ప్రాంజలి ప్రభ..14/04***
🙏 శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం: అర్దకొండ/అరకొండ . 🙏
అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు..
డాక్టర్ ను చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు?. నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో వున్నాడు..... మీకు కొంచెం కూడా బాద్యత లేదా?"
డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను.... బయట వున్నాను ..... ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే, నేను నాకు సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.................. మరి ఇప్పుడు మీరు స్తిమిత పడి శాంతిస్తె ..... నేను సర్జరీకి వెళతా".
తండ్రి ఇంకా కోపంతో
‼️"శాంత పడాలా? నీ కొడుక్కే ఇలా జరిగివుంటే, నువ్వు శాంతంగా ఉండగలవా?"‼️
డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "నేను మన పవిత్ర వేదగ్రందాలలో వున్నది ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను....
'మనం మట్టి నుండే వచ్చాం ...మట్టిలోకే వెళ్ళిపోతాం... అది అంతా ఆ
‼️భగవంతుని మాయాలీలలు‼️' .......
డాక్టర్స్ ఎవరూ ఎవరి జీవిత కాలాన్ని పొడిగించలేరు.. వెళ్లి మీరు నీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్ధించండి........ నేను చెయ్యవలసింది చేసి ...మేము ప్రయత్నిస్తాము".
తండ్రి కోపంతో రగిలిపోతూ
‼️"మనది కానప్పుడు ... సలహాలు ఇవ్వటం చాలా తేలికే" గొణుకుంటున్నాడు‼️
డాక్టర్ కొన్ని గంటల తరువాత .... వచ్చి తండ్రితో
‼️"భగవంతునికి ధన్యవాదాలు‼️... మీ కొడుకు ఇప్పుడు క్షేమమే" .. "మేరు ఎమన్నా అడగా లని అనుకుంటే నర్స్ ని అడగండి" అని.....
ఆతండ్రి నుంచి సమాధానంకోసం ఆగ కుండా బయటకు చాలా వేగంగా
వెళ్ళిపోయాడు ....
తండ్రి:"ఈ డాక్టర్ ఎందుకు అంత కఠినాత్ముడు........
కొన్ని నిముషాలు ఆగివుంటే నేను నా కొడుకు గురించి సమాచారం ఇంకొంత
అడిగివుందేవాడిని కదా".
ఆయనకు మా గురించి
పట్టింపు లేదా ,తీరిక లేదా.... అంటూ నోటికి వచ్చిన వన్నీ అంటూనే ఉన్నా డు.
అంటూనే కామెంట్ చేస్తున్నాడు .......... అక్కడనే వున్న నర్స్ అది చూసి డాక్టర్ వెళ్ళిన కొన్ని నిముషాల తరువాత ...
నర్స్ కన్నీళ్ళతో ‼️"ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు‼️. మేము ఆయనకి సర్జరీ కోసం, ఫోన్ చేసినప్పుడు ...
‼️స్మశానం దగ్గర వున్నారు‼️.. మద్యలో వచ్చి ఆయన మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి, మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చెయ్యటానికి .... మళ్ళా స్మశానానికే వెళ్లారు"వైద్యో నారాయణో హరిః.
ఆ నర్సు యొక్క మాటలు విన్నాక ఆ తండ్రి తన మనసున ఎదుటి వారి యొక్క
పరిస్థితులు తెలుసుకోకుండా , అంచనా వేయకుండా వేరొకరి గురించి కోపగించుకోవడం ,
చెడుగా మాట్లాడడం , చెడుగా తలంచడం కూడా చేయకూడదని అప్పుడు కన్నీటితో నిండిన నయనాలతో కూడిన చేతులతో అక్కడే పరుండి పోయి, అదే పరిస్థితుల్లో మనమైతే చేయలేము కదా అని ఒకసారి ఆలోచించి, పాదాభివందనం చేసి వెళ్ళిపోయాడు.
జగద్గురు శ్రీఆది శంకరాచార్య విరచిత ” నిర్వాణ షట్కం ”
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
శివోహం శివోహం | శివోహం శివోహం | శివోహం శివోహం ||
1) మనో బుధ్యహంకార చిత్తాని నాహం|
న చ వ్యోమ భూమిర్-న తేజో న వాయుః|
2) అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః|
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ|
3) న మే ద్వేషరాగౌ న మే లోభమోహో|
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః|
4) న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం|
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా|
5) అహం నిర్వికల్పో నిరాకార రూపో|
న వా బంధనం నైవ ముక్తి న బంధః|
6) న మృత్యుర్-న శంకా న మే జాతి|
న బంధుర్-న మిత్రం గురుర్నైవ శిష్యః |
శివోహం శివోహం| శివోహం శివోహం| శివోహం శివోహం||
🕉🌞🌏🌙🌟🚩
(1 ) మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే! నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం!!
నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను,చిత్తమునూ కాను, నేను
కర్ణములనూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐననాసికనూ కాను,
నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ
కాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుదనైన శివుడనే,
శివుడనే.
కాను. నేను జ్ఞానేద్రియములైన త్వక్, చక్షు, శ్రోత్ర, (జిహ్వ)రసన, ఘ్రాణ ఇంద్రియములు అంటే చర్మము, కనులు, చెవులు,నాలుక, నాసిక(ముక్కునూ) కాను.అంటే ‘నాకోసం’ అని ఎవరి కోసం అయితే చర్మము ద్వారా, కనుల ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నానో ఆ అనుభవించేది నేను కాను. ఆ అనుభవము నాదీ కాదు. అంటే అనుభవించే వాడు వేరే, నేను కాదు. అంటే నాకోసం అని తుచ్చమైన ఆనందాలకు నేను లోను కానవసరం లేదు, కాకూడదు, అంటే నేనే కాదు ఎవరూ కూడా లోను కావలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి ద్వారా కలిగే ఆనందాలు క్షణికాలు కనుక!
పంచ జ్ఞానేంద్రియములు ఐన చెవులు, కనులు, చర్మము, జిహ్వ, నాసిక ఉద్భవించాయి.
వీటి ద్వారా ఈ జ్ఞానములు అనుభవం లోకి వస్తాయి కనుక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు.
2) నచ ప్రాణ సంజ్ఞో నవై పంచ వాయుర్నవా సప్త ధాతుర్నవా పంచ కోశః!
నేను ప్రాణ వాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు సంఘమును కాను,
సప్త ధాతువులైన రక్త, మాంస, మేథ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాను, నేను అన్నమయ,
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచ కోశములను కాను, నేను పంచ కర్మేంద్రియములైన వాక్కు, చేతులు, పాదములు, కామ ఇచ్చను తీర్చుకునే ఇంద్రియమును కాను, విసర్జక అవయవ ఇంద్రియమునూ కాను..చిదానంద రూపుదనైన శివుడనే, నేను శివుడనే!
(3)న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ!
నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు,మోహము లేదు, నాకు మదము
కానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేను
చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు యే పురుషార్ధములూ లేవు..ఎందుకనగా..నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కాను కనుక నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!
4)న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ! అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం!!
నాకు పుణ్యము లేదు, పాపమూ లేదు, సౌఖ్యము లేదు, దు:ఖము లేదు,మంత్రము, తీర్ధము,వేదము, యజ్ఞము, ఏవీ లేవు. నేను అనుభవమును కాను, అనుభవించుట యను
క్రియనూ కాను, అనుభవించే వాడినీ కాను, నేను చిదానంద రూపుడనైన శివుడను,
నేను శివుడను!
(5)న మృత్యుర్నశంకా నమే జాతి భేద: పితా నైవ మే నైవ మాతా చ జన్మ!
నాకు మృత్యువు లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జన్మ లేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేరు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! జనన మరణములు, జాతి భేదములు, తల్లి దండ్రులు, గురు శిష్యులు..ఏ బంధములు లేవు..ఎందుకనగా..నేను శివుడను కనుక..అన్ని బంధములకు, అనుబంధములకు అతీతుడను కనుక!
6)అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణామ్!
నేను నిర్వికల్పుడను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిరాకారుడను, ఎందుకంటే ఈ ఆకారం శాశ్వతం కాదు కనుక, అన్నింటికీ, అంతటా అన్ని ఇంద్రియములకూనేనే అధిపతిని, నాకు ధించినవి సంబంధించనివి ఏవీ లేవు, నాకు ముక్తి లేదు, బంధమూ లేదు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే!
మనో బుద్ధ్యాహంకార చిత్తాని నాహం.. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు విధములైన అంతః కరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది, అందలాలెక్కిస్తుంది, అధః పాతాళానికి తొక్కేస్తుంది. కనుకనే మనసే అన్నింటికీ కారణం, ప్రేరణం, ఉత్ప్రేరకం, వినాశకరం.
అందుకే ‘ మన ఏవ మనుష్యాణామ్ కారణం బంధ మోక్షయో:’ మనుషుల బంధాలకు, మోక్షానికి కారణం మనసే అన్నది ఒక ఉపనిషత్తు!
‘ద్వే శబ్దే బంధ మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బధ్యతే జంతు:
‘నాది’, ‘నాది కాదు’ అనే రెండు శబ్దాలే బంధానికీ, మోక్షానికీ కారణాలు, నాది అనుకుంటే బంధం, ఎందుకంటే నాది అనే దానితో మొదలై, నాది మాత్రమే, నాకు మాత్రమే, నాకు కాకున్నా పరవా లేదు ఎవరికీ కాకూడదు..నాది కాకున్నా పరవా లేదు, ఎవరిదీ కాకూడదు, ఎవరికీ చెందకూడదు..అనే దాకా దారి తీస్తుంది. ఆది వినాశనానికి దారి తీస్తుంది. ఈనాడు సమాజంలో జరుగుతున్న హింసకు, దౌర్జన్యానికీ అదే కారణం!
బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. మంచి, చెడులను గ్రహింప గలుగుతుంది. చిత్తము తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేలా చేస్తుంది.
అహంకారం మహదహంకారం(గొప్ప అంధకారం) మిధ్యాహంకారం (మిధ్యాన్ధకారం) అని రెండు రకాలుగా ఉన్నది. అహంకారం అంటేనే అంధ కారం. సృష్టికి మొదలు మహా అంధకారం వ్యాపించి వున్నది..ఏదీ తెలియని బ్రహ్మ దేవుడు తనకన్నా పరమాత్ముడు ఐన వాడిని ప్రార్ధిస్తే ఆ శ్రీ మహా విష్ణువు తన తేజః పుంజములతో దానిని తొలగించి కరుణిస్తే, అప్పుడు బ్రహ్మ తన సృష్టిని కొనసాగించాడు అని పురాణ గాధ.
నేను అనేది సాత్త్వికాహంకారం, నేను కూడా అనేది రాజసిక అహంకారం, నేను మాత్రమే అనేది తామసిక అహంకారం!
నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడి నుండి, ఎక్కడికి అనే అన్వేషణ సాత్త్వికమైనది, మనిషిని వున్నతుడిని చేస్తుంది. నేను కూడా అనేది రాజసికమైనది, నాకూ ఒక ఉనికి, ఒక సత్తా ఉంది అనే సాధనకు ఉపకరిస్తుంది..ఈ రెండూ మంచివే..అవసరమైనవే. నేను మాత్రమే, నాకు మాత్రమే, నాది మాత్రమే అనేది తామసికమైనది, ఆది కలిగివున్నవాడిని, వాడిద్వారా సర్వాన్నీ నాశనం చేస్తుంది. ఈ నాశనానికి చిత్తం బాటు వేస్తుంది, చిత్తం వచ్చినట్లు ప్రవర్తించడం ద్వారా, దానికి మనసు కారణమౌతుంది సరిగా వుపయోగించకుంటే, మనసే అన్నింటికీ కారణం కనుక దానిని బుద్ధికి స్వాధీనం చేసి, అప్పుడు బుద్ధి ద్వారా కలిగిన విచక్షణతో మంచి చెడులను తెలిసికొని, మంచిని గ్రహించి, చెడును విసర్జించాలి కనుక బుద్ధి పరమాత్మ తత్త్వం. ఉపనిషత్తులు అన్నీ ఇదే చెప్పాయి.
ఆత్మానగుం రధినం విద్ధి శరీరం రధమేవతు బుద్ధించ సారధిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ,
ఇన్ద్రియాణి హయాన్యాహు: తేషాం విషయ గోచరాన్, అత్మెంద్రియ మనో యుక్తం భోక్తేత్యాహు
ర్మనీషిణః .. అన్నది ఒక ఉపనిషత్తు.
అంటే శరీరమే రధము. ఆత్మ అంటే పరమాత్మ స్వరూపి
ఐన జీవాత్మ రధికుడు. అంటే రధాన్ని ఎక్కే వాడు. బుద్ధి సారధి. అంటే పరమాత్మ రూపకమైన
బుద్ధి ఈ రధాన్ని నడిపితే, గుర్రములవంటి ఇంద్రియములను మనసు అనే కళ్ళెం తో అదుపు
చేస్తూ, పరమాత్ముడి సారధ్యంలో, సర్వం ఆయనకే అప్పగించి, నమ్మి,కూర్చుంటే రధాన్ని
క్షేమంగా గమ్యానికి నడుపుతాడు, కనుక మనసు అనే కళ్ళెమును కూడా సారధి ఐన
పరమాత్ముడికి అప్పగించాలి.
అంటే మనసును పరమాత్ముని యందు లగ్నం చేయాలి. ఆత్మ,
ఇంద్రియాలు, మనసు కలిగిన వాడిని భోక్త అంటారు, డానికి బుద్ధిని కూడా జోడిస్తే ఆ భోక్తృత్వ
భావన నశిస్తుంది. అప్పుడు నేను చేస్తున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అనే భావన
నశిస్తుంది. అప్పుడు సుఖ దు:ఖాలూ, రాగ ద్వేషాలు, బంధ మోక్షాలూ, మంచీ చెడూ, ఇలాంటి
ద్వంద్వాలు నశిస్తాయి. శివమే అంటే శాంతమే, సౌఖ్యమే, ఆనందమే మిగులుతుంది..కనుక
శివోహం..శివోహం!
బుద్ధికి అప్పజెప్పి ప్రయాణం చేస్తే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రి యాలూ దారి తప్పవు, మంచి కర్మలే
మిగులుతాయి, మంచి జ్ఞానమే మిగులుతుంది అప్పుడు శివుడౌ తాడు మానవుడు, కనుక ఇంతా
కలిగిన శివుడనే నేను!
సప్త ధాతువులు, పంచ ప్రాణాలు, పంచ కోశాలు, బంధాలు, భవ బంధాలు, అనుబంధాలు,సంబంధాలు
అన్నీ నేను దేహం అనుకుంటే అవి గెలుస్తాయి, నేను దేహమును కాను ఎందుకంటే దేహం శాశ్వతం కాదు
కనుక, అని తెలిసికొంటే దేహం నశిస్తుంది, ఆత్మ రహిస్తుంది ఆత్మ మిగులుతుంది, ఆ ఆత్మ పరమాత్మ తత్
త్వం కనుక, జీవం ఉన్నంత కాలం జివునితో వుండి తరువాత దేవునితో కలిసిపోతుంది కనుక, దానికి మరణం
లేదు, కనుక ఆది శాశ్వతం.ఈ జ్ఞానం కలిగితే దేహం ద్వారా వచ్చే ఏ మంచి చెడు..సుఖ దు;ఖాలు..మొదలైన ద్వంద్వాలున్డవు కనుక అప్పుడు మిగిలేది పరమానందమే కనుక నేను శివుడను, నేను శివుడనే! మనసును బుద్ధి ద్వారా నియమించుకుని కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించి, కర్మేన్ద్రియములను, జ్ఞానేన్ద్రియములను, ప్రాణ వాయువులను, సప్త ధాతువులను,పంచ మహా భూతాలను, పంచ కోశాలను జయించి అంటే ఇవన్నీ జయించడం ద్వారా మిగిలిన పరమానందమును అనుభవించడం ద్వారా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడనే నేను!
యద్వాచా నాభ్యు దితం యేన వాగభ్యుధ్యతే ….
యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం ….
యత్ చక్షుసా న పశ్యతి యేన చక్షూగుమ్సి పశ్యతి….
యత్ శ్రోత్రే ణ న శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం…
యత్ ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణాః ప్రణీయతే…
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే ….
ఏది వాక్కుల ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా వాక్కు పలుకడం జరుగుతుందో, ఏది మనసు ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా మనసు దేనినైనా తెలిసికొన గలుగుతుందో, ఏది కనుల ద్వారా చూడ బడ జాలదో, దేని ద్వారా కనులు చూడ గలుగుతాయో, ఏది చెవుల ద్వారా వినబడ జాలదో దేని ద్వారా చెవులు విన గలుగుతాయో, ఏది ప్రాణములచేత జీవింపదో, దేని ద్వారా ప్రాణములు జీవింప గలుగుతాయో అదియే బ్రహ్మము..వేరేది ఏదీ కాదు..అని చెప్పింది ఉపనిషత్తు. రెండు పెదవులు, ముప్పై రెండు పళ్ళూ, నాలుక, కొండ నాలుక వున్న వాళ్ళు కూడా పలుక లేని వారు వున్నారు, మూగ వాళ్ళు, అంటే వీటన్నింటికీ పలుకును ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ఆది లేక పోతే ఇవన్నీ వున్న వాళ్ళు కూడా పలుకలేరు కదా, కళ్ళు, కను బొమలు, కను గుడ్లు అన్నీ సరిగా వున్నా చూపు లేని వాళ్ళు గుడ్డి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నింటికీ చూపును ఇచ్చే శక్తి ఒకటి వేరేది వున్నది, అలాగే చెవులున్నా, కర్ణభేరి వున్నా మిగిలినవి అన్నీ సరిగా వున్నా వినలేని చెవిటి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నిటికీ విన గలిగిన శక్తిని ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ప్రాణములు వున్నప్పుడూ తెలియబడనిది, అదేదో తెలియనిది ఐన ఏది లేకుంటే ప్రాణములు లేకుండా పోతాయో దాని వల్లనే ప్రాణములున్నట్లు, జీవం వున్నట్లు కనిపిస్తుందో…అదియే బ్రహ్మము..అంటే కేవలం పైకి కనిపించే నోరు, కళ్ళు, చెవులు,ఇవన్నీ సరిగా వున్నా అవి పని చేయకుండ పోతాయి, అంటే వీటికి శక్తినిచ్చే శక్తి ఒకటి ఉంది కదా..అదే బ్రహ్మం.
అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం
తథా అరసం నిత్య మగంధ వచ్చయత్
అనాద్యనంతం మహతః పరం ధృవం
నిచాయ్య తన్మ్రుత్యు ముఖాత్ప్ర ముచ్యతే..
అన్నది ఉపనిషత్తు ఇదే భావాన్ని తెలియ జేస్తూ..ఈ జ్ఞానం కలిగినప్పుడు మృత్యువు లేకుండా పోతుంది, పుట్టుకే శాశ్వతం కాదు అని తెలిస్తే మృత్యువూ శాశ్వతం కాదు
అని తెలుస్తుంది కనుక మృత్యువు వుండదు, ఇదంతా అశాశ్వతం అని తెలుస్తుంది కనుక ఇవన్నీ పోయేవే అని తెలుస్తుంది కనుక భయం వుండదు, ఆ భయమే మృత్యువు, ఆ బలహీనతే మృత్యువు, తెలిసికొన్న ఆ శాశ్వత సత్యం, ఆ శక్తి అదే జీవం, ఎందుకంటే దానికి చావు అంతం అనేది లేదు కనుక, ఇదే భావాన్ని స్వామి వివేకానంద చెప్పింది! ఇక్కడ చావు వుండదు అంటే పుట్టుకా శాశ్వతం కాదు, చావూ శాశ్వతం కాదు, అవి సహజ ధర్మాలు,అనివార్యాలు అని తెలియడం వలన క
లిగే జ్ఞానం వలన కలిగే ఆనందం వలన మృత్యు భీతి వుండదు కనుక మృత్యు భావం వుండదు కనుక మృత్యువు వుండదు అని అర్థం, అంతే కానీ ఈ జ్ఞానం కలిగిన వాడు శారీరకంగా చిరంజీవి అని కాదు, శరీరానికే మృత్యువు, ఆత్మకు కాదు అని తెలిసికొనడం వలన కలిగే చావు లేని ఆత్మ జ్ఞానం అని అర్థం!..ఎందుకంటే ఆ ఆత్మకు చావు లేదు కనుక..ఇదే భగవధ్గీత లో శ్రీ కృష్ణుడు అర్జునునితో చెప్పింది!
***
(పాద్యం), కూర్చోవడానికి కుర్చీ (ఆసనము) ఇలా వివిధ సత్కారములతో ఆదరించడం మన సాంప్రదాయం.
అలాకే కోర్కెల సాధనకు (ముక్తి అనేది కూడా ఒక కోరికయే) పరమాత్మను పంచోపచారములతోను లేదా షోడశోపచారములతోను ఆరాధిస్తాము. కాని జగన్మాత శ్రేష్ఠమైన దేవత గనుక అరువది నాలుకు ఉపచారములతోను ఆరాధిస్తాము. ఈ ఉపచారములతో పరమేశ్వరి అనుగ్రహం పొందడం జరుగుతుంది.
పరమేశ్వరి అరువది నాలుగు ఉపచారములతో ఆరాధింపబడుతుంది గనుక చతుష్షష్ట్యుపచారాఢ్యా యని అనబడినది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం చతుష్షష్ట్యుపచారాఢ్యాయై నమః అని అనవలెను.
*తల్లి సాత్వికురాలైనా పిల్లలు ఆవేశపరులౌతున్నారు ఎందుకు...?*
ఇది మన సనాతన ధర్మం చెబుతున్నది..
మనవారు దీన్ని ఎప్పుడో మరిచారు .
వంటచేయడం వడ్డించడం ఒక వరం..
అయితే అది ఇప్పుడు ఒక కళగా మారింది..
వంట ఇల్లు ఒక దేవాలయం..
పొయ్యి వెలిగించడం అంటే అగ్ని హోత్రం వెలిగించడమే.. అది భక్తిగా.. భగవంతుని తలుస్తూ నేను చేయ బోయే పదార్థాలు
మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలి తీర్చి ఆరోగ్యం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ చేయాలి అని పెద్దలు చెబుతారు..
అందుకే మన పూర్వీకులు ఏదో ఒక పారాయణం చేస్తూ వంట చేసే వారు..
(నేను గణేశ పంచకం , హనుమాన్ చాలీసా చదువుతాను ఇవి రెండూ చదివే లోపల నా వంట అయిపోతుంది. )
వంట చేసిన వారి మనస్థితి తిన్నవారిపై కూడా ప్రభావం చూపుతుంది అంటారు..
దీనికి అమ్మ చెప్పిన ఒక కథ కూడా ఉంది..
ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు..
అతను మహా నిష్టాగరిష్ఠుడు.. అతనింట్లో దేవతార్చన , అతని కుల వృత్తి తప్ప అతనికి
ఏం తెలియదు..
ఒక రోజు ఆ ఊరి జమీందారు గారు
ఈ బ్రాహ్మణుడిని తమ ఇంటికి భోజనానికి పిలిచారు..
పాపం ఎప్పటి లాగే ఆయన భోజనానికి వెళ్ళారు..
ఏనాడు లేనిది ఆరోజు ఆయనకు తాను భోంచేస్తున్న అరిటాకు పక్కన పెట్టిన వెండి గ్లాసు మీదకు మనసు పోయింది..
భోంచేస్తున్నాడన్న మాటే కానీ చూపు గ్లాసు మీదే ఉంది..
చివరకు భోజనం చేయడం పూర్తి అయ్యింది..
చేయికడుక్కోవడానికి గ్లాస్ తీసుకుని వెళ్ళి చేయి కడుక్కుని ఆ గ్లాస్ ని తన చేతి సంచీలో వేసుకున్నాడు..
ఆ తరువాత జమీందారు గారు ఇచ్చిన దక్షిణ తాంబూలాదులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు .
కాళ్ళు కడుక్కని లోపలికి వెళ్ళి కూచున్నాక
భార్య ఇచ్చిన దాహం పుచ్చుకున్న వెంటనే అతను స్ప్రుహ లోకి వచ్చాడు..
తాను చేసినది దొంతనం అని తనను ఎవరో ఛెళ్ళున కొట్టినట్టు అయ్యింది..
వెంటనే చేతి సంచీ భుజాన వేసుకుని భార్యతో కూడా చెప్పకుండా పరుగు పరుగున జమిందారు గారింటికి వెళ్ళాడు..
ఇప్పుడే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన బ్రాహ్మణుడిని ఆశ్చర్యంగా చూస్తున్న జమీందరుని చూసి
" అయ్యా మీ ఇంట్లో వండిన పదార్థాలకు కావలసిన వస్తువులను కరగాయలతో సహా ఎలా సేకరించారు. మీ వంట మనిషేమయినా మారారా? వేరే వంటవారు వచ్చారా?" అని అడిగాడు..
ఆయన భార్యను పిలిచి అడిగాడు .
"అవునండి నెలరోజులయ్యింది "అని చెప్పింది.
"ఆర్యా! ఏం జరిగింది? " అనడిగిన జమీందారుకు
"అయ్యా! ఎన్నడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం చేసాను.. నాకు ఎందుకు ఆబుద్ధి పట్టిందో తెలీదు. ఇంటికి వెళ్ళి నాభార్య చేతి మంచి నీరు తాగాక నేను స్ప్రుహలోకి వచ్చి జరిగిన తప్పు తెలుసుకుని వచ్చాను.. "
"మీ వంట మనిషి మీ ఇంట దొంగతనం చేస్తున్నదేమో గ్రహించండి.. అటువంటి మనిషి చేతి వంట తిన్న నా బుద్ధి వక్రీకరించింది." అని చెప్పడంతో
వారు వంట మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో ఆమె తప్పు ఒప్పుకుని వంట సరుకులను కూరగాయలను తన ఇంటికి దొంగతనంగా చేర వేస్తుండడం ఒప్పుకుంది..
వెంటనే వారు ఆమెను పని నుండి బహిష్కరించారు.
బ్రాహ్మణుడు తాను దొంగిలించిన వస్తువును వారికి తిరిగి ఇచ్చి క్షమించ మని అనడిగి తిరిగి ఇంటికి వెళ్ళాడు.
వంట చేసే వారి ప్రభావం వారి మీద ఎంత ఉంటుందో తెలుసుకోవాలి..
అతిథి దేవో భవ అన్నారు..
ఏదో అలా వంట చేసి అందమైన టేబుల్ మీద అందమైన పాత్రలలో సర్దడం కాదు . నేల మీద అరిటాకులో వడ్డించినా మంచి మనసుతో వండి వడ్డించడం అవసరం..
అలాగే చాలా మంది ఇంట్లో ఎంగిళ్ళకు ప్రాధాన్యత ఇవ్వరు. తిన్న కంచంలో మిగిలినది కూడా వంటలో కలపడం , తింటున్న కుడిచేత్తో మారు వడ్డించుకోడం..
ఒకరి పళ్ళెంలో నుండి ఒకరు తీసుకుని తినడం ఫ్రిజ్ లో బాటిల్ ని నోటికి కరిచి పెట్టుకుని తాగడం ఇలా చాలా ఉంటాయి..
నేను కళ్ళతో చూసాను..
వచ్చే వారు నిష్టాగరిష్టులైతే వారికి ఎంగిలి పెట్టిన పాపం ఊరికే పోదు..
అందుకే నియమంతో ఉండే వారు ఎవరూ
వేరే వారి ఇంట్లో వేరేవారి చేతిమీద వీలైనంతవరకు తినకపోవడమే మంచింది..
నేడు రోడ్డు మీద ఎవరు వండినదో తినడం ఎక్కువయ్యింది అందుకే ఇంత గందర గోళం..
అందుకే తల్లి సాత్వికురాలైనా పిల్లలు ఆవేశ పరులవుతున్నారు..
అది గమనించుకుని పిల్లలను పెంచండి..
*****************************
నేటి నా పాట పాట సంఖ్య:-597.
**†**************************
రచన:- మహేష్ వూటుకూరి ✍️
9640713717.
దోర్నాల..
ప్రకాశం జిల్లా.
04/04/2023.
****************
పాట సందర్భంపై నా విశ్లేషణ.:-
****************************
ఇద్దరి మద్య ప్రేమ పుట్టడం సహజం కాని ఆ ప్రేమికుల మద్య పరిపూర్ణ మైన అవగాహన నమ్మకం సంపూర్ణంగా ఉన్న వారి ప్రేమ అచంచలమైన ఆత్మవిశ్వాసం తో ఎలా రోజులతో మమేకమై ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తు అనుభూతుల సంగమంలో అంబరమంటే ఆనందాలను పొందారో ఈ ప్రేముకుల నవ రాగపు జీవనమే ఈ పాట.
************************************************
పల్లవి:-
********
మాలోన ఒకటే మాట
వందల సార్లు ప్రేమంటు
అదే పనిగా జపించేనులే
ముద్దులే పొద్దులై పొడిచేనులే
సంతసం సముద్రమంతగా
అనుభూతుల అలలై సాగేనులే...
మాత్రోవ ఒకటే బాట
ఆనందాల పూల తోటనే చేరెనులే
మురిపాల పరిమళాలు ఆస్వాదించినాములే
అంతే పనిగా ఎంతగానో తపించినా మనసు
పదే పదే ప్రేమించెనే ప్రేమంటు
హద్దులు లేని ఆనందం వెల్లి విరిసేనులే.!!
మాలోన ఒకటే మాట
వందల సార్లు ప్రేమంటు
అదే పనిగా జపించేనులే.!!
చరణం:-
**********
మా రెండు హృదయాలు
పలికెనే ఇష్టంగా ప్రేమ ప్రేమంటు
అదే మా ప్రేమ పంటగా
మా కనుల పంటగా
బంగారు మూటగా
నీ రాక అరుదెంచేరా
మా రెండు మూడు గా
ముచ్చటాయెనే కాలం ఒడిలో నీతో ఇలాగా..!!
మూడు రాకతో మురిపాలు కురిసెనులే
ఏడేడు జన్మల బంధాలు ఒకటై నర్తించెనులే
కాలమంతా సంతోషమాయనులే
నాలుగు దిక్కులై నవ్వులే పంచెనులే..!!
పల్లవి:-
********
మాలోన ఒకటే మాట వందల సార్లు అదే పనిగా ప్రేమంటు
చరణం:-
********
పంచభూతాల సహకారమే
పంచుకున్న ప్రేమ బంధం
ఆరు గాలం పంటలా
ఏడురంగుల ఇంద్ర ధనస్సు గా మెరిసేనులే ..!!
అష్ట లక్ష్ముల ఆగమనమై
అష్టైశ్వర్యాలు సిద్దించేనులే
నవరాత్రుల శోభ ఇంటిలో వెలుగై
కంటి నిండుగా నిలిచేనులే...!!
మా లోగిలంతా నవరాగం పాడెనులే
నవ్వులే పచ్చ తోరణాలు కట్టేనులే!!
దశ దిశల నీ కీర్తి పున్నమల్లే పాకి
పారిజాతమల్లే పూయాలిలే..!!
పల్లవి:-
********
మాలోన ఒకటే మాట వందల సార్లు ప్రేమంటు
చరణం:-
********
ఏకాదశి రోజునే నీ జననం
పరవశించేనురా మా నాన్నే మరలా వచ్చింనతగా
సంబరమాయే హృదయానా
సంతోషమంటే ఏంటో చూపించినావురా కన్నా..!!
ద్వాదశ రాశుల ఆశీస్సులు అందుకున్నావురా
పన్నెండు పుష్కరాల చూసిన అనందం పంచినావురా..
చాలు చాలు ఇక జీవితం ఇంతకంటే ఇంకేమి ఆనందముంటుందిరా..!!
శత వసంతాలు లోకానికి నవ్వులు పంచాలిరా
శతమానం భవతని దీవెనెలు అందుకోవాలిరా
ముక్కోటి దేవతలు దీవించాలిరా
మూడు కాలాలు నిను చూసీ మురిసిపోవాలిరా.!!
పల్లవి:-
******
మాలోన ఒకటే మాట
వందల సార్లు ప్రేమంటు..!!
**************************

Comments
Post a Comment