భగవద్విభూతియోగం 10వ అధ్యాయము
02. న మే విదు: సురగణా: ప్రభవం న మహర్షయ: |
అహమాదిర్షి దేవానాం మహర్షీణాం చ సర్వశ: ||
🌷. తాత్పర్యం :
సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై యున్నందున దేవతా సమూహముగాని, మహర్షులుగాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలిసికొనజాలరు.
🌷. భాష్యము :
బ్రహ్మసంహిత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే దేవదేవుడు. అతని కన్నను అధికుడు వేరొక్కడు లేడు. అతడే సర్వకారణ కారణుడు. తానే దేవతలకు మరియు ఋషులకు కారణుడనని అతడే స్వయముగా ఇచ్చట పలుకుచున్నాడు. అనగా దేవతలు మరియు మహర్షులు కూడా శ్రీకృష్ణుని సంపూర్ణముగా ఎరుగలేరు. వారే ఆ భగవానుని నామమును గాని, స్వరూపమును గాని ఎరుగలేరన్నచో అల్పమైన ఈ లోకమునకు చెందిన నామమాత్ర పండితుల విషయము వేరుగా తెలుపపనిలేదు. భగవానుడు ఏ కారణము నిమిత్తము ధరత్రి యందు సామాన్యమానవునిగా అవతరించి అద్భుతములు మరియు అసాధారణములైన కార్యముల నొనర్చునో ఎవ్వరును ఎరుగాజాలరు. అనగా పాండిత్యమనునది శ్రీకృష్ణుని అవగాహన చేసికొనుటకు ఒక యోగ్యత కాదని మనము గ్రహింపవలెను. దేవతలు మరియు ఋషులు సైతము తమ మానసికకల్పనలచే శ్రీకృష్ణుని అవగతము చేసికొన యత్నించినను విఫలురైరి. కనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణభగవానుని ఎరుగాజాలరని శ్రీమద్భాగవతమునందు స్పష్టముగా తెలుపబడినది. వారు తమ పరిమిత ఇంద్రియముల పరధి మేరకు ఊహాగానము చేయ యత్నించినను త్రిగుణములచే వ్యక్తము కానట్టి నిజతత్త్వమునకు విరుద్ధభావమైన నిరాకారతత్త్వమునే చేరగలరు. అనగా వారు మానసిక కల్పనలను కావించినను దాని ద్వారా శ్రీకృష్ణుని మాత్రము ఎరుగాజాలరు.
పరతత్త్వమును తెలిసికొనగోరువారు కొరకై శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తాను దేవదేవుడననియు మరియు పరమపురుషుడనని పరోక్షముగా తెలియజేయుచున్నాడు. ఈ విషయమును ప్రతియొక్కరు గమనింపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
03. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసమ్మూఢ: స మర్త్యేషు సర్వపాపై: ప్రముచ్యతే ||
🌷. తాత్పర్యం :
నన్ను పుట్టుకలేని వానిగను, అనాదిగను, సర్వలోకములకు దివ్యప్రభువుగను తెలిసికొనినవాడు మాత్రమే మనుజులందరిలోను భ్రాంతిరహితుడై, సర్వపాపముల నుండి ముక్తుడగును.
🌷. భాష్యము :
“మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతిసిద్ధయే” యని సప్తమాధ్యాయమున (7.3) తెలుపబడినట్లు ఆధ్యాత్మికానుభవస్థాయిని పొందుటకై యత్నించువారు సామాన్యజనులు కానేరరు. ఆధ్యాత్మికానుభవమునకు సంబంధించిన జ్ఞానము ఏ మాత్రములేని కోట్లాది సామాన్యమానవుల కన్నను వారు నిక్కము ఉత్తములు. కాని ఆ విధముగా తమ ఆధ్యాత్మికస్థితిని అవగాహన చేసికొన యత్నించువారిలో శ్రీకృష్ణుడు దేవదేవుడు, సర్వమునకు ప్రభువు, పుట్టుకలేనివాడనెడి అవగాహనకు వచ్చినవాడు ఆత్మానుభవప్రాప్తిలో కృతకృత్యుడైనట్టివాడు.
శ్రీకృష్ణుని దివ్యస్థితిని సంపూర్ణముగా నెరుగగలిగిన స్థితి యందే మనుజుడు సర్వవిధములైన పాపఫలముల నుండి ముక్తుడు కాగలడు.
ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అజునిగా (పుట్టుకలేనివానిగా) వర్ణింపబడినాడు. ద్వితీయాధ్యాయమున జీవులు సైతము అజులుగా తెలుపబడినను భగవానుడు వారికి భిన్నమైనవాడు. భౌతికబంధకారణముగా జన్మించుచు మరణించు జీవులకు అతడు భిన్నుడు. ఆ బద్ధజీవులు తమ దేహములను మార్చుచుండ, భగవానుని దేహము మార్పురహితమై యున్నది. అతడు భౌతికప్రపంచమునకు అరుదెంచినను అజునిగనే అరుదెంచును. కనుకనే శ్రీకృష్ణభగవానుడు తన అంతరంగశక్తి ద్వారా న్యునమైన భౌతికశక్తికి అధీనుడుగాక సదా దివ్యశక్తియందే స్థితుడై యుండునని చతుర్థాధ్యాయమున తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
04. బుద్ధిర్ జ్ఞానమసమ్మోహ: క్షమా సత్యం దమ: శమ: |
సుఖం దుఃఖం భవో(భావో భయం చాభయమేవ చ ||
05. అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో(యశః |
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధా: ||
🌷. తాత్పర్యం :
బుద్ధి,జ్ఞానము, సంశయముగాని భ్రాంతిగాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధగుణములు నా చేతనే సృష్టించబడినవి.
🌷. భాష్యము :
జీవుల శుభాశుభములైన వివధ గుణములన్నియును శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి. ఆ గుణములే ఇచ్చట వివరింపబడినవి.
విషయములను సరియైన దృక్పథముతో విశ్లేషించు శక్తియే బుద్ధి యనబడును. ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికమనెడి అవగాహనయే జ్ఞానము.
విశ్వవిద్యాలయ చదువుతో లభ్యమైన జ్ఞానము భౌతికమునకు సంబంధించిన జ్ఞానమైనందున, వాస్తవజ్ఞానముగా ఆంగీకరింపబడదు. ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడుమ భేదము నెరుగగలుగుటయే వాస్తవజ్ఞానము.
కాని నేటి ఆధునిక విద్యావిధానమున ఆధ్యాత్మికత్వమును గూర్చిన ఎట్టి జ్ఞానము లేదు. జనుల కేవలము భౌతికమూలకములు మరియు దేహావసరముల యెడ మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విద్యాలయజ్ఞానము అసంపూర్ణమై యున్నది.
మనుజుడు శంకను వదిలి దివ్యతత్త్వము నవగాహన చేసికొనినప్పుడు సంశయము మరియు భ్రాంతిరాహిత్యమనెడి (అసమ్మోహము) స్థితిని సాధించగలడు. అట్టివాడు నెమ్మదిగా అయినప్పటికిని నిక్కముగా భ్రాంతి నుండి ముక్తుడు కాగలడు. కనుక దేనిని కూడా గ్రుడ్డిగా ఆంగీకరింపక శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింపవలసియున్నది.
ఓర్పు మరియు క్షమాగుణములను (క్షమ) అలవరచుకొని ఇతరుల సాధారణ అపరాధముల యెడ ఓర్పును కలిగి వారిని క్షమింపవలెను. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా తెలియజేయుటయే సత్యమనుదాని భావము. వాస్తవములనెన్నడును తప్పుగా ప్రదర్శించరాదు.
ఇతరులకు నచ్చునదైనప్పుడే సత్యమును పలుకుట సాంఘికమర్యాదయైనను వాస్తవమునకు అది సత్యసంధత కానేరదు. కావున వాస్తవములను సర్వులు అవగాహన చేసికొను రీతిలో సత్యమును నిక్కచ్చిగా పలుకవలెను.
దొంగను దొంగయని పలికి జనులను సావధానపరచుటయే సత్యము కాగలదు. సత్యము కొన్నిమార్లు రుచింపకపోయినను ఎవ్వరును దానిని పలుకుట యందు జంకును కలిగియుండరాదు.
ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా ప్రదర్శించవలెనని సత్యసంధత కోరును. సత్యమునకు ఒసగబడు నిర్వచనమిదియే.
🌹 🌹 🌹 🌹 🌹
06. మహర్షయ: సప్త పూర్వే చతుర్వా మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమా: ప్రజా: ||
🌷. తాత్పర్యం :
సప్తమహాఋషులు, వారికి పూర్వము సనకసనందనాదులు మరియు మనువురు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధలోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి.
🌷. భాష్యము :
ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు విశ్వజనము యొక్క వంశక్రమానుగత సారాంశమును వివరించుచున్నాడు. తొలుత ఆదిజీవుడైన బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడని తెలియబడు భగవానుని శక్తి నుండి ఉద్భవించెను.
ఆ బ్రహ్మదేవుని నుండి తొలుత సనక, సనందన, సనాతన, సనత్కుమారులును, మనువులును, ఆ తరువాత సప్తఋషులును ఉద్భవించిరి. ఈ ఇరువదియైదుమంది ఋషులు విశ్వమునందలి జీవులందరికి ప్రజాపతులుగా ప్రసిద్ధినొందిరి.
అసంఖ్యాకములుగా నున్నటువంటి విశ్వములలో అసంఖ్యాక లోకములు కలవు. ఆ లోకములన్నియును వివధజనులతో నిండియున్నవి. వారందరును ఆ ఇరువదియైదుగురు ప్రజాపతుల నుండియే జన్మించిరి.
శ్రీకృష్ణుని కరుణచే విశ్వమును సృష్టించు జ్ఞానమును పొందుటకు పూర్వము బ్రహ్మదేవుడు వేయి దేవతాసంవత్సరములు తపమాచరించియుండెను. తదుపరి బ్రహ్మ నుండి సనక, సనందన, సనాత్కుమారులును, ఆపై రుద్రుడును మరియు సప్తఋషులును ఉదయించిరి.
ఈ విధముగా బ్రహ్మణులు మరియు క్షత్రియులు మొదలైన వారందరు భగవానుని శక్తి నుండి ఉద్భవించినట్టివారు. కనుకనే బ్రహ్మదేవుడు పితామహునిగను మరియు అతనికి తండ్రియైన శ్రీకృష్ణుడు ప్రపితామహునిగను తెలియబడినారు.
ఈ విషయము భగవద్గీత (11.39) యందలి ఏకాదశాధ్యాయమున తెలుపబడినది.ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు విశ్వజనము యొక్క వంశక్రమానుగత సారాంశమును వివరించుచున్నాడు. తొలుత ఆదిజీవుడైన బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడని తెలియబడు భగవానుని శక్తి నుండి ఉద్భవించెను.
ఆ బ్రహ్మదేవుని నుండి తొలుత సనక, సనందన, సనాతన, సనత్కుమారులును, మనువులును, ఆ తరువాత సప్తఋషులును ఉద్భవించిరి. ఈ ఇరువదియైదుమంది ఋషులు విశ్వమునందలి జీవులందరికి ప్రజాపతులుగా ప్రసిద్ధినొందిరి.
అసంఖ్యాకములుగా నున్నటువంటి విశ్వములలో అసంఖ్యాక లోకములు కలవు. ఆ లోకములన్నియును వివధజనులతో నిండియున్నవి. వారందరును ఆ ఇరువదియైదుగురు ప్రజాపతుల నుండియే జన్మించిరి.
శ్రీకృష్ణుని కరుణచే విశ్వమును సృష్టించు జ్ఞానమును పొందుటకు పూర్వము బ్రహ్మదేవుడు వేయి దేవతాసంవత్సరములు తపమాచరించియుండెను. తదుపరి బ్రహ్మ నుండి సనక, సనందన, సనాత్కుమారులును, ఆపై రుద్రుడును మరియు సప్తఋషులును ఉదయించిరి.
ఈ విధముగా బ్రహ్మణులు మరియు క్షత్రియులు మొదలైన వారందరు భగవానుని శక్తి నుండి ఉద్భవించినట్టివారు. కనుకనే బ్రహ్మదేవుడు పితామహునిగను మరియు అతనికి తండ్రియైన శ్రీకృష్ణుడు ప్రపితామహునిగను తెలియబడినారు. ఈ విషయము భగవద్గీత (11.39) యందలి ఏకాదశాధ్యాయమున తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹
07. ఏతాం విభూతిం యోగం చ మామ యో వేత్తి తత్త్వత: |
సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ: ||
🌷. తాత్పర్యం :
నా ఈ దివ్యవిభూతిని, యోగశక్తిని యథార్థముగ నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానము ఆధ్యాత్మికపూర్ణత్వము యొక్క అత్యున్నతదశ వంటిది.
ఆ భగవానుని వివిధములైన దివ్యవిభూతుల యెడ స్థిరనిశ్చయము కలుగనిదే ఎవ్వరును సంపూర్ణముగా భక్తియోగమున నెలకొనలేరు. సాధారణముగా జనులు భగవానుడు గొప్పవాడని తెలిసియుందురుగాని అతడెంతటి గొప్పవాడనెడి విషయమును పూర్తిగా ఎరిగియుండరు.
ఇచ్చట ఆ విషయములన్నియును సమగ్రముగా తెలుపబడినవి. శ్రీకృష్ణభగవానుడు ఎంతటి ఘనుడనెడి విషయము సమగ్రముగా తెలిసినపుడు సహజముగా మనుజుడు అతనికి శరణమునొంది భక్తియుతసేవలో నిమగ్నుడగును.
భగవానుని దివ్యవిభూతులు యథార్థముగా అవగతమైనప్పుడు అతని శరణుజొచ్చుట కన్నను మనుజునకు వేరొక్క మార్గముండదు. ఇటువంటి వాస్తవమైన జ్ఞానమును భగవద్గీత, భాగవతము మరియు అటువంటి ఇతర వాజ్మయము ద్వారా తెలిసికొనవచ్చును.
ఈ విశ్వపాలనము కొరకు విశ్వమనదంతటను పలుదేవతలు కలరు. వారిలో బ్రహ్మ, శివుడు, సనకసనందనాదులు, ఇతర ప్రజాపతులు ముఖ్యమైనవారు.
విశ్వజనులకు గల పలువురు పితృదేవతలు శ్రీకృష్ణుని నుండియే జన్మించిరి. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వపితృదేవతలకు ఆది పితృదేవుడై యున్నాడు.
ఇవన్నియును వాస్తవమునకు శ్రీకృష్ణభగవానుని కొన్ని విభూతులు మాత్రమే.
ఈ విభూతుల యెడ విశ్వాసము కలిగినవాడు శ్రీకృష్ణుని శ్రద్ధతో శంకారహితముగా గ్రహించి, అతని భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. భగవత్సేవలో ఆసక్తిని మరియు శ్రద్ధను వృద్ధిపరచుకొనుటకు ఈ ప్రత్యేక జ్ఞానము అత్యంత అవసరమై యున్నది.
శ్రీకృష్ణభగవానుని దివ్యఘనతను సంపూర్ణముగా నెరుగుటచే మనుజుడు శ్రద్ధాపూరితమైన భక్తియోగమున స్థిరుడు కాగాలనందున ఆ దేవదేవుడు ఎంతటి ఘనుడో తెలిసికొనుట యందు ఎవ్వరును ఉపేక్ష వహింపరాదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 08 🌴
08. అహం సర్వస్య ప్రభవో మత్త: సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితా: ||
🌷. తాత్పర్యం :
నేనే సర్వములైన ఆధ్యాత్మిక, భౌతికజగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపుర్వకముగా అర్చింతురు.
🌷. భాష్యము :
వేదములను సంపూర్ణముగా అధ్యయనము చేసినవాడును మరియు శ్రీచైతన్యమహాప్రభువు వంటి ప్రామాణికుల ద్వారా జ్ఞానమును పొంది, ఆ ఉపదేశములను ఏ విధముగా ఆచరణలో పెట్టవలెనో ఎరిగినవాడు అగు పండితుడు శ్రీకృష్ణుడే భౌతిక, ఆధ్యాత్మికజగత్తుల యందలి సర్వమునకు మూలమని అవగాహన చేసికొనగలడు.
ఈ విషయమును పూర్ణముగా నెరిగియుండుటచే అతడు అ భగవ…
. శ్రీమద్భగవద్గీత - 361 / Bhagavad-Gita - 361 🌹
09. మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్త: పరస్పరమ్ |
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ ||
🌷. తాత్పర్యం :
నా శుద్ధభక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై, వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై యుండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును అనుభవింతురు.
🌷. భాష్యము :
శుద్ధభక్తులు (వారి లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి) శ్రీకృష్ణభగవానుడు దివ్యమగు ప్రేమయుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు.
వారి మనస్సు లెన్నడును శ్రీకృష్ణచరణారవిందముల నుండి మరలవు. వారి చర్చలు ఆధ్యాత్మిక విషయముల పైననే పూర్ణముగా కేంద్రీకృతమై యుండును. కనుకనే వారి దివ్యలక్షణములు ఈ శ్లోకమున ప్రత్యేకముగా వర్ణింపబడినవి. అట్టి శుద్ధభక్తులు ఇరువదినాలుగుగంటలు శ్రీకృష్ణభగవానుని గుణములను మరియు లీలలను కీర్తించుట యందు లగ్నమై యుందురు. హృదయము మరియు ఆత్మ సదా శ్రీకృష్ణతత్పరములై యుండి వారు ఇతర భక్తులతో ఆ దేవదేవుని గూర్చి చర్చించుట యందు ఆనదమును ననుభవింతురు.
భక్తియోగపు ప్రాథమికదశ యందు సేవ ద్వారా దివ్యానందము ననుభవించెడి భక్తులు పరిపక్వస్థితిలో భగవత్ప్రేమ యందే వాస్తవముగా స్థితులగుదురు.
అటువంటి దివ్యస్థితి యందు నెలకొనిన పిమ్మట శ్రీకృష్ణభగవానుడు తన ధామమునందు ప్రదర్శించు సంపూర్ణత్వమును వారు అనుభవింపగలరు. భక్తియుతసేవను జీవుని హృదయమునందు బీజమును నాటుటగా శ్రీచైతన్యమహాప్రభువు పోల్చియున్నారు.
విశ్వమునందలి అసంఖ్యాకలోకములలో సదా పరిభ్రమించు అనంతకోటి జీవరాసులలో భాగ్యవంతులైన కొందరే శుద్ధభక్తుని సాంగత్యమును పొంది భక్తిని గూర్చి తెలియుట అవకాశమును పొందుదురు. ఈ భక్తియుతసేవ యనునది బీజము వంటిది.
అట్టి భక్తిబీజము హృదయములో నాటబడిన పిమ్మట మనుజుడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను కృష్ణనామమును కీర్తించుటను, శ్రవణము చేయుటను నిరంతరము కొనసాగించినచో నిత్యము జలమొసగుటచే వృక్షబీజము మొలకెత్తు రీతి, ఆ భక్తిబీజము మొలకెత్తగలదు. పిమ్మట భక్తిలత క్రమముగా పెరిగి పెరిగి బ్రంహాండమును చేదించుకొని ఆధ్యాత్మికాకాశమునందలి బ్రహ్మజ్యోతిని చేరును.
ఆధ్యాత్మికాకాశము నందును అది గోలోకబృందావనమగా పిలువబడు అత్యున్నతమైన దివ్యకృష్ణలోకమును చేరునంతవరకు పెరిగి పెరిగి అంత్యమున కృష్ణపాదారవిందమును చేరి అచ్చట విశ్రమించును. అటుపిమ్మట లతలు పుష్పములను, ఫలములను ఒసగురీతి భక్తిలత సైతము ఫల, పుష్పములను ఒసగును. అట్టి సమయమున కూడా శ్రవణ, కీర్తనల రూపమున జలసేవ భక్తిలతకు జరుగుచునే యుండును.
ఇట్టి భక్తిలత చైతన్యచరితామృతమునందు (మధ్యలీల 19వ అధ్యాయము) విపులముగా వర్ణింపబడినది. భక్తిలత శ్రీకృష్ణభగవానుని చరణాశ్రయమును సంపూర్ణముగా పొందిన పిమ్మట మనుజుడు భగవత్ప్రేమ యందు పూర్ణముగా లీనమగునని దాని యందు వివరింపబడినది.
అంతట జలమును వీడి మత్య్సము బ్రతుకలేనట్లు, భక్తుడు భగవానుని సంబంధము లేకుండా క్షణకాలమును జీవింపలేడు. అటువంటి దివ్యస్థితిలో భక్తుడు శ్రీకృష్ణభగవానుని సంబధమున దివ్యమైన లక్షణములను వాస్తవముగా పొందును.
భగవానుడు మరియు అతని భక్తుల నడుమగల సంబంధపు వర్ణనలతోనే శ్రీమద్భాగవతము నిండియున్నది.
కావున భాగవతముననే (12.13.18) తెలుపబడినట్లు అది భక్తులకు అత్యంత ప్రియమైనదై యున్నది (శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం ). శ్రీమద్భాగవతమునందు ధర్మము, అర్థము, కామము, మోక్షములను గూర్చిన చర్చలేదు. భగవానుడు మరియు భక్తుల దివ్యస్వభావము పూర్ణముగా వర్ణింపబడిన ఏకైక చరితము శ్రీమద్భాగవతమే.
కనుకనే యువతీయువకులు ఒండరుల సాహచర్యమున ఆనందమును పొందురీతి, కృష్ణభక్తిభావన యందు పూర్ణతనొందిన మహాత్ములు అట్టి దివ్యశాస్త్రములను శ్రవణము చేయుట యందు నిత్యానందమును పొందుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
10. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే ||
🌷. తాత్పర్యం :
ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైనవారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేనొసగుదును.
🌷. భాష్యము :
“బుద్ధియోగమ్” అను పదము ఈ శ్లోకమునందు ముఖ్యమైనది. ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశమొసగుచు తాను అనేక విషయములను చర్చించితిననియు మరియు ఇకపై బుద్ధియోగము ద్వారా కొన్ని విషయములు తెలుపనున్నట్లుయు పలికియున్న విషయమును మనమిచ్చట జ్ఞాపకము చేసికొనవలెను. అట్టి బుద్ధియోగమే ఇచ్చట పేర్కొనబడినది. బుద్ధియోగమనగా కృష్ణభక్తిరసభావనలో కర్మనొనర్చుట యనియే భావము. అదియే అత్యుత్తమబుద్ధి మరియు జ్ఞానము అనబడును. బుద్ధి యనగా తెలివి మరియు యోగమనగా యోగకర్మలు. భగవద్దామమునకు చేరగోరి మనుజుడు కృష్ణభక్తిభావనలో భక్తియుక్తసేవయందు నిలిచినచో అతని కర్మలు బుద్ధియోగమనబడును. అనగా బుద్ధియోగము ద్వారా మనుజుడు భౌతికజగత్తు బంధముల నుండి సులభముగా విడివడగలడు. పురోగతి యనుదాని చరమప్రయోజనము శ్రీకృష్ణుడే. కాని జనసామాన్యము ఈ విషయము నెరుగరు. కనుకనే గురువు మరియు భక్తుల సాంగత్యము అత్యంత ముఖ్యమై యున్నది. కనుక ప్రతియొక్కరు శ్రీకృష్ణుడే పరమగమ్యమని తెలిసికొనవలసియున్నది. ఆ విధముగా గమ్యమును నిర్ణయించి, నెమ్మదిగా అయినప్పటికిని క్రమముగా ప్రయాణించినచో అంతిమలక్ష్యము ప్రాప్తించగలదు.
మానవుడు జీవితలక్ష్యము నెరిగియు తన కర్మఫలముల యెడ అనురక్తిని కలిగియున్నచో అతడు కర్మయోగమునందు వర్తించినవాడగును. అదే విధముగా మానవుడు కృష్ణుడే గమ్యమని తెలిసియు, కృష్ణుని అవగతము చేసికొనుటకు మానసికకల్పనలను ఆశ్రయించినచో జ్ఞానయోగమునందు వర్తించినవాడగును. ఇక మానవుడు తన గమ్యమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన యందు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణుని పొందగోరినపుడు భక్తియోగమునందు లేదా బుద్ధియోగమునందు వర్తించినవాడగును. వాస్తవమునకు ఈ బుద్ధియోగమే సంపూర్ణము మరియు సమగ్రమైన యోగమై యున్నది. ఇదియే మానవజన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణస్థితి.
మనుజుడు ఆధ్యాత్మికగురువును పొందినను మరియు ఏదేని ఒక ఆధ్యాత్మికసంఘముతో సంబంధమును కలిగయున్నను ఒకవేళ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధిని పొందలేకపోయినచో ఎటువంటి కష్టము లేకుండా అతడు అంత్యమున తనను చేరురీతిలో శ్రీకృష్ణుడే అతనికి అంతర్యమున ఉపదేశములొసగును.
🌹 🌹 🌹 🌹 🌹
11. తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమ: |
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||
🌷. తాత్పర్యం :
నేను వారి యెడ ప్రత్యేకకరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు, తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింపజేయుదును.
🌷. భాష్యము :
శ్రీచైతన్యమహాప్రభువు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రకీర్తనమును వారణాసి యందు ప్రచారము చేసినపుడు వేలాదిమంది అయినను అనుసరించి. కాని ప్రకాశానందసరస్వతి యను నతడు (ఆ కాలమున వారణాసి యందు గొప్పసేవ మోసిన పండితుడు) మాత్రము మహాప్రభువు భావావేశపరుడైనందుకు ఆయనను హేళనచేసెను.
అదే విధముగా కొన్నిమార్లు కొందరు తత్త్వవేత్తలు భక్తులైనవారు అజ్ఞానాంధకారములో నుండి, తత్త్వరీత్యా భావావేశపరులై యుందురన్న భావానలో వారిని విమర్శింతురు. కాని వాస్తవమునకు అది సత్యముకాదు. ఘనులైన పండితులెందరో భక్తితత్త్వమును సమగ్రమముగా విశదపరిచిరి.
కాని భక్తుడు వారి రచనల నుండి కాని, గురూపదేశముల నుండి కాని లాభము పొందలేకున్నను, భక్తియోగమునందు శ్రద్దాళువైనచో శ్రీకృష్ణుడు స్వయముగా అతని అంతర్యము నుండి సహాయమును కూర్చగలడు. అనగా శ్రద్ధతో కృష్ణభక్తిభావన యందు నిలిచిన భక్తుడు ఎన్నడును జ్ఞానరహితుడు కాబోడు. సంపూర్ణ కృష్ణభక్తిభావనలో సేవ నొనర్చుట ఒక్కటే దానికి కావలసిన యోగ్యత.
ఆత్మానాత్మవిచక్షణ లేకుండా ఎవ్వరును శుద్ధజ్ఞానమును పొందలేరని ఆధునిక తత్త్వవేత్తలు భావింతురు. అట్టివారికి శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున చక్కని సమాధానమొసగినాడు. అనగా శుద్ధభక్తియోగమున నియుక్తులైనవారు తగినంత విద్య లేనప్పటికి మరియు వేదనియమములను గూర్చిన తగిన జ్ఞానమును కలిగియుండనప్పటికిని ఈ శ్లోకమున తెలుపబడినట్లు తప్పక భగవానునిచే సహాయమును పొందగలరు.
పరతత్త్వమైన తనను కేవలము మానసికకల్పనల ద్వారా అవగాహన చేసికొనుట సాధ్యముకాని విషయమని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు బోధించెను. పరతత్త్వమైన భగవానుడు అత్యంత ఘనుడైనవాడగుచో మనోకల్పనల ద్వారా అతనిని అవగాహనము చేసికొనుట లేదా పొందగలుగుట సాధ్యము కాదు.
మనుజడు భక్తి లేకుండ మరియు పరతత్త్వమునందు అనురాగము లేకుండ కోట్లాది సంవత్సరములు మానసికకల్పనలు గావించినను పరతత్త్వమైన శ్రీకృష్ణుడు ముదమొంది తన అంతరంగశక్తి ద్వారా శుద్ధభక్తుని హృదయమున తనను తాను విశదపరచుకొనును.
శుద్ధభక్తుడు శ్రీకృష్ణుడు సదా తన హృదయమునందు నిలుపుకొనియుండును. సూర్యసముడైన శ్రీకృష్ణుని అట్టి ఉనికిచే భక్తుని హృదయమునందలి అజ్ఞానాంధకారము పటాపంచలైపోవును. ఇదియే శ్రీకృష్ణుడు తన శుద్ధభక్తుల యెడ చూపు ప్రత్యేక కరుణయై యున్నది.
కోటానుకోట్ల జన్మల యందలి విషయసంపర్క మాలిన్యముచే మనుజుని హృదయము సదా భౌతికత్వమనెడి ధూళిచే కప్పబడియుండును. కాని అతడు భక్తియుతసేవలో నియుక్తుడై హరేకృష్ణమహామంత్రమును నిరంతరము జపించినచో శీఘ్రమే ఆ హృదయమాలిన్యము తొలగిపోయి, శుద్ధజ్ఞానస్థితికి ఉద్దరింపబడును. అనగా చరమలక్ష్యమైన విష్ణువు కేవలము హరినామసంకీర్తనము మరియు భక్తియుతసేవ తోడనే లభించునుగాని మనోకల్పన లేదా వాదములతో కాదు.
శుద్ధభక్తుడు ఏనాడును భౌతిక జీవితావసరములను గూర్చిన చింత మరియు ఆందోళనలను కలిగియుండ నవసరము లేదు. ఏలయన అతడు తన హృదయము నుండి అజ్ఞానాంధకారమును తొలగించుకొనినంతనే ప్రేమయుతసేవచే తృప్తుడైన శ్రీకృష్ణభగవానుడు అతనికి అప్రయత్నముగా సర్వమును సమకూర్చును. ఇదియే గీతోపదేశముల సారాంశము.
కనుకనే గీతాధ్యయనము ద్వారా మనుజుడు శ్రీకృష్ణభగవానునకు సంపూర్ణశరణాగతుడై అతని శుద్ధభక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. పిదప భగవానుడే రక్షణభారమును స్వీకరించినపుడు అతడు సర్వవిధములైన భౌతికయత్నముల నుండి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
15. స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ||
🌷. తాత్పర్యం :
ఓ పురుషోత్తమా! సర్వకారణుడా! సర్వేశ్వరుడా! దేవదేవా! జగన్నాథా! నీవొక్కడవే నీ అంతరంగశక్తి ద్వారా నిజాముగా నిన్నెరుగుదువు.
🌷. భాష్యము :
అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించువారివలె భక్తియుతసేవ ద్వారా శ్రీకృష్ణునితో సంబంధమును కలిగియున్నవారికే ఆ దేవదేవుడు విడితుడు కాగలడు.
దానవ, నాస్తికప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఎన్నడును ఎరుగలేరు. శ్రీకృష్ణభగవానుని నిజతత్త్వము నుండి దూరముగా గొనిపోవు మానసికకల్పనము వాస్తవమునకు గొప్ప పాపము. ఆ విధముగా శ్రీకృష్ణుని ఎరుగజాలనివారు గీతకు వ్యాఖ్యానమును చేయరాడు. భగవద్గీత శ్రీకృష్ణుని ఉపదేశము.
అది కృష్ణసంబంధవిజ్ఞానమై యున్నందున కృష్ణుని నుండి దానిని అర్జునుడు అవగతము చేసికొన రీతిలోనే మనము అవగతము చేసికొనవలెను. దానినెన్నడును నాస్తికులైనవారి నుండి గ్రహింపరాదు.
శ్రీమద్భాగవతమున పరతత్త్వమును గూర్చి ఇట్లు తెలుపబడినది (1.2.11)
వదన్తి తత్ తత్త్వవిదస్తత్త్వమ్ యద్ జ్ఞానమద్వయం |
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ధ్యతే ||
పరతత్త్వమనునది నిరాకారబ్రహ్మము, పరమాత్మ, అంత్యమున భగవానునిగా వివధదశలలో అనుభవమునకు వచ్చును. అనగా పరతత్త్వావగాహనలో మనుజుడు అంత్యమున శ్రీకృష్ణభగవానుని అనుభూతికి చేరును. ఆ దేవదేవుని స్వరూపమును సామాన్యమానవుడు గాని, బ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభూతి కలిగిన ముక్తపురుషుడు గాని అవగతము చేసికొనలేడు.
కనుక అట్టివారు శ్రీకృష్ణుడు స్వయముగా పలికిన భగవద్గీత శ్లోకముల ద్వారా ఆ భగవానుని నిజతత్త్వమును అవగతము చేసికొనుటకు యత్నింపవచ్చును. నిరాకారవాదులు కొన్నిమార్లు కృష్ణుని భగవానుడు గాని లేదా అతని అధికారమును గాని అంగీకరింతురు. అయినప్పటికి ఆ ముక్తపురుషులలో పెక్కురు అతనిని పురుషోత్తమునిగా ఎరుగాజాలరు.
కనుకనే అర్జునుడిచ్చట శ్రీకృష్ణుని “పురుషోత్తముడు” అనుచు సంబోధించినవాడు. పురుషోత్తముడైనను జీవులందరికీ అతడే తండ్రి యని జనులు తెలియకపోవచ్చునని అర్జునుడు అతనిని “భూతభావన” అనియు సంబోదించినాడు. ఆ దేవదేవుని సకలజీవులకు తండ్రిగా తెలిసినను అతడే దివ్యనియామకుడని మనుజుడు తెలియకపోవచ్చును గావున అతడు ఇచ్చట “భూతేశ” (పరమనియామకుడు) అనియు సంబోధించినాడు.
అతనిని జీవులను నియమించువానిగా అవగతము చేసికొనినను దేవతలందరికీ అతడే మూలమని మనుజుడు తెలియకపోవచ్చును కావున అర్జునుడు శ్రీకృష్ణుని దేవతాపూజ్యుడైన దేవదేవుడనియు కీర్తించినాడు. సర్వదేవతా పూజ్యుడైన భగవానుని అవగతము చేసికొనినను అతడే సర్వమునకు అధిపతి యని మనుజుడు తెలిసికొనలేకపోవచ్చును కావున అతడు తిరిగి “జగత్పతి” యని సంబోధింపబడినాడు.
ఈ విధముగా కృష్ణునికి సంబంధించిన నిజతత్త్వము అర్జునుని అనుభవముచే ఈ శ్లోకము నందు నిర్ధారితమైనది. కనుక కృష్ణుని యథార్థముగా తెలిసికొనుట కొరకు మనము అర్జునుని అడుగుజాడలను అనుసరింపవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
16. వక్తుమర్హస్యశేణ దివ్యా హ్యాత్మవిభూతయ: |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్టసి ||
🌷. తాత్పర్యం :
నీవు ఏ దివ్యవిభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపిచియుందువో వాటన్నింనిటిని దయతో నాకు విశదముగా తెలియజేయుమ.
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన తన అవగాహనచే అర్జునుడు సంతుష్టి చెందియే ఉన్నట్లుగా ఈ శ్లోకమున గోచరించుసునది.
కృష్ణుని కరుణ వలన అతడు స్వానుభావమును, బుద్ధిని, జ్ఞానమును మరియు వాని ద్వారా తెలిసికొనదగిన సర్వవిషయములను ఏరుగజాలి శ్రీకృష్ణుని దేవదేవునిగా అవగతము చేసికొనగలిగెను.
తనకెటువంటి సందేహము లేకున్నను ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుని సర్వవ్యాపకక లక్షణమును వివరింపుమని అడుగుచున్నాడు.
శ్రీకృష్ణభగవానుని ఈ సర్వవ్యాపక లక్షణమునకే సామాన్యజనులు, ముఖ్యముగా నిరాకారవాదులు ఎక్కువ ప్రాముఖ్యము నొసగుటయే అందులకు కారణము.
కనుకనే వివిధశక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధముగా సర్వవ్యాపియై యుండునో అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. ఈ ప్రశ్నను అర్జునుడు సామాన్యజనుల పక్షమున అడిగినట్లుగా ప్రతియొక్కరు గుర్తింపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
17. కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్ |
కేషు కేషు చ భావేషు చిన్త్యో(సి భగవన్మయా ||
🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! యోగీశ్వరా! నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలిసికొనగలను? ఓ దేవదేవా! ఏ యే రూపములందు నున్ను స్మరింపవలెను?
🌷. భాష్యము :
గడచిన అధ్యాయమునందు తెలుపబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణడు తన యోగమాయచే కప్పబడియుండును. కేవలము శరణాగతులైన మహాత్ములు మరియు భక్తులే అతనిని గాంచగలరు.
ఇప్పుడు అర్జునుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుడు దేవదేవుడని సంపూర్ణముగా విశ్వసించినను, సామాన్యుడు సైతము ఏవిధముగా ఆ సర్వవ్యాపియైన భగవానుని అవగతము చేసికొనగలడో అట్టి సర్వసాధారణ పద్ధతిని తెలియగోరుచున్నాడు.
యోగమాయచే కప్పబడినందున శ్రీకృష్ణుని సామాన్యజనులు (దానవులు మరియు నాస్తికులతో సహా) ఎరుగలేరు. కనుక వారి లాభము కొరకే అర్జునుడు ఈ ప్రశ్నలను అడుగుచున్నాడు. ఉన్నతుడైన భక్తుడు తన స్వీయావగాహన కొరకే గాక సమస్త మానవాళి అవగాహన కొరకై యత్నించును.
కనుకనే భక్తుడును మరియు ఘనవైష్ణవుడును అగు అర్జునుడు కరుణాపూర్ణుడై తన ప్రశ్నచే భగవానుని సర్వవ్యాపకత్వమును సామాన్యుడు తెలియుటకు అవకాశమొసగుచున్నాడు. శ్రీకృష్ణుడు తనను ఆచ్చాదించియున్న యోగమాయకు ప్రభువైనందునే అర్జునుడు ఇచ్చట అతనిని “యోగిన్” అని ప్రత్యేకముగా సంబోధించినాడు.
అట్టి యోగమాయ కారణముననే ఆ భగవానుడు సామాన్యునకు గోచరింపకుండుట లేక గోచరించుట జరుగుచుండును. కృష్ణుని యెడ ప్రేమలేని సామాన్యమానవుడు అతనిని గూర్చి సదా చింతనను గావింపలేడు.
కనుక అతడు భౌతికభావనముననే చింతింపవలసియుండును. అర్జునుడు భౌతికప్రవృత్తి కలిగిన జనుల ఆలోచనాధోరణిని పరిగణనకు తీసికొనుచున్నాడు. ఇచ్చట “కేషు కేషు చ భావేషు” అను పదములు భౌతికప్రవృతిని (భావ మనగా భౌతికవిషయములు) సూచించును.
భౌతికప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఆధ్యాత్మికముగా అవగాహన చేసికొనలేనందున భౌతికములైనవానిపై మనస్సును కేంద్రీకరించి, భౌతికప్రాతినిధ్యముల ద్వారా ఏవిధముగా శ్రీకృష్ణుడు వ్యక్తమగుచున్నాడో గాంచవలసినదిగా ఉపదేశింపబడుదురు.
🌹 🌹 🌹 🌹
18. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన |
భూయ: కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ జనార్ధనా! నీ యోగవిభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివితీరుట లేదు.
🌷. భాష్యము :
శౌనకుని అధ్యక్షతనగల నైమిశారణ్యఋషులు సైతము సూతగోస్వామితో ఈ విధముగనే పలికియుండిరి.
వయం తు న వితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే |
యచ్చృణ్వాతామ్ రసజ్ఞానామ్ స్వాదు స్వాదు పదేపదే ||
“ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణుని దివ్యలీలలను నిరంతరము శ్రవణము చేసినను ఎవ్వరును తనివినొందలేరు.
శ్రీకృష్ణునితో దివ్యసంబంధమును కలిగినవారు అతని లీలావర్ణనములను అడుగడున అస్వాదింతురు” (శ్రీమద్భాగవతము 1.1.19). అనగా అర్జునుడు శ్రీకృష్ణుని గూర్చియు, ముఖ్యముగా అతడు ఏ విధముగా సర్వవ్యాపియై యున్నాడన్న విషయమును గూర్చియు శ్రవణము చేయుటలో అనురక్తుడై యున్నాడు.
కృష్ణునకు సంబంధించిన ఏ వర్ణనమైనను లేదా విషయమైనను వాస్తవమునకు అమృతముతో సమానము. అటువంటి అమృతమును ఎవ్వరైనను అనుభవపూర్వకముగా ఆస్వాదింపవచ్చును.
ఆధునిక కథలు, నవలలు, చరిత్రల వంటి గ్రామ్యకథలు శ్రీకృష్ణుని దివ్యలీలకు భిన్నములై యుండును. మనుజుడు వారి యెడ కొంతకాలమునకు విసుగు చెందవచ్చునేమో గాని కృష్ణుని గూర్చి వినుట యందు విసుగు చెందడు. కనుకనే విశ్వచరిత్ర దేవదేవుని వివిధావతారములతో నిండియున్నది.
భగవానుని అట్టి వివిధ అవతారముల యందలి లీలలను వర్ణించు చరిత్రలే పురాణములు. ఈ కారణముననే ఎన్నిమార్లు పఠించినను వాని యందలి పఠనాంశములు నిత్యనూతనముగా నుండును.
🌹 🌹 🌹 🌹 🌹
21. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన |
భూయ: కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ జనార్ధనా! నీ యోగవిభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివితీరుట లేదు.
🌷. భాష్యము :
శౌనకుని అధ్యక్షతనగల నైమిశారణ్యఋషులు సైతము సూతగోస్వామితో ఈ విధముగనే పలికియుండిరి.
వయం తు న వితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే |
యచ్చృణ్వాతామ్ రసజ్ఞానామ్ స్వాదు స్వాదు పదేపదే ||
“ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణుని దివ్యలీలలను నిరంతరము శ్రవణము చేసినను ఎవ్వరును తనివినొందలేరు.
శ్రీకృష్ణునితో దివ్యసంబంధమును కలిగినవారు అతని లీలావర్ణనములను అడుగడున అస్వాదింతురు”
(శ్రీమద్భాగవతము 1.1.19). అనగా అర్జునుడు శ్రీకృష్ణుని గూర్చియు, ముఖ్యముగా అతడు ఏ విధముగా సర్వవ్యాపియై యున్నాడన్న విషయమును గూర్చియు శ్రవణము చేయుటలో అనురక్తుడై యున్నాడు.
కృష్ణునకు సంబంధించిన ఏ వర్ణనమైనను లేదా విషయమైనను వాస్తవమునకు అమృతముతో సమానము. అటువంటి అమృతమును ఎవ్వరైనను అనుభవపూర్వకముగా ఆస్వాదింపవచ్చును.
ఆధునిక కథలు, నవలలు, చరిత్రల వంటి గ్రామ్యకథలు శ్రీకృష్ణుని దివ్యలీలకు భిన్నములై యుండును. మనుజుడు వారి యెడ కొంతకాలమునకు విసుగు చెందవచ్చునేమో గాని కృష్ణుని గూర్చి వినుట యందు విసుగు చెందడు. కనుకనే విశ్వచరిత్ర దేవదేవుని వివిధావతారములతో నిండియున్నది.
భగవానుని అట్టి వివిధ అవతారముల యందలి లీలలను వర్ణించు చరిత్రలే పురాణములు. ఈ కారణముననే ఎన్నిమార్లు పఠించినను వాని యందలి పఠనాంశములు నిత్యనూతనముగా నుండును.
🌹 🌹 🌹 🌹 🌹
19. శ్రీ భగవానువాచ
హస్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయ: |
ప్రాధాన్యత కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే ||
🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను : సరియే! నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసెదను. కాని ఓ అర్జునా! నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైనవానినే నేను నీకు తెలుపుదును.
🌷. భాష్యము :
శ్రీకృష్ణుని ఘనతను మరియు అతని విభూతుల ఘనతను సంపూర్ణముగా గ్రహించుట సాధ్యముగాని విషయము. జీవుని ఇంద్రియములు పరిమితములుగా నుండి శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా నెరుగుటకు అతనిని అనుమతింపవు. అయినను భక్తులైనవారు శ్రీకృష్ణుని అవగాహన చేసికొనుటకు సదా యత్నింతురు.
కాని ఏదేని ఒక ప్రత్యేక సమయమున లేదా ప్రత్యేక జీవనస్థితిలో అతనిని పూర్తిగా అవగతము చేసికొనియే తీరుదుమనెడి భావనలో కాదు. పైగా కృష్ణపరములగు విషయములు అత్యంత మధురములై వారికి అమృతప్రాయములుగా తోచును కనుకనే వారు కృష్ణకథల యందు దివ్యానందమును పొందుదురు.
శ్రీకృష్ణుని దివ్యవిభూతులను మరియు వివిధశక్తులను చర్చించుట యందు అట్టి శుద్ధభక్తులు ఆధ్యాత్మికానందమును అనుభవింతురు. కనుకనే వాటి శ్రవణమును మరియు చర్చను వారు చేయగోరుదురు. తన విభూతుల పరిధిని జీవులు అవగతము చేసికొనలేరని శ్రీకృష్ణుడు తెలిసియున్నందునే వివిధశక్తులలో ప్రధానమైన వానిని మాత్రమే తెలుపుటకు అతడు ఆంగీకరించినాడు.
ఇచ్చట “ప్రాధాన్యత:” అను పదము ముఖ్యమైనది. శ్రీకృష్ణభగవానుని విభూతులు అనంతములైనందున వానిలో ప్రధానములైన కొన్నింటినే మనము తెలిసికొనగలము. వానినన్నింటిని అవగతము చేసికొనుట సాధ్యముగాని విషయము.
భగవానుడు ఏ విభూతుల ద్వారా సమస్త జగత్తును నియమించునో వాటినే ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన “విభూతి” యను పదము సూచించుచున్నది. విభూతి యనునది అసాధారణ వైభవమును సూచించునని అమరకోశనిఘంటువు నందు తెలుపబడినది.
శ్రీకృష్ణభగవానుని అసాధారణ విభూతులనుగాని, అతని దివ్యశక్తులనుగాని నిరాకారవాది లేక బహుదేవతార్చనాపరుడు ఎరుగలేడు. భౌతిక, ఆధ్యాత్మికజగత్తు లందంతటను అతని దివ్యశక్తులు సర్వరూపములలో విస్తరించియున్నవి. కాని సామాన్యుడు ప్రత్యక్షముగా గాంచగలిగిన దానినే శ్రీకృష్ణుడు ఇచ్చట వివరింపనున్నాడు. అనగా వైవిధ్యముతో కూడిన అతని శక్తిలో కొంతభాగమే ఇచ్చట వర్ణింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
20. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత: |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! నేను సర్వజీవ హృదయములందు వసించియున్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆదిమధ్యాంతములు నేనే అయి యున్నాను.
🌷. భాష్యము :
ఈ శ్లోకమున అర్జునుడు గూడాకేశునిగా సంబోధింపబడినాడు. అనగా నిద్ర యనెడి అంధకారమును జయించినవాడని భావము. అజ్ఞానాంధకారమున నిద్రించువారికి ఏ విధముగా భగవానుడు భౌతిక, ఆధ్యాత్మికజగత్తులందు వివిధరీతుల ప్రకటితిమగునో అవగతము చేసికొనుట సాధ్యము కాదు.
కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుని ఆ విధముగా సంబోధించుట ప్రాముఖ్యమును సంతరించుకొన్నది. అర్జునుడు అంధకారమును ఆవలయుండుట వలననే శ్రీకృష్ణభగవానుడు అతనికి వివిధభూతులను వివరించుటకు అంగీకరించెను.
తాను తన ప్రధానవిస్తారము ద్వారా సమస్త విశ్వమునకు ఆత్మనై యున్నానని శ్రీకృష్ణుడు తొలుత అర్జునునకు తెలుపుచున్నాడు.
సృష్టికి పూర్వము శ్రీకృష్ణభగవానుడు తన ప్రధానాంశము ద్వారా పురుషావతారములను దాల్చగా అతనిని నుండియే సర్వము ఆరంభమయ్యెను. కనుక అతడే ఆత్మయై (విశ్వపు మూలతత్త్వమైన మహతత్త్వమునకు ఆత్మ) యున్నాడు. అనగా భౌతికశక్తి యనునది సృష్టికి కారణము కాదు.
వాస్తవమునకు మహావిష్ణువు మహాతత్త్వమనెడి సంపూర్ణ భౌతికశక్తి యందు ప్రవేశించును. అతడే దానికి ఆత్మయై యున్నాడు. సృష్టింపబడిన విశ్వములలో ప్రవేశించు మహావిష్ణువు తిరిగి పరమాత్మగా ప్రతిజీవి యందును ప్రకటమగును.
ఆత్మ ఉనికి కారణముగా దేహము నిలిచియుండుననియు, ఆత్మ ఉనికి లేనిచో దేహము వృద్ధినొందదనియు మనము అనుభవపుర్వకముగా నెరిగియున్నాము. అదే విధముగా పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ప్రవేశించినంతనే భౌతికసృష్టియు వృద్ధినొందదు.
కనుకనే “సర్వవిశ్వములందు భగవానుడు పరమాత్మ రూపున వసించియున్నాడు” అని సుబలోపనిషత్తు నందు తెలుపబడినది (ప్రకృత్యాదిసర్వభుతాంతర్యామీ సర్వశేషీ చ నారాయణ: ).
శ్రీకృష్ణభగవానుని మూడు పురుషావతారములు శ్రీమద్భాగవతము నందు వర్ణింపబడినవి. “విష్ణోస్తు త్రీణి రూపాణి పురుషాఖ్యాన్యథో విదు:” అని స్వాతంత్రము నందు కూడా ఆ అవతారములు వర్ణింపబడినవి.
అనగా శ్రీకృష్ణభగవానుడు కారణోదకశాయి విష్ణువు, గర్భోదకశాయి విష్ణువు మరియు క్షీరోదకశాయి విష్ణువు అనెడి మూడురూపములలో భౌతికసృష్టి యందు ప్రకటమగును.
“య: కారణార్ణవజలే భజతి స్మ యోగనిద్రాం” అని కారణోదకశాయి విష్ణువు (మహావిష్ణువు) బ్రహ్మసంహిత (5.49) యందు వర్ణింపబడినాడు.
అనగా దేవదేవుడును, సర్వకారణ కారణుడును అయిన శ్రీకృష్ణుడు విశ్వజలములందు మహావిష్ణువు రూపమున శయనించును. అనగా అతడే విశ్వమునకు ఆదియును, సృష్టులకు పోషకుడును, సమస్త శక్తికి అంతమును అయి యున్నాడు.
21. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ||
🌷. తాత్పర్యం :
నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై యున్నాను.
🌷. భాష్యము :
ఆదిత్యులు పన్నెండురు కలరు. వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు. అకాశమునందు ప్రకాశించువానిలో సూర్యుడు ముఖ్యమైనవాడు. అతడు దేవదేవుని సముజ్జ్వలనేత్రముగా బ్రహ్మసంహిత యందు అంగీకరింపబడినాడు. ఆకాశమున ఏబదిరకముల వాయువులు వీచుచుండును. వాటికి అధిష్టానదేవతయైన మరీచి శ్రీకృష్ణుని ప్రతినిధి.
రాత్రిసమయమున నక్షత్రములందు ప్రదానుడైన చంద్రుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. చంద్రుడు ఒకానొక నక్షత్రమని ఈ శ్లోకము ద్వారా గోచరించుచున్నది. అనగా ఆకాశమునందు మెరయు నక్షత్రములు కూడా సూర్యునికాంతినే ప్రతిబింబించుచున్నవి. విశ్వమునందు అనేక సూర్యులు కలరనెడి సిద్ధాంతమును వేదవాజ్మయము అంగీకరింపదు. సూర్యుడొక్కడే. సూర్యునికాంతిని ప్రతిబింబించుట ద్వారా చంద్రుడు వెలుగునట్లు, నక్షత్రములు కూడా వెలుతురును ప్రసరించుచున్నవి. చంద్రుడు నక్షత్రములలో ఒకడని భగవద్గీత ఇచ్చట తెలుపుచున్నందున ఆకాశమున మొరయు నక్షత్రములు చంద్రుని పోలినవే గాని సూర్యులు కానేరవు.
🌹 🌹 🌹 🌹 🌹
22. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ: |
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ||
🌷. తాత్పర్యం :
నేను వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతియైన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి ప్రాణమును(చైతన్యమును) అయి యున్నాను.
🌷. భాష్యము :
భౌతికపదార్థము మరియు ఆత్మ నడుమ భేదమేమనగా భౌతికపదార్థము జీవునివలె చైతన్యమును కలిగియుండదు. అనగా ఈ చైతన్యము దివ్యమును మరియు నిత్యమును అయి యున్నది. అట్టి చైతన్యమెన్నడును భౌతికపదార్థ సమ్మేళనముచే ఉద్భవించదు.
🌹 🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹 🌹
23. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరు: శిఖరిణామహమ్ ||
🌷. తాత్పర్యం :
నేను రుద్రులలో శివుడను, యక్ష, రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి యున్నాను.
🌷. భాష్యము :
రుద్రులు పదునొకండుగురు కలరు. వారిలో శివుడు (శంకరుడు) ముఖ్యమైనవాడు. అతడు ఈ విశ్వమునందు భగవానుని తమోగుణావతారము. యక్ష, రాక్షసుల నాయకుడైన కుబేరుడు దేవతల కోశాధిపతి. అతడు దేవదేవుని ప్రతినిధి. సమృద్ధియైన ప్రకృతి సపదలకు మేరుపర్వతము మిక్కిలి ప్రసిద్ధము
🌹 🌹 🌹 🌹 🌹
24. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కన్ద: సరసామస్మి సాగర: ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. నేను సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో సముద్రమునై యున్నాను.
🌷. భాష్యము :
స్వర్గలోకదేవతలలో ఇంద్రుడు ముఖ్యదేవత. అతడే స్వర్గాధిపతియనియు తెలియబడును. అతడు పాలించు లోకము ఇంద్రలోకము మరియు బృహస్పతి అతని పురోహితుడు.
ఇంద్రుడు రాజులందరిలో ముఖ్యుడగుట వలన బృహస్పతి పురోహితులందరిలో ముఖ్యుడయ్యెను. రాజులందరిలో ఇంద్రుడు ప్రధానుడైనట్లుగా పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన కార్తికేయుడు సేనానాయకులలో ప్రధానుడు.
అదే విధముగ జలనిధులలో సముద్రము ఘనమైనది. ఈ ప్రాతినిధ్యములన్నియును శ్రీకృష్ణుని ఘనతకు సూచనలు మాత్రమే ఒసగును.
🌹 🌹 🌹 🌹 🌹
25. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం |
యజ్ఞానాం జపయజ్ఞో(స్మి స్థావరాణాం హిమాలయ: ||
🌷. తాత్పర్యం :
నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములైనవానిలో హిమాలయమును అయి యున్నాను.
🌷. భాష్యము :
విశ్వమునందలి తొలిజీవియైన బ్రహ్మదేవుడు వివిధజీవజాతుల సృష్టికై పెక్కురు పుత్రులను సృజించెను. అట్టి పుత్రులలో భృగుమహర్షి శక్తిమంతుడైన ఋషి.
దివ్య ధ్వనులలో ఓంకారము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. అదేvవిధముగా సమస్తయజ్ఞములలో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను జపయజ్ఞము శ్రీకృష్ణుని విశుద్ధ ప్రాతినిధ్యమే.
కొన్నిమార్లు పశుహింసను కూడిన యజ్ఞములు ఉపదేశింపబడినను ఈ హరినామ జపయజ్ఞమునందు హింస యనెడి ప్రశ్నయే ఉదయింపదు. కనుకనే ఇది అత్యంత సులభము మరియు పరమపవిత్రమై యున్నది.
సృష్టియందు ఉదాత్తమైనది శ్రీకృష్ణునికి ప్రాతినిద్యము వహించును గావున ప్రపంచమునందలి ఘనపర్వతములైన హిమాలయములు సైతము శ్రీకృష్ణునికి ప్రాతినిద్యములు.
శ్లోకములలో మేరుపర్వతమును గూర్చి చెప్పబడినను, అది హిమాలయమువలె స్థావరముగాక, కొన్నిమార్లు చలనశీలమై యుండును. కనుకనే హిమాలయములు మేరువుకన్నను ఘనమైనవి.
🌹 🌹 🌹 🌹 🌹
26. అశ్వత్థ: సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద: |
గంధర్వాణాం చిత్రరథ: సిద్దానాం కపిలో ముని: ||
🌷. తాత్పర్యం :
నేను వృక్షములలో రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలుడను అయి యున్నాను.
🌷. భాష్యము :
అత్యంత ఉన్నతమును మరియు సుందరమును అగు వృక్షములలో రావిచెట్టు ఒకటి. భారతదేశజనులు తమ ప్రాత:కాల కర్మలలో ఒకటిగా దానిని అర్చింతురు. విశ్వములలో గొప్ప భక్తునిగా పరిగణింపబడెడి నారదుడు దేవతలలో సైతము పూజలనందును.
కనుకనే భక్తుని రూపున అతడు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. గంధర్వలోకము మనోహరముగా గానము చేయువారితో నిండియుండును. వారి ఉత్తమగాయకుడు చిత్రరథుడు.
సిద్దులలో దేవహుతి తనయుడైన కపిలుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. శ్రీకృష్ణుని అవతారమైన అతడు తెలిపిన తత్త్వము శ్రీమద్భాగవతమున వివరింపబడినది.
తదనంతర కాలమున వేరొక కపిలుడు ప్రసిద్ధి పొందినను అతని తత్త్వము నాస్తికమైనట్టిది. కావుననే వారి నడుమ గొప్ప అంతరము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹
27. ఉచ్చై:శ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేన్ద్రాణాం నారాణాం చ నరాధిపమ్ ||
🌷. తాత్పర్యం :
అశ్వములలో అమృతము కొరకై సాగరమంథనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. అలాగుననే నేను గజరాజులలో ఐరావతమును మరియు నరులలో రాజును అయి యున్నాను.
🌷. భాష్యము :
ఒకమారు దేవదానవులు సముద్రమంథనము నందు పాల్గొనగా ఆ కార్యము వలన అమృతము మరియు హాలాహలము రెండును ఉద్భవించినవి. అట్లు ఉద్భవించిన హాలాహలమును పరమశివుడు త్రాగెను. అమృతము నుండి ఉద్భవించిన అనేకములలో ఉచ్చైశ్రవనామము గల అశ్వమొకటి. అమృతము నుండి ఉద్భవించిన వేరొక జంతువు ఐరావతమను గజము. అమృతము నుండి ఉద్భవించినందున ఈ రెండు జంతువుల ప్రత్యేకతను సంతరించుకొని, శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించుచున్నవి.
నరులలో నరాధిపుడైన రాజు శ్రీకృష్ణునికి ప్రతినిధి. ఏలయన శ్రీకృష్ణుడు విశ్వపోషకుడు కాగా, రాజులు (దైవగుణములు కలిగియున్నందున రాజులుగా నియమింపబడినవారు) తమ రాజ్యమును పాలించువారై యున్నారు.ధర్మరాజు, పరీక్షిత్తు, శ్రీరాముడు వంటి ధర్మాత్ములైన రాజులు సదా తమ ప్రజల క్షేమమును గూర్చియే తలచియుండిరి. కనుకనే వేదములందు రాజు భగవానుని ప్రతినిధిగా పరిగణింపబడినాడు. కాని నేటి కాలమున ధర్మము నశించిన కారణముగా రాజవంశములు క్షీణించి చివరకు పూర్తిగా నశించిపోయినవి. అయినను పూర్వకాలమున ధర్మాత్ములైన రాజులు సంరక్షణలో జనులు ఆనందముతో జీవించిరని మనము అవగాహన చేసికొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
28. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్ప: సర్పాణామస్మి వాసుకి: ||
🌷. తాత్పర్యం :
నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మథుడను మరియు సర్పములలో వాసుకుని అయి యున్నాను.
🌷. భాష్యము :
నిక్కముగా మహాత్తరమగు ఆయుధమైన వజ్రాయుధము శ్రీకృష్ణుని శక్తికి ప్రాతినిధ్యము వహించును. ఆధ్యాత్మికజగమునందలి కృష్ణలోకమున ఎప్పుడు కోరినను,
ఎంతకోరినను క్షీరము నొసగగల గోవులు అసంఖ్యాకములుగా కలవు. అటువంటి గోవులు ఈ భౌతికజగమున లేవు.
అవి కృష్ణలోకమున ఉన్నట్లుగా మాత్రము పేర్కొనబడినది. “సురభి” నామము గల ఆ గోవులను శ్రీకృష్ణభగవానుడు పెక్కింటిని కలిగియుండి వానిని గాంచుట యందు నిమగ్నుడై యుండుననియు తెలుపబడినది.
సత్సాంతానము కొరకై కలిగెడి కామవాంఛ కందర్పుడు కనుక అతడు శ్రీకృష్ణుని ప్రతినిధి. కొన్నిమార్లు మైథునక్రియ కేవలము ఇంద్రియభోగము కొరకే ఒనరింపబడుచుండును.
అదియెన్నడును కృష్ణునికి ప్రాతినిధ్యము వహింపదు. కేవలము సత్సాంతానప్రాప్తికై ఒరరింపబడెడిదే కందర్పునిగా పిలువబడి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును.
🌹 🌹 🌹 🌹 🌹
29. అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితౄణామర్యమా చాస్మి యమ: సంయమతామహమ్ ||
🌷. తాత్పర్యం :
నేను పెక్కుపడగలు గల నాగులలో అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో అర్యముడను, ధర్మనిర్వాహకులలో మృత్యుదేవతయైన యముడను అయి యున్నాను.
🌻. భాష్యము :
జలవాసులలో వరుణదేవుడు ఘనుడైనట్లుగా పెక్కుపడగలు గల నాగులలో అనంతుడు ఘనుడైనట్టివాడు. వారిరువురును శ్రీకృష్ణుని ప్రతినిధులు. ఆర్యముడు అధిపతిగా గల పితృలోకమొకటి కలదు. అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. దుష్కృతులైనవారిని దండించుటకు గల పెక్కుమందిలో యమధర్మరాజు ముఖ్యుడు. ఈ భూలోకమునకు చేరువలోగల లోకమునందే అతడు నిలిచియుండును. మరణానంతరము పాపులు అచ్చటకు గొనిపోబడగా అతడు వారికి వివిధరకములైన శిక్షలు విధించుచుండును.
🌹 🌹 🌹 🌹 🌹
30. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల: కలయతామహమ్ |
మృగాణాం చ మృగేన్ర్ద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్ ||
🌷. తాత్పర్యం :
నేను దైత్యులలో భక్త ప్రహ్లాదుడను, అణుచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షలలో గరుత్మంతుడను అయి యున్నాను.
🌻. భాష్యము :
అక్కాచెల్లెండ్రయిన దితి మరియు అదితులలో అదితి తనయులు అదిత్యులుగా, దితి తనయులు దైత్యులుగా పిలువబడిరి. వారిలో ఆదిత్యులు భగవానుని భక్తులు కాగా, దైత్యులు నాస్తికులైరి. ప్రహ్లాదుడు అట్టి దైత్యవంశమున జన్మించినప్పటికి చిన్ననాటి నుండియు గొప్పభక్తుడై యుండెను. తన భక్తితత్పరత మరియు దైవీస్వభావము కారణముగా అతడు శ్రీకృష్ణుని ప్రతినిధిగా గుర్తింపబడినాడు.
దమనమొనర్చునవి లేక అణుచునవి మొదలగు అంశములు పలు ఉన్నప్పటికిని కాలము మాత్రము భౌతికవిశ్వమునందలి సమస్తమును అణుచునదై యున్నది. కనుక అది శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మృగములలో సింహము అతి భయంకరము మరియు శక్తివంతమైనది. అదే విధముగా లక్షలాది పక్షిజాతులలో విష్ణువాహనమైన గరుడుడు అత్యంత ఘనుడు.
🌹 🌹 🌹 🌹 🌹
31. పవన: పవతాస్మి రామ: శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ ||
🌷. తాత్పర్యం :
నేను పవిత్రమొనర్చువానిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, జలజంతువులలో మకరమును, నదులలో గంగానదిని అయి యున్నాను.
🌻. భాష్యము :
అతిపెద్దవైన జలజంతువులలో మకరము ఒకటి. అది నిక్కముగా మానవునకు ప్రమాదకరమైనది. అట్టి మకరము శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 36 🌴
36. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయోస్మి(స్మి వ్యవసా యో(స్మి సత్త్వం సత్త్వవతామహమ్ ||
🌷 . తాత్పర్యము :
నేను మోసములలో జూదమును, జేజస్వులలో తేజస్సునై యున్నాను. ఆలాగుననే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే.
🌻. భాష్యము :
విశ్వమనదంతటను పలువిధములైన మోసకారులు కలరు.
వారి పలువిధములైన మోసములలో జూదము అగ్రగణ్యమై యున్నందున అది శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. అనగా పరమపురుషునిగా శ్రీకృష్ణుడు సామాన్యపురుషుని కన్నను గొప్ప వంచన చేయగలడు.
ఒకవేళ అతడు ఎవ్వరినైనను వంచింప దలచినచో ఎవ్వరును వంచన యందు అతనిని అధిగమింపలేరు. అనగా శ్రీకృష్ణుని ఘనత ఒక రంగమునందే గాక, అన్ని రంగములందు గొప్పదై యున్నది.
జయించు వారిలో జయమును, తేజస్సులలో తేజస్సును అతడే. యత్నశీలురులలో ఘన యత్నశీలుడు, సాహసులలో అతిసాహసుడు మరియు బలము గలవారిలో అతిబలశాలి అతడే.
శ్రీకృష్ణుడు ధరత్రిపై అవతరించినపుడు ఎవ్వరును అతని శక్తిని అధిగమింపలేకపోయిరి. అతడు చిన్ననాతనే గోవర్ధనపర్వతము నెత్తెను. అట్టి శ్రీకృష్ణుని మోసమునందు గాని, తేజస్సునందు గాని, జయమునందు గాని, యత్నమునందు గాని మరియు బలమునందు గాని ఎవ్వరును అధిగమింపలేరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 388 / Bhagavad-Gita - 388 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 37 🌴
37. వృష్ణీనాం వాసుదేవో(స్మి పాణ్డవానాం ధనంజయ: |
మునీనామప్యహం వ్యాస: కవీనాముశనా కవి: ||
🌷. తాత్పర్యం :
నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయి యున్నాను.
🌷. భాష్యము :
శ్రీకృష్ణుడు ఆద్యదేవదేవుడు కాగా, బలదేవుడు అతని అవ్యవహిత విస్తృతాంశయై యున్నాడు. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు వసుదేవుని తనయులుగా అవతరించి యున్నందున వారిరువురిని వాసుదేవులుగా పిలువవచ్చును.
వేరొక దృష్టితో చూచినచో శ్రీకృష్ణుడు ఎన్నడును బృందావనమును వీడడు కనుక, బృందావనమునకు అన్యమైన స్థలములలో దర్శితమైన కృష్ణుని రూపములు అతని విస్తృతాంశములై యున్నవి. అనగా శ్రీకృష్ణుని విస్తృతాంశయైన వాసుదేవుడు శ్రీకృష్ణుని కన్నను అన్యుడు కాదు.
భగవద్గీత యందలి ఈ శ్లోకమున గల వాసుదేవ పదము బలరామునే సూచించుచున్నదని అవగతము చేసికొనవలెను. ఏలయన బలరాముడే సర్వవతారములకు మూలమై యున్నందున వాసుదేవ అంశములకు సైతము అతడే మూలమై యున్నాడు.
ఈ విధమైన శ్రీకృష్ణభగవానుని అవ్యవహిత విస్తారములు “స్వాంశములు” (వ్యక్తిగత రూపములు) అని పిలువబడును. ఇవియేగాక “విభిన్నాంశములు” అని పిలువబడు విస్తృతరూపములును కలవు.
పాండురాజు తనయులలో ధనంజయునిగా పేరొందిన అర్జునుడు నరులలో శ్రేష్టుడు గనుక శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మునులు లేక వేదజ్ఞానపారంగతులైన మనుజులలో వ్యాసుడు శ్రేష్టుడు.
ఏలయన ఆయన ఈ కలియుగ జనులకు అవగతమగునట్లు భిన్నపద్దతులలో వేదజ్ఞానమును వివరించెను. అంతియేగాక వ్యాసుడు శ్రీకృష్ణుని అవతారమై యున్నాడు.
కనుక అతడు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. ఎట్టి విషయమును గూర్చియైనను సమగ్రముగా ఆలోచింప సమర్థులైనవారిని కవులందురు.
అట్టి కవులలో దానవుల గురువైన ఉశనుడు(శుక్రాచార్యుడు) అసాధారణ మేధాసంపన్నుడు మరియు దూరదృష్టి కలిగిన రాజనీతినిపుణుడు కనుక శ్రీకృష్ణుని విభూతికి ప్రతినిధియై యున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 38 🌴
38. దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ||
🌷. తాత్పర్యం :
నేను చట్టవిరుద్ధతను అణుచువానిలో శిక్షను, జయమును కోరువారిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును అయియున్నాను.
🌷. భాష్యము :
దుష్కృతులైనవారిని శిక్షించు విధానములు దండనసాధనములలో ముఖ్యమైనవి. కనుక దుష్కృతులు శిక్షింపబడినప్పుడు ఆ శిక్షను గూర్చువాడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. ఏదేని ఒక రంగమునందు జయమును పొంద యత్నించువారిలో మిక్కిలి విజయవంతమైన అంశము నీతి. శ్రవణము, చింతనము, ధ్యానాది గుహ్యమగు కర్మలలో మౌనమైనది. ఏలయన మౌనము ద్వారా మనుజడు త్వరితముగా పురోగతిని సాధింపగలడు. జ్ఞానవంతుడైనవాడు భగవానుని ఉన్నత, గౌణప్రకృతులైన ఆత్మ మరియు భౌతికపదార్థముల నడుమ అంతరమును విశ్లేషించగలిగియుండును. అట్టి జ్ఞానము స్వయముగా శ్రీకృష్ణుడే.
🌹 🌹 🌹 🌹 🌹
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 39 🌴
39. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ ||
🌷. తాత్పర్యం :
ఇంకను ఓ అర్జునా! సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావరజంగములలో నేను లేకుండ ఏదియును స్థితిని కలిగియుండలేదు.
🌷. భాష్యము :
ప్రతిదానికి ఒక కారణముండును. అట్టి కారణము లేదా బీజము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు శక్తి లేకుండా ఏదియును స్థితిని కలిగియుండలేదు కనుక అతడు సర్వశక్తిమంతుడని పిలువబడినాడు. అతని శక్తి లేకుండా స్థావరము గాని, జంగమము గాని ఏదియును మనుగడను కలిగియుండలేదు. కనుకనే కృష్ణుని శక్తిపై ఆధారపడనిదిగా గోచరించునది మాయగా (లేనటువంటిది) పిలువబడును.
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీమద్భగవద్గీత - 391 / Bhagavad-Gita - 391 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 40 🌴
40. నాన్తోస్తి మయ దివ్యానాం విభూతీనాం పరన్తప |
ఏష తూద్దేశత: ప్రోక్తా విభూతేర్విస్తరో మయా ||
🌷. తాత్పర్యం :
ఓ శత్రుంజయుడా! నా దివ్య విభూతులకు అంతమనునది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే.
🌷. భాష్యము :
వేదవాజ్మయమున తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుని విభూతులు మరియు శక్తులు వివిధరీతుల అవగతమైనను వాస్తవమునకు అట్టి విభూతులకు పరిమితిలేదు. కనుకనే సమస్త విభూతులు మరియు శక్తులు ఎన్నడును వివరింపబడలేవు.
అనగా అర్జునుని జిజ్ఞాసను సంతృప్తిపరచుట కొరకు శ్రీకృష్ణభగవానుడు కేవలము కొన్ని ఉదాహరణములను మాత్రమే వివరించియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
41. యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్చ త్వం మమ తేజోంశసంభవమ్ ||
🌷. తాత్పర్యం :
సంపన్నములును, సుందరములును, వైభవోపేతములును అగు సమస్తసృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినదిగా తెలిసికొనుము.
🌷. భాష్యము :
భౌతిక, ఆధ్యాత్మికజగముల యందలి ఎట్టి వైభవోపేతము లేదా సుందరసృష్టియైనను శ్రీకృష్ణుని విభూతి యొక్క అంశమాత్ర వ్యక్తీకరణమే యని సర్వులు ఎరుగవలెను. కనుక విశేషవైభవముతో కూడినదేడైనను శ్రీకృష్ణుని విభూతికి ప్రాతినిధ్యముగా భావింపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 42 🌴
42. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాం శేన స్థితో జగత్ ||
🌷. తాత్పర్యం :
కాని ఓ అర్జునా! ఈ సవిస్తరమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? కేవలము ఒక అంశమాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించు చుందును.
🌷. భాష్యము :
పరమాత్మ రూపమున సమస్తము నందును ప్రవేశించుట ద్వారా శ్రీకృష్ణభగవానుడు సర్వవిశ్వములందును నలిచియుండును. సమస్త విషయములు ఏ విధముగా విభూతిసంపన్నములు మరియు వైభవోపేతములుగా నిలిచియున్నవో అవగతము చేసికొనుటలో అర్థము లేదని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలియజేయుచున్నాడు.
శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున చేరియుండుట చేతనే ప్రతిదియు స్థితిని కలిగియున్నదని అతడు అవగతము చేసికొనవలసియున్నది. అనగా మహత్తర జీవియైన బ్రహ్మదేవుని మొదలుగా అతిసూక్ష్మమైన చీమ వరకు గల సమస్తజీవుల యందును శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపమున వాటి యందు నిలిచి పోషించుట చేతనే అవి స్థితిని కలిగియున్నవి.
ఏ దేవతార్చనమైనను చివరకు దేవదేవుడైన శ్రీకృష్ణుని చెంతకే లేదా పరమగమ్యమునకే మనుజుని చేర్చునని పలుకు సిద్ధాంతమొకటి కలదు. కాని బ్రహ్మరుద్రాదులు వంటి గొప్ప దేవతలే శ్రీకృష్ణభగవానుని విభుతిలో అంశమాత్రమునకు ప్రాతినిధ్యము వహించుచున్నందున దేవతార్చనము ఇచ్చట పూర్తిగా నిరసింపబడుచున్నది. జన్మగల ప్రతియొక్కరికి అతడే మూలము మరియు అతని కన్నను ఘనుడెవ్వడును లేడు.
అతని కన్నను ఘనుడు గాని, సమానుడు గాని లేనందునే అతడు “ఆసమౌర్థ్వ” యని పిలువబడినాడు.
శ్రీమద్భగవద్గీత యందలి “భగవద్విభూతి” అను దశమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment