ప్రాంజలి ప్రభ..12/04

 


నేటి సమస్య.. వర్ణన రామ శరము 

సీస పద్యము 

బ్రతుకునిచ్చినవారి బ్రతుకుబుగ్గిని చేయ
రంగరించియు మార్చు రామ శరము
హక్కులన్నియు తెల్ప హాయిని చేర్చియు
రక్షగా సమయమ్ము రామ శరము
దుష్ట రాక్షసులకు దుర్మార్గులకు తోడు 
రక్కసి మూకకు రామ శరము
రావణ చర్యను మట్టు పెట్టియు రామ 
రక్షించె సీతను రామ శరము 

తే. సర్వు లక్షేమమును నెంచి సహన ముంచి
సంఘరక్షణ సేవగా సమయ ముంచి
ధర్మ నిష్టా గరిష్టుల ధరణి నెంచి
రామ శరణు కోరిన రక్ష రామ శరము
దైవ సాక్షాత్కారం
ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం.. _*శబ్దం* ._
వాయువుకు ఉన్నగుణాలు రెండు.. *_శబ్దము, స్పర్శ._*
అగ్నికి ఉన్న గుణాలు మూడు.. *_శబ్ద, స్పర్శ, రూపములు._*
జలముకు ఉన్న గుణాలు నాలుగు.. *_శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు._*
భూమికి ఉన్న గుణాలు ఐదు.. *_శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు._*
ఈ ఐదు గుణాలూ… _పాంచభౌతిక తత్త్వాలు_ గల మన శరీరానికి ఉన్నాయి..
కనుకనే..మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం... *_జలము…_*
‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల..
మనం నీటిని చేతితో పట్టుకోలేము...
నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం...
కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగానీ..
మనం బంధించలేము... *_అగ్ని…_*
‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవలన..
అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ..
కనీసం తాకనైనా తాకలేము..
తాకితే శిక్షిస్తుంది... *_వాయువు…_*
‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవలన..
మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే..
తనంతట తాను మనలను స్పృశించి..
తన ఉనికిని మనకు తెలియజేస్తుంది...*_ఆకాశం…_*
‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవలన..
అది మన కళ్ళకు కనిపించకుండా..
తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది... కేవలం..
ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు.. ఏ గుణము లేని..
ఆ.. *_‘నిర్గుణ పరబ్రహ్మ’_* ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు???
అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి...
దాన్ని తెరవాలంటే.._పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను..
అనగా.. ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి...అప్పుడు..
నీవు _నిర్గుణుడవు_ అవుతావు..._నిర్గుణుడు_అనగా.._పరమాత్మ_
నిన్ను నీలోనే దర్శించుకుంటావు.. అదే.. _‘అహం బ్రహ్మాస్మి’_ అంటే...
_‘నిన్ను నీవు తెలుసుకోవడమే’..__దైవాన్ని దర్శించడమంటే..._
అదే.._దైవ సాక్షాత్కారం_ అంటే..!
🙏🙏



శ్రీ శ్రేయస్కరీ స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

1)శ్రేయస్కరి శ్రమనివారిణి సిద్ధవిద్యే
స్వానందపూర్ణహృదయే కరుణాతనో మే |
చిత్తే వస ప్రియతమేన శివేన సార్ధం
మాంగళ్యమాతను సదైవ ముదైవ మాతః ||


2)శ్రేయస్కరి శ్రితజనోద్ధరణైకదక్షే
దాక్షాయణి క్షపిత పాతకతూలరాశే |
శర్మణ్యపాదయుగళే జలజప్రమోదే
మిత్రేత్రయీ ప్రసృమరే రమతాం మనో మే ||


3)శ్రేయస్కరి ప్రణతపామర పారదాన
జ్ఞాన ప్రదానసరణిశ్రిత పాదపీఠే |
శ్రేయాంసి సంతి నిఖిలాని సుమంగళాని
తత్రైవ మే వసతు మానసరాజహంసః ||


4)శ్రేయస్కరీతి తవనామ గృణాతి భక్త్యా
శ్రేయాంసి తస్య సదనే చ కరీ పురస్తాత్ |
కిం కిం న సిధ్యతి సుమంగళనామ మాలాం
ధృత్వా సుఖం స్వపితి శేషతనౌ రమేశః ||


5)శ్రేయస్కరీతి వరదేతి దయాపరేతి
వేదోదరేతి విధిశంకర పూజితేతి |
వాణీతి శంభురమణీతి చ తారిణీతి
శ్రీదేశికేంద్ర కరుణేతి గృణామి నిత్యం ||


6)శ్రేయస్కరీ ప్రకటమేవ తవాభిధానం
యత్రాస్తి తత్ర రవివత్ప్రథమానవీర్యం |
బ్రహ్మేంద్రరుద్రమరుదాది గృహాణి సౌఖ్యైః
పూర్ణాని నామమహిమా ప్రథితస్త్రిలోక్యామ్ ||


7)శ్రేయస్కరి ప్రణతవత్సలతా త్వయీతి
వాచం శృణుష్వ సరళాం సరసాం చ సత్యామ్ |
భక్త్యా నతోఽస్మి వినతోఽస్మి సుమంగళే త్వత్-
పాదాంబుజే ప్రణిహితే మయి సన్నిధత్స్వ ||


8)శ్రేయస్కరీచరణసేవనతత్పరేణ
కృష్ణేన భిక్షువపుషా రచితం పఠేద్యః |
తస్య ప్రసీదతి సురారివిమర్దనీయ-
మంబా తనోతి సదనేషు సుమంగళాని ||


9)యథామతి కృతస్తుతౌ ముదముపైతి మాతా న కిం
యథావి భవదానతో ముదముపైతి పాత్రం న కిం |
భవాని తవ సంస్తుతిం విరచితుం నచాహం
క్షమస్తథాపి ముదమేష్యసి ప్రదిశసీష్టమంబ త్వరాత్ ||


||
ఇతి శ్రేయస్కరీ స్తోత్రం ||

🕉🌞🌎🌙🌟🚩


2. Q:-- చెడును ప్రోత్సహించ వద్దు. చెడ్డ వ్యక్తికి శిక్ష పడితే చూసి సంతోషించడం పాపమా?

A:-- మన చుట్టూ, మన ఇంటి పక్కన అందరూ దుష్టాత్మలే ఉన్నారనుకోండి. వారితో ఎక్కువ గడపవద్దు, అలా గడిపితే మన స్పందనలు మారుతాయి. కావున నవ్వడం, తలూపడం, తక్కువ సంభాషించి వారిని దూరంగా ఉంచాలి.

ఎందుకంటే కొందరి సదాత్మలకు మాత్రమే దుష్టాత్మలను మార్చగల శక్తి ఉంటుంది. కొంతమంది వారిని మార్చక పోగా వీరు మారిపోయి కింద ఆవరణకు పడిపోతారు.

చెడ్డ వ్యక్తికి శిక్ష పడితే మనం అతను గుణపాఠం నేర్చుకుంటాడు. హాని చేయడం మానేసి బాగుపడే అవకాశం వచ్చింది అనుకుంటే మంచిదే, కానీ మనం అతనికి మంచి శాస్తి జరిగింది అలాగే జరగాలి అనుకుంటే పాపం.

ఏదైనా మన భావన పైన ఆధారపడి ఉంటుంది.

1. Q:--జాతక ఫలాలు గురించిన వివరణ?

A:--  మనం magazines లో newspapers లో జాతక ఫలాలు చదువుతుంటాము. వీటిని బలహీనమైన భౌతిక మనస్సు గలవారు చదివినప్పుడు అది వారి మనస్సుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మన ఆలోచనలు చాలా శక్తివంతమైనవి.

అవి మనము తీవ్రంగా ఏది ఆలోచిస్తే వాటినే మన ఫలితాలగా మనకు లభించేలా చేస్తాయి. అవి జరిగిన తర్వాత జాతక ఫలాల్లో చెప్పినట్టే జరిగింది అని అనుకుంటారు.

మీ మానవులు ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

ఇక్కడ మీ నమ్మకం, బలహీనత వల్ల కొన్ని జరుగుతున్నాయి. కొన్నిటిని మనమే ఆకర్షిస్తున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

*_మాస్టారు జీవితపాఠం!_*
--------------------------------------
ఇది ప్రశ్నకు ప్రశ్న కాదు..
నీకు నువ్వే 
వేసుకోవాల్సిన ప్రశ్న..
చెప్పుకోవాల్సిన జవాబు..

ఒక మాస్టారికి జర్నలిస్టుకు
మధ్య జరిగిన ఆసక్తికరచర్చ..
జీవితానుభవాన్ని కాచి వడపోసిన ఆ గురుబ్రహ్మను
ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టి
ఆ గురువు ముందు.. అక్కడున్న జనం ముందు తన ప్రతిభను ప్రదర్శిద్దామని తాపత్రయ పడిన జర్నలిస్టు శిష్యునికి జీవితం అంటే ఏమిటో కళ్ళ ముందు చూపించిన మాస్టారి 
అనుభవసారం..
ఈ కథానుసారం..!!

ప్రతి మనిషికి గుణపాఠంగా ఉండే ఈ కథనం సాగిందిలా..చూడండి..
ఆ శిష్యుడు గురువు గారిని అడుగుతున్నాడిలా..
మాస్టారూ.. గత ప్రసంగంలో మీరు *contact..connection..*
అనే రెండు పదాలు పదేపడే
వాడారు..ఆ రెంటికీ తేడా ఏంటో..నాకైతే ఆ రెండు పదాలూ ఒకేలా 
ధ్వనించాయి.. అర్థమయ్యాయి..
మీకైనా వాటిలో తేడా తెలుస్తుందా..
ఇలా సారుని తికమికపెట్టి 
తన తెలివితేటలు జనం మెచ్చేలా చేసుకోవాలని కుర్ర జర్నలిస్టు తాపత్రయం..
అయితే ఎదురుగా ఉన్న ఆచార్యుని అనుభవం 
కుర్రాడిని ప్రశ్నించడం మొదలుపెట్టింది..
ఓయ్..పిల్లగాడా..
నీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు..!?
మాస్టారు తన ప్రశ్నకు బదులు చెప్పలేక సంభాషణ పక్కదారి పట్టిస్తున్నారని భావించినా సరే..పెద్దాయన అడుగుతున్నారు కదాని 
సమాధానం చెప్పాడు..
మా అమ్మ ఈ మధ్యనే కన్ను మూసింది..నాన్న ఒక్కరే ఇంట్లో ఉన్నారు.ఇంకా ఇద్దరు అక్కలు..ఒక అన్న పెళ్ళిళ్ళు అయి ఎవరి కాపురాలు... వ్యాపకాల్లో వారున్నారు..

మాస్టారు మళ్లీ ఇలా అడిగారు..
మరి నువ్వు నాన్నతో కలిసి ఉండడం లేదాని..

జర్నలిస్టు మోముపై విజయగర్వంతో కూడిన చిరు మందహాసం..
ఈసారి మాస్టార్ని గురించి కాదు..తన తండ్రిని తాను చూసుకుంటున్న వైనం గూర్చి..
లేదు మాస్టారూ..నేను మా నాన్న ఒకే ఊళ్ళో ఉంటున్నాం..అయితే నేను.. నా భార్య ఇద్దరం ఉద్యోగాల్లో ఉన్నాం గనక నాన్నని దగ్గరుండి చూసుకునే అవకాశం లేదు.అయినా మేం నలుగురు సంతానం నాన్నకి తగినంత డబ్బులిచ్చి 
పని వాళ్ళని పెట్టి ఆయన సంరక్షణ చేస్తున్నాం..నాన్న హ్యాపీగానే ఉన్నారు..
    
        అయితే నువ్వు మీ నాన్నతో రోజు మాటాడుతున్నావా..
మాస్టారు ప్రశ్న ఈసారి కొంచెం గుచ్చుకున్నట్టు అనిపించింది.
      రోజూ కాదు అప్పుడప్పుడు.. కుర్రాడి స్వరం తగ్గింది..
    మీరంతా నాన్నని ఎప్పుడు కలుస్తున్నారు..
మాస్టారు మరో క్వశ్చన్..
ఇప్పుడు అందరిలో ఆసక్తి పెరిగింది..ఆ గదిలో చీమ పడితే చిటుక్కుమని వినిపించేంత నిశ్శబ్దం..
       ఇప్పుడు మాస్టారే జర్నలిస్టును ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపించింది.
పెద్దాయన అడుగుతుంటే కుర్రాడి మొహంలో రంగులు మారుతున్నాయి.చల్లటి ఎసి గదిలో కూడా నుదుటిన చెమట బిందువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి..
        నెమ్మదిగా చెప్పాడు కుర్రాడు...ఏ పండక్కో .. పబ్బానికో..అందరం కాకపోయినా వీలున్న వాళ్ళు 
నాన్నతో కాసేపు గడిపి వస్తాము...
     ఆ వెంటనే మాస్టారు మరో ప్రశ్న సంధించారు..మొత్తం 
మీరంతా కలిసి నాన్నతో గడిపిన చివరి తేదీ గుర్తుందా!?
       ఉత్కంఠ పెరిగింది..జనాల్లో..
ఉద్వేగం హెచ్చింది మాస్టారు లో..
ఉల్లాసం పోయింది.. కుర్రాడిలో..
    గుర్తు లేదు.. నూతిలోంచి
వస్తున్నట్టుగా ఉంది స్వరం...
        మళ్లీ మాస్టారు మంద్రస్వరంతో ఇలా అడిగారు..
       పోనీ నాన్నని కలిసినప్పుడు ఆయన పక్కన కూర్చుని అమ్మ పోయిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో వాకబు
చేసావా..ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నావా..ఆ ఒంటరితనం ఆయన్ని ఎంత బాధిస్తోందో ఆరా తీసే ప్రయత్నమైనా చేసావా...
         ఆ కుర్రాడి కళ్ళలో నీళ్ళు తిరగడం మొదలైంది.
పశ్చాత్తాప భావన స్పష్టంగా కనిపిస్తోంది.
        అప్పుడు పెద్దాయన తన కుర్చీ నుంచి లేచి కుర్రాడి వద్దకు వచ్చి అతగాడి చెయ్యిని తన చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా నిమురుతూ ఇలా అన్నాడు..
         ఇప్పుడు అర్థం అయిందా..మీరంతా ఒకరికి ఒకరు _*contact*_ లో ఉన్నారు.కానీ *_connect_* అయి లేరు.అందరూ కలిసి ఉండాలి..అది కుదరనప్పుడు కనీసం రోజు మాట్లాడుకోవాలి.సమయం ఉన్నప్పుడు.. సందర్భం వచ్చినప్పుడు కాకుండా సమయం చేసుకుని కలుస్తూ ఉండాలి.కలిసినప్పుడు కూడా మొక్కుబడిగా కాకుండా కలిసి భోంచెయ్యాలి..నీకు మేమంతా ఉన్నామనే భరోసా నాన్నకి ఇవ్వాలి.మీ అన్నదమ్ములు..అక్కాచెల్లెళ్ల కుటుంబాలు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ..కలుస్తూ మీరంతా ఒక్కటిగా ఉన్నారని నాన్నకి తెలిసేలా చెయ్యాలి.. ఒకరినొకరు కలుసుకోవడం..కలిసి తినడం..కబుర్లు చెప్పుకోవడం..అమ్మని గురించిన అనుభూతులను నాన్న దగ్గర నెమరువేసుకోవడం..ఇవన్నీ *connection* అంటే..తీరిక దొరికినప్పుడు ఓ హలో చెప్పేస్తే అది *contact* మాత్రమే..అది ఎప్పటికీ ఎవరికీ తృప్తి ఇవ్వదు.
        ఆ హాలు చప్పట్లతో
మారుమ్రోగింది..అందరి మొహాల్లో అదోలాంటి దీప్తి..
ఇక ఆ కుర్రాడిలో అనూహ్యమైన నిశ్శబ్దం..
కాని.. ఏదో తెలుసుకున్న..
అర్ధమైన భావన..
         అప్పటికే తన చేతుల్లో ఉన్న మాస్టారు చేతులను నెమ్మదిగా కళ్ళకు అద్దుకుని
లేచి నిలబడి వంగి ఋషిలాంటి ఆ గురుప్రపూర్ణుడి పాదాలను తాకి కళ్ళు తుడుచుకుంటూ
బయటికి వెళ్ళిపోయాడు.
మాస్టారికి తెలుసు..
అతడి పయనం తండ్రి వద్దకేనని.. *contact* కి.. *connection* కి మధ్య వ్యత్యాసం అతడికి స్పష్టంగా అవగతమైందని..అక్కడి ఆహుతుల
కరతాళధ్వనులు.. 
అభినందనల మధ్య ఆయన నిష్క్రమించి సైకిల్ తీసుకుని 
తన ఒంటరి గదికి ప్రయాణం అయ్యారు..
 *సేకరణ: నేత్ర స్పీరిచ్యువల్ ఛానెల్ 🎤🎤🎤*

*పితృయజ్ఞాల్లోని స్వధాదేవి ఎవరు?*
పితృదేవతారాధనా రహస్యాలు*

‘‘ఏడు తరాలు‘‘ అనే మాట తెలియని హిందువు ఉండడు. కానీ ఆ ఏడు తరాలు ఏమిటో చాలా మందికి తెలియదు. ఇది తెలియాలంటే దుర్గాదేవి నుంచీ ఉద్భవించిన ఈ క్రింది దేవీశక్తుల గురించి తెలుసుకోవాలి.

వేదాలలో పురాణాలలో ఎన్నో రహస్యాలు సముద్రంలోని రత్నాల మాదిరిగా దాగి ఉన్నాయి. ఈ సంగతి వరాహస్వామి వరాహపురాణంలో స్వయంగా చెప్పాడు. ‘‘వేదాల్లో ఎన్నో విధాలైన సుదుర్లభమైన రహస్యాలున్నాయి. వాటిలో నీవు ఏవి వినాలనుకుంటున్నావో వాటిని కోరుకో చెబుతాను‘‘ అని నారదుడితో అన్నాడు.

ఆ మీదట నారదుడు స్వాహా, స్వధాల గురించి అడిగాడు. వీరిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని కోరగా అతిరహస్యమైన వారి జన్మవృత్తాంతాలు వరాహస్వామి చెప్పాడు.

సృష్టి ప్రారంభంలో సమస్తమూ సృష్టించిన మహేశుడు తానే స్వయంగా యజ్ఞరూపమై ఆవిర్భవించాడు. యజ్ఞంలో వచ్చే హవిస్సులు దేవతలకు చెందుతాయని అన్నాడు. అయితే వారు హవిస్సులు దేవతలు పొందలేకపోయారు. ఇది గమనించిన సృష్టికర్త దుర్గాదేవిని ప్రార్ధించడంతో అద్భుతమైన సౌందర్యరాశి ఉద్భవించింది. ఆమెను చూసి పరమానందభరితుడైన విధాత ఆమెను స్వాహాదేవి అనే పేరుతో పిలిచి అగ్నిదేవుని భార్యవు కావాలని కోరాడు. స్వాహాదేవిని మంత్రం చివర ఉచ్చరించి దేవతలకు ఆహుతులు ఇస్తే అవి వారికి చెందుతాయని చెప్పాడు. మంత్రం చివర స్వాహా అని లేకపోతే అది నింద్యమైనది అవుతుంది. అంబిక నుంచీ పుట్టిన స్వాహాదేవి అగ్నిదేవుని సర్వసంపత్తి. అగ్నికి ఉన్న అపారమైన శక్తి ఆయన దాహంలో ఉంది. ఆ దాహశక్తే స్వాహాదేవి.

ఆమెకు అగ్నిదేవునికీ సంతానంగా దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని అనే ముగ్గురు కుమారులు పుట్టారు.  

ఈమె వృత్తాంతం చెప్పిన తరువాత స్వధాదేవి వృత్తాంతం చెప్పాడు.

స్వధాదేవి పితృదేవతలకు తృప్తికరమైనది. ఆమే శ్రాద్ధఫలాన్ని పెంపొందింప చేస్తుంది. ఆమే శ్రాద్ధానికి అధిష్ఠానదేవి.

సృష్టికర్త దేవతలకు హవిస్సులు చేరే మార్గం రూపొందించాక సప్తపితృగణాలను సృష్టించాడు. అంటే  7 తరాల పితృదేవతలను సృష్టించాడన్న మాట. వీరికి ఆహారంగా శ్రాద్ధతర్పకపూరకమైన ఆహారం సృష్టించాడు. అదే మనం పెడుతున్న శ్రాద్ధం. ఇవి కూడా విధాతే పితృగణాల కోసం సృష్టించాడు. ఇవి పితృయజ్ఞాలు. 

ఇవి మామూలు యజ్ఞాలుగా కాకుండా ప్రత్యేకపద్ధతిలో విధాత సృష్టించాడు. కనుక ఇవి సామాన్య యజ్ఞయాగాదులకు భిన్నంగా ఉంటాయి. ఇవి కోరిన కోరికలు తీర్చడంలో సామాన్యయజ్ఞాలకన్నా శ్రేయస్కరమైనవి. పితృయజ్ఞాలలో పిండప్రదానాలు  చేస్తే త్వరగా కోరికలను సిద్ధింపచేస్తారు సప్తపితరులు. వీరి ఆరాధన సంపూర్తిగా వేరేగా ఉండడం వల్ల, మరణానంతర దశదినసంస్కారాల వల్ల దేవత్వం పొందడం వల్ల, ఏ కొంచెం తప్పు జరిగినా శ్రాద్ధం పాడైపోయి ముట్టాల్సిన పితరులకు పిండప్రదానాలు ముట్టక నానారకాలచావులు పొందిన వారికి ముడతాయి కనుక చాలా మంది వీటిని అపార్ధం చేసుకున్నారు. కానీ ఇవి కూడా చండీయాగం, సుదర్శన హోమం వంటి పరమశ్రేయోదాయకమైన యజ్ఞాలే. వాటికన్నా ఎక్కువ శ్రద్ధాగా చేయాలి. 

కానీ ఇంటిలోని నాయనమ్మల నుంచీ నోటితో మాట్లాడడం వచ్చిన వారి వరకూ అంతా ప్రవాచకులై భాష్యాలు చెప్పడం వలన పితృకార్యాలు అంటే విపరీత  అర్ధాలు జనాల్లోకి చేరిపోయాయి. కనుక వరాహపురాణంలో ఉన్న ఈ రహస్యాలు ఆంధ్రవ్యాసులవారు చెప్పగా తెలుసుకుందాం.

దేవతల మాదిరిగా పితృగణాలకు కూడా తమకు అర్పిస్తున్న ఆహుతులు చేరకపోవడం జరిగింది. దీంతో విధాత గతంలో స్వాహాదేవిని సృష్టించినట్టే మరో దేవతను సృష్టించాడు. ఆమే స్వధాదేవి. ఆమె బ్రహ్మమానస పుత్రిక. మానవకన్య. ఈమెను పితృగణాలకు విధాత ఇచ్చాడు. ఈమె పేరైన స్వధను మంత్రం చివర ఉంచి ఆహుతులు ఇస్తే అవన్నీ పితృగణాలకు చేరతాయని ఆదేశించాడు. 

అప్పటి నుంచీ పితృదేవతలకు ఇచ్చే ప్రతీ ఆహుతి, దానమూ, ఉదకమూ స్వధా నామముతో ఇస్తేనే వారికి చెందుతూ వచ్చాయి.  స్వాహా అని అంటే దేవతలకు చెందినట్టు, స్వధా అని అంటే పితృదేవతలకు చెందుతాయన్నమాట.

పితృదేవతలను సంతోషపెట్టాలి అంటే స్వధాదేవిని స్మరించాలి. ఆమెను అర్చించాలి. ఆమెను కీర్తించని వాని పితృయజ్ఞం ఫలించదు. 

స్వధా అనుకుంటే పితరులు సంతోషించి సమస్త సంపదలూ ఇస్తారు. మూడు సంధ్యలలోనూ స్వధా, స్వధా, స్వధా అని మూడు సార్లు అనుకుంటే మంచి భార్యవస్తుంది. మంచి పుత్రుడు కలుగుతాడు. సకల సంపదలూ కలుగుతాయి. 

ఓం, స్వస్తి, నమః, స్వాహా, దక్షిణా అనే ఐదుపేర్లతో పాటు స్వధా కూడా కలిపి మొత్తం ఆరు పేర్లు నాలుగు వేదాలలో సమానంగా నిరూపితమైంది. అంటే ఓంకారంతో సమానమైన శక్తి కలది స్వధా నామం.

......
*వృద్ధాప్యంలో…*
           *డబ్బు అవసరం?*
               ➖➖➖
*నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనం నిండా ఎన్నో నక్షత్రాలు. క్రమక్రమంగా ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి.* 
*నీ తోటి వయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.*
*నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా నాయనమ్మలూ, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు.*
*నీ భాగస్వామి కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు.*
*బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.*
*నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.*
*నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. ఈ సొసైటీ   నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది.*
*దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి కావుమని అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది.*
*అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది.*
*పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు......*
*నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు.*
*ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.*
*నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు              నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా,   చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో   నీవాళ్ళు చర్చిస్తూ ఉంటారు.*
*ఇవి వినడానికి చేదుగా ఉన్నా, పచ్చి నిజాలు.....!* 
*’ఇలా ఎందుకు జరుగుతుంది’ అంటే ఇది కలియుగం కాబట్టి.* 
*ఇక్కడ తరిగింది ప్రేమ, అభిమానం. పెరిగింది స్వార్థం, అసూయ.*
*ఇది చదవటానికి, వినటానికి చిత్రంగా ఉన్నా, చాలామంది జీవితాల్లో జరగబోయే పచ్చి నిజాలు.*
మిణుకుమిణుకు కధ

#ఆఫీస్‌ నుండి వచ్చానో లేదో అన్నయ్య నుండి ఫోన్‌ వచ్చింది. వదినకి ఆరోగ్యం బాగా లేదని, బాగా నీరసమై పోయిందని చెప్పేసరికి గాబరా పడ్డాను. రెండిళ్ళ అవతలే అన్నయ్య కుటుంబం వుండేది. ఆలస్యం చెయ్యకుండా పరుగు పెట్టాను. దాదాపుగా అపస్మారక స్థితిలో వుంది వదిన. అబులెన్స్‌ రప్పించి, మా ఊర్లోనే వున్న ప్రసాద్‌ డాక్టర్‌ గారి దగ్గరికి తీసుకువెళ్ళాం. ''షుగర్‌ దాదాపుగా నాలుగు వందలు దాటింది. వెంటనే మీరు విశాఖపట్నం తీసుకెళ్ళిపోండి'' అని చెప్పగానే... అదే అంబులెన్స్‌లో విశాఖపట్నం తీసుకెళ్ళి కనకదుర్గ నర్సింగ్‌హోమ్‌లో జాయిన్‌ చేశాం.

అన్నయ్య గారబ్బాయి, కోడలు, పిల్లలతో కలిసి తిరుపతి వెళ్ళడం వల్ల... పూర్తి బాధ్యత నామీద పడింది. వదినకేమైనా అయితే తాను ఒంటరినై పోతానేమోనని అన్నయ్య భయపడిపోతూ... ఏడుస్తున్నాడు కూడా. అన్నయ్య ఏడవటం నేనెప్పుడూ చూడలేదు.

అందరికీ ఒకటే అనుమానం... వదిన ఇంక బతకదనే వారి నమ్మకం.
మరోవైపు వదినని ఎలాగైనా బతికించుకోవాలని తాపత్రయం నాది.

డాక్టర్లందరితోనూ మాట్లాడుతూనే వున్నాను. వదినకి షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోవడం వల్ల కిడ్నీ కూడా పనిచేయడం తగ్గిపోయింది. ఎవ్వరికీ ఎటువంటి ఆశలూ లేవు... నాకు మాత్రం ఏదో నమ్మకం... చిన్ని ఆశ ఏ మూలనో మిణుకుమిణుకు మంటూ వుండే దీపంలా కన్పిస్తోంది.

అన్నయ్య గారబ్బాయినీ, బంధువుల్నీ, దగ్గరివాళ్ళనీ రమ్మని అందరికీ కబుర్లు పంపేశారు. ఇవాళ్ళో రేపో ప్రాణం పోతుందన్నట్లుగా ఉంది వారి తీరు. నా ప్రయత్నం ఆపలేదు.

నా పరిచయాన్ని ఉపయోగించి మంచి డాక్టర్లనీ రప్పించాను. రెండ్రోజుల్లోనే షుగర్‌ లెవల్స్‌ బాగా తగ్గి, నార్మల్‌కి వచ్చేయి. కిడ్నీ పనితీరు కూడా సాధారణ స్థితికి వచ్చేసింది. వారం రోజుల్లో డిశ్చార్జ్‌ చేసేశారు. వదిన మరలా బతికి ఇంటికి వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. తనలా వచ్చేసరికి... అన్నయ్య ముఖంలో ఏదో తెలీని ఆనందం. అవధులు లేని ధైర్యం కొట్టొచ్చినట్టుగా కన్పించడమే కాకుండా... నేనంటే అన్నయ్యకి ప్రత్యేకమైన అభిమానం, నమ్మకం ఏర్పడ్డాయి.

ఎవరెంతగా నిరుత్సాహ పరిచినా నేను వెనక్కి తగ్గలేదు. చివరి క్షణం దాకా ప్రయత్నిస్తూనే వున్నాను. ఏదైతేనేం ఫలితం దక్కింది. వదిన మామూలు మనిషయింది.
ఇంత జరిగినా అన్నయ్య ఒక్కడే సంతోషంగా వున్నాడు. మిగిలిన వాళ్ళంతా నిరుత్సాహంగానే వుండటం నేను గమనించకపోలేదు.
డబ్బు బాగా ఖర్చయిపోయిందనీ, తాము చనిపోతుందని చెప్పిన మనిషి, మరలా లేచి కూర్చుందనీ, తాము చెప్పింది నిజం కాలేదనీ... ఇలా ఏవేవో కారణాలతో వారు అసంతృప్తిగా వున్నారనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది.
కాలచక్రం గిర్రున తిరిగింది.
ఐదు సంవత్సరాలు ఏమీ కాకుండానే గడిచిపోయాయి. వదిన ఆరోగ్యం పదిలంగానే ఉంది. అన్నయ్య ఆరోగ్యం కాస్త క్షీణించింది. అన్నయ్య నావైపు మరలా ఆశగా చూశాడు. నా ప్రయత్నం మరలా మొదలు పెట్టాను. మరలా విశాఖపట్నం తీసుకెళ్ళాలని నా వుద్దేశం. మరలా డబ్బు ఖర్చయిపోతుందేమోనని వారి భయం. అయినా అన్నయ్యను దక్కించుకోవాలంటే తప్పదు. దాదాపుగా బలవంతంగానే వాళ్ళకి పూర్తిగా ఇష్టం లేకపోయినా నా కారులో ఆసుపత్రి వరకూ తీసుకెళ్ళగలిగాను. పరీక్షలన్నీ అయ్యాయి. అవసరమైన మందులన్నీ ఇచ్చారు. నాకన్నా శ్రద్ధగా అన్నయ్య కోసం ఆలోచిస్తున్నట్లుగానే అన్పించింది. వాళ్ళపై నాకు నమ్మకం కలిగింది.

కానీ అన్నయ్యకు కలగలేదు. లేదు, బాగానే చూపిస్తున్నారులేమని చెప్పి, అన్నయ్యను నమ్మించాను.

దాదాపుగా ప్రతిరోజూ అన్నయ్యను కలిసేవాడిని. గతంలో తిరిగినట్లుగా బయటకు వెళ్ళలేకపోయేవాడు. ఇంటికే పరిమితమయ్యాడు.

ఏం కావాలంటే అవి కొని, ప్రతిరోజూ పట్టుకెళ్ళేవాడ్ని. కాసేపు కబుర్లు చెప్పి వచ్చేసేవాడ్ని.

అనుకోకుండా ఏవో పనులు తగిలినా, అన్నయ్యను కలవటం మానలేదు. అన్నయ్య కొడుక్కి ఇంకేం ట్రీట్‌మెంట్‌ చేస్తే బాగుంటుందో చెప్పి, అలా చేయించమని చెప్పేవాడ్ని ఎప్పటికప్పుడు. అన్నయ్య ఆరోగ్యం బాగవుతుందనే తప్ప, వేరే వుద్దేశ్యం నాకు లేదు.
ఒకసారి అనుకోకుండా అన్నయ్య గారమ్మాయి నుండి నాకు ఫోనొచ్చింది.

''ఏంటి మీరు మా నాన్నగార్కి హాస్పిటల్‌ ట్రీట్‌మెంట్‌ చేయించమని మా తమ్ముడ్ని రోజూ సతాయిస్తున్నారట. ఆ మధ్య మా అమ్మ కోసమని మూడు లక్షల ఖర్చు పెట్టించారు. ఇప్పుడేమో మా నాన్న కోసం ఖర్చు పెట్టిదామనుకుంటున్నారు. వీళ్ళని చూసుకోవడం తప్ప, మా తమ్ముడింక బాగుపడక్కర్లేదా? జీవితాంతం వాళ్ళ గురించే వున్న డబ్బంతా ఖర్చు చేసేస్తే, ఇంక వాడు బతకక్కర్లేదా?'' దాదాపు నాకు వార్నింగ్‌ ఇచ్చింది.
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ''అలాగే తల్లీ... నేన్జేసింది తప్పే'' అని మాత్రం చెప్పి ఫోన్‌ పెట్టేశాను.
ఈ సంఘటన జరిగిందగ్గర్నుండి నాకు లోలోపల ఏదో అపరాధ భావన కలిగేది. అన్నయ్య వద్దకు వెళ్దామనుకునేవాడ్ని. మరలా వెనకడుగు వేసేవాడ్ని.
అన్నయ్య ఫోన్‌ చేస్తేనే తప్ప వెళ్ళడానికి సంశయించేవాడ్ని.

అన్నయ్య వెళ్ళిన ప్రతిసారీ ఏవొక ఆరోగ్య సమస్యలు ఏకరువు పెట్టేవాడు. నేను అన్నయ్యని హాస్పిటల్లోకి తీసుకెళ్తే, వారిపరువుకి ఏదో భంగం కలిగినట్లు భావించేవారు. వాళ్ళు తీసుకెళ్ళేవారు కాదు. చివరికి ఒకసారి నేను ఆఫీస్‌ నుండి ఇంటికి చేరుకోగానే కబురొచ్చింది... పిలిచినా అన్నయ్య పలకడం లేదని!

మరలా యథావిధిగా పరుగు పెట్టాను. అప్పటికే అన్నయ్య గుండె ఆగిపోయింది. అంబులెన్స్‌, డాక్టర్లూ... అందర్నీ పిలిచినా వృథా ప్రయత్నమే అయ్యంది. ఏదైతేనేం... అన్నయ్యను మా నుండి దూరం చేసుకున్నాం. చివరకు వదిన ఒంటరయ్యింది. అన్నయ్య లేని జీవితాన్ని అలవాటు చేసుకోవటం మొదలుపెట్టింది. ఏదేమైనా డబ్బు కోసం కొడుకు, కోడలి మీద ఆధారపడాల్సిందే.
వదిన పేరున కోట్ల విలువైన ఆస్తి వుంది. అన్నయ్య, వదినలకు నలుగురు సంతానం. ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అబ్బాయికి కూడా పెళ్ళయిపోయింది. ఆడపిల్లలు వాటాలడుగుతారేమోననే భయంతోనో, మరే కారణంతోనో అన్నయ్య కొడుకు... వదిన పేరనున్న ఆస్తినంతా తన పేరున రాయించేసుకున్నాడు. అదే వదిన పాలిట శాపమవుతుందని భావించి వుండదు పాపం! కొడుకు పేరునే కదా అని మరో ఆలోచన లేకుండా సంతకాలు చేసేసింది.
అనుకోకుండా ఆ వెంటనే వదిన ఆరోగ్యం పాడయింది. మరలా షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోయాయి. తూతూమంత్రంగా ట్రీట్‌మెంట్‌ జరుగుతుందే తప్ప, సరైన చికిత్స అందలేదు. డయాబెటిక్‌ రెటినోపతి వచ్చి కంటి చూపు బాగా తగ్గిపోయింది. వదినకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరిపైనా ఆధారపడడం ఇష్టముండేది కాదు. తన వంట తనే చేసుకునేది. కంట్రోల్‌ లేకుండా తినేయటం వల్లే షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోయాయని, అందుకే చూపు కూడా పోయిందని తేల్చింది కోడలు. అన్నయ్యగారబ్బాయి కాదనలేదు. దాంతో వదిన దగ్గరున్న గ్యాస్‌ సిలెండర్‌ను వెనక్కి తీసేసుకున్నారు. ఫలితంగా కోడలు పెట్టిందే తప్ప అంతకు మించి తినే అవకాశం లేకుండా పోయింది. వదినది భారీ కాయం. ఏ మూలకీ రానంత తక్కువ తిండి ఆమెను బలహీనపరిచింది. దానికి తోడు ఆత్మాభిమానం చచ్చి మరింత కుంగిపోయింది. వదినని చూసి బాధపడటమే నా పనయింది.
ప్రతిరోజూ వెళ్ళినా గానీ, ఏం చెప్పినా గాని పట్టించుకునేవాళ్ళే లేకపోయారు. నేనేం తీసుకెళ్ళి పెట్టినా, తిననిచ్చేవారు కాదు. ట్రీట్‌మెంట్‌ చేయిద్దామని చెప్తే, చేయిస్తున్నాం కదా అనేవాళ్ళు. వారికి నచ్చిన మందులు ఇవ్వటమే కాని, డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళేవారు కాదు. నాతోపాటు ఇరుగుపొరుగు వారెవరు చెప్పినా వినిపించుకునేవారు కాదు.
వదిన మంచం పట్టింది. లేచి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది. మంచం పైనే అన్నీను. ''ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, తీసుకెళ్దాం'' ఈ సారి గట్టిగానే చెప్పాను.
''హాస్పిటల్‌ ఖర్చు ఎంతయినా నేను భరిస్తాను'' అని చెప్పాను. వారి నుండి అవునని గానీ, కాదనిగానీ ఏ సమాధానమూ లేదు. వదిన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఏం జరిగిందో తెలీదు. తిండితో పాటు, బీపీ టాబ్లెట్లు కూడా తగ్గించేశారేమో... వదిన మాట కూడా పడిపోయింది. తనకి అడిగే శక్తి లేదు. అడగాలనే ఆసక్తి వున్నా, మూగదైపోయిన నోరు ఆమెకు ఆ అవకాశం లేకుండా చేసింది. కళ్ళముందే అంతా జరుగుతున్నా, నైతిక విలువలు, కుటుంబ విలువలూ పతనమవుతున్నా... నేనూ మూగవాడ్నే అయ్యాను. నా మాటలు ఎవరూ వినిపించుకోలేదు. వదిన వేదననీ, నా ఆవేదననీ పట్టించుకునే వారే కరువయ్యారు.

ఏ కొంచెమో తిండి తినగలిగే నోరు, మింగే శక్తి కోల్పోయి, కేవలం ద్రవ పదార్థాల్ని మాత్రమే స్వీకరించే దీనస్థితికి చేరుకుంది.

ఈ సారి నోరు విప్పక తప్పలేదు. ''తల్లిదండ్రులనేవారు మనకి గొప్ప ఆస్తి. వారిని కాపాడుకోవటం మన విధి. కనీస చికిత్స చేయించకుండా వదిలేయటం దారుణం. తిండి తినలేని పరిస్థితుల్లో కూడా, మనం మెడికల్‌గా సపోర్టు ఇవ్వకపోవటం అత్యంత హేయం. ఆమెక ఖర్మకి ఆమెని వదిలేసి ఎప్పుడు చనిపోతుందా అని ఎదురు చూడటం... ఇంతకు మించిన ఘోరం ఇంకేముంటుంది? మీరు తీసుకెళ్తారా లేకుంటే నన్ను తీసుకెళ్ళమంటారా? ఏదో ఒకటి తేల్చుకోండి...'' దాదాపుగా పెద్ద గొడవే చేశాను.
మొక్కుబడిగా తీసుకెళ్ళి, ఒక్క రోజు మాత్రమే ఆసుపత్రిలో వుంచి, ఎవరికీ చెప్పకుండా వెనక్కి తీసుకొచ్చేశారు. కాని ఒక్క రోజులోనే ఆమెకి ఆరోగ్యం ఎంతో మెరుగు పడింది. ఎందుకు ఇంటికి తీసుకొచ్చారో కారణం వారికే తెలియాలి మరి! ఏదైతేనేం ఆమెను మంచానికే పరిమితం చేశారు.
రెండ్రోజుల్లోనే కోమాలోకి వెళ్ళిపోయింది. నోట్లో వేసినవి మింగటం తప్ప, చూపులేదు, మాటా లేదు. కనీసం ట్రీట్‌మెంటూ చేయించటం లేదు. దాదాపుగా పదిహేను రోజులు అలాగే గడిచిపోయాయి. తిండి లేకుండా, అనారోగ్యంతో వున్న వారెవరైనా అన్ని రోజులు ప్రాణంతో వుండగలరా? ఆరోగ్యంగా వున్నవాళ్ళు సైతం తిండి లేకపోతే ఆకలితో చచ్చిపోతారు.
అన్నయ్య గారబ్బాయితో చెప్పాను... ''ఇప్పటికైనా డాక్టర్లకు చూపిద్దాం. కనీసం సుఖంగానైనా చచ్చిపోతుంది. ఇది కూడా హత్యే. ఇలా వదిలేయడం, తల్లి అనే దయాదాక్షిణ్యం కూడా లేకుండా తిండి లేని పరిస్థితుల్లో చంపేయటం క్రూరమైన హత్య కాకపోతే మరేమిటి?''
విన్నా విననట్లే వుండిపోయాడు. పదిహేను రోజులు ప్రాణంతో అచేతనంగా పడి వున్నా పట్టించుకోని ఆత్మీయులున్నారని తెలిసి, మర్నాడే ప్రాణం వదిలేసింది. ఏడుపాగలేదు నాకు. కళ్ళముందే నదిలో మునిగిపోతునన వ్యక్తిని కాపాడకుండా చూస్తూ వుండిపోవటం లాంటిదే ఇది.
ప్రమాదం జరిగి రక్తంతో రోడ్డంతా తడిసిపోయి, గిలగిల కొట్టుకుంటున్న ప్రాణాన్ని, ఏ ఆసుపత్రికీ తీసుకెళ్ళకుండా, ఏ సాయమూ చేయకుండా వదిలేసినట్లే అనిపిస్తోంది. నా నిస్సహాయ స్థితికి నన్ను నేనే నిందించుకున్నాను. ఈ పాపంలో ఎంతో కొంత నాక్కూడా భాగముందంటే అది అబద్దం కాదు. వదిననను ఈసారి కాపాడుకోలేకపోయాననే అపరాధ భావన నన్ను బాధిస్తోంది. గతంలో అన్నయ్య నాకు మద్దతుగా వున్నాడు. ఈసారి నాకు మద్దతిచ్చినవారే లేరు. వదిన వారికెవరికీ అక్కర్లేని ప్రాణమైపోవటం చాలా బాధగావుంది. తల్లిదండ్రులు సైతం అక్కర్లేని వారిగా, పనికిరాని వారిగా నేటి కాలంలో మారిపోతున్నారా అన్పించింది.
వదిన కర్మకాండలు ఘనంగా జరిగాయి. మేళతాళాలతో, తప్పెడుగాళ్ళతో కోలాహలంగా సాగాయి. ఎక్కడా తక్కువ చేయలేదు. పెద్ద ఖర్మకి కూడా మరింత ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పత్రికలలో ప్రకటనలు - 'నీవు చనిపోయిననూ మా మదిలో నిలిచే వుంటావు... నీవు లేకపోయిననూ నీ జ్ఞాపకాలతో బతికేస్తాం'.
అవాజ్యమైన ప్రేమను ఒలకబోస్తూ రాతలు... ఆమెకి కనీసం చివరి రోజుల్లో తిండి పెట్టకపోయినా, వేలాదిమందికి పెద్ద ఖర్మ రోజున విందు భోజనాలంట... ఆమె కడుపు కాలి మరణిస్తే, ఆమెకిష్టమైన కూరలూ, వంటకాలని చెప్పి వచ్చిన వారందరికీ వడ్డిస్తారట.
ఆమె పేరున స్వయం పాక దానాలూ, నిలువెత్తు హోర్డింగులూ, బ్రాహ్మణులతో పూజలూ, గోదానం, వస్త్రదానం, ఛత్రదానం, పాదుకా దానం... ఒకటా రెండా! బతికున్నప్పుడు ఆమె బతిమిలాడినా కాశీకి తీసుకెళ్ళనివారు, కుటుంబమంతా ఆమె అస్థికలను కాశీకి తీసుకెళ్ళి గంగలో మునుగుతారంట. ఇవన్నీ చూస్తుంటే బాధగా, వింటుంటే కర్ణకఠోరంగా అన్పిస్తోంది. పూజలు జరుగుతుండగానే మధ్యలో లేచాను.
''బాబారు... ఉండండి... వెళ్ళిపోతున్నారేమిటి?'' మాటలు విన్పిస్తున్నాయి. కలకలం రేగిందక్కడ.
మనస్సాక్షి అంగీకరించలేదు. మనిషిని బతికించడానికి పంచినా పర్వాలేదు... ఇంత క్రూరంగా చంపేశాక, ఇవన్నీ ఎవరికోసం?
వడివడిగా అక్కడ నుండి దూరంగా వచ్చేశాను.
*రచయిత - డా||ఎమ్‌.వి.జె.భువనేశ్వరరావు గారు*
****
భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 70 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

37. “నేను వేదశాస్త్రాలు చదివాను. చాలా తపస్సు చేసాను. ఇక నేను మోక్షానికి అర్హుణ్ణే” అని ఎవరూ అనుకోరాదు! 

38. ఇంత తపస్సు చేస్తే నాకు మోక్షానికి ఎప్పుడో అర్హత వచ్చేసిందని - నా పని అయిపోయిందని - లోకక్షేమం కోసమే బ్రతుకుతున్నానని జ్ఞాని ఎప్పుడూ అనుకోడు. జీవన్ముక్తుడు కూడా ఎప్పుడూ అలా భావన చేయఖూడదు. అసలు చెయ్యనే చెయ్యడు. 

39. అనంత కల్యాణగుణ సంపన్నుడయిన, కరుణామయుడయిన ఆ హరిమాత్రమే ముక్తినివ్వాలి. అట్లా కోరాలి. సత్కర్మలు ఆచరించాను కాబట్టి మోక్షం రావాలి అంటే, అలా వీలు లేదు. కర్మకు, ముక్తికి సంబంధం లేదు.

40. కర్మ ముక్తి అయితే ఎలా? కర్మ బంధనం కదా! కర్మ వలన కదా మనం పుట్టాము. మళ్ళీ కర్మచేసి మోక్షము పొందటమేమిటి? అది తప్పు. 

41. సుఖదుఃఖాలు దూరం చేసుకోవటానికి తపస్సుచేస్తే, ఆ తరువాత సుఖాలు కూడా అధిగమించబడి దాటబడతాయి. అదీ పరిణామదశ, అట్టివాడు, వైరాగ్యప్రవృత్తి యందు దృధమయిన నిష్ట కలిగి యుండిన వాడు పరమపదం పొందుతాడు అని భృగుమహర్షి బోధించాడు.

42. తరవాత భరద్వాజుడు, “ఇహలోకానికి, పరలోకానికి భేదం ఏమిటి? అని అడిగాడు. 
దానికి భృగుమహర్షి బదులిస్తూ, ‘ఈ ఇహలోకమంతా కర్మభూమి, భోగాస్పదమైనటువంటిది. ఎక్కువ దుఃఖము, తక్కువ సుఖము కలిగినది. చాలా ఎక్కువ సుఖము – అనంతమైన సౌఖ్యప్రదమయినది – స్వర్గలోకమనబడుతుంది.  ఆ సుఖానికీ, ఈ భూలోకసుఖానికీ హస్తిమశకాంతం. ఏనుగు-దోమ ఆ పరిణామాలలోని భేదమంతఉంది. అక్కడ సుఖానికీ ఇక్కడ సుఖానికి తేడా.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
 
సేకరణ:-

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ