||శ్రీమన్నారాయణీయము|| సప్తమ స్కంధము / 24వ దశకము - ప్రహ్లాదచరిత్ర వర్ణనము / 24-5-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
*సురారీణాం హాస్యం తవచరణదాస్యం నిజసుతే
స దృష్ట్వా దుష్టాత్మా గురుభిరశిశిక్షచ్చిరమముమ్।
గురుప్రోక్తం చాసావిదమిదమభద్రాయ దృఢమి-
త్యపాకుర్వన్ సర్వం తవచరణభక్త్యైవ వవృధే।।*
భావము:-
శ్రీహరీ! నీ భక్తుడగు ప్రహ్లాదుడు - అసురులు హేళనచేయు నీ పాదసేవయందు అనురక్తుడగుట చూచి, హిరణ్యకశిపుడు సహించలేకపోయెను. గర్వాంధుడై (నీనుండి ప్రహ్లాదుని మనసును మరల్చవలెనని), గురువులవద్ద చిరకాలము ఉంచి శిక్షణ ఇప్పించెను. గురువులు భోధించునది - (ఆత్మకు) భద్రము కాదని ధృఢనిశ్చయము చేసుకొనిన ప్రహ్లాదుడు వారి భోధనలను తిరస్కరించుచుండెను. నీ చరణములయెడ భక్తి మాత్రమే ప్రహ్లాదుని హృదయమున వృద్ధిచెందుచుండెను.
వ్యాఖ్య:-
ఈవివరంలో మనం పోతన భాగవతం లోని మూడు పద్యాలు చూద్దాం.
1. చదువనివాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత కలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ!
రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునితో చదువు యొక్క విశిష్ఠత గురించి చెప్పిన సందర్భంలోనిది ఈ పద్యం. ఇది పోతన భాగవతంలోని ప్రహ్లాదచరిత్రలోనిది.
భావం:-
నాయనా ప్రహ్లాదా! చదువుకోనివాడు అజ్ఞాని అవుతాడు. బాగా చదువుకుంటే సత్, అసత్ అంటే ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు బాగా అర్థమవుతాయి. అందుకే అందరూ శ్రద్ధగా చదువుకోవాలి. అది కూడా గురువుల దగ్గరకు వెళ్లి మాత్రమే చదువుకోవాలి. కాబట్టి మన కులగురువులైన చండామార్కుల వారి దగ్గర నిన్ను చదివిస్తాను.
ఈ పద్యంలో చదువుకోవడం ఎంత అవసరమో చెబుతూ, అది గురువుల దగ్గర చదువుకోవాలనే విషయాన్ని తెలియచేశాడు పోతన. రాక్షసరాజయినప్పటికీ హిరణ్యకశిపునికి గురువుల పట్ల గౌరవం ఎక్కువ. ఈ పద్యంలో ‘చదువు’ అనే పదాన్ని వాడుతూ, పిల్లలంతా ఎందుకు చదువుకోవాలో వివరించారు.
2. చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ నే
చదివినవి కలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!
పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని పద్యం ఇది. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని విద్యాభ్యాసం కోసం గురువులైన చండామార్కుల వారి దగ్గర చేర్చుతాడు. కొంతకాలం గడిచాక,కుమారుడు ఎంతవరకు చదువుకున్నాడో తెలుసుకుందామనే ఉద్దేశంతోఆశ్రమానికి వచ్చి, కొడుకునుఅడుగుతాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ప్రహ్లాదుడు చెప్పినదే ఈ పద్యం.
భావం:-
తండ్రీ! గురువులైన చండామార్కులవారు నన్ను బాగా చదివించారు. ధర్మానికి, అర్థానికి సంబంధించిన ముఖ్యశాస్త్రాలన్నీ చదివాను. అంతేకాదు ఇంకా చాలా విషయాలు కూడా చదివాను. చదువులలో దాగి ఉన్న విషయాలన్నిటినీ తెలుసుకున్నాను.
ఈ పద్యంలో ప్రహ్లాదుడు ‘చదువులలో మర్మమెల్ల’ అన్న మాటను... అన్ని విద్యలలోనూ దాగి ఉన్నది భగవంతుడైన విష్ణుమూర్తి మాత్రమే అనే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని పలుకుతాఇందులో ‘చదువు’ అనే పదం నాలుగు పాదాలలోనూ ఉంది. అందువల్ల నేర్చుకోవడానికి ఇబ్బంది లేకపోవడమేగాక, వినడానికి కూడా ఇంపుగా ఉంటుంది.
3. ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే!
రాక్షసరాజయిన హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే ద్వేషం. కాని అతడి కొడుకు ప్రహ్లాదుడికి మాత్రం విష్ణువంటే మహాభక్తి కావడం వల్ల ఎప్పుడూ శ్రీహరినే ధ్యానించేవాడు. దాంతో కొడుకుపైన హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. ఎన్ని విధాలుగా చెప్పినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని మానుకోకపోవడంతో నిజంగానే శ్రీహరి అంతటా ఉన్నాడా? అని కొడుకును ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానమే ఈ పద్యం.
తాత్పర్యం:-
విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహం అక్కరలేదు. ఆయన అన్నిచోట్లా ఉంటాడు. ఎక్కడ వెతికితే అక్కడే కనపడతాడు. ఓ రాక్షసరాజా! ఇది సత్యం"
ఈ పద్యంలో,‘ఇందు, అందు, ఎందెందు, అందందే’ అనే పదాలు వచ్చాయి. ఇవన్నీ ఒకేలాంటి పదాలు కావటం వల్ల వినడానికి చాలా హాయిగా ఉంటాయి.
***
[
18-27-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అII రాజసకర్తను గూర్చి చెప్పుచున్నారు –
రాగీ కర్మఫలప్రేప్సుః
లుబ్ధో హింసాత్మకో౽శుచిః
హర్షశోకాన్వితః కర్తా
రాజసః పరికీర్తితః.
తా-అనురాగము (బంధ్వాదులందు అభిమానము) గలవాడును, కర్మఫలము నాశించువాడును, లోభియు, హింసాస్వభావము కలవాడును, శుచిత్వము లేనివాడును, (కార్యము సిద్ధించినపుడు) సంతోషముతోను, (చెడినపుడు) దుఃఖముతోను గూడియుండువాడునగు కర్త రాజసకర్తయని చెప్పబడును.
వ్యాఖ్య: - ఈ పై లక్షణములు గలవాడు రాజసకర్తయని చెప్పబడుటవలన, ఉత్తముడగువాడు ఆ లక్షణములను త్యజించివేయవలెననుట సుస్పష్టము. అనగా బంధ్వాదులందును, ఇతర ప్రాపంచిక పదార్థములందును అనురాగము (అభిమానము) లేకుండవలెను. కర్మఫలమును కోరరాదు. ఏప్రాణిని హింసింపరాదు. అశుభ్రతను త్యజించవలెను. కార్యముయొక్క సిద్ధి, అసిద్ధులందు హర్షశోకములను మనోవికారములు లేకుండ సమచిత్తుడై, ద్వంద్వసహిష్ణువై యుండవలెను. ప్రతివాడును తన హృదయమును పరిశోధించుకొని ఈ పైనదెలిపిన రాజసకర్తయొక్క లక్షణములున్నచో వానిని ప్రయత్నపూర్వకముగ విడనాడి సాత్త్వికకర్తయే అయియుండులాగున చూడవలెను.
ప్ర:- రాజసకర్త ఎట్టివాడు?
ఉ:- (1) (బంధ్వాదులందు) అనురాగముగలవాడును,
(2) కర్మఫలము నాశించువాడును,
(3) లోభియు,
(4) హింసాస్వభావము గలవాడును,
(5) శుచిత్వము లేనివాడును,
(6) (కార్యసిద్ధియందు) సంతోషముతోను, (కార్యవైఫల్యమునందు) దుఃఖముతోను గూడియుండువాడును రాజసకర్తయనబడును.
***
18-29-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
అ| బుద్ధి, ధైర్యము - అనువానియొక్క సత్త్వాది త్రివిధరూపములను వేరువేరుగ తెలుపబోవుచున్నారు–
బుద్ధేర్భేదం ధృతేెశ్చైెవ
గుణత స్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ
పృథక్త్వేన ధనంజయ!
తా:- ఓ అర్జునా! బుద్ధి యొక్కయు, ధైర్యముయొక్కయు భేదమును గుణములనుబట్టి మూడువిధములుగా వేరువేరుగను, సంపూర్ణముగను చెప్పబడుచున్నదానిని (నీ విపుడు) వినుము.
88🌹. గీతోపనిషత్తు -104 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 32. బంధవిమోచన జ్ఞానము - పాపము చేసినవారు పాపఫలములను దుఃఖములుగను, బాధలుగను అనుభవించుచు బంధితులై యుందురు. పుణ్యములు చేసినవారు సుఖము అనుభవించుచు, వారును బద్దులై జీవింతురు. పాపకార్యములు చేసినవారు అశుభవాసనల యందు , అట్లే పుణ్యకార్యములు చేయువారు శుభముల యందు తగుల్కొని జీవింతురు. జ్ఞాన మొక్కటే అందరికిని పరిష్కారము. జ్ఞాన మనగ ఫలముల యందాసక్తి లేక, కర్తవ్యము నిర్వర్తించుటయే. పుణ్యాత్ములకైనను, పాపాత్ములకైనను, సామాన్యులకైనను యిది ఒక్కటియే తరించు మార్గము. 🍀
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి || 36
పాపాత్ము లందరికన్నను కూడ నీవు పాపము చేసిన వాడవైనను, ఆ సమస్త పాపమును (పై తెలుపబడిన) జ్ఞానమను తెప్పచేత నీవు చక్కగ దాటగలవు. పాపము చేసినవారు పాపఫలములను దుఃఖములుగను, నష్టములుగను, రోగములుగను, బాధలుగను అనుభవించుచు బంధితులై యుందురు.
పుణ్యములు చేసినవారు ధనము, కీర్తి, పదవి, సంపద, ఆరోగ్యము, సుఖము అనుభవించుచు, వారును బద్దులై జీవింతురు. పాపకార్యములు చేసినవారు అశుభవాసనల యందు తగుల్కొని జీవింతురు. అట్లే పుణ్యకార్యములు చేయువారు శుభముల యందు తగుల్కొని జీవింతురు. ఇరువురును వాసనా భావముచే బంధితులే. బంగారు త్రాళ్ళతో కట్టినను, పలుపు త్రాళ్ళతో కట్టినను బంధము బంధమే కదా! పుణ్యములు చేసినవారికి అనుభవము రూపమున పుణ్యము కలుగును.
పాపములు చేసిన వారికి కూడ అనుభవ రూపమున పాపములు తొలగును. పాప పుణ్యముల హెచ్చుతగ్గులను బట్టి సుఖదుఃఖముల బంధములు ఉండుచునే యుండును. సామాన్యజీవులు కొన్ని పుణ్యకార్యములు, కొన్ని పాప కార్యములు చేయుటవలన సుఖదుఃఖములతో జీవితము
సాగుచుండును. పై మూడు తెగలవారికి బంధవిమోచనము లేదు.
జ్ఞాన మొక్కటే అందరికిని పరిష్కారము. జ్ఞాన మనగ ఫలముల యందాసక్తి లేక, కర్తవ్యము నిర్వర్తించుటయే. అయెవరు నిర్వర్తించినను, ప్రపంచమను సాగరమున తెప్పతో సాగతున్నట్లుగ తేలుచు జీవించగలరు. ఈ జ్ఞానమార్గ మొక్కటే నిజముగ దాటించు నావ. పుణ్యాత్ములకైనను, పాపాత్ములకైనను, సామాన్యులకైనను యిది ఒక్కటియే తరించు మార్గము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[17:12, 21/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 303 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
74. అధ్యాయము - 29
🌻. దక్ష యజ్ఞములో సతి - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుని యజ్ఞము మహా ప్రభతో కొనసాగుచుండెను. దేవతలు, రాక్షసులు, మునులు, ఇంద్రాది దిక్పాలకులు ఉత్సాహముతో దానిలో పాల్గొనిరి. దక్షపుత్రి అచటకు వెళ్లెను (1). అనేక వింతలతో గూడినది, గొప్ప కాంతి గలది, దేవతల ఋషుల గణములతో కూడినది అగు తన తండ్రి ప్రాసాదము నామె అచట చూచెను (2). అపుడా దేవి ద్వారము వద్ద తన వాహనమగు నందినుండి దిగి వెంటనే ఆమె ఒక్కతెయే లోపలకు యజ్ఞశాలకు వెళ్లెను (3).యశస్వినియగు ఆమె తల్లి అసిక్ని, మరియు సోదరీ మణులు ఆమెకు ఉచితమగు మర్యాదలు చేసిరి (4).
దక్షుడు ఆమెను చూచెను. కాని ఎట్టి ఆదరమును చూపలేదు. శివమాయచే విమోహితులైన ఇతరులు కూడా వాని భయముచే ఆమెను ఆదరింపలేదు (5). ఓ మహర్షీ!ఈ విధముగా సర్వుల అనాదరమునకు గురి అయిన ఆ సతి మిక్కిలి ఆశ్చర్యమును పొంది తల్లికి, తండ్రికి సమస్కరించెను (6). ఆ యజ్ఞములో విష్ణువు మొదలగు దేవతల కీయబడిన హవిర్భాగముల నామె చూచెను. కాని దక్షుడు శంభునకు భాగము నీయలేదు. సతీదేవికి పట్టరాని కోపము కలిగెను (7).
ఈ విధముగా అవమానింపబడిన సతీదేవి మిక్కిలి క్రోధమును పొంది దక్షుని దహించువేయునా యన్నట్లు చూచెను. మరియు ఇతరులను కూడ భయమును గొల్పు దృష్టితో చూచెను (8).
సతి ఇట్లు పలికెను -
పరమ మంగళ స్వరూపుడగు శంభుని నీవేల ఆహ్వానించలేదు? ఆయన ఈ చరాచర జగత్తునకంతకు పవిత్రత నాపాదించుచున్నాడు (9). యజ్ఞ స్వరూపుడు, యజ్ఞవేత్తలలో శ్రేష్ఠుడు, యజ్ఞము అంగముగా గలవాడు, యజ్ఞములోని దక్షిణ స్వరూపముగా గలవాడు, సోమయాజి స్వరూపుడునగు శంభుడు లేని యజ్ఞము ఎట్లు సంభవము? (10). ఆయనను స్మరించినంత మాత్రాన సర్వము పవిత్రమగును. ఆశ్చర్యము!ఆయన యొక్క స్మరణ లేని కర్మలన్నియూ అపవిత్రములగును (11). యజ్ఞద్రవ్యములు, మంత్రములు, దేవతల కిచ్చే హవిర్భాగములు, పితరులకిచ్చే కవ్యము ఇత్యాది సర్వము ఆయన యొక్క స్వరూపమే. అట్టి శంభుడు లేని యజ్ఞము ఎట్లు ప్రవర్తిల్లుచున్నది?(12).
ఓరీ తండ్రీ !నీవు అధముడవు. శివుని ఒక సామాన్య సురునిగా భావించి నీవు అనాదరము చేసితివి. ఈనాటికి నీ బుద్ధి భ్రష్టమైనది (13). ఓరీ! ఏ మహేశ్వరుని సేవించి విష్ణు బ్రహ్మాది దేవతలందరు తమతమ పదవులను పొందినారో, అట్టి హరుని ఎరుగకున్నావు (14). విష్ణు బ్రహ్మాది దేవతలు, ఈ మహర్షులు తమ ప్రభువగు శంభుడు లేని ఈ నీ యజ్ఞమునకు ఎట్లు వచ్చేసిరి ? (15).
బ్రహ్మ ఇట్లు పలికెను -
శివస్వరూపిణి, పరమేశ్వరి అగు ఆ సతి ఇట్లు పలికి, మరల విష్ణ్వాదులనందరినీ వేర్వేరుగా భయము కలిగించుచున్నదై ఇట్లు పలికెను (16).
సతి ఇట్లు పలికెను -
ఓ విష్ణూ!నీవు మహాదేవుని స్వరూపము నెరుంగవా ? వేదములాయనను సగుణుడనియు, నిర్గుణుడనియు కూడ వర్ణించుచున్నవి గదా !(17). ఓ హరీ! పూర్వము మహేశ్వరుడు అనేక పర్యాయములు నీకు చేయూత నిచ్చి, నీవు వరాహాది అవతారములను ధరించుటకు ఆవశ్యకమగు శిక్షణ నిచ్చియుండెను (18). ఓరీ! దుష్టబుద్ధీ !అయిననూ నీకు మనస్సులో జ్ఞానము ఉదయించలేదు. నీ ప్రభువగు శివుడు లేని ఈ దక్షయజ్ఞమునకు భాగమును గోరి వచ్చితివి (19). ఓరీ బ్రహ్మా! పూర్వము నీవు అయిదు ముఖములు గలవాడవై సదాశివుని ఎదుట గర్వమును చూపగా, ఆయన నిన్ను నాల్గు ముఖములు గలవానిని చేసెను. నీవు ఆ అద్భుతమును విస్మరించితివి (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:12, 21/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 189 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. వసిష్ఠమహర్షి-అరుంధతి - 2 🌻
7. ఆ విధంగా శాపగ్రథుడైన నిమి యజ్ఞసంకల్పంలో తనకు చిరంజీవిత్వం, శాశ్వతంగా తన కీర్తి, వ్యక్తిత్వం సృష్టిలో ఉండాలని కోరుకుని ప్రారంభించాడు. ఆయన కోరికకు దేవతలు మన్నించి, మనుష్యులయొక్క నేత్రములందు (అంటే రెప్పపాటుయందు) శాశ్వతంగా ఉండమన్నారు. ‘నిమేషం’ అంటే ‘నిమి శయనించేది(ఉండేది)’ అనే అర్థం.
8. అనిమిషులు అంటే దేవతలు, అంటే రెప్పపాటులేనివారు అని అర్థం. ఆ విధంగా మనుష్యుల్లోని ఈ రెప్పపాటే శాశ్వతంగా నిమిచక్రవర్తి యొక్క దేహం అయింది. ఇది మనుష్యులలోనే కాక, భౌతికశరీరాలుకలిగిన సమస్తజీవులలోను ఉంది. నిమియొక్క ప్రతి. శాపం కారణంగా వసిష్ఠుడు కూడా దేహాన్ని పోగొట్టుకున్నాడు.
9. ఆయన తనకుండేటటువంటి యోగవిద్యాబలంతో మిత్రవరుణులనే దేవతలదగ్గరికివెళ్ళి తనకు దివ్యమైన దేహాన్ని ప్రసాదించమని కోరాడు. ఊర్వశిని దర్శనం చేయటంచేత వాళ్ళకు(మిత్రావరుణులకు) స్ఖలితమైన వీర్యాన్ని ఒక భాండంలో పెడితే, దాంట్లోంచి ఈయనకు శరీరం పుట్టింది. అందుకే అగస్త్యుడివలె ఈయనకూడా కుంభ సంభవుడు. ‘అగస్త్య కుంభసంభవః’ అంటారు. మళ్ళీ భూలోకానికి వచ్చాడు.
10. ఆయన తలచుకుంటే తన తపోబలంచేత శరీరాన్ని తానే సృష్టించుకోగలడు. అయినప్పటికి తపస్సును, తపోధనాన్ని వినియోగించులోలేదు. తపస్సు దేనికోసమూ వాడుకోరు.(మరి దేవతలకుకూడా ఈ తపస్సు పోతుంది కదా అని సందేహం కలగవచ్చు. వాళ్ళు దేవతలు. వాళ్ళు సంపాదించిన తపస్సు కాదది. సహజంగా వారి తేజస్సు అది. వాళ్ళు దివ్యశరీరులు. పుట్టినప్పటినుంచీ శాశ్వతంగా అలాగే ఉంటారు వాళ్ళు.
11. అక్షయమైన తేజస్సు వాళ్ళకుంటుంది. తపస్సు వలన మానవుడు సాధించగలిగే విషయాలు ఏవయితే ఉన్నాయో – అంటే ఉత్తమలోకాలు, సుఖాలు, కోరికలు తీర్చుకునే శక్తిసామర్థ్యాలు-అవన్నీ దేవతలచే ఇదివరకే పొందబడ్డాయని అర్థం.) ఆ ప్రకారంగా వసిష్ఠుడు ద్విజన్ముడయ్యాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:12, 21/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 128 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 7 🌻
528. భగవంతుని అనంత స్వభావత్రాయము
అనంత జ్ఞానము,
అనంత శక్తి,
అనంత ఆనందము.
529. విజ్ఞాన భూమిక యందున్న "మజ్జూబ్" ను బ్రాహ్మిభూతుదందురు.
530. భగవంతుని చరమ (పరమ) స్థితి :
భగవంతుని అనంత సంఖ్యానీక స్థితులలో గల మూలాధార స్థితి. ఇచ్చట భగవంతునికి చైతన్యమున్నది. (శాశ్వతముగా చైతన్యమందు ఎఱుకయున్న స్థితి) శాశ్వతముగా భగవంతుడున్నాడు అను పరాత్పరుని యొక్క చైతన్య స్థితి (పరమాత్మ స్థితి).
సశేషం...
🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
761వ నామ మంత్రము 22.12.2020
ఓం సుభగాయై నమః
అయిదు వత్సరముల కన్యాస్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.
భగ అనగా ఐశ్వర్యము, కామము, మహాత్మ్యము, జ్ఞానము, యోని, కీర్తి, వీర్యము, ప్రయత్నము అని గలదు. మంగళప్రదమైన వీటన్నిటినీ కలిగియుండి, తనభక్తులకు కూడా వీటన్నిటినీ ప్రసాదించు సర్వసౌభాగ్య స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సుభగా యను మూడక్షరముల నామ మంత్రమును ఓం సుభగాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ మంగళస్వరూపిణియైన జగన్మాతను ఆరాధించు భక్తులకు ఐశ్వర్యము, వారి మాటలలో మహత్తు, జ్ఞానము, భౌతిక విషయములయందు విరక్తి, కీర్తి ప్రతిష్టలు వంటి మంగళప్రదములు అనుగ్రహించును.
సు అనగా మంగళప్రదము. భగ అనగా ఐశ్వర్యము; అణిమాది అష్టసిద్ధులు; యశస్సు; ద్వాదశాదిత్యులు; జ్ఞానము; వైరాగ్యము; అదృష్టము; కీర్తి; లావణ్యము మొదలైన అర్థములు గలవు. మంగళప్రదమైన వీటన్నింటిని శ్రీమాత కలిగియున్నది. మరియు తన భక్తులకు కూడా అనుగ్రహించును. కన్యా ప్రకరణమునందు సుభగ అనగా ఐదు వత్సరముల బాలిక. గనుక జగన్మాత ఐదు వత్సరముల కన్యాస్వరూపురాలు. భగ అనగా సూర్యుడను అర్థముకూడా గలదు. కాబట్టి జగన్మాతచే సూర్యుడు కాంతిపుంజములతో ప్రకాశిస్తున్నాడు. విష్ణుపురాణమునందు శ్రీమహావిష్ణువుయొక్క పరాశక్తియే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను ఈ మూడు సంజ్ఞలను పొంది త్రయి అను పేరు కలిగి ఉన్నది. ప్రతీ నెలలోనూ సూర్యుడు ఉండుచోట ఈ వేద త్రయి (త్రివేదముల స్వరూపం గల విష్ణుశక్తి) సూర్యునియందుండి, సూర్యుడు ఉండుచోట ఉదయం ఋగ్వేదముగాను, మధ్యాహ్నము యజుర్వేదముగాను, సాయంత్రమందు సామవేదముగాను ప్రకాశించడం జరుగుతుంది. అనగా వేదముల స్వరూపంలో విష్ణువు సూర్యునితోనే ఉంటాడు. ఈ విధంగా శక్తిస్వరూపుడైన రవికి (సుభగా అని అమ్మవారిని అన్నాము గనుక) ఉదయాస్తమయాలు ఉండవు. విష్ణువు సూర్యునితో ఉండగా, అమ్మవారు సూర్యస్వరూపురాలు గనుక శ్రీమాత సప్తమయ అవుతుంది. సప్తమయ అనగా ఏడు గణములతో కూడి ఉంటుంది. ఆ ఏడు గణములు: 1)దేవగణము 2) ఋషిగణము, 3) గంధర్వగణము, 4)అప్సరగణము, 5) యక్షగణము, 6) సర్పగణము, 7) రాక్షసగణము.
అనగా సూర్యునితో విష్ణువు శోభాయమానుడు. జగన్మాత సూర్యస్వరూపురాలు గనుక జగన్మాతయే సప్తమయమై, శోభాయమానమయినది.
సు అనగా మంగళకరము గదా. భగ అనగా సూర్యుడు అని గ్రహిస్తే, జగన్మాత మంగళకరమైన సూర్వస్వరూపురాలు అగుటచే, సూర్యుడు సప్తమయుడు గనుక జగన్మాత సప్తమయయని భావించదగును.
సూర్యునిలో ఉన్న విష్ణుశక్తి చలింపకున్నను, ప్రతీమాసమునందు సూర్యునిలోని మార్పుననుసరించి ఈ సప్తగణములు చలించు చుండును.
భగ అనగా ఐశ్వర్యము అని అర్థముగలుదు. ఐశ్వర్యము అనగా భాగ్యము. సుభగ అనగా సౌభాగ్యము. పద్మపురాణములో సౌభాగ్యముగా చెప్పబడినవి: 1) ఇక్షువు (చెఱకు), 2) తరురాజము (పారిజాతము), 3) నిష్పావము (అనుములు లేదా వేరేదైనా పప్పు ధాన్యము లేదా ధనియాలు), 4) జీరకము (జీలకర్ర), 5) వికృతిని పొందిన గోక్షీరము (ఆవుపాలు, ఆవు నెయ్యి, ఆవు జున్ను, ఆవుపాల విరుగుడు, ఆవు పెరుగు-వీటిలో ఏదైనా సరే), 6) కౌసుంభపుష్పము (కుంకుమపువ్వు), 7) పుష్పములు, 8) లవణము (ఉప్పు) - వీటిని సౌభాగ్యాష్టకము అందురు. జగన్మాత ఈ సౌభాగ్యాష్టక స్వరూణి గాన సుభగా యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సుభగాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
187వ నామ మంత్రము 22.12.2020
ఓం నిరత్యయాయై నమః
ఆజ్ఞలు పాటింపబడకుండుట, ఆజ్ఞలు జరగకపోవుట, నశించుట; నిర్వహణలో దోషము లుండుట వంటి అత్యయము లేవియు లేని జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరత్యయా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిరత్యయాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు సాధకులకు ఆ తల్లి వారిని ఆధ్యాత్మికంగా గాని, భౌతికంగా గాను అన్నివిధాలా పరిపూర్ణమైస సుఖసంతోషములతో విలసిల్లువారిగా అనుగ్రహించును.
ఆ పరమేశ్వరి లోకేశ్వరి. ముల్లోకములందు తనకు సాటియైనవారుగాని, అధికులుగాని లేరు. ఆ తల్లి ఆజ్ఞలను అతిక్రమించువారుకూడా లేరు. గనుక నిరత్యయా యను నామ మంత్రము కలిగి యున్నది.
అత్యయా అను పదమునకు ఆజ్ఞను పాటించకుండ ఉండుట, జరగకపోవుట, నశించుట; దోషము, పని చెడిపోవుట అని నిఘంటువులో అర్థములుగలవు.
జగన్మాత శ్రీమహారాజ్ఞి. తన ఆజ్ఞకు లోబడి తను నియమించిన లోకపాలురు అందరూ ప్రవర్తిస్తుంటారు. ఆజ్ఞలను అతిక్రమించరు. గనుక ఆ తల్లి నిరత్యయా యని అనబడినది.
లలితాంబ శ్రీమహారాజ్ఞి. సకలజగత్తుల పాలనా నిర్వహణ తానే చేపట్టియున్నది. ఒక ప్రణాళికానుబట్టి జగత్పరిపాలన లోకపాలురద్వారా నిర్వహించుచున్నది. అట్టి పాలనాకార్యక్రమములు తను అనుకున్నప్రకారమే జరుగుతాయి. జరగకపోవుట అనేది ఉండదు.
జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. సృష్టికి పూర్వమే తానున్నది. ప్రళయకాలంలో జగత్తులనన్నింటినీ తనలో నిక్షిప్తముచేసికొని మరల సృష్టిచేయువరకూ నిరీక్షిస్తుంది. ఆదిమధ్యాంతరహిత. గనుక నాశనము లేనిది.
తన పాలనా వ్యవహారములందు ప్రణాళికాబద్ధ నిర్వహణ కలిగి దోషరహితముగా పరిపాలించుచున్నది. గనుక దోషము లన్నవి ఉండవు.
జగత్పరిపాలనయందు లోకపాలురందరు అమ్మవారి ఆజ్ఞకు లోబడి పనిచేయునట్లుగా పర్యవేక్షిస్తూ, ఏ క్షణమునందు కూడా పరిపాలనాంశము లేవియు తన ఇష్టమునకు వ్యతిరేకమై, పనిచెడిపోవుట అనునది సంభవింపక కొనసాగును.
విశ్వనిఘంఠువులో అత్యయ శబ్దమునకు అతిక్రమము, దండము , వినాశము, దోషము, కృచ్ఛ్రము అని అర్థములు గలవు. ఈ విధమైన అత్యయములు ఏవియు లేనిది గనుక ఆ తల్లి నిరత్యయా యని అనబడుచున్నది.
కాబట్టి జగన్మాత నిరత్యయా యను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది.
🚩శ్రీ ఆంజనేయ పంచరత్నం🚩
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*1)వీతాఖిల విషయేచ్ఛం
జాతానందాశ్రు పులక మత్యచ్ఛమ్!*
*సీతాపతి దూతాఖ్యం
వాతాత్మజ మద్య భావయే హృద్యం!!*
*2) తరుణారుణ ముఖ కమలం
కరుణారస పూరపూరితాపాంగం!*
*సంజీవనమాశాసే మంజుల
మహిమానంజనా భాగ్యం!!*
*3) శంబర వైరి శరాతిగమం
అంభుజదళ విపుల లోచనోదారం!*
*కంబుగళ మనిలాదిష్టం
బింబజ్వలితోష్ఠమేక మవలంబే!!*
*4) దూరీకృత సీతార్తిః
ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తిః!*
దారిత దశముఖ కీర్తిః పురతో మమభాతు హనుమతోమూర్తిః!!
*5) వానర నికరాధ్యక్షం దానవకుల
కుముద రవికర సదృశం!*
*దీన జనావన దీక్షం పవన
తపః పాకపుంగ మద్రాక్షాం!!*
*ఏతత్ పవన సుతస్య స్తోత్రం
యః పఠతి పంచ రత్నాఖ్యం!*
*చిరమిహ నిఖిలాన్ భోగాన్
భుక్త్వా శ్రీరామ భక్తిమా భవతి!!*
🕉🌞🌏🌙🌟🚩
శ్రీ ఆంజనేయ ప్రశస్తి
🚩🚩🚩🚩🚩🚩
సర్వారిష్ట నివారకమ్, శుభకరం పింగాక్ష మక్షాపహమ్
సీతాన్వేషణ తత్పరం, కపివరమ్ కోటి ఇందు సుర్యప్రభమ్
లంకా ద్వీప భయంకరం సకలదమ్ సుగ్రీవ సమ్మానినం
దేవేంద్రాది సమస్త దేవా వినుతం కాకుత్స దూతం భజే !
" సకల అరిష్టములను తొలగించు వాడు, శుభములు కలిగించు వాడు, పసుపు పచ్చని నేత్రములు కలవాడు, అక్షుని సంహరించు వాడు, సీతాన్వేషణ తత్పరుడు, కపి శ్రేష్టుడు,, కోటి సూర్య చంద్రుల సమ ప్రకాశము కలవాడు, లంకా ద్వీపమునకు భయంకరమైన వాడు, సర్వ అభిశ్తములను తీర్చువాడు, సుగ్రీవునిచే సన్మానింప బడిన వాడు, సమస్త దేవతలచే పొగడబడిన వాడు అయిన శ్రీరామ చంద్రుని దూత యగు హనుమంతునికి నమస్కరించు చున్నాను.
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా,
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరనార్భవెత్
ఆయు: ప్రజ్ఞా యశో లక్ష్మీ: శ్రద్దా పుత్రా: సుశీలతా
ఆరోగ్యం దేహి సౌఖ్యంచ కపినాద నమోస్తుతే...
ఆంజనేయ స్వామీ సర్వదేవతా స్వరూపుడు. శీఘ్ర ఫల ప్రదాత. హనుమను స్మరించినందువలన ప్రతివారికి బుద్ది, బలము, కీర్తి, ధైర్యము, భయము లేకుండుట, రోగములు లేకుండుట, మంచి వాక్కు కలుగును. భూత ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షస , భేతాళ, శాఖిని, ధాకిని మొదలైన దుష్ట
గ్రహములు దగ్గరకు రావు. సర్వ మతముల వారు సేవించవచ్చు. అనన్య భక్తితో సేవించిన వారికీ సర్వ కష్టములు తొలగి సత్ఫలితములు కలుగును అనుటలో సందేహము లేదు.
శ్రీ రామ నామము యొక్క గొప్పతనమును లోకమునకు చాటి చెప్పినవాతుడు.
రామ్ తత్త్వొధికమ్ నామ ఇతి మన్యా మహెవయమ్
త్వయైకా తారితా యొధ్య నామ్నాతు భువనత్రయం!
(ఓ రామ! నీ కంటే, నీ నామము గొప్పదని మా నమ్మకము. ఏలన, నీవు అయోధ్య పురవాసులను మాత్రమె తరింప జేసితివి. కాని, నీ నామము మూడు లోకములను తరింప చేయుచున్నది.)
రామ నామము మిద గట్టి విశ్వాసము కలిగి తను తరించి లోకమును తరింప చేసినవాడు హనుమంతుడు.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం,
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం,
మారుతిం నమత రాక్షసాంతకం
(ఎచ్చట శ్రీరామ కీర్తన జరుగునో, అచ్చట హనుమంతుడు తల వంచి అంజలి ఘటించి ఆనంద బాష్పములు రాల్చుచుండును.రామభక్తులకు హనుమంతుడు రక్షకుడు.)
నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మసి!
(హనుమంతుడు వాయు పుత్రుడు. వాయువును వేదములు పరమ శక్తికి ప్రతీకగా స్తుతించుచున్నవి.)
మహెశస్య తధాన్శెన భూత్వా పవన నందన:
హనుమానితి విఖ్యాతో మహాబల పరాక్రమ:
(మహెశుని యొక్క అంశ చే పవన నందనుడై పుట్టి హనుమంతుడు అని లోకమున మహాబల పరాక్రమ సంపన్నుడై విఖ్యాతి నొంది యున్నాడు.)
దుష్టానాం శిక్షనార్ధాయ శిష్టానాం రక్షనాయచ
రామ కార్యార్ధ సిద్ధ్యర్ధం జాతశ్రీ హనుమాన్ శివ:
(దుష్టులను శిక్షించుతకు , శిష్టులను రక్షించుటకు రామ కార్య సిద్ది కొరకు శివుడే హనుమన్తునిగా అవతరించి యున్నాడు. )
ఆంజనేయం పూజత: శ్చేత్పుజితా సర్వ దేవతా:
( ఆంజనేయుని పూజించిన సర్వ దేవతలను పుజించినట్లే)--
పరాశర సంహిత.
. శ్రీమద్భగవద్గీత - 586 / Bhagavad-Gita - 586 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 03 🌴
03. త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ: |
యజ్ఞదానతప:కర్మ న త్యాజ్యమితి చాపరే ||
🌷. తాత్పర్యం :
సర్వకామ్యకర్మలు దోషము వలె త్యాజ్యములని కొందరు విజ్ఞులు పలుకగా, యజ్ఞము, దానము, తపస్సనెడి కర్మలు ఎన్నడును విడువరానివని మరికొందరు మునులు పలుకుదురు.
🌷. భాష్యము :
వేదములందు వివాదాస్పాదములైన పలుకర్మలు కలవు. ఉదాహరణమునకు యజ్ఞమునందు జంతుబలిని ఒసగవచ్చునని తెలుపబడినది. అయినను కొందరు అట్టి బలి యనునవి అత్యంత హేయమని పలుకుదురు. వేదములందు యజ్ఞసమయమున జంతుబలి ఉపదేశింపబడినను వాస్తవమునకు జంతువు వధింపబడినట్లుగా భావింపబడదు. యజ్ఞవిధి జంతువునకు నూతనజన్మను గూర్చగలుగుటయే అందులకు కారణము. యజ్ఞమునందు వధింపబడిన పిమ్మట జంతువుకు కొన్నిమార్లు నూతన జంతుశరీరము కాని లేదా కొన్నిమార్లు వెంటనే మానవజన్మము కాని ఒసగబడుచుండును.
కాని ఈ విషయమున ఋషుల యందు పలు భేదాభిప్రాయములు కలవు. జంతుబలి సర్వదా నిషిద్దమని కొందరు పలుకగా, కొన్ని సమయములందు అది సబబైనదే యని మరికొందరు పలుకుదురు. యజ్ఞకర్మకు సంబంధించిన ఈ భిన్నాభిప్రాయములను శ్రీకృష్ణభగవానుడే స్వయముగా పరిష్కరింపనున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
ఏకార్ణవాప్లుతాం దేవీం మహీం విష్ణుర్బభారయత్ ।
తస్మాదుక్తో మహీ భర్తా పురాణార్థ వివేకిభిః ॥
ప్రళయకాలమున ఎకార్ణవమున అనగా ఏక సముద్రమున (కలిసిపోయి భూమిని ముంచెత్తిన అన్ని సముద్రాలు) ముణిగిపోయిన భూమి దేవిని తన శక్తితో భరించిన విష్ణువు మహీభర్తా అని చెప్పబడును.
:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
సీ. ఘనుఁడు వైవస్వత మనువుకు దృష్టమై యరుదెంచునట్టి యుగాంతసమయ మందు విచిత్రమత్స్యావతారము దాల్చి యఖిలావనీమయం బగుచుఁ జాల సర్వజీవులకు నాశ్రయభూతుఁ డగుచు నే కార్ణవంబైన తోయముల నడుమ మన్ముఖశ్లథవేదమార్గంబులను జిక్కు వడకుండ శాఖ లేర్పడఁగఁ జేసి తే. దివ్యు లర్థింప నాకర్థిఁ దెచ్చి యిచ్చి, మనువు నెక్కించి పెన్నావ వనధినడుమ మునుఁగకుండంగ నరసిన యనిమిషావ, తార మేరికి నుతియింపఁ దరమే వత్స! (142)
ప్రళయకాలంలో సమస్తమూ జలమయమైపోయింది. ఆ పరిస్థితిని వైవస్వతమనువు ముందే గ్రహించి ఒక పడవపై కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు విచిత్రమైన మత్స్యావతారమెత్తాడు. భూతలానికి ఆశ్రయమైన ఆ దేవుడప్పుడు ఎల్లప్రాణులకూ నివాసభూతుడైనాడు. నా (బ్రహ్మ) వదనంనుండి జారిపోయిన వేదశాఖలు సంకీర్ణం కాకుండా విభజించి దేవతల కోరికమేరకు మళ్ళీ నాకు ప్రీతితో అందజేశాడు. వైవస్వతమనువు అధిష్ఠించిన నావ సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. నాయనా! మహనీయమైన ఆ మత్స్యావతారాన్ని వివరించడం ఎవరికి సాధ్యం?
సశేషం...
శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥయస్య వక్షసినిత్యం శ్రీర్నివసత్యనపాయినీ ।
సవైకుంఠః శ్రీనివాస ఇతి ప్రోక్తో మహాత్మభిః ॥
వాసము అనగా వసించు స్థలము. నిత్యము వసించు చోటు నివాసము. శ్రీ అనగా లక్ష్మికి నిత్యము ఎవని వక్షము చోటగునో ఆ విష్ణువు శ్రీనివాసః అని చెప్పబడును.
:: పోతన భాగవతము - పంచమ స్కంధము, ప్రథమ ఆశ్వాసము ::
సీ.అంత నావిష్కృత కాంత చతుర్భుజంబులును బీతాంబరంబును వెలుంగ
శ్రీవత్సకౌస్తుభ శ్రీరమా చిహ్నంబు లురమందు రమ్యమై యిరవు పడఁగ
శంఖ చక్రగదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెఱయ
నతులిత నవ రత్నహాట కాంకిత నూత్న ఘనకిరీటద్యుతుల్ గడలుకొనఁగఁతే.గర్ణ కుండల కటి సూత్ర కనకరత్న, హారకేయూర వర నూపురాది భూషణముల భూషితుఁడైన శ్రీనాయకుండు, దంపతుల కప్పు డెదురుఁ బ్రత్యక్షమయ్యె. (43)
ప్రకాశమానములైన చతుర్భుజాలతో, పట్టుపీతాంబరంతో, రమణీయమయిన శ్రీవత్సం కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షఃస్థలంతో, శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలయిన దివ్యాయుధాలతో; సాటిలేని నవరత్నాల కాంతుల వెదజల్లే బంగారు కిరీటంతో; మకర కుండలాలూ, మొలనూలూ, మణులు చెక్కిన స్వర్ణహారాలూ; బాహుపురులూ, కాలి అందెలూ ప్రకాశింపగా లక్ష్మీనారాయణుడు ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:11, 22/12/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 139 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 69 🌻
జల పంచకానికి అధిష్ఠానము ఎవరు? జలములో జలము - విష్ణువు కదా! కాబట్టి జలపంచకమంతా కూడా రేపు ప్రళయకాలంలో ఏమైపోతుంది? విష్ణువు నందు అంతర్భూతమైపోతుంది. ఆయన నుంచే వ్యక్తమైంది, ఆయనయందే తిరిగి లయమైపోతుంది.
అందుకనే నారాయణడని పేరు. నారము ఆయనము. నీరము యొక్క ఆశ్రయమంతా విష్ణువే. జలములో జలము అన్నమాట. కాబట్టి ఆ జలపంచకమంతా ఆధారభూతంగా ఉన్నటువంటి విష్ణువు ద్వారా ఏర్పడింది, తిరిగి మరలా ఆయన యందే లయించిపోయింది.
అగ్నిపంచకం.
అగ్నిలో ఆకాశము - దిక్పాలకులు, అష్ట దిక్పాలకులు!
అగ్నిలో వాయువు - వాయుదేవుడు.
అగ్నిలో అగ్ని - సూర్యుడు.
ఈ సూర్యుడే అధిష్ఠానం. మనం కూడా అగ్నిని ఎక్కడి నుంచి పొందుతున్నాము? అంటే, సూర్యుడి నుంచే పొందుతున్నాము. ప్రకాశము నుంచే పొందుతున్నాము. ఆ సూర్యప్రకాశము ఆధారంగానే క్రమశః సృష్టి జరుగుతుంది.
సూర్యుడు లేకపోతే ఈ సృష్టిలో ఏదీ లేదు. చీకటి యుగం. మంచుఖండం, హిమయుగం, నడుస్తూఉంటుందన్నమాట. ఆ సూర్యప్రభావం వల్లనే, ఆ జలంలోనుంచి జీవులన్నీ పుట్టుకొచ్చినాయి.
అగ్నిలో జలము - వరుణుడు, వరుణుడు!
అగ్నిలో పృథ్వి - అశ్వినీ దేవతలు, అశ్వనీ దేవతలు.
ఈ రకంగా ఆది దైవక సృష్టి అగ్నిపంచకానికి సంబంధించినటువంటిది. ఈ అశ్వనీ దేవతలు, అష్టదిక్పాలకులు, వరుణుడు, సూర్యుడు... వీళ్ళందరూ కూడా మనం ఆరాధించేటటువంటి దేవతలన్నమాట. వీళ్ళందరి ప్రభావం చేతనే ఋతువులన్నీ ఏర్పడుతున్నాయి. భ్రమణం ద్వారా ఏర్పడుతున్నాయి. భూభ్రమణము, భూ పరిభ్రమణము అంటున్నాము కదా!
భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఈ అధిష్ఠాన దేవత అనుగ్రహంచేత, ఆ యా ఋతువులన్నీ ఏర్పడి, ఆ జీవ సృష్టి అంతా జరుగతోంది. వరుణ భగవానుని అనుగ్రహం లేకపోయినట్లయితే, మనం వర్షపాతం లేక విలవిల లాడిపోతాము. ఎన్ని భూమి మీద నీళ్ళున్నప్పటికీ కూడా, వర్షం లేకపోతే ప్రాణులన్నిటికి చాలా ఇబ్బంది కరమైన జీవితం జరుగుతూఉంటుంది.
ఒక కాలానికి వచ్చేటప్పటికి అసలు వరణుడే లేకపోతాడు. ప్రళయ కాలానికి వచ్చేటప్పటికి సూర్యప్రభావం తీవ్రమైపోతుంది. తీవ్రమైపోయి, మిగిలినటువంటి అగ్ని పంచకం అంతాకూడా దేదీప్యమానమైనటువంటి ప్రభావితమై, కిందున్న జలపంచకాన్ని తనయందు కలిపేస్తుంది.
జలపంచకమేమో తన ఆధీనంలో ఉన్న పృథ్వి పంచకాన్ని కలిపేసుకుంటే, ఆ జలపంచకాన్ని, ఈ అగ్ని పంచకానికి అధిష్ఠానమైనటువంటి సూర్య తప్తత చేత, ఆ మొత్తం ఇంకిపోయేట్లు చేస్తుంది. అప్పుడు ప్రళయకాలంలో జరిగే విధానం అది. ఆది దైవతముల యొక్క ప్రభావం అంతా కూడా.
సృష్టి ఆవిర్భావ కాలమందు, సృష్టి పోషణ కాలమందు, సృష్టి తిరోధాన ప్రళకాలమందు. ఈ ఆది దైవతం యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది. భూమి విలువ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, భూకంపం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ భూమి ఉందని. అప్పటి వరకూ నేల ఉందని ఎవరూ అనుకోరు. తింటుంటాడు, తిరుగుతూ ఉంటాడు, గడిపేస్తూ ఉంటాడు.
భూకంపం వస్తే, అప్పుడు భూమి యొక్క ప్రభావం ఎంతుందో తెలుస్తుంది. భూదేవత యొక్క అనుగ్రహం అలా ఉందన్నమాట. అట్లా మనం ఈ పంచభూతాలని ఆదిదైవతంగా భావించి ఆరాధించే విధానాన్ని పెద్దలు కల్పించారు.
ఈ రకంగా పృథ్వి పంచకాన్ని, జలపంచకాన్ని, అగ్ని పంచకాన్ని తెలుసుకున్న తరువాత వాయుపంచకం.
వాయువులో ఆకాశము - జయుడు,
వాయువులో వాయువు - విశ్వయోని,
వాయువులో అగ్ని - అజుడు,
వాయువులో జలము - విశిష్ఠుడు,
వాయివులో పృథ్వి - విశ్వకర్త.
వీళ్ళే ఆధారం. వాయుదేవత అంటే వీళ్ళే. వీళ్ళందరినీ కలిపి వాయుదేవత.... వాయువులో వాయువు చాలా ముఖ్యం.
గు: వాయువులో వాయువు ఏమిటిప్పుడు?
శి: విశ్వయోని- విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:11, 22/12/2020] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 13 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 13 🍀
సమాధీ హరీచీ సమసుఖేవీణ్!
న సాథేల్ జాణ్ ద్వైత బుద్ధీ!!
బుద్ధి చే వైభవ్ అన్స్ నాహీ దుజే!
ఏకా కేశవ రాజే సకళ సిద్ధీ!!
రిధీ సిద్దీ నిధీ అవబీచ్ ఉపాధీ!
జవ్ త్యా పరమానందీ మన్ నాహీ!!
జ్ఞానదేవీ రమ్, రమలే సమాధాన్!
హరీ చే చింతన్ సర్వకాళ్!!
భావము:
సమసుఖము కలుగక పూర్వము శ్రీహరిలో సమాధి సుఖాన్ని పొందజాలము. ద్వైత బుద్ధి ఉన్నంత కాలము సమసుఖము సాధ్యము కాదు.
బుద్ధి యొక్క వైభవము అన్యముగా రెండవది ఏదీ లేదు. ఒక్క కేశవరాజే సకల సిద్ధులకు మూల కారణము. పరమానందునిలో మనసు స్థిరముగ లేనిచో ఈ రిద్ధి-సిద్ధి, నిధులు సర్వము అవసరము లేని ఉపాధులే అయిపోతాయి.
హరి చింతనలో సర్వకాలము నా మనసు రమించి లీనమై పోవుట వలన నాకు సమాధానము లభించినదని జ్ఞానదేవులు తెలిపినారు.
🌻. నామ సుధ -13 🌻
సమసుఖము కలుగక పూర్వము
హరిలో సమాధి పొందజాలము
ద్వైత బుద్ది ఉన్నంత కాలము
సమ సుఖ:ము కాదు సాధ్యము
ఇలలో బుద్ధికి మరో వైభవము
రెండవది లేదు అన్యము
ఒక కేశవ రాజే దానికి మూలము
సకల సిద్ధులకు ఆధారము
రిధీ సిద్ధీ నిధీ ఇవి సర్వము
ఉపాధులన్నీ అనవసరము
మనుస్సునందు పరమాత్ముని భావము
లేని ప్రయాస నిరుపయోగము
జ్ఞాన దేవునిలో రమించే నామము
అంతరంగమున సమాధానము
హరి చింతనలో సర్వ కాలము
గడిపిరి వారు నిరంతరము
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[06:11, 22/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 156 / Sri Lalitha Chaitanya Vijnanam - 156 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖
🌻156. 'నీరాగా'🌻
అనురాగములకు అతీతమైనది శ్రీమాత అని భావము. రాగమనగా ఇచ్ఛ లేక కోరిక. శ్రీమాత అనురాగమునకు ఆలయమేయైనను ఆమెకు సృష్టి యందలి ఏ విషయము పైనను ప్రత్యేకముగా ఇచ్ఛ లేదు. సమస్త ఇచ్ఛలు తీరిన వారికి ఇక ఇచ్చలు ఏమి యుండును? పరిపూర్ణత్వము కారణముగా ఇచ్ఛకవకాశమే లేదు. లేని దానిపై ఇచ్ఛ కలుగును. కాని అన్నియు తానై నిండిన స్థితి యందిచ్ఛ ఎట్లుండగలదు? స్థితి యందుండగ మరియొక ఇచ్ఛ కవకాశమే లేదు.
జీవులకు లేనివి, కావలసినవి చాలా యున్నవి. ఇచ్ఛ పూర్తియగు వరకు ఇచ్చనే అనుసరించుచుందురు. వారు రాగబద్ధులు. ఇచ్ఛ వలన కొంత సాధింపబడుట జరుగును. కానీ అట్టి సాధనలో కామ క్రోదాధి అరిషడ్వర్గములు పుట్టి జీవులను బంధించు చుండును. ఇచ్ఛా నిర్వహణము. ఇచ్ఛా పరిపూర్తి, ఆపై ఇచ్ఛను దాటిన స్థితి, ఈ మూడింటిని శ్రీమాతయే ప్రసాదించగలదు. ఆరాధనయే దానికి ఆధారము.
ఆరాధనము వలన ఇచ్ఛాపూర్తి జ్ఞానము కలుగును. ధర్మ యుక్తముగా నిర్వర్తించుకొను బలము కలుగును. క్రమముగా ఆరాధనయే ఇచ్ఛాలేమి స్థితిని కూడ ప్రసాదించుచుండును. ఉదాహరణకు బంగారునగలపై జీవులకు మోజు కలదు. బంగారమునకు నగలపై యెట్టి మోజు ఉండదు. కారణము తానే నగల రూపమున ఉండుట. అట్లే శ్రీమాత కూడను.
తానే సమస్త వస్తుజాలముగ యేర్పడి ఉన్నప్పుడు యిక యిచ్చగించవలసినది ఏమియూ లేదు. వశిష్టాది బ్రహర్షులట్టి వారు. మరియొక మాట! ఇచ్ఛాపరిపూర్ణులు ఇచ్ఛారహితులై యున్నారు. వారే యితరుల ఇచ్ఛను పరిపూర్తి గావింపగలరు. పూర్ణత్వము గలవారే యితరులకు కూడ పూర్ణత్వము నందించగలరు. శ్రీమాత పరిపూర్ణ అగుటచే ఆమెయే నిజమగు నీరాగ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
నేనూ నాదీ అనే ఈ భావాలే లోకంలో అనర్ధాలన్నింటికీ కారణాలు. ఇంద్రియసుఖాలకై ప్రాకులాట స్వార్ధానికి దారి తీస్తుంది. స్వార్ధమే దుఃఖానికి కారణమౌతుంది.
సత్యం, పవిత్రత, నిస్వార్థం; భూనభోంతరాల్లోని ఏ శక్తీ, ఈ సుగుణాలతో జాజ్వల్యమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటై ఎదిరించినా, వారు ప్రతిఘటించగలరు.
🕉🌞🌎🌙🌟🚩
మాయ
సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా కనుమరుగుచేసి, అజ్ఞాన అంధకారంలో
జీవుణ్ణి అధోగతి పాలు చేసేది మాయ
జనన మరణ సంసార సాగరంలో ముంచునది మాయ
కంటికి కనపడని ఒక మహాశక్తి మాయ
మాయ ప్రభావం వలనే సృష్టి నడుస్తోంది.
సృష్టిలోని చరాచర భూతములన్ని
మాయకి లోబడి కాలచక్రంలో తిరుగుతుంటాయి.
ఈ ప్రపంచంలోని పదార్థాలన్నీ గారడీవాడు చేసే మాయాజాలం లాంటివి.
చూసే ప్రేక్షకులు జీవులు , ఆశ్చర్య పోతుంటారు . కానీ గారడీవాడు చేసే మాయాజాలాన్ని ఏనాటికి తెలుసుకోరు.
ఆ పదార్థాలని ఎలా పుట్టిస్తాడో ఎలా మాయం చేస్తాడో ఎప్పటికి విచారించకుండా చేసి మాయ కప్పివేస్తుంది.
గారడీవాడు కనిపించకుండా మాయాజాలం చేస్తాడు .
మాయగాళ్లకే మహా మాయగాడు వాడు.
మాయావినో మమిరే అశ్య మాయాయ (ఋగ్వేదం 9.83.3)
మహా మాయగాళ్ళు ఆయన మాయచేతనే మాయచేస్తుంటారు.
బీజాస్యాన్తరివాన్కురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః
మాయకల్పిత దేశకాలకలన వైచిత్ర్య చిత్రీకృతం
మాయావివ విజృంభయత్యపి మహాయోగివ యః స్వేచ్ఛయా తస్మైశ్రీ నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః!!
(దక్షిణామూర్తి స్తోత్రం )
చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్టుగా గోచరించే ఈ మహాజగత్తంతా
దేశకాలావృతమైన సమస్త చరాచర ప్రపంచాన్ని ఇంద్రజాలకునివలె, మహాయోగివలె తన మాయ శక్తితో ఈ జగన్నాటకాన్ని నడిపే మహాత్ముడైన గురువు దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారాలు.
వాడు సృష్టించిన పదార్థాలకు ఆకర్షితులై , వాటిని చూస్తున్నాం , వాటినే కోరుకుంటూ , విశిష్టమైన వాణ్ణి కోరుకోవడం మరిచిపోతున్నాం ,
వాణ్ణి చూడలేక పోతున్నాం
పదార్థాలు వరకే ఆగిపోతున్నాం వాటివెనక యదార్థాన్ని గ్రహించలేక పోతున్నాం.
కాననివాని నుతగొని
కాననివాడు విశిష్ట వస్తువున్
కానని భంగి!!
ఒకసారి నారదుడికి సందేహం వచ్చింది
ఎందుకు దేవతలు , మహర్షులు మాయ అంటే భయపడతారు ?
ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికై సరాసరి వైకుంఠవాసుడైన శ్రీహరి దగ్గరకి వెళ్లి అడుగుతాడు ?
త్రిగుణాత్మికమైన నా మాయ చాల దుర్లభమైనదని ,
దానిని అధిగమించుట కష్టసాధ్యమని , దాని గురించి వదిలివేయమని చెప్తాడు.
అయినా నారదుడు వదలకుండా తెలుసుకోవాలని పట్టుపడతాడు , ఆ మాయని చూడాలని , దాని గురించి వివరించామని అడుగుతాడు.
మాయ వివరించడానికి, వర్ణించడానికి శక్యం కాదు కావాలంటే భూలోకానికి వెళితే అక్కడ చూపిస్తాను రేపు రమ్మంటాడు సరే స్వామి
అని వెళతాడు. మరుసటి రోజు వైకుంఠానికి వస్తాడు .
మాయాజోలికి పోకుండా ఉంటె నీకె మంచిదని చెప్తాడు, కానీ నారదుడు
వదలదు లేదు స్వామి ఎలాగైనా నేను దాని మర్మం తెలుసుకోవాలని అంటాడు.
సరేనని నారాయణ నారదుడు ఇద్దరు కలిసి భూలోకానికి వెళుతుండగా మధ్యలో శ్రీహరికి దాహం వేస్తుంది. దాహంగా ఉంది నీళ్లు తీసుకురమ్మని నారదుడికి
చెప్తాడు, వెంటనే నారదుడు నీటికోసమని ఒక కొలను దగ్గరకి వెళ్తాడు.
అక్కడ ఒక అందమైన స్త్రీ కనపడుతుంది.
ఆమెని చూసి మనసుపడి మోహిస్తాడు , ఆమె మాయలో పడిపోతాడు.
నారాయణుని , అయన నామాన్ని మరచిపోతాడు.
ఆమెని గాంధర్వ వివాహం చేసుకుంటాడు.
కొలను పక్కనే ఒక పాక కట్టుకుని ఆమెతో హాయిగా సంసారం చేస్తుంటాడు.
ఇద్దరు పిల్లలు కూడా కలుగుతారు.
ఉన్నట్టుండి జోరుగా వానపడుతుంది ,
వరద పారుతుంది .
వరద హోరు పెరిగే సరికి కట్టుకున్న పాకలోకి నీళ్లు వస్తాయి , వేరే దారిలేక ఆ వరదని దాటి అవతలి ఒడ్డుకి వెళదామను కుంటాడు.
పిల్లలని భుజాలమీద పెట్టుకుని, భార్యని చెతపట్టుకుని వరద దాటుతుంటే హోరు ఇంకా పెరిగేపోతుంది పీకలోతులదాకా నీళ్లు వచ్చేస్తాయి బరువెక్కేసరికి పిల్లలని వదిలేస్తాడు , తర్వాత భార్యని వదిలేస్తాడు , వాళ్ళు వరదలో కొట్టుకొనిపోతారు .
తాను ఒక్కడే ఒడ్డుకి చేరి బోరుమని బాధపడతాడు.
అయ్యో నా భార్య పిల్లలు వెళ్లిపోయారు ఇక నా బ్రతుకు ఎందుకని
తాను కూడా వరదలో దూకి ప్రాయోపవేశం చేయాలనీ అనుకుంటాడు .
అప్పుడు వస్తాడు నారాయణుడు నారదా అని పిలుస్తాడు. ఎవరా అని వెన్నకి తిరిగి చూస్తే నారాయణుడు
వెంటనే నారాయణ వాక్కవ స్వామి
నా భార్య పిల్లలు వరదలో కొట్టుకొనిపోయారు. ఇప్పుడు నాగతి ఏమి ,
నాకు వాళ్ళు కావాలని అడుగుతాడు.
చూశావా నారద నా మాయ మహిమ ,
నువ్వు ఇక్కడికి వచ్చి రెండు గడియలు కాలేదు అప్పుడే నా మాయలోపడి ఎంత విచారిస్తున్నావు.
కాసేపటికి నారదుడు కళ్ళు తెరుచు కుంటాడు , వామ్మో మహా ప్రభో నీ మాయ ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు. అందుకే స్వామి
ఎందరో మహర్షులు కూడా ని మాయకి లొంగిపోయారు .
నీ మాయ అనన్య అసామాన్యం , ఆశ్చర్యం అని చెప్పి నారాయణ అనుకుంటూ ముల్లోక సంచారానికి వెళ్తాడు.
మాయ లో పడటమే ఈ జీవితంలో అన్నిటికన్నా ఆశ్చర్యం.
ఈ జీవితమనే అడవిలో మన మనసు తికమక పడుతుంది పెడుతుంది. మన ఇహలోకజీవితం శాశ్వతం సంపూర్ణం ఎన్నటికి మారనిది సుఖమైనది అంటుంది. కానీ మన మనసు అంటుకు పోయిన ఈ లోకం ఈ లోకంలోని మన జీవితం తాత్కాలికం అసంపూర్ణం ఎప్పుడూ మారేది కొరతలతోకూడినది విచారకరమైనది.
గత జన్మల కర్మలను స్వభావాలను బట్టి మనం ఇహలోక ఆశలు పెంచుకుంటాము. మన రాగ ద్వేషాలను బట్టి ఆశలు కోర్కెలు ఎన్నోమనలో కలుగుతాయి.
మనసు పుట్టించే ఇహలోకాశలతో మనం మోసపోతాము. నాది నేను అనే మాయలో పడి మంచి వస్తువులుకోరతాము రోగం మరణం వద్దంటాము. మహావిద్యావంతులు కూడా కోర్కెలు ఉండాలి కోర్కెలు లేనివాడు చచ్చినట్లే లెక్క అంటారు.
తల్లిదండ్రుల్ని జన్మను బంధువుల్ని కులాన్ని రంగును మరణాన్ని అన్నిటినీ మనమే ఏదేది ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో కోరుకున్నట్లు అలాగే జరుగుతున్నట్లూ భ్రమిస్తున్నాము. అన్నిటికంటే ఆశ్యర్యం కలిగించే మన ఈమూర్ఖత్వం అజ్ఞానమే మహా మాయ.
అందుకే భజగోవిందంలో శంకరులంటారు
మాకురు దనజన యవ్వన గర్వం హారతి నిమేషత్ కాలాత్సర్వం మాయమయమిదం అఖిలం హిత్వా బ్రహ్మ పదం త్వం ప్రవిశ్య విదిత్వా!!
లెక్కలేనంత ధనం ఉంది కాబాట్టి నేనే ధనవంతున్ననే ధన గర్వంతో విర్రవీగిన , బంధుజనం ఉన్నారని, నాకు చాలామంది గొప్పవ్యక్తులు తెలుసనీ , ఏంటో సర్కిల్ ఉందనే గర్వంతో విర్రవీగిన ,
యవ్వనంలో దేహ సౌందర్యము , దేహ దారుఢ్యం బాగుంటుంది కాబట్టి నాయంత వాణ్ణి నేననే గర్వంతో విర్రవీగినా
అవన్నీ శాశ్వతం కాదు , భూకంపం వస్తే క్షణకాలంలో మాయమైపోతాయి.
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుజ్న్కరని
ప్రాణం పోయేటప్పుడు ఎవ్వరు రక్షించలేరు.
మరణానంతరం ఏవి వెంటరావు.
మాయ జాలరి ఎలాగైతే చేపలు పెట్టేవాడు ఒక బెండుకి మధ్యలో దారం కట్టి దాని చివరన నొక్కి పెట్టి దానికి ఎర్రని తగిలించి చెరువులో గాలం వేసి చేపల్ని పడతాడో అలాగే మాయ జాలరి....
అయిన దైవం మానవులకి మాయ అనే బెండుకి ఆశ అనే దారం కట్టి దానికి మనస్సనే కొక్కి పెట్టి దానికి విషయసుఖాలనే ఎర్రని తగిలించి లోకమనే చెరువులో మాయ గాలం వేసి జీవులనే చేపల్ని పడుతున్నాడు. చేపకి కడుపు నిండుగా ఉన్నా రుచికి లొంగిపోయి లౌల్యముతో ఎర్రని కొరుకుతుంది. చటుక్కున కొరకగానే లటుక్కున గాలానికి తగులుకుంటుంది . అప్పుడు బెండు కదులుతుంది వాడు గట్టునుండి గమనిస్తూ ఉంటాడు బెండు కదలాగానే పరుగెత్తుకుని వెళ్లి గాలాన్ని తీసుకుని వచ్చి చేపని తీసి సంచిలో వేసుకుంటాడు.
అలాగే మానవులు ఇంద్రియలోలురై విషయసుఖాలనే ఎరకి వాటికీ ఆకర్షితులై ఆశపడి ఆ విషయాలపట్ల మోహితుడవుతాడు వాటిని అనుభవిస్తాడు. మనసు వాటిని భద్రంగా లోపల దాచుకుంటుంది గుర్తుకువచ్చినప్పుడల్లా అనుభవిస్తూ ఉంటాడు పడే పదే చేయడం వలన అది వాసనగా వ్యసనంగా మారుతుంది అప్పుడు మాయ అనే గాలానికి తగులుకుంటాడు జననమరణ చక్ర సంసారంలో తిరుగుతూ ఉంటాడు. చేప ఎర్రని చూసి పట్టించుకోకుండా దాని జోలికిపోకుండా జాలరి పాదాలకింద మట్టిని ఆశ్రయిస్తే అది తప్పించుకోగలడు.
అలాగే మానవులు కూడా విషయసుఖాలకు మోహపడకుండా అవి క్షణికాలని అనిత్యలని వాటిని వదిలేసి ఆ మాయ జాలరి పరమాత్ముని పాదాలు పట్టుకుంటే జననమరణ చక్ర సంసారం నుండి బయటపడగలడు లేకపోతె పునరపి జననం పునరపి మరణం పుడుతూ చస్తూ ఉండాల్సిందే తప్పించుకోకుండా మమమేమి చేస్తున్నాం చేపలగా ఇందుర్తియే లోలురమై విషయసుఖాలకి ఆశపడి యముని పాషానికి తగులుకుంటున్నాం చేపకి రుచి ఒక్కటే లౌల్యం కానీ మానవులకి ఐదు లౌల్యాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఎన్ని జన్మల్లో అనుభవించి ఉంటామో కానీ వాసనరూపంలో ప్రేరేపిస్తుంటాయి వదలవు క్షణకములని తెలుసుకుని వైరాగ్యముతో వాటిపట్ల మొహాన్ని విడిచిపెట్టాలి ఇప్పటికైనా కలనుండి మేలుకొని భ్రాంతిని వదిలి బ్రహ్మము దరిచేరితే మోక్షపదవిని పొందవచ్చు .
ఓం తత్ సత్...
ఓం సర్వ భూతానాం... శాంతిర్భవంతు..
ఓం శాంతిః శాంతిః శాంతిః
🕉🌞🌏🌙🌟🚩
శ్రీరమణీయం - (748)
🕉🌞🌎🌙🌟🚩
"భగవద్గీత, విచారణమార్గం ఈ రెండింటిలో ఉన్న తేడా ఏమిటి !?"
శ్రీకృష్ణపరమాత్ముడు బోధించిన భగవద్గీత, భగవాన్ శ్రీరమణమహర్షి సూచించిన విచారణమార్గం రెండూ ఒకటే. భగవద్గీతకు మరో పేరు విచారణమార్గం. శ్రీకృష్ణపరమాత్ముడు ఏ ధర్మజీవనానైతే ప్రభోదించారో శ్రీరమణమహర్షి కూడా అదే ధర్మాచరణను బోధించారు. మనందరం ప్రతిక్షణం భగవంతుడిగానే ఉంటున్నాం. ఏ ఇంద్రియానుభూతితో పని లేకుండానే మనం ఉన్నట్లు మనకు నిరంతరం తెలుస్తూనే ఉంటుంది. అది అనుక్షణం మనకు లభించే దైవానుభవమే. అదే ఆత్మానుభవం. కానీ మనకది తెలియటంలేదు. కారణం ఏమిటని విచారిస్తే, మనలో లోపించిన ధర్మనిరతే కారణమని అర్థమవుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
దైవస్మరణ ధర్మబలాన్నిస్తే.. ధర్మం దైవదర్శనం చేయిస్తుంది !''- (అధ్యాయం -92)
🕉🌞🌎🌙🌟🚩
[14:20, 22/12/2020] +91 92915 82862: "ఋభుగీత " (215)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
సృష్టి అంతటా జీవనానికి అవసరమైన విజ్ఞానం ఉంది !!
విజ్ఞానం అంటే మన దేహానికి, ప్రపంచానికి సంబంధించిన భౌతిక సమాచారం. అది కూడా దైవమే. విజ్ఞానం ప్రతివారికీ అవసరం. ఎవరికి ఉండాల్సిన విజ్ఞానం వారికి ఉంటేనే జీవనం సాగుతుంది. విజ్ఞానం లేకపోతే జీవనం సాగదు. విజ్ఞానమంతా బుద్ధిగతమైనది. అంటే బుద్దిరూపంలో ఉన్న భగవంతుడని అర్థం. జనసమూహం కూడా దైవమే. అందం, ఆకర్షణ అన్నీ భగవంతుడే. విజ్ఞానం లేని వారు ఎవరూ ఉండరు. ఎంతో కొంత ప్రాపంచిక జ్ఞానం ఉండబట్టే పిచ్చివాడుకూడా ఆకలిని గుర్తించి అడుక్కుంటున్నాడు. అన్నం పెడితే తింటున్నాడు. కాగితంలో తిన్నా, ఆకులో తిన్నా, నేలపై తిన్నా , తినాలి అనే తెలివి మాత్రం కలిగి ఉన్నాడు. అలా సృష్టి అంతటా జీవనానికి అవసరమైన విజ్ఞానం ఉందని గుర్తిస్తే అది జ్ఞానంగా పరిణమిస్తుంది !
🕉🌞🌎🌙🌟🚩
[14:40, 22/12/2020] +91 92915 82862: 🌷106-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
అధ్యాయము-9
రాజవిద్య-రాజగుహ్యము
13. మహాత్ములు మాత్రము నా దివ్య ప్రకృతి యందు వర్తించుచున్నారు. నన్నే స్మరించుట వలన ఇది సాధ్యమగుచున్నది. జీవులలో నన్ను చూచుచు, అన్యభావనలేని మనసుతో వర్తించుచున్నారు. జీవులుగా దిగుటకు ముందున్న నన్నే జీవులలో చూచుచున్నారు.
14. ఎవరి గుణములను గ్రహించినను ఈ నన్నే కీర్తించుచున్నారు. ఎవరికి నమస్కరించినను, భక్తి చూపినను, ఎవరి కొరకై ఎట్టి ప్రయత్నము చేసినను నన్నే ఉద్దేశించుచున్నారు.
15. దేనిని తెలిసికొనినను నన్నే తెలిసికొని జ్ఞానయజ్ఞముచే విశ్వ శ్రేయస్సు అనుమార్గమున నన్నే సేవించుచున్నారు. ఒక్కొక్కరిని వేరుగా గౌరవించుచు, ఒక్కనిగా గౌరవించుచున్నారు.
16. పాపములు, అజ్ఞానము హరించుటకు చేయు సంస్కార కర్మలు, క్రతువులు, యజ్ఞములు నన్నే ఉద్దేశించి నాయందే ఆచరించుచున్నారు. గాలి, నీరు, ఇల్లు, వాకిలి పరిశుభ్రము చేసుకొనుట కూడా ఆయా దేవతలకు సేవయే. వారు నేనని ఎరిగి చేయుచున్నారు. పితృదేవతలకు ఇచ్చు పిండోత్పత్తి సమర్పణము 'స్వధ' అనబడును. తాను ధరించిన తన వీర్యమని ఈ పదమునకు అర్థము. పిండోత్పత్తికి స్వధా సమర్పణము కూడ కామము లేక నన్నుగా భావించి సమర్పణము చేయుచున్నారు. ఓషదులనగా ధాన్యములు. వానితో చేయబడిన అన్నము ఆకలిని, నాశమును నివారించు ఔషధము. అట్లే మందులను వ్యాధులను నివారించును. ఈ నాశనివారణము. నా భావమని గుర్తించి వారు ఆహారాదులు స్వీకరించుచున్నారు. యజ్ఞమునందు ప్రయోగింపబడు మంత్రములు ఋషులచే దర్శింపబడినవి. వారి మనస్సులలో అవి దర్శనము అగుటకు నేనే కారణము కనుక మంత్రము నేనుగా ఉచ్చరించుచున్నారు. నా నుండి ఉద్భవించిన అంగ దేవతల ప్రభావముచే గోవు శరీరము నుండి పాలును, అందుండి నేయియు వచ్చుచున్నవి. వారు నేయిని, హోమము చేయువానిని కూడ నన్నుగనే గుర్తించుచున్నారు.
🕉🌞🌎🌙🌟🚩
[14:40, 22/12/2020] +91 92915 82862: 119) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
స్వయమాత్మేతి పర్యాయై తేన లోకే తయోః సహ ౹ ప్రయోగో నాస్త్యతః స్వత్వమాత్మత్వం చాన్య వారకమ్ ౹౹43౹౹
43. "స్వయం" "ఆత్మ"అనునవి పర్యాయ పదములు.కనుకనే లోకమున ఈ రెండింటికి ఏకకాలమున ప్రయోగము లేదు.ఇవి రెండూ ఇతర భావములను వారించును.
ఘటః స్వయం న జానాతీత్యేవం స్వత్వం ఘటాదిషు ౹
అచేతనేషు దృష్టం చేత్ దృశ్యతామాత్మ సత్త్వతః ౹౹44౹౹
44. (ఆక్షేపము)"ఘటము స్వయముగ తెలియజాలదు" మొదలైన ప్రయోగములందు కుండ మొదలగు అచేతనములందు కూడ స్వత్వము కనబడుచున్నది గదా.
(సమాధానము)అట్లే ఆత్మసత్తాయే అచేతనములకు కూడా ఆశ్రయమగుట చేత వానియందు కూడా స్వత్వము కన్పించును.
చేతనాచేతనభిదా కూటస్థాత్మకృతా న హి౹ కింతు బుద్ధికృతాభాసకృతైవే త్యవగమ్యతామ్౹౹45౹౹
45. చేతనము అచేతనము అనే భేదము కూటస్థమగు ఆత్మ వలన కలుగుట లేదు.
ప్రతిఫలన సాధనమగు బుద్ధి,అంతఃకరణము,వలన ప్రతిఫలనమగు అభాసల వలన మాత్రమే అని తెలియును.
యథా చేతన ఆభాసః కూటస్థే భ్రాంతి కల్పితః ౹ అచేతనో ఘటాదిశ్చ తథా తత్ర్పైవ కల్పితః ౹౹46౹౹
46. కూటస్థము నందు భ్రాంతి ద్వారా చేతనమనే అభాస కల్పితమగుచున్నట్లే కుండ మొదలగు అచేతనములనే అభాసలు కూడా కూటస్థమునందు భ్రాంతిచే కల్పింపబడుచున్నవి. చేతనములు,అచేతనములు రెండింటికీ ఆశ్రయము కూటస్థ బ్రహ్మమే అని భావము.
వ్యాఖ్య:- ఉన్నది సర్వవ్యాపియైన బ్రహ్మమే.
అవిద్యా ఉపాధియందలి శుద్ధ మలిన తారతమ్యముల వలన, కొన్ని ఉపాధులయందు బ్రహ్మము ప్రతిఫలించి చిదాభాసలు,
అనగా జీవులు చేతనములు, భాసించును.
కొన్ని ఉపాధుల యందు ప్రతిఫలింపక అచేతనములుగ భాసించును.
ఇంద్రియజ్ఞానము గల వానికి ఇంద్రియ జ్ఞానము లేనివానికి మధ్య,
జడ-చేతనములకు మధ్య భేదములేదు.
సమస్తపదార్థముల సారమునందు ఏ మాత్రము భేదము లేదు.దీనికి కారణము సర్వపదార్థములయందలి సత్తయొక్క సమానత్వమే.
ఏల అనగా,అనంతమయిన చైతన్యము అంతట ఒకే విధముగా ఉన్నది.
తనను విభిన్నపదార్థములుగా తాదాత్మ్యము చెందించుకొనుచున్న ప్రజ్ఞయే భేదములకు కారణము.
చేతనములు అచేతనములు అనేే భేదము కూటస్థమగు అత్మ వలన కలుగుట లేదు. ప్రతిఫలనసాధనమగు బుద్ధి, అంతఃకరణము,వలన ప్రతిఫలనమగు అభాసల వలన మాత్రమే అని తెలియును.
అనంతమయిన ఒకే చైతన్యము విభిన్నపదార్థములలో విభిన్న నామములతో పిలవబడును.అదే విధముగా క్రిములుగా,చీమలుగా,పక్షులుగా తాదాత్మ్యము చెందుచున్న ప్రజ్ఞయే ఒకే విధమయిన అనంత చైతన్యమే.
ఉత్తరధ్రువము నందు నివసించు జనులు దక్షణధ్రువమునందలి జనులను ఎరుగనట్లే(కావున వారితో తమ తారతమ్యము చూడనట్లే)ఆ చైతన్యమునందు పోలికగనీ,భేదబుద్ధిగానీ లేదు.
ప్రతిస్వతంత్రపదార్థము ఈ ప్రజ్ఞచే అట్టిదిగా,(ఆ పదార్థముగా) తాదాత్మ్యము జెంది ఇతరపదార్థముల నుండి వ్యత్యాసము లేకుండ తానుగా ఉండును.
వానికి"ఇంద్రియజ్ఞానముగలవి",
"ఇంద్రియజ్ఞానము లేనివి"అను భేదములను ఆరోపించుట,రాతిలో పుట్టిన కప్ప,దానికి వెలుపల పుట్టిన కప్ప-ఒకటి జడమనియు, రెండవది చేతనమనియు-తమ్ము విభిన్నముగా భావించుట వంటిదే.
సముద్రమునందు తరంగములు అభివ్యక్తమురయినట్లుగానే
చేతనములు,అచేతనములకు అశ్రయము కూటస్థ బ్రహ్మమే.
🕉🌞🌏🌙🌟🚩
3-శ్రీ రామదాసు కీర్తన
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
ధన్యాసి - ఆదిపల్లవి:-
తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా!
అను పల్లవి:మీరిన కాలుని దూతలపాలిటి
మృత్యువుయని మదినమ్ముక యున్న!!
చరణము(లు):-
మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా
హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా
ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా
వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు!!
ఎన్నిజన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్న
అన్ని రూపులై యున్న నాపరాత్పరు నామహాత్ముని కథ విన్నా
ఎన్ని జన్మములజేసిన పాపములీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా!!
నిర్మల మంతర్లక్ష్యభావమున నిత్యానందముతోనున్న
కర్మంబులువిడి మోక్షపద్ధతిని కన్నుల నే జూచుచునున్న
ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్న
మర్మము దెలిసిన రామదాసుని హృన్మందిరముననే యున్న!!
******
||శ్రీమన్నారాయణీయము|| సప్తమ స్కంధము / 24వ దశకము - ప్రహ్లాదచరిత్ర వర్ణనము / 24-6-శ్లోకం
అధీతేషు శ్రేష్ఠం కిమితి పరిపృష్టే౾థ తనయే
భవద్భక్తిం వర్యామభిగదతి పర్యాకులధృతిః।
గురుభ్యో రోషిత్వా సహజమతిరస్యేత్యభివిదన్
వధోపాయానస్మిన్ వ్యతనుత భవత్పాదశరణే।।
భావము:-
ఒకనాడు హిరణ్యకశిపుడు "నీవు చదివిన చదువుల సారమేమి?" అని ప్రహ్లాదుని ప్రశ్నించెను. అంతట ప్రహ్లాదుడు (శాశ్వత ఆనందమునకు) "శ్రీహరి భక్తియే శ్రేష్టమని" పలికెను. ప్రహ్లాదుడట్లు హరిని కీర్తించుట విని , క్రోధముతో హృదయము కలవరపడగా, హిరణ్యకశిపుడు గురువులను నిందించెను. పిమ్మట - ప్రహ్లాదుని స్వతఃసిద్ధమగు బుద్ధియే దీనికి కారణమని గ్రహించి, శ్రీహరీ! నీపాదములే తనకు రక్ష అని నమ్మి ఆరాధించు ఆ ప్రహ్లాదుని చంపు ఉపాయములను ఆలోచించసాగెను.
వ్యాఖ్య:-
ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. ఆయన తండ్రి హిరణ్యకశిపుడు అతన్ని విష్ణువును ప్రార్థించకుండా ఉండటానికి సర్వ విధాలా ప్రయత్నించాడు. కానీ ఆ శ్రీ మహా విష్ణువు పట్ల అతనికున్న తిరుగులేని భక్తి విశ్వాసాల ముందు ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అతను చిన్నతనం నుంచే మహాఋషుల ఉపన్యాసాలను శ్రద్ధగా ఆలకించేవాడు.
తల్లి గర్భంలో ఉండగా నారదుడు వచ్చి ఆమెకు విష్ణు ప్రవచనాలను వినిపిస్తుండేవాడు. ఆమె ఒక్కోసారి నిద్రపోయినా అవి గర్భంలో ఉన్న ప్రహ్లాదునిపై చెరగని ముద్ర వేశాయి.
ప్రహ్లాదుడు పదకొండు సంవత్సరాల వయసులో ఉండగా, ప్రజల సమస్యల మీద అవగాహన కలగాలని హిరణ్యకశిపుడు అతన్ని ఇతర సైనికులతో పాటు గస్తీ తిరగమని పంపించాడు.
ప్రహ్లాదుడు అలా తిరుగుతుండగా ఓ రోజు రాత్రి దూరంగా ఓ వైపు నుంచి పొగ, మంటలు రావడం గమనించాడు. దగ్గరికెళ్ళి చూస్తే ఓ కుమ్మరి తాను తయారు చేసిన కుండలు కాలుతూ ఉన్నాయి. అతను మాత్రం బాధ నిండిన ముఖంతో, ముకుళిత హస్తాలతో ఇలా ప్రార్థిస్తున్నాడు.
“దేవా! ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. నువ్వనుకుంటే జరగనిది ఏదీ లేదు. హే భగవాన్! దయ ఉంచు. నేను అజాగ్రత్త పరుణ్ణే, కానీ నీవు దయామయుడవు. కరుణా సముద్రుడవు! నీవొక్కనివే నా తప్పును మన్నించగలవు. నేనెంత దుర్మార్గుణ్ణైనా నీ వాడిని. నీ కృపతో ఏదైనా సాధ్యమే. ఆ పిల్లి కూనల్ని నువ్వే కాపాడాలి.”
అలా పదే పదే అనుకుంటూ ఆ కుమ్మరి ప్రార్థిస్తూనే ఉన్నాడు. అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. కుండల చుట్టూ మంటలు కమ్ముకుంటున్నాయి. ప్రహ్లాదుడికి ఇదంతా వింతగా, ఆశ్చర్యంగా అనిపించి అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాడు.
ప్రహ్లాదుడు: “ఏం జరిగింది? నువ్వేం చేస్తున్నావు?”
కుమ్మరి: “ఏం చెప్పమంటావు కుమారా! నేను కుండలు తయారు చేసి వాటిని కాల్చడానికి మంటల్లో వేశాను. వాటిలో ఒక కుండలో ఒక పిల్లి కొన్ని కూనలకు జన్మనిచ్చింది. మంటల్లో పెట్టడానికి ముందు వాటిని తీసేయాలనుకున్నాను కానీ మరిచిపోయాను. వాటిని మంటల్లో పెట్టేసి బాగా అంటుకున్న తర్వాత ఆ విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. అంతా భగవంతుడి దయ. ఆయన తలుచుకుంటే వాటిని కాపాడగలుగుతాడు. అందుకనే ఆయన్ను ప్రార్థిస్తున్నాను.” అన్నాడు.
ప్రహ్లాదుడు: “ఇది కేవలం నీ మూర్ఖత్వం, పిచ్చితనం, మంటలు అంత పెద్దవిగా ఉంటే ఆ కూనలు ఎలా బ్రతుకుతాయి?”
కుమ్మరి: “నిజం రాకుమారా! భగవంతుడు తలుచుకుంటే తప్పకుండా బ్రతుకుతాయి. ఆయన తలుచుకుంటే ఓ చిన్న విత్తనం నుంచి మహావృక్షం మొలకెత్తుతుంది. మాతృమూర్తి గర్భంలోని ఓ చిన్న ద్రవ బిందువు నుంచి ఓ చక్రవర్తిని ఉద్భవింపజేయగలడు. ఓ నీటి చుక్క నుంచే నీవు-నేను, మంచి-చెడు అనే అంతరాలు ఉద్భవించాయి. ఇవన్నీ పరమాత్ముని లీలలు కాదా?
ఆవు ఎండు గడ్డి తని తీయటి, తెల్లని పాలిస్తుంది. పాము పాలు తాగి విషాన్నిస్తుంది. తల్లి మామూలు ఆహారాన్ని పాలుగా మార్చి బిడ్డకు అందిస్తుంది. పిల్లలు పెరిగి పెద్ద వారవగానే అలా తయారవడం ఆగిపోతుంది. ఇవన్నీ భగవంతుని యొక్క అంతులేని లీలలే!”
ప్రహ్లాదుడు: “సరే, మంటలు ఆరిపోయిన తర్వాత నన్నొకసారి పిలువు. ఆ కూనలు ఎలా బ్రతికుంటాయో చూడాలని ఉంది.”
కుమ్మరి: “చిత్తం రాకుమారా! మీరు రేపు వేకువ జామునే రండి. రేపే ఆ కుండల్ని తెరిచి చూపిస్తాను”
తర్వాతి రోజు ఉదయమే ప్రహ్లాదుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ కుమ్మరి కాసేపు ధ్యానం చేసుకుని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఆ కుండలు తెరిచాడు. వాటిలో నాలుగు కుండలు సరిగా కాలలేదు. పచ్చిగా ఉన్నాయి. వాటిని తాకగానే నాలుగు పిల్లి కూనలు బయటికి దూకి పరిగెత్తాయి.
ప్రహ్లాదుని మనసులో ఎక్కడో దాగి ఉన్న ఆధ్యాత్మిక ఆలోచనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. జీవిత సారం భగవంతుడే అని గ్రహించాడు. దైవారాధన ప్రారంభించాడు. అతను విష్ణువును ఆరాధించడం చాలా మందికి నచ్చలేదు. అసుర రాజు పుత్రుడై ఉండి వారి బద్ధ విరోధి విష్ణువును ఆరాధించడమా? అని విమర్శించే వారు. కానీ ప్రహ్లాదుడు ఇవేమీ పట్టించుకోకుండా అచంచల భక్తితో విష్ణువును పూజిస్తూ ఉండేవాడు.అతని తండ్రి మొదట్లో కోప్పడ్డాడు. తర్వాత కొండల మీద నుంచి కిందకి తోయించాడు. సముద్రంలో పడవేయించాడు. ఏనుగులతో తొక్కించాడు. కానీ అవేవీ అతని విశ్వాసాన్ని కదిలించలేకపోయాయి. (అఃతర్వాహిని).
అలాగే కంచిస్వామి చెప్పిన ప్రకారం హిరణ్యకశిపుని ఆజ్ఞపై ప్రహ్లాదుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి అభిచారిక హోమాలు కూడా చేశారు. అందునుంచి కృత్య అనే శక్తి ఉద్భవించింది. అది ప్రహ్లాదుని చంపలేక హోమం చేసిన రాక్షసుల పైనే పడుతుంది. ఆ రాక్షసులు హతయోగ్యులే. చంపవద్దని సిఫార్స్ చేయడానికి వారి యెడ ఏ యోగ్యతలూ లేవు. అయినా ప్రహ్లాదుడు 'వీరు నాకెంత అపకారం చేసినా వారి యెడ నా మిత్ర భావం చెక్కు చెదరని మాట నిజమే అయితే ఈ కృత్య నుండి వారు రక్షించబడతారు గాక!' అంటాడు ప్రహ్లాదుడు. అది ఆయన అపకారికి ఉపకారం చేసే తత్వం.
18-30-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
అ-మొట్టమొదట సాత్త్వికబుద్ధిని గూర్చి చెప్పుచున్నారు-
ప్రవృత్తిం చ నివృత్తిం చ
కార్యాకార్యే భయాభయే
బన్దం మోక్షం చ యా వేత్తి
బుద్ధిస్సా పార్థ! సాత్త్వికీ
తా:- ఓ అర్జునా! ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని (లేక ప్రవృత్తిమార్గమగు కర్మమార్గమును), అధర్మమునుండి నివృత్తిని (లేక నివృత్తిమార్గమగు సన్న్యాసమార్గమును); చేయదగుదానిని, చేయదగనిదానిని; భయమును, అభయమును; బంధమును, మోక్షమును -తెలిసికొనుచున్నదో అట్టి బుద్ధి సాత్త్వికమైనది యగును.
వ్యాఖ్య:- సాత్త్వికబుద్ధి మంచి చెడ్డల రెండిటినిగూర్చి తెలిసికొని మంచిని గ్రహించి చెడ్డను వదలివేయుచుండును. అట్లే బంధము, మోక్షము రెండిటిని తెలిసికొని బంధమును పరిత్యజించి మోక్షమునుగూర్చి యత్నించును. అదేవిధమున భయరూపమగు ఈ దృశ్యసంసారస్థితినిజూచి, దానియెడల విరక్తిగలిగి, అభయరూపమగు నిత్యానంద పరమాత్మనే ఆశ్రయించి తరించును.
అట్టి సాత్త్వికబుద్ధియే ఉత్తమోత్తమమైనది. కాబట్టి అట్టి బుద్ధి తమకు కలదాయని ప్రతివారును యోచించుకొని భగవద్దృష్టిలో
బుద్ధిమంతులై వర్తించుటకు ప్రయత్నించవలెను. ఇట్టి లక్షణములుగల బుద్ధిలేనిచో ఎంతటి పాండిత్యము, లౌకికప్రజ్ఞ యున్నప్పటికిని జనులు బుద్ధికొఱవడినవారే యగుదురు.
ప్ర:- సాత్త్విక బుద్ధి ఎట్టిది?
ఉ:- (1) ధర్మప్రవృత్తిని (లేక ప్రవృత్తి మార్గమును),
(2) చేయదగినదానిని, జేయదగనిదానిని,
(3)భయమును, అభయమును,
(4) బంధమును, మోక్షమును -
వీనిని చక్కగ తెలుసుకొను బుద్ధియే సాత్త్వికబుద్ధి యనబడును.
*****
🌹. గీతోపనిషత్తు -105 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 33. కర్మ నిర్వహణ జ్ఞానము - ఈ ప్రపంచములో జ్ఞానముతో సమానమైన పవిత్రత కలిగినది ఏదియు లేదు. ఈ నిష్కామ కర్మయోగ జ్ఞానము కాలక్రమమున యోగసిద్ధిని గావించి, సాధకునకు 'తాను' ఎవరో స్వయముగ తెలుపును. పరమ పవిత్ర స్థితియే విభూతి. ఆచరణ యందలి నిష్కామత, ఫలమునందు నిరాసక్తి, నిర్వహణము నందు త్రికరణ శుద్ధి, సిద్ధించిన కార్యము లందు మమకార పడకుండుట మాత్రమే మార్గము. జ్ఞానము సర్వము కర్మనిర్వహణ జ్ఞానమే 🍀
యథైధాంసి సమిద్దాం గ్ని ర్భస్మసాత్ కురుతేట ర్జున |
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా || 37
న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే |
తత్స్వయం యోగ సంసిద్ధః కాలే నాత్మని విందతి || 38
ఓ అర్జునా! బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలనే ప్రకారముగ భస్మీభూత మొనర్చుచున్నదో, ఆ ప్రకారముగనే, జ్ఞానమను అగ్ని సమస్త కర్మలను భస్మము చేసి వేయును. ఈ ప్రపంచములో జ్ఞానముతో సమానమైన పవిత్రత కలిగినది ఏదియు లేదు. ఈ నిష్కామ కర్మయోగ జ్ఞానము కాలక్రమమున యోగసిద్ధిని గావించి, సాధకునకు 'తాను' ఎవరో స్వయముగ తెలుపును.
కోరికలు, ఆవేశకావేశములు, స్వార్థచింతన, అహంకార పూరితమగు భావనలు, ఫలములం దాసక్తి, కార్యములందు వక్రత, తనదనుకొను వానియందు మమకారము పచ్చి కట్టెల వంటివి. అట్టి కట్టెలు అగ్నికార్యమునకు పనికిరావు.
కేవలము చివికి నశించుట జరుగును. ఎండుకట్టె అగ్ని స్పర్శతో త్వరితముగ మండగలదు. స్థితి మార్పులు పొందగలదు. పవిత్రీకరింపబడి, విభూతియై మిగులగలదు. విభూతి పరమ పవిత్రము. కారణమేమనగ అగ్ని దానిని ఏమియును చేయలేదు. పరమ పవిత్ర స్థితియే విభూతి. అగ్నివలననే కట్టె విభూతిగ మారుచున్నది.
జ్ఞానము వలననే మనిషి మహాత్ము డగుచున్నాడు. జ్ఞానమనగ, కర్మలను నిర్వర్తించు జ్ఞానము. కర్మ నిర్వహణమున పాత కర్మలు, ప్రస్తుత కర్మలు నశించవలెను. క్రొత్తకర్మలు పుట్టరాదు. వ్యక్తిగత కర్మము నుండి విమోచనము పొందినవారు దివ్యకర్మయందే చిరకాలము జీవించుచు నుందురు. శాశ్వతులుగ నుందురు.
అట్టివారు భగవత్ విభూతియే. కేవలము దైవమే వారి నుండి వ్యక్తమగుచు, శ్రేయస్సు చేకూర్చుచు నుండును. స్వయముగ భగవంతుడే వారియందు ఉపస్థితుడై యుండుటచేత 'స్వయమును' గూర్చి కూడ వారు కాలక్రమమున తెలిసిన వారగుదురు.
ఈ రెండు శ్లోకములలో స్థూలముగ మూడు పురోగమన ములు గోచరించును.
1. జ్ఞానముతో కూడి నిర్వర్తించు కర్మ వలన కర్మ నాశనము క్రమముగ నగుట.
2. కర్మమోచనము పొందినవారు పవిత్రులై నిలచి దివ్య కార్యములకు సమర్పణ చెందియుండుట.
3. దైవము తమనుండి దివ్యకర్మను వ్యక్తము చేయుచుండగ, కాలక్రమమున తామెవ్వరో తమకు తెలియుట.
ఇట్లాత్మజ్ఞానము కర్మ నిర్వర్తించు జ్ఞానము నుండే పొంద వచ్చని, మరియొక మార్గము లేదని దైవము సూచించు చున్నాడు. ఎంత తెలిసినను, ఎంత పాండిత్యమున్నను, ఎన్ని విధములగు విద్యలు నేర్చినను, ఆచరణ యందలి నిష్కామత, ఫలమునందు నిరాసక్తి, నిర్వహణమునందు త్రికరణ శుద్ధి, సిద్ధించిన కార్యము లందు మమకార పడకుండుట మాత్రమే మార్గము. జ్ఞానము సర్వము కర్మనిర్వహణ జ్ఞానమే అని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[17:46, 22/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 304 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
74. అధ్యాయము - 29
🌻. దక్ష యజ్ఞములో సతి - 2 🌻
ఓరీ! ఇంద్రా! నీవు మహాదేవుని పరాక్రమమునెరుంగవా? క్రూరమగు కర్మలను చేయగలిగే హరునిచే నీ వజ్రము భస్మము చేయబడినది (21). ఓ దేవతలారా!మహాదేవుని పరాక్రమమును మీరెరుంగరా? ఓయీ అత్రీ !వసిష్ఠా! మునులారా !మీరిచట ఏమి చేసినారు ?(22) పూర్వము దారువనములో ఆ రుద్ర విభుడు భిక్షాటమును చేసినాడు. ఏలయన, ఆ సమయములో మునులగు మీరు ఆయనను భిక్షుడవు కమ్మని శపించిరి (23). అట్లు శపించిననూ రుద్రుడు ఏమి చేసినాడో మరిచినారా ఏమి? లింగ రూపుడగు శివుడు స్థావర జంగమాత్మకమగు జగత్తునంతనూ దహించివేసినాడు (24).
విష్ణువు బ్రహ్మ మొదలగు సర్వ దేవతలు, మునులు, ఇతరులు శంకరుడు లేని ఈ యజ్ఞమునకు వచ్చి మూర్ఖులైరి (25). ఎవని నుండి సర్వవేదములు, వేదాంగములు, శాస్త్రములు, వాక్కు పుట్టినవో, ఎవడు వేదాంతములచే ప్రతిపాదింపబడుచున్నాడో, అట్టి శంభుని కొందరు మాత్రమే తెలియగలరు. ఇతరులకు ఆయన అందడు (26).
బ్రహ్మ ఇట్లు పలికెను -
జగన్మాతయగు సతీదేవి కోపముతో కూడియున్నదై దుఃఖితమగు హృదయముతో అచట ఇట్టి అనేకములగు పలుకులను పలికెను (27). విష్ణువు మొదలగు సర్వ దేవతలు, మునులు భయముచే కల్లోలితమగు మనస్సులు గలవారై ఆమె మాటలను విని మిన్మకుండిరి (28). అపుడు దక్షుడు తన కుమార్తె యొక్క ఆ పలుకులను విని, ఆ సతిని క్రూరమగు చూపులతో చూచి, కోపమును పొంది, ఇట్లు పలికెను (29)..
దక్షుడిట్లు పలికెను -
నీవు అధిక ప్రసంగము నేల చేయుచున్నావు ?ఇపుడునీ కిచట పని లేదు. ఓ మంగళ స్వరూపులారా! వెళ్లెదవా ?ఉండెదవా? నీవు ఏల వచ్చితివి ?(30). నీ భర్తయగు శివుడు అమంగళుడనియు, కులహీనుడనియు, వేద బహిష్కృతుడనియు, భూత ప్రేత పిశాచములకు రాజనియు పండితులు చెప్పుచున్నారు (31). అందువలననే , ఓ పుత్రీ! విద్వాంసుడనగు నేను ఈ సత్యము నెరింగి మిక్కిలి చెడు వేషమును ధరించు రుద్రుని దేవతలు, ఋషులు కొలువు దీర్చియున్న ఈ యజ్ఞమునకు ఆహ్వానించలేదు (32).
బుద్ధిహీనుడు, పాపియగు బ్రహ్మ ప్రేరేపించగా నేను, వేదతాత్పర్యము తెలియనివాడు, గర్విష్ఠి, దుర్మార్గుడనగు రుద్రునకు నిన్ను ఇచ్చి వివాహమును చేసితిని (33). ఓ స్వచ్ఛమగు చిరునగవు గలదానా !కాన నీవు కోపమును వీడి స్వస్థురాలవు కమ్ము. నీవు ఈ యజ్ఞమునకు ఎటులైననూ వచ్చితివి గాన, దీనిలో పాలు పంచుకొనుము (34).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుడిట్లు పలుకగా, దక్షుని కుమార్తె, ముల్లోకములకు పూజ్యురాలునగు ఆ సతి నిందావచనములను పలుకు తన తండ్రిని చూచి మిక్కిలి కోపమును పొందెను (35). అపుడామె ఇట్లు తలపోసెను. నేను శంకరుని వద్దకు ఎట్లు పోగలను ? నాకగు శంకరుని చూడవలెనని యున్నది. ఆయన వివరములనడిగినచో, నేను ఏమి సమాధానము నీయగలను ? (36) అపుడు ముల్లోకములకు తల్లియగు ఆ సతి క్రోధముతో కూడినదై, నిట్టూర్పులను విడచుచున్నదై, దుర్బుద్ధియగు ఆ దక్షునితో నిట్లనెను (37).
సతి ఇట్లు పలికెను -
ఎవడు మహాదేవుని నిందించునో, ఎవడు మహాదేవుని నిందను వినునో, వారిద్దరు సూర్యచంద్రులున్నంత వరకు నరకములో నుందురు (38). కావున నేను దేహమును వీడెదను. అగ్నిని ప్రవేశించెదను. తండ్రీ !నా ప్రభువును గూర్చి అనాదరముతో నీవు పలికిన పలుకులను విన్న నాకు జీవతముతో పనియేమి ?(39).
శక్తిగలవాడు శంభుని నిందించువాని నాలుకను బలాత్కారముగా కోసివేయవలెను. అపుడా నిందావచనములను విన్న అశుద్ధి నిస్సందేహముగా తొలగిపోవును (40). అట్లు చేయ శక్తిలేని బుద్ధిమంతుడగు మానవుడు చెవులను గట్టిగా మూసుకొని అచటి నుండి తొలగిపోయినచో, ఆతడు శుధ్ధుడగునని గొప్ప పండితులు చెప్పుచున్నారు (41)|
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:46, 22/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 190 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. వసిష్ఠమహర్షి-అరుంధతి - 3 🌻
12. ఒక గృహస్థాశ్రమంలోనే యోగము, భోగము, తపస్సు, దానము, త్యాగము, ధర్మము, సంగానికి ఋణం తీర్చుకోవడము – ఇటువంటివన్నీ సాధ్యమవుతాయి. అటువంటి ఆదర్శమైన గృహస్థధర్మాన్నే మన ఋషులు సాధించారు.గృహస్థ ధర్మం అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మహర్షులనే జ్ఞాపకం తెచ్చుకోవాలి. సంసారం బంధనం, బాధ అంటాం కాని; ఆ సంసారంలోనే ధార్మికదృష్టి కలిగిన వాడికి ఋణాలు తీర్చుకోవడానికి, ధర్మం అవలంబించడానికి, తపస్సు చేసుకోవడానికి అవకాశంఉంది.
13. సంసారంలో ఇబ్బందులు, బాధలు పుణ్యం లేకపోవడంవల్ల వస్తాయి. పూర్వపుణ్యం లేనటువంటి సంసారం చాలా కష్టభూయిష్టమైనది. అటువంటి సంసారంలోకూడా ఉత్తములు తపోభంగం లేకుండా జీవించారు. వాళ్ళ తపస్సుకు, నిష్ఠకు, ధర్మానికి ఏ భంగమూ కలుగకుండా వారు సంసారక్లేశాలను అనుభవించారు. కష్టంలేని సంసారమైనప్పటికీకూడా, ఇవన్నీ చేయగలమని అనుకోకూడదు. ఎన్నో కష్టాలు పడుతూకూడా మన పూర్వులు తమ ధర్మనిష్టలో లోపంరాకుండా జీవించారు. అదే భారతీయ ఆదర్శం.
14. తీవ్రమైన కోరికకలిగినా, దుఃఖంకలిగినా, గొప్ప అవమానం జరిగినా – ఈ లోకవ్యవహారాన్ని వదిలిపెట్టి తపస్సుకు వెళ్ళటమనేది ఆనాడు ఆర్యుల విధానం. ఆ తపస్సులోతప్ప శాంతికలుగదు.
15. విశ్వామిత్రుడు వసిష్ఠునిపై దండెత్తినప్పుడు, విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రసంపదంతా ఆ బ్రహ్మాండంలో లయమైపోయింది. అది నిర్గుణమైన బ్రహ్మవస్తువు. దాంట్లోంచే సగుణమైన జగత్తంతా పుట్టింది. అందువల్ల జగత్తంతా అందులో లయంచెందవలసిందే. ఈ జగత్తులో ఎటువంటి శక్తి అయినా, పదార్థమైనా, లక్షణమైనా, బలమైనా, అస్త్రమైనా బ్రహ్మలో లీనంకావలసిందే.
16. దేనియందు సృష్టియంతా లయం చెందుతుందో దానికి ప్రతీకయే ఆ బ్రహ్మదండం. అంతేకాని వసిష్ఠుడు ప్రత్యస్త్రప్రయోగం చేయడు.తిరిగి వేరే అస్త్రాలతో యుద్ధంచేయటం అనేది అవిద్యామూలకమైనదవుతుందే తప్ప, వస్తువులను లయంచేసే బ్రహ్మవస్తువు కాదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:46, 22/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 129 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 8 🌻
531. భగవంతుని చైతన్యస్థితియే - పరమాత్మ.
532. భగవంతుడు, తాను పరాత్పరునిగా శాశ్వతుడనైయున్నానని, తన అస్తిత్వమును ఎఱుకతో అనుభవించుటయే పరమాత్మస్థితి. ఈ సత్యానుభవము ఒకసారి ప్రాప్తించినచో అది శాశ్వతముగా నిలిచి యుండును.
533. పరమాత్మలో నున్న ఆత్మ జీవాత్మయై, సంస్కారముల నుండి ముక్తి పొంది, పరమాత్మలో, శివాత్మయైనది. పరమాత్మలో లీనమై పరమాత్మతో తాదాత్మ్యత చెంది, తాను పరమాత్మనని అనుభూతి నొందుచున్నది.
534. 'పరమాత్మయే ఆత్మ' అన్నది శాశ్వత సత్యము.
535. ప్రశ్న:- వాస్తవికముగా ఆత్మయే పరమాత్మ అయితే, ఆత్మకు అప్పుడు పరమాత్మలో లీనము కావలెనెడి పరిస్థితి దానికెట్లు కలుగుచున్నది?
జవాబు:- వాస్తవమునకు ఆత్మయే పరమాత్మయని గ్రహించుటకై మనము పరమాత్మను అనంత అపార సాగరముతో పోల్చుకొందము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:22, 23/12/2020] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 587 / Bhagavad-Gita - 587 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 04 🌴
04. నిశ్చయం శ్రుణు మే తత్ర త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పరుషవ్యాఘ్ర త్రివిధ: సమ్ప్రకీర్తిత:
🌷. తాత్పర్యం :
ఓ భరతశ్రేష్టా! పురుషవ్యాఘ్రా! త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము.శాస్త్రములందు అట్టి త్యాగము మూడువిధములని తెలుపబడినది.
🌷. భాష్యము :
త్యాగమును గూర్చి పలు అభిప్రాయములున్నను శ్రీకృష్ణభగవానుడిచ్చట దాని యెడ తన నిర్ణయమును తెలియజేయనున్నాడు. దానినే తుది నిర్ణయముగా భావింపవలెను. సత్యమెరిగినచో వేదములనునవి భగవానుడు ఒసగిన వివిధ నియమములే. అట్టి భగవానుడే ప్రత్యక్షముగా నిలిచియుండి పలుకుచున్నందున అతని వాక్యమును తుది నిర్ణయముగా స్వీకరింపవలెను.
ఏ గుణమునందు నిర్వహింపబడినదనెడి విషయము ననుసరించి త్యాగమును గుర్తింపవలెనని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
[06:22, 23/12/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 140 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 70 🌻
కాబట్టి, ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి ప్రాదుర్భవించింది? అంటే, ప్రాణ చలనం చేత ప్రారంభమయ్యింది. అసలు ప్రాణ చలనమే లేకపోతే? ఏ జీవులూ లేరు. కాబట్టి, విశ్వయోని నుంచి జీవ సృష్టి అంతా వచ్చింది అన్నారు.
‘విశ్వయోని’ అనే పేరు పెట్టడంలోనే తెలుసుకోవాలన్నమాట. సాకారం కాదు. నిరాకార పద్ధతి. నిరీంద్రియ పద్ధతి. ప్రాణచలన ప్రభావ రూపమైనటువంటి హంస యొక్క చలనం ప్రారంభమయ్యింది. తద్వారా జీవపదార్థం జీవాణువుల యొక్క చలనం ప్రారంభమయ్యింది.
లేకపోతే శుక్ల శోణితాలు తమంత తాము ఎలా చెలిస్తున్నాయి? తమంతట తాము ఎట్లా కలుస్తున్నాయి? తమంతట తాము సంవిత్ బిందువుగా ఎలా ఏర్పడుతున్నాయి? తమంతట తాము జీవాణువులుగా మరలా ఎలా విభజన పొందుతున్నాయి? కాబట్టి, చలనమంతా ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఈ వాయుచలనం మీద ఆధారపడి ఉంది.
కదల్చగలిగేటటువంటి శక్తి, ఎండించ గలిగేటటువంటి శక్తి, లయింప జేయగలిగే శక్తి, దేనినైనా కూడా తనయందు ఇమిడ్చుకో గలిగినటువంటి శక్తి, అంతా కూడా ఈ వాయువు చేతిలోనే ఉంది. పోషించాలన్నా ఈ వాయువే. లయింప చేయాలన్నా కూడా ఈ వాయువే. సమస్త అగ్ని పంచకము, సూర్యుడులో ఉన్నటువంటి ప్రాణశక్తి ‘రై’ అనేటటువంటి శక్తిగా విడుదల అవుతు ఉంటుంది.
ప్రళయకాలమందు అంటే ఈ సూర్యుడు మొత్తం నవగ్రహాలను వెనుకకు తీసుకుని, తన ఆత్మరక్షణను విరమిస్తాడు. ఆ వెంటనే ఎలా అయితే ఇది ఇప్పటి వరకూ తమ తమ కక్ష్యలలో పనిచేస్తూ ఉన్నాయో, కక్ష్యలన్నీ కొలాప్స్ [collapse] అయిపోతాయి. తన యందు ఒకదానికొకటి ఢీకొంటాయి. ఢీకొని విరమణ చెంది, మరలా ఆ సూర్యుడి యందు లయమైపోతాయి.
ఆ సూర్యుడు కూడా లేకుండా పోతాడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా! ఆ నక్షత్రం కాస్తా డెడ్ స్టార్ [Dead Star] అయిపోతుంది. బ్లాక్‌హోల్ [Black Hole] అయిపోతుంది. కృష్ణబిలం అయిపోతుంది. వెంటనే ఆ కృష్ణ శక్తి వలన అప్పటి వరకూ ఉన్న సమస్త బ్రహ్మాండ సృష్టి కూడా తనలోనికి లాగేసుకునింది. లాగేసుకునేప్పటికి ఎక్కడినుంచైతే విచ్ఛిన్నమై, ఉత్పన్నమైనాయో మరలా ఆ స్థానమునందే ప్రళయకాలమందు లయించబడిపోతాయి.
చిట్ట చివరికి లయించబడేది ఏమిటంటే ఆకాశ పంచకం. ఆ ఆకాశ పంచకం ఎట్లా లయించబడుతుంది?
ఆకాశంలో ఆకాశం - గురుమూర్తి చెప్పుకున్నాంగా!
ఆకాశంలో వాయువు - చంద్రుడు,
ఎవరమ్మా? ఆకాశంలో వాయువు?
చంద్రుడు - ఆ మనస్సు కదా!
మనస్సు యొక్క అధిదేవత - చంద్రుడు.
కాబట్టి, ఈ చంద్రుడు కూడా వెళ్ళి పోతాడు. ఈ రకంగా బృహస్పతి వెళ్ళిపోతాడు. ఆ రకంగా రుద్రడు వెళ్ళి పోతాడు. ఇట్లా అందరూ ఈ అధిష్ఠాన దేవతాగణం అంతా చిట్ట చివరికి జ్ఞాత స్థానంలోకి లయం అయిపోతుంది. క్షేత్రజ్ఞుడు వెళ్ళిపోతాడు. క్షేత్రములు వెళ్ళిపోతాయి. ఆ అక్షర పురుష స్థితిలోకి చేరిపోతాయి. బ్రహ్మము అయినటువంటి గురుమూర్తి స్థితిలోకి చేరిపోతాయి.
ఆ బ్రహ్మము కూటస్థుడు. ఈ అధిష్ఠాన దేవత సముదాయము, పంచతన్మాత్రలు, పంచశక్తులు, పంచబ్రహ్మలు ఇదంతా బ్రహ్మాండం అన్నమాట. ఇదంతా సూక్ష్మాతి సూక్ష్మం. ఆదిదైవతం. ఇదేమో బ్రహ్మాండం. పిండాండానికి వచ్చేటప్పటికి ఆ యా రకములైనటువంటి గోళకములు, ఏమిటి?
కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, అంతరేంద్రియాలు ఆ రకమైనటువంటి ఇంద్రియ వ్యవస్థ అంతా కూడా పిండాండం. ఈ రకమైనటువంటి దేవతా వ్యవస్థీకరణ అంతా కూడా బ్రహ్మాండం. ఇదంతా కూడా ఆదిదైవతం అన్నమాట. ఇది బ్రహ్మాండ పంచీకరణ.
ఈ రకంగా పిండాండము, బ్రహ్మాండము.... ఒక దానియందు ఒకటి ఇమిడి ఉన్నట్లుగా తోస్తూఉన్నది. ఈ రకంగా ఈ సమస్థ సృష్టి, స్థితి, ప్రళయములకు ముందున్నటువంటి .... ఎందుకని ఆ పైన 1, 2, 3 అని వేసి ఉంటుంది. ఒకటి, రెండూ, మూడు ఏమిటి?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:22, 23/12/2020] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 14 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 14 🍀
నిత్య సత్యమిత్ హరిపార్ జ్యాసీ!
కళికాళ్ త్యాసీ న పాహే దృష్టి!!
రామకృష్ణ ఉచ్చార్ అనంతరాశీ తప్
పాపాచే కళప్ పళతీపుడే!!
హరి హరి హరి హా మంత్ర శివాచా!
మణ తీ జే వాచా తయా మోక్ష!!
జ్ఞానదేవా పార్ నారాయణ నామ్!
పావిజే ఉత్తమ్ నిజస్థాన్!!
భావము:
నిత్య సత్యమైన హరి పాఠమును అమితముగా పాడే వారిని కలికాలము కన్నెత్తి కూడా చూడదు.
రామ కృష్ణ నామోచ్చరణ అనునది అనంతరాశుల తప: ఫలముతో సమానము కావున వారి పాప సమూహమంత ముందుకు పారిపోతుంది.
హరి హరి హరి అని శివుడు జపించే ఈ మంత్రమును నాలుకతో పాడే వారికి మోక్షము లభించును. నారాయణ నామాన్ని పాడిన వారు నిజధామాన్ని పొందగలరని జ్ఞానదేవులు తెలిపినారు.
🌻.
సశేషం....
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 157 / Sri Lalitha Chaitanya Vijnanam - 157 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖
🌻157. 'రాగమథనీ'🌻
రాగద్వేషాది క్లేశములను మథించునది శ్రీదేవి అని అర్థము. ఇచ్ఛా పరిపూర్తి గూర్చి ముందు నామములో తెలుపబడినది. అట్టి సాధనమున, కాలమును, కర్మమును బట్టి రాగద్వేషములు ఏర్పడుచుండును. కామక్రోధములు కలుగుచుండును. లోభమోహములు ఆవరించుచుండును. విజయము కలిగినప్పుడెల్ల మదమున కవకాశముండును. ఇతరులకు విజయము కలిగినపుడు మాత్సర్య భావములు కలుగును. ఇవి అన్నియూ తన వృద్ధికై జీవుడు పనిచేయుచున్న సమయమున కలుగు మలినములు. వీటి వలన దుఃఖము, బంధము కలుగును.
జీవుడు తన కొరకై తాను పాటుపడుట సహజము. ఇహపర సౌఖ్యమునకు ప్రయత్నించువాడు జీవుడు. ఇది సత్సంకల్పమే. అట్టి సంకల్పమును నిర్వర్తించు సమయమున పై విధమగు క్లేశములుండుట సృష్టి ధర్మము. వానిని తొలగించుకొనుట జీవుని కర్తవ్యము. అవి తొలగింపబడుటకు శ్రీదేవి ఆరాధనము ఎంతయో తోడ్పడగలదు.
అసురశక్తులను మథించి, సురశక్తులను వృద్ధి గావించి, జీవుల వృద్ధికి తోడ్పాటు చేయునది శ్రీదేవి. దైవీశక్తులు జీవుల యందు పెంపొందింప బడుటకు అసురశక్తుల మథనము కూడ ముఖ్యమై ఉన్నది. భండాసురాది అసురశక్తులను వధించుటలో శ్రీమాత సిద్ధహస్త. ఆమె ఆరాధనముననే అసురశక్తులు మథింపబడగలవు.
సశేషం...
శ్రీ గణనాయకాష్టకం
1) ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్!
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్!!
2) మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్!
బాలేందుశకలం మౌళీ, వందేహం గణ నాయకమ్!!
3) చిత్రరత్నవిచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్!
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్!!
4) గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్!
పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్!!
5) మూషి కోత్తమ మారుహ్య దేవాసురమహాహవే!
యోద్ధు కామం మహావీరం వందేహం గణ నాయకమ్!!
6) యక్షకిన్నెర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా!
స్తూయ మానం మహా బాహుం వందేహం గణ నాయకమ్!!
7) అంబికాహృదయానందం, మాతృభి: పరివేష్టితమ్!
భక్తిప్రియం మదోన్మత్తం, వందేహం గణ నాయకమ్!!
8) సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్!
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణ నాయకమ్!!
9) గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః!
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్!!
ఇతి శ్రీ గణనాయకాష్టకమ్.
🕉🌞🌎🌙🌟🚩
నిరత్సాహపరచే ఆలోచనలు వస్తే వాటిని బయటకు పారద్రోలు. నీ మనస్సును ఎల్లప్పుడూ ఉన్నత ఆశయాలతో నింపు.
****
పవిత్రత లోపించిన ఆలోచన, అపవిత్రమైన కార్యంతో సమానమైనదే. కోరికల్ని అదుపుచేస్తే, ఉన్నత లక్ష్యాలను చేరవచ్చు. లైంగికశక్తిని ఆధ్యాత్మిక మార్గంలోకి మరల్చండి.
*****
జ్ఞానిని, అజ్ఞానిని అనుకరించకూడదు
ఎవరిని మీరు అనుకరించాలి అంటే ? ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు, ఒక అజ్ఞానినీ మీరు అనుకరించకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండీ ఈ విషయం... ఒక జ్ఞానిని అనుకరించలేరు !
ఒక భగవాన్ రమణులు గోచీ పెట్టుకొన్నారుగదాని మీరూ గోచి పెట్టుకుని ఆయలా తిరిగితే మీరు రమణమహర్షి అవడం సాధ్యంకాదు. భగవాన్ రమణులూ.. ధ్యానంలో ఉండగా... ఆయన తొడలకింద తేళ్ళూ, జ్జెర్రులూ పట్టుకొని తొడలు కొరుక్కుతినేసి నెత్తురు కాల్వలై ప్రవహించినా... ఆయనకు శరీరమునందు సృతిలేదు. ఆయనలా గోచీ పెట్టుకోగలవేమో... ఆయనలా... నువ్వు ఆ స్థితిలో నిలబడిపోయి బాహ్మము నుంచి విడిపడిపోవడం నీకు సాధ్యమవుతుందా ?
జ్ఞానిని అనుకరించ వద్దూ... జ్ఞానిగా అయిన తరువాత, నీవు జ్ఞానివి కాగలిగితే... నీ స్థితి నీ కొస్తుందప్పుడు, నీవు జ్ఞానివైపోయినట్టూ...
రమణులు ఎలా ఉంటారో, రామకృష్ణ పరమహంస ఎలాఉంటారో, ఒక చంద్రశేఖర సరస్వతి ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖర భారతి ఎలా ఉంటారో అలా ఉండే ప్రయత్నం నీవు చేయకూడదు. అది సాధ్యమయ్యే విషయం కాదు.
చంద్రశేఖర భారతీ... పుష్పార్చన చేస్తూ... చేస్తూ... సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే బిందెలతో నీళ్ళు తెచ్చి ఆయనమీద పోసేసేవాళ్ళు. ఆయనకు బాహ్య స్పుృతి ఉండేది కాదు. ఒళ్ళుతుడిచేసి బట్టలాగేసి, చుట్టేసేవారు. అలాగే ఉండేవారు. కొన్ని రోజులు అదే సమాధి స్థితిలో ఉండేవారు.
ఏదీ అలా నేను కూడా నటిస్తానండీ అంటే కుదిరే విషయమా ! అది సాధ్యం కాదు. జ్ఞానిని అనుకరించ రాదూ అనుకరించే ప్రయత్నమూ చేయ్యకూడదు. లేదా జ్ఞానిని అనుకరించలేవు. అజ్ఞానినీ... అనుకరించరాదు.
జ్ఞానీ సంధ్యావందనం చేయకపోవచ్చూ, జ్ఞానీ బట్టకట్టకపోవచ్చు, ఒక అజ్ఞానీ బట్ట కట్టకపోవచ్చూ, తండ్రికి తద్దినం పెట్టకపోవచ్చూ, వాడు చేస్తున్నాడని నీవు చేయకూడదు. ఈ రెండిటికి మధ్యలో నీ పరిధి తెలుసుకొని నీవు ప్రవర్తిస్తే పైకి ఎక్కుతావు, ఈ ఎక్కేటటువంటి ప్రస్తానమునకు సాధన అని పేరు.
అజ్ఞానికి చూసి అలా చేయకుండా ఉండడం, జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకపోవడం, అజ్ఞానిచూసి వాడు బాగుపడాలని కోరుకొని, నీవు జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయడానికి నిశ్ఛలమైన చిత్తంతో కర్మాచరణం చేసేటటువంటి ప్రక్రియకు సాధనా అని పేరు శాస్త్రంలో..!
: శ్రీరమణీయం - (749)
"సాధనలో ధర్మనిరతికి కావలసినవి ఏమిటి !?"
మనందరికీ భక్తి, విశ్వాసం, ఏదోక విధమైన సాధనామార్గాలు ఉన్నాయి. కానీ దైవదర్శనానికి అవసరమైన ధర్మం విషయంలోనే లోపం జరుగుతుంది. అందుకే భగవాన్ శ్రీరమణమహర్షి సద్ధర్మాచరణలో సుస్థిరులై సన్మార్గంలో జీవిస్తూ విచలితులు కాకుండా ఉంటేనే ఆత్మానుభవానికి, దైవానుగ్రహానికి కావలసిన బలం పెరుగుతుందని సూచించారు. ధర్మనిరతికి కావాల్సిన మనోబలం కోసం భక్తి, సత్సంగాలు ఉపకరిస్తాయని బోధించారు. భగవంతుని స్మరణకు, భగవద్ధర్శనానికి మధ్య ధర్మం అనే వారధి యొక్క ఆవశ్యకతను బోధిస్తున్న విచారణమార్గమే మనకు అభినవ భగవద్గీత !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
దైవస్మరణ ధర్మబలాన్నిస్తే.. ధర్మం దైవదర్శనం చేయిస్తుంది !''- (అధ్యాయం -92)
🕉🌞🌎🌙🌟🚩
[13:28, 23/12/2020] +91 92915 82862: "ఋభుగీత " (216)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
సత్యం అర్ధమైన మనసు నిష్కామం అవుతుంది !
భౌతిక జీవనంలో రూపనామలకు ఉన్న ప్రాధాన్యతను మానసికంగా కూడా ఆపాదించడం వల్లనే మనసు ఆనందానికి దూరం అవుతుంది. మనసే ఆనందం. దానికి ఆనందాన్ని కలిగించాల్సిన అవసరం లేదు. ఇది అర్థమైతే మనసుకి కోరికలు నశిస్తాయి. కోరిక కలిగింది అంటే మనసు దేన్నో అడుగుతుందని అర్థం. మనసు అడిగేదంతా దానికి తెలిసిన దాన్నే అడుగుతుంది. మనసుకు తెలిసేది ఎదైనా మనసులో నిలబడి ఉండేది కాదు. ఎంత పెద్ద అనుభవమైనా మనసు పరంగా తీసుకుంటే దానికి శాశ్వతత్వం ఉండదు. ఈ విషయం అర్థమైతే కోరికల అవసరం ఏమిటో అర్థమై, క్రమేణా మనసు నిష్కామం అవుతుంది !
🕉🌞🌎🌙🌟🚩
[13:40, 23/12/2020] +91 92915 82862: 🌷107-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
అధ్యాయము-9
రాజవిద్య-రాజగుహ్యము
17. జగత్తు నా వలన కలుగుచున్నది కనుక నేను తండ్రిని. నా యందు కలుగుచున్నది గనుక నేను తల్లిని. నా నుండి సృష్టి క్రమమందుచున్నది కనుక నేను సృష్టికర్తను. జీవునకు తండ్రి, వాని తండ్రి నుండి పుట్టును గనుక నేను పితామహుడను. ఏ వస్తువును గూర్చి తెలుసుకొనినను అందు నేనుందును కనుక నేను వేద్యము. ఈ స్థితిలేవియు నన్నంటవు కనుక నేను పవిత్రుడను. నా నుండి సృష్టి ఉచ్చారణ పొందుతున్నది గనుక నేను 'ఓం'కారము. కంఠధ్వని కలుగు కారణము నేను కనుక నేను ఋగ్వేదము. దానికి ముందున్న శ్వాస నా ప్రభావమున కలుగుచున్నది గనుక నేను శ్వాసమూలమగు లయబద్ధ గానము, అనగా సామవేదము. జ్ఞానము నుండి ఆచరణలోనికి జీవులను ప్రేరేపించు ప్రకృతిని గనుక యజుర్వేదము.
18. దేశ కాలములు, అన్న పానీయములు, జీవనోపాధి నిచ్చువాడు నాయందే గనుక నేనే గతి, భరించు వాడను, ప్రభువును. నేను కల్పించుకొనను కనుక వారి కర్మలకు నేనే సాక్షి. నివాసము ఏ భావము నందు భయము తీర్చు మిత్రాదుల రూపమునందు ఉంటిని గనుక నేనే శరణము. వారి ఉత్పత్తి స్థానము, లీనమగు స్థానము నాయందే. ఉన్నది నాయందే. విత్తనమున అంకురశక్తి తాను పెరగకుండ దేహముగా పంచభూతములను పెంచుచున్నది. అట్టి బీజశక్తి నేను.
19. సూర్యునిలో వేడిగా, ఎండగ నన్ను నేను కల్పన చేసుకొని భూమిపై జలములుగా కల్పించుకొని, ఎండ వేడిమిచే నీటిని మేఘములుగా ఆకర్షించి వర్షములుగా విడుచుచున్నాను. ఇది తరుగకుండునట్లు కల్పించితిని కనుక పంచ భూతములకు ఆహార రూపమున అమృతత్వమును కల్పించితిని. ఎప్పటికప్పుడు మారుచుండుట అను మృత్యువును కూడా కల్పించితిని. తిరుగుట ఉన్నప్పుడు మారుట ఉండును. అన్నము కావలసినచో మేఘములు కావలెను. కనుక మృత్యువను మార్పు అమృతత్వమునకు తప్పనిసరి. ఇట్లు మంచిచెడ్డలుగా కనిపించు కల్పన నేను.
🕉🌞🌎🌙🌟🚩
[13:40, 23/12/2020] +91 92915 82862: 120) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
తత్తేదంతే అపి స్వత్వమివ త్వమహమాదిషు ౹ సర్వత్రానుగతే తేన తయోరప్యాత్మతేతి చేత్ ౹౹47౹౹
47.(ఆక్షేపము)స్వత్వశబ్దము వలె ఇది,అది అనే శబ్దములు కూడా నీవు,నేను,అతడు అనే మూడు పురుషుల యందూ అన్వయించుటచే అవి కూడా ఆత్మార్థకములగును కదా.
తే ఆత్మత్వేఽ ప్యనుగతే తత్తేదంతే తతస్తయో ౹ ఆత్మత్వం నైవ సంభావ్యం సమ్యక్త్వాదేర్యథాతథా౹౹48౹౹
48.(సమాధానము)ఇది,అది అనే పదములు మూడు పురుషుల యందు మాత్రమే గాక ఆత్మయందు కూడా అన్వయించును.కనుక అవి సమీచీనత్వము వలె విస్తృతతరమైన అర్థము గలవి. అందుచే అది ఇది అనే పదములు ఆత్మార్థకములు కావు.
తత్తదంన్తే స్వత్త్వన్యత్వే త్వన్తాహన్తే పరస్పరమ్ ౹ ప్రతిద్వంద్వితయా లోకే ప్రసిద్ధే నాస్తి సంశయః ౹౹49౹౹
49. అంతేగాక ఇది-అది,
ఆత్మ-ఇతరము,నీవు-నేేను, అనునవి పరస్పర వ్యతిరేక పదములని లోకమున ప్రసిద్ధమే. అందు సంశయమేమియు
లేదు.
అన్వతాయాః ప్రతిద్వంద్వీ స్వయం కూటస్థ ఇష్యతామ్ ౹ త్వన్తాయాః ప్రతియోగ్యేషోఽ హ మిత్యాత్మని కల్పితః ౹౹50౹౹
50. అన్యత యొక్క ప్రతిద్వంద్వి స్వయంత.అదే కూటస్థము. త్వంత("నీవు" అనేె భావము) యొక్కప్రతిద్వంద్వి అహంత.అదే అహంకారము,జీవుడు.ఇదే కూటస్థముపై ఆరోపింపబడినది.
🕉🌞🌏🌙🌟🚩
[13:42, 23/12/2020] +91 92915 82862: 4-శ్రీ రామదాసు కీర్తన
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
కన్నడ - ఆట (ధన్యాసి -
ఆది)పల్లవి:హరిహరిరామ నన్నరమర చూడకు
నిరతము నీ నామస్మరణ ఏమరను!!
చరణము(లు):దశరథనందన దశముఖమర్దన
పశుపతిరంజన పాపవిమోచన!!
మణిమయభూషణ మంజులభాషణ
రణజయభీషణ రఘుకులపోషణ!!
పతితపావననామ భద్రాచలధామ
సతతము శ్రీరామదాసునేలుమా రామ!!
🕉🌞🌏🌙🌟🚩
[13:43, 23/12/2020] +91 92915 82862: ||శ్రీమన్నారాయణీయము|| సప్తమ స్కంధము / 24వ దశకము - ప్రహ్లాదచరిత్ర వర్ణనము / 24-7-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
స శూలైరావిద్ధః సుబహుమథితో దిగ్గజగణైః
మహాసర్పైర్దష్టో౾ప్యనశనగరాహారవిధుతః।
గిరీంద్రావక్షిప్తో౾ ప్యహహా! పరమాత్మన్నయి విభో!
త్వయి న్యస్తాత్మత్వాత్ కిమపి న నిపీడామభజత।।
భావము:-
తండ్రి (హిరణ్యకశిపుడు) - ప్రహ్లాదుని పలుమార్లు శూలములచే పొడిపించెను. ఏనుగుల సమూహముచే తొక్కించెను. మహాసర్పములచే కరిపించెను. ఆహారము యిడకుండా పస్తులుంచెను. విషాహారము తినిపించెను. కొండలపైనుండి త్రోసివేయించెను. అయిననూ - ఆహా! పరమాత్మా! ఆత్మతత్వమును పూర్తిగా గ్రహించిన, నీ భక్తుడగు ప్రహ్లాదుడు మాత్రము ఇసుమంతయూ బాధననుభవించలేదు.
వ్యాఖ్య:-
తనయుడి విష్ణుభక్తి చూసి హిరణ్యకశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన శ్రీమహావిష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని్.
1) శూలాలతో పొడిచినా
2) ఏనుగులతో తొక్కించినా
3) మంటల్లో కాల్చినా
4) కొండపై నుండి త్రోయించినా
ప్రహ్లాదునకు బాధ కలుగలేదు. అతడు హరినామస్మరణ మానలేదు.
అది చూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు.
అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు
1) ఆత్మజ్ఞానాన్ని
2) హరితత్వాన్ని
3) మోక్షమార్గాన్ని
ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.
క్రోధంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి – నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు.
అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.
ఆ హరి ఎక్కడున్నాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా...
కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్
గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత
చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం
దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా
యెడన్? – అన్నాడు బాలుడు.
ఇంకా ” చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన
నందందే గలడు ” అని చెప్పాడు.
హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు
భాషింప స
త్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు
తర్జింప శ్రీ
నరసింహాకృతి. నుండె నచ్యుతుడు నానా జంగమ
స్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్ధండ
ప్రభావంబుతోన్
ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొంటుండగా శ్రీహరి సకల జడ, చేతన పదార్థములలో శ్రీనృసింహాకృతిలో నుండెను ( సర్వాంతర్యామిత్వం )
అయితే “( ఈ స్థంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్ )”? అని రాజు ప్రశ్నించాడు.
” బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్థంభమునందెకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును.
ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్తక్ష స్వరూపంబునన్ ” అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు.” సరే చూద్దాం. ఈ స్థంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డు పడతాడా?” అని హిరణ్యకశిపుడు చేతితో స్థంభంపై చరిచాడు.
🕉🌞🌎🌙🌟🚩
[13:45, 23/12/2020] +91 92915 82862: 18-31-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ-రాజసబుద్ధిని తెలుపుచున్నారు –
యయా ధర్మమధర్మం చ
కార్యం చాకార్య మేవ చ
అయథావవత్ప్రజానాతి
బుద్ధిస్సా పార్థ! రాజసీ
తా:- ఓ అర్జునా! ఏ బుద్ధిచేత మనుజుడు ధర్మమును, అధర్మమును; చేయదగినదానిని, చేయరానిదానిని- ఉన్నదియున్నట్లుకాక (మరియొకవిధముగ, పొరబాటుగ) తెలిసికొనుచున్నాడో ఆ బుద్ధి రాజసబుద్ధియైయున్నది.
వ్యాఖ్య:- కొందరి బుద్ధి ధర్మాధర్మములను, కర్తవ్యాకర్తవ్యములను శాస్త్రములందు బోధింపబడిన రీతిగగాక, పెద్దలగు గురువులు తెలిపినరీతిగా గాక మరియొక విధముగ పొరబాటుగ గ్రహించును. అట్టిబుద్ధి రాజసమైనది. దానిని సంస్కరించి సాత్త్వికబుద్ధిగా ప్రయత్నముచే మార్చుకొనవలెను.
ప్ర:- రాజస బుద్ధి ఎట్టిది?
ఉ:-ధర్మమును, అధర్మమును; కర్తవ్యమును, అకర్తవ్యమును- ఉన్నది ఉన్నట్లుకాక పొరబాటుగా తెలిసికొను బుద్ధి రాజసబుద్ధియైయున్నది.
🕉🌞🌎🌙🌟🚩
[18:12, 23/12/2020] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు -106 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్లోకము 39 - 1
🍀 34 - 1. శ్రద్ధ - శ్రద్ధయనగ పరిపూర్ణ ఆసక్తితో కూడిన ఆచరణ. శ్రద్ధ కలవాడు తాను చేయు పనియందే మనసు లగ్నము చేసి యుండును. శ్రద్ధ గల మనసు సంయమము అను శక్తిని పొందును. ఎపుడైనను, ఎచటైనను విషయములు సూటిగ గోచరించుట, అవగాహన యగుట యుండును. సూక్ష్మమగు విషయములు కూడ సులభముగ అర్థమగును. శ్రద్ధ గలవా డన్ని విషయము లందును శ్రద్ధగ నుండును. 'శ్రద్ధ' అను గుణము సమస్తమగు సిద్ధులను సాధింపచేయును. జ్ఞానమునకు కూడ శ్రద్ధయే ప్రధానము. చేయు పనియందు శ్రద్ధ, ఫలముల యందనాసక్తి ముఖ్యమని తెలియవలెను. 🍀
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |
జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి మచిరే ణాధిగచ్ఛతి || 39
శ్రద్ధగలవాడు, తదేక నిష్ఠగలవాడు, యింద్రి యార్థము లందు చిక్కుకొననివాడు ఈ జ్ఞానమును పొందగలడు. జ్ఞానమును పొందినవాడు త్వరితగతిని పరమశాంతిని పొంద గలడు. జ్ఞానమునకు మూడరతతీ శ్లోకమున చెప్పబడినవి. అందు మొదటిది శ్రద్ధ, రెండవది నిష్ఠ. మూడవది యింద్రియ నియమము.
1. శ్రద్ధ :
శ్రద్ధయనగ పరిపూర్ణ ఆసక్తితో కూడిన ఆచరణ. ఆసక్తి లేనిదే ఎవ్వడును ఏ పనియు చేయడు. ఆసక్తి పూర్ణముగ నున్నచో మనసు పరిపూర్ణముగ ఒక పనియందర్పింప బడును. శ్రద్ధగ పనిచేయు వానికి మనసు పనియందు సమర్పితమగుట చేత యితర విషయములపై ప్రసరింపదు. పరిసరములందేమి జరుగుచున్నను అతనికి వాటి అస్థిత్వముండదు.
అర్జునుడు బాణము ఎక్కు పెట్టినపుడు పిట్టకన్ను మాత్రమే కనిపించుట, యితరములు గోచరింపకుండుట జరిగినది. ఇది శ్రద్ధకు తార్కాణము. అటులనే శ్రీరాముడు తాటి చెట్టు ఏడుతలలను కొట్టుట, పదునాలుగువేల రాక్షసుల నొక్క బాణముతో చంపుట శ్రద్ధకు తార్కాణము. శ్రద్ధ కలవాడు తాను చేయు పనియందే మనసు లగ్నము చేసి యుండును.
ఎన్ని సంవత్సరములైనను చేయు పనియందే శ్రద్ధ గోచరించును. శ్రద్ధ గల మనసు సంయమము అను శక్తిని పొందును. ఎపుడైనను, ఎచటైనను విషయములు సూటిగ గోచరించుట, అవగాహన యగుట యుండును. సూక్ష్మమగు విషయములు కూడ సులభముగ అర్థమగును. శ్రద్ధ గలవా డన్ని విషయము లందును శ్రద్ధగ నుండును.
కొన్ని విషయములందు శ్రద్ధ, కొన్ని విషయములందు అశ్రద్ధ యుండదు. రాముని జీవితమే దీనికి తార్కాణము. (భరతు నెట్లాద రించెనో, గుహుని కూడ అట్లే ఆదరించెను.) శ్రద్ధగలవాడు ప్రస్తుతమునందే యుండును. భవిష్యత్తు లోనికి తొంగిచూచుట, గతమును నెమరువేయుట యుండదు. శ్రద్ధ గలవానికి ఎదుట నున్న కర్తవ్యమే దైవము.
శ్రద్ధ అను గుణము చిన్నతనముననే నేర్చినవారు కార్యము లందు సులభముగ విజయమును సాధింపగలరు. మరపు గల వారందరు శ్రద్ధ లేనివారే.
ప్రస్తుత కాలమున మర పెక్కువ. అనగ శ్రద్ధ తక్కువ. నిజమునకు 'శ్రద్ధ' అను గుణము సమస్తమగు సిద్ధులను సాధింపచేయును. జ్ఞానమునకు కూడ శ్రద్ధయే ప్రధానము. చేయు పనియందు శ్రద్ధ, ఫలములయందనాసక్తి ముఖ్యమని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[18:12, 23/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 305 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
74. అధ్యాయము - 29
🌻. దక్ష యజ్ఞములో సతి - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆమె ఈ తీరున ధర్మమును నీతిని చెప్పి, పశ్చాత్తాపమును పొందెను. ఆమె కలుషితమైన మనస్సుతో శంకరుని మాటలను స్మరించుకొనెను (42). అపుడా సతి మిక్కిలి కోపించి దక్షునితో , విష్ణువు మొదలగు దేవతలతో, మరియు మునులతో అందరితో నిశ్శంకముగా నిశ్చయముగా నిట్లు పలికెను (43).
సతీదేవి ఇట్లు పలికెను -
తండ్రీ! నీవు శంభుని నిందించితివి. తరువాత దుఃఖించెదవు. ఇహ లోకములో మహాదుఃఖముననుభవించి, మరణించిన తరవాత నరకయాతనలను పొందెదవు (44). ఏ పరమాత్మకు ద్వేష్యుడగు ప్రాణిగాని, ప్రియుడగు ప్రాణిగాని లేడో, అట్టి అజాత శత్రువగు శంకరునిపై నీవు తక్క మరెవ్వరు కక్ష గట్టెదరు? (45) దుర్మార్గులు ఈర్ష్యతో సర్వదా మహాత్ములను నిందించుట ఆశ్చర్యకరము కాదు. కాని మహాత్ముల పాదధూళిచే నశింపజేయబడిన తమోగుణము గలవారికి మహాత్ములను నిందించుట శోభావహము కాదు (46).
ఏ మానవులు ఒక్కసారి 'శివ' అను రెండక్షరములను ఉచ్చరించెదరో వారి పాపములన్నియూ వెనువెంటనే నశించును (47). అమంగళుడవు, దుష్టుడవు అగు నీవు పవిత్రమగు కీర్తి గలవాడు, ఉల్లంఘింప శక్యము కాని శాసనము గలవాడు, సర్వేశ్వరుడునగు శంభుని ద్వేషించుట ఆశ్చర్యము (48).
మహాత్ములు తమ మనస్సు అనే తుమ్మెదలతో ఆయన పాదములనే పద్మములను బాగుగా సేవించెదరు. ఆయన పాదములు భక్తుల కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. బ్రహ్మానందమును గోరు ముముక్షువులు ఆయన పాదములను ఆదరముతో గొల్చెదరు (49). శివుడు భక్త జనులకు వరములను ప్రేమతో వర్షించును. సర్వప్రాణులకు హితుడగు ఆయనపై మూర్ఖత వలన నీవు ద్వేషమును చూపుచున్నావు (50). శివుడు (మంగళ స్వరూపుడు) అమంగళ##వేషధారియా? బ్రహ్మాది దేవతలు, మునులు, సనకాది సిద్ధులు, ఇతరులు, విద్వాంసులు అట్లు తలచుట లేదు. నీవు మాత్రమే అట్లు తలంచుచున్నావు (51).
విశాల హృదయుడగు ఆయన, జటలను విరబోసుకొని, భూతములతో గూడి, శ్మశానమునందు కపాలధారియై, కపాలమాలను, భస్మను ధరించి ప్రీతితో నివసించుచున్నాడు (52). ఈ సత్యము నెరింగిన మునులు, దేవతలు ఆయన పాదధూళిని నిర్మాల్యముగా స్వీకరించి, ఆదరముతో శిరస్సుపై ధరించుచున్నారు. ఆ శివుడు పరమేశ్వరుడు (53).
వేదములో ప్రవృత్తి, నివృత్తి అను రెండు విధముల కర్మ విధింపబడినది. విద్వాంసులు వాటి మధ్య గల భేదమును విచారించి నిరూపించినారు (54). ఈ రెండు పరస్పర విరుద్ధములు గనుక, ఒకే వ్యక్తి ఒకే కాలములో రెండింటినీ అనుష్ఠింపజాలడు. పరబ్రహమ్మయగు శంభునియందు ఈ ద్వివిధ కర్మల సంబంధము లేదు (55).
ఓ తండ్రీ !ఆయనను మీరు పొందలేరు. మీరు యజ్ఞశాలలో కామ్య కర్మలననుష్ఠించి ధూమ్రమార్గమును పొందెదరు. మావంటి ఆత్మ జ్ఞానపరులు మాత్రమే కర్మ ఫలములను త్యజించి పరమాత్మను భజించెదరు (56). ఆయన లక్షణము ఇంద్రియ గోచరము కాదు. ఆయనను అవధూతలు చక్కగా సేవించెదరు. కావున, ఓ తండ్రీ! నీవు దుర్బుద్ధితో చూచి, అహంకారమును పొందకుము (57).
ఇన్ని మాటలేల ? నీవి దుష్టుడవు. నీ బుద్ధి అన్ని విధములుగా భ్రష్టమైనది. నీ నుండి జన్మించిన ఈ దేహముతో నాకు ప్రయోజనమేమియూ లేదు (58). మహాత్ములను పరిపరివిధముల నిందించు దుష్టుని జన్మ నిందార్హము. విద్వాంసుడు అట్టి వానితో సంబంధమును ప్రయత్నపూర్వకముగా వీడవలెను (59).
భగవాన్ వృషభధ్వజుడు నన్ను నీ కుమార్తెను గనుక దాక్షాయణి అని పిలుచును. అట్టి సందర్భములలో నా మనస్సు వెనువెంటనే మిక్కిలి క్లేశమును పొందును (60). కావున, నీ శరీరమునుండి ఉద్భవించిన ఈ దేహము శవమువలె మిక్కిలి అశుచియైనది, నిందితమైనది, కావున నేను ఇప్పుడు ఈ దేహమును నిశ్చయముగా వీడి సుఖమును పొందగలను (61).
ఓ దేవతలారా! మునులారా! మీరందరు నా మాటను వినుడు. దుష్ట బుద్ధిగల మీరందరు సర్వధా అనుచితమగు పనిని చేయుచున్నారు (62). శివుని నిందించి, కలిని ప్రేమించు మీరందరు మిక్కిలి మూఢులు. మీకు సంపూర్ణమగు దండన హరుని నుండి నిశ్చితముగా కర్మ ఫల రూపముగా లభించగలదు. దీనిలో సందేహము లేదు (63).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడా సతి యజ్ఞశాలయందు దక్షుని, ఇతరులను ఉద్ధేశించి ఇట్లు పలికి విరమించెను. ఆమె ప్రాణప్రియుడగు శంభుని మనస్సులో స్మరించెను (64).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు సతీ ఖండలో సతీ వాక్య వర్ణనమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[18:12, 23/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 191 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. వసిష్ఠమహర్షి-అరుంధతి - 4 🌻
17. బ్రహ్మతేజోబలమే నిజమైన బలం, క్షత్రియ బలంకాదు అన్నది. “ధిక్ క్షత్రియబలం, బ్రహ్మతేజోబలం బలం” అనుకున్నాడు విశ్వామిత్రుడు. క్షాత్రం అంటే సృష్టిలో ఉండే శక్తులు. ఇవన్నీ సృష్టిలోని పదార్థాలే. ఈ పదార్థమంతా దేనియందుపుట్టి, దేనిలో స్థితికలిగి ఉండి, దేనిలో తిరిగి లయం చెందుతున్నదో; అటువంటి బ్రహ్మోపాసన చేసినవాడి బలం అనంతం. బలమంటే అదే.
18. బ్రహ్మజ్ఞాని అయిన వసిష్ఠుడికి దుఃఖం రావడమేమిటి? ఆత్మహత్యాప్రయత్నం చేయడమేమిటి? అనే సందేహాలు కలుగవచ్చు. అదంతా శరీరము, సంసారము యొక్క లక్షణమంతే. మరి బ్రహ్మజ్ఞానికి దుఃఖం అంటదంటారు కదా అని ప్రశ్న. దుర్భరమైన దుఃఖం ఆవేశించినా అది జ్ఞానికి ఒక్క క్షణమే. క్షణంలోనే దానిని ఉపసంహారం చేసుకుంటారు.
19. ఆ క్షణంలో ఏదయినా జరుగవచ్చు. ప్రకృతియొక్క ప్రభావం ఎంతటివాడిపైననైనా ఉంటుందని చెప్పటానికి మాత్రమే ఈ గాథలు ఏర్పడ్డాయి. వసిష్టుడికి వచ్చిన ఆగ్రహం, దుఃఖం ఒక్క ఘడియ, అంతే. ప్రకృతికి జ్ఞానిపై అంతవరకే ప్రభావం. ‘జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహి సా | బలాదాకృష్య మోహాయ మహా మాయా ప్రయఛ్ఛతి||’ అని అందుకే అన్నారు. అంటే ఎంతటి నిగ్రహం కల వానినైనా, జ్ఞానినైనా ఒక్కక్షణం అజ్ఞానం ఆవరించవచ్చు. అది ప్రకృతియొక్క లక్షణం.
20. ఈ ప్రకృతిపట్ల అభినివేశంతో, ఈ సంసారం నాది అనే భావన ఒక్క క్షణం కలిగి, అంటే ఆత్మవిస్మృతి కలిగినపుడు ఒక్క తృటి దుఃఖం లేదా ఆగ్రహం జ్ఞానికి కూడా కలుగవచ్చు. అయితే సామాన్యులకు, జ్ఞానులకు భేదమేమిటంటే; శరీరమున్నంతసేపూ మనస్సు, బుద్ధి, చిత్తము బ్రహ్మజ్ఞాని యందుకూడా ఉన్నప్పటికీ, ప్రకృతియొక్క వికారము వారి మనోబుద్ధుల యందే క్షణంపాటు ఆవరిస్తుందే తప్ప, అది వారి ఆత్మయందు ప్రవేశించదు.
21. ఇంకా విశదంగా చెప్పాలంటే, సామాన్యుడికొచ్చే ఆగ్రహం అహంకారంగా జీవాత్మయందు ప్రవేశించి, కర్మచేయించి, దానిఫలాన్ని ఉత్తరజన్మకు ఇస్తుంది. అయితే జ్ఞానికి వచ్చే ఆగ్రహం కేవలం మనోబుద్ధులవరకు మాత్రమే పరిమితంకాని, వారి ఆత్మవస్తువుయందు ప్రవేశించదు, కర్మఫలహేతువుకాదు.
వసిష్ఠుడిని “యోగం అంటే ఏమిటి?” అని అడిగాడు జనక చక్రవర్తి. “యోగమంటే ధ్యానమే! అది రెండువిధాలుగా ఉంటుంది.
22. ప్రాణాయామపూర్వకంగా ఉంటుంది. మనస్సున ఏకాగ్రవృత్తి అనేదొకటుంది. సగుణభావంతో ప్రాణాయామము ఫలప్రదమవుతుంది, నిర్గుణభావంలో ఏకాగ్రత లభిస్తుంది. ఈ రెండూ యోగంవల్ల సాధ్యమవుతాయి” ‘మితాక్షర’ను ఆధారం చేసుకునే ‘హిందూ లా'(Himdu Law) పుట్టింది. బ్రిటీష్ హిందూ లా వచ్చింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[18:12, 23/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 130 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 9 🌻
535 - 2. పరమాత్మయైన ఆత్మ, అనంత అపార నిస్సీమ మహాసాగరము నుండి ఎన్నడు బయటపడజాలదు. ఎందుచేత?
ఆత్మయనెడు బిందులవలేశము, పరమాత్మయనెడు మహాసాగరములో నున్నంతవరకు, అది మహాసాగరములో కలిసియే యున్నందున ఆత్మ కూడా పరమాత్మయే.
సాగరము నుండి బిందు లవలేశమును వెలికి తీసినప్పుడు అది ఆత్మయైనది. నీటి ఉపరితలమున బుడగగా ఏర్పడినప్పుడు దానికి పరిమితి రూపము, ఆకృతి, రంగు ఏర్పడుచున్నవి.
అనగా - ఆత్మయనెడి లవలేశము, అనంత అపార సాగరము నుండి వేరుపడినప్పుడే దానికి బిందురూపము లేక బుద్బుదరూపము యేర్పడి పరిమిత వ్యక్తిత్వము కలుగుచున్నది.
ఇట్లు వేరైన బిందులవలేశము తిరిగి సాగరజలములో కలిసి పోయినప్పుడు, అది కూడా సాగరమే యైనది కనుక వాస్తవమునకు "ఆత్మయే పరమాత్మ".
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment