ప్రాంజలి ప్రభ O2/04

 



           
.......
.
తెలుగు భాషని మన ఇళ్లలోనే వాడటం మానేసాం.
ఇప్పుడు బళ్ళలో కూడా...

ఎప్పుడో కొన్నేళ్ళక్రితం
నాయని జయశ్రీ రాసిన వ్యాసం....

"డోర్ లాక్ చెయ్యకండి"

‘నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ?’
ఇందులో ‘కార్’ తప్ప అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.
కానీ మనం వాడం.
ఎందుకు?
ఇది ఈరోజు నాకు హఠాత్తుగా వచ్చిన ఆలోచన కాదు.
చాలా రోజుల నుంచీ మనసులో నలుగుతున్న ప్రశ్నే.
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడిపెట్టుకో అనే వాళ్ళం.
ఇవేకాదు,
చిన్నతనంలో వినిన, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్నమొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకి నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం?

మన తెలుగులో మాటలు లేవా?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి.
కానీ మనం పలకం.

వంటింటిని కిచెన్ చేసాం.
వసారా వరండాగా మారింది.
ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.

మన ఇళ్ళకి చుట్టాలు, బంధువులు రావడం మానేసారు.
గెస్ట్‌లే వస్తారు.
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు.
ఏ లంచో, డిన్నరో చేస్తారు.
భోజనానికి కూర్చొన్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం.
అందులో వడ్డించేవన్నీ రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై, చికెన్, మటన్ వగైరాలే.
అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, కోడికూర, మాంసం తినండి అంటే ఇంకేమన్నా ఉందా, 
వాళ్ళేమనుకుంటారో అని భయం.

అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసికెళ్ళం.
బ్యాగ్ పట్టుకుని షాప్‍కి వెళ్తున్నాము.
అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము.
కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడని అడిగా.
ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి? అని ఎదురు ప్రశ్న వేసింది.
బిత్తరపోవడం నావంతయింది.

టీవీలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు,
వంటా-వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళకి అలవోకగా ఆంగ్లపదాలు పట్టుబడతాయి మరి.
అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు.

టీవీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకి వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది.
అది ఏ భాషో మీరే చెప్పండి.
‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి,
ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి,
స్టౌవ్ ఆఫ్‍చేసి మసాలాపౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలా సాగుతుంది.
మరి మన కూరలకి అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?

నిన్న మా పక్కింటాయన వచ్చి
‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి,
ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’
అని చెప్పి వెళ్ళాడు.
మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం.
అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న
అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు.
ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై
కజిన్స్ అయిపోయారు.

పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం.
స్కూల్‍కే పంపిస్తాం.
సరే బడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు.
ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము.

మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలని వదిలేస్తున్నాం?
ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా?
తెలుగు మాటలు మనకి మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి?
ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు.
నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు,
నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం,
ఇతరులు అనుకోవాలన్న భావన.

ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి.

\ఒకప్పుడు సంస్కృతం పట్ల ఇదే దృక్పథం అలవరచుకున్న తెలుగు వాళ్ళు
తూర్పు పడమర మిగిల్చారు
కానీ ఉత్తరం దక్షిణం మరచిపోయారు.
ఈ కాలంలో ‘వడ’, ‘తెన్ను’ అంటే ఎవరికి తెలుస్తుంది?

‘జనని సంస్కృతంబె ఎల్ల భాషలకును’
అని భావించిన గొప్పగొప్ప పండితులు
వారి పాండిత్య ప్రకర్ష కోసం
తెలుగు మాటలు వదిలేసి సంస్కృతం వాడటం మొదలుపెట్టారు.
వారి దగ్గర పాఠం వల్లెవేసిన వాళ్ళకి అదే గీర్వాణం వంటబట్టింది.

అదే వరవడిలో మనకి పగలు మిగిలింది, మావు చీకట్లో కలిసిపోయింది.
ఉసురుకి ప్రాణం పోయింది.
ఎడం దూరం అయింది.
అన్నం తినడం మొదలు పెట్టాక కూడు చద్దిపట్టింది.

ప్రస్తుతం మనం సంతోష పడాలన్నా,
బాధ పడాలన్నా,
ఆఖరికి భయపడాలన్నా
సంస్కృతంలోనే పడుతున్నాం.
ఇలా చెబుతూ పోతే వీటికి అంతే లేదు. 

వివిధ జానపద కళారూపాలలో ఉన్న ఆనాటి తెలుగు సాహిత్యం,
శాసనాలు దేశీయ ఛందస్సు లోనే ఉండేవి.
తెలుగు కవులు దేశి కవిత్వాన్ని వదిలి మార్గ కవిత బాట పట్టడంతో
చాప కింద నీరులా భాషలో మార్పు వచ్చింది.
ఇంత జరిగినా మన పల్లె పట్టుల్లో మాత్రం
జానపద కళలు నిన్న మొన్నటి వరకు బతికే ఉన్నాయి.
వారి నోట అచ్చ తెనుగు మాటలే వినిపించేవి.

ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.

ఈ మధ్య ఓ సారి ప్రయాణం మధ్యలో
ఒక చిన్న పల్లెటూర్లో కారు ఆపి
ఇక్కడ మంచినీళ్ళ సీసాలు ఎక్కడ అమ్ముతారు బాబూ అని ఒకతన్ని అడిగా.
అతడు కొంచెం వింతగా నావైపు చూసి,
మినరల్ వాటర్ బాటిల్సా మేడం? అన్నాడు.
అవునయ్యా అన్నా.
అలా చెప్పండి మేడం అర్థం అవుతుంది,
అని అవి అమ్మే చోటు చూపించాడు.

మూలమూలలకి విస్తరించిన టివి ప్రసారాలు,
ఇంటర్నెట్ల ప్రభావం వలన ఈ మార్పు చాల త్వరగా జరుగుతూ ఉంది.

భాషలో లేని పదాలను
పరభాషల నుంచి తెచ్చుకొని వాడుకోవడం వల్ల
ఆ భాష పరిపుష్టమౌతుంది.

అలాగని వాడుకలో ఉన్నమాటలని వదిలేసి
పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించిపోతుంది.
ఇంకా సమయం మించిపోలేదు.
ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు మాటలు
అంతరించి పోకుండా ఉండాలంటే
మనం వీలైనంత వరకు తెలుగు మాటలే వాడాలి.

బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా,
కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం.
అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి,
అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం
.........

     
చందమామలో కుందేలు ఎలా ఉంటోంది*

పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణచంద్రుడి కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది. కానీ దాని మధ్య కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది. చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు, అంటే చాలా వేల ఏళ్ల క్రితం, చందమామ తెల్లగా, వెండిపళ్లెంలాగా ఉండేవాడు. ఆ కాలంలో భూమిమీద ఒక అరణ్యంలో ఒక కుందేలూ, ఒక కోతీ, ఒక నక్కా, ఒక మానుపిల్లీ సఖ్యంగా ఉంటూ ఉండేవి. కుందేలు తన ముగ్గురు మిత్రులకూ ఉత్తమ మానవధర్మాలు చెబుతూ, పశుత్వంనుంచి బయటపడమని హితబోధ చేస్తూ ఉండేది.

మిగిలిన జంతువులు తమ స్నేహితుడైన కుందేలును చూసి గౌరవించేవేగాని కుందేలు చెప్పే ధర్మాలను ఆచరించలేకపోయేవి. ఎందుచేతనంటే కోతి చపలచిత్తం గలది. నక్క జిత్తుల మారిది, మానుపిల్లి దొంగబుద్ధి కలది. కుందేలు ఎంత హితబోధ చేసినా వాటికి పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధులు మారాయి కావు.

ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆరోజు ఉదయం కుందేలు తన స్నేహితులతో "అన్నలారా! ఇవాళ కార్తీక పౌర్ణమి, ఉపవాస దినం. పగలల్లా ఉపవాసం ఉండి, పొద్దూకగానే అతిథులకు ఆహారం పెట్టి, అనంతరం చంద్రదర్శనం చేసుకుని మనం భోజనం చేసినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది. నేను అలాగే చేయబోతున్నాను. మీరు కూడా అదేవిధంగా చేయవలసిందని నా కోరిక" అన్నది.

కోతీ, నక్కా, మానుపిల్లీ తలలు ఊపి, తాము కూడా పగలల్లా ఉపవాసం ఉండి చంద్రోదయం కాగానే భోజనం చేస్తామని కుందేలుకు మాట ఇచ్చి తలా ఒకదారినా బయలు దేరాయి. ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్న మరుక్షణం నుంచి కోతికి ఎక్కడ లేని ఆకలి వేస్తున్నట్లు తోచసాగింది. "అమ్మయ్యో, రాత్రి చీకటి పడేదాకా ఈ ఆకలికి తట్టుకోగలనా? బతికుంటే వచ్చే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండొచ్చు" అని నిశ్చయించి కోతి పళ్లచెట్లకోసం వెతకనారంభించింది. నక్క ఉపవాసం చేయటానికి పులులు తిరిగే ప్రాంతానికి వెళ్లింది. కడుపు ఎంత మాడుతున్నా సరే ఆహారం మాత్రం ముట్టరాదనుకున్నది. కానీ కొంత దూరం వెళ్లాక ఒక పొదలో సగం తిన్న జింక శరీరం కనిపించింది. ఏ పులో దానిని చంపి కొంత తిని అక్కడ దాచివుంటుంది. తాను ఉపవాసం కారణంగా దానిని పోనిచ్చినట్లయితే చీకటి పడ్డాక తనకు ఆహారం దొరుకుతుందో, దొరకదో! అందుచేత నక్క ఉపవాసం ఆలోచన కట్టి పెట్టి వెంటనే భోజనానికి ఉపక్రమించింది.

మానుపిల్లి సాయంకాలం దాకా పడుకుని నిద్రపోదామనే ఉద్దేశంతో ఒక చెట్టు ఎక్కింది. ఆ చెట్టు కొమ్మలలో దానికొక పక్షిగూడూ, పిల్లలూ కనిపించాయి. మానుపిల్లి ఉపవాసం సంగతే మరచిపోయి పక్షిపిల్లలను కాస్తా భక్షించింది. నలుగురు మిత్రులలో కుందేలు మాత్రమే సాయంకాలం దాకా కటిక ఉపవాసం చేసింది. సూర్యాస్తమయమూ, చంద్రోదయమూ కూడా కాబోతున్నాయి. కుందేలుకు ఒక విచారం పట్టుకున్నది. అతిథి అభ్యాగతులెవరూ కనిపించలేదు. ఒంటరిగా భోజనం చేసేదాని కన్న, అతిథులకు పెట్టి తినడం ఎక్కువ పుణ్యం. అందుచేత కుందేలు అతిథులకోసం ఇంటిముందు నిలబడి ఎదురుచూడసాగింది.

కుందేలు నిష్టను కనిపెడుతున్న చందమామ మానవరూపం ధరించి ఆసమయంలో కుందేలును పరీక్షించటానికి వచ్చాడు. "పొద్దుటినుండి ఉపవాసం వున్నాను. అరణ్యంలో ఇంత భోజనం పెట్టేవారే లేరు. కాస్త నాకు భోజనం పెట్టి పుణ్యం కట్టుకుంటావా?" అని చందమామ కుందేలును అడిగాడు. "అయ్యా, నాకు కావలసిన ఆకు అలములు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి కాని, నీకు తగిన భోజనం ఎక్కడ దొరుకుతుంది? అందుచేత నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకుని నాకు ముక్తి ప్రసాదించు" అన్నది కుందేలు.

"కార్తీక పౌర్ణమి పుణ్యదినం నాడు జీవహింస చేయతగునా? నేను నిన్ను ఎట్లా చంపను?" అని అడిగాడు చందమామ "అయ్యా, దానికి విచారించవద్దు. మీరు ఎండు పుల్లలు తెచ్చి అగ్ని చెయ్యండి. నేను అందులో ఆహుతి అవుతాను. ఆ తరువాత మీరు నన్ను హాయిగా భుజించండి." అన్నది కుందేలు. మనిషి వేషంలో ఉన్న చందమామ అక్కడే పుల్లలు పేర్చి పెద్ద మంట చేశాడు. కుందేలు ఒక్కసారి భగవంతుణ్ణి స్మరించి ఆ మంటలోకి దూకింది. కాని, చిత్రం! ఆ మంటలు కుందేలును సోకనేలేదు."అయ్యా, నన్నీమంటలు దహించకుండా ఉన్నాయి. నేనేం చేసేది. మీ ఆకలి ఎట్లా తీర్చేది?" అని కుందేలు శోకించింది. మరుక్షణమే మంటలు మాయమయాయి. చందమామ దేదీప్యమానమైన తన నిజస్వరూపంలో ప్రత్యక్షమై కుందేలును ఎత్తుకుని "నీ జన్మ ధన్యమైనది. నిన్నునాతో శాశ్వతంగా ఉంచుకుంటాను. రా, పోదాం." అన్నాడు. ఆనాటినుంచి కుందేలు చందమామ వెంటనే వుంటోంది.
......


బ్రెజిల్ లో ఒక కోటీశ్వరుడు తన One Million Dollar ఖరీదుగల బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!!
నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే.. నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు..!!
అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ ఈయన ఒక పెద్ద అవివేకి అని, One Million Dollar కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!!
మీడియాతో పాటుగా ప్రజలు కూడా చాలా తిట్టారు అతన్ని..!!
అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి రెడీగా ఉన్నారు..!! పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!!
అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా..
ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..? మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!! దీనిని వేరోకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా.. అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!!

అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!
"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!! దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!!
ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!!
నిజమే కానీ మీరు మాత్రం వెలకట్టలేని...
మీ(మన) గుండె...
కళ్ళు...
ఊపిరితిత్తులు..
మూత్రపిండాలు..
ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి కదా..?
ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి కదా..?
వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని.. ఆలోచన కాని లేదు ఎందుకు..?
కారు పోయినా.. డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!!
మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?
వాటికి విలువ కట్టగలమా..?
మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేక పోతున్నాం..?
కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు కదా..?
మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు..?
ఆలోచించండి..!!
అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!!
మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడానని అక్కడున్నవారి జ్ఞానోదయం కలిగించాడు ఆ పెద్దమనిషి.
  • ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైఖేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకొన్నాడు...(సాధ్యమయ్యిందా ?) కానీ...


ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖ శిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి, ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటివద్ద 12 మంది వైద్యులను నియమించుకొన్నాడు.

మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమించబడ్డారు.

తాను తినే ఆహారం ముందుగా లాబరేటరీ లో పరీక్షించబడి, అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది.

ఆయన పదుకొనె మంచం ఆయన పీల్చుకొనే ప్రాణవాయు పరిమాణాన్ని నియంత్రించగలిగే సాంకేతికతను కలిగి ఉండేది.

ఆయనకు ఏ అవయవం ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో  ఇచ్చేందుకు అవయవ దాతలు సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఈ అవయవ దాతలందరి యోగక్షేమాలు ఈయన సొంత ఖర్చుపై చూసుకోబడేవి.

ఈ వసతులన్నింటితో ఆయన 150 సంవత్సరాలు జీవించాలన్న కలతో/ కోరికతో జీవనం సాగించారు.

అయ్యో,  ఆయన విఫలమయ్యాడే!

50 సంవత్సరాల వయస్సులో, 2009 సం, జూన్ 25 వ తేదీన ఆయన గుండె పని చేయటం మానేసింది.

ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆ 12 మంది డాక్టర్ల నిరాఘాట, నిర్విరామ ప్రయత్నాలు ఫలించలేదు.

లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా నుండి రప్పించబడిన ప్రత్యేక నిపుణులైన డాక్టర్ల ప్రయత్నాలు కూడా ఆయనను రక్షించలేకపోయాయి.

25 సంవత్సరాల పాటు  ఆయన వ్యక్తిగత డాక్టర్ల  సలహా తీసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని వ్యక్తి 150 సంవత్సరాలు జీవించాలన్న ఆయన స్వప్నాన్ని సాకారం చేసుకోలేకపోయాడు.

2.5 మిలియన్ మంది ప్రత్యక్షంగా తన అంతిమ యాత్రలో పాల్గొన్న చరిత్ర ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక్క జాక్సన్ మాత్రమే దక్కించుకోగలిగాడు.

ఆయన చనిపోయిన ఆ ప్రత్యేక దినమైన 25/06/2009 వ తేదీన 3.15 నిముషాలకు వికీపీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లు పనిచేయటం మానేసాయి. మిలియన్ల కొద్దీ జనం మైఖెల్ జాక్సన్ గూర్చి గూగుల్ లో వెతికారు...

జాక్సన్ చావును సవాలు చేసి, దాన్ని జయించాలనుకొన్నాడు; గానీ, చావే జాక్సన్ కు ప్రతిసవాలు విసిరి, తానే జయించింది.

ఈ భౌతిక ప్రపంచంలో మన భౌతిక జీవనాన్ని, భౌతిక మరణం కబళిస్తుంది.  ఇది జీవన నియమావళి.

ఇప్పుడు మనమోసారి ఆలోచిద్దాం!

మనం డాక్టర్లు, ఇంజినీర్లు, డెకోరేటర్లు, డిజైనర్ల కోసమే  (డబ్బు) సంపాదిస్తున్నామా?

అత్యంత విలాసవంతమైన భవంతులు, కార్ల తోను; అత్యంత వ్యయభరితమైన వివాహ వేడుకలతోనూ మనం ఎవరిని సంతృప్తి పరచాలనుకొంటున్నాం?

రెండే రెండురోజుల క్రితం ఓ వివాహ వేడుకలో మనం తిన్న ఆహారపదార్ధాలను నేడు గుర్తుకు తెచ్చుకోగలమా?

మన జీవనాన్ని మనమొక మృగంలా ఎందుకు కొనసాగిస్తున్నాం?

సుఖ జీవనానికని చెప్పి, ఎన్ని తరాలకు సరిపడా సొమ్మును మనం ఆదా చేయలనుకొంటున్నాం?

మనలో అత్యధికులకు ఒకరు లేదా ఇద్దరు సంతానం మాత్రమే ఉన్నారు. అయితే, మనమెప్పుడైనా, మనకెంత అవసరం ఉంది, మనం ఎంత కోరుకొంటున్నాం అని ఒక్క క్షణమైనా అలోచించామా?

'మా పిల్లలు సంపాదించ లేని అసమర్థులు కాబట్టి వారి కోసం మరింత పోగు పెట్టటం అవసరమని' మనం ఒప్పుకొంటున్నామా?

ఈ వారంలో నీకోసం గానీ, నీ కుటుంబం కోసం గానీ, నీ మిత్రుల కోసం గానీ, కొంత సమయమైనా కేటాయించగలిగావా?

నీ కోసం నువ్వు కేవలం ఐదు శాతం సొమ్మునైనా ఖర్చు చేసుకోగల్గుతున్నావా?

మన జీవన మనుగడలో మనమేం సంపాదిస్తున్నామో వాటిలోనే మనం ఆనందాన్ని ఎందుకు వెతుక్కోలేకపోతున్నాము?

వీటి కోసం నువ్వు లోతుగా ఆలోచిస్తే నిద్రలేమి, స్థూలకాయం, వెన్నుపూస జారిపోవటం వంటి వ్యాధులు నిన్ను చుట్టుముడతాయేమో?! బహుశా నీ గుండె కూడా పని చేయటం మానేస్తుందేమో?!

ముగింపు:

నీకోసం నువ్వు కొంత సమయాన్ని వెచ్చించుకో. మనం ఏ విధమైన ఆస్తుల్ని సొంతం చేసుకోలేం, అవన్నీ  కేవలం తాత్కాలికంగా  మన పేరు రాయబడే దస్త్రాలు మాత్రమే!

'ఇవ్వన్నీ నా ఆస్తులు' అని నీవు చెప్పినప్పుడెల్లా, భగవంతుడు నిన్ను చూసి ఓ వికృత నవ్వు నవ్వుతూ ఉంటాడు.
ఓ వ్యక్తి నడుపుతున్న కారును చూసి, వేసుకున్న బట్టలు చూసి, అతనిపై ఓ గొప్ప భావనను నువ్వు సృష్టించుకోనవసరం లేదు.

మనకున్న గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, గణిత మేధావులు, సంస్కర్తలు లాంటి మహానుభావులంతా వారి ప్రయాణానికి వారు స్కూటర్ లను సైకిళ్ళను మాత్రమే  వాడేవారు!

ఐశ్వర్యవంతుడవ్వాలనుకోవటం పాపం కాదు; కేవలం డబ్బుతో మాత్రమే ఐశ్వర్యవంతుడవ్వాలనుకోవటం కచ్చితంగా పాపం!

జీవనాన్ని నువ్వు అదుపులో పెట్టుకో, లేకుంటే, అది నిన్ను తన అదుపులోకి తీసుకొంటుంది.

చివరకు-
మన జీవన చరమాంకానికి మనం పొందే 'ఆనందం', 'తృప్తి', 'శాంతి' మాత్రమే మనకు నిజమైన వాస్తవ విషయాలుగా ఋజువవుతాయి.

విచారించదగిన విషయమేమంటే- వీటినేమీ మనం డబ్బుతో కొనుక్కోలేము...🙏🙏🙏
****

6. నేటి హాస్యం  
MOBILES తో జనబాహుళ్యం ... 

*నిద్ర*= కళ్ళు ముసుకుంటే రాదు 
*Net* Off చేస్తే వస్తుంది 

ఆకలితో ఉన్నవాడికి అన్నం, Android ఫోన్ వున్న 
వాడికి charger ఇవ్వడం పుణ్యకార్యం 

కోన్నిరోజుల ముందు వరకు అందరు *బేటా* కొరకు ఎదురుచుశాం, 
ఇప్పుడేమొ *Data* కొరకు 

Phone పాడైతే పిల్లలు చేసారంటాం, పిల్లలు పాడైతే Phone కారణం అంటాం. 

ఒకప్పుడు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు
 *పెద్దవాళ్ళ ఆశీర్వాదం* తీసుకుని వెళ్ళేవాళ్ళం, 

ఇప్పుడేమొ *ఫోన్ బ్యాటరీ ఫుల్* చేస్కోనీ వెళతాం 

Suddenly phone balance ఐపోతే, మనం మాట్లాడాల్సిన ఆవతలి వ్యక్తి 
భూమ్మీద దొరుకుతాడో లేదో అనేంత కంగారు పడిపోతాం 

Battery low అయి 1%లేదా 2% మీద ఉందనుకోండీ అప్పుడు చూడాలీ, 
చార్జర్ వైపు ఎలా పరుగెడతామంటే 
ఉహించుకోండి.... 

కొందరు phone pattern password ఎలా set చేస్తారంటే, 
వామ్మొ..... 
దాంట్లో ఎదో ISI పత్రాలు దాచుకున్నట్టు.. 

అనుకోకుండా ఫోన్ మిత్రుల దగ్గర మరిచిపోయినమనుకో..... 
మన అమాయక ప్రేయసీనీ శక్తీమాన్ దగ్గర వదిలేసినట్టు అన్పిస్తుంది.. 

Mobile company వాళ్ళతో ఒక request ఏంటంటే pls phone back side లో ఒక చిన్న lunch box తయారు చేసేయ్యండీ 
--((**))--

    

5. నేటి హాస్యం 

దేముడికి తనవాటా రాబట్టుకోవడం తెలుసు - 

ఒక పిసినారి గుడికి వెళ్లి జేబులన్నీ కెలికి ఒక చిరిగిపోయిన పదిరూపాయల నోటు హుండిలో వేసి ప్రసాదం కోసం చూస్తున్నాడు.

 అంతలో వెనుక ఉన్న ఒక మహిళ ఇతనికి ఒక 50 రూపాయాల నోట్ల కట్ట అందించిది .

 ఈ పిసినారి ఆమెకు హుండీ అందదేమో అనుకుని ఆ కట్ట హుండిలో వేసి బయటకు వస్తు కంగారుగా జేబులు తడుముతున్నాడు -

 ఆ మహిళ ఏమిటి ఈ కంగారు అనడిగింది, నా జేబులో ఒక నోట్లకట్ట ఉండాలి, అది లేదు అన్నాడు. మీరు హుండిలో వేసినప్పుడు కింద పడిపోతీ మీకు అందించాను కదా అదీ హుండిలో వేసారు కదా అందా అమ్మడు - పిసినారి తలతిరిగి క్రింద పడిపోయాడు

--((*))-


*అవధాన విద్యావికాస పరిషత్* వారి ఆధ్వర్యవంలో.... *2-4-2023 వ తేదీన సాయంకాలం రవీంద్ర భారతిలో జరిగిన క్షిప్రావధాని శ్రీ ముద్దురాజయ్య  గారి శతతమ అష్టావధానము లో వారు పూరణ చేసిన పద్యములు*


 1- *నిషిద్ధాక్షరి* కంది శంకరయ్యగారు
*అంశం- ముద్దులొలికే చందమామ వర్ణన*
(-)వీ(క)డన్(-)వె(ల)ట్టన్ (జ) గూ(డ)ర్పన్ 
(-)తోడై(వ)సి(వ)ల్గుల్(-)శ(ల) మిం(చ)ప( యతి)తో(ర)డ్తో(వ)మి(ట)న్నున్ .....

వీడన్ వెట్టన్ గూర్పన్
తోడై సిల్గుల్  శమింప తోడ్తో మిన్నున్ 
వీడక వెన్నెల గురిసెడి
వాడా శశి యోషధులకు ప్రాపైనిల్చున్!!

2- *సమస్య* అన్నపరెడ్డి సత్యనారాయణ  రెడ్డి గారు

 చేడ్పడి యార్ధికంబుగ భుజింపగ
 నన్నము లేక యున్నచో
తోడ్పడి బంధు సంఘము హితుల్  కడు సాయము చేయు చుండు టన్ 
మాడ్పును చెందగా వెతలు మానస వీధుల వీడి యుంటచే
*ఏడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్!!*
*(ఆఖరి పాదమే సమస్య)*

3- *దత్తపది* కటకంవేంకట రామ శర్మ గారు
*అంశం-*కలప-పలక-గడప-పడగ*
*రామాయణార్ధంలో ఉత్పలమాలలో*
సీతకలంగి యుండుటను  చేతము లో *పలక* ల్గ చేయగా
బ్రాతిగ తాను గాంచి  *కలపల్కె* ను వే త్రిజటాఖ్య కూర్మి,వి
ఖ్యాతిగ సర్పపున్ *బడగ* కైవడి నొప్పెడి  రావణాసురున్
భుతలి గూల్చు నీ వెతల పూనికతో *గడపంగ* రాముడే!!

4- *న్యస్తాక్షరి* ఆరవల్లి శ్రీదేవి గారు
*అంశం- అవధానంలో న్యస్తాక్షరి వైశిష్ట్యం* శార్దూలంలో...
*1-13-4-17---అక్షరాలుగా నాలుగు పాదాలలో*
*న్య* స్తంబై తనరారు యక్కరములన్ స్థానంబులన్ నిల్పి,వి
ధ్వస్తంబించుట కాని  భావనల వి *స్తా* రంబుగా పూరణల్ 
స్వస్తిన్ దీ *క్ష* ఘటింప ధారుణిని నశ్రాంతంబు చింతించి ,,సూ
రి స్తుత్యంబుగ చేయు నిట్టి క్రియ నోలిన్ భూ *రి* సంస్కారియౌ!!

5- *వర్ణన*  గెంటేల జగదీశ్చంద్ర కుమార్ గారు
*అంశం-నర్సింహావతార వైభవం*

భక్తుని నమ్మకం బెపుడువ్యర్ధము గాదని చాటి చెప్పగా
యుక్తులు దుష్ట వర్తనము లోలి  పరాత్పరు పైన జూపినన్
వ్యక్తము గాక నిష్ఫలములై తనరారు నటంచు దెల్పగా 
యుక్తిని పుట్టి స్తంభమున  నుగ్ర నృసింహుడు చంపె రక్కసున్!!



Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ