతర్ ప్రయాణమే శివదీక్ష. శివస్తుతిలో నమః జేష్టాయచ - నమః కనిష్టాయచ అని చదువుతాం. అంటే ఇంట్లో ఉన్న వయో వృద్ధుడైన తాతయ్య శివుడే. ఆ ఇంటి కోడలి కడుపులో పిండంగా ఉన్న శిశువు కూడా శివుడే. దైవం కాని వ్యక్తి, వస్తువూ లేదని చెప్పడమే దీని భావం. మన నుండి దూరంగా ఉన్న ప్రాపంచిక వస్తువులపై కలిగే మోహాన్ని వధించేది శివుడే. ఆ మోహానికి కారణంగా మనలోనే అంటిపెట్టుకున్న అరిషడ్వార్గాలను వధించేది కూడా శివుడే. అన్నింటితో ఉంటూనే ఒకానొక పరమవస్తువువైపు సాగే అంతర్ ప్రయాణమే శివదీక్ష ! ఈ అవగాహన కలిగించేది శివదీక్ష !!
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
శివైక్య భావన కోసమే ఆధ్యాత్మిక సాధన !'- (అధ్యాయం-65)
🕉🌞🌎🌙🌟🚩
[19:07, 05/05/2020] +91 92915 82862: శ్రీరమణీయం -(517)
🕉🌞🌎🌙🌟🚩
ఆలోచనలు ఏవీ లేనప్పుడు మనసు కూడా లేనట్లేనా ?
మనసు అనేదానికి ఆలోచన తప్ప మరొక రూపంలేదు. నా మనసులో ఆంజనేయస్వామి ఉన్నారంటే, నా ఆలోచనలు ఆంజనేయస్వామి గురించి ఉన్నాయని అర్ధం. మనసనేది ప్రత్యేకించి ఏదీలేదు. ఆ మనసులో ఉన్న విషయమే మనసుకు ఉనికిని, రూపాన్ని కల్పిస్తుంది. శివాలయానికి వెళ్ళాలి అనిపిస్తే మనసు శివాలయంగా ఉన్నట్లు అర్ధం. ఏది ఇప్పుడు మన ఆలోచనగా ఉందో అదే మన మనస్సు ! ఏది ఇప్పుడు మన మనసులో ఉందో అదే మన ఆలోచన. మనసు-ఆలోచన రెండిటికీ బేధంలేదు. కాబట్టి మౌనంలో మనసు పోతుందంటే అర్ధం ఆలోచనలు పోవటమే !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
శివైక్య భావన కోసమే ఆధ్యాత్మిక సాధన !'- (అధ్యాయం-65)
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(518)
🕉🌞🌎🌙🌟🚩
శివుడు అనే ఆలోచన రాగానే ఒక రూపం స్పురిస్తుంది అది సత్యమేనా ?
శివుడు అంటే ఏదో ఒక ప్రత్యేక రూపం కాదు. మన ఆత్మకు మనం శివుడనే రూపాన్ని ఇచ్చాం. ఆ సత్యం తెలియటానికి శివదీక్ష ఏర్పడింది. నా మనసు శివాలయం మీదకు పోతుంది అంటారు. నిజంగా మనసు ఎక్కడికీ వెళ్ళదు. శివాలయం అనే ఆలోచన మనస్సులోకి వచ్చింది అంతే ! ఇలా మనసు దీనిపైకి వెళ్ళిందని చెప్తే అప్పటికి ఆ ఆలోచన మన మనస్సులో ఉందని అర్ధం. మనసులో ఏ ఆలోచనలు లేకుండా పోవడమే మౌనం. అదే శివైక్యం. అదే అద్వైతం కూడా. అదే మనకు గురువు నేర్పేది. మన భావన చేత ఆత్మకు దైవం అని ఎలాగైతే ఒక రూపాన్ని ఇచ్చామో, అలాగే గురువు అనే మరొక రూపాన్ని కూడా ఇచ్చాం, అంతే !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_శివైక్య భావన కోసమే ఆధ్యాత్మిక సాధన !'- (అధ్యాయం-65)
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(521)
🕉🌞🌎🌙🌟🚩
"దేహాత్మభావన అంటే నేను దేహం అనుకోవటమేనా, దాన్ని అధిగమించే తరుణోపాయం ఏమిటి ?"
దేహాత్మభావన అంటే తాను కేవలం ఒక దేహాన్ని అనుకోవడం కాదు. తనకు తాను ఒక గుర్తింపుతో భావించటం. నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను కార్మికుడిని ఇలా అనుకోవటమే దేహాత్మభావన ! ఇప్పుడు మనకి అలాంటి భావనే ఉంది. అది దాటినవాడు గురువు కనుక ఆయనను మనం ఆశ్రయిస్తున్నాం. ఇద్దరిలోనూ సత్య దృష్టి ఉంటేనే వాళ్ళు గురుశిష్యులు అవుతారు. అద్వైత భావనలో ఉన్నవాడు గురువైతే, ఆ అద్వైత భావనను ఆశ్రయిస్తున్న వాడు శిష్యుడు. అలాంటప్పుడు ఇద్దరిలోనూ గురువు అంటే దేహం అనే భావనకే ఆస్కారంలేదు. అద్వైత భావనలేని అజ్ఞానికి బయటినుండి చూస్తున్నప్పుడు గురుశిష్యులు ఇద్దరూ అజ్ఞానులుగానే కనిపిస్తారు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_శివైక్య భావన కోసమే ఆధ్యాత్మిక సాధన !'- (అధ్యాయం-65)-
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(520)
🕉🌞🌎🌙🌟🚩
"గురువు, జ్ఞాని ఒక్కరేనా, ఏమైనా తేడా ఉంటుందా !?"
మనం చేరుకోవలసిన చివరి గమ్యాన్ని సాధించి మనకు మార్గం చూపేవాడు గురువు. గమ్యం గురించి మాత్రమే తెలుసుకొని బోధించేవాడు గురువు కాడు. అతడూ మనలాగే సాధకుడే అవుతాడు. దేహాత్మభావన దాటానివాడు అంటే తనను దేహం అనుకునేవాడు గురువుకాడు. గురువు కేవలం దేహమాత్రుడే అనుకునే వాడు శిష్యుడూకాడు. మనకు నిద్రలో ఎలాగైతే బేధభావన ఏదీ తెలియకుండా పోతుందో జ్ఞానికి మెలకువలోనే అలా ఉంటుంది. నిద్రకు, జ్ఞానానికి కొద్ది తేడానే ఉంది. ఏమీ తెలియకుండా పోవటం నిద్ర అయితే, అన్నీ తెలుస్తూ మనసులో ఏమీ లేకుండా పోవటం జ్ఞానం. అలా ఉండే జ్ఞానికే గురువు అని పేరు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
శివైక్య భావన కోసమే ఆధ్యాత్మిక సాధన !'- (అధ్యాయం-65)
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(523)
🕉🌞🌎🌙🌟🚩
"సత్-చిత్-ఆనందం అంటే ?"
దైవానికే సత్-చిత్-ఆనందం అని పేరు. భగవాన్ శ్రీరమణమహర్షి దీని గురించి ఇలా వివరించారు. జీవుడు-ఈశ్వరుడు-బంధమూ ఈ త్రిపుటి అన్ని మతాల్లోనూ సమానమే. మనః ప్రవృత్తి ఉన్నంతవరకే వాని యదార్థము. మనసు లేచిన పిదపనే దైవ ప్రతిపాదనను కూడా ! దైవం ఆత్మకు భిన్నం కాదు. ఆత్మకు దైవ రూపం ఇచ్చారు. గురువుకు సైతం అట్లాగే ఇచ్చారు. సత్ అంటే సదసత్తుల కవ్వల - చిత్ అంటే చిదచిత్తుల కావల - ఆనందం అంటే ఆనంద అనానందముల కావాల. సత్ అంటే ఇప్పటికే ఉండి కూడా మనకు కనిపించనిది. చిత్ అంటే ఉన్నదాన్ని ప్రకాశమానం చేసేది. ఆనందం అంటే ఆ వస్తువు ప్రకాశంచేత మనం గుర్తించినందువల్ల కలిగే మానసిక స్థితి. మనకి ఇంట్లో ఒక పాత ట్రంకుపెట్టె కనిపించింది. దానిపై ఇందులో బంగారు నగ ఉంది అని వ్రాసి ఉంది. అందులో ఉన్నది సత్ అయినా దాని ప్రకాశం మనకు తెలియదు. కాబట్టి ఆనందం కలగడంలేదు. కష్టపడి తెరిచి చూస్తే అందులోని నగ ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమే దాన్ని గుర్తించేలా చేస్తుంది. అలా గుర్తించినందువల్లనే మనసు ఆనంద పడుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
శివైక్య భావన కోసమే ఆధ్యాత్మిక సాధన !'- (అధ్యాయం-65)
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(524)
🕉🌞🌎🌙🌟🚩
"అజ్ఞాని కూడా ఆనందం, శాంతి పొందుతూనే ఉంటాడు కదా.. మరి జ్ఞాని, అజ్ఞాని పొందే వీటిలో తేడా ఏముంది ?"
దైవం జ్ఞానిలోనే కాదు అజ్ఞాని లోనూ సచ్చిదానందంగానే ఉంది. కాకపోతే భావనలోనే తేడా ఉంది. జ్ఞాని ప్రపంచమంతా ఉన్న శాశ్వతమైన సత్ ను తెలుసుకుంటాడు. అజ్ఞాని అశాశ్వతమైన ప్రపంచాన్ని సత్ గా భావిస్తుంటాడు. జ్ఞాని సత్యం యొక్క ప్రకాశంచేత దాన్ని గుర్తిస్తుంటే, అజ్ఞాని కూడా సత్పదార్థం చేత ఏర్పడ్డ ప్రకాశం {చిత్ } తోనే ఈ ప్రపంచాన్ని గుర్తిస్తున్నాడు. జ్ఞాని సత్యంతో అనుసంధానమై అఖండానందాన్ని పొందుతుంటే, అజ్ఞాని ఈ ప్రపంచంతో మమేకమై తాత్కాలిక శాంతినిచ్చే సంతోషాన్ని పొందుతున్నాడు. జ్ఞానికి కలిగేది శాశ్వత సచ్చిదానందం కావటంవల్ల అది అఖండ శాంతిని కలిగిస్తుంది. అజ్ఞానికి ప్రపంచం ద్వారా కలిగే తాత్కాలిక సచ్చిదానందంవల్ల శాంతికూడా తాత్కాలిక సంతోషమే అవుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_శివైక్య భావన కోసమే ఆధ్యాత్మిక సాధన !'- (అధ్యాయం-65)-
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(527)
🕉🌞🌎🌙🌟🚩
"చక్రాంకితులు కావటం, లింగధారులు కావటంలలోని ఆంతర్యం ఏమిటి ?"
భక్తులు చక్రాంకితులు, లింగధారులు కావటం కేవలం తమతమ ఇష్టాన్ని బయటికి ప్రకటించుకునేందుకు కాదు. చక్రాంకితాలు కావటం అంటే చక్ర్యాంకితుడు కావడం. అంటే ఆ 'చక్రి ' (విష్ణువు) అందించిన సందేశానికి అంకితం కావటం. లింగధారణ అంటే సర్వవ్యాపకమైన శివతత్వాన్ని ధరించటం. నేను ఏ దీక్షలో ఉన్నాను, దైవాన్ని ఏ రూపంలో కొలుస్తున్నాను అనేది ఎవరికి వారికి పూర్తిగా వ్యక్తిగత విషయం. దాని కంటే ముందుగా తాను ఆచరించాల్సిన మానవ ధర్మాలను, చూపాల్సిన మానవత్వాన్ని విస్మరిస్తే ఏ దీక్ష అయినా కేవలం నాటికలో వేషధారణే అవుతుంది. ముందు తాను మనిషి కానివాడు భక్తుడు ఎలా అవుతాడు ? తల్లిదండ్రులను పోషించని వాడు, కుటుంబ బాధ్యతలు చేపట్టని వాడు, సాటి ప్రాణులను ఆదరించని వాడు.. దైవం దృష్టిలో భక్తుడిగానే కాదు కనీసం మానవుడిగా కూడా చలామణి కాలేడు. అందరూ హీనంగా చూసే గజ్జికుక్కలో కూడా దీక్షలు తీసుకున్న వారికి దీక్షామూర్తులే కనిపించాలి. అలాకాకుండా ఆదరించాల్సిన సాటి మానవులను హీనంగా చూసేవాడు ఏ దీక్ష తీసుకున్నా అది నటనే అవుతుంది కానీ శరణాగతి కాదు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సర్వవ్యాపకత్వాన్ని గుర్తించటమే శరణాగతి !'- (అధ్యాయం-66)
శ్రీరమణీయం-(528)
🕉🌞🌎🌙🌟🚩
"భక్తి కలిగి ఉండటం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది కదా ?"
ఆధ్యాత్మికం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు. ఆధ్యాత్మికంలో భక్తి ఒక భాగం మాత్రమే. అంతర్ముఖం కావటమంటే ముందు మనలోని లోపాలు వెతుక్కొని సవరించుకోవటం. సద్గురు మన బుద్ధిరూపంలో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. "కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే గురువు కావాలి, నేర్చుకున్నది తీసేయ్యటానికి గురువెందుకు ?" అని శ్రీరమణమహర్షి అన్నారు. చిన్నపిల్లవాడికి ఏదైనా పెట్టుకోవటం ఎలానో మనం నేర్పాలి. ఎలా వదిలివేయాలో నేర్పనక్కర్లేదు. పట్టుకున్నది మంచిది కాదని తెలిస్తే వాడే వదిలివేస్తాడు. ఆధ్యాత్మికత అంటే సంపూర్ణ మనశ్శాంతి. అది మనలో ఉంది. మనం చేయవలసిందల్లా అడ్డుగావున్న బేధభావాలను తొలగించుకోవటమే !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సర్వవ్యాపకత్వాన్ని గుర్తించటమే శరణాగతి !'- (అధ్యాయం-66)
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం-(530)
🕉🌞🌎🌙🌟🚩
"సద్గురువుకు, దైవానికి మధ్య తేడా ఏమిటి ?"
శరణాగతి చెందిన తర్వాత సద్గురువుకు, దైవానికి మధ్య తేడాలేదని తెలుస్తుంది. మూడు ముళ్ళు వేస్తే వివాహబంధం ఏర్పడుతుంది. గురువుతో మన బంధం అలా ఏర్పడేది కాదు. మన జన్మజన్మాంతరాల్లో ఆ బంధం మనకు తోడుగా వుండేది. సద్గురువుతో సంబంధం ఒక మంత్రంతోనో, శిరస్సుపై చేయిపెట్టి దీవిస్తేనో ఏర్పడేది కాదు. సద్గురు చేతిని మన శిరస్సుపై ఉంచాలని మనం కోరుకునేది ఎందుకంటే ఆ సద్గురువు అప్పటికే మన తలలోనే ఉన్నట్లు గుర్తించక పోవటం వల్లనే !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సర్వవ్యాపకత్వాన్ని గుర్తించటమే శరణాగతి !'- (అధ్యాయం-66)
🕉🌞🌎🌙🌟🚩
[14:25, 22/05/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(534)
🕉🌞🌎🌙🌟🚩
"ఒక సాధకుడికి జ్ఞానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ?"
"ఆత్మసిద్ధి కాలేదే అన్న నీ భ్రాంతిని పోగొట్టడానికి " అని ఒక భక్తుడి ఈ ప్రశ్నకు భగవాన్ శ్రీరమణమహర్షి సమాధానమిచ్చారు. సహజంగా చీకటిలో త్రాడు పాముగా కనిపించటం మన భ్రాంతి. ఆ ప్రాంతంలో ఒక పెద్ద విషసర్పం తిరుగుతుందని, దానివల్ల చాలా మంది చనిపోయారని విన్న మాటలవలన మనలో కలిగే భయం విభ్రాంతి. అంటే మనలో సహజంగా కలిగే భ్రాంతి విపరీతమైతే అది విభ్రాంతిగా మారుతుంది. మన భ్రాంతి-విభ్రాంతి వల్ల ఆ త్రాడు పాముగా మారలేదు. ఇవి తొలగిపోయిన మరుక్షణం తిరిగి మనకది త్రాడుగానే కనిపిస్తుంది. జ్ఞానిచేసే పని ఆ విభ్రాంతిని తొలగించటమే. ప్రతి సాధకుడికి తానొక గమ్యం చేరుకోవాలన్న తపన ఉంటుంది. తాను కోరుకున్న స్థితి అప్పటికే తనకి ఉన్నదేనని జ్ఞానివల్ల మనకి తెలుస్తుంది. ఒక జ్ఞాని గురించి సాధకుడికే తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికే అతడు కొంత ప్రయాణాన్ని పూర్తిచేయటమో, ఆ ప్రయాణంపై ఇష్టం కలిగి ఉండటమో చేస్తున్నాడు కనుక !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సర్వవ్యాపకత్వాన్ని గుర్తించటమే శరణాగతి !'- (అధ్యాయం-66)
🕉🌞🌎🌙🌟🚩
[17:43, 26/05/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(538)
🕉🌞🌎🌙🌟🚩
"మాయకు ప్రభావితం కాకుండా శుద్ధమనసును సాధించుకునే మార్గం ఏముంది ?"
ఏ విషయంపైన వ్యామోహం లేకుండా, ఎవరు ఈ సృష్టిలో తానొక అంతర్భాగంగా నిర్లిప్తతతో ఉంటారో వారిది శుద్ధమనసే అవుతుంది. తత్కాలంలో ఒక విషయంపైకి వెళ్ళని మనసు ఆ విషయంలో శుద్ధమనసే అవుతుంది. మనసులో ఏ విషయమైతే లేదో దాని విషయంలో వాడికి మాయే ఉండదు. అప్పుడు ఆ విషయంలో ఆతనికి వైరాగ్యం కలిగినట్లే. అలా అన్ని విషయాల్లో నిశ్చలత సాధిస్తే అది శుద్దవైరాగ్యం. వైరాగ్యంలో దేన్ని వద్దని తిరస్కరించడం ఉండదు. ఏదీ కావాలని కోరుకోకపోవటమే ఉంటుంది. ఎందుకంటే ఫలానాది వద్దనుకోవటం కూడా తనకిష్టమైన దాన్ని కావాలనుకోవటమే అవుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
జ్ఞాన వైరాగ్యాలు లోపిస్తే కలిగేది మాయ !'
🕉🌞🌎🌙🌟🚩
[15:51, 28/05/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(540)
🕉🌞🌎🌙🌟🚩
"మాయ ఎందుకు పుడుతుంది ? ఎలా పుడుతుంది !?"
మనకు తెలియకుండా జరిగిపోయే పరిణామానికి మనం పెట్టుకున్న పేరు మాయ ! మనం ఎందుకు-ఎక్కడ-ఎలా పుడుతున్నామో మనకు తెలియదు. ఎలా చనిపోతున్నామో కూడా తెలియదు. ఏదైతే మన చేతుల్లో లేదో అది మనకి తెలియకుండానే జరుగుతుంది. ఏది మనకు తెలియకుండా జరుగుతుందో అదంతా మాయగా అనిపిస్తుంది. ఆది నుండి ఫలం వరకూ విషయమంతా మనకు తెలిసిఉంటే దాన్ని జ్ఞానం అంటాం. వెలుతురు లేనిచోట చీకటి ఉన్నట్లు, జ్ఞానం లేనిచోట మనసు పొందే స్థితి మాయ. చిన్న పిల్లలతో ఆడుకుంటూ జేబు నుండి తీసిఇచ్చిన చాక్లెట్టునే సృష్టించామని నమ్మిస్తాం. అక్కడ మనం ఇచ్చిన చాక్లెట్ సత్యమే కానీ అది సృష్టించి ఇచ్చామని పిల్లలు నమ్ముతున్న విషయం అసత్యం. ఇక్కడ ఏమి జరిగిందో పిల్లలకు తెలియలేదు కనుక దాన్ని మాయ అంటున్నాం. ఈ సృష్టి విషయంలో మన పరిజ్ఞానం కూడా మాయగానే ఉంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
జ్ఞాన వైరాగ్యాలు లోపిస్తే కలిగేది మాయ !'- (అధ్యాయం -67)
[14:09, 01/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(544)
🕉🌞🌎🌙🌟🚩
"మాయ ఎలా అవహిస్తుంది ? దాని నుండి ఎలా బయటపడాలి !?"
కోరిక, మోహం రూపంలో మాయ మన మనసును అవహిస్తుంది. మనలో పూర్తి జ్ఞాన-వైరాగ్యాలు కలిగే వరకు మాయ మనలను వదిలిపెట్టదు. మనం లౌకిక విషయాల్లో ఇరుక్కుపోయేందుకు మాయ చేసేందుకు అలవాటు పడ్డాం. ఇప్పుడు అనుభవిస్తున్న విషయాన్ని మళ్ళీ కావాలనుకోవటం, అప్పటికి లేని విషయాలను కావాలని అడగటం కోరిక అవుతుంది. లభించింది శాశ్వతంగా ఉండాలన్న ఆశ మోహం అవుతుంది. కోరిక, మోహం లేని స్థితి వైరాగ్యం. ఇప్పుడు మనం ఏఏ విషయాల్లో మాయలేకుండా ఉన్నామో ఆయా విషయాల్లో మనం విరాగులమే అవుతాం. అదే స్థితి అన్ని విషయాల్లోనూ పొందితే సంపూర్ణ విరాగులం అవుతాం. వైరాగ్యం, ఆత్మసాక్షాత్కారం వేర్వేరు కాదు. మన యదార్ధస్థితిని తెలుసుకోవటమే రెండింటి ఫలం. తద్వారా మాయ నుండి బయట పడవచ్చు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
జ్ఞాన వైరాగ్యాలు లోపిస్తే కలిగేది మాయ !'- (అధ్యాయం -67)
[14:38, 03/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(546)
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరామచంద్రుడికి వశిష్ట మహర్షి బోధ !
శ్రీరామచంద్రుడు : బ్రహ్మము శుద్ధము, అతని నుండి మాయ పుట్టుట ఏమి ? అతనినే మాయ కప్పుటేమి !?
వశిష్ట మహర్షి : గాఢ వైరాగ్యమున్న శుద్ధమనసులో ఈ ప్రశ్న జనించదు. నిజమును అద్వైత వాదంలో జీవ, ఈశ్వర, మాయకు తావులేదు. తనలో తాను మునుగగా, వాసనలు పూర్తిగా నష్టమై ఈ ప్రశ్నలకు సందివ్వవు.
శ్రీరామచంద్రుడు : ఆత్మ నుండి జీవుడేట్లు కలిగినాడు ?
వశిష్ట మహర్షి : నీ యదార్ధస్థితిని తెలుసుకో, నీకీ ప్రశ్న రాదు. తాను వేరని ఎవరైనా ఎందుకు అనుకోవలె ? పుట్టుక పూర్వం తానెట్లున్నాడు ? చనిపోయిన తర్వాత ఎట్లుండబోతాడు ? ఇట్టి ప్రశ్నలతో కాలం వృధా పోవటం ఎందుకు ? నిద్రలో నీ రూపేమి ? నిన్ను నీవొక వ్యక్తిగా ఎందుకు భావిస్తున్నావు ?
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_జ్ఞాన వైరాగ్యాలు లోపిస్తే కలిగేది మాయ !'- (అధ్యాయం -6-
🕉🌞🌎🌙🌟🚩
[15:02, 04/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(547)
🕉🌞🌎🌙🌟🚩
"ఏకాగ్రతను ఏ విధంగా కుదుర్చుకోవాలి ?"
గురువు అనుగ్రహంతో లభించే దైవజపం శ్రద్ధగా సాగితే మనసుకు ఒకే విషయాన్ని ఆలోచించటం అలవాటవుతుంది. దీనివల్ల ఏకాగ్రత కుదురుతుంది. ఇప్పటికే మన మనకు అనేక విషయాల్లో ఏకాగ్రత కుదురుతూనే ఉంది. ఆ ఏకాగ్రత మనసు ఇష్టపడే విషయాల్లో మాత్రమే ఉంది. సినిమా చూసేటప్పుడు, పేపర్ చదివేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు మనం ఏకాగ్రతతోనే ఉంటున్నాం. మనసు ఇష్టపడే విషయంలో కాకుండా మనం అనుకున్న విషయంలో ఏకాగ్రత సాధించటం నేర్చుకోవాలి. సంఘటనల ద్వారా సంతోషదుఃఖాలలో ఏది వస్తే దాన్ని మనం అనుభవిస్తున్నాం. మనసు ఏకాగ్రత సిద్ధించి అనుకొన్న విషయంలో నిలపగలిగితే వచ్చే సంతోషదుఃఖాలను పైకి అనుభవిస్తూనే మనసు అంతరంలో ఆనందాన్ని పొందగలుగుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'- (అధ్యాయం -68)
🕉🌞🌎🌙🌟🚩
[16:43, 05/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(548)
🕉🌞🌎🌙🌟🚩
"ఏకాగ్రత సాధించటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి ?"
మనం మనసుకు లేని గుణాన్ని ఎప్పటికీ అలవర్చలేము. దానికి ఉన్న గుణాన్ని గుర్తించి వశం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనలో నిరంతరం సాగుతున్న ధ్యాన స్థితిని గుర్తించి దాన్ని నిరంతరం అనుభవించటమే మనం చేయవలసిన సాధన. మనసుకు సహజంగా ఉన్న శాంతే దాని ధ్యానగుణం. అది స్పష్టంగా అర్ధం కావటమే ఏకాగ్రతను సాధించటం వలన కలిగే ప్రయోజనం !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'- (అధ్యాయం -68)
🕉🌞🌎🌙🌟🚩
[14:39, 06/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(549)
🕉🌞🌎🌙🌟🚩
"మనసు సంతోషాన్ని, ఆనందాన్ని బయటి నుండి పొందుతుందా ? తనలోనుండే తాను పొందుతుందా ??"
ఒక ఆహ్లాదకరమైన దృశ్యాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు మనసు ఆనంద పడుతుంది. ఈ ఆనందంలో దృశ్యం తాలూకు సంతోషంతోపాటు మనసు ఆ విషయంపై నిలిచినందువల్ల వచ్చే శాంతి కూడా కలిసి ఉంటుంది. సంతోషపడాలంటే మనసుకు మరొక విషయం కావాలి. కానీ తనలోనేవున్న శాంతిని పొందటానికి నిలకడగా ఉంటే చాలు. మనం ఏదైనా పనిలో లీనమైనప్పుడు జరిగేది అదే. మనసు నిలకడలో దాని నుండి అదే ఫలాన్ని పొందుతుందన్న విషయాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్న రోజు ప్రతి పనిలోనూ ఆ శాంతిని గుర్తించి ఆనందంగా జీవించవచ్చు. ఎందుకంటే మనసులో ఆ ధ్యానం జరుగని క్షణం ఏదీ ఉండదు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'- (అధ్యాయం -68)
[14:19, 07/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(550)
🕉🌞🌎🌙🌟🚩
"బయటి వస్తువులు, విషయాల ద్వారా లభించే సంతోషం, సుఖం తెలుస్తుంది కానీ మనసు తన నుండి తాను పొందేది ఏమిటో అర్థం కావడం లేదు ?"
మనం పొందుతున్న ప్రతి అనుభవంలోనూ మనసు తన నుండి తాను పొందే ఫలం, ఎదుటి వస్తువు నుండి పొందే ఫలం జంటగానే లభిస్తున్నాయి. మనకిప్పుడు ఎదుటి వస్తువు నుండి వచ్చే ఫలమే తెలుస్తుంది. అందులోనే మనసు నుండి మనసు పొందే 'శాంతి 'అనే ఫలం కూడా కలిసిపోయి ఉన్నట్లు గ్రహించలేక పోతున్నాం. అలా నిరంతరాయంగా ఉన్న శాంతి మన గ్రహింపులోకి వచ్చేందుకు మనసును అనుసరించే ఉంటుంది. అందుకే మనసును గమనిస్తూ ఉండటంచేత నిరంతరాయంగా ఉన్న ధ్యానం ఏదో ఒక రోజు దానంతట అదే ఆవిష్కరింప బడుతుంది. మనలో ఇప్పుడు అనుక్షణం ధ్యానం కొనసాగుతున్నా అనేక వ్యాపకాల కోలాహలంలో దాన్ని గుర్తించలేక పోతున్నామన్న విషయం అప్పుడు అర్థమవుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'- (అధ్యాయం -68)
🕉🌞🌎🌙🌟🚩
[13:30, 08/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(551)
🕉🌞🌎🌙🌟🚩
"ధ్యానం అనుభవంలోవున్నా గుర్తించలేకపోతున్నామా ? అదెలా జరుగుతుంది !?"
ధ్యానం కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే అనుభవంలోకి వచ్చేది కాదు. మనలో ఇప్పుడు అనుక్షణం ధ్యానం కొనసాగుతున్నా అనేక వ్యాపకాల కోలాహలంలో దాన్ని గుర్తించలేక పోయామన్న విషయం గ్రహించగలగాలి. ఒక్కసారి ధ్యానం ఆవిష్కరింపబడిన తర్వాత ప్రతి పనిలోనూ దాన్ని మనం ఆస్వాదించవచ్చు. ఒక్కసారి ఆ స్థితి అర్ధమైతే ఈ లౌకిక జీవనంలో పొందే సుఖదుఃఖాలు అన్నీ కేవలం పాలవంటి ధ్యానంపై ఏర్పడిన నురగతో సమానమని తెలుస్తుంది. అందుకే ధ్యానానుభవం పొందిన వ్యక్తి 99 శాతం స్వీయ ఆనందాన్ని పొందుతూ, ఒకశాతం లౌకిక జీవనంలో ఉంటాడు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'- (అధ్యాయం -68)
🕉🌞🌎🌙🌟🚩
[16:16, 09/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(552)
🕉🌞🌎🌙🌟🚩
"ఏదైనా ఒక విషయంలో నిమగ్నమైన మనసు విషయాన్ని తెలుసుకుంటుంది కానీ అప్పుడు తానెలా ఉన్నాననేది ఎందుకని తెలియటంలేదు ?"
మనసుకున్న రెండు లక్షణాల్లో ఒకటి నిమగ్నమైన విషయంలో నిలిచి ఉండటం. రెండవది తనను తాను గమనించుకోవటం. ఈ రెండు పనులు ఏకకాలంలో జరుగుతున్నా, మనకు మనసు నిమగ్నమైవున్న విషయం మాత్రమే తెలుస్తుంది. మనసు తనను తాను గమనించుకునే విషయం తెలియడంలేదు. అలా గమనించే శక్తే మనసుకున్న ధ్యానశక్తి. మనసు దేన్ని గ్రహించి గమనిస్తుందో అదే మనకు అనుభవంగా ఉంటుంది. ఒక్కక్షణం కూడా మనసు ఏదీ గ్రహించకుండా (తెలుసుకోకుండా) ఉండదు. అద్దం ముందున్న ఏ దృశ్యమైనా దానిలో ప్రతిబింబించకుండా తప్పించుకోనట్లే మనసు ముందుకు వచ్చిన ఏ విషయం కూడా దాని గ్రహింపుశక్తి నుండి తప్పించుకోలేదు. అయితే ధ్యానశక్తి కుదరకపోవటం వలన మనసు తనను తాను గమనించలేక పోతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'- (అధ్యాయం -68)
[14:42, 11/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (554)
🕉🌞🌎🌙🌟🚩
"ధ్యానానుభవం నిరంతరం కొనసాగుతుండేదే.. అంటున్నప్పుడు ప్రత్యేకంగా ధ్యానం చేయాలని ప్రయత్నించడం ఎందుకు ?"
ఆ అనుభవం పొందేందుకు సాధన అవసరం. ఒక ఫోటోకు మరోవైపు ఉన్న తెల్ల కాగితంలాగా మనసుకు ధ్యానం నిరంతరం ఉండేస్థితే ! దాన్ని గుర్తించేంత సమయం ఇవ్వకపోవటం చేతనే మనకది అనుభవంలోకి రావటంలేదు. వస్తువు నుండి పొందే ఫలంపై మనం గమనింపు పెడుతున్నాం కానీ మనసు నుండి మనస్సు పొందే ఫలంవైపు ఆ గమనింపు సారించడంలేదు. మనం ప్రతిసారీ మనసు గ్రహించే విషయాన్నే గమనిస్తున్నాం కానీ ఆ గ్రహింపును గమనించటంలేదు. దైవజపం ద్వారా గురువు అందించే ఏకాగ్రతలో మన మనసు తన గ్రహింపును అది గమనించుకుంటుంది. అదే మనకు ధ్యానంగా ఆవిష్కరింప బడుతోంది. కాబట్టి మనసు కేవలం ఏకాగ్రతలోనే కాదు సర్వకాల సర్వావస్థల్లోనూ విషయాలను గ్రహించే శక్తిని కలిగిఉంది. కాబట్టి మనం ఆ గ్రహింపుశక్తిని ఎప్పుడైనా గమనించవచ్చు. అలా గమనించే ప్రతిక్షణం మనకు ధ్యానానుభవమే ఉంటుంది. అందుకే పెద్దలు ధ్యానం చేసేదికాదు, అది నీలో ఉన్నదే అంటున్నారు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'- (అధ్యాయం -68)
🕉🌞🌎🌙🌟🚩
[14:28, 10/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(553)
🕉🌞🌎🌙🌟🚩
"గ్రహింపు అనుభవంగా, జ్ఞాపకంగా మనసు ఏ విధంగా అందిస్తుంది ?"
మనకు అనేక విషయాలు గ్రహింపులో ఉన్నా, మన ధ్యాస దేనిపై ఉంటుందో అదే మన అనుభవంలోకి వస్తుంది. ప్రతి గ్రహింపు మనసులో జ్ఞాపకంగా ఉంటుంది. అందుకే నిద్ర మనకు అనుభవంలో లేకపోయినా దానికి సంబంధించిన శాంతిని మనసు జ్ఞాపకంగా అందించగలుగుతుంది. సినిమాలో లీనమైన మనసు ఆ కథాంశాన్నే గమనిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఏసి నిలిపివేసినందువల్ల వచ్చే ఉక్కపోతను, ఇరుకుగా కూర్చోవడం వల్ల వచ్చే కాళ్ళ నొప్పులను కూడా గ్రహిస్తూనే ఉంటుంది. కనుకనే ధ్యాస మారగానే అవి తిరిగి గమనింపులోకి వస్తాయి. అది కూడా చాలా సేపటి నుండి కాళ్ళు నొప్పెడుతున్న విషయంతో సహా తెలుస్తుంది. అంటే మనసు తాను గ్రహించిన విషయాన్ని అప్పటికి అనుభవంగా అందించలేకపోయినా, జ్ఞాపకంగా అందించేటప్పుడు ఏదీ మినహాయించకుండానే అందిస్తుందని అర్థమవుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'-
🕉🌞🌎🌙🌟🚩
[15:20, 12/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(555)
🕉🌞🌎🌙🌟🚩
"ధ్యానాన్ని అర్ధం చేసుకోవటం, ఆవిష్కరించుకోవటం ఎలా సాధ్యం అవుతుంది ?"
మన మనసు మూడు స్థితుల్లో ఉంటుంది. "ఒక విషయంలో తాదాత్మ్యత పొందినప్పుడు, గాఢనిద్రలో ఉన్నప్పుడు, ఆలోచనలు ఇతర పనుల్లో ఉన్నప్పుడు" మన మనసు స్థితిని గమనించి వీటిలోవున్న వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు నిరంతరంగా ఉన్న ధ్యానం మనకు అర్ధమవుతుంది. అంటే సర్వకాలసర్వావస్థల్లో మనసు యొక్క స్థితి తెలిస్తే ధ్యానం ఆవిష్కరించబడుతుంది. ఈ ధ్యానస్థితిని చేరుకునేందుకు గురువు చెప్పే మంత్రం నిరంతరంగా చేస్తూ ఉంటే మనసును మనసు గమనించే ఏకాగ్రత సిద్ధిస్తుంది. నిజానికి మంత్రాన్ని నిరంతరాయంగా చేయటంలోనే ఏకాగ్రత ఉంది. !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'- (అధ్యాయం -68)
[14:12, 14/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం-(557)
🕉🌞🌎🌙🌟🚩
ధ్యానానుభవాన్ని ఏ విధంగా ఆవిష్కరించుకోవచ్చు ?
భగవంతుడు అందరినీ ధ్యానం అనే గుణంతోనే పంపాడు. అది కూడా సర్వకాల సర్వావస్థల్లో ఉండే విధంగా నింపాడు. మనతోనే ఉన్న వస్తువు మనకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏదో ఒక వస్తువు సహాయంతోనో, వ్యక్తుల సహాయంతోనో, ఒకానొక భంగిమలోనో మాత్రమే వచ్చేదే ధ్యానం అయితే అది మనకి పరాయిది అవుతుంది. ప్రశాంతంగా నిద్ర లేచిన రోజున నిద్రలో మనం పొందిన హాయిని అనుభవిస్తూ లేస్తాము. హడావుడిగా నిద్రలేచిన రోజు ఆ హాయిని గుర్తించకుండానే పనిలో పడిపోతాం. ధ్యానం కూడా అంతే మనం దానికి తగిన సమయం, శ్రద్ధ కేటాయిస్తే ధ్యానానుభవం తప్పకుండా ఆవిష్కృతమవుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
ప్రతి పనిలోనూ ధ్యానం ఇమిడివుంది !'- (అధ్యాయం -68)
🕉🌞🌎🌙🌟🚩
[14:22, 16/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం -(559)
🕉🌞🌎🌙🌟🚩
"కలకంటున్నప్పుడు, మెలకువలో ఉన్నప్పుడు దేనికదే సత్యంగా అనిపిస్తుంది.. మరి ఈ రెండూ కల్పనలే అంటారు ఎందుకు ?"
కలకంటున్న సమయంలో అప్పటికి అదే సత్యం అనిపిస్తుంది. నిద్రలేవగానే 'ఇల' సత్యమనిపిస్తుంది. ఎప్పటికప్పుడు సత్యంగా భ్రమింపజేస్తున్న ఈ రెండింటిలో ఏ సంఘటన అయినా శాశ్వతంగా నిలిచి ఉండటంలేదు. ఆ సంఘటనలను తెలుసుకునే మనం మాత్రం ఆ సంఘటన ఏర్పడక ముందు నుండి ఉంటున్నాం. ఆ ఉన్నదేదో అనుభవపూర్వకంగా తెలిస్తే అది ఆత్మజ్ఞానం అవుతుంది. ప్రదర్శనకు ముందు నుండే ఉన్న తెర సినిమాకు ఆధారం. అలాగే కలలో, ఇలలో ఏర్పడే సంఘటనల కన్నా ముందు నుండి ఉన్న ఆధారం ఆత్మ. ఒకే తెరపై కనిపించే సినిమాల్లో ఒకటి నిజం, ఒకటి అబద్ధం కావటానికి అవకాశం లేదు. కథాంశాలు వేరైనా రెండూ కల్పనలే. అలాగే మన కల, ఇల రెండూ ఆ మనసు తెరపై సినిమాల వంటివే. మనలో ఉన్న ఆత్మశక్తి మనకు అనుభవంలోకి వస్తేగానీ ఇది అర్ధం కాదు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
కలకు-ఇలకు ఆధారం ఆత్మ !'- (అధ్యాయం -69)
🕉🌞🌎🌙🌟🚩
[14:22, 16/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: మేము ఆత్మను కనుగొనేదెలా..
జవాబు: ఆత్మను పరిశోధించడం కుదరదు. అనాత్మ మీదనే మనము పరిశీలనంతా.. అనాత్మను మాత్రమే తొలగించగలము. ఆత్మ ఎపుడూ వున్నదే. అది తనంత తానే ప్రకాశిస్తుంది. ఆత్మను తెలుసుకోవడం అంటే ఆత్మగా ఉండడమే. అది సాపేక్షికజ్ఞానము కాదు.
ప్రాపంచిక విషయాలతో అయితే అభివృద్ధిని సూచించగలము. కాని ఆధ్యాత్మిక విషయంలో అజ్ఞానమును తొలగించుకోవడమే. కేవలం పుస్తక జ్ణానమును సంపాదించుకొనుట కాదు.
ప్రశ్న: ఆత్మతో అనుసంధానమెలా..
జవాబు: అది నీకు దూరంగా ఉంటే దానితో అనుసంధానము సాధ్యమే. అది వున్నదే మన ఆలోచనలవల్ల దానిని తెలుసుకోలేక పోతున్నాము. నీవు దాన్ని గురించి ఆలోచించనూ లేవు. దాన్ని మరచిపోనూ లేవు. నీవు దాని కొరకు ప్రయత్నించినా, ప్రయత్నించకపోయినా అది ఉండనేవుంది. సత్యమైన ఉనికియే మన అసలు స్వభావము.
🕉🌞🌎🌙🌟🚩
[
[14:12, 14/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: పవిత్ర గ్రంధాలలో కొన్ని పదములు - ఆత్మ, పరమాత్మ, పరా .. ఇత్యాదిగా వున్నాయి. వాటి మధ్య తేడా ఏమిటి ?
జవాబు: వాటి అన్నింటి అర్ధము ఒకటే. ప్రజలు వారి అవగాహనను బట్టి అర్థం చేసుకుంటున్నారు. అది కాల పరిస్థితులను బట్టి వచ్చాయి. వాటి అర్థం ఆత్మే 'పరా' అంటే సాపేక్షకమైనది కాదు. నిరపేక్షమైనది అని అర్థం.. పరిపూర్ణమైనది అని.
ఆత్మ, పరమాత్మ రెండూ ఒక్కటే. సాక్షాత్కారము శాశ్వతమైనది. అది శాశ్వతం కాకపోతే దానికి ఒక మొదలు వుంటుంది. తుది వుంటుంది. అశాశ్వతమైన దానికి చేసే ప్రయత్నం వృధాయే కదా. ఆ స్థితి ప్రయత్నరహితమైనది. అప్రయత్నంగా ఎరుకలో వుండడమే ఆనందం.
ప్రశ్న: నేను పరిమితుడిని అయితే నాకెందుకొచ్చింది ఈ పరిమితత్వం.
జవాబు: నీ మాటలను నీవు పరిశీలించు. నీవు 'నేను' తో మొదలుపెట్టావు. ఆ 'నేను' ను తెలుసుకో. తెలుసుకున్న తర్వాత కూడా ఈ సందేహం వుంటే అపుడు ఆలోచించవచ్చును. కాని ఇపుడు కాదు. ఆత్మ ఇప్పటికిప్పుడే వున్నది. అది ఒక్కటే వున్నది. అది క్రొత్తగా పొందబడేది కాదు. అది సహజము శాశ్వతము. ఆత్మ అంటేనే అనంతమైనది అని అర్దం. దాని అర్థం పరిమితం చేయకు.
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
[15:20, 12/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: మారే ఆత్మ, మారని ఆత్మ వున్నాయా..
జవాబు: మార్పు అనేది ఆలోచనే. ఆలోచనలన్నీ 'నేను' అన్న ఆలోచన తర్వాతే. ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి. అపుడు ఆలోచనలు లేకుండా పోతాయి. చెప్పేదేమంటే, నేను అన్న ఆలోచన ఎక్కడ పుడుతుందో, దాని మూలాన్ని గమనిస్తే అసలు నేనును తెలుసుకుంటావు. ఆత్మ పేరు నేను.
ప్రశ్న: నేను ఆత్మని చేరుకోవడమెలాగ..
జవాబు: ఆత్మని చేరుకోవడమనేదే లేదు. అది అలా పొందబడేదైతే, అది ఇప్పుడు, ఇక్కడ లేదు అని అర్థం. కొత్తగా పొందబడేది ఏదైనా అది నశించిపోతుంది. అది అశాశ్వతము. శాశ్వతం కాని దానికి కష్టపడి ప్రయత్నించడం వృధా. కాబట్టి ఆత్మ పొందబడేది, చేరుకునేది కాదు. నీవు అదే, ఆత్మవే, అజ్ఞానం వలన నీ ఆనందస్థితిని తెలుసుకోలేక పోతున్నావు. అజ్ఞానము నీ ఆనందానికి ఒక తెరను కప్పివేసింది. నీవు అజ్ఞానం తొలగించే ప్రయత్నం చేయు. అజ్ఞానము అంటే తప్పుతెలివి. ఈ తప్పంతా ఎక్కడున్నదంటే మనసుతో, శరీరంతోడి తప్పు తాదాత్మ్యము వలన. ఆత్మవిచారణతో ఈ తప్పు తాదాత్మ్యము తొలగిపోతుంది, ఆత్మ ద్వైతానికి దూరము. ఒకటి వుంటే రెండవది వుంటుంది. ఒకటి లేకపోతే ఇతర సంఖ్యలుండవు. సత్యమేమిటంటే అది ఒకటి కాదు రెండుకాదు అంటే రెండవది లేనిది అని అసలైన అర్ధము. ఎపుడు ఆ సత్య వస్తువునే భావించు దాని మీదనే దృష్టిని వుంచు. అదిగానే వుండు. ఆత్మనుభవమును పొందేంత వరకు నీ విచారణ సాగాలి. అపుడే నీకు శాశ్వతానందము.
🕉🌞🌎🌙🌟🚩
[14:29, 10/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: జరుగనున్న దేదో జరుగక మానదన్నప్పుడు ప్రార్థనలు చేయటం గాని, ప్రయత్నం చేయటంగాని ఎందుకు ? ఊరికే ఉంటే సరిపోదా ?
జవాబు: విధిని దాటడానికి రెండే మార్గాలున్నాయి - ఆ అదృష్టమెవరికి అని విచారించి, ఆ అదృష్టానికి వశమైనది అహంకారమే గాని ఆత్మకాదనీ, అసలు అహంకారానికి అస్తిత్వమే లేదని తెలుసుకోవటం. రెండవది, పరిపూర్ణంగా సర్వేశ్వరునికి అర్పితమై అహంకారాన్ని ధ్వంసం చేయటం. అంటే, నీ నిస్సహాయతని గ్రహించి "ప్రభూ నేను కాదు, నీవే" నని ఎప్పుడూ అనుకోవటం. "నేను - నాది" అనే భావాన్ని విడిచి, అంతా సర్వేశ్వరునికే అంకితం చేసి, నీ జీవిత గమనాన్ని ఆయన అధీనం చేయటం. "భగవంతుడు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి" అని కోరిక ఉన్నంత కాలం శరణాగతి పరిపూర్ణం కాదు. ప్రపత్తి అంటే సర్వేశ్వరుని పట్ల అచంచలమైన, నిర్హేతుకమైన ప్రేమ. ఆఖరికి మోక్షం కొ'రకు కూడా కాదు. దీనినే మరొక విధంగా చెప్పాలంటే, విధిని గెలవాలంటే, ఆత్మ విచారమార్గం ద్వారా గాని, అహంకారాన్ని తుడిచి పెట్టెయ్యాలి ..!!
🕉🌞🌎🌙🌟🚩
[14:42, 11/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: నేను ఆత్మను అని ఎలా తెలుసుకోగలను..
జవాబు: ఆత్మంటే ఏమిటి.. నీవు ఆత్మ అని దేని గురించి అనుకుంటున్నావు.. మనసునా, బుద్ధినా, నేను అన్న ఆలోచననా.. నేను అన్న ఆలోచనని గట్టిగా పట్టుకో. ఇతర తలపులు ఆగిపోతాయి. ఆత్మ మాత్రమే ఉంటుంది. రెండు నేనులున్నాయా.. నీ అస్తిత్వమును నీవు ఎలాగ తెలుసుకుంటున్నావు. నిన్ను నీవు కళ్ళతో చూసుకొనగలవా. నిన్నే ప్రశ్నించుకో. అసలు ఈ ప్రశ్న ఎలా ఉత్పన్నమైనది. అడిగేందుకు నేను ఉంటానా, ఉండనా.. నన్ను నేను కనుగొనగలనా అద్దంలో లాగా.. నీ దృష్టి బాహ్యంగా ఉన్నందు వలన, ఆత్మ మీద దృష్టి పోయినది. ఆత్మ బాహ్య వస్తువులలో లేడు. అంతర్ముఖుడివి కమ్ము. నీవు ఆత్మగానే వుంటావు. ఆత్మలో మంచి, చెడు లక్షణములు లేవు. అన్ని లక్షణాలకు అతీతమైనది. లక్షణములన్నీ మనసుకు సంబంధించినవి. 'నేను' అనునది ఎక్కడ వున్నది.. అని విచారణ చేయాలి. నేను అన్న ఆలోచన వచ్చిన తర్వాతనే మనసుతోను, ఇంద్రియాలతోను, శరీరంతోను తాదాత్మ్యం జరుగుతుంది. వీటితో తాదాత్మ్యము వల్లనే ఆత్మ మీద దృష్టి తొలగింది. అసలు నేనును పట్టుకోవడానికి, మిధ్యా నేనును తొలగించుకొనుటకే శాస్త్రాలు పంచకోశముల విశ్లేషణ చేసింది. దాని ఉద్దేశం పంచకోశములను తొలగించుకోవడమే కాదు. అసలు నేను (ఆత్మ) ను కనుగొనేందుకు. అసలైన నేను (ఆత్మ) అనంతం, శాశ్వతం. దానికి ఆది, అంతములు లేవు. మిధ్యా నేను పుడుతుంది ఛస్తుంది. అది అశాశ్వతము. ఎవరికి ఈ మారిపోయే ఆలోచనలు వస్తున్నాయి. అవి నేను అన్న ఆలోచనకే, మిగిలిన ఆలోచనలు వస్తున్నాయి. ఆ నేను అన్న ఆలోచనను గట్టిగి పట్టుకో.. ఆత్మే వుంటుంది.
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
[16:16, 09/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: నా ప్రమేయమేమి లేకుండా నాకేదైనా వచ్చిందనుకోండి, దానిని నేననుభవిస్తే దాని వల్ల చెడు ఫలితాలుంటాయా ?
జవాబు: ప్రతి పనికీ ఫలితముంటుంది. ప్రారబ్ధవశాన నీకేదైనా వస్తే నీవేమీ చేయలేవు దానికి. వచ్చిన దానిని ఏ మమకారమూ లేకుండా, అదే ఇంకా ఎక్కువ కావాలనే కోరిక లేకుండా, తీసుకుంటే నీకే కీడూ వాటిల్లదు. దానివల్ల మళ్ళీ జన్ననెత్త వలసి రాదు. అలాకాకుండా, ఎంతో ఆసక్తితో దానిని ఆస్వాదించి, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటే, మళ్ళీ జన్మనెత్తాల్సి వస్తుంది.
✨⚡️✨⚡️✨⚡️
ప్రశ్న: సంకల్పమంటూ ఏమైనా ఉందా అసలు ?
జవాబు: ఎవరి సంకల్పం ? కర్తృత్వ భావమున్నంత కాలం అనుభవముంటుంది. వ్యక్తి సంకల్పమూ ఉంటుంది.
ఆత్మ విచారం వల్ల ఆ భావం పోతే, దైవసంకల్పమే పనిచేసి అన్నిటినీ నడిపిస్తుంది. విధిని జ్ఞానం, ఆత్మజ్ఞానం అతిక్రమిస్తుంది. ఆత్మజ్ఞానం సంకల్పానికీ, విధికీ అతీతం.
✨⚡️✨⚡️✨⚡️
ప్రశ్న: దేనినైనా చేయటానికి మనిషికి గల స్వేచ్ఛ, బాధ్యతల మాట ఏమిటి?
జవాబు: మనిషికి గల స్వేచ్ఛ ఒక్కటే. ప్రయత్నించి, దేహాత్మబుద్ధిని తొలగించే జ్ఞానాన్ని సంపాదించటమే. ప్రారబ్థం వల్ల అనివార్యమైన కలాపాలను శరీరం చేస్తుంది. దేహంతో తాదాత్మ్యం చెంది దాని ఫలితాలని అనుభవించటానికి గాని, ఆ తాదాత్మ్యం లేకుండా కేవలం సాక్షీభూతుడుగా ఉండటం గాని మనిషి చేతుల్లో ఉంది.
🕉🌞🌎🌙🌟🚩
[13:30, 08/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: గురువు అనుగ్రహం సాక్షాత్కారానికి ఎలా పని చేస్తుంది..
జవాబు: సాధకుడు మొదట అసంతృప్తిగా ఉంటాడు. ప్రపంచంతో అసంతృప్తి వున్నందువలన అతడు తన కోరికలు తీర్చుకునేందుకు భగవంతుడిని ప్రార్ధిస్తాడు. ఆ రకంగా అతని మనసు శుద్ధమౌతుంది. తరువాత కోరికలను తృప్తిపరచుటకంటే భగవంతుడిని తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువవుతుంది. అపుడు భగవంతుని కరుణ పని చేయడం ప్రారంభమవుతుంది. అతనికి ఒక గురువును పంపించి అతనికి బోధచేసి అతని మనసును శుద్ధం చేస్తాడు. అపుడు మనసుకు శక్తి కలిగి అది అంతర్ముఖమవుతుంది. తరువాత ధ్యాన తీవ్రత వలన మనసు ఇంకా శుద్ధమయి అది ఇంక కదలక స్థిరముగా వుంటుంది. అపుడూ వుండేది ఆత్మే. గురువు బాహ్యంలోనూ, లోపలా వుంటాడు. మనస్సును బయటనుంచి లోపలికి తోస్తాడు. లోపల నుంచి లోపలికి లాగుతాడు ఆత్మలోనికి. మనసు ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేస్తాడు. అదీ అనుగ్రహమంటే.. భగవంతుడు, గురువు, ఆత్మ ఒక్కరే. గురువు అనుగ్రహం తప్పనిసరి, కాని సాధన చేయవలసింది నీవే.. జ్ఞాని యొక్క 'నేను' లో శరీరం కూడా ఉంటుంది. కాని ఆయన శరీరంతో తాదాత్మ్యము చెందడు. ఆయనకు 'నేను' కన్నా వేరుగా ఏమీ వుండదు. శరీరము పడిపోతే (చనిపోతే) 'నేను' కు నష్టం ఏమీ లేదు. 'నేను' అలాగే ఉంటుంది. శరీరమే గనుక తను చనిపోయానని దానికి అనిపిస్తే, అదే లేచి అడుగవచ్చు కదా.. కాని అది జడము. అందువలన అది అడుగలేదు. 'నేను' ఎపుడూ చావదు. అడుగదు. ఎవరు చనిపోయేది. ఎవరు అడిగేది..
🕉🌞🌎🌙🌟
[14:19, 07/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: 'దయ' గురువిచ్చే బహుమానమా...
జవాబు: భగవంతుడు, దయ, గురువు ఇవన్నీ సమానర్ధకములు. అసలు అది లోపలే వున్నది, మరియు సర్వవ్యాపకమైనది. ఆత్మ లోపల లేదా. గురువేమైనా తన చూపుతో దానిని (ఆత్మను) అనుగ్రహిస్తాడా.. అలా అనుకునే వ్యక్తి గురువు కాడు. దీక్షలు చాలా రకములు. హస్త దీక్ష, స్పర్శ దీక్ష, చక్షు దీక్ష. గురువేదో మంత్రాలతో, నీళ్ళతో, అగ్నితో ఏదో తతంగం నిర్వహిస్తే దానిని దీక్ష అంటారు. ఆ దీక్షలతో శిష్యుడు పరిణితి చెందుతాడని భావిస్తారు. వ్యక్తిత్వమంటూ (అహం) ఏమీ లేని వ్యక్తియే గురువు. దక్షిణామూర్తి అలాంటి వాడే.. ఆయన ఏమి చేసాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. శిష్యులు ఆయన ముందు ఉండినారు. ఆయన మౌనాన్నే కొనసాగించినాడు. శిష్యులు సందేహాలు (సందేహించేవాడు - అహం) పోయినవి. నిజమైన గురువు ఆయనే. ఆయన చేసినదే దీక్ష (మౌన దీక్ష). అదియే జ్ఞానము. మాటలు సముదాయము కాదు. మౌనమే ఎక్కువ శక్తివంతమైనది. శాస్త్రాలు ఎంత విస్తారంగా ఉన్నా, ఎంత స్పష్టంగా చెప్పినా, అవి ఈ పని చేయలేవు. అంత సమర్థులూ గాదు. గురువు మౌనంగానే ఉంటాడు. ఆయన మౌనంలోనే ఎంతో శక్తి ప్రశాంతత వుంటుంది. అది శాస్త్రాలన్నింటికన్నా శక్తివంతమైనది. జ్ఞానులతో సహవాసమే జ్ఞానప్రాప్తికి దోహదం చేస్తుంది. ఎంతో దీర్ఘకాలం చేస్తేనే కాని, ఎంతో శ్రవణం చేస్తేనే గాని, ఎంతో కష్టపడితే గాని జ్ణానమును నేను పొందలేదు అనునటువంటి మాటలవల్ల ఇటువంటి సందేహాలు (ప్రశ్నను గమనించండి) వస్తాయి. లోపల జరిగేపని బయటకు కనిపించేది కాదు. నిజానికి గురువు లోపలనే ఉన్నాడు.
తాయుమానవర్ ఇలా అన్నారు :
"ఓ భగవంతుడా.. నీవు అనేక జన్మలు నాతోనే వుండి, నన్ను వదలకుండా చివరకు నన్ను రక్షించావు. అదే సాక్షాత్కారము".
భాగవతంలో కూడా ఇలాగే వున్నది. మనమిద్దరమూ (భగవంతుడు, జీవుడు) ఇపుడే కాదు ఎపుడూ కలిసే వున్నాము. గురువు యొక్క అనుగ్రహము శాస్త్రాధ్యయనము, ధ్యానము కన్నా ఎక్కువ శక్తివంతమైనది. ఇదే ప్రధానమైనది. మిగిలినవన్నీ తరువాతవే.. తక్కువవే..
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
[14:40, 06/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: ఈశ్వరానుగ్రహం తప్పనిసరి అంటారే..
జవాబు: మనమే ఈశ్వరులము. మనలను మనము ఈశ్వర స్వరూపులుగా చూడడమే ఈశ్వరానుగ్రహము. ఆయన స్వభావమే అనుగ్రహం. అది ఆయనకు వదిలి పెట్టుము. అరమరికలు లేని శరణాగతి చెందుము. నీ బలహీనతను గుర్తించి, నీకంటే ఉన్నతమైన శక్తిని తగిన బలమిచ్చుటకు ప్రార్థింపుము. అహంను మూలంలో కరిగింపుము. శరణాగతి చెందిన వానిని భగవంతుడెపుడూ విడువడు. ఒక దివ్యశక్తి నిన్ను నడిపించుచున్నది. ఏది, ఎపుడు ఎలా చేయాలి అన్న విషయం దానికి తెలియును. ఆ శక్తిని నమ్ముము.
⚡️✨⚡️✨⚡️✨
ప్రశ్న: దైవానుగ్రహము అవసరమా.. నిజాయితీ గల మన ప్రయత్నాలు మనలను గమ్యానికి చేర్చవా..
జవాబు: చేర్చును. నిజాయితీ గల సాధనకు తప్పక సాక్షాత్కారము కలుగును. ఎవరైతే నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తారో ఈ మార్గంలో, వారికి తప్పక అనుగ్రహం కలుగుతుంది. గురువనుగ్రహమైనా, దైవానుగ్రహమైనా, ఒక్కటే. నిజానికి దైవము, గురువు ఒక్కరే వేరు వేరు కాదు.
🕉🌞🌏🌙🌟🚩
[16:43, 05/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌏🌙🌟🚩
ప్రశ్న: గురువు అనుగ్రహమనగా ఏమిటి ?
జవాబు: గురువు పని లోపలనే. గురువు ఆంతర్యములోను, బాహ్యం లోను వుంటాడు. నిన్ను లోపలికి తీసుకు వెళ్ళే పరిస్థితులను కల్పిస్తాడు. నిన్ను లోపలికి తోస్తాడు. లోపలి గురువు నిన్ను లోపలికి లాక్కుంటాడు. నీవు కేంద్రంలో స్థిరమైపోతావు. గాఢ నిద్రలో నీవు (అహం) కేంద్రంలోనే వుంటావు. మేలుకుంటే బయటకి వస్తావు. వెంటనే ఇది, అది అని ఆలోచిస్తావు. దీన్ని సరిచేయవలెను. ఇది లోపల, బయట వుండే గురువుకే సాధ్యము. ఆయనని శరీరంగా గుర్తిస్తావా. మనకు బాహ్య ప్రపంచం మీద పట్టుండాలని, దాన్ని జయించాలని మనం ప్రయత్నం చేస్తూంటాము. మనకు విసుగు పుట్టి ఆంతర్యములోకి వెళితే, మానవాతీత శక్తి ఒకటి వుందని గుర్తిస్తాము. ఆ శక్తిని ఒప్పుకొని గుర్తించాలి. ఈ అహం అనునది శక్తివంతమైన ఏనుగు వంటిది. అది సింహంలాంటి బలసంపన్నునకు తప్ప ఇక దేనికీ లొంగదు. ఆ సింహం గురువు తప్ప మరొకటి కాదు. సింహం యొక్క చూపే ఏనుగును గజగజలాడించి చంపేస్తుంది. మన అహం ఎప్పుడు నశించి పోతుందో అపుడే అపుడే మన వైభవముండునని గ్రహిస్తాము. ఆ స్థితి రావాలంటే భగవంతునికి శరణాగతి చెంది, ప్రభూ నీవే నాకు రక్ష అని ప్రార్థించాలి. అపుడు గురువు ఈ వ్యక్తికి అర్హత వున్నదని చూసి గురువు మార్గదర్శి అవుతాడు. మౌనం లోని హృదయభాషణమే అత్యున్నతమైన శిక్షణ.
🕉🌞🌏🌙🌟🚩
[15:02, 04/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: తూర్పు, పశ్చిమ దేశాల జ్ఞానులు కలుసుకోవడం సాధ్యమా.. భారతదేశం ఆధ్యాత్మిక కేంద్రమా..
జవాబు: ఆత్మ అనంతమైనది. రూపము లేనిది. అదే ఆధ్యాత్మిక కేంద్రము. తూర్పు దేశమైన పశ్చిమ దేశమైన కేంద్రం మారదు. అది ఒక ప్రాంతానికి చెందినది కాదు. అది సర్వవ్యాపకము కనుక అందులోనే ప్రపంచం, నాయకులు, సృష్టి, ప్రళయము అన్నీ వుంటాయి. నీవు కలుసుకోవడం గురించి మాట్లాడుతున్నావు. అంటే ఆధ్యాత్మిక నాయకులను శరీరాలుగా చూస్తున్నావు. వారు శరీరాలు కారు, వారికి శరీరస్పృహ ఉండదు. వారు రూపనామ రహిత అంతులేని ఆత్మ. వారు ఎపుడూ ఏకమే సాక్షాత్కారమైతే అసలు ప్రశ్నలే ఉత్పన్నం కావు.
⚡️✨⚡️✨⚡️✨
ప్రశ్న: విద్య జ్ఞానిని ఎక్కువగా ప్రపంచానికి ఉపయోగపడేట్లు చేయగలదా..
జవాబు: చదువురాని జ్ఞానికి ఎంతటి విద్యావంతుడైనా వంగి నమస్కరించవలసినదే. విద్య చదువుకున్న అజ్ఞానము.
⚡️✨⚡️✨⚡️✨
ప్రశ్న: మానవాళి ఆధ్యాత్మిక ఎదుగుదలను గమనించే గురుపరంపర ఏమైనా వున్నదా..
జవాబు: అది ఉండనీ ఉండకపోనీ.. ఇదంతా ఊహాగానమే. ఇదంతా మానేసి ఆత్మను తెలుసుకో. గురు పరంపరను ఒకరు ఒప్పుకొనవచ్చు మరొకరు ఒప్పుకొనకపోవచ్చును. కాని ఆత్మను ఎవరూ కాదనలేరు. గురు పరంపర ఆత్మకు విడిగా లేదు. సాక్షాత్కారము గమ్యము.
🕉🌞🌎🌙🌟🚩
[14:38, 03/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ఒక జ్ణానిని ఎవరైన తూలనాడితే దానిని వారు ఎలా స్వీకరిస్తారు ?
జవాబు: పసి పిల్లవాడు, జ్ఞాని ఒక్కటే. సంఘటనలు జరిగినంతసేపే వారికి ఆసక్తి వుంటుంది. వాటి ప్రభావం వారిమీద ఎంతమాత్రం ఉండదు. దాని గురించిన ఆలోచనలేమీ వుండవు. గీతలో ఒక శ్లోకము ఇలా వున్నది అహం నశించిన వ్యక్తి తన ధర్మం ప్రకారం శతృవులను (లోకం లోని వారిని) సంహరించినా అతను హంతకుడు కాడు. అతనికి ఏదీ బంధించదు. అలాగే జ్ఞానికి గతకర్మలు వాసనలు వుండవు. అహం నశించిన వ్యక్తిని అవి ఎలా బంధిస్తాయి. అలాగే జ్ఞాని యుద్ధంలో ఎంతమందిని చంపినా అతనికి ఏ పాపము అంటదు. జ్ఞానికి భూత, భవిష్యత్ , వర్తమానము లేమీ లేవు. ఆయన వీటికి అతీతుడు. ఎందుకంటే కాలాతీతమైన ఆత్మలోనే ఆయన జీవిస్తాడు కనుక. జ్ఞానులు భవిష్యత్తు గురించి ప్రణాళిక లేమీవేయరు. వారు అలా ఎందుకు చేయాలి. వాళ్ళలో అహం లేదు కనుక వారు ఆ దివ్యశక్తి చేత కార్యములకు వినియోగింపబడతారు. ఏమి జరుగుతుందో ఊరక చూస్తూంటారు. వారు పనులన్నీ దైవేశ్చకే వదిలిపెడతారు. వారిలో అహం లేదు కనుక ఎపుడూ శాంతిగా ఉంటారు.
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
[14:11, 01/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రపంచానికి గురువులు మార్గదర్శకత్వం చేస్తారనే మాట ఏమిటి ?
జవాబు: మీ మనసులను బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖంగా తీసుకువెళ్ళండి అని చెప్పుటలేదా .. గురువుల ప్రసక్తి అందుకే.
జ్ఞాని ఒక్కచోటనే కూర్చొని ఏమైనా చేయగలడు ఆయన తలచుకుంటే. ఆయన యుద్ధములను ప్రేరేపించగలడు మాన్పగలడు. కాని ఆయనకు తెలుసు ఒక విశ్వశక్తి, ద్వారా సర్వము నిర్వహించబడుతున్నదని. అందువలన అతను తెలివి తక్కువగా విశ్వవ్యవహారాలలో జోక్యం చేసుకోడు. గురువేమి చేయును. ఆయనేమైనా సాక్షాత్కారాన్ని శిష్యుల చేతిలో పెడతాడా. జ్ఞానుల సాహచర్యములో వుంటే శిష్యుల అజ్ఞానము క్రమముగా తొలగి సాక్షాత్కారము అవుతుంది కదా. సాక్షాత్కారము శాశ్వతమైనది. అది కొత్తగా గురువు చేత ఇవ్వబడేది కాదు. అజ్ఞానం తొలగించటంలో ఆయన సహాయపడతాడు. శిష్యుడు గురువుకు తనను తాను సమర్పించుకుంటాడు. అపుడు శిష్యుని అహం ఆనవాలు కూడా లేకుండా నశించిపోతుంది. అపుడు దుఃఖానికి అవకాశమే లేదు. దీన్ని సరిగా అర్థం చేసుకొనకుండా గురువేదో శిష్యునికి 'తత్వమసి' లాంటిదేదో ఉపదేశిస్తాడని, దానివల్ల అతనికేదో శక్తులు వస్తాయని భావన చేస్తుంటారు. అసలే అజ్ఞానంలో వున్నాడు. ఇంకా అహం వృద్ధి చెందితే ఎలా వుంటుంది. అతని అజ్ఞానం ఇంకా పెరిగిపోతుంది. అహం (మిధ్యా, నేను) నశించాలి. అహం నశించడమే గురుసేవకు ఫలితం
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
[15:51, 28/05/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
గురువు - గురుత్వము
ప్రశ్న: ఆధ్యాత్మిక మార్గములో పురోగమించుటకు గురువు అవసరమా ?
జవాబు: గురువు అవసరమే.. ఆధ్యాత్మిక మార్గంలో వెలుగు చూపుతాడు. ద్వైతము (నానాత్వము - అనేకత్వము) ఉన్నంత వరకు గురువు అవసరమే. నీకు వ్యక్తిత్వమున్నంత వరకూ గురువు అవసరమే. గురువు ఆత్మే. నీవు నిన్ను శరీరముగా భావించుచున్నావు. అందుకనే గురువును కూడా శరీరముగా భావించి ఈ ప్రశ్నలు వేయుచున్నావు. నీవు గాని, గురువు గాని శరీరాలు కారు. ఆత్మయే. నీవు, గురువు ఇద్దరూ ఆత్మస్వరూపులేనన్న జ్ఞానము ఆత్మసాక్షాత్కారమైన తరువాతనే కలుగుతుంది.
ప్రశ్న: మనకు నిర్దేశింపబడిన గురువును ఎలా కనుగొనగలుగుతాము ?
జవాబు: తీవ్రమైన ధ్యానము వలన ఆ కలయిక ఏర్పడును. గురువు యొక్క దృష్టికి (చూపు) పవిత్రీకరించే శక్తి కలదు. నీ అస్తిత్వమును తెలుసుకుంటే గురువు యొక్క అస్తిత్వమును తెలుసుకొందువు. ఉన్నది గురువు ఒక్కటే. అది ఆత్మే. అందరి గురువుల ద్వారా పని చేసేది భగవంతుడే. ఆయనకు వారికి తేడా ఏమీలేదు. ఆయన నిశ్శబ్ధంగానే పని చేస్తాడు. సమర్థుడైన గురువు సమక్షంలో నీవు అనుభవించే ప్రశాంతత, ఆయన ఎడల నీకు కలిగే భక్తి, శ్రద్ధ, గౌరవముల వల్ల గురువును గుర్తించగలరు.
🕉🌞🌎🌙🌟🚩
[17:43, 26/05/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: వేదాలలో సృష్టి క్రమమున్నది. పరబ్రహ్మ ముందు ఆకాశాన్ని సృష్టి చేసిందని, తర్వాత మిగిలిన పంచ భూతములను సృష్టి చేసిందని చెబుతారు. శూన్యము నుంచి ఏదైనా ఎలా వస్తుంది ?
జవాబు: వేదముల సృష్టి క్రమమంతా కూడా సృష్టి, ప్రళయం, ఎలాగా అని తెలుసుకోగోరిన వారికి మాత్రమే. అవి రకరకాల పరిస్థితుల కనుగుణంగా వుంటాయి. వాటి ఉద్దేశ్యము మాత్రం ఒకటే. ప్రశ్నలు వారి వారి దృక్కోణాన్ని బట్టి ఉన్నట్లే సమాధానాలు కూడా అలాగే ఉంటాయి. వేదముల యొక్క ప్రధాన ఉద్దేశం ఆత్మ యొక్క అస్థిత్వమును చెప్పడం - దానిని పొందే మార్గం చెప్పడం అంతే. ఆత్మానుభవమైతే వేదాలు నిరుపయోగమే. అవి అంతగా వివరించాయంటే అది అంతా సాధకుల ఉన్నతి కొరకే. పైకి ఎక్కుతూవుంటే ఎక్కిన మెట్లన్నీ కూడా పైకి చేరుకునేందుకే అని అర్థం అవుతుంది. మనుషులు ఆత్మను గురించి అర్థం చేసుకొనలేరు. వారికి స్వర్గం, నరకం, పునర్జన్మలు లాంటివి తెలుసుకోవాలని ఆతృత పడతారు. వారు ఎక్కడికి తిరిగినా, ఏమిచేసినా చివరకు ఆత్మ వద్దకు రావలసినదే. అలాంటపుడు ఇపుడే ఆత్మ వద్దకు ఎందుకు రాకూడదు. సృష్టి లేదు, ప్రళయం లేదు. మనసుంటే ప్రపంచం ఉంటుంది. సృష్టి, ప్రళయం కదలికలే..
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
మరణమనే భయానికి ఏకైక ఔషధం 'అభేద దృష్టి'.
ఒకటి సైన్స్; మరొకటి సూపర్ సైన్స్ (ఆధ్యాత్మికత)
*ఒకటి బయటకు ప్రయాణం;
మరొకటి లోపలికి ప్రయాణం.*
బయటకు ప్రయాణం చేసే సైంటిస్ట్ కూడా ప్రయాణం చేస్తున్నది "తన లోపలికే".
*నామరూపాల వలన ప్రయోజనం ఏమిటంటే-
దాని (ఆత్మ) ఉనికిని ప్రకటించుకోవడం కోసమే.*
మనసు గుట్టు తెలుసుకో, విశ్వం గుట్టు తెలుస్తుంది.
🕉🌞🌎🌙🌟🚩
[14:25, 22/05/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌏🌙🌟🚩
ప్రశ్న: సహజ సమాధినందుకొనే ముందు నిర్వికల్ప స్థితిని అందుకోవాలా ?
జవాబు: ఏ సమాధి స్థితిలోనైన అంటే సవికల్ప స్థితైనా సరే, నిర్వికల్ప సమాధి అయినా సరే, శాశ్వతంగా ఉండటమే సహజస్థితి. శరీరధ్యాస కలిగి ఉండటమంటే ఏమిటి ? జడమైన దేహానికి చైతన్యం తోడయ్యింది. అంటే ఈ రెండూ ఇంకో చైతన్యంలోనివి. ఆ చైతన్యం దేనివల్లా ప్రభావితంకాదు. ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది, అది కేవలం - శరీరధ్యాస ఉన్నా లేకపోయినా ఉంటుంది. ఆ శుద్ధ చైతన్యాన్ని విడువకుండా ఉంటే, ఈ శరీరధ్యాస ఉంటేనేం, లేకపోతేనేం ? శరీరధ్యాస అసలు లేకపోవటం, సమాధి అవస్థను ఇంకా తీవ్రం చేస్తుంది. అంతేగాని పరమాత్మ అంటే ఉండే ఎరుకని ఏ విధంగానూ తగ్గించదు.
ప్రశ్న: మనస్సు ఆత్మలో శమించటానికి ప్రారంభమవుతున్నప్పుడు తరచూ భయం కలుగుతుంది..
జవాబు: సమాధి స్థితిలోకి వెళ్తున్నప్పుడు భయమూ, శరీరకంపనమూ కలుగుతాయి - పూర్తిగాపోని అహంకారం వల్ల. ఇది కూడా ఈషణ్మాత్రమైన లేకుండా సమసిపోతే, ఒకే ఒక చైతన్యంలో మాత్రమే ఉండే స్థితిలోకి వెళ్తాడు మనిషి. ఒళ్ళువణకటం కూడా ఆగిపోతుంది.
ప్రశ్న: సమాధి అవస్థ అంటే పరమానందమా, సంతోషాతిరేకమా ?
జవాబు: సమాధిలో ఉండేది ప్రశాంతత. సమాధి ముగిసిన తరువాత మనస్సు మళ్ళీ ఉదయిస్తుంది. అప్పుడు కలిగేది సంతోషాతిరేకం. భక్తిలో ముందుగా కలిగేది సంతోషాతిరేకం. కళ్ళవెంట నీరు కారటం, ఒళ్ళు గగుర్పాటు చెందటం, కంఠం గద్గద మవటం - ఇవన్నీ దాని లక్షణాలు. "అహం" పూర్తిగా సమసిపోయిన తరువాత, సహజస్థితి కలిగినప్పుడు ఈ చిహ్నాలు, పారవశ్యాలు పోతాయి.
🕉🌞🌏🌙🌟🚩
"అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: నా మనస్సు నిర్మలంగా రెండు మూడు రోజులుంటుంది - ఆ తరువాత బద్ధకంగా అయిపోతుంది, మళ్ళీ నిర్మలమవుతుంది - ఎందువల్ల ?
జవాబు: అది సహజమే. స్వచ్ఛత, చలాకీతనం, బద్ధకం - అంటే సత్త్వరజస్తమోగుణాలు. ఒకదాని తర్వాత ఒకటి పని చేయటం వల్లనే.. బద్ధకం (తమస్సు) వచ్చిందని బాధపడకు. కాని సత్ప్వగుణం పనిచేస్తున్నపుడు దానిని విడువకుండా పట్టుకో. సాధ్యమైనంత లబ్ధిపొందు.
ప్రశ్న: ఒకోసారి శరీరం ధ్యానాన్ని కుదరనీయదు. అందుకే యోగాభ్యాసాన్ని చేసి శరీరాన్ని లొంగదీసుకోవాలా ?
జవాబు: అది వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ఉంటుంది - జబ్బుని నయం చేసుకోవటానికి ఒకడు హఠయోగాభ్యాసం చేస్తాడు, మరొకడు భగవంతుడిని నమ్ముతాడు. ఇంకొంకడు తన సంకల్పబలాన్ని నమ్ముతాడు. నాలుగోవాడు ఆ జబ్బుని నిర్లక్ష్యం చేయవచ్చు ! అందరూ ధ్యానం చేసుకుంటూనే ఉంటారు. ఆత్మాన్వేషణే ప్రధానం. మిగిలినవన్నీ అప్రధానం
ప్రశ్న: ధ్యానం చేసుకునేటప్పుడు తాను ఆత్మసాక్షాత్కారం దిశగా పురోగమిస్తున్
నానా లేదా అని ఎట్లా తెలుస్తుంది. దీనికి నిదర్శనాలేమిటి ?
జవాబు: అనవసరమైన ఆలోచనలనుండి విముక్తి, ఒకే భావం పై మనస్సు నిలవటం.. ఇవే పురోగతికి నిదర్శనాలు
🕉🌞🌎🌙🌟🚩
"అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: మనం చూసే ఈ ప్రపంచానికి కారణం ఆత్మే కదా ?
జవాబు: ఆత్మే ప్రపంచంగా అనేక నామరూపాలతో కనబడుతుంది. అయితే, ఆత్మ సృష్టి స్థితి లయలకు నిమ్మిత్త కారణం కాదు. "తానే ప్రపంచంగా కనబడుతుందన్న విషయ మెరుగక, ఆత్మ గురించిన గందరగోళ మెందుకు కలుగుతుంది ?" అని ప్రశ్నించకు. దాని బదులు "ఈ గందరగోళం ఎవరికి కలుగుతోంది" అని ప్రశ్నించుకో. పరిశీలన మీద ఆత్మకి ఏ విధమైన గందరగోళమూ లేదని తేలుతుంది.
ప్రశ్న: రాళ్ళు ఎప్పటికి రాళ్ళ మాదిరి వుండవలసిందేనా..
జవాబు: వాటిని ఎవరు చూస్తున్నారు. నీ ఇంద్రియాల ద్వారా నీ మనసే అలా గ్రహించినది. కనుక అవి నీ మనసులోనివే. అది ఎవరి మనసు. ఆత్మను కనుగొంటే ఇలాంటి ప్రశ్నలే వుండవు. బాహ్య వస్తువుల కన్నా ఆత్మ అత్యంత సన్నిహితమైనది. ద్రష్టను తెలుసుకో. దృశ్యము తన జాగ్రత్త తనే తీసుకుంటుంది. అందరూ ఎవరి కర్మను వారు అనుభవించవలసినదే. భగవంతుడు వాటిలో ఏది వారి ఆధ్యాత్మికతకు తగునో వాటినే మనకు అందిస్తాడు. మన కర్మ ఫలితాలనుంచి ఏవీ తొలగించడు.. ఏవీ తగిలించడు. మంచి చెడు కర్మలన్నీ మనిషి అంతర మన
సులోనే నిక్షిప్తమై వుంటాయి. మన ఆధ్యాత్మిక పురోగతి ఏది మనకు చక్కగా సరిపోతుందో అది కష్టమైనా, సుఖమైనా మనకు భగవంతుడందిస్తాడు. నిరంకుశంగా ఏమీ వుండదు.
🕉🌞🌎🌙🌟🚩
"అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: తూర్పు, పశ్చిమ దేశాల జ్ఞానులు కలుసుకోవడం సాధ్యమా.. భారతదేశం ఆధ్యాత్మిక కేంద్రమా..
జవాబు: ఆత్మ అనంతమైనది. రూపము లేనిది. అదే ఆధ్యాత్మిక కేంద్రము. తూర్పు దేశమైన పశ్చిమ దేశమైన కేంద్రం మారదు. అది ఒక ప్రాంతానికి చెందినది కాదు. అది సర్వవ్యాపకము కనుక అందులోనే ప్రపంచం, నాయకులు, సృష్టి, ప్రళయము అన్నీ వుంటాయి. నీవు కలుసుకోవడం గురించి మాట్లాడుతున్నావు. అంటే ఆధ్యాత్మిక నాయకులను శరీరాలుగా చూస్తున్నావు. వారు శరీరాలు కారు, వారికి శరీరస్పృహ ఉండదు. వారు రూపనామ రహిత అంతులేని ఆత్మ. వారు ఎపుడూ ఏకమే సాక్షాత్కారమైతే అసలు ప్రశ్నలే ఉత్పన్నం కావు.
⚡️✨⚡️✨⚡️✨
ప్రశ్న: విద్య జ్ఞానిని ఎక్కువగా ప్రపంచానికి ఉపయోగపడేట్లు చేయగలదా..
జవాబు: చదువురాని జ్ఞానికి ఎంతటి విద్యావంతుడైనా వంగి నమస్కరించవలసినదే. విద్య చదువుకున్న అజ్ఞానము.
⚡️✨⚡️✨⚡️✨
ప్రశ్న: మానవాళి ఆధ్యాత్మిక ఎదుగుదలను గమనించే గురుపరంపర ఏమైనా వున్నదా..
జవాబు: అది ఉండనీ ఉండకపోనీ.. ఇదంతా ఊహాగానమే. ఇదంతా మానేసి ఆత్మను తెలుసుకో. గురు పరంపరను ఒకరు ఒప్పుకొనవచ్చు మరొకరు ఒప్పుకొనకపోవచ్చును. కాని ఆత్మను ఎవరూ కాదనలేరు. గురు పరంపర ఆత్మకు విడిగా లేదు. సాక్షాత్కారము గమ్యము.
🕉🌞🌎🌙🌟🚩
"అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
️⃣ *ప్రశ్న: దేవతలకు, ఆత్మకు సంబంధమేమిటి ? అసలు ఇంతమంది దేవతలు ఎందుకు ?
జవాబు: శివ, గణపతి, బ్రహ్మ ఇవన్నీ కూడా మానవ మనోస్థాయి లోనివే. నీవెంత నిజమో అవి అంతే నిజము. ప్రభుత్వం తన కార్యనిర్వాహణకు అనేక శాఖలున్నట్లు భగవంతునికి ఇంత దేవతా కార్యనిర్వాహక వర్గము. ఆత్మ దృష్టితో చూస్తే ఇవన్నీ భ్రాంతియే, కల్పనయే..
️⃣ *ప్రశ్న: నా అంతర్గత అన్వేషణకు ఏ సమాధానం రాలేదు..
జవాబు: అన్వేషకుడే సమాధానం. ఇంతకన్నా ఇంకేమి కావలెను. వచ్చేది ఏదైనా అది సత్యం కాదు. ఏది ఉన్నదో అదే సత్యం. నీవు నీవుగా ఉండేందుకు ఎవరి సహాయం కావాలి. నీవు తెలుసుకోవాలి, అంతే..
️⃣ *ప్రశ్న: ఆధ్యాత్మిక కేంద్రం మనలోనే వున్నది అనిమీరు అంటున్నారు కదా.. అలాగైతే కొన్ని కోట్ల కేంద్రాలుండవలెను కదా..
జవాబు: ఆధ్యాత్మిక కేంద్రం పరిమితిలేనిది. అది ఒక్కటే.. దాని లోనికి మునిగి దాన్ని తెలుసుకో. నేను అన్న ఆలోచన ఎక్కడ పుడుతుందో గమనిస్తే అసలు నేను మిగులుతుంది. అది వివరించ సాధ్యపడదు.
'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (664)
🕉🌞🌎🌙🌟🚩
దీపం వెలిగిస్తే చీకటి పోయినట్లే.. మనసుకు అవగాహన వస్తే అశాంతి దూరం అవుతుంది !!
ఆధ్యాత్మిక బోధ అంతా మనసును కమ్ముకున్న భ్రమలను తొలగించి సుఖదుఃఖాలకు అతీతమైన ఆనందాన్ని అందించేందుకే. అందుకు దృష్టి, దృక్పథం మారటం అవసరం. ఇప్పుడు చూస్తున్న ప్రపంచం, పరిస్థితులనే అవగాహనతో చూస్తే వాస్తవం అర్థం అవుతుంది. అవగాహన లేని మనసు అపార్థం చేసుకుంటుంది. అపార్థం చేసుకున్న మనసు అశాంతి పాలవుతుంది. దీపం వెలిగిస్తే తప్ప చీకటి పోనట్లే మనసుకు మంచి అవగాహన వస్తేగానీ అశాంతి దూరంకాదు. అలాంటి అవగాహనకోసమే జ్ఞాన బోధ మనకు తోడ్పడుతుంది. మనలో భక్తి, వైరాగ్య, జ్ఞానాలను అంకురింపచేసి ఆత్మజ్ఞానానికి అర్హుల్ని చేస్తుంది. కఠినతరమైన నియమాలు లేని విచారణ మార్గానికి జ్ఞానుల బోధ ఊతకర్రగా నిలిచి మన గమ్యానికి మనని సులభంగా చేరుస్తుంది !
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
🕉🌞🌎🌙🌟🚩
భక్తురాలు :
స్వామి ! చెడుగుణాలు పోగొట్టుకోటానికి తగిన సాధనను తెలిపే గురువును వెదకాలి కదా ముందు ?
మహర్షి :
చెడుగుణాలు పోగొట్టుకోవాలన్న తీవ్రత మనకు కలిగితే, గురువు దొరకడం ఏమి ? పోగొట్టుకోవాలి అనే జిజ్ఞాస కలగాలి ముందు మనకు.
కలిగితే,
గురువు వెతుక్కుంటూ మన వద్దకు వస్తాడు. కాకుంటే ఎలాగో తన వద్దకు రప్పించుకుంటాడు. ఆ గురువు మనల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టే ఉంటాడు. ఈశ్వరుడు, గురువును మనకు చూపుతాడు.
తన బిడ్డ క్షేమం తండ్రి కంటే విచారించేవారు ఎవరు? ఆయన ( ఈశ్వరుడు , గురువు ) సదా మన చుట్
టూ ఆవరించే ఉన్నాడు.
పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్లు రక్షిస్తాడు. అయితే, మనం హృదయపూర్వకంగా నమ్మాలి.
🕉🌞🌎🌙🌟🚩
''అష్టావక్రగీత' 20వ ప్రకరణ (663)
🕉🌞🌎🌙🌟🚩
జ్ఞానబోధ మనిషి చేరుకోవాల్సిన ఉత్కృష్టస్థితి గురించి చెప్తుంది !!
గురువులేని కాలం, గురువులేని చోటులలో మనం ఆధ్యాత్మిక ఉన్నతికోసం రకరకాల ఉపాధులను, మార్గాలను ఆశ్రయించాల్సిన పనిలేదు. ఆయన ఆచరించే లౌకిక ధర్మాలను, పారలౌకిక శాంతిని రెంటిని అనుసరిస్తే సరిపోతుంది. దేనికెంత విలువ ఇవ్వాలో దానికంత విలువనివ్వడం సామరస్యత. ఆధ్యాత్మిక దృష్టిలో అహంకార మమకారాలు రెంటికి తావుండదు. కానీ ఐహికదృష్టిలో పుణ్యపాపనిశ్చయాలనేవి ఉంటాయి. జ్ఞానబోధలో మనిషి చేరుకోవాల్సిన ఉత్కృష్టస్థితిని గురించి చెప్తారు. అది మనోధర్మాలకు అతీతంగా ఉంటుందని గుర్తించాలి కానీ మనోధర్మాలకు వ్యతిరేకంగా ఉంటుందని భావించ కూడదు. మన స్వస్థితిని మనం తెలుసుకునేందుకు ఆ ఉన్నత స్థితిని పొందిన జ్ఞానులే సరైన మార్గాన్ని బోధించ గలరు. తమ బోధ ద్వారా నిజమైన జిజ్ఞాసికి ఆ స్థితిని అనుభవైకవేద్యం చేయగలరు !
🕉🌞🌎🌙🌟🚩
"అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: ఆత్మ తనను తాను తెలుసుకుంటుందా?
జవాబు: ఆత్మ జ్ఞానానికి, అజ్ఞానానికి అతీతమైనది. ఈ ప్రశ్నలో ద్రష్ట, దృశ్యము వున్నాయి. కాని ఆత్మ వీటికి అతీతమైనది. ఆత్మ జ్ఞానస్వరూపమే.
ప్రశ్న: భగవంతుడిని చూసేదెలా?
జవాబు: లోపలనే. మనసును లోపలికి మరలిస్తే, భగవంతుడు అంతరంగ చైతన్యంగా అనుభవానికి వస్తాడు.
భగవంతుడు అంతటా ఉన్నాడు. ద్రష్టలో కూడా వున్నాడు. భగవంతుడుని ఎక్కడ చూడవలెను. ఆయనను బాహ్యంగా చూడలేము. ఆయనను లోపలనే చూడగలము. వస్తువులను చూడాలంటే మనసుండాలి. వస్తువులలో భగవంతుడిని చూడడమంటే అది మానసిక క్రియ. అది నిజం కాదు. లోపలి చైతన్యమే భగవంతుడు.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం -(526)
🕉🌞🌎🌙🌟🚩
"శరణాగతి సిద్ధించే మార్గం గురించి సెలవివ్వండి ?"
శరణాగతి అనేది ఆధ్యాత్మిక సాధనలో అంచలంచలుగా సిద్ధించే ఒక స్థితి. అలా సంపూర్ణ శరణాగతి చెందినవారే భక్తుడిగా, శిష్యుడిగా ఉండగలుగుతారు. ఒక సంపూర్ణ మానవుడు మాత్రమే సాధకుడుగా, భక్తుడిగా, శిష్యుడిగా ఎదగగలడు. ప్రతి వారిని అలా సంపూర్ణ మానవులుగా తీర్చిదిద్దే మతమే హిందూ మతం. అందుకు ఈ తరం వారికి లభించిన అద్భుత మార్గం శ్రీరమణమార్గం. దైవాన్ని మనం ఏరూపంలో కొలుస్తున్నామో, ఆ రూపం ద్వారా దైవం మనకందించే ఆశయానికి అంకితమైతేనే అది నిజమైన భక్తి లేదా శరణాగతి అవుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
'సర్వవ్యాపకత్వాన్ని గుర్తించటమే శరణాగతి !'- (అధ్యాయం-66)
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (660)
🕉🌞🌎🌙🌟🚩
అనుభవంలోనే ఉన్న విషయానికి తార్కాణాలు.. ఉపమానాలు అవసరంలేదు !!
ముంజేతి కంకణానికి అద్దం ఎలాగైతే అవసరం లేదో అనుభవంలోనే ఉన్న విషయానికి వేరే తార్కాణాలు, ఉపమానాలు అవసరంలేదు. అవన్నీ మనసు స్థాయిలో అవగాహన ఏర్పడటానికి అవసరం. మనకి సంతోషం, దుఃఖాలతో కూడిన ఏ అనుభవమైనా క్షణకాలమే. అంతఃకరణ ధర్మానికి, ఆత్మధర్మానికి బేధం ఎలా ఉంటుందంటే.. పడుకోడానికి, నిద్రపోవడానికి ఉన్నంత తేడా ఉంటుంది. నిద్ర పట్టేంతసేపు పడుకున్న పరుపు మనకు సౌకర్యంగా, సుఖాన్నిచ్చేదిగా ఉండాలని కోరుకుంటాం. పరుపుద్వారా లభించే హాయి అంతా నిద్ర పట్టేంతవరకే. నిద్ర పట్టిన తర్వాత తాను పట్టు ప
రుపుపై పడుకున్నానా, పాతచాపపై పడుకున్నానా అన్న తేడా ఉండదు. ఆత్మజ్ఞాన స్థితి అలాంటిది !
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (661)
🕉🌞🌎🌙🌟🚩
తనలోని శాంతిని తాను అనుభవించడం ఆత్మధర్మం_
సుఖాన్ని కోరుకోవడం అంతఃకరణ ధర్మం. తనలోని శాంతిని తాను అనుభవించడం ఆత్మధర్మం. దానికి ఏ భౌతిక, మానసిక ప్రక్రియలతో పనిలేదు. బాహ్య జీవనంలో అంతఃకరణ ధర్మాలు అనుసరించాల్సిందే. కాని దానికి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వా
లి. ఆ వివేకమే కళ్యాణ గుణంగా పరిణమించి ఈ సృష్టితో సామరస్యంగా సహజీవనం ఏర్పడేలా చేస్తుంది. అవగాహన ద్వారా మనకి, పరిస్థితులకు మధ్య సామరస్యతను సాధించడమే శుభకరమైన పరిణామం. గురువు ఏది బోధించినా, ఎంత బోధించినా అది మనకు అవగాహనలోకి రాకపోతే అది అనుభవంలోకి రాదు !
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (657)
🕉🌞🌎🌙🌟🚩
జ్ఞాపకాలుగా ఉన్న సంతోష, దుఃఖాలు గుర్తుకురాని స్థితి స్వస్థితి !!
జీవితంలో మనం దాటి వచ్చిన కష్టసుఖాలుగాని, సంతోషదుఃఖాలు గానీ ఏవీ నిక్షిప్త జ్ఞాపకాలుగా తప్ప అనుభవా
లుగా నిలిచి ఉండవు. మనం విలువనిచ్చి స్మృతిలోకి తెచ్చుకుంటే తప్ప ఆ జ్ఞాపకాలకు విలువలేదు. అవి గుర్తుకువస్తే మళ్ళీ ఆ సంతోషమో, దుఃఖమో గుర్తుకు వస్తుందేగానీ ప్రత్యక్షంగా అవి అనుభవాలను ఇవ్వలేవు. జ్ఞాపకాలుగా ఉన్న సంతోష, దుఃఖాలు గుర్తుకురాని స్థితి స్వస్థితి. ఎందుకంటే అంతఃకరణ ధర్మంలో తప్ప స్వధర్మంలో ఏ జ్ఞాపకాలు, అనుభవాలు ఉండవు. అంతఃకరణ ధర్మాలకు ఉన్న పరిమితి అర్థమైతే అవి మనని ప్రభావితం చేయకుండా ఉంటాయి !
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (658)
🕉🌞🌎🌙🌟🚩
ఆత్మ తనలో లేని స్వధర్మాలను వదిలించుకోవల్సిన అవసరం లేదు !!
కలలో ఏర్పడిన అనుభవాలు కలలో స్పందన కలిగిస్తాయి. అంతే గానీ మెలకువగా ఉన్నప్పుడు అవి గుర్తుకొచ్చినా మనని ప్రభావితం చేయవు. ఎందుకంటే అవన్నీ కలలోనివే గానీ ఇలలోనివి కావన్న అవగాహన మనకుంది. అలాగే ఇలలోని అనుభవాలు, జ్ఞాపకాలు కూడా అంతఃకరణ లోనివేగానీ మన స్వస్వరూపమైన ఆత్మలోనివి కావన్న అవగాహన కలిగితే అవికూడా మనని ప్రభావితంచేయవు. సంతోష దుఃఖాలు నిజంగా మన స్వధర్మంలోనే ఉండి ఉంటే అవి నిద్రతో సహా సదా మనని ప్రభావితం చేయాలి. కానీ మెలకువగా ఉన్నప్పుడు గుర్తుకొస్తే తప్ప సంతోషం, దుఃఖం ఉండటం లేదు. ఆత్మ తనలో లేని స్వధర్మాలను వదిలించుకోవల్సిన అవసరం లేదు. అవి ఆత్మలక్షణం కాదని గుర్తించి మనసుపై వాటి ప్రభావాలను తగ్గించుకోవడమే మనం చేయాల్సిన సాధన !
🕉🌞🌎🌙🌟🚩
🌻 మహానీయుని మాట
-------------------------
" సముద్రంలో వాన కురిస్తే...
ప్రయోజనం లేదు.
పగటిపూట దీపం వెలిగితే...
ప్రయోజనం లేదు.
ధనవంతునికి ఇచ్చే చిరుకానుక....
ప్రయోజనం లేదు.
రోగాలున్న వ్యక్తికి రుచికరమైన భోజనం...
ప్రయోజనం లేదు.
అదే విధంగా ఒక మూర్ఖునికి
నీవు బుద్ధి చెప్పినా
ప్రయోజనం లేదు."
--------------------------
🌹 నేటీ మంచి మాట 🌼
---------------------------
" ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు.కానీ తీరిగ్గా ఆలోచించినపుడు నీది తప్పు అని అనిపించినపుడు మాత్రం క్షమించమని అడగడానికి సందేహాపడకు."
🕉🌞🌎🌙🌟🚩
*అన్ని లోకాల్లోనూ, అన్ని కాలాల్లోనూ.,
ఎట్టి మార్పు లేక ఉన్న ఏకైక తత్వం "నేను".*
శిష్యుడు:- జ్ఞానిని జ్ఞానే గుర్తించగలడు.
గురువు:- జ్ఞాని జ్ఞానే అయితే, తాను గుర్తించడానికి తాను తప్ప అన్యం ఏమి గోచరించదు.
విశిష్టాద్వైతం:- దీనిని రామానుజాచార్యులు వారు ప్రవచించినారు. ఈ సిద్ధాంతం ప్రకారం సృష్టి మొత్తం మూడే విస్తరించాయని ప్రతిపాదించినారు. అవి జీవుడు వేరు, ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అని.
ద్వైతం:- దీనిని మధ్వాచార్యులు వారు ప్రవచించినారు. వీరి ప్రకారం సృష్టిలో ఉన్నవి రెండే అని అవి జీవుడు మరియు పరమాత్మ అని వీరి సిద్ధాంతం. ప్రకృతి అనునది జీవునిలో అంతార్భాగమేనని వీరి సిద్ధాంతం.
అద్వైతం:- దీనిని ఆదిశంకరాచార్యులు వారు ప్రవచించినారు. రెండు లేవు, ఉన్నది ఒకటేనని, ఆ ఒకటి ఆత్మ పదార్థం అని. ఈ సృష్టి మొత్తం నిండి వున్నది ఆత్మ తప్ప మరేమి లేదు అని వీరి సిద్ధాంతం.
ఆది, అంతం లేనిదే 'వేదాంతం'.
త్రికరణ శుద్ధి అంటే :--
➡️ మనస్సులో ఏది ఉంటుందో దాన్నే మాట్లాడటం.
➡️ ఏది మాట్లాడుతున్నామో దాన్నే చేయటం.
➡️ ఏం చేస్తున్నామో దాని గురించే మాట్లాడటం.
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (655)
🕉🌞🌎🌙🌟🚩
ఆధ్యాత్మికఫలం మనసుకు అతీతమైనది !!
ఆత్మజ్ఞానం ఎలా ఉంటుందో అనుభవించడమే కానీ నిజానికి దాన్ని ఎవరూ ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పలేరు. అది అవాఙ్మయ గోచరం. మాటలకూ, మనసుకీ అందేది కాదు. అందుకే ఎంతటి జ్ఞాని అయినా దానికి మార్గాన్ని చెప్పగలరే గానీ అది ఎలా ఉంటుందో చెప్పలేరు. అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. అందుకే ఆధ్యాత్మిక బోధ అంతా మనసును ఎలా ఉంచుకోవాలో చెప్తారు. అదే మార్గం వంటిది. ఆధ్యాత్మికఫలం మనసుకు అతీతమైనది. అది మనసుతో తెలుసుకొని మాటలతో చెప్పేది కాదు !
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరామకృష్ణామృతము
💎💎💎💎💎💎
సముద్రగర్భంలో ముత్యాలు ఉన్నాయి.
కానీ వాటిని పొందగోరాలంటే అనేక అపాయాలను ఎదుర్కోవాలి.
ఒక్కసారి మునిగి నంతనే ముత్యాలు చేతికి చిక్కని పక్షంలో సముద్రంలో ముత్యాలు లేవని నిర్ధారించకూడదు.
మళ్లీమళ్లీ మునిగి అన్వేషిస్తే చివరకు కష్టం ఫలిస్తుంది.
విశ్వంలో భగవంతుడు ఉన్నాడు.
ఆ దేవుని కనుగొనడంలో మీ తొలి ప్రయత్నం విఫలమైతే నిరుత్సాహ పడవద్దు.
దీక్షతో సాధన చెయ్యి చివరకు నీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది .
💎💎💎💎💎💎
జ్ఞాన ప్రసూనాంబిక శివ జ్ఞానమును మననం చేసుకుంటూ ఉంటుంది. అది లోకంలో సద్గురు ప్రవచనం గా ప్రకటనమౌతూ ఉంటుంది. అంతేగాని గురువుకు లోకానికి బోధించాలనే సంకల్పం ఏమి ఉండదు.
భూమిలో ఉండే ఖనిజాలకు ఇచ్చినంత విలువ, మనం 'భూమి'కి ఇవ్వడంలేదు.
మహనీయులకు ఇచ్చినంత విలువ, మనం 'బ్రహ్మ పదార్థాని'కి ఇవ్వడం లేదు.
పుట్టినప్పుడు పేరు ఉండదు., ఊపిరి తప్ప.
పోయినప్పుడు ఊపిరి ఉండదు., పేరు తప్ప.
శ్రీరమణీయం-(520)
🕉🌞🌎🌙🌟🚩
"గురువు, జ్ఞాని ఒక్కరేనా, ఏమైనా తేడా ఉంటుందా !?"
మనం చేరుకోవలసిన చివరి గమ్యాన్ని సాధించి మనకు మార్గం చూపేవాడు గురువు. గమ్యం గురించి మాత్రమే తెలుసుకొని బోధించేవాడు గురువు కాడు. అతడూ మనలాగే సాధకుడే అవుతాడు. దేహాత్మభావన దాటానివాడు అంటే తనను దేహం అనుకునేవాడు గురువుకాడు. గురువు కేవలం దేహమాత్రుడే అనుకునే వాడు శిష్యుడూకాడు. మనకు నిద్రలో ఎలాగైతే బేధభావన ఏదీ తెలియకుండా పోతుందో జ్ఞానికి మెలకువలోనే అలా ఉంటుంది. నిద్రకు, జ్ఞానానికి కొద్ది తేడానే ఉంది. ఏమీ తెలియకుండా పోవటం నిద్ర అయితే, అన్నీ తెలుస్తూ మనసులో ఏమీ లేకుండా పోవటం జ్ఞానం. అలా ఉండే జ్ఞానికే గురువు అని పేరు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
శివైక్య భావన కోసమే ఆధ్యాత్మిక సాధన !'- (అధ్యాయం-65)
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (657)
🕉🌞🌎🌙🌟🚩
జ్ఞాపకాలుగా ఉన్న సంతోష, దుఃఖాలు గుర్తుకురాని స్థితి స్వస్థితి !!
జీవితంలో మనం దాటి వచ్చిన కష్టసుఖాలుగాని, సంతోషదుఃఖాలు గానీ ఏవీ నిక్షిప్త జ్ఞాపకాలుగా తప్ప అనుభవాలుగా నిలి
చి ఉండవు. మనం విలువనిచ్చి స్మృతిలోకి తెచ్చుకుంటే తప్ప ఆ జ్ఞాపకాలకు విలువలేదు. అవి గుర్తుకువస్తే మళ్ళీ ఆ సంతోషమో, దుఃఖమో గుర్తుకు వస్తుందేగానీ ప్రత్యక్షంగా అవి అనుభవాలను ఇవ్వలేవు. జ్ఞాపకాలుగా ఉన్న సంతోష, దుఃఖాలు గుర్తుకురాని స్థితి స్వస్థితి. ఎందుకంటే అంతఃకరణ ధర్మంలో తప్ప స్వధర్మంలో ఏ జ్ఞాపకాలు, అనుభవాలు ఉండవు. అంతఃకరణ ధర్మాలకు ఉన్న పరిమితి అర్థమైతే అవి మనని ప్రభావితం చేయకుండా ఉంటాయి !
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
[19:07, 05/05/2020] +91 92915 82862: _ 'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (654)_
🕉🌞🌎🌙🌟🚩
మన దృక్పథమే మన గమ్యాన్ని నిర్ధేశిస్తుంది !!
అనుభవజ్ఞానం లేని ఆధ్యాత్మిక విజ్ఞానం సాధారణ పరిజ్ఞానంగా మిగిలిపోతుంది. అది మనకి మన భర్త గురించో, భార్య గురించో, పిల్లల గురించో తెలియడం లాంటిదే అవుతుంది. మనసు అన్నింటినీ తెలుసుకుంటుంది. అది దాని ధర్మం. కానీ ఆధ్యాత్మికత మనోమూలానికి సంబంధించింది. మనసును విశ్లేషిస్తూ వెళ్ళడం ద్వారా మనోమూలాన్ని చేరుకుంటే పరిపూర్ణత లభిస్తుంది. అందుకు మనోధర్మం సోపానంగా నిలుస్తుందే గానీ పూర్ణజ్ఞానాన్ని ఇవ్వలేదు. ఆకురాలిన చెట్టు దుఃఖిస్తుందా ? తన సంతానాన్ని కోల్పోయిన కుక్క స్వల్పకాలం బాధ పడుతుందే కానీ వేదన చెందుతూ ఉంటుందా. అవి సృష్టిసహజత్వాన్ని అనుసరిస్తాయి. మనసుతో వీటిని గమనించి సహజత్వాన్ని స్వీకరించే దృక్పథం అలవడితే అది ఆధ్యాత్మిక ఉన్నతికి దోహద పడుతుంది. మన దృక్పథమే మన గమ్యాన్ని నిర్ధేశిస…
[19:19, 05/05/2020] +91 92915 82862: కర్మ-ఫలితం-ధ్యానం
🕉🌞🌎🌙🌟🚩
తెలిసి చేసినా తెలియక చేసినా మన ప్రతి కర్మలకు ఫలితం ఉంటుంది, ఒకరిని దూషించినా లేక ఒకసారి భగవంతుడు కి నమస్కారం చేసుకున్న రెడింటికి ఫలితం ఉంటుంది..
భగవంతుడు పై ప్రగాఢ మైన విశ్వాసం లేకుండా కేవలం నామజపం చేయడం వలన ప్రయోజనముంటుందా అని కొంతమంది అనుకుంటుంటారు..
అయితే.....మనం కోరి నీళ్లలోకి దిగినా, ఎవరైనా మనల్ని పట్టుకుని నీళ్లలోకి తోసేసినా మన బట్టలు తడవక తప్పదు కదా!
అలాగే మనం క్రమపద్ధతిలో నిత్యం నామస్మరణ చేస్తుంటే మన మనస్సులో ప్రగాఢ విశ్వాసం ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది, భగవన్నామ స్మరణ చేస్తున్న మనకు కూడా రోజూ చేస్తుంటే క్రమేణా మనసు నిలకడ చెందుతుంది.ఎల్లప్పుడూ విచారణ చేస్తే మన మనస్సు కోరుకునే లౌకిక వస్తువులన్నీ అనిత్యాలని ఎరిగి మనస్సును భగవంతునికి సమర్పించుకోవాలి.
ఉదాహరణకు ఒకరు చేపలు పడుతూవున్నారు...అటు వైపుగా మేళతాళాలతో పెద్ద ఊరేగింపు వెళ్లింది. ఆ శబ్దాలు హోరుగా వినిపించినా కానీ, అతని మనస్సు గాలం మీదే లగ్నమై ఉంటుంది....మన మనస్సు లో ఎన్ని ఆలోచనలు వున్నా ఎల్లప్పుడూ భగవంతుని పాదపద్మాల పై మనస్సు నుంచి ఎల్లప్పుడూ ఆయన స్మరణలో మునిగివుండడమే సాధన.
🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 20వ ప్రకరణ (652)
🕉🌞🌎🌙🌟🚩
గురువును అనుసరించడం ద్వారా వారిలోని గుణాలను తాను కొనసాగించడమే శిష్యత్వం !!
_మనం ఏదైనా చూడాలంటే పెద్దగా శ్రమ పడక్కర్లేదు. కళ్ళు తెరిస్తే ఉన్నది అదే దృశ్యమానం అవుతుంది. ఇది ఎంత సరళమో ఆత్మ విచారణ కూడా అంతే సరళం. సత్యం అర్థమైన వ్యక్తి సంతోష, దుఃఖాలను తిరస్కరించడు. సహజంగా తీసుకుంటాడు. సహజంగా తీసుకున్నప్పుడు ఇది సంతోషం, ఇది దుఃఖం అని వాటిని స్వీకరించడం, తిరస్కరించడం చేయడు. ఆత్మజ్ఞాన సిద్ధుడైన గురువు అలా సహజంగా ఉం
టాడు. గురువును అనుసరించడం ద్వారా వారిలోని ఆ గుణాలను తాను కొనసాగించడమే శిష్యత్వం. గురువు అంటే ఏమిటో అర్థం కాకపోతే ఎప్పటికీ పరాయిగానే చూస్తాం. తానేమిటో, గురువేమిటో అర్థం అయితే రెంటిలో ఉన్న పరమాత్మ వస్తువును చూస్తాం. అప్పుడే గురువుకి, తనకి ఉన్న అబేధస్థితి శిష్యుడికి అర్ధం అవుతుంది !
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
"కనిపించే ప్రపంచం మనోకల్పితం అంటే నమ్మేదెలా ?"
'కల-ఇల'లను బేరీజు వేసుకుంటే మనః కల్పితమైన ప్రపంచం అవాస్తవమని తెలుస్తుంది. ఎవరు చేస్తున్నారో, ఎలా జరుగుతుందో మనకు తెలియకుండా, జరిగింది మాత్రమే తెలియటాన్ని మహత్యంగా భావిస్తున్నాం. కొంచెం మనసుపెట్టి గమనిస్తే మన నిత్యజీవితం అంతా మహత్యమేనని తెలుస్తుంది. మన గుండెను నడిపేది ఎవరు ? మనలో జరిగే రక్తప్రసరణకు కారణం ఎవరు ? మనలో శ్వాసను నడిపిస్తున్నది ఎవరు ? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే సైన్స్ చెప్పే 'శక్తి' అనే సమాధానంతో వెయ్యి ప్రశ్నలు పుడతాయి. ఏ వ్యక్తి, పరికరం లేని ఆ శక్తి ఎలా జనిస్తుందో గమనిస్తే అందులోవున్న మహత్యం అర్ధం అవుతుంది. మరి మహత్యం జరిగేచోట దైవం లేకుండా ఉండదు కనుక మనలో దైవం ఉన్నదనే మాట ముమ్మాటికీ సత్యం. నమ్మలేని ఈ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు సత్యం అనుకుంటున్న ఈ ప్రపంచం అబద్ధమని గ్రహించాలి. అందుకే 'కల-ఇల'లను బేరీజు వేసుకుంటే మనః కల్పిత ప్రపంచం అసత్యమని రూఢీ అవుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
కలకు-ఇలకు ఆధారం ఆత్మ !'- (అధ్యాయం -69)
🕉🌞🌎🌙🌟🚩
[14:20, 17/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
ప్రశ్న: ఈ ఆలోచనల నుంచి తప్పించుకునేదెలా..
జవాబు: నీవు అనవసరమైన ఆలోచనలతో నిండిపోయినావు. అదే అసలు సమస్య. నీవు ఉన్నట్లుగానే వుండు. ఆలోచనలన్ని మాయమౌతాయి. ఆలోచనలు, స్పందనలు ఎవరికి వస్తున్నాయి. నీవు అతిగా ఆలోచించడానికి బాగా అలవాటు పడిపోయినావు. అందువల్లనే ఆలోచించకుండా ఉండలేక పోతున్నావు.
ప్రశ్న: 'అహం బ్రహ్మస్మి' అని అనుకుంటూ వుండేదా.. అది సరియైన అభ్యాసమేనా..
జవాబు: అలా ఎందుకు అనుకోవాలి.. నిజానికి నీవు బ్రహ్మానివే. నేను మనుష్యుడునా, నేను పురుషుడునా అని ఎవరు అనుకుంటా వుంటారు. ఎవరైనా ఎపుడైనా నేను మనుష్యుడను కానేమో అని సందేహం వస్తే నేను జంతువును అని అంటే అపుడు కాదూ నేను మనుష్యుడనే అని చెప్పవచ్చు. తప్పు అభిప్రాయము పోగొట్టుకునేందుకు అలా అనుకొనవచ్చును. దృఢపడింతర్వాత ఇక అలాంటి ఆలోచన అవసరం లేదు. సాక్షాత్కారమైతే ఇక సిద్ధాంతాలతో నమ్మకాలతో పనిలేదు.
🕉🌞🌎🌙🌟🚩
[14:22, 17/06/2020] +91 92915 82862: "ఋభుగీత "(27)
🕉🌞🌎🌙🌟🚩
2వ అధ్యాయము
బ్రహ్మంగా ఉండాలంటే అడ్డుగా ఉన్న గుణాలు తీసేస్తే చాలు !!
అద్వితీయ స్థితిలో అందరం సామానులమే. అలాంటి అద్వితీయస్థితే నిర్గుణబ్రహ్మము. మనకు కోరికలు, బాధలు, సంతోషాలు రకరకాలుగా ఉన్నా అవేవిలేని శూన్యస్థితి మాత్రం అందరికీ సమానంగా అద్వితీయంగానే ఉంటుంది. మనం ఆశలేని స్థితిలో ఆనందంగా ఉన్నప్పుడు అన్నిటికి పరమమైన శూన్యంగా, దేనితోనూ పోలికలేని అద్వితీయంగా ఉంటాము. అదే బ్రహ్మము. బ్రహ్మంగా ఉండాలంటే అడ్డుగా ఉన్న గుణాలు తీసేస్తే చాలు. గుణాలు లేకుండా జీవనం ఎలా అని మనం అనుకోనక్కర్లేదు. ఆస్థితి వస్తే పరమాత్మే మనని నడుపుతాడు !
🕉🌞🌎🌙🌟🚩
Comments
Post a Comment