**మల్లాప్రగడ రామకృష్ణ*

*చిన్నకథ* (1)

*సంసారంలో ఓపికతో ఆవేశం లేని లోకం*


మాటేరాని చిన్నది మనసే లేని, కళ్ళతో, మమతే చూపాలని, ఉబలాట బడుతున్నది.


స్వాతిచినుకుల సంధ్యవేళలో, లేత పడుచు ఊపుల చిలిపి ఆటలుగా, ఈగాలిలో స్వరాలు పాడుతూ,శృతి లయలు యేకము కొరకు ఊహలు ఉయ్యాల ఊపి చూపుతూ,


  *సంసారం* కోసం ఉబలాట పడుతున్నది.


కోకిల *ఓపిక* కోరిక గలగలలు, కూతల రసగీతికల కళకళ రావములు, ఆకాశ దీపాల మధ్య, వెన్నెల వెలుగుల తో నయగరాలు జాబిల్లి చూపులకు ఉబలా టబడుతున్నది.


లేత నవ్వులు జూపి, వయసు వయ్యరాలు జూపి, *ఆవేశం* లేని ప్రేమను పొందాలని ఆరాట పోరాట లేని అలాపన తో ఎదసొదలు తెలపాలని ఉబలాట పడుతున్నది.


*లోకం* తీరు యెలా నున్నా, కాలాలు మారుతున్నా, ప్రేమ జీవించే ఉంటుంది,

ప్రేమనుంచి తప్పించుకొనేవారు లేనేలేరు.


*మనిషిగా పుట్టటం, ముక్తి కలగాలనే కోరిక వుండటం, సమర్ధుడైన గురువు లభించడం*.

ఈ పైవాటి అన్నింటిలో మనకు రెండు శ్రమ పడకుండానే లభించాయి.

ఇక మనకు కావాల్సింది ముక్తి పొందాలనే కోరికను అలవర్చుకోవడం. ప్రేమ దక్కించుకోవడం సర్వసాధారణం ఆది నిలబెట్టుకోవడమే జీవితం.

ఇదే మన సహజమార్గ సాధన లక్ష్యం.

*సంసారంలో ఓపికతో ఆవేశం లేని లోకం*

****


గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి* 

* గురు ప్రార్ధన * చిన్న కథ (2)


 *శ్రీ మహావిష్ణువు యొక్క అంశయే  వ్యాస భగవానునిగా  అవతరించడం జరిగింది. వ్యాసభగవానుడు లక్ష శ్లోకాల మహా భారత  ఇతిహాసాన్ని మనకి అందించడమే కాకుండా పరమ పవిత్రమైన వేదములను,వేదాంగములను ,అష్టాదశ పురాణములను, సంస్కృత భాగవతం కూడా మానవాళి శ్రేయస్సుకి అందించారు.* *అందుకనే వ్యాస భగవానుల వారిని వేదవ్యాసుడు అని కూడా పిలుస్తారు. వ్యాసభగవానులవారు ఆషాఢ పౌర్ణమి నాడు  అవతరించారు. మహర్షు లలో వేద వ్యాసుల వారు  మహా అగ్రగణ్యులు. వారు ఒసగిన అత్యుత్తమ జ్ఞాన సంపద  వలననే వేద వ్యాసుల వారిని  సద్గురువుగాను, ఉత్తమ గురువు గాను  గురు పూర్ణిమ నాడు పూజించడం సత్సంప్రదాయముగా నిలిచిపోయింది. గురు పూర్ణిమ నాడు వ్యాసభగవానునితో పాటు,  త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయునకు,దక్షిణ మూర్తి వారిని, విఘ్నాధిపతి మరియు  సకల విద్యలకు ఒజ్జ అయిన  వినాయకునకు  పూజలు అర్పించడం సత్ సంప్రదాయము.*


*నాలుగు ముఖములు లేకున్నను  బ్రహ్మ అంతటివాడు అయిన,  రెండు చేతులే ఉన్నప్పటికీ  శ్రీ మహావిష్ణువు అంతటివాడును అయిన, నుదుటన మూడవ నేత్రము లేకున్నను  మహాశివుడు అంతటివాడు అయిన  వ్యాసభగవానునికి  అంజలి ఘటిస్తూ..*


 *శుభం భూయాత్.*


*.*** 

నేటి చిన్న కధ (3)


ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలంబతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది.


పేదలకు భూములు పంచిపెట్టేవాడు లేడు కానీ, వాటిని యివ్వనీకుండ చెడగొట్టగల

దిట్టలున్నారు. కరువుతో నీరులేక యెండిపోయిన గ్రామాల కడగండ్లు తుడిచేవారు లేరు.

గాని బాగా పంటలు పండినగ్రామాలకందరూ నాయకులే! పేదల్ని పట్టించుకోరు గాని

గొప్పవారి సిరిసంపదలను అందరూ పొగిడేవారే. తనభార్య అడ్డతిరుగుళ్లను పట్టించుకోరు

గాని పరస్త్రీల వ్యభిచారాన్ని గోరంతలు కొండంతలు చేసి చెబుతాడు. అసలు అలాంటివారికి పెత్తనమిచ్చిన మనుష్యులదే తప్పు.


ఈశ్వరా! ఎన్నాళ్లు బ్రతుకుతాను? చూడవలసినవన్నీ చూశాను. ఇంకేం చూడాలి? ఇంతకాలం, భార్యాపుత్రులను పోషించాను. ఇంకెంతకాలం పోషించగలను. నిన్నే నమ్మి సేవించే నాకు తురీయావస్థలోని (జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని జీవునికి మూడు అవస్థలుంటాయి. ఆ మూడింటినీ మించి నాలుగవ అవస్థ కూడా ఉంటుంది. దానిని తురీయమందురు. ఆ తురీయావస్థకు (అనగా ధ్యానసమాధికి) చేరుకొన్న యోగసిద్ధులు ఆత్మసాక్షాత్కారం పొంది ఆనందిస్తారు.) ఆ ఆనందము నాకెప్పుడు కలుగును. ఎంతకాలం ఈ నిరీక్షణలో గడిపినా ప్రయోజనం ఏం ఉన్నది? నన్ను నిరాశపరచక దయచూపి రక్షించు.


యిది రాయి యని మనుష్యులు చూడకుండా వెళ్లిపోతారు, అటేపోతున్న శిల్పి రాయిని అమ్మవారుగా చెక్కితే మనుష్యులు అమ్మలు గన్నమ్మా అంటూ వేడుకుంటారు. 


గురువుని కొందరు వీరికేమి వచ్చన్నా గురువుమాత్రము సర్వస్వం ధారపోసి విద్యార్థులకు ఉన్నత విద్య నేర్పుతారు. ఇదేనండి లోకం 

ముందు నువ్వేమిటో తెలుసుకో తర్వాత లోకం గూర్చి యాలోచించు 


మీ మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రాంజలి ప్రభ

***


శుభోదయం... చిన్న కథ (4)

మల్లప్రగడ రామకృష్ణ 


 నది సముద్రం వైపుకి పరిగెత్తుకుని వస్తుంది. దీపపు జ్వాల ఆకాశం దిశగా పైకి లేస్తుంది. అలా లేవాలి అనే ప్రయత్నం ఏదైనా అది చేస్తుందా? ఏ విధంగా నీరు ఒక గోతిలోనికి పోతుందో, అదే విధంగా ఎక్కడ గురుత్వము జనిoస్తుందో, అటువైపు అన్వేషణ చేస్తున్నవాడు ప్రయాణం చేసుకుంటూ పోతాడు. ఎవరు ఏదీ చేయరు. ఏ విధంగా అయస్కాంతము లాగేస్తుందో, అలా.


ధర్మం లో కర్తృత్వము అనే ప్రశ్న ఉండదు. గురువు అనే వాడు ఆకర్త. గురువు దగ్గర కూర్చోగా, కూర్చోగా ఏదో అవుతుంది. గురువు ఏదీ చేయడు. సత్సాంగము

 అంటే గురు శిష్యులిద్దరు కూర్చుని వుంటారు. వీళ్లిద్దరి మధ్య ఏదో ఘటిస్తుంది. అన్వేషించే వారు అన్వేషిస్తూ వుంటారు. ఇచ్చేవారు ఇస్తూ వుంటారు.


జనాలు ధ్యానం చేస్తున్నాము అంటారు. ధ్యానం చేయడం అనేది సరైన మాట కాదు. ధ్యానంలో ఉన్నాము అని అంటే చాలు. ఎప్పుడు ఆ చేయడం అంతా ఆగిపోతుందో అప్పుడు నీవు లోపల ఉంటావు. వ్యక్తి ధ్యానం లో ఉంటాడు. ధ్యానం చేయడం ఉండదు.


అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! *నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. తల్లి.. అంతా నీదయా.

--(())--


చిన్న కథ.. 9


మనం శివుని కుటుంబాన్ని ఆదర్శం గా తీసుకోవాలి.


 శివుని వాహనం - నంది ; మెడలో-  పాము

పార్వతి వాహనం -  సింహం 

 కుమారస్వామి వాహనం -  నెమలి

 వినాయకుని వాహనం -  ఎలుక 


ఒకసారి ఆలోచించినట్లయితే అన్ని విరోధ జీవులే .

నంది - సింహం

 నెమలి - పాము 

పాము - ఎలుక .

అయినను అవి అన్ని సఖ్యంగా నివసిస్తున్నాయి. కారణమేమనగా అవి యోగస్థితిలో ఉన్నవి. 

అట్లే మన కుటుంబంలో కూడా వివిధ మనస్తత్వాల వారు ఉన్నను, వారు యోగస్థితిలో ఉన్నచో మన మధ్య ఎటువంటి గొడవలు సంభవించవు. 

మరి యోగ స్థితిలో రావలెనన్న "ధ్యానం" రోజు తప్పక చేయవలసినదే.


శివలింగం పైన అభిషేకించిన ద్రవ్యములన్నీ కిందకు జారి పోయినట్లు, 

'నేను-నాది' అనుకునే ప్రతిదీ ఎప్పటికైనా జారిపోతాయని, ఏదీ శాశ్వతం కాదనే సత్యాన్ని గుర్తించడమే "అభిషేకం"లోని అంతరార్ధం.


చిత్రకారుడు గీసే ప్రతి గీతా బొమ్మకు పరిపుష్టం చేకూర్చేదే. 


జీవునికి సంభవించే ప్రతి సుఖదుఃఖానుభవం  తాను పరిపూర్ణం కావడానికి దోహదం చేసేదే.


'దాని'ని (Superior Power) మనం తెలుసుకోలేం. కానీ తెలియబడుతున్న సకలము దానివలననే తెలియబడుతున్నది ... అని తెలుసుకుంటే చాలు. 'దాని'ని మనం తెలుసుకున్నట్లే. 


ప్రత్యక్ష, పరోక్ష అనుభవములకు అతీతమైన అనుభవం 'అది'. కాబట్టి దానిని "అపరోక్షానుభవం" అన్నారు ఋషులు.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ