*కామంలేని మనసు మాయకు లోబడని స్థితిలో ఉంటుంది !!

సంపూర్ణ అవగాహన సాధించుకున్న మనసు తనకి తానే గురువుగా మార్గదర్శకం చేసుకుంటుంది. గురువు అంటే గుర్తించేలా చేసే గుణం. మనసుకు సత్యం అర్థమయ్యేకొద్ది గురుతత్త్వం మనలోనే ఇనుమడిస్తూ ఉంటుంది. అప్పుడు మనసు ప్రకృతి ప్రభావం చేత దోషప్రవృత్తితో వ్యవహరించినా, మనసులోని శుద్ధత్వం , పరిపూర్ణత్వం ఎక్కడికీ పోవు అని తెలుస్తుంది. నిర్మలచిత్తంతో ఈ విషయం తెలుసుకున్న మనసు, తనకు ఇక దేనితో పనిలేదని తెలిసి  కామవిహీనం అవుతుంది. కామంలేని మనసు ఏ మాయకు లోబడని స్థితిలో ఉంటుంది. కామానికి, మాయకు లోనుకాని మనసు దోషరహితంగా పరిణమించి పరిమళిస్తుంది !

*కామంలేని మనసు మాయకు లోబడని స్థితిలో ఉంటుంది !!

సంపూర్ణ అవగాహన సాధించుకున్న మనసు తనకి తానే గురువుగా మార్గదర్శకం చేసుకుంటుంది. గురువు అంటే గుర్తించేలా చేసే గుణం. మనసుకు సత్యం అర్థమయ్యేకొద్ది గురుతత్త్వం మనలోనే ఇనుమడిస్తూ ఉంటుంది. అప్పుడు మనసు ప్రకృతి ప్రభావం చేత దోషప్రవృత్తితో వ్యవహరించినా, మనసులోని శుద్ధత్వం , పరిపూర్ణత్వం ఎక్కడికీ పోవు అని తెలుస్తుంది. నిర్మలచిత్తంతో ఈ విషయం తెలుసుకున్న మనసు, తనకు ఇక దేనితో పనిలేదని తెలిసి  కామవిహీనం అవుతుంది. కామంలేని మనసు ఏ మాయకు లోబడని స్థితిలో ఉంటుంది. కామానికి, మాయకు లోనుకాని మనసు దోషరహితంగా పరిణమించి పరిమళిస్తుంది !

8. ఇన్నిటి యందు నేను ప్రకృతిగ ఎట్లుంటినో వివరించెదను. ప్రకృతి అనగా నా నుండి నేను వర్తించుట. నీటికి రుచి లేదు. నాలుకకు రుచి లేదు. నీటి యందును, నాలుక యందును నేనున్నాను. నాలుకపై నీరు పడినప్పుడు రుచి, తృప్తి పుట్టును. ఇది నా ప్రకృతి సృష్టి. అట్లే సూర్యుడు తనకు తాను వెలుగు కాదు. చంద్రుడును కాదు. కన్ను తనకు తాను చూపు కాదు. కిరణము చూపు కాదు. కిరణము కంటిని స్పృశించినపుడు నేను చూపగుదును. గ్రంథములలో, అక్షరములు పదములు కావు. పదములు వాక్యము కావు. వాక్యమందు అర్థముండదు. మనస్సు నందు అర్థం ఉండదు. వాక్యము మనస్సునకు సోకినపుడు నేను అర్థముగా పుట్టుచున్నాను. ఇట్లు వేదముల యందు అర్థమగు తత్వము నేను. దానిని 'ఓం' అని వ్యవహరింతురు. ఆకాశమునందు శబ్ద తరంగములు వినిపింపవు. చెవి వినదు. తరంగములు చెవికి సోకినపుడు నేను వినబడుచున్నాను. పురుషునిలో పురుషత్వము వలె నేనీ సర్వము నందు ఇమిడి ఉన్నాను.

9. ఇట్లే సుగంధము నేను. సుగంధ, దుర్గంధములను విడమరచు ప్రజ్ఞ నేను. అగ్ని యందు తేజస్సు నేను. జీవులయందు జీవము నేను. తపస్సు చేయువాని యందు తపస్సెక్కడ ఉన్నది? కానీ ఉన్నదని తెలియును. తపస్సు నేను. తెలియుట నేను.

10. మొలకెత్తుట, గర్భధారణము అను శక్తి నేను. దీని వలన శాశ్వతుడనైనను నిత్య నూతనుడుగ భాసించుచున్నాను. బుద్ధిమంతులలో బుద్ధి, చురుకయిన వారిలో చురుకుతనము నేను.

అవతారిక - సాత్త్విక, రాజసిక, తామసిక, త్యాగములు మూడిటిని చెప్పదలంచి మొట్టమొదట తామసత్యాగమును గూర్చి చెప్పుచున్నారు–

యతస్య తు సన్న్యాసః  కర్మణో  నోపపద్యతే | 

మోహాత్తస్య పరిత్యాగః  తామసః పరికీర్తితః || 

తాత్పర్యము:- (వేదశాస్త్రాదులచే) విధింపబడినట్టి కర్మముయొక్క పరిత్యాగము యుక్తము కాదు. అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైన విడిచిపెట్టిన అది తామస త్యాగమే యగునని చెప్పబడుచున్నది.

వ్యాఖ్య: - శాస్త్రవిహితమగు కర్మను ఎవరును త్యజించరాదు. శాస్త్రములందు విధింపబడు కర్మలన్నియు జీవునియొక్క నైతిక ఆధ్యాత్మిక సమున్నతికి దోహదమును గలుగజేయునవియే యగుటవలన వాని నెవరును త్యజించరాదు. అట్లు త్యజించుట అవివేకమే యగును. కనుకనే "మోహాత్” అని యిచట చెప్పబడినది.

 అనగా మోహముచే, అజ్ఞానముచే ఆవరింపబడునపుడు మాత్రమే అట్టి విధ్యుక్తకర్మమును, ధర్మమును త్యజించు సంకల్పము జీవునకు కలుగుచుండునని భావము. కాబట్టి వివేకము నాశ్రయించి అట్టి శాస్త్ర నియతకర్మలను పరిత్యజించక ఆచరించుటయే శ్రేయస్కరము. సోమరితనముచేగాని, అజ్ఞానముచేగాని అట్టిదేయగు మఱే కారణముచేగాని వానిని త్యజించినచో అది తామసత్యాగమే కాగలదు.

ఇదివఱలో యజ్ఞదానాదులను గూర్చి వర్ణించునపుడును, మున్ముందు జ్ఞానము, ధైర్యము మున్నగువానిని చెప్పునపుడును మొదట సాత్త్వికమైనదానిని, తదుపరి రాజసమైనదానిని, ఆపిమ్మట తామసమైనదానిని చెప్పి, ఈ ఒక్క త్యాగమునుగూర్చి చెప్పునపుడు మాత్రము మొదట తామసమును, తదుపరి రాజసమును, ఆపిమ్మట సాత్త్వికమును చెప్పుట గమనార్హమైనది. మొట్టమొదటనే తామసత్యాగుల చర్యను ఖండించవలెనను ఉద్దేశ్యముతో భగవానుడీ విధముగ చెప్పియుండవచ్చును.

ప్రశ్న:- తామసత్యాగ మెట్టిది?

ఉత్తరము:- శాస్త్రవిహితములగు తపోయజ్ఞదానాది కర్మలయొక్క పరిత్యాగము తగదు. అట్టి త్యాగము తామసమనియే చెప్పబడును.

ప్రశ్న:- దేనివలన జనులు నియతకర్మలను త్యజించుచుందురు?

ఉత్తరము: - అవివేకమువలన, అజ్ఞానమువలన.

ప్రశ్న:- కాబట్టి శాస్త్రవిహితకర్మలను త్యజించువారెట్టివారని నిశ్చయించుకొనవచ్చును?

ఉత్తరము: - అవివేకులని, మోహవశులని నిశ్చయించుకొనవచ్చును.

 🌹. గీతోపనిషత్తు  - 87 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 25. చతుర్యజ్ఞములు -     ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము. ఈ నాలుగు యజ్ఞములు దృఢవ్రతములుగ ప్రయత్నించు వారు కూడ దివ్యానుభూతిని పొందగలరు. 🍀

📚. 4. జ్ఞానయోగము  - 28  📚

ద్రవ్యయజ్ఞ స్తపోయజ్ఞ యోగయజ్ఞా స్తథాల పరే |

స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రితవ్రతాః || 28

ముందు శ్లోకముల యందు నాలుగు యజ్ఞములు తెలుపబడినవి. అవి వరుసగ బ్రహ్మ యజ్ఞము, దేవ యజ్ఞము, ఇంద్రియ యజ్ఞము, మనో యజ్ఞము. ఇపుడీ శ్లోకమున మరి నాలుగు యజ్ఞములు తెలుపబడినవి. 

అవి వరుసగా ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము. ఈ నాలుగు యజ్ఞములు దృఢవ్రతములుగ ప్రయత్నించు వారు కూడ దివ్యానుభూతిని పొందగలరు.

1. ద్రవ్య యజ్ఞము :

తనకున్న సమస్త ఒనరులను సమర్పణ బుద్ధితో సద్విషయములకు వినియోగించుట ఒక మహత్తర యజ్ఞము.  బలి, శిబి యిత్యాది మహాత్ములు ఈ యజ్ఞము ద్వారా దైవానుగ్రహ పాత్రులై, శాశ్వతులైరి.

2. తపో యజ్ఞము :

తపస్సు ఎందరినో దైవానుగ్రహ పాత్రు లను గావించినది. తపస్సు మూడు భాగములుగ నున్నది. శారీరక తపస్సు, వాజ్మయ తపస్సు, మనోమయ తపస్సు. ఈ సోపానముల ద్వారా మనస్సును దైవమున కర్పించి, స్థిరముగ చేయు తపస్సు వలన దైవ మనుగ్రహించును. 

విశ్వామిత్ర మహర్షి తపస్సునకు పెట్టినది పేరు. ఆ మహర్షి చేసిన తపస్సు అనుపమానము. ఆయన యందు బ్రహ్మమును గూర్చిన తపనయే నిరుపమానమగు తపస్సుగ నడచినది. దైవమును గూర్చి తపన లేనిచో తపస్సు కుదరదు.

తపన యున్నవానికి దైవముచే పొందబడుటయే ప్రధానమగు కర్తవ్యమై, యితర వ్యాపారములను మాని రహస్య ప్రదేశమున తపస్సు చేయును. కలియుగమున మానవులకు ఇది దుష్కర విషయము. గౌతమబుద్ధుడీ మార్గముననే కలియుగమున సిద్ధి

పొందెను. 

3. యోగ యజ్ఞము : 

యోగమనగా అష్టాంగ యోగమే. ఇది సమగ్రముగ ఏడు సోపానములతో కూడిన మార్గమిది. ఎనిమిదవది సిద్ధి. దానిని సమాధి అందురు. కలియుగమున అష్టాంగ యోగమునకు జగద్గురువు మైత్రేయులు అధిపతిగ నున్నారు. పరమగురువు లందించు మార్గము అష్టాంగ యోగమే. 

ఇందు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము ఏడు సోపానములుగ నున్నవి. దీక్షతో క్రమముగ ఈ ఏడింటిని అధిగమించుట సక్రమమగు మార్గము. ఈ మార్గము సక్రమము కానిచో యోగము సిద్ధించదు. ఇది యొక యజ్ఞము. 

4. స్వాధ్యాయము : 

స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము కూడ దైవ సన్నిధికి చేర్చగలదు. వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు ఇత్యాది వాజ్మయమున రుచి కలిగి వాని నధ్యయనము చేసి, వాని యందలి అంతరార్థములను గ్రహించి, (గ్రహింపలేకున్నచో సద్గురువులను సేవించి, పూజించి, వారి అనుగ్రహముగ జ్ఞానము నుపదేశముగ పొంది) అందు అనుష్ఠానపరమైన విషయములను ఆచరణ మార్గమున కొనివచ్చి తాదాత్మ్యము చెందుట వలన, అజ్ఞానము తొలగి జ్ఞానము నిలచును. ఈ విధముగ కూడ దైవ సాన్నిధ్యము చేరవచ్చును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 172 🌹

🌻. భరద్వాజ మహర్షి  - 3 🌻

15. శ్రీమహావిష్ణువు వరాహమూర్తిగా, భూమిని మూలమ్నుంచీ ఎత్తాడు. ఇక్కడకూడా ఈ పందులు గడ్డికోసం భూమిని త్రవ్వుతూ ఉంటాయి. గడ్డిమొక్కలకు భూమిలో కాయలుంటాయి. ఆ కాయలు వాటికి ఆహారం. వీటికోసమని భూమిని సమూలంగా ఛేదిస్తుంది. అది దానిలక్షణం. 

16. శత్రువృక్షాన్ని సమూలంగా అక్కడనుండి ఎత్తి పారేయాలి అన్నమాట. సమూలంగా ఛేదించాలి. దాని విత్తనంకూడా లేకుండా నాశనం చేయమని ఆయన ఉద్దేశ్యం. అడే ఆర్యధర్మం.

17. మన దేశ చరిత్రలో గతంలో అనేకమంది హిందూ మహారాజులు, శత్రువులు తమచేతికి చిక్కిన తరువాత వారిని శిక్షించకుండా క్షమించి, మర్యాద చేసి పంపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే అది ఎంత తెలివితక్కువ పనో, ఆ తరువాత భారతదేశ చరిత్ర మనకు తెలియజేసింది. అలా చేసి ఆ హిందూరాజులు తమ దాక్షిణ్యం బయటపెట్టుకున్నారు కాని, వారు అలా చేసి ఉండకూడదు. 

18. నీ మనసులో ఉండేటటువంటి కరుణ, విశాలదృష్టి శత్రువుదృష్టిలో, శత్రువు హృదయంలో లేకపోతే ఏమవుతావు నువ్వు? కాబట్టి శత్రువును ఉపేక్షించదం అనార్యపద్ధతి.

యుద్ధభూమిలో యుద్ధంచేయనని అర్జునుడు విషాదయోగం పూనినపుడు, ‘అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జునా’ అంటూ శ్రీకృష్ణుడు, ‘యుద్ధం చేయక పోవడాన్ని’ మూడు విశేషణాలతో ఖండించాడు. 

19. ‘వీళ్ళందరూ నా బంధువులు కదా! వీళ్ళను సంహరిస్తే నాకు పాపం చుట్టుకుంటుంది’ లాంటి శాంతివచనాలు యుద్ధరంగంలో నిలుచుని పలకటమనేది ‘అనార్య జుష్టం అస్వర్గ్యం’ – అంటే, అది ఆర్యలక్షణంకాదని, స్వర్గాన్నివ్వదని; అంతేగాక ‘అకీర్తికరం’ – కీర్తినికూడా ఇవ్వదని కృష్ణభవానుని ఉద్బోధ. అలా భగవంతుడు రాజధర్మాలను క్షత్రియుడైన అర్జునుడికి బోధించాడు.

20. భరద్వాజమహర్షి సత్రుంజయుడికి ఇంకా రాజధర్మాలగురించి చెపుతున్నాడు: “నీ శత్రువుల ప్రసక్తి వచ్చినప్పుడు నువ్వు కోయిలవలే మాట్లాడాలి మధురంగా. నీ వాక్పారుష్యంచేత శత్రుత్వం పెంచవద్దు. యుద్దానికి నువ్వు మొదటి కారణం కావద్దు” అని. రాజు ఎప్పుడూ కూడా జాగ్రత్తలో ఉండాలి. 

21. చతురంగబలాలు ఉన్నాయి కదా అని నిద్రపోకూడదు. తనచుట్టూ అనేకమంది పరివారం ఉన్నది కాబట్టే జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎవరిలో ఏ విధమైన మనస్తత్వం ఉంటుందో తెలియదు. నమ్మితేనే మోసంచేయటం కుదురుతుంది. అందుకని ద్రోహమంటే నమ్మకద్రోహమనే అర్థం. ఈ ప్రకారంగా మనుష్యులు ఉంటారు. అందుకనే శత్రు పక్షంలో కోయిలవలె మధురంగా మాట్లాడాలి. శత్రువుల యడల దయాదాక్షిణ్యాలు ఉండకూడదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 111 🌹

🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 16 🌻

463."సప్తపొరల తెర"

"తేరే ఘూంఘట్ కే ఫట్ ఖోలే; తుఝె రామ్ మిలేగా"

కబీర్ సూక్తి

గౌళీపంతురాగం--ఆదితాళం

(మాయామాళవ గౌళ రాగ జన్యం) త్యాగరాజ కృతి

"తెరతీయగ రాదా? నాలోని తెర తీయగ రాదా?

464. నీవు "స్వ" (మిథ్యాహం) అనెడు సప్తపొరల తెరను తొలగించినచో, భగవంతుని కనుగొందువు.  ఏడు పొరలు ఏడు మూలవాంఛలను సూచించును. ఏడును సప్త ఙ్ఞానేంద్రియములకు  సంబంధించిన సప్త ద్వారములు.

1.నోరు, 

2.కుడినాసిక, 

3.ఎడమనాసిక, 

4.కుడిచెవి, 

5.ఎడమచెవి, 

6.కుడికన్ను, 

7.ఎడమకన్ను, 

సప్త ముడులు, సప్త పొరలు

.......................ముడి 7

ముడి  6........... ముడి 5

ముడి 4...........ముడి 3

ముడి 2............ముడి 1


466.సప్తద్వారములు

---------( ఎడమ కన్ను)-----(7)

(6)-------(కుడి కన్ను)-------(7)

(6)------(ఎడమ చెవి)-------(5)

(4)------(కుడి చెవి)---------(5)

(4)------(ఎడమ నాసిక)-------(3)

(2)-----(కుడి నాసిక)---------(3)

(2)-----( నోరు)-------------(1)


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

యథా ధౌతో ఘట్టితశ్చ లాంఛితో రంజితః పటః౹ చిదంతర్యామీ సూత్రాత్మా విరాట్ చాత్మా తథేర్యతే ౹౹2౹౹

2.  చిత్రీకరించడంలో వస్త్రము,బిగువునిచ్చుట,

రేఖాచిత్రము,వర్ణచిత్రము అనే నాలుగు అవస్థలున్నవి. జగద్రచనలో కూడా అట్లె శుద్ధ బ్రహ్మము(చిత్) అంతర్యామి సూత్రాత్మ విరాట్టు అను నాలుగు అవస్థలు గలవు.

*స్వతః శుభ్రోఽ త్ర ధౌతః 

స్యాద్ ఘట్టితోఽ న్నవిలేపనాత్ ౹ మష్యాకారైర్లాంఛితః స్యాద్రఙ్జతో వర్ణపూరణాత్ ౹౹3౹౹*

3. వర్ణచిత్రమునకు ఆధారమైన వస్త్రము ఇతర ద్రవ్యములతో సంయోగము లేనపుడు శుభ్రముగ ఉండును.దానినే ధౌత వస్త్రమంటాము.గంజిపెట్టుట వలన అది బిగువు పొందును.అది సిరా మొదలగు వానిచే రేఖలతో లాంఛిత మగును.ఈ రేఖాచిత్రమున తగినట్లు వర్ణములు నింపుటవలన వర్ణ చిత్రము సిద్ధమగుచున్నది.

స్వతశ్చిదంతర్యామీ తు మాయావీ సూక్ష్మసృష్టితః ౹ సూత్రాత్మా స్థూలసృష్టైవ విరాడిత్యుచ్యతే పరః ౹౹4౹౹

4.మాయాకార్యమగు అపంచీకృత భూతకార్యమగు సమిష్టి సూక్ష్మశరీరమును ఉపాధిగ జేసికొని హిరణ్యగర్భుడు సూత్రాత్మ అనబడుచున్నది.అట్లే పంచీకృత భూతకార్యమగు సమిష్టి స్థూలశరీరము ఉపాధియైనపుడు విరాట్ అనబడుచున్నది.

పరము అనగా పరమాత్మ బ్రహ్మము, స్వరూపమున శుద్ధచైతన్యము.

మాయ-విరహితమైనది.

మాయా-సమన్వితమైన బ్రహ్మము

ఈశ్వరుడు అంతర్యామి అనబడుచున్నది.

ఈశ్వరుడు అందరియందు అంతర్యామియై యున్నాడు.ఆ పరమాత్మ బాహ్యమందును వ్యాపించియున్నాడు.కనుకనే అతని స్థులశరీరము సమస్త సమిష్టి ప్రపంచము,అంతరమందును ఉన్నాడు.

కనుక సూక్ష్మశరీరము సమిష్టి సూక్ష్మశరీరమగుచున్నది.

అంతరాంతరమున ఉన్నాడు.

అందుచే కారణశరీరము మాయ

(మూలా ప్రకృతి ఆయెను)

ఆ పరమాత్మ యొకడే ఆయా ఉపాధులనుబట్టి అనేకముగానున్నాడు.

కావున జీవోపాధి ఈశ్వరోపాధిదొలగి చైతన్యమే మిగులుచున్నది.ఇటుల జీవుడే పరబ్రహ్మము.ఈ విషయమును వేదాంతశాస్త్రములు చెప్పుచున్నవి.

రంగులు,రేఖాచిత్రాలు లేనప్పుడు ధౌత వస్త్రము శుభ్రముగానే యుండును.కాని వస్త్రానికి గంజి పెట్టుటవలనను‌,రంగులు చిత్రాలవలనను,శుభ్రమైన వస్త్రానికి బదులు దానిపై వున్న రంగులు చిత్రాలు మాత్రమే సత్యం అనుకో కూడదు కదా!

బురదతో గూడిన జలము చిల్లగింజ సంబంధముతో బురదపోయి శుద్ధమగుచున్నదో, ఆలాగునే జీవాత్మయు బ్రహ్మాత్మైక విజ్ఞాన విచారణచే పరిచ్ఛిన్నత్వాది రూపాజ్ఞానదోషమును తొలగగా నిరావరణ బ్రహ్మమై ప్రకాశించుచున్నది.

బ్రహ్మముతప్ప మరేమియు లేదు. కోశములుగానీ,ఇంద్రియములుగాని ఏవియు భాసించవు.అన్నియు పరబ్రహ్మములై యున్నందున బహ్యవస్తువులును ఆంతరిక వస్తువులును పరమాత్మ స్వరూపములే.

ఆత్మ పరమాత్మమైయున్నందున నిరతిశయ నిరవధికానందమును తనలోనే తాను అనుభవించుచున్నాడు.

మనోబుద్ధ్యాది సాధన లేమియు అపేక్షింప పనిలేదు.బ్రహ్మముకన్నా వేరు లేదుగదా!

ఇది సర్వవేదాంత సిద్ధాన్తము.

🌞🌏🌙🌟🚩

 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

యథా ధౌతో ఘట్టితశ్చ లాంఛితో రంజితః పటః౹ చిదంతర్యామీ సూత్రాత్మా విరాట్ చాత్మా తథేర్యతే ౹౹2౹౹

2.  చిత్రీకరించడంలో వస్త్రము,బిగువునిచ్చుట,

రేఖాచిత్రము,వర్ణచిత్రము అనే నాలుగు అవస్థలున్నవి. జగద్రచనలో కూడా అట్లె శుద్ధ బ్రహ్మము(చిత్) అంతర్యామి సూత్రాత్మ విరాట్టు అను నాలుగు అవస్థలు గలవు.

*స్వతః శుభ్రోఽ త్ర ధౌతః 

స్యాద్ ఘట్టితోఽ న్నవిలేపనాత్ ౹ మష్యాకారైర్లాంఛితః స్యాద్రఙ్జతో వర్ణపూరణాత్ ౹౹3౹౹*

3. వర్ణచిత్రమునకు ఆధారమైన వస్త్రము ఇతర ద్రవ్యములతో సంయోగము లేనపుడు శుభ్రముగ ఉండును.దానినే ధౌత వస్త్రమంటాము.గంజిపెట్టుట వలన అది బిగువు పొందును.అది సిరా మొదలగు వానిచే రేఖలతో లాంఛిత మగును.ఈ రేఖాచిత్రమున తగినట్లు వర్ణములు నింపుటవలన వర్ణ చిత్రము సిద్ధమగుచున్నది.

స్వతశ్చిదంతర్యామీ తు మాయావీ సూక్ష్మసృష్టితః ౹ సూత్రాత్మా స్థూలసృష్టైవ విరాడిత్యుచ్యతే పరః ౹౹4౹౹

4.మాయాకార్యమగు అపంచీకృత భూతకార్యమగు సమిష్టి సూక్ష్మశరీరమును ఉపాధిగ జేసికొని హిరణ్యగర్భుడు సూత్రాత్మ అనబడుచున్నది.అట్లే పంచీకృత భూతకార్యమగు సమిష్టి స్థూలశరీరము ఉపాధియైనపుడు విరాట్ అనబడుచున్నది.

పరము అనగా పరమాత్మ బ్రహ్మము, స్వరూపమున శుద్ధచైతన్యము.

మాయ-విరహితమైనది.

మాయా-సమన్వితమైన బ్రహ్మము

ఈశ్వరుడు అంతర్యామి అనబడుచున్నది.

ఈశ్వరుడు అందరియందు అంతర్యామియై యున్నాడు.ఆ పరమాత్మ బాహ్యమందును వ్యాపించియున్నాడు.కనుకనే అతని స్థులశరీరము సమస్త సమిష్టి ప్రపంచము,అంతరమందును ఉన్నాడు.

కనుక సూక్ష్మశరీరము సమిష్టి సూక్ష్మశరీరమగుచున్నది.

అంతరాంతరమున ఉన్నాడు.

అందుచే కారణశరీరము మాయ

(మూలా ప్రకృతి ఆయెను)

ఆ పరమాత్మ యొకడే ఆయా ఉపాధులనుబట్టి అనేకముగానున్నాడు.

కావున జీవోపాధి ఈశ్వరోపాధిదొలగి చైతన్యమే మిగులుచున్నది.ఇటుల జీవుడే పరబ్రహ్మము.ఈ విషయమును వేదాంతశాస్త్రములు చెప్పుచున్నవి.

రంగులు,రేఖాచిత్రాలు లేనప్పుడు ధౌత వస్త్రము శుభ్రముగానే యుండును.కాని వస్త్రానికి గంజి పెట్టుటవలనను‌,రంగులు చిత్రాలవలనను,శుభ్రమైన వస్త్రానికి బదులు దానిపై వున్న రంగులు చిత్రాలు మాత్రమే సత్యం అనుకో కూడదు కదా!

బురదతో గూడిన జలము చిల్లగింజ సంబంధముతో బురదపోయి శుద్ధమగుచున్నదో, ఆలాగునే జీవాత్మయు బ్రహ్మాత్మైక విజ్ఞాన విచారణచే పరిచ్ఛిన్నత్వాది రూపాజ్ఞానదోషమును తొలగగా నిరావరణ బ్రహ్మమై ప్రకాశించుచున్నది.

బ్రహ్మముతప్ప మరేమియు లేదు. కోశములుగానీ,ఇంద్రియములుగాని ఏవియు భాసించవు.అన్నియు పరబ్రహ్మములై యున్నందున బహ్యవస్తువులును ఆంతరిక వస్తువులును పరమాత్మ స్వరూపములే.

ఆత్మ పరమాత్మమైయున్నందున నిరతిశయ నిరవధికానందమును తనలోనే తాను అనుభవించుచున్నాడు.

మనోబుద్ధ్యాది సాధన లేమియు అపేక్షింప పనిలేదు.బ్రహ్మముకన్నా వేరు లేదుగదా!

ఇది సర్వవేదాంత సిద్ధాన్తము.

🕉🌞

 శ్రీరమణీయం - (727)


 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

167వ నామ మంత్రము


ఓం పాపనాశిన్యై నమః


కేవలం మంత్రజపం చేతగాని, నామస్మరణం చేతగాని భక్తుల పాపాలను నాశనం చేయు పరాశక్తికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి పాపనాశినీ యను ఐదక్షరముల  (పంచాక్షరీ)  నామ మంత్రమును ఓం పాపనాశిన్యై నమః అని ఉచ్చరిస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ అఖిలాండేశ్వరిని ఆరాధించు భక్తులను వారు తెలిసిగాని, తెలియకగాని చేసిన పాపకృత్యములను క్షమించి సద్బుద్ధిని ప్రసాదించి తరింపజేయును.


జగన్మాత నామ పారాయణప్రీతా యని నామ ప్రసిద్ధమైనది. తనకిష్టమైన తన నామ మంత్రమును జపించు భక్తుల  పాపములను నశింపజేస్తుంది. ఓం శ్రీమాత్రే నమః అని నోరారా స్మరించండి. వెంటనే ఆ తల్లి వారి పాపములను అగ్నిలో దూదివలెను,  ఎండుగడ్డివలెనూ దహింపజేస్తుంది. అలాగని పాపకృత్యం చేయడం, వెంటనే నామ మంత్రజపం చేస్తే  ఆ తల్లి ఊరుకోదు. పాపకృత్యములు చేయు ఆ దుష్టబుద్ధిని తగలబెట్టి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. అందుకే జగన్మాత పాపసాశినీ అని నామ   ప్రసిద్ధమైనది. 


వాసిష్ఠసృతియందు ఇలా చెప్పబడినదని సౌభాగ్య భాస్కరంలో 359వ పుటలో చెప్పబడినది.

శ్లో. విద్యాతపోభ్యాం సంయుక్తం సదాపి పాపకర్మాణమేనో

న ప్రతియుజ్యతే జాపినాం హోమినాం చైవధ్యాయినాం

తీర్థవాసినాం న సంవసంతి పాపాని యే చ స్నాతాశ్శిరోవ్రతైః

విద్యాతపస్సులతో గూడి జపపరాయణుడైన బ్రాహ్మణుడు పాపకర్మలు నిత్యము చేయుచున్నను అతనికి పాపములు అంటవు. మంత్రజపములు చేయువానిని,  సదా ధ్యాన నిమగ్నుడైనవానిని దివ్యతీర్థములను సేవించువానిని, శిరస్సునందు అగ్నిని ధరించునతనిని పాపములు అంటవు.

మరియు పద్ళపురాణంలో,పుష్కరఖండంలో ఇలాచెప్పబడినదని సౌభాగ్యభాస్కరంలో చెప్పబడినది:

శ్లో. మేరుపర్వతమాత్రోఽపి రాశిః పాపస్య కర్మణః

కాత్యాయినీం సమాసాద్య నశ్యతి క్షణమాత్రతః॥

పాపకర్మలు చేయువాని పాపములరాశి మేరు పర్వతమంత పెద్దదైననూ, జగన్మాత దర్శనంచేత అంతపాపమూ  నశిస్తుంది.దేవీభాగవతంలో ఈ విధంగా చెప్పబడినదని సౌభాగ్యభాస్కరంలో చెప్పడంజరిగినది:

శ్లో. ఛిత్వా భిత్వా చ భూతాని హత్వా సర్వమిదం జగత్|

ప్రణమ్య శిరసా దేవీం న స పాపైర్వితిప్యతే॥

వర్ణాశ్రమ ధర్మములు విడిచినవారు, పాపకర్ములు, జగన్మాతను ధ్యానించినంతనే వారి  పాపములు నాశనమై, పుణ్యాత్ములగుదురు.ఇక్కడ ఒక విషయం మనం అర్థంచేసుకోవాలి. అదేమిటంటే చేయాలనుకున్న పాపకృత్యములు చేసేసి, అంతా ఆ దైవభారమంటూ నామజపంచేసేస్తే  పుణ్యాత్ములై పోతారనేది, పాపం పోతుందనికాదు. జగన్మాత అంతటి భక్తసులభురాలు. చేసిన పాపాలకు అనుభవం ఏనాటికైనా తప్పదు. చేసిన పాపాలు కట్టికుడుపుతాయి. కాని జగన్మాత నామ స్మరణతో మనం పాపకర్మలకు దూరంగా ఉంటాము. అదియే పాపనాశినీ యను నామ మంత్రమునకు పరమార్థము. ఆ తల్లి మనను పాపము చేయనీయకుండా, పుణ్యకర్మలనాచరించుటయంధు మనసును నిమగ్నము చేస్తుంది. ఈ పరమార్థం దృష్టిలో ఉంచుకొని జగన్మాతకు నమస్కరిస్తూ ఓం పాపనాశిన్యై నమః అని అనవలెను.

***


10. యాతయామం గతరసం పూతి పుర్యుషితం చ యత్ |

ఉచ్ఛష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||

🌷. తాత్పర్యం : 

భుజించుటకు మూడుగంటలకు ముందు తయారుచేయబడినవి, రుచిరహితము లైనవి, చెడిపోయినవి మరియు క్రుళ్ళినవి, ఎంగిలి మరియు నిషిద్ధపదార్థములను కలిగినట్టివియైన ఆహారములు తమోగుణులకు ప్రియమైనవి.


🌷. భాష్యము  :

ఆయుష్షును వృద్ధిచేయుట, మనస్సును పవిత్రమొనర్చుట, దేహమునకు శక్తిని కలిగించుటయే ఆహారము యొక్క ప్రయోజనమై యున్నది. అదియొక్కటే దాని ప్రయోజనము. ఆరోగ్యమునకు దోహదములై ఆయువును వృద్దినొందించునటువంటి పాలు, బియ్యము, గోధుమలు, పండ్లు, చక్కర, కూరగాయలు వంటి ఆహారపదార్థములను స్వీకారయోగ్యములని పెద్దలు పూర్వము నిర్ణయించిరి. అట్టి ఆహారము సత్త్వగుణము నందున్నట్టివారికి మిక్కిలి ప్రియమై యుండును. 

పేలాలు మరియు బెల్లపు ముడిపదార్థమైన మొలాసిస్ వంటివి స్వత: రుచికరములు కాకున్నను పాలు మరియు ఇతర ఆహారపదార్థముల మిశ్రణముచే రుచికరములు, సత్త్వగుణసమన్వితములు కాగలవు. స్వత: పవిత్రములైన ఈ పదార్థములు నిషిద్ధములైన మద్యమాంసాదులకు మిక్కిలి భిన్నమైనవి.ఎనిమిదవ శ్లోకమున తెలుపబడిన స్నిగ్ధపదార్థములకు మరియు జంతువులను చంపగా లభించెడి క్రొవ్వు పదార్థములకు ఎట్టి సంబంధము లేదు.

 క్రొవ్వుపదార్థములు అత్యంత అద్భుతాహారమైన క్షీరరూపమున లభించుచున్నవి. పాలు, వెన్న, మీగడ వంటివి జంతువు యొక్క క్రొవ్వును వేరొక రూపమున అందించునటువంటివి. అవి అమాయకజీవులను వధించు అవసరమును నివారించుచున్నవి. కాని నిర్లక్ష్యకారణముననే జంతువులను వధించుట యనెడి కార్యము నిరాటంకముగా సాగుచున్నది.

 జీవనమునకు అవసరమైన క్రొవ్వుపదార్థములను పాల ద్వారా స్వీకరించుట నాగరికపధ్ధతి కాగా, జంతువధ యనునది మిక్కిలి అనాగరికమై యున్నది. పప్పులు, గోధుమల వంటి ఆహారములందు మాంసకృత్తులు పుష్కలముగా లభించును

🌹 🌹 🌹 🌹 🌹

భుజ్యతే భుజించ లేదా అనుభవించ బడును. మాయా శబ్దముచే చెప్పబడు ప్రకృతియే జీవులకు భోజ్య రూపమున నుండుటచే 'భోజనం' అని చెప్పబడినది.

:: తైత్తీరీయోపనిషత్ - ద్వితీయాధ్యాయః, సప్తమోఽనువాకః ::

అసద్వా ఇదమగ్ర ఆసీత్ । తతో వై స దజాయత తదాత్మానగ్‍ం స్వయ మకురుత । తస్మాత్తత్సుకృత ముచ్యత ఇతి । యద్వై తత్సుకృతమ్ । రసో వై సః । రసగ్‍ం హ్యేవాయం లబ్ధ్వాఽఽనందీ భవతి । కే హ్యేవాఽన్యాత్కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ । ఏష హ్యేవానందయాతి ॥ 1 ॥

పూర్వమునందు పరబ్రహ్మ స్వరూపముగా చెప్పబడిన ఈ ప్రపంచము సృష్టికి పూర్వము వ్యాకృతమై నామరూప విశేషములకు విపరీతమగు అవ్యాకృతమైన పరబ్రహ్మముగానే యుండెను. అట్టి అవ్యాకృత పరబ్రహ్మము నుండియే ప్రవివిక్తమగు నామరూప విశేషముగల జగత్తు పుట్టెను. 

ఏ కారణమువలన ఆ పరబ్రహ్మము ఈ ప్రకారము తన్ను తాను చేసికొనెనో ఆ కారణమునుండియే బ్రహ్మము స్వకర్తృకమైనదని చెప్పబడుచున్నది. ఇట్లు స్వకర్తృకమైన ఆ పరబ్రహ్మము, తృప్తి హేతువగు ఆనందకరమైన రసస్వరూపముగానున్నది. ఇట్టి రసస్వరూపమును జీవి పొంది సుఖవంతుడగుచున్నాడు. 

ఈ సుఖస్వరూపమైన పరమాత్మ హృదయాకాశమునందు లేని యెడల ఎవడు ప్రాణాపానాది వ్యాపారము చేయును? ఈ పరమాత్మయే లోకమును సుఖపెట్టుచున్నాడు.


సశేషం... 


🌹 . శ్రీ శివ మహా పురాణము - 285 🌹 

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

68. అధ్యాయము - 23

🌻. భక్తి మహిమ  -3 🌻

ఓ దేవీ! వాటిని స్వీకరించువారు లేక పోవుటచే అవి శిథిలమైనవి. సర్వయుగములలో, మరియు విశేషించి కలియుగములో భక్తి ప్రత్యక్ష ఫలము నిచ్చును (39). భక్తియొక్క ప్రభావము చేనేను నిత్యము భక్తికి వశుడనై ఉందుననుటలో సందేహము లేదు. లోకములో భక్తి గల పురుషునకు నేను సర్వదా సహాయమును చేసెదను (40). 

ఆతని విఘ్నములను నేను తొలగించి, ఆతని శత్రువును దండించెదను. సందేహము లేదు. ఓ దేవీ! భక్తుని కారణంగా నేను క్రోధముతో నిండినవాడనైనా కంటినుండి పుట్టిన అగ్నితో కాముని (41) దహించితిని. నేను నాభక్తులను రక్షించెదను. దేవీ! పూర్వము నేను భక్తుని కారణంగా సూర్యునిపై తీవ్రమగు కోపమును పొంది (42) శూలమును తీసుకొని ఆతనిని జయించితిని.

ఓ దేవీ! భక్తుని కారణంగా నేను పరివార సమేతుడగు సమేతుడగు రావణుని కోపము చేసి పరిత్యజించితిని (43).ఆతని విషయములో నేను పక్షపాతమును సహించలేదు. ఓ దేవీ!చెడు ఆలోచనను చేయ మొదలిడిన వ్యాసుని, నేను భక్తుని కారణంగా (44) నందిచే దండింప జేసి కాశీ నుండి బయటకు పంపించితిని. ఓ దేవదేవీ! ఇన్ని మాటలేల? నేను సర్వదా భక్తునకు అధీనుడనై ఉందును (45).భక్తిని చేయు పురుషునకు నేను మిక్కిలి వశుడనై ఉందు ననుటలో సందియము లేదు.

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుని కుమార్తెయగు సతీదేవి భక్తి మహాత్మ్యమును ఈ తీరున విని (46), మనస్సులో మిక్కిలి సంతసించి, శివుని ఆనందముతో నమస్కరించెను. ఓ మహర్షీ! ఆమె గొప్ప భక్తితో భక్తికాండకు సంబంధించిన విషయమునే మరల ప్రశ్నించెను (47). 

లోకములో జీవులను ఉద్ధరించుటయే పరమ లక్ష్యముగా గల సుఖదాయకమగు శాస్త్రమును గురించి, యంత్ర మంత్ర విషయముల గురించి, విశేషించి వాటి మహిమను గురించి (48), 

జీవులను ఉద్ధరించే ఇతర విషయముల గురించి ప్రశ్నించెను. శంకరుడు ఆ సతీ ప్రశ్నను విని మిక్కిలి సంతసంచిన వాడై (49),సర్వజీవులనుద్ధరించుట కొరకై ప్రీతితో సర్వమును వర్ణించెను.

మహేశ్వరుడు యంత్ర శాస్త్రమును, పంచాగమును (50), ఆయా శ్రేష్ఠ దేవతల మహిమను వర్ణించెను. ఓ మహర్షీ! ఇతిహాస గాథలను, భక్తుల మహాత్మ్యమును (51) 

వర్ణాశ్రమ ధర్మములను, రాజ ధర్మములను, పుత్ర ధర్మములను, స్త్రీ ధర్మములను, వాటి మహాత్మ్యమును, వినాశములేని తత్త్వమును (52), జీవులకు సుఖమును కలిగించే వైద్య శాస్త్ర, జ్యోతిశ్శాస్త్ర, సాముద్రిక శాస్త్రములను, ఇతరములైన అనేక శాస్త్రములను (53) మహేశ్వరుడు దయతో వాటి స్వరూపము స్పష్టమగునట్లు వర్ణించెను.

  ఈ విధముగా సర్వజ్ఞలగు సతీశివులు ముల్లోకములకు సుఖములనొసంగిరి (54). వారు లోకములకు ఉపకారము చేయుట కొరకై సద్గుణములకు నిలయమగు మూర్తులను ధరించి, హిమ వత్పర్వతమునందు, కైలాసము నందు బహు విధములుగా క్రిడించిరి (55). పరబ్రహ్మ స్వరూపులగు వారిద్దరు అపుడు ఇతర స్థలముల యందు కూడ విహరించిరి (56).

శ్రీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీ ఖండమునందు భక్తి ప్రభావవర్ణమనే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

: మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |

శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ‖ 42 ‖


🌻 123. 'శారదారాధ్యా' 🌻

శారదగా ఆరాధింపబడునది శ్రీ లలిత అని అర్థము.

శారదాదేవిచే పూజింపబడునది అని మరియొక అర్థము. పండితులచే పూజింపబడునది అని మరియొక అర్థము. ఆరాధనకు వాక్కు ప్రధానము. వాక్కు సరస్వతీ దేవియే. ఆమె విద్యలకు అధిదేవత అగుటచే శారద అయినది. అట్టి శారద ఆధారముగ శ్రీదేవి ఆరాధింప

బడుచున్నది. 

వాక్కునకు ఫలశృతి దైవారాధనయే. వాక్కుచే స్వల్ప ఆరాధనము దివ్యత్వమును అవతరింపచేయగలదు. అందులకే సూక్తములు, స్తోత్రములు, కీర్తనములు, గీతములు. 

శరదృతువున ప్రత్యేకముగ శ్రీదేవిని ఆరాధించు సంప్రదాయము కలదు. అందువలన కూడ ఆమె శారదారాధ్య. శరన్నవరాత్రులలో నవమినాటి పూజ శ్రీదేవి కత్యంత ప్రీతికరము. 

శ్రీలలితను శారద రూపముగ ఆరాధించు సంప్రదాయము కలదు. శరత్కాల నవమినందు దేవతలచే పూజింపబడి మేల్కొలుప బడుటచే శ్రీలలితను శారదగ భావింతురు. మేల్కొలుపబడిన ఆమె మహిషాసురుని మర్దించును. 

అందువలన శరత్కాలమున పుట్టిన శ్రీదేవిని శారదాదేవిగ ఆరాధింతురు. శారదా పీఠమున ఆరాధింప బడుచున్న దేవి శ్రీలలితయే కదా! శృంగేరి యందు ప్రప్రథమముగ ఈ పీఠము నేర్పరచినది శ్రీశంకరులే.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |

శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ‖ 42 ‖


🌻 124. 'శర్వాణీ! 🌻


శర్వుని భార్యగా వెలుగొందునది శర్వాణి అని అర్థము.


అష్టప్రకృతులను, మూలప్రకృతియైన శ్రీలలిత నిర్మాణము చేయగ అందు అష్టమూర్తియై శివుడు వసించును. అట్లు ఎనిమిదవది అయిన భూరూపమున వసించు శివతత్వమును శర్వుడు అందురు. అతని భార్య శర్వాణి అయినది. 


ఆమె భూరూపమే! భూమిపై విశిష్టముగ వృక్షములు మొలకెత్తుటచే ఆమెకు సుకేశి అని నామము కలదు. వీరిరువురికి జనించిన వాడే అంగారకుడు. ఈ విషయము అంగ పురాణమునందు, వాయు పురాణమునందు గోచరించును. 


శర్వాణి అనగా భూ ప్రజ్ఞ, మనయందలి భౌతికశరీర ప్రజ్ఞ. భౌతిక శరీరము కుదురుగనుండుటకు శర్వుని, శర్వాణిని ఆరాధించుట ఋషులిచ్చిన ఉపాయము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


మంచితనం మన సహజ స్వభావం, పవిత్రత మన సహజస్వభావం. ఆ స్వభావం నశింపబడదు.

'శ్రద్ధ' అనే ఆదర్శాన్ని మరలా మనలో తీసుకురావాలి. ఆత్మవిశ్వాసం పునః జాగృతం కావాలి. అప్పుడు మాత్రమే మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ క్రమంగా మనమే పరిష్కరించుకోగలం.

🕉🌞🌎🌙🌟🚩

: భాగవతము

ఓం శ్రీ గురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩


6 వ రుద్రుడు : ఋతధ్వజుడు -  సర్పిస్సు.


శుక్రధాతువు మనలో ఏర్పడడానికి ఈ రుద్రుడు పనిచేస్తాడు. శుక్రధాతువు చక్కగా నిర్మాణమవడానికి, ప్రజోత్పత్తికి  ఈ రుద్రుడే కారణము.



భావన లో నుంచి అగ్ని ఆధారముగా చిన్న చిన్న పాము రూపాలలో  పురుషుడిలో  దిగివస్తుంది. శుక్రాన్ని తయారుచేసి, శుక్రములో జీవులను పుట్టించే శక్తి ఈ రుద్రుడిస్తాడు. 


🕉🌞🌎🌙🌟🚩


7వ రుద్రుడు :  ఉరుడు - ఇలా...


పట్టి ఉంచే తత్త్వము. ఏర్పడిన శుక్రమును స్త్రీ యందు ప్రవేశపెట్టి, గర్భధారణ ఏర్పడడానికి కృషి చేస్తాడు.  సృష్టిలో జీవులు ఏర్పడాలంటే ఈ రుద్రుడు పనిచేయాలి. లేకపోతే సృష్టి ఉండదు. ఏర్పడిన గర్భము నిలవాలన్నా శివానుగ్రహముండాలి.



కాబట్టి జీవుల పుట్టుక అంతా కూడా రుద్రశక్తి వలన జరుగుతుంది. ఈ జ్ఞానము తెలుసుకొని మనము ఎంతో కృతజ్ఞతా భావనతో ఉండాలి.


 శ్రీరమణీయం - (728)



"ఋభుగీత " (195)

🕉🌞🌎🌙🌟🚩


సర్వసిద్ధాంత సంగ్రహము

14వ అధ్యాయము



వ్యవహారిక సత్యంలో "నేను" భావం ఎంత అవసరమో... మానసికంగా సత్యానుభవానికి అది అంత అవరోధం !



కామంలేని మనసుకు సంకల్పాలు, వికల్పాలు ఉండవు. సంకల్ప, వికాల్పాలు లేని మనసు తానే సదా శివంగా ఉంటుంది. నిర్మలమైన తురీయానుభూతిలో విహరిస్తోంది. నేను, నాది అనే అహంకారమే మనిషిని జనన, మరణ, సంసారచక్రంలో బంధిస్తుంది. వ్యవహారిక సత్యంలో  "నేను" భావం ఎంత అవసరమో మానసికంగా అది సత్యానుభవానికి అంత అవరోధం. అందుకే నేను, నాది అనే భావన పరిధి తెలుసుకొని మసలుకుంటే అవి ఆధ్యాత్మిక మార్గానికి అడ్డురాకుండా ఉంటాయి !


🕉🌞🌎🌙🌟🚩

[15:57, 02/12/2020] +91 92915 82862: 🌷87-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩


అధ్యాయము-7

🥀 శాస్త్రవిజ్ఞానము🥀

11. బలవంతులలో బలము పట్టుదలతో కలుషితమై ఉండును. తీవ్ర రాగ ద్వేషములతో ఉండును. ఈ దోషములను దమింపగల బలము నేను. సృష్టి సంకల్పము కామముగా వ్యక్తమగుచున్నది. అందు పశు ప్రయత్నము, అపరిశుద్ధి కలుషములుగ ఉండును. వానిని దమించి మానవుడు దాంపత్య కామమును సాధించుకొన గలుగుట ప్రత్యక్షమే కదా! అట్టి ధర్మబద్ధ కామము నేను. కనుకనే కలుషములు జయింపబడుచున్నవి.

12. ఎవరెవరిలో సత్వ రజ స్తమస్సుల భావములు పొటమరించుచున్నవో వారి యందు అవి నా నుండియే కానీ వానిలో నేను లేను. అవి నా యందున్నవి. కనుకనే అవి నన్ను అంటవు. కుండలో మట్టి ఉన్నట్లు భ్రమ కలుగును. అచ్చట మట్టి తప్ప, కుండయను పదార్థమేమియు లేదు. ఆకారమును కుండ అందుము. మట్టియందు ఆకారమున్నది కాని ఆకారము నందు మట్టి నిలబడలేదు కదా! అట్లే నా యందు ఈ ప్రకృతులున్నవి గాని వానియందు నేను లేను.

13. మూడు గుణముల నూలు పోగుల అల్లిక వలె సృష్టి ఉన్నది. దారముతో అల్లిన రుమాలుపై బొమ్మలున్నచో బొమ్మలు జ్ఞప్తి ఉండి దారము మరుపునకు వచ్చును. ఈ మరుపును మోహమందురు. జీవులు త్రిగుణమయము అయిన సృష్టియందు మోహితులై దానికి అతీతుడు అగు నన్ను మరచుచున్నారు.


 🕉🌞🌎🌙🌟🚩

 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

బ్రహ్మాద్యాః స్తంబపర్యంతాః ప్రాణినోఽత్ర జడా అపి ౹ ఉత్తమాధమ భావేన వర్తన్తే పటచిత్రవత్ ౹౹5౹౹


5. పటచిత్రమునందు 

బ్రహ్మ విష్ణువు మొదలగు శ్రేష్ఠములైన చిత్రములు,

నీరు తృణములు మొదలగు సామాన్య చిత్రములు ఉన్నట్లే శుద్ధ బ్రహ్మము నందును బ్రహ్మాది దేవతలు గడ్డి గరిక వంటి సామాన్య ద్రవ్యములు ఆరోపింపబడుచున్నది.

బ్రహ్మ మొదలు గరిక వరకు చేతనాత్మకము,ఉత్తమము.పర్వతములు నదులు మొదలగునవి జడాత్మమకములు,అధమములు.



చిత్రార్పిత మనుష్యాణాం వస్త్రాభాసాః పృథక్ పృథక్ ౹ చిత్రధారేణ వస్త్రేణ సదృశా ఇవ కల్పితాః ౹౹6౹౹


6. ఈ పటచిత్రమునందలి మనుష్యులకు మరల వివిధములగు వస్త్రములు, చిత్రమునకు ఆధారమైన వస్త్రము వంటివే,కల్పింపబడును.

ఆ కల్పిత వస్త్రములు వస్త్రాభాసలు.



ఒక్కసారి పరిమితి నెలకొన్నచో పిదప ఇతరపరిణామములు దానివెంట సంభవించును.

అవి భౌతిక,మానసికవ్యాధులు.

సముద్రము పైభాగమున తరంగములు ఆవిర్భవించి పిదప బుడగలు మొదలగు వానిని సృజించును.



 పటచిత్రమునందు భగవంతునివంటి శ్రేష్ఠమైన చిత్రాములు  ,తరువాత వివిధ రకములైన సామాన్యచిత్రములు కూడా  ఉంటాయి. మానవులచిత్రములు,అందులోని మానవ బొమ్మలకు వస్త్రములు,

ఆ వస్త్రములకు మళ్ళీవివిధములైన రంగులును, అలంకరణకు ఆభరణములు ఇలా ప్రతిది కల్పననే.ఆ కల్పితములన్ని అభాసలు.



అలాగే శుద్ధ బ్రహ్మమునందు కూడా

బ్రహ్మాది దేవతల నుండి గడ్డి గరిక వంటి సామాన్య ద్రవ్యముల వరకు ఆరో పింపబడుచున్నవి.ఇందులో చేతనాలు(ఉత్తమమైనవి),

జడాలు(అధమములు) వరకు ఉన్నవి.



శుద్ధ చైతన్యము కేవలచైతన్యమయము,జ్ఞేయవిషయరహితము,సర్వవ్యపియునగు చిదాత్మ స్వచ్ఛము,దాని వెలుగులో సర్వజీవులు తమ నిజాత్మను తెలిసికొందురు.



మనస్సుగా,బుద్ధిగా,ఇంద్రియములుగా,అట్టి ఇతర సర్వభావనలుగా తన స్వరూపము నిషేధింపబడిన (తిరస్కరింపబడిన) పిదప శుద్ధ చైతన్యమయిన బ్రహ్మము నేను అని తెలియవలెను.



బ్రహ్మము ఏకము కావున ద్వితీయత్వాదులు ఎచటనుంచి వచ్చును.అవిద్యా కల్పితమైన వ్యవహారంలో బ్రహ్మ పరిణామం ఎన్నో రూపాలలో కనబడవచ్చు. కానీ పారమార్థక రూపంలో బ్రహ్మమొక్కటే.నామరూపాలు లేవు.



నీ ఆత్మయే పరబ్రహ్మ అని తెలుసుకోవటం వల్ల మోక్ష ఫలసిద్ధి కలుగుతుందని పరిణామ శ్రుతి బోధిస్తున్నది.


🕉🌞🌎🌙🌟🚩


భౌతిక సంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం పొసగితే తప్ప వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయం చేకూరదు.

పాశ్చాత్యదేశాలలో మీరు చూసే భౌతిక అభివృద్ధి అంతా వారికున్న శ్రద్ధ వలన కలిగిందే. వాళ్ళ కండరాలను వాళ్ళు విశ్వసిస్తారు. ఆత్మబలాన్ని విశ్వసిస్తే ఇంకెంత అధికతర ప్రయోజనం కలుగుతుందో కదా! మీ శాస్త్రాలు, ఋషులు ముక్తకంఠంతో బోధిస్తున్న అనంతశక్తి సమన్వితమైన ఆ అనంతాత్మను విశ్వసించండి. నాశరహితమైన ఆ ఆత్మ నుంచి అనంతశక్తి బయల్పడడానికి సంసిద్ధంగా ఉంది. ధైర్యంగా ఉండండి. శ్రద్ధ కలిగి ఉండండి. తక్కినదంతా దానంతట అదే వచ్చి తీరుతుంది.


🕉🌞🌎🌙🌟🚩

 భాగవతము

శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩


8 వ రుద్రుడు:- రేతోభవుడు - అంబికా గర్భధారణ శక్తి. శిశువును బయటకు నెట్టగలిగే శక్తి. సుఖ ప్రసవమునకు ఈ రుద్రుడు, శక్తి సహకరిస్తారు. గర్భము  ధరించినపుడు అనారోగ్య సమస్యలు, complications రాకుండా ఉంటాయి.



6, 7, 8 శక్తులు జీవుల పుట్టుకకు సంబంధించిన ప్రాతిపదికకు తోడ్పడతారు.  ఇది ఒక రకంగా కుమారసంభవము కధ లాంటిది. గర్భము ధరించినపుడు ఈ రుద్రశక్తులు వినకూడదు, పాటించకూడదు అని చెప్తూ ఉంటారు. కాని మాస్టర్ ఇ.కె.గారు వీటిని ఎంత ధారణ చేయ గలిగితే అంత సమర్ధత పెరుగుతుందని చెప్పారు. 


🕉🌞🌎🌙🌟🚩


ఆచార్య సద్భావన


ఆధ్యాత్మికతను స్వంతం చేసుకుని జీవించే వారి పట్ల మనకు ఆరాధనా భావం కలుగుతుంది. జ్ఞానులు, ప్రవక్తలు మొదలైన మహాత్ములంతా ఈ కోవకు చెందినవారే. వారికీ మనకూ మధ్య తేడా ఏమిటి అనేది గమనిద్దాం.



వారిలో మృదుత్వం, పారదర్శకత్వం అధికంగా ఉంటాయి.



ఒక సాధారణ కిటికీ అద్దాన్ని మనం పట్టించుకోక వదిలివేస్తే అది దుమ్ము ధూళితో కప్పబడి తన పారదర్శకతను కోల్పోతుంది, తిరిగి శుభ్రం చేసినపుడే దాని నుండి వెలుగు ప్రసరితమవుతుంది.



అదే విధంగా మనలో సందేహం, స్వార్థం, దాస్య భావనల ధూళి పేరుకుని ఉన్నది. వాటిని తుడిచి వేయగలిగితే స్వతః సిద్ధమైన ఆత్మస్వరూపం ప్రకాశవంతంగా గోచరమవుతుంది.



ప్రకాశవంతమైన కాంతి ఉనికి సర్వదా మన చుట్టుముట్టి ఉన్నది, దానిని గుర్తించగలగాలి. మనం అంధకారంలో మునిగి ఉండవలసిన ఆవశ్యకత ఏదీ లేదు. ఎందుచేతనంటే ప్రతీ జీవిలోనూ నశించని ఆత్మజ్యోతి ప్రకాశం నిలిచి ఉన్నది.



భగవంతుడు ఆబ్రహ్మకీట పర్యంతం ప్రతీ జీవికి కలుగజేసిన అద్భుత వరం ఇది. ఆ అంతర్జ్యోతి అత్యంత పారదర్శకంగా వెలుగొందుతూ తన ఉనికి ద్వారా ప్రకాశాన్ని విరజిమ్ముతూనే ఉన్నది.



స్వయంప్రకాశితమైన ఆ కాంతిరేఖలను అల్పబుద్ధితో, అహంతో, కోరికల వలయాలతో అడ్డుకుంటూ అడ్డుగోడను మనమే నిర్మించుకుంటున్నాం.

సర్వసిద్ధాంత సంగ్రహము

14వ అధ్యాయము


మానసిక జీవనంలో నేనుకు ప్రయోజనం లేదు !!


సంసారం అంటే భార్యా, పిల్లలు, వృత్తి ఉద్యోగాలు కాదు. వాటన్నింటిని మానసికంగా మోసే "నేను", వాటిని నాది అనే అహంకారం... ఇదే సంసారం. అహంకారం అణగారిన రోజున పుణ్యపాపాల ప్రసక్తి కూడా ఉండదు. ఇది, ఇతడు అనే భేదం ఎందుకొస్తుందంటే నాది, నేను అనే భావంచేతనే. వ్యవహారికంగా జీవనంలో అవి అత్యావశ్యమైనా మానసిక జీవనంలో వాటికి ప్రయోజనం లేదు. అహంకార వివర్జితమైతే నేను అంటూ ఏదీలేదని, జీవనానికి అసలు ఆ స్మరణతోనే నిమిత్తం లేదని తెలుస్తుంది !


🕉🌞🌎🌙🌟🚩

[14:52, 03/12/2020] +91 92915 82862: 🌷88-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩


అధ్యాయము-7

🥀 శాస్త్రవిజ్ఞానము🥀


14. ఈ దారముల అల్లిక కూడ నాదే కనుక దివ్యతత్వము, జీవుల మోహము కూడా దివ్యమే! అందు ఏ భాగమున ఎవ్వడును శరణాగతి మాత్రము చెందరాదు. అనగా పరమార్థమని అనుకొనరాదు. అతడు మోహము నుండి మోహమునకు ప్రయాణము చేయుచుండును. ఈ మోహమును దాటుట సాధ్యము కాదు. మనస్సు మోహమయము. నా యందు స్మరణ నిలిపి శరణుజొచ్చినవాడు నేనుగ నాతో ఉండును కనుక ఈ మోహమును దాటును.



15. మోహముచే కప్పబడిన వారు ఒకరికొకరు గాక యుందురు. ఒకరు చేయు పనులు ఇంకొకరికి బాధ కలిగించును. అవియే దుష్కర్మలు. దానిని ఆచరించువారు నరులలో అథమస్థితిలో నున్నవారు. అప్పటి వారి స్వభావమును అసుర మందురు నిద్రించువాని తెలివి వలె వారి జ్ఞానము మోహమున మాటు పడును దాని వలన జీవులకు ఆర్తి కలుగుచున్నది.



16. ఆర్తి నుండి తప్పించుకొనుటకు ధనమునో, వ్యక్తినో, అన్నపానీయములనో వెతుకును. ఇట్లు వెతుకుచు ఆర్తి నుండి ఆర్తికి నడయాడుతూ వెతికి వెతికి తటాలున నన్ను వెదకును. ఏ వ్యక్తిలో నన్ను వెదకినను నా పూజ ఆరంభమగును. ఈ అన్వేషణలో ఆర్తి హరములైన మార్గములకై జిజ్ఞాస పుట్టును. దానితో అనేక శాస్త్రములను కనుగొనును. అందును ఒకడు నన్ను కనుగొనును. మరియొకడు ప్రయోజనములను తీర్చుకొనుటకై ఇతరులను ఆశ్రయించుచు ప్రయోజన రూపమున నా వెంట వచ్చును. అతడును నన్ను కనుగొనును. తుదకు ఇది అంతయు నేనని ఎరిగి నన్ను తెలిసికొని జ్ఞాని అగును.


🕉🌞🌎🌙🌟🚩


🕉🌞🌏🌙🌟🚩

 6-శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచితం అద్వైత వేదాంత  గీతం


సురుటి రాగః - ఆదితాళమ్‌.



 క్రీడతి - వనమాలీ.

క్రీడతి వనమాలీ గోష్ఠే

క్రీడతి వనమాలీ!!



1. ప్రహ్లాద పరాశర పరిపాలీ

పవనాత్మజ జామ్బవ దనుకూలీ|| క్రీడతి||



2. పద్మాకుచ పరిరమ్భణ శాలీ

పటుతర శాసిత మాలి సుమాలీ || క్రీడతి||



3. పరమహంస వరకుసుమ సుమాలీ

ప్రణవ పయోరుహ గర్భ కపాలీ|| క్రీడతి||



తాత్పర్యము:-


1. ఆహా! వనమాలి - వైజయంతీ విభూషితుడు క్రీడించు చున్నాడు. గోశాలలో ! గోశాలలో!

ప్రహ్లాదుని బాలించిన దైవము - పరాశరమహర్షి నేలిన (వ్యాసుని తండ్రి పరాశరుడు) వేలుపుదొఱ హనుమంతునకు, జాంబవంతునకు అనుకూలుడై చెలగిన ప్రభువు - క్రీడించు చున్నాడు. గోశాలలో! గోశాలలో!!



2. లక్ష్మీదేవి స్తనద్వయంను గాడము హత్తి కౌగిలిలో గొన్న హరి - మాలిని, సుమాలిని శాసించిన వైకుంఠుడు అడుగో! గోశాలలో ఆడుచున్నాడు! గోశాలలో! (సుమాలి రావణుని మాతామహుడు. సుమాలి అన్న మాలి. హరి మాలిని యుద్ధమున సంహరించెను. సుమాలి పారిపోయెను. చూడు -రామాయణము ఉత్తరకాండ).



3. చక్కని పూలదండనువలె పరమహంసలైన యోగీంద్రులను (పరమశివేంద్రులను) తనగుండెలయందు నిండించు కొన్న దేవదేవుడు - ఓంకారమనెడు తామరపూవులో శివుడై కూర్చున్న శ్రీకృష్ణపరబ్రహ్మము - గోశాలలో - పశుశాలా ప్రాంగణములో క్రీడించుచున్నాడు!

(శివుడు సదా ధ్యానమగ్నుడు. ఆయనకు చలనము లేదు. అట్లు సుస్థిరుడై ఓంకృతి గర్భమున వెలయుచున్న వాడని భావము).


🕉🌞🌏🌙🌟🚩

-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩


అవతారిక -ఇక సాత్త్వికత్యాగమును వివరించుచున్నారు-


కార్యమిత్యేవ యత్కర్మ 

నియతం క్రియతేఽర్జున ! | 

సఙ్గం త్యక్త్వా ఫలం చైవ 

స త్యాగస్సాత్త్వికో మతః || 


తాత్పర్యము:- ఇది చేయదగినదియే యని తలంచి శాస్త్రనియతమగు ఏ  కర్మము అభిమానము, ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి (కర్మమందలి సంగఫల) త్యాగము సాత్త్వికత్యాగమని నిశ్చయింపబడినది.



వ్యాఖ్య:- త్యాగమనగా సంగత్యాగమేకాని, ఫలత్యాగమేకాని, కర్మత్యాగముకాదని ఈశ్లోకముద్వారా స్పష్టముగ వెల్లడియగుచున్నది.



 మఱియు “కార్యమ్" అని చెప్పినందువలన శాస్త్రనియతమగు కర్మ మనుజుడు తప్పక చేయవలెననియే బోధితమగుచున్నది. తామసుడు శాస్త్రవిధి తెలియక దాని నాచరించకనుండును. రాజసుడు తెలిసియు ఆచరించుట కష్టమని భావించి దానిని చేయకుండును.



సాత్త్వికుడు తెలిసియు, కష్టములకు జంకక -  సంగమును, ఫలమును త్యజించి దాని నాచరించును. సాత్త్వికునిదే ఉత్తమపద్ధతియనియు, ఆతడు కావించిన త్యాగమే ఉత్తమత్యాగమనియు ఈశ్లోకముద్వారా విదితమగుచున్నది. కావున అద్దానినే విజ్ఞులవలంబించవలెను.



ప్రశ్న:- సాత్త్వికత్యాగముయొక్క లక్షణమేమి?


ఉత్తరము: - శాస్త్ర నియతమగు కర్మను, "ఇది తప్పక చేయవలెను" అని యెంచి  ఫలమును, సంగమును (ఆసక్తిని) వదలివైచి చేయుట సాత్త్వికత్యాగమనబడును.


🕉🌞🌎🌙🌟🚩

[18:39, 03/12/2020] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  - 89 🌹

🍀 26 - 2.  ప్రాణాయామ యజ్ఞము  -     ఎంత నెమ్మదిగ శ్వాసను పీల్చిన మనసు అంత నెమ్మదించును. నిదాన మగుచున్న మనసునకు ప్రశాంతత రుచి తెలియును. ఈ ప్రశాంతత రుచిగొనిన మనసు మరింత ప్రశాంతతకై మరింత నెమ్మదిగ పీల్చుట, వదలుట చేయును. ఈ అభ్యాసమున మనోశాంతి అనునది యిట్లు అప్రయత్నముగ లభించును. 🍀


📚. 4. జ్ఞానయోగము  - 29, 30   📚

Part 2


ప్రవాహము పైన వస్తువులు తేలుచు వేగముగ కదలుచున్నను అది వస్తువుల కదలిక కాదు కదా! ప్రవాహ వేగమే పైన తేలు వస్తువుల వేగము. అట్లే శరీర ప్రయాణ వేగమునకు, మనో ప్రయాణ వేగమునకు శ్వాసయే ఆధారమని తెలియును. 


శ్వాస ప్రవాహమున మనసు లగ్నమగును. శ్వాస నెమ్మదించినచో మనసు నెమ్మదించును. మనసు నెమ్మదించినచో శ్వాస నెమ్మదించును. కావున మనసు నెమ్మదించ వలెనన్నచో శ్వాసను నెమ్మదిగ నిర్వర్తించవలెను. మనసు వేగముగ పనిచేయు వారియందు శ్వాస కూడ వేగముగ పనిచేయుచు నుండును. అట్టివారి శ్వాస బుసలు కొట్టుచున్నట్లుగ యుండును. ఇది రజోగుణ పూరితమైన శ్వాస. 


మనసు లగ్నము చేసి శ్వాసను  నెమ్మదిగ పీల్చుట అభ్యాసమున రెండవ మెట్టు. ఎంత నెమ్మదిగ శ్వాసను పీల్చిన మనసు అంత నెమ్మదించును. పీల్చినంత నెమ్మదిగనే వదలుట కూడ చేయవలెను. పీల్చుట, వదలుట నెమ్మది యగుకొలది మనసు నిదానమగు చుండును. 


నిదాన మగుచున్న మనసునకు ప్రశాంతత రుచి తెలియును. ఈ ప్రశాంతత రుచిగొనిన మనసు మరింత ప్రశాంతతకై మరింత నెమ్మదిగ పీల్చుట, వదలుట చేయును. ఈ అభ్యాసమున మనోశాంతి అనునది యిట్లు అప్రయత్నముగ లభించును.


మనోశాంతియే ధ్యేయముగ ప్రస్తుతకాలమున ధ్యానములు బోధింపబడుచున్నవి. వాస్తవమునకు మనోశాంతి నిజమగు ధ్యానమునకు ఆరంభము. ధ్యేయము కాదు, అంతము కాదు. మనోశాంతి ఆధారముగ ప్రాణాయామ యజ్ఞము ఆరంభమై ప్రత్యాహార, ధారణ స్థితులను దాటి ప్రజ్ఞ ధ్యానమును చేరును. 


అందులకే భగవానుని బోధ ధ్యానమును గూర్చి తరువాత అధ్యాయమైన ఆరవ అధ్యాయమున వున్నది. నాలుగవ అధ్యాయమగు జ్ఞాన యోగమున- యోగమున నాలుగవ అంగమైన ప్రాణాయామమును బోధించుట పతంజలి యోగశాస్త్రమునకు, భగవద్గీతకు గల సమన్వయము.


ప్రశాంతతో కూడిన మనస్సు శ్వాసను నెమ్మదిగ పీల్చుటతో పాటు పూర్ణముగ పీల్చుట చేయును. శ్వాసనెంత పూర్ణముగ పీల్చినచో అంత పూర్ణముగ వదలుట జరుగును. పూర్ణముగ పీల్చుట వలన ప్రాణావాయువు దేహమున పూర్ణముగ నిండును. పూర్ణముగ వదలుట వలన అపాన వాయువు పూర్ణముగ బయలు వెడలును. 


అపానము పూర్ణముగ బయలు వెడలినచో దేహమందలి మలినములు బైటకు నెట్టబడును. మలినములు నెట్టబడుట, ప్రాణము పీల్చబడుట కారణముగ ఈ అభ్యాసమున దొరకు రెండవ బహుమతి ప్రాణశక్తి. క్రమముగ దేహము ఆరోగ్య వంతమగుటకు క్రొత్తగా కొనివచ్చిన ప్రాణము సహకరించును. ప్రాణశక్తి పెరుగుట, మలినములు తొలగుట అనునది నిరంతరము జరుగు ప్రాణాయామము అభ్యాసమున మరియొక భాగము. 


ప్రాణమును అనేక విధములుగ దేహము అందుకొను చుండును. ఆహారము అందులో ఒక భాగము. మనసును లగ్నము చేసి శ్వాసను నెమ్మదిగ పీల్చుట, వదలుట, పూర్ణముగ పీల్చుట, వదలుట కారణముగ శ్వాస క్రమ బద్ధము చెందుట జరుగును. 


మనసు  ప్రశాంతత చెందు చుండును. ప్రాణశక్తి పెరుగుచు నుండును. ఉచ్ఛ్వాస నుండి పొందు ప్రాణవాయువు వలసిన ప్రాణశక్తిని దేహమున కిచ్చుచుండును. అట్టివారు నియతాహారు లగుదురు. అనగా సహజముగ వారి ఆహారము నియమింపబడును. ఇదియొక సిద్ధి. 


వీరు ఆహారమును అల్పముగనే స్వీకరించినను శక్తివంతులై యుందురు, సులభముగ అలసట చెందరు. దేహము తేలిక పడుచు పలుచనై కాంతివంత మగుచుండును. దేహమున శుభమగు మార్పులు ఈ విధముగ శ్వాస నభ్యసించుటవలన వచ్చును. శ్వాస నుండి వలసిన ప్రాణశక్తి లభించుటచే ఆహారము నందు నియమము

సహజముగ ఏర్పడును. 


ఆహారము తగ్గుట జరుగునే కాని చేయుటగ నుండదు. తగ్గించుట చేయువారు అకస్మాత్తుగ ఎక్కువ తినుచుందురు. ఎక్కువ తినుట, తక్కువ తినుట వలన దేహమునకు అవ్యవస్థత కలిగించును. ఈ అవస్థకు గురియగు దేహము, అస్వస్థతకు కారణమగును. ఉపవాసములు చేయువారు, ఎక్కువగను, తక్కువగను తినువారు యోగమున కనర్హులు. 


యోగజీవనము నిర్మల సెలయేరువలె ప్రవహించవలెనే కాని వరదవలె కాదు. పై కారణముగనే భగవద్గీత యందు నియతాహార విషయము 30వ శ్లోకమున తెలుపబడెను. 29వ శ్లోకమున ప్రాణమును గూర్చిన సాధన తెలుపబడినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 174 🌹

🌻. భరద్వాజ మహర్షి  - 5 🌻


31. భరద్వాజుడు ఇంకా చెప్పడు: “రాజా! అరామాల్లో, వేశ్యా వాటికల్లో, సత్రాల్లో, మదిరాల్లో, స్నాన-పానప్రదేశాల్లో దొంగలు చేరుతూ ఉంటారు. జార, చోరులవల్ల ప్రజలకు భయం ఉంటుంది. అందుకని వాళ్ళను పట్టుకుని దండించాలి. అది పరిపాలనలో ప్రథమధర్మం. ప్రజాక్షేమం కోసమని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో నువ్వు గమనించాలి. 


32. ఎవరి గురించో మరెవరో ఉత్తమ కులస్థుడనీ, పుణ్యాత్ముడనీ, చాలా మంచివాడనీ చెబుతారు. అది తీసుకుని నివు నమ్మవద్దు. అలాగని వాడిని అక్కడే అనుమానించనూవద్దు” అని చెప్పాడు.


33. నమ్మవద్దు, అనుమానించవద్దు అంటే, మరి ఏం చెయ్యాలి! పరీక్ష చేయాలి. పరీక్షించాలి వాళ్ళను. తన మనిషినే వాడిదగ్గరికి పంపించి పరీక్షించాలి. 


34. రాజు తన మనిషిని అనుమానంకలిగినవాడి దగ్గరికి పంపించి ఎట్లా పరీక్షిస్తాడంటే; రాజు యొక్క అంతరంగికుడు, ఉద్యోగంలో కొత్తగాచేరిన వాడిదగ్గరికివెళ్ళి, “మన రాజు చాలా దుర్మార్గుడు. అందరి మనసులలోనూ ఆయన మీద క్రోధం ఉంది. ఎప్పుడో సమయం చూచి మేము తిరుగుబాటు చేద్దామనుకుంటున్నాము నువ్వేమంటావు? ఆయన తమ్ముడొకడు మంచివాడున్నాడు; ఆయనకు రాజ్యమొస్తే సుఖపడతాం మనం. నిన్ను రేపు ఆయన దగ్గరికి తీసుకెళతాను” అంటాడు. అప్పుడు ఆ కొత్తవాడు, “అలాగా! రేపు వెడదాం” అని కనుక అంటే, మర్నాడు వాడిని పంపించెయ్యాలి. అదీ పరీక్ష చేయటమంటే! దానితో వీడి నిజస్వభావం బయటపడిపోతుంది. 


35. వాడికి ఆశపెట్టి, ధనాశపెట్టి పరీక్ష చేయాలి. అనుమానించినట్లు కనబడకూడదు. అలాగని గుడ్డిగా నమ్మనేకూడదు. ఈ ప్రకారంగా ప్రతివాడినీకూడా పరీక్షించాలి.

గిల్లికజ్జాలు పెట్టుకొని, చిన్నచిన్న కారణాలకోసం ఎవరూకూడా బలమయినవాడితో శత్రుత్వం పెట్టుకోకూడదు. రాజు చిన్నచిన్న విషయాలను అన్నిటినీకూడా ఉదారస్వభావంతో వదిలి పెట్టాలి. కాని వాటిని మాత్రం వెతుకుతూ ఉండాలి. 


36. సాధారణంగా మనం తేలు, పాము ఎక్కడుందోఅని వెలుతురులో పరీక్షించినట్లు, పాలకుడు శత్రువులను వెతుకుతూ ఉండాలి. ఇవాళ ఒకడు మనకు అపచారంచేసాడు అంటే, వాడిని గురించి చాలా జాగ్రత్తవహించి ఎప్పుడూ పరిశీలన చేస్తూండాలి. మనమే వైరం పెట్టుకోకూడదు. చిన్న నేరాలన్నింటినీ క్షమించి వదిలివేయాలి. 


37. హృదయంలో ఒకడిమీద ద్వేషం పెట్టుకోవటము, అతడంటే తనకు ఇష్టంలేదని అందరిలోనూ అనటము, వాడిమీద వైరభావము పెట్టుకోవడము, ఇట్లాంటివి ఉండకూడదు. ఎందుకంటే తన ఇస్టాఇస్టాలకు అక్కడ తావులేదు. అది Public administration. ప్రతీవాడికి ఏదో స్వభావం ఉంటుంది. ఏదో మతం ఉంటుంది. వాడిని dislike చేసినప్పటికీకూడా వాడితో రాజు వైరం పెట్టుకోకూడదని స్నేహమే పాటించాలని భరద్వాజుడు రాజనీతి బోధించాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 113 🌹

🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 18 🌻


472. సంస్కారములున్నంతవరకు, సృష్టి నిలిచి యుండును, భగవంతుడు మరుగుపడి యుండును.


473. సంస్కారములు నాశనమైనచో సృష్టి అదృశ్యమగును. భగవంతుడు కాన్పించును.


474. సంస్కారముల వలననే, సృష్టిలో నిద్రావస్థయు, జాగ్రదవస్థయు పగటి జీవితమును స్థాపింపబడుచున్నవి.


475. భగవంతుడు రూపముతో తాదాత్మ్యము చెందుటకు సంస్కారములే కారణము.


476. సంస్కారములే అనుభవమును ఇచ్చును.


477. అది ప్రేరణము యొక్క పరిమాణు ప్రమాణమైన తొలి సంస్కారమే, ఆత్మ యొక్క అనంత చైతన్య రాహిత్య స్థితికి, పరమాణు ప్రమాణమైన తొలి చైతన్యము నొసంగినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[02:47, 04/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


169వ నామ మంత్రము


ఓం క్రోధశమన్యై నమః


కోపము శత్రువు వంటిది. కోపము అజ్ఞానమునకు చిహ్నము. కోపము గలవాడు చేయు యజ్ఞములు, జపములు, పూజలు నిష్ఫలములు.  తన భక్తులలో అట్టి కోపమును నశింపజేయు తల్లికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి క్రోధశమనీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం క్రోధశమన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని అత్యంతభక్తి తత్పరతతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే తొలుత తనలో తనకు శత్రుసమానముగా ఉండు కోపము నశించును. పిదప జగన్మాత నామ స్మరణపై నిమగ్నత అధికమై ఆత్మానందానుభూతిని పొందును. సుఖసంతోషములతో జీవించును. అంత్యమున జన్మరాహిత్యత కూడిన మోక్షము లభించును.


కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము ఈ ఆరింటిని అరిషడ్వర్గములు అందురు. వర్గము అంటే కూటమి. అరి అంటే శత్రువు. అరిషడ్వర్గము అంటే ఒక శత్రువు ఏవిధంగా సంహరిస్తాడో అలాగే ఈ వర్గములో ఏలక్షణమైనా శత్రువుతో సమానమే.  అందునా క్రోధము చాలా ప్రమాదమైన శత్రువు. క్రోధము వలన ఫలితం వెంటనే తెలిసిపోతుంది. ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించవు. జగన్మాత పరమాత్మ స్వరూపిణి. కాబట్టి మనసుకు సంబంధించినది మరియు శరీరధారులకు ఉండే క్రోధము జగన్మాతకు ఉండదు. అందుచే ఆ తల్లి నిష్క్రోధా అనగా కోపము లేనిది అను నామ మంత్రముగలిగినది. తను నిష్క్రోధా యనబడుచున్నది గనుక తన భక్తులకు కూడా క్రోధము ఉండ కూడదు. అందుకు తన భక్తులలోని క్రోధాన్ని నశింపజేస్తుంది.


క్రోధయుక్తో యద్యజతి యజ్జుహోతి యదర్చతి|


సతస్య హరతే సర్వం ఆమకుంభో యథోదకమ్॥


పచ్చికుండలో ఉదకము (నీరు)  నిలబడనట్లు క్రోధము ఉన్నవాడు చేయు యజ్ఞములు, జపములు, పూజలు నిష్ఫలాన్ని ఇస్తాయి.  క్రోధము ఉన్నవాడు అజ్ఞానితో సమానం.  క్రోధము ఉన్నవాడు తనకు తెలియకుండానే అయినదానికి, కానిదానికి ఊగిపోతూ ఉంటాడు. అది ఆరోగ్యానికి కూడా మంచిదికాదు. రెండవది కోపం అనేది విచక్షణాజ్ఞానంలేకుండా చేస్తుంది. గనుక ఎదుటవారిని మానసిక మరియు భౌతికపరంగా హింసించడం జరుగుతుంది. దాని వలన క్రోధం కలిగి ఉండడం ఒక పాపమయితే, ఆ కోపంలో తాను చేయు హింసవలన మరింత పాపం సంచిత మౌతుంది. అపఖ్యాతిని మూటగట్టుకుంటాడు. లేదా తనను తానే శిక్షించుకొను రీతిలో తన యునికిని తానే పోగొట్టుకొని, తనతో పాటు, తనపై ఆధారపడినవారినికూడా ఇక్కట్లపాలు చేయడం జరుగుతుంది.  అందుకే తన కోపము తనకే శత్రువు అని అన్నారు పెద్దలు.


క్రోధస్య దుష్టత్వం ఆపస్తంబేనోక్తం క్రోధముయొక్క దుష్టత్వాన్ని ఆపస్తంబుడు చెప్పడం జరిగింది (ఆయన చెప్పడం ఏమిటి? అందరికీ స్వానుభవమే! కాదంటారా? ఎవ్వరూ అనరు.) అయినా. 

 

 జగన్మాత తన భక్తులలోని ఇంతటి ప్రమాదకరమైన క్రోధమును నశింపజేయును  గనుకనే క్రోధశమనీ యను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం క్రోధశమన్యై నమః అని అనవలెను.

12. అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్ |

ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||

🌷. తాత్పర్యం : 

ఓ భరతశ్రేష్టా! ఏదేని ఒక భౌతికలాభము కొరకు లేదా ఆడంబరము కొరకు నిర్వహింపబడు యజ్ఞము రజోగుణప్రధానమైనదని యెరుగుము. 


🌷. భాష్యము  :

కొన్నిమార్లు యజ్ఞములు మరియు ఆచారకర్మలు ఉన్నతలోక ప్రాప్తి కొరకు లేదా ఈ జగమున ఏదేని భౌతికలాభము కొరకు ఒనరించబడుచుండును. అట్టి యజ్ఞములు లేదా ఆచారకర్మలు రజోగుణ ప్రధానములైనవిగా భావింపబడును.

🌹 🌹 🌹 🌹 🌹


🌻146. అనఘః, अनघः, Anaghaḥ🌻


ఓం అనఘాయ నమః | ॐ अनघाय नमः | OM Anaghāya namaḥ


అఘం న విద్యతేఽస్య ఈతనికి ఏయొకదోషమును లేదు; ఏ పాపమూ లేనివాడు.


:: ఛాందోగ్యోపనిషత్ - అష్టమ ప్రపాఠకః, సప్తమః ఖండః ::

య ఆత్మాఽపహతపాప్మా విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సోఽపిపాస స్సత్య కామ స్సత్యసఙ్కల్ప స్సోఽన్వేష్ట వ్యస్స విజిజ్ఞాసితవ్య స్స సర్వాంశ్చ లోకా నా ప్నోతి సర్వాంశ్చ కామా న్య స్తమాత్మాన మనువిద్య విజానాతీతి హ ప్రజాపతి రువాచ ॥ 1 ॥


ఆత్మ పాపరహితమైనది, ముసలితనము లేనిది, మరణము లేనిది, దుఃఖము లేనిది, ఆకలి దప్పికలు లేనిది. ఆయాత్మ సత్యకామమును, సత్య సంకల్పమును అయియున్నది. ఇట్టి ఆత్మను శ్రద్ధగా వెదకి తెలిసికొనవలెను. ఈ రీతిగా తెలిసికొన్నవాడు అన్ని లోకములను, అన్ని కోరికలను పొందుచున్నాడని ప్రజాపతి చెప్పెను.


:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము (110) ::

మ. పరమాత్ముం డజుఁ డీ జగంబుఁ బ్రతికల్పంబందు గల్పించుఁ దాఁ

బరిరక్షించును ద్రుంచునట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ

ద్భరితుం గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ

శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తిఁ జింతించెదన్‌.


పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతికల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు. పాపరహితుడూ, బ్రహ్మస్వరూపుడూ, శాశ్వతుడూ, జగమంతా నిండినవాడూ, కేవలుడూ, సాటిలేనివాడూ, నిర్మలమైన జ్ఞానం కలవాడూ, సర్వాంతర్యామీ, తుదిమొదళ్ళు లేనివాడూ, గుణరహితుడూ, నిత్యుడూ అయిన ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తున్నాను.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥


[06:39, 04/12/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 121 🌹

🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 51 🌻


ముందు పృథ్వి అంతా జలమయమైంది. ఆ జలమయమైనటువంటి పృథ్వి మరల ద్వాదశ సూర్యుల చేత ఎండగట్టబడుతుంది. అగ్ని తప్తమైపోతుంది. అయః పిండమైపోతుంది. అయః పిండమైనటువంటిది కాస్తా వాయురూపాన్ని ధరిస్తుంది. 


ఆ వాయు రూపాన్ని ధరించింది కాస్తా ఆకాశంలో లయమైపోతుంది. ఎక్కడ నుంచైతే ఉత్పన్నమైనాయో అవి తమ తమ స్వస్థానమందు లీనమైపోతాయి. ఈ రకముగా ఈ పంచభూతాలు వాటి యొక్క వ్యక్తీకరణ, వాటి యొక్క లయాన్ని ఇక్కడ బోధించే ప్రయత్నం చేస్తున్నారు.


     మరలా ఎట్లా ప్రాదుర్భవిస్తాయి అండి అంటే, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలనేటటువంటి పంచకృత్యాలుగా బోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విత్తనము ఉన్నదండీ! విత్తనము స్వయంగా మొలకెత్తేస్తుందా? అంటే, దానికి నీళ్ళ యొక్క సంయోజనీయత జరిగి, దాని యొక్క బీజ కవచం ఉబ్బి సిద్ధంగా మొలక రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితి ఒకటి. మొలక ఎత్తేటువంటి స్థితి ఒకటి. మొలక ఎత్తిన తరువాత రెమ్మలు, కొమ్మలు వచ్చి కాండము ఏర్పడినటువంటి స్థితి ఒకటి. తరువాత పూలు, ఫలములు వచ్చేటటువంటి స్థితి ఒకటి. 


ఈ రకంగా చెట్టుకి ఈ స్థితులు ఎట్లా అయితే ఉన్నాయో, అట్లాగే ‘బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్‌ మహత్‌ మహదో మహదహంకారః, మహదహంకారో ఆకాశః’ అని ఎక్కడిదాకా చెబుతున్నామో దానిని చక్కగా వివరిస్తున్నారన్నమాట!


        ఒక చెట్టు యొక్క ఉత్పన్నము ఎట్లా అవుతుందో, అంకురం ఎట్లా వస్తుందో, ఆ అంకురం మొలక ఎట్లా అవుతుందో, ఆ మొలక కాండం ఎట్లా అవుతుందో, ఆ కాండమే ఫల పుష్పాదులను ఎట్లా ఇస్తుందో, ఆ ఉపమానాన్ని స్వీకరించి, విత్తనము ఏదైతే ఉందో, ఆ విత్తనము ఉబ్బినటువంటి స్థితి మహతత్త్వము. విత్తనము విత్తనముగా ఉంటేనేమో మహత్తు కంటే ముండు ఉన్నటువంటి అవ్యక్తము. అర్థమైందా అండి? ఆ అవ్యక్తము కంటే ముందున్నటువంటిది పరమాత్మ.


        కాబట్టి, అహం బీజ ప్రవర్తిత. అని, భగవద్గీతలో కూడా పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తియోగంలో చెబుతూఉన్నాడు. నేను బీజ ప్రదాతను. ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటి వాడను అనేటటువంటిది కూడా అక్కడ మనకు బోధిస్తున్నాడు. అక్షర పరబ్రహ్మ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రెండిటిని బాగా అధ్యయనం చేయాలన్నమాట. 


ఎవరైతే మహతత్త్వాన్ని, అవ్యక్తాన్ని, దానిపైనున్నటువంటి బ్రహ్మమును, తెలుసుకోవాలనుకుంటారో, వాళ్ళు ఈ భగవద్గీతలో అక్షరపరబ్రహ్మయోగాన్ని, పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని బాగా అధ్యయనం చేయాలి. బాగా అధ్యయనం చేయడమం అంటే భగవద్గీతని, అది ఉపనిషత్ సారముగా బోధింపబడింది కాబట్టి, ఏ ఉపనిషత్తుల నుంచి ఆయా శ్లోకములు స్వీకరించబడినాయో, ఆయా ఉపనిషత్తులని కూడా చదువ వలసినటువంటి అవసరం ఉంది. 


అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. శ్రవణం చేయాల్సిన అవసరం ఉంది. మనన నిధిధ్యాసలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చదివేటటువంటి వాళ్ళు మాత్రమే భగవద్గీతను క్షుణ్ణంగా చదివినట్లు. 


ఎక్కడికక్కడ వ్యాఖ్యాన సహితంగా ఉన్నటువంటి గ్రంధాలలో, ఆ యా వాక్యములను, ఏ ఉపనిషత్తుల నుంచి స్వీకరించబడ్డాయో, ఏ ఉపనిషత్ వాక్యములకు సమన్వయం అవుతుందో, శ్వేతాశ్వతరోపనిషత్, కఠోపనిషత్ ఇలా అనేక రకాలైనటువంటి, సమన్వయీకరించబడేటటువంటి ముండక, మాండూక్య, కేన, బృహదారాణ్యక. ఈ ఉపనిషత్తుల యొక్క వాక్యాలన్నింటినీ కూడా, ఈ భగవద్గీతకు అనుసంధాన పరచి, వ్యాఖ్యన విశేషాలు లభిస్తోంది. 


కాబట్టి, అటువంటి వ్యాఖ్యాన విశేషములను చదివేటప్పుడు కూడా, ఈ సమన్వయంతో చదువుకోవల్సినటువంటి, అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే భగవద్గీతను బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అప్పుడే సమగ్రమైనటువంటి అవగాహన కూడా కలుగుతుంది. 


అప్పుడేమి తెలుస్తుందంటే, సర్వవేదాంత గ్రంథములన్నియూ కూడా ఆత్మనిష్ఠ, బ్రహ్మనిష్ఠ, పరబ్రహ్మనిర్ణయం అనేటటువంటి లక్ష్యాలు దిశగానే బోధించారు అనేటటువంటి సుస్పష్టమైన మార్గము బోధపడుతుంది. - విద్యా సాగర్ స్వామి 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[06:39, 04/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 286 🌹 


🌻. శ్రీరామునకు పరీక్ష  - 2 🌻


నేను, విష్ణువు, సర్వదేవతలు, మహాత్ములగు మునులు, మరియు సనకాది సిద్ధులు సర్వదా ఆయనను సేవించెదము (18). నిత్యము ఆనందముతో ఆయన కీర్తిని గానము చేయు శేషుడు ఆ కీర్తియొక్క అంతమును చేరలేక పోయెను. కుమారా! ఆ శంకరప్రభువు మంగళముల నిచ్చును (19). 


ఈ చిత్త భ్రాంతి అంతయూ ఆయన లీలవలననే సంప్రాప్తమైనది. దీని యందు ఎవ్వరి దోషము లేదు. సర్వవ్యాపకుడగు ఆయనయే సర్వమును ప్రేరేపించుచున్నాడు (20). సత్తారూపుడు, లీలాపండితుడు నగు ఆ రుద్రుడు ఒక సమయమునందు సతితో గూడి వృషభము నధిష్ఠించి ముల్లోకములలో పర్యటించుచూ భూలోకమును దర్శించెను (21).


సత్యమగు శపథము గల ఆ ప్రభువు సముద్రముపై ఆకసములో పర్యటించుచూ, దండకారణ్యమునకు వచ్చి అచటి సౌందర్యమును సతీదేవికి చూపించుచుండెను (22). రావణునిచే మోసముతో అపహరింపబడిన ప్రియురాలగు సీతకొరకు లక్ష్మణునితో గూడి అన్వేషించుచున్న రాముని ఈ శివుడు అచట చూచెను (23).


 రాముడు 'హా సీతా!' అని బిగ్గరగా అరచుచూ, విరహముచే ఆవేశింపబడిన మనస్సు గలవాడై, ఇటునటు వెదకుచూ, అదే పనిగా ఏడ్చుచుండెను (24).  రాముడు ఆమెను పొందవలననే కోరికతో, ఆమె వెళ్లిన మార్గము కొరకు లతలను, వృక్షములను ప్రశ్నించుచుండెను. ఆయన బుద్ధి నష్టమయ్యెను. ఆయన సిగ్గును వీడి శోకముచే విహ్వలుడై యుండెను (25).


సూర్యవంశములో పుట్టినవాడు, వీరుడు, రాజకుమారుడు, దశరథుని పుత్రుడు, భరతుని అన్న అగు రాముడు ఆనందమును గోల్పోయి, కాంతి విహీనుడై, ఉండెను (26). తల్లి కోరిన వరములకు అధీనుడై అడవిలో లక్ష్మణునితో కలిసి తిరుగాడు చున్న రామునికి విశాలహృదయము గలవాడు, పూర్ణకాముడునగు ఆ శివుడు ఆనందముతో నమస్కరించెను (27). 


భక్తవత్సలుడగు శంకరుడు మరియొక్క స్థానమునకు వెళ్లుచూ అడవిలో రామునికి తన దర్శనమునిచ్చి 'జయ' అని పలికెను (28). మోహింపజేసే ఇట్టి శివలీలను చూచి, శివమాయచే విమోహితురాలైన సతీదేవి మిక్కిలి విస్మయమును పొంది శివునితో నిట్లనెను (29).


సతీదేవి ఇట్లు పలికెను -


ఓ దేవదేవా! పరబ్రహ్మా!సర్వేశ్వరా!పరమేశ్వరా! హరిబ్రహ్మాది దేవతలందరు సర్వదా నిన్ను సేవించెదరు (30). సర్వులచే సర్వదా నమస్కరింప , సేవించ, ధ్యానించ దగినవాడవు నీవే. మానవుడు నిర్వికారి, పరమాత్మ అగు నిన్ను ప్రయత్న పూర్వకముగా వేదాంతములనుండి యెరుంగ వలెను (31). 


ఓ నాథా! విరహముచే దుఃఖితమైయున్న ఆకారము గలవారు, వనమందు దీనులై కష్టపడుతూ తిరుగుతున్నవారు, వీరులు, ధనుర్ధారులునగు ఈ పురుషులిద్దరు ఎవరు?(32). 


వారిద్దరిలో నల్లకలువ వలె శ్యామ వర్ణము గల జ్యేష్ఠుని చూచి నీవు భక్తుని వలె ప్రసన్నుడవై సంతసించుటకు కారణమేమి?(33). ఓ శంకరస్వామీ! నీవు నా ఈ సంశయమును నివారింప దగుదువు. ఓ ప్రభూ! స్వామికి సేవకుడు ప్రణమిల్లుటయే యుక్తముగ నుండును గదా!(34).


బ్రహ్మ ఇట్లు పలికెను -


ఆదిశక్తి, పరమేశ్వరి, శివుని అర్థాంగి అగు ఆ సతీదేవి శివుని మాయకు వశురాలై శివప్రభువును ఇట్లు ప్రశ్నించెను (35). పరమేశ్వరుడు, లీలాదక్షుడునగు శంకరుడు సతీదేవి యొక్క ఆ మాటను విని నవ్వి ఇట్లనెను (36).


సశేషం....

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |

శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖


🌻 128. 'సాధ్వీ' 🌻


అనన్యసామాన్యమైన పాతివ్రత్యము కారణముగ శ్రీలలితను సాధ్వీ అని పిలుతురు.


పాతివ్రత్యులకు పార్వతీదేవియే అధిష్టాన దేవత. ఆమె పూర్వ జన్మమున సతీదేవి. “సతి, సాధ్వీ, పతివ్రత అని అమరకోశమున సతీదేవిని ఉదహరింతురు. ఆమెయే మరల జన్మించి, మరల శివుని కొఱకై తపస్సుచేసి శివుని చేరినది. 


భూత, భవిష్యత్, వర్తమాన కాలములందు వేరొక పురుషునితో భర్త సంబంధము లేకపోవుటచే ఆమె పతివ్రత. ముందు జన్మములందు పొందిన భర్తనే జన్మ జన్మలకు పొందుట పాతివ్రత్యమని పురాణములు తెలుపుచున్నవి. 


పాతివ్రత్య విషయమున పార్వతీదేవినే స్మరించుటకు శంకరులీ విధముగా తెలిపినారు. "సరస్వతీ అనుగ్రహముగల కవులందరునూ సరస్వతీపతులే. ధనముగలవాడెల్ల లక్ష్మీపతియే కాని పార్వతీదేవి విషయమట్లు కాదు. మహాదేవులకు తప్ప, ఆమె ఎవ్వరికినీ వశము కాదు”. అట్లు అనన్య సామాన్యమైన పతివ్రత అయిన పార్వతిని 'సాధ్వి' అని పిలుతురు.


పర్వతరాజునకు పుట్టినప్పుడు కూడ తాను శివునే వివాహ మాడుదునని ప్రకటించి లోకముల నాశ్చర్యపరచిన మహాసాధ్వి ఆమె. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


[06:39, 04/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 68 / Sri Lalitha Sahasra 

     పురాతనమైన, వైశ్వికమైన సనాతన సాంప్రదాయం...మానవునిలో సప్త భూమికలను కనుగొన్నది. 1. భౌతిక శరీరం 2. ప్రాణము 3. సూక్ష్మ శరీరం 4. పశుత్వం 5. మానవత్వం 6. ఆధ్యాత్మికం 7. దివ్యత్వం . ఈ దివ్యత్వాన్ని సమాధి అంటారు. సమాధిలో ఈశ్వర చైతన్యాన్ని ఒక సాధకుడు అనుభవిస్తాడు. చిత్తానికి ఆధారమైన ఆత్మ శక్తి ఈ ఏడవ స్థితిలో వ్యక్తం అవుతుంది. మనస్సు సమాధిలో ప్రవేశించడం వలన, మనస్సు ద్వారా కొన్ని లేదా చాలా సిద్ధులు వ్యక్తం అవుతూంటాయి. 


   సమాధి స్థితిని చేరిన యోగి దేశకాలాల పరిధి దాటిన స్థితిలో ఆ పరమాత్ముడితో కూడా ఐక్య జ్ఞానాన్ని సాధిస్తాడు. అనంత శక్తినిలయమైన పరమాత్ముడి ద్వారా దివ్య శక్తులు ప్రవహించడానికి జీవాత్మ ఒక పరికరంగా భాసిస్తుంది.



    మనిషి తనను తాను స్వస్థత పరచుకోవడం - ఒక సిద్ధి :


 మన ఉనికిని నిర్దేశించే ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకొని, జీవితాన్ని ఎవరు గడుపుతారో వారు మంచి ఆరోగ్యంతో ఉంటారు. "యద్భావం తద్భవతి "...అనే వాక్యంలో, గొప్ప వైశ్విక సత్యం ఉంది. మన భావం ప్రకృతి బద్ధ జీవనం అయితే, ఫలితం గొప్ప ఆరోగ్యంగా ఉంటాము. ఒక  పూర్ణుడైన యోగి జబ్బు పడడు. అతడు సమాధి స్థితిని సాధించి ఉండడం వలన, అతను వైశ్విక ప్రాణ శక్తితో నిరంతరం అనుసంధానం అవ్వడం వలన...పూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు. ఒక హఠ యోగి అయితే, తాను జబ్బు పడడానికి ఇష్టపడడు. అయితే అతడు ఏ ఒక్కనాడైనా కర్మను అనుభవించాల్సి వచ్చినపుడు...జబ్బు పడవచ్చును. నిత్యమూ సమాధి స్థితిలో ఉన్న వాడు, ప్రాపంచిక వ్యవహారాల్లోకి రావడం అంతగా ఇష్ట పడడు. 


మనో స్వస్థత - ఒక సిద్ధి :


    మనో శక్తి ఒక సహజ శక్తి. ఆ శక్తి స్పృహతో రోగి అర్థబాహ్య మనస్సులోకి, సూటిగా ప్రయోగించబడుతుంది. ఇక్కడ బాహ్య మనస్సు కంటే (స్థూల మనస్సు), సూక్ష్మ మనస్సు వ్యాపక శక్తి విశాలమైనది. బాహ్య మనస్సు, నేను-నాది అనే పరిధిలో ఉండి పోతుంది. ఎరుక గలిగిన మనస్సు, శరీరము యొక్క రోగాన్ని అదుపు చేసి, మనో స్వస్థతకు కారణమై అద్భుత ఫలితాలనిస్తుంది. మనస్సు బాగుంటే, శరీరము బాగుంటుంది.


అష్ట సిద్ధులు - మహిమా సిద్ధి :


 మహిమా సిద్ధి అనగా తన శరీరాన్ని, అనూహ్యమైన పరిమాణంలోకి పెంచుకోవడం. హిందూ పురాణ, ఇతిహాసాది సాహిత్యంలో ఈ మహిమా సిద్ధికి సంబంధించి, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు, శ్రీమద్రామాయణంలో, హనుమంతుడు సందర్భాన్ని బట్టి...ఎన్నో సిద్ధులు ప్రదర్శిస్తాడు కదా! అలాగే భగవద్గీతలో గల విశ్వరూప సందర్శన యోగంలో...మనము ఆ భగవానుని విశ్వరూపాన్ని చూస్తాము కదా!


 || అనేక వక్త్రనయన మనేకాద్భుతదర్శనమ్

అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్||


|| దివ్యమాల్యామ్బరదరం దివ్యగన్ధానులేపనమ్

సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతో ముఖమ్.||


---విశ్వరూప సందర్శన యోగం, భగవద్గీత


తాత్పర్యం : పెక్కు ముఖములు, నేత్రములు కలదియూ,అనేకములగు అద్భుత విషయాలు చూపునదియూ, దివ్యములైన పెక్కు ఆభరణములతో కూడినదియూ, అనేక దివ్యాయుధములతో కూడినదియూ, దివ్యములైన వస్త్రములు-పుష్ప మాలికలతో కూడినదియూ, అనేక ఆశ్చర్యములతో నిండియున్నదియూ, ప్రకాశ మానమైనదియూ,అంతము లేనిదియూ....అయిన ఆ విశ్వరూపమును...భగవానుడు-అర్జుననుకు చూపిరి.


 || అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామిత్వాం సర్వతోఽనన్త రూపమ్

నాన్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా ||


---విశ్వరూప సందర్శన యోగం, భగవద్గీత


తాత్పర్యం : ఓ జగద్రూపా! మిమ్ము, అనేక హస్తములు, ఉదరములు, ముఖములు, నేత్రములు గలవారిగను, అనంత రూపులు గనూ నేను చూచుచున్నాను. మరియూ మీ యొక్క తుది - మధ్యము - మొదలును గాని, నేను గాంచజాలకున్నాను.


    ఇలా భగవంతుని శక్తిని మనము పవిత్ర గ్రంథాలలో చూస్తాము. అయితే మనిషి సాధించే సిద్ధులకు-భగవద్విభూతులకు...హస్తిమశకాంతరం ఉంది!!!


   మరో విషయం. మహిమా సిద్ధితో అనుసంధానించబడిన మరొక సిద్ధి దూర దృష్టి. దీనిని clairvoyance అంటారు. 


   ఈ మహిమా సిద్ధిని ప్రదర్శించగల యోగులు ఉన్నత స్థాయి యోగులు. ఈ సిద్ధిని ప్రదర్శించగల యోగులు అరుదుగా ఉంటారు. ఒక పూర్ణుడైన యోగి కూడా ఈ సిద్ధిని అరుదుగా ప్రయోగిస్తాడు.


    యోగ సిద్ధిని పొందిన యోగి సూర్య కాంతిని వినగలడు. శబ్దాన్ని చూడగలడు కూడా. దూరంగా ఉన్న వస్తువు పరిమళాన్ని రుచి చూడగలడు కూడా...దూరంగా ఉన్న పదార్ధాల సుగంధాన్ని ఆఘ్రాణించగలడు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? మన ఇంద్రియాల సహజ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం వల్లనే...ఇవన్నీ సాధ్యమవుతాయి. ఒక యోగి, సతత ధ్యానం ద్వారా...తన ఇంద్రియాల సామర్థ్యాన్ని...ఎన్నో రెట్లు అధికం చేయగలడు. ఇంద్రియాల లోని నిబిడీకృతమైన అతీంద్రీయ జ్ఞానమంతా, ధ్యానంలో ఒకే ఒక్క విషయంపై పొందే ఏకాగ్రత వలన వెల్లడి అవుతుంది. సిద్ధులు, అతీంద్రియానుభూతులు ఈ విధంగా కూడా ప్రకటితమవుతూ ఉంటాయి.


    కుండలినీ శక్తి జాగృతమైన యోగి, తన సాధనల ప్రభావంలో ఉన్నప్పుడు...అతని భౌతిక శరీరమందలి అవయవాలన్నీ, మంచి సామర్థ్యంతో చురుకుగా ఉంటాయి. అటువంటి యోగి శరీరం దివ్యానుభూతులు,సిద్ధులు ప్రకటనం కావడానికి అనుకూలంగా ఉంటుంది.


సశేషము

[13:07, 04/12/2020] +91 7013 527 083: హాలో ఎర్త్  - అగార్తా - హిందూ పురాణేతిహాసాల సమన్వయం - వైజ్ఞానిక విశ్లేషణ 


             

      భూ ఉపరితలం క్రింద, ఏదైనా నాగరికత ఉందా? లేక కేవలం ఘన పదార్ధంగానే భూమి ఉందా? నికెల్, ఇనుము, తదితర లోహాలు, మట్టి, రాళ్ళు రప్పలతోనే భూమి యొక్క ఉపరి భాగం తర్వాత పొరలు ఉన్నాయా? లేక ఏవైనా భూగర్భ నాగరికతలు ఉన్నాయా? ఈ ప్రశ్న జిజ్ఞాసువైన ప్రతి ఒక్కరికీ వస్తుంది. అయితే భూమి గూర్చి, భూస్వరూపాల గూర్చి మనిషికి తెలిసినది తక్కువే. తెలుసుకోవలసినది చాలా ఉంది.


    ఈ నేపథ్యంలో "హాలో ఎర్త్" (Hollow Earth) సిద్ధాంతం ప్రకారం....భూమి క్రింద గల"అగార్తా" (Aghartha), .....గూర్చి తెలుసుకోవడం, కొంతైనా జిజ్ఞాసా పూర్వకంగా ఉంటుంది! 


అయితే "అగార్తా" .....హిందూ పురాణాల్లో చెప్పబడ్డ పాతాళ లోకమా? పరిశీలిద్దాం.

"అగార్తా" ఒక ప్రాచీన, మార్మిక నగరం. ఈ నగరం భూమి లోపలి పొరల్లో కలదు. చాలా సార్లు ఈ "అగార్తా"...."శంబల" నగరానికి సన్నిహితంగా ఉన్నట్లు కథనాలు చెబుతున్నాయి. శంబల ప్రస్తావన,  విష్ణు పురాణం నందు మనం కాంచవచ్చును.


    శంబల- కల్కి భగవానుడు-కలి యుగాంతం-పోతులూరి వీరబ్రహ్మం గారి కాల జ్ఞాన తత్వాలు-వీటిలో కలి యుగాంత ప్రస్తావన....అలాగే భవిష్య పురాణంలో కూడా కలియుగాంత ప్రస్తావన....ఇదంతా....చదువరులందరికీ తెలిసిన విషయమే !!!


ఆధ్యాత్మిక జిజ్ఞాసువులైన చాలామందిలో....కొంత మందికైనా "శంబల" గూర్చి తెలుసు. (గతంలో నేనే శంబల గూర్చి కొన్ని వ్యాసాలు ఇచ్చాను. ఆసక్తి కలవారు చదువగలరు.)


     మానవ పరిణామ క్రమంలో...మన కంటే ముందున్న బుద్ధి జీవుల నివాసమే "శంబల". శంబల వాసులు, తపస్వులు. నిరంతరం ఊర్థ్వ చైతన్యంతో సంబంధం కలిగి ఉంటారు. శంబల వాసులు ....నిరంతరం ఉన్నత తలాలతో (డైమన్షన్స్) సంబంధం కలిగి ఉంటారు. శంబలను జంగమ దేవరల నివాస స్థలంగాను, విస్మృత దైవీక రాజ్యం గానూ, శ్వేత-జలాల భూమి గానూ, జీవించే అగ్ని గల భూమి గానూ కూడా "శంబలను" గుర్తిస్తారు.


    ఇక "అగార్తా" విషయానికొద్దాం. చాలామంది పరిశోధకుల ప్రకారం "అగార్తా" అన్న భూగర్భ నగరానికి  వెళ్ళడానికి కొన్ని దారులున్నాయి. Kentucky Mammoth Cave - USA, బెర్ముడా ట్రయాంగిల్, భారత్-టిబెట్ సరిహద్దు హిమాలయాలు, భూమి యొక్క ధృవ ప్రాంతాలలోని గుహ్యమైన మార్గాలు....వీటి ద్వారా "అగార్తా"కు వెళ్ళే మార్గాలున్నాయని చెబుతున్నారు. అయితే భారత-టిబెట్ దేశాలలో మాత్రం ....ఆయా మార్మిక దారులన్నీ, శక్తివంతులైన హిందూ-బౌద్ధ యోగులచే కాపాడబడుతున్నాయి. అర్హులకు మాత్రమే ఆ రహస్యాలు అందజేయబడుతున్నాయి.

 ప్రాచీన చరిత్రలు ఏం చెబుతున్నాయంటే, లక్షల సంవత్సరాల క్రిందట, అనేక కారణాల వలన, బుద్ధి జీవులైన కొందరు ప్రజలు భూగర్భంలో గల నగరానికి వలస వెళిపోయారు. వారు తమ స్వంతదైన అనుకూల పరిస్థితులతోనూ, పర్యావరణ అనుకూల పరిస్థితులతోనూ, తమకు గల మార్మిక, ఆధ్యాత్మిక అవగాహనతోనూ....తమ నివాసం అయిన "అగార్తా" నగరాన్ని నిర్మించుకున్నారు.


ఇక "హాలో ఎర్త్" సిద్ధాంత నిరూపణలకొస్తే, గత మూడు, నాలుగు శతాబ్దాలుగా భూమి లోపలి నాగరికతలను పరిశోధించే పరిశోధనలు ఎక్కువయ్యాయి. భూమి కేవలం మట్టి, రాతి ముద్ద కాదు. శాస్త్ర వేత్తల ప్రకారం,వారి పరిశోధనల ప్రకారం భూమి కేంద్ర భాగంలో అతి వేడిగా ఉన్న మాగ్మా కలదు. కానీ "పాతాళావరణం " (hollow sphere) చుట్టూ దట్టమైన భూ ద్రవ్యరాశి (భూమి-భూ స్వరూపాలు) కలదు. ఉత్తర దక్షిణ ధృవాలలో తెరుచుకొనేటట్లుగానూ కూడా కలదు. ఈ భూమి లోపలి భాగంలో ఒక సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడని కూడా సిద్ధాంతాలు చెబుతున్నాయి. "హాలో ఎర్త్" సిద్ధాంతం ప్రకారం భూద్రవ్యరాశి వలయం సుమారు 600 నుండి 800 మైళ్ళ వ్యాసం తోనూ, ధృవాల వద్ద 100 నుండి 1400 మైళ్ళ వ్యాసం తోనూ ఉన్నాయి అని హాలో ఎర్త్ సిద్ధాంతం చెబుతోంది. ఈ రకంగా కేంద్రంలో 7000 మైళ్ళతోనూ , ఈ పాతాళం విస్తరించి ఉందట.

 విచిత్రమైన విషయమేమిటంటే, భూమి-నీరు ఆవరించిన నిష్పత్తి పరిశీలిస్తే, భూమి ఉపరి భాగానికి, భూమి అంతర్భాగానికి (హాలో ఎర్త్) , పరస్పర విరుద్ధం గోచరిస్తోంది. భూమి పై భూభాగం,జల భాగముల నిష్పత్తి 1 : 4 అయితే, ఈ inner crust లో వీటి నిష్పత్తి 4 : 1 గా ఉంది. ఈ వైరుధ్యానికి కారణం భూమి పై భాగంలో ప్రవహించే జల స్వరూపాలైన సముద్రాలు,నదులు,సరస్సుల....వలన ఆ నిష్పత్తి 1 : 4 గా ఉంటే, ఆ జల స్వరూపాలు, వాటి క్రింద గల భూభాగంపైననే ఆధారపడి ఉన్నాయి కదా!


 "హాలో ఎర్త్" సిద్ధాంతాన్ని ధృవీకరిస్తూ, మన పురాణ, ఐతిహ్యాలలో కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. కొన్ని చూద్దాం.


     1. సగర పుత్రుల కథ - పాతాళ గంగ (బ్రహ్మాండ పురాణాంతర్గతం)...ఇతిహాసాలలో కూడా ఈ గాథ ఉందనుకోండి! ఆ కథ మరల ఒకసారి స్మరించుకుందాం.


సగర పుత్రుల కథ : 


సగరుడు  సత్య యుగానికి చెందిన గొప్ప చక్రవర్తి. సూర్య వంశం లేదా ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. రామాయణంలో దశరథ మహారాజు కి ఈయన పూర్వీకుడు.


ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు విదర్భ రాజకుమారి. మరొకరు  శైబ్య.


సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశుమంతుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగధేనువును పాతాళంలో (పాతాళం అనగా హాలో ఎర్త్ అని అగార్తా అని బలమైన భావన) దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపస్సు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.


భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దివిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నుముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది. ఇది మనందరికీ చాలావరకు తెలిసిన కథయే. ఈ కథలో చెప్పబడ్డ పాతాళమే, నేటి "హాలో ఎర్త్ (Hollow Earth) కావచ్చందామంటారా?  పరిశోధనార్హం.


2.  మహా విష్ణువు యొక్క కల్క్యావతారం :


శ్రీమద్భాగవతంలో, ద్వాదశ స్కందంలో చెప్పబడ్డ శ్లోకం ప్రకారం .......


కలియుగాంత కాలంలో, కల్కి భగవానుడు, ఈ శంబల నగరం నుండే ఉద్భవిస్తాడని, అతను భూమిపై అవతరించి "సత్య యుగ" స్థాపన చేస్తాడని చెప్పబడి ఉన్నది. ఈ విషయం పద్మ పురాణం, భవిష్య పురాణం లలో కూడా చెప్పబడినది. అయితే ఈ "శంబల" నగరం ఆనుపానులు ఇంకా, ఈ రోజుకీ తెలియ రాలేదు. రక రకాలుగా చెబుతున్నప్పటికీ అంతా మార్మికం !!! గూఢం !!! ఇలాగే ఉంటుంది. చాలా మంది పరిశోధకులు ఈ "శంబల" హాలో ఎర్త్ లేదా అగార్తా కు చెందిన నగరమే అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు టిబెట్ సాంప్రదాయాల ప్రకారం ఈ శంబల భూగర్భ నగరమే!

    


   శ్రీమద్రామాయణం ప్రకారం...భూమి లోపల కూడా జీవనం ఉంది అని తెలియడానికి తగు ఆధారాలున్నాయి.


సీతామాత, రావణునిచే అపహరించబడిన తరువాత, రావణుణ్ణి తాను వెంటాడి వేటాడతానని, భూమిలోపలి చీకటి గుహల పర్యంతం....తాను వెంట తరుముతానని, ఆయా ప్రాంతాల నుండి సీతమ్మను విడిపించి, వెనుకకు తీసుకువస్తానని, శ్రీరామునితో...లక్ష్మణుడు అంటాడు. దీనిని బట్టి ఆనాటికే , భూమిలో గల రహస్య ప్రాంతాలు తెలుసునని ఈ సంఘటన చెబుతోంది. రామాయణ కాలం నాటికే ఈ రోజు మనం చెప్పుకొనే అగార్తా, హాలో ఎర్త్....తెలుసును అందామా? ఆ అగార్తాయే పాతాళమా?


   ఇక రామాయణమందలి కిష్కింద కాండలో, వాలిని చంపడానికి...తన బలాన్ని నిరూపించుకొనే ప్రయత్నంలో శ్రీరాముడు...7 తాళ వృక్షముల ద్వారా తన నిశితమైన శరాన్ని సంధిస్తే, ఆ శరం, ఆ తాళ వృక్షములను ఖండిస్తూ...ఒక కఠిన మైన రాతిని చీల్చుతూ, పాతాళాన్ని స్పృశిస్తూ...తిరిగి తన అమ్ముల పొదిలోకి చేరుతుంది.


    బౌద్ధులు ఈ అగార్తా వాసులను, వీరు నివసించే అగార్తాను, అగార్తా గల పాతాళాన్ని (హాలో ఎర్త్)....ఎటువంటి సంకోచం లేకుండా విశ్వసిస్తారు......ఈ అగార్తాలో లక్షలాది మంది ప్రజలు నివసిస్తూ ఉంటారని, వారిలో గొప్ప లామాలతో , ఈ అగార్తా వాసులు...సంభాషిస్తూ ఉంటారని....బౌద్ధులు చెబుతూంటారు. దలైలామా, భూమి మీద గల ఆ రహస్య ప్రపంచానికి ప్రతినిధి అని నమ్మూతూంటారు....కొన్ని వేల సంవత్సరాల నుండి అగార్తా వాసుల,శంబల వాసుల సందేశాలు....తమ లామాలకు ప్రసారం చేయబడుతున్నాయని , బౌద్ధుల గాఢ విశ్వాసం. అనేక భూగోళ ప్రళయాల నుండి తట్టుకుని........ఈ భూ అంతర్భాగంలో నివసిస్తున్న ఈ అతి మానవ జాతి గొప్ప మేధో సంపత్తి కలది....!


   రష్యన్ చిత్రకారుడు, తాత్వికుడు....నికోలాస్ రోరిక్ ఇలా చెబుతాడు. టిబెట్ రాజధాని లాసా , శంబలకు వెళ్ళే ఒకానొక రహస్య మార్గంతో కనెక్టు చేయబడిందని....తనకు ఒక సిద్ధుడైన,తాపసి అయిన లామా చెప్పాడని చెబుతాడు.


అయితే ఈ అగార్తా వాసులు, మన మానవ జాతి కంటే కూడా హెచ్చు వయస్సు కలవారని, మార్మికులు చెబుతూ ఉంటారు. వారికి, ఒక్కొక్కరికీ కొన్ని వేల సంవత్సరాలు....భట్టాచార్య....ఉన్నప్పటికీ , ఒక్కొక్కరూ విచిత్రంగా 35-40 సంవత్సరాల వయస్కులుగా ఉంటారట. వారు ఇచ్ఛా శరీరధారులు కూడా!


   వారికి "రాత్రి" తెలియదుట. పొగ చూరిన సూర్యుడు లేదా మబ్బుపట్టిన సూర్యుని వెలుతురు....ఈ అగార్తా కేంద్రకంలో భాసిస్తూ ఉంటుందట. మనం భూమ్యాకర్షణ శక్తికి లోనై ఉంటాము కదా! కానీ ఈ అగార్తాలో ఈ భూమ్యాకర్షణ శక్తి చాలా తక్కువ ఉంటుంది. లేదా ఆ శక్తి ఇక్కడ ప్రభావం చూపడం తక్కువ...... ఫలితంగా ఇక్కడి  జీవుల  శరీరాలు తేలికగా ఉంటాయి. ఈ అగార్త పరిశోధకులు చెప్పినదాని ప్రకారం అగార్తా లో ఎప్పుడూ 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, ఇక్కడ gravitational force తక్కువగా ఉండడం వలన ఇక్కడ మనుజులు, చాలా తక్కువ బరువును కలిగి యున్నట్లు భావిస్తారు.


[ భాగవతము

శ్రీగురుభ్యోనమః


*9 వ రుద్రుడు : కాలుడు - ఇరావతి 

ఇరావతి అంటే మెరుపుతీగ లాగా అప్పటికప్పుడు మంచి ఆలోచన భాసిస్తుంది. మామూలుగా ఆలోచన రావడం వేరు. మెరుపు ఆలోచన రావడం వేరు. ఒక్క మెరుపు ఆలోచన వలన జీవితములో అత్యద్భుతమైన  కార్యాన్ని నిర్వర్తిస్తారు. కాలుడు ఈ స్పూర్తి నిస్తాడు.*



మంచి ఆలోచన వచ్చి వెళ్ళిపోతుంది. ఒక పుస్తకములో వ్రాసుకొని కాలహరణము లేకుండా నిర్వర్తించగలగాలి. మంచి ఆలోచన మనము తలచుకుంటే రాదు. కాలము రూపములో కాలుడు అందిస్తాడు. ఇవ్వడము కాలుడిచ్చినా, దానిని మనము పొందిక చేసుకోవడము ఇరావతి అనే శక్తి వలన కలుగుతుంది.

"ఋభుగీత " (197)

🕉🌞🌎🌙🌟🚩


ఋభు నిధాఘ సంవాదము"

15వ అధ్యాయము 


సత్యం  నిశ్చయాత్మకమైనది !!


అద్వైతం అనేది ఉత్కృష్టమైన జ్ఞానం. అది ఒక సిద్ధాంతం కాదు. పరమసత్యం. వాస్తవదృష్టి వచ్చిన ప్రతివారికీ అనుభవంలోకి వచ్చే సార్వజనీన సర్వకాలీనమైన సత్యం. అందుకే సత్యాన్ని తెలుసుకోవడమేగానీ నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మకం అనేది భౌతికమైన అంశాల విషయంలో మనసు స్థాయిలో ఉంటుంది. సత్యం అలాకాదు. విషయం అర్థమైన తర్వాత సహజంగా ఏర్పడే నిశ్చయాత్మకమైన విశ్వాసంగా ఉంటుంది. అందుకే ఋభువు నిధాఘుడికి యోగీశ పునశ్చరణమేల... ఈ నిశ్చయముతోనే ఉండు. ఈ నిశ్చయం వల్లనే 'బ్రహ్మమగుదువు" అని స్పష్టం చేస్తున్నారు. ఆరంభంలో పరమ తత్త్వమును మరల వినమనీ, అది మోక్ష ప్రదాయకమని చెప్పి చివరికి పునఃశ్చరణతో పని లేదని చెప్పారు !


🕉🌞🌎🌙🌟🚩

🌷89-మంద్రగీత🌷

🥀 శాస్త్రవిజ్ఞానము🥀


17. ఇట్లు నన్ను చేరుటకు మార్గములు నాలుగు:-


1. ఆర్తి లేక బాధ

2. జిజ్ఞాస లేక కుతూహలము

3. అర్థము లేక ప్రయోజనాపేక్ష

4. జ్ఞానము లేక స్వస్వరూపము.



వారిలో జ్ఞాని అనగా నిత్యము నాయందు యోగ స్థితి చెందువాడు. స్మరింపబడు నేను ఒక్కడినే కనుక వానికి ఏకాంత భక్తి అలవడి ఉత్తమునిగ చేయును. జ్ఞానికి నాకన్న ప్రియమైన వస్తువు లేదు. నాకు జ్ఞాని కన్నా ప్రియము లేదు.



18. నాలుగు విధములుగా నన్ను చేరు వారు మంచివారే! కాని జ్ఞాని అనగా నేనే! ఇది నా మతము. అతడు ఆత్మ యోగము కలవాడై నన్ను గతిగా చేరుతున్నాడు.



19. దీనికి అనేక జన్మలు పట్టవచ్చును. జన్మల అంతమున జీవి జ్ఞానవంతుడై నన్ను చేరక తప్పదు. సమస్త జీవుల చర్యలను వాసుదేవుడని అతడు దర్శించును. వాసుదేవుడనగా జీవులలో వసించు దేవుడు. దీనిని దర్శించిన వాడు మహాత్ముడు అనగా అందరిలోని పెద్ద ఆత్మ లేక నేను.



20. జ్ఞానము నందు స్థిరత్వము చెందక మునుపు కలుగు జన్మలలో ఆయా కోరికలుగ జ్ఞానము హరింపబడు చుండును. అట్టివారు అన్యదేవతలను శరణు పొందుదురు. అనగా తనకన్న అన్యునిగా దేవుని తెలిసికొనగోరుటలో అనేక ఆకార నామ రూప భేదములను, ప్రయోజన భేదములను పొందుచున్నారు. ఒక్కొక్కని స్వభావమును బట్టి, అనగా త్రిగుణాత్మక ప్రకృతిని బట్టి అతడు ఆరాధించు దేవత ఏర్పడును. శివుడు, విష్ణువు, మొదలు గంగానమ్మ, పోలేరమ్మ వరకు గల దేవతలు ఇట్టి వారే! దేవత అనగా దేవుని యందు ప్రతిబింబించు సాధకుని విగ్రహము లేక మొగము, కొందరికి వ్యక్తులే ప్రయోజనములు సమకూర్చు దేవతలు. కొందరికి ధనము దేవత. వాని ప్రకృతిని బట్టి వాని దృష్టిని ఆకర్షించు కేంద్రమే దేవత. ఒక్కొక్కడు తన దేవతను, స్వభావమును అనుసరించి నీతులను, నియమములను, నిబంధనలను ఏర్పరచుకొని అందు వర్తించును. రజోగుణము ఎక్కువయినచో తన నిబంధనలతో ఇతరులను గూడ దమింప చూచును.



చిత్రస్థ పర్వతాదీనాం వస్త్రాభాసో న లిఖ్యతే ౹ సృష్టిస్థ మృత్తికాదీనాం చిదాభాసస్తథా నహి ౹౹9౹౹

9. పటచిత్రమునందలి పర్వతములు మొదలగు వానికి వస్త్రాభాసలు,కల్పిత వస్త్రములు, చిత్రింపబడవు.అట్లే సృష్టియందలి మట్టి,శిలలు మొదలగు వానికి చిదాభాస కూడా ఉండదు.

చిదాభాసుడు మనఃప్రకాశముగా అగుపించు ఆత్మయొక్క భావన.

ఒకటి మూడు అగును,మూడు అయిదు అగును,అయిదు అనేకమగును.

అనగా నిర్మలమైన ఆత్మ(ఒకటిగా ఉన్నట్లు అగుపించు సత్త్వము), సంపర్కము ద్వారా మూడు(సత్త్వ,రజస్తమస్సులు)

అగును.ఆ మూడింటితో పంచభూతములు జనించును.ఆ అయిదింటితో సమస్త విశ్వము ఆవిర్భవించును.

ఇదే దేహము ఆత్మయని భ్రాంతిని కలిగించును.

జీవాత్మ యందు ప్రతిఫలించిన విధముగా,ఆకాశపరిభాషలో అది మూడు వర్గములు(విధములు)గా విభజింపబడి యున్నట్లు వివరింపబడినది.

నిరవధికమయిన శుద్ధచైతన్యము, నిరవధికమయిన మానసిక చైతన్యప్రపంచము,నిరవధికమయిన పదార్థప్రపంచము (చిదాకాశము,చిత్తాకాశము,భూతాకాశము).

మనస్సు(చిత్తము)తన త్రివిధరూపములుగా అనగా,

మనస్సు,బుద్ధి,అహంకారములుగా విభజింపబడినప్పుడు,అది అంతఃకరణమనబడును.కరణము అనగా ఉపకరణము(సాధనము లేక పనిముట్టు)అని అర్థము.

కాళ్ళు,చేతులు,ఇతర దేహావయవములు బాహ్యకరణములు,దేహములోపల పనిచేయు ఇంద్రియములు అంతఃకరణములు.

ఆ ఆత్మభావన లేక ఈ అంతఃకరణములతో పనిచేయు ప్రకాశమానమనస్సు జీవుడు అనబడును.

స్పర్శ వేద్యమయిన శుద్ధచైతన్యరూపము యొక్క ప్రతిబింబమయిన మానసికచైతన్యము పదార్థప్రపంచమును చూచునపుడు దానిని''మానసాకాశము"అందురు.

కానీ అది స్పర్శవేద్యమయిన శుద్ధచైతన్య రూపమును చూచునప్పుడు,దానిని

"సంపూర్ణ చైతన్యము"  

(చిన్మయము)అందురు.

అందువలననే

"మానవుని బంధ-మోక్షములు రెండింటికిని మనస్సు కారణము"-

అని చెప్పిరి.ఈ మనస్సే అనేకభ్రాంతులను కల్పించును.ఈ రాగబంధాలతో జీవులు బహు విధములుగా సంసార చక్రమున పరిభ్రమిస్తూవుంటారు.

పరమాత్మస్థితి ఎట్టి మార్పు లేనిది, పొందనిది.మరియు అది మలినము(జననమరణాలు) కాదు. మాలిన్యమే కల్పితము, కల్పనయే మాలిన్యము. దీనిని తెలిసికొన్నప్పుడు కల్పన(ఊహ)త్యజింపబడి మాలిన్యము నివర్తించును.

తన స్వరూపము ఆత్మవిచారణవలన పైన పేర్కొన్న తత్త్వరహస్యము నిశ్చయింపబడిన యెడల బాహుళ్యము (నానాత్వము) అయిదుగాను,

అయిదు మూడుగాను, మూడు ఒకటిగాను లయించును.

తలనొప్పికి మందువేసుకొని వదిలించుకున్న పిదప నీవు సహజముగా(పూర్వము)ఉండినట్లే ఉందువు.తలనొప్పి, దేహమే ఆత్మ అనుభ్రాంతివంటిది.ఆత్మవిచారణ అను ఔషధమును ఇచ్చినప్పుడు అది అదృశ్యమగును.

నిత్యసత్యుడుగా మిగులుదువు.


***

-శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచితం అద్వైత వేదాంత  గీతం


సావేరి రాగః - ఆదితాళమ్‌.



 భజరే - యదునాథమ్‌.

భజరే యదునాథం - మానస -

భజరే యదునాథమ్‌||



1. గోపవధూ పరిరమ్భణలోలం

గోప కిశోరక మద్భుతలీలమ్‌||

 || భజ||



2. కపటాఙ్గీకృత మానుషవేషం

కపటనాట్యకృత కుత్సితవేషమ్‌||

|| భజ||



3. పరమహంసహృత్‌ తత్త్వస్వరూపం

ప్రణవపయోధర ప్రణవస్వరూపమ్‌||

 || భజ||



తాత్పర్యము:-


1. మానసమా! యదుకులతిలకుని, యాదవశిరోరత్నమును శ్రీకృష్ణచంద్రుని సేవింపవే!

గోపీప్రియుడై, వారిని కౌగిలిలో గొనుటకై వేచిచూచు గోపకిశోరుని - ప్రభువును - ఓనాచిత్తమా! హత్తి నిలువవే! తన లీలచే ఎల్లలోకమును ఆశ్చర్యరసమగ్ను మొనరించు

స్వామిని సేవింపవే!



2. ఓసి మానసమా! అతడు సాధారణమానవుడుకాడే! లీలామానుషవిగ్రహుడే! లోకముయొక్క కనులు గప్పుటకై మానవరూపముధరించిన పరబ్రహ్మమే! నాట్యమాడుచున్నదే? హీనవేషము దాల్చియున్న దే! ఇదంతయు కపటమే! అది పరబ్రహ్మమే! ఆ యదువంశశిరోరత్నమును ఆరాధింపవే!



3. చిత్తమా! మహాయోగులు తమయెడదలయందీ తత్త్వమునే ఆరాధించుచుందురే! ఇట్టి ప్రణవ స్వరూపమే! ప్రణవమేఘమే! (మేఘము నీటిని వర్షించును. ప్రణవము ఆనందమును వర్షించును.) అన్యచింతలు వీడి దీని నారాధింపవే!


[14:19, 04/12/2020] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-1-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩


ప్రాచేతసస్తు భగవన్నపరో హి దక్షః

త్వత్సేవనం వ్యధితసర్గవివృద్ధికామః।

ఆవిర్భభూవిథ తదా లసదష్టబాహుః

తస్మై వరం దదిథ తాం చ వధూమసిక్నీమ్।


భావము:-


భగవాన్ ! ప్రచేతసులకు 'దక్షుడు' అను ఒక పుత్రుడు కలడు. ఇతడు దక్షప్రజాపతి కాక 'వేరొక దక్షుడు'. ప్రజాసృష్టిని వృద్ధి చేయవలయునను కోరికతో అతను నిన్ను సేవించుచుండెను. ప్రభూ! అష్టభుజములు కలిగిన రూపముతో ప్రకాశించుచూ – ఆ దక్షునికి నీవు సాక్షాత్కరించితివి. అతడు కోరిన వరములను అనుగ్రహించుటయేగాక అతనికి 'అసక్ని' అను భార్యను కూడా ప్రసాదించితివి.


వ్యాఖ్య:-


ఈశ్లోకంలో చెప్పబడ్డ దక్షుడు ఒకప్పుడు చేసిన తపోదీక్షకు ప్రసన్నుడై శ్రీహరి సాక్షాత్కరించాడు. శంఖ, చక్ర, గదా, ధనుష్పాణియై నవ్వురాజిల్లెడు  మోముతో నిలిచిన నారాయణుని  పాదాల వ్రాలి ఆనంద తన్మయుడు కాగా వానిని లేవనెత్తి:



ప్రజాపతీ! ఇంద్రియ నిగ్రహంతో సంధ్యావందనం చేసేవారి హృదయంలో నేనుంటాను. ఆ హృదయం నేనే. ధ్యానం నా దేహం. శబ్దం నా రూపం. యజ్ఞాలు నా అవయవాలు. ధర్మం ఆత్మ. దేవతలు నా ప్రాణం. నా మాయతో బ్రహ్మను పుట్టించి లోకసృష్టి సాగించాను.



ఇప్పుడు అసిక్ని అనే యువతిని నీ భార్యగా యిస్తున్నాను. ఆమెతో దాంపత్యం సాగించి ప్రాణి కోటిని సృష్టించు అని అదృశ్యమయ్యాడు.



దక్షుని సంతానం పశ్చిమ దిశగా వెళ్లి సింధునదీ తటాన  తపస్సు ఆరంభించారు. వారి దగ్గరకు నారదుడు వచ్చి : నాయనా! మీరు ఈ దీక్షతో పరంధామం చేరండి, సంసార విషవలయంలో జనన మరణ చక్రధారలకు లొంగకండి, అని వెళ్లాడు.



తన బిడ్డల వైరాగ్యం చూసి దక్షుడు విచారంలో మునుగగా బ్రహ్మ ప్రత్యక్షమై: విచారించకు మరికొందరు  కుమారులను  పొందు అన్నాడు.



అప్పుడు పుట్టిన వారికి కూడా నారదుడు తత్త్వ భోధచేసి విరక్తులను చేయగా వానిపై ఆగ్రహంతో  దక్షుడు -



నారదా! నీ ప్రచారఫలంగా సృష్టి ఆగిపోతున్నది. నీకు ఏ లోకంలోనూ స్థానం వుండదు. అని శపించాడు.  అందువల్లనే నారదుడు త్రిలోక సంచారి అయ్యాడు.



అనంతరం దక్షుడు అరవై మంది కుమార్తెలను కన్నాడు. వారిలో పదిమంది యముని భార్యలు,  ఇరవైఏడుగురు  చంద్రపత్నలు. పదముగ్గురు కశ్యపుని భార్యలు. అంగీరస, కృశాశ్వ భూతులకు యిద్దరిద్దరు. మిగిలిన నలుగురూ కశ్యపునితో వెళ్లారు.



(వీరివల్ల సమస్త ప్రాణులూ ప్రభవించాయి. ప్రాణికోటి విశేషాలు మూల భాగవంతంలో కాని, పోతనగారి గ్రంధంలో కాని వివరంగా దొరుకుతాయి.). 


🕉🌞🌎🌙🌟🚩

గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩


అవతారిక - అట్టి త్యాగశీలుడు కర్మలందు ఇచ్ఛాద్వేషములు లేకుండునని తెలుపుచున్నారు-


న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్జతే | 

త్యాగీ సత్త్వసమావిష్టో  

మేధావీ ఛిన్నసంశయః || 


తాత్పర్యము:- సత్త్వగుణముతో గూడినవాడును, ప్రజ్ఞాశాలియు, సంశయములను బోగొట్టుకొనినవాడును నగు త్యాగశీలుడు, అశుభమును, కామ్యమును, దుఃఖకరమును నగు కర్మను ద్వేషింపడు; శుభమును, నిష్కామమును, సుఖకరమునగు కర్మయందు ఆసక్తుడుకాడు (అభిమానము గలిగియుండడు).



వ్యాఖ్య:- సత్త్వగుణముతో గూడిన కర్మఫలత్యాగి ద్వంద్వములందు సమబుద్ధి గలిగి యుండునని చెప్పబడుచున్నది. ఒకదానిని ద్వేషించుటగాని, మఱియొక దానియందు ఆసక్తిగలిగి తగుల్కొనుటగాని యతనికుండదు.



 అతడు ఇచ్ఛాద్వేషరహితుడై యుండును. అశుభకర్మను, కామ్యకర్మను ద్వేషింపడని చెప్పినంతమాత్రముచేత దానిని ప్రేమించునని అర్థముకాదు.



 జీవన్ముక్తునిపగిది దానియెడల తటస్థభావముగలిగి, తాను మాత్రము దాని నాచరింపక శుభకార్యమునే, నిష్కామకర్మమునే ఆచరించును. అట్లాచరించినను దానితో కలియక, దానియం దభిమానము (సంగము) లేకయుండును.



ప్రశ్న:- సత్త్వగుణశీలుడగు కర్మఫలత్యాగియొక్క స్వభావమెట్లుండును?


ఉత్తరము:- అతడు

(1) సత్త్వగుణసంపన్నుడై

(2) ప్రజ్ఞాశాలియై

(3) సంశయరహితుడై

(4) అశుభ (కామ్యాది) కర్మలను ద్వేషింపకయు,

శుభ(నిష్కామాది) కర్మములందు తగుల్కొనకయు

 (అభిమానము లేకయు) నుండును.


🌹. గీతోపనిషత్తు  - 90 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 26 - 3. ప్రాణాయామ యజ్ఞము  -    సృష్టి యందలి క్రమమే క్రతువు.  సృష్టి యందు కాలమే దైవము. కావున కాలము ననుసరించుచు చేయు శ్వాస క్రతుబద్దము కాగలదు. జీవితము క్రతుబద్ధము కావలెనన్నను, క్రమబద్ధము కావలెనన్నను కాలమును గౌరవించుట నేర్చుకొనవలెను. కాలము ననుసరించుట నేర్చుకొనవలెను. ఒకే కాలమున ప్రాణాయామ హోమమును నిర్వర్తించుట ఐదవ నియమము 🍀


📚. 4. జ్ఞానయోగము  - 29, 30   📚

Part 3


పై తెలిపిన విధముగ శ్వాస నభ్యసించుచున్న కొలది దేహతత్వము మారుచుండును. దేహధాతువుల యందలి తమస్సు క్రమముగ తొలగును. తమస్సు తొలగినకొలది బద్ధకము, నిద్ర వదలును. ధాతువులు తేలిక యగుచున్నకొలది, తేలిక యగు ఆహారమే దేహము స్వీకరించును. బరువగు ఆహారమును నిర్జించును. ఇది అంతయు సహజముగ జరుగును. దేహమునకు హింసగ జరుగదు. యోగమున మాంసాహారులు శాకాహారులగుట. 


శాకాహారులు దుంపలు ఇత్యాది బరువైన ఆహారమునకు బదులు కూరలు, ఆకు కూరలు మొదలగు ఆహారమునకు మ్రొగ్గుట, పప్పుదినుసులు తగ్గించుట, ద్రవాహారము పెరుగుట సహజముగ జరుగును. ఉప్పు, కారములు కూడ తగ్గును. మసాలా దినుసుల ప్రసక్తియే యుండదు. పండ్లు, పండ్లరసము, నీరు ఆహారమున ఎక్కువభాగ మగును. ఇట్లు సహజముగనే దేహ ధాతువుల యందు కలిగిన మార్పువలన ఆహారమందు మార్పులు కలుగును. అపుడు శ్వాస అభ్యాసము మరింత చురుకుగ సాగును. 


మనసు లగ్నము చేసి శ్వాసను నెమ్మదిగను, పూర్ణముగను పీల్చుట, వదలుట వలన మనసు ప్రశాంతత చెందుట, ప్రాణశక్తి పెంపొంది స్వస్థత చేకూరుట, ప్రాణము పూర్ణమై అస్వస్థతను దరిచేరనీయకుండుట, తత్కారణముగ ఆయుర్దాయము పెరుగుట, శరీర ధాతువులయందు చక్కని మార్పు జరిగి ఆహారము నియత మగుట జరుగునని తెలుపబడినది. శ్వాసను నెమ్మదిగను, పూర్ణముగను పీల్చుట, వదలుట ప్రతి శ్వాస యందు నిర్వర్తింపబడుట మూడవ నియమము. నెమ్మదిగను, పూర్ణముగను పీల్చుట, వదలుట మొదటి రెండు నియమములు. 


మూడవ నియమము ప్రకారము ప్రతి శ్వాస దాని నెమ్మదితనము నందును, దీర్ఘత్వము నందును, పూర్ణత్వము నందును ఒకే విధముగ నుండవలెను. మొదటి శ్వాస ఎంత శ్రద్ధగ నిర్వర్తింపబడుచున్నదో, చివరి శ్వాసకూడ అంతే శ్రద్ధగ, అంతే నెమ్మదిగ, దీర్ఘముగ, పూర్ణముగ నిర్వర్తింపబడవలెను. ఈ మూడవ నియమముననే శ్వాస క్రమబద్ధమగును. క్రతుబద్ధ మగును. 


సృష్టియందలి క్రమమే క్రతువు. ఆ క్రమము ననుసరించియే ఋషులు క్రతువులను దర్శించిరి. క్రతువు లన్నియు కాలబద్ధమై యుండును. కాలమే సృష్టియందు గల క్రమము. అవరోహణము, ఆరోహణము కాలము వలననే జరుగుచున్నది. 


సృష్టి యందు కాలమే దైవము. కావున కాలము ననుసరించుచు చేయు శ్వాస క్రతుబద్దము కాగలదు. జీవితము క్రతుబద్ధము కావలెనన్నను, క్రమబద్ధము కావలెనన్నను కాలమును గౌరవించుట నేర్చుకొనవలెను. కాలము ననుసరించుట నేర్చుకొనవలెను. ప్రాణాయామ యజ్ఞమున పై తెలిపిన విధముగ శ్వాసను క్రమబద్ధము చేయుట యనగా ఒక శ్వాసకు ఎంతకాలము పట్టునో తరువాత శ్వాసలకు కూడ అంతే కాలము పట్టవలెను. ఇది నాలుగవ నియమము. 


ప్రతిదినము సాధకుని సౌకర్యమును బట్టి ఒకే కాలమున ప్రాణాయామ హోమమును నిర్వర్తించుట ఐదవ నియమము. అనగా ప్రతిదినము అదే సమయమునకు నిర్వర్తించుకొనవలెను. శ్వాసల సంఖ్య క్రమముగ పెంచుకొనవచ్చును. ప్రతి మూడు శ్వాసలు ఒక విభాగముగ (యూనిట్) భావించుచు పెంచుకొన వలెను. 


ఇట్లు తొమ్మిది విభాగములుగ ఇరువది ఏడు శ్వాసలు నిర్వర్తించుకొనుట ఒక శ్వాస విభాగముగ గుర్తించవలెను. క్రమముగ దీనిని మూడు రెట్లు పెంచుకొనవచ్చును. అనగా ఒకసారి శ్వాస ప్రక్రియను ప్రారంభించినప్పుడు కనీసము 3 x 9 = 27 శ్వాసలు నిర్వర్తించుకొనవలెను. అట్లు 27 X 3 = 81 శ్వాసల వరకును నిర్వర్తించుకొనవచ్చును. ఇచ్చట కాలమునకు శ్వాసలే కొలతగాని గడియారము కాదు.


ప్రాణాయామ పరాయణులు, ముందు తెలిపిన శ్వాస యజ్ఞమును దినమునకు మూడుసార్లు నిర్వర్తించుకొందురు. అట్టివారిని గూర్చి భగవానుడు 29వ శ్లోకమున తెలుపుచున్నాడు. ముందు తెలిపిన నియమము లన్నియు శ్రద్ధతో పాటించు వారికి ఆహార వ్యవహారాదులు నియతమగును. ఆహార విషయమున ఎంత పవిత్రత ఏర్పడునో విహార విషయముల యందు కూడ అంతే పవిత్రత ఏర్పడును. వీరి జీవితము ప్రపంచమున సాగు చున్నప్పటికిని, అందు మమేకమై యుండక, మైకములేక జీవింతురు. అవసరము లేనిచో కదలరు. దేహమును కదలింపరు. 


అవసరము లేనిచో మాట్లాడరు. అవసరము లేనివి చూడరు, వినరు, స్పృశింపరు. ఇట్టివారికి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశములతోపాటు, పంచేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములతో కూడిన లింగశరీరము కూడ పవిత్రమై పారదర్శకముగ నుండును. పై తెలిపిన నియమము లన్నియు యమునిచే నచికేతునకు తెలుపబడినట్లుగ కఠోపనిషత్ నందు తెలుపుదురు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[19:47, 04/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 175 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మార్కండేయ మహర్షి  - 1 🌻


1. వార్ధక్యం కోరుకోమని పెద్దలు అంటూంటారు. కన్ను, కాలు పనిచెయ్యకుండా ఉండేంత వార్ధక్యం కోరుకోమని – అంటే ఆయుర్ధాయం కోరుకోమని అంటారు. అది బాధే కావచ్చు! కానీ శరీరం జరాగ్రస్తమైనప్పటికీ మనోబుద్ధులు, ఏకాగ్రత ఈశ్వరుడియందు లగ్నం చేయగలిగిన దృష్టి కనుక ఉంటే, ఆ శరీరం వలన బాధపడరు. 


 2. అలా ఆ జన్మ సార్ధమవుతుంది. మరొక కారణం ఏమిటంటే – యౌవనంలో బలము, ఓపిక ఉన్నంత కాలము మనుష్యులలో పారమార్ధిక చింత కలగటంలేదు. అది వృద్ధాప్యం వచ్చిన తరువాతమాత్రమే కలుగుతున్నది. 


3. ఈశ్వరుడి యందు భక్తి శ్రద్ధలు కలగటము మనిషికి వృద్ధాప్యము ప్రారంభమైన తరువాత మాత్రమే జరుగు తున్నది. మరి అలా కలిగినవెంటనే పోతే ఎలాగ! ఇక ఆ భక్తికి ఉపయోగమేమిటి? మరి తపస్సు ఎప్పుడు? అందుకనే, సుధీర్ఘమైన జర(వృద్ధాప్యం)ను కోరుకునే సంప్రదాయంకూడా ఒకటి ఉంది. అలా అడగమనికూడా చెప్తారు పెద్దలు. ఉత్తరదేశంలో ‘చిరాయురస్తు’ అని కాకుండా, ‘జరాయురస్తు’ అని ఆశీర్వదిస్తారు.


4. పూర్వం ఉత్తమజీవులకు, మృత్యుదేవత వాళ్ళకు బాగా తెలివిగా ఉండగానే ఒక పాశం వలె కనబడి తీసుకెళ్ళేదట. సావిత్రి చరిత్ర తరువాత మృత్యుదేవత జీవులకు కనబడటం మానేసిందట! చాలా చిక్కువచ్చింది మృత్యుదేవతకు! అంటే సావిత్రి చేతిలో మృత్యుదేవత ఓడిపొయినట్లే. 


5. మార్కండేయుడు తన కంఠానికి మృత్యుపాశం తగలగానే ఈశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుని, తనను రక్షించమని శివుణ్ణి ప్రార్ధించాడు. సాధారణంగా శరణాగతి పొందినవారికి ఏ ఆపద వచ్చినా మామూలు వీరుడయిన క్షత్రియుడే సహించడు. సాక్షాత్తు రుద్రుడినే శరణు అంటే, తన సన్నిధిలోకి వచ్చిన యముణ్ణి సహిస్తాడా? వెంటనే త్రిశూలం పుచ్చుకుని, మృత్యువును చంపటానికే వచ్చాడు. శరణు అని ఆయన కాళ్ళమీద పడ్డాడు మృత్యుదేవత.


6. “నా భక్తుదయినవాడిని, సదా నన్ను స్మరించేవాడిని మృత్యుదేవతవైన నువ్వు ఎన్నడూ పాశబద్ధుణ్ణి చెయ్యటానికి వీలులేదు. శాశ్వతంగా ఇది నా శాసనంగా ఉంటుంది. మరణసమయంలో మృత్యువును జయిద్దామనే కోరికతో, బతకాలనే ఆశతో నన్ను స్మరణచేస్తున్నవాడిని నువ్వు ఏమీ చెయ్యకూడదు. శివస్మరణచేస్తూ, వెళ్ళిపోవడానికి సిద్దపడ్డవాళ్ళుమాత్రమే వెళ్ళిపోతారు” అని ఈశ్వరుడు ఈ విషయం మృత్యువుతో చెప్పాడు.


7. యోగులలో ప్రతీ మహాయోగి, తత్త్వం తెలిసిన తరువాత కూడా శరీరంలోంచి ఒక్కమాటు బయటకి వచ్చి మృత్యువువంటి స్థితిని అనుభవిస్తాడు. శరీరంలోంచి బయటకి రావటమూ తన శరీరాన్ని తను చూడటము, మళ్ళీ అందులోకి ప్రవేశించటము అనేవి చేసిన తరువాత అతడు చిరంజీవి అవుతాడు. తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే శరీరాన్ని వదిలిపెడతాడు. భారతభూమిలోని మహాయోగులలో ఇది ఒక విశిస్ట లక్షణంగా ఉన్నది! అందుకే వాళ్ళు స్వఛ్ఛంద మరణాన్ని పొందుతారు. 


8. అంటే, గట్టిగా రాటకు పశువు కట్టబడితే ఎలా ఉంటుందో, అలాగ జీవాత్మ మూలాధారమందు కట్టబడి ఉంటుంది. దానిని ఒకమాటు వదిలించుకుని ఇవతలకు వచ్చి మళ్ళీ ప్రవేశిస్తే స్వేఛ్ఛగా ఉంటాడు. ఇంట్లో మనుష్యుడు తిరుగుతూ ఉన్నట్లు ఉంటాడు దేహంలో. అప్పుడిక ఆ జీవిడు పాశానికి కట్టుబడి ఉండడు. మృత్యంజయ మంత్రంలోకూడా ఈ విషయమే స్ఫురిస్తుంది.


9.  ‘మృత్యోర్ముక్షీయ మామృతాత్’ – ‘మృత్యువునుంచీ విడిపించు. అమృతత్వంనుంచి కాదు’ అని అర్థంచేసుకోవాలి. అమృతత్వంనుండి వేరుచేయవద్దని; అంటే, అమృతత్వంలో ఉన్న ముడినికాక, మృత్యువులో ఉన్న ముడిని విప్పెయ్యమని అంటుంది ఆ మంత్రం.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[19:47, 04/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 114 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 19 🌻


తాదాత్మ్యము:-

478. భగవంతుడు, 

భౌతిక ప్రపంచములో, దేహమయ్యెను.

 సూక్ష్మ ప్రపంచములో, ప్రాణమయ్యెను.

 మానసిక ప్రపంచములో, మనస్సయ్యెను.

 విజ్ఞాన భూమికలో, భగవంతుడయ్యెను.


" దేవుడె నీవై నీవే దేవుడై

దివ్యత్వంబును పొందెదవు”

(మెహెర్ గీతావళి నుండి)


తాదాత్మ్యతలు,  అహమ్  

నేను భగవంతునను -  సత్య అహమ్ 


మిధ్యాహమ్ - మాయ  - అవిద్య

1. మనోముయ ప్రపంచం - నేను మనస్సును. 

2. సూక్ష్మ ప్రపంచము - నేను శక్తిని 

3. భౌతిక ప్రపంచం - నేను మానవుడిని 


నేను ఎవరిని? - సహజ ఆహమ్


479. స్థూల సంస్కారములు---అన్నమయ దేహచైతన్యము --- భౌతిక లోకానుభవము.


సూక్ష్మ సంస్కారములు --- ప్రాణమయ దేహచైతన్యము --- సూక్ష్మ లోకానుభవము


మానసిక సంస్కారములు --- మనోమయ దేహచైతన్యము --- మానసిక లోకానుభవము.


480. ఆత్మకు -- స్థూల, సూక్ష్మ, కారణ దేహములు ప్రతిబింబములు.


481.స్థూల--సూక్ష్మ--కారణ దేహములు--

పరిమితి గలవి, రూపములు గలవి, నశ్వరమైనవి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

💐💐💐💐

[03:21, 05/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


170వ నామ మంత్రము


ఓం నిర్లోభాయై నమః


తనకున్నది తనుకూడా అనుభవింపక,  ఒరులకు పెట్టక,  ఉన్నది చాలు అనే తృప్తిలేక ఇంకా ఇంకా కూడబెట్టాలనే లోభ గుణం మనసుకు సంబంధించినది. ఆత్మకు సంబంధించదు. అటువంటి లోభ గుణంలేని పరమాత్మ స్వరూపిణియైన శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్లోభా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిర్లోభాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ అఖిలాండేశ్వరియైన లలితాంబను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించిన సాధకుడు లోభత్వము లేక ఉన్నదానితో తృప్తినందుతూ, పరమేశ్వరీ పాదసేవయందు నిమగ్నుడై ఆత్మానందముతో జీవించి తరించును.


తనకున్నది తనుకూడా అనుభవింపక, పరమదరిద్రాన్ని అనుభవిస్తూ, ఒరులకు పెట్టక,  ఉన్నది చాలు అనే తృప్తిలేక ఇంకా ఇంకా కూడబెట్టాలనే దురాశ కలిగియుండుట, లేక మొత్తం తనకే కావాలి వేరొకరికి కాకూడదు అనే దురాశ,, ఇంకా ఇంకా కూడబెట్టాలి, అందుకు ఎంతైనా నైచ్యానికి దిగజారుటయే లోభత్వం. ఇది ఒక మానసిక వ్యాధి. కేవలం మనసుకు సంబంధించినది. ఆత్మకు సంబంధించదు.


మనకు ఏదైనా కలిగి ఉంటే, అది భగవంతుడు ఇచ్చినది. పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు.  తను తినాలి. కొంత దానధర్మములకు వెచ్చించాలి. సద్గతుల మాట ఎలా ఉన్నా మళ్ళీ వచ్చేజన్మలో నైనా పుణ్యకార్యములకు మనకున్నదాంట్లో కొంత వెచ్చించాలి.  దాన ధర్మములు కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా, పుచ్చుకొనేవారి అర్హతను అనుసరించి దానము ఇవ్వవలెను.  ఒక అవిటివానికి, తిండికి లేనివానికి, ఆపదలో ఉన్నవారికి, పేదవిద్యార్ధికి...ఇలా పాత్రమెరిగిన దానముచేయుటయే ఔదార్యత మరియు నిర్లోభత్వము


నిర్లోభా అనగా లోభత్వము లేనిది. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు - ఈ ఆరును అరిషడ్వర్గములు. ఇవి మానసిక శత్రువులు. అనగా మనసుకు సంబంధించినవి.  ఆత్మకు సంబంధించనివి. జగన్మాత పరమాత్మస్వరూపిణి. కాబట్టి లోభము అన్న గుణము నాపాదించుటయే దోషము. గనుక


అత్యంతమౌదార్యాన్నిర్లోభా (సౌభాగ్యభాస్కరం, 361వ పుట)


అమ్మవారు మిగుల ఔదార్యము గలది అని అనుట ఉచితము. భక్తులు కోరిన ధర్మబద్ధమైన కోరికలను తీర్చును.  కాబట్టి ఆ తల్లి నిర్లోభా  అనగా భక్తుల కోరికలను తీర్చుటకు సంశయించదు అని భావించవలెను. 


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్లోభాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 13 🌴


13. విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్ |

శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ||


🌷. తాత్పర్యం : 

శాస్త్రనిర్దేశముల యెడ గౌరవము లేకుండ, ప్రసాదవితరణము కాని, వేదమంత్రోచ్చారణము కాని, బ్రాహ్మణదక్షిణలు కాని లేకుండా శ్రద్ధారహితముగా ఒనర్చబడు ఏ యజ్ఞమైనను తామసగుణ ప్రధానమైనదిగా భావింపబడును.


🌷. భాష్యము  :

తామసగుణ ప్రధానమైన శ్రద్ధ వాస్తవమునకు శ్రద్ధారాహిత్యమే యనబడును. కొందరు ఏదేని ఒక దేవతను ధనలాభము కొరకై పూజించి, తదుపరి ఆ ధనమును శాస్త్రనిర్దేశములను లెక్కజేయక వినోదమందు ఖర్చుచేయుదురు. 


అటువంటి ధర్మకార్యప్రదర్శనములు నిజమైనవిగా గుర్తింపబడవు. అవియన్నియును తమోగుణమును కూడినట్టివే. అవి కేవలము దానవప్రవృత్తిని కలిగించే గాని మానవులకు హితకరములు కాజాలవు.

🌹 🌹 🌹 🌹 🌹

ఓం జేత్రే నమః | ॐ जेत्रे नमः | OM Jetre namaḥ


యతో జయత్యతిశేతే సర్వ భూతాని కేశవః ।

స్వభావతోఽతో జేతేతి ప్రోచ్యతే విభుధోత్తమైః ॥ 


తన స్వబావముతోనే సర్వభూతములను అతిశయించువాడు కావున విష్ణువు జేతా అని చెప్పబడును.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 149 / Vishnu Sahasranama Contemplation - 149 🌹

📚. ప్రసాద్ భరద్వాజ 


🌻149. విశ్వయోనిః, विश्वयोनिः, Viśvayoniḥ🌻


ఓం విశ్వయోనయే నమః | ॐ विश्वयोनये नमः | OM Viśvayonaye namaḥ


విశ్వం యోనిర్యస్య విశ్వశ్చాసౌ యోనిశ్చ కేశవః ।

యోనిర్విశ్వస్య స బుధైర్విశ్వయోనిరితీరితః ॥


విశ్వము యోనిగా (ఆశ్రయస్థానము) ఎవనికి కలదో అట్టివాడు. లేదా ఈతడు విశ్వముగా రూపొందియుండువాడునూ, సకలమునకు ఆశ్రయస్థానమునూ అయి యున్నవాడు.


:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము, కాళీయ మర్ధనం ::

సీ. వివిధ భావాకార వీర్యబీజాశయ జవయోనియుతముగా జగము లెల్ల

     నీవ చేసితి మున్న, నే మా జగంబులో సహజకోపనులము సర్పములము,

     దుర్వారమైన నీ తోరంపు మాయ నే మెఱిఁగి దాఁటెడు పని కెంతవార?

     మంతకుఁ గారణ మఖిలేశ్వరుండవు సర్వజ్ఞుఁడవు నీవు జలజనయన!

తే. మనిచె దేనిని మన్నించి మనుపు నన్ను నిగ్రహించెద వేనిని నిగ్రహింపు,

     మింక సర్వేశ! మా యిమ్ము లెందుఁ గలవు, చిత్తమందున్న క్రమమునఁ జేయఁదగును.


సర్వేశ్వరా! పూర్వము ఈ జగత్తు లన్నిటినీ వివిధ భావాలు, ఆకారాలు, వీర్యములు, వీర్యాతిశయములు, జనన స్థానాలతో సహా నీవే సృష్టించావు. అటువంటి నీ సృష్టిలో మేము సహజంగా కోపం కలిగిన సర్పాలము. నీ మాయ దాటరానిది. అటువంటి నీ అద్భుతమైన మాయను తెలుసుకొని దాటాలంటే అది మాకు సాధ్యమా? ఈ సర్వానికి  ఈశ్వరుడవు. అన్నీ తెలిసిన వాడవైన నీవే అన్నింటికీ కారణము. కనుక కమలనయనా! మమ్ములను క్షమింపదలచుకుంటే క్షమించు, రక్షించు; శిక్షించ దలచుకుంటే శిక్షించు, ఇంకా మా యిష్టాలు ఎక్కడున్నాయి? నీ దివ్య చిత్తం ఎలా ఉంటే అలా చెయ్యి.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 122 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ


🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 52 🌻


అంతే కానీ, ఒకటి మరొక తీరుగా చెప్పింది, ఒకటి మరొక తీరుగా చెప్పిందనే ఖండన మండనాల జోలికి వెళ్ళకుండా ఉండాలి. శాస్త్రారణ్యంలో చిక్కపడకుండా ఉండాలి. ఈ అధ్యయనం చాలా అవసరం. సృష్టిని అధ్యయనం చేయాలి. తనను తాను అధ్యయనం చేయాలి. పంచకోశాలని బాగా అధ్యయనం చేయాలి. 


పంచభూతాలను బాగా అధ్యయనం చేయాలి. పంచకోశ సాక్షి ఎలా ఉన్నాడో గమనించాలి. పంచభూత సాక్షి ఎలా ఉన్నాడో గమనించాలి. ఆవరణ దోషం లేకుండా ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడో గర్తించగలగాలి. ఆవరణ రహితమైనటువంటి స్థితిని గుర్తించాలి. మల విక్షేప ఆవరణలు అనేటటువంటి మలత్రయాలని కూడా పోగొట్టుకోవాలి. పంచమలములను లేకుండా చేయాలి.

  

      ఈ రకంగా ప్రతీదానిని సూక్ష్మంగా గుర్తించి, సూక్ష్మంగా రద్దు చేసి, తనను తాను అధిగమిస్తూ, తనను తాను తెలుసుకుంటూ, తనను తాను పోగొట్టుకుంటూ, ముందు తనను తాను తెలుసుకోవాలి, తరువాత తనను తాను అధిగమించాలి, తరువాత తనను తాను పోగొట్టుకోవాలి. ఈ రకమైనటువంటి, క్రమమైనటువంటి, మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. 


ఒక్కొక్క గుణాన్ని నువ్వు విరమిస్తే, అది సూక్ష్మమైపోతుంది. ఐదు గుణములు కలిగినటువంటి పృథ్వి స్థూలంగా కనబడుతుంది. నాలుగు గుణములు కలిగినటువంటి జలము స్థూలంగా కనబడుతుంది. మూడు గుణములు కలిగినటువంటి అగ్ని స్థూలంగా కనబడుతున్నది. రెండు గుణములు కలిగినటువంటి వాయువు స్థూలంగా కనబడుతున్నది. అవి కూడా స్థూలంగానే ఉన్నాయి. 


కానీ వీటి యందు సగభాగము అపంచీకృతములై, అవి ఎక్కడ ఉన్నాయి అంటే, ఆకాశానికి అవతల ఉన్నాయి. ఆ అర్థభాగములన్నీ కూడాను, కూటస్థ భాగములో ఉన్నాయి. ఆ అర్థభాగములన్నీ బ్రహ్మాండ భాగములుగా ఉన్నాయి. ఆ అర్థభాగములు అన్నీ కూడాను, అధిష్ఠానములుగా ఉన్నాయి. ఆ అర్థభాగములు అన్నీ కూడ దేవతా సమూహములుగా ఉన్నాయి. 


ఆ అపంచీకృతమైనటువంటి బ్రహ్మాండ భాగమంతా కూడా, అద్వయముగా దర్శన పద్ధతిగా తెలుసుకొన్నవాడవై, పంచశక్తులు, పంచబ్రహ్మల యొక్క అనుగ్రహాన్ని పొందిన వాడవై, బ్రహ్మాండ, పిండాండ నిర్ణయన్ని స్పష్టముగా ఎఱిగిన వాడవై, బ్రహ్మాండ పంచీకరణలో ఉన్న 25 తత్త్వాలను, పిండాండ పంచీకరణలో ఉన్న 25 తత్త్వాలను సమన్వయీకరించుకుని, ఒక దాని కొకటి ఆధారభూతమై ఎట్లా ఉన్నాయో తెలుసుకొని, అధిగమించేటటువంటి పద్ధతిగా జ్ఞాత కూటస్థునికి అభేద స్థితి ఎట్లా ఉన్నదో, ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులు ఎట్లా అయిఉన్నారో, ఆధేయ పద్ధతిగా నువ్వు ప్రయాణం చేయవలసినటువంటి అవసరము ఉన్నది.


        ఈ రకంగా అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తిచేసి, ఎవరైతే బ్రహ్మనిష్ఠులై వారు ఉన్నారో, వారు ముక్తులగుదురు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య అనేటటువంటి చతుర్విధ ముక్తులను, సాధించినటువంటి వారు అవుతున్నారు. బ్రహ్మనిష్ఠులు అవుతున్నారు. ఈ రకంగా తప్పక సాధకులందరూ, ఈ లక్ష్యాన్ని సాధించవలసినదిగా యమధర్మరాజు గారు ఉపదేశాన్ని చేస్తున్నారు.


నచికేతుని మూలమున లభించినట్టియు, మృత్యు దేవతల వలన ఉపదేశింపబడినట్టియు, వైదికమగుట వలన సనాతనమైనట్టియు, గురుశిష్య సంవాద రూపముగా నున్నట్టియూ, ఈ ఉపాఖ్యానమును యోగ్యులకు చెప్పిన వారున్ను, బ్రహ్మవిష్ణులగు గురువుల వలన ఉపదేశమును పొందిన వారున్ను, బ్రహ్మలోకమున పూజనీయులు అగుదురు.

 

        ఈ కఠోపనిషత్తులో ఉన్నటువంటి, ఈ ఆత్మోపదేశ విశేషాన్ని తెలియజేస్తున్నారు యమధర్మరాజుగారు. నచికేతుని మూలమున మానవాళిని ఉద్ధరించదలచి, మానవాళికందరికీ మహోపదేశాన్ని చేసేటటువంటి ప్రయత్నం, ఆత్మోపదేశాన్ని చేసేటటువంటి ప్రయత్నాన్ని చేశారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[06:37, 05/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 287 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

69. అధ్యాయము - 24


🌻. శ్రీరామునకు పరీక్ష  - 3 🌻


పరమేశ్వరుడిట్లు పలికెను -


ఓ సతీదేవీ! వినుము. నేను సత్యమును చెప్పెదను. అసత్యమాడను. వరదాన ప్రభావము వలన, ఆదరము వలన నేను ఇట్లు ప్రణమిల్లితిని (37). రామలక్ష్మణులను పేరు గల ఈ సోదరు లిద్దరు వీరులచే పూజింపబడువారు. ఓ దేవీ! దశరథుని కుమారులగు ఈ ప్రాజ్ఞులు సూర్యవంశమునందు పుట్టినవారు (38). 


పచ్చని రంగు గల ఈ చిన్నవాడు లక్ష్మణుడు. శేషుని అంశచే జన్మించినవాడు. విష్ణువు పూర్ణాంశతో రాముడను పేర జ్యేష్ఠుడై జన్మించినవాడు. ఆయన వలన ఎవ్వరికీ హాని లేదు (39). విష్ణువు భూమి యందు సాధువులను రక్షించుట కొరకు, మన సుఖము కొరకు జన్మించినాడు. ఇట్లు పలికి జగత్కారణుడు అగు శంభు ప్రభుడు మిన్న కుండెను (40).


శంభుని ఈ మాటలను వినిన తరువాతనైనూ ఆమె మనస్సునకు విశ్వాసము కలుగలేదు. ముల్లోకములను మోహింపజేయు శివుని మాయ బలీయమైనది (41). లీలా పండితుడు, సనాతనుడు అగు శంభు ప్రభుడు ఆమె మనస్సులో విశ్వాసము కలుగలేదని యెరింగి ఇట్లు పలికెను (42).


శివుడిట్లు పలికెను -


ఓ దేవీ! నా మాటను వినుము. నీ మనస్సునకు విశ్వాసము కలుగనిచో, నీవు నీ బుద్ధిని ఉపయోగించి రాముని పరీక్షించుము (43). ఓ సతీ! ప్రియురాలా! నీ మోహము తొలగునంత వరకు ప్రయత్నించుము. నేను ఆ మర్రి చెట్టు నీడలో నిలబడి యుందును. నీవు పరీక్షను చేయుము (44).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[06:37, 05/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 129, 130 / Sri Lalitha Chaitanya Vijnanam  - 129, 130  🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |

శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖


🌻 129. 'శరచ్చంద్రనిభాననా'  🌻


శరచ్చంద్రునితో సాటియైన ముఖము కలది శ్రీలలిత అని అర్థము.


ఋతువులలో శరదృతువు అత్యంత ఆహ్లాదము కలిగించును. ఈ ఋతువునందు ఎండ, చలి, వాన యుండవు. శీతోష్ణములు సమతుల్యమై ఆనందమును కలిగించును. ప్రకృతి కూడ పుష్టి కలిగి తన సౌందర్యమును ప్రదర్శించుచుండును. కవులు శరదృతువును వేనోళ్ళ కొనియాడుచూ గ్రంథస్థము చేసిరి. 


శరత్ నందు ప్రకృతి, పురుషుల సమాగమము పరిపూర్ణమై యుండును. శరత్ పూర్ణిమా చంద్రుడు తుష్టిగను, పుష్టిగను, కాంతివంతముగను గోచరించును. 


అందమునకు, ఆనందమునకు శరత్కాలమందలి పూర్ణచంద్రుని కవులుదహరించు చుందురు. వర్ణింపనలవికాని అందము కలిగి ఆనందము నిచ్చు శరత్ పూర్ణిమా చంద్రునివంటి ముఖము కలిగినది శ్రీదేవి. 


ఆమె అందము ఈశ్వరుని సహితము మోహింప చేయగలదు. అట్టి ముఖమునారాధించు భక్తుడు ఆమె అందమునకు ఆకర్షింపబడి ఆమెయందు తన్మయత్వము పొంది మోక్షమును పొందును. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 130  / Sri Lalitha Chaitanya Vijnanam  - 130 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |

శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖


🌻 130. 'శాతోదరీ  🌻


సన్నని నడుము కలది శ్రీదేవి అని అర్థము.


హిమవంతుని పుత్రిక అని మరియొక అర్థము. శ్రీలలితాదేవి నడుమును గూర్చి, ఉదరమును గూర్చి అనేకములగు వర్ణనలున్నవి. ఆమె నడుము పురుషునకు కూడ అందమే. అట్టి పురుషుని సింహమధ్యముడు అందురు. 


అంతకన్న సన్నమైన నడుము స్త్రీకి అందము. సృష్టియందే స్త్రీకిని లేనంత, ఈర్ష్య పడునంత సన్నని అందమైన నడుము కలదని వర్ణనము. శ్రీలలిత యొక్క అందమును వర్ణించు నామములలో ఇది యొకటి.


శతోదరుడు అనగా హిమవంతుడు. హిమాలయములందు వందలకొలది గుహలు కలవు. అందువలన అతడు శతోదరుడు. అతని పుత్రికగా శ్రీలలిత జనించుటచే 'శాతోదరి' అను నామము కలిగినదని మరియొక అర్థము. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[13:51, 05/12/2020] +91 92915 82862: 💎💥💎💥💎💥💎


🔺 శ్రీ ఆది శంకరాచార్య       _విరచిత __

💎 వివేక చూడామణి.

స్వామీ చిన్మయానందుల వ్యాఖ్యానం.

ఆడియో నం.269


💎💥💎💥💎💥💎


పని చెయ్యండి! పట్టువిడువవద్దు! ధైర్యంగా ఉండండి! దేన్నైనా, ఎలాంటిదాన్నైనా ఎదుర్కోండి.


సుఖాలను త్యజించమని వేదాంతం చెప్పదు. కానీ వాటిని అతిక్రమించి అతీతులవమని అంటుంది.


🕉🌞🌎🌙🌟🚩

 భాగవతము

శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩


*10 వ రుద్రుడు : వామదేవుడు - సుధా.

సుధా అనగా చక్కగా ధరించునది లేక అమృతము. అద్భుతమైన భావాలు అందరికీ కలగవచ్చు. వాటిని ధరించే శక్తి, భరించే శక్తి, నిర్వర్తించే శక్తి కావాలి. అది ఎవరి యందు ఉంటే వారు 'సుధ' అనే తత్త్వము కలిగి ఉంటారు. కొంతమంది ఆనందము వచ్చినా పట్టలేరు.*



గంగావతరణములో గంగను రుద్రుడే చక్కగా ధరించి, ఆ శక్తిని పట్టి భూమి మీద జలప్రవాహము ఏర్పరిచేటట్లు చేసాడు. ధరించలేని,  భరించలేని వారికి మనోవికారాలు వస్తాయి. 'సుధ' అనే శక్తి మనలో బలంగా ఉండాలంటే 'వామదేవాయనమః' అని అనుకోవాలి.


🕉🌞🌎🌙🌟🚩

[15:25, 05/12/2020] +91 92915 82862: శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


మోహనరాగః - ఆదితాళమ్‌..


భజరే - రఘువీరమ్‌.

భజరే రఘువీరం - మానస

భజరే రఘువీరమ్‌ (బహుధీరమ్‌).



1. అమ్బుదడిమ్భ విడమ్బనగాత్రం

అమ్బుదవాహస నన్దనగాత్రమ్‌ || భజ||



2. కుశిక సుతాపిత కార్ముకవేదం

వశిహృదయామ్బుజ భాస్కరపాదమ్‌|| భజ||



3. కుణ్డల మణ్డన మణ్డిత కర్ణం

కుణ్డలి మఞ్చక మద్భుత వర్ణమ్‌ || భజ||



4. దణ్డిత సున్ద సుతాదికవీరం

మణ్డిత మనుకుల మాశ్రయశౌరిమ్‌ || భజ||



5. పరమహంస మఖిలాగమ వేద్యం

పరమవేద మకుటీ ప్రతిపాద్యమ్‌|| భజ||



తాత్పర్యము:-


1. మనమా! శ్రీరఘువీరుని శ్రీరాముని సేవింపవే! పిల్ల మబ్బులను వెక్కిరించు నల్లని మేనుగల ఘునందనుని - ఇంద్రుని బిడ్డయైన జయంతుని బాలించిన ప్రభువును ఆరాధింపవే!


(రామవనవాసవేళ అమ్మరొమ్ములమధ్య నెత్తురోడునట్లు ముక్కుతో బొడిచిన కాకాసురుడు జయంతుడే. వానిపై బ్రహ్మాస్త్రమును బ్రయోగించియు శరణొందగా స్వామి కరుణించినాడు.)



2. కుశికాత్మజుడైన విశ్వామిత్రునినుండి ధనుర్వేదము నెల్ల గ్రహించిన రామచంద్రుని -

రవికిరణములు తామరలను వికసింపజేసినట్లు జితేంద్రియులైన మునుల హృదయములకు వికాసముగూర్చు శ్రీరామచంద్రుని సేవింపవే!



3. ఆదిశేషుని శయ్యగా గొని - కుండలాలంకృత కర్ణుడైన ఆస్వామి శరీరచ్ఛాయ అద్భుతమైనదే! ఆ స్వామి నోచిత్తమా సంస్మరింపవే!



4. సుందుని కొడుకులైన మారీచసుబాహులను - ఇల్లా లైన తాటకను దండించిన వీరుని -

తానవతరించి మనువంశమునకు గొప్పఖ్యాతిని గూర్చిన శౌరిని రఘునాథుని ఆశ్రయింపవే! ఆశ్రయించి సేవింపవే!

పరమహంసస్వరూపియై - (పరమశివేంద్రుల రూపమున నున్న) వేదవేద్యుడైన ఆ స్వామిని వేదములకు కిరీటములు అనదగిన ఉపనిషత్తులు పరబ్రహ్మమని ప్రతిపాదించుచున్నదే! మానసమా! నీ వారఘుకులతిలకు నాశ్రయించి మేలొందవే!


🕉🌞🌏🌙🌟🚩

 🌹. గీతోపనిషత్తు  - 92 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 26 - 5 . ప్రాణాయామ యజ్ఞము  -     ప్రణవము ప్రాణమై, ప్రాణము స్పందనమై పంచ ప్రాణములుగ నేర్పడి దేహమును నిర్వర్తించుచు నుండును.  వీనిననుసరించి మరి ఐదు చిల్లర ప్రాణములు వున్నవి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణములు. ఇవి ఆధారముగనే జీవుడు దేహము నందుండును.  🍀


📚. 4. జ్ఞానయోగము  - 29, 30   📚

Part 5


తాననగ తనయందు జరుగు స్పందనమే అని తెలియును. స్పందనము నుండే అనగా తననుండే మనసు, శ్వాస రెండు ప్రవాహములుగ నేర్పడి దేహ మేర్పడినదని తెలియును. దేహము తన నివాసమేకాని, తాను కాదనియు తెలియును. నివాస పరిణామము నివసించువాని పరిణామము కన్న చాల పెద్దది. 


ప్రతి జీవియు అతని శరీరమున అతని బొటన వేలంత మాత్రమే యుండును. బొటన వ్రేలికి, శరీరమునకు గల వ్యత్యాసమే నివాసమునకు, నివాసికి కూడ క…

[17:54, 06/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 177 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మార్కండేయ మహర్షి  - 3 🌻


20. అనేక పాపాలు చేస్తూ తిర్యగ్జీవనులలో, పశుపక్ష్యాదులలో పుడుతూ నరకాలలో వేగుటు ఏమీ తెలియకుండా పరిభ్రమించే జీవులు ఇప్పుడున్న మానవులు. ఈ తిరిగే సంసారచక్రంలో వీళ్ళుచేసే పాపపుణ్యాలు, వీళ్ళు చనిపోయినపుడు నీడలాగా ఆ జీవులను అనుసరించి దుఃఖాలను ఇచ్చేటటువంటి మరొకజన్మను ఇస్తూ ఉంటాయి. ధన సంపాదనచేస్తూ సుఖంతప్ప మరొక కార్యక్రమం ఏమీలేనటువంటివాళ్ళున్నారే, వాళ్ళునస్తికుల అనబడతారు. వాళ్ళకు ఈ లోకమే సుఖప్రదంగా కనపడుతుంది. మరికొందరున్నారు, 


21. ఇందులో కాస్త ఉత్తములు వాళ్ళు. వాళ్ళు ఉపవాసములుచేసి, తీర్థములు సేవించి వేదాధ్యయనము చేసేవాళ్ళు. దేహాన్ని కృశింపచేసుకుంటూ ఎవో వ్రతములు చేసుకోవటం అనే లక్షణం కొందరిలో ఉంటుంది. ఆ లక్షణాలతో సద్గృహస్థులై ధర్మాన్ని ఆచరిస్తూ సు…

[17:54, 06/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 116 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 21 🌻


🌻. సర్వశూన్య స్థితి యందు ఎరుక 🌻


485. సంస్కారములు పూర్తిగా నాశనము కాగానే ఇంతవరకు సంస్కారములలో చిక్కువడిన పూర్ణచైతన్యమునకు పూర్తి విమోచనము ప్రాప్తించి, పరిశుద్ధమైన మహాచైతన్యముగా రూపాంతరమందినది.


486. మహాచైతన్యము మిథ్యాహం యొక్క చైతన్యమును గాదు, దివ్యాహం (నేను భగవంతుడను) యొక్క చైతన్యమును గాదు. ఇచ్చట చైతన్యమే ఉన్నది.(బాహ్యమునకు మాత్రము) భగవంతుడు లేడు. 


అనగా సర్వకాల సర్వావస్థల యందు, సర్వత్రా శాశ్వతుడై యున్న భగవంతుడు, ఇచ్చట లేకపోవుట ఎట్లు సంభవించును? భగవంతుడు ఎన్నడు ఉండకపోవుట సంభవించదు. కాని--


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🕉🌞🌎🌙🌟🚩

[22:23, 06/12/2020] +91 92915 82862: భాగవతము 

శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩


*11 వ రుద్రుడు:- ధృతవ్రతుడు - దీక్ష

ఒకే పనిని అనంతకాలం చేయడం. ఒక రోజు చేసి, ఒక రోజు చేయకుండా ఉండడం కాదు. జన్మల తరబడి ఒకే కార్యక్రమాన్ని చేసుకునే శక్తి ఈ రుద్రుడిస్తాడు. సత్కార్యాన్ని నిరంతరముగా చేయడము వలన మనుషులు ఋషులయ్యారు. మహాత్ములయ్యారు.*


 

ప్రతిదానికి సాకులు చెప్పి పనులు మానేసిన వాళ్ళు ధృతవ్రతుడు కాలేరు. అంతరాయములు అధిగమించి పురోగతి సాధించాలంటే దీక్ష ఉండాలి. ఏ పని మొదలు పెట్టినా అలా కొనసాగుతూ ఉండాలి. అలాంటి వారి జీవితము కొనసాగుతుంది. వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. దేహము పడిపోయినా దేహము తెచ్చుకొని కొనసాగిస్తారు. వాళ్ళు చిరంజీవులుగా మారతారు. అన్నీ part time చేయడం వలన దృఢత్వముండదు.


🕉🌞🌎🌙🌟🚩

[22:28, 06/12/2020] +91 92915 82862: శ్రీరమణీయం -(732)

🕉🌞🌎🌙🌟🚩



{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"

"భగవదానుభవానికి భావ దూరంలోనే ఉన్నాము !''- (అధ్యాయం -89)


🕉🌞🌎🌙🌟🚩

[22:28, 06/12/2020] +91 92915 82862: 🌷91-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩


అధ్యాయము-7

🥀 శాస్త్రవిజ్ఞానము🥀


25. కొన్ని భోజన ద్రవ్యములను కలిపి పాకము చేసినచో పిండి వంట అగును. అందు మూల ద్రవ్యములున్నవి కాని నామము, రూపము, అనుభవము మారినవి. ఇది  కలయిక వలన కలిగిన మాయ. దీనివలన కొన్ని వస్తువులు మరియొక క్రొత్త వస్తువుగ భాసించుచున్నవి. ఇట్లే మనుష్యులు మున్నగు సకల చరాచర జగత్తు జీవుల దృష్టికి భాసించుచున్నది. ఇది నా ప్రకృతుల కలయిక యొక్క మాయ. ఇదియే యోగమాయ. దీని వలన నేను సర్వము నందుండియు ప్రకాశింప కున్నాను. జీవుల యందు పరస్పర సంబంధ బుద్ధి కలవానికి మోహము కలుగును. ఈ యోగ మాయ నుండి తప్పించునది యోగ విద్య. అదియే నా స్మరణము.



26. నాలో భూతకాలములు నడిచిపోయినవి. వర్తమానము వర్తించుచున్నది. భవిష్యత్తు నాలో రాబోవుచున్నది. ఈ మూడు కాలములలో వర్తించి దర్శించువారెవ్వరును నన్నెరుగ లేరు.



27. ఇచ్ఛ, ద్వేషము అను సంచలనములచే, చెరువు నీటికి బురద రంగు పట్టినట్లు, జ్ఞానమునకు మోహము పట్టును. సర్వజీవులు వానియందు మోహము చెంది జన్మాంతరములలో నాయందు యోగము చెందుచున్నారు.



28. పుణ్యకర్మల ఆచరణము వలన మోహకారణములైన రాగ ద్వేషములు శమించును. ఫలితము నుండి మనస్సు సన్యసించును. ఈ క్రమమున అంతమున ముక్తులై జీవులు నా యందు వసింతురు. అంతమనగా సంచలనమునకు అంతమని భావము. అదికాక సృష్టి ప్రకృతికి గాని, నాకు గాని అంతము లేదు.


🕉🌞🌎🌙🌟🚩

[22:31, 06/12/2020] +91 92915 82862: 🧘ఆధ్యాత్మిక సాధన 🧘‍♂

🕉🌞🌎🌙🌟🚩


ఆధ్యాత్మిక సాధన అంటే మనని మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే అంతరంగ సాధన.



దీనికి మన బాహ్య పరిస్థితులతో, మన భౌతిక స్థితితో సంబంధం లేదు. మన మతము, కులం, లింగం (ఆడా, మగ), వయస్సు వీటితో సంబంధం లేదు. కేవలం అంతరంగ మార్పు కావాలి అన్న పట్టుదల ఒకటి ఉంటే చాలు వారు ఈ సాధనకు అర్హులు.



దీనికి బాహ్య గురువు ఉండడు. బయట నుంచి ఎవ్వరు మనని నియంత్రించరు. అస్సలు ఈ సాధన చేస్తున్నామని ఎవ్వరికి తెలియదు. కానీ సాధనా పరిమళాలు అందరిని ఆకర్షింపచేసి, వారిని కూడా ఈ సాధనకు ప్రేరణచేస్తాయి. కాబట్టి ఈ సాధనకు ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేవు.



_ఆధ్యాత్మిక సాధనకు కావాల్సిన కొన్ని ముఖ్య లక్షణాలు..._*


1).స్వ ప్రయత్నం.



2).స్వయం క్రమశిక్షణ.



3).స్వ అధ్యయనం.



4).స్వ పరీశీలన.



5).స్వ లక్ష్య నిర్ణయం.



6).సమయ పాలన.



7).పోల్చుకోక పోవడం.



8).అనాసక్తి.



9).మౌనం.



10).ఎల్లలు లేని ప్రేమ.



11).ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించడం.



12).అన్ని వాస్తవాలని యధాతధంగా స్వీకరించడం.



13).కర్మని బట్టి సర్వం జరుగుతాయి కాబట్టి "చేసుకున్నవాడికి చేసుకున్నంత" అని గ్రహించడం.



14).వాస్తవానికి మనమే సృష్టి కర్త అని గ్రహించి కావాల్సిన వాస్తవాలను సృష్టించుకోవడం.



15).నిత్యము, సత్యము, శాశ్వతం వీటిని గురించి విచారణ, విశ్లేషణ చేయడం.



16).మార్పు సహజం అని గుర్తించి దానిని ఆహ్వానించడం.



17).అహంకారమును పూర్తిగా తొలగించడం.



18).మమకారాన్ని ఆదిలోనే తుంచడం.



19).తాను అందరికంటే అధికుడను అన్న భావం రానివ్వకుండా జగ్రత్తగా ఉండడం.



20).సదా ఎరుకలో ఉండడం.



21).భౌతిక, ఆధ్యాత్మిక, మతములపై పూర్తి అవగాహన కలిగి ఒక దానితో ఇంకొకటి కలిపి కలగాపులగం చేయకపోవడం.



22).అలవాట్లు, వ్యాసనాలు, సంప్రదాయాలు, సంస్కారాలు, వాసనలు వీటి గురించి పూర్తి అవగాహన కలిగి సరియైనవి ఎన్నిక చేసుకోవడం.



23).అంతరంగ శుద్ధి కలిగి ఉండడం, దాని కోసం సాధన చేయడం.



24).అహం నాస్తి, ఇదం నమమ అన్న భావాలని అవగాహన చేసుకొని జీవించడం.



25). మనచే ఆచరింప బడ్డ సర్వ కర్మ ఫలితాలు పరమాత్మకు ప్రతి నిత్యం ప్రయత్నపూర్వకంగా సమర్పణ చేయడం.



26).దేని చేత బంధింపబడక నిత్య ముక్త స్థితిలో ఉండడం..


🕉🌞🌎🌙🌟🚩

 శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన


సురుటిరాగః - ఆదితాళమ్‌.


 చేతః శ్రీరామమ్‌!

చేతః శ్రీరామం - చిన్తయ

జీమూతశ్యామమ్‌!



1. అఙ్గీకృత తుమ్బురు సఙ్గీతం

హనుమద్గవయ గవాక్ష సమేతమ్‌|| చేతః||



2. నవరత్న స్థాపిత కోటీరం

నవతులసీదళ కల్పితహారమ్‌|| చేతః||



3. పరమహంస హృద్‌ గోపురదీపం

చరణదళిత ముని తరుణీశాపమ్‌|| చేతః||



తాత్పర్యము:-


1. చిత్తమా! మేఘశ్యాముని శ్రీరాముని ధ్యానింపవే! తుంబురుగానము నంగీకరించిన ప్రభువును, హనుమతో - గవయ గవాక్షవీరులతో కొలువుదీరియున్న శ్రీరఘునాథుని ఆశ్రయింపవే!



2. శిరమున నవరత్నకిరీటముతో - మెడలో తులసీ దళదామముతో శోభించు రామచంద్రుని - ఓచిత్తమా! ఆశ్రయింపవే! ఆశ్రయించి ధ్యానింపవే!



3. గుడిగోపురమున ధగధగ మెఱయు దీపమువలె యోగిపుంగవుల (పరమశివేంద్రుల) హృదయములో వెలుగులుజిమ్ము శ్రీరాముని - పాదస్పర్శచేతనే పాషాణమును పడతిగా మార్చిన (అహల్యా శాపవిమోచనము) శ్రీరామచంద్రపరబ్రహ్మ మును చిత్తమా! సేవింపవే! సేవించి ధ్యానింపవే!


🕉🌞🌏🌙🌟🚩

 *||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-3-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩


షష్ట్యా తతో దుహితృభిస్సృజతః కులౌఘాన్

దౌహిత్రసూనురథ తస్య స విశ్వరూపః।

త్వత్ర్సోత్రవర్మితమజాపయదింద్రమాజౌ

దేవ! త్వదీయమహిమాఖలు సర్వజైత్రః।।


భావము:-


పిమ్మట, దక్షుడు తన అదితి మున్నగు అరువది కుమార్తెల ద్వారా ప్రజాసృష్టి వివృద్ది గావించెను. ఆక్రమమున, అదితి కశ్యపులకు ద్వారా కలిగిన 'త్వష్ట' అను దౌహిత్రునికి (కుమార్తె కుమారునికి) 'విశ్వరూపుడు' అను పుత్రుడు కలిగెను. ప్రభూ! ఆ విశ్వరూపుడు నీ స్తోత్రకవచమును (నారాయణ కవచమును) దేవేంద్రునిచే పఠింపజేసెను. నీ ఈ 'స్తోత్రకవచము' మిక్కిలి మహిమాన్వితమయినది. సకల విజయ సిద్ధిదాయకమైనది.


వ్యాఖ్య:-


ఆయుధాల నుంచి గాని, గాయపరచే వస్తువుల నుంచి గాని, ప్రతికూల శక్తులవల్ల గాని హాని కలగకుండా చేసేది’ అని కవచమనే పదానికి నిఘంటువు అర్థం చెబుతుంది. 



పూర్వులు దుష్ట శక్తులనుంచి మనల్ని రక్షించే మంత్రాన్ని కూడా కవచం అనేవారు. ఇవి దేవతల పేరు మీద ఉంటాయి. గణపతి, గాయత్రీ, సుదర్శన మొదలైన కవచ మంత్రాలు ప్రసిద్ధి చెందాయి. నారాయణ కవచం పరమ పవిత్రం. ఈ కవచం గురించి  భాగవతం విశదీకరించిందిఇంద్రుడు గర్వంతో సింహాసనంపై రాజసం ఒలకబోస్తూ కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఆయన గురువైన బృహస్పతి సభలోకి వచ్చాడు. ఇంద్రుడు గురువును గౌరవించలేదు. 



దాంతో ఆయన కోపించి సభలో నుంచి విసవిసా వెళ్లిపోయాడు. ఇదే సరైన సమయమని శుక్రాచార్యుడు రాక్షసుల్ని దేవతలపైకి ఎగదోశాడు. రాక్షసుల దెబ్బకు దేవతలు విలవిల్లాడారు. బ్రహ్మను శరణు వేడారు. ‘గురువును గౌరవించనందువల్ల మీకు ఈ గతి పట్టింది. మీరు త్వష్టమనువు కుమారుడైన విశ్వరూపుడిని ఆశ్రయించండి. మీ కష్టాలు తీరతాయి’ అని బ్రహ్మ దేవతలకు సలహా ఇచ్చాడు. 



దేవతలు విశ్వరూపుడి చెంతకు పోయి, తమ మొర వినిపించారు. అప్పుడు విశ్వరూపుడు వారికి నారాయణ కవచాన్ని ఉపదేశించాడు.



నారాయణ కవచం ఏం చెబుతోంది? ‘గరుడుడిపై పాదాలు మోపి, శంఖ చక్రాదులనూ అణిమాది అష్ట విభూతులనూ హస్తాలందు ధరించే స్వామి దయతో నన్ను రక్షించాలి! మకర, వరుణ, జలాల వల్ల మాకు మరణం కలగకుండా ఆ మత్స్యావతార మూర్తి నన్ను కాపాడాలి! అడవుల్లో, సంకట ప్రదేశాల్లో, యుద్ధరంగంలో, అగ్నిజ్వాలలో శ్రీనరసింహస్వామి నాకు దిక్కు అగుగాక... పుణ్యప్రదుడైన స్వామికి నా నమస్కారం! ఆశ్రిత రక్షణ తత్పరుడైన వైకుంఠ ధాముడికి ప్రణామం!’ అని ఇంద్రుడు భక్తితో నియమ నిష్ఠలతో శ్రీమన్నారాయణుణ్ని ప్రార్థించాడు.



 ఈ నారాయణకవచము  ప్రభావంతో దేవతలు రాక్షసులను జయించగలిగారు. 'అభయమిచ్చి రక్షించు స్వామీ!’ అని ప్రార్థించేవారికి నారాయణుడు భూత ప్రేత పిశాచ బాధలనుంచి విముక్తి ప్రసాదిస్తాడని భాగవత కథ ప్రబోధిస్తున్నది. 


🕉🌞🌎🌙🌟🚩

[22:37, 06/12/2020] +91 92915 82862: 18-12-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩


అవతారిక -  కర్మఫలములను త్యజించుటచే కర్మబంధమునుండి మనుజు డేల విడివడగలడో చెప్పుచున్నారు -


అనిష్టమిష్టం మిశ్రం చ 

త్రివిధం కర్మణః ఫలమ్ | 

భవత్యత్యాగినాం ప్రేత్య  

న తు సన్న్యాసినాం క్వచిత్ || 


తాత్పర్యము:- దుఃఖకరమైనదియు, సుఖకరమైనదియు, సుఖదుఃఖములు రెండును గలసినదియునగు మూడువిధములైన కర్మఫలము- కర్మఫలత్యాగము చేయనివారలకు మరణానంతరము కలుగుచున్నది,  కర్మఫలత్యాగముచేసినవారికన్ననో అవి యెన్నటికిని కలుగనేరవు.



వ్యాఖ్య:- కర్మ బంధమును గలుగజేయునని, జన్మకు హేతువగునని, కావున చేయరాదని చెప్పువారికి భగవానుడీశ్లోకమున సరియైన సమాధాన మొసంగిరి. కర్మ యెవరికి బంధమును గలిగించును? అందఱికినిగాదు.



 ఫలాపేక్షతో చేయువారికి, సంగముతోను, అభిమానముతోను, కర్తృత్వబుద్ధితోను ఆచరించువారికి మాత్రమే కర్మ బంధకరముగ పరిణమించునుగాని, అసంగముగ, నిష్కామముగ ఫలాపేక్షారహితముగ ఆచరించువారికి గాదు. ఆ విషయమే ఈ శ్లోకమందు స్పష్టముగ చెప్పబడినది.



 స్వర్గాది సుఖరూప ఇష్టఫలముగాని, నరకనీచజన్మాది దుఃఖరూప అనిష్టఫలముగాని, మానవజన్మయను సుఖదుఃఖమిశ్రఫలముగాని ఫలాపేక్షతో కర్మలను జేయువారికే కలుగునుగాని, ఫలములను వదలిన వారికి కాదు. (న తు సన్న్యాసినాం క్వచిత్) అని చెప్పుటవలన ఏకాలమందును వారికి బంధము కలుగదని భావము. ఏలయనగా కర్మఫలములను త్యజించువారికి చిత్తశుద్ధిద్వారా మోక్షమే కలుగును. జన్మరాహిత్యమే సిద్ధించును.



వారికి లోకాదుల (జన్మాదుల) ప్రసక్తియే యుండదు. సంసారచక్ర పరిభ్రమణమంతయు ఫలాపేక్షతో కర్మలను జేయువారికే యగును. దీనినిబట్టి ఫలాపేక్షారహితమగు (నిష్కామమగు) కర్మ యెంతటి మహిమతో గూడుకొనియున్నదో, భగవానునకు దానియెడల యెంతటి ప్రీతియో విస్పష్టమగుచున్నది.



ప్రశ్న:- కర్మఫల మెన్నివిధములు? అవి యేవి?

ఉత్తరము: - మూడు విధములు -

(1) ఇష్టమైనది (సుఖకరమైన స్వర్గాదులు)

(2) అయిష్టమైనది (దుఃఖకరమగు నరకనీచజన్మాదులు)

(3) ఇష్టానిష్టమిశ్రమమైనది (సుఖదుఃఖములు రెండునుగల మానవజన్మ).



ప్రశ్న:- ఈ మూడు ఫలములు యెవరికి కలుగును?


ఉత్తరము:- కర్మఫలములను వదలక కర్మలను ఫలాసక్తితో చేయువారికే కలుగును.



ప్రశ్న:- ఎపుడు కలుగును?


ఉత్తరము:- మరణానంతరము (ప్రేత్య).



ప్రశ్న:- ఈ కర్మఫలములు ఎవరికి కలుగవు?


ఉత్తరము:-కర్మఫలములు త్యజించి కర్మనాచరించువారికి అనగా, నిష్కామకర్మాచరణపరులకు కలుగవు. (వారికి చిత్తశుద్ధిద్వారా మోక్షమే లభించును గావున).


🕉🌞🌎🌙🌟🚩

[02:39, 07/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


172వ నామ మంత్రము


ఓం నిస్సంశయాయై నమః


సంశయములు లేనిది, సంశయములను నాశనము చేయునది మరియు కోరికలు లేనట్టి  గురుస్వరూపిణియైన జగదీశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిస్సంశయా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిస్సంశయాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకుడు సంశయరహితుడై, జన్మకు కారణములు, పునర్జన్మ రహితమైన మోక్షసాధనకు తానేమి చేయవలెనో ఆ పరమేశ్వరి కరుణతో తెలిసికొని, ఆత్మానందానుభూతితో జీవించి తరించును.


 మానవ జన్మే సంశయాత్మకమైనది. ద్వైతమంటే ఏమిటి? అద్వైతమంటే ఏమిటి?  ఈ రెండిటిలో దేనిని అనుసరించాలి? జీవుడు వేరు, దేవుడు వేరు అని చెప్పే ద్వైతము ఎంతవరకూ అనుసరించదగినది, జీవుడు, దేవుడు ఒకటే అని చెప్పే అద్వైతము యొక్క నిర్వచనమేమిటి? అది అనుసరించినందువల్ల ఆత్మానందానుభూతి కలుగుతుందా? ఆత్మ, దేహము ఈ రెండూ ఒకటేనా? ఈ రెండూ కాని మనస్సే ఆత్మ అవుతుందా? ఇవి ఏమియు కాని బుద్ధికి, మనస్సుకు గల సంబంధం ఏమిటి? ఇవన్నీ సంశయాలే!


ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవుడు అని చెబుతారు. దేవలోకం ఉంది అంటారు. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలలో ఏది దేవలోకం? అసలు దేవతలను ఎవరైనా చూడడం జరిగిందా? 


ఇంక పరబ్రహ్మమంటే ఏమిటి? కర్మఫలం అనేది ఉందా? ఉంటే దానిని అనుభవింపజేసేవారు ఎవరు? దేవుడి గుడి, విగ్రహం, పుణ్యక్షేత్రం ఇవి ఏమిటి? దేవుడు సర్వాంతర్యామి అయితే, గుడికే ఎందుకు వెళ్ళాలి? , దేవుడిని విగ్రహంలోనే ఎందుకు వెదకాలి? పుణ్యక్షేత్రాలలోనే దేవుడు ఎందుకు ఉంటాడు?  ఇవన్నీ సంశయాలే మనకు. 


వీటికి సమాధానాలు వేదవేదాంగములందు, శాస్త్రములందు,  పురాణేతిహాసములందు తెలిసికోవచ్చు. అంతమాత్రమే కాదు. ఆ జగన్మాతను త్రికరణ శుద్ధిగా ధ్యానిస్తే కూడా మానవునికి గల అనేక సంశయాలకు సమాధానం దొరుకుతుంది.


జగన్మాత సర్వ మంత్రస్వరూపిణి మరియు సర్వమంత్రాత్మిక. ఇంకను సర్వతంత్రాత్మిక.   జగన్మాత శ్రీవిద్యా స్వరూపిణి. కుండలినీ శక్తిగా షట్చక్రములలో ఉంటూ, బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులను ఛేదించుకుంటూ, సహస్రారంలో సుధాసాగరమందు పరమేశ్వరుని చేరి, అమృతధారలలో సాధకుని తన్మయుణ్ణిచేసి పరబ్రహ్మతత్త్వాన్ని అనుభవైకవేద్యంగా బోధించే గురుమండలరూపిణి గనుక నిస్సంశయా  యని నామ ప్రసిద్ధమైనది.  ఆ తల్లి సర్వ మంత్రస్వరూపిణి, సర్వతంత్రరూపిణి, మహాయో

గేశ్వరేశ్వరి గనుక నిస్సంశయా అని అనబడినది. ఆ పరమేశ్వరి మూలమంత్రాత్మికా, మూలకూటత్రయకళేబరా, జ్ఞానదాయనీ, సర్వవేదాంత సంవేద్యా,, సత్యానంద స్వరూపిణీ, ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తి స్వరూపిణీ,  గురుమండల రూపిణీ, దక్షిణామూర్తి రూపిణీ, శివజ్ఞాన ప్రదాయనీ, శాస్త్రసారా, పరబ్రహ్మస్వరూపిణీ అని వివిధ నామ మంత్రములే తన స్వరూపమైనది ఆ తల్లికి సంశయాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి నిస్సంశయా యని నామ మంత్రముతో స్తుతింప బడుచున్నది.  అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిస్సంశయాయై నమః అని అనవలెను.

🌸💐💐💐

[06:25, 07/12/2020] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 571  / Bhagavad-Gita - 571 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 15 🌴


15. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |

స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే ||


🌷. తాత్పర్యం : 

సత్యమును, ప్రియమును, హితకరమును, అనుద్వేగకరమును అగు వచనములను పలుకుట మరియు నిత్యము వేదపారాయణము చేయుట యనునవి వాక్కునకు సంబంధించిన తపస్సనబడును.


🌷. భాష్యము  :

ఇతరుల మనస్సు కలతపడు రీతిలో మనుజుడు ఎన్నడును భాషించరాదు. కాని ఉపాధ్యాయుడు మాత్రము శిక్షణ నిమిత్తమై తన విద్యార్థులతో సత్యమును పలుకవచ్చును.


 అదే ఉపాధ్యాయుడు తన విద్యార్థులు కానివారి యెడ మాత్రము భిన్నముగా ప్రవర్తించవలెను. అనగా తాను వారి కలతకు కారణమైనచో అతడు వారితో సంభాషింపరాదు. వాక్కునకు సంబంధించినంతవరకు ఇదియే తపస్సు. దీనితోపాటు వ్యర్థప్రసంగమును కూడా చేయరాదు. 


సత్సంగమునందు కేవలము శాస్త్రములచే సమర్థింపబడిన దానినే పలుకవలెను. ఆ సమయమున తాను ప్రవచించు విషయములను సమర్థించుటకు శాస్త్రప్రమాణమును నిదర్శనముగా చూపవలెను. దానితోపాటు ఆ ప్రవచనము కూడా శ్రవణానందకరముగా నుండవలెను. 


అట్టి చర్చల ద్వారా మనుజుడు దివ్యలాభమును పొంది మానవసంఘమును ఉద్ధరింపగలడు. వేదవాజ్మయము అనంతముగా నున్నది. మనుజుడు దానిని అధ్యయనము కావింపవలెను.అదియే వాచిక తపస్సనబడును.

🌹 🌹 🌹 🌹 🌹


🌻152. వామనః, वामनः, Vāmanaḥ🌻


ఓం వామనాయ నమః | ॐ वामनाय नमः | OM Vāmanāya namaḥ


వామనః, वामनः, Vāmanaḥ

వామన రూపేణ బలిం యాచితవాన్ వామన రూపముతో బలిని యాచించెను. ఈ కథ యందలి వామనుడు విష్ణుడే! లేదా సంభజనీయః లెస్సగా, ఎంతో గొప్పగా ఆశ్రయించి సేవించ బడదగినవాడు.


:: కఠోపనిషత్ - ద్వితియాధ్యాయము, 5వ వల్లి ::

ఊర్ధ్వం ప్రాణమున్నయ త్యపనం ప్రత్యగస్యతి ।

మధ్యే వామన మాసీనం, విశ్వేదేవా ఉపాసతే ॥ 3 ॥


పూజనీయుడగు పరమాత్మ ప్రాణమును పైకి పంపుచున్నాడు. అపానమును క్రిందకు పంపుచున్నాడు. మధ్యలో అసీనుడై యున్న ఆ యాత్మను దేవతలందరు ఆరాధించుచున్నారు.


:: పోతన భాగవతము - ఆష్టమ స్కందము ::

క. మునిజన నియమధారను, జనితాసుర యువతి నేత్ర జలకణధారన్‍

    దనుజేంద్రనిరాధారను, వనజాక్షుఁడు గొనియే బలివివర్జితధారన్‍.


బలిచక్రవర్తి అందించిన దానధారను వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనది. రాక్షసస్త్రీలను కన్నీటిధారల పాలుచేసేది. రాక్షసరాజులను నిరాధారులుగా మార్చేది.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 153 / Vishnu Sahasranama Contemplation - 153 🌹

📚. ప్రసాద్ భరద్వాజ 


 🌻153. ప్రాంశుః, प्रांशुः, Prāṃśuḥ🌻


ఓం ప్రాంశవే నమః | ॐ प्रांशवे नमः | OM Prāṃśave namaḥ


ప్రాంశుః, प्रांशुः, Prāṃśuḥ

ప్రాంశు అనగా ఉన్నతమైన లేదా పొడువైన అని అర్థము. స ఏవ జగత్త్రయం క్రమమాణః ప్రాంశు రభూత్ ఇతి ఆ వామనుడే జగత్త్రయమును తన అడుగులతో వ్యాపించుచు ప్రాంశువు అయ్యెను.


:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::

శా. ఇంతింతై, వటుఁడింతయై, మఱియుఁ దా నింతై, నభోవీథిపై

నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రుని కంతయై, ధ్రువుని పైనంతై, మహర్వాటి పై

నంతై, సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై

మ. రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్‍.


దానాన్ని తీసుకొన్న వామనుడు కొద్ది కొద్దిగా ఎదిగినాడు. ఇంతవాడు అంతవాడైనాడు. అంతవాడు మరింతవాడైనాడు. క్రమక్రమంగా పెరిగిపోతున్నాడు. వరుసగా ఆకాశం కంటె మేఘమండలం కంటె, వెలుగుల రాశికంటె పైకి పెరిగాడు. చంద్రుని వరకూ, ధ్రువతారవరకూ, మహార్లోకం వరకూ, ఆ పైన సత్యలోకం వరకూ పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండిపోయినాడు.


వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో సూర్యబింబం క్రమక్రమంగా అతనికి గొడుగుగా, తరువాత శిరోమణిగా (శిరస్సున ధరించే ఆభరణం), తరువాత మకర కుండలంగా (చెవి ఆభరణం), తరువాత కంఠాభరణంగా, ఆ తరువాత బంగారు భుజకీర్తిగా (భుజాన ధరించు ఆభరణం), అటు తరువాత కాంతులీనే కంకణంగా (చేతికి ధరించే ఆభరణం), అనంతరం మొలలోని గంటగా, ఆ పైన మేలైన కాలి అందెగా, చివరకు పాదపీఠంగా ప్రకాశించింది. (వామనుడు ఎంతగా పెరిగిపోయాడో సూర్య బింబ సంబంధముతో తెలుపటం జరిగింది).


:: హరివంశము - తృతీయ ఖండము, ఏకసప్తతోఽధ్యాయము ::

తోయే తు పతితే హస్తే వామనోఽభూద వామనః ।

సర్వదేవమయం రూపం దర్శయామాస వై ప్రభుః ।

భూః పాదౌ ద్యౌః శిరశ్చాస్య చంద్రాదిత్యౌ చ చక్షుషీః ॥ 43, 44 ॥


'జలము హస్తమునందు పడగానే వామనుడు అవామనుడు (పొడగరి) అయ్యెను. అంతటి ఆ ప్రభువు సర్వదేవమయమమగు రూపమును చూపెను. అట్టి ఈతని పాదములుగా భూమియు, శిరముగా ద్యులోకమును, నేత్రములుగా చంద్రసూర్యులును అయ్యెను.'


ఈ మొదలుగా విశ్వరూపమును చూపి ఆతడు భూర్భువర్సువర్లోకములను ఆక్రమించుచు పెరిగిపోవు క్రమములో భూమిని దాటి విక్రమించుచు అతని వక్షస్థలమున చంద్రసూర్యులుండిరి. అంతరిక్షలోకమును దాటి ముందునకు ప్రక్రమించుచుండగా ఆతని నాభియందు ఆ చంద్రసూర్యులు నిలిచి ఉండిరి. ద్యులోకమును కూడా దాటుచు ఆక్రమించుచు పోవుచున్న ఆతనికి మోకాళ్ళదిగువను ఆ రవిచంద్రులు వచ్చిరి.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

06:25, 07/12/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 124 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ


🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 54 🌻


చతుర్థవల్లిలో నచికేతుడు తనలో తాను ఆత్మోపదేశము గ్రహించిన తరువాత, విన్న తరువాత మరి ఇట్లయితే మానవాళి అంతా కూడా ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి కదా! ఈ ఆత్మాశ్రయాన్ని పొందాలి కదా! ఈ స్వస్వరూపజ్ఞానాన్ని పొందాలి కదా! ఈ స్వప్రకాశ లక్షణాన్ని తెలుసుకోగలిగి ఉండాలి కదా! కానీ, అట్లు తెలుసుకోజాలకున్నారు కదా! కారణమేమై ఉంటుంది? ప్రతిబంధకము ఏమై ఉంటుంది? అడ్డుగా ఏమి ఉంది? అనేటటువంటి విచారణ చేపట్టాలి. 


ఆ విచారణను గ్రహించినటువంటి యమధర్మరాజు నచికేతునికి మరలా ఆత్మోపదేశము నందు స్థిరపరచటానికి దానికి ప్రతిబంధకాల గురించి, అడ్డు వచ్చేటటువంటి ఇంద్రియ వ్యాపార విశేషాల గురించి, వాటిని అధిగమించే ప్రక్రియల గురించి, తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రతి బంధకాలని మానవుడు స్వయముగా, విశేషముగా పరిశోధించి, సద్గురు కృప చేత, ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును పొంది, అధిగమించవలసినటువంటి అవసరము ఉన్నది.


         నచికేతా! పరమేశ్వరుడు శ్రోత్రాది ఇంద్రియములను, శబ్దాది బాహ్య విషయములను గ్రహించుటకే నిర్మించెను. కావున మానవుడు ఆ ఇంద్రియముల ద్వారా ప్రాకృతకములగు బాహ్య విషయములనే గ్రహింపగలుగుచున్నాడు. కానీ, అంతరాత్మను గ్రహించుట లేదు. 


ఇంద్రియములు బహిర్ముఖములై ఉండుట చేత, బాహ్య విషయములనే గ్రహించుట సహజము అయినప్పటికినీ ఉపాయశాలియు, ధైర్యము కలవాడును అగు మానవుడు, ప్రవాహమునకు ఎదురీదునటుల వివేకియగు వాడు గొప్ప ప్రయత్నము చేత, ఇంద్రియ ప్రవృత్తిలను నిరోధించి, వానిని అంతర్ముఖముగా నుండునట్లు చేసి, ప్రత్యగాత్మను చూచుచున్నాడు. దాని వలన జరామరణ రూప సంసారము నుండి విముక్తుడగును.

    

     కాబట్టి, సంసారము యొక్క లక్షణమేమిటంటే, జర మరణం. అంటే ముసలితనము, మరణము. ‘వృద్ధాప్యము, అసక్తత, మరణము’ ఇవన్నీ జీవితములో ప్రతీ ఒక్కరూ పొందేటటువంటి బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య రూపములు అనేటటువంటి, పరిణామ రూపమగు ‘శరీరమే నేను’ అనుకొన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పక శరీరమందు ఆసక్తి చేత, శరీరమునందు గల బాంధవ్యము చేత, శరీరమునందు గల సాంగత్యము చేత, ‘శరీరమే నేను’ - అనుకునేటటువంటి అజ్ఞానము అవిద్య చేత, అభిమానము చేత, ఆ యా ఇంద్రియ రూప వ్యవహారమంతా కూడా తానేనని భావించి, భ్రమ చేత, భ్రాంతి చేత, అవిద్యామోహము చేత, అజ్ఞాన మూలము చేత ఆ రకమైనటువంటి మనోభ్రాంతికి గురియై, సంసారమునందు పడిపోవుతున్నాడు.


         అలా గనక ఎవరైతే విచారణ చేసి, దానిని ముఖ్యమైనటువంటి ఉపమానము ఏమిటంటే ఇక్కడ ‘ప్రవాహమునకు ఎదురీది’ గొప్ప మనోధైర్యము కలిగి యుండి స్వీయ ***14.41 ప్రయత్నము చేత, అనేటటువంటి మూడు అంశాలని మనము వివరించుకొనుచున్నాము.


 ప్రవాహమునకు ఎదురీదేటటువంటి వాడు తన ప్రాణమును స్వాధీన పరుచుకొన్న వాడై ఉండాలి. నీళ్ళు త్రాగకుండా ఉండాలి. అలలకు ఎదురీద గలిగేటటువంటి సమర్థుడై ఉండాలి. 


గొప్ప శారీరక బలము కలిగినవాడై ఉండాలి, గొప్ప మనోబలం కలిగిన వాడై ఉండాలి. ఇంద్రియాలను వాటి యొక్క ధర్మము నుంచి విరమించగలిగినటువంటి సమర్థుడై ఉండాలి. అట్టి ఇంద్రియ జయాన్ని సాధించినటువంటి వాడు మాత్రమే, ప్రవాహానికి ఎదురీద గలుగుతాడు. 


అట్లా నీ మనస్సు ‘నీరు పల్లమెరుగు’ అన్నట్లుగా, బాహ్య విషయేంద్రియ వ్యాపారమునందు నిమగ్నమై, దాని యొక్క సుఖదుఃఖములను అనుభవిస్తూ, ఆ యా సుఖదుఃఖముల యొక్క అలలలో కొట్టుకొనిపోతూ, సంసార మూలమైనటువంటి జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ, కర్మచేత బాధించబడుతూ, కర్మఫలాలను అనుభవిస్తూ, మీరు చేస్తున్నటువంటి జీవనాన్ని విచారణ చేసి, ఆత్మ విచారణ ద్వారా, ఆత్మోపదేశము ద్వారా, ఆత్మసాక్షాత్కార జ్ఞానము ద్వారా, ఆ మోహాన్ని ఒదిలించుకోవాలి. 


అప్పుడు మాత్రమే నీవు ముక్తుడవైయ్యేటటువంటి అవకాశం ఉన్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[06:25, 07/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 289 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

70. అధ్యాయము - 25


🌻. సతీ వియోగము  - 1 🌻


రాముడిట్లు పలికెను -


ఓ దేవీ! పూర్వము ఒకప్పుడు పరమ కారణుడగు శంభుడు విశ్వకర్మను పిలిపించి, అన్నిటికంటె ఊర్ధ్వమునందున్న తనలోకములో (1), తన గోశాలయందు ఆ విశ్వకర్మచేత సుందరమైన పెద్ద భవనమును నిర్మింపజేసెను. దానియందు గొప్ప సింహాసనమును చక్కగా ఏర్పాటు చేసెను (2). 


దానియందు మహాదివ్యము, అన్నివేళలా అద్భుతమును గొల్పునది, సర్వోత్తమము అగు ఛత్రమును శంకరుడు విశ్వకర్మచేత నిర్మింపజేసెను (3). ఆయన వెంటనే ఇంద్రాది సమస్త దేవతా గణములను, సిద్ధ, గంధర్వ, నాగ ఉపదేవులనందరినీ పిలిపించెను (4).


సర్వ వేదములను, శాస్త్రములను, బ్రహ్మను, ఆయన పుత్రులను, మునులను పిలిపించెను. దేవతా స్త్రీలందరు అప్సరసలతో గూడి వివిధ వస్తువులను తీసుకొని విచ్చేసిరి (5). దేవతల, ఋషుల, సిద్ధుల, మరియు నాగుల కన్యలను పదహారేసి మందిని మంగళార్థమై రప్పించెను (6). 


ఓ మహర్షీ! గొప్ప గాయకులచే పాడించి, వీణామృదంగాది ప్రముఖ వాద్యములను వాయింపజేసి ఉత్సవమును చేయించెను (7). సర్వ ఓషధులు మొదలగు, రాజాభిషేకమునకు అర్హమైన ద్రవ్యములను తెప్పించెను. వివిధ తీర్థములలో ప్రత్యక్షముగా లభించే జలములతో నిండిన అయిదు కుంభములనేర్పాటు జేసెను (8).


మరియు దివ్యములగు ఇతర వస్తువుల నన్నిటినీ తన గణములచే రప్పించెను. శంకరుడు గొప్ప ధ్వని కల్గునట్లు వేదఘోషను ఏర్పాటు చేసెను (9). 


ఓ దేవీ! అపుడు మహేశ్వరుడు ప్రీతి చెందిన మనస్సు గలవాడై వైకుంఠము నుండి విష్ణువును పిలిపించెను. విష్ణువు యొక్క పూర్ణ భక్తికి ఆయన చాల ఆనందించెను (10). మహాదేవుడు సుమూహూర్తమునందు ఆ భవనములో శ్రేష్ఠ సింహాసనముపై విష్ణువును ప్రీతితో కూర్చుండ బెట్టి, సర్వత్రా అలంకరింపజేసెను(11). 


సుందరమగు కిరీటమును పెట్టి, కౌతుకమనే మాంగళిక కర్మను చేసి, మహేశ్వరుడు స్వయముగా బ్రహ్మాండమండపమునందు అభిషేకించెను (12). ఇతరులకు లభించని స్వీయ ఐశ్వర్యము నంతనూ ఇచ్చెను. తరువాత స్వతంత్రుడు, భక్తవత్సలుడు నగు శంభుడు ఆ విష్ణువును స్తుతించెను (13).


మహేశ్వరుడిట్లు పలికెను -


ఓ సృష్టికర్తా! ఈనాటినుండి నా ఆజ్ఞచే ఈ విష్ణువు నాకు నమస్కరింపదగినవాడు అయినాడు. ఈ మాటను అందరు వినెదరు గాక! (15). వత్సా! విష్ణువు దేవతలందరికీ నమస్కరింపదగినవాడు. నీవీ హరిని నమస్కరించుము. నా ఆజ్ఞచే నా ఈ వేదములు నన్ను వలెనే విష్ణువును కూడ వర్ణించును గాక!(16).


రాముడిట్లు పలికెను -


రుద్రుడు ఇట్లు పలికి స్వయముగా గరుడధ్వజుడగు విష్ణువునకు నమస్కరించెను. భక్తవత్సలుడు, వరదాత అగు శివుని మనస్సు విష్ణువు యొక్క భక్తిచే ప్రసన్నమైనది (17). 


అపుడు బ్రహ్మాది దేవతలు, మునులు, సిద్ధులు మొదలగు వారందరు విష్ణువునకు నమస్కరించిరి (18).అపుడు భక్తవత్సలుడగు మహేశ్వరుడు మిక్కిలి ప్రసన్నుడై, దేవతలు ప్రశంసించుచుండగా, విష్ణువునకు గొప్ప వరముల నిచ్చెను (19).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |

శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖


🌻 133. 'నిరంజనా' 🌻


అజ్ఞానమను చీకటి సోకనిది శ్రీలలిత అని అర్థము.


అజ్ఞానము మూడు విధములు. మలమూత్రములతో కూడిన శరీరమే తాననుకొనుట. కర్మమే సమస్తమని కర్మస్వరూపమెరుగక అనేక జన్మ కర్మలయందు మునిగి యుండుట, తాను, ఇతరము అను భేదబుద్ధి కలిగి యుండుట. ఇట్టి త్రివిధములగు అజ్ఞానమును నలుపుతో పోల్చుదురు. ఇట్టి అజ్ఞానపు నలుపును అంజనము అందురు.


 అట్టి అజ్ఞానము నశించినపుడు నిరంజనమందురు. నిరంజనమనగా అజ్ఞాన రహితము, అవిద్యారహితము అయిన స్థితి. మిథ్యను మాయను దాటిన స్థితి. 


శ్రీలలిత త్రిగుణములతో కూడి మిథ్యా సహితమైన సృష్టి సలుపు చున్నప్పటికీ స్వతః ఆమెకు ఆ మిథ్యగానీ, మాయగాని,  అజ్ఞానము గాని అంటదు. 


కవి సన్నివేశములను, పాత్రలను అనేక విధములుగా సృష్టించు చున్నప్పటికి, వాని కతీతుడై అతడెట్లుండునో అట్లే శ్రీలలిత కూడను. సామాన్యజీవులు తాము సృష్టించిన వానియందు చిక్కు బడుదురు.


జ్ఞానులు పరహితము కొఱకు సృష్టించి అందు చిక్కుపడక నుందురు. అట్టివారికి శ్రీలలిత ప్రమాణము. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 134  / Sri Lalitha Chaitanya Vijnanam  - 134 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖


🌻134. 'నిర్లేపా' 🌻


సృష్టి లేపనము అంటనిది శ్రీలలిత అని అర్థము.


శ్రీలలిత తన త్రిగుణములచేతను, పంచభూతములచేతను, ఎనిమిది ఆవరణములు సృష్టి చేయును. వానికి ఆమె మూలము కనుక ఆమె తొమ్మిదవది. తనయందలి శివతత్త్వము పదవది. 


ఎనిమిది ఆవరణములు శుద్ధచైతన్యమగు ఆమెకు ఎనిమిది పూతల వంటివి. ఆ పూతలు ఆమెను ఏమియు చేయజాలవు. అందువలన ఆమె నిర్లేప. 


జీవుడు కూడ చైతన్య స్వరూపుడే. అతనికి కూడ ఈ ఎనిమిది ఆవరణములున్నవి. అవి వరుసగా అహంకారము, బుద్ధి, చిత్తము, పంచభూతములు. 


అతడు ఈ ఆవరణములన్నిటిచేత బంధింపబడి యున్నాడు. భౌతిక బంధనమునుండి అహంకారమువరకు అన్ని ఆవరణముల యందు బద్ధుడై స్వస్వరూపమును మరచి జీవించు చున్నాడు. 


అట్టివాడు జ్ఞానము పొందవలెనన్నచో శ్రీలలిత నిర్లేప స్థితిని ఆరాధించవలెను. అది ఎట్లు? శుద్ధము, అనంతము, అమిత ప్రకాశవంతము అయిన వెలుగు నారాధించుటయే. ఈ ఉపాసనము స్థిరపడినచో జీవుడు అష్టబంధములను తొలగించుకొనగలడు. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


[09:13, 07/12/2020] +91 7013 527 083: సిద్ధులు - అష్ట సిద్ధులు



          --- 4 ---


📚✍️ భట్టాచార్య



   జగత్తులో...మూడు భూమికలున్నాయి. అవి భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం. ఈ భూమికల్లో...ఒక దానికంటే మరొకటి ఉన్నతమైనవి. ఈ మూడు భూమికలపైననూ, ఒక యోగ సిద్ధుడి, తంత్ర సిద్ధుడి అధికారం ఉంటుంది. ఒక సిద్ధుడు విషయ జ్ఞానం కొరకు చాలా సార్లు ఇంద్రియాల మీద ఆధార పడడు. అతడు వీటి నుండి స్వేచ్ఛ పొందిన వాడు. 


   ఒక సిద్ధుడు, చిత్ శక్తిని అర్థం చేసుకుంటూ, ప్రకృతి నియమాలననుసరించి ప్రవర్తిస్తాడు. పాంచ భౌతిక ప్రకృతిని అధిగమించిన వాడు, అరుదుగా ప్రకృతి నియమాలను కూడా అధిగమించగలడు.


దూర శ్రవణం - ఒక సిద్ధి :


 ఒక యోగి గాఢ ధ్యానావస్తల్లో ఉంటే...చాలా సార్లు లేదా కొన్నిసార్లు అతనికి దివ్య/దూర శ్రవణం అనే సిద్ధి సంప్రాప్తిస్తుంది. మంత్ర సాధన ద్వారా, కొన్ని ప్రత్యేక క్రియల ద్వారా కూడా ఈ సిద్ధి వస్తుంది. గాఢ మైన ధ్యానావస్తల్లో ఉన్నపుడు, అతను కొన్ని మీటర్ల దూరం నుండి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు...మనుజుల, మనుజేతరుల మాటలు వినిపిస్తాయి. కొన్ని సార్లు చిత్ర విచిత్ర ధ్వనులు కూడా వినిపిస్తాయి. ఇతర తలాలలో ఉన్న జీవులు మాటలాడుకొనే, మాటలు కూడా వినిపించవచ్చు. దీనిని clairaudience అంటారు. అయితే, వీటిని విశ్లేషించడానికి, నైపుణ్యం అవసం కూడా.....


దూర దర్శనం - ఒక సిద్ధి :


దీనిని clairvoyance అని కూడా అంటారు. యోగ సాధనల ద్వారా, కొన్ని ప్రత్యేక క్రియల ద్వారా, గాఢమైన ధ్యానం ద్వారా, మంత్ర సాధన ద్వారా...ఈ సిద్ధి సంప్రాప్తిస్తుంది. ఈ సిద్ధి వలన ఒక యోగి భూత-భవిష్యత్-వర్తమానాలను...చూడగలడు. త్రికాలజ్ఞుడు కాగలడు. ఈ దూర దృష్టి లేదా దివ్య దృష్టి, ఒక యోగి యొక్క ఆధ్యాత్మిక పరిణామం కూడా. కుండలినీ శక్తిని, ఉత్తేజ పరచడం ద్వారా కూడా ఈ సిద్ధి పొందడం జరుగుతుంది.


   యోగ సాధనలో "ఆజ్ఞా చక్రాన్ని" ఉత్తేజ పరచడం ద్వారా...ఈ దివ్య దృష్టి లేద దూర దృష్టి అనే సిద్ధిని...ఒక యోగి పొంద గలడు. కాబట్టి...


|| ఉత్తిష్ఠోత్తిష్ఠ యోగీ భవ ||



 ఒక యోగి, ధ్యానంలో ఉన్నప్పుడు ...అత్యంత ప్రకాశవంతమైన కాంతి బిందువులను చూస్తాడు. ఈ బిందువులు శూన్యంలోంచి వస్తూ పోతున్నట్లుగా...కనిపిస్తాయి. ఇవి మనం నిత్య జీవితంలో, చూడనటువంటి దివ్య వర్ణములను ప్రతిబింబిస్తాయి. కొందరికైతే, సముద్రము నుండి ఉదయిస్తున్న పెద్ద సూర్యబింబం మాదిరి జ్యోతి దర్శనం అవుతుంది. మరి కొందరికి దట్టమైన మబ్బుల మధ్య గల సుందరమైన చంద్రబింబాన్ని చూస్తారు. ఈ మనోహరమైన అనుభూతులు...యోగి తన దేహ భావాన్ని మరచిపోయి సాటిలేని ఆనందానుభూతిలో...తేలియాడేలా చేస్తాయి. 




పతంజలి యోగ దర్శనంలో....ఒక సూత్రం చెబుతాడు.


|| జన్మౌషధి - మంత్ర - తపః - సమాధిజాః సిద్ధయః ||


తా : జన్మతో, మూలికలతో, మంత్రాలతో, తపస్సుతో, సమాధితో సిద్ధులు కలుగుతాయి.


   కొందరు పుట్టుకతోనే, సిద్ధపురుషులై ఉంటారు. అయితే వీరు ఈ సిద్ధులను , పూర్వ జన్మల్లో సంపాదించుకొని ఉంటారు. తమ పూర్వ జన్మ ఫలాన్ని అనుభవించడానికా...అన్నట్లుగా...ఈమారు జన్మిస్తారు. సాంఖ్య తత్వ జ్ఞాన జనకుడైన "కపిలుడు", సిద్ధుడై జన్మించాడని అంటారు. సిద్ధుడంటే, విజయం పొందిన వాడని అర్థం.


మంత్ర శక్తి - ఒక సిద్ధి :


    హిత పరిస్థితుల్లో, మంత్రోచ్ఛారణ వలన, అద్భుత శక్తులు కలుగుతాయి. మానవ మంత్ర, మానసిక శక్తులకు పరిమితం లేదు.


అష్ట మహా సిద్ధులు - లఘిమా సిద్ధి :


    సంస్కృత భాషలో "లఘిమ" అంటే, తేలికగా మారిపోవడం. దూది పింజ కంటే, తేలికగా మారడం. గాలిలో తేలిపోవడం, భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మారి, గాలి లోకి లేవడం కూడా "లఘిమా సిద్ధి" క్రిందకే వస్తుంది. 


   ప్రాణాయామంలో పరమ సిద్ధిని పొందిన యోగి , గాలిలో కొన్ని అడుగుల ఎత్తు లేస్తాడు. దీనిని Levitation అని కూడా అంటారు. ఇది లఘిమా సిద్ధియే. లఘిమా సిద్ధిలో ఈ levitation లాంటివి మరికొన్ని ఉన్నాయి. అవి కూడా బహు తేలికగా మారిపోవడం లాంటివి.


    ఈ లఘిమా సిద్ధికి సంబంధించి, పతంజలి యోగ సూత్రాలలో ఒక సూత్రం ఉంది.


|| కాయాకాశయోః సంబంధసంయమాల్లఘు తూల సమాపత్తేశ్చాకాశగమనమ్ ||


తా : యోగి శరీరాకాల సంబంధంలో "సంయమం" చేస్తే, శరీరం పత్తిలా తేలికై, యోగి ఆకాశంలో సంచరిస్తాడు. ఇది కూడా లఘిమా సిద్ధియే.


అష్ట మహా సిద్ధులు - గరిమా సిద్ధి : 


గరిమా సిద్ధి అనగా అత్యంత బరువుగా మారిపోవడం. శ్రీ భారతంలో, సౌగంధికాపహరణం అనే  ఘట్టంలో.... భీముడు సౌగంధికా పుష్పం కోసం వెతికే దారిలో, హనుమంతుడు, మారు రూపంలో ఎదురు పడి...తన తోకను దాటి వెళ్ళమంటాడు, భీముని. ఎన్ని ప్రయత్నాలు చేసినా భీముడు ఆ తోక ఎత్తలేడు. ఆ విధంగా ఆంజనేయుడు, గరిమా సిద్ధిని ప్రదర్శిస్తాడు. ఈ గరిమా సిద్ధిని ప్రదర్శించే యోగిని, ఈ సృష్టిలో ఎవరు కూడా ఈషణ్మాత్రమైనా కదల్చలేడు.



 పరకాయ ప్రవేశము - ఒక పరమ సిద్ధి :


    పరకాయ ప్రవేశము అనగా, ఒక యోగి లేదా సాధకుడు...తాను వేరొకరి శరీరంలో ప్రవేశించడం. చరిత్రలో  ఆది శంకరులు పరకాయ ప్రవేశం ద్వారా, మృతి చెందిన అమరూ రాజు శరీరంలో ప్రవేశించడం, మనం "శంకర విజయం" లో చదువుతాము.


    పరకాయ ప్రవేశ సిద్ధి గూర్చి కూడా పతంజలి యోగ సూత్రాలు ఇలా చెబుతాయి.


|| బంధ కారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాశ్చ చిత్తస్య పర శరీరావేశః ||


తా : బంధ కారణం సడలిపోవడం వలన, ఇంద్రియాల ద్వారా విషయాల్లో ప్రసరించే జ్ఞానం కలిగియుండుట (శరీరంలోని నాడులు గ్రహించడం) వలన, యోగి మరొకరి శరీరంలో ప్రవేశిస్తాడు.


   యోగి స్వయంగా తాను ఒక శరీరంలో వర్తిస్తున్ననూ, యోగి ఒక శవంలో ప్రవేశించి, ఆ శవం కదిలేలా చేయగలడు. మానవ జీవ క్రియలన్నియూ ఆ శవం నిర్వహించేలా చేయగలడు. లేదా ఒక సజీవ శరీరంలో ప్రవేశించి, ఆ శరీర మనస్సును-ఇంద్రియాలను నిరోధించి, యోగి తాత్కాలికంగా ఆ శరీరం ద్వారా వర్తిల్లగలడు. యోగులననుసరించి, మనస్సు సర్వగతం కావడం వలన, ఆ యోగ భగవానుడు, మరొకరి శరీరంలో ప్రవేశించాలనుకొంటే, ఆ శరీరంపై సంయమం చేసి...దానిలో ప్రవేశిస్తాడు.


అష్ట మహా సిద్ధులు - ప్రాప్తి : ప్రాప్తి అనగా సముపార్జన.  సర్వ కాల సర్వావస్థల్లోనూ...సముపార్జించడమే..."ప్రాప్తి". సతత యోగ సాధనల ద్వారా ఒక యోగి "ప్రాప్తి" అనే సిద్ధిని పొందును. 


అష్ట మహా సిద్ధులు - ప్రకామ్యము: ఒక సాధకుడు ఈ "ప్రకామ్య సిద్ధిని" పొందితే, అతను ఏది కోరుకుంటే ...అది జరుగుతుంది. సృష్టిలో తాను ఏది తలచుకొంటే, అది జరుగుతుంది. దీనినే "ప్రకామ్యము" అంటారు.



సశేషము



 భాగవతము

శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩


ఈ పదకొండు రుద్రశక్తులు మనలో పనిచేయాలంటే పంచాక్షరి, రుద్రనమకం, రుద్రమంత్రం బాగా చేసుకోవాలి. ఈ రుద్ర శక్తులను అద్భుతమైన విషయములుగా గుర్తించి  చిన్నతనంలోనే పిల్లలకు పంచాక్షరి, రుద్రమంత్రము అలవాటు చేస్తే వారిలో శక్తులు బలముగా ఏర్పడతాయి. ఈ పదకొండు మంది రుద్రులు శిరస్సు నుండి పాదము దాకా స్థిరపడతారు. పదకొండు రకాల శక్తులు వారి యందు ఆవిష్కరింపబడతాయి. అలాంటి జీవుడు మహత్కార్యాలకు పనికి వస్తాడు.



ఎపుడో 50 సంవత్సరములకు మొదలుపెడితే అవదు. 5 సంవత్సరాలకు మొదలుపెట్టి, 10 సంవత్సరములకు శ్రద్ధ కలిగితే ఫలితముంటుంది. ఏడు లేక ఎనిమిది  సంవత్సరములకి  దానియందు పట్టు వస్తే  11 రుద్రులు మనలో బాగా స్థిరపడినట్లే. 35 సంవత్సరముల తర్వాత కొత్తగా మనసుకి పట్టడం కష్టం. కుస్తీ పట్టడమే ఉంటుంది.


🕉🌞🌎🌙🌟🚩


ఆచార్య సద్భావన


మహాత్ములు సదా భగవంతుని దివ్యస్పర్శకు స్పందించుటకు సిద్ధంగా ఉంటారు.



మనిషి తన ఆలోచనలను అపరిమితత్వంపై కేంద్రీకరించినప్పుడు దివ్యజ్ఞానాన్ని పొందుతాడు.



అనంతుడైన భగవంతుణ్ణి తెలుసుకోవడం ద్వారా మనం పరిపూర్ణులం అవుతాం. అప్పుడు మన చేతలు, హృదయం, మనస్సు ఏకం అవుతాయి. అల్పమైన *నేను కు స్థానం ఉండదు.*



అంతర్వాణి ఆధ్యాత్మిక జీవనంలో ఒక గొప్ప ఉపకరణం. స్వార్థంలేని హృదయంలో మాత్రమే అది అభివృద్ధి చెందుతుంది. అది ప్రతి అంశంపై తన ప్రకాశాన్ని వెదజల్లుతుంది.



దానికి పూర్వమే, మనం విజయం సాధించలేమని భావిస్తున్న అడ్డంకులు కూడా అలవోకగా అంతరించిపోతాయి.


శుభంభూయాత్


🕉🌞🌎🌙🌟🚩

[18:51, 07/12/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (733)

🕉🌞🌎🌙🌟🚩



{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

"దైవదర్శనం.. దుఃఖనాశనం.. శాంతితోనే సాధ్యం !''- (అధ్యాయం -90)


🕉🌞🌎🌙🌟🚩

[18:51, 07/12/2020] +91 92915 82862: "ఋభుగీత" (200)

🕉🌞🌎🌙🌟🚩


ఋభు నిధాఘ సంవాదము"

15వ అధ్యాయము 


సర్వత్యాగమంటే చిత్తాన్ని త్యజించడం !


త్యజించడం అంటే వేరు అనే స్మరణ లేకపోవడమే. అది మహామౌనం. అలా సర్వం త్యజించడమే నిత్యసుఖము అని ఋభు మహర్షి బోధ. త్యజించడం అంటే బాహ్యంగా కాదు. మనసులో నుండి ఆశ, కోరిక పోవడమే నిజమైన త్యాగం. ఏదో ఆశించి ఏర్పడే భక్తి, శిష్యత్వం లౌకికమైన విషయాలే అవుతాయి. పరమసత్యం కోసం అన్నింటినీ త్యజించడం అంటే మనసును త్యజించడమే అని కూడా ఋభువు నిర్ధారించారు. మనసు అంటే నేను అనే అహంకారమే. అదే మహాయాగంగా నిరూపించారు. అదే మహామోక్షంగా సెలవిచ్చారు. సర్వత్యాగమంటే చిత్తాన్ని త్యజించడం !


🕉🌞🌎🌙🌟🚩

[19:26, 07/12/2020] +91 92915 82862: 🌷91-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩


అధ్యాయము-7

🥀 శాస్త్రవిజ్ఞానము🥀


25. కొన్ని భోజన ద్రవ్యములను కలిపి పాకము చేసినచో పిండి వంట అగును. అందు మూల ద్రవ్యములున్నవి కాని నామము, రూపము, అనుభవము మారినవి. ఇది  కలయిక వలన కలిగిన మాయ. దీనివలన కొన్ని వస్తువులు మరియొక క్రొత్త వస్తువుగ భాసించుచున్నవి. ఇట్లే మనుష్యులు మున్నగు సకల చరాచర జగత్తు జీవుల దృష్టికి భాసించుచున్నది. ఇది నా ప్రకృతుల కలయిక యొక్క మాయ. ఇదియే యోగమాయ. దీని వలన నేను సర్వము నందుండియు ప్రకాశింప కున్నాను. జీవుల యందు పరస్పర సంబంధ బుద్ధి కలవానికి మోహము కలుగును. ఈ యోగ మాయ నుండి తప్పించునది యోగ విద్య. అదియే నా స్మరణము.



26. నాలో భూతకాలములు నడిచిపోయినవి. వర్తమానము వర్తించుచున్నది. భవిష్యత్తు నాలో రాబోవుచున్నది. ఈ మూడు కాలములలో వర్తించి దర్శించువారెవ్వరును నన్నెరుగ లేరు.



27. ఇచ్ఛ, ద్వేషము అను సంచలనములచే, చెరువు నీటికి బురద రంగు పట్టినట్లు, జ్ఞానమునకు మోహము పట్టును. సర్వజీవులు వానియందు మోహము చెంది జన్మాంతరములలో నాయందు యోగము చెందుచున్నారు.



28. పుణ్యకర్మల ఆచరణము వలన మోహకారణములైన రాగ ద్వేషములు శమించును. ఫలితము నుండి మనస్సు సన్యసించును. ఈ క్రమమున అంతమున ముక్తులై జీవులు నా యందు వసింతురు. అంతమనగా సంచలనమునకు అంతమని భావము. అదికాక సృష్టి ప్రకృతికి గాని, నాకు గాని అంతము లేదు.


🕉🌞🌎🌙🌟🚩

 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"


సదా విచారయేత్తస్మా జ్జగజ్జీవ పరాత్మనః ౹ జీవ భావ జగద్భావ బాధే స్వాత్వైవ శిష్యతే ౹౹12౹౹


12. కనుక సర్వదా జీవుడు జగత్తు పరమాత్మలను గూర్చి విచారింప వలెను.జీవుడనే భావము జగత్తు అనే భావము బాధ చెందినపుడు ప్రత్యగాత్మ స్వరూపమగు పరమాత్మయే మిగులును.బాధ అనగా అవి సత్యమనే భావము నశించుట.



ఈ సంసారము(ప్రపంచదృశ్యము)

అనునది జీవుని(ప్రథమవ్యక్తి -హిరణ్యగర్భుని)ఆద్యస్వప్నమే.



సృష్టి ప్రారంభమున హిరణ్యగర్భుని సమిష్టి పుర్యష్టకమునకు (సూక్ష్మదేహము) విషయజ్ఞానము ఎట్లు కల్గినదో అట్లే వ్యష్టి పుర్యష్టకములన్నింటికి విషయజ్ఞానము సర్వదా సంభవించును.



జీవుడు

(పుర్యష్టకరూపుడు లేక సూక్ష్మదేహరూపుడు)గర్భమునందున్నప్పుడే దేనిని ఊహించినను దానిని ఉన్నట్లుగా తాను చూచును.



స్థూలప్రపంచమందు విశ్వమూలతత్త్వములు ఎట్లు రూపొందునో,అట్లే సూక్ష్మప్రపంచమందు గూడ ఆ తత్త్వమునకు సరియగు ఇంద్రియములు రూపొందుచున్నవి.



సహజముగా యథార్థముగా సృజింపబడలేదు.ఈ పదములు వర్ణనలు కేవలము ఉపదేశము కోసమే ఉపయోగింపబడును. ఉపదేశార్థము ఉపయోగింపబడిన ఈ భావములు విచారముతో తొలగును.



ఆత్మ(పరమాత్మ) సత్యము. జీవుడు,

పుర్యష్టకమ(సూక్ష్మశరీరము),

సంసారమనే ప్రపంచ దృశ్యము దానికి సంబంధించిన మిగిలినదంతయు అసత్యము,వాని స్వభావ విచారణ నిస్సందేహముగా వాని అసత్యత్వ విచారణయే!



వ్యక్తికి అసత్యత్వపు నిజ స్వభావమును ఉపదేశించునుద్దేశముతో జీవుడు,మొదలగునట్టి పదములు ఉపయోగింపబడును.



ఈ అపరిచ్ఛిన్నచైతన్యము జీవస్వభావమును ధరించినట్లుగానుండి తన నిజస్వభావమును విస్మరించి, ఉన్నదని తాను తలుచుదానినంతటని అనుభవగోచరము గావించుకొనును.



రాత్రి యందు తాను దర్శించు అసత్యపిశాచము బాలునకు నిజముగా సత్యమయినట్లే జీవుడు గూడ తాను జూచు పంచభూతములను అవి తనకు కొన్ని వెలుపలనున్నట్లుగా కొన్నితన లోపల ఉన్నట్లుగా జీవుడు భావించును.అందువలన అతడు వానిని అనుభవించును.ఇవి జీవుని భావనలు తప్ప వేరు కావు.



ఎక్కడ ప్రపంచము కనిపించినను అది మాయామయమయిన ప్రపంచదృశ్యమే.అందువలన ఈ భ్రాంతి మానసిక పరిమితితో(వాసనతో)పోషింపబడును.



జీవుడు ఒక దేహమునుండి మరియొక దేహమునకు బోవును.

ఆ దేహము జీవుడు పెట్టుకున్న భావనయొక్క ప్రతిబింబమే.

అసత్యమయినది(దేహము)

మాత్రమే

మరణించును. మరియు మరియొక దేహమునందు మరల జనించునది కూడా అసత్యమే. 



సర్వదా జీవుడు జగత్తు పరమాత్మలను గూర్చి విచారింప వలెను.జీవజగత్తుల భావము నశించిన ప్రత్యగాత్మ స్వరూపమగు పరమాత్మయే మిగులును.



అన్ని ఆలోచనలను,భావనలను లేక మానసికరూపములను పరిత్యజించుట,గాఢమయిన మానసికపరిమితుల నివృత్తియే పరమాత్మ లేక బ్రహ్మము.



అట్టి

పరిమితి -బంధము, 

దాని 

పరిత్యాగము-విముక్తి.


🕉🌞🌏🌙🌟🚩

[19:51, 07/12/2020] +91 92915 82862: శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన


💧🦜సదాశివ బ్రహ్మేంద్ర యోగి విరచిత  శ్రీ రామ కీర్తన /మనసును బ్రహ్మానందంలో ఓలలాడుతూ..... బ్రహ్మంలో చరించమనే కీర్తన💧🦜



💧🦜పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం

పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం!!



చరణం 1:


💧🦜జనన మరణ భయ శోకవిదూరం

సకల శాస్త్ర నిగమాగమ సారం

జనన మరణ భయ శోకవిదూరం

సకల శాస్త్ర నిగమాగమ సారం

జనన మరణ భయ శోకవిదూరం

సకల శాస్త్ర నిగమాగమ సారం!!



💧🦜పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం

పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం!!



చరణం 2:


💧🦜శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం

శుక శౌనక కౌశిక ముఖ పీతం

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం

శుక శౌనక కౌశిక ముఖ పీతం

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం

శుక శౌనక కౌశిక ముఖ పీతం!!



💧🦜పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం

పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం

రామ రసం ... రామ రసం!!


🕉🌞🌎🌙🌟🚩


తాత్పర్యము:-


శ్రీరామనామరసమునో నా జిహ్వేంద్రియమా! ఆస్వాదింపవే! ఆస్వాదించి చెన్నొందవే!

1. రామరసము నాస్వాదింపుము. పాపములు నీదరి జేరవు. రామరసపాన మొనరింపుము - చతుర్విధ పురుషార్థములు కొల్లలుగా ఫలించును.



2. శ్రీరామనామామృత సేవనముచే - ''చచ్చెదమని - మరలబుట్టెదమని'' భయము ఏది ఇంతవరకు బీడించుచున్నదో - అది మటుమాయమై పోవునే! జిహ్వేంద్రియమా! శ్రీరామ రసమును పానమొనరింపవే! ఇది సకల వేదసారమే! సర్వ శాస్త్రములు, ఆగమములు దీనినే నిరూపించుచున్నవే!



3. బ్రహ్మాండము నెవరు పాలించుచున్నారు. శ్రీరామ నామామృతము! పతితులను సైతము పరమపవిత్రులుగా మార్చగలవారెవరు? శ్రీరామరసాయనము! అదిమాత్రమే ఆపని చేయగలదు.

అందుచే రసనేంద్రియమా! రామరసపానము జేసి రంజిల్లవే!



4. నిర్మలాంతఃకరణులైన యోగివరేణ్యులు (పరమశివేంద్రులు) శ్రీరామనామమును గానము చేయుచుందురే? ఓ రసనేంద్రియమా! శ్రీశుకయోగి - శౌనకమునివరుడు - విశ్వామిత్ర మహర్షి శ్రీరామనామామృతము నాదరముతో సేవించిన వారే సుమా! ఓనా జిహ్వేంద్రియమా! రామరసాయనమును సేవింపవే!


🕉🌞🌎🌙🌟🚩

[19:57, 07/12/2020] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-4-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩


ప్రాక్ శూరసేనవిషయే కిల చిత్రకేతుః

పుత్రాగ్రహీ నృపతిరంగిరసః ప్రభావాత్।

లబ్ద్వైకపుత్రమథ తత్ర హతే సపత్నీ-

సంఘైరముహ్యదవశస్తవ మాయయా౾ సౌ।।


భావము:-


ఒకానొకప్పుడు శూరసేన రాజ్యమును 'చిత్రకేతుడు' అను రాజు పరిపాలించుచుండెను. పుత్రులులేని ఆరాజుకు, 'అంగీరస' ముని అనుగ్రహమున పుత్రసంతానము కలిగెను. చిత్రకేతుని ఇతర భార్యలు (అసూయతో) ఆ పుత్రుని వధించిరి. మాయామోహితుడై, భగవాన్! 'చిత్రకేతుడు' దుఃఖ వివశుడయ్యెను.


వ్యాఖ్య:-


చిత్రకేతుడు శురసేనదేశమునకు రాజు . సంతానము కొఱకు కోటిమంది స్త్రిలను పెండ్లాడేను.కాని ఫలము లేకపోయేను. ఒకనాడు అంగిరసుడను ముని అతని మందిరమునకు రాగా, రాజు పూజించి, తన అపుత్రత్వమును గుర్చిచెప్పెను. 



అంగిరసుడు రాజుచేత పుత్రాకామేష్టి చేయించి యజ్ఞప్రసాదము నాతని పట్టపురాణి కృతద్యుతికి ఇచ్చెను. రాజునకు కుమారుడు పుట్టెను .అ రాజు పుత్రుని మొహములో బడి , వానిని వాని తల్లిని మిక్కిలి ఆదరించేను. ఇది తక్కిన రాణులకు కంటగిం పయ్యను. వారు బాలునికి విషము పెట్టి చంపిరి.



మరణించిన బాలునికై రాజును రాణియు విలపించుచు౦డగా అంగిరసుడు నారదునితో వచ్చి రాజుతో ఇట్లనెను.”రాజా! “ఋణానుబంధరూపేణ పశుపత్నిసుతాలయా:” అందురు.



(పశువులు , భార్యలు,కొడుకులు, ఇండ్లు ||ఋణములు బట్టి వచ్చును పోవును.) జగత్తు స్వప్నమువంటిది. స్వప్నము నిజముగునా? కర్మవశమున జీవులు పుట్టి గిట్టిచుందురు. నీకు వీడేమగును ?వానికి నీవే మగుదవు? ఇదంతయు భౌతికదేహ మున్నంత వరకే. నివు శ్రీహరిని ధ్యానించుచు మోహవికారములు త్యజింపుము’’. 



నారదుడు, “రాజా!నీకును వీనికిని బంధుత్వ మేమున్నదో చూడు” మని బాలుని దేహము జూచి , “జీవా! మీ తల్లితండ్రులు నీకై దుఃఖి౦చుచున్నారు. నీవు తిరిగి ఈ దేహములో ప్రవేశి౦చి వీరికి సంతోషము గలిగింపు”మనెను. బాలుడు , “కర్మబద్ధుడనై అనేక జన్మము లేత్తుచున్న నాకు వీరే జన్మలో తల్లి తండ్రులు ?ఒక్కక్క జన్మలో వేర్వేరు తల్లితండ్రులు బ౦ధువులు నాకేర్పడుచున్నారు. సర్వేశ్వరుడైన శ్రీపతి తన మాయాధీనులను జేసి జీవులను పుట్టించుచు తిరిగి తనలో లీనము చేసికోనును.



అని పలికి అ జీవుడు వెళ్లిపోగా చిత్రకేతుడు మోహము విడిచి బాలునికి యమునానదిలో ఉత్తరక్రియలు చేసెను. నారదునకు నమస్కరింపగా అతడు రాజునకు నారాయణమంత్రము ముపదేశించెను. 


🕉🌞🌎🌙🌟🚩

[20:18, 07/12/2020] +91 92915 82862: 18-13-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩    

     

అవతారిక - కర్మలు నెరవేరుటకుగల ఐదు కారణములను వచించుచున్నారు -


పఞ్చైతాని మహాబాహో! 

కారణాని నిబోధ మే | 

సాఙ్ఖ్యే  కృతాన్తే  ప్రోక్తాని 

సిద్ధయే సర్వకర్మణామ్ || 


తాత్పర్యము:- గొప్ప బాహువులుకల ఓ అర్జునా! సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండయొక్క అంతమును దెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను నావలన తెలిసికొనుము.



వ్యాఖ్య:- కృత + అన్తే  = కృతాన్తే, సాంఖ్యే - అనగా కర్మకాండయొక్క అంతమును బోధించు వేదాంతశాస్త్రమందు - అని అర్థము. వేదాంతమున ఆత్మ స్వరూపమును నిర్ణయించునపుడు అది ప్రకృతికి పరమై, అతీతమైయుండునది యనియు, సమస్తకర్మలు ప్రకృతిచేతనే జరుగుచుండుననియు, ఆత్మ సాక్షిగ,  నిష్క్రియముగ నుండుననియు అట తెలియజేయబడును.



కనుకనే సమస్తకర్మలు అంతమగు వేదాంత శాస్త్రమున అని యిట చెప్పబడినది. మఱియు "సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే” అని చెప్పబడినందువలన కర్మలన్నియు జ్ఞానమందు లయించిపోయి, పరిసమాప్తమగుచున్నవి. ఏలయనిన, చైతన్య (ప్రజ్ఞారూప) ఆత్మస్థితియందు శరీర, ఇంద్రియ, మనస్సంకల్పాదులుండవు కావున అచట కర్మ రహితమగును. కర్మను దాటిపోయినస్థితి అది. కనుకనే ఇచట జ్ఞానమునకు, వేదాంతశాస్త్రమునకు కర్మయొక్క అంతము (కృతాంతము) అని చెప్పబడినది.



ప్రశ్న:- ఏ కర్మ అయినను జరుగవలెననిన ఎన్ని కారణములుండవలెను?


ఉత్తరము :- ఐదు.



ప్రశ్న:- వానినిగూర్చి ఎచట తెలుపబడినది?


ఉత్తరము:- కర్మయొక్క అంతమగు జ్ఞానమును బోధించు సాంఖ్య (వేదాంత) శాస్త్రమున తెలుపబడినది.


🕉🌞🌎🌙🌟🚩

[02:47, 08/12/2020] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ  అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

[02:56, 08/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


173వ నామ మంత్రము


ఓం సంశయఘ్న్యై నమః


దేహము, ఇంద్రియాలే తాను అనే అజ్ఞానభావన అను హృదయగ్రంథి విడిపోయి, సాధకునికి తానే సచ్చిదానందరూపుడనే జ్ఞానమును అన్ని వర్ణముల (బ్రహ్మక్షత్రియవైశ్యశూద్ర యను వర్ణముల) వారికి ప్రసాదించు జగజ్జననికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి సంశయఘ్నీ యను నాలుకక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సంశయఘ్న్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి సంశయములన్నియు తీర్చి, సచ్చిదానంద స్వరూపుడనను జ్ఞానాన్ని ప్రసాదించును.


పరమాత్మస్వరూపిణి అయిన జగన్మాతను ఆరాధిస్తున్నాము. అనేక సంశయాలు ఉండడం సహజం.  


అజ్ఞానమను అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమనే జ్యోతిని వెలిగించు నతడు గురువు. మంత్రోపదేశం చేసి, దీక్ష ఇచ్చి, ఎలా సాధనచేయాలో తెలియజేయునతడు గురువు. సాధకునికి సంశయాలు ఉండడం సహజం గనుక సంశయాలకు సమాధానంచెప్పేది గురువు మాత్రమే.  అటువంటి గురుస్వరూపిణి కాబట్టి సంశయఘ్నీ యను నామము కలిగియున్నది.


జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. గురుమూర్తిః (603వ నామ మంత్రము)  గురువుయొక్క రూపముగా ఉన్నది జగన్మాత. అందుచే సంశయఘ్నీ అను నామ మంత్రము కలిగియున్నది.


త్రిమూర్తిః (628వ నామ మంత్రము)  సత్త్వరజస్తమోగుణ ప్రకృతులకు అధిదేవతలైన త్రిమూర్తిస్వరూపిణి,  త్రిగుణాతీతమైన పరబ్రహ్మను సూచించే గురుస్వరూపిణి గనుక ఆ తల్లి భక్తుల సంశయములను తీర్చుతుంది. అందుచే అమ్మవారిని సంశయఘ్నీ అని స్తుతిస్తున్నాము.

దక్షిణామూర్తిరూపిణీ (725వ నామమంత్రము) వటవృక్షం క్రింద, దక్షిణాభిముఖంగా, పద్మాసనంలో, చిన్మయముద్రతో, తురీయస్థితిలో కూర్చుని త్రిమూర్తులకే గురువుగా ప్రసిద్ధికెక్కిన దక్షిణామూర్తి స్వరూపిణి అమ్మవారు. దక్షిణామూర్తి స్వరూపంలో జగన్మాత దర్శనం సర్వసంశయములను పోగొడుతుంది. గనుకనే జగన్మాత సంశయఘ్నీ యని నామ ప్రసిద్ధి చెందినది. శ్రీవిద్యాపరంపరలో సిద్ధౌఘమునందున్న సనకసనందనాదులచే ఆరాధింపబడిన గురుస్వరూపిణి గనక జగన్మాత సంశయఘ్నీ యని స్తుతింపబడుచున్నది. శివజ్ణానప్రదాయినీ (727వ నామ మంత్రము) జగన్మాత శివసంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదించు గురుస్వరూపిణి గనుక జగన్మాత సంశయఘ్నీ యను నామమునకు సార్థకత కలిగియున్నది. 


భిద్యతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వసంశయాః|


క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే॥


అజ్ఞానంతో ఈ దేహము, ఇంద్రియములు మాత్రమే తాను అనే భావన అయిన హృదయగ్రంథి విడిపోయి, సాధకుడు తానొక సచ్చిదానంద స్వరూపుడనను జ్ఞానంతో తనలోనున్న సంశయనాశనమునకు కారణమైన జగన్మాత సంశయఘ్నీ యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సంశయఘ్న్యై నమః అని అనవలెను.

🌸💐💐💐

[05:43, 08/12/2020] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 572  / Bhagavad-Gita - 572 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 16 🌴


16. మన:ప్రసాద: సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహ: |

భావసంశుద్దిరిత్యేతత్ తపో మానసముచ్యతే ||


🌷. తాత్పర్యం : 

తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వమును పవిత్రమొనర్చుట యనునవి మానసిక తపస్సనబడును.


🌷. భాష్యము  :

మనస్సును తపోసంపన్నము చేయుట యనగా దానిని ఇంద్రియభోగము నుండి దూరము చేయుటయే. ఇతరులకు మేలు చేయుతను గూర్చియే అది ఆలోచించునట్లుగా దానిని శిక్షణము గూర్చవలెను. 


ఆలోచన యందు మౌనమును కలిగియుండుటయే మనస్సుకు చక్కని శిక్షణము వంటిది. అనగా మనుజుడు కృష్ణభక్తిరసభావన నుండి ఏమాత్రము మరలక, సర్వదా ఇంద్రియభోగమును వర్జించవలెను. 


ఆ విధముగా కృష్ణభక్తిభావనను పొందుటయే స్వభావమును పవిత్రమొనర్చుకొనుట కాగలదు. మనస్సును ఇంద్రియభోగ ఆలోచన నుండి దూరము చేయుట ద్వారానే మానసిక సంతృప్తి లభింపగలదు. ఇంద్రియభోగమును గూర్చి మనమెంతగా ఆలోచింతుమో అంతగా మనస్సు అసంతృప్తికి గురియగును. 


నేటికాలమున మనము మనస్సును పలువిధములైన ఇంద్రియభోగ పద్ధతుల యందు అనవసరముగా నెలకొల్పుట వలననే మన మనస్సు తృప్తినొందు అవకాశమును పొందకున్నది. వేదవాజ్మయము వైపునకు దానిని మళ్ళించుటయే ఉత్తమమార్గము. 


అట్టి వాజ్మయము పురాణములు, మహాభారతములలో వలె మనస్తృప్తికర కథలను కలిగియుండును. మనుజుడు ఆ జ్ఞానము యొక్క లాభమును గొని పవిత్రుడు కాగలడు. మనస్సు సర్వదా వంచన స్వభావ వర్జితమై, ఇతరుల శ్రేయస్సునే తలుపవలెను. 


ఆత్మానుభవమును గూర్చి మనుజుడు సదా యోచించుటయే మౌనమనుదాని భావము. ఇట్టి భావన దృష్ట్యా కృష్ణభక్తిరసభావితుడైన భక్తుడు సంపూర్ణ మౌనమును పాటించనివాడే యగుచున్నాడు. మనోనిగ్రహమనగా మనస్సును ఇంద్రియభోగానుభవము నుండి దూరము చేయుటని భావము. 


అంతియేగాక మనుజుడు తన వ్యవహారములందు ఋజుత్వమును కలిగియుండి, తద్ద్వారా తన అస్తిత్వమును పవిత్రమొనర్చుకొనవలెను. ఈ లక్షణములన్నియును కలసి మానసిక తపస్సనబడును.

🌹 🌹 🌹 🌹 🌹


🌻154. అమోఘః, अमोघः, Amoghaḥ🌻


ఓం అమోఘాయ నమః | ॐ अमोघाय नमः | OM Amoghāya namaḥ


న మోఘం యస్య మోఘము అనగా నిష్ఫలము కాని చేష్టితము ఎవనికి కలదో అట్టివాడు.


:: పోతన భాగవతము - ప్రథమ స్కంధము ::

మ. భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం

త విధిం జేయు, మునుంగఁ డందు; బహుభూత వ్రాతమం దాత్మ తం

త్రవిహారస్థితుఁడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్‍

దివి భంగి గొనుఁజిక్కఁ; డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్‍.


శ్రీమన్నారాయణుడు ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. అంతే కాని తాను మాత్రం ఆ జన్మ మరణాలతో నిమగ్నం కాడు. అనేకమైన ప్రాణి సమూహమందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సంతరిస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతతుడుగా, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.


110. అమోఘః, अमोघः, Amoghaḥ


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 155 / Vishnu Sahasranama Contemplation - 155 🌹

📚. ప్రసాద్ భరద్వాజ 


🌻155. శుచిః, शुचिः, Śuciḥ🌻


ఓం శుచయే నమః | ॐ शुचये नमः | OM Śucaye namaḥ


స్తువతామర్చయతాం చ స్మరతాం పావనత్వతః ।

తథాఽస్య స్పర్శ ఇత్యాదిమంత్రవర్ణాచ్ఛుచిర్హరిః ॥ 


పవిత్రుడు. పవిత్రతను కలిగించువాడు. స్తుతించువారినీ, అర్చించిన వారినీ, స్మరించు వారినీ హరి పవిత్రులనుగా చేయును. అదిగాక ఆయన స్పర్శమును పవిత్రము కావున విష్ణువు శుచిః అని చెప్పబడును.


:: శ్రీమద్భాగవతము - నవమస్కన్ధము, దశమోఽధ్యాయము ::

ఏకపత్నీవ్రతధరో రాజర్షిచరితః శుచిః ।

స్వధర్మం గృహమేధీయం శిక్షయాన్స్వయమాచరత్ ॥ 55 ॥


ఏకపత్నీవ్రతమును పాటించినవాడూ, రాజర్షి వంటి చరితము గలవాడూ, పవిత్రుడూ అయిన శ్రీరామచంద్రుడు గృహస్తులకు స్వధర్మమును తన స్వీయ ఆచరణద్వారా నేర్పినాడు.


:: పోతన భాగవతము - అష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::

సీ.భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నాహ్వయమును గుణమును లెవ్వనికి లేకజగములఁ గలిగించు సమయించు కొఱకునై నిజమాయ నెవ్వఁ డిన్నియును దాల్చునా పరమేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్దరూపికి రూపహీనునకుజిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకుఆ.మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ, గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచునిపుణుఁడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు.


భగవంతునికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవు. అతడు లోకాలను పుట్టించి నశింపజేయడం కోసము తన మాయాప్రభావముతో ఇవన్నీ ధరిస్తాడు. రూపం లేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు. ఆత్మకాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకు మూలం; అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ ఊహలకూ అందరానివాడు; పరిశుద్ధుడు. సత్త్వగుణంతో దరిజేర దగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 125 🌹

🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 55 🌻

నచికేతుడు తనలో తాను ఇట్లు అనుకొనుచున్నాడు. సూక్ష్మబుద్ధితో, సూక్ష్మాతిసూక్ష్మమైన ఈ ఆత్మను తెలిసికొనవచ్చునని, ఇంతవరకూ యమధర్మరాజు చెప్పియున్నాడు. 

ఆయన చెప్పినంత సులభముగా ఆత్మను అందరూ గుర్తించ లేకున్నారు. అట్లు ఆత్మను గుర్తించకుండుటకు ప్రతిబంధ కారణములు ఏవైనా ఉన్నవేమో తెలిసికొని, తొలగించుకొనవచ్చును గదా యని, తలంచు చుండగా అతని సంశయుమును గ్రహించిన యమధర్మరాజు ప్రతిబంధ కారణములను ఈ విధముగా చెప్పుచున్నాడు.

     

         కోహం బంధః, తప్పక ప్రతీ ఒక్కరూ విచారణ చేయవలసినటువంటి ప్రశ్న ఇది. నాకు బంధకారణమేమి? కోహం బంధః? అనే విచారణ చేసినట్లయితే,

 పంచభూతముల చేత, ప్రేరేపింపబడుతున్నటువంటి ప్రకృతి చేత ప్రేరితమౌతున్నటువంటి, త్రిగుణాత్మకమైనటువంటి వ్యామోహము చేత, మాలిన్యము చేత, ప్రేరేపింపబడేటటువంటి, మనస్సు అనేటటువంటి, బుద్ధి అనేటటువంటి, అంతర ఇంద్రియాల ద్వారా అంతఃకరణ చతుష్టయాన్ని చక్కగా ఎఱిగి, ఆ అంతఃకరణ చతుష్టయ సాక్షి అయినటువంటి జ్ఞాత నేనని ఎఱిగి,


 అట్టి జ్ఞాత స్థానములో తాను స్థిరముగా నిలబడి ఉండి, మిగిలినటువంటి 24 తత్త్వములను తన ఆధారముగనే తాను నడిపించుచున్నాడనేటటువంటి సత్యమును గ్రహించి, అవి తనకి పనిముట్లని గ్రహించి, తాను సహజముగా స్వస్వరూపుడునని, స్వయం ప్రకాశకుడనని, తన ప్రభావం చేత మాత్రమె, మిగిలిన 24 తత్వములు సమర్థవంతములు అగుచున్నవని 


పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణములను లెస్సగా పరిశీలించినటువంటి వాడై, ప్రతి ఒక్క విశేషములను స్పష్టముగా ఎఱిగినటువంటి వాడై, సాంఖ్య తారక అమనస్క విధిని ఎఱిగినవాడై, తనను తాను విరమింప చేసుకుని, 


తనను తాను తెలుసుకుని, తనను తాను పోగొట్టుకొనేటటువంటి రాజయోగ మార్గములో ప్రయాణము చేయవలసినటువంటి అవసరము ఉన్నది. అలా ఎవరైతే మనస్సును విరమింప చేయగలుగుతున్నారో, వాళ్ళు మాత్రమే ఈ ముక్తి పథంలో నడువగలుగుతున్నారు.

    

     ఎవరైతే బాహ్య వ్యవహారముల నందు మగ్నత చెంది ఉంటారో, బాహ్య వ్యవహారం బలంగా ఉంటుందో, బాహ్య వ్యవహారములయందు, సుఖదుఃఖముల యందు ఆసక్తి కలిగియుంటారో వారందరూ తప్పక మరల జనన మరణ జరామరణ చక్రములో ప్రవేశింపక తప్పదు. సంసార చక్రములో పరిభ్రమింపక తప్పదు. అవిద్యా మోహము చేత బాధింపబడక తప్పదు. మనోభ్రాంతి చేత లాగబడక తప్పదు. 


ఇట్లు గ్రహించనటువంటి వారు, వివేచనా శీలియై, వివేకముతో తమను తాము, తనలో ఉన్నటువంటి, యథార్థమైనటువంటి సర్వకాల సర్వ అవస్థలయందు మార్పు చెందనటువంటి, పరిణామ శీలము కానటువంటి, ఆత్మతత్వమును ఎఱిగేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని చేయాలి. ఈ సత్యాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలి.


         మనస్సు ఇంద్రియములతో కూడినప్పుడే అవి వాని వాని విషయములను గ్రహించగలుగును. లేనిచో ఇంద్రియములు విషయములను గ్రహించుట లేదు. ఆత్మ దర్శనము కావలయునని, మనస్సు అంతర్ముఖము కావలయును.


 one cannot serve two masters  అన్నట్లు ఒక సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేనట్లు, మనస్సు అంతరముగా ఉన్న ఆత్మను, బాహ్యముగా ఉన్న శబ్దాది విషయములను, ఒకేసారి గ్రహించలేదు. శబ్దాది విషయములనుండి ఇంద్రియములను మరల్చిన గానీ, మనస్సు బాహ్య విషయముల నుండి మరలుటలేదు. ధ్యాన శీలుడైన వ్యక్తి మాత్రమే, ఇంద్రియములను నిగ్రహించి మనస్సును అంతర్ముఖము చేసుకొనగలడు.


         అతి ముఖ్యమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెబుతున్నారు. ధ్యానశీలుడైన వ్యక్తి మాత్రమే ఇంద్రియముల నుండి గ్రహించి, మనస్సును అంతర్ముఖము చేసికొన గలడు. ఈ రహస్య సూత్రాన్ని మనం మానవ జీవితంలో బాగా ఆశ్రయించ వలసినటువంటి అవసరమున్నది.


 ధ్యానము అంటే ఏదో ఒక పది నిమిషాలో, పదిహేను నిమిషాలో, ఐదు నిమిషాలో, మూడు నిమిషాలో, గంటో, అరగంటో చేసేటటువంటి తాత్కాలికమైన ప్రయత్నం కాదు. సహజ ధ్యాన శీలియై ఉండాలి. సమాధినిష్ఠుడై ఉండాలి. - విద్యా సాగర్ గారు 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[05:43, 08/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 290🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

70. అధ్యాయము - 25


🌻. సతీ వియోగము  - 2 🌻


మహేశ్వరుడిట్లు పలికెను -


నీవు లోకములన్నింటికీ నా ఆజ్ఞచే కర్తవు. భరించువాడవు, హరించు వాడవు. ధర్మ, అర్థ, కామముల నిచ్చువాడవు, దుర్మార్గులను శిక్షించువాడవు (20). నీవు జగత్తునకు ప్రభువు. నీకు జగత్తునకు పూజ్యుడవు. మహాబల పరాక్రమములు గల నీవు ఎక్కడనైననూ నాకు కూడా జయింప శక్యము కానివాడవు కాగలవు(21). 


నేను నీకు ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులను ఇచ్చెదను. నీవు స్వీకరింపుము. ముల్లోకములలో అనేక లీలలను ప్రకటించగలిగే మహిమను, స్వాతంత్ర్యమును స్వీకరింపుము (22). 


ఓ హరీ! నిన్ను ద్వేషించువారిని నేను ప్రయత్నపూర్వకముగా దండించుట నిశ్చయము. ఓ విష్ణో! నీ భక్తులకు నేను ఉత్తమమగు మోక్షము నిచ్చెదను (23).


దేవతలు కూడ తపింప శక్యము కాని ఈ మాయనను కూడా స్వీకరించుము. దీనిచే సంమోహితమైన జగత్తు జడాత్మకమగును (24). ఓ హరీ! నీవు నా ఎడమ చేయి. ఈ బ్రహ్మ నా కుడిచేయి. ఈ బ్రహ్మకు కూడా నీవు తండ్రివి. రక్షకుడవు కాగలవు (25). 


రుద్రుడు నా హృదయము. నేనే రుద్రుడు. దీనిలో సంశయము లేదు. రుద్రుడు నీకు, మరియు బ్రహ్మాదులకు కూడ పూజ్యుడు. ఇది నిశ్చయము.(26). నీవు ఇచటనే ఉండి జగత్తునంతనూ పాలించుము. మరియు, విశేషించి అనేక అవతారములనెత్తి, ఆ అవతారములలో వివిధ లీలలను ప్రకటించుము (27).


నా లోకములో నీ యీ స్థానము సర్వసమృద్ధమై గోలోకమని ఖ్యాతిని బడసి అద్భుతముగా ప్రకాశించగలదు (28). ఓ హరీ! భూమియందు సాధువులను రక్షించే నీ అవతారములు ఏవి రాగలవో, వారందరు నిశ్చయముగా నా భక్తులుగను, నా వరములచే ప్రీతులుగను ఉండగలరు. నేను వారిని అట్లు చూడగలను (29).


రాముడిట్లు పలికెను -


ఈ విధముగా ఉమాపతియగు శంభుడు విష్ణువునకు స్వయముగా అఖండైశ్వర్యమును సంక్రమింపజేసి, ఆ కైలాస పర్వతమునందు తన గణములతో కూడి యథేచ్ఛగా క్రీడించుచున్నాడు (30). ఆనాటి నుండియు లక్ష్మీపతి గోపవేషమును ధరించి, అచటకు ఆనందముగా వెళ్లి, గోపులకు, గోపికలకు, గోవులకు ప్రభువు ఆయెను (31). 


మరియు ఆ విష్ణువు ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని యాజ్ఞచే అనేక అవతారములను ధరించి సర్వ జగత్తును రక్షించెను (32). ఆయన ఇపుడు ఇచట శంకరుని ఆజ్ఞచే నాల్గు రూపములతో అవతరించినాడు. వారిలో నేను రాముడను. భరత లక్ష్మణ శత్రుఘ్నులు మిగిలిన వారు (33).


ఓ సతీ దేవీ! నేను తండ్రి యాజ్ఞచే సీతాలక్ష్ముణులతో గూడి వనమును వచ్చితిని. ఈనాడు దైవవశమున మేము దుఃఖితులమైతిమి(34) ఎవరో ఒక రాక్షసుడు నా భార్యయగు సీతను అపహరించినాడు. నేను అట్టి విరహము గలవాడనై తమ్మునితో గూడి ఈ అడవియందు నా ప్రియురాలిని వెదకుచున్నాను. (35) 


నీ దర్శనము లబించినది గాన, నాకు అన్ని విధములా క్షేమము కలుగ గలదు. ఓ సతీ తల్లీ! నీదయచే దీనిలో సందేహమును లేదు(36). నాకు నీనుండి సీత లభించుట అను వరము నిశ్చయముగా ప్రాప్తించును. నీ అనుగ్రహముచే నాకు దుఃఖమును కలుగజేసిన ఆ రాక్షసుని, ఆ పాపాత్ముని వధించెను(37).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[05:43, 08/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 135, 136 / Sri Lalitha Chaitanya Vijnanam  - 135, 136 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖


*🌻135. 'నిర్మలా'🌻


అజ్ఞానపూరితమగు మలము లేనిది శ్రీలలిత అని అర్థము.


మలము లంటనిది శ్రీలలిత. సృష్టికార్యమంతయు అగ్నికార్యమే. అందువలన ప్రతి ఆవరణమునందు చేతలతోపాటు మలినముకూడ యుండును. నిప్పు ఉన్న చోట పొగయుండును. పొగచూరు యుండును. అద్దమున్నచోట దుమ్ము పట్టును. వంట చేసిన పాత్రకు మసి పట్టును. 


ఆహారముగాను జీవులకు మలమూత్రాదు లేర్పడును. శరీరమునకు, పంచేంద్రియములకు, మనస్సునకు, బుద్ధి, అహంకారములకు కూడ మలినము సోకుచునుండును. 


ఎచ్చట జ్ఞానమను అగ్ని యుండునో అచ్చట అజ్ఞానమను పొగకూడ యుండును. ఈ అజ్ఞానమును ప్రతి నిత్యము తొలగించుకొనుట సాధన. తొలగించుకొననిచో మలమునకు బలమేర్పడును.  


మలములు బలపడినచో మరణానుభూతి కూడ యుండును. అన్ని స్థితులయందలి మలినములు నిత్యము తొలగించు కొనుటయే సాధన. దీపపు కాంతి నిశ్చలముగా నిలబడుటకు గాజు చిమ్నీ వాడుచుందుము. చిమ్నీని శుభ్రముగా తుడుచుకొననిచో దీపము గోచరించదుకదా! అట్లే తనయందలి మలినములను నిర్మూలించుకొనని వానికి తాను జ్యోతి స్వరూపుడనని తెలియదు.


అట్టి నిర్మూలనమునకు శ్రీలలిత ఉపాసనమును వినియోగించు కొనవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 136  / Sri Lalitha Chaitanya Vijnanam  - 136 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖


*🌻136. 'నిత్యా' 🌻


సృష్టి, స్థితి, ప్రళయ కాలములయందు యుండునది శ్రీదేవి అని అర్థము. 


భూత, భవిష్యత్, వర్తమానకాలముల యందుండునది, ఎప్పుడునూ వుండునది. పరాశక్తిగను, పరాప్రకృతిగను, అన్ని కాలములయందును శ్రీలలిత  ఉన్నది. 


ఉండుట, లేకుండుట అనునవి అవగాహనను బట్టియేగాని, అసలు సత్యము గాదు. స్థూలముగ నున్నవి కనబడ నపుడు లేవనుకొందుము. స్థూలమున కవతరించినపుడు వున్నది అనుకొందుము. ఇది స్థూలమగు అవగాహన మాత్రమే. 


స్థూలము నుండి సూక్ష్మమునకు, సూక్ష్మమునుండి స్థూలమునకు అవరోహణ, ఆరోహణ క్రమములలో సృష్టి మొత్తమూ ఎప్పుడునూ వుండనే  వున్నది.


అందలి జీవులు కూడ ఎప్పుడూ ఉండనే ఉన్నారు. 'ఉన్నది పోదు, లేనిది రాదు' అని శ్రీకృష్ణుడు గీతయందు బోధించినాడు. విత్తనము రూపమున మహత్తరమగు వృక్షముండును. వృక్షము రూపమున విత్తనముండును. విత్తనము వృక్షమైనపుడు, విత్తనము గోచరింపదు. కాని మరల విత్తనము వృక్షము కాగలదు. 


అట్లే సమస్త జీవులును సూక్ష్మములోనికి పోవుచూ, స్థూలములోనికి వచ్చుచూ నుందురు. ఏదోనొక స్థితిలో వస్తువుండును గాని లేకుండుట యుండదు. ఇది సత్యము. 


దీనిని దర్శించుట ఋషులకే సాధ్యము. స్థూల దృష్టిగలవారికి సాధ్యము కాదు. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


శారీరక బలంతో పాటు, బుద్ధిబలం కూడా పెంచుకోవాలి. బుధ్ధిసూక్ష్మతతో పాటు శారీరక బలం, నైతిక విలువలు ఉన్న నాడు మొత్తం ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది.

**సుఖమయము, శుభదాయకము అయిన లోకం, 'సామాజిక ప్రగతి' 'వేడి మంచు', 'నల్లని వెలుగు' ల్లా అసంబద్ధమయినవే. అనర్థాలను సృష్టించని భౌతిక అభివృద్ధి ఉండదు.


🕉🌞🌎🌙🌟🚩

[13:55, 08/12/2020] +91 92915 82862: ఆచార్య సద్భావన

🕉🌞🌎🌙🌟🚩


మనం అంతర్ముఖులమయ్యేకొలదీ బాహ్య సంఘటనల ప్రభావం మన ఎడల అంతకంతకూ తగ్గుతూ వస్తుంది.



బాహ్యంలో జీవించే వ్యక్తి అన్ని విషయాలను గమనిస్తాడు. అన్ని విషయాలు అతని గమనింపుకు వస్తాయి. అతడు గోరంత దాన్ని కొండంతగా చూస్తాడు.



ఒక వ్యక్తి చూపులుగాని, చర్యలుగాని దుష్ఠభావాంతో ఉన్నట్టుగా అతడు ఊహించుకుంటాడు.



దుష్టత్వాన్ని భూతద్దంలో చూస్తే అది చివరకు మనకు భరించలేని భారమయ్యేంతగా తయారయి ఆఖరికి మనం అరణ్యానికి పోయినా శాంతిని దక్కనివ్వదు.



అందు వలన ఈ చింతనను జయించాలి. అంతర్కుఖుడై జీవించే వ్యక్తి ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండడు.



అంతరంగంతో సంబంధం ఏర్పరచుకోవటం తెలిసినవాడు కోల్పోయేదీ ఏదీ ఉండదు.



శుభంభూయాత్



ఆచార్య సద్భోదన

🕉🌞🌎🌙🌟🚩                


దివ్యమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో వేర్పాటుకు తావే లేదు. ఉన్నది ఒక్కటే అయినప్పుడు వేరు చేయటం జరగని పని. 



మన జీవితాలు మన చేతలు మన శ్రేయస్సు కొఱకు కాదు, మనం మన మోక్షం గురించి మాత్రమే ఆలోచించరాదు. దాని కొఱకై మనం వేరే చోటుకు పోవలసిన పని లేదు. 



భగవంతుడు తన అసంఖ్యాక బిడ్డలను ఆశీర్వదించడానికి వారిని కాంతి బాటకు తెచ్చేందుకు మనల్ని పరికరాలుగా వాడుకుంటున్నాడు. ఆయన తన కర్తవ్య నిర్వహణలో ఉన్నాడు. 



మనల్ని ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు. ఆయన మార్గదర్శకత్వం లేకుండా మనం ఒక్క క్షణం కూడా జీవించలేము. 



కనుక స్వీయలాభం యోచించక భగవంతుని చేతిలో ఉపకరణమనే భావనతో ముందుకు సాగాలి.



  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                       

లోకా సమస్తా సుఖినోభవన్తు!


🕉🌞🌎🌙🌟🚩

[14:27, 08/12/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (734)

🕉🌞🌎🌙🌟🚩


'నేనెవరు' అన్న ప్రశ్న ద్వారా సాధన ముందుకు ఏ విధంగా కొనసాగుతుంది !?"


భగవాన్ శ్రీరమణమహర్షి బోధించిన నేనెవరు అన్న ప్రశ్నకు సులభోపాయం ఆత్మను శోధించటమే. అయితే అంతకన్నా ముందు అసలు మన వ్యక్తిత్వం ఏమిటో చూసుకోవాలి. నేను, వ్యక్తిత్వం, అహంకారం అనే పదాలు మనసుకు పర్యాయ పదాలే. వేదాంత పరిభాషలో దేన్నైతే అహంకారం అంటారో దాన్నే గ్రాంధిక భాషలో వ్యక్తిత్వమని,  వాడుక భాషలో నేను అని వాడుతుంటాం. నేనెవరు అన్నప్రశ్నతో మన వ్యక్తిత్వానికి సంబంధించిన ఆత్మపరిశీలన పుట్టాలి. దానివల్ల మన వ్యక్తిత్వం ఏమిటో, అందులోని లోపాలు ఏమిటో తెలుస్తాయి. వ్యక్తిత్వంలో లోపాలన్నీ ప్రవర్తన ద్వారా వ్యక్తమవుతాయి. ఆ లోపాలను సవరించుకుంటే వ్యక్తిత్వం బాగుపడుతుంది. చెడ్డ వ్యక్తిత్వం వల్ల దురహంకారం వస్తుంది మంచి వ్యక్తిత్వం నిరహంకారానికి దారి తీస్తుంది. నిష్కలమైన వ్యక్తిత్వంతో ఉండటమే అహంకార రహితస్థితి. నిరహంకార స్థితికి మరో పేరే శాంతి. మంచి వ్యక్తిత్వానికి ప్రతీక మంచి ప్రవర్తనే కాబట్టి ఒక సత్ప్రవర్తన ద్వారా మనం దుఃఖాన్ని దూరం చేసే శాంతిని సంపాదించుకోవచ్చు !


{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

"దైవదర్శనం.. దుఃఖనాశనం.. శాంతితోనే సాధ్యం !''- (అధ్యాయం -90)


🕉🌞🌎🌙🌟🚩

[14:27, 08/12/2020] +91 92915 82862: "ఋభుగీత " (199)

🕉🌞🌎🌙🌟🚩


ఋభు నిధాఘ సంవాదము"

15వ అధ్యాయము 


అద్వైతంలో  ఏ భావానికీ తావు ఉండదు !!


ఆరంభంలో మరల మరల సత్యాన్ని వినటం, అది ధారణగా మారి నిధి ధ్యాసగా నిలిచే వరకూ మననం చేయడం అవసరం. ఈ సత్యాన్ని తెలుసుకున్నందువల్ల ఫలం “అంతా శాంతమే" అని ఋభు మహర్షి స్పష్టం చేస్తున్నారు. అద్వైత అవగాహన పరమశాంతి కోసమే. ఇది ఎటువంటి ఆశలకు, సంశయాలకు తావులేనిది. అది అక్షరమైనది. అద్వైతంలో  "ఇది నేను" అనే ఏ భావానికీ తావు ఉండదు. వేదవాక్కు, గురువాక్కుతో సహా అంతా బ్రహ్మమే. ఆ స్థితి ఏర్పడిన తర్వాత వేదం, శాస్త్రం, గురువు అన్నింటిని త్యజించే స్థితి వస్తుంది. అంటే తానే వాటి సారంగా మారే అభేదస్థితి వస్తుంది !


🕉🌞🌎🌙🌟🚩

[14:34, 08/12/2020] +91 92915 82862: 🌷92-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩


అధ్యాయము-7

🥀 శాస్త్రవిజ్ఞానము🥀


29. ముసలితనము, మరణము, జననము, వ్యాధి మున్నగు మార్పులను గమనించి, తదతీతుడునగు నన్ను ఆశ్రయించుట ఎరిగి ఆత్మ మూర్తులై మహాత్ములు బ్రహ్మానందము అనుభవించుచున్నారు.



30. జీవులను అధిష్టించినది 'నేను'. పంచభూతములను అధిష్టించినది 'నేను'. సృష్టియజ్ఞమును అధిష్టించినది 'నేను'. ఒక్కొక్కడు చేయు పనులను అధిష్టించి యున్నది  'నేను'. ఇట్లు నన్ను స్మరించుచు ప్రయాణ కాలమున నాయందుండువారు నాయందే నిలుతురు.

 


ప్రయాణ కాలమనగా ఒక ప్రజ్ఞ నుండి మరియొక ప్రజ్ఞకు జీవుడు మారు కాలము. మనస్సు నిద్రగా మారుట ఒక ఉదాహరణము. దేహము విడుచుట ఒక ఉదాహరణము. దేహము ధరించుట ఒక ఉదాహరణము. ప్రజ్ఞ యొక్క స్థితిలో అంతమై మరియొక స్థితిలో మేల్కొను సమయములలో దేని యందయినను జీవుడు చిక్కుకొని చనిపోవచ్చును. ఆ సమయములలో నన్ను స్మరించుచున్నవాడు చిక్కుకొనడు. కనుక నాయందే లీనమై మరియొక ప్రజ్ఞగా కాక నాయందే మేల్కొనును. యోగస్థితి అనగా ఇట్టిది.


 🕉🌞🌎🌙🌟🚩

[14:34, 08/12/2020] +91 92915 82862: 105) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


నా ప్రతీతిస్త యోర్బాధః కింతు మిథ్యాత్వ నిశ్చయః ౹ నో చే త్సుషుప్తి మూర్చాదౌ ముచ్యేతాయత్నతో  జనః ౹౹13౹౹


13. అవి బాధ చెందుట అనగా ఇంద్రియ గోచరములు కాకుండుట కాదు.కాగా,అవి మిథ్య అనే దృఢనిశ్చయమే బాధ.అట్లు కానిచో సుషుప్తి మూర్చ మొదలగు అవస్థలయందు ఏ ప్రయత్నము లేకయే మానవుడు ముక్తి నొందవచ్చును గదా !


పరమాత్మావశేషోఽ పి తత్సత్వ వినిశ్చయః ౹ స జగద్విస్మృతిర్నో చే జ్జీవన్ముక్తిర్న సంభవేత్ ౹౹14౹౹


14. "పరమాత్మయే మిగులును" అనగా పరమాత్మయే సత్యము అనే దృఢ నిశ్చయము అని అర్థము.

ఆ జీవజగత్తులు విస్మరింపబడునని కాదు.అట్లు కానిచో జీవన్ముక్తియే సంభవింపదు.



మనకు చలనచిత్ర దృశ్యములు కన్పించునట్లే జీవన్ముక్తునకు జగన్నాటకము కన్పించుచుండును.వెండి తెర ఒక్కటే సత్యము,దాని మీది సినిమా దృశ్యములన్నీ చలనచిత్రములే అనే జ్ఞానము మనకున్నట్లే జీవన్ముక్తునకు జగన్నాటకము బూటకమే అనీ పరబ్రహ్మమే సత్యమనీ

 తెలియును.

జగత్తును మరచుటయే జ్ఞానమైనచో ఇట్టి

జీవన్ముక్తి సంభవింపనె సంభవింపదు గదా!



జీవజగత్తులు ఇంద్రియగోచరములు కాకుండటయే బాధ(సత్యమనే భావము నశించుట)యైనచో గాఢనిద్రయందు ఏమీ గోచరింపదు.అపుడు తత్త్వజ్ఞానము లేకయే ముక్తి కలుగవలెను.కాని అట్లు జరుగుట లేదు.కనుక బాధ అనగా మిథ్యాత్వ నిశ్చయమని నిర్ధారణము.



అసలు జగత్తనగా నామరూపములే. 

ఈ నామరూపములు ఊరక అగుపడడమేగానీ ఒక వస్తువుగా ఉండలేదు.



కుండ పుట్టకమునుపు కుండ అను పేరును, దాని రూపమును లేవు. కుండ పగిలిన తర్వాత గూడా లేవు.ఉన్నవస్తువు మట్టి ఒక్కటే సత్యము.

ఈ మధ్య కాలంలో ఊరక గోచరించేవిగాన ఉన్నట్లు తోచేవాటిని మిధ్య అంటారు.



 నామరూపములు వ్యవహారార్థమై వాక్కు ద్వారా ఇది కుండ అని వాడుకోవడం తప్ప అనగా కేవలం వాక్కు ద్వారా తెలియబడడమే గానీ పరమార్థముగా నామరూపములు లేనేలేవు.



ఏది మొదట లేనిదై చివరలేకుండా పోవునో అది మిధ్య.



అట్లే బ్రహ్మముందు గోచరించు జగత్తు యొక్క నామరూపములు మిధ్యయై యున్నవి.వాటి పరమార్థము బ్రహ్మమే.



అవిద్యా జీవునికి బ్రహ్మము ప్రపంచముగా అగుపడుచున్నదే గానీ,ప్రపంచరూపముగా మారనూలేదు.ప్రపంచమును పుట్టించనూలేదు.దీనికి శంకరులు

"వివర్త" మని పేరు పెట్టారు.అనగా తన స్వరూపంలో మార్పు లేకుండా అన్యరూపంగా అగుపడడాన్ని వివర్తమందురు.



కల్పిత సర్పమునకు త్రాడు కారణమైనట్లు కల్పిత లేక మిధ్యయైన ఈ జగత్తుకు బ్రహ్మము వివర్తోపాదాన కారణమై యున్నది.



వివర్తవాదము ననుసరించి నామరూపములతో గూడిన ఈ జగత్తంతయూ బ్రహ్మమేనని చెప్పుచున్నాము.అయితే నామరూపములనబడు వికారములతో యున్న జగత్తును నిర్వికారమైన బ్రహ్మముగా చెప్పుట ఎట్లనగా,త్రాడుయందు దోచు సర్పమును బట్టుకొని ఈ కనిపించు పామే త్రాడు అని చెప్పుట పొసగదు.మరేమనగా ఆకనిపించు పాము అసత్యమై మిథ్యయై యున్నది.దాని పరమార్థము బ్రహ్మమే.ఈ ప్రకారము జగత్తు బ్రహ్మమేనని చెప్పబడినది.



"సర్వం హ్యేత ద్ర్బహ్మ"-ఈ సర్వము బ్రహ్మమే,అనుట యందు "ఈ సర్వము అనునది అసత్యము,మిథ్య దీని పరమార్థము 

"బ్రహ్మమే" అని శ్రుతుల అభిప్రాయము.


🕉🌞🌏🌙🌟🚩

[14:48, 08/12/2020] +91 92915 82862: శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

అఠాణారాగః - ఆదితాళమ్‌.


12. ఖేలతి -మమ- హృదయే.

ఖేలతి మమ హృదయయే

రామః - ఖేలతి మమహృదయే||



1. మోహమహార్ణవ తారకకారీ

రాగద్వేషముఖాసుర మారీ ||

|| ఖేలతి||



2. శాన్తి విదేహసుతా సహాచారీ

దహరాయోధ్యా నగరవిహారీ ||

|| ఖేలతి||



3. పరమహంస సామ్రాజ్యోద్ధారీ

సత్యజ్ఞానానన్ద విహారీ||

|| ఖేలతి||



తాత్పర్యము:-


1. ఆహా! నాహృదయములో - రాగద్వేషాది రాక్షస వర్గమును నేలగూల్చుచు - అంతములేని అజ్ఞాన సముద్రమును దాటించువాడై - రాముడు. శ్రీరామచంద్రుడు క్రీడించుచున్నాడు.



2. పరమ ప్రశాంతియే సీతమ్మతల్లియై తన్ను వెన్నంటి నిలువగా - హృదయదేశమునందు యోగిజనైక వేద్యమైన దహరస్థానమునే అయోధ్యగా స్వీకరించి అందు విహరించుచు రాఘువుడు క్రీడించుచున్నాడు.



3. ఆహా! సత్యజ్ఞాన - ఆనందరూపుడై, యోగిజనులకు (పరమశివేంద్రులు) ఆత్మజ్ఞాన సామ్రాజ్యమును సముద్దరించుచు రాఘవుడు నాహృదయములో ఇదుగో! క్రీడించు చున్నాడు.


🕉🌞🌏🌙🌟🚩

[14:51, 08/12/2020] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-5-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩


తం నారదస్తు సమమంగిరసా దయాళుః

సంప్రాప్యతావదుపదర్శ్య సుతస్య జీవమ్।

కస్యాస్మిపుత్ర ఇతితస్య గిరావిమోహం

త్యక్త్వా త్వదర్చనవిధౌ నృపతిం న్యయుంక్త।।


భావము:-


అట్లు దుఃఖించుచున్న 'చిత్రకేతుని' వద్దకు, దయాళువయిన నారదమహర్షి , ' అంగీరస' మునితో కలిసి వచ్చి - ఆ మృతశిశువు ఆత్మను రావించెను. ఆ యాత్మ చిత్రకేతునితో ఇట్లనెను. "దేహముండు వరకు నీ పుత్రుడనగు నేను - ఆ దేహము త్యజించిన పిదప ఎవరి పుత్రుడను!?" అని ప్రశ్నించెను. ఆవాక్కులతో మోహమువీడి 'చిత్రకేతుడు' విరక్తుడయ్యెను. నిన్ను (నారాయణుని) అర్చించమని, నారదమునీంద్రుడు అప్పుడు, 'చిత్రకేతునికి' ఉపదేశించెను.


వ్యాఖ్య:-


పూర్వం శూరసేన దేశాన్ని చిత్రకేతువు అనే రాజు పాలిస్తుండేవాడు. అతడి కీర్తి విశ్వమంతా వ్యాపించింది. ఆ మహారాజుకు అనేకమంది భార్యలున్నారు. అయినప్పటికీ ఆయనకు సంతానం కలగలేదు.



 లేదని బాధపడుతున్న ఆ రాజు మందిరానికి ఒకనాడు అంగిరసుడు అనే మహాముని వచ్చాడు. ఆయన విచారానికి కారణం అడిగాడు. రాజు మనస్సులోని అభిప్రాయాన్ని తెలుసుకుని అంగిరసుడు ఆయనతో పుత్రకామేష్టిని చేయించాడు. యజ్ఞశేషాన్ని అతడి పెద్ద భార్య కృతద్యుతికి ఇచ్చి వెళ్లిపోయాడు అంగిరసుడు. పుత్రుడు కలుగుతాడని, అతడి వల్ల సుఖ-దుఃఖాలు అనుభవిస్తాడని చెప్పాడు. అంగిరసుడు చెప్పినట్లే భార్య కొడుకును కన్నది. కుమారుడి జాతకం చూపించాడు చిత్రకేతువు. 



ఇదిలా వుండగా కృతద్యుతి సవతులు ఈర్ష్యతో బాలుడికి విషప్రయోగం చేయడంతో అతడు మరణించాడు. మహారాజు, ఆయన భార్య ఇది చూసి విలపించారు. రాజు దుఃఖాన్ని తెలుసుకుని అంగిరసుడు, నారదుడితో కలిసి అక్కడికి వచ్చాడు. 



రాజు ఎవరికోసం దుఃఖపడుతున్నాడనీ, ఈ జన్మలో కొడుకులైనవారు పూర్వజన్మలో ఏమవుతారో రాజుకు తెలుసునా అనీ, కాలప్రవాహంలో ప్రాణులు పుట్తూ-చస్తూ వుంటారనీ, విష్ణుమాయవల్లే జీవులకు జీవులు జన్మిస్తున్నట్లు కనిపిస్తుందనీ, చావు-పుట్టుకలు సత్యం కాదనీ, సృష్టి ఈశ్వరుడికి ఒక క్రీడ అనీ, బాంధవ్యాలు నిజం కావనీ, అజ్ఞానాంధకారం నుండి వెలువడి వాసుదేవుడి మీద చిత్తం నిలిపి నిర్మలాత్ముడివి కమ్మనీ బోధించాడు అంగిరసుడు చిత్రకేతుడికి. 



ఇలా దివ్యజ్ఞానం బోధించిన అతడెవరని, అతడి వెంట వున్నదెవరని అడిగాడు చిత్రకేతుడు. రాజు పుత్రకాంక్షతో వున్నప్పుడు అతడితో పుత్రకామిష్టి చేయించి పుత్రుడిని ప్రసాదించిన అంగిరసుడుని తనే అనీ, తనతో వచ్చిన వాడు బ్రహ్మమానస పుత్రుడైన నారదుడనీ, రాజును అనుగ్రహించి జ్ఞానబోధ చేయడానికి వచ్చామనీ చెప్పాడు. ఈ లోకంలో అన్నీ చంచలం అని అంటూ, నిర్మలమైన మనస్సుతో ఆత్మజ్ఞానాన్ని అలవరుచుకుని శాశ్వతమైన పదవిని పొందమని అంగిరసుడు చిత్రకేతుడికి చెప్పాడు.  



అప్పుడు నారదుడు రాజుతో ఇలా అన్నాడు: "ఉపనిషత్తులలో చెప్పబడిన ఒక మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. దాన్ని ఏడు రాత్రులు ఎవరు పఠిస్తారో అతడు సంకర్షుణుండైన భగవంతుడిని చూస్తాడు. శీఘ్రంగా ఉత్తమ పదాన్ని పొందుతాడు. ఇప్పుడీ కుమారుడికి నీకు ఎలాంటి సంబంధమూ లేదు". ఇలా చెప్తూ, బాలుడి మృత దేహాన్ని చూస్తూ "ఓ జీవుడా! నీకు శుభం! నువ్వు తిరిగి ఈ శరీరంలో ప్రవేశించి నీకున్న ఆయుశ్శేషాన్ని అనుభవించి పిత్రాధీనమైన రాజ్యాన్ని అనుభవించు" అని అన్నాడు. 



అప్పుడా బాలుడు, తాను కర్మవశాన అనేక జన్మలు ఎత్తాననీ, ఏ జన్మలో వీరు (రాజు-ఆయన భార్య) తనకు తల్లి-తండ్రులయ్యారో చెప్పాలనీ, వాస్తవంగా జీవుడికి ఎవరితోనూ సంబంధం వుండదనీ, శ్రీమన్నారాయణుడే శాశ్వతుడనీ, సర్వానికి సాక్షైన ఆయనకు ప్రియులు-అప్రియులు అంటూ ఎవ్వరూలేరనీ, తనకు రాజు దంపతులకు ఎట్టి సంబంధం లేదనీ, కాబట్టి తనకోసం వారు దుఃఖించాల్సిన అవసరం లేదనీ స్పష్టం చేశాడు. ఇలా పలికి ఆ జీవుడు వెళ్లిపోయాడు. అప్పుడు చిత్రకేతువు శోకాన్ని వదిలి యమునానదీ తీరానికి వెళ్లి కొడుకుకు ఉత్తర క్రియలు చేశాడు.   



చిత్రకేతువు యమునానదిలో స్నానం చేసి నారదుడికి నమస్కరించాడు. అతడు ప్రసన్నమై భగవ్మంత్రాన్ని ఉపదేశించాడు. తరువాత అంగిరసుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. చిత్రకేతువు నారదుడు చెప్పిన విధంగా నిరాహారుడై సమాధిలో వుండి నారాయణ స్వరూపాన్ని ధ్యానం చేశాడు. ఏడు రాత్రులు ఆ విద్యను ఆరాధించే సరికి విద్యాధర చక్రవర్తిత్వం లభించింది. 


🕉🌞🌎🌙🌟🚩

[14:56, 08/12/2020] +91 92915 82862: 18-14,15-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉️🌞🌏🌙🌟🚩


అధిష్ఠానం తథా కర్తా 

కరణం చ పృథగ్విధమ్

వివిధాశ్చ పృథక్చేష్టా

దైవం చైవాత్ర పఇ్చమమ్.


తాత్పర్యము:- ఈ కర్మాచరణ విషయమున

(1) శరీరము

(2) కర్త

(3) వివిధములగు ఇంద్రియములు

(4) పలు విధములుగను, వేఱువేఱుగను

నుండు క్రియలు (వ్యాపారములు) ఐదవదియగు

(5) దైవమున్ను కారణములుగా నున్నవి.



వ్యాఖ్య: - కరణములనగా పండ్రెండు (పంచకర్మేంద్రియములు + పంచజ్ఞానేంద్రియములు + మనస్సు + బుద్ది). చేష్టలనగా వానివాని వ్యాపారములు.



 ఇచట "దైవ"మనగా ఆ యా ఇంద్రియాదుల 

అధిష్ఠానదేవతలనిగాని, లేక పూర్వజన్మసంస్కారములు (అదృష్ట పుణ్యపాపములు) అనిగాని చెప్పవచ్చును.



ప్రశ్న: - ఏ కర్మ అయినను జరుగవలెననిన

దానికి గల ఐదు కారణములెవ్వి?


ఉత్తరము:-

(1) శరీరము

(2) కర్త

(3) వివిధములగు ఇంద్రియములు

(4) ఆ ఇంద్రియములయొక్క వ్యాపారములు

(5) దైవము.

~~~~

అవతరిక - ఏ కర్మచేయబడినప్పటికిని ఈ ఐదున్ను అందులకు కారణములని చెప్పుచున్నారు -



శరీరవాజ్మనోభిర్యత్ 

కర్మ ప్రారభతే నరః

న్యాయ్యం వా విపరీతం వా 

పంచైతే తస్య హేతవః


తాత్పర్యము:- మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అను వీనిచేత న్యాయమైనట్టిగాని (శాస్త్రీయమైనట్టి గాని), అన్యాయమైనట్టి (అశాస్త్రీయమైనట్టి) గాని ఏకర్మమును ప్రారంభించుచున్నాడో దానికీ ఐదున్ను కారణములైయున్నవి.


🕉️🌞🌏🌙🌟🚩

[18:21, 08/12/2020] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  - 93 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 26 - 6 . ప్రాణాయామ యజ్ఞము  -      ప్రాణవాయువు ముక్కు పుటముల నుండి భ్రూమధ్యము వరకు ప్రవేశించి, అచటి నుండి వాయునాళము ద్వారా ఉపిరితిత్తుల వరకు వ్యాపించి యుండును. ప్రాణ వాయువును పూర్ణముగ పీల్చుట చాల ముఖ్యము.  పరిపూర్ణముగ శ్వాసను పీల్చుట వలన ఎన్నియో రోగముల నరికట్టవచ్చును.  🍀


📚. 4. జ్ఞానయోగము  - 29, 30   📚

Part 6


పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి. 


🌷 1. ప్రాణవాయువు: 🌷


ఇది శ్వాస ద్వారా పీల్చబడుచున్నది. ముక్కుపుటముల నుండి ఉదర వితానము క్రింది భాగము వరకు ఈ వాయువు పనిచేయు చుండును.


కావున కనుబొమల నుండి ఉదర వితానము వరకు గల శరీర భాగములు, వాని స్వస్థత ఈ వాయువు బలమునకు సంబంధించి యున్నవి. ప్రాణవాయువు బలముగ స్వీకరింపబడుచున్నచో ఈ శరీర భాగమంతయు ప్రాణబలముతో కూడిన అస్వస్థతను దరిచేరనీయదు.


 ప్రాణవాయువు ముక్కు పుటముల నుండి భ్రూమధ్యము వరకు ప్రవేశించి, అచటి నుండి వాయునాళము ద్వారా ఉపిరితిత్తుల వరకు వ్యాపించి యుండును. 


ప్రాణవాయువును పూర్ణముగ పీల్చుట చాల ముఖ్యము. సామాన్యముగ జీవులు వారు పీల్చగలిగిన శక్తిలో నాలుగవ వంతు మాత్రమే పీల్చుదురని పరిశోధనలు తెలుపుచున్నవి.


 పరిపూర్ణముగ శ్వాసను పీల్చుట వలన ఎన్నియో రోగముల నరికట్టవచ్చును. సత్సాధకుడు శ్వాసావయవముల నన్నింటిని పరిశుభ్రముగను, ఆరోగ్యముగను ఉంచుకొనుటకు జాగరూకత వహించి యుండవలెను. 


అనగా ముక్కు, గొంతు, శ్వాసనాళము, ఊపిరితిత్తులు. వీటియందు తరచు జలుబు చేయుట, దగ్గు వచ్చుట ఇత్యాదివి కలుగకుండ శ్రద్ధ వహించవలెను. మూలసూత్రము- 'బాగుగ గాలి పీల్చుటయే.'


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[18:21, 08/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 178 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మార్కండేయ మహర్షి  - 4 🌻


26. క్షమవల్ల మహత్తు, వస్తాయి. కానీ క్రోధంవల్ల ఉన్నశక్తులు నశిస్తాయి. ఏముంది? ఒకడికి అపకారం, అపచారం చేస్తాడు. అంతకన్నా చేయగలిగింది ఏముంది? దానివల్ల అది పొందినవాడికి కర్మక్షయం అవుతుంది. పాపక్షయం అవుతుంది. కాని క్రోధంవల్ల తపస్సే క్షయం అవుతుంది. వివేకి ఎప్పుడూ తన తపస్సును వ్యర్థం చేసుకోడు.


27.  తనకు అపచారం చేసినవాడినికూడా సిక్షించకుండా వదిలిపెడతాడు. ఎందుచేతనంటే, పాపానికి ఫలం ఎలాగూ ఈ ప్రపంచంలో ఉండనే ఉంది. తనెందుకు తన తపస్సును వ్యర్థంచేసుకోవాలి? పాపంచేసినవాడే ఫలం అనుభవిస్తాడు. వివేకం అంటే ఇదే.


28. “గృహస్థులయొక్క ధర్మములేవి? కొడుకులు తల్లితండ్రుల విషయంలో ఎట్లాంటిభక్తి, ధర్మములు కలిగి ఉండాలి?” అని ధర్మరాజు అడిగాడు. “తల్లిదండ్రులమీద భక్తి, ధర్మార్థములందు ఆసక్తి, ఈ రెండే పుత్రులకు ఉండాలి” అని చెప్పాడు.


29. బ్రహ్మదేవుడు పూర్వం ఏడుగురు ఋషులను సృష్టించాడు. తరువాత తనను అరాధిస్తూ ఉండమని వాళ్ళతో బ్రహ్మదేవుడు చెప్పాడు. మరీచాదులైన ఆ మునులు బ్రహ్మ మాట వినక, అంతఃకరణలో పరమేశ్వరుడిని గురించి తపస్సుచేసారు. ఇది ప్రవృత్తి, నివృత్తుల విషయం. బ్రహ్మ తనను ఆరాధించమనడంలో అర్థం, వారిని ప్రవృత్తిమార్గంలో నిలుపటానికి, కాని వాళ్ళు నివృత్తిమార్గంలో మహేశ్వరుడిని అంతఃకరణలో ఆరాధించారు. 


30. అందుకు బ్రహ్మదేవుడికి ఆగ్రహంవచ్చి, “మీ బ్రహ్మవిజ్ఞాన శక్తులు ఏవైతో ఉన్నాయో అవి నశించుగాక!” అని వాళ్ళను శప్తుల్ని చేసాడు. వాళ్ళాల్లో జ్ఞానాన్ని ఆయన హరించాడు. “ఆ తరువాత వాళ్ళు ప్రవృత్తిమార్గంలో వివాహాలూ చేసుకున్నారు. పుత్రులను కన్నారు. స్వర్గస్థులయినారు. అజ్ఞానంరాగానే మృత్యువు ఆవరించింది వాళ్ళను. 


31. పృత్యువు – అవిద్య, అజ్ఞానం యొక్క లక్షణం. స్వర్గానికి వెళ్ళి భూలోకంలో తమ కొడుకులు క్రమంతప్పకుండా తమకు శ్రాద్ధాలు పెడుతుంటే చూచి ఆనందించటం వాళ్ళకు అలవాటయింది. చనిపోయిన తరువాత తమకు పుత్రులు శ్రాద్ధాదిక్రియలు విర్వర్తించటంవల్ల వాళ్ళకు ఆనందం. మొత్తం అవిద్య యొక్క లక్షణములే ఇవి! బ్రహ్మశాపమే అదంతా. ఆ శ్రాద్ధానందంలో వాళ్ళు సుఖంగా ఉన్నారు. 


32. అసలు వాళ్ళు దేవతలకు తండ్రులు. మొత్తమొదట బ్రహ్మ సంతానంగా పుట్టారు. తరువాత దేవతలు వాళ్ళనుంచే పుట్టారు. అంటే దేవతలకు కూడా వాళ్ళు తంద్రుల లాంటివాళ్ళు. ఆ ఏడుగురిలో అమూర్తులు ముగ్గురు, సమూర్తులు నలుగురు. అంటే రూపంకలిగినవాళ్ళు నలుగురు. రూపం లేనివాళ్ళు ముగ్గురు. వీళ్ళను దేవతలు కూడా గౌరవించటం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూనూ.


33. వాళ్ళు అలాగ మూడుయుగాలు ఉంటారు. ఆ తరువాత బ్రహ్మజ్ఞానం కొరకు జన్మిస్తారు. క్రమక్రమంగా వాళ్ళు ఇక్కడ పుట్టినతరువాత, సాంఖ్య మతాల్లో కొంతకలం ఉన్నతరువాత, పునరావృత్తిలేనటువంటి జ్ఞానమార్గంలో యోగసిద్ధి పొందుతారు. అంతేకాక, వాళ్ళు తమ యోగబలంతో – యోగసాధన చేసె భక్తులు, మోక్షమార్గాన్వేషకులు ఎవర్యితే ఉన్నారో, వాళ్ళకు యోగాభివృద్ధినిస్తారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[18:21, 08/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 117 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. సర్వశూన్య స్థితి యందు ఎరుక  - 2 🌻


487. నిర్వాణ స్థితిలో, భగవంతుడు 'చైతన్యము' యొక్క పాత్రను వహించుచున్నాడని దాని భావము.


488. అభావము నుండి పుట్టిన సంస్కారములే, సమస్త అనుభవములకు కారణము కాబట్టి ఇచ్చట మనస్సు దాని సమస్త సంస్కారములతో సహితముగా నశించి పోయినది. పరిమిత "అహమ్" యొక్క మిథ్యానుభవములు కూడా అదృశ్యమైనవి.


489. ఈ దివ్యశున్యత్వము, సత్యస్థితి నుండి పుట్టినదే గాని మాయ నుండి పుట్టినది కాదు. 


490. అభావమైన మాయాసృష్టి అదృశ్యమైన తక్షణమే "అహంబ్రహ్మాస్మి" (నేను భగవంతుడను) అనెడు భగవదనుభూతి కలుగుటకు ఒక్క క్షణమునకు ముందుగానే, యీ దివ్య ప్రపూర్ణ పరమ శూన్యస్థితి యొక్క అనుభవము కలుగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

 శ్రీమాత్రేనమః

[02:40, 09/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


174వ నామ మంత్రము


ఓం నిర్భవాయై నమః


జీవికి ఉండు ఆరు వికారములు (పుట్టుక, స్థితి, వృద్ధి, విపరిణామము, క్షయము, నాశనము)  లేని పరబ్రహ్మ స్వరూపురాలు అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్భవా యను మూడక్షరముల నామ మంత్రమును    ఓం నిర్భవాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిపూరిత హృదయంతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే ఆధ్యాత్మికజ్ఞాన సంపదను ప్రసాదించును మరియు సుఖసంతోషములతో భౌతిక జీవనము కొనసాగునట్లు అనుగ్రహించును.


భౌతిక జీవులకు శరీరం ఏర్పడడమనేదే పుట్టుక. అలా పుట్టిన తరువాత భౌతిక ప్రపంచంలో ఉంటూ, దినదిన ప్రవర్ధమానంగా శరీరం పెరుగుతూ, ఆ పెరుగుదలలో మార్పులు ఏర్పడుతూ, పెరుగుట విరుగుట కొరకే యన్నట్లు క్రమంగా శరీరంలోని  జవసత్త్వాలు క్షయమవుతూ, శరీరంనుండి జీవుడు నిష్క్రమించగానే శరీరం పంచభూతాలలో కలిసిపోతూ ఉంటుంది. వీటినే జీవికి గల ఆరు వికారములు అంటారు.


మానవుడు పుట్టిననుండి నాలుగు అవస్థలు ఉన్నాయి. వాటిని అవస్థా చతుష్టయం అని కూడా అన్నారు. అవి -  1) బాల్యం, 2) కౌమారం, 3) యౌవనం, 4) వార్ధక్యం. 


ఒక ఆంగ్లకవి (షేక్స్పియర్) ఈ ప్రపంచం ఒక నాటకరంగం. జీవిత నాటకం రంగంలో  ఏడుగా విభజింపబడినది. ఒక్కొక్క రంగంలోను మాసవుడు ఒక్కొక్క పాత్రలో  నటిస్తాడు. ఆయా పాత్రలకనుగుణమైన విధంగా రంగస్థలలాలంకరణ ఉంటుంది. ఏడు పాత్రలు పోషిస్తాడు. ఏడవ పాత్ర పూర్తికాగానే జీవిత నాటక రంగం నుండి నిష్క్రమిస్తాడు.

ఆ ఏడు పాత్రలూ మానవుని జీవితాన్ని ఏడు దశలుగా  చెప్పడం జరిగింది. అది బాల్యము, విద్యార్ధి, నవయౌవనము (13 నుండి 19 సంవత్సరముల మధ్య), యౌవనము, మధ్యవయస్సు, వృద్ధాప్యము, అవసానదశ. ఇవి జీవితమనే నాటకరంగంలో మానవుని ఏడు పాత్రలు.


పుట్టిన జీవి గిట్టువరకూ గల దశలన్నియు ఇన్నివిధాలుగా వివిధ కోణాలలో చెప్పబడింది. ఇది అంతయు భౌతిక జీవునికి మాత్రమే. పరబ్రహ్మస్వరూపిణి అయిన శ్రీమాతకు కాదు. సకల జీవులను తాను సృష్టిస్తుంది. ఆడిస్తుంది. ఆ ఆట ముగియగానే తనలో లయంచేసుకుంటుంది. ఆ జీవుని కర్మలఫలాన్ననుసరించి మరల పుట్టడమా, పుట్టడమయితే ఏశరీరంతో పుట్టడం, కర్మఫలం ఏవిధంగా అనుభవించడం అనేది అంతా నిర్ణయించేది ఆ పరమేశ్వరియే. 

జగన్మాత కనులు తెరిస్తే జగత్తు ఉద్భవిస్తుంది. కళ్ళు మూస్తే జగత్తు ఆమెలో లయమవుతుంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః (281వ నామ మంత్రము - కన్నులు తెరచినంతనే బ్రహ్మాండములు సృష్టింపజేస్తూ, కన్నులు మూసినంతనే బ్రహ్మాండాలను నశింపజేయునది) 

అటువంటి పరబ్రహ్మ స్వరూపిణి -  నిర్భవా అంటే ఆమెకు పుట్టడం, గిట్టడం, మరల పుట్టడం అనే జననమరణచక్రభ్రమణం ఉండవు. 


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్భవాయై నమః అని అనవలెను.

🌸💐💐💐

[05:35, 09/12/2020] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 573  / Bhagavad-Gita - 573 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 17 🌴


17. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరై: |

అఫలాకాంక్షిభిర్యుకై: సాత్త్వికం పరిచక్షతే ||


🌷. తాత్పర్యం : 

దివ్యమైన శ్రద్ధతో కేవలము భగవానుని నిమిత్తమై భౌతికవాంఛారహితులైన వారిచే ఒనర్చబడు ఈ త్రివిధ తపస్సులు సాత్త్విక తపస్సనబడును.


🌷. భాష్యము  :


🌹 🌹 🌹 🌹 🌹


🌻157. అతీంద్రః, अतीन्द्रः, Atīndraḥ🌻


ఓం అతీంద్రాయ నమః | ॐ अतीन्द्राय नमः | OM Atīndrāya namaḥ


ఇంద్రం అతీతః తనకు స్వభావసిద్ధములగు జ్ఞానమూ, ఈశ్వరత్వమూ మొదలగు లక్షణములచేత ఇంద్రుని అతిక్రమించువాడు. లేదా ఇంద్రియ గోచరము కాని వాడు అని కూడా అర్థము చేసికొనవచ్చును.


సీ. వరధర్మకామార్థ వర్జితకాములై విబుధు లెవ్వని సేవించి యిష్ట

గతిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి కవ్యయ దేహ మిచ్చు నెవ్వాఁడు కరుణ?

ముక్తాత్ములెవ్వని మునుకొని చింతించు? రానందవార్ధి మగ్నాంతరంగు

లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక భద్రచరిత్రంబుఁ బాడుచుందు?

ఆ. రా మహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మ, యోగగమ్యుఁ బూర్ణ నున్నతాత్ము

బ్రహ్మమైన వానిఁ బరుని నతీంద్రియు, నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.


ధర్మంపైనా కామంపైనా ధనం పైనా ఆశలు విడిచిన పండితుల పూజలందుకొని వారుకోరుకొన్న ఉత్తమ వరాలు ఎవ్వడు అనుగ్రహిస్తాడో, దరిజేరి కోరిన వారికి దయతో నాశనంలేని శరీరాన్ని ప్రసాదిస్తాడో, ముక్తులైన వారు ఆనంద సముద్రంలో మునిగిన మనస్సులతో ఎవరిని అనునిత్యమూ ఆరాధిస్తారో, పరమార్థాన్ని చింతించేవారు ఏకాంతంగా ఎవరి పవిత్రమైన చరిత్రను పాడుతుంటారో అట్టి ఆద్యుడైనవాడూ, కంటికి కానరానివాడూ, ఆధ్యాత్మ యోగంవల్ల మాత్రమే చేరదగినవాడూ, పరిపూర్ణుడూ, మహాత్ముడూ, బ్రహ్మస్వరూపుడూ, శ్రేష్ఠమైనవాడూ, ఇంద్రియ గోచరము కానివాడూ, స్థూల స్వరూపుడూ, సూక్ష్మ స్వరూపుడూ అయిన మహేశుడిని నేను భజియించుతాను. 


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

:35, 09/12/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 126 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ


🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 56 🌻


అటువంటి ఆంతరిక సమాధిని, అంతర్యామి తత్వాన్ని, ఆ అంతఃకరణ చతుష్టయాన్ని దాట గలిగేటటువంటి, సమర్థమైనటువంటి, ఆ మనస్సుని అంతర్ముఖం వైపుకు, మనస్సుని ఆత్మయందు సంయమింప చేసేటటువంటి ఏ ప్రయత్నం ఉన్నదో, దానికే ధ్యానం అని పేరు. అంతేకానీ, ఇతరములైనటువంటి, బాహ్యములైనటువంటి, దృశ్యవిశేషములైనటువంటి దర్శనానుభూతులైనటువంటి, భావ విశేషములైనటువంటి, భావ వ్యక్తీకరణలైనటువంటి వాటిని ధ్యానమని పిలుచుట అసంబద్ధం.


         ఎవరికైతే మనస్సు ఆత్మయందు సంయమింప చేయబడి, వ్యవహారశీలమైనటువంటి మనస్సు లేనటువంటి వారుంటారో, వారు మాత్రమే ధ్యానం చేస్తున్నారు. విధిని చక్కగా ఎరిగినటువంటి వారు. 


వ్యవహార శీలమైనటువంటి మనస్సు కలిగినటువంటివారు అందరూ తప్పక వారి వారి ఇంద్రియాసక్తులను అనుసరించి, గుణబలాన్ని అనుసరించి, వాసనాబలాన్ని అనుసరించి, సంస్కార బలాన్ని అనుసరించి, ఆ యా ఇంద్రియ రీతులయందు మగ్నత చెందక తప్పదు. 


అవి భ్రాంతి రూపమైనటువంటి, అద్దము నందు బొమ్మ ప్రతిబింబం, ఏరకమైనటువంటి సుఖాన్ని ఇస్తుందో, అటువంటి ప్రతిబింబ సుఖాన్ని, ఈ ఇంద్రియ వ్యాపారముల యందు సుఖదుఃఖముల రూపంలో, తనకున్న స్మృతిజ్ఞాన రూపమే, ఇక్కడ ప్రతిబింబ రూపముగా కనబడుతున్నదనే సత్యాన్ని ఎఱుగక, పిల్లవాడు అద్దాన్ని ముందు పెట్టుకుని ఆడినట్లుగా, తన ప్రతి బింబమును తానే చూచుకుని ఆనందపడినట్లుగా, తన యొక్క ప్రతిబింబ.... బింబ సుఖముయొక్క ప్రతిబింబం అయినటువంటి, ఇంద్రియ వ్యవహారముల యందు ఏర్పడుతున్నటువంటి, తత్కాల రూప పరిమిత, అశాశ్వత సుఖదుఃఖములను అనుభవించుచు, వాటినే సత్యమని భావించేటటువంటి, భ్రాంతికి లోనౌతున్నాడు - అనేటటువంటి విషయాన్ని సుస్పష్టముగా మళ్ళా ఇప్పుడు తెలియజెప్తున్నారు.


         అద్దమును ప్రపంచము వైపు త్రిప్పినప్పుడు, ప్రపంచమును చూపును. తన వైపుకు త్రిప్పుకుని, తన ముఖమును చూపించునటుల, మనస్సు ఇంద్రియములతో కూడినప్పుడు ప్రపంచమును, అంతర్ముఖమైనప్పుడు ప్రత్యగాత్మను చూపించును. గట్టి ప్రయత్నము చేత, ఇంద్రియములను, మనస్సును అంతర్ముఖముగా ఉండునట్లు చేయవలెను. అట్టి వారికే మోక్షము.


         మోక్షాధికారులు ఎవరో సుస్పష్టముగా చెబుతున్నారు. ఎవరైతే మనస్సును, అంతరాత్మ వైపు, అంతర్యామి వైపు, స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానం వైపు, స్వస్థానం వైపు, హృదయాకాశం వైపు, ఎవరైతే తిప్పుతారో, బుద్ధి గుహయందు ఉంచుతారో, వారికి మాత్రమే మోక్షము సాధ్యమౌతుంది. మిగిలిన వారు మోక్షము, మోక్షము అని పలవరించుటే తప్ప, వారికి ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి ప్రపంచాన్ని చూడాలి అంటే, ప్రపంచం వైపుకి తిరగాలి. అంతర్యామిని చూడాలి అంటే అంతర్యామి వైపు తిరగాలి. 


మనస్సు అనే అద్దాన్ని ప్రపంచం వైపు తిప్పినప్పుడు అదే ప్రపంచం అందులో ప్రతిబింబిస్తుంది. అదే మనస్సుని అంతర్యామి వైపు గనుక త్రిప్పినట్లయితే, తన ఉనికిని తానే కోల్పోయి ఆ ఆత్మతత్వాన్ని గ్రహిస్తుంది. ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతుంది. ఆత్మానుభూతి యందు తానే లేనటువంటి స్థితిలో లయమైపోతుంది. 


ఆ అంతఃకరణమంతా లేనటువంటి, లయమైనటువంటి స్థితిలో, తానే పరిణామ రహితమైనటువంటి ఏ ఆత్మగా ఉన్నాడో, అంతర్యామిగా ఉన్నాడో, “సర్వభూతస్తమాత్మానం, సర్వభూతానిచాత్మని, వీక్షతే యోగయుక్తాత్మ, సర్వత్ర సమదర్శినః” - అటువంటి సమదర్శనాన్ని చక్కగా సాధిస్తాడు. అనేకత్వం అనేటటువంటి దృష్టి లేకుండా, ఏకత్వానుభూతి యందు స్థిరముగా ఉంటాడు. 


ఈ రకంగా తనయందు స్వస్థితుడైనటువంటి, తన స్వస్థానమునందు స్వస్థితుడయ్యేటటువంటి మోక్షము, ఆ మార్గములో ఈ ఆత్మనిష్ఠ చాలా ముఖ్యమైనటువంటిది. 


అటువంటి ఆత్మనిష్ఠను సాధించడానికి సాధకులందరూ తప్పక అంతర్‌ ధ్యాన మగ్నులై, అంతర్ముఖంలో స్థిరంగా ఉండేటటువంటి పద్ధతిని ఆశ్రయించాలి.

అజ్ఞానులు బహిర్గతములైన కామ్యవిషయములనే కోరుచున్నారు. అట్టివారు జన్మ, జరామరణ రోగాదులతో కూడి, మృత్యపాశమునకు గురియగుచున్నారు. 


కానీ వివేకవంతులు అశాశ్వతమైన భోగములను కోరక, శాశ్వతమైన మోక్షమునే కోరుదురు. మోక్షము ‘న కర్మణా వర్థతేనో కనీయాన్‌’ అను శృతిని అనుసరించు, కర్మల చేత పెరుగుట కానీ, తరుగుట కానీ లేదు. ఇది ధృవమైనది, శాశ్వతమైనది. వివేకులు ఈ విధముగా తెలిసి దాని కురేషణ, ధనేషణ, పుత్రేషణలను ఈ ఈషణాత్రయములను త్యజించి, మోక్షాభిలాషులు అగుచున్నారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[05:35, 09/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 291🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

70. అధ్యాయము - 25


🌻. సతీ వియోగము  - 3 🌻


మీరిద్దరు ఈనాడే నా యందు దయను చూపినారు. ఇది మాహాభాగ్యము . మీరిద్దరు ఎవనిపై దయను చూపెదరో. అట్టి పురుషుడు ధన్యుడు, శ్రేష్ఠుడు(38). రఘురాముడు శివపత్నియగు సతితో నిట్లు పలికి,అనేక పర్యాయములు ప్రణమిల్లి ఆమె ఆజ్ఞచే ఆ వనమును సంచరించెను. (39). 


జితేంద్రియుడగు రాముని ఈ వాక్యములను విని, సతీదేవి చాల సంతసించి, అతని శివభక్తిని తన హృదయములో చాల మెచ్చుకొనెను(40). తాను చేసిన పనిని గుర్తునకు తెచ్చుకొని , ఆమె మనస్సులో అతిశయించిన దుఃఖమును పొందెను. ఆమె దుఃఖముతో పాలిపోయిన ముఖముగలదై నిరుత్సాహముగా శివుని వద్దకు తిరిగి వచ్చెను(41).


ఆ దేవి మార్గమునందు నడుస్తూ అనేక పర్యాయములు లిట్లు చింతిల్లెను. శివుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి, నేను రాముని విషయంలో చెడు ఆలోచనను చేసితిని.(42).శంకరుని వద్దకు వెళ్లి నేను, ఏమి సమాధానమును చెప్పగలను? అపుడామె ఇట్లు పరిపరివిధముల చింతిల్లి పశ్చాత్తాపమును పొందెను. (43). 


ఆమె శోకముతో నిండిన హృదయమున గలదై కాంతిని గోల్పోయి విషాదభరితమైన ముఖముతో సంభుని సమీపమునకు వెళ్లి నమస్కరించెను(44). శివుడు దుఃఖతరాలగు ఆమెను చూచి క్షేమమేనా ?అని ప్రశ్నించెను రాముని ఏ విధముగా పరీక్షించితివి ?అని ఆయన ప్రీతితో పలికెను(45).


శివుని మాటను విని ఆమె తలవంచుకొని ఏమియూ మాటలాడకుండెను. శోకముతో నిండిన హృదయము గల సతి ఆయనకు దగ్గరగా నిలబడియుండెను(46) అపుడు మహాయోగి, నానాలీలా దక్షుడు అగు మహేశ్వరుడు ధ్యానమార్గములో దక్షపుత్రి యొక్క ఆచరణను తెలుసుకొనెను(47). 


మర్యాదను రక్షించే ఆ రుద్రుడు విష్ణువు ప్రార్థించగా తాను పూర్వము చేసిన ప్రతిజ్ఞను గుర్తుకు తెచ్చుకొనెను. (48). ఆ ప్రభువునకు విషాదముకలిగెను. ధర్మమును పలికి, ఆచరించి, ధర్మమునూ సదా రక్షించే శివుడు తన మనస్సులో నిట్లనుకొనెను(49).


శివుడిట్లు పలికెను-


నేను దాక్షాయణి యందు పూర్వమునందు వలె ప్రేమను కలిగియున్నచో, లోకలీలను అనుసరించే నా యొక్క శుద్ధమగు మహా శపథము నశించును(50).


బ్రహ్మ ఇట్లు పలికెను-


వేద ధర్మమును నిష్ఠతో పాలించు శివుడు ఇట్లు పరిపరివిదముల తలపోసి, హృదయములో సతిని త్యజించి శపథము నష్టము కాకుండునట్లు చేసెను(51). 


అపుడా పరమేశ్వరుడు ఆ సతీదేవిని మనస్సులో త్యజించి తన కైలాసమునకు వెళ్లెను. ఆశ్చర్యము !ఆ ప్రభువు దుఃఖమును పొందెను. (52). మార్గమునందు వెళ్లుచున్న ఆ మహేశ్వరుని ఉద్దేశించి, సర్వులు విశేషించి సతీదేవి వింటూ ఉండగా , ఆకాశవాణి ఇట్లు పలికెను(53).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[05:35, 09/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 137, 138  / Sri Lalitha Chaitanya Vijnanam  - 137, 138 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖


🌻137. 'నిరాకారా' 🌻


ఆకారము లేనిది శ్రీదేవి అని అర్థము. 


పంచభూతముల సృష్టికి ముందు ఆకారములుండవు. కేవలము వెలుగు, శబ్దము, వాని వలయములు, గుణములుండును. వానికి పూర్వము శుద్ధచైతన్యముండును. దానికి పూర్వము సత్యము మాత్రమే యుండును. శ్రీదేవి సహజ స్థితి అట్టి సత్యము. 


ఆమె నుండియే పై తెలిపినవన్నియూ వ్యక్తమగుచుండును. ఆ స్థితిలో

ఆమెకు గుణములు లేవు. రూపములు లేవు. అందువలననే తరువాతి నామములలో (139) ఆమెని నిర్గుణ అని కూడ అందురు. విధముగ 25 నామము లిచ్చట పేర్కొనబడినవి. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 138  / Sri Lalitha Chaitanya Vijnanam  - 138 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖


🌻138. 'నిరాకులా' 🌻


కలత చెందనిది శ్రీదేవి అని అర్థము. 


అజ్ఞానమున్నచోట కలత యుండును. శ్రీలలిత విద్యా స్వరూపిణి అగుటచే, అవిద్యా సంబంధమైన కలత యుండదు. సృష్టి యందు అవిద్య లేక అజ్ఞానము తప్పదు. జ్ఞానము అజ్ఞానముచే కప్పబడి యుండును. విద్యాసంపన్నులు అవిద్యను గర్షించక, విద్యను ఆశ్రయించి యుందురు. అవిద్యకూడా సృష్టియందలి భాగమే అని తెలిసి యుందురు.


 అందువలన వారికి ఘర్షణ యుండదు. అట్టి సమగ్రభావనమునకు శ్రీదేవి అధిష్టాన దేవత. ఆమెకు సురులు, అసురులు కూడ సమానమే. మితిమీరినపుడు సర్దుబాట్లు చేయు చుండును. 


విద్యావంతులు కూడా అవిద్య తాకిడివలన కలత చెందుట జరుగుచుండును. వారి విద్య సమగ్రము కాదు. అజ్ఞానమును దూషించు జ్ఞానము పరిపూర్ణ జ్ఞానము కాదు. అవసర మగుచో దానిని నిర్జించుటయే గాని దూషించుట విద్యావంతులు చేయరు.


దూషించువారికి కలత తప్పదు. అట్టివారికి మనస్సు చంచలమగును. చంచలమగు మనస్సు కలతబారిన నీరువలె ఉండును. కలతలు ఎక్కువగ నుండును.


 భూషణాదులకు దూరముగ ప్రశాంతము, అచంచలము అగు మనస్సుతో నుండుటయే నిజమగు జ్ఞానము. జ్ఞాని, జ్ఞానము అజ్ఞానముల స్వరూపముల నెరిగి తన కర్తవ్యము ననుసరించుచూ జీవించును. అట్టివారు నిరాకులు. 


శ్రీదేవి త్రిగుణాతీత కూడ అగుటవలన ఆమెకు కలత యుండదు. కలతలన్నియు త్రిగుణ సృష్టియందే ఉండును. 


చరితము చంచలము అయిన మనసుగల వారికి శ్రీదేవి దూరము. వారు దేవి ఆరాధన మార్గమున కలతలను బాసి, స్థిరచిత్తమును గొని, అటుపై దేవి అనుగ్రహమునకు ప్రయత్నింపవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


నాయకుడుగా ముందుకు వస్తే మీకు సాయం చెయ్యటానికి ఎవ్వరూ రారు. విజయాన్ని సాధించాలంటే 'అహాన్ని' నిర్మూలించుకో.

సుఖమయము, శుభదాయకము అయిన లోకం, 'సామాజిక ప్రగతి' 'వేడి మంచు', 'నల్లని వెలుగు' ల్లా అసంబద్ధమైనవే. అనర్థాలను సృష్టించని భౌతిక అభివృద్ధి ఉండదు.


🕉️🌞🌏🌙🌟🚩

[14:52, 09/12/2020] +91 92915 82862: భాగవతము

శ్రీగురుభ్యోనమః

🕉️🌞🌏🌙🌟🚩


రుద్రశక్తి వలన మొత్తము చీకటంతా వెలుగై పోతుంది. మనలో ఛిధ్రాలు పోవాలంటే శివారాధన ముఖ్యము. అందుకనే  అక్షరాభ్యాసం నుంచి పంచాక్షరి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ఆ మంత్రం చేసుకుంటే అయిదు ఇంద్రియాలలో, పంచ భూతాలలో, పంచతన్మాత్రలలో రుద్రుడు చేరిపోతాడు. Electronics ఏమి నేర్చుకున్నా యిది రాదు. చిన్నపిల్ల వాడికి రుద్రమంత్రము నేర్పిస్తే వాడి వృద్ధి తరగదు.



పిల్లలకు సెలవులు వచ్చినపుడు ఇవి నేర్పించాలి.  వారిలో ప్రజ్ఞ వికసించడానికి తల్లి తండ్రులుగా మనము ప్రయత్నము చేయాలి. ఎంత ప్రయత్నము చేస్తే అంత. 


🕉️🌞🌏🌙🌟🚩


ఆచార్య సద్భావన


మనం అంతర్ముఖులమయ్యేకొలదీ బాహ్య సంఘటనల ప్రభావం మన ఎడల అంతకంతకూ తగ్గుతూ వస్తుంది.



బాహ్యంలో జీవించే వ్యక్తి అన్ని విషయాలను గమనిస్తాడు. అన్ని విషయాలు అతని గమనింపుకు వస్తాయి. అతడు గోరంత దాన్ని కొండంతగా చూస్తాడు.



ఒక వ్యక్తి చూపులుగాని, చర్యలుగాని దుష్ఠభావాంతో ఉన్నట్టుగా అతడు ఊహించుకుంటాడు.



దుష్టత్వాన్ని భూతద్దంలో చూస్తే అది చివరకు మనకు భరించలేని భారమయ్యేంతగా తయారయి ఆఖరికి మనం అరణ్యానికి పోయినా శాంతిని దక్కనివ్వదు.



అందు వలన ఈ చింతనను జయించాలి. అంతర్కుఖుడై జీవించే వ్యక్తి ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండడు.



అంతరంగంతో సంబంధం ఏర్పరచుకోవటం తెలిసినవాడు కోల్పోయేదీ ఏదీ ఉండదు.


శుభంభూయాత్


🕉️🌞🌏🌙🌟🚩

[15:01, 09/12/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (735)

🕉🌞🌎🌙🌟🚩


"శాంతి ఏ విధంగా దుఃఖాన్ని రూపుమాప గలుగుతుంది !?"



గడ్డివాములో పడ్డ నిప్పురవ్వ ఎంత చిన్నదైనా మొత్తాన్ని దగ్ధం చేస్తుంది. పాలలో వేసిన మజ్జిగ చుక్క ఎంత చిన్నదైనా పాల మొత్తాన్ని పెరుగుగా మార్చేస్తుంది. అలాగే మనలో శాంతి అనే మౌలిక గుణం పుట్టగానే అప్పటివరకు గూడుకట్టుకున్న దుఃఖరాశి ఇక దగ్ధం కావటం మొదలవుతుంది. మనం సంపాదించుకున్న శాంతి గుణమే దైవదర్శనాన్ని, దుఃఖనాశనాన్ని ఈ రెండిటినీ సాధించి పెడుతుంది. కాబట్టి మన సాధన అంతా మనసులో శాంతిని సంపాదించుకోవడానికే. అలాంటి శాంతి సాధకుల్లో నెలకొంటే అదే ముల్లోకాల్లో దైవం ఎక్కడ దాగున్నా తీసుకొచ్చి మన మనసులో ప్రతిష్టిస్తుంది !



{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

"దైవదర్శనం.. దుఃఖనాశనం.. శాంతితోనే సాధ్యం !''- (అధ్యాయం -90)


🕉🌞🌎🌙🌟🚩

[15:01, 09/12/2020] +91 92915 82862: "ఋభుగీత " (201)

🕉🌞🌎🌙🌟🚩


ఋభు నిధాఘ సంవాదము"

15వ అధ్యాయము 


అద్వైత భావన అంకురిస్తే ఆనందంగా ఫలిస్తుంది !


చిత్తం అంటే గతం మనలో ఏర్పరిచిన అభిప్రాయాలు, వాసనలు, నమ్మకాలు. ఇదంతా జన్మ జన్మలుగా పోగేసుకున్న సమాచారం. ఇవన్నీ పోవడమే చిత్త త్యాగం. చిత్తమే పునర్జీవితమని, మహామాయ అని, దేహసంబంధాన్ని ఏర్పరిచే బంధమని, దేహాన్ని గురించి భయపడేలా చేసే భావనలకు కారణమని తెలుసుకోవాలి. అందుకే సత్యాన్ని దూరంచేసే చిత్తాన్ని అనుసరించడమే మహాపాపం. అందుకే ద్వంద్వాన్ని ప్రేరేపించే చిత్రాన్ని త్యజిస్తే అద్వైతభావన అంకురించి అది ఆనందంగా ఫలిస్తుంది. అదే సదా మనని బ్రహ్మీస్థితిలో ఉంచుతుంది. అది ఎటువంటి లక్షణాలు లేని సదాపూర్ణ స్థితి కలిగించేదే ఈ జ్ఞానబోధ !


🕉🌞🌎🌙🌟🚩

[15:12, 09/12/2020] +91 92915 82862: 🌷93-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩


అధ్యాయము-8

🥀 *దారులు-మెట్లు🥀*


1. అర్జునుడు:-  నీవిప్పుడు బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మము, అధిభూతము, అధిదైవము అను పదములను ఉపయోగించితివి. వానిని వివరించి తెలుపుము.



2. అట్లే అధి యజ్ఞము అంటివి. అది ఎట్టిది? ఈ శరీరమున దాని నెట్లు తెలియవలెను? ప్రయాణ కాలమున జ్ఞప్తి యుంచుకొనుట ఎట్లు?



3. కృష్ణుడు: బ్రహ్మమును వివరించుచున్నాను. సృష్టిలో ఏ వస్తువుకైనను ఒక పరిమాణం ఉన్నది. భూమి యందు కొంత మట్టి ఉన్నది. కొన్ని నీళ్లు ఉన్నవి. అంతకన్నా ఎక్కువ ఉండుటకు వీలులేదు. పుట్టుట, కొంతకాలముండుట మరల కరిగియో, తరిగియో పోవుట అను లక్షణములు వీనికి ఉన్నవి. అట్లే జీవుల శరీరములోని పదార్థములకును. ఇక భూమి చుట్టును వాయువు ఉన్నది. దాని పరిమాణము మారుచుండును. అయినను ఎప్పటికప్పుడు పరిమాణము ఉండును. కనుక అదియు పరిమితమే! సూర్యుని నుండి కిరణములు భూమికి వచ్చుచున్నవి. వానికి పరిమాణము లేదు. పోయినంత మేర వ్యాపించు చుండును. బరువు మున్నగునవి లేవు. కానీ స్పర్శయు, కనిపించుటయు గలవు, ఉండుటయు, లేకుండుటయు కలవు. కనుక మనము చూచు వెలుగు కూడా పరిమితమే! ఇన్నిటిని ఆవరించి ఆకాశమున్నది. మనలో మనస్సు మున్నగునవి పనిచేయుచున్నవి. వీనికిని పరమాణాదులు లేవు కానీ ఉండుట, లేకుండుట గలదు. అందు ఆకాశమునకు అదియును లేదు. ఉండుటయు, లేకుండుటయు ఏక కాలమున ఆకాశమగుచున్నది. ఈ ఆకాశము గూడ దేనిపై ఆధారపడియున్నదో ఊహింపుము. అది పరిమితం కాదు. అరుగదు, కరుగదు, తరుగదు, రాదు, పోదు. క్షరము అనబడు మార్పుల సముదాయము దానికి వర్తింపదు. దానిని అక్షరమందరు. అదియే బ్రహ్మము. అదియే మొదటి 'నేను'. ఈ నాకు మొదలు, చివరలు లేవు కాని మిగిలిన వాని అన్నిటికిని మాత్రము అది మొదలు చివర. ఇదియే బ్రహ్మము (వ్యాపించియున్నది). తనలో తాను వ్యాపించుచున్నది. సృష్టిగ వ్యాపించునది అని బ్రహ్మమను పదమునకు అర్థము. ఇక ఆధ్యాత్మమనగా ఏమో వివరించెదను. పై చెప్పిన బ్రహ్మము ఆత్మ యగుట కలుగుచున్నది. అనగా సృష్టిగా దిగి వచ్చుటకు తానగుట జరుగును. తన యందు తాను పుట్టుట జరుగును. దీనిని స్వ+భావము అని కూడా అందురు. బ్రహ్మము యొక్క ఈ లక్షణము ఆధ్యాత్మము.


 🕉🌞🌎🌙🌟🚩

[15:13, 09/12/2020] +91 92915 82862: 106) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🕉🌞🌏🌙🌟🚩


పరోక్షా చాపరోక్షేతి విద్యా ద్వేధా విచారజా ౹ తత్రాపరోక్షవిద్యాప్తౌ విచారోఽ యం సమాప్యతే ౹౹15౹౹


15.విచారణ వలన కలుగు జ్ఞానము రెండు విధములు,

పరోక్షము, అపరోక్షము అని,

అపరోక్షజ్ఞానము క‌లుగుటతో విచారణ సమాప్తి నొందును.




అస్తి బ్రహ్మేతి చేద్వేద పరోక్షజ్ఞానమేవ తత్ ౹ అహం బ్రహ్మేతి చేద్వేద సాక్షాత్కారః స ఉచ్యతే  ౹౹16౹౹


16.  "బ్రహ్మము ఉన్నది"అనే జ్ఞానము పరోక్షము మాత్రమే

"నేనే బ్రహ్మమును"అనే జ్ఞానము అపరోక్షము.

అదే సాక్షాత్కారము.




తత్సాక్షార సిద్ధ్యర్థ మాత్మ తత్త్వం వివిచ్యతే ౹ యేనాయం సర్వ సంసారాతు త్సద్య ఏవ విముచ్యతే ౹౹17౹౹


17. ఆ సాక్షాత్కారము సిద్ధించు కొరకు ఆత్మ తత్త్వము వివేచింప బడుచున్నది.

ఈ ఆత్మసాక్షాత్కారముచే జీవుడు తత్క్షణమే సంసార చక్రము నుండి విముక్తి నొందును.



నిజమైన గురువు స్వయంగా నారాయణ స్వరూపమే.మానవరూపంలో వుండే గురువు వలన పరమసత్యాన్ని గ్రహించి  

అపరోక్ష జ్ఞానముతో సత్యదర్శనాన్ని పొందగలగాలి.



బుద్ధితో సముపార్జించిన జ్ఞానమంతా పర+అక్ష అంటే ఇతరుల కన్ను.ఇతరుల కన్నులతో చూసినది పరోక్షజ్ఞానం. సునిశితమూ తీక్షణమూ అయిన బుద్ధికల వారందరూ కూడా దీనిని సంపాదించగలరు.కానీ దీనిని స్వానుభవముగా గ్రహించడం మాత్రం అత్యంత కష్టసాధ్యం.



స్వయంగా తన కన్నులతో చూసినది   అ+పరోక్ష+జ్ఞానం. అపరోక్షనుభూతి అంటే స్వానుభవం.



సిద్ధాంతపరమయిన జ్ఞానసంపాదన ప్రధనంకాదు, స్వానుభవము వలన మాత్రమే సత్యదర్శనమౌతుంది.

శాస్త్రాధ్యయనము వలన బ్రహ్మము కలదు అనే పరోక్షజ్ఞానము కలుగు చున్నది.

మనలోని ప్రత్యగాత్మయే బ్రహ్మమనే అనుభవము కలుగుట అపరోక్ష జ్ఞానము.



పరోక్షజ్ఞానమనగా తర్కాది జనితమైన జ్ఞానము.అపరోక్ష జ్ఞానము అనుభవ జనితము. తేనెటీగలు కుట్టును అనే జ్ఞానము అందరికిని కలదు.సాక్షాత్తుగ తేనెటీగలచే కుట్టబడిన వ్యక్తికి కలుగు "తేనెటీగలు కుట్టును"అనే జ్ఞానములోని విశిష్టత స్పష్టమే గదా!



బుద్ధి ఫరిధిని అధిగమించి శుద్ధచైతన్యస్థితిలోనికి చేరుకోవాలి.మహోన్నతమైన విలువలకనుగుణంగా జీవిస్తూ,కేవలం శారీరక మానసిక సుఖాలతో తృప్తిపడకుండా,జీవన పరమార్థాన్ని గ్రహించి సాధించాలనే దృఢదీక్షతో జీవించాలి.

"లక్ష్యం"

మీద నిలబడడమే తపస్సు.



మానసికమైన కోరికలూ,బుద్ధిలోని ఆలోచనల నిరంకుశాధికారంనుండి విడివడి,వివేకంతో పరిమితత్త్వం నుండి బయటపడాలి.



మనచుట్టూఉండే వస్తుమయ ప్రపంచం మీద వ్యామోహం లేకుండా మమకారమూ, రాగద్వేషాలూ లేకుండా వైరాగ్యాన్ని వృద్ధిచేసుకోవాలి.



బ్రహ్మత్వం మొదలుకుని జడపదార్థం వరకూగల సర్వస్థితుల మీదను,కాకిరెట్టమీద ఉన్నట్లుగా (ఎటువంటి ఆకర్షణా లేకుండా)తీవ్ర వైరాగ్యం కలిగి ఉండడమే నిర్మలమయిన వైరాగ్యం.



మనోబుద్ధులద్వారా చైతన్యం ఆధారంగా చూడబడే బాహ్యవస్తుమయ ప్రపంచమంతా కూడా అనిత్యమయినది-నిత్యమూ మారే స్వభావం కలది.దృగ్గోచరమయే వస్తువులు నిత్యమూ మార్పు చెందుతూ నశిస్తూ పరిమితత్త్వంతో కూడి ఉన్నాయి.



వస్తుమయ ప్రపంచము నిత్యమూ మార్పు చెందుతూ ఉంటుందనీ,దానిని ప్రకాశింపజేసే చైతన్యం మాత్రం నిశ్చలంగా నిత్యమూ స్థిరంగా ఉంటుందనీ గ్రహించిన వాడే వివేకవంతుడు.

చైతన్యం నిత్యమైనది. మార్పులేనిది.



స్థూల-సూక్ష్మ-కారణ శరీరాలన్నీ కూడా చైతన్యజ్యోతి యొక్క విభిన్న వ్యక్తరూపాలు మాత్రమేననే జ్ఞానంలో క్రమంగా నిష్ఠను పొందడమే ఆత్మ సాక్షాత్కారానికి-స్వరూప దర్శనానికి సులభమయిన సాధనా విధానం.



నాలోని ఆత్మ,నేనే అయిన ఆత్మ‌, నిత్యమూ స్థిరంగా ఉంటుందని ఆ పరమాత్మస్వరూపమే నేను అనేదే అసలైనజ్ఞానం.

సద్ వృత్తి-నేనూ నాతో పాటుగా నేను చేసేవన్నీ కూడా కలిపి ఏకంగా ఒకేఒక బ్రహ్మం ఉంది,అహం బ్రహ్మస్మి-ఇది వినా రెండవదేదీ లేదు,అనే దృఢజ్ఞనంలో సాధకుడు స్థితమయిన నిరంతర ధ్యానంలో ఉండగలగాలి.



రెండవదానికి తావివ్వని అఖండ బ్రహ్మానుభవంలో నిష్ఠకలిగి ఉండడమే సమాధి(జ్ఞానం)అనబడుతుంది.



ఇదే సత్యాన్ని ప్రత్యక్షంగా దర్శించడం బ్రహ్మానుభవం,అపరోక్షానుభూతి అని అంటారు.


🕉🌞🌏🌙🌟🚩

[15:53, 09/12/2020] +91 92915 82862: శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

తోడిరాగః - ఆదితాళమ్‌.


13. ఖేలతి పిణ్డాణ్డడే 

ఖేలతి పిణ్డాణ్డడే 

భగవాన్‌ - ఖేలతి పిణ్డాణ్ణడే 



1. హంసః సోహం హంసః సోహం

హంసః సోహం సోహమితి || ఖేలతి||



2. పరమాత్మాహం పరిపూర్ణోహం

బ్రహ్మైవాహ మహంబ్రహ్మేతి || ఖేలతి||



3. త్వక్‌ చక్షుః శ్రుతి జిహ్వాఘ్రాణ

పంచవిధ ప్రాణోపస్థానే || ఖేలతి||



4. శబ్దస్పర్శ రసాదికమాత్రే

సాత్విక రాజస తామసమిత్రే || ఖేలతి||



5. బుద్ధి మనశ్చిత్తాహంకారే

భూజల తేజో గగన సమీరే || ఖేలతి||



6. పరమహంస రూపేణవిహర్తా

బ్రహ్మవిష్ణు రుద్రాదిక కర్తా|| ఖేలతి||



తాత్పర్యము:-


1. బ్రహ్మాండము నందంతటను నిండియున్న భగవంతుడు నాయీ పిండాఁడములో - దేహములో ఆడుచున్నాడు. 'హంసఃసోహం - హంసః సోహంః - హంసః - సోహం సోహం' అని పలుకుచు ఆడుచున్నాడు.

వివరము; (మనము గాలిని బీల్చు చున్నాము; విడుచు చున్నాము. గాలి లోపలకు ప్రవేశించుచు 'హం' అని ధ్వనించుచున్నది. బయటకు బోవుచు 'సో' అని ధ్వనించుచున్నది. అనగా మన ఊరు నిట్టూరుపులయందు 'హంసో' అన్న ధ్వని పుట్టుచున్నది.



సంస్కృతభాషలో పదాంతమునందలి ఓకారము - విసర్గముయొక్క వికారమే. అందుచే ఊర్పు నిట్టూర్పులు 'హంసః' అని ధ్వనించుచున్నవని తెలియుచున్నది.

ఊర్పు తరువాత నిట్టూర్పును గాక - నిట్టూర్పు తరువాత ఊర్పును పరిగణింపగా ఆధ్వని 'సోహం' అగుచున్నది.



ఇట్లు మనము గమనించుట లేదుగాని - మనయందు 'హంసః - సోహం' అన్న ధ్వనులు నిరంతరము సాగుచున్నవి హకారము - శివవాచి, సకారము శక్తి వాచకము. 'హంసః' అనగా శివశక్తులే!

'హంసః సోహం - హంసః సోహం' అనుచు శివశక్త్యా త్మకమైన దైవతత్త్వమే (చెడుగుడి ఆటలో బాలురు కూత కూయుచున్నట్లు) మనయందాడుచున్నది.



ఇచట మరొకవిశేషము :- 'సోహం' అనుదానిని విడదీయగా 'సః+అహం' అగును. ఉన్నవి ఈ రెండక్షరములేకాని, ఈ 'అకారము' 'ఓకార-హకారముల' నడుమ జనించుటకు సంస్కృత వ్యాకరణము అవకాశము కల్పించును, అందుచే 'సోహం' అనుదానిని విడదీయగా 'నః+అహం' అగును.

'సః=వాడు, అహం=నేను, వాడు నేను అనగా 'వాడే నేను' అగుచున్నది. అనగా - 'వాడేనేను, నేనేవాడు' అన్న అర్థము జనించుచున్నది.

శివశక్తిస్వరూపమైన దైవతత్త్వము నాపిండాండములో 'హంసః సోహం' హంసః సోహం' అనుచు - 'నేనే వాడు, వాడే నేను' అని నిరంతరము పల్కుచు - ఫలితముగా - నేను పరమాత్మను, నేను పరిపూర్ణుడను, నేను బ్రహ్మమను, బ్రహ్మమే నేను - అని ఘోషింపుచు విహరింపుచున్నది. ఇది సత్యము.

ఉత్తమ సాధకున కిది అనుభవములో సాక్షాత్కరించును. అట్టివాడు తన ఊర్పు నిట్టూర్పులపై భగవంతుని యొక్క యీ క్రీడావిహారము నందు చిత్తమును నిలిపి, పరిణతుడై అద్వైతశిఖరాగ్రమును జేరి బ్రహ్మాత్మ్యైక్యము ననుభవించును.

'సాధన చేయనివానికి ఏమియును లేదు'.



2. నేను పరమాత్మను, నేను పరిపూర్ణుడను! నేను బ్రహ్మమను బ్రహ్మము నేనే! అనుచు భగవంతుడు - భగవానుడే నాశరీరమునందాడుచున్నాడు.



3. నాత్వగింద్రియము (చర్మము)లో - కంటిలో - చెవిలో - ముక్కులో - నాల్కపై స్వామి క్రీడించుచున్నాడు! ప్రాణ పంచకమునకు ఆశ్రయమైన నాదేహములో 'బ్రహ్మైవాహం' అనుచున్నాడు! క్రీడించుచున్నాడు.



4. మనోబుద్ధ్యహంకార చిత్తాత్మకమైన నా అంతంకరణములోని నాల్గుభాగములయందును - భగవానుడు 'బ్రహ్మైవాహ' మ్మనుచు గంతులు వేయుచున్నాడు.



5. 'నేల - నీరు - నిప్పు -గాలి - ఆకసము' - అనెడు పంచ భూతముల సమ్మిశ్రమముగానున్న నాయీ పిండాండములో హరియొక్క క్రీడావిహారము నిరంతరముగా సాగుచున్నది.



6. పరమహంసలైన యోగీంద్రుల రూపమున (సదాశివులు గురువులు) లోకమున వివరించు స్వామి - బ్రహ్మ -విష్ణు - మహేశులకు మూలమైన దైవము - నాపిండాండమున క్రీడించు చున్నాడు.


🕉🌞🌏🌙🌟🚩

[17:21, 09/12/2020] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-6-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩


స్తోత్రం చ మంత్రమపి నారదతో౾థలబ్ద్వా

తోషాయ శేషవపుషో నమ తే తపస్యన్।

విద్యాధరాధిపతితాం స హి సప్తరాత్రే

లబ్ద్వా౾ప్యకుంఠమతిరన్వభజద్భవంతమ్।।


భావము:-


నారదుడు 'చిత్రకేతునికి'- నీ (నారాయణుని) స్తోత్రమును మరియు మంత్రమును ఉపదేశించెను. 'చిత్రకేతుడు' నిన్ను 'శేషుని' రూపమున అర్చించుచూ తపస్సాచరించెను. నీ అనుగ్రహముచే ఆ మంత్రప్రభావమున, ఏడుదినములలోనే 'చిత్రకేతునికి' - విద్యాధరాధిపతి పదవి సిద్ధించెను. అయిననూ భగవాన్! చిత్రకేతుడు ధృఢభక్తితో నిన్నే ఉపాసించుచుండెను.


వ్యాఖ్య:-


చిత్రకేతుడు, వసుదేవుని తమ్ముడైన దేవభాగుని పెద్దకొడుకు.ఇతను శూరసేనదేశానికి రాజు. చిత్రకేతుడు చాలా మంది భార్యలను వివాహమాడాడు. అంతమంది భార్యలను వివాహమాడిననూ ఎవరికీ సంతానం కలుగలేదు. దానితో చిత్రకేతుడు మనస్సులో దిగులు వెంటాడుతుండేది. 



ఒకరోజు అంగీరసుడను గొప్ప సాధువు అతని రాజభవనానికి వచ్చాడు.చిత్రకేతుడు పాదాలనుకడిగి స్వాగతించాడు.సంతానం కారణంగా సంతోషంగా లేడని తెలుసుకుంటాడు. అంగీరసుడు రాజు చిత్రకేతుడుతో పుత్రకామేష్టి యాగం చేయించి,యజ్ఞప్రసాదం అతని పట్టపురాణి కృతద్యుతిచేత తినిపిస్తాడు.దీని ఫలితంగా భార్య కృతద్యుతి ఒక కొడుకుకు జన్మనిచ్చింది.రాజుకు కొడుకు పుట్టిన తరువాత రాజు,రాజ భవనంలోని నివాసితులందరూ చాలా ఆనందంగా ఉంటారు.దీనితో కృతద్యుతి సహభార్యలకు అసూయ కలిగింది.తరువాత కొంతకాలానికి అసూయ చెందిన రాజు భార్యలు రాజు కుమారునికి విషప్రయోగం చేస్తారు.లేక లేక కలిగిన కుమారుడు మరణంతో చిత్రకేతుడు కలతచెందుతాడు.



చిత్రకేతుడు అధిక విలాపం నుండి ఉపశమనం పొందటానికి అంగీరస మహాముని, నారద మహర్షి ఒకరోజు జీవితం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి,తండ్రి, కొడుకు మధ్య సంబంధం వాస్తవం కాదని,ఇది కేవలం భ్రమ మాత్రమేనని,ఈ సంబంధం ఇంతకుముందు ఎప్పడూ ఉనికిలో లేదని,భవిష్యత్తులో కూడా ఉండదని, తాత్కాలిక సంబంధాల కోసం ఒకరు కోసం ఒకరు విలపించకూడదని,మొత్తం విశ్వ వ్యక్తీకరణ తాత్కాలికంఅని, అవాస్తవం కానప్పటికీ, ఇది వాస్తవం కాదని. భగవంతుని వ్యక్తిత్వం దిశ ద్వారా, భౌతిక ప్రపంచంలో సృష్టించబడిన ప్రతిదీ అశాశ్వతమైందని,ఒక తాత్కాలిక అమరిక ద్వారా, ఒక తండ్రికి ఒక బిడ్డ పుడతాడు, లేదా ఒక జీవన సంస్థ అని పిలవబడే తండ్రికి బిడ్డ అవుతాడని,ఈ తాత్కాలిక ఏర్పాటు దైవం చేత చేయబడిందని,తండ్రి లేదా కొడుకు ఎవ్వరూ స్వతంత్రంగా లేరని, ఈ వాస్తవాలు తెలుసుకుని చింతను విడనాడాలని బోధిస్తారు.అంగీరసుడు, నారద ఉద్బోధ ద్వారా చిత్రకేతుడు విచారం నుండి విముక్తి పొంది జ్ఞానవంతుడై దేహం వదలి దేవత్వం వహించి విద్యాధరాధిపతి అయి ఒకప్పుడు కైలాసానికి పోయి అచ్చట పార్వతితో కూడుకొని ఉన్న శివునిచూచి, జగత్కర్తలు అయిన మీరు కూడ ఇట్లు మిథునరూపంగా ఉందురా, అని పార్వతీదేవి వినునట్లు అంటాడు.అందులకు పార్వతి కోపించి అతనిని రాక్షసుడు అగునట్లు శపిస్తుంది.అంత అతడు వృత్రాసురుడుగా జన్మించి, ఇంద్రుని చేత చంపబడి మోక్షాన్ని పొందుతాడు. 


🕉🌞🌎🌙🌟🚩

-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - సాక్షియగు ఆత్మను కర్తయని తలంచువాడు అవివేకియని తెలుపుచున్నారు–


తత్త్రెవం సతి కర్తారం 

ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాత్

న స పశ్యతి దుర్మతిః


తాత్పర్యము:- కర్మవిషయమందు ఇట్లుండగా (పైన తెలిపిన అయిదున్ను కారణములై యుండగా) ఎవడు సంస్కరింపబడని బుద్ధిగలవాడగుటచే, నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో, అట్టి అవివేకి కర్మముయొక్కగాని, ఆత్మయొక్కగాని వాస్తవస్వరూపమును ఎఱుంగకున్నాడు.


వ్యాఖ్య: - కర్మయందు ఆత్మ కర్తకాదు,  పైనదెల్పిన అయిదుమాత్రమే కర్తలు. ఆత్మసాక్షి, కేవలుడు, నిరుపాధికుడు, సంగరహితుడు. కర్తృత్వమును ఆత్మయందారోపించువాడు వివేకహీనుడేయగును. ఆతడు పరమార్థతత్త్వమును తెలియనివాడు; శ్రవణాది సంస్కారములేని బుద్ధిగలవాడు - దుర్మతి.



అసంగమగు ఆత్మను కర్తగ జూచువాడు నేత్రములున్నను గ్రుడ్డివాడేయగును. ఏలయనిన అతడు సత్యమును గాంచుటలేదు. ఆత్మకు కర్తృత్వమును ఆరోపించుట అజ్ఞానమేయగును. కావుననే అట్టివారు గ్రుడ్డివారే యని చెప్పబడినది.



దీనికి కారణము వారిబుద్ధికి సరియైన సంస్కారము లేకుండుటయే(అకృతబుద్ధిత్వాత్). ఎంత పాండిత్యము, ఎన్ని లౌకికవిద్యలు గలిగియున్నప్పటికిని  సత్యదృష్టిలేనిచో, ఆత్మజ్ఞానములేనిచో అట్టివారు అంధప్రాయులే యగుదురు. ఏలయనిన వారు జ్ఞాననేత్రవిహీనులై యున్నారు. వారెంత గొప్పవారైనప్పటికిని చీకటిలోనున్నవారి చందముననే యుండుచు వాస్తవమును గ్రహించజాలకయుందురు.



కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకమున్నను  ఆత్మజ్ఞానము లేనివారు దుర్మతులు, అంధులే కనుక, ప్రపంచదృష్టిలో కీర్తిప్రతిష్టలు సంపాదించుకొనినప్పటికిని పరమార్థదృష్టిలో వారు గణనీయులుకారు. కనుక, జనులు ఆత్మతత్త్వమెరింగి మానవులకేకాక, భగవంతునకుగూడ ప్రీతిపాత్రులు కావలయును.



దోషము - అసంగమగు ఆత్మను కర్తగ భావించుట. 

దోషకారణము - బుద్ధి శ్రవణాదులచే సంస్కరింపబడకుండుట.

దోషఫలితము - అజ్ఞానరూప అంధత్వము (సత్యమును జూడజాలకుండుట).



ప్రశ్న:- ఆత్మ ఎట్టిది?


ఉత్తరము: - కేవలమై, సాక్షియై, అసంగమైయున్నది.



ప్రశ్న:- అట్టి నిష్క్రియ అసంగఆత్మను కర్తయని మనుజు డేల చెప్పుచున్నాడు?


ఉత్తరము: - అజ్ఞానమువలన, బుద్ధికి ఇంకను శ్రవణాది సంస్కారము లేనందువలన.



ప్రశ్న:- కాబట్టి ఆతని స్థితి ఎట్లున్నది?


ఉత్తరము: - గ్రుడ్డివానివలె నున్నది. సత్యము నతడు కాంచుటలేదు.


🕉🌞🌎🌙🌟🚩

[02:37, 10/12/2020] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ  అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

[02:43, 10/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


175వ నామ మంత్రము


ఓం భవనాశిన్యై నమః


భవబంధముల (పుట్టుక, చావు మరల పుట్టుక వంటి జనన మరణచక్రభ్రమణము) నుండి తప్పించు  పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి భవనాశినీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం భవనాశిన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాపరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణించి సంసారక్లేశముల నుండి కాపాడి, శాశ్వతమైన పునర్జన్మరహిత మోక్షమునకు కావలసిన సాధనాపటిమను కలుగజేయును.


 పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్|


ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే॥


మళ్ళీ మళ్ళీ పుట్టడం, మరణించడం మళ్ళీ అదే...ఈ జనన మరణ చక్రభ్రమణం భౌతిక జీవులకు పరిపాటి. ఈ సంసారక్లేశమునుండి కాపాడమని  ఈ భౌతిక జీవులు ఆ పరమాత్మను వేడుకుంటాయి.


పుట్టాలంటే తల్లిగర్భంలో ఉండడం అంటే చిన్న విషయం కాదు. మలమూత్రాలమధ్య, ఆకలిబాధతో, క్రిములు కరుస్తుంటే, తలక్రిందులుగా ప్రాణాలు పిడికిట్లో పెట్టుకుని ఉండే గర్భవాసం ఒక మహానరకం.    అంధకారమైన గర్భంలో   ఈ ప్రక్కనుండి ఆ ప్రక్కకు తిరగడానికి కష్టమయేస్థితిలో శిశువుపడే బాధ వర్ణనాతీతం.  నరకంలో కోట్లాది సంవత్సరాలు ఉండవచ్చు, కాని గర్భవాసంలో జీవుడు నవమాసాలు పడేబాధ మహా దుర్భరం. 


బాల్యయౌవనకౌమారవృద్ధాప్యావస్థలను అనుభవించి, అవసానదశలో ఎన్ని కష్టాలు పడాలి?   రోగములు చుట్టుముట్టగా, కఫము, వాతము, పైత్యముల బాధతో, నోటినుండి మాటరాక, తనవాళ్ళు, తన ఆస్తులు వీటిపై మమకారము పీడిస్తుంటే ఆ దుర్భరపరిస్థితి వర్ణనాతీతం.


ఇటువంటి జనన మరణ చక్రభ్రమణమనే బాధలనుండి జగన్మాత కాపాడుతుంది.


గంగానది ఒక జీవనది. పవిత్రమైన నది. గంగానదీ స్నానం సర్వపాపాలకు పరిహారం. ఆ నదీ పవిత్రస్నానంతో పాపాలన్నీ నశిస్తాయి. జగన్మాత గంగానదీ స్వరూపురాలు గనుక భవనాశినీ యను నామముతో స్తుతింపబడుచున్నది. 


శక్తిరహస్యం అనే గ్రంథంలో ఇలా చెప్పబడినది.


నవమ్యాం శుక్లపక్షే తు విధివత్ చండికాం నృప|


ఘృతేన స్నపయే ద్యస్తు తస్య పుణ్యఫలం శృణు॥


దశ పూర్వాన్ దశ పరా నాత్మానం చ విశేషతః|


భవార్ణవా త్సముద్ధృత్య దుర్గా లోకే మహీయతే॥ (సౌభాగ్యభాస్కరం, 364వ పుట)


శుక్లపక్షంలో నవమి తిథినాడు చండికను ఆవు నేతిలో స్నానం చేయించు సాధకులను అటు పదితరములు,ఇటు పదితరములు వరకూ సంసారసాగరమునుండి ఆ పరమేశ్వరి రక్షించును.


కూర్మపురాణంలో ఇలాగలదు:-


సైషా ధాత్రీ విధాత్రీ చ పరమానన్ద మిచ్ఛతామ్|


సంసారతాపా న్నిఖిలా న్నిహంతీశ్వర సంజ్ఞయే॥ (సౌభాగ్య భాస్కరం, 364వ పుట)


తనను పూజించువారికి, పరమానందమును కోరువారికి ఆ తల్లి  సంసారతాపములను నశింపజేయును.


దేవీ భాగవతంలో శ్రీమాత ఇలా చెప్పినది.


అహం వై మత్సరాన్ భక్తా నైశ్వర్యం యోగమాశ్రితాన్|


సంసారసాగరా త్తస్మా దుద్ధరా మ్యచిరేణతు॥


నా యందు ఆసక్తి గలవారై పరమేశ్వరుని యోగము నాశ్రయించిన భక్తులను సంసారార్ణవము నుండి శీఘ్రముగా ఉద్ధరింతును


జగన్మాత భవనాశిని. గనుక ఆ పరమేశ్వరిని నిశ్చలచిత్తముతో ధ్యానించినచో తప్పక భవబంధవిముక్తి కలిగించును.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భవనాశిన్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

. శ్రీమద్భగవద్గీత - 574  / Bhagavad-Gita - 574 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 18 🌴


18. సత్కారమానపూజార్థం తపో దమ్భేన చైవ యత్ |

క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధృవమ్ ||


🌷. తాత్పర్యం : 

గౌరవము, సన్న్యాసము, పూజలనందు కొరకు గర్వముచే ఒనర్చబడు తపస్సు రజోగుణ ప్రధానమైనది చెప్పబడును. అది స్థిరముగాని, శాశ్వతముగాని కాజాలదు


🌷. భాష్యము  :

జనులను ఆకర్షించుటకు మరియు ఇతరుల నుండి గౌరవము, సన్న్యాసము, పూజలనందుటకు కొన్నిమార్లు తపోనిష్టలు ఆచరింపబడుచుండును. రజోగుణము నందున్నవారు తమ అనుయాయులు తమను పూజించునట్లుగాను కాళ్ళుకడిగి దక్షిణలు అర్పించునట్లుగాను చేయుచుందురు. 


తపో ప్రదర్శనల ద్వారా ఏర్పాటు చేయబడెడి అట్టి కృత్రిమమైన ఏర్పాట్లు రజోగుణమునందున్నట్టివే. వాస్తవమునకు వాటి ఫలితములు తాత్కాలికములు. అవి కొంతకాలము సాగినను ఎన్నడును శాశ్వతములు కాజాలవు.

🌹 🌹 🌹 🌹 🌹


🌻159. సర్గః, सर्गः, Sargaḥ🌻


ఓం సర్గాయ నమః | ॐ सर्गाय नमः | OM Sargāya namaḥ


సృజ్యతే ఇతి సృజింపబడును. సృజింపబడు ప్రపంచంతయు తన రూపమే కావున 'సర్గః' అనగా సృష్టి. అట్టి సర్గమునకు అనగా సృష్టికి హేతు భూతుడు కావున 'సర్గః' అనబడును. సృజించు కాలము సమీపించగా సంగ్రహించిన సమస్తమునూ మరల విష్ణు దేవుని సంకల్పమే సృజించును.


:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::

తే.  మహదహంకార పంచతన్మాత్ర గగన, పవన శిఖి తోయ భూ భూతపంచ కేంద్రి

      య ప్రపంచంబు భగవంతునందు నగుట, "సర్గ" మందురు దీనిని జనవరేణ్య!


రాజా! మహతత్త్వం, అహంకారం, శబ్దస్పర్శరూప రసగంధాలనే ఐదు తన్మాత్రలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు - ఇవి అన్నీ భగవంతునిలో కన్పించడమే "సర్గ"మంటారు.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

[06:12, 10/12/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 127 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ


🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 57 🌻


ఈషణ త్రయాన్ని త్యజించాలనే టటువంటి గొప్ప సందేశాన్ని ఇందులో ఇస్తున్నారు. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ - అనేటటువంటి ఈషణ త్రయాన్ని జయించాలి మానవుడు. సదా మనస్సు ఎప్పుడూ కూడా ఈ ఈషణ త్రయాలచేత ప్రేరేపించబడుతూ ఉంటుంది. 


మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? మా ఆవిడ ఏం చేస్తుందో, మా ఆయన ఏం చేస్తున్నాడో, మా ధనం అంతా ఏమైపోయిందో, నా ఇల్లు ఏమైపోయిందో, నా వస్తువులు ఏమైపోయినాయో, నా ఉద్యోగం ఏమైపోయిందో, నా సమస్యలు ఏమైపోయందో, నా వారంతా ఏమైపోయారో, నా బంధువులు ఏమైపోయారో, నా అనేటటువంటి వారంతా ఏం చేస్తున్నారో, నా స్నేహితులు ఏమైపోయారో, ఈ రకముగా రక్త సంబంధము ఉన్నవారు, రక్త సంబంధము లేని వారు, మనః సంబంధీకులు, ప్రాణ సంబంధీకులు, శరీర సంబంధీకులు. 


ఈ రకంగా అనేక రకాల సంబంధాలతో తాదాత్మ్యత చెంది, ముడిపడి, పాత్రోచితమైనటువంటి మగ్నత చెంది, ఆయా పాత్రలే సత్యమనుకొని, ఆయా పాత్రల యొక్క వ్యవహారమే సత్యమనుకొని, ఆయా ఇంద్రియ వ్యవహారమే సత్యమనుకొని, వారి వారి యందు చరించుట చేత ఏర్పడేటటువంటి సౌఖ్యమునే సత్యముగా భావించి, అశాశ్వతమైన పద్ధతిగా జీవించేటటువంటి జీవభావంతో మానవులు జరామరణ చక్రంలోకి లాగబడుతున్నారు.


   ఈ భోగము... భోగము అంటే సుఖదుఃఖముల రెండింటి యొక్క అనుభవము భోగమే. కాబట్టి, ఆ యా సుఖదుఃఖ ద్వంద్వానుభూతి యందు సుఖం లేకపోతే దుఃఖానికి విలువ లేదు, దుఃఖం లేకపోతే సుఖానికి విలువలేదు. కాబట్టి, ఆ యా సంవేదనలు మనఃపూర్వక సంవేదనలు ఇవి. అటువంటి సంవేదనల యందు మనస్సును లగ్నం చేసి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటటువంటి దాహము కలిగించేటటువంటి ఈషణత్రయం. 


దాహము బాగా పెరిగితే వాటి యందు చింత కలుగుతుంది. ఎంతగా దాహం పెరిగితే, ఇంకా అనుభవించాలనే టటువంటి భావన బలంగా బలపడిపోయి, ఆక్రమించుకునేటటువంటి అంతర్యామిత్వం, అంతరంగ లక్షణాన్ని కలిగినటువంటి వారందరూ, ఆయా అనుభూతుల యందు ఇంకా ప్రపంచాన్ని అలా చూడాలి, ఇంకా ప్రపంచాన్ని ఇలా చూడాలి, ఇంకా అనేక సంబంధాలని ఇలా అనుభవించాలి, ఇంకా అనేక మందిని దర్శించాలి, ఇంకా అనేకమందితో బాంధవ్యాన్ని పెంచుకోవాలి, అనంతంగా విశ్వవ్యాపకంగా 750 కోట్ల మంది మానవులలో నేను గొప్పవాడిని, నేను ప్రతిభాశీలిని అనేటటువంటి గుర్తింపును పొందాలి. 


ఈ రకంగా ప్రతి ఒక్క చోట, ఆ యా అభిమానమును బలపరిచేటటువంటి శరీరాభిమానమును, దేహాభిమానమును బలపరచుకుని ప్రత్యగాత్మకు దూరంగా, స్వాత్మస్థితికి దూరంగా చరించేటటువంటి లక్షణమే బంధము. ఎవరైతే స్వాత్మ నిగ్రహం, స్వాత్మ అనుగ్రహం, స్వాత్మ సాక్షాత్కారం, స్వాత్మానుభూతి, ఆత్మనిష్ఠ దీనిని సాధించినటువంటి వారు ఉంటారో, వారందరూ వివేకులు.

 

        ఎవరైతే నాశరహితమైనటువంటి, పరిణామ రహితమైనటువంటి, శాశ్వతమైనటువంటి, మోక్షదాయక మైనటువంటి, జనన మరణ మృత్యురూప సంసారము నుంచి బయట పడవేయ గలిగినటువంటి ఈ ఆత్మదర్శనాన్ని, ఈ ఆత్మోపదేశాన్ని, ఈ ఆత్మవిచారణని, ఈ ఆత్మభావాన్ని, ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని, ఈ ఆత్మానుభూతిని, ఈ ఆత్మనిష్ఠని ఆశ్రయిస్తారో, వారు శాశ్వతమైనటువంటి, ధృవమైనటువంటి, తరగుట, పెరగుట లేనటువంటి, పరిణామ రహితమైనటువంటి, ద్వంద్వానుభూతికి అవకాశమే లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. 


ఎప్పుడైతే నీకంటే అన్యము తోచిందో, ఆ అన్యమైనటువంటి వారు ధనము చేతగానీ, ధారేషణ అంటే భార్య, బిడ్డల చేతగానీ, పుత్రేషణ చేతగానీ, ఈషణాత్రయము చేత సంబంధపడుతున్నటువంటివారై ఉంటారు. 


కాబట్టి, ఆ ఈషణాత్రయ సంబంధము నందు మనోవ్యాపారమును లగ్నము చేయుట అవివేకము, అజ్ఞానము, అవిద్య, అధ్వాన్నము. కాబట్టి, అటువంటి సంగత్యాగాన్ని చేయవలసినదిగా కోరుతున్నారు. సర్వసాక్షిత్వాన్ని ఆశ్రయించవలసినదిగా చెబుతున్నారు. ఉపదేశిస్తున్నారు. 


అటువంటి సర్వాధారమైనటువంటి, సర్వసాక్షి అయినటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి ఆత్మ స్వరూపాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, వాళ్ళు వివేకం పొందినటువంటి వారు. - విద్యా సాగర్ గారు 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[06:12, 10/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 292🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

70. అధ్యాయము - 25


🌻. సతీ వియోగము  - 4 🌻


ఆకాశవాణి ఇట్లు పలికెను-


ఓ పరమేశ్వరా! నీవు ధన్యుడవు. నీతో సమముగా శపథమును నెరవేర్చుకోగల మహాయోగి, మహాప్రభువు ఈ ముల్లోకములలో మరియొకడు లేడు (54).


బ్రహ్మ ఇట్లు పలికెను-


ఈ ఆకాశవాణిని వినగానే సతీదేవి కాంతిని కోల్పోయి శివుని ఇట్లు ప్రశించెను. నాథా !నీవుచేసిన శపథమేమి? నాకు చెప్పుడు(55) హితమును చేయు ఆ శివ ప్రభుడు, సతీదేవి ఇట్లు ప్రశ్నించిననూ, తాను వివాహములో పూర్వము విష్ణువు యెదుట చేసిన శపథమును వెల్లడించలేదు(56). అపుడు సతి ప్రాణ ప్రియుడు, తన భర్తయగు శివనిధ్యానించెను. ఓ మహర్షీ !తన ప్రియుడు తనను త్యజించుటకు గల కారణము ఆమెకు సమగ్రముగా అవగతమయ్యెను(57). 


అపుడు ఆ దాక్షాయణి శంభుడు తనను వీడుట లెరింగి, అనవరతము నిట్టూర్పులు విడుచుచూ, మిక్కిలి దుఃఖించెను(58). శివునకు ఆమె మనోగతము అవగతమయ్యెను. ఆ ప్రభుడు ఇతరములగు అనేక గాథలను ప్రస్తావించి తన సత్యశపథమును ప్రస్తావించకుండా గుప్తముగ నుంచెను(59).


ఆయన సతితోగూడి వివిధ వృత్తాంతములను చెప్పుచూ, కైలాసమును చేరుకొనెను. ఆ శివయోగి శ్రేష్ఠమగు ఆసనమునందు గూర్చుండి సమాధిని పొంది ఆత్మాను సంధానమును జేసెను. (60) ఆ కైలాస దామమునందు సతీదేవి మహా దుఃకముతో కూడిన మనస్సుతో నుండెను, (61)


ఓ మహర్షీ !లోకలీలను అనుసరించు నట్టియు, స్వేచ్ఛచే స్వీకరింపబడిన దేహము గల్గినట్టుయు, సర్వసమర్థులైన ఆ సతీ శివులు ఇట్లు చిరకాలమును గడిపిరి(62). అపుడు భక్తుల మహా దుఃఖములనైననూ తొలగించు ఆ శివుడు ధ్యానమును వీడెను. ఆ విషయమును నెరింగి జగన్మాతయగు ఆ సతి అచటకు విచ్చేసెను(63).


దుఃఖముతో నిండిన హృదయముతో ఆ దేవి శివునకు నమస్కరించెను. విశాల హృదయుడగు శంభుడు తన ఎదురుగా ఆమెకు ఆసనము నిచ్చెను(64). ఆయన ఆమెకు మిక్కిలి ప్రీతితో మనోహరములగు అనేక గాథలను చెప్పెను. ఆప్రభుడు అట్టి లీలను ప్రదర్శించి, వెను వెంటనే ఆమె దుఃఖమును తొలగించి వేసెను.(65). ఆమె పూర్వమునందు వలనే ఆనందించెను. ఆయన తన శపథమును వీడలేదు.


వత్సా!పరమేశ్వరుడగు శివుని విషయములో ఆశ్చర్యమనునది లేదని యెరుంగవలెను(66).


ఓ మహర్షీ మహర్షులు శివాశివుల గాథను ఇట్లు వర్ణించిరి. కొందరు విద్వాంసులు కానివారు వారికి వియోగమును వర్ణించిరి. కాని, వారికి వియోగమెట్లు సంభవమగును (67) శివాశివుల చరిత్రను యథార్థముగా ఎవ్వరు యెరుంగ గలరు? వారిద్దరు తమ ఇచ్ఛచే క్రీడించి, చరిత్రను సృష్టించుచుందురు గదా !(68) సతీ శివులు శబ్దార్థముల వలె నిత్యము కలిసియుందురు గదా! వారికి అట్టి ఇచ్ఛ కలిగిన పక్షములో మాత్రమే వారిద్దరికీ వియోగము సంభవమగును(69).


శ్రీ శివమహాపురాణములో రెండవదియగు సతీ ఖండములో సతీ వియోగమనే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది(25)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[06:12, 10/12/2020] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్  అభంగాలు - నామసుధ  - 1 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య

సేకరణ. ప్రసాద్ భరద్వాజ


🍀. అభంగ్ - 1 🍀


దేవాచియే ద్వారీ ఉభా క్షణభరీ !

తేణే ముక్తి చారీ సాధియేల్యా!!

హరిముఖీమణా హరి ముఖే మణా !

పుణ్యాచీ గణనా కోణ్ కరీ!!

అసోని సంసారీ జిఎవేగు కరీ!

వేదశాస్త్రి ఉభారీ బాహ్యా సదా!!

జ్ఞానదేవ మణే వ్యాసాచియే ఖుణే!

ద్వారకేచే రాణే పాండవా ఘరీ!!


భావము :

దేవుని ద్వారమున క్షణ కాలము నిలబడిన వారికి నాలుగు విధములైన ముక్తులు సాధ్యము కాగలవు. హరి అని నోటితో పలుకుము. 


హరి హరి అని పలికిన వారికి లభించిన పుణ్యము లెక్కించుట ఎవ్వరి తరము కాదు. సంసారములోనే ఉండి హరి ప్రాప్తికై మనసును త్వర పర్చవలెనని వేద శాస్త్రాలన్ని సదా చేతులెత్తి ఘోషిస్తున్నాయి. ఇది వ్యాసుడు తెలిపిన గుర్తు (మర్మము). కావున ద్వారకకు రాజు అయిన శ్రీ కృష్ణుడు పాండవుల ఇంటిలో ఉండిరని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.


🌻. నామ సుధ -1 🌻


దేవుని ద్వారము శాంతికి నిలయము

నిలచిన అక్కడ ఒక క్షణ కాలము

నాలుగు ముక్తులు వారికి సాధ్యము

హరి నామములో మహిమ అనంతము

హరియని నోటితో గానము చేయుము

హరిహరియని నోటితో గానము చేయుము. 


అగణిత పుణ్యము అయ్యేను ప్రాప్తము

లెక్కించడము ఎవ్వరితరము

సంసారములో సాగు చుండుము

హరి ప్రాప్తికై వేగిరపడుము. 


వేద శాస్త్రముల ఘోషను వినుము

నిలబడి చేతులెత్తినవి కనుగొనుము

జ్ఞాన దేవుని వచనము వినుము

వ్యాసుడు తెలిపిన మర్మము కనుము

ద్వారక రాజు వచ్చిరి చూడుము

పాండవులింటిలో ఉండిరి స్థిరము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[06:12, 10/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 139, 140 / Sri Lalitha Chaitanya Vijnanam  - 139 , 140 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖


🌻139. 'నిర్గుణా 🌻


గుణములు లేనిది గావున శ్రీదేవి నిర్గుణ అని అర్థము.


గుణములకు పుట్టిల్లు శ్రీలలిత. ఆమె నుండియే ఇచ్ఛా జ్ఞాన క్రియలు, సత్వము, రజస్సు, తమస్సు, సృష్టి స్థితి లయములు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించును. ఆమె వానియందున్నప్పటికీ, వానికి అతీతముగా నుండును. అందువలన ఆమె గుణములను గుర్తించుట అసాధ్యము. ఏ గుణములు, ఏ లక్షణములు లేక కేవలము శుద్ధ చైతన్య స్వరూపిణిగా ఆమె ప్రకాశించుచుండును. ఆమెకు ఆమెయే సాటి.


హిమవంతుడు ఉమను గూర్చి నారదుని ప్రశ్నించెనట! ఆమె గుణములను, లక్షణములను తెలియజెప్పుమని మహర్షిని వేడుకొనెనట. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను. “కోటాను కోట్ల దేవతలు కలరు. వారినందరిని వారి వారి లక్షణములతో గుర్తింపగలను.


వారికి దేహములుండవుకదా! అందువలన వారి లక్షణములను బట్టి వారిని గుర్తింతును. అట్లే శరీరముతో కూడిన జీవులందరిని వారి వారి గుణములచే గుర్తింతును. కాని నీ పుత్రికగ జనించిన ఈ కుమారిని గుర్తించుట నలవికాదు. ఈమెకు లక్షణములు లేవు. గుణములు లేవు. ఈమె నిర్గుణ, సాక్షాత్తూ పరమశివుని వంటిది.” 


పై తెలిపిన విధముగా శ్రీలలితకు నిర్గుణ నామము సార్థకమైనది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 140  / Sri Lalitha Chaitanya Vijnanam  - 140 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖


🌻140. 'నిష్కళా' 🌻


శ్రీదేవి కళలకు అతీతురాలు అని అర్థము.


నిర్గుణము, నిరాకారము యగు శ్రీలలిత యందు కళలు కూడా గోచరించవు. ఏకళ లేని ఆమెనుండి పుట్టిన గుణములనుండి సమస్త కళలు పుట్టుచున్నవి. ఆమెయందు అన్నియు వున్నను ఏమీలేనట్లు గోచరించును. రాత్రి యందలి ఆకాశమువలె నుండు ఆమె పగటి ఆకాశమువలె గుణములను ఆశ్రయించి అనేక వెలుగులను ఆవిష్కరించును. 


గుణములను ఆశ్రయించిన దైవము నారాధించుట ఒక మతము. ఏ గుణమూ లేక, ఏ కళా లేక, ఏ ఆకారమూ లేక, ఏ ఆధారమూ లేని తత్త్వము నారాధించుట మరియొక మతము. వీరు దైవమును నామరూపముల యందు గాని, గుణముల యందు గాని, లక్షణములయందు గాని వున్నట్లు భావింపరు. వారి దృష్టి యందు ధ్యాన మనగా నిష్కళ చింతయే. దీనిని భక్తికి పరాకాష్ఠగ భావింతురు. 


కాని శ్రీకృష్ణుడు ఇట్టి నిరాకార నిర్గుణ తత్త్వమును భావించుట సామాన్యులకు సౌకర్యము కాదని, దుఃఖము కలిగించునని సర్వమంగళమగు రూపము నొకదానిని, విశేష గుణములతో కూడిన దానిని భావించుట వలన అనురక్తి, ఆసక్తి, భక్తి ఇనుమడించునని తద్వారా బ్రహ్మైక్యము పొందవచ్చునని తెలిపినాడు. 


శ్రీదేవిని మహత్తరమగు గుణములతో ఆరాధించుటకే కదా సహస్ర నామములు. నిర్గుణ ఆరాధనమునకు నామావళితో పనియే లేదు. గుణాతీత స్థితిని పొందిన శంకరులు సైతము శ్రీలలితను, పరమ శివుని అనేక గుణ వర్ణనములతో స్తోత్రము గావించిరి. దీనివలన తెలియునదేమనగా తత్త్వము - వ్యక్తము, అవ్యక్తము కూడ అయివున్నదని, వ్యక్తమైనది మాత్రమే దైవమని భావింపక, అవ్యక్తము అతీతమై కూడా వున్నదని తెలియుట.


సశేషం...

మన బాధలను శాశ్వతంగా తొలగింపగలిగినది తత్వజ్ఞానం ఒక్కటే. ఇతరమైన ఎలాంటి జ్ఞానమైనా మన అవసరాలను కొంతకాలం వరకు మాత్రమే తీర్చగలదు. తత్వజ్ఞానం ఒక్కటే మానవుడి లోటుపాటులను శాశ్వతంగా నిర్మూలిస్తుంది.


మనకు కావలసింది శ్రద్ధ... మనిషికి మనిషికీ మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే గాని వేరేమీ కాదు. ఒక మనిషిని గొప్పవాడిగాను, ఇంకొకరిని బలహీనుడిగాను, అధముడిగాను చేసేది శ్రధ్ధే (అంటే శ్రద్ధలో వ్యత్యాసమే) కాబట్టి ఈ శ్రద్ధ మీలో ప్రవేశించాలి.


🕉🌞🌎🌙🌟🚩

[06:58, 10/12/2020] +91 92915 82862: 🧘‍♂️జ్ఞానం అంటే ఏమిటి?🧘‍♀️

🕉🌞🌏🌙🌟🚩


జ్ఞానం అంటే చాల మందికి గుర్తు వచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. దీనినే చాల మంది వేరే వారిని అవహేలనగా కూడ, తమాషాగా కూడ మాట్లాడు కుంటారు.



అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుద్ధునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది?

 


సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు.



కాని తెలివితేటలూ జ్ఞానం కాదు.



మరి జ్ఞానం అంటే ఏమిటి?



 భగవద్గీతలో శ్రీ కృష్ణుడు మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది.



 కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం..



మన సనాతన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం.



 జ్ఞానం అంటే తెలుసుకోవడం.



 జ్ఞానాన్ని దేని ద్వారా తెలుసు కోవాలి అంటే...



 ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన  చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.



సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు.



ఆ జ్ఞానం అంటే ఏమిటి ?



 నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం.



 అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు? “దేవుడు” ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.



జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం.

 


దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే.

 


భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాశ్వతుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రకృతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.



అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.



మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసు కోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు.



మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసు కోవడమే జ్ఞానం.



 ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వ భయాల నుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం.



 ఇలా స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి.



శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు.



1. ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగి యుండుట జ్ఞానమార్గములనియు ఇవి కాక ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును.



2. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మము ఎత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకార రూపమైన పరమాత్మను) శరణము నొందు చున్నాడు.



3. అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలే ప్రకాశించి పరమార్ధ తత్వము జూపును.



4. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్చబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.



5. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి.



6. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావి చేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది.


🕉🌞🌏🌙🌟🚩

[07:06, 10/12/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (736)

🕉🌞🌎🌙🌟🚩


"నిద్రలో ఉన్న శాంతి, మెలకువలోని శాంతికి సారూప్యత ఏమిటి ? శాంతిగా ఉన్నట్లు కొలమానం ఏమిటి !?"


సామాన్యులలో నెలకొన్న శాంతి వారి మనసును ఆనందవనం చేస్తుంది. ఆనందం అంటే కష్టాలులేని స్థితి కాదు. ఉన్న కష్టం తెలియకుండా ఉండే స్థితి ! నిద్ర ఎలాగైతే సమస్త దుఃఖాలను, రోగాలను, కష్టాలనూ తెలియకుండా చేస్తుందో శాంతి కూడా అంతే. నిరహంకారమైన మనసు దేనిలోనూ తన ప్రమేయం లేదని తెలుసుకుంటుంది. నేనే కర్తను అనే భావం పోయిన మరుక్షణం అక్కడ ఉండేది శాంతే. మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవటం ద్వారా ఇది సాధ్యమవుతుంది. నైతిక విలువలతో కూడిన మంచి ప్రవర్తనే మంచి వ్యక్తిత్వానికి కొలమానం. కాబట్టి మనం ఎంత శాంతిగా ఉన్నామనటానికి కొలమానం మనం ఆచరించే నైతిక విలువలే !


{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

"దైవదర్శనం.. దుఃఖనాశనం.. శాంతితోనే సాధ్యం !''- (అధ్యాయం -90)


🕉🌞🌎🌙🌟🚩

[07:06, 10/12/2020] +91 92915 82862: "ఋభుగీత " (202)

🕉🌞🌎🌙🌟🚩


ఋభు నిధాఘ సంవాదము"

15వ అధ్యాయము 


ఈ జగత్తులో ఆత్మే పరమానందాన్ని ఇస్తుంది !


తాను బ్రహ్మమని, సర్వాంతర్యామియైన పరబ్రహ్మమని అర్థమైనప్పుడు ఇక ఆనందమే ఉంటుంది. ఆత్మ అంటే నిత్యశుద్దాత్మ. మనం మనసును, జీవనాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకుంటే అదే ఆత్మ స్వభావం కనుక మనకి బ్రహ్మీభావానికి చేరుస్తుంది. సత్యం అర్థమైన తర్వాత దేన్నీ కాంక్షించడం, విస్మరించడం ఉండదు. అది నిత్యసుఖంగా భాసిల్లుతుంది. ఈ జగత్తులో కూడా ఆత్మే పరమానందాన్ని ఇస్తుంది. ఈ జీవరూపాత్మ పూజలందుకునే ఈశ్వర విగ్రహము అన్నీ అందులో భాగాలేనని తెలిస్తే వాటి అవసరంగానీ, వాటిపై వ్యతిరేకత గానీ రెండూ ఉండవు !


🕉🌞🌎🌙🌟🚩

[07:18, 10/12/2020] +91 92915 82862: 🌷94-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩


అధ్యాయము-8

🥀దారులు-మెట్లు🥀


* 3. ఇట్లు తనను తాను పుట్టించుకొనుటకు ఒక క్రమము లేక ప్రణాళిక ఉండవలెను. ఈ ప్రణాళికను అనుసరించి ఒకే విధమున నిరంతరము జీవులు, దేహములు, పంచభూతములు, మనో బుద్ధి అహంకారాదులు, స్త్రీ పురుష విభేదము, భార్యాభర్తలు, సంతానోత్పత్తి క్రమాదులు కలుగుచున్నవి. ఈ క్రమమంతయు మారక ఒకే విధమున జరుగును. ఇట్లు జరుగుటయే కర్మము అనబడును. కనుక జీవులుద్భవించు మారిన ప్రయత్నమే కర్మము.*



*4. అధి భూతమనగా పదార్ధములలో ఉన్న మార్పు లక్షణము. నిరంతరము ఒక ద్రవ్యము ఇంకొకటిగ మారుచుండును. ఈ మార్పుతోనే శరీరాదులు తయారై పెరిగి మరల నశించుచున్నవి. 

ఇట్లు నశించు స్థితులలో ఇమిడియున్న నశింపని బ్రహ్మమే పురుషుడు అనబడును. అదియే అధి దైవతము. ప్రతి దేహమునందును 'నేను' అను ప్రజ్ఞ యుండును. అదియే అధి యజ్ఞము.*



5. ఈ దేహమున ఏ స్థితి అంతమగుచున్న కాలమునను ఈ నన్ను స్మరించుచునే యుండవచ్చును. అట్లు దేహములను విడువ వచ్చును. అప్పుడతడు మార్పును దాటి నేను అను స్థితిని పొందుచున్నాడు.



6. శరీరమును విడచునపుడు జీవుడు దేనిని స్మరించునో  దానినే పొందును. ఆహారాదుల అభిలాషతో దేహము విడిచినచో మరల ఆహారాపేక్ష ప్రధానముగా కలిగి పుట్టును. ధనము స్మరించినచో ధనకాంక్ష యగును. నిద్రకు ముందు దేనిని స్మరించునో మరల మేల్కాంచి దానియందే ప్రవర్తించును. పనులు చేయుచు నిదురించిన వాడు మరల ఆ పనిని పూర్తి చేయును.



7. నన్ను స్మరించుచు శరీరము విడిచినవాడు శరీరేంద్రియ మనో బుద్ధి అహంకారాది స్థితులలో దేనియందు కట్టుబడక 'నా' యందుండును. అనగా జనన మరణాతీతుడు. ఇదియే శాశ్వతస్థితి. నీవు నీ మనోబుద్ధి తత్వములను నాయందు అర్పించి సర్వకాలముల యందును నన్నే స్మరింపుము. యుద్ధము చేయుచు కూడా నన్నే స్మరింపుము.


🕉🌞🌎🌙🌟🚩

[07:19, 10/12/2020] +91 92915 82862: 107) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


కూటస్థో బ్రహ్మ జీవేశావిత్యేవం చిచ్చతుర్విధా ౹ ఘటాకాశమహాకాశౌ జలాకాశభ్రఖే యథా ౹౹18౹౹


18.  ఘటము నందలి ఆకాశము, అనంతమగు మహాకాశము, జలము నందలి ఆకాశము, మేఘమునందలి ఆకాశము అని ఆకాశము నాలుగు విధములుగ తోచునట్లే, పరమార్థమున ఒకటియేయైన చిదాత్మ వ్యవహార దశయందు కూటస్థము,బ్రహ్మము, జీవుడు,ఈశ్వరుడు అనే నాలుగు విధములుగ భాసించును.




ఘటావచ్ఛిన్నఖే నీరం యత్తత్ర ప్రతిబింబితః ౹ సాభ్ర నక్షత్ర ఆకాశో జలాకాశ ఉదీర్యతే ౹౹19౹౹


19. ఘటముచే సీమితమైన ఆకాశము నందలి నీటి యందు మేఘములు నక్షత్రములతో సహా ప్రతిఫలించిన ఆకాశమే జలాకాశమనబడుచున్నది.




మహాకాశస్య మధ్యే యన్మేఘమండల మీక్ష్యతే ౹ ప్రతిబింబతయా తత్ర మేఘాకాశో జలే స్థితః ౹౹20౹౹


20.  ఆకాశము నందలి మేఘములందు గల నీటి కణముల యందు ప్రతిఫలించిన ఆకాశము మేఘాకాశము.




మేఘాంశరూపముదకం తుషారాకార సంస్థితమ్ ౹

తత్ర ఖప్రతిబింబోఽ యం నీరత్వాదనుమీయతే ౹౹21౹౹


21.మేఘమనగా ఒకానొక అవస్థ యందున్న జలమే.మంచు ఆకారమున ఉండును.జలము నందు ప్రతిఫలించినట్లే మేఘావస్థ యందున్న జలమునందు కూడా ఆకాశము ప్రతిఫలించునని అనుమానముచే తెలియుచున్నాము.



కార్యకారణరూప ఉపాధులే జీవత్వ ఈశ్వరత్వ వ్యవహార ప్రయోజకములు.ఉపాధులు దొలగిన జీవుడు,ఈశ్వరుడు ఇద్దఱు లేరు.ఉన్నది పరబ్రహ్మ చైతన్యమొక్కటే.



ఈశ్వరుడనగా నియంత,పాలకుడు,సృష్టికర్త.

ఇలాంటి పదములు మాయను నియమించువాడు జగత్తును పాలించువాడు సృష్టించువాడు అనునప్పుడే సంభవించుచున్నవి.

అప్పుడే ఈశ్వరుని నామములు సార్థకము లగుచున్నవి.



కనుక మాయా మహదాదికారణోపాధులున్నప్పుడే ఈశ్వరాది వ్యవహారము సిద్ధించును.అందుచేతనే కారణమగు మాయోపాధిగలవాడు ఈశ్వరుడని శాస్త్రములు వచించుచున్నవి.



జీవుడనగా

 కించిత్ జ్ఞుడు,సుఖి,దుఃఖి ఇలాంటి పదములు మాయాకార్యమగు అవిద్యయున్నప్పుడు ప్రయుక్తములగుచున్నవి.కావున కార్యమగు అవిద్యోపాధికుడు జీవుడనీ వ్యవహారము సిద్ధించుచున్నది.



కనుక ఈ రెండు ఉపాధులును తొలగించిన ఈశ్వరుడు,జీవుడును లేరు.అదెటులన్న రాజ్యమను ఉపాధియున్నప్పుడు రాజు అని పిలవబడుచుండెను.కుగ్రామములో నున్నందువలన భటుడని వ్యవహరింపబడెను.రాజునకు రాజత్వము,భటునకు కుగ్రామత్వము పోయిన రాజభట వ్యవహారమే లేదు గదా!ఇద్దఱు సమానులే గదా.



ఈ జీవత్వ ఈశ్వరత్వములు రాజత్వభటత్వములవలె ఆగస్తుకములే.యథార్థముగా విచారించిన ఒకే పరబ్రహ్మ చైతన్యమే ద్వివిధముగా 

భ్రాన్తిచే నున్నది.



ఒకే సూర్యుడు మేఘాకాశ జలములో ప్రతిబింబించినప్పుడు మేఘాకాశ సూర్యుడుగాను, ఘటాకాశములలో ప్రతిబింబించినప్పుడు ఘటాకాశసూర్యుడు గాను నున్నాడు.



మేఘముగా మంచుగా నీరుగా ఒకే జలము వివిధ అవస్థలలో వేరవేరు రూపాలు ధరించు విధముగా ఒకే పరబ్రహ్మచైతన్యము అంతటా ప్రతిబింబించును.



అదేవిధముగా ఒకే సద్వస్తువు కల్పిత ఉపాధులచే జీవేశులుగానున్నది.ఉన్నది ఒకటియే అందుచేతనే

(జీవశ్శివశ్శివో జీవః స జీవః కేవలశ్శివః)జీవుడే శివుడు,శివుడే జీవుడు.ఆ జీవుడు కేవల శివుడు అనగా ఒకే చైతన్యమని అర్థము.

భేదమేమియు లేదు.అని శ్రుతి చెప్పుచున్నది.



జీవేశులిద్దరు లేరు.ఒకే పరబ్రహ్మైచైతన్యము అనేదే అఖండార్థము.


🕉🌞🌏🌙🌟🚩

[07:35, 10/12/2020] +91 92915 82862: శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


ధనాసరీరాగః - ఆదితాళమ్‌.


14. స్థిరతా నహి - నహిరే.

స్ధిరతా నహి నహిరే - మానస

స్థిరతా సహి సహిరే!!



1. తానత్రయసాగర మగ్నానాం

దర్పాహంకార విలగ్నానామ్‌|| స్థిరతా||



2. విషయపాశ వేష్టిత చిత్తానాం

విపరీతజ్ఞాన విమత్తానామ్‌|| స్థిరతా||



3. పరమహంసయోగి విరుద్ధానాం

బహు చఞ్చలతర సుఖబద్ధానామ్‌|| స్థిరతా||



తాత్పర్యము:-


ఓసి మానసమా! కుదురుండదే? వారికి శాంతియుండదే?



1. ఆధ్యాత్మికము (శరీరసంబంధి) ఆధిభౌతికము (పంచభూతములవల్లనైనది) అధిదైవికము (దైవసంబంధి) అని మూడు రకములైన తాపములు. ఈ తాపత్రయము సముద్రమువలె అంతములేనిది. అందు మునిగినవారికి కుదురుండదే మానసమా! గర్వమున - అహంకారమున తగులుకొన్న వారికి శాంతి యుండదే!



2. శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాత్మకములైన విషయములు పాశములు. అవి చుట్టలు చుట్టలుగా నెవరిని జుట్టి బాధించుచున్నవో వారికి - ఓమానసమా! కుదురుండదే! స్థిరతయుండదే!



ఏది తాను కాదో - దానిని తాననుకొనుట (శరీరము తాననుకొనుట) ఏది - తానో - అది తానుకాదనుకొనుట (అచ్చమైన ఆత్మను తానుగా గుర్తింపకపోవుట) అనగా అనాత్మయందు ఆత్మభావము, ఆత్మయందు అనాత్మభావము - విపరీత జ్ఞానము అనబడును.



ఇట్లు విపరీతజ్ఞానముచే ఎవ్వరి బుద్ధి చెడియున్నదో - వారికి ఓచిత్తమా! శాంతి ఎట్లుండునే? స్థైర్యము ఎట్లు లభించునే?



3. పరమహంసలైన యోగీంద్రులు (సదాశివులగురువులు) ఉపదేశించు యోగమార్గమును వ్యతిరేకించువారికి - మిక్కిలి చంచలములైన ఇంద్రియసుఖములయందు దగులు కొన్నవారికి చిత్తమా! శాంతియుండదే! నిలుకడ ఉండదే!


🕉🌞🌏🌙🌟🚩

[07:37, 10/12/2020] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-7-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩


తస్మై మృణాళధవళేన సహస్రశీర్ణా

రూపేణ బద్ధనుతిసిద్ధగణావృతేన।

ప్రాచుర్భవన్నచిరతో నుతిభిః ప్రసన్నో

దత్త్వా౾త్మతత్వ్తమనుగృహ్య తిరోదధాథ।


భావము:-


అప్పుడు 'ప్రభూ! తెల్లతామరతూడునుబోలిన శరీరము కలిగినది - వేయి పడగలతో ప్రకాశించునది, స్తుతి స్తోత్రములతో సిద్ధులచే అర్చించబడునది అగు నీ "ఆదిశేషుని" రూపమున, ఆ 'చిత్రకేతునికి' సాక్షాత్కరించితివి. చిత్రకేతుని స్తోత్రములకు ప్రసన్నుడవై అతనికి ఆత్మతత్వమును ఉపదేశించి శీఘ్రమే అంతర్హితుడవయితివి.



వ్యాఖ్య:-


తనకోసం వారు దుఃఖించాల్సిన అవసరం లేదనీ స్పష్టం చేసిన కొడుకుకు ఉత్తర క్రియలు చేసిన అనంతరం    

యమునానదిలో స్నానం చేసి నారదుడికి నమస్కరించాడు. అతడు ప్రసన్నమై భగవ్మంత్రాన్ని ఉపదేశించాడు. తరువాత అంగిరసుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. 



చిత్రకేతువు నారదుడు చెప్పిన విధంగా నిరాహారుడై సమాధిలో వుండి నారాయణ స్వరూపాన్ని ధ్యానం చేశాడు. ఏడు రాత్రులు ఆ విద్యను ఆరాధించే సరికి విద్యాధర చక్రవర్తిత్వం లభించింది. నారాయణుడి అనుగ్రహంతో ఒక దివ్య విమానాన్ని అదిరోహించి మనోవేగంతో ముల్లోకాలు సంచరించసాగాడు. 



ఆలా తిరుగుతున్న సమయంలో శ్రీమహావిష్ణువు పాదపీఠమైన ఆదిశేషుడిని చూశాడు. ఆయన్ను చూసేసరికి ఆయన పాపాలన్నీ హరించిపోయాయి. ఆదిశేషుడిని స్తుతించాడు. దానికి ఆయన ప్రసన్నుడయ్యాడు, సంతోషించాడు. తనను భక్తిశ్రద్ధలతో, విజ్ఞానంతో కూడిన వాక్కులతో స్తోత్రం చేసి ముక్తుడయ్యాడని చెప్పి అంతర్థానమయ్యాడు ఆదిశేషుడు. 



ఆ తరువాత చిత్రకేతువు గగనచారిగా లక్షల దివ్య సంవత్సరాలు అనేక రమ్యమైన ప్రదేశాలలో విహరించాడు. తన మనస్సులో వైష్ణవ జ్ఞానాన్ని, భాగవత అర్చనాన్ని నింపుకున్నాడు. ఎల్లప్పుడూ ఆ పుండరీకాక్షుడినే స్తుతిస్తూ ఆ హరి కథలనే వినేవాడు. 



ఇలా హరినే కీర్తిస్తూ, మనస్సులో సేవిస్తూ చిత్రకేత మహారాజు హిమవత్పర్వత ప్రాంతంలో పర్యటించసాగాడు.


🕉🌞🌎🌙🌟🚩

[10:40, 10/12/2020] +91 92915 82862: 18-17-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩


అl అహంకారము, కర్తృత్వబుద్ధి లేనివాడు కర్మలచే నంటబడడని వచించుచున్నారు– 



యస్య నాహంకృతో భావో 

బుద్ధిర్యస్య న లిప్యతే

హత్వా౽పి స ఇమాన్ లోకాన్

న హన్తి న నిబధ్యతే.


తా:- ఎవనికి "నేను కర్తను' అను తలంపు లేదో, ఎవనియొక్క బుద్ధి విషయములను, కర్మలను అంటదో అతడీ ప్రాణులన్నిటిని చంపినను వాస్తవముగ ఏమియు చంపుటలేదు. మరియు నతడు (కర్మలచే, పాపముచే) బంధింపబడుటయు లేదు.



వ్యాఖ్య:- అహంకారముగాని, 'నేను కర్తను' అను తలంపుగాని లేనివానికి, బుద్ధి విషయములందుగాని , కర్మలందుగాని అంటనివానికి ఈ ప్రాణులన్నిటిని వధించినను, వధించనట్లేయనియు, పాపముచే నతడు చుట్టుకొనబడడనియు, ఆతడు బంధింపబడడనియు ఇచట తెలుపబడెను. ఈ శ్లోకార్థమును బహుజాగ్రత్తగ యోచన చేయవలయును. లేకున్న మనుజుడు అజ్ఞానమను అఖాతమున పడిపోవు ప్రమాదము గలదు.



కర్మబంధమునకు కారణము కర్మలందు కర్తృత్వబుద్ధి గలిగియుండుట, బుద్ధి ఆ యా విషయములకు, కర్మలకు అంటుకొనుట (సంగము) అయియున్నది. కర్తృత్వబుద్ధి లేకుండ కర్మలు చేయువానికిగాని, విషయములందు బుద్ధి అంటకుండ (సంగములేకుండ) కర్మలు చేయువానికిగాని, ఆ కర్మజనిత సుఖదుఃఖములుగాని పుణ్యపాపములుగాని అంటవు. ఆ సత్యమే యిచట చెప్పబడినది. అంతియేకాని ప్రాణులను చంపుమనిగాని, చంపుట యుక్తమనిగాని యిచట బోధింపబడలేదు.



 పైగా సమస్తమును ఆత్మరూపముగ వీక్షించువాడు, కర్తృత్వములేనివాడు, అసంగుడై యుండువాడు, తాను మనస్సుగాదని తలంచువాడు, ఆత్మయందే స్థితిగలిగియుండును గావున అట్టివాడు సమస్తప్రాణులందును తన ఆత్మనే చూచుటవలన ఒక ప్రాణి కెట్లు బాధకలుగజేయగలడు? కాబట్టి అట్టి అసంగభావము గలవాడు, ఆత్మస్థితుడు జనులకు ఉపకారము చేయునేకాని, అపకారము చేయడు. ప్రాణులను హింసింపడు. ఒకవేళ హింసించినచో ఆతని కింకను ఆత్మజ్ఞానము కలుగలేదనియే ఊహించవలసియుండును.

       మనుజుడు వాస్తవముగ దేహముగాని, మనస్సుగాని కాదు - ఆత్మయే. కర్తృత్వము, అహంభావము లేనివాడు ఆత్మయందే స్థితి గల్గియుండును. అట్టివారు బుద్ధిచేగావింపబడు కర్మలతోగాని, తజ్జనిత బంధముతోగాని ఏ సంబంధమును లేకుండును.



కాబట్టి యతడు ఒక ప్రాణినేకాదు, అన్ని ప్రాణులను ఒకవేళ చంపినను, బుద్ధితో సంగము లేకుండుటవలన, కర్తృత్వము లేకుండుటవలన, ఆత్మయందే యుండుటవలన ఆతడు చంపనట్లేయగుచున్నాడు. మరియు ఆ వధవలన కలుగు పాపముచే, బంధముచే అంటబడక నుండుచున్నాడు.



ఇచట ఆత్మయొక్క ఆత్మస్థితునియొక్క  నిర్లేపత్వమును గూర్చిన ఒకానొక సిద్దాంతము, సత్యము చెప్పబడినదేకాని హింసాప్రేరణము కాదు. వాస్తవముగ అట్టి నిర్లేపత్వమును బడసినవాడు, ఆత్మయందున్నవాడు నిరంతరము ప్రాణికోట్లకు మేలుచేయునే కాని, వానిని ఏ మాత్రము బాధింపడు. ఈ విషయమును ముముక్షువులు ముఖ్యముగ జ్ఞప్తియందుంచుకొనవలెను.

పుణ్యపాపములకు కారణము కర్తృత్వము, సంగము, ఆసక్తి; అనగా జీవుడు తన ఆత్మస్థానమును వదలి, దిగివచ్చి దృశ్యముతో, బుద్ధితో జేరి "నేను చేయుచున్నాను" అని తలంచుటయే.



 కాని ఎపు డట్టి సంగము (ఆసక్తి), కర్తృత్వములేదో అత్తటి ఆ పుణ్యపాపములతోగాని, తజ్ఞనిత సుఖదుఃఖములచే గాని, బంధమోక్షములతోగాని మనుజునకు సంబంధము యుండదు. కావుననే అట్టివాడు అందరిని చంపినను, చంపనివాడే యని చెప్పబడుటకు కారణము. "ఎంతపాపమైనను అంటదు" - అనుదానికి ఒక తార్కాణముగ, " అతడొకవేళ అందరిని చంపినను చంపనివాడేయగునని వచింపబడినదేకాని వారిని చంపుమని బోధింపబడలేదు.



మరియు అర్జునుడు క్షత్రియుడు. దుష్టశిక్షణ ప్రభువుకు ధర్మము, కర్తవ్యము. కౌరవులు అధర్మమును జేబట్టి దుష్టులుగ తయారైరి. " కావున అట్టివారినందరిని ఓ అర్జునా! అసంగబుద్ధిగలిగి, నిరహంకారముతో నీవు వధించినను వధింపనట్లేయగు’ నని భగవానుడు అర్జునునకు తెలియజేయుచున్నాడనియు భావించవచ్చును.



బుద్ధిని దాటి, అహంభావమును దాటి ఆత్మయందు నెలకొనియుండువానికి ఆ బుద్ధితో ఏది చేసినను చేయనట్లేయగునుగదా! అయితే అట్టి స్థితియందుండువారు అసభ్యమైన, అధర్మయుతమైన, హింసాకరమైన, పీడాకరమైన క్రియలెవ్వియును జేయరు. " ఇమాన్ లోకాన్' అని అర్జునునకు చెప్పినందువలన “ ఈ యెదుటనున్న కౌరవరాజులు మున్నగువారు అనియు తలంచవచ్చును. ప్రభువులు దుష్టులకు, ద్రోహులకు గావించు శిక్ష పాపముగా పరిగణింపబడదు.



 కావున అది వారిని బంధింపదు. పైగా అట్టి క్రియను అసంగబుద్ధితో నాచరించునపుడు ఇంకను ఏ మాత్రము బంధప్రభావమును కలుగజేయదు.

కాబట్టి భగవానుడు తెలిపిన ఈ శ్లోకమందలి భావమును చాల లోతుగ విచారించి, పరప్రాణికి ఏమియు బాధ కలుగజేయక, ఆత్మయందు స్థితుడై అసంగబుద్ధితో ఆ యా కార్యముల నెరవేర్చుచు, బంధవిముక్తుడై వెలయవలెను.



ప్ర:- పాపమునకు, బంధమునకు కారణమేమి?


ఉ:- (1) అహంభావము ("నేను కర్తను' అనుభావము) (2) బుద్దియొక్క సంగము (విషయాదులతో, కర్మాదులతో అంటుకొనుట).



ప్ర:- పాపము, బంధము తొలగుటకు ఉపాయమేమి?


ఉ:- అట్టి సంగ కర్తృత్వాదులు లేకుండుట. అత్తటి కార్యములను జేసినను వానిచే నతడు బంధింపబడడు.


🕉🌞🌎🌙🌟🚩

ఇది నిజంగా రోమాలు నిక్క పొడుచుకొనేలా చేసే నిజ జీవితంలోని జరిగిన సంఘటన...

చరిత్రలో నిలిచిన కథ.

నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు, ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. 

ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు. 


ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కూడా పరమ శివుడు కనిపించాడు నిజంగా అద్బుతమైన శివుని లీల ఇది. 

ఈమె భార్యది మరియు ఈయనది నిజంగా అదృష్టమే.


 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు, “ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్ 

అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. 

ఆమె పేరు మేరీ. ఇలా కొన్ని రోజుల గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. 


అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదానికి గురి అయింది. ఎప్పుడు భయంతో, భాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది. ఆమె రాత్రి పగల్లు తన భర్త కోసం తపిస్తూ బాధ పడుతూ ఎదురు చూడసాగింది. అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైధ్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేద మంత్రాలు విని, వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది. అక్కడ పూజారులు మహా శివుణ్ణి పూజించడం ఈమె గమనించింది. 


ఆ పూజారులు “ఈమె మనసులో ఏదో బాధలో ఉందని” గ్రహించి పలకరించారు.

ఆ పూజారులు “ఏమైంది తల్లి నీకు అని అడగగనే, వెంటనే ఆమె భర్త ‘కల్నల్ గురించి చెప్పి, భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని, వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. 


ఆ పూజా రులు ఆమెని ఓదారుస్తూ “మహా శివునికి తన భాధని చెప్పుకోమని అన్నారు.

ఆమె గుడిలో మహా శివునికి మొక్కీ ఇంటికి వెళ్లింది తర్వాత ఆమె శివున్ని భక్తితో కొలుస్తూ “లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది. 

భక్తితో ఆరాధిస్తూ ఆమె “తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకు వస్తే, బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది. 11 రోజుల జపం చేసిన తర్వాత, ఆమె కి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. 

ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయట పడినట్లు చెప్పాడు. 


పతాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, 

ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహా యోగి వెలుగుతూ కనిపించాడని. ఆయన పులి చర్మం ధరించి, మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. 

ఆయన శక్తికి, తేజస్సుకి పతాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కోన్నాడు. 

ఈ యోగి వల్లే మేము విజయం సాధించమని అన్నాడు. 

ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, ఆ మహా యోగి కల్నల్ తో మాట్లాడాడని చెప్తూ, నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు.


కొన్ని వారాల తర్వాత, కల్నల్ ఇంటికి చేరుకున్నారు. తర్వాత కల్నల్ మరియు మేరీ భైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. కల్నల్ గుడిలో ఉన్న మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఈయనే అని అన్నాడు. అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ “మహా శివునికి” అపార భక్తులు అయ్యారు. 

ఆ తర్వాత బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. 

జన్మ ధన్యం చేసుకున్నారు ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్ద రి పేర్లు ఉన్నాయి. 

సేకరణ 

బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక్క గుడి ఇదే. 

ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది...

సర్వేజనా సుఖినోభవంతు 

ఓం శాంతి ... ఓం శాంతి .. ఓం శాంతి 


👍👏👌


సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (వాట్సాప్ ) 

--(())--


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ