భగవద్గీత... 2

 శ్రీమద్ భగవద్గీత...సాంఖ్య యోగం.. రెండవ అధ్యాయం 


సంజయ వ్యాఖ్యానం 

మ.కరుణాసాగర పూర్ణిడై పొరలుచూ కన్నీరుకే బద్దుడున్ 

తరుణమ్మున్ మది బుద్దియే చెడియుటన్ తత్త్వమ్ము సాంఖ్యమ్ముగన్ 

పరి దుఃఖమ్మున పార్ధుడే గనుచునే పాఠ్యమ్ము వ్యాప్తంగయున్ 

చిరునవ్వుల్ గల చిద్విలాసిపలుకే చిన్మాయ రూపంబుగన్              (1)


శ్రీ భగవాన్ వాణి 

ఉ. కాలము కానికాలమున కానివి వాక్కులు యేలచెప్పగన్ 

ఏలను మోహమే కలిగి హెచ్చుగ తెల్పుచు యుండుటేలనున్

బాలుడవై నువే పలుకు బంధము యేలను నీకుయిప్పుడున్ 

జాలితొ గూడవే యశము జాడ్యము స్వర్గము లేకయుండుటన్          (2)


చం.పిరికితనమ్ము గావలదు నీకిదియేలనుపుట్టె పార్ధుడా 

సరియగుబోదు సాహసివి సామమువద్దుయనేది యేలణున్ 

తరుణముయుద్ధమేగతియు తప్పులు యెంచకచూడు యర్జునా 

ఇకరణమేను సేయుము బిగించుధనుస్సు నుపార్ధ యిప్పుడున్       (3)

 

శా. ద్రోణాచార్యులు భీష్మ పూజ్యులుగనే దోస్తుల్ మరెందారొ యు

ద్ధాన్యాయమ్మును జేయవచ్చినవిరో ధైర్యమ్ము గాజూపుచున్ 

బాణాలే యరిసూదనా విడువనే బంధుత్వ పూజ్యుళ్లు గన్            

ప్రాణాలే విడిచేద పాపముకదా ప్రాధాన్య వాక్కుళ్లు గన్                     (4 )


ఉ. చేయను యుద్దమున్ గురువు చంపుట దోషము బిచ్చ మెత్తెదన్ 

గాయము రక్తసిక్తమగు గమ్యపు రాజ్యము నాకు యేలనున్ 

ప్రాయము వీరులన్ హతము ప్రాభవ యుద్ధపు భోగమేలనున్ 

ధ్యేయము జీవమైనకళ దేహము భాదలు పట్టుటెందుకున్               (5 )


చం. ఎవరుజయింతు రోయెరుక యేలనుచెప్పగలమ్ము యిప్పుడున్    

ఎవరు భయాన యుందురొ సయోధ్యతగాను నె నష్ట మిప్పుడున్ 

ఎవరణ యాత్మసంభవులు యేలను యుద్ధముచేయ నేనుగన్

ఎవరని జంప జీవమగు యెంతయుచెప్ప జయమ్ము ప్రశ్నగన్         (6 ) 


చం. భయ గుణదోష మేమదిలొ బంధపు దోషుడనైతి చూడుమున్ 

నయవిధ ధర్మ మేయిదియు న్యాయముసత్యముగాను చెప్పితిన్

నయమగు సంధి యేదియన నాకునుతెల్పుమునీవు యిప్పుడున్ 

ప్రియమగువాదనేయగుటప్రీతిగ వాక్కులుగాను పార్థుడున్             (7 )


శా. ఈశోకాగ్నిదించుచూ మనసుగన్ ఈప్సిత్వ భావమ్ముగాఁ

నాశమ్మున్ గనుమాయిపాపసిరిగన్ రాజ్యాధి కారమ్ముగన్ 

ఆశించన్ యిసురాధిపత్యముగనే ప్రాప్తి౦చ నాకెందుకున్ 

ధీశోకంబుఁగతీ నుపాయముగనున్ దేహమ్ముగాఁ ధ్యేయమున్         (8 )


ఉ.ఈవిధమున్ మదీయకలలీ విధి మానస మెల్ల నిండగా         

నా విజయుండుపల్కెనిటు నాశయ యుత్సుక తోడఁ దెల్పగన్      

నే విడువంగ యుద్ధ మును నీరస మెచ్చగ సంగతించగన్,       

ఈ విపులమ్ములన్ దెలుప నింకను విల్లును ముట్ట లేననన్  (9 )


చం.గురువుల దీవెనల్, సహజ గొప్పలు నీవుగ శోకమేలనన్

విరివిగ బంధుజాలమిట విందుల, వేడ్కల మందహాసముల్  

తరతమ భేదముల్ విడువ ధర్మ నిబద్ధత నిల్చెనివ్విధిన్ 

శరణము నీవె యంచునిట సాకుల దెల్పగ కృష్ణు డంతటన్  (10)


శా.శోకం బాపెడి వాని బోధనలలో సూ త్రమ్ము పాటించ గన్

శోకించన్ సురజ్ఞానివోలె పలుకుల్సూ క్తుల్ ప్రబోధించగన్

శోకమ్ముల్ వచియించు గాథ లెరుగన్ సూత్రాల లక్ష్యమ్ము గన్

శోకించే విధిగా మనన్ వలదు వాక్సూరమ్ము నీతోడుగన్ (11)


మ.ఇక నేడే మన మొక్కటై పగఱ వేధించే సమూహమ్ము లన్,   

ఇక ముందే మనముండుచోటునిట ప్రాప్తించన్ సహాయమ్ములన్, 

ఇక నాత్మాంశములే సజీవముల ప్రావీణ్యంపు సారమ్ములన్, 

ఇకనీవూ మరి నేనుగాను కలసే యిష్టమ్ము ప్రశ్నే యగున్     (12)


ఉ.జీవుని జన్మ యాత్మ యగు చిత్రవిచిత్రము గానుపృథ్విపై 

పోవును బాల్య మీడులును పొందుగ జీవుని యాత్రలేయగున్ 

జీవన శైలిలో బ్రతుకు జీర్ణము దేహము లందు సాగగన్  

పోవును దేహమొక్కటిల పోరుల పాలయి వీరులైననున్     (13)


మ.విషయాలేభవ మొందగన్ వినయమే వేద్యంపు విశ్వాసమున్ 

విషయమ్ముల్ విధి రీతివేదనలుగా వేల్పుల్ సుసౌఖ్యమ్ములన్ 

విషయాలేమరి పుట్టుగిట్టుటలనే విన్యాస సత్యమ్ములన్ 

విషయమ్మే దన సర్వమున్ వితరణే వేదోక్త  సామ్యమ్ముగన్ (14)


ఉ.ధీరుల ముఖ్య చేష్టలన దివ్యసమాంతర రాజ్య కాంక్షలన్ 

నేరుగ సాగనీ పరమ నిర్మల క్షేత్రపు ధర్మ యుద్ధముల్  

వీరులు వ్యాకులమ్మగుచు విగ్రహ చేష్టలు దీప్తి చెందగన్ 

వారలు పోరునందుతగ వర్తన వేద్యపు భావనమ్ము లన్  (15)


మ.కనిపించే వినయమ్ము గమ్యమగుటే కాలమ్ము తీర్పేయగున్ 

తనువంతాస్థిరమై  సమమ్ములుగనే తత్త్వమ్ము శీతోష్ణముల్  

అనువౌ మార్పుల  వాస్తవాసరళి గా వాశ్చల్య వైనమ్ములన్ 

కననొక్కండును యుద్ధ వేత్తగనగా గాండీవ ధారేయనన్    (16)


చం.పరమ శివా యనంగ పద పాటవ మెంచగ నెవ్వ రైననున్,  

వెరగున వాధృ సంహతపు వేళలఁ జెప్పు సమర్ధతా తతుల్  

స్థిరమగువాని నాశనముచేయుట కారణమైన నేలనన్ 

తరణ విధమ్ము తెల్పగలదారుల నెంచగ బుద్ధి నేర్వగన్ (17)


శా.దేహమ్ముల్ స్థిరహీన మైన కదనా దీక్షత్వ నాశమ్ముగన్ 

మోహమ్ముల్ స్థిరహీనమై  వివిధమున్ మోక్షమ్ము వెంటాడగన్ 

దాహమ్ముల్  స్థిరముండకన్ సమరమే దాసాను దాస్యమ్ముగన్ 

దేహాత్మా స్థిరమున్ వసించు నెపుడున్ దేవాత్మ సాయమ్ముగన్ (18)


ఉ.ఆత్మలఁ జంపుభావముననర్థము లేయవి వట్టిభావనల్  

ఆత్మలు వేరుగాకదలి యాశల బెంచగఁ  జంపలేముగా  

ఆత్మలుఁ గల్గ లేదనెడి వాదన లన్నియు కాలతీర్పులన్ 

ఆత్మము చంపదెవ్వరిని యార్తము నందును కాలమందునన్ (19)


ఉ.ఆత్మము పుట్టిగిట్టుట యనాదిగ లేదనసత్యమేయగున్ 

ఆత్మకు భావనాశయము లార్ద్రత  బంధము లెన్న లేకయున్ 

ఆత్మము జన్మలేనిదన హాస్యమసత్యపు విశ్వతే యగున్ 

ఆత్మకు దేహఛాయలుగ హద్దులె లౌకిక చావు పుట్టుకల్  (20)


శా.ఓ, పార్థా  మనలోని యాత్మ స్థిరముల్ నోడంగ వేధింపులన్  

ఓ, పార్థా నవశక్తితో నరయనన్నో యాత్మ గాలెక్కగన్ 

హే, పార్థా మరణమ్ములేనిమనసే యీపోరు మర్మమ్ములన్ 

హా, పార్థా యెవరెట్లుచంపగలరో హారమ్ము  నా యాజ్ఞగన్  (21)


శా.జీవార్థమ్ము లనే ప్రధాన విధిగా చిత్తమ్ము  దర్శించగన్ 

ప్రావీణ్యమ్ములనే విధాన బలమై ప్రాధాన్యతాభావమున్ 

జీవాత్మా స్థిరతత్త్వ దేహమనగా ఛిద్రా  శరీరమ్ము గా  

దైవాత్మా పనుపుల్ సహేతు విధిగా ధైర్యమ్ము ప్రారంభమున్ (22)


ఉ. ఆత్మను శస్త్రముల్ కదలి యాలము ఛిద్రము జేయలేవనన్ 

ఆత్మనుఁ గాల్చ వీలవదు యగ్నికి నేయితరమ్ముఁ గూడినన్ 

ఆత్మను నీరు నేపగిది నార్ద్రము జేయదు యేమిజేసినన్   

ఆత్మను గాలికూల్చగల హాలతు లేదను సూనృతమ్ములన్ (23)


ఉ.ఆత్మలు శాశ్వతంంబనగ నాతప మందున వానలందునన్   

ఆత్మల నెండగా మరియు నార్ద్రతఁ జెందవు నాశమందగన్  

ఆత్మ చలించ దెప్పుడు సహాయపరంపరలందు చేరగన్ 

ఆత్మల శోధనమ్ము గన సాధ్యము కాదన సత్యమే యగున్  (24)


ఆత్మలు శాశ్వతంంబనగ నాతప మందున వానలందునన్   

ఆత్మల నెండగా మరియు నార్ద్రతఁ జెందవు నాశమందగన్  

ఆత్మ చలించ దెప్పుడు సహాయపరంపరలందు చేరగన్ 

ఆత్మల శోధనమ్ము గన సాధ్యము కాదన సత్యమే యగున్ (25)


పుట్టుట యన్నదేనిజము పృథ్విని మానవ ధర్మ మార్గమున్ 

గిట్టుట తప్పదన్నదియు కీలక సత్యము జన్మజన్మకున్ 

పట్టిన పట్టువీడుటలొ పంతముఁ బూనగ నేలనివవిధిన్ 

గట్టి మనస్సుగాసమర గర్జనఁ జేయగ శంఖ ముదుమా   (26)


పుట్టిన చింతలన్ గొలువు పూనగ సేవలొనర్చలేకయున్  

గిట్టి, ఋణానుబంధమున కీలక మైన మరో ప్రభూతినిన్ 

పుట్టి నియంత్రణల్ జరుగు పూర్ణ నియుక్తము పూర్తి జేయగన్ 

గిట్టుట నంతమందు పరి ఖేదముఁ చెందగ యుద్ధ మందునన్ (27)


పుట్టుక కారణమ్మదియ పుణ్యము పాపము లెందువల్లనో 

గిట్టెడు సాకుపోరుయను కేలినిఁ జేయుట వల్లనే యనన్ 

పుట్టుట గిట్టుటే బ్రతుకు స్పూర్తిగ జీవన ధర్మ మార్గమే, 

నిట్టి శరీరమే కలుగ నీకును శోకము లేల నిప్పుడున్   (28)


కననొక్కండిల నబ్బురమ్ముగనగా గర్వమ్ము పెంపొందగా  

విననొక్కండిల నబ్బురమ్ముగనగా విశ్వాస సాధ్యమ్ముగా  

వినిపించే భగవాను కృష్ణు వర వైవిధ్యమ్ము  లేపాద్యముల్  

విన నెవ్వారు వచింపగా మహిమలన్ వేద్యాను కర్మంబులన్ (29)


ప్రకృతిన పుట్టుజీవులకు బంధన పాశము యాత్మయై చనన్ 

ప్రకృతిని నిత్యవస్యమను పక్షము నందునఁ చేరి యుండుటన్ 

సుకృతము నెంచగా భరత సూత్రము సాటిగ పోరులందునన్ 

వికృతముఁ జూపు శోకమును వీడిధనుస్సును పట్టు యుద్ధమున్ (30)

చం.పదిలము సత్య ధర్మమను బంధన చేష్టల యుద్ధమందునన్

పద పడి పోరు జేయ నిటు పాపపు చింతలవేల యుద్ధమున్ 
చెదరని ధర్మమౌను కద శ్రేష్ఠపు వీరుల శౌర్యమూర్తులన్, 
అది యిది ప్రశ్న లేల మనమార్గము ధర్మమునిల్పు టర్జునా (31)

చెం.తెలియకవచ్చెనంచిటుసుధీ, విధివేద్య విదారణమ్ములన్  
తెలియును నాదు బోధనలు తేట లమేయ వివాద చేష్టలన్ 
తలపులు స్వర్గ మార్గమున తప్పక తెర్చియెనుండు నర్జునా 
సులభముగా సజావున విశోధన స్వర్గ  విజేయ సత్యముల్  (32)

శా.పోరాటమ్మున యుద్ధ ధర్మముకదా ప్రోత్సాహ మీలాగునన్ 
పోరాటమ్మును మాని నీవుభయముల్ పొందంగ హీనమ్ము లౌ  
నేరమ్ముల్ నెరజేయ నొప్పదనగా నీబోధ పాటించ కన్  
ఘోరమ్మౌ దొసగుల్ ప్రకోపముల ముక్కోణంపు భావమ్ములన్ (33)

ఉ.లోకులు నీదుజంకులను లోలల చేష్టల నీచమంచనన్  
మేకులు గాహృదిన్ చెరగి మిక్కుట నీచవిమర్శచేయగన్ 
కాకుల పోలికన్ పొడిచి కర్దము చల్లగఁ జూడ నెంచగన్ 
మాకిటు బాధలన్ గలుగ మంచిది కాదను భావమెచ్చగన్ (34)

ఉ.మిక్కిలి యుద్ధ విద్యలను మీరగ హెచ్చి నజేయమందగన్ 
చిక్కని దృష్టి తప్పినను చేరువ నష్టము లెక్కువేయగున్ 
మక్కువ బంధులందుపర మార్థము మానుము యుద్ధమందునన్ 
తక్కువ జేసిచూడకిటు ధర్మము యుద్ధపు బాధ్యతర్జునా (35

)శా.నీవైరిప్రజలెంతగా విరివిగా నిర్వేద నిస్తేజ ముల్  
నీ వీరత్వములేగనన్ కదన నిర్నీతార్థ స్వార్ధమ్ములౌ  
యావేశమ్ములనన్ ధరన్ పరమ గర్హ్యమ్మై విచారించగన్   
నీవే నోర్పును జూప నిందలు వినన్ నీబోధలేమార్చినన్ (36)

మ.సమరమ్మందున మృత్యువుల్ సహజ మేస్వర్గమ్ము  ప్రాప్తమ్ము గా, 
అమరత్వంబగు నీదు కర్మలుగనన్ యారాధ్య వేద్యా గతిన్ 
సమరమ్మున్ జయమైన భోగములిలన్ సాధ్యమ్ము స్వంతమ్ములౌ  
అమరత్వాశయమేవిధానపరమౌయాకాంక్ష లేయర్జునా  (37)

మ.సమరమ్మందున లాభనష్టములనన్ సామ్యంపు సంభావ్యతన్ 
సమరమ్మున్ సుఖ దుఃఖముల్ గలుగుటన్ సందర్భ లక్ష్యమ్ముగన్ 
సమరమ్మున్ విధిపాపపుణ్యము లుగన్ సన్నద్ధమై సాగగన్ 
సమరమ్మున్ సహజమ్ము సంఘటిత విస్తారమ్ము సాగించగన్  (38)

ఉ.జ్ఞాన పథంబులన్ సమత జ్ఞానము పంచితి నేను నివ్విధిన్  
జ్ఞాన మొసంగగా బరగు జ్ఞానవిశేషము బోధజేయగన్ 
దానినె కర్మగన్ దెలుపు ధర్మము సామ్యపథంబుజూపగన్  
జ్ఞానము తోడు నీమనసు సద్గతి పొందుట నీదు లక్ష్యమున్ (39)

శా.ఆరంభమ్మగు కర్మలే కదనమున్ హార్యమ్ము లౌభావముల్  
ప్రారంభమ్మగు తేజముల్ కలకలల్ ప్రారబ్ధ కర్మాలనన్ 
సారమ్ముల్ స్థిత కర్మలున్ గనుటనే సారథ్య లక్ష్యమ్ముగన్ 
ధీరుండౌ విధిగన్ సుసంగవిధులన్ దేహమ్ము యుద్ధమ్మునన్ (40)

ఉ.నిశ్చయ చిత్తమొక్కటియ నీమపు నిష్ఠల తేజమేయగున్ 
నిశ్చల కర్మచేయువిధి నీతుల దర్శన మార్గమేయగున్ 
నిశ్చయ మెంతయున్న విధి నిర్ణయ మన్నది నేను తీర్చగన్  
నిశ్చల చిత్తమందు నిక నీదు నియామక కార్య మెంచు మా!  (41)

ఉ.భోగ  విలాస మాయలతొ బోల మనస్కులు చూడ గల్గగన్ 
వేగవిశారదల్ నెరపు వేదముఁ  దెల్పగ  విద్య లెల్లరన్ 
బాగుగ జీనమంద పరి పాటిగ వ్యూహము తీర్చ యుద్ధమున్  
త్యాగమనంతముల్ సమర ధర్మము నందున నీవు జేయగన్  (42)

 మనదనెడీక్షణమ్ముసుఖమార్గము గానువిధాన తీర్పులన్ 
మనమున కోర్కెలేగతిగ మానసవాహక కాలపొంగులన్ 
మనము సకాల కర్మలను మార్కొను విద్యలు తేజరిల్లగన్ 
మనసిడి జేయుయుద్ధములె మాన్యములైనవిధర్మ సామ్యమై   (43)

చం.తెలుపుదు సత్యవాక్కులను తీక్షణ నిర్ణయ మెంచి యందునన్ 
చలనములీ విధాన మున జాలము లన్నియు భ్రాంతియే యనన్  
కలవర మైన చిత్తమున కర్కశ కాలపు దర్శనమ్ములన్  
మలుపులనిచ్చు విద్యలను మార్గము లెంచగ సూనృతమ్ములన్ (44)

ఉ. నీవిటు హర్ష ద్యోతపు వినీతుడుగా మనసుంచి సాగగన్ 
నీవిక  ప్రేమతత్త్వమును నిత్యపరాత్పర యోగసాధనన్ 
నీవెటులైనసత్యమును నిల్పగ నిశ్చయ కార్యరూపమున్ 
నీవ యతఃపరమ్ములుగ నిశ్చయ సిద్ధికి కారణమ్ముగన్ (45)


ఉ.చిన్న జలాశయమ్ములు సుచిత్రవిచిత్ర యుపాయమేయనన్
చిన్నది యాశలన్ ప్రబల జ్యేష్ఠ సహాయపరంపరమ్ముగన్,
ఉన్న పరాత్పరుండు స్థిర ముత్సవ తత్త్వము బోధఁ జేయగన్
యున్నత వేదపాఠములు యుద్ధృతి మార్చెడి బ్రాహ్మతత్త్వమున్ (46)

శా.కర్మాచార్యవిధానమే విధులుగా కార్యమ్ము సాఫల్యతన్ 
ధర్మమ్ముల్ నెరవేర్చగా విశదమౌ తన్మాత్ర విశ్వాసమున్ 
కర్మల్ కర్తలు తప్పినన్ మనిషిగా కాలమ్ము శాసించగన్ 
కర్మా పేక్షయులేక సాగు ఫలముల్ కర్తవ్య సాధ్యమ్ముగన్ (47)

శా.యోగాసక్తి విధేయతన్ జయములే యోగ్యంపు సంభావ్యతన్ 
రాగార్ద్రానుభవాప్రమేయ ఫలమే రాజ్యమ్ము స్వంతమ్ముగన్ 
సాగించన్ మది ధర్మ కర్మలవిధుల్ సాధ్యమ్ము సాంతమ్ము గా  
యోగమ్ముల్ పటిమా సమాన ప్రతిగా నుల్లమ్ము సమ్మోదమున్ (48)

మ.ఫలమాశించెడి కర్మలే సమరమున్ ప్రశ్నార్థ కమ్మై చనన్   
ఫలమున్ బొందగ సాధ్యమై పరమ సంప్రాప్తమ్ము లక్ష్యమ్ముగన్ 
ఫలమాశించక జేయుటే ఫలితమౌ పాఠ్యమ్ము బోధించగన్ 
ఫలమే యుద్ధపు సాధనా జవము సంపన్నాధికారమ్ములే.   (49)

మ.సమతాచిత్తము కర్మలన్ జరపగా  సామాన్య వైనమ్ముగన్ 
మమతాఖేదము లెల్లమానుటగతిన్ మాన్యమ్ము సౌలభ్యముల్  
సమతాభావమెరుంగుమా మురిపమై సామ్రాజ్య భావమ్ములన్ 
సమతాయోగము నేర్పు బోధనలనన్ సౌలభ్య నేస్తమ్ముగన్ (50)

 పరమపదమ్ము పొందెదరుపార్థివ వాంఛలు నిర్వికారమై  
మరణపు వీత ముక్తులగుమానవ కర్మ ఫలమ్ము త్యాగమై  
తరుణపు బుద్ధియుక్తులగు తన్మయ భావముతోడు ముక్తులై  
నిరతము సాధ్యమే యనగ నిశ్చయ భావమునందు  స్వర్గమై  (51)

 నీమోహంబునకాలమేజరుగుటన్ నీర్నేత చిత్తమ్ములన్ 
నీమాయా మరులే  సమగ్ర కదనా నిర్దుష్ట చేష్టమ్ము లై   
నీమాత్రా సమయాను కూల సరముల్ నేయార్థ భావమ్ములై  
ప్రేమార్థమ్ము లనన్ విధాన విధులన్ పేరేన్ను సత్యమ్ములై  (52)

 ప్రచలితమైన మాటలన ప్రాణ సమస్యలుఁ దెచ్చు బుద్ధులన్,  
పచకచ నిశ్చలమ్మగుట బాధల వేధ్య తపస్సు సాగగన్ 
విచలితమైన బుద్ధులను విద్యల యోగ్యపరాత్పరమ్ములన్  
అచలమునందు నాత్మగన హార్దము లెన్న మనో విధానమున్  (53)

 తెలుపుము కేశవా పురుష తేజ స్వధర్మ పరమ్ము లేవియో ?
పలుకుము కేశవా గుణము భాషణ భావపు బంధ మేదియో ?
తెలుపుము కేశవా మనసు ధీస్థితినెట్లు వసించు మూలమో  ?
పలుకుము కేశవా పరమ ప్రాప్తపు రీతి  నెరంగు నీతులన్ (54)

 మ.కోll   పూర్తిగా తొలగించకోరిక పూజ్యమేయగు నిత్యమున్ 
స్ఫూర్తిగా పరమాత్మ యోగము సూత్రమేయగు విద్యగన్ 
మూర్తిగా స్థిత కాలధర్మము ముఖ్య యాత్మగ జీవమున్ 
కీర్తి ప్రజ్ఞతఁ బట్టి నెంచుట కీలకమ్మగు యర్జునా (55)

భేద మనస్సునన్ సమయ పేరిమి లక్ష్యము జేసిఁ జూడగన్ 
మోదములందగన్ మనసు మోహపు మాయల జిక్కి భ్రాంతులన్ 
క్రోధము వీడి నేస్తముల కూటము లందున శాంతిబొందగన్  
కాదన ధీవరా సమర కాలము నేదియ తెల్పు మర్జునా (56)

 మమ తాసక్తులు లేనివానినెడ నేమాన్యత్వ మేలాగునన్ 
సమతాభావము సానుకూల మయముల్ సహ్యమ్ముకాదేలనో 
క్షమయా గుణ్యపు సామ్య బుద్ధులనయన్ కర్మమ్ము లీదారులన్  
స్థిమితమ్ముల్ గమనించునీవుమహితా శ్రేయమ్ము లే యర్జునా (57)

 తన యంగమ్ములు లోనికై ముడుచు వృత్తమ్మెంచు సామ్యమ్ముగా  
మనయాశల్ ఫలియించు కీలకములౌ మార్గమ్ము శోధించగన్ 
జనధర్మమ్ము విధానవిద్య చరితా జ్ఞానమ్ము పొందంగనే  
మనబుద్ధుల్ స్థిర మైనవే యనగ నేమార్చేమహాజ్ఞానిగన్ (58)

 విషయమ్ముల్ భవదీయ హృద్య వచ నల్ విశ్వాసముల్ పొందుగన్ 
విషయార్థాలను వీడగల్గు విధులే విశ్వమ్ము వ్యాపించగన్ 
విషయాలన్ పురుషార్థ కర్మలనగావేసారి వేధించగన్ 
విషయాసక్తిని మోక్షమందగలుగన్ విద్యా వివేకమ్ములన్ (59)

 ఈమహమ్మగు కాలమేమన ఇంద్రియాలకు లొంగకన్,  
ఈ మనోహర వాంఛలన్నియు నేపుగా చకితమ్ము లై,  
ఈమనుష్యులు నిగ్రహమ్ముల నెంచినన్  పరివేదనే    
క్షేమమన్నది రాక పోవు నికృష్టమౌ నిహ లోకమున్   (60)



Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ