పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో అంత ఆర్ధ్ర స్వరూపుడు. అట్టడుగు లోకాలనుండి మన కంటికి కనబడని ఊర్ధ్వలోకాల వరకు ఉన్న సమస్త లోకాలలోనూ వ్యాపించి ఉన్నవాడు రుద్రుడు.

ఏ యింట్లో రుద్రాభిషేకం జరుగుతుందో అక్కడ ఏ దోషాలు ఉండవు. అపమృత్యువు, వ్యాధులు ఉండవు. శివుడు అరిష్టాలను పోగొట్టి, రక్షణ, సంపదలు ఇస్తాడు. ఆత్మసాధనకు తోడ్పడి, అంతరాయములను తొలగిస్తాడు.

కృష్ణుడు వేరు, రుద్రుడు వేరు కాదు. యుద్ధములో కృష్ణుడు రథము తోలుతూ ఉంటే రథము ముందు ఒక ఆయన జడలు దాల్చి, శూలము పట్టుకొని వెడుతూ అర్జునునికి కనిపించాడు. యుద్ధము అయిన తరువాత ఎవరు అని అడిగితే ఆయనే రుద్రుడు. మేమిద్దరము కలిసి నిర్వహిస్తేనే యుద్ధము పూర్తయినదని శ్రీకృష్ణుడు చెపుతాడు.

అశాంతిని సృష్టించే అహంకారం యొక్క స్వరూపాన్ని నేను తెలుసుకోవడం వీలవుతుందా !?"

అక్కడే ఉన్న వస్తువును చీకటి కనిపించకుండా చేస్తుంది. అహంకారం మనలోనే ఉన్న శాంతిని వ్యక్తం కాకుండా చేస్తుంది. కనిపించని చీకటిని పట్టుకోలేము. కానీ ఒక దీపాన్ని వెలిగించి ఆ చీకటిని పారద్రోలవచ్చు. అలాగే అశాంతికి కారణమైన అహంకారం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. తెలిసిన ధర్మాన్ని ఆచరించడం ద్వారా తెలియని అహంకారం అదృశ్యం అవుతుంది. మనకి, దేహానికి మధ్యవర్తిగా ఉన్న అహంకారమే కష్టసుఖాలకు కారణం. మన ముందు కనిపించే ప్రపంచంలో ఎప్పుడూ సుఖం-సంతోషం ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రపంచం ఎప్పుడూ కష్టసుఖాలు, సంతోషదుఃఖాల మిశ్రమంగానే ఉంది. నిజానికి అవి రెండూ ప్రపంచానివి కావు. మన అహంకారానివి. కష్టాన్ని, దుఃఖాన్ని మనకి తెలిసేలా చేసే అహంకారమే సుఖ, సంతోషాలతో ఉండాలనిపించేలా చేస్తుంది. అదే మాయ !

"దీపంతో అంధకారం - ధర్మంతో అహంకారం అదృశ్యం !''- (అధ్యాయం -91)

బ్రహ్మానందము"

16వ అధ్యాయము 

మనసుకే పూర్ణానంద స్థితి కలుగుతుంది !

జరిగేదానితో పాటే మనసు కదులుతూ ఉంటే అదే పూర్ణమైన ఆనందంగా సాగుతుంది. కానీ కోరిక మొదలైన మరు క్షణం  ఉన్న ఆనందం అసంపూర్ణంగా అనిపిస్తుంది. అదే వెలితిగా మారి సంపూర్ణతను గుర్తించకుండా చేస్తుంది.  చిదానంధమయం అంటే "చిత్" ఆనందమయమే అని గుర్తించాలి. ఎందుకంటే చిత్ అంటే వ్యక్తమైనది. మనలోని ఆత్మ చేత మనసు, మనసు చేత ఈ ప్రపంచం వ్యక్తం కావడమే ఆనందంగా పరిణమిస్తుంది. పసి పిల్లలు అన్నిట్లో  అదే అనుభవిస్తారు. ఉన్నదానితో అలా కోరిక లేకుండా ఉండగలిగితే మనలోనే ఉన్న చిదానందం మన మనసుకు కూడా తెలుస్తుంది. నిత్య పూర్ణానంద స్థితి కలుగుతుంది !

అధ్యాయము-8

దారులు-మెట్లు

17. నీలో నీ మనస్సు నీ దినచర్యను, సన్ని వేశములను, ఊహలను సృష్టించుచుండును. అవి వచ్చుచు పోవుచుండును. నిద్ర వచ్చినపుడు అవి అన్నియు నిద్రలోనికి కరిగిపోవును. అట్లే ఈ సృష్టి అంతయూ దాని మనస్సు నుండి పుట్టుచుండును. మరల ఆ మనస్సుతో దాని నిద్రలోనికి పోవుచుండును. ఈ మనస్సే సృష్టికర్తయగు బ్రహ్మ. అతని యందు సృష్టి మేలుకొని ఉన్న కాలము బ్రహ్మ పగలు అందురు. ప్రళయమును బ్రహ్మ రాత్రి అందురు. మానవుల మనస్సులకు వేల రెట్లు బ్రహ్మ మనస్సు పని చేయును, అట్లే నిద్రించును. మానవునకు వేయి యుగముల కాలము బ్రహ్మ పగలు. మరి వేయి యుగముల కాలము బ్రహ్మ రాత్రి. మన భూమిపై ఉన్న వారికి సూర్యోదయము నుండి సూర్యోదయమునకు ఒక దినము. 365 దినములు ఒక సంవత్సరము. అట్టి సంవత్సరములు 43,20,000 ఒక యుగము లేక మహాయుగము. అట్టి వేయి యుగములు బ్రహ్మ పగలు. మరియొక వేయి రాత్రి.

18. అందు పగటి యందు సమస్తము లేని స్థితి నుండి ఉన్న స్థితికి వచ్చి వర్తించును. ఇదియే సృష్టి. రాత్రియందు లేని స్థితి లోనికి పోవును. ఇదియే ప్రళయము.

19. సమస్త జీవరాసులు ఈ విధముగా పగలు వర్తించి రాత్రి లీనమగుచుండును ఇందు దేనిని స్మరించినను దాని వెంట ఈ స్థితులను పొందుతూ జీవుడు తుదకు ప్రళయము పొందును.

స్వానుభూతావవిశ్వాసే తర్కస్యాప్యనవస్థితేః ౹ కథం వా తార్కికం మన్యస్తత్త్వ నిశ్చయ మాప్నుయాత్ ౹౹29౹౹

29. స్వానుభవమునందు విశ్వాసము లేనిచో తర్కము అంతియ నిర్ధారణను ఇవ్వజాలనందున,తార్కికులకు తత్త్వనిశ్చయమెట్లు లభించును?లభింపదు.

బుద్ధ్యారోహాయ తర్కశ్చేదపేక్షేత తథా సతి ౹ 

స్వానుభూత్యనుసారేణ తర్క్యతాం మా కుతర్కతామ్ ౹౹30౹౹

30. అనుభూత విషయము సంభవమే అని తెలిసికొనుటకు తర్కము అవశ్యకమైనచో అనుభవము అనుసరించి తర్కించు.కుతర్కములు చేయకు.

ఎంత సూక్ష్మ తర్కమును అవలంబించి ఒకరు సిద్ధాంతము చేసినను,అతని కంటె బుద్ధిశాలురు మరింత సూక్ష్మతర్కముచే విపరీత సిద్ధాంతము చేయగలరు.ఇది తార్కికులంగీకరించిన విషయమే. కనుక తత్త్వనిర్ధారణలో కేవల తర్కముపై  విశ్వాసముంచలేము. ఇక అనుభవమును కూడా విశ్వసింపనిచో తత్త్వనిశ్చయమునకు మార్గమే లేకపోవును.కనుక అనుభవమును విశ్వసించి దాని యందలి లోపదోషములను తొలగించి నిష్కర్షచేయుటకు మాత్రమే తర్కము ఉపయోగపడును.ఇట్లు తర్కము యొక్క పరిధిని గుర్తించి సదుపయోగము చేయవలెననే గాని కేవలము తర్కించుట వలననే ప్రయోజనము సాధింపబడదు.

అనుభూత విషయము ఎట్లు అనుభవమునకు వచ్చినదో తెలిసికొనిన ఇచ్ఛానుసారము ఆ అనుభవమును సంపాదించుకొనగలము.ఇట్టి జ్ఞానమును సంపాదించుటకు తర్కము అవసరమే.ఇట్టి తర్కము అనుభవమును అనుసరించి నడుచునే గాని పిడివాదములచే నడవదు.పక్షులెగురుట అనే అనుభవమును స్వీకరించి తర్కించి మానవుడు వామానముల నెక్కి తానును ఎగురగలుగు చున్నాడు.అట్లే బ్రహ్మవిదులు అనుభవమును స్వీకరించి సుతర్కము చేసి వారి అనుభవమును మనము కూడా సంపాదించుకొనవలెనే గాని కుతర్కమీలు చేయుట నిరర్థక ప్రయాస.

"మనువు" 

ధర్మాధర్మ విచక్షణా జ్ఞానానికి, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో పాటు శ్రుతిలో ఉన్న ప్రమాణాన్ని కూడా గుర్తించాలని బోధించాడు.

అంతేకాకుండా వేద విరుద్ధంకాని తర్కంతో ఎవడు అనుసంధానం చేసుకుంటాడో,అతడే ధర్మాన్ని తెలుసుకోగలడని ఇలా వ్యక్తం చేసాడు:

"ప్రత్యక్ష మనుమానం చ శాస్త్రం చ వివిధాగమమ్,త్రయం సువిదితం కార్యం ధర్మా శుద్ధి మభీప్సతా,

ఆర్షం ధర్మోపదేశం చ వేద శాస్త్రోఽ విరోధినా యస్తర్కేణ అనుసంధత్యే స ధర్మం వేద నేతరః"

--------(మ.స్మృ12.105,106).

శాస్త్ర ప్రమాణం వల్లే, పరమాత్మ జగత్కారణం అని బ్రహ్మవాదులు విశ్వసిస్తారు.అలాగే సమ్యక్ జ్ఞానం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని మోక్షవాదుల దృఢవిశ్వాసం.

అలాగే సమ్యక్ జ్ఞానం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని మోక్షవాదుల దృఢవిశ్వాసం.

భూత,భవిష్యత్ వర్తమానాలకు చెందిన తార్కికులనందరినీ ఒక చోట చేర్చి నిర్ణయించటం, తార్కికవాదులకు శక్యం కాదు.శ్రుత్యాధారిత జ్ఞానసాధన,సమ్యక్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందనే విషయం నిర్వివాదాంశం.

శ్రుతిపరంగాను,శాస్త్రానుగుణంగా ఉన్న తర్కసిద్ధాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి,

"బ్రహ్మము" జగత్తుకు మూలకారణమని,

నిజస్వభావమని ఇచ్చట నిర్ధారించడమైనది.

త్వత్సేవనేన దితిరింద్రవధోద్యతా౾పి

తాన్ ప్రత్యుతేంద్రసుహృదో మరుతో౾భిలేభే।

దుష్టాశయే౾పి శుభదైవ భవన్నిషేవా

తత్తాదృశస్త్వమవ మాం పవనాలయేశ!

భావము:-

దేవేంద్రుని సంహరించు అసురశక్తికల కుమారుడు కావలెనని, ప్రభూ! 'దితి' (కశ్యపుని భార్య) నిన్ను సేవించెను. కాని దానికి బదులుగా దేవతా స్వరూపులైన పుత్రులను దితికి ప్రసాదించితివి. ఆ పుత్రులు (మరుత్తులు) దేవేంద్రునితో శత్రుత్వమునకు బదులు మిత్రత్వమును అవలంభించిరి. ఉపాసనా ఆశయము ఏదయినను - భక్తితోచేయు నీ సేవ, శుభఫలమునే ఇచ్చును కదా!. అట్టి మహిమగలిగిన గురవాయూరుపురాధీశా! నన్ను రక్షింపమని - నిన్ను ప్రార్ధించుచున్నాను.

వ్యాఖ్య:-

మరుత్తులు అనగా వాయువులు. దేవ దానవ యుద్ధములో దానవులంతా ఇంద్రుడి చేత సంహరింపబడితే, ఆ బాధతో, పగతో, దితి తన భర్తయిన కశ్యప ప్రజాపతిని శక్ర హంతారం (ఇంద్రుడిని చంపే కొడుకు) కావాలంటుంది. దానికాయన వెయ్యి సంవత్సరాలు నియమ నిష్టలతో, శుచిగా తపోనిష్టలో ఉంటే అటువంటి పుత్రుడు పుడతాడు అని వరమిస్తూ దితిని స్పృశించి తపస్సుకి వెళిపోతాడు. 

ఇంద్రుని మీద పగ తీర్చుకోవాలని శుక్లప్లవనమునకు వెళ్ళి తపస్సు మొదలుపెడుతుంది దితి. ఆమెకు ఎన్నో సపరియలు చేస్తూ ఆమె తపస్సు చేస్తున్న ఆశ్రమంలోనే ఇంద్రుడు ఆమెను కనిపెట్టుకుని ఉంటాడు. 

ఇహ తపస్సు పూర్తవ్వడానికి సరిగ్గా పది సంవత్సరాలు ఉందనగా (అనగా ౯౯౦ సంవత్సరాలు గడిచాక) దితి కాళ్ళు పెట్టుకునే వైపు తల పెట్టుకుని నిద్రపోతుంది. అది చేయకూడని పని కనుక ఆమె అశుచి అవుతుంది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించి గర్భంలోని పిండాన్ని ఏడు ముక్కలు క్రింద కోసేస్తాడు. ఆ నొప్పికి తట్టుకోలేని పిండాలు ఏడుస్తుంటే ఇంద్రుడు “మా రుద” (ఏడవద్దు) అని అంటాడు. 

ఇదంతా తన గర్భంలో జరిగేసరికి దితికి మెలకువ వచ్చి ఇంద్రుడిని బయటకి రమ్మంటుంది. బయటకి వచ్చిన ఇంద్రుడు తన తప్పేమీ లేదనీ, ఆమె అశుచి అవ్వటం వలనే ఇలా చెయ్యవలసి వచ్చిందనీ చెప్తాడు. అది విన్న దితి తన తప్పుని ఒప్పుకుని, తన గర్భస్థ పిండాన్ని చంపినందుకు గాను ఇంద్రుడిని వరం కోరుకుంటుంది.

” బ్రహ్మలోకం చరత్వేకః ఇంద్రలోకే తధాపరః

దివి వాయురితి ఖ్యాతః త్రితయోపి మహాశయాః

చత్వారస్తు సురశ్రేష్ఠ దిశోవై తవశాసనాత్

సంచరిష్యతి భద్రంతే దేవభూతాః మమాత్మజాః

స్వత్కృతేనైవ నామ్నా మారుతాయితి విశృతాః “

ఆ ఏడుగురిలో ఒకరు బ్రహ్మలోకంలో, ఇంకొకరు ఇంద్రలోకములో, మరొకరు భూమి మీద వాయువు అనే పేరుతో ఉంటూ ఈ ముగ్గురూ మహాయశస్సు పొందాలి. మిగిలిన నలుగురూ నాలుగు దిక్కులలో ఉంటూ నువ్వు చెప్పినట్టు వింటూ ఉండేలా చేసి వీరందరినీ దేవతా గణాలలో చేర్చుకో. వీరిని “మా రుద” అని నువ్వు అన్నట్టే మరుత్తులుగా నిశ్చయించాను. ఇకనించీ వీరంతా మారుదులు (మారుతులు) లేదా మరుత్తులుగా ఖ్యాతి పొందేలా చేయి అని కోరుకుంటుంది. దానికి అంగీకరించిన ఇంద్రుడు అలానే దీవిస్తాడు.

ఆ విధముగా ఒక రాక్షసుడు కావలసిన వాడు ఏడు దేవతా గణాలు అయ్యి మరుత్తులు జన్మించారు.

షష్ఠ స్కంధము పరిపూర్ణం

23వ దశకము సమాప్తము.

***

గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩

అII ఇక తామసజ్ఞానమును గూర్చి తెలుపుచున్నారు—

యత్తు కృత్సవదేకస్మిన్  కార్యేసక్త మహైతుకమ్ 

అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్.

తా:-ఏ జ్ఞానమువలన మనుజుడు ఏదేని ఒక్కపనియందు (శరీర, ప్రతిమాదులందు) సమస్తమును అదియేయని తగుల్కొనియుండునో, అందులకు తగిన హేతువు లేకుండునో, తత్త్వమును (సత్యవస్తువును) తెలియకనుండునో, అల్పమైనదిగ (అల్పఫలము గలిగినదిగ) యుండునో అట్టి జ్ఞానము తామసజ్ఞానమని చెప్పబడినది.

వ్యాఖ్య: - తామసజ్ఞానము కలవాడు ఏదియో యొక దృశ్యవస్తువును పట్టుకొని ఏదియో మునిగిపోయినట్లు దానియందే ఆసక్తిగలిగి, అదియే సమస్తమని తలంచుచుండును. అతడు ఒకవ్యక్తియొక్క శరీరమును మాత్రమేచూచి, ఆ శరీరమే ఆత్మయని అదియే సమస్తమని భావించుచుండును. 

      రాజసజ్ఞానము గలవాడు లోని గుణమును, మనోభావములను మాత్రమే చూచును.        

      సాత్త్వికజ్ఞానముకలవాడు లోని అవిభక్తమగు ఆత్మనే వీక్షించును. చంచలవస్తువులగు దేహము, మనస్సు రెండును వికారవంతములైనవి, అస్థిరములైనవి. కావున వాని నాశ్రయించువాడు, వానియెడల దృష్టిగలవాడు అస్థిరత్వమునే, వినాశమునే, జననమరణములనే పొందుచుండును. నిత్యమై, స్థిరమై, అవ్యయమైనట్టి ఆత్మను ఆశ్రయించువాడు, అట్టి ఆత్మదృష్టిగలవాడు నిత్య, పునరావృత్తి రహిత ఆత్మపదవినే పొందును. కాబట్టి రాజస, తామసజ్ఞానముల రెండిటిని వదలి సాత్త్వికజ్ఞానమునే విజ్ఞుడవలంబించవలెను.

ప్ర:- తామసజ్ఞాన మెట్టిది?

ఉ:- ఏదియో యొక దృశ్యవస్తువును పట్టుకొని దానియందే ఆసక్తిగలిగి, అదియే సమస్తమని భావించునది (దృష్టాంతమునకు శరీరమును జూచి అదియే ఆత్మయని భావించుట),

(2)అందులకు తగిన హేతువును జూపజాలనిది,

(3) తత్త్వమును, సత్యవస్తువును తెలుపజాలనిది,

(4) అల్పఫలము గలిగి యుండునది తామసజ్ఞానము అనబడును.

🕉🌞🌎🌙🌟🚩

 గీతోపనిషత్తు  - 97 🌹

🍀 26 - 10 . ప్రాణాయామ యజ్ఞము  -    ఉదాన వాయువు కంఠ భాగమునుండి భూమధ్యము వరకు వ్యాపించి యుండి జీవుని హృదయము నుండి ఊర్ధ్య గతిని కలిగించి, ప్రత్యాహారస్థితి యందు నిలుపును. అపుడు జీవుడు తననొక స్పందనాత్మక చైతన్యముగ కంఠమునందు, నోటియందు, క్రింది తాలువుయందు, పై తాలువు యందు, నాసిక యందు స్పందన ప్రక్రియగ అనుభూతి చెందుచునుండును. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస, హృదయమునందు స్పందన యుండవు. ప్రాణస్పందనము, ప్రజ్ఞ ముఖమున యుండును. 🍀

📚. 4. జ్ఞానయోగము  - 29, 30   📚

పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి. 

🌷 4. ఉదాన వాయువు   - 2 🌷 

ఉదాన వాయువు కంఠ భాగమునుండి భూమధ్యము వరకు వ్యాపించి యుండి జీవుని హృదయము నుండి ఊర్ధ్య గతిని కలిగించి, ప్రత్యాహారస్థితి యందు నిలుపును. అపుడు జీవుడు తననొక స్పందనాత్మక చైతన్యముగ కంఠమునందు, నోటియందు, క్రింది తాలువుయందు, పై తాలువు యందు, నాసిక యందు స్పందన ప్రక్రియగ అనుభూతి చెందుచునుండును. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస, హృదయమునందు స్పందన యుండవు. ప్రాణస్పందనము, ప్రజ్ఞ ముఖమున యుండును.

ప్రజ్ఞ ప్రశాంతముగ నుండును. భ్రూమధ్యమున క్రమముగ చేరును. ఈ స్థితిలో సాధకునకు ఆహార విషయమున, ఉచ్చారణ విషయమున విశిష్టమగు నిష్ఠయుండును. పవిత్రమగు ఆహారమును మాత్రమే స్వీకరింపగలడు. పవిత్రమగు భాషణమును మాత్రమే చేయగలడు. అతడిపుడు చేరునది ఆకాశతత్వముగ గనుక, ఆకాశమువలె నిర్మలమగు విషయములందు మాత్రమే ఆసక్తి కలిగి యుండును. 

ప్రాపంచిక ప్రవృత్తులు, దేహప్రవృత్తులు యాంత్రికముగ సాగుచుండును. వానిని విసర్జించ నవసరము లేదు. ఉదాసీనతతో నిర్వర్తించుట యుండును. ఉదాన శబ్దమున 'ఉత్' అను శబ్దముండును. అనగ ప్రాణమాధారముగ జీవు డూర్ధ్వముఖము చెందుటకు దేహమున ఏర్పడిన సౌకర్యమని తెలియవలెను. 

ఆకాశమును చేరినది జీవ ప్రజ్ఞ యగుటచే అది అనంతము, అపరిమితము, సర్వవ్యాపకము అగు తత్త్వమునకు చేరువగుచుండును. భ్రూమధ్యము వరకు చేరి, అనంతత్వములోనికి వంతెన నేర్పరచుకొను ప్రయత్నమున నుండును.

హృదయమునుండి భ్రూమధ్యమునకు చేరు మార్గమున సాధకునికి అనేకానేక దివ్యానుభూతులు కలుగుచునుండును. అనేకములగు దివ్యరూపములు దర్శనమగు చుండును. అనేకములగు దివ్య విషయములు వినపడుచుండును. రకరకముల కాంతి దర్శనము లగుచుండును. 

అట్లే వివిధములగు వాయిద్యములు వినబడుచు నుండును. ఈ సమస్త దర్శనమును నాదబిందు కళాత్మకముగ పెద్దలు వివరించుచు నుందురు. వీని కాకర్షింప బడక ఊర్ధ్వమునకు సాగుట ఉత్తమమని పెద్దలు తెలిపిరి. 

భ్రూమధ్యమున చేరిన త్రిగుణాత్మక జీవప్రజ్ఞ, త్రిగుణముల కావలనున్న త్రిగుణాతీతమగు తత్వముతో అనుసంధానము చెందుటయే ప్రధానము కాగ, ఉదాన వాయువు వ్యానవాయువుతో అనుసంధానము చెందుట ప్రారంభమగును.

సశేషం...

. శ్రీ శివ మహా పురాణము - 295🌹 

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

71. అధ్యాయము - 26

🌻. దక్షుని విరోధము  - 3 🌻

దక్షుడిట్లు పనికెను-

మీ రుద్రగణముల వారందరు వేద బాహ్యులు, వేదమార్గమును వీడినవారు, మరియు మహర్షులచే త్యజించబడినవారు అగుదురు గాక! (26) మీరు నాస్తిక సిద్ధాంతమునందు శ్రద్ధగలవారు, శిష్టుల ఆచారమునుండి బహిష్కరింపబడినవారు, మద్యపానమునందు అభిరుచిగలవారు, జటలను, భస్మను, ఎముకలను ధరించువారు అగుదురు గాక! (27).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుడీ విధముగా శివకింకరులను శపించగా, ఆ మాటలను విని శివునకు ఇష్టుడగు నంది మిక్కిలి కోపావిష్టుడాయెను (28). శిలాదుని కుమారుడు, తేజశ్శాలి, శివునకు ప్రియుడు అగు నంది మహాబలుడు, గర్విష్ఠి అగు ఆ దక్షునితో వెంటనే ఇట్లనెను (29).

నందీశ్వరుడిట్లు పలికెను -

ఓ దక్షా! మోసగాడా! దుర్బుద్ధీ! శివతత్త్వము నెరుంగని నీవు బ్రాహ్మణ చాపల్యముచే శివగణములను వృథాగా శపించితివి (30). బ్రాహ్మణాహంకారము గల వారు, దుష్ట బుద్ధులు, మరియు మూర్ఖులునగు భృగ్వాది ఋషులు కూడా మహాప్రభువగు మహేశ్వరుని ఉపహాసము చేసిరి (31). 

ఇచట నున్న బ్రాహ్మణులలో ఎవరైతే రుద్రుని యందు నీవు వలెనే విముఖత గల దుష్టులో, వారిని రుద్రుని తేజస్సు యొక్క మహిమను గలవాడనగు నేను శపించుచున్నాను (32). మీరు వేదములయందలి అర్థవాదముల యందు మాత్రమే శ్రద్ధగలవారై, వేద తత్త్వము నెరుంగజాలని బహిర్ముఖులై, నిత్యము ఇతరము మరి ఏదీ లేదని పలికే విప్రులు అగుదురు గాక! (33).

ఓ విప్రులారా! మీరు కామనలతో నిండిన మనస్సు కలవారై, స్వర్గమే సర్వస్వమనే ధారణ గలవారై, క్రోధ లోభ గర్వములతో కూడియున్నవారై, సిగ్గును వీడిన నిత్య యాచకులై అగుదురు గాక! (34) ఓ బ్రాహ్మణులారా! మీరు వేదమార్గమును వీడి శూద్రులచే యాగములను చేయించి, ధనమును సంపాదించుటయే ధ్యేయముగా గల దరిద్రులు అగుదురు గాక! (35) 

ఓ దక్షా! దుష్టులనుండి దానములను స్వీకరించు వీరందరు నరకమును పొందగలరు. మరికొందరు బ్రహ్మ రాక్షసులగుదురు (36). ఎవడైతే శివుని దేవతలలో ఒకనిగా భావించి, ఆ పరమేశ్వరుని విషయములో ద్రోహబుద్ధిని కలిగియుండునో, అట్టి దుష్టబుద్ధియగు దక్షుడు తత్త్వము నుండి విముఖుడగును (37).

దక్షుడు గృహస్థుడై కుట్రలే ధర్మముగా గలవాడై, నిత్యము తుచ్ఛ సుఖములను కోరి కర్మ తంత్రమును విస్తరించువాడై, ఇదియే శాశ్వత వేద ధర్మమని భ్రమించి (38), ముఖములో ఆనందము లేనివాడై, ఆత్మ జ్ఞానమును విస్మరించి, పశువువలె అజ్ఞానియై, కర్మ భ్రష్టుడై, నిత్యము నీతి మాలిన వాడై అగును. ఈ దక్షుడు తొందరలో మేక ముఖము కలవాడగును (39). 

దక్షుడు ఈశ్వరుని శపించగా, కోపించిన నంది అచటి బ్రాహ్మణులను శపించగా, అచట పెద్ద హాహాకారము బయలుదేరెను (40). నేనా మాటలను విని ఆ దక్షుని, భృగ్వాది బ్రాహ్మణులను కూడ అనేక పర్యాయములు నిందించితిని. వేద ప్రవర్తకుడనగు నేను శివతత్త్వము నెరుంగుదును గదా! (41) సదాశివుడు నంది యొక్క వచనములను విని చిరునవ్వును అల్పముగా ప్రకటించి, ఆతనికి బోధించగోరి ఈ మధుర వాక్యములను పలికెను (42).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

 భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 182 🌹

🌻. విశ్వామిత్రమహర్షి  - 2 🌻

06. మనందరికీ విశ్వామిత్రమహర్షి ప్రసాదమే ‘గాయత్రీ మంత్రం’. ‘విశ్వామిత్ర ఋషిః గాయత్రీ ఛందః ‘ అని మనం నిత్యమూ అంటూంటాము. ప్రతీసంధ్యావందనంలో మూడు మాట్లు మనం అనుకునేది ఈ ఋషిస్మరణ. 

07. ‘త్రిపదా షట్‌కుక్షిః’ అని అనేక విషయములలో ఉన్నది ఆ గయత్రీ మహామంత్రం. అది సంపూర్ణమయినది. గాయత్రి యొక్క మగత్తు ఎంతటిదంటే మూడు వేదములూ క్షుణ్ణంగా పారాయణ చేసి, వాటిని ముఖస్థం చేసుకుంటే వచ్చే పుణ్యమేదో గాయత్రి స్మరణ చేస్తే వస్తుందని, దానికి తుల్యమైన మంత్రమే లేదని పెద్దల బోధ. 

08. త్రిమూర్తులు అందులో ఉన్నారు; త్రిమూర్తుల శక్తులు అందులో ఉన్నాయి. సమస్త ప్రకృతీ అందులో ఉంది. పరబ్రహ్మ వస్తువది. అందులో ఆద్యంతములు ఉన్నాయి. అదే మనకు రక్ష. దాని ఉపదేశమే మనిషికి ద్విజత్వాన్ని, పశువుకు విప్రత్వాన్ని ఇస్తుంది. పశువుకు విప్రత్వం ఇవ్వగల్గినటువంటి ఉత్కృష్టమయిన మంత్రంగా గాయత్రీమంత్రం జగత్పూజ్యమయింది. దానికి ఋషి విశ్వామిత్రుడు.

09. దేవతలయినా భూమి మీద పుట్టిన తరువాత సంసారంలో ప్రవేశించకపోవటం కష్టం. ప్రవేశించాక కామక్రోధాదులకు లోను కాకుండా ఉండటం మరీ కష్టం.

రామలక్ష్మణులు ఆయనను, “ఇంత అస్త్రబలసంపన్నులే మీరు! మీరే తృటిలో ఈ రాక్షసులును చంపగలరుకదా! మమ్మల్ని ఎందుకు పిలిపించారు?” అని అడిగారు. 

10. అప్పుడు విశ్వామిత్రుడు, “నేన్ను బ్రహ్మర్షిని అయిన తరువాత నా కర్తవ్యం ఏమీ లేదు నాయనా! క్షత్రియులచేత చేయించవలసిన పనే ఉంది. నేను తలపెట్టిన యాగం లోకక్షేమం కోసమే!” అన్నాడు. 

11. ఆ వంకతో రాముడి సన్నిధిలో యాగంచేద్దామని ఆయన ఉద్దేశ్యం. సాక్షాత్ విష్ణుస్వరూపుడైన రాముడే ప్రత్యక్షంగా ఎదురుగా ఉండగా, ఇక విష్ణువును ప్రత్యేకంగా యజ్ఞంలో ఆవాహనచేసి, రెండక్షతలు వేసి విగ్రహం పెట్టటమెందుకు? ‘విష్ణుమావాహయామి స్థాపయామి’ అనట్మెందుకు విష్ణువు ఎదురుగా ఉండగా? కాబట్టి మంత్రంమీద ఆధారపడక, విష్ణువు మీదనే ఆధారపడ్డాడు విశ్వామిత్రుడు. 

12. ఏ విష్ణువు యొక్క అనుగ్రహంతో లోకంలో రాక్షస సంహారం చేయదలచుకున్నాడో, ఆయననే తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 121 🌹

504. ఈ మానసిక గోళములో,  మనోభువనము - ఆరవ భూమిక  నుండి ప్రధాన దేవదూతలు భగవంతుని చూడలేరు. కాని ఆరవ భూమికలో నున్న మానవుడు భగవంతుని ముఖాముఖీ సర్వత్రా సమస్తమందు చూడగలడు, చూచుచున్నాడు.

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర  - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 1 🌻

శాశ్వత అనంత సత్యస్థితి  - అహం బ్రహ్మాస్మి  - నేను భగవంతుడను, విజ్ఞాన భూమిక.

505. తన దృష్టిని క్రమముగా క్రిందికిదించి, తన పైననే దృష్టిని మరల్చుట సప్తమ భూమికను చేరుటవంటిది.

506. నిర్వాణస్థితి దాటిన తక్షణమే "అహం బ్రహ్మాస్మి" స్థితి ఎఱుకతో అనుభవనీయమగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[18:55, 14/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 85  / Sri Vishnu Sahasra Namavali - 85 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ 

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

శ్రవణం నక్షత్ర ప్రధమ పాద శ్లోకం

    1వ మాలిక

        (రేగుప్తి రాగము -ఆదితాళము)

ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!

    భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!

అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!

    మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!

1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని

    యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని

    నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని

    నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి

2. ఛ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము

    పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము

    లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము

    మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.

🕉🌞🌎🌙🌟🚩

ఇది మార్గశిరమాసము. వెన్నెల నిండిన మంచిరోజు. ఓ అందమైన ఆభరణాలుగల పడుచులారా ! ఈ మార్గశిర స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండి, ముందు నడవండి. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధముగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీనందగోపుల కుమారుడను, అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును, నీలమేఘశ్యాముడను, ఎర్ర తామరులను పోలిన కన్నులు కలవాడును, సూర్యునివలే ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఇచ్చేటటువంటి దివ్య ముఖమండలము కలవాడును అయినవాడు నారాయణుడే. అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకే, మనసు ఉపేక్షించు వ్రాతసాధనమగు 'పర' అను వాద్యమును ఈయనున్నాడు. మనము ఈ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించునట్లు, మీరు అందరూ వచ్చి, ఈ వ్రతములో చేరండి.                     

అవతారిక

గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూలమగు కాలము మనకు లభించినదే అని, ఆ కాలమును ముందుగా పొగుడుచున్నారు. ఈ వ్రతము చేయుటకు తగిన వారెవరో నిర్ణయించుకొనుచున్నారు. ఈ వ్రతము చేసి, తాము పొందదగిన ఫలమేమో, దానిని పొందించు సాధనామేమో స్మరించుచు ఈ పాశురమును పాడుచు ఆనందించుచున్నారు.

🕉🌞🌎🌙🌟🚩 

 ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ధనుర్మాసానికి ఎందుకు అంత  విశిష్టత ?

🕉️🌞🌏🌙🌟🚩

రాబోయేకాలం ధనుర్మాసమే, 

ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము.

👉🏼కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. 

🎋చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు  ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . 

ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు . . . అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు .

ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. 

🌺మానవులకు ఒకసంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు . ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది . సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం . అనగా . . . ఇది రాత్రి కాలం . మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం . అనగా . . . పగలుగా భావన . ఇలా భావిచినప్పుడు . . . దక్షిణాయనమునకు చివరిది . . . ఉత్తరాయణమునకు ముందుది ఐనదే ధనుర్మాసం.

🌻 ప్రాతఃకాలమువలె పవిత్రమైనది . . . సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది . కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు . . . ఈ నెల విష్ణుమూర్తికి  ప్రీతికరమైనది. గోదాదేవి  కథ ఈ మాసమునకు సంబంధించినదే.

🌞 సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు.

👉🏼ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.

🍁కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది.

🔥 ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల  మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.

ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.

🌾ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది.

ధనుర్మాసఫలశ్రుతి:

ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్క రోజు అయినా మనసా వాచ కర్మణా యదాశక్తిగా పూజించిన యెడల 1000 యేళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితము కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలోకాని లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ  పుణ్య జలంలోకాని లేదా ఒక చెరువు లోకాని మీకు తోచిన పుణ్య స్థలంలో  ఒక్క మునుగు మునుగిన 4 రెట్లు అశ్వమేధయాగం చేసిన ఫలితము దక్కును.

🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏

🕉️🌞🌏🌙🌟🚩

 గోదాదేవి.. భక్తి పారవశ్యం

నీలాతుంగ స్తనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం

పారార్థం స్వం శృతిశతశిరస్సిద్ధం అధ్యాపయంతీ

స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా 

బలాత్కృత్యభుంక్తే

గోదా తస్యై నమ ఇదమిదం భూయయేవాస్తుభూయః

స్వోచ్ఛిష్టమాలికా బంధ గంధ బందుర జిష్ణవే

విష్ణుచిత్త తనూజాయైు గోదాయైు నిత్యమంగళం

భక్తుడికి భగవంతుడిపై సర్వాధికారాలూ ఉంటాయని ప్రపంచానికి తెలిపిన తన్మయి , ఆండాళ్‌ గోదాదేవి. తులసి వనంలో జన్మించి , భట్టనాథ ఆళ్వార్‌కి పెంపుడు బిడ్డయైు వటపత్రశాయి భక్తురాలై.. స్వామితో అనన్య సంబంధం పెంచుకొని , తాను ధరించిన పూదండనే తనకి ప్రియమైనదని ఆ దేవుడితోనే అనిపించుకొన్న మహాభక్తురాలు. ఆ స్వామిని పొందడానికి , అలనాటి గోపికల కాత్యాయినీ వ్రతం లాగా , తానూ ప్రధాన గోపికగా ఊహించుకొని , తన స్నేహితురాండ్లని గోపికలుగా తీర్చిదిద్ది , అనన్య భక్తురాలిగా కీర్తింపబడి భక్తులందరూ చూచుచుండగా , శ్రీరంగనాథుడి ఆకాంక్షల మేరకు , జ్యోతిలా మారి ఆయన్ను చేరిన భక్త శిరోమణి. ఆమె 30 పాశురములు / పాటలు రాసి , పాడి మన కోరికలు తీరడానికి తిరుప్పావై పేరిట భక్తులకు ధారపోసింది.

ధనుర్మాసం.. భక్తపారవశ్యంతో కూడుకున్న పండుగ. గోదాదేవి స్వామి వ్రతం చేసి , నారాయణుని పలువిధాల కీర్తించి కృష్ణమందిరం చేరి , కృష్ణకుటుంబాన్ని లేపి తాము వచ్చిన కార్యం గురించి విన్నవించుకుంటుంది.

తమని ఎలా కటాక్షించాలో కూడా తానే భక్తవివశయైు సూచిస్తుంది. సింహం గుహ నుండి వచ్చిన విధంగా కృష్ణుడు వచ్చి సభలోకి తమని ఆహ్వానించాలనీ , తమ గురించి స్వయంగా అడిగి తెలుసుకోవాలని.. అప్పుడు తమ కోరికలేమిటో వివరంగా విన్నవించుకోవాలనీ కృష్ణుడికి , ద్వారపాలకుల ద్వారా తెలియపరుస్తుంది. ఆమె సూచించిన మేరకే కృష్ణుడు కొలువు తీరి కుశల ప్రశ్నలు వేసి *‘మీ కోరికలేమిట’ ని  అని అడుగుతాడు. దానికి గోదాదేవి.. ‘కల్యాణ గోవిందా ! మీరు ఈ ఆడపిల్లలందరికి సన్మానం చేయాలి. చేతి ఆభరణాలు గాజులు కంకణాలు , భుజకీర్తులు కర్ణాభరణాలైన చెవిదిద్దులు , పాదా భరణాలు , మాకు సరిపడే సరిపోయే దుస్తులు ఇవ్వాలి. అవి మాకు నచ్చునట్లుగా మీరే సవరించాలి. మాకు భజించడానికి సంగీత పరికరాలు కావాలి. ఆ తరువాత పాలల్లో మునిగిన అన్నం తింటుంటే నోటి నుండి కారి మోచేతుల మీదుగా ప్రవహించేట్టుగా నెయ్యి ఉండాలి.

ఇంతేకాదు గోవులను కాచే గోవిందా ! నీవు మాలో ఒకడిగా ఉంటూ భుజించాలి. నీకు , మాకు ఉన్న సంబంధం విడదీయరానిది. మనం అంతా గొల్లవారమే తెంపినా తెగని సంబంధం. మేము అజ్ఞానులమని విదిలించుకోవద్దు. నీ మీద ప్రేమతో చనువుగా ఉన్నందుకు కోపగించుకోవద్దు. నీ పాదాలని మేము తనివితీరా స్పృశించే విధంగా కడిగే విధంగా మీరు సహకరించాలి’ అంటూ గోదాదేవి భగవత్‌ సాన్నిధ్యాన్ని , అనుభవించి అకారత్రయములైన జ్ఞానభక్త ప్రపత్తులను అనన్యగతిత్వమును , అనన్య శరణత్వమును , అనన్య భోగ్యత్వమును అదేవిధముగా పరమాత్ముడి భక్తవశంకరత్వాన్ని అశేష జనానికి ప్రసారం చేసింది.

🕉️🌞🌏🌙🌟🚩

 తిరుప్పావై అంటే ఏమిటీ? వీటి ప్రాశస్త్యం ఏమిటి?

👌 ఏమిటా తిరుప్పావై❓️ ఏముంది అందులో ❓️ కేవలం ముప్పై పాటలే కదా అని అనుకోకూడదు. చూడటానికి పైపైకి ఒక కృష్ణ-గోపికల కథగా కనిపిస్తుంది. ఒక దూది పువ్వుని విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి. ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇకపై వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇమిడి ఉంది. అందుకే తిరుప్పావైని ఐదో వేదం అంటారు.

 👌 తిరుప్పావై ఏమిటో తెలిసింది, మరి అందరూ చెయ్యవచ్చా? శ్రీకృష్ణుడి కోసం చేసేది "నీవే తల్లివి తండ్రివి ....." అని అందరం చిన్నపుడు చదివిందేకదా, అందరూ చెయ్యవచ్చు ఈ వ్రతం.

👌మరి ఎప్పుడు ఆచరించాలి? ఒక రైతు పంట పండించేందుకు నారు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా, అంతెందుకు పరీక్షలో మంచి మార్కులు రావడానికి తెలతెలవారే సమయంలో లేచి చదివుతాడు ఒక విధ్యార్థి. మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం. సూర్యుడు ధనుః రాశిలో ప్రవేశించి ఉంటాడు. ఆంగ్ల మానం ప్రకారం డిసెంబరు 16 నుండి మొదలై సంక్రాంతి వరకు. ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం.

 👌వ్రతం చేసే సమయం తెలిసింది, వ్రతం చేయటం కష్టం కాదా? కాదు, ఇది అతి సులభమైనది. తెలతెల వారే సమయంలో స్నానం చేయ్యటం, ఆరోజు పాశురం చదివి, ఆపై శ్రీకృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం. ఇక ఆయా పాశురాల అర్థం వినడం అంతే. శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం.

💐 పాండ్యేవిశ్వంభరాం గోదాం వందే  శ్రీరంగనాయకీం 💐

[05:08, 15/12/2020] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ  అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

[05:15, 15/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

754వ నామ మంత్రము

ఓం అపర్ణాయై నమః

పరమశివుణ్ణి తప్ప వేరొకరిని వివాహం చేసుకోను అని కఠోరమైన తపస్సులో చివరకు ఆకులు సహితం భక్షించకుండా దీక్షవహించిన పార్వతీ స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అపర్ణా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం అపర్ణాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిప్రపత్తులతోను, ఏకాగ్రచిత్తముతో ఆరాధిస్తే భక్తులు ఆ తల్లి కరుణచే 'అప్పులు చేయకూడదనియు, తాము పడ్డకష్టానికి ప్రతిఫలంగా వచ్చినదే చాలుననియు, ఉన్న దాంట్లోనే తృప్తినందగలమనే' మానసికమైన మార్పుతోనూ మరియు శాంతిసౌఖ్యములతోను జీవింతురు.

హిమవంతుడు ఒక పర్వతరాజు.  పరమేశ్వరి అంశతో మేనక హిమవంతులకు ఒక కుమార్తె జన్మించినది. పర్వత రాజు కుమార్తె గనుక ఆమె పార్వతి అను నామముగలదు. అలాగే హిమవంతుని కుమార్తె గనుక హైమావతి అను పేరుకూడా గలదు.  ఈ బాలిక పెద్దదికాగానే, తాను పరమశివుణ్ణి తప్ప అన్యులను వివాహమాడనని సంకల్పించుకుని తపస్సు చేయడానికి అరణ్యములకు వెళ్ళింది. 

వివిధ పద్ధతులలో, కఠోరమైన తపస్సు కొనసాగించినది. మహాతాపాన్ని కలిగిస్తున్న ఎండవేళ చుట్టూ నాలుగు అగ్నులు, ఆకాశంలో మండుతున్న సూర్యగోళం, ఆ వేడికి ఎర్రబడి మండుతున్న బండరాయి -– ఇవన్నీ నిలువ సాధ్యం కాని పరితాపాన్ని కలిగించే పరిస్థితులు. మనకి ఊహించుకుంటేనే భయం వేసే ఈ సన్నివేశంలో ఆ హైమవతి తపస్సుచేసినది.  

హేమంతశిశిరాల్లో (శీతాకాలంలో) ఆ ఉమ నిరాహారిణి అయి, నిత్యమూ మెడలోతు నీటిలో నిలబడి తపస్సు కొనసాగించింది.

హోరున వర్షం, కొన్నిసార్లు తల పగిలే వడగళ్ళు పడుతున్నప్పుడు కూడా పరమేశ్వరుని తనవాడిగా చేసుకోవడానికి దృఢదీక్షతో తపస్సు కొనసాగించినది.

కొంతకాలం ఒకపూట మాత్రం భోజనం చేస్తూ తపస్సు చేసినది.

మరికొంతకాలం భూమిపై (కటికనేలపై) పరుండినది.

కొంతకాలం ఆహారంగా కాయలు, పళ్ళు తింటూ తపస్సు చేసినది.

కొంతకాలం కేవలం ఆకులు మత్రమే తిని తపస్సుచేసినది.

పరమశివునికి కనికరం కలగక పోవడంతో ఏదైనా ఆహారం మాట అటుంచి ఇంతకు ముందు ఆకులు (పర్ణములు) తినేది కాస్తా ఆ ఆకులు  కూడా తినకుండా తపస్సు మరింత కఠోరం చేయడంతో ఆమె అపర్ణ అను సార్థకనామధేయముతో విరాజిల్లినది. 

చివరకు పరమశివుని చేపట్టి ఆయనదేహంలో సగం తన సొంతంజేసుకుని అర్థనారీశ్వరతత్త్వానికి ప్రతీకగా నిలచినది.

తలపై గంగ ఉన్నా, ఆ గంగను తలదన్నే ప్రేమతో పరమశివుని దేహంలో సగం దేహమై విరాజిల్లినది.

ఎవరో (భగీరథుడు) పిలిచారు. ఎవరికోసమో (సగరచక్రవర్తి కుమారుల శాపవిమోచనార్థమై) పోతూ మధ్యలో మజిలీ వేసిందిగాని సవతిగా కాదని వాదించిన మహా గడసరి పార్వతి.

అపర్ణ అనగా  ఋణము తీర్చినది. అనగా జగన్మాత తన భక్తులకు ఋణబాధలు లేకుండా కరుణించుతుంది గనుక అపర్ణా యను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది.

పర్ణము అనగా ఆకు. శిశిరఋతువులో చెట్లు ఆకులు (పర్ణములు) లేకుండా ఉంటాయి. గనుక శిశిరఋతువును కూడా అపర్ణ యను పదముతో సమన్వయించగా జగన్మాత శిశిరఋతు స్వరూపిణియై అపర్ణ యను నామాంకితగా తెలియవచ్చును.

అపర్ణ యను ఈ నామమును సంపుటి చేసి జపించినవారికి ఋణభారం లేకుండా జగన్మాత కాపాడుతుంది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అపర్ణాయై నమః అని అనవలెను.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:15, 15/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

180వ నామ మంత్రము

ఓం నిర్నాశాయై నమః

జగత్తులో అన్నీ  నాశనమవుతాయి. నాశనంకాని (అంతంలేని) పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్నాశా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిర్నాశాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను భక్తిప్రపూరిత హృదయములతో ఉపాసన చేయు సాధకులకు ఆ తల్లి విశేషమైన ఆధ్యాత్మికజ్ఞానమును ప్రసాదించి ఆత్మానందానుభూతిని కలుగజేయును.

సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మే తి శ్రుతిః - సత్యము, జ్ఞానము అనంతము అను ఈ మూడు లక్షణములే  పరబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయిన శ్రీమాతయే సత్యము. అంతము లేనిది. సృష్టికిముందు, సృష్టికి తరువాత, ప్రళయకాలంలో కూడా ఆ తల్లియే. వీటికన్నిటికీ కారణమయిన పరమాత్మయే ఆ తల్లి. సత్యస్వరూపిణి కూడా ఆ తల్లియే. ఈ సృష్టిలో కంటికి కనిపించేవి అన్నిటికీ అంతం ఉన్నది. ఏర్పడతాయి. ఉపయోగపడతాయి. మాయమవుతాయి. కాని పరమాత్మయే ఆదిమధ్యాంతములు  లేనిది ఆ ఒక్క పరమాత్మయే. అంటే నాశనము లేనిది. 

లయకాలంలో భూమి నీటిలోను నీరు నిప్పులోను, నిప్పు వాయువులోను, వాయువు ఆకాశంలోను, చివరగా ఆకాశం మాయలోనూ కలుస్తాయి. దీనినే మహానిష్క్రమణ అంటారు. కాని కర్మక్షయం కాని జీవులు మాత్రం కర్మను తమతో ఉంచుకొని మాయలో లీనమౌతారు. ఉండేది ఆ పరబ్రహ్మమొక్కటే. అంటే నాశనము లేనిది. కాబట్టి పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాత నిర్నాశా యని  అనబడినది.

అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం నిర్నాశాయై నమః

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[06:18, 15/12/2020] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 579  / Bhagavad-Gita - 579 🌹

🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 23 🌴

23. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ: స్మృత: |

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా: పురా ||

🌷. తాత్పర్యం : 

సృష్ట్యారంభము నుండియు “ఓం, తత్, సత్” అను మూడు పదములు పరతత్త్వమును సూచించుటకు వాడబడినవి. వేదమంత్రములను ఉచ్చరించునపుడును, పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణము కావించునపుడును ఈ మూడు సంజ్ఞాపదములు బ్రాహ్మణులచే ఉపయోగింపబడుచుండెడివి.

🌷. భాష్యము  :

తపస్సు, యజ్ఞము, దానము, ఆహారమనునవి సాత్త్వికము, రాజసము, తామసములనెడి మూడు రకములని ఇంతవరకు వివరింపబడినది. ఈ విధముగా ప్రథమ, ద్వితీయ, తృతీయ తరగతులకు చెందినను అవి ప్రకృతిజన్మములైన త్రిగుణములచే బంధింపబడునట్టివి మరియు మలినపూర్ణములైనట్టివి. 

కాని అట్టి కర్మలు నిత్యుడగు శ్రీకృష్ణభగవానుని (ఓం, తత్, సత్) పరములగునప్పుడు ఆధ్యాత్మికపురోగతికి దోహదములు కాగలవు.

 శాస్త్రనిర్దేశములందు అట్టి ప్రయోజనమే సూచించబడినది. ఓం, తత్, సత్ అనెడి ఈ మూడుపదములు ముఖ్యముగా పరతత్త్వమైన దేవదేవుని సూచించును. ఇక వానిలో “ఓం” అనునది అన్ని వేదమంత్రములందును గోచరించును. శాస్త్రనియమముల ననుసరింపనివాడు పరతత్త్వమును పొందలేడు. 

ఒకవేళ అతడు తాత్కాలికలాభములను పొందినప్పటికిని జీవితపు అంతిమఫలమును మాత్రము సాధింపలేడు. సారాంశమేమనగా దానము, యజ్ఞము, తపస్సు అనువానిని సత్త్వగుణము నందే ఆచరింపవలెను. రజస్తమోగుణములందు ఒనరింపబడెడి ఆ కార్యములు గుణహీనములై యుండును. 

మనుజుని భగవద్దామమునకు తిరిగి చేర్చు ఆధ్యాత్మికకర్మలను శాస్త్రీయముగా ఒనర్చు విధానమే అట్టి కృష్ణభక్తిరసభావనము. అట్టి దివ్యమార్గమున వర్తించుటలో ఎన్నడును శక్తి వృథా కాబోదు.

🌹 🌹 🌹 🌹 🌹

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::

ఉ. పూని భగవత్పాదాంబురుహ మూల నివాసులమైన మేము మే

ధానిధి! నీ విలోకనముఁదక్కఁగ నన్యముఁ గోర నేర్తుమా?

మానిత పారిజాత కుసుమ స్ఫుట నవ్యమరందలుబ్ధ శో

భా నయశాలి యైన మధుపంబు భజించునె యన్యపుష్పముల్‍?

నీ పాదాలను ఆశ్రయించుకున్న మేము నీ దర్శనం తప్ప మరొకటి కోరగలమా? పారిజాత పుష్పం లోని తేనె రుచి మరిగిన తుమ్మెద మరొక పుష్పం దగ్గరికి వెళ్ళదు కదా! 

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

అతీతః ఇంద్రియాణి ఇంద్రియములను అతిక్రమించిన వాడు. ఇంద్రియములవలన అనుభవమునకు అందనివాడు. అశబ్ధ మస్పర్శనమ్ ఇత్యాదిశ్రుతిచే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనునవి ఏ మాత్రమును లేనివాడు కావున ఈ పంచ విషయములను గ్రహించగల జ్ఞానేంద్రియ పంచమునకును గోచరము కానివాడు.

:: కఠోపనిషత్ - ప్రథమాధ్యాయము 3వ వల్లి ::

అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం

    తథాఽరసం నిత్య మగన్ధవచ్చ యత్ ।

అనాద్యనన్తం మహతః పరం ధ్రువం

    నిచాయ్య తన్మృత్యుముఖా త్ప్రముచ్యతే ॥ 15 ॥

శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు లేనిదియు అవ్యయమైనదియు, ఆద్యంతములు లేనిదియు, నిత్యమైనదియు, మహత్తుకు పరమైనదియు నయియున్న దానిని తెలిసికొనినవాడు మృత్యుముఖము నుండి పూర్తిగా విడివడును.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 62 🌻

నాకు ఇవాళ సరిగ్గా నిద్రపట్టలేదండి!

నాకు ఇవాళ నిద్రా సుఖం సరిగ్గా లభించలేదు.

నాకు ఇవాళ స్వప్నం సరిగ్గా రాలేదండి.

నాకు ఇవాళ స్వప్నంలో చాలా డిస్టర్బెన్స్‌ గా వుందండి.

నాకు ఇవాళ జాగ్రదావస్థలో చాలా డిస్టర్బెన్స్‌గా వుందండి.

అనేక రకములైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళకు గురౌతు, అనేక రకములైనటువంటి ఇంద్రియ వ్యాపారముల చేత లాగబడుతున్నారు.  అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, వాటన్నింటి చేత, ఇంద్రియములు పరిణామ శీలములై, వ్యవహార శీలములై, ప్రతిబింబ జ్ఞాన సహితములై, అజ్ఞాన ప్రభావం చేత, అవిద్యా ప్రభావం చేత, మోహ ప్రభావం చేత, మాయా ప్రభావం చేత, భక్తి విశ్వాసములు లోపించడం చేత, అనన్యభక్తి లోపించడం చేత, ఈశ్వరుని యందు సరియైనటువంటి చిత్త ఏకాగ్రతను నిలుపుకోలేకపోవడం చేత, ఎవరికైతే అనన్య భక్తి ఉందో, భక్తి విశ్వాసములు - అంటే అవ్యభిచారీ భక్తి అంటారు. అట్టి అవ్యభిచారీ భక్తిని గనక ఆశ్రయించి, అనన్యభక్తిని పొందినటువంటివారు, తప్పక మూడుగుణాలని జయిస్తారు. 

కాబట్టి తప్పక గుణత్రయాన్ని, శరీరత్రయాన్ని, దేహత్రయాన్ని, ఈషణ త్రయాన్ని ఇటువంటి త్రిపుటిని దాటాలి అంటే, ఈ అవస్థాత్రయాన్ని దాటటం అత్యవసరం. ఎవరైతే అవస్థాత్రయ సాక్షిగా ఉన్నాడో, అదే చైతన్యం. అదే ప్రజ్ఞ. అదే ఆత్మ. అదే అంతర్యామి. అదే ప్రత్యగాత్మ. అదే యథార్థ నేను.

      కాబట్టి అటువంటి తురీయ సంయమి తప్పక మానవులు గుర్తించాలి. అటువంటి తురీయస్థితిలో సహజముగా నిలకడకలిగి ఉండాలి. దృష్టిని సదా భూమా స్థితి యందు నిలుపగలిగినటువంటి వాడై ఉండాలి. ఏమార్పూ లేక ఉండాలి. ఏ పరిమాణము లేక ఉండాలి. ఏ అనుభవమూ లేక ఉండాలి. ఏ బంధము లేక ఉండాలి. 

ఏ రకమైనటువంటి కుంగుబాట్లు లేక ఉండాలి. ఏ రకమైనటువంటి దిగులు లేక ఉండాలి. ఏ రకమైనటువంటి ఇంద్రియ వ్యాపార ప్రభావం లేకుండా ఉండాలి. ఏ రకములైనటువంటి అవస్థాత్రయ ప్రభావం లేకుండా ఉండాలి. ఆ రకంగా సాక్షిత్వమును సదా ఆశ్రయించాలి. ఇట్లా సాక్షిగా ఉన్నటువంటి స్థితిని ఎవరైతే సాధిస్తారో, త్రిపుటికి సాక్షిగా ఉన్నటువంటి స్థితిని ఎవరైతే సాధిస్తారో, వాళ్ళు మాత్రమే ఆ అంతర్యామిత్వాన్ని, ఆ ఆత్మస్థితిని నిలబెట్టుకోగలుగుతున్నారు.

బుద్ధి అహంకారముతో కూడిన ఆత్మచైతన్యము ‘అహంకర్త అహం భోక్త’ నేను కర్తను, నేను భోక్తను అని వ్యవహరించుచున్నది. అట్టి జీవుని బుద్ధి, అహంకారము అను ఉపాధినుండి వేరుపరచినచో కాలత్రయ నియామకుడగు ఈశ్వరుడే అగుచున్నాడు. ఈ విధముగా తెలిసిన వారు తనను ఇతరుల నుండి రక్షించుకొనగోరరు.

        ముఖ్యమైన అంశాలని యమధర్మరాజుగారు నచికేతునికి ఉపదేశిస్తున్నారు ఈ కఠోపనిషత్తు సందర్భముగా. ప్రధానము.. ఈశ్వర లక్షణాన్ని నిరూపిస్తున్నారు. ఎవరైతే ఈ బుద్ధికి వేరైనటువంటి వాళ్ళు, అంటే మహతత్త్వము, అవ్యక్తము, ప్రత్యగాత్మ ఈ మూడు స్థితులకి సంబంధించిన వాడు ఈశ్వరుడు.

 గోళకములు, ఇంద్రియములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్ర సహితమైనటువంటి జ్ఞానము, మనస్సు, బుద్ధి ఇదంతా జీవుడు. దీని అవతల ఉన్నటువంటి మహతత్త్వము, అవ్యక్తము, ప్రత్యగాత్మ ఈ మూడు స్థితులకు సంబంధించినవాడు ఈశ్వరుడు. అయితే ఈశ్వరత్వాన్ని సాధించడం మానవులందరికి తప్పనిసరి. ఆ దివ్యత్వానుభవం లేకుండా, ఆత్మానుభూతిని పొందజాలరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[06:18, 15/12/2020] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్  మహరాజ్ అభంగాలు - నామసుధ  - 6 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 6 🍀

సాధుబోధ్ ఝాలా తో నురోనియా రేలా!

రాయీచ్ మురాలా అనుభవ్!!

కాపురాచీ వాతీ ఉజళలీ జ్యోతీ!

రాయీచ్ సమాప్తీ ఝాలీ జైశీ!!

మోక్షరేఖే ఆలా భాగ్యే వినటలా!

సాధూచా అంకిలా హరిభక్తి!

జ్ఞానదేవా గోడీ సంగతీ సజ్జని

హరి దిసే జనీ వనీ ఆత్మతత్త్వీం

భావము:

సాధు బోధ అయిన క్షణమే సంశయము తొలిగి పోవును వెంటనే

అజ్ఞానము నశించి పోయి ఆత్మానుభవము కలుగును. 

నిప్పుతో కలిసిన కర్పూరము జ్యోతిగా ప్రజ్వలించి వెంటనే ఆరి

పోయినట్లుగానే అజ్ఞానము నశించి పోవును. సాధువుకే అంకితమైన హరి భక్తుడికి మోక్ష రేఖ దరిచేరి భాగ్యము ఉదయించును.

సాధువుల సాంగత్యమే మధురముగ ఉన్నదని తెలియుట వలన నాకు జనములో వనములో హరి కనిపించినాడని జ్ఞానదేవుని వచనము.

🌻. నామ సుధ -6 🌻

సాధు బోధ అయినచో ప్రాప్తము

మిగలదు ఏమీ సందేహము

అజ్ఞానము అక్కడే మాయము

కలుగును వారికి ఆత్మ జ్ఞానము

నిప్పును కలిసిన కర్పూరము

దీప్తినిచ్చు ఉజ్వల ప్రకాశము

కర్పూరము అక్కడే సమాప్తము

ఆ విధముగా తొలుగును సందేహము

మోక్ష రేఖ చేరును సమీపము

ఉదయించు వెంటనే భాగ్యము

'సాధువుకే అంకితము జీవితము'

హరి భక్తిలో తానయ్యేను లీనము

జ్ఞాన దేవునికి అత్యంత ప్రియము

సజ్జనాళితోడి సాంగత్యము

జనములో వనములో హరిరూపము

కనిపించెను అంతట ఆత్మతత్త్వము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[06:18, 15/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 148, 149 / Sri Lalitha Chaitanya Vijnanam  - 148, 149 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |

నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖

🌻148. 'నిత్యశుద్ధా"🌻

ఎల్లప్పుడూ శుద్ధ స్థితి యందుండునది శ్రీమాత.

ఎల్లప్పుడూ అనగా భూత, భవిష్యత్, వర్తమాన కాలములందు అని అర్థము. శాశ్వతముగ శుద్ధమైనది. శుద్ధ అనగా మలినములు లేనిది. అజ్ఞానము, అహంకారము, కోరిక, వైషమ్యము, మోహము ఇత్యాది మలినములు లేకుండుటయే శుద్ధ స్థితి. మాయ తాకనిది శుద్ధ స్థితి. శ్రీమాతకు మాయ ప్రధానమగు పనిముట్టు. మాయతోనే సృష్టి నిర్మాణము, నిర్వహణము గావించు చుండును. మాయ ఆమెపై ఆధిక్యము కలది కాదు.

సృష్టియందు మలినము తప్పనిసరి. సృష్టి కార్యము అగ్నికార్యమగుటచే మసిబారుట కూడ జరుగు చుండును. అన్ని లోకముల యందు కొద్దియో గొప్పగనో మలినముండుట తప్పనిసరి. దానిని ప్రతినిత్యము పరిశుభ్ర పరచుకొనుట సాధన. బ్రహ్మాదులకైనను ఇది తప్పదు. త్రిమూర్తులు గూడ అప్పుడప్పుడు మాయా మోహములను మలినము సోకినవారే అని పురాణములు  తెలుపుచున్నవి. అట్టి మలినములు సోకని శాశ్వత శుద్ధత్వము ఇచ్చట చెప్పబడుచున్నది.

జీవ చైతన్యము కూడ అట్టి శుద్ధత్వము కలిగి యున్నది. ఈ కారణముచేతనే జీవుడు దైవాంశయే కాని అతనిని ఆవరించి యుండు అహంకారాది అష్ట ఆవరణలు మలినముల నుత్పత్తి చేయుచు నుండును. వీని ప్రభావము జీవునిపై నున్నప్పుడు అతని సహజస్థితి జీవుడు కోల్పోవును. అతడు నిర్మలుడే అయినను, శరీర  సహవాసము వలన, శరీర వాసనలు సోకుట జరుగుచుండును. 

శరీరము మలినములతో కూడినది. అందుండువాడు నిర్మలుడు. నిర్మలుడు నిర్మలుడుగానే యుండవలెనన్నచో అహంకారాది భావనలు దాటవలెను. “తా నున్నాడు” అని భావించు ప్రతి మానవుడు అహంకారియే. దైవమే తానుగ నున్నాడు. నిజమునకు దైవమే వున్నాడు. “నేనుండుట మాయ” అని నిత్యము తెలిసినవాడు నిత్య శుద్ధు డగును. అట్లగుటకు సాధన కావలెను. సాధనవలన సిద్ధి  పొందువాడు జీవుడు. శ్రీమాత నిత్యసిద్ధ, కావున 'నిత్యశుద్ధ', 

సశేషం...

🌻149. 'నిత్యబుద్ధా'🌻

శ్రీమాత శాశ్వత బుద్ధి స్వరూపిణి అని అర్థము.

జ్ఞాన స్వరూపిణి అని అర్థము.

శుద్ధత్వమువలె బుద్ధత్వము కూడ శ్రీమాత సహజ స్థితి. ఆమె బుద్ధి స్వరూపిణి కనుక బుద్ధి ప్రచోదనము చేయుమని ఆమెను ఆరాధించుట జరుగుచున్నది. అందులకే గాయత్రి మంత్రము. శుద్ధి, బుద్ధి అనునవి ఒక దానివెంట ఒకటి కలుగు సిద్ధులు. శుద్ధి నిత్యము గావించుకొను చుండవలెను. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశముల శుద్ధి శ్రద్ధతో గావించుకొనుచు బుద్ధి ప్రచోదనమునకు ప్రయత్నించుట సాధన. 

బుద్ధిని గొని శుద్ధిని సాధించుట, శుద్ధితో బుద్ధిని ఆహ్వానించుట నిత్యము జరుగవలెను. అట్టి వారికే సంసారము నుండి తరించుటకు వీలగును. జైనమతమున తరణమును చెందుటకు ఆరాధించు శ్రీమాతను 'తారాదేవి' అని పిలుతురు. శుద్ధబుద్ధులు అను తీర్థంకరులు తారాదేవి అనుగ్రహముచే తరించిరని  తెలుప బడుచున్నది. 

శుద్ధి, బుద్ధి తరించుటకు ముఖ్యమని తెలియవలెను. ఈ కారణముగనే నిత్యశుద్ధా, “నిత్యబుద్ధా' అను నామములు వరుసగా పేర్కొనబడినవి. 

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🔺 శ్రీ ఆది శంకరాచార్య       _విరచిత __

💎 వివేక చూడామణి.

స్వామీ చిన్మయానందుల వ్యాఖ్యానం.

ఆడియో నం.278

💎💥💎💥💎💥💎

[12:08, 15/12/2020] +91 92915 82862: అన్నమయ్య సంకీర్తన

🕉🌞🌎🌙🌟🚩

గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు

రేకు: 356-1

సంపుటము: 4-327

రేకు రాగము: శ్రీరాగం.

ఓ పవనాత్మజ ఓ ఘనుఁడ

బాపు బాపనఁగఁ పరగితిగా!!

ఓ హనుమంతుడ వుదయాచలని -

ర్వాహక నిజ సర్వ ప్రబల -

దేహము మోఁచిన తెగువకు నిటువలె

సాహసమిటువలెఁ చాటితిగా!!

ఓ రవిగ్రహణ ఓ దనుజాంతక

మారులేక మతి మలసితిగా

దారుణపువినతాతనయాదులు

గారవింప నిటు గలిగితిగా!!

ఓ దశముఖహర ఓ వేంకటపతి -

పాదసరోరుహపాలకుఁడా

యీ దేహముతో ఇన్నిలోకములు

నీదేహమెక్క నిలిచితిగా!!

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - డిసెంబరు 14.

పద్మం వికసించినప్పుడు దానిలోని మకరందం కోసం తేనెటీగలు వాటంతట అవే వస్తాయి.  అదేవిధంగా మీలోని 'సౌశీల్యం' అనే పద్మాన్ని పూర్తిగా వికసించనివ్వండి. అప్పుడు ఫలితాలు వాటంతట అవే చేకూరతాయి.

🕉🌞🌎🌙🌟🚩

నాయనా! మృత్యువు అనివార్యమైనపుడు, రాళ్ళు రప్పల్లాగా పడి ఉండటంకంటే ధీరులుగా మరణించటం మేలు కాదా? ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమే ముంది? తుప్పపట్టేకంటే, ఈషణ్మాత్రమైనా పరులకు మేలు చేయటంలో అరిగిపోవటం మంచిది.

🕉🌞🌎🌙🌟🚩

[13:35, 14/12/2020] +91 92915 82862: శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩

పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో అంత ఆర్ధ్ర స్వరూపుడు. అట్టడుగు లోకాలనుండి మన కంటికి కనబడని ఊర్ధ్వలోకాల వరకు ఉన్న సమస్త లోకాలలోనూ వ్యాపించి ఉన్నవాడు రుద్రుడు.

ఏ యింట్లో రుద్రాభిషేకం జరుగుతుందో అక్కడ ఏ దోషాలు ఉండవు. అపమృత్యువు, వ్యాధులు ఉండవు. శివుడు అరిష్టాలను పోగొట్టి, రక్షణ, సంపదలు ఇస్తాడు. ఆత్మసాధనకు తోడ్పడి, అంతరాయములను తొలగిస్తాడు.

కృష్ణుడు వేరు, రుద్రుడు వేరు కాదు. యుద్ధములో కృష్ణుడు రథము తోలుతూ ఉంటే రథము ముందు ఒక ఆయన జడలు దాల్చి, శూలము పట్టుకొని వెడుతూ అర్జునునికి కనిపించాడు. యుద్ధము అయిన తరువాత ఎవరు అని అడిగితే ఆయనే రుద్రుడు. మేమిద్దరము కలిసి నిర్వహిస్తేనే యుద్ధము పూర్తయినదని శ్రీకృష్ణుడు చెపుతాడు.

🕉🌞🌎🌙🌟🚩

[13:43, 14/12/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (740)

🕉🌞🌎🌙🌟🚩

"అశాంతిని సృష్టించే అహంకారం యొక్క స్వరూపాన్ని నేను తెలుసుకోవడం వీలవుతుందా !?"

అక్కడే ఉన్న వస్తువును చీకటి కనిపించకుండా చేస్తుంది. అహంకారం మనలోనే ఉన్న శాంతిని వ్యక్తం కాకుండా చేస్తుంది. కనిపించని చీకటిని పట్టుకోలేము. కానీ ఒక దీపాన్ని వెలిగించి ఆ చీకటిని పారద్రోలవచ్చు. అలాగే అశాంతికి కారణమైన అహంకారం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. తెలిసిన ధర్మాన్ని ఆచరించడం ద్వారా తెలియని అహంకారం అదృశ్యం అవుతుంది. మనకి, దేహానికి మధ్యవర్తిగా ఉన్న అహంకారమే కష్టసుఖాలకు కారణం. మన ముందు కనిపించే ప్రపంచంలో ఎప్పుడూ సుఖం-సంతోషం ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రపంచం ఎప్పుడూ కష్టసుఖాలు, సంతోషదుఃఖాల మిశ్రమంగానే ఉంది. నిజానికి అవి రెండూ ప్రపంచానివి కావు. మన అహంకారానివి. కష్టాన్ని, దుఃఖాన్ని మనకి తెలిసేలా చేసే అహంకారమే సుఖ, సంతోషాలతో ఉండాలనిపించేలా చేస్తుంది. అదే మాయ !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

"దీపంతో అంధకారం - ధర్మంతో అహంకారం అదృశ్యం !''- (అధ్యాయం -91)

🕉🌞🌎🌙🌟🚩

[13:43, 14/12/2020] +91 92915 82862: "ఋభుగీత " (207)

🕉🌞🌎🌙🌟🚩

బ్రహ్మానందము"

16వ అధ్యాయము 

మనసుకే పూర్ణానంద స్థితి కలుగుతుంది !

జరిగేదానితో పాటే మనసు కదులుతూ ఉంటే అదే పూర్ణమైన ఆనందంగా సాగుతుంది. కానీ కోరిక మొదలైన మరు క్షణం  ఉన్న ఆనందం అసంపూర్ణంగా అనిపిస్తుంది. అదే వెలితిగా మారి సంపూర్ణతను గుర్తించకుండా చేస్తుంది.  చిదానంధమయం అంటే "చిత్" ఆనందమయమే అని గుర్తించాలి. ఎందుకంటే చిత్ అంటే వ్యక్తమైనది. మనలోని ఆత్మ చేత మనసు, మనసు చేత ఈ ప్రపంచం వ్యక్తం కావడమే ఆనందంగా పరిణమిస్తుంది. పసి పిల్లలు అన్నిట్లో  అదే అనుభవిస్తారు. ఉన్నదానితో అలా కోరిక లేకుండా ఉండగలిగితే మనలోనే ఉన్న చిదానందం మన మనసుకు కూడా తెలుస్తుంది. నిత్య పూర్ణానంద స్థితి కలుగుతుంది !

🕉🌞🌎🌙🌟🚩

[13:50, 14/12/2020] +91 92915 82862: 🌷98-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩

అధ్యాయము-8

🥀దారులు-మెట్లు🥀

17. నీలో నీ మనస్సు నీ దినచర్యను, సన్ని వేశములను, ఊహలను సృష్టించుచుండును. అవి వచ్చుచు పోవుచుండును. నిద్ర వచ్చినపుడు అవి అన్నియు నిద్రలోనికి కరిగిపోవును. అట్లే ఈ సృష్టి అంతయూ దాని మనస్సు నుండి పుట్టుచుండును. మరల ఆ మనస్సుతో దాని నిద్రలోనికి పోవుచుండును. ఈ మనస్సే సృష్టికర్తయగు బ్రహ్మ. అతని యందు సృష్టి మేలుకొని ఉన్న కాలము బ్రహ్మ పగలు అందురు. ప్రళయమును బ్రహ్మ రాత్రి అందురు. మానవుల మనస్సులకు వేల రెట్లు బ్రహ్మ మనస్సు పని చేయును, అట్లే నిద్రించును. మానవునకు వేయి యుగముల కాలము బ్రహ్మ పగలు. మరి వేయి యుగముల కాలము బ్రహ్మ రాత్రి. మన భూమిపై ఉన్న వారికి సూర్యోదయము నుండి సూర్యోదయమునకు ఒక దినము. 365 దినములు ఒక సంవత్సరము. అట్టి సంవత్సరములు 43,20,000 ఒక యుగము లేక మహాయుగము. అట్టి వేయి యుగములు బ్రహ్మ పగలు. మరియొక వేయి రాత్రి.

18. అందు పగటి యందు సమస్తము లేని స్థితి నుండి ఉన్న స్థితికి వచ్చి వర్తించును. ఇదియే సృష్టి. రాత్రియందు లేని స్థితి లోనికి పోవును. ఇదియే ప్రళయము.

19. సమస్త జీవరాసులు ఈ విధముగా పగలు వర్తించి రాత్రి లీనమగుచుండును ఇందు దేనిని స్మరించినను దాని వెంట ఈ స్థితులను పొందుతూ జీవుడు తుదకు ప్రళయము పొందును.

🕉🌞🌎🌙🌟🚩

[13:50, 14/12/2020] +91 92915 82862: 111) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

స్వానుభూతావవిశ్వాసే తర్కస్యాప్యనవస్థితేః ౹ కథం వా తార్కికం మన్యస్తత్త్వ నిశ్చయ మాప్నుయాత్ ౹౹29౹౹

29. స్వానుభవమునందు విశ్వాసము లేనిచో తర్కము అంతియ నిర్ధారణను ఇవ్వజాలనందున,తార్కికులకు తత్త్వనిశ్చయమెట్లు లభించును?లభింపదు.

బుద్ధ్యారోహాయ తర్కశ్చేదపేక్షేత తథా సతి ౹ స్వానుభూత్యనుసారేణ తర్క్యతాం మా కుతర్కతామ్ ౹౹30౹౹

30. అనుభూత విషయము సంభవమే అని తెలిసికొనుటకు తర్కము అవశ్యకమైనచో అనుభవము అనుసరించి తర్కించు.కుతర్కములు చేయకు.

ఎంత సూక్ష్మ తర్కమును అవలంబించి ఒకరు సిద్ధాంతము చేసినను,అతని కంటె బుద్ధిశాలురు మరింత సూక్ష్మతర్కముచే విపరీత సిద్ధాంతము చేయగలరు.ఇది తార్కికులంగీకరించిన విషయమే. కనుక తత్త్వనిర్ధారణలో కేవల తర్కముపై  విశ్వాసముంచలేము. ఇక అనుభవమును కూడా విశ్వసింపనిచో తత్త్వనిశ్చయమునకు మార్గమే లేకపోవును.కనుక అనుభవమును విశ్వసించి దాని యందలి లోపదోషములను తొలగించి నిష్కర్షచేయుటకు మాత్రమే తర్కము ఉపయోగపడును.ఇట్లు తర్కము యొక్క పరిధిని గుర్తించి సదుపయోగము చేయవలెననే గాని కేవలము తర్కించుట వలననే ప్రయోజనము సాధింపబడదు.

అనుభూత విషయము ఎట్లు అనుభవమునకు వచ్చినదో తెలిసికొనిన ఇచ్ఛానుసారము ఆ అనుభవమును సంపాదించుకొనగలము.ఇట్టి జ్ఞానమును సంపాదించుటకు తర్కము అవసరమే.ఇట్టి తర్కము అనుభవమును అనుసరించి నడుచునే గాని పిడివాదములచే నడవదు.పక్షులెగురుట అనే అనుభవమును స్వీకరించి తర్కించి మానవుడు వామానముల నెక్కి తానును ఎగురగలుగు చున్నాడు.అట్లే బ్రహ్మవిదులు అనుభవమును స్వీకరించి సుతర్కము చేసి వారి అనుభవమును మనము కూడా సంపాదించుకొనవలెనే గాని కుతర్కమీలు చేయుట నిరర్థక ప్రయాస.

"మనువు" 

ధర్మాధర్మ విచక్షణా జ్ఞానానికి, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో పాటు శ్రుతిలో ఉన్న ప్రమాణాన్ని కూడా గుర్తించాలని బోధించాడు.

అంతేకాకుండా వేద విరుద్ధంకాని తర్కంతో ఎవడు అనుసంధానం చేసుకుంటాడో,అతడే ధర్మాన్ని తెలుసుకోగలడని ఇలా వ్యక్తం చేసాడు:

"ప్రత్యక్ష మనుమానం చ శాస్త్రం చ వివిధాగమమ్,త్రయం సువిదితం కార్యం ధర్మా శుద్ధి మభీప్సతా,

ఆర్షం ధర్మోపదేశం చ వేద శాస్త్రోఽ విరోధినా యస్తర్కేణ అనుసంధత్యే స ధర్మం వేద నేతరః"

--------(మ.స్మృ12.105,106).

శాస్త్ర ప్రమాణం వల్లే, పరమాత్మ జగత్కారణం అని బ్రహ్మవాదులు విశ్వసిస్తారు.అలాగే సమ్యక్ జ్ఞానం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని మోక్షవాదుల దృఢవిశ్వాసం.

అలాగే సమ్యక్ జ్ఞానం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని మోక్షవాదుల దృఢవిశ్వాసం.

భూత,భవిష్యత్ వర్తమానాలకు చెందిన తార్కికులనందరినీ ఒక చోట చేర్చి నిర్ణయించటం, తార్కికవాదులకు శక్యం కాదు.శ్రుత్యాధారిత జ్ఞానసాధన,సమ్యక్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందనే విషయం నిర్వివాదాంశం.

శ్రుతిపరంగాను,శాస్త్రానుగుణంగా ఉన్న తర్కసిద్ధాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి,

"బ్రహ్మము" జగత్తుకు మూలకారణమని,

నిజస్వభావమని ఇచ్చట నిర్ధారించడమైనది.

🕉🌞🌏🌙🌟🚩

: శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

నవరోజ్‌ రాగః - ఆదితాళమ్‌.

18. సర్వం బ్రహ్మమయమ్‌.

సర్వం బ్రహ్మమయమ్‌

రేరే - సర్వం బ్రహ్మమయమ్‌!

1. కిం వచనీయం కిమవచనీయం

కిం రచనీయం కిమరచనీయమ్‌ || సర్వం||

2. కిం పఠనీయం కిమపఠనీయం

కిం భజనీయం కిమభజనీయమ్‌|| సర్వం||

3. కిం బొద్దవ్యం కిమచోద్ధవ్యం

కిం భోక్తవ్యం కిమభోక్తవ్యమ్‌|| సర్వం||

4. సర్వత్ర సదా హంసధ్యానం

కర్తవ్యం భో! ముక్తినిదానమ్‌|| సర్వం||

🕉🌞🌎🌙🌟🚩

తాత్పర్యము:-

సర్వము బ్రహ్మమయమే! అంతయును బ్రహ్మమే! ఇదంతా బ్రహ్మమే రా!

1. ఇచట ప్రవచింపదగిన దేమున్నది? ప్రవచింపరాని దేమున్నది? చేయదగిన దేమున్నది? చేయగూడని దేమున్నది? అంతయును బ్రహ్మమేరా!

2. చదువదగిన దేమిటి? చదువరాని దేమిటి? సేవింపదగిన దేమిటి? సేవింపరాని దేమిటి? సర్పమును బ్రహ్మమే. (అంతయును బ్రహ్మముగా నెవనికి భాసింపుచున్నదో వానికి విధి నిషేధము లుండవు).

3. తెలియ దగిన దేమిటి? తెలియరాని దేమిటి? తిన దిగిన దేమిటి! తినరానిదేమిటి? అంతటను బ్రహ్మమే నిండి యున్నదిరా!

4. చేయవలసినదొక్కటే! అన్ని వేళల యందును - అన్ని చోటులయందును ముక్తి కారణమైన 'హంస ధ్యానము - హంస ధ్యాన మొక్కటియే' అచరింప వలెను.

సర్వమును బ్రహ్మమే!

హంస ధ్యానము :- గాలిని లోనికి బీల్చుచు 'సో ' అను అక్షరమును - విడుచుచు 'హం' అను అక్షరమును అనుసంధానము చేయవలెను.

'అనుసంధానము = శ్వాసగమనంలో .... ఉచ్వాసకు  'సో ' అను అక్షరమును, నిశ్వాసకు   'హం' అను అక్షరమును భావించుట. ఇదియే హంస ధ్యానము. ఇది బ్రహ్మానుభవమును గలిగించు ప్రక్రియ. వివరములకు 'సూత సంహితను పరిశీలించునది.

 *||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-11-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩

[14:43, 14/12/2020] +91 92915 82862: శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

( సోహం )యే ( ఓం )

మన శరీరములో ప్రతి ఒక్కరికి శ్వాస ఆడుచున్నది. 

శ్వాసను బట్టి ప్రాణమున్నదని లేదని చెప్పవచ్చును. కావున శ్వాసను ప్రాణము అన్నారు. అనగ గాలి అని అర్థము మన శరీరములో ఐదు రకముల గాలులు గలవు. అవి వరుసగ వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాణ వాయువులంటాము. వాటినే పంచప్రాణములని కూడ అనుచున్నాము. 

వీటిలో ప్రాణవాయువు శరీరములో ఊపిరితిత్తులనుండి ముక్కురంద్రముల వరకు వ్యాపించివున్నది. ప్రాణవాయువు రెండు ఊపిరితిత్తుల నుండి ముక్కురంధ్రముల ద్వార బయటికి లోపలికి చలించుచున్నది. మనిషి పుట్టుకలో బయటినుండి శ్వాస లోపలికి ప్రవేశిస్తున్నది, చావులో లోపలి నుండి బయటికి వెళ్లిపోవుచున్నది. శ్వాస బయటినుండి పోయిన, లోపలినుండి బయటికి వచ్చిన రెండుగానే బయలుదేరుచున్నది. 

రెండు ఊపిరితిత్తులనుండి బయలుదేరిన శ్వాస రెండు చీలికలుగానే బయటికి వస్తున్నది. కావున శ్వాసను వృక్షముగ పోల్చి, మొదలులో రెండుకొమ్మలు పుట్టిన వృక్షమని అన్నారు. దానినే ఆది ద్వయంబు వృక్షము అన్నారు. శ్వాస లోపలికి బయటికి చలించడములో రెండు శబ్దములు పుట్టుచున్నవి. అవి సో, హం అను శబ్దములు, శ్వాస వలన కలుగు శబ్దములు కావున విూదటి రెండక్షరములని అని అన్నారు. 

లోపలికి పోవునపుడు ఒక శబ్దము బయటికి వచ్చునపుడొక శబ్దము పుట్టుచు ప్రత్యేకత కల్గియున్నవి. లోపలికి పోవు "సో" శబ్దమును బయటికి వచ్చు "హం" శబ్దములను రెండిటిని కలిసి చూస్తే '"ఓం" అను శబ్దము పుట్టుచున్నది. మొదటిదైన సో శబ్దములో 'ఓ' శబ్దము చివరిగ వినిపిస్తున్నది. 

అలాగే రెండవదైన హం శబ్దములో "మ్‌" శబ్దము వినిపిస్తున్నది. రెండిటిని కలిపితే ఓం అను శబ్దము తయారగుచున్నది. కావున ఆదియు అంత్యము కూడిన అని మూడవ చరణములో అన్నారు.

 ప్రతి జీవరాసి శరీరములోను శ్వాసలో "ఓమ్‌" అను శబ్దము ఇమిడి ఉన్నది. ఆధ్యాత్మికములో అత్యంత ప్రాముఖ్యమైనది కావున వేద వేద్యులకు వేదాంతమని చెప్పారు.

🕉🌞🌎🌙🌟🚩

[14:48, 14/12/2020] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-11-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩

త్వత్సేవనేన దితిరింద్రవధోద్యతా౾పి

తాన్ ప్రత్యుతేంద్రసుహృదో మరుతో౾భిలేభే।

దుష్టాశయే౾పి శుభదైవ భవన్నిషేవా

తత్తాదృశస్త్వమవ మాం పవనాలయేశ!

భావము:-

దేవేంద్రుని సంహరించు అసురశక్తికల కుమారుడు కావలెనని, ప్రభూ! 'దితి' (కశ్యపుని భార్య) నిన్ను సేవించెను. కాని దానికి బదులుగా దేవతా స్వరూపులైన పుత్రులను దితికి ప్రసాదించితివి. ఆ పుత్రులు (మరుత్తులు) దేవేంద్రునితో శత్రుత్వమునకు బదులు మిత్రత్వమును అవలంభించిరి. ఉపాసనా ఆశయము ఏదయినను - భక్తితోచేయు నీ సేవ, శుభఫలమునే ఇచ్చును కదా!. అట్టి మహిమగలిగిన గురవాయూరుపురాధీశా! నన్ను రక్షింపమని - నిన్ను ప్రార్ధించుచున్నాను.

వ్యాఖ్య:-

మరుత్తులు అనగా వాయువులు. దేవ దానవ యుద్ధములో దానవులంతా ఇంద్రుడి చేత సంహరింపబడితే, ఆ బాధతో, పగతో, దితి తన భర్తయిన కశ్యప ప్రజాపతిని శక్ర హంతారం (ఇంద్రుడిని చంపే కొడుకు) కావాలంటుంది. దానికాయన వెయ్యి సంవత్సరాలు నియమ నిష్టలతో, శుచిగా తపోనిష్టలో ఉంటే అటువంటి పుత్రుడు పుడతాడు అని వరమిస్తూ దితిని స్పృశించి తపస్సుకి వెళిపోతాడు. 

ఇంద్రుని మీద పగ తీర్చుకోవాలని శుక్లప్లవనమునకు వెళ్ళి తపస్సు మొదలుపెడుతుంది దితి. ఆమెకు ఎన్నో సపరియలు చేస్తూ ఆమె తపస్సు చేస్తున్న ఆశ్రమంలోనే ఇంద్రుడు ఆమెను కనిపెట్టుకుని ఉంటాడు. 

ఇహ తపస్సు పూర్తవ్వడానికి సరిగ్గా పది సంవత్సరాలు ఉందనగా (అనగా ౯౯౦ సంవత్సరాలు గడిచాక) దితి కాళ్ళు పెట్టుకునే వైపు తల పెట్టుకుని నిద్రపోతుంది. అది చేయకూడని పని కనుక ఆమె అశుచి అవుతుంది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించి గర్భంలోని పిండాన్ని ఏడు ముక్కలు క్రింద కోసేస్తాడు. ఆ నొప్పికి తట్టుకోలేని పిండాలు ఏడుస్తుంటే ఇంద్రుడు “మా రుద” (ఏడవద్దు) అని అంటాడు. 

ఇదంతా తన గర్భంలో జరిగేసరికి దితికి మెలకువ వచ్చి ఇంద్రుడిని బయటకి రమ్మంటుంది. బయటకి వచ్చిన ఇంద్రుడు తన తప్పేమీ లేదనీ, ఆమె అశుచి అవ్వటం వలనే ఇలా చెయ్యవలసి వచ్చిందనీ చెప్తాడు. అది విన్న దితి తన తప్పుని ఒప్పుకుని, తన గర్భస్థ పిండాన్ని చంపినందుకు గాను ఇంద్రుడిని వరం కోరుకుంటుంది.

” బ్రహ్మలోకం చరత్వేకః ఇంద్రలోకే తధాపరః

దివి వాయురితి ఖ్యాతః త్రితయోపి మహాశయాః

చత్వారస్తు సురశ్రేష్ఠ దిశోవై తవశాసనాత్

సంచరిష్యతి భద్రంతే దేవభూతాః మమాత్మజాః

స్వత్కృతేనైవ నామ్నా మారుతాయితి విశృతాః “

ఆ ఏడుగురిలో ఒకరు బ్రహ్మలోకంలో, ఇంకొకరు ఇంద్రలోకములో, మరొకరు భూమి మీద వాయువు అనే పేరుతో ఉంటూ ఈ ముగ్గురూ మహాయశస్సు పొందాలి. మిగిలిన నలుగురూ నాలుగు దిక్కులలో ఉంటూ నువ్వు చెప్పినట్టు వింటూ ఉండేలా చేసి వీరందరినీ దేవతా గణాలలో చేర్చుకో. వీరిని “మా రుద” అని నువ్వు అన్నట్టే మరుత్తులుగా నిశ్చయించాను. ఇకనించీ వీరంతా మారుదులు (మారుతులు) లేదా మరుత్తులుగా ఖ్యాతి పొందేలా చేయి అని కోరుకుంటుంది. దానికి అంగీకరించిన ఇంద్రుడు అలానే దీవిస్తాడు.

ఆ విధముగా ఒక రాక్షసుడు కావలసిన వాడు ఏడు దేవతా గణాలు అయ్యి మరుత్తులు జన్మించారు.

షష్ఠ స్కంధము పరిపూర్ణం

23వ దశకము సమాప్తము.

🕉🌞🌎🌙🌟🚩

[16:54, 14/12/2020] +91 92915 82862: 18-22-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩

అII ఇక తామసజ్ఞానమును గూర్చి తెలుపుచున్నారు—

యత్తు కృత్సవదేకస్మిన్ 

కార్యేసక్త మహైతుకమ్ అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్.

తా:-ఏ జ్ఞానమువలన మనుజుడు ఏదేని ఒక్కపనియందు (శరీర, ప్రతిమాదులందు) సమస్తమును అదియేయని తగుల్కొనియుండునో, అందులకు తగిన హేతువు లేకుండునో, తత్త్వమును (సత్యవస్తువును) తెలియకనుండునో, అల్పమైనదిగ (అల్పఫలము గలిగినదిగ) యుండునో అట్టి జ్ఞానము తామసజ్ఞానమని చెప్పబడినది.

వ్యాఖ్య: - తామసజ్ఞానము కలవాడు ఏదియో యొక దృశ్యవస్తువును పట్టుకొని ఏదియో మునిగిపోయినట్లు దానియందే ఆసక్తిగలిగి, అదియే సమస్తమని తలంచుచుండును. అతడు ఒకవ్యక్తియొక్క శరీరమును మాత్రమేచూచి, ఆ శరీరమే ఆత్మయని అదియే సమస్తమని భావించుచుండును. 

      రాజసజ్ఞానము గలవాడు లోని గుణమును, మనోభావములను మాత్రమే చూచును.        

      సాత్త్వికజ్ఞానముకలవాడు లోని అవిభక్తమగు ఆత్మనే వీక్షించును. చంచలవస్తువులగు దేహము, మనస్సు రెండును వికారవంతములైనవి, అస్థిరములైనవి. కావున వాని నాశ్రయించువాడు, వానియెడల దృష్టిగలవాడు అస్థిరత్వమునే, వినాశమునే, జననమరణములనే పొందుచుండును. నిత్యమై, స్థిరమై, అవ్యయమైనట్టి ఆత్మను ఆశ్రయించువాడు, అట్టి ఆత్మదృష్టిగలవాడు నిత్య, పునరావృత్తి రహిత ఆత్మపదవినే పొందును. కాబట్టి రాజస, తామసజ్ఞానముల రెండిటిని వదలి సాత్త్వికజ్ఞానమునే విజ్ఞుడవలంబించవలెను.

ప్ర:- తామసజ్ఞాన మెట్టిది?

ఉ:- ఏదియో యొక దృశ్యవస్తువును పట్టుకొని దానియందే ఆసక్తిగలిగి, అదియే సమస్తమని భావించునది (దృష్టాంతమునకు శరీరమును జూచి అదియే ఆత్మయని భావించుట),

(2)అందులకు తగిన

హేతువును జూపజాలనిది,

(3) తత్త్వమును, సత్యవస్తువును తెలుపజాలనిది,

(4) అల్పఫలము గలిగి యుండునది తామసజ్ఞానము అనబడును.

🕉🌞🌎🌙🌟🚩

[18:55, 14/12/2020] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  - 97 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 26 - 10 . ప్రాణాయామ యజ్ఞము  -    ఉదాన వాయువు కంఠ భాగమునుండి భూమధ్యము వరకు వ్యాపించి యుండి జీవుని హృదయము నుండి ఊర్ధ్య గతిని కలిగించి, ప్రత్యాహారస్థితి యందు నిలుపును. అపుడు జీవుడు తననొక స్పందనాత్మక చైతన్యముగ కంఠమునందు, నోటియందు, క్రింది తాలువుయందు, పై తాలువు యందు, నాసిక యందు స్పందన ప్రక్రియగ అనుభూతి చెందుచునుండును. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస, హృదయమునందు స్పందన యుండవు. ప్రాణస్పందనము, ప్రజ్ఞ ముఖమున యుండును. 🍀

📚. 4. జ్ఞానయోగము  - 29, 30   📚

Part 10

పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి. 

🌷 4. ఉదాన వాయువు   - 2 🌷 

ఉదాన వాయువు కంఠ భాగమునుండి భూమధ్యము వరకు వ్యాపించి యుండి జీవుని హృదయము నుండి ఊర్ధ్య గతిని కలిగించి, ప్రత్యాహారస్థితి యందు నిలుపును. అపుడు జీవుడు తననొక స్పందనాత్మక చైతన్యముగ కంఠమునందు, నోటియందు, క్రింది తాలువుయందు, పై తాలువు యందు, నాసిక యందు స్పందన ప్రక్రియగ అనుభూతి చెందుచునుండును. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస, హృదయమునందు స్పందన యుండవు. ప్రాణస్పందనము, ప్రజ్ఞ ముఖమున యుండును.

ప్రజ్ఞ ప్రశాంతముగ నుండును. భ్రూమధ్యమున క్రమముగ చేరును. ఈ స్థితిలో సాధకునకు ఆహార విషయమున, ఉచ్చారణ విషయమున విశిష్టమగు నిష్ఠయుండును. పవిత్రమగు ఆహారమును మాత్రమే స్వీకరింపగలడు. పవిత్రమగు భాషణమును మాత్రమే చేయగలడు. అతడిపుడు చేరునది ఆకాశతత్వముగ గనుక, ఆకాశమువలె నిర్మలమగు విషయములందు మాత్రమే ఆసక్తి కలిగి యుండును. 

ప్రాపంచిక ప్రవృత్తులు, దేహప్రవృత్తులు యాంత్రికముగ సాగుచుండును. వానిని విసర్జించ నవసరము లేదు. ఉదాసీనతతో నిర్వర్తించుట యుండును. ఉదాన శబ్దమున 'ఉత్' అను శబ్దముండును. అనగ ప్రాణమాధారముగ జీవు డూర్ధ్వముఖము చెందుటకు దేహమున ఏర్పడిన సౌకర్యమని తెలియవలెను. 

ఆకాశమును చేరినది జీవ ప్రజ్ఞ యగుటచే అది అనంతము, అపరిమితము, సర్వవ్యాపకము అగు తత్త్వమునకు చేరువగుచుండును. భ్రూమధ్యము వరకు చేరి, అనంతత్వములోనికి వంతెన నేర్పరచుకొను ప్రయత్నమున నుండును.

హృదయమునుండి భ్రూమధ్యమునకు చేరు మార్గమున సాధకునికి అనేకానేక దివ్యానుభూతులు కలుగుచునుండును. అనేకములగు దివ్యరూపములు దర్శనమగు చుండును. అనేకములగు దివ్య విషయములు వినపడుచుండును. రకరకముల కాంతి దర్శనము లగుచుండును. 

అట్లే వివిధములగు వాయిద్యములు వినబడుచు నుండును. ఈ సమస్త దర్శనమును నాదబిందు కళాత్మకముగ పెద్దలు వివరించుచు నుందురు. వీని కాకర్షింప బడక ఊర్ధ్వమునకు సాగుట ఉత్తమమని పెద్దలు తెలిపిరి. 

భ్రూమధ్యమున చేరిన త్రిగుణాత్మక జీవప్రజ్ఞ, త్రిగుణముల కావలనున్న త్రిగుణాతీతమగు తత్వముతో అనుసంధానము చెందుటయే ప్రధానము కాగ, ఉదాన వాయువు వ్యానవాయువుతో అనుసంధానము చెందుట ప్రారంభమగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[18:55, 14/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 295🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

71. అధ్యాయము - 26

🌻. దక్షుని విరోధము  - 3 🌻

దక్షుడిట్లు పనికెను-

మీ రుద్రగణముల వారందరు వేద బాహ్యులు, వేదమార్గమును వీడినవారు, మరియు మహర్షులచే త్యజించబడినవారు అగుదురు గాక! (26) మీరు నాస్తిక సిద్ధాంతమునందు శ్రద్ధగలవారు, శిష్టుల ఆచారమునుండి బహిష్కరింపబడినవారు, మద్యపానమునందు అభిరుచిగలవారు, జటలను, భస్మను, ఎముకలను ధరించువారు అగుదురు గాక! (27).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుడీ విధముగా శివకింకరులను శపించగా, ఆ మాటలను విని శివునకు ఇష్టుడగు నంది మిక్కిలి కోపావిష్టుడాయెను (28). శిలాదుని కుమారుడు, తేజశ్శాలి, శివునకు ప్రియుడు అగు నంది మహాబలుడు, గర్విష్ఠి అగు ఆ దక్షునితో వెంటనే ఇట్లనెను (29).

నందీశ్వరుడిట్లు పలికెను -

ఓ దక్షా! మోసగాడా! దుర్బుద్ధీ! శివతత్త్వము నెరుంగని నీవు బ్రాహ్మణ చాపల్యముచే శివగణములను వృథాగా శపించితివి (30). బ్రాహ్మణాహంకారము గల వారు, దుష్ట బుద్ధులు, మరియు మూర్ఖులునగు భృగ్వాది ఋషులు కూడా మహాప్రభువగు మహేశ్వరుని ఉపహాసము చేసిరి (31). 

ఇచట నున్న బ్రాహ్మణులలో ఎవరైతే రుద్రుని యందు నీవు వలెనే విముఖత గల దుష్టులో, వారిని రుద్రుని తేజస్సు యొక్క మహిమను గలవాడనగు నేను శపించుచున్నాను (32). మీరు వేదములయందలి అర్థవాదముల యందు మాత్రమే శ్రద్ధగలవారై, వేద తత్త్వము నెరుంగజాలని బహిర్ముఖులై, నిత్యము ఇతరము మరి ఏదీ లేదని పలికే విప్రులు అగుదురు గాక! (33).

ఓ విప్రులారా! మీరు కామనలతో నిండిన మనస్సు కలవారై, స్వర్గమే సర్వస్వమనే ధారణ గలవారై, క్రోధ లోభ గర్వములతో కూడియున్నవారై, సిగ్గును వీడిన నిత్య యాచకులై అగుదురు గాక! (34) ఓ బ్రాహ్మణులారా! మీరు వేదమార్గమును వీడి శూద్రులచే యాగములను చేయించి, ధనమును సంపాదించుటయే ధ్యేయముగా గల దరిద్రులు అగుదురు గాక! (35) 

ఓ దక్షా! దుష్టులనుండి దానములను స్వీకరించు వీరందరు నరకమును పొందగలరు. మరికొందరు బ్రహ్మ రాక్షసులగుదురు (36). ఎవడైతే శివుని దేవతలలో ఒకనిగా భావించి, ఆ పరమేశ్వరుని విషయములో ద్రోహబుద్ధిని కలిగియుండునో, అట్టి దుష్టబుద్ధియగు దక్షుడు తత్త్వము నుండి విముఖుడగును (37).

దక్షుడు గృహస్థుడై కుట్రలే ధర్మముగా గలవాడై, నిత్యము తుచ్ఛ సుఖములను కోరి కర్మ తంత్రమును విస్తరించువాడై, ఇదియే శాశ్వత వేద ధర్మమని భ్రమించి (38), ముఖములో ఆనందము లేనివాడై, ఆత్మ జ్ఞానమును విస్మరించి, పశువువలె అజ్ఞానియై, కర్మ భ్రష్టుడై, నిత్యము నీతి మాలిన వాడై అగును. ఈ దక్షుడు తొందరలో మేక ముఖము కలవాడగును (39). 

దక్షుడు ఈశ్వరుని శపించగా, కోపించిన నంది అచటి బ్రాహ్మణులను శపించగా, అచట పెద్ద హాహాకారము బయలుదేరెను (40). నేనా మాటలను విని ఆ దక్షుని, భృగ్వాది బ్రాహ్మణులను కూడ అనేక పర్యాయములు నిందించితిని. వేద ప్రవర్తకుడనగు నేను శివతత్త్వము నెరుంగుదును గదా! (41) సదాశివుడు నంది యొక్క వచనములను విని చిరునవ్వును అల్పముగా ప్రకటించి, ఆతనికి బోధించగోరి ఈ మధుర వాక్యములను పలికెను (42).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[18:55, 14/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 182 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వామిత్రమహర్షి  - 2 🌻

06. మనందరికీ విశ్వామిత్రమహర్షి ప్రసాదమే ‘గాయత్రీ మంత్రం’. ‘విశ్వామిత్ర ఋషిః గాయత్రీ ఛందః ‘ అని మనం నిత్యమూ అంటూంటాము. ప్రతీసంధ్యావందనంలో మూడు మాట్లు మనం అనుకునేది ఈ ఋషిస్మరణ. 

07. ‘త్రిపదా షట్‌కుక్షిః’ అని అనేక విషయములలో ఉన్నది ఆ గయత్రీ మహామంత్రం. అది సంపూర్ణమయినది. గాయత్రి యొక్క మగత్తు ఎంతటిదంటే మూడు వేదములూ క్షుణ్ణంగా పారాయణ చేసి, వాటిని ముఖస్థం చేసుకుంటే వచ్చే పుణ్యమేదో గాయత్రి స్మరణ చేస్తే వస్తుందని, దానికి తుల్యమైన మంత్రమే లేదని పెద్దల బోధ. 

08. త్రిమూర్తులు అందులో ఉన్నారు; త్రిమూర్తుల శక్తులు అందులో ఉన్నాయి. సమస్త ప్రకృతీ అందులో ఉంది. పరబ్రహ్మ వస్తువది. అందులో ఆద్యంతములు ఉన్నాయి. అదే మనకు రక్ష. దాని ఉపదేశమే మనిషికి ద్విజత్వాన్ని, పశువుకు విప్రత్వాన్ని ఇస్తుంది. పశువుకు విప్రత్వం ఇవ్వగల్గినటువంటి ఉత్కృష్టమయిన మంత్రంగా గాయత్రీమంత్రం జగత్పూజ్యమయింది. దానికి ఋషి విశ్వామిత్రుడు.

09. దేవతలయినా భూమి మీద పుట్టిన తరువాత సంసారంలో ప్రవేశించకపోవటం కష్టం. ప్రవేశించాక కామక్రోధాదులకు లోను కాకుండా ఉండటం మరీ కష్టం.

రామలక్ష్మణులు ఆయనను, “ఇంత అస్త్రబలసంపన్నులే మీరు! మీరే తృటిలో ఈ రాక్షసులును చంపగలరుకదా! మమ్మల్ని ఎందుకు పిలిపించారు?” అని అడిగారు. 

10. అప్పుడు విశ్వామిత్రుడు, “నేన్ను బ్రహ్మర్షిని అయిన తరువాత నా కర్తవ్యం ఏమీ లేదు నాయనా! క్షత్రియులచేత చేయించవలసిన పనే ఉంది. నేను తలపెట్టిన యాగం లోకక్షేమం కోసమే!” అన్నాడు. 

11. ఆ వంకతో రాముడి సన్నిధిలో యాగంచేద్దామని ఆయన ఉద్దేశ్యం. సాక్షాత్ విష్ణుస్వరూపుడైన రాముడే ప్రత్యక్షంగా ఎదురుగా ఉండగా, ఇక విష్ణువును ప్రత్యేకంగా యజ్ఞంలో ఆవాహనచేసి, రెండక్షతలు వేసి విగ్రహం పెట్టటమెందుకు? ‘విష్ణుమావాహయామి స్థాపయామి’ అనట్మెందుకు విష్ణువు ఎదురుగా ఉండగా? కాబట్టి మంత్రంమీద ఆధారపడక, విష్ణువు మీదనే ఆధారపడ్డాడు విశ్వామిత్రుడు. 

12. ఏ విష్ణువు యొక్క అనుగ్రహంతో లోకంలో రాక్షస సంహారం చేయదలచుకున్నాడో, ఆయననే తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[18:55, 14/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 121 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ

504. ఈ మానసిక గోళములో,  మనోభువనము - ఆరవ భూమిక  నుండి ప్రధాన దేవదూతలు భగవంతుని చూడలేరు. కాని ఆరవ భూమికలో నున్న మానవుడు భగవంతుని ముఖాముఖీ సర్వత్రా సమస్తమందు చూడగలడు, చూచుచున్నాడు.

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర  - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 1 🌻

శాశ్వత అనంత సత్యస్థితి  - అహం బ్రహ్మాస్మి  - నేను భగవంతుడను, విజ్ఞాన భూమిక.

505. తన దృష్టిని క్రమముగా క్రిందికిదించి, తన పైననే దృష్టిని మరల్చుట సప్తమ భూమికను చేరుటవంటిది.

506. నిర్వాణస్థితి దాటిన తక్షణమే "అహం బ్రహ్మాస్మి" స్థితి ఎఱుకతో అనుభవనీయమగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

శ్రవణం నక్షత్ర ప్రధమ పాద శ్లోకం

శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! బలరామకృష్ణుల పౌగండ వయస్సునకు చేరిన పిమ్మట తమ ఆఱవ ఏట ఆవులను మేపసాగిరి. వారు తమతోడి బాలురతోగూడి బృందావనమున గోవులను కాయుచు తమ పవిత్ర పాదస్పర్శచే ఆ ప్రదేశమును పునీతమొనర్చుచుండిరి.

ఆ వనప్రదేశము అంతయును పశుగ్రాసమునకు అనువగు చక్కని పచ్చిక బయళ్ళతోను, ఆకులలములతోను, వివిధములగు పూవులతోను ఒప్పుచు బలరామునితో, గోపబాలురతోగూడి, గోవులను మేపుచు ఆ వనమున విహరించుటకై శ్రీకృష్ణుడు వేణువును ఊదుచూ (మ్రోగించుచూ) బయలుదేఱెను. గోపకుమారులు ఆ నందనందనుని వైభవమును కీర్తించుచుండిరి. తన అన్నయు, మిత్రులును తనను అనుసరించి వచ్చుచుండగా ఆ యశోదా తనయుడు గోవులను తోలుకొనుచు ఆ వనమున ప్రవేశించెను. 

ఆ వనమునందలి తుమ్మెదల ఝంకారములు ఇంపుగొలుపుచుండెను. చంగుచంగున ఎగురుచు పరుగిడుచున్న లేళ్ళ (మృగముల) కదలికలు మనోజ్ఞముగా నుండెను. పక్షుల గుంపులు అటునిటు తిరుగుచు కలకలారావములు చేయుచుండెను. అందలి సరోవరజలములు మహాత్ముల మనస్సులవలె నిర్మలములై, చల్లదనమునకు పేరుమోసినవి. చక్కగా వికసించిన పద్మముల మీదుగా వీచుచున్న అచటి వాయువులు అంతటను సువాసనలు వెదజల్లుచుండెను. ఆ వనవైభవమునకు ముగ్ధుడై, శ్రీకృష్ణుడు అందు క్రీడించుటకు ముచ్చటపడెను.

అచటి చెట్లన్నియును ఎర్రని లేలేత చిగురుటాకులతో, బాగుగా వికసించిన పూవులతో, కమ్మని ఫలములతో ఒప్పుచు, వాటి బరువునకు వంగిన కొమ్మలతో వాటి కోమల పాదములను స్పృశించుచున్నట్లు (ముద్దాడుచున్నట్లు) ఉండెను. అంతట శ్రీకృష్ణుడు ఆ కొమ్మల అందచందములను, ఆ వృక్షముల తీరుతెన్నులను ఆశ్చర్యముతో తిలకించుచు, సంతోషపూర్వకముగా తన అన్నతో ఇట్లనెను.

శ్రీభగవానువాచ

శ్రీభగవానుడు ఇట్లనెను అన్నా! బలరామా! ఇటు చూడుము. ఇచటి  వృక్షములు తమ శాఖలు (కొమ్మలు)  అనెడి చేతులలో పూవులను, ఫలములను నింపుకొని, ఇంద్రాదిదేవతలచే పూజింపబడు నీ పాదములకు వాటిని అర్పించుచు ఆరాధించుచున్నవి. వినమ్రులై నమస్కరించుచున్నవి. అవి తమ చిలుకపలుకుల ద్వారా ఆత్మీయతను ప్రకటించుచు "స్వామీ! మేము పూర్వజన్మలలో చేసికొనిన పాపకర్మల ఫలితముగా వచ్చిన మా వృక్షజన్మను తొలగించి, మాకు ఉత్తమ జన్మను ప్రసాదింపుము" అని వేడుకొనుచున్నట్లు ఉన్నవి.

ఆదిపురుషా! (ఆదిశేషా!/బలరామా!) ఈ తుమ్మెదలను పరికింపుము. సకలలోకములను పునీతమొనర్చునట్టి నీ యశస్సును ఇవి తమ ఝంకార నాదములతో కీర్తించుచు, నిరంతరము నిన్ను సేవించు చున్నవి. బహుశః ఇవి ఇంతకు పూర్వము నిన్ను భక్తిశ్రద్ధలతో పూజించుచుండెడి మునీశ్వరులై యుండవచ్చును. అందువలననే, పుణ్యాత్ములకు ఆరాధ్యదైవమైన నీవు, ఇప్పుడు గూఢముగా గోపాలుని రూపములో ఉన్నను, ఇవి నిన్ను వీడకున్నవి.

ఎల్లరకును పూజ్యుడవైన సోదరా! ఇచటి ప్రాణులకు ఈ వనమే గృహము (నివాసస్థానము). తమ ఇంటికి వచ్చిన నిన్ను జూచి, ఇవి సంతోషముతో పొంగిపోవుచున్నవి. నీలాంబరుడవైన నిన్ను జూచి, మేఘముగా భావించి, నెమళ్ళు ఆనందముతో నృత్యము చేయుచున్నవి. హరిణములు గోపికలవలె అందమైన తమ తళుకుబెళుకు చూపులతో నిన్ను గాంచుచు మురిపింప చేయుచున్నవి. కోకిలలు హర్షాతిరేకముస మధురమైన తమ కుహూకుహూ రావములతో (పంచమస్వరములతో) స్వాగతము పలుకుచున్నవి. ఇంత యెందులకు? ఈ వనమున గల పశుపక్ష్యాదు లన్నియును నీ రాకతో ధన్యములైనవి. సహృదయులైనవారు తమ గృహమునకు వచ్చిన అతిథికి స్వాగత సత్కారములు నెఱపుచుందురు. వారి స్వభావమే అంతగదా!

అన్నా! కోమలములైన పచ్చికబయళ్ళతో ఒప్పుచున్న ఈ ధరణి నీ పాదస్పర్శకు నోచుకొనుటతో ధన్యురాలైనది. వృక్షములు, లతలు సుఖావహమైన  నీ కర (నఖ) స్పర్శతో కృతార్థములైనవి. నీ కరుణా కటాక్షవీక్షణములకు పాత్రములైన ఈ నదులు, గిరులు, పక్షులు, మృగములు చరితార్థములైనవి. ఎల్లప్పుడు లక్ష్మీదేవి కోరుకొనెడి మనోహరమైన నీ వక్షస్థలస్పర్శవలన గోపికలు పారవశ్యమును అనుభవించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి   పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

.పాశురము

ॐॐॐॐॐॐॐॐॐ

    మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

    నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

    శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

    కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

    ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

    కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

    నారాయణనే నమక్కే పఱై దరువాన్

    పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము :-

 సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.

        తిరుప్పావైగీతమాలిక

    అవతారిక:

వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.

    1వ మాలిక

        (రేగుప్తి రాగము -ఆదితాళము)

ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!

    భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!

అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!

    మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!

1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని

    యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని

    నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని

    నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి

2. ఛ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము

    పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము

    లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము

    మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.

🕉🌞🌎🌙🌟🚩

ఇది మార్గశిరమాసము. వెన్నెల నిండిన మంచిరోజు. ఓ అందమైన ఆభరణాలుగల పడుచులారా ! ఈ మార్గశిర స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండి, ముందు నడవండి. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధముగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీనందగోపుల కుమారుడను, అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును, నీలమేఘశ్యాముడను, ఎర్ర తామరులను పోలిన కన్నులు కలవాడును, సూర్యునివలే ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఇచ్చేటటువంటి దివ్య ముఖమండలము కలవాడును అయినవాడు నారాయణుడే. అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకే, మనసు ఉపేక్షించు వ్రాతసాధనమగు 'పర' అను వాద్యమును ఈయనున్నాడు. మనము ఈ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించునట్లు, మీరు అందరూ వచ్చి, ఈ వ్రతములో చేరండి.                     

అవతారిక

గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూలమగు కాలము మనకు లభించినదే అని, ఆ కాలమును ముందుగా పొగుడుచున్నారు. ఈ వ్రతము చేయుటకు తగిన వారెవరో నిర్ణయించుకొనుచున్నారు. ఈ వ్రతము చేసి, తాము పొందదగిన ఫలమేమో, దానిని పొందించు సాధనామేమో స్మరించుచు ఈ పాశురమును పాడుచు ఆనందించుచున్నారు.

🕉🌞🌎🌙🌟🚩 

[00:08, 15/12/2020] +91 92915 82862: ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ధనుర్మాసానికి ఎందుకు అంత  విశిష్టత ?

🕉️🌞🌏🌙🌟🚩

రాబోయేకాలం ధనుర్మాసమే, 

ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము.

👉🏼కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. 

🎋చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు  ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . 

ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు . . . అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు .

ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. 

🌺మానవులకు ఒకసంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు . ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది . సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం . అనగా . . . ఇది రాత్రి కాలం . మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం . అనగా . . . పగలుగా భావన . ఇలా భావిచినప్పుడు . . . దక్షిణాయనమునకు చివరిది . . . ఉత్తరాయణమునకు ముందుది ఐనదే ధనుర్మాసం.

🌻 ప్రాతఃకాలమువలె పవిత్రమైనది . . . సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది . కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు . . . ఈ నెల విష్ణుమూర్తికి  ప్రీతికరమైనది. గోదాదేవి  కథ ఈ మాసమునకు సంబంధించినదే.

🌞 సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు.

👉🏼ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.

🍁కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది.

🔥 ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల  మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.

ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.

🌾ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది.

ధనుర్మాసఫలశ్రుతి:

ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్క రోజు అయినా మనసా వాచ కర్మణా యదాశక్తిగా పూజించిన యెడల 1000 యేళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితము కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలోకాని లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ  పుణ్య జలంలోకాని లేదా ఒక చెరువు లోకాని మీకు తోచిన పుణ్య స్థలంలో  ఒక్క మునుగు మునుగిన 4 రెట్లు అశ్వమేధయాగం చేసిన ఫలితము దక్కును.

🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹

🙏లోకాసమస్తా శుఖినోభవంతు🙏

🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏

🕉️🌞🌏🌙🌟🚩

 గోదాదేవి.. భక్తి పారవశ్యం

నీలాతుంగ స్తనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం

పారార్థం స్వం శృతిశతశిరస్సిద్ధం అధ్యాపయంతీ

స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా 

బలాత్కృత్యభుంక్తే

గోదా తస్యై నమ ఇదమిదం భూయయేవాస్తుభూయః

స్వోచ్ఛిష్టమాలికా బంధ గంధ బందుర జిష్ణవే

విష్ణుచిత్త తనూజాయైు గోదాయైు నిత్యమంగళం

భక్తుడికి భగవంతుడిపై సర్వాధికారాలూ ఉంటాయని ప్రపంచానికి తెలిపిన తన్మయి , ఆండాళ్‌ గోదాదేవి. తులసి వనంలో జన్మించి , భట్టనాథ ఆళ్వార్‌కి పెంపుడు బిడ్డయైు వటపత్రశాయి భక్తురాలై.. స్వామితో అనన్య సంబంధం పెంచుకొని , తాను ధరించిన పూదండనే తనకి ప్రియమైనదని ఆ దేవుడితోనే అనిపించుకొన్న మహాభక్తురాలు. ఆ స్వామిని పొందడానికి , అలనాటి గోపికల కాత్యాయినీ వ్రతం లాగా , తానూ ప్రధాన గోపికగా ఊహించుకొని , తన స్నేహితురాండ్లని గోపికలుగా తీర్చిదిద్ది , అనన్య భక్తురాలిగా కీర్తింపబడి భక్తులందరూ చూచుచుండగా , శ్రీరంగనాథుడి ఆకాంక్షల మేరకు , జ్యోతిలా మారి ఆయన్ను చేరిన భక్త శిరోమణి. ఆమె 30 పాశురములు / పాటలు రాసి , పాడి మన కోరికలు తీరడానికి తిరుప్పావై పేరిట భక్తులకు ధారపోసింది.

ధనుర్మాసం.. భక్తపారవశ్యంతో కూడుకున్న పండుగ. గోదాదేవి స్వామి వ్రతం చేసి , నారాయణుని పలువిధాల కీర్తించి కృష్ణమందిరం చేరి , కృష్ణకుటుంబాన్ని లేపి తాము వచ్చిన కార్యం గురించి విన్నవించుకుంటుంది.

తమని ఎలా కటాక్షించాలో కూడా తానే భక్తవివశయైు సూచిస్తుంది. సింహం గుహ నుండి వచ్చిన విధంగా కృష్ణుడు వచ్చి సభలోకి తమని ఆహ్వానించాలనీ , తమ గురించి స్వయంగా అడిగి తెలుసుకోవాలని.. అప్పుడు తమ కోరికలేమిటో వివరంగా విన్నవించుకోవాలనీ కృష్ణుడికి , ద్వారపాలకుల ద్వారా తెలియపరుస్తుంది. ఆమె సూచించిన మేరకే కృష్ణుడు కొలువు తీరి కుశల ప్రశ్నలు వేసి *‘మీ కోరికలేమిట’ ని  అని అడుగుతాడు. దానికి గోదాదేవి.. ‘కల్యాణ గోవిందా ! మీరు ఈ ఆడపిల్లలందరికి సన్మానం చేయాలి. చేతి ఆభరణాలు గాజులు కంకణాలు , భుజకీర్తులు కర్ణాభరణాలైన చెవిదిద్దులు , పాదా భరణాలు , మాకు సరిపడే సరిపోయే దుస్తులు ఇవ్వాలి. అవి మాకు నచ్చునట్లుగా మీరే సవరించాలి. మాకు భజించడానికి సంగీత పరికరాలు కావాలి. ఆ తరువాత పాలల్లో మునిగిన అన్నం తింటుంటే నోటి నుండి కారి మోచేతుల మీదుగా ప్రవహించేట్టుగా నెయ్యి ఉండాలి.

ఇంతేకాదు గోవులను కాచే గోవిందా ! నీవు మాలో ఒకడిగా ఉంటూ భుజించాలి. నీకు , మాకు ఉన్న సంబంధం విడదీయరానిది. మనం అంతా గొల్లవారమే తెంపినా తెగని సంబంధం. మేము అజ్ఞానులమని విదిలించుకోవద్దు. నీ మీద ప్రేమతో చనువుగా ఉన్నందుకు కోపగించుకోవద్దు. నీ పాదాలని మేము తనివితీరా స్పృశించే విధంగా కడిగే విధంగా మీరు సహకరించాలి’ అంటూ గోదాదేవి భగవత్‌ సాన్నిధ్యాన్ని , అనుభవించి అకారత్రయములైన జ్ఞానభక్త ప్రపత్తులను అనన్యగతిత్వమును , అనన్య శరణత్వమును , అనన్య భోగ్యత్వమును అదేవిధముగా పరమాత్ముడి భక్తవశంకరత్వాన్ని అశేష జనానికి ప్రసారం చేసింది.

🕉️🌞🌏🌙🌟🚩

 తిరుప్పావై అంటే ఏమిటీ? వీటి ప్రాశస్త్యం ఏమిటి?

👌 ఏమిటా తిరుప్పావై❓️ ఏముంది అందులో ❓️ కేవలం ముప్పై పాటలే కదా అని అనుకోకూడదు. చూడటానికి పైపైకి ఒక కృష్ణ-గోపికల కథగా కనిపిస్తుంది. ఒక దూది పువ్వుని విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి. ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇకపై వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇమిడి ఉంది. అందుకే తిరుప్పావైని ఐదో వేదం అంటారు.

 👌 తిరుప్పావై ఏమిటో తెలిసింది, మరి అందరూ చెయ్యవచ్చా? శ్రీకృష్ణుడి కోసం చేసేది "నీవే తల్లివి తండ్రివి ....." అని అందరం చిన్నపుడు చదివిందేకదా, అందరూ చెయ్యవచ్చు ఈ వ్రతం.

👌మరి ఎప్పుడు ఆచరించాలి? ఒక రైతు పంట పండించేందుకు నారు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా, అంతెందుకు పరీక్షలో మంచి మార్కులు రావడానికి తెలతెలవారే సమయంలో లేచి చదివుతాడు ఒక విధ్యార్థి. మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం. సూర్యుడు ధనుః రాశిలో ప్రవేశించి ఉంటాడు. ఆంగ్ల మానం ప్రకారం డిసెంబరు 16 నుండి మొదలై సంక్రాంతి వరకు. ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం.

 👌వ్రతం చేసే సమయం తెలిసింది, వ్రతం చేయటం కష్టం కాదా? కాదు, ఇది అతి సులభమైనది. తెలతెల వారే సమయంలో స్నానం చేయ్యటం, ఆరోజు పాశురం చదివి, ఆపై శ్రీకృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం. ఇక ఆయా పాశురాల అర్థం వినడం అంతే. శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం.

💐 పాండ్యేవిశ్వంభరాం గోదాం వందే  శ్రీరంగనాయకీం 💐

[05:08, 15/12/2020] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ  అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

[05:15, 15/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

754వ నామ మంత్రము

ఓం అపర్ణాయై నమః

పరమశివుణ్ణి తప్ప వేరొకరిని వివాహం చేసుకోను అని కఠోరమైన తపస్సులో చివరకు ఆకులు సహితం భక్షించకుండా దీక్షవహించిన పార్వతీ స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అపర్ణా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం అపర్ణాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిప్రపత్తులతోను, ఏకాగ్రచిత్తముతో ఆరాధిస్తే భక్తులు ఆ తల్లి కరుణచే 'అప్పులు చేయకూడదనియు, తాము పడ్డకష్టానికి ప్రతిఫలంగా వచ్చినదే చాలుననియు, ఉన్న దాంట్లోనే తృప్తినందగలమనే' మానసికమైన మార్పుతోనూ మరియు శాంతిసౌఖ్యములతోను జీవింతురు.

హిమవంతుడు ఒక పర్వతరాజు.  పరమేశ్వరి అంశతో మేనక హిమవంతులకు ఒక కుమార్తె జన్మించినది. పర్వత రాజు కుమార్తె గనుక ఆమె పార్వతి అను నామముగలదు. అలాగే హిమవంతుని కుమార్తె గనుక హైమావతి అను పేరుకూడా గలదు.  ఈ బాలిక పెద్దదికాగానే, తాను పరమశివుణ్ణి తప్ప అన్యులను వివాహమాడనని సంకల్పించుకుని తపస్సు చేయడానికి అరణ్యములకు వెళ్ళింది. 

వివిధ పద్ధతులలో, కఠోరమైన తపస్సు కొనసాగించినది. మహాతాపాన్ని కలిగిస్తున్న ఎండవేళ చుట్టూ నాలుగు అగ్నులు, ఆకాశంలో మండుతున్న సూర్యగోళం, ఆ వేడికి ఎర్రబడి మండుతున్న బండరాయి -– ఇవన్నీ నిలువ సాధ్యం కాని పరితాపాన్ని కలిగించే పరిస్థితులు. మనకి ఊహించుకుంటేనే భయం వేసే ఈ సన్నివేశంలో ఆ హైమవతి తపస్సుచేసినది.  

హేమంతశిశిరాల్లో (శీతాకాలంలో) ఆ ఉమ నిరాహారిణి అయి, నిత్యమూ మెడలోతు నీటిలో నిలబడి తపస్సు కొనసాగించింది.

హోరున వర్షం, కొన్నిసార్లు తల పగిలే వడగళ్ళు పడుతున్నప్పుడు కూడా పరమేశ్వరుని తనవాడిగా చేసుకోవడానికి దృఢదీక్షతో తపస్సు కొనసాగించినది.

కొంతకాలం ఒకపూట మాత్రం భోజనం చేస్తూ తపస్సు చేసినది.

మరికొంతకాలం భూమిపై (కటికనేలపై) పరుండినది.

కొంతకాలం ఆహారంగా కాయలు, పళ్ళు తింటూ తపస్సు చేసినది.

కొంతకాలం కేవలం ఆకులు మత్రమే తిని తపస్సుచేసినది.

పరమశివునికి కనికరం కలగక పోవడంతో ఏదైనా ఆహారం మాట అటుంచి ఇంతకు ముందు ఆకులు (పర్ణములు) తినేది కాస్తా ఆ ఆకులు  కూడా తినకుండా తపస్సు మరింత కఠోరం చేయడంతో ఆమె అపర్ణ అను సార్థకనామధేయముతో విరాజిల్లినది. 

చివరకు పరమశివుని చేపట్టి ఆయనదేహంలో సగం తన సొంతంజేసుకుని అర్థనారీశ్వరతత్త్వానికి ప్రతీకగా నిలచినది.

తలపై గంగ ఉన్నా, ఆ గంగను తలదన్నే ప్రేమతో పరమశివుని దేహంలో సగం దేహమై విరాజిల్లినది.

ఎవరో (భగీరథుడు) పిలిచారు. ఎవరికోసమో (సగరచక్రవర్తి కుమారుల శాపవిమోచనార్థమై) పోతూ మధ్యలో మజిలీ వేసిందిగాని సవతిగా కాదని వాదించిన మహా గడసరి పార్వతి.

అపర్ణ అనగా  ఋణము తీర్చినది. అనగా జగన్మాత తన భక్తులకు ఋణబాధలు లేకుండా కరుణించుతుంది గనుక అపర్ణా యను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది.

పర్ణము అనగా ఆకు. శిశిరఋతువులో చెట్లు ఆకులు (పర్ణములు) లేకుండా ఉంటాయి. గనుక శిశిరఋతువును కూడా అపర్ణ యను పదముతో సమన్వయించగా జగన్మాత శిశిరఋతు స్వరూపిణియై అపర్ణ యను నామాంకితగా తెలియవచ్చును.

అపర్ణ యను ఈ నామమును సంపుటి చేసి జపించినవారికి ఋణభారం లేకుండా జగన్మాత కాపాడుతుంది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అపర్ణాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[05:15, 15/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

180వ నామ మంత్రము

ఓం నిర్నాశాయై నమః

జగత్తులో అన్నీ  నాశనమవుతాయి. నాశనంకాని (అంతంలేని) పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్నాశా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిర్నాశాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను భక్తిప్రపూరిత హృదయములతో ఉపాసన చేయు సాధకులకు ఆ తల్లి విశేషమైన ఆధ్యాత్మికజ్ఞానమును ప్రసాదించి ఆత్మానందానుభూతిని కలుగజేయును.

సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మే తి శ్రుతిః - సత్యము, జ్ఞానము అనంతము అను ఈ మూడు లక్షణములే  పరబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయిన శ్రీమాతయే సత్యము. అంతము లేనిది. సృష్టికిముందు, సృష్టికి తరువాత, ప్రళయకాలంలో కూడా ఆ తల్లియే. వీటికన్నిటికీ కారణమయిన పరమాత్మయే ఆ తల్లి. సత్యస్వరూపిణి కూడా ఆ తల్లియే. ఈ సృష్టిలో కంటికి కనిపించేవి అన్నిటికీ అంతం ఉన్నది. ఏర్పడతాయి. ఉపయోగపడతాయి. మాయమవుతాయి. కాని పరమాత్మయే ఆదిమధ్యాంతములు  లేనిది ఆ ఒక్క పరమాత్మయే. అంటే నాశనము లేనిది. 

లయకాలంలో భూమి నీటిలోను నీరు నిప్పులోను, నిప్పు వాయువులోను, వాయువు ఆకాశంలోను, చివరగా ఆకాశం మాయలోనూ కలుస్తాయి. దీనినే మహానిష్క్రమణ అంటారు. కాని కర్మక్షయం కాని జీవులు మాత్రం కర్మను తమతో ఉంచుకొని మాయలో లీనమౌతారు. ఉండేది ఆ పరబ్రహ్మమొక్కటే. అంటే నాశనము లేనిది. కాబట్టి పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాత నిర్నాశా యని  అనబడినది.

అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం నిర్నాశాయై నమః

🌸💐💐💐

🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 23 🌴

23. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ: స్మృత: |

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా: పురా ||

🌷. తాత్పర్యం : 

సృష్ట్యారంభము నుండియు “ఓం, తత్, సత్” అను మూడు పదములు పరతత్త్వమును సూచించుటకు వాడబడినవి. వేదమంత్రములను ఉచ్చరించునపుడును, పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణము కావించునపుడును ఈ మూడు సంజ్ఞాపదములు బ్రాహ్మణులచే ఉపయోగింపబడుచుండెడివి.

🌷. భాష్యము  :

తపస్సు, యజ్ఞము, దానము, ఆహారమనునవి సాత్త్వికము, రాజసము, తామసములనెడి మూడు రకములని ఇంతవరకు వివరింపబడినది. ఈ విధముగా ప్రథమ, ద్వితీయ, తృతీయ తరగతులకు చెందినను అవి ప్రకృతిజన్మములైన త్రిగుణములచే బంధింపబడునట్టివి మరియు మలినపూర్ణములైనట్టివి. 

కాని అట్టి కర్మలు నిత్యుడగు శ్రీకృష్ణభగవానుని (ఓం, తత్, సత్) పరములగునప్పుడు ఆధ్యాత్మికపురోగతికి దోహదములు కాగలవు.

 శాస్త్రనిర్దేశములందు అట్టి ప్రయోజనమే సూచించబడినది. ఓం, తత్, సత్ అనెడి ఈ మూడుపదములు ముఖ్యముగా పరతత్త్వమైన దేవదేవుని సూచించును. ఇక వానిలో “ఓం” అనునది అన్ని వేదమంత్రములందును గోచరించును. శాస్త్రనియమముల ననుసరింపనివాడు పరతత్త్వమును పొందలేడు. 

ఒకవేళ అతడు తాత్కాలికలాభములను పొందినప్పటికిని జీవితపు అంతిమఫలమును మాత్రము సాధింపలేడు. సారాంశమేమనగా దానము, యజ్ఞము, తపస్సు అనువానిని సత్త్వగుణము నందే ఆచరింపవలెను. రజస్తమోగుణములందు ఒనరింపబడెడి ఆ కార్యములు గుణహీనములై యుండును. 

మనుజుని భగవద్దామమునకు తిరిగి చేర్చు ఆధ్యాత్మికకర్మలను శాస్త్రీయముగా ఒనర్చు విధానమే అట్టి కృష్ణభక్తిరసభావనము. అట్టి దివ్యమార్గమున వర్తించుటలో ఎన్నడును శక్తి వృథా కాబోదు.

🌹 🌹 🌹 🌹 🌹

అతీతః ఇంద్రియాణి ఇంద్రియములను అతిక్రమించిన వాడు. ఇంద్రియములవలన అనుభవమునకు అందనివాడు. అశబ్ధ మస్పర్శనమ్ ఇత్యాదిశ్రుతిచే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనునవి ఏ మాత్రమును లేనివాడు కావున ఈ పంచ విషయములను గ్రహించగల జ్ఞానేంద్రియ పంచమునకును గోచరము కానివాడు.

:: కఠోపనిషత్ - ప్రథమాధ్యాయము 3వ వల్లి ::

అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం

    తథాఽరసం నిత్య మగన్ధవచ్చ యత్ ।

అనాద్యనన్తం మహతః పరం ధ్రువం

    నిచాయ్య తన్మృత్యుముఖా త్ప్రముచ్యతే ॥ 15 ॥

శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు లేనిదియు అవ్యయమైనదియు, ఆద్యంతములు లేనిదియు, నిత్యమైనదియు, మహత్తుకు పరమైనదియు నయియున్న దానిని తెలిసికొనినవాడు మృత్యుముఖము నుండి పూర్తిగా విడివడును.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

[06:18, 15/12/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 132 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ

🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 62 🌻

నాకు ఇవాళ సరిగ్గా నిద్రపట్టలేదండి!

నాకు ఇవాళ నిద్రా సుఖం సరిగ్గా లభించలేదు.

నాకు ఇవాళ స్వప్నం సరిగ్గా రాలేదండి.

నాకు ఇవాళ స్వప్నంలో చాలా డిస్టర్బెన్స్‌ గా వుందండి.

నాకు ఇవాళ జాగ్రదావస్థలో చాలా డిస్టర్బెన్స్‌గా వుందండి.

అనేక రకములైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళకు గురౌతు, అనేక రకములైనటువంటి ఇంద్రియ వ్యాపారముల చేత లాగబడుతున్నారు.  అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, వాటన్నింటి చేత, ఇంద్రియములు పరిణామ శీలములై, వ్యవహార శీలములై, ప్రతిబింబ జ్ఞాన సహితములై, అజ్ఞాన ప్రభావం చేత, అవిద్యా ప్రభావం చేత, మోహ ప్రభావం చేత, మాయా ప్రభావం చేత, భక్తి విశ్వాసములు లోపించడం చేత, అనన్యభక్తి లోపించడం చేత, ఈశ్వరుని యందు సరియైనటువంటి చిత్త ఏకాగ్రతను నిలుపుకోలేకపోవడం చేత, ఎవరికైతే అనన్య భక్తి ఉందో, భక్తి విశ్వాసములు - అంటే అవ్యభిచారీ భక్తి అంటారు. అట్టి అవ్యభిచారీ భక్తిని గనక ఆశ్రయించి, అనన్యభక్తిని పొందినటువంటివారు, తప్పక మూడుగుణాలని జయిస్తారు. 

కాబట్టి తప్పక గుణత్రయాన్ని, శరీరత్రయాన్ని, దేహత్రయాన్ని, ఈషణ త్రయాన్ని ఇటువంటి త్రిపుటిని దాటాలి అంటే, ఈ అవస్థాత్రయాన్ని దాటటం అత్యవసరం. ఎవరైతే అవస్థాత్రయ సాక్షిగా ఉన్నాడో, అదే చైతన్యం. అదే ప్రజ్ఞ. అదే ఆత్మ. అదే అంతర్యామి. అదే ప్రత్యగాత్మ. అదే యథార్థ నేను.

      కాబట్టి అటువంటి తురీయ సంయమి తప్పక మానవులు గుర్తించాలి. అటువంటి తురీయస్థితిలో సహజముగా నిలకడకలిగి ఉండాలి. దృష్టిని సదా భూమా స్థితి యందు నిలుపగలిగినటువంటి వాడై ఉండాలి. ఏమార్పూ లేక ఉండాలి. ఏ పరిమాణము లేక ఉండాలి. ఏ అనుభవమూ లేక ఉండాలి. ఏ బంధము లేక ఉండాలి. 

ఏ రకమైనటువంటి కుంగుబాట్లు లేక ఉండాలి. ఏ రకమైనటువంటి దిగులు లేక ఉండాలి. ఏ రకమైనటువంటి ఇంద్రియ వ్యాపార ప్రభావం లేకుండా ఉండాలి. ఏ రకములైనటువంటి అవస్థాత్రయ ప్రభావం లేకుండా ఉండాలి. ఆ రకంగా సాక్షిత్వమును సదా ఆశ్రయించాలి. ఇట్లా సాక్షిగా ఉన్నటువంటి స్థితిని ఎవరైతే సాధిస్తారో, త్రిపుటికి సాక్షిగా ఉన్నటువంటి స్థితిని ఎవరైతే సాధిస్తారో, వాళ్ళు మాత్రమే ఆ అంతర్యామిత్వాన్ని, ఆ ఆత్మస్థితిని నిలబెట్టుకోగలుగుతున్నారు.

బుద్ధి అహంకారముతో కూడిన ఆత్మచైతన్యము ‘అహంకర్త అహం భోక్త’ నేను కర్తను, నేను భోక్తను అని వ్యవహరించుచున్నది. అట్టి జీవుని బుద్ధి, అహంకారము అను ఉపాధినుండి వేరుపరచినచో కాలత్రయ నియామకుడగు ఈశ్వరుడే అగుచున్నాడు. ఈ విధముగా తెలిసిన వారు తనను ఇతరుల నుండి రక్షించుకొనగోరరు.

        ముఖ్యమైన అంశాలని యమధర్మరాజుగారు నచికేతునికి ఉపదేశిస్తున్నారు ఈ కఠోపనిషత్తు సందర్భముగా. ప్రధానము.. ఈశ్వర లక్షణాన్ని నిరూపిస్తున్నారు. ఎవరైతే ఈ బుద్ధికి వేరైనటువంటి వాళ్ళు, అంటే మహతత్త్వము, అవ్యక్తము, ప్రత్యగాత్మ ఈ మూడు స్థితులకి సంబంధించిన వాడు ఈశ్వరుడు.

 గోళకములు, ఇంద్రియములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్ర సహితమైనటువంటి జ్ఞానము, మనస్సు, బుద్ధి ఇదంతా జీవుడు. దీని అవతల ఉన్నటువంటి మహతత్త్వము, అవ్యక్తము, ప్రత్యగాత్మ ఈ మూడు స్థితులకు సంబంధించినవాడు ఈశ్వరుడు. అయితే ఈశ్వరత్వాన్ని సాధించడం మానవులందరికి తప్పనిసరి. ఆ దివ్యత్వానుభవం లేకుండా, ఆత్మానుభూతిని పొందజాలరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[06:18, 15/12/2020] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్  మహరాజ్ అభంగాలు - నామసుధ  - 6 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 6 🍀

సాధుబోధ్ ఝాలా తో నురోనియా రేలా!

రాయీచ్ మురాలా అనుభవ్!!

కాపురాచీ వాతీ ఉజళలీ జ్యోతీ!

రాయీచ్ సమాప్తీ ఝాలీ జైశీ!!

మోక్షరేఖే ఆలా భాగ్యే వినటలా!

సాధూచా అంకిలా హరిభక్తి!

జ్ఞానదేవా గోడీ సంగతీ సజ్జని

హరి దిసే జనీ వనీ ఆత్మతత్త్వీం

భావము:

సాధు బోధ అయిన క్షణమే సంశయము తొలిగి పోవును వెంటనే

అజ్ఞానము నశించి పోయి ఆత్మానుభవము కలుగును. 

నిప్పుతో కలిసిన కర్పూరము జ్యోతిగా ప్రజ్వలించి వెంటనే ఆరి

పోయినట్లుగానే అజ్ఞానము నశించి పోవును. సాధువుకే అంకితమైన హరి భక్తుడికి మోక్ష రేఖ దరిచేరి భాగ్యము ఉదయించును.

సాధువుల సాంగత్యమే మధురముగ ఉన్నదని తెలియుట వలన నాకు జనములో వనములో హరి కనిపించినాడని జ్ఞానదేవుని వచనము.

🌻. నామ సుధ -6 🌻

సాధు బోధ అయినచో ప్రాప్తము

మిగలదు ఏమీ సందేహము

అజ్ఞానము అక్కడే మాయము

కలుగును వారికి ఆత్మ జ్ఞానము

నిప్పును కలిసిన కర్పూరము

దీప్తినిచ్చు ఉజ్వల ప్రకాశము

కర్పూరము అక్కడే సమాప్తము

ఆ విధముగా తొలుగును సందేహము

మోక్ష రేఖ చేరును సమీపము

ఉదయించు వెంటనే భాగ్యము

'సాధువుకే అంకితము జీవితము'

హరి భక్తిలో తానయ్యేను లీనము

జ్ఞాన దేవునికి అత్యంత ప్రియము

సజ్జనాళితోడి సాంగత్యము

జనములో వనములో హరిరూపము

కనిపించెను అంతట ఆత్మతత్త్వము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |

నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖

🌻148. 'నిత్యశుద్ధా"🌻

ఎల్లప్పుడూ శుద్ధ స్థితి యందుండునది శ్రీమాత.

ఎల్లప్పుడూ అనగా భూత, భవిష్యత్, వర్తమాన కాలములందు అని అర్థము. శాశ్వతముగ శుద్ధమైనది. శుద్ధ అనగా మలినములు లేనిది. అజ్ఞానము, అహంకారము, కోరిక, వైషమ్యము, మోహము ఇత్యాది మలినములు లేకుండుటయే శుద్ధ స్థితి. మాయ తాకనిది శుద్ధ స్థితి. శ్రీమాతకు మాయ ప్రధానమగు పనిముట్టు. మాయతోనే సృష్టి నిర్మాణము, నిర్వహణము గావించు చుండును. మాయ ఆమెపై ఆధిక్యము కలది కాదు.

సృష్టియందు మలినము తప్పనిసరి. సృష్టి కార్యము అగ్నికార్యమగుటచే మసిబారుట కూడ జరుగు చుండును. అన్ని లోకముల యందు కొద్దియో గొప్పగనో మలినముండుట తప్పనిసరి. దానిని ప్రతినిత్యము పరిశుభ్ర పరచుకొనుట సాధన. బ్రహ్మాదులకైనను ఇది తప్పదు. త్రిమూర్తులు గూడ అప్పుడప్పుడు మాయా మోహములను మలినము సోకినవారే అని పురాణములు  తెలుపుచున్నవి. అట్టి మలినములు సోకని శాశ్వత శుద్ధత్వము ఇచ్చట చెప్పబడుచున్నది.

జీవ చైతన్యము కూడ అట్టి శుద్ధత్వము కలిగి యున్నది. ఈ కారణముచేతనే జీవుడు దైవాంశయే కాని అతనిని ఆవరించి యుండు అహంకారాది అష్ట ఆవరణలు మలినముల నుత్పత్తి చేయుచు నుండును. వీని ప్రభావము జీవునిపై నున్నప్పుడు అతని సహజస్థితి జీవుడు కోల్పోవును. అతడు నిర్మలుడే అయినను, శరీర  సహవాసము వలన, శరీర వాసనలు సోకుట జరుగుచుండును. 

శరీరము మలినములతో కూడినది. అందుండువాడు నిర్మలుడు. నిర్మలుడు నిర్మలుడుగానే యుండవలెనన్నచో అహంకారాది భావనలు దాటవలెను. “తా నున్నాడు” అని భావించు ప్రతి మానవుడు అహంకారియే. దైవమే తానుగ నున్నాడు. నిజమునకు దైవమే వున్నాడు. “నేనుండుట మాయ” అని నిత్యము తెలిసినవాడు నిత్య శుద్ధు డగును. అట్లగుటకు సాధన కావలెను. సాధనవలన సిద్ధి  పొందువాడు జీవుడు. శ్రీమాత నిత్యసిద్ధ, కావున 'నిత్యశుద్ధ', 

సశేషం...

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 149  / Sri Lalitha Chaitanya Vijnanam  - 149 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |

నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖

🌻149. 'నిత్యబుద్ధా'🌻

శ్రీమాత శాశ్వత బుద్ధి స్వరూపిణి అని అర్థము.

జ్ఞాన స్వరూపిణి అని అర్థము.

శుద్ధత్వమువలె బుద్ధత్వము కూడ శ్రీమాత సహజ స్థితి. ఆమె బుద్ధి స్వరూపిణి కనుక బుద్ధి ప్రచోదనము చేయుమని ఆమెను ఆరాధించుట జరుగుచున్నది. అందులకే గాయత్రి మంత్రము. శుద్ధి, బుద్ధి అనునవి ఒక దానివెంట ఒకటి కలుగు సిద్ధులు. శుద్ధి నిత్యము గావించుకొను చుండవలెను. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశముల శుద్ధి శ్రద్ధతో గావించుకొనుచు బుద్ధి ప్రచోదనమునకు ప్రయత్నించుట సాధన. 

బుద్ధిని గొని శుద్ధిని సాధించుట, శుద్ధితో బుద్ధిని ఆహ్వానించుట నిత్యము జరుగవలెను. అట్టి వారికే సంసారము నుండి తరించుటకు వీలగును. జైనమతమున తరణమును చెందుటకు ఆరాధించు శ్రీమాతను 'తారాదేవి' అని పిలుతురు. శుద్ధబుద్ధులు అను తీర్థంకరులు తారాదేవి అనుగ్రహముచే తరించిరని  తెలుప బడుచున్నది. 

శుద్ధి, బుద్ధి తరించుటకు ముఖ్యమని తెలియవలెను. ఈ కారణముగనే నిత్యశుద్ధా, “నిత్యబుద్ధా' అను నామములు వరుసగా పేర్కొనబడినవి. 

సశేషం...

[14:49, 16/12/2020] +91 92915 82862: 💎💥💎💥💎💥💎

స్వామీ చిన్మయానందుల వ్యాఖ్యానం.

అధ్భుతానికి, నిస్వార్ధానికి, శ్రమకు, అనుగ్రహానికి, మాతృత్వానికి ఆదర్శం భారతీయ మహిళ.

ఆత్మవికాశానికి స్ఫూర్తిదాయక ఆలోచనలు.

దానాన్ని మించిన మంచిగుణం ఏదీ లేదు.

 చిరిగి పోయిన సంచిలో బంగారం పెడితే ఆ సంచి చిరిగి వున్నా, సంచి కి విలువ ఉంటుంది.

సంచి నుండి బంగారాన్ని వేరు చేస్తే,

ఆ సంచికి విలువ లేదు.

దాని వలె, మన శరీరమనే నవరంధ్రాల చిరిగిన సంచిలో, ఆత్మ అనే భగవంతుడు ఉన్న వరకే  ఈ శరీరానికి విలువ.

శరీరంలోని ఆత్మ బైటికి వెళ్ళాక, ఈ శరీరాన్ని ముట్టటానికి కూడా అయినవాళ్ళు ఆలోచిస్తారు.

అంటే  బంగారానికి విలువ ఉంది కానీ, సంచికి కాదు.

అలాగే చైతన్య స్వరూపుడైన భగవంతుడికి/ ఆత్మ విలువ వుంది కానీ, మన శరీరానికి కాదు. 

శరీరంలో జీవం ఉంటే శివం, 

శరీరం నుండి జీవి వెళ్లిపోతే శవం.

ఈ శరీరంలో జీవం వున్నప్పుడే, నలుగురికి ఉపయోగపడాలి.

నిరంతరం ధ్యాన సాధన చేయాలి.

🕉🌞🌎🌙🌟🚩

[12:21, 15/12/2020] +91 92915 82862: శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩

సూర్యుని మార్గశీర్షమాస ప్రవేశము సత్సాధకులకు అత్యంత పుణ్యప్రదమగు కాలము. మార్గశీర్ష ప్రజ్ఞ   ఎక్కుపెట్టిన బాణము గమ్యమునకు చేరునట్లు, సాధకులను ఏకోన్ముఖము చేసి, ఉన్నతము, ఉత్తమము అగు గమ్యమును చేర్చగలదు. తన స్వభావము నుండి తాను బయటపడుట మార్గశీర్షమున సాధనము.

అందులకు గురుబోధ తోడ్పడును. గురువగు దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్యుడు పరోక్షముగా తోడ్పడును. సుబ్రహ్మణ్య షష్టి, దత్తపౌర్ణమి, గీతా జయంతి మార్గశీర్ష శుక్లపక్షమున సాధనకు వలసిన స్పూర్తిని, బలమును చేకూర్చగలవు.

"గ్రుడ్డు నుండి బయటపడిన పిల్ల పక్షి రెక్కల నుపయోగించి చేయు ప్రయత్నము వంటిది మార్గశీర్ష మాసమున సాధకుని స్థితి" అని పరమగురువు జ్వాలాకులుడు చెప్పెను.

🕉🌞🌎🌙🌟🚩

    ధనుర్మాసం  - అవగాహన

  ధనుర్మాసనంలో వైష్ణవులు తెల్లవారు జామున లేచి ఏవో పూజలూ పునస్కారాలూ చేస్తూ హడావిడిగా ఉంటారు. అసలు ధనుర్మాసం అనే పేరు చైత్ర మాసం మొదలైన పేర్లలో ఎక్కడా కనిపించదే! ఆ మాసానికి, అప్పుడు చేసే పూజలకు ఏదన్నా సంబంధం ఉంటే చెప్పండి..

ఈ కథ వెనుక ఒక చక్కని సంకేతం ఉన్నది. చలికాలంలో భూమి మంచు పొర కప్పుకొని సూర్యుని సహజ జీవరసానికి కొంతదూరమై విరహాన్ని పొందుతుంది. ధనుర్మాసం పూర్తి అయ్యేసరికి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కనుక మరల సూర్యుని జీవరసాన్ని ఆమె పొందడం ప్రారంభమవుతుంది.

ఈ కథ కన్నా ముందే వేద ఋషుల కాలము‌ నుండి ధనుర్మాసం బృహస్పతికి స్వస్థానంగా శాస్ర్తప్రసిద్ధి చెందినది. ఉత్తారాయణం దేవతలకు సూర్యోదయ కాలం కనుక దానికి ముందున్న ఈ ధనుర్మాసం దేవతలకు తెల్లవారుజాము అవుతుంది. అప్పుడు పడే సూర్యకిరణాలు బ్రాహ్మీ ముహూర్తకాలం లాగా యోగ ధ్యాన పరులకు ఆత్మజ్ఞానం కలిగిస్తాయి. కనుకనే ఈ రాశిని పుణ్యస్థానము, భాగ్య స్థానము అని జ్యోతిర్విదులు గుర్తించారు. ధనుస్సులో మూలా నక్షత్రము ఉన్నది. దానికి‌ మానవుల శరీరంలో వెన్నెముక అడుగున ఉన్న మూలాధారం అనే చక్రానికి సంబంధమున్నది. ఈ సంబంధాన్ని వినియోగించుకొని యోగ సాధకులు ఈ మాసంలో కుండలిని యోగం గురువుల దగ్గర ఉపదేశం కావడం వేదకాలం నుండి వస్తూ ఉన్న సంప్రదాయ విద్య.

ఆచరణ శీలురైన పెద్దలకు ఈ మాసం ఇన్ని విధాలుగా ప్రాధాన్యం వహించి ఉన్నది. ఎవరు ఎంత సాధన చేస్తే వారికి అంత ఫలితం ఇలాంటి‌ విషయాల్లో ఉంటుంది.

   (మాస్టర్ ఇ.కె. గారి సందేశము)

🕉🌞🌎🌙🌟🚩

[12:28, 15/12/2020] +91 92915 82862: శ్రీరమణీయం -(741)

🕉🌞🌎🌙🌟🚩

"అహంభావం లేకుండా జీవనం కుదరదు కదా, అలాంటప్పుడు అహంభావం వల్ల కష్టం, సుఖం తప్పనిసరి అవుతున్నాయి కదా !?"

మనకు అహంకారంలేని స్థితి ఏమిటో ఒక్కసారి అర్థమైతే మనం ఇప్పటివరకూ అనుభవించిన సంతోషానికి కోటి రెట్ల సంతోషం అనుభవంలోకి వస్తుంది. దైవం మన ముందు సాక్షాత్కరిస్తానన్నా ఆ ఆనందం ముందు వద్దులే అనిపిస్తుంది ! ఇప్పటివరకు మనం అనుకున్నది నెరవేరితే వచ్చే సంతోషం, నెరవేరకపోతే వచ్చే దుఃఖం గురించే మనకు తెలుసు. అసలు సంతోష, దుఃఖాల ప్రభావం మనపై లేకపోతే వచ్చే ఆనందం గురించి మనకి తెలియదు. మనం వేసుకునే రెయిన్ కోటు వర్షప్రభావాన్ని మనపై లేకుండా చేసినట్లే, ధర్మాన్ని ధరించిన వ్యక్తి అహంకార రహితుడై సంతోష, దుఃఖాలకు ప్రభావితుడు కాడు. వెలుతురుతో చీకటి, మెలకువతో నిద్ర అక్కడ నిలువలేవు. అలాగే ధర్మం ఉన్నచోట అహంకారం ఉండలేదు. అహంకారం లేకుండా మనకు కష్టం, సుఖం రెండూ లేనేలేవు !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

"దీపంతో అంధకారం - ధర్మంతో అహంకారం అదృశ్యం !''- (అధ్యాయం -91)

🕉🌞🌎🌙🌟🚩

[12:28, 15/12/2020] +91 92915 82862: "ఋభుగీత "(208)

🕉🌞🌎🌙🌟🚩

బ్రహ్మానందము"

16వ అధ్యాయము 

కోరిక చేతనే మనసు ఆనందానికి దూరం అవుతుంది !

పసిప్రాయంలో ప్రతివారు యోగజీవనంలోనే ఉంటారు. వయసు పెరిగే కొద్ది కోరికలచేత ఆ ఆనందం నుండి వియోగులౌతారు. సహజమైనది ఎప్పుడైనా ఆనందంగానే ఉంటుంది. అంతటా ఉన్న శివుడ్ని సర్వత్రా చూడగలిగితే అదే ఆనందం. ఈ సృష్టిలో పశుపక్ష్యాదులు, వృక్షాలు, నదీనదాలు, చరాచరాలు అన్నింటిలో ఉన్నది దైవీశక్తేనని గుర్తిస్తూపోతే అందులోని ఆనందం వ్యక్తం అవుతుంది. అసహ్యం లేకుండాచూస్తే అశుద్ధంలోనూ అదే దైవీశక్తిని గమనిస్తాం. అసహ్యం అంటే ఏమిటో తెలియదు కనుకనే పసివాడు అశుద్ధంతో కూడా ఆనందంగా ఆడుకుంటాడు. మనసు కోరికచేతనే ఆ ఆనందానికి దూరం అవుతుంది !

🕉🌞🌎🌙🌟🚩

[12:36, 15/12/2020] +91 92915 82862: 🌷99-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩

అధ్యాయము-8

🥀దారులు-మెట్లు🥀

20. నన్ను స్మరించినపుడు ఈ రెండు స్థితులను పొందడు. జీవులకు వ్యక్త స్థితి ఎట్లు తెలియునో అట్లే నన్ను స్మరించువానికి అవ్యక్త స్థితి కూడా తెలియును. అనగా వ్యక్తావ్యక్తములకు అతీతమైన స్థితి తెలియును. ఈ స్థితియే సనాతనము, ఉత్తమము. ఇందున్నవాడే పరమపురుషుడు. అతనియందు జీవులు పుట్టుచు నశించుచుండగా జీవులయందు అతడు నశింపక వసించి ఉన్నాడు. ఉదాహరణమునకు ఒక చిత్రకారుడు రాత్రియందు దృశ్యమొకటియు, పగటి యందు దృశ్యమొకటియు చిత్రపటములను చిత్రించెను. ఆ రెండును ఎట్లున్నవో పరిశీలించుటకు ఆ గదిలో వెలుగుండవలెను. సృష్టి ప్రళయములకు పైన ఇట్టి వెలుగే పరమ పురుషుడుగా ప్రకాశించుచున్నది.

21. ప్రళయమున జీవులు అవ్యక్తములోనికి పోయి అందుండి పుట్టుచున్నవి. వ్యక్తము క్షరతత్వము గలది అనగా మార్పుల సముదాయము నాశము దాని ధర్మము. అవ్యక్తమునకు నాశము లేదు అదియే అక్షరము. సృష్టి, ప్రళయము రెండు భాగములు అనుకొనరాదు. ప్రళయము అనబడు తత్వము మారని ప్రధాన తత్వము. దాని నుండి వచ్చిపోవు సృష్టి ఒక్క భాగమే! ఇందు వ్యక్తతత్వము చరము అనియు, అవ్యక్తతత్వము ధ్రువ మనియు తెలియుచున్నది. రెండింటియందున్న భగవంతుడు అవ్యక్తమునందు శాశ్వతుడుగను, సృష్టియందు అశాశ్వతుడుగను వర్తించుచున్నాడు. ఉన్నవి రెండే తత్వములు, మూడుగా పని చేయుచున్నవి. జీవులు వ్యక్తమున మేల్కొని అవ్యక్తమున నిదురించుచున్నారు. ముక్తుడు అనగా యోగి అవ్యక్తమున మేల్కాంచి యుండుటచే రెండు తత్వముల యందును మేల్కాంచి యున్నాడు.

 🕉🌞🌎🌙🌟🚩

[12:36, 15/12/2020] +91 92915 82862: 112) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩

స్వానుభూతి రవిద్యాయామావృతౌ చ ప్రదర్శితా ౹ అతః కూటస్థ చైతన్య మవిరోధీతి తర్కతామ్ ౹౹31౹౹

31.   మనము అవిద్యను అనుభవించుచుండుట ఆ అవిద్య 

మన చైతన్యమును ఆవరించి ఉండుట ముందే చూపబడినది. కనుక కూటస్థ చైతన్యమునకు విరోధము లేదని తర్కింపుము. అనగా కూటస్థ చైతన్యము, అవిద్య ఏక కాలముననే ఉండుట సంభవమే అని స్వీకరింపవలెను.

మనము "చైతన్యవంతులము" అని అనుటలో ఎవరికీ సంశయము లేదు.తెలియనిది కాదు.

కాని మనలోని ఏ అంశము చైతన్యము?అని ప్రశ్నించినచో సమాధానము మనకు తెలియదు.

శరీరమా?మనస్సా?బుద్ధియా?వీటన్నిటికంటె విలక్షణమైన మరియొకటియా?ఇట్లు మనయందున్న చైతన్యపు అనుభవము దాని స్వరూపమును గూర్చిన అవిద్యయు ఏకకాలముననే యుండుచున్నవి. కనుక వానికి విరోధము లేదు.

చైతన్యం నిత్యమూ సర్వవ్యాప్తంగా,బాహ్యాభ్యంతరాలలో అంతటా నిండి వుంది.కానీ మనలోని చైతన్యం 

శరీర మనోబుద్ధులద్వారా బాహ్యంగా చూసినప్పుడు మనకు చైతన్యంగా కనిపించుడంలేదు.

జీవ చైతన్య రూపమయిన బ్రహ్మం ఏ శరీరంలోనయినా లేనట్లయితే,ఆ శరీరము ప్రపంచములో ఎటువంటి పనినీ చెయ్యజాలదు.ఈ విధంగా మనమందరమూ కూడా ఒకే ఒక మహత్తర సత్యం యొక్క వ్యక్తరూపాలం మాత్రమే.

మనకీసత్యం ఎందుకు బోధపడడంలేదు?మన అనుభవానికి ఈ సత్యం ఎందుకు అందడంలేదు?

ఎందుచేతనంటే అజ్ఞానమే దీనికంతటికీ కారణం.సత్యాన్ని గ్రహించ పోవడంవలన ఇది మన అనుభవానికి అందడంలేదు. ఏకత్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించలేకపోతున్నాము.

మన విజ్ఞాన శాస్త్రవేత్తలు కనుగొనక పూర్వం కూడా విద్యుచ్ఛక్తి ఉండనే ఉంది. అదేవిధముగా మనకు తెలియకపోయినప్పటికీ ఈ ప్రపంచములో కనబడే కార్యాలన్నింటికీ కూడా కారణంగా ఏకమయిన సత్యం మాత్రమే ఉంది.

కుండ,దాక,కూజా,గోలం మొదలయిన వాటినెన్నింటినో మనం నిత్యము వాడుతూనే ఉంటాము.వాటి ఉపయోగాని కనువుగా ఉండే ఆకారము మీదను వాటి పేరు మీదనూ దృష్టి ఉంచడం వలన అవి వస్తుతః మట్టి మాత్రమేననే విషయాన్ని గుర్తిండంలేదు.అవన్నీ నిత్యమూ మట్టి మాత్రమే అయినప్పటికీ వాటి ఉపయోగాల కనుగుణంగా వాటిని వేరువేరగా భావిస్తున్నాము.

వాడుకలో మన దృష్టి వాటి ఆకార పరిమాణాల మీదనూ నామం మీదనూ మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది.

ఆయా నామరూపాలనుండి మన దృష్టిని మళ్ళించినప్పుడు అంతటా మట్టి మాత్రమే మనకు కనిపిస్తుంది.

అవిద్య వలన మనకు ఈసత్యం బోధపడడంలేదు.

సునిశితము ఏకాగ్రమూ అయిన దృష్టితో మనం మన వ్యవహారాలన్నింటినీ పరిశీలిస్తూ వాటిలోగల మార్పులనుండీ విభేదాలనుండి దృష్టిని మళ్ళించినప్పుడు అంతర్గతముగా ఉన్న శుద్ధచైతన్యాన్ని గ్రహించగలుగుతాము.

🕉🌞🌏🌙🌟🚩

: అన్నమయ్య సంకీర్తన

గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు

రేకు: 356-1

సంపుటము: 4-327

రేకు రాగము: శ్రీరాగం.

ఓ పవనాత్మజ ఓ ఘనుఁడ

బాపు బాపనఁగఁ పరగితిగా!!

ఓ హనుమంతుడ వుదయాచలని -

ర్వాహక నిజ సర్వ ప్రబల -

దేహము మోఁచిన తెగువకు నిటువలె

సాహసమిటువలెఁ చాటితిగా!!

ఓ రవిగ్రహణ ఓ దనుజాంతక

మారులేక మతి మలసితిగా

దారుణపువినతాతనయాదులు

గారవింప నిటు గలిగితిగా!!

ఓ దశముఖహర ఓ వేంకటపతి -

పాదసరోరుహపాలకుఁడా

యీ దేహముతో ఇన్నిలోకములు

నీదేహమెక్క నిలిచితిగా!!

🕉🌞🌎🌙🌟🚩

[12:48, 15/12/2020] +91 92915 82862: శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

నవరోజ్‌ రాగః - ఆదితాళమ్‌.

19. తద్వజ్జీవత్వమ్‌

తద్వజ్జీవత్వం

బ్రహ్మణి - తద్వజ్జీవత్వమ్‌||

1. యద్వత్తోయే చస్ద్రద్విత్వం

యద్వన్ముకురే ప్రతిబింబత్వమ్‌ || తద్వత్‌||

2. స్థాణౌ యద్వన్రరూపత్వం

భానుకరే యద్వత్తోయత్వమ్‌|| తద్వత్‌||

3. శుక్తౌ యద్వద్‌రజత మయత్వం

రజ్జౌ యద్వత్‌ ఫణి దేహత్వం|| తద్వత్‌||

4. పరమహంస గురు ణాద్వయ విద్యా||

భణితా ధిక్కృత మాయావిద్యా || తద్వత్‌||

🕉🌞🌎🌙🌟🚩

తాత్పర్యము:-

(బహ్మమందు జీవభావము భ్రాంతిమూలము) - (బ్రహ్మము కంటె వేరైనదిలేదు).

జీవభావము - బ్రహ్మమందు; బ్రహ్మమందు జీవభావనము అట్టిదయ్యా!

1. నీటిలో ఇద్దరు చంద్రులు దోచుట లేదా? నిజముగా ఇద్దరు చంద్రులున్నారా? లేరు. బ్రహ్మమందు జీవభావనము అట్టిదయ్యా! (బ్రహ్మము కంటె వేరుగా జీవుడు లేడు. లేనే లేడు).

అద్దమున ప్రతిబింబము కనబడుట లేదా? బ్రహ్మమున జీవభావ మట్టిదే! (ప్రతిబింబమున్న తావుకూడ అద్దమే! అది అద్దముకంటె వేరైనదికాదు.)

2. దుంగయందు (భ్రాంతిచే) దొంగ దోచుచున్నాడు. సూర్యకిరణములే (భ్రాంతిచే) జలముగా దోచుచున్నవి. అట్లే బ్రహ్మమునందు జీవభావము భ్రాంతిచే జనించుచున్నది.

(ఉన్నది దుంగయే; దొంగలేడు. ఉన్నది సూర్యకిరణ ప్రసారమే; జలము లేదు. అట్లే ఉన్నది బ్రహ్మమే! జీవుడు లేడు!! అనిభావము).

3. ముత్యపు చిప్పలో వెండి నిండి యున్నట్లు తోచు చున్నది. త్రాటియందు సర్పశరీరము భాసించుచున్నది. వాస్తవమునకు 'వెండి, పాము' రెండును లేవు. అట్లే బ్రహ్మమున జీవభావము తలయెత్తుచున్నది. బ్రహ్మముకంటె వేరేమియును లేదు.

4. ఇది అద్వయ బ్రహ్మవిద్య. పరమహంసలైన గురు వర్యులు మాయా నిరాసకము; అవిద్యానాశకము అయిన ఈవిద్యను ప్రవచించినారు, ఘోషించినారు.

బ్రహ్మమున జీవభావము భ్రాంతిమూలమే నయ్యా!

🕉🌞🌏🌙🌟🚩

[13:31, 15/12/2020] +91 92915 82862: తిరుప్పావై మొదటిరోజు పాశురం

1.పాశురము

ॐॐॐॐॐॐॐॐॐ

    మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

    నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

    శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

    కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

    ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

    కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

    నారాయణనే నమక్కే పఱై దరువాన్

    పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము :-

 సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.

        తిరుప్పావైగీతమాలిక

    అవతారిక:

వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.

    1వ మాలిక

        (రేగుప్తి రాగము -ఆదితాళము)

ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!

    భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!

అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!

    మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!

1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని

    యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని

    నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని

    నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి

2. ఛ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము

    పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము

    లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము

    మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.

🕉🌞🌎🌙🌟🚩

ఇది మార్గశిరమాసము. వెన్నెల నిండిన మంచిరోజు. ఓ అందమైన ఆభరణాలుగల పడుచులారా ! ఈ మార్గశిర స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండి, ముందు నడవండి. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధముగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీనందగోపుల కుమారుడను, అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును, నీలమేఘశ్యాముడను, ఎర్ర తామరులను పోలిన కన్నులు కలవాడును, సూర్యునివలే ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఇచ్చేటటువంటి దివ్య ముఖమండలము కలవాడును అయినవాడు నారాయణుడే. అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకే, మనసు ఉపేక్షించు వ్రాతసాధనమగు 'పర' అను వాద్యమును ఈయనున్నాడు. మనము ఈ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించునట్లు, మీరు అందరూ వచ్చి, ఈ వ్రతములో చేరండి.                     

అవతారిక

గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూలమగు కాలము మనకు లభించినదే అని, ఆ కాలమును ముందుగా పొగుడుచున్నారు. ఈ వ్రతము చేయుటకు తగిన వారెవరో నిర్ణయించుకొనుచున్నారు. ఈ వ్రతము చేసి, తాము పొందదగిన ఫలమేమో, దానిని పొందించు సాధనామేమో స్మరించుచు ఈ పాశురమును పాడుచు ఆనందించు చున్నారు.

🕉🌞🌎🌙🌟🚩 

 తిరుప్పావై ప్రవచనం - 1 వ రోజు

భగవంతుని మొదటి స్థానం నారాయణ తత్వం

పాశురము

మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

    నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

    శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

    కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

    ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

    కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

    నారాయణనే నమక్కే పఱై దరువాన్

    పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం

"మార్గళి త్తింగళ్" మార్గశిర్షం మంచి మాసం , ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే , అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షిణాయణం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంకు మారుతాడు , అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. "మది నిఱైంద నన్నాళాల్"  చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం , చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం.  "నీరాడ ప్పోదువీర్ పోదుమినో" స్నానం చేయటానికి వెల్దాం ! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. "నేరిళైయీర్" భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే. 

"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి" పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని "చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్" సంపన్నుల

ైన గోప పిల్లల్లా ,  మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం.

ఏ భయమూ అవసరం లేదు. "కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్" పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ , ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా ! 

"ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం" మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందంచే పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. "కార్మేని" నల్లని మేఘంలాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కల్గి , "చ్చెంగణ్ " వాత్సల్యం కల్గినవాడు. "కదిర్మదియం పోల్ ముగత్తాన్" చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గినవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు. 

"నారాయణనే నమక్కే పఱైతరువాన్" నారాయణ అనే మత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా "పారోర్ పుగళప్పడింద్" ఫలం సాక్షాత్తు పరమాత్మే , ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.

నారాయణ మంత్రం

ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా , సాగరంలో జలానికి అంతంలేనట్టుగా , మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయనగుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు.  ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా , అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం. 

ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి "విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ". విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు - ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు , ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనుక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది , వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది ,  ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది , ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది. 

నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం , నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం.  సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం , విడ దీస్తే ఉత్తర - అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాన్ని అర్థం ఆధారం.

  ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు , లోపల - బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు , ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది.

అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి , చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు , పైన కూడా ఉంటాడు కనక అయన పరుడు - అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు.  జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను  జ్ఞానం కల్గి ఉంటాడు.  చేయిజాస్తే అందేవాడు , వారిలోని దోశాలనను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు , దోశాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు.  దోశాలను తొలగించే శక్తి కూదా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది , సౌశీల్యం ఉంది , వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది , వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది , తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది , ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది. 

అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్య మంత్రంగా అందించింది.  

ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుండి.  శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు , శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి , కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి , దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి , నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది , దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.

🕉🌞🌎🌙🌟🚩

[16:12, 15/12/2020] +91 92915 82862: 18-23-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩

అII ఇంతదనుక మూడు విధములైన జ్ఞానములనుగూర్చి తెలిపి ఇక మూడు విధములైన కర్మలను గురించి తెలుపబోవుచు మొట్టమొదట సాత్త్వికకర్మనుగూర్చి చెప్పుచున్నారు –

నియతం సంగరహితం 

అరాగద్వేషతః కృతమ్

అఫలప్రేప్సునా కర్మ

యత్తత్సాత్త్వికముచ్యతే

తా:- శాస్త్రముచే నియమింపబడినదియు, ఫలాపేక్షగాని, ఆసక్తి (సంగము) అభిమానముగాని, రాగద్వేషములుగాని లేకుండ చేయబడునదియు సాత్త్వికకర్మ యనబడును.

వ్యాఖ్య: - కర్మను గురించి ఎచట చెప్పవలసివచ్చినను "నియతం, నియతం" అని భగవానుడు పదేపదే వాక్రుచ్చుచున్నారు. నియతమనగా వేదశాస్తాదులచే నియమింపబడినది అని యర్థము.

వారి వారికి తోచినదే సత్యమని భావించక జనులు శాస్త్రప్రమాణమునుగైకొని, దానితో తన యనుభవమును మేళవింపజేసికొని వ్యవహరింపవలెను. కనుకనే ఇష్టమువచ్చిన కర్మనుచేయక శాస్త్రనియతమగు కర్మనే చేయవలెనని యాదేశించుటకు కారణమైనది.

 "న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ " అనునట్లు ప్రపంచములో కర్మచేయక ఎవడును ఉండలేడుగనుక, కర్మయనునది నిత్యజీవితములో సర్వులకును అవశ్యకర్తవ్యమైయుండుటవలన దానిరహస్యమును ఎల్లరును బాగుగ తెలిసికొనియుండుట భావ్యమై యున్నది.

 కాబట్టి సాత్త్విక కర్మను గూర్చి భగవానుడిచట తెలిపిన ఈ భావములు సర్వులకును చాల ముఖ్యములైయున్నవి. కర్మ ఏప్రకారము ఉండవలెననగా -

(1) శాస్త్ర నియతమై యుండవలెను.

(2) సంగరహితముగ (ఆసక్తి, అభిమానములేకుండ) గావింపబడవలెను.

(3) రాగద్వేషములులేకుండ చేయబడవలెను. (4) ఫలాపేక్షలేక నొనర్చబడవలెను.

ఈ నాలుగు విధముల సరిపోయి ఆచరింపబడు కర్మ చిత్తశుద్ధికరమై, హృదయమాలిన్యనివారకమై, దోషభంజకమై, జ్ఞానదాయకమై, మోక్షప్రదమైయుండగలదు.

'సంగరహితమ్ - "బుద్దిర్యస్య న లిప్యతే' అని ఇదివరలో తెలుపబడినట్లు కర్మలందు  అంటుకొనకయుండుటయే అసంగత్వము. అనగా "నేను చేయుచున్నాన"ను అభిమానముగాని,

మమత్వముగాని, ఆసక్తిగాని యుండరాదు.

 అట్టివాడు కర్మపాశముచే “ న నిబధ్యతే "- బంధింపబడనేరడని గీతాశయము. కావున సంగరహితముగ, ఫలాపేక్షావర్జితముగ కార్యముల నాచరించుటను అభ్యసింపవలెను.

" అరాగద్వేషతః" - పదార్థములపై రాగద్వేషములులేనపుడే సంగరహితముగ కార్యమాచరించుటకు వీలుపడును. మరియు ఫలాభిలాషను త్యజించుటకును అనుకూలపడును. కాబట్టి కర్మయొక్క శుద్ధత్వమున కీ రాగద్వేషరాహిత్యము అత్యంతావశ్యకమైయున్నది.

ప్ర:- సాత్త్వికకర్మయెట్టిది?

ఉ:- (1) శాస్త్రనియమితమైనది,

(2) సంగరహితముగ నాచరింపబడునది,

(3) రాగద్వేషవర్జితముగ నొనర్చబడునది,

(4) ఫలాభిలాషలేక గావింపబడునది - సాత్త్వికకర్మయనబడును.

🕉🌞🌎🌙🌟🚩

[16:17, 15/12/2020] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  - 98 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 26 - 11 . ప్రాణాయామ యజ్ఞము  -    వ్యాన వాయువు దేహమున ప్రజ్ఞ అంతర్యామిత్వము చెందుటకు, దేహము అంతట వ్యాపించి యుండుటకు పని చేయుచు నుండును. జీవప్రజ్ఞ దేహ వ్యాప్తి చెందుటకు, దేహము మొత్తము కదలికలకు, దేహము పెరుగుదలకు వ్యాన వాయువు తోడ్పడుచుండును. ఉదానము నుండి వ్యానము చేరిన జీవప్రజ్ఞ సహస్రారమును చేరి తన నిజస్థితిని అనుభూతి చెందగలదు.   ఈ మొత్తము మార్గమును “ప్రాణాయామ యజ్ఞ"మని దైవము తెలిపియున్నాడు. 🍀

📚. 4. జ్ఞానయోగము  - 29, 30   📚

🌷 5. వ్యాన వాయువు: 🌷

వ్యాన వాయువు దేహమంతయు వ్యాపించి యుండును. శిరస్సునుండి పాదముల వరకు అన్ని భాగముల యందు పని చేయుచు నుండును. దేహమున ప్రజ్ఞ అంతర్యామిత్వము చెందుటకు, దేహము అంతట వ్యాపించి యుండుటకు పని చేయుచు నుండును. జీవప్రజ్ఞ దేహ వ్యాప్తి చెందుటకు, దేహము మొత్తము కదలికలకు, దేహము పెరుగుదలకు వ్యాన వాయువు తోడ్పడుచుండును.

ఉదానము నుండి వ్యానము చేరిన జీవప్రజ్ఞ సహస్రారమును చేరి తన నిజస్థితిని అనుభూతి చెందగలదు. ఈ విధముగ ప్రాణము, అపానము, సమానమున సామ్యము చెందుట, సమాన వాయువునుండి జీవప్రజ్ఞ ఉదానవాయువు చేరుట, ఉదాన మాధారముగ ఊర్ధ్వముఖ మగుట, ఊర్ధ్వముఖము చెందిన ఉదానము వ్యానమును చేరుట ఈ మొత్తము మార్గమును “ప్రాణాయామ యజ్ఞ"మని దైవము తెలిపియున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[16:17, 15/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 296 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

71. అధ్యాయము - 26

🌻. దక్షుని విరోధము  - 4 🌻

సదాశివుడిట్లు పలికెను -

నందీ! మహాప్రాజ్ఞా! నా మాటను వినుము. నీవు కోపమును పొందుట తగదు. నేను శపింపబడితినని నీవు భ్రమపడి బ్రాహ్మణులను వృథాగా శపించితివి (43). వేదములు మంత్రాక్షరములతో, సూక్తములతో నిండియుండును. సర్వప్రాణులు ఆత్మ సూక్తము నందు ప్రతిష్ఠితమై యుండును (44). 

కావున ఆత్మ ప్రతిపాదకమగు వేదమును పఠించు విద్వాంసులను నీవు కోపావిష్టుడవై ఏనాడూ శపించవలదు. ఎవరైననూ ఎంతటి మానసిక క్షోభకలిగిననూ ఎప్పుడైననూ వేదములను శపించరాదు (45). నేనిపుడు శాపమును పొందలేదు. నీవు తత్త్వమును ఎరుంగుము. సనకాది మహాత్ములకు జ్ఞానమును బోధించిన మహాధీశాలివి. నీవు. శాంతుడవు కమ్ము (46). 

యజ్ఞము నేనే. యజ్ఞమును చేయు యజమానిని నేనే. యజ్ఞములోని అంగములన్నియూ నేనే. యజ్ఞము నా స్వరూపమే. నాకు యజ్ఞమునందు అభిరుచి మెండు. పైగా, యజ్ఞ బాహ్యుడను కూడ నేనే (47). నీవెవరివి? వీరెవరు?ఇతడెవరు? తత్త్వ దృష్ట్యా సర్వము నేనే. ఈ సత్యము నెరింగి విమర్శించినచో, నీవు బ్రాహ్మణులను శపించుట వ్యర్థమే గదా? (48) ఓ నందీ! నీవు మహా బుద్ధిశాలివి. నీవు క్రోధాదులను వీడి, తత్త్వజ్ఞానముచే ప్రపంచ రచనను బాధించి (మిథ్యయని యెరింగి,), జ్ఞానివై స్వస్వరూపమునందు ప్రతిష్ఠతుడవు కమ్ము (49).

బ్రహ్మ ఇట్లు పలికెను -

శంభుడు ఈ విధముగా నందికేశ్వరునకు బోధించగా, ఆతడు వివేక నిష్ఠుడై, క్రోధమును వీడి శాంతుడాయెను (50). శివుడు ఆతనికి , తన గణములకు నచ్చజెప్పెను. శివునకు నంది ప్రాణప్రియుడు. ఆయన ఆనందముతో, తన గణములతో గూడి తన ధామకు వెళ్లెను (51). క్రోధావేశము గల దక్షుడు శివద్రోహమే లక్ష్యము గా గలవాడై, ఆ బ్రాహ్మణులతో కలిసి తన స్థానమునకు వెళ్లెను (52). తాను రుద్రుని శపించిన ఘట్టమును గుర్తుచేసుకొని మిక్కిలి కోపమును చెందుచున్న మూడ బుద్ధియగు ఆ దక్షుడు శ్రద్ధను వీడి శివపూజకులను నిందించుటయే తన ధ్యేయముగా పెట్టుకొనెను (53).

దుర్బుద్ధియగు దక్షుడు శంభు పరమాత్మయొక్క ఆ మాటలను వినెను. అయిననూ వాని బుద్ధి ఎంత దుష్టమో గదా! వత్సా! నేనా వృత్తాంతమును చెప్పెదను వినుము.

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీ ఖండములో శివుని తో దక్షుని విరోధమనే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[16:17, 15/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 183 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వామిత్రమహర్షి  - 3 🌻

13. లోకానుగ్రహం కోసం యాగంకాని, లేకపోతే బ్రహ్మర్షికి యాగం ఏమిటి?  ఎందుకు చేస్తాడు? ఈ యజ్ఞాలు జ్ఞానమా? యజ్ఞం జ్ఞానం కాదు. కర్మకు అజ్ఞానానికి ముడి. యజ్ఞ కర్మంతా కూడా జ్ఞానదాయకం అనుకోరాదు. లోకంలో కొన్నికొన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి, కొన్ని దుష్టశక్తుల నాశనం కోసమని యజ్ఞం చేయబడుతుంది. 

14. యజ్ఞాన్ని లౌకికంగా, భూలోకంలో మనకు యోగక్షేమాలు కోరి చేయవలసిందే తప్ప, దానివలన జ్ఞానం రాదు. ఇకాడ ఒక రహస్యం కూడా ఉంది. యజ్ఞం పదిమందితో సాధ్యమయ్యే సామూహిక కర్మ. అందువల్ల ఎవరికీ అది జ్ఞానప్రదం కాదు. 

15. కాని తపస్సు వ్యక్తిది. అది వ్యక్తికి అనంతశక్తిని, ముక్తిని కూడా ఇవ్వగలదు. మరి విశ్వామిత్రుడు జ్ఞానకర్మ కాని కర్మను ఎందుకు చేస్తాడు అంటే, లోకక్షేమం కోసమనే చేసాడాయన. లోకక్షేమం కోసమని విష్ణువును తీసుకొచ్చి తన తపస్సు, అస్తబలం ఆయన కిచ్చాడు. ఆయన సన్నిఢిలో యజ్ఞం చేసాడు. రాక్షససంహారానికి హేతువయ్యాడు. అంతటి మహాత్ముడు. విశ్వానికి మిత్రుడాయన.

16. తపస్సంపన్నులు చేసే ప్రతి పనికి ఒక కార్యకారణ సంబంధం ఉండాలి కాని, అకారణంగా తపస్సులోంచి ఏ వస్తువునూ సృష్టించకూడదు. జ్ఞాని ఆ పనిని ఎన్నడూ చెయ్యడు. ఒక కారణం ఉండాలి. కారణంలోచి కార్యం పుట్టాలి.

17. ఆశీర్వచనం అనేది అనేక రకాలుగా ఉంటుంది. కోరిక కోసమని ఒకడడుగుతాడు. అతడికి పుణ్యం ఉండదు, తపస్సు ధార పోయవలసిన అవసరం వస్తుంది. సంకల్పబలం అనేది ఒకటుంది. తపస్సుతో సంబంధం లేనటువంటి అమోఘమయిన సంకల్పం. 

18. బ్రహ్మ తపస్సు ధారపోసి సృష్టించటం లేదు. సంకల్ప బలం చేత సృష్టిస్తున్నాడు. సంకల్పంలోంచి సమస్తమూ, భూతములన్నీ పుడుతున్నాయి. బ్రహ్మకెటువంటి శక్తి ఉన్నదో బ్రహ్మజ్ఞానికి ఆ సంకల్పమందు ఆ శక్తి ఉంటుంది. అది అతని వాక్కు. 

19. ఎందుచేతనంటే, సత్యభావనయందే ఉండటేంచేత భావన సత్యమవుతుంది. తపస్సుతో నిమిత్తంలేదు. తపస్సు దేహంతో, మనస్సుతో, ఇంద్రియములతో, చిత్తంతో ఆచరించబడి, లభించే ఒక శక్తి. ఒక ధనం అది. తపస్సుని వ్యయం చెయ్యకుండా సత్యసంకల్పులు సంకల్ప బలం మాత్రంచేత ఏది భావన చేసినా అది సత్యమవుతుంది. 

20. అంటే ఎప్పుడూ సత్యం చెప్పగా, తరువాత చెప్పింది సత్యమవటం మొదలవుతుంది. ఇది సత్యంయొక్క శక్తి. ఎన్నడూ అనృతం లేకుండా త్రికరణశుద్ధిగా ఎవరైతే సత్యం చెప్పుతూ ఉంటాడో, సత్యధర్మదీక్ష ఎవరికైతే ఉంటుందో అతడు ఏది చెప్పినా సత్యమవుతుంది. 

21. ఏది చెప్పినా సత్యంకావటానికి తపస్సు కారణంకాదు. సత్యధర్మమే, సత్య వ్రతమే కారణం. ఇది తపోధనం కాదు. అతడి యందు పుట్టినటువంటి ఒక విభూతి, ఒక లక్షణం, ఐశ్వర్యం. అది అతడి హృదయమందు పుట్టిన, అతడి మనస్సుయందు పుట్టిన ఒక ఐశ్వర్యం కాబట్టి, సత్యానికి అంత శక్తి ఉంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[16:17, 15/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 122 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర  - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 2 🌻

508. ఆత్మ యొక్క అంతర్ముఖ చైతన్యము, సద్గురువు యొక్క అనుగ్రహము వలన సర్వోన్నత స్థాయికి చేర్చబడి, పరమాత్మలో తన అనంత స్థితి యొక్క ఆత్మానుభూతికి ఆత్మను నడిపించినది.

509. ఆత్మ, స్వీయ చైతన్యమును సంపాదించుటకు పడిన అధిక వేదనలో.... సంస్కారములు, అనుభవములు, దేహత్రయముతో పొందిన తాదాత్మ్యతలు, ముల్లోక అనుభవములు (ఆరు భూమికల అనుభవములు) వాటికి సంబంధించిన అట్టహాసములు అన్నియు వట్టి కల మాత్రమే.

510. సప్తమ భూమికలో, ఆత్మ యొక్క స్వీయ అనంత స్థితి ఎఱుకతో అనుభూతిని పొందినది.

511. నిర్వాణస్థితిలో నాశనమైన పరిమిత మిథ్యాహం యొక్క స్థానమును సత్య - అనంత - అపరిమిత దివ్య అహమ్ ఆక్రమించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

755వ నామ మంత్రము 16.12.2020

ఓం చండికాయై నమః

చండముండాది రాక్షస సంహారం చేయడానికి ఆవిర్భవించిన చండికా స్వరూపిణియైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి చండికా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం చండికాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకుడు  తనలోని అరిషడ్వర్గసమన్వితమైన రాక్షసలక్షణములను విడనాడి, జ్ఞానస్వరూపుడై పరమేశ్వరీ నామ మంత్రజపముతో సుఖసంతోషమయమైన భౌతికజీవనముతోబాటు, ఆత్మానందానుభూతినందు దివ్యజీవనమునుకూడా కొనసాగించి తరించును.

చండి అనే పదం చండ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో చండ అంటే ఛేదించగల అని అర్థం.

చండి లేదా చండిక ఒక హిందూ దేవత. ఈమె మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళి స్వరూపిణి, పరదేవతా స్వరూపం. ఇచ్ఛా శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తిల కలయిక. పార్వతి లేదా ఆది పరాశక్తి యొక్క రౌద్ర రూపంగానూ అభివర్ణించబడింది. శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రకారం పరాశక్తి అంటే బ్రహ్మమనియే. ఈ పరాశక్తి రూపమైన చండి కూడా బ్రహ్మస్వరూపమే. దేవి మహత్మ్యంలో పలుచోట్ల ఆమె గురించిన ప్రస్తావన ఉంది.

సకల జగత్తులనూ సృష్టించి, పాలకులను నియమించి, పాలనాపరమైన సిద్ధాంతములను అమలుపరుస్తూ జీవకోటిని తన బిడ్డలుగా భావించి, కావలసినవి అన్నీ ప్రసాదిస్తోంది. అయినప్పటికినీ ప్రణాళికాబద్ధమైన పాలనలో అష్టదిక్పాలకులు, నవగ్రహములు, లోకపాలురు అందరూ తన భయభక్తులలో ఉండి వారి వారి ధర్మములను సక్రమంగా నిర్వర్తించడానికి  ఉగ్రస్వరూపాన్ని కూడా ఒకటి ఏర్పరచినదే ఈ చండికా స్వరూపం.

జగన్మాత చండీ స్వరూపంతో బయల్వెడలబట్టే వాయుదేవుడు క్రమబద్ధంగా  పెనుగాలులు వీచకుండా చండిక ఆజ్ఞలకు లోనై ఉంటాడు. అలాగే సూర్యుడు తన ప్రచండభాను ప్రతాపంతో కాకుండా ప్రకాశించుతూ ఉంటాడు. చంద్రుడు చల్లదనాన్నిస్తూ, శరద్రాత్రులలో ఆహ్లాదంగొలిపే వెన్నెలను ఇస్తాడు. శనీశ్వరుడు జీవుల కర్మలననుసరించి కర్మఫలదాతగా ప్రవర్తిస్తాడు. (శనీశ్వరునికి భయపడవలసిన పనిలేదు. ఆయన మంచివాడే. మనం మంచివాళ్ళమయితే శనిమహాదశలో శుభఫలితాలు ఉంటాయి. తెలియకో, తెలిసియో చేసినకర్మలు మంచివికాకుంటే కర్మఫలితాలు అందుకు తగినట్లు ఉంటాయి. శనీశ్వరుడిని దూషించడం చాలా దోషం), వరుణుడు అతివృష్టి లేదా అనావృష్టి కాకుండా నెలకు మూడు వానలు అన్నట్లుగా జలప్రాప్తి, తన్మూలంగా ఆహోరోత్పత్తి జరుగుతుంది. ఇలా అష్టదిక్పాలకులు, నవగ్రహములు చండీమాత అజ్ఞలకు లోబడి ఉంటారు.  ఏదైనా జలప్రళయముగాని, తుపాను విలయముగాని, ప్రచండాగ్నిజ్వాలలకు ప్రాంతాలు దహనమవడంగాని జరుగుతున్నాయంటే జీవకోటి గాడి తప్పి, పరమేశ్వరి విధించిన నిబంధనలకు విరుద్దంగా మసలినదని భావము. ఆ చండీస్వరూపిణియైన జగన్మాతే ఆజ్ఞాపిస్తుంది అలాంటి విపత్తులతో జీవకోటికి హెచ్చరికలు జారీచేయమని.

 దేవీభాగవతంలో ఏడు సంవత్సరముల బాలికను చండిక అని అనబడుతుంది. దేవీ నవరాత్రులలో ఏడు సంవత్సరముల బాలికను చండికగా భావించి పూజించడం ఒక ఆనవాయితీగా వున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం చండికాయైనమః అనిఅనవలెను.

[05:04, 16/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

181వ నామ మంత్రము

ఓం మృత్యుమథన్యై నమః

మృత్యుధర్మాన్ని నశింపజేసి అమృతత్త్వాన్ని ప్రసాదించు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మృత్యుమథనీ యను  ఐదక్షరముల నామ మంత్రమును ఓం మృత్యుమథన్యై నమః అని ఉచ్చరించుచూ,  ఆ శ్రీమాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు, ఆ తల్లి కరుణచే సుఖశాంతులు సంప్రాప్తమై, నిత్యము పరమాత్మయందు దృష్టిని నిలిపి ధ్యాననిమగ్నతతో జీవితమును తరింపజేసికొనుటజరుగును.

మృత్యువు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. మరణ శిక్షననుభవించబోవువానికి, ఆ శిక్ష అమలు యగువరకూ తీరని మానసిక సంక్షోభననుభవిస్తాడు. అలాగే మరణశయ్యపైనున్న రోగికి తెలుసు తనకు మరణం తథ్యమని. అలాంటప్పుడు తీరని మానసిక వ్యథకు గురియవుతాడు. అంటే చనిపోవడంకన్నా, తాను చనిపోతాను అన్న భావమే నిజమైన మృత్యు లక్షణం. పరీక్షిన్మహారాజు తక్షకుని వలన తనకు మృత్యువు తథ్యమని తెలిసి, తనను ఆ మరణ భయం నుండి దూరంచేయమని శుకయోగిని శరణు వేడుతాడు. శుకయోగి పుణ్యకథాశ్రవణంతో అతనిలోని మృత్యుభావనను దూరంచేస్తాడు. మృత్యువు అనేది దేహానికి తప్ప ఆత్మకు ఉండదు. జీర్ణవస్త్రమును విడచి నూతనవస్త్రమును ధరించినట్లు, ఆత్మ శుష్కించిన శరీరం విడచి, నూతన శరీరంలోనికి ప్రవేశిస్తుంది అని బోధిస్తాడు.

జగన్మాతను ఆరాధించిన భక్తులకు మరణధర్మమైన పుట్టుక అన్నదే లేకుండా చేసి శాశ్వతమైన అమృతత్త్వాన్ని ప్రసాదిస్తుందన్నదే ఈ నామ మంత్రములోని భావము.

పుట్టినవానికి మరణం తప్పదు. మరణించినవాడు మరల పుట్టక తప్పదు. ఇది మరణధర్మం. జననమరణచక్రభ్రమణంలో జీవుడు కొట్టుమిట్టాడుతూ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు.  కర్మఫలాన్ననుసరించి స్వర్గసుఖములు లేక నరకబాధలు అనుభవించడం జరుగుతుంది. కర్మశేషాన్ని బట్టి తరువాత ఏ జన్మ అన్నది కూడా ఉంటుంది. జ్ఞానులయినవారు కర్మలకు దూరంగా ఉంటారు. బ్రహ్మజ్ఞానస్వరూపులై కర్మలు చేయక, పాపపుణ్యాలు అనేవి ఉండక, ఈ జ్ఞానస్వరూపులు జన్మరాహిత్యాన్ని పొందుతారు. అంటే మరణధర్మాన్ని దరికి రానీయక అమృతత్త్వాన్ని పొందుతారు.

జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించువారికి ఆ తల్లి కరుణచే బ్రహ్మజ్ఞానప్రాప్తికలిగి,   మరణధర్మం పోయి అమృతత్త్వం లభిస్తుంది. కాబట్టి పరమేశ్వరి మృత్యుమథనీ యను నామముతో స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మృత్యుమథన్యై నమః అని అనవలెను.

. శ్రీమద్భగవద్గీత - 580  / Bhagavad-Gita - 580 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 24 🌴

24. తస్మాద్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదానతప:క్రియా: |

ప్రవర్తన్తే విధానోక్తా: సతతం బ్రహ్మవాదినామ్ ||

🌷. తాత్పర్యం : 

కనుకనే శాస్త్రనియమానుసారము యజ్ఞము, దానము, తపములను చేపట్టు తత్త్వజ్ఞులు పరమపురుషుని పొందుటకై వానిని ఓంకారముతో ప్రారంభింతురు.

🌷. భాష్యము  :

ఋగ్వేదము (1.22.20) “ఓంతద్విష్ణో: పరమం పదం” అని పలుకుచున్నది. అనగా విష్ణు పాదపద్మములే దివ్యభక్తికి స్థానములు. దేవదేవుడైన శ్రీకృష్ణుని కొరకు ఒనర్చబడునదేదైనను కర్మల యందు సంపూర్ణత్వమును నిశ్చయముగా సిద్ధింపజేయును.

🌹 🌹 🌹 🌹 🌹

. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 133 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ

🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 63 🌻

దీనికి అడ్డువస్తున్నది ఏమిటి? సహజంగా తాను ఈశ్వరుడే అయివున్నప్పటికీ, తనకు తాను ఈశ్వరుడుగా తోచడం లేదు. ‘ఈశ్వరుడు వేరే కలడు’ - అనేటటువంటి భ్రాంతికిలోనై, ప్రథమ భ్రాంతి ‘పంచ భ్రమ నిరూపణ’ అని ఆది శంకరులు ఒక విధానాన్ని అందించారు. (అన్నపూర్ణోపనిషత్‌ అంతర్గతంగా) 

అందులో మొట్టమొదటి భ్రాంతి ‘జీవేశ్వరోభిన్నః’ కాబట్టి ‘జీవుడు ఈశ్వరుడు వేరు వేరే’ అనేటటువంటి ప్రథమమైనటువంటి భ్రమ చేత, మనోభ్రాంతికి, మనస్సు అనేటటువంటి మయాకల్పితమైనటువంటి, ప్రతిబింబ సమానమైనటువంటి, అసలు లేనేలేనటువంటి భ్రమకి గురౌతున్నాడు. ఈ విభ్రమ నుంచి తప్పక ప్రయత్నశీలియై, ఆత్మవిచారణ చేత తనకు తాను బుద్ధికి వేరు పరుచుకుని తాను ఈశ్వరుడు అనే నిర్ణయాన్ని, అనే స్థితిని తప్పక సాధించాలి. అలా లేకపోయినట్లయితే ఎప్పటికి అభిమానగ్రస్థుడుగా మిగిలిపోతాడు.

    ఇప్పుడు మనమందరం సామాన్యంగా జీవిస్తున్నటువంటి జీవనం ఎలా జీవిస్తున్నాము అంటే ‘విధి, వ్యాధి, అభిమానము’ - అనే మూడింటికి గురై, జీవుడుగా జీవిస్తూఉన్నాము. కానీ, ఈ మూడింటికి ఆధారం పట్టుకొమ్మ అభిమానం. ‘శరీరం నేను’ అనేటటువంటి అభిమానం. ‘నేనే కర్త’ ను అనేటటువంటి అభిమానము.

 ‘నేనే భోక్త’ ను అనేటటువంటి అభిమానము. కార్యకారణమునకు లొంగినటువంటి అభిమానము. కాలత్రయానికి లొంగినటువంటి అభిమానము. అవస్థాత్రయానికి లొంగినటువంటి అభిమానము. దేహత్రయానికి లొంగినటువంటి అభిమానము. శరీర త్రయానికి లొంగినటువంటి అభిమానము.

ఈ రకంగా ఎన్ని త్రిపుటులున్నాయో, ఆ అన్ని త్రిపుటులకు, గుణత్రయానికి లొంగిపోయినటువంటి అభిమానము. ఇట్లా ప్రతీ దానికి కూడా ఈ అభిమానమే అడ్డు వస్తూఉంటుంది. ఒకరు ఒకరితో మాట్లాడాలి అంటే, అభిమానం అడ్డు వస్తుంది. ఒకరు ఒకరితో సంబంధ పడాలి అంటే, అభిమానం అడ్డం వస్తుంది. ఒకరు ఒకరిని క్షమాపణ అడగాలి అనంటే, అభిమానం అడ్డు వస్తోంది. 

ఒకరు ఒకరిని ప్రశంసించాలి అంటే, అభిమానం అడ్డు వస్తుంది. ఈ అభిమానం అనే తెర ఏదైతే ఉందో, నిజానికి ఇదొక పెద్ద తెర. ఇనుప గొలుసుల తెర. సాత్విక, రాజసిక, తామసిక శక్తులతో కూడినటువంటి, గుణ త్రయంతో కూడినటువంటి తెర. “తెర తీయరా తిరుపతి దేవర తెర తీయరా..” - అనేటటువంటి పాటలో ఆ తెర అంటే ఈ అభిమానము అనేటటువంటి తెర.

    నేనే చేస్తున్నాను. సర్వకర్తను నేనే. సర్వహర్తను నేనే. సర్వభర్తను నేనే. అనే ఈశ్వరత్వాన్ని సాధించవలసినటువంటి మానవుడు, నిమిత్తమైనటువంటి కర్తృత్వ భావంతో, పరిమితమైనటువంటి,శరీరం చేత పరిమితించబడినటువంటి, దేహాభిమానం చేత పరిమితించబడినటువంటి చైతన్యం కలిగినవాడై, జీవాత్మగా వ్యవహరించడం చేత, ఇంద్రియాలకు లోబడి వ్యవహరించడం చేత, ఈ రకమైనటువంటి అజ్ఞానావృతమైన, అవిద్యావృతమైన, మోహావృతమైన, మాయావృతమైన జీవనశైలిని మానవుడు కలిగియుంటున్నాడు. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[06:09, 16/12/2020] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్  మహరాజ్ అభంగాలు - నామసుధ  - 7 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 7 🍀

పర్వతా ప్రమాణే పాతక్ కరణే!

వజ్రలేప్ హెణే అభక్తాసీ!!

నాహి జ్యాసీ భక్తి తో పతిత్ అభక్త!

హరిసీ న భజత్ దైవహత్!!

అనంత వాచాళ్ బరళతీ బరళ్!

త్యాకై సేని గోపాళ్ పావే హరి?!!

జ్ఞానదేవా ప్రమాణ్ ఆత్మా హా నిధాన్!

సర్వా ఘటీ పూర్జ్ ఏక్ నాందే!!

భావము:

పర్వతమంతటి పాపము చేసినవాడు అభక్తుడు. వాడు చేసిన కఠిన పాపాలు వజ్ర లేపమై బాధించును. 

హరి భక్తి లేని వాడు పతితుడు, భక్తి హీనుడు హరి భజన చేసే భాగ్యము కోల్పోవును.

ఈ అధిక ప్రసంగిని, వాగుడుకాయను దయాళుడైన శ్రీహరి ఎందుకు కరుణించాలి?

ఆత్మయే తరగని దైవనిధి. సర్వ ఘటములలో హరి ఒక్కడే

క్రీడించుచున్నాడని జ్ఞాన దేవులు తన అనుభవమును తెలిపినారు,

🌻. నామ సుధ -7 🌻

పర్వత మంతటి పాపకృత్యము

అభక్తుడు చేసిన కర్మ సమూహము

అయి పోయినది వజ్ర లేపనము

భక్తిలేని బ్రతుకుయే హీనము

హరిపై లేదు భక్తి భావము

భక్తి హీనుడి బ్రతుకు పతితము

తీరి పోయినది దైవ ధనము

కోల్పోయాడు భజన భాగ్యము

నేర్చినాడు వాగుడు అధికము

వాదించడముతో ఏమి ఫలితము

శ్రీహరి రూపము దయగల దైవము

అయినా ఎందుకు కరుణించడము?

జ్ఞాన దేవుని ప్రమాణము వినుము

“ఆత్మయే దైవ ధనము”

సర్వ ఘటములలో సంపూర్ణము

క్రీడించు హరి ఒక్కడే సత్యము

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[06:09, 16/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 150  / Sri Lalitha Chaitanya Vijnanam  - 150 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |

నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖

🌻150. 'నిరవద్యా'🌻

నిందకతీత మైనది శ్రీలలిత అని అర్థము.

అవద్య అనగా అవిద్యా వికారము వలన పుట్టిన నింద. శ్రీమాత విద్యా అవిద్యా స్వరూపిణి. అవిద్య యందు వసించుచూ వున్నప్పటికి అవిద్యా ప్రభావము ఆమె నంటదు. మట్టి యందున్ననూ బంగారము బంగారమేకదా! అవిద్యా వికారము కలవారు అవద్య నరకముల వసింతురు. కారణ మేదైనను అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశముల యందు వుడుకుట వున్న వారందరూ, అవద్య నరక వాసులే. 

నిత్యము చింత, దుఃఖము, బాధ, భయము, ద్వేషము, ఈర్ష్య, గర్వము, అసూయ, ఇత్యాది భావములలో సతమతమగు వారందరు అవద్యా నరకమున జీవించు చున్నవారే. శ్రీమాత నిరవద్య అగుటచే ఆమె నాశ్రయించి ఆరాధించువారు పాపకూపములైన ఈ భావముల నుండి విముక్తి పొందెదరు. ఆమె నాశ్రయించుట వలన, సతతము స్మరించుట వలన దోష రహితులై జీవింపగలరు. అనుభవమగు భావములు శ్రీదేవి భక్తులను సోకవని శ్రీ సూక్తము కూడ చాటి చెప్పుచుండును.

“నక్రోధో నచ మాత్సర్యమ్....”

సశేషం...

[07:12, 16/12/2020] +91 92915 82862: తిరుప్పావై 2వ పాశురము

తిరుప్పావై ప్రవచనం‎ - 2

ॐॐॐॐॐॐॐॐॐ

02 వ రోజు - భగవంతుని రెండో స్థానంవ్యూహం (పాల్కడలి)

 ఆండాళ్ తిరువడిగలే శరణం

వ్రతనియమాలు పాశురము

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు 

శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్

పైయత్తుయిన్ఱ పరమనడి పాడి

నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి

మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్

శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్

ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి

ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్!!

సీ.పాల కడలి యందు పవళించి యుండెను

        అలవోక నిద్రతో అలరు చుండె

 శేషుడం పాన్పైన శ్రీహరి పాదముల 

   తలచుచు  చేరుము తనివితీర

 వలదు కాటుక పూత వలదు పాలను తాగుట 

      వలదు నెయిని గ్రోల వలదు యనుచు 

దీక్షను బూనుము దీవెనలందగ 

         పొద్దు పొడవక ముందు పూజ చేసి 

భక్తి గౌరవములు ప్రభవిల్లు చుండగా

          ప్రార్థనంబును చేయు ప్రమదమంది!!

గీ.నోచిన దినములందున నోటి యందు 

దురుసు మాటలు రాకుండ జరుపు మెపుడు 

ప్రభువుగా తలపోయుచు పరుల నెల్ల 

దానధర్మాలు జరుపుము తప్పకుండ

 శ్రద్ధ భక్తిని కలిగించి బుద్ధి నిమ్ము

శ్రీధరుని మానసంబున స్థిరముకమ్ము!!

మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు,  శాస్త్రాలలో  ఆవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మర్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. 

అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి.  మరి అలాంటి మార్గంలో  పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో.  ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో. 

భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు.

 "అణు:" అతి చిన్నరూపం నుండి "బృహత్:" అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. "శబ్ద సహ" అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు, "శబ్దాతిగ" చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు, అందుకే ఆయనను గోవింద అని అంటారు.  మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా! మరి ఇక్కడ తగినవి- తగనివి అంటూ ఉంటాయా!! 

ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం,రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. 

సత్వం  జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని,బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచబూతాలతో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో  పోలుస్తారు, బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు,రజస్సు, సత్వ గుణాలను మిగతామూడు వెల్లతోపోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలి తో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు-తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాల్ని పాటించాలి.  నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక, మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా- అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.

"వైయత్తు వాళ్ వీర్గాళ్!"  ఈ భుమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది, ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది ఈ విషయం రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నివ్వు ఆజ్ఞ యివ్వు నిన్ను

పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు, దానికి సీత ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా, చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో, కాని శ్రీరామ చందృడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా, నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక, తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.

"నాముం నం పావైక్కు" ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు, లోకుల వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది.

 "శెయ్యుం కిరిశైగళ్ కేళీరో" మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి, " పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి"  పాల కడలిలోని సుకుమారం గా పవళించి ఉన్న వైకుఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి "పరమన్" అని అంటారు.   ఎందుకంటే  మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాల్కడలిలోనేకదా! ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ద్వజా, అరవింద, వజ్రా, అంకుష ఇత్యాదులు గుర్తులుగా  చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో, భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక-యోగనిద్ర.  మనకోసం ఇంకా ఎమి చేస్తె బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాల్కడలి. 

వ్యుహం-పాల్కడలి

నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.

ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతోలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు.  ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.

అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.

ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు.

 మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ద అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు,   మరొక రూపం తీస్తాడు, దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇందృనిలో ఉండి చేస్తాడు.  అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.  ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.  

ఆయన పాదలను పాడుదాం. కడుపు నిండి పోతుంది-  ఇక "నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్" నెయ్యి వద్దు పాలు వద్దు. "నాట్కాలే నీరాడి" తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం. 

 "మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్" కాటుక,పూలు ధరించం, ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. "శెయ్యాదన శెయ్యోమ్" మాపూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం - ప్రాచీణ ఆచారాలు మానెయ్యం " తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్" పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. "ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి" చాతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. "ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్" ఇవన్ని ఆనందంతో చేస్తాం.

🕉🌞🌎🌙🌟🚩

ఆండాళ్ తల్లి మనకు నేర్పిన దేమి ?

మానవ జాతి ఉజ్జీవించటానికి ఆండాళ్ తల్లి ఉత్తమమైన, పరమ సాత్వికమైన, సర్వ సులభమైన వ్రతాన్ని అందించాలని ఈ లోకంలో అవతరించింది. భగవంతుడు ఈ లోకంలో ఎన్నో సార్లు అవతరించాడు. మానవ జాతి బాగుపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు. ఆయన చేసిన ఉపదేశాల్లో కర్మాచరణ చేయాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, భక్తిని పెంపోందించుకోవాలి అంటూ ఎన్నో రకముల సాధనములని చూపించాడు. 

చివరికి "మామేకం శరణం వ్రజ" అంటూ తననే ఆశ్రయించమని చరమోపాయాన్ని ఉపదేశించినా పెద్దగా ఫలితం లేకపోయింది. భగవంతుడి కృషి

అంతగా ఫలించలేక పోయే సరికి ఆయనకి విసుగు ఏర్పడి కలియుగంలో వీళ్ళ మధ్యకి రానే రాను అనుకునేంత స్థితికి వెళ్ళి పోయాడు.

 ఇది వరకు యుగాల్లో తిరిగే రూపాల్లో వచ్చాడు. ఒక్కో అవతారంలో ఒక్కో చరమోపదేశాన్ని ఇచ్చాడు. ఈ కలియుగంలో అలా చరమోపదేశాన్ని ఇవ్వడానికి రావలని అనిపించలేదు కనుక తిరగని అర్చారూపంలోనే ఉంటాను అని నిర్ణయించుకున్నాడు భగవంతుడు. చెప్పాల్సింది అలాకాదు, చెప్పే పద్దతి ఒకటుంటుంది. నేను వెళ్ళి నేర్పుతా అంటూ ఆండాళ్ తల్లి ఈ లోకంలో అవతరించింది. ఏమి నేర్పాలని మన వద్దకి వచ్చింది అంటే అవి మూడు కార్యాలు చేస్తానని ప్రతిజ్ఞ పూని వచ్చింది అమ్మ.

కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్ట్వైవ సర్వాత్మనాం

ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం |

సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యే పురే

జాతాం వైదికవిష్ణుచిత్తతనయాం గోదాముదారాంస్తుమః ||

ఒకటి "కీర్తనం". అంటే లోకంలో వాళ్ళకి పాట అంటే ఇష్టం, మొదట తాను పాడి అందరిచే పాడించింది. భగవంతుడు కూడా ఒక పాటని ఇచ్చాడు, అదే భగవద్గీత. అదీ పాటే కానీ ప్రయోజనం అనుకున్నంతగా లేక పోయింది. భగవద్గీతను అర్జునునికి అందించినప్పుడు "యుద్ధారంభే శస్త్రాభ్యాసః" అన్నట్లు అవతల యుద్ధరంగంలో సందిగ్థత, చెప్పేంత ఓపిక భగవంతునికీ లేదు, వినే శ్రద్ధ అర్జునునికీ లేదు. అర్జునుడు అంతా విన్నా పెద్దగా అర్థం కాలేదు. ఎంత కష్టపడి చెప్పినా అర్థకాలేదని "నోనమశ్రద్ధధానోసి దుర్మేదాసాష్చపాండవ" అంత అశ్రధ్ధ పనికిరాదయా అంటూ మొదట ఉపనిషద్ సారముగా చెప్పిన దానికి మళ్ళీ సారముగా "అనుగీతాని" మొరొక సారాన్ని చెప్పాడు భగవానుడు. 

ఇలా ఎంత చెప్పినా సరే ఆ చెప్పడం చిన్న చిన్న పాటలవలె ఉండకపోవటంచే ఆయన చెప్పినది అంతగా ఫలించలేదు. అందుకే “కీర్తనం", ఎలా పాడాలో, ఎట్లా పాడాలో, నేను నేర్పిస్తానంటూ వచ్చింది అమ్మ.  ప్రేమతో చెబితే వింటారు కానీ కోపంతో చెబితే ఎవ్వరికి నచ్చదు. "ప్రకటం విధాతుమ్", అందుకోసమే బుజ్జగించి అందరికి ఇలాంటివి ఎలా ఉంటాయో తెలియజేయటానికి వచ్చింది అమ్మ. చక్కగా పాడితే లోపల ఉన్న మానస ప్రవృత్తులంతా పరిశుభ్రం అవుతాయి. మనిషి పాటలో పరవసిస్తాడు. ఇలా చేయండి అని ఆండాళ్ తల్లి చెప్పలేదెప్పుడూనూ, ఇలా చేద్దాం రండి అని తనతో పాటు మనల్ని చేర్చుకుంది. మరి ఏది పడితే అది పాడుతే సరికాదు కదా! మన ఇళ్ళల్లో మురికి నీటి నాళాలు వాడగా వాడగా పాడైనప్పుడు అందులో దాని జిడ్డును తొలగించే ద్రవాన్ని పోస్తే చక్కగా మారినట్లే, ఈ లోపల మన ఇంద్రియాల్లో మన మనస్సులో మన బుద్ధిలో ఉన్న మాళిన్యాన్ని తొలగించే భగవన్నామ అమృతాన్ని కనుక పోయగలిగితే అవి శుద్ది అవుతాయి. ఉపదేశంగా కావలన్నా లేదా హాయిగా పాడుకోవాలన్నా అదే నారాయణ నామమే అని ఋషులు వెలుగెత్తి చాటిన నారాయణ నామమనే ఉత్తమ మంత్రాన్ని అందించింది అమ్మ.

రెండవది "ప్రపదనం", మనం భగవంతునికి శరణాగతి చేయాలి. ఎలా చేయాలి ? అదేదో నిర్భందంగా చేయాలా ? సహజంగా చేయాలా ? అట్లా సహజంగా ఎలా చేయాలో తెలుపడానికి వచ్చింది అమ్మ.

మూడోది "స్వస్మై ప్రసూనార్పణం". సహజంగా ప్రేమతో ఎప్పుడైతే భగవంతునికేసి ఒంగుతావో అది స్వామికి ఆనంద దాయకం. అప్పుడు భగవంతునికి నీవేమీ చేయనక్కరలేదు, హృదయ కమలాన్ని అర్పణ చేస్తే చాలు, భక్తి పరిమళం కల్గిన మనస్సుని అర్పిస్తే చాలు. మనం అర్పించాల్సింది లోన వికసించిన శ్రద్ధని.

ఇవి ఎలా చెయ్యాలో చెప్పడానికి అమ్మ అవతరించింది.

॥ గజాననస్తోత్రం దేవర్షికృతమ్ ॥

శ్రీ గణేశాయ నమః

దేవర్షయ ఊచుః:-

1)విదేహరూపం భవబన్ధహారం సదా స్వనిష్ఠం స్వసుఖప్రదమ్ తమ్ ।

అమేయసాంఖ్యేన చ లక్ష్మీశం గజాననం భక్తియుతం భజామః ॥

2)మునీన్ద్రవన్ద్యం విధిబోధహీనం సుబుద్ధిదం బుద్ధిధరం ప్రశాన్తమ్ ।

వికారహీనం సకలాంమకం వై గజాననం భక్తియుతం భజామః ॥ 

3)అమేయ రూపం హృది సంస్థితం తం బ్రహ్మాఽహమేకం భ్రమనాశకారమ్ ।

అనాది-మధ్యాన్తమపారరూపం గజాననం భక్తియుతం భజామః ॥ 

4)జగత్ప్రమాణం జగదీశమేవమగమ్యమాద్యం జగదాదిహీనమ్ ।

అనాత్మనాం మోహప్రదం పురాణం గజాననం భక్తియుతం భజామః ॥

5)న పృథ్విరూపం న జలప్రకాశనం న తేజసంస్థం న సమీరసంస్థమ్ ।

న ఖే గతం పంచవిభూతిహీనం గజాననం భక్తియుతం భజామః ॥

6)న విశ్వగం తైజసగం న ప్రాజ్ఞం సమష్టి-వ్యష్టిస్థ-మనన్తగం తమ్ ।

గుణైర్విహీనం పరమార్థభూతం గజాననం భక్తియుతం భజామః ॥

7)గణేశగం నైవ చ బిన్దుసంస్థం న దేహినం బోధమయం న ఢుణ్ఢీ ।

సుయోగహీనం ప్రవదన్తి తత్స్థం గజాననం భక్తియుతం భజామః ॥ 

8)అనాగతం గ్రైవగతం గణేశం కథం తదాకారమయం వదామః ।

తథాపి సర్వం ప్రతిదేహసంస్థం గజాననం భక్తియుతం భజామః ॥

9)యది త్వయా నాథ! ఘృతం న కించిత్తదా కథం సర్వమిదం భజామి ।

అతో మహాత్మానమచిన్త్యమేవం గజానన భక్తియుతం భజామః ॥

10)సుసిద్ధిదం భక్తజనస్య దేవం సకామికానామిహ సౌఖ్యదం తమ్ ।

అకామికానాం భవబన్ధహారం గజాననం భక్తియుతం భజామః ॥

11)సురేన్ద్రసేవ్యం హ్యసురైః సుసేవ్యం సమానభావేన విరాజయన్తమ్ ।

అనన్తబాహు మూషకధ్వజం తం గజాననం భక్తియుతం భజామః ॥ 

12)సదా సుఖానన్దమయం జలే చ సముద్రజే ఇక్షురసే నివాసమ్ ।

ద్వన్ద్వస్య యానేన చ నాశరూపే గజాననం భక్తియుతం భజామః ॥ 

13)చతుఃపదార్థా వివిధప్రకాశస్తదేవ హస్తం సుచతుర్భుజం తమ్ ।

అనాథనాథం చ మహోదరం వై గజాననం భక్తియుతం భజామః ॥

14)మహాఖుమారూఢమకాలకాలం విదేహయోగేన చ లభ్యమానమ్ ।

అమాయినం మాయికమోహదం తం గజాననం భక్తియుతం భజామః ॥

15) రవి స్వరూపం రవిభాసహీనం హరిస్వరూపం హరిబోధహీనమ్ ।

శివస్వరూపం శివభాసనాశం గజాననం భక్తియుతం భజామః ॥ 

16)మహేశ్వరీస్థం చ సుశక్తిహీనం ప్రభుం పరేశం పరవన్ద్యమేవమ్ ।

అచాలకం చాలకబీజరూపం గజాననం భక్తియుతం భజామః ॥

17)శివాది-దేవైశ్చ ఖగైశ్చ వన్ద్యం నరైర్లతా-వృక్ష-పశుప్రముఖ్యైః ।

చరాఽచరైర్లోక-విహీనమేవం గజాననం భక్తియుతం భజామః ॥ 

18)మనోవచోహీనతయా సుసంస్థం నివృత్తిమాత్రం హ్యజమవ్యయం తమ్ ।

తథాఽపి దేవం పురసంస్థితం తం గజాననం భక్తియుతం భజామః ॥

19)వయం సుధన్యా గణపస్తవేన తథైవ మర్త్యార్చనతస్తథైవ ।

గణేశరూపాశ్చ కృతాస్త్వయా తం గజాననం భక్తియుతం భజామః ॥ 

20)గజాఖ్యబీజం ప్రవదన్తి వేదాస్తదేవ చిహ్నేన చ యోగినస్త్వామ్ ।

గచ్ఛన్తి తేనైవ గజాననం తం గజాననం భక్తియుతం భజామః ॥

21)పురాణవేదాః శివవిష్ణుకాద్యామరాః శుకాద్యా గణపస్తవే వై ।

వికుణ్ఠితాః కిం చ వయం స్తవామో గజాననం భక్తియుతం భజామః ॥

ముద్గల ఉవాచ:-

22)ఏవం స్తుత్వా గణేశానం నేముః సర్వే పునః పునః ।

తానుత్థాప్య వచో రమ్యం గజానన ఉవాచ హ ॥

గజానన ఉవాచ:-

23)వరం బ్రూత మహాభాగా దేవాః సర్షిగణాః పరమ్ ।

స్తోత్రేణ ప్రీతిసంయుక్తో దాస్యామి వాంఛితం పరమ్ ॥

25)జాననవచః శ్రుత్వా హర్షయుక్తా సురర్షయః ।

జగుస్తం భక్తిభావేన సాశ్రునేత్రా ప్రజాపతే ॥ 

దేవర్షయ ఊచుః:-

25)యది గజానన స్వామిన్ ప్రసన్నో వరదోఽసి మే ।

తదా భక్తిం దృఢాం దేహి లోభహీనాం త్వదీయకామ్ ॥

26)లోభాసురస్య దేవేశ కృతా శాన్తిః సుఖప్రదా ।

తయా గజదిదం సర్వం వరయుక్తం కృతం త్వయా ॥

27)అధునా దేవదేవేశ! కర్మయుక్తా ద్విజాతయః ।

భవిష్యన్తి ధరాయాం వై వయం స్వస్థానగాస్తథా ॥

28)స్వ-స్వధర్మరతాః సర్వే కృతాస్త్వయా గజానన!।

అతః పరం వరం ఢుణ్ఢే యాచమానః కిమప్యహో!॥ 

29)యదా తే స్మరణం నాథ కరిష్యామో వయం ప్రభో ।

తదా సంకటహీనాన్ వై కురూ త్వం నో గజానన!॥

30)ఏవముక్త్వా ప్రణేముస్తం గజాననమనామయమ్ ।

తానువాచ సప్రీత్యాత్మా భక్తాధీనః స్వభావతః ॥

గజానన ఉవాచ:-

31)యద్యచ్చ ప్రార్థితం దేవా మునయః సర్వమంజసా ౹

భవిష్యతి న సన్దేహో మత్స్మృత్యా సర్వదా హి వః ॥

32)భవత్కృతమదీయం వై స్తోత్రం సర్వత్ర సిద్ధిదమ్ ।

భవిష్యతి విశేషేణ మమ భక్తి-ప్రదాయకమ్ ॥ 

33)పుత్ర-పౌత్ర-ప్రదం పూర్ణం ధన-ధాన్య-ప్రవర్ధనమ్ ।

సర్వసమ్పత్కరం దేవాః పఠనాచ్ఛ్రవణాన్నృణామ్ ॥

34)మారణోచ్చాటనాదీని నశ్యన్తి స్తోత్రపాఠతః ।

పరకృత్యం చ విప్రేన్ద్రా అశుభం నైవ బాధతే ॥ 

35)సంగ్రామే జయదం చైవ యాత్రాకాలే ఫలప్రదమ్ ।

శత్రూచ్చాటనాదిషు చ ప్రశస్తం తద్ భవిష్యతి ॥ 

36)కారాగృహగతస్యైవ బన్ధనాశకరం భవేత్ ।

అసాధ్యం సాధయేత్ సర్వమనేనైవ సురర్షయః ॥

37)ఏకవింశతి వారం తత్ చైకవింశద్దినావధిమ్ ।

ప్రయోగం యః కరోత్యేవ సర్వ సిద్ధియుతో భవేత్ ॥

38)ధర్మాఽర్థకామ-మోక్షాణాం బ్రహ్మభూతస్య దాయకమ్ ।

భవిష్యతి న సన్దేహః స్తోత్రం మద్భక్తివర్ధనమ్ ॥

ఏవముక్త్వా గణాధీశస్తత్రైవాన్తరధీయత ॥

ఇతి ముద్గల పురాణాన్తర్గతం గజాననస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

మన ప్రస్తుత స్థితికి మనమే భాద్యులం. ఏం కాగోరుతామో ఆ విధంగా అవడానికి మనకు శక్తి ఉంది. మన వర్తమాన స్థితికి పూర్వకర్మల ఫలితమైతే మనం పొందగోరే స్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందవచ్చునని నిశ్చయమోతుంది. కాబట్టి ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి.

ఇంద్రియ భ్రాంతి జన్యమైన ఈ ప్రపంచాన్ని పరిత్యజించండి. పారమార్థికులమై పరమ సత్యాన్ని అన్వేషించాలనే తపన మాత్రమే శ్రేయోదాయకం.

🕉🌞🌎🌙🌟🚩

[14:56, 16/12/2020] +91 92915 82862: భాగవతము

శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩

*సృష్టి నుంచి ఎన్నో ప్రజ్ఞలు దిగివస్తాయి. ఈ ప్రజ్ఞలకు వాటి స్వభావమును బట్టి, గుణములను బట్టి పేర్లు ఉంటాయి. ఈ ప్రజ్ఞలన్నీ ఎలా దిగి వచ్చాయి, వాటి క్రమము ఎప్పటికప్పుడు గుర్తు

పెట్టుకోవడం వలన, మనము సమన్వయించు కొనడము వలన ఆ ప్రజ్ఞల అనుభూతిని పొందవచ్చు.*

మన ధారణ శక్తి ఈ భాగవతములో పరీక్షింపబడుతుంది. ప్రజ్ఞలన్నీ సృష్టి అంతా వ్యాపించి మహత్తరమైన కార్యములు నిర్వర్తిస్తూ, ఒక్కొక్కరు ఒక్కొక్క సూర్యునివలె వెలిగిపోతూ వారి కిరణముల ద్వారా జీవులను పట్టుకొస్తూ ఉంటారు.మానవసృష్టి లోని గొప్పతనమేమిటంటే ప్రజ్ఞలన్నీ మనలో ఉన్నాయి. మనలో వీరిని దర్శించవచ్చు. 

🕉🌞🌎🌙🌟🚩

[15:00, 16/12/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (742)

🕉🌞🌎🌙🌟🚩

"ఈ ప్రపంచంలో కనిపిస్తున్న బాధలు, దుఃఖాలు నిజం కాదా ? అహంకారాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి !?"

మనని ఈ ప్రపంచం బాధిస్తుంది అన్న అపోహలో మనం ఉన్నాం. ప్రపంచం జడం. దానికా శక్తిలేదు. దుఃఖం మన మనసులో కూడా లేదు. అందుకే నిద్రలో చాలా హాయిగా ఉంటున్నాం. ప్రపంచంలోనూ, మనలోనూ లేని సంతోషదుఃఖాలనే ద్వంద్వభావాన్ని మనకు కల్పిస్తున్నది 'అహంకారమే'! అది బ్రోకర్ లాంటిది. దాన్ని వదిలించుకుంటే ఈ ప్రపంచం ఆనందవనంగా  కనిపిస్తుంది. మనసును కప్పేసిన అహంకారం అనే చీకటిని ధర్మం అనే దీపంతోనే పోగొట్టగలం. మనసా, వాచా, కర్మణా మనలో ధర్మం నిండిఉంటే అహంకారం మన దాపులకు కూడా రాలేదు. ఇప్పుడు ప్రపంచం అహంకారాన్ని ఆడిస్తుంటే, అహంకారం మనల్ని ఆడిస్తుంది. కానీ మనలో ధర్మం నెలకొంటే ఈ రెండు తోక ముడుచుకుంటాయి. నిజానికి అహంకారం అనేది ఒకటి ప్రత్యేకంగా లేదు. వెలుతురు లేకపోవటాన్ని చీకటి అన్నట్లుగానే, ఎక్కడైతే ధర్మం లోపిస్తుందో అక్కడ అది అహంకారంగా వ్యక్తమవుతుంది. కాబట్టి సమస్య అహంకారం కాదు. ధర్మం లేకపోవటమే. సమస్యకు పరిష్కారం కూడా తిరిగి ధర్మాన్ని నెలకొల్పడమే గానీ అసలు ఉనికేలేని అహంకారంతో యుద్ధం చేయటం కాదు !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

"దీపంతో అంధకారం - ధర్మంతో అహంకారం అదృశ్యం !''- (అధ్యాయం -91)

🕉🌞🌎🌙🌟🚩

[15:00, 16/12/2020] +91 92915 82862: "ఋభుగీత " (209)

🕉🌞🌎🌙🌟🚩

బ్రహ్మానందము"

16వ అధ్యాయము 

సత్యం తెలిస్తే జగమే జ్ఞానానందమయంగా గోచరమౌతుంది !

కోరిక అంటే సంకల్పం, ఆశించడం. ఆశ చేతనే మనసు ఏదేదో ఊహిస్తుంది. ఊహించిన మనసు అనుభవించేదాకా ఊర్కోదు. దాన్ని కలలోనో, ఇలలోనో, లేదంటే మరుజన్మలోనో తప్పకుండా సాకారం చేసుకునే శక్తి మనసుకే ఉంది. ఆనందం అనంతంగా ఉంటుంది. దానికి విరామం తుది అనేది ఉండదు. అది తెలిస్తే జగమే జ్ఞానానందమయంగా గోచరమౌతుంది. కదిలిపోయే జగంతో మనం కదిలివెళ్తూ ఉంటే ఆనందం అనంతంగానే ఉంటుంది !

🕉🌞🌎🌙🌟🚩

[15:06, 16/12/2020] +91 92915 82862: 🌷100-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩

అధ్యాయము-8

🥀దారులు-మెట్లు🥀

22. వ్యక్తావ్యక్తములు ఎవని యందు వర్తించుచున్నవో వాడే సర్వాంతర్యామి. జీవుడు వ్యక్తస్థితి యందు కాని, అవ్యక్త స్థితి యందు కానీ ఉండక అంతర్యామి యందు మేల్కాంచి ఉండవలెను. ఇది నన్ను స్మరించుటచే లభ్యము.

23. వ్యక్తావ్యక్తములలో ఒకదాని యందు ఉండుట వలన రెండింటి యందును తిరిగి తిరిగి వర్తించు చుండును. ఇదియే పునరావృత్తి చక్రము. నాయందు వర్తించుట వలన ఈ ఆవృత్తి కలుగదు. కాలమానములో జీవుల ప్రజ్ఞకు ఆవృత్తి కలిగించు కాలములు కొన్నియు. ఆవృత్తి దాటించు కాలములు కొన్నియు కలవు. అట్లే సృష్టిలో ఉన్న పదార్ధములలో కూడా ఈ రెండిటిని కలిగించునవి ఉన్నవి. వానిని వివరించెదను.

24. ఈ సృష్టి మొత్తము సూక్ష్మ తత్వం నుండి స్థూలమునకు దిగి వచ్చుచున్నది. అందలి స్థితులు దిగివచ్చు నిచ్చెన మెట్లు. మరల స్థూలము నుండి సూక్ష్మమునకు పోవుచున్నది‌. అందలి స్థితులు ఎక్కిపోవు నిచ్చెనమెట్లు. కొన్ని పదార్ధములకు, కాలములకు దిగివచ్చు మెట్లుండును. కొన్నిటికి ఎక్కిపోవు మెట్లుండును. దిగివచ్చు మెట్లు ప్రజ్ఞను బంధించును. ఎక్కి పోవు మెట్లు బంధ విమోచనము కలిగించును. రెండు నిచ్చెనలయందును అవియే మెట్లు. ఒకదానికొకటి వ్యతిరేకమున పేర్చి ఉండును. ఈ రెండు నిచ్చెనలును ఆద్యంతములలో కలిసికొని మొత్తం ఒక చక్రాకారమగు నిచ్చెనగా అమర్చబడియున్నది. ఆరోహణము ఇచ్చు మెట్లు చక్ర ప్రవృత్తి నుండి విమోచనము కలిగించును. అవరోహణ క్రమమునందలి మెట్లు ప్రజ్ఞను చక్రములోనికి దింపి త్రిప్పును.

నిప్పు స్థూల పదార్థమును సూక్ష్మతత్వము లోనికి దహించును. వెలుగు, పగటి కాలము కూడా ఇట్లే ఆరోహణ క్రమం ఇచ్చును. మాసమున శుక్లపక్షము, సంవత్సరమున ఉత్తరాయణము, ఇట్లే ఊర్థ్వగతికి అనుకూలము. అందు శరీరము విడిచినవాడు, ధ్యానము చేసినవాడు ఊర్థ్వగతిని పొందును. బ్రహ్మలోక  ప్రజ్ఞను పొందును.

 🕉🌞🌎🌙🌟🚩

[15:06, 16/12/2020] +91 92915 82862: 113) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩

తచ్చేద్విరోధి కేనేయమావృతిర్ హ్యనుభూయతామ్ ౹ వివేకస్తు విరోధ్యస్యాస్తత్త్వజ్ఞానిని దృశ్యతామ్ ౹౹32౹౹

32.  కూటస్థ చైతన్యమునకే అవిద్యతో విరోధమైనచో అవిద్య ఉన్నదనే అనుభవం ఎవరికి కలుగుచున్నది?

(అవిద్యను గూర్చిన ప్రతీతియే లేక పోవునని భావము)

కాని వివేకము అవిద్యకు విరోధి. తత్త్వజ్ఞానుల యందు అవిద్య లేకుండుటను చూడుము.

వ్యాఖ్య:    వివేకమనగా ఉపనిషద్విచారణ జన్యమైన జ్ఞానము.ఈ జ్ఞానము అవిద్యను తొలగించును.దానితో అవిద్యాకార్యములైన 

స్థూల సూక్ష్మ కారణ శరీరముల బోధ కూడా తొలగి కూటస్థ చైతన్యపు నిరంతరాయమైన బోధ కలుగును.ఇట్టి బోధ కలిగినవారే తత్త్వజ్ఞానులు.

మాయను ఉపాధిగ స్వీకరించిన బ్రహ్మము ఈశ్వరుడనీ అవిద్యను ఉపాధిగ స్వీకరించిన బ్రహ్మము జీవుడని చెప్పబడినది.

ఈ అవిద్యయే కారణ శరీరము. అవిద్యకు గల ఆవరణ శక్తి వలన కూటస్థ చైతన్యమును గూర్చిన బోధ ఆవరింపబడుచున్నది.

విక్షేప శక్తి వలన అవిద్యా కల్పితములైన సూక్ష్మ స్థూల శరీరములు భాసించుచున్నవి. సూక్ష్మశరీరమున,అనగా అంతఃకరణమున,ప్రతిఫలించిన కూటస్థ చైతన్యము చిదాభాసుడు అనబడుచున్నాడుఇదే"జీవుడు"అని వ్యవహారము.ఈ విక్షేపశక్తియే అన్యోన్యాధ్యాస,అధ్యాస,

అధ్యారోపము అనీ తెలియబడుచున్నది.

ఉపనిషదుపదేశములను చక్కగా వివేచించి విచారించి అనుభవమునకు తెచ్చుకొను ప్రయత్నము చేసినచో వివేకము కలిగి అవిద్య తొలగి ప్రత్యక్ చైతన్యబోధ అనుభవగతమగును.

కేవలము ఉపనిషద్ గ్రంథములను 

మాత్రము అధ్యయనము చేసినచో

కలుగునది పరోక్ష జ్ఞానము.అది సాపేక్షము(relative).దీని వలన మనకు అజ్ఞానము,అవిద్య కలదు అని మాత్రము బోధపడును. అవిద్యకు ఈ జ్ఞానము విరోధి కాదు.కనుకనే సాధారణ పండితులు విద్వాంసులయందు అపారమైన తాత్త్విక పాండిత్యమున కూటస్థచైతన్య బోధరాహిత్యమును ఏకకాలమున చూచుచున్నాము.

ఉపనిషత్తులు ఉపదేశించిన మార్గమును అవలంబించి అభ్యసించిన వారియందు కూటస్థ చైతన్యపు దివ్య ప్రకాశమును అవిద్యా రాహిత్యమును మనము చూడగలుగుదుము.వారియందు కేవల పండితప్రకాండులు సూర్యుని ముందు దివిటీల వలె వెలవెల బోవుదురు గదా!

ఇట్టి తత్త్వదర్శులకు కలిగిన జ్ఞానము అపరోక్ష జ్ఞానమను బడుచున్నది.ఇది చైతన్యినుభవజన్యమైన జ్ఞానము.

కనుక బోధ స్వరూపమైన కూటస్థచైతన్యము అజ్ఞానము,అవిద్యతో ఏకకాలమున ఉండుట అసంభవమేమీ కాదు.కాగా అవసరము కూడా.

అవిద్య ఉన్నదని తెలిసిననే దానిని తొలగించే ప్రయత్నము జరుగును.

అవిద్యను గూర్చిన జ్ఞానము కూడా లేని మనుష్యులు ఇతర జంతువుల వలెనే పుట్టుచు చచ్చుచు సంసార చక్రమున తిరుగుచుందురు.

🕉🌞🌏🌙🌟🚩

[15:23, 16/12/2020] +91 92915 82862: శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩

కల్యాణీరాగః - ఆదితాళమ్‌.

20. పూర్ణ బోధో7హమ్‌

పూర్ణబోధోహం -

సదానన్ద - పూర్ణబోధో7హమ్‌.

1. వర్ణాశ్రమాచార కర్మాతి దూరో7హం.

స్వర్ణవ దఖిలవికార గతో7హమ్‌ || పూర్ణ||

2. ప్రత్యగాత్మాహం ప్రవితతసత్యఘనో7హం

శ్రుత్యన్తశతకోటి ప్రకటిత బ్రహ్మాహం

నిత్యో7హ మభయో7హ మద్వితీయోహమ్‌|| పూర్ణ||

3. సాక్షిమాత్రో7హం ప్రగళిత పక్షపాతో7హం

మోక్షస్వరూపో7హ మోంకారగమ్యో7హం

సూక్ష్మో7హ మన ఘో7హ మద్భుతాత్మాహమ్‌|| పూర్ణ||

4. స్వప్రకాశో7హం విభురహం నిష్ప్రపఞ్చో7హం

అప్రమేయో7హ మచలో7హ మకలో7హం

నిష్ప్రతర్క్యాఖణ్ణౖక రసో7హమ్‌ || పూర్ణ||

5. అజనిర్మమో7హం బుధజన భజనీయో7హం

అజరో7హ మమరో7హ మమృత స్వరూపో7హం

నిజపూర్ణ మహిమని నిహిత మహితో7హమ్‌ || పూర్ణ||

6. నిరవయవో7హం నిరుపమ నిష్కలఙ్కో7హం

పరమశివేన్ద్ర శ్రీగురు సోమ సముదిత

నిరవధి నిర్వాణ సుఖసాగరో7హమ్‌ || పూర్ణ||

🕉🌞🌎🌙🌟🚩

తాత్పర్యము:-

1. ఆహా! నాకు జ్ఞానోదయమైనది - ఆనందమయమై నిండైన ఏజ్ఞానము నాయందు ఉదయించినదో - ఆ జ్ఞానమే నేను.

బ్రాహ్మాణాది వర్ణములు - వర్ణములకు విధింప బడిన ఆచారములు నాకు లేవు. కరకంకణ-కర్ణ భూషాదులుగా ఒకే బంగారము అనేక వికారములు చెందినట్లు - ఒక్క నేనే వివిధముగా గోచరించుచున్నాను. (నాకంటె వేరైనది లేదు. నిండైన జ్ఞానానందములే నారూపము.)

2. అన్నిటికిని లోపలిదైన ఆత్మను నేను, (శరీరము - ఇంద్రియములు - మనస్సు - బుద్ధి - ఆత్మ - ఇవి ఒకదానికంటె ఒకటి లోపలివి.) అనంతముగా విస్తరించి యున్న సత్యముయొక్క ఘనీభూత స్వరూపమే నేను.

('సత్యము' అనగా - నిజము, ఆడి తప్పకుండుట అన్నది లౌకికార్థము.

 వేదాంతమున సత్యము అనగా త్రికాలాబాధ్యమైనది. సృష్టి - స్థితి - లయములయందును, అవి లేనపుడును - ఎన్నడును ఏది కొంచెముకూడ వికారమునకు లోను కాదో - అది సత్యము - అనగా బ్రహ్మము అని అర్థము.)

బహుళములైన ఉపనిషత్తులు ఏ పరబ్రహ్మమును బోధించు చున్నవో ఆపరబ్రహ్మమే నేను! వెలితిలేని జ్ఞానానందములే నారూపము.

3. నేను నిత్యుడను ఒకప్పడుండుట - ఒకప్పుడు లేకుండుట నాకు లేవు. నాకు భయము లేదు. ''ద్వితీయాద్వై భయంభవతి'' - రెండవదియున్న భయము జనించును. రెండవది లేదు. ఉన్నది నేనొక్కడనే! నాకు భయము దేనివలన గల్గును? నేనద్వితీయుడను, రెండవది లేనివాడను. 'ఏకమేవాద్వితీయం బ్రహ్మ' అని శ్రుతి నన్నే తెలుపుచున్నది. నేను జ్ఞానానందమయుడను.

నేను కేవలము సాక్షిని. (''సాక్షాత్‌ ద్రష్టాసాక్షీ ''చూచిన వాడు. నాలో - నాకు వెలుపల ఏమి జరిగినను - జరుగుచున్నను - అది మంచియైనను చెడ్డయైనను నాకు దానితో లేశమును సంబంధము లేదు.

ఇద్దరు వ్యక్తులు వివాదపడుచున్నారు. ఏ వెలుగులో వారు వివాదపడుచున్నారో ఆ వెలుగునకు వారి వివాదముతో సంబంధమేమున్నది? జరుగుచున్న వివాదమునకు ఆ వెలుగు సాక్షి; అంతే! అట్లే నేను నామనోబుద్ధ్యహంకార చిత్తాదుల యందును - ఇంద్రియములయందును - దేహమున - దేహమునకు బయటిదైన లోకమున జరుగు సర్వవిధ కృత్యములకు సాక్షిని. కేవలము సాక్షిని. ఏమి జరిగినను నా వెలుగులో జరుగుచున్నది. అంతే! నాకు ఆజరుగుచున్న దానితో సంబంధము ఏమాత్రమును లే.) ఇట్లగుట చేతనే నాకు పక్షపాతము లేదు.

 లోకము దేనిని సుఖమనుకొనుచున్నదో - అది సంభవింపలేదని బాధగాని, దేనిని దుఃఖముగా భావించుచున్నదో అది తొలగ లేదన్న ఆరాటముగాని ఆనలో లేవు. నేను సాక్షిమాత్రుడను గదా! అందుచేతనే - ఇది సంబవింపవలెనని | ఇది కలుగరాదని నే నెన్నడును భావింపను. ఇందువలననే నాకు దేనియందును పక్షపాతములేదు. మోక్షము నాస్వరూపమే! (తన్ను అనగా ఆత్మను తానెఱుంగుటయే మోక్షము. ఆ ఎఱుక జ్ఞానము. ఆజ్ఞానమే నారూపము).

ఓంకారము నన్నే తెలుపుచున్నది. నేను సూక్ష్ముడను - మహత్తరుడను, 'అణోరణీయాన్‌ - మహతో మహీయాన్‌' అని శ్రుతి నన్నే కీర్తించుచున్నది. నేను జ్ఞానానందమయుడను!

4. నేను స్వయంప్రకాశ శీలిని. (చూ. 17. తాత్పర్యము లోని వివరణము) నాయందు ప్రపంచము లేదు. (ఉన్నది నేనే) ఇంత అని నన్ను గొలుచుట సాధ్యము కాదు. (బ్రహ్మ అనంతమైనది) నేనచలుడను. (దేహాదులకు చలనముగాని, బ్రహ్మమునకు చలనము లేశమును లేదు.) నేను నిష్కలుడను. (భాగరహితుడను).

నా రూపము తర్కమునకు అందదు. అది అఖండము - ఏకరసము. (బహ్మము అనంతము | ఏకము. అందు ఖండములకు - ముక్కలకు - భాగములకు అవకాశము ఎట్లు? 'రసోవై సః- ఆనంన్దం బ్రహ్మేతి వ్యజానాత్‌' అనుచు శ్రుతిరసమే, ఆనందమే బ్రహ్మస్వరూపమని నన్నే కీర్తించుచున్నది.)

జ్ఞానమయమైన ఆనందము నేనే!

5. నేనజుడను (నాకు బుట్టుకలేదు). నేను నిర్మముడను (ఉన్నది నేనే కాని, నాకంటె వేరైనది లేశమును లేదు.)

జ్ఞానులైనవారికి నేనే సేవ్యుడను. (జ్ఞాని పరబ్రహ్మాను సంథాన పరుడై యుండును. ఆపర బ్రహ్మము నేనే!)

నేను అమృతుడను. నేను నావెలితి లేని నామహా మహిమ యందే సుప్రతిష్ఠితుడనై యున్నాను. నేను నిత్యము జ్ఞానానంద పరిపూర్ణుడను.

6. నాయందు అవయవ విభాగము లేదు. నాకు సాటి వేరొకటి లేదు. నేను నిష్కలుడను.

శ్రీ గురువులు పరమశివవేంద్రులు శీతమయూఖుడువోలె చంద్రుడువలె) అపారముగా వెల్లివిరియ జేసిన బ్రహ్మానంద సముద్రమే నేను!!

నేను జ్ఞానమయుడను!

ఆనందమయుడను! 'బ్రహ్మైవాహం'.

🕉🌞🌏🌙🌟🚩

[16:07, 16/12/2020] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  - 99 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 27. యజ్ఞార్థ భావము  -   యజ్ఞార్థముగ జీవించువారు అట్టి కార్యము లందు అందరి శ్రేయస్సును హృదయమున స్మరించుచు నిర్వర్తించ వలెను.  యజ్ఞము లాచరింపగ అందు శేషించిన ఫలము అమృతమయము. దాని ననుభవించు వారు శాశ్వతమైన బ్రహ్మమును పొందుచున్నారు. పరమాత్మ తెలిపిన యజ్ఞము ఫలాపేక్షలేక యితరుల శ్రేయస్సు కొరకు ఆచరించు కార్యము.  అట్టివారే దైవానుగ్రహ ప్రాప్తులగుదురు.  అట్టి వారికే సనాతనము, శాశ్వతము అగు బ్రహ్మనుభూతి అనుభవమగును. 🍀

యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |

నాయం లోక్కో స్త్యయజ్ఞస్య కుతో 2 వ్య: కురుసత్తమ || 31

కురుసత్తముడవగు ఓ అర్జునా! యజ్ఞము లాచరింపగ అందు శేషించిన ఫలము అమృతమయము. దాని ననుభవించు వారు శాశ్వతమైన బ్రహ్మమును పొందుచున్నారు. లోకమున యజ్ఞము చేయనివానికి ఈ లోకమునందే అస్థిత్వము దొరుకదు. 

పరలోకమెట్లు దొరుకును? పరమాత్మ తెలిపిన యజ్ఞము ఫలాపేక్షలేక యితరుల శ్రేయస్సు కొరకు ఆచరించు కార్యము. అట్లు కార్యములను నిర్వర్తించు రాజవంశమైన కురు వంశమునందు అర్జునుని శ్రేష్ఠునిగ శ్రీకృష్ణుడు సంబోధించినాడు. నిజమునకు అర్జునుని జీవితమంతయు యజ్ఞార్థమే.

ఇట్లు యజ్ఞార్థముగ జీవించువారు అట్టి కార్యము లందు అందరి శ్రేయస్సును హృదయమున స్మరించుచు నిర్వర్తించ వలెను. అట్టి విశిష్టమగు కార్యముల నుండి పుట్టిన ఫలములను అందరికిని పంచవలెను. అందరికి పంచగ మిగిలినది తాను భుజించినచో అది అమృతమగును. ముందుగ భుజించుట వలన ఫల మమృతము కాదు. అందువలన అందరికొరకు తాను, అందరి శ్రేయస్సు తరువాత తన శ్రేయస్సు అనునది యఁరభావము. 

అట్టివారే దైవానుగ్రహ ప్రాప్తులగుదురు. అట్టి వారికే సనాతనము, శాశ్వతము అగు బ్రహ్మనుభూతి అనుభవమగును. అన్ని విషయములందు అందరికన్న ముందు పొంద వలెనని, అందరికన్న ముందు భుజించవలెనని భావించువారు ప్రాపంచికులు. వారికి నిదానమే లేదు. అట్టి వారికి యజ్ఞమన నేమో తెలియదు. వారీ లోకమున కూడ స్థిమితముగ నుండలేరు. వారి పరలోక ప్రయత్నము లన్నియు హాస్యాస్పదములే. 

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[16:07, 16/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 297 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

72. అధ్యాయము - 27

🌻. దక్షయజ్ఞ ప్రారంభము  - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఒకప్పుడు ఆ దక్షుడు గొప్ప యజ్ఞమునారంభించెను. ఆ యజ్ఞమునకు దీక్షితుడైన దక్షుడు దేవతలను, ఋషులను ఆహ్వానించెను (1). మహర్షులు, దేవతలు అందరు శివమాయచే మోహితులై ఆతని యజ్ఞమును చేయించుటకు అచటికి విచ్చేసిరి (2). అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాస భగవానుడు, భారద్వాజుడు, గౌతముడు (3), పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకుపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు, మరియు వైశంపాయనుడు విచ్చేసిరి (4).

నా కుమారుడగు దక్షుని యజ్ఞమునకు వీరేగాక ఇంకా ఎందరో మహర్షులు తమ భార్య పిల్లలతో ఆనందముగా విచ్చేసిరి (5). మరియు, సర్వదేవగణములు, మహాత్ములగు లోకపాలురు, సర్వ ఉపదేవగణములు తమ వాహనముతో, సైన్యములతో కూడి విచ్చేసిరి (6). జగత్స్రష్టనగు నన్ను స్తుతించి సత్యలోకమునుండి తీసుకొని వెళ్లిరి. నేను నా కుమారులతో, పరివారముతో, మరియు మూర్తీభవించిన వేదశాస్త్రములతో గూడి వెళ్లితిని (7). మరియు, వైకుంఠము నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరముతో దోడ్కొని వచ్చిరి. ఆయన ఆ యజ్ఞమునకు తన భక్తులతో, పరివారముతో గూడి విచ్చేసెను (8).

వీరే గాక, ఇంకనూ చాల మంది మోహితులై దక్షయజ్ఞమునకు వచ్చిరి. దుష్టుడగు దక్షుడు వారినందరినీ సత్కరించెను (9). విశ్వకర్మ మిక్కిలి విలువైన, గొప్పగా ప్రకాశించే మహాదివ్య భవనములను నిర్మించి యుండెను. దక్షుడు వారందరికీ వాటిలో మకామునిచ్చెను (10). ఆ భవనములన్నింటియందు యోగ్యతనను సరించి అందరు నివసించిరి. నేను, విష్ణువు కూడ అచట నివసింతిమి. అందరికీ సన్మానము చేయబడెను. వారందరు చక్కగా ప్రకాశించిరి (11). 

అపుడు కనఖల తీర్థమునందు జరిగిన ఆ మహాయజ్ఞములో దక్షుడు భృగువు మొదలగు తపశ్శాలురను ఋత్విక్కులుగా నియమించెను (12). విష్ణువు మరుద్గణములన్నింటితో గూడి స్వయముగా ఆ యజ్ఞమునకు అధ్యక్షుడు గా నుండెను. నేను బ్రహ్మనై ఆ యజ్ఞములో వేద విధిని వివరిస్తూ నడిపించితిని (13).

సర్వదిక్పాలకులు ఆయుధములను ధరించి పరివారసమేతముగా ద్వారపాలకుల స్థానమునందు నిలబడి రక్షణనొసంగిరి. ఆ దృశ్యము చాల కుతూహలమును కలిగించెను (14). సుందరాకారుడగు యజ్ఞుడు ఆ దక్షుని యజ్ఞములో స్వయముగా హాజరయ్యెను. మహాముని శ్రేష్ఠులందరు స్వయముగా వేదోక్త కర్మలను నిర్వహించిరి (15). అగ్ని తన వేయి రూపములతో హవిస్సును స్వీకరించుటకై ఆ యజ్ఞమహోత్సవములో వెనువెంటనే ఉపస్థితుడాయెను (16). పద్ధెనిమిదివేల మంది ఋత్విక్కులు హోమమును చేసిరి. అరవై నాలుగు వేల దేవర్షులు ఉద్గాతృస్థానముల నలంకరించిరి (17).

అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులైరి. నారదాది ఋషులు, మరియు సప్తవర్షులు వేర్వేరుగా గాథలను వినిపించిరి (18). ఆ దక్షుడు తన మహాయజ్ఞములో గంధర్వులను, విద్యాధరులను, సిద్ధ సంఘములను, ద్వాదశా దిత్యులను, అసంఖ్యాకములగు నాగులను వారివారి గణములతో యజ్ఞములతో సహా ఋత్విక్కులు గా వరణము చేసెను (19). ఆ యజ్ఞములో యజమానియగు దక్షుడు ద్విజర్షులను, రాజర్షులను, దేవర్షులను, మిత్రులతో మంత్రులతో సైన్యములతో గూడియున్న రాజులను, వసువులను, గణ దేవతలను అందరినీ వరణము చేసెను (20).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[16:07, 16/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 184 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వామిత్రమహర్షి  - 4 🌻

22. హరిశ్చంద్రుడు రాజ్యంపోయినా, కొడుకుపోయినా సత్యవ్రతమే గొప్పదని, ఇవన్నీ ఎప్పుడయినా నశించేవేనని, కాని సత్యవ్రతం శాశ్వతమైనటువంటి ఐశ్వర్యమనీ వివేకంతో గ్రహించాడు. అందుకే దారిద్య్రాన్నికూడా దుఃఖంలేకుండా అనుభవించాడు. “అయ్యో! భార్యను పోగొట్టుకుంటున్నాను. అయ్యో! రాజ్యం పోగొట్టుకున్నాను” అని ఏడవలేదు. చూచిన వాళ్ళు దుఃఖం పొందారు. 

22. కాబట్టి మహాత్ములెవరయినా సరే, కష్టం వచ్చినప్పుడు దుఃఖించలేదు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని చూచినవాళ్ళుమాత్రం దుఃఖించారు. విశ్వామిత్రుడు లేకపోతే హరిశ్చంద్రుడు లేడు, అతడి చరిత్ర లేదు. అతడిని అసత్యమాడించగలనని విశ్వామిత్రుడు ప్రతిజ్ఞచేసాడని మామూలుగా పురాణంలో వ్రాయబడింది. 

23. అలా వ్రాయబడిఉందికాని, వాస్తవంగా విశ్వామిత్రుడు అన్నది, “హరిశ్చంద్రుడి సత్యవ్రతదీక్షను నేను పరీక్షిస్తాను. మీరెవ్వరూ పరీక్షచేయలేరు!” అని. ఆ విధంగా ఆయనను పరీక్షించి నిలబెట్టి, “నా పరీక్షకు నీవు నిలబడ్డవు! నువ్వు ఏది అడిగినా నీకిస్తాను” అని హరిశ్చంద్రుడికి అన్ని కోరికలనూ తీర్చాడు.

24. విశ్వామిత్ర వాక్యాలలో మహాపాతకాలంటే ఏమిటో నిర్ణయించబడి ఉన్నది. ప్రాయశ్చిత్తం అనేది లేదు. అనుభవించి తీరవలసిందే! ఇహపరములూ రెండూ తెలిసిన ఋషులు వ్రాసారివన్నీ. ఇహంలో ఏధర్మాన్ని ఆచరిస్తే ఏ లోకం కలుగుతుందో తెలిసి, పరలోకస్వభావంకూడా తెలిసినవాళ్ళే ఇహలోక ధర్మం చెప్పలి. ఇక్కడి న్యాయం చూచినవాళ్ళు; అంతేగాక, పారలౌకికమైన ప్రవృత్తి ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి? పాశబంధనాన్నించి విముక్తి అంటే ఏమిటి? అది దేనివల్ల కలుగుతుంది-అవన్నీకూడా తెలిసిన మహర్షులే ఇక్కడ ఆచరించవలసిన ధర్మాన్ని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళ మాటలు మనకు శిరోధార్యములు.

25. విశ్వామిత్రుడు సప్తర్షిమండలంలోకి వెళ్ళి సప్తర్షులలో ఒకరుగా ఉండి, నిత్యుడు – శాశ్వతుడుగా వెలుగొందుతున్నారు. ఆయనకొక లోకం, పదవి ఉన్నది. ఆయనను స్మరణచేయటంతోటే దర్శనమిచ్చేటటువంటీ మహాత్ముడు, శక్తిసంపన్నుడు. ఆయనను స్మరించి స్తోత్రంచేస్తే ఉపాసిస్తే అనేక విశేషములయిన జ్ఞానములు కలుగుతాయి. 

26. ఆయన శక్తి ఎంతటిదో, ఆయన ఔదార్యముకూడా అంత గొప్పదే. ఆయనను అడిగితే ఏదయినా ఇస్తారు, ఇవ్వడంలో ముదువెనకలు లేవుమరి. ఆయన గొప్పదాత, క్షాత్ర లక్షణం కలిగినదాత. అందుకనే లోకలో-బ్రాహ్మణుడేం దానంచేస్తాడు, చేస్తే క్షత్రియుడే చెయ్యాలి, లేకపోతే వైశ్యుడివ్వాలి అని ఒక వాడుక ఉంది. వాళ్ళే దాతలు కాని, బ్రాహ్మణులెలా అవుతారు? బ్రాహ్మణులు ఇవ్వరు, తీసుకుంటారు. 

27. అంటే, దాత అనేవాడికి క్షాత్రగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి. రజోగుణం లేకపోతే ఇవ్వలేడు. “వాడడిగింది నాకు లేఖ్ఖా! అడిగింది ఇచ్చేస్తాను. నా దగ్గిన ఉన్నది ఇచ్చేస్తాను” అనుకుంటాడు దాత. దెండో ఆలోచన ఉండదు. ఖర్చుపెట్టేటప్పుడు దాతృత్వగుణానికి వెనకాల రజోగుణం ఉంటుంది. తీక్షణమైన స్వభావం ఉంటుంది. ఆ స్వభావానికి – దాత ఒక వీరుడు, ధీరుడు అయి ఉండాలి. ‘దానవీరుడు’ అంటారందుకే. కర్ణాదులు అందరూ అలాంటివాళ్ళే, దానవీరులు వాళ్ళు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[16:07, 16/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 123 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర  - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 3 🌻

512. నిర్వాణమే నిర్వికల్ప స్థితిగా రూపాంతర మొందును.

513. మానవుని స్థితిలో భగవంతుని 'మహా చైతన్యము' పరమాత్మపై ప్రకాశించి, పరమాత్మతో తాదాత్మ్యతను పొంది, "నేను భగవంతుడను" అనెడి అనుభవమును పొందును. ఇదియే జీవిత గమ్యము.

514. జీవిత గమ్యమును చేరుకొనుటయే నిర్వికల్ప సమాధి స్థితి.

515. సామాన్య మానవుడు నిత్యము రాత్రివేళ పరుండును. ఉదయము మేల్కొను చుండును. అట్లే - రాత్రివేళ గాఢ నిద్రవంటిది నిర్వాణస్థితి. ఉదయము, జాగ్రదవస్థ వంటిది దివ్య జాగృతియైన నిర్వికల్ప సమాథి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

📚✍️ భట్టాచార్య

నాద యోగుల భావనలోను ,నాద యోగ గ్రంథాల లోను’’ నాదబ్రహ్మ’’  .లేక పారమార్ధిక నాదం నుండే సకల సృష్టి ఆవిర్భావం జరిగిందని ఉన్నది. ప్రపంచం అంటే శబ్ద కంపనాల ప్రాక్షేపణ( projection )అని నాద యోగుల విశ్వాసం .ఈ నాద ప్రకంపన వలననే సకల చరాచర సృష్టి ఆవిర్భవించింది . వేదాంతులు శబ్దం నుండే సృష్టి ఉద్భవమైనదని అన్నారు .5జ్ఞానేంద్రియాలు ,5కర్మేంద్రియాలు ,5జ్ఞానేంద్రియాలు ,4 విధాల మానసిక వృత్తులు ,3గుణాలు అన్నీ ఒక ఒక విశ్వ నాదం నుండి ఆవిర్భ వి౦చాయని నాద యోగులు భావిస్తారు .అంటే ప్రకృతి ,భౌతిక ,మానసిక బౌద్ధిక విశ్వాలన్నీ నాద బ్రహ్మ నుండే ఉద్భవించాయి .ఇదే నాద యోగులందరి ఏకాభిప్రాయం .కనుక  కంపనాల వలన అది ఏర్పడిందన్న  సత్యాన్ని నాద యోగి  నమ్ముతాడు. ఈ కంపనాలు ఒకో సారి... అసలు కంపించక పోవటం లేక అధిక తీవ్ర ఫ్రీక్వెన్సీలలోమానవ ఇంద్రియాలు అందుకోలేని విధంగా   కంపించటం జరుగుతుంది .

శాశ్వత ,మూల నాదం కు అత్యంత గరిష్ట ఫ్రీక్వెన్సీ ,కంపనాలు ఉంటాయి .ఏ వస్తువైనా విపరీతమైన ,ఊహింప రాని వేగం తో కంపిస్తే అది చివరికి చలనం లేనిది అవుతుంది .కనుక కదలిక లో,కంపనలో  గరిష్ట బిందువు వద్ద ఏర్పడేది  నిశ్చలనమే .ఈ నిశ్చలనమే సకల చరాచర సృష్టికి మూల కారణ హేతువౌతుంది .

నాద యోగుల భావనలో ఈ విశ్వం లో ప్రతిదీ శాశ్వత ,అనంత నాదం నుండే పుట్టి ,పరిణామం చెందుతుంది .ఈ విషయాలపై పూర్తి పరిజ్ఞానం పొందాలంటే నాద బిందు ఉపనిషత్,మరియు హంసోపనిషత్  లను పూర్తిగా అధ్యయనం చేయాలి .ఇవికాక అనేక అధ్యాత్మిక సంస్థలు నాద యోగశాస్త్రం  పై ప్రత్యేక అధ్యయనం చేసినవి ఉన్నాయి.

సంగీతం కూడా ఆ నాదం యొక్క భౌతిక రూపమే .స్వచ్చమైన మంత్ర౦  కూడా ఆ  నాదం యొక్కఅభివ్యక్త రూపమే (manifestation) .శరీరం లోని ప్రాణ స్పందనలు కూడా నాదము యొక్క వ్యక్తీకరణలే .నాద యోగ సాధన ముఖ్యోద్దేశం ...ప్రాథమిక, మూల, అత్యుత్తమ ,అంతిమ ,అంతర్నాదం, శబ్దం ,పదాన్ని  కనుగొనటమే .ఈ శాశ్వత అభౌతిక నాదాన్ని అన్వేషింఛి తెలుసుకోవటానికి విధానాన్ని స్థూలం నుండే ప్రారంభించాలి .చివరికి ఆ అనంత శాశ్వత పారమార్ధిక  మానసిక నాద దర్శన కోసం మన చేతన ప్రభావాన్ని దాటి మరింత లోతుగా వెతకాలి.

చైతన్యము యొక్క పూర్ణానుభవమే "సమాధి".  ఈ పరిపూర్ణ స్థితిలో, మనస్సు- శరీరాలను, సమాధి అధిగమిస్తుంది. పరిపూర్ణ చైతన్యాన్ని అన్వేషించే మార్గంలో,  శరీరానికి, మనస్సుకు సంబంధించిన పూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు.

ఈ నేపథ్యంలో ఒక సాధకుడు అభిజ్ఞా జ్ఞానాన్ని, భావాత్మక జ్ఞానాన్ని కూడా కలిగి యుంటాడు. సాధకుడు....ఆత్మ యొక్క విస్త్తృతిని నాద బ్రహ్మం గానూ లేదా శబ్ద బ్రహ్మం గానూ గుర్తిస్తాడు. 

The Soul and It's Mechanism.

 సాధనలో ఈ "నాద బ్రహ్మం" అనుభవానికి వచ్చిన తరువాతనే, నిర్గుణ పరబ్రహ్మం అనుభవానికి వస్తుంది.

నాదము అనగా, శబ్ద ప్రవాహం. యోగము అనగా కలయిక. నాద యోగము అనగా, వ్యక్తి చేతనను ...విశ్వ చేతన స్థాయికి తీసుకువెళ్ళడం. అంటే మనం వైశ్విక చైతన్యాన్ని, నాద యోగాభ్యాసం ద్వారా పొందవచ్చును.ఎప్పుడైతే వైశ్విక చైతన్యం,  అహంకారం చేత అడ్డగించబడుతుందో, ఆ వైశ్విక చైతన్యానుభవానికి....అడ్డుగా ఉన్న అహాన్ని....ఈ నాదం తొలగించి, ఒక యోగి పరిపూర్ణ చైతన్యానుభవం పొందేలా చేస్తుంది, ఈ నాదయోగం.

అనాహత నాదం అంటే ఏమిటి ? కొందరు దాన్ని విశ్వాంతరాళ నాదమైన ప్రణవనాదం   ఓంకారం అన్నారు . కాదు కాదు ,అది తుమ్మెదలు చేసే నిరంతర  ఝంకార నాదాన్ని తలపించే  భ్రామరీ నాదం అన్నారు మరికొందరు .ఇంకొందరు అదే ఖట్ ఖట్ మని నినదించే  హృదయ స్పందనం అనాహత నాదం అన్నారు .

         ఈ అనాహత నాదాన్నే కొందరు అనాహద నాదమన్నారు .రెండిటిలో అర్ధ భేదం ఉంది .అన్ + ఆహతం =అనాహతం .అన్ అంటే కాదు అని అర్ధం. ఆహతం అంటే కొట్టటం ,సుత్తితో మోదటం ,దెబ్బ కొట్టటం అని అర్ధం .మొత్తం మీద దెబ్బ కొట్టటం వలన ఘర్షణ వలన వచ్చే శబ్దం కాదు అని అర్ధం .కనుక అనాహతం అంటే వస్తువుల పరస్పర ఘర్షణ వలన జనించే శబ్దం కాదని అర్ధం .ఎక్కడ శబ్దం ఉత్పత్తి అవాలన్నా రెండు వస్తువుల మధ్య పరస్పర రాపిడి లేక ఘర్షణ ఉండాలని మనకు తెలుసు .ఇదే ‘’ఆహత నాదం’’.అనాహతం అంటే రెండు వస్తువుల మధ్య పరస్పర ఘర్షణ వలన జనించిన శబ్దం కాదని స్పష్టమౌతోంది .అనాహతం సహజంగా(స్పాంటేనియస్ ) ,యాదృచ్చికంగా స్వయం చాలితమైన (ఆటోమేటిక్ )నాదం .కొందరు అనాహద నాదమని ఎందుకన్నారు ?అన్+హదం=అనాహదం.అన్ అంటే కాదు అని అర్ధం . హదం అంటే సరిహద్దు (బౌండరి ).ఈ రెండూ కలిస్తే సరిహద్దులు లేని నాదమే అనాహద నాదం అని అర్ధమొస్తుంది .అంతులేని, హద్దు లేని ఏ నాదమైనా  అనాహత నాదమే అవుతుంది .

హృదయ చక్రము లేదా అనాహత చక్రముపై ధారణ చేసినపుడు ఈ అనాహత నాదం వినవచ్చును. ఈ నాదం సృష్టి ఆది నాదం. ఓంకారమన్నది, సృష్టించబడని స్పందనాత్మక నాదం. అన్ని శబ్దాలు, సృష్టి ఆవిర్భావం కూడా ఓంకారం నుండే సంభవించింది.

తస్య వాచక ప్రణవః

ప్రకృతి అన్నది శక్తి అయితే,  ఆ శక్తియే స్పందనగా మారితే....అన్ని స్పందనలూ "శబ్ద బ్రహ్మమే".

మనిషి జన్యువుల నుండి బాక్టీరియాల వరకు, భూమి నుండి నక్షత్ర గ్రహ మండలాల వరకు, నక్షత్రాల నుండి కృష్ణ బిలాల వరకు.....ప్రతీ దానికీ ఒక శబ్దం ఉంది, నాదం ఉంది. ఒక యోగి నక్షత్ర సంగీతాన్ని వినగలడు. గ్రహాల శబ్దాన్ని కూడా అతను వినగలడు. ఈ బ్రహ్మాండ చాలక యంత్ర ధ్వని "ఓంకారమే" అన్న స్ఫురణకు కూడా వస్తాడు.

ఆకాశం , చెవితో సంబంధం కలిగి ఉంది. ఈ చెవియే శబ్దాన్ని వింటుంది కూడా. ఆకాశం యొక్క గుణం శబ్దం. మనిషి చనిపోయే క్రమంలో, చిట్ట చివరిగా కోల్పోవలసినది వినికిడి శక్తియే. అందుకనే, హిందూ సాంప్రదాయంలోనూ, యోగ సాంప్రదాయంలోను....మనిషి శరీరాన్ని వదలి వేసే సమయానికి ముందే, పవిత్ర శబ్దాలు , చెవిలో ఉచ్ఛరిస్తారు. ఆ శబ్దాలు వినిన తర్వాతనే ఆ జీవి మరణిస్తాడన్నమాట! ఈ ఆచారం వెనుక ఉన్నది "నాద యోగ సాంప్రదాయం".

➡️ నాద యోగం –మహర్షి గోరఖ్ నాథ్

మత్స్యేంద్ర  నాధుని శిష్యులైన మహర్షి గోరఖ్ నాథ్, ఆధ్యాత్మికతలో గురువును మించిన శిష్యులై విపరీతప్రచారం పొందారు .ఆయన ‘’సాధువులారా !’’సో –హం ‘’ను నిరంతరం జపించండి ఈ జపాన్ని మనసుతో చేయకండి .దానిని మీ అంతశ్చేతన తో చేయండి..అలా చేస్తే మీరు మీ దైనందిన జీవితం లో అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికీ మీ శ్వాస 24గంటల రోజులో నిమిషానికి 15నుంచి 19సార్లు ఉండేట్లు అంటే రోజుకు 21,600 సార్లు ఉండేట్లు జాగృతమవండి .అంటే మీ శ్వాస గంటకు 900సార్లు లేక ఆ పైన ఉండేట్లు చూసుకోండి . అప్పుడు అనాహద నాదం ఉద్భవించి(ఎమర్జ్ ) వ్యక్తమౌతుంది (మానిఫెస్ట్ ).వెన్నెముకలో కాంతి జ్యోతకమవుతుంది .సూర్య నాడి మేల్కొంటుంది .అప్పుడు వర్ణనాతీతమైన కంపించే నాదం మీ శరీరం లోని ప్రతి సూక్ష్మ  రంధ్రం నుండి ఓం లేక సోహం లాంటి నాదం వినే అనుభూతి కలుగుతుంది ‘’అని మహర్షి గోరఖ్ నాథ్, నాద యోగాన్ని గురించి తన గ్రంథాలలో వర్ణించారు .

అంతిమ నాదం :

ఉన్నత స్థాయి చేతనలో వ్యక్తమయ్యే నాదాన్ని గురించి మాటలలో వర్ణించి చెప్పలేము .అ నాదం ఆనంద మయ కోశం ఆవలి నుండి వస్తుంది. వ్యక్తిగత చేతన పూర్తిగా కరిగిపోయే నాదం లోని  అత్యున్నత బిందువు నాద యోగికి అనుభవమౌతుంది .సాధకుడు నాదం లో తన ఉన్నత చేతనను గుర్తిస్తాడు .అప్పుడు ఈ విశాల విశ్వం అంతా ఆ నాదమే అని గ్రహిస్తాడు .

 శ్రీమచ్ఛంకర భగవతః కృతౌ భ్రమరామ్బాష్టకం

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

1) చాఞ్చల్యారుణలోచనాఞ్చితకృపాచన్ద్రార్కచూడామణిం|

చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్ |

చంచచ్చమ్పకనాసికాగ్రవిలసన్ముక్తామణీరఞ్జితాం|

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ||

చంచలములు - ఎర్రనివి - దయతో నిండినవి అగు కన్నులు కలది, అర్థచంద్రుని చూడామణిగా ధరించినది, చిరునవ్వుతో అందమైన ముఖము కలది, చరాచర ప్రపంచమునంతటినీ సంరక్షించునది, ’తత్’ అను పదమునకు అర్థమైనది, సంపెంగపువ్వు వంటి ముక్కు చివరన ముత్యమును అలంకరించుకున్నది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

2) కస్తూరీతిలకాఞ్చితేన్దువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం|

కర్పూరద్రావమిక్షచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ |

లోలాపాఙ్గతరఙ్గితైరధికృపాసారైర్నతానన్దినీం|

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 2||

కస్తూరీ తిలకము శోభిల్లుచున్న నొసటి ప్రదేశము కలది, కర్పూరము - సున్నము - వక్కలతో సుగంధభరితమైన తాంబూలమును సేవించుచున్నది, చంచలమైన కటాక్షములద్వార వర్షించు కృపారసములచే భక్తులను ఆనందింపచేయునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

3) రాజన్మత్తమరాలమన్దగమనాం రాజీవపత్రేక్షణాం|

రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదామ్భోరుహామ్ |

రాజీవాయతమన్దమణ్డితకుచాం రాజాధిరాజేశ్వరీం|

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ||

మదించిన హంసవలే మెల్లగ నడచునది, తామరరేకుల వంటి కన్నులుకలది, బ్రహ్మ మొదలగు దేవతలచే నమస్కరించబడు పాదపద్మములు కలది, విశాలమైన తామరరేకులతో అలంకరింపబడిన స్తనములు కలది, రాజాధిరాజులను కూడా శాసించునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

4) షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం|

షట్చక్రాన్తరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్ |

షట్చక్రాఞ్చితపాదుకాఞ్చితపదాం షడ్భావగాం షోడశీం|

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ||

క్షత్రములవలే ప్రకాశించు ఆరు అక్షరముల మంత్రము నందు వెలుగొందుచున్నది, శివుని భార్య అయినది, అరిషడ్వర్గములను నశింపచేయునది, మూలాధారము మొదలగు ఆరు చక్రములలోనుండునది, అమృతరూపమైనది, కాకిని మొదలగు ఆరు యోగినులచే చుట్టబడినది, ఆరు చక్రములు శోభిల్లు పాదుకలు ధరించిన పాదములు కలది, పుట్టుక మొదలగు ఆరు భావములను తొలగించునది, పదహారు అక్షరముల మంత్రస్వరూపమైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

5) శ్రీనాథాదృతపాలితాత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం|

జ్ఞానాసక్తమనోజయౌవనలసద్గన్ధర్వకన్యాదృతామ్ |

దీనానామాతివేలభాగ్యజననీం దివ్యామ్బరాలంకృతాం|

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ||

విష్ణువుచే ఆదరించబడుచూ మూడులోకములను పాలించుచున్నది, శ్రీచక్రమునందు సంచరించుచున్నది, యువతులైన గంధర్వకన్యలచే పాటలు పాడుచూ సేవింపబడుచున్నది, దీనులకు మిక్కిలి భాగ్యమునిచ్చునది, దివ్యవస్త్రములను ధరించినది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

6) లావణ్యాధికభూషితాఙ్గలతికాం లాక్షాలసద్రాగిణీం|

సేవాయాతసమస్తదేవవనితాం సీమన్తభూషాన్వితామ్ |

భావోల్లాసవశీకృతప్రియతమాం భణ్డాసురచ్ఛేదినీం|

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ||

అధిక సౌందర్యవంతమైన శరీరము కలది, లక్కవలే ఎర్రనైనది, నమస్కరించు దేవతాస్త్రీలతలలపైనున్న ఆభరణములతో ప్రకాశించుచున్నది, అనురాగముచే పరమేశ్వరుని వశీకరింపచేసుకున్నది, భండాసురుని సంహరించినది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

7) ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం|

మున్యారాధనమేధినీం సుమవతాం ముక్తిప్రదానవ్రతామ్ |

కన్యాపూజనపుప్రసన్నహృదయాం కాఞ్చీలసన్మధ్యమాం|

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ||

ధన్యురాలు, చంద్రునిలో ధ్యానింపదగిన చరిత్రము కలది, మేఘము వలే నల్లనైనది, మునులు చేయు ఆరాధనలతో సంతోషించునది, మహాత్ములకు ముక్తినిచ్చునది, కన్యకా పూజలు చేయువారియందు ప్రసన్నమైన హృదయము కలది, ఒడ్డాణముతో ప్రకాశించు నడుము కలది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

8) కర్పూరాగరుకుఙ్కుమాఙ్కితకుచాం కర్పూరవర్ణస్థితాం|

కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీమ్ |

కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాన్తరస్థాయినీం|

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ||

కర్పూరము - అగరు - కుంకుమలు పూయబడిన వక్షస్థలము కలది, కర్పూరము వంటి శరీరచ్చాయ కలది, అన్నివిధములైన కర్మలను దహించివేయునది, శివుని భార్యయైనది, కోరికలు కలది, మన్మథుని తన కన్నులలో నింపుకున్నది, కరుణతో నిండిన హృదయము కలది, ప్రళయకాలమునందు కూడా స్థిరముగా నుండునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

9) గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాన్ధర్వగానప్రియాం|

గమ్భీరాం గజగామినీం గిరిసుతాం గన్ధాక్షతాలంకృతామ్ |

గఙ్గాగౌత్మగర్గసంనుతపదాం గాం గౌతమీం గోమతీం|

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ||

స్తుతించువారిని రక్షించునది, జెండాపై గరుడ చిహ్నము కలది, ఆకాశమునందు సంచరించునది, గంధర్వగానమును ఇష్టపడునది, గంభీరమైనది, గజగమనము కలది, హిమవంతుని కుమార్తెయైనది, గంధము - అక్షతలతో అలంకరింపబడినది, గంగ - గౌతమమహర్షి - గర్గుడు మొదలైన వారిచే స్తుతింపబడు పాదములు కలది, గోవు - గౌతమి - గోమతి స్వరూపిణియైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

|| ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ భ్రమరామ్బాష్టకం సమ్పూర్ణమ్ ||

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

750వ నామ మంత్రము

ఓం మహేశ్వర్యై నమః

మహోన్నతమైన మరియు మహోత్కృష్టమైన ఈశ్వరి అయిన జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహేశ్వరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను ఆరాధించు భక్తులు, ఆ తల్లి కరుణచే సుఖశాంతులతోబాటు, ఆత్మానందానుభూతిని కూడా పొందుదురు.

జగన్మాత శ్రీమహారాజ్ఞి. అనగా సకలలోకములకూ మంగళకరమైన మహారాజ్ఞి. పంచబ్రహ్మలను తన ఆసనమునకు కోళ్ళుగా గలిగి జగత్తులకే ఏలిక. చిదగ్నికుండ సంభూత (శుద్ధచైతన్యమునుండి ఉద్భవించినది).  జగత్తునకు సృష్టిస్థితిలయలకు కారణమైనది.  మహేశ్వరునికి శక్తి. జగత్తంతా ఆమెయే. జగత్తు కానిది కూడా ఆమెయే. ప్రణవస్వరూపుడైన పరమేశ్వరుని పత్ని, అట్టి ప్రణవమునకే ఆది అయిన ఆదిశక్తి.  మహాప్రళయం సమయంలో కర్మక్షయంకాని జీవులను, ఆ జీవరాసుల కర్మపక్వం అగువరకూ తనలోనే ధరించి, ఆ జీవరాశికి కర్మ పరిపక్వత కలిగిన యనంతరం పుట్టుక కలుగజేసిన మహాశక్తి. పంచవింశతి (ఇరువది ఐదు) వ్యూహములు గల మహేశ్వరుని భార్య. 

1)  దేవకార్యసముద్యతా దేవతల యొక్క కార్యములను నిర్వహించడానికి సంసిద్ధత యను గొప్పదనము గలిగినది.

2)  భండుడు, మహిషాసురాది రాక్షసులను తెగటార్చిన సైనిక సామర్థ్యము గలిగినది.

3)  బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవసంస్థుత వైభవా - భండాసురాది రాక్షస సంహారము సమయంలో చూపిన పరాక్రమానికి బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడిన వైభవము గలిగినది.

4)  హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నషధిః శివుని నేత్రాగ్నికి ఆహుతి అయిన మన్మథుని సజీవుడిని చేసి సాటి స్త్రీ మూర్తి అయిన రతీ దేవికి అమంగళము లేకుండా చేసిన మంచిదనము కలిగినది. 

5) సకలలోకములకు మహాసామ్రాజ్ఞియై, త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహములకు వారి వారి సమర్థతలకనుగుణంగా లోకపాలుకులుగా ఆధిపత్యమునిచ్చిన అధికారికలక్షణం గలిగినది. కాబట్టి, పైన చెప్ఫిన 1) గొప్పదనం, 2) సామర్థ్యం, 3) వైభవం, 4) మంచిదనం, 5) అధికారిక లక్షణం వంటి లక్షణముల కలబోతగా మహా లక్షణం గలిగిన సగుణాత్మకమై విరాజిల్లు జగన్మాత మహేశ్వరీ యను నామ మంత్రమునకు సార్థకత కలిగి యున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహేశ్వర్యై నమః అని అనవలెను.

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

176వ నామ మంత్రము

ఓం నిర్వికల్పాయై నమః

సంకల్ప వికల్పములు లేని శుద్ధచైతన్య స్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్వికల్పా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిర్వికల్పాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులు జ్ఞానపరిపూర్ణులై, సదా పరమేశ్వరీ ధ్యానమునందు మనస్సును నిమగ్నముచేసి తరించుదురు.

సంకల్పము అంటే ఏదైనా చేయాలనే ఆలోచన. సాధారణంగా పూజచేయునపుడు ఆచమనం చేసి, తమ యునికికి సంబంధించిన కాలము, ప్రదేశము, తిథివారనక్షత్రాదులు, ఆపైన సంకల్పంచేయువారి గోత్రము, నామధేయం, ఎందు నిమిత్తం సంకల్పం చేస్తున్నామో...ఇత్యాదులు సంకల్పంలో ఉంటాయి. అలాగే ఏదైనా కార్యక్రమం చేయాలనుకోవడాన్ని కూడా సంకల్పం అంటాము. కాని వికల్పము అంటే సంకల్పానికి వ్యతిరేకంగా అర్థం తీసుకోకూడదు. వికల్పానికి అర్థం భ్రాంతి అని అంటే ఇక్కఢ సందర్భం కుదురుతుంది. అంటే లేని  వస్తువును గూర్చి వివరణ ఈయడం. దీనినే శూన్యమైన విషయము నుండి పుట్టిన జ్ఞానము. దీనికి ఒక ఉదాహరణముగా ధూర్జటి మహాకవి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఒక పద్యం పరిశీలిద్దాము.

శా||అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా

కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతింజెంది  చరించుగాని, పరమార్థంబైన నీయందు దా

జింతాకంతయు జింత నిల్పడు గదా, శ్రీకాళహస్తీశ్వరా!        

ఈ పద్యంలోని భావము

ఓ శ్రీకాళహస్తీశ్వరా! పరమేశ్వరా! ఈ జగత్తు, ఈ జీవనము, జననము-మరణము మళ్ళీ జన్మించడం అనేవి అంతయూ మిథ్య.  అలా తెలిసి కూడా ఎల్లప్పుడూ భార్యా, బిడ్డలు, సంపదలు, తనువు అనేవి శాశ్వతమనియు, సత్యమనియు తలచుచూ మోహము అనే  సముద్రం (మోహార్ణవములో) లో మునిగి పోవును గాని, జన్మకు పరమార్థమునిచ్చే నీయందు రవ్వంతైనను ధ్యానము నిల్పడు కదా. ఇదంతా అజ్ఞానమే కదా!

ఈ రకమైన అజ్ఞానమే వికల్పము అంటారు.  వికల్పము అనునది అజ్ఞాన సంబంధమైనది. లేనిది ఊహించుకొని  అదే నిజమని భ్రాంతి చెందడం. ఇది కేవలం మనసుకు సంబంధించినది. పరమాత్మసంబంధమైనది కాదు. గనుక పరమాత్మ, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అయిన జగన్మాత నిర్వికల్పా యని అనబడినది. సాధకుడు యోగసాధనలో పరాకాష్ఠదశలో సమాధిస్థితికి చేరుతాడు. ఆ స్థితిలో సంకల్పవికల్పములు ఉండవు.  దీనినే నిర్వికల్ప సమాధి స్థితి యంటారు. పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాతకు సంకల్పవికల్పములు ఉండవు. గాన నిర్వికల్పా యను నామంత్రముతో స్తుతింపబడు చున్నది.

జగన్మాత  చతుష్షష్టికళామయి (236వ నామ మంత్రము) అనగా అరవై నాలుగు కళలలోను పరిపూర్ణురాలు. అటు వంటి కళాప్రపూర్ణ అయిన జగన్మాత 

విజ్ఞాన ఘనరూపిణీ (253వ నామ మంత్రము) అన్ని కళలయందును జ్ఞానము కలిగి యుండుటను విజ్ఞానఘనము అందురు. గనుక ఆ తల్లి విజ్ఞానఘనరూపిణీ యని అనబడుచున్నది గనుక జ్ఞానమునకు పరాకాష్ఠ అయినది గనుక సంకల్పవికల్పములు ఉండవు. కావున నిర్వికల్పా యని అనబడుచున్నది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్వికల్ఫాయై నమః అని అనవలెను.

--(())--

 సప్త మాతృకలు

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

విశ్వ నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి, వేద పురాణాగమాలు ఆ శక్తి తాలూకు వివిధ కోణాలను వివిధ రూపాలుగా ఆవిష్కరించాయి. వాటి ఉపాసనా విధులను ఏర్పరచాయి. ఆ పద్ధతిలో 'సప్త మాతృకా' తత్వం ఒకటి.

శుంభునిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో, భయంకరమైన అసుర సేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా 'దేవీ మహాత్మ్యం' వర్ణించింది.

1. బ్రహ్మలోని శక్తి 'బ్రాహ్మి',

2. విష్ణుశక్తి 'వైష్ణవి',

 3. మహేశ్వరుని శక్తి 'మహేశ్వరి',

 4. స్కందుని శక్తి 'కౌమారి',

 5. యజ్ఞ వరాహస్వామి శక్తి 'వారాహి',

 6. ఇంద్రుని శక్తి (ఐంద్రి),

 7. అమ్మవారి భ్రూమధ్యం (కనుబొమల ముడి) నుంచి ఆవిర్భవించిన కాలశక్తి 'కాళి' (చాముణ్డా).

 -వీరిని 'సప్త మాతృకలు' అంటారు.

 ఈ శక్తులు విశ్వాన్ని నిర్వహించే ఏడు రకాల మహా శక్తులు.

ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో మనలో జాగృతమయ్యే శివ శక్తులు, నిజానికి ఒకే శక్తి తాలూకు వివిధ వ్యక్తీకరణలు.

1. బ్రాహ్మి:- అనంతాకాశంలో, హృదయాకాశంలో అవ్యక్తనాదంగా ఉన్న శక్తి బ్రాహ్మి. కంఠాది ఉపాధులతో ఈ నాదమే స్వర, అక్షరాలుగా శబ్దరూపంగా వ్యక్తమవుతుంది. సర్వ శాస్త్ర జ్ఞానాలకు మూలమైన ఈ శబ్ద స్వరూపిణిని ఉపాసించడం జ్ఞానదాయకం.

2. వైష్ణవి:- విశ్వమందంతటా తేజస్తరంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపజేసే అద్భుత శక్తి, స్థితికారక శక్తి ఈ తల్లి.

3. మహేశ్వరి:- ప్రతివారి హృదయంలో 'అహం' (నేను) అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మహేశ్వరి. 'సర్వ భూత హృదయాల్లో ఈశ్వరుడే, శరీరాది ఉపాధులను కదిలిస్తున్నాడు' అని భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం ఈ భావాన్నే చెబుతున్నది.

4. కౌమారి:- సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణంలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి కౌమారి.

5. వారాహి:- ఈ యజ్ఞ వరాహశక్తి అన్న ప్రదాయిని. చేతిలో ధరించిన నాగలి, రోకలి ఆయుధాలు అన్నోత్పత్తినీ, అన్నపరిణామాన్నీ (మార్పునీ) తెలియజేసే సంకేతాలు. దేవతలకు హవ్యాన్నీ, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి.

6. ఐంద్రి:- జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపం ఈ శక్తి. బలానికి సంకేతంగా వజ్రాయుధాన్ని ధరించే శక్తి.

7. చాముణ్డా:- కథ ప్రకారం- రక్తబీజుడనే రాక్షసుని దేవి సంహరించే టప్పుడు, స్రవించే ప్రతి రక్తకణం నుంచి ఎందరో రాక్షసులు ఉత్పన్నమవుతుంటే, 'చాముణ్డా' దేవి తన నాలికతో ఈ రక్తాన్ని పానం చేసింది. అప్పుడు ఆ అసురుడు హతమారి పోయాడు.

విషయ లంపటానికి సంకేతం రక్తబీజుడు. రకరకాల కామసంకల్పాలే రక్తకణాలు. వీటి నుంచి ఉత్పన్నమయ్యే బాధాకర, అజ్ఞానశక్తులే అసురులు. వాటిని నిర్మూలించే సమాధిస్థితిలోని దివ్య చైతన్యం 'చాముణ్డా'.

ఏకం పరబ్రహ్మ తత్వం. అనేకం ప్రపంచ స్వరూపం. ఈ అనేకమే 'చమూ' (సేనలు). ఈ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితిని చేరుకోవడమే సమాధి. దీనినే 'చాముణ్డా' అని సంకేతించారు.

చండ, ముండ- అనే దనుజుల్ని సంహరించినందుకు 'చాముణ్డా'- అన్నారని మరో కథనం. యోగపరంగా చూస్తే- మూలాధారం నుంచి గ్రంథిని భేదించడం చండాసుర సంహారం. సహస్రార కమలంలో ప్రవేశించేటప్పుడు జరిగే భేదనం ముండాసుర సంహారం.

- ఈ విధమైన తాత్విక, యోగదర్శనాన్ని కావ్యకంఠ గణపతి ముని సంభావించారు (ఉమా సహస్రం).

మొత్తంగా పరిశీలిస్తే- 1.విశ్వాన్ని నడిపే శక్తులు, 2.యోగసాధనవల్ల మనలో మేల్కొనే దివ్యశక్తులు- వీటినే విభిన్న శక్తిరూపాలుగా పురాణాదులు ఆవిష్కరించాయని స్పష్టమవుతోంది. ఈ సర్వశక్తుల సమన్వయరూపిణి... సప్తమాతృకలు.

 భాగవతము 

శ్రీగురుభ్యోనమః

దక్ష ప్రజాపతి నక్షత్ర మండలములను 27 గా విభజించి ఆ నక్షత్ర మండలములకు పేర్లు తానే నిర్ణయం చేస్తాడు. భృగు మహర్షి సహాయముతోనూ, సతీదేవి సహాయముతోనూ నామాలను ఏర్పాటు చేస్తాడు. ఇదంతా మనము కదా చేసినది, మన పేరు కూడా ఏదైనా నక్షత్రానికి పెడితే బాగుంటుందని తాపత్రయ పడతాడు. ఇది అహంకార లక్షణము.

వశిష్ట మహర్షిని పిలిచి అడుగుతారు. నాకు తెలియదు. ఇది తెలియాలంటే మనకు శివుడే చెప్పగలడు అంటాడు. శివుడా! శివుడికేమి తెలుసు అని దక్షుడు అంటాడు. శివునికి తెలిసినంత ఎవరికీ తెలియదంటాడు వశిష్ఠుడు. శివుడంటే దక్షునికి అయిష్టత ఉన్నది. దక్షుడు విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చేస్తుంటాడు. విష్ణువు ప్రత్యక్షమై నీవు శివుడిని అడిగితేనే బావుంటుంది అని చెప్తాడు.

(సశేషము)

ఆచార్య సద్భావన

ప్రతి జీవుడూ తన గత కర్మల భారాన్ని మోస్తూ, రాబోయే భవిష్యత్తుని నిర్మించుకుంటూ ఉంటాడు.

ఆత్మసాక్షాత్కారమే జీవనపరమావధి. అది పరిపూర్ణంగా సాధించే వరకూ ఈ అశాశ్వత జనన మరణ వలయంలో తిరుగాడుతూనే ఉంటాం.

అయితే అది ఎక్కడ ఎలా లభ్యమవుతుంది అనే ప్రశ్న వస్తే భౌతికంగా కనిపించె వాటిలో అది లభ్యం కాదు అని చెప్పాలి.

మన దృష్టిని మరల్చి అంతర్ముఖం చేయాలి. అయితే అంతర్ముఖం అవడం అంటే శూన్యంలోకి దృష్టి సారించడం కాదు, అది మనిషిలో ఒక నూతన ఆరంభానికి నాంది.

దీనికై మనలోని ఆత్మ చైతన్యాన్ని జాగృతం చేయవలసి ఉంటుంది. అది సాధింపబడినపుడు అంతరాత్మ యొక్క అసలు వైభవం వెలుగులోకి వస్తుంది.

శుభంభూయాత్

: శ్రీరమణీయం - (737)

"మనలో ఉన్న శాంతి, ధ్యానం ఏఏ సందర్భాల్లో బహిర్గతం అవుతుంది !?"

నైతికవర్తనం ద్వారా నిరహంకార స్థితి వస్తే మనలోనే ఉన్న శాంతి, ధ్యానం బహిర్గతమవుతుంది. అలా ఉదయించిన శాంతి లేదా ధ్యానం సర్వకాల సర్వావస్థల్లో మనతోనే ఉంటుందన్న విషయం మనకు తెలుస్తుంది. అదే సమస్త దుఃఖాలను దూరం చేస్తుంది. ఆత్మ-శాంతి-ధ్యానం ఇవన్నీ పరమాత్మకు పర్యాయపదాలు. భగవాన్ శ్రీరమణమహర్షి ఆలోచనకి, ఆలోచనకి మధ్య ఉన్నది ఆత్మేనన్నారు. అంటే ప్రతి ఆలోచనలోనూ ఉన్నది ఆత్మే. అంటే శాంతి లేదా ధ్యానం ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఒక వ్యక్తి ఇంటి నుండి బయటకు వచ్చి, లోకమంతా తిరిగినా తన ఇంటి చిరునామా తన మనసులోనే ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరంలేదు. రోజుకొకసారి కళ్ళు మూసుకుని స్మరించుకోవాల్సిన అగత్యంలేదు. తన ఇంటి చిరునామా తనతోనే పదిలంగా ఉంటుంది. శాంతి, ధ్యానం కూడా అలాంటివే !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

"దైవదర్శనం.. దుఃఖనాశనం.. శాంతితోనే సాధ్యం !''- (అధ్యాయం -90)

: "ఋభుగీత " (204)

ఋభు నిధాఘ సంవాదము"

15వ అధ్యాయము 

మరుపున పడిన సత్యాన్ని తిరిగి గుర్తుచేయడమే జ్ఞాన బోధ !

భవప్రదమైన విజ్ఞానము, భవనాశనమైన జ్ఞానము రెండూ ఆత్మజ్ఞానాలే. అద్వయము అంటే అది దేనికీ భిన్నంకాదు. అది దేన్నీ నిరసించదు. అందుకే అది పరమ సుఖప్రదముగా భాసిస్తుంది. మనందరం నిజానికి సుఖరూపులమే. చిత్తము చేత, లోకభావనచేత, దేహభావన చేత ఈ సత్యాన్ని మరిచి దానికి దూరమౌతున్నాం. మరుపున పడిన సత్యాన్ని తిరిగి గుర్తుచేయడమే జ్ఞానబోధ. మనం కొత్తగా జ్ఞానబోధలో నేర్చుకునేది ఏదీ ఉండదు. జన్మాంతర సంస్కారంచేత మర్చిపోయిన సత్యాన్ని తిరిగి వివరణాత్మకంగా గుర్తుచేసేదే ఈ వేదాంత బోధ. అది అర్థమైతే బ్రహ్మమే సర్వమని అనుభవంలోకి వస్తుంది !

 🌷95-మంద్రగీత🌷

అధ్యాయము-8

🥀దారులు-మెట్లు🥀

8. అనుక్షణము కలిగిన భావము అందెల్ల నన్నే స్మరించుట అభ్యాసము. దానితో ప్రజ్ఞకు మరి ఒకటి లేని స్థితి వచ్చును. అదియే యోగము. అట్టి యోగి దివ్యుడగు పరమ పురుషుని పొందును. నీలోనున్న ఏ తత్వము, నాకన్న పైన ఏమియు ఎరుగదు. అట్టి నన్ను, పరమ పురుషుని ధ్యానించుటకు ధ్యానమార్గం ఉపదేశించెదను వినుము.

9. నీవు దేనిని తెలుసుకొనదలచినపుడైన తెలుసుకొనవాడు 'నేను'. చూడదలచినపుడు చూచువాడు 'నేను'. తెలుసుకొనదలచిన విషయములు వచ్చుచు పోవుచుండును. అందు తెలుసుకొనుచున్న  నేను వచ్చుట, పోవుట లేదు. కనుక పురాణమూర్తి యగు కవిని, వచ్చుట, పోవుట నీ అధీనమున ఉండవు. నీ యందున్న నా యధీనమున ఉండును. కనుక నేను శాసించువాడను. నీలో మాత్రమే కాక నీలోని అణువు నందును ఇట్లే వర్తింతును. ఒక్కొక్క అణువున వేరువేరుగ శాసించుచు, నీ మొత్తము శరీరమునకే నేనుగ శాసించుచున్నాను. సమస్త సృష్టియందు ఇట్లే!

10. ఈ దేహములను అణువులను పుట్టించుట, చేర్చి కూర్చుట చేయుచున్నాను. కనుక సృష్టికర్తను. నీ మనస్సు కూడా నానుండి సృష్టింపబడినది. కనుక నన్ను నీ మనస్సు చింతన చేసి అంతు తెలియలేదు. సూర్యుని కాంతి చీకటిని పోగొట్టినట్లు తెలుసుకొనుటకు ముందున్న  స్థితిని పోగొట్టుచున్నాను. అదియే అజ్ఞానమను చీకటి. దానిని తెలుసుకొనుటగా పోగొట్టుచున్నాను. నన్ను ఈ విధముగా ధ్యానము చేయవలెను. దేహాదులు విడుచు కాలమున మనస్సు నా స్మరణలో ఉన్నచో అచంచలమగును. భక్తి కలుగును. అది వరకు అభ్యాసము చేసిన ఈ చలనముచే కనుబొమ్మల నడుమ ప్రాణమును ప్రవేశింప చేయగలరు. అనగా చనిపోవు సమయమున భ్రూమద్యమున నన్ను స్మరించుట యందు దివ్యుడగు పరమ పురుషుని చేరుదురు.

 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అధిష్ఠానతయా దేహద్వయావచ్ఛిన్న చేతనః౹ కూటవన్నిర్వికారేణ స్థితః కూటస్థ ఉచ్యతే ౹౹22౹౹

22. ఆధారమైన చైతన్యముపై స్థూల సూక్ష్మదేహములు రెండూ కూడా ఆరోపింపబడుచు చైతన్యమును సీమీతము చేయుచున్నవి.కానీ ఆ చైతన్యము మాత్రము కమ్మరి యొక్క ఇనుపకూటము వలె 

ఏ వికారమును పొందక ఉండును. 

ఈ నిర్వికారమైన చైతన్యమే కూటస్థము.

కూటస్థే కల్పితా బుద్ధిస్తత్ర చిత్ర్పతిబింబకః ౹ ప్రాణానాం ధారణాజ్జీవః సంసారేణ స యుజ్యతే ౹౹23౹౹

23. కూటస్థ చైతన్యముపై బుద్ధి ఆరోపింపబడుచున్నది.బుద్ధి యందు ప్రతిఫలించిన చైతన్యము ప్రాణములను ధరించుటచే జీవుడనబడు చున్నది.

ఈ జీవుడు జన్మమృత్యురూపమైన సంసారమున బద్ధుడగుచున్నాడు.

వాఖ్య:-  చైతన్యమునకు ఆద్యంతములు లేవనుట స్పష్టము.  కానీ జననమరణములకు  లోనగుచున్న చైతన్యమును చూడక మనకు తప్పుట లేదు. కనుక జన్మమృత్యు లక్షణమైన చైతన్యము వాస్తవ చైతన్యము కాదనీ అది చైతన్యాభాసమనీ సిద్ధాంతము చేయబడినది. ప్రాణములతో కూడిన ఈ చైతన్యాభాసకే జీవుడని పేరు.

అభాసవాదమనగా మాయకు అధిష్టానమై,మాయయందు శుద్ధ చైతన్యాభాసము జీవుడు.

నేను జీవుడను దేహము నాది కళత్ర పుత్రాదులు నావారు ఇట్టి అనాత్మపదార్థముల యధ్యాసను భ్రాంతిని మోహమును త్యజించవలెను.ఈ అధ్యాస అభాసరూపమైనది.సత్యము కాదు.

అవిద్యాకార్యమేమన,లేనిదానిని ఉన్నట్లు కల్పించుటయగును. ఇదియే అభాసమగును.ఈ అభాసమెట్టిదనగా,

ఒకానొకడు స్వగ్రామమును వదలి మరియొక గ్రామమునకు వెళ్ళేను.అచ్చట నున్న వస్తు సందోహముచేతను కొంతకాలముండుటచేతనూ జన సంసర్గము చేతను మూఢుడగుటచే తన గ్రామమును మరిచెను.

అందుచే తానెచ్చటనుండి వచ్చినదియు స్మృతికి రాకపోయెను.

తర్వాత అతని గ్రామములో నున్న యొకానొక ఆప్తుడు వచ్చి యా మూఢునికి తనగ్రామమును తన విశ్రాంతి ధామమును గుర్తుపరచెను. తర్వాత స్వగ్రామమును దెలిసికొని వాడు

సుఖి యాయెను.

గ్రామాంతరమనునది మధ్యలో వచ్చినది.ఆలాగున జీవుడను వ్యవహారము మధ్యలో వచ్చినది. ఈ జీవత్వము,నేను జీవుడను అనునది అధ్యాస(కల్పితము).

జీవేశ్వరులనగా మాయాభాసులు.

వారిద్దరిచేతనే జగదుత్పత్తి యాయెను.జీవత్వ ఈశ్వరత్వ వ్యవహారములు కల్పితములు. అభాసమనగా నిజముగా తోచునది,విచారించిన లేనిది.

పరబ్రహ్మము నిర్విషయము, నిర్వికారము కానీ స్థూల సూక్ష్మదేహములు  రెండూ కూడా ఆరోపింపబడుచున్నాయి.

స్పష్టమగు దృష్టివలన అవగాహన వలన విచారణ వలన భ్రాంతితో గూడిన అవగాహన అదృశ్యమగును.

నిర్వికారమైన చైతన్యమే కూటస్థము.

పట్టువిడువని ఆలోచనవలన సూక్ష్మశరీరము స్థూలభౌతిక శరీరమగును.

దృఢమయిన జ్ఞానాభ్యాసముచేత 

పదార్థము-మనస్సు,

స్థూలము-సూక్ష్మము

ఒకే అపరిచ్ఛిన్న చైతన్యమని చక్కగా అవగతమగునంతవరకు వివేకవంతుడగు సాధకుడు వానిని నిర్మలముగావించుటకు గట్టిగా ప్రయత్నింపవలెను.

దృశ్యము శుద్ధ(కేవల)  చైతన్యముగా కనిపించునప్పుడు, అది స్వప్నముతో సమానమగును. అగ్నిలో వేయబడిన సమస్తము ఒకే బూడిదయగునట్లు సర్వదశలు ప్రపంచ దృశ్యముగూడ జ్ఞానాగ్నివలన ఒక్కటిగా కుదింపబడును.

చైతన్యమే ఈ స్థూలప్రపంచముగా అగుపించుచున్నది.దీనిని అవగతము గావించుకొన్నప్పుడు పదార్థమున్నదను నమ్మకము తొలగును.

అట్టి జ్ఞాని సంసారమును దాటి సర్వకర్మలను అంతమొందించుకొనును.

 శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

ఆనన్దభైరవిరాగః - ఆదితాళమ్‌.

16. నహిరే నహి శఙ్కా.

నహిరే నహి శఙ్కా

కాచి - న్నహిరే నహి శఙ్కా||

1. అజ మక్షర మద్వైత మనన్తం

ధ్యాయన్తి బ్రహ్మ పరం శాన్తమ్‌ || నహిరే||

2. యే త్యజన్తి బహుతర సన్తాపం

యే భజన్తి సచ్చిత్సుఖ రూపమ్‌|| సహిరే||

4. పరమహంస గురు భణితం గీతం

యే పఠన్తి నిగమార్థ సమేతమ్‌|| నహిరే||

తాత్పర్యము:-

వారికి ఏభయమును లేదు ఉండదు! ఎవరికి? బ్రహ్మాను సంధాన పరులకు! 'బ్రహ్మపదార్థము పుట్టదు గిట్టదు. అదొక్కటే ఉన్నది, రెండవది లేనే లేదు. అది అనంతము. దాని కంటె గొప్పది శాంతమైనది లేదు' - అని యీ విధముగా ఎవరు నిరంతరము బ్రహ్మానుసంధానపరులై ఉంటారో - వారికి సందేహాలు ఉండవు. భయాలు జనింపవు.

2. ఎవరు బహుళ తాపములను దెచ్చిపెట్టుసంసారాసక్తిని వీడి - సచ్చిదానందమయమైన పరబ్రహ్మమే తానని ధ్యానించి సేవింతురో వారికి లేశమున్నూ భీతిలేదు. ఉండదు.

3. ఇట్టి వారికి ఏశంకయును లేదన్న యీ మాట పరమహంసలైన గురువులు చెప్పినమాట సుమా! వేదార్థ మిదియే సుమా! ఇట్లున్న యీగీతము నెవరు పఠింతురో పఠించి ఆచరింతురో - వారికి భయమా! వారికి భీతియా! వారికి శంకయా!

లేదు! కలుగదు!! ఉండదు!!!

*||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-8-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩

త్వద్భక్తమౌళిరథ సో౾పి చ లక్ష లక్షం

వర్షాణి హర్షులమనా భువనేషు కామమ్।

సంగాపయన్ గుణగణం తవ సుందరీభిః

సంగాతిరేకరహితో లలితం చచార।।

భావము:-

ప్రభూ! విద్యాధరాధిపతియైన ఆ 'చిత్రకేతుడు' నీ భక్తులలో అగ్రగణ్యుడు. అట్టి 'చిత్రకేతుడు', నీ గుణగణములను కీర్తించుచు, నీ కీర్తనలను గానముచేయుచూ, సౌందర్యవతులగు విధ్యాధర స్త్రీబృందముతో కలిసి ఎల్లెడలా సంచరించెను; మహదానందముగా అట్లు కొన్ని లక్షల సంవత్సరములు గడిపెను. మనస్సున అన్ని బంధములు త్యజించి - జితేంద్రుడై, భక్తియోగమార్గ మాధుర్యమును ఆస్వాదించుచు తరించెను.

వ్యాఖ్య:-

కొడుకు మరణంతో దుఃఖిస్తున్న చిత్రకేతువు తన వద్దకు వచ్చిన అంగీరసుడిని "మహానుభావా! మీరు నాలో జ్ఞానాన్ని పుట్టించడానికే వచ్చారా? అసలు మీరు ఎవరు ఎందుకు నాకు ఇలాంటి జ్ఞానాన్ని బోధ చేస్తున్నారు" అని అడిగాడు.

‘‘చిత్రకేతూ! మనుషులు, జంతువులు అసలు ప్రాణికోటి అంతా భగవంతుని ఆధీనంలో ఉంటాం.ఆయన నడిపించినట్టు నడుస్తుంటాం. మనకు ఇచ్చిన బుద్ధి ని ఉపయోగించి భగవంతుని తత్త్వాన్ని అర్థం చేసుకోవాలి.’’ అని అంగీరసుడు చెప్పాడు.

‘‘చిత్రకేతు! నీకు నేను నారాయణ మంత్రాన్ని చెబుతాను. నీవు పరిశుద్ధమైన మనస్సుతో ఆ నారాయణ

మంత్రాన్ని అనుష్టించు. ఏడురోజుల్లో ఆ నారాయణుడు నీకు దివ్యదర్శన భాగ్యా న్ని కలుగచేస్తాడు. నీకు శుభం కలుగుతుంది’ అని నారదుడు చెప్పాడు.

చిత్రకేతువు మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి ఆ బాలునికి అంత్యక్రియలు చేసి నారదుని నుంచి నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొందాడు.

నిర్మల మనస్కుడై నారాయణ మంత్రాన్ని జపించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ప్రశాంత వాతావరణంలో నిశ్చలంగా కూర్చుని చిత్రకేతువు నారాయణ మంత్రాన్ని జపించసాగాడు. ఏడు రోజుల తరువాత చిత్రకేతువుకు విద్యాధర చక్రవర్తిత్వం లభించింది. ఇచ్ఛానుసారం ముల్లోకాలు తిరుగగలిగే దివ్యవిమానం కూడా ఒకటి లభ్యమైంది. అతడు ఎంతో సంతోషంతో వాటిని స్వీకరించి పరంధాముని చూడడానికి బయలుదేరాడు. కొంతదూరం తరువాత అతడికి నారాయణుడు పవ్వళించే ఆదిశేషువు కనిపించాడు.

ఆయన్ను స్తోత్రం చేశాడు. విద్యాధర చక్రవర్తి స్థానాన్ని పొంది చిత్రకేతువు చేసే స్తోత్రాన్ని విన్న ఆదిశేషు చాలా సంతోషించాడు. అతడు ‘ఓరుూ చిత్రకేతూ ! నీవు చాలా అదృష్టవంతుడివి. చాలామంది నరజన్మను ఎత్తి కూడా దాంపత్యబంధమనో తల్లిదండ్రుల సేవాబంధం అనో ఏదో ఒకపేరుపెట్టుకుంటూ అక్కడక్కడే తిరుగుతుంటారు. ఈ బంధమోక్షం జరిగిన తరువాత కానీ నన్ను గుర్తించరు. నీవీనాడు మోక్షార్హత పొందావు. నీకు అన్నీ శుభాలే జరుగుతాయి ’అని చెప్పి ఆ అనంతుడు అంతర్థానమై పోయాడు.

చిత్రకేతువు అనంతుడు మాయమైన దిక్కునే చూస్తూ వాసుదేవుని గూర్చి స్తుతించాడు. తనకు తెలిసిన భగవంతుని కథలు రమ్యంగా పాటలాగా పాడాడు. నర్తించాడు. భగవంతుని గుణగానం చేశాడు.

ఆ గానం వినడానికి గంధర్వులు, కింపురుషులు, సాధువులు అక్కడికి వచ్చారు. వారంతా కలసి కూడా విష్ణు సంకీర్తన చేశారు.

చిత్రకేతువు భగవంతుని నామోచ్చారణతోనే రోజులను సునాయాసంగా గడుపుతున్నాడు. ఒకరోజు కైలాసపర్వత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడంతా మంచుకొండలు పరుచుకున్నాయి. శివుని విభూతియే అంతటా నిండి ఉందా అన్నట్టుగా మంచు కుప్పకుప్పలుగా పేరుకుని పోయి ఉంది.

అక్కడంతా గుంపుగుంపులు పరమేశ్వర దర్శనానికి వెళ్లేవారు చిత్రకేతువుకు కనిపించారు. తాను కూడా వారితో వెళ్లాడు.

అక్కడ బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. నారద తుంబరులు గానం తమ వాయిద్యాలను సరిచేసుకొంటూ శివనామ గానం చేస్తున్నారు. 

-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

అవతారిక - కర్మకు కారణమును, ఆధారమును తెలుపుచున్నారు –

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా 

త్రివిధా కర్మచోదనా 

కరణం కర్మ కర్తేతి 

త్రివిధః కర్మసంగ్రహః!!

తాత్పర్యము: - కర్మమునకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియువాడు అని మూడువిధములుగ నున్నది. అట్లే కర్మ కాధారమున్ను ఉపకరణము (సాధనము), క్రియ, చేయువాడు - అని మూడు విధములుగ నున్నది.

 ప్రశ్న:- కర్మమునకు హేతు వెన్ని విధములుగ నున్నది? అవియేవి?

ఉత్తరము:- మూడు విధములుగ. అవి

(1) ఉపకరణము

(2) క్రియ

(3) కర్త (చేయువాడు) అయియున్నవి.

~~~~

అవతారిక - జ్ఞానము, కర్మ, కర్త - అనువానియొక్క సాత్త్విక, రాజస, తామసరూపములను తెలియజేసెదనని భగవానుడు పలుకుచున్నారు -

జ్ఞానం కర్మ చ కర్తా చ 

త్రిధైవ గుణభేదతః

ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి. 

తాత్పర్యము:- గుణములనుగూర్చి విచారణచేయు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మము, కర్త అనునివియు సత్త్వాదిగుణములయొక్క భేదముననుసరించి మూడువిధములుగనే చెప్పబడుచున్నవి. వానినిగూడ యథారీతి (శాస్త్రోక్తప్రకారము) చెప్పెదను వినుము.

ప్రశ్న:- భగవానుడు గుణభేదముననుసరించి మూడువిధములుగ వేనినిగురించి చెప్పదలంచెను?

ఉత్తరము:-

(1) జ్ఞానము,

(2) కర్మ,

(3) కర్త - అను ఈ మూడింటినిగూర్చి.

ప్రశ్న:- వానిని గురించి యెచట తెలుపబడినది?

ఉత్తరము:- సాంఖ్య శాస్త్రమునందు.

: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

751వ నామ మంత్రము

ఓం మహాకాళ్యై నమః

అనంతమైన కాలస్వరూపము, కాలచక్రమును నియమానుసారం పరిభ్రమింపజేయు మహేశ్వర శక్తిగా, మృత్యువుకే మృత్యువుగా విరాజిల్లు మహాకాళి స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాకాళీ యను నాలుగు అక్షరాల (చతురక్షరీ) నామ  మంత్రమును ఓం మహాకాళ్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాతను ఆరాధించు భక్తులను ఆ లలితాంబిక సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి చేస్తుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగజేస్తుంది.

మహాకాళి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతియని అని త్రిశక్తులను నిత్యం పూజలు చేయునప్పుడు స్మరిస్తుంటాము. అలాగే దశమహావిద్యలలో కాళి కూడా ఒక మహావిద్య. కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. ఈ మహాకాళికి పదిచేతులు ఉంటాయి.  పది చేతులలో ఖడ్గము, చక్రము, గద, ధనుస్సు, బాణాలు, ఇనుపకట్లగుదియ, శూలము, భుశుండి, శిరస్సు, శంఖము - పది చేతులలో ధరిస్తుంది. 

మహాకవి కాళిదాసు కాళికాదేవి భక్తుడు. ఆ తల్లి అనుగ్రహంతో ఒకనాటి గొర్రెలకాపరి, నిరక్షరకుక్షి అయిన అతడు సంస్కృత భాషలో మహాకవి అయాడు. ఎన్నో సంస్కృత మహాకావ్యాలు రాయగలిగాడు. మహాకవి కాళిదాసు గురుంచి నాలుగు మాటలు:-

విద్వత్తులో తనను పరాజయించిన వానినే పరిణయమాడెదను అని ప్రతిజ్ఞ పూనిన విద్యోత్తమ అనబడే ఓ యువరాణి, విక్రమాదిత్యుని ఆస్థానములోని పండితులనందరినీ తన పాండిత్యముచే పరాజయము పాలుచేసింది. ఈ అవమానము సహించలేని ఆ పండితులు, ఆనాటికి మందబుద్ధిగా ఉన్న కాళిదాసుని గొప్ప పండితుడని ఆమెను మోసగించి, వారిరువురికినీ పరిణయము గావించిరి. పెళ్ళి తరువాత కాళిదాసు నిజస్వరూపమును గ్రహించిన ఆమె తన అవివేకమునకు, తనకు జరిగిన అవమానమునకు క్రుంగిపోవును. ఇది గ్రహించిన కాళిదాసు జ్ఞాన సముపార్జనకునూ, విద్వత్తు గల భార్యకు తగు సమానునిగను ఉండవలెనన్న తలంపుతో, తన ఇష్టదైవమయిన కాళికాదేవిని ప్రసన్నము చేసుకొనుటకు ఇల్లు విడుచును. అతని ప్రార్థన ఆలకించిన మాత ప్రసన్నురాలై, కాళిదాసుకు గొప్ప విద్వత్తును, మాటనేర్పరి తనాన్ని అనుగ్రహించును. ఈ విధంగా కాళీమాత అనుగ్రహంతో సంస్కృతభాషలో ఒక మహాకవి అయాడు. 

మహాకాళి అనగా పరిచ్ఛేద్యము (హద్దులు, పరిమితులు, నిర్వచనములు, కొలమానములు మొదలగునవి) లేని అనంత రూపిణి మహాకాళి.  

మహాకాళి అంటే మృత్యువుకే మృత్యువు. మహాకాళి జగన్మాత అంశ. గనుకనే జగన్మాత అయిన లలితాంబ మహాకాళీ యను నామ మంత్రముతో ఆరాధింపబడుచున్నది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం  మహాకాళ్యై నమః అని అనవలెను.

: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

177వ నామ మంత్రము

ఓం నిరాబాధాయై నమః

సృష్టికి ముందు గాని, తరువాత గాని బాధ యనునది లేని ఆనంద స్వరూపిణియైన పరాత్పరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరాబాధా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిరాబాధాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ కరుణామయి అయిన లలితాంబను  ఆరాధించు భక్తులకు ఆ తల్లి సుఖశాంతులను ప్రసాదించి, ఆత్మానందానుభూతిని కలిగించి తరింపజేయును.

నిరాబాధా అంటే బాధలు, వేధలు లేనిది. జగన్మాత పరమాత్మ స్వరూపిణి. ఆ తల్లికిబాధలేమిటి?  ఉండవు.  జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి కదా! అందుచేత ఆమెకు బాధలు లేనిది అనగా నిరాబాధా అని నామ మంత్రము కలిగియున్నది. బాధ అనేది ఎప్పుడు ఉంటుంది. అనుకన్నది కాకపోతే, తన కిష్టంలేనిది ఏదైనా సంభవిస్తే. ఒక్కమాటలో చెప్పాలంటే కష్టానికి అర్థం ఇష్టం లేనిది. అవివేకం, అజ్ఞానం, వికల్పాలు అనేవి చోటుచేససుకుంటే అక్కడ బాధలు ఉంటాయి. జగన్నాతను నిరాబాధా అంటే బాధలు లేని పరబ్రహ్మస్వరూపిణి యని స్వరూపిణి అని మనం అనుకోవాలి. అమ్మవారికి బాధ అనేది ఏర్పడితే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహిద్దాము. 

అహంకారంతో విర్రవీగిన దక్షుడు తను జరుపుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుడిని ఆహ్వానించలేదు. అయినా ఈశ్వరుడి సతీమణి, దక్షుడి కుమార్తె దాక్షాయణి తండ్రి చేసిన తప్పును తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది. శక్తి స్వరూపిణి దాక్షాయణి చేసిన నీతిబోధలు దక్షుడికి రుచించలేదు. దాంతో దక్షాయణి విరక్తి చెందింది. దక్షుడి అహంకారాన్ని అణచడానికి యాగం జరగకూడదని హోమాగ్నిలో దూకింది. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. దక్షుడు చేయబూనిన యాగాన్ని నాశనం చేశాడు. దాక్షాయణి కళేబరాన్ని భుజంపై వేసుకుని రుద్రతాండవం ఆడాడు. అఖిలాండం దద్దరిల్లింది. భీతి చెందిన దేవతలు పరంధామున్ని సహాయం కొరకు ఆశ్రయించారు. ఈశ్వరుని క్రోధాన్ని తగ్గించి మామూలు స్ధితికి తీసుకురమ్మని వేడుకొన్నారు. పరంధాముడు(విష్ణుమూర్తి) తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రాయుధం ఈశ్వరుని భుజంపై నిర్జీవంగా వున్న దాక్షాయణి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. దాంతో ఈశ్వరుడు తిరిగి మామూలు స్ధితికి చేరుకుని తప్పిదాన్ని తెలుసుకున్నాడు. "ఉమామహేశ్వరి శరీరంలోని అవయవాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలలో శక్తిపీఠాలు విలసిల్లాయి.

అమ్మవారికి కలిగిన బాధ లోకానికి మేలుచేసిందికదా. శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. జగన్మాతను అనేక రూపాల్లో సేవించుకుంటున్నాము.  ఆ తల్లికి బాధకలిగి అవతారం చాలించింది మళ్ళీ అవతారంలో నిరాదాధా అనే నామ మంత్రానికి సార్థకత చేకూర్చింది. 

బాధ అనేది దేహానికి గనుక బాధ వచ్చిన ఆదేహాన్ని అగ్నికి సమర్పించింది. అంటే బాధ అనేది దేహానికి గాని ఆత్మకు కాదు. జగన్మాత నిర్గుణమూర్తి. గనుక ఆతల్లి నిర్బాధా యని అనబడుచున్నది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్బాధాయై నమః అని అనవలెను.

: 🌹. శ్రీమద్భగవద్గీత - 576  / Bhagavad-Gita - 576 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 20 🌴

20. దాతవ్యమితి యద్దానం దీయతే(నుపకారిణే |

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ||

🌷. తాత్పర్యం : 

ప్రతిఫలవాంఛ లేకుండా సరియైన ప్రదేశమున మరియు సరియైన సమయమున తగినవానికి స్వధర్మమనెడి భావముతో ఒనర్చబడు దానము సత్త్వగుణమును కూడినదిగా భావింపబడును.

🌷. భాష్యము  :

ఆధ్యాత్మిక కర్మలందు నియుక్తుడైనవానికి దానమొసగవలెనని వేదములందు ఉపదేశింపబడినది. విచక్షణారహిత దానము వాని యందు ఉపదేశింప బడలేదు. ఆధ్యాత్మిక పూర్ణత్వమే సర్వదా ప్రధాన ప్రయోజనమై యున్నది. 

కనుకనే దానమును తీర్థక్షేత్రమునందు కాని, గ్రహణ సమయములందు కాని, మాసాంతమున కాని, యోగ్యుడైన బ్రాహ్మణునకు గాని, భక్తునకు గాని, దేవాలయమునకు గాని ఒసగవలెనని ఉపదేశింపబడినది. అటువంటి దానమును ప్రతిఫలాపేక్ష రహితముగా ఒనరింపవలెను. 

ధనహీనులకు కొన్నిమార్లు కరుణాస్వభావముతో దానమొసగినను, దానము గ్రహించువాడు పాత్రుడు కానిచో అట్టి దానము ఆధ్యాత్మికపురోగతికి దోహదము కాజాలదు. అనగా విచక్షణారహిత దానము వేదములందు ఉపదేశింపబడలేదు. 

🌹 🌹 🌹 🌹 🌹

: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 129 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ

🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 59 🌻

ఎందుకనంటే ఇవి ఏవీ కూడా స్వయముగా పనిచేయడం లేదు. కారణం ఏమిటంటే, దేవతలకి కూడా ఆ యా ఆసక్తులు పనిచేయడం చేత, వాళ్ళు కూడా ఈ విషయంలో సంశయగ్రస్థులు అవుతున్నారు. వాళ్ళు కూడా ఆత్మతత్వాన్ని ఎరగాలి అంటే, ఆత్మనిష్ఠులు అవ్వాలి అంటే, ఆ యా ఇంద్రియ అధిష్ఠాన దేవతలు కూడా మరలా మానవశరీరాన్ని ధరించవలసినటువంటి అవసరము ఉన్నది. 

అంత విశేషమైనటువంటి మానవ దేహాన్ని ధరించి, కేవలము ఇంద్రియ వ్యాపార లక్షణము చేత, కేవలము ఇంద్రియ వ్యాపార సుఖము చేత, లాగబడుతూ, ప్రేరేపించబడుతూ అట్టి ఇంద్రియ వ్యాపారముల ఫలితములైనటువంటి సుఖదుఃఖములే సత్యమనుకొని, సుఖాపేక్షచేత ప్రేరేపించబడుతూ, జీవభావమునుండి మగ్నత చెందడం వల్ల, ఆ వివేకంతో, ప్రయత్నశీలివై లక్ష్యమునందు శుద్ధి కలిగినటువంటి వాడవై, సరియైన గురువును ఆశ్రయించి, ఈ పంచీకరణాన్ని, సాంఖ్యవిచారణని సాంగోపాంగముగా ఎరిగిన వాడవై, నీ నిజజీవితంలో ఆ రకమైనటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి, ఆత్మసాక్షాత్కార జ్ఞానమును, పరిణామ రహితమైనటువంటి స్థితిని పొందవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. ఇట్టి ఆత్మోపదేశాన్ని మానవులందరూ తప్పక అందుకోవాలి అనేటటువంటి ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నారు.

          (ఇంతకు మందు ఇంద్రియములకు అంతరముగా మనస్సు, మనస్సుకు అంతరముగా బుద్ధి, బుద్ధికి అంతరముగా ఆత్మ ఉన్నటుల చెప్పబడినది. ఇప్పుడు ఆ ఆత్మ అన్నిటికి, అంతరముగా యుండి బుద్ధి మనస్సులతో కూడి, ఇంద్రియముల ద్వారా శబ్దాది విషయములను గ్రహించుచున్నటుల చెప్పబడినది. ఈ విధముగా ఆత్మయునికి దృఢముగాను, స్పష్టముగాను చెప్పబడినది. అయినప్పటికి అవిద్యతో కూడిన, అల్పజ్ఞానులు ఈ ఆత్మను తెలియలేకున్నారు.)

         మరలా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలని సుస్పష్ట పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అజ్ఞానం ఆవరించియున్నప్పడు, ఆ యా దేహేంద్రియ మనోవ్యాపారం సత్యం అని తోస్తూఉంటాయి. తాత్కాలికములైనటువంటి సుఖదుఃఖములు సత్యములని తోస్తూఉంటాయి. షడ్రుచులు సత్యమని తోస్తూఉంటాయి. దశవిధ నాదాలు సత్యమని తోస్తూఉంటాయి. బాహ్యములైనటువంటి ఇంద్రియ వ్యాపారములే సత్యమని తోస్తూఉంటాయి. జన్మించినది అసలు ఇంద్రియ సుఖం కోసమేనని, తోస్తూ ఉంటాడు. తలపోస్తూ ఉంటాడు. ఇంద్రియాదులందు సుఖదుఃఖములను అనుభవించడం కొరకే పుట్టాను అనేటటువంటి మోహాన్ని పొందుతున్నాడు.

         ప్రయత్నశీలియైనటువంటి వాడు, వివేకి అయినటువంటి వాడు, పెద్దల మార్గమును అనుసరించినటువంటి వాడు, మోక్షమార్గ అనురక్తుడైనటువంటి వాడు, స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ప్రయత్నశీలియైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, అతడు దృఢముగా ప్రయత్నం చేస్తాడు. జీవితంలోని దశాంతర్దశలయందు ఆత్మయొక్క ఉనికి లెస్సగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. 

పైన చెప్పినటువంటి ఉపమానం ఏదైతే మరణావస్థతో పోలిక చెప్పారో, ప్రతీ ఒక్కరూ ఆ మృత్యుకాలమందు తాను ఎట్లు అగుచున్నాడో గుర్తుచేసుకుని, మరణావసాన సమయమందు, ఈ శరీరము ఎట్లు నిశ్చేతనమగుచున్నదో, అచేతనమగుచున్నదో, కట్టెవలె, కొయ్యవలె, దారువు వలె, శిలవలె పరిణామ రహితమై పడివుండుచున్నదో, కేవలము ఆత్మచైతన్య సంగత్వము చేత, ఆత్మచైతన్య ప్రభావము చేత, ఆత్మచైతన్య అంశీభూతము అగుట చేత, ఆత్మ చైతన్య ప్రభావశీలమై శరీరమంతా వ్యాపించి తన చైతన్యమును వ్యాప్తి ఒనరించడం చేత మాత్రమే ఇవన్నీ పనిచేస్తున్నాయనే సత్యాన్ని గుర్తించగలుగుతాడు. 

తన మరణాన్ని తాను ఎఱిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, తనలో ఉన్నటువంటి ఆత్మచైతన్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు ఈ శరీరాన్ని ఒక తోలుతిత్తి వలె, ఒక వస్త్రము వలె, ఒక చెక్క వలె, ఒక మృణ్మయ దేహము వలె, ఒక మృత్తికా భాండము వలె చూస్తూ ఉంటాడు. 

ఈ రకమైనటువంటి దృష్టి కలిగినటువంటివాడికి, ఈ ఘటము యొక్క విశేషము, ఈ ఘటము యొక్క పనితనము తెలిసినటువంటి వాడై, ఘటమును ప్రకాశింప చేసేటటువంటి స్వప్రకాశమే ప్రధానంగాని, ఘటము అప్రధానం అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుంటాడు. - విద్యా సాగర్ గారు 

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

 సంత్ జ్ఞానేశ్వర్  మహరాజ్ అభంగాలు - నామసుధ  - 3 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 3 🍀

త్రిగుణ అసార్ నిర్గుణ హే సార్!

సారాసార్ విచార్ హరి పార్!!

సగుణ నిర్గుణ గుణాచే అగుణ్!

హరి వీణ మన్ వ్యర్డ్ జాయ్!!

అవ్యక్తి నిరాకార్ నాహీ జ్యా ఆకార్! !

జేధోని చరాచర హరిసీ భజే!!

జ్ఞానదేవా ధ్యానీ రామకృష్ణ మనీ !

అనంత్ జన్మోనీ పుణ్య హెయ్!!

భావము :

త్రిగుణము అసారము, నిర్గుణము సారము. సారమేది? ఏది అసారము? అనే విచారము చేసి తెలుపగలదు హరి పాఠము.

సగుణము, నిర్గుణము గుణములతో కూడియున్నదే అగుణము. హరితో మనసుకు సంబంధము లేకపోతే జీవితమంతా వ్యర్థమే.

అవ్యక్తుడు నిరాకారుడు, ఆకారము లేనివాడు ఎవ్వరి నుండి ఈ చరాచర సృష్టి జరిగినదో అట్టి హరినే భజించుము.

అనంత జన్మల పుణ్యము వలన నిరంతరము రామ కృష్ణుల  …

[06:04, 12/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 143  / Sri Lalitha Chaitanya Vijnanam  - 143 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |

నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖

🌻143. 'నిరుపప్లవా' 🌻

నాశనము లేనిది శ్రీలలిత అని భావము.

సృష్టి స్థితుల యందు గాక లయమున కూడ వుండునది శ్రీలలిత. ప్రకృతి పురుషులు లయమున కూడ నుందురు. లయమున ఆమెది యోగనిద్ర. అనగా మెలకువా కాదు, లేనిస్థితి కాదు. వుండియూ లేనట్లుండుట, లేకయూ వుండుట. లేనిచో ఉద్భవించదు కదా! ఉండునుకాని, ఉన్నట్లు ఆమెకు తప్ప మరి ఎవ్వరికిని తెలియదు. 

కాలము రూపమున మేల్కొనినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ మొదలగు వారికి వున్నామని తెలియును. ఎట్లుంటిమి? అను ప్రశ్న కూడ జనించును. ఎట్లుంటిమో తెలియకపోవుట నిద్రస్థితి. తెలిసి యుండుట యోగనిద్రా స్థితి. శ్రీదేవి లయమునకూడ బీజప్రాయముగ తత్త్వ మందిమిడి యుండును. కావున ఆమె నాశనము లేనిది. శ్రీలలిత నారాధించు భక్తులు కూడ ఇట్లే నాశనము లేక యుందురు. 

"నాభక్తులెన్నటికిని నశించరు” అని శ్రీకృష్ణుడు పలికినదీ సత్యమే. సనక సనందనాదులు, నారదుడు అట్టి దేవీ భక్తులు. 

సశేషం...

 శ్రీ ఆదిశంకరుల విరచిత శ్రీ రామాష్టకము

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

1) భజేవిశేష సుందరం సమస్తపాప ఖణ్డనమ్‌ | స్వభక్త చిత్త రఞ్జనం సదైవ రామ మద్వయమ్‌||

2) జటాకలాప శోభితం సమస్తపాపనాశకమ్‌ |స్వభక్తభితి భఞ్జనం భజేహ రామమద్వయమ్‌ ||

3) నిజస్వరూప బోధకం కృపాకరం భవాపహమ్‌| నమం శివం నిరఞ్జనం భజేహ రామ మద్వయమ్‌ ||

4) సదా ప్రపంచ కల్పితం హ్యనామ రూప హస్తవమ్‌ | నరాకృతిం నిరామయం భజేహ రామమద్వయమ్‌||

5) నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయమ్‌ | చిదేకరూప సంతతం భజేహ రామమద్వయమ్‌||

6) భవాబ్ధిపోత రూపకం హ్యశేష దేహ కల్పితమ్‌ | గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయమ్‌||

 7)మహాసువాక్య బోధకైర్విరాజమాన వాక్పదైః | పరం చ బ్రహ్మవ్యాపకం భజేహ రామమద్వయమ్‌ ||

8) శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్‌ | విరాజమైన దైశికం భజేహ రామమద్వయమ్‌||

రామాష్టకం పఠతి యస్సుకరం సుపుణ్యం  వ్యాసేనభాషితమిదం శ్రుణుతే మనుష్యః|

విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహనిలయే లభతే చ మోక్షమ్‌ ||

ఇతి శ్రీ రామాష్టకము సంపూర్ణం.

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

ॐॐॐॐॐॐॐॐॐॐ

ఒక్క రామనామం నాలుక మీద నర్తిస్తే ఆ నామం నర్తించిన కారణం చేత సమస్తపాపములనుండి వినిర్ముక్తుడు కావచ్చు.

ఒక్క రామనామం స్మరణతో లెక్కలేనన్ని లాభాలు చేకూరుతాయి. రామనామ గర్జన ఉన్నచోట విష్ణువు సుదర్శన చక్రం తిరుగుతుంది. దీనులను రక్షించేది ఈ రామనామమే.

"రామనామం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని సత్పురుషులు, పురాణాలు, ఉపనిషత్తులు గానం చేశాయి. జ్ఞానగుణరాశి అయిన శివుడు సతతము దీన్ని జపిస్తాడు. రామరక్షాస్తోత్రంలో శంకరుడు పార్వతికి రామనామ మహత్వాన్ని చెప్తూ విష్ణువు యొక్క వెయ్యినామాలు ఒక్క రామనామంతో సమానమని" అన్నాడు. "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే" ఈ నామం వల్ల స్వరూపం ప్రాప్తిస్తుంది.

భగవంతునియొక్క నామము సర్వకాల సర్వావస్థలయందు అవసరమే. ఒకమంత్రం చేయడానికి, అంగన్యాస కరన్యాసాలు, కాళ్ళూ చేతులు కదపకుండా కూర్చొని చేయాలి. అదే ఒక భగవన్నామం చెప్పడానికి యే అవస్థలోనైనా చెప్పవచ్చు.

రామా! నీదివ్యమైన నామాన్ని నా నాలుకమీద నర్తింపచెయ్యి అంటాడు. ఆ ఒక్క నామాన్ని పట్టుకొని భగవన్నామాన్ని సతతం జపించిన కారణం చేత సమస్త పాపములనుండి విడుదలై పరమేశ్వరుణ్ణి చేరగలడు. భగవన్నామము అంతగొప్పది. భగవన్నామాన్ని ఉచ్ఛరించగలిగిన స్థితి ఒక్క మనుష్య ప్రాణికే వుంది.

మానవాళిని ఆకర్షించిన ఒకే ఒక గుణము శ్రీరామచంద్రుని ధర్మం. ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ మూర్త్భీవించిన ధర్మమే శ్రీరాముడు. ఆ పరమాత్మనామాలలో ‘‘రామా’’ శబ్దం అత్యంత ప్రాముఖ్యం గలది. భవసాగర తరణానికి తారకం ‘రామ’ శబ్దమని జ్ఞానుల నమ్మిక. ‘వేయి విష్ణు నామాలను పఠించే అవకాశం లేనప్పుడు ‘రామ, నామమొకటి స్మరించినా చాలును’ అంటారు శ్రీ ఆదిశంకరులు. శ్రీరామచంద్రమూర్తి భక్త జనరక్షకుడు. భక్తులపట్ల ఆయనకు అమితమైన ప్రేమానురాగాలు. తనపాద స్పర్శతో రాతిని నాతిగా చేసిన కరుణామయుడు. అంతేకాదు తన కోసం సర్వం త్యజించి తనే్న నమ్ముకున్న భక్తురాలు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను స్వీకరించిన భక్తజన ప్రియుడు. సర్వప్రాణులపట్ల అపారమైన కరుణ కలిగిన జగద్రక్షకుడు.

 అందుకనే చెరసాలలో కడగండ్లు పాలవుతున్న రామదాసుని స్వయంగా వెళ్ళి విడిపించిన భక్తజన ప్రియుడు. ‘‘రామనామము రమ్యమైనదని, భక్తులు స్తుతిస్తే, ‘శ్రీరామ నీనామమెంత రుచిరా’ అంటూ రామనామంతోనే తరిస్తారు రాముని నమ్మిన భక్తులు. ప్రపంచంలో రామనామానికి ఏ నామము సాటిరాదనే భక్తి తత్పరతతో జపిస్తారు. శ్రీరామనామంలానే శ్రీరామాయణం కూడా ఎంతో మహిమాన్వితం అయింది. ఎవరినోట రామాయణం పలకబడుతుందో, ఎవరి చెవిలో రామాయణం కథ మ్రోగుతుందో వారికన్నా ధన్యులు ఈ ముల్లోకాలలోను లేరని ప్రతీతి.

శ్రీరామాయణమున శ్రీరాముని జీవితం సంఘటనాత్మకమైనది. స్వార్థాన్ని త్యజించి, ధర్మమార్గాన్ని ఆచరిస్తూ విశిష్ట మానవుడుగా వెలుగొందుతాడు. దశరథరాముడు కల్యాణ రాముడిగా, సీతారాముడిగా, కోదండ రాముడిగా, మారుతి రాముడిగా, ఆత్మ రాముడిగా, అమృత రాముడై అనంత రాముడిగా పరిఢివిల్లాడు. శ్రీరాముడు సత్యసంధుడిగా, శ్రేయోభిలాషియైన మిత్రుడుగా, ఆదర్శ సోదరుడుగా, ప్రేమైక మూర్తియైన భర్తగా, కరుణాసింధుడిగా, ధర్మస్వరూపుడుగా, శరణాగత వత్సలుడుగా, పురుషోత్తమునిగా, అదృశ్యముగా, సర్వాంతర్యామియై సమస్త ప్రకృతిచే కీర్తింపబడు పరమాత్మగా దర్శనమిచ్చే శ్రీరాముని నామానికి అంత మహిమతో ప్రకాశిస్తుంది.

ఆనాటి రామరాజ్యాన్ని మానవాళి హృదయాలలో నిక్షిప్తమై వుందనడానికి రాజ్యపాలకుడుగా శ్రీరామచంద్రమూర్తి జగత్తుకే మార్గదర్శకం. ‘రామ, అన్నపదం రెండు అత్యున్నత బీజాక్షర యుక్తమైన మంత్రం. ‘రా’ అనే అక్షరం పలుకగానే మానవ సమస్త దోషాలు తొలగిపోయి కల్మషరాహిత్యాన్ని మానవునికి ప్రసాదిస్తుంది. ‘మ’ అనే రెండో బీజాక్షరం మానవుల హృదయాంతరాలు అమృతమయమై దైవత్వాన్ని ప్రసాదిస్తుంది. రామనామం రెండు అత్యున్నత బీజాక్షరాల సంహిత. మధురాతి మధురమైన సుశబ్దం.

ఆదో ప్రణవనాదం. ఆదో వేదం. ఒక పరిపూర్ణ జీవితానికి నిర్వచనం శ్రీరామచరిత్ర. సాక్షాత్ శ్రీమన్నారాయుడే నరుడిగా అవతారమెత్తి విశ్వమానవ జాతికి ఆదర్శమూర్తిగా నిలిచాడు. రాముడు మానవరూపంలో ఉన్న మాధవుడిని ఆంజనేయుడు కీర్తించాడు. శ్రీరాముడు నాకు ప్రేమాతిశయగల భర్తే కాకుండా సకల లోకాలకు స్వామి, ఆఖిలలోకారాధ్యుడు, వేదవేద్యుడు, నిర్మలగుణ యశోనిధి, సర్వజీవులకు సముడు, పరంధాముడైన శ్రీరామచంద్రుడు పగతుని పరిమార్చి తనను పరిగ్రహిస్తాడని జగన్మాత జానకి విశ్వాసం. ధనుర్ధారి అయిన శ్రీరామచంద్రమూర్తికి అపజయం అనేది లేదని విశ్వసించిన దేవతలు కూడా రాముని స్మరించారు. శుభం కలగాలని దీవించారు. రామనామాన్ని భజించి, ప్రార్థించే మానవాళి జగమంతా రామమయమై జీవన్ముకులు అవుతారు.

రామ రహస్యోపనిషత్

ఆద్యోరా తత్పదార్ధస్స్యాత్ మకారస్త్వం పదార్ధవాన్ !

తయో స్సంయోజన మసిత్యర్ధే తత్త్వవిదో విదుః !!

లోకమున రామ నామ స్మరణ ప్రతివారును చేయుదురు.  అట్టి రామనామమున కర్ధము యేమనగా, " రమతీతి రామః "  అనగా జ్ణానుల యొక్క హృదయములను రమింపజేయువాడు, అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి.  "రా" అనగా "తత్" పదార్ధము, "మ" అనగా " త్వం" పదార్ధము. ఈ రెంటియొక్క కూడికయే " తత్వమసి" యగుచున్నది.  "తత్" అనగా, పరమాత్మ "త్వం" అనగా జీవాత్మ.  ఈ పరమాత్మ జీవాత్మల సంపుటియే "రామ" యనబడును. 

 ఇతడే అన్ని జీవులయందును  సాక్షియై యుండుటవలన నితనిని ఆత్మారాముడని చెప్పబడును,  ఇది జ్ణానకాండము యొక్క అర్ధము.  కర్మ కాండార్ధమే మనగా;  రాముడు దశకంఠుని సంహరించి సీతను చేకొనెని చెప్పుచున్నది.  దీని రహస్యార్ధమేమనగా, ఆత్మయే రాముడు, మనస్సే సీత.  కామక్రోధాదులనెడి దశగుణములే రావణుడు.  ఈ కామక్రోధాది దశగుణములను జయించి మనస్సు అనెడి సీతను, ఆత్మా రామునియందు జేర్చుటయే  రామాయణము యొక్క అంతరార్ధము, అని తెలిసికొనవలెను.

రామ రహస్యోపనిషత్

రామ యేవ పరంబ్రహ్మ!   రామ యేవపరంతపః!  రామ యేవ పరంతత్వం శ్రీరామెా బ్రహ్మ తారకమ్!!

ముక్తికోపనిషత్

 శ్రీరామనామ జపాత్ నరో  దురాచారగతోపివా! సాలోక్యముక్తి  మాప్నోతి నతులోకాన్తరాదికమ్!!

శాంతి పురాణము       

రామనామ జపాదేవ లోకే శాంతి సముద్భవం   |  యన్యనామ ప్రలాపేన దుర్భిక్ఛం మరణం భళయం   ||

ఆనంద రామాయణము

సంసారార్ణవ సంమగ్న నరం యస్తారయేన్మనుః           |        

సయేవ తారకస్తత్ర రామ మంత్ర ప్రకధ్యతే  ||   

         ఆత్మనే రమతే యస్తాదాత్మారామస్తదుచ్యతే  |

    బ్రహ్మాండం జజాయతే యస్తాత్తస్మాబ్రహ్మ ప్రకీర్తితమ్     ||       రామనామాత్పరో మంత్రో న భవిష్యతి    ||

రామతాపిన్యుపనిషత్

 రమన్తే యెాగినో  (ఆ)నన్తే నిత్యానందే చిదాత్మని | యితి రామ పదేనాసౌ  పరం బ్రహ్మాభిదీయతే !!

  !!శివపురాణము!!

  ఆహో భగవన్నామగృణన్ కృతార్ధో వసామి కాశ్యా  మనితం భవాన్యా,                                                   మాణస్య విముక్తయే హం దిశామి మంత్రం తవ   రామనామ!!

ప్రసంగేనాపి శ్రీరామ నామ సర్వేశ్వర ప్రియమ్|          

కృతార్థాస్తే   ముని శ్రేష్ట సర్వదోషాద్గతాః   సదా ||                 (విష్ణుపురాణము).

🕉🌞🌎🌙🌟🚩

ప్రతి కార్యం-అవహేళన, ప్రతిఘటన, తరువాత అంగీకారం. ఈ మూడు దశలను దాటవలసి ఉంటుంది. తానున్న కాలానికంటే ముందుగా ఆలోచించే ప్రతి వ్యక్తినీ లోకం అపార్ధం చేసుకోవడం సహజం. కాబట్టి ప్రతిఘటన, హింస అనివార్యాలు. మీరు స్ధైర్యంగా, పవిత్రంగా ఉంటూ భగవంతునిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు ఇవన్నీ అదృశ్యమవుతాయి.

🕉🌞🌎🌙🌟🚩

 భాగవతము

శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩

దక్షుడికి శివుని గురించి వేరే భావనలున్నాయి. (శివుడు ఒంటికి  బూడిద పూసుకుంటాడని, మెడలో పాములు ధరిస్తాడని, శ్మశానములో ఉంటాడని) శివుడు స్మరణ మాత్రము చేత దర్శన మిచ్చేటటువంటి మహాదేవుడని అని వశిష్ఠుడు చెపుతాడు. వశిష్ఠుడు ధ్యానము చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు.

అమితమైన సౌందర్యముతో  కూడి ఉంటాడు. దక్షుడు శివుడిని చూసి మనది ఒక అందమా అనుకుంటాడు. ఈయన నగలు లేకపోయినా బావున్నాడు, ఇన్ని నగలు పెట్టుకున్నా ఈయన అందముతో సమానముగా లేము కదా! ఆయన తేజస్సుతో పోలిస్తే మన తేజస్సు ఒక గుడ్డి వెలుగు వలె ఉన్నదని అనుకుంటాడు. శివుడు 16 సంవత్సరాల వయస్సు గల వాడుగా ఉంటాడు.

(సశేషము)

ఆచార్య సద్భావన

మనం అంతర్ముఖులమయ్యేకొలదీ బాహ్య సంఘటనల ప్రభావం మన ఎడల అంతకంతకూ తగ్గుతూ వస్తుంది.

బాహ్యంలో జీవించే వ్యక్తి అన్ని విషయాలను గమనిస్తాడు. అన్ని విషయాలు అతని గమనింపుకు వస్తాయి. అతడు గోరంత దాన్ని కొండంతగా చూస్తాడు.

ఒక వ్యక్తి చూపులుగాని, చర్యలుగాని దుష్ఠభావాంతో ఉన్నట్టుగా అతడు ఊహించుకుంటాడు.

దుష్టత్వాన్ని భూతద్దంలో చూస్తే అది చివరకు మనకు భరించలేని భారమయ్యేంతగా తయారయి ఆఖరికి మనం అరణ్యానికి పోయినా శాంతిని దక్కనివ్వదు.

అందు వలన ఈ చింతనను జయించాలి. అంతర్కుఖుడై జీవించే వ్యక్తి ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండడు.

అంతరంగంతో సంబంధం ఏర్పరచుకోవటం తెలిసినవాడు కోల్పోయేదీ ఏదీ ఉండదు.

శుభంభూయాత్

 శ్రీరమణీయం - (738)

"ఎన్ని కష్టాలు ఎదురైనా వాటి నుండి దుఃఖం పొందకుండా శాంతిగా ఉండగల మార్గమేది !?"

పెద్ద సముద్రం మనని భయపెడుతుంది. కానీ చిన్న నావ మనకి బోలెడు ధైర్యాన్నిస్తుంది. నిజానికి సముద్రం అంటే భయం ఉండదు. అందులో మునిగి పోతామనేదే భయం. నావను చూడగానే సముద్రం అదృశ్యం కాదు. సముద్రమంటే ఉన్న భయం అదృశ్యమవుతుంది. అలాగే మనలను ఆవరించి ఉన్న సంసారం అనే సముద్రం విషయంలో కూడా అంతే. శాంతి అనే చిన్న నావ దొరకగానే సంసారం అక్కడే ఉంటుంది. కానీ సంసారం అనే విషయంలో కలిగే దుఃఖం అంతమవుతుంది. మనకి చాలా సినిమాలు నచ్చేది అందులో కథానాయకుని వ్యక్తిత్వం వల్లనే. నైతిక విలువలతో కష్టాలను భరిస్తూ, సత్ప్రవర్తనతో ఉన్న పాత్ర మనకు సినిమా నచ్చేలా చేస్తుంది. రామాయణ, మహాభారతాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా మనకు ఆ నైతికతనే నేర్పారు. 18 అధ్యాయాల భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది మనసును నిర్మలంగా ఉంచుకోమనే. ప్రతి కాండలో శ్రీరాముడు చూపింది కూడా అదే మనోనిర్మలత్వాన్నే. నిర్మలమైన మనస్సు ఉన్నంత మాత్రాన కష్టాలన్నీ దూరంకావు. కానీ ఏ కష్టం అతన్ని దుఃఖ పెట్టకుండా ఉంటుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

"దైవదర్శనం.. దుఃఖనాశనం.. శాంతితోనే సాధ్యం !''- (అధ్యాయం -90)

🕉🌞🌎🌙🌟🚩

 "ఋభుగీత " (205)

🕉🌞🌎🌙🌟🚩

ఋభు నిధాఘ సంవాదము"

15వ అధ్యాయము 

మనసుకు సత్యం అర్థమైతే ద్వంద్వం, దుఃఖం పోతాయి !

అంతా అవ్యయమైన బ్రహ్మమే అయినప్పుడు ఇక "సర్వము" అనే పదమేలేదు. సర్వమూ అంటూ ఏమీ లేదు. మనందరం సత్ - చిత్ - ఆనందరూపులమే. సర్వ వ్యాపకమైన ఉనికే మనలో నేనుగా భాసిస్తుందని తెలియజేసే ఈ ఋభుగీత బోధ ద్వారా మనం సదా చైతన్య స్వరూపులం అని తెలుసుకోవాలి. ఆ సత్యం తెలుసుకుంటే అది యోగంలో పొందే తురీయస్థితికి సమానం అవుతుంది. అప్పుడు దాన్ని మనం  నిత్యజీవితంలో కూడా అనుభవిస్తాము. నేను సదా బ్రహ్మమే అనే నిశ్చయాత్మకమైన మనసును సాధించే వరకూ మనసుకు ద్వంద్వం, దుఃఖం తప్పవు. ద్వంద్వంపోతే దుఃఖం పోతుంది. సత్యం అర్థమైతే ద్వంద్వం పోతుంది !

🕉🌞🌎🌙🌟🚩

 🌷96-మంద్రగీత🌷

 🕉🌞🌎🌙🌟🚩

అధ్యాయము-8

🥀దారులు-మెట్లు🥀

11. నన్ను వేదముగ తెలిసిన వారు వేదమున కూడా నన్నే అధ్యయనము చేసి క్షరములని బ్రహ్మమును అభ్యాసము చేయుదురు. కోరికలను తొలగించుకొని సంయమము చెందిన వారు నన్ను ప్రవేశించుచున్నారు. నన్ను కోరి పెద్దలు బ్రహ్మచర్యము చరించుచున్నారు. దానిని గూర్చి మరికొంత వివరింతును.

12. శరీరము విడుచు సమయమున సర్వ ద్వారములను సంయమము చేయుము. భ్రూమధ్యము నందు నిలిపిన మనస్సును హృదయమున నిరోధింపుము. గుండె కొట్టుకొనుటను లెక్కించినచో మనస్సు హృదయమున నిలుప బడును. అచ్చటి నుండి శరీర స్పందనలకు ఆ భావము కల్పింపుము. హృదయము నుండి మెల్లగా మూర్థమునకు ఊర్థముగ ధ్యానము చేసినచో శ్వాస, గుండె కొట్టుకొనుట మొదలగు ప్రాణ స్పందనములు తనయందు శమించును. ఇట్లు యోగధారణ చేయుము.

13. ఆ స్థితిలో నన్ను స్మరించుచు 'ఓం' అని ఉచ్ఛరింపుము. ఇది నోటితో గాక, శ్వాసతో కాక, మనస్సుతో గాక, మొత్తముతో  ఉచ్చరింపుము. నేను అను ప్రజ్ఞతో హృదయము నుండి శిరస్సు పైకి ఊర్ధ్వముగ ఉచ్చరించుము. ఆ ఉచ్చారణగా బయటికి వచ్చి శరీరమును విడిచి పెట్టుదువు. అప్పుడు తిరిగిరాని ఉత్తమమైన స్థితిని పొందుదువు. (ఇట్లు ఉచ్చరించి శరీరమును విడుచుట చనిపోయినప్పుడే చేయనక్కరలేదు అభ్యాసమున నిరంతరము చేయుచుండ వచ్చును. అట్టి వారికి శరీరమున్నను దానితో సంబంధం ఉండదు. శరీరమునకు మాత్రము తనతో సంబంధమున్నంత వరకు పనిచేయు చుండును).

 🕉🌞🌎🌙🌟🚩

 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

జలవ్యోమ్నా ఘటాకాశో యథా సర్వస్తిరోహితః ౹ తథా జీవేన కూటస్థః సోఽ న్యోన్యాధ్యాస ఉచ్యతే  ౹౹24౹౹

24.జలాకాశముచే ఘటాకాశము సంపూర్ణముగా ఆవరింపబడి కనిపింప కుండునట్లు జీవునిచే కూటస్థము సర్వదా ఆవరింపబడి గోచరింపక ఉండును.వీనినే అన్నోన్యాధ్యాస అని అంటారు.

అయం జీవో న కూటస్థం వివినక్తి కదాచన  ౹ అనాది రవివేకోఽ యం మూలాఽ విద్యేతి గమ్యతామ్ ౹౹25౹౹

25. ఈ అన్నోన్యాధ్యాస ఫలముగా జీవుడు ఎన్నటికిని కూటస్థమును గూర్చి వివేచింపక ఉండును.ఈ అవివేకము అనాదియైనది.దీనినే మూలావిద్య అంటారు.

విక్షేపావృత్తి రూపాభ్యాం ద్విధాఽ విద్యా వ్యవస్థితా ౹ న భాతి నాస్తి కూటస్థ ఇత్యాపాదనమావృతిః ౹౹26౹౹

26. అవిద్యయందు రెండుంశములున్నవి.విక్షేపము ఆవృతి అని. కూటస్థము ప్రకాశింపదు.కనుక అసలు లేదు అని ఆరోపించుట ఆవృతి.

అజ్ఞానము లేక అవిద్యయనునది అనాది,శాస్త్రములలో అనాది అవిద్యామాయా యని చేప్పబడినది.అనాది యొక్క ఆదిని గూర్చి తెలిసికొనవలయునునని ప్రయత్నించుట మూర్ఖత్వము.

జీవుని పరమార్థ రూపము జననమరణములు లేని శుద్ధ అసంగ చిన్మాత్ర కూటస్థాత్మయే.

ఇట్టి ఆత్మ సర్వవ్యాపి అయిన బ్రహ్మమున కంటే అన్యముకాదు.

జీవుడు

(అంతఃకరణ ప్రతిబింబుడు)తన వాస్తవ స్వరూపము ఇట్టిదని తెలియక పోవుట(మరుపు)అనీ అజ్ఞానముచేత అనాదిగా స్వరూపమునందు ఆరోపించుకొని యున్న దేహేంద్రియాది 

మనః ప్రాణాదులే 

"నేననియు" 

విషయప్రపంచ సంబంధమైన వస్తుజాతము

 "నాదనియు" 

ఆరోపించుకొని అహంకార మమకారములతో సంసారచక్రమున పరిభ్రమించుచున్నాడు.

బ్రహ్మ రూపాత్మను తెలిసికొనలేదు అనునది అవిద్యాస్వరూపము లేక

అజ్ఞానలక్షణము.అంటే మన నిజస్వరూపమైన బ్రహ్మరూపాత్మను మనకు తెలియ నివ్వకుండా మరుగు పరిచినది.

నీటిలో పుట్టిన పాచి నీటినే కమ్ముకొని నటుల,కంటిలో పుట్టిన పొర కంటినే ఆవరించి నటుల ఈ అవిద్య  స్వస్వరూపమైన ఆత్మయందు భాసించి ఆత్మను తెలియ నవ్వకుండా క్రమ్ముకున్నది 

విషయప్రపంచమును,

స్థూలదేహమును, సూక్ష్మ దేహమని చెప్పబడుచున్న జ్ఞానేంద్రియకర్మేంద్రియములను,

అంతఃకరణమును,ప్రాణాదివాయువులను వీటన్నింటి యందు ఎడతెగక కర్తృ రూపముతో యున్న తనను,కర్తృత్వములేని సాక్షిగా వేరు చేసుకొనవలెను.

ఒక్క సాక్షిత్వముమాత్రమే వుండిన అట్టి స్థితికి బ్రహ్మమునకు ఏకత్వము చెప్పవచ్చును.అంటే చిదాభాసుడు తనను సాక్షిగా గుర్తించి ఆపై బ్రహ్మముగా నిశ్చయిస్తాడు.

అవిద్యా ఫలముగ మనము నిత్యసత్యమైన బ్రహ్మమును గ్రహింపక తత్కాల సత్యమైన జగత్తును చూచుచున్నాము.

అవిద్యను విశ్లేషించినచో ఉన్నదానిని చూడకపోవుట,లేనిదానిని చూచుట అనే రెండు ప్రక్రియలను గమనింపగలము.

మొదటిదానిని ఆవరణమనీ రెండవదానికి విక్షేపమనీ పేర్లు.అవిద్య యొక్క ఆవరణ ప్రభావముచే ఉన్న కూటస్థము తిరోహితమగుచున్నది.దాని విక్షేప ప్రభావముచే స్థూలసూక్ష్మాది శరీరములు జీవులు కన్పించుచున్నవి.

🕉🌞🌏🌙🌟🚩

 శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩

(కామ్భోదిరాగః - ఆదితాళమ్‌)

17. చిన్తా నహిరే-నాస్తి కిల

చిన్తా నాస్తి కిల

తేషాం - చిన్తా నాస్తి కిల.

1. శమ దమ కరుణా సమ్పూర్ణానాం

సాధు సమాగమ సంకీర్ణానాం|| చిన్తా||

2. కాలత్రయ జిత కన్దర్పాణాం

ఖణ్డిత సర్వేంద్రియ దర్పాణామ్‌|| చిన్తా||

3. పరమహంసగురు పద చిత్తానాం

బ్రహ్మానన్దామృత మత్తానామ్‌|| చిన్తా||

🕉🌞🌎🌙🌟🚩

తాత్పర్యము:-

చింతలేదు - వారికి శోకము లేదు ఇలలో.

1. అంతరింద్రియములను, బహిరింద్రియములను పూర్తిగా అదుపులో ఉంచుకొన్న వారికి - సజ్జన సంగతి యందు కాలము గడుపు వారికి దుఃఖము లేదు! చింతలేదు!

2. మూడు వేళలయందును కామునెన్నడును కదలనీయని వారికి - అన్ని యింద్రియముల విజృంభణమును పూర్తిగా అరికట్టిన వారికి చింత ఏమున్నది! శోకమేమున్నది!!

3. పరమహంసలైన శ్రీ గురువులపాదములయందు తమ్ముతామర్పించు కొన్న వారికి (సదాశివబ్రహ్మేంద్రులవారు తమ గురువులను స్మరించు చున్నారు. ఎవరైనను తమ గురువుల నిటులే భావింప వలెనని భావము) - బ్రహ్మానందామృత పానముచే తమను తాము  మరచువారికి చింత ఏమున్నది? శోకమే మున్నది?

🕉🌞🌏🌙🌟🚩

||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-9-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩

*అత్యంతసంగవిలయాయ భవత్ప్రణున్నో

నూనం స రౌప్యగిరిమాప్య మహత్సమాజే।*

*నిశ్శంకమంకకృతవల్లభమంగజారిం

తం శంకరం పరిహసన్నుమయా౾భిశేపే।।*

భావము:-

భగవాన్! నీవు 'చిత్రకేతునికి' పరిపూర్ణ నిస్సాంగత్యమును (సాంగత్యరహిత నిశ్చలత్వమును) అనుగ్రహింప దలచితివి. అప్పుడు 'చిత్రకేతుడు' నీ ప్రేరణచే కైలాసగిరికి వెళ్ళెను. అచ్చట ముఖ్య మునిగణములెల్లరూ పరివేష్టించియుండిరి. ఆ మహాసభలో శంకరుడు ఉమాదేవిని తన తొడభాగముపై కూర్చుండబెట్టుకొనియుండెను. ఆ దృశ్యమును చూచి పరిహసించగా - 'చిత్రకేతుడు' ఉమాదేవి శాపమునకు (అసుర జన్మకు) గురియయ్యెను.

వ్యాఖ్య:-

విద్యాధర పతి అయిన చిత్రకేతువు పరమాత్మ వెళ్ళిన దిక్కుకు నమస్కారం చేసి ఒక లక్ష సంవత్సరాలు తన శక్తి తొలగిపోకుండా సిద్ధ చారణులచే స్తోత్రం చేయబడుతూ పర్వత ప్రాంతములలో విద్యాధర స్త్రీలతో కలిసి పరమాత్మను గానం చేస్తూ పరమాత్మను గానం చేయిస్తూ కాలం గడిపాడు.

ఆదిశేషువిచ్చిన కామగమనమైన విమానములో సంచరిస్తూ ఒక సారి కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ సిద్ధులూ చారణులూ ఉన్నారు.

తన ముందు కూర్చున్న సనకాదులకు తత్వోపదేశం చేస్తున్నాడు. ఈయన కూడా అది విన్నాడు. శంకరుడు పార్వతీ దేవిని ఆలింగనం చేసుకుని తత్వోపదేశం చేస్తుంటే ఇలా అన్నాడు. 

"శంకరుడు లోకగురువు. జీవులకు తత్వం బోధిస్తున్నాడు. ఇలాంటి శంకరుడు కూడా భరయను కౌగిలించుకుని కూర్చి మాకు తత్వం చెబుతున్నాడు. జఠాధరుడైన వాడు ప్రాకృతమైన పామరుడిలా ఎలా ఉన్నాడు. పామరుడు కూడా రహస్యముగా ఏకాంతముగా భార్యతో ఉంటాడు గానీ సభలో ఉంటాడా? మరి శంకరుడు ఎలా ఉన్నాడు ఇలా?"

శంకరుడు అది విని ఒక చిరునవ్వి నవ్వి మౌనముగా ఉన్నాడు. ఆయన చెప్పిన దాన్ని వినే ఋషులు కూడా మౌనముగా ఊరుకున్నారు గానీ భర్తను అధిక్షేపించగానే పార్వతీ అమ్మవారు ఊరుకోక "లోకానికి ధర్మం చెప్పే మహానుభావుడు, సిగ్గులేని మాలాటి వారికి ధర్మం చేప్పేవాడు వచ్చాడు. బ్రహ్మకూ బ్రహ్మ పుత్రులకూ సనకాదులకూ కుమార స్వామికీ మొదలైనవారికి ఈ ధర్మం తెలియదు. ఈయనకు మాత్రమే తెలుసు. 

ఇప్పుడు నేను చెప్పిన వీరందరి చేత ధ్యానించబడే మహిమ గల శ్రీమన్నారాయణుని పాదములను ధ్యాఇంచే వీడు జ్ఞ్యానులని పరిహైసించి దుష్టుడై కొత్త బాష్యం చెబుతున్నాడు. ఇటువంటి వాడు వైకుంఠం వెళ్ళడానికి అర్హుడు కాడు. వైకుంఠములో అందరు సాధువులే ఉంటారు. నీవు రాక్షస యోనిలో చేరి రాక్షసునిగా పుట్టు. మళ్ళీ ఇలాంటి మహానుభావులకు నీవు అవమానం చేయకూడదు. పుత్రా! నీకు గుణపాఠం చెప్పడానికే ఇలా చేస్తున్నాను. "

ఇలా శపిస్తే ఆ శాపాన్ని పొందిన చిత్రకేతువు తలవంచి ఆమెను ప్రార్థించాడు. "అమ్మా నీవు ఇచ్చిన శాపాన్ని శిరస్సు వంచి స్వీకరిస్తున్నాను. మానవులు పొందవలసినది వారు పొందే తీరు తారు వారి కర్మ ఫలితముగా. నన్ను శపించావంటే అది నా పూర్వ జన్మ కర్మ ఫలమే. జీవుడు సంసారములో సంచరిస్తూ సుఖాన్నీ దుఃఖాన్ని జ్యానాన్నీ అజ్ఞ్యానాన్ని అనుభవిస్తాడు. 

కర్మానుసారముగా. మానవుడికి జీవుడికీ కలిగే సుఖ దుఃఖములకు జీవుడూ కారణం కాదు. ఇతరులూ కారణం కాదు. తెలియని వారే నేను తప్పు చేసాను, వాడు తప్పు చేసాడు అంటారు. పరమాత్మ ఒక్కడే తన మాయతో సకల జగత్తులనీ సృష్టిస్తాడు. ఆ పరమాత్మే సుఖాన్ని దుఃఖాన్నీ బంధాన్నీ మోక్షాన్నీ ఇస్తాడు. పరమాత్మకి ఎలాంటి రాగద్వేషాలు ఉండవు.

సంసారమనే చక్రముతో సంబంధం ఉండదు. ఆయనకు తనవాడూ పరాయి వాడూ మిత్రుడు అంటూ ఎవరూ ఉండరు. ఆయనకు సుఖమూ దుఃఖమూ అంటూ ఉండదు. సుఖం యందు ప్రీతీ దుఃఖం యందు కోపమూ లేదు. ఆయనకేమీ లేకున్నా ఆయన తన సంకల్పముతో మన కర్మానుగుణముగా సుఖదుఃఖాలను ప్రసాదిస్తూ ఉంటాడు. పుట్టుకా సంసారం బంధమూ ఇస్తూ ఉంటాడు. నీ శాపానికి భయపడి నేను ఇలా అనట్లేదు. శాపాన్ని తీసేయమని నేను అడగను. ఒక వేళ నేను మాట్లాడిన దాని వలన నీ మనసు కష్ట్పడితే, నేను తప్పుగా మాట్లాడితే క్షమించు. కానీ ఆ శాపం తొలగించమని నేను అడగను "

ఇలా పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకుని వారందరూ చూస్తుండగానే విమానం ఎక్కి వెళ్ళిపోయాడు.

🕉🌞🌎🌙🌟🚩

-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

అ౹౹ మొదట జ్ఞానము నెత్తుకొని సాత్త్విక జ్ఞానము యొక్క స్వరూపమును తెలియజేయు చున్నారు–

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే

అవిభక్తం విభక్తేషు 

తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికమ్.

తా:- విభజింపబడి వేఱువేఱుగనున్న సమస్త చరాచర ప్రాణులందును, ఒక్కటైన నాశరహితమగు

ఆత్మవస్తువును (దైవముయొక్క ఉనికిని) విభజింపబడక (ఏకముగ) నున్నట్లు ఏ జ్ఞానముచేత నెఱుంగుచున్నాడో అట్టి జ్ఞానము సాత్త్వికమని తెలిసికొనుము.

వ్యాఖ్య: - అజ్ఞానుల దృష్టికి, (స్థూలదృష్టికి , భౌతికనేత్రమునకు) ఈ ప్రపంచము, సమస్తపదార్థములు, సమస్తప్రాణులు విభజింపబడియున్నట్లు, వేరువేరుగా నున్నట్లు కానుపించును.

కాని జ్ఞానులదృష్టికి అంతయు అవిభక్తముగను, సర్వత్ర నాశరహితమగు ఒకే ఆత్మవస్తువు (పరబ్రహ్మము) వ్యాపించియున్నట్లును గోచరించును. ఏ జ్ఞానముచే అట్టి అవిభక్తము వారికి అనుభూతమగునో అట్టి జ్ఞానము సాత్త్వికమైనదని యిచట పేర్కొనబడెను.

"సర్వభూతేషు - అని చెప్పినందువలన భగవంతుడు (ఆత్మ) సమస్త చరాచర ప్రాణికోట్లయందును వ్యాపించియున్నాడని తెలియుచున్నది. కావున ఎట్టి నికృష్టజీవి అయినప్పటికిని, తన వెనుకనున్న పరమాత్మను తెలిసికొని, తన యథార్థరూపమును అవగతమొనర్చుకొని తరించుటకు అవకాశము కలదు.

 తరంగము చిన్నదైనను దానికాధార భూతమైన సముద్రమును భావించి దానిలో లీనమగుటకు, సముద్రరూపమగుటకు అద్దానికి హక్కుగలదు. కావున ఎట్టి అల్పవ్యక్తి అయినప్పటికిని ఎవరును ఇక అధైర్యపడవలసిన పనిలేదు. హృదయమును పవిత్రమొనర్చుకొని తన నిజరూపమగు ఆత్మను తెలిసికొనిన చాలును, తరించిపోవును.

అనేక తరంగములు ఉన్నప్పటికిని వాని నామరూపములను వదలి జలమును మాత్రము చూచువానివలెను;

 పెక్కుకుండలను చూచియు వానియందలి మృత్తికనే(మట్టినే) వీక్షించువానివలెను; 

పుష్పమాలలోని అనేకపుష్పములలోన గల దారమును చూచువానివలెను-

ప్రపంచమున అనేక జీవరాసులను, భిన్నభిన్న పదార్థములను చూచినను వాని ఉపాధిరూపమును, నామరూపములను వదలి అన్నిటియందును అనుస్యూతమైయున్న అవిభక్తమగు ఏకమైన ఆత్మనే చూచువాడు సాత్త్వికజ్ఞానయుతుడని చెప్పబడును.  

   అనగా అనేకత్వములో ఏకత్వమును;

నాశములో అవినాశిత్వమును;

విభజిత వస్తువులను అవిభక్తముగ -

వీక్షింపగలుటయే ఉత్తమజ్ఞానమని బోధించిరి. దీనినిబట్టి ప్రపంచమున అనేకత్వమును జూచుట కేవలము అజ్ఞానమేయని తేలుచున్నది.

ఈ శ్లోకమున ఆత్మవస్తువునకు మూడు విశేషణములు చెప్పబడినవి - అది (1) ఏకమైనది

(2) అవ్యయమైనది (3) అవిభక్తమైనది - అని. ప్రపంచవస్తువులకును ఆత్మకును భేదము ఈ క్రింద తెలుపబడుచున్నది.

ప్రపంచవస్తువులు -

(1)అనేకములైనవి, 

(2)నాశవంతములు,

(3)విభాగముతో గూడినవి.

కానీ ఆత్మ (దైవము)- 

(1)ఏకమైనది (ఏకమ్), (2)నాశరహితమైనది (అవ్యయమ్),

(3)అవిభక్తమైనది (అవిభక్తమ్).

       లోకమున పెక్కు జ్ఞానములు కలవు - సంగీతజ్ఞానము, సాహిత్యజ్ఞానము, రాజకీయజ్ఞానము, మున్నగునవి.

 కాని ఏ జ్ఞానమువలన అనేకత్వములో ఏకత్వమును, మృత్యువులో అమృతత్వమును, విభాగములో అవిభాగమును గాంచగలనో అదియే అన్ని జ్ఞానములలోను శ్రేష్టమైనదని, అదియే సాత్త్వికజ్ఞానమని భగవానుడు తెలిపెను.  అదియే అధ్యాత్యవిద్య. కాబట్టి విజ్ఞులు ఈ భగవద్వాక్యమునందు విశ్వాసముకలవారై ఉత్తమోత్తమజ్ఞానమునే బడసి ధన్యులయ్యెదరుగాక!

   దీనినిబట్టి ప్రపంచములో ఎందరో మేధాసంపన్నులు, కళాకుశలురు ఉన్నప్పటికిని ఇట్టి సర్వభూతాత్మభావము, సర్వాత్మ జ్ఞానము, అవిభక్తదైవభావము లేనిచో వారందఱున్ను భగవద్దృష్టిలో వాస్తవజ్ఞానరహితులే యగుదురు. కావున లౌకికములగు ఇతర విద్యలు, జ్ఞానములు ఎన్నియున్నప్పటికిని ప్రతివారును భగవత్ప్రోక్తమగు ఈ సాత్త్వికజ్ఞానమును అవలంబించి సర్వాత్మదృష్టిగలవారై జీవితమును తరింపజేసికొనవలెను. అట్లుకాక, లోకములో భిన్నత్వమును కాంచుచో, అందులకు ఫలితము సంసారబంధమే, మృత్యువే, జననమరణ దుఃఖమే.

 ఉపనిషత్తులు ఈ అర్థమునే ఈ ప్రకారముగ తెలుపుచున్నవి -

"మృత్యోస్సమృత్యు మాప్నోతి 

య ఇహ నానేవ పశ్యతి'. కావున ప్రపంచములో ఏ ప్రాణిని చూచినప్పటికిని ఆతని దేహముపైగాని, గుణముపైగాని దృష్టినుంచక లోనగల ఆత్మపైననే దృష్టి నుంచవలెను.

1-దేహదృష్టిమాత్రము గలిగియుండువారు అధములు.

2-మనోదృష్టి గలిగియుండువారు, అనగా ఒక ప్రాణిని జూచినపుడు అతని గుణములను మాత్రము పరికించువారు మధ్యములు.

3-ఆత్మదృష్టి, దైవదృష్టిగలవారు ఉత్తములు. 

ఈ భావమే ఈ శ్లోకమున వ్యక్తీకరింపబడినది. కావున అట్టి ఆత్మదృష్టికై సాత్త్వికజ్ఞానమునకె సర్వులును యత్నించవలెను.

ప్ర:- సాత్త్విక జ్ఞానము యొక్క లక్షణమేమి?

ఉ: - ఏ జ్ఞానముచే మనుజుడు వేఱు వేఱుగనున్న సమస్త ప్రాణులందును, ఏకమై, నాశరహితమై, అవిభక్తమైనట్టి ఆత్మవస్తువును వీక్షింపగలుగునో అదియే సాత్త్విక జ్ఞానము.

ప్ర:- భగవంతు డెచటగలరు?

ఉ:- సమస్త చరాచర ప్రాణికోట్లయందును గలరు.

ప్ర:- ఆత్మయొక్క స్వరూపమేది?

ఉ:- అది

 (1) ఏకమైనది

(2) నాశరహితమైనది (3) అవిభక్తమైనది.

ప్ర:- ఈ ప్రపంచమున అనేకత్వము సత్యమా?

ఉ:- కాదు. ఏకత్వమే సత్యమైనది (పూసలలో దారమువలె, తరంగములలో జలమువలె).

🕉️🌞🌏🌙🌟🚩

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ