`11--01--2021 భగవద్గిత
బుద్దిబలం
ముగ్గురు మిత్రులు ఓసారి అమ్మవారి గుడికి వెళ్లారు. ప్రసాదంగా చక్కెర పొంగలి ఇచ్చారు. అది ఒకరు తినడానికే సరిపోతుంది. నేను తింటానంటే నేను తింటానని ముగ్గురూ వాదులాడుకున్నారు. తగాదా తేలలేదు. వారిలో చిన్నవాడు ఒక ఉపాయం చెప్పాడు.
‘ఇప్పుడు ఎలాగూ మధ్యాహ్నమై పోయింది. కాబట్టి హాయిగా పడుకుని నిద్రపోదాం. ముగ్గురిలో ఎవరికి అద్భుతమైన కల వస్తే వారు సాయంత్రం దాన్ని తినొచ్చు’ అన్నాడు.
సరేననుకుని ముగ్గురూ చక్కెర పొంగలి పొట్లాన్ని చిటారు కొమ్మకి కట్టి చెట్టు కిందనే పడుకున్నారు.
సాయంత్రం అయ్యేసరికి ముగ్గురికీ మెలకువ వచ్చింది. మొదటి వాడు ‘నాకు భలే కల వచ్చింది’ అంటూ ఇలా చెప్పాడు…
నేను ఒక అడవిలో వెళుతుంటే కుబేరుడు పుష్పక విమానం మీద వచ్చి నా ముందు దిగాడు. నన్ను సాదరంగా యక్షలోకానికి తీసుకుపోయాడు. అక్కడ నేను పన్నీటితో జలకాలాడాను. పట్టు వస్త్రాలు కట్టుకున్నాను. బంగారు పళ్లెంలో కుబేరుడు స్వయంగా నాకు విందుభోజనం వడ్డించాడు. తర్వాత అప్సరసలతో నాట్యం చేశాను. కుబేరుడు నేను మోయగలిగినంత బంగారాన్ని ఇచ్చి కిందకి పంపాడు’.
రెండోవాడు ‘నాకల అంతకంటే అద్భుతమైంది’ అంటూ ఇలా చెప్పసాగాడు…
‘నేను ఓ మైదానంలో పడుకుని ఆకాశంలోకి చూస్తుంటే ఐరావతం కనిపించింది. ఆశ్చర్యంగా చూస్తుంటే అది నా దగ్గరే దిగింది. దాని మీద ఇంద్రుడు ఉన్నాడు. నన్ను కౌగిలించుకుని స్వర్గానికి తీసుకుపోయాడు. తాగినంత అమృతం పట్టించాడు. వజ్రాలు పొదిగిన బంగారు కంచంలో పంచభక్ష్యపరమాన్నాలు వడ్డించాడు. రంభ, ఊర్వశి, మేనకల నాట్యం ఏర్పాటు చేశాడు. నేను మోయలేనన్ని రత్నాలు ఇచ్చాడు. తిరిగి ఐరావతం ఇక్కడ దింపిందో లేదో మెలకువ వచ్చింది.’
ఇద్దరి కలలూ విని మూడోవాడు చప్పట్లు కొట్టాడు. ‘మరి నీకేం కల వచ్చింది?’ అని ఇద్దరూ వాడిని అడిగారు. మూడో వాడు ఇలా చెప్పాడు…
‘నాకేమీ అద్భుతమైన కల రాలేదు. నేను అడవిలో వెళుతుంటే పులి వెంట పడింది. పరిగెట్టుకునిపోతూ ఓ లోయలో పడ్డాను. ఒళ్లంతా దెబ్బలు. డేక్కుంటూ వెళుతుంటే అమ్మవారి గుడి కనిపించింది. ఈ కష్టాలేంటి తల్లీ అని అడిగేసరికి అమ్మవారు ‘నీ స్నేహితుల్లో ఒకడు కుబేరుడి విందు ఆరగిస్తున్నాడు. మరొకడు ఇంద్రుడిచ్చిన అమృతం తింటున్నాడు. కాబట్టి నువ్వు చక్కెర పొంగలి తిను’ అని మనం చెట్టు కొమ్మకు కట్టిన పొట్లం చూపించింది. ఏం చేయను? అమ్మవారి ఆజ్ఞ. మెలకువ రాగానే తినేశాను’ అన్నాడు.
మిగతా ఇద్దరూ నోరు వెళ్లబెట్టారు.
లావుగలవాని కంటెను
భావింపఁగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
లోకములో శరీరబలముగల వానికంటెను న్యాయముగా నుండు వాడు బలవంతుడని లెక్కించుకోవాలి. ఏనుగు కంటెనూ చిన్నవాడైన మావటివాఁడు ఏనుగును అదుపులో పెట్టుకొని ఎక్కుచున్నాడుగదా! గాన శరీరబలముగలవాడి కంటే బుద్ధిబలం గలవాడే బలవంతుడు.
****
విడుదల అంటే- విముక్తి, మోక్షం, స్వేచ్ఛ. జైలు నుంచి ఖైదీ బయటికి వచ్చి స్వేచ్ఛగా జీవించడం. ఆధ్యాత్మికపరంగా జీవుడు దేహబంధం నుంచి, సంసారబంధం నుంచి విడుదల కావడం. బంధాల నుంచి తొలగాలనే దాన్నే 'ముముక్షత్వం' అంటారు. ఇది మోక్షానికి దారి.
ప్రకృతిలోని సమస్త జీవరాశి సృష్టి ప్రసాదించిన మేరకు సహజత్వాన్ని వీడకుండా ఆహార సంపాదన, ఆత్మరక్షణ, సంతానోత్పత్తి జరుపుకొంటాయి. వాటికదే ప్రకృతి ధర్మం.
అన్ని జీవరాశుల్లోను ఉన్నతమైన సంస్కారవంతమైన జీవి నరుడు. ప్రకృతి ప్రసాదించిన చిత్తం, మనసు, బుద్ధి, జ్ఞానం, అహంకారం, విచక్షణ కలిగిన ఉత్కృష్టమైన జీవి. వీటితోపాటు నవ్వు, రాగద్వేషాలు, కామ-క్రోధాలు, ఈర్ష్య అసూయలు, జాలి, సిగ్గు, అనుమానం, అసహ్యం, కులం, శీలం, జాతి అనే బంధాలను; భక్తి, రక్తి, వైరాగ్యం, ముక్తి అనే పారమార్థిక సంపదనూ సృష్టికర్త ప్రసాదించాడు. ఇంతటి ధన్యజీవి అయిన మానవుడు నేడు ఎంతవరకు జీవన్ముక్తుడు కాగలగుతున్నాడన్నది ప్రశ్నార్థకమే!
గతంలో యోగులు, రుషులు, వేదాంతులు, పురాణ పురుషులు, సత్య, ధర్మాల్ని పాటిస్తూ ఎరుకతో మరుజన్మ లేని స్థితిని పొందినట్లు మన శాస్త్ర పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. తమ జ్ఞానసంపదతో ఇంద్రియ నిగ్రహంతో, చిత్త వృత్తుల్ని నిరోధిస్తూ, అరిషడ్వర్గాల్ని జయించి పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సక్రమరీతిలో సాధించి చరితార్థులైనారు.
ప్రకృతిలో మార్పు సహజం. దానికి ఈ కలికాలం కూడా మినహాయింపు కాదు. జనాభా పెరిగింది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. పోటీతత్వం ఇంతలంతలై జీవన సమస్య భారమైంది. నేటి మానవుడు భౌతికపరంగా, విజ్ఞానపరంగా అభివృద్ధి సాధించినప్పటికీ- మానసిక శాంతి లేక కొట్టుమిట్టాడుతున్నాడు. ఒంటరిగా, కంటినిండా నిద్రలేక, సంపాదనే ధ్యేయంగా అహరహం శ్రమిస్తూ యాంత్రిక జీవనం సాగిస్తున్నాడు.
ఈ సుడిగుండాల నుంచి మానవుడు బయటపడి మానసిక స్వేచ్ఛతో తిరగలేడా? అంటే తప్పక విడుదల కాగలడు! ముందుగా మనిషి సంపాదన తప్పు కాదని, సంసారం తన ధర్మమని, అతి మాత్రం కూడదని, ఇవేవీ శాశ్వతం కాదని, పుట్టిన ప్రతిజీవీ గిట్టక తప్పదని మామూలు లోకజ్ఞానంతోనైనా గ్రహించాలి. అయితే వచ్చిన చిక్కల్లా అతిగా సంసారబంధాలు పెంచుకోవడం, తానెప్పటికీ శాశ్వతుడననుకోవడం- అనుకొని అక్రమాలు చేసి కూడబెట్టడం కూడదని తెలుసుకోవాలి. ఈ ఇరుక్కున్న బంధాల నుంచి మానసికంగా బయటపడటమే విడుదల, ముక్తి, మోక్షం.
భవబంధనాల నుంచి విడుదల కావడం అంత తేలికైన పనికాకపోయినా అసాధ్యం మాత్రం కాదు. 'గృహాశ్రమ' జీవనంలో ఉంటూనే, తామరాకుపై నీటిబొట్టులా, అంటీ అంటని రీతిలో విరాగత్వం పొందవచ్చు. అక్కరలేనివి కూడబెట్టే పద్ధతికి స్వస్తి పలికి ఆత్మతృప్తితో జీవించడం ఉత్తమం. గీతాచార్యుడు సెలవిచ్చిన భక్తి, జ్ఞాన, కర్మ, యోగమార్గాలు ముక్తికి సోపానాలు. అందులో యోగమార్గమైన ధ్యానం ద్వారా చిత్తవృత్తుల్ని నిరోధించి, ఇంద్రియ ప్రేరేపితమైన కోర్కెల్ని అదుపుచేస్తే ఈ బంధాలనుంచి విడుదలై మానసిక స్వేచ్ఛతో ఇక్కడే స్వర్గసౌఖ్యాలు పొందవచ్చు. నరకం, స్వర్గం రెండూ మన బుర్రలోనివే. సాధన ద్వారా అరిషడ్వర్గాలను జయించి మానవులంతా స్వేచ్ఛాజీవులై బ్రహ్మనంద భరితులు కావాలి. తద్వారా మానవతకు మహోన్నత స్థానం కల్పించాలని ఆశిద్దాం.
***
భగవద్గీత అంతర్గత సూక్తులు మొదటి అధ్యాయము
తేటగీతి పద్యాలు ..
గ్రుడ్డి వారైన ప్రేమను క్రుమ్మరించు
వయసు మీద కన్న ప్రేమ వదల నంది
ఆశ మన ఇతర ల వారు అనెను ఎవరు
చివర పోరాట మారాట చింత కలిగే ...1
వయసు మీరిన భక్తి యు వేకువవ్వు
వయసు పోరాట తగదని వాక్కు పలికె
గురువు ప్రార్ధించి రణరంగ కాలుమోపె
గురువు దైవమని తలంచు గీత బోధ .... 2
గురువు శిష్యుల బేధము గుప్త మగును
గురువు శిష్యుల గొప్పలు గమ్యమగును
తన్ను తాను శక్తిని చూపు తోడు గవును
ప్రీతి ఒక్కరొకరి మధ్య పగలు లాగ ...3
ఎంతవరకైన తెలివితో యదను తాకు
కొంత నడవడికలు మార్చి కొలువ చేరు
కొలువ విలువను పొందియు కధలు తెలుపు
నిరుప యోగమా ఉపయోగ నడక నేర్చు ...4
నీవు ఎదుటివారితెలివి నటన తెలిపి
పరిమితముగ స్నేహము చేసి పదవి పొందు
నీవు బలహీన పడవద్దు, నిత్య బలము
అపరిమితమైనట్టి సే నలును చూడు ..5
దిగులు చెందకు ధైర్యము తోడు ఉండు
నమ్మకము ఉంచి నాణ్యత న్యాయముంచు
జయము ఖాయము అనితల్చి జాగరూక
దైవముయె నిన్ను నడిపించి ధర్మమవ్వు ...6
సింహ నాదము వినబడ్డ సదరు ముప్పు
వచ్చె దియు రాక మానదు వేగ మవ్వు
భయము ఇబ్బంది పెట్టిన బోధ వల్ల
ధైర్య మువలన నిర్భయ జయము పొందు .... ..7
ముందు భవిషత్తు విజయము మౌన మవ్వు
ఆయుధము ధైర్య సంఘట నయని తీర్పు
శబ్ద మువలన భయమునే సలిపి ఉన్న
శబ్ద ఉత్సాహముయె శబ్ద సాధనవ్వు .... 8
చెవిటి వాని చెవిలోఊదె శ౦ఖ మైన
ముర్కునికి చెప్పు మంచియే శబ్దమైన
భయమును తలవని వారు బ్రాంతి చెందు
గుండె భీతిల్లక జయము కాంక్ష కలుగు .... 9
గొప్పతనమును తెల్సుకో కాలమందు
నేనె గొప్పని అందరి నడుమ అనకు
గొప్పలకు పోక ధైర్యము మరులుగొలుపు
నీవు ఆలోచనలు లేక నమ్మ వద్దు .... .... 10
భగవద్గీత అంతర్గత సూక్తులు మొదటి అధ్యాయము (2)
తేటగీతి పద్యాలు .. రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాటలతొ మనసుకు నొప్పి మగువ వల్లె
మగువ మాటల లొ నిజముయే మైమరపులె
హృదయ వేదవాదనలు లే హాయ్ గొలుపు
నీటిలో శబ్ద పైన నూ నాట్య మాడు .... 11
మనకు చూసిన నిజమని మాయగలుగు
వెలుగు రేఖలు వలె బుద్ధి అవగతమగు
నీకు ను పరోక్ష సహకార నాణ్య తగును
ప్రతిదీ నీకు ప్రత్యక్షపు పనులు కావు .... ... 12
విషయ వ్యత్యాసముల బాధ విధివిదిత్వ
దేశ కాల ప్రవ ర్తన దారి చూపు
కాల నిర్ణయ శక్తి నీ కు భుజ తట్టు
గమ్య గమనము గుర్తుగా గొప్పచేయు ... ..13
నలుగురిలొ మాట కనువిప్పి నలుగు చుండు
నలుగురి వినయ భావాలు నిన్ను తాకు
నలుగురిలొ మెప్పు పొందినా నటన అనియు
నలుగురి సహన మేదియు పనికి రాదు ... .14
చూపు ఎటువుంటె అదియేను సంతసమ్ము
వెనుక గోతులు అన్నియు వచ్చి పోవు
మృత్యువు ఎడారిన గృహము ముందు వచ్చు
తెలుసుకో నీవు యు నిమిత్త మాతృడివియు ... 15
అమృత భావము ఆనంద స్వర రూపు
స్వర హాలాహలముయే స్థిరముగాను
ఉన్న శక్తిని ఉపయోగ ఊహలగును
ఉన్న శక్తి యు సమయాన కానరాదు ... ..16
ఉన్న లేనట్లె విద్యలే ఊహలయితె
ఫలితముయు ఆశ చుట్టును పారు చుండు
పతన మైనను లేచియు ఫలము పొందు
నీవు చేయు ప్రతిఫల పనులకు వలదు ... .17
శుభ్రత శరీరముకుయును శోభనిచ్చు
నిద్రలో కను రెప్పలు నీకు రక్ష
అవసర అనవసర మేది అవని యందు
అర్ధ ముతెలిసియు అనర్ధ మవగతమ్ము ... ... 18
ముందు మనలోన మాలిన్య మంత దులుపు
అదియు మందహాసము గాను మారు చుండు
ప్రతిదినము ప్రీతి చెందియు ప్రోత్స హించు
మనసుకు మగువతోడును మంత్ర మగును ... .19
సమయ సద్విని యోగము సహజ మవ్వు
జగతి మిధ్యగా ప్రకృతికి జాడ్య మవ్వు
ప్రకృతి పవళించు కూటమి పదనిసలగు
నేటి ప్రకృతియే రేపటి నిజము తెల్పు ... .... 20
--(())--
*ధృఢసంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలను ఇస్తాయి. వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు అన్ని విఘ్నాలను ప్రతిఘటించి నిలువగలుగుతారు.
🕉🌞🌎🌙🌟🚩
*మనకోసమే భగవంతుడు దేదీప్యమానమైన గురువు రూపాన్ని ధరిస్తాడు. గురుతత్వం అర్ధం అయ్యే కొద్దీ, క్రమంగా నామరూపాలు నశించి దైవం నిజరూపంలో సాక్షాత్కరిస్తాడు.
*దరిద్రులలో, దు:ఖభాజనులలో, దుర్బలులలో కొలువై ఉన్న భగవంతుణ్ణి ఉపాసిస్తున్నామన్న భావంతో సేవ చేయండి.
.....
భాగవతము
శ్రీగురుభ్యోనమః
ఈ సృష్టి అనేటటువంటి క్రీడా రంగము నందు జీవుడు ప్రవేశించి, తాను నిర్వర్తించవలసిన కార్యక్రమములు ధర్మముగా నిర్వర్తించుకుంటూ మళ్లీ తిరోధారణ చెందుతూ ఉండాలి. స్వచ్ఛందముగా ప్రవేశించి, స్వచ్చందముగా నిష్క్రమించడము క్రీడ. తిరోధారణ చెందడం ప్రతి రాత్రి జరగాలి.
*ప్రతి రాత్రి ఈ విధముగా వెనక్కి
వెళ్లిపోగలగడం అనేది నేర్చుకుంటే ఈ శరీరములో నుంచి బయటకు వెళ్లిపోవడం అంత కష్టముగా ఉండదు. ప్రతి రోజు ఈ విధముగా సాధన చేయమని యోగశాస్త్రము చెప్పినది.*
🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
భగవంతుని పిలుపుకోసం అనుక్షణం అప్రమత్తతో మెలగటం మరువవద్దు.
మనం చేయవలసిన కర్తవ్యాలను మహత్ భావనతో పవిత్రంగా ఆచరిస్తే అవి ఇబ్బడి ముబ్బడిగా ఫలాలను అందిస్తాయి. ఉన్నతాశయాలను కలిగి ఉన్నప్పుడే మన జీవితం ఫలవంతం కాగలదు.
ఏ కార్యమైన దానంతట అదే మంచిగానీ, చెడుగానీ అవజాలదు. కానీ ఆ కార్యం చెయ్యడానికి మనకు కలిగిన ప్రేరణ ఆ కార్యం యొక్క యోగ్యత, అయోగ్యతలను నిర్ణయిస్తుంది.
అన్నింటి కన్నా ఒక ఆధ్యాత్మిక ఆదర్శంతో కార్యాచరణానికి పూనుకోవడం ఉత్తమంగా నిలుస్తుంది.
శుభంభూయాత్
శ్రీరమణీయం -(768)
🕉🌞🌎🌙🌟🚩
"నిద్రలో ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు జ్ఞానం ఏవిధంగా ఉంటుంది !?"
నిద్ర నుండి లేచినప్పుడు తలపు ఉన్నతమై అందు జ్ఞానతేజం తొలకాడుతుంది. ఆతేజం పూర్వం నుండి హృదయంలో ఉన్నదే. అది మేధలో చైతన్యంగా ప్రతిఫలిస్తుంది. కానీ దాని ప్రత్యేక వైశిష్ట్యం అహంకారస్పూర్తికి తరువాతనే. నిర్వికల్ప స్థితిలో దీనిని విశ్వమానసమనో, విశ్వచైతన్యమనో అనవలె. ఈస్థితి ఏ నిముషమో, అత్యల్పకాలమో ఉంటుంది. దీనిలో అహంకారం చొచ్చుకొన్నప్పుడు అది సగుణము సవికల్పమూ అయి, 'నే'నన్న పలుకు ఉదయిస్తుంది. ఇది ఎప్పుడూ ఒక వ్యక్తిపరంగా, ఏదోనొక సత్తాపరంగా ఇచట దేహంగా, వ్యయహృతమవుతుంది. అట్లు దేహమే నేనన్న భావం కలుగుతుంది. దాని పర్యవసానం తెలిసిందే కదా ! ఉల్లం అభాసకాంతి గనుక దానిని చంద్రుడన్నారు. మూలకాంతి హృదయంలో ఉన్నది. అందుకే హృదయాన్ని సూర్యసమంగా చెప్తారు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
ఘర్షణలేని మనసే శాంతి సామ్రాజ్యం !''- (అధ్యాయం -94)
🕉🌞🌎🌙🌟🚩
"ఋభుగీత "(235)
ఆత్మవైభవము"
17వ అధ్యాయము
ఏదీ బాధించకపోతే అది సంసారహీనత, అదే మౌనం... అది ఏదీ అడగని స్థితి !
ఇబ్బంది, కష్టం భౌతికమైనవి. బాధ, దుఃఖం మానసికమైనవి. లౌకిక జీవనంలో ఇబ్బందులు, కష్టాలు తప్పవు కానీ వాటి ప్రభావం బాధగా, దుఃఖంగా పరిణమించకుండా చూసుకోవాలి. బాధ తప్పనిసరి కాదు, అది ఐచ్ఛికం. మనం చాలా విషయాల్లో బాధకు లోనుకాకుండా ఉండగలుగుతున్నాం. అలా అన్ని విషయాల్లో ఉండగలగటం వస్తే ఆ నిబ్బరమే చిత్తశూన్యత. సంసారం అనేది బాధ, దుఃఖాలను కలిగించేది. అవి లేనివాడు చిత్తహీనుడే అవుతాడు. చిత్తహీనుడే తత్ అయినవాడు. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నా అందులో ఏదీ బాధించకపోతే అది సంసారహీనత అవుతుంది. అదే మౌనం. అది ఏదీ అడగని స్థితి !
నేను ఎవరు ?🧘♂
అరవై నాలుగు లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అది కూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది. ఈ దేహం నేనే అంటాం.
కానీ ఎలా ? నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది ? ఏ భాగము వినదు. వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా !ఎందుకు మొరాయిస్తుంది ? ఈ దేహం నీదేకదా ! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు ? ఈదేహం నీదేకదా ! ఎందుకు నీమాట వినడంలేదు ?ఈదేహం నీదేకదా ! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్ ?
ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆపరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే. ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు. ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో.
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం ఔతాయి. రూపానికి ముందు నువ్వున్నావు. రూపంలో నువ్వున్నావ్. రూపం వదిలేశాకా నువ్వుంటావు !
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు. ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.
కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయు.
ముద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
మూడు గుణముల విశేషములు
1. శ్రీకృష్ణుడు: కనుక ఇటుపైన మూడు గుణముల నుండి విమోచనము పొందుట ఎట్లు-అనబడు జ్ఞానమును వివరించు చున్నాను. దీనిని ఉపాసించి మునులెల్లరు మౌనముగా గుణ విమోచనమును పొందిరి.
2. ఈ జ్ఞానమును ఆశ్రయించి జీవులు నాతో సమాన ధర్మము పొందుదురు. అపుడు సృష్టి జరుగునప్పుడు పుట్టరు. ప్రళయము నందు నశించరు. (సమాన ధర్మము అనగా నన్ను స్మరించుట, దానివలన నా లక్షణము ఆపాదించుకొనుట, తదితర ధర్మములకు అతీతులగుట, నాయందు ఉండుట, నేనగుట అను సోపాన క్రమమున ఉండును. సృష్టి జరుగునప్పుడు పుట్టకుండుట అనగా శరీరాదులు కలిగినను, అందు వర్తించుచున్నను జన్మము అను ఆరోపణము లేకుండుట. జన్మించక ముందు ఎట్లుందురో, జన్మించు చున్నప్పుడును గర్భమునందును, జన్మించిన తరువాత వయస్సు మున్నగు ధర్మములందును చిక్కకుండుట. ఇక ప్రళయమున నశింపకుండుట అనగా శరీరము నందు ఉన్నప్పుడు ఎట్లుందురో, శరీరము విడుచునప్పుడును, విడిచిన తర్వాతను అట్లే ఉండుట. ఇది స్వదేహముల విషయముననే కాక సకల సృష్టి యొక్క భావాభావములందు కూడా చిక్కుకొనక తానుండుట తెలియ జేయును. జీవునకు జనన మరణములు ఎట్లో, ఒక సృష్టి మొత్తమునకు అట్లే. అవియే బ్రహ్మకల్పము, బ్రహ్మా యండము బ్రహ్మ ప్రళయము అనునవి.).
🕉🌞🌎🌙🌟🚩
P శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
నిరంశ స్యోభయాత్మాత్వం న కథఞ్చిద్ఘటిష్యతే ౹ తేన చిద్రూప ఏవాత్మేత్యాహుః సాంఖ్యవివేకినః ౹౹98౹౹
98. నిరవయవమగు ఆత్మ రెండూ,చేతనము అచేతనము కూడా,అగుట ఏ విధముగనైనను సంభవింపదు.ఆత్మ చిద్రూపము మాత్రమే అని సాంఖ్యులు వాదింతురు.
వ్యాఖ్య: షడ్దర్శనములలో అయిదవదగు పూర్వ మీమాంసయందు రెండు సంప్రదాయములు గలవు.
ప్రభాకర సంప్రదాయము,
కుమారిల భట్టు సంప్రదాయము. వీరినే సంగ్రహముగ భాట్టులని వ్యవహరింతురు.
ఆరవదగు ఉత్తర మీమాంసయే వేదాంతము.
కొన్ని స్థితులయందు చైతన్యము ఆవృతమై ఉండునని భట్టుల నిర్ణయము.
ఆత్మ విజ్ఞానఘనమని శ్రుతి వాక్యము.
అందు అచేెతనమునకు స్థానము లేదు.నిద్రయందలి జడత్వమును స్మరించుట, జడమగు విషయమును,మాయను,
అనుభవించుట చేత.
ఆత్మ యొక్క జడత్వమును అనుభవించి కాదు.
కనుక భట్టుల వాదము సమీచీనము కాదు.
ఆదిత్యుని కిరణములు చంద్రుని యందు ప్రతిఫలించి వెన్నెల కాంతి ద్వారా రాత్రుల యందలి చీకటిని పోగొట్టును.ఆ కిరణములే గృహము నందలి కంచు పాత్రపై బడి గృహమును గూడా వెలుగుతో నింపును.
అలాగే ఆత్మ చైతన్యము బుద్ధియందు ప్రతిఫలించి తద్వారా ఇంద్రియములను,ఇంద్రియముల ద్వారా బాహ్య వస్తువులను ప్రకాశింపజేయుచున్నది.
కావున జగత్తునందలి సమస్త పదార్థములను చైతన్య స్వరూపమైన ఆత్మ ప్రకాశింప జేయుట వలన ఆత్మ చిద్రూపంబని చెప్పబడుచున్నది.
అట్లే ఆత్మయైన తాను జాగ్రత్స్వప్న సుషుప్తు లనెడు త్రివిధావస్థల నెరుగు చుండుటచే తానే చిద్రూపాత్మయై యున్నాడు. జాగ్రత్స్వప్నములలో తప్ప సుషుప్తియందు ఆత్మ దేనినీ గూడ తెలిసికొనదుగాన జడమని నిశ్చయించగూడదు.
సుషుప్తి యందు ఏ వస్తువును గూడా తెలిసికొనలేదు అని తెలుపు జ్ఞానమైనను అచ్చట ఉన్నది కదా!
లేనిచో సుషుప్తి యందు ఏమియు తెలియలేదు అని తెలిసికొనిన
దెవరు?
వెలుగు చున్న దీపమును ఆకాశము వైపు తిప్పినప్పుడు అచ్చట ప్రకాశింపజేయుటకు రెండవ వస్తువు లేనప్పటికిని దీపము తనంతట తాను ప్రకాశించుచునే యుండునట్లు, సుషుప్తి యందు తెలిసికొనుటకు రెండవ పదార్థము లేకున్నను తాను మాత్రము కేవల చైతన్య స్వరుపుడై యున్నాడు. సుషుప్తియందు ఆత్మయైన తాను ప్రకాశరూపుడై యుండుటచేత అప్రకాశమైన అజ్ఞానము(తెలియని తనం) లేనే లేదు.
జ్యోతి స్వరూపుడగుటచే సూర్యునికి అంధకారములేనియట్లు,నిత్య బోధ స్వరూపుడైన ఆత్మకు అజ్ఞానము సర్వదా లేదు.
కావున అవస్థలు ఉన్నప్పుడు ఉన్నవని,లేనప్పుడు లేవని తెలియుతాను చిద్రూపుడై యున్నాడు.
అట్లే బాల్య యౌవ్వన వార్థక్యములను ప్రాతర్మధ్యాహ్న సాయంకాలములను,పగలు రాత్రి సంధ్యాకాలములను,వార పక్ష మాస బుతు సంవత్సరయుగ మన్వంతర కల్పములను,ఇంతకు ముందు ఇప్పటి రాబోవు దేహాలను,భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఈ సర్వమును ఒకే రీతిలో ఎట్టి మార్పును లేక ఆత్మ అయిన తాను తెలియు చుండుట వలన చిద్రూపుడై యున్నాడు.
కావున శ్రుతియందు
"ప్రజ్ఞానం బ్రహ్మ"
(ఐతరేయ-ఉప-3-3)మని చెప్పంబడినది.
🕉🌞🌏🌙🌟🚩
26-శ్రీ రామదాసు కీర్తన
వరాళి రాగం త్రిపుట తాళం.
ప: అడుగుదాటి కదల నియ్యను
నా కభయ మియ్యక నిన్ను విడువను || అడుగు ||
అ.ప.: గడియ గడియకు తిరిగి తిరిగి
యడిగితిని వేసార వచ్చెను
గడువు తప్పిన నేను నిక బహు
దుడుకుతనములు సేయుదును నిను || అడుగు ||
చ1: కుదురుగా కూర్చుండనియ్యను
కోపమొచ్చిన భయముచెందను
మది నెరింగీ యుండుమిక మొగ
మాట మేమియు లేదుగద నా
హృదయకమలమునందు నీ మృదు
పదములను బంధించివేతును || అడుగు ||
చ2: రేపు మాపని జరిపితే నే
నపుజేసెడివాడగాను
ప్రాపు నీవని నమ్మి కొలిచిన
పాపముల నెడబాపి దయతో
తేప తేపకు నీదు మోమిటు
జూపకుండిన నోర్వసుమ్మి || అడుగు ||
చ3: పతితపావన బిరుదు లేదా
పాలనము నను సేయరాదా
ప్రతి దినంబును దేవ నిను భూ
పతి వటంచును వేడినను నీ
హిత జనంబులు వచ్చి నను బ్రతి
మాలినను విడబోను నిన్ను || అడుగు ||
చ4: రాక్షసాంతక భక్తవరదా
సారసాక్ష సుజనరక్షక
ఈ క్షణంబున దీనజనుడని
మోక్షమియ్యక యుంటివ నిను
సాక్షిబెట్టియు నేడు నేనొక
దీక్షచే సాధింతు నిన్ను || అడుగు ||
చ5: భూరి భద్రాచల నివాసా
భుజగశయనా భక్తపోష
కూరిమిగ నిను విడిచిపెట్టిన
ధరణిలో భద్రాద్రిరాఘవ
రామదాసుం డనెడి నామము
మారుపేరున పిలువు నన్ను || అడుగు ||
🕉🌞🌏🌙🌟🚩
[14:42, 11/01/2021] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము||
సప్తమ స్కంధము/ 25వ దశకము - శ్రీనృసింహావిర్భావ వర్ణనము/25-6-శ్లోకం*
🕉🌞🌎🌙🌟🚩
భ్రామ్యంతం దితిజాధమం పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాం జవాత్
ద్వారే౾ థోరుయుగే నిపాత్య నఖరాన్ వ్యుత్ఖాయ వక్షోభువి।
నిర్భిందన్నధిగర్భనిర్భరగలద్రక్తాంబుబద్ధోత్సవం
పాయం పాయముదైరయో బహు జగత్సంహారిసింహారవాన్।।
భావము:-
ప్రభూ! నరసింహమూర్తీ! ఆ హిరణ్యకశిపుడు ఖడ్గమును డాలును చేతబట్టి నిన్ను వధించవలెనని తిరుగుచుండగా, ఆ దైత్యాధమునిని, వేగముగా నీ చేతులతోనెత్తి పట్టుకొని - ముందుగా ద్వారము పైన కూర్చుని, నీ తొడల పైన పడవేసుకొని, నీ గోళ్ళతో అతని వక్షస్ధలమును చీల్చివేసితివి. అట్లు వధించబడిన హిరణ్యకశిపుని శరీరమునుండి స్రవించు రక్తధారలను ఆనందముతో పదేపదే త్రావుచు జగత్తు భీతిల్లుచుండగా నీవు భయంకర సింహనాదము చేసితివి.
దానవ వీరుడైన హిరణ్యకశిపుడు తన భయంకరమైన గదాదండాన్ని గిరగిరా త్రిప్పి నరసింహుని మీదకి విసిరాడు. ఆయన వెంటనే, గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసి పట్టినట్లుగా రాక్షసరాజును పట్టుకున్నాడు.
ఆ దానవుడు ఎగిరి పడి ఇటూనటూ గింజుకుని, రోషంతో, చాకచక్యంతో బలంపుంజుకుని, పట్టు తప్పించుకున్నాడు. అధైర్యం చెందకుండా గరుత్మంతుని పట్టు తప్పించుకున్న సర్పరాజు లాగా ఎగిరి ఎగిరి పడుతూ చిందులు త్రొక్కుతూ పోరాడసాగాడు. “తన భుజబలానికి ఈ నరసింహుడు లొంగిపోతాడులే” అనుకుంటూ, నదురు బెదురు లేకుండా రాక్షసేశ్వరుడు విజృంభిస్తున్నాడు. తన పరాక్రమాన్ని నైపుణ్యంగా ప్రదర్శిస్తున్నాడు. దేవతలు ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాల చాటున నక్కి నక్కి చూస్తూ “మన జీవితాలకు ముప్పు తప్పేలా లేదు, వీడేమో లొంగేలా లేడు” అనే సందేహాలతో దిగులుపడసాగారు.
అయినా రహస్యంగా ఆ రాక్షసుడినే చూస్తున్నారు. హిరణ్యకశిపుడు కవచధారి అయి యుద్ధ విద్య తంత్రాలు ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర గతులలో ఖడ్గచాలనం చేస్తూ భూమ్యాకాశా లంతటా తానే పరిభ్రమిస్తున్నాడు. మల్ల యుద్ధ విద్యా విన్యాసాలైన ఉరుకుట, తిరుగుట మున్నగునవి లాఘవంగా చూపుతున్నాడు. రకరకాల పరిభ్రమణాలు చేస్తూ, భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరి పడుతున్న రాక్షసుడి అహంకారాన్ని సహించక నరసింహ ప్రభువు ఆగ్రహించాడు.
ఉగ్ర నరసింహస్వామి యొక్క సింహముఖం నుండి జనించిన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలలో వెలువడిన అగ్నిజ్వాలలతో భూమ్యాకాశాలు నిండిపోయాయి. ఆయన కోరల ధగ ధగ కాంతులు హిరణ్యకశిప రాక్షసుని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అంధుణ్ణి చేశాయి. ముళ్ళల్లా ఉన్న ఆయన కేసరాల విదలింపులకు ఆకాశంలోని మేఘపంక్తులు చెల్లాచెదరైపోయాయి. ఆ నరహరి కాలిగోరుల నుండి వెలువడే తీక్షణములైన కాంతులు, ప్రళయకాలపు మేఘాలలోని మెరుపు తీగలలా మెరుస్తున్నాయి.
ఆ నారసింహుడు అదను చూసి జటలు ఝళిపించాడు, ఒక్కసారిగా గర్జించి హుంకరించాడు, కనుబొమలు ముడిచి తీక్షణంగా వీక్షించాడు, ఆ ఉగ్రమూర్తి వికృతంగా తన నాల్కను ఆడించి, ఆ రాక్షసుడిపై విజృంభించి దూకి ఒడిసి పట్టుకున్నాడు.
నాగేంద్రుడు ఎలుకను ఏమాత్రం లెక్కచేయకుండా ఒడిసిపట్టినట్లుగా, ఆ నరసింహ ప్రభువు పట్టుకోడంతో, ఆ దేవతా శత్రువు అయిన హిరణ్యకశిపుడు ప్రాణభీతితో సుళ్ళు తిరిగిపోయాడు.
సాధుజనుల, భక్తుల అందరి పాపాలను పటాపంచలు చేసేవాడు, కడు భయంకరంగా కదులుచున్న నాలుక గలవాడు, మహోగ్రమైన వేగం గలవాడు అయిన నరసింహ దేవుడికి, ఇంద్రుని శత్రువైన హిరణ్యకశిపుడు లోబడిపోయాడు.
అప్పుడు, గరుత్మంతుడు పాములను పట్టుకుని చీల్చే విధంగా, నృసింహావతారుడు ఆగ్రహంతో వజ్రకఠోరకాయుడూ; అచంచల ఉత్సాహవంతుడూ; మహాబాహుడూ; ఇంద్ర అగ్ని యమాదులకు మిక్కిలి భయం పుట్టించేవాడూ; దానవవంశ శుభంకరుడూ; దుస్సహ పరాక్రమం గలవాడూ అయిన హిరణ్యకశిపుడిని పట్టుకుని బలవంతంగా తన తొడలపై అడ్డంగా పడేసుకొన్నాడు. వాడి రొమ్ము తన వాడి గోళ్ళతో చీల్చాడు.
దేవదేవుడు నరసింహ రూపుడు, దానవేశ్వరుడి గుండెలు చీల్చి నెత్తురు కురిపించాడు; కఠోరమైన రక్తనాళాలు త్రెంచి తుత్తునియలు చేసాడు; కండరాలు ఖండించి ముక్కలు ముక్కలుగా చేసాడు; రక్తం కారుతున్న ప్రేగులు లాగి తన కంఠంలో మాలికలుగా వేసుకున్నాడు. ఇలా అమితోత్సాహంతో హిరణ్యకశిపుని చంపి సంహరించి నరసింహమూర్తి గోళ్ళ కాంతులతో ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు.
ఆ ఉగ్ర నరసింహుని గోళ్ళు ఆ రాక్షసుని వక్ష కవాటం పగులగొట్టేటప్పుడు గండ్రగొడ్డళ్ళలా విరాజిల్లాయి. హృదయపద్మం పెకలించేటప్పుడు త్రవ్వుగోలల వలె దీపించాయి.
రక్తనాళాలు త్రెపేటప్పుడు బలిష్ఠమైన కొడవళ్ళు వలె ప్రకాశించాయి. ప్రేగులు కోసేటప్పుడు రంపాలలాగా రాణించాయి. తన ఊరువులపై పడి ఉన్న రాక్షసుడిని ఎలాంటి అస్త్రశస్త్రాలతోనూ పనిలేకుండా నరకేసరి తన గోళ్ళతోనే సంహరించాడు. అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైన రణ విజయాన్ని చాటుతూ శోభించాయి.
🕉🌞🌎🌙🌟🚩
గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అII 41వ శ్లోకమునుండి ఇంతవఱకు కర్మయోగమును గూర్చిన విచారణ గావించి, ఇక ఇక్కడనుండి జ్ఞానయోగమును గూర్చిన (సాంఖ్యయోగమును, లేక సన్న్యాసయోగమును) గూర్చిన విచారణను గావించుచున్నారు -
అసక్తబుద్ధిస్సర్వత్ర
జితాత్మా విగతస్పృహః |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ||
తా:- సమస్తవిషయములందును తగులుబాటునొందని (అసక్తమగు) బుద్ధిగలవాడును, మనస్సును జయించినవాడును, కోరికలు లేనివాడునగు మనుజుడు సంగత్యాగముచే (జ్ఞానమార్గముచే) సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మస్థితిని పొందుచున్నాడు.
వ్యాఖ్య:- ఇంతవఱకు నిష్కామకర్మయోగమును ప్రతిపాదించుచువచ్చి ఇటనుండి జ్ఞానయోగ (సాంఖ్యయోగ) విచారణయందు ప్రవేశించుచున్నారు.
కొన్ని సుగుణములు చెప్పి, అవి కలవాడు నిష్క్రియపరమాత్మస్థితిని బొందగల్గునని వచించుచున్నారు.
అవి యేవియనగా (1) దేనియందును తగుల్కొనని బుద్ధిగలిగియుండుట
(2) మనస్సును జయించుట
(3) ఆశ లేకుండుట.
"సర్వత్ర" - అని చెప్పుటచే ఏ వస్తువునందును, ఏ కాలమందును బుద్ధి తగుల్కొనరాదనియు, సర్వత్ర అసక్తుడై మెలగవలెననియు భావము.
ఏలయనగా కొందరు కొన్ని విషయములందు విరక్తులైయున్నను, కొన్నిటియందు ఆసక్తులై యుందురు. అట్లే కొందఱు ధ్యానకాలమందు అసక్తచిత్తులైయున్నను, బహిః ప్రపంచములో ప్రవేశించునపుడు విషయములందు సక్తత గలిగియుందురు. అట్టిదేమియు లేకుండుటకుగాను, "సర్వత్ర”అని ఉపదేశింపబడినది.
“జితాత్మా” - తన మనస్సును జయించినవాడు ప్రపంచమునంతను జయించినట్లే. అట్లు మనస్సును జయించనివాడు ప్రపంచమునంతను జయించినను పరతంత్రుడేయగును. దుఃఖ మాతనిని వీడదు. కాబట్టి బయటి శత్రువులతోబాటు అంతఃశత్రువులనుగూడ జయించవలెను. లేనిచో ‘భోక్తుర్గళే కణ్టకవత్ప్రతీతమ్' – అని శ్రీ శంకరులు చెప్పినట్లు , దుష్టమనస్సు
"భుజించువాని కంఠమున తగుల్కొనిన ముల్లు వలె బాధించును”. కాబట్టి వివేకవంతులు మున్ముందు తన మనస్సును, ఇంద్రియములను ప్రయత్నపూర్వకముగ జయించవలెను.
"విగతస్పృహః” - దృశ్యపదార్ధముల వేనియందును కోరిక, ఆశ యుండరాదు. అపుడే మనస్సు బయటకుపరుగెత్తక అంతర్ముఖమై ఆత్మయందు నెలకొనును. చంచల చిత్తముచే ఆత్మానుభూతి యెన్నటికిని కలుగదు. చిత్తము నిశ్చలముగా నుండవలెననిన కోరికలు నశించవలెను.
కనుకనే "విగతస్పృహః’ (ఆశ, కోరికలు లేకుండవలెను) అని చెప్పబడినది.
‘నైష్కర్మ్యసిద్ధిమ్' - మోక్షము నిచట నైష్కర్మ్యస్థితియని వర్ణించిరి. అనగా సమస్తకర్మలు రహితమైన ఆత్మస్థితియని అర్ధము. దేహము ఇంద్రియములు, మనస్సు అన్నిటిని దాటిన స్థితిగనుక అట్టి ఆత్మస్థితియందు కర్మ సంభవింపమి అద్దానిని నైష్కర్మ్యమని చెప్పిరి.
అట్టి నైష్కర్మ్యరూపమగు ఆత్మస్థితి త్యాగము (సన్న్యాసము) చేతనే లభించునని ఇట తెలుపబడినది. దేని త్యాగము? కర్మఫలత్యాగము, విషయవాంఛా త్యాగము, సంగపరిత్యాగము. దీనినిబట్టి కర్మఫలత్యాగముచే, విషయాశాపరిత్యాగముచే క్రమముగ కర్మరహిత (నైష్కర్మ్య, లేక కర్మాతీత) మోక్షపదవి లభించగలదని స్పష్టమగుచున్నది.
"పరమామ్” - అని చెప్పుటచే ఆ యాత్మస్థితి అన్ని పదవులకంటెను, అన్ని సిద్ధులకంటెను శ్రేష్ఠతమమైనదని విదితమగుచున్నది.
ప్ర:- నైష్కర్మ్యసిద్ధియనగా నేమి?
ఉ: - నిష్క్రియ ఆత్మస్థితి, మోక్షము.
ప్ర:- అది యెట్లు లభ్యమగును?
ఉ:- (1) దేనియందును తగుల్కొనని బుద్ధిగలిగియుండుటచేతను
(2) మనస్సును జయించుట చేతను
(3) ఆశలు లేకుండుటచేతను
(4) త్యాగబుద్ధి చేతను, (సర్వకర్మఫలత్యాగము, సంగపరిత్యాగముచేతను) అట్టి నైష్కర్మ్యరూపమోక్షస్థితి లభించును.
ప్ర:- ఆ మోక్షస్థితి యెట్టిది?
ఉ:- అన్ని సిద్ధులలోను, పదవులలోను ఉత్కృష్టమైనది.
ప్ర:- కర్మముచే నైష్కర్మ్యము (మోక్షము) నెట్లు పొందవచ్చును?
ఉ:- ఫలత్యాగపూర్వకముగ కర్మలనుచేయుటవలన చిత్తము శుద్ధమగుటచేతను, పైన దెల్పిన మనోనిగ్రహాదుల నభ్యసించుటచేతను జీవుడు క్రమముగ నైష్కర్మ్యస్థితిని (మోక్షమును) బొందగల్గుచున్నాడు.
🕉🌞🌎🌙🌟🚩
Only admins can send messages
18-49-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
అII 41వ శ్లోకమునుండి ఇంతవఱకు కర్మయోగమును గూర్చిన విచారణ గావించి, ఇక ఇక్కడనుండి జ్ఞానయోగమును గూర్చిన (సాంఖ్యయోగమును, లేక సన్న్యాసయోగమును) గూర్చిన విచారణను గావించుచున్నారు -
అసక్తబుద్ధిస్సర్వత్ర
జితాత్మా విగతస్పృహః |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ||
తా:- సమస్తవిషయములందును తగులుబాటునొందని (అసక్తమగు) బుద్ధిగలవాడును, మనస్సును జయించినవాడును, కోరికలు లేనివాడునగు మనుజుడు సంగత్యాగముచే (జ్ఞానమార్గముచే) సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మస్థితిని పొందుచున్నాడు.
వ్యాఖ్య:- ఇంతవఱకు నిష్కామకర్మయోగమును ప్రతిపాదించుచువచ్చి ఇటనుండి జ్ఞానయోగ (సాంఖ్యయోగ) విచారణయందు ప్రవేశించుచున్నారు.
కొన్ని సుగుణములు చెప్పి, అవి కలవాడు నిష్క్రియపరమాత్మస్థితిని బొందగల్గునని వచించుచున్నారు.
అవి యేవియనగా (1) దేనియందును తగుల్కొనని బుద్ధిగలిగియుండుట
(2) మనస్సును జయించుట
(3) ఆశ లేకుండుట.
"సర్వత్ర" - అని చెప్పుటచే ఏ వస్తువునందును, ఏ కాలమందును బుద్ధి తగుల్కొనరాదనియు, సర్వత్ర అసక్తుడై మెలగవలెననియు భావము.
ఏలయనగా కొందరు కొన్ని విషయములందు విరక్తులైయున్నను, కొన్నిటియందు ఆసక్తులై యుందురు. అట్లే కొందఱు ధ్యానకాలమందు అసక్తచిత్తులైయున్నను, బహిః ప్రపంచములో ప్రవేశించునపుడు విషయములందు సక్తత గలిగియుందురు. అట్టిదేమియు లేకుండుటకుగాను, "సర్వత్ర”అని ఉపదేశింపబడినది.
“జితాత్మా” - తన మనస్సును జయించినవాడు ప్రపంచమునంతను జయించినట్లే. అట్లు మనస్సును జయించనివాడు ప్రపంచమునంతను జయించినను పరతంత్రుడేయగును. దుఃఖ మాతనిని వీడదు. కాబట్టి బయటి శత్రువులతోబాటు అంతఃశత్రువులనుగూడ జయించవలెను. లేనిచో ‘భోక్తుర్గళే కణ్టకవత్ప్రతీతమ్' – అని శ్రీ శంకరులు చెప్పినట్లు , దుష్టమనస్సు
"భుజించువాని కంఠమున తగుల్కొనిన ముల్లు వలె బాధించును”. కాబట్టి వివేకవంతులు మున్ముందు తన మనస్సును, ఇంద్రియములను ప్రయత్నపూర్వకముగ జయించవలెను.
"విగతస్పృహః” - దృశ్యపదార్ధముల వేనియందును కోరిక, ఆశ యుండరాదు. అపుడే మనస్సు బయటకుపరుగెత్తక అంతర్ముఖమై ఆత్మయందు నెలకొనును. చంచల చిత్తముచే ఆత్మానుభూతి యెన్నటికిని కలుగదు. చిత్తము నిశ్చలముగా నుండవలెననిన కోరికలు నశించవలెను.
కనుకనే "విగతస్పృహః’ (ఆశ, కోరికలు లేకుండవలెను) అని చెప్పబడినది.
‘నైష్కర్మ్యసిద్ధిమ్' - మోక్షము నిచట నైష్కర్మ్యస్థితియని వర్ణించిరి. అనగా సమస్తకర్మలు రహితమైన ఆత్మస్థితియని అర్ధము. దేహము ఇంద్రియములు, మనస్సు అన్నిటిని దాటిన స్థితిగనుక అట్టి ఆత్మస్థితియందు కర్మ సంభవింపమి అద్దానిని నైష్కర్మ్యమని చెప్పిరి.
అట్టి నైష్కర్మ్యరూపమగు ఆత్మస్థితి త్యాగము (సన్న్యాసము) చేతనే లభించునని ఇట తెలుపబడినది. దేని త్యాగము? కర్మఫలత్యాగము, విషయవాంఛా త్యాగము, సంగపరిత్యాగము. దీనినిబట్టి కర్మఫలత్యాగముచే, విషయాశాపరిత్యాగముచే క్రమముగ కర్మరహిత (నైష్కర్మ్య, లేక కర్మాతీత) మోక్షపదవి లభించగలదని స్పష్టమగుచున్నది.
"పరమామ్” - అని చెప్పుటచే ఆ యాత్మస్థితి అన్ని పదవులకంటెను, అన్ని సిద్ధులకంటెను శ్రేష్ఠతమమైనదని విదితమగుచున్నది.
ప్ర:- నైష్కర్మ్యసిద్ధియనగా నేమి?
ఉ: - నిష్క్రియ ఆత్మస్థితి, మోక్షము.
ప్ర:- అది యెట్లు లభ్యమగును?
ఉ:- (1) దేనియందును తగుల్కొనని బుద్ధిగలిగియుండుటచేతను
(2) మనస్సును జయించుట చేతను
(3) ఆశలు లేకుండుటచేతను
(4) త్యాగబుద్ధి చేతను, (సర్వకర్మఫలత్యాగము, సంగపరిత్యాగముచేతను) అట్టి నైష్కర్మ్యరూపమోక్షస్థితి లభించును.
ప్ర:- ఆ మోక్షస్థితి యెట్టిది?
ఉ:- అన్ని సిద్ధులలోను, పదవులలోను ఉత్కృష్టమైనది.
ప్ర:- కర్మముచే నైష్కర్మ్యము (మోక్షము) నెట్లు పొందవచ్చును?
ఉ:- ఫలత్యాగపూర్వకముగ కర్మలనుచేయుటవలన చిత్తము శుద్ధమగుటచేతను, పైన దెల్పిన మనోనిగ్రహాదుల నభ్యసించుటచేతను జీవుడు క్రమముగ నైష్కర్మ్యస్థితిని (మోక్షమును) బొందగల్గుచున్నాడు.
: తిరుప్పావై 28వ పాశురం
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
28.పాశురం
కఱవై పిన్ శేస్టు కానమ్ శేర్ న్దుణ్బోమ్
అఱివోన్ఱు మిల్లాత వాయ్ క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యాముడై యోమ్
కుఱైవోన్ఱు మిల్లాదగోవిన్డా! ఉన్ఱన్నోడు
ఉఱవేల్ సమక్కు ఇంగోళిక్క వోళియాదు
అణియాద పిళ్ళైగాళోం అన్బినాల్, ఉన్ఱన్నై?
శిరు ఇఱైవా నీ తారయి పరమేలో రెంబావాయ్!!
ॐॐॐॐॐॐॐ
భావం:-
ॐॐॐॐॐॐॐ
పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించి ఉండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియూ జ్ఞానము లేని మా గోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకెన్ని లొపములున్నను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు. గోవిందా ! ఓ స్వామీ ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు. లోకమర్యాద తెలియని పిల్లలము. అందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరుపెట్టి పిలిచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములను అనుగ్రహింపక ఉండకము. మాకు ఆపేక్షితమగు 'పఱ' ను ఒసంగుము. అని గోపికలు అందరు స్వామికి శరణాగతిని చేశారు. తమ తప్పులను క్షమించమని క్షమాయాచన చేశారు.
ఓ కృష్ణా! మేము అవివేక శిఖామణులము, తెల్లవారగానే చద్దిత్రాగి పశువుల వెంట అడవికిపోయి, పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము . వువేకమేమాత్రమును లేనివారము. అజ్ఞానులము. గొల్లపడుచులము . నీవు మా గొల్లకులంలో జన్మించటయే మాకు మహాభాగ్యము . నీతోడి సహవాసమే మాకదృష్టము. యీ బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచిలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణగుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోక మర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్నచిన్న పేర్లతో కృష్ణా! గోవిందా! అని పిలిచాము. స్వామీ! అందుకు కోపగించుకోకు! జ్ఞానులు పొందవలసిన ఆ పద వాద్యమును యీ కారణమున మాకు యివ్వననబోకుము. నీతో మెలిగిన సుఖలమనే యెంచి మాపై కృపచేయుము . అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేయగ ఆశీర్వదించుమని, తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు.
ॐॐॐॐॐॐॐ
అవతారిక
ॐॐॐॐॐॐॐ
భగవానునే ఉపాయముగా ఆశ్రయించువారు సర్వోపాయములను పరిత్యజించవలెను. అది వారి - వారి స్థితిని బట్టి భిన్న - భిన్నముగా ఉండును. కర్మ జ్ఞాన భాక్ష్యాద్యు ఉపాయములను ఇదివరకు సాధనములు అనుకొని ఆచరించినవారు వదలితిని అని నివేదించవలెను. వానిని ఆచరించుటకు అశక్తులు ఐనవారు .... స్వామీ ! నేను అట్టి సాధనములను ఆచరింప అసమర్ధుడను అనవలెను. ఆచరింపవలెనని తెలిసియూ తన స్వరూపమునకు తగదని ఆచరింపని వారు అవి మాకు తగినవి కాదు కదా ! అని అనవలెను. బొత్తిగా వాని విషయమునే తెలియని వారు నేను వేరొక ఉపాయముందని తెలియలేము స్వామీ ! అనవలెను. గోపికలు శ్రీకృష్ణుడు తప్ప వేరొక సాధనముండునని తెలియనివారు మాకేమియూ విడువదగినది లేదు స్వామి అని ఈ పాశురమున విన్నవించుచున్నారు.
గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి. కాని వారి అంతరంగ మందున్న కోరిక ఆముష్మిక మైనదని స్వామికి తెలియును 'నీకు మాకును వున్న సంబంధమే! మేమజ్ఞానులము. మేము నిన్నుగాని, నీవు మమ్ములనుగాని విడిచి వుండలేని బంధమే అర్హత' అని విన్నవించారీ పాశురంలో.....
కమానురాగము _ రూపకతాళము
ప... ప్రేమతో చిరునామమున నిన్ను పిలిచినామని
స్వామీ! గోవింద ! అలగబోకుమా! కణ్ణా!
అ..ప.. ఏమీ! తెలియని వారము స్వామీ!
మము కృపజూడర! గొల్ల పడుచులము
స్వామీ! గోవింద! అలగబోకుమా! కణ్ణా!
చ ... ఎంతటి పుణ్యమొ నీ అవతారము
వింత గద! గొల్లకులమున ప్రభవము!
ఎంత త్రేంచినను తెగనీది బంధము
ఎంత ధన్యమీ గోపికా కులము!
స్వామీ! గోవింద! అలగాబొకుమా! కణ్ణా!
2చ.. కోపింపకుమా! కృష్ణ ! కృపాకర!
కృపాజేయును వాద్య విశేషము త్వర!
గోపికలము మే మజ్ఞానులము
మేవుచు పశువులను బ్రతికెడివారము
స్వామీ! గోవింద! అలగాబోకుమా! కణ్ణా!
ॐॐॐॐॐॐॐॐॐॐ
శ్రీకృష్ణుడే సిద్దోపాయం
ఆండాళ్ తిరువడిగలే శరణం
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఇన్నిరోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచినా, నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం "గోవిందా" అని పిలవడంచే స్వామికి సంతోషం వేసింది. వీళ్ళకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి గాని అనుగ్రహించడు. భగవంతుని చేరే ఉపాయాలు కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి. చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు. పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయనను సిద్దోపాయం అని అంటారు. ఇలా ఉపాయాలు రెండు రకాలు, ఒకటి మనం సాదించాల్సిన కర్మ, జ్ఞానాదులు ఇక రెండోది సిద్దమైన ఉన్న పరమాత్మ.
అందుకే మనవాల్లుళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం "హే గోవిందా" నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే స
ిద్దోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది.
అవి ఏమిటంటే
1. తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమి లేదు అని స్పష్టం చెయ్యాలి.
2. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమి లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి.
3. ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి.
4. ఆయనకీ మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది, ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి.
5. మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి.
6. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి.
ఈ ఆరూ లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే!!
ఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం, దాన్ని తగ్గించుకొనే శక్తి మనలో లేదు, దాన్ని తగ్గించగల యోగ్యుడవు నివ్వు అని చెప్పాలి, నిన్ను నమ్ముకుని వచ్చాను అని అయనతో సంబంధం గురించి చెప్పాలి, జబ్బురకుండా మళ్ళీ ఆ తప్పులు చెయ్యనని చెప్పాలి, త్వరగా తగ్గించండి అంటూ త్వరను తెలుపాలి. అప్పుడు గాని ఆ వైద్యుడు మందు ఇవ్వడు. అదే మన స్వంత ప్రవృత్తి చూపితే అదేదో నివ్వే చూసుకో అని వదిలేస్తాడు. లోకంలో వ్యాదిని నయం చేయటానికి ఎన్నో మందులు ఉండవచ్చు, వైద్యుడు వేరే మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాది నివారించాలి అంటే వైద్యుడూ, మందూ అన్నీ శ్రీకృష్ణుడే. అందుకే మనవాళ్ళు శ్రీకృష్ణుడిని "వైద్యో వైద్యః" చక్కటి వైద్యుడు సుమా!! అని చెబుతారు.
అయితే మనవాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు, అయితే ఇంకా వీళ్ళల్లో కర్తుత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరిక్షిస్తాడు. అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. ఈ రోజు మనవాళ్ళు మాకు కర్మ, జ్ఞానం, భక్తి ఇవన్నీ ఏమి లేవు అని చెబుతున్నారు, దీన్నే ఉపాయ నిష్కర్ష అని అంటారు. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు.
మొదట మేం అంటూ ఆర్జించుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్ని ఏమి లేవు.
ఇవి లభించాలి అంటే వేదాధ్యయణం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్దుడై ఉండాలి. అలాంటి గురువు వెంట కదా వెళ్ళితే అవి ప్రాప్తిస్తాయి. మరి మేమో "కఱవైగళ్ పిన్ శెన్ఱు " పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా. అవి కూడా పాలు ఇస్తేనే మేం పోశిస్తాం. లేకుంటే లేదు.
ఇది కర్మ అని కూడా భావించం, కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. "కానమ్ శేర్-నుంద్-ణ్భోమ్" అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది, ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు.
మేం "అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు" ఎలాంటి జ్ఞానం, భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా. మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూసాడు.
మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటే "ఉన్ఱన్నై ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్" మాకోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మద్య ఉంటూ మేం పండిచనక్కర లేని ఒక పుణ్యం మావద్ద ఉందయా, అది నివ్వు.
"కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా" కళ్యాణ గుణ పూర్తి కల వాడివి, ఏలోటు లేని వాడివి. మాలోటు తీర్చగలిగే వాడివి గోవిందా.
"ఉందన్నో డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు" నీకూ మాకూ ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం. ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు. "అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్" ఇన్నాళ్ళు తెలియక రక రకాల పేర్లతో పిలిచాం తెలియక, చిన్న పిల్లలం, పట్టించుకుంటారా. "ఉన్ఱన్నై చ్చిఱు పేర్-అళైత్తనవుం" చిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేసాం, నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం.
"శీఱి యరుళాదే" కోపించక అనుగ్రహించు. "ఇఱైవా! నీ తారాయ్ పఱై" మాకందరికి స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు, నీవు నీవాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూశిస్తారు. అనుగ్రహించు.
ॐॐॐॐॐॐॐॐॐ
తిరుప్పావై 28వ పాశురము/అనువాద పద్యం
ॐॐॐॐॐॐॐॐॐॐ
సీ.గోపకులము చేరి గోవిందు డైనావు
చల్లగా చూడుము గొల్లలనక
వేచి యుంటిమి మేము వేసారి బోనీకు
చిత్తడి చేయకు చిత్తములను
గోవు వెంట తిరిగి గోపాలుడైనావు
మాకుఫలము నిమ్ము మదిని దోచి
కోనలందు తిరుగు గొల్ల కన్నియలంచు
కోపించ బోకుము కోరిక విని
పుణ్య మేమున్నదో పుట్టిరేపల్లెలో
నోచుచున్నాము యీ నోమునిపుడు!!
తే.గీ.జన్మ జన్మల బందమై సాగునపుడు
చిన్ని పేర్లతో పిలుచుచు యెన్ని మాట
లంటిమో కాని నొచ్చక యన్ని సైచి
పరను దయచేసి మాకొక వరము నిమ్ము
శ్రద్ధ భక్తి నొసగి బుద్ధిని కల్గించు
శ్రీధరుని మనసున స్థిరము కమ్ము!!
🌹. గీతోపనిషత్తు -121 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 5
🍀. 4 . సాంఖ్యము - యోగము - జ్ఞానయోగులచే పొందబడు గమ్యమే కర్మయోగము చేతను పొందబడుచున్నది. కర్మ జ్ఞానములు రెండిటినీ ఒకటిగ చూచువాడే తెలిసినవాడు. ఏమి చేయవలెనో, ఎట్లు చేయవలెనో తెలిసి కర్మమును చేయుట కర్మబంధము నుండి జీవునికి విముక్తి కలిగించును. విముక్తి కలిగిన తరువాత కూడ కర్మాచరణమే యుండును. ఆచరణమే ఆనందమయమై నిలచును. అపుడు నిర్వహించునది దివ్యకర్మ యని పిలువబడును. మొదట బుద్ధిని ప్రచోదనము గావించుకొని, చేయదలచిన పనులను చేయుట కాక, చేయవలసిన పనులను చేయుట నేర్వ వలెను. 🍀
5. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగై రపి గమ్యతే |
ఏకం సాంఖ్యంచ యోగం చ యః పశ్యతి స పశ్యతి || 5
జ్ఞానయోగులచే పొందబడు గమ్యమే కర్మయోగము చేతను పొందబడుచున్నది. కర్మ జ్ఞానములు రెండిటినీ ఒకటిగ చూచువాడే తెలిసినవాడు.
ఏమి చేయవలెనో, ఎట్లు చేయవలెనో తెలిసి కర్మమును చేయుట కర్మబంధము నుండి జీవునికి విముక్తి కలిగించును. విముక్తి కలిగిన తరువాత కూడ కర్మాచరణమే యుండును. ఆచరణమే ఆనందమయమై నిలచును. అపుడు నిర్వహించునది దివ్యకర్మ యని పిలువబడును.
మహాత్ము లందరును దివ్య కర్మమునే నిర్వర్తించు నుందురు. వారికి కర్మబంధము లేదు. ఆచరణమందలి ఆనందమే యుండును. ఫలితముల యందు వారి కాసక్తి యుండదు.
దేనిని గూర్చి రాగము గాని, ద్వేషముగాని యుండదు. తటస్థ స్థితి యందుండి తమ వద్దకు వచ్చిన కర్మను ధర్మ మాధారముగ నిర్వర్తింతురు. ఇట్టి తటస్థస్థితి వశిష్ఠ, అగస్త్యాది మహర్షులు నిర్వర్తించి చూపిరి. ఇదియే నిజమగు సన్న్యాసము.
దైవము గీతయందలి రెండవ అధ్యాయమున బుద్ధిని ఆశ్రయింపమని తెలిపెను. మూడవ అధ్యాయమున కర్మ మాచరింప మని తెలిపెను. నాల్గవ అధ్యాయమున కర్మాచరణము త్యాగ
స్ఫూర్తిని కలిగించి, పరహిత యజ్ఞములనెట్లు నిర్వర్తింప చేయునో తెలిపెను. తదనుగుణమగు జ్ఞాన మెట్లబ్బునో తెలిపెను.
ఐదవ అధ్యాయమున తటస్థస్థితిని చేరుట తెలుపుచున్నాడు. ఈ సోపానములను యిట్లే అధిరోహించుట వలన ప్రాపంచిక బంధములు తప్పక తొలుగగలవు. భగవద్గీత యందలి అధ్యాయము లన్నియు యిట్లోక ఆరోహణ క్రమమును కలిగియున్నవి. యోగ మనగ క్రమముగ యిందలి సోపానములను అధిరోహించుటయే.
మొదట బుద్ధిని ప్రచోదనము గావించుకొని, చేయదలచిన పనులను చేయుట కాక, చేయవలసిన పనులను చేయుట నేర్వ వలెను. చేయవలసిన పనులు చేయుచున్నపుడు ఫలితముల నాశించుట, ఫలితముల కొరకై వక్రతల నాశ్రయించుట, కర్మ ఫలములకు రాగము కారణముగ లొంగుట విసర్జించవలెను. అట్లు చేయు కర్మాచరణము శుద్ధమై త్యాగపు తీరములు చేరును.
అపుడే ద్రవ్యాది ద్వాదశ యజ్ఞములు నిర్వహించు సామర్థ్యము కలుగును. అట్లు కర్మయందుత్తీర్ణుడైనవాడు తటస్థ స్థితిని చేరి సన్న్యాసి యగును. ఇదియొక ముఖ్యమగు క్రమము. తోచినది తోచినట్లు చేయుటగాక, పై క్రమము ననుసరించి యుండవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 321 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
81. అధ్యాయము - 36
🌻. విష్ణు వీర భద్ర సంవాదము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
అపుడీ విధముగా తన అభిప్రాయమును విష్ణువు ప్రకటించగా,ఇంద్రుడాయనను పరిహసించి, వజ్రమును చేత బట్టి, దేవతలతో గూడి యుద్ధమునకు సంసిద్ధుడాయెను (1). అపుడు ఇంద్రుడు ఏనుగును, అగ్నిమేకను, యముడు దున్నను, నిర్ ఋతి ప్రేతమును (2), వరుణుడు మొసలిని, వాయువు లేడిని, కుబేరుడు పుష్పకమును అధిష్ఠించి, జాగరూకత గల వారై యుద్ధమునకు సంసిద్ధులైరి (3). అదే విధముగా పరాక్రమవంతులగు ఇతర దేవతలు, యక్షులు, చారణులు, గుహ్యకులు తమ తమ వాహనముల నధిష్టించిరి (4).
అపుడు సర్వదేవగణములు, బలశాలురగు ఇంద్రుడు మొదలగు లోకపాలురు శివమాయచే విమోహితులై యుద్ధమును చేసిరి (5). అపుడు దేవతలకు, రుద్రగణములకు మధ్య గొప్ప యుద్ధము చెలరేగెను. వారు పదునైన బల్లెములతో, ఇనుపబాణములతో ఒకరితో నొకరు యుద్ధమును చేసిరి (6).
ఆ యుద్ధము అనే మహాసంరంభములో శంఖములు, భేరీలు, పెద్ద దుందుబులు, పటహములు, డిండిమములుఇత్యాది వాద్యములు మ్రోగింపబడెను (7). ఆ మహా శబ్దము చే ప్రోత్సాహింతులైన దేవతలు లోకపాలురతో గూడిన వారై, ఆ సమయములో శివకింకరులను సంహరింప జొచ్చిరి (8)
ఇంద్రుడు మొదలగు లోకపాలకులు, శంభుని గణములు వెనుదిరుగునట్లు చేసిరి. ఓ మహర్షీ! వారు భృగువు యొక్క మంత్రబలముచే సంహరింపబడిరి (9). యజ్వ యగు భృగువు దేవతలకు హవిర్భాగములనిచ్చి, దీక్షితుడగు దక్షుని సంతోషపెట్టుటకై ఆ రుద్ర గణములను తన మంత్రబలముచే తరిమి వేసెను (10). తన వారైన భూతప్రేతపిశాచములు ఓడి పోవుటను గాంచి వీరభద్రుడు మిక్కిలి కోపము గలవాడై, వారిని తనవెనుక ఉంచుకొని (11).
వృషభముల నధిష్ఠించిన గణములు ముందు నడుచు చుండగా, మహాబలుడగు ఆతడు స్వయముగా పెద్ద త్రిశూలము ధరించి దేవతలను పడగొట్టెను (12). అపుడు ఆ గణము దేవతలను, యక్షలను, సాధ్యుల గమములను, గుహ్యకులను, మరియు చారణులను శూలములతో పొడిచి వేగముగా సంహరింపజొచ్చిరి (13).
కొందరిని కత్తులతో రెండు ముక్కలుగా నరికిరి. మరికొందరిని ఇనుప రోకళ్లతో పొడిచి చంపిరి. ఆ గణములు ఆ యుద్ధములో దేవతలను ఇతర ఆయుధములతో గూడ కొట్ట జొచ్చిరి (14). ఈ విధముగా ఆ దేవతలందరు పారాజయమును పొంది, ఒకరితో మరియొకరికి సంబంధము లేకుండగా పారిపోయి, స్వర్గములో దాగిరి (15).
ఆ భయంకర సంగ్రామములో మహాబలవంతులగు ఇంద్రుడు మొదలగు లోకపాలురు మాత్రమే ఉత్సాహముతో ధైర్యము నవలంబించి నిలబడిరి (16). ఆ రణరంగమునందు ఇంద్రుడు మొదలగు వారందరు కలసి సంప్రదించుకొని, అపుడు బృహస్పతి వద్దకు వెళ్లి వినయముతో నమస్కరించి ఇట్లు ప్రశ్నించిరి (17).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 206 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చ్యవనమహర్షి-సుకన్య - 3 🌻
12. అలాంటి గ్రంథాల్లో ఓ అక్షరానికో, ఓ శ్లోకానికో ఒకరికి అర్థం తెలియకపోతే, తనకర్థమయేలాగ దానిని అతడు దిద్దుకునేవాడు. ఈ ప్రకారంగా అనేక మార్పులు పురాణాలలో చోటుచేసుకున్నాయి.
13. ఇది కాక, ఒక ధర్మాన్ని గురించి పురాణాన్ని చెపుతున్నప్పుడు దీనికి ఈ కథను చేరిస్తే బాగుంటుందని, ఆ కథకు ఇంకొక కథ చేర్చటము, ఆ సూత్రాన్ని ఆ ధర్మాన్ని గట్టిగా చెప్పటానికి మరొక కథను-తనకు తెలిసిన కథను-అందులో పెట్టటము; ఏదైనా ఒక ధర్మాన్ని గురించి చెప్పవలసివస్తే అప్పుడు ఈ ధ్రమాలు ఈ సమయంలో చెపితే బాగుండును అను వాటిని అక్కడ చేర్చడం- ఇట్లా జరిగేవి.
14. ధర్మం చెప్పటం బ్రాహ్మణుడి ధర్మం. అతడి ఉద్యోగమే అది. అంటే ఎక్కడైనా ధర్మసంకటంవస్తే, బ్రాహమణుడు వెళ్ళి ఇది ధర్మం అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోవాలి. భూతదయ గొప్పది. సత్యం గొప్పది. శౌచము(అంటే ఎప్పుడూ మనసుకు, శరీరానికి శుచి ఉండటం) చాలా ముఖ్యం.
15. ఇలాంటి వాళ్ళు ఎవరయితే ఉన్నారో-భూతదయ కలిగి సత్ప్రవర్తనతో ఉండి మనస్సు, శరీరము శుచిగా పెట్టుకోగలిగిన వారెవరైన ఉంటే; వాళ్ళ పాదాలే సకల తీర్థములు, వాళ్ళ పాదస్పర్శచేత సమస్త తీర్థముల ఫలాలు కలుగుతాయి. “ప్రసిద్ధమయిన మహాక్షేత్రాలలో నైమిశము, చక్రతీర్థము, పుష్కర క్షేత్రము అనే మూడుతీర్థములు సకలలోకాలలో కూడా శ్రేష్ఠమయిన క్షేత్రాలు అవి. అక్కడకువెళ్ళి వాటిని సేవించినవాళ్ళకు సకల పాపములు నశిస్తాయి”.
16. రాక్షసులు ఎప్పుడు తపస్సుచేసినా, అనేకమందిని చంపటానికి వీలైనటువంటి ఆయుధాన్ని అదుగుతూ ఉంటారు. “ఒక బ్రహ్మాండమయిన ఆయుధం నాకిచ్చావంటే దానికి ఎదురు ఉండదు. దానితో ముట్టుకుంటేనే అందరూ చావాలి. బూడిద కావాలి” ఇట్లాంటి వరాలే అడుగుతారు. లోకలో ఆకలి లేకుండా చేయమని ఒకడు, లోకంలో తాము ముట్టుకుంటే ఎవరైనా చనిపోవాలి అని మరొకడు – రాక్షసులు ఇలాంటి వరాలే అడుగుతారు. అందరికీ లోకంమీదనే దృష్టి.
17. శరీరానికి బలం ఇచ్చేటటువంటి, ఆయ్స్సును వృద్ధి పరచేటటుబంటిది ఒక ఔషధాన్ని అశ్వినీదేవతల దగ్గరినుంచి గ్రహించి లోకానికి ఇచ్చాడు చయవనమహర్షి. ఆయుర్వేదంలో కొన్ని మూలికలనుఇచ్చి, వాటికి ప్రయోగాలు చెప్పడని కూడా శాస్త్రం చెబుతున్నది. ‘చ్యవనప్రాశ‘ అనేది ఆయనపేరు మీదుగానే నేడు వాడకంలో ఉంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 145 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 24 🌻
585. మానవుడు పరస్పరాశ్రితములైన యీ నాలుగు గోళములను దూకి తనదైన సత్యగోళములోనికి ప్రవేశించెను, ప్రవేశించును.
586. ఐదవ గోళము లేక, సప్తమ భూమిక ఏ గోళమును కాదు.లేక ఒక భూమికయును కాదు అని చెప్పుటలో పొరపాటు లేదు. అది భగవంతుని స్వీయ స్వత్వముయొక్క సత్యస్థితి.
587. అనంత జ్ఞాన శక్యానందముల సప్తమ భూమికలో జీవాత్మ భగవంతునిలో లీనమై, భగవంతుడే యగును. ఎల్లకాలముల యందు కాలమును అధిగమించి యుండును. అప్పుడతనికి శరీరమున్నను లేనట్లే పరిగణించబడును. సత్యధర్మము ననుసరించి పరమాత్మానుభూతి నొందిన కొద్దికాలములో ఈ స్థూలకాయము రాలిపోవును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామములు - 1 / Vishnu Sahasra Namavali - 1 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
🌻. ప్రారంభము 🌻
పాలకడలిలో శంఖ చక్ర గదా పద్మములు ధరించిన వాడు, భూమియే పాదములుగా గలవాడు, సూర్యచంద్రములు నేత్రములైన వాడు, దిక్కులే చెవులైన వాడు, త్రిభువనములు శరీరముగా గలవాడు, శేషశాయి, విశ్వరూపుడు, శ్రీవత్సాంక కౌస్తుభ పీతాంబరధారి, నీలమేఘ వర్ణుడు అయిన రుక్మిణీ సత్యభామా సమేతుడు, ముకుందుడు, పరమాత్ముడు అయిన దేవునకు ధ్యానము చెప్పబడుతుంది.
"హరిః ఓం" అంటూ వేయి నామాల జపం మొదలవుతుంది.
అశ్వని నక్షత్ర ప్రధమ పాద శ్లోకం
🍀 1. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ‖ 1 ‖ 🍀
🍀 1) విశ్వం -
మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
🍀 2) విష్ణు: -
విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
🍀 3) వషట్కార: -
వేద స్వరూపుడు.
🍀 4) భూత భవ్య భవత్ ప్రభు: -
భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
🍀 5) భూత కృద్ -
భూతములను సృష్టించిన వాడు.
🍀 6) భూత భృత్ -
జీవులందరిని పోషించు వాడు.
🍀 7) భావ: -
సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
🍀 8) భూతాత్మా -
సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
🍀 9) భూత భావన: -
జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 🌹
Comments
Post a Comment