ప్రాంజలి ప్రభ..05/04
శ్రీ కాశీలోని ఏకాదశ రుద్రగణపతులు
1. శ్రీ కేదారేశ్వర గణేశ్వరాయనమః||
2. శ్రీ మండల గణేశ్వరాయ నమః ।
3. శ్రీ కపర్దీశ్వర గనేశ్వరాయ నమః |
4. శ్రీ ధర్మేశ్వర గణేశ్వరాయ నమః ॥
5. శ్రీ పశుపతిః గణేశ్వరాయ నమః |
6. శ్రీ భాగీరథీ గణేశ్వరాయ నమః |
7. శ్రీ హరిశ్చంద్ర గణేశ్వరాయ నమః ॥
8. శ్రీ వికట గణేశ్వరాయ నమః |
9. శ్రీ బిందు మాధవ గణేశ్వరాయ నమః |10. శ్రీ భైరవ గణేశ్వరాయ నమః |
11. శ్రీ మహారాజ బడేగణేశ్వరాయ నమః |
శ్రీ సాక్షి గణేశ్వరాయ నమః |
శ్రీ కాశీలో ఇవి కాక 56 గణేశ్వరులు గలరు.
డుండి గణపతి :
శ్లో : కుండలీకృత నాగేంద్రం,
ఖండేందు కృత శేఖరమ్ |
పిండీకృత మహావిఘ్నం,
ఢుండి రాజం నమామ్యహమ్ ॥
1. కాశీలో విరాజిల్లుతున్న 56 వినాయక దేవాలయాలు
గణేశుడు కాశీ క్షేత్రాన్ని, విశ్వనాధ మందిరాన్ని అష్టదిక్కులా, సప్తవలయ రక్షణవ్యవస్ధ ద్వారా రక్షిస్తూ ఉంటాడు. ఈ సప్త వలయ రక్షణలో ముఖ్యమైన ఎనిమిది వినాయక అవతారములు కలవు. ఒక్కొక్క వలయము, వాటిలోని వినాయక దేవాలయములు ఇక్కడ ప్రస్తావించ బడినవి.
ఒకటవ వలయము:
1. శ్రీ అర్క వినాయకుడు,
2. శ్రీ దుర్గా వినాయకుడు,
3. శ్రీ భీమచండ వినాయకుడు,
4. శ్రీ డేహ్లివినాయకుడు,
5. శ్రీ ఉద్దండ వినాయకుడు,
6. శ్రీ పాశపాణి వినాయకుడు,
7. శ్రీ ఖర్వ వినాయకుడు,
8. శ్రీ శిద్ద వినాయకుడు.
ఈ అష్ట వినాయకులు కాశీ క్షేత్ర వెలుపలి పరిక్రమమములో ఉండి భక్తులకి సిద్ధిని ప్రసాదిస్తూ, నాస్తికులని శిక్షిస్తూ కాశీని కాపాడుతూ ఉంటారు.
రెండవ వలయము:-
రెండవ వలయములో కూడా అష్టవినాయకులు కాశీపురవాసుల సమస్త విఘ్నాలను తొలగిస్తూ రక్షణ కల్పిస్తారు.
9. శ్రీ లంబోదర వినాయక,
10. శ్రీ కూట దంత వినాయకుడు
11. శ్రీ శాల కంటక వినాయకుడు
12. శ్రీ కూష్మాండ వినాయకుడు
13. శ్రీ ముండ వినాయకుడు
14. శ్రీ వికట దంత వినాయకుడు
15. శ్రీ రాజ పుత్రా వినాయకుడు
16. శ్రీ ప్రణవ వినాయకుడు
మూడవ వలయము :-
ఇక మూడవ వలయములోని అష్ట వినాయకులు కాశీ క్షేత్రాన్ని అంతటినీ అత్యంత శ్రద్ధతో పరిరక్షిస్తూ ఉంటారు.
17. శ్రీ వక్రతుండ వినాయకుడు
18. శ్రీ ఏక దంత వినాయకుడు
19. శ్రీ త్రిముఖ వినాయకుడు
20. శ్రీ పంచాశ్వ వినాయకుడు
21. శ్రీ హేరంబ వినాయకుడు
22. శ్రీ విఘ్న రాజ వినాయకుడు
23. శ్రీ వరద వినాయకుడు
24. మోదకప్రియ వినాయకుడు
నాల్గవ వలయము:-
25. శ్రీ అభయప్రద వినాయకుడు
26. శ్రీ సింహ తుండ వినాయకుడు
27. శ్రీ కూడితాక్ష వినాయకుడు
28. శ్రీ క్షిప్ర ప్రసాద వినాయకుడు
29. శ్రీ చింతామణి వినాయకుడు
30. శ్రీ దంత హస్త వినాయకుడు
31. శ్రీ పిఛిoడల వినాయకుడు
32. శ్రీ ఉద్దండ ముండ వినాయకుడు
ఐదవ వలయము : -
33. శ్రీ స్ధూల దంత వినాయకుడు
34. శ్రీ కాళీ ప్రియ వినాయకుడు
35. శ్రీ చాతుర్దంత వినాయకుడు
36. శ్రీ ద్విదంత వినాయకుడు
37. శ్రీ జ్యేష్ట వినాయకుడు
38. శ్రీ గజ వినాయకుడు
39. శ్రీ కాళ వినాయకుడు
40. శ్రీ నాగేశ్ వినాయకుడు
ఆరవ వలయము:- ఈ వలయములోని వినాయకుల నామ స్మరణ మాత్రముచే భక్తుడు ముక్తిని పొందును.
41. శ్రీ మణికర్ణి వినాయకుడు
42. శ్రీ ఆశ వినాయకుడు
43. శ్రీ సృష్టి వినాయకుడు
44. శ్రీ యక్ష వినాయకుడు
45. శ్రీ గజ కర్ణ వినాయకుడు
46. శ్రీ చిత్రఘంట వినాయకుడు
47. శ్రీ స్ధూల జంఘ / మిత్ర వినాయకుడు
48. శ్రీ మంగళ వినాయకుడు
ఏడవ వలయము :- ఈ వలయములోని ఐదు వినాయకులు ప్రసిద్ధులు:
49. శ్రీ మొద వినాయకుడు
50. శ్రీ ప్రమోద వినాయకుడు
51. శ్రీ సుముఖ వినాయకుడు
52. శ్రీ దుర్ముఖ వినాయకుడు
53. శ్రీ గణనాధ వినాయకుడు
ఇక 54. శ్రీ జ్ఞాన వినాయకుడు, 55. శ్రీ ద్వార వినాయకుడు కాశీపురి ముఖ్య ద్వారం పై ఉన్నారు.
56. శ్రీ అవిముక్త వినాయకుడు – ఈ అవిముక్త క్షేత్రములోని భక్తుల అన్ని కష్టాలనూ దూరంచేసి, భాధలనుండి విముక్తము చేస్తాడు..
సనత్కుమారుని బోధలు
ఒక పని చేస్తున్నప్పుడు ప్రారంభములో ఎంత శ్రద్ధ ఉంటుందో రోజూ అలాగే పది, ఇరువది, ముప్పది సంవత్సరాలు గూడా చేయుచుండినచో దానిని శ్రద్ధ అందురు. శ్రద్ధ వలన నీలో ఉన్న ప్రజ్ఞకు ఒక స్పూర్తి, ఒక ప్రమాణము ఉంటుంది. శ్రద్ధ లేకపోతే గ్రహించే బలము గూడా తగ్గుతుంది. కూర్చోవడములో, నడవడములో, పలకరించడములో, వస్త్రధారణలో శ్రద్ధ అవసరము.
ఎపుడూ ఒకే రకమైన శ్రద్ధ ఉంటే కళ పెరుగుతుంది. మనిషిలో శ్రద్ధను బట్టి వికాసము ఉంటుంది. శ్రద్ధను బట్టి పరిసరాలలో ఉన్న తత్త్వమును గ్రహించడములో మన అర్హత పెరుగుతుంది.
శ్రద్ధ తన స్వరూపమే అనియు, దానిని జీవుడెంతగా ఆరాధించునో అతడు అంతగా తన స్థితి చెందుననియు భగవద్గీత లో కృష్ణుడు చెప్పెను.
***
ఆచార్య సద్భావన
తనను చూసి తానే జాలిపడటం అనారోగ్యకరం. అది ఆనందాన్ని పొందనీయక నిరోధిస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యపు జాగృతి వలన కలిగిన ఆనంద మాధుర్యాన్ని చవి చూసిన వారిని ఎటువంటి కష్టాలు, కన్నీళ్ళు, దురదృష్టాలు, వైపరీత్యాలు కదపలేవు. భగవంతుని మరిచిపోవడమే గొప్ప ఆపద, తాను దివ్యత్వపు వారసుడినని విస్మరించడమే పెద్ద దురదృష్టం. మేధస్సు కానీ, లెక్కలు కట్టే బుద్ధిగానీ భగవంతుని పట్టుకోలేదు. భక్తి విశ్వాసాలతో నిండి ఉన్న హృదయం, స్వార్థ చింతన లేని హృదయమే తాను భగవంతుని చేత సదా పరి రక్షించబడుతున్నాననే సంగతిని గ్రహిస్తుంది.
అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.
.......
భావి ఆశలన్నీ శీలవంతులు, బుద్ధిశీలురు అయి పరుల సేవలో సర్వం సమర్పించగలవారు మరియు విధేయత గల యువతీ, యువకులలోనే ఉంది. వారనా భావాలకు ఆచరణ రూపం ఇచ్చే ప్రయత్నంలో తమ జీవితాలనే త్యాగం చేస్తారు. తద్వారా తమకు, దేశం మొత్తానికీ మేలు చేస్తారు. శక్తిలేని హృదయాలు, శ్రమకు ఓర్చలేని కృశించిన శరీరాలు, ధైర్యం లోపించిన మనస్సులు: వీటితో ఏ పని సాధ్యమవుతుంది? నచికేతునిలాంటి శ్రద్ధావంతులు పదో, పన్నెండు మందో నాకు లభిస్తే ఈ దేశపు ఆశలు, ఆశయాలను కొత్త దారిలోకర్యంతో ప్రారంభించిన మంచిపనికి ప్రతికూలత ఉంటే, అది ప్రారంభించిన వాళ్ల నైతిక బలాన్ని మరింత ఉత్తేజ పరుస్తుంది. ప్రతిఘటన, ఆటంకం దేనికి ఉండదో అది మానవులను మృత్యుసదృశ నైతిక పతన మార్గానికి కొనిపోతుంది.
శ్రీగురుభ్యోనమః
ఓం శ్రీ గం గణపతయే నమః
***
గణపతి ప్రధమ పూజ్యుడు. భక్తి ప్రధానముగా ప్రతిరోజూ గణపతి పూజచేయడం వలన ప్రజ్ఞలో కుదురు వస్తుంది. పురోగతికి కావలిసిన వన్నీ ఏర్పడతాయి. మనలో అవకతవకలు లేకుండా చేస్తాడు. విఘ్నములు తొలగుతాయి..
బృహస్పతి విద్యలకు అధిపతి. అలాంటి బృహస్పతికే బృహస్పతి గణపతి. గణపతి మనలో మూలాధారములో పశ్చిమ దిక్కులో ఉంటాడు. జీవుడు స్థిరముగా ఉండడానికి మూలాధారములో ఉంచారు.
గణపతి ఎంత స్థిరత్వము ఇస్తాడో అంత విడుదల శరీరము నుంచి గూడా ఇస్తాడు. హాయిగా, సుఖముగా ఉండి కర్తవ్యాలు నిర్వర్తించి శరీరము నుంచి విడుదల పొందాలి. కేతువుకు గణపతి అధిపతి.
***
*నలభై ఏళ్ల వయసులో..*
ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే.
*సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది.*
*యాభై ఏళ్ల వయస్సులో..*
అందమైన దేహం.. అందవిహీనం..
మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం.
*ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.*
*అరవై ఏళ్ల వయసులో..*
ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే.
*పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు.*
*డెబ్బై ఏళ్లవయస్సులో..*
విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే...
*కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.*
*ఎనభైఏళ్ల వయస్సులో..*
ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు.
*ఎంత డబ్బున్నా ... స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.*
*తొంభైఏళ్ల వయస్సులో..*
నిద్ర మెలుకువ రెండూ ఒకటే.
*సూర్యోదయం.. సూర్యాస్తమయం... రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.*
అందంతో వచ్చే మిడిసిపాటు...
ఆస్తులతోవచ్చే అహంకారం...
పదవులతో గౌరవాన్ని ఆశించటం...
కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగవడం సత్యం.
*సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే.*
అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ...
అనుబంధాలను పదిలపరుచుకుంటూ...
జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం..!
మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.
ఆమె తన ఐహికమైన బరువుబాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరీ జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉండిపోయింది.
నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమయిపోయేది.
ప్రతిరోజూ ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం, అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి, కలిపి చేసే కిచిడీ అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యధాతథంగా ఆలయానికి పంపేది. అక్కడకూడా నివేదనమయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది.
క్రమక్రంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమయిపోయింది. ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడీ పూర్తికానిదే మిగిలిన భోగాలేవీ సక్రమంగా అమరేవి కావు.. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు.
అనతికాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తికలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంబడే స్వామి పలుకుతాడు అని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని, ఆమెను కలవాలని తన పూరీ యాత్ర సందర్భముగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు.
ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగి కి నచ్చలేదు. ఒక మడీ, ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి, అక్కడే స్వామికి నివేదన చేసి, అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు.
ఆ బైరాగి కర్మాబాయి కి ఆచారవ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకుని వంట చేయాలని చెప్పాడు.
అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్లూ తప్పు చేసాను అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అని అనుకుంది.
మరునాడు నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకుని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి , ఆకలికి తాళలేకపోతున్నాను అని, ఏముంటే అది, ఇంత ఆహారం పెట్టమని వేడుకుంటున్నాడు. ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు.
కర్మాబాయి కి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంటకూడా చేసుకోని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది.
తాను ఇంట్లో చేసిన కిచిడీ, ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. అదెలాగూ గుడికి పంపొద్దు. తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు. కనుక, ఆ కిచిడీ ఆ సాధువు కి పెట్టేస్తే అని అనుకుంది. అలా చేస్తే అతని ఆకలీ తీరుతుంది, ఆ ప్రాణాలూ నిలబడతాయి అని అనుకుంది.
ఆ సాధువు కి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడీ వడ్డించింది. అతనెంతో ఆత్రంగా, ఆప్యాయంగా ఆ కిచిడీ తిని, ఆమెకు కృతజ్ఞతలు చెప్పి, ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత మడి కట్టుకుని, గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానె తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు, నిన్న తనకు ఆచారవ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురుచూస్తున్నారు.
ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కుని ఆ వంటను తీసుకుని స్వామి కి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి, తెర తొలిగించారు. ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు.
స్వామి నోటికంతా కిచిడీ అంటుకుని ఉంది. మూతి సరిగ్గా కడుక్కోని చిన్ని పిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి మొఖం అంత అందంగా ఉంది.
ఆ మహిమ కు అందరూ ఆశ్చర్యపోయినా, అలా స్వామి నోటికి ఆహారపదార్థం అలా అంటుకుని ఉండడం అరిష్టం అని భావించారు అర్చకులు. ఆ బైరాగి ని అడిగారు. స్వామి నీవు అడిగితె పలుకుతారు కదా, అసలేమయ్యిందో కనుక్కోండి అని అడిగారు.
సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు. అప్పుడు స్వామి వైపునుండి అదృశ్యవాణి వినిపించసాగింది.
బైరాగీ, నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, శ్రద్దగా వినండి. కేవలం భక్తిశ్రద్దలతో పరిశుద్దంతరంగయైన కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడీ భోగమంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు. కానీ, నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్లి భక్తిశ్రద్దలతో బాటు ఆచారాలు, వ్యవహారాలూ ఇవీ అంటూ నూరిపోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించనవన్నీ అపచారాలు అని అభిప్రాయపడ్డది. భయపడ్డది. దుఃఖించింది.
తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి, ఆలయ నిమిత్తం మడి కట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది.
దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి అయిదు ఘడియలు ఆలస్యం అయ్యింది. నేనా ఆలస్యం తో ఆకలికి తాళలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు. నాకు భోగం అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడీ భోగం ఉండడం వల్ల, అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల, ఆమె ఇంటికే వెళ్లి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మరిచిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది.
ఆ విధంగా వినిపించిన స్వామి వారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాలప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు.
కర్మాబాయి మాత్రం స్వామి వారు తన పై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. అంతటి పరిశుద్దాత్మురాలికి ఆచారవ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. అయితే, తాను పాటిస్తున్న అచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు.
వెంటనే జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ బైరాగికి. అమాయకుడా, మనసు నాయందు లగ్నం కావడం కోసమే ఆ అచారాలన్నీ అవసరమే. కానీ, ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమయ్యిందో, వాళ్లకు ఆచారవ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకామె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడి బట్టలు ఎందుకయ్యా అని. అంతే కాదు, ఆచారవ్యవహారాలు తెలిసిన వారు, ఆ ప్రకారమే చేయాలి, అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించేవి నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి.
ఆచారవ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను.
బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మాబాయి కి క్షమాపణ చెప్పుకున్నాడు. స్వామి అతనిని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది.
ఆ నాడే కాదు, ఈ నాడు కూడా, ఇప్పటికీ కూడా, కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడీ భోగం బంగారు పళ్లెంలో ఉంచి భోగం జరుపుతారు.
ఎంత పావనమైన విషయం కదా...
మనం త్రికరణశుద్ధిగా భగవంతుడిని మనసులో నిలుపుకొని స్వామికి రోజూ ఇంత వంటకాన్ని నివేదన చేస్తే, స్వామి స్వీకరిస్తాడు.
జై జగన్నాథ
*****

Comments
Post a Comment