" బొట్టు"


సాజము ఫాల భాగమున చక్కని కుంకుమ బొట్టు తీర్చుటన్

రాజ సమాన భాగ్య రసలాలిత దీప్తిని పెంచి పంచు నీ

పాజము నిశ్చలమ్ముగను భౌతిక రుగ్మత రూపుమాపుచున్

తేజము నిచ్చు నీ నుదుట తీరగు బొట్టు ప్రకాశమానమౌ


( సాజము : సహజము;      పాజము: బలము; భౌతిక :

 పంచభూత సంబధ;   రుగ్మత ; వ్యాధి/ నొప్పి)

"నడత"


వయసుకు తగ్గ చింతన నివారణ కోరెడి జాగరూకతన్

పయనపు దారియందు నిరపాయపు శైలి నిబద్ధ హేతువై

భయము, నిగూఢ మానసపు వైనము కాదని నిర్భయమ్ముగా

జయము వికాస నేస్తమని సన్నుతి చేయుచు సాగిపోవలెన్.....


[21/10, 07:05] Mallapragada Ramakrishna: సమస్యను మల్లా ప్రగడ పరిష్కరించడం...........

తాళము వేయుతత్త్వమగు తానుగ తీర్పుగ గొప్పదే యగున్  

మేళము శబ్దమే మనసు మీరగ యద్భుతమైనదే యగున్  

గాళము వేయు బుద్ధుయు సు గాత్రము నిత్యము తప్పు నెంచకే  

రాలను వేయువారికె వరాల నొసంగును దేవుడెప్పుడున్

🌿 భావవిశ్లేషణ:

“తత్త్వాన్ని తెలుసుకోవడం” — అది మానసిక తాళం, ధృఢమైన నిర్ణయం.

సరైన నిర్ణయం తీసుకోవడం గొప్పతనంగా భావించబడింది.

మనసు, శబ్దం, సంగీతం — ఇవన్నీ మేళముగా ఉండాలి.

మనసు శాంతియుతంగా, మేళభంగరహితంగా ఉన్నప్పుడు, అది అద్భుత ఫలాన్ని ఇస్తుంది.

బుద్ధి మరియు శరీరం ప్రతి రోజు తప్పులుండకుండా, నియమాన్ని పాటించాలి.

స్వచ్ఛమైన బుద్ధి, శుద్ధమైన గాత్రం — జీవనవిధి.

కృషి చేసే వారికి దేవుడు ఎప్పుడూ వరాలుగా, కృతజ్ఞతలుగా ప్రతిఫలిస్తాడు.

నిజమైన శ్రద్ధ, తపస్సు, నిశ్చల ప్రణాళికతో చేసిన కృషికి ఫలితం తప్పక వస్తుంది.

💠

[21/10, 07:17] Mallapragada Ramakrishna: సాలిగూడున చిక్కెజీవము సంతసమ్ముగ శఖ్యతే  

మాలికామది తీరుయేయగు మానసమ్ముయు గుప్తమున్  

గాలితీరున సర్వమోహము గమ్యమేయగు లక్ష్యమున్  

ఆలివైనము జీవనమ్మగు ఆశ పాశము నిత్యమున్

భావం (సరళంగా):

మన జీవితము చిన్నది, తాత్కాలికం.

అది సంతోషంతో, స్నేహంతో, శ్రేయోభిలాషతో నింపాలి.

మనసులో ఉన్న బుద్ధి, జ్ఞానం, ఆత్మసంపదలను గోప్యంగా, శాంతియుతంగా నిలుపుకోవాలి.

మోహాలు వాయు లాంటివి — వస్తాయి, పోతాయి.

మన లక్ష్యం స్పష్టంగా ఉంటే, మోహాలను అధిగమించవచ్చు.

జీవితంలో ఆశలు, బంధాలు ఉంటాయి.

అవి నిత్యముగా మనకు పాఠాలు, అనుభవాలను నేర్పుతాయి.

*****

మంచు పూలవి జల్లుతీరున మానసమ్మును దోచుటే 

మంచి బల్కులు హాయికూర్చును మచ్చమార్చుట సత్యమే

పంచ శక్తి వినమ్ర బుద్దియు పాశమే యగు నిత్యమై 

పంచ దీపము చెంత జేర్చును పాలు నీళ్లుగ యేకమే :

పద్యార్థ విశ్లేషణ:

→ మన మనసును శాంతి, చైతన్యముగా ఆకర్షించే ప్రకృతి సౌందర్యం. మంచు పూల్ల ప్రభావం మన హృదయాన్ని మోహనంగా మారుస్తుంది.

→ మంచి అలవాట్లు, మంచి కర్మలు మన మనసును ఆనందంగా, హాయిగా ఉంచుతాయి.

→ ఐదు ప్రకృతి శక్తులు (భూతశక్తులు) వినమ్రతతో నియంత్రించబడితే, అవి మన జీవితానికి శ్రేయస్కరంగా మారుతాయి

→ ఐదు దీపాల కాంతి ఒక్కటే, పాలను నింపిన నీటిలా, అవి మన జీవితానికి ఉజ్వలాన్ని ఇస్తాయి.

****

005శా::

నాకే కష్టముగానువచ్చుటయు వినాశమ్ము మారేస్థితీ

ఏకే మేకగుటే సుఖా సుఖముగన్ యిష్టాప్రమాణమ్ముగన్

సాకే జీవముగన్ బసుగంధ విదితం సామర్థ్య మూలమ్ముగన్

లాకేత్వమ్మును దాకు కొమ్మునిడు హేలన్ దాత యెల్లప్పుడున్

💠 పదార్థ / భావవిశ్లేషణ:

→ “నాకు మాత్రమే కష్టమని అనిపించడం, అదే వినాశరూప స్థితి”

అంటే — వ్యక్తిగత అనుభవమనే భావన (అహం–భావం) ఉద్భవించిన చోటే దుఃఖం, నాశనం మొదలవుతుంది.

→ “ఏకత్వమే నిజమైన సుఖం; అది మాత్రమే ఇష్టానికి ప్రమాణం.”

అంటే — ద్వంద్వరహిత స్థితిలోనే శాంతి ఉంది. ‘ఏకత్వానుభూతి’ని సుఖానికి ప్రమాణంగా చూపుతున్నారు.

→ “ఆ సాక్షి జీవమే సుగంధములవంటి పరిమళమై, అంతర్గత సామర్థ్యానికి మూలం.”

సాక్షి–భావం లేదా ఆత్మజ్ఞానం మన జీవనశక్తికి, సామర్థ్యానికి మూలమైన పరిమళముగా ఉంది.

→ “ఆ లాకేత్వ (లౌకిక, ఆకర్షణాత్మక) గుణాన్ని తొలగించే దాత (జ్ఞానప్రదాత) ఎప్పుడు వస్తాడు?”

అంటే — మనసులోని లౌకిక ఆకర్షణను, ‘నేను’ అనే తంతువును తెంచే కరుణామూర్తి ఎప్పుడు దర్శనమిస్తాడు?

004.సమస్యను మల్లా ప్రగడ పరిష్కరించడం......

పంకజము ప్రఫుల్లమయ్యె బాబూ నిశిలోన్


సంకటముప్రమోదమయ్యె ఆశా సెగలోన్

అంకితము ప్రమాదమయ్యె ఛాయా రతిలోన్

శంకలు మటుమాయమయ్యె భావ్యమ్ము గనౌన్

పంకజము ప్రఫుల్లమయ్యె బాబూ నిశిలోన్


అంధకారములో పుష్పం విరబూయడం, ఆశ సంకటముగా మారడం, ప్రమాదం అంకితముగా పరిణమించడం, శంకల మాయమవడం.

పద్యార్థం (సరళ భావం):

రాత్రి (నిశి) వంటి చీకటిలో కూడా కమలం విరబూయడం అంటే, మనిషి జీవితంలో కష్టాల సమయంలో కూడా అంతర ప్రబోధం, సృజనాత్మకత వికసించవచ్చు.

సంకటాలు కూడా ఆశా సెగలుగా మారి ఉత్సాహం కలిగిస్తాయి.ప్రమాదం అంకితభావంగా మారినపుడు అది ధైర్యాన్ని ఇస్తుంది.మనసులోని అనుమానాలు, శంకలు తొలగిపోయి, విశ్వాస భావ్యత్వం స్థిరపడుతుంది.


నేటి శ్లోకంపై నేను వ్రాసే పద్యం


(001)

 విద్యానాం నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్త ధనం ౹


విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యాగురుణాం గురుః ౹౹

(సంగ్రహము )

        విద్య అనేది మనిషికి ఉండే సుందర రూపం.దాన్ని అతను మూసి పెట్టిన గుప్త నిధి. విద్య మనిషికి భోగాన్ని ,సుఖాన్ని,యశస్సుని,తెచ్చి ఇస్తుంది.

మ. కో.

విద్య యన్నది సర్వ సృష్టికి విశ్వమోహము తప్పదే

విద్య సుందర రూపమేయగు వేగు చుక్కగ మాదిరిన్ 

విద్య గుప్తనిధీ యశస్సుని వేదనమ్ముల కర్హమౌ

 విద్య భోగము శాంతి ధామము వెన్నెలల్ కురియిo చగా

***

(002)నేటి సమస్య నా పూరణ

*మతిపూబోడిరొ చెంత చేరగ దవే మోమెత్తినన్  జూడవే


మ::

సతినీవా పలుకాలకించవ కళా  సాధ్యమ్ము నీతోడుగన్

 గతి నీయుక్తియు సామ రస్యముననే కాలమ్ము తీరేయగున్

 స్థితి నాదృష్టియు నీదు మాయలగు టేస్తిత్యంత రమ్మేయగున్

మతిపూబోడిరొ చెంత చేరగ దవే మోమెత్తినన్  జూడవే

భావం 

సతినీవా పలుకాలకించవ కళా  సాధ్యమ్ము నీతోడుగన్

 గతి నీయుక్తియు సామ రస్యముననే కాలమ్ము తీరేయగున్

 స్థితి నాదృష్టియు నీదు మాయలగు టేస్తిత్యంత రమ్మేయగున్

సతినీవా పలుకాలకించవ కళా  సాధ్యమ్ము నీతోడుగన్

 గతి నీయుక్తియు సామ రస్యముననే కాలమ్ము తీరేయగున్

 స్థితి నాదృష్టియు నీదు మాయలగు టేస్తిత్యంత రమ్మేయగున్

మతిపూబోడిరొ చెంత చేరగ దవే మోమెత్తినన్  జూడవే


సరళ భావం:

ఓ సతినీ (దేవీ, దైవసహచరిణి)!

నీతో ఉండగా నా వాక్కులు సత్యముగా, సుస్వరముగా మారుతాయి —

నీవు నా కళా సాధ్యమునకు ప్రేరణ.

నీ యుక్తి, నీ సౌమ్యత, నీ సారస్యం వల్లనా జీవితం సమయసార్ధకమై, సుగమమై పూర్తవుతుంది.నీవు నాదృష్టిలో ఉన్నంత వరకు

నీ మాయల రూపములు, నీ లీలలు, స్థితి–అంతస్థితులన్నీ నిశ్చలముగా కనిపిస్తాయి.

మరి ఇప్పుడు — ఓ పూబోడిరొ!

(సౌందర్య, కరుణామయీ!)

నీవు నా చెంతకు చేరి,

నేను నీ జ్యోతి రూపాన్ని స్పష్టముగా దర్శించుటకు అనుగ్రహించు.

****

నేటి సమస్యను పరిష్కరించడం......


003. గీ.పుష్ప పరిమళం చలితమై పూజ్య మగుట

చిత్త సౌరభ కళలు విచిత్ర మగుట

మత్తు మాయలకునె జిక్కి మంకు బుద్ది

పురుషు లెల్లరు జేరిరి పుష్ప కొరకు

విశ్లేషణ:

– పుష్పం (సుందరత, భౌతిక ఆకర్షణ) తాత్కాలికమైనది, కానీ దాని వాసన (మూల్యము, ధర్మము, సద్భావము)నే మనం పూజ్యంగా భావిస్తాం.

– మనసు యొక్క సౌరభం — అంటే మానసిక సద్గుణాలు, ఆలోచనల సౌందర్యం — కళాత్మకంగా, విచిత్రరూపాల్లో వ్యక్తమవుతుంది.

– కానీ మాయల మత్తులో పడిన మనుషులు — భ్రాంతి, దురాశ, మమకారం — వీటివల్ల మంకుబుద్ధి (తప్పు అవగాహన)తో నిండిపోతారు.

– అందువల్ల అందరూ బయటి పుష్పం కోసం పరుగులు తీస్తున్నారు; అంటే ఆత్మ సౌందర్యం కంటే భౌతిక సౌందర్యం కోసం పోటీ పడుతున్నారు.

“బాహ్య సౌందర్యం కాదు, అంతర సుగంధమే నిజమైన పూజ్యము.”

*****

మల్లాప్రగడ రామకృష్ణ పూరణ

సమస్య:(001)

వాడల వాడలందిరుగు వాడగు చోరుడు దేవుడెట్లగున్


ఉ.చూడగ మాయలెన్నివిన సొంపుగ చేయుచు నవ్వు తూ సహా

యుండుగు యెల్లవేళల ప్రయోగము చేయుచు కొత్త బల్కులే

వీడక మిత్రలందరితొ వేడుక యాటల దొంగ యన్ననూ

వాడల వాడలందిరుగు వాడగు చోరుడు దేవుడెట్లగున్


సరళ భావం:

మనిషి లోకంలో ఎన్నో మాయలు, విన్యాసాలు చేస్తూ, నవ్వుతూ, కొత్త కొత్త ఆలోచనలతో ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూ, స్నేహితులందరితో ఆటపాటల్లో మునిగిపోయి, ముచ్చట్లతో గడిపేవాడు — ఇలాంటి వాడు చిన్నచిన్న చోరత్వాలూ చేసేవాడే అయి ఉండవచ్చు.

అయినా, ఈ వాడి ప్రవర్తనలోని చలాకితనం, హాస్యం, కొత్తదనం చూసి “ఇతడే దేవుడు ఎలా అవుతాడు?” అని కవిని ఆశ్చర్యపరచిన భావమే చివరి చరణంలో వ్యక్తమవుతోంది —

******


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ