అహం సర్వస్య ప్రభవో
మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజంతే మాం
బుధా భావసమన్వితాః ।।
నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును. నా వల్లనే అన్నీ
కొనసాగుతున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత
భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు.
శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాన్ని "అహం సర్వస్య ప్రభవో" అనటంతో
ప్రారంభిస్తున్నాడు, అంటే "నేనే సర్వోత్కృష్ట పరమ సత్యాన్ని మరియు సర్వ
కారణ కారణాన్ని" అని. ఈ విషయాన్ని భగవద్గీత లో చాలా సార్లు చెప్పారు. ఇతర
పురాణ/ఇతిహాసాలలో కూడా ఇది గట్టిగా పేర్కొనబడినది.
ఋగ్వేదము ప్రకారం:
యం కామయే తం తం ఉగ్రం కృష్ణోమి తం బ్రహ్మాణం తమ్ ఋషిం తం సుమేద్సం (10.125.5)
"నేను ప్రేమించే వారిని అత్యంత మహానీయులుగా చేస్తాను; వారిని పురుషులుగా
లేదా స్త్రీలగా చేస్తాను; వారిని జ్ఞానవంతులైన మహాత్ములుగా చేస్తాను; ఏదేని
జీవాత్మను బ్రహ్మ పదవికి అర్హునిగా చేస్తాను."
ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వివేకులు ధృడ విశ్వాసం పెంచుకుని మరియు ప్రేమయుక్త భక్తితో ఆయనను ఆరాధిస్తారు.
ఈ విధంగా శ్రీ కృష్ణుడు ఈ భౌతిక జగత్తుకి మరియు ఆధ్యాత్మిక జగత్తుకి, రెండింటికీ కూడా సర్వేశ్వరుడు. .
అనంతమైన భౌతిక విశ్వంతో కూడిన ఈ భౌతిక సృష్టిపై ఆధిపత్య భగవంతుని స్వరూపమే
మహావిష్ణువు. మహా విష్ణువునే ప్రథమ పురుషుడు అని కూడా అంటారు (భౌతిక
జగత్తులో భగవంతుని యొక్క ప్రథమ స్వరూపము).
ఆయన కారణ సముద్రంలో దివ్యమైన నీటిలో ఉంటూ అనంతమైన బ్రహ్మాండాలను తన శరీర
రోమకూపాల్లోంచి సృజిస్తూ ఉంటాడు. తదుపరి ఆయనే ప్రతి ఒక్క బ్రహ్మాండం క్రింద
గర్భోదక్షాయి విష్ణు స్వరూపంలో వ్యాప్తించి ఉంటాడు, ఆయననే ద్వితీయ
పురుషుడు అంటారు. (భౌతిక ప్రపంచంలో రెండవ స్వరూపము).
గర్భోదక్షాయి విష్ణు నుండి బ్రహ్మ జన్మించాడు. ఆయనే సృష్టి క్రమాన్ని
నిర్దేశిస్తాడు – విశ్వము యొక్క విభిన్నములైన స్థూల, సూక్ష్మ పదార్ధాలని,
ప్రకృతి నియమాలని, గ్రహాలూ, పాలపుంతలూ, వాటిపై నివసించే జీవరాశులు మొదలైన
వన్నీటినీ సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి బ్రహ్మని విశ్వ సృష్టి కర్త అని అంటూ
ఉంటారు, నిజానికి ఆయన ద్వితీయ స్థాన సృష్టికర్త.
గర్భోదకశాయి విష్ణు ఇంకొంత వ్యాప్తి నొంది, తానే, క్షీరోదక్షాయి విష్ణు గా
రూపాంతరం చెంది, ప్రతి బ్రహ్మాండం యొక్క పై భాగంలో, క్షీర సాగరంలో
నివసిస్తాడు. క్షీరోదక్షాయి విష్ణువు నే తృతీయ పురుషుడు అంటారు. (భౌతిక
జగత్తు లో భగవంతుని యొక్క మూడవ రూపాంతరము).
విశ్వం పైన ఉంటాడు కానీ తానే పరమాత్మ రూపంలో సర్వ ప్రాణుల హృదయములో, వాటి
కర్మలను గమనిస్తూ, వాటి లెక్క గణిస్తూ, సరైన సమయంలో కర్మ ఫలాలని అందచేస్తూ
ఉంటాడు. అందుకే ఆయనను విశ్వ స్థితికారకుడు అంటారు.
ఇక్కడ చెప్పబడిన విష్ణు మూర్తి స్వరూపాలన్నీ శ్రీ కృష్ణుడి కన్నా అబేధములే.
అందుకే, ఈ శ్లోకంలో సమస్త ఆధ్యాత్మిక మరియు భౌతిక సృష్టి ఆయన నుండే
వచ్చాయి అని అంటున్నాడు.
శ్రీ కృష్ణుడే అన్ని అవతారాల మూలం. శ్రీమద్భాగవతము ప్రకారం : ఏతే చాంశ కలాః
పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం (1.3.28) - భగవంతుని సమస్త స్వరూపాలు శ్రీ
కృష్ణుడి రూపాంతరాలే లేదా ఆయన రూపాంతరాల రూపాంతరాలే; ఆయన మాత్రం స్వయం
భగవానుడు. అందుకే, ద్వితీయ స్థాన సృష్టికర్త అయిన బ్రహ్మ, శ్రీ కృష్ణుడిని ఈ
విధంగా స్తుతించాడు:
యస్యైకనిశ్వసిత కాలమథావలంబ్య
జీవంతి లోమవిలజా జగదండనాథాః
విష్ణుర్మహాన్ సఇహయస్య కలావిషేశో
గోవిందమాది పురుషం తమహం భజామి (బ్రహ్మ సంహిత 5.48)
“అనంతమైన బ్రహ్మాండాలు – ప్రతి ఒక్క దాంట్లో ఒక శంకరుడు, బ్రహ్మ, మరియు
విష్ణు ఉన్నటువంటివి – శ్రీ మహా విష్ణువు శరీర రోమ కూపాల్లోంచి ఆయన శ్వాస
తీసుకున్నప్పుడు సృజించ బడుతాయి; మరియు ఆయన శ్వాస విడిచినప్పుడు ఆయనలోకే
లయమై పోతాయి. అటువంటి శ్రీ మహా విష్ణువు మూల స్వరూపమైన శ్రీ కృష్ణుడిని
నేను పూజిస్తాను.”
భార్య : "ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా.. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది."
భర్త : "అవునా... అలాగైతే దాన్నేం చేస్తావు?"
భార్య : "ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే..."
భర్త : "అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి..."
భార్య : "ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే!"
భర్త : "ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి. తినడానికీ రుచిగ ఉంటుంది."
భార్య : "గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను, వ్రాసుకోండి."
భర్త : "సరే చెప్పు..."
భార్య : "ఊఁ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ, జీలకర్ర.."
భర్త : "సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా?"
భార్య : "ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ..."
భర్త : "బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు?"
భార్య : "మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తరా? తెచ్చేదేదో పెద్దదే తెండి. కోసిపెట్టినది , కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి."
భర్త : "సరే... బయల్దేరనా?"
భార్య : "అయ్యో .. కాస్త ఆగండి.. ఒకటే గుమ్మడికాయ తేకూడదంట, అమ్మమ్మ చెబుతుండేవారు. ఎలాగూ తెస్తున్నారు రెండు తెండి. అవి కూడ పెద్దవి. ఇంకో పని చేయండి.పెద్ద గుమ్మడి కాయ తెస్తున్నారెలాగూ, ఒక కేజి చక్కెర, ఒక కేజి నెయ్యి , ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు..."
భర్త : "ఇవన్నీ మజ్జిగ పులుసుకు ఎందుకే?"
భార్య : "ఛీ, పులుసుకు కాదండి.. హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలివేయరాదు. అపశకునం.."
భర్త : "ఇక చాలా?"
భార్య : "కాస్త ఆగండి.. ఓ నాలుగైదు నిమ్మ కాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకురండి. ఘమఘమల వాసనలొస్తాయి."
భర్త : "హల్వాకు ఇంగువ వేస్తారా?"
భార్య : "అబ్బా.... హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారాండి.. ఇవి గుమ్మడికాయ వడియాలకు.. గుమ్మడికాయ తెస్తున్నపుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి?"
భర్త : "ఇకనైనా వెళ్ళనా?"
భార్య : "ఏదో జ్ఞాపకానికొస్తోంది ఉండండి. ఆ.. జ్ఞాపకమొచ్చింది. ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసుకోసం గుమ్మడికాయతో బాటు మంచి కాంబినేషన్ . దాంతో బాటు ఒక అర్ధ కేజి మొత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంటసోడా, రిఫైన్డ్ ఆయిలూ తీసుకురండి, వేరుశనగనూనె కాదు సన్ ఫ్లవర్ ఆయిల్..."
భర్త : "సరే.. బయల్దేరుతున్నాను."
భార్య : "అదేమిటి వెనుక తలుపు వైపు. అక్కడెక్కడికి వెళ్తున్నారు."
భర్త : "నేను బయటకు పోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను."
భార్య : "ఎందుకు? మార్కెట్ కు పోరా?"
భర్త : "నీ మార్కెట్ నాశనం కాను. గ్లాసుడు మజ్జిగపులుసు కోసం వేయి రూపాయలు ఖర్చు చేయాలా? పాపమొస్తే రానీ.. నేనే ఆ పులిసిన పెరుగును బయట పారబోస్తాను.."
భార్య : "ఏమిటండీ, మీరే చెప్పారుగా..."
భర్త : ఓసి... నీ అమ్మ కడుపు మాడా బుద్ధి లేక చెప్పానే...
*****
*శరీరం కర్మలు చేసే ఒక పరికరం*
*పునర్విత్తం పునర్మిత్రం*
*పునర్భార్య పునర్మహి*
*ఏతత్సర్వంపునర్లభ్యం*
*న శరీరం పునఃపునః।।*
🌷పోయిన *ధనం* మళ్లీ చేరుతుంది.
🌷*దూరమైన మిత్రుడు* మళ్లీ చేరువఅవుతాడు.
🌷*భార్య* గతిస్తే మరొక భార్య లభిస్తుంది.
🌷*భూసంపద* మళ్లీ ప్రాప్తిస్తుంది.
పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు!
కాని *మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు.*
అందుకే
*శరీరం ఖలు ధర్మసాధనం* అన్నారు.
కేవలం *శరీరం* ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు.
*శరీరం* ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.
*శరీరం* ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.
ఏ పని చేయడానికైనా *శరీరం* కావాలి.
కనుక *శరీరము* ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.
జంతువులకు *శరీరం* ఉంటుంది, కాని, వాటికి ఆలోచన ఉండదు.
పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి *శరీరం* సహకరించదు.
*బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం*
ఉండేది ఒక్క *మనుష్యులకే.*
వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.
కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి.
*అతిగా తిన్నా,*
*అతిగా ఆలోచించినా,*
*అతిగా సుఖించినా,*
*అతిగా దుఃఖించినా,*
*ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది*.
ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు.
కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.
*దీనికి*
*సత్యం,*
*ధర్మం*,
*శాంతి*,
*ప్రేమ,*
*అహింసలను*
*పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి.*
*విస్తరాకు*
విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు.
బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,
తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా *మురికి పెంటపై పడేసి వస్తాము.*
తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా.
*మనిషి జీవితం కూడ అంతే*
*'ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు*
విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు *ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది*,
*విస్తరాకుకు ఉన్న*
*"ముందు ఆలోచన", తృప్తి భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !*
*"" సేవ చేసే అవకాశము* *వచ్చినపుడు సేవ చేయండి""* *జారవిడుచుకోకూడదు*
మళ్లీ ,
ఇంకొకసారి,
ఎప్పుడో చేయవచ్చు
అనుకొని వాయిదా వేయకండి,
ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే.....,
*కుండ ఎప్పుడైనా పగలవచ్చు, అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.*
*ఎంత సంపాదించి ఏమి లాభం ?*
*ఒక్క పైసా కూడా తీసుకు పోగలమా?*
*మన చేత, మన వల్ల* *ప్రత్యక్షంగా,పరోక్షంగా
*మంచి జరిగితే,*
*మన ఈ జన్మ సార్థకమయినట్లే .....
సర్వే సన్నాసుఖినోభవంతు
.......
*శరీరం కర్మలు చేసే ఒక పరికరం*
*పునర్విత్తం పునర్మిత్రం*
*పునర్భార్య పునర్మహి*
*ఏతత్సర్వంపునర్లభ్యం*
*న శరీరం పునఃపునః।।*
🌷పోయిన *ధనం* మళ్లీ చేరుతుంది.
🌷*దూరమైన మిత్రుడు* మళ్లీ చేరువఅవుతాడు.
🌷*భార్య* గతిస్తే మరొక భార్య లభిస్తుంది.
🌷*భూసంపద* మళ్లీ ప్రాప్తిస్తుంది.
పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు!
కాని *మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు.*
అందుకే
*శరీరం ఖలు ధర్మసాధనం* అన్నారు.
కేవలం *శరీరం* ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు.
*శరీరం* ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.
*శరీరం* ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.
ఏ పని చేయడానికైనా *శరీరం* కావాలి.
కనుక *శరీరము* ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.
జంతువులకు *శరీరం* ఉంటుంది, కాని, వాటికి ఆలోచన ఉండదు.
పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి *శరీరం* సహకరించదు.
*బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం*
ఉండేది ఒక్క *మనుష్యులకే.*
వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.
కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి.
*అతిగా తిన్నా,*
*అతిగా ఆలోచించినా,*
*అతిగా సుఖించినా,*
*అతిగా దుఃఖించినా,*
*ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది*.
ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు.
కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.
*దీనికి*
*సత్యం,*
*ధర్మం*,
*శాంతి*,
*ప్రేమ,*
*అహింసలను*
*పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి.*
*విస్తరాకు*
విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు.
బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,
తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా *మురికి పెంటపై పడేసి వస్తాము.*
తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా.
*మనిషి జీవితం కూడ అంతే*
*'ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు*
విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు *ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది*,
*విస్తరాకుకు ఉన్న*
*"ముందు ఆలోచన", తృప్తి భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !*
*"" సేవ చేసే అవకాశము* *వచ్చినపుడు సేవ చేయండి""* *జారవిడుచుకోకూడదు*
మళ్లీ ,
ఇంకొకసారి,
ఎప్పుడో చేయవచ్చు
అనుకొని వాయిదా వేయకండి,
ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే.....,
*కుండ ఎప్పుడైనా పగలవచ్చు, అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.*
*ఎంత సంపాదించి ఏమి లాభం ?*
*ఒక్క పైసా కూడా తీసుకు పోగలమా?*
*మన చేత, మన వల్ల* *ప్రత్యక్షంగా,పరోక్షంగా
*మంచి జరిగితే,*
*మన ఈ జన్మ సార్థకమయినట్లే .....
సర్వే సన్నాసుఖినోభవంతు
.........
Comments
Post a Comment