* ఈ లోకం ఎప్పుడూ పుణ్యపాపాల, సుఖ దుఃఖాల మిశ్రమం. ఈ చక్రం పైకి, కిందికి తిరుగుతుంటుంది. జననమరణాలు అనేవి అనివార్యమైన విధి నిర్ణయాలు.
*ఇంద్రియ సుఖాలకు బానిసగా ఉన్నంతకాలం మానవుడు, ప్రపంచానికి దాస్యం చేయాలి. ఇంద్రియాలను జయించిన మరుక్షణం ప్రపంచమే అతడికి లోబడుతుంది.
***
మనుషుల్లా జీవిద్దాం..
మూసిన కన్ను తెరవక పోయినా... తెరిచిన కన్ను మూయక పోయినా శ్వాస తీసుకుని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకంలో, ఈ జన్మకు అదే చివరి చూపు...
మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచిపోయేలా చేస్తుంది కాలం.
విరోధులు స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం.
అపురూపంగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు, మన్నులో కలిసిపోక తప్పదు.
ఈ క్షణం మాత్రమే నీది. మరుక్షణం ఏవరిదో ? ఏమవుతుందో ఎవరికి తెలుసు ?
ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా, నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు.
ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా, బలవంతులైనా అవయవక్షీణం, ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు.
ఈ సృష్టిలో మనము మొదలు కాదు. చివర కాదు.
ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకువెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు.
చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం మనకి లేదు. ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం.
మనం కేవలం ప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ మాయ.
అశాశ్వతమైనవి శాశ్వతమనే మాయను భక్తితో చేధిద్దాం.
అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం భక్తిమార్గం.
అందుకే మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన మన ఇతిహాసాలను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం.
దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు.
భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం.
నలుగురికి సాయం చేయాలి, నిత్యం భగవంతుడిని ఆశ్రయించి ధర్మాచరణ, కర్మాచరణ చేయాలి.
()()(
శ్రీరమణీయం - (746)
" ధర్మజీవనం యొక్క విశిష్టత ? సాధకుని బాధ్యతల గురించి తెలుసుకోవాలని ఉంది !?"
మన మోక్షసాధనా మార్గాలైన భక్తి, యోగ, జ్ఞానాలన్నింటిలోనూ పెద్దలు ఇమిడ్చింది ధర్మాన్నే. అందుకే ఏ సాధనామార్గంలో లేని సామాన్యులకు నేరుగా ధర్మాన్నే బోధించారు. ధర్మంలో జీవించకుండా అహంకారాన్ని విడనాడిన కానీ, అహంకారం పోకుండా హాయిగా ఉన్న వారు గాని లేరు. మనిషిలో ధర్మాన్ని పెంచి అహంకారాన్ని నాశనం చేసేందుకు ఉపకరణాలుగా మారాల్సిన సాధనామార్గాలు అహంకారాన్ని పెంచేవి కాకూడదు. మనిషిని బాధించే అశాంతిని దూరం చేసుకోవడం కోసం పెద్దలు అహంకారాన్ని తగ్గించుకోమని చెప్పారు. అహంకారాన్ని తగ్గించుకోటానికి ధర్మాన్ని ఆచరించమని బోధించారు. ధర్మాన్ని ఆచరించే బలంకోసం దైవాన్ని ఆశ్రయించమని సూచించారు. అందుకే దైవనామస్మరణ కూడా ధర్మం కోసమే చేయాలన్నారు. దైవబలంతో ధర్మం చేయగలిగితే, ధర్మమే మనకు సుఖశాంతులను ఇస్తుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"దీపంతో అంధకారం - ధర్మంతో అహంకారం అదృశ్యం !''- (అధ్యాయం -91)
--(())--
"ఋభుగీత " (213)
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
ఆనందమే మన(సు) స్వస్వరూపం !!
మనందరిలో జన్మజన్మల సంస్కారం ఉంటుంది. మనసును సంస్కరించే సనాతన భారతీయతత్వం ఇమిడి ఉంటుంది. దాన్ని కాపాడుకుంటే చాలు, మనసుకున్న సహజమైన ఆనందం అనుభవంలోకి వస్తుంది. జీవితం అనంతం, జీవనం వ్యక్తిగతం. జీవితంగా తీసుకుంటే అది ఎవరిదీ కాదు. మనసు మెలకువతో స్పందిస్తుంది. కోరికలతో ప్రతిస్పందిస్తుంది. మనసుకే సహజంగా ఉన్నదాన్ని ఆనందం అంటారు. అన్ని గుణాలు మనసుకి ఉన్నాయి. కానీ ఆనందమే దాని స్వస్వరూపంగా ఉంది !
🕉🌞🌎🌙🌟🚩
104-మంద్రగీత🌷
అధ్యాయము-9
రాజవిద్య-రాజగుహ్యము
6. ఆకాశమునందు వాయువు ఎట్లున్నదో గమనింపుము. కదలునప్పుడు వాయువు, కదలనప్పుడు ఆకాశము. ఆకాశమే వాయువులోని అణువులుగా దిగివచ్చుచున్నది. అణువులు ఆకాశమందు ఉండుటచే అణువులందు ఆకాశము ఏక కాలమున ఉన్నది. అదే కాలమున లేదు. కనుకనే ఆకాశము ఉన్నది, లేదు అను ఊహలు కూడా సత్యము. ఆకాశము దిగి వచ్చుటయే వాయువు. కానీ దిగి వచ్చిన వాయువులో దిగి రాని ఆకాశమే మాతృకగా వర్తించుచున్నది. కనుకనే వాయువు పుట్టిన వెనుక కూడా మొదటి ఆకాశముననే ఉండక తప్పినది కాదు. అట్లే నాయందు జీవులును.
7. వాయు వున్నప్పుడు అందు ఆకాశముండును. వాయువు లేనప్పుడు ఆకాశమే ఉండును. అట్లే జీవుల కల్పన ఉన్నప్పుడు వారి యందు నేను భావింపబడుదును. వారి కల్పన అంతమైనపుడు నేనే ఉందును. ఇట్లే నాది అను భావము నాయందు వర్తించుటయు, అది నా యందు లీనమై నేనే వర్తించుటయు కలవు. నాది అను భావము ప్రకృతి. అనగా నా ప్రకృతి, నా భావము, నా స్వభావము. దాని యందు నేనుందును. దానికి పైన కూడా నేనుందును. స్వభావమనగా 'తన' పుట్టుక. దీని నుండి సృష్టి పుట్టుచున్నది. జీవులు ప్రళయమున నేనగుచున్నవి. కల్పాదిలో నా ప్రకృతి వలన వానిని సృష్టించుచున్నాను.
8. ఇట్లు సృష్టించుట 'నా' ప్రకృతి. దానిని అనుసరించి మరల మరల ఈ సృష్టిని కల్పనగా కల్పించుచున్నాను. జీవులు సృష్టింపబడునప్పుడును, మరల లీనమగునప్పుడును నా వశమే గాని తన వశము గాక వర్తించుచున్నారు. జీవించి భావించినపుడు తమ వశమేమియు లేదు. వారు నాలో భావించుచున్నారు. గనుక నా యందే వారి భావన పుట్టుచున్నది.
--(())-
||శ్రీమన్నారాయణీయము|| సప్తమ స్కంధము / 24వ దశకము - ప్రహ్లాదచరిత్ర వర్ణనము / 24-3-శ్లోకం
నిహంతుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చ రిపోః
బహిర్దృష్టేరంతర్దధిథ హృదయే సూక్ష్మ వపుషా।
నదన్నుచ్చైస్తత్రాప్యఖిలభువనాంతే చ మృగయన్।
భియా యాతం మత్వా స ఖిలు జితకాశీ నివవృతే।।
భావము:-
పిదప - హిరణ్యకశిపుడు భగవాన్! నిన్ను వధించవలెనని వైకుంఠమునకు వచ్చెను. బాహ్యదృష్టితో వెదకుచున్న ఆ రాక్షసునికి నీవు కనపడలేదు. సూక్ష్మరూపముతో తన (హిరణ్యకశిపుని) హృదయమునందే అంతర్హితుడవై యుండిన నిన్ను - అంతర్దృష్టిలేని, ఆ అసురుడు చూడలేకపోయెను. గట్టిగా అరచుచూ, సకలలోకములందును నిన్ను వెదకసాగెను. అయిననూ కానలేకపోయెను. తనకు భయపడి నీవు ఎచ్చటికో (పారి) పోయి ఉందువని భావించి వెనకకు మరలెను.
--(())--
🌹. గీతోపనిషత్తు -103 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 31. నిజమైన జ్ఞానము - అర్జునా! సద్గురువు శుశ్రూష ద్వారా వారి అనుగ్రహము నుండి నీవు పొందిన జ్ఞానము నిన్ను మోహము నుండి తరింప జేయును. జ్ఞానులను సైతము అపుడపుడు దైవమాయ మోహమున పడవేయును. అది దైవలీలయే! జ్ఞానుల విషయమున అది తాత్కాలికమే యగును. మోహము దాటిన వారే నిజమగు జ్ఞానులు. “నా యందు గల వెల్గు నా పరిసరముల వారి రూపమున కన్పట్టు గాక" అను వాక్యము నిజమగు జ్ఞానమార్గము. తన యందు, అందరి యందుగల ఒకే సత్యమును నిత్యము దర్శించువాడే జ్ఞాని. 🍀
యజ్జా త్వా న పునర్మోహ మేవం యాస్యసి పాండవ |
యేన భూతా న్యశేషేణ ద్రక్ష్య స్యాత్మ న్యథోమయి || 35
అర్జునా! సద్గురువు శుశ్రూష ద్వారా వారి అనుగ్రహము నుండి నీవు పొందిన జ్ఞానము నిన్ను మోహము నుండి తరింప జేయును. నీకు, నీయందును నా యందును, సమస్త ప్రాణుల యందును గల ఒకే ఒక తత్వము దర్శనము కాగలదు. నిజమగు జ్ఞాన ప్రయోజన మేమో ఈ శ్లోకము తెలుపు చున్నది. భగవానుని దృష్టిలో ఈ రెండు అర్హతలు కలవారే జ్ఞానులు.
జ్ఞానమను అగ్నిచేత సర్వమును హరింపబడినవారు మరల మోహమున పడరు. ఒకవేళ అట్లు పడినను, అది తాత్కాలికము. కండ్లున్నవారు సామాన్యముగ నడచినపుడు గోతిలో పడరు. ప్రమాదవశమున ఒకమారు పడినను, మాటి మాటికి పడుట యుండదు.
జ్ఞానులను సైతము అపుడపుడు దైవమాయ మోహమున పడవేయును. అది దైవలీలయే! జ్ఞానుల విషయమున అది తాత్కాలికమే యగును. నిజమగు జ్ఞానులు మరల మరల మోహమున పడుట యుండదు. మోహము దాటిన వారే నిజమగు జ్ఞానులు. దైవము, జ్ఞానులను గూర్చి మరియొక అర్హత తెలిపినాడు.
నిజమగు జ్ఞానికి తనయందు, తన పరిసరములయందు తత్త్వమే (దైవమే) గోచరించుచు నుండును. మరియొకటి యుండదు. “నా యందు గల వెల్గు నా పరిసరముల వారి రూపమున కన్పట్టు గాక" అను వాక్యము నిజమగు జ్ఞానమార్గము. తన యందు, అందరి యందుగల ఒకే సత్యమును నిత్యము దర్శించువాడే జ్ఞాని. జ్ఞాని సహచర్యమున సాధకు డీ రెంటిని గమనింపవచ్చును.
అతడు వ్యామోహమున్నట్లు కనిపించు చున్నను, నిజమునకు అంతరంగమున అది గోచరింపదు. అతడన్నిటియందు గల దైవము తోనే ముడిపడి యుండును. ఇతర ఆకర్షణములు కలుగవు. నిత్య జీవితమున జ్ఞాని యిట్లు ప్రవర్తించు చుండగ, దానిని చూచుటయే మహదానందకరము. చూచువారికి వలసిన స్ఫూర్తి, ఆచరణీ యాత్మకమగు బలము కూడ జ్ఞాని నుండి లభింపగలదు.
ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణుడు జ్ఞానియనగ నెట్లుండునో, ఎట్టివారిని జిజ్ఞాసువు లాశ్రయింపవలెనో సున్నితముగ తెలిపినాడు.
సశేషం...
🌻. సతీ యాత్ర - 2 🌻
సతీదేవి ఇట్లనెను -
నా తండ్రి గొప్ప యజ్ఞమును చేయుచున్నాడని నేను వింటిని. అచట గొప్ప ఉత్సవము జరుగుచున్నది. దేవతలు, ఋషులు వచ్చియున్నారు (19). ఓ దేవదేవేశ! ప్రభూ! నా తండ్రిచేయు మహాయజ్ఞమునకు వెళ్లుట నీకు అభీష్టము ఏల కాలేదు? ఆ విషయమునంతనూ చెప్పుము (20).
మహాదేవా! మంచి హృదయముగల వారితో కలిసిమెలిసి ఉండి వారికి ప్రీతిని వర్థిల్లజేయుట మంచి హృదయము గల వారి ధర్మము గదా! (21). ఓ ప్రభూ! స్వామీ! కావున నీవు అన్ని ఏర్పాట్లను చేసి, నా ప్రార్ధనను మన్నించి, నాతో గూడి నా తండ్రి యొక్క యజ్ఞశాలకు ప్రయాణమును ఈనాడే ఆరంభించుము (22).
బ్రహ్మ ఇట్లు పలికెను -
మహేశ్వర దేవుడు ఆ సతీదేవి యొక్క ఆ మాటలను విని, దక్షుని వాక్కులనే బా…
[18:51, 20/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 188 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. వసిష్ఠమహర్షి-అరుంధతి - 1 🌻
బోధనలు/గ్రంధాలు: వసిష్ఠస్మృతి, వసిష్ఠ ధర్మ సూత్రములు, వృద్ధవాసిష్ఠము, మితాక్షర, స్మృతిచంద్రిక, యోగవాసిష్ఠము, జ్ఞానవాసిష్ఠము, జ్యోతిర్వాసిష్ఠము
జ్ఞానం:
1. వసిస్ఠమహర్షి సత్వగుణంలో అగ్రగణ్యుడు. లోకంలో అందరికంటే అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని పొందినవాడాయన. బ్రహ్మదేవుడికి కూడా ఆగ్రహం ఉంది, రజోగుణం ఉంది. కాని ఈయనలో లేవు. అంటే వసిష్ఠుడు ఆ గుణంలో బ్రహ్మదేవుడికంటె అధికుడు. అంతటి మహాత్ముడు ఆయన.
2. ఈయనది ఒక జన్మ కాదు. శరీరం పోగొట్టుకుని, బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మళ్ళీ శరీరరం తెచ్చుకున్నవాడు. కాబట్టి ఆయన విషయంలో మొదటి జన్మ, రెండవ జన్మ అని చెప్పవలసి వస్తుంది. ఆయన వ్యక్తి రూపంలో అలాగేఉన్నారు. అదే చిత్తము, అదే వ్యక్తి. శరీరంపోతే, మరొకశరీరం తెచ…
చేతనత్వ బీజాలు - 252 / Seeds Of Consciousness - 252 🌹
*🌻 101. 'నేను' అనే సూత్రం అందరికీ సాధారణమే. దానికి ఏ ప్రత్యేక లక్షణాలు కూడా లేవు; అది లోకం మొత్తం పనితీరు యొక్క సూత్రం. 🌻 *
ఈ 'నేను' అనే జ్ఞానం నిజానికి మీరు జీవించడానికి ఉపయోగించే సూత్రం మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి; 'మీరు' అనేవారు లేకపోతే ఏదైనా ఉన్నదా? మీ 'ఉండటం' అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఈ 'నేను' అనే జ్ఞానం రాక ముందు మీకు ఏదైనా తెలుసా? లేదా గాఢ నిద్రలో 'నేను' గా ఉన్నపుడు మీకు ఏదైనా తెలుసా? ఈ శరీరంలో 'నేను' అనే సూత్రంగా పని చేస్తున్నది నీకు ప్రత్యేకమైనది కాదు . దీనికి ఎటువంటి గుణాలు లేవు. అందరికీ సాధారణంగా వున్నదే.
🌹 🌹 🌹 🌹 🌹
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 6 🌻
524. భగవంతుని అనంత దివ్య సుషుప్తిలోనుండి బహిర్గతమైన అజ్ఞాత చైతన్యము (చైతన్య రహితస్థితి) క్రమక్రముగా పరిణామము ద్వారా తొలి మానవరూపము చేరుసరికి పూర్ణచైతన్యమైనది.
525. అసంఖ్యాక జన్మలనంతరము యీపూర్ణ చైతన్యమే ఆధ్యాత్మిక మార్గములో పూర్తిగా అంతర్ముఖమై "నేను భగవంతుడను" అనెడు దివ్య జాగృతిని ఎఱుకతో అనుభవించును.
526. భగవంతుడు తనను స్వయముగా కనుగొనుటకు తన ద్వైతమును మానవునిలో కోల్పోయెను. అట్లే మానవుడు తన మానవత్వమును భగవంతునిలో కోల్పోయిన క్షణమే - తాను శాశ్వతుడనియు, అనంతుడనియు, తన స్వీయ సత్యనుభావమును పొందెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[ఓ సింహాల్లారా రండి! 'మేము గొర్రెలం' అని మీరు అనుకొనేలా చేసే ఆ మాయను విసిరిపారేయండి. మీరు అనంతమైన ఆత్మస్వరూపులు, స్వేచ్ఛాజీవులు, ధన్యులు, శాశ్వతులు. మీరు వస్తువులు కాదు, శరీరాలు కాదు. వస్తు సంపదలు మీ బానిసలు. మీరు వస్తుసంపదకు బానిసలు కారు.
🕉🌞🌎🌙🌟🚩
I
మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే.
🕉🌞🌎🌙🌟🚩
[13:26, 19/12/2020] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
పరిపూర్ణమైన ఆదర్శమూర్తులై భూమిపై నడచిన వారు ఇద్దరే. రాముడు, కృష్ణుడు. ఎవరయినా వారిని అనుసరించ వలసినదే. వారి జీవితములు యజ్ఞార్ధము. వారిద్దరూ యజ్ఞస్వరూపులు. వారు తమకు కావలసిన దాని గురించి జీవించలేదు. సృష్టి మొత్తము యజ్ఞస్వరూపము, పరహితమే.
చిన్నతనము నుంచి నీ జీవితము నీ కొరకు గాదు, యజ్ఞార్ధము అని తెలుసుకోవాలి. పదిమందికి మేలు చేయడం కోసము భగవంతుడు మనలను పుట్టించాడు, పదిమంది కోసం నేను జీవిస్తాను అనే భావన ప్రతి ఒక్కరికీ ఉండాలి. జీవితములో మనకి ఎంత తొందరగా ఆ రుచి తెలిస్తే జీవితమంత ఫలవంతమవుతుంది. పదిమంది కోసము జీవించిన వారి చరిత్రలు ఆచంద్రతారార్కము స్మరింపబడతాయి.
🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భావన
ఉన్నత ఆదర్శాల ఆచరణలో ఒక్కోసారి మనం పట్టుని కోల్పోతూ ఉంటాం.
అనంతుడు, నాశరహితుడైన పరమాత్మలో మనమూ భాగస్థులమే. ఇది గుర్తించగలిగితే అల్పమైన ఆలోచనలు అణగిపోగలవు. ఆయనను పొందే ప్రయత్నం కొనసాగుతుంది.
నూతన విశ్వాసం, ప్రేమ, నమ్మకం క్రమక్రమంగా ఏర్పడతాయి.
భగవంతుడు పరిపూర్ణుడు. మనం ఆయనలో భాగమై నిలిచి ఉన్నవారం. ఆయన విశ్వాత్మకుడు, అనంతుడు అయితే కావచ్చు గాక, కానీ మనం ఆయనకు చెందినవారమే కదా, కనుక అధైర్యపడరాదు.
ఒక్కోసారి స్వార్థపు కోరలకు చిక్కుకుని ఆయన నుండి దూరంగా జరిగినా, ఆ సంపూర్ణుని నుండి విడివడి ఉండలేం.
శుభంభూయాత్
🕉🌞🌎🌙🌟🚩
"ఋభుగీత " (212)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
మనసే సత్య జ్యోతి !!
జ్యోతి అంటే వెలుగు, వెలుగు అంటే తెలుసుకునేలా చేసేది. మనసే మనకీ ప్రపంచాన్ని తెలుసుకునేలా చేస్తుంది. కనుక మనసే జ్యోతి. అది సదా సత్య జ్యోతిగానే ఉంటుంది. మనసుకు మనం అలవర్చిన గుణాలు తీసేస్తే అది ఎల్లప్పుడూ సహజమైన స్పందనలతో సత్యజ్యోతిగా వెలుగునిస్తుంది. సంసారంలో మనం కొన్నింటిని స్వీకరిస్తాం, కొన్నింటిని ఆహ్వానిస్తాం, మరికొన్నింటిని తిరస్కరిస్తాం. కానీ నిజానికి సంసారం అంటేనే అన్నింటి కలబోత. స్వీకరించడం, ఆహ్వానించటం, తిరస్కరించడం మాని గమనిస్తూ వెళ్తే తాత్కాలికంగా కష్టసుఖాలు అనిపించినా, సంసారంలో ప్రతిదీ ఆనందంగా గడిచిపోతుంది !
🕉🌞🌎🌙🌟🚩
[13:38, 19/12/2020] +91 92915 82862: 🌷103-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
అధ్యాయము-9
రాజవిద్య-రాజగుహ్యము
5. ఇంకొక సంబంధము కూడా ఉన్నది. నాయందు ఆ జీవులు లేవు. ఆ జీవుల స్థితులు నాయందు అంటవు. మట్టియందు కుండ ఆకారంగా ఉన్నది. మట్టికి ఈ ఆకారము లేదు. కుండ అనునది ఆకారము మాత్రమే. కనుక దానికి మట్టియందు అస్తిత్వం లేదు. కుండ యందు మట్టి ఉన్నది. కానీ కుండకు వేరుగా అస్తిత్వము లేదు. కనుక దాని యందు ఏమియు లేదు. ఇదే జీవులకు నాకు గల సంబంధం. ఈ సంబంధమే వారికి నా యందు గల యోగము. దీని అనుభూతియే యోగ విద్య. దానికి వలసిన అభ్యాసమే యోగాభ్యాసము. సృష్టి నా ఐశ్వర్యం. అనగా ఈశ్వర భావము. అనగా నేను దానికి అధిపతిగా ఉండుట, ప్రభువుగా ఉండుట. ఇట్టి సంబంధము రాజునకును, రాజ్యమునకు నడుమ తెలియబడుచున్నది. కనుక ఇది రాజవిద్య అనబడును. ఈ సంబంధం ఉన్నను వ్యక్తము కాదు. కనుక కేవలం అనుభుతి విషయమే కనుక, చేష్టాదికములలో చిక్కదు కనుక ఇది గుహ్యము. జీవులను నేను భరించి, ధరించుచున్నాను. ఐననూ వానియందు లేను. నా యందే అవి ఉన్నవి. అవి నా శరీరము. నేను వానిచే భావింపబడుదును. శరీరమున మనస్సు ఉద్భవించి తోచుచున్నట్లు నేను వారి భావనలో ఉద్భవింతును. తన యందు నేను ఉన్నట్లు ప్రతి జీవికి భావన కలదు. నాయందు జీవులును, వారి భావనలును గలవు. కనుక నాయందే ఈ భావనలున్నవి. నేను వానిని భావింపను. నాకు భావనలు కలుగును. జీవులు భావనలను భావింతురు.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
ఇదమంశం స్వతః పశ్యన్ రూప్యమిత్యభిమన్యతే ౹ తథా స్వం చ స్వతః పశ్యన్నహమిత్యాభిమన్యతే ౹౹37౹౹
37. "ఇది" అనునంశమును చూచుచు దానిని రజితమని భ్రమించును అట్లే తనను తాను ఉద్దేశించుచు "నేను"అని అభిమానపడును.
సత్యత్వము వాస్తవమునకు లేనట్టి రజితమునకు అన్వయింపబడినది.
అట్లే కూటస్థ చైతన్యపు వస్తుత్వము స్వయంత్వము అనునవి కల్పితములైన శరీరములకు, అనగా జీవునకు, అవిద్యచే అన్వయింపబడుచున్నవి.
మాలిన్యములను తొలగించినప్పుడు యథార్థమగు పదార్థము అభివ్యక్తమగు విధముగాను,రాత్రిచీకటిని తొలగించినప్పుడు చీకటిచే కప్పబడిన వస్తువులు స్పష్టముగా కనిపించువిధముగాను,
అవిద్యావరణ తొలగినప్పుడు "బ్రహ్మచైతన్య" అసంగత్వము, ఆనందము తెలియబడును.
శుద్ధచైతన్యమే విక్షేపశక్తి వలన
'నేను'అను మలిన భావనను పెట్టుకొని నిజముగా అసత్యమైనను
(నేను అను)అహంకారము,అది యథార్థముగా ఉన్నట్లు నమ్మి భ్రాంతిజెందును.తనను తాను ఉద్ధేశించుచు "నేను"అని అభిమానపడును.
నేను అనుకొనునపుడు మనస్సున ఉండునవి శరీల లక్షణములే,
ఇంత అందగాడును,బలశాలిని, సంపన్నుడను,అధికారిని మొదలగునవి.
"ఇది రజతము"అనే భావములో "ఇది" అని చూడబడినది ముత్యపు చిప్ప. కాని దానిపై ఆరోపింపబడినవి రజతలక్షణములు.అట్లే "నేను"అనుటచే ఉద్దేశింపబడినది కూటస్థ చైతన్యమే.కాని దానిపై ఆరోపింపబడిన శరీర లక్షణములచే అహంత కలుగుచున్నది.
"అహం" యొక్క స్వీయతత్త్వము తెలిసినప్పుడు,అది అటుపైన అహంకారముగా అగుపించదు, అపరిచ్ఛిన్నతత్త్వముగానే అగుపించును.
వాస్తవముగా"నేను"గా వేరయిన "వ్యక్తి-తత్త్వము" లేదు.
ఈ సత్యము నిర్మల మనస్సుతో వ్యక్తికి అభివ్యక్యమయినప్పుడు అతని అజ్ఞానము తత్ క్షణమే తొలగును.
ఇట్లు"నేను"ఒక ప్రత్యేకవ్యక్తిగా అసత్యమని తెలిసినప్పుడు మానవుడు దానికి సంబంధించిన అన్యభావనలు ఎట్లు నమ్మగలడు?
ఆ విధముగా"నేను" ఉన్నంతకాలము వ్యక్తి జీవితములో దుఃఖమే ఉండును. మరియు "ఆత్మజ్ఞానము"ద్వారా తప్ప ఈ "నేను"అను భావనను వదిలించుకొనుట సాధ్యము కాదు.
వ్యక్తి ఈ "అహంతా" పిశాచావిష్టుడయినప్పుడు శాస్త్రములు,మంత్రములు ఏవియు అతనిని ఆ పిశాచమునుండి విడిపించుకొనుటకు సమర్థుని గావింపవు.
ఆత్మ అపరిచ్ఛిన్న చైతన్యమునందు కేవల ప్రతిబింబమను సత్యమును నిరంతరము గుర్తించూకొనుటవలన మాత్రమే
"అహంతా"వృద్ధి నశించును.
🕉🌞🌏🌙🌟🚩
శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన
సురుటి రాగః - ఆదితాళమ్.
23. జయ - తుజ్ఞతరఙ్గే. జయ తుఙ్గతరఙ్గే- గఙ్గే - జయ తుఙ్గతరఙ్గే||
1. కమల భవాణ్డ కరణ్డ పవిత్రే
బహువిధ బన్ధ చ్ఛేద లవిత్రే || జయ||
2. దూరీకృత జన పాప సమూహే
పూరిత కచ్ఛప గుచ్ఛ గ్రాహే|| జయ||
3. పరమహంస గురు భణిత చరిత్రే
బ్రహ్మవిష్ణుశఙ్కర నుతిపాత్రే|| జయ||
***
తాత్పర్యము:-
1. మహాతరంగ పరిశోభితాగంగా! జయ! వివిధములైన సంసారబంధములను ఛేదించు పవిత్రమవైన (కొడవలి) గంగా! తుంగతరంగా! జయ!
2. లోకుల పాతకముల నెల్ల దూరమునకు తరిమివేయు గంగా! తాబేళ్లతో - వివిధ జలచరములతో నిండియున్న తుంగతరంగా! జయ!
3. పరమహంసలైన గురువులచే (సదాశివబ్రహ్మేంద్రుల గురువులు) కీర్తింపబడిన చరిత్రకల గంగా! బ్రహ్మ, విష్ణు - మహేశుల సన్నుతికి పాత్రమవైన ఓభాగీరధీ! జయ!
(ఉరకలు పెట్టివచ్చుచున్న బ్రహ్మజ్ఞాన ప్రవాహమే గంగ!) (ప్రతికీర్తనలోను హంస - పరమహంస శబ్దములచే కీర్తింప బడినవారు శ్రీపరమశివేంద్రసరస్వతీ మహాస్వామి - సదాశివబ్రహ్మేంద్రుల గురువులు)
***
[14:30, 19/12/2020] +91 92915 82862: ||శ్రీమన్నారాయణీయము|| సప్తమ స్కంధము / 24వ దశకము - ప్రహ్లాదచరిత్ర వర్ణనము / 24-2-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
విధాతారం ఘోరం స ఖిలు తపసిత్వా న చిరతః
పురస్సాక్షాత్కుర్వన్ సురనరమృగాద్యైరనిథనమ్।
వరంలబ్ద్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం
పరిక్షుందన్నింద్రాదహరత దివం త్వామగణయన్।
భావము:-
హిరణ్యకశిపుడు (నిన్ను సంహరించవలెనను కోరికతో నీ బొడ్డుతమ్మిన పుట్టిన) బ్రహ్మదేవునికై ఘోర తపస్సుచేసెను. బ్రహ్మదేవుడు శీఘ్రమే సాక్షత్కరించి వరము కోరుకొనుమనగా - దేవతలు, నరులు, మృగములు మొదలగు ప్రాణులచే తనకు మరణము సంభవించకుండునట్లు వరమును కోరెను.
ఆ వరగర్వముతో, భగవాన్! నిన్ను ఎంతమాత్రము లక్ష్యపెట్టక, నిన్నే రక్షకుడుగా తలచు - జగత్తునంతను భాధించసాగెను; దేవేంద్రుని నుండి స్వర్గలోకమును హస్తగతము చేసుకొనెను.
వ్యాఖ్య:-
తన సోదరుడైన హిరణ్యాక్షుని ప్రాణాలు తీసిన హరిపట్ల పగతో ప్రతీకారంతో ద్వేషంతో రగిలి పోతుంటారు హిరణ్యకశిపుడు. ఆదుగ్ధతోనే ఘోరమైన తపస్సు చేస్తాడు. నూరేళ్ళు నిద్రా హారాలు మాని ఎముకల గూడుగా మారిపోయాడు. ముల్లోకాలు గడగడలాడిపోయాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు.
“దేవతలచేతగాని, రాక్షసులచేతగాని, నరులచేతగాని, జీవమున్న వాళ్ళచేతగాని, జీవములేని వాళ్ళచేతగాని, రాత్రిగాని, పగలుగాని, నేలపైనగాని, నీట్లోగాని, గాలిలోగాని, భూమిలోగాని, అగ్నిలోగాని, ఆకాశంలోగాని, దశదిశలలోగాని, ఇంట్లోగాని బయటగాని, జంతువుల చేతగాని, ఆయుధాల చేతగాని, సర్పాల చేతగాని, సరీసృపాల చేతగాని నాకు మరణం లేకుండా వరమివ్వు అని కోరి వరం పొందుతాడు.
అలా వరం పొందిన హిరణ్యకశిపుడు ముల్లోకాలను ముచ్చెమటలు పొయించాడు.
***
[14:36, 19/12/2020] +91 92915 82862: 18-26-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
అ-మూడు విధములగు కర్తలను గురించి చెప్పుచు మొదట సాత్త్వికకర్తయొక్క స్వభావమును తెలియజేయుచున్నారు-
ముక్తసంగో౽నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే.
తా:- సంగమును (ఆసక్తిని, ఫలాపేక్షను) విడచినవాడును, "నేను కర్తను' అను అభిమానము, అహంభావము లేనివాడును, ధైర్యముతోను, ఉత్సాహముతోను గూడియున్నవాడును, కార్యము సిద్ధించినను, సిద్ధింపకున్నను వికారమును జెందనివాడునునగు కర్త సాత్త్వికకర్తయని చెప్పబడుచున్నాడు.
వ్యాఖ్య:- నిత్యజీవితములో మనుజుడు నిరంతరము ఏదియోయొక కర్మను చేయవలసియే యుండుటవలన కర్తకుండవలసిన ఈ లక్షణములను తెలిసికొనినచో చక్కగ వ్యవహరించుటకు వీలగును.
ఇచట కర్తకు నాలుగు ఉత్తమ లక్షణములు పేర్కొనబడినవి - అందు మొదటిది సంగము లేకుండుట. అనగా కార్యముచేసినను ఫలాపేక్షను విడచిపెట్టి కార్యమునందు తగుల్కొనక అసంగుడై యుండవలెను. రెండవది, " అహం' భావము లేకుండుట. అనగా "నేను కర్తనను అభిమానము లేకుండవలెను.
ఇక మూడవది ధైర్యోత్సాహములతో గూడియుండుట. పిరికితనమునకును, నిరుత్సాహమునకును అధ్యాత్మక్షేత్రమున చోటే లేదు. అవి కలవాడు ఒక్క అడుగైనను పరమార్థరంగమున ముందునకు వేయలేడు. తాను కేవలము నిత్యశుద్ధబుద్ధముక్త ఆత్మస్వరూపుడే యని తలంచుకొనుచుండినచో అపరిమిత ధైర్యము, ఉత్సాహము మనుజునకు కలుగుచుండును. వాస్తవముగ తానట్టి నిర్మలాత్మయేకావున ఇక అధైర్యమును, నిరుత్సాహమును పారద్రోలి సాధనలందు ప్రయత్నశీలుడు కావలెను.
సాత్త్వికకర్తయొక్క నాల్గవలక్షణము కార్యముయొక్క సిద్ధి, అసిద్ధులందు నిర్వికారుడైయుండుట. కార్యమునందు అపజయమును పొందినచో, లేక కార్యము విఫలమైనచో జయము కొఱకై, సఫలత్వము కొఱకై తిరిగి యత్నించవలసినదేకాని ఏవిధమైన మనోవికారమును బొందగూడదు. ద్వంద్వములకును ఏమాత్రము జంకగూడదు. ఈ జగత్తంతయు మిథ్యాభూతమని యెంచియు, తాను సాక్షియగు సత్యఆత్మస్వరూపుడని భావించియు, ద్వంద్వములందు సమబుద్ధిగలిగి వర్తించవలెను.
ప్ర:- సాత్త్వికకర్తయొక్క లక్షణము లేవి?
ఉ:- (1) సంగమును (ఫలాపేక్షను) విడచుట, (2) "నేను కర్తన' ను అహంభావము లేకుండుట,
(3) ధైర్యోత్సాహములు గలిగియుండుట,
(4) కార్యము సఫలమైనను, విఫలమైనను, ఏవిధమైన వికారమును జెందకుండుట.
***
. గీతోపనిషత్తు -102 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 30. బంధమోచనము - బంధమోచన జ్ఞానము, బంధమోచనులైన ముక్తి జీవుల వద్ద దర్శింపవచ్చును. కేవలము విషయ పరిజ్ఞానము వలన ఎవ్వడును జ్ఞాని కాలేడు. నిజమగు జ్ఞాని సాన్నిధ్యము వలననే జ్ఞాని యగుటకు వీలగును. ఇచ్చట జ్ఞాని యనగ బంధములను పరిష్కరించుకొనుచు, చేయు కర్మలవలన మరల బంధములను సృష్టించుకొనక జీవించు విధానము. ఈ విధానమున జీవుడు బంధమోచనుడై, స్వతంత్రుడై దివ్యవైభవమున నుండును. అట్టివాడే జ్ఞాని. అతని నిత్యజీవన ఆచరణమే నిజమగు దర్శన జ్ఞానము. ఈ శ్లోకము సద్గురు శుశ్రూష బంధ మోచనము కోరువానికి ఉపకరణము కాగలదని తెలుపుచున్నది. 🍀
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శినః 34
తత్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసి, వ్యకిగతముగ వారికి సేవచేసి, వినయముగ వారిని సమయా సమయ వివేకముతో ప్రశ్నించియు, బంధమోచన జ్ఞానమును ఉపదేశపూర్వకముగ పొందుము. బంధమోచన జ్ఞానము, బంధమోచనులైన ముక్తి జీవుల వద్ద దర్శింపవచ్చును. జ్ఞాన మనగ బంధమోచన జ్ఞానమే అని తెలుపబడినది గదా! తెలిపినంత మాత్రమున తెలుసుకొనిన వాడు ఆచరింపలేడు.
ఫలాసక్తి లేక కార్యము నాశ్రయించి, కర్మను నిర్వర్తించవలెనని సర్వసామాన్యముగ అందరు వినియే యుందురు. అంతమాత్రముచేత ఆచరింప గలుగుచున్నారా? కర్మాచరణము దైవము తెలుపురీతిలో ఆచరించుట అంత సులభము కాదని అందరును అంగీకరింతురు. కోరిక ప్రధానముగ జీవించు మానవుడు, తన వ్యక్తిగత కోరిక కన్న కర్తవ్యమే ప్రధానమని భావించుటకు సంస్కారబలముగ చాల మార్పు రావలెను.
కేవలము విషయ పరిజ్ఞానము వలన ఎవ్వడును జ్ఞాని కాలేడు. నిజమగు జ్ఞాని సాన్నిధ్యము వలననే జ్ఞాని యగుటకు వీలగును. ఇచ్చట జ్ఞాని యనగ బంధములను పరిష్కరించుకొనుచు, చేయు కర్మలవలన మరల బంధములను సృష్టించుకొనక జీవించు విధానము. ఈ విధానమున జీవుడు బంధమోచనుడై, స్వతంత్రుడై దివ్యవైభవమున నుండును. అట్టివాడే జ్ఞాని. అతని నిత్యజీవన ఆచరణమే నిజమగు దర్శన జ్ఞానము. జ్ఞానుల జీవన విధానము ఆకర్షణీయమై యుండును. వారు కర్మలాచరించు తీరు, ఫలాసక్తి లేని సూటియైన కర్తవ్యాచరణము, వ్యామోహము లేని జీవనము గమనించినచో ఆచరించుటకు వలసిన స్ఫూర్తి, సంకల్పబలము కలుగును.
అట్లాచరించు బుద్ధిమంతుడు నిర్వర్తించవలసిన మరియొక కర్తవ్యము దైవమిచట బోధించు చున్నాడు. జీవన్ముక్తుడగు జ్ఞాని దరిచేరుట, అతని జీవన విధానమును అవగాహనము చేసుకొనుట, సున్నితముగ అతడు కర్మ నిర్వర్తించు విధానము తెలుసుకొనుట, స్ఫూర్తితో ఆ విధానము ననుసరించుటతో బాటు, అట్టి జ్ఞాన పురుషునికి సేవ చేయుట, సాష్టాంగ దండప్రణామము చేయుట, అనుగ్రహమున వారు తెలిపిన సుళువులను, సూత్రములను హృదయస్థము గావించుకొని, వాచాలత్వము లేక వినయముతో ఆచరించుట.
భగవద్గీత యందలి ఈ శ్లోకము సద్గురు శుశ్రూష బంధ మోచనము కోరువానికి ఉపకరణము కాగలదని తెలుపుచున్నది. స్వంతముగ తమకు తాము నిర్వర్తించుకొనుట కన్న తెలిసిన వారి సాన్నిధ్యమున నిర్వర్తించుకొనుట ఉత్తమము. తెలిసినవారి అనుగ్రహము పొందుట ఉత్తమోత్తమము.
అనుగ్రహ మనునది అయస్కాంతీకరణము వంటిది. అయస్కాంత సన్నిధిని యినుప ముక్క త్వరితగతిని అయస్కాంతము కాగలదు. ఒక మనిషికి సేవ చేయుట, అతనికి సాష్టాంగ దండ ప్రణామము చేయుట, అతనిని వినయముతో అడిగి తెలుసుకొనుట అహంకారులకు సాధ్యము కాదు. అహంకారమున్నంత కాలము బంధమోచనము కలుగదు.
సాధకుని యందు సత్త్వము పెరుగుటకు ఈ మూడు సూత్రములను దైవము సూచించినాడు. అదియే మన పాద నమస్కారము, సేవ, పరిప్రశ్నము. కృష్ణ భక్తుల విషయమున ఈ మూడును గమనింపదగును. దైవభక్తుల జీవితమున ఈ మూడును దినచర్యగ పాటింపబడును. అట్టివారే దైవానుగ్రహ పాత్రులు కాగలరు. సద్గురువు రూపమున దైవమే వారిని అనుగ్రహించు చుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 300 🌹
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
73. అధ్యాయము - 28
🌻. సతీ యాత్ర- 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
దక్షుని యజ్ఞమునకు దేవతలు, ఋషులు వెళ్లుచున్న సమయములోనే సతీదేవి గంధమాదన పర్వతమునందుండెను (1). దక్షపుత్రియగు సతి ఎత్తైన అరుగులతో కూడిన ఈత కొలను యందు సఖురాండ్రతో గూడి చిరకాలము క్రీడించెను (2). దక్షుని పుత్రియగు సతి ఆనందముతో క్రీడించుచూ, రోహిణీతో కలిసి దక్ష యజ్ఞమునకు వెళ్లుచున్న చంద్రుని చూచెను. ఆమె వెంటనే క్రీడలనుండి సెలవు తీసుకొని (3), తనకు ప్రాణ ప్రియురాలు, తనక్షేమమును చేయునది, విజయ అను పేరు గలది అగు తన సఖి కేశాలంకారమును చేసుకొనుచుండగా చూచెను. ఆ సతీదేవి ఆమెతో నిట్లనెను (4).
సతీదేవి ఇట్లు పలికెను -
ఓ విజయా! నీవు నాకు ప్రాణసమమైన ప్రీతిగల, సఖురాండ్రలో కెల్ల శ్రేష్ఠమైన సఖివి. ఈ చంద్రుడు రోహిణితో గూడి ఎచటకు వెళ్లుచున్నాడు? వెంటనే తెలుసుకొని రమ్ము (5).
బ్రహ్మ ఇట్లు పలికెను -
సతి అట్లు ఆజ్ఞాపించగా, విజయ వెంటనే చంద్రుని వద్దకు వెళ్లి ఎచటకు వెళ్లుచుంటివి? అని మర్యాదగా ప్రశ్నించెను (6). విజయ యొక్క ప్రశ్వను విని చంద్రుడు తాను దక్షుని యజ్ఞమనే ఉత్సవమునకు వెళ్లుచున్నానని చెప్పెను. మరియు ఆదరపూర్వకముగా వివరములనన్నిటినీ చెప్పెను (7).
ఆ మాటలను విని ఆశ్చర్యమును పొందిన విజయ వేగముగా సతీదేవి వద్దకు వెళ్లి, చంద్రుడు చెప్పిన ఆ వృత్తాంతమునంతనూ చెప్పెను (8). ఆ మాటను విని నీలవర్ణముగల ఆ సతీదేవి చాల ఆశ్చర్యమును పొందెను. అట్లు జరుగుటకు గల కారణమును గూర్చి ఆలోచించిననూ, ఆమెకు తెలియలేదు. ఆమె తన మనస్సులో ఇట్లు తలపోసెను (9).
నా తండ్రియగు దక్షుడు, తల్లియగు వీరిణి మమ్ములనిద్దరినీ ఏల ఆహ్వానించలేదో! ప్రియకుమార్తెనగు నన్ను మరచినా యేమి? (10). దీనికి గల కారణమును గూర్చి శంకరుని అడిగెదను. ఇట్లు తలపోసి ఆమె ఆ యజ్ఞమునకు వెళ్లుటకై నిశ్చయించుకొనెను (11). అపుడా దాక్షాయణీ దేవి తన ప్రియ సఖియగు విజయను అచటనే యుంచి వెంటనే శివుని వద్దకు వెళ్లెను (12). సభామద్యములో అనేక గణములతో, నంది మొదలగు మహా వీరులతో, శ్రేష్ఠులగు గణాధ్యక్షులతో చుట్టు వారబడియున్న ఆ శివుని చూచెను (13).
ఆ దాక్షాయణి తన భర్తయగు ప్రభువును అచట చూచి, ఆహ్వానము రాకుండుటకు గల కారణమునడుగుటకై శంకరుని సన్నిధికి వెంటనే వెళ్లెను (14). శివుడు తన ప్రియురాలగు ఆమెను తన అంకముపై కూర్చుండబెట్టుకొని ప్రేమతో, ఆదరముతో మాటలాడగా, ఆమె చాల సంతసించెను (15). అపుడు గొప్ప లీలలను ప్రకటించువాడు, సర్వేశ్వరుడు, సత్పురుషులకు సుఖములనిచ్చువాడునగు శంభుడు గణముల మధ్య విరాజిల్లువాడై ఆదరముతో వెంటనే సతీదేవితో నిట్లనెను (16).
శంభుడిట్లు పలికెను -
ఓ సుందరీ! ఈ సభా మధ్యములోనికి విస్మయముతో గూడిన దానవై నీవు వచ్చుటకు గల కారణమును ప్రీతితో నాకు వెంటనే చెప్పుము (17).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఆ మహేశ్వరుడు అపుడిట్లు పలుకగా, శివపత్నియగు సతి చేతులు జోడించి నమస్కరించి వెంటనే ఇట్లు పలికెను (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 187 🌹
🌻. విశ్వామిత్రమహర్షి - 7 🌻
39. చాలా సంపాదించాననుకుంటే అది ఉండగా మనంపొతాం. మన పుణ్యం బాగుండకపోతే, మనముండగానే అవి పోతాయి. రెండూ దుఃఖమే. తపోధనం సంపాదించాలి. ఆ తపోధనానికి హేతువైన ఎలాంటి శరీరం ఉండాలి, ఎలాంటి మనస్సు ఉండాలి అంటే – అందుకు శౌచమే విధించారు. మితాహారంవల్ల అది వస్తుంది.
40. ఎంత బలిష్ఠుడయినా, వాడికి ఏదో రోగం వస్తే ఒక మూల పడుంటాడు. వాడిని గౌరవిస్తారా? వాడి ఆత్మగౌరవం అంతా ఏమయింది? వాడి గర్వం అంతా ఏమయింది? నశించలేదా? అతడికి కేవలం పశువుకు చేసినట్లు చికిత్స చెయ్యరా వైద్యులు? కాబట్టి ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి ప్రతిపత్తి, గౌరవము, దర్పము-వీనియందు ఆధారపడి ఉండకూడదు. ఆత్మగౌరవంతో తనను తాను గౌరవించుకునే స్థితిలో ఎప్పుడూ ఉండాలి. శౌచం చేత, గుణంచేత, “నాలో దోషం లేదు” అని తనను తాను గౌరవించుకోవాలి.
41. ఆత్మగౌరవం అంటే, “ఏ లక్షణములు నాయందు ఉన్నాయో అవి గౌరవహేతువులు. నన్ను నేను అవమానపరచుకోవలసిన ఆవశ్యకత నాకు లేదు. నా గుణములవల్ల నా యందు నాకు గౌరవమే ఉంది” అనుకోవాలి. అయితే అది అహంకారం కాదు, దర్పంకాదు. అట్టి ఆత్మగౌరవానికి యోగ్యత సంపాదించాలి. అంతేకాని ఇంకొకళ్ళు ఇచ్చేది గౌరవంకాదు. తనయందు తనకుండే గౌరవమే గౌరవం. కలియుగంలో ఈ ధర్మాలు ఎక్కువగా చెప్పారు పురాణాలలో.
42. అట్టి అపూర్వధర్మనిర్ణాయకుడు విశ్వామిత్రుడు. దీక్షకు, పట్టుదలకు మరోపేరు ఆయన. పట్టుదలలేని వాడు దానికోసం ఒకసారి విశ్వామిత్రుణ్ణి తలచుకోవాలి. బాగా ఆలోచించి ఒక నిర్ణయంతీసుకున్నాక, ఇక ఎంత కష్టం వచ్చినా దాని అంతు కనుక్కోవలసిందే! ఆ పట్టుదలే ఆర్యుల లక్షణం. ఈ పట్టుదల రజోగుణంవల్లనే వస్తుంది. ఆ రజోగుణంలేనిదే తపస్సులుకూడా ఫలించవు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 126 🌹
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 5 🌻
520. "నేను ఎవడును?" అన్న భగవంతుని తొలిపలుకునకు ఇచ్చట విజ్ఞన్నభూమికలో "నేను భగవంతుడను"అని సమాధానము వచ్చినది.
521. ఆదిలో భగవంతుడు భగవంతునిగా నుండెను. ఇప్పుడు భగవంతుడు భగవంతుడయ్యెను.
522. భౌతిక , సూక్ష్మ, మానసిక ప్రపంచములలో యదార్థముగా, భగవంతుడు భగవంతునిగా లేకుండెను.
523. ఇచ్చట భగవంతుడు తన అనంత యదార్థ స్థితిఃని ఎఱుకతో అనుభవించుచున్నాడు, భగవంతుని దివ్య స్వప్నము ఇక్కడితో అంతమై పోయినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
. శ్రీ విష్ణు సహస్ర నామములు - 90 / Sri Vishnu Sahasra Namavali - 90 🌹
నామము - భావము
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
ధనిష్ట నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం
5 వ పాశురం
~~
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము
~~~~~
ఆశ్చర్యమగు చేష్టలు కలిగిన వాడు, నిత్యము భగవద్ సంబందము గల ఉత్తర దేసమందలి మధురా నగరికి నిర్వాకుడును, పవిత్రమైన జలముగల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును, గోపవంసమున ప్రకాశించిన మంగళ దీపము అయిన వాడును, యశోదా మాత చె తాడు తో బంధింపబడిన శ్రీ కృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాసియు . ఆగామి పాపరాసియు , అగ్నిలో పడిన దూది వలె భాస్మమైపోవును. కావున భగవానుని నామాలు పాడుడు.
మన పాపాలు తొలగుటకు ఎనిమిది పుష్పాలు అర్పించాలి అవి.
1 అహింస ,
2 ఇంద్రియ నిగ్రహము ,
౩ సర్వభూతదయ ,
4 క్షమా ,
5 జ్ఞానము ,
6 తపస్సు ,
7 సత్యము ,
8 ధ్యానము.
ఇవి విష్ణు ప్రీతి కరమైన పుష్పాలు . వీటి తో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అని భావము.
ॐ అవతారిక ॐ
కర్మసందోహము మోక్షప్రాప్తికి ప్రతిబంధకము కద! అనేక జన్మలను పొందుటకీ కర్మలే కారణాలు. కావున వీనిని నిర్మూలించక తప్పదు. అది ఎట్లన భగవద్ధ్యానము, భగవత్సేవ, భగవస్సంకీర్తనములే కర్మను పోగొట్టుకొనుటకు సులభతరమార్గములని గోదాదేవి సూచించుచున్నది.
(హిందోళ రాగము - ఆదితాళము)
ప. నామములను పాడుడు - తిరు
నామములను పాడుడు - ఓ! సఖులార!
అ.ప. నామము హరియించు నఘముల నెల్లను
ఏమరక పాడుడు తిరునామములను
1 చ. మధురానాథుని మాయాధీశుని
మధుజల యమునా తీర విహారిని
యదువంశోజ్జ్వల దీప్త దీపికను
హృది దామోదరు యశోగీతికల
2. చ. శుచిని హరిని సుమముల నర్చించుచు
కాచెడి విభునకు అంజలి ఘటించి
వాచాస్తుతించి మదిని ధ్యానించి
సంచిత కర్మలు జారిపోవగా
నామములను పాడుడు
ॐॐॐॐॐॐॐॐॐ
తిరుప్పావై ప్రవచనం - 05 వ రోజు
భగవంతుని ఐదో స్థానం - అర్చా స్వరూపం
ఆండాళ్ తిరువడిగలే శరణం
5వ పాశురము
ॐॐॐॐॐॐॐॐॐ
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్
భావం:-
~~~~
మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణాలు, చేష్టలు కలవాడు కృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించెను. భవత్సంభంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువే. యమునానది తీరమందున్న గొల్లకులమున జన్మించి, ఆ గొల్లకులమును ప్రకాశింపచేసినవాడు. తల్లి యశోద గర్భమును కాంతివంతమొనర్చిన దామోదరుడు. గొల్లకుల మాణిక్య దీపము. వ్రతకారణముగా కృష్ణునిచేరి మనము ఇతరములైన కోరికలు ఏమీ కోరక, పవిత్రమైన మనస్సుతో స్వామికి పూలను అర్పించి, నమస్కరించి, నోరార అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి, ధ్యానించిన -- సంచిత పాపములను .. ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనము చేయుటవలన పాపములన్నీ అగ్నిలోపడిన దూదివలె భస్మమైపోవును. కావున స్వామి యొక్క తిరునామములను కీర్తించుకుందాము.
తిరుప్పావై 5వ పాశురము తెలుగు అనువాద పద్యము
~~~~~
.సీసమాలిక
చెప్పరే చెప్పరే శ్రీరామ మహిమల
ఒప్పుల కుప్పలై తప్పకుండ
ఎప్పుడో చేసిన తప్పులు నశియింప
అగ్గిలో పడవేయ బుగ్గియగును
కళ్యాణ గుణుడైన కమల గర్భుని చేత
వ్రజ వంశముకెల్ల బందువితడు
మాతృ గర్భము కెల్ల మలినలుగా వచ్చి
ధ్యానించి సుమములు తపన పడుచు
పిల్లన గ్రోవితో యెల్లవేళల యందు
గోవుల పిలుచును కూర్మి చేత
తే.గీ.మాయవానిని ఉత్తర మధురపురికి
నందవంశపు రాజగు నళిననాభు
అర్చనలు చేసి పుష్పాల నందజేసి
సేవ చేసి వత్తమనుచు చెలులపిలిచె
శ్రద్ధ భక్తిని కల్గించు బుద్ధినిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
అవతారిక:-
~~~~
గోపికలందరూ ఆండాళ్ గోపిక పిలుపుననుసరించి ఒకచోట చేరిరి. వారిలో కొందరు వేదాంతము తెలిసినవారు. కొందరు ధర్మశాస్త్రమును తెలిసినవారు. వారిలో కొందరు ఈవిధంగా శంకించిరి. మనము కేవలము జ్ఞానము లేనివారముకదా ? తెలిసియు తెలియకయు ఎన్నో పాపములను చేసినవారముకదా, ఈ జన్మలోనేకాక అనాదికాలము నుండి ఆర్జించిన పాపములెన్నియో మనకున్నవికదా, మనకు కృష్ణభగవానుని సంశ్లేషము ఈ పాపములు తొలగినదే ఎట్లు లభించును?
చాలా అందమైనది- అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్-ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే అనందం. ఆనందింపచేయుతత్వము ఐతే రామ-రమయతి అని అంటారు. కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడూ అలాగే అనుకున్నాడు, కృష్ణుడి విశ్వరూపం చూసాకే అర్థం అయ్యింది ఆయనంటే ఏమిటో. అంతటావ్యాపించిన ఈ తత్వం మనకోసం మనం ఏర్పర్చిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఏదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు, అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించక పోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృదాయే. ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్నచోటే చాలు.
అందుకే "నివృత్తరాగస్య గృహం తపోవనం" నీ లోపల అహంకారం తగ్గితే బాహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో, ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్టుగా ఉండాలి, నీకు భయం కల్గించనట్లుగా ఉండాలి. ఇలా మనం తయారుచేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటేచాలు. ఆ విష్వాసం చాలు, పూజకు నిభందనలు ఏమి లేవు. అచంచలమైన విశ్వాసంతో నిశ్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయనా ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు. ఆధునిక అణువిజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంది- దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణాలను మనం శాస్త్రంల ద్వార గుర్తించగల్గుతున్నాం. అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది ఈరోజు పాటలో.
రెండో ఆధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు- "సమ్షయాత్మా వినష్యతి". ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరి అయిన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి, సంషయం అవసరం లేదు. దాన్నే అండాళ్ తల్లి అందమైన పాటలో గోపికల
కథగా అందించింది.
ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీ జనం అంతా చేరారు.మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నమని తెలియజేసింది. రెండో రోజు వ్రతానికి కావల్సిన నియమాలేమిటో తెలియ జేసింది.
మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోక క్షేమం గురించి వివరించింది. నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తె మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోర్పడుతారు అని తెలియజేసింది. ఇకవారంతా శ్రీకృష్ణుడికోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంషయం వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకా సంషయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది, ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది- అందుకు ఆమె, రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దశరతుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా! మరి మంచి పనులకు అడ్డులు కూడా అలాగే ఉంటాయికదా అని సంషయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంషయాన్ని తెలియజేసింది.
ఈ గోపిక కావ్యాలు చదివినట్లు ఉంది, ఒక కావ్యంలోని వర్ణణ గురించి చెపుతూ- ఒక తుమ్మెద ఒక పద్మం పై వాలిందట, మధువును పానం చేసేసరికి మత్తుతో నిద్ర పోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకుళించు కుపోయిందట, లేచి చూడగానే బయటకు వెల్లడానికి మార్గంలేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుంది ఒక నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురుచూసిందట. అంతలోనే ఒక మదపు టేనుగు స్నానం కోసం ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరికొట్టింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకుంటాం కాని నెరవేరుతాయా అని సంషయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది- ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరం పైనే రాసి ఉంటాయి అంటారు కదా! వాటిని మనం అనుభవించక తప్పదు కదా! మరి మనం ఎట్లాంటి కర్మలు చేసామో ఏమిటో మనం విజయం సాదిస్తామో లెదో అని సంషయాన్ని తెలియ జేసింది.
ఇలాంటి సంషయాలన్నిటికి సమాదానం ఇస్తుంది ఆండాళ్ తల్లి ఈరోజు పాటలో.
మనం చేసే కర్మలచే పుణ్య-పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్ని విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు- అందుకే ఆయననను సర్వజ్ఞుడు-సర్వవేత్త అంటారు.
ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కాని, మాటలలో కాని, చేతలలో కాని చెడు రానివ్వోద్దన్నారు. ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే. ఇప్పుడు వచ్చిన త్రేనుపుతో మనం నిన్న తిన్న తిండిని గుర్తించగలం కదా. ఇక మనం ఏమిచేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. భగవంతుడికి మనపై కల్గిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కల్గిన కోపమే పాపము అంటారు. వీటన్నిటినుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది. మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి, అవి సంచితములు-ఆగామి-ప్రారబ్దం అని అంటారు. ఇదివరకు మనం చేసుకున్నవాటిని సంచితములని, ఇప్పుడీ శరీరంగా అనుభవిస్తున్నవాటిని ప్రారబ్దం అని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తిలో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు. మనం కావాలని అనుకుంటే సంచితాలను-ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది.
భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటం చే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మన పై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు. ఇక ప్రారబ్దం కుడా నిర్వీర్యం కావాలంటే - మనం భగవంతునికి చెందిన వాడను- నేను చేసేది వాడి సేవ - వాడికోసం చేస్తునాను ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ తల్లి చెబుతుంది.
"మాయనై మన్ను వడమదురై మైందనై" - చిత్ర విచిత్ర మైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు శక్తి విశేషములు కల్గి ఉన్నవాడు. అలాంటి వాడు మధురానగరానికి దిగివచ్చాడు. "తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై" మరి పెరగటమేమో యమునానది ఆవల ఉన్న గోకులంలో. పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునానది దాటడం, ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ పదిహెనవ పాటలో చెబుతుంది. యమునానది సూర్యుని పుత్రిక, యముడి సోదరి.
మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది. మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డుననే తిరిగేవాడు. నీటికోసమై వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు. "ఆయర్ కులత్తినిల్ తోన్ఱుం అణి విళక్కై" గోకులమ్లో మరి వెలిగించనక్కరలేని మణిదీపం వెలుతురువలె పెరుగుతున్నాడు పరమాత్మ. "తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై" మరి ఎలా ఉంటాడు ఆయన అంటే, తల్లి రోటికి కట్టివేస్తే ఏమి చేతకాని వాడిలా పడి ఉంటాడు- అందుకే ఆయనను దామోదరుడు అంటారు. దామ- ఉదరుడు అయ్యాడు, మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో.
అక్కడ తల్లి ప్రేమతో లోంగబడి ఉన్నాడు, మన జ్ఞానంతో మన దగ్గర ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కల్గిన వ్యక్తికి భగవతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే ఒక మంచి మార్గం.
ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరులో జన్మించి అక్కడి వటపత్రశాయిని కోలిచింది, శ్రీరంగనాథున్ని చేరింది, సుందరబాహు స్వామికి మొక్కుబడి చేసింది, వేంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహరూపంలో ఉన్నవారినే కోలిచింది, భగవంతునికోసం ఎక్కడికని పరుగులు పెట్టలా! విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకూ ఆ విశ్వాసపూర్ణత కలగాలి. తాను ఆర్జించినది మనమూ పొందాలని తిరుప్పావైని మనకు అందించింది. "తూయోమాయ్ వందు " దీనికి మనం పరిశుద్దం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ది ఏర్పడుతుంది.
"నాం తూమలర్ తూవి త్తొళుదు" పరిశుద్దమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటాన్ని అంజలి అంటారు. అన్-జలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టు చేస్తుంది. "వాయినాల్ పాడి" నోరు ఉంది కనక ఆయన నామాన్ని పాడుదాం చాలు. "మనత్తినాల్ శిదిక్క" మనస్సు ఉంది కనక ఆయన గుణములని స్మరించుదాం.
"పోయ పిళైయుం " మనం గతంలోచేసిన సంచితములైన పాపాలన్నీ పోతాయి "పుగుదురువాన్ రిన్ఱనవుమ్" ఇక రాబోయే ఆగామి "తీయనిల్ తూశగుం " మనకు అంటకుండా ఉంటుంది "శేప్ప్" ఆయన నామాల్ని చెప్పు. ఈపాటలో ఆండాళ్ మాయానై, మన్నువడ మదురై, దామోదర అని ఇలా కొన్ని నామాల్ని తెలిపింది.
ఆగమములు చెప్పినదేమిటి?
పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||
ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. అదేం తెలుపుతుందో తెలుసుకుందాం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదని ప్రశ్న వస్తుంది. పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇత్యాదులు అన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మత్రం దానికి సమాధానం ఇస్తుంది.
"పూర్ణమిదమ్"- ఇదం అంటే చాలాదగ్గరగా ఉంటుంది, నీ లోపలోనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియట్లేదు కదా!. "పూర్ణ మద:"- అద: అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. లాభం లేదు గుర్తించటం కష్టం. మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం.
"పూర్ణాత్ పూర్ణముదచ్యతే"- ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది- అదీ పూర్ణమే. సృష్టి,స్తితి,లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది. అదీ పూర్ణ రూపమే, కానీ మనం చూడలేం కదా.
"పూర్ణస్య పూర్ణమాదాయ" ఆయా అవసరాలను బట్టి ఆపూర్ణం లోనుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది- అదీ పూర్ణమే. వీటినే అవతరాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా మనం ఇప్పుడు చూడలేం కదా, ఎలాగా? "పూర్ణమేవా వశిష్యతే"- ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గూణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి.
ఈ స్వరూపాలన్నన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం అంటారు.
🕉🌞🌎🌙🌟🚩 శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
759వ నామ మంత్రము 20.12.2020
ఓం విశ్వధారిణ్యై నమః
సకల జగత్తులకు కారణభూతురాలు, ఆధారమైనదై, ప్రళయకాలంలో సకల విశ్వములనూ తన గర్భమందు నిక్షిప్తమొనర్చుకున్న జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి విశ్వధారిణీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం విశ్వధారిణ్యై నమః అని ఉచ్చరించుచూ, అ విశ్వేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు భౌతికంగా సుఖసంతోషములను ప్రసాదించుచూ, తన యందు అనంతమైన భక్తిప్రపత్తులను ఇనుమడింపజేసి, భగవద్ధ్యానములో తరింపజేయును.
విశ్వధారిణీ అనగా, విశ్వమును ధరించిన మహాతల్లి.
జగన్మాతను లలితా సహస్ర నామావళి యందు రెండవ నామ మంత్రములోనే శ్రీమహాసామ్రాజ్ఞీ అని స్తుతించాము. సకల జగత్తులకు కారణభూతురాలు ఆ పరమేశ్వరి. ఆ జగత్తుల కన్నిటికీ తానే ఆధారమైనది. సృష్టించినంత మాత్రమున పరమాత్మకు పనిపూర్తి అయిపోలేదు. ఆ…
[05:05, 20/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
185వ నామ మంత్రము 20.12.2020
ఓం నీలచికురాయై నమః
సహజస్వభావ సిద్ధంగా తుమ్మెదఱెక్కలవలె నల్లగా, ఉంగరాలుతిరిగి, నునుపుదనంతో, చిక్కగా చక్కదనం కలిగిన ముంగురులు కలిగిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నీలచికురా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం నీలచికురాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు సకలార్థసిద్ధియు, ఆత్మానందానుభూతియు చేకూరును.
నల్లని ముంగురులు కలిగినది జగన్మాత. సాధారణంగా మహిళా మణులు నుదురుపైభాగాన తలపై గల వెంట్రుకలను వ్రేళ్ళతో ఉంగరాలుగా చుట్టి, నుదుటికిపైన, కణతలమీద అతికించుకొని తమ సౌందర్యాన్ని ఇనుమడించుకోవాలని శ్రమపడతారు. జగన్మాతకు ఈ శ్రమలేదు. ఆ ముంగురులు నల్లగా, తుమ్మెదఱెక్కలవలె, నునుపుగా, దట్టంగా, ఉంగరాలు ఉంగరాలుగా చుట్టుకొని ఉన్నాయట. అమ్మవారి సౌందర్యం మరింత ఇనుమడించి కామేశ్వరుడిని ఆకర్షిస్తున్నాయట. ఇదే విషయం ఆదిశంకరాచార్యుల వారు వారి సౌందర్యలహరిలో 45వ శ్లోకంలో చెప్పిన విధానం పరిశీలిద్దాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అరాలై స్వాభావ్యా-దలికలభసశ్రీభిరలకైః
పరీతం తే వక్త్రం - పరిహసతి పంకేరుహ రుచిమ్ |
దరస్మేరే యస్మిన్ - దశనరుచి కింజల్కరుచిరే
సుగంధౌ మాద్యంతి - స్మరదహన చక్షుర్మధులిహః || 45 ||
ముంగురులచే కమ్ముకొనిన దేవి ముఖము పద్మమును పరిహసించుచున్నది. ఆమె చిరునగవు శివుని మోహింపజేయుచున్నది.
భావము:
అమ్మా...సహజంగా వంకరలు తిరిగినవై తుమ్మెదల కాంతివంటి నల్లని కాంతి కలిగిన ముంగురులు మీద పడుచున్న నీ ముఖారవిందము పద్మముల అందమును ధిక్కరించుచున్నది.ఎటులనగా! ఆ పద్మాలు ఎంత అందంగా ఉన్నా - నీ ముఖం అంతకు మించిన సౌందర్యంతో ఉంటుంది.ఆ పద్మాలలో నిత్యం సువాసనలు వెదజల్లే కింజల్కాలు ఉంటే - నీ ముఖంలో నిత్యం చిరునవ్వుల పరిమళాలు వెదజల్లే దంతాలు ఉన్నాయి.ఆ పద్మాల మీద తుమ్మెదలు వాలుతూ ఉంటే - నీ ముఖముపై నీ ముంగురులు దోబూచులాడుచున్నవి. అంతమాత్రంచేత ఆ పద్మాలతో నీ వదనారవిందాన్ని పోల్చరాదు.ఎందుచేతననగా ఆ పద్మముల మకరందమును గ్రోలుటకై తుమ్మెదలు మాత్రమే మోహపడుతున్నవి కాని పలువరుస తళుక్కులతో చిరునవ్వుల సోయగముతో నిండియున్న నీ ముఖ సౌందర్య మకరందాన్ని గ్రోలుటకు ఎటువంటి కామ వికారములు లేక ఆ మన్మథుడినే జయించిన ఆ కామేశ్వరుని చూపులను తుమ్మెదలు నిత్యం నీ ముఖముపైనే ముసురుకొనుచున్నవి.( అనగా మన్మథుడినే జయించిన శంకరుడు అమ్మ సోయగమునకు వశుడైనాడు) కనుక పద్మములకన్నా నీ ముఖమే శ్రేష్ఠతమము.
🌹శ్రీమద్భగవద్గీత - 584 / Bhagavad-Gita - 584 🌹
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 01 🌴
01. అర్జున ఉవాచ
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్చామి వేదితుమ్ |
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను : ఓ మహాబాహో! కేశిసంహారా! ఇంద్రియధీశా! త్యాగము, సన్న్యాసము అనువాని ప్రయోజనమును నేను తెలిసికొనగోరుచున్నాను.
🌷. భాష్యము :
వాస్తవమునకు భగవద్గీత పదునేడు అధ్యాయముతోనే ముగిసినది. ఈ ప్రస్తుత పదునెనిమిదవ అధ్యాయము ఇంతవరకు చర్చించిన అంశముల సారాంశమై యున్నది. తన భక్తియుతసేవయే జీవిత పరమలక్ష్యమని పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు ప్రతి అధ్యాయమునందు నొక్కి చెప్పియున్నాడు. అదే విషయము ఈ అష్టాధ్యాయమున పరమగుహ్యజ్ఞానముగా సంగ్రహపరపబడుచున్నది.
మొదటి ఆరు అధ్యాయములలో “యోగినామపి సర్వేషాం – నన్ను తన హృదయమునందు సదా చింతించువాడు యోగులందరిలోను అత్యుత్తముడు” వంటి శ్లోకములలో ద్వారా భక్తియుతసేవకు ప్రాధాన్యము ఒసగబడినది. ఇక తదుపరి ఆరు అధ్యాయములలో శుద్ధభక్తియుతసేవ, దాని లక్షణములు, కర్మలు చర్చించబడినవి. జ్ఞానము, సన్న్యాసము, ప్రకృతికర్మలు, దివ్యస్వభావము, భక్తియుతసేవ యనునవి చివరి ఆరు అధ్యాయములలో వర్ణింపబడినవి. ఓం,తత్, సత్ అనెడి పదములతో సూచింపబడు భగవానుని సంబంధములోనే సర్వకర్మలు ఒనరింపబడవలెనని సారాంశముగా చెప్పబడినది.
అట్టి ఓం, తత్, సత్ అను పదములే దివ్యపురుషుడైన విష్ణువును సూచించును. భగవద్గీత యొక్క ఈ మూడవభాగము భక్తియుతసేవ ఒక్కటియే జీవిత ముఖ్యప్రయోజనమనియు, వేరేదియును అట్లు ముఖ్యప్రయోజనము కానేరదనియు నిర్ధారించి చూపినది. ఈ విషయమును పూర్వపు ఆచార్యులను మరియు బ్రహ్మసూత్రములను (వేదాంతసూత్రములను) ఉదహరించుట ద్వారా సమర్థింపబడినది. కొందరు నిరాకారవాదులు వేదాంతసూత్ర జ్ఞానమంతయు తమ సొత్తేయైనట్లు భావించినను, వాస్తవమునకు వేదంతసూత్రములు ముఖ్యప్రయోజనము భక్తియుతసేవను అవగాహన మొనర్చుకొనుటయే.
శ్రీకృష్ణభగవానుడే స్వయముగా ఆ వేదాంతసూత్రముల కర్త మరియు జ్ఞాత యగుటయే అందులకు కారణము. ఈ విషయము పంచదశాధ్యాయమున వివరింపబడినది. అన్ని శాస్త్రములలో (వేదములలో) భక్తియుతసేవ ఒక్కటియే లక్ష్యముగా వర్ణింపబడినదనెడి విషయమునే భగవద్గీత వివరించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
7:19, 20/12/2020] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 178, 179 / Vishnu Sahasranama Contemplation - 178, 179 🌹
🌻178. శ్రీమాన్, श्रीमान्, Śrīmān🌻
ఓం శ్రీమతే నమః | ॐ श्रीमते नमः | OM Śrīmate namaḥ
శ్రీమాన్యస్య సమగ్రా శ్రీః హరేరైశ్వర్యలక్షణా శ్రీ అనగా ఐశ్వర్యము. ఐశ్వర్యము అను శ్రీ గల విష్ణువు శ్రీమాన్ అని చెప్పబడును.ఈశ్వరత్వము అనగా సృష్టిస్థితిలయ సామర్థ్యము అను సమగ్రమగు శ్రీ ఎవనికి కలదో అట్టివాడు.
:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ. పరమాత్మ! మర్త్య సుపర్వ తిర్యఙ్మృగ దితిజ సరీసృప ద్విజగణాది
సంవ్యాప్తమును సదసద్విశేషంబును గైకొని మహదాది కారణంబు
నైన విరాడ్విగ్రహంబు నే నెఱుంగుఁదుఁ గాని తక్కిన సుమంగళము నైన
సంతత సుమహితైశ్వర్య రూపంబును భూరిశబ్దాది వ్యాపార శూన్య
తే. మైన బ్రహ్మస్వరూప మే నాత్మ నెఱుఁగఁ, బ్రవిమలాకార! సంసార భయవిదూర!
పరమ మునిగేయ! సంతత భాగధేయ!, నలిన నేత్రా! రమా లలనా కళత్ర! (286)
పరమాత్మా! మానవులూ, దేవతలూ, మృగాలూ, రాక్షసులూ, పాములూ, పక్షులూ మొదలయిన పలు విధాల ప్రాణులతో నిండి ప్రకృతి పురుషులతో కూడి మహదాదులకు కారణమైన నీ స్థూల రూపాన్ని నేను ఎరుగుదును. కానీ, నిత్యకల్యాణమూ, నిరంతర మహైశ్వర్య సంపన్నమూ అయి, శబ్ద వ్యాపారానికి గోచరం కాని నీ పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రం నేను ఎరుగను. రాజీవనేత్రా! రమాకళత్రా! నీవు నిర్మలాకారుడవు. భవభయదూరుడవు. మునిజన సంస్తనీయుడవు. పరమ భాగ్యధౌరేయుడవు.
22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
. రోజూవారి వివేకం - 3 / DAILY WISDOM - 3 🌹
🍀 సంపూర్ణ సాక్షాత్కారం 🍀
🌻. చైతన్యం యొక్క డి-హిప్నోటైజేషన్ 🌻
ఈ ఇంటిగ్రేషన్ ఈ జీవితంలో కూడా సాధించవచ్చు. భౌతిక కోశం ముందున్న వాస్తవికతపై నిరంతర ధ్యానం మరియు వేర్పాటు స్పృహను తిరస్కరించడం ద్వారా సమైక్యత ప్రభావవంతం అయితే, ఈ ప్రయోజనం కోసం మరికొన్ని జననాలు మరియు మరణాలు తీసుకోవలసిన అవసరం లేదు.
అటైన్మెంట్ ప్రక్రియ యొక్క శీఘ్రత అటువంటి ధ్యానం యొక్క శక్తి యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది, దాని ప్రతికూల మరియు నిశ్చయాత్మక అంశాలలో. ఆధ్యాత్మిక ధ్యానం యొక్క అన్ని పద్ధతుల యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం భౌతికత్వం మరియు వ్యక్తిత్వం యొక్క స్పృహ యొక్క డీహైప్నోటైజేషన్.
కొనసాగుతుంది ...
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 137 🌹
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 67 🌻
ఈ రకంగా ఆత్మసాక్షాత్కర జ్ఞానాన్ని కూడా పొందుతాడు. ఇట్లా ఎవరైతే ఈ ఆత్మదర్శనాన్ని పొందగలుగుతున్నారో, అంతటా ఉన్నది ఒకే ఒక ఆత్మ. అన్నింటిని తన యందు దర్శించుట, తనను అన్నింటి యందు దర్శించుట అనేటటువంటి అభేద స్థితికి చేరుతాడో, అప్పుడిక తాను పొందదగినది, పొందకోరేది, మరొకటి ఏదీ లేదు కదా! తను అనుభవింపదగినది, అనుభవింపకోరేది, తనకు అన్యమైనటువంటిది రెండవ వస్తువు లేదు కదా! ఈ రకంగా తానైనటువంటి స్థితిలోకి చేరిపోతూ ఉంటాడు. ఇట్లా చేరడం ద్వారా ఆత్మనిష్ఠుడు అవుతాడు.
జ్ఞాత బ్రహ్మానుసంధానం చేయడం ప్రారంభిస్తుంది. తన మూలం అయినటువంటి కూటస్థుడిని ఎఱిగే ప్రయత్నం చేయడం మొదలుపెడుతుంది. జ్ఞాత మిగిలినటువంటి 24 తత్త్వాల యందు ప్రవహించడం, ప్రసరించడం విరమిస్తుంది. తద్వారా తానైన నిష్ఠను పొందగలిగిన స్థితిని పొందుతుంది. తన మూలాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తు్ంది. ఈ రకంగా జ్ఞాత బ్రహ్మాను సంధానంలో ఉంటుంది. ఈ రకంగా బ్రహ్మనిష్ఠను సాధించేటటువంటి దిశగా పరిణామం ప్రారంభమౌతుంది.
ఇట్లా ఆత్మదర్శన సిద్ధిని పొందగోరే వారందరు ఈ సూక్ష్మమైనటువంటి, సూక్ష్మతరమైనటువంటి, సూక్ష్మతమమైనటువంటి, అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రత్యగాత్మ స్థితికి తప్పక చేరాలి. సాధకులందరూ కూడా, ఈ రకమైన ఆంతరిక పరిణామాన్ని సాధించాలి. ఈ రకమైనటువంటి నిర్ణయ క్రమాన్ని పొందాలి. ఈ రకమైనటువంటి దర్శనవిధిని అనుసరించాలి.
(కల్పాంతమందు ప్రళయమగును. అట్టి ప్రళయ సమయమున భూతములన్నియు లయమై అవ్యక్తమే మిగిలియుండును. జీవులు కూడా తమ తమ కర్మవాసనలతో కూడి, సూక్ష్మ శరీరముతో అవ్యక్తమందే నిలిచి యుందురు. మరలా సృష్టి ప్రారంభ సమయమున ఆకాశాది పంచభూతములకంటే ముందుగా హిరణ్యగర్భుడు జన్మించును.
అతడే దేవాది సకల శరీరములను సృజించెను. ఆ శరీరములందు జీవునితో పాటు పరమాత్మయు అంతర్యామి రూపమున నివసించును. అట్టి పరమాత్మను జ్ఞానులు మాత్రమే చూచుచున్నారు. మరియు ప్రాణ స్వరూప హిరణ్యగర్భుడు స్థూల ప్రపంచమందలి శబ్దాది విషయరూప అన్నమును భుజించుట చేత, అదితి అని చెప్పబడుచున్నాడు.
ఇంద్రాది దేవతా స్వరూపముగా నుండుట చేత సర్వ దేవతామయుడనబడుచున్నాడు. వ్యష్టి ప్రాణులందు లౌదాత్మము నొందుటవలన సర్వ భూతమయుడుగా ఉన్నాడు. అట్టి హిరణ్యగర్భుడు ఏ పరమాత్మను ధ్యానించుచున్నాడో, అటులనే నీవును నీ బుద్ధి గుహలయందు ప్రవేశించినట్టి, పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకొనుము.)
ముఖ్యమైనటువంటి క్రమసృష్టి యందు, కల్పాంతమందు మరలా ప్రళయం వచ్చినప్పుడు, లయమైనప్పుడు ఈ సృష్టి క్రమం ఎట్లా ఏర్పడిందో, ఆ పంచీకరణ విధానం ద్వారా ఎట్లా అయితే
బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్ మహత్ మహదో మహదహంకారః మహదహంకారో ఆకాశః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః ఆగ్నయోరాపః ఆపయోః పృథ్వి పృథ్వియోః ఓషధీః ఓషధియోః అన్నం అన్నమివ జీవః -
ఈ రకమైనటువంటి క్రమ సృష్టి ఏదైతే ఉందో, ఇది మరలా కల్పాంతంలో విరమించి ప్రళయం అవుతుంది. ఆ ప్రళయానికి మరల తిరిగి అవ్యక్తమే మిగులుతుంది. బ్రహ్మము, అవ్యక్తము. ఇంతే ఉండేది. మరలా అవ్యక్తము నుంచి అన్నీ సృజించబడుతాయి.
ఆ మహతత్తమనేటటువంటి హిరణ్యగర్భుడు ముందు వచ్చేటటువంటి ప్రాదుర్భవమైనటువంటి స్థితి. ఆ హిరణ్యగర్భుడు ఆదిదైవతానికి అధిష్ఠానం. సర్వ దేవతా స్వరూపము కూడా ఆ హిరణ్యగర్భస్థానం నుంచే వ్యక్తమౌతోంది. సృష్టి క్రమమంతా ఆ హిరణ్య గర్భస్థానము నుంచే వ్యక్తమౌతోంది. ఇది ఆరవ కోశము. షట్కోశము. కాబట్టి మానవుడు తనకు తాను పంచకోశముల వరకే తెలుసుకుంటే సరిపోవడం లేదు.
ఈ హిరణ్యగర్భుడి వరకు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ఆరవకోశమైనటువంటి ఆది దైవతాన్ని తెలుసుకోవాలి. సర్వదేవతలు ఇంద్రాది సమస్త దేవతలు, బ్రహ్మనిష్ఠులు, దిక్పాలకులు, ఇంద్రియాది అధిష్ఠాన దేవతలు... సమస్తము పంచీకరణలో చెప్పబడినటువంటి విధానంలో పృథ్వీ పంచకంలో ఏ అధిష్ఠాన దేవతలుంటారో చెబుతారా ఎవరైనా?- విద్యా సాగర్ గారు
సశేషం...
*ముముక్షు ప్రకరణము / నాల్గవ అధ్యాయము / శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము*
***
న పతత్యవటే జ్ఞస్తు విషయాసఙ్గరూపిణి
కః కిల జ్ఞాతసరణిః శ్వభ్రం సమనుధావతి.
జ్ఞాని విషయాసంగ రూపమగు గోతియందు పడడు, ఏలయనఁగా మార్గ నెఱింగిన ఎవడు గోతివైపునకు పరుగిడును?
***
దృశ్యతే లోకసామాన్యో యథాప్రాప్తానువృత్తిమాన్ ఇష్టానిష్టఫలప్రాప్తౌ హృదయే నాపరాజితః.
జ్ఞాని యథాప్రాప్తములగు కార్యముల నాచరించుచు పైకి ఇతర మనుజులవలెనే కానిపించును. కాని, ఇష్ట అనిష్ట ఫలప్రాప్తి యందు హృదయమున ఏమాత్రము వికారము నొందక (మాయచే జయింపబడక) యే యుండును.
***
అహం జగదితిప్రౌఢో ద్రష్టృదృశ్యపిశాచకః
పిశాచోఽ ర్కోదయేనేన స్వయం శామ్యత్యయత్నతః.
జ్ఞానసూర్యుఁడుదయింప 'నేను' ఈ జగత్తు ఇత్యాదిరూపమగు ప్రబల మైనట్టి ద్రష్టృదృశ్యపిశాచము, సూర్యోదయముచే పిశాచమువలె అప్రయత్నముగనే శమించిపోయి కేవలము శుద్ధాత్మయే శేషించును.
🌹 🌹 🌹 🌹 🌹
. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 11 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 11 🍀
హరి ఉచ్చారణీ అనంత్ పాపరాశీ!
జాతీల లయాసీ క్షణ మాత్రే!!
తృణ అగ్నిమేళే సమరస ఝాలే!
తైసే నామే కేలే జపతా హరీ!!
హరి ఉచ్చారణ మంత్రి హా అగాథ్!
పళే భూతబాధా భేణే తేడే!!
జ్ఞానదేవ మణే హరి మాఝా సమర్ట్!
న కరవే అర్ ఉపనిషదా!!
భావము:
హరినామము ఉచ్ఛరించినంతలోనే అనంత పాపరాశులు క్షణ మాత్ర కాలములో నశించి పోతాయి. చిన్న నిప్పు రవ్వ పడినచోటంతా అగ్నిగ మారినట్లు, హరినామ జపము చేయువారు హరి రూపులై పోతారు.
అగాధమైన ఈ హరి నామోచ్చరణ చేయువారి భూత బాధలన్ని పారిపోతాయి. మరి భయమెందుకు?
నా హరి సమర్థుడు, ఉపనిషత్తులు కూడ నా హరి సామర్థ్యానికి అర్థము చెప్ప జాలవని జ్ఞానదేవులు అంటున్నారు.
🌻. నామ సుధ -11 🌻
ఉచ్ఛరించునంతనే హరినామము
అనంత రాశుల పాపము
హరించి పోవును సర్వము
క్షణ మాత్ర కాలంలో అంతము
గడ్డి పోచంత అగ్ని వేయుము
చేయగలదు అది దాని రూపము
ఆ విధముగ చేయును హరినామము;
జపించిన వారలను హరి రూపము
హరినామ ఉచ్చారణము
అగాధమైనది ఈ మంత్రము
భూత బాధలన్నీ పలాయనము
భయమెక్కడిది ఇప్పుడు చెప్పుము
జ్ఞాన దేవుడు పలికిన వచనము
సమర్థుడు నా హరి వినుము
చెప్పజాలవు ఉపనిషత్తులు అర్థము
హరినామ మహిమ అమూల్యము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
. గురు గీత - దత్త వాక్య - 158 / Guru Geeta - Datta Vaakya - 158 🌹
శ్లోక :
దుస్వప్న నాశిని...
ఈ గురుగీత చెడు కలల ప్రభావాన్ని తొలగిస్తుంది మరియు మంచి కలల ఫలితాలను ఇస్తుంది (వాటిని వాస్తవికతలోకి తీసుకువస్తుంది). గురుగీత శత్రువులను నాశనం చేస్తుంది మరియు అభ్యాసకుడు బ్రహస్పతి (ఖగోళ గురువు) వలె గొప్పవాడు అవుతారు ఇక్కడ, “స్వప్న” లేదా కల పుట్టుక మరియు మరణ చక్రానికి కారణమయ్యే అజ్ఞానాన్ని సూచిస్తుంది. అజ్ఞానం నిజమైన నిద్ర.
ఎందుకంటే ఇది బానిసత్వాన్ని పెంచుతుంది, ఇది చెడ్డ కల. పుట్టుక మనకు సద్గురు దయను తెచ్చిపెడితే అది మంచి కల. ఇక్కడ శత్రువులు 6 దుర్గుణాలు, అనగా, కామ (కామం), క్రోధ (కోపం), లోభా (దురాశ), మోహ (అటాచ్మెంట్), మాడా (అహంకారం), మాత్సర్యమ్ (అసూయ).
“వాకాస్పత్య ప్రదిని” బ్రహ్మ స్థితిని ప్రసాదించేదాన్ని సూచిస్తుంది.
స్లోకా:
కోరుకునేవారికి కోరిక ఇచ్చే ఆవు (కామధేను) గురుగీత. ఇది చింతామణి (అన్ని దు s ఖాలను మరియు బాధలను తొలగించే రత్నం) మరియు ఇది అన్ని శుభ విషయాలను ఇస్తుంది. ప్రతి పద్యం నెరవేర్పును అందిస్తుంది. ఇది మీకు ప్రాపంచిక నెరవేర్పులను కూడా ఇస్తుంది. ఈ కారణంగా, అన్వేషకులు తమ చుట్టూ ఉన్న ప్రజలను ఆకర్షిస్తారు. భక్తితో కోరుకునేవారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఏదేమైనా, గురుగీత అన్నిటికంటే ఎక్కువ ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తుంది.
విముక్తి ప్రాథమిక ప్రయోజనం. ఇక్కడ, కామధేను మరియు చింతామణిని సూచించడంలో మరొక అర్ధం కూడా ఉంది. ఒక అభ్యాసకుడు అతీంద్రియ శక్తుల (సిద్ధి) తర్వాత అకస్మాత్తుగా తన యోగ స్థితి నుండి పడిపోవటం ప్రారంభిస్తే, గురు గీతను అధ్యయనం చేయడం వల్ల అతనికి అభ్యున్నతికి గురు మార్గదర్శకత్వం లభిస్తుంది. అలాంటి శిష్యుడిని గురువు వీడడు, యోగ స్థితి నుండి పడనివ్వడు. స్వీయ-సాక్షాత్కారం కోసం అతని ప్రారంభ కోరిక చివరికి ఫలించింది.
స్లోకా:
మోక్షకామో జపెన్నిత్యం
ఒకరు విముక్తి కోరుకుంటే, రోజూ ఈ జపం చేస్తే, అతను మోక్ష లక్ష్మిని (విముక్తి సంపద) పొందుతాడు. జపం మగ సంతానం కోసం ఉంటే, ఒకరు చాలా మంది కుమారులు పుడతారు, అదేవిధంగా, అది ధనవంతుల కోసం అయితే, అతను సమృద్ధిగా సంపదను పొందుతాడు.
స్లోకా:
మూడుసార్లు జపిస్తే, జైలులో ఉన్న వ్యక్తిని ఒకేసారి విడుదల చేస్తారు. ఒక స్త్రీ ప్రతిరోజూ దీనిని జపిస్తే, ఆమె పిల్లలను పుట్టి, తన భర్త మరియు పిల్లలతో పాటు పవిత్రమైన, సుదీర్ఘ జీవితాన్ని గడుపుతుంది.
స్వామీజీ జీవిత చరిత్రలో ఈ స్లోకాకు ఆధారాలు ఉన్నాయి. ఇది మరపురానిది. ఒక అమాయకుడికి ఒకసారి .ఢిల్లీలో జీవిత ఖైదు విధించబడింది. అతని బంధువులు స్వామీజీ వద్దకు వచ్చి సహాయం కోసం ప్రార్థించారు. వ్యక్తి ప్రతిరోజూ జపించాలని సూచనలతో స్వామీజీ గురుగీత నుండి 5 శ్లోకాలను ఎంచుకున్నారు. ఖైదీ ఈ శ్లోకాలను ఒక నెల పాటు పఠించాడు. ఊహించని విధంగా కేసు తిరిగి ప్రారంభించబడింది.
ఖైదీ జపించడం కొనసాగించాడు. కోర్టు చర్యలు 6 నెలలు కొనసాగాయి. చివరికి కోర్టు కేసును కొట్టివేసింది. జీవిత ఖైదు విధించిన వ్యక్తిని ఏడాదిలోపు జైలు నుండి విడుదల చేశారు. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఈ పద్యంలో వివరించబడినది ఖచ్చితంగా నిజం.
కొనసాగుతుంది ...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 154 / Sri Lalitha Chaitanya Vijnanam - 154 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖
🌻154. 'నిరుపాధి'🌻
ఉపాధిలేనిది, అతీతమైనది శ్రీమాత అని అర్థము. శ్రీమాత ఉపాధిలేని స్థితియందుండి జీవులకు ఉపాధి ఏర్పరుచుచుండును. ఉపాధులకు ఉపాధి ధర్మము లున్నవి. ఈ ఉపాధులలో దేవి ఉన్నప్పటికిని ఆయా ధర్మములు ఆమెను సోకవు.
ఉదాహరణకు స్ఫటికమునకు చేరువలో ఉన్న పూవు రంగు స్ఫటికమున ప్రతిబింబించును. కాని స్ఫటికమున ఆ రంగు చేరలేదు. అట్లే శ్రీదేవి చుట్టును ఎన్ని ఆవరణలు, ఉపాధులు ఉన్నప్పటికిని వాని ప్రభావము శ్రీదేవిపై యుండదు.
ఉపాధులు చైతన్యముపై ప్రభావము చూపినపుడు, అవిద్య ఆవరించినట్లు అగును. ఇతరుల ప్రభావము జీవులపై ఉండుట సర్వసామాన్యము. దానికి కారణము అవిద్యయే. అవిద్య ఎంత బలముగా నున్నచో అంత బలముగా ఇతరుల ప్రవర్తన సాధకులకు కలవరము కలిగించుచుండును.
ఇతరుల ప్రవర్తనతో చలింపక తాను తానుగానే ఉండు స్థిరచిత్తుడగు సాధకుడు అవిద్యచే అంత హింసింపబడడు. భాగవతోత్తముని జీవితమున ఈ విధమగు నిశ్చలత్వము గోచరించును. "ఉద్వేగమునకు గురి కాబడనివాడు, ఉద్వేగము కలిగించనివాడు నా భక్తుడు” అని శ్రీకృష్ణుడు తెలిపినాడు.
ఇతరము, ఇతరులుగా గోచరించుచున్నది చైతన్యమే అని తెలిసినవారే ఉపాధి ధర్మముల ప్రభావము సోకక జీవింతురు. అట్టి వారికి శ్రీదేవి పరాకాష్ఠ. ఆమె చిత్ స్వరూపిణి అగుటచే ఉపాధి ప్రభావము ఆమెపై ఏమియూ యుండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ సూర్య పంజర స్తోత్రం
1)ఓం ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం|సకలభువననేత్రం రత్నరజ్జూపమేయమ్ | తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాం|సురవరమభివంద్యం సుందరం విశ్వదీపమ్ ||
2)ఓం శిఖాయాం భాస్కరాయ నమః |లలాటే సూర్యాయ నమః | భ్రూమధ్యే భానవే నమః |కర్ణయోః దివాకరాయ నమః | నాసికాయాం భానవే నమః |నేత్రయోః సవిత్రే నమః | ముఖే భాస్కరాయ నమః |ఓష్ఠయోః పర్జన్యాయ నమః | పాదయోః ప్రభాకరాయ నమః ||
3)ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః |
ఓం హంసాం హంసీం హంసూం హంసైం హంసౌం హంసః ||
4)ఓం సత్యతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా | ఓం స్థితిరూపకకారణాయ పూర్వాదిగ్భాగే మాం రక్షతు ||
5)ఓం బ్రహ్మతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా | ఓం తారకబ్రహ్మరూపాయ పరయంత్ర-పరతంత్ర-పరమంత్ర-సర్వోపద్రవనాశనార్థం దక్షిణదిగ్భాగే మాం రక్షతు ||
6)ఓం విష్ణుతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా | ఓం ప్రచండమార్తాండ ఉగ్రతేజోరూపిణే ముకురవర్ణాయ తేజోవర్ణాయ మమ సర్వరాజస్త్రీపురుష-వశీకరణార్థం పశ్చిమదిగ్భాగే మాం రక్షతు ||
6)ఓం రుద్రతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా | ఓం భవాయ రుద్రరూపిణే ఉత్తరదిగ్భాగే సర్వమృత్యోపశమనార్థం మాం రక్షతు ||
7)ఓం అగ్నితేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా | ఓం తిమిరతేజసే సర్వరోగనివారణాయ ఊర్ధ్వదిగ్భాగే మాం రక్షతు ||
8)ఓం సర్వతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా | ఓం నమస్కారప్రియాయ శ్రీసూర్యనారాయణాయ అధోదిగ్భాగే సర్వాభీష్టసిద్ధ్యర్థం మాం రక్షతు ||
9)మార్తాండాయ నమః భానవే నమః హంసాయ నమః సూర్యాయ నమః దివాకరాయ నమః తపనాయ నమః భాస్కరాయ నమః మాం రక్షతు ||
10)మిత్ర-రవి-సూర్య-భాను-ఖగపూష-హిరణ్యగర్భ- మరీచ్యాదిత్య-సవిత్రర్క-భాస్కరేభ్యో నమః శిరస్థానే మాం రక్షతు || సూర్యాది నవగ్రహేభ్యో నమః లలాటస్థానే మాం రక్షతు ||
11)ధరాయ నమః ధృవాయ నమః సోమాయ నమః అథర్వాయ నమః అనిలాయ నమః అనలాయ నమః ప్రత్యూషాయ నమః ప్రతాపాయ నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు ||
12)వీరభద్రాయ నమః గిరీశాయ నమః
శంభవే నమః అజైకపదే నమః అహిర్బుధ్నే నమః పినాకినే నమః భువనాధీశ్వరాయ నమః దిశాంతపతయే నమః పశుపతయే నమః స్థాణవే నమః భవాయ నమః లలాటస్థానే మాం రక్షతు ||
13)ధాత్రే నమః అంశుమతే నమః పూష్ణే నమః పర్జన్యాయ నమః విష్ణవే నమః నేత్రస్థానే మాం రక్షతు ||
14)అరుణాయ నమః సూర్యాయ నమః ఇంద్రాయ నమః రవయే నమః సువర్ణరేతసే నమః యమాయ నమః దివాకరాయ నమః కర్ణస్థానే మాం రక్షతు ||
15)అసితాంగభైరవాయ నమః రురుభైరవాయ నమః చండభైరవాయ నమః క్రోధభైరవాయ నమః ఉన్మత్తభైరవాయ నమః భీషణభైరవాయ నమః కాలభైరవాయ నమః సంహారభైరవాయ నమః ముఖస్థానే మాం రక్షతు ||
16)బ్రాహ్మ్యై నమః మహేశ్వర్యై నమః కౌమార్యై నమః వైష్ణవ్యై నమః వరాహ్యై నమః ఇంద్రాణ్యై నమః చాముండాయై నమః కంఠస్థానే మాం రక్షతు ||
17)ఇంద్రాయ నమః అగ్నయే నమః|యమాయ నమః నిర్‍ఋతయే నమః|వరుణాయ నమః వాయవే నమః|కుబేరాయ నమః ఈశానాయ నమః|బాహుస్థానే మాం రక్షతు ||
17)మేషాదిద్వాదశరాశిభ్యో నమః| హృదయస్థానే మాం రక్షతు ||
18)వజ్రాయుధాయ నమః శక్త్యాయుధాయ నమః|దండాయుధాయ నమః ఖడ్గాయుధాయ నమః|పాశాయుధాయ నమః|అంకుశాయుధాయ నమః|గదాయుధాయ నమః త్రిశూలాయుధాయ నమః|పద్మాయుధాయ నమః చక్రాయుధాయ నమః| కటిస్థానే మాం రక్షతు ||
19)మిత్రాయ నమః దక్షిణహస్తే మాం రక్షతు | రవయే నమః వామహస్తే మాం రక్షతు |సూర్యాయ నమః హృదయే మాం రక్షతు | భానవే నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు | ఖగాయ నమః దక్షిణపాదే మాం రక్షతు | పూష్ణే నమః వామపాదే మాం రక్షతు |హిరణ్యగర్భాయ నమః నాభిస్థానే మాం రక్షతు |మరీచయే నమః కంఠస్థానే మాం రక్షతు | ఆదిత్యాయ నమః దక్షిణచక్షూషి మాం రక్షతు | సవిత్రే నమః వామచక్షుషి మాం రక్షతు |భాస్కరాయ నమః హస్తే మాం రక్షతు |అర్కాయ నమః కవచే మాం రక్షతు ||
20)ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతి కరాయ ధీమహి | తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ||
|| ఇతి శ్రీ సూర్య పంజర స్తోత్రమ్ ||
***
ఒక సత్కార్యాన్నో ఘనకార్యాన్నో నువ్వు చెయ్యాలనుకుంటే దానికి ఎలాంటి ఫలం కలుగుతుందో అనే చింతన నీకు ఉండకూడదు.
జాగృతి
స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు
కోరికలు క్షణికమైన సంతృప్తి లో అంతులేని దుఃఖాన్ని మోసుకొస్తాయి.
*ముముక్షు ప్రకరణము / నాల్గవ అధ్యాయము / శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము*
***
న పతత్యవటే జ్ఞస్తు విషయాసఙ్గరూపిణి
కః కిల జ్ఞాతసరణిః శ్వభ్రం సమనుధావతి.
జ్ఞాని విషయాసంగ రూపమగు గోతియందు పడడు, ఏలయనఁగా మార్గ నెఱింగిన ఎవడు గోతివైపునకు పరుగిడును?
***
దృశ్యతే లోకసామాన్యో యథాప్రాప్తానువృత్తిమాన్ ఇష్టానిష్టఫలప్రాప్తౌ హృదయే నాపరాజితః.
జ్ఞాని యథాప్రాప్తములగు కార్యముల నాచరించుచు పైకి ఇతర మనుజులవలెనే కానిపించును. కాని, ఇష్ట అనిష్ట ఫలప్రాప్తి యందు హృదయమున ఏమాత్రము వికారము నొందక (మాయచే జయింపబడక) యే యుండును.
***
అహం జగదితిప్రౌఢో ద్రష్టృదృశ్యపిశాచకః
పిశాచోఽ ర్కోదయేనేన స్వయం శామ్యత్యయత్నతః.
జ్ఞానసూర్యుఁడుదయింప 'నేను' ఈ జగత్తు ఇత్యాదిరూపమగు ప్రబల మైనట్టి ద్రష్టృదృశ్యపిశాచము, సూర్యోదయముచే పిశాచమువలె అప్రయత్నముగనే శమించిపోయి కేవలము శుద్ధాత్మయే శేషించును.
🕉🌞🌎🌙🌟🚩
భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
శివుడు సనాతనుడు. అనగా ఎప్పుడూ ఉండేవాడని అర్ధము. అలాంటి శివుడు ప్రత్యక్షమవగానే దక్షుని తరపువారు అడుగుతారు. 27 నక్షత్రాలలో ఏదైనా ఒక దానికి ఈయన పేరుపెట్టాలనే సంకల్పము ఒకటి కలిగినది. మీరు ఏమంటారు అని అడిగితే, నక్షత్రాల స్వరూప స్వభావాల ననుసరించి దక్షుడు పెట్టినవి బావుంది. అవి శాశ్వతముగా ఉండాలి.
ద్వాదశ రాశులలో మొట్ట మొదటి రాశికి పెట్టిన పేరే నీ పేరుగా స్థిరముగా నిలుస్తుంది. దానికి నేను మేషము అని పేరు పెట్టాను. మేషము అంటే గొర్రె కదా అని అంటే, అవును నీవు భవిష్యత్తులో గొర్రె తలకాయ కలిగి ఉంటావు అని విష్ణువు చెపుతాడు. (దక్షుడంటే శివుడికి ఎంతమాత్రము వేరే భావన ఉండదు.) దక్షుడు ఒకటి అడిగితే విష్ణువు ఒకటి చెప్పి వెళ్ళిపోతాడు.
గొర్రె కు స్వంత బుద్ధి ఉండదు. ముందు గొర్రెలు ఎలా వెడుతుంటే అలా అటు, ఇటు చూడకుండా, ముందుకు వెడుతూ ఉంటాయి. మనకు గూడా దైవము వైపే దృష్టి ఉండాలి తప్ప, మిగిలిన విషయముల యందు కాదు. గొర్రె తల వచ్చిన తరువాత దక్షుడికి అహంకారము తగ్గి, వినయము కలిగి బుద్ధిమంతుడు అవుతాడు. విష్ణువు వచ్చి గొర్రె తల తీసేస్తాను అంటే నామీద నాకే నమ్మకము లేదు. శివనింద చేసాను కాబట్టి నేను అనుభవిస్తాను అంటాడు. ఇప్పుడు కాశీలో దక్షుడున్నాడు. శివదర్శనానికి భక్తితో వచ్చేవారికి కావలసిన స్పూర్తి, మెలకువలు, హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు.
***
శ్రీరమణీయం -(739)
"ఋభుగీత "(206)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
ఆనందం ఎప్పుడూ అసంపూర్ణంగా ఉండదు !!
నేను అంటే అర్థం ఏమిటి ? మన మనసు మనకు తెలుసు. మనసుకి స్పందనలు, ప్రతిస్పందనలు వంటి గుణాలుంటాయి. బాధపడేది మనసే. నేను బాధపడ్డాను ! నాకు బాధ కలిగింది ! అనే మాటలన్నీ మనసును ఉద్దేశించినవే. ఆ మనసుకే బ్రహ్మానందం ఉంది. మనలోని రూపనామాలు మనసే. అదే బయటివారికి స్మృతిగా కనిపిస్తుంది. రూపం, నామం, గుణం ఇవన్నీ మనసైతే, మనసుకి ఉన్న గ్రహింపుశక్తి ఆత్మ. పూర్ణానందం అంటే ఆసలు ఆనందమే, ఎప్పుడూ అసంపూర్ణంగా ఉండదు అని అర్ధం. కానీ కోరిక చేత అది అసంపూర్ణంగా వ్యక్తమౌతుంది !
🕉🌞🌎🌙🌟🚩
[12:01, 13/12/2020] +91 92915 82862: 🌷97-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
అధ్యాయము-8
🥀దారులు-మెట్లు🥀
14. అట్టి స్థితిలో మరియొకటి అను ప్రజ్ఞ ఉండదు. ఇట్టి వానికి నేను సులభ సాధ్యుడును. అట్టివాడు నిత్య యోగి.
15. ఇట్లు నన్ను పొంది అశాశ్వతము, దుఃఖములకు నిలయములగు పునర్జన్మ ఎవడును పొందడు. అనగా శరీరములు తనయందు పుట్టుచు పోవుచుండ వచ్చును. తాను మాత్రము పుట్టడు, పోడు. ఈ పరమపదమును పొందినవారు మహాత్ములు.
16. ఒక స్థితిని పొందినవాడు తిరిగి క్రింది స్థితుల లోనికి జారుటకు అవకాశమున్నదా అను ప్రశ్న వచ్చును. సాధనలో పృద్వి, ఆపస్తేజో వాయురాకాశములు, పంచేంద్రియములు దాటి మనస్సును చేరినను మరల ప్రజ్ఞ దిగి వచ్చుచుండును. మనస్సు నుండి పంచేంద్రియములు, పంచభూతములు పుట్టుచున్నవి కనుక మనస్సే సృష్టికర్త. వాని లోకము వరకు సాధన చేసిన వాడు మరల దిగివచ్చుచుండును. వానిని దాటి నన్ను చేరినవాడు ఇక దిగిరాడు. ఉదాహరణకు ఒక సంగీత కార్యక్రమమునకు పోయి కూర్చున్నవాడు దిక్కులు చూచుచుండవచ్చును. సంగీతము వినుచున్నను ఇతరుల సంభాషణలు వినిపించవచ్చును. మనస్సులో ఇతర భావములు పుట్టుచుండవచ్చును. కానీ ఒక మారు గాయకుని నాద మాధురిచే మనస్సు హరింపబడినచో కన్ను తెరిచియున్నను వస్తువులు కనిపింపవు. మాటలు వినిపింపవు ఆలోచనలు రావు. అట్లే నన్ను పొందిన వానికి జన్మలు కలగవు.
[12:01, 13/12/2020] +91 92915 82862: 110) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
అజ్ఞానీ విదుషా పృష్టి కూటస్థం న ప్రబుద్ధ్యతే ౹
నభాతి నాస్తి కూటస్థ ఇతి బుద్ధ్వా వదత్యపి ౹౹27౹౹
27. లోకానుభవమున కూడా అజ్ఞానియైన పురుషుని విద్వాంసుడు కూటస్థమును గూర్చి అడిగినచో అతడు
"నాకు తెలియద"నును.
అంతే గాక "ఈ కూటస్థము తెలియబడుట లేదు గదా,అసలు లేనేలేదు" అని తలచి అట్లే ప్రత్యుత్తరమిచ్చును కూడా.
స్వప్రకాశే కుతోఽ విద్యా తాం వినా కథమావృతిః ౹
ఇత్యాది తర్కజాలాని స్వానీభూతిర్గ్రసత్యసౌ ౹౹28౹౹
28. కూటస్థము స్వయముగా భాసించినచో అవిద్య ఎట్లుండును?
అవిద్యయే లేనిచో ఇక ఆవరణమెట్లు? మొదలైన తర్కవితర్కములన్నీ స్వానుభవముచే మ్రింగివేయబడును.
బుద్ధి లేదా వ్యష్టి అజ్ఞానము-దీనికి అధిష్ఠానమయిన చైతన్యము-కూటస్థుడు.
బుద్ధి సహిత చైతన్యము జీవుడనే వారి పక్షమున,"బుద్ధికి,
వ్యష్టి-అజ్ఞాన సహిత చైతన్యము జీవుడనే వారి పక్షమున,"వ్యష్టి-అజ్ఞానమునకు"-అధిష్ఠానం కూటస్థుడే.
ఇతడు ఘటాకాశము వంటివాడు.ఇతడు అజుడు. బ్రహ్మము కన్నా భిన్నంగా,బుద్ది యందు ప్రతిబింబించటం ద్వారా చిదాభాసుడుగా పుడతాడు.కానీ కూటస్థుడు బ్రహ్మరూపుడే.
ఘటాకాశము మహాకాశము కన్నా భిన్నం కాదు.
కూటస్థుడే ప్రత్యేగాత్మ,స్వరూపము,జీవసాక్షి.
తర్కికముగ అసంభవములైనవి ఎన్నో అనుభవమునకు వచ్చుచున్నవి.ఆ అనుభవమును సమర్థించుటకు క్రొత్త తర్కములను ఆవిష్కరింపబడుచున్నవి.గాలి కంటే బరువైన వస్తువులు గాలిలో ఎగురగలుగుట తార్కికముగ అసంభవము.
కాని పక్షులు విమానములు ఎగురుచున్నవి దీనిని సమర్థించుటకు ఒక క్రొత్త శాస్త్రము.
అట్లే స్వప్రకాశమైన కూటస్థము దానిని ఆవరించిన అవిద్య ఏకకాలమున ఉండుట తార్కికముగ అసంభవము.కాని వస్తుస్థితి అట్టిదే.
పరమాత్మ సాక్షాత్కారము నొందిన వ్యక్తులకు దీని యందలి అనుపానులన్నీ అవగత మగును.
"నహిదృష్టే అనుపపన్నం నామ".
సాక్షాత్తుగ చూడబడుచున్న విషయమునందు
'ఇది యుపపన్నము కాదే' అనే ప్రశ్నయే ఉండదు.
లోకానుభవమున కూడా అజ్ఞానియైన వాడు బ్రహ్మము తెలియబడుటలేదు కావున అసలు లేనేలేదు అని నిర్ణయించుకొనును.
బ్రహ్మమునకు ఏవిధమైన రూపము లేనందు వల్ల ప్రత్యక్షంగా కనబడదు.
ధర్మం విషయంలో ఎలాగో,అలాగే శాస్త్రం చేతనే బ్రహ్మపదార్థం నిరూపింపబడుతుంది.ఏ తర్కమూ ఉపయుక్తం కాదనే శ్రుతి స్పష్టం చేస్తున్నది.
వాదనే ప్రధానమని భావించే శుష్కతర్కానికి ఆస్కారం లేదు.
శ్రుతి, ప్రపంచం,బ్రహ్మనిర్మితమూ,
బ్రహ్మ కన్నా వ్యతిరిక్తమైన ప్రపంచం లేదు, కార్యం-కారణం అభిన్నములనే స్పష్టం చేస్తున్నది. దీనినే అనుసరించాలి. మరో ప్రమాణం లేదు.
బ్రహ్మం తెలియకపోవడమనేది అవిద్య, ప్రకాశింపకపోవడమనేది ఆవరణము.
"బ్రహ్మవేత్త అయిన ఆచార్యుని బోధనవలన మాత్రమే పరమాత్మను పొందడము సాధ్యముఅవుతుంది.
18) శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత అద్వైత వేదాంత కీర్తన
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
నాథనామక్రియారాగః - ఆదితాళమ్.
బ్రహ్మైవాహం కిల
బ్రహ్మైవాహం కిల
సద్గురు కృపయా - బ్రహ్మైవాహం కిల||
1. బ్రహ్మైవాహం కిల గురుకృపయా
చిన్మయ బోధానన్ద ఘనం తత్|| బ్రహ్మై||
2. శ్రుత్యనన్తైక నిరూపిత మతులం
సత్యసుఖామ్బుధి సమరస మనఘమ్|| బ్రహ్మై||
3. కర్మాకర్మ వికర్మ విదూరం
నిర్మలసంవి దఖణ్డ మపారమ్|| బ్రహ్మై||
4. నిరవధి సత్తాస్పద పదమజరం
నిరుపమ మహిమని నిహితమనీహమ్|| బ్రహ్మై||
5. ఆశాపాశ వినాశన చతురం
కోశపఞ్చకాతీత మనన్తమ్|| బ్రహ్మై||
6. కారణకారణ మేకమనేకం
కాలకాల కలిదోష విహీనమ్|| బ్రహ్మై||
7. అప్రమేయపద మఖిలాధారం
నిష్ప్రపంఞ్చ నిజ నిష్క్రియ రూపవ్|| బ్రహ్మై||
8. స్వప్రకాశ శివ మద్వయ మనఘం
నిష్ప్రతర్క్య మనపాయ మకాయమ్|| బ్రహ్మై||
తాత్పర్యము:-
1. శ్రీ గురువుల కరుణచే నేను బ్రహ్మమునే! శ్రీ గురుకృపచే - 'చిన్మయము, జ్ఞానానందములచే ఘనీభూతము అయిన బ్రహ్మమే నేనని' నాకు అనుభవమునకు వచ్చినది.
2. దేనిని వేదములు అనంతమని - ఒక్కటియని నిరూపించుచున్నవో, దేనిని సత్యమని - ఆనంద సముద్రమని - పెరుగుట. తరుగుట ఎఱుగని నిత్యసమరసమని కీర్తించుచున్నవో - ఆబ్రహ్మమే నేను! శ్రీ గురుకరుణాప్తిచే నేను బ్రహ్మమనైతిని!
3. ఏ బ్రహ్మానుభవమున 'జేయదగిన - చేయగూడని విశేషముగా చేయదగిన కర్మలన్నవి కొంచెము కూడ శేషించి యుండవో, ఏది నిర్మలజ్ఞానరూపమో, దేనియందు విభాగము లన్నవిలేవో, మరియు నెయ్యది సారము లేనిదో - శ్రీగురుకరుణా విశేషముచే అట్టి బ్రహ్మము నేనైయున్నాను.
4. ఏది నిరవధికసత్యమో - (ఎన్నడును ఏవేళయందును మారదో) దేనియందు శైథిల్యము కొంచెమును లేదో - దేనిమహిమకు సాటిలేదో - తనమహిమయందే ఏది తాను నిలిచియున్నదో - ఎందుకోరికలన్నవి ఉదయింపవో శ్రీగురువుల కరుణచే నేనా బ్రహ్మమనై యున్నాను.
5. కోరికలన్న పాశములకు అంతముండదు. బ్రహ్మానుభవముకలిగినంతనే ఆకోరికలు
మరి నిలువవు. అన్నమయ - ప్రాణమయ - మనోమయ - జ్ఞానమయ - ఆనందమయములనెడు పంచకోశములను దాటిన మీదట అనుభవమునకు అందునట్టి అనంతమైన ఆబ్రహ్మము నేనే!!
6. లోకములో దేని ఉనికికైనను కారణమున్నది; కాని బ్రహ్మమునకు కారణములేదు. అన్నిటికిని అదియే కారణముగా నున్నది. అందుచే అది సర్వకారణములకును కారణమైనది. అది ఒక్కటి. అనేకముగా దోచుచున్నది.
ఆ బ్రహ్మపదార్థము 'ఫలానా కాలములోనిది, అని కాలములో బంధించుటకు వీలుకానిది. కాలమన్నది తల యెత్తనిచోట అది ఉన్నది. అందుచే అదికాలమునకును కాలుడైనది; మృత్యువైనది.
'కలి' అనునది కాలములోని మురికి; మడ్డి. ఇచట పాపమే ఎక్కువ. కాలమనునది తలఎత్తని తావుకదా బ్రహ్మము. కాలప్రసక్తియే లేనిదైన బ్రహ్మమున కలిదోషము లెటులంటును? ఇట్టి పరబ్రహ్మము నేనే!!
7. పరబ్రహ్మము యొక్క పరిమాణము - ఇంతయని కొలుచుట ఎవరికిని సాధ్యముకాదు. అది సర్వాధారము. అచట ప్రపంచము లేదు. అచ్చట ఏవిధమైన క్రియయును లేదు.
అట్లు అమేయము - అఖిలాధారము - నిష్ప్రపంచము - నిష్క్రియము అయిన బ్రహ్మము నేనే!!
8. లోకములోని ఏవస్తువును స్వయంప్రకాశము కాదు. అనగా పరాపేక్షలేక తానై స్ఫురింపదు, ప్రకాశింపదు. సూర్యుడున్నాడు. స్వయముగనే ప్రకాశించుచున్నాడు కదా! అనవచ్చును.
కాని అతడు అనంతతానై స్ఫురింపడు. వాని స్ఫురణమునకు 'నీవో - నేనో' అవసరము. అపుడు మాత్రమే వాని ఉనికి అవగతమగును. కాని సర్వులును అనుభవించు 'నేను, అన్నదాని స్ఫురణమునకు పరాపేక్షయున్నదా! లేదు. అందుచే 'నేను' అన్నది తప్ప అన్యములన్నియును పరతః ప్రకాశములే.
ఈ నేను రెండు విధములుగా నున్నది. బుద్ధియందు తోచు 'అహంతా స్ఫూర్తి' అచ్చమైనది కాదు.
అది అజ్ఞాన విలాసము, బుద్ధిని దాటిపోయినపుడు ఏది తాను అనెడి అనుభూతి ఉదయించునో అది నిజమైన నేను. అది ఆత్మ. అది బ్రహ్మము. అది - అదొక్కటి మాత్రమే స్వయంప్రకాశశీలము. ఇతరములన్నియు దానిమహిమచే మాత్రమే స్ఫురించుచున్నవి. తెలియబడుచున్నవి. (నేను - ఆత్మ - బ్రహ్మము - ఇదొకటి మాత్రము తనకు దానుగా తెలియబడుచున్నది. ఇతరములు ఏవియును తమకు దామై తెలియబడవు.) అందు చేతనే. శ్రుతి - 'యస్య భాసా సర్వమిదం విభాతి' అన్నది. అనగా బ్రహ్మము స్వయంప్రకాశశీలమైనదని అర్థము.
మరియును ఆ బ్రహ్మము మంగళమయమైనది. అది ఒక్కటన్న ఒక్కటి, రెండవది లేనేలేదు. అందుచే అది అద్వయము.
ఆ బ్రహ్మవస్తువు తర్కములకు జిక్కునదికాదు. దానికొక అపాయమన్నది ఎన్నడును లేదు, కలుగదు. దానికి శరీరము లేదు.
ఇట్లు స్వయంప్రకాశమై - శివమై - అతర్క్యమై - అనపాయమై - అశరీరియై యున్న బ్రహ్మము నేనే!!
(ఇచట 'శివ' శబ్దము సదాశివుల గురువులకు సూచకము).
🕉🌞🌏🌙🌟🚩
[13:54, 13/12/2020] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| షష్ఠ స్కంధము
23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనము/23-10-శ్లోకం*
🕉🌞🌎🌙🌟🚩
*నిస్సంభ్రమస్త్వయమయాచితశాపమోక్షో
వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధీ।*
*భక్త్యాత్మతత్త్వకథనైస్సమరే విచిత్రం
శత్రోరపి భ్రమమపాస్య గతః పదం తే।।*
భావము:-
'చిత్రకేతుడు' పార్వతి శాపముచే తనకు ప్రాప్తించిన అసురజన్మకు కలవరపడలేదు; శాపవిముక్తిని కోరి ప్రార్ధించలేదు. 'వృత్రాసుర' రూపమును స్వీకరించి 'ఇంద్రునితో' యుద్ధమునకు తలబడెను. అందు 'ఇంద్రునికి' (శత్రువేయైనను), భక్తితత్వమును మరియు ఆత్మతత్వమును భోధించెను; శత్రువునకు కూడా - మాయచే ఆవహించిన భ్రమను తొలగించిన - "చిత్రకేతుని" వృత్తాంతము పరమ ఆశ్చర్యకరము. ప్రభూ! తుదకు ఆ విష్ణుభక్తుడు నీ సాన్నిధ్యమును పొందెను.
వ్యాఖ్య:-
ఒకనాడు చిత్రకేతుడు తన విమానము పై కైలాసము మీదుగా బోవుచు కొలువులో నున్న శంకరుని దర్శనము చేసుకొని నమస్కరించెను . ఒకే పీఠ౦ముపై పార్వతి ని తోడ మీద కూర్చుండబెట్టుకొన్న శివుని జూచి “మీరు ప్రకృతి పురుషులు కావచ్చు .ఏకాంతసమయంలో నిట్లు కూర్చుండవచ్చుగాని నిండుసభలో నిట్లుండుట న్యాయమా?”అని యాక్షేపించెను.
పార్వతి కోపించి , “ఇందరును ఏ మనలేదుగాని నీవు మాత్రము అధిక్షేపించెదవా? ఇంత అహంకారముగల నీవు రాక్షసజన్మ మెత్తుము “అని శపించెను. చిత్రకేతుడు తన తప్పు తెలిసికొని ఉమాశంకరులకు నమస్కరించి “అమ్మా! జీవులకు వారివారి కర్మములవలన జననమరణములు , సుఖదుఃఖములు కలుగుచుండుననుటకు కిదియే నిదర్శనము . నన్ననుగ్రహింపుము .నీ శాపమునకు నేను భయపడటంలేదు . జగత్పితరులైన మిమ్ము అధిక్షేపించినందుకు చింతించుచున్నా”నని మ్రొక్కి వెడలిపోయెను.
తరువాత అందరు వినుచుండగా పార్వతితో శివుడు “చూచితివా ? విష్ణు భక్తులు నిస్స్రుహత్వము !వారికి సుఖదు:ఖములు సమానములు .తిరిగి నీకు శాప మియ్యగలవాడైనను శంతుడుకాన నీ శాపమును తలదాల్చి వెడలిపోయేను”అని పలికేను. అతడే త్వష్ట చేసిన పుత్రకామేష్టిలో దక్షిణాగ్నియందు వృత్రాసురుడు జనించెను .అతనికి అ ధర్మము , జ్ఞానము పూర్వజన్మమునుండి సంక్రమి౦చినవే. వారట్లేల ఇంద్రుని విదిచిపోయిరని పరిక్షిత్తు అడుగగా శుకడిట్లు చెప్పెను.
వృత్రపరాక్రమునకు భయపడి దేవతలు ,మునులు ఇంద్రునొద్దకు వచ్చి ''నీవు వృత్రసురును వధి౦పు ''మనగా అతడు ''పూర్వము ఇట్లే మీ మాటలు విని విశ్వరూపుని జంపినాను .ఆ దోషము పోగొట్టుకొనుటకు నాకు తలప్రాణము తోకకు వచ్చినది .మరల ఇంకొక బ్రహ్మహత్యకు ఒడిగట్టలే''నని నిరాకరించెను .దానికి మహర్షులు ''నీ చేత మే మశ్వమేధాయాగము చేయించి పాపవిముక్తిని జేయుదు''మని చెప్పి సురరాజును ఒప్పించిరి. అందుకే వృత్రుని జంపి ఇంద్రుడు బ్రహ్మహత్యాపాపము మూటగట్టుకొనెను. ఆ పాపము ఒక చండాల స్త్రి రూపమున ఇంద్రుని వెంటబడెను .ఇంద్రుడు పారిపోయి మానససరస్సులోని తామర కాడలో దాగుకొనెను.
అందున్న దారాలతో కలసిపోయి ఒక రూప మన్నది లేక వేయేండ్లు ఉండెను .అది శివునిదిక్కు (ఉత్తరము ).కాన చండాలి అచటికి పోలేక ఇంద్రునికై బయట కాచుకొని కూర్చుండేను. అంతకాలము స్వర్గరాజ్య మరాజకము కాకూడదని , భూలోకము నుండినూ అశ్వమేధయాగములుచేసిన నహుషుడను రాజును దెచ్చి దేవతలు , ఋషులు ఇంద్రపదవిలో నిలిపిరి .
అతడా పదవిలో మదించి , శచీదేవిని భార్యగా నుండమనినిర్బధించెను.ఆమె''బ్రహ్మర్షులు మోసేడు పల్లకిలోరమ్ము.నిన్నూవరి౦చెదను''ననెను .సహుషు డట్లేవచ్చును అగస్త్యుని''సర్ప-సర్ప''(దగ్గరకు సమీపింపుము)అని కాలితో దన్నేను.ఆముని కోపించి నీవు సర్పమై భూలోకమున బడియు౦డు ''మని శపించెను .దానితో నహుషుని ఇంద్రపదవి మట్టిలోగలిసేను.
ఇంద్రుడు డా పద్మనాళములో నుండి యిన్నేండ్లును హరిధ్యానము చేయుచుండేను.మునులును, దేవతలును ఇంద్రుడున్నచోట తెలిసికోని వచ్చి అతనిని మన్నించమని కోరి స్వర్గమునకుదేచ్చిరి.
పాపరూపిణియైన చండాలి, అంతకాలము విష్ణుధ్యానము చేసిన ఇంద్రుని చేరలేకపోయేను. మునులింద్రుని చేత అశ్వమేధయాగము చేయి౦చి పాపవిముక్తిని జేసిరి. ఈ వృత్రాసుర వధను జదివిన వారును వినినవారును అఖండ భోగభాగ్యాములతో తులతూగి , తుదకు మోక్షము నొందుదురు. శత్రు వెంతవాడైనను ఉపేక్షి౦పరాదు,ఇది రాజనీతి . పరిక్షిత్తు శకుని జూచి , ''మహాత్మా!అసురుడైన వృత్రున కంతటికీ ధర్మము జ్ఞానము ఏల కలిగినవి ?అని యడుగగా శుకమునీంద్రు డు ఏమి చెప్పాడో ముందు ముందు చూద్దాం.
🕉🌞🌎🌙🌟🚩
-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అII రాజసజ్ఞానమును చెప్పుచున్నారు-
పృథక్త్వేన తు యజ్జ్ఞానం
నానా భావాన్పృథగ్విధాన్
వేత్తి సర్వేషు భూతేషు
తజ్జ్ఞానం విద్ధి రాజసమ్
తా:- ఏ జ్ఞానమువలన మనుజుడు సమస్తప్రాణులందును వేర్వేరువిధములుగ నున్న అనేక జీవులను వేర్వేరుగా నెరుంగుచున్నాడో, అట్టి జ్ఞానమును రాజసజ్ఞానమని తెలిసికొనుము.
వ్యాఖ్య:- ప్రపంచమునగల ప్రాణులలో "వీడువేఱు, వీడువేఱు - అని యీ ప్రకారముగ అనేకత్వమును జూచుట ఉత్తమజ్ఞానముకాదు. అది రాజసమేయగును. అట్టి జ్ఞానముకలవా రొకవ్యక్తిని చూచినపుడు ఆతని గుణమును పరికించుదురేకాని ఆత్మను కాదు. కనుకనే వారు వ్యక్తులలో భిన్నత్వమును జూచుదురు. ఇట్టి రాజసజ్ఞానమునే యిపుడు ప్రపంచమున పెక్కురు కలిగియుండుచున్నారు. ఏలయనగా వారు ప్రాణులలో భిన్నత్వమునే గాంచుచున్నారు. కావున అద్దానిని తొలగించుకొని అద్వైతభావమును, సమదృష్టిని అవలంబించవలెను (దిండ్లపై గలీబులపై దృష్టినుంచక లోనగలదూదిపైననే దృష్టిగలిగి యుండునట్లు).
ప్ర:- రాజసజ్ఞానముయొక్క లక్షణమేమి?
ఉ:- ప్రపంచములో అనేకత్వమునుజూచుట, సర్వజీవులందును " వీడు వేఱు, వీడు వేరు" అను భేదభావము గలిగియుండుట.
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
753వ నామ మంత్రము
ఓం మహాశనాయై నమః
విశ్వానికి ప్రతీకయైన వైశ్వానరుని స్వరూపంతో, విశ్వమే (గొప్పదైన) ఆహారంగా గలిగిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాశనా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాశనాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు భౌతిక జీవనమందు అన్నవస్త్రములకు లోటులేకుండా, పాడిపంటలతో, సిరిసంపదలతో దినదిన ప్రవర్ధమానమై జీవించుచూ, పరమేశ్వరీ ధ్యానంతో జీవితాన్ని కొనసాగించుచూ జన్మ తరించినది అను భావన కలుగునట్లు అనుగ్రహించును.
ఇంతకు ముందు నామములో (752వ నామ మంత్రము - మహాగ్రాసా) ప్రళయకాలంలో విశ్వమంతయు ఒక్క కబళంగా తన కుక్షిలో నిక్షేపము చేసుకున్నదని భావము.
ప్రస్తుతము మహాశనా అనగా గొప్ఫదైన ఆహారము (అన్నము) కలిగినది అనగా విశ్వంలో ప్రతీ వస్తువు కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంతటి పరబ్రహ్మ స్వరూపమే పరమేశ్వరికి ఆహారము గనుక మహా (గొప్పదైన) అశనా (ఆహారముగా గలిగినది) అని చెప్పబడింది.
విశ్వానికి ప్రతీక విశ్వానరుడు. అతని ఆహారమే ఈ విశ్వం. ఎవరీ విశ్వానరుడు. ఆ వివరం తెలుసుకుందాం.
*సేకరణ
పరమాత్మ స్వరూపములలో ఒక స్వరూపమునకు పేరు వైశ్వానరుడు అని. ఇతనినే అనిరుద్ధుడు అనికూడా అందురు. ఈయన చక్షురీంద్రియము నందు ఉంటాడు. చక్షువు అనగా కన్ను. ఈ కంటిలోని నల్లగుడ్డుపై మనకు ఆకారాన్ని కన్నింపచేసే ఇంద్రియముంటుంది. దానినే చక్షురీంద్రియమంటారు. ఆ ఇంద్రియాన్ని స్థానంగా కలిగి ఉంటాడు. వైశ్వానరుడు లేదా అనిరుద్ధుడు అని పిలవబడే పరమాత్మ యొక్క మొదటి స్వరూపము. జాగ్రత్ దశలో (మేల్కొని ఉన్నపుడు) జీవుడు చక్షురీంద్రియము ద్వారా బాహ్య విషయములను గుర్తించి, వాటిని అనుభవించుచుండును. ఆ జాగ్రత్ దశలోని జీవునికి అంతరాత్మగా ఉండి ఆయా విషయములను అనుభవించిపచేస్తూ ఉండే స్వరూపమే వైశ్వానరుడిది.
వైశ్వానరుడు అంటేనే (విశ్వాన్ – నరాన్ నయతి ఇతి వైశ్వానర:) జీవులను నడిపించువాడు (పొందించువాడు) అని అర్థము. ఈ వైశ్వానరుడు చక్షురీంద్రియమును స్థానంగా చేసుకొని జీవునిలో ఉండి బాహ్యములయిన పదార్థములను (రూప, రస, స్పర్శ, గంధ, శబ్దాలు) తాను తెలిసికొనుచుండును, ఆ పదార్థజ్ఞానమును జీవునికి కల్గింపచేయును. ఇది వాని వ్యాపారము (కార్యము). ఇక
వాని రూపము నాలుగు భూజములతో, రెండు పాదములతో, తొండముతోను ఏడు అవయవములు కలిగి, 19 ముఖములు కలిగి ఉండును. మధ్యముఖము గజముఖముగా తొండము కల్గి ఉండి, అటు తొమ్మిది, ఇటు తొమ్మిది ముఖములు పురుష ముఖ ఆకారము కలిగి ఉండును. ఇది ఆయన రూపము.
మరొకచోట వైశ్వానర విద్యలో వైశ్వానరుని రూపము మరొకలా వర్ణించబడి ఉంది. ఆ విద్యలో కూడా వైశ్వానరుడికి 7 అంగములు, 19 ముఖములు చెప్పబడి ఉన్నాయి. ద్యులోకుడు వైశ్వానరుడి మూర్థస్థానమునే ఒక అంగముగాను, సూర్యుడు చక్షువనే అంగముగాను, వాయువు వైశ్వానరుడి ప్రాణముగాను, ఆకాశమంతా ఆయన శరీరమధ్యభాగముగాను, జలము ఆయన మూత్రాశయముగాను, పృథివీ ఆయన పాదములుగాను, జాగ్రత్ దశలో ఉన్న జీవుడు వైశ్వానరుడి 7వ అంగముగాను వర్ణించబడినాయి.
ఇక ఆ వైశ్వానర విద్యలోని వైశ్వానరుడికి గల 19 ముఖములు ఏమిటంటే జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, ప్రాణవృత్తులు (వ్యాన, ఉదాన, సమానాదులు) ఐదు, అంత:కరణ వృత్తులు (మనస్, చిత్త, అహంకార, బుద్ధులు) నాలుగు.
ఇక్కడ మాండూక్యోపనిషత్‌లోనూ వైశ్వానర నామధేయంతో, 7 అంగములు, 19 ముఖములు గల రూపము వర్ణించబడింది. వైశ్వానరవిద్య ఛాందోగ్యోపనిషత్‌లోనూ వైశ్వానరుడికి 7 అంగములు, 19 ముఖములే చెప్తూ వేరే వర్ణించబడిన ఆ అవయవములను ప్రస్తుతము కూడా అన్వయించుకోవచ్చును. ఇక ఇట్టి విలక్షణ రూపము కలిగి జాగ్రత్ దశా జీవునిలో ఉండు వైశ్వానరుడు స్థూల భుక్ అంటారు. స్థూలములు అంటే బాహ్యముగా ఆయా ఇంద్రియములచేత గ్రహించబడునట్టి విషయములు. రూపముకలిగిన పదార్థములు, రుచి కల్గినవి, శబ్ధించునవి, స్పర్శ కల్గినవి, గంథము కల్గిన వి అన్నీ స్థూలములనబడును. ఈ స్థూలపదార్థములను జీవునికి అనుభవింపచేయువాడు కనుక వైశ్వానరుడు స్థూలభుక్.
అయితే స్థూలభుక్ అంటే నిజానికి స్థూలములైన బాహ్య పదార్థములను అనుభవించువాడు అనికదా అర్థము చెప్పవలసింది. అని సందేహము రావచ్చును. పదార్థానుభవము తద్వారా సుఖదు:ఖాది అనుభవమనునది కర్మనుబట్టి ఏర్పడుచుండును. ఆ కర్మఫల అనుభవమునది జీవునికే కానీ, పరమాత్మకి ఉండదు. కానీ శ్రుతి, కర్మఫల అనుభవ, కర్తృత్వాన్ని జీవ, పరమాత్మలిద్దరికీ చెప్పి, అది ఏ విధంగానో సమర్థిస్తుంది. బుతం పితంబౌ సుకృతస్య లోకే... అనే మంత్రంలోని కర్మఫలమును జీవుడు, పరమాత్మ ఇద్దరూ అనుభవిస్తున్నారని శ్రుతి చెప్తున్నది. అయితే జీవుడిలాగే పరమాత్మ కర్మ అనుభవించాల్సివస్తే ఇక తేడా ఏముంటుంది? ఆయనా జీవుడితోపాటు ఈ శరీరంలో ఉంటూ సుఖమో, దు:ఖమో పొందవలసివస్తుంది.
అందుకని శ్రుతి మరొక మంత్రములో ద్వాసుపర్ణా సయుజా సఖాయా, సమానంవృక్షం పరిషస్వజాతే తయోరన్య: పిప్పలం స్వాదు అత్తి, అనశ్నన్ అన్యో అభిచాకశీతి అని జీవపరమాత్మలిరువురూ శరీరంలో ఉన్నా, జీవుడు మాత్రమే కర్మఫలాన్ని అనుభవిస్తాడని, పరమాత్మేమో జీవునిచేత ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తూ ఉంటాడని జెప్పింది. కనుక పరమాత్మకి ప్రయోజన కర్తృత్వము, జీవునికి ప్రయోజ్యకర్తృత్వము సిద్ధిస్తాయి. ప్రస్తుతమున బాహ్యపదార్థముల అనుభవ విషయములో కూడా ఆయా పదార్థాలని అనుభవించేదీ, సుఖమో-దు:ఖమో పొందేదీ ప్రయోజ్యకర్త అయిన జీవుడే, పరమాత్మ కేవలము కూడా ఉండి ఆయా పదార్థాలని అనుభవింపచేస్తూ ప్రయోజక కర్త తానవుతున్నాడు. కనుక, వైశ్వానరుడు స్థూలభుక్ అయ్యాడు. ఇదియే భోగ్యము.
ఈ విధంగా జాగ్రత్ దశలో ఉండు జీవునికి అన్తర్యామిగానుండి శాసించువాడు అనిరుద్ధ, వైశ్వానర నామములకల పరమాత్మ యొక్క మొదటి స్వరూపమని, వాని స్థానము చక్షురీంద్రియమని, వాని వ్యాపారము బాహ్యపదార్థముల యొక్క జ్ఞానము జీవునికి కల్గించడమని, 7 అంగములు, 19 ముఖములు కల్గినది వాని రూపమని, స్థూలపదార్థములన్నీ వాని భోగ్యములను ఐదు విషయములు వివరించబడినవి.
*విశ్వమే ఆహారంగా గల సాక్షాత్తు విశ్వానరుడి స్వరూపమే పరమేశ్వరి గనుక ఆ తల్లి మహాశనా అని సార్థక నామాంకిత అయినది. ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం మహాశనాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[05:29, 14/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
179వ నామ మంత్రము
ఓం భేదనాశిన్యై నమః
భక్తులలోని జీవాత్మ, పరమాత్మలు వేరు వేరు అను భేద బుద్ధిని నశింపజేయు పరబ్రహ్మస్వరూపిణికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి భేదనాశినీ యను ఐదుఅక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం భేదనాశిన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరబ్రహ్మ స్వరూపిణియైన లలితాంబను భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు భేదరహితమైన భక్తి మరింత కలిగి, సుఖశాంతులతో జీవనముకొనసాగిస్తూ, ఆత్మానందానుభూతితో జీవించును.
జీవాత్మ, పరమాత్మల భిన్నత్వాన్ని భావించే ద్వైతభావనను భక్తులలో తొలగించి,అద్వైతభావనను పెంచుతుంది జగన్మాత గనుక భేదనాశినీ యను నామ మంత్రము కలిగియున్నది.
నేను అంటే ఈ శరీరము, ఇంద్రియాలు అని కాదు. యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తు అహం బ్రహ్మస్మి అని చెప్పింది. అహం బ్రహ్మ అస్మి అంటే నేను బ్రహ్మ అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. ప్రతి మనిషిలోను భగవంతుడు కొలువై ఉంటాడు. అందుకే అన్నారు అహం బ్రహ్మస్మి అని కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు.
శరీరము వేరు, నేను అనుకునే నేను వేరు. నేను అనేది అత్మ మాత్రమే. ఈ నేను అనే ఆత్మ అలా కర్మలనాచరిస్తూ, కర్మవాసనలననుసరించి దేహాలు మారుతూ ఉంటుంది. కర్మపరిపక్వతచెంది, సత్కర్మలైతే ఫలితంగా జన్మరాహిత్యం లభిస్తుంది. ముక్తిలభిస్తుంది.
చరాచర జగత్తులో పంచభూతాలు (నేల, నింగి, నిప్పు, నీరు, గాలి),కొండలు, జలరాశులు, జీవరాశులు మొదలైనవాటిని ఊహిస్తే అంతా పరబ్రహ్మస్వరూపమే. పరబ్రహ్మము తప్ప మరేదియు తోచదు. వేరేదైనా ఉంది అనిభావిస్తే అది అజ్ఞానమౌతుంది. అట్టి అజ్ఞానమే భేదభావము. జగన్మాత తన భక్తులలో ఈ భేదభావాన్ని పోగొడుతుంది గనుక భేదనాశిని యని అనబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భేదనాశిన్యై నమః అని అనవలెను.
శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578 🌹
🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 22 🌴
22. ఆదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే |
అసత్ర్కుతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ||
🌷. తాత్పర్యం :
అపవిత్రత ప్రదేశమునందు తగని సమయమున అపాత్రులకు ఒసగబడునటువంటిది లేదా తగిన శ్రద్ధ మరియు గౌరవము లేకుండా ఒసగబడునటువంటిదైన దానము తమోగుణప్రధానమైనదని చెప్పబడును.
🌷. భాష్యము :
మత్తుపదార్థములను స్వీకరించు నిమిత్తముగాని, జూదము నిమిత్తముగాని చేయబడు దానములు ఇచ్చట ప్రోత్సాహింపబడుటలేదు.
అటువంటి దానము తమోగుణ ప్రధానమై లాభదాయకము కాకుండును. పైగా అటువంటి దానము చేయుటవలన పాపులను ప్రోత్సాహించినట్లే యగును.
అదే విధముగా పాత్రుడైనవానికి శ్రద్ధ మరియు గౌరవము లేకుండా దానమొసగుటయు తమోగుణమును కూడినట్టి దానముగా భావింపబడును
🌹 🌹 🌹 🌹 🌹
🌻166. వీరహా, वीरहा, Vīrahā🌻
ఓం వీరఘ్నే నమః | ॐ वीरघ्ने नमः | OM Vīraghne namaḥ
వీరహా, वीरहा, Vīrahā
ధర్మత్రాణాయ వీరాంస్తాన్ దైత్యాన్ హంతీతి వీరహా ధర్మ రక్షణ కొఱకు అధర్ములైన దైత్యాది వీరులను సంహరించు విష్ణువు వీరహా అనబడును.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, శ్రీకృష్ణావతార ఘట్టము ::
సీ. గుణము వికారంబుఁ గోరికయును లేని నీవలన జగంబు నెఱి జనించుఁ,
బ్రబ్బు, లేదగు; నంచుఁ బలుకుట దప్పుగా దీశుండవై బ్రహ్మ మీవ యైన
నినుఁ గొల్చు గుణములు నీ యానతులు సేయ, భటులు శౌర్యంబులు పతికి వచ్చు
పగిది నీ గుణముల బాగులు నీ వని తోఁచును నీమాయతోడఁ గూడి
ఆ. నీవు రక్త ధవళ నీల వర్ణంబుల, జగము సేయఁ గావ సమయఁ జూడఁ
దనరు, దట్లు నేఁడు దైత్యుల దండింపఁ, బృథివిఁ గావ నవతరించి తీశ!
నీ వలన జగత్తు అంతా జన్మిస్తుంది. అయితే ఆ జగత్తుకి అవసరమైన త్రిగుణాలు గాని, వాని మార్పులు గాని నీకు లేవు. సృష్టి చేయాలనే కోరికకూడా నీకు లేదు. నీ వల్లనే పుట్టిన జగత్తు నీవలననే వృద్ధిపొంది నీయందే లయమవుతుంది అనడం పొరబాటు కాదు. సర్వాతీతుడవై బ్రహ్మము అయిన నీవు తమ ప్రభువు వని త్రిగుణాలు నీ ఆజ్ఞను పరిపాలిస్తాయి. లోకంలో భటుల శౌర్యం ప్రభువు శౌర్యంగా ప్రసిద్ధి కెక్కుతుంది. అలాగే నీ మాయతో కూడి గుణాలూ, వాటి గొప్పతనమూ నీవిగా కన్పిస్తుంటాయి. నీవు ఎర్రని రంగుతోకూడి ఉన్నప్పుడు రజోగుణ రూపుడవై సృష్టి చేస్తావు. తెల్లని రంగుతోకూడి ఉన్నపుడు సత్త్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తావు. నల్లని రంగుతోకూడి ఉన్నపుడు తమోగుణ రూపుడవై, సృష్టినంతటినీ లయం చేస్తావు. ఇవన్నీ నీవు ధరించే పాత్రలు. అలాగే నేడుకూడా దైత్యులను దండించడానికి భూమిపై మానవుడుగా అవతరించావు. అయినా నీవు మాకు ప్రభుడవే!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌻167. మాధవః, माधवः, Mādhavaḥ🌻
ఓం మాధవాయ నమః | ॐ माधवाय नमः | OM Mādhavāya namaḥ
విద్యాపతిత్వాచ్ఛ్రీ విష్ణుః స్స మాధవ ఇతీర్యతే మా అనగా విద్య; ధవః అనగా స్వామి. బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ విద్య మా అనబడును. సర్వ విద్యలును మా అను శబ్దమున చెప్పబడును. బ్రహ్మ విద్యకు ఇతర విద్యలకు అన్నింటికీ విష్ణువు స్వామి కావున మాధవుడనబడునని వ్యాసుడే హరివంశమున స్పష్టపరచెను.
:: హరివంశము - తృతీయ స్కంధము, అష్టాశితోఽధ్యాయః ::
మా విద్యా చ హరేః ప్రోక్తా తస్యా ఈశోయతో భవాన్ ।
తస్మా న్మాధవనామాఽసి ధవః స్వామీతి శబ్దితః ॥ 49 ॥
హరికి సంబంధించు విద్య (పరమాత్మ తత్త్వ జ్ఞానము) 'మా' అని చెప్పబడును. నీవు దానికి ఈశుడవుకావున ధవః అనగా స్వామి అని అర్థము. కావున నీవు 'మాధవః' అను నామము కలవాడవగుచున్నావు.
72. మాధవః, माधवः, Mādhavaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥
[05:56, 14/12/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 131 🌹
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 61 🌻
అవస్థాత్రయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. మానవులందరూ, జీవులందరూ సృష్టి అంతా కూడా జాగ్రత్ స్వప్న సుషుప్తులకు లోనౌతుంది. సర్వేంద్రియ వ్యవహారం పరిణామ శీలమై, ప్రతిభావంతముగా వ్యవహరిస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో దానిని జాగ్రదావస్థయని, అవే ఇంద్రియములు వెనుకకు మరలి, తమకు ఆధారంగా ఉన్నటువంటి, మనస్సు అనేటటువంటి ఏక ఇంద్రియమునందు అంశీభూతములై, నిక్షిప్తమై, అర్థజాగృతి సగము మెలకువ, సగము నిద్రా స్థితిలో సర్వేంద్రియానుభూతులన్ని ఇంద్రియముల సహాయము లేకనే అనుభవించేటటువంటి స్వప్నావస్థలోనూ,
ఆ మనస్సు కూడా అచేతనమై, సుప్త చేతనమై సుషుప్త్యావస్థలో కదలక పడియుండేటటువంటి ఇంద్రియముగా, పనిముట్టుగా మనస్సు, బుద్ధి కూడా మారి, ప్రజ్ఞా స్థితిలో నిలకడ చెంది, కానీ అట్టి ఎఱుకలేక తానైనటువంటి స్థితిని తెలుసుకోలేక తనను తాను మరిచిపోయి, శరీర భ్రాంతి యందే నిమగ్నమై ఉన్నటువంటి జీవుడు, జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలను నిరంతరాయముగా అనుభవిస్తూ, వాటియందే పరిణమిస్తూ, ఆ పరిణామమే సత్యమనుకొనుచూ, ఆ ద్వంద్వానుభూతులే సత్యమనుకొనుచూ,
అట్టి ద్వంద్వానుభూతులయందు సరియైనటువంటి వ్యవహారము లేకున్నచో తనకే ఏదో అయిపోవుచున్నదనే భ్రాంతిని పొందుచూ ఇవాళ నిద్ర సరిగ్గా పట్టలేదండీ, ఇవాళ కలలు విపరీతంగా వచ్చినాయండి. ఇవాళ నిద్రమధ్యలో లేచి కూర్చున్నానండి. ఇవాళ జాగ్రదావస్థ సరిగ్గా లేదండి. ఇవాళ మెలకువలో అంతా భావములు అన్నీ కూడాను మనః సంయమనం లేకపోవడం చేత, అరిషడ్వర్గాల చేత, కామక్రోథలోభమోహ మద మాత్సర్యముల చేత భావించబడుతూ, బాధించబడుతూ ప్రభావితం అవుతూ ఆ ఇంద్రియ సంగత్వాన్ని,
సుఖ దుఃఖ సంగత్వాన్ని, వ్యవహార సంగత్వాన్ని, ప్రతిబింబ సంగత్వాన్ని పొంది, స్వప్నావస్థలోకూడా సరియైనటువంటి స్థితి లేక అనేక రకములైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తున్నట్లుగా ఇబ్బందులను అధిగమిస్తున్నట్లుగా బాధచెంది సరైన నిద్రావస్థలేక, సరియైన స్వప్నావస్థ లేక, సరియైన జాగ్రదావస్థ లేక ఈ మూడూ కూడా శరీరమే అనుభవిస్తున్నది కానీ నేను అనుభవించడం లేదనేటటువంటి జ్ఞానము లేకపోవడం చేత,
తురీయావస్థలో ప్రవేశం లేకపోవడం చేత, స్వాత్మసాక్షాత్కర జ్ఞానంలో అనుభవజ్ఞానం లేకపోవడం చేత, ప్రతి నిత్యమూ ఈ మూడు అత్యవసరమై ఉన్నదని తోచుట చేత, ఈ మూడింటి యందే నిమగ్నమగుచు, వీటినే నిత్యజీవితముగా భావించుచు, వీటి యందున్న వ్యవహారమునందు కలుగుచున్న సుఖదుఃఖములే సత్యమని భ్రమసి, వాటి యందు సాంగత్య దోషమును పొంది, వాటి సంగత్వము చేత ప్రభావితము అవుతూ, వాటినే నిరంతరాయముగా కోరుచూ, ఏ ఆత్మకైతే ఇట్టి మూడు అవస్థలు లేవో, ఏ ఆత్మ యొక్క ఉనికి చేతనే ఈ మూడు అవస్థలు ఏర్పడుచున్నవో, అట్టి స్వస్వరూప జ్ఞానాన్ని మానవుడు ఆశ్రయించడం లేదు.
అందువల్లనే జరానమరణ రూప సంసార చక్రమునందు, కర్మ చక్రమునందు ఇమిడిపోయి, బాధించబడి, ప్రభావితమై మరల మరల పరిణామ శీలమై పునరావృత్తిని పొందుచున్నాడు. కానీ పునరావృత్తి రహితమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, మోక్షదాయకమైనటువంటిది, ముక్తిదాయకమైనటువంటిది అయినటువంటి స్వాత్మనిష్ఠను, కాలత్రయాన్ని, శరీర త్రయాన్ని, దేహత్రయాన్ని దాటి అవస్థాత్రయ సాక్షిత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు.
ఇప్పటి వరకూ కాలత్రయాన్ని, శరీర త్రయాన్ని, దేహత్రయాన్ని, ఈషణ త్రయాన్ని ఇలా మూడు మూడుగా ఉన్నటువంటి త్రిపుటులనన్నింటిని వివరిస్తూ ఇప్పుడు అవస్థాత్రయాన్ని.... అవస్థ అంటేనే అర్థం ఏమిటంటే, అస్థః అంటే ఉండుట. అవ - అంటే ఉన్నస్థితి నుంచి క్రిందకి దిగి వచ్చుట. అవస్థ - కాబట్టి తను ఆత్మస్వరూపుడై ఉన్నప్పటికి, జాగ్రదావస్థలో, మెలకువలో ఇంద్రియములతో వ్యవహరించుచూ, ఆ ఇంద్రియ వ్యవహారమే తానని భ్రమసి, ఆ భ్రమచేత భ్రాంతి చెంది,
మాయా మోహితుడై, అట్టి మాయా మోహమును మరింతగా అనుభవించాలనేటటుంవంటి కాంక్ష చేత, ప్రియాప్రియముల చేత లాగబడి, గుణత్రయముల చేత ప్రభావితమై మనోఫలకములో, మనోబుద్ధులచేత స్వప్నావస్థ యందుకూడా అదే ఇంద్రియానుభవములను మరల మరలా అనుభవించుచూ సంతృప్తి లేక, అసంతృప్తులను చెందుచూ, ఇంకనూ బలమైనటువంటి సుఖమును పొందాలనే బలీయమైన కాంక్ష చేత, లేని సుఖమును పొందాలనే ప్రయత్నము చేత, వస్తుగత నిశ్చయజ్ఞానము లేక,
ఆ వస్తువులు సుఖం ఇస్తున్నాయనే భ్రాంతి చేత, ఆ ఇంద్రియములే సుఖస్థానములని భ్రమసి, భ్రాంతి చెందటం చేత, భ్రమాజన్యజ్ఞానము అభ్యాసము చేత, భ్రమాజన్య జ్ఞానమును ఆశ్రయించడం చేత, ప్రతిబింబ జ్ఞానమునే సత్యమని భావించుట చేత, ఆ రకమైనటువంటి జాగ్రత్ స్వప్న సుషుప్తులను శరీరమే అనుభవించు చున్నప్పటికి, తాను అనుభవించుచున్నాడని తనకు ఆపాదించుకొనుచున్నాడు. ఇదీ అజ్ఞానమంటే.
నేను ఇవాళ సరిగ్గా నిద్రపోలేదండి! - విద్యా సాగర్ గారు
సశేషం...
. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 5 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 5 🍀
యోగ యాగ విధీ యేణే నవే సిద్ధీ!
వాయాచి ఉపాదీ దంటే ధర్మ్!!
భావే వీణ దేవ నకళె నిస్సందేహ్!
గురు విణ్ అనుభవ కైసా కళే?!!
తపే విణ్ దైవత్ ది ధల్యా వీణ్ ప్రాప్తి!
గుజే వీణ్ హిత్ కోణ్ సాంగే!!
జ్ఞానదేవ సాంగే దృష్టాంతాచీ మాత్!
సాధూచె సంగతీ తరణోపాయ్!!
భావము:
యోగము, యాగము విధి విధానాలతో పరమార్థము సిద్ధించదు. ఇవి నశించే ఉపాదులు మరియు డంభధర్మము కలిగించును. భావన లేకపోతే నిస్సందేహముగ దేవుడు తెలియడు. గురువు లేకుండానే అనుభవము ఎలా రాగలదు.
తపము చేయక పోతే దైవత్వము రాదు, దానము చేయకుండానే పుణ్యము రాదు. మరి! అడగక ముందే హిత వచనము ఎవ్వరు చెప్పగలరు! సాధు సాంగత్యమే తరుణోపాయమని శాస్త్రాదులలో అనేక దృష్టాంతములు కలవని జ్ఞానదేవులు చెప్పుచున్నారు.
🌻. నామ సుధ -5 🌻
యోగ యాగము విధి యుక్తము
సిద్ధించదు వీటితో పరమార్థము
నశించే ఉపాధులే ప్రాప్తము
ఢంభధర్మము, అభిమానము
భావన లేనిదే దైవము
తెలియజాలదు నిస్సందేహము
గురువు లేనిదే ఆ అనుభవము
కలుగుట నీకు ఎలా సాధ్యము?
తపము చేయకనే దైవ కటాక్షము
దానము చేయకనే పుణ్య ఫలితము
అడుగక ముందే హిత వాక్యము
చెప్పేది ఎవ్వరు ఉపదేశము
జ్ఞాన దేవులు చెప్పిన వచనము
దృష్టాంతములున్నవి అనేకము
సాధువుతో చేయుము సాంగత్యము
వారి బోధలే తరుణోపాయము
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖
🌻146. 'నిష్క్రపంచా'🌻
ప్రపంచము లేనిది శ్రీమాత అని అర్థము.
శ్రీమాత నుండి పుట్టినది ప్రపంచము. ప్రపంచ మనగా పంచభూతములతో విస్తారముగ నేర్పడినది. పంచభూతములామెపై ప్రభావము చూపలేవు. ప్రపంచ మనగా మొత్తము సృష్టి యను భావన కూడ వున్నది. అట్టి సృష్టికి కూడా ఆమె అతీతము. సృష్టిగాని, సృష్టి యందలి ఏ శక్తిగాని ఆమెపై ప్రభావము చూపలేవు. దైవమునకు, జీవులకు గల ప్రధానమగు వ్యత్యాసములలో ఇది ఒకటి. జీవులపై గుణములు, పంచభూతములు, ప్రభావము చూపుచునే యుండును. జీవులు కూడా ఒకరిపై నొకరు ప్రభావము చూపుచు నుందురు.
ఈ విధముగ జీవుడు అనేకానేక ప్రభావములకు లోనగుచుండును. ఒకపూట యున్నట్లు మనస్సు మరి యొకపూట యుండదు. కారణము జీవులు, సృష్టి వారిపై చూపు నిరంతర ప్రభావమే. కేవలము నిద్రయందు మాత్రమే యెట్టి ప్రభావము సోకక యుండుట వలన జీవులకు విశ్రాంతి దొరకు చున్నది. ఇతర సమయములలో ఏదియో యొక విషయము వారి మనస్సులపై ప్రభావము చూపుచు నడిపించుచు నుండును.
దైవ భక్తులు తమ నిరంతర, నిశ్చల ఆరాధన ద్వారమున ఈ ప్రభావమునుండి బయల్పడుటకు ప్రయత్నింతురు. దైవముతో ప్రజ్ఞ ముడిపడి యున్నప్పుడు ఇతర ప్రభావము లేమియు తమపై నుండవు. ముడివిడినపుడు ఏదియో యొక భావన ద్వారమున సృష్టి, జీవులు, జీవులపై ప్రభావము చూపుచు నుందురు. అనన్య చింతనులు సృష్టి యందు ప్రపంచ ప్రభావము లేక వర్తించుచుందురు.
వారే సద్గురువులు, మార్గదర్శకులు. వారు శ్రీమాతకు ప్రియమగు భక్తులు. పై కారణముగ 'నిష్క్రపంచ' యగు శ్రీమాత అనుగ్రహము పొందుటకు ప్రపంచమున మునిగిన జీవులు శ్రీమాతను ఆరాధించుట మార్గము. సద్గురు ముఖద్వారమున ఆరాధించుట సౌలభ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 147 / Sri Lalitha Chaitanya Vijnanam - 147 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖
🌻147. 'నిరాశ్రయా'🌻
ఏ ఆశ్రయము లేనిది శ్రీమాత అని అర్థము.
సృష్టిలోని ప్రతి జీవునికిని శరీరమే ప్రధానమగు ఆశ్రయమై యున్నది. అల్పులకు ఆస్తిపాస్తులు, కుటుంబము, బంధుమిత్రులు ఆశ్రయమై యుండును. సంఘమున కీర్తి, ప్రతిష్ఠలు, పదవులు, యిత్యాదిని ఆశ్రయించి జీవించువారు ఇంకనూ పతనము చెందిన వారే. కీర్తి, ప్రతిష్ఠ, పదవి, బంధుమిత్రులు, శరీరము కూడ తనపై ఆధారపడి యున్నవి కాని వాటిపై తాను ఆధారపడి లేడు.
ప్రధానముగ ప్రతి ఒక్కడును జీవుడు. జీవుడుగ జ్యోతి స్వరూపుడు. నత్త నుండి రసము స్రవించి నత్తగుల్ల ఏర్పడినట్లు తననుండియే తన శరీరము, శరీర సంబంధముగ కుటుంబము, ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు, పదవులు, కీర్తిప్రతిష్ఠలు, ఏర్పడుచున్నవి.
వాటన్నింటికిని తానాశ్రయము. తన నాశ్రయించిన వానిపై ఆధారపడువాడు అల్పబుద్ధియే కదా! చక్రవర్తి సైనికునిపై ఆధారపడినట్లు, రాజు బంటుపై ఆధారపడినట్లు హీనముగ జీవించుట, తనను తానాశ్రయింపక యితరముల నాశ్రయించిన వారికి తప్పదు.
శ్రీమాత నుండి కోటానుకోట్ల జీవులు, లోకములు యేర్పడినను వాటన్నింటికిని తానాశ్రయమై నిలచినదే కాని తాను దేనినీ ఆశ్రయించదు. ఆమె శరీరమును కూడ ఆశ్రయించి యుండదు.
అందులకే ఆమె నిరాకార అని చెప్పబడినది. దేవతలు, ఋషులు, యోగులు కారణ శరీరమునుగాని, సూక్ష్మ శరీరమునుగాని, ఆశ్రయించి యుందురు. మానవులు భౌతిక శరీరము నాశ్రయించి యుందురు. కాని మానవులయందు, యోగుల యందు, ఋషుల యందు శ్రీమాత నాశ్రయించినవారు ఆమె వలననే నిరాశ్రయ స్థితి పొందుదురు. వారి నిరాశ్రయత కన్న మించినది శ్రీమాత 'నిరాశ్రయ'
సశేషం...
Comments
Post a Comment