[15:49, 28/12/2020] +91 92915 82862: తిరుప్పావై 14వ రోజు పాశురము
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
14 వ పాశురం
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఉజ్గళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెజ్గళు నీర్ వాయ్ నెగిళ్ న్దు అమ్బల్ వాయ్ కూమ్బినకాణ్
శెజ్గల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్
తజ్గళ్ తిరుక్కోయిల్ శజ్గిడువాన్ పోగిన్ఱార్
ఎజ్గళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్!
శజ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పజ్గయక్కణ్తానై ప్పాడేలో రెమ్బావాయ్!!
భావం:-
ॐॐॐॐॐॐॐॐॐॐ
స్నానము చేయుటకు గోపికల నందరును లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఈ పాశురములో మేల్కొల్పుచున్నారు. ...... ఓ పరిపూర్ణురాలా ! నీ పెరటి తోటలో దిగుడుబావిలో ఎర్ర తామరలు వికసించినవి. నల్లకలువలు ముడుచుకొనిపోవుచున్నవి. లెమ్ము .... ఎఱ్ఱని కాషాయములను దాల్చి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమతమ ఆలయములలొ ఆరాధనము చేయుటకై పోవుచున్నారు లెమ్ము. ముందుగా నీవు మేల్కొని వచ్చి, మమ్ములను లేపుదువు అని మాట ఇచ్చినావు కదా ? మరచితివా ? ఓ లజ్జా విహీనురాలా ! లెమ్ము , ఓ మాట నేర్పుగలదానా ! శంఖమును - చక్రమును ధరించిన వాడును, ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము.
ఏమె సఖీ! ఇదేమి? ముందుగ మమ్ములను లేపుదునంటివికదా! ఇంతవరకును పండుకొనే వున్నావేమి? లే! లెమ్ము! తెల్లవారిపోయినది. చూడు. మీ పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి. నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు. యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి 'కుంచెకోలను' తాళపు చెవులను తీసికొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతః కాలమగు సూచనలేకదా! నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి? నీవు పూర్ణురాలవుకదా! సరే! ఇకనైన లేచిరమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేని దానా? లేవవమ్మా అనగా 'నన్నేల నిందింతురు? నేనేమి చేయవలె?; ననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంక జాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా' అని గోదాదేవి యీ (పాశురంలో) తొమ్మిదవ గోపికను లేపిచున్నది.
అవతారిక ॐॐॐॐॐॐॐॐॐॐ
ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపెదనని చెప్పిన ఒకగోపిక మేల్కొల్పబడుచున్నది. ఈమె వీరి సంఘమునకు అంతకు నాయకురాలై నడిపింపగల శక్తి గలది, తన పూర్ణానుభవముచే ఒడలు మరచి తాను చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరించి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తను ఉండిపోయెను. ఈమె ఇంటిలో ఒకపెద్ద తోట కలదు. పెరటి వైపున ఉన్న ఆ తోటలో దిగుడుబావి కలదు. ఆ దిగుడుబావిలో తామరపూవులు, కలువపూవులు ఉన్నవి. ఆమె తన్మయతతో అనుభవించుచు ఇతరములను మరచి ఉండెను. అట్టి స్థితిలో ఉన్న గోపికను ఈరోజు మేలుకొలుపు చున్నారు.
ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముని, శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతి యైన గోపికను మేల్కొలిపారు క్రిందటి (పాశురంలో) ఇప్పుడు ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్ధత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాల్ తల్లి (యీ పాశురంలో) లేపుతున్నది.
తానే వచ్చి అందరను మేల్కొల్పుతానని బీరాలు పల్కి, ఇంకను నిద్రబోవుచున్నదీ గోపిక. తన పెరట్లోని దిగుడుబావిలోని కలువలూ, తామరలనూ చూచుకొని మురిసిపోతున్నదీమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది. ఈమె భగవదను భవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి, ఆ ఆనందాను భూతిలోనే నిమగ్నయైనత్తిట్టి యిట్టి గోపికను (యీ పాశురంలో) మేల్కొలుపుతున్నది మన ఆండాళమ్మగారు.
లలితరాగము - ఏకతాళము
ॐॐॐॐॐॐॐॐॐॐ
ప.. ముందుంగ లేపుదు నంటివి ముచ్చటలెన్నో చెప్పితి
వెందుబోయె నోటిమాట! సిగ్గు నీకు లేకపోయె!
1 చ.. పెరటి దిగుడు బావిలోని ఎర్రని కలువలు నవ్వెను!
పరికించవె సఖి! ఆ నీలోత్పలములు ముకుళించెను!
తిరు కోవెల 'కుచ్చికోల' తెరువగ నదె తపోధనులు
వర కాషాయాంబరులౌ శుభ్రదంతు లేగ గనవె!
2 చ.. శంఖ చక్రములు గల్గిన శ్రీహస్తుని హరిని
పంకేరుహ నేత్రుని - శ్రీ కృష్ణుని సర్వేశుని
పంకజలోచనీ! పాడుమో మంజుల భాషిణీ'
ఇంకనైన లేవవె! నీ నిద్దుర చాలించవె!
ॐॐॐॐॐॐॐॐॐॐ
వేదమే ప్రమాణం
ఆండాళ్ తిరువడిగలే శరణం
ॐॐॐॐॐॐॐॐॐॐ
మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తి
గా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక.
అందుకే మనం వేద మర్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.
"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్" ఎర్ర కలవలు వికసిస్తున్నాయి "ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి.
సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు. లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావల్సిస్తే చూసుకో.
అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక.
"శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్" తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ " ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్" తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.
అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ "ఎంగళై" మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్" ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే! "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటంలేదా "నావుడైయాయ్" పెద్ద మాటకారిదానివి.
జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో " శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ"
ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.
ॐॐॐॐॐॐॐॐॐॐ
తిరుప్పావై 14వ పాశురము/తెలుగు పద్యానువాదము
ॐॐॐॐॐॐॐॐॐॐ
సీ .కలువలు కనుమూసె కమలమ్ము పూసెను
పెరటి కొలనులందు విరివి గాను
జీయరు స్వాములు చేరిరి కోవెల
కుంచె కోలల దాల్చి గుళ్ళు తెరువ
మిమ్ము నేనే వచ్చి మేల్కొల్పెదను యంచు
నిదురింతు రేలనే నీరజాక్షి
శంఖ చక్రధరుని శౌరిని పొగడగా
తరుణు లందరు కూడి తరలిరమ్ము
తే.గీ. నిద్ర మానవే ఓ కొమ్మ నీలనేత్రి
సేవ చేయగ రమ్మని చెలియ పిలువ
మాట కత్తెగ నీవెన్ని మాటలాడి
సిగ్గు చిందింతు వేలనే చిగురు బోడి
శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నొసగు
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
[నృప॥9128॥
పరీక్షిన్మహారాజా! ప్రజాపాలన తత్పరుడైన సమర్థుడగు రాజుయొక్క పాలనలో దొంగలు, పెద్దపులులు మున్నగు దుష్టమృగములు తప్ప ప్రజలు, సాత్త్వికప్రాణులు నిర్భయముగా సంతోషముతో జీవించుచుందురు. అట్లే శరదృతువునందు సూర్యోదయమైనంతనే కలువలు తప్ప తక్కిన కమలములు మొదలగు పుష్పములు చక్కగా వికసించి, కలకలలాడుచుండెను.
20.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
పురగ్రామేష్వాగ్రయణైరింద్రియైశ్చ మహోత్సవైః|
బభౌ భూః పక్వసస్యాఢ్యా కలాభ్యాం నితరాం హరేః॥9129॥
శరత్కాలమున నగరముల యందును, గ్రామములయందును ఇంద్రసంబంధమైన ఆగ్రయణములు (క్రొత్త ధాన్యములను తినుటకు ముందు ఆచరింపబడు యాగములు), ఇతర మహోత్సవములు మున్నగు వాటికారణముగా భూమి పాడిపంటలతో విరాజిల్లు చుండెను. మహాత్ములైన బలరామకృష్ణుల ప్రభావముతో భూతలము ఇంకను పరళశోభావహమై యుండెను.
20.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
వణిఙ్మునినృపస్నాతా నిర్గమ్యార్థాన్ ప్రపేదిరే|
వర్షరుద్ధా యథా సిద్ధాః స్వపిండాన్ కాల ఆగతే॥9130॥
తపశ్చర్యలతో సిద్ధిపొందిన మహాపురుషులు తమ తనువులను చాలించి (ఈ లోకమును వీడిన పిమ్మట) తమ తపస్సుల ఫలముగా ఉత్తమ జన్మలను పొందుచుందురు. అట్లే వణిజులు, మునులు, రాజులు, తీర్థయాత్రాపరులు వర్షఋతువు ముగియువఱకును తమ తమ స్థానములయందే నిలిచి (తమ స్థానములను వీడక) యుందురు. కాని శరదృతువు ప్రవేశింపగనే వణిజులు క్రయవిక్రయాదికములైన తమ వ్యాపారముల కొఱకును, మునులు తమ స్వచ్ఛంద సంచారముల కొఱకును, రాజులు జైత్రయాత్రకును, వేదాధ్యయనమును ముగించిన బ్రహ్మచారులు వివాహమునకై తమ గృహములను చేరుటకును బయలుదేరిరి.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం
శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి
దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ |
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||
భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||
శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ , విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది , త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.
ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ , సర్వస్వతి , పార్వతిమాతలు , మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు.
నారద మహర్షి అనసూయ "పాతివ్రత్యాన్ని" (భర్త పట్ల భక్తిభావం) గురించి బ్రహ్మ - విష్ణు - శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు , ఈర్ష్య , అసూయ , ద్వేషమనే దుర్గుణలకు లోనయితే ! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పడానికో , శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకడానికో ! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తూలు ఎంతవారించినా , పెడచెవిని పెట్టారు ససేమిరా ! అన్నారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు.
వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది , వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది.
లేడిపిల్లలు చెంగు చెంగున గంతులువేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణుల కేరింతలతో అ ఆశ్రమ వాతవరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామ మేమిటో ? అని వారిని చూచిన పక్షులు కిలకిలా రాగాలు చేయసాగాయి. ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు , మరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమనీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో , మనం ముగ్గురం కూడ చిన్నారి బాలురవలె ఈ మునిబాలకులతో కలిసి ఆడుకుంటే ! ఎంతబాగుండునో ! అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం , అని తలచి ఆశ్రమం ముంగిటవైపునకు పయనమయినారు.
మహా తపోబలసంపున్నుడైన కర్దమ మహర్షికి , దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని , ముని శ్రేష్టుడైన అత్రిమహర్షికి ఇచ్చి వివాహంచేసారు.
అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూ , అతిధి అభ్యాగతులను అదరిస్తూ తన "పతి సేవతత్ పరతచే" పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూ , పంచభూతాలు , అష్టదిక్పాలకులు సహితం అణకువుగా వుండేలా చేస్తున్న ఆ పతివ్రతా తల్లిని , దివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధుపుంగవుల ముగ్గురిని చూచిన ఆ పుణ్య దంపతులు , సాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి , అనంతరం మీరు మువ్వురు బ్రహ్మ , విష్ణు , మహేస్వరులవలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు , భోజనాలు సిద్ధంచేశాను రండి అంటూ ! అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. వారి పలుకులు అ పతివ్రతా తల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది.
ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన "భర్త" ను మనసారా నమస్కరించుకుంది. "పాతివ్రత్యజ్యోతి" వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాసరూపంలో ఉన్నత్రిమూర్తుల గుట్టు రట్టు అయింది. వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ! ఏమి నా భాగ్యము ! ముల్లోకాలను ఏలే సృష్టి , స్థితి , లయకారకులైన వీరు నాముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారా ? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింప చేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా , అని ఆలోచిస్తూ ! ఒక ప్రక్క పాతివ్రత్యం , మరోవైపు అతిథిసేవ. ఈ రెండు ధర్మాలను ఏకకాలంల్లో సాధించడమెలా ? అనుకుంటూ పతికి నమస్కరించి "ఓం శ్రీపతి దేవయనమః" అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే అ ముగ్గురు పసిబాలురయ్యారు ! వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు , ౠషిబాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఊయలవేయగా ! వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది.
"ఇంతటి మహద్భాగ్యం" సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి.... ! ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి త్రుళ్ళిపడి మరలా తేరుకుని , తన దివ్య దృష్టితో జరిగినది , జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే ! కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి ! ఆ చిన్నారులు బుడి బుడి నడకలతో , ఆడుతూ గెంతుతూ అ మునిబాలకులతో , కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య , కౌమార , యవ్వన , వార్ధక్యాలలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కదా మధురాను భూతిని మిగిల్చిది అని మురిసిపోయారు. కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయౌనిజులైన వారికి చాలాకాలం కొనసాగుతుంది.
ఇలా ఉండగా ! లక్ష్మీ , సరస్వతి , పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెల్లుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన "ఈర్ష అసూయ - ద్వేషాలు" పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని ముని కన్యలు స్వాగతించారు. అ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి , ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది ! అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి , స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది.
పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిబిక్ష పెట్టమని కన్నీళ్ళతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే ! మీ మీ భర్తలను గుర్తించి ! తీసుకోని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో , ఒకేరూపుతో , అమాయకంగా నోట్లో వేలువేసుకోని , నిద్రిస్తున్న అ జగన్నాటక సూత్రధారులను ఎవరు ? ఎవరో ? గుర్తించుకోలేక పోయారు.
తల్లీ ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని "ఈర్ష్య , అసూయ , ద్వేషాలతో !" మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేపడతారు. అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన !
త్రిమూర్తులు సాక్షాత్కరించి , ఈ ఆశ్రమవాస సమయమందు , మీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు.
నాయనలారా ! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు ! మీరు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ , విష్ణు , బ్రహ్మ అంశలతో దూర్వాసుడు , దత్తాత్రేయ మరియ వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరమడిగింది. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత ! బ్రహ్మ , శివుడు వారి వారి అంశలను "దత్తనారాయణు" నికి యిచ్చారు. అప్పటి నుండి ఆ స్వామివారు "శ్రీ దత్తాత్రేయ" స్వామిగా అవతారము ఎత్తారు. ఆంద్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో కోరల పౌర్ణమి , కుక్కల పండగగా వ్యవహరిస్తారు. ఈ రోజు కుక్కలకు సజ్జ బూరెలు , తెప్పాల చెక్కలు ఆహరం పెట్టటం సాంప్రదాయం.
🕉️🌞🌏🌙🌟🚩
రేపు అనగా 29/12/2020 మార్గశిర పౌర్ణమి – దత్తాత్రేయ జయంతి
అత్రిమహర్షి భార్య అనసూయాదేవి. తన పాతివ్రత్య మాహాత్మ్యం చేత ఆ మాట బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శిశువులుగా చేసి ఆడించింది, పాలిచ్చింది. ముగ్గురుమూర్తులూ ఆ దంపతులకు కొడుకులయ్యారు.
త్రిమూర్తుల సమిష్టిరూపంగా అత్రి,అనసూయల బిడ్డడైన శ్రీదత్తాత్రేయుడు అనాదిగా హైందవ జాతీయుల పూజలందుకుంటున్నాడు. విష్ణువు దత్తాత్రేయుడని శివుడే దుర్వాస మహర్షి అని, బ్రహ్మదేవుడు చంద్రుడనీ భావించడం కూడా సనాతన సంప్రదాయం. శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించడం త్రిమూర్తులను పూజించడమే. తెల్లవారు ఝామున స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకృత్యాలను ఆచరించిన తరువాత శ్రీ దత్తాత్రేయుడిని షోడశోపచారాలలో అర్చించడం సంప్రదాయం.
పవిత్ర నదులలో ఈ రోజున స్నానం చేసి ఆతరిని అనసూయను శ్రీదత్తాత్రేయుడిని పూజించడం విశేష వ్రాత. శ్రీ దత్తాత్రేయుని చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక. ఆయనను పరివేష్టించి ఉండే శునక చతుష్టం - నాలుగు కుక్కలు - నాలుగు వేదాలకు ప్రతిరూపాలు. శునకం కాలభైరవుడు.
🕉️🌞🌏🌙🌟🚩
[00:13, 29/12/2020] +91 92915 82862: 🔥శ్రీ దత్తాత్రేయస్వామి🔥
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
శ్రీ దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు.
సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు.
ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో,
చంద్రుడు బ్రహ్మ అంశతో,
దుర్వాసుడు శివుని అంశతో
జన్మించారని పురాణ కథనం.
గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది.
ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదుఃఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు.
ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా,
ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది.
ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.
ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు.
ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.
అతని సతీమణి అనఘాదేవి.
అనఘ అనగా పాపము లేనిది.
పాపము మూడు విధాలు...
మనసు తో,
బుద్దితో,
ఇంద్రియములతో,
మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ.
దత్తుని రూపంలో అంతరార్థం:-
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో,
నాలుగు కుక్కలతో,
ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది.
వీటికి గల అర్థాలను పరిశీలిస్తే..
మూడు శిరస్సులు:
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు,
ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
నాలుగు కుక్కలు:
నాలుగు వేదములు ఇవి.
దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.
ఆవు:
మనసే మాయాశక్తి.
సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.
మాల:
అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.
త్రిశూలము :
ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.
చక్రము:
అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.
డమరు:
సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
కమండలము:
సమస్త బాధలను పోగొట్టును.
శుభములను సమకూర్చును.
దత్త తత్వం:
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
దత్తాత్రేయుని భక్తితో స్మరించినవారికి సమస్త పాపములు నశిస్తాయి.
దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది.
దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు.
తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా..
“అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ”
అనే పవిత్ర భావనతో,
భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు,
ఏదో ఒక రూపంలో వచ్చి,
రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.
శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని
21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది.
దత్తాత్రేయుడు మాయా ప్రభావితులై దారితప్పుతున్న మానవులకు జ్ఞానబోధనలకు,
ఆచారవ్యవహారాల అనుసరణకు,
ధర్మాధర్మ విచక్షణకు,
శిష్ట రక్షణతోబాటు,
మానవాళి విధ్యుక్త ధర్మాల ప్రబోధకే
దత్తుడు పెద్దపీట వేశాడు.
అందుకే ఆయన బోధగురువుగా మన్ననలను పొందారు.
దత్తావతార ముఖ్యోద్దేశం...భిన్నత్వంలో ఏకత్వసాధన.
అన్ని సాధనలను ఏకంచేసి,
తనలో కలుపుకోవడమే ఈ అవతార తత్త్వం.
విష్ణువు ధరించిన అనేక అవతారాలలో ఎంతో సనాతన మైనది, విలక్షణమైనది దత్తావతారం.
కర్మ, భక్తి, జ్ఞానాలను ఒక్కొక్క దానిని
ఒక్కొక్క యోగంగా మలచి,
వాటినన్నింటినీ జ్ఞానంతో సంలీనం చేసి,
సాధకులను బ్రహ్మజ్ఞాన విధులుగా పరిగణింపజేస్తాడు.
సాధనలో పరిపూర్ణ స్థితిని అందుకునేటట్లు అనుగ్రహిస్తాడు.
దత్త సాంప్రదాయం సంసారంలో ఉంటూనే, స్వధర్మపాలన చేసుకుంటూ తరించవచ్చని,
ముక్తిని సాధించవచ్చని తెలుపుతుంది.
దత్తునిది జ్ఞానతత్త్వం.
ఆయన బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగ విద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు.
దత్తుడు బ్రహ్మకు వేదవిద్య, మంత్రవిద్య, బ్రహ్మవిద్యలను ఉపదేశించాడు.
అలాగే ప్రహ్లాదునికి ఆధ్యాత్మిక విద్య,
వశిష్టునికి యోగవిద్య,
పరశురామునికి శ్రీవిద్య,
కార్తవీర్యునికి ఆత్మవిద్య,
అలర్కునికి యోగవిద్య...
ఇలా ఎంతో మంది మహానుభావులకు జ్ఞానామృతాన్ని పంచాడు.
ఇందులో సంతులు, సాధువులు, అవధూతలెందరో ఉన్నారు.
దత్త జయంతికి ఒక విశిష్టత ఉంది.
ఆకాశంలోని నక్షత్ర మండలంలో దత్తుడు జన్మించిన మార్గశిర మాసంలో పూర్ణిమ నాడు మానవులు నివసించే భూమి తిరుగుతూ, తిరుగుతూ, విశ్వాంతరాళంలో దత్తుని స్థానానికి అతి సమీపంగా వస్తుంది.
ఆ సమయానికి సూర్యచంద్రులతో బాటు, మానవులు కూడా ఒకే సరళరేఖలో దత్తునికి చేరువగా ఉంటారు.
అందువల్ల దత్తజయంతి నాడు అసంకల్పితంగా మానవులలోనికి దత్తశక్తి ప్రవేశిస్తుంది.
ఆ రోజు దత్తుని విశేషంగా పూజించిన వారు....వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.
ఈ శ్లోకాన్ని.. ఉదయం..మధ్యాహ్నం(12గంటలకు) సాయంత్రం 21సార్లు..పఠిస్తే...
దత్త అనుగ్రహం కలుగుతుంది.
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
దత్తా దత్తా శ్రీ గురుదత్తా..!!
🕉️🌞🌏🌙🌟🚩
షోడశ దత్తవతారాలు)
శ్రీపాద శ్రీ వల్లభులు రెండవ సంవత్సరంలో ప్రవేశించినప్పటి నుండి వారు “షోడశ కళాపరి పూర్ణ మహా యుగావతారమను” విషయమును తెలుపుచుండిరి. దత్తాత్రేయుల వారికి షోడశ సంఖ్యకు (16) చాల దగ్గర సంబంధం కలదు. శ్రీపాదుల వారు 16వ సంవత్సరం వరుకు పీఠికాపురంలో ఉన్నారు. అటుపిమ్మట 30వ సంవత్సరం వరుకు కురువ పురంలో ఉన్నారు.
అయినప్పటికీ వారి వయస్సు 16వ సంవత్సరం లోనే నిలిచిపోయింది. అదే విధంగా దత్తాత్రేయుల వారి వయసు కూడా పదహారే! దత్తత్రేయుని అవతారలూ పదహారే! ప్రసిద్ధికెక్కిన ఆయన నామలూ పదహారే! దత్త సంప్రదాయం లో “షోడశాక్షరీ మంత్రం” మహా శక్తి వంత మైనది. ఆ మంత్రం గురించి ఉపనిషత్తులు “కావాలంటే 16సార్లు నీ తల నరికి ఇవ్వు కాని షోడశాక్షరీ మంత్రాన్ని మాత్రం ఇవ్వద్దని” చెపుతాయి.
16 సంఖ్య లో ని 1 ని 6 ని కలపగా 7 వస్తుంది.(1+6=7). ఋషుల భావన ప్రకారం సప్తమ సంఖ్య “మూలతత్వాన్ని” తెలుపుతుంది. అలాగే శ్రుతులు సప్త(7) సంఖ్య ని “అనంతమని”, “పరబ్రహ్మ” అని సూచించాయి.
కాబట్టి పై వివరణలో ఋషుల మరియు శ్రుతుల భావన ప్రకారం చెప్పబడిన ములతత్వం-అనంతం అనేవి దత్తాత్రేయుడుగా చెప్పవచ్చును. అందువల్లనే దత్త సంప్రదాయం లో “సప్తావరణపూజ”కు అధిక ప్రాధాన్యత కలదు.
అలాగే దత్తాత్రేయుడు ఉండే లోకం 7వదైన ఊర్ధ్వలోకం (సత్యలోకం). అదేవిధంగా మన శరీరంలో ఉండే 7వ చక్రం పేరు “సహస్రారచక్రం”. సహస్రారంలో దైవశక్తి ఉంటుంది.
సాధకుడు తన కుండలిని శక్తిని జాగృతంచేసి క్రింద(మూలాధారం) నుండి పైకి 7వ చక్రంలోకి (సహస్రారం) పయనింపజేసి అక్కడగల శక్తిని దత్తం చేసుకుంటే దత్తస్వరుపంగా మారిపోవడంఖాయం.
శ్రీమహా విష్ణువునకు ఏవిధంగా అయితే దశావతారాలు ఉన్నాయో దత్తాత్రేయుల వారికి కలియుగానికి ముందు (పూర్వయుగములలో) మరియు కలియుగములో (ప్రస్తుత యుగములో) అనేక అవతారాలు గలవు.
ఈ అన్ని అవతారాలు గురుతత్వాన్ని, దత్తసంప్రదాయాన్ని సూచిస్తూ ఉంటాయి. అదే విధంగా పూర్వ మరియు ప్రస్తుత యుగములలో వివిధ “దత్తావతార అంశలు” వచ్చి, దత్తాత్రేయుడు ఇచ్చిన పనిని నిర్వర్తించి తిరిగి దత్తలీనమయ్యాయి.
🕉️🌞🌏🌙🌟🚩
సహస్రకుండలితో అనంతజ్యోతి
ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంది. ఇదే దత్తతత్వం. దానిని దర్శించగలగటమే మానవ జన్మ పరమార్ధం. ఈ దైవత్వాన్ని దర్శించటానికి ప్రతి మనిషీ కొన్ని ప్రధానమైన లక్షణాలు అలవరచుకోవాలి. అవి ధర్మం, సత్యం, అహింస, దయ. వీటన్నింటిలోను అత్యున్నతమైనది దయ. ఈ గుణం అత్యధికంగా ఉన్నవారికి మిగిలినవన్నీ వాటంతట అవే అబ్బుతాయి.
అయితే ఈ గుణాలు మనకు సహజసిద్ధంగా వస్తాయా? వాటిని అలవరచుకోవాలా? ఈ సంశయం అనేక మందికి వస్తూ ఉంటుంది. సహజసిద్ధంగా కొంత వచ్చినా- మిగతా కొంత సాధనతో అలవరచుకో. దీనికి ప్రధానమైన మార్గం తపస్సు. చాలామంది ధ్యానానికి, తపస్సుకు మధ్య తేడా తెలియక సతమతమవుతూ ఉంటారు. ధ్యానం మనిషిలో ఏకాగ్రతను పెంచుతుంది. ఒకే విషయంపై మనసు కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. కానీ తపస్సు మనిషిని ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించేలా చేస్తుంది. ధ్యానంలో మనిషి, ఆత్మ వేర్వేరు. తపస్సులో ఈ రెండూ ఒకటే. ఇవి ఏకీకృతమైనప్పుడు కోటి సూర్యుళ్ల కాంతి ఉత్తేజితమవుతుంది.
ఎలా సాధించాలి?
తపస్సు- ఈ పదాన్ని మనం అందరం వినే ఉంటాం. కానీ ఎలా చేయాలి? కళ్లు మూసుకొని ఎవరినో ఒకరిని ధ్యానిస్తే అది తపస్సు అవుతుందా? లేక తపస్సుకు లక్ష్యం ఏదైనా ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉత్పన్నం అవుతూ ఉంటాయి. తపస్సు గురు అనుగ్రహంతో చేయాలి. అలా చేసినప్పుడు మనలో ఉండే సహస్ర కుండలి ప్రకాశితమవుతుంది. అసలీ సహస్ర కుండలి ఏమిటి? మన శరీరం తొమ్మిది చక్రాల సమాహారం. లాలటంలో ఉండేది సహస్రకుండలి.
ఈ కుండలిని దర్శించగలిగినప్పుడు దేవుడు అనే మాటనే మర్చిపోగలుగుతాం. అదొక అనన్య సామాన్యమైన అనుభూతి. దీనిని సందర్శించగలిగే అనుగ్రహాన్ని ఇవ్వగలిగినవాడు గురువు మాత్రమే! ఇప్పుడు సహస్ర కుండలి గురించి మరింత చెప్పుకుందాము.
ఈ సహస్ర కుండలికి సహస్ర పాదుకలు, తొమ్మిది ద్వారాలు ఉంటాయి. ఈ ద్వారాలకు గుమ్హ్యణి, నాభిణి, కర్ణాంకిణి, వాక్భంధిని, సారగుణి, మేధ్యణి, పూరిని, వైష్ణుణి, సహస్రణి అని పేర్లు. ఈ తొమ్మిది ద్వారాలకు- ఒకో దానికి పన్నెండు బీజాక్షరాలు అమరి ఉంటాయి. ఈ బీజాక్షరాలు ఈ ద్వారాల శక్తికి సంకేతాలు. ఈ మొత్తం ద్వారాలన్నింటిలోను సహస్రణి అతి ముఖ్యమైనది. దీనిని సాధించగలిగితే- పదివేల కోట్ల సూర్యకాంతితో సమానమైన సహస్రణి దర్శనమవుతుంది.
దత్త జయంతి రోజున..
దత్త జయంతి రోజున దత్తాత్రేయ శక్తి అపరిమితంగా ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తిలోను హృత్ శక్తిగా, చిత్ శక్తిగా, ఆత్మశక్తిగా వెలుగొందుతూ ఉంటుంది. ఆ శక్తితో అనుసంధానం కలిగిన వ్యక్తి దత్తస్వరూపుడే. అయితే దీనికి తపస్సు చాలా అవసరం.
🕉️🌞🌏🌙🌟🚩
💥శ్రీ దత్త చైతన్యం💥
🕉🌞🌎🌙🌟🚩
మూలాధార స్వాధిస్థాన చక్రాలు కలిపి బ్రహ్మ గ్రంధి,
మణిపూరక, అనాహత చక్రాలు కలిపి విష్ణుగ్రంధి,
విశుధ్ధి, ఆఙ్ఞచక్రాలు కలిపి రుద్రగ్రంధి అంటారు.
లింగస్థాన స్వాధిష్టానంతో సంతానం కంటున్నావు కాబట్టి నీవే బ్రహ్మ,
అనాహత-మణిపూరక చక్రాలతో పోషణ చేస్తున్నావు...,కాబట్టి నీవే విష్ణువు,
విశుద్ధి,ఆఙ్ఙా చక్రాలతో (ఊపిరి)శ్వాస మార్గం, (ఇది ఆగితే శవం) ఉంటే శివం.... కాబట్టి నీవే రుద్రుడు.
ఈముగురిని నడిపేది సహస్రారంలోని_ పరబ్రహ్మం.
అంతా నీలోనే ఉన్నది కదా నీవే దత్తుడవు.
తెలుసుకున్న అవధూత స్వామి సిద్ద మంగళం దత్త సిధ్ధుడైనాడు.
(సంత్ శ్రీ శ్రీ సదానంద స్వామీజీ)
🕉️🌞🌏🌙🌟🚩
[00:14, 29/12/2020] +91 92915 82862: శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దత్తాత్రేయ షట్చక్ర జాగరణ స్త్రోత్రం
కుండలిని జాగృతికి, దత్తోపాసనకు, శ్రీ దత్త ప్రభువు దివ్య అనుగ్రహమునకు ఈ స్తోత్రరాజం విశేషమైనది.
1) దిగంబరం భస్మసుగన్ధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాం చ |
పద్మాసనస్థం ఋషిదేవవన్దితం దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదమ్||
భావం:- దిగంబరులు, భస్మ, సుగంధములతో అలంకరించిన దేహము కలవాడు, చక్రం,త్రిశూలం, డమరుకం,గద, ధరించినవాడు,పద్మాసనంలో విరాజమానులై ఋషులు,దేవతలతో పూజింపబడుతున్న దత్తాత్రేయుని ధ్యానించువారి అభీష్టములు సిధ్ధించును.
2) మూలాధారే వారిజపద్మే సచతుష్కే వం శం షం సం వర్ణవిశాలైః సువిశాలైః |
రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
భావం:- మూలాధారచక్రస్థానం లో నాలుగు దళములు వున్న పద్మం వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము లకు సంకేతం. చిక్కటి ఎరుపు వర్ణం తో కూడివున్న ఆ దళాలపై వం, శం, షం, సం అనే బీజాక్షరాలు వుంటాయి. దీనికి భగవంతుడు (అధిష్ఠాన దేవత) గణనాథుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించుచున్నాను.
3) స్వాధిష్ఠానే షట్దలపద్మే తనులింగే బాలాన్తైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః |
పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
భావము:- స్వాధిష్టానచక్రం ( లింగమూలమున వుండు) ఆరు దళములు కలిగిన పద్మము వలె వుండి, అగ్ని తత్వం కలది. సింధూర వర్ణం కల ఈ పద్మం మీద బం, భం, మం,యం,రం , లం, అక్షరాలు వుంటాయి. దీని అధిపతి బ్రహ్మ. వాహనం మొసలి. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
4) నాభౌ పద్మే పత్రదశాంకే డఫవర్ణే లక్ష్మీకాన్తం గరూఢారూఢం మణిపూరే |
నీలవర్ణం నిర్గుణరూపం నిగమాక్షం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
భావము:- మణిపూరక చక్రం బొడ్డు మూలములో పది దళములతో కూడిన పద్మము లాగా వుండును. బీజాక్షరాలు డ,ఢ,ణ,త,థ ద,ధ,న,ప,ఫ లిఖించబడి యుండును. అధిపతి లక్ష్మీకాంతుడు ( విష్ణువు). మణిపూరక మందున్న మేఘం నిలవర్ణము కలది, నిర్గుణ రూపం కలది, అంధకారమును పోగొట్టు మెరుపు లాంటిది. శ్రీగురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
5) హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే అనాహతాంతే వృషభారూఢం శివరూపమ్ |
సర్గస్థిత్యంతాం కుర్వాణం ధవలాంగం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
భావము:- హృదయము వెనుక విలసిల్లే ఈ చక్రం పన్నెండు దళములు కల పద్మము వలె వుండును. క,ఖ,గ,ఘ,ఙ,చ,ఛ,జ,ఝ,ఞ,ట,ఠ అను అక్షరములు కలది. అనాహత (తగలకుండా వచ్చే శబ్దం) చక్రమునకు అధిదేవత సృష్టి స్థితి లయ కారకుడు, ధవల వర్ణము కలవాడు, వృషభ వాహనుడైన శివుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
6) కంఠస్థానే చక్రవిశుద్ధే కమలాన్తే చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే|
మాయాధీశం జీవశివం తం భగవంతం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
భావము:- విశుద్ధ చక్రం ( పవిత్రము చేయునది) కంఠస్థానంలో వెనుక పదహారు దళములతో కూడిన శ్వేత వర్ణ కమలమ వలె వుండును. అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ ,ఋ,ౠ,ఌ, ౡ,ఏ,ఐ ,ఓ,ఔ,అం, అః అక్షరాలు వుండును. ఇది చంద్రుని ఆకారము లో వుండును. పదహారు అక్షరాలు చంద్రుని పదహారు కళలకు, శుద్ధ చైతన్యమునకు సంకేతము. దీని అధిపతి మాయాధీశుడైన శివుడు.శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
7) ఆజ్ఞాచక్రే భృకుటిస్థానే ద్విదలాన్తే హం క్షం బీజం జ్ఞానసముద్రం గురూమూర్తిం|
విద్యుత్వర్ణం జ్ఞానమయం తం నిటిలాక్షం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
భావము:- ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో రెండు దళములతో కూడిన పద్మము వలె వుండును. హం , క్షం అను బీజాక్షరాలు వుండును. దీనినే జ్ఞానచక్షువు అంటారు. ఈ చక్రమును సాధన చేస్తే, ఆత్మ దర్శనం అయి బ్రహ్మ జ్ఞాని అవుతాడు. ప్రకాశవంతమైన వర్ణముతో, జ్ఞానమయుడు, త్రినేత్రుడు, అయిన సదాశివుడు దీనికి అధిపతి. శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
8) మూర్ధ్నిస్థానే వారిజపద్మే శశిబీజం శుభ్రం వర్ణం పత్రసహస్రే లలనాఖ్యే|
హం బీజాఖ్యం వర్ణసహస్రం తూర్యాంతం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
భావము:- కపాలం పై బాగంలో (బ్రహ్మారంధ్రం అని కూడా అంటారు ) ఓం కారంతో వేయి దళముల పద్మము లాగా వుండును. ప్రకాశించు తెల్లని రంగులో సకల వర్ణములు కలిగి వుండును. హం బీజాక్షరాలు తో వుండును.ఆత్మజ్ఞానం సాధించిన పరమహంసలు పొందేస్థితి. పరిపూర్ణ జ్ఞానమునకు ప్రతీక. అద్వైత స్థితి. శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
9) బ్రహ్మానన్దం బ్రహ్మముకున్దం భగవన్తం బ్రహ్మజ్ఞానం జ్ఞానమయం తం స్వయమేవ| పరమాత్మానం బ్రహ్మమునీంద్రం భసితాఙ్గం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
భావం:- బ్రహ్మానందము ప్రసాదించువాడు, బ్రహ్మముకుందుడు, భగవంతుడు, బ్రహ్మజ్ఞాని మరియు జ్ఞానమయుడు, నిర్గుణ శుద్ధ చైతన్య ముతో ప్రకాశించుచూ స్వయంగా పరమాత్మ అయిన వాడు, బ్రహ్మ మునీంద్రుడు, ప్రకాశమానమైన అంగములు కలవాడు, శ్రీగురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
ఇతి శ్రీమద్శఙ్కరాచార్య విరచితం శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రం సమ్పూర్ణమ్ ||
🕉🌞🌍🌙🌟🚩
శ్రీ దత్త షట్చక్ర జాగరణ స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం సాధన పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.
సాధన :- పద్మాసనం లో కూర్చొని వెన్ను నిటారుగా ఉంచి మొట్టమొదట మూలాధారం నుండి మొదలు పెట్టి సహస్రారం వరకు,..., ఒక్కొక్క చక్రానికి సంబంధించిన స్త్రోత్రంను ఆచక్రం వద్ద పారాయణ చేయాలి.
ఈ పారాయణ రోజుకి 11 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదు దాని నుండి వచ్చే శక్తి తట్టుకోవడం కష్టం అతిగా చక్రాలు క్రియావంతం అయినా సమస్యలు వస్తాయి గర్భిణీ స్త్రీలు చేయకూడదు.
ఏ చక్రానికి సంబంధించిన స్త్రోత్రం చేస్తున్నారో ఆ చక్రం మీద దృష్టి పెట్టి చేయవలెను.
11 సార్లు పారాయణ ముగిసిన తరువాత ధ్యానంలో . ఉండండి.తరువాత గంట వ్యవధి ఇచ్చి మీ ఇష్ట దేవత మంతాన్ని గాని స్త్రోత్రం గాని దండకం కానీ 108 సార్లు పారాయణ చేసుకోవచ్చును.
ఇలా 40 రోజులు చేసుకోవచ్చును. శక్తిని బట్టి 90 రోజులు కూడా చేసుకోవచ్చును.
సాత్విక ఆహారం బ్రహ్మచర్యం అవసరానికి మించి ఎక్కువగా వృధాగా మాట్లాడకూడదు పనికి వచ్చే మాటలు ఎంత సేపు అయిన పరవలేదు ఉపయోగం లేనివి వృధా మాటలు ఈ సాధన చేసినప్పడు వద్దు.ఎందుకు అంటే విశుద్ధి చక్రంలో శక్తి క్షీణిస్తుంది ఈ చక్రం గొంతు దగ్గర ఉంటుంది.
ఈ దత్త షట్చక్ర స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.
మనిషి శరీరంలోని శక్తి కేంద్రాలనే యోగ సాధకులు చక్రాలంటారు.మనిషి వెన్నుపూసలో నిద్రాణ స్థితిలో దాగివుండే ఒక అనిర్వచనీయమైన శక్తినే కుండలిని శక్తిగా యోగ శాస్త్రం అభివర్ణిస్తోంది. విశేష యోగ సాధన ద్వారా వెన్నుపూస దిగువనుండే మూలాధారం వద్ద నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి సహస్రారం వరకు సుషుమ్న నాడి సాయంతో చేర్చే పద్ధతిని కుండలినీ యోగం వివరిస్తోంది. ప్రాణ శక్తిని సమతుల్యం చేయటం తెలుసుకున్న మనిషికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది.
చక్రాలు
----------------
మూలాధార చక్రము:- గుద భాగానికి పైన ,లింగ స్థానానికి కింది భాగంలో ఈ చక్రం ఉంటుంది. ఇక్కడే కుండలినీ శక్తి నిద్రాణమై ఉంటుంది. ఈ చక్రం పనితీరు బాగున్న వారు ధైర్యం, భద్రతతో జీవిస్తారు. ఈ చక్రం పనితీరు దెబ్బతిన్న వ్యక్తులు నిరంతరం అసంతృప్తి, భయం వంటి భావనలతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. వీరు తరచూ ఎముకలు, దంతాలు, పేగులకు సంబంధించిన అనారోగ్యాలను ఎదుర్కొంటుంటారు. మొక్కలు పెంచటం, పచ్చిక మీద చెప్పులు లేకుండా నడవటం వల్ల ఈ చక్ర పనితీరును మెరుగుపరచుకోవచ్చు. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని వెన్నుపూస దిగువ భాగాన ఎరుపు రంగు ఉన్నట్లు భావిస్తూ 'నేను సరైన రక్షణలో ఉన్నాను. నా అవసరాలన్నీ చక్కగా సమకూరుతున్నాయి. నాకెలాంటి భయం లేదు' అని భావన చేయటం ద్వారా ఈ చక్రం పనితీరును మెరుగు పరచుకోవచ్చు.
స్వాధిష్ఠాన చక్రము:- బొడ్డు దిగువ భాగాన ఉండే నారింజ రంగు చక్రమే స్వాధిష్ఠానం. ఇది భావోద్వేగాల కేంద్రం. మంచి చెడులను భరించే శక్తితో బాటు ఇంద్రియాలనూ ఇది ప్రభావితం చేస్తుంది. ఆనందమయ జీవితాన్ని కోరే ప్రతి వ్యక్తీ ఈ చక్ర గతిని గాడిలో పెట్టుకోవాలి. దీని పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం మనసు మీద పడి మనిషి వ్యసనాల పాలవుతాడు. నిజ జీవితంలో కోల్పోయే ఆనందాన్ని వ్యసనాల ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తూ ఊహా జగతిలో ఉండిపోతాడు. ఈ చక్రం పనితీరు బాగుండాలంటే బొడ్డు కింద భాగంలో నారింజ రంగును ఊహించుకొని 'ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచే స్థితిని ఆహ్వానిస్తాను. వాటిని ఆసాంతం అనుభవిస్తాను' అని పదే పదే మనసులో అనుకోవాలి.
మణిపూరక చక్రము:- బొడ్డు పై భాగంలో పసుపు రంగులో ఉండే చక్రమే మణిపూరకం. మానసిక ప్రవృత్తిని, ఆత్మ నిగ్రహాలను ఇది ప్రభావితం చేస్తుంది. సమస్యలను ఎదుర్కొని సానుకూల పరిష్కారాలను కనుగొనేందుకు ఈ చక్రం దోహద పడుతుంది. దీని పనితీరు బాగున్న వ్యక్తులలో ఏదో తెలియని ఆకర్షణ, వెలుగు ఉంటుంది. దీని పనితీరు దెబ్బతిన్న వ్యక్తులు సొంతనిర్ణయాలు తీసుకోలేరు. తరచూ మాట మార్చటం, ఇతరుల మీద ఆధారపడటం, ఒప్పుకున్న పనిని పూర్తి చేయలేకపోవటం, ఒకే సమయంలో పలు పనులు మొదలుపెట్టి ఒక్క పనీ చేయలేక పోవటం, ఎదుటి వారిని సంతోషపు పెట్టేందుకు సొంత సమయాన్ని వృధా చేసుకోవటం వంటి లక్షణాలుంటాయి. ఈ పరిస్థితి మారాలంటే క్రమబద్ధమైన జీవనానికి అలవాటు పడాలి. రోజూ వ్యాయామం చేయట, ధ్యానం చేయటం తప్పనిసరి. బొడ్డు, గుండె మధ్య భాగంలో పసుపు రంగు గోళాన్ని ఊహించుకొని ' నేను చేసే ప్రతి పనికీ నేనే బాధ్యుడను. నన్ను నేను అదుపు చేసుకోగలను' అని మళ్ళీ మళ్ళీ భావన చేసుకోవటం ద్వారా ఈచక్రం పనితీరు మెరుగుపడుతుంది.
అనాహత చక్రము:- ఇది హృదయ స్థానములో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ప్రేమ వంటి సున్నితమైన భావనలకు ఇది కేంద్రం. ఈ చక్రం ఛాతీ, వీపు భాగాల పనితీరును నియంత్రిస్తుంది. ప్రతి క్షణాన్ని ప్రేమించేలా చేయటంతో బాటు ప్రాణ శక్తిని, చైతన్యాన్ని పెంపొందిస్తుంది. దీని పనితీరు బాగున్న వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి భేషజాలు లేకుండా వాస్తవాలని అంగీకరిస్తారు. ఈ చక్రం పనితీరు దెబ్బ తిన్నవారికి ఏ పనిలోనూ సంతోషం, సంతృప్తి లభించవు. ఎవరినీ నమ్మరు. ఎప్పుడూ తక్షణ ఫలితాలను ఆశిస్తారు. పనులను మధ్యలోనే వదిలేస్తారు. పెంపుడు జంతువుల ఆలనా పాలనా చూడటం ద్వారా ఈ చక్రం పనితీరు బాగుపడుతుంది. గుండె భాగంలో ఆకుపచ్చ గోళాన్ని ఊహిస్తూ ' నేను అందరి ప్రేమనూ పొందగలను. నా చుటూ ఉన్నవారికి ప్రేమను పంచుతాను. మంచి చెడులను ఏకరీతిన జీవితంలోకి ఆహ్వానిస్తాను.' అని రోజూ పదే పదే మననం చేసుకోవటం ద్వారా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.
విశుద్ధి చక్రము:- కంఠ స్థానములో నీలి రంగులో ఉండే ఈ చక్రం సృజన, భావ వ్యక్తీకరణకు కేంద్రం. ఇది దవడ, మెడ, ఊపిరితిత్తుల పనితీరును నియంత్రిస్తుంది. దీని పనితీరు బాగున్న వారు ఏ రంగంలోనైనా నాయకులుగా, మార్గదర్శులుగా ఎదుగుతారు. వీరిమాటను అందరూ ఆమోదిస్తారు. ప్రణాళికా బద్ధంగా పనిచేయటమే గాక ఇతరులు చెప్పేదాన్నీ శ్రద్దగా వింటారు. ఈ చక్రం పనితీరు దెబ్బవారు కంగారు, గందరగోళానికి గురికావటం, అనాలోచితంగా పనులు చేయటం వంటి ఇబ్బందులకు గురవుతారు . మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేయటం, ఇంటిపని, రచనా వ్యాసంగం, పుస్తకాలు చదవటం, క్రీడలు వంటి వాటిని అలవాటు చేసుకుంటే ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది. ప్రశాంతంగా కూర్చొని గొంతు భాగాన నీలిరంగు గోళం ఉందని భావిస్తూ ' నేను ఏ విషయాన్నైనా కొత్తగా ఆలోచిస్తాను. దాన్ని నలుగురికీ ఆసక్తి కలిగేలా చెప్పగలను' అని మననం చేయటం ద్వారా కూడా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.
ఆజ్ఞా చక్రము:- భ్రూ (కనుబొమల) మధ్య భాగంలో ముదురు నీలం రంగులో ఉండే ఈ చక్రమే అంతర్బుద్దికి కేంద్రం. ఊహించటం, ఆలోచించటం దీని పని. దీన్నే త్రినేత్రం అనీ అంటారు. దీని పనితీరు బాగుంటే భవిష్యత్తులో రానున్న సంకేతాలను, మార్పులనూ సరిగా ఊహించగలరు. కళాకారులుగా గుర్తింపు పొందుతారు. ఈ చక్రం పని తీరు దెబ్బ తిన్నవారు కంటికి కనిపించే వాటినే నమ్ముతారు. సొంతనిర్ణయాలు తీసుకోలేరు. చిన్న చిన్న విషయాలకూ అతిజాగ్రత్త పడుతుంటారు. బొమ్మలు వేయటం, రంగులద్డటం వంటి పనులతో ఈ చక్రం పనితీరు మెరుగు పడుతుంది. కనుబొమ్మల మధ్యభాగంలో ముదురు నీలిరంగు గోళాన్ని ఊహిస్తూ ' అంతర్బుద్దిని, ఊహాశక్తిని పెంచుకొంటాను. ఈ క్రమంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాను' అని సంకల్పం చెప్పుకుంటే ఈ చక్రం పనితీరు మెరుగు పడుతుంది.
సహస్రార చక్రము :- మాడు భాగంలో బచ్చలి పండు రంగులో ఉంటుంది. ఈ చక్రాన్ని చేరుకున్న వ్యక్తి జీవాత్మ, పరమాత్మల సంబంధాన్ని తెలుసుకుంటాడు. యోగ సాధన పరంగా కుండలిని ఆఖరి మజిలీ ఇది.ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు ఈ చక్రాన్ని చేరగలరు. దీనిని శైవులు శివస్థానమనీ, వైష్ణవులు పరమ పురుష స్థానమనీ, శాక్తేయులు దేవీస్థానమనీ, కొందరు హరిహర స్థానమనీ అంటారు. కుండలిని శక్తిని ఈ స్థానానికి చేర్చిన మనిషికి పునర్జన్మ నెత్తాల్సిన అవసరం లేదని యోగ శాస్త్రం స్పష్టం చేస్తోంది.
ఈ దత్త షట్చక్ర స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.
🕉🌞🌎🌙🌟🚩
💐💐💐💐
[05:31, 29/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
768వ నామ మంత్రము 29.12.2020
ఓం ద్యుతిధరాయై నమః
తేజస్సు కలిగిన అంగసంపద, బ్రహ్మవర్చస్సు అనే తేజస్సుతో ప్రకాశించు జగజ్జననికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ద్యుతిధరా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ద్యుతిధరాయై నమః యని ఉచ్చరించుచూ, అత్యంతభక్తప్రపూరిత హృదయంతో ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు సకల కార్యసిద్ధి, సుఖసంతోషములు సంప్రాప్తించును. దైవచింతనతో జీవనము కొనసాగించే నిశ్చలత ఆ పరమేశ్వరి ప్రసాదించును.
ద్యుతి అంటే కాంతి. ఉద్యద్భానుసహస్రాభ యను నామము తో వేయిమంది బాలభాస్కరుల కాంతిని కలిగియున్నది. అంతటి కాంతిని తాను ధరించినది గనుకనే ద్యుతిధరా యని అన్నాము. జగన్మాతయే కోటి ద్యుతులకు తార్కాణము. . సూర్యచంద్రులు, నక్షత్రములు, పంచాగ్నులు(దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, సభ్యాగ్ని, అవసథ్యాగ్ని), తొలకరి మేఘములనుండి వెలువడే తళుక్కుమనే మెఱుపులకు కాంతులను అనుగ్రహించేది పరమేశ్వరి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అని కూడా స్తుతించాము. అనగా శుక్రనక్షత్ర కాంతులనే తిరస్కరించే నాసాభరణం ధరించింది. అమ్మవారు అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనగా శరత్కాల శుక్లపక్షంలోగాని, కృష్ణపక్షంలోగాని సమానమైన కాంతులను రువ్వే అష్టమీచంద్రుని కాంతుల మాదిరిగా ప్రకాశించే లలాటం కలిగినది అమ్మవారు. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచన తన ముఖకాంతియనే ప్రవాహంలో తళుకుతళుకున మెఱుస్తూ చలించే మీనములజంటతో పోల్చబడిన కన్నులు కలిగినది అమ్మవారు. తాటంక యుగళీ భూత తపనోడుప మండల సూర్యచంద్రులే అమ్మవారి చెవికమ్మలు. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః పద్మరాగశిలల అద్దాన్ని తిరస్కరించే నున్నని, నిర్మలమైన చెక్కిళ్ళు కలిగినది ఆ తల్లి. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్ఛదా క్రొత్తపగడము మరియు దొండపండ్ల కాంతిని వెక్కిరించే కాంతులు గలిగిన పెదవులు గలిగినది శ్రీమాత. శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వల అమ్మవారి పలువరుసలు రెండును శ్రీవిద్య బీజాక్షరముల ఆకారముతో ప్రకాశిస్తున్నాయట. (శ్రీవిద్యోపాసకుడైన బ్రాహ్మణుని ముఖకాంతులు అంతటి తేజోవంతముగా ఉంటాయి). కామేశబద్ధమాంగల్య సూత్ర శోభిత కంధర పరమశివునిచే కట్టబడిన మంగళసూత్ర శోభతో మరింత కాంతితో అమ్మవారు ప్రకాశిస్తున్నది. కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత అంగదకేయూరములను బంగారు ఆభరణములతో ప్రకాశించే భుజములు కలిగి ఉన్నది జగన్మాత.
అమ్మవారు సిందూరారుణ విగ్రహాం సిందూరం మాదిరిగా ఎర్రని శరీరకాంతి కలిగినది. మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం తన మాణిక్యమణిమయకిరీటంలో చంద్రుణ్ణి ధరించింది. సర్వారుణ ఆ తల్లి దేహమంతా అరుణవర్ణ కాంతులతో ప్రకాశిస్తున్నది. ఆపాదమస్తకము వివిధకాంతులతో అమ్మవారు విరాజిల్లుతున్నది గనుకనే ద్యుతిధరా యని అన్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే కాంతులు వెదజల్లే అంగసంపద కలిగి, శ్రీవిద్యాస్వరూపిణియై బ్రహ్మవర్చస్సు అనే తేజస్సుతో ప్రకాశిస్తున్నది. గనుకనే అమ్మవారిని ద్యుతిధరా యని అన్నాము.
అటువంటి పరాశక్తికి నమస్కరించునపుడు ఓం ద్యుతిధరాయై నమః అని అనవలెను.
[05:31, 29/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
194వ నామ మంత్రము 29.12.2020
ఓం దురాచారశమన్యై నమః
దురాచారములవలన భగవదను గ్రహమునకు దూరమవకుండా దురాచారములను శమింపజేసి భక్తులను కాపాడు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి దురాచారశమనీ అను ఏడక్షరముల నామ మంత్రమును ఓం దురాచారశమన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకులకు ఆ తల్లి వారిలో ఏమైనా దురాచారసంబంధమైన చర్యలు ఉంటే వాటినుండి వారిని తప్పించి, సదాచారులుగా మార్చి, సత్కర్మలు చేయించుటద్వారా వారిలోని దుష్కర్మలఫలితప్రభావమును తగ్గించును.
ధర్మశాస్త్రములో చేయకూడదని నిషేధింపబడినవి చేయుట ఎటువంటిదో, చేయవలసినవి చేయకపోవుటకూడా అటువంటిదే. అనగా అదే దురాచారము. ఇటువంటి దురాచారములను శమింపజేస్తుంది గనుక పరమేశ్వరిని దురాచారశమనీ యని అన్నాము.
బ్రాహ్మణునికి మద్యపానము, మాంసభక్షణము, అన్యస్త్రీ సంపర్కము వంటివి దురాచారములు. అలాగే త్రికాల సంధ్యలాచరించకుండుట, భగవదారాధనకు దూరముగానుండుట, ధర్మశాస్త్రములు బోధించకుండుట కూడా దురాచారములే. వర్ణాశ్రమధర్మములకు విరుద్ధములైన కర్మలన్నియును దురాచారములే. ప్రతిజీవుడూ తెలిసిగాని, తెలియకగాని చేసినకర్మలయొక్క ఫలితము అనుభవించి తీరవలసినదే. కర్మల ఫలితములు జన్మజన్మలకు సంచితములవుతూ ఉంటాయి. అనగా గత జన్మలో చేసిన దుష్కర్మల ఫలితానికి ప్రస్తుత జన్మలో చేసే దుష్కర్మల ఫలితం తోడయితే దుష్కర్మఫలంకూడా పెరుగుతుంది. గత జన్మలో చేసిన దుష్కర్మల ఫలితానికి, ప్రస్తుత జన్మలో చేసే సత్కర్మల ఫలితం
గత జన్మ దుష్కర్మఫలాన్ని తగ్గిస్తుంది. ఇది ఒక Bank ఖాతావంటిది. డబ్బులు వేస్తుంటే మన bank నిల్వ పెరుగుతుంది. తీసేస్తే bank నిల్వ తగ్గుతుంది. కల్పాంతంవరకూ కూడా కర్మలఫలితం అనుభవించవలసిందే. కర్మలఫలితం క్షయమైతే పరమేశ్వరి సాన్నిధ్యం పొందినట్లే. గనుక పరమేశ్వరి చింతనతో జీవితాన్ని గడిపితే దుష్కర్మలఫలితం క్షయమవుతుంది. జగన్మాత నామ స్మరణగాని, ఆరాధనగాని, మంత్రజప సాధనగాని చేస్తే పరమేశ్వరి దురాచారములను శమింపజేస్తుంది. గనకనే జగన్మాత దురాచారశమనీ యను నామ మంత్రముతో స్తుతిస్తున్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం దురాచారశమన్యై నమః అని అనవలెను.
🌸💐💐💐
🌹. శ్రీమద్భగవద్గీత - 593 / Bhagavad-Gita - 593 🌹
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 10 🌴
10. న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయ: ||
🌷. తాత్పర్యం :
అశుభకర్మల యెడ ద్వేషము గాని, శుభకర్మల యెడ సంగత్వముగాని లేనట్టి సత్త్వగుణస్థితుడగు బుద్ధిమంతుడైన త్యాగికి కర్మయెడ ఎట్టి సంశయములు ఉండవు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావన యందున్నవాడు (సత్త్వగుణపూర్ణుడు) తన దేహమునకు క్లేశమును గూర్చు విషయములను గాని, మనుజులను గాని ద్వేషింపడు. విధ్యుక్తధర్మ పాలనము వలన క్లేశములకు వెరువక తగిన సమయమున మరియు తగిన ప్రదేశమున అట్టివాడు కర్మ నోనరించును.
దివ్యస్థితిలో నిలిచియున్న అట్టివాడు అత్యంత మేధాసంపన్నుడనియు మరియు తానొనరించు కర్మల యెడ సంశయరహితుడనియు అవగతము చేసికొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌻196. పద్మనాభః, पद्मनाभः, Padmanābhaḥ🌻
ఓం పద్మనాభాయ నమః | ॐ पद्मनाभाय नमः | OM Padmanābhāya namaḥ
పద్మనాభః, पद्मनाभः, Padmanābhaḥ
పద్మం ఇవ సువర్తులా నాభిః అస్య పద్మము వలె చక్కగా వర్తులమగు నాభి ఈతనికి గలదు. లేదా హృదయ పద్మస్య నాభౌ మధ్యే ప్రకాశతే హృదయపద్మపు నాభియందు ప్రకాశించు వాడు.
:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
సీ. తలకొని పంచభూత ప్రవర్తక మైన భూరిమాయాగుణస్ఫురణఁ జిక్కు
వడక, లోకంబులు భవదీయ జఠరంబులో నిల్పి ఘనసమాలోలచటుల
సర్వంకషోర్మిభీషణవార్ధి నడుమను ఫణిరాజభోగతల్పంబునందు
యోగనిద్రారతి నుండంగ నొకకొంత కాలంబు సనఁగ మేల్కనిన వేళ
తే. నలఘభవదీయ నాభితోయజమువలన, గడఁగి ముల్లోకములు సోపకరణములుగఁ
బుట్టఁజేసితి వతులవిభూతి మేఱసి, పుండరీకాక్ష! సతత భువనరక్ష!
తెల్లతామర రేకులవంటి కన్నులు గలవాడై ఎల్లవేళలా ముల్లోకాలను చల్లగా రక్షించే స్వామీ! నీవు ముందుండి పంచభూతాలను ప్రవర్తింపజేసే మహామాయాబంధాలలో చిక్కుపడకుండా లోకాలను నీ కడుపులో నిల్పుకొంటావు. ఉవ్వెత్తుగా లేచి పడుతున్న ఉత్తుంగ తరంగాలతో పొంగి పొరలే భయంకరమైన సముద్రం నడుమ శేషతల్పం మీద శయనించి యోగనిద్రలో ఉంటావు. కొంతకాలం గడిచాక మేల్కొంటావు. అప్పుడు నీ సాటిలేని మేటి వైభవాన్ని వ్యక్తం చేస్తూ, నీ నాభికమలంలో నుండి మూడు లోకాలను పుట్టింపజేస్తావు.
మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 197 / Vishnu Sahasranama Contemplation - 197🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻197. ప్రజాపతిః, प्रजापतिः, Prajāpatiḥ🌻
ఓం ప్రజాపతయే నమః | ॐ प्रजापतये नमः | OM Prajāpataye namaḥ
ప్రజాపతిః, प्रजापतिः, Prajāpatiḥప్రజానాం పతిః పితా ప్రజలకు పతి లేదా తండ్రి వంటివాడు.
:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
సీ.హరియందు నాకాశ, మాకాశమున వాయు, వనిలంబువలన హుతాశనుండు,హవ్యవాహనునందు నంబువు, లుదకంబు వలన వసుంధర గలిగె, ధాత్రివలన బహుప్రజావళి యుద్భవం బయ్యె, నింతకు మూలమై యొసఁగునట్టి,నారాయణుఁడు, చిదానంద స్వరూపకుం, డవ్యయుం, డజుఁడు, ననంతుఁ, డాఢ్యుఁతే.డాది మధ్యాంత శూన్యుం, డనాదినిధనుఁ, డతనివలనను సంభూత మైన యట్టిసృష్టి హేతుప్రకార మీక్షించి తెలియఁ, జాల రెంతటి మునులైన జనవరేణ్య! (277)
శ్రీహరినుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి వాయువు పుట్టింది. వాయువు నుండి అగ్ని పుట్టింది. అగ్నినుండి నీరు పుట్టింది. నీటి నుండి భూమి పుట్టింది. భూమి నుండి నానావిధ జీవ సంతతి పుట్టింది. ఇంతటికీ మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే. ఆయన జ్ఞానానంద స్వరూపుడు, అవ్యయుడు, పుట్టుక లేనివాడు, అంతము లేనివాడు, ప్రభువు, ఆదిమధ్యాంత రహితుడు, జనన మరణాలు లేనివాడు. రాజా! ఆయన నుండి జనించిన ఈ సృష్టికి హేతువేమిటో, దాని స్వరూపమెలంటిదో ఎంత పరీక్షించినా ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకొన లేకున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 146 🌹
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 76 🌻
అందువలనే ఈ హిరణ్మయకోశము, ఈ హిరణ్య గర్భస్థితి దివ్య యానమునకు ఆధార భూతమైనటువంటి స్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పక హిరణ్య గర్భస్థితిని అందుకోవలసిన అవసరం ఉన్నది సాధకులందరికి కూడా. ఋషులైపోతారు అన్నమాట.. ఎవరైతే ఈ హిరణ్యగర్భస్థితిని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడ బ్రహ్మనిష్ఠులై మహర్షులౌతారు. ఎందువల్లంటే ఈ హిరణ్మయకోశమే సర్వసృష్టికి ఆధారభూతమైనటువంటి స్థితి.
ఇక్కణ్ణుండి ఏం చెబుతున్నారు?- యజ్ఞంలో అంటే ఋత్త్విక్కులు యజ్ఞం చేసేటప్పుడు అరణిని మధిస్తారు. అంటే మన అగ్గిపుల్లల అగ్గిపెట్టె ద్వారా వచ్చినటువంటి అగ్ని పనికి రాదు అన్నమాట. అది స్వాభావికమైనటువంటి సృష్టిలో అగ్ని ఎలా అయితే సాధ్యమై ఉన్నదో, దానిని స్వీకరించాలి అనేటటువంటి నియమం ఉందన్నమాట. అందువలన అరణిని మధిస్తూ ఉంటారు. ఎక్కడైనా యజ్ఞం చేసే చోట మొట్టమొదట అంకురారోహణ తరువాత అక్కడ అరణిని మధిస్తూ ఉంటారు. అరణి అంటే అర్ధం ఏమిటంటే రావి, జువ్వి అనేటటువంటి కఱ్ఱలుంటాయి. ఈ రావి, జువ్వి అనే కర్రలు ఒకదానిపై ఒకటి పెట్టి, వాటిని పైన పెట్టి, మధిస్తారన్నమాట.
ఆ పైనించి ఒక కఱ్ఱ ఉంటుంది, క్రింద ఒక కఱ్ఱ లో ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. దాంట్లో, వడ్రంగి బర్మా తిప్పినట్లుగా, అది బాగా బలవత్తరంగా తిప్పుతారు. ఆ రాపిడి వలన ఈ కఱ్ఱ కఱ్ఱ రాపిడి వలన, రెండు కఱ్ఱలలో కూడ ఆంతర్భూతమై ఉన్నటువంటి అగ్ని ఉత్పన్నమౌతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి అగ్నిని జాగ్రత్తగా ఆ దూది ద్వారా మండించి, ఆ దూది ద్వారా మండినటువంటి అగ్ని ని ఇతరితర హవ్య ద్రవ్యాలను మండింపచేసి, అట్టి అగ్నిని తీసుకు వచ్చి, యజ్ఞాన్ని ప్రారంభిస్తారు.
ఈ రకంగా ఋత్త్విక్కులు అరణి చేత మంధించబడినటువంటి అగ్నిని ఎలా అయితే వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇది ఎప్పటినుండీ ప్రారంభమైంది?- ఋగ్వేదకాలం నుండి ప్రారంభమైంది. కృతయుగ కాలం నుండి ఈ యజ్ఞ విధానం ప్రారంభమైంది.
కాబట్టి అప్పటినుండి అనుచానంగా, సాంప్రదాయంగా, గురుశిష్య పారంపర్యంగా ఈ అరణి ద్వారా అగ్నిని మంధించేటటువంటి, అగ్ని ద్యోతక విధానాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాము. ఏమిటి అసలీ అరణి? దీనిలో ఉన్న తాత్త్విక దృక్పథమేమిటి?- అంటే ఆ రెండు భాగములు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రింది భాగమేమో జీవాత్మ, పై భాగమేమో పరమాత్మ. పరమాత్మ యొక్క ప్రభావం చేత జీవాత్మ నడుపబడుచున్నది. పరమాత్మ- జీవాత్మ ఏదైతే ప్రత్యగాత్మ – పరమాత్మ వున్నాయో ఈ రెండింటి మధ్యలో అగ్ని ఉన్నది.
అగ్ని చేతనే సర్వ సృష్టి పోషింపబడుచున్నది. సర్వ సృష్టి సృష్టించబడుచున్నది. సర్వ సృష్టి లయింపబడుచున్నది. పునః ప్రాదుర్భవించేది కూడ ఆ అగ్ని వలనే. కాబట్టి అట్టి అగ్ని స్థానమును, అట్టి అగ్ని యొక్క స్థితిని తెలుసుకోవలసినటువంటి అవకాశం అవసరం అందరికీ ఉన్నది. దీనికి అందుకంటే చయన విద్య, అగ్ని విద్య అని కొన్ని నామాంతరములు కూడ ఉన్నాయి.
సాధకుడు తన లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మితాహారముతో పోషించుకోవాలి. అధికమైన ఆహారాన్ని తినకూడదు. ఎవరైతే అధికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో, వారు శరీరభావాన్ని, శరీర తాదాత్మ్యతను సులభంగా పొందుతారు. కారణం భోజనం ఫుల్లుగా [full] తిన్న తరువాత నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర అనేటటువంటి మత్తు శరీరభావం చేతనే కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి పూట పోయే నిద్ర కూడ శరీర తాదాత్మ్యతాప్రభావం చేతనే ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బ్రహ్మనిష్ఠులై ఉన్నారో, ఎవరైతే జీవన్ముక్తులై ఉన్నారో వారికి నిద్ర అనేది ఉండదు. వారు ఎపుడూ తురీయనిష్ఠలో ఉంటారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 20 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 20 🍀
నామ సంకీర్తన్ వైష్ణవాంచీ జోడీ!
పాపే అనంత్ కోడీ గేలీ త్యాంచీ!!
అనంత్ జన్మాంచే తప్ ఏక్ నామ్!
సర్వ మార్గ్ సుగమ్ హరిపార్!!
యోగ యాగ క్రియా ధర్మాధర్మ్ మాయా!
గేలేతే విలయా హరి పాఠీ!!
జ్ఞానదేవీ యజ్ఞ యాగ్ క్రియా ధర్మ్!
హరివిణ నేమ్ నాహీ దుజా!!
భావము:
వైష్ణవులకు నామ సంకీర్తన మూలధనము. నామ జపము చేసే వారి అనంత కోటి పాపాలు తొలిగి పోతాయి.
ఒక్క హరి నామ జపము అనంత జన్మల తపస్సుతో సమానము. హరి పాఠము అన్ని మార్గాలలో సుగమము. యోగ, యాగ, క్రియ, మరియ ధర్మాధర్మ మాయ, మోహము అన్నియు నామ సాధనతో పాఠకునిలో విలయమై పోతాయి.
యజ్ఞము, యాగము, క్రియలు, ధర్మాలు అన్నియూ నాకు హరినామమే. హరి నామము తప్ప ఇతర అన్య నేమములు ఏమియు లేవని జ్ఞానదేవులు తెలిపినారు.
🌻. నామ సుధ -20 🌻
నామ సుధా సంకీర్తనము
వైష్ణవులకు మూల ధనము
అనంత కోటి పాప సమూహము
అయిపోయినది అంతా మాయము
అనంత జన్మలు చేసిన తపము
సమానము ఒక్క హరినామము
సర్వ మార్గములలో సుగమము
హరిపాఠ నామ సంకీర్తనము
యోగ యాగ క్రియలు సర్వము
ధర్మాధర్మ మాయ మోహము
నామ సాధనతో అవును విలయము
హరి పాఠ మహిమ అమోఘము
జ్ఞానదేవునికి నామమే యజ్ఞము
యాగము క్రియ మరియు ధర్మము
అన్నియు నాకు హరినామము
హరిని విడిచి లేదు అన్యనేమము.
సశేషం....
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖
🌻163. ' మోహనాశినీ '🌻
జీవుల మోహము నాశనము చేయునది శ్రీదేవి అని అర్థము.
నేను, ఇతరము అను భావము ద్వైత బుద్ధి. ఇది యున్నంత కాలము అజ్ఞానముండును. ఇతరుల రూపమున ఉన్నది కూడ నేనే అను భావము అద్వైత బుద్ధి. అపుడే ప్రేమ అవగాహన కలుగును. అందరి యందున్నదీ శివ శక్తులే. శివము, సత్యము, శక్తి, చైతన్యము. వీని నుండి పుట్టినవాడే జీవుడు. అందరి మూలము ఒకటే. కావున జీవు లందరూ, ఒకే ఉదరము నుండి పుట్టినవారనీ, సహోదరులని జ్ఞానము తెలుపును. ఇట్టి జ్ఞానము కలగనంత కాలము మోహముండును.
సృష్టియందు మోహము సహజము. మోహము వలన దుఃఖము తప్పనిసరి యగును. దుఃఖమువలన జీవుడు విచారమున పడును. దుఃఖమును దాటుటకు ప్రయత్నించును. కానీ ద్వైత బుద్ధి యున్నంత కాలము దుఃఖముండును. ఈ సత్యము తెలియుటకు కొన్ని జన్మ పరంపరలు సాగును. అనుభవైక జ్ఞానమే జ్ఞానము కాని అధ్యయనము, శ్రవణము వలన జ్ఞానము జీవునియందు స్థితిగొనదు.
తెలిసినది ఆచరించినపుడే తత్ఫలముగ జ్ఞానముదయించును. శ్రీమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారిని శ్రీమాతయే ఉద్దరించుకొనును. క్రమముగా జ్ఞానోదయము గావించును. జీవుని ఆర్తిని బట్టి ఉధారణ ఉండును. సురులైనను, అసురులైనను, మానవులైనను, ఆమె అనుగ్రహమునకు పాత్రులే. జ్ఞానమును ప్రసాదించుటకు శ్రీమాత రకరకములైన ఉపాయములను వినియోగించును.
ఎట్లైనను జీవుని ఉద్ధరించుటయే ఆమె లక్ష్యము. సామ దాన భేద దండోపాయములను జీవులపై ప్రయోగించుచు వారి ఉద్ధణకు తగు తోడ్పాటు గావించుచుండును. సృష్టియందు జీవులకు మోహము సహజము. మోహము దాట యత్నము చేయు జీవులకు శ్రీమాత ఆరాధనము శరణ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
ఈ శరీరం మనలను సంసార సముద్రాన్నుండి తరింపచేసే నౌక. కాబట్టి శరీరాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యహీనులు యోగులు కాలేరు.
సత్యం, పవిత్రత, నిస్వార్థం; భూనభోంతరాల్లోని ఏ శక్తీ, ఈ సుగుణాలతో జాజ్వల్యమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటై ఎదిరించినా, వారు ప్రతిఘటించగలరు.
🕉️🌞🌏🌙🌟🚩
🧘♂️నిర్వాణం🧘♀️
🕉️🌞🌍🌙🌟🚩
ఇంద్రియ సంపర్కంతో బ్రహ్మానందం అనుభవ రససిద్ధం కాదు. అనన్య చింతనే అసలు సాధన.
ఇంద్రియానుభవాలన్నీ బంధనలే. ప్రపంచానికి, ప్రపంచాతీత భావనకు శుద్ధభావనను సాధించుకోవాలి. అది వైవిధ్యమే తప్ప వైరుధ్యం కాదు. చలించే మనసుకు, బోధించే హృదయానికి మధ్య గల మహాశూన్యమే సంపూర్ణస్థితి. తెలుసుకుంటున్నవాడికి, తెలుసుకున్నదానికి మధ్య ఉన్నదే బంధన. ఇక తెలుసుకోవలసినదంటూ ఏమీ లేదన్న స్థితే విముక్తి. ఆలోచనకు, ఆలోచనకు మధ్య ఉన్న స్వల్ప విరామమే వెలుగు.
ఆ వెలుగే సర్వ ఫలప్రదాత. అదే అసలు మనం. అది నిజమైన మెలకువ. నిద్రకు ముందున్న ఆనందస్థితి. అదొక శిలాసదృశ సంస్థితి. మనసు మలగి, అవ్యయానందం మెరిసే నిశ్శబ్ద ఖేల!
మట్టిపాత్రను ఆవరించిన మట్టివలె, శూన్య పూర్ణ స్థితులలో అచ్యుతానందం ఆవరించి ఉంటుంది. చెలియలికట్టకు మాత్రమే లోబడే మహాసముద్రం అలలను, కెరటాలను నిగ్రహించినట్లు.. హృదయం మాత్రమే మనసును అచలం చేయగలదు. సముద్రమంతా ఏ విధంగా జీవ జలమయమో అలా దృశ్యమాన ప్రపంచమంతా చైతన్యభరితమే.
చూస్తున్నది అనాత్మ! చూపిస్తున్నది ఆత్మ!!
అలలెరుగని ఆనందామృత సాగరం మనసును ముంచెత్తుతుంటుంది. దాన్ని గుర్తెరిగి, నిలబెట్టుకోవాలి. కట్టు తెగని మమకారం, మమత ఆచరణీయం. నిజానికి ‘నేను’ తప్ప అన్యం లేదు. ఆ ‘నేను’కే బ్రహ్మం అని పేరు.
ఆ భావస్థితిని అందుకోగలిగితే ఈ జగమంతా ఆనంద సంద్రమే. ఈ అనుభవం భ్రమలను తొలగించి, బొమ్మలలోని బ్రహ్మాన్ని ఆవిష్కరిస్తుంది. అది అమృతానంద స్థితి. తెలుసుకోవడంతోనే ఆగక.. ఆచరించగలిగితే మనసు నిర్మలమవుతుంది. నీళ్లముందు నిలబడి ‘పటిక.. పటిక’ అంటే నీరు శుభ్రం కాదు. నీటిలో పటికను కలపాలి. అప్పుడే స్వచ్ఛత లభిస్తుంది. శుద్ధత్వం నుంచి బుద్ధత్వాన్ని సాధించాలి. అదే సిద్ధత్వం.
నేను ధ్యానిని అనుకోవడం కేవలం ఒక స్ఫురణే! దాన్నీ దాటగలిగితే అదే సమాధి. అంటే సర్వమూ అధీనమైన స్థితి.
మనోలయం జరిగిన తరుణంలో ఎన్ని ప్రచండ వాయువులు వీచనీ, సర్వసముద్రాలు ఏకం కానీ, ద్వాదశాదిత్యులు ఏకకాలంలో జ్వలించనీ.. ఏమీ కాదు. అది అచ్యుత స్థితి. ద్వంద్వాతీత స్థితి. అదే అచల నిర్వాణ స్థితి. పాము కుబుసం విడుస్తున్నప్పుడు.. తన నుంచి ఏదో విడిపోతున్నట్లు తలపోస్తుంది. విడిచిన తక్షణం నిర్వికారంగా జరజర పాకి తన దారిన తాను వెళ్తుంది. ఇదే మనసును విదుల్చుకునే వైనం.
మనసు విడివడిన నాడు మనిషిలోని పసితనం పల్లవిస్తుంది. అఖండ శిలలో దివ్యమూర్తి దాగి ఉన్నట్లు.. ఈ ప్రపంచం నిజానికి బ్రహ్మమయమే. కనుక ప్రపంచం అసత్‌గా కనిపించే సత్, జడంగా కనిపించే దివ్యచైతన్యం. ఈ విచారణే ఆత్మ విచార మార్గం. ఇదే సూటి దారి. ఇదే అసలు దారి!!
🕉️🌞🌍🌙🌟🚩
శ్రీరమణీయం -(755)
"బాధలు, దుఃఖాలు లేకుండా/రాకుండా చేసుకోవడంలో జరుగుతున్న లోపాలు ఏమిటి !?"
ప్రాపంచిక విషయాలకు అతి విలువ ఇవ్వటమే మనం చేస్తున్న పొరపాటు. అంటే అసలు ప్రాపంచిక విషయాలే అక్కర్లేదని కాదు. ఏ విషయానికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో, ఎవరితో ఎంత పరిమితంగా ఉండాలో అలవాటు చేసుకోవటం అవసరం. ఇప్పుడు మన నిత్యజీవితంలో లోపించిన ఈ హద్దులే మనని దుఃఖానికి గురిచేసి అనాత్మ[దేహ]భావనలో కూరుకుపోయేలా చేస్తున్నాయి !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
సాధనంతా ఆత్మగా మారటానికి కాదు.. అనాత్మభావన పోవటానికే !''- (అధ్యాయం -93)
🕉🌞🌎🌙🌟🚩
"ఋభుగీత " (222)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
దైవమేమిటో సంపూర్ణంగా అర్ధమైతే శాంతి వస్తుంది !
దైవం ఒక రూపంగా కనిపిస్తే శాంతిరాదు. దైవం ఏమిటో సంపూర్ణంగా అర్ధమైతే శాంతి వస్తుంది. అందుకే రావణాసురుడికి శివుడు దర్శనం ఇచ్చినా శాంతి రాలేదు. ఎవరినీ శాంతిగా ఉండనివ్వలేదు. శ్రీరాముడు తాను శాంతిగా ఉండి, అందరినీ శాంతిగా ఉంచాడు కనుకనే దైవంగా పూజలందుకున్నాడు. శ్రీకృష్ణుడు కేవలం పాండవులకే కాదు, కౌరవులకు కూడా ధర్మబోధ చేశాడు. ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చిమరీ విశ్వరూపం చూపించాడు. అయినా ఫలితం లేదు. దుర్యోధనుడికి ఎన్నో హితవచనాలు చెప్పినా మార్పులేదు. శాంతినివ్వని దైవదర్శనం, ధ్యానం, తపస్సు, ధర్మమీమాంసలు నిరుపయోగమే అవుతాయి !
🕉🌞🌎🌙🌟🚩
113-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
అధ్యాయము-10
దివ్య వైభవము
12,13 అర్జునుడు: ఎంత పవిత్ర సత్యము! నీవు చెప్పిన పరబ్రహ్మము నీవే! నీవు చూపిన సాటిలేని వెలుగు నీవే! వానికి నీవే గమ్యము. నీ కన్న అవి ఏమీయు లేవు. శాశ్వతమూర్తివగు పురాణ పురుషుడు, ఆదిదేవుడు ఎవడో ఇప్పుడు తెలిసినది. అది నీవే! ఋషులందరు నీకు జన్మలు లేవనియు, సర్వమునకు ప్రభువనియు చెప్పిరి. చాలలేదు. దేవర్షియగు నారదుడు గానము చేసెను. చాల లేదు. దేవలుడు అను ఋషి చీకటి అనగా నీవే అని చెప్పెను. చాలలేదు. వ్యాసుడు వివరించి చెప్పెను. చాలలేదు. నీవే స్వయముగా చెప్పితివి. పరిపూర్ణమైనది.
14. అదే సత్యమును నీవు స్వయముగ ఉచ్చరింపగా సర్వము సహజ సత్యమని ఇప్పుడు తలచుచున్నాను. నీ వ్యక్త రూపము యొక్క వైభవము దేవ దానవాదులకును తెలియదు.
15. తెలియుట అనగా నీ సంకల్పమే. నా 'నేను' లో నీ 'నేను' తెలియునట్లు సంకల్పించుటయే నాకు తెలియుట. జీవులను సృష్టిగ భావించుచున్నావు. నన్ను నీవు భావించినపుడు నేను తెలిసికొనుచున్నట్లు కూడా నీవు భావించి ఉండవలెను. కనుకనే నేను తెలిసికొంటిని. మాకు తెలియుట అనగా ఇట్టిది. ఇట్లు మా లోపల, వెలుపల ఆధిపత్యం వహించి ప్రభువై ఉన్నావు.
16. పలుకుము. ఇంకను ఈ జ్ఞానమును ఉచ్ఛరించి పలుకుము. నీవు పలుకుట అనగా నేను తెలుసుకొనుట. అశేషముగ నీ దివ్య వైభవములను గూర్చి వివరింపుము. వినిన అనుభూతిలో అవి నా వైభవములగును. ఈ లోకముల యందు ఎట్లు విస్తరించి లోపల వెలుపలగా నిండి, భావించుచునే భావనకు అందక మా భావనలకు అతీతముగా ఎట్లుంటివో అట్టి నీ విలాసమును గూర్చి ఇంకా నీవే వివరింపుము.
126) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
వాగాదీనామింద్రియాణాం కలహః శ్రుతిషు శ్రుతః ౹ తేన చైతన్యమేతేషామాత్మత్వం తత ఏవ హి ౹౹64౹౹
64. వాక్కు మొదలగు ఇంద్రియముల కలహము వేదమునందు
(బృహదారణ్యక ఉప.6.1.7-14)
విందుము.కనుక ఇంద్రియములు చేతనములు. ఆ కారణముచే అవే ఆత్మయని వారి వాదము.
దేహమునందలి జీవశక్తి ఉత్తేజితమయినప్పుడు ఆలోచనకు,వాక్కునకు,క్రియకు సంబంధించిన వివిధమలగు అవయవములు తమ కార్యమును నిర్వహించును.
అవి,మనస్సునందు ప్రబలముగా (వ్యాప్తమయి)ఉండు భ్రాంతియుతభావనల వలన తమ దృశ్యవిషయములవైపు ప్రసరించును.ఈ జీవశక్తి ఆత్మలోపల వివిధ రూపములను దర్శించును.
ఈ దర్శనము స్థిరస్వభావము కలదిగానున్నట్లు కనిపించుట వలన ఇది జాగ్రద్దశ అనబడును.
బ్రహ్మమునకు ఎట్టి అంగాలు లేవు నిరవయవి.అయితే కార్యరూపంలో సమస్తమైన బ్రహ్మము పరిణామం చెందాలి.
బ్రహ్మము"నిష్కలం","నిష్ర్కియం,
"శాంతం","నిరవద్యం,నిరంజనమ"
అని శ్రుతులు నిర్దేశిస్తున్నవి.
లోకంలో సాలెపురుగు తనే దారాన్ని సృజించుకొని దానిలో సంచరిస్తూ ఉంటుంది.కొన్ని జాతి కొంగలు మేఘగర్జనతో పురుష సంయోగం లేకపోయినా
గర్భం ధరిస్తాయి. తామరతీగ(పద్మలత)ఒక సరస్సు నుండి మరో సరస్సుకు బాహ్యసాధనాపేక్ష లేకుండా విస్తరిస్తుంది.అలాగే బ్రహ్మశక్తి ఊహకందనిది.అందువల్ల జగత్ నిర్మాణము,సమస్త సృష్టికార్యము బ్రహ్మమునకు సాధ్యమేనని శ్రుతి ప్రమాణము.
ప్రకృతి-వికారరూపం రెండూ అనన్యంగా ఉంటాయనే శ్రుతిలో వినబడు తున్నది.ప్రతి ప్రాణి యొక్క హృదయస్థానంలో బ్రహ్మముంటుందని,సుషుప్తిలో జీవాత్మ-సత్సంపన్నుడౌతాడని శ్రుతి నిర్దేశం.
కార్యరూపంలోనే కాక,బ్రహ్మము అవికృత రూపంలో ఉందనే శ్రుతులు బోధిస్తున్నాయి.బ్రహ్మ నిరవయవి అనే ఉపనిషద్వాక్యాలు నిర్ధారిస్తున్నవి .శబ్ద ప్రామాణ్యంతోనే అగోచరమైన బ్రహ్మమును స్థాపించడం శక్యం. అందువల్ల నిరవయత్వాన్ని నిస్సంసందేహంగా అంగీకరించాలి.
నేను చూచుచున్నాను-మొ౹౹ ఇంద్రియములు"నేను"అనటం వలన స్థూలదేహం ఆత్మకాదు.
"నాదేహం"అనడం మమకారం. "నేను దేహం" అంటే అహంకారం. "దేహం"నేను అనటం లేదు కనుక దేహం ఆత్మకాదు.
జనన మరణాదులున్నందున "దేహం" "ఆత్మ"కాదు.
ఏది లేనందువలన శరీరమే ఉండదో అది ఆత్మ.కనుక ఇంద్రియములు కొన్ని లేకున్నా శరీరం ఉంటుంది.కనుక ఇంద్రియాలు ఆత్మకాదు.
అవిద్యా కల్పితమైన వ్యవహారంలో బ్రహ్మ పరిణామం ఎన్నో రూపాలలో కనపడవచ్చు.కాని,పారమార్థక రూపంలో బ్రహ్మ మొక్కటే. నానారూపాలు లేవు. నామరూపభేదం కేవలం వాచారంభణం
(వాక్కుతో వచ్చినది).
"నీ ఆత్మయే పరబ్రహ్మ"అని తెలుసుకోవటం వల్ల మోక్ష ఫలసిద్ధి కలుగుతుంది.
***
-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ || ఇక సాత్త్వికసుఖము, రాజససుఖము, తామససుఖము - అను మూడు సుఖములను గూర్చి వర్ణించుచున్నారు-
సుఖం త్విదానీం త్రివిధం
శృణు మే భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర
దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||
తా:-భరతకుల శ్రేష్ఠుడవగు ಓ అర్జునా! దేనియెుక్క అభ్యాసముచే మనుజుడు ఆనందము నొందుచుండునో, దుఃఖశాంతినిగూడ లెస్సగ బడయుచుండునో, అట్టి సుఖమిపుడు మూడువిధములుగా నాచే తెలుపబడుచున్నది. వినుము -
వ్యాఖ్య:- “అభ్యాసాత్” - సాత్త్వికసుఖము, దైవసుఖము, బ్రహ్మానందము అభ్యాసమువలననే జీవునకు లభించగలదని భగవాను డిచట తెలియజేయుచున్నాడు. అధ్యాత్మవిద్య మాటలచే, ‘వాచా’జ్ఞానముచే కలుగునది కాదు. అది అనుభవవిద్య (Practical Science). అందలి ప్రతిసిద్ధాంతమును అనుభవములో చూచుకొనవలెను.
అపుడే జీవునకు ప్రత్యక్ష సుఖము లభించును. చాలమంది " మాకు సాక్షాత్కార మెట్లు కలుగును, దుఃఖ మెట్లు తొలగును, సుఖ మెట్లుకలుగును?" అని ప్రశ్నించుచుందురు. భగవాను డందులకు "అభ్యాసముచేయుడు, మీకవి లభించును" అని యిచట చెప్పుచున్నాడు. ప్రయత్నము చేయక, సాధింపక, ఒడ్డునకూర్చొని మాటలు చెప్పుటద్వారా పరమార్థానుభవమెన్నటికిని కలుగనేరదు. పెరుగును చిలికిననే వెన్నవచ్చును. నువ్వులను పిండిననే నూనెవచ్చును. చెఱకును నమలిననే మాధుర్యమనుభూతమగును. అట్లే అభ్యాసముచేతనే ‘దుఃఖాంతము’, సుఖావిర్భావము జీవునకు కలుగగలదు.
“దుఃఖాన్తం చ నిగచ్ఛతి” - ఈ ప్రపంచమున ప్రతిజీవియు కోరునది దుఃఖరాహిత్యము, దుఃఖాంతము. జీవిత మందలి అతిముఖ్యమైన, క్లిష్టతరమైన సమస్య ఈ దుఃఖాంతసంపాదనమే యగును. ప్రతివానిని ఈ సమస్యయే బాధించుచున్నది. చీమయు ఈ దుఃఖాంతమునకే, అనగా దుఃఖమును పోగొట్టుకొనుటకొఱకే యత్నించుచున్నది. దోమయు దానికొఱకే యత్నించుచున్నది. చతుర్ముఖబ్రహ్మయు దానికొఱకే యత్నించుచున్నాడు.
దుఃఖముయొక్క అంతమును (దుఃఖరాహిత్యమును) ప్రాణి యెచట పొందగలదు? ఈ మహాసంసారిక బాధలన్నియు ఎచ్చోట నుపశమించగలవు? దుఃఖములేనిచోటు ఏది? ప్రపంచములో ఎచట వెతకినను అట్టిచోటు లభించగలదా? శాశ్వతసుఖము నొసంగగల వస్తువు ఈ దృశ్యసమూహమందుకలదా? లేదు. దుఃఖముయొక్క అంత మొక ఆత్మయందే, దైవమందే కలదు. ఆత్మసుఖమందే , సాత్త్వికానందమందే దుఃఖముయొక్క అంతమును జీవుడు పొందగల్గుచున్నాడని ఈ శ్లోకమున చెప్పబడినది.
ఈ భగవద్వాక్యమువలన ప్రతి ప్రాణిని వేధించుచున్న "దుఃఖనివారణసమస్య” తీరిపోయినది. దుఃఖనివారణ కుపాయము సాత్త్వికసుఖసంపాదనమే, ఆత్మానందప్రాప్తియే. కాబట్టి ఆత్మసుఖమునే, దైవసుఖమునే అన్వేషింపవలయును. అది యెట్లు లభ్యమగును? అభ్యాసమువలన, సాధన చతుష్టయరూపసంపత్తిచేత, అమానిత్వాదిగుణములచేత. "నిగచ్ఛతి" అని చెప్పుటవలన అభ్యాసముచే నట్టి దుఃఖరాహిత్యస్థితిని జీవుడు లెస్సగ బడయగలడని తెలియుచున్నది.
ప్ర:- సుఖ మెన్ని విధములు?
ఉ:- మూడువిధములు.
(1) సాత్త్వికసుఖము
(2) రాజససుఖము
(3) తామససుఖము - అని.
ప్ర :- దుఃఖరాహిత్యము ఎట్లు కలుగును?
ఉ:- అభ్యాసముద్వారా ఉత్తమ (సాత్త్విక) సుఖమును బొందుటచే దుఃఖము సంపూర్ణముగ
తొలగిపోగలదు.
🕉🌞🌎🌙🌟🚩
[17:09, 29/12/2020] +91 92915 82862: తిరుప్పావై 15 వ రోజు పాశురము
15 వ పాశురం
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్!!
భావం
ॐॐॐॐॐॐॐ
ఈ పాశురంలో ఉన్న గోపికకు , బయట ఉన్న గోపికలకు సంవాదము నిబంధింపబడినది.
బయట గోపికలు : ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్రించుచున్నావా ! అయ్యో ఏమి ఇది ?
లోపల గోపిక : పూర్ణలగు గోపికలారా ! చీకాకు కలుగునట్లు జిల్లుమని పిలువకుడు. నేను ఇప్పుడే వచ్చుచున్నాను.
బయట గోపికలు : నీవు చాలా నేర్పుగల దానవు. నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే తెలుసుకున్నాము.
లోపల గోపిక : మీరే నేర్పుగలవారలు, పోనిండు, నేనే కఠినురాలను.
బయట గోపికలు : నీకు ఈ ప్రత్యేకత ఏమి ?అలా ఏకాంతముగా ఉండేదవేల ? వేగముగా బయటకు రమ్ము.
లోపల గోపిక : అందరు గోపికలు వచ్చిరా ?
బయట గోపికలు : వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకొనుము.
లోపల గోపిక : సరే ! నేను వచ్చి ఏమి చేయవలెను ?
బయట గోపికలు : బలిష్టమగు కువలయాపీడనము అను ఏనుగును చంపిన వాడును శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము.
మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.
ఈరోజు పదిహేనవ పాశురం బయటగోపబాలికలకు లోపలగోపబాలిక మద్య సంభాషనలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్సి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమో నని అనుకోని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.
అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, "ఎల్లే!" ఏమే "ఇళంకిళియే!" లేత చిలకా! "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.
కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు "నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.
బయట నుండి వాళ్ళు " వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీనోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్" ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోప బాలిక "వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.
కాని బయట నుండి, "ఒల్లై నీ పోదాయ్" ఏమే రా! మరి ఇంక, "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరోకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి "ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.
పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై " బలం కల్గిన ఏనుగు -కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తోలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.
ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మల్లీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ.
పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముశ్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట.
ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించు కుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.
అవతారిక
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఇంతవరకు భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధనాక్రమము వివరింపబడినది. ఇట్టి సాధన చేయుటచే ఏర్పడవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలుగుట. అది పూర్ణముగా తొలగిననాడుగాని ఆచార్య సమాశ్రయణముచే మంత్రము లభించి భగవదనుభవము కలుగనేరదు. ఇట్టి పరిపూర్ణస్థితి యందు ఉన్న గోపిక ఈనాడు మేలుకొలుప బడుచున్నది.
మొదటి సగము ఒక తిరుప్పావు -- రెండవ సగము వేరొక తిరుప్పావు. మొదటిది భాగవత సమాశ్రయణ వ్రతము, భగవత్భక్తులను ఆశ్రయించుటచే ఆత్మగుణములు పరిపూర్ణముగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమగునత్తి ఆకారము లభించును. ఆ ఆత్మగుణ పరిపూర్తి అనేది ఎట్టిదో ఈ పాశురములో నిరూపించబడినది.
వ్రతాన్ని చేయటానికై తమ గోష్ఠిలో చేర్చుకొనదగిన పదవ గోపికను యీ మాలికలో గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది సంభాషణ రూపంలో వున్న అద్వితీయ పాశురం. ఈ గోపికను యీగోష్ఠి నంతను సేవించవలెనను కుతూహలమున్నది. భగవద్గుణాలను ఏకాంతంగా ఒక్కరే అనుభవించటం తగదని అందుకే గోష్ఠిలోని అందరకూ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెప్తున్నది.
ఇక్కడితో వ్రతంలోని రెండవ దశయైన ఆశ్రయణ దశ పూర్తవుతుంది. వ్రత మిషతో భగవద్గుణాలనందరకు పంచాలనే అద్భుతమైన భావానికి లోనైన ఆండాళ్ తల్లి శ్రవణ, మనన, ధ్యానాలనే వాటిని చక్కగా విశదపరచి నిరూపించింది.
భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి. మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది. దానితో ఎడతెగని ఆనందం లభించి స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తాదాత్త్యతను పొందుతుంది. ఈ పదవ గోపిక లక్షణాలు కూడా యివే! ఇట్టి నిద్రలో మునిగివున్న యీ పదవ గోపికను తమ గోష్ఠిలో చేరమని సంభాషణా రూపంలో సమాధానపరచి గోష్ఠిలో చేర్చుకున్నది గోదా తల్లి.
కమాసురాగము - ఏకతాళము
ॐॐॐॐॐॐॐॐॐॐ
వారు: చిలక పలుకు చిన్నదాన! ఇంకా నిదురింతువే!
ఆమె: చెలియలార! ఉలికి పడగ పిలువకు డిదె వచ్చుచుంటి.
వారు: పుల్లవిరుపు మాటల నీ చతురోక్తుల నెరుగుదుమే?
ఆమె: అల్లన మీరె చతురలు! నన్నిట్టుల నుండనీరె!
వలసినవారెల్ల రిచట కూడిరి! ఓ చెలియరో!
వారు: చెలులెల్లరు వచ్చిరి నీ వెంచుకోవె! సఖియరో!
ఆమె: ఏల నేను రావలె! మీకేమి నేను చేయవలె?
వారు: బలియుని కువలయకరి మదమణచిన శ్రీకృష్ణుని లీలల
కీర్తింప నీవు శీఘ్రమే రావమ్మరో!
చిలక పలుకు చిన్నదాన! ఇంకా నిదురింతువే?
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఆచార్య సన్నిదానానికి చేరే ముందర స్థితి

ఈరోజు పాశురం బయటగోపబాలికలకు లోపలగోపబాలిక మద్య సంభాషనలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్సి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమో నని అనుకోని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.

కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి *"
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్"* ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు "నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.

"పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై " బలం కల్గిన ఏనుగు -కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తోలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.
ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మల్లీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు.
మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముశ్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట.
ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్.
అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించు కుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకో కూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.
ॐॐॐॐॐॐॐॐॐॐ
తిరుప్పావై15 వ పాశురము / తెలుగు పద్యానువాదము
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఎల్లే యిలఙ్కిళియే
సీ . రామ చిలుకవమ్మ రావమ్మ మేల్కొొని
వేచి యున్నామమ్మ వేగరమ్ము
నిద్ర విడిచి వచ్చి నీచెంత నిలిచాము
మా నిద్ర నంతయు మరచినాము
భళిభళీ! యెంతటి పడతులు మీరంత
నంగనాచితనము నాకు తెలుసు
గడుసరి మగువలు కారేమొ మీరెల్ల
నే గడుసరి నంచు నేర్చినారు
వచ్చి లెక్కింపుము వచ్చిన వారెల్ల
యిచటనే యున్నాము వెళ్ళలేక
తే.గీ. గుణము లన్నియు పాడుచు కోర్కెమీర
మత్త గజకుంభముల మదమణచు వాణ్ణి
నిన్ను కొని పోవ మేమెల్ల నిల్చినాము
హరిని కీర్తింప మనమెల్ల అరుగవలయు
శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
[20:13, 29/12/2020] +91 95058 13235: 29.12.2020 సాయ
హరివంశమునందు పద్మపురాణములో శంకరుని ఆపాదమస్తకమూ యజ్ఞాంగములతో సమానముగా వర్ణింపబడినది. పరమేశ్వరుని అర్ధాంగి యగుటచే పరమేశ్వరికూడా యజ్ఞస్వరూపురాలుగా చెప్పబడినది. గనుక పరమేశ్వరిని యజ్ఞరూపా యని అన్నాము.
యజ్ఞములు పాకయజ్ఞములు, హవిర్యాగాలు, సోమ సంస్థలు అని మూడు ప్రధాన రకములు గలవు.
పాక యజ్ఞాలు
1) ఔపాసన, 2) స్థాలీపాకము, 3) వైశ్వదేవము, 4) అష్టకము, 5) మాస శ్రాద్ధము, 6) సర్పబలి, 7) ఈశాన బలి.
హవిర్యాగాలు
1) అగ్నిహోత్రాలు, 2) దర్శపూర్ణిమాసలు, 3) అగ్రయణం, 4) చాతుర్మాస్యాలు, 5) పిండ, పితృ యజ్ఞాలు, 6) నిరూఢ పశుబంధము, 7) సౌత్రామణి
సోమ సంస్థలు
1) అగ్నిష్టోమము, 2) అత్యగ్నిష్టోమము, 3) ఉక్థము, 4) అతిరాత్రము, 5) ఆప్తోర్యామం, 6) వాజపేయం, 7) పౌండరీకం
పంచమహాయజ్ఞములు
పంచ మహాయజ్ఞములు అనగా హిందూ ధర్మశాస్త్రాలననుసరించి గృహస్థు ఆచరించవలసిన ఐదు యజ్ఞములు.
బ్రహ్మ యజ్ఞము ఈ యజ్ఞము ద్వారా గృహస్థుడు అనేక కొత్త విషయములను తెలుసుకుంటాడు. అంతేకాక మిగిలినవారికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞంలో భాగంగా గృహస్థుడు జ్ఞానమును ఆర్జిస్తాడు, అందరికి పంచి పెడతాడు. బ్రహ్మ యజ్ఞమనగా వేదాధ్యయనము. రామాయణ, భాగవతాద్యుద్గ్రంథములను పఠించడం.
దేవ యజ్ఞము ఇవి భగవదనుగ్రహం కోసం, ఇష్టకార్యార్ధ సిద్ధి కోసం చేస్తారు. గృహస్థులయితే తమ గార్హపత్యాగ్ని లో హవిస్సును సమర్పిస్తారు. బ్రహ్మచారులయితే లౌకికమైన అగ్నితోనే చేస్తారు. ఇక శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలమును ఇస్తుంది. దేవ యజ్ఞమనగా ఆజ్యము, లాజలు (పేలాలు) వంటితో హోమం జరిపించుట
పితృ యజ్ఞము ఇవి తమను వదలి పరలోకమునకు చేరిన తమ పితృదేవతల కొరకు చేస్తారు. ఐతే తండ్రి బ్రతికి ఉండగా ఇట్టి యజ్ఞమును చేయుటకు పుత్రునికి అధికారం లేదని చెప్పెదరు. పితృ యజ్ఞమనగా శ్రాద్ధము, తర్పణములు మొదలైన కార్యక్రమాలు జరిపి పూర్వీకులను సంతృప్తి పరుచుట.
భూత యజ్ఞము తనతో పాటుగా ఈ భూమిమీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను నడుచుకోవాలి. భూత యజ్ఞమనగా సకల భూతములకు బలిదానములు ఇచ్చుట
నృయజ్ఞము ఈ యజ్ఞమునే అతిధి యజ్ఞం అనికూడా పిలుస్తారు. మన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవంగా చూసుకోవాలి. ఈ యజ్ఞము ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రమములవారికి ఆధారం అవుతున్నాడు. నృయజ్ఞమనగా అతిథి పూజాదులు నిర్వర్తించడం.
పైన చెప్పిన వివిధరూపాలైన యజ్ఞములన్నియు సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపమే గనుక శ్రీమాత యజ్ఞరూపా యని అనబడినది.
యజ్ఞోవై విష్ణుః వేదములో యజ్ఞమే విష్ణువని చెప్పబడినది. భగవద్గీతలోకూడా తానే యజ్ఞస్వరూపుడనని భగవానుడే చెపుతాడు. జగన్మాత విష్ణుస్వరూపిణి గనుక యజ్ఞరూపా యని అన్నారు.
జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం యజ్ఞరూపాయై నమః అని అనవలెను.
🌸💐💐💐
: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
195వ నామ మంత్రము 30.12.2020
ఓం దోషవర్జితాయై నమః
రాగద్వేష సంబంధిత దోషములనునవి లేక విరాజిల్లు జగజ్జననికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి దోషవర్జితా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం దోషవర్జితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి వారి సాధనకు విఘాతం కలిగించు దోషములను దూరముచేసి, భగవదారాధనలో నిమగ్నముచేసి, సుఖసంతోషములను, ఆత్మానందానుభూతిని అనుగ్రహించును.
జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. నిప్పులో పడిన మిడత మాడిపోతుంది. అటువంటి దోషములు ఆ తల్లి చేరవు. ఎందుచేతనంటే జగన్మాత చిదగ్నికుండసంభూత గనుక దోషవర్జితా యని అనబడినది. అంతేగాని అమ్మవారు దోషములను విడచిపెట్టింది అని మనం అనుకుంటే మనకు దోషంవస్తుంది.
అరిషడ్వర్గములు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేవి అంతశ్శత్రువులు. రావణాబ్రహ్మ వేదవేదింగ పారంగతుడు. కాని నేను అనే అహం బాగా ఉన్నవాడు. వరగర్వితుడు. స్త్రీవ్యామోహం విపరీతంగా గలవాడు. ఈ దోషాలవల్లనే అతడు అంతమయాడు. అలాగే శిశుపాలదంవక్త్రులు, హిరణ్యకశిప హిరణ్యాక్షులు, దుర్యోధనుడు - వీరందరును రాగద్వేషముల వలన దోషపూరితిహృదయులై నశించారు. అరిషడ్వర్గములు అనేవి బుద్ధిమీద ప్రభావంచూపుతాయి. .అరిషడ్వర్గాలకు కారణమైనవి రాగద్వేషాలు అవడంచేత దోషపూరితమైన కర్మలు చేయిస్తాయి. ఫలితంగా కర్మఫలాలు సంచితములవుతూ జన్మజన్మలకు కొనసాగతాయి. కనుక పరమేశ్వరీ ఆరాధన వలన దోషములు వర్జింపబడతాయి. గనుకనే జగన్మాత దోషవర్జితా యని అనబడినది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
****
ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఇరువది ఒకటవ అధ్యాయము
వేణుగీతము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
21.15 (పదునైదవ శ్లోకము)
నద్యస్తదా తదుపాధార్య ముకుందగీతమావర్తలక్షితమనోభవభగ్నవేగాః|
ఆలింగనస్థగితమూర్మిభుజైర్మురారేః గృహ్ణంతి పాదయుగలం కమలోపహారాః॥9145॥
సఖీ! దేవతలు, గోవులు, పక్షులు మొదలగువాని విషయము అట్లుండనిమ్ము. ఇటు నదులవైపు ఒక పర్యాయము పరికించి చూడుము. నదులన్నియును హాయిని గొలిపెడి ఆ మురళీరవమును వినుచు వినుచు మోహనపరవశలైనట్లు కనబడుచున్నవి. కృష్ణప్రేమకారణముగా ఆ వాహినులు మన్మథబాణములకు గుఱియై (కామవికారములకు లోనై) సుడులు తిరుగుచు తూలిసోలి పోవుచున్నట్లు ఒప్ఫుచున్నవి. ఆ స్థితిలోనున్న ఆ నదీభామినులు తరంగములనెడి హస్తములతో ఆ స్వామి చరణములను ఆలింగనము చేసికొనుచున్నవా యనునట్లు పట్టుకొనుచు, కమలములను కానుకలుగా సమర్పించి, అర్చించుచున్నవి.
21.16 (పదునారవ శ్లోకము)
దృష్ట్వాఽఽతపే వ్రజపశూన్ సహ రామగోపైః సంచారయంతమను వేణుముదీరయంతమ్|
ప్రేమప్రవృద్ధ ఉదితః కుసుమావలీభిః సఖ్యుర్వ్యధాత్స్వవపుషాంబుద ఆతపత్రమ్॥9146॥
సఖీ! ఆకాశముననున్న ఆ మేఘమును చూడుము. బలరామునితో గోపాలురతోగూడి, మధ్యాహ్నసమయమున గోవులను మేపుచు, పిల్లనుగ్రోవిని ఊదుచున్న శ్రీకృష్ణుని జూచి మేఘము గూడ ఆయనపై మరులుగొనినట్లున్నది. అందువలన అది తన సఖుడైన (కృష్ణునకువలె మేఘము శ్యామవర్ణ శోభితము, లోకోపకారము. అందువలన శ్రీకృష్ణుడు మేఘమునకు సఖుడు). కృష్ణప్రభువుపై తన జలబిందువులనెడి పూలను చల్లుచు, గొడుగు పట్టుచు,ఆ స్వామిని సేవించుచున్నది.
21.17 (పదునేడవ శ్లోకము)
పూర్ణాః పులింద్య ఉరుగాయపదాబ్జరాగశ్రీకుంకుమేన దయితాస్తనమండితేన|
తద్దర్శనస్మరరుజస్తృణరూషితేన లింపంత్య ఆననకుచేషు జహుస్తదాధిమ్॥9147॥
సఖీ! మహామనీశ్వరులు నిరంతరము శ్రీహరి పాదములను తమ హృధయములలో నిలుపుకొని ప్రస్తుతించుచుందురు. అట్టి శ్రీపాదములను తనయొడిలో చేర్చుకొని లక్ష్మీదేవి వాటిని సేవించుచుండును. ఆ సమయమున లక్ష్మీదేవియొక్క వక్షస్థలమునందు విరచితములైన కుంకుమపరాగములు ఆ స్వామి పాదములకు అంటుకొనుచుండును. గోవులను మేపుచు శ్రీహరి (శ్రీకృష్ణుడు) పచ్చికలపై తిరుగుచున్నప్ఫుడు ఆ ప్రభువుయొక్క పాదములకు అంటుకొనిన కుంకుమ పాదుల గడ్డిపరకలకు చేరుచుండును. శ్రీకృష్ణుని దర్శనమునకై తహతహతో పరితపించుచున్న శబరాంగనలు ఆ కుంకుమలను తమ ముఖముపైనను, వక్షస్థలముల యందును రాసికొనుచుందురు. ఆ కుంకుమ స్పర్శనే శ్రీకృష్ణుని సంస్పర్శగా తలంచుకొనుచు వారు మనోవ్యథను వీడి మిగుల ఆనందించుచుందురు. కనుక ఆ బోయకన్యలు ఎంతయు ధన్యులు కదా!
21.18 (పదునెనిమిదవ శ్లోకము)
హంతాయమద్రిరబలా హరిదాసవర్యో యద్రామకృష్ణచరణస్పర్శప్రమోదః|
మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్పానీయసూయవసకందరకందమూలైః॥9148॥
భళీ! సఖులారా! గిరులలో శ్రేష్ఠమైన ఈ గోవర్ధన పర్వతము భగవద్భక్తులలో సర్వోన్నతమైనది. శ్రీకృష్ణునియొక్క బలరామునియొక్క పాదముల సుఖస్పర్శతో పునీతమై పరమానందభరితమగుచు వృక్షములనెడి రోమాంచములచే పులకించిపోవుచున్నది. చూచితిరా! దీని భాగ్యమే భాగ్యము. ఇది సెలయేళ్ళద్వారా స్నానపానములకు స్వచ్ఛములైన జలములను సమకూర్చుచున్నది. గోవులకు లేతపచ్చికలను అందించుచున్నది. విశ్రాంతికై గుహలను ఏర్పాటు చేయుచున్నది. ఆహారమునకై కందమూల ఫలములను సమర్పించుచున్నది. ఈ విధముగా ఇది బలరామ కృష్ణులకును, గోపాలకులకును, గోవులకును సగౌరవముగా అపూర్వరీతిలో సేవలొనర్చుచున్నది. నిజముగా ఈ గిరిజీవితము ఎంతయు సార్థకము, ధన్యము.
21.19 (పందొమ్మిదవ శ్లోకము)
గా గోపకైరనువనం నయతోరుదారవేణుస్వనైః కలపదైస్తనుభృత్సు సఖ్యః|
అస్పందనం గతిమతాం పులకస్తరూణాం నిర్యోగపాశకృతలక్షణయోర్విచిత్రమ్॥9149॥
సఖులారా! శ్రీకృష్ణుడు, బలరాముడు గోవులను మేపుచు వనములలో ఎట్లు తిరుగుచున్నారో చూడుడు. వారు తమ తలలపై నిర్యోగములను (పాలు పితుకునప్పుడు ఆవుల ఎడమకాళ్ళను బంధించు త్రాళ్ళను), భుజములపై పాశములను (అల్లరి పశువులను అదుపు చేయుటకై ఉపయోగించెడి త్రాళ్ళను) ధరించియున్నారు. గోపాలురు గూడ వారిని అనుసరించుచు తగువిధముగా ఆవులను మళ్ళించుచున్నారు. ఆ సమయమున ఆ ఇరువురును (బలరామకృష్ణులు) వినసొంపైన రాగాలాపనలతో వేణుగానము చేయుచున్నారు. ఆ గానమాధుర్యములకు తన్మయులై మనుష్యులు మైమఱచిపోవుచున్నారు. అంతేగాదు, పశుపక్ష్యాదులు సైతము ఆ పారవశ్యమున నిశ్చేష్టములగుచున్నవి. స్థావరములైన వృక్షములు సైతము కొమ్మలతో, రెమ్మలతో పులకించు పోవుచున్నవి. జంగమములను (మనుష్య, పశుపక్ష్యాదులను) స్థావరములుగా, స్థావరములను (వృక్షములను) జంగమములుగా మార్చివేయుచున్న ఈ వేణుగాన మహత్త్వము మిగుల విచిత్రమైనది. ఎంతయు అద్భుతమైనది.
21.20 (ఇరువదియవ శ్లోకము)
ఏవం విధా భగవతో యా వృందావనచారిణః|
వర్ణయంత్యో మిథో గోప్యః క్రీడాస్తన్మయతాం యయుః॥9150॥
బృందావనమున విహరించుచున్న కృష్ణభగవానుని యొక్క అద్భుతలీలలను గూర్చి ప్రతిదినము ఈ విధముగా గోపకాంతలు తమలో తాము ముచ్చటించుకొనుచు తన్మయత్వమును పొందుచుండిరి.
ఈ వేణుగీతములను ప్రతినిత్యము శ్రద్ధగా పఠించువారికి కృష్ణప్రేమ లభించును - అని ఎందరో మహాత్ములు స్వానుభవముతో వెల్లడించిన వచనములు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకవింశోఽధ్యాయః (21)
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది ఒకటవ అధ్యాయము (21)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
[06:51, 30/12/2020] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 594 / Bhagavad-Gita - 594 🌹
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 11 🌴
11. న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత: |
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ||
🌷. తాత్పర్యం :
దేహధారుడైనవానికి సర్వకర్మలు త్యజించుట నిక్కముగా అసాధ్యమైన విషయము. కాని కర్మఫలములను త్యాగమొనర్చినవాడు మాత్రము నిజమైన త్యాగి యనబడును.
🌷. భాష్యము :
మనుజుడు ఏ సమయమునను కర్మను త్యజింపజాలడని భగవద్గీత యందే తెలుపబడినది. కనుక కృష్ణుని కొరకే కర్మనొనరించుచు, కర్మఫలమును తాననుభవింపక కృష్ణునికే సమస్తమును అర్పించువాడు నిజమైన త్యాగి యనబడును.
మా అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘమునందు సభ్యులైన పలువురు తమ కార్యాలయములందు గాని, కర్మాగారమునందు గాని, ఇతర చోట్ల గాని కష్టించి పనిచేసినను వారు సంపాదించినదంతయు సంస్థకే ఒసగుదురు.
అట్టి మహాత్ములు వాస్తవముగా సన్న్యాసులైనట్టివారే. అనగా వారు సన్న్యాసాశ్రమము నందు నెలకొనియున్నట్టివారే. కర్మఫలములను ఏ విధముగా త్యాగము చేయవలెనో మరియు ఎట్టి ప్రయోజనమునకై కర్మఫలములను విడువవలెనో ఈ శ్లోకమున సృష్టపరుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
[06:51, 30/12/2020] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 198, 199 / Vishnu Sahasranama Contemplation - 198, 199 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻198. అమృత్యుః, अमृत्युः, Amr̥tyuḥ🌻
ఓం అమృత్యవే నమః | ॐ अमृत्यवे नमः | OM Amr̥tyave namaḥ
మృత్యుః వినాశః వినాశహేతుర్వా అస్య న విద్యతే మృత్యువు అనగా వినాశము గానీ, వినాశమునకు హేతువగు జన్మాది రూప లక్షణము గానీ ఈతనికి లేదు.
:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ ।
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ॥ 19 ॥
ఓ అర్జునా! నేను తపింపజేయువాడను మఱియు వర్షమునుకూడా నేనే కురిపించుచున్నాను. వర్షమును నిలుపుదలచేయువాడనూ నేనే. అమృతత్వమును అనగా మరణరాహిత్యమున్నూ, మరణమ్మునూ నేనే. అట్లే సద్వస్తువున్నూ, అసద్వస్తువున్నూ నేనే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
ఓం సర్వదృశే నమః | ॐ सर्वदृशे नमः | OM Sarvadr̥śe namaḥ
సర్వదృక్, सर्वदृक्, Sarvadr̥k
ప్రాణినాం కృతాకృతం సర్వం పశ్యతి స్వాభావికేన బోధేన తన స్వభావమే యగు శుద్ధ జ్ఞానముచేతనే ప్రాణుల కృతాకృతములగు కర్మలను అనగా చేయబడినవీ, చేయబడనివీ యగు కర్మములను చూచును గావున ఈతడు సర్వదృక్.
:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ. కేశవా! సంతత క్లేశనాశనుఁడవు గురుసన్మనో వాగగోచరుఁడవు
నిద్ధమనోరథ హేతుభూతోదార గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల
విశ్వోద్భవ స్థితి విలయార్థ ధృతనిత్య విపుల మాయాగుణ విగ్రహుఁడవు
మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుండ వతిశాంతమానసుఁడవు
తే. తవిలి సంసార హారిమేధస్కుఁడవును, దేవదేవుఁడవును వాసుదేవుఁడవును
సర్వభూత నివాసివి సర్వసాక్షి, వైన నీకు నమస్కారమయ్య! కృష్ణ! (918)
కేశవా! నీవు దుఃఖాన్ని తొలగిస్తావు. భక్తుల మనస్సునకూ, మాటలకూ అందవు. సకల శ్రేయస్సులను కలిగించే ఉదారగుణాలు, పేర్లు కలవాడవు. సత్త్వగుణం కలవాడవు. ప్రప్రంచసృష్టి, స్థితి, విలయాల కోసం మాయామయమైన బ్రహ్మాది గుణ విగ్రహాన్ని ధరిస్తావు. నీవు సర్వేంద్రియ మార్గాలచేత తెలియబడని మార్గం కలవాడవు. ప్రశాంతమైన మనస్సు కలవాడవు. సంసారాన్ని హరించే జ్ఞానం కలవాడవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. నీవు సర్వప్రాణులలో నివసిస్తావు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! నీకు నమస్కారం.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
[06:51, 30/12/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 147 🌹
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 77 🌻
అట్టి తురీయనిష్ఠ యందు శరీరమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు ఉన్నప్పటికీ, తాను విలక్షణుడైఉండుటచేత, తాను సాక్షీ భూతుడై ఉండుటచేత, తాను సాక్షీ మాత్రుడై ఉండుటచేత, సదా హిరణ్మయకోశమందు రమించేటటువంటి లక్షణం కల్గి ఉండుట చేత, సదా అగ్ని దీప్తిని కలిగి యుండుట చేత, సదా స్వయం ప్రకాశాన్ని కల్గి ఉండుట చేత ఆ సుషుప్త్యావస్థ యొక్క చీకటిని, అజ్ఞానాంధకారాన్ని తాననుభవించడు. దీనికొక ఉపమానం ఉంది. ఎట్లా అంటే సూర్యునియందు చీకటి ఉండే అవకాశం ఉందా? అంటే ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు చీకటి ఏర్పడదు.
కాబట్టి సూర్యస్థానంలో ఎట్లా అయితే చీకటి ఏర్పడదో, అట్లే తురీయనిష్ఠుడైనటువంటి, బ్రహ్మనిష్ఠుడై సిద్ధించినటువంటి, హిరణ్యగర్భ స్థితిని సాధించినటువంటి, సిద్ధించినటువంటి మహానుభావులు ఎవరైతే మహర్షి ఎవరైతే ఉన్నారో, అతనికి అజ్ఞానాంధకారమనే సుషుప్త్యావస్థ లేదు.
కేవలము భౌతికమైనటువంటి శరీరము తనకు తా ధన్యవంతమగుట గాని, తనకు తా విరమించడం గాని ఒక పనిముట్టువలే జరుగుతూ ఉంటుంది. జరగడమే ఉంటుంది గాని, అతను అవస్థాత్రయమునకు లొంగుట ఉండదు.
ఈ రకంగా అగ్నిని మనం ఆశ్రయించి, అగ్నిని ఆరాధించి ఆ అగ్ని యొక్క ఆధారముగా... ‘హవ్యవాహనుడు’.. అందుకే ఆయన పేరు “హవ్యవాహనుడు”. ఈ అగ్ని యందు అర్పించబడేటటువంటి సమస్తమూ కూడ హవిస్సులు. వీటిని ఆధారముగా మనం దివ్యత్వాన్ని పొందటానికి శ్రోతస్సులు అంటాం. ఈ రకంగా హవిస్సులే వారి దివ్యత్వాన్ని సాధించినపుడు శ్రోతస్సులు అవుతున్నాయి, అంటే శ్రుతి భాగములు అవుతున్నాయి.
ఏవైతే శ్రోతస్సులవుతున్నాయో, అట్టి శ్రుతి భాగములన్నీ కూడ ఏ పరమాత్మనైతే జపిస్తూ ఉన్నాయో, ఏ పరమాత్మనైతే నిర్ణయిస్తూఉన్నాయో, ఏ పరమాత్మ స్థితిని ఆశ్రయిస్తున్నాయో అట్టి పరమాత్మను నేనే అనేటటువంటి స్థితికి చేరాలి.
అలా ఎవరైతే సిద్ధ స్థితిని పొందుతారో, అలా ఎవరైతే దేశికేంద్రులైనటువంటి స్థితిని సాధిస్తారో, అలా ఎవరైతే అఖండ ఎరుకైననటువంటి పరబ్రహ్మమును దాటుతారో, లేని ఎరుకైనట్టి పరబ్రహ్మమును దాటతారో, పరమాత్మ స్థితిని దాటి బయలు అనేటటువంటి స్థితికి చేరతారో, ఇట్టి అధియఙాగ్నిని జాగరణ శీలురైన ఋత్విక్కులు ప్రతి నిత్యమూ కాపాడుచున్నారు.
కాబట్టి ఈ యజ్ఞంలో ఉన్నటువంటి అగ్ని ఆంతరికం యజ్ఞం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఈ తురీయనిష్ట అనేటటువంటి ఆంతరికయఙం నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. అట్లా ఈ ఆంతరిక యజ్ఞంలో ఎవరైతే తనను తాను లేకుండా చేసుకుంటున్నారో, తనను తాను దగ్ధం చేసుకుంటున్నారో, ప్రారబ్ద ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం కాగా, త్రిపుటి అంతా దగ్ధం కాగా - కర్మ త్రయం, దేహత్రయం, శరీరత్రయం, అవస్థాత్రయం, గుణత్రయం, ఈ రకంగా త్రిపుటి అంతా ఏదైతే ఉందో ఆ త్రిపుటి అంతా కూడ ఈ జ్ఞానయజ్ఞంలో ఈ జ్ఞానాగ్నిలో ఈ అంతరిక యజ్ఞంలో దగ్ధమైపోగ జీవభావము నిశ్శేషముగా లేనిదై బ్రహ్మనిష్టుడౌతున్నాడు. అపుడు హిరణ్యగర్భ స్థితిని సాధిస్తాడు.
తురీయనిష్ట చేత పొందదగినటువంటి ఆరవ కోశమైనటువంటి ఈ హిరణ్మయకోశము, ఈ హిరణ్యగర్భ స్థితి అత్యుత్తమమైనటువంటి బ్రహ్మనిష్టకు ఆశ్రయమైనటువంటి స్థితి. ఈ హిరణ్యగర్భ స్థితి నుంచి ఏ జ్ఞానాగ్ని ద్వారా అనంతంగా ఉన్నటువంటి, అవధులు లేకుండా ఉన్నటువంటి అనంత విశ్వము కూడ దగ్ధమైపోతుంది మరల.
సంచితం ఎలా అయితే లేకుండా పోయిందో, జ్ఞాన పరమైన రుణానుబంధము ఎట్లా లేకుండా పోతుందో అట్లే అఖండ విశ్వమూ కూడ ఈ హిరణ్యగర్భ స్థితి యందు లయమై పోతున్నటువంటి ఆ లయ స్థితిని తాను దర్శన విధిగా దర్శిస్తాడు. అట్లా విరాడ్రూపంగా ఉన్నటువంటి అనంత విశ్వమూ ఈ అగ్ని యందు లేకుండా పోతుంది. ఈ అగ్నియే, ఈ హిరణ్మయకోశమే పరమాత్మగా మారిపోతుంది, పరబ్రహ్మము అయిపోతుంది. అఖండ ఎరుక లేని ఎరుక అయిపోతుంది.
ఆ విధంగా పూర్ణ గురువు సహాయంతో అనంత విశ్వము పిల్లలాటలవలే తోచేటటువంటిది ఎరుక లేని పద్ధతి. సంకల్పము- సంకల్పాతీతము, శూన్యము- శూన్యాతీతము. లేకుండా పోవుట అనేది శూన్యము, అలా ఎరుక లేకుండా పోవుట, లేని ఎరుక అగుట శూన్యాతీతమగుట. అలాగే కాలము- కాలాతీతము. కాలుని సహాయ సహకారంతో, కాలుని అనుగ్రహంతో, ఆ కాల పురుషుని యొక్క కృప చేత, ఈ అఖండ ఎరుకను దాటి, బయలు అనేటటువంటి దర్శనాన్ని పొంది, ఆ బయలు స్థితిలోకి చేరుతారు.- విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:51, 30/12/2020] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 21 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 21 🍀
కాళ్ వేళ్ నామ్ ఉచ్చారితా నాహీ!
దోస్తీపక్షి పాహీ ఉద్ధరతీ!!
రామకృష్ణ నామ సర్వదోషా హరణ్!
జడజీవా తారణ్ హరి ఏక్!!
హరి నామ సార్ జిన్హా
యా నామాచీ!
ఉపమా త్యా దైవాచీ కోణ్ వానీ!!
జ్ఞానదేవా సాంగ్ ఝాలా హరిపార్!
పూర్వజా వైకుండ్ మార్గ్ సోపా!!
భావము:
నామోచ్ఛారణ చేయడానికి కాల వేళాదుల నియమము ఏమీ లేదు. నామ స్మరణ చేయువారి ఇరు పక్షాలు ఉద్దరించి పోతాయి.
రామకృష్ణ నామము సర్వ దోషాలను హరించి వేయును. ఒక్క హరి నామమే జడ జీవులను తరించి వేయగలదు. హరినామ సారము యొక్క రుచి మరిగిన నాలుక దైవమును వర్ణించి
చెప్పడము ఎవ్వరికి సాధ్యము కాదు.
హరిపాఠమును పఠించి హృదయస్థము చేసుకున్న వారి పూర్వజులకు కూడ వైకుంఠ మార్గము సులభము కాగలదని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.
🌻. నామ సుధ -21 🌻
లేదు కాల వేళాదుల నియమము
ఉచ్ఛరించుటకు హరి నామము
ఇరు పక్షముల పరివారము
అయిపోవుదురు ఉద్గారము
రామకృష్ణ మధుర నామము
సర్వదోషహరణ కారణము
జడజీవులను తరించడము
హరి ఒకడికే ఇది సాధ్యము
హరినామము వేద సారము
నామ రుచి మరిగిన నాలుక భాగ్యము;
వర్ణింపనెవరి వైఖరి తరము
ఆ భక్త జనుల దైవ వైభవము
జ్ఞానదేవుని నామకీర్తనము
అయిపోయినది పరిపూర్ణము
పూర్వజులకు వైకుంఠ మార్గము
సులభముగా అయినది సాధ్యము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[06:51, 30/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 164 / Sri Lalitha Chaitanya Vijnanam - 164 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖
🌻164. ' నిర్మమా '🌻
“ఇది నాది”, అను బుద్ధి లేనిది శ్రీమాత.
నేను అను భావము అహంకారము. నాది అను భావము మమకారము. నాది అను భావమున్న చోట బంధమున్నది. నాది అని భావించు వస్తువుపైన, ప్రాణముపైన మమకారము అను జిగురు
ప్రసరించి, జీవుడు వానికి అతుకుకొని బద్ధుడగుచుండును. నాది అను వస్తువు కోల్పోయినపుడు బాధపడును. నిజమున కేదియూ తనది కాదు.
తన దగ్గర చేర్చబడినవే యుండును కానీ, తనవి అని ఏమియూ ఉండవు. తన శరీరము తన చుట్టునూ దేవతలచే అల్లబడినది. అందు వర్తించువారు కూడా దేవతలే. శరీరము దేవతలిచ్చినది. కానీ, తనది కాదు. అది దైవదత్తము. అట్లే భార్య, భర్త, బిడ్డలు, మువ్వురునూ దైవవశమున చేరినవారే కాని, తనవారు కాదు. వారియందు కర్తవ్యమే యున్నది కాని, అధికారము లేదు.
అట్లే బంధువులు, స్నేహితులు, ఆస్తులు, పాస్తులు. ఇవి యన్నియూ తన చుట్టునూ చేరుట, విడిపోవుట కాలక్రమమున తప్పనిసరి. వచ్చినవెల్ల పోవునవే. శరీరముతో సహా సర్వమునూ పోవునవే కాని తనతో నుండునవి కావు.
ధర్మమూ, కర్మమూ మాత్రమే తనతో నడచి వచ్చును. అవియునూ మోక్షమార్గమున సడలును. తానొకడే సత్యము. తాను సనాతనుడు, భేద సనాతనులైన ఉమామహేశ్వరుల తనయుడు. అట్టి జీవుడు ఐక్యము చెందిననూ, తన అస్తిత్వము కూడ భగవదనుగ్రహముగ కలిగి యుండును.
సనక సనందనాదులు, నారదుడు అట్టివారు. వారునూ బుద్ధి లేక, స్వలాభ రహితులై శ్రీమాత అనుచరులుగ జీవులకు జ్ఞాన సంతర్పణము చేయుచున్నారు. మమకారమున్నంత కాలము బంధముండును. బంధ మున్నంత కాలము బాధ యుండును. తన చుట్టును చేరినవి తనవి అనుకొనక దైవమునవి అనుకొనుట అభ్యసించవలెను.
తాను, తన పరసరముల చేరినవి, అన్నియునూ దైవమునకు చెందినవే కాని తనకు చెందినవి కావు. వానియందు మమకారము దుఃఖము కలిగించును. కావున ఈ భావము దాటిన వారికే ప్రశాంత యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[12:01, 30/12/2020] +91 92915 82862: 💥🎊💥🎊💥🎊💥🎊💥🎊
శ్రీ రామతీర్ధ వేదాంత భాష్యము.
రచన:-శ్రీ కేశవ తీర్ధ స్వామి.
ఆత్మానందం.
ఆడియో నం.4
💥🎊💥🎊💥🎊💥🎊💥🎊
[12:02, 30/12/2020] +91 92915 82862: 🌀👂🍯🎊💖🎊👂🍯🌀
శ్రీకృష్ణ కర్ణామృతం.
-- లీలాశుకుల రచన
ధనుర్మాసమును పురస్కరించుకుని.
ఆడియో నం.5
🌀👂🍯🎊💖🎊👂🍯🌀
[12:08, 30/12/2020] +91 92915 82862: శ్రీ గణేశ స్తవం
ఋషిరువాచ:--
ॐॐॐॐॐॐॐ
1)అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణమ్ |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ ||
2) గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్ |
మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ ||
3)జగత్కారణం కారణజ్ఞానరూపం సురాదిం సుఖాదిం గుణేశం గణేశమ్ |
జగద్వయాపినం విశ్వవంద్యం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ ||
4)రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతిజ్ఞం సదా కార్యసక్తం హృదాఽచింత్యరూపమ్ |
జగత్కారణం సర్వవిద్యానిదానం పరబ్రహ్మరూపం గణేశం నతాః స్మః||
5)సదా సత్యయోగ్యం ముదా క్రీడమానం సురారీన్హరంతం జగత్పాలయంతమ్ |
అనేకావతారం నిజజ్ఞానహారం సదా విశ్వరూపం గణేశం నమామః ||
6)తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం జగద్ధారకం తారకం జ్ఞానహేతుమ్ |
అనేకాగమైః స్వం జనం బోధయంతం సదా సర్వరూపం గణేశం నమామః||
7)తమః స్తోమహారం జనాజ్ఞానహారం త్రయీవేదసారం పరబ్రహ్మసారమ్ |
మునిజ్ఞానకారం విదూరే వికారం సదా బ్రహ్మరూపం గణేశం నమామః ||
8)నిజైరోషధీస్తర్పయంతం కరాద్యైః సురౌఘాంకలాభిః సుధాస్రావిణీభిః |
దినేశాంశుసంతాపహారం ద్విజేశం శశాంకస్వరూపం గణేశం నమామః||
9)ప్రకాశస్వరూపం నభో వాయురూపం వికారాదిహేతుం కలాధారరూపమ్ |
అనేకక్రియానేకశక్తిస్వరూపం సదా శక్తిరూపం గణేశం నమామః ||
10)ప్రధానస్వరూపం మహత్తత్వరూపం ధరాచారిరూపం దిగీశాదిరూపమ్ |
అసత్సత్స్వరూపం జగద్ధేతురూపం సదా విశ్వరూపం గణేశం నతాః స్మః ||
11)త్వదీయే మనః స్థాపయేదంఘ్రియుగ్మే జనో విఘ్నసంఘాతపీడాం లభేత |
లసత్సూర్యబింబే విశాలే స్థితోఽయం జనో ధ్వాంతపీడాం కథం వా లభేత||
12)వయం భ్రామితాః సర్వథాఽజ్ఞానయోగాదలబ్ధాస్తవాంఘ్రిం బహూన్వర్షపూగాన్ |
ఇదానీమవాప్తాస్తవైవ ప్రసాదాత్ప్రపన్నాన్సదా పాహి విశ్వంభ రాద్య ||
13)ఏవం స్తుతో గణేశస్తు సంతుష్టోఽభూన్మహామునే |
కృపయా పరయోపేతోఽభిధాతుముపచక్రమే||
ఈ శరీరం మనలను సంసార సముద్రాన్నుండి తరింపచేసే నౌక. కాబట్టి శరీరాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యహీనులు యోగులు కాలేరు.
సత్యం, పవిత్రత, నిస్వార్థం; భూనభోంతరాల్లోని ఏ శక్తీ, ఈ సుగుణాలతో జాజ్వల్యమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటై ఎదిరించినా, వారు ప్రతిఘటించగలరు.
🕉️🌞🌏🌙🌟🚩
🧘♂️నిర్వాణం🧘♀️
ఇంద్రియ సంపర్కంతో బ్రహ్మానందం అనుభవ రససిద్ధం కాదు. అనన్య చింతనే అసలు సాధన.
ఇంద్రియానుభవాలన్నీ బంధనలే. ప్రపంచానికి, ప్రపంచాతీత భావనకు శుద్ధభావనను సాధించుకోవాలి. అది వైవిధ్యమే తప్ప వైరుధ్యం కాదు. చలించే మనసుకు, బోధించే హృదయానికి మధ్య గల మహాశూన్యమే సంపూర్ణస్థితి. తెలుసుకుంటున్నవాడికి, తెలుసుకున్నదానికి మధ్య ఉన్నదే బంధన. ఇక తెలుసుకోవలసినదంటూ ఏమీ లేదన్న స్థితే విముక్తి. ఆలోచనకు, ఆలోచనకు మధ్య ఉన్న స్వల్ప విరామమే వెలుగు.
ఆ వెలుగే సర్వ ఫలప్రదాత. అదే అసలు మనం. అది నిజమైన మెలకువ. నిద్రకు ముందున్న ఆనందస్థితి. అదొక శిలాసదృశ సంస్థితి. మనసు మలగి, అవ్యయానందం మెరిసే నిశ్శబ్ద ఖేల!
మట్టిపాత్రను ఆవరించిన మట్టివలె, శూన్య పూర్ణ స్థితులలో అచ్యుతానందం ఆవరించి ఉంటుంది. చెలియలికట్టకు మాత్రమే లోబడే మహాసముద్రం అలలను, కెరటాలను నిగ్రహించినట్లు.. హృదయం మాత్రమే మనసును అచలం చేయగలదు. సముద్రమంతా ఏ విధంగా జీవ జలమయమో అలా దృశ్యమాన ప్రపంచమంతా చైతన్యభరితమే.
చూస్తున్నది అనాత్మ! చూపిస్తున్నది ఆత్మ!!
అలలెరుగని ఆనందామృత సాగరం మనసును ముంచెత్తుతుంటుంది. దాన్ని గుర్తెరిగి, నిలబెట్టుకోవాలి. కట్టు తెగని మమకారం, మమత ఆచరణీయం. నిజానికి ‘నేను’ తప్ప అన్యం లేదు. ఆ ‘నేను’కే బ్రహ్మం అని పేరు.
ఆ భావస్థితిని అందుకోగలిగితే ఈ జగమంతా ఆనంద సంద్రమే. ఈ అనుభవం భ్రమలను తొలగించి, బొమ్మలలోని బ్రహ్మాన్ని ఆవిష్కరిస్తుంది. అది అమృతానంద స్థితి. తెలుసుకోవడంతోనే ఆగక.. ఆచరించగలిగితే మనసు నిర్మలమవుతుంది. నీళ్లముందు నిలబడి ‘పటిక.. పటిక’ అంటే నీరు శుభ్రం కాదు. నీటిలో పటికను కలపాలి. అప్పుడే స్వచ్ఛత లభిస్తుంది. శుద్ధత్వం నుంచి బుద్ధత్వాన్ని సాధించాలి. అదే సిద్ధత్వం.
నేను ధ్యానిని అనుకోవడం కేవలం ఒక స్ఫురణే! దాన్నీ దాటగలిగితే అదే సమాధి. అంటే సర్వమూ అధీనమైన స్థితి.
మనోలయం జరిగిన తరుణంలో ఎన్ని ప్రచండ వాయువులు వీచనీ, సర్వసముద్రాలు ఏకం కానీ, ద్వాదశాదిత్యులు ఏకకాలంలో జ్వలించనీ.. ఏమీ కాదు. అది అచ్యుత స్థితి. ద్వంద్వాతీత స్థితి. అదే అచల నిర్వాణ స్థితి. పాము కుబుసం విడుస్తున్నప్పుడు.. తన నుంచి ఏదో విడిపోతున్నట్లు తలపోస్తుంది. విడిచిన తక్షణం నిర్వికారంగా జరజర పాకి తన దారిన తాను వెళ్తుంది. ఇదే మనసును విదుల్చుకునే వైనం.
మనసు విడివడిన నాడు మనిషిలోని పసితనం పల్లవిస్తుంది. అఖండ శిలలో దివ్యమూర్తి దాగి ఉన్నట్లు.. ఈ ప్రపంచం నిజానికి బ్రహ్మమయమే. కనుక ప్రపంచం అసత్‌గా కనిపించే సత్, జడంగా కనిపించే దివ్యచైతన్యం. ఈ విచారణే ఆత్మ విచార మార్గం. ఇదే సూటి దారి. ఇదే అసలు దారి!!
🕉️🌞🌍🌙🌟🚩
శ్రీరమణీయం -(755)
🕉🌞🌎🌙🌟🚩
"బాధలు, దుఃఖాలు లేకుండా/రాకుండా చేసుకోవడంలో జరుగుతున్న లోపాలు ఏమిటి !?"
ప్రాపంచిక విషయాలకు అతి విలువ ఇవ్వటమే మనం చేస్తున్న పొరపాటు. అంటే అసలు ప్రాపంచిక విషయాలే అక్కర్లేదని కాదు. ఏ విషయానికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో, ఎవరితో ఎంత పరిమితంగా ఉండాలో అలవాటు చేసుకోవటం అవసరం. ఇప్పుడు మన నిత్యజీవితంలో లోపించిన ఈ హద్దులే మనని దుఃఖానికి గురిచేసి అనాత్మ[దేహ]భావనలో కూరుకుపోయేలా చేస్తున్నాయి !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
సాధనంతా ఆత్మగా మారటానికి కాదు.. అనాత్మభావన పోవటానికే !''- (అధ్యాయం -93)
🕉🌞🌎🌙🌟🚩
[16:18, 29/12/2020] +91 92915 82862: "ఋభుగీత " (222)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
దైవమేమిటో సంపూర్ణంగా అర్ధమైతే శాంతి వస్తుంది !
దైవం ఒక రూపంగా కనిపిస్తే శాంతిరాదు. దైవం ఏమిటో సంపూర్ణంగా అర్ధమైతే శాంతి వస్తుంది. అందుకే రావణాసురుడికి శివుడు దర్శనం ఇచ్చినా శాంతి రాలేదు. ఎవరినీ శాంతిగా ఉండనివ్వలేదు. శ్రీరాముడు తాను శాంతిగా ఉండి, అందరినీ శాంతిగా ఉంచాడు కనుకనే దైవంగా పూజలందుకున్నాడు. శ్రీకృష్ణుడు కేవలం పాండవులకే కాదు, కౌరవులకు కూడా ధర్మబోధ చేశాడు. ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చిమరీ విశ్వరూపం చూపించాడు. అయినా ఫలితం లేదు. దుర్యోధనుడికి ఎన్నో హితవచనాలు చెప్పినా మార్పులేదు. శాంతినివ్వని దైవదర్శనం, ధ్యానం, తపస్సు, ధర్మమీమాంసలు నిరుపయోగమే అవుతాయి !
🕉🌞🌎🌙🌟🚩
🌷113-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
అధ్యాయము-10
దివ్య వైభవము
12,13 అర్జునుడు: ఎంత పవిత్ర సత్యము! నీవు చెప్పిన పరబ్రహ్మము నీవే! నీవు చూపిన సాటిలేని వెలుగు నీవే! వానికి నీవే గమ్యము. నీ కన్న అవి ఏమీయు లేవు. శాశ్వతమూర్తివగు పురాణ పురుషుడు, ఆదిదేవుడు ఎవడో ఇప్పుడు తెలిసినది. అది నీవే! ఋషులందరు నీకు జన్మలు లేవనియు, సర్వమునకు ప్రభువనియు చెప్పిరి. చాలలేదు. దేవర్షియగు నారదుడు గానము చేసెను. చాల లేదు. దేవలుడు అను ఋషి చీకటి అనగా నీవే అని చెప్పెను. చాలలేదు. వ్యాసుడు వివరించి చెప్పెను. చాలలేదు. నీవే స్వయముగా చెప్పితివి. పరిపూర్ణమైనది.
14. అదే సత్యమును నీవు స్వయముగ ఉచ్చరింపగా సర్వము సహజ సత్యమని ఇప్పుడు తలచుచున్నాను. నీ వ్యక్త రూపము యొక్క వైభవము దేవ దానవాదులకును తెలియదు.
15. తెలియుట అనగా నీ సంకల్పమే. నా 'నేను' లో నీ 'నేను' తెలియునట్లు సంకల్పించుటయే నాకు తెలియుట. జీవులను సృష్టిగ భావించుచున్నావు. నన్ను నీవు భావించినపుడు నేను తెలిసికొనుచున్నట్లు కూడా నీవు భావించి ఉండవలెను. కనుకనే నేను తెలిసికొంటిని. మాకు తెలియుట అనగా ఇట్టిది. ఇట్లు మా లోపల, వెలుపల ఆధిపత్యం వహించి ప్రభువై ఉన్నావు.
16. పలుకుము. ఇంకను ఈ జ్ఞానమును ఉచ్ఛరించి పలుకుము. నీవు పలుకుట అనగా నేను తెలుసుకొనుట. అశేషముగ నీ దివ్య వైభవములను గూర్చి వివరింపుము. వినిన అనుభూతిలో అవి నా వైభవములగును. ఈ లోకముల యందు ఎట్లు విస్తరించి లోపల వెలుపలగా నిండి, భావించుచునే భావనకు అందక మా భావనలకు అతీతముగా ఎట్లుంటివో అట్టి నీ విలాసమును గూర్చి ఇంకా నీవే వివరింపుము.
🕉🌞🌎🌙🌟🚩
[16:29, 29/12/2020] +91 92915 82862: 126) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
వాగాదీనామింద్రియాణాం కలహః శ్రుతిషు శ్రుతః ౹ తేన చైతన్యమేతేషామాత్మత్వం తత ఏవ హి ౹౹64౹౹
64. వాక్కు మొదలగు ఇంద్రియముల కలహము వేదమునందు
(బృహదారణ్యక ఉప.6.1.7-14)
విందుము.కనుక ఇంద్రియములు చేతనములు. ఆ కారణముచే అవే ఆత్మయని వారి వాదము.
దేహమునందలి జీవశక్తి ఉత్తేజితమయినప్పుడు ఆలోచనకు,వాక్కునకు,క్రియకు సంబంధించిన వివిధమలగు అవయవములు తమ కార్యమును నిర్వహించును.
అవి,మనస్సునందు ప్రబలముగా (వ్యాప్తమయి)ఉండు భ్రాంతియుతభావనల వలన తమ దృశ్యవిషయములవైపు ప్రసరించును.ఈ జీవశక్తి ఆత్మలోపల వివిధ రూపములను దర్శించును.
ఈ దర్శనము స్థిరస్వభావము కలదిగానున్నట్లు కనిపించుట వలన ఇది జాగ్రద్దశ అనబడును.
బ్రహ్మమునకు ఎట్టి అంగాలు లేవు నిరవయవి.అయితే కార్యరూపంలో సమస్తమైన బ్రహ్మము పరిణామం చెందాలి.
బ్రహ్మము"నిష్కలం","నిష్ర్కియం,
"శాంతం","నిరవద్యం,నిరంజనమ"
అని శ్రుతులు నిర్దేశిస్తున్నవి.
లోకంలో సాలెపురుగు తనే దారాన్ని సృజించుకొని దానిలో సంచరిస్తూ ఉంటుంది.కొన్ని జాతి కొంగలు మేఘగర్జనతో పురుష సంయోగం లేకపోయినా
గర్భం ధరిస్తాయి. తామరతీగ(పద్మలత)ఒక సరస్సు నుండి మరో సరస్సుకు బాహ్యసాధనాపేక్ష లేకుండా విస్తరిస్తుంది.అలాగే బ్రహ్మశక్తి ఊహకందనిది.అందువల్ల జగత్ నిర్మాణము,సమస్త సృష్టికార్యము బ్రహ్మమునకు సాధ్యమేనని శ్రుతి ప్రమాణము.
ప్రకృతి-వికారరూపం రెండూ అనన్యంగా ఉంటాయనే శ్రుతిలో వినబడు తున్నది.ప్రతి ప్రాణి యొక్క హృదయస్థానంలో బ్రహ్మముంటుందని,సుషుప్తిలో జీవాత్మ-సత్సంపన్నుడౌతాడని శ్రుతి నిర్దేశం.
కార్యరూపంలోనే కాక,బ్రహ్మము అవికృత రూపంలో ఉందనే శ్రుతులు బోధిస్తున్నాయి.బ్రహ్మ నిరవయవి అనే ఉపనిషద్వాక్యాలు నిర్ధారిస్తున్నవి .శబ్ద ప్రామాణ్యంతోనే అగోచరమైన బ్రహ్మమును స్థాపించడం శక్యం. అందువల్ల నిరవయత్వాన్ని నిస్సంసందేహంగా అంగీకరించాలి.
నేను చూచుచున్నాను-మొ౹౹ ఇంద్రియములు"నేను"అనటం వలన స్థూలదేహం ఆత్మకాదు.
"నాదేహం"అనడం మమకారం. "నేను దేహం" అంటే అహంకారం. "దేహం"నేను అనటం లేదు కనుక దేహం ఆత్మకాదు.
జనన మరణాదులున్నందున "దేహం" "ఆత్మ"కాదు.
ఏది లేనందువలన శరీరమే ఉండదో అది ఆత్మ.కనుక ఇంద్రియములు కొన్ని లేకున్నా శరీరం ఉంటుంది.కనుక ఇంద్రియాలు ఆత్మకాదు.
అవిద్యా కల్పితమైన వ్యవహారంలో బ్రహ్మ పరిణామం ఎన్నో రూపాలలో కనపడవచ్చు.కాని,పారమార్థక రూపంలో బ్రహ్మ మొక్కటే. నానారూపాలు లేవు. నామరూపభేదం కేవలం వాచారంభణం
(వాక్కుతో వచ్చినది).
"నీ ఆత్మయే పరబ్రహ్మ"అని తెలుసుకోవటం వల్ల మోక్ష ఫలసిద్ధి కలుగుతుంది.
🕉🌞🌏🌙🌟🚩
12-శ్రీ రామదాసు కీర్తన
వరాళి - రూపక (-త్రిపుట).
పల్లవి:-
అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను!! అ..
అను పల్లవి:-
గడియగడియకు తిరిగితిరిగి యడిగితిని వేసారవచ్చెను
గడువుదప్పిన నేను నిక బహు దుడుకుతనములు సేయుదును నిను!! అ..
చరణము(లు):-
కుదురుగా గూర్చుండనియ్యను కోపమొచ్చిన భయము చెందను
మది నెరింగి యుండుమిక మొగమాటమేమియు లేదుగద నా
హృదయ కమలమునందు నీ మృదు పదములను బంధించివేతును!! అ..
రేపు మాపని జరిపితే నే నాపుజేసెడివాడ గాను
ప్రాపు నీవని నమ్మిగొలిచిన పాపముల నెడబాపి దయతో
తేపతేపకు నీదు మోమిటు చూపకుండిన నోర్వసుమ్మి!! అ..
పతితపావన బిరుదులేదా పాలనము నను సేయరాదా
ప్రతిదినంబును దేవ నిను భూపతి వటంచును వేడినను నీ
హితజనంబులు వచ్చి నన్ను బ్రతిమాలినను విడబోను నిన్ను!! అ..
రాక్షసాంతక భక్తవరదా సారసాక్ష సుజనరక్షక
యీ క్షణంబున దీనజనుడని మోక్షమియ్యక యుంటివా నిను
సాక్షి బెట్టియు నేడు నేనొక దీక్షచే సాధింతు నిన్ను!! అ..
భూరి భద్రాచలనివాసా భుజగశయనా భక్తపోష
కూరిమిగ నిను విడిచిపెట్టిన ధరణిలో భద్రాద్రి రాఘవ
రామదాసుం డనెడి నామము మారుపేరున బిలువు నన్ను!! అ..
🕉🌞🌏🌙🌟🚩
[16:36, 29/12/2020] +91 92915 82862: 18-36-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ || ఇక సాత్త్వికసుఖము, రాజససుఖము, తామససుఖము - అను మూడు సుఖములను గూర్చి వర్ణించుచున్నారు-
సుఖం త్విదానీం త్రివిధం
శృణు మే భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర
దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||
తా:-భరతకుల శ్రేష్ఠుడవగు ಓ అర్జునా! దేనియెుక్క అభ్యాసముచే మనుజుడు ఆనందము నొందుచుండునో, దుఃఖశాంతినిగూడ లెస్సగ బడయుచుండునో, అట్టి సుఖమిపుడు మూడువిధములుగా నాచే తెలుపబడుచున్నది. వినుము -
వ్యాఖ్య:- “అభ్యాసాత్” - సాత్త్వికసుఖము, దైవసుఖము, బ్రహ్మానందము అభ్యాసమువలననే జీవునకు లభించగలదని భగవాను డిచట తెలియజేయుచున్నాడు. అధ్యాత్మవిద్య మాటలచే, ‘వాచా’జ్ఞానముచే కలుగునది కాదు. అది అనుభవవిద్య (Practical Science). అందలి ప్రతిసిద్ధాంతమును అనుభవములో చూచుకొనవలెను.
అపుడే జీవునకు ప్రత్యక్ష సుఖము లభించును. చాలమంది " మాకు సాక్షాత్కార మెట్లు కలుగును, దుఃఖ మెట్లు తొలగును, సుఖ మెట్లుకలుగును?" అని ప్రశ్నించుచుందురు. భగవాను డందులకు "అభ్యాసముచేయుడు, మీకవి లభించును" అని యిచట చెప్పుచున్నాడు. ప్రయత్నము చేయక, సాధింపక, ఒడ్డునకూర్చొని మాటలు చెప్పుటద్వారా పరమార్థానుభవమెన్నటికిని కలుగనేరదు. పెరుగును చిలికిననే వెన్నవచ్చును. నువ్వులను పిండిననే నూనెవచ్చును. చెఱకును నమలిననే మాధుర్యమనుభూతమగును. అట్లే అభ్యాసముచేతనే ‘దుఃఖాంతము’, సుఖావిర్భావము జీవునకు కలుగగలదు.
“దుఃఖాన్తం చ నిగచ్ఛతి” - ఈ ప్రపంచమున ప్రతిజీవియు కోరునది దుఃఖరాహిత్యము, దుఃఖాంతము. జీవిత మందలి అతిముఖ్యమైన, క్లిష్టతరమైన సమస్య ఈ దుఃఖాంతసంపాదనమే యగును. ప్రతివానిని ఈ సమస్యయే బాధించుచున్నది. చీమయు ఈ దుఃఖాంతమునకే, అనగా దుఃఖమును పోగొట్టుకొనుటకొఱకే యత్నించుచున్నది. దోమయు దానికొఱకే యత్నించుచున్నది. చతుర్ముఖబ్రహ్మయు దానికొఱకే యత్నించుచున్నాడు.
దుఃఖముయొక్క అంతమును (దుఃఖరాహిత్యమును) ప్రాణి యెచట పొందగలదు? ఈ మహాసంసారిక బాధలన్నియు ఎచ్చోట నుపశమించగలవు? దుఃఖములేనిచోటు ఏది? ప్రపంచములో ఎచట వెతకినను అట్టిచోటు లభించగలదా? శాశ్వతసుఖము నొసంగగల వస్తువు ఈ దృశ్యసమూహమందుకలదా? లేదు. దుఃఖముయొక్క అంత మొక ఆత్మయందే, దైవమందే కలదు. ఆత్మసుఖమందే , సాత్త్వికానందమందే దుఃఖముయొక్క అంతమును జీవుడు పొందగల్గుచున్నాడని ఈ శ్లోకమున చెప్పబడినది.
ఈ భగవద్వాక్యమువలన ప్రతి ప్రాణిని వేధించుచున్న "దుఃఖనివారణసమస్య” తీరిపోయినది. దుఃఖనివారణ కుపాయము సాత్త్వికసుఖసంపాదనమే, ఆత్మానందప్రాప్తియే. కాబట్టి ఆత్మసుఖమునే, దైవసుఖమునే అన్వేషింపవలయును. అది యెట్లు లభ్యమగును? అభ్యాసమువలన, సాధన చతుష్టయరూపసంపత్తిచేత, అమానిత్వాదిగుణములచేత. "నిగచ్ఛతి" అని చెప్పుటవలన అభ్యాసముచే నట్టి దుఃఖరాహిత్యస్థితిని జీవుడు లెస్సగ బడయగలడని తెలియుచున్నది.
ప్ర:- సుఖ మెన్ని విధములు?
ఉ:- మూడువిధములు.
(1) సాత్త్వికసుఖము
(2) రాజససుఖము
(3) తామససుఖము - అని.
ప్ర :- దుఃఖరాహిత్యము ఎట్లు కలుగును?
ఉ:- అభ్యాసముద్వారా ఉత్తమ (సాత్త్విక) సుఖమును బొందుటచే దుఃఖము సంపూర్ణముగ
తొలగిపోగలదు.
🕉🌞🌎🌙🌟🚩
[17:09, 29/12/2020] +91 92915 82862: తిరుప్పావై 15 వ రోజు పాశురము
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
15 వ పాశురం
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్!!
భావం
ॐॐॐॐॐॐॐ
ఈ పాశురంలో ఉన్న గోపికకు , బయట ఉన్న గోపికలకు సంవాదము నిబంధింపబడినది.
బయట గోపికలు : ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్రించుచున్నావా ! అయ్యో ఏమి ఇది ?
లోపల గోపిక : పూర్ణలగు గోపికలారా ! చీకాకు కలుగునట్లు జిల్లుమని పిలువకుడు. నేను ఇప్పుడే వచ్చుచున్నాను.
బయట గోపికలు : నీవు చాలా నేర్పుగల దానవు. నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే తెలుసుకున్నాము.
లోపల గోపిక : మీరే నేర్పుగలవారలు, పోనిండు, నేనే కఠినురాలను.
బయట గోపికలు : నీకు ఈ ప్రత్యేకత ఏమి ?అలా ఏకాంతముగా ఉండేదవేల ? వేగముగా బయటకు రమ్ము.
లోపల గోపిక : అందరు గోపికలు వచ్చిరా ?
బయట గోపికలు : వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకొనుము.
లోపల గోపిక : సరే ! నేను వచ్చి ఏమి చేయవలెను ?
బయట గోపికలు : బలిష్టమగు కువలయాపీడనము అను ఏనుగును చంపిన వాడును శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము.
మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.
ఈరోజు పదిహేనవ పాశురం బయటగోపబాలికలకు లోపలగోపబాలిక మద్య సంభాషనలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్సి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమో నని అనుకోని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.
అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, "ఎల్లే!" ఏమే "ఇళంకిళియే!" లేత చిలకా! "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.
కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు "నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.
బయట నుండి వాళ్ళు " వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీనోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్" ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోప బాలిక "వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.
కాని బయట నుండి, "ఒల్లై నీ పోదాయ్" ఏమే రా! మరి ఇంక, "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరోకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి "ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.
పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై " బలం కల్గిన ఏనుగు -కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తోలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.
ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మల్లీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ.
పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముశ్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట.
ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించు కుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.
అవతారిక
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఇంతవరకు భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధనాక్రమము వివరింపబడినది. ఇట్టి సాధన చేయుటచే ఏర్పడవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలుగుట. అది పూర్ణముగా తొలగిననాడుగాని ఆచార్య సమాశ్రయణముచే మంత్రము లభించి భగవదనుభవము కలుగనేరదు. ఇట్టి పరిపూర్ణస్థితి యందు ఉన్న గోపిక ఈనాడు మేలుకొలుప బడుచున్నది.
మొదటి సగము ఒక తిరుప్పావు -- రెండవ సగము వేరొక తిరుప్పావు. మొదటిది భాగవత సమాశ్రయణ వ్రతము, భగవత్భక్తులను ఆశ్రయించుటచే ఆత్మగుణములు పరిపూర్ణముగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమగునత్తి ఆకారము లభించును. ఆ ఆత్మగుణ పరిపూర్తి అనేది ఎట్టిదో ఈ పాశురములో నిరూపించబడినది.
వ్రతాన్ని చేయటానికై తమ గోష్ఠిలో చేర్చుకొనదగిన పదవ గోపికను యీ మాలికలో గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది సంభాషణ రూపంలో వున్న అద్వితీయ పాశురం. ఈ గోపికను యీగోష్ఠి నంతను సేవించవలెనను కుతూహలమున్నది. భగవద్గుణాలను ఏకాంతంగా ఒక్కరే అనుభవించటం తగదని అందుకే గోష్ఠిలోని అందరకూ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెప్తున్నది.
ఇక్కడితో వ్రతంలోని రెండవ దశయైన ఆశ్రయణ దశ పూర్తవుతుంది. వ్రత మిషతో భగవద్గుణాలనందరకు పంచాలనే అద్భుతమైన భావానికి లోనైన ఆండాళ్ తల్లి శ్రవణ, మనన, ధ్యానాలనే వాటిని చక్కగా విశదపరచి నిరూపించింది.
భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి. మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది. దానితో ఎడతెగని ఆనందం లభించి స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తాదాత్త్యతను పొందుతుంది. ఈ పదవ గోపిక లక్షణాలు కూడా యివే! ఇట్టి నిద్రలో మునిగివున్న యీ పదవ గోపికను తమ గోష్ఠిలో చేరమని సంభాషణా రూపంలో సమాధానపరచి గోష్ఠిలో చేర్చుకున్నది గోదా తల్లి.
కమాసురాగము - ఏకతాళము
ॐॐॐॐॐॐॐॐॐॐ
వారు: చిలక పలుకు చిన్నదాన! ఇంకా నిదురింతువే!
ఆమె: చెలియలార! ఉలికి పడగ పిలువకు డిదె వచ్చుచుంటి.
వారు: పుల్లవిరుపు మాటల నీ చతురోక్తుల నెరుగుదుమే?
ఆమె: అల్లన మీరె చతురలు! నన్నిట్టుల నుండనీరె!
వలసినవారెల్ల రిచట కూడిరి! ఓ చెలియరో!
వారు: చెలులెల్లరు వచ్చిరి నీ వెంచుకోవె! సఖియరో!
ఆమె: ఏల నేను రావలె! మీకేమి నేను చేయవలె?
వారు: బలియుని కువలయకరి మదమణచిన శ్రీకృష్ణుని లీలల
కీర్తింప నీవు శీఘ్రమే రావమ్మరో!
చిలక పలుకు చిన్నదాన! ఇంకా నిదురింతువే?
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఆచార్య సన్నిదానానికి చేరే ముందర స్థితి
ఆండాళ్ తిరువడిగలే శరణం
ॐॐॐॐॐॐॐॐॐॐ
మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.
ఈరోజు పాశురం బయటగోపబాలికలకు లోపలగోపబాలిక మద్య సంభాషనలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్సి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమో నని అనుకోని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.
అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, "ఎల్లే!" ఏమే "ఇళంకిళియే!" లేత చిలకా! "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.
కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి *"
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్"* ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు "నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.
బయట నుండి వాళ్ళు " వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీనోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్" ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోప బాలిక "వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.
కాని బయట నుండి, "ఒల్లై నీ పోదాయ్" ఏమే రా! మరి ఇంక, "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరోకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి "ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.
"పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై " బలం కల్గిన ఏనుగు -కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తోలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.
ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మల్లీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు.
మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముశ్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట.
ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్.
అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించు కుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకో కూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.
ॐॐॐॐॐॐॐॐॐॐ
తిరుప్పావై15 వ పాశురము / తెలుగు పద్యానువాదము
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఎల్లే యిలఙ్కిళియే
సీ . రామ చిలుకవమ్మ రావమ్మ మేల్కొొని
వేచి యున్నామమ్మ వేగరమ్ము
నిద్ర విడిచి వచ్చి నీచెంత నిలిచాము
మా నిద్ర నంతయు మరచినాము
భళిభళీ! యెంతటి పడతులు మీరంత
నంగనాచితనము నాకు తెలుసు
గడుసరి మగువలు కారేమొ మీరెల్ల
నే గడుసరి నంచు నేర్చినారు
వచ్చి లెక్కింపుము వచ్చిన వారెల్ల
యిచటనే యున్నాము వెళ్ళలేక
తే.గీ. గుణము లన్నియు పాడుచు కోర్కెమీర
మత్త గజకుంభముల మదమణచు వాణ్ణి
నిన్ను కొని పోవ మేమెల్ల నిల్చినాము
హరిని కీర్తింప మనమెల్ల అరుగవలయు
శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఇరువది ఒకటవ అధ్యాయము
వేణుగీతము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
21.9 (తొమ్మిదవ శ్లోకము)
గోప్యః కిమాచరదయం కుశలం స్మ వేణుర్దామోదరాధరసుధామపి గోపికానామ్|
భుంక్తే స్వయం యదవశిష్టరసం హ్రదిన్యో హృష్యత్త్వచోఽశ్రు ముముచుస్తరవో యథాఽఽర్యః॥9139॥
మఱియొక గోపిక ఇట్లు వచించుచున్నది "సఖులారా! ఈ వేణువు పూర్వజన్మమునందు ఎంతటి పుణ్యము చేసికొనినదో ఏమో! ఆ స్వామినే తమ సర్వస్వముగా భావించెడి గోపికలకును సుదుర్లభమైన కృష్ణప్రభువుయొక్క అధరామృతమును తడికూడా మిగల్చకుండా తాను మాత్రమే ఆస్వాదింపగల్గుతున్నది. ఈ వేణువు యమునానదీ జలములు చిందెడి ప్రదేశమున మధురముగా గానము చేయుచు చక్కగా వర్థిల్లినది. ఆ దృశ్యమును జూచి ఆ నది బంగారు కొడుకును గన్న తల్లివలె పొంగిపోవుచు, బాగుగా వికసించిన పద్మములనెడి రోమాంచములతో విలసిల్లుచున్నది. హరిభక్తుని జూచి, అతని వంశమువారు అనందాశ్రువులను రాల్చుచున్నట్లుగా, ఆ కృష్ణప్రభువు యొక్క మురళీగానమునకు పరవశించిన వృక్షములు తమ పూవులనుండి మకరందబిందువులను స్రవింప జేయుచున్నవా యనునట్లు వాటి పూదేనియలు జాలువాఱుచున్నవి".
21.10 (పదియవ శ్లోకము)
వృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీసుతపదాంబుజలబ్ధలక్ష్మి|
గోవిందవేణుమను మత్తమయూరనృత్యం ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్యసమస్తసత్త్వమ్॥9140॥
గోపిక ఇంకను ఇట్లు వచించుచున్నది "సఖీ! శుభలక్షణ సంపన్నములైన శ్రీకృష్ణుని దివ్య పాదముద్రలకు నోచుకొనిన బృందావనము యొక్క యశోవైభవములు స్వర్గము వఱకును వ్యాపించుచున్నవి. ఆ ప్రభువుయొక్క మధురవేణుగానమును విని, మంద మేఘ గర్జనగా భావించి, నెమళ్ళు మైమఱచి, లయబద్ధముగా నృత్యములు చేయుచున్నవి. ఆ గానమధురిమలకును, ఆ నృత్యవైభవములకును అచటి పర్వతసానువులయందలి పశుపక్ష్యాదులన్నియును పారవశ్యమునకు లోనై నిశ్చేష్టముగా ఉన్నవి.
21.11 (పదకొండవ శ్లోకము)
ధన్యాః స్మ మూఢగతయోఽపి హరిణ్య ఏతా యా నందనందనముపాత్తవిచిత్రవేషమ్|
ఆకర్ణ్య వేణురణితం సహకృష్ణసారాః పూజాం దధుర్విరచితాం ప్రణయావలోకైః॥9141॥
గోపిక ఇంకను ఇట్లు వచించుచున్నది లేళ్ళు తిర్యగ్జాతికి చెందినవే. ఐనను వాటికి సంగీతజ్ఞానము లేకున్నను శ్రీకృష్ణుని దివ్యమురళీ రవములకును, ఆ స్వామియొక్క విచిత్రవేషవైభవమునకును ఆకర్షితములై, మగజింకలతో గూడి, ఆ ప్రభువుయొక్క కోమలపాదములను దర్శించుచు ఎంతయు ఆనందించుచున్నవి. అంతేగాక, అవి ప్రేమానురాగములతో నిండిన తమ చూపులనెడి కుసుమములతో ఆ దివ్యచరణములను ఆరాధించుచు, ఆ పరమాత్ముని అనుగ్రహములకు పాత్రములగుచున్నవి. నిజముగా ఆ హరిణములు ఎంతటి ధన్యజీవులోగదా!
21.12 (పండ్రెండవ శ్లోకము)
కృష్ణం నిరీక్ష్య వనితోత్సవరూపశీలం శ్రుత్వా చ తత్క్వణితవేణువిచిత్రగీతమ్|
దేవ్యో విమానగతయః స్మరనున్నసారా భ్రశ్యత్ప్రసూనకబరా ముముహుర్వినీవ్యః॥9142॥
గోపిక ఇంకను ఇట్లు వచించుచున్నది తమ పతులతో గూడి ఆకాశమున విమానములలో సంచరించుచున్న దివ్యాంగనలు సైతము శ్రీకృష్ణుని రూపసౌభాగ్యమును కనులార దర్శించుచును, అద్భుత వేణుగానమును చెవులప్పగించి వినుచును, అతని దయాస్వభావమునకు పరవశించిపోవుచుండిరి. అంతట శ్రీకృష్ణుని సన్నిధిని చేరుకొనుటకుగాను వారిలో తీవ్రమైన ఆకాంక్షచెలరేగినది. అప్ఫుడు వారి కొప్పులు వీడి, పూలమాలలు జారిపోవుచుండెను. వస్త్రములు సడలిపోవుచుండెను.
21.13 (పదమూడవ శ్లోకము)
గావశ్చ కృష్ణముఖనిర్గతవేణుగీతపీయూషముత్తభితకర్ణపుటైః పిబంత్యః|
శావాః స్నుతస్తనపయఃకవలాః స్మ తస్థుర్గోవిందమాత్మని దృశాశ్రుకలాః స్పృశంత్యః॥9143॥
గోవులు శ్రీకృష్ణుని ముఖమునుండి జాలువాఱుచున్న వేణుగానామృతమును, నిక్కపొడుచుకొనియున్న తమ చెవులద్వారా తనివిదీర ఆస్వాదించుచున్నవి. అట్లే గోవత్సములు (లేగదూడలు) తమ తల్లుల పొదుగులనుండి సమృద్ధిగా స్రవించుచున్న క్షీరములు తమ గొంతులలో ఉండగనే కృష్ణప్రభువుయొక్క మురళీరవములు చెవుల బడుటతో పాలు త్రాగుటమాని, మైమఱచి, ఎక్కడివక్కడ నిలిచిపోయినవి. ఆవులును, దూడలును ఆ గోపాలుని తమ మనస్సులలోనే ఆలింగనము చేసికొనుచు ఆనందాశ్రువులను రాల్చుచున్నవి.
21.14 (పదునాలుగవ శ్లోకము)
ప్రాయో బతాంబ విహగా మునయో వనేఽస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతమ్|
ఆరుహ్య యే ద్రుమభుజాన్ రుచిరప్రవాలాన్ శృణ్వంత్యమీలితదృశో విగతాన్యవాచః॥9144॥
గోపిక ఇంకను ఇట్లు వచించుచున్నది ఒక పర్యాయము ఈ పక్షులవైపు చూడుము. వీటిని పక్షులు అని యనుటకంటెను మునులు అని యనుటయే ఎంతయు సముచితము. ఏలయన వేదశాఖలను (వేదభాగములను) పఠించుచున్న మునులు శ్రీకృష్ణదర్శనము ఐనతోడనే తమ కార్యకలాపములను అన్నింటిని ప్రక్కనపెట్టి భగవద్దర్శనానందమునే (బ్రహ్మానందమునే) అనుభవించు చుందురు. అట్లే ఈ పక్షులుగూడ చెట్ల కొమ్మలపై చేరి, లేలేత చిగురుటాకులను తినుచుండగనే శ్రీకృష్ణదర్శనము అగుటతో, ఆ స్వామి మురళీనాదము చెవులబడుటతో, మిగుల ఆనందించుచు విప్పారిన నేత్రములతో హాయిని అనుభవించుచున్నవి. అప్పుడు వాటికి ఇతర ప్రపంచము ఏమాత్రము పట్టుటలేదు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
[05:07, 30/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
769వ నామ మంత్రము 30.12.2020
ఓం యజ్ఞరూపాయై నమః
విష్ణుస్వరూపురాలు (నారాయణి), యజ్ఞములే తన స్వరూపంగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి యజ్ఞరూపా యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం యజ్ఞరూపాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి సుఖసంతోషములను ప్రసాదించును. ఆత్మానందానుభూతిని కలుగజేయును.
హరివంశమునందు పద్మపురాణములో శంకరుని ఆపాదమస్తకమూ యజ్ఞాంగములతో సమానముగా వర్ణింపబడినది. పరమేశ్వరుని అర్ధాంగి యగుటచే పరమేశ్వరికూడా యజ్ఞస్వరూపురాలుగా చెప్పబడినది. గనుక పరమేశ్వరిని యజ్ఞరూపా యని అన్నాము.
యజ్ఞములు పాకయజ్ఞములు, హవిర్యాగాలు, సోమ సంస్థలు అని మూడు ప్రధాన రకములు గలవు.
పాక యజ్ఞాలు
1) ఔపాసన, 2) స్థాలీపాకము, 3) వైశ్వదేవము, 4) అష్టకము, 5) మాస శ్రాద్ధము, 6) సర్పబలి, 7) ఈశాన బలి.
హవిర్యాగాలు
1) అగ్నిహోత్రాలు, 2) దర్శపూర్ణిమాసలు, 3) అగ్రయణం, 4) చాతుర్మాస్యాలు, 5) పిండ, పితృ యజ్ఞాలు, 6) నిరూఢ పశుబంధము, 7) సౌత్రామణి
సోమ సంస్థలు
1) అగ్నిష్టోమము, 2) అత్యగ్నిష్టోమము, 3) ఉక్థము, 4) అతిరాత్రము, 5) ఆప్తోర్యామం, 6) వాజపేయం, 7) పౌండరీకం
పంచమహాయజ్ఞములు
పంచ మహాయజ్ఞములు అనగా హిందూ ధర్మశాస్త్రాలననుసరించి గృహస్థు ఆచరించవలసిన ఐదు యజ్ఞములు.
బ్రహ్మ యజ్ఞము ఈ యజ్ఞము ద్వారా గృహస్థుడు అనేక కొత్త విషయములను తెలుసుకుంటాడు. అంతేకాక మిగిలినవారికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞంలో భాగంగా గృహస్థుడు జ్ఞానమును ఆర్జిస్తాడు, అందరికి పంచి పెడతాడు. బ్రహ్మ యజ్ఞమనగా వేదాధ్యయనము. రామాయణ, భాగవతాద్యుద్గ్రంథములను పఠించడం.
దేవ యజ్ఞము ఇవి భగవదనుగ్రహం కోసం, ఇష్టకార్యార్ధ సిద్ధి కోసం చేస్తారు. గృహస్థులయితే తమ గార్హపత్యాగ్ని లో హవిస్సును సమర్పిస్తారు. బ్రహ్మచారులయితే లౌకికమైన అగ్నితోనే చేస్తారు. ఇక శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలమును ఇస్తుంది. దేవ యజ్ఞమనగా ఆజ్యము, లాజలు (పేలాలు) వంటితో హోమం జరిపించుట
పితృ యజ్ఞము ఇవి తమను వదలి పరలోకమునకు చేరిన తమ పితృదేవతల కొరకు చేస్తారు. ఐతే తండ్రి బ్రతికి ఉండగా ఇట్టి యజ్ఞమును చేయుటకు పుత్రునికి అధికారం లేదని చెప్పెదరు. పితృ యజ్ఞమనగా శ్రాద్ధము, తర్పణములు మొదలైన కార్యక్రమాలు జరిపి పూర్వీకులను సంతృప్తి పరుచుట.
భూత యజ్ఞము తనతో పాటుగా ఈ భూమిమీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను నడుచుకోవాలి. భూత యజ్ఞమనగా సకల భూతములకు బలిదానములు ఇచ్చుట
నృయజ్ఞము ఈ యజ్ఞమునే అతిధి యజ్ఞం అనికూడా పిలుస్తారు. మన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవంగా చూసుకోవాలి. ఈ యజ్ఞము ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రమములవారికి ఆధారం అవుతున్నాడు. నృయజ్ఞమనగా అతిథి పూజాదులు నిర్వర్తించడం.
పైన చెప్పిన వివిధరూపాలైన యజ్ఞములన్నియు సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపమే గనుక శ్రీమాత యజ్ఞరూపా యని అనబడినది.
యజ్ఞోవై విష్ణుః వేదములో యజ్ఞమే విష్ణువని చెప్పబడినది. భగవద్గీతలోకూడా తానే యజ్ఞస్వరూపుడనని భగవానుడే చెపుతాడు. జగన్మాత విష్ణుస్వరూపిణి గనుక యజ్ఞరూపా యని అన్నారు.
జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం యజ్ఞరూపాయై నమః అని అనవలెను.
🌸💐💐💐
[05:07, 30/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
195వ నామ మంత్రము 30.12.2020
ఓం దోషవర్జితాయై నమః
రాగద్వేష సంబంధిత దోషములనునవి లేక విరాజిల్లు జగజ్జననికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి దోషవర్జితా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం దోషవర్జితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి వారి సాధనకు విఘాతం కలిగించు దోషములను దూరముచేసి, భగవదారాధనలో నిమగ్నముచేసి, సుఖసంతోషములను, ఆత్మానందానుభూతిని అనుగ్రహించును.
జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. నిప్పులో పడిన మిడత మాడిపోతుంది. అటువంటి దోషములు ఆ తల్లి చేరవు. ఎందుచేతనంటే జగన్మాత చిదగ్నికుండసంభూత గనుక దోషవర్జితా యని అనబడినది. అంతేగాని అమ్మవారు దోషములను విడచిపెట్టింది అని మనం అనుకుంటే మనకు దోషంవస్తుంది.
అరిషడ్వర్గములు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేవి అంతశ్శత్రువులు. రావణాబ్రహ్మ వేదవేదింగ పారంగతుడు. కాని నేను అనే అహం బాగా ఉన్నవాడు. వరగర్వితుడు. స్త్రీవ్యామోహం విపరీతంగా గలవాడు. ఈ దోషాలవల్లనే అతడు అంతమయాడు. అలాగే శిశుపాలదంవక్త్రులు, హిరణ్యకశిప హిరణ్యాక్షులు, దుర్యోధనుడు - వీరందరును రాగద్వేషముల వలన దోషపూరితిహృదయులై నశించారు. అరిషడ్వర్గములు అనేవి బుద్ధిమీద ప్రభావంచూపుతాయి. .అరిషడ్వర్గాలకు కారణమైనవి రాగద్వేషాలు అవడంచేత దోషపూరితమైన కర్మలు చేయిస్తాయి. ఫలితంగా కర్మఫలాలు సంచితములవుతూ జన్మజన్మలకు కొనసాగతాయి. కనుక పరమేశ్వరీ ఆరాధన వలన దోషములు వర్జింపబడతాయి. గనుకనే జగన్మాత దోషవర్జితా యని అనబడినది.
🌸💐💐💐
ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఇరువది ఒకటవ అధ్యాయము
వేణుగీతము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
21.15 (పదునైదవ శ్లోకము)
నద్యస్తదా తదుపాధార్య ముకుందగీతమావర్తలక్షితమనోభవభగ్నవేగాః|
ఆలింగనస్థగితమూర్మిభుజైర్మురారేః గృహ్ణంతి పాదయుగలం కమలోపహారాః॥9145॥
సఖీ! దేవతలు, గోవులు, పక్షులు మొదలగువాని విషయము అట్లుండనిమ్ము. ఇటు నదులవైపు ఒక పర్యాయము పరికించి చూడుము. నదులన్నియును హాయిని గొలిపెడి ఆ మురళీరవమును వినుచు వినుచు మోహనపరవశలైనట్లు కనబడుచున్నవి. కృష్ణప్రేమకారణముగా ఆ వాహినులు మన్మథబాణములకు గుఱియై (కామవికారములకు లోనై) సుడులు తిరుగుచు తూలిసోలి పోవుచున్నట్లు ఒప్ఫుచున్నవి. ఆ స్థితిలోనున్న ఆ నదీభామినులు తరంగములనెడి హస్తములతో ఆ స్వామి చరణములను ఆలింగనము చేసికొనుచున్నవా యనునట్లు పట్టుకొనుచు, కమలములను కానుకలుగా సమర్పించి, అర్చించుచున్నవి.
21.16 (పదునారవ శ్లోకము)
దృష్ట్వాఽఽతపే వ్రజపశూన్ సహ రామగోపైః సంచారయంతమను వేణుముదీరయంతమ్|
ప్రేమప్రవృద్ధ ఉదితః కుసుమావలీభిః సఖ్యుర్వ్యధాత్స్వవపుషాంబుద ఆతపత్రమ్॥9146॥
సఖీ! ఆకాశముననున్న ఆ మేఘమును చూడుము. బలరామునితో గోపాలురతోగూడి, మధ్యాహ్నసమయమున గోవులను మేపుచు, పిల్లనుగ్రోవిని ఊదుచున్న శ్రీకృష్ణుని జూచి మేఘము గూడ ఆయనపై మరులుగొనినట్లున్నది. అందువలన అది తన సఖుడైన (కృష్ణునకువలె మేఘము శ్యామవర్ణ శోభితము, లోకోపకారము. అందువలన శ్రీకృష్ణుడు మేఘమునకు సఖుడు). కృష్ణప్రభువుపై తన జలబిందువులనెడి పూలను చల్లుచు, గొడుగు పట్టుచు,ఆ స్వామిని సేవించుచున్నది.
21.17 (పదునేడవ శ్లోకము)
పూర్ణాః పులింద్య ఉరుగాయపదాబ్జరాగశ్రీకుంకుమేన దయితాస్తనమండితేన|
తద్దర్శనస్మరరుజస్తృణరూషితేన లింపంత్య ఆననకుచేషు జహుస్తదాధిమ్॥9147॥
సఖీ! మహామనీశ్వరులు నిరంతరము శ్రీహరి పాదములను తమ హృధయములలో నిలుపుకొని ప్రస్తుతించుచుందురు. అట్టి శ్రీపాదములను తనయొడిలో చేర్చుకొని లక్ష్మీదేవి వాటిని సేవించుచుండును. ఆ సమయమున లక్ష్మీదేవియొక్క వక్షస్థలమునందు విరచితములైన కుంకుమపరాగములు ఆ స్వామి పాదములకు అంటుకొనుచుండును. గోవులను మేపుచు శ్రీహరి (శ్రీకృష్ణుడు) పచ్చికలపై తిరుగుచున్నప్ఫుడు ఆ ప్రభువుయొక్క పాదములకు అంటుకొనిన కుంకుమ పాదుల గడ్డిపరకలకు చేరుచుండును. శ్రీకృష్ణుని దర్శనమునకై తహతహతో పరితపించుచున్న శబరాంగనలు ఆ కుంకుమలను తమ ముఖముపైనను, వక్షస్థలముల యందును రాసికొనుచుందురు. ఆ కుంకుమ స్పర్శనే శ్రీకృష్ణుని సంస్పర్శగా తలంచుకొనుచు వారు మనోవ్యథను వీడి మిగుల ఆనందించుచుందురు. కనుక ఆ బోయకన్యలు ఎంతయు ధన్యులు కదా!
21.18 (పదునెనిమిదవ శ్లోకము)
హంతాయమద్రిరబలా హరిదాసవర్యో యద్రామకృష్ణచరణస్పర్శప్రమోదః|
మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్పానీయసూయవసకందరకందమూలైః॥9148॥
భళీ! సఖులారా! గిరులలో శ్రేష్ఠమైన ఈ గోవర్ధన పర్వతము భగవద్భక్తులలో సర్వోన్నతమైనది. శ్రీకృష్ణునియొక్క బలరామునియొక్క పాదముల సుఖస్పర్శతో పునీతమై పరమానందభరితమగుచు వృక్షములనెడి రోమాంచములచే పులకించిపోవుచున్నది. చూచితిరా! దీని భాగ్యమే భాగ్యము. ఇది సెలయేళ్ళద్వారా స్నానపానములకు స్వచ్ఛములైన జలములను సమకూర్చుచున్నది. గోవులకు లేతపచ్చికలను అందించుచున్నది. విశ్రాంతికై గుహలను ఏర్పాటు చేయుచున్నది. ఆహారమునకై కందమూల ఫలములను సమర్పించుచున్నది. ఈ విధముగా ఇది బలరామ కృష్ణులకును, గోపాలకులకును, గోవులకును సగౌరవముగా అపూర్వరీతిలో సేవలొనర్చుచున్నది. నిజముగా ఈ గిరిజీవితము ఎంతయు సార్థకము, ధన్యము.
21.19 (పందొమ్మిదవ శ్లోకము)
గా గోపకైరనువనం నయతోరుదారవేణుస్వనైః కలపదైస్తనుభృత్సు సఖ్యః|
అస్పందనం గతిమతాం పులకస్తరూణాం నిర్యోగపాశకృతలక్షణయోర్విచిత్రమ్॥9149॥
సఖులారా! శ్రీకృష్ణుడు, బలరాముడు గోవులను మేపుచు వనములలో ఎట్లు తిరుగుచున్నారో చూడుడు. వారు తమ తలలపై నిర్యోగములను (పాలు పితుకునప్పుడు ఆవుల ఎడమకాళ్ళను బంధించు త్రాళ్ళను), భుజములపై పాశములను (అల్లరి పశువులను అదుపు చేయుటకై ఉపయోగించెడి త్రాళ్ళను) ధరించియున్నారు. గోపాలురు గూడ వారిని అనుసరించుచు తగువిధముగా ఆవులను మళ్ళించుచున్నారు. ఆ సమయమున ఆ ఇరువురును (బలరామకృష్ణులు) వినసొంపైన రాగాలాపనలతో వేణుగానము చేయుచున్నారు. ఆ గానమాధుర్యములకు తన్మయులై మనుష్యులు మైమఱచిపోవుచున్నారు. అంతేగాదు, పశుపక్ష్యాదులు సైతము ఆ పారవశ్యమున నిశ్చేష్టములగుచున్నవి. స్థావరములైన వృక్షములు సైతము కొమ్మలతో, రెమ్మలతో పులకించు పోవుచున్నవి. జంగమములను (మనుష్య, పశుపక్ష్యాదులను) స్థావరములుగా, స్థావరములను (వృక్షములను) జంగమములుగా మార్చివేయుచున్న ఈ వేణుగాన మహత్త్వము మిగుల విచిత్రమైనది. ఎంతయు అద్భుతమైనది.
21.20 (ఇరువదియవ శ్లోకము)
ఏవం విధా భగవతో యా వృందావనచారిణః|
వర్ణయంత్యో మిథో గోప్యః క్రీడాస్తన్మయతాం యయుః॥9150॥
బృందావనమున విహరించుచున్న కృష్ణభగవానుని యొక్క అద్భుతలీలలను గూర్చి ప్రతిదినము ఈ విధముగా గోపకాంతలు తమలో తాము ముచ్చటించుకొనుచు తన్మయత్వమును పొందుచుండిరి.
ఈ వేణుగీతములను ప్రతినిత్యము శ్రద్ధగా పఠించువారికి కృష్ణప్రేమ లభించును - అని ఎందరో మహాత్ములు స్వానుభవముతో వెల్లడించిన వచనములు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకవింశోఽధ్యాయః (21)
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది ఒకటవ అధ్యాయము (21)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
🌹. శ్రీమద్భగవద్గీత - 594 / Bhagavad-Gita - 594 🌹
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 11 🌴
11. న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత: |
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ||
🌷. తాత్పర్యం :
దేహధారుడైనవానికి సర్వకర్మలు త్యజించుట నిక్కముగా అసాధ్యమైన విషయము. కాని కర్మఫలములను త్యాగమొనర్చినవాడు మాత్రము నిజమైన త్యాగి యనబడును.
🌷. భాష్యము :
మనుజుడు ఏ సమయమునను కర్మను త్యజింపజాలడని భగవద్గీత యందే తెలుపబడినది. కనుక కృష్ణుని కొరకే కర్మనొనరించుచు, కర్మఫలమును తాననుభవింపక కృష్ణునికే సమస్తమును అర్పించువాడు నిజమైన త్యాగి యనబడును.
మా అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘమునందు సభ్యులైన పలువురు తమ కార్యాలయములందు గాని, కర్మాగారమునందు గాని, ఇతర చోట్ల గాని కష్టించి పనిచేసినను వారు సంపాదించినదంతయు సంస్థకే ఒసగుదురు.
అట్టి మహాత్ములు వాస్తవముగా సన్న్యాసులైనట్టివారే. అనగా వారు సన్న్యాసాశ్రమము నందు నెలకొనియున్నట్టివారే. కర్మఫలములను ఏ విధముగా త్యాగము చేయవలెనో మరియు ఎట్టి ప్రయోజనమునకై కర్మఫలములను విడువవలెనో ఈ శ్లోకమున సృష్టపరుపబడినది.
[06:51, 30/12/2020] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 198, 199 / Vishnu Sahasranama Contemplation - 198, 199 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻198. అమృత్యుః, अमृत्युः, Amr̥tyuḥ🌻
ఓం అమృత్యవే నమః | ॐ अमृत्यवे नमः | OM Amr̥tyave namaḥ
మృత్యుః వినాశః వినాశహేతుర్వా అస్య న విద్యతే మృత్యువు అనగా వినాశము గానీ, వినాశమునకు హేతువగు జన్మాది రూప లక్షణము గానీ ఈతనికి లేదు.
:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ ।
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ॥ 19 ॥
ఓ అర్జునా! నేను తపింపజేయువాడను మఱియు వర్షమునుకూడా నేనే కురిపించుచున్నాను. వర్షమును నిలుపుదలచేయువాడనూ నేనే. అమృతత్వమును అనగా మరణరాహిత్యమున్నూ, మరణమ్మునూ నేనే. అట్లే సద్వస్తువున్నూ, అసద్వస్తువున్నూ నేనే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
🌻199. సర్వదృక్, सर्वदृक्, Sarvadr̥k🌻
ఓం సర్వదృశే నమః | ॐ सर्वदृशे नमः | OM Sarvadr̥śe namaḥ
సర్వదృక్, सर्वदृक्, Sarvadr̥k
ప్రాణినాం కృతాకృతం సర్వం పశ్యతి స్వాభావికేన బోధేన తన స్వభావమే యగు శుద్ధ జ్ఞానముచేతనే ప్రాణుల కృతాకృతములగు కర్మలను అనగా చేయబడినవీ, చేయబడనివీ యగు కర్మములను చూచును గావున ఈతడు సర్వదృక్.
:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ. కేశవా! సంతత క్లేశనాశనుఁడవు గురుసన్మనో వాగగోచరుఁడవు
నిద్ధమనోరథ హేతుభూతోదార గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల
విశ్వోద్భవ స్థితి విలయార్థ ధృతనిత్య విపుల మాయాగుణ విగ్రహుఁడవు
మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుండ వతిశాంతమానసుఁడవు
తే. తవిలి సంసార హారిమేధస్కుఁడవును, దేవదేవుఁడవును వాసుదేవుఁడవును
సర్వభూత నివాసివి సర్వసాక్షి, వైన నీకు నమస్కారమయ్య! కృష్ణ! (918)
కేశవా! నీవు దుఃఖాన్ని తొలగిస్తావు. భక్తుల మనస్సునకూ, మాటలకూ అందవు. సకల శ్రేయస్సులను కలిగించే ఉదారగుణాలు, పేర్లు కలవాడవు. సత్త్వగుణం కలవాడవు. ప్రప్రంచసృష్టి, స్థితి, విలయాల కోసం మాయామయమైన బ్రహ్మాది గుణ విగ్రహాన్ని ధరిస్తావు. నీవు సర్వేంద్రియ మార్గాలచేత తెలియబడని మార్గం కలవాడవు. ప్రశాంతమైన మనస్సు కలవాడవు. సంసారాన్ని హరించే జ్ఞానం కలవాడవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. నీవు సర్వప్రాణులలో నివసిస్తావు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! నీకు నమస్కారం.
సశేషం...
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 147 🌹
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 77 🌻
అట్టి తురీయనిష్ఠ యందు శరీరమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు ఉన్నప్పటికీ, తాను విలక్షణుడైఉండుటచేత, తాను సాక్షీ భూతుడై ఉండుటచేత, తాను సాక్షీ మాత్రుడై ఉండుటచేత, సదా హిరణ్మయకోశమందు రమించేటటువంటి లక్షణం కల్గి ఉండుట చేత, సదా అగ్ని దీప్తిని కలిగి యుండుట చేత, సదా స్వయం ప్రకాశాన్ని కల్గి ఉండుట చేత ఆ సుషుప్త్యావస్థ యొక్క చీకటిని, అజ్ఞానాంధకారాన్ని తాననుభవించడు. దీనికొక ఉపమానం ఉంది. ఎట్లా అంటే సూర్యునియందు చీకటి ఉండే అవకాశం ఉందా? అంటే ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు చీకటి ఏర్పడదు.
కాబట్టి సూర్యస్థానంలో ఎట్లా అయితే చీకటి ఏర్పడదో, అట్లే తురీయనిష్ఠుడైనటువంటి, బ్రహ్మనిష్ఠుడై సిద్ధించినటువంటి, హిరణ్యగర్భ స్థితిని సాధించినటువంటి, సిద్ధించినటువంటి మహానుభావులు ఎవరైతే మహర్షి ఎవరైతే ఉన్నారో, అతనికి అజ్ఞానాంధకారమనే సుషుప్త్యావస్థ లేదు.
కేవలము భౌతికమైనటువంటి శరీరము తనకు తా ధన్యవంతమగుట గాని, తనకు తా విరమించడం గాని ఒక పనిముట్టువలే జరుగుతూ ఉంటుంది. జరగడమే ఉంటుంది గాని, అతను అవస్థాత్రయమునకు లొంగుట ఉండదు.
ఈ రకంగా అగ్నిని మనం ఆశ్రయించి, అగ్నిని ఆరాధించి ఆ అగ్ని యొక్క ఆధారముగా... ‘హవ్యవాహనుడు’.. అందుకే ఆయన పేరు “హవ్యవాహనుడు”. ఈ అగ్ని యందు అర్పించబడేటటువంటి సమస్తమూ కూడ హవిస్సులు. వీటిని ఆధారముగా మనం దివ్యత్వాన్ని పొందటానికి శ్రోతస్సులు అంటాం. ఈ రకంగా హవిస్సులే వారి దివ్యత్వాన్ని సాధించినపుడు శ్రోతస్సులు అవుతున్నాయి, అంటే శ్రుతి భాగములు అవుతున్నాయి.
ఏవైతే శ్రోతస్సులవుతున్నాయో, అట్టి శ్రుతి భాగములన్నీ కూడ ఏ పరమాత్మనైతే జపిస్తూ ఉన్నాయో, ఏ పరమాత్మనైతే నిర్ణయిస్తూఉన్నాయో, ఏ పరమాత్మ స్థితిని ఆశ్రయిస్తున్నాయో అట్టి పరమాత్మను నేనే అనేటటువంటి స్థితికి చేరాలి.
అలా ఎవరైతే సిద్ధ స్థితిని పొందుతారో, అలా ఎవరైతే దేశికేంద్రులైనటువంటి స్థితిని సాధిస్తారో, అలా ఎవరైతే అఖండ ఎరుకైననటువంటి పరబ్రహ్మమును దాటుతారో, లేని ఎరుకైనట్టి పరబ్రహ్మమును దాటతారో, పరమాత్మ స్థితిని దాటి బయలు అనేటటువంటి స్థితికి చేరతారో, ఇట్టి అధియఙాగ్నిని జాగరణ శీలురైన ఋత్విక్కులు ప్రతి నిత్యమూ కాపాడుచున్నారు.
కాబట్టి ఈ యజ్ఞంలో ఉన్నటువంటి అగ్ని ఆంతరికం యజ్ఞం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఈ తురీయనిష్ట అనేటటువంటి ఆంతరికయఙం నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. అట్లా ఈ ఆంతరిక యజ్ఞంలో ఎవరైతే తనను తాను లేకుండా చేసుకుంటున్నారో, తనను తాను దగ్ధం చేసుకుంటున్నారో, ప్రారబ్ద ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం కాగా, త్రిపుటి అంతా దగ్ధం కాగా - కర్మ త్రయం, దేహత్రయం, శరీరత్రయం, అవస్థాత్రయం, గుణత్రయం, ఈ రకంగా త్రిపుటి అంతా ఏదైతే ఉందో ఆ త్రిపుటి అంతా కూడ ఈ జ్ఞానయజ్ఞంలో ఈ జ్ఞానాగ్నిలో ఈ అంతరిక యజ్ఞంలో దగ్ధమైపోగ జీవభావము నిశ్శేషముగా లేనిదై బ్రహ్మనిష్టుడౌతున్నాడు. అపుడు హిరణ్యగర్భ స్థితిని సాధిస్తాడు.
తురీయనిష్ట చేత పొందదగినటువంటి ఆరవ కోశమైనటువంటి ఈ హిరణ్మయకోశము, ఈ హిరణ్యగర్భ స్థితి అత్యుత్తమమైనటువంటి బ్రహ్మనిష్టకు ఆశ్రయమైనటువంటి స్థితి. ఈ హిరణ్యగర్భ స్థితి నుంచి ఏ జ్ఞానాగ్ని ద్వారా అనంతంగా ఉన్నటువంటి, అవధులు లేకుండా ఉన్నటువంటి అనంత విశ్వము కూడ దగ్ధమైపోతుంది మరల.
సంచితం ఎలా అయితే లేకుండా పోయిందో, జ్ఞాన పరమైన రుణానుబంధము ఎట్లా లేకుండా పోతుందో అట్లే అఖండ విశ్వమూ కూడ ఈ హిరణ్యగర్భ స్థితి యందు లయమై పోతున్నటువంటి ఆ లయ స్థితిని తాను దర్శన విధిగా దర్శిస్తాడు. అట్లా విరాడ్రూపంగా ఉన్నటువంటి అనంత విశ్వమూ ఈ అగ్ని యందు లేకుండా పోతుంది. ఈ అగ్నియే, ఈ హిరణ్మయకోశమే పరమాత్మగా మారిపోతుంది, పరబ్రహ్మము అయిపోతుంది. అఖండ ఎరుక లేని ఎరుక అయిపోతుంది.
ఆ విధంగా పూర్ణ గురువు సహాయంతో అనంత విశ్వము పిల్లలాటలవలే తోచేటటువంటిది ఎరుక లేని పద్ధతి. సంకల్పము- సంకల్పాతీతము, శూన్యము- శూన్యాతీతము. లేకుండా పోవుట అనేది శూన్యము, అలా ఎరుక లేకుండా పోవుట, లేని ఎరుక అగుట శూన్యాతీతమగుట. అలాగే కాలము- కాలాతీతము. కాలుని సహాయ సహకారంతో, కాలుని అనుగ్రహంతో, ఆ కాల పురుషుని యొక్క కృప చేత, ఈ అఖండ ఎరుకను దాటి, బయలు అనేటటువంటి దర్శనాన్ని పొంది, ఆ బయలు స్థితిలోకి చేరుతారు.- విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:51, 30/12/2020] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 21 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 21 🍀
కాళ్ వేళ్ నామ్ ఉచ్చారితా నాహీ!
దోస్తీపక్షి పాహీ ఉద్ధరతీ!!
రామకృష్ణ నామ సర్వదోషా హరణ్!
జడజీవా తారణ్ హరి ఏక్!!
హరి నామ సార్ జిన్హా
యా నామాచీ!
ఉపమా త్యా దైవాచీ కోణ్ వానీ!!
జ్ఞానదేవా సాంగ్ ఝాలా హరిపార్!
పూర్వజా వైకుండ్ మార్గ్ సోపా!!
భావము:
నామోచ్ఛారణ చేయడానికి కాల వేళాదుల నియమము ఏమీ లేదు. నామ స్మరణ చేయువారి ఇరు పక్షాలు ఉద్దరించి పోతాయి.
రామకృష్ణ నామము సర్వ దోషాలను హరించి వేయును. ఒక్క హరి నామమే జడ జీవులను తరించి వేయగలదు. హరినామ సారము యొక్క రుచి మరిగిన నాలుక దైవమును వర్ణించి
చెప్పడము ఎవ్వరికి సాధ్యము కాదు.
హరిపాఠమును పఠించి హృదయస్థము చేసుకున్న వారి పూర్వజులకు కూడ వైకుంఠ మార్గము సులభము కాగలదని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.
🌻. నామ సుధ -21 🌻
లేదు కాల వేళాదుల నియమము
ఉచ్ఛరించుటకు హరి నామము
ఇరు పక్షముల పరివారము
అయిపోవుదురు ఉద్గారము
రామకృష్ణ మధుర నామము
సర్వదోషహరణ కారణము
జడజీవులను తరించడము
హరి ఒకడికే ఇది సాధ్యము
హరినామము వేద సారము
నామ రుచి మరిగిన నాలుక భాగ్యము;
వర్ణింపనెవరి వైఖరి తరము
ఆ భక్త జనుల దైవ వైభవము
జ్ఞానదేవుని నామకీర్తనము
అయిపోయినది పరిపూర్ణము
పూర్వజులకు వైకుంఠ మార్గము
సులభముగా అయినది సాధ్యము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[06:51, 30/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 164 / Sri Lalitha Chaitanya Vijnanam - 164 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖
🌻164. ' నిర్మమా '🌻
“ఇది నాది”, అను బుద్ధి లేనిది శ్రీమాత.
నేను అను భావము అహంకారము. నాది అను భావము మమకారము. నాది అను భావమున్న చోట బంధమున్నది. నాది అని భావించు వస్తువుపైన, ప్రాణముపైన మమకారము అను జిగురు
ప్రసరించి, జీవుడు వానికి అతుకుకొని బద్ధుడగుచుండును. నాది అను వస్తువు కోల్పోయినపుడు బాధపడును. నిజమున కేదియూ తనది కాదు.
తన దగ్గర చేర్చబడినవే యుండును కానీ, తనవి అని ఏమియూ ఉండవు. తన శరీరము తన చుట్టునూ దేవతలచే అల్లబడినది. అందు వర్తించువారు కూడా దేవతలే. శరీరము దేవతలిచ్చినది. కానీ, తనది కాదు. అది దైవదత్తము. అట్లే భార్య, భర్త, బిడ్డలు, మువ్వురునూ దైవవశమున చేరినవారే కాని, తనవారు కాదు. వారియందు కర్తవ్యమే యున్నది కాని, అధికారము లేదు.
అట్లే బంధువులు, స్నేహితులు, ఆస్తులు, పాస్తులు. ఇవి యన్నియూ తన చుట్టునూ చేరుట, విడిపోవుట కాలక్రమమున తప్పనిసరి. వచ్చినవెల్ల పోవునవే. శరీరముతో సహా సర్వమునూ పోవునవే కాని తనతో నుండునవి కావు.
ధర్మమూ, కర్మమూ మాత్రమే తనతో నడచి వచ్చును. అవియునూ మోక్షమార్గమున సడలును. తానొకడే సత్యము. తాను సనాతనుడు, భేద సనాతనులైన ఉమామహేశ్వరుల తనయుడు. అట్టి జీవుడు ఐక్యము చెందిననూ, తన అస్తిత్వము కూడ భగవదనుగ్రహముగ కలిగి యుండును.
సనక సనందనాదులు, నారదుడు అట్టివారు. వారునూ బుద్ధి లేక, స్వలాభ రహితులై శ్రీమాత అనుచరులుగ జీవులకు జ్ఞాన సంతర్పణము చేయుచున్నారు. మమకారమున్నంత కాలము బంధముండును. బంధ మున్నంత కాలము బాధ యుండును. తన చుట్టును చేరినవి తనవి అనుకొనక దైవమునవి అనుకొనుట అభ్యసించవలెను.
తాను, తన పరసరముల చేరినవి, అన్నియునూ దైవమునకు చెందినవే కాని తనకు చెందినవి కావు. వానియందు మమకారము దుఃఖము కలిగించును. కావున ఈ భావము దాటిన వారికే ప్రశాంత యుండును.
సశేషం...
శ్రీ రామతీర్ధ వేదాంత భాష్యము.
రచన:-శ్రీ కేశవ తీర్ధ స్వామి.
ఆత్మానందం.
ఆడియో నం.4
శ్రీకృష్ణ కర్ణామృతం.
-- లీలాశుకుల రచన
ధనుర్మాసమును పురస్కరించుకుని.
ఆడియో నం.5
🌀👂🍯🎊💖🎊👂🍯🌀
: శ్రీ గణేశ స్తవం
ఋషిరువాచ:--
ॐॐॐॐॐॐॐ
1)అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణమ్ |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ ||
2) గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్ |
మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ ||
3)జగత్కారణం కారణజ్ఞానరూపం సురాదిం సుఖాదిం గుణేశం గణేశమ్ |
జగద్వయాపినం విశ్వవంద్యం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ ||
4)రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతిజ్ఞం సదా కార్యసక్తం హృదాఽచింత్యరూపమ్ |
జగత్కారణం సర్వవిద్యానిదానం పరబ్రహ్మరూపం గణేశం నతాః స్మః||
5)సదా సత్యయోగ్యం ముదా క్రీడమానం సురారీన్హరంతం జగత్పాలయంతమ్ |
అనేకావతారం నిజజ్ఞానహారం సదా విశ్వరూపం గణేశం నమామః ||
6)తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం జగద్ధారకం తారకం జ్ఞానహేతుమ్ |
అనేకాగమైః స్వం జనం బోధయంతం సదా సర్వరూపం గణేశం నమామః||
7)తమః స్తోమహారం జనాజ్ఞానహారం త్రయీవేదసారం పరబ్రహ్మసారమ్ |
మునిజ్ఞానకారం విదూరే వికారం సదా బ్రహ్మరూపం గణేశం నమామః ||
8)నిజైరోషధీస్తర్పయంతం కరాద్యైః సురౌఘాంకలాభిః సుధాస్రావిణీభిః |
దినేశాంశుసంతాపహారం ద్విజేశం శశాంకస్వరూపం గణేశం నమామః||
9)ప్రకాశస్వరూపం నభో వాయురూపం వికారాదిహేతుం కలాధారరూపమ్ |
అనేకక్రియానేకశక్తిస్వరూపం సదా శక్తిరూపం గణేశం నమామః ||
10)ప్రధానస్వరూపం మహత్తత్వరూపం ధరాచారిరూపం దిగీశాదిరూపమ్ |
అసత్సత్స్వరూపం జగద్ధేతురూపం సదా విశ్వరూపం గణేశం నతాః స్మః ||
11)త్వదీయే మనః స్థాపయేదంఘ్రియుగ్మే జనో విఘ్నసంఘాతపీడాం లభేత |
లసత్సూర్యబింబే విశాలే స్థితోఽయం జనో ధ్వాంతపీడాం కథం వా లభేత||
12)వయం భ్రామితాః సర్వథాఽజ్ఞానయోగాదలబ్ధాస్తవాంఘ్రిం బహూన్వర్షపూగాన్ |
ఇదానీమవాప్తాస్తవైవ ప్రసాదాత్ప్రపన్నాన్సదా పాహి విశ్వంభ రాద్య ||
13)ఏవం స్తుతో గణేశస్తు సంతుష్టోఽభూన్మహామునే |
కృపయా పరయోపేతోఽభిధాతుముపచక్రమే||
లోకానికి కావలసింది సత్ప్రవర్తన (సౌశీల్యం), ఎవరి జీవితం ఉజ్జ్వల ప్రేమయుతమై, స్వార్థరహితమై ఉంటుందో అలాంటి వారే లోకానికి అవసరమై ఉన్నారు. అటువంటి ప్రేమతో కూడిన ప్రతి పలుకూ పిడుగువలె తాకుతుంది. ధీరవాక్కులు, ధీరతరమైన చేతలు మనకు కావలసి ఉన్నవి. మహనీయులారా! లేవండి, మేల్కొనండి!
🕉🌞🌎🌙🌟🚩
భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
మనము దైవాన్ని ఆరాధన చేసేటప్పుడు భ్రూమధ్యములో ఉన్నట్లు భావన చేయమని శ్రీకృష్ణుడు చెప్పాడు. అక్కడ త్రిగుణాత్మకమైన త్రిభుజము వలె ఒక ద్వారము ఉంటుంది. అది ఏమిటంటే సత్వము, రజస్సు, తమస్సు, లేక త్రిమూర్తులు, లేక ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులుగా మనకి ఇడా, పింగళ, సుషుమ్న అను మూడు నాడులు కేంద్రాలుగా ఫాలభాగములో ఉంటాయి. ఆ ఫాలభాగములో ఉండే త్రిభుజములో నుంచి ఆవలకి వెళ్ళాలి.
అది రజస్సు నుండి, తమస్సు నుండి వీలుపడదు. సత్వ, రజస్తమస్సులు సమన్వయింపబడాలి. అపుడే సమకోణ త్రిభుజము ఏర్పడుతుంది. సత్వము నుండి, నిత్యసత్వము లోకి ప్రవేశించి, నిత్యసత్వములో నుంచి గుణాతీతము లోనికి ప్రవేశిస్తే ద్వారము దాటినట్లే.
🕉🌞🌎🌙🌟🚩
దత్తాత్రేయుడు యోగమునకు అధిదేవత. ప్రతి సద్గురువు దత్తాత్రేయ స్వరూపమే. 'గురుర్బ్రహ్మ' అని మనము చేసే స్తోత్రము దత్తాత్రేయునికే చెందుతుంది. మనలో ఉండే బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపమైన ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులను సమన్వయ పరచడమే దత్తారాధన లోని ప్రధానమైన అంశము. అందుకనే ఆయన మూడు తలలతో ఉంటాడు. దత్తారాధన చేస్తున్నప్పుడు మనలో ఉండే ఇడ, పింగళ, సుషుమ్న నాడులను మూడు తలకాయలు గాను, సుషుమ్న నాడి మూలాధారము వరకు ఉంటుంది కాబట్టి అది ఆయన శరీరము గాను భావన చేయాలి.
మనలో దత్తస్వరూపము మూలాధారము వరకు ఏర్పడి ఉంటుంది. ఆయనలో శివతత్త్వము, విష్ణుతత్త్వము, బ్రహ్మ తత్త్వము ఉన్నాయి కాబట్టి శు లము, చక్రము, పద్మము, చంద్రుని ధరించి ఉంటాడు. వృషభము, హంస, గరుడుడు ఏకమై మనకి ఒక గోవుగా కనిపిస్తుంది. నాలుగు వేదములు నాలుగు జాగిలములుగా కనిపిస్తాయి. యోగవిద్య కావాలన్నా, యోగస్థితి నుంచి క్రిందకు జారకుండా ఉండాలన్నా దత్తారాధన ముఖ్యము.
🕉🌞🌎🌙🌟🚩
[12:19, 30/12/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (756)
🕉🌞🌎🌙🌟🚩
"వాస్తవంలో జీవించటం అంటే ఎలా !?"
వాస్తవంలో జీవించటం అంటే ఉన్నదున్నట్లు గ్రహించటం. మనం దేనికైనా ఇచ్చే విలువ దాన్నుంచి పొందే ప్రయోజనాన్నిబట్టి ఉంటుంది. ఏది మనకు ప్రయోజనకరమో, ఏది అప్రయోజనకరమో, ఏ ప్రయోజనం శాశ్వతంగా నిలుస్తుందో, ఏది అశాశ్వతంగా ముగుస్తుందో తెలుసుకుంటే ప్రపంచం విషయంలో మన మనసుకి తగిన పరిమితులు ఏర్పడతాయి. భార్యాపిల్లలతో, కుటుంబ సభ్యులతో, సమాజంలో ఎవరెవరితో ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలో తెలుసుకోవాలి. మన నిజమైన అవసరాలకు, కోరుకుంటున్న సౌకర్యాలకు, విలాసాలకు ఉన్న అంతరం ఏమిటో అవగాహన చేసుకోవటం ద్వారా వాస్తవంలో జీవించటం అలవాటు అవుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
సాధనంతా ఆత్మగా మారటానికి కాదు.. అనాత్మభావన పోవటానికే !''- (అధ్యాయం -93)
🕉🌞🌎🌙🌟🚩
: "ఋభుగీత"(223)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
ప్రవర్తనలో మార్పురావడమే మనలోని భక్తికి కొలమానం !
దేశవిదేశాల్లో భక్తులు కలిగి ఉన్న మహనీయులైనా వారి ప్రక్కనే తిరిగే వారిని మార్చలేకపోవచ్చు. వ్యక్తి గొప్పతనానికి మహత్తులే కొలమానం కానక్కర్లేదు. అన్నీ తెలిసి అతి సామాన్యుడిగా, భక్తుడిగా వినయంగా ఉండటంలోనే నిజమైన మహత్మ్యం ఉంది. మహాత్ములపై భక్తి కలిగి ఉండటం అంటే కేవలం భౌతికమైన వినయ, విధేయతలు మాత్రమే కావు. మనసులో గౌరవంతో కూడిన ప్రేమ కలిగి ఉంటేనే అది మనని ప్రభావితంచేసి సంస్కరిస్తుంది. మనం సమాజం అని పిలిచేది వ్యక్తుల ప్రవర్తననే. సమాజానికి కీడుచేసే వారిలో చాలామందికి ఇష్టదైవం, గురువు ఉంటారు. మరి అవి ఎందుకు వారిని మార్చటంలేదంటే వారికున్నది నిజమైన భక్తి కాదు. "ప్రవర్తనలో మార్పురావడమే మనలోని భక్తికి కొలమానం” !
🕉🌞🌎🌙🌟🚩
[12:26, 30/12/2020] +91 92915 82862: 🌷114-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
అధ్యాయము-10
దివ్య వైభవము
17. నన్ను యోగి అని సంబోధించితివి. అనగా నీలో నన్ను భావించి అందు యోగివైతివి. నిన్ను ధ్యానించుట, తెలియుట ఎట్లు సాధ్యము? ఏ యే భావములయందు నీవు ధ్యానింపబడుదువో, దర్శింపబడుదువో, మాకెట్లు తెలియును? నీవే వివరింపవలెను.
18. నీకును, జీవులకు నడుమగల యోగమను సంబంధము, జీవుల యందు వర్తించు నీ యోగమాయ మున్నగు నీ వైభవ విస్తృతిని గూర్చి మరల పలుకుము. వినుచున్న నా తృప్తికి ఆద్యంతములుండవు.
19. కృష్ణుడు: అంతకన్న కావలిసినదేమి! దివ్యములైన ఆత్మ వైభవములను తప్పక వర్ణింతును. కాని నాకు కూడా సాధ్యము కాదు. ప్రాధాన్యమును బట్టి మాత్రము వివరింపగలను.
20. 'నేను' వ్యాపించు వైభవమునకు ఆద్యంతములు లేవు. కనుక వానిని సంపూర్ణముగ ఎట్లు వర్ణింతును? వానికి నేనే మొదలు, నడిమి, అంతము అని మాత్రము ఎరుగుదును. అందరి సర్వ జీవులలో ఆత్మగ ఉన్నాను. ఎవరికి వారు నేను అనుకొందురు. నేను ఉన్నానని ఎరుగుదురు. ఈ నేను అహంకారము. అది ఎరుగుట ఎట్లు అని ప్రశ్నించినచో నన్ను నేను ఎరుగుదును. అను జ్ఞానము కలుగును. ఈ జ్ఞానమే ఆత్మ. ఇది సర్వజీవుల ఆశయముగ ఉన్నది. దానికి స్థానము హృదయము.
🕉🌞🌎🌙🌟🚩
127) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
హైరణ్యగర్భాః ప్రాణాత్మవాదిన స్త్వేవ మూచిరే ౹ చక్షురాద్యక్షలోపేఽపి ప్రాణసత్త్వే తు జీవతి ౹౹65౹౹
65. హిరణ్యగర్భ సంప్రదాయపు వారు ప్రాణములే ఆత్మయందురు. కన్నులు మొదలగు ఇంద్రియములు లేకున్నను ప్రాణములున్నచో జీవించును అని వారు ఎత్తి చూపుదురు.
ప్రాణోజాగర్తి సుప్తేఽ పి ప్రాణశ్రైష్ఠ్యాదికం శ్రుతమ్ ౹ కోశః ప్రాణమయః సమ్యగ్విస్త రేణ ప్రపఞ్చితః ౹౹66౹౹
66. నిద్రయందు కూడ ప్రాణము మేలుకొనియే ఉండును. శ్రుతులును ప్రాణము శ్రేష్ఠమని చెప్పుచున్నవి.ప్రాణమయ కోశము సవిస్తరముగ ఉపదేశింపబడినది.
చూ.బృహదారణ్యక
ఉప.1.3.7;5.13.1 ఛాందోగ్య ఉప.5.1 ప్రశ్న ఉప.2-3(4.3)తైత్తిరీయ ఉప.2.2.1
మన ఆత్మేతి మమన్యన్త ఉపాసనపరా జనాః ౹ ప్రాణస్యాభోక్తృతా స్పష్టా భోక్తృత్వం మనసస్తతః ౹౹67౹౹
67. ఉపాసనా పరులైన జనులు మనస్సే ఆత్మయందురు. సుఖదుఃఖములను,అనుభవించే శక్తి మనస్సునకు గలదు. ప్రాణమునకు ఆశక్తి లేదని స్పష్టముగ తెలియుచున్నది గదా. కనుక భోక్తృత్వము గల మనస్సే ఆత్మయని వారి వాదము.
వ్యాఖ్య: ఇది నారద పంచరాత్ర సంప్రదాయము.ప్రాణము ఆత్మ కాదనుటకు అందు ఎన్నో కారణములు చూపబడినవి.అది వాయువు మాత్రమే.
నిద్రలో కూడా ప్రాణము పనిచేసినా అది శరీరమును గాని బాహ్య విషయమును గాని అనుభవింప జాలదు.ప్రాణము పోయినచో శరీరము మరణించును.జఠరాగ్ని లేకున్నను శరీరము మరణించును. శ్రుతి ప్రాణము యొక్క మహత్వమును వర్ణించుట ఉపాసనయందు రుచి కల్పించుటకు మాత్రమే.
ప్రాణము శరీరమును ప్రవేశించినదని శ్రుతి చెప్పుట అధిదేవతను ఉద్దేశించియే.
శ్రుతి మనస్సే ఆత్మ అని కూడా చెప్పును,
"ఆహారము లేక నా ప్రాణము పోవుచున్నది" అనుట ప్రాణమునందలి ప్రీతిని మాత్రమే తెలుపును గాని దాని ఆత్మత్వమును గాదు.
బాహ్య వాయువు వలె రాకపోకలు చేసేది ఆత్మకాదు.
ప్రాణం కనబడకపోయినా మూర్ఛాదులందు చావు లేదు.
నిద్రలో ప్రాణమున్నా పని యుండదు.కనుక ప్రాణము జడము.
ఇంద్రియాదులకన్నా అది శ్రేష్ఠ మనుట కొరకే శ్రుతి ప్రాణమును ప్రధానంగా చెప్పింది.
వృక్షాదులందు ప్రాణం ఉన్నట్లు మనకు తెలియదు.అయినా అవి బ్రతికి ఉంటాయి.
మనస్సు-ఇంద్రియాలవలె సాధనం లేదా ఒక మేస్త్రీ వంటిది.
సుషుప్తిలో మనస్సు లేదు.అయినా ఆత్మ పోయిందనలేదు.
నా మనస్సు-మమకారమే గాని అహం కాదు.స్థిరము-అస్థిరము.
అభాసంతో కూడితేనే మనస్సు
కర్త,భోక్త లేకుంటే జడమే.
ఆత్మకన్నా భిన్నమయినదంతయు మిధ్య.మిధ్యా వస్తువులవలన సత్యమయిన అధిష్ఠానము చెడదు.స్వప్న వృత్తాంతం వలన జాగరణ వృత్తాంతం మారదు.
మిధ్యా సర్పం వలన రజ్జువునకు విషం రాదు.స్వప్నంలో ఎండమావిలో బురద రాదు.కనుక ఆత్మ అసంగం.అది కర్తగా కనబడినా కర్త కాదు.భోక్త కాదు.
కనుక జ్ఞానాత్పూర్వమున్న ఆత్మ బ్రహ్మరూపమే కనుక ఐక్యం సిద్ధము.
🕉🌞🌏🌙🌟🚩
13-శ్రీ రామదాసు కీర్తన
అసావేరి - ఆది
పల్లవి:-
అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా! రామప్ప గొబ్బున నన్నాదుకోరా!! ఆదుకోరా! నన్నాదుకోరా!! అ..
చరణము(లు):-
మేలు చేయుదు నంటిగదరా! మేలు చేసితినేమి భయమంటి గదరా!
వరహాలు మొహరీలు జమ జేస్తిగదరా! నీ పరిచారకులకు నే పంచితి గదరా!! అ..
పరులకొక్కరువ్వ యీయ లేదు గదరా ఓ పరమాత్మ నీ పాదములే నమ్మినానురా!! అ..
కొరడాలు తీసుక గొట్టిరి గదరా! హరనుత గోవింద హరితాళలేరా!! అ..
ఆత్మలోపల నిన్ను నెరనమ్మినారా! శరణాగత త్రాణ బిరుదేమైనదిరా!! అ..
శరధిబంధించిన శౌర్యమెక్కడరా! రాక్షస సంహార రక్షింపరారా!! అ..
రామ భద్రాద్రి శ్రీరామ రామా! నీనామమెప్పుడు భజియించితిగదరా!
రామదాసుని నిటుల చేయించితేరా!! అ..
🕉🌞🌏🌙🌟🚩
-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
అll సాత్త్వికసుఖముయొక్క లక్షణమును వచించుచున్నారు –
యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం
ఆత్మబుద్ధి ప్రసాదజమ్ ||
తా:- ఏ సుఖము ప్రారంభమునందు విషమువలెను, పర్యవసానమందు అమృతమును బోలినదిగను నుండునో, తన బుద్ధి యొక్క నిర్మలత్వముచే గలుగునట్టి ఆ సుఖము సాత్త్వికమని చెప్పబడినది.
వ్యాఖ్య: - అధ్యాత్మక్షేత్రమున సాధకునకు అభ్యాసకాలమందు ప్రారంభమున బ్రహ్మనిష్ఠ, ధ్యాన, వైరాగ్యాదులు ఒకింత కష్టముగా తోచవచ్చును. కాని అభ్యాసము, సాధన పూర్తియగుకాలమున అమృతతుల్యముగ నుండును. ఆత్మసుఖము నవి కలుగచేయును - అని యిచట వచింపబడినది.
కావున సాధనదశలోగాని, అభ్యాసకాలములో గాని ఎవరికైనను కష్టముకలిగినచో, విసుగు జనించినచో, అధైర్యపడక, అది వాస్తవమగు బాధ కాదనియు, పరిణామమున అనంతానందము కలుగుననియు నిశ్చయించి సాధనను విడనాడక ధైర్యముతో కొనసాగించవలెను. కనుకనే "విషమివ' అని చెప్పిరేకాని "విషమ్” అని చెప్పలేదు. అనగా ఆ ప్రారంభకష్టము విషమువలె తోచునేగాని వాస్తవముగ విషముకాదని భావము. ఇచట ప్రయోగించిన ‘ఇవ' అను పదమునందు గొప్ప అర్థముకలదు. ‘బాధవలె తోచునేకాని బాధకాద’ని ఆ పదమువలన స్పష్టమగుచున్నది.
ఆ తాత్కాలిక బాధకైనను కారణము జన్మార్జితములైన పాపవాసనలకును, ఆధునిక పుణ్యవాసనలకును, మధ్యగలుగు సంఘర్షణమే యగును. పుణ్యవాసనలు బలమై, పాపవాసనలను తొలగద్రోయునపుడు అవి వెడలి పోవుచు పోవుచు జీవుని గిల్లిపోవును. ఆ నొప్పియే ఈ 'విషమివ' అనుదాని యర్థము. అదియే జీవుని ప్రారంభబాధ. వాస్తవముగ అది బాధకాదు. అనుపమ సుఖమునకు నాందియే యగును.
ఒకానొక రోగమునకు "వేపఉండ" అను మందు ఇచ్చుదురు. అది చేదుగా నున్నను ఆరోగ్యమును గలుగజేయును. ఔషధము సేవించునపుడు అప్రీతిగానున్నను, బలవంతముగా నైనను సేవించవలసినదే ఆరోగ్యముకొఱకు. ఒక ఱాయి దేవవిగ్రహముగా మారుటకు మొదట ఉలిదెబ్బలు తినునట్లును, బంగారము శిరోభూషణముగా మారుటకు స్వర్ణకారుని సుత్తిదెబ్బలు తినునట్లును - అనంతమగు బ్రహ్మానందము ననుభవించుటకు ముందు జీవుడొకింత త్యాగము చేయవలసియుండును.
అట్లు అల్పసుఖమును వదలునప్పుడు ఒకింత దుఃఖము కలుగవచ్చును. అనేక జన్మలనుండి ఆ విషయసుఖములను బంధువులు జీవుని హృదయగేహములో నివసించుచున్నారు. వారు పోవునపుడు బంధువియోగమందువలె తాత్కాలిక ఆవేదన కొంతకలుగును. అంతమాత్రముతో సాధకుడు బెదరిపోరాదు. కొంత ఓపికబట్టి సాధనను విడువక కొనసాగించినచో ఆ కష్టకాలము తొలగిపోయి సుఖకాల మేతెంచును.
ఒక విద్యార్థిదశలో రేయింబవళ్లు కష్టపడి చదువును. తదుపరి ఉద్యోగకాలమందు సుఖించును.
అట్లే అధ్యాత్మరంగమున ఇంద్రియాదులను నిగ్రహించునపుడు, అంతర్యుద్ధఫలితముగ కొంత ప్రయాస కలిగినపుడు దానిని సహించుకొని ముందునకు సాగిపోవలెను. అంతియేకాని భయపడి సాధనను విరమించరాదు. కనుకనే భగవానుడిచట సాత్త్వికసుఖముయొక్క నిజస్థితిని తెలుపుచున్నారు. విషరూపదుఃఖములో అమృతరూప సుఖముయొక్క బీజములున్నవని సెలవిచ్చిరి. తాత్కాలికకష్టరూపమగు ఆ విషము నెట్లైనను దిగమ్రింగివేసినచో వానిలోనగల అమృతబీజము లపుడు మొలకెత్తును.
ఇది విషమువలె నున్నదికదాయని పారవేసినచో దానిలోని అమృతబీజములనుగూడ జనులు పోగొట్టుకొనినవారగుదురు. కాబట్టి సాధకు లివ్విషయమున కడు జాగరూకులై యుండి భగవానుని ఈ అమూల్యోపదేశము జ్ఞప్తియందుంచుకొని అనంతాత్మసుఖము తమకై వేచియున్నదని భావించి, కష్టసహిష్ణువులై, త్యాగశీలురై, సాధనను విడువకుండ చేయుచునే యుండవలెను. కనుకనే ‘కశ్చిద్ధీరః’ - ఏ ఒకానొక ధీరుడో (అన్నికష్టముల నోర్చుకొని) ప్రత్యగాత్మను చూడగలడని ఉపనిషత్తులలో చెప్పబడినది. శ్రీ బుద్ధదేవుడు, శ్రీ రామకృష్ణపరమహంస మున్నగువారి సాధనకాలజీవితములను చూచినచో ఈ సత్యము బోధపడగలదు.
మఱియు 'అమృతోపమమ్'- అమృతమునుబోలి అని యిచట చెప్పుటయు చాల సమంజసముగా నున్నది. ఏలయనిన, ఆత్మసుఖము, దైవసుఖము దేవతల అమృతమును పోలినదేకాని, జడమగు ఆ దేవతల అమృతముకాదు. దానికంటె ఎన్నికోట్ల రెట్లో అధికశక్తివంతమైనదది. దేవతల యొద్దగల అమృతము స్థూలదేహమునకు కొంతకాలము మృతిలేకుండ నివారించును. కాని ఈ ఆత్మసుఖరూపమగు అమృతము
శాశ్వతముగ జననమరణ సంసారప్రవాహమునుండి జీవుని తప్పించివేయును.
"ఆత్మబుద్ధి ప్రసాదజమ్”- ఆ సాత్త్వికసుఖము (ఆత్మసుఖము) యెట్లు కలుగగలదు? బుద్ధి నిర్మలముగానున్నచో, విషయదోషము లెవ్వియు లేకయుండినచో, నిర్మలదర్పణమున ప్రతిబింబమువలె ఆత్మసుఖము అందు గోచరింపగలదు. అనుభూతము కాగలదు. కాబట్టి సుఖము నపేక్షించువారు మొట్టమొదట తమబుద్ధిని నిర్మలముగా నొనర్చుకొనవలెను.
"మోక్షమెచటనున్నది? సుఖమెచటనున్నది?”- అని కొందరు ప్రశ్నించుదురు. దానికి భగవాను డిచట సమాధాన మొుసంగిరి. మోక్షము, దైవసుఖము ఆకాశములో లేదు. పాతాళములో లేదు. నిర్మలమగు తన బుద్ధియందే కలదు. ఈ యర్థమునే శ్రీ వసిష్ఠమహర్షియు శ్రీరామచంద్రున కిట్లు బోధించిరి -
న మోక్షో నభసః పృష్ఠే
పాతాలే న చ భూతలే
మోక్షో హి చేతో విమలం సమ్యగ్జ్ఞానవిబోధితం (శ్రీ వసిష్ఠగీత).
ప్ర:- సాత్త్వికసుఖముయొక్క లక్షణమేమి?
ఉ:- ప్రారంభములో (అభ్యాసకాలములో) విషమువలె కష్టముగతోచి తుదకు అమృతమువలె సుఖదాయకముగ నుండునది సాత్త్వికసుఖము.
ప్ర :- అట్టి సాత్త్వికసుఖము జీవున కెట్లు కలుగును?
ఉ :ー నిర్మల బుద్ధి నుండి ఆ సుఖము జనించును. కావున సుఖాభిలాషి బుద్ధిని నిర్మలమొనర్చుకొనవలయును.
ప్ర:- కాబట్టి జీవుని కర్తవ్యమేమి?
ఉ:- ఆధ్యాత్మికసాధనలు గావించునపుడు కలుగు కష్టములకు జంకక భగవంతునిపై పూర్ణ విశ్వాసముంచి, సాధనను ధైర్యముతో కొనసాగించి, బుద్ధియందు విషయదోషమెద్దియు లేకుండ అద్దానిని సునిర్మలముగా గావించవలెను. అత్తఱి మహత్తరమగు ఆత్మసుఖ మాతనికి అనుభూతము కాగలదు. అదియే మోక్షము.
🕉🌞🌎🌙🌟🚩
[12:52, 30/12/2020] +91 92915 82862: తిరుప్పావై 16వ పాశురము
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
16 పాశురము ॐॐॐॐॐॐॐॐॐॐ
నాయగనాయ్ నిన్ఱనన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుమ్ తోరణ
వాశల్ కాప్పానే! *మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
ఆయర్ శిఱుమియరో ముక్కు; అఱైపఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్;
తూయోమాయ్ వన్దోమ్, తుయలెళ పాడువాన్,
వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే, అమ్మా! నీ,
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్!!
భావం :-
ॐॐॐॐॐॐॐॐॐॐ
అందరకును నాయకుడై ఉన్న నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా ! లోనికి విడుపుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వరమును కాపాడు ద్వారపాలకా ! మణులచే సుందరమైన తలుపులు గడియను తెరువుము. గోప బాలికలమగు మాకు మాయావియు, మణివర్ణుడను అగు శ్రీకృష్ణపరమాత్మ ధ్వనిచే 'పర' అను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాట ఇచ్చెను. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి ఇచ్చిన వారము కాము. పరిశుద్ధ భావముతో వచ్చితిమి. శ్రీకృష్ణుని మేలుకొలుపుటకు గానము చేయ వచ్చితిమి. స్వామీ ! ముందుగానే నీవు కాదు అనకుము. దగ్గరగా ప్రేమతో ఒకదానిని ఒకటి చేరి బిగువుతో నిలిచి ఉన్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనికి పోనీయు. అని గోపికలు భవన పాలకుని, ద్వార పాలకుని అర్థించిరి.
మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా! మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసినవారము. గొల్లకులమయిన పుట్టిన అజ్ఞానులమైననూ స్వామి యందత్యదిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్ఠితుడును. ఇంద్రనీల మణివర్ణముగల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు 'పఱై' అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగ సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ! నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక ధృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకొంటున్నారు.
అవతారిక :-
ॐॐॐॐॐॐॐॐॐॐ
గోపికలు --- నిద్రపోతున్న ఆనందవ్రజమున కృష్ణసంశ్లేష యోగ్యత కల గోపికలను అందరిని మేలుకొలుపుకొని నందగోప భవనమును చేరుకొనిరి. భగవానుని ఆశ్రయించినపుడు మహాపురుషుల ద్వారా ఆశ్రయించాలి అని చెప్పుచుందురు. అందుకే తాము కూడా భవనపాలకుని, ద్వారపాలకుని ప్రార్థించి -- నందగోపుని ఆశ్రయించి కృష్ణపరమాత్మను పొందాలని యత్నించుచున్నారు.
దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ క్షేత్రపాలకుని ముందుగా సేవించి --- ద్వారపాలకుని, అమ్మవారిని, ప్రధానదైవాలని సేవించాలి. అంతర్యామిని ఉపాసన చేయువారు ఇంద్రియములను, ప్రాణమును, మనస్సును వశపరచుకొని బుద్ధిద్వారా ఆత్మా స్వరూప జ్ఞానముతో పరమాత్మను ఉపాసింతురు. ఇవి అన్నియు కలసివచ్చునట్లు ఆండాళ్ళు ఈ వ్రతమును ప్రతిపాదించుచు కృష్ణావతారమున గోపికలు ఏ విధంగా శ్రీకృష్ణుని చేరిరో, ఆలయంలో దైవమును సేవించుటకు ఏ విధంగా వెళ్ళెదరో , భగవత్ ఉపాసన చేయువారు ఏ విధంగా ఉపాసింతురో మనకు ఈపాశురం లో తెలియచేసెను.
ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తియై యీ 16వ మాలికతో మూడవ దశ ప్రారంభమౌతుంది. నిద్రిస్తున్న గోపికలనందరను మేల్కొలిపి, అందరను వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి, వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి, అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివానిని లేపుచున్నారు. పెద్దలు చేయని పనిని చేయమని' కదా ప్రతిజ్ఞ. దానినాచరించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు. భాగవతుల పురస్కరించుకొని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో, శూర్పణఖవలె పరాభవము నొందవలసిందేకదా! అనగా పురుషకారమును పురస్కరించుకొనకుండ పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలెను కదా! భగవంతుని చేరటానికి ముందు ఆచార్యు నాశ్రయించవలెను కదా! నిరహంకారులై ఆచార్యునాశ్రయించినవారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకొన్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతనిద్వారా శ్రీకృష్ణపరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు.
దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి, మొదట క్షేత్రపాలకుని దర్శించాలి. పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారినీ సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం వుంది. మనస్సునదుపులో వుంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాళ్ తల్లి మనకు చెప్తున్నది (పాశురంలో)
ఖరహరప్రియ - ఏకతాళము
ॐॐॐॐॐॐॐॐॐॐ
ప.. మా ప్రభుడౌ నందుని తిరు మాళగ రక్షించువాడ!
సుప్రకాశ ధ్వజతోరణ ద్వారము గాచేటివాడ!
ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!
సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!
చ.. గొల్ల పిల్లలను మాకు నల్లని కృష్ణయ్య నిన్న
అల్లన
మ్రోగేటి వాద్య ముల్ల మలర నిత్తుననెను.
చెల్లని మాటల నోటను మెల్లగ జెప్పగబోకుమ!
నల్లనయ్య కృష్ణయ్యను మెల్లగ దర్శింపరాగ
ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!
సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!
భగవంతుణ్ణి పొందేది ఆచార్యుని ద్వారానే
ఆండాళ్ తిరువడిగలే శరణం
ॐॐॐॐॐॐॐॐॐॐ
మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి. ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది.
ఆ భవనంకు ఒక తోరణం ఒక ద్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాల్లంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.
"నాయగనాయ్ నిన్ఱ" నాయకుడవై ఉండే "నందగోపనుడైయ" నందగోపుడి "కోయిల్ కాప్పానే!" భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ "కొడిత్తోన్ఱుమ్" ఒక గరుడ ద్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చేరల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు - ఆ గరుడ ద్వజం. ఇదీ భగవంతుని చేష్ట. "తోరణ వాశల్ " మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని "కాప్పానే" కాపాడేవాడా అని నమస్కరించారు. "మణిక్కదవం " మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం "తాళ్ తిఱవా" తాళ్ళం తీయవయ్యా.
ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు అన్నాడేమో "ఆయర్ శిఱుమియరోముక్కు" చిన్న గొల్ల పిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. "అఱై పఱై" వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు. ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కాని, " నెన్నలే వాయ్-నేరుందాన్" నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మన్ని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం అయనచుట్టు తిరగాల్సొస్తుంది, "మాయన్" ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అయనని అంటె "మణివణ్ణన్" ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటమం లేదయా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. "తూయోమాయ్ వందోమ్" చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది "తుయిలెర ప్పాడువాన్" ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని.
"వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా" అమ్మా స్వామీ ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, "నీ నేశనిలైక్కదవం" శ్రీకృష్ణ ప్రేమచే సుదృడంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు, ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, "నీక్కు" నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.
తిరుప్పావై 16పాశురము తెలుగు పద్యాను వాదము
ॐॐॐॐॐॐॐॐॐॐ
నంద వంశపురాజ మందిర రక్షకా
ద్వజ తోరణమ్ముల ద్వారపాల
వద్దని చెప్పకు వల్ల కాదనబోకు
స్వామిని సేవింప మేము రాగ
అల్లదే రతనాల గొళ్ళెము తీయుము
మాదవు దర్శించి మోదమంద
కల్లలు లేనట్టి గొల్ల కన్నెలమయ్య
నీల మేఘుని చూడ నిల్చినాము
ఆ.వె. మాయలాడి వాని మాటల తోడనే
పరను పొంద గోరి వచ్చినాము
తాన మాడినాము తలుపులు తీయుము
మేలుకొలుపు పాడి మేలుకొలుప
శ్రద్ధ భక్తి నొసగి బుద్ధిని యొసగుము
శ్రీధరుని మనసున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
[17:11, 30/12/2020] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు -111 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
📚. 4. జ్ఞానయోగము - శ్లోకము 42 📚
🍀 37. నిష్కామ కర్మయోగము - మానవులకు తెలుసు కొనుటలో గల ఆసక్తి చేయుటలో లేదు. తెలుసుకున్న కొలది యింకను తెలుసుకొన వలెనను ఆరాటమేగాని, తెలిసినది ఆచరించుట యుండదు. తెలిసినది ఏ కొద్దియైనను, దాని నాచరించుట ఆరంభించినచో తెలియవలసినది ఎప్పటికప్పుడు తెలియుచునే యుండును. ఆచరింపక తెలుసుకొనుట ఆరంభించినచో అది వ్యసనమై స్థిరపడును. తెలుసుకొనుట, ఆచరించుట ఉచ్ఛ్వాస నిశ్వాసలవలె ఎవరియందు జరుగునో అట్టివారే ముముక్షు మార్గమున పయనించువారు. అందులకే ఉత్తిష్ఠ, అతిష్ఠ (లెమ్ము, ఆచరింపుము) అని దైవము పలికినాడు. యోగమనగ నిష్కామ కర్మయోగమే. 🍀
తస్మా దజ్ఞానసంభూతం హృత్ స్థం జ్ఞానాసి నాత్మనః |
ఛిత్వైనం సంశయం యోగ మాతిష్ణోత్తిష్ఠ భారత || 42
భరత పుత్రుడవగు ఓ అర్జునా! నీ హృదయమందు పుట్టిన అజ్ఞానమును, ఈ తెలుపబడిన జ్ఞానమను ఖడ్గముచే ఛేదించుము. నిష్కామముగ కర్మమును నిర్వర్తించుము. సంశయింపక లెమ్ము. అర్జునుడు సంశయమున పడుట చేతనే అతని హృదయమున అనేకానేక ప్రశ్నలు ఉద్భవించినవి. ప్రశ్నల నుండి ప్రశ్నలు పుట్టుచున్నవి. సహజముగ జ్ఞానవంతుడైనను అతడు సంశయ మున పడుటచే అతని నజ్ఞాన మావరించినది. అజ్ఞానము, సంశయముతోడై, అశ్రద్ధ జనింపగ శ్రీకృష్ణుడు తెలిపిన విషయమునే మరల మరల తెలుపవలసి వచ్చినది. అర్జునుని యందుకల వాత్సల్యముతో దైవము మరల మరల నిష్కామ కర్మయోగ ప్రభావమును వివరించినాడు.
అర్జునుడు ధనుస్సు, బాణములను విడిచి పెట్టి ప్రశ్నలు వేయుట, శ్రీకృష్ణుడు పదే పదే ఒకే సమాధానము తెలుపుట మానవుల సహజ ధోరణిని తెలుపును. మానవులకు తెలుసు కొనుటలో గల ఆసక్తి చేయుటలో లేదు. తెలుసుకున్న కొలది యింకను తెలుసుకొన వలెనను ఆరాటమేగాని, తెలిసినది ఆచరించుట యుండదు. తెలిసినది ఏ కొద్దియైనను, దాని నాచరించుట ఆరంభించినచో తెలియవలసినది ఎప్పటికప్పుడు తెలియుచునే యుండును. ఆచరింపక తెలుసుకొనుట ఆరంభించినచో అది వ్యసనమై స్థిరపడును. తెలుసుకొనుట, ఆచరించుట ఉచ్ఛ్వాస నిశ్వాసలవలె ఎవరియందు జరుగునో అట్టివారే ముముక్షు మార్గమున పయనించువారు.
అందులకే ఉత్తిష్ఠ, అతిష్ఠ (లెమ్ము, ఆచరింపుము) అని దైవము పలికినాడు. ఆచరించవలసినది తాను తెలిపిన యోగము. అందుచే "యోగమాలిష్ణోత్తిష్ఠ భారత" అని పలికినాడు. యోగమనగ నిష్కామ కర్మయోగమే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[17:11, 30/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 311 🌹
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
77. అధ్యాయము - 32
🌻. వీరభద్రుడు - 1 🌻
నారదుడిట్లు పలికెను -
మూర్ఖుడగు దక్షుడు ఆకాశవాణిని విని, అపుడేమి చేసినాడు? ఇతరులు ఏమి చేసిరి?అపుడు ఏ మాయెను ?చెప్పుము (1). భృగు మహర్షి యొక్క మంత్ర బలముచే పరాజితులైన శివగణములు ఏమి చేసిరి? ఎచటకు వెళ్ళిరి ? ఓ మహాబుద్ధి శాలీ !ఆ విషయమును నీవు చెప్పుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆకాశవాణిని విన్న దేవతలు, ఇతరులు అందరు ఆశ్చర్యచకితులై కింకర్తవ్యతా విమూఢులై నిలబడియుండిరి. వారేమియూ మాటలాడకుండిరి (3). భృగువు యొక్క మంత్రబలముచే కొందరు శివగణములు సంహరింపబడిరి. వారిలో మిగిలిన వీరులు పారిపోయి శివుని శరణు పొందిరి (4). సాటిలేని తేజస్సు గల రుద్రునకు వారు ఆదరముతో నమస్కరించి జరిగిన వృత్తాంతమునంతనూ యథాతథముగా నివేదించిరి (5).
గణములు ఇట్లు పలికిరి -
దేవదేవా !మహాదేవా! శరణు పొందిన మమ్ములను రక్షించుము. ఓ నాథా !సతీదేవి యొక్క విస్తరమగు వృత్తాంతమును ఆదరముతో చక్కగా వినుము (6). ఓ మహేశ్వరా! గర్విష్ఠి, పరమదుష్టుడునగు దక్షుడు సతీదేవిని అనాదరించి, అవమానించినాడు. దేవతలు కూడ అటులనే చేసినారు (7). ఆతడు మీకు భాగమును ఈయలేదు. కాని దేవతలకిచ్చినాడు. దుష్టుడు, మిక్కిలి గర్విష్ఠియగు దక్షుడు బిగ్గరగా పలుకరాని మాటలను పలికినాడు (8).
ఓ ప్రభూ! నీకు యజ్ఞములో భాగము ఈయకపోవుటను చూచి సతీదేవి మిక్కిలి కోపించెను. అపుడామె తన తండ్రిని పరిపరివిధముల నిందించి తన దేహమును అగ్నికి ఆహుతి చేసెను (9).
పదివేల మంది గణములు మిక్కిలి సిగ్గుపడిన వారై తమ దేహములను ఆయుధములతో నరుకుకొని అచట మరణించిరి. మాలో కొందరు మిక్కిలి కోపించి (10),భయమును గొల్పుచూ వేగముగా ఆ యజ్ఞమును ధ్వంసము చేయుటకు సిద్ధమైతిమి. కాని శత్రువగు భృగువు తన మహిమచే మమ్ములను తరిమి వేసినాడు (11). జగత్తును రక్షించే ఓ ప్రభూ! మేము నిన్ను శరణు పొందితిమి. హే దయోళో! మాకు సంప్రాప్తమైన ఈ భయము నుండి మమ్ములను రక్షించి, భయమును తొలిగించుము(12).
హే మహాప్రభో! మిక్కిలి గర్వించిన దక్షుడు మొదలగు దుష్టులందరు ఆ యజ్ఞములో పెద్ద అవమానమును చేసిరి (13). అభిమానమును రక్షించువాడా! సతీదేవికి, మాకు జిరిగిన వృత్తాంతమునంతనూ నీకు చెప్పితిమి. ఆ మూర్ఖుల విషయములో నీవు ఎట్లు చేయగోరెదవో, అట్లు చేయుము (14).
బ్రహ్మఇట్లు పలికెను -
శివ ప్రభుడు ఆ తన గణముల మాటలను విని, వెంటనే ఆ వృత్తాంతమునంతనూ ఎరుంగుటకై నారదుని స్మరించెను (15). ఓ దేవర్షీ! నీ దర్శనము దివ్యమైనది. నీవు వెంటనే అచటకు వచ్చి, శంకరుని భక్తితో అంజలి యొగ్గి నమస్కరించి అచట నిలబడితివి (16). ఆ ప్రభుడు అపుడు నిన్ను ప్రశంసించి, దక్షయజ్ఞమునకు వెళ్లిన సతీదేవి యొక్క వార్తను, మరియు ఇతర వృత్తాంతమును గురించి ప్రశ్నించెను (17).
ఓ కుమారా! శంభుడు ఇట్లు ప్రశ్నించగా, ఆయనను మస్సులో ధ్యానించే నీవు వెంటనే దక్షయజ్ఞములో జరిగిన వృత్తాంతమునంతనూ చెప్పియుంటివి (18). ఓ మహర్షీ !అతి భయంకరమగు పరాక్రమము గలవాడు, సర్వేశ్వరుడునగు ఆ రుద్రుడు నీవు చెప్పిన ఆ వృత్తాంతమును విని వెనువెంటనే క్రోధమును పొందెను (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:11, 30/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 196 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జమదగ్నిమహర్షి-రేణుక - 2 🌻
06. తన దగ్గర ఎంత ఉంది, ఎంత ఇచ్చాడు అనే దన్నిబట్టి దానం యొక్క మహత్తు ఉంటుంది. అంతే కాని ఎంత ఇచ్చడు అనేదానినిబట్టికాదు. ఒక కోతీశ్వరుడు లక్షరూపాయలు దానం చేస్తూ యథాశక్తి అంటే, అది దోషం. “నా బుద్ధి చిన్నది. లక్షకంటే ఎక్కువ ఇవ్వటంలేదు. నేను ఇవ్వగలిగినవాడినే! యాభైలక్షలు ఇవ్వగలిగినవాడినే! కాని నాబుద్ధి చిన్నది. స్వీకరించి అనుగ్రహించండి” అని అనాలి.
07. “యథాశక్తి ఇస్తున్నాను. ఏకంగా లక్షరూపాయలు ఇస్తున్నాను. చాలా పెద్దమొత్తం ఇస్తున్నాను” అనుకోవటం వాడికి దానమే కాదు. తనశక్తికి సరిపడేటట్లు ఇస్తేనే అది దానం. ‘శక్త్యనుసారం’ – ‘యథాశక్తి’ అనరాదు, అలా అనకూడదు. ‘యథాబుద్ధి’ అనాలి. యథాశక్తి అంటే ‘యావఛ్ఛక్తి’ అనే అర్థం. దానికి అదే అర్థం. జ్ఞాపకం పెట్టుకోవాలి.
08. ఇవ్వగలిగితే లక్ష ఇవ్వాలి. ఇవ్వలేకపోతే ఒప్పుకోవాలి! అప్పుడు దోషం ఉండదు. ఎప్పుడూ కూడా ఆ మాట-యథాశక్తి అనేమాట-వాడకుండా ఉండటమే న్యాయం, క్షేమం. నిజానికి మనం దానం యథాశక్తిగా ఎప్పుడూ ఎందులోనూ చెయ్యటంలేదు. ఏదో యథాబుద్ధి చేస్తున్నాం. ఒకవేళ చేసినా, దానిని దానం అనే అంటారు. అంతే కాని అది త్యాగం అనిపించుకోదు. త్యాగం వేరు.
09. ఒకదాత, కోటి ఇవ్వకలిగినవాడు, లక్షే ఇస్తే, దానం చేసిన వాడవుతాడు. దానికుండే ప్రతిఫలం ఎదో ఉంటుంది. అది పుణ్యమే అవుతుంది. అయితే ఉన్నదంతా ఇవ్వగలిగిన వాడు త్యాగంచేసినవాడవుతాదు. దానంవల్ల పుణ్యంవస్తే, త్యాగంవల్ల మోక్షమేవస్తుంది.(‘త్యాగేనైకే అమృతత్వమానశుః’ అని ఆర్యోక్తి).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:11, 30/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 135 🌹
✍️. శ్రీ బాలగోపాల్
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 14 🌻
548. ఉన్నత చైతన్యము:- మానవుడు, ఉన్నతర చైతన్యము:- ఆధ్యాత్మిక మార్గము, మహోన్నత చైతన్యము:- భగవంతుడు, సర్వోన్నత చైతన్యము:- సద్గురువు లేక అవతార పురుషుడు.
549. సృష్ట రూపములలో ఉన్నత చైతన్యము:- మానవుడు, మానవులలో మహోన్నత చైతన్యము:- భగవంతుడు.
550. భగవదనుభూతి పరుడైన మానవుడు (జ్ఞానముతో, విశుద్ధ చైతన్యముతో కూడిన) సర్వశక్తిమంతుడు. సత్యస్థితి యందు జాగరూకుడై యుండును. అతడే జ్ఞానము-జ్ఞాని-జ్ఞేయము, ప్రేమ-ప్రేమికుడు-ప్రియతముడు.
ప్రతి జీవాత్మలో తానున్నాననియు, తనలో ప్రతి జీవాత్మ ఉన్నదనియు అతడెరుంగును. అతడే సమస్తమునకు ఆద్యంతములని కూడా ఎఱుంగును. తాను శాశ్వతముగా, ఆ.... సత్యసాగరునిగనే యుంటిననియు, ఉన్నాననియు, ఉందుననియు ఎరుంగును. కాని, సామాన్య మానవునకు తానెక్కడ నుండి వచ్చెనో, ఎక్కడికి పోవునో తెలియదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. గీతోపనిషత్తు -111 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
📚. 4. జ్ఞానయోగము - శ్లోకము 42 📚
🍀 37. నిష్కామ కర్మయోగము - మానవులకు తెలుసు కొనుటలో గల ఆసక్తి చేయుటలో లేదు. తెలుసుకున్న కొలది యింకను తెలుసుకొన వలెనను ఆరాటమేగాని, తెలిసినది ఆచరించుట యుండదు. తెలిసినది ఏ కొద్దియైనను, దాని నాచరించుట ఆరంభించినచో తెలియవలసినది ఎప్పటికప్పుడు తెలియుచునే యుండును. ఆచరింపక తెలుసుకొనుట ఆరంభించినచో అది వ్యసనమై స్థిరపడును. తెలుసుకొనుట, ఆచరించుట ఉచ్ఛ్వాస నిశ్వాసలవలె ఎవరియందు జరుగునో అట్టివారే ముముక్షు మార్గమున పయనించువారు. అందులకే ఉత్తిష్ఠ, అతిష్ఠ (లెమ్ము, ఆచరింపుము) అని దైవము పలికినాడు. యోగమనగ నిష్కామ కర్మయోగమే. 🍀
తస్మా దజ్ఞానసంభూతం హృత్ స్థం జ్ఞానాసి నాత్మనః |
ఛిత్వైనం సంశయం యోగ మాతిష్ణోత్తిష్ఠ భారత || 42
భరత పుత్రుడవగు ఓ అర్జునా! నీ హృదయమందు పుట్టిన అజ్ఞానమును, ఈ తెలుపబడిన జ్ఞానమను ఖడ్గముచే ఛేదించుము. నిష్కామముగ కర్మమును నిర్వర్తించుము. సంశయింపక లెమ్ము. అర్జునుడు సంశయమున పడుట చేతనే అతని హృదయమున అనేకానేక ప్రశ్నలు ఉద్భవించినవి. ప్రశ్నల నుండి ప్రశ్నలు పుట్టుచున్నవి. సహజముగ జ్ఞానవంతుడైనను అతడు సంశయ మున పడుటచే అతని నజ్ఞాన మావరించినది. అజ్ఞానము, సంశయముతోడై, అశ్రద్ధ జనింపగ శ్రీకృష్ణుడు తెలిపిన విషయమునే మరల మరల తెలుపవలసి వచ్చినది. అర్జునుని యందుకల వాత్సల్యముతో దైవము మరల మరల నిష్కామ కర్మయోగ ప్రభావమును వివరించినాడు.
అర్జునుడు ధనుస్సు, బాణములను విడిచి పెట్టి ప్రశ్నలు వేయుట, శ్రీకృష్ణుడు పదే పదే ఒకే సమాధానము తెలుపుట మానవుల సహజ ధోరణిని తెలుపును. మానవులకు తెలుసు కొనుటలో గల ఆసక్తి చేయుటలో లేదు. తెలుసుకున్న కొలది యింకను తెలుసుకొన వలెనను ఆరాటమేగాని, తెలిసినది ఆచరించుట యుండదు. తెలిసినది ఏ కొద్దియైనను, దాని నాచరించుట ఆరంభించినచో తెలియవలసినది ఎప్పటికప్పుడు తెలియుచునే యుండును. ఆచరింపక తెలుసుకొనుట ఆరంభించినచో అది వ్యసనమై స్థిరపడును. తెలుసుకొనుట, ఆచరించుట ఉచ్ఛ్వాస నిశ్వాసలవలె ఎవరియందు జరుగునో అట్టివారే ముముక్షు మార్గమున పయనించువారు.
అందులకే ఉత్తిష్ఠ, అతిష్ఠ (లెమ్ము, ఆచరింపుము) అని దైవము పలికినాడు. ఆచరించవలసినది తాను తెలిపిన యోగము. అందుచే "యోగమాలిష్ణోత్తిష్ఠ భారత" అని పలికినాడు. యోగమనగ నిష్కామ కర్మయోగమే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[17:16, 30/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 311 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
77. అధ్యాయము - 32
🌻. వీరభద్రుడు - 1 🌻
నారదుడిట్లు పలికెను -
మూర్ఖుడగు దక్షుడు ఆకాశవాణిని విని, అపుడేమి చేసినాడు? ఇతరులు ఏమి చేసిరి?అపుడు ఏ మాయెను ?చెప్పుము (1). భృగు మహర్షి యొక్క మంత్ర బలముచే పరాజితులైన శివగణములు ఏమి చేసిరి? ఎచటకు వెళ్ళిరి ? ఓ మహాబుద్ధి శాలీ !ఆ విషయమును నీవు చెప్పుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆకాశవాణిని విన్న దేవతలు, ఇతరులు అందరు ఆశ్చర్యచకితులై కింకర్తవ్యతా విమూఢులై నిలబడియుండిరి. వారేమియూ మాటలాడకుండిరి (3). భృగువు యొక్క మంత్రబలముచే కొందరు శివగణములు సంహరింపబడిరి. వారిలో మిగిలిన వీరులు పారిపోయి శివుని శరణు పొందిరి (4). సాటిలేని తేజస్సు గల రుద్రునకు వారు ఆదరముతో నమస్కరించి జరిగిన వృత్తాంతమునంతనూ యథాతథముగా నివేదించిరి (5).
గణములు ఇట్లు పలికిరి -
దేవదేవా !మహాదేవా! శరణు పొందిన మమ్ములను రక్షించుము. ఓ నాథా !సతీదేవి యొక్క విస్తరమగు వృత్తాంతమును ఆదరముతో చక్కగా వినుము (6). ఓ మహేశ్వరా! గర్విష్ఠి, పరమదుష్టుడునగు దక్షుడు సతీదేవిని అనాదరించి, అవమానించినాడు. దేవతలు కూడ అటులనే చేసినారు (7). ఆతడు మీకు భాగమును ఈయలేదు. కాని దేవతలకిచ్చినాడు. దుష్టుడు, మిక్కిలి గర్విష్ఠియగు దక్షుడు బిగ్గరగా పలుకరాని మాటలను పలికినాడు (8).
ఓ ప్రభూ! నీకు యజ్ఞములో భాగము ఈయకపోవుటను చూచి సతీదేవి మిక్కిలి కోపించెను. అపుడామె తన తండ్రిని పరిపరివిధముల నిందించి తన దేహమును అగ్నికి ఆహుతి చేసెను (9).
పదివేల మంది గణములు మిక్కిలి సిగ్గుపడిన వారై తమ దేహములను ఆయుధములతో నరుకుకొని అచట మరణించిరి. మాలో కొందరు మిక్కిలి కోపించి (10),భయమును గొల్పుచూ వేగముగా ఆ యజ్ఞమును ధ్వంసము చేయుటకు సిద్ధమైతిమి. కాని శత్రువగు భృగువు తన మహిమచే మమ్ములను తరిమి వేసినాడు (11). జగత్తును రక్షించే ఓ ప్రభూ! మేము నిన్ను శరణు పొందితిమి. హే దయోళో! మాకు సంప్రాప్తమైన ఈ భయము నుండి మమ్ములను రక్షించి, భయమును తొలిగించుము(12).
హే మహాప్రభో! మిక్కిలి గర్వించిన దక్షుడు మొదలగు దుష్టులందరు ఆ యజ్ఞములో పెద్ద అవమానమును చేసిరి (13). అభిమానమును రక్షించువాడా! సతీదేవికి, మాకు జిరిగిన వృత్తాంతమునంతనూ నీకు చెప్పితిమి. ఆ మూర్ఖుల విషయములో నీవు ఎట్లు చేయగోరెదవో, అట్లు చేయుము (14).
బ్రహ్మఇట్లు పలికెను -
శివ ప్రభుడు ఆ తన గణముల మాటలను విని, వెంటనే ఆ వృత్తాంతమునంతనూ ఎరుంగుటకై నారదుని స్మరించెను (15). ఓ దేవర్షీ! నీ దర్శనము దివ్యమైనది. నీవు వెంటనే అచటకు వచ్చి, శంకరుని భక్తితో అంజలి యొగ్గి నమస్కరించి అచట నిలబడితివి (16). ఆ ప్రభుడు అపుడు నిన్ను ప్రశంసించి, దక్షయజ్ఞమునకు వెళ్లిన సతీదేవి యొక్క వార్తను, మరియు ఇతర వృత్తాంతమును గురించి ప్రశ్నించెను (17).
ఓ కుమారా! శంభుడు ఇట్లు ప్రశ్నించగా, ఆయనను మస్సులో ధ్యానించే నీవు వెంటనే దక్షయజ్ఞములో జరిగిన వృత్తాంతమునంతనూ చెప్పియుంటివి (18). ఓ మహర్షీ !అతి భయంకరమగు పరాక్రమము గలవాడు, సర్వేశ్వరుడునగు ఆ రుద్రుడు నీవు చెప్పిన ఆ వృత్తాంతమును విని వెనువెంటనే క్రోధమును పొందెను (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:16, 30/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల
🌻. జమదగ్నిమహర్షి-రేణుక - 2 🌻
06. తన దగ్గర ఎంత ఉంది, ఎంత ఇచ్చాడు అనే దన్నిబట్టి దానం యొక్క మహత్తు ఉంటుంది. అంతే కాని ఎంత ఇచ్చడు అనేదానినిబట్టికాదు. ఒక కోతీశ్వరుడు లక్షరూపాయలు దానం చేస్తూ యథాశక్తి అంటే, అది దోషం. “నా బుద్ధి చిన్నది. లక్షకంటే ఎక్కువ ఇవ్వటంలేదు. నేను ఇవ్వగలిగినవాడినే! యాభైలక్షలు ఇవ్వగలిగినవాడినే! కాని నాబుద్ధి చిన్నది. స్వీకరించి అనుగ్రహించండి” అని అనాలి.
07. “యథాశక్తి ఇస్తున్నాను. ఏకంగా లక్షరూపాయలు ఇస్తున్నాను. చాలా పెద్దమొత్తం ఇస్తున్నాను” అనుకోవటం వాడికి దానమే కాదు. తనశక్తికి సరిపడేటట్లు ఇస్తేనే అది దానం. ‘శక్త్యనుసారం’ – ‘యథాశక్తి’ అనరాదు, అలా అనకూడదు. ‘యథాబుద్ధి’ అనాలి. యథాశక్తి అంటే ‘యావఛ్ఛక్తి’ అనే అర్థం. దానికి అదే అర్థం. జ్ఞాపకం పెట్టుకోవాలి.
08. ఇవ్వగలిగితే లక్ష ఇవ్వాలి. ఇవ్వలేకపోతే ఒప్పుకోవాలి! అప్పుడు దోషం ఉండదు. ఎప్పుడూ కూడా ఆ మాట-యథాశక్తి అనేమాట-వాడకుండా ఉండటమే న్యాయం, క్షేమం. నిజానికి మనం దానం యథాశక్తిగా ఎప్పుడూ ఎందులోనూ చెయ్యటంలేదు. ఏదో యథాబుద్ధి చేస్తున్నాం. ఒకవేళ చేసినా, దానిని దానం అనే అంటారు. అంతే కాని అది త్యాగం అనిపించుకోదు. త్యాగం వేరు.
09. ఒకదాత, కోటి ఇవ్వకలిగినవాడు, లక్షే ఇస్తే, దానం చేసిన వాడవుతాడు. దానికుండే ప్రతిఫలం ఎదో ఉంటుంది. అది పుణ్యమే అవుతుంది. అయితే ఉన్నదంతా ఇవ్వగలిగిన వాడు త్యాగంచేసినవాడవుతాదు. దానంవల్ల పుణ్యంవస్తే, త్యాగంవల్ల మోక్షమేవస్తుంది.(‘త్యాగేనైకే అమృతత్వమానశుః’ అని ఆర్యోక్తి).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:16, 30/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 135 🌹
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 14 🌻
548. ఉన్నత చైతన్యము:- మానవుడు, ఉన్నతర చైతన్యము:- ఆధ్యాత్మిక మార్గము, మహోన్నత చైతన్యము:- భగవంతుడు, సర్వోన్నత చైతన్యము:- సద్గురువు లేక అవతార పురుషుడు.
549. సృష్ట రూపములలో ఉన్నత చైతన్యము:- మానవుడు, మానవులలో మహోన్నత చైతన్యము:- భగవంతుడు.
550. భగవదనుభూతి పరుడైన మానవుడు (జ్ఞానముతో, విశుద్ధ చైతన్యముతో కూడిన) సర్వశక్తిమంతుడు. సత్యస్థితి యందు జాగరూకుడై యుండును. అతడే జ్ఞానము-జ్ఞాని-జ్ఞేయము, ప్రేమ-ప్రేమికుడు-ప్రియతముడు.
ప్రతి జీవాత్మలో తానున్నాననియు, తనలో ప్రతి జీవాత్మ ఉన్నదనియు అతడెరుంగును. అతడే సమస్తమునకు ఆద్యంతములని కూడా ఎఱుంగును. తాను శాశ్వతముగా, ఆ.... సత్యసాగరునిగనే యుంటిననియు, ఉన్నాననియు, ఉందుననియు ఎరుంగును. కాని, సామాన్య మానవునకు తానెక్కడ నుండి వచ్చెనో, ఎక్కడికి పోవునో తెలియదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment