తంత్ర మార్గం***
శ్రీ గురుచరణ కమలేభ్యో నమః
తంత్ర మార్గం
తంత్ర మార్గం (1) :
మంత్ర తంత్రాలు నిజమైతే నిజమని నిరూపిస్తాను..... బూటకాలు అయితే బూటకం అని నిర్థారిస్తాను. ఈ లక్ష్యంతో ఇల్లు వదిలి బయలుదేరాను.
అప్పటికి నేను ఇల్లు వదిలి వచ్చే మూడు నెలలు అయిపోయింది. అన్వేషణ ఫలిస్తుందని సూచన కూడా తగ్గలేదు. మంచి ఆదాయం గల ఉద్యోగం ,భార్య ,పిల్లలు... ఆదాయము అన్నీ వదులుకొని ఒక చేతి సంచిలో ధోవతుల జత వేసుకొని ఇల్లు వదిలి బయలుదేరినది, ఎందుకు ?
మంత్ర తంత్రాలు ఉన్నాయా?
జ్యోతిష్యం నిజమా ? అయితే ఫలితాలు ఎందుకు తప్పుతాయి ?
మంత్ర తంత్ర జ్యోతిష రంగాల నిగ్గు తేల్చుకోవాలి. అవి నిజమైతే ... తిరిగి వచ్చి వాటిని లోకంలో నిరూపించాలి. బూటకం ఐతే బూటకమని ప్రపంచానికి చెప్పాలి. ఇలా బయలుదేరి మూడు నెలలు అయిపోయింది. ఈ మధ్య కాలంలో కొంతమంది సాధువులు, సన్యాసులు కలిసారు. వారి ఎవరి దగ్గర నాకు తృప్తి కలగలేదు. ఇంత నిరాశ లో ఉండగా గుజరాత్ లోని ఒక అడవిలో "స్వామి పూర్ణానందజీ" కలిశారు. ఆయన దగ్గర వారం రోజులు ఉన్నాను. ఆ వారం రోజుల్లో ఆయన భోజనం చేయడం గాని, నీళ్లు త్రాగడం గాని చూడలేదు. శరీరంపై కేవలం ఒక్క "లంగోటి" మాత్రమే ధరించేవాడు. నేను దగ్గరలోని పల్లెకు వెళ్లి, పిండి తెచ్చుకొని రొట్టె చేసుకుని దాన్ని నీళ్ళతో... దిగమ్రింగుతూ ఉంటే చూసి నవ్వేవారు.
స్వామిజీ దగ్గర మొదటిసారిగా శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు తెలిసాయి. మొండితనం అహంకారం మోసం కుతర్కాలు పూర్తిగా వదిలివేసి గురువు పట్ల పూర్తి సమర్పణ భావంతో తన వ్యక్తిగత ప్రాధాన్యాలను గురువు భావనలతో విలీనం చేసి పరిపూర్ణ నిశ్చల శ్రద్ధతో సేవిస్తే తప్ప శిష్యునికి గురువు అనుగ్రహం లభించదని ఆయన చెప్పేవారు. స్వామీజీ గాయత్రి ఉపాసకులు. ఎన్నో పురశ్చరణలు చేసినవారు. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఆశించాను. కానీ ఆయన మౌనంగా ఉండిపోయేవారు. ఎనిమిదవ రోజున ఆయన పాదాలకు నమస్కరించి అనిశ్చిత లక్ష్యం వైపు సాగిపోయాను.
స్వామి పూర్ణానంద జీ దగ్గర నుండి బయలుదేరాక, "మధుసూధన్ బాబా" అనే అఘోరీతో నివసించే అవకాశం కలిగింది. ఆయన "తంత్ర విద్య"లో చాలా నిష్ణాతుడు. భయంకరమైన పాములను పట్టుకొని తిరిగే వాడు. ఎంతటి మనిషినైనా, నోటితో ఉది మట్టికరిపించే వాడు. ఎదురుతిరిగిన వారి నోట రక్తం కక్కించే వాడు. ఎంత మంట పెట్టిన నీళ్లు వేడి కాకుండా చేసేవాడు. ఇలా ఎన్నో చిన్న పెద్ద విద్యలు ఆయనకు కరతలామలకాలు. నా సేవకు మెచ్చి వాటిని కూడా నేర్పాడు ఆయన.
ఒక నాటి అర్ధరాత్రి వెన్నెల వేళ....... నన్ను స్మశానానికి తీసుకు వెళ్ళాడు. "ఈరోజు నువ్వు భూత విద్య నేర్చుకోవాలి. ఒక భూతాన్ని వశం చేసుకుంటే చాలు... ఇక ఏ లోటు ఉండదు. నువ్వు కోరుకున్నవన్నీ వాటంతట అవే లభిస్తాయి".... అన్నాడు మధుసూదన్ బాబా. (సశేషం)
మూలం : గురుదేవ్ నారాయణ దత్త శ్రీమాలీజీ
ప్రేరణ : శ్రీ అనిల్ కుమార్ జోషి
✒️భట్టాచార్య
--(())--
తంత్ర మార్గం
---3---
మధుసూదన్ బాబా దగ్గర నుంచి.... బయలుదేరి తిరుగుతూ, తిరుగుతూ.... ఆబూ చేరుకున్నాను.
ఇప్పటివరకు నేను రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాలలోనే తిరుగుతున్నాను. ఆబూ లోనివేవీ నన్ను ఆకర్షించలేదు. "గోముఖ్" నుంచి నుంచి క్రిందికి దిగి వశిష్టాశ్రమమును చేరుకున్నాను. అక్కడ ఉన్న సాధువులు ఇంకా క్రిందికి పోవడం ప్రమాదకరమని చెప్పారు. ఆ మార్గంలో క్రూరమృగాలు ఉన్నాయని, పుట్టలకు పుట్టలు.... భయంకరమైన పాములు ఉన్నాయని అన్నారు.
కానీ వారిలో ఒకరు గొప్ప సంగతి చెప్పారు. ఈ వశిష్టాశ్రమాని కి రెండు మైళ్ళ దూరంలో ఒక పర్ణశాల ఉందని చెప్పారు..... దానిలో ఒక సిద్ధయోగి, సిద్ధ తపస్వి....అయిన "యోగీశ్వరానందజీ" ఉన్నారు.
కానీ ఆయన దర్శనం దుర్లభం. అసలు చాలా కొద్ది మందికే ఆయన కనిపిస్తారు. అసలు కొద్దిమంది మాత్రమే అక్కడిదాకా వెళ్ళగలరు.
మరునాడు ఉదయం బయలు దేరాను, ఆయనను దర్శించుకోవడానికి.... నిజం ! ఆ మార్గం చాలా కఠినమైనది. అడుగడుగునా ముళ్ళు, మొనదేలిన రాళ్లు ఎగుడుదిగుడులు, పుట్టల నిండా పాములు. ఆయన మార్గంలో ఎంతో దృఢసంకల్పం, ఎదురులేని గుండె ఉంటే తప్ప ఎవరూ అడుగు కదపలేరు.
అది ప్రాణాల మీదకు తెచ్చే త్రోవ.
భగవంతుని దయవల్ల నేను పదకొండు గంటలకల్లా, ఆ పర్ణశాలకు చేరాను. కాళ్లకి చెప్పులు ఉన్నా పాదాలు రక్తసిక్తమై పోయాయి.
పర్ణశాల పరిసరాలలో ఎవరూ కనిపించలేదు. తలుపు వేసి ఉంది. ఆ తలుపు తెరవాలా... వద్దా... అని కొన్ని క్షణాలు సంశయం లో పడి చివరకు చెప్పులు విడిచి తలుపు తెరిచాను. ఆ కుటీరం లోపల కూడా ఎవరూ లేరు. అటు ఇటు నలువైపులా కలయజూసాను. ఎవరూ కనిపించలేదు.
అప్పుడు..... కొద్ది క్షణాలకు.......
కుటీరంలో నుండి హుంకారం వినిపించింది.
కుటీరంలో ఓ మూల.....
మెల్ల మెల్లగా.....
ఒక పురుషాకృతి రూపు ధరించడం మొదలయింది......
సన్నని మంచుతెరలా మొదలైన ఆకారం..... క్రమంగా పూర్ణ పురుషాకృతి ధరించింది.....
గాలిలో నుంచి ఆయన రూపుదిద్దుకున్నారు.
ఆయనే "స్వామీ యోగీశ్వరానందజీ"!
అదీ... ఆయన నాకు ప్రసాదించిన ప్రథమ దర్శనం!...
(సశేషం)
----మూలం : గురుదేవ్ నారాయణ్ దత్త్ శ్రీమాలి
----ప్రేరణ : గురుదేవ్ శ్రీ అనిల్ కుమార్ జోషి
శ్రీ గురుచరణ కమలేభ్యో నమః
తంత్ర మార్గం
Episode-6
స్వామీ యోగీశ్వరానందజీ దగ్గర నుండి బయలుదేరి, హరిద్వార్ వెళ్ళాను. ఋషీకేశ్ ప్రాంతాలలో తిరుగుతున్నాను. మనస్సుకు శాంతి లభించలేదు. ఉద్విగ్నంగా ఉంది.
ఒకనాటి ఉదయం ఋషీకేశ్ లోని "లక్ష్మణ ఝూలా" దగ్గర ఉన్న రామాలయంలో దర్శనం చేసుకొని... బయటకు వస్తూ ఉండగా ధవళ కేశాలతో ఉన్న 80 ఏళ్ల సన్యాసి ఎదురు వచ్చారు. ఆయన కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి..... అడవి వైపు సాగిపోయారు. నేను ఆయన వెంట పడ్డాను. శత వృద్ధుడు అయినా ఆయన చాలా వేగంగా వెళుతున్నారు. దాదాపు మైలు దూరంలో ఉన్న ఆయన కుటీరాన్ని చేరుకున్నాము. ఆయన లోనికి వెళ్ళిన ఏడెనిమిది నిమిషాలకు సంకోచిస్తూనే...నేను దగ్గరకు వెళ్ళాను. ఆ కుటీరము మట్టితో నిర్మించినది. శుభ్రంగా, నిర్మలంగా, పవిత్రంగా ఉంది. అక్కడకు వెళ్ళగానే ఒక పరిపూర్ణ ఆధ్యాత్మిక క్షేత్రం చేరిన అనుభూతి కలిగింది. మనస్సు ప్రసన్నమై, అలసట అంతా మాయమైపోయింది.
ఆ స్వామీజీ పేరు కింకర్ బాబా. 80 ఏళ్ల వయస్సులో కూడా ఆయన శరీరం పుష్టిగా ఉంది. ఒక్క పన్ను కూడా ఊడిపోలేదు. కన్నులలో మెరుపు ఉంది. ఆయనకు నా జీవిత లక్ష్యాన్ని నివేదించాను. నన్ను గురించి నేనే పరిచయం చేసుకున్నాను. కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి నెమ్మదిగా అన్నారు...... "నేను సాధారణమైన మానవుడిని".
" నాకు మీలో శతాంశం ప్రసాదించండి చాలు. నన్ను కూడా మీలాగా సాధారణమైన మనిషిని చేయండి...."అన్నాను.
స్వామీజీ.... సాముద్రిక, జ్యోతిష, ఆయుర్వేద శాస్త్రాలలో అఖండ ప్రజ్ఞానిధి. త్రికాల దర్శి. ఆయన సాధారణ వేష భాషలు, జీవనం, ప్రవర్తన చూసిన వారెవరికీ ఆయనలో అగాధమైన జ్యోతిష సాగరం పొంగులు ఎత్తుతుందనే అనుమానం కూడా కలగదు. చివరికి నేను తన కుటీరంలో ఉండడానికి ఆయన అనుమతించారు. నా భోజన భాజనాదుల విషయం చెప్పలేదు, నేను అడగనూ లేదు. ఉదయం ఆయన పూజాదికాలు పూర్తి చేసుకునే వేళకు నేను సంధ్యావందనం నుంచి ఆయన చరణాల వద్ద కూర్చునే వాడిని. భారతీయ జ్యోతిష్యానికి సంబంధించిన వేలాది శ్లోకాలు... ఆయనకు కంఠోపాఠం. ఆ శ్లోకాలు ఏ పుస్తకంలోనూ, కనిపించవు. ఆయన దగ్గర గడిపిన నెల రోజులలో వందలాది శ్లోకాలు నా చేత వ్రాయించారు. అవే ఫలిత జ్యోతిషానికి ఆధార సూత్రం అయినాయి.
జన్మకుండలి ద్వారా గర్భ శోధనం జరిపి, జనన సమయాన్ని సెకండ్ లతో... సహా సరిగ్గా నిర్ధారించే విధానాన్ని ఆయన నేర్పారు. గర్భ కుండలి, బీజ కుండలి నిర్మాణం కూడా ఉపదేశించారు. ఆయన అభిప్రాయం లో జన్మ కుండలి స్థూలం అయితే... గర్భ కుండలి సూక్ష్మం. ఏ క్షణంలో, తల్లిదండ్రుల సంగమంలో, బీజారోపణ జరుగుతుందో.... ఆ క్షణం జీవన ఫలితాలను నిర్ధారించడంలో మొదటి మెట్టు. తరువాత తల్లి గర్భంలో మాంస పిండంలో ఏ క్షణాన ప్రాణ సంచారం ప్రారంభమవుతుందో... క్షణం కూడా ఫలితాలు నిర్ధారించడంలో చాలా ప్రధానం. అందువల్ల గర్భ కుండలి, ప్రాణ కుండలి, జన్మకుండలి... మూడూ తయారు చేయవచ్చు. ఆ విధానాన్ని నాకునూ నేర్పారు.
ఆయన నా చేత వ్రాయించిన శ్లోకాలు... అనంతరకాలంలో, ఏ గ్రంథములోనూ కనిపించలేదు. వాటిలోని ఒక్కొక్క శ్లోకము, భవిష్యత్తు ఫలితాలు నిర్ధారించడంలో అపార విజ్ఞానాన్ని పొదుగు కొన్నవి. ఆయన వ్రాసిన 525 శ్లోకాలు అద్భుతము, ఆశ్చర్య జనకము అయినవి. ఫలిత జ్యోతిష్యములో ...అవి శిఖర సదృశాలు.
భవిష్యత్తు చెప్పడంలో... ఫలిత జ్యోతిష్యంలో... ఇప్పుడు నాకు లభించిన కొద్దిపాటి కీర్తి, సన్మానాలకు... పూజ్య స్వామీజీ ఆశీర్వాదము... ఆయన ద్వారా లభించిన జ్ఞానము-శ్లోకాలు కారణము. అందుకు నేను స్వామీజీకి ఎల్లప్పుడూ కృతజ్ఞుడనే.
భగవంతుడు అనుకూలిస్తే... ఆయురారోగ్యాలు అనుమతిస్తే... ఈ శ్లోకాలను వాటి అన్వయము... అర్థాలతో సహా పాఠకులకు అందిస్తాను. అదే జ్యోతిష ప్రపంచానికి నేను సమర్పించే కానుకల అవుతుంది.
స్వామిజి దగ్గర సాముద్రికం అంటే హస్త రేఖా విజ్ఞానానికి సంబంధించిన అపారమైన భాండాగారం ఉంది. ఆయా రేఖల... పరస్పర సంయోగం వల్ల ఏర్పడే ఈ యోగాల పేర్లు కూడా ఉన్నాయి.
ఆయన దగ్గర మరొక అద్భుతమైన విద్య ఉంది. చేతి వేళ్ళలో మధ్యవ్రేలు ఆధారంగా... జనన సమయాన్ని నిర్ధారించి చెప్పడం... అక్షాంశ- దేశాంతరాల ఆధారంగా... జన్మ స్థానాన్ని చెప్పడంలో... ఆయన నిధి. ఈ విద్యను ఆయన నాకు పరమ వాత్సల్యంతో నేర్పారు.(సశేషం)
అనుభవం : గురుదేవ్ నారాయణ్ దత్త్ శ్రీమాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
--(())__
తంత్ర మార్గం
శరీర కాయ కల్ప అనుభవం
Episode - 7
ఒక రోజు ఉదయం, నేను గంగా స్నానం చేసి వచ్చేసరికి .....స్వామీజీ బిల్వ వృక్షం క్రింద కూర్చొని ఉన్నారు.
ఆయన గళం నుండి "సౌందర్యలహరి శ్లోకాలు" మధురంగా వెలువడి..... వాతావరణాన్ని మనోహరం చేస్తున్నాయి. సౌందర్యం అనేది జీవనంలోని పూర్ణత్వం, ఉత్సాహము. సౌందర్యం, జీవనం యొక్క మధుర నృత్యం., ఆనంద గీతం , కళ్ళను కట్టి పడేసే సమ్మోహన క్రియ. దేవతలు ప్రసాదించే వరం. కోట్ల వజ్రాలు రత్నాలు కన్నా విలువైనది. జన్మజన్మల పుణ్యఫలంగా అలాంటి సౌందర్యం లభిస్తుంది. సౌందర్యం.... జీవితంలోని పాప తాపాలు, దోష దుఃఖాలు పోగొట్టే కళ. సాధారణ మానవుడికి, పూర్ణత్వాన్ని అందించే ప్రక్రియ సౌందర్యం.
స్వామీజీ గళం నుండి వెలువడుతున్న సౌందర్యలహరి శ్లోకాలు.... ఆ ప్రకృతిని మరింత శాంత సుందరం చేస్తున్నాయి. అలాంటి ప్రశాంత మధుర వాతావరణంలో అంతటి మధుర పాఠాలు వినడం.... భాగ్యశాలురకే దక్కే వరం.
అప్పుడు కుటీరం లో నుండి
ఒక వృద్ధ వ్యక్తి బయటకు వచ్చాడు. గత 20 రోజులుగా అతనిని నేను చూడలేదు. అతడు నా ప్రక్కన స్వామీజీ ఎదుట కూర్చున్నాడు. అతడికి 60 - 65 ఏళ్ల వయస్సు ఉంటుంది.అయినా.... నిటారుగా నడవ గలుగుతున్నాడు. అతడి శరీరం పై మాత్రం చర్మం ముడుతలు పడింది. జీవితంలో ఎన్నో అనుభవించిన వాడిలా ప్రశాంతంగా ఉన్నాడు. స్వామీజీ 20 నిమిషాల తర్వాత కనులు తెరిచి.... ఆ వృద్ధుడిని చూసి.... చిరునవ్వు నవ్వారు.
శంకర్ !ఎలా ఉన్నావు? అని అడిగారు.
అతడు, స్వామీజీ పాదాలకు..... నమస్కరించి మౌనంగా కూర్చున్నాడు.
ఎనిమిదేళ్ల తర్వాత కనిపించావు. ఇంత ముసలి వాడివి అయిపోయావు ఏమిటి ? ముఖం మీద ముడతలు ఎలా వచ్చాయి? బాబాజీ కులాసాగా ఉన్నారా? అని ప్రశ్నలు గుప్పించారు.
అతను పర్వత ప్రాంతాల భాషలో ఏదో చెప్పాడు. బాబాజీ..... స్వామీజీ గురువు అని, ఆయనను గురువు దగ్గరికి తీసుకు వెళ్లడానికి, వచ్చాడు..... అని మాత్రం అర్థమైంది. బాబాజీ చాలా దూరంలో హిమాచ్ఛాదితమైన, పర్వతాలలో ఉంటారని, ఆ వృద్ధ వ్యక్తి ఆయనకు సేవకుడని అని అర్థం అయింది.
శంకర్! నీ శరీరం మీద వార్ధక్యం వ్యాపిస్తోంది. ఈ వేళ నేను నీకు "కాయకల్పం" చేస్తాను. నువ్వు బాటియా, పప్పు... తయారు చేయి... భోజనం చేద్దాం . సామగ్రి అంతా, కుటీరంలో ఉంది. నేను బయటికి వెళుతున్నాను. రెండు మూడు గంటలలో తిరిగి వచ్చేస్తాను. అంటూ స్వామీజీ వెళ్ళిపోయారు.
శంకర్, చాలా మితభాషి. పైగా అతని భాష ఒక పెద్ద సమస్య అయింది. అతడికి, మరొక భాష రాదు. సంజ్ఞలతో, బాబాజీ గురించి.... కొంతలో కొంత తెలుసుకున్నాను. అతను కుటీరం బయట పొయ్యి వెలిగించి, గోధుమ పిండితో గుండ్రని బాటియాలు, పప్పు తయారు చేశాడు.
11:30 కల్లా, స్వామీజీ తిరిగి వచ్చారు.
ఆయన చేతిలో పది అంగుళాల..... అడవి మొక్క వేరు లాంటిది.... ఉంది. ముగ్గురికీ భోజనం వడ్డించారు శంకర్. శంకర్ కోసము పప్పు నింపిన చిన్న పాత్రలో స్వామీజీ అడవి మొక్క వేరుతో కలపడం మొదలు పెట్టాడు. ఆ వేడి పప్పులో..... ఆ వేరు కరిగిపోయి కలిసిపోతుంది. పప్పు గాఢమైన పసుపు రంగులోకి మారిపోతోంది. దాదాపు నాలుగు అంగుళాల దాకా..... వేరు కరిగి పోయిన తరువాత స్వామీజీ మిగిలిన ముక్కను విసిరిపారేసారు. శంకర్ ఆ పప్పు అంతా తినేసాడు. భోజనాలు అయిన తరువాత, స్వామీజీ ఆజ్ఞ ప్రకారము మేము ఆయనతో అడవిలో తిరగడానికి వెళ్ళాము. అలా 4 గంటలు అడవిలో తిరిగాము బహుశా శంకర్ కి మందు వంట పట్టడానికి.... అలా తిరగడం అవసరం అనుకుంటాను.
ఆశ్చర్యం ! నాలుగు గంటల తరువాత, మేము కుటీరానికి తిరిగి వచ్చే వేళకు శంకర్ లో.... అద్భుతమైన మార్పు వచ్చింది. అతని ముఖంపై ముడతలు మాయమైపోయినాయి. తెల్లవారేసరికి చేతుల పై ముడతలు వెతికినా, కనిపించకుండా పోయాయి. తల పైన, కనుబొమల పైన ఉన్న తెల్లని వెంట్రుకలు, పూర్తిగా నల్లగా మారి పోయాయి....! శరీరంలో వార్ధక్యం మచ్చ కూడా కనిపించకుండా పోయింది. అతడు శరీరానికి పూర్తిగా కాయకల్పం అయ్యింది. శరీరంలోని రుగ్మత అంతా పోయి ....... ఆరోగ్యవంతంగా తయారయ్యాడు.....! ముఖంలో నూతన తేజస్సు వచ్చింది. అతడి శరీరంలో నుండి ఒక రకమైన కాంతి వెలువడుతోంది.(సశేషం)
మూలం : గురుదేవ్ శ్రీ నారాయణ దత్త శ్రీమాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
episode - 8
సాయంత్రం 6 గంటలకు స్వామీజీ, శంకర్ తో కలిసి..... బాబాజీ దగ్గరకు బయలుదేరారు. నేను ఇంకా, మూడు నాలుగు నెలలు, ఆయన దగ్గర ఉండాలనుకున్నాను. కానీ ఆయనే వెళ్ళిపోతున్నారు. ఆయనతో కూడా వస్తాను, అని పట్టుబట్టాను. కానీ, గురూజీ అనుమతి లేకుండా, నిన్ను కూడా తీసుకు వెళ్ళలేను. అని, ఆయన చెప్పారు. ఆయన వెళ్లిపోయారు.నేను ఒంటరిగా మిగిలి పోయాను.
ఆయన చేసిన కాయకల్ప ప్రయోగం అద్భుతమైనది. మిగిలిపోయిన వేరు ముక్కను, ఆయన విసిరి వేశారు కదా! దానికోసం ఎంతగానో వెతికాను. దొరకలేదు. మరునాటి ఉదయం, ఐదారు గంటలు మళ్ళీ వెతికాను. దానిని ఆయన ఎంతో దూరం పారేయలేదు....... అయినా అది దొరకలేదు. అదృష్టం లేకపోతే, ఏదీ లభించదు కదా! ఆ ముక్క నాకు దొరకలేదు. స్వామీజీ కూడా దాని గురించి ఏమీ చెప్పలేదు. మరో రెండు మూడు నెలల ఆయనతో ఉండి ఉంటే కచ్చితంగా ఆయన నాకు నేర్పి ఉండేవారు.
భారతీయ మూలికా విజ్ఞానం అద్భుతమైనది. ఈ సంఘటన నా కనుల ముందు జరిగింది. భారతీయ వైద్యులు ఈ మూలికను వెతుకగలరా? అది గంగాతీరంలో 20 - 50 మైళ్ళ లోపే దొరుకుతుంది. పప్పులో కరిగిపోతుంది. పసుపు రంగు లోకి మారిపోతుంది...... అయితే ఇవన్నీ మామూలు సంకేతాలు మాత్రమే.
ఈ విద్య నాకు లభించి ఉంటే, పోనీండి! ఆయన నాకు ప్రసాదించిన జ్యోతిష సాముద్రిక శాస్త్ర విజ్ఞానం మాత్రం ఇతరత్రా అలభ్యమైనది. నా శరీరంలోని ప్రతి అణువూ...... ఆయనకు కృతజ్ఞయై ఉంది. ఉంటుంది...
****
కింకర్ బాబా వెళ్ళిపోయాక, నేను హరిద్వార్ కి తిరిగి వచ్చాను. గంగా తీరంలో ప్రతి సాయంత్రం, ఒక మహాత్ముని ప్రవచనానికి హాజరయ్యేవాడిని. కానీ నా మనసుకు శాంతి లభించలేదు. ఒక రోజు సాయంత్రం, గంగాతీరంలో..... తిరుగుతూ, తిరుగుతూ చాలా దూరం వెళ్లి పోయాను. అలసిపోయి, ఒక విశాలమైన రాతి పై కూర్చున్నాను. కొద్దిసేపటికి అలాగే నిద్ర పోయాను. మెలకువ, వచ్చేసరికి ఆకాశంలో చుక్కలు కనిపించాయి వాచీ చూస్తే రాత్రి 2:00 అయింది.
ఆ నిద్రలో ఒక స్వప్నం వచ్చింది. మెలకువ వచ్చాక దాని అర్ధం ఏమిటో.... అని ఆలోచిస్తున్నాను. ఆ కలలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు నన్ను గంగానది పుట్టిన చోటుకు రమ్మనమని ప్రేరేపించాడు. ఆయనతో కొద్ది అడుగులు నడిచి, అడుగు తడబడి.... పడిపోయాను. లేచి చూసేసరికి ఆయన పాతిక అడుగుల దూరంలో ఉండి పిలుస్తున్నాడు. ఇంతలో మెలుకువొచ్చింది. ప్రక్కనే నా సంచి, ఉంది దానిలో ఒక జత బట్టలు, ఒక చ
లోటా ఉన్నాయి. లేచి ,గంగాజలంతో ...ముఖం కడుక్కున్నాను. స్నానం చేయాలనిపించింది. చాలా సేపు శీతల గంగా జలంతో స్నానం చేస్తూ ఉండిపోయాను. -- నిర్భయంగా -- నిస్సంశయంగా.......
మార్గమధ్యంలో, ఎక్కడ కూడా ...ఏ ఇంటిలోనూ..... వండిన ఆహారాన్ని స్వీకరించలేదు. ఒకటి, రెండు రోజులు.... ఉపవాసం ఉండి ఆకలి తీవ్రమైనప్పుడు, ఒకటి ,రెండు ఇళ్ళలో..... పిండి తీసుకొని ఆ ఊరి వెలుపల, ఒకటి రెండు రొట్టెలు చేసుకుని తినే వాడిని.
హరిద్వార్ ,గంగోత్రి ల మధ్య .... ఓ ప్రక్కకి, "మణేజా" అనే గ్రామం ఉంది. ఆ గ్రామం వెలుపల ఒక శివాలయం ఉంది. నేను అక్కడే ఆగాను. ఆ ఆలయంలో 87 ఏళ్ళ "నాగా బాబా" ఒకరు ఉన్నారు. శరీరమంతటా విభూతి పూసుకుని ఉండేవారు. పైకి మామూలు మనిషిగా కనిపించినా..... ఆయన కన్నులలోని మెరుపు, ఆయన సిద్ధ పురుషుడు అని చెప్పకనే చెబుతుంది.
గ్రామానికి మైలు దూరంలో ఉన్న ఆ శివాలయం లో ఒక బావి ఉంది. నేను అక్కడికి చేరే సరికి, సూర్యాస్తమయం అయింది. రాత్రి గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు, "నాగాబాబా" ....ఊఁ...ఊఁ....అని లేదా క్లుప్తంగానూ, సమాధానం చెప్పేవారు. గ్రామస్తులు ఆయన సాధారణ సాధువు.... అని అనుకునేవారు. కానీ ఆయన ఒక దివ్య పురుషుడు. నిరంతరం అఖండ ఆనందంలో మునిగి ఉండేవాడు.
ఆ శివాలయం లో ఉండటానికి, అనుమతి కోరితే.... ఆయన కళ్ళతోనే అనుమతి ఇచ్చారు. రాత్రి వచ్చిన గ్రామస్తులలో ఒకరు," జాగ్రత్తగా ఉండు! బాబాజీ కి సంబంధించిన వస్తువులు ఏవైనా పోతే, నిన్ను ప్రాణాలతో వదలం!!!!.... అని హెచ్చరించారు. బాబాజీ మాటలాడలేదు, చిరునవ్వు నవ్వారు.(సశేషం)
మూలం : గురుదేవ్ నారాయణ దత్త్ శ్రీమాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
----9-----
రాత్రి నిద్రించే ఉదయం లేవగానే, స్నానసంధ్యలు పూర్తిచేసుకుని బాబా గారికి నమస్కరించి, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. ఆయన ఆశీర్వదించనూ కూడా లేదు. అలా కూర్చుని 1:00 అయిపోయింది. ఆయన నిశ్చలంగా ఉండి పోయారు. ఎండ మండిపోతోంది.
ఆయనకు నమస్కరించి, గ్రామంలోకి వెళ్లి పిండి తెచ్చి రొట్టెలు చేసాను. బాబాజీ తినమంటే ఆయన అంగీకరించలేదు, తిరస్కరించనూ లేదు. అడిగితే "వద్దు" అన్నారు. భోజనం చేసిన తరువాత ఆలయాన్ని శుభ్రపరిచి.... శివుడికి అభిషేకం చేశాను.
మూడు గంటలకు, బాబాజీ లేచి.... బయటకి వెళ్లి రెండు గంటల తరువాత వచ్చి, చెట్టు క్రింద నిద్ర పోయారు. రోజు గడిచిపోయింది. బాబాజీ నాతో ఏమీ మాట్లాడ లేదు.
ఇలా ఐదు రోజులు గడిచిపోయాయి ఆయన నా స్థైర్యాన్ని పరీక్షిస్తున్నాడు, అనిపించింది. అయినా పరీక్షకు కూడా హద్దు ఉంటుంది కదా! నాకు కాలం చాలా విలువైనది. ఇలా వ్యర్ధంగా గడిచిపోతే ప్రయోజనం ఏముంది?
ఒక రోజు ఉదయం శివార్చన, అనంతరం "చంద్రశేఖరాష్టకం"గానం చేస్తున్నాను.
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్|
రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం
శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహం
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం

మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్
దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్
క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగధారిణమ్

కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్
అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్
భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం
సోమవారినభోహుతాశనసోమపానిలఖాకృతిం

విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం
సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశం గణనాథయూథసమన్వితం

మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠే న్న హి తస్య మృత్యుభయం భవేత్
పూర్ణ మాయు రరోగతా మఖిలార్థసంపద మాదరం
చంద్రశేఖర యేవ తస్య దతాతి ముక్తిమయత్నత:
తన్మయత్వంతో పఠించి కనులు తెరిచేసరికి, శివలింగం వద్ద "నాగాబాబా " ఉన్నారు. ఓహ్! చాలా బాగుంది. ఏదీ... మరొక్కసారి గానం చేయు. తనివి తీరడం లేదు.
కొద్ది సేపటికి, ఆయన కూడా కన్నులు తెరిచి, నీ పేరేమిటి అన్నారు....
"నారాయణ్"....అన్నాను.
నాకు తెలుసు" బయటికి పద.... అన్నారు.
నా చెయ్యి పట్టుకొని, చెట్టుక్రిందకి తీసుకుని వెళ్లారు.
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ మీ అమ్మగారు అనారోగ్యంగా ఉంటే, నువ్విలా తిరుగుతున్నావు..... ఇలా రా! అన్నారు.
నేను ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన "నఖ దర్పణాది ఖండ విభూతి" లో నిష్ణాతులు. ఆయన కుడి చేతి బొటన వ్రేలిని నా కళ్ళ ముందు ఉంచారు. అవును ఆ గోరు అద్దం లా మారిపోయింది. ఆ నఖ దర్పణంలో......
మా ఇల్లు.... మంచం మీద మా అమ్మ...... తీవ్రమైన జ్వరంతో పడి ఉంది. నా భార్య ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఉంది. ప్రక్కన మా అబ్బాయి నిలబడి ఉన్నాడు.
మా అబ్బాయి గొంతు వినిపించింది. అమ్మమ్మా? ఎలా ఉంది? అని.....
అస్పష్ట స్వరంతో, అమ్మ గొంతులో నుంచి ఒకే ఒక మాట వెలువడింది. "నారాయణ్"!
ఈ దృశ్యం ,మాటలు ....అన్నీ ఆయన కుడి చేతి బొటన వ్రేలి గోటి నుంచే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి.
(సశేషం)
మూలం మరియూ అనుభవం : గురుదేవ్ నారాయణ్ దత్త్ శ్రీమాలి
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
Episode - 10
"నాగాబాబా" కుడిచేతి బొటనవ్రేలి గోటిలో.... జోధ్పూర్లోని..... నా ఇంటి దృశ్యం చూడగానే..... కంగారు పడిపోయి కళ్ళు మూసుకున్నాను. మా అమ్మ ఈ పరిస్థితిలో ఉండడానికి, బాధ్యత నాదే అనిపించింది. నేను ఇల్లు వదలి పోవడం వల్లనే మా అమ్మ ఆరోగ్యం పాడయిపోయింది అనిపించింది.
క్షణ క్షణానికి నా ముఖంలో రంగులు మారిపోతున్నాయి. "నాగా బాబా" ఏకాగ్రంగా నన్నే చూస్తున్నారు.
ఏం కనిపిస్తుంది? అని అడిగారు బాబా.
నా కనుల నుండి ధారాపాతంగా కన్నీళ్లు వర్షిస్తున్నాయి. గొంతు పూడి పోయింది. బా....బా....జీ.....! అని మాత్రమే అనగలిగాను.
ఏమి నిర్ణయించుకున్నావు? అని అడిగారు ఆయన.
ఇప్పుడే .....ఈ క్షణమే..... ఇంటికి వెళ్ళి పోతాను. ఇలా తిరగడం వల్ల ఏమవుతుంది?అంటూ లేచి నిలబడ్డాను.
"కూర్చో!" హుంకరించారు బాబాజీ.
ఎవరో భుజాలు పట్టి కూల వేసినట్లు కూర్చున్నాను.
అయిందా ?ఒక్క సంఘటన కే అలసి పోయావా? అన్ని అతి సహజంగానే, చేతి లోకి వచ్చి పడతాయి...... అనుకున్నావా ?ఏది త్యాగం లేకుండా బలిదానం లేకుండా ఏదైనా లభిస్తుందా?
కానీ తల్లిని బలిచేసి, పొందే వన్నీ నాకు వద్దు.
నేను మాతృ ఋణాన్ని కూడా తీర్చాలి కదా!--- అదే కొడుకుగా నా కర్తవ్యం కదా! అమ్మ నా పేరు తలుచుకుని బాధపడుతోంది. నేనేమో ఇక్కడ.... మీ దగ్గర ఏదో నేర్చుకోవాలని పడి ఉన్నాను. ఆరు రోజులైంది .ఇదిగో ఇదే, మొదటిసారి మీరు నాతో మాట్లాడటం అన్నాను.
బాబాజీ పకపకా నవ్వారు .చాల్చాల్లే! మీ అమ్మ మరణించదు. ఆమె కష్టాన్నంతా, నేను అనుభవిస్తాను. నువ్వు ఇంటి నుండి బయట పడ్డావంటేనే, భగవంతుడు ఏదో, ప్రణాళిక వేసి ఉంటాడు. ఏదో ఒక కారణం ఉంటుంది. భవిష్యత్తులో ఎవరికీ లభించని గురువు నీకు లభించనున్నాడు ....... ఆయనే స్వామీ సచ్చిదానందజీ.... ఇలా అంటూనే, ఆయన పడుకున్నాడు. అలా పడుకుంటూ.... నన్ను గమనిస్తూ ఉండు. కంగారుపడకు. ఈ విషయాలు ఎవరితో కూడా చర్చించవద్దు.... అన్నారు.
నా బుర్ర వేడెక్కి పోయింది. నూతి దగ్గరకు వెళ్ళి, గంట సేపు స్నానం చేశాను. అప్పటికి నా మనస్సు కొంత ప్రశాంతత పొంది ఉంది. శివాలయం దగ్గరకు వచ్చేసరికి, బాబాజీ అలాగే పడుకుని ఉన్నారు. చేయి వేసి చూస్తే, ఆయన శరీరం కాలి వేడెక్కిపోయి, ఉంది. 103 -104 డిగ్రీల జ్వరం ఉండి ఉంటుంది.....! మనస్సు బాగులేక, సాయంత్రం భోజనం చేయలేదు. ఆలయంలో, కళ్ళు మూసుకున్నాను. ఆ క్షణంలో నాగా బాబా కనుల ముందు ప్రత్యక్షమయ్యారు.
శాంతంగా ఉండు. మీ అమ్మ ఆరోగ్యం బాగుపడింది. రేపటికి పూర్తిగా స్వస్థత చిక్కుతుంది. ఆమె బాధనంతా, కష్టాన్నంతా..... నేను అనుభవిస్తున్నాను.
నన్ను లేపి ఆలయం ప్రక్కన ఉన్న కుటీరంలో, పడుకోబెట్టు అన్నారు.
కళ్ళు తెరిచి చూస్తే, బాబాజీ ఆ చెట్టు క్రింద అలాగే పడుకుని ఉన్నారు. ఆయనను, రెండు చేతులతో ఎత్తుకుని.... కుటీరంలో పడుకోబెట్టి ప్రక్కనే కూర్చున్నాను. ఆ సాయంత్రం ఒక గ్రామీణుడు రెండు లీటర్ల పాలు తెచ్చాడు. జ్వరం సంగతి విని, ఆయన వృద్ధుడు. చాలా చాలా సార్లు ఇలా జ్వర పడుతున్నాడు. ఎన్నోసార్లు, కట్టుకోవడానికి, కప్పుకోవడానికి వస్త్రాలు ఇచ్చాము. కానీ ఆయన కట్టుకోరు, కప్పుకోరు.... ఏదో రోజు ఇలాగే చచ్చిపోతారు. ఈయన మొండితనం ఏమిటో! ఆ భగవంతునికే తెలియాలి, అంటూ వెళ్లిపోయాడు.
అమాయకులు వీళ్ళు. ఎంత అజ్ఞానులు. బాబాజీ ఎంత బ్రహ్మజ్ఞానియో, సిద్ధుడో,త్రికాల దర్శియో...వీరికి ఏమి తెలుసు?
రాత్రి అంతా మేలుకొనే ఉన్నాను. ఉదయం స్నానసంధ్యాదులు..... ముగించుకొని, వచ్చేసరికి బాబాజీ జ్వరం తగ్గి పోయింది. అంతే కాదు ఆయన నది దగ్గరకి వెళ్లి పోయారు. తిరిగి వచ్చేసరికి, పరమ ప్రశాంతంగా,ప్రసన్నంగా ఉన్నారు.
నారాయణ్! మీ అమ్మ పూర్తిగా కోలుకున్నారు. ఆమెను మృత్యువు తప్పని స్థితి నుంచి బయట పడేసాను. మరో 30 ఏళ్లు ఆయుర్దాయం ప్రసాదించాను. చూడు. అంటూ..... తన కుడి చేతి బొటన వేలు గోటిని, నా కళ్ళ ముందు ఉంచారు.
నేను ఆశ్చర్య చకితుడనయ్యాను. అమ్మ పరిపూర్ణ ఆరోగ్యవంతులైంది. ఇంటి వాకిట్లో కూర్చుని ఉంది. అతి ప్రసన్నంగా ఉంది.
నాలుగేళ్ల తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు, మాటల్లో ఈ సంగతి వచ్చింది. ఆ రోజు రాత్రి, చాలా తీవ్ర అనారోగ్యం చేసింది ఆమెకి. అయితే రాత్రికి రాత్రి జ్వరం తగ్గిపోవడం మాత్రమే కాదు, పరిపూర్ణ ఆరోగ్యం చేకూరడం, వ్యాధి మచ్చుకు కూడా లేకుండా పోవడం, డాక్టర్లను అందరినీ ఆశ్చర్యపరిచింది.
అమ్మ ఆరోగ్యంగా తిరగడాన్ని, బాబాజీ "నఖ దర్పణం"లో చూడగానే నేను ఆయన చరణాల పై వాలిపోయాను. మొదటి సారిగా ఆయన ఆశీర్వదించారు.
"నువ్వు నీ లక్ష్యం లో సఫలుడివి అవుతావు!"
అంతే కాదు . అదే రోజు ఆయన నాకు "నఖ దర్పణాదిఖండ విభూతి" కి సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించారు. మంత్రాన్ని ఉపదేశించారు. ఆ సాధన చాలా కష్టమైనది. అయినా 3 పగళ్ళు, 3 రాత్రులు మేల్కొని, తన ఎదుట ఈ సాధన చేయించారు. ఇది ఆయన ప్రసాదించిన మొదటి విద్య.
ఈ సాధన వల్ల, భూత ,వర్తమాన భవిష్యత్తులలో... ఏది రహస్యం ఉండదు. ఎంత దూరంలో ఉన్న ప్రదేశంలోనైనా.... నఖ దర్పణంలో దర్శించవచ్చు.ఏ వ్యక్తి గతాన్నయినా, వర్తమాన భవిష్యత్తులనయినా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నేను కోరుకున్నప్పుడు, ఎప్పుడైనా ఇంటిని, అక్కడ పరిస్థితులను బొటన వ్రేలు గోటితో దర్శించి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఇందులో విశేషం ఏమిటంటే.... తల వెంట్రుకల నుండి గోటి వరకు స్పష్టంగా కనిపిస్తాయి.
ఈసాధన కు "నఖ దర్పణాది ఖండ విభూతి" మంత్రాన్ని, నిత్య నియమంగా జపించుట అవసరము. బాబాజీ దగ్గరనుంచి వెళ్ళాక, నాలుగైదేళ్లు దీనిని నిత్యమూ
అభ్యసించాను. కానీ తిరిగి వచ్చి గృహస్త జీవనం లో దిగాక నిత్యజపం సాధ్యం కాలేదు.......
(సశేషం)
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
Episode - 11
నేను నాగాబాబా దగ్గర దాదాపు రెండు నెలలు ఉన్నాను. ఒక రోజు మధ్యాహ్నం నేను ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన "శ్వాస సాధన" గురించి వివరిస్తున్నారు. ఆయన ఉద్దేశంలో "ఉచ్ఛ్వాస నిశ్వాసాల" నియంత్రణ లోనే అఖండానంద అనుభూతి ఉంది. ఆయన అవలంబించే ప్రక్రియ, అతి సరళమైనది. 5 , 6 గంటల ప్రయత్నంతోనే..... నేను దానిని నేర్చుకున్నాను. శ్వాస నియంత్రణ వల్ల అనిర్వచనీయమైన ఆనందం ఉంది. దానిని గురించి వ్రాయడం గానీ, వివరించడం గానీ సాధ్యం కాదు. ఆ ఆనందాన్ని అనుభవించవలసినదే.
మానవ జీవితంలోని పరిపూర్ణత్వం "రసాస్వాదనం" లోనే ఉంది. అయితే సంపూర్ణ రసాస్వాదనం, సన్యాసులకు కూడా సాధ్యం కాదు. గృహస్తులకు కూడా సాధ్యం కాదు. కఠోర బ్రహ్మచర్యం వల్ల కూడా, ఇది సాధ్యం కాదు.అధిక భోగ విలాసాల వల్ల కూడా రసాస్వాదనం సంభవం కాదు.....అంటారు నాగాబాబా.
మానవుని వీర్యమే అతని జీవనం. ఆ వీర్యం పైననే అతని రస సాధన, రసాస్వాదనం ఆధార పడి ఉన్నాయి. ఇడా, పింగళ తో పాటు చెప్పబడిన బిందువే..... శుక్రాత్మకమైన వీర్యము. అది తేజోమయం అయితే శుక్రవారం ఆడే ప్రేరేపితం కావడం వల్ల, వీర్యం బయటకు పోతుంది. దానిని స్ఖలన క్రియ అంటారు. ఇది మృత్యుక్రియ కూడానూ!
అయితే ఈ విషయంలో, మరో నైపుణ్యం ఉంది. శుక్రము లేదా వీర్యాన్ని.... ధరించడానికి ముందే దానిని వాయవీయం చేయడం..... అది వాయవీయం అయిపోతే పతనం లేదా స్కలనం అన్నదే ఉండదు.
ఆ విధంగా మానవుడు తన తేజోమయ స్వరూపాన్ని కాపాడుకోగలడు. ఈ వాయవీయ రూపం ధరించిన వీర్యం తరళంగా ఉంటుంది. దానిని ఊర్ధ్వముఖం చేయవచ్చును. దీనినే ఊర్ధ్వరేతావస్థ లేదా దివ్యావస్థ అంటారు అని నాగాబాబా అన్నారు.
శ్వాస ప్రశ్వాస సాధన మొదట నాగా బాబా వద్ద నేర్చుకున్నాను. తర్వాత దానిలోని ఉన్నత స్థితులను, పూజ్య గురుదేవులు .....స్వామీ సచ్చిదానందజీ వద్ద నేర్చుకున్నాను.
నాగా బాబా దగ్గర అనేక శక్తులు ఉన్నాయి. ఇతరుల మనస్సులను చదవడం ఆయనకు అతి సులువు. ఒకరోజు ఇద్దరము, గంగాతీరంలో నడుస్తూ ఉండగా..... ఆయన కాగితం మీద ఏదో ఒకటి రాసి వేసుకో.....అన్నారు.
నేను, " ఈ జన్మలో నాకు సరైన గురువు లభిస్తాడా? అని వ్రాశాను. ఆయన చెప్పినట్టే దానిని ఉండ చుట్టి జేబులో వేసుకున్నాను.
నేను ఏమి రాశానో ఆయన చెప్పారు. " త్రికాల సాధనా మంత్రం" ద్వారా అది సాధ్యమే! అని నేను అన్నాను. దాన్ని అప్పటికే నేను నేర్చుకున్నాను.
"ఈసారి మళ్లీ వ్రాయు" అన్నారు.
"నాకు గురువు ఎప్పుడు లభిస్తాడు? ఆయన పేరేమిటి?" అని వ్రాశాను.
"ఆ కాగితాన్ని ఉండచుట్టి గంగలోకి దూరంగా విసిరేయ్" అన్నారు. అలాగే చేశాను . నిమిషం తర్వాత గంగలో చేయి పెట్టి, ఆ కాగితాన్ని తీసి ఇచ్చారు. నా కాగితం నాదే...... దానిపై నా దస్తూరీయే ఉంది. దాని క్రింద.... మూడు నెలల తర్వాత ,సచ్చిదానంద రూపంలో అని వ్రాసి ఉంది.
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే..... ఆ కాగితం కొత్తది లాగానే ఉంది. ఉండ చుట్టిన చిహ్నాలు ఏమీ లేవు......!
మూలం మరియూ అనుభవం : గురుదేవ్ నారాయణ దత్త శ్రీమాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
తంత్ర మార్గం
Episode - 2
.....ఆ మాట నిజమే. నా కళ్ళతో చూశాను. బాబా ఎన్నడూ తన చేతులతో రొట్టెలు చేసుకోలేదు. ఆయన పర్ణశాల రెండు భాగాలుగా ఉండేది. ముందు భాగంలో బాబా కూర్చునేవారు. రెండవ వాటాలో ఎవరూ ఉండేవారు కాదు. గిన్నెలు, గోధుమపిండి, నీళ్లు, పొయ్యి, పెనం వంటివి మాత్రమే ఉండేవి. సరిగ్గా భోజనాల వేళకు... గంటా గంటన్నర ముందు, ఆ వాటాలో నుండి రకరకాల ధ్వనులు వినవచ్చేవి. ఎవరు రొట్టెలు, కూర, ఇతర భోజ్య పదార్థాలు తయారు చేస్తున్న చప్పుడు వినిపించేది. వాటి పరిమళాలు వ్యాపించేవి.
ఒకసారి ఆయన తో కబుర్లు చెబుతూ చెబుతూ కుతూహలం కొద్దీ ఆ రెండవ భాగం లోనికి వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు... కానీ... ఏవో అదృశ్యహస్తాలు రొట్టెలు వత్తుతున్నాయి......! ఆ రొట్టెలు పొయ్యి పైనున్న పెనంపై పడుతున్నాయి.
కాలుతున్నాయి. తిరగబడుతున్నాయి!
రెండు వైపులా కాలిన తర్వాత క్రిందనున్న పళ్లెంలో దొంతరలుగా పేరుకుంటున్నాయి....!
ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవయ్యాయి. అలాంటి దృశ్యాలు చూడడం నాకు అదే మొదటి సారి! ఇది ఎలా సాధ్యం?
అది నా భూత సేవకుడి పని అన్నారు... మధుసూదన్ బాబా....
ఆ రాత్రి నన్ను స్మశానానికి తీసుకువెళ్లి ఒక చోట కూర్చోబెట్టారు. తను కూడా కూర్చుని మా ఇద్దరి చుట్టూ కర్రతో వలయంగా రక్షా చక్రం గీసారు. ఆ రక్షా చక్రం లో కూర్చుని ఆయన ఏమి చేసారో తెలియదు.
అది వెన్నెల రాత్రి........
కొద్దిసేపటికి రక్షా చక్రం చుట్టూ... విచిత్ర వేషాలతో,ఆభరణాలతో, వివిధ వర్ణాల ప్రాణులు, రక్షా చక్రం దాటి లోపలికి మాత్రం రావడం లేదు.
ఆ ప్రాణంగా కచ్చితంగా భూతాలే!
భయంకరంగా ఉన్నాయి!
నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను!
నిద్రపోతున్నానా? కలగంటున్నానా?
ఇది వాస్తవమా? ఇది సాధ్యమా?
నన్ను నేను గిల్లుకుని చూసుకున్నాను. ఇది నిద్ర కాదు... కల కాదు... భ్రమ కాదు... వాస్తవం.
నేను మెలకువగానే ఉన్నాను. నా ఎదుట దృశ్యం భయానకం.
బాబా ధ్యానం ఎటో ఉంది!
కొద్దిసేపటికి బాబా ఆ దృశ్యానికి తెరవేసి... నన్ను తీసుకుని కుటీరానికి తిరిగి వచ్చారు. మరునాడు నేను ఆయన దగ్గర సెలవు తీసుకున్నాను. ఆయన నన్ను కొద్ది వ్యవధిలోనే 36 సాధనల్లో సిద్ధి కలిగించారు. నన్ను తన దగ్గరే ఉంచుకోవాలని ఎంతో ప్రయత్నించారు.
కానీ.....
నా లక్ష్యం వేరు!
నా గమ్యం వేరు!
నేను ముందుకు సాగిపోయాను.
(సశేషం)
తంత్ర మార్గం
---3---
మధుసూదన్ బాబా దగ్గర నుంచి.... బయలుదేరి తిరుగుతూ, తిరుగుతూ.... ఆబూ చేరుకున్నాను.
ఇప్పటివరకు నేను రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాలలోనే తిరుగుతున్నాను. ఆబూ లోనివేవీ నన్ను ఆకర్షించలేదు. "గోముఖ్" నుంచి నుంచి క్రిందికి దిగి వశిష్టాశ్రమమును చేరుకున్నాను. అక్కడ ఉన్న సాధువులు ఇంకా క్రిందికి పోవడం ప్రమాదకరమని చెప్పారు. ఆ మార్గంలో క్రూరమృగాలు ఉన్నాయని, పుట్టలకు పుట్టలు.... భయంకరమైన పాములు ఉన్నాయని అన్నారు.
కానీ వారిలో ఒకరు గొప్ప సంగతి చెప్పారు. ఈ వశిష్టాశ్రమాని కి రెండు మైళ్ళ దూరంలో ఒక పర్ణశాల ఉందని చెప్పారు..... దానిలో ఒక సిద్ధయోగి, సిద్ధ తపస్వి....అయిన "యోగీశ్వరానందజీ" ఉన్నారు.
కానీ ఆయన దర్శనం దుర్లభం. అసలు చాలా కొద్ది మందికే ఆయన కనిపిస్తారు. అసలు కొద్దిమంది మాత్రమే అక్కడిదాకా వెళ్ళగలరు.
మరునాడు ఉదయం బయలు దేరాను, ఆయనను దర్శించుకోవడానికి.... నిజం ! ఆ మార్గం చాలా కఠినమైనది. అడుగడుగునా ముళ్ళు, మొనదేలిన రాళ్లు ఎగుడుదిగుడులు, పుట్టల నిండా పాములు. ఆయన మార్గంలో ఎంతో దృఢసంకల్పం, ఎదురులేని గుండె ఉంటే తప్ప ఎవరూ అడుగు కదపలేరు.
అది ప్రాణాల మీదకు తెచ్చే త్రోవ.
భగవంతుని దయవల్ల నేను పదకొండు గంటలకల్లా, ఆ పర్ణశాలకు చేరాను. కాళ్లకి చెప్పులు ఉన్నా పాదాలు రక్తసిక్తమై పోయాయి.
పర్ణశాల పరిసరాలలో ఎవరూ కనిపించలేదు. తలుపు వేసి ఉంది. ఆ తలుపు తెరవాలా... వద్దా... అని కొన్ని క్షణాలు సంశయం లో పడి చివరకు చెప్పులు విడిచి తలుపు తెరిచాను. ఆ కుటీరం లోపల కూడా ఎవరూ లేరు. అటు ఇటు నలువైపులా కలయజూసాను. ఎవరూ కనిపించలేదు.
అప్పుడు..... కొద్ది క్షణాలకు.......
కుటీరంలో నుండి హుంకారం వినిపించింది.
కుటీరంలో ఓ మూల.....
మెల్ల మెల్లగా.....
ఒక పురుషాకృతి రూపు ధరించడం మొదలయింది......
సన్నని మంచుతెరలా మొదలైన ఆకారం..... క్రమంగా పూర్ణ పురుషాకృతి ధరించింది.....
గాలిలో నుంచి ఆయన రూపుదిద్దుకున్నారు.
ఆయనే "స్వామీ యోగీశ్వరానందజీ"!
అదీ... ఆయన నాకు ప్రసాదించిన ప్రథమ దర్శనం!...
(సశేషం)
----మూలం : గురుదేవ్ నారాయణ్ దత్త్ శ్రీమాలి
----ప్రేరణ : గురుదేవ్ శ్రీ అనిల్ కుమార్ జోషి
4. 🌻. మమకారం ఆత్మ సాధనకు ఆటంకం 🌻
మనం చేసే చాలా రకాల ధ్యాన పద్దతులలో కేవలం ఒకే ఒక లక్ష్యం ఉంటుంది, అదే మన చైతన్య స్థాయిని పెంచుకోవటం అనమాట. చైతన్య స్థాయి అంటే ఏమిటి అంటే, ఏమీ లేదు - మన ఆలోచనా స్థాయిని పెంచుకోవటం అనమాట.
మన ఆలోచనలకి ఎటువంటి పరిధులు లేకుండా మన చైతన్య స్థాయిని పెంపొందించుకోవడం. ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే మనలో చాలా మందికి మన చైతన్య స్థాయిలో కేవలం మన కుటుంబాన్ని మాత్రమే ఉంచుకొంటాం. తల్లీ, తండ్రీ - తల్లితండ్రుల్ని కూడా ఈమధ్య ఉంచుకోవటం లేదు.
కేవలం భార్య, భర్త, పిల్లలు; ఎంతసేపూ మన ఆలోచనా పరిధులు వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయికానీ వీరిని దాటి పైస్థాయిని వెళ్లవు. ఇటువంటి వారిలో మమకారం ఎక్కువ ఉంటుంది. స్వార్ధ చింతన ఎక్కువగా ఉంటుంది. ఇతర వ్యక్తులతో, ఇరుగుపొరుగు వాళ్లతో పంచుకోవటం అనేది ఉండనేవుండదు.
మనకి ఎక్కువగా ఉన్న వస్తువులు పంచుకోవటం కావచ్చు, ధనాన్ని పంచుకోవటం కావొచ్చు, జ్ఞానాన్ని పంచుకోవటం కావొచ్చు, ప్రేమని పంచుకోవటం కావొచ్చు. ఏ లక్షణాలు అయితే మన కుటుంబం చుట్టూ తిరుగుతూ వుంటాయో పై స్థాయి వాళ్ళకి మాత్రం ఈ లక్షణాలు వర్తించకుండా ఉంటాయి.
చాలామంది తమ కుటుంబమే కాకుండా, ఇరుగుపొరుగు వాళ్లే కాకుండా, సమాజము, గ్రామములోని ప్రజలతో పాటు కష్టాలు సుఖాలు పంచుకోవటం, సమాజ సేవ చెయ్యటం ఉంటుంది.
అంటే వీరి చైతన్య స్థాయిలో ఆ గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇంకా కాస్తా పైస్థాయికి వెళితే ఆ జిల్లా మొత్తం ఉండవచ్చు, ఇంకా కాస్త పైస్థాయికి వెళితే భారత దేశం, ఇంకా మొత్తం ప్రపంచం ఇలా ఉండవచ్చు. దీనినే ఇంగ్లీష్ లో ‘Expansion of human consciousness’ అని అంటాము.
మనం ముచ్చటగా తెలుగులో చెప్పుకోవాలి అంటే ‘మన మానవ చైతన్య వ్యాప్తి ’ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అయితే మనం మన చైతన్య స్థాయిని పెంచుకుంటామో అప్పడు ఈ ప్రపంచంలోని ప్రజలు అందరూ కూడా మన సొంత కుటుంబ సభ్యుల్లాగానే మనం భావిస్తాం.
అలాగే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం కూడా దుఃఖపడతాం, వాళ్ళకోసం ప్రార్దిస్తాం. అలాగే వాళ్ళు సుఖంగా ఉంటే మనంకూడా చాలా సంతోషిస్తాం. ఇటువంటి స్థాయిలో ఉన్న ఒక మహా యోగిని గూర్చి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
వివేకానంద స్వామిగారి గురించి తెలియనివాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే వారి జీవితంలోని కొన్ని ఘట్టాలు చాలామందికి తెలియదు. అందులోని ఒక ప్రధాన ఘట్టాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
వివేకానంద చాలా చిన్న వయస్సులోనే అనగా 39 ఏళ్ల వయస్సులోనే దేహత్యాగం చేశారు. ఆయన తన సహచరునితో ఒకసారి ఈవిధంగా చెప్పారు ‘నాకు ఈమధ్య ఈ భారత దేశం అంతా నాలోనే ఉంది, నేను అంతా నేను భారతదేశమంతటా నిండి వున్నాను అని అనిపిస్తున్నది.
అది మెల్లమెల్లగా మొత్తం ప్రపంచం అంతా కూడా నాలోనే ఉన్నట్టు, నేను ప్రపంచమంతా ఉన్నట్టుగా, ప్రజలందరిలోనూ, ఇక్కడ భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, చెట్లు, కొండలూ, గుట్టలు, మనుషులు, నదులు, అన్నిటిలో నేనే వున్నాను అనే భావం నాలో చాలా తొందరగా వ్యాపిస్తుంది.
ఈ సృష్టించబడిన అన్ని జీవులపై అపారమైన కరుణా ప్రేమా, పొంగి పొరలుతున్నాయి. కనుక నా ఈ దేహం ఈ విధంగా విస్తరిస్తున్నటువంటి చైతన్య స్థాయిని ఇముడ్చుకోలేక పోతున్నది.
ఇది దేహం వదిలి విశ్వమంతా తొందరలో వ్యాపిస్తుంది. కనుక నేను ఇంక ఎంతోకాలం బ్రతకను. ఎందుకంటే ఈ దేహం నా చైతన్య స్థాయిని పూర్తిగా నింపుకోలేకపోతుంది. కాబట్టి నేను దేహత్యాగం చెయ్యక తప్పదు’ అని చెప్పారట.
దీనిలో చాలా అర్ధం వుంది. దీనికి ముందు పైన అర్ధం కావటానికి నేను కొంచం వివరించి చెప్పాను. అంటే స్వామి వివేకానంద సాక్షాత్తుపరబ్రహ్మ జ్ఞానాన్ని పొందిన పరమాత్ముడు. అందుకే ఈ సృష్టిలో వున్న ప్రతి జీవిలో తనను తానే చూసుకోవటం, ఆ జీవి తనలోనే వున్నది అని తలుచుకోవడం దానికి తార్కాణం.
సాక్షాతూ శ్రీ దత్తుడి తత్వాన్ని అర్ధం చేసుకోవటమే కాకుండా దాన్ని సాక్షాత్తు అనుభవించినటువంటి ఒక మహా యోగి అని చెప్పక తప్పదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ గురు చరణ కమలేభ్యో నమః
తంత్ర మార్గం
Episode - 5
సాధన ప్రారంభ దశలోనే ,ఇంతటి మహాత్ముడు, అలభ్యుడు అయిన యోగి చరణ సాన్నిధ్యంలో..... కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి అవకాశం కలగడం నా అదృష్టం. వాయవీముద్ర కు సంబంధించిన జ్ఞానం కూడా ఆయన దగ్గర నాకు లభించింది. తరువాత సంవత్సరాలలో కొంత సాధించాను కూడా. కాని గృహస్థ జీవితంలో ఆ మార్గంలో అనవరతము పయనించలేకపోయాను.
మరల ఒకసారి ప్రకృతి ఒడిలోకి వెళ్ళి పోయే అవకాశం వస్తే, ఇతర బంధాలు వదిలి, వాయవీ ముద్రా సాధన చేయాలనే కోరిక ఇప్పటికీ ఉంది. ఆ ఈశ్వరుడు ఎప్పుడు అవకాశం కల్పిస్తాడో చూడాలి. చాలాసార్లు యోగ్యుడైన శిష్యుడు ఇదంతా ఎవరికైనా నేర్పాలని కోరిక కలిగింది. కానీ యోగ్యుడైన శిష్యుడు దొరకడానికి మాత్రం అదృష్టం ఉండొద్దూ ?!!!
కుండలినీ జాగరణ విషయంలోనూ స్వామీజీ నుండే నేర్చుకున్నాను. ఆయనే "ఏకస్థ ధ్యానముద్ర" నేర్పారు. ఆయన కృపతోనే "వికల్ప శూన్య సంకల్ప" మార్గంలో ముందడుగు వేయగలిగాను. ఇప్పటికీ ఆయన దగ్గర నేర్చుకున్న ఆ జ్ఞానం నాకు వరదానమే. ఆయనకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడనే.
దాదాపు నెల రోజుల తరువాత ఆయన -- నారాయణ్! ఇక వెళ్ళిపో! అన్నారు.
నీ మార్గంలో ఇది ఆరంభమే..... అంతం కాదు! అని కూడా అన్నారు.
నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది....అన్నారు.
నా కన్నా గొప్ప వ్యక్తిత్వం ఒకటి నిన్నుపిలుస్తోంది. ఇప్పుడు నువ్వు వెళ్లి పోవాలి.....అన్నారు.
ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు. నువ్వు ఇక్కడికి తిరిగి రాకూడదు....అనికూడా అన్నారు.
మొదటిసారిగా, మొట్టమొదటిసారిగా..... ఈ మాటలు విని నేను వెక్కి వెక్కి ఏడ్చాను. స్వామీజీ ,నన్ను బ్రహ్మ లోకం లో నుంచి మానుష లోకంలో కి విసిరేసినట్లు భావించాను. కానీ ఆయన త్రికాలదర్శి. తనకన్నా గొప్ప వ్యక్తి గురించి ఆయన చెబుతున్నారు. ఆయన ఆజ్ఞ, ఆజ్ఞయే. అక్కడ ఉండిపోయే ప్రశ్నే లేదు. అనంతరకా
అనంతర కాలంలో పరమ పూజ్య స్వామి సచ్చిదానందజీ ని కలిసినప్పుడు... స్వామి యోగీశ్వరానంద మాటలు నిజమయ్యాయి.
స్నానం చేసి స్వామి యోగీశ్వరానంద కు ప్రదక్షిణం చేశాను. నీరు నిండిన కళ్ళతో నమస్కరిస్తూ... ఆయన ఎదుట కూర్చున్నాను. ఆయన తన శరీరం అంతా సమర్పణ ముద్రలో ఉంచారు. కుడిచేయి నా తలపై ఉంచారు. ఆయన నేత్రాలు నిర్నిమేషంగా ఉన్నాయి.
ఆయన తేజస్సు, నా కళ్ల ద్వారా హృదయంలోకి అవతరిస్తుంది. ఆయన తన జోలెలో నుంచి అందమైన సాలిగ్రామాన్ని తీసి నాకు ప్రసాదించారు. అంతే! అంతర్ధానం అయ్యారు. ఆ క్షణాలలో ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను ఏమీ మాట్లాడ లేకపోయాను. కానీ ఆ మౌన సంభాషణ లోనే.... ఆయన చెప్పవలసినది అంతా చెప్పేశారు. ఆయన ప్రసాదించిన సాలిగ్రామ మూర్తిని స్పృశించగానే, ఒక్కసారిగా విద్యుత్ స్పులింగం వంటిది... ప్రత్యక్షం అయింది. నేను అద్భుత కాంతిలో స్నానం చేస్తున్నట్లు అనిపించింది. అత్యంత వేగంగా బ్రహ్మాండమంతా పర్యటిస్తున్నట్లు అనుభూతి కలిగింది. ఆ అనుభూతి "నభూతో న భవిష్యతి". ఆ సంచార అవస్థలో... ఒక దివ్య చేతన నాకు దర్శనమిచ్చింది కూడా. ఒక తేజపుంజం ఎదుట నిలిచినట్లయింది. హిమాలయం...తన ఉన్నతమైన మస్తకం ఎత్తి నిలిచినట్లు తోచింది. ఆ కనులలో అపార కరుణ, మమత వర్షిస్తున్నట్లు కనిపించింది. ఆ పెదవులపై... సమస్త వేదాలు నాట్యం చేస్తున్నట్టు... అనిపించింది. ఆ దేహములోనే రోమ రోమాన... కరుణ, వాత్సల్యం, మమతాను రాగాలు... ప్రవహిస్తున్నట్లు తోచింది. ఆయన సమస్త దేవతల ఏకీకృత రూపంగా దర్శనమిచ్చారు. ఆయన దర్శనం కాగానే నా శిరస్సు ...భక్తి భావంతో... అవనతమై పోయింది. ఆ రూపం నా కనులలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఆయనే పూజ్య గురుదేవులు "స్వామి సచ్చిదానందజీ"......
(సశేషం)
శ్రీ గురు చరణ కమలేభ్యో నమః
తంత్ర మార్గం
Episode - 5
సాధన ప్రారంభ దశలోనే ,ఇంతటి మహాత్ముడు, అలభ్యుడు అయిన యోగి చరణ సాన్నిధ్యంలో..... కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి అవకాశం కలగడం నా అదృష్టం. వాయవీముద్ర కు సంబంధించిన జ్ఞానం కూడా ఆయన దగ్గర నాకు లభించింది. తరువాత సంవత్సరాలలో కొంత సాధించాను కూడా. కాని గృహస్థ జీవితంలో ఆ మార్గంలో అనవరతము పయనించలేకపోయాను.
మరల ఒకసారి ప్రకృతి ఒడిలోకి వెళ్ళి పోయే అవకాశం వస్తే, ఇతర బంధాలు వదిలి, వాయవీ ముద్రా సాధన చేయాలనే కోరిక ఇప్పటికీ ఉంది. ఆ ఈశ్వరుడు ఎప్పుడు అవకాశం కల్పిస్తాడో చూడాలి. చాలాసార్లు యోగ్యుడైన శిష్యుడు ఇదంతా ఎవరికైనా నేర్పాలని కోరిక కలిగింది. కానీ యోగ్యుడైన శిష్యుడు దొరకడానికి మాత్రం అదృష్టం ఉండొద్దూ ?!!!
కుండలినీ జాగరణ విషయంలోనూ స్వామీజీ నుండే నేర్చుకున్నాను. ఆయనే "ఏకస్థ ధ్యానముద్ర" నేర్పారు. ఆయన కృపతోనే "వికల్ప శూన్య సంకల్ప" మార్గంలో ముందడుగు వేయగలిగాను. ఇప్పటికీ ఆయన దగ్గర నేర్చుకున్న ఆ జ్ఞానం నాకు వరదానమే. ఆయనకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడనే.
దాదాపు నెల రోజుల తరువాత ఆయన -- నారాయణ్! ఇక వెళ్ళిపో! అన్నారు.
నీ మార్గంలో ఇది ఆరంభమే..... అంతం కాదు! అని కూడా అన్నారు.
నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది....అన్నారు.
నా కన్నా గొప్ప వ్యక్తిత్వం ఒకటి నిన్నుపిలుస్తోంది. ఇప్పుడు నువ్వు వెళ్లి పోవాలి.....అన్నారు.
ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు. నువ్వు ఇక్కడికి తిరిగి రాకూడదు....అనికూడా అన్నారు.
మొదటిసారిగా, మొట్టమొదటిసారిగా..... ఈ మాటలు విని నేను వెక్కి వెక్కి ఏడ్చాను. స్వామీజీ ,నన్ను బ్రహ్మ లోకం లో నుంచి మానుష లోకంలో కి విసిరేసినట్లు భావించాను. కానీ ఆయన త్రికాలదర్శి. తనకన్నా గొప్ప వ్యక్తి గురించి ఆయన చెబుతున్నారు. ఆయన ఆజ్ఞ, ఆజ్ఞయే. అక్కడ ఉండిపోయే ప్రశ్నే లేదు. అనంతరకా
అనంతర కాలంలో పరమ పూజ్య స్వామి సచ్చిదానందజీ ని కలిసినప్పుడు... స్వామి యోగీశ్వరానంద మాటలు నిజమయ్యాయి.
స్నానం చేసి స్వామి యోగీశ్వరానంద కు ప్రదక్షిణం చేశాను. నీరు నిండిన కళ్ళతో నమస్కరిస్తూ... ఆయన ఎదుట కూర్చున్నాను. ఆయన తన శరీరం అంతా సమర్పణ ముద్రలో ఉంచారు. కుడిచేయి నా తలపై ఉంచారు. ఆయన నేత్రాలు నిర్నిమేషంగా ఉన్నాయి.
ఆయన తేజస్సు, నా కళ్ల ద్వారా హృదయంలోకి అవతరిస్తుంది. ఆయన తన జోలెలో నుంచి అందమైన సాలిగ్రామాన్ని తీసి నాకు ప్రసాదించారు. అంతే! అంతర్ధానం అయ్యారు. ఆ క్షణాలలో ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను ఏమీ మాట్లాడ లేకపోయాను. కానీ ఆ మౌన సంభాషణ లోనే.... ఆయన చెప్పవలసినది అంతా చెప్పేశారు. ఆయన ప్రసాదించిన సాలిగ్రామ మూర్తిని స్పృశించగానే, ఒక్కసారిగా విద్యుత్ స్పులింగం వంటిది... ప్రత్యక్షం అయింది. నేను అద్భుత కాంతిలో స్నానం చేస్తున్నట్లు అనిపించింది. అత్యంత వేగంగా బ్రహ్మాండమంతా పర్యటిస్తున్నట్లు అనుభూతి కలిగింది. ఆ అనుభూతి "నభూతో న భవిష్యతి". ఆ సంచార అవస్థలో... ఒక దివ్య చేతన నాకు దర్శనమిచ్చింది కూడా. ఒక తేజపుంజం ఎదుట నిలిచినట్లయింది. హిమాలయం...తన ఉన్నతమైన మస్తకం ఎత్తి నిలిచినట్లు తోచింది. ఆ కనులలో అపార కరుణ, మమత వర్షిస్తున్నట్లు కనిపించింది. ఆ పెదవులపై... సమస్త వేదాలు నాట్యం చేస్తున్నట్టు... అనిపించింది. ఆ దేహములోనే రోమ రోమాన... కరుణ, వాత్సల్యం, మమతాను రాగాలు... ప్రవహిస్తున్నట్లు తోచింది. ఆయన సమస్త దేవతల ఏకీకృత రూపంగా దర్శనమిచ్చారు. ఆయన దర్శనం కాగానే నా శిరస్సు ...భక్తి భావంతో... అవనతమై పోయింది. ఆ రూపం నా కనులలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఆయనే పూజ్య గురుదేవులు "స్వామి సచ్చిదానందజీ"......
(సశేషం)
శ్రీ గురుచరణ కమలేభ్యో నమః
తంత్ర మార్గం
Episode-6
స్వామీ యోగీశ్వరానందజీ దగ్గర నుండి బయలుదేరి, హరిద్వార్ వెళ్ళాను. ఋషీకేశ్ ప్రాంతాలలో తిరుగుతున్నాను. మనస్సుకు శాంతి లభించలేదు. ఉద్విగ్నంగా ఉంది.
ఒకనాటి ఉదయం ఋషీకేశ్ లోని "లక్ష్మణ ఝూలా" దగ్గర ఉన్న రామాలయంలో దర్శనం చేసుకొని... బయటకు వస్తూ ఉండగా ధవళ కేశాలతో ఉన్న 80 ఏళ్ల సన్యాసి ఎదురు వచ్చారు. ఆయన కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి..... అడవి వైపు సాగిపోయారు. నేను ఆయన వెంట పడ్డాను. శత వృద్ధుడు అయినా ఆయన చాలా వేగంగా వెళుతున్నారు. దాదాపు మైలు దూరంలో ఉన్న ఆయన కుటీరాన్ని చేరుకున్నాము. ఆయన లోనికి వెళ్ళిన ఏడెనిమిది నిమిషాలకు సంకోచిస్తూనే...నేను దగ్గరకు వెళ్ళాను. ఆ కుటీరము మట్టితో నిర్మించినది. శుభ్రంగా, నిర్మలంగా, పవిత్రంగా ఉంది. అక్కడకు వెళ్ళగానే ఒక పరిపూర్ణ ఆధ్యాత్మిక క్షేత్రం చేరిన అనుభూతి కలిగింది. మనస్సు ప్రసన్నమై, అలసట అంతా మాయమైపోయింది.
ఆ స్వామీజీ పేరు కింకర్ బాబా. 80 ఏళ్ల వయస్సులో కూడా ఆయన శరీరం పుష్టిగా ఉంది. ఒక్క పన్ను కూడా ఊడిపోలేదు. కన్నులలో మెరుపు ఉంది. ఆయనకు నా జీవిత లక్ష్యాన్ని నివేదించాను. నన్ను గురించి నేనే పరిచయం చేసుకున్నాను. కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి నెమ్మదిగా అన్నారు...... "నేను సాధారణమైన మానవుడిని".
" నాకు మీలో శతాంశం ప్రసాదించండి చాలు. నన్ను కూడా మీలాగా సాధారణమైన మనిషిని చేయండి...."అన్నాను.
స్వామీజీ.... సాముద్రిక, జ్యోతిష, ఆయుర్వేద శాస్త్రాలలో అఖండ ప్రజ్ఞానిధి. త్రికాల దర్శి. ఆయన సాధారణ వేష భాషలు, జీవనం, ప్రవర్తన చూసిన వారెవరికీ ఆయనలో అగాధమైన జ్యోతిష సాగరం పొంగులు ఎత్తుతుందనే అనుమానం కూడా కలగదు. చివరికి నేను తన కుటీరంలో ఉండడానికి ఆయన అనుమతించారు. నా భోజన భాజనాదుల విషయం చెప్పలేదు, నేను అడగనూ లేదు. ఉదయం ఆయన పూజాదికాలు పూర్తి చేసుకునే వేళకు నేను సంధ్యావందనం నుంచి ఆయన చరణాల వద్ద కూర్చునే వాడిని. భారతీయ జ్యోతిష్యానికి సంబంధించిన వేలాది శ్లోకాలు... ఆయనకు కంఠోపాఠం. ఆ శ్లోకాలు ఏ పుస్తకంలోనూ, కనిపించవు. ఆయన దగ్గర గడిపిన నెల రోజులలో వందలాది శ్లోకాలు నా చేత వ్రాయించారు. అవే ఫలిత జ్యోతిషానికి ఆధార సూత్రం అయినాయి.
జన్మకుండలి ద్వారా గర్భ శోధనం జరిపి, జనన సమయాన్ని సెకండ్ లతో... సహా సరిగ్గా నిర్ధారించే విధానాన్ని ఆయన నేర్పారు. గర్భ కుండలి, బీజ కుండలి నిర్మాణం కూడా ఉపదేశించారు. ఆయన అభిప్రాయం లో జన్మ కుండలి స్థూలం అయితే... గర్భ కుండలి సూక్ష్మం. ఏ క్షణంలో, తల్లిదండ్రుల సంగమంలో, బీజారోపణ జరుగుతుందో.... ఆ క్షణం జీవన ఫలితాలను నిర్ధారించడంలో మొదటి మెట్టు. తరువాత తల్లి గర్భంలో మాంస పిండంలో ఏ క్షణాన ప్రాణ సంచారం ప్రారంభమవుతుందో... క్షణం కూడా ఫలితాలు నిర్ధారించడంలో చాలా ప్రధానం. అందువల్ల గర్భ కుండలి, ప్రాణ కుండలి, జన్మకుండలి... మూడూ తయారు చేయవచ్చు. ఆ విధానాన్ని నాకునూ నేర్పారు.
ఆయన నా చేత వ్రాయించిన శ్లోకాలు... అనంతరకాలంలో, ఏ గ్రంథములోనూ కనిపించలేదు. వాటిలోని ఒక్కొక్క శ్లోకము, భవిష్యత్తు ఫలితాలు నిర్ధారించడంలో అపార విజ్ఞానాన్ని పొదుగు కొన్నవి. ఆయన వ్రాసిన 525 శ్లోకాలు అద్భుతము, ఆశ్చర్య జనకము అయినవి. ఫలిత జ్యోతిష్యములో ...అవి శిఖర సదృశాలు.
భవిష్యత్తు చెప్పడంలో... ఫలిత జ్యోతిష్యంలో... ఇప్పుడు నాకు లభించిన కొద్దిపాటి కీర్తి, సన్మానాలకు... పూజ్య స్వామీజీ ఆశీర్వాదము... ఆయన ద్వారా లభించిన జ్ఞానము-శ్లోకాలు కారణము. అందుకు నేను స్వామీజీకి ఎల్లప్పుడూ కృతజ్ఞుడనే.
భగవంతుడు అనుకూలిస్తే... ఆయురారోగ్యాలు అనుమతిస్తే... ఈ శ్లోకాలను వాటి అన్వయము... అర్థాలతో సహా పాఠకులకు అందిస్తాను. అదే జ్యోతిష ప్రపంచానికి నేను సమర్పించే కానుకల అవుతుంది.
స్వామిజి దగ్గర సాముద్రికం అంటే హస్త రేఖా విజ్ఞానానికి సంబంధించిన అపారమైన భాండాగారం ఉంది. ఆయా రేఖల... పరస్పర సంయోగం వల్ల ఏర్పడే ఈ యోగాల పేర్లు కూడా ఉన్నాయి.
ఆయన దగ్గర మరొక అద్భుతమైన విద్య ఉంది. చేతి వేళ్ళలో మధ్యవ్రేలు ఆధారంగా... జనన సమయాన్ని నిర్ధారించి చెప్పడం... అక్షాంశ- దేశాంతరాల ఆధారంగా... జన్మ స్థానాన్ని చెప్పడంలో... ఆయన నిధి. ఈ విద్యను ఆయన నాకు పరమ వాత్సల్యంతో నేర్పారు.(సశేషం)
అనుభవం : గురుదేవ్ నారాయణ్ దత్త్ శ్రీమాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
--(())__
తంత్ర మార్గం
శరీర కాయ కల్ప అనుభవం
Episode - 7
ఒక రోజు ఉదయం, నేను గంగా స్నానం చేసి వచ్చేసరికి .....స్వామీజీ బిల్వ వృక్షం క్రింద కూర్చొని ఉన్నారు.
ఆయన గళం నుండి "సౌందర్యలహరి శ్లోకాలు" మధురంగా వెలువడి..... వాతావరణాన్ని మనోహరం చేస్తున్నాయి. సౌందర్యం అనేది జీవనంలోని పూర్ణత్వం, ఉత్సాహము. సౌందర్యం, జీవనం యొక్క మధుర నృత్యం., ఆనంద గీతం , కళ్ళను కట్టి పడేసే సమ్మోహన క్రియ. దేవతలు ప్రసాదించే వరం. కోట్ల వజ్రాలు రత్నాలు కన్నా విలువైనది. జన్మజన్మల పుణ్యఫలంగా అలాంటి సౌందర్యం లభిస్తుంది. సౌందర్యం.... జీవితంలోని పాప తాపాలు, దోష దుఃఖాలు పోగొట్టే కళ. సాధారణ మానవుడికి, పూర్ణత్వాన్ని అందించే ప్రక్రియ సౌందర్యం.
స్వామీజీ గళం నుండి వెలువడుతున్న సౌందర్యలహరి శ్లోకాలు.... ఆ ప్రకృతిని మరింత శాంత సుందరం చేస్తున్నాయి. అలాంటి ప్రశాంత మధుర వాతావరణంలో అంతటి మధుర పాఠాలు వినడం.... భాగ్యశాలురకే దక్కే వరం.
అప్పుడు కుటీరం లో నుండి
ఒక వృద్ధ వ్యక్తి బయటకు వచ్చాడు. గత 20 రోజులుగా అతనిని నేను చూడలేదు. అతడు నా ప్రక్కన స్వామీజీ ఎదుట కూర్చున్నాడు. అతడికి 60 - 65 ఏళ్ల వయస్సు ఉంటుంది.అయినా.... నిటారుగా నడవ గలుగుతున్నాడు. అతడి శరీరం పై మాత్రం చర్మం ముడుతలు పడింది. జీవితంలో ఎన్నో అనుభవించిన వాడిలా ప్రశాంతంగా ఉన్నాడు. స్వామీజీ 20 నిమిషాల తర్వాత కనులు తెరిచి.... ఆ వృద్ధుడిని చూసి.... చిరునవ్వు నవ్వారు.
శంకర్ !ఎలా ఉన్నావు? అని అడిగారు.
అతడు, స్వామీజీ పాదాలకు..... నమస్కరించి మౌనంగా కూర్చున్నాడు.
ఎనిమిదేళ్ల తర్వాత కనిపించావు. ఇంత ముసలి వాడివి అయిపోయావు ఏమిటి ? ముఖం మీద ముడతలు ఎలా వచ్చాయి? బాబాజీ కులాసాగా ఉన్నారా? అని ప్రశ్నలు గుప్పించారు.
అతను పర్వత ప్రాంతాల భాషలో ఏదో చెప్పాడు. బాబాజీ..... స్వామీజీ గురువు అని, ఆయనను గురువు దగ్గరికి తీసుకు వెళ్లడానికి, వచ్చాడు..... అని మాత్రం అర్థమైంది. బాబాజీ చాలా దూరంలో హిమాచ్ఛాదితమైన, పర్వతాలలో ఉంటారని, ఆ వృద్ధ వ్యక్తి ఆయనకు సేవకుడని అని అర్థం అయింది.
శంకర్! నీ శరీరం మీద వార్ధక్యం వ్యాపిస్తోంది. ఈ వేళ నేను నీకు "కాయకల్పం" చేస్తాను. నువ్వు బాటియా, పప్పు... తయారు చేయి... భోజనం చేద్దాం . సామగ్రి అంతా, కుటీరంలో ఉంది. నేను బయటికి వెళుతున్నాను. రెండు మూడు గంటలలో తిరిగి వచ్చేస్తాను. అంటూ స్వామీజీ వెళ్ళిపోయారు.
శంకర్, చాలా మితభాషి. పైగా అతని భాష ఒక పెద్ద సమస్య అయింది. అతడికి, మరొక భాష రాదు. సంజ్ఞలతో, బాబాజీ గురించి.... కొంతలో కొంత తెలుసుకున్నాను. అతను కుటీరం బయట పొయ్యి వెలిగించి, గోధుమ పిండితో గుండ్రని బాటియాలు, పప్పు తయారు చేశాడు.
11:30 కల్లా, స్వామీజీ తిరిగి వచ్చారు.
ఆయన చేతిలో పది అంగుళాల..... అడవి మొక్క వేరు లాంటిది.... ఉంది. ముగ్గురికీ భోజనం వడ్డించారు శంకర్. శంకర్ కోసము పప్పు నింపిన చిన్న పాత్రలో స్వామీజీ అడవి మొక్క వేరుతో కలపడం మొదలు పెట్టాడు. ఆ వేడి పప్పులో..... ఆ వేరు కరిగిపోయి కలిసిపోతుంది. పప్పు గాఢమైన పసుపు రంగులోకి మారిపోతోంది. దాదాపు నాలుగు అంగుళాల దాకా..... వేరు కరిగి పోయిన తరువాత స్వామీజీ మిగిలిన ముక్కను విసిరిపారేసారు. శంకర్ ఆ పప్పు అంతా తినేసాడు. భోజనాలు అయిన తరువాత, స్వామీజీ ఆజ్ఞ ప్రకారము మేము ఆయనతో అడవిలో తిరగడానికి వెళ్ళాము. అలా 4 గంటలు అడవిలో తిరిగాము బహుశా శంకర్ కి మందు వంట పట్టడానికి.... అలా తిరగడం అవసరం అనుకుంటాను.
ఆశ్చర్యం ! నాలుగు గంటల తరువాత, మేము కుటీరానికి తిరిగి వచ్చే వేళకు శంకర్ లో.... అద్భుతమైన మార్పు వచ్చింది. అతని ముఖంపై ముడతలు మాయమైపోయినాయి. తెల్లవారేసరికి చేతుల పై ముడతలు వెతికినా, కనిపించకుండా పోయాయి. తల పైన, కనుబొమల పైన ఉన్న తెల్లని వెంట్రుకలు, పూర్తిగా నల్లగా మారి పోయాయి....! శరీరంలో వార్ధక్యం మచ్చ కూడా కనిపించకుండా పోయింది. అతడు శరీరానికి పూర్తిగా కాయకల్పం అయ్యింది. శరీరంలోని రుగ్మత అంతా పోయి ....... ఆరోగ్యవంతంగా తయారయ్యాడు.....! ముఖంలో నూతన తేజస్సు వచ్చింది. అతడి శరీరంలో నుండి ఒక రకమైన కాంతి వెలువడుతోంది.(సశేషం)
మూలం : గురుదేవ్ శ్రీ నారాయణ దత్త శ్రీమాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
episode - 8
సాయంత్రం 6 గంటలకు స్వామీజీ, శంకర్ తో కలిసి..... బాబాజీ దగ్గరకు బయలుదేరారు. నేను ఇంకా, మూడు నాలుగు నెలలు, ఆయన దగ్గర ఉండాలనుకున్నాను. కానీ ఆయనే వెళ్ళిపోతున్నారు. ఆయనతో కూడా వస్తాను, అని పట్టుబట్టాను. కానీ, గురూజీ అనుమతి లేకుండా, నిన్ను కూడా తీసుకు వెళ్ళలేను. అని, ఆయన చెప్పారు. ఆయన వెళ్లిపోయారు.నేను ఒంటరిగా మిగిలి పోయాను.
ఆయన చేసిన కాయకల్ప ప్రయోగం అద్భుతమైనది. మిగిలిపోయిన వేరు ముక్కను, ఆయన విసిరి వేశారు కదా! దానికోసం ఎంతగానో వెతికాను. దొరకలేదు. మరునాటి ఉదయం, ఐదారు గంటలు మళ్ళీ వెతికాను. దానిని ఆయన ఎంతో దూరం పారేయలేదు....... అయినా అది దొరకలేదు. అదృష్టం లేకపోతే, ఏదీ లభించదు కదా! ఆ ముక్క నాకు దొరకలేదు. స్వామీజీ కూడా దాని గురించి ఏమీ చెప్పలేదు. మరో రెండు మూడు నెలల ఆయనతో ఉండి ఉంటే కచ్చితంగా ఆయన నాకు నేర్పి ఉండేవారు.
భారతీయ మూలికా విజ్ఞానం అద్భుతమైనది. ఈ సంఘటన నా కనుల ముందు జరిగింది. భారతీయ వైద్యులు ఈ మూలికను వెతుకగలరా? అది గంగాతీరంలో 20 - 50 మైళ్ళ లోపే దొరుకుతుంది. పప్పులో కరిగిపోతుంది. పసుపు రంగు లోకి మారిపోతుంది...... అయితే ఇవన్నీ మామూలు సంకేతాలు మాత్రమే.
ఈ విద్య నాకు లభించి ఉంటే, పోనీండి! ఆయన నాకు ప్రసాదించిన జ్యోతిష సాముద్రిక శాస్త్ర విజ్ఞానం మాత్రం ఇతరత్రా అలభ్యమైనది. నా శరీరంలోని ప్రతి అణువూ...... ఆయనకు కృతజ్ఞయై ఉంది. ఉంటుంది...
****
కింకర్ బాబా వెళ్ళిపోయాక, నేను హరిద్వార్ కి తిరిగి వచ్చాను. గంగా తీరంలో ప్రతి సాయంత్రం, ఒక మహాత్ముని ప్రవచనానికి హాజరయ్యేవాడిని. కానీ నా మనసుకు శాంతి లభించలేదు. ఒక రోజు సాయంత్రం, గంగాతీరంలో..... తిరుగుతూ, తిరుగుతూ చాలా దూరం వెళ్లి పోయాను. అలసిపోయి, ఒక విశాలమైన రాతి పై కూర్చున్నాను. కొద్దిసేపటికి అలాగే నిద్ర పోయాను. మెలకువ, వచ్చేసరికి ఆకాశంలో చుక్కలు కనిపించాయి వాచీ చూస్తే రాత్రి 2:00 అయింది.
ఆ నిద్రలో ఒక స్వప్నం వచ్చింది. మెలకువ వచ్చాక దాని అర్ధం ఏమిటో.... అని ఆలోచిస్తున్నాను. ఆ కలలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు నన్ను గంగానది పుట్టిన చోటుకు రమ్మనమని ప్రేరేపించాడు. ఆయనతో కొద్ది అడుగులు నడిచి, అడుగు తడబడి.... పడిపోయాను. లేచి చూసేసరికి ఆయన పాతిక అడుగుల దూరంలో ఉండి పిలుస్తున్నాడు. ఇంతలో మెలుకువొచ్చింది. ప్రక్కనే నా సంచి, ఉంది దానిలో ఒక జత బట్టలు, ఒక చ
లోటా ఉన్నాయి. లేచి ,గంగాజలంతో ...ముఖం కడుక్కున్నాను. స్నానం చేయాలనిపించింది. చాలా సేపు శీతల గంగా జలంతో స్నానం చేస్తూ ఉండిపోయాను. -- నిర్భయంగా -- నిస్సంశయంగా.......
మార్గమధ్యంలో, ఎక్కడ కూడా ...ఏ ఇంటిలోనూ..... వండిన ఆహారాన్ని స్వీకరించలేదు. ఒకటి, రెండు రోజులు.... ఉపవాసం ఉండి ఆకలి తీవ్రమైనప్పుడు, ఒకటి ,రెండు ఇళ్ళలో..... పిండి తీసుకొని ఆ ఊరి వెలుపల, ఒకటి రెండు రొట్టెలు చేసుకుని తినే వాడిని.
హరిద్వార్ ,గంగోత్రి ల మధ్య .... ఓ ప్రక్కకి, "మణేజా" అనే గ్రామం ఉంది. ఆ గ్రామం వెలుపల ఒక శివాలయం ఉంది. నేను అక్కడే ఆగాను. ఆ ఆలయంలో 87 ఏళ్ళ "నాగా బాబా" ఒకరు ఉన్నారు. శరీరమంతటా విభూతి పూసుకుని ఉండేవారు. పైకి మామూలు మనిషిగా కనిపించినా..... ఆయన కన్నులలోని మెరుపు, ఆయన సిద్ధ పురుషుడు అని చెప్పకనే చెబుతుంది.
గ్రామానికి మైలు దూరంలో ఉన్న ఆ శివాలయం లో ఒక బావి ఉంది. నేను అక్కడికి చేరే సరికి, సూర్యాస్తమయం అయింది. రాత్రి గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు, "నాగాబాబా" ....ఊఁ...ఊఁ....అని లేదా క్లుప్తంగానూ, సమాధానం చెప్పేవారు. గ్రామస్తులు ఆయన సాధారణ సాధువు.... అని అనుకునేవారు. కానీ ఆయన ఒక దివ్య పురుషుడు. నిరంతరం అఖండ ఆనందంలో మునిగి ఉండేవాడు.
ఆ శివాలయం లో ఉండటానికి, అనుమతి కోరితే.... ఆయన కళ్ళతోనే అనుమతి ఇచ్చారు. రాత్రి వచ్చిన గ్రామస్తులలో ఒకరు," జాగ్రత్తగా ఉండు! బాబాజీ కి సంబంధించిన వస్తువులు ఏవైనా పోతే, నిన్ను ప్రాణాలతో వదలం!!!!.... అని హెచ్చరించారు. బాబాజీ మాటలాడలేదు, చిరునవ్వు నవ్వారు.(సశేషం)
మూలం : గురుదేవ్ నారాయణ దత్త్ శ్రీమాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
----9-----
రాత్రి నిద్రించే ఉదయం లేవగానే, స్నానసంధ్యలు పూర్తిచేసుకుని బాబా గారికి నమస్కరించి, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. ఆయన ఆశీర్వదించనూ కూడా లేదు. అలా కూర్చుని 1:00 అయిపోయింది. ఆయన నిశ్చలంగా ఉండి పోయారు. ఎండ మండిపోతోంది.
ఆయనకు నమస్కరించి, గ్రామంలోకి వెళ్లి పిండి తెచ్చి రొట్టెలు చేసాను. బాబాజీ తినమంటే ఆయన అంగీకరించలేదు, తిరస్కరించనూ లేదు. అడిగితే "వద్దు" అన్నారు. భోజనం చేసిన తరువాత ఆలయాన్ని శుభ్రపరిచి.... శివుడికి అభిషేకం చేశాను.
మూడు గంటలకు, బాబాజీ లేచి.... బయటకి వెళ్లి రెండు గంటల తరువాత వచ్చి, చెట్టు క్రింద నిద్ర పోయారు. రోజు గడిచిపోయింది. బాబాజీ నాతో ఏమీ మాట్లాడ లేదు.
ఇలా ఐదు రోజులు గడిచిపోయాయి ఆయన నా స్థైర్యాన్ని పరీక్షిస్తున్నాడు, అనిపించింది. అయినా పరీక్షకు కూడా హద్దు ఉంటుంది కదా! నాకు కాలం చాలా విలువైనది. ఇలా వ్యర్ధంగా గడిచిపోతే ప్రయోజనం ఏముంది?
ఒక రోజు ఉదయం శివార్చన, అనంతరం "చంద్రశేఖరాష్టకం"గానం చేస్తున్నాను.
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్|
రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం
శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహం
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్
దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్
క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగధారిణమ్
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్
అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్
భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం
సోమవారినభోహుతాశనసోమపానిలఖాకృతిం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం
సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశం గణనాథయూథసమన్వితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠే న్న హి తస్య మృత్యుభయం భవేత్
పూర్ణ మాయు రరోగతా మఖిలార్థసంపద మాదరం
చంద్రశేఖర యేవ తస్య దతాతి ముక్తిమయత్నత:
తన్మయత్వంతో పఠించి కనులు తెరిచేసరికి, శివలింగం వద్ద "నాగాబాబా " ఉన్నారు. ఓహ్! చాలా బాగుంది. ఏదీ... మరొక్కసారి గానం చేయు. తనివి తీరడం లేదు.
కొద్ది సేపటికి, ఆయన కూడా కన్నులు తెరిచి, నీ పేరేమిటి అన్నారు....
"నారాయణ్"....అన్నాను.
నాకు తెలుసు" బయటికి పద.... అన్నారు.
నా చెయ్యి పట్టుకొని, చెట్టుక్రిందకి తీసుకుని వెళ్లారు.
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ మీ అమ్మగారు అనారోగ్యంగా ఉంటే, నువ్విలా తిరుగుతున్నావు..... ఇలా రా! అన్నారు.
నేను ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన "నఖ దర్పణాది ఖండ విభూతి" లో నిష్ణాతులు. ఆయన కుడి చేతి బొటన వ్రేలిని నా కళ్ళ ముందు ఉంచారు. అవును ఆ గోరు అద్దం లా మారిపోయింది. ఆ నఖ దర్పణంలో......
మా ఇల్లు.... మంచం మీద మా అమ్మ...... తీవ్రమైన జ్వరంతో పడి ఉంది. నా భార్య ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఉంది. ప్రక్కన మా అబ్బాయి నిలబడి ఉన్నాడు.
మా అబ్బాయి గొంతు వినిపించింది. అమ్మమ్మా? ఎలా ఉంది? అని.....
అస్పష్ట స్వరంతో, అమ్మ గొంతులో నుంచి ఒకే ఒక మాట వెలువడింది. "నారాయణ్"!
ఈ దృశ్యం ,మాటలు ....అన్నీ ఆయన కుడి చేతి బొటన వ్రేలి గోటి నుంచే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి.
(సశేషం)
మూలం మరియూ అనుభవం : గురుదేవ్ నారాయణ్ దత్త్ శ్రీమాలి
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
Episode - 10
"నాగాబాబా" కుడిచేతి బొటనవ్రేలి గోటిలో.... జోధ్పూర్లోని..... నా ఇంటి దృశ్యం చూడగానే..... కంగారు పడిపోయి కళ్ళు మూసుకున్నాను. మా అమ్మ ఈ పరిస్థితిలో ఉండడానికి, బాధ్యత నాదే అనిపించింది. నేను ఇల్లు వదలి పోవడం వల్లనే మా అమ్మ ఆరోగ్యం పాడయిపోయింది అనిపించింది.
క్షణ క్షణానికి నా ముఖంలో రంగులు మారిపోతున్నాయి. "నాగా బాబా" ఏకాగ్రంగా నన్నే చూస్తున్నారు.
ఏం కనిపిస్తుంది? అని అడిగారు బాబా.
నా కనుల నుండి ధారాపాతంగా కన్నీళ్లు వర్షిస్తున్నాయి. గొంతు పూడి పోయింది. బా....బా....జీ.....! అని మాత్రమే అనగలిగాను.
ఏమి నిర్ణయించుకున్నావు? అని అడిగారు ఆయన.
ఇప్పుడే .....ఈ క్షణమే..... ఇంటికి వెళ్ళి పోతాను. ఇలా తిరగడం వల్ల ఏమవుతుంది?అంటూ లేచి నిలబడ్డాను.
"కూర్చో!" హుంకరించారు బాబాజీ.
ఎవరో భుజాలు పట్టి కూల వేసినట్లు కూర్చున్నాను.
అయిందా ?ఒక్క సంఘటన కే అలసి పోయావా? అన్ని అతి సహజంగానే, చేతి లోకి వచ్చి పడతాయి...... అనుకున్నావా ?ఏది త్యాగం లేకుండా బలిదానం లేకుండా ఏదైనా లభిస్తుందా?
కానీ తల్లిని బలిచేసి, పొందే వన్నీ నాకు వద్దు.
నేను మాతృ ఋణాన్ని కూడా తీర్చాలి కదా!--- అదే కొడుకుగా నా కర్తవ్యం కదా! అమ్మ నా పేరు తలుచుకుని బాధపడుతోంది. నేనేమో ఇక్కడ.... మీ దగ్గర ఏదో నేర్చుకోవాలని పడి ఉన్నాను. ఆరు రోజులైంది .ఇదిగో ఇదే, మొదటిసారి మీరు నాతో మాట్లాడటం అన్నాను.
బాబాజీ పకపకా నవ్వారు .చాల్చాల్లే! మీ అమ్మ మరణించదు. ఆమె కష్టాన్నంతా, నేను అనుభవిస్తాను. నువ్వు ఇంటి నుండి బయట పడ్డావంటేనే, భగవంతుడు ఏదో, ప్రణాళిక వేసి ఉంటాడు. ఏదో ఒక కారణం ఉంటుంది. భవిష్యత్తులో ఎవరికీ లభించని గురువు నీకు లభించనున్నాడు ....... ఆయనే స్వామీ సచ్చిదానందజీ.... ఇలా అంటూనే, ఆయన పడుకున్నాడు. అలా పడుకుంటూ.... నన్ను గమనిస్తూ ఉండు. కంగారుపడకు. ఈ విషయాలు ఎవరితో కూడా చర్చించవద్దు.... అన్నారు.
నా బుర్ర వేడెక్కి పోయింది. నూతి దగ్గరకు వెళ్ళి, గంట సేపు స్నానం చేశాను. అప్పటికి నా మనస్సు కొంత ప్రశాంతత పొంది ఉంది. శివాలయం దగ్గరకు వచ్చేసరికి, బాబాజీ అలాగే పడుకుని ఉన్నారు. చేయి వేసి చూస్తే, ఆయన శరీరం కాలి వేడెక్కిపోయి, ఉంది. 103 -104 డిగ్రీల జ్వరం ఉండి ఉంటుంది.....! మనస్సు బాగులేక, సాయంత్రం భోజనం చేయలేదు. ఆలయంలో, కళ్ళు మూసుకున్నాను. ఆ క్షణంలో నాగా బాబా కనుల ముందు ప్రత్యక్షమయ్యారు.
శాంతంగా ఉండు. మీ అమ్మ ఆరోగ్యం బాగుపడింది. రేపటికి పూర్తిగా స్వస్థత చిక్కుతుంది. ఆమె బాధనంతా, కష్టాన్నంతా..... నేను అనుభవిస్తున్నాను.
నన్ను లేపి ఆలయం ప్రక్కన ఉన్న కుటీరంలో, పడుకోబెట్టు అన్నారు.
కళ్ళు తెరిచి చూస్తే, బాబాజీ ఆ చెట్టు క్రింద అలాగే పడుకుని ఉన్నారు. ఆయనను, రెండు చేతులతో ఎత్తుకుని.... కుటీరంలో పడుకోబెట్టి ప్రక్కనే కూర్చున్నాను. ఆ సాయంత్రం ఒక గ్రామీణుడు రెండు లీటర్ల పాలు తెచ్చాడు. జ్వరం సంగతి విని, ఆయన వృద్ధుడు. చాలా చాలా సార్లు ఇలా జ్వర పడుతున్నాడు. ఎన్నోసార్లు, కట్టుకోవడానికి, కప్పుకోవడానికి వస్త్రాలు ఇచ్చాము. కానీ ఆయన కట్టుకోరు, కప్పుకోరు.... ఏదో రోజు ఇలాగే చచ్చిపోతారు. ఈయన మొండితనం ఏమిటో! ఆ భగవంతునికే తెలియాలి, అంటూ వెళ్లిపోయాడు.
అమాయకులు వీళ్ళు. ఎంత అజ్ఞానులు. బాబాజీ ఎంత బ్రహ్మజ్ఞానియో, సిద్ధుడో,త్రికాల దర్శియో...వీరికి ఏమి తెలుసు?
రాత్రి అంతా మేలుకొనే ఉన్నాను. ఉదయం స్నానసంధ్యాదులు..... ముగించుకొని, వచ్చేసరికి బాబాజీ జ్వరం తగ్గి పోయింది. అంతే కాదు ఆయన నది దగ్గరకి వెళ్లి పోయారు. తిరిగి వచ్చేసరికి, పరమ ప్రశాంతంగా,ప్రసన్నంగా ఉన్నారు.
నారాయణ్! మీ అమ్మ పూర్తిగా కోలుకున్నారు. ఆమెను మృత్యువు తప్పని స్థితి నుంచి బయట పడేసాను. మరో 30 ఏళ్లు ఆయుర్దాయం ప్రసాదించాను. చూడు. అంటూ..... తన కుడి చేతి బొటన వేలు గోటిని, నా కళ్ళ ముందు ఉంచారు.
నేను ఆశ్చర్య చకితుడనయ్యాను. అమ్మ పరిపూర్ణ ఆరోగ్యవంతులైంది. ఇంటి వాకిట్లో కూర్చుని ఉంది. అతి ప్రసన్నంగా ఉంది.
నాలుగేళ్ల తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు, మాటల్లో ఈ సంగతి వచ్చింది. ఆ రోజు రాత్రి, చాలా తీవ్ర అనారోగ్యం చేసింది ఆమెకి. అయితే రాత్రికి రాత్రి జ్వరం తగ్గిపోవడం మాత్రమే కాదు, పరిపూర్ణ ఆరోగ్యం చేకూరడం, వ్యాధి మచ్చుకు కూడా లేకుండా పోవడం, డాక్టర్లను అందరినీ ఆశ్చర్యపరిచింది.
అమ్మ ఆరోగ్యంగా తిరగడాన్ని, బాబాజీ "నఖ దర్పణం"లో చూడగానే నేను ఆయన చరణాల పై వాలిపోయాను. మొదటి సారిగా ఆయన ఆశీర్వదించారు.
"నువ్వు నీ లక్ష్యం లో సఫలుడివి అవుతావు!"
అంతే కాదు . అదే రోజు ఆయన నాకు "నఖ దర్పణాదిఖండ విభూతి" కి సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించారు. మంత్రాన్ని ఉపదేశించారు. ఆ సాధన చాలా కష్టమైనది. అయినా 3 పగళ్ళు, 3 రాత్రులు మేల్కొని, తన ఎదుట ఈ సాధన చేయించారు. ఇది ఆయన ప్రసాదించిన మొదటి విద్య.
ఈ సాధన వల్ల, భూత ,వర్తమాన భవిష్యత్తులలో... ఏది రహస్యం ఉండదు. ఎంత దూరంలో ఉన్న ప్రదేశంలోనైనా.... నఖ దర్పణంలో దర్శించవచ్చు.ఏ వ్యక్తి గతాన్నయినా, వర్తమాన భవిష్యత్తులనయినా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నేను కోరుకున్నప్పుడు, ఎప్పుడైనా ఇంటిని, అక్కడ పరిస్థితులను బొటన వ్రేలు గోటితో దర్శించి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఇందులో విశేషం ఏమిటంటే.... తల వెంట్రుకల నుండి గోటి వరకు స్పష్టంగా కనిపిస్తాయి.
ఈసాధన కు "నఖ దర్పణాది ఖండ విభూతి" మంత్రాన్ని, నిత్య నియమంగా జపించుట అవసరము. బాబాజీ దగ్గరనుంచి వెళ్ళాక, నాలుగైదేళ్లు దీనిని నిత్యమూ
అభ్యసించాను. కానీ తిరిగి వచ్చి గృహస్త జీవనం లో దిగాక నిత్యజపం సాధ్యం కాలేదు.......
(సశేషం)
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
Episode - 11
నేను నాగాబాబా దగ్గర దాదాపు రెండు నెలలు ఉన్నాను. ఒక రోజు మధ్యాహ్నం నేను ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన "శ్వాస సాధన" గురించి వివరిస్తున్నారు. ఆయన ఉద్దేశంలో "ఉచ్ఛ్వాస నిశ్వాసాల" నియంత్రణ లోనే అఖండానంద అనుభూతి ఉంది. ఆయన అవలంబించే ప్రక్రియ, అతి సరళమైనది. 5 , 6 గంటల ప్రయత్నంతోనే..... నేను దానిని నేర్చుకున్నాను. శ్వాస నియంత్రణ వల్ల అనిర్వచనీయమైన ఆనందం ఉంది. దానిని గురించి వ్రాయడం గానీ, వివరించడం గానీ సాధ్యం కాదు. ఆ ఆనందాన్ని అనుభవించవలసినదే.
మానవ జీవితంలోని పరిపూర్ణత్వం "రసాస్వాదనం" లోనే ఉంది. అయితే సంపూర్ణ రసాస్వాదనం, సన్యాసులకు కూడా సాధ్యం కాదు. గృహస్తులకు కూడా సాధ్యం కాదు. కఠోర బ్రహ్మచర్యం వల్ల కూడా, ఇది సాధ్యం కాదు.అధిక భోగ విలాసాల వల్ల కూడా రసాస్వాదనం సంభవం కాదు.....అంటారు నాగాబాబా.
మానవుని వీర్యమే అతని జీవనం. ఆ వీర్యం పైననే అతని రస సాధన, రసాస్వాదనం ఆధార పడి ఉన్నాయి. ఇడా, పింగళ తో పాటు చెప్పబడిన బిందువే..... శుక్రాత్మకమైన వీర్యము. అది తేజోమయం అయితే శుక్రవారం ఆడే ప్రేరేపితం కావడం వల్ల, వీర్యం బయటకు పోతుంది. దానిని స్ఖలన క్రియ అంటారు. ఇది మృత్యుక్రియ కూడానూ!
అయితే ఈ విషయంలో, మరో నైపుణ్యం ఉంది. శుక్రము లేదా వీర్యాన్ని.... ధరించడానికి ముందే దానిని వాయవీయం చేయడం..... అది వాయవీయం అయిపోతే పతనం లేదా స్కలనం అన్నదే ఉండదు.
ఆ విధంగా మానవుడు తన తేజోమయ స్వరూపాన్ని కాపాడుకోగలడు. ఈ వాయవీయ రూపం ధరించిన వీర్యం తరళంగా ఉంటుంది. దానిని ఊర్ధ్వముఖం చేయవచ్చును. దీనినే ఊర్ధ్వరేతావస్థ లేదా దివ్యావస్థ అంటారు అని నాగాబాబా అన్నారు.
శ్వాస ప్రశ్వాస సాధన మొదట నాగా బాబా వద్ద నేర్చుకున్నాను. తర్వాత దానిలోని ఉన్నత స్థితులను, పూజ్య గురుదేవులు .....స్వామీ సచ్చిదానందజీ వద్ద నేర్చుకున్నాను.
నాగా బాబా దగ్గర అనేక శక్తులు ఉన్నాయి. ఇతరుల మనస్సులను చదవడం ఆయనకు అతి సులువు. ఒకరోజు ఇద్దరము, గంగాతీరంలో నడుస్తూ ఉండగా..... ఆయన కాగితం మీద ఏదో ఒకటి రాసి వేసుకో.....అన్నారు.
నేను, " ఈ జన్మలో నాకు సరైన గురువు లభిస్తాడా? అని వ్రాశాను. ఆయన చెప్పినట్టే దానిని ఉండ చుట్టి జేబులో వేసుకున్నాను.
నేను ఏమి రాశానో ఆయన చెప్పారు. " త్రికాల సాధనా మంత్రం" ద్వారా అది సాధ్యమే! అని నేను అన్నాను. దాన్ని అప్పటికే నేను నేర్చుకున్నాను.
"ఈసారి మళ్లీ వ్రాయు" అన్నారు.
"నాకు గురువు ఎప్పుడు లభిస్తాడు? ఆయన పేరేమిటి?" అని వ్రాశాను.
"ఆ కాగితాన్ని ఉండచుట్టి గంగలోకి దూరంగా విసిరేయ్" అన్నారు. అలాగే చేశాను . నిమిషం తర్వాత గంగలో చేయి పెట్టి, ఆ కాగితాన్ని తీసి ఇచ్చారు. నా కాగితం నాదే...... దానిపై నా దస్తూరీయే ఉంది. దాని క్రింద.... మూడు నెలల తర్వాత ,సచ్చిదానంద రూపంలో అని వ్రాసి ఉంది.
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే..... ఆ కాగితం కొత్తది లాగానే ఉంది. ఉండ చుట్టిన చిహ్నాలు ఏమీ లేవు......!
మూలం మరియూ అనుభవం : గురుదేవ్ నారాయణ దత్త శ్రీమాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
తంత్ర మార్గం
--12--
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
ఈరోజు ఉదయం నేను గంగా స్నానం చేసి.... తిరిగి వస్తున్నాను. దారిలో ఒక కొండ నాకు నన్ను కాటువేసింది. చీకటిగా ఉండడంతో నేను దానిని చూడలేదు. కాటు పడడంతో నేను హాహకారం చేశాను. ఆ "కొండ నాగు" సరసర లాడుతూ ఎటో వెళ్ళిపోయింది.
కాటు పడిన చోట భయంకరమైన, మంట మొదలైంది. పరుగులు తీస్తూ బాబాజీ దగ్గరకు వచ్చి పడ్డాను. పాము! పాము! అంటూ.....నిశ్చేష్టుడిలా ఉండిపోయాను. ఆయన కుడి చేతి బొటన వ్రేలు నా నోట్లో ఉంచారు. పదిహేను ఇరవై నిమిషాల సేపు, ఆ బొటనవ్రేలిని నోటితో ఆస్వాదించాను. అంతే!.... అంతే ఆ పావుగంటలో స్వస్థత చేకూరింది. విష ప్రభావం పూర్తిగా మాయమైపోయింది.
బాబాజీ సహజంగానే శూన్య మనస్కత తో ఉండిపోయేవారు. ఒకే ఆసనంపై, ఒకే ముద్రలో..... గంటల తరబడి ఉండిపోయేవారు. బహుశా, ఆయన బ్రహ్మానందం లో మునిగిపోయి ఉండేవారేమో! ఒకరోజు కుతూహలం కొద్దీ, బాబా! మీరు ఎవరి ధ్యానం లో..... మునిగి ఉండిపోయేవారు....?
ఆ ఆనందం ఏమిటి? అని అడిగాను.
"బ్రహ్మానందం".... అన్నారు బాబా.
నేను కూడా ఈ బ్రహ్మానంద రసాన్ని, ఆస్వాదించగలనా? అని అడిగాను.
బాబా ఒక్కసారి హుంకరించి, నా గుండెల మీద గట్టిగా తన్నేరు. నేను ఏవో.... ఊర్థ్వ లోకాలకు ఎగిరిపోయినట్లు అనిపించింది. చింతలు అన్నింటికీ దూరంగా..... ఒక అనిర్వచనీయమైన లోకంలో.... సర్వత్రా శాంతి నిండి ఉన్న చోటికి..... సుగంధ భరితమైన, పవిత్రత తో నిండిపోయిన చోటుకి..... ఎగిరిపోయినట్లు అనిపించింది.
రెండు నిమిషాల తర్వాత నేను కనులు తెరిచాను.
"ఏమన్నా కనిపించిందా"? అని అడిగారు బాబా.
అవును బాబాజీ! వర్ణనలకు అందని, ఒక అనుభవం కలిగింది..... కానీ...... అన్నాను.
"చాలు, ఇంత కన్నా..... అధికంగా అనుభవం పొందడానికి, ఇప్పుడు నీకు అధికారం లేదు. సమయం వచ్చినప్పుడు చూద్దాం అన్నారు.
నేను మనస్సు చిక్క పట్టుకొని మౌనంగా ఉండిపోయాను.
బాబా దగ్గర దాదాపు మూడు నెలలు ఉన్నాను. ఒక రోజు మనసులో.... విపరీతమైన అశాంతి చెలరేగింది. ఎవరో ప్రాణాలను బయటకు లాగేస్తున్నట్లు అనిపించింది. నా ఆవేదన బాబాజీ తో చెప్పాను.
బాబాజీ, గంభీరంగా ఉండిపోయారు. కొద్దిసేపటికి "నిన్ను గురువు పిలుస్తున్నాడు." అంటూ నన్ను పైకి లేపాడు. ఇప్పుడే , ఈ క్షణమే, ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళు".... అన్నారు.
కానీ,ఏ దిశలో వెళ్ళాలి? ఎటు వెళ్లాలి? ఏ దిశలో పయనించాలి?
బాబాజీ నవ్వారు. నీళ్లు తమంతట తామే తమ లక్ష్యం వైపు ప్రవహిస్తాయి. గంగోత్రి వైపు వెళ్ళు! అంటూ నన్ను పైకి లేపారు. నేను ఆయన అనుమతి పొంది బయలుదేరాను. నాకు నా రెండు ధోవతులు, జలపాత్ర.... సంచిలో వేసుకొని అశృపూరిత నయనాలతో
నిలబడ్డాను.
బాబాజీ నేత్రాలు కూడా
చెమ్మగిల్లాయి. గంగా తటం వరకు కూడా వచ్చారు. అప్పుడు మద్యాహ్నం 2:00 అయింది. వెళ్ళు! త్వరలోనే, మళ్లీ ఒకసారి నిన్ను కలుసుకుంటాను..... అన్నారు.
బాబాజీ చరణాలకు నమస్కరించి, పాదధూళి శిరస్సున ధరించాను. గంగ ఒడ్డునే....తెలియని దారిలో .....
బరువెక్కిన గుండెలతో, అశృ పూరితమైన నయనాలతో ఆగిపోయాను. బాబాజీ శివాలయం వైపు వెళ్లి పోయారు.......(సశేషం)
అనుభవం : గురుదేవ్ నారాయణ దత్త శ్రీమాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
----13---
బాబాజీ దగ్గరనుండి బయలుదేరాక ఎన్నో రోజులు తిరిగాను. మార్గమధ్యంలో, ఏదో గ్రామంలో ఆగుతూ పోయాను. ఎన్నో అనుభవాలు కలిగాయి. అవన్నీ రాయడం వ్యర్థం. తర్వాత భైరవీ మాతను కలిసాను.
భైరవీ మాత బాలవితంతువు. నేను ఆమెను దర్శించుకునే సమయానికి, ఆమెకు 70 ఏళ్లు. ఆ గ్రామంలోని ఒక కాళీ మందిరంలో ఆమె నివాసం. ఆమె కాళీ భక్తురాలు.
ఆ ప్రాంతంలో ఆమె చాలా ప్రసిద్ధురాలు కూడా. నేను ఆ గ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంటిలో ఉన్నాను. రోజూ ఉదయం, సాయంత్రం భైరవి మాత సత్సంగానికి వెళ్లి, ఆమె బోధనలను వింటూ ఉండేవాడిని. ఆమె బెంగాల్కు చెందిన స్త్రీ. 11 ఏళ్ల వయస్సు లోనే వివాహం అయింది. కొద్ది కాలానికి అమ్మ వితంతు అయింది అప్పటి నుండి ఆమె మనస్సులో వైరాగ్యం చోటుచేసుకుంది ఆమె తంత్ర శాస్త్రంలో తన గురువు నుండి, ఎంతో జ్ఞానాన్ని సంపాదించు కుంది. ఆమె దగ్గరకు దూరదూర ప్రదేశాల నుంచి చాలామంది వచ్చేవారు. ఇప్పటికి 20 ఏళ్లకు పైగా ఆమె అన్నం స్వీకరించడం మానేసింది. పండ్లు, పాలు మాత్రమే స్వీకరిస్తుంది.
ఒకరోజు సత్సంగం మధ్యలో నిలిపి, నన్ను చూసి ఇప్పటివరకు.... నీకు గురువు ఎవరూ లభించినట్లు లేదు అంది భైరవి మాత.
అవును..... అని చెబుతూ, "నేను యోగ్యుడైన గురువు కోసం...... అన్వేషణ లో ఉన్నాను. అతి శీఘ్రం గానే..... అలాంటి గురువు లభించాలని కోరుకుంటూ ఉన్నాను" అన్నాను.
"గురువును అన్వేషించడంలో ఆలస్యం దేనికి?" అని ఆమె నవ్వుతూ ప్రశ్నించింది.
అప్పుడు మౌనంగా ఉండిపోయాను. అవును. గురువును అన్వేషించడంలో..... ఆలస్యం దేనికి? మానసిక కల్లోలం తో నేను అలసి పోయాను.
సత్సంగం అయిపోయింది. అందరూ లేచి వెళ్ళి పోతున్నారు. ఆమె నా వైపు వేలు చూపిస్తూ..... మనస్సు లో అశాంతి గా ఉందా? అని ప్రశ్నించారు.
అవునమ్మా! నిజానికి నా జీవితం వ్యర్ధం అయిపోతోంది. దాదాపు రెండేళ్లు అయిపోయింది. ఇప్పటివరకు గురువే లభించలేదు అన్నాను.
అంతేకాదు....... గురువును పొందడం ఎలా? అని ప్రశ్నించాను.
ఆమె నవ్వింది. శిష్యుడివి కావాలి.... శిష్యుడు కావడంతోనే, గురు ప్రాప్తి సంభవిస్తుంది.
నేను ఆశ్చర్య పోయాను. విషయం ఏదో..... మడతపేచీ లాగే ఉంది.
నాకు అర్థం కావడం లేదు అమ్మా! అన్నాను.
గురువు లభించడం సహజమూ, సులభమూనూ.... కానీ శిష్యుడు కావడం.....తనలో శిష్యత్వాన్ని ఉత్పన్నం చేసుకోవడం అత్యంత కష్టం. అంతేకాదు. శిష్యతా గుణాలు వికసించడం లో ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోతాయి.
నీలో శిష్యత్వ గుణం పూర్తిగా, వికసించిన రోజున, అదే క్షణంలో గురువు లభిస్తాడు. అని వివరించింది భైరవీ మాత........
(సశేషం)
మూలం మరియూ అనుభవం : గురుదేవ్ శ్రీ నారాయణ్ దత్త్ శ్రీ మాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
🖋️ భట్టాచార్య
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
----14---
శిష్యత్వ గుణాలు ఏమిటి ?అని జిజ్ఞాసతో ప్రశ్నించాను.
శిష్యత్వానికి ప్రప్రథమ - అంతిమ లక్షణం ఒకటే - సర్వాత్మనా గురువు లో విలీనం కావడం. గురువు లో విలీనం అయిపోయాక, సొంత ఆలోచనలు,
స్వంత భావాలు, స్వీయ- కామ -క్రోధ-
లోభాది సమస్త విషయాలు తిరోహితం అయిపోతాయి. గురువు ఆజ్ఞయే అధిక ప్రాధాన్యం సంతరించుకుంటుంది. దానిలో ఇతర ఆలోచనలు ,తర్కానికి తావు లేదు.
నా మనస్సుకి తృప్తి కలుగలేదు.
"ఒకవేళ గురువు నూతిలో దూకమంటే"....అని ప్రశ్నించాను.
గురువు అలా
ఆదేశిస్తాడా? ఎదురు ప్రశ్న వేసింది మాత.
ఒకవేళ అలా ఆదేశిస్తే......అన్నాను.
ఇంకా తటపటాయింపు దేనికి? ఇతర ఆలోచనలు,తర్కాలు దేనికి?
గురువు ఆజ్ఞను పాలించడంలో.... ఆలస్యం ఎందుకు?
అయితే గురువాజ్ఞను పాలించడం అంత సులువైన విషయం ఏమీ కాదు.
దానిలో తటపటాయింపులకు, ఉచ్ఛ నీచాలకు తావు లేదు.
బహుశా నా వల్ల అది సాధ్యం కాదేమో! అన్నాను నేను.
అయితే గురు ప్రాప్తి కూడా సాధ్యం కాదు, అంటూ భైరవీ మాత
లేచి తన సాధన స్థలం లోనికి వెళ్ళి పోయింది.
నేను పదిహేను నిమిషాలు అలాగే, కూర్చునుండిపోయాను. నా ఎదుట.... శిష్య త్వానికి సంబంధించిన కొత్త అధ్యాయం పుటలు తెరుచుకున్నాయి. నిజానికి, దేనినైనా పొందడం అంత సులువేమీ కాదు. మనం ఎంతో కొంత అర్పించనంత వరకు దేనినైనా, పొందాలని మాత్రం ఎలా ఆశిస్తాం ?అలా అని మన దగ్గర సమర్పించడానికి మాత్రం ఏముంది? ఈ తనువు, మనసు తప్ప......!
నాలో దుఖం పెల్లుబికింది .నేను ఇప్పటివరకు శిష్యత్వ గుణాలను ఇంకా నేర్చుకోలేకపోయాను, సమీకరించుకోలేకపోయాను. ఇంకా గురువులను ఎలా ఆశించగలం? లోపమంతా ఇప్పటివరకు, నాలోనే ఉంది. నా కంట కన్నీరు ధారలు కట్టింది.
నేను లేచి, నా నివాసానికి వెళ్ళి నిద్రపోయాను. తల భారంగా ఉంది భైరవి మాత తనలోని లోపాలను వెలికి తీసింది. ఇన్నాళ్లూ ఆ లోపాలను నేను గుర్తించలేదు. రెండవ రోజు నేను సత్సంగానికి పోలేదు.
మూడవ రోజు మాత నుండి పిలుపు వచ్చింది.
నా సాధనా కుటీరంలో.... మూడు గంటలకు కలుసుకో.....అని.
(సశేషం)
---మూలం : గురుదేవ్ నారాయణ దత్త శ్రీమాలి
---ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
----15----
ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాను. భైరవి మాత సాధనా కక్ష్యలోనుంచి మధురమైన స్తోత్రం వినిపిస్తోంది.
"సులలనాతతథేయిత...... జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే"
నేను సమ్మోహితుడినై వింటూ ఉండిపోయాను. కొన్ని క్షణాలకు " లోపలకు రా!" అన్న ఆదేశం వచ్చింది. ఆ గది చాలా చిన్నది. అగరు ధూపం తో నిండిపోయి ఉన్నది. నేను చిన్నపిల్లవాడిలా, భైరవి మాత ఎదుటవున్న ఆసనంపై వినమ్రంగా కూర్చున్నాను.
మొదటి రోజే నీ కళ్ళలోకి చూసిన క్షణమే..... నీ ఒక విశిష్ట వ్యక్తి కోసం అన్వేషిస్తున్నావని నాకు తెలిసింది. ఆ వ్యక్తిని కలుసుకోవడం అచిరకాలం లోనే జరుగుతుంది.
ఆమె నన్ను కళ్ళు మూసుకొని , ధ్యానాన్ని ఊర్థ్వస్థం చేయమని ఆదేశించింది. నేను ఆసనంలో కూర్చుని కొద్ది క్షణాలలో ధ్యానాన్ని ఊర్థ్వస్తం చేయగలిగాను.
ఆమె చేయి మొదట, నా శిరస్సుపైన, తరువాత కన్నుల పైన పడింది. ఒక వెలుగు నాలో ప్రవేశిస్తున్నట్లు తోచింది. ధ్యానం లోనే ఉన్నా.... సర్వమూ తెలుస్తోంది. చరాచర విశ్వం ఉద్భవించడం మొదలయింది. సర్వత్రా వ్యాపించి పోతున్నట్టు అనుభూతి కలిగింది. అంతే కాదు, సమస్త విశ్వమూ నాలో విశ్వవ్యాప్తం అయిపోతున్నట్లు తోచింది. ఈ అనుభవం కొద్ది క్షణాలు నిలిచింది. ఆమె చేయి తొలగిపోగానే అనుభూతి సమాప్తం అయిపోయింది. నా ధ్యానం కూడా చెదిరిపోయింది. కనులు తెరుసుకున్నాయి.
"ఏమైనా కనిపించిందా?" మాత ప్రశ్నించింది.
అవునమ్మా..... అన్నాను.
ఇదే ప్రకృత్యాత్మకత. సాధనలో రెండవ దశ. మూడవ దశ.... నీకు నీ గురువే ....నేర్పుతాడు..... అంటూ ఈ ప్రకృత్యాత్మక స్థితిని పొందే మార్గాన్ని ఆమె నేర్పించింది.
అదొక అద్భుతం. ఆ తర్వాత అక్కడ 15 రోజులు ఉన్నాను. సాధనతో, అభ్యాసంతో..... ఈ స్థితిని అరగంటకు పైగా నిలపగలిగే స్థితిని చేరుకున్నాను. చివరి రోజు భైరవి మాత ఎదుట ఆమె ఆదేశం మేరకు ఈ సాధన చేసి చూపించాను.
భైరవీ మాత పరమ ప్రసన్నురాలై పోయింది. ఆమె ప్రసన్నురాలై నాకు "సర్వాత్మ భావ విశ్వదర్శనం" చేసే
విధానం కూడా నేర్పించింది. అది అత్యంత కఠినమైనదే అయినా అద్భుతమైనది , విస్తృతమైనది. దాని గురించి వ్రాయడం ఉచితం కాదు.
సత్సంగం అయిపోయాక ఆమె నన్ను ఆపింది.
"గురుదక్షిణ ఇవ్వవా ?"అని ప్రశ్నించింది.
నేను లేచి నిలబడి, సాష్టాంగ నమస్కారం చేశాను. శరీరాన్ని, మనస్సును సమర్పితం చేశాను. మరో గురుదక్షిణ నేను మాత్రం ఏమివ్వగలను?
ఆమె నా భుజం పట్టుకొని లేపింది. ఆమె స్పర్శ తగలగానే, కుండలినీ శక్తి.... విరాట్ శూన్యంలో సంచరించడం మొదలయింది. వెంటనే సమాధి స్థితి లభించింది. అలా గంట సేపు ఆ స్థితిలోనే ఉండి పోయాను....అతి సహజంగా!అప్రయత్నంగా!
కళ్ళు తెరిచేసరికి, ఆమె ఎదురుగానే ఉంది. చిరునవ్వులు చిందిస్తోంది. ఆ విరాట్ శూన్యంలో జగజ్జనని చిరునవ్వుల ఒలికిస్తున్నట్లు ఉంది..... నేను ఆనందాతిరేకంతో పులకితుడై పోయాను. ఎదుట పూజ స్థలం నుంచి ఒక మణిని తీసి ఆమె నాకు ప్రసాదించింది.... అద్భుతమైనది సిద్ది ప్రదమైనది ఆ మణి. అనంతరకాలంలో గురుకృపవల్ల ఆ మణి.... ఎంత అద్భుత శక్తి సంపన్నమైనదో, ఫలప్రదమైనదో సాధనమయమైనదో తెలిసి వచ్చింది. సంపూర్ణ విశ్వం యొక్క సమస్త వైభవము దాని ముందు తుచ్ఛమైనది. (సశేషం)
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
----18----
"హరి ఓం బాబా"....అఘోరీ సన్యాసుల వంటివాడు. అత్యంత కఠినుడు. కానీ ప్రసన్నుడు అయితే చివరకు ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చేస్తాడు. కోపం వస్తే, ఎదుటివారిని చీల్చి చెండాడుతాడు. మమతా,జాలి వంటివి ఏవీ ఉండవు ఆయనకు. ఆయన "మనోభావాలు" ఎప్పుడు మారి పోతాయో తెలియదు. ఆయనతో సాహచర్యం ఫలితంగా, గుర్తుగా..... ఆయన కొట్టిన దెబ్బలు ఇంకా నా శరీరం మీద ఉన్నాయి. కానీ ఆయన ప్రసన్నుడై ,ప్రసాదించిన వాటి ముందు.... మూడు లోకాల లోని సంపదా తుచ్ఛమైనదే.
బాబా బ్రాహ్మణులు. కాశీ సమీపం లోని..... ఏదో గ్రామం వారిది. ఆ విషయం ఆయనే చెప్పారు. 13 ,14 ఏళ్ల వయస్సులో, ఇంటి నుండి వచ్చేసి... తిరిగి వెళ్లలేదు. హిమాలయాలే ఆయన ఇల్లు వాకిలి. హిమాలయాల్లోని మూల మూలల ప్రదేశాలు ఆయనకు తెలుసు. వందల, వేల సాధువులు, సన్యాసులతో ఆయన వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి.ఆయన సాధనలోని ఉన్నతోన్నత శిఖరాలను అధిరోహించారు.
తన జీవిత కాలంలో 10,000 శివలింగాలను ప్రతిష్టించాలని ఆయన ఒక వ్రతం పెట్టుకున్నాడు. హిమాలయాల నుంచి దిగి వచ్చినప్పుడల్లా దేశంలో ఏదో మూలకు వెళ్ళి చందాలు వసూలు చేసి, శివలింగ ప్రతిష్టచేసి..... వీలైతే చిన్న ఆలయమైనా నిర్మింపజేసేవారు. మళ్లీ హిమాలయాలకు వెళ్ళి పోయేవారు. ఆయన పరమశివ భక్తుడు. మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు రావణకృతమైన "శివతాండవ స్తోత్రాన్ని" మధురంగా గానం చేసేవారు. ఆ మధుర గానానికి సర్వప్రకృతి శివమయం అయిపోయేది. దయాళువైన శంకరుడు ఆయన గానంలో మరింత మాధుర్యాన్ని నింపేవాడు.
ఒక రోజు ఆయనను అడిగాను..... బాబా! మీరు ఎప్పుడైనా పరమశివుని దర్శించారా? అని.
ఎన్నోసార్లు దర్శించాను. ఏం? నీకు కూడా దర్శించాలని ఉందా? అని అడిగారు బాబా.
"అవును".
అయితే, రేపు చూద్దువుగానిలే! అన్నారాయన.
మరునాడు స్నానాదికాలు పూర్తిచేసుకుని ఆయన ఎదుట కూర్చున్నాను.
ధ్యానం చెయ్యు. నిన్ను నేను కూడా తీసుకు వెళతాను...అన్నారు.
మరుక్షణం ఎవరో, నా ప్రాణాలను శరీరం నుండి వేరు చేసి పైకి లాక్కున్నట్లు..... అనిపించింది. నా ప్రాణం వేగంగా పైకి ఎగిరి పోతుంది. మరుక్షణంలో ఎదుట కైలాసం. ఉత్తుంగ శృంగం. హిమాచ్ఛాదితం. ఎదుట, సమాధిగతుడైన పరమ శివుడు. నేను తన్మయుడనై పోయి ఒంటికాలి మీద నిలబడ్డాను. ఆ క్షణం లోని అనుభవం ......వర్ణింప శక్యము కాదు.
ఆ తర్వాత ఎవరో వెనుకకు లాగుతున్నట్లు అయింది. ప్రాణాలు మళ్ళీ శరీరంలో చేరాయి. భుజం మీద బాబా చేయి ఉంది.
ఏమన్నా కనిపించిందా? అని అడుగుతున్నారు బాబా. నేను చేతి గడియారం చూసుకున్నాను. ఇదంతా మూడు నాలుగు నిమిషాలలో ముగిసిపోయింది. నేను ఒక అనిర్వచనీయమైన ఆనందం తో పులకరించిపోతూ "అవును... బాబా!" అన్నాను.
నేను లేచి, బాబాకి ప్రదక్షిణం చేసి చేతులు జోడించి, నమస్కరించి ఎదుట కూర్చున్నాను. "బాబా! కోరినప్పుడల్లా ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలిగే సాధన ఏదైనా ఉందా?" అని అడిగాను.
"ఉంది" అన్నారు.
" నాకు ఆ బిక్ష ప్రసాదించరా!" అని ప్రార్థించాను.
"నేర్పుతాను....అన్నీ నేర్పుతాను....నిశ్చింతగా ఉండు"....అన్నారాయన.
బాబా ఆశీర్వాదం లభించడంతో...... కృతకృత్యుడిని అయ్యాను...అనిపించింది.
ఈ ప్రపంచంలో సుఖంగా జీవించాలనుకుంటే, వ్యతిరేక పరిస్థితుల్లో జీవించు..... నీకు ఏదైనా సిద్ధులు ఉంటే వాటిని పొరపాటున కూడా ప్రదర్శించవద్దు. అత్యంత సాధారణ మానవుడు లాగానే జీవించు. నీకు ఏ విషయమైనా తెలిసినా, ఏమీ తెలియని అజ్ఞాని లాగానే ఉండు. ఈ ప్రపంచంలో విశ్రాంతిగా బ్రతక దలిస్తే..... సాధారణ .....అత్యంత సాధారణ...... మానవుడవు అయిపోయి జీవించు. నీ వాస్తవ స్వరూపం బయట పడనీయకు....అనేవారు బాబా.
ఆ మాటలు నేను శిరోధార్యంగా స్వీకరించాను. ఆయన మాటల్లోని సత్యం నాకు కొద్ది సంవత్సరాల క్రితం తెలిసివచ్చింది. (సశేషం)
---- మూలం : శ్రీ నారాయణ్ దత్త్ మాలిజీ

----17----
సీతా రామ స్వామి పరమ వైష్ణవులు. దుఢియాచారి గ్రామంలోని రామ మందిరం లో ప్రధాన అర్చకులు. ఆ గ్రామం చాలా పెద్దది. అక్కడ మందిరం కూడా చాలా ప్రసిద్ధమైనది. అందమైన శ్రీరామచంద్రుని విగ్రహం ఉంది.
నేను తిరుగుతూ, తిరుగుతూ.... దుడియాచారి గ్రామానికి చేరుకొని ఆ మందిరములో మకాం వేసాను. మందిరంలో ఒక పక్క అతిథి గృహాలు ఉన్నాయి. వాటిలో నేను కూడా ఉన్నాను.
మూడోరోజో, నాలుగో రోజో ఆలయంలో...... సాయంత్రం, హారతి అయిపోయాక సీతారామస్వామి బయటికి వెడుతుంటే నేను కూడా ఆయన వెంట వెళ్ళాను. దారిలో నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నా పర్యటన లక్ష్యాన్ని వివరించాను. అప్పటికి ఆయన ఇల్లు చేరుకున్నాము.
తాంత్రిక ప్రక్రియల ప్రసక్తి వచ్చేసరికి, నేను రెండు మూడు ప్రక్రియలు చేసి చూపించాను. వాటిలో ఒకటి స్వామి..... ఇంటిలోనే అందరిని సమ్మోహితులను చేయడం. ఆయన ఎదుటే ఆయన భార్యను, కొడుకును, సోదరుని....సమ్మోహితులను చేశాను. నేను ఏమి చెప్తే, అదంతా చేశారు వారు. ఆయన ఇదంతా చూస్తూనే ఉన్నారు. కానీ ఆయన ముఖంలో ఎలాంటి మార్పు రాలేదు.
వారిని తిరిగి స్వస్థులను చేసాక, స్వామీజీ లేచి అలా బయటికి వెళదాం రండి...... అంటూ ముందుకు నడిచారు. నేను ఆయన వెంట బయలుదేరాను. గ్రామం వెలుపల మైదానంలో, ఆయన ఒక చోట కూర్చొని నువ్వు, నీ భవిష్యత్తు గురించి ఏమి ఆలోచిస్తున్నావు? అని ప్రశ్నించారు.
నేను ఏ సమాధానం చెప్పకపోవడంతో ఆయనే మళ్ళీ ఇలా అన్నారు...... ఈ తాంత్రిక ప్రక్రియల ప్రయత్నాలలో కాలాన్ని గడపడం..... అంటే జీవితాన్ని వ్యర్థం చేసుకోవడమే. నీ జీవితం ఇలాంటి చిన్న చిన్న సిద్ధుల కోసం కాదు. నువ్వు జ్యోతిష్యంలో పరిపూర్ణ శ్రద్ధ చూపాలి. తరువాత గంట గంటన్నర మాట్లాడుకున్నాం. ఆ సంభాషణల సారాంశం ఏమిటంటే...... ఆయనకు తాంత్రిక విద్యలు నేర్చుకోవాలని ఉంది. అవి నేర్పినందుకు బదులుగా ఆయన నాకు జ్యోతిష్యం, ఆయుర్వేదం బోధిస్తారు. స్వామీజీ చికిత్స రంగంలో అద్వితీయుడు. ఆ విషయం తరువాత గాని తెలియలేదు.
రత్న ఔషధ రంగంలో ఆయన నిస్సందేహంగా సాటి లేని వారు. ఈ మాట చెప్పడానికి నేను ఏమి సంకోచించను. స్వామి చికిత్స చేసే విధానం..... అద్భుతంగా ఉంటుంది. ఆయన రోగిని లేదా జాతక చక్రాన్ని బట్టి చికిత్స చేసేవారు. స్వామీజీ గడప త్రొక్కిన ఏరోగైనా మరణించడం జరగదని ప్రసిద్ధి ఉండేది. ఎంత గుడ్డు రోగాన్నైనా నెల, నెలన్నరలో ఆయన పోగొట్టేవాడు. ఒక విశేష ప్రక్రియతో 9 గ్రహాలు కు సంబంధించి, సూర్య, చంద్ర కుజ ఘటికలు (మాత్రలు) తయారు చేసే వాడు. అంతే కాదు. రెండు ప్రక్రియలు కలిపి శని-రాహు ఘటికలు, కుజ-గురు ఘటికలు కూడా తయారు చేసేవారు. అలాగే మూడు,అయిదు గ్రహాలకు కలిపి కూడా మాత్రలు తయారు చేసేవారు. వాటిలో ప్రధానమైనది నిష్పత్తి. ఆ నిష్పత్తి తేడాల ప్రభావంతో తేడాను సాధించేవారు.
గ్రహాలకు సంబంధించి..... తయారుచేసే మాత్రలకు సంబంధించిన జ్ఞానాన్ని తయారుచేసే విధానం ఇది. ఇది దాచదలచుకోలేదు.
ఏ గ్రహానికి సంబంధించిన మాత్రలను తయారు చేయాలి అనుకుంటే.... ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని తీసుకోవాలి. సూర్యునికి మాణిక్యము, చంద్రునికి ముత్యం..... అలాగే, ఇతర గ్రహాలకు కూడా. ఆ రత్నం 3 క్యారెట్ల నుండి 7 క్యారెట్ల వరకు ఉండాలి. ప్రామాణికమైనది పరిశుద్ధమైనది అయి ఉండాలి. కాంతివంతంగా, జ్యోతిష రీత్యా దోషరహితంగా... వుండాలి.(సశేషం)
మూలం : గురుదేవ్ నారాయణ్ దత్త్ శ్రీమాలీజీ
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషీజీ
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
----18----
"హరి ఓం బాబా"....అఘోరీ సన్యాసుల వంటివాడు. అత్యంత కఠినుడు. కానీ ప్రసన్నుడు అయితే చివరకు ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చేస్తాడు. కోపం వస్తే, ఎదుటివారిని చీల్చి చెండాడుతాడు. మమతా,జాలి వంటివి ఏవీ ఉండవు ఆయనకు. ఆయన "మనోభావాలు" ఎప్పుడు మారి పోతాయో తెలియదు. ఆయనతో సాహచర్యం ఫలితంగా, గుర్తుగా..... ఆయన కొట్టిన దెబ్బలు ఇంకా నా శరీరం మీద ఉన్నాయి. కానీ ఆయన ప్రసన్నుడై ,ప్రసాదించిన వాటి ముందు.... మూడు లోకాల లోని సంపదా తుచ్ఛమైనదే.
బాబా బ్రాహ్మణులు. కాశీ సమీపం లోని..... ఏదో గ్రామం వారిది. ఆ విషయం ఆయనే చెప్పారు. 13 ,14 ఏళ్ల వయస్సులో, ఇంటి నుండి వచ్చేసి... తిరిగి వెళ్లలేదు. హిమాలయాలే ఆయన ఇల్లు వాకిలి. హిమాలయాల్లోని మూల మూలల ప్రదేశాలు ఆయనకు తెలుసు. వందల, వేల సాధువులు, సన్యాసులతో ఆయన వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి.ఆయన సాధనలోని ఉన్నతోన్నత శిఖరాలను అధిరోహించారు.
తన జీవిత కాలంలో 10,000 శివలింగాలను ప్రతిష్టించాలని ఆయన ఒక వ్రతం పెట్టుకున్నాడు. హిమాలయాల నుంచి దిగి వచ్చినప్పుడల్లా దేశంలో ఏదో మూలకు వెళ్ళి చందాలు వసూలు చేసి, శివలింగ ప్రతిష్టచేసి..... వీలైతే చిన్న ఆలయమైనా నిర్మింపజేసేవారు. మళ్లీ హిమాలయాలకు వెళ్ళి పోయేవారు. ఆయన పరమశివ భక్తుడు. మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు రావణకృతమైన "శివతాండవ స్తోత్రాన్ని" మధురంగా గానం చేసేవారు. ఆ మధుర గానానికి సర్వప్రకృతి శివమయం అయిపోయేది. దయాళువైన శంకరుడు ఆయన గానంలో మరింత మాధుర్యాన్ని నింపేవాడు.
ఒక రోజు ఆయనను అడిగాను..... బాబా! మీరు ఎప్పుడైనా పరమశివుని దర్శించారా? అని.
ఎన్నోసార్లు దర్శించాను. ఏం? నీకు కూడా దర్శించాలని ఉందా? అని అడిగారు బాబా.
"అవును".
అయితే, రేపు చూద్దువుగానిలే! అన్నారాయన.
మరునాడు స్నానాదికాలు పూర్తిచేసుకుని ఆయన ఎదుట కూర్చున్నాను.
ధ్యానం చెయ్యు. నిన్ను నేను కూడా తీసుకు వెళతాను...అన్నారు.
మరుక్షణం ఎవరో, నా ప్రాణాలను శరీరం నుండి వేరు చేసి పైకి లాక్కున్నట్లు..... అనిపించింది. నా ప్రాణం వేగంగా పైకి ఎగిరి పోతుంది. మరుక్షణంలో ఎదుట కైలాసం. ఉత్తుంగ శృంగం. హిమాచ్ఛాదితం. ఎదుట, సమాధిగతుడైన పరమ శివుడు. నేను తన్మయుడనై పోయి ఒంటికాలి మీద నిలబడ్డాను. ఆ క్షణం లోని అనుభవం ......వర్ణింప శక్యము కాదు.
ఆ తర్వాత ఎవరో వెనుకకు లాగుతున్నట్లు అయింది. ప్రాణాలు మళ్ళీ శరీరంలో చేరాయి. భుజం మీద బాబా చేయి ఉంది.
ఏమన్నా కనిపించిందా? అని అడుగుతున్నారు బాబా. నేను చేతి గడియారం చూసుకున్నాను. ఇదంతా మూడు నాలుగు నిమిషాలలో ముగిసిపోయింది. నేను ఒక అనిర్వచనీయమైన ఆనందం తో పులకరించిపోతూ "అవును... బాబా!" అన్నాను.
నేను లేచి, బాబాకి ప్రదక్షిణం చేసి చేతులు జోడించి, నమస్కరించి ఎదుట కూర్చున్నాను. "బాబా! కోరినప్పుడల్లా ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలిగే సాధన ఏదైనా ఉందా?" అని అడిగాను.
"ఉంది" అన్నారు.
" నాకు ఆ బిక్ష ప్రసాదించరా!" అని ప్రార్థించాను.
"నేర్పుతాను....అన్నీ నేర్పుతాను....నిశ్చింతగా ఉండు"....అన్నారాయన.
బాబా ఆశీర్వాదం లభించడంతో...... కృతకృత్యుడిని అయ్యాను...అనిపించింది.
ఈ ప్రపంచంలో సుఖంగా జీవించాలనుకుంటే, వ్యతిరేక పరిస్థితుల్లో జీవించు..... నీకు ఏదైనా సిద్ధులు ఉంటే వాటిని పొరపాటున కూడా ప్రదర్శించవద్దు. అత్యంత సాధారణ మానవుడు లాగానే జీవించు. నీకు ఏ విషయమైనా తెలిసినా, ఏమీ తెలియని అజ్ఞాని లాగానే ఉండు. ఈ ప్రపంచంలో విశ్రాంతిగా బ్రతక దలిస్తే..... సాధారణ .....అత్యంత సాధారణ...... మానవుడవు అయిపోయి జీవించు. నీ వాస్తవ స్వరూపం బయట పడనీయకు....అనేవారు బాబా.
ఆ మాటలు నేను శిరోధార్యంగా స్వీకరించాను. ఆయన మాటల్లోని సత్యం నాకు కొద్ది సంవత్సరాల క్రితం తెలిసివచ్చింది. (సశేషం)
---- మూలం : శ్రీ నారాయణ్ దత్త్ మాలిజీ
ప్రేరణ : శ్రీ అనిల్ కుమార్ జోషి
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
ఎపిసోడ్ - 23
ఢిల్లీలో ఒకసారి "అంధ చక్షు షణ్ముఖేశ్వర స్వామి" ని కలిసాను. ఆయన అప్పుడు ఎందరో ఉన్నత అధికారుల ఎదుట 10 మణుగుల రాయిని తన శక్తితో ముక్కలు ముక్కలు చేసి చూపించారు. నేత్ర భేదనా శక్తితో సంకెళ్ళు త్రెంచి చూపారు. ఎదుటి వారు ఏమేమి ఆలోచిస్తున్నారో, వారికి చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఈ విద్య గోప్యమైనదేమీ కాదు. ఈ విద్య యొక్క శక్తి మిక్కిలీ ఆశ్చర్యకరమైనది.
నేను హరి ఓం బాబా గురించి చెప్తున్నాను కదా! ఈ "పరా మనోవైజ్ఞానిక విద్యల" గురించి మొదటిసారి ఆయన దగ్గరే విన్నాను. నా డైరీలో ఏఏ చిరునామాలు వ్రాసుకొని ఉన్నానో, అవన్నీ ఆయన మనస్సును ఏకాగ్రం చేసి, గడ గడ చెప్పేసాడు. ఏ పేజీలో ఏముందో కూడా చూడకుండా చెప్పేసాడు.
మానస సరోవర యాత్రలో ఆయన ఈ విద్య గురించి నాకు బోధించారు. కేవలం బోధించడమే కాదు చిత్తాన్ని ఏకాగ్రం చేయడం నేర్పారు. తన ఎదుట కూర్చోబెట్టుకొని ప్రయోగింప చేసి చూపారు.
ఏకాగ్రత సాధించాక "సంవిత్ సాధన" నేర్పారు. ఆ సాధన అభ్యసించిన తరువాత, నా ఆత్మను ఇతరులు ఆత్మతో లీనం చేయడం అనుభవం లోనికి వచ్చింది. ఆ తర్వాత ఏ వ్యక్తిని చూసినా..... వారి మనసులో ఉన్నది తెలుసుకోగలిగే వాడిని. ఆ అభ్యాసం తీవ్రతరం అయిన తరువాత, ఎంత దూరంలో ఉన్న పరిచితుడనైనా తలచుకొని, అతని మనస్సు లోని విషయాన్ని గ్రహించడం సులువు అయిపోయింది. ఆ తరువాత నా భార్య, నా తల్లి ఏమనుకుంటున్నారో..... తెలుసుకొనేవాడిని.
మానస సరోవర యాత్ర ఎంత కష్టమైందో, అంతకంటే ఆహ్లాదకరమైనది కూడా. మానస సరోవర ప్రాంతం లాంటి రమ్యమైన, శాంతి పూర్ణమైన పవిత్ర స్థలం మరెక్కడా లేదు. మనస్సును ఏకాగ్రం చేయడానికి , ఆ అభ్యాసానికి ఇది సర్వోత్తమ స్థానం అనడంలో సందేహం లేదు.
" హరి ఓం బాబా" సిద్ధుల గురించి చెప్తేనే ఒక గ్రంథం అయి కూర్చుంటుంది. ఆయన ఒకసారి "గంధ తన్మాత్ర సిద్ధి'" సిద్ధి గూర్చి చెప్పారు. దాని ద్వారా శరీరం నుండి లేదా చేతి నుండి ఎలాంటి పరిమళం కావాలంటే, అలాంటి పరిమళం ప్రసరింప చేయవచ్చును. ఆ సమయంలో దేనిని తాకినా, అది సుగంధభరితం అయిపోతుంది. ఆ విషయాన్ని చెబుతూ ఆయన తన రెండు అరచేతులను ఒకదానితో ఒకటి రుద్దుకొని కుడి అరచేతిని నా ఎదుటే ఉంచారు. దాదాపు నాలుగు అడుగుల దూరంలో కూర్చున్న నాకు గులాబీల పరిమళం అనుభవానికి వచ్చింది.
"గులాబీ పరిమళం వస్తోందా?" అని అడిగారు.
"అవును బాబా" అన్నాను.
"మరిప్పుడు ?" అని అడిగారు.
అలా అంటూనే, మళ్ళీ అరచేతులను, రుద్దుకొని కుడి అరచేతిని నా ఎదుట ఉంచారు. ఇప్పుడు నలుదిక్కులా కస్తూరి పరిమళం నిండి పోయింది. ఒక్క క్షణం లోనే ఆయన కోరిన పరిమాళాన్ని ఉత్పన్నం చేయడంలో సమర్ధులు.
(సశేషం)
మూలం : గురుదేవ్ నారాయణ్ దత్త శ్రీమాలీజీ
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
---24---
బాబాజీ దగ్గర నుండి వచ్చిన తర్వాత, చాలా సంవత్సరాలకు, జోద్ పూర్ లో ఒక బెంగాలీ యువతి నా దగ్గరికి వచ్చింది. ఆమె ఒక సైనిక అధికారి కి రెండవ భార్య. అతడి మొదటి భార్య మరణించింది . అతడు ఉద్యోగ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె వయస్సు 17 /18 సంవత్సరాలు ఉంటుంది. వారిద్దరిదీ ప్రేమ వివాహం. వారిద్దరూ జోద్ పూర్ లో ఉంటున్నారు.
నేను ఏదో వ్రాసుకుంటూండగా, వాళ్ళిద్దరూ వచ్చారు. ఆమె పేరు "శక్తి భట్టాచార్య".
ఆమె ఇలా అంది..... డాక్టర్ సాబ్! జ్యోతిష రంగం లో మీ గురించి ఎంతో విన్నాను. బెంగాలీ పత్రికలలో మీ భవిష్య ఫలితాలు ముద్రిస్తూ ఉంటారు. అవి ఆశ్చర్యకరంగా నిజమౌతూ ఉంటాయి. నాకు హస్త సాముద్రికంలోనూ ఆసక్తి, కొంత ప్రవేశము ఉన్నాయి.
నాకు జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉంది. వారంలో ఒకటి రెండు రోజులు గంట, గంటన్నర నాకు నేర్పగలరా?
నేను మౌనంగా ఉండిపోయాను.
నేను మీ శిష్యురాలిని కావాలనుకుంటున్నాను. అయోగ్యురాలిని మాత్రం కాదు. నాకు సాముద్రికంలో బాగా ప్రవేశం ఉంది . మీ చెయ్యి ఇలా ఇవ్వండి చూస్తాను.... అన్నది.
"మిస్సెస్ భట్టాచార్య!" నా భూత భవిష్యత్తుల గురించి నాకు తెలుసు. మీరు ఇతని చేయి చూడండి. అంటూ నా పక్కనే ఉన్న ఆయనను చూపించాను.
నా ప్రక్కన ఒకాయన ఉన్నాడు. పి.డబ్ల్యు.డి. లో గుమస్తా. జీతం కేవలం 250 రూపాయలు ఉంటుంది. మంచి పుష్టిగా ఉంటాడు. మంచి దుస్తులు ధరించాడు. చేతి వ్రేలికి నకిలీ వజ్రం పొదిగిన ఉంగరం ఉంది.
శక్తి భట్టాచార్య, అతని కేసి రెండు నిముషాలు చూసి అతని చేతిని పరిశీలించింది.
నేను ఆమెని పరీక్షిద్దామని ఆయన పేరు గోపాల్ పురోహిత్. ఆకాశవాణిలో ఉన్నతాధికారి.... అన్నాను. ఆమె నవ్వింది. డాక్టర్ సాబ్! మీరు కూడా అబద్ధాలు చెప్తారా? ఈ మనిషి జీవితంలో ఉన్నత అధికారి కాజాలడు. మహా అయితే "హై క్లర్క్"కాగలడు. జీతం 450 దాటదు. అన్నది.
అయితే, "మిస్సెస్ భట్టాచార్యా!" మీరు చేయి చూడడం కేవలం నెపం మాత్రమే! మీకు కర్ణపిశాచినీ శక్తి ఉంది. అవునా? అని అడిగాను. శక్తి మళ్ళీ నవ్వుతూ మీ దగ్గర దాచేదేముంది , డాక్టర్ సాబ్!అంటూ అతని చెయ్యి వదిలేసింది.
ఒక గ్లాసు మంచినీరు తెప్పించగలరా.....అని ఆమె అడిగింది.
నేను లోపల నుంచి నీళ్ళు తెప్పించాను. ఆమె గ్లాసు మీద ఒక్క నిముషం చెయ్యి ఉంచింది. "గంధ తన్మాత్ర సిద్ది" ని స్మరించింది.ఆమె చేయి తీయగానే గులాబీల పరిమళం వ్యాపించింది . గది అంతా పరిమళ భరితం అయింది. బయటికి కూడా ఆ సుగంధం వ్యాపించింది.
నేను నవ్వాను.
నేను శిష్యురాలిని కావడానికి పరీక్షలు నా అంతట నేనే ప్రదర్శిస్తున్నాను. నేను ఉత్తీర్ణురాలనయ్యాను అనుకుంటే మీ శిష్యురాలిగా చేర్చుకోండి.....అంది శక్తి భట్టాచార్య.(సశేషం)
మూలం : గురుదేవ్ నారాయణ్ దత్త్ శ్రీమాలీజీ
ప్రేరణ : గురుదేవ్ అనిల్ కుమార్ జోషి
✒️ భట్టాచార్య

---25---
"హరి ఓం బాబా'' గురించి చెబుతూ మరో విషయం లోకి వెళ్ళిపోయాను. నాకు బాబాజీ సాహచర్యం చాలా కాలం లభించింది. మానస సరోవర యాత్ర ముగిశాక, కొద్దికాలం ఆయన తన గురు స్థానం అయిన "ముండీ భాటీ" లో ఉన్నారు.
ఇక్కడే ఆయన గురువు సమాధి అయ్యారు.
ఒక రోజు ఆయన్ని అడిగాను --- బాబాజీ! యోగికి గుర్తులు ఏమిటి?
యోగ మర్మాలు తెలుసుకోవడమే.... అన్నారు ఆయన.
"బాబా! యోగి తన శక్తుల చమత్కారాన్ని ప్రదర్శించాలా?"అని అడిగారు.
బాబా ఇలా చెప్పారు. వద్దు.... వ్యక్తి యోగమార్గంలో ఉన్నంతకాలం, పరిపూర్ణత సిద్ధించనంతకాలం..... అలాంటి చమత్కార ప్రదర్శనలకు దూరంగా ఉండాలి. అలాంటి ప్రదర్శనల వల్ల అహంకారం వస్తుంది. ఆ అహంకారం వలన యోగి భ్రష్టుడవుతాడు. అందువలన యోగ సాధనలో పరిపూర్ణత వచ్చేవరకు, సర్వ సాధారణంగా ఉండాలి.
ఎవరు ఎంత రెచ్చగొట్టినా చమత్కార ప్రదర్శన వలలో పడకూడదు. తన యోగ క్రియలను, సాధనలను
ఎల్లప్పుడు రహస్యంగానే ఉంచాలి. అత్యంత సమీప స్వజనులకు అయినా, వాటి ఛాయలు కూడా తెలియనివ్వకూడదు. యోగ సాధనలో పరిపూర్ణులైనపుడు అయినప్పుడు ఎలాంటి బంధనాలు ఉండవు. అప్పుడు అతనిలో అహంకారం శూన్యం అవుతుంది.
అహంకారం శూన్యమై పోయిన పరిస్థితుల్లో, అతను మహిమలను ప్రదర్శించినప్పటికీ అది అతనికి ఎలాంటి అహంకారాన్ని కలిగించదు. సాధన పరిపూర్తి అయిన వారికి అసంభవం అంటూ ఉండదు. పదార్థాలన్నీ అతని ఆధీనంలో ఉంటాయి. అలాంటి వారు భౌతికతకు ఎంతో ఆవల ఉంటారు.
బాబాజీ ఈ "ముండీ భాటీ" ఆశ్రమానికి వచ్చి పోతూ ఉంటారు. ఈ ఆశ్రమానికి సంబంధించిన ఖర్చులు అన్నీ ఆయనే భరిస్తూ ఉంటారు. చాలా సార్లు ఆయన సాధన కోసం ఆ ఆశ్రమంలోనే ఉన్న, "సిద్ధ గుహ"లో ప్రవేశించి , మూడు నాలుగు నెలల పాటు ఆ గుహలోనే ఉండిపోయేవారు. ఆ నాలుగు నెలల పాటు అన్నపానీయాలు ఉండవు. నాలుగు నెలల తర్వాత ఆయన గుహ నుండి బయటకు వచ్చేవారు. అంతవరకు ఆయన ఎవరికీ కనిపించేవారు కాదు.( సశేషం)
మూలం : శ్రీ నారాయణ దత్త శ్రీమాలి
ప్రేరణ : శ్రీ అనిల్ కుమార్ జోషి
🖋️భట్టాచార్య
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
---26---
నేను ఆయనతో ఉన్న కాలంలోనే, "సిద్ధ గుహ"లో ప్రవేశించాలని అనుకున్నారు. ఆయనను వదలి వెళ్ళడం అసంభవంగా అనిపించింది. కానీ ఆయన కఠోరమైన ఆజ్ఞ శిరోధార్యం కదా! సిద్ధగుహలో ప్రవేశిస్తూ, అందరు శిష్యులతోపాటు, నన్ను కూడా ఆశీర్వదించారు. నా శిరస్సు పై చేయి ఉంచి, తర్వాత గుహలో ప్రవేశించారు. ఆ సాయంకాలం బాబాజీ స్మృతులు చేసిన మనసు నిండా నింపుకొని, బయలుదేరి ముందుకు సాగారు.
......బాబాజీ దగ్గర నుంచి బయలుదేరి నెల రోజులు అవుతుంది. నా మనస్సు ఏమీ బాగుండలేదు. పగలు, రాత్రి శాంతి లేకుండా పోయింది. సాధనలో కూడా మనస్సు కుదుట పడలేదు. వైరాగ్యం పెరిగిపోతోంది. గృహస్త జీవితంపై మమకారం పోలేదు. వైరాగ్యం పూర్తిగా ఏర్పడనూ లేదు.మనస్సు త్రిశంకు స్వర్గం లాంటి స్థితిలో ఉన్నది. ఒక రోజు ఈ పరిస్థితి మరీ తీవ్రం కావడంతో "బాబాజీ" ని ఆవాహన చేసాను.
పూర్ణ సమాధి స్థితిలోకి వెళ్లే సరికి, బాబాజీ దర్శనమిచ్చారు. టెలివిజన్ తెరమీద బొమ్మలా కనిపించారు. నా ఎదుట ఆయన నిశ్చలంగా, సౌమ్యంగా, మధుర మందహాసంతో, దర్శనమిచ్చి.....
ఎందుకు నన్ను పిలిచావు... అన్నారు.
బాబా! నా మనసు నిలవడం లేదు.
ఇప్పటి వరకు అంధకారంలోనే ఉన్నాను. ధ్యానంలో పరిపూర్ణ తన్మయత్వం కలుగడం లేదు. ఇంటికి వెళ్ళాలనే కోరిక కలుగడం లేదు.
మీ నుండి వచ్చాక దాదాపు నెల రోజులు వ్యర్ధం అయిపోయాయి. ఇప్పటివరకు గురువును పొందలేకపోయాను.
రేపు ఇదే సమయానికి, ఇక్కడే నిన్ను ఒక సాధువు కలుస్తాడు. అతని వెంట వెళ్లు...అతి శీఘ్రంగా నీకు గురువు లభిస్తాడు.... అన్నారు బాబాజీ. అలా అంటూనే ఆయన అదృశ్యం అయిపోయారు.
నా ధ్యానం చెదిరిపోయింది. (సశేషం)
మూలం : శ్రీ నారాయణ దత్త్ శ్రీమాలి
ప్రేరణ : శ్రీ అనిల్ జోషి
తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
---27---
రెండవ రోజు సాయంత్రం, అక్కడికి ఒక ప్రౌఢ సన్యాసి వచ్చాడు. వస్తూనే, "గురూజీ! మిమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడే బయలుదేరాలి" అన్నాడు.
"గురూజీ ఎవరు?" అని అడిగాను.
ఆ సన్యాసి ఏమీ మాట్లాడకుండా, ముందుకు నడిచాడు. ఏమి చేయాలో తెలియక వెంట నడిచాను. నాలుగైదు గంటలు నడిచాక "బంధూ, అలసిపోయాను. కొంచెం విశ్రాంతి తీసుకోవాలి" అన్నాను.
అప్పటివరకు, ఆ సన్యాసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా, ముందుకు నడుస్తూనే ఉన్నాడు. నేను అలసిపోయానని చెప్పిననూ అతను ఆగలేదు. వెను తిరిగి చూడలేదు.
ఇక నేనేమీ మాటలాడ లేదు. అతడి వెంట నడుస్తూనే ఉన్నాను. ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో, ఒక ఆశ్రమానికి చేరుకున్నాము. శాంతంగా, చిత్తాకర్షకంగా ఉంది ఆశ్రమము. ఆశ్రమాన్ని సమీపిస్తూనే, ఆ సన్యాసి కనుమరుగై పోయాడు.నేను అరగంట సేపు ఒక చెట్టు క్రింద కూర్చుని ఉన్నాను. అక్కడ నాకు ఎవరూ కనిపించలేదు. అలసట తీరిన తర్వాత లేచాను. ఆ ఆశ్రమం ఒక నది ఒడ్డున ఉంది. నేను తృప్తి తీరా స్నానం చేసాను. సంధ్యా వందనం చేసుకొని ధ్యానమగ్నుడనయ్యాను. కనులు తెరిచే సరికి సూర్యుడు ఉదయిస్తున్నాడు.
ఆశ్రమంలో కొద్దిగా కలకలం మొదలైంది. సాధువులు అటు ఇటు సంచరించడం ప్రారంభమైంది. నేను చెట్టు క్రింద కూర్చొని చూస్తున్నాను. నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిన సన్యాసి కనిపించలేదు.
దాదాపు తొమ్మిదిన్నర గంటలకు, పిలుపు వచ్చింది. ఆశ్రమానికి ఫర్లాంగు దూరంలో ఉన్న కుటీరం దగ్గరకు నన్ను తీసుకొని వెళ్లారు.కుటీరం బయట ఒక యువ సాధువు ఉన్నాడు. నన్ను అక్కడికి తీసుకొని వచ్చిన వ్యక్తి అతడితో ఏమి చెప్పాడో అర్థం కాలేదు. నా బట్టల సంచి బయట పెట్టించి లోపలకు తీసుకొని వెళ్ళారు.
లోపల ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. వేలాది చంద్రులు, ఒక్కసారిగా వెలుగుతున్నంత శీతల కాంతి. కుటీరం మధ్యలో కూర్చొని ఉన్నారు, పరమహంస స్వామి సచ్చిదానందజీ. ఎంత శాంత తేజస్వి! మొదటిసారిగా పూజ్య గురుదేవుల శిరస్సు చుట్టూ ఉన్న కాంతి కిరీటాన్ని దర్శించాను. అంతకుముందు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైన దేవతల బొమ్మలు చుట్టూ, ఇతర దేవతల బొమ్మల తలల చుట్టూ అలాంటి కాంతి పరి వేషాలను చూసాను. యోగుల తేజోమయమైన ముఖ మండలాలు దర్శించాను. కానీ ఇలాంటి కాంతి కిరీటాన్ని మొదటి సారిగా చూస్తున్నాను. (సశేషం)
మూలం : గురుదేవ్ నారాయణ దత్త శ్రీమాలి
ప్రేరణ : గురుదేవ్ అనిల్ జోషి
✒️ భట్టాచార్య
[08:23, 10/07/2020] +91 7013 527 083: తంత్ర మార్గం
(ఒక సిద్ధ యోగి ఆత్మ కథ)
--- 28 ---
ఆయన వృద్ధులు, గౌర వర్ణులు, విశాలమైన-అపార మేధా సంపత్తిని సూచించే ఫాల భాగం ఆయనది. తేజో మయమైన ముఖ మండలంతో, శాంత-సరళ , ప్రేమ పూర్వక నేత్ర ద్వయంతో ఆయన దర్శన మిచ్చారు. అలా నిలిచి పోయి చూస్తున్నారు. ఆయన నుండి కనులు తిప్పలేకపోతున్నారు. ఎంతో కాలంగా దాహంతో అలమటించి పోయి, ఇప్పుడు అమృతం త్రాగుచున్నవాడిలా ఉంది, నా పరిస్థితి.
నన్ను కూర్చోమని సైగ చేశారు. కూర్చున్నాను. ఇప్పుడు నా కుటీరం అంతటా, నా దృష్టి ప్రసరించింది. స్వచ్ఛంగా, పరమ పవిత్రంగా ఉంది. కుటీరంలో, ఎడమవైపు మరొక సాధువు సమాధి స్థితిలో ఉన్నాడు.
నా సమస్త ఇంద్రియాలు, మరొక్కసారి గురుచరణాలలో లీనమయ్యాయి. "నువ్వు అన్వేషిస్తున్న వ్యక్తి నీ ఎదుటనే ఉన్నారు" అని అంతరాత్మ చెబుతోంది.
ఎవరి కోసం ఇన్ని ఏళ్లుగా తిరుగుతున్నావో, ఆ వ్యక్తి ఈయనే.... ఆయన కృప పొందడం ద్వారానే "హృదయ గ్రంథి" వీడుతుంది. సంశయ శృంఖలాలు తెగిపోతాయి. సమస్త దుష్కర్మలు నశించి పోతాయి. ఆయన ద్వారానే "బ్రహ్మప్రాప్తి" సంభవం కాగలదు. అని అంతరాత్మ చెబుతోంది.
"భిద్యతే హృదయ గ్రంథిః ఛిద్యన్తే సర్వ సంశయాః క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే||"
సంసార సాగరాన్ని దాటడానికి, ఏకైక మార్గం సమర్ధుడైన గురువే, అతడే బాధల నుండి దాటించ గలడు.....అని "శారదా తిలక తంత్రం"లో చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.
"సంసార సింధో స్తరణైక హేతూన్, దధే గురూన్ మూర్థ్ని శివ స్వరూపాన్,
రజాంశి యేషాం పద పంకజానాం, తీర్థాభిషేకం శ్రియమావహన్తి" ----
అంటే.....సంసార సాగరాన్ని దాటడానికి, శివ స్వరూపుడైన గురువును నా సహస్రార కమలంలో స్థాపించుకుంటున్నాను. ఆయన చరణ కమలాల ధూళి తీర్థ స్నాన ఫలాన్ని ప్రసాదిస్తుంది.....అని.
నేను పరమహంస స్వామీజీ పాదాలపై వాలి పోయాను.(సశేషం)

[08:54, 10/07/2020] +91 7013 527 083: నాగా సాధువులు
“జగద్గురు బోధలు”
శ్రీ కంచి పరమాచార్య వైభవం
🕉🌞🌏🌙🌟🚩
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం|
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం||
ॐॐॐॐॐॐॐॐॐॐ

Comments
Post a Comment