ఉపనిషద్విచారణ
145.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
145. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు
ॐॐॐॐॐॐॐॐॐॐ
దేవలోకం చేరే లోపులోనే ఇంద్రుడికి ఈ విధమైన సందేహం కలగగానే ఇలా తలచేడు. ఈ దేహాన్ని అలంకరింప జేసినప్పుడు అది శృంగారంగా అలంకరింప బడినట్లుంటుంది. మంచి వస్త్రాలు ధరించినట్లుంటుంది. శుభ్రంగా క్షురకర్మ చేయించు కున్నట్లు కనబడుతుంది. కన్నులు గుడ్డివైతే ఈ శరీరం గుడ్డిదిగా కనబడుతుంది.
ఈ శరీరం, కన్ను, ముక్కు మొదలైన వాటితో అందవిహీనంగా ఉంటే వికారంగా కన బడుతుంది. శరీరం కుంటిదైన కుంటిదిగా అంగవిహీనం గా కనబడుతుంది. ఈ శరీరం నాశనమైతే వెంటనే మరణం సంభవిస్తుంది.
అందువల్ల ఇది ఆత్మ అవడానికి వీలు లేదు. అందువల్ల నేను యథార్థాన్ని గ్రహించడంలేదు. ఇది ఆత్మ అయ్యేటందుకు సావకాశం లేదు. అని ఇంద్రుడు తర్జన భర్జన పడి తిరిగి సమిత్పాణియై ప్రజాపతి బ్రహ్మ దగ్గరికి వెళ్ళేడు.
భగవన్! ఈ శరీరం నశించినప్పుడు అన్నీ నశిస్తున్నాయి. అందువల్ల నేను శుభమును చూడలేకపోతున్నాను. అంటే ప్రజాపతి “దేవేంద్రా! అది నిజమే. ఈ విషయాన్ని నీకు మళ్ళీ బోధిస్తాను. మళ్ళీ 32 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేయి.” అన్నాడు.
ముప్పయిరెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం లో ఉండి తపించడం (తపస్సు) ద్వారా అతని మనస్సు, బుద్ధి మరింత పరిశుద్ధతని పొంది ఉన్నత స్థాయిలో ఉపదేశానికి అర్హత సంపాదిస్తాడని ప్రజాపతి తలచేడు.
దేవేంద్రుడా రీతిగా 32 సంవత్సరముల తపస్సు తర్వాత ప్రజాపతి “స్వప్నములో ఆధిక్యతను పొంది విహరించేదే ఆత్మ. అదే అమృతము. అభయము, బ్రహ్మము” అని చెప్పేడు.
ఇక్కడ స్వప్నములో ఉండే ఆత్మ అంటే తైజసుడైన జీవుడు అని అర్ధము. దీనిని విన్న ఇంద్రుడు సమాధానపడి వెళ్ళిపోయాడు. కాని దేవలోకం చేరే లోపల తిరిగి సంశయాత్ముడయ్యాడు.
ఈ శరీరం గుడ్డిదయితే స్వప్నం లోని ఆత్మ గుడ్డిది కావడం లేదు. ఈ శరీరంలోని కళ్ళ ద్వారా ఏదయినా కారుతున్నప్పటికీ కలలో కళ్ళు మంచిగా ఉంటాయి. ఈ శరీరం వధించ బడినా ఆత్మ వధించబడదు. శరీరం రోతగా ఉన్నా స్వప్నంలో ఆత్మ రోతగా ఉండదు.
ఇలా ఉన్నా స్వప్నంలో ఆ స్వప్నాత్మను చంపినట్టుగా, పరుగెత్త జేసినట్టు, దుఃఖము కలిగినట్టు, ఏడ్చినట్టు కనుపిస్తుంది. కాబట్టి దీనిలో నేను ఏ పవిత్ర సత్యాన్ని గ్రహించడం లేదు.
అందువల్ల ఈ స్వప్నాత్మ ఆత్మ అయ్యేటందుకు ఆస్కారం లేదు అనుకొని, ఆ సందేహ నివృత్తికై ప్రజాపతి దగ్గరకు చేతులు జోడించుకొని చేరేడు.
ఇక్కడ ప్రజాపతి తాను కేవలం నిమిత్తమాత్రుడు గానే ఉంటూ అంచలంచలుగా శిష్యుడిని ఆత్మ దర్శన దిశగా నడిపిస్తున్నాడు.
“భగవన్! ఈ దేహము గుడ్డిదైనపుడు స్వప్నాత్మ గ్రుడ్డిదవడం లేదు. దేహం యొక్క మాలిన్యం తో స్వప్నాత్మ మలినం చెందడం లేదు. అయినా స్వప్నంలో అది వధించబడినట్లు, దుఃఖము చెందినట్లు, పరుగెత్తినట్టు కనుపిస్తోంది. నాకు సందేహ నివృత్తి కాలేదు” అన్నాడు దేవేంద్రుడు.
“నీ సందేహం సరిఅయినదే. తిరిగి 32 సంవత్సరాలు ఇక్కడ బ్రహ్మచర్య వ్రతం తో తపస్సు చేసి రా నీకు తత్వాన్ని విపులంగ బోధిస్తాను” అన్నాడు బ్రహ్మ.
దేవేంద్రుడు తపస్సు చేసిన తర్వాత ప్రజాపతి అతనితో “ఏది సంపూర్ణంగా, ప్రసన్నంగా నిద్రిస్తుందో, ఏది ఎలాంటి కలలను కనటం లేదో అదే ఆత్మ అంటే. అదే అమృతం. అదే అభయం. దానినే పరబ్రహ్మ అంటారు” అని చెప్పేడు. అది విని సరేనని బయలు దేరిన ఇంద్రునికి తిరిగి సందేహం పీడించ సాగింది.
ఇప్పుడు నేను విన్నది సుషుప్తి అనే దాని గురించి. కాని నిద్రపోతున్నప్పుడు నేనెలాంటివాడనో నాకు స్పష్టంగా తెలియటల్లేదు. ఈ స్థితిలో నేనెలాంటి పంచభూతాలను తెలుసుకోలేకపోతున్నాను. ఈ స్థితిలో అంతా నాశనం చెందినదానిలా అనిపిస్తోంది. ఇందులో సత్యం కనపడటం లేదు. అని తలుస్తూ తిరిగి ప్రజాపతి దగ్గరకు చేరేడు.
మామూలు నిద్రలో ఇంద్రియ వ్యాపారం లేకపోయినా మనస్సు పని చేస్తుంది. కనుక కలలు వస్తాయి. కాని సుషుప్తిలో మనస్సు, ఇంద్రియాలు అన్నీ నిర్వ్యాపారంగా ఉంటాయి. మనస్సు పని చేయదు కాబట్టి కలలు ఉండవు.
“భగవన్! నేనిట్టివాడిని అనే విషయం నాకు సుషుప్తి అవస్థలో తెలియడం లేదు. అలాగే పంచభూతాలలో వేటిని తెలుసుకో లేక పోతున్నాను. ఈ సమస్తమూ వినాశము చెందిన వాటివలె కన్పిస్తున్నాయి.” అని అన్న ఇంద్రుని మాటలకు ప్రజాపతి “నీవన్నది నిజమే. నువ్వు మరొక ఐదు సంవత్సరాలు తపస్సు చేసిరా అప్పుడు చెబుతాను.” అన్నాడు.
ఈ రీతిగా ఇంద్రుడు 101 సంవత్సరములు దేవేంద్రుడు ప్రజాపతి దగ్గర తపస్సు చేసి బ్రహ్మవిద్యను పొంది ఆత్మజ్ఞనాన్ని తెలుసుకో గలిగాడు.
వచ్చే భాగంలో చాందోగ్యోపనిషత్తు లోని చివరి ఖండాలు ఆత్మకు ఆధార భూతమైన ఈ శరీరం గురించి, పరబ్రహ్మ గురించి మరింత విపులంగా వివరిస్తున్నాయి.
***
146A. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు
ॐॐॐॐॐॐॐॐॐॐ
దేవేంద్రుడు సకల భోగములను విడిచి పెట్టి 101 సంవత్సరాలు ప్రజాపతి దగ్గర ఆత్మజ్ఞానం కొరకై కఠోర తపస్సాచరించాడు.
బ్రహ్మ అప్పుడు ఇంద్రా! ఈ దేహం మరణించే స్వభావం కలిగి ఉంది. ఎల్లవేళలా మృత్యుముఖంలో ఉంటుంది. అలాంటి ఈ దేహం అమృతము అశరీరి అయిన ఆ ఆత్మకు ఉపాధిగా ఉంది.
ఈ ఆత్మ దేహంలో ఉన్నంతకాలం అహం భావంతో ఇష్టా అయిష్టాలతో కూడి ఉంటుంది. దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం రాగద్వేషాలు నశించవు.
అశరీరి అయిన ఆత్మకు రాగద్వేషాలు ఉండవు. వాయువుకు శరీరం లేదు. అలాగే ఆకాశం, విద్యుత్తు, పిడుగు, వీటన్నింటికీఉపాధి అనేదే లేదు. ఇవన్నీ ఆకాశానికి అవతలకు వెళ్ళి పరంజ్యోతిలో లీనమై అక్కడ ఏ విధంగా అయితే ప్రకాశిస్తాయో, అదే విధంగా ప్రత్యగాత్మ ఈ శరీరం నుండి వాక్కు బయల్వెడలి పరమజ్యోతిలో లీనమై సస్వరూపంగా ప్రకాశిస్తుంది. ఈతడే ఉత్తమమైన పురుషుడు.
అక్కడ ఆ పురుషుడు పూర్వం తాను పుట్టిన శరీరాన్ని ఏమాత్రం గుర్తు పెట్టుకోకుండా స్త్రీలతో, అక్కడున్న వాహనాలతో, తనకు సంబంధించిన వారితో నవ్వుతూ ఆడుతూ పాడుతూ విహరిస్తూంటాడు.
అతని రూప చూసి అర్ధం చేసుకొనేటందుకే ఈ కన్నులున్నాయి. ఆఘ్రాణించి చూడాలనే జ్ఞానం కలిగినదే ఆత్మ. ఆత్మ మాట్లాడటానికే వాక్కు ఉంది. వినడానికే శ్రోత్రేంద్రియం ఉంది.
ఈ సంప్రసాద స్వరూపుడైన జీవాత్మ దేహం నుంచి మేఘములాగే పైకి పోయి పరంజ్యోతిలో కల్సిపోతుంది. దేహభావనను వదిలేస్తుంది.
నేను మననం చేయాలి అనే జ్ఞానం ఉన్నదే ఆత్మ. మనస్సే దానికి ఆలంబనగా, దైవికమైన నేత్రంగా ఉంది. ఆ మనస్సుతోనే ఆత్మ కామ్య పదార్ధాలను తెలుసుకొని ఆనందిస్తుంది. బ్రహ్మ లోకంలో నివసించే దేవతలంతా ఈ ఆత్మనే ఉపాసిస్తున్నారు. అందుకే ఆ దేవతలంతా అన్ని లోకాలకు పోగలుగు తున్నారు. అన్ని కోరికలు తీరిన వారవుతున్నారు. ఆ విధంగా ఆత్మ తత్వాన్ని తెలుసుకొని సకల వాంఛలను తీర్చుకుంటున్నారని ప్రజాపతి ఇంద్రుడికి బోధించాడు.
శ్యామా చ్ఛబళం ప్రపద్యే శబళా చ్ఛ్యామం ప్రపద్యే అశ్వ ఇవ రోమాణి విధూయ పాపం చంద్రఇవ రాహో ర్ముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీర మకృతం కృతాత్మా బ్రహ్మలోక మభిసంభవామీ త్యభి సంభవామీతి।।
(ఈ మంత్రం శుద్ధి కోసం జపం చేయడానికి వినియోగిస్తారు).
శ్యామ వర్ణం నుంచి శబల బ్రహ్మను పొందు తున్నాను. నీల వర్ణము లాగ గంభీరమై దురవగాహమై యున్న హృదయస్థమగు బ్రహ్మము నుండి అరణ్యము లాగ శబలమైన బ్రహ్మలోకాన్ని పొందుతున్నాను. ఆ శబల బ్రహ్మ నుంచి నీల వర్ణాన్ని పొందుతున్నాను. అంటే హృదయ రూపుడనౌతున్నాను. అశ్వము తన వెంట్రుకలను విదలించిన విధంగా పాపాలన్నిటినీ విదిల్చి, రాహు గ్రహం నుంచి విముక్తి పొందిన చంద్రుడి లాగ శరీరాన్ని విడుస్తాను. కృతాత్ముడనై బ్రహ్మ లోకానికి వెడతాను.
దహరాకాశం అనేది నామ రూపాలను వ్యక్తం చేస్తుంది. ఈ నామ రూపాలు ఏ ఆత్మలో ఉంటాయో దానినే బ్రహ్మం అంటారు. అదే అమృతం. అదే పరబ్రహ్మం. అదే ఆత్మ. ఈ ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మ ప్రజాపతికి, ఆ ప్రజాపతి మనువుకు, మనువు మానవులకు బోధించేడు.
తద్ధైత ద్బ్రహ్మా ప్రజాపతయ ఉవాచ:-
ప్రజాపతిర్మననే మనుః ప్రజాభ్యః ఆచార్య కులాద్వేద మధీత్య యథావిధానం గురోః కర్మాతి శేషేనాభిసమావృత్య కుటుమ్చే శుచౌ దేశే స్వాధ్యాయ మధీయానో ధార్మికా న్విదధ దాత్మని సర్వేన్ద్రియాణి సంప్రతిష్టా ప్యాహింసం త్సర్వభూతా నన్యత్ర తేర్ధేభ్యః స్స ఖల్వేనం వర్తయ న్యావదాయుషం బ్రహ్మలోక మభిసమ్పద్యతే నచ పునరావర్తతే నచ పునరా వర్తతే।।
శ్రద్ధగా వినండి. గురుశుశ్రూషని శ్రద్ధగా చేసి, యధావిధిగా వేదాభ్యాసం చేసి, పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించి, సద్గురువు ఆజ్ఞతో గృహస్తాశ్రమాన్ని అనుభవించి, మంచి అధ్యయన శీలురైన సత్సంతానాన్ని, శిష్యులను పొంది శాస్త్ర విహితములైన కర్మలనాచరించి, దేశకాల ప్రవృత్తి ననుసరిస్తూ, అహింసావ్రతులై యావజ్జీవితము తన జీవనయాత్రను కొనసాగించే మానవుడు సాక్షాత్తూ ఆ బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అతనికి జన్మరాహిత్యం కలుగుతుంది.
ఈ విధంగా ఇంద్రుడు సమగ్ర ఆత్మజ్ఞానాన్ని ప్రజాపతి ద్వారా ఉపదేశం పొంది. దేవతలందరకూ ఆ జ్ఞానాన్ని పంచాడు.
మానవులు కూడా దేహాత్మ బుద్ధిని వదలి సస్వరూపజ్ఞానాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందినపుడు సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలకు అతీతులై శాశ్వతానందాన్ని పొందుతారు.
అంటూ చాందోగ్యోపనిషత్తు ముగుస్తుంది.
***
146A. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు
దేవేంద్రుడు సకల భోగములను విడిచి పెట్టి 101 సంవత్సరాలు ప్రజాపతి దగ్గర ఆత్మజ్ఞానం కొరకై కఠోర తపస్సాచరించాడు.
బ్రహ్మ అప్పుడు ఇంద్రా! ఈ దేహం మరణించే స్వభావం కలిగి ఉంది. ఎల్లవేళలా మృత్యు ముఖంలో ఉంటుంది. అలాంటి ఈ దేహం అమృతము అశరీరి అయిన ఆ ఆత్మకు ఉపాధిగా ఉంది.
ఈ ఆత్మ దేహంలో ఉన్నంతకాలం అహం భావంతో ఇష్టా అయిష్టాలతో కూడి ఉంటుంది. దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం రాగద్వేషాలు నశించవు.
అశరీరి అయిన ఆత్మకు రాగద్వేషాలు ఉండవు. వాయువుకు శరీరం లేదు. అలాగే ఆకాశం, విద్యుత్తు, పిడుగు, వీటన్నింటికీఉపాధి అనేదే లేదు. ఇవన్నీ ఆకాశానికి అవతలకు వెళ్ళి పరంజ్యోతిలో లీనమై అక్కడ ఏ విధంగా అయితే ప్రకాశిస్తాయో, అదే విధంగా ప్రత్యగాత్మ ఈ శరీరం నుండి వాక్కు బయల్వెడలి పరమజ్యోతిలో లీనమై సస్వరూపంగా ప్రకాశిస్తుంది. ఈతడే ఉత్తమమైన పురుషుడు. అక్కడ ఆ పురుషుడు పూర్వం తాను పుట్టిన శరీరాన్ని ఏమాత్రం గుర్తు పెట్టుకోకుండా స్త్రీలతో, అక్కడున్న వాహనాలతో, తనకు సంబంధించిన వారితో నవ్వుతూ ఆడుతూ పాడుతూ విహరిస్తూంటాడు.
అతని రూప చూసి అర్ధం చేసుకొనేటందుకే ఈ కన్నులున్నాయి. ఆఘ్రాణించి చూడాలనే జ్ఞానం కలిగినదే ఆత్మ. ఆత్మ మాట్లాడటానికే వాక్కు ఉంది. వినడానికే శ్రోత్రేంద్రియం ఉంది.
ఈ సంప్రసాద స్వరూపుడైన జీవాత్మ దేహం నుంచి మేఘములాగే పైకి పోయి పరంజ్యోతిలో కల్సిపోతుంది. దేహభావనను వదిలేస్తుంది.
నేను మననం చేయాలి అనే జ్ఞానం ఉన్నదే ఆత్మ. మనస్సే దానికి ఆలంబనగా, దైవికమైన నేత్రంగా ఉంది. ఆ మనస్సుతోనే ఆత్మ కామ్య పదార్ధాలను తెలుసుకొని ఆనందిస్తుంది. బ్రహ్మ లోకంలో నివసించే దేవతలంతా ఈ ఆత్మనే ఉపాసిస్తున్నారు. అందుకే ఆ దేవతలంతా అన్ని లోకాలకు పోగలుగు తున్నారు. అన్ని కోరికలు తీరిన వారవుతున్నారు. ఆ విధంగా ఆత్మ తత్వాన్ని తెలుసుకొని సకల వాంఛలను తీర్చుకుంటున్నారని ప్రజాపతి ఇంద్రుడికి బోధించాడు.
శ్యామా చ్ఛబళం ప్రపద్యే శబళా చ్ఛ్యామం ప్రపద్యే అశ్వ ఇవ రోమాణి విధూయ పాపం చంద్రఇవ రాహో ర్ముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీర మకృతం కృతాత్మా బ్రహ్మలోక మభిసంభవామీ త్యభి సంభవామీతి।।
(ఈ మంత్రం శుద్ధి కోసం జపం చేయడానికి వినియోగిస్తారు).
శ్యామ వర్ణం నుంచి శబల బ్రహ్మను పొందు తున్నాను. నీల వర్ణము లాగ గంభీరమై దురవగాహమై యున్న హృదయస్థమగు బ్రహ్మము నుండి అరణ్యము లాగ శబలమైన బ్రహ్మలోకాన్ని పొందుతున్నాను. ఆ శబల బ్రహ్మ నుంచి నీల వర్ణాన్ని పొందుతున్నాను. అంటే హృదయ రూపుడనౌతున్నాను. అశ్వము తన వెంట్రుకలను విదలించిన విధంగా పాపాలన్నిటినీ విదిల్చి, రాహు గ్రహం నుంచి విముక్తి పొందిన చంద్రుడి లాగ శరీరాన్ని విడుస్తాను. కృతాత్ముడనై బ్రహ్మ లోకానికి వెడతాను.
దహరాకాశం అనేది నామ రూపాలను వ్యక్తం చేస్తుంది. ఈ నామ రూపాలు ఏ ఆత్మలో ఉంటాయో దానినే బ్రహ్మం అంటారు. అదే అమృతం. అదే పరబ్రహ్మం. అదే ఆత్మ. ఈ ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మ ప్రజాపతికి, ఆ ప్రజాపతి మనువుకు, మనువు మానవులకు బోధించేడు.
తద్ధైత ద్బ్రహ్మా ప్రజాపతయ ఉవాచ:-
ప్రజాపతిర్మననే మనుః ప్రజాభ్యః ఆచార్య కులాద్వేద మధీత్య యథావిధానం గురోః కర్మాతి శేషేనాభిసమావృత్య కుటుమ్చే శుచౌ దేశే స్వాధ్యాయ మధీయానో ధార్మికా న్విదధ దాత్మని సర్వేన్ద్రియాణి సంప్రతిష్టా ప్యాహింసం త్సర్వభూతా నన్యత్ర తేర్ధేభ్యః స్స ఖల్వేనం వర్తయ న్యావదాయుషం బ్రహ్మలోక మభిసమ్పద్యతే నచ పునరావర్తతే నచ పునరా వర్తతే।।
శ్రద్ధగా వినండి. గురుశుశ్రూషని శ్రద్ధగా చేసి, యధావిధిగా వేదాభ్యాసం చేసి, పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించి, సద్గురువు ఆజ్ఞతో గృహస్తాశ్రమాన్ని అనుభవించి, మంచి అధ్యయన శీలురైన సత్సంతానాన్ని, శిష్యులను పొంది శాస్త్ర విహితములైన కర్మలనాచరించి, దేశకాల ప్రవృత్తి ననుసరిస్తూ, అహింసావ్రతులై యావజ్జీవితము తన జీవనయాత్రను కొనసాగించే మానవుడు సాక్షాత్తూ ఆ బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అతనికి జన్మరాహిత్యం కలుగుతుంది.
ఈ విధంగా ఇంద్రుడు సమగ్ర ఆత్మజ్ఞానాన్ని ప్రజాపతి ద్వారా ఉపదేశం పొంది. దేవతలందరకూ ఆ జ్ఞానాన్ని పంచాడు.
మానవులు కూడా దేహాత్మ బుద్ధిని వదలి సస్వరూపజ్ఞానాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందినపుడు సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలకు అతీతులై శాశ్వతానందాన్ని పొందుతారు.
అంటూ చాందోగ్యోపనిషత్తు ముగుస్తుంది.
***
146B.ఉపనిషద్విచారణ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
146B. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు
ॐॐॐॐॐॐॐॐॐॐ
146a. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు – విహంగవీక్షణ:
ఈ ఉపనిషత్తు ఓం ఆప్యాయన్తు మమాంగాని… అనే శాంతిమంత్రం తో మొదలవుతుంది.
బృహదారణ్యకోపనిషత్తు ఉపనిషత్తులన్నిటి లోకి పెద్దది కాగా, దాని తర్వాత అతిపెద్ద ఉపనిషత్తు చాందోగ్యోపనిషత్తే.
ఇది సామవేదం చివర ఎనిమిది అధ్యాయాలతో ఉంది. దీనిలో మొదటి ఐదు అధ్యాయాలలో రకరకాల ఉపాసనల గురించి, ఓంకారానుష్ఠాన్ని గురించి, మధు విద్య, శాండిల్య విద్య, భూమా విద్య మొదలైన వాటిని వివరించబడ్డాయి. ఆరవ అధ్యాయం నుంచి ఎనిమిదవ అధ్యాయం వరకూ జ్ఞానోపదేశం చేయబడింది.
ప్రధమ ప్రపాఠకం లో సూటిగా....
ఓమిత్యేతదక్షర ముద్గీథ ముపాసీతోమితి హ్యుద్గాయతి తస్యోప వ్యాఖ్యానమ్।।
అంటూ
నాశ రహితమైన శక్తి నుండి పుట్టిన శబ్దం “ఓం” అనే అక్షరమే ఉద్గీధం (పాడబడేది). దీన్ని ఆశ్రయించండి. ఆశబ్దం లో మనస్సును లీనం చేయండి. ఈ ఓంకారమే సర్వము, అక్షరము, అమృతము మరియు అభయము.
షాం భూతానాం పృథివీరసః పృథివ్యా…
అంటూ భూతాల సారమే పృథివి, పృథివీ సారమే జలం, జలసారమే సస్యాలు. వాటిని సేవించి మానవుడు సస్యసారమౌతున్నాడు. అతని సారం (జ్ఞానం) అతని వాక్కు. వాక్కు ద్వారా ప్రకటింప బడటం వల్ల ఆ వాక్కుకు జ్ఞానాన్ని అందించేది ఋక్కు (ప్రాణుని ఊర్ధ్వ గమనం).
వాక్కే ఋక్కు, ప్రాణమే సామము, ఓంకారమే ఉద్గీధము. వాక్కు, ప్రాణముల యొక్క మిథునమే ఓంకారము.
ఇక్కడ ఒక చిన్న కధలో ఉద్గీథోపాసన ముఖ్య ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని చేయాలి అని
చెప్పబడింది. ప్రజాపతి పుత్రులైన దేవతలు అసురులు పరస్పర వైరాన్ని పెంచుకొని యుద్ధానికి దిగేరుట. రాక్షసులను జయించాలనే సంకల్పంతో దేవతలు ఉద్గీథోపాసన అనే ఓంకారోపాసన చేసేరు.
దేవతలు ఘ్రాణేంద్రియములో ఉండే ప్రాణాన్ని అవలంభించి ఉన్న ఉద్గీథాన్ని ఉపాసిస్తే వాళ్ళను రాక్షసులు నాశనం చేసేసేరు. దేవతలు క్రమంగా వాక్కు, చక్షుస్సు, శ్రోత్రము మరియు మనస్సులను ఉపయోగించి చేసిన ఉద్గీథము ద్వారా రాక్షసుల నుంచి పరాభవాన్ని పొందేరు.
చివరగా గురుస్థానమునకు దగ్గరగా ఉన్న ముఖ్య ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని చేసిన ఉద్గీథోపాసన వల్ల రాక్షసులు మట్టిముద్దను రాతితో కొట్టిన రీతిగా నశించిపోయారు. అంటే ముఖ్యప్రాణం యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న వాడు నిర్వికారము అద్వితీయము అయిన ఆత్మాను భవం కలవాడవుతాడు.
ఈ కధలో ప్రణవోపాసన ఇంద్రియాల ద్వారా జరగలేదు. మన దేహంలోని ముఖ్యశక్తి అయిన ప్రాణుని నుండే ప్రణవోపాసన జరపబడుతోంది అని అర్ధం అవుతోంది.
అంగీరసుడనే ఋషి ప్రాణరూప ఉద్గీథోపాసన చేసేడు. ప్రాణము దేహం యొక్క సార సర్వస్వమై ఉన్నందువల్ల దానిని అంగీరసం అంటారు. పరబ్రహ్మాధారంగా ఉండే దేహస్థ ప్రాణమే ఓంకారమని తాత్పర్యం.
ప్రాచీన కాలం లో ఉద్గీధ గానాన్ని నైపుణ్యంగా చేయగల మహర్షులు శాలవత్యుని పుత్రుడు శిలాకముని, దాల్భ్య వంశీయుడైన చైకితాయనుడు, జీబల పుత్రుడైన ప్రవాహణుడు అని ముగ్గురు ఉద్గీథగానం అన్నిటికంటే శ్రేష్ఠము, ఉత్తమము మరియు నిధి అనంతమై ఉంది అని చెప్పేరు. శునకపుత్రుడైన అతిధన్వ ముని ఉదరశాండిల్యుడనే మునికి ఉద్గీథగానాన్ని బోధించేడు.
మరొక కధ ఉషస్థిముని ద్వారా ఉద్గీథగానాన్ని ప్రస్తావ గానం, ఉద్గీథగానం, ప్రతిహారగానం ద్వారా వివరించేరు. తరువాత ఉద్గీథగానాన్ని శునకములు చేయగలవు అంటూ చెప్పిన కధలో: దాల్భ్యకముని, మైత్రేయగ్లావ ఋషి కలసి అక్కడ సమీపంలో ఉండే గ్రామానికి వేదాలనభ్యశించ డానికి వెళితే వాళ్ళకు అక్కడ కుక్కల రూపంలో వేదగాన దేవతలు ప్రత్యక్షమవుతారు.
ఒక తెల్లటి కుక్క “మేము గానంచేసి అలసిపోయి ఉన్నాము. మాకు అన్నము తీసుకుని రండి” అని చెప్పింది.
మరుసటిరోజు, ఋత్విక్కులు గానం చేసిన విధంగానే బహిష్పవమాన స్తోత్రాలను ఋత్విక్కులు చేతులు కదిపిన రీతిగా వాటి అవయవాలను త్రిప్పుతూ మధురంగా గానం చేశాయి.
ప్రధమ ప్రపాఠకంలో చివరగా త్రయోదశ ఖండం లో పదమూడు స్తోభాక్షరాలు వాటి అధిష్టాన దేవతల గురించి వివరణ ఇవ్వబడింది.
🕉🌞🌏🌙🌟🚩
ఓం నమః శివాయ:
146C. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు
చతుర్ధ ప్రపాఠకం లో
జానాశ్రుతి- రైక్వుల కధ తో మొదలయి సంవర్గ విద్యను వివరించారు.
జనశృత వంశానికి చెందిన మునికి మనుమడైన జానాశృతి అనే ముని ఎంతో శ్రద్ధగా అన్నదానం చేస్తూండేవాడు. ఒకరోజు రాత్రి రెండు హంసలు అతని ఇంటి మీదుగా ఎగురుతూ పోతున్నాయి. ఆ హంసలలో ఒక హంస రెండోదానితో “ఓ బల్లాక్షుడా! నీకు అసలే చూపు సరిగ్గా లేదు. ఈ ప్రదేశమంతా జానశృతి యొక్క తేజస్సు వ్యాపించి ఉంది. దానిని తాకవద్దు. అది నిన్ను కాల్చేస్తుంది.“ అంటే రెండవ హంస, “ఓ అజ్ఞానీ! ఇతడేమైనా బండి రైక్వుడంతటివాడా! అంతగా కీర్తిస్తున్నావు.“ అంది.
చజూదంలో ఎన్నో రకాలుంటాయి. వాటిలో కృత అనే ఆట ఒకటి ఉంది. ఆ ఆటలో గెలిచినవాడు మిగిలిన వారు గెలిచిన అన్ని రకాల ఆటలలో తాను నెగ్గినట్లవుతుంది. అదే విధంగా లోకంలోని జనులంతా చేసే అన్నిరకాల పుణ్యాలు ఆరైక్వుడినే జేరుతాయి. ఎందుకంటే ఆ రైక్వుడు ఆత్మజ్ఞాని.
ఆ రైక్వుని గురించి వెదికించగా అతను ఒక బండి క్రింద కూర్చుని మూగ గజ్జిని రుద్దు కుంటున్నాడు. అతనికి జానాశృతి తన కూతురుని, వేయిగోవుల్ని, అనేక భూషణాలను సమర్పించుకొని అతనిని ప్రసన్నం చేసుకో గలిగేడు.
సంవర్గం అంటే చివరి ఆశ్రయం అని అర్ధం. అగ్ని చల్లబడితే వాయువునే ఆశ్రయిస్తుంది. సూర్యుడు కూడా అస్తమించిన తర్వాత వాయువులోనే చేరుతాడు. చంద్రుడు అస్తమించిన తర్వాత వాయువులోనే లీనమవుతాడు. జలం ఇంకితే వాయువునాశ్రయిస్తుంది. వాయువే ఈ సమస్తాన్ని మింగుతుంది. ఇది అధిదైవతము. అంటే ఈ విషయాలు విశ్వనులోని శక్తులగురించి అని.
ఇంక ఆధ్యాత్మము అంటే శరీరంలో ఉండే శక్తుల గురించిన విషయము. దీనిలో ప్రాణమే సంవర్గము. మనుష్యుడు నిద్రపోతే అతని వాక్కు, నేత్రము, శ్రోత్రము, మనస్సు మొదలైన సర్వేంద్రియాలు ప్రాణం లో చేరిపోతున్నాయి. ఈ ప్రాణమే సర్వాన్నీ భుజిస్తోంది.
దేవతలలో వాయువు, మానవులలో ప్రాణము సంవర్గాలు అవుతాయి. కపి గోత్రీయుడైన శౌనకుడు, కక్ష సేనాత్మజుడగు అభిప్రతారి కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఒక బ్రహ్మచారి వచ్చి బిక్ష ను అర్ధించాడు. వారాతనికి బిక్ష పెట్టలేదు. ఆ బ్రహ్మచారి శౌనకునితో “అగ్ని ఆదిగాగల నలుగురు దేవతలను తనలో లీనంచేసుకొన్న ప్రజాపతిని మీరు గుర్తించలేకున్నారు.
సంవర్గవిద్యనే చెప్పేడు. ఓ అభిప్రతారీ! అనంత రూపంలో ఉన్న ప్రజాపతికి యజ్ఞాదులలో అన్నాన్ని తృప్తిగా పెట్టబడుతోంటే వానికే మీరు అన్నము లేదనుచున్నారు” అన్నాడు.
ఈ బ్రహ్మచారికి సంవర్గవిద్య తెలుసునని గ్రహించి ఓ బ్రహ్మచారీ! మేముకూడా అతనినే ఉపాసిస్తామని చెప్పి అతనికి బిక్ష పెట్టేరు. ఇక్కడ సంవర్గమైన వాయువునకు అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము అనేవి ఆహారాలయ్యాయి. వాక్కు, నేత్రము, చెవి, మనస్సు అనే ఆహారాలకు ప్రాణమే సంవర్గమవుతోంది. విరాట్ స్వరూపంలో పరమాత్మే ఆహారాన్ని గ్రహిస్తున్నాడు. ఇదే భావం భగవద్గీతలోని విశ్వరూప సందర్శనయోగం లో కనబడుతుంది.
తరువాత సత్యకామ జాబాల కధ ఇలా వుంది.
హారిద్రుమత గౌతముని దగ్గరకు విద్యాభ్యాసం గురించి వచ్చి, నీ గోత్రమేది అని గౌతముడడిగిన ప్రశ్నకు “నా గోత్రమేదో నాకు తెలియదు. ఈ విషయంలో నాతల్లి ఈ రీతిగా చెప్పింది. ‘బాబూ! నాయవ్వన సమయంలో పలుచోట్ల నేను పరిచర్యలు చేసివున్నాను. అప్పుడు నీవు జన్మించితివి. నా పేరు జాబాల, నీ పేరు సత్యకామ, కనుక నీ పేరు సత్య కామ జాబాల అని చెప్పు’”. అన్నాడు.
గౌతముడు ఆ బాలుని సత్యసంధతకు మెచ్చుకొని అతనికి ఉపనయనం చేసి తన శిష్య వర్గం లో చేర్చుకున్నాడు. అతనికి నాలుగు వందల బక్కగా వున్న గోవులనిచ్చి వాటిని చక్కగా మేపి వేయిగోవులయ్యిన తర్వాత తనదగ్గరకు రమ్మని ఆజ్ఞాపించాడు.
ఎన్నో సంవత్సరాలు ఆ గోవులను మేపితుండగా అవి వేయి సంఖ్యకు చేరుకున్నాయి. అప్పుడు ఆపశు సమూహంలోని వృషభమొకటి ఓ “సత్యకామా! మేము ఇప్పుడు ఒక వేయి అయివున్నాము. మమ్ము ఆచార్యుల దగ్గరకు తోలుకొని పో” అంది. నేను పరమాత్మలో ఒక పాదం చెబుతాను. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అనే ఈ నాలుగు దిక్కులు నాలుగు కళలు. ఈ నాలుగు కళలు చేరి పరమాత్మకు ఒక పాదం. ఈ పాదాన్ని “ప్రకాశవాన్” అని పిలుస్తారు. రెండవ పాదాన్ని అగ్నిదేవుడు నీకు బోధిస్తాడు. అంతా వృషభం.
మర్నాడు సాయంత్రం గోవులను ఒకచోట ఆపి ఎండుపుల్లల్ని చేర్చి అగ్నిని వెలిగించి తూర్పుగా తిరిగి కూర్చున్నాడు. అప్పుడు అగ్ని “పృథివి, అంతరిక్షము, ద్యులోకం, సముద్రం అనే నాలుగు కళలు చేరి రెండవపాదం అనబడతాయి. ఈ పాదాన్ని ‘అనంతవాన్’ అంటారు. తరువాతి పాదాన్ని నీకు హంస చెబుతుంది. అన్నాడగ్ని.
అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు అనే నాలుగు కళలు కలిస్తే మూడవపాదం. ఈ పాదాన్ని జ్యోతిష్మాన్ అని పిలుస్తారు. అని హంస తెలిపింది. నాల్గవ పాదం మద్గు అనే జలచర పక్షి చెప్పింది. ప్రాణం, చక్షుసు, శ్రోత్రం, మనస్సు అనే నాలుగు కళలు బ్రహ్మ యొక్క నాల్గవ పాదం మరియు దానిని ఆయతనవాన్ (ఆశ్రయం గలది) అని పిలుస్తారు.
ఈవిధంగా తెలుసుకుంటూ సత్యకాముడు గురుకులాన్ని చేరేడు. గౌతముడు సత్యకాముని చూచి, నిన్ను చూస్తే పరబ్రహ్మను తెలుసుకున్న వాడిలా కనబడుతున్నావు. నీకెవరు చెప్పేరు.అని అడిగేడు. గురుదేవా! మానవేతరులు నాకు చెప్పేరు. అయినా మీరే ఉపదేశించాలి. గురు ముఖత నేర్చిన విద్యయే శ్రేష్టం. అని సత్యకాముడు కోరగా గౌతముడు మరల షోడశ కళా విద్యలను బోధించేడు.
ఉపకోసలాయనుడనే ముని సత్యకామ జాబాల ఆశ్రమంలో బ్రహ్మ విద్య కై బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు. 12 సంవత్సరాలయిన తర్వాత సత్యకామ జాబాల తన శిష్యులందరకూ వీడ్కోలు సభ ఏర్పాటు చేసేడు కానీ ఉపకోసలుణ్ణి మాత్రం ఆ సభలో జేర్చ లేదు. ఆ తర్వాత గురువు సంచార నిమిత్తమై వెళ్ళి పోయాడు.
మానసిక వ్యథతో ఉపకోసలుడు ఉపవాస దీక్ష మొదలు పెట్టేడు. అక్కడున్న యజ్ఞాగ్నులు అతనితో “ప్రాణము బ్రహ్మము, కం అంటే బ్రహ్మము, ఖం అంటే కూడా బ్రహ్మమే.” అన్నాయి. ఉపకోసలుడు “ ప్రాణం బ్రహ్మమని నాకు తెలుసు. కం, ఖం అనేవి నాకు తెలియదు “అన్నాడు. ప్రాణం, ఆకాశం హృదయం లోనే ఉన్నాయి.(క అంటే సుఖం, ఆనందం; ఖ అంటే ఆకాశం, హృదయాకాశం. అన్నాయి.
గార్హపత్యాగ్ని “ భూమి, అగ్ని, ఆహారం, సూర్యుడు నా రూపాలే. సూర్యుడిలో ఉండే పురుషుణ్ణి నేనే.
(పృథివి, అగ్ని ఈ రెండూ అనుభవింప బడేవి. అగ్ని, ఆదిత్యుడు అనుభవించేవారు- భోక్తలు.)” అని బోధించింది.
అప్పుడు అన్వాహార్య పచాగ్ని ఇలా బోధ చేసింది. “జలము, దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడు నా రూపాలే. చంద్రుడిలో ఉన్న పురుషుణ్ణి నేనే. (చంద్రుడికి దక్షిణ దిక్కు తో సంబంధం ఉంది. నక్షత్రాలు చంద్రుడికి అన్నము అని ప్రసిద్ధము.)
ఆతర్వాత, ఆహవనీయాగ్ని ఇలా చెప్పింది. “ప్రాణం, ఆకాశం, స్వర్గం, విద్యుత్తు నారూపములే. విద్యుత్తులో వెలిగే పురుషుణ్ణి నేనే. (విద్యుత్తుకు ద్యులోకము, ఆహవనీయాగ్నికి ఆకాశము నివాస స్థలాలు.) ప్రియ ఉపకోసలా! ఈ ఆత్మ జ్ఞానాన్ని నీకు మేము బోధించేము.
సరయిన మార్గం మీ గురువు ఉపదేశిస్తాడు. అన్నాయి త్రేతాగ్నులు.
సంచారం నుంచి తిరిగి వచ్చిన గురువు, “ఉపకోసలా! త్రేతాగ్నులు నీకు సాధనావిజ్ఞానాన్ని బోధించేరు. నీ కోరిక బ్రహ్మ జ్ఞానం గురించి. అది నేను బోధిస్తాను. పద్మము పైన నీటి బిందువులు పద్మమును అంటలేనట్లు బ్రహ్మజ్ఞానిని పాపములు స్పృశించవు.
నేత్రాలలో నివసించే పురుషుడే ఆత్మ. ఈ ఆత్మ అమరము, భయరహితము, పరబ్రహ్మ. అందుకే స్వచ్ఛమైన నెయ్యి గాని, జలము గాని నేత్రాలపై జల్లితే అవి లోపలికి పోవు. బయటకే వస్తాయి.
బ్రహ్నజ్ఞానిని ఆశీర్వాద నిధిగా గుర్తించాలి. బ్రహ్మజ్ఞాని కాంతికి నిధానము. ఈతడు అన్ని వస్తువులలోను ప్రకాశిస్తాడు. ఉత్తమలోక ప్రాప్తికి అంత్యక్రియల కంటే బ్రహ్మజ్ఞానమే ఉత్తమమైనది.
***
146D.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
146d. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు – విహంగవీక్షణ (Continued):
పంచమ ప్రపాఠకంలో 24ఖండాలలో జ్యేష్ఠమైన దానిని, శ్రేష్ఠమైనదాన్ని గురించి ఎవరు తెలుసుకుంటాడో అతడే జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు. జ్యేష్ఠంగా, శ్రేష్ఠంగా ఉండేది ప్రాణం. వసిష్ఠ మహర్షిని తెలుసుకున్నవాడు వసిష్ఠుడే అవుతున్నాడు. వాక్కే వసిష్ఠుడు. వసిష్ఠతను పొందిన (ప్రతిష్ఠ) దానిని తెలిసినవాడు ఇహలోకం లోను, పరలోకం లోను కూడా ప్రతిష్ఠకలవాడవుతాడు.
మన శరీరం లో ఉండే ఇంద్రియాలు నేను శ్రేష్ఠుడనంటే నేను శ్రేష్ఠుడనని వాదులాడుకోవడం మొదలు పెట్టాయి.
అప్పుడు ఇంద్రియాలన్నీ తమ తమ తండ్రి యైన ప్రజాపతి దగ్గరకు వెళ్ళి భగవన్! మా యందెవరు శ్రేష్ఠులని అడిగేయి. మీలో ఎవరు శరీరాన్ని వదలి పోయినట్లయితే శరీరం అత్యంత అశుచియై పాపభూయిష్ఠము అవుతుందో అతడే శ్రేష్ఠడు అని చెప్పేడు.
వాగింద్రియం దేహం నుంచి బయటకు వెళ్ళి ఒక సంవత్సరం తర్వాత తిరిగి దేహం లో చేరింది. నేను లేనప్పుడు ఈ దేహం జీవించి ఉందా? అని అడిగింది. ప్రాణం ఉండి మూగవాడిలా వింటూ చూస్తూ మనస్సుతో ఆలోచిస్తూ ఈ శరీరం జీవించే ఉంది అనిచెప్పేక వాగీంద్రియం ఏమీ అనలేక ఊరకుండిపోయింది. అలాగే నేత్రేంద్రియం బయటకు పోయినప్పుడు గుడ్డి వాడిలా; శ్రోత్రేంద్రియం బయటకు పోయినప్పుడు చెవిటివాడిలా; మనేంద్రియం బయటకు పోయినప్పుడు పిచ్చివాడిలా శరీరం బ్రతికింది.
ఇప్పుడు ప్రాణం యొక్క వంతు వచ్చింది. ప్రాణం బయటకు పోవడానికి అయత్తమయింది. వెంటనే ఉత్తమాశ్వము తనను కట్టిన గుంజను కూడా ఊడబెరుకుతూ బయటకు వెళ్ళతున్నట్టు ముఖ్య ప్రాణం తన యావచ్ఛక్తులను శరీరం నుంచి పెకలించి వేయడం మొదలయ్యింది. అప్పుడు ఇంద్రియాలన్నీ ముఖ్యప్రాణం తో “హే భగవన్! నీవే మాలో శ్రేష్ఠుడవు. నీవు వెళ్ళిపోవద్దు.
నిజంగా నేను వశిష్ఠుడనై ఉన్నది నీవు ఈ శరీరం లో ప్రతిష్ఠితుడవై ఉన్నందువల్లే అని వాక్కు; నేను భాగ్యవంతుడనై ఉన్నది నీవు ఇందుండడం వల్లే అని శ్రోత్రము, నేను ఈ శరీరానికి ఆశ్రయ స్థానమై ఉన్నది నీవు ఇందుండడం వల్లే అని మనస్సు విన్నవించు కున్నాయి. అందుకే వాక్కు, నేత్రము, శ్రోత్రేంద్రియము,మనస్సు మొదలైన ఈ ఇంద్రియాలను ప్రాణేంద్రియాలు అంటారు.
ఇక్కడ శ్వేతకేతు కు పంచాగ్ని విద్యోపదేశం చెప్పబడింది. అరుణముని పౌత్రుడైన శ్వేతకేతు ప్రవాహణుడనే పాంచాలరాజు భవనానికి వెళ్ళేడు. రాజు శ్వేతకేతును “వత్సా! మీతండ్రి అన్ని విద్యలను బోధించేరు కదా! అని అడిగితే ఔను, అన్నీ బోధించేరు అన్నాడు.
అప్పుడు ప్రవాహణుడు ఐదు ప్రశ్నలను అడిగేడు. సృష్టింప బడిన జీవులందరూ ఇక్కడనుంచి ఎక్కడకు వెళుతున్నారో తెలుసా? దేవయాన మార్గం గురించి, పితృయాన మార్గం గురించి అన్ని వివరాలు నీకు తెలుసా? ఇతర లోకాలు ఎందుకు ఇక్కడనుంచి వెళ్ళిన జనులచే సంపూర్ణం కావో తెలుసా? పంచమ హవిస్సు, జలము పురుషుడనే సంజ్ఞ నెట్లు పొందునో తెలుసా? ఈ ప్రశ్నలకు శ్వేతకేతు తనకు జవాబులు తెలియవని చెప్పేడు. మరి తెలియనప్పుడు అన్ని విద్యలను నేర్చేవని ఎందుకు చెప్పేవు అని రాజు అడిగేడు.
శ్వేతకేతు తన తండ్రి దగ్గరకు చేరి ప్రవాహణు డడిగిన ప్రశ్నలగురించి తన తండ్రి నడుగగా తనకూ వాటి జవాబులు తెలియవని చెప్పి తన కొడుకుతో సహా ఆ రాజు దగ్గరకు వెళ్ళేడు. అరుణముని అక్కడ కొంతకాలము బ్రహ్మ చర్య వ్రతాన్ని పాటిస్తూ తపస్సుచేస్తూ గడపగా ప్రవాహణుడు పంచాగ్ని విద్యను బోధిస్తాడు.
ఓ గౌతమా! ఈ ద్యులోకమే అగ్నిగా ఉంది.
ఆదిత్యభగవానుడే సమిధ. కిరణాలే ధూమము. పగలే జ్వాల. ఇంద్రియాభిమాన దేవతలు ఈ అగ్నిలో శ్రద్ధ అనే ఆహుతిని ఇస్తున్నారు. ఆ హవిస్సుల వల్ల అగ్నినుండి సోమరాజు ఆవిర్భవిస్తున్నాడు. అదే విధంగా శ్రద్ధ, సోముడు, వర్షము, అన్నము, వీర్యము అనే ఆహుతులను క్రమంగా ద్యులోకము, పర్జన్య, పృథివి, పురుష, యోషాగ్నులలో హోమం చేయడం ద్వారా పురుషుడు జన్మిస్తున్నాడు.
ఈ విధంగా జలమే పురుషుడనే పేరుతో ఉంటాడు. జరాయువు అనే పలుచని సంచితో చుట్టబడిన ఆ శిశువు తొమ్మిది లేక పది నెలలు మాతృగర్భంలో శయనించి తర్వాత జన్మిస్తాడు. అలా పుట్టినవాడు తన ఆయువున్నంత వరకూ జీవిస్తాడు.
అతడు మరణించిన తర్వాత ఆయా అగ్నులు అతను చేసిన కర్మలననుసరించి ఆయా లోకాలకు తీసుకొన పోతాయి అంటూ మొదటి ప్రశ్నకు సృష్టించబడ్డ జీవులంతా మరణానంతరం ఎక్కడకు పోతున్నారనే ప్రశ్నకు జవాబిచ్చాడు.
పైన చెప్పిన జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, అలాగే అరణ్యాలలో ఎంతో దీక్షగా తపస్సాచరించే వారు అర్చిరాది లోకాలకు అంటే దివ్యకాంతి లోకాలకు చేరుకుంటారు.
అక్కడనుండి క్రమంగా అహర్లోకం, శుక్లపక్ష ఉత్తరాయణం, సంవత్సరం, ఆదిత్యుడు, చంద్రుడు, విద్యుత్తు మొదలైన మార్గాలలో ప్రయాణం చేస్తూ అమానుషుడు అనే పురుషుణ్ణి చేరుతారు. అతడే వారిని బ్రహ్మలోకానికి చేరుస్తాడు. దీనినే దేవయాన మార్గం అంటారు. ఇది దేవయానమార్గం ఏది అనే ప్రశ్నకు సమాధానం.
ఈ లోకం లోనే ఉంటూ తన ఇష్టాపూర్తిగా పుణ్య కర్మలు చేస్తూ దానధర్మములు చేస్తూ ఉండేవాళ్ళు ధూమలోకానికి వెడతారు. అక్కడ నుండి రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము, అక్కడనుంచి పితృలోకము, గగనమార్గము, చంద్రమార్గము చేరుతారు. అంటే ఆయా అభిమాన దేవతలను చేరుతారు.
ఈ విధంగా పితృయాన మార్గం ద్వారా చంద్రలేకాన్ని చేరినవాళ్ళు తమ తమ కర్మలు పూర్తయ్యే వరకూ ఆ లోకం లోనే ఉండి, తిరిగి ఆ మేఘం కురిసే వర్షం, వర్షం ద్వారా ఉత్పన్నమయ్యే ఓషధులు, వడ్లు, ఆహారధాన్యాలు మొదలైన పదార్ధాల రూపంలో బయటకు రావడాన్కి చాలా కష్టాలు పడతారు. మానవులు తినే ఆ ఆహార పదార్ధాల నుంచి వీర్యం ద్వారా స్త్రీనుంచి అన్నగత జీవులుగా అంటే మానవులుగా పుడతారు.
పైవిధంగా ధాన్యాల రూపంలో ఉన్న జీవులు గత జన్మలలో తాము ఆచరించిన పుణ్యకర్మలను అనుసరించి ఉత్తమ యోనులలోను, దుష్కర్మలను అనుసరించి నీచయోనులలోను జన్మిస్తారు.
పుణ్యకర్మలను ఎవరు ఆచరించరో, నిషేధించబడిన పాపకర్మలను చేసే వాళ్ళు ఈ రెండు మార్గాల ద్వారా కాకుండా మాటిమాటికి పుడుతూ చస్తూ ఉంటారు. దీనివల్లే పరలోకాలు ఎందరు జీవులతో నిండివున్నా అవి పరిపూర్ణం కావడం లేదు.
ఇక మిగిలిన ఖండాలలో వైశ్వానరాత్మను గురించిన జ్ఞానాన్ని వివరించారు.
ఉపమన్యుని పుత్రుడు ప్రాచీనశాలుడు, పులషముని కుమారుడు సత్యయజ్ఞుడు, భాల్లవి ఋషి పుత్రుడు ఇంద్రద్యుమ్నుడు, శర్కరాక్షుని పుత్రుడు జనుడు, అశ్వతరాశ్వముని కుమారుడు బుడిలుడు అనే ఈ ఐదుగురు మహాగృహస్తులు వైశ్వానరాత్మను తెలుసుకొన గోరి ఉద్దాలక మహర్షి వైశ్వానరాత్మను తెలిసినవాడని విని ఆ ఋషి సన్నిధికి సమిత్పాణులై చేరేరు. అప్పుడా ఉద్దాలకుడు తనకు బ్రహ్మవిద్యను సమగ్రముగా బోధించ గలిగిన జ్ఞానం లేదని చెప్పి వాళ్ళను తీసుకొన కేకయ పుత్రుడిని అశ్వపతి రాజు దగ్గరకు తీసుకొన వెళ్ళేడు.
అశ్వపతిరాజు ప్రాచీనశాలునితో నీవు ఉపాసించే ద్యులోకం సుతేజమనే వైశ్వానరాత్మ, అది పూర్ణాత్మకాదు. ఇది పూర్ణాత్మ యొక్క శిరస్సు మాత్రమే అని చెప్పేడు. సత్య యజ్ఞునితో నీవు ఉపాసించే ఆదిత్యుడు విశ్వరూపమనే వైశ్వానరాత్మ మాత్రమే. ఇది విశ్వరూపాత్మ యొక్క కన్ను మాత్రమే అన్నాడు. ఇంద్రద్యుమ్నునితో నీవు ఉపాసించే వాయువు పృథగ్వర్త్మ అనే వైశ్వానరాత్మ, అది సంపూర్ణాత్మకాదు.
ఇది పరమాత్మ యొక్క ప్రాణము మాత్రమే అంటూ శర్కరాక్షునితోనీవు ఉపాసించే ఆకాశము బహుళ అనే వైశ్వానరాత్మ మాత్రమే. ఇది విశ్వాత్మ యొక్క శరీర మధ్యభాగమే అన్నాడు. అశ్వపతిరాజు తర్వాత బుడిలుడితో నీవు ఉపాసించే జలము రయి అనే వైశ్వానరాత్మ మాత్రమే. ఇది ఆ పరమాత్మ యొక్క వస్తి అంటే మూత్రపిండము.
చివరగా ఉద్దాలకునితో నీవు ఉపాసించే భూమి పరిపూర్ణాత్మ యొక్క ప్రతిష్టా అనే వైశ్వానరాత్మ. ఇది పరబ్రహ్మ యొక్క ఒక పాదము అంటూ తన దగ్గరకు వచ్చిన అందరు మునులను ఉద్దేశించి అయ్యా! మీరందరూ ఈ వైశ్వానరాత్మను వేరు వేరుగా అసంపూర్ణంగా తెలుసుకొని ఉపాసించారు.
ఈ వైశ్వానరాత్మ యొక్క శిరస్సే సుతేజము, ద్యులోకము; నేత్రములే విశ్వరూపము, ఆదిత్యుడు; పృథగ్వర్త్మ యే వాయువు ప్రాణము. శరీర మధ్య భాగమే ఆకాశం, వస్తి రయి జలము. పాదములు పృథివి; ఊరువులు వేది, రోమములు దర్భలు. హృదయం గార్హపత్న్యాగ్ని. మనస్సు (దక్షిణాగ్ని) అన్వాహర్యపచనము, నోరు ఆహవనీయము. అంటూ పంచ ఆహూతులను ప్రాణాయస్వాహా, వ్యానాయస్వహా, అపానాయస్వాహా, సమానాయస్వాహా, ఉదానాయస్వాహా అంటూ వైశ్వానరునకు చేసే ఆహుతుల వలన విశ్వంలోని సమస్తమూ సంతృప్తి చెందుతున్నాయని చెబుతూ ఈ పంచమ ప్రపాఠకం ముగుస్తుంది.
మన శరీరం లోని వైశ్వానరునకు మనం భోజన సమయంలో ఇచ్చే పంచ ఆహుతుల వల్ల అదే ఫలితాన్ని పొందుతున్నామని పరోక్షంగా ఉద్ఘోషిస్తోందీ ఉపనిషత్తు.
***
ఓం నమః శివాయ:
146E.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
146e. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు – విహంగవీక్షణ (Continued):
షష్ఠ ప్రపాఠకంలో:
అరుణముని పౌత్రుడు ఆరుణి యొక్క కుమారుడు అయిన శ్వేతకేతు తండ్రి అనుమతితో,12 సంవత్సరాల వయస్సులో, గురుకులం లో చేరి 24 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకూ వేద విద్యాభ్యాసం చేసి విద్యాగర్వంతో తండ్రి దగ్గరకు వచ్చేడు.
అతని తండ్రి(ఉద్దాలకుడు) శ్వేతకేతుతో “నువ్వు బ్రహ్మవిద్యోపదేశం పొందేవా? ఏ జ్ఞానంతో సర్వాంతర్యామి వినబడుతోందో, తర్కించడానికి వీలుకానిది తర్కించబడుతోందో, ఏది తెలిస్తేj అన్నీ తెలియ బడుతున్నాయో, ఏది తెలిస్తే ఇక దేని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉండదో అలాంటి పరబ్రహ్మ తత్వం మీ గురువు దగ్గర తెలుసుకున్నావా?” అని అడిగితే ఆ బ్రహ్మ విద్యోపదేశం నాకు తెలియదు.
అప్పుడు ఉద్దాలకుడు శ్వేతకేతుతో “ఓసౌమ్యా! మట్టితో చేసిన కుండల్లో ఉన్నదంతా మట్టే. కానీ పేర్లు రూపాలు మాత్రమే వేరుగా కుండ, ఇటుక లాగ ఉన్నావాటిలో ఉన్నదంతా మట్టే. మట్టే సత్యమైనది. ఒక చిన్న ఇనుప కత్తి జ్ఞానంతో అన్ని ఇనుప వస్తువుల జ్ఞానం ఎలా కలుగుతోందో అలాగే ఆ వస్తువులన్నీ అసత్యమే ఇనుము (లోహము) మాత్రమే సత్యము.
నామ రూపాలతో నిండిఉన్న ఈ సృష్టి మొత్తం సృష్టిగా పుట్టడానికి పూర్వము సత్ గా ఒకటిగా, అద్వితీయంగా అంటే రెండోది అనేది లేనిదిగా ఉంది. సత్ పదార్ధంగా ఉన్న పరబ్రహ్మమే మొట్టమొదట ఆవిర్భవించింది. ఆ ఏకైక పరబ్రహ్మ నేను ఎన్నో రూపాలను ధరిస్తాను అని సంకల్పించింది. ముందుగా తననుంచి ఒక దివ్య తేజస్సును పుట్టించింది.
తర్వాత జలాన్ని ఉత్పత్తి చేసింది. అందువల్లే పురుషుడు తపించ బడ్డప్పుడు స్వేదము ఉత్పత్తి అవుతోంది. అగ్ని నుండి నీరు పుడుతోంది. ఆ జలం నుండే అన్నం (భూమి) ఉత్పత్తి అవుతోంది. ఎక్కడ సమృద్ధిగా వర్షం కురుస్తోందో అక్కడ పుష్కలంగా పుష్టికరమైన అన్నం ఉత్పత్తి అవుతోంది. ఈ విధంగా త్రివృత్కరణమనేది ప్రతిపాదించడానికి మూడు భూతాల సృష్టి చెప్పబడింది.
త్రివృత్కరణమంటే అగ్ని,జలము, పృథివి అనే మూడు భూతముల సమ్మిశ్రణముతో ఏర్పడిన సృష్టి విధానము.
ఈ భూతములు అండజాలు, జరాయుజాలు, ఉద్భిజాలు అని మూడు విధాలు. స్వేదజాలనేవి ఈ మూడింటిలోను అంతర్గతంగా వున్నాయి.
సత్ రూపంలో ఉన్న ఆ పరబ్రహ్మ “నేను జీవాత్మ రూపం లో అగ్ని, జలం, భూమి అనే దేవతలలో ప్రవేశించి వారికి పేరు రూపాన్ని కలిగించాలని, ఎన్నో రకాల పేర్లతో, రూపాలతో సృష్టి చేయాలని సంకల్పించాడు. దానికి అనుగుణం గా ఆ మూడుభూతాలను విడివిడిగా త్రివృత్కరణ చేసాడు.
ముందుగా అన్నం. అంటే మనం తిన్న ఆహారం శరీరం లోకి వెళ్ళాక దానిలోని స్థూల బాగం మలంగాను,మధ్య భాగం మాంసంగాను, అత్యంత సూక్ష్మ భాగం మనస్సుగాను మారుతోంది.
మనం త్రాగిన నీరు శరీరం లోకి వెళ్ళేక స్థూలభాగం మూత్రంగా, మధ్యభాగం నెత్తురుగా, అత్యంత సూక్ష్మ భాగం ప్రాణంగా మారుతోంది.
మనం త్రాగిన నెయ్యి, నూనె లోపలికి వెళ్ళేక స్థూలభాగం ఎముకలుగా, మధ్యభాగం మజ్జగా, అత్యంత సూక్ష్మ భాగం వాగీంద్రియంగా మారుతోంది.
అందువల్ల మనస్సును అన్నమయం గాను, ప్రాణాన్ని జలమయం గాను, వాగీంద్రియాన్ని తేజోమయం గాను తెలుసుకోవాలి.
పురుషునిలోని పదహారుకళలలోను ఏ ఒక్క కళ జీవించి ఉన్నాకూడా, బాగా ప్రజ్వరిల్లిన అగ్ని చల్లారేక అందులో ఉన్న చిన్న చిన్న నిప్పురవ్వ కూడా గడ్డి వేయడం వల్ల పెద్ద మంటగా మారుతుందో అలాగే, ఆ కళను అన్నం తినడం ద్వారా ఉద్దీపింప చేసి మిగిలిన కళలను కూడా సంరక్షించ వచ్చు అంటూ శ్వేతకేతును పదిహేను రోజులు నిరాహారంగా ఉండమని, ఒక్క నీళ్ళు మాత్రం త్రాగమని చెప్పేడు.
15 రోజుల తర్వాత అతనిలో ఒక్క జీవకళ మాత్రం మిగిలి ఉండడం వల్ల అతనికి తను నేర్చుకున్న వేదాలన్నీ జ్ఞప్తికి రాక పోవడం, తిరిగి అన్నం తినడం వల్ల అన్ని జీవకళలు పునర్జీవించడం అనే విషయాన్ని సాధనాపూర్వకంగా నిరూపించేడు ఉద్దాలకుడు.
నిద్ర యొక్క స్వరూపాన్ని ఈ విధంగా వివరించాడు. ఈ పురుషుడు నిద్రిస్తున్నప్పుడు సద్రూపమైన ఆత్మతో అభేదం గా ఉంటున్నాడు. తనలో (ఆత్మలో) తానే లయమైపోతాడు. అందుకే నిద్రపోతున్నాడని చెబుతారు. ఆ సమయంలో అతను తనలో తానే ఒకటిగా ఉన్నాడని అర్ధం. త్రాటితో కట్టబడిన పక్షి ఎక్కడ తిరిగినా కూడా చివరకు తన పంజరానికే జేరే విధంగా మనస్సు కూడా ప్రాణుని చే బంధింపబడి ఉండడం వల్ల ఎక్కడెక్కడకు పోయినా తగిన ఆశ్రయం లభించక తిరిగి ప్రాణాన్నే ఆశ్రయిస్తోంది.
ఆకలిదప్పులను వివరిస్తూ మనం తిన్న అన్నాన్ని వ్యవస్థాబద్ధంగా దాన్లో ఉన్న జలం శరీరం లోని అన్ని భాగాలకూ తీసుకొనిపోతుంది. ఈ జలాన్ని అశనాయ అని పిలుస్తారు. ఈ శరీరం జలముతో వృద్ధిపొందుతోంది. ఈ దేహం యొక్క మూలం అన్నమే. అన్నానికి మూలం జలం. జలానికి మూలం తేజస్సు. తేజస్సుకు మూలం సత్తు.
జలము తప్ప ఈ శరీరానికి మూలం మరేదీ లేదుకనుక జలం యొక్క అంకురము చేత తేజస్సు, తేజస్సు అనే అంకురం చేత సత్తు యొక్క మూలాన్ని తెలుసుకోవాలి. తేజస్సు జలం అన్నం అనే త్రివృత్కరణాలు ఆ పరమ పురుషునిలో ఎలా ఉన్నారనే విషయాన్ని తెలియజేశారు
మరణించే మనుష్యుని యొక
్క వాక్కు మనస్సులోను, మనస్సు ప్రాణములోను, ప్రాణం తేజస్సులోను, ఆ తేజస్సు పరమాత్మలోను లయమవుతున్నాయి. తేనెటీగలు అనేక దిక్కులనుండి అనేక పుష్పముల నుండి మధువును సేకరించి తెస్తున్నాయి. అందులో ఒక మధు బిందువు ను తీసుకొని అది ఏ పుష్పం నుండి తెచ్చినదో చెప్పగలమా? అదే రీతిగా సమస్త ప్రజలు సుషుప్తిలో అంటే సత్తులో లీనమై పోతున్నారు. అలా లీనమైపోయిన సంగతి తెలుసుకో లేకపోతున్నారు.
ఆ జీవులన్నీ జాగ్రదావస్థలో మొదట ఏ సంస్కారంలో ఉంటారో ఆ రీతిగానే ఆయా రూపాలతో పులి, సింహము, తోడేలు, వరాహము, కీటకము, మశకము, పతంగము మొదలైన వాటిలో ఏదో ఒక రూపాన్ని లేదా దేహాన్ని ధరిస్తూ ఉంటాయి. ఈ సమస్త ప్రపంచము పరమాత్మ చేత పరిపూర్ణమై ఉంది. దానినే ఆత్మ అంటారు. ఆ ఆత్మవు నీవే అయి ఉన్నావు.
నదులలో కొన్ని పూర్వ వాహినులు, కొన్ని పశ్చిమ వాహినులుగా వివిధ రీతులలో ప్రవహించి చివరకు సముద్రం లో చేరిన తర్వాత తిరిగి ఈ నది ఆ నది అని తెలియజాలక సముద్ర రూపమే అవుతున్నాయో అలాగే సద్రూపం గా ఉన్న ఆ పరబ్రహ్మ తత్వం అత్యంత సూక్ష్మం. ఇదే ఆత్మ. నీవు అదే అయి ఉన్నావు అని శ్వేతకేతుకు ఉద్దాలకుడు చెప్పేడు.
ఇక్కడ రెండు మంచి ఉదాహరణలతో తత్వమసి అనేదాని నిరూపణ చేసేడు ఉద్దాలకుడు.
ఒక మర్రిపండును చీల్చి చూస్తే బీజాలు ఉన్నాయి. ఆ బీజాలను చీల్చగా అత్యంత సూక్ష్మభాగము కనిపించడం లేదు. ఆ కనుపించని సూక్ష్మ భాగం నుంచే ఇంచ పెద్ద వటవృక్షం పుడుతోంది. ఆ అత్యంత సూక్ష్మ భాగమే పరబ్రహ్మ స్వరూపం. అదే సత్యము. దానినే పరబ్రహ్మ అంటారు. అది నీవే అయి ఉన్నావు.
ఒక ఉప్పురాయిని నీటిలో వేస్తే అది నీటిలో కరిగిపోయింది. ఉప్పురాయి కనపడక పోయినా నీరు మాత్రం ఉప్పగా అయ్యాయి. ఆ గ్లాసులోని పైభాగంలో నీరు, మధ్య భాగం లో నీరు క్రింద భాగం లోని నీరు కూడా ఉప్పగానే ఉన్నాయి.
ఉప్పు నీటిలో ఉన్నా మనకేవిధంగా కనపడకుండా ఉంటుందో, ఉప్పు నీటియందంతా వ్యాపించి ఉంటుందో అలాగే సద్రూపమైన పరబ్రహ్మము సర్వత్రా వ్యాపించి ఉన్నా మనం చూడలేక పోతున్నాము. ఇదే ఆత్మ. ఆ ఆత్మ నీవే అయి ఉన్నావు.
వ్యాధి పీడితుడై మరణశయ్య యందుండిన పురుషుని చుట్టుపక్కల అతని బంధువులందరూ నన్ను గుర్తిస్తున్నావా? అని అడుగుతూంటారు. అతని వాక్కు మనస్సులోను, మనస్సు ప్రాణములోను, ప్రాణం తేజస్సులోను, తేజస్సు పరదేవత లోను లీనమైనప్పుడు అతడింకెవ్వరిని గుర్తు పట్టలేడు. ఇది అత్యంత సూక్ష్మము. ఈ తేజస్సు, ప్రాణము, వాక్కు, దేహమునకు కారణముగా ఉండే సూక్ష్మ తత్వమే పరమాత్మ. అదే ఆత్మ. ఆ ఆత్మవు నీవు అయి ఉన్నావు.
సత్యస్వరూపమైన ఆత్మను నేనే నని గుర్తించిన ఆత్మవిదుడు సర్వ దుఃఖాలవల్ల బాధింపబడడు. శ్వేతకేతూ! ఆ ఆత్మవు నీవే అయి ఉన్నావు అని ఉద్దాలకుడు బోధించగా శ్వేతకేతు పరిపూర్ణ తత్వజ్ఞానం కలవాడయ్యాడు.
వచ్చే భాగంలో సప్తమ అష్టమ ప్రపాఠకాల విహంగవీక్షణ పూర్తి చేద్దాము.
146f. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు – విహంగవీక్షణ (Continued):
సప్తమ ప్రపాఠకం లో:-
సనత్కుమారుడు నారదునకు భూమా విద్యను ఉపదేశించిన విషయం ప్రస్తావించబడింది. చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, నృత్యగీతాది లలితకళలు మొదలైనవి తెలుసుకొని ఇప్పటివరకూ మంత్రవేత్త గానే ఉన్నాను కాని ఆత్మవేత్తను కాలేకపోయాను. ఆత్మవేత్తయే శోకం నుండి బయటపడి ముక్తుడవుతాడని విన్నాను. నాకాఆత్మ విద్యను ప్రసాదించండి అని నారదుడు సనత్కుమారుని వేడుకొన్నాడు.
ఇక్కడనుంచి నామ జపం, మంత్ర జపం, వాక్కు ద్వారా భజన, మానసిక జపం మొదలైన వాని యొక్క ఫలితాలను వివరిస్తూ తపస్సు లోకి తీసుకొన వెడుతున్నాడు సనత్కుమారుడు.
నీవీ భౌతికమైన విద్యలన్నిటిలోనూ నిష్ణాతుడవు కాబట్టి, నామములోనే బ్రహ్మ బుద్ధినుంచి నామమునే బ్రహ్మము గా ఉపాసన చేయి అని సనత్కుమారుడు చెప్పేడు. నామాన్ని బ్రహ్మమని ఉపాసించేవాడు నామము ఎంతవరకూ వ్యాపింప గలదో అంతవరకూ వ్యాప్తి గలవాడై పూర్తి ఫలాన్ని పొందుతాడు అన్నాడు.
నామము కంటే కూడా వాక్కు గొప్పది. ఇంతవరకూ నీవు నేర్చిన విద్యలన్నీ వాక్కు మాత్రమే తెలియజేయ గలగుతుంది. అందువల్ల వాక్కును బ్రహ్మము గా ఉపాసించు అని నారదునకు సనత్కుమారుడు చెప్పేడు. వాక్కును పరబ్రహ్మగా ఉపాసించేవాడు వాక్కు యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది వాక్కు ఎంతవరకూ వ్యాప్తి చెంది ఉందో అంతవరకూ స్వేచ్ఛగా విహరించ గలుగుతాడు.
మనస్సు వాక్కు కంటే గొప్పది. రెండు ఉసిరికాయలు లేదా రెండు రేగు కాయలు లేదా రెండు తాటికాయలు ఒకే పిడికిటిలో ఇమిడ్చు కొనినట్లు మనస్సులో నామము మరియు వాక్కు ఇమిడ్చుకో బడ్డాయి. మనస్సే ఆత్మ, మనస్సే లోకము, మనస్సే బ్రహ్మము. మనస్సును పరబ్రహ్మగా ఉపాసించేవాడు మనస్సు ఎంత వరకూ వ్యాపించగలదో అంతవరకూ యథేచ్ఛగా విహరించ గలుగుతాడు.
సంకల్పము మనస్సు కంటే చాలా పెద్దది. మానవుడు సంకల్పం చేసినప్పుడు మనస్సుతో కోరుతాడు. మనస్సు వాక్కును ప్రేరేపిస్తుంది. వాక్కు నామములో చేరి ఉంది. నామము మంత్రము లోను, మంత్రము కర్మలలోను చేరి ఉండడం వల్ల నామము, మనస్సు మొదలైన వాటన్నిటికీ సంకల్పమే ఆశ్రయము. అన్నింటికీ మూలము సంకల్పమే. సమస్త సృష్టి సంకల్పమయమే. సంకల్పాన్ని పరబ్రహ్మ గా ఉపాసించేవాడు సృష్టింపబడిన ధ్రువ లోకానికి తానే ధ్రువుడై దుఃఖము లేని లోకాలకు తాను దుఃఖ రహితుడై ఉంటాడు. సంకల్పము ఎంత దూరం వ్యాప్తి చెందుతుందో అంత దూరం ఈతడు స్వేచ్ఛగా సంచరించ గలుగుతాడు.
చిత్తము సంకల్పం కన్నా గొప్పది.
మనుష్యునిలో చిత్తము సక్రమము గా ఉన్నప్పుడే పైన చెప్పిన వన్నీ పని చేస్తాయి. అందుకే వాటన్నిటికీ చిత్తమే ఆత్మ. ఈ చిత్తాన్ని అంటే బుద్ధిని ఉపాసించేవాడు సర్వ భావాలకు స్వతంత్రుడై సర్వ లోకాలలో సంచరించ గలుగుతాడు.
చిత్తము కంటే ధ్యాన సిద్ధి గొప్పది. అంతరిక్షము, ద్యులోకము, నీరు, కొండలు, దేవతలు, మానవులు మొదలైన ఈ సర్వస్వము ధ్యానం చేస్తున్న వాటివలె కనిపిస్తున్నాయి. ధ్యానం కంటే విజ్ఞానం గొప్పది. విజ్ఞానం కంటే బలము గొప్పది. అన్నము బలము కన్నా గొప్పది. అన్నము కంటే జలం గొప్పది. తేజస్సు జలం కన్నా గొప్పది. ఆకాశము తేజస్సు కన్నా గొప్పది. అంతఃకరణ ధర్మమైన జ్ఞాపక శక్తి ఆకాశం కన్నా గొప్పది. ఆశ అనేది జ్ఞాపక శక్తి కన్నాగొప్పది.
ప్రాణ శక్తి ఆశ కంటే కూడ గొప్పది.
ప్రాణోవా ఆశయా భూయాన్యథావా అరా నాభౌ… అంటూ, ప్రాణః ప్రాణేన యాతి… ప్రాణః ప్రాణం దదాతి… అంటూ ప్రాణ శక్తి యొక్క గొప్పదనాన్ని స్వయం చాలక, స్వయం పోషక, స్వయం వృద్ధికారక శక్తి గా ప్రాణుని యొక్క జ్యేష్ఠత్వాన్ని శ్రేష్ఠత్వాన్ని నిరూపిస్తూ నీశరీరం లోని ప్రాణ శక్తియే తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, ఆచార్యుడు, బ్రాహ్మణుడు అయి ఉందని ఈ పై వారిలో ఎవరిని దూషించినా పితృఘాతకుడవు, మాతృ ఘాతకుడవు మొదలుగా అంటారు. కానీ ప్రాణుడే శ్రేష్ఠడనుకొంటే ఇంక ఆత్మ వరకూ వెళ్ళేవాడు కాదు సనత్కుమారుడు.
ఈ ప్రాణమే సమస్తమని చూచేవాడు, విచారించేవాడు, తెలుసుకొనేవాడు, సత్య జ్ఞానములను అధికముగా చెప్పేవాడు యదార్ధమైన అతివాది అవుతాడు. సత్య దర్శనుడు మాత్రమే సత్యాన్ని వచిస్తాడు. మనుష్యుడు మననం చేసి తెలుసు కుంటాడు. మనుష్యుడు శ్రద్ధాయుక్తుడైతే మననం చేయ గలుగుతాడు. గురు శుశ్రూషాది నిష్ఠ ఉంటే శ్రద్ధా యుక్తుడౌతాడు. కర్మానుష్ఠానం ద్వారా నిష్ఠ కలుగుతుంది. సుఖము కలిగి తన కోరికలు నెరవేరుతున్నప్పుడే మానవుడు కర్మలను చేస్తాడు. (తన కోరికలు తీరక సుఖం లభించక పోతే కర్మలు చేయడం లేదు).
అందుచేత సుఖమే ‘భూమ.’ భూమ అంటే గొప్పది. బ్రహ్మము, ఆత్మ. ఈ విధంగా ఆత్మ యొక్క శ్రేష్ఠత్వాన్ని నిరూపిస్తూ ఆత్మ యొక్క మహిమను చెబుతున్నాడు సనత్కుమారుడు. జాగ్రత్తగా గమనించండి.
ఏ ఆత్మ యందు ఆత్మ కంటే వేరయినదేది కన్పించడం లేదో, వినిపించడం లేదో దానినే భూమ అంటారు. ఈ ఆత్మ తన మహిమ యందే తాను ప్రతిష్ఠితమై ఉంది. అది నిరాలంబము. ఆత్మ యొక్క మహిమ అన్య పదార్ధములనుండి కలగడం లేదు. ఆత్మ వల్లనే ఇతర పదార్ధములన్నీ మహిమను పొందుతున్నాయి.
ఆ యాత్మ క్రింద, పైన, వెనుక, ముందు, ప్రక్కల, అంతటా నిండి ఉంది. జగత్తంతా ఆత్మయే. ఈ అనంత తత్వమే భూమ. ఈ విధంగా చూచినవాడు, తలచిన వాడు, గ్రహించిన వాడు ఆత్మ యందే క్రీడిస్తూ ఉంటాడు. ఆత్మ తనలోనే ఉందని బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడు. తానే రాజై ఉంటాడు. సమస్త లోకాలలోను తన ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటాడు.
పైన చెప్పిన విధంగా సర్వాత్మ భావనతో చూచే వాడి యొక్క ఆత్మ నుండే ప్రాణం, ఆశ, స్మరణ, ఆకాశము, తేజస్సు, జలము, అన్నము, బలము, ధ్యానము, చిత్తము, సంకల్పము, మనస్సు, వాక్కు, నామము, మంత్రములు, కర్మలు మొదలైన సమస్తము ఉత్పత్తి అవుతున్నాయి. ఈ రీతిగా ఆత్మను ఎరిగిన వాడు మృత్యువును చూడడు, వ్యాధిని పొందడు, శోకమునొందడు, సర్వాన్ని ఆత్మ మయంగా దర్శిస్తాడు.
సృష్టికి పూర్వం బ్రహ్మము ఒక్కటే ఉంది. తర్వాత ఆ బ్రహ్మమే మూడై, అయిదై, ఏడై, తొమ్మిదై, పదకొండై, అనేకమైంది. వందలాదిగ వేలు అసంఖ్యాకంగా అయ్యింది. దీనికి ముందుగా ఆహారం పరిశుద్ధం గా ఉండాలి. ఆహారంతో అంతఃకరణము శుద్ధి అవుతుంది.
దానితో జ్ఞాపకశక్తి కలుగుతుంది. అప్పుడు అజ్ఞాన గ్రంధులన్నీ తెగిపోతాయి. దోషాలన్నీ నశిస్తాయి. తమస్సు పోతుంది. అంటూ భూమా విద్యను నారదునకు బోధించేడు.
వచ్చే భాగం లో అష్టమ ప్రపాఠకం యొక్క విహంగ వీక్షణలో ఇంద్రుడు విరోచనుల బ్రహ్మవిద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం.
146g. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు – విహంగవీక్షణ (Continued):
అష్టమ ప్రపాఠకంలో:-
ఈ అధ్యాయం ఎలా మొదలవుతుందంటే మన శరీరం లోని దహరాకాశం లో ఉండే ఆకాశం ఈ విశ్వంలోని విశాల వినీలీకాశానికి ఏమాత్రం భిన్నంగా ఉండదు అని. ఆత్మ తత్వాన్ని మరింత వివరంగా చర్చిస్తాడు.
ఈ బ్రహ్మపురిలో అంటే ఈ శరీరంలో హృదయ గుహలోచిన్న పద్మం ఉంది. ఆ పద్మం లో సూక్ష్మమైన అంతరాకాశం ఉంది. బయట ఉన్న ఆకాశం ఎంత అనంతమైఉందో హృదయం లోని ఆకాశం కూడా అంతే అనంతంగా ఉంది. ద్యులోకం, పృథివి, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, నక్షత్రాలు మొదలైన సర్వస్వము హృదయాకాశంలో స్థితమై ఉన్నాయి. బ్రహ్మోపాసన గురించి హృదయాకాశంలో ఉన్న సర్వ జగత్తు కల్పనయే అని దీని అర్ధము.
బ్రహ్మపురం అనబడే ఈ శరీరంలో అన్ని భూతాలు, సమస్త కామాలు అంతర్భూతంగా ఉంటే ఈ శరీరానికి వార్ధక్యం కలిగి మరణం ఏర్పడినప్పుడు దీనిలో ఉండే భూతాలన్నీ ఏమవుతాయి. ఘటనాశం అయినప్పుడు ఆ ఘటం లోని ఘటాకాశం నాశనమవకుండా విశాల ఆకాశంలో కలిసిపోతున్నట్టే దహరాకాశం లో ఉన్నవి నశించవు.
ఈ శరీరానికి ముసలితనం వచ్చినా అందులోని బ్రహ్మకు వృద్ధాప్యం రాదు. ఈ దేహానికి దెబ్బ తగిలినా ఆత్మకు తగలదు. ఈ బ్రహ్మము సత్యమైనది. శరీరం సత్యం కాదు. బ్రహ్మంలో సమస్త సద్గుణాలు ఆశ్రయించి ఉన్నాయి. ఈ ఆత్మ పాపరహితమైనది. పరబ్రహ్మమునకు (ఆత్మకు) ముసలితనం, మరణం, దుఃఖము, ఆకలి, దప్పిక మొదలైనవేవీ లేవు. ఆత్మ సత్యకామమై ఉంది. సత్యసంకల్పమై ఉంది.
ఆత్మ యొక్క సత్యకామాలు అసత్యం తో కప్పబడి ఉండడం వల్ల నిరాలంబమైన ఆనందం విషయ వాంఛలచే మూయబడి ఉంది. భూమిలో గుప్తంగా ఉండే ధనాన్ని ప్రతిరోజూ దానిపై తిరుగుతున్నాకూడా ఎలాఅయితే పొందలేరో, అదేవిధంగా ఈ జీవులంతా ప్రతిరోజూ సుషుప్తి దశలో (నిద్రలో) ఆత్మ స్థానానికి పోయి వస్తున్నా కూడా అసత్య మోహితులై ఉండడం వల్ల సత్యకామాలను పొందలేకుండా ఉన్నారు.
ఈ ఆత్మ హృదయం లోనే ఉంది అని చెప్పడానికి హృది = హృదయం లో; అయమ్ = ఈ ఆత్మ అంటే హృదయంలో ఉండేదే ఆత్మ అని అర్ధం. ఆ ఆత్మకు సత్యమ్ అని పేరు. ‘స’ అంటే అమృతం; ‘తి’ అంటే మర్త్యము. ‘యమ్’ అంటే అమృతాన్ని మర్త్యాన్ని ఏకం చేసేది సత్యమ్ అని అర్ధం.
సూర్యుని యందు పింగళ, శుక్ల, నీల, పీత, లోహితవర్ణములు వివిధ కిరణాలచే కన్పిస్తున్నట్లు ఈ హృదయం నుంచి వెలువడిన నాడులు పింగళ, శుక్ల, నీల, పీత, లోహితమనే వర్ణాలు గల సూక్ష్మ రసము చేత నిండి ఆయా రంగులతో భాసిస్తున్నాయి. ఈ సూర్య కిరణాలు ఇహలోకానికి, పరలోకాలలోనికి వెడుతున్నాయి. సూర్యుని నుంచి బహిర్గతములైన కిరణాలు ఈ నాడులలో జేరుతున్నాయి. ఈ నాడులనుండి ప్రసరించే కిరణాలు ఆ సూర్యుని చేరుతున్నాయి. మానవుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు జీవుడు ఈ నాడులలో చేరి గుప్తంగా ఉంటున్నాడు.
జీవుడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఈ నాడుల నుంచి ప్రసరించే కిరణాలద్వారా పైకి పోతాడు. హృదయం నుండి నూటొక్క నాడులు వెలువడుతున్నాయి. వానిలో సుషుమ్న అనే ఒక నాడి మూర్ధ్నానికి పోతోంది. ఆ ద్వారం గుండా పోయేవాడు అమృత స్వరూపుడౌతున్నాడు.
ఆత్మను తెలుసుకొన్నవాడు అన్నిలోకములను, అన్ని కోరికలను పొందుతున్నాడని ప్రజాపతి చెప్పేడు. అది విన్న దేవతలు, రాక్షసులు ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటామని చెప్పేరు. దేవతల పక్షాన ఇంద్రుడు, రాక్షసులనుంచి విరోచనుడు ఇద్దరూ సమిత్పాణులై ప్రజాపతి బ్రహ్మను సమీపించారు.
బద్ధ శత్రువులైన విరోచనుడు, ఇంద్రుడు బ్రహ్మ దేవుని సన్నిధిలో 32 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేసేరు. అప్పుడు ప్రజాపతి ‘మీరు ఏ యే కోరికలతో ఇక్కడ ఉన్నారు’ అని ప్రశ్నించేడు. వారిద్దరూ పాపరహితము,జరామరణరాహిత్యము దుఃఖరహితము, క్షుత్పిపాసారహితము సత్య కామము అయిన బ్రహ్మతత్వాన్ని ఉపదేశించ మని కోరేరు.
ప్రజాపతి ఈ విధంగా చెప్పేడు. ఈ నేత్రములతో దర్శనమిస్తున్న పురుషుడే ఆత్మ. ఇదే అమృతము, అభయము, పరబ్రహ్మము అని బోధించేడు. జలపాత్రలో మిమ్ములను మీరు చూచుకోమన్నాడు. మా ప్రతిబింబమే కనబడుతోందన్నారు. తిరిగి క్షురకర్మ చేసుకొని మంచి వస్త్రాలతో అలంకరించుకొని నీటి పాత్ర లో చూచుకోగా ఏ రీతిగా అలంకరించుకున్నామో అదేరీతిగా కనబడుతున్నామని బదులిచ్చేరు.
అప్పుడు ప్రజాపతి అతడే ఆత్మ అదే అమృతము, అభయము, పరబ్రహ్మము అని బోధించేడు. వాళ్ళిద్దరూ శాంతించిన మనస్సు కలవారై వెళ్ళిపోయారు.
విరోచనుడు మనస్సులో సమాధానపడి తన రాక్షసుల దగ్గరకు వెళ్ళి ఆత్మ అంటే ఛాయా మాత్రమే. ఛాయాత్మనే పూజించాలి. ఈ రీతిగా ఛాయాత్మను సేవించి పూజిస్తే ఇహ పరలోకాలను పొందవచ్చని ప్రకటించేడు. రాక్షసుల తత్వజ్ఞానమీ విధంగా ఉంది. చనిపోయిన వాని దేహాన్ని అన్న వస్త్రాదులతో అలంకరించడం ద్వారా చనిపోయిన వాడు పరలోకాలను పొందుతాడని భావించారు.
ఇంద్రుడు దేవలోకాన్ని చేరే దారిలోనే ఆత్మ విషయమై సందేహం వచ్చింది. ఈ దేహం గుడ్డిదైతే ప్రతిబింబం గుడ్డిదిగాను; శరీరం కన్ను ముక్కు వీటిచే అసహ్యంగా ఉంటే అందవికారం గాను కనబడుతోంది. ఈ శరీరం మరణంతో నాశనమవుతోంది. ఇది ఆత్మ అయ్యేటందుకు వీలు లేదు
అని పలువిధాల ఆలోచించి సమిత్పాణియై తిరిగి ప్రజాపతి వద్దకు చేరేడు. తన సందేహం చెప్పగానే మరల 32 సంవత్సరాలు బ్రహ్మచర్య వ్రతం తో తపస్సు చేయి తత్వాన్ని విపులంగా చెబుతాను అన్నాడు ప్రజాపతి.
దేవేంద్రుడారీతిగా మరో 32 సంవత్సరాల తపమాచరించిన తర్వాత ప్రజాపతి “స్వప్నములో ఆధిక్యతను పొంది విహరించేదే ఆత్మ. అదే అభయము, అమృతము మరియు బ్రహ్మమని” చెప్పేడు. ఇక్కడ స్వప్నం లో ఉండే ఆత్మ అంటే తైజసుడైన జీవుడు అని అర్ధం. దేవేంద్రుడు సమాధాన పడి వెళ్ళిపోయాడు.
వెళ్ళే దారిలో తిరిగి సంశయాత్ముడయ్యాడు.
ఈ శరీరం గుడ్డిదైనప్పుడు స్వప్నంలోని ఆత్మ గ్రుడ్డిది అవటం లేదు. ఈ శరీరం స్వప్నంలో వధింప బడ్డా కూడా వాస్తవంలో వధింపబడటం లేదు. శరీరం యొక్క రోత చే స్వప్న శరీరం రోత చెందడం లేదు. అందువల్ల ఈ స్వప్నాత్మ ఆత్మ కాదని సందేహం కలిగింది. తిరిగి ప్రజాపతిని చేరి, ఓ భగవన్, ఈ స్వప్నాత్మ దేహేంద్రియ దోషాలతో దూషితమవటం లేదు. అంటూ తన సందేహాన్ని వివరించేడు. నువ్వన్నది సత్యమే అంటూ తిరిగి 32 సంవత్సరాలు బ్రహ్మచర్యం తో ఇక్కడ తపస్సు చేయి. నేను విపులంగ వివరిస్తాను.
అప్పుడు ఏది సంపూర్ణ ప్రసన్నతచేత నిద్రించి ఉందో, ఏది స్వప్నాన్ని గాంచదో అదే ఆత్మ. అదే అమృతము, అభయము మరియు బ్రహ్మము అని చెప్పేడు. అప్పటికి సమాధానపడినా, ఇంద్రునికి సంశయము గానే ఉంది. పైన చెప్పినది సుషుప్త్యాత్మ. నిద్రలో నేనిట్టివాడను అని చక్కగా తెలియటం లేదు. ఎట్టి భూతాలను తెలుసుకో లేకపోతున్నాము. ఇది నాశనమొందే దానిలాగే ఉంది. ఇది ఆత్మ అవడానికి ఆస్కారం లేదు. అని తలుస్తూ తిరిగి ప్రజాపతిని చేరేడు.
మరల 5 సంవత్సరాలు మాత్రము బ్రహ్మచర్యం తో తపస్సు చేయమని చెప్పేడు. ఈ రీతిగా మొత్తం 101 సంవత్సరాలు సమస్తభోగాలు వదలి తపస్సు చేసిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొంద గలిగేడు ఇంద్రుడు.
అప్పుడు ప్రజాపతి ఈ విధంగా చెప్పేడు:
ఇంద్రా! ఈ దేహం మరణించే స్వభావం కలిగి ఉంది. ఎల్లవేళలా మృత్యుముఖం లో ఉంటుంది. అటువంటి ఈ దేహం అమృతము, అశరీరము అయిన ఆత్మకు ఉపాధిగా ఉంది.
ఆ ఆత్మ దేహం తో ఉన్నప్పుడు అహంభావం తో ఇష్టానిష్టాలతో కూడి ఉంటుంది. దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం రాగద్వేషాలు నశించవు. అశరీరి అయిన ఆత్మకు రాగద్వేషాలు లేవు. వాయువుకు శరీరం లేదు.
అలాగే ఆకాశం, విద్యుత్తు, పిడుగు వీటన్నిటికీ ఉపాధి లేదు. ఇవన్నీ ఆకాశానికి అవ్వల పరంజ్యోతిలో లీనమై అక్కడ స్వస్వరూపం తో ఏ రకంగా ప్రకాశిస్తూ ఉంటాయో అలాగే ప్రత్యగాత్మ ఈ శరీరాన్నుండి వెళ్ళి పరంజ్యోతిలో లీనమై స్వస్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది..
ఆ అంతరాకాశంలో (బ్రహ్మరంధ్రంలో)ఉండేదే ఆత్మ. అతడే ఉత్తమ పురుషుడు అతడు పాప రహితుడు. చావు, శోకం, రోగం అనేవి లేనివాడు. సత్యకాముడు, సత్య సంకల్పుడు. ఈ శాంత ప్రసన్న పురుషుడు (జీవాత్మ) ఈ శరీరాన్ని వదలి, పరంజ్యోతిలో లీనమై స్వరూప జ్ఞాన యుక్తుడు అవుతాడు.
ఆ స్వరూప జ్ఞానయుక్త స్థితినే ఆత్మ అంటారు. మానవులను(మర్త్యులను), దేవతలను (అమర్త్యులను) కలిపే సేతువు లాంటి వాడు ఆత్మ. ఈ సేతువు దాటిన వాడికి రాత్రి కూడా పగలుగా మారుతుంది. అజ్ఞానమనేది లేశమైనా లేకుండా పోతుంది. ఎందుకంటే అవతల బ్రహ్మలోకం ప్రకాశపూర్ణం గా ఉంటుంది.
జనులు బ్రహ్మచర్యాన్నే యజ్ఞం, సత్రాయణం, అనాశకాయం అంటూ వివిధ పేర్లతో పిలుస్తూంటారు. ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మనుండి ప్రజాపతికి, ప్రజాపతి నుండి మనువుకు, మనువు నుంచి ప్రజలకు బోధింపబడింది. గురు శుశ్రూష చేస్తూ పూర్ణప్రజ్ఞ కలవారై జ్ఞానప్రాప్తిని పొంది సద్గురువు ఆజ్ఞతో గృహస్తాశ్రమం లో ఉంటూ సత్సంతానాన్ని, జ్ఞానకాంక్షులైన శిష్యులను పొంది శాస్త్ర విహితమైన కర్మలనాచరిస్తూ దేశకాల ప్రవృత్తి ననుసరించి, అహింసావ్రతులై యావజ్జీవితము గడిపిన వ్యక్తి బ్రహ్మ లోకాన్ని పొందుతాడు. అతనికి జన్మరాహిత్యం కలుగుతుంది. నచ పునరావర్తతే, నచ పున రా వర్తతే అంటూ చాందోగ్యోపనిషత్తు ముగుస్తుంది.
***
147.ఉపనిషద్విచారణ
147. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు:-
చాందోగ్యోపనిషత్తు ముగించుకొని మనం దశోపనిషత్తులలో చివరిదైన బృహదారణ్యకో పనిషత్తులోకి ప్రవేశిస్తున్నాము. ఉపనిష ద్వాజ్ఞ్మయానికే తలమానిక అయినదీ ఉపనిషత్తు. శుక్ల యజుర్వేదాంతర్గతమైనది. శతపథ బ్రాహ్మణంలో చివరగా ఉంది.
బృహత్ అంటే పరిమాణంలో అతిపెద్దది అని అర్ధం. పరిమాణం లోనే కాక, విషయ విశిష్టత, సమగ్రత, వివరణల న్నింటిలోనూ గొప్పదే. ఈ ఉపనిషత్తు కాణ్వశాఖ, మాంధ్యందినశాఖ అని రెండు శాఖలుగా ప్రచారంలో ఉంది. శ్రీ ఆది శంకరులు కాణ్వ శాఖ ననుసరించి వ్యాఖ్యానం వ్రాశారు.
బృహదారణ్యకోపనిషత్తు 8 అధ్యాయాల గ్రంథం. వీటిలో ఒకటి, రెండు అధ్యాయాలు కర్మాంగాలు అయిన ప్రవర్గ్యోపనిషత్తులను ప్రతిపాదిస్తున్నాయి. బ్రహ్మవిద్యతో సంబంధము లేని ఈ రెండు అధ్యాయాలకు శంకరభాష్యం లో వివరణ లేదు.
మూడు, నాలుగు అధ్యాయాలలో మధుకాండ, కర్మోపాసన ద్వారా వచ్చేజ్ఞానం గురించి చెప్ప బడింది. 5,6 అధ్యాయాలలో యాజ్ఞవల్క్యకాండ అంటూ బ్రహ్మజ్ఞానాన్ని వివరించారు. యాజ్ఞ వల్క్యుడు జనకుని సభలో జనకుని పురోహితు డైన అశ్వలుడుని, గార్గి అనే బ్రహ్మ వాదినిని ఓడించి బ్రహ్మజ్ఞానాన్ని వివరించడం జరిగింది. 7,8 అధ్యాయాలలో ఖిలకాండ అంటూ పర అపర విద్యల లో మిగిలిన విషయాలను చర్చించారు.
ఈ ఉపనిషత్తు పూర్ణమదః పూర్ణమిదం… అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే।।
అది అంటే ఆ బ్రహ్మం పూర్ణం. ఇది అంటే ఈ జగత్తు పూర్ణం. ఆ పూర్ణం నుంచే ఈ పూర్ణం బయటకు వచ్చినా అక్కడ పూర్ణుడు పూర్ణుడిగానే ఉన్నాడు.
తృతీయాధ్యాయం ప్రధమ బ్రాహ్మణం:
తృతీయాధ్యాయంతో బృహదారణ్యకోపనిషత్తు మొదలవుతుంది. ప్రధమ బ్రాహ్మణం లో ప్రజాపతి వివరించిన అశ్వమేధయాగ వర్ణన ఉంది.
ఓం ఉషావా అశ్వస్య మేధస్య శిరః సూర్యశచక్షు ర్వాతః ప్రాణో వ్యాత్త మగ్ని ర్వైశ్వానర స్సంవత్సర ఆత్మాశ్వస్య మేధ్యస్య ద్యౌః పృష్ఠమన్తరిక్ష ముదరం పృథివీ పాజస్యమ్…
అశ్వమేధ యాగంలో యజ్ఞాశ్వం యొక్క శిరస్సు ఉషస్సు (బ్రహ్మీ ముహూర్తం), సూర్యుడే కన్ను, వాయువే ప్రాణం, తెరవబడిన ముఖమే వైశ్వానరాగ్ని, దేహం సంవత్సరం, వీపు ద్యులోకం, ఉదరం ఆకాశం, పాదాసన స్థానం భూమి, పార్శ్వాలు దిక్కులు, ప్రక్కలలో ఉన్న ఎముకలు ఈశాన్యాది విదిక్తులు, అవయవములే ఆరు ఋతువులు, మాంసం ఆకాశంలో ఉన్న మేఘాలు, కడుపులో ఉన్న అశనం ఇసుక, నాడులే నదులు, వెంట్రుకలు ఓషధులు మరియు వనస్పతులు; ఇంక అశ్వం యొక్క పూర్వభాగం మధ్యాహ్నం వరకూ ప్రకాశించు సూర్యుడు, ఉత్తర భాగం సాయంత్రం వరకూ ప్రకాశించు సూర్యుడు, అశ్వం యొక్క అంగాలను విస్తరింప జేయడమే విద్యుత్తులు, అంగాలను కంపింపజేయడమే ఉరుములు, మూత్రవిసర్జనమే వర్షము శబ్దం చేయడమే వాక్కు అని ప్రజాపతి వివరించేడు.
ఈ అశ్వానికి ముందు వెనుక భాగములు లో ఉన్న స్వర్ణ రజత పాత్రలను అహోరాతిరాలుగాను, ఆ పాత్రలను పెట్టే స్తానాలను పూర్వ పశ్చిమ సముద్రాలుగాను ధ్యానించాలి. ఇలా ప్రజా ప్రత్యంగ సదృశముగా ధ్యానింపబడిన అవయవములు గల అశ్వానికి సముద్రం ఉత్పత్తి స్థానమవడం వల్లసముద్రాన్ని బంధువుగా ధ్యానించాలి.
ఇక్కడ విశ్వాన్నే గుర్రం తో పోల్చేరు. తేజస్సే ఆకృతులుగా మారిన ఆ పూర్వపు వెలుగును దాని శిరస్సుగాను, సర్వత్ర వ్యాపించిన వాయువే ప్రాణమనీ సముద్రమే దాన్ని ప్రతిష్ఠించిన బంధువని దానినఉత్పత్తికి కారణమనీ వివరించబడింది.
***
148.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
148. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: ద్వితీయ బ్రాహ్మణం:-
ఓమ్ నైవేహ కించనాగ్ర అసీన్మృత్యునై వేదమావృత మాసీత్।
అశనాయయాశనాయా హి మృత్యు స్తన్మనోకురు తాత్మన్వీ స్యామితి।
విశ్వం రూపొందే దానికి ముందు ఏమీ లేదు. అంటే ఈ అనంత సంసార చక్రం లో సృష్టికి ముందు ఏమీ లేదు. భక్షించడమనే ఒకే ఒక కోరిక గలిగిన హిరణ్యగర్భుని చేతనే సమస్త జగత్తు ఆవరింపబడి ఉంది. అంటే మృత్యువు చేతనే ఆవరింపబడి ఉంది. తాను ఆత్మవంతుడుగా అవాలి అని మృత్యువు కోరుకుంది. ఆ మృత్యువు తనను తాను అర్చిస్తూ సంచరించగా జలం ఉత్పత్తి అయ్యింది.
ఇక్కడ మృత్యువు అనేశబ్దాన్ని స్వామీ జయతీర్ధులు (యోగి అచ్యుతుల శిష్యులు) ఆత్మ స్థానం నుంచి విడివడి క్రిందకు దిగి బయటపడిన శక్తి “ ప్రాణశక్తి “ గా వివరించారు. తనను తాను అర్చిస్తూ సంచరించగా అన్నదానికి ప్రాణాయామ ప్రక్రియ ద్వారా స్పందించినప్పుడు ప్రప్రధమంగా వాయురూపంలో వ్యాప్తమయి దాని నుంచి తేజస్సు, తేజస్సునుంచి జలం ఉత్పత్తి అయ్యాయని భావం. ముందుగా స్థూల రూపం గా కన్పడిన జలాన్ని మాత్రమే ఉపనిషత్కారులు సూచించారని వివరణ ఇచ్చారు.”
ఆపోవా అర్కస్తద్యదపాగ్ం శర ఆసీ త్తత్సమహన్యత।
సా పృథివ్య భవ త్తస్యామ శ్రామత్ తస్య శ్రాన్తస్య తప్తస్య తేజోరసో నిరవర్తాగ్నిః
ఉదకాలు అర్క స్వరూపం. అంటే తేజస్సుతోనే నీరు ఏర్పడిందని అర్ధం. ఏది నీటి యొక్క మీగడ వంటి రూపం ఉందోఅది ఘనీభవించి భూమిగా మారింది. ఈ క్రమం లో మృత్యువు శ్రమను, సంతాపము, బడలికను పొందడం వల్ల ఉత్పత్తి అయిన తేజస్సు యొక్క సారమే అగ్ని అయ్యింది.
స త్రేధాత్మానం వ్యకురుతాదిత్యం తృతీయం వాయుం తృతీయగ్ం స ఏష ప్రాణః త్రేధా విహితః తస్య ప్రాచీదిక్సిరో సౌ చాసౌ చేర్మౌ।
వాయువు, అగ్ని, ఆదిత్యుడు- ఇలా మృత్యువు (ప్రాణశక్తి) మూడువిధాలుగా అయ్యాడు. ఇలా వేరుపరచ బడిన పరమాత్మ స్వరూపమైన ఆ అగ్నికి తూర్పు దిక్కు శిరస్సు, ఈశాన్య ఆగ్నేయాలు రెండూ రెండు బాహువులు, పశ్చిమ దిక్కు దేహం యొక్క క్రింది భాగం, వాయువ్య నైఋతి దిక్కులు రెండు తొడలు, దక్షిణ ఉత్తరాలు రెండూ రెండు పార్శ్వములు, ద్యులోకం వీపు, ఆకాశం కడుపు, భూమి వక్షస్థలం అయి ఉన్నాయి. ఇటువంటి అగ్ని ఉదకాలలో ఉంచబడింది.
సో కామయత ద్వితీయో మ ఆత్మజాయే తేతి స మనసా వాచం మిథునగ్ం సమభవత్ అశనాయా మృత్యుస్తద్యద్రేత. ఆసీత్స సంవత్సరో భవత్।
ఆ హిరణ్యగర్భుడు తనకు రెండో ఆత్మ పుట్టాలని కోరుకుంటే వేదవాక్కు (వాణి) పుట్టింది. ఈ వాణి ఆత్మల మిథునం వల్ల ఋక్, యజుస్, సామ ఛందస్సు, యజ్ఞం, ప్రజలు పశువులు సృష్టించ బడ్డాయి.
ఇంకా సమస్తమైన క్రియలను, క్రియాఫలాలనుకూడా సృజించేడు. ఆ పరమాత్మ దేనినయితే సృజించేడో దానినంతనూ తినాలని తలచేడు. అలా తలచడం వల్ల అతనికి అదితిత్వం కలిగింది. కనుక ఈ సమస్త జగత్తుకి ఆ పరమాత్మ బక్షకుడయ్యాడు. ఈ సమస్త జగత్తు ఆ పరమాత్మకు అన్నమయ్యింది.
సోకామయత భూయసా యజ్ఞేన భూయో యజేయేతి।
సో శ్రామ్యత్స తపోతప్యత తస్య శ్రాన్తస్య తప్తస్య యశోవీర్య ముదక్రామత్।
ప్రజాపతి తిరిగి శ్రమతోతపస్సు చేశాడు.
చక్షురాది ఇంద్రియ సాధ్యాలయిన యశో వీర్యాలు పుట్టాయి. (ప్రాణా వై యశోవీర్యం )
పంచప్రాణాలు, కీర్తీ వీర్యాలు బహిర్గతమయ్యాయి. ఆ యశో వీర్యాలు ప్రాణ స్వరూపాలయిన జ్ఞానేంద్రియాలుగానే ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నీ బహిర్గతమవ్వగానే హిరణ్య గర్భుని శరీరం అపవిత్రమై బలహీన మయ్యింది. అప్పుడు అతని మనస్సు శరీరం మీదే ప్రీతి గలదిగా ఉంది.
ఈ విధమైన ప్రజాపతి శరీరం అశ్వాన్ని సృష్టించి అశ్వమేధమని యజ్ఞ సంబంధమైనదిగా మారింది అంటూ మరిన్ని యజ్ఞ వివరాలతో ద్వితీయ బ్రాహ్మణం పూర్తవుతుంది.
***
149.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
149. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: తృతీయ బ్రాహ్మణమ్:-
ద్వయా హ ప్రాజాపత్యాః దేవాశ్చాసురాశ్చ।
తతః కానీయసా ఏవ దేవా।
జ్యాయసా అసురాః త ఏషు లోకేష్వస్పర్ధన్త తే హ దేవా ఊచుర్హన్తాసు రాన్యజ్ఞ ఉద్గీథేనాత్యయా మేతి।
ఈ బ్రాహ్మణం ఎలా మొదలవుతోందంటే ప్రజాపతి యొక్క సంతానమైన దేవతలు అసురులు అతి తక్కువ సమయంలోనే ఈ లోకలమీద ఆధిపత్యం తమదంటే తమదని కలహించుకోసాగేరు. రాక్షసులు ఆ స్వల్ప కాలం లోనే చాలా అధిక సంఖ్యలో పెరిగిపోయారు. దేవతలు మాత్రం స్వల్ప సంఖ్యలోనే ఉన్నారు.
రాక్షసులను జయించడానికి దేవతలు ఉద్గీథోపాసన చేయడమే సరయినదని ఉద్గాత గురించి వెతకడం మొదలు పెట్టేరు.
చాందోగ్యోపనిషత్తు చూస్తే మొదటి ప్రపాఠకమంతా ఓం కారమనే అక్షరమే ఉద్గీథము. దీనినే ప్రణవగానం అంటారు అంటూ ఓంకారం యొక్క అనుష్టానాన్ని వివరించేరు. అదే విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తు లోని మూడవ అధ్యాయం తృతీయ బ్రాహ్మణం లో మరింత వివరంగా చెప్పేరు.
తే హ వాచమూచు స్త్వం న ఉద్గాయేతి తథేతి తేభ్యో వాగుదగాయత్।
ఆ దేవతలు వాగభిమాన దేవతను తమకొరకు ఔద్గాత్య కర్మ ను చేయమని ప్రార్ధించేరు. వాక్కు ఆధారముగా ఉద్గీథము చేయగా దేవతలు ఆ ఉద్గాతను హతం చేసేరుట. అంటే దేవతలు ఓడిపోయారు.
అనంతరం దేవతలు ఘ్రాణేంద్రియాన్ని ప్రార్ధించగా ముక్కుద్వారా చేసిన ఓంకారనుష్టానాన్ని రాక్షసులు త్రిప్పికొట్టేరు.
చక్షురింద్రియాన్ని ఆధారంగా చేసుకొని ఉద్గీథగానాన్ని రాక్షసులు నశింపజేసేరుట.
అప్పుడు దేవతలు శ్రోత్రేంద్రియాన్ని ప్రార్ధించగా ఆ శ్రోత్రము సరేయని దేవతల కొరకై ఉద్గీథాన్ని గానం చేసింది. అయినా దేవతలు రాక్షసులనుండి రక్షింప బడలేక పోయారు.
దేవతలప్పుడు మనోధిష్ఠాన దేవతను ప్రార్ధించేరు ఉద్గీథగానానికై. అప్పుడు, అసురులకు సంబంధించిన మనో వ్యాపారంతో దేవతల మనస్సు పాప పంకిలమై పోగా రాక్షసులు దేవతలను జయించేరు.
ఈ విధంగా పంచేంద్రియాలు, షష్టమ ఇంద్రియమైన మనస్సుతో కలిపిన అన్ని ఇంద్రియాలు అపరిశుద్ధమై పోయాయి కాని దేవతలకు జయం చేకూర లేదు.
అథ హేమమాసన్యం ప్రాణమూచు స్త్వం న ఉద్గాయేతి త థేతి తేభ్య ఏష ప్రాణ ఉదగాయత్తే విదు రనేన వై న ఉద్గా త్రాత్యేష న్తీతి తమభిద్రుత్య పాప్మనా విధ్యన్ స యథాశ్మాన మృత్వా లోష్టో విధ్వగ్ం సేతైవగ్ం హైవ విధ్వగ్ం సమానా విష్వఞ్చో వినేశుస్తతో దేవా అభవన్ పరాసురాః భవత్యాత్మనా పరాస్య ద్విషన్ పాప్మా భ్రాతృవ్యో భవతే య ఏవం వేద।।
దేవతలప్పుడు వదనగుహ లో ఉండే ప్రాణాన్ని చేరి ఓ ముఖ్య ప్రాణమా! నీవు మాకొరకు ఔద్గాత్ర కర్మను చేయుమా అని ప్రార్ధించేరు. వదనగుహలో ఉండేటటువంటి ముఖ్య ప్రాణం సరే అలానే చేస్తాను అని చెప్పి ఉద్గీథ గానాన్ని చేసింది.
అప్పుడు ఆ రాక్షసులు ఇంతకు ముందు ఇంద్రియాలను పాప పంకిలం చేసి నశింప జేసినట్లే ముఖ్య ప్రాణాన్ని, బండ రాయిని, కొట్టడానికై వెళ్ళిన మట్టిపెళ్ళ వలే వెళ్ళేరు. కాని ఆ పాషాణాన్ని కొట్టలేక రాక్షసులు నశించేరు.
అలా రాక్షసులు నశించడం తోనే వాగాది ఇంద్రియాలు ఈ పిండ మాత్రమైన దేహం లో దేవత్వాన్ని పొందేయి.
ఈ విధంగా ఓంకారనుష్ఠానాన్ని ముఖ్యప్రాణం యొక్క సాయంతో చేసిన వారు దేహాభిమానాన్ని విడిచి ప్రజాపతిత్వాన్ని పొందుతున్నారు.
వచ్చే భాగంలో ఈ తృతీయ బ్రాహ్మణం లోని అతి ముఖ్యమైన మంత్రం “అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాఽమృతంగమయ” గురించి చదువుకుందాం.
***
ఓం నమః శివాయ:
150.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
150. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: తృతీయ బ్రాహ్మణమ్(Continued)
చాలా శ్రద్ధగా రెండుమూడు సార్లు చదివి అర్ధం చేసుకోండి:-
వదన గుహలో ఉండే ఏ ప్రాణాన్నయితే ఆధారంగా జేసుకొని ఉద్గీథగానాన్ని చేసేరో ఆ ముఖ్య ప్రాణం యొక్క వివరణ ఇస్తున్నారిక్కడ.
తే హోచుః క్వను సోఽభూద్యో న ఇత్థమస క్తేత్యయ మాస్యేఽన్తరితి సోఽయాస్య అజ్ఞ్గిరసోజ్ఞానాగ్ం హి రసః ।
ఏ ప్రాణం వల్ల మనం ఈరకమైన దైవీభావాన్ని పొందేమో ఆ ప్రాణం ఎక్కడ ఉంది? అని దేవతలు ప్రశ్నించేరు. ప్రత్యక్షముగా ముఖమధ్యం లో ఉన్న(భ్రూమధ్యానికి వెనుకగా, గురుస్తానానికి పై భాగం లో అంటే కొండనాలుక పైభాగం లో నివశించే) ప్రాణాన్ని పొందగలిగేరు. ఇందువల్లే ప్రాణాన్ని అయాస్యమని అంటారు. కార్యకారణాలకునిలయమైన సర్వావయవములలో శ్రేష్ఠమైనది ఆత్మ అవడం వల్ల దానిని ఆజ్ఞ్గీరసము అన్నారు. (ఆంగిరసము= దేహ అవయవములకు సారభూతమైనది అని అర్ధం).
సావా ఏషా దేవతా దూర్నామ దూరగ్ం హ్యస్యా మృత్యుర్దూరగ్ం హ వా అస్మా న్మృత్యు ర్భవతి య ఏవం వేద।
ఆ దేవత దూర్ అనే పేరు గలవాడు ఎందుకంటే మృత్యువు అతనికి దూరంగా ఉంటుంది. ఈ ప్రాణ దేవత ఇంద్రియాల వృత్తులవలన పుట్టిన పాపాన్ని పోగొడుతుంది. ఆ ఇంద్రియాలను ప్రాక్ పశ్చిమ దిగ్భేదాలు లేని ప్రదేశం లోకి నెట్టి వేస్తూంది. కాబట్టి మృత్యు స్వరూపమైన పాపము ఆ ప్రాణోపాసకుని చెంతకు చేరలేదు. ఇక్కడ సాధకుని ఇంద్రియాలు ఏరకంగా అమరత్వాన్ని పొందుతున్నాయో వివరిస్తున్నాడు.
ఆ ప్రాణం ఉద్గీథ కర్మలో ప్రధానమైన వాక్కును మృత్యువు కంటే మిన్నగా చేసింది. ఆ వాక్కు మృత్యువు నధిగమించడం ద్వారా తన స్వస్వరూపమైన అగ్నిగా ప్రకాశించింది.
ప్రాణ వాయువు, ఘ్రాణము (నాశిక) ఉద్గీథోపాసన వల్ల మృత్యు స్వరూపాన్ని విడిచి వాయు స్వరూపమయ్యింది. నేత్రేంద్రియం సూర్య స్వరూపమై ప్రకాశిస్తోంది. శ్రోత్రేంద్రియం (చెవి, వినికిడి) దిగ్దేవతా స్వరూపమై ప్రకాశిస్తోంది.
మనస్సు ఆ ప్రాణదేవతోపాసన వల్ల మృత్యు రూపాన్ని విడిచి, చంద్ర స్వరూపమై మృత్యువు లేకనే ప్రకాశిస్తోంది. (ప్రాణ దేవతోపాసన వల్ల వాక్కు, ఘ్రాణం, చక్షుస్సు, శ్రోత్రం, మనస్సులు వాటి ఆధి దైవిక రూపాలయిన అగ్ని, వాయువు, ఆదిత్యుడు, దిక్కులు, చంద్రుడుగా అయి ప్రకాశిస్తున్నారు.)
అథాత్మనేఽన్నాద్య మాగాయద్యద్ధి కిఞ్చాన్న మద్యతేఽనేనైవ తదద్యత ఇహ ప్రతితిష్ఠతి।।
అప్పుడు ప్రాణం తన కొరకు భక్షణార్హమైన అన్నమును గూర్చి ఉద్గీథగానాన్ని చేసింది.
ఇక్కడ ప్రాణోపాసనవల్ల (ఉద్గీథోపాసన) అశనోత్పత్తి జరుగుతుంది అని, మన శరీరానికి మనం ఇచ్చే స్థూల ఆహారం ప్రాణ శక్తికి తగిన బలాన్నివ్వదని వివరించారు.
ముఖ్యప్రాణుని ఆధారంగా చేసే ఉద్గీథగానం వల్ల ముందుగా ఇంద్రియాలన్నీ శుద్ధి చేయబడి అమరత్వాన్ని పొందుతాయని, అప్పుడు, ప్రాణానికి బక్షణార్హమైన అశనోత్పత్తి జరుగుతుందని దీని అర్ధం.
అప్పుడు అశనోత్పత్తికై ఉద్గీథాన్ని చేస్తున్న ప్రాణం తో వాగాది ఇంద్రియాలు “ఓ ప్రాణమా! నీవు అశనోత్పత్తితో అశన స్వీకారం వల్ల తుష్టుడవై ఉన్నావు. మమ్ములను కూడా ఆ అన్నములో చేర్చుకోండి” అని ప్రార్ధించేయి. “మీకు అన్నము కావాలంటే నాలో అభిముఖంగా ప్రవేశించండి” అని చెప్పింది ప్రాణం. వాగీంద్రియ దేవతలంతా ప్రాణం ద్వారా అశనాన్ని పొంది తృప్తి చెందు తున్నారు. ఈ విధంగా అవయవములకు రస రూపమైనది కాబట్టే ప్రాణాన్ని అంగీరసము అన్నారు.
ఏష ఉ ఏవ బృహస్పతి ర్వాగ్వై బృహతీ తస్యా ఏష పతి స్తస్మాదు బృహస్పతిః।।
ఈ ప్రాణమే బృహస్పతి రూపమైన ఋగ్వేదానికి పతి. వాక్కే బృహతీ ఛన్దస్సు. ఆ బృహతీ ఛన్దో రూపమైన ఋగ్వేదానికి ఈ ప్రాణమే ప్రభువు. అందువల్ల ప్రాణం బృహస్పతి అవుతోంది.
ఈ ప్రాణమే వాగ్రూపమైన యజుర్వేదానికి అధిపతి. బ్రహ్మ స్వరూపం అవుతోంది.
ఈ ప్రాణమే సామము. వాక్కు కూడా సామము. ‘సా’మరియు ‘అమ’ అనే వాటి కలయికయై ఉంది. ఇదే సామము యొక్క సమ రసత్వము. ఈ ప్రాణము అనేది మధుపానికి, మశకానికి, ఏనుగుకు, ఈ మూడు లోకాలకు, ఈ సర్వస్వం లోను ఒక అణువు కూడా అధికంగా లేకుండా సమానంగా ఉండడం వల్ల ప్రాణం (వాక్కు) సామము అనిపించుకొంటుంది.
దీనిని బట్టి వాక్కే ఋక్కు, వాక్కే యజుస్సు, వాక్కే సామము అనబడుతోంది.
వాక్ ప్రాణ సముదాయమే ఉద్గీథము. ప్రాణమే ‘ఉత్’. ప్రాణం వల్లే ఈ సర్వస్వం ధరింప బడుతోంది. వాక్కే ‘గీథము’. అందుచేత ఉత్ మరియు గీథము కలిసి ఉద్గీథము అవుతోంది.
ఉద్గీథరూపమైన ప్రాణ స్వరూపమగు సామమునకు మాధుర్య ధ్వనియే ధనము.
సామశబ్ద వాచ్యమైన ప్రాణానికి స్వరమే భూషణం, సువర్ణం. ఆ సామ్య శబ్ద వాచ్యమైన ప్రాణానికి వక్షస్థలము, కంఠము, శిరస్సు, జిహ్వ మూలం, దంతములు, ముక్కు పెదవులు, దవుడలు అనే ఈ ఎనిమిది స్వరూపముగా గల వాక్కే స్థానమవుతోంది. అటువంటి వాక్కులో ఈ ముఖ్య ప్రాణం సామగానాన్ని చేస్తూంది. ఈ రీతిగా ముఖ్యప్రాణం యొక్క స్థానాన్ని తెలుసుకొన్న వ్యక్తి ప్రాణ తేజస్సును పొందిన వాడవుతాడు.
ఇప్పుడు పవమానము అనే పేరు గల మంత్రాల యొక్క గాన రీతులు చెప్పబడుతున్నాయి. ప్రాణ విజ్ఞానాన్ని తెలుసుకున్న వారికి, అంటే ఉద్గీథగానాన్ని చేసేవారికి చెప్పబడే పవమాన మంత్రాలు ఇవి.
అథాతః పవమానానామేవాభ్యారోహః స వై ఖలు ప్రస్తోతా సామ ప్రస్తౌతి స యత్ర ప్రస్తుయా త్తదేతాని జపేత్। అసతోమా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాఽమృతంగమయ ఏతి స యదా హా సతో మా సద్గమయేతి…।
“అసతోమా సద్గమయ,”
“తమసోమా జ్యోతిర్గమయా,”
“మృత్యోర్మా అమృతం గమయ”
అనే మూడు మంత్రాలు పవమానాలు అనబడతాయి.
అసతోమా సద్గమయ – నన్ను అసత్తు నుండి అంటే జడత్వం నుంచి, చెడునుంచి సత్తు లోనికి అంటే చైతన్యం లోనికి (మంచి వైపుకు) నడిపించు.
తమసోమా జ్యోతిర్గమయ – తమస్సు నుంచి అంటే చీకటి లేదా అజ్ఞానం నుంచి జ్యోతి లోనికి అంటే వెలుగు లేదా జ్ఞానం వైపుకు నడిపించు.
మృత్యోర్మాఽమృతం గమయ – మృత్యువు నుంచి అమృతత్వం వైపుకు నడిపించు. మృత్యువే అసత్తు. సత్తే అమృతము. మృత్యువును దాటించి నాకు అమృతత్వాన్ని ప్రసాదించమని అర్ధం.
ఈ విధంగా ప్రాణాన్ని తెలుసుకుని ఉపాసించే వారికి బ్రహ్మ స్వరూపావ్యాప్తికి పైన చెప్పిన మూడు పవమాన మంత్రములు తప్ప వేరే ప్రార్ధనే లేదు. ఇక్కడ ఉద్గాథ బ్రహ్మ స్వరూపి అవుతున్నాడు.
ప్రాణోపాసన చేసే వారికి, ఉద్గీథగానాన్ని చేసే సాధకులకు పై మూడు పవమాన మంత్రాలు ఎంత ముఖ్యమో అర్ధం చేసుకోండి.
అసత్తు(జడత్వం) నుంచి సత్ (చైతన్యం) లోనికి; తమస్సు (అజ్ఞానం) నుంచి జ్యోతి (జ్ఞానం) లోనికి; మృత్యువు నుంచి అమృతత్వం లోకి నడిపించ గలిగే సాధన – ముఖ్య ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని చేసే ఓంకారనుష్ఠానం (ఉద్గీథగానము) ఒక్కటి మాత్రమే.
***
151.ఉపనిషద్విచారణ
ప్రాంజలి ప్రభ
🕉🌞🌏🌙🌟🚩
151. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: తృతీయాధ్యాయం. చతుర్ధ బ్రాహ్మణమ్:
ఈ చతుర్ధ బ్రాహ్మణం లో పంచ మహా వాక్యాలలో ఒకటైన “అహం బ్రహ్మాస్మి” అనే వాక్యం ప్రతిపాదించబడి నిరూపించబడింది.
ఇంకొక్క మహత్తరమైన విషయం సత్యం ధర్మం అనేవి రెండు కాదని ఒకటేననే సత్యం ఎంతో సరళ రీతిలో వివరించబడింది. వివరాలలోకి వెడదాము.
ఓం ఆత్మై వేదమగ్ర ఆసీత్ పురుషవిధః సోఽనువీక్ష్య నాన్యదాత్మనోఽపశ్యత్ సోఽహమస్మీ త్యగ్రే వ్యాహరత్తతో హన్నా మాభవత్….
ఈ శరీరోత్పత్తి కంటే పూర్వము అంటే విశ్వం యొక్క ఆవిర్భావానికి ముందు పురషరూపి యైన ఆత్మ (పరమాత్మ) ఒక్కటే ఉండేది. అంటే విశ్వమంతాఆత్మ స్వరూపం గానే ఉంది.
సవై నైవరేమే తస్మాదేకాకీ న రమతే స ద్వితీయ మైచ్ఛత్।
స హైతావానాస యథా స్త్రీపుమాగ్ంసౌ సంపరిష్వక్తౌ స ఇమ మే వాత్మానం ద్వేధా పాత యత్తతః పతిశ్చ పత్నీ చాభవతాం…
ఆ ప్రజాపతి తాను ఒక్కడే సర్వస్వంగా ఉండటాన్ని చూసి తృప్తి చెందలేదు. అప్పుడు తనను తాను రెండు గా విభజించుకున్నాడు. అప్పుడతడే సతి పతి అని ఇద్దరు వ్యక్తులుగా మారేడు. అందుకే యాజ్ఞవల్క్య ఋషి మనుష్యుడు చీల్చిన వెదురు బొంగు వలే ఉన్నాడు అని చెప్పేడు. పురుషుడు ఉండే ఈ అర్ధ భాగం స్త్రీచేత పూర్తి చేయ బడుతోంది. ఆస్త్రీ పురుషుల వల్లే మానవ జాతి అభివృద్ధి చెందింది.
ఆ స్త్రీ యే తిరిగి గోరూపము తో జన్మ ఎత్తింది. అప్పుడు ఆ ప్రజాపతి వృషభ రూపమై వచ్చి ఆమెతో కూడి ఎద్దులను ఆవులను వృద్ధిచేసేడు. తిరిగి ఆమె ఆడ గుర్రముగా జన్మిస్తే, ప్రజాపతి మొగ గుర్రమయ్యాడు. అదేరీతి పిపీలికాది సమస్త జీవరాసులు ఉత్పన్నమయ్యాయి.
సమస్త దేవతా స్వరూపమైన విశేష సృష్టి అంతా ఆ ప్రజాపతియే అని గ్రహించాలి. ఈ సృష్టి ఎంతో అతిశయమైనది. అటువంటి అతిశయమైన ప్రజాపతి యొక్క సృష్టిని ఆత్మ స్వరూపమైన దానిగా తెలుసుకున్న వాడు ఈ సమస్త సృష్టిలో ప్రజాపతి లాగే సృష్టి కర్త అవుతున్నాడు.
ఈ సమస్త సృష్టి మొదట అవ్యక్తం గా ఉంది. అది నామ రూపాల వల్ల వ్యక్తమయ్యింది. వస్తువులన్నీ దీని రూపమిది, దీని పేరుఇది అని వ్యక్త మయ్యాయి.
నఖ శిఖ పర్యంతము వ్యక్తమయిన జీవుల దేహములలో ఆ సృష్టి కర్త ప్రవేశించి ఉన్నాడు. దానిని ఎలా పోల్చేరంటే కత్తి ఒరలో ఉన్నప్పుడు ఎలాఅయితే కనపడదో, పరమాత్మ, ఒరవలే ఉన్న ఈ జగద్వస్తువులన్నింటా నిండి ఉన్నాడు. కాని సృష్టిలో ఎక్కడా కనుపించడు. జనులతనిని చూడలేరు.
అవ్యక్తమైన ఆ పరమాత్మ జీవుల యొక్క దేహాలలో ప్రవేశించి, ప్రాణ వాయువు యొక్క గమనాది వ్యాపారాన్ని చేస్తూ ప్రాణి అనే పేరుతోను; వాగ్వ్యాపారం చేస్తూ వాక్కనే పేరు తోను; ఈక్షణ (వీక్షణ) వ్యాపారం చేస్తూ నేత్రమనే పేరు తోను; శ్రవణవ్యాపారం చేస్తూ శ్రోత్రమనే పేరుతోను, మనో వ్యాపారం చేస్తూ మనస్సనే పేరుతోను ప్రవర్తిస్తోంది. దేహం లో ప్రవేశించి ఉండడం వల్ల ఆ ఆత్మకు (జీవాత్మకు) ఆయా కర్మల వల్ల ఆ పేర్లన్నీ పుడుతున్నాయి.
ఎప్పుడయితే జీవాత్మ తన స్వభావ ప్రవృత్తితో అన్ని వ్యాపారాలను విడిచి తనను తాను ఆత్మ స్వరూపము గా చూస్తున్నాడో అప్పుడు సంపూర్ణాత్మ అవుతున్నాడు. కాబట్టి సర్వముఆత్మ స్వరూపమే అని ఉపాసించాలి.
తదాహు ర్యద్బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యన్తో మనుష్య మన్యన్తే కిము తద్బ్రహ్మా వై (వే) ద్యస్మా త్త త్సర్వ మభవ దితి।
మనుష్యులు బ్రహ్మ విద్యా మహిమ చే మేమే ఈ సర్వస్వము అవుతాము అంటారు. బ్రహ్మమంటే ఏమిటి? దేని వల్ల సమస్తము సృష్టింప బడిందో అట్టి పరబ్రహ్మను ఎవరు తెలుసుకున్నారు? జిజ్ఞాసువులు ఈ రెండు ప్రశ్నలను సంధించారు.
బ్రహ్మ వా ఇద మగ్ర అసీత్త దాత్మానమేవావై (వే) త్।
అహం బ్రహ్మాస్మీతి। తస్మాత్తత్సర్వ మభవత్ తద్యో యో దేవానాం…
సృష్టికి ముందు పరబ్రహ్మస్వరూపం అలానే ఉంది. మొదట ఉన్నది బ్రహ్మమే. అదే సర్వ వ్యాప్తమయ్యింది. ఆ పరబ్రహ్మను నేను. నేను పరబ్రహ్మ గా అయి ఉన్నాను అని తనను తాను తెలుసుకున్నాడు. ఈ రీతిగా అహం బ్రహ్మస్మి అని తెలుసుకున్న వాడు ఆ పరబ్రహ్మమే అవు తున్నాడు.
వామదేవ ఋషి ఈ పరబ్రహ్మ స్వరూపాన్నే దర్శిస్తూ నేను మనువు నయ్యాను. సూర్యుడనయ్యాను. అని భావిస్తూ నేను బ్రహ్మమే అవుతున్నాడు. అట్టి బ్రహ్మ వేత్తతో దేవతలు కూడా విరోధించ లేరు. ఆ పరబ్రహ్మ వేత్త ఈ దేవతలందరకూ ఆత్మ స్వరూపంగా అవుతున్నాడు.
బ్రహ్మవేత్తకాని పురుషుడు నేను, నేను ఉపాసించెడి దైవము వేరు వేరని తలుస్తూ అజ్ఞానం లో ఉన్నాడు. ఈ ఉపనిషత్తు ఏమి చెబుతోందంటే “మనుష్యులు బ్రహ్మజ్ఞాన సంపన్నులైతే యజ్ఞయాగాది క్రతువులను వీడి, నిత్య నైమిత్తికర్మలను మానితే దేవతలకు హవ్య కవ్యాలు ముట్టవని దేవతలు మానవులకు ఆత్మజ్ఞాన సముపార్జనాక్రియ లో అవరోధాలను కల్పిస్తారని”.
వచ్చే భాగం లో చతుర్వధ పురుషార్ధాలయిన ధర్మార్ధకామ మోక్షాలలో సత్యం ఎందుకు చోటు చేసకోలేదు అనే విషయాన్ని చూద్దాం.
***
152.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
152. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: తృతీయాధ్యాయం. చతుర్ధబ్రాహ్మణమ్(Continued):
బ్రహ్మవా ఇదమగ్ర ఆసీదేకమేవ తదేకగ్ం స న్న వ్యభవత్త చ్ఛ్రేయో రూపమత్య సృజత క్షత్రం యాన్యేతాని దేవత్రా క్షత్రా ణీంద్రో వరుణః సోమో రుద్రః పర్జన్యో యమోమృత్యురీశాత ఇతి తస్మాత్ క్షత్రాత్పరం నాస్తి…
పూర్వం అగ్ని స్వరూపాన్ని పొందిన బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉండడం వల్ల, ఎల్లప్పుడు బ్రహ్మత్వం లోనే ఉండిపోవడంత వల్ల కర్మ చేసేందుకు సాధ్యం కాలేదు. సదా బ్రహ్మత్వం లో ఉండే బ్రాహ్మణుల తర్వాత క్షత్రమనే శ్రేయో రూపాన్ని సృష్టించాడు. బ్రహ్మత్వం నుంచి బహిర్ముఖుడయ్యాక క్షాత్రత్వం పుట్టింది. క్షాత్రమెప్పుడూ క్రియాశీలతను కలిగి ఉంటుంది.
అందువల్ల క్రియాశీలురైన ఇంద్ర, వరుణ, సోమ, రుద్ర, పర్జన్య, ఋతు, మృత్యు, యమ, ఈశానాది క్షత్రియ దేవతల సృష్టి జరిగింది. కనుక క్షాత్రం కన్న శ్రేష్ఠమైనది ఏదీ లేదు. బ్రహ్మత్వపు యశస్సు క్షాత్రత్వం వల్లనే కలుగుతోంది. క్షత్రియుల ఉత్పత్తి తర్వాత వేర్వేరు కర్మల కోసం, వసు, రుద్ర, ఆదిత్య విశ్వదేవాది(వీరిని గణశః లేదా గణములని చెప్పబడే దేవతలు) వైశ్యులను, శూద్రులను (పురుషుడే సూద్రుడు. ఈ పృథివి అంతా పూష అని చెప్పబడుతుంది. ఎందుకంటే భూమే సర్వాన్ని పోషించేది కాబట్టి.) ఉత్పత్తి చేశాడు.
ఈ రీతిగా చాతుర్వర్ణాలను సృజించిన తర్వాత ఉగ్రమైన క్షత్రియజాతి కి (బలవంతునికి) నియామ కాలయిన విధులు లేకపోవడంవల్ల బ్రహ్మ ధర్మాన్ని సృష్టించేడు. మానవుడు తనంత తాను అనుసరించడానికి విధించుకునే నియమమే ధర్మం అనబడుతుంది.
అధో అబలీయాన్ బలీయాంస మాశంసతే ధర్మేణ యధా రాజ్ఞైనం యోవైస ధర్మః సత్యం వైతత్।
బలహీనుడు బలవంతుని ధర్మబలము చే జయించగలడు. ఇటువంటి ధర్మాన్నే శాస్త్రీయమైన సత్యం అంటారు. ధర్మమే సత్యం, ధర్మం అని రెండుగా మారింది. ధర్మం అంటే క్రమం తెలిసిన ఆచరణ అని, సత్యం అంటే సత్యవాక్కు అని అర్ధం.
తస్మాత్సత్యం వదంత మాహుర్ధర్మం వదతీతి ధర్మం వా వదంతం సత్యం వదాత్యేత ద్ధేవైత దుభయం భవతి।
ఎల్లప్పుడూ లోకములో సత్య ధర్మాలు రెండింటినీ తెలుసుకొని ప్రవర్తించే వాళ్ళు సత్యం చెప్పే వాడిని ధర్మం చెబుతున్నాడని, ధర్మం చెప్పేవాడిని సత్యం చెబుతున్నాడని చెబుతున్నారు. అందుకనే పునరుక్తి దోషం లేకుండా మొదటిదైన ధర్మాన్ని మాత్రమే చతుర్విధపురుషార్ధాలలో ముందుగా చెప్పేరు.
అవి ధర్మార్ధ కామ మోక్షాలు.
అథో అయం వా ఆత్మా సర్వేషాం భూతానాం లోకః స యజ్ఞుహోతి….।
ఈ జీవాత్మ యే సమస్త భూతాలకు అనుభవించ దగిన ఆత్మ గా ఉంది. గృహస్తు అయినటువంటి ఆ జీవుడు తను చేయు కర్మ విశేషం చేత సమస్త భూతాలకు ఉపకారం చేస్తున్నాడు. ఎలా అంటే యజ్ఞ కర్మ చేత దేవతలకు, స్వాధాయా యాధ్యయన కర్మలతో ఋషులకు, పిండోదకాలు ఇవ్వడం వల్ల పితృదేవతలకు, గృహమునందు అతిథులకు వసతిని, అన్నమును ఇవ్వడం ద్వారా మనుష్యులకు, గడ్డి ఉదరములనివ్వడం ద్వారా పశువులకు, బలి, అన్నపాత్రల క్షాళనం ద్వారా పిపీలికాది శ్వానములు మొదలైన జీవులకు, కాకాది పక్షులకు అజ్ఞానియై కర్మలు చేయడం ద్వారా ఉపకారాన్ని చేస్తున్నాడు. ఈరకంగా లబ్ధిని పొందిన సమస్త భూతములు గృహస్తుని రక్షిస్తున్నాయి. దీనినే దేవ,ఋషి, పితృ,మనుష్య, భూతములకు చేసే దానాలను పంచయజ్ఞ ప్రకరణం లో తెలుపబడింది.
పరమాత్మకు వల్లే, ఒంటరిగ ఉన్న మానవుడు ధనము, స్త్రీలు, పుత్రాదులుకావాలని, తను కర్మ చేయాలనీ వాంఛిస్తాడు. వీనిలో ఏదోఒకటి దొరికేవరకూ వాడి మనస్సే వాడికి ఆత్మ, వాక్కే భార్య, ప్రాణమే పుత్రుడు, నేత్రములే ధనం(ఎందుకంటే చూపుతోటే ధనాన్ని గుర్తిస్తాడు.), చెవియే దైవము, ఆత్మయే కర్మ (ఆత్మనుంచే దేహేంద్రియాల వల్ల కర్మ అవుతుంది) – దీనినే పాంక్త యజ్ఞం అంటారు. అంటే అయిదుగురుచే అయ్యేటటువంటిదని అర్ధం.
యజ్ఞము పాంక్తం. పశువు పాంక్తం. పురుషుడు పాంక్తం. సర్వమూ పాంక్తమే. ఈ విధంగా సర్వాన్ని పాంక్త రూపమైన యజ్ఞం గా తెలుసుకొని ఉపాసించేవాడు జగత్తు యొక్క స్వరూపం తో ఈ సమస్తాన్నీ పొందుతున్నాడు అంటూ చతుర్ధ బ్రాహ్మణమ్ ముగుస్తోంది.
***
153.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
153. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: తృతీయాధ్యాయం. పంచమబ్రాహ్మణమ్:
ప్రజాపతి ఈ జగత్తు కొరకై సృజించిన సప్తాన్నాల వివరణ:
యత్సప్తాన్నాని మేధయా తపసాజనయత్పితా।
ఏకమస్య సాధారణం ద్వే దేవా నభాజయత్త్రీణ్యాత్మ నేఽ కురుత పశుభ్య ఏకం ప్రాయచ్ఛ త్తస్మిన్సర్వం ప్రతిష్టితం యచ్చ ప్రాణితి యచ్చన।
హిరణ్యగర్భుడు అంటే ప్రజాపతి (బ్రహ్మ) తన మేధస్సు, తపస్సుల సాయం తో చేసిన సప్త అన్నాలు ఏమిటంటే మొదటిది మానవులు అందరకూ సామాన్యంగా ఉండి భుజింపబడే అన్నం. దేవతల కొరకు హుత, ప్రహుత అనే రెండు అన్నాలను సృష్టించేడు. ఆ పరమ పిత యైన ప్రజాపతి తన కొరకై మనోవాక్ప్రాణాలనే మూడు అన్నములు సృష్టించేడు. పశువుల కొరకు క్షీరమును (పాలను)సృష్టించేడు.
సమస్త జీవులు, చెట్లు మొదలయిన సమస్త జగత్తు పయస్సులో ఉంచబడింది. ఈ సప్త అన్నాలు సర్వవేళలా బక్షింపబడుతున్నా కూడా క్షీణింపవు, తరిగిపోవు అక్షయమవుతాయి.
సాధారణముగా జీవులచే బక్షింపబడే ఒక్కటే అయిన అన్నాన్ని జీవుల యొక్క సముదాయం కోసం పరమాత్మ సృష్టించేడు. ఆ అన్నము ధర్మాధర్మములతో కలిసిఉంది. కాబట్టి ఈ అన్నాన్ని ముందుగా భగవరాధనకై ఉపయోగించి అప్పుడు మనం శరీరాభివృద్ధి కై తినాలి.
ఆ పరమాత్మ దేవతలకొరకై హుత, ప్రహుత అనే రెండు అన్నాలను హోమ, బలిహరణాలు చేయడానికై సృష్టించేడు. అందుకే దేవతల గురించి హోమాలు, బలిహరణాలు (హవిస్సు లేదా అన్నాన్నే బలిహరణం గా)చేస్తున్నారు.
ఈ హుత, ప్రహుత అనే వాటినే దర్శపూర్ణ మాసాలుగ చెబుతారు.(దర్శ అంటే అమావాస్య, పూర్ణ అంటే పూర్ణిమ అని మాసములు అంటే పౌర్ణమి వెళ్ళిన మరునాటి పాడ్యమి, అమావాస్య వెళ్ళిన మరునాటి పాడ్యమి రెండురోజులను దర్శ పూర్ణ మాసాలు అంటారు. ఆరోజు చేసే హవిర్యజ్ఞాన్ని “ఇష్టి” అంటారు. ఈ యజ్ఞ క్రియ ప్రతి గృహస్తు తన ఇంట్లోనే జరుపుతాడు. దర్శపూర్ణ మాసం అనేది సప్త హవిర్యజ్ఞాలలో ఒకటి.) కనుక గృహస్తులంతా నిష్కామంగా దర్శపూర్ణ మాసాలలోనే దేవతలను గూర్చి హుత ప్రహుతాలను చేస్తున్నారు.
ఆ పరమాత్మ పశువులకు పయస్వరూపమైన పాలను అన్నముగా సృష్టించేడు. పాలు అనేవి సర్వానికి ఆధారం కనుక మనుషులు తర్వాత పశువులు ఉపయోగిస్తాయి. ఈ క్షీరం లోనే సమస్త ప్రపంచం ప్రతిష్ఠితమై ఉంది. సర్వానికి ఆధారమైన అటువంటి పాలను దేవతలను ఉద్దేశించి ఒక సంవత్సరం పాటు హోమం చేస్తే ఆ వ్యక్తి ఈ జన్మ తర్వాత దేవతలలో పుట్టడం తథ్యం.
ఇప్పటి వరకూ నాలుగు అన్నముల గురించి తెలిసేయి.
త్రీణ్యాత్మనే కురుతేతి మనోవాచం ప్రాణం తాన్యాత్మనేఽ కురుతాన్య త్రమనా అభూవం నాదర్శమన్యత్రమనా అభూవం నాశ్రౌషమితి మనసా హ్యేవ పశ్యతి మనసా శ్రుణోతి।
ప్రజాపతి తనకొరకై మూడు అన్నములను చేసుకున్నాడు. అవే మనస్సు, వాక్కు, ప్రాణము లనెడి అన్నములు.
ఈ మనుష్యుడు మనస్సు గలవాడవడం వల్ల మనస్సు తోనే చూస్తున్నాడు. మనస్సు తోనే వింటున్నాడు.
కామస్సంకల్పో విచికిత్సా శ్రద్ధాఽ శ్రద్ధాధృతిరధృతిః హ్రీర్ధీర్భీ రిత్యే తత్ర వంట మన ఏవ…
కోరికలు కోరడమే సంకల్పము. సంశయ జ్ఞానము, ఆస్తిక్యబుద్ధి, అశ్రద్ధ, ధారణ, అదృతి, లజ్జ, ప్రజ్ఞ, భయము మొదలైన ఈ సమస్తమూ మనస్సే అనబడతాయి. అందువల్లే వీపుమీద తాకినా మనస్సు చేత తెలుసుకో గలుగుతున్నాడు.
సర్వ శబ్దములు వాక్కే. ఈ వాక్కు వస్తు నిర్ణయాన్ని బట్టి వస్తువు వలే ప్రకాశించేది కాదు. కాని వస్తువును ప్రకాశింపజేసేది మాత్రము వాక్కే.
ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం మరియు సమానం అనే అన్నము, ఈ శరీరము యొక్క చేష్టలవల్ల ఉత్పన్నమయ్యే సమస్తమూ ప్రాణమే అవుతుంది.
ఈ మనోవాక్ప్రాణాల యొక్క స్వరూపమైన ఈ దేహమే వాజ్ఞ్మయము, మనోమయము మరియు ప్రాణ మయము అని తెలుసుకోవాలి.
భూ, భువః,సువర్లోకాలు మూడు వాజ్ఞ్మనప్రాణాలే.
ఋక్, యజుర్, సామవేదాలు ఈ వాజ్ఞ్మనప్రాణాలే.
దేవతలు, పితృదేవతలు, మనుష్యులు ఈ వాజ్ఞ్మనప్రాణములే.
మాతాపితరులు, సంతానము ఈ మనోవాక్ప్రాణాలే.(మనస్సే తండ్రి, వాక్కే తల్లి, ప్రాణమే సంతానము).
వచ్చే భాగంలో ఈ వాజ్ఞ్మనప్రాణాలు అనే అన్నాల గురించి మరింత విపులంగా తెలుసుకుందాము.
***
154.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
154. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: తృతీయాధ్యాయం. పంచమబ్రాహ్మణమ్(Continued):
ఇంతకు ముందు మనం వాక్ ప్రాణాల మిథునమే ఉద్గీథము అని తెలుసుకున్నాము. ఉద్గీథ గానం వల్ల అశన ప్రాప్తి జరిగి ప్రాణ శక్తి శక్తిమంతము అవుతోంది. మనస్సు తో సహా ఇంద్రియాలన్నీ ప్రాణుని నుంచి శక్తిని గ్రహించి పరిపుష్టిని పొందుతున్నాయి. ఈ విధం గా మన శరీరంలో ఉండే ఆత్మ మనస్సు, వాక్కు మరియు ప్రాణాలనే అన్నాలను తన కోసమై సృష్టించుకొంది.
సప్త అన్నాలలో సృష్టిలోని జీవకోటికి స్థూలాన్నాన్ని, పాలను, దేవతలకు హుత ప్రహుత అన్నాలను, ప్రజాపతి అంటే ఆత్మ తన కొరకై వాక్ మనో ప్రాణాలు అనే అన్నాలను సృష్టించుకొన్నాడు.
వీటిలో విజ్ఞాన స్వరూపమే వాక్స్వరూపము. వాక్కే విజ్ఞాన స్వరూపము. విషయములను తెలుసు కొనుటకు ఇష్టపడే ప్రేమే మనస్సు యొక్క స్వరూపమవుతోంది. అంటే మనస్సే విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడే ప్రేమ. ఇంద్రియ గోచరమైన స్వరూపము యొక్క అజ్ఞానమే ప్రాణ స్వరూపము. ప్రాణము ఈ విధంగా ఇంద్రియ గోచర స్వరూపం అవడం వల్లే మనలను ప్రాణులు అన్నారు.
వాక్కు మనస్సు అనబడే తల్లిదండ్రులలో తల్లి అయిన అగ్ని స్వరూపం వాక్కు, తండ్రియైన సూర్య స్వరూపం మనస్సుల సంగమం వల్ల వాయువు జనించింది. చలనాత్మకమైన కర్మ చేసేటందుకే వాయువు పుట్టింది. ఆ వాయువే పరమేశ్వరుని లాగ తిరుగు లేని వాడయ్యేడు. వాయువుతో సమానమైన ప్రతిశక్తి లేనే లేదు.
ఈ విధంగా వాక్ మనప్రాణాలు మూడూ సమానముగ ఉండి అంతము లేనివై(అనంతములు) ఉన్నాయి.
షోడశ కళలే అవయవములుగా కలిగి వాగ్మనః ప్రాణములనే అన్నములే తన స్వరూపము గా కలిగిన ఆ ప్రజాపతి సంవత్సర స్వరూపుడుగా (కాల స్వరూపుడు) ఉన్నాడు.
ఆ ప్రజాపతికి 15 తిథులు పదిహేను కళలు. కాని అమావాస్య నాడు మిగిలి ఉండే పదహారవ కళ (ఆత్మ తత్వం) మాత్రమే శాశ్వతమైనది. ఈ శాశ్వతమైన కళతో సమస్త ప్రాణి వర్గము లోను వ్యాపించి ఉంటాడు. ఆత్మ స్వరూపమే శాశ్వతమైన కళగా చెప్పబడింది.
అందువల్ల అమావాస్య తిథినాడు ఎంతటి పాపాత్ముడినైనా, ఏ చిన్న జీవి నైనా హింసించ కూడదు. ప్రజాపతి స్వరూపమైన చంద్రుని అర్చన కొరకే అమావాస్య నాడు పూర్తిగా జీవహింస కూడదని నిషేధించేయి వేదాలు.
మనుష్య లోకము, పితృలోకము, దేవలోకము అని మూడు లోకాలు ఉన్నాయి. ప్రసిద్ధమైన మనుష్యలోకము పుత్రుడనే సాధనముతోను, అగ్నిహోత్రాది కర్మలచే పితృలోకాన్ని, ఆ పరావిద్యతో దేవలోకాన్ని జయించాలి. సమస్తలోకములలోను ఉత్తమమైన దేవలోకసాధనము ఆత్మ విద్య మాత్రమే.
ఈ బ్రాహ్మణంలో చివరగా చాందోగ్యం లో లాగే మన శరీరం లోని అవయవాలన్నీ నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవడం, చివరకు ప్రాణ శక్తినే తమ అధి దేవతగా గుర్తించడం చెప్పబడింది.
తర్వాత అధిదేవతా దర్శనం చెప్పబడింది. అగ్ని తానే ప్రజ్వలింప జేయగలనని మనస్సులో తలచి విపరీతముగా జ్వలించడం మొదలు పెట్టింది. సూర్యుడు కూడా తనే సర్వలోకాలను తపింపజేయ గలనని తలచేడు. చంద్రుడు తానొక్కడే సమస్తలోకాలను ప్రకాశింప జేయగలనని భావించేడు. ఈ రీతిగా మిగిలిన దేవతలంతా కూడా అహంకారం తో తమ తమ పనులను నిర్విరామంగా చేయడం మొదలు పెట్టేరు.
పైన చెప్పినట్లు సమస్త ఇంద్రియములకు కేంద్రంగా ఉన్న ముఖ్య ప్రాణము ఏ విధంగా వెలుగొందిందో అదే విధంగా వాయుదేవత మాత్రము ఎడతెగక తన పని తాను చేస్తూ ఉంది. అందుచేత వాయువు అధి దైవతము అయ్యింది. ఈ విధంగా అధ్యాత్మము అధిదైవతము అనే రెండూ తర్కించుకొని వాయువు యొక్క వ్రతమే భంగము కానిదని గొప్పదని నిర్ణయింప బడింది.
సూర్యుడు అధిదైవత రూపం లో వాయువు నుండి ఉదయిస్తూ వాయువులోనే అస్త మిస్తున్నాడు. అదే సూర్యుడు అధ్యాత్మ స్వరూపుడై నేత్ర రూపం లో ప్రాణం నుంచి ఉదయుస్తూ ప్రాణం లోనే అస్తమిస్తున్నాడు.
ఇదేవిధంగా అగ్న్యాది దేవతలు వాయువునే కొలుస్తున్నారు. అందువల్ల ఇంద్రియ వ్యాపారాలను మాని ప్రాణోపాసన ద్వారా మాత్రమే మానవులు హిరణ్యగర్భుని జేరుతున్నారు.
***
ఓం నమః శివాయ:
156.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
156. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: చతుర్ధ అథ్యాయం. ప్రధమ బ్రాహ్మణమ్
బలాకముని పుత్రుడు బాలాకిముని. గార్గ వంశానికి చెందినవాడవడం వల్ల గార్గ్యుడు అనే పిలిచేవారు. ఆతను మంచి వక్త అయి విద్యాగర్వం తో విర్రవీగుతుండేవాడు. ఆ గార్గ్యుడు అజాత శత్రువనే పేరు గల కాశీ రాజు దగ్గరకు వెళ్ళి నీకు బ్రహ్మ విద్య బోధిస్తానని చెబుతాడు.
అప్పుడు కాశీరాజు “పూర్వం బ్రహ్మ వేత్తలైన జనులంతా జనక మహారాజే మహా దాత, గొప్ప శ్రోత అని చెబుతున్నారు. ఓ గార్గ్యా! నువ్వు నన్నే జనకుని తో సమానముగా భావించి నాకు బ్రహ్మవిద్యా స్వరూపం చెప్పగలనని పలికేవు. ఇందు నిమిత్తమై నీకు వేయి గోవులను దానమిస్తున్నాను” అని పలికేడు.
“ఓ రాజా! ఆదిత్యునిలో పరిపూర్ణుడైన పరబ్రహ్మ స్వరూపుడు ఎవరైతే ఉన్నారో వానినే ఈ శరీరేంద్రియ సముదాయంలో పరబ్రహ్మగా ఉపాసిస్తున్నాను.” అన్నాడు గార్గ్యుడు.
దానికి కాశీరాజు అజాతశత్రువు “గార్గ్యా! సమస్త భూతాలను అతిక్రమించేవాడు, అన్ని భూతాలకు శిరస్సుగాను రాజుగాను ఉండే ఆ ఆదిత్యుని నేను కూడా పరబ్రహ్మగా ఉపాసిస్తున్నాను. దానినుంచి ఆ ఆదిత్యుని గుణాలు లభ్యమవుతాయికాని అది బ్రహ్మజ్ఞానం కాదు,” అన్నాడు.
తర్వాత గార్గ్యుడు “చంద్రుడు, మెరుపు, త్వక్కు, హృదయము, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, అద్దం, శబ్దం, దిక్కులు, అద్దంలోని ఛాయా పురుషుడు మొదలైనవి బ్రహ్మము గా చెబుతూ చివరగా బుద్ధి స్వరూపమైన ప్రజాపతి యందలి పురుషుని ఈ దేహేంద్రియ సముదాయం లో పరబ్రహ్మ గా ఉపాసిస్తున్నాను.” అన్నాడు.
స హోవాచాజాతశత్రు రేతావన్నూ ఇత్యేతా వద్ధీతి నైతావాతా విదితం భవతీతి స హోవాచ గార్గ్య ఉపత్వా యా నీతి।
అజాతశత్రువు గార్గ్యునితో “ఇవన్నీ నాకు తెలిసినవే. ఇవన్నీ నేనూ చేస్తున్నాను. వీటినుంచి మనకు పుట్టే సంతానానికి మంచి శరీరం, బుద్ధి తోపాటు ఇంద్రియ నిగ్రహం లభిస్తాయి. అంతే. నీకింతేనా తెలిసింది?” అని అడుగుతాడు. “ఈ జ్ఞానం మనలో అంతర్నిహితంగా ఉండే శక్తుల గురించే. వీటి వల్ల బ్రహ్మజ్ఞానం లభ్యం కాదు”. అంటే గార్గ్యుడు ఆ రాజుతో “అయితే మీరే నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి” అంటాడు.
ఆ రాజు గార్గ్యుని చేయి పట్టుకొని ఒక నిద్ర పోతున్న మనిషి దగ్గరకు తీసుకొనిపోయాడు. ఆ నిద్రపోతున్న మనిషిని, “ఓ సోమరాజా! తెల్లని వస్త్రాలు ధరించినవాడా” అని పిలిచాడు అజాతశత్రువు. ఆ నిద్రిస్తున్నవాడు లేవలేదు. అప్పుడు చేత్తో తట్టి కదిలిస్తే నిద్రలోంచి మేల్కొన్నాడు.
కాశీ రాజు గార్గ్యునితో “ఈ విజ్ఞానమయ పురుషుడు నిద్రిస్తున్నప్పుడు ఎక్కడకు వెళ్ళి ఉంటాడు? మెలుకువ వచ్చిన తర్వాత ఎక్కడ నుంచి వచ్చి ఉంటాడు?”
నిద్రించిన సమయంలో ఈ విజ్ఞానమయ పురుషుడు, ఈ ప్రాణము విజ్ఞానముతో తెలుసుకొన గలిగే శక్తిని గ్రహించి హృదయం యొక్క అంతరాలలోఉండే ఆకాశం (దహరాకాశం) లోవిశ్రమించి ఉంటాడు.
అప్పుడు ప్రాణము మనస్సు (వాక్కు, చక్షుస్సు, శ్రోత్రము మొదలైన ఇంద్రియ సముదాయంతో కూడిన మనస్సు) మొదలైన విజ్ఞాన సామర్ధ్యం కలవన్నీ లోపలకు గ్రహింపబడి ఉన్నాయి. నిద్రించిన సమయంలో సూక్ష్మదేహము యొక్క సంబంధము చేత స్వాభావికమైన ఆత్మలాగే ఉంటుంది.
ఈ జీవాత్మ నిద్రలో స్వప్నాన్ని పొందినప్పుడు రకరకాల లోకాలకు పోయి చూస్తోంది. అక్కడ మహారాజు లాగా, అలాగే మిగిలిన అధికము నీచము అయిన వివిధ రూపాలను అనుభవిస్తూంది. ఆ స్వప్నంలో ఈ శరీరం లోని జీవుడు నిజమైన మహారాజు లాగే దేశ ప్రజలను పాలిస్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు. రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. అలాగే విజ్ఞానమయమైన ఆత్మ, వాక్కు శ్రోత్రం మొదలైన ఇంద్రియాలను ఉపయోగిస్తూ కలలోనే మెలుకువగా ఉన్నప్పుడు కలిగిన అనుభవాలన్నీ కూడా పొందుతోంది.
సుషుప్తిలో ఉన్నప్పుడు (గాఢనిద్రలో) రెండవ వస్తు పరిజ్ఞానమే లేనప్పుడు ఈ జీవుడు శరీరమంతా వ్యాపించి ఉన్న “హిత” అనే 72 వేల నాడీ సముదాయంలో నిదురిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ స్థితిలో ఏ వాసనలు లేకుండా (తను రాజో, బ్రాహ్మణుడో, అధికుడో, నీచుడో తెలియని స్థితి) అత్యంత ఆనంద స్థితి లో నిద్రిస్తున్నాడు.
స యథోర్ణ నాభి స్తన్తునోచ్చరే ద్యథాగ్నేః
క్షుద్రా విస్ఫు లిఞ్గా ప్యుచ్చర న్త్యేవమే వాస్మాదాత్మనః
సర్వే ప్రాణా స్సర్వేలోకా స్సర్వే దేవా స్సర్వాణి భూతాని వ్యుచ్చరన్తి।
సాలె పురుగు దేహం నుంచి దారాలు బయటకు వస్తున్న విధంగా, ప్రజ్వలిస్తున్న అగ్ని నుంచి నిప్పురవ్వలు (మిణుగురులు) బయటకు వస్తున్నట్లు ఈ విశ్వాత్మ, పరమాత్మ నుంచి సర్వ ప్రాణులు, సర్వ లోకాలు, సర్వ దేవతలు, సమస్త ప్రాణికోటి ఉద్భవిస్తూ ఉంటాయి.
తస్యోపనిషత్సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషా మేష సత్యమ్।
ఆ ఆత్మ యొక్క జ్ఞానమే సత్యమైనది. ప్రాణులకు, ఇంద్రియములతో కూడిన మనస్సు కలిగిన ఈ సమస్త ప్రాణి కోటికి, పరమ సత్యమైన అస్థిత్వము ఆ ఆత్మ ఒక్కటే. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానమవుతుంది. అంటూ కాశీరాజు, అజాతశత్రువు గార్గయునికి బ్రహ్మవిద్యా ఉపదేశం చేసేడు.
***
157.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
157. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: చతుర్ధ అథ్యాయం. ద్వితీయ& తృతీయ బ్రాహ్మణాలు:
మొదటి బ్రాహ్మణంలో మనకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలు ఉంటాయని, వాటిలోసుషుప్తిలో జీవాత్మ తన స్వస్వరూపమైన పరమాత్మతో తాత్కాలికంగా మిలనమవుతున్నాడు. ఈ జీవాత్మ తన స్వస్వరూపదర్శనాన్ని పొందడానికి చేసే నిర్విరామ సాధనే బ్రహ్మ విద్య అనబడుతుంది అంటూ ఆత్మను సత్య స్య సత్యం అని నిర్వచించారు.
ఈ శరీరం మధ్యభాగంలో ఉన్న ప్రాణమే శిశువు. ఆ శిశువుకి ఈ శరీరమే ఆధారము. ప్రాణశక్తి యే ఈ శరీరంలో స్తంభము ఆధారంగా ఉన్న శిశువు. మనము తినే అన్నమే స్ధూల, మధ్యమ, ఆణిష్టములనే మూడు రసాలుగా అవుతోంది.
మొదటిది స్ధూల రసము మూత్రపురీషములై బయటకు వెళ్ళిపోతోంది.
రెండవదైన మధ్యమ రసము రక్తముగాను, స్వకార్యములైన తక్కు, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, ఎముకలు, రేతస్సు అనే ఏడు రూపాలుగ పెరుగుతోంది. మూడవదియగు సూక్ష్మ రసం అమృతమని, ఊర్జమని చెప్పబడితోంది. అది నాభికి ఊర్ధ్వముఖంగా ఉన్న హృదయం నుండి బయటకు వచ్చి దేహమంతటా వ్యాపించి ఉన్న డెబ్బయి రెండు వేల నాడులలోను ప్రవేశించి స్థూణము అనే బలాన్ని పుట్టిస్తోంది. ఈ విధంగా అన్నం ప్రాణ శరీరాలను బంధిస్తోంది.
ఈ ప్రాణం సుషుప్త్యావస్థ నుంచి బయటకు వచ్చి జాగ్రదావస్థలో నేత్రాలను పొందుతోంది. అన్న స్వరూపులైన రుద్రాది దేవతలు ఏడుగురు జాగ్రదావస్థలో నేత్రాలలో ఉండే ప్రాణాన్ని ఈ విధంగా పొందుతున్నారు.
ఆ ప్రాణాన్ని రుద్రుడు నేత్రాలలోని రక్త రేఖల ద్వారా పొందుతున్నాడు. పర్జన్యుడు నేత్రాలలో కలిగే నీటిద్వారాను; సూర్యుడు కళ్ళలోని నల్లగుడ్డు ద్వారాను; ఇంద్రుడు కళ్ళలోని తెల్లని కాంతి నుంచి పొందుతున్నారు. భూమి కంటియొక్క క్రింద రెప్ప ద్వారా, అంతరిక్షము కంటి పై రెప్ప ద్వారాను పొందుతున్నారు.
సోమపాన పాత్రలాగ ఉండే శిరస్సులో విశ్వ రూపమైన యశస్సు ఉంచబడింది. ఆ శిరస్సు సమీపంలో శ్రోత్రాదులలో వ్యాపించి ఉండే ప్రాణవాయువులే సప్తఋషులుగా ఉన్నారు.
దక్షిణపు చెవి గౌతమఋషి; ఉత్తరపు చెవి భరద్వాజఋషి; దక్షిణ నేత్రం విశ్వామిత్రుడు; ఉత్తర నేత్రం జమదగ్ని; దక్షిణ నాసాపుటము వసిష్ఠుడు; ఉత్తర ముక్కు రంధ్రము కశ్యపుడు; వాక్కే అత్రి ఋషి. బ్రహ్మ సంవాదం చేసే వాక్కు అంటే బ్రహ్మ పలికిన వాక్కు ఎనిమిదవది అవుతోంది. ఎలాగంటే వాగీంద్రియం తినడం ద్వారా సప్తమ ఋషి అయ్యింది. వాక్కు పలకడం ద్వారా అష్టమత్వాన్ని పొందుతోంది.
ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చమర్త్యం చామృతం చస్థితం చ యచ్ఛ సచ్చ త్యచ్చ।।
పరబ్రహ్మకు రూపముతో కూడి అవధులు కలిగిన మరణ స్వభావం కలది అయిన మానవ శరీరము మూర్తస్వరూపము అనబడుతోంటే అమూర్త స్వరూపము కూడా ఉంది. అమూర్తస్వరూపమైన ఆత్మకు అవధులు లేక అంతట వ్యాపించి ఉంది. దీనికి మరణ ధర్మము లేదు.
మూర్తామూర్త స్వరూపాలలో మూర్త స్వరూపం అంటే భూమి, జలము, తేజస్సు కలిగి అవయవములతో కూడిన ఆకారము కనుక ఇది మరణ స్వభావం కలిగినది. ప్రత్యక్షముగా కంటికి కనబడుతూ అవధులు కలిగి ఉంది. ఈ పంచభూతాలలో పృథివ్యాపస్తేజస్సుల యొక్క సారమే లోకాలన్నిటినీ తపింపజేసే సూర్య మండలం.
అమూర్త స్వరూపం అంటే పంచభూతాలలో పైన చెప్పిన పృథివ్యాపస్తేజస్సులు కాకుండా మిగిలిన వాయువు ఆకాశముల మిశ్రమమే. వీటికి ఆకారములేకపోవడం వల్ల మరణ ధర్మము లేనివి. మరణ ధర్మము లేనివి కనుక సర్వవ్యాపకమైనవి. సర్వ వ్యాపకమైనవి కాబట్టే అదృశ్యంగా ఉన్నాయి. ఈ వాయువు ఆకాశముల యొక్క సారమే సూర్యమండలంలో అంతర్గతంగా ఉండే అధిదైవక పురుషుడు.
మూర్తస్వరూపం: మన నేత్రములే ఈ శరీరంలో అధ్యాత్మ స్వరూపం. పృథివి, నీరు తేజస్సుల సారమే ఈ నేత్రాలు. సూర్యమండలం అధిదైవతమైతే మనశరీరంలోని నేత్రాలు అధ్యాత్మస్వరూపం. భౌతికంగా సమస్త గ్రహాలకు భూతరాసులకు సూర్యమండలం శక్తినిచ్చేదయితే మన శరీరంలోని నేత్రద్వయం శరీరానికంతకు శక్తిని తేజస్సును ఇస్తాయి.
అమూర్తస్వరూపం: ఈ దేహం లోని ప్రాణాకాశాలు రెండూ అమూర్తస్వరూపాన్ని సూచిస్తున్నాయి. అమూర్తత్వాది ధర్మాలతో కూడిన వాయువు ఆకాశాల యొక్క సారాన్నే లింగశరీరం అంటారు.
లింగశరీరం యొక్క దక్షిణ నేత్రంలో ఉండే పురుషుడే అధ్యాత్మ స్వరూపుడు.
లింగశరీరాత్మక పురుషుని యొక్క స్వరూపం ఎర్రటి వస్త్రంలాగ, తెల్లటి కంబళి లాగ, మిణుగురు పురుగు, అగ్నిజ్వాల, శుక్లమువలె, మెరుపులాగ ఉంటుంది.
ఇంతకన్న విపులంగ చెప్పవలసి వచ్చినప్పుడు నేతి నేతి అంటూ ఇదికాదు, ఇదికాదు అని మాత్రమే పరబ్రహ్మయొక్క నిర్దేశం చేయబడింది. దీనికంటే అన్యమైనది ఏదీలేదు. ఇంతవరకూ చెప్పినదే పరబ్రహ్మ యొక్క నిర్వచనము. శ్రోత్రము, వాక్కు మొదలైన ఇంద్రియాలు సత్యస్వరూపము. ఆ పరబ్రహ్మకు “సత్యస్యసత్యం” అనేదే నామధేయం.
వచ్చే భాగంలో యాజ్ఞవల్క్యుని చే బ్రహ్మవిద్యా విషయమై సమగ్రమైన బోధన మొదలవుతుంది.
***
158.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
158. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: చతుర్ధ అథ్యాయం. చతుర్ధబ్రాహ్మణం:
ఈ బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్యుడు తన భార్యలు ఇద్దరినీ పిలిచి తను వానప్రస్తానికి వెళ్ళేముందర తన సంపద ఇరువురికి సమానంగా పంచడంతో మొదలవుతుంది.
మైత్రేయికి బ్రహ్మవిద్యా బోధన తరువాతి అంశం. ఇక్కడనుంచి బృహదారణ్య కోపనిషత్తు లో బ్రహ్మవిద్య మీద సమగ్ర చర్చ జరుగుతుంది. మనం తైత్తిరీయ ఉపనిషత్తు ప్రారంభంలో యాజ్ఞవల్క్యని గురించి చదివేము. ఇక్కడ మరిన్ని వివరాలు తెలుసు కుందాం.
గంగా తీరంలో చమత్కార పురంలో యజ్ఞవల్క్యుడు అనే ముని ఉండేవాడు.
నిరంతర అన్నదానం వలన వాజసని అనేపేరు, వేద అధ్యనం, అధ్యాపనం వలన బ్రహ్మరాతుడు అనేపేరు వచ్చేయి. ఆయన భార్య సునంద. బ్రహ్మవిద్యను బోధించి వ్యాపింపచేయగల పుత్రునికోసం ఆ దంపతులు తపస్సుచేయగా బ్రహ్మ దర్శనం ఇచ్చాడు. వాళ్ళు ఆయననే తమ కుమారునిగా జన్మించమని కోరారు. సహజమైన బ్రహ్మ తేజస్సుతో జన్మించిన ఆపుత్రుడే యాజ్ఞవల్క్యుడు.
చిన్నతనంలో ఉపనయనాది సంస్కారముల అనంతరం బాష్కలుని వద్ద ఋగ్వేదం, జైమిని వద్ద సామవేదం, ఉద్దాలకునివద్ద అధర్వణ వేదం, తండ్రివద్ద యజుస్సు నేర్చుకున్నాడు. తరువాత యజుర్వేదాన్ని శిష్యులకు చెబుతున్న వైశంపాయనుని వద్దకు యజుర్వేదం పూర్తిగా అధ్యయనం చేయడానికి వెడతాడు. “గురువును మించిన దైవములేడు.” నీ సర్వస్వము గురువే అని యాజ్ఞవల్క్యునికి తండ్రిబోధించి గురువు వద్దకు పంపిస్తాడు.
యాజ్ఞవల్క్యుడు భక్తితో గురువును సేవించి, అక్కడ ఉన్న విద్యార్థులలో ప్రథమునిగా నిలిచి, గురువు వద్ద సంపూర్ణ యజుర్వేదము, అనేక రహస్య విద్యలు నేర్చుకున్నాడు. సంపూర్ణమైన బ్రహ్మ తేజస్సు, గురుసేవా పుణ్యఫలమూ అతనికి లభించాయి. దీనితో కొంత సాత్త్వికాహంకారము అతనికి వచ్చింది.
వైశంపాయనుని శిష్యులలో ఆయన మేనల్లుడు ఉండే వాడు.
అతడు ఒకనాడు తనపట్ల అవిధేయతను ప్రదర్శిస్తే వైశంపాయనుడతన్ని కాలితో తన్నాడట. “నేను చేసిన ఈ పని బ్రహ్మహత్యతో సమానం, దీనికి నివృత్తి చేసుకొనేదెలా?” అంటాడు. అక్కడే ఉన్న యాజ్ఞవల్క్యుడు “నేను నా తపః శక్తితో మీ దోషం నివృత్తిచేస్తాను. ఈ పని ఇంకెవరూ చేయలేరు” అన్నాడు. గురువుగారికి కోపము వచ్చి, “నాకంటె గొప్పవాడివయ్యావా? నిన్ను నాగురుకులం నుండి బహిష్కరిస్తున్నాను.
నీ అహంకారానికి ప్రతిఫలంగా నావద్ద నేర్చుకొన్న విద్య ఇక్కడే వదిలేసి పో” అని ఆజ్ఞాపిస్తాడు. యాజ్ఞ వల్క్యుడు గురువు పాదాలపై పడి, క్షమాపణ వేడి, ఆయన ఆజ్ఞ ప్రకారం యజుర్వేద విద్యనంతా అక్కడ రక్తసిక్త వమనంతో వదలిపెడతాడు. తన మాట ప్రకారం గురువుగారి దోషంకూడా తొలగించాడు. ఆ విద్యను తిత్తిరి పక్షులు గ్రహిస్తే వాని పలుకులు విని ఇతరులు గ్రహించారు. ఇదే తైత్తిరీయ సంహిత అయ్యింది.
యాజ్ఞవల్క్యుడు సూర్యుని ఉపాసించి కొంచెంభిన్నమైన శుక్లయజుర్వేదం నేర్చుకుంటాడు. సూర్యుడు శుక్లయజుర్వేదాన్ని యాజ్ఞవల్క్యునికి ఇచ్చినతరువాత సరస్వతీదేవిని ఆరాధించి ఇతరవిద్యలను పొందమని చెబుతాడు. యాజ్ఞవల్క్యుని తపోనిష్ఠ ఫలంగా సరస్వతీదేవి దర్శనం లభించింది. ఆమె అన్నివిద్యలూ ఎల్లవేళలా అతని హృదయ ఫలకంపై ఉండేటట్లు అనుగ్రహించింది.
బృహదారణ్యక ఉపనిషత్తు యాజ్ఞవల్క్యుని ప్రతిభను ఆవిష్కరిస్తుంది. మిథిలనుపాలించే జనక మహారాజు ఒకసారి ఈయనను యాగంచేస్తూ ఆహ్వానించాడు.
అనేక మంది మహర్షులుకూడా ఆయాగానికి వచ్చారు. జనకుడు ఒక వేయి శ్రేష్టమైన గోవులను( వాటి కొమ్ములకుబంగారు తొడుగులు వేసి కొమ్ము కొమ్ముకు బంగారునాణేలు వ్రేలాడ దీసి) అక్కడ ఉంచి “మీలో అందరికంటే శ్రేష్ఠుడను, బ్రహ్మజ్ఞానిని అనుకునేవారు ఈ సంపదను తీసుకు వెళ్ళండి” అన్నాడు.
అక్కడ ఉన్న ప్రతివారికి ఆసంపద మీద ఆశ పుట్టి, తానేశ్రేష్ఠుడనని చెప్పాలని మనసులో ఉన్నా భయంతో సంకోచించారు. యాజ్ఞవల్క్యుడు లేచి తన శిష్యులను పిలిచి ఆసంపదను తన ఆశ్రమానికి తరలించమని ఆజ్ఞాపిస్తాడు.
వెంటనే సభలోని కొందరులేచి “నీవు అంత గొప్పవాడివా? నీజ్ఞానము ఏపాటిదో పరీక్షిస్తాం. ముందు మాప్రశ్నలకు సమాధానం చెప్పు” అని అతడితో వాదన లోనికి దిగారు. తాను గోసహస్రాన్ని అందరిలో శ్రేష్ఠుడనననే ఉద్దేశ్యంతో తీసుకోవడంతో యాజ్ఞవల్క్యునకు అందరిముందు తాను బ్రహ్మజ్ఞానిననీ, అందరికంటే అధికుడననీ నిరూపించుకోవలసి వచ్చినది. అందరిప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అందరి సందేహాలు తీర్చాలి.
యజ్ఞయాగాదులు చేసి, జ్ఞానార్జన కూడాచేసి బ్రహ్మజ్ఞాన సిద్ధినిపొందినవారు కూడా తమ సందేహాలు తీర్చుకునేందుకు, అతడు తమమీద అధికుడౌనోకాదో తేల్చుకునేందుకు ప్రశ్నించారు. ఇలా రకరకాల వారు ఈ ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యునితో వాదించడం కనుపిస్తుంది. యాజ్ఞవల్క్యుడు వారిప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. వాదనలో వారు అతనిని జయించలేక ఓటమిని అంగీకరించారు.
మిథిలా నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో కతుడనే మహర్షి నివసించేవాడు. ఆయన కుమార్తె కాత్యాయని. అమెకు యుక్తవయస్సు వచ్చాక ఆమె తండ్రి ఆమెను యాజ్ఞవల్క్యునకిచ్చి వివాహంచేసేడు. కాత్యాయని మంచి గృహిణి. ఇల్లు గడపడం, ఇంటిక
ి వచ్చిన అతిథి అభ్యాగతులను సేవించడం వంటి పనులలో ఆమె నిమగ్నురాలై ఉండేది.
మిత్రుడు అనే బ్రాహ్మణునికి మైత్రేయి అనే కుమార్తె ఉండేది. ఆమె రాజ సభలలో యాజ్ఞవల్క్యుని బోధలను, సంవాదాలను వింది. యాజ్ఞవల్క్యునివద్ద ఆత్మజ్ఞానాన్ని గ్రహించాలని ఆమె కోరిక. ఇది సులభసాధ్యం కావడానికి ఆయనను పెండ్లిచేసుకోవాలని అనుకున్నది.
ఆకాలంలోనే గార్గి అనే యోగీశ్వరి, మహాజ్ఞాని ఉండేది. ఆమె ఈ మైత్రేయిని తీసుకొనివెళ్ళి కాత్యాయని అనుమతితో యాజ్ఞవల్క్యుని సేవలో నియోగించింది. ఆయన అనుగ్రహంచేత మైత్రేయిని భార్యగా అంగీకరించేటట్లు చేసింది గార్గి. మైత్రేయి ఆకాలములోని మహిళలలో ప్రఖ్యాతి వహించినది. ఋగ్వేదములోని కొన్ని మంత్రాలకు ఆమె ఋషిగా చెప్పబడినది. ఆమెను బ్రహ్మవాదిని అనేవారు.
ఇంక గార్గి గురించి:
పూర్వం వాచక్ను అనే ఓ మహర్షి ఉండేవాడు. ఆయన కుమార్తె గార్గి అందానికీ, ఆత్మ స్థైర్యానికీ, పాండిత్యానికీ పెట్టింది పేరుగా ఉండేది. గార్గిని వాచక్ను మహర్షి గొప్ప పండితురాలిగా తీర్చిదిద్దాలనుకున్నాడు.
తన ఆశ్రమానికి వచ్చే ఎందరెందరో పండితులతో ఆమెకు కావలసిన విద్యనంతటినీ నేర్చుకొనేలా చేశాడు. వేదాంత విద్యలో ఆమెను గొప్పగా తీర్చిదిద్దాడు. గార్గి విద్యా ప్రాభవం మెల్లమెల్లగా అందరికీ తెలిసింది. ఎక్కడన్నా గొప్ప గొప్ప వేదాంత సభలు జరిగినప్పుడుకూడా ఆమె వెళుతూ ఉండేది.
గార్గి తన కడుపున పుట్టి అంత గొప్పదైనందుకు వాచక్ను మహర్షికి ఎంతో ఆనందం కలిగింది. అయితే ఆమె యవ్వన దశను దాటిపోతున్నా వివాహానికి మాత్రం సుముఖంగా లేకపోవటంతో ఎంతో బాధపడ్డాడు. తన కుమార్తె గొప్ప విద్యావతి అని పేరు తెచ్చుకోవాలనుకున్నాడు కానీ, పెళ్ళి లేకుండా బ్రహ్మచారిణిగా ఉండిపోవాలని అనుకోలేదు.
అలాంటి రోజుల్లో ఓ రోజున నారద మహర్షి ఆమె దగ్గర కొచ్చి స్త్రీ వివాహమాడాల్సిన అవసరాన్ని గురించి వివరించి చెప్పాడు. వివాహమైతే తప్ప ఆమె కావాలనుకుంటున్న ముక్తి సాధించటానికి అర్హత లభించదన్నాడు. అప్పుడు ఆలోచనలో పడింది గార్గి. తగిన వరుడి కోసం అన్వేషిస్తుంటే శృంగవంతుడు అనే ఒక ముని కనిపించాడు.
అతడిని తనకు తగిన వరుడిగా భావించిన గార్గి వివాహానికైతే సమ్మతించింది కానీ, ఒక్క రోజుకు మించి తమ గృహస్థ జీవితం ఉండబోదని, రెండో రోజున సన్యాస దీక్షను తీసుకుని వెళ్లిపోతానని అంది. ఆమె అలా అనటం చూసిన కొందరు పెళ్ళి అయ్యాక ఈ ఆలోచన మానుకుంటుందిలే అనుకొన్నారు. పెళ్ళి అయింది. ఒక రోజు గడిచింది. ముందుగా అనుకొన్న మాట ప్రకారం తాను విడిపోబోతున్నానని గ్రహించి ఆమెకు నచ్చజెప్పటానికి ప్రయత్నం చేశాడు శృంగ వంతుడు.
కానీ ఆమె మనస్సు మార్చు కోలేదు. ఇహలోక సుఖాల కోసం పాకులాడక, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోక తాను పొందాలనుకున్న ముక్తిమార్గం వైపు నడిచింది. వేదాంతసారం తెలిసిన మహోన్నత మనిషిగా చరిత్రలో నిలిచిపోయింది.
***
161.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
161. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: చతుర్ధ అథ్యాయం. పంచమ బ్రాహ్మణం:
(చతుర్ధ, పంచమ, షష్ట బ్రాహ్మణాలలో మైత్రేయికి చేసిన బ్రహ్మవిద్యోపదేశం వివరించబడింది).
యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి మధువిద్యను ఉపదేశిస్తున్నాడు. (ఈ మధువిద్యా వివరణ వల్లే మూడు, నాలుగు అధ్యాయాలకు మధుకాండ అని పేరు వచ్చింది).
మనం చాందోగ్యోపనిషత్తు లో చదువుకున మధు విద్య తిరిగి ఇక్కడ వివరింప బడింది. అధర్వణ పుత్రుడైన దధ్యజ్ అనే ఋషి దేవవైద్యులైన అశ్వనీదేవతలకు మధువిద్యను ఉపదేశించేడు.
దధ్యజ్ అశ్వనీ దేవతలతో “ఇంద్రుడు మధువనే ఈ బ్రహ్మవిద్య ను నాకు ఉపదేశించే సమయంలో, ఈ బ్రహ్మ విద్యను ఎవరకీ చెప్పకూడదని, చెప్పినట్లయితే నీ శిరస్సు ఛేదిస్తానని ప్రతిజ్ఞ చేసి చెప్పేడు. కనుక నేను మీకు ఉపదేశించడానికి భయపడుతున్నాను” అన్నాడు. “మీరు నాకా భయాన్ని తొలగిస్తే మీకు మధు విద్యను ఉపదేశిస్తాను.” అని పలికేడు దధ్యజ్ ఋషి.
అప్పుడు అశ్వనీ దేవతలు “ఓ అధర్వణ కుమారా!దధ్యజా! మీకా భయం ఎంతమాత్రమూ లేదు. మీ శిరస్సును ఛేదించి మరొకచోట భద్రపరచి మీకు అశ్వ శిరస్సుతో జత చేస్తాము (అశ్వనీ దేవతలు దేవ వైద్యులు కదా!). ఆ శిరస్సుతో మాకు మధువిద్యను ఉపదేశించండి. ఇంద్రుడు కోపించి ఆ శిరస్సును ఛేదిస్తే తిరిగి మీ నిజ శిరస్సు మీకు యధాప్రకారం తిరిగి జత కూరుస్తాము.” అని ప్రతిజ్ఞ చేసేరు అశ్వనీ దేవతలు. అప్పుడు మధువిద్య ఉపదేశాన్ని పొందేరు దధ్యజ్ ఋషి నుంచి.
ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధ్వస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు యశ్చాయ మస్యాం పృథివ్యాం తేజోమయో మృతమయః
ఈ భూమి సమస్త జీవులకు మధు స్వరూపమై ఉంది. పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచ భూతాలతో కూడిన ఈ జగత్తంతా కార్యకారణ సంబంధముతో ముడివడి ఉంది.
పంచభూతాత్కతమైన ఈ శరీరం లో తేజస్వరూపము అమృతస్వరూపము అయిన జీవుడు ఆత్మస్వరూపమే.
ఈ భూమి, జలములు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, దిక్కులు, సమస్త ప్రాణుల యొక్క మధు స్వరూపము. విద్యుత్తు, మేఘగర్జనము కూడా సమస్త భూతములయొక్క మధు స్వరూపమే.
భూమి యందలి తేజస్వరూపుడు అమృత స్వరూపుడు అయిన పురుషుడు దేహేంద్రియముల యొక్క సముదాయానికి కర్త అవుతున్నాడు. జలములలో ఉండే పురుషుడు ఈ శరీరంలో రేతస్సంబంధుడు అవుతున్నాడు. అగ్నిలో ఉండే మధుస్వరూపం మన శరీరంలో ఉండే వాఞ్మయుడే. వాయువు ప్రాణ స్వరూపుడుగా మన శరీరంలో ఉన్నాడు. సూర్యుడు నేత్రములందు, దిక్కులు శ్రవణము లోను, చంద్రుడు మనస్సునందు, విద్యుత్తు చర్మములోను, మేఘగర్జన శబ్దములోను, ఆకాశము హృదయం లోను ( హృదయం అంటే దహరాకాశంలో) మనశరీరంలో ఉంటూ ఆత్మ స్వరూపంగా భాసిస్తున్నారు.
అయం ధర్మ స్సర్వేషాం భూతానాం మధ్వస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు యశ్చాయ మస్మిన్ ధర్మే తేజోమయోఽమృతమయః పురుషో యశ్చాయమధ్యాత్మం ధార్మ స్త్జోమయోఽ మృతమయః పురుషోఽ యమేవ స యోఽ యమాత్మేద మమృత మిదం బ్రహ్మేదగం సర్వమ్।
అపూర్వము అనే ఈ ధర్మం పంచభూతముల యొక్క సారం. సమస్త భూతాలు ఈ ధర్మము యొక్క సారము. భూమి మొదలైన పంచ భూతాలలో ఉన్న ఒకే విధమైన ధర్మంలో ఉండే తేజోమయుడు, అమృతమయుడు అయిన పురుషుడు మన శరీరంలో ఉండే జీవాత్మ ఒకేటే మరియు ఈ రెండూ ఆత్మ స్వరూపమే అనేదే మధువిద్య యొక్క తాత్పర్యము.
వచ్చే భాగంలో మధు విద్యను మరింత వివరంగా బోధిస్తాడు యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి.
***
162.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
162. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: చతుర్ధ అథ్యాయం. పంచమ బ్రాహ్మణం:
క్రితం భాగంలో చెప్పిన మధువిద్యను మరొక్కసారి చదివి ఈ వివరణలోకి రండి.
ఈ మానవ శరీరం సమస్త భూతాలయొక్క సారమై ఉంది. దేహేంద్రియాది సముదాయములో తేజోమయుడు అమృతమయుడైన జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపమే. ఆ విజ్ఞనముతో కూడిన ఆత్మ యే పంచ భూతాలకు అధిపతి అవుతూంది.
మధువిద్యలో దేహేంద్రియ సముదాయము, ఇంద్రియవృత్తులు పంచభూతాలతో ఏవిధంగా ముడివడి వున్నాయో వివరించబడ్డాయి.
వాటిని శుద్ధి పరచి ఆత్మను అవగాహన చేసుకోగలిగే స్థితికి తెచ్చేదే ఉద్గీథగానముతో కూడిన ప్రాణాయామ అనుష్ఠానము.
యోగాభ్యాస స్థితిలో ప్రాణుని ఆధారంగా చేసే ఉద్గీధము తో కూడిన ప్రాణాయామ క్రియ ద్వారా మన శరీరములోని పంచభూతముల ఉద్ధారణ జరుగుతుంది.
శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పిన విధంగా
పృథ్వ్యప్ తేజోఽనిల ఖే స ముత్థితే
పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే
న తస్య రోగో నజరా నమృత్యుః
ప్రాప్తస్య యోగాగ్ని మయం శరీరం।।
యోగాభ్యాసంలో క్రమంగా పృథివి, ఆపః, తేజః, వాయు మరియు ఆకాశం అనే పంచభూతాలు శుద్ధి కావింపడతాయి.
మన శరీరంలో భూమికి సంబంధించిన భాగం శుద్ధి చేయబడుతూంటే యోగాభ్యాస సమయంలోను ఆతర్వాత కూడా మట్టి వాసన మన నాశిక వెంబడి శ్వాస ప్రశ్వాసలలో తెలుస్తూ ఉంటుంది. ఈ భూతత్వం పూర్తిగా ప్రక్షాళన కాబడి, శుద్ధి చేయబడి మన శరీరం తేజ స్వరూపంగా మారుతుంది. భూమియందలి మార్పులు, ప్రకంపనలు, ఆరు ఋతువులలోని అతిసూక్ష్మమైన మార్పులు తెలియ వస్తాయి.
శరీరం యొక్క పరిమాణం లో మూడు వంతులుగా ఉండే జలం యొక్క ప్రక్షాళన వల్ల యోగాభ్యాస ప్రధమ దశలో మన నోట్లో విపరీతంగా లాలాజలం ఉత్పత్తి అవుతుంది. అది ఎంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుందంటే బయటనుంచి నీరు త్రాగాలని అనిపించదు. శరీరంలో ఒక తన్మయత్వ స్థితి ఏర్పడుతుంది.
శరీరానికి మంచి తేజస్సు వస్తుంది. ఇకముందు ముందు శరీరంలోని నీటి పరిమాణం తగ్గుతూ శరీరం యొక్క వన్నె ద్విగుణీ కృతమవుతుంది. భూగర్భ జలాల సమాచారం, మేఘాలు, వర్షాల ప్రభావం చాలా సునిశితంగా అర్ధం అవడం మొదలవుతుంది. రేతస్సు శుద్ధి అవుతుంది. సత్సంతానానికి నాంది పలుకుతుంది.
“అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః…” అగ్నికి సంబంధించిన శుద్ధితో శరీరం తేజోమయం అవుతుంది.
వాక్సుద్ధి జరిగి వాజ్ఞ్మయుడుగా మారుతాడు. భుజించిన ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. రేతస్సు భస్మీపటలం చేయబడి రేతస్సు ఓజస్సుగాను, ఓజస్సు తేజస్సుగాను మారుతుంది. నేత్రదృష్టి తీక్షణంగాను అత్యంత ఆకర్షణీయంగాను మారుతుంది. ప్రకృతిలోని సహజమైన రంగులు అందాలు కనులవిందులు చేస్తాయి.
శరీరం చుట్టూ ఏర్పడే విద్యుత్ వలయాల శక్తి ఉధృతం అవుతుంది. చర్మంలో విశేషమైన కాంతి ఉత్పన్నమవుతుంది. చర్మం నుంచి మంచి సుగంధ భరితమైన వాసన వెలువడుతుంది. దృఢమైన మానసిక శక్తి ఏర్పడుతుంది. ఇతరుల మనస్సులోని భావాలు తెలుస్తాయి. వారి విద్యుత్ వలయాల పరిధిలోకి చేరిన వారి మానసిక రుగ్మతలు,సంఘర్షణలు అంతమయి మనస్సులు కుదుట బడతాయి. శారీరిక రుగ్మతలు కూడా సరి అవుతాయి.
ముసలితనం రాదు. అపమృత్యు భయం ఉండదు. ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం – శరీరం పూర్తిగా యోగాగ్నితో నిండి పోతుంది.
పంచభూతాలలో నాల్గవదయిన వాయువు శుద్ధి కావడం ద్వారా ప్రాణ శక్తి ఉధృతంగా పెరుగు తుంది. వాయువు శుద్ధి అయిన యోగాభ్యాసి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల వాయు మండలమే శుద్ధి అవుతుంది. “వాయు సర్వత్ర గో మహాన్”- వాయు సంచారం ద్వారా సమస్త లోకాల యొక్క సమాచారం అవగతం అవుతుంది.
ఇటువంటి సాధకుని నోటినుంచివచ్చే శాంతి ప్రవచనాలు సత్వరం ఫలిస్తాయి. మనస్సు అధీనంలోకి వస్తుంది. ఇచ్ఛామాత్రంగా (కోరిక కలిగిన తక్షణమే) ప్రాణమనో మిలనం జరుగుతుంది వీరికి. ధ్యాన స్థితి వీరికి కరతలామలకంగా ఉంటుంది. మేఘాలు, మేఘ గర్జనలు, విద్యుదాఘాతాలు శబ్ద స్వరూపంగా తెలుస్తాయి.
పంచభూతాలలో ఆఖరుదైన ఆకాశము మన హృదయంలో అంటే శిరస్సులోని దహరాకాశమే. అదే ఆత్మ నివసించే ప్రదేశం.
పంచభూతాలలో శుద్ధీకరింపబడిన భూమి, అగ్ని, జలము, వాయువులవల్ల మనస్సు ప్రాణము ఏకాత్మతను పొంది ప్రాణ మనో మిలనం జరుగుతుంది. అట్టి ప్రాణం మనస్సు తో కలసి దహరాకాశం లో ఉన్న ఆత్మను చేరి సమాధిస్థితిని పొందుతుంది.
అదే పరబ్రహ్మ స్వరూపం. దీనినే అపూర్వమనే ధర్మము అంటారు. అందుకే ఈ మనుష్య జాతిని సమస్త భూతముల యొక్క సారం అంటారు.
ఆ ఆత్మ సర్వ భూతాలకు అధిపతి మరియు రాజు అవుతోంది. అటువంటి ఆత్మ స్వరూపంలో సమస్త ప్రాణులు, సర్వ దేవతలు, సర్వ లోకాలు, సమస్త భూతాలు, సమస్త ఆత్మలు రధచక్రంలో ఇరుసు చుట్టూ ఉండే ఆకులు లాగ అమర్చబడి ఉన్నాయి.
లఘుత్వ మారోగ్య మలోలుపత్వం
వర్ణప్రసాదం స్వరసౌష్టవంచ।
గంధం శ్శుభో మూత్రపురీషమల్పం
యోగప్రవృత్తిం ప్రథమాం వదంతి।।
ప్రప్రధమంగా శరీరం తేలికగా అవుతుంది.మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది. చపలత్వం తగ్గిపోతుంది.శరీరం యొక్క రంగు ప్రకాశవంతమై ఉంటుంది. గంభీరమైన స్పష్ఠమైన నిర్దుష్టమైన కంఠధ్వని ఏర్పడుతుంది. శరీరం మంచి సు వాసనలను వెదజల్లుతూ ఉంటుంది. మూత్ర పురీషములు పూర్తిగా తగ్గిపోతాయి. తీసుకున్న ఆహారమంతా పూర్తిగా జీర్ణమయిపోతుంది.
యథైవ బింబం మృదయోపలిప్తం
తేజోమయం భ్రాజతే తత్సుధాంతమ్
తద్వాఽఽత్మ తత్వం ప్రసమీక్ష్య దేహీ
ఏకః కృతార్ధో భవతే వీతశోకః।।
బంగారు విగ్రహాలకు మట్టి పూసి అగ్నిలో కాల్చడం వల్ల అవి ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తాయి. మధువిద్యలో చెప్పినట్లు పంచభూతాత్మకమైన ఈశరీరం ముఖ్యప్రాణుని ఆధారంగా చేసే ఉద్గీథం వల్ల శుద్ధి చేయబడి ప్రాణ మనోమిలనమయి ఆత్మ దర్శన స్థితిని పొందుతోంది. ఆత్మ తత్వాన్ని దర్శించిన వాడు శోక విముక్తుడౌతున్నాడు. కృతార్ధుడు అవుతున్నాడు.
***
168.ఉపనిషద్విచారణ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
168. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: పంచమాధ్యాయం. పంచమ బ్రాహ్మణం:
యాజ్ఞవల్క్యుడు ఉషస్తునికి “ఆత్మ సర్వ వ్యాప్తమైనది అవడానికి వివరిస్తూ ఉషస్తా! ఆత్మ దృష్టి లాంటిది. దృష్టిని దృష్టి చూడలేదుకదా! సర్వ దృష్టికి మూలమైన దానిని ఈ దృష్టితో చూడడం సాధ్యం కాదు.అలాగే వినడం అనేది ఒక శక్తి. చెవికి వినబడుతుంది కనుక వినికిడి శక్తి ఉందని తెలుస్తుంది. సర్వ వినికిడి శక్తికి మూలమైన దానిని ఈ చెవి వినలేదు.
అలాగే ఆలోచనల వల్ల మనస్సు ఉన్నట్లు అర్ధమవుతుంది కానీ ఆ మనస్సు యొక్క మూల శక్తిని మన ఆలోచనల ద్వారా తెలుసుకోవడం సాధ్యంకాదు. ఈ మానవ శరీరంలో మనస్సు, చెవి, కన్ను కర్తలవుతున్నాయి.
వీటన్నిటికీ కర్త అయిన ఆ ఆత్మను వీటి సాయంతో చూడడం సాధ్యం కాదు. ఆత్మకు ఇతర భౌతిక వస్తువుల లాగా ఆకారం ఉండదు. అది సర్వత్రా వ్యాపించిన విశ్వ చైతన్యం. దానికి సంబంధించిన జ్ఞానం కలిగిన నాడు ఈ ఇంద్రియాలన్నీకూడా ఆత్మయే అయిపోతాయి.” అని వివరించాడు.
ఉషస్తుడు ప్రత్యక్షంగా కనుపించని ఆత్మ ఉందా అని ప్రశ్నిస్తే కహోళుడు ఆ ఆత్మ యొక్క స్వభావం ఎలాంటిది అని అడుగుతున్నాడు.
కౌషీతకుని కుమారుడైన కహోళుడు “యాజ్ఞవల్క్యా! సన్నిహితంగాను, ప్రత్యక్షంగాను ఉండే పరబ్రహ్మ స్వరూపాన్ని, సర్వాంతర్యామి యైన ప్రత్యగాత్మ స్వరూపమైన ఆ ఆత్మ స్వరూపాన్ని నాకు వివరించు” అని అడిగేడు.
ఓ కహోళుడా! సర్వ ప్రాణులలో ఉండే ఆ ఆత్మే నీలోను ఉంది. ప్రాణ మనశ్శరీరాలే ఆధారంగా ఉండే క్షుత్పిపాసలు, శోకమోహాలు, జరామరణాలు అనేవి ఏవీ ఆ ఆత్మను మాలిన్యం చేయలేక పోతున్నాయి.
అథభిక్షాచర్యం చరన్తి యా హ్యేవ పుత్రైషణా సా విత్తైషణా యా విత్తైషణా సా లోకైషణోభేహ్యేతే ఏషణే ఏవ భవతః।।
ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన బ్రహ్మజ్ఞానులు పుత్రైషణ, విత్తైషణ మరియు లోకైషణ అనే ఏషణా త్రయాదులు వదలి బిక్షాచరణను చేస్తూ సమస్త విషయముల దృష్టిని తిరస్కరించాలి.
తస్మాద్బ్రాహ్మణః పాణ్డిత్యం నిర్వద్య బాల్యేన తిష్ఠా సేత్ బాల్యం చ పాణ్డిత్యం చ నిర్విద్యాథ మునిర మౌనం చ మౌనంచ నిర్విద్యాథ బ్రాహ్మణః స బ్రాహ్మణః।।
తనకున్న పాండిత్యాన్నంతనూ వదలి స్వాధ్యాయి యైన విద్యార్ధిలా, బాలుడిలా (బాలస్వభావం కలవాడిలా) మారి అంటే నిగర్విగా మారి పరబ్రహ్మమును గురించి ధ్యానం చేయాలి. బాల్యపాండిత్యాలను త్రోసిపుచ్చి ముని కావాలి. మౌన అమౌనాలను త్రోసిపుచ్చి బ్రాహ్మణుడై ధన్యుడు కావాలి. అప్పుడే స్వరూపమైన ఆ మౌనాన్ని అర్ధం చేసుకొని సమస్తము ఆ బ్రహ్మ స్వరూపమనే జ్ఞానము కల బ్రాహ్మణుడౌతున్నాడు.
(ఏషణత్రయాదులు: ఈషణ/ఏషణ అంటే కోరిక.
విత్తేషణ = ధనం కావాలనే కోరిక
పుత్రేషణ = పుత్రులు కలగాలనే కోరిక
లోకేషణ లేదా దారేషణ = లోకంలోని సౌఖ్యాలన్నీ లేదా భార్య దొరకాలనే కోరిక (అంటే పెళ్ళి కావాలనే కోరిక))
చూడండి- ఆత్మజ్ఞానానికి కావలసిన పరిస్తితులు ఏమిటో వివరిస్తూ, వాటిని అలవరచుకోనిదే బ్రహ్మజ్ఞానం దుర్లభమవుతుందనే విషయాన్ని యాజ్ఞవల్క్యుడు విశదపరిచేడు.
ఒకటి రెండుసార్లు శాంత మనస్కులై చదివి అర్ధం చేసుకొని ఆచరించండి.
వచ్చే భాగంలో వచక్నుని పుత్రిక యైన గార్గి ప్రవేశం ఆమె అడిగిన ప్రశ్నలు ఉంటాయి.
***
169.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
169. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: పంచమాధ్యాయం. షష్ఠ బ్రాహ్మణం:
ఆ తర్వాత వచక్నుని పుత్రికయైన గార్గి “ఓభగవన్ యాజ్ఞవల్క్యా! ఈ సమస్తము జలములో ఓతప్రోతమై ఉందికదా! మరి జలము దేనిలో ఓతప్రోతమై ఉంది? అంటే ఉదకాలకు ఆధారం ఏమిటి?” అని అడిగింది.
యాజ్ఞవల్క్యుడు జవాబిచ్చేడు “వాయువు లో” అని.
వాయువు దేనితో కలిసి ఉంది? ఆకాశంతో
మరి ఆకాశం? గంధర్వలోకంతో
ఆ గంధర్వ లోకం? ఆదిత్య లోకంతో.
ఆ ఆదిత్యలోకం? చంద్రలోకంతో.
మరి చంద్రలోకం? నక్షత్రలోకం తో.
ఆ నక్షత్ర లోకం? దేవలోకంతో.
మరి దేవలోకం? ఇంద్రలోకంతో.
ఆ ఇంద్రలోకం? ప్రజాపతిలోకంతో.
మరి ప్రజాపతి లోకం? హిరణ్యగర్భుని లోకంతో. అంటే బ్రహ్మలోకంతో ఓతప్రోతమై ఉంది.
ఆ బ్రహ్మలోకం దేనితో ఓతప్రోతమై ఉంది? అని గార్గి అడిగింది.
ఇంతవరకూఓపికగా సమాధానమిచ్చిన యాజ్ఞవల్క్యుడు ఈ చివరి ప్రశ్నకు తీవ్రంగా స్పందించేడు.
“గార్గీ! హద్దు మీరుతున్నావు. తలపగులుతుంది జాగ్రత్త!” అని హెచ్చరించేడు.
“ఓ గార్గీ! ఇంతవరకూ అడిగినది ఒప్పుకున్నాను. సర్వానికీ అతీతమైనది ఆబ్రహ్మ వస్తువు హిరణ్యగర్భుని లోకము మాత్రమే. అదే సర్వస్వము. దానిని చెప్పడానికి సాధ్యము కాదు. ఆదిమధ్యాంతరహితుడు, అవ్యక్తుడు, ఇంద్రియా తీతుడు అయిన ఆ పరబ్రహ్మ తప్ప మరేదీ లేదు.
తర్కించ డానికి అర్హమైనది కాదు. తపస్సు ద్వారా తెలుసుకోవాలి, ధ్యానములో అనుభవానికి తెచ్చుకోవలసినది తప్ప ఇంక ప్రశ్నించ కూడదు. ఈవిధంగా న్యాయాన్నతిక్రమించి ప్రశ్నిస్తే నీ తల తెగి కిందపడుతుంది. నీకు బ్రతికి ఉండాలనే కోరిక ఉంటే ఈ ప్రశ్నను అడగవద్దు.” అని పలకగా గార్గి మరొక ప్రశ్న వేయడం ఆపింది.
(ఓతప్రోతము అంటే మగ్గం నేసేవాడు మగ్గం నేసేటప్పుడు ముందుగా దారాలన్నీ ఒక వరుసలో పేర్చుకొని వాటిని మగ్గం మీదకు చేర్చి బట్ట నేసేటప్పుడు తనకు కావలసిన డిజైన్ కూర్చుకుంటూ అడ్డంగా వచ్చే దారాలను నేస్తాడు.దాని కొరకై ఒక దారపు కండెను అటు ఇటు వెళ్ళేట్లా కాలితో మగ్గాన్ని తొక్కుతూ చేతితో లాగుతూ నేస్తాడు. దానినే “పడుగు పేక “ అని కూడా అంటారు. ఈ నేసే పద్ధతినే ఓతప్రోతము అని అంటారు.
ఆ దారాలలో మధ్య దారపు కండె అటు ఇటు నడుస్తున్నప్పుడు పైన ఉండే దారాలను ఏడు ఊర్ధ్వ లోకాలు గాను క్రింద ఉండే దారాలను ఏడు అధోలోకాలగాను అనుకొంటే మధ్యలో ఉండే దారపు కండె ఈ జీవుడు అవుతాడు. ఈజీవుడు ఊర్ధ్వ అధోలోకాలైన పదునాలుగు భువన భాండాలలోను జననమరణాలలో తను చేసిన కర్మలకు అనుగుణంగా ఓతప్రోతముగా సంచరిస్తూ ఉంటాడు.)
***
160.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
160. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: చతుర్ధ అథ్యాయం. చతుర్ధబ్రాహ్మణం:
(చతుర్ధ, పంచమ, షష్ట బ్రాహ్మణాలలో మైత్రేయికి
చేసిన బ్రహ్మవిద్యోపదేశం వివరించబడింది.)
స యథా సర్వాసామపాగ్ం సముద్ర ఏకాయన మేవగ్ం సర్వేషాగ్ం స్పర్శానాం త్వగేకాయన మేవగ్ం సర్వేషాగ్ం రసానాం జిహ్వైకాయన మేవగ్ం . . . .
సమస్త నదులకు, తటాకాదులలో ఉన్న జలాలకు మహా సముద్రమే నిలయమైనట్లు, మృదువు, కఠినమైన సమస్త స్పర్శలకు మన చర్మము, సమస్త రుచులకు జిహ్వ, అన్ని వాసనలకు నాశిక, అన్ని రూపాలకు కళ్ళు, సర్వ శబ్దములకు శ్రోత్రము, సంకల్పాలన్నిటికీ మనస్సు, విద్యలన్నిటికీ హృదయము, కర్మలన్నింటికీచేతులు, ఆనందా లన్నిటికీ యోనియు, మార్గాలన్నిటికీ పాదములు, వేదములన్నిటికీ వాక్కు అయి ఉన్నాయి.
ఈ ఇంద్రియాలన్నీ విషయాల నుంచి వేరుకాక ఆ విషయములే తాము అవుతున్నాయి. అలాగే సర్వేంద్రియాలు మనస్సుగా అవుతున్నాయి
ఆ మనస్సు విజ్ఞాన స్వరూపమవుతోంది. ఆ విజ్ఞాన స్వరూపం ప్రజ్ఞాన ఘన స్వరూపమైన పరమాత్మలో విలీనమై నీటిలో వేసిన ఉప్పుగడ్డ లాగ నిరుపాధికమవుతోంది.
స యథా సైన్ధవఖిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవాను విలీయేత, న హాస్యోద్గ్రహణా యేవస్యాత్, యతో యతస్త్వాదదీత లవణమేవై వం వా అర ఇదం మహాద్భూత మనన్త మపారం విజ్ఞాన ఘన ఏవ।
ఇక్కడ యాజ్ఞవల్క్యుడు ప్రజ్ఞానఘనాన్ని వివరిస్తున్నాడు. నీటినుంచే తయారు చేయబడిన ఉప్పురాయిని నీటిలో వేస్తే తిరిగి దానిని బయటకు తీయడం ఎంతటి వారికైనా సాధ్యంకాదు. ఆ నీటిని రుచి చూచిఉప్పగా ఉంది అని దాని స్వభావాన్ని తెలుసుకోవచ్చు. అదే విధంగా ఈ మనస్సుతో కూడిన విజ్ఞాన ఘన స్వరూపమైన ఈ జీవాత్మ ప్రజ్ఞానఘన స్వరూపమైన పరమాత్మలో నిండి ఉన్నాడు.
ఏతేభ్యో భూతేభ్యః సముత్థాయ తాన్యేవాసు వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తీత్యరే బ్రవీమీతి హోవాచ యాజ్ఞవల్క్యః।।
ఓ మైత్రేయీ! ఈ సమస్త భూతముల నుండి అజ్ఞానం వల్ల నామరూపాలు పుట్టి తిరిగి ఆత్మలోనే లీనమవుతున్నాయి.
దేహేంద్రియములు, మనస్సు ప్రాణము మొదలైన వాటివల్ల బ్రహ్మవిద్య సాధన ద్వారా తన్ను తాను తెలుసుకుని పరమాత్మ స్వరూపముగా మారిన వ్యక్తికి నేను, ఇతడు, ఇతని పుత్రుడు, ఇది నా వస్తువు, నేను సుఖం గా వున్నాను, నేను దుఃఖములో ఉన్నాను అనేటటువంటి బేధ భావం ఉండదని యాజ్ఞవల్క్యుడు పరమాత్మ స్వరూపాన్ని వివరించేడు.
ఆత్మ నామరూప క్రియాత్మకమైన ఈ శరీరంలో ఉండడం వల్ల తనను ఈ శరీరంతో గుర్తింప బడుతూ ద్వైత భావాన్ని పొందుతోంది. దానివల్ల చూడడం, వినడం, మాట్లాడడం, వాసన చూడడం, తలచు కోవడం, తెలుసుకోవడం అనేవి జరుగు తున్నాయి.
ఎప్పుడు ఆత్మవేత్తకు బ్రహ్మజ్ఞానము చేత సర్వస్వము ఆత్మయే అని అవగతమవుతుందో అప్పుడు దేనిచేత చూడడం జరుగుతోంది? దేనిచేత వినగలుగు తున్నాము? ఎవనిచేత సర్వ క్రియలు జరపబడుతున్నాయో, ఎవని వల్ల సర్వము తెలుసుకొనబడుతోందో అదే ప్రజ్ఞానఘన ఆత్మ. అదే బ్రహ్మజ్ఞానము. సర్వస్వాన్ని తెలుసుకొనేది ప్రజ్ఞాన ఘనమైన ఆత్మయే.
***
170.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
170. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: పంచమాధ్యాయం. సప్తమ బ్రాహ్మణం:
ఇప్పటివరకూ బ్రహ్మవిద్యా విషయమై అడిగిన ప్రశ్నలు అంత సంపూర్ణంగా లేవు. అరుణి పుత్రుడైన ఉద్దాలకుడు యాజ్ఞవల్క్యనికి అథర్వణవేదాన్ని నేర్పిన గురువు. ఆయనకు తెలుసు యాజ్ఞవల్క్యుడు పరిపూర్ణమైన బ్రహ్మ జ్ఞాని అని.
జనకుని యాగసభలో వచ్చిన సమస్త విద్వద్వరేణ్యులకు బ్రహ్మవిద్య పూర్తిగా అవగత మవాలని, తన శిష్యుడు యాజ్ఞవల్క్యుడు పరిపూర్ణ జ్ఞాని అని అందరకూ తెలియాలని తనే ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబడు తున్నాడు.
ఓ యాజ్ఞవల్క్యా! మేము ఒకప్పుడు మద్రదేశం లో కపిగోత్రజుడైన పతంజలి ఇంట్లో యజ్ఞ విధానా లను అధ్యయనం చేయడానికి ఉండేవాళ్ళం. ఆ పతంజలి భార్య యొక్క ఒంటిమీదకు ఒక గంధర్వుడు ఆవహిస్తూ ఉండేవాడు. అధర్వణపుత్రుడైన కబంధుడనే ఆ గంధర్వుడు పతంజలుని, మిగిలిన యాజ్ఞీకులను చూచి “ఓ కాప్యుడా! ఈ లోకాన్నీ పరలోకాలు మరియు సర్వ భూతాలను కలిపి ఉంచే సూత్రం ఒకటి ఉంది.
అది మీకు తెలుసా? ఈ లోకం పరలోకం మరియు సమస్త భూతాలలోను అంతర్యామియై నియంత్రిస్తున్నాడో ఆ అంతర్యామి గురించి మీకు తెలుసా? అని అడిగేడు.
ఎవరైతే ఈ సూత్రాన్ని మరియు ఆ అంతర్యామిని తెలుసుకుంటారో వాళ్ళే బ్రహ్మజ్ఞానులౌతారు.
వాళ్ళే ఈ లోకాలు దేవతలు వేదాలు సమస్త భూతాలు మరియు ఆ సర్వాంతర్యామిని తెలిసిన వాళ్ళు
అవుతారు. అని ఆ గంధర్వుడు చెప్పగా ఆ జ్ఞానాన్ని అతనినుంచి తెలుసుకొన్నాము. నీకు ఆ సూత్రము, ఆ అంతర్యామితత్వం తెలుసా? ఈ రెండింటిని తెలియకుండా నేనే బ్రహ్మజ్ఞానిని అని గోవులను తోలుకొనిపోతే నీ తల పగులుతుంది జాగ్రత్త!” అని ఉద్దాలకుడు యాజ్ఞవల్క్యునితో అన్నాడు.
తత్సూత్రం వాయునా వై గౌతమ సూత్రేణా యం చ లోకః
పరశ్చలోకః సర్వాణి చ భూతాని సన్దృబ్ధాని భవన్తి
ఓ భగవన్ ఉద్దాలకా! ఆ సూత్రము వాయువే. సూత్ర రూపమైన వాయువు చేతనే ఈలోకము (ఈ జన్మము) పరలోకము (పరజన్మ) సమస్త భూతాలు కట్టుబడి ఉన్నాయి.
తస్మాద్వై గౌతమ పురుషం ప్రేత మాహుర్వ్యస్రగ్ం సిషతాస్యాంగా నీతి వాయునా హి.
ఈ లోకము పరలోకము సమస్త భూతాలను అనుసంధానించేది వాయువే. మన శరీరం, శరీరంలోని సకల అవయవాలు నిశ్చేతనాలు. సూత్రరూపమైన వాయు స్వరూపము చేతనే అవయవాలన్నీ కూర్చబడి ఉన్నాయి. శరీరం నుంచి వాయువు (శ్వాస) నిష్క్రమిస్తే దండలో దారం తెగిపోతే పూసలు విడిపోయినట్లుగా అవయవాలన్నీ చేతనత్వాన్ని కోల్పోతాయి.
అంతర్యామి తత్వం:
యః పృథివ్యాం తిష్ఠన్ పృథివ్యా అన్తరో యం పృథివీ న వేదయస్య పృథివీ శరీరం యః
పృథివీమన్తరో యమయత్యేష త ఆత్మాన్తర్యా మ్యమృతః।।
ఎవడు భూమిలోనే ఉండి భూమి కంటే వేరుగా ఉంటూ భూమినే నియంత్రిస్తూ ఉంటాడో ఎవరిని పృథివి తెలుసుకోలేకుండా ఉందో, భూమి ఎవరికి శరీరమో అతడే అంతర్యామి. అదే ఆత్మ స్వరూపము.
కఠోపనిషత్తులో ఏతద్వైతత్ అంటూ ఆత్మ స్వరూపాన్ని వివరించినట్లు ఇక్కడ ఉదకములు, అగ్ని, అంతరిక్షము, వాయువు,ద్యులోకము, సూర్యుడు, దిక్కులు, చంద్రుడు నక్షత్రములు, ఆకాశము, సకల భూతములు మొదలైన వాటి లోపల వ్యాపించి ఉందో అదే అంతర్యామి. దేనిని ఇవి తెలుసుకోలేవో అవన్నీ ఆత్మ స్వరూపాలు. ఇవే ఆ ఆత్మకు శరీరాలు.
పైన చెప్పినవాటితో పాటు వాక్కు, దృష్టి, శ్రోత్రము, త్వక్కు, తమస్సు, తేజస్సు, ప్రాణము, మనస్సు, బుద్ధి (విజ్ఞానము), రేతస్సు, వీటన్నిటిలోను లోపల ఉంటూ వీటిని నడిపిస్తోందో అది అంతర్యామి. వాటి అంతరములో ఉన్నది ఆత్మ స్వరూపము.
పంచభూతాలలోనే కాక అన్ని భూతాలలోను సర్వాంతర్యామిగా ఉంటూ వాటికి తెలియకుండానే వాటిని నడిపిస్తూవాటి యొక్క శరీరంగా ఉండేదే అంతర్యామి.
అదే మన ఆత్మ. ఆ ఆత్మే చూచేది, వినేది, ఆలోచించేది, తెలుసుకొనేది అదే అమృతమైనది.
ఆ అంతర్యామి స్వరూపమైన ఆత్మ నేత్రము యొక్క దృష్టికి కనబడదు కాని దృక్స్వరూపం గా ఉంది. చెవికి వినబడనిదై శ్రోత్రాన్ని నడిపిస్తోంది. మనస్సంకల్పానికి అంతుచిక్కనిదై మనలోని సంకల్పాన్ని నడిపిస్తోంది.
ఈ అంతర్యామి కంటే వేరైన ద్రష్ట లేడు, శ్రోత లేడు. వేరే సంకల్పించే శక్తి లేదు, వేరే తెలుసుకొనే శక్తి లేదు. సర్వ భూతాలను నియంత్రించే అతడే అమృతుడు. సర్వ సాక్షీభూతుడు. అమృత మయమైన నీ లోని ఆ అంతర్యామియే నీ యొక్క ఆత్మ.
ఈ జవాబుతో ఉద్దాలకుడు సంతృప్తుడయ్యాడు.
వచ్చే భాగంలో గార్గి పునః ప్రవేశించి ప్రశ్నించడానికి ఉద్యుక్తురాలవుతోంది.
🕉🌞🌏🌙🌟🚩
171.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
171. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: పంచమాధ్యాయం. అష్టమ బ్రాహ్మణం:
అప్పుడు వచక్నుని పుత్రిక యైన గార్గి రెండవ సారి యాజ్ఞవల్క్యుని ప్రశ్నించడానికి ఉపక్రమించింది. అక్కడ ఉన్న బ్రాహ్మణుల నుద్దేశించి “ పూజ్యులైన మీరందరూ నాకు అనుమతి ఇస్తే ఈ యాజ్ఞవల్క్యుని రెండు ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానము చెబితే మీలో ఎవ్వరూ ఈ యాజ్ఞవల్క్యుని బ్రహ్మ సంవాదం లో జయించ లేరని నిర్ణయిద్దాము” అని పలుకగా అందరూ దానికి సమ్మతించేరు.
గార్గి మొదలుపెట్టింది.
“ఓ యాజ్ఞవల్క్యా! వీరులైన కాశీదేశపు రాజుకానీ, విదేహ చక్రవర్తిగాని తమ ధనుస్సులందు బాణములను సంధించి విడిస్తే అవి శత్రువులను ఎలా బాధిస్తాయో అదే రీతిగా మిమ్ము రెండు ప్రశ్నలడిగుతాను.” అంటే “సరే అడుగు నేను సిద్ధమే” అన్నాడు.
“యాజ్ఞవల్క్యా!స్వర్గలోకమునకు పైన, పృథివికి క్రింద, భూలోకానికి స్వర్గానికి మధ్య ఉండే అంతరాళం లోను, భూతభవిష్యద్వర్తమానాలలో వీటన్నిటినీ కలుపుతూ ఉండే సూత్రం ఏది ఉందో అది దేనిలో ఓతప్రోతమై ఉంది. దానిని వివరంగా చెప్పండి” అని అడిగింది గార్గి.
“ఓ గార్గీ! ద్యులోకానికి పైన భూమికంటే క్రింద ఆ రెండింటికి మధ్య లోను మరియు భూత వర్తమాన భవిష్యత్తులయిన జగత్తంతా వ్యాపించి ఉండేది అవ్యక్తమైన ఆకాశము. ఈ జగత్తుకు ఉన్న సృష్టి స్థితి లయాలనే మూడు అవస్తలలోను సూత్రమని చెప్పబడేది ఆ అవ్యక్త ఆకాశం (అంతరిక్షము) చేత వ్యాపించి ఉంటుంది. అదే ఆకాశం లో ఈ సూత్రరూపమైన సమస్తము ఓతప్రోతమై ఉంది అని సమాధానం చెప్పేడు యాజ్ఞవల్క్యుడు.
“ఓ యాజ్ఞవల్క్యా! నాప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పేవు. నీకు ఇవే నానమస్కారాలు.” అంది గార్గి.
“నా రెండవ ప్రశ్న ఏమిటంటే సూత్రాత్మ అవ్యక్త ఆకాశం చేత కల్పింపబడిందన్నావుకదా! ఆ అవ్యక్త ఆకాశం దేనితో ఓతప్రోతముగా ఉంది? దేనితో వ్యాపించబడింది.” అంది గార్గి.
ఈ మంత్రం చాలా ముఖ్యమైనది. చూడండి: ఆత్మ స్వరూపాన్ని వివరిస్తున్నాడు.
సహోవాచై తద్వై తదక్షరం గార్గి బ్రహ్మణా అభివద న్త్యస్థూల మనణ్వ హ్రస్వ మదీర్ఘ లోహిత మస్నేహ మచ్ఛాయ మతమోఽ వాయ్వనాకాశ మసజ్ఞ మరస మగన్ధ మచక్షుష్క మశ్రోత్ర మవాగమనోఽ తేజస్క మప్రాణ మముఖ మమాత్ర మనన్తర మబాహ్యం న తదశ్నాతి కించన తదశ్నాతి కశ్చన।।
ఓ గార్గీ! బ్రహ్మజ్ఞానులు దానిని అక్షరమని చెబుతారు. నాశరహితమైన ఆ అక్షరములోనే అవ్యక్త ఆకాశము ఓతప్రోతమై ఉంది. ఆ అక్షరము స్థూలము కాదు. సూక్ష్మముకాదు. అణువు కాదు. పొట్టిది కాదు, పొడుగుది కాదు. అలోహితమది అంటే రక్తము లేనిది. అస్నేహము అంటే జిడ్డు, నూనె లేదా క్రొవ్వు లేనిది. అచ్ఛాయము అంటే నీడలేనిది. అతమము అంటే తమస్సు (అజ్ఞానము) లేనిది లేదా చీకటి లేనిది, అవాయువు అంటే వాయువు కానిది. అనాకాశము అంటే ఆకాశము కానిది; అసంగము అంటే సంగము కానిది. అరసము అంటే రసము లేనిది, అగంధము అంటే వాసన లేనిది, కన్ను, చెవి, వాక్కు, మనస్సు లేనిది. తేజస్సు, ప్రాణము, ముఖము లేనిది.
అంతెందుకు, అమాత్రము అంటే పరిమాణము లేనిది. లోపల లేదు, బయటా లేదు. అదే వుంది. అది దేనినీ తినడం లేదు. దానిని ఎవరూ భుజించడం లేదు. అది దేనికీ భోక్త కాదు. అది దేనికీ భోజ్యము కాదు. అక్షరమైనటువంటి వ్యాపకమైన స్వరూపము గా దాని తత్వాన్ని తెలుసుకోవాలి.
ఇప్పుడు ఆ అక్షర పరబ్రహ్మ యొక్క ప్రశాసనాన్ని అంటే నియంత్రణాశక్తిని వివరిస్తున్నాడు.
ఓ గార్గీ! ఆ అక్షరుని ఆజ్ఞ తోనే సూర్యచంద్రులు సంచరిస్తున్నారు. పృథివీ అంతరిక్షాలు శక్తిమంతం గా ఉన్నాయి. ఆ అక్షరుని కనుసన్నలలోనే నిముషాలు ముహూర్తములు, అహోరాత్రాలు పక్షాలు మాసాలు, ఋతువులు మరియు సంవత్సరాలతో కూడిన కాల గమనం గతి తప్పకుండా నడుస్తోంది. ఆ అక్షరుని ఆజ్ఞతోనే హిమవత్పర్వతాలనుంచి కొన్ని నదులు తూర్పు దిశగాను కొన్ని నదులు పశ్చిమ దిశ గాను ప్రవహిస్తున్నాయి. ఈ అక్షరుని ప్రశాసనాన్ని అనుసరించే మనుష్యులు దానధర్మాలు చేస్తున్నారు. హవ్య యజ్ఞాలు, పితృ దేవతలకు దర్వీహోమం జరపబడుతున్నాయి.
ఓ గార్గీ! ఈ అక్షర పరబ్రహ్మాన్ని తెలుసుకోకుండా ఎన్నో సంవత్సరాలు యజ్ఞయాగాది క్రతువులు చేసినా అది నిష్ప్రయోజనమే. ఆ అక్షరుని తెలుసుకోకుండా మరణించినవాడు ఈ జనన మరణ చక్రనుంచి విముక్తుడు కాలేడు.
ఓ గార్గీ! ఈ అక్షర పరబ్రహ్మ తాను చూచేదే కాని మనచేత చూడబడేదికాదు. మనకు వినబడకుండా ఉండి తాను వింటుంది. తాను తెలుసుకొనేదే కాని మనచేత తెలుసుకో బడేది కాదు. ఈ అక్షరబ్రహ్మ తప్ప ఇంక చూసేది, వినేది, తెలుసుకొనబడేది, ఆలోచించబడేది ఇంకేదీ లేదు. ఓ గార్గీ! ఈ అక్షరములోనే ఆకాశము ఓతప్రోతమై ఉంది.” అని యాజ్ఞవల్క్యుడు ముగించేడు.
అప్పుడు గార్గి “ఓ పూజ్యులైన బ్రాహ్మణులారా! యాజ్ఞవల్క్య మహామునికి నమస్కరించి వారితో వాదమునుండి మనము విరమించుట మంచిది. మీలో ఏ ఒక్కరూ ఈ మునిని బ్రహ్మవిద్య యందు సంవాదం లో జయింపలేరు” అని ఆ ఋషికి నమస్కరించి శాంతించింది.
వచ్చే భాగంలో:
గార్గి అలా ప్రకటించిన తర్వాత కూడా శకలుని కుమారుడైన విదగ్ధుడు అనే ఋషి యాజ్ఞవల్క్యుని ప్రశ్నించడం మొదలుపెట్టి భంగపడి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అహంకారంతో బ్రహ్మజ్ఞానిని ద్వేషించి అవమానించడానికి ప్రయత్నించిన వారికి ఇహపరాలు రెండూ కూడా దక్కవు అన్నట్లుగా విదగ్ధుడి మరణంతర్వాత ఆయన శిష్యులు అంత్యక్రియలు చేసి అతని అస్థికలను తీసుకొని పోతూంటే మార్గమధ్యంలో దొంగలు ధనమని తలచి ఆ అస్థికలను దొంగిలించుకు పోయారు.
***
Om Namaha Shivaya:
174.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
174. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: పంచమాధ్యాయం. నవమ బ్రాహ్మణం (Continuation):
ఓ శాకల్యుడా! ఈ బ్రాహ్మణులు నిన్ను ఒక కీలుబొమ్మలా ఆడిస్తూ, నీ ద్వారా నన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత మనస్కుడవై శాంతించు. నీకు శుభమవుతుంది. అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
ఓ యాజ్ఞవల్క్యా! కురు పాంచాల దేశములలోని బ్రాహ్మణులను అతిక్రమించి వాదన చేస్తున్నావు, నీవు బ్రహ్మవేత్తవేనా? అని విదగ్ధుడు (శాకల్యుడు) అడిగేడు. దానితో యాజ్ఞవల్క్యనికి పూర్తిగా అర్ధమయ్యింది శాకల్యుని అహంకారము.
ఓ శాకల్యా! నేను దేవతలతో కూడుకున్నవి, ప్రతిష్ఠలతో కూడుకున్న దిక్కులను గుర్తు ఎరుగుదును. అనగానే ఓ యాజ్ఞవల్క్యా! నీవు అధిష్ఠాన దేవతలతోను వారి స్థితులతోను కూడిన దిక్కుల వివరాలు నాకు చెప్పు? అని అడిగేడు.
ఇక్కడనుంచి ప్రతి జవాబుకి శాకల్యుని నుంచి అతని అంగీకారాన్ని తీసుకున్నాడు.
యాజ్ఞవల్క్యా! ఈ తూర్పు దిక్కులో నీవు ఏ దేవతా స్వరూపుడవు అయ్యావు?
సూర్య దేవతా స్వరూపుడను.
ఆ సూర్యుడెక్కడ ఉంచబడ్డాడు? నేత్రములో.
ఆ నేత్రము ఎక్కడ ఉంచబడింది? నేత్రము ఆకారములలో(రూపాలు) ఉంచబడింది.
ఆ రూపాలు దేనిలో ఉంచబడ్డాయి? హృదయం చేతనే రూపాలు తెలియబడు తున్నాయి కనుక హృదయంలోనే ఉంచబడ్డాయి.
ఓ యాజ్ఞవల్క్యా! నీవు చెప్పినవన్నీ నేను అంగీక రిస్తున్నాను.
దక్షిణ దిక్కులో ఏ దేవత ఉంది? యమదేవత.
ఆ యముని ప్రతిష్ఠ ఏది? యజ్ఞము.
యజ్ఞము దేనిలో ప్రతిష్ఠిత మై ఉంది? దక్షిణ యొసగుట యందు.
దక్షిణ దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? శ్రద్ధ యందు. ఎందుకంటే శ్రద్ధ ఉన్నప్పుడే మానవులు దక్షిణ ఇవ్వగలుగుతారు.
శ్రద్ధలో దక్షిణ ప్రతిష్ఠింపబడి ఉంది. శ్రద్ధ దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? హృదయంలో.
హృదయము (బుద్ధి) చేతనే శ్రద్ధను తెలుసుకో గలుగుతాడు. అందువల్ల హృదయమే శ్రద్ధ యొక్క ప్రతిష్ఠా స్థానమై ఉంది.
ఓ యాజ్ఞవల్క్యా! నీ సమాధానములను అంగీకరించితిని అని శాకల్యుడు చెప్పేడు.
ఓ యాజ్ఞవల్క్యా! నీవు పశ్చిమ దిక్కులో ఏదేవతా స్వరూపుడవు అయ్యావు? వరుణ దేవతా స్వరూపుడను.
ఆ వరుణుడు ఎక్కడ ఉంచబడ్డాడు? ఉదకములలో ఉంచబడ్డాడు. ఉదకములు రేతస్సు లో ఉంచబడ్డాయి.
ఆ రేతస్సు దేనిలో ఉంచబడింది? పుత్రుడు హృదయం నుండే పుడతాడని చెబుతారు. అందుకని రేతస్సు హృదయం లోనే ఉంచ బడింది.
యాజ్ఞవల్క్యా! నేను నీవు చెప్పినవన్నీ అంగీకరిస్తున్నాను.
ఉత్తర దిక్కులో నేను సోమదేవతా స్వరూపుడనై ఉన్నాను. సోముడు యజ్ఞ దీక్షలోను, యజ్ఞదీక్ష సత్యము లోను, సత్యము హృదయములోను ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ ప్రకారము నీవు చెప్పిన వన్నీ నేను అంగీకరించేను.
కిందేవతోస్యాం ధ్రువాయాం దిశ్యసీత్యగ్ని దేవత ఇతి సోగ్నిః
కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి వాచీతి కస్మిన్ను వాక్ ప్రతిష్ఠితేతి హృదయ ఇతి కస్మిన్ను హృదయం ప్రతిష్ఠితమితి।।
ఈ ధ్రువ నక్షత్రాది దిక్కులలో ఏ దేవత ఉంది? అగ్ని దేవత.
ఆ అగ్ని దేవత దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? వాక్కు లో.
వాక్కు దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? హృదయం లో.
హృదయం దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? అని శాకల్యుడడిగిన ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడిలో ఆగ్రహం పెల్లుబికింది.
అహల్లి కేతి హోవాచ యాజ్ఞవల్క్యో యత్రైతదన్య త్రాస్మన్మన్యాసై యద్ధ్యేత దన్య త్రాస్మత్స్యాచ్ఛ్వానో వైనదద్యు ర్వయాగ్ంసి వై నద్విమథ్వీ రన్నితి।।
ఓ అహల్లికా! అతిమాఢుడా! ఈ హృదయం మనలను విడిచి వేరొకదానిలో ప్రతిష్ఠితమై ఉందని నీవు కనుక తెలుసుకొని ఉంటే – అంటే ఈ శరీరము కాక రెండవ స్థానములలో హృదయం ప్రతిష్ఠించ బడితే దానిని కుక్కలు తిని వేసి ఉంటాయి. లేదా పక్షులుకూడా తినివేస్తాయి. హృదయం అనేది నీలో కాకుండా బయట వేరే ప్రతిష్ఠితమై ఉండదు. హృదయము ఈ శరీరంలోనే ఉంచబడింది.
అయినా శాకల్యుడు ప్రశ్నించడం ఆపలేదు.
నీ శరీరము, నీ హృదయము దేనిలో ప్రతిష్ఠింప బడి ఉన్నాయి? శాకల్యా! ప్రాణవాయువులో. ప్రాణవాయువు అపానవాయువులోను, అపాన వాయువు వ్యానవాయువులోను, వ్యాన వాయువు ఉదాన వాయువులోను, ఉదాన వాయువు సమాన వాయువులోను ఉంచబడ్డాయి. శరీరము హృదయము ప్రాణాది వాయువుల చేత ఒకదానిలో మరొకటి ఓతప్రోతముగా ఉంచ బడ్డాయి.
ఓ శాకల్యా! నేతి నేతి అంటూ నిషేధించి నిరూపింపబడిన ఆత్మ స్వరూపము ఈ శరీర ధర్మాలను అతిక్రమించి ఉంటుంది. గ్రహించ డానికి సాధ్యము కానిది. అందువల్లే ఆత్మ స్వరూపము శిథిలము కానిది, ఆకారము లేనిది అయ్యింది.
శాకల్యా! ఈ ఆత్మ పృథివి మొదలైన ఎనిమిది స్థానములను, అగ్ని మొదలైన ఎనిమిది లోకములను, అమృతము మొదలైన ఎనమండుగురు దేవతలను, శరీరము మొదలైన ఎనిమిది పురుషులను సస్వరూపముతో, ఆత్మ స్వరూపముతో హృదయములో ఉపాధి ధర్మాన్ని అతిక్రమించి ఉంది.
ఉపనిషత్తులలో తెలుసుకో దగిన అటువంటి ఆత్మను నిన్ను అడుగు తున్నాను. దానిని నీవు చెప్పలేక పోతే నీ శిరస్సు పగిలిపోతుంది సుమా. అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
శాకల్యుడు ఆత్మ స్వరూపాన్ని తెలియని వాడవడం వల్ల అతని శిరస్సు పగిలి పడిపోయింది.
ఈ రీతిగా బ్రాహ్మణ శాపానికి హతుడైన శాకల్యునికి ఊర్ధ్వలోక క్రియలను చేసి పుణ్య లోకప్రాప్తి కలుగ చేయాలని అతని శిష్యులు శాకల్యుని అస్థికలను తీసుకొని పోతూంటే దారిలో దొంగలు వాటిని ధనమని తలచి దొంగిలించుకొని పోయేరు.
ఆ రకంగా అహంకారంతో బ్రహ్మవేత్తను ద్వేషించిన వాడికి ఇహ పరలోకాలు రెండూ కూడా లేకుండా పోయేయి.
***
174.ఉపనిషద్విచారణ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
174. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: పంచమాధ్యాయం. నవమ బ్రాహ్మణం (Continuation):
ఓ శాకల్యుడా! ఈ బ్రాహ్మణులు నిన్ను ఒక కీలుబొమ్మలా ఆడిస్తూ, నీ ద్వారా నన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత మనస్కుడవై శాంతించు. నీకు శుభమవుతుంది. అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
ఓ యాజ్ఞవల్క్యా! కురు పాంచాల దేశములలోని బ్రాహ్మణులను అతిక్రమించి వాదన చేస్తున్నావు, నీవు బ్రహ్మవేత్తవేనా? అని విదగ్ధుడు (శాకల్యుడు) అడిగేడు. దానితో యాజ్ఞవల్క్యనికి పూర్తిగా అర్ధమయ్యింది శాకల్యుని అహంకారము.
ఓ శాకల్యా! నేను దేవతలతో కూడుకున్నవి, ప్రతిష్ఠలతో కూడుకున్న దిక్కులను గుర్తు ఎరుగుదును. అనగానే ఓ యాజ్ఞవల్క్యా! నీవు అధిష్ఠాన దేవతలతోను వారి స్థితులతోను కూడిన దిక్కుల వివరాలు నాకు చెప్పు? అని అడిగేడు.
ఇక్కడనుంచి ప్రతి జవాబుకి శాకల్యుని నుంచి అతని అంగీకారాన్ని తీసుకున్నాడు.
యాజ్ఞవల్క్యా! ఈ తూర్పు దిక్కులో నీవు ఏ దేవతా స్వరూపుడవు అయ్యావు?
సూర్య దేవతా స్వరూపుడను.
ఆ సూర్యుడెక్కడ ఉంచబడ్డాడు? నేత్రములో.
ఆ నేత్రము ఎక్కడ ఉంచబడింది? నేత్రము ఆకారములలో(రూపాలు) ఉంచబడింది.
ఆ రూపాలు దేనిలో ఉంచబడ్డాయి? హృదయం చేతనే రూపాలు తెలియబడు తున్నాయి కనుక హృదయంలోనే ఉంచబడ్డాయి.
ఓ యాజ్ఞవల్క్యా! నీవు చెప్పినవన్నీ నేను అంగీక రిస్తున్నాను.
దక్షిణ దిక్కులో ఏ దేవత ఉంది? యమదేవత.
ఆ యముని ప్రతిష్ఠ ఏది? యజ్ఞము.
యజ్ఞము దేనిలో ప్రతిష్ఠిత మై ఉంది? దక్షిణ యొసగుట యందు.
దక్షిణ దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? శ్రద్ధ యందు. ఎందుకంటే శ్రద్ధ ఉన్నప్పుడే మానవులు దక్షిణ ఇవ్వగలుగుతారు.
శ్రద్ధలో దక్షిణ ప్రతిష్ఠింపబడి ఉంది. శ్రద్ధ దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? హృదయంలో.
హృదయము (బుద్ధి) చేతనే శ్రద్ధను తెలుసుకో గలుగుతాడు. అందువల్ల హృదయమే శ్రద్ధ యొక్క ప్రతిష్ఠా స్థానమై ఉంది.
ఓ యాజ్ఞవల్క్యా! నీ సమాధానములను అంగీకరించితిని అని శాకల్యుడు చెప్పేడు.
ఓ యాజ్ఞవల్క్యా! నీవు పశ్చిమ దిక్కులో ఏదేవతా స్వరూపుడవు అయ్యావు? వరుణ దేవతా స్వరూపుడను.
ఆ వరుణుడు ఎక్కడ ఉంచబడ్డాడు? ఉదకములలో ఉంచబడ్డాడు. ఉదకములు రేతస్సు లో ఉంచబడ్డాయి.
ఆ రేతస్సు దేనిలో ఉంచబడింది? పుత్రుడు హృదయం నుండే పుడతాడని చెబుతారు. అందుకని రేతస్సు హృదయం లోనే ఉంచ బడింది.
యాజ్ఞవల్క్యా! నేను నీవు చెప్పినవన్నీ అంగీకరిస్తున్నాను.
ఉత్తర దిక్కులో నేను సోమదేవతా స్వరూపుడనై ఉన్నాను. సోముడు యజ్ఞ దీక్షలోను, యజ్ఞదీక్ష సత్యము లోను, సత్యము హృదయములోను ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ ప్రకారము నీవు చెప్పిన వన్నీ నేను అంగీకరించేను.
కిందేవతోస్యాం ధ్రువాయాం దిశ్యసీత్యగ్ని దేవత ఇతి సోగ్నిః
కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి వాచీతి కస్మిన్ను వాక్ ప్రతిష్ఠితేతి హృదయ ఇతి కస్మిన్ను హృదయం ప్రతిష్ఠితమితి।।
ఈ ధ్రువ నక్షత్రాది దిక్కులలో ఏ దేవత ఉంది? అగ్ని దేవత.
ఆ అగ్ని దేవత దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? వాక్కు లో.
వాక్కు దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? హృదయం లో.
హృదయం దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? అని శాకల్యుడడిగిన ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడిలో ఆగ్రహం పెల్లుబికింది.
అహల్లి కేతి హోవాచ యాజ్ఞవల్క్యో యత్రైతదన్య త్రాస్మన్మన్యాసై యద్ధ్యేత దన్య త్రాస్మత్స్యాచ్ఛ్వానో వైనదద్యు ర్వయాగ్ంసి వై నద్విమథ్వీ రన్నితి।।
ఓ అహల్లికా! అతిమాఢుడా! ఈ హృదయం మనలను విడిచి వేరొకదానిలో ప్రతిష్ఠితమై ఉందని నీవు కనుక తెలుసుకొని ఉంటే – అంటే ఈ శరీరము కాక రెండవ స్థానములలో హృదయం ప్రతిష్ఠించ బడితే దానిని కుక్కలు తిని వేసి ఉంటాయి. లేదా పక్షులుకూడా తినివేస్తాయి. హృదయం అనేది నీలో కాకుండా బయట వేరే ప్రతిష్ఠితమై ఉండదు. హృదయము ఈ శరీరంలోనే ఉంచబడింది.
అయినా శాకల్యుడు ప్రశ్నించడం ఆపలేదు.
నీ శరీరము, నీ హృదయము దేనిలో ప్రతిష్ఠింప బడి ఉన్నాయి? శాకల్యా! ప్రాణవాయువులో. ప్రాణవాయువు అపానవాయువులోను, అపాన వాయువు వ్యానవాయువులోను, వ్యాన వాయువు ఉదాన వాయువులోను, ఉదాన వాయువు సమాన వాయువులోను ఉంచబడ్డాయి. శరీరము హృదయము ప్రాణాది వాయువుల చేత ఒకదానిలో మరొకటి ఓతప్రోతముగా ఉంచ బడ్డాయి.
ఓ శాకల్యా! నేతి నేతి అంటూ నిషేధించి నిరూపింపబడిన ఆత్మ స్వరూపము ఈ శరీర ధర్మాలను అతిక్రమించి ఉంటుంది. గ్రహించ డానికి సాధ్యము కానిది. అందువల్లే ఆత్మ స్వరూపము శిథిలము కానిది, ఆకారము లేనిది అయ్యింది.
శాకల్యా! ఈ ఆత్మ పృథివి మొదలైన ఎనిమిది స్థానములను, అగ్ని మొదలైన ఎనిమిది లోకములను, అమృతము మొదలైన ఎనమండుగురు దేవతలను, శరీరము మొదలైన ఎనిమిది పురుషులను సస్వరూపముతో, ఆత్మ స్వరూపముతో హృదయములో ఉపాధి ధర్మాన్ని అతిక్రమించి ఉంది.
ఉపనిషత్తులలో తెలుసుకో దగిన అటువంటి ఆత్మను నిన్ను అడుగు తున్నాను. దానిని నీవు చెప్పలేక పోతే నీ శిరస్సు పగిలిపోతుంది సుమా. అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
శాకల్యుడు ఆత్మ స్వరూపాన్ని తెలియని వాడవడం వల్ల అతని శిరస్సు పగిలి పడిపోయింది.
ఈ రీతిగా బ్రాహ్మణ శాపానికి హతుడైన శాకల్యునికి ఊర్ధ్వలోక క్రియలను చేసి పుణ్య లోకప్రాప్తి కలుగ చేయాలని అతని శిష్యులు శాకల్యుని అస్థికలను తీసుకొని పోతూంటే దారిలో దొంగలు వాటిని ధనమని తలచి దొంగిలించుకొని పోయేరు.
ఆ రకంగా అహంకారంతో బ్రహ్మవేత్తను ద్వేషించిన వాడికి ఇహ పరలోకాలు రెండూ కూడా లేకుండా పోయేయి.
***
Om Namaha Shivaya:
174.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
174. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: పంచమాధ్యాయం. నవమ బ్రాహ్మణం (Continuation):
ఓ శాకల్యుడా! ఈ బ్రాహ్మణులు నిన్ను ఒక కీలుబొమ్మలా ఆడిస్తూ, నీ ద్వారా నన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత మనస్కుడవై శాంతించు. నీకు శుభమవుతుంది. అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
ఓ యాజ్ఞవల్క్యా! కురు పాంచాల దేశములలోని బ్రాహ్మణులను అతిక్రమించి వాదన చేస్తున్నావు, నీవు బ్రహ్మవేత్తవేనా? అని విదగ్ధుడు (శాకల్యుడు) అడిగేడు. దానితో యాజ్ఞవల్క్యనికి పూర్తిగా అర్ధమయ్యింది శాకల్యుని అహంకారము.
ఓ శాకల్యా! నేను దేవతలతో కూడుకున్నవి, ప్రతిష్ఠలతో కూడుకున్న దిక్కులను గుర్తు ఎరుగుదును. అనగానే ఓ యాజ్ఞవల్క్యా! నీవు అధిష్ఠాన దేవతలతోను వారి స్థితులతోను కూడిన దిక్కుల వివరాలు నాకు చెప్పు? అని అడిగేడు.
ఇక్కడనుంచి ప్రతి జవాబుకి శాకల్యుని నుంచి అతని అంగీకారాన్ని తీసుకున్నాడు.
యాజ్ఞవల్క్యా! ఈ తూర్పు దిక్కులో నీవు ఏ దేవతా స్వరూపుడవు అయ్యావు?
సూర్య దేవతా స్వరూపుడను.
ఆ సూర్యుడెక్కడ ఉంచబడ్డాడు? నేత్రములో.
ఆ నేత్రము ఎక్కడ ఉంచబడింది? నేత్రము ఆకారములలో(రూపాలు) ఉంచబడింది.
ఆ రూపాలు దేనిలో ఉంచబడ్డాయి? హృదయం చేతనే రూపాలు తెలియబడు తున్నాయి కనుక హృదయంలోనే ఉంచబడ్డాయి.
ఓ యాజ్ఞవల్క్యా! నీవు చెప్పినవన్నీ నేను అంగీక రిస్తున్నాను.
దక్షిణ దిక్కులో ఏ దేవత ఉంది? యమదేవత.
ఆ యముని ప్రతిష్ఠ ఏది? యజ్ఞము.
యజ్ఞము దేనిలో ప్రతిష్ఠిత మై ఉంది? దక్షిణ యొసగుట యందు.
దక్షిణ దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? శ్రద్ధ యందు. ఎందుకంటే శ్రద్ధ ఉన్నప్పుడే మానవులు దక్షిణ ఇవ్వగలుగుతారు.
శ్రద్ధలో దక్షిణ ప్రతిష్ఠింపబడి ఉంది. శ్రద్ధ దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? హృదయంలో.
హృదయము (బుద్ధి) చేతనే శ్రద్ధను తెలుసుకో గలుగుతాడు. అందువల్ల హృదయమే శ్రద్ధ యొక్క ప్రతిష్ఠా స్థానమై ఉంది.
ఓ యాజ్ఞవల్క్యా! నీ సమాధానములను అంగీకరించితిని అని శాకల్యుడు చెప్పేడు.
ఓ యాజ్ఞవల్క్యా! నీవు పశ్చిమ దిక్కులో ఏదేవతా స్వరూపుడవు అయ్యావు? వరుణ దేవతా స్వరూపుడను.
ఆ వరుణుడు ఎక్కడ ఉంచబడ్డాడు? ఉదకములలో ఉంచబడ్డాడు. ఉదకములు రేతస్సు లో ఉంచబడ్డాయి.
ఆ రేతస్సు దేనిలో ఉంచబడింది? పుత్రుడు హృదయం నుండే పుడతాడని చెబుతారు. అందుకని రేతస్సు హృదయం లోనే ఉంచ బడింది.
యాజ్ఞవల్క్యా! నేను నీవు చెప్పినవన్నీ అంగీకరిస్తున్నాను.
ఉత్తర దిక్కులో నేను సోమదేవతా స్వరూపుడనై ఉన్నాను. సోముడు యజ్ఞ దీక్షలోను, యజ్ఞదీక్ష సత్యము లోను, సత్యము హృదయములోను ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ ప్రకారము నీవు చెప్పిన వన్నీ నేను అంగీకరించేను.
కిందేవతోస్యాం ధ్రువాయాం దిశ్యసీత్యగ్ని దేవత ఇతి సోగ్నిః
కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి వాచీతి కస్మిన్ను వాక్ ప్రతిష్ఠితేతి హృదయ ఇతి కస్మిన్ను హృదయం ప్రతిష్ఠితమితి।।
ఈ ధ్రువ నక్షత్రాది దిక్కులలో ఏ దేవత ఉంది? అగ్ని దేవత.
ఆ అగ్ని దేవత దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? వాక్కు లో.
వాక్కు దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? హృదయం లో.
హృదయం దేనిలో ప్రతిష్ఠితమై ఉంది? అని శాకల్యుడడిగిన ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడిలో ఆగ్రహం పెల్లుబికింది.
అహల్లి కేతి హోవాచ యాజ్ఞవల్క్యో యత్రైతదన్య త్రాస్మన్మన్యాసై యద్ధ్యేత దన్య త్రాస్మత్స్యాచ్ఛ్వానో వైనదద్యు ర్వయాగ్ంసి వై నద్విమథ్వీ రన్నితి।।
ఓ అహల్లికా! అతిమాఢుడా! ఈ హృదయం మనలను విడిచి వేరొకదానిలో ప్రతిష్ఠితమై ఉందని నీవు కనుక తెలుసుకొని ఉంటే – అంటే ఈ శరీరము కాక రెండవ స్థానములలో హృదయం ప్రతిష్ఠించ బడితే దానిని కుక్కలు తిని వేసి ఉంటాయి. లేదా పక్షులుకూడా తినివేస్తాయి. హృదయం అనేది నీలో కాకుండా బయట వేరే ప్రతిష్ఠితమై ఉండదు. హృదయము ఈ శరీరంలోనే ఉంచబడింది.
అయినా శాకల్యుడు ప్రశ్నించడం ఆపలేదు.
నీ శరీరము, నీ హృదయము దేనిలో ప్రతిష్ఠింప బడి ఉన్నాయి? శాకల్యా! ప్రాణవాయువులో. ప్రాణవాయువు అపానవాయువులోను, అపాన వాయువు వ్యానవాయువులోను, వ్యాన వాయువు ఉదాన వాయువులోను, ఉదాన వాయువు సమాన వాయువులోను ఉంచబడ్డాయి. శరీరము హృదయము ప్రాణాది వాయువుల చేత ఒకదానిలో మరొకటి ఓతప్రోతముగా ఉంచ బడ్డాయి.
ఓ శాకల్యా! నేతి నేతి అంటూ నిషేధించి నిరూపింపబడిన ఆత్మ స్వరూపము ఈ శరీర ధర్మాలను అతిక్రమించి ఉంటుంది. గ్రహించ డానికి సాధ్యము కానిది. అందువల్లే ఆత్మ స్వరూపము శిథిలము కానిది, ఆకారము లేనిది అయ్యింది.
శాకల్యా! ఈ ఆత్మ పృథివి మొదలైన ఎనిమిది స్థానములను, అగ్ని మొదలైన ఎనిమిది లోకములను, అమృతము మొదలైన ఎనమండుగురు దేవతలను, శరీరము మొదలైన ఎనిమిది పురుషులను సస్వరూపముతో, ఆత్మ స్వరూపముతో హృదయములో ఉపాధి ధర్మాన్ని అతిక్రమించి ఉంది.
ఉపనిషత్తులలో తెలుసుకో దగిన అటువంటి ఆత్మను నిన్ను అడుగు తున్నాను. దానిని నీవు చెప్పలేక పోతే నీ శిరస్సు పగిలిపోతుంది సుమా. అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
శాకల్యుడు ఆత్మ స్వరూపాన్ని తెలియని వాడవడం వల్ల అతని శిరస్సు పగిలి పడిపోయింది.
ఈ రీతిగా బ్రాహ్మణ శాపానికి హతుడైన శాకల్యునికి ఊర్ధ్వలోక క్రియలను చేసి పుణ్య లోకప్రాప్తి కలుగ చేయాలని అతని శిష్యులు శాకల్యుని అస్థికలను తీసుకొని పోతూంటే దారిలో దొంగలు వాటిని ధనమని తలచి దొంగిలించుకొని పోయేరు.
ఆ రకంగా అహంకారంతో బ్రహ్మవేత్తను ద్వేషించిన వాడికి ఇహ పరలోకాలు రెండూ కూడా లేకుండా పోయేయి.
***
175.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
175. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: పంచమాధ్యాయం. నవమ బ్రాహ్మణం (Continuation):
ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడు ఆ బ్రాహ్మణు లందరివైపు తిరిగి, “ఓ ఉత్తములైన బ్రాహ్మణులారా! మీలో ఎవరైనా నన్ను ఏమయినా అడగవచ్చు. నేను కూడా మిమ్ములను ప్రశ్నిస్తాను.” అన్నాడు. వారిలో ప్రశ్నించడానికి ఎవరూ ధైర్యము ఉన్నవాళ్ళు లేకపోయేరు.
ఎవరూ అడగక పోయినా యాజ్ఞవల్క్యుడు వారందరకూ బ్రహ్మత్వము గురించి మరింత విపులంగా చెప్పదలచుకొన్నాడు.
ఓ బ్రాహ్మణులారా! శరీర అవయవములతో ఈ మానవుడు, ఫలపుష్పాదులతో వృక్షాలు ఉన్నాయి కదా! త్వక్కు, చర్మము, రుధిరము, మాంసము, నరము, మజ్జ, ఎముకలు శరీరము ఈ మానవుడికి ఉంటే బెరడు, తొక్కు, రసము, బంక, నార, చేవ, కొయ్య వృక్షానికి ఉన్నాయి. వృక్షాన్ని మొదలు నరికితే తిరిగి కొత్తగా చిగిర్చి చెట్టు పెరుగుతోంది. ఆ ప్రకారమే మానవుడికి నరక బడిన చేయి గాని కాలు గాని తిరిగి మొలవడం లేదు. అలాగే మృత్యువు చేత చంపబడిన మానవ శరీరము తిరిగి జీవాన్ని పొందటల్లేదు.
మరి ఈ శరీరము ఏ మొదలు నుండి పుడుతోంది? అని ప్రశ్న వేశాడు.
ఈ శరీరము రేతస్సు నుంచి పుడుతోందా?
అలాగయితే బ్రతికిన వారికే రేతస్సు ఉంటుంది. మృతుడి నుండి పుట్టడం లేదు.
చెట్టు బీజం నుంచి పుడుతోంది. కానీ వేళ్ళతో సహా సమూలంగా పెరికివేస్తే తిరిగి మూలం నుండి పుట్టడం లేదు.
జాత ఏవ న జాయతే కో న్వేనం జనయేత్పునః।।
అందువల్ల ఈ సమస్త జగత్తుకు మూలమైనది ఏది? పుట్టిన మనుష్యుడు తిరిగి పుట్టని యెడల అంటే చనిపోయిన తర్వాత తిరిగి జన్మ లేకపోతే ఈతను చేసిన పాపపుణ్యాలు ఏమవుతాయి?
కొత్త ఆత్మ జన్మ తీసుకున్నట్లయితే చేయని పాప పుణ్యాలు ఎక్కడనుంచి సంతరించుకొని జన్మను పొందుతుంది?
మరణించిన వానిని తిరిగి ఎవరు పుట్టిస్తున్నారు?
దేనినుంచి తిరిగి పుడుతున్నాడు?
అని యాజ్ఞ వల్క్యడు వేసిన ప్రశ్నకు సమాధానం రాలేదు సభలోని ఋషుల నుంచి.
విజ్ఞానమానన్దం బ్రహ్మరాతిర్దాతుః పరాయణమ్ తిష్ఠమానస్య తద్విద ఇతి।।
విజ్ఞానమయుడు, ఆనందమయుడూ అయిన పరబ్రహ్మయే కర్మచేసే యజమాని.
అతనే కర్మఫల ప్రదాత యైన బ్రహ్మవేత్త.
కర్మయే పునర్జన్మకు మూలం.
అంటూ తన ప్రశ్నలకు సమాధానం చెబుతూ యాజ్ఞవల్క్యుడు ముగించేడు. ఆ గోవులను తనతో తీసుకొనిపోయేడు.
వచ్చే భాగంలో షష్ఠాధ్యాయం లో యాజ్ఞవల్క్యుడు జనకునికి బ్రహ్మవిద్యను బోధించాలనే ఉద్దేశ్యంతో జనకుని రాజగృహానికి వస్తాడు.
🕉🌞🌏🌙🌟🚩
"ఋభుగీత "(49)
3వ అధ్యాయము [ప్రపంచము చిన్మాత్రము]
స్వీయజ్ఞానం కోసమే ధ్యానం, సమాధి !!
ధ్యానం, సమాధి ఉన్నతమైనవే. కానీ వాటి ఉపయోగం మనను గురించి మనం తెలుసుకోడానికేగాని ఆస్థితిలోనే ఉండిపోవాలనిపించడం కాదు. ఎందుకంటే తత్ సమాన స్థితిని నిద్రలో రోజూ పొందుతూనే ఉన్నాం. తేడాఅల్లా నిద్రలో తెలియకుండా జరుగుతుంది. సాధనలో తెలిసి జరుగుతుంది. ధ్యానం, సమాధివల్ల ప్రపంచంలో సుఖదుఃఖాలకు నీవే మూలం అని తెలుస్తుంది. అంతేగానీ అవి సుఖదుఃఖాలను తప్పించుకునే మార్గాలుకావు. అలా చేస్తే టీచర్ కొడుతున్నాడని బడి మానేయడంలాంటిదే అవుతుంది !
ఓం నమః శివాయ:
176.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
176. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: షష్ఠమ అధ్యాయం, ప్రధమ బ్రాహ్మణం:
విదేహ దేశానికి చక్రవర్తి యైన జనకుని దగ్గరకు యాజ్ఞవల్క్యడు విచ్చేశాడు. జనకుడు ఓ మునీంద్రా! మీకు మరిన్ని గోవులు కావాలా? లేదా నన్ను తత్వంలో ప్రశ్నించడానికి వచ్చారా? అని అడిగేడు.
ఆరోజులలో అడవుల మధ్యలో గురుకులాలు నడపడం చాలా కష్టంగా ఉండేది. వేదవిద్యకై విద్యార్ధులు గురుకులాలకు అలా వస్తూనే ఉండే వారు. ఒకసారి గురుకులానికి వచ్చిన విద్యార్ధి సుమారు 12 సంవత్సరాలు అక్కడే ఉండి చదువు పూర్తి చేసుకొని వెళ్ళేవారు.
ఆ విద్యార్ధులందరకూ వసతి కల్పించి భోజన సదుపాయాలు చేయడం ఆ మునులకు, ఋషులకు తలకు మించిన పనే అయ్యేది. అప్పుడు ఆ ఋషులు రాజులనాశ్రయించి గోవులను ధాన్యాలను దానంగా అర్ధించేవారు.
యాజ్ఞవల్క్యుడు బ్రహ్మవిద్యా సంవాద సమయంలో వేయి గోవులను వాటి కొమ్ములకు అలంకరించిన బంగారు తొడుగులు, వాటికి కట్టబడిన నాణేలతో గ్రహించేడు. తిరిగి అవసరార్థం వచ్చేడేమో అని జనకుడు ప్రశ్నించేడు.
అప్పుడు బ్రహ్మవిద్యను కూలంకషంగా ప్రశ్నోత్తరాలతో వివరించిన యాజ్ఞవల్క్యుడు అన్నాడు, “ఓ జనకమహారాజా! ఆ రెండింటినీ కోరే వచ్చేను. ముందుగా నీకు ఏ ఏ ఆచార్యులు ఏమి బోధించేరో తెలుసుకోదలచేను”.
ఓ యాజ్ఞవల్క్యా! శిలిని పుత్రుడైన జిత్వుడనే ముని “నాకు వాక్కే బ్రహ్మము అని చెప్పేడు. తల్లిదండ్రులు ఆచార్యుల చేత మంచిగా శిక్షణ పొందిన వాడు ఏ విధంగా ప్రమాణ వాక్యాలు పలుకుతాడో అదే విధంగా వాక్కు బ్రహ్మము అని చెప్పేడు. అన్నాడు జనకుడు.
ఓ జనకా! ఆ శైలిని వాగ్రూపమైన బ్రహ్మకు శరీరము ఏదో, వాక్కుకు ఆశ్రయము యేదో చెప్పేడా? అంటే లేదు, చెప్పలేదు అన్నాడు జనకుడు.
వీరు ఏది బ్రహ్మమని బోధించేరో అవన్నీ ఉత్కృష్ఠమైనవే. కాని వాటి యొక్క శరీరం, వాటికి ఆధారము అనే వాటి గురించి నీకు వివరించ లేదు. వాటి ఉపాసనా రూపాలు కూడా చెప్పలేదు. ఏకపాదమైన బ్రహ్మాన్ని మాత్రమే చెప్పేరు. ఆ బోధన సమగ్ర మవడానికి నేను బ్రహ్మము యొక్క మిగిలిన మూడు పాదాలు కూడా చెబుతాను.
వాక్కును ఏకపాద రూపమైన బ్రహ్మము. ఈ వాగ్రూపమైన బ్రహ్మానికి వాక్కే శరీరమవుతుంది. దీనికి ఆ ఆకాశమే ఆశ్రయము.
ఏకపాద స్వరూపమైన వాగ్రూప బ్రహ్మాన్ని ప్రజ్ఞ అని ఉపాసన చేయాలి అంటే ఏ ప్రజ్ఞ? కొంచెం విశదీకరించండి అని జనకుడు అడిగాడు.
వాక్కే ప్రజ్ఞ అవుతుంది. సృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, చతుషష్ఠి కళలు, బ్రహ్మ సూత్రాలు, భాష్యాలు, భాష్యాలకు వ్యాఖ్యానాలు, హోమ, బక్షణ, పాననిమిత్తమైన ధర్మములు, ఈ జన్మ, పరజన్మ, సమస్త భూతాలు వాక్కు చేతే తెలుసుకొనబడుతున్నాయి. కాబట్టి వాక్కే ప్రజ్ఞ అవుతుంది. వాక్కే పరబ్రహ్మ రూపము.
వాక్కును ప్రజ్ఞ గా భావించి ఉపాశించేవాడిని వాక్కు ఎన్నటికి మరచిపోదు. అటువంటి వాడిని సమస్త భూతాలు ప్రేమిస్తాయి. ఈ భూమి మీదే దైవ స్వరూపుడు గా కొలవబడతాడు. మరణా నంతరము దేవతలలో కలుస్తాడు.
ఓ యాజ్ఞవల్క్యా! మీకు ఏనుగులాంటి వృషభాన్ని, వేయి ఆవులను ఇస్తున్నాను అన్నాడు జనకుడు. ఓ జనకా! శిష్యుని ఉద్ధరణ పూర్తికాకుండా శిష్యుని నుంచి ధనాన్ని గ్రహించ కూడదని నా తండ్రి చెప్పేడు. అందుకని నేను వాటిని ఇప్పుడు గ్రహించను. ఇంకా ఇతరులు ఏమేమి బోధించేరో చెప్పు. అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
శుల్బ పుత్రుడైన ఉదంకుడు ప్రాణమే బ్రహ్మ స్వరూపమని చెప్పేడు. అని జనకుడు అనగానే, ప్రాణరూప పరబ్రహ్మానికి శరీరమేదో, ఆశ్రయమేదో చెప్పేడా అంటే లేదన్నాడు. యాజ్ఞవల్క్యుడు “ప్రాణరూప పరబ్రహ్మానికి ప్రాణమే శరీరము, ఆకాశమే ఉత్పత్తి, స్థితిలయ కాలాలలో ఆశ్రయము. ప్రియత్వమే ఉపాసనా రూపము.
ప్రాణమే ప్రియమైనది. ఎందుకంటే ఈ మనుష్యులు ప్రాణములు కాపాడుకోవలెననే కోరికతో ధనము ఆర్జించుట కొరకు అనర్హుల చేతకూడా యాగములు చేయిస్తున్నారు. గ్రహించనలవి కాని తీక్షణములైన వస్తువులను గ్రహిస్తున్నాడు. ప్రాణమును పోషించుకోవాలనే మిషతో మరణకారకమైన దిక్కులకు కూడా పోతున్నాడు. అందుచేత అదే అన్నిటికంటే ప్రియమైనది. ప్రాణమే పరబ్రహ్మము.
వర్కువార్హ్ణుడనే ముని నేత్రమే బ్రహ్మమని చెప్పేడు. అన్నాడు జనకుడు. దానికి యాజ్ఞ వల్క్యుడు “నేత్రమే శరీరము. ఆకాశము దానికి ఆశ్రయమై ఉంది. లోకులు ఇతరులను చూసేవా అని అని అడుగుతారు. వాడు చూసేను అని చెబితే అది సత్యమవుతుంది. ఈ నేత్రరూప పరబ్రహ్మాన్ని సత్యస్వరూపముగా ధ్యానించాలి, ఉపాశించాలి”. అని చెప్పేడు.
ఓ యాజ్ఞ వల్క్యా! భరద్వాజ పుత్రుడైన గర్దభీ విపీతుడనే ముని తల్లిదండ్రులు, ఆచార్యులు వల్ల శుశిక్షుతుడైన వాడు సత్యాన్ని ఎలా పలుకుతాడో ఆ విధంగా సత్యమైన శ్రవణము లేకపోతే ఏమీ సిద్ధించదు. కనుక శ్రోత్రమే బ్రహ్మమని చెప్పేడు.
ఓ విదేహ రాజా! ఆ శ్రోత్ర బ్రహ్మకు శ్రోత్రమే శరీరం. ఆ ఆకాశమే శ్రోత్రానికి ఉత్పత్తి స్థితి లయ కాలాలలో ఆశ్రయమై ఉంది. శ్రోత్రబ్రహ్మను అనంతంగా భావించి ఉపాసించాలి అంటే జనకుడు అనంతము అంటే ఏమిటి అని అడిగేడు.
ఓ జనకా! దిక్కులే అనంతమైనవి. మనం పోయి చూద్దామంటే తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ దిక్కలలో ఏ దిక్కు
యొక్క అంతాన్ని చేరనేలేము, చూడలేము. ఆ దిక్కులే శ్రోత్ర రూపమవుతాయి. శ్రోత్రాన్ని అనంతంగా భావించి ఉపాసించాలి.
సత్యకామ జాబాల మనస్సు బ్రహ్మమని నాకు బోధించేడు. ఎందుకంటే మనస్సు లేని వాడు ఏమి చేయగలడు? అని జనకుడు చెప్పేడు. ఓ రాజా! మనస్సే ఆనందము. మనస్సు చేతనే మనుష్యుడు స్త్రీని కోరుకుని ఆమెకు తమవంటి కుమారుడు కలుగుతాడని, ఆ పుత్రుడు ఆనందరూపుడై ఉంటాడని వాంఛిస్తాడు. ఈ మానస బ్రహ్మకు మనస్సే శరీరము, ఆకాశమే ఆధారము. మనస్సును ఆనందముగా భావించి ఉపాసించాలి.
శకల పుత్రుడైన విదగ్ధుడనే ఋషి హృదయమే (బుద్ధి) బ్రహ్మమని నాకు చెప్పేడు. అన్నాడు జనకుడు.
ఓ జనకమహారాజా! హృదయమే స్థితి. హృదయమే సర్వభూతాలకు ఆశ్రయస్తానము. హృదయమే పరబ్రహ్మము. హృదయమే శరీరము. ఆకాశమే ఆధారము. హృదయాన్ని స్థితిగా ఉపాసన చేయాలి. ఈ విధంగా హృదయాన్ని ఉపాసన చేసే వాళ్ళ దగ్గరకు సమస్త భూతాలు చేరుతాయి.
వాక్కు, ప్రాణము, నేత్రము, శ్రోత్రము, మనస్సు మరియు హృదయం(బుద్ధి) అనే వాటిని ఉపాశించేటప్పుడు వానినే వాటియొక్క శరీరంగా భావించి ఆకాశాన్ని ఆధారంగా చేసుకొని ఉపాశిసించాలి. వాక్కు యొక్క ఉపాసనా రూపము ప్రజ్ఞ అయితే, ప్రాణానికి ప్రేమతత్వము, నేత్రానికి సత్యము, శ్రోత్రానికి అనంతత్వము, మనస్సునకు ఆనందము, హృదయానికి స్థితి ఉపాసనా రూపాలు అవుతున్నాయి. అయినా సంపూర్ణ బ్రహ్మజ్ఞానానికి ఇవి చాలవు అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
వేదకాలం లోనే సమగ్రంగా బ్రహ్మవిద్యను తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉండడంవల్ల జనకునికే ఆత్మజ్ఞానాన్ని పొందగలిగే బ్రహ్మ విద్య (యాజ్ఞవల్క్యుని నుంచి తప్ప) దొరకడమే దుర్లభమయ్యింది.
వచ్చే భాగంలో యాజ్ఞ వల్క్యుడు మరింత వివరంగా చెప్పి జనకునికి బ్రహ్మవిద్యోపదేశం చేయడం చూద్దాం.
🕉🌞🌏🌙🌟🚩
"ఋభుగీత " (50)
3వ అధ్యాయము [ప్రపంచము చిన్మాత్రము]
సహజ ధ్యానం సిద్ధించే వరకూ ధ్యానం కూడా ఒక అనుభవమే !!
నిద్రను ఎవరూ తెచ్చుకోలేరు. దానంతట అది రావాల్సిందే. నిజానికి నిద్ర అనే ఒక ప్రత్యేక అనుభవం అంటూ ఏదీలేదు. మనసు అన్ని అనుభవాల నుండి పొందే ఉపసంహరణే నిద్రగా పరిణమిస్తుంది. అదే పనిని మన ప్రయత్నంతో చేస్తే అది ధ్యానంగా పరిమళిస్తుంది. అది ప్రయత్నంతో పనిలేని సహజ ధ్యానంగా మారేవరకూ... మనకు ఉన్న అనేక అనుభవాల్లాగానే ధ్యానం కూడా ఒక అనుభవంగా ఉంటుంది. అందుకే మనలోని ప్రాపంచిక భావాలను, భయాలను తీసేయడానికి అవసరమైన అనుభవాలకోసం గురువు/దైవం భౌతిక సంఘటనలనే వాడుకుంటారు !
177.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
177. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: షష్ఠమ అధ్యాయం, ద్వితీయ బ్రాహ్మణం:
ఈ బ్రాహ్మణం లో ఆత్మ యొక్క అస్థిత్వం అత్యంత సూక్ష్మము అని చెబుతూ ఈ స్థూల శరీరానికి అవసరమైన ఆహారంకన్నా ఆత్మకు హిత అనే అత్యంత సూక్ష్మ నాడులద్వారా సరఫరా చేయబడే ఆహారం మరింత సూక్ష్మమైనది అని చెప్ప బడింది.
(ప్రాణాయామము ద్వారా మాత్రమే ఆ సూక్ష్మాహారం ఉత్పత్తి చేయబడుతుంది. అది అశనము అనే పేరుతో పిలువ బడుతుంది.
విదేహ దేశాధిపతి జనకుడు లేచి యాజ్ఞవల్క్యని కాళ్ళకు నమస్కరించి నాకు బ్రహ్మవిద్యను ఉపదేశించమని ప్రార్ధించేడు.
ఓ జనకమహారాజా! నీవు అనేకమంది ఋషులచే ఉపనిషత్తులలో చెప్పబడిన అనేక బ్రహ్మములను ఉపాశించేవు.
దూరదేశాలకువెళ్ళేవాడు ఏ రధాన్నో, నావనో సిద్ధం చేసుకున్నట్లుగా బ్రహ్మజ్ఞానాన్నాశించి సర్వ ఉపనిషత్తులు వేదాలు చదివి ఆచార్యుల ద్వారా ఉపదేశింపబడిన వాడవు. ఈ దేహాన్ని విడిచిన తర్వాత నీవు ఎక్కడకు పోగలవో నీకు తెలుసా?
ఓ యాజ్ఞవల్క్యా! దేహత్యాగానంతరము నేను ఎక్కడకు పోగలనో, ఏమి పొందగలనో నాకు తెలియదు. అనగానే అయితే నీవు పొందగల వస్తువు గురించి నీకు చెబుతాను. అన్నాడు.
ఇన్దో హ వై నామైష యో యం దక్షిణే క్ష న్పురుషస్తం వా ఏత మిన్దగ్ం సన్త మింద్ర ఇత్యాక్షతే పరోక్షేణైవ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ప్రత్యక్షదివిషః।।
ఈ దక్షిణ నేత్రము (కుడిక న్ను) లోప్రకాశించే సూర్యుడు, సూర్యమండలం లో ప్రకాశించే సూర్యుడు ఒక్కడే. అతడు ప్రత్యక్షముగా ఇన్దుడని పిలవబడు తున్నాడు. పరోక్షముగా అతనినే ఇంద్రుడని చెబుతారు.
అథై తద్వామేక్షిణి పురుషరూపమేషాస్య పత్నీ విరాట్ త యోరేష సగ్ం స్తావో య ఏషో న్తర్హృదయ అకాశోఽథైన యోరేతదన్నం య ఏషోఽ న్తర్హృదయే లోహిత పిండోథైన యోరేతత్ ప్రావరణం…
ముందు మంత్రంలో కుడి కన్ను లో ప్రకాశ మానుడైనవాడు భోక్త మరియు భర్త యైన ఇంద్రుడని చెప్పేరు.
ఇక్కడ (ఎడమకన్ను) వామ నేత్రంలో ఉండే పురుషుడు భోగ్యమైన అన్నము మరియు భార్య యైన ఇంద్రాణి అని చెబుతున్నారు. ఈ పురుష స్త్రీ సంగమస్థానం (సంభోగ స్థానము) హృదయం (మెదడు, బుద్ధి) లోని చిదాకాశం. అంటే అదే ఆత్మ ఉండే ప్రదేశము.
(కుడి ఎడమ కన్నులు మెదడులోని దహరా కాశంలో కేంద్రీకృత మవ్వాలి. రెండు కన్నులు తెరిచి భ్రూమధ్యంలో దృష్టి నిలపితే అప్పుడు సంగమ స్థానంలోకి చూపు చేరుతుంది.)
యైషా హృదయా దూర్ధ్వా నాడ్యుచ్చరతి యథా కేశః సహస్రధా భిన్న ఏవమస్యైతా హితా నామ నాఢ్యోన్తర్హృదయే ప్రతిష్ఠితా
మెదడు యొక్క పై భాగం లో ఉండే ఒకనాడి ఆ పురుషుని చేరే మార్గము. ఆ నాడి యొక్క సహస్ర భాగముగా ఉండే తలవెంట్రుక కన్నా అతి సూక్ష్మం గా ఉండే “హిత” అనే నాడులు హృదయంలో ప్రతిష్టింప బడి ఉన్నాయి.
భవ న్త్యేతాభిర్వా ఏతదా స్రవదా స్రవతి తస్మాదేష
ప్రవిక్తాహారతర ఇవైవభవత్య స్మాచ్ఛారీ రా దాత్మనః
ఈ నాడుల ద్వారా హృదయం లో ఉన్న ఆత్మకు సూక్ష్మ ఆహారం సరఫరా అవుతుంది. ఆ యాత్మ ఈ శరీరఆత్మకన్నా సూక్ష్మతరమైన ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఆత్మ యొక్క అస్తిత్వము అత్యంత సూక్ష్మము.
ప్రాక్ పశ్చిమ దక్షిణ ఉత్తర ఊర్ధ్వ అధో దిక్కులన్నిటి లోను ప్రాణ రూపమై ఉన్నది ఈ ఆత్మయే. ఆ ఆత్మ నే నేతి, నేతి ఇది కాదు, ఇదికాదు అంటూ వర్ణించారు.
ఆత్మా గృహ్యో న హి గృహ్యతే శీర్యో నహి శీర్యతే సఞ్గో నహి సజ్ఞ్యతే సితో న వ్యధతే న రిష్య త్యభయం వై జనక.
ఓ జనకా! ఈ ఆత్మ బంధించడానికి అలవి కానిది. అది అవినాశి. నశించనిది. అసంగమమైనది. అనాసక్తమైనది. బాధింపబడనిది. వ్యధ చెందనిది. అటువంటి అభయ స్వరూపమైన ఆత్మ నీకు ప్రాప్తించినది. అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
ఓ యాజ్ఞవల్క్యమునీ! నీవు భయరహితమైన బ్రహ్మము యొక్క జ్ఞానాన్ని నాకు ప్రసాదించేవు. నా సమస్త రాజ్యాన్ని నీకు దానమిస్తున్నాను. నన్ను నీకు అర్పించుకుంటున్నాను. అన్నాడు జనకుడు.
"ఋభుగీత " (52)
3వ అధ్యాయము [ప్రపంచము చిన్మాత్రము]
గమనించడం అనేది పరిణామ క్రియ !!
మనకి దైవాన్ని చూడాలనో, ఇంకా చూడలేదనో ఒక భావం ఉంటుంది. తెలియని వస్తువు విషయంలో మనకా ఆలోచన రాదు. ఒక విలువైన వస్తువు గురించి తెలిసిన తర్వాత అది గోచరం అయ్యే వరకూ ప్రయత్నం ఉంటుంది. గోచరించడం అంటే మనకు స్పృశించేది, కనిపించేది, వినిపించేది, గమనించగలిగేది. గమనించడం అనేది మానసికంగా జరిగే పరిణామ క్రియ. ఒక విషయంలోకి లోతుగా చూడటం పరిశీలన అవుతుంది. మామిడి పండును చూసి తెలుసుకుంటాం. తర్వాత దానిని తిని రుచిని తెలుసుకుంటాం. ఆ రుచిలోని మాధుర్యాన్ని తెలుసు కుంటాం. ఇదంతా గమనింపులో వివిధ దశల్లో జరిగే ప్రక్రియ. దైవం విధాయంలోనూ ఉన్నాడని తెలియడం, ఎలా ఉన్నాడో తెలియడం, ఎక్కడ ఉన్నాడో తెలియడం... ఇలా సాగి ఒక రోజుకి నాతోనే, నాలోని, నాగానే ఉన్నాడని గమనింపులోకి వస్తుంది !
179.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
179. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: షష్ఠమ అధ్యాయం, తృతీయ బ్రాహ్మణం (Continuation):
కొంచెం మనస్సు ఉంచి చదివి అర్ధం చేసుకోండి.
తస్య వా ఏతస్య పురుషస్య ద్వే ఏవ స్థానే భవతః
ఇదం చ పరలోకస్థానం చ సన్థ్యం తృతీయగ్ం స్వప్న స్థానం తస్మిన్సన్థ్యే స్థానే తిష్ఠ న్నేతే ఉభే స్థానే పశ్య తీదం చ పరలోక స్థానం చ
ఈ లోకము మరియు పరలోకము అని రెండు స్థానాలు ఉన్నాయి. మూడవ స్థానాన్ని స్వప్న స్థానమని అంటారు. స్వప్న స్థానము సంధి స్థానము. ఈ పురుషుడు ఆ సంధి యైన స్వప్న స్థానములో ఉండి ఇహ పరలోకాలను చూస్తూ ఉంటాడు.
అథ యథా క్రమోఽయం పరలోక స్థానే భవతి తమాక్రమమా క్రమ్యో భయాన్పాప్మ న ఆనన్దాగ్ంశ్చ పశ్యతి
ఇహ లోకంలో తను చేసిన కర్మలను అనుసరించి పరలోకమున పాపము మరియు ఆనందములను అనుభవిస్తాడు.
సయత్ర ప్రస్వపిత్యస్య లోకస్య సర్వావతో మాత్రా మపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాసా స్వేన జ్యోతిషా ప్రస్వపిత్యత్రాయం పురుషః స్వయం జ్యోతి ర్భవతి।।
అక్కడ అంటే ఆ స్వప్న స్థానములో ఈ లోకములోని పంచభూతాత్మకమైన శరీరాన్ని వదలి సూక్ష్మాంశమైన వాసనా రూపముతో స్వయం ప్రకాశమానుడై ఉంటాడు. దృక్ స్వరూపము అవుతాడు. స్వయం జ్యోతియై ప్రకాశిస్తాడు. ఇతనినే తైజసుడు అంటారు.
అక్కడ అంటే ఆ స్వప్న స్థానములో రధాలు గాని, రథానికి కూర్చబడే గుర్రాలుగాని, ఆరథాలు పోయే మార్గాలు కాని, నీటిగుంటలు, చెరువులు, నదులు కాని లేవు. వీటన్నిటికీ సర్వానికీ కర్త యైన ఆ యాత్మయే వీటిని నిర్మిస్తోంది. అక్కడ ఆనందము, మోదము, ప్రమోదము అనేవి ఏమీ లేవు.
స్వప్నే న శారీరమభి ప్రహత్యాఽసుప్తః సుప్తానభిచాకశీతి।
శుక్రమాదాయ పునరేతి స్థానగ్ం హిరణ్మయః పురుష ఏక హగ్ంసః।
అట్టి ఆత్మ తాను స్వప్నావస్థ లోకి పోకుండా ఈ శరీరాన్ని స్వప్నావస్థ వల్ల చేతనత్వం లేకుండా చేస్తోంది. జాగ్రదావస్థలో తను పొందిన అనుభవాలను స్వప్నంలో చూస్తోంది. ఆతర్వాత తిరిగి ఇంద్రియ రూపం తీసుకొని జాగ్రదావస్థలోకి వస్తున్నాడీ ఏకైక హిరణ్మయుడైన పురుషుడు.
ప్రాణేన రక్షన్న వరం కులాయం బహిష్కులాయా దమృతశ్చరిత్వా।
స ఈయతే అమృతో యత్ర కామగ్ం హిరణ్మయః పురుష ఏక హగ్ంసః।।
ఆ హిరణ్మయ పురుషుడైన ఆత్మ ప్రాణం ద్వారా ఈ శరీరాన్ని కాపాడుతూ ఉంటాడు. స్వప్నంలో ఈ శరీరం నుంచి బయట సంచరిస్తూ అమృత మయుడు అవుతున్నాడు. ఎక్కడెక్కడ తన వాంఛితార్ధాలను తీర్చుకోగలడో అక్కడ తీరిన కోరికలు గలవాడవుతున్నాడు. స్వప్న స్థానములో ఉచ్ఛనీచములైన భావాలను పొందుతూ అనేక వాసనా రూపాలను అనుభవిస్తున్నాడు. స్త్రీలతో సంతోషిస్తున్నట్లు, స్నేహితులతో ఆనందిస్తున్నట్లు, భయంకరమైన వాటిని చూస్తున్నట్టు అనుభవాలు పొందు తున్నాడు.
ఆ ఆత్మ ఎక్కడ ఎక్కడ ఆనందిస్తోందో ఆయా స్తలాలను అనుభవాలను చూస్తూంటారు. కాని ఆ ఆత్మను ఎవరూ చూడలేరు. అందుకే నిద్రపోతున్న వాడిని హటాత్తుగా లేపకూడదు అంటారు. తాను పోయి వచ్చెడి ద్వారము దొరక్క పోతే అతని ఆత్మ తిరిగి (మెలుకువ పొందుట) శరీరంలో ప్రవేశించడం కష్టమవుతుంది.
ఇదే రకంగా సమాధి స్థితిలో మనస్సుతో కలిసిన ఆత్మ శరీరాన్ని వదలి బయట సంచారానికి వెళ్ళి తిరిగి శరీరంలోకి ప్రవేశించే టప్పుడు ఏమాత్రం శరీరం యొక్క ఆసనంలో తేడా వచ్చినా ఆత్మ తిరిగి ఆ శరీరాన్ని గుర్తించి దానిలో తిరిగి ప్రవేశించలేదు. అందువల్ల ధ్యానంలో ఉన్న వ్యక్తిని చేతితో తట్టి, లేకపోతే కదిపి ధ్యానం నుంచి లేపకూడదు.
***
180.ఉపనిషద్విచారణ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
180. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: షష్ఠమ అధ్యాయం, తృతీయ బ్రాహ్మణం (Continuation):
ఈ భాగంలో చెప్పిన ఆత్మ యొక్క లక్షణాలు చాలా ముఖ్యమైనవి. శ్రద్ధతో చదివి అర్ధం చేసుకోండి.
యాని హ్యేవ జాగ్రత్పశ్యతి తాని సుప్త ఇత్యత్రాయం పురుషః స్వయం జ్యోతిర్భవతి సోహం భగవతే సహస్రం దదామ్యత ఊర్ధ్వం విమోక్షాయ బ్రూహితి।
జాగ్రదావస్థ అనేది ఒక స్థితి అయితే ఆ అవస్థలోనే స్వప్నాన్ని చూస్తూంటాడు అని అంటారు. కాదు, మెలుకువగా ఉన్నప్పుడు చూసినదానినే స్వప్నంలో కూడా చూస్తాడు అందువల్ల జాగ్రత స్వప్నావస్థలు రెండూ ఒకటే అని అంటారు. కాని అది నిజం కాదు. స్వప్నంలో ఆత్మ స్వయం జ్యోతిలా ప్రకాశిస్తాడు అని యాజ్ఞవల్క్యుడు చెప్పగా జనకుడు ఓ ఋషీ మీరు వేయి గోవులను స్వీకరించి నాకు మోక్షప్రధానమైన సాధనాన్ని అనుగ్రహించండి అని వేడుకొన్నాడు.
సవా ఏష ఏతస్మిన్ సమ్ప్రసాదే రత్వా చరిత్వా దృష్టైవ పుణ్యం చ పాపం చ।
పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాయైవ సయత్తత్ర కించిత్పశ్యత్య నన్వా గత స్తేన భవత్య సజ్ఞోహ్యయం పురుష ఇత్యేవమేవ।
ఓ విదేహరాజా! జనకా! ఆ స్వయంజ్యోతి స్వరూపమైన ఆత్మ సుషుప్తిలో మునిగి విహరిస్తూ పాప పుణ్యముల ను చూడటం వల్ల వెళ్ళిన మార్గములోనే తిరిగి స్వప్న స్థానానికి వస్తాడు. అంటే కొద్ది సమయం సుషుప్తిలో ఉంటాడు.తిరిగి స్వప్న స్థానానికి న్యాయ ప్రకారం వస్తాడు. స్వప్న స్థానం లో చూచిన పాప పుణ్య ఫలములు అతను పొందుట లేదు. ఆ ఆత్మ అసంగుడవుతున్నాడు.
స్వయం జ్యోతి స్వరూపమైన ఆ ఆత్మ జాగ్రత్ స్వప్న సుషుప్తులలో సచరిస్తూ సమస్త జనులతో అనురాగాన్ని అనుభవిస్jతూ నానా విధములుగా క్రీడిస్తూ కూడా అక్కడ పొందిన పాప పుణ్యములకు బద్ధుడుగా అవడంలేదు. అన్ని అవస్తలలోను అసంగుడిగా ఉంటాడు.
ఒక పెద్ద తిమింగలం నది యొక్క రెండు ఒడ్డులను అనుసరించి ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో అలాగే ఈ ఆత్మ జాగరిత స్వప్న స్థానములను అనుసరించే సంచరిస్తుంది.
ఆకాశంలో నిర్విరామంగా ఎగిరి అలసిన గ్రద్ద లేక డేగ లాంటి పక్షి ఏ విధంగా అయితే రెక్కలు ముడుచుకొని తిన్నగా గూటిలోకి చేరుతుందో అలాగే జాగృత స్వప్న స్థానాల మధ్య సంచరించే ఈ ఆత్మ తన గమ్య స్థానము, విశ్రాంతి స్థానము అయిన సుషుప్తి లోకి చేరుకుంటుంది. అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. అక్కడ ఏ కోరికలు కోరదు. ఏ స్వప్నాలు చూడదు. ప్రాజ్ఞునిగా ప్రవర్తిస్తుంది.
తావా అస్యైతా హితా నామ నాడ్యోయథా కేశః సహస్రధా భిన్నాస్తావతాఽణిమ్నా తిష్ఠన్తి శుక్లస్య నీలస్య పిఞ్గళస్య హరితస్య లోహితస్య పూర్ణః।
సహస్రాధిక విభాగాలుగా చేయబడి తల వెంట్రుక కన్నా అతి సూక్ష్మమైన హిత యనే పేరుగల నాడులు తెల్లని రంగు, నీలవర్ణము, సస్యవర్ణము, మరియు ఆకుపచ్చ రంగు రసములతో నిండి ఉన్నాయి.
స్వప్నములో వీడు కొడుతున్నాడు, వాళ్ళు పట్టుకుని వశము ఒనర్చుకుంటున్నారు, ఏనుగు తరుముతోంది, నేను పల్లములో పడిపోతున్నాను మొదలైనవి అనుభవిస్తాడు. తిరిగి లేచిన తర్వాత నేను దేవతను, నేను రాజును, నేనే ఈ సర్వస్వాన్ని అయి వున్నాను అని తెలుస్తుందో అప్పుడు అది ఆత్మకు పరలోకము అవుతుంది.
తద్వా అస్యైతదతిచ్ఛన్దా అపహత పాప్మా భయగ్ం రూపం।
ఆ సుషుప్తిలో ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏది అంటే కామ రహితమైనది. ధర్మాధర్మ వర్జితమైనది. భయ రహితమైనది.
తద్యథా ప్రియయా స్త్రియా సమ్పరిష్వక్తో న బాహ్యం కించనవేద నా న్తరమేవ మేవాయం పురుషః. ప్రాజ్ఞేనాత్మనా సమ్వరిష్యక్తో న బాహ్యం కించన వేద నా న్తరం।
తనకు ప్రియురాలయిన స్త్రీని గాఢంగా ఆలింగనం చేసికున్నప్పుడు ఆ తాదాత్మ్యంతో ఏ విధంగా తాము ఇరువురు కాదు, ఒక్కరే, తాము తప్ప తమకు లోపల గాని బయటగాని ఈ విశ్వంలో ఇంకేమీ లేవు అనే భావం కలుగుతుందో అలాగే స్వరూపము స్వకీయాత్మతో కలిసి ఏక రూపాన్ని పొంది వెలుపల ఉన్నది, లోపల ఉన్నది అని వేరు వేరుగా తెలుసుకొనలేని స్థితిలోకి చేరుతుంది.
తద్వా అస్యై తదాప్త కామమాత్మ కామ మకామగ్ం రూపగ్ం శోకాన్తరమ్।
అదే ఈ ఆత్మ యొక్క స్వరూపము. ఇది ఆప్త కామము కలది. ఆత్మయే కామము గా కలది. కామము లేనిది. శోకశూన్యమైనది అయిన పరమాత్మను పొందుతోంది.
అవసరమైన సంస్కృత మంత్రాలు ఎందుకు ఇక్కడ ఇస్తున్నానంటే, నేను ఒక ధోరణిలో మంత్రార్ధాన్ని రాస్తున్నప్పుడు సహజమైన అర్ధాన్ని వదలి నేను మరోలా వ్యాఖ్యానిస్తే మీరు అసలు మంత్రం చదివి అర్ధం చేసుకోగలుగుతారని, నన్ను సవరిస్తారని.
***
181.ఉపనిషద్విచారణ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
181. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: షష్ఠమ అధ్యాయం, తృతీయ బ్రాహ్మణం (Continuation):
ఆ సుషుప్తిలో ఆనందరూపమైన ఆత్మకు బాహ్య ప్రపంచములోని పితాపుత్ర సంబంధమైన కర్మ విడిచి పోవడం వల్లతండ్రి లేడు, తల్లి లేదు, పుత్రుడు లేడు, లోకములు లేవు, దేవతలు లేరు, వేదాలు లేవు.
ఈ విధంగా ఆత్మ సుషుప్తిలో శుభకర్మలను అశుభకర్మలను కూడా అతిక్రమించి ఉంది.ధనాన్ని దానం చేయడంగాని, దొంగిలించడంగాని లేదు.
భ్రూణహత్య చేయడంకాని, చేయకపోవడంకాని, చండాలత్వము, పుల్కసత్వము అనేవి లేవు. కర్మసంబంధమే లేకపోవడంవలన సన్యాసాశ్రమం లేదు, వానప్రస్థం లేదు. ఆత్మ పుణ్యకర్మలు లేదా పాపకర్మలననుసరించి ఉండదు. ఈ విధంగా సుషుప్తి లో ఆత్మ సమస్త వాంఛలను అతిక్ర మించినదై హృదయంలో నివసిస్తుంది.
ఆ స్థితిలో చూడగల సామర్ధ్యం ఉండీ ఆత్మ చూడడం లేదు. అతను అవినాశి కాబట్టి చూచేవాని దృష్టికి నష్టం కలగదు. తను ఆత్మ స్వరూపమే అయినప్పుడు వేరుగా చూచేటందుకు ఇంకేమీ ఉండదు.
వాసన రుచి చూడడం లేదా అంటే సామర్ధ్యం ఉండీ తను ఆత్మ పదార్ధమే అవడం వల్ల రెండవ వస్తువు అక్కడ ఉండదు. సుషుప్తిలో ఉన్న ఆత్మ మాట్లాడదు (వాక్కు), వినదు (శ్రవణము), తలచదు(మనస్సు), స్పృశించదు( త్వక్కు), తెలుసుకొనదు(తెలివి).
ఎప్పుడైతే ఈ ఆత్మ కంటే వేరొక వస్తువు ఉందో (సుషుప్తి నుండి జాగ్రదావస్థకు వచ్చిన తర్వాత) అప్పుడు జడంగా ఉన్న ఇంద్రియాలన్నీ తమ తమ పనులను తిరిగి మొదలు పెడతాయి.
ఒకటి రెండవ దానిని చూడ గలదు, వాసన రుచి చూడ గలదు, మాటలాడించ గలుగుతుంది, వినగలుగు తుంది, విచారించ గలుగుతుంది. స్పృశించ గలదు. ఒకటి మరొక దానిని తెలుసుకో గలుగు తుంది. రెండవదే లేనప్పుడు చలనరహితమే అది.
సలిల ఏకో ద్రష్టాఽద్వైతో భవ త్యేష బ్రహ్మలోకః స మ్రాడితి హైన మనుశశాస
ఉదకములలో ఏ విధంగా అయితే రెండవది ఉండదో అలాగే సుషుప్తిలో రెండవ వస్తువు అనేది ఉండదు. ఆ ఆత్మయే బ్రహ్మలోకము. ఈ సుషుప్తి కాలమే ఆత్మకు శ్రేష్ఠమైన స్థానము.అదే
శ్రేష్ఠమైన సంపద. అదే శ్రేష్ఠమైన లోకము. అదే శ్రేష్ఠమైన ఆనందము. ఆ ఆనందము యొక్క అంశ ననుసరించే సమస్త భూతాలు జీవిస్తున్నాయి.
(యాజ్ఞవల్క్యుడు ఇక్కడ ఆనందాన్ని క్లుప్తంగా నిర్వచిస్తున్నాడు. తైత్త్రీయోపనిషత్తులో ఇవే విషయాలను విపులంగా వివరించారు).
ఒక మనుష్యానందం అంటే సమస్త
అవయవాలు చక్కగా కలిగి ఉన్న, సమస్త ఉపకరణాలు సమృద్ధిగా ఉన్న మనుష్యుడు అనుభవింప వలసిన భోగాలలో ఏదీ కొఱత లేకుండా ఉండాలి. అందరికీ యజమానుడై ఉండాలి. అట్టి ఆనందాన్ని మనుష్యానందం అంటారు. అటువంటి నూరు మనుష్యానందాలు కలిపితే ఒక పితరుల ఆనందం అవుతుంది.
వంద పితరుల ఆనందాలు కలిపితే ఒక గంధర్వానందం. వంద గంధర్వానందాలు కలిపితే ఒక కర్మ దేవతల ఆనందము. ఒక వంద కర్మదేవతల ఆనందం కలిపితే అది ఒక అజాన దేవతల ఆనందం అనబడుతుంది. అజాన దేవతల ఆనందము అంటే వేదాధ్యయనము చేసినవాడు, పాప రహితుడు, కోరికలు లేనివాడు అయినట్టి మనుష్యుని యొక్క ఆనందము అజాన దేవతల ఆనందముతో సమానమవుతుంది.
అజానదేవతల ఆనందానికి వంద రెట్లధికమైనది ఒక ప్రజాపతి ఆనందము. ఆ ప్రజాపతి ఆనందానికి వంద రెట్లధికమైనది బ్రహ్మానందము. ఈ బ్రహ్మానందమే పరమోత్కృష్ఠమైన పరమ ఆనందము. అని యాజ్ఞవల్క్యుడు చెప్పేడు. జనకుడు నమస్కరించి నాకు మోక్షం ప్రాప్తించే ఉపదేశాన్నివ్వండి అని ప్రార్ధించేడు.
***
.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
183. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: షష్ఠమ అధ్యాయం, చతుర్ధ బ్రాహ్మణం:
స యత్రాయమాత్మాఽ బల్యం నేత్యసమ్మోహ మివ నేత్యధైన మేతే ప్రాణా అభి సమాయన్తి
ఈ శరీరం లో ఉండే జీవాత్మ శక్తితగ్గి తన బలాన్ని కోల్పోయినప్పుడు ఈ శరీరాన్ని వీడడానికి ఉద్యుక్తుడు అవుతాడు. స్పృహ కోల్పోయినప్పుడు ఏ ఏ ప్రాణాలున్నాయో అవన్నీ ఆ జీవత్మను చేరుకుంటాయి.
స ఏతా స్తేజో మాత్రాః సమభ్యా దదానో హృదయమే వాన్వ వక్రామతి
తేజస్సు తో ఉన్న సమస్త అవయవములలోని జీవశక్తిని ఆకర్షించి హృదయంలో ప్రవేశిస్తాడా పురుషుడు.
స యత్రైష చాక్షుషః పురుషః పరా జ్ఞ్పర్యా వర్తతే తథా రూపజ్ఞో భవతి।
కళ్ళలో ఉండే పురుషుడు ఈ శరీరావయవాల మీద విముఖత పొందుతాడు. అంతటా వ్యాపిస్తాడు. రూపజ్ఞానాన్ని కోల్పోతాడు.
ఆ విధంగా శరీరంలోని ఇంద్రియాల యొక్క తేజస్సు జీవాత్మలో చేరిపోయాక అతడు చూడలేడు, వాసన రుచి చూడలేడు, పలకలేడు, వినలేడు, ఆలోచించలేడు, స్పృశించలేడు, తెలుసుకొనలేడు అంటారు.
ఈ విధంగా సర్వేంద్రియాలు ఆత్మతో సంయమమయితే ఆ ఆత్మ నేత్రము ద్వారాగాని, శిరస్సుద్వారాగాని ఇతర శరీర అంగముల ద్వారా బయటకు పోతోంది.
ఆత్మ శరీరం నుంచి బయటకు పోగానే దానిని అనుసరిస్తూ ఈశరీరానికి సర్వాధికారయిన ప్రాణం కూడా ఆత్మననుసరించి బయటకు వెళ్ళిపోతోంది. అన్ని ఇంద్రియాలు కూడా ఆత్మను ప్రాణాన్ని అనుసరించి శరీరం నుంచి నిష్క్రమిస్తున్నాయి.
ఆ ఆత్మననుసరించే కర్మ, విశేష జ్ఞాన సహితమైన విద్య, అనుభవరూపమైన వాసనలు అన్నీకూడా వెళ్ళిపోతున్నాయి.
ఆత్మ ఈ శరీరాన్ని ఏవిధంగా వదిలి వేరొక దేహాన్ని పొందుతోందో చెప్పడానికి తృణ జలూకము అనే గడ్డిపురుగు ఏ విధంగా అయితే గడ్డిపోచ చివరి వరకూ వెళ్ళి తన ముందు శరీరాన్ని వేరొక గడ్డిపోచమీదకు జేర్చి తరువాత మిగిలిన దేహాన్ని మొదటి గడ్డిపోచ నుంచి తీసుకుంటుందో అలాగే ఆత్మ మొదటి శరీరాన్ని క్రింద పడేసి రెండవ శరీరాన్ని ఆశ్రయించిన తర్వాత మొదటి శరీరం నుంచి ఉప సంహరించు కుంటుంది. ఆ పూర్వ వాసనలతో తాను పొందిన నూతన దేహంలో ఆత్మభావం చేస్తుంది.
కంసాలి ఏ విధంగా కొద్దిపాటి బంగారం తీసుకొని సుందరమైన నూతన ఆభరణాన్ని చేస్తాడో అలాగే ఈ శరీరాన్ని క్రింద పడేసి కొత్తది మరీ సుందరంగా ఉండే ఇంకొక శరీరాన్ని తయారు చేసు కుంటుంది. పిత్రుదేవతలు, గంధర్వులు, దేవతలు లేదా ప్రజాపతి లేదా ఇతర భూతాలుగా శరీరాన్ని నిర్మించుకుంటుంది.
అటువంటి విజ్ఞాన స్వరూపమైన ఈ ఆత్మ యే ఆ పరబ్రహ్మము. మనోమయుడు, ప్రాణమయుడు, చక్షుర్మయుడు, శ్రోత్రమయుడు, పృథివీమయుడు, జల స్వరూపుడు, వాయుస్వరూపుడు ఆకాశ స్వరూపుడు అయి ఉన్నాడు.
ఇతడే తేజో స్వరూపుడు తేజరహితుడు కూడా. కామ మయుడు మరియు అకామమయుడూ ఇతడే. క్రోధరూపుడు, క్రోధరహిత స్వరూపుడు; ధర్మ స్వరూపుడు, అధర్మ స్వరూపుడు మొదలైన సర్వ స్వరూపాలు అతడే. ఈ ఆత్మ ఏఆకారాన్ని ఆలంబనగా తీసుకుంటుందో అదే తను అవు తుంది.
ఈ ఆత్మ జీవుల యొక్క రూపాలను ఆలంబనగా చేసుకొని పుణ్యకర్మలు చేస్తూ పుణ్యాత్ముడుగాను, పాపకర్మలను చేస్తూ పాపాత్ముడుగాను అవు తున్నాడు. కొందరు ఆత్మను కామ స్వరూపుడని చెబుతారు. ఆ ఆత్మ తన కోరిక ప్రకారం ఏ యే కర్మలనయితే చేస్తుందో ఆ కర్మఫలాలను పొందు తున్నాడు. ఈ ఆత్మయే కూటస్థుడు. ఇతడే ఆ పరబ్రహ్మ.
***
184.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
184. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: షష్ఠమ అధ్యాయం, చతుర్ధ బ్రాహ్మణం (Continuation):
జనకునికి బ్రహ్మవిద్యా పరమైన బోధన ఈ విధంగా సాగుతోంది. యాజ్ఞవల్క్యుడు మరింత విపులంగా విశదీకరిస్తున్నాడు.
ఏవాయం పురుష ఇతి స యథాకామో భవతి తత్ క్రతుర్భవతి యత్ క్రతుర్భవతి తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే త దభిసమ్పద్యతే।।
ఆ విధంగా కోరికలతో కూడిన పురుషుడు తన ఇచ్ఛ ప్రకారం ఏ ఏ కర్మలు చేస్తున్నాడో ఆ కర్మ ఫలాలను పొందుతున్నాడు. శరీరాన్ని ఆలంబనగా చేసుకున్న పురుషుడు ఈ లోకములోనే ఆ కర్మఫలాలను అనుభవించి మరణించి ఊర్ధ్వలోకాలకు పోతున్నాడు. తిరిగి కర్మ చేయడానికి జన్మ ఎత్తుతున్నాడు. కర్మఫలం మీద ఆసక్తి కల పురుషుడు ఈ జనన మరణ రూప భ్రమణంలో చిక్కుకుంటున్నాడు.
కర్మఫలాలను కోరని వాడు నిష్కాముడు, ఆప్తకాముడు ఆత్మకాముడుగా అవుతున్నాడు. అతని సమస్త ఇంద్రియాలు కూడా బ్రహ్మత్వాన్ని పొందుతున్నాయి.
ఎప్పుడయితే ఈ జీవుడి హృదయంలో ఉండే కోరికలన్నీ నశించిపోతాయో అప్పుడుఅతడు అమృతుడు అవుతూ బ్రహ్మత్వాన్ని పొందు తున్నాడు. సర్పము తన యొక్క కుబుసాన్ని చలన రహిత స్థితిలో పుట్టలో ఏరీతిలో వదిలి పోతుందో అదే రీతిగా ఈ దేహం పతనమవుతుంది. తర్వాత శరీరం లేనివాడై మరణం లేనివాడై తేజో స్వరూపుడు అవుతున్నాడు.
కడు ప్రాచీనము, అత్యంత సూక్ష్మము సమస్త జనులను తరింపజేసే జ్ఞానమార్గం విషయంలో పండితులు కొందరు శుక్ల నాడిని, కొందరు నల్లని నాడిని, పసుపురంగు నాడిని, పచ్చని నాడిని, అలాగే ఎర్రని నాడిని మోక్షమార్గమని చెప్పేరు. బ్రహ్మవిద్యా స్వరూపమైన ఆ మోక్షమార్గాన్ని బ్రహ్మజ్ఞాని మాత్రమే పొందగలుగుతున్నాడు.
ఇక్కడ ఈశావాశ్యోపనిషత్తులోని అవిద్యను గురించి చెప్పిన మంత్రాలు జనకునికి చెబుతున్నారు యాజ్ఞవల్క్య ఋషి.
అన్ధం తమః ప్రవిశన్తి యేఽవిద్యాముపాసతే। తతోభూయ ఇవతే తమో య ఉ విద్యాయాగ్ం రతాః।।
అవిద్యను ఉపాశించే వారు అంటే జ్ఞానము కంటే ఇతరమైన దానిని ఉపాశించేవాళ్ళు కర్మ ప్రధానమైన ఈ సంసారాన్ని పొందుతున్నారు. అలా అని బ్రహ్మవిద్యను ఉపాశించేవారు మరింత అజ్ఞానం చేత కప్పబడిపోతున్నారు. దీని అర్ధం ఏమిటంటే విద్య అవిద్యలకు భిన్నమైనది అతీతమైనది ఆత్మజ్ఞానము అని తెలుసుకోవాలి.
అనన్దా నామతే లోకా అన్ధేన తమసావృతాః।। తాగ్ం స్తే ప్రేత్యాభిగచ్ఛన్త్య విద్యాగ్ం సో బుధో జనాః।।
అజ్ఞానముచేత కప్పబడి ఆత్మవిద్యను తెలుసుకొన లేక కర్మలు చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందకుండానే ఈ జనులు మరణించి ఈ దేహాన్ని విడిచి తమస్సుతో నిండిన లోకాలకు పోతారు. జనన మరణ చక్రాన్ని అతిక్రమించలేరు.
***
185.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
185. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: షష్ఠమ అధ్యాయం, చతుర్ధ బ్రాహ్మణం (Continuation):
ఈ ఆత్మను నేనే అయి ఉన్నాను (అహం బ్రహ్మాస్మి) అని తెలుసుకున్న వ్యక్తి తన శరీరాన్ని కష్ట పెట్టవలసిన పని లేదు. ఆ వ్యక్తి సర్వకాల సర్వావస్థలలోను ఆత్మగానే ఉండడం వల్ల అతనికి ఏ ఇతర కోరిక ఉండదు.
ఎన్నో అనర్ధాలతో కూడి ఉన్నది ఈ శరీరం. దీనిలో ఉండే ఆత్మను ఎవరైతే తెలుసుకోగలుగు తున్నారో వాళ్ళు గొప్ప జ్ఞానులుగా అవుతున్నారు. అతనిదే ఈ లోకమంతా. అతడే విశ్వరూపుడైన ఆత్మగా అవుతున్నాడు.
ఈ శరీరంలో ఉంటూనే సాధనతో బ్రహ్మత్వాన్ని పొందాలి. లేకపోతే ఎంతో అనర్థం జరుగుతుంది. బ్రహ్మజ్ఞాని అమృతుడు అవుతున్నాడు. ఆ విధంగా కానివాడు జనన మరణ చక్రంలో పడి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు.
భూత భవిష్యద్వర్తమానాలకు నియామకుడైన ఈశ్వరుడే తన ఆత్మ అయి ఉన్నాడని తెలుసుకున్నవాడు అతనే సర్వేశ్వరుడు అవుతున్నాడు. అలాంటివాడు దేనికి, ఎవరికి భయపడడు.
కాలుని రూపంలో ఉంటూ సంవత్సరాలు, మాసాలు, పక్షాలు రోజులు మొదలైనవి పరిభ్రమిస్తున్నాయి. ఆ సూర్యాది తేజస్సులకు ప్రకాశాన్నిచ్చే అమృత స్వరూపుని ఆయుస్సు గా దేవతలంతా ఉపాశిస్తున్నారు.
పరబ్రహ్మలో ఐదు సంఖ్యతో అయిదు రకాల సమూహాలున్నాయి. గంధర్వులు, పితరులు, దేవతలు, అమరులు, రాక్షసులు అనే అయిదుగురు, ఆకాశం దేనిలో ఉంచబడ్డాయో ఆ పరబ్రహ్మనే ఆత్మ స్వరూపంగా భావిస్తున్నాను. ఈ విధంగా నాశరహితమైన పరబ్రహ్మను తెలుసుకుని నేను కూడా అమృతస్వరూపుడైన పరమాత్మగా అయ్యాను.
అక్షర స్వరూపమైన ఆత్మను ప్రాణ వ్యాపారానికి, నేత్రాలకు, చెవులకు మనస్సుకు ఆధార భూతునిగా తెలుసుకున్నవారే పరబ్రహ్మమును నిశ్చయముగా తెలుసుకున్న వాళ్ళవుతారు.
పరిశుద్ధమైన మనస్సుతోనే ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలి. బ్రహ్మ దర్శన విషయంలో లేశమైనా అనేకత్వమనేది లేదు. పరబ్రహ్మ దర్శన విషయంలో నానాత్వాన్ని చూసేవాడు మరణము వల్లే మరణాన్ని పొందుతాడు.
పరబ్రహ్మము అప్రమేయమైనది. ధ్రువమైనది. నిత్యమైనది. మాలిన్యరహితమైనది. ఆకాశము కంటే సూక్ష్మమైనది. జన్మము లేనిది. సర్వ శ్రేష్ఠమైనది. ఈ బ్రహ్మమును ఏక స్వరూపంగానే చూడాలి.
***
186.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
186. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: షష్ఠమ అధ్యాయం, చతుర్ధ బ్రాహ్మణం (Continuation):
యాజ్ఞవల్క్యుడు జనకునికి చెబుతున్నాడు.
విజ్ఞాని అయిన బ్రహ్మవిదుడు ఇతర విషయాలను వదలి పరబ్రహ్మ తత్వాన్నే ధ్యానించాలి. అనాత్మ విషయాలను అభ్యసించ కూడదు. అట్టి అనవసర విషయాలు, శబ్దాలు శ్రమను కలుగజేస్తాయి.
ప్రాణుల్లో విజ్ఞాన స్వరూపుడుగా ఉన్న పురుషుడు సాక్షాత్తు ఆ పరమాత్మయే. హృదయాంతరాళం లోని ఆకాశంలో నివసించే ఆ పరమాత్మే సమస్తాన్నీ తన అధీనంలో ఉంచుకున్నాడు. అతడే సర్వాన్నీ శాసించే ఈశ్వరుడు.
శుభ కర్మాచరణంవల్ల అతడు వృద్ధి చెందడు. నీచ కర్మలనాచరించడం వల్ల అతడు క్షీణించడు. సమస్త భూతాధిపతి, భూత పాలకుడు మరియు అతడే సర్వేశ్వరుడు. అతడే అందరకూ సేతువు లా ఉన్నాడు. ఈ లోకాలన్నీ స్థిరంగా ఉండడానికి అతడే ఆధారం.
ఆ పరబ్రహ్మను వేదవాక్యాల చేత, యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ఉపవాస వ్రతాలు ఆచరించడం చేత తెలుసుకోవాలని వేదవేత్తలైన పండితులు చెబుతారు. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవారు మునులు అవుతారు. ఈ బ్రహ్మ తత్వాన్ని వాంఛించేవారు సన్యాస దీక్షను స్వీకరిస్తారు.
మోక్షసాధనయే పరమధ్యేయంగా గల బ్రహ్మవిదులు సంతానాపేక్ష లేనివారై ఉండేవారు. అందువల్ల ఈషణత్రయాన్ని (పుత్రేషణ, విత్తేషణ, లోకేషణలు) వదలి బిక్షాటన చేస్తూ సాధనలో ఉండేవారు.
కర్మేంద్రియాలచే పట్టుబడని ఆ ఆత్మ పదార్ధము నేతి, నేతి (ఇదికాదు, ఇదికాదు) అంటూ నిర్ధారింప బడింది. ఆ ఆత్మ గ్రహింప శక్యము కానిది, అగ్రాహ్యము. అశీర్యుడు అంటే నాశనమొందువాడు కాదు. అసంగుడు కాబట్టి దేనికీ అంటుకోదు, దేనికీ బుద్ధుడు కాడు.
అవినాశియు బ్రహ్మజ్ఞానియు అయిన అతను పాప పుణ్యాలు రెంటికీ అతీతుడు. అతను విహిత కర్మలు చేసినా, చేయకపోయినా ఎలాంటి పాపము అతనిని అంటదు. అతనికి తాపాన్నివ్వవు.
ఓ జనకా! ఈ ఆత్మ గురించి ఒక వేద ఋక్కు స్పష్టంగా ఇలా చెప్పింది. ఆ ఆత్మ నిత్యమైనది. ఆ ఆత్మ తత్వాన్ని తెలుసుకున్న బ్రహ్మవేత్త యొక్క మహిమ పుణ్య కర్మచే వృద్ధిని కాని పాపకర్మచే క్షీణత్వం కాని పొందదు.
తస్యైవస్యా త్పదవిత్తం విదిత్వా నలిప్యతే కర్మణా పాపకేనేతి।
ఆ ఆత్మ యొక్క మహహిమనెరిగిన వాడే “పదవిత్” అనబడతాడు. ఆ మహిమ నెరిగిన వానికిక కర్మము తో సంబంధము లేదు. ఈ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి శాంత చిత్తుడౌతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు అవుతాడు. ఉపరతి పొందినవాడవుతాడు (చంచలమైన మనస్సును బాహ్యవిషయాలనుంచి మరల్చి సర్వదా బ్రహ్మము నందే నిల్పడాన్ని ఉపరతి అంటారు).
తితీక్షువు అవుతాడు.(సీతోష్ణములు, క్షుత్పిపాసలు, మానావ మానములు మొదలైన ద్వంద్వాలవల్ల కలిగే దుఃఖాలను ఓర్చుకుంటూ, పరుల వల్ల కలిగే దుఃఖములకు శరీర బుద్ధి దార్ఢ్యములుకలిగి ఉండీ ప్రతీకారము చేయక, చిత్తవ్యాకులముగాని, వాక్పారుష్యము గాని లేకుండ సహించి ఉండడాన్ని తితీక్ష అంటారు). ఏకాగ్ర చిత్తుడు అవుతాడు. మోక్షగామి అవుతాడు. అనగా షడ్గుణ సంపన్నుడై తనయందే పరమాత్మను దర్శిస్తున్నాడు. సమస్తాన్ని ఆత్మగా చూడగలుగుతున్నాడు.
ఓ జనక మహారాజా!
అట్టి బ్రహ్మజ్ఞానిని కృతాకృత కర్మలు బాధించవు. కర్మలనే అతడు భస్మం చేయగలుగుతాడు. అతడు పాపరహితుడు. విరజుడు. ఇచ్ఛారహితుడు. సంశయ వర్జితుడు. అతడు బ్రహ్మదర్శనము పొందిన జ్ఞాని. ఇదే బ్రహ్మలోకం అంటే.
ఈ ఆత్మ ఎంతో గొప్పది. ఎలాంటి జన్మలు లేనిది. అన్నానికి భోక్త యై ఉంది. సకల భూతాలకు అవి చేసిన కర్మలకు ఫలాన్ని ఇచ్చేద అవుతోంది.
స వా ఏష మహా మజ ఆత్మాఽజరోఽమరోఽమృతో ఽభ యో బ్రహ్మా భయం వై బ్రహ్మాభయగ్ం హి వై బ్రహ్మ భవతి య ఏవం వేద।।
జన్మరహితుడైన ఆ ఆత్మ పురుషుడు మహాత్ముడు. అజుడు. జరామరణాలు లేనివాడు. అభయుడు. అమృతుడు. పరబ్రహ్మ స్వరూపుడు. ఈ విధంగా ఎవరైతే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడో అతడు భయ రహితుడైన పరబ్రహ్మ స్వరూపమే అవుతాడు.
***
188.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
188. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: సప్తమ అధ్యాయం: తృతీయ, చతుర్ధ, పంచమ బ్రాహ్మణాలు:
దమం, దానం, దయ అనే గొప్పవైన ఈ త్రిగుణాలు ఉన్నవాడే సర్వ ఉపాసనలకు అధికారి అవుతున్నాడు అంటూ ఇప్పటివరకూ నిరుపాధిక (నిర్గుణ) బ్రహ్మోపాసననే చెప్పేరు. ఇప్పుడు సోపాధిక (సగుణ) బ్రహ్మోపాసన వాటి ఫలాలు చెప్పబడ్డాయీ మంత్రంలో.
ఇంతవరకూ దమం, దానం, దయ అనే ఈ మూడు గుణాలను ద అనే అక్షరంలో ఉపదేశించిన ప్రజాపతియే మన హృదయ స్వరూపుడు. అంటే మనుష్యుడి హృదయమే (రక్తాన్ని సరఫరాచేసే గుండె కాదు) ప్రజాపతి, ఆ పరబ్రహ్మము.
ఈ హృదయం అనే పేరులో ఉండే మూడు అక్షరాలలో ఒక్కొక్క అక్షరాన్ని ఉపాశించడం వల్ల మానవులు విశేష ఫలితాలను పొందుతున్నారు. హృదయం లో ఉండే హృ అనే అక్షరాన్ని పరబ్రహ్మ గా ఉపాసిస్తే అతని ఇంద్రియాలు, ఇతరుల ఇంద్రియాలు అతని వశంలో ఉంటాయి.
ద అనే అక్షరాన్ని ఉపాసించే వాడికి (ద అనే ధాతువుకు ఇచ్చుట అనే అర్ధం ఉంది) అతనికి సంబంధించిన వారు, సంబంధించని వారూ అతనికి తమ తమ శక్తులను ఇస్తారు.
ఇంక యం అంటే లోపలకు వెళ్ళడం అని అర్ధం. యం అనే అక్షరాన్ని ఉపాసించేవాళ్ళు స్వర్గలోక ప్రాప్తిని పొందుతున్నారు. ఈ విధంగా హృదయం లోని ఒక్కొక్క అక్షరాన్ని ఉపాసిస్తేనే ఇంతింత ఫలితం దొరుకుతున్నప్పుడు మొత్తం హృదయం అనే పూర్తి పదాన్ని ఉపాసిస్తే విశేష ఫలప్రాప్తి ఉంటుంది.
ఈ హృదయ పరబ్రహ్మము అనేది సత్య స్వరూపము. అంటే సత్యం కూడా హృదయ పరబ్రహ్మమే అవుతుంది. సత్యమనే పరబ్రహ్మ ఎంతో గొప్పది, పూజ్యమైనది, ముందుగా పుట్టినది. ఈ మూడు గుణాలను తెలుసుకొని సత్యాన్ని ఉపాసించేవాళ్ళు సమస్త లోకాలను తమ అధీనంలో ఉంచుకోగలుగుతారు. వాళ్ళకు శత్రువులనే వాళ్ళే ఉండరు. సమస్త శుభ ఫలితాలను పొందుతారు.
ఈ సత్యమనే పరబ్రహ్మను ఎలా ఉపాసించాలో చెబుతున్నాడు. ఈ నామ రూపాత్మకమైన ప్రపంచం ముందుగా జలరూపంలోనే ఉండేది. సత్యం చతుర్ముఖ బ్రహ్మను సృష్టించగా ఆ బ్రహ్మ విరాట్ పురుషుణ్ణి, విరాట్పురుషుడు దేవతలను సృష్టించారు. ఆ దేవతలంతా తిరిగి సత్యబ్రహ్మనే ఉపాసిస్తున్నారు. అందువల్ల సత్యబ్రహ్మయే అన్నిటికన్నా, అందరికన్నా గొప్పది.
ఈ సత్య అనేదానిలో ఉన్న స, త్, య అనే మూడక్షరాలలోను మొదటిది స కారం చివరిది య కారం రెండూ సత్యమైనది, శాశ్వత మైనవి. మధ్యలో ఉండే త్ అక్షరం అసత్యమైనది అంటే మృత్యు స్వరూపమైనది. స కార యకారములే లక్షణముగా గల సత్య స్వరూపము సత్యాన్నే అధికంగా కలిగి ఉంటుంది. త్ కారము అనే అసత్యమైన మృత్యుస్వరూపం మాత్రం చాలా స్వల్పమయి నశించిపోతుంది. ఉపాసకుడికి మృత్యుభయం ఉండదు.
ఈ సత్యమనేది ఆదిత్య స్వరూపం. ఆదిత్య మండలంలో ఉండే సూర్యుడు, ఈ దేహంలోని కుడి కంట్లో ఉండే విజ్ఞాన స్వరూపుడు ఒక్కరే. వీరిద్దరూ ఒకరిలో మరొకరు ప్రకాశిస్తూ ఉంటారు. ఎలా అంటే సూర్యుడు తన కిరణాలతో జీవుడి అధ్యాత్మరూపమైన నేత్రంలో ప్రతిష్ఠితమై ఉంటే జీవుడు తన ప్రాణంతో అధి దైవ స్వరూపమైన సూర్యమండలంలో ప్రకాశిస్తున్నాడు.
అంటే సూర్యుడు తన కిరణాల ద్వారా వెలుతుర్నిస్తూ నేత్రానికి సాయపడుతోంటే, ఆ నేత్రము తన ప్రాణశక్తి అనగా చూచే శక్తి ద్వారా సూర్యుణ్ణి వ్యక్త పరుస్తున్నాడు. ఇది తెలుసుకున్న జీవుడు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేప్పుడు చాక్షుష స్వరూపుడైన ఆ సూర్యుడు తన కిరణాలను ఉపసంహరించుకొని తటస్థ రూపంతో ఉంటాడు.
అప్పుడు కిరణములు లేని ఈ సూర్యమండలం కాంతిహీనమై తెల్లగా కనపడుతుంది. ఈ సూర్యుని నేత్రములలోని విజ్ఞాన స్వరూపుని ఒక్కనిగా భావించి ఉపాసించే వాడిని సూర్యకిరణాలు బాధించవు.
వచ్చే భాగంలో ఆదిత్య మండలాంతర్గతుడైన ఆపురుషుని అవయవాల వర్ణనను చూద్దాము.
***
189.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
189. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: సప్తమ అధ్యాయం :పంచమం నుంచి దశమ బ్రాహ్మణం వరకూ:
సూర్యమండలం లో ఉన్న ఆ సత్య పురుషునికి భూ, భువః, సువః అనే మూడు వ్యాహృతులే అవయవాలుగా ఉన్నాయి. భూః అనే వ్యాహృతి తల అయితే భువః అనే వ్యాహృతి లోని రెండక్షరాలు రెండు భుజాలు, సువః అనే వ్యాహృతిలోని రెండక్షరాలు రెండు పాదాలు అవుతున్నాయి. అతనికి అహః అనేది రహస్య నామము. మరొక రహస్య నామము ఉపనిషత్.
ఆ మనోమయ పురుషుడు కాంతియే స్వరూపంగా గలవాడై వడ్ల గింజ లాగ, యవధాన్య గింజ లాగ మరీ చిన్న పరిమాణం గలవాడై ఈ సమస్తాన్నీ నియంత్రించే అధిపతిగా ఉంటాడు.
అంధకారాన్ని తొలగించే విద్యుత్స్వరూపమే ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను వాక్కు స్వరూపంగా వర్ణిస్తారు. వాక్కు అంటే వేదం. దీనిని కామధేనువుగా భావించి ఉపాసించాలి. ఈ కామధేనువుకు స్వాహా, వషట్, హస్త, స్వధా అనే నాలుగు స్తనాలున్నాయి.
వీటిలో మొదటి రెండూ స్వాహా, వషట్ అనే రెండు స్తనముల చేత దేవతలకు హవిస్సులు ఇవ్వ బడుతున్నాయి.
హస్త అనే స్తనము చేత మనుష్యులకు అన్నము ఇవ్వబడుతోంది. స్వధా అనే స్తనము చేత పితృదేవతలకు కవ్యము ఇవ్వ బడుతోంది. వాక్ స్వరూపమైన కామ దేనువుకి వృషభమే ప్రాణం. మనస్సు ద్వారానే ఆ వృషభం వాక్కు అనే క్షీరాన్ని స్రవింప జేస్తుంది. అందువల్ల మనస్సే ఆ ధేనువుకు దూడ. ఈ రీతిగా వాక్స్వరూపుడైన పరబ్రహ్మను కామధేనువుగా భావించి ఉపాసించాలి.
అయమగ్నిర్వైశ్వానరో యో య మన్తః పురుషే యే నేద మన్నం పచ్యతే యదిద మద్యతే తస్యైష ఘోషో భవతి యమే తత్కర్ణావపిధాయ శృణోతి న యదో త్క్రమిష్య న్ధవతి నైనం ఘోషగ్ం శృణోతి।।
దీనినే వైశ్వనరాగ్ని అంటారు. ఇది పురుషుడి (మానవుడి) లోపల ఉండే అగ్ని. దీనినే జఠరాగ్ని అంటారు. ఈ అగ్ని అన్నాన్ని పచనం (అరిగేటట్టు) చేస్తుంది. ఈ అగ్నికి ఒక విధమైన ధ్వని ఉంది. మనం రెండు చెవులను మూసుకుంటే ఆ ధ్వని వినిపిస్తుంది. ఆ శబ్దమే జఠరాగ్ని చేసే ధ్వని. ఈ శరీరంలో భోక్త అయిన పురుషుడు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడో అప్పుడు ఆ ధ్వని వినిపించడం ఆగిపోతుంది.
దశమ బ్రాహ్మణం:
ఇచ్ఛామరణి అయిన బ్రహ్మజ్ఞాని బ్రహ్మ లోకాన్ని చేరే మార్గాన్ని చెబుతున్నారు. బ్రహ్మజ్ఞాని ఈలోకములో ఉన్న తన శరీరాన్ని వదలి అనంతవాయువుల్లో కలిసి వాయురూపాన్ని పొందుతున్నాడు. ఆ మహావాయువు ఆ ఆత్మకొరకు రథచక్రము యొక్క రంధ్రము వంటి మార్గాన్ని ఇస్తోంది.
ఆ మార్గము ద్వారా ఈ పురుషుడు వాయు మండలము దాటి సూర్యుని చేరుతున్నాడు. అక్కడా ఆదిత్యుడు వాయు రూపములో ఉన్న ఆ పురుషునకు ఆడంబరము (డమరుకము) యొక్క రంధ్రమంత మార్గాన్ని ఇస్తున్నాడు. ఆ మార్గము ద్వారా ఆ వాయురూప పురుషుడు ప్రయాణించి సూర్యమండలం దాటి చంద్రలోకం చేరుతాడు. (ఇది భూమి చుట్టూ తిరిగే చంద్రుని మండలం కాదు. సూర్య మండలానికి అవతల అత్యంత దూరంలో ప్రజాపతి లోకానికి దగ్గరగా ఉంటుంది.)
అక్కడ ఉన్న చంద్రుడు ఆ పురుషునికి ఒక భేరీవాద్యం యొక్క రంధ్రం ఎంత ఉంటుందో అంత మార్గాన్ని ఇస్తాడు. ఆ మార్గం ద్వారా చంద్రలోకాన్ని అతిక్రమించి న తత్ర సూర్యోభాతి, నచంద్రతారకం… శీతోష్ణాలు, సుఖదుఃఖాలు లేనటువంటి బ్రహ్మలోకాన్ని చేరి ఎన్నో, ఎన్నెన్నో బ్రహ్మకల్పాలు గడిచేవరకూ శాశ్వతంగా అక్కడే నివసిస్తాడు.
ఈ ఖిల కాండలో అంటే సప్తమ అష్టమ అధ్యాయాలలో ప్రతి బ్రాహ్మణం లోను వేరు వేరు విషయాలు ప్రస్తావించ బడ్డాయి. ఇప్పటివరకూ అయిన ఉపనిషత్తులలోని విశేషాంశాలు కొన్ని తిరిగి ప్రస్తావించ బడ్డాయి.
***
190.ఉపనిషద్విచారణ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
190. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: సప్తమ అధ్యాయం: ఏకాదశ బ్రాహ్మణం నుంచి త్రయోదశ బ్రాహ్మణం వరకూ:
ఏకాదశ బ్రాహ్మణం:
ఈ బ్రాహ్మణంలో ఈ శరీరానికి మనం చేసే ఏపని అయినా తపస్సు లాంటిదే అనే విషయాన్ని చెబుతున్నాడు.
జ్వర పీడుతుడైన వాడు సంతాపము చెందుతూ ఉంటాడు.
అతని శరీరం తాపానికి గురి అవుతుంది. ఆ తాపం కూడా ఒక విధమైన తపస్సు. ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన వాడికి అంత్యక్రియలు జరిపించడం కోసం గ్రామం చివరనున్న అడవికి తీసుకొని పోతారు. అలా తీసుకొని వెళ్ళడం కూడా ఒక విధమైన తపస్సు అంటారు. మరణించిన వాడి శరీరాన్ని అగ్నిలో దహిస్తారు. అతని శరీరం దహించబడడమే పరమ తపస్సు.
ద్వాదశ బ్రాహ్మణం:-
కొందరు అన్నాన్ని బ్రహ్మస్వరూపం అంటారు.
అది సరికాదు. అన్నం లో ప్రాణమనేది లేకపోతే ఆ అన్నం పాడైపోతుంది. దుర్వాసన వచ్చి పాసిపోతుంది. అలాగే కొందరు ఋషులు ప్రాణమే పరబ్రహ్మ అన్నారు. ఇది కూడా సత్యం కాదు. ఎందుకంటే ఈ శరీరానికి అన్నం లేకపోతే శరీరం నీరసించిపోతుంది. ప్రాణం ఎండిపోతుంది. ఈ విధంగా చూస్తే అన్నం, ప్రాణం రెండూ విడివిడిగా బ్రహ్మం కాదని తెలుస్తోంది. అన్నం, ప్రాణం రెండూ కలిసి ఏక స్వరూపంగా ఉన్నప్పుడు మాత్రం పరబ్రహ్మత్వాన్ని పొందుతాయి.
ఈ విషయాన్ని పాతృదుడనే మహర్షి తన తండ్రితో చెబుతూ ఇలా ప్రాణాన్ని, అన్నాన్ని సమష్టిగా పరబ్రహ్మ స్వరూపంగా భావించే వాడికి నేను మంచిగాని చెడుగాని ఏమీ చేయలేను. అలాంటి బ్రహ్మజ్ఞానికి మంచి చెడులు, ఇష్టాఇష్టాలు అనేవేవీ ఉండవు. అన్న ప్రాణాలను రెండింటిని ఏకం చేస్తేనే బ్రహ్మభావం ఏర్పడుతుంది. ఈ సమస్త ప్రాణులూ అన్నాన్ని ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి అన్నాన్ని ‘వి’ అని, ఈ భూతాలన్నీ ప్రాణంతో రమిస్తున్నాయి కాబట్టి ప్రాణాన్ని ‘రం ‘ అని భావించేరు.
త్రయోదశ బ్రాహ్మణం:
ఉక్థం ప్రాణో వా ఉక్థం ప్రాణో హీదగ్ం సర్వముత్థాపయ త్యు ద్దాస్మాదుక్థ విద్థీర స్తిష్ఠ త్యుక్తస్య సాయుజ్యగ్ం స లోకతాం జయతి య ఏవం వేద।।
శస్త్రమనేఋగ్వేద మంత్రాన్నే ఉక్థం అంటారు. ఈ మంత్రంలో ప్రాణమే ఉక్థం గా చెప్పబడింది. ఈ శరీరంలో ప్రాణం ఎంత ప్రధానమైనదో స్తోత్ర రూపంలో ఉండే మంత్రాలలో ప్రధానమైనది. ఉక్థంగా చెప్పబడిన ప్రాణమే అన్ని కర్మలను చేయించ గలుగుతోంది. ఉక్థాన్ని ప్రాణరూప బ్రహ్మగా ఉపాసించేవాడు ప్రాణాన్ని జయించిన వీరుడవుతాడు.
ఈ ప్రాణం వల్లే సమస్త జీవులు ఒకదానితో ఒకటి కలసి ఉంటున్నాయి. ప్రాణమే అందరినీ కూర్చి ఉంచేది. అందువల్ల ప్రాణమే యజుస్సు. ప్రాణాన్ని హవిస్సు నొసగే యజుర్వేదం గా ధ్యానం చేయాలి.
సమస్త భూతాలు ఈ ప్రాణం లోనే ప్రతిష్టితమై ఉన్నాయి. అందువల్ల ప్రాణాన్ని సామవేదంగా ఉపాసించాలి.
ఈ ప్రాణమే మన శరీరాన్ని శస్త్రాలు బారినుండి, హింస నుండి రక్షిస్తుంది కనుక ప్రాణాన్ని క్షత్రంగా భావించి ఉపాసించాలి.
ఈవిధంగా భావించి ఉపాసించే సాధకులు ప్రాణం యొక్క ఐక్యతను, సాలోక్యతను సారూప్యతను పొందుతారు.
***
191.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
191. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: సప్తమ అధ్యాయం: చతుర్దశ బ్రాహ్మణం :
ఈ బ్రాహ్మణంలో గాయత్రీ మంత్రం లోని నాలుగు పాదాలను వివరించేరు. ఈ వివరణ చాందోగ్య ఉనిషత్తులో తృతీయ ప్రపాఠకం లో ఇచ్చిన గాయత్రీ మంత్ర వివరణకు అనుబంధమైనది.
భూమి- అంతరిక్షం- ద్యౌః ( ద కార య కారములు) అనే మూడు పదాలలో మొత్తం ఎనిమిది అక్షరాలున్నాయి. గాయత్రి ఛంధస్సులో కూడా ప్రతి పాదానికి ఎనిమిది అక్షరాలే ఉంటాయి. అలాగే ఎనిమిది అక్షరాలతో కూతడిన పాదాలు మూడు ఉంటాయి గాయత్రీ ఛందస్సులో.
అంటే భూమి, అంతరిక్షం, ద్యౌః (స్వర్గ లోకం) అనే త్రిలోక స్వరూపమే గాయత్రి యొక్క మొదటి పాదం.
ఋక్ యజస్సు సామ వేదాల పేర్లలోని అక్షరాలు ఋచః, యజస్సు, సామాని అనే పదాలలోని ఎనిమిది అక్షరాలు గాయత్రీ ఛందస్సు యొక్క రెండవ పాదం అవుతుంది.
ప్రాణ అపాన వ్యాన ( వ,య, న) అనే మూడు పదాలలోని ఎనిమిది అక్షరాలు గాయత్రి యొక్క మూడవ పాదం అవుతోంది.
ఏతదేవ తురీయం దర్శతం పదం సరోరజా య ఏష తపతి యద్వై చతుర్ధం తత్తురీయం దర్శతం పదమితి దదృశ ఇవహ్యేష సరోరజా ఇతి
ఇక గాయత్రిలోని నాల్గవ పాదాన్ని “సరోరజసి దర్శితపదం” అంటారు. దర్శిత పదం అంటే సూర్యమండల అంతర్గత పురుషుడు ప్రకాశిస్తూ దర్శనం ఇస్తున్నాడు అని. సరోరజ అంటే అన్ని లోకాల కన్న పైన ఆధిపత్యం తో ప్రకాశిస్తున్నాడు అని తెలుసు కోవాలి.
ఈ విషయాలను తెలుసుకున్న వ్యక్తి సూర్యునిలా అఖండ తేజస్సుతో, గొప్ప ఖ్యాతితో సర్వాధిపతిగా ప్రకాశిస్తాడు. అందువల్ల దీనినే గాయత్రీ తురీయ పదం అంటారు.
ఈనాల్గవ పాదం సత్యం లో ప్రతిష్ఠితమై ఉంది. ఇక్కడ మన నేత్రాలే ప్రసిద్ధ సత్యం గా పేర్కొన బడింది. ఎలా అంటే ఇప్పుడు నేను చూచేను, నేను విన్నాను అని ఇద్దరు కలహించుకొంటూంటే ఎవడైతే నేను చూచేను అన్నాడో వాడిని మనం విశ్వసిస్తాము. కనుక చెవులకన్నా కళ్ళే సత్యం.
సూర్యునికి ఆశ్రయమైన నేత్రము, తురీయ పదము అయిన ప్రసిద్ధమైన సత్యం బలము లో ప్రతిష్టితమై ఉంది. ఆ బలం ఏమిటంటే శరీరంలోని ప్రాణశక్తే. ప్రాణశక్తి నేత్రేంద్రియం కంటే బలిష్ఠమైనది. సత్యం కన్నా గొప్పది. ఈ విధంగా మూడు పాదాలు కలిగిన గాయత్రి పరబ్రహ్మ స్వరూపమైన ప్రాణం లో ప్రతిష్ఠితమై ఉండి వాగాది ఇంద్రియాలను కాపాడుతోంది. ఇంద్రియాలను సంరక్షిస్తూ ఉండడం వల్లే గాయత్రి అనే పేరు స్థిరమైంది.
ఈ లోకంలో ఎనిమిది సంవత్సరాలు నిండిన బాలునికి గురువు ఉపనయన సంస్కారాన్ని చేసి సావిత్రీ రూపమైన గాయత్రీ మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రం ద్వారా ఆ బాలుడి ప్రాణాలు రక్షింపబడడం వల్ల సావిత్రియే గాయత్రిగా చెప్పబడింది.
కొందరు గురువులు త్రిపద గాయత్రికి బదులుగా వటువుకు అనుష్టుప్ ఛందస్సులో ఉన్న సావిత్రి మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు. వాక్కే అనుష్టుప్ అనీ, వాక్కే ఈ శరీరం లో ఉండే సరస్వతి అనీ అనుకొని సావిత్రిని అనుష్టుప్ ఛందస్సులో ఉపదేశిస్తున్నారు. అలా చేయకూడదు. ఎందుకంటే ప్రాణాలను రక్షించేది గాయత్రియే కనుక గాయత్రి ఛందస్సులో ఉండే త్రిపద గాయత్రిని మాత్రమే ఉపదేశించాలి.
ఈ ప్రకారం గాయత్రిని గ్రహించిన వాడు ఎంత ఎక్కువ దానాన్ని తీసుకున్నా అతనికి ఎలాంటి దోషము, పాపము రాదు.
గాయత్రి మంత్రాన్ని ఉపాసించేవాడు, ఈ మూడు లోకాలను దానంగా గ్రహించినా ఆ దానం స్వీకరించడం వల్ల కలిగే దోషం, గాయత్రి యొక్క ప్రధమ పాదం ఒక్కటీ జపిస్తే తొలగిపోతుంది.
అలాగే త్రయీ విద్య యైన మూడు వేదాలను దానంగా తీసుకుంటే కలిగే దోషం గాయత్రి యొక్క రెండవ పాదాన్ని జపిస్తే తొలగిపోతుంది.
ఈ లోకం లో ఎన్ని రకాలయిన ప్రాణులున్నాయో ఆ సమస్త ప్రాణ సమూహాన్నీ దానంగా తీసుకుంటే కలిగే దోషం గాయత్రి యొక్క మూడో పాదాన్ని జపిస్తే నశించిపోతుంది.
ఇలా దానాలు స్వీకరించడం వల్ల కలిగే దోష నివారణార్ధం గాయత్రీ మంత్ర జపాన్ని అన్ని కాలాలలోను చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా గాయత్రి యొక్క మూడు పాదాల విజ్ఞాన ఫలాన్ని పొందిన తర్వాత ఆ ప్రకాశించే సూర్య మండల అంతర్గత పురుష స్వరూపమైన గాయత్రి యొక్క సరోరజసి యనే తురీయ పాదము యొక్క జ్ఞానాన్ని పొందడం దుర్లభం.
pranjali prabha
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
186. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: షష్ఠమ అధ్యాయం, చతుర్ధ బ్రాహ్మణం (Continuation):
యాజ్ఞవల్క్యుడు జనకునికి చెబుతున్నాడు.
విజ్ఞాని అయిన బ్రహ్మవిదుడు ఇతర విషయాలను వదలి పరబ్రహ్మ తత్వాన్నే ధ్యానించాలి. అనాత్మ విషయాలను అభ్యసించ కూడదు. అట్టి అనవసర విషయాలు, శబ్దాలు శ్రమను కలుగజేస్తాయి.
ప్రాణుల్లో విజ్ఞాన స్వరూపుడుగా ఉన్న పురుషుడు సాక్షాత్తు ఆ పరమాత్మయే. హృదయాంతరాళం లోని ఆకాశంలో నివసించే ఆ పరమాత్మే సమస్తాన్నీ తన అధీనంలో ఉంచుకున్నాడు. అతడే సర్వాన్నీ శాసించే ఈశ్వరుడు.
శుభ కర్మాచరణంవల్ల అతడు వృద్ధి చెందడు. నీచ కర్మలనాచరించడం వల్ల అతడు క్షీణించడు. సమస్త భూతాధిపతి, భూత పాలకుడు మరియు అతడే సర్వేశ్వరుడు. అతడే అందరకూ సేతువు లా ఉన్నాడు. ఈ లోకాలన్నీ స్థిరంగా ఉండడానికి అతడే ఆధారం.
ఆ పరబ్రహ్మను వేదవాక్యాల చేత, యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ఉపవాస వ్రతాలు ఆచరించడం చేత తెలుసుకోవాలని వేదవేత్తలైన పండితులు చెబుతారు. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవారు మునులు అవుతారు. ఈ బ్రహ్మ తత్వాన్ని వాంఛించేవారు సన్యాస దీక్షను స్వీకరిస్తారు.
మోక్షసాధనయే పరమధ్యేయంగా గల బ్రహ్మవిదులు సంతానాపేక్ష లేనివారై ఉండేవారు. అందువల్ల ఈషణత్రయాన్ని (పుత్రేషణ, విత్తేషణ, లోకేషణలు) వదలి బిక్షాటన చేస్తూ సాధనలో ఉండేవారు.
కర్మేంద్రియాలచే పట్టుబడని ఆ ఆత్మ పదార్ధము నేతి, నేతి (ఇదికాదు, ఇదికాదు) అంటూ నిర్ధారింప బడింది. ఆ ఆత్మ గ్రహింప శక్యము కానిది, అగ్రాహ్యము. అశీర్యుడు అంటే నాశనమొందువాడు కాదు. అసంగుడు కాబట్టి దేనికీ అంటుకోదు, దేనికీ బుద్ధుడు కాడు.
అవినాశియు బ్రహ్మజ్ఞానియు అయిన అతను పాప పుణ్యాలు రెంటికీ అతీతుడు. అతను విహిత కర్మలు చేసినా, చేయకపోయినా ఎలాంటి పాపము అతనిని అంటదు. అతనికి తాపాన్నివ్వవు.
ఓ జనకా! ఈ ఆత్మ గురించి ఒక వేద ఋక్కు స్పష్టంగా ఇలా చెప్పింది. ఆ ఆత్మ నిత్యమైనది. ఆ ఆత్మ తత్వాన్ని తెలుసుకున్న బ్రహ్మవేత్త యొక్క మహిమ పుణ్య కర్మచే వృద్ధిని కాని పాపకర్మచే క్షీణత్వం కాని పొందదు.
తస్యైవస్యా త్పదవిత్తం విదిత్వా నలిప్యతే కర్మణా పాపకేనేతి।
ఆ ఆత్మ యొక్క మహహిమనెరిగిన వాడే “పదవిత్” అనబడతాడు. ఆ మహిమ నెరిగిన వానికిక కర్మము తో సంబంధము లేదు. ఈ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి శాంత చిత్తుడౌతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు అవుతాడు. ఉపరతి పొందినవాడవుతాడు (చంచలమైన మనస్సును బాహ్యవిషయాలనుంచి మరల్చి సర్వదా బ్రహ్మము నందే నిల్పడాన్ని ఉపరతి అంటారు).
తితీక్షువు అవుతాడు.(సీతోష్ణములు, క్షుత్పిపాసలు, మానావ మానములు మొదలైన ద్వంద్వాలవల్ల కలిగే దుఃఖాలను ఓర్చుకుంటూ, పరుల వల్ల కలిగే దుఃఖములకు శరీర బుద్ధి దార్ఢ్యములుకలిగి ఉండీ ప్రతీకారము చేయక, చిత్తవ్యాకులముగాని, వాక్పారుష్యము గాని లేకుండ సహించి ఉండడాన్ని తితీక్ష అంటారు). ఏకాగ్ర చిత్తుడు అవుతాడు. మోక్షగామి అవుతాడు. అనగా షడ్గుణ సంపన్నుడై తనయందే పరమాత్మను దర్శిస్తున్నాడు. సమస్తాన్ని ఆత్మగా చూడగలుగుతున్నాడు.
ఓ జనక మహారాజా!
అట్టి బ్రహ్మజ్ఞానిని కృతాకృత కర్మలు బాధించవు. కర్మలనే అతడు భస్మం చేయగలుగుతాడు. అతడు పాపరహితుడు. విరజుడు. ఇచ్ఛారహితుడు. సంశయ వర్జితుడు. అతడు బ్రహ్మదర్శనము పొందిన జ్ఞాని. ఇదే బ్రహ్మలోకం అంటే.
ఈ ఆత్మ ఎంతో గొప్పది. ఎలాంటి జన్మలు లేనిది. అన్నానికి భోక్త యై ఉంది. సకల భూతాలకు అవి చేసిన కర్మలకు ఫలాన్ని ఇచ్చేద అవుతోంది.
స వా ఏష మహా మజ ఆత్మాఽజరోఽమరోఽమృతో ఽభ యో బ్రహ్మా భయం వై బ్రహ్మాభయగ్ం హి వై బ్రహ్మ భవతి య ఏవం వేద।।
జన్మరహితుడైన ఆ ఆత్మ పురుషుడు మహాత్ముడు. అజుడు. జరామరణాలు లేనివాడు. అభయుడు. అమృతుడు. పరబ్రహ్మ స్వరూపుడు. ఈ విధంగా ఎవరైతే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడో అతడు భయ రహితుడైన పరబ్రహ్మ స్వరూపమే అవుతాడు.
***
188.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
188. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: సప్తమ అధ్యాయం: తృతీయ, చతుర్ధ, పంచమ బ్రాహ్మణాలు:
దమం, దానం, దయ అనే గొప్పవైన ఈ త్రిగుణాలు ఉన్నవాడే సర్వ ఉపాసనలకు అధికారి అవుతున్నాడు అంటూ ఇప్పటివరకూ నిరుపాధిక (నిర్గుణ) బ్రహ్మోపాసననే చెప్పేరు. ఇప్పుడు సోపాధిక (సగుణ) బ్రహ్మోపాసన వాటి ఫలాలు చెప్పబడ్డాయీ మంత్రంలో.
ఇంతవరకూ దమం, దానం, దయ అనే ఈ మూడు గుణాలను ద అనే అక్షరంలో ఉపదేశించిన ప్రజాపతియే మన హృదయ స్వరూపుడు. అంటే మనుష్యుడి హృదయమే (రక్తాన్ని సరఫరాచేసే గుండె కాదు) ప్రజాపతి, ఆ పరబ్రహ్మము.
ఈ హృదయం అనే పేరులో ఉండే మూడు అక్షరాలలో ఒక్కొక్క అక్షరాన్ని ఉపాశించడం వల్ల మానవులు విశేష ఫలితాలను పొందుతున్నారు. హృదయం లో ఉండే హృ అనే అక్షరాన్ని పరబ్రహ్మ గా ఉపాసిస్తే అతని ఇంద్రియాలు, ఇతరుల ఇంద్రియాలు అతని వశంలో ఉంటాయి.
ద అనే అక్షరాన్ని ఉపాసించే వాడికి (ద అనే ధాతువుకు ఇచ్చుట అనే అర్ధం ఉంది) అతనికి సంబంధించిన వారు, సంబంధించని వారూ అతనికి తమ తమ శక్తులను ఇస్తారు.
ఇంక యం అంటే లోపలకు వెళ్ళడం అని అర్ధం. యం అనే అక్షరాన్ని ఉపాసించేవాళ్ళు స్వర్గలోక ప్రాప్తిని పొందుతున్నారు. ఈ విధంగా హృదయం లోని ఒక్కొక్క అక్షరాన్ని ఉపాసిస్తేనే ఇంతింత ఫలితం దొరుకుతున్నప్పుడు మొత్తం హృదయం అనే పూర్తి పదాన్ని ఉపాసిస్తే విశేష ఫలప్రాప్తి ఉంటుంది.
ఈ హృదయ పరబ్రహ్మము అనేది సత్య స్వరూపము. అంటే సత్యం కూడా హృదయ పరబ్రహ్మమే అవుతుంది. సత్యమనే పరబ్రహ్మ ఎంతో గొప్పది, పూజ్యమైనది, ముందుగా పుట్టినది. ఈ మూడు గుణాలను తెలుసుకొని సత్యాన్ని ఉపాసించేవాళ్ళు సమస్త లోకాలను తమ అధీనంలో ఉంచుకోగలుగుతారు. వాళ్ళకు శత్రువులనే వాళ్ళే ఉండరు. సమస్త శుభ ఫలితాలను పొందుతారు.
ఈ సత్యమనే పరబ్రహ్మను ఎలా ఉపాసించాలో చెబుతున్నాడు. ఈ నామ రూపాత్మకమైన ప్రపంచం ముందుగా జలరూపంలోనే ఉండేది. సత్యం చతుర్ముఖ బ్రహ్మను సృష్టించగా ఆ బ్రహ్మ విరాట్ పురుషుణ్ణి, విరాట్పురుషుడు దేవతలను సృష్టించారు. ఆ దేవతలంతా తిరిగి సత్యబ్రహ్మనే ఉపాసిస్తున్నారు. అందువల్ల సత్యబ్రహ్మయే అన్నిటికన్నా, అందరికన్నా గొప్పది.
ఈ సత్య అనేదానిలో ఉన్న స, త్, య అనే మూడక్షరాలలోను మొదటిది స కారం చివరిది య కారం రెండూ సత్యమైనది, శాశ్వత మైనవి. మధ్యలో ఉండే త్ అక్షరం అసత్యమైనది అంటే మృత్యు స్వరూపమైనది. స కార యకారములే లక్షణముగా గల సత్య స్వరూపము సత్యాన్నే అధికంగా కలిగి ఉంటుంది. త్ కారము అనే అసత్యమైన మృత్యుస్వరూపం మాత్రం చాలా స్వల్పమయి నశించిపోతుంది. ఉపాసకుడికి మృత్యుభయం ఉండదు.
ఈ సత్యమనేది ఆదిత్య స్వరూపం. ఆదిత్య మండలంలో ఉండే సూర్యుడు, ఈ దేహంలోని కుడి కంట్లో ఉండే విజ్ఞాన స్వరూపుడు ఒక్కరే. వీరిద్దరూ ఒకరిలో మరొకరు ప్రకాశిస్తూ ఉంటారు. ఎలా అంటే సూర్యుడు తన కిరణాలతో జీవుడి అధ్యాత్మరూపమైన నేత్రంలో ప్రతిష్ఠితమై ఉంటే జీవుడు తన ప్రాణంతో అధి దైవ స్వరూపమైన సూర్యమండలంలో ప్రకాశిస్తున్నాడు.
అంటే సూర్యుడు తన కిరణాల ద్వారా వెలుతుర్నిస్తూ నేత్రానికి సాయపడుతోంటే, ఆ నేత్రము తన ప్రాణశక్తి అనగా చూచే శక్తి ద్వారా సూర్యుణ్ణి వ్యక్త పరుస్తున్నాడు. ఇది తెలుసుకున్న జీవుడు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేప్పుడు చాక్షుష స్వరూపుడైన ఆ సూర్యుడు తన కిరణాలను ఉపసంహరించుకొని తటస్థ రూపంతో ఉంటాడు.
అప్పుడు కిరణములు లేని ఈ సూర్యమండలం కాంతిహీనమై తెల్లగా కనపడుతుంది. ఈ సూర్యుని నేత్రములలోని విజ్ఞాన స్వరూపుని ఒక్కనిగా భావించి ఉపాసించే వాడిని సూర్యకిరణాలు బాధించవు.
వచ్చే భాగంలో ఆదిత్య మండలాంతర్గతుడైన ఆపురుషుని అవయవాల వర్ణనను చూద్దాము.
***
189.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
189. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: సప్తమ అధ్యాయం :పంచమం నుంచి దశమ బ్రాహ్మణం వరకూ:
సూర్యమండలం లో ఉన్న ఆ సత్య పురుషునికి భూ, భువః, సువః అనే మూడు వ్యాహృతులే అవయవాలుగా ఉన్నాయి. భూః అనే వ్యాహృతి తల అయితే భువః అనే వ్యాహృతి లోని రెండక్షరాలు రెండు భుజాలు, సువః అనే వ్యాహృతిలోని రెండక్షరాలు రెండు పాదాలు అవుతున్నాయి. అతనికి అహః అనేది రహస్య నామము. మరొక రహస్య నామము ఉపనిషత్.
ఆ మనోమయ పురుషుడు కాంతియే స్వరూపంగా గలవాడై వడ్ల గింజ లాగ, యవధాన్య గింజ లాగ మరీ చిన్న పరిమాణం గలవాడై ఈ సమస్తాన్నీ నియంత్రించే అధిపతిగా ఉంటాడు.
అంధకారాన్ని తొలగించే విద్యుత్స్వరూపమే ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను వాక్కు స్వరూపంగా వర్ణిస్తారు. వాక్కు అంటే వేదం. దీనిని కామధేనువుగా భావించి ఉపాసించాలి. ఈ కామధేనువుకు స్వాహా, వషట్, హస్త, స్వధా అనే నాలుగు స్తనాలున్నాయి.
వీటిలో మొదటి రెండూ స్వాహా, వషట్ అనే రెండు స్తనముల చేత దేవతలకు హవిస్సులు ఇవ్వ బడుతున్నాయి.
హస్త అనే స్తనము చేత మనుష్యులకు అన్నము ఇవ్వబడుతోంది. స్వధా అనే స్తనము చేత పితృదేవతలకు కవ్యము ఇవ్వ బడుతోంది. వాక్ స్వరూపమైన కామ దేనువుకి వృషభమే ప్రాణం. మనస్సు ద్వారానే ఆ వృషభం వాక్కు అనే క్షీరాన్ని స్రవింప జేస్తుంది. అందువల్ల మనస్సే ఆ ధేనువుకు దూడ. ఈ రీతిగా వాక్స్వరూపుడైన పరబ్రహ్మను కామధేనువుగా భావించి ఉపాసించాలి.
అయమగ్నిర్వైశ్వానరో యో య మన్తః పురుషే యే నేద మన్నం పచ్యతే యదిద మద్యతే తస్యైష ఘోషో భవతి యమే తత్కర్ణావపిధాయ శృణోతి న యదో త్క్రమిష్య న్ధవతి నైనం ఘోషగ్ం శృణోతి।।
దీనినే వైశ్వనరాగ్ని అంటారు. ఇది పురుషుడి (మానవుడి) లోపల ఉండే అగ్ని. దీనినే జఠరాగ్ని అంటారు. ఈ అగ్ని అన్నాన్ని పచనం (అరిగేటట్టు) చేస్తుంది. ఈ అగ్నికి ఒక విధమైన ధ్వని ఉంది. మనం రెండు చెవులను మూసుకుంటే ఆ ధ్వని వినిపిస్తుంది. ఆ శబ్దమే జఠరాగ్ని చేసే ధ్వని. ఈ శరీరంలో భోక్త అయిన పురుషుడు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడో అప్పుడు ఆ ధ్వని వినిపించడం ఆగిపోతుంది.
దశమ బ్రాహ్మణం:
ఇచ్ఛామరణి అయిన బ్రహ్మజ్ఞాని బ్రహ్మ లోకాన్ని చేరే మార్గాన్ని చెబుతున్నారు. బ్రహ్మజ్ఞాని ఈలోకములో ఉన్న తన శరీరాన్ని వదలి అనంతవాయువుల్లో కలిసి వాయురూపాన్ని పొందుతున్నాడు. ఆ మహావాయువు ఆ ఆత్మకొరకు రథచక్రము యొక్క రంధ్రము వంటి మార్గాన్ని ఇస్తోంది.
ఆ మార్గము ద్వారా ఈ పురుషుడు వాయు మండలము దాటి సూర్యుని చేరుతున్నాడు. అక్కడా ఆదిత్యుడు వాయు రూపములో ఉన్న ఆ పురుషునకు ఆడంబరము (డమరుకము) యొక్క రంధ్రమంత మార్గాన్ని ఇస్తున్నాడు. ఆ మార్గము ద్వారా ఆ వాయురూప పురుషుడు ప్రయాణించి సూర్యమండలం దాటి చంద్రలోకం చేరుతాడు. (ఇది భూమి చుట్టూ తిరిగే చంద్రుని మండలం కాదు. సూర్య మండలానికి అవతల అత్యంత దూరంలో ప్రజాపతి లోకానికి దగ్గరగా ఉంటుంది.)
అక్కడ ఉన్న చంద్రుడు ఆ పురుషునికి ఒక భేరీవాద్యం యొక్క రంధ్రం ఎంత ఉంటుందో అంత మార్గాన్ని ఇస్తాడు. ఆ మార్గం ద్వారా చంద్రలోకాన్ని అతిక్రమించి న తత్ర సూర్యోభాతి, నచంద్రతారకం… శీతోష్ణాలు, సుఖదుఃఖాలు లేనటువంటి బ్రహ్మలోకాన్ని చేరి ఎన్నో, ఎన్నెన్నో బ్రహ్మకల్పాలు గడిచేవరకూ శాశ్వతంగా అక్కడే నివసిస్తాడు.
ఈ ఖిల కాండలో అంటే సప్తమ అష్టమ అధ్యాయాలలో ప్రతి బ్రాహ్మణం లోను వేరు వేరు విషయాలు ప్రస్తావించ బడ్డాయి. ఇప్పటివరకూ అయిన ఉపనిషత్తులలోని విశేషాంశాలు కొన్ని తిరిగి ప్రస్తావించ బడ్డాయి.
***
190.ఉపనిషద్విచారణ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
190. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: సప్తమ అధ్యాయం: ఏకాదశ బ్రాహ్మణం నుంచి త్రయోదశ బ్రాహ్మణం వరకూ:
ఏకాదశ బ్రాహ్మణం:
ఈ బ్రాహ్మణంలో ఈ శరీరానికి మనం చేసే ఏపని అయినా తపస్సు లాంటిదే అనే విషయాన్ని చెబుతున్నాడు.
జ్వర పీడుతుడైన వాడు సంతాపము చెందుతూ ఉంటాడు.
అతని శరీరం తాపానికి గురి అవుతుంది. ఆ తాపం కూడా ఒక విధమైన తపస్సు. ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన వాడికి అంత్యక్రియలు జరిపించడం కోసం గ్రామం చివరనున్న అడవికి తీసుకొని పోతారు. అలా తీసుకొని వెళ్ళడం కూడా ఒక విధమైన తపస్సు అంటారు. మరణించిన వాడి శరీరాన్ని అగ్నిలో దహిస్తారు. అతని శరీరం దహించబడడమే పరమ తపస్సు.
ద్వాదశ బ్రాహ్మణం:-
కొందరు అన్నాన్ని బ్రహ్మస్వరూపం అంటారు.
అది సరికాదు. అన్నం లో ప్రాణమనేది లేకపోతే ఆ అన్నం పాడైపోతుంది. దుర్వాసన వచ్చి పాసిపోతుంది. అలాగే కొందరు ఋషులు ప్రాణమే పరబ్రహ్మ అన్నారు. ఇది కూడా సత్యం కాదు. ఎందుకంటే ఈ శరీరానికి అన్నం లేకపోతే శరీరం నీరసించిపోతుంది. ప్రాణం ఎండిపోతుంది. ఈ విధంగా చూస్తే అన్నం, ప్రాణం రెండూ విడివిడిగా బ్రహ్మం కాదని తెలుస్తోంది. అన్నం, ప్రాణం రెండూ కలిసి ఏక స్వరూపంగా ఉన్నప్పుడు మాత్రం పరబ్రహ్మత్వాన్ని పొందుతాయి.
ఈ విషయాన్ని పాతృదుడనే మహర్షి తన తండ్రితో చెబుతూ ఇలా ప్రాణాన్ని, అన్నాన్ని సమష్టిగా పరబ్రహ్మ స్వరూపంగా భావించే వాడికి నేను మంచిగాని చెడుగాని ఏమీ చేయలేను. అలాంటి బ్రహ్మజ్ఞానికి మంచి చెడులు, ఇష్టాఇష్టాలు అనేవేవీ ఉండవు. అన్న ప్రాణాలను రెండింటిని ఏకం చేస్తేనే బ్రహ్మభావం ఏర్పడుతుంది. ఈ సమస్త ప్రాణులూ అన్నాన్ని ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి అన్నాన్ని ‘వి’ అని, ఈ భూతాలన్నీ ప్రాణంతో రమిస్తున్నాయి కాబట్టి ప్రాణాన్ని ‘రం ‘ అని భావించేరు.
త్రయోదశ బ్రాహ్మణం:
ఉక్థం ప్రాణో వా ఉక్థం ప్రాణో హీదగ్ం సర్వముత్థాపయ త్యు ద్దాస్మాదుక్థ విద్థీర స్తిష్ఠ త్యుక్తస్య సాయుజ్యగ్ం స లోకతాం జయతి య ఏవం వేద।।
శస్త్రమనేఋగ్వేద మంత్రాన్నే ఉక్థం అంటారు. ఈ మంత్రంలో ప్రాణమే ఉక్థం గా చెప్పబడింది. ఈ శరీరంలో ప్రాణం ఎంత ప్రధానమైనదో స్తోత్ర రూపంలో ఉండే మంత్రాలలో ప్రధానమైనది. ఉక్థంగా చెప్పబడిన ప్రాణమే అన్ని కర్మలను చేయించ గలుగుతోంది. ఉక్థాన్ని ప్రాణరూప బ్రహ్మగా ఉపాసించేవాడు ప్రాణాన్ని జయించిన వీరుడవుతాడు.
ఈ ప్రాణం వల్లే సమస్త జీవులు ఒకదానితో ఒకటి కలసి ఉంటున్నాయి. ప్రాణమే అందరినీ కూర్చి ఉంచేది. అందువల్ల ప్రాణమే యజుస్సు. ప్రాణాన్ని హవిస్సు నొసగే యజుర్వేదం గా ధ్యానం చేయాలి.
సమస్త భూతాలు ఈ ప్రాణం లోనే ప్రతిష్టితమై ఉన్నాయి. అందువల్ల ప్రాణాన్ని సామవేదంగా ఉపాసించాలి.
ఈ ప్రాణమే మన శరీరాన్ని శస్త్రాలు బారినుండి, హింస నుండి రక్షిస్తుంది కనుక ప్రాణాన్ని క్షత్రంగా భావించి ఉపాసించాలి.
ఈవిధంగా భావించి ఉపాసించే సాధకులు ప్రాణం యొక్క ఐక్యతను, సాలోక్యతను సారూప్యతను పొందుతారు.
***
191.ఉపనిషద్విచారణ
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
191. ఉపనిషత్తులు – బృహదారణ్యకోపనిషత్తు: సప్తమ అధ్యాయం: చతుర్దశ బ్రాహ్మణం :
ఈ బ్రాహ్మణంలో గాయత్రీ మంత్రం లోని నాలుగు పాదాలను వివరించేరు. ఈ వివరణ చాందోగ్య ఉనిషత్తులో తృతీయ ప్రపాఠకం లో ఇచ్చిన గాయత్రీ మంత్ర వివరణకు అనుబంధమైనది.
భూమి- అంతరిక్షం- ద్యౌః ( ద కార య కారములు) అనే మూడు పదాలలో మొత్తం ఎనిమిది అక్షరాలున్నాయి. గాయత్రి ఛంధస్సులో కూడా ప్రతి పాదానికి ఎనిమిది అక్షరాలే ఉంటాయి. అలాగే ఎనిమిది అక్షరాలతో కూతడిన పాదాలు మూడు ఉంటాయి గాయత్రీ ఛందస్సులో.
అంటే భూమి, అంతరిక్షం, ద్యౌః (స్వర్గ లోకం) అనే త్రిలోక స్వరూపమే గాయత్రి యొక్క మొదటి పాదం.
ఋక్ యజస్సు సామ వేదాల పేర్లలోని అక్షరాలు ఋచః, యజస్సు, సామాని అనే పదాలలోని ఎనిమిది అక్షరాలు గాయత్రీ ఛందస్సు యొక్క రెండవ పాదం అవుతుంది.
ప్రాణ అపాన వ్యాన ( వ,య, న) అనే మూడు పదాలలోని ఎనిమిది అక్షరాలు గాయత్రి యొక్క మూడవ పాదం అవుతోంది.
ఏతదేవ తురీయం దర్శతం పదం సరోరజా య ఏష తపతి యద్వై చతుర్ధం తత్తురీయం దర్శతం పదమితి దదృశ ఇవహ్యేష సరోరజా ఇతి
ఇక గాయత్రిలోని నాల్గవ పాదాన్ని “సరోరజసి దర్శితపదం” అంటారు. దర్శిత పదం అంటే సూర్యమండల అంతర్గత పురుషుడు ప్రకాశిస్తూ దర్శనం ఇస్తున్నాడు అని. సరోరజ అంటే అన్ని లోకాల కన్న పైన ఆధిపత్యం తో ప్రకాశిస్తున్నాడు అని తెలుసు కోవాలి.
ఈ విషయాలను తెలుసుకున్న వ్యక్తి సూర్యునిలా అఖండ తేజస్సుతో, గొప్ప ఖ్యాతితో సర్వాధిపతిగా ప్రకాశిస్తాడు. అందువల్ల దీనినే గాయత్రీ తురీయ పదం అంటారు.
ఈనాల్గవ పాదం సత్యం లో ప్రతిష్ఠితమై ఉంది. ఇక్కడ మన నేత్రాలే ప్రసిద్ధ సత్యం గా పేర్కొన బడింది. ఎలా అంటే ఇప్పుడు నేను చూచేను, నేను విన్నాను అని ఇద్దరు కలహించుకొంటూంటే ఎవడైతే నేను చూచేను అన్నాడో వాడిని మనం విశ్వసిస్తాము. కనుక చెవులకన్నా కళ్ళే సత్యం.
సూర్యునికి ఆశ్రయమైన నేత్రము, తురీయ పదము అయిన ప్రసిద్ధమైన సత్యం బలము లో ప్రతిష్టితమై ఉంది. ఆ బలం ఏమిటంటే శరీరంలోని ప్రాణశక్తే. ప్రాణశక్తి నేత్రేంద్రియం కంటే బలిష్ఠమైనది. సత్యం కన్నా గొప్పది. ఈ విధంగా మూడు పాదాలు కలిగిన గాయత్రి పరబ్రహ్మ స్వరూపమైన ప్రాణం లో ప్రతిష్ఠితమై ఉండి వాగాది ఇంద్రియాలను కాపాడుతోంది. ఇంద్రియాలను సంరక్షిస్తూ ఉండడం వల్లే గాయత్రి అనే పేరు స్థిరమైంది.
ఈ లోకంలో ఎనిమిది సంవత్సరాలు నిండిన బాలునికి గురువు ఉపనయన సంస్కారాన్ని చేసి సావిత్రీ రూపమైన గాయత్రీ మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రం ద్వారా ఆ బాలుడి ప్రాణాలు రక్షింపబడడం వల్ల సావిత్రియే గాయత్రిగా చెప్పబడింది.
కొందరు గురువులు త్రిపద గాయత్రికి బదులుగా వటువుకు అనుష్టుప్ ఛందస్సులో ఉన్న సావిత్రి మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు. వాక్కే అనుష్టుప్ అనీ, వాక్కే ఈ శరీరం లో ఉండే సరస్వతి అనీ అనుకొని సావిత్రిని అనుష్టుప్ ఛందస్సులో ఉపదేశిస్తున్నారు. అలా చేయకూడదు. ఎందుకంటే ప్రాణాలను రక్షించేది గాయత్రియే కనుక గాయత్రి ఛందస్సులో ఉండే త్రిపద గాయత్రిని మాత్రమే ఉపదేశించాలి.
ఈ ప్రకారం గాయత్రిని గ్రహించిన వాడు ఎంత ఎక్కువ దానాన్ని తీసుకున్నా అతనికి ఎలాంటి దోషము, పాపము రాదు.
గాయత్రి మంత్రాన్ని ఉపాసించేవాడు, ఈ మూడు లోకాలను దానంగా గ్రహించినా ఆ దానం స్వీకరించడం వల్ల కలిగే దోషం, గాయత్రి యొక్క ప్రధమ పాదం ఒక్కటీ జపిస్తే తొలగిపోతుంది.
అలాగే త్రయీ విద్య యైన మూడు వేదాలను దానంగా తీసుకుంటే కలిగే దోషం గాయత్రి యొక్క రెండవ పాదాన్ని జపిస్తే తొలగిపోతుంది.
ఈ లోకం లో ఎన్ని రకాలయిన ప్రాణులున్నాయో ఆ సమస్త ప్రాణ సమూహాన్నీ దానంగా తీసుకుంటే కలిగే దోషం గాయత్రి యొక్క మూడో పాదాన్ని జపిస్తే నశించిపోతుంది.
ఇలా దానాలు స్వీకరించడం వల్ల కలిగే దోష నివారణార్ధం గాయత్రీ మంత్ర జపాన్ని అన్ని కాలాలలోను చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా గాయత్రి యొక్క మూడు పాదాల విజ్ఞాన ఫలాన్ని పొందిన తర్వాత ఆ ప్రకాశించే సూర్య మండల అంతర్గత పురుష స్వరూపమైన గాయత్రి యొక్క సరోరజసి యనే తురీయ పాదము యొక్క జ్ఞానాన్ని పొందడం దుర్లభం.
pranjali prabha
Comments
Post a Comment