ప్రాంజలి ప్రభ..4/04
.
సుభాషితం - 454
---------------
🌺లాలయేత్ పంచ వర్షాణి
దశ వర్షాణి తాడయేత్ :
ప్రాప్యేతు శోడశే వర్షే :
పుత్రం మిత్ర వదాచరేత్.🌺
కొడుకును 5 సంవత్సరాల వరకూ లాలిస్తూ ముద్దు చెయ్యాలి.10 సంవత్సరాలు వయసులో దండించాలి.16 ఏళ్ల ప్రాయములో కొడుకుని అతని తల్లి తండ్రి మిత్రుడిలా భావించి వ్యవరించాలి.
🌺✍🏼ప్రభ,
⚜️🕉️🚩 కృష్ణం వందే జగద్గురుం 🌹🙏
.......
💥ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు.
వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు.
చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు.
సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు.
మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.
మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు.
ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.
తెల్లారింది. చూస్తే భార్య లేదు.
అంతేకాదు ఆ కుండ కూడా లేదు.
పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు.
భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు.
కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు.
నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది.
తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని.
"ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు" అన్నాడు అర్జునుడు శ్రీ కృష్ణుడితో..
"లేదు అర్జునా ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం" అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు.
ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.
దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు.
అతని హృదయం ద్రవించింది.
కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు.
పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.
అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ..
అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది.
ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు.
నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం.
ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది.. దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు.
అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేల సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.
ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు.
ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది.
తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి.
పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు.
కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.
అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు.
అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.
నిజానికి అది దేవుడి చేయాల్సిన పని.
తనూ పంచుకున్నాడు.
అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.
సేకరణ...
.........
ప్రాంజలి ప్రభ
ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి మరు జన్మకు కారణమవుతాయి.
ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది, అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది.
ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు, రాజు అందుకు సమ్మతించాడు.
ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు.
ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది! ... రాత్రి అయింది.
అది మొదటి యామం, తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు, హెచ్చరిక చేసే సమయం వచ్చింది.
అప్పుడు మూగవాడు ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:
“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః."
మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు...
కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు.
'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు.
ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది, కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.
మళ్ళా రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:
“జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”
పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.
ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది:
“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”
తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు.
ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు...
ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ బాలుడు...
“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”
అని చాటింపు వేశాడు.
ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త జాగ్రత్త - అని చాటాడు...
ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు.
పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు.
కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.
మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు...
అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు.
అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు.”
తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు.
అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.
తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు.
అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు.
అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు.
“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి.
నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు.
రాజు అమితాశ్చర్యపోయాడు, అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు.
ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు,
ఇలా కొంతకాలం గడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు.
“ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు.
అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు.
నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం.”
బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది.
దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు.
అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు.
వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు.
ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు.
అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది...
*అదేమంటే:..*
మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి.
అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది...
అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి.
ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది...
మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు...
అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు.
అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు...
దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.
ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు.
బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.
"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు.
అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ...
ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా?
నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది.
భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు !!!...
కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం ఒక పాఠమైనది.”
అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు.
మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది.
సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది.
కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది...
నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక!
కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా చేస్తూ ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుని గౌరవిస్తూ ప్రవర్తిస్తే తప్పకుండా అంత్యకాల నామ స్మరణ తప్పక లభిస్తుంది...
భగవద్గీత లో చెప్పినటుల "అద్వేష్టా సర్వ భూతానాం" ఆచరించుతూ ఉంటేనే ఇది సాధ్యము.
ఏ ఒక్కరి మీద ద్వేషము లేని వారికే ఇది సుసాధ్యము...
ఎందుకనగా తను వేరొకరిని ద్వేషించే సమయములో ఒకవేళ మరణము సంభవస్తే అదే ద్వేషముతో పాము-కప్ప జన్మలను, మరియు గజ-కచ్చప (ఏనుగు-తాబేలు) జన్మలను పొంది అనేక యుగములు తగవులాడుకొనే అవకాసము ఉన్నదని పురాణములు చెప్పుచున్నవి. కావున మొట్టమొదలు మనము శత్రువులు అనుకునే వారిమీద మన అభిప్రాయములను సరిదిద్దుకుని "అద్వేష్టా సర్వభూతానాం" గా తయారు అవడము అత్యంతావశ్యకము.
నిత్యము రామనామ స్మరణ చేసిన వాల్మీకి మహర్షి అంత్య సమయములో కూడా రామ నామ స్మరణ చేయడము వలన తులసీదాసు గా జన్మించగనే (1498-1623) అందరు పిల్లలవలె ఏడవకుండా "రామ్ రామ్" అని పలకడము అందుకని మొదలు ఆయన పేరు "రాంబోలా" అని అందరూ పిలవడము జరిగినది
ఇంతకన్నా మనకు ఏమి ఉదాహరణ కావాలి.... *
సేకరణ
........
➡️ ఈ విశ్వంలో శూన్య ప్రదేశం అనేది ఎక్కడ ఉండదు. మరి ఈ విశ్వమంతా చైతన్య శక్తి చేత ఆవరించబడి ఉంది.
➡️ ఈ సృష్టిలో 190 లక్షల వేరువేరు ఫ్రీక్వెన్సీలు (పౌనఃపున్యం) ఉన్నాయి.
ఆధ్యాత్మిక తల్లి - అహింస
ఆధ్యాత్మిక తండ్రి - ధ్యానం
పుత్రుడు - పున్నామ నరకం:-
పున్నామ నరకం అన్నది చీము నెత్తురుతో కూడినది అని అంటారు. మరి చీము నెత్తురుతో కూడినది ఈ దేహమే.
పునః అంటే మళ్ళీ; నామం అంటే పేరు.
పునః నామ నరకం అంటే మళ్ళీ మళ్ళీ పేరు తీసుకునే నరకం, అంటే "పునర్జన్మ" అన్నమాట.
ఇక్కడ పుత్రుడు అంటే శారీరక పుత్రుడు కాదు -- 'మానస పుత్రుడు' అని. అనగా, మన ఆత్మజ్ఞానాన్ని సంతరించుకున్నవారు.
కనుక, 'మానస పుత్రుడు' మాత్రమే మనలను 'పున్నామ నరకం' నుండి తప్పిస్తారు -- అని అంతరార్థం.
ఆలోచన అనేది శక్తి యొక్క సూక్ష్మమైన, తేలికైన రూపం.
మానవుడు మాధవుడిలా పరిణమించడానికి..
👉 ఈ భూలోకమే సరైన క్షేత్రం,
👉 మరి ఈ దేహమే సరైన ఉపకరణం.
భౌతిక జీవితంలో -
➡️ అనుభవాలతో ఎంత నుజ్జు నుజ్జు అయితే,
➡️ ఆత్మ పరంగా అంతా డబుల్ ప్రమోషన్ చెందినట్టు.
*: ఏకకాలంలో ఒకే మనంగా జీవిస్తున్న మన రెండు జీవితాలలోని
➡️ 'జీవవత్ కర్మపూరిత కోణం' బయటికి కనబడితే
➡️ 'సాక్షివత్ కర్మతీత కోణం' మాత్రం బయటకి కనబడకుండా (లోపలకి) ఉంటుంది.
* జ్ఞాని మరణం - దేహాన్ని వదిలిపెడతాడు.
👉 అజ్ఞాని మరణం - దేహం నుండి వదలగొట్టపడతాడు.
*స్వర్గానికి ఓ కుక్క కూడా వెళ్ళింది.
మనిషి వెళ్లడం పెద్ద విశేషమేమీ కాదు.
"జ్ఞాన సిద్ధుడు" కావడమే మానవుని అంతిమ లక్ష్యం. 'స్వర్గం' కాదు.
:* చేతబడులు అనేవి లేవు.
➡ మనస్సు బలహీనం వల్ల అన్నీ అలానే అనిపిస్తుంది, కనిపిస్తుంది.
➡ మానసికంగా ధృడం కావాలి.
దానికి మార్గం - ధ్యానమే.
*రాకపోకలు ఉన్న ప్రతీది స్త్రీతత్వమే
➡️ రాకడ...స్త్రీ నుంచే...గర్భం నుంచే...
➡️ పోకడ...స్త్రీలోకే...(భూ)గర్భంలోకే...
* రాకపోకలు లేనిది ఒకటే ఉంటుంది
➡️ అదే ఉత్తమ'పురుష'ము
➡️ అదే 'నేను'(ఆత్మ)
* "మన జీవితంలోని ఏ సమస్యకు ఆధ్యాత్మికం పరిష్కారం చూపదు.
సమస్యను సమస్యగా తెలియనీకుండా చేసే "మత్తు మందు" (అనస్తీషియా) లాంటిది ఆధ్యాత్మికం.
* నేను" అనేది నాలుగు తత్త్వాలుగా ప్రస్ఫుటమవుతోంది.
అవే -- మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు.
➡ సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు 'మనస్సు'గా
➡ నిత్యానిత్యాలను, మంచి చెడులను చెప్పేటప్పుడు 'బుద్ధి'గా
➡ నిరంతర చింతన చేసేటప్పుడు 'చిత్తం'గా
➡ నేను, నాది అనేటప్పుడు 'అహంకారం'గా
-- ఆత్మ పదార్ధం ప్రస్ఫుటమవుతోంది.
* మనస్సుని శుద్ధి చేయవలెనంటే 'కర్మయోగం'
* బుద్ధిని సునిశితం చేయవలెనంటే 'జ్ఞానయోగం'
* చిత్త వృత్తులను నిరోధించవలెనంటే 'రాజయోగం'
* అహంకారాన్ని అంటే నేను, నాది అనే భావాలను పూర్తిగా తుడిచిపెట్టుకు పోవాలంటే 'భక్తియోగమే' మార్గము.
* నాటకం జీవుడికి ముగియడం - మరణం.
* నాటకం దేవుడికి ముగియడం- ప్రళయం.
ఉన్నది ఒకే వస్తువు--
* అది చలించడం చూచి, కొందరు 'శక్తి' అని
* దానికి ఆశ్రయమైన అచలత్వాన్ని చూచి, మరికొందరు 'ఆత్మ' అని అంటున్నారు.
* మరణం ఎలా ఉంటుందో తెలియనప్పుడు దాని గురించి నేను ఎందుకు భయపడాలి? మరణించిన తర్వాత.. ఉంటే జీవించి ఉంటా, లేకపోతే మరణిస్తా.
* జీవించి ఉంటే భయపడే అవసరమే లేదు.
* ఒకవేళ మరణిస్తే నేనే లేనప్పుడు ఇక భయంతో పనేముంటుంది.
ధ్యాన 'యజ్ఞం':-
* సంకల్ప రహితంగా శ్వాసపై నిలచిన మనస్సే - యజ్ఞకుండం
* శ్వాసే - ఆహుతులు.
* మరి మనస్సు అనుభవించే శూన్యత్వమే - యజ్ఞ ఫలం.
* మహా మూల చైతన్యమే అన్నింటికీ మూలము. దాని యొక్క పని "ఆలోచన". మనకు ఏ ఆలోచన అయితే అవసరమో ఆ ఆలోచనను అది కలిగిస్తుంది.
*మృత్యువును దర్శించిన ప్రతిసారి... "మనం కేవలం శరీరం మాత్రమే కాదు, మనం అనంత చైతన్య శకలాలం" అన్న సత్యాన్ని దృఢంగా మననం చేసుకోవాలి.
.....
* ఘటాకాశమే... చిదాకాశం:-
ఘటం అంటే కుండ; చిదం అంటే బ్రహ్మాండం; ఆకాశం అంటే మహాశూన్యం.
* కుండలో ఉన్న ఆకాశం మరి బ్రహ్మాండంలో ఉన్న ఆకాశం అంతా ఒకటే. కుండ పగిలినప్పుడు ఆకాశం పగిలిపోదు., అలాగే మన శరీరం చనిపోతే మన ఆత్మకు ఏమి కాదు.
......
* బండి చక్రం ఎంత పెద్దదైన నిలబడి ఉంటే, నేల మీద ఉండేది ఒక బిందువంతా స్థలంలోనే.
.....
* అదేవిధంగా జీవితం ఎంత సుదీర్ఘమైనా, వర్తమానం అనే ఒక ఒకానొక బిందువు మీద మాత్రమే అది నిలిచి ఉంటుంది.
......
* నీ గతాన్ని తెలుసుకోవాలంటే దాని ఫలితమైన వర్తమానాన్ని పరిశీలించు.
* నీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే దానికి కారణమైన వర్తమానాన్ని పరిశీలించు.
* అవసరానికి మించి ఆశించడం - మానసిక రోగం
* అవసరానికి మించి అనుభవించడం - శారీరక రోగం
.......
1. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం
2. ధ్యానం అంటే తలంపుకు తలంపుకు మధ్య ఉన్న పరతత్వం
3. నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం దాని పేరు ధ్యానం
4. శరీరాన్ని మరిచిపోతే - నిద్ర
మనస్సును మరిచిపోతే - ధ్యానం
5. నీళ్లలో మునిగితే - స్నానం
నీలో నువ్వు మునిగితే - ధ్యానం
6. ఏమీ తినకుండా ఉండడం - ఉపవాసం
ఏ ఆలోచనలు లేకుండా ఉండడం - ధ్యానం
7. ధ్యానం యొక్క అంతిమ గమ్యం 'సాక్షి తత్వమే'.
8. ఎలా మొదలు పెడతావో ధ్యానాన్ని.. అది నీ సమస్య
ధ్యానం మొదలైందా.. ఇక సమస్యలన్నిటికీ అదే పరిహారం
......
* నాలుగు సముద్రాల వరకు భూమిని దానము చేసిన
* సంపూర్ణ దక్షిణలు గల యజ్ఞములన్నింటినీ చేసిన
* సర్వ తీర్థములయందు స్నానమొనర్చిన
* నాలుగు వేదములు పఠించుట వలన ఏ పుణ్యము కలుగునో
అట్టి పుణ్యఫలములన్నియు చంపబడుతున్న జంతువును రక్షించుటవలన కలిగే పుణ్యంలో 16వ భాగమునకు కూడా సమము కాదు.
* బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉన్న బ్రహ్మర్షులంతా కూడా "ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా నశించిపోయేదే., రకరకాల అనుభవాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇక్కడికి విచ్చేసిన ఆత్మ ఒక్కటే శాశ్వతం" అన్న సత్యాన్ని తెలుసుకుని స్థితప్రజ్ఞులలా జీవిస్తుంటారు.
*ఏది తెలుసుకుంటే ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆరాటం ఉంటుందో -- అది సాపేక్ష జ్ఞానం (ద్వైతం)
* లోకంలో 99.99% సాపేక్ష జ్ఞానాలే,
ఏది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సినది ఏది మిగిలి ఉండదో -- అది నిరపేక్ష జ్ఞానం (అద్వైతం)
*ఆత్మ ఎన్నడూ జన్మించి ఉండలేదు, ఎన్నడూ మరణించదు. మనం మరణిస్తామన్న భావన, చావుకు భయపడటం వంటివి కేవలం మూఢనమ్మకాలు. మనం దీనిని చేయగలం, దానిని చేయలేం అనే భావాలు కూడా భ్రాంతి జనితాలే. మనం అన్నింటినీ చేయగలం.
*సత్యం పవిత్రమైనది, సత్యం సర్వజ్ఞం. సత్యం బలదాయకంగా ఉండాలి! జ్ఞానదాయకంగా ఉండాలి! జవసత్వదాయకమై ఉండాలి!
* సత్యమొక్కటే బలాన్ని ఇవ్వగలదు.
* నీవు ఎవరివి, నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో. అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగృత పరచుకో.అప్పుడు బంధాలు తెగి పోతాయి.
* మనం స్వార్ధపరులుగా ఉన్నంతవరకూ మనకు సత్యం గోచరించదు.
* జీవితం గడుస్తున్న కొద్దీ రోజు రోజుకూ ప్రతిమనిషీ దైవమే అనే భావన నాలో ధృఢ పడుతోంది. ఎంత దుష్ట స్వభావం గల స్రీలోనైనా, పురుషుడిలోనైనా ఆ దైవత్వం నశించదు.
* ఈ ప్రపంచంలో మన చేతలే మన భావి జీవితాన్ని నిర్ధారిస్తాయి.
* భేరీనాదంతో లోకమంతటా చాటండి. "మీలో ఏ పాపమూ లేదు, దైన్యము లేదు, మీరు అనంతశక్తి సంపన్నులు. లేవండి! మేల్కొనండి! మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి".
- భౌతిక విజ్ఞానం, భౌతిక సంపదలను మాత్రమే చేకూర్చగలదు. ఆధ్యాత్మిక జ్ఞానం శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తుంది.
* అనంత శక్తి మనిషి ఆత్మయందే ఉంది. ఆ శక్తి గురించి అతనికి తెలిసి ఉండవచ్చు లేదా తెలియకపోవచ్చు. ఆ ఆత్మ గురించిన ఎరుకను కలిగి ఉండటమే దానిని అభివ్యక్తం చేయడమంటే... మనిషి తన అనంత శక్తిని, జ్ఞానాన్ని గుర్తెరిగినప్పుడు ఆత్మ స్వీయ ఔన్నత్యాన్ని ప్రకటిస్తుంది.
* భగవద్భక్తి, గురుభక్తి, సత్యమునందు విశ్వాసం ఉన్నంతవరకూ ఏదీ నీకు హాని కలిగించలేదు.
* సత్సంకల్పం, నిష్కాపట్యం మరియు అఖండప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న వ్యక్తి లక్షలకొద్ది కపటుల, పశుసమానుల కుతంత్రాలను వమ్ము చేయగలడు.
* ధీరులు, సాహసోపేతులు, ఉత్సాహపూరితులైనవారి సహాయం నాకు కావాలి. లేకపోతే నేను ఒంటరిగానే పనిచేస్తాను. నావంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు లభిస్తే, నేనీ లోకాన్ని తలకిందులు చేసేవాణ్ణే.
*మనం ఏది కామో అదిగా మనల్ని జనులు భావించాలని మన శక్తిని వెచ్చిస్తాం. ఆ శక్తిని మనం ఎలా ఉండాలనుకొంటున్నామో దానికోసం వినియోగించడం ఉత్తమం.
*నాదృష్టిలో ఎవరైనా తనను తాను అల్పుడనని, హీనుడనని తలచడమే మహాపాతకం, అజ్ఞానం.
*శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి; ఆహార, విహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి
*మనిషి అంతర్గతంగా అనంతశక్తి కలిగివున్నాడు. అతడు దానిని అనుభూతమోనర్చుకో గలడు. అది సాధ్యమే. అయినా ఆ విషయంపై మనిషికి నమ్మకం లేదు.
..............

Comments
Post a Comment