ప్రాంజలి ప్రభ 23/03

  


 జై శ్రీ రామ్

*రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?

ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న "నవరత్నాలలో" ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది.

రాజ్యసభలో ఉన్న పండితుల అందరినీ పిలిచి "రామాయణం" లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు.

ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు.

ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు.

విక్రమాదిత్యుని రాజ్యసభలో "వరరుచి" అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.

అతనికి ఆ వెయ్యి  బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది.

అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాల లో తిరిగి రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు.

అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది. 

40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.

నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు.

వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ  మాటల్లో రామాయణంలో ప్రముఖమయిన శ్లోకం "మాం విద్ధి... అని చెప్పింది.

ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది.

అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు.

ఆ శ్లోకం ఇది 👇

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్

అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్

ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు.

అతను  చెప్పిన 18 రకాలయిన  అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.


ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి?

ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు?

ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలోఅరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది.

రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి  లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ,

తన తల్లి "సుమిత్ర" ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం.

ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. 

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్.

అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత! యథాసుఖమ్৷৷

మొదటి అర్ధం:

రామ= రాముడు:  దశరథం=దశరథుడు:  విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా

లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో,  సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!

రెండవ అర్ధం:

రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం)  దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా

ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ  ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి  రా! 

మూడవ అర్ధం:

రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి ); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా

ఓ పుత్రా!  నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో,

సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు.

రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక  శోకిస్తుంది.

కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.  

  ****

 * జాలి - దయ 

జాలి పడుట దయ చూపుట కాదు. జాలి వేరు, దయ వేరు. జాలి పడువారు జాలిని కోరుదురు కూడ. తమపై ఎవరికిని జాలిలేదని కూడ వారికనిపించుచుండును. తానితరులపై జూపిన జాలి తనపై నెవ్వరును చూపుట లేదని కూడ జాలి పడుదురు. దుఃఖింతురు కూడ. ఆ దుఃఖము నుండి ఇతరులపై ఆరోపణలు చేయుట ప్రారంభింతురు. తమను గూర్చి ఎవరును పట్టించు కొనుట లేదని రోషము చెందుదురు. తమలో గల జాలి తమపై ఆవరించి చైతన్యమునకు అవరోహణము కలిగించు కొనుచుందురు. వారి దుఃఖము, ద్వేషము, రోషము కారణముగ రోగగ్రస్తులు కూడ నగుదురు. దయ, జాలివంటిది కాదు.

దయ కలవాడు, ఇతరుల కష్టములను చూచి కేవలము జాలిపడక వారికేమి కావలయునో బుద్ధి నుండి గ్రహించి నిర్వర్తించును. వారి కష్టనష్టములను తన లోనికి గొనక వారికి సహాయ సహకారము లందించును. దయ గలవాడు, జాలి గలవాడి వలె దుఃఖించడు. కర్తవ్యనిర్వహణమే గావించును. జాలి హృదయ దౌర్బల్యము కలిగించును. దయ, హృదయ వికాసమును గావించును. జాలి విషయమున “జాలి పడుట" అందురు. దయ విషయమున “దయ చూపుట” అందురు. ఒకటి పడుట కాగ రెండవది చూపుట యుండును. పడుటకన్న చూపించుట మేలు కదా! హృదయము నందలి పురుషప్రజ్ఞ - దయ. స్త్రీ ప్రజ్ఞ - జాలి.

---

* తెలుసుకోదగిన విషయం .....

ఒక రోజొక గురువు గారు తన ఇద్దరు శిష్యుల్నీ పిలిచి, “ఈ రోజు మీరిద్దరూ పొరుగూరికి వెళ్లి రావాలి” అని చెప్పారు. ఒక సంచిలో ఆహారాన్ని నింపి, ఒక శిష్యునికి ఇచ్చి, “ఎవరైనా అవసరం ఉన్న వాళ్లు కనిపిస్తే వారికి ఈ ఆహారాన్ని పంచుకుంటూ వెళ్లు” అన్నారు. 

రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి ‘దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్లు’ అన్నారు.

ఇద్దరూ సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచి వాడు ఆడుతూపాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక అతనికి ఒక విలువైన రంగు రాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ రంగు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండేకొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది.

ఇక రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభం అయింది. పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేక పోయాడు. ప్రయాణమూ కష్టంగా సాగింది.

మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి. మీ యగమ్యాన్ని ఎలా చేరుకోదలచుకున్నారు?

ఈ కథను తాత్విక దృష్టితో చూసినట్లయితే “విలువగలవైనా ..

లౌకిక విషయాలను, వస్తు సమాగ్రిని ప్రోగు చేసుకుంటూ వెళితే, జీవితం దుర్భరమవుతుంది. అదే మన ప్రేమనీ , జ్ఞానాన్నీ పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే, మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది”. 

అదే ఈ కథలోని తత్త్వం. మానవునికి అనుసరణీయం.


 *వ్యక్తమ గుటఁగన విధిగా

సఖ్యత త్రిగుణాలు గాను సాక్షి గ నుండన్

వాక్యపు వాసన ఫలముల్

ముఖ్యమగుటయే నుసాధ్యమునిదే యగుటన్

---

* ఏదీ నీదియు కాదులె

నాదియు నీదియును ఏది నానుడి శూన్యం

కాదని ఊపిరి పోయును

నాదని బ్రతికేను సొంత నాన్యత శూన్యం

---

* ఏదీ లేదన వచ్చే

మాదీ లేదని చెప్పే మానస బుద్ధీ

వాదీ వేదన పల్కే

కాదీ బ్రతుకు న అనుకువ కాలపు బుధ్ధీ

---

*సిరి లొలికెను సిరివెన్నెల,

విరిసిన గీతాలు గాను వేకువ నాదం

మరి మరి నదిగా సాగెను

తరుణాన పాట లెలమిన తనివీ తీరే

---

---

*కళ్ళే కైపును చూపెను

ముళ్ళై గుండెలను గుచ్చి ముక్కెర చూపెన్

జళ్ళై కళ్ళలొ జలజల

గళ్ళై మనసును చురుకుగ గాళము యగుటన్

---

*బాసల పస చెలిమిగనే

యాసల పస పలుకులుగనె యాకలి మార్చున్

పూసల పస పుడమిన నే 

ప్రాసల పస పద్యమౌను ప్రకటన కవులున్

.........

*కుంకుడు పులుసును కళ్ళలొ

ఇంకుడు గుంట గను చేరి ఈశ్వరిలీలల్

మంకేల నీకు మనసున

వంకర కళ్ళలొ నులుసులు వరుసగ మార్చెన్

........

*కొబ్బరి పచ్చడి తిన్నా

నిబ్బరమైన మనసులకు  నియమమ్ముగనన్

అబ్బురపరిచే కళలే

నబ్బుట విధిగా జరుగుట నరముల బలమున్

........

*భూమియు అంతా పుత్తడి

కామిక బుద్ధులు మెలుకువ కాలము అలికే

సామిని కోరిన తీరదు

ఆమని ఆశకు కలలగ ఆకలి తీరెన్


*మనిషి మనిషి దూరముయే

మనసే మగువైన నమ్మె మత్రం ఇదియున్

అణువంత సొగసు కులుకే

తనువే భూమిగ గగనము తాపము తీర్చెన్

---

*చిన్నది కన్నది కళలై

ఉన్నది తెలిపిన కనవలె ఉనికియు గతులన్

మిన్నగ చూసెను బతుకున

మన్నని లేకయు సుఖమగు మనసే భకరువున్


*చిన్నది అన్నది కళలై

ఉన్నది తెలిపిన కనవలె ఉనికియు గతులన్

మిన్నగ చూసెను బతుకున

మన్నని లేకయు సుఖమగు మనసే భరువున్

......

*గురిచేరిన చోటున నే

మరి మరి అందరు సహాయ మనునది చూపున్

గురి కుదరక యే విమర్శ

చేరే ఆశీర్వాదము చింతగ మారున్

..........


*మల్లెల రోదన గుట్టుయు

మల్లిక చూపుల పలుకులు మాలను చూపెన్

తల్లడిలి కనికరమ్మే

నల్లికవి యదే కదిలెను నటనకు లొంగెన్


*నింగియు చూపుల నివ్వెర

ఒంగిన వయ్యారపు నడుము ఒంపులు పిలుపున్

సంగమ కాంక్షకు చిక్కియు

సింగము ఆత్రుతనుచూపి సిరులను దోచెన్


*అడిగిన పొగడిన తిరిగిన

వడివడి తలుపులు తెలుపుచు వలచుచు బ్రతికెన్

నడకల మలుపుల  నడుముతొ

పిడికెడు కడుపుకు కళలతొ బిగువున నలిగెన్

.......

తేటగీతి పద్యాలు 

*జూ.యన్.టి.ఆర్. జన్మదినోత్సవ శుభాకాంక్షలు


కళ్ళు చెమ్మగిళ్ళె నటన కాల మగుట

పట్టుదలతో ను కధలకు ప్రాణ మిచ్చె

తాత వారస నటనతో తెలుగు భాష

నందమూరి తారక రామ నాట్య రుద్ర

---

*మనసు పడ నంత మాత్రాన మగువ రాదు

ప్రేమ చూపిన మాత్రాన పేరు రాదు

సమయ సద్విని యోగమే సహన మవదు

ఓర్పు ఓదార్పు వినయమ్ము ఓడిపోదు

అందుకే ప్రేమ ఓర్పు యే ఆదు కొనుట

---

*ప్రాంజలి ప్రభ వారి సమస్యను పూరించండి........

పాపము లేనిచో జగతి పాడయి పోవును నిక్కువంబుగన్ 

......

*ఉత్పలమాల 

కోపము లేనిచో ప్రగతి కోరుట సాధ్యము కాదుకాదుగన్

తాపము లేనిచో ప్రతిభ దారిన చేరుట సాధ్యమేలనున్

ఓపిక లేనిచో బ్రతుకు ఓడుట బాధకు బంధనమ్ముగన్

పాపము లేనిచో జగతి పాడయి పోవును నిక్కువంబుగన్

..

*చంపకమాల

విధిన న నేమి జర్గునని విద్యను నేర్చిన పండితుండనెన్

మధువును దోచు లక్షణము మాధ్యమికానన విద్యపాశమున్

పదములుతెల్పుపాఠముయు ప్రేమకు చిహ్నము అయ్యెనే యగున్

విధుడు గళంకహీనుడగబేరు గనెన్ గురుపత్ని గూడుటన్

---


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ