*స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది...........!!
కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
--> భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
స్నేహితులంటే ఇలా ఉండాలి. చిత్రగ్రీవుడు, హిరణ్యకులే అసలు సిసలు స్నేహితులుఅనుకున్నాడు లఘు పతనకుడు. హిరణ్యకునితో స్నేహం చేయాలనుకున్నాడు. చాటు నుండి తప్పుకుని, హిరణ్యకుని కలుగుదగ్గరకు చేరుకున్నాడు.‘‘హిరణ్యకా’’ పిలిచాడు.మళ్ళీ తనని పిలుస్తున్నది ఎవరా? అని సాలోచనగా చూశాడు హిరణ్యకుడు.‘‘నువ్వు మామూలు వాడివి కాదు. మహానుభావుడివి. ఇందాక జరిగిందంతా నేను చూశాను. చిత్రగ్రీవుడికి నీలాంటి స్నేహితుడు ఉండడం అతని అదృష్టం. నాక్కూడా నీతో స్నేహం చేయాలని ఉంది. నీతో తిరగాలని ఉంది. మనిద్దరి స్నేహం కూడా ముందు తరాలకి ముచ్చటగా ఉండాలి. రా! బయటికి రా! మాట్లాడుకుందాం’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘అసలు ఎవరు నువ్వు’’ కలుగులోంచే ప్రశ్నించాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు జవాబు చెప్పబోయేంతలోనే మళ్ళీ ఇలా అన్నాడతడు.‘‘నువ్వెవరో తెలీదు. నీ రూపు రేఖలేంటో తెలీదు. తెలియని వారితో స్నేహం చేయడం ఎలా’’పాపం! భయపడుతున్నాడనుకుని, సన్నగా నవ్వుకుని ఇలా అన్నాడు లఘుపతనకుడు.‘‘నేనో కాకిని. నా పేరు లఘుపతనకుడు’’కాకి అన్న మాట వినిపించగానే హిరణ్యకుని గుండెలు జారిపోయాయి. కాకితో స్నేహమా? కలలో మాటనుకున్నాడతను.‘‘అమ్మో! నీతో స్నేహమా? జరగని పని. మీ కాకి జాతి పనేమిటి? మా ఎలుక జాతిని పట్టి, చంపి తినడం. మీతో స్నేహం అంటే కోరి చావును కొని తెచ్చుకోవడమే! వద్దు! నీకూ నాకూ స్నేహం కుదరదు. వెళ్ళిక్కణ్నుంచి’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘అది కాదు, నేను చెప్పేది విను.
ముందు బయటికి రా.’’‘‘చచ్చినా రాను. బయటికి వస్తే నన్ను పొడుచుకుని తింటావు. సమాన వియ్యం సమాన కయ్యం అంటారు. అలాగే స్నేహం కూడా సమానులతోనే చెయ్యాలి. నువ్వూ నేనూ ఏ రకంగానూ సమానులం కాము. అందుకని ఎందుకొచ్చిన గొడవ, మనిద్దరికీ స్నేహం కుదరదుగానీ వెళ్ళిక్కణ్నుంచి’’ అన్నాడు హిరణ్యకుడు.లఘుపతనకుడు కదిలిన శబ్దం వినరాలేదు. దాంతో మళ్ళీ ఇలా అన్నాడు.‘‘తారతమ్యాలు తెలుసుకోక వెనకటికి ఓ జింక, నక్కతో స్నేహం చేసింది. చేసి, ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆ కథ నీకు తెలుసు కదా’’‘‘తెలీదు’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘అయితే విను, చెబుతాను’’ అంటూ కథ చెప్ప సాగాడు హిరణ్యకుడు.జింక-నక్క కథఅనగనగా మగధదేశం. ఆ దేశంలో ఓ అడవి. దాని పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఓ జింకా, ఓ కాకీ ఉండేవి. ఉండేవంటే మామూలుగా ఉండడం కాదు, స్నేహంగా ఉండేవి. జింక అంటే కాకికి ఇష్టం. కాకి అంటే జింకకి ఇష్టం. దాంతో చెట్ట పట్టాలేసుకుని తిరిగేవవి. అడవి అంతా పచ్చపచ్చగా ఉండేది. జింకకి కావలిసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అందమైన అడవి. ఆరోగ్యంగా ఉంది. ఇకనేం! ఎక్కడ పడితే అక్కడికి చె ంగు చెంగున గెంతుకుంటూ వెళ్ళేది జింక. అదలా గెంతుకుంటూ వెళ్తోంటే దాన్ని ఓ నక్క చూసింది. ఆహా! జింక అంటే ఇది కదా! ఎంత చక్కగా బలిసి ఉందో! తింటే మహా రుచిగా ఉంటుంది. తినాలి దీన్ని. తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించాలనుకుని, జింక చెంతకు చేరిందది.
శుభోదయం
ఫలము మా చేతిలో లేదు. కేవలం కర్మ మాత్రమే మా చేతిలో ఉంది అని అర్ధం చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు వారు ఆయన ఏ ఫలం ఇస్తాడో దానితో సంతృప్తిగా వుంటారు.
కొందరు మనుషులు కర్మలు దోషపూరితమైనవి, అందుకని వాటిని వదలి పెట్టాలి అని అంటారు. ఆకర్మ స్థితిని పొందండి. కర్మని చేయనే చేయకండి. మీరు ఎలాంటి కర్మని చేయవలసిన అవసరం లేని స్థితిని చేరుకున్న నాడు, ముక్తిని పొందుతారు అంటారు. మరో రకమైన వారు, యజ్ఞము, దానము, తపస్సుతో కూడిన కర్మలు త్యాగము చేసే యోగ్యతని కలిగినవి కావు అంటారు.
తపస్సుతో కూడిన కర్మలు అంటే సమతుల్యతని తీసుకువచ్చేవి అని అర్ధం. వీటి వలన జీవితం సమతుల్యం అవుతుంది. ఒక అపరాధం చేశారు, కొంచెం సేవ చేయండి. ఎవరినో తిట్టారు, క్షమాపణలు చెప్పండి.
ఏది స్వయం కోసం కాక, సమిష్టి కోసం చేయబడుతుందో, అది యజ్ఞము. యజ్ఞం అనేది ఒక సమిష్టి కర్మ. అందులో మీది, నాది అంటూ వ్యక్తిగత ఆకాంక్షలు ఏమీ ఉండవు. అందుకనే యజ్ఞము, దానము, తపస్సులతో కూడిన కర్మలు త్యాగానికి యోగ్యమైనవి కావు.
--(())--
*విద్యాజీవితం నిర్విఘ్నంగా సాగడానికి ‘సరస్వతీ నమస్తుభ్యం’ అని ప్రార్థిస్తాం. మరి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో విలసిల్లడానికి ‘అరుంధతీ నమస్తుభ్యం’ అనుకోవాలి. మాటల్లోనే కాదు బాటలోనూ అరుంధతిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె పంచమహా పతివ్రతల్లో ఒకరు.*
*ఇంతకీ అరుంధతి ఎవరు? ఏమి ఆమె పెళ్లికథ? అంటే బోలెడు విషయాలు ఉన్నాయి. యాగకర్త మేధాతిథి అరుంధతిని పెంచి పెద్ద చేసి వసిష్టుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అరుంధతి వసిష్టుడికి దార. తార. వసిష్టుడితో అరుంధతి అంటే తారతో తార. అరుంధతిని దర్శించుకుంటే దంపతులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయన్నది అనాదిగా ఉన్న అఖండమైన విశ్వాసం. దంపతులు అన్యోన్యంగా ఉండి చక్కటి సంతానా న్ని పొంది వాళ్లు సమాజానికి మేలు చేయాలన్నదే గా అందరి ఆకాంక్ష. విశ్వామిత్రుడి శాపకారణంగా వసిష్టుడు తల్లడిల్లిపోతాడు. వసిష్టుడు బతుకు మీద విరక్తితో చనిపోవడానికి కాళ్లుచేతులను తానే కట్టేసుకుని *నదిలోకి దూకుతాడు. వసిష్టుడు చనిపోవడాన్ని ఏమాత్రం సహించలేని నదీమతల్లి ఆయనను కాపాడుతుంది. కానీ వసిష్టుడు జీవచ్ఛ వంలా అయిపోయాడు. అప్పుడు అర్ధాంగి అయిన అరుంధతి తన పతి దేవుణ్ని కంటికి రెప్పలా చూసుకుంది. జీవితభాగస్వామి ఎలా ఉండాలో కళ్లకు కట్టేట్టు చూపించింది. ఇది ఆదర్శం కదా! అరుంధతి దర్శనం వల్ల సమకూరే ప్రయోజనం అంతేనా? కాదు కాదు ఆరోగ్య ప్రయోజనం కూడా ఉందంటారు. అరుంధతీ నక్షత్రాన్ని దర్శించుకుంటే కంటికి ఉన్న చూపు పెరుగుతుందట. నిశిత దృష్టి కలుగుతుందట! ఎన్నో సంప్రదాయాల్లో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉంటాయి. వాటిని నిగ్గు దేల్చుకుని ఆచరించుకుంటే జీవితం సార్థకమవుతుంది. అదేగా కావల్సింది*
(((()))))
--! ! --
. నమ్మకాన్ని కలిగించే ధ్యానం 🌹
‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
ఒకవేళ నమ్మకం మీకు కష్టమనిపిస్తే మీరు మీ గత జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్లాలి. ఆ జ్ఞాపకాలన్నీ పరమ చెత్త. మీ మనసు వాటితో నిండి బరువెక్కి పోయింది. దానిని శుభ్రం చేయాలంటే ముందు ఆ చెత్త బరువును దించుకోవాలి.
అందుకు మీరు పతిరోజు రాత్రి మీ గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎంత చిన్న నాటి పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే జరిగిన అనేక విషయాలను మన చైతన్యంలోకి ప్రవేశించకుండా మనం దాచేస్తూ ఉంటాం.
వాటిని మీ చైతన్యంలోకి ప్రవేశించనివ్వండి. అలా ప్రతిరోజు దానిపైన దృష్టి పెట్టి ఒక గంట ధ్యానం చెయ్యండి. అలా చేస్తున్నపుడు మీరు చాలా లోతుల్లోకి మీజ్ఞాపకాల లోతుల్లోకి వెళ్తున్నట్టు మీకు చాల ఆస్పష్టంగా తెలుస్తుంది. ఆ క్రమంలో మీరు నాలుగైదేళ్లు వయసులో ఉన్నపుడు జరిగిన విషయాలు మీకు జ్ఞాపకమొస్తాయి.
అంతకు మించి మీరు ముందుకు వెళ్లలేరు. ఐనా మీప్రయత్నాన్ని ఆపకుండా, మీ సాధనను కొనసాగిస్తే మీ రెండేళ్ల ప్రాయంలో జరిగిన విషయాలు గుర్తుస్తాయి. ఆ సాధనలో తల్లి గర్భంలో ఉన్నప్పటి జ్ఞాపకాలు తెలుసుకొన్నవారు, ఇంతకన్నా ముందుకెళ్లి గత జన్మలో ఎప్పుడు ఎక్కడ ఎలా మరణించారో తెలుసుకొన్న వారు కూడా ఉన్నారు. తల్లి గర్భం నుంచి ఎంత కష్టపడి మీరు బయటపడ్డారో తెలుసుకోగలిగితే ఆ జ్ఞాపకం నుంచి మీరు బయటపడుతారు.
ఎందుకంటే దానిని మీరు దాదాపు పునర్జన్మగా భావిస్తారు. శిశువు పుట్టిన వెంటనే కొన్ని క్షణాలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరియై ఏడుస్తారు. అపుడే ఆ శిశువుకు అన్ని దారులు తెరుచుకుంటాయి. ఊపిరాడడం, ప్రారంభమవుతుంది. సాధనలో మీరు కూడా ఆ స్థితికి చేరుకోవచ్చు. అపుడు మీరు కూడా ఆ శిశువులా ముందుకు వెళ్లడం, వెనక్కి రావడం చేస్తూ ఉండాలి.
అపుడు ప్రతిరోజు మీ మనసులోని గత జ్ఞాపకాల బరువు తగ్గడం, దాని స్థానంలో నమ్మకం చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా మూడు నుంచి తొమ్మిది నెలల కాలంలో మనసు పరిశుద్ధమై మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఇలా మీ జ్ఞాపకాలను మీరు తెలుసుకోగలిగితే వాటి నుంచి మీరు బయటపడుతారు.
చైతన్య రాహిత్యం మీకు బానిసత్వాన్ని సృష్టిస్తుంది. అవగాహన, మిమ్మల్ని ఆ బానిసత్వం నుంచి బయటపడేలా చేస్తుంది. అపుడే నమ్మకం కలిగేందుకు అవకాశముంటుంది.
***
**
. 'సద్గతిప్రదా'
సద్గతిని ప్రసాదించునది శ్రీదేవి అని అర్థము.
సత్యమునకు దారి చూపుట శ్రీదేవి ఆశయము. దానిని ప్రసాదించుట ఆమె అనుగ్రహము. సత్యమును చేరుటయే జీవుల గమ్యము. జన్మ పరంపర లన్నియూ జీవులను సత్యము వైపునకే నడిపించును. రకరకముల అనుభవములను పొందుచూ, సమగ్రత్వము చెందుచూ, జీవుడు పరిణామమున ముందుకు సాగుచు నుండును.
నిరుపమానమైన ఓర్పుతో ప్రేమతో కరుణతో శ్రీదేవి జన్మ పరంపరల నొసగుచూ జీవులను సద్గతివైపు నడిపించు చుండును. “జీవులు దేనిని అభిలషించుచునైననూ చివరకు నన్నే చేరుచున్నారు. దేని నన్వేషించు వారైననూ నన్ను గూర్చియే అన్వేషించు చున్నారు. వారి ఆనందాన్వేషణము నన్ను చేరుటకే.” ఇట్లు చేరుటకు దేహము లావశ్యకములు.
జన్మ పరంపర లావశ్యకము. ప్రకృతి రూపమున శ్రీదేవి ఇట్టి జన్మల ననుగ్రహించుచూ అనుభవమును, అనుభూతిని కలిగించుచూ జీవులను సత్యము వైపునకు నిరంతరము నడిపించుచునే యున్నది. అజ్ఞానవశులైన వారు కూడ సత్యపథముననే నడుచు చున్నారని తెలియుట సమగ్ర జ్ఞానము. అనుభవ లేమియే అజ్ఞానము కాని అది దుష్టత్వము కాదు.
అజ్ఞాని, జ్ఞాని కూడ వారి వారి అనుభవముల ననుసరించుచూ క్రమముగ దైవమును చేరుటయే సృష్టి కథ. మాతృభావము కలిగినవారే తెలిసిన వారిని, తెలియని వారిని కూడా ఒకే ప్రేమతో నడిపింతురు. అట్టి కరుణామయి శ్రీదేవి అని తెలియవలెను.
***
***
***
విలేఖరి:
సార్ మీది ఏ కులం????
నేను: ఏ వయస్సు లో...
విలేఖరి :
అంటే వయస్సు బట్టి
కులం వుంటుందా???
నేను: వుంటుంది బాల్యంలో బాలకులం యవ్వనంలో యువకులం వృద్ధాప్యంలో పండుటాకులం
రాలిపోయే ఎండుటాకులం విలేఖరి:
అది కాదు మామూలుగా మీది ఏ కులం???
నేను: ఎవరూ లేకుంటే ఏకాకులం ప్రేమలో వున్నప్పుడుప్రేమికులం పెళ్లి అయ్యాక సంసారికులం
కానప్పుడు బ్రహ్మచారికులం విలేఖరి:
అది కాదండీ కమ్మ కాపు ఆలా మీది ఏ కులం
నేను : ధనముంటే దనికులం లేకుంటే బీదకులం దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం నమ్మకుంటే నాస్తికులం
విలేఖరి:
మీకు ఆసలు కులం లేదా????
నేను:
ఎందుకు లేదు ప్రయాణిస్తే ప్రయాణికులం యాత్రలు చేస్తే యాత్రికులం మాయలు చేస్తే మాంత్రికులం ఉపన్యసిస్తే ఉపన్యాసకులం హాస్యం పండిస్తే విధూషకులం పాడితే గాయకులం
సభలో ఉంటే సభికులం సినిమా హాల్లొ ప్రేక్షకులం టీవీ ల ముందు వీక్షకులం
విలేఖరి:
మీరు ఎక్కడ చదివారు????
నేను: చదివింది గురుకులం అభ్యసిస్తే అభ్యాసకులం బోధిస్తే బోధకులం వృత్తిరీత్యా అధ్యాపకులం
పత్రికల పాఠకులం నేర్పించే శిక్షకులం
విలేఖరి:
అసలు మీరు ఎవరండీ ఇలా చంపుతున్నారు????
నేను:
నాగరికత నేర్పిన నాగరికులం జాతకాలునమ్మేఅమాయకులం మూఢత్వంపోని మూర్ఖులం
విలేఖరి:
అసలు మీ వయస్సు ఎంతండి బాబు????
నేను:
కొందరికి పూర్వీకులం మరికొందరికి సమకాలికులం ప్రస్తుత వర్తమానికులం
విలేఖరి:
అసలు మీది ఏ దేశం???
నేను:
భరత జాతి వంశీకులం భావి భారత రథసారథికులం...
విలేఖరి:
మీకు దణ్ణం రా బాబు ఇంకెప్పుడు ఎవరిని మీది ఏ కులం అని మాత్రం అడగను...
***
శ్రీ ఆది శంకరాచార్య విరచితం
శ్రీ గురు అష్టకము
“నిజమైన గురువుకి సమానమైనదానిని మూడులోకాలలోను చెప్పలేము. పరుసవేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కాని ఇంకొక పరుసవేదిగా మార్చదు. కాని ఒక గురువు తన్ను నమ్మి శరణుజొచ్చిన శిష్యుడిని తనంతటివాడిని చేస్తాడు. కాబట్టి గురువు అసమానుడు. అల్ప బుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చెయ్యగలడు గురువు.
జగద్గురువులైన ఆదిశంకరులు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు. వారు ఒకచోట అడుగుతారు, “ఎన్ని ఉన్నా, మనస్సు గురు పాదములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం?” అని.వారి రచించిఅన్ ‘గురు అష్టకం’లో ప్రతి చోట అడుగుతారు. ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?అని. ఎనిమిది శ్లోకములలోను దీన్ని మకుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు.
శ్రీశంకర భగవత్పాదులు రచించిన గురు అష్టకం శిష్యునికి ఉండాల్సిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శిష్యుడికి ఉండాల్సింది గురువు మీద నమ్మకం, విశ్వాసం. మనకు ఎవరిమీద ఐతే గురి కలుగుతుందో వారే గురువు. లోకంలో నిషిద్ధ గురువులు కూడా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం అంటే బురదపాము నోట్లో ఉన్న కప్పవంటి జీవితం అవుతుంది.
***
ఛాయారూపం కధ
“మీ భార్య గారిని లేపు!” ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది। “మీరు నన్ను చూడాలంటే, తెల్లారగట్ల నాలుగు గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి గుంటూరు వచ్చెయ్యండి!” ఛాయామాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది।
“నాన్నా! నాన్నా! చచ్చి పొయ్యాడు !” నా గొంతులోంచి వెలువడ్డ భయార్తస్వరం। నాభార్యను వెంటనే లేపేసింది। వెక్కివెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త చెప్పాను।
“అదంతా నీ భ్రమ; దాన్నేం పట్టించుకోకు,” అన్నారు । కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో ।
“మీ నాన్న ఆరోగ్యం దివ్యంగా ఉంది। చెడ్డకబురు ఏమైనా వస్తే రేపు బయల్దేరి వెళ్దాం లే!” “ఇప్పుడు బయల్దేరకపోతే, తరవాత మిమ్మల్ని మీరు క్షమించుకో లేరు।” నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికించింది, “నేనూ మిమ్మల్ని ఎన్నడూ క్షమించను!”
విషాదపూర్ణమైన ఆ ఉదయం, స్పష్టమైన కబురు తెచ్చింది: “నాన్నకు జబ్బుచేసి ప్రమాదస్థితిలో ఉంది; వెంటనే వచ్చెయ్యండి।” మాకు మతి చెడిపోయింది। ఇద్దరం బయలుదేరాం। దారిలో బండి మారేచోట ఒక ఊళ్ళో మా మామయ్యల్లో ఒకాయన మమ్మల్ని కలుసుకున్నాడు। భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మావేపు వస్తుంది। మొదట చిన్నగా కనిపించినదే రానురాను పెద్దదవుతూ వచ్చింది। మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా, చటుక్కున రైలుపట్టాల కడ్డంగా పడిపోవాలని పించింది। అప్పుడే నాన్నకు దూరమై పోయినందువల్ల, నాన్న లేని ప్రపంచాన్ని భరించలేననిపించింది।
ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు, నాన్న ఒక్కరు అన్నంతగా ప్రేమించాను నేను। చిన్నతనంలో నా కెదురైన చిన్నచిన్న బాధలన్నిటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకొన్న నాన్న నల్లటి కళ్ళే ఇంకా గుర్తున్నాయి ।
“నాన్న ఇంకా బతిఉన్నడా !” మామయ్యని, ఈ ఒక్క చివరి ప్రశ్న అడగడంకోసం ఆగాను।
నా ముఖంలో ఉన్న నిరాశని అర్థంచేసుకోడానికి అట్టేసేపు పట్ట లేదాయనకి। “లేకేం? బతికే ఉన్నాడు !” అన్నారు। కాని ఆయన మాట, ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను।
మేము గుంటూరు లో మా ఇంటికి చేరడం, దిగ్ర్భాంతి కలిగించే మృత్యు వైచిత్ర్యాన్ని దర్శించడానికే అయింది। నేను కుప్పలా కూలి పోయాను; ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడింది।
నాన్న గారు అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి, నీవు ఎవరిని యాచించకు, రెక్కలుమించి శ్రమపడకు, ఉన్న దానిలో తృప్తి పడుట నేర్చుకో, కాలంతో నడవటాన్ని నేర్చుకో, నాగురించి ఆలోచించకు నీగురించి కాక నీ బిడ్డల గురించి ఆలోచించు, రేపో మాపో రాలిపోయే ఈ కాయం,ఆ హనుమంతుడి నీకు దారిచూపుతాడు, ధారియమే నీ ఆయుదం'
వేదాలలోఅన్నిటికన్నా ఆఖరులో భూమి ఉద్భవించింది। భూమి నుండి ఓషధులు, ఓషధుల నుంచి అన్నము వచ్చింది। ఇదంతా లోకేశ్వరి అయిన జగన్మాత సంకల్పం మాత్రమే। అందుకే ఆ పరమేశ్వరి సంకల్పం మాత్రాన ఆహారం వచ్చింది కనుక ఆ తల్లిని అన్నదా అని స్తుతించుచున్నాము। వర్షాలకోసం యజ్ఞాలు చేస్తాము। హోమగుండంలో అగ్నిలో ఆదిత్యునికిచ్చిన ఆహూతుల వలన వేడి, ఆ వేడి ఆదిత్యుని ప్రకాశము పెరిగి, నదులు, సముద్రమల లోని నీరు ఆవిరై, మేఘాలై, వానగా కురిసి, మరల వాగులు, వంకలు, నదులు, జలాశయములు జలకళను సంతరించుకుని కాయధాన్యాలు, గింజధాన్యాలు, కూరగాయలు, పళ్ళు వివిధరకములైన ఆహారోత్పత్తులు జరిగి జీవులకు ఆహారం (అన్నము) లభిస్తుంది। ఇదంతా ఆ అఖిలాండేశ్వరి సంకల్పము మాత్రమే। అందుకే ఆ జగన్మాతను అన్నదా అని భజించుతాము।
మిరపకాయ అన్నం ఒకడు తింటే, పంచభక్ష్య పరమాన్నములు మరొకడు తింటాడు। మత్స్యమాంసాదులు ఒకడు తింటే ఆకులలమలు వేరొక జీవితింటుంది। ఏది తిన్నా, ఎంత తిన్నా ఆ జీవి యొక్క పూర్వ జన్మ కర్మలఫలంగా జన్మ ఎత్తడం, ఆ జన్మలో, ఆ జీవికి ఉండే ఆహార నియమాల ననుసరించి ఆహారం తీసుకోవడం జరుగుతుంది। ఏదైనా ఆకలి తీరడం కోసమే। ఇదంతా ఆ పరమేశ్వరి సంకల్పము వలననే। అందుకే ఆ పరమేశ్వరిని అన్నదా అని ప్రార్థించుచున్నాము।
మనం తక్కువ పూజ చేస్తే ఎక్కువ ఫలం లభించదు। అలాగే జీవియొక్క అవసరాలననుసరించి ఆ జగన్మాత ఆహారం ఇస్తుంది కనుక ఆ తల్లిని అన్నదా అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నాము। అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అన్నదాయై నమః అని అనవలెను।
101. వృషభము - వాక్కు
ప్రతి అణువు పరిణామములో ఒక సూర్యమండలము కాగలదు. ప్రతి జీవుడును అటులనే పరిణామ క్రమమున అనగా పరమపదము చేరుకొను మార్గమున ఒక బ్రహ్మాండ శరీరమును ధరించగలడు. నిజమునకు విశ్వమంతయు ఏకాక్షరము నుండి ఉద్భవించినదియే కదా! పరమపదము నుండి ఉద్భవించిన వాక్కు ఈ సమస్త విశ్వ నిర్మాణమునకు ఆధారమై నిలచియున్నది. దీనినే దివ్యసం ని కూడ నిర్వచింతురు.
దీని పంచాంగములే పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములు మరియు కర్మేంద్రియములు. పై తెలుపబడిన నాలుగు పంచకములను వాక్కుయే అధిష్ఠించి యుండును. దీనినే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులని తెలుపుదరు. పంచాంగముగ నేర్పడిన సృష్టికి అధిష్టాన దేవత సరస్వతి లేక వాక్కుయే. ప్రవహించునది కావున సరస్వతి యనిరి. వాక్కును వృషభముగ కూడ పేర్కొనిరి.
మనయందు ఈ వృషభము కంఠధ్వని రూపమున వ్యక్తమగుచున్నది. కంఠధ్వనిని సమర్థవంతముగ, శ్రావ్యముగ, పవిత్రముగ నిర్వర్తించుకొనువారు తమ జీవనమును పునర్ నిర్మాణమును చేసుకొనగలరు.
సశేషం...
102*. స్వేచ్ఛకు దారి చైతన్యమే. నిర్భయులుగా మారండి
మీలో దాగి ఉన్న శక్తిలో మీకు తెలిసింది చాలా తక్కువ. అవధుల్లేని సముద్రంలా విస్తరించిన అనంతమైన శక్తి, దివ్యత్వాలు, మీకు ఆధారంగా ఉన్నాయి.
. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’
తప్పించుకోవాలనే భావన మీలో ఎప్పుడు కలిగినా, వెంటనే ఎక్కడికి పారిపోకుండా మొండిగా అక్కడే ఉండి దానితో శక్తి వంచన లేకుండా పోరాడండి. అలా ప్రతిదానికి వ్యతిరేకంగా నెలరోజులు చెయ్యగలిగితే ఆ రెండిండినీ పోరాడడం, పారిపోవడాలను - ఎలా వదిలించుకోవాలో మీకు అర్థమవుతుంది. అవి రెండు తప్పే.
ఒక తప్పు మీ లోతుల్లోకి బాగా చొచ్చుకుపోయింది. దానిని మరొక దానితో సమతౌల్యం చెయ్యాలి. అప్పుడే మనిషి నిర్భయుడవుతాడు. కనుక ఏ విషయంలోనైనా మీరు నెలరోజుల పాటు ఒక యోధుడుగా ఉండండి. అపుడు మీరు నిజంగా చాలా చక్కని అనుభూతిని పొందుతారు.
తప్పించుకుని పారిపోయేవారిని ఎవరైనా నీచంగా భావిస్తారు. ఎందుకంటే అది పిరికిపందలు చేసే పని. కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకోండి. అప్పుడే పోరాడడం, పారిపోవడాలను వదిలించు కోగలుగుతారు.
ఎందుకంటే, ధైర్యంగా ఉండడమనేది కూడా మీలోని పిరికితనానికి చిహ్నమే. కాబట్టి ధైర్యం, పిరికి తనాలు మాయమైన వెంటనే ఎవరైనా నిర్భయులవుతారు. కావాలంటే మీరు కూడా ప్రయత్నించి చూడండి.
***
smalla story Pranjali prabha
106 *కష్ట సుఖాలు - నవగ్రహాలు*
ఆచారాలు, నమ్మకాలు మతానికి చెందినవి. ఈ పుస్తకం వేదాంత ప్రాతిపదిక మీద రాయబడింది. వేదాంతంలో నవగ్రహాలు, జ్యోతిషం, వాస్తు, రత్నధారణ, శని పూజ లాంటి వాటికి చోటులేదు.
కాబట్టి అలాంటి అంశాలని ఈ పుస్తకం కర్మ సిద్ధాంత పరిధిలోనే సమర్ధిస్తుంది. వాటి మీద గౌరవం గలవారు దయచేసి ఈ పాయింట్‌నే గమనించగలరు.
మనకి ప్రాప్తించే కష్టనష్టాలన్నిటికీ నవగ్రహాల ప్రమేయం వుందని చాలామంది నమ్ముతూంటారు. ముఖ్యంగా శనిగ్రహం ఇలాంటి నిందకి గురవుతూంటాడు.
కొన్ని కొన్ని గ్రహాలు మంచి రాశిలో వున్నప్పుడు పుట్టినవారికి సుఖాలు అధికంగా వస్తాయని, అవి నీచ స్థానంలో వున్నప్పుడు జన్మిస్తే కష్టాలు వస్తాయని అనుకుంటారు. నిజానికి ఇది నిజాన్ని తలకిందులుగా అర్ధం చేసుకోవడం అవుతుంది.
***
107..పరికరాలు మరియు సూత్రాలు .
అన్ని మతాలు ప్రాథమికంగా మేల్కొలుపు పద్ధతులు తప్ప మరేమీ కాదు. కానీ సిద్ధాంతాల వల్ల అన్ని మతాలు దారి తప్పాయి. ఆ సిద్ధాంతాలు ముఖ్యమైనవి కావు; ఆ సిద్ధాంతాలు పద్ధతులకు ఆధారాలు తప్ప మరేమీ కాదు. అవి ఏకపక్షంగా ఉన్నాయి. 🕉
కొన్ని మతాలు ఒకే జీవితాన్ని నమ్ముతాయి. ఈ నమ్మకం ప్రజలకు అవగాహన కల్పించే పరికరం. మీరు ఆశ్చర్య పోతారు, ఎందుకంటే సాధారణంగా ఇది ఒక సూత్రం అని మేము భావిస్తున్నాము. ఇది ఒక సూత్రం కాదు; ఇది కేవలం ఆలోచనను బలవంతంగా ఇంటికి పంపే పరికరం. ఇది సుత్తి మార్గం: 'అనవసరమైన విషయాలలో సమయాన్ని కోల్పోకండి. అధికారం, డబ్బు, పలుకుబడిని వెంబడించకండి, ఎందుకంటే మీకు ఒకే జీవితం ఉంది. మృత్యువు వస్తోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి …
నీతి కథ
తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.
రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు మృత్యువు వచ్చింది మరియు మృత్యువుకు సవాలు విసిరాడు
"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీత మాత యొక్క సమాచారం ప్రభు" శ్రీరాముడి"కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువు తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది.
మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. ఇది కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.
కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వుతున్నారు!
ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో, జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.
అక్కడ మహాభారతంలో, భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?
అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా అయింది. కాని భీష్మపితామహుడు చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!
జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడి లో ప్రాణ త్యాగం చేసాదు.
జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు ఏడుస్తున్నాడు.ఇంత తేడా ఎందుకు?
ఇంతటి తేడా ఏమిటంటే, ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. అడ్డుకోలేకపోయాడు!
దుశ్శాసనుడుకు ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడి కి అవకాశం ఇచ్చాడు కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూవున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.
దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.
జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!
ఇతరులుకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో, వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు .
"నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు ."
"సత్యమేవ జయతే "
సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చిన్నకధలు
సీక్రెట్ డాక్ట్రిన్
ప్రాంజలి ప్రభ - ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చిన్నకధలు
ప్రాంజలి ప్రభ - ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ చిన్నకధలు విగ్రహారాధనలో అంతరార్థం! ఉత్తమం సహజావస్థా ద్వితీయం ధ్యానధారణా తృతీయాప్రతిమా పూజా హోమయాత్రాచతుర్థికా – శివపురాణం అంటే, భగవంతుని తనలో ప్రత్యక్షం (ఆత్మదర్శనం)చేసుకోవడం ఉత్తమమయినది. భగవంతుని గురించిన జ్ఞానము, ధారణ దాని తరువాతవి. మూడవది భగవంతుని ప్రతిమలను పూజించడం. నాలుగవది పుణ్యక్షేత్రాలను దర్శించడం. చివరి రెండూ సామాన్య భక్తుల కోసం ఉద్దేశించినవి. పరామాత్మ అనుగ్రహం పొందడానికి విగ్రహారాధన ఒక మెట్టు వంటిది. అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాః పరికల్పితాః – ధర్మనోపనిషత్ సామాన్యులకు నిర్గుణాకారుడైన ఆ పరబ్రహ్మోపాసనార్థమై మొదటి మెట్టుగా విగ్రహారాధన కల్పించబడినది.ఈ విధంగా ఏర్పడిన విగ్రహారాధన డవార్యదోర్వీర్యంబుఆ మోక్షాన్ని పొందవచ్చు. దీనికి భక్తి ప్రధానం. భక్త్యా వీణా బ్రహ్మజ్ఞానం న కదా చిదపి జాయతే – మహానారాయణోపనిషత్ పరిపూర్ణమైన భక్తి లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని (ఆత్మజ్ఞానాన్ని) ఏవిధంగానూ పొందలేము. ఆత్మజ్ఞానాన్ని పొందటానికి సాధనంగా వారికి ఇష్టమైన దైవ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి. అలా పూజించటం పరబ్రహ్మను పూజించినట్లే అవుతుంది. భక్తులు తఇష్టమైన మకు దేవతావిగ్రహాన్ని నిల్పుకుని ఆ విగ్రహమే ‘పరబ్రహ్మగా’ తలచి, నిశ్చలభక్తితో, శ్రద్ధాశక్తులతో, పరిపూర్ణవిశ్వాసంతో నిరంతరం పూజించితే తప్పనిసరిగా ‘ఆత్మజ్ఞానం’ పొందుతారు. ప్రాంజలి ప్రభ - ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ చిన్నకధలు విగ్రహారాధన ద్వారా మనస్సుని నిశ్చల పరుచుకుని, (మనోనిగ్రహాన్ని పొంది) ఆ తదుపరి ‘నిర్గుణోపాసన’ ఆచరించవచ్చు. అంతేగాని, మనోనిగ్రహాన్ని పొందకుండా నిర్గుణోపాసన ద్వారా ‘ఆత్మజ్ఞానాన్ని’ తెలుసుకోవాలనుకోవటం హాస్యాస్పదం. మనస్సుని అంటే పంచేంద్రియాలను, కామ, క్రోధాది అరిషడ్వర్గములను జయించనివాడు ‘నిర్గుణోపాసన’కు అర్హుడు కాదు. భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో “విగ్రహారాధన” చేసేవారు “పరబ్రహ్మ”ను ఆరాధించి నట్లే అవుతుందని, వీరే పరమ భాగవతోత్తములని శ్రుతులు తెలుపుతున్నాయి. విగ్రహారాధన చేయకుండానే “పరబ్రహ్మను” ఆరాధించవచ్చు. దీనినే ‘నిర్గుణోపాసన’ అంటారు. కాని నిర్గుణోపాసన సామాన్యులకు సాద్యం కానిది. ఎందువలనంటే మన ఎదుట నిలుపుకున్న ‘దైవవిగ్రహము’ మీదనే, మన దృష్టిని, మనస్సుని తదేకంగా నిలపటం కష్టము. అటువంటప్పుడు నిరాకారుడైన ఆ “పరబ్రహ్మ” పై మన మనస్సుని ఎలా నిలుపగలం. సామాన్యులకు అది సాధ్యం కాని విషయం. మానవునికి క్షణకాలంలోనే అనేక సంకల్పాలు శరపరంపరలుగా కలుగుతుంటాయి. అటువంటి విపరీత చంచల స్వభావమైన మనస్సును కదలక నిశ్చలంగా ఉండేటట్లు చేయడం చాల కష్టం. కాబట్టి మనస్సును “విగ్రహారాధన” అనే ప్రక్రియలో నిశ్చలపరచి, “మనోనిగ్రహాన్ని” పొందటం అత్యంతావశ్యకం. కాబట్టి, మనస్సుని నిగ్రహించి, ‘ఆత్మ జ్ఞానాన్ని’ పొందటానికి లేక ‘పరబ్రహ్మతత్త్వాన్ని’ తెలుసుకోవటానికి ‘విగ్రహారాధన’ యే మిక్కిలి ప్రయోజనకారిగా ఉంది. సర్వవ్యాప్తుడై సర్వభూతాలలో చిద్రూపుడైన ‘పరమాత్మ’ స్వరూపాలకు శిలా, మృత్తిక, దారుకలతో, కళావిన్యాస ప్రక్రియలతో విగ్రహాలుగా తయారు చేసి, ఆ దేవతామూర్తులను మంత్ర తంత్ర సంస్కారములచే ఆవాహన చేసి, ప్రతిష్టించి, వర్ణ, రూప నామములతో మంత్ర, తంత్ర యంత్ర విధులతో సామాన్యులైన భక్తులు పూజించి, భగవదనుగ్రహాన్ని పొందటం శాస్త్ర సంబంధమై ఉంది. దుర్లభో మానుశోదేహః దేహీనాం క్షణభంగురః తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనమః జీవులలో మానవజన్మదుర్లభమైనది. కాని, క్షణ భంగురమైనది. కావున ఆ కొద్ది దుర్లభమైన “దైవ సాక్షాత్కారా”నికి వినియోగించుకోవలెను. ఇది ఉత్తమం. భగవదారాధన పూర్వకమైన విగ్రహారాధన కేవలం వైదికమైన పరలోకప్రాప్తికే కాక శారీరక, మానసికశాక్తులను పెంచుకోవడానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. శాస్త్రాలలో అవ్యక్తమని చెప్పబడుతున్న ‘పరమాత్మ’ను ఆరాదిన్చాదానికిగల మార్గాలలో సులభమైంది ఈ ‘విగ్రహారాధన’. ప్రాంజలి ప్రభ - ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ చిన్నకధలు భగవంతుడు సర్వవ్యాపి. ఆ స్వామి అన్నింటా వ్యాపించి ఉన్నాడు. కనుక మనం పూజించే విగ్రహంలో కూడ ఎందుకు లేదు? తప్పక ఉన్నాడు. అందుకే మనకు విగ్రహాన్ని చూడగానే భక్త్యావేశం కలిగి పరవశులం అవుతుంటాం! ఆ విగ్రహరూపం ముందు మన గోడును చెప్పుకుని సేదతీరుతుంటాం విగ్రహారాధనకు ఆసక్తి, నమ్మకం చాలా ముఖ్యం. భక్తి, ప్రేమలు ప్రధానం. ఆడంబరాలతో చేసె విగ్రహారాధనలకు, అహంకారపూరితమైన భావావేశాలకు ‘పరమాత్మ’ గోచరింపడు. ప్రశాంత చిత్తంతో ఆరాధిస్తూ, నిష్కామంగా దృఢవిశ్వాసంతో ఆయనను ఆరాధిస్తే తప్పని సరిగా సాక్షాత్కరిస్తాడు. ఆయన భక్తజన పరాధీనుడు. విగ్రహమనగా విశేషంగా గ్రహించేది. అంటే భగవంతుని శక్తిని, గుణాలను, స్వరూపాన్ని పూర్తిచేసిగా తనలో ఇముడ్చుకొనగలిగినవే “దైవ విగ్రహాలు”. అవి దేనితో చేయబడినప్పటికీ కళావిన్యాస పూర్వకంగా ఉండి, మంత్రశక్తిచే శాస్త్రప్రకారం ప్రతిష్టించబడటం చేత, అవి “భగవంతుని” తత్త్వాన్ని ఆకర్షించుకుని, తమలో నిక్షిప్తపరచుకుని, ఆ శక్తితో అవి ప్రకాశిస్తుంటాయి. కాబట్టి వాటిని ‘అర్చామూర్తులు’ అని అన్నారు. భగవద్గీతలో ఉదాహరించిన ప్రకారం, ఉపాసింప వీలులేని భగవత్త్వమును సామాన్య భక్తులు ఉపాసించుటకు వీలుగా విగ్రహారాధన రూపొందింది. అందరికి అందుబాటులో ఉండి, సులభసాధ్యమైనది ఈ విగ్రహారాధన. సర్వాంతర్యామియైన భగవంతుడు కేవలం తపఃసంపన్నులను, యోగులకే చూడ సాధ్యమవుతాడు. ఆకారణంగా సామాన్యులకు ‘అర్చావతారవిగ్రహా’లే శరణ్యమవుతున్నాయి. ప్రాంజలి ప్రభ - ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ చిన్నకధలు విగ్రహాలలో భాగాచ్చక్తి నింపటానికి మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు సాధనములు ఉన్నాయి. భగవతత్వం ప్రప్రథమంగా శబ్దంచే గ్రహింపబడుతుంది. భగవద్రాహకమగు శబ్దమేది ఉందో, అదే ఆ దైవం యొక్క మంత్రంగా నిలుస్తోంది. నిత్యపూజాగృహములయందు పూజావిగ్రహాలు 4 అంగుళాలు మొదలు 12అంగుళాల వరకు ఉండాలి. పూజా ప్రతిమలు రత్నాలతో తయారైనవైతే అత్యుత్తమం. ఆ తరువాత బంగారం, వెండి, రాగి లోహాలతో విడివిడిగా గాని, ఈ లోహములన్నింటిలో కలిపి గాని (పంచలోహాలు) చేయుంచుకోవటం ఉత్తమం. రాయితో తయారైనవి మధ్యమం, చెక్కలతో తయారైనవి అధమం. దైవపటాలకన్నా విగ్రహాలు శ్రేష్ఠం. అందులోనూ పంచలోహాల విగ్రహాలు గాని, శిల, దారు, మృత్తికావిగ్రహాలు కాని, శక్త్యానుసారంగా ఉపయోగించుకోవచ్చు. దైవవిగ్రహాలు చూడటానికి ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, మనస్సుని ఆకట్టుకునే విధంగా, కళాత్మకంగా, సుందర మనోహరంగా తీర్చిదిద్దిఉండాలి. ఇంట్లో ఈశాన్యభాగంలోగాని, ఉత్తర, తూర్పుభాగాలలోగాని పూజామందిరాన్ని ఏర్పరచుకోవాలి. పూజామందిరంలో ఈశాన్య, తూర్పు, ఉత్తర భాగాలలో ఉన్నతమైన స్థలంలో గాని, ఎత్తైన పీఠంపైగాని పూజావిగ్రహాలను ప్రతిష్టించాలి. దైవవిగ్రహాలకు ఎదురుగా కూర్చుని పూజించరాదు. సగుణ జ్ఞానహీనస్య నహినిర్గుణ వేదనమ్ నందిదర్శన హీనస్య యథా న శివదర్శనమ్ ఎలాగైతే నంది దర్శనాన్ని చేయలేనివాడు శివదర్శనాన్ని చేయలేకపోతాడో, అలాగు సగుణజ్ఞానంలేనివానికి నిర్గుణజ్ఞానం సిద్ధించదు. పెద్దఆకారంతో గర్భగుడికి బైటనున్న నందీశ్వరుని చూడజలని అశక్తుడు చీకట్లో చిన్నదిగా ఉన్న శివలింగాన్ని ఎలా చూడగలడు? అని శివపూరానం చెబుతోంది. అందుకనే సగుణరూపంలో మనకోసం భూలోకానికి విచ్చేసి కొలువైన దైవాలను నియమనిష్ఠలతో పూజించి వారి ముందు మన లోరికలను ఉంచి వారి కరుణాకటాక్ష వీక్షణాలతో మన జన్మలను ధన్యం చేసుకుందాం. హిందూమతంలో పధానమయినది ఏకేశ్వరభావాన. ఏ దేవుని పూజించినా ఆ పూజలన్నీ ఏకేశ్వరునికే చెండుతాయన్నది ప్రతి ఒక్క హిందువు అపర నమ్మకం! |
| *** |
Comments
Post a Comment