ఆదిశంకరాచార్య కృతం వేదసార శివస్తోత్రమ్
1) పశూనాం పతిం పాపనాశం పరేశం గజేన్ద్రస్య కృత్తిం వసానం వరేణ్యమ్ ।
జటాజూటమధ్యే స్ఫురద్గాఙ్గవారిం మహాదేవమేకం స్మరామి స్మరారిమ్ ॥
సమస్త ప్రాణులకూ ప్రభువు, పాపనాశకుడు, పరమేశ్వరుడు, ఏనుగు చర్మమును ధరించినవాడు, ప్రార్ధించదగినవాడు, జటాజూటమునందు గంగనుమోయుచున్నవాడు, మన్మథుని సంహరించినవాడు అగు మహాదేవుని ఒక్కనినే స్మరించుచున్నాను.
2) మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యఙ్గభూషమ్ ।
విరూపాక్షమిన్ద్వర్కవహ్నిత్రినేత్రం సదానన్దమీడే ప్రభుం పఞ్చవక్త్రమ్ ॥
మహేశ్వరుడు, దేవతలను కూడా శాసించువాడు, రాక్షసులను సంహరించువాడు, అంతటా వ్యాపించినవాడు, ప్రపంచమును పాలించువాడు, విభూతితో దేహమునలంకరించుకున్నవాడు, ఎగుడు దిగుడు కన్నులవాడు, చంద్రుడు - సూర్యుడు - అగ్ని అను మూడు నేత్రములు కలవాడు, సదానందరూపుడు, పంచముఖములున్నవాడు అగు పరమశివుని స్తుతించుచున్నాను.
3) గిరీశం గణేశం గలే నీలవర్ణం గవేన్ద్రాధిరూఢం గుణాతీతరూపమ్ ।
భవం భాస్వరం భస్మనా భూషితాఙ్గం భవానీకళత్రం భజే పఞ్చవక్త్రమ్ ॥
కైలాసముపైనున్నవాడు, ప్రమథ్గణములకధిపతి, కంఠమునందు నీలవర్ణమున్నవాడు, నందివాహనుడు, సత్వరజస్తమోగుణములకతీతుడు, ప్రకాశించువాడు, భస్మచే అలంకరించబడిన శరీరము కలవాడు, భవానీపతి, పంచముఖుడు అగు పరమేశ్వరుని సేవించుచున్నాను.
4) శివాకాన్త శమ్భో శశాఙ్కార్ధమౌలే మహేశాన శూలిఞ్జటాజూటధారిన్ ।
త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూపః ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప ॥
ఓ పార్వతీపతీ! శంభో! చంద్రమౌళీ! మహేశ్వరా! శూలమును ధరించినవాడా! జటాజూటమున్నవాడా! నీవొక్కడివే ప్రపంచమంతా వ్యాపించిన విశ్వరూపుడవు. ఓ ప్రభూ! పరిపూర్ణరూపుడా! ప్రసన్నుడవగుము.
5) పరాత్మానమేకం జగద్బీజమాద్యం నిరీహం నిరాకారమోఙ్కారవేద్యమ్ ।
యతో జాయతే పాల్యతే యేన విశ్వం తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్ ॥
పరమాత్మ, ఒక్కడు, ప్రపంచము ఏర్పడుటకు మూలకారణుడు, కోరికలు లేనివాడు, ఆకారములేనివాడు, ఓంకారముచే తెలియబడువాడు, ప్రపంచము యొక్క సృష్టి,స్థితి,లయలకు ఆధారమైనవాడు అగు పరమేశ్వరుని సేవించుచున్నాను.
6) న భూమిర్నం చాపో న వహ్నిర్న వాయు ర్న చాకాశమాస్తే న తన్ద్రా న నిద్రా ।
న చోష్ణం న శీతం న దేశో న వేషో న యస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే ॥
భూమి - నీరు - నిప్పు - గాలి - ఆకాశము కానివాడు, ఆలస్యము - నిద్ర - వేడి - చలి -దేశము - వేషము లేనివాడు, ఆకారము లేనివాడైనా త్రిమూర్తి స్వరూపుడు అగు పరమేశ్వరుని స్తుతించుచున్నాను.
7. అజం శాశ్వతం కారణం కారణానాం శివం కేవలం భాసకం భాసకానామ్ ।
తురీయం తమఃపారమాద్యన్తహీనం ప్రపద్యే పరం పావనం ద్వైతహీనమ్ ॥
పుట్టుకలేనివాడు, శాశ్వతుడు, కారణములకే కారణమైనవాడు, శుభకరుడు, కైవల్యస్వరూపుడు, ప్రకాశించు సూర్యుడు, చంద్రుడు మొదలగు వారిని కూడా ప్రకాశింప చేయువాడు, సత్త్వరజస్తమో గుణములకు అతీతుడుగా నాలుగవ స్వరూపుడు, అజ్ఞానాంధ కారమునకు అవతలనున్నవాడు, ఆది అంతము లేనివాడు, పరమపవిత్రుడు, భేదములేనివాడు అగు పరమేశ్వరుని శరణుపొందుచుచున్నాను.
8) నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే నమస్తే నమస్తే చిదానన్దమూర్తే ।
నమస్తే నమస్తే తపోయోగగమ్య నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య ॥
అంతటా వ్యాపించి ఉన్నవాడా! విశ్వస్వరూపుడా! చిదానందాకారుడా! తపస్సు యోగములద్వారా పొందదగినవాడా! వేదవిజ్ఞానముచే తెలుసుకొనదగినవాడా! నీకు నమస్కారము.
9) ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవ శమ్భో మహేశ త్రినేత్ర ।
శివాకాన్త శాన్త స్మరారే పురారే త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః ॥
ప్రభూ! శూలపాణీ! అంతటా వ్యాపించినవాడా! విశ్వనాథా! మహాదేవా! శంభో! మహేశా! ముక్కంటీ! పార్వతీవల్లభా! శాంతస్వరూపుడా! మన్మథుని జయించినవాడా! త్రిపురాసురుని సంహరించినవాడా! నీకంటే వేరొకడు ప్రార్ధించదగినవాడు, లెక్కించదగినవాడు లేడు.
10) శమ్భో మహేశ కరుణామయ శూలపాణే గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ ।
కాశీపతే కరుణయా జగదేతదేక స్త్వంహంసి పాసి విదధాసి మహేశ్వరోఽసి ॥
శంభో! మహేశా! కరుణామయుడా! శూలపాణీ! గౌరీపతీ! పశుపతీ! ప్రాణులబంధములను పోగొట్టువాడా! కాశీపతీ! నీవొక్కడివే కరుణతో ఈ ప్రపంచమును నాశనము చేయుచున్నావు, పాలించుచున్నావు, సృష్టించుచున్నావు, నీవు మహేశ్వరుడవు.
11) త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ ।
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ లిఙ్గాత్మకే హర చరాచరవిశ్వరూపిన్ ॥
ఓ దేవా! శంకరా! మన్మథుని జయించినవాడా! నీ నుండే ప్రపంచము పుట్టుచున్నది. ఓ సుఖదాతా! విశ్వనాథా! నీ యందే ప్రపంచము నిలుచుచున్నది. ఓ ఈశ్వరా! హరా! ప్రపంచస్వరూపుడా! లింగరూపుడవైన నీయందే ఈ ప్రపంచము లీనమగుచున్నది.
|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం వేదసారశివస్తోత్రం సమ్పూర్ణమ్ ||
బైద్యనాధ్ , జ్యోతిర్లింగం కోలాహలంగా భక్తుల అభిషేకం...
మహాకాళేశ్వర్ - జ్యోతిర్లింగం, హారతి దర్శనము
🌹. వేద ఉపనిషత్ సూక్తములు - 52 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కేనోపనిషత్తు - 7 🌻
నాలుగవ భాగం : - 2
5. అథా ధ్యాత్మం యదేతద్ గచ్ఛతీవ చ
మనోఁ నేన చైతదుపస్మరత్యభీక్ష్ణం సంకల్ప:
ఇప్పుడు ఆత్మలో బ్రహ్మం అభివ్యక్తీకరణం అన్న దృక్కోణం నుండి దాని వర్ణనను గురించి, ఆ బ్రహ్మంవల్లే మనస్సు ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. జ్ఞాపకం వుంచుకుంటుంది, వస్తువులను ఊహించు కుంటుంది.
6. తద్ధ తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం ; సమ ఏతదేవం వేదాభిహైనం సర్వాణి భూతాని సంవాచ్ఛంతి !!
బ్రహ్మం తద్వనం అని అన్ని జీవులకూ ఆత్మగా ఆరాధించదగిందని ప్రసిద్ధి చెందింది. కాబట్టి దాన్ని తద్వనంగా ధ్యానించాలి. ఇలా తెలుసుకున్న వానిని సకల జీవులూ ప్రేమిస్తాయి.
7. ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా త ఉపనిషద్ బ్రాహ్మీం వావ త ఉపనిషదబ్రూమేతి !!
శిష్యుడు : ఆచార్యవర్యా.. నాకు ఉపనిషత్ ను ఉపదేశించండి.
ఆచార్యుడు : నీకు ఉపనిషత్తు ఉపదేశించబడింది. నిజంగా బ్రహ్మం గురించి ఉపనిషత్తు నీకు ఉపదేశించాం.
8. తస్యై తపోదమ: కర్మేతి ప్రతిష్ఠా వేదా: సర్వాంగాని సత్య మాయతనమ్ !!
తపస్సు, నిగ్రహం, నిష్టా పూర్వకమైన కర్మ. ఇవి ఉపనిషత్తులని బ్రహ్మ జ్ఞానానికి మూలభిత్తికలు. వేదాలు దాని సర్వాంగాలు. సత్యం దాని నివాస స్థానం.
9. యోవా ఏతామేవం వేదాపహత్య పాప్మాన మనన్తే స్వర్గేలోకే జ్యేయే ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి !
నిజంగా ఇలా ఉపనిషత్తును తెలుసుకున్నవాడు పాపాన్ని నిర్మూలించుకుంటాడు. అనంతం మహోన్నతం, ఆనందమయం అయిన బ్రహ్మంలో ప్రతిష్ఠితుడౌతాడు. అవును.. అందులో ప్రతిష్టితుడౌతాడు.
ఇది నాలుగవ భాగం - కేనోపనిషత్తు సమాప్తము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹.
వేద ఉపనిషత్ సూక్తములు - 51 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కేనోపనిషత్తు - 6 🌻
నాలుగవ భాగం : - 1
1. సా బ్రహ్మేతి హోవాచ!!
బ్రహ్మణో వా ఏతద్ విజయే మహియధ్వమితి; తతో హైవ విదాఞ్చకార బ్రహ్మేతి!!
‘‘అది బ్రహ్మం అని.. బ్రహ్మం వల్ల కదా మీరు విజయం సాధించి, ఘనత పొందారు’’ అని ఉమాదేవి అంది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని ఇంద్రుడు అప్పుడు తెలుసుకున్నాడు.
2. తస్మాద్ వా ఏతే దేవా అతితరా మివాన్యాన్ దేవాన్, యదగ్ని ర్వా యురింద్రస్తే హ్యేనన్నే దిష్ఠం పస్పర్శుస్తే హ్యేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి!!
అందువల్లే కదా ఈ దేవతలు అంటే.. అగ్ని, వాయువు, ఇంద్రుడు - ఇతర దేవతలను అధిగమించారు. వారే ఆ శక్తికి అత్యంత సమీపంగా వెళ్లారు. అది బ్రహ్మం అని తెలుసుకోవడంలో వారే ప్రథములు.
3. తస్మాద్ వా ఇంద్రోఁతితరా మివాన్యాన్ దేవాన్; సహ్యేనన్నే దిష్ఠం పస్పర్శ, స హ్యేనత్
ప్రథమో విదాంచకార బ్రహ్మేతి!!
ఇంద్రుడు ఈ బ్రహ్మంను సమీపంలో స్పృశించాడు. అందువల్లే ఇంద్రుడు ఇతర దేవతలను అధిగమించాడు. అతడే ఆ దివ్యశక్తి బ్రహ్మం అని తెలుసుకోవడంలో ప్రథముడు. ఇంద్రుడే బ్రహ్మవేత్తలలో మొదటివాడు.
4. తస్యైష ఆదేశ: యదేతద్ విద్యుతో వ్యద్యుతదా
ఇతీన్న్యమీమిషదా ఇత్యధి దైవతమ్!!
బ్రహ్మం వర్ణన ఇది : అహో! మిరుమిట్లుగొలుపు మెరుపును ప్రకాశింపచేసేది ఆ బ్రహ్మమే. మనిషిని రెప్పలు ఆర్చేటట్లు చేసేది ఆ బ్రహ్మమే. ప్రకృతి శక్తులుగా ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణకు సంబంధించినదిగా చెప్పవలసింది ఇది.
సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹
[18:37, 28/04/2020] +91 98494 71690: 🌹. వేద ఉపనిషత్ సూక్తములు - 48 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కేనోపనిషత్తు - 3 🌻
రెండవ భాగం :
1. యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపమ్ !
యదస్యత్వం యదస్య దేవేష్యథను మీ మాంస్యం మేవతే మన్యే విదితమ్ !
ఆచార్యుడు : ‘‘నేను బ్రహ్మతత్వం గురించి బాగానే తెలుసుకున్నాను’’ అని ఒకవేళ అనుకున్నట్లయితే.. నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు చూసే ప్రాణులలో దేవతలలో పరిచ్చిన్నమైన బ్రహ్మ రూపం అతి స్వల్పం. కాబట్టి బ్రహ్మం గురించి నువ్వు తెలుసుకోవలసి వుంది.
శిష్యుడు : (మళ్లీ చింతనచేసి బ్రహ్మం సాక్షాత్కరించుకొని) బ్రహ్మం తెలుసుకున్నానని అనుకుంటున్నాను.
2. నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ!
యోనస్తత్ వేద తద్వేదనో న వేదేతి వేద చ!!
నాకు బాగా తెలుసు అని నేను అనుకోను. నాకు తెలియదు అని కూడా కాదు. తెలుసు కూడా! నా తోటివిద్యార్థులలో అది తెలియంది కాదు అని, తెలిసినది అని గ్రహించినవాడు దానిని గ్రహించగలడు.
3. యస్యామతం తస్య మతం మతం యస్య న వేద స:!
అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవిజానతమ్!!
ఏ బ్రహ్మవేత్త అయితే తనకు బ్రహ్మం తెలియదని భావిస్తాడో.. వాడు దాన్ని తెలుసుకుంటాడు. ఏ బ్రహ్మవేత్త అయితే తనకు బ్రహ్మం తెలుసునని భావిస్తాడో.. వాడు దాన్ని తెలుసుకోలేడు. బ్రహ్మవేత్తలు రెండుతెగలు. అందులో ఒకరు బ్రహ్మం తెలుసునని అనుకునేవారు. వీరికి బ్రహ్మం తెలియదని కాదు కాని రెండవతెగవారు బ్రహ్మం తెలియదని అనుకునేవారు. వీరికి బ్రహ్మం తెలుసు.
4. ప్రతిబోధవిదితం మత మమృతత్వం హి విన్దతే!
ఆత్మనా విన్దతే వీర్యం విద్యయా విన్దతేఁ మృతమ్!!
మనస్సు చెందే వికారాన్ని స్పూర్తిగోచరం ద్వారా తెలుసుకున్నవాడు అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మ ద్వారా నిజమైన బలాన్ని, జ్ఞానం ద్వారా అమరత్వాన్ని పొందుతాడు.
5. ఇహ చేద వేదీ దథ సత్యమస్తి న చేదిహావేదీ న్మహతీ వినష్టి: !
భూతేషు భూతేషు విచిత్య ధీరా: ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి !!
ఇక్కడ ఈ ప్రపంచంలో దాన్ని సాక్షాత్కరించు కున్నట్లయితే.. ఆపైన నిజమైన జీవితం వుంది. అలా సాక్షాత్కరించు కోనట్లయితే సర్వనాశనమే. ప్రతి జీవిలోనూ ఆత్మను వివక్షిచుకుంటూ.. ప్రజ్ఞాశాలి ఇంద్రియ జీవనాన్ని అతిక్రమించి అమరత్వాన్ని పొందుతాడు.
(ఇది రెండవ భాగం)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. వేద ఉపనిషత్ సూక్తములు - 46 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కేనోపనిషత్తు - 1 🌻.
ప్రథమ భాగము -1
🌻. శాంతి మంత్ర :
ఓం ఆప్యాయన్తు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు:
శ్రోతమథో బలమింద్రియాణిచ సర్వాణి !
సర్వం బ్రహ్మౌపనిషదం మాఁహం బ్రహ్మనిరాకుర్యాం మామా బ్రహ్మి నిరాకరోదనిరాకరణ మస్త్వనిరాకరణం మేఁ స్తు !
తదాత్మని నిరతే య ఉపనిషత్తు ధర్మాస్తేమయిసస్తు తేజమయిసస్తు !!
ఓం శాంతి: శాంతి: శాంతి:
నా అవయవాలు శక్తివంతాలగుగాక. నా వాక్కు, ప్రాణాలు, కళ్లు, చెవి మరియు అన్ని ఇంద్రియాలు శక్తివంతాలగుగాక. ఈ సకలబ్రహ్మాండము వేదాంతవేద్యమైన బ్రహ్మమే. ఎన్నడూ నేను బ్రహ్మాన్ని నిరాకరించకుందునుగాక. బ్రహ్మం నన్ను నిరాకరింపకుండుగాక (అనగా నేను ఆ బ్రహ్మమే కదా!). నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండుగాక. బ్రహ్మనిరాకరణం కనీసం నాలో లేకుండుగాక. ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమగుణాలు ఆత్మనిరతుడైన నాయందు నిలుచుగాక. నాయందు ఆ సకలధర్మములు నెలకొనుగాక! ఓం శాంతి: శాంతి: శాంతి:
🌻. కేనోపనిషత్తు - మొదటిభాగం ; 🌻
1. కేనేషితం పతతి ప్రేషితం మన:
కేనప్రాణ: ప్రథమ: ప్రైతియుక్త: !
కేనేషితాం వాచమిమాం వదన్తి
చక్షు: శ్రోత్రం క ఉ దేవోయునక్తి !!
శిష్యుడు : మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయోగింపబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతారు? నిజంగా ఏ బుద్ధి కళ్లను, చెవులను నియమిస్తుంది?
2. శ్రోత్తస్య శ్రోత్రం మనసో మనో యద్
వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణ: !
చక్షుషశ్చక్షురతి ముచ్యధీరా:
ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్తి !!
ఆచార్యుడు : ఆత్మ శక్తి వలననే చెవి వుంటుంది. కన్ను చూస్తుంది. జిహ్వ మాట్లాడుతుంది. మనస్సు గ్రహిస్తుంది. ప్రాణాలు పనిచేస్తాయి. బుద్దిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాలనుండి వివక్షిస్తాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు.
3. నతత్ర చక్షుర్గచ్చి నవాగ్ గచ్చతి నోమున: !
న విద్మో న విజానీమో యథైత దనుశిష్వాత్ !!
ఆ బ్రహ్మ విషయంలో కన్ను పోజాలదు... మాటలుగాని, మనస్సుగాని పోలేవు. కాబట్టి మాకు దాని గురించి తెలియదు. దాన్ని ఏవిధంగా నేర్పించవచ్చునో ఆ పద్ధతి కూడా మాకు తెలియదు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
. వేద ఉపనిషత్ సూక్తములు - 43 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఈశావాస్య ఉపనిషత్తులు - 2 🌻
5. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా
ఆప్నువన్ పూర్వమర్షత్!
తద్ధావతోఁ న్యానత్యేతి తిష్ఠ
త్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి!!
ఆత్మ ఒక్కటే చలించనిదైనా కనస్సుకంటే వేగవంతమైనది. మనస్సుకన్నా ముందే వెళ్లగలదు కనుక అది ఇంద్రియాలకు అందదు. నిత్యమూ స్థిరమైన దైనా పరుగెత్తే అన్నిటికన్నా వేగవంతమైనది. ఆత్మ సకలప్రాణికోటుల కార్యకలాపాలను భరించటానికి ప్రాణశక్తిని సమకూరుస్తోంది.
6. త దేజతి తన్నైజతి త ద్దూరే తద్వంతికే!
త దన్తరస్య సర్వస్య త దు సర్వ స్యాస్య బాహ్యత:!!
ఆత్మ చలిస్తోంది, చలించదు. అది దూరంలో వుంది, దగ్గర కూడా వుంది. అది లోపలా బయటా అంతా వుంది.
7. యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి!
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే!!
అన్ని జీవులు తన ఆత్మకంటే వేరైనవి కావనీ, తన ఆత్మే అన్ని జీవులలోని ఆత్మగా దర్శించే వాడు దేనిని ద్వేషింపడు.
8. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మై వాభూ ద్విజానత: !
తత్రకో మోహ: క: శోక: ఏకత్వ మనుపశ్యత: !!
అన్ని జీవులను తన ఆత్మగానూ, చరాచర జగత్తును ఆత్మయొక్క ఏకత్వంగాను దర్శించే ఆత్మజ్ఞానికి మోహమేమిటి? శోకమేమిటి?
సశేషం.....
🌹 వేద ఉపనిషత్ సూక్తములు - 41 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 . ఋగ్వేదంలో చెప్పబడిన విశ్వ ఆవిర్భావము - 3 / Origin of the Universe according to Rigveda - 3 🌴
🌻. నాసదీయ సూక్తము - ఋగ్వేదము / Nasadiya suktham - 3 🌻
06. కో అద్ధా వేద క ఇహ ప్ర వోచత్కుత ఆజాతా కుత ఇయం విసృష్టిః |
అర్వాగ్దేవా అస్య విసర్జసేనాథా కో వేద యత ఆబభూవ ||
06. को अद्धा वेद क इह प्र वोचत् कुत आजाता कुत इयंविसृष्टिः ।
अर्वाग् देवा अस्य विसर्जनेनाथा को वेद यतआबभूव ॥6॥
కానీ ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసు? దేవతలకు (పరబ్రహ్మం కాదు, పుణ్యఫలాల కారణంగా దేవతాజన్మను పొందిన వారు, ఇంద్రుడు, వరుణుడు, ఆదిత్యుడు, అగ్ని మొదలైనవారు) కూడా ఈ ప్రాదుర్భావం తరువాతే అస్తిత్వం సిద్ధించింది (వారు కూడా ఈ తర్వాత వచ్చినవారే).
07. ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న |
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్సో అంగ వేద యది వా న వేద ||
07. इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न ।
यो अस्याध्यक्षः परमे व्योमन् सो अङ्ग वेद यदि वा नवेद ॥7॥
ఈ సృష్టిని చేసి, దాని పగ్గాలు పట్టి నడిపిస్తున్నవాడికి నిశ్చయంగా ఇది ఎలా ఏర్పడిందో, దీనికి కారణం ఎంటో తెలిసే ఉండాలి. బహుసా అతనికి కూడా తెలియదేమో! (ఎవరికి తెలుసు?)
|| ఓం శాంతిః శాంతిః శాంతిః ||
🌹 🌹 🌹 🌹 🌹
🌹. వేద ఉపనిషత్ సూక్తములు - 40 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఋగ్వేదంలో చెప్పబడిన విశ్వ ఆవిర్భావము - 2 / Origin of the Universe according to Rigveda - 2 🌴
🌻. నాసదీయ సూక్తము - ఋగ్వేదము / Nasadiya suktham - 2 🌻
03. తమ ఆసీత్తమసా గూళ్హమగ్రే౭ప్రకేతం సలిలం సర్వమా ఇదమ్ |
తుచ్ఛ్యేనాభ్వపిహితం యదాసీత్తపసస్తన్మహినాజాతైకమ్ ||
03. तम आसीत् तमसा गूळमग्रेऽप्रकेतं सलिलं सर्वमाइदम्
तुच्येनाभ्वपिहितं यदासीत् तपसस्तन्महिनाजायतैकम् || 3 ||
అంతా అంధకారంతో ఆవృతమైన గాఢాంధకారం నెలకొని ఉంది. అవగాహనకి అందని ఆ బ్రహ్మం (బ్రహ్మ పదార్ధం) మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. అది ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం (శూన్యం కూడ పూర్తిగా “శూన్యం” కాదని గుళిక శాస్త్రం చెబుతోంది కదా!). తీవ్రమైన తాపం (వేడి) వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది, ఉనికి ఏర్పడింది. (బిగ్ బ్యాంగ్ జరుగగా అధికమైన వేడి పుట్టిందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్తున్నది.)
04. కామస్తదగ్రే సమవర్తతాధి మనసో రేత ప్రథమం యదాసీత్ |
సతో బన్ధుమసతి నిరవిన్దన్హృది ప్రతీష్యా కవయో మనీషా ||
04. कामस्तदग्रॆ समवर्तताधि मनसॊ रॆत: प्रथमं यदासीत् ।
सतॊबन्धुमसति निरविन्दन्हृदि प्रतीष्या कवयॊ मनीषा ॥4॥
దానికి కారణం కోరిక (ఇచ్ఛ). అదే ప్రధమ బీజం, పరబ్రహ్మం యొక్క మనసు నుంచి ఉద్భవించింది. అక్కడి నుంచే విశ్వావిర్భావం జరిగింది, విశ్వం వికసించింది. అది ఉనికికి, ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది. అనగా విశ్వం వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఏ ఋషులైతే దాని కోసం తమ హృదయాలను శోధించారో, వారికి శక్తికి, పదార్ధానికి, సత్తుకు, అసత్తుకు కారణమైన చైతన్యాన్ని దర్శించగలిగారు. వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.
05. తిరశ్చీనో వితతో రశ్మిరేషామధః స్విదాసీ ౩ దుపరి స్వీదాసీ ౩ త్ |
రేతోధా ఆసన్మహిమాన ఆసన్స్వధా అవస్తాత్ప్రయతిః పరస్తాత్ ||
05. तिरश्चीनो विततो रश्मिरेषामधः स्विदासी दुपरिस्विदासी ।
रेतोधाआसन् महिमान आसन् स्वधा अवस्तात् प्रयतिः परस्तात् ॥5॥
మరియు శూన్యానికి, దానిపైన, క్రింద ఏమున్నదో, దానికి ఆధారమైనదేదో తెలుసుకోగలిగారు. అభ్యుదమైన ఆ శక్తి సారవంతమైనశక్తులను తయారు చేసింది. అన్నిటికిపైన చైతన్యశక్తి యొక్క ఉద్దేశ్యం, ప్రేరణ ఉంది, అదే దీన్ని నడిపిస్తోంది, క్రింద క్రమశిక్షణతో కూడిన సృజనాత్మకత ఉంది. అది ప్రేరణ
వేద ఉపనిషత్ సూక్తములు - 39 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 . ఋగ్వేదంలో చెప్పబడిన విశ్వ ఆవిర్భావము - 1 / Origin of the Universe according to Rigveda - 1 🌴
🌻. నాసదీయ సూక్తము - ఋగ్వేదము / Nasadiya suktham - 1 🌻
*01. నాసదా సీన్నో సదాసీత్తదానీం నాసీద్రజో నో వ్యోమా పరో యత్ |
కిమావరీవ కుహ కస్య శర్మన్నమ్భ కిమాసీద్గహనం గభీరమ్ ||*
01. नासदासीन्नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमा परो यत् ।
किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद्गहनं गभीरम् ॥1॥
సృష్ట్యాదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అనేది లేదు (సత్ లేదు, అసత్ లేదు). అంతరిక్షం లేదు. అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కాని ఏదీ లేదనటానికి వీలు లేదు. ఏదో ఉంది. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది. కానీ ఇదంతా దేనిచే/ఎవరిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?
కదిలేశక్తి లేనివాటి వెనుక - జడమైన వాటి వెనుక ఏ శక్తి ఉండి ఉండాలి. ?
*వ్యాఖ్యానం : సూక్ష్మంగా*
మనస్సు విషయవస్తువులపై పడటానికి, ముఖ్యప్రాణము చలించటానికి, వాక్కు పలకటానికి, కన్ను చూడటానికి, చెవి వినటానికి ఏది కారణమని - ఏది ప్రేరణ కలిగిస్తున్నదని శిష్యుడు ప్రశ్నించాడు. దీనిని బట్టి ఇవన్నీ స్వతంత్రంగా కదిలేశక్తి లేనివని, జడమైన వీటి వెనుక ఏదో చైతన్య శక్తి ఉండి ఉండాలని శిష్యునికి తెలిసే ఉండాలి. కనుక అదేదో తెలుపమని శిష్యుడు అడుగుతున్నాడు. శిష్యుని ప్రశ్న చాలా లోతైనది. దానికి గురుదేవుని సమాధానం చాలా గూఢంగా ఉన్నది. సమాధానం సూటిగా లేదు. బాగా మననం చేస్తేనే అర్థమవుతుంది.
చెవికి చెవిగా, మనస్సుకు మనస్సుగా, వాక్కుకు వాక్కుగా, ప్రాణానికి ప్రాణంగా, కంటికి కన్నుగా ఆ చైతన్యము ఉన్నదని తెలియజేస్తున్నాడు. చైతన్యం అవ్యక్తమైనది. కంటికి కనిపించేది కాదు. ఇంద్రియ అగోచరం. పైగా అది ఇలా ఉంటుందని నిర్దేశించి చెప్పే వీలులేనిది. అనిర్దేశ్యం. అది అంతటా ఉన్న ఏక - అద్వయ - సత్యవస్తువు. ఇలా అగోచరమై, అచింత్యమై, అనిర్దేశ్యమై, అవ్యక్తమై, అనిర్వాచ్యమైన ఆత్మను - చైతన్యాన్ని నిర్వచించవలసిన క్లిష్ట సమస్య గురుదేవుని ముందున్నది. అందుకే *ఒక ప్రత్యేకమైన పధ్ధతి ద్వారా విషయాన్ని తెలియజేస్తూ శిష్యుని యొక్క మనస్సును దృశ్య వస్తువు నుండి దృక్కు వైపుకు - ఆధారం వైపుకు - చైతన్యం వైపుకు త్రిప్పుతున్నాడు*.
నిజంగా ఉన్నది ఒకే ఒక సత్యవస్తువు. అదే చైతన్యం. అదే పరమాత్మ.
చెవికి నిజంగా వినే శక్తి ఉన్నదా? లేదు. చెవి వినుటకు కారణమైన చైతన్యశక్తియే చెవికి చెవిగా ఉన్నది. కన్ను చూడటానికి కారణమైన చైతన్యశక్తియే కంటికి కన్నుగా ఉన్నది. మనస్సు చలించటానికి కారణమైన చైతన్యశక్తియే మనస్సుకు మనస్సుగా ఉన్నది. అంటే జడమైన ఇంద్రియాలకు పనిచేసే శక్తినిస్తున్నది ఆత్మచైతన్యమే.
ఇలా ఇంద్రియాలు - ప్రాణాలు - మనస్సు మొత్తం అన్నీ అనాత్మ అనీ, జడమని తెలుసుకొని, వీటికి చైతన్యం కలిగించే ఆత్మయే అధిష్ఠానవస్తువని గ్రహించి ఆత్మకారణంగానే ఇవన్నీ చలిస్తున్నాయని తెలుసుకోవాలి. మనస్సుతో ఆలోచించేవాడు, వాక్కుతో మాట్లాడే వాడు, చెవితో వినేవాడు, కంటితో చూచేవాడు అన్నీ ఆత్మయేనని తెలుసుకోవాలి.
##################
🌞 *ఇంతకీ జీవుడెవరు? జీవుడు ఆత్మ ఒక్కరేనా?*
##### *వ్యాఖ్యానం : సూక్ష్మంగా* #####
ఇంద్రియాలను ఉపయోగించుకొనే వాణ్ణే జీవుడంటారు గదా! ఐనప్పుడు జీవుడు ఆత్మ ఒక్కరేనా? నిత్యమూ పుడుతూ గిడుతూ బాధలు పడుతూ సంతోషిస్తూ ఉండే జీవుడూ: పుట్టుకలేని, చావులేని, సుఖదుఃఖాలు లేని ఆనంద స్వరూప ఆత్మ ఒక్కరేనా?
నిజంగా ఒక్కరే కాని, ఒక్కరుగా ఉండరు. ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకొని, విషయవస్తువులను పట్టుకొని, సుఖాలకై పరుగులు తీస్తూ దుఃఖాలను కొని తెచ్చుకొనే వాడు జీవుడు. అతడే ఈ శరీర మనోబుద్ధుల తాదాత్మ్యన్ని వదలి, ఈ ప్రపంచ విషయాలతో ఏమాత్రం సంబంధం పెట్టుకోక, అన్నింటిని మనః పూర్వకంగా వదిలి, తాను తానుగా - ఆత్మగా - చైతన్యంగా కేవలంగా ఉండిపోయేవాడు పరమాత్మ. *పట్టూ విడుపులలోనే జీవుడికి దేవుడికీ తేడా. అన్నీ పట్టుకున్నవాడు జీవుడు. వదిలిన నాడు అతడే పరమాత్మ*. క్షణక్షణం మార్పులు చెందే ప్రపంచాన్ని చూస్తూ మారిపోయే ఇంద్రియాలలో కూర్చొని మైమరచినవాడు, తన నిజస్వరూపాన్ని మరచిన వాడు తాను కూడా మారుతూ బాధలు పడాలి. అలాగాక వాటితో తాదాత్మ్యాన్ని వదలి ఈ లోకాన్ని దాటిన ధీరులు మృత్యువును అధిగమించి, అమృతత్వాన్ని పొందుతారు. జీవన్ముక్తులై ఆనంద సాగరంలో ఓలలాడుతారు. బిచ్చగాడి వేషం వేసుకున్న భాగ్యవంతుడు తనను తాను మరచి నటించటంలో లీనమైతే అనేక తిట్లూ శాపనార్థాలు పడాలి. అలాగాక నటుడిగా ఎలా నటిస్తున్నా, తనను తాను గుర్తెరిగినవాడు. తాను బిచ్చగాణ్ణి కాదు, భాగ్యవంతుడనని ఎరుక గలవాడు అన్ని తిట్లలో శాపనార్థాలలో కూడా హాయిగా నవ్వుకో గలుగుతాడు. జీవుడికి దేవుడికి తేడా ఇదే.
##################
*సేకరణ :* : కేనోపనిషత్తు
✍ *వ్యాఖ్యాత* : *“అభినవ వ్యాస”,“జ్ఞానప్రపూర్ణ” శ్రీ దేవిశెట్టి చలపతిరావుగారు
శ్రీరమణీయం - (564)
🕉🌞🌎🌙🌟🚩
"సాధనలో కర్తృత్వం పోవాలంటే..?"
సత్యాసత్యాల వివేకంరావాలి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రాపంచిక విషయాలు స్వప్నంతో సమానమన్న సత్యం అర్థం అయితే కర్తృత్వభావన పోయి నిజమైన ఈశ్వరారాధన చేయగలుగుతాం. వివేకంతో గమనిస్తే జాగృతిని దీర్ఘ స్వప్నంగా గుర్తించేందుకు మనకు రోజూ వచ్చే కలలు కూడా సాధనగా ఉపకరిస్తాయి. మనం చేసే పనిలో ఏ విఘ్నాలు రాకుండా ఉండేందుకు మనం విఘ్నేశ్వర పూజ చేస్తుంటాం. ఈ సృష్టిలో జరిగే ప్రతి పని ఈశ్వరశక్తితో జరిగేదేనని తెలుసుకుని, అలాంటి ప్రతి ఈశ్వర కార్యంలోనూ ఏదో ఒక రూపంలో విఘ్నం తప్పదని గుర్తించటమే నిజమైన విఘ్నేశ్వర పూజ అవుతుంది
. శత్రువు ఆకారం కాదు కధ
అనగనగా ఒక అడవి,ఆ అడవిలో ఎన్నో జంతువులు. ఆ అడవికి సింహం రారాజు..
సింహం ఆకలేసినపుడు మాత్రమే వేటాడుతూ మిగతా సమయంలో తన గుహలో నిద్రపోయేది, ఇదిలా ఉండగా పక్క ఇంకో అడివి నుండి కొన్ని అడవి పందులు వచ్చాయి, వాటిని చూసి సింహం .."ఆ పందులే కదా మనకు ఏందిలే"అని ఊరుకుంది ,ఆ పందులు కొన్నాళ్ళకు గుంపులు, గుంపులుగా పిల్లల్ని కని అడవంతా ఆక్రమించుకుని అడవిని నాశనం చేయసాగాయి. సింహం ఎప్పటిలాగే ఆకలేసినపుడు లేడినో, జింకనో వేటాడి,తిని గుహలో పడుకునేది. ఇంకొంత కాలం పోయాక ఆ అడవిలో కొండగొర్రెలు ప్రవేశించాయి, బద్దకానికి అలవాటు పడిన సింహం వాటిని వేటాడక దొరికింది తిని పడుకునేది. మరి కొంతకాలం గడిచే సరికి అడవి నిండా పందులూ, గొర్రెలే కనిపించసాగాయి.పందులు .. దుంపలు,వేర్లు పెకలిస్తూ చెట్లు నాశనం చేస్తుంటే, గొర్రెలు పచ్చని ఆకులు,చక్కని కాయలు తినేస్తూ అడవిని ఎడారిలా మార్చేసాయి ,ఇది చూసిన మిగతా జంతువులు వేరే అడవికి వలస పోగా,మిగిలినవి ఆకలితో చచ్చాయి.
సింహం పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించి సమావేశం పెట్టింది."నేను రాజుగా అజ్ఞాపిస్తున్నా,వెంటనే ఈ అడవి వదిలి పోండి"అని పందులు,గొర్రెలను హెచ్చరించింది కానీ సంఖ్యాబలం ఉన్న పందులూ,గొర్రెలూ కలిసి సింహాన్ని చంపేసాయి..
ఇక్కడ సింహం చేసిన తప్పులు👇
1.తన సంతానాన్ని పెంచుకోకపోవడం.
2.తన అడివి లోకి వచ్చిన రోజే పందుల్ని,గొర్రెల్ని తరిమేయక పోవడం.
3.నాకెందుకులే ,నా ఆహారం,నా ఆధారం ఉంటే చాలు అని అనుకోవడం.
4.తన అడివి పట్ల బాధ్యత, కృతజ్ఞత లేకపోవడం.
5.తన దాకా వచ్చే వరకు ముప్పుని గ్రహించకపోవడం.
6.తన బద్దకంతో దుష్టులకు ఆశ్రయం ఇవ్వడం.
7.ఆకులు,దుంపలు తినే పందులు,గొర్రెలు నన్ను ఏం చేస్తాయిలే అనే మొద్దు స్వభావం.
నీతి :- శత్రువు ఆకారం కాదు,వాడి ఆలోచన చూసి జాగ్రత్త పడాలి..ఆవు గొప్పదనం తెలియజేసిన చ్యవన ముని!
చంద్ర వంశానికి చెందిన పురూరవ చక్రవర్తికి, ఊర్వశికి ఆయువు అనే కుమారుడు పుట్టాడు. ఈ ఆయువుకు నహుషుడు అనే కొడుకు పుట్టాడు. నహుషుడు తన రాజ్యాన్ని ఎంతో బాధ్యతగా పాలించేవాడు. ఒకరోజు గంగా యమునా నదుల సంగమ ప్రాంతంలో కొంతమంది చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతుండగా వారికి చేపలతో పాటు ఓ ఋషి కూడా వలలో పడ్డాడు. ఆ ఋషి 12 సంవత్సరాల నుండి నీళ్లలో సమాధి స్థితిలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు. అలాంటి ఋషి తపస్సుకు భంగం కలిగించామని ఆ చేపలు పట్టేవాళ్ళు బాధపడ్డారు. అలా నీటిలో తపస్సు చేసుకుంటున్న ఋషి పేరు చ్యవనుడు.
చేపలు పట్టేవాళ్ళంతా చ్యవణుడితో క్షమించమని కోరారు. అయితే చ్యవనుడు మాత్రం వాళ్ళతో "నేను చేపలతో కలిసి ఇన్నాళ్లు బ్రతికాను ఇప్పుడు వాటితో పాటు మీకు దొరికాను. మీరు నన్ను కూడా చేపలతో పాటు అమ్మేసి డబ్బు కూడబెట్టుకోండి" అన్నాడు.
ఋషి ఆజ్ఞను అమలుపరచడం ఎలాగో తెలియక జాలరులు ఆ సమస్యను నహుషుని దృష్టికి తీసుకొని వచ్చారు. నహుషుడు విషయం తెలిసిన వెంటనే మంత్రి పురోహితులు అందరితో కలిసి చ్యవనమహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసాడు. మత్స్యకారులు పొరపాటు చేశారు క్షమించండి అని క్షమాపణ అడిగాడు. అయితే చ్యవనుడు నహుషునితో జాలరులకు చెప్పినమాటే చెప్పాడు. 'చేపలతో పాటు నన్ను కూడా తగిన వెలకు అమ్మండి' అని అన్నాడు.
చ్యవనుడు అలా చెప్పిన తరువాత నహుషుడు చేపలు పట్టేవాళ్లకు వేయి మాడలు ఇవ్వబోయాడు. అయితే చ్యవనుడు 'రాజా! నా వెల వేయి మాడలా? సరియైన వెల ఇవ్వవయ్యా!' అన్నాడు.
చక్రవర్తి లక్షమాడలన్నాడు. చ్యవనమహర్షి సంతృప్తి చెందలేదు. కోటి మాడలన్నాడు. ఋషికి అంగీకారం కాకపోవడంతో సగం రాజ్యమివ్వడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అదీ సరియైన వెల కాదన్నాడు ముని. మొత్తం రాజ్యాన్ని మునికోసం సమర్పించడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అప్పటికీ చ్యవనమహర్షి ఒప్పుకోకపోవడంతో నహుషుడికి ఏం చేయాలో తోచలేదు.
చివరకు చ్యవన మహర్షి నహుషునితో 'రాజా! వెళ్ళి నీ మంత్రులతో సంప్రదించి తగిన వెలనునిర్ణయించు' అని ఆదేశించాడు.
సకలసంపదలు కలిగిన రాజ్యం కూడా చ్యవనుడికి సరితూగకపోవడంతో ఏం చేయాలా అని బాధపడుతున్న నహుషుని వద్దకు గవిజాతుడనే ముని వచ్చి పరిష్కారం చెప్పాడు. 'బ్రాహ్మణుని, గోవును - ఆ బ్రహ్మ దేవుడు సమాన విలువ కలిగినవిగా సృష్టించాడు. బ్రాహ్మణుడు అఖిల మంత్రాలకు అధిష్టానమైతే గోపు హవిస్సుకు మూలం. కనుక చ్యవనునికి సాటి రాగలది గోవు తప్ప మరేదీలేదు. కాబట్టి అతనికి ఆవు నిమ్మను ఇవ్వమని మార్గం చెప్పాడు గవిజాతముని.
నహుషుడు చ్యవనమహర్షి దగ్గరకు వెళ్లి, 'మహాత్మా! తమకు వెల కట్టగల శక్తి మాకెక్కడిది? నన్ను కనికరించి మీకు తగిన మూల్యంగా ఈ ఆవును అంగీకరించండి'. అని ప్రార్ధించాడు. చ్యవనమహర్షి నహుషుని భక్తిశ్రద్ధలకు, వినయ విధేయతలకు ఎంతో సంతోషించాడు. 'రాజా! అవు అగ్నిమయం, అమృత స్వరూపం, స్వర్గానికి సోపానం. దేవతలకైనా పూజ్యనీయమైనది. హోమ విధాన సంపద్వాహినియైన గోవు నాకు తగిన వెల' అని అంగీకరించాడు.
ఆవు గొప్పదనానికి ఇదొక గొప్ప ఉదాహరణ...
భగవంతుడి సాక్షాత్కారానికి ఓ చక్కని ఉదాహరణ!
జీవితంలో చాలామంది కోరుకునేది ఆ భగవంతుడి సాక్షాత్కారం. అయితే అది కోరుకున్నంత సులభంగా లభించదు. భగవత్సాక్షాత్కారం అనేది భగవంతుడి అవ్యాజ కృప వల్ల లభిస్తుందే తప్ప, దాన్ని మూల్యమిచ్చి పొందలేం. మనిషి తన అన్వేషణలో ప్రతిగా ఏదో పొందాలనే స్వభావాన్ని వదిలిపెట్టాలి. ప్రాపంచిక విషయాలను పరిత్యజించడం అన్నది ఈ రక్షమైన జీవితంలో ముఖ్యమైన దశ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే అతడు ప్రాపంచిక విషయాలకు పూర్తిగా దూరమయ్యాడని ఎవరూ చెప్పలేరు. గ్రహించడానికి వీలు కాని అతి సూక్ష్మమైన అంశం అది.
ఉదాహరణకు ఒక వ్యక్తి బాహ్యంగా సంపదలన్నీ విడిచిపెట్టి ఏకాంతంలో ఉండవచ్చు, అయినా అతని మనస్సు మారుమూలల్లో అతనికి తెలియని కోరికలెన్నో ఉండవచ్చు. అంతేకాకుండా తానొక గొప్ప పరిత్యాగిని అన్న భావనే స్వల్ప లౌకికత. ఒక వ్యక్తికి తనకు 'సంపదలున్నాయనే గర్వం ఎలా ప్రతిబంధకమవుతుందో, అలాగే తాను గొప్ప విరక్తుణ్ణి, లేక సమస్తం పరిత్యజించాను అన్న భావనతో అభిమానం ప్రారంభమై అతడిలో అహాన్ని పెంచుతుంది. ప్రాథమికంగా మనం విడిచిపెట్టాల్సింది. “నేను, నాది” అన్న భావనను (మనలోని అహాన్ని)! ప్రాపంచిక జీవితాన్ని పరిత్యజించడం అనేది దానికి మొదటి మెట్టు. అది సంపదలనూ, కోరికలనూ పరిత్యజించడానికి పరాకాష్ఠ. మనలోని అల్పమైన అహాన్ని పరమాత్మకు అప్పగించి, భగవంతుడు తప్ప మరో ఆధారం లేనివారమవ్వాలి.
భగవంతుడి సాక్షాత్కారం కోసం లౌకికతను పూర్తిగా పరిత్యజించి, అపారమైన శాంతిని అలవరచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే కథ ఒకటి ఉంది. దీన్ని రామకృష్ణ పరమహంస గారు తన శిష్యులకు చెబుతూ ఉండేవారు. ఆ కథ ఏమిటంటే…
“ఒకమారు నారదమహర్షి శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వెళుతున్నాడు. తోవలో తీవ్రమైన జపధ్యానాదులు చేసే ఒక సాధువు కనపడ్డాడు. నారదుడు వైకుంఠానికి వెళుతున్నట్లు తెలిసి, తనకు ముక్తి లభించడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో మహావిష్ణువును అడగమన్నాడు. సరేనని చెప్పి నారదుడు ముందుకు సాగుతుంటే సాధారణ జీవితం గడుపుతున్న ఇంకో మనిషి కనపడ్డాడు. అతను కూడా తనకు ముక్తి ఎప్పుడు లభిస్తుందో శ్రీమహావిష్ణువును అడగమన్నాడు.
వైకుంఠం వెళ్ళి తిరిగి వస్తూ, నారదుడు తన సమాధానం కోసం ఎదురుచూస్తున్న సాధువును కలిశాడు. నారదుడు ఆ సాధువుతో, అతడికి మరో ఏడు జన్మల తరువాత ముక్తి లభిస్తుందని మహావిష్ణువు చెప్పినట్లు తెలియచేశాడు. ముక్తి కోసం అంత కాలం వేచి ఉండాలని తెలిసిన సాధువు దుఃఖించాడు. ఇక నారదుడు రెండో వ్యక్తిని కలిసి, అతనికి ముక్తి లభించడానికి పక్కనే ఉన్న చింత చెట్టును చూపి ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు అతడు ఎత్తాల్సి ఉంటుందని తెలియజేశాడు. భగవంతుడి అభీష్టం అదే అయితే అంతవరకూ నిరీక్షించడం తన అదృష్టం అంటూ అతను ఏ మాత్రం విచారించకుండా ఆనందంతో తల ఆకాశం వైపు ఎత్తి చిందులు వెయ్యసాగాడు.
వెంటనే “నీలో పరిత్యాగం, తితీక్ష అన్న గుణాలున్నాయి. నీకు ఇప్పుడే ముక్తి లభిస్తుంది" అని అశరీరవాణి పలికింది. ఆ వెంటనే ఆ సాధారణ వ్యక్తికి ముక్తి లభించింది. కాబట్టి, భగవంతుడి సాక్షాత్కారం లభించాలంటే లౌకికతను పూర్తిగా పరిత్యజించి భగవంతునిపై అపారమైన విశ్వాసాన్ని అలవరచుకోవాలి...
తంత్రమంటే నిజమైన అర్థమేమిటి??
తంత్రం అనగానే చాలామంది ఉలిక్కిపడతారు. అదేదో అందరికీ చేటు చేసేది అనేది భయపడతారు. అదే అభిప్రాయాన్ని అన్ని చోట్లా వ్యక్తం చేస్తారు. కానీ తంత్రానికి అసలైన అర్థం చాలామందికి తెలియదు.
తంత్రమనే మాట ఎంతో ప్రాచీనకాలం నించీ ఉపయోగించబడిన పదం. నిఘంటువులు ఈ పదానికి చాలా అర్థాలు ఇచ్చాయి. తన్యత ఇతితంత్రం - తనువిస్తారే, విస్తరించబడునది అని వ్యుత్పత్తి ప్రధానంగా ఉంది. దీనికి సిద్ధాంతం, నూతి పడుగు, పరివారము అని అమరకోశం అర్ధాలిస్తుంది. ఇక 'వైజయంతీ నిఘంటువు' మాత్రం స్వరాష్ట్ర చింత అన్న అర్ధం ఇచ్చింది. ఈ అర్థాన్ని బట్టే 'స్వతంత్రము' మొదలైన శబ్దాలు ఉపయోగించబడు తున్నవి. భారతం ఆదిపర్వంలో ఒక దృశ్యం తంత్రంగా చెప్పబడింది.
ఉదంకుడనే మహర్షి గురుపత్ని కోరిన ప్రకారం పౌష్య మహాదేవి కుండలాలు తెస్తూ త్రోవలో తక్షకుడు వాటిని ఆపహరించగా వాడి వెంటబడి పాతాళానికి వెళ్లాడు. అక్కడ సితాసిత తంతు సంతానపటము నేస్తున్న యిద్దరు స్త్రీలను, ద్వాదశారచక్రము తిప్పుతున్న ఆరుగురు కుమారులను, అతి ప్రమాణతురగా రూఢుడైన ఒక దివ్యపురుషుణ్ణి చూచాడు. అదంతా ఒక దేవతా రహస్యం దాన్ని ఒక గొప్ప తంత్రంగా వ్యాసుడు వర్ణించాడు. ఈ విధంగా ఈ శబ్దం ఎంతో విశిష్టతను సంతరించుకొన్నది. అంటే మరొక కోణంలో ఆలోచిస్తే.. రహస్యం నిఘోడంగా మిలితమైపోయిన దాన్ని తంత్రం అని చెప్పవచ్చు.
మంత్రశాస్త్ర విశేషాలను చెప్పే గ్రంధాలు ఎన్నో ఉంటాయి. అలాంటి చాలా గ్రంథములకు తంత్రములు అనే పేరే పెట్టబడింది. ఎందుకంటే మంత్రాలలో ఉన్న రహస్యం అలాంటిది అని పురాణం పండితులు కూడా విశ్లేషణ ఇస్తారు. మంత్రాన్ని సిద్ధి పొందటానికి అవసరమయ్యే సామాగ్రి అంతా తంత్రం కిందికే వస్తుంది. చాలావరకు తంత్రంలో మంత్ర సిద్ధి పొందడానికి పూజలు, హోమాలు కూడా చేయాల్సి ఉంటుంది. వీటి కోసం మూలికలు, హోమద్రవ్యాలు, కుండ విశేషాలు, తర్పణవస్తువులు, వాటిని ఉపయోగించే విధానాలు ఇవన్నీ తంత్ర విధానంలోనే చెప్పబడి ఉంటాయి.
అందుకే చాలామంది మంత్రాలు చదువుతూ ఏదైనా పూజ లేదా హోమం చేస్తూ ఉన్నప్పుడు తంత్రమని చెప్పి భయపడుతూ ఉంటారు. అయితే తంత్రమనేది చెడ్డది కాదు. దీనివల్ల మంత్రసిద్ది, మంత్రం సిద్ధి వల్ల కొన్నిరకాల శక్తులు లభిస్తాయి. వీటిని సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే ఎంతో గొప్పపని చేసినవారు అవుతారు. కనుక ఇక్కడ తంత్రమనేది మంత్రసంబంధమైన సిద్ధిసాధనాలను వివరించే ప్రక్రియగా భావించవచ్చు. ప్రాచీన మంత్ర శాస్త్రవేత్తలు ఏ అర్థంలో ఉనయోగించారో ఆ అర్థాన్నే అనుసంధానించవచ్చు.
శాస్త్ర గ్రంథాలలో తంత్రశాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడింది.
విష్ణుర్వరిష్ణో దేవానాం ప్రదానా ముదధిస్తధా
నదీనాంచ యథాగంగా పర్వతానాం హిమాలయః అశ్వత్థః సర్వవృక్షాణాం రాజ్ఞామింద్రోయధావరః తథా సమస్తశాస్త్రాణాం తంత్రశాస్త్రమనుత్తమం సర్వకామప్రదం పుణ్యం తంత్రం పై వేద సమ్మితం.
అని శాస్త్ర గ్రంథాలలో నిర్వచించారు.
దేవతలలో విష్ణువువలె, హ్రదములలో సముద్రము వలె, నదులలో గంగ వలె, కొండలలో హిమవంతము వలె, చెట్లలో రావివలె రాజులలో ఇంద్రునివలె, సమస్త శాస్త్రములలో తంత్రశాస్త్రము. శ్రేష్ఠమైనది, వేదసమ్మతమైనది. అని అర్థం. అంటే వేదాలు మంత్రాలతో నిండి ఉన్నవి, అంటే అవి కూడా తంత్రాల కోవలోకే వస్తాయి. అలాంటప్పుడు వాటిని చెడ్డవి అని అనలేం కదా. కాబట్టి తంత్రాలు అంటే మంత్ర సంబంధమైన సిద్ధి పొందడానికి మార్గాలు...
చక్వవేణుడు అనే రాజు గురించి విన్నారా??
ఒకానొకప్పుడు చక్వవేణుడు అనే పేరు కలిగిన ఒక మహారాజు ఉండేవాడు. అతడు గుణ సంపన్నుడు. సదాచారపరాయణుడు, ధర్మాత్ముడు, సత్యవాది. తనపైతాను ఆధారపడేవాడు. బాగా కష్టపడే స్వభావము గలవాడు. త్యాగశీలుడు, విరాగి, జ్ఞాని, భక్తుడు, తేజశ్శాలి, తపోమూర్తి, ఉన్నతశ్రేణికి చెందిన అనుభవశాలియైన మహాపురుషుడు. అతడు రాజ్యసంబంధమైన ద్రవ్యాన్ని తన కోసము, తన భార్యకోసము వినియోగించుకోవడం దోషంగా భావించి దానిని ముట్టుకోకుండా ఆ డబ్బుకు దూరంగా ఉండేవాడు.
పన్నుల రూపములో ప్రజలనుండి వసూలుచేసిన ద్రవ్యాన్ని వారి క్షేమంకోసమే వినియోగించే వాడు. రాజ్యకార్యాలను అతడు ప్రతిఫలాపేక్షను, అభిమానాన్ని వర్ణించి 'తనువును, మనసును లగ్నంచేసి నిర్వర్తించేవాడు. ప్రజలమీద అతని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. రామరాజ్యంలో లాగా అతని రాజ్యంలోని ప్రజలందరూ దుఃఖమంటే ఏమిటో తెలియక అన్ని రకాల సుఖసంపదలతోను ఎంతో సంతోషంగా ఉండేవారు.
మహారాజు తను, తన భార్య జీవించడానికి రాజ్యానికి సంబంధించిన డబ్బు ముట్టకుండా ప్రత్యేకముగా వ్యవసాయం చేసుకొనేవాడు. ఆ వ్యవసాయానికి కూడా ఎద్దులు ఉపయోగించేవారు కాదు. ఎద్దులకు బదులుగా మహారాణి స్వయముగా నాగలిని లాగేది. మహారాజు విత్తనాలను చల్లేవాడు. వారు తమ పొలములో పండిన పంటతోనే తమ జీవితాన్ని హాయిగా సాగించుకొనేవారు. వారు వారి పొలములో చెరకు, ప్రత్తి, ధాన్యము, ఫలాలు, ఆకుకూరలు పండించుకొనేవారు. అంతేకాదు వారి పొలములో పండిన ప్రత్తితోనే వస్త్రం తయారు చేసుకొని ధరించేవారు. తన పొలములో పండిన చెరకుతోనే బెల్లం తయారుచేసుకొని తినేవారు. పొలములో పండిన అన్నాన్ని, తమ ఫలాలను, ఆకుకూరలను మాత్రమే ఆహారంగా ఆరగించేవారు.
చక్వవేణుడి భార్యకు ధరించడానికి ఆభరణాలు ఏమీ ఉండేవి కావు. కారణమేమంటే అతడు రాజ్యద్రవ్యాన్ని వినియోగించి ఆమెకు ఆభరణాలు ఏవీ చేయించేవాడు కాదు. వారి పొలంలో పండేపంట వారికి సాధారణమైన అన్నవస్త్రాదులతో కాలం గడపడానికే సరిపడుతూ ఉండేది. ఒక్క పొలం పనులకే కాక అతడు రాజ్యకార్యాలకోసం కూడా కాలాన్ని వినియోగిస్తూ ఉండేవాడు. అతని జీవనం సదాచారసంపదతో సాదాగా బ్రతికే ఒకరైతు జీవితాన్ని పోలి ఉండేది. ప్రతిదినము ఆరుగంటల కాలము నిద్రకుపోగా మిగిలిన కాలమంతా అతడు దేవుడిని పూజించడం, ఇతరులకు సహాయం చేయడం, రాజ్యం పనులు చూసుకోవడం, పొలం పనులు చేసుకోవడం వంటి వాటితో మునిగి తేలుతూ ఉండేవాడు.
అతనికి అన్ని జీవుల పట్లా సమానత్వ భావన ఉండేది. జంతువుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండేవి. అన్ని రకాల జీవులను, ప్రాణులను పరమాత్మ స్వరూపములుగా భావించేవాడు. అందరికీ సమాన ప్రేమాభిమానాలతో సేవలు చేసేవాడు. అయితే అతనికి ఏదైనా అవసరం అయితే ఎవరినీ అడిగేవాడు కాదు. తనమీద తాను ఆధారపడి కష్టపడి తనకు అవసరమైనది సంపాదించుకునేవాడు. సహజంగానే అతనిలో దీనిమీద వ్యామోహం ఉండేది కాదు. సేవకులచేత కాని, రాజ్య సంబంధమైన పనులు చేసే వారిచేత కాని తాను ఏ పనీ చేయించుకొనేవాడుకాడు. అతడు ఏ పని చేసినా ఆసక్తిని, అహంకారాన్ని విడిచిపెట్టి ఎంతో ఉత్సాహంతోను, ధైర్యంతోను వేస్తూ ఉండేవాడు.
ఇలా పురాణాలలో చూస్తే.. చక్వవేణుడు అనే ఓ గొప్ప రాజు ఉన్నాడు.....
.
Comments
Post a Comment