సార్థకనామ గణాక్షర వృత్తము "నవ్య" 

*

ఈవృత్తము చిత్తవిలాసితము అని పేర్కొనబడినది. 

*

చిత్తవిలాసిత (నవ్య) - III IU IUU = IIII UIUU 

*

బ్రతుకొక బాట గాదా, బ్రతికిన నాడు దేవా

వెతుకుట కేమి లేదా, వెతికిన వాడు దేవా

స్మృతులిఁక లేనివేనా, స్మృతులను జూపు దేవా

చితులను బూదియేనా, చిత్తముయు తీరు దేవా

*

నను దను మఱ్చెనేమో, నను విధి జేర్చు దేవా

మనసున నుండనేమో, మనసుయె చెండు దేవా

వనజము వాడెనేమో, వలపుల పండు దేవా

దినమిఁక చీఁకటేమో, దినమొఖ వార్త దేవా

*

సుమమున కాఱు రేకుల్, సుఖమున చేర్చు దేవా

హిమములు రాలు పూవుల్,  హిమమున జార్చు దేవా

రమణికి ముగ్గు ప్రీతుల్, రమణికి సిగ్గు దేవా

రమణము శీత రీతుల్, రమణము రమ్య దేవా

*

మనసు వసంత మెప్డో,  మనసు పసందు దేవా

మనకు వసంత మప్డే,  మనకు సుఖంబు దేవా

దినమది నవ్యమేగా,  దినమిది భవ్య దేవా

మనసది భవ్యమేగా,  మనసది దివ్య దేవా

*

విధేయుడు - మల్లా ప్రగడ రామకృష్ణ

తేటగీతి పద్యమాల 


దీన జనులను బ్రోచెడి తిరుమలేశ

మానసంబును పంచెడి మౌన ధీశ 

మూడునామాల వాడయో మొహనాంగ

దండు కోవయామమ్మును ధర్మతేజ 


నిండు తనమేను మాస్థితి నిర్మలాత్మ

అండగా ఆదుకొనెడి ఆత్మ బంధు

గానమేప్రార్ధన మనసు గమ్య వాస

ప్రాణమేపంచెడిహృదయ ఫలము పాశ 


 సుప్రభాత సేవల నందు సూర్యతేజ 

 స్వప్రభాత కాలమందు స్వర్ణ తేజ

 ద్వి ప్రకాశ ప్రభావము దీక్ష తేజ

సుప్రభాపర కరుణాల సూత్ర తేజ


ధ్యేయమేనిత్య పూజగా దీక్ష ధీస

ప్రాయమేపంచగల వీర పలుకు వాస 

సాయమేచేయు శఖ్యత సమర ధీశ 

వేయి నామాల దైవమా వేo కటేశా

జ్ఞాపకాల.. ఆటవెలది


మాయయన్నదేది మనసు మార్చుటయేది 

తెల్లవారు హృదయ తీరు తెలుపు

ఓరవాకిలిగను నోరు తెరువగాను

కళ్ళముందు కథల కవిత కదలు


చెట్టుకున్న పువ్వు చిత్తముంచియు తుంప 

పలక లేని పువ్వు బట్టి తీయ 

నోటి కాడ ముద్ద నొప్పి కదాయది 

పుట్టిగిట్టు పువ్వు పుడమి నందు 


నందివర్ధనంబు నమ్మ తెలుపు గాను 

దొప్పదీపవెలుగు దొర్లు తీరు 

కానరానిసూర్య కాంతి చీకటిగాను 

కోడికూతలేవి కొనగలగగ


పులి కనులలొ గుర్తు పురకళ్ళు తెరువా 

మిత్ర శత్రు గురక మీర కున్న 

ఉండబట్టలేక ఊరు తెల్లగమార

అలవి కాని కోప అలక పట్టు 


కొండరాళ్ళమీద కోర్కెలు కంపుయు

వర్షధార గనునె వరద వలపు

పచ్చగడ్డి నిజము పడక పరిచ

గడ్డిపువ్వు నోరు కళ్ళు తెరచె


తనివి తీరని వగు తపనగుర్తులు చెప్ప

స్వప్న భువన లీల సరయు వేళ

ప్రేమ యంచు చురక ప్రీతిగొ నక తీరు

జీవితాన మలుపు జాతర యి ది

 జ్ఞాపకాల ఆటవెలదు


దేవుడున్నకళలు దీక్షల తీరుగన్ 

పక్ష మన్నది కల పలుకు లాగ 

వాళ్ళు వీళ్ళు యన్న వాక్కుబట్టిమనసు 

ధనిక బీద యన్న ధరణి బాధ 


దిక్కులన్ని కలయు దివ్యవెలుగుతీరు 

నిజమనేదికథలు నిర్మలమగు

బుద్ధి మాయకమ్మి భుక్తి కరువుచేరు

బద్ధకంబు మనసు బంధ బలుపు


యోగ్యు డైన లక్ష్మి యోగము నున్నచో

భోగ తనము చేరి భుక్తి కరువు

త్యాగు డైన తోడు దాహము నున్నచో 

మూగవాని తీరు ముచ్చు బతుకు


కథలు అదుపులోన గాంచ గలుగు తీరు 

వ్యధలు తప్ప లేని వ్యాధి తీరు 

సొదలు రొదలు తప్ప సోకులీలలతీరు

పొదలు మాటు పలుకు పోరు తీరు


మనసు మాయలన్ని మమతతీర్చ గలుగు

సొగసు తీరు మారు సొమ్ము బట్టి

వయసు యుడుకు చేరు వాక్కుల తపనలు

పరశు బట్టి వేట పరువు యాట

🎵 పల్లవి

ఐక్యతారగం మన పలుకు – కలిసి నడిస్తే అదే బలుకు

ఒక్కరిగా కాదు మన అడుగు – ఒక్కటైతే జయపు అడుగు

ఐక్యతారగం మన పలుకు – కలిసి నడిస్తే అదే బలుకు

చెదరని చేతులు కలిసే వరుకు – మారుతుంది లోకం దారుల వరుకు

(హుక్)

ఒక్కటే… ఒక్కటే… మన శ్వాసలో శక్తి ఒక్కటే

ఒక్కటే… ఒక్కటే… మన గుండెలో గమ్యం ఒక్కటే

🎶 చరణం – 1

ఒక్క గింజ గాలికి ఎగిరిపోతే

రాశి అయితే ఆకలే పారిపోతే

చిన్నదైనా విలువ దాగి ఉంటే

కలిసుంటే విజయం పుట్టుకొస్తే

చెయ్యి చెయ్యి కలిపిన క్షణమే

శ్రమకైనా అర్థం దొరికే సమయమే

నిన్ను నన్ను మేముగా మార్చే

ఐక్యతే జీవితం నేర్పే

🎵 పల్లవి (షార్ట్ రిపీట్)

ఐక్యతారగం మన పలుకు – కలిసి నడిస్తే అదే బలుకు

ఒక్కటైతే జయపు అడుగు

🎶 చరణం – 2

ఒక్క ఇటుక దారిలో అడ్డమే

లక్ష ఇటుకలు కోటకు మెట్టమే

కాలం కొట్టినా కూలని బలం

కలిసిన మనుషులే ఆ స్తంభం

చిన్న స్వరం ఒంటరిగా పోతే

సంగీతం మౌనమే అవుతే

తంతులన్నీ కలిసిన వేళ

వీణే స్వరాల వర్షమే

🎵 కోరస్ (గ్రూప్ సాంగ్)

ఒక్కటైతే… ఓ ఓ…

చీకటి కూడా వెలుగే… ఓ ఓ…

ఒక్కటైతే… ఓ ఓ…

రేపటి దారి మనదే…

🎶 చరణం – 3

ఒక్క చుక్క ఎండలో ఆవిరై

చుక్కలన్నీ నదిగా మారి

పచ్చదనం భూమికి పూస్తే

జీవితమే పండుగ అవుతే

ఒక్క దీపం చీకటి చీల్చే

వెయ్యి దీపాలు పగలే తెచ్చే

నిన్ను నన్ను మేముగా మార్చే

ఆ వెలుగే ఐక్యత అంటే

🎵 బ్రిడ్జ్ (స్లో నుంచి బిల్డ్ అప్)

ఒక్క అక్షరం మౌనంగా ఉన్నా

వాక్యమైతే మార్గం చూపినా

గ్రంథమై తరతరాలు నడిపే

శక్తి ఒక్కటే – మన ఐక్యతే

🎵 ఫైనల్ పల్లవి (హై ఎనర్జీ)

ఐక్యతారగం మన పలుకు – కలిసి నడిస్తే అదే బలుకు

చెదరని చేతులు కలిసే వరుకు – మారుతుంది లోకం దారుల వరుకు

ఒక్కటే… ఒక్కటే… మన శ్వాసలో శక్తి ఒక్కటే

ఒక్కటే… ఒక్కటే… మన గమ్యం మనమే – ఒక్కటే!

*****

* 🎬🎵 పల్లవి

ఒక్క అడుగే చిన్నదనుకున్నా – కాలమే మారే సంకేతమదేనా

లక్ష అడుగులు కలిసిన వేళ – చరిత్రే నడిచే మహాయాత్రేనా

ఒక్కరైతే ఓటమేనా – ఒక్కటైతే లోకమేనా

చెయ్యి చెయ్యి కలిసే వరకూ – ఆగదు ఈ గమనమేనా

(హుక్)

ఒక్కటై… ఒక్కటై…

మన శ్వాసలే నినాదమై…

ఒక్కటై… ఒక్కటై…

ఈ నేలే స్పందించునై…

🎶 చరణం – 1

గడ్డిపరకలు గాలికి రెపరెపలాడితే

విధికే బలియై చీలిపోతే

గడ్డిపోచలు పెనవేసి తాడై మారితే

గజాన్నీ బంధించగలిగితే

బలమంటే కండల కవచం కాదు

బలమంటే మనసుల కలయిక చూడు

చిన్నదనుకున్నదే శక్తి అవుతుంది

ఐక్యతే లోకాన్ని కదిలిస్తుంది

🎵 పల్లవి (షార్ట్)

ఒక్క అడుగే చిన్నదనుకున్నా

ఒక్కటైతే చరిత్రే రాసేనా

🎶 చరణం – 2

చిన్న శక్తులు ఒంటరిగా నిలిస్తే

దౌర్జన్యమే గెలిచే వేళ

ఐక్యమై అడుగు ముందుకేస్తే

కాలమే వంగే క్షణం అది వేళ

వేటికవిగా తిరిగే పావురాలకు

వలలో దారి తప్పదు

ఒక్కటై రెక్కలెత్తిన నాడు

వేటగాడి యుక్తి చెల్లదు

🎵 కోరస్ (గ్రూప్ సాంగ్)

ఒక్కటైతే… ఓ ఓ…

భయముకే భవిష్యత్తే లేదే…

ఒక్కటైతే… ఓ ఓ…

న్యాయమే నడిచే దారే…

🎶 చరణం – 3

బలహీనమని విస్మరించినదే

బలానికి విత్తనమవుతుందే

సంఘటితమైన క్షణాన అది

వృక్షమై విస్తరిస్తుందే

ఎలుక పళ్ల చిన్న పదునే

బంధనాల్ని తెంచిందంటే

మిత్రత్వం సహకారం ఐకమత్యమే

విజయానికి అసలైన మంత్రం అంటే

🎶 బ్రిడ్జ్ (స్లో → బిల్డ్ అప్)

కార్మికుడి చెమట చుక్కలో

విద్యార్థి నినాద గళంలో

సమాజం నడిచే అడుగుల్లో

ప్రజాస్వామ్యం బ్రతికే రూపంలో

చేతులు ఒక్కటై కంపిస్తేనే

నాదం పుడుతుందే

హృదయాలు ఒక్కటై స్పందిస్తేనే

హర్షధ్వని మోగుతుందే

🎵 ఫైనల్ పల్లవి (హై ఎనర్జీ)

ఒక్క అడుగే చిన్నదనుకున్నా – కాలమే మారే సంకేతమదేనా

లక్ష అడుగులు కలిసిన వేళ – చరిత్రే నడిచే మహాయాత్రేనా

అల్పానామపి వస్తువులే – సంఘటితమైతే శక్తులే

ఈ యుగానికి అదే సత్యం – ఐక్యతే మన విజయం

(ఎండ్ చాంట్ – గ్రూప్)

ఒక్కటే! ఒక్కటే!

మన బలం ఒక్కటే!

ఒక్కటే! ఒక్కటే!

మన భవిష్యత్తు ఒక్కటే!

*****

రాజీవము - ర/త/త/మ/లగ UIUU . UIU / UIUU . UIU 


పోర అంటా పొమ్మురా ఉండు అంటా ఉండరా 

రార యంటా నమ్మురా పండు నంటా మెండురా


జీవితార్థం ఏమిటా రెంటి మధ్యా ఉండరా 

భావి మార్గం తోపుటా బెట్టు మిధ్యా నందురా


లోన శోకం మింగరా బైట హాసం చూపరా 

కాన లేనీ బుద్ధిరా కైపు వైనం వద్దురా


నువ్వు నంజుండేశుడే చాల చక్కా ఉండరా 

నవ్వు సంభాష్యంబులే చక్కచక్యం చూపరా


వాడు రాసేదేమిటో వాడికర్థం కాదురా 

వీడు వాడే మందుయో విశ్వ మాయా నేర్పు రా


బమ్మ చెప్పేదేమిటా బొమ్మలాగా ఉండరా 

నమ్మ నేస్తoమేమిటా నాన్న లాగా ఉండరా


స్వర్గమందా అమ్రుతం భూమిపై సారాయిరా 

నిర్గుణంబే సమాధాణంబులే నింగిపై మేఘంబురా


తాగితే తప్పేమిరా మాయలోనా ఉండరా 

ఊగితే నిప్పౌ నురా ఊరులోనా మంటరా


మోహనా ఏకాకిగా పాడరా ఆకోకిలై 

దాహమై ధన్యత్వమై సాగరా ఏకాకిగా


అంతమందా వెల్గురా ఆశతోడా ఉండరా 

సంతసంబే చల్లగా సాగ చుండా నుండురా


చూడు పిల్లా చూపులే చాలు చూస్తూ ఉండనా

చూడు మాయా నవ్వులే నాకు చాలూ ఉండనా


పోర నంటా పొమ్మరా నుండు నంటూ నుండకే

చేర నంటా నమ్మరా నుండ కుండా నుండకే


 లోన సోకం మింగనా బైట హాసం చూపనా 

 మౌన మైకం ఒప్పునా మోహ దాహం చూపనా


 లోన శోకం చూపకే బైట పాపం నొప్పకే

జ్ఞాన దీపం కాంతులే కాల వైనం చెప్పకే


మీ విధేయుడు 

మల్లాప్రగడ రామకృష్ణ

*

🎶 పాట : “విలువల వెలుగు” 🎶

పల్లవి

విలువలు మారవు… విజయాలే మారు

వలపులు మారవు… వలపించే బుద్ధే మారు

తలపులు తెరువవు… తెరిపించే మనసే మారు

కులుకులు మారవు… కులికించే వయసే మారు

విలువలు మారవు… కాలమే మారినా

మనిషి మారాలి… మానవత్వం నిలిచినా

చరణం – 1

ఎండలు వస్తే చెట్టుచేమల విలువ మారు

నీడ ఇచ్చే చేతులే అప్పుడు గుర్తుకారు

వానలు వస్తే ఛత్రం సహాయం విలువ మారు

తడిసిన వేళ మనసులు నిజమౌతారు

కష్టకాలం తలుపు తట్టే క్షణములో

గురువుల మాటే దారి చూపు వెలుగులో

పల్లవి (రిపీట్)

విలువలు మారవు… విజయాలే మారు

వలపులు మారవు… వలపించే బుద్ధే మారు

చరణం – 2

ఆపద వచ్చి అధైర్యం కమ్మిన వేళ

దైవం విలువ మనసులో పెరుగే వేళ

బాధలలో భ్రమలు పోయే సమయములో

స్నేహితుల ప్రేమే నిలిచే నిజములో

నవ్వు పంచిన రోజులు గుర్తుకొచ్చి

నిలిచేవారే నిజమైన బంధమని

బ్రిడ్జ్ (మధ్య భాగం)

అందుకే అంటారు పెద్దల మాట

అందరూ ఉన్నప్పుడే కాపాడుకో బంధం బాట

అన్నింటితో మంచిగా నడుచుకో

విలువను చూసి మారడం నేర్చుకో

పల్లవి (ఫైనల్)

విలువలు మారవు… మనసే మారాలి

కాలం నేర్పే పాఠం మనం గ్రహించాలి

చూస్తూ… ఆలోచిస్తూ… విలువ బట్టి మారాలి

మారినా లోకం… మానవత్వం నిలవాలి

*****

దేశంకాని దేశంలో ఆంధ్రుల అగమ్య గోచరం, వర్ణిమ్ చాలన్న కవులకు అందని ఆవేదన


సీసమాలిక. 

లోపల కడగళ్ళు; రోడ్డుపై వడగళ్ళు; 

కారులున్నవి, పోవ దారి లేదు; 

సంకెళ్ళు లేకుండ శాంతి లేకయు యిల్లు; 

ప్రతి జీవి తానొక్క బందియయ్యె; 

పసివాళ్ళ యేడుపుల్; వంటకై యగచాట్లు; 

పిండి, బియ్యము, పాలు నిండుకొనెను; 

త్రాగునీరది లేదు; ధనమక్కరకు రాదు; 

గొట్టములను గడ్డకట్టె నీరు; 

ఇంటిలోఁ జీఁకట్లు; కంటిలో భయరేఖ; 

గదుల వెచ్చనఁజేయు విధము లేదు; 

చలిబాధకోర్వక జనులెల్ల కొయ్యలై 

మృత్యుగహ్వరమును మెట్టు భయము; 

గతవైభవమ్మంత కాలసర్పము మ్రింగ 

వర్తమానమ్మొక వ్యర్థమయ్యె; 

ఆటవెలది. 

దుర్దినములు తొలగి ద్యుమణిప్రభ మరల 

నమెరికాను వెలిగి హిమము కఱగి 

జనుల జీవితముల శాంతి వెల్లివిరియ 

కరములూతమిడుము కర్మసాక్షి! 

- డా.  


_(దుర్దినము = “సూర్యోదయము కాని రోజు” అని జ్యోతిశ్శాస్త్రము)_ 

_(ద్యుమణి, కర్మసాక్షి = సూర్యుడు)_ 

_(కరము = కిరణము, చేయి)_

కరిగిపోయే ఆటవెలది


కరిగిపోయెజీవి కాలపరుగులుగా

బతుకు పోరులో ప్రయాణమేను

ప్రతిమజిలిలోన ప్రతిభ జ్ఞాపకముగా

ఎన్నొ పరిచయాలు, ఎన్నొ చెలిమి


ఒక్కరిగను కూడ ఓర్పును వీడదు 

జ్ఞాపకాలు గాను జ్ఞప్తి మధుర

ఎవరి అవసరంబు ఎవరి దారెవరిది 

కలిసివున్న  సమయ కలలు తీరు


దేశమన్న ధనిక దీన బతుకు కదా 

నీతి యన్నది కథ నీరు కాద

పంది కుక్క నక్క పాశపు బతుకేగ

రోజు లన్ని మారి రోష బుద్ధి 


నానుడిగను నటన నాయకత్వమగుటే 

ఏక తత్వమనుచు  ఎక్క దిగుచు 

మతము కులము మాయ మానవత్వమనసు 

మంచి చెడు చెలిమిగ మనసు పట్టు 


దేశ సేవ యనుచు దివ్యమైన దొంగగా 

సమాజమ్ము నందు సకల సృష్టి 

బతికి చచ్చు మనిషి బంధము తీరగు 

ఉండబట్టలేని ఉడుకు రాజ్యమిదియు 


తీపి కార పులుపు తెల్పలేని రుచులు 

మనసు విషము మాట మందు తీరు 

ఘనము యనితరమగు గంపలో కప్పలా 

కాల మాయ యిదియు కాదనేల

జనవరి 29 జాతీయ వార్తాపత్రికా దినోత్సవం సందర్భంగా


🎶 పాట – 1పేపర్ బెల్లు మోగిన ఉదయం”


పేపర్ బెల్లు మోగిన ఉదయం

పాల కాఫీ పొగలలో స్వప్నం

రేడియోలో భక్తి రాగం

అమ్మ నిద్రలేవారా అనే నాదం


వరండాలో నాన్న గంభీరం

అక్షరాల వెంట పరుగెత్తిన కళ్ళు

ఆహా ఒహో అంటూ అనందం

వార్తలతో పెరిగిన మనసులు

స్వాతంత్ర్య గాథల ఊపిరితో

హృదయల్లో కదిలిన సంతోషం


జాతికి నింపిన చైతన్యాలు

పరీక్ష ఫలితం చూపిన వేళ

ఎదో తెలియని తన్మయం

వాకిట్లో దేవుడిలా నువ్వే

నవ్వుల్లో ఆనందం నింపి

పదరా పదా అంటూ తిరిగే యవ్వనం.


ఇంటి గుండెల్లో పండగ నువ్వే

పావలా విలువే అయినా

పర్వతాల బరువు నీ సత్యం

కథల కవిత్వం తొ పారాయణం


ఇంటింటి నేస్తమై నిలిచిన

నిన్నటి పత్రికే మా ప్రపంచం

నేడు ఆధునికం కళ్ళకు హానికరం

హృదయాలు కదిలిచే ప్రాంజలి ప్రభ

చదవండి, చదవండి

పత్రికలు మనకు ఉపయోగం అని గుర్తించండి

****

జనవరి 29. పత్రికా దినోత్సవo సందర్భముగా

పాట – 2

“అక్షరాల బతుకు”

నేడు శీర్షికలలో శబ్దం

నిజం వెనుకబడిన ఖండం

అదే వెంటాడుతున్న దౌర్భాగ్యం

ప్రభుత్వాలు నిస్తేజం


పార్టీ రంగు పూసుకున్న

పత్రికల ముఖం మారిన సందేహం

చదివే చేతులు తగ్గినా

చచ్చిపోలేదు భాష గుండె


అక్షరమంటే జీవనమని

మరిచిపోకూ తరమా నీవే

పిల్లల చేత పుస్తకం పెడితే

తెలుగు తిరిగి ఊపిరి పోస్తుంది


పత్రికకే కాదు

పాఠకుడికీ బాధ్యత ఉందని

గుర్తు చేస్తేనే

భాష మళ్లీ నడుస్తుంది


కాగితం కాదు అది—

కాలానికి అద్దం

నిన్న, నేడు, రేపు

కలిపే సేతువు అక్షరం


ఉద్భవచిత్తమేపలుకు 

ఊహల మర్మము కర్మలౌను 

ప్రా పోద్భవ సృష్టిధర్మమగు 

పుట్టుక గిట్టుట సంభవంబు


 సా ముద్భవ న్యాయ సత్యముగు 

ముఖ్యము సంభవ జీవనంబుగన్

ఉద్భవ కాలనిర్ణయము 

యున్నత మార్గము యిష్టజన్మగన్   


*****

నేటి జనహిత.. ఆటవెలది మరియు పృద్వి.


జనహితమన సర్వ జాగృతి ధర్మమై 

అర్ధమున్న సహన ఆశ చేరు 

వ్యర్థ పలుకు తీరు వ్యాధికలుగజేయు 

నిజము నిలకడగను నీడ తీరు 


ఛాయయైన బతుకు చాతుర్యమే కధా 

ధ్యేయమైన సకల దీక్ష తీరు 

తొలికవి తుది కవులు తోడుకవిత్వము 

పామరత్వ మేను పండిత కళ 


రాళ్ళు కరుగు గీత రమ్యత కవిత్వం 

హృదయ తత్వ మయము హాయి గొలుప 

అక్షర రుధిరమ్ము  అణుకువ నేర్పును 

నిర్భయంగ నిజము నిర్మలంబు 


సారవంత భూమి సా మరస్యపలుకు 

సమయ సేద్య బతుకు సంఘ తృప్తి 

ఈయడారి జీవి యిష్టకలలు గాను 

పంత మైన బతుకు పంట కాక 

 

బంధ మన్నదేది బాధ సుఖము తోడు

సొంతమైన సమయ సోకు చింత

సంగతంత తెలుప సంసార మలుపులే

ఉండి పోవ గలుగు ఉంచు పోవు


స్పష్ట భవ్యతేను శాంతి సంపద గను

ఇష్ట వాక్కు యింటి యిoతి మహిమ 

దృష్టి విలువ నెంచి దృఢ సంసయముతీర్చు 

సృష్టి ధర్మమేను శృతి లయలగు


ఉద్భవచిత్తమేపలుకు ఊహల మర్మము కర్మలౌను ప్రా

పోద్భవ సృష్టిధర్మమగు పుట్టుక గిట్టుట సంభవంబు సా 

ముద్భవ న్యాయ సత్యముగు ముఖ్యము సంభవ జీవనంబుగన్

ఉద్భవ కాలనిర్ణయము యున్నత మార్గము యిష్టజన్మగన్

పాలేఱు - మ/భ/భ/గ UU . UU . IIU . IIU  10 పంక్తి 433


కాలమ్మేలే కలకాల మనసే

జ్వాలల్లాగే చలనంబు జరిపే

పాలల్లే సుప్ర భవంబు గనే

నీలల్లే లే నియమంబు గనే


భావమ్మందే పయనించఁగ రా  

పూవై నాతో+ పులకించఁగ రా 

జీవమ్మందే సిరి నింపెదవా 

త్రోవన్ ముండ్లం దొలగించఁగ రా 


వీణానాదప్రియ మీఁటెదవా 

గానమ్మందే కదలించఁగ రా 

నేనేమిత్తున్ నిఱుపేదనుగా 

మౌనమ్మందే మఱపించఁగ రా 


కాలం నీదే కలకాలమే

గాలం నీదే గమనoబుయే

తాళం నీదే తమకoబుయే

మేళం నీదే నిముషంబుయే


కామేశీ నాకలలో+ కళయై 

ప్రేమమ్మందే వికసించఁగ రా


సోలించంగా సుర మోహనమై 

పాలేఱై రా ప్రవహించఁగ రా


*****

హోదా గీచిన మౌన హృద్యముగనే హోమంబు నిత్యంబుగన్ 

ఆదాయంబగు విశ్వ వాకిటగనే యామిని సౌభాగ్యమున్ 

బాధాతత్త్వము దివ్యచర్యలగుటన్ భాగ్యంబు చుట్టేయగున్ 

బీదాబిక్కికధాధనంబుగనుగన్ ప్రేమంబు లోకంబుగన్

→ పదవులు, గుర్తింపులు పోయిన తరువాత మిగిలేది శుద్ధ మౌనం.ఆ మౌనమే నిత్యయజ్ఞం — అగ్ని కాదు, అహంకార త్యాగమే ఆహుతి.→ విశ్వాన్నే స్వగృహంగా భావించిన దశలో,రాత్రి కూడా చీకటి కాదు — విశ్రాంతి, వరప్రసాదం.→ బాధను శిక్షగా కాక సాధనగా చూచినపుడు,అదే దైవకృపగా మారి అదృష్టం వెంట నడుస్తుంది.→ కథలే ఆస్తి, అనుభవాలే సంపద.భౌతిక ధనం లేకున్నా, ప్రేమే ప్రపంచమై విస్తరిస్తుంది.

*****

ఉ.

విశ్వమునంత నిండినను విశ్వ ప్రపంచము నందు తానుగా

దృశ్యుడు  కాడు  నేరికిని  దృష్టికి   దోచడు  నెట్టి   జీవికిన్

విశ్వపు  చర్మ  చక్షువుల  వీక్షణ  కందని  వాని  నెంచ,  'అ

దృశ్య'ను శబ్దవాచ్యమదె దృష్టపు జాలపు నేస్త మేళనున్

భావార్థం (సారాంశం):విశ్వమంతటా నిండివున్నప్పటికీ, ఆ పరమసత్యం ఈ లోకంలో ఏ రూపంగా ప్రత్యక్షమవదు.కంటికి కనిపించదు, సాధారణ దృష్టికి చిక్కదు, జీవుల ఇంద్రియాలకు దొరకదు.ఈ విశ్వానికి చర్మములైన చక్షువులు—అంటే ఇంద్రియాలన్నీ—వీక్షించినా అందని ఆ తత్త్వాన్ని‘అదృశ్యం’ అని పిలవడం కేవలం పదప్రయోగం మాత్రమే;అది దృష్టి జాలంలో అల్లబడిన మాయా నేస్తం కాదు.చూసే కన్నుకన్నా ముందు ఉన్నది అది.ఆలోచించే మనసుకన్నా లోతులో ఉన్నది అది.

******

చెం.

మనుషుల కష్టమన్నదియె మార్గపు జీవనమేను నిత్యమున్ 

తనువుకు తృప్తి యన్నదియె తన్మయతత్త్వజపంబు సత్యమున్ 

మనసుకు ప్రేమ బాధ్యతయె మంగళ మౌను శుభంబు తీరుగన్ 

అణువుయె దైవకల్పనలు అందముఆశ్చర్యభావమేయగున్

🌼 పద్య భావం:::మనిషి జీవితంలో కష్టాలు ఉండటం అనేది తప్పనిసరి.అవి మార్గమధ్యంలో ఎదురయ్యే సహజ అనుభవాలే; వాటినే జీవితం అని స్వీకరించాలి.శరీరానికి నిజమైన తృప్తి భోగాల్లో కాదు—తన అంతరంగాన్ని తెలుసుకునే తన్మయతత్త్వ జపంలో,అంటే ఆత్మపరిశీలనలోనే సత్యంగా లభిస్తుంది.మనసుకు కావలసింది స్వార్థం కాదు—ప్రేమతో కూడిన బాధ్యత.ఆ ప్రేమ బాధ్యతగా మారినప్పుడుజీవితం మంగళకరంగా, శుభఫలితాల దిశగా సాగుతుంది.అణువంత చిన్నదైన జీవిలో కూడాదైవసంబంధమైన ఊహలు, సృష్టి రహస్యాలు దాగి ఉంటాయి.అవి మనకుఆశ్చర్యం, అందం, విస్మయభావాన్ని కలిగించిజీవితాన్ని అర్థవంతంగా మారుస్తాయి.

*****

మ.

మదబుద్ధుల్ మధుపాన యౌవన దశోన్మాదంబుచే నొంటి యా

డుది కన్పించినజాలు బల్మి మొయి జుట్టున్ ముట్టి కొంపోయి పొo

దెద , రేలా మధుపాన మేలిక నిషేధింపండొ యాశ్చర్య మ

య్యదె పో బీజము సంఘదుర్గతికి : కాదా ? ఆపదుధారిణీ !

– (మ.)భావం :మదం, బుద్ధిహీనత, మద్యం, యౌవనోన్మాదం—ఇవన్నీ కలిసి మనిషిని అంధుడ్ని చేస్తున్నాయి.అలాంటి మత్తులో పడినవాడు తన చుట్టూ ఉన్నవాటిని విచ్ఛిన్నం చేస్తూ, జుట్టు పట్టుకొని లాగి, ఇళ్ళు ధ్వంసం చేసే స్థితికి దిగజారుతున్నాడు. ఇలాంటి దుష్ప్రవర్తనలకు మూలకారణం మద్యం కాదా అది సమాజ దుర్గతికి విత్తనమే కాదా?అందుకే—👉 “ఈ మద్యం అనే అపాయాన్ని అడ్డుకోండి, రక్షించండి”అని ఆపదుధారిణీ (దేవత/శక్తి/నైతిక శక్తి)ని కవి వేడుకుంటున్నాడు.

*****

శా

లజ్జాహీనులు రూకకై చలనచిత్ర క్షేత్ర మందెక్కి మై

పజ్జన్ వస్త్రమటంచు నుంచుకొన కవ్వ వ్వా ! యొకే గెంతుటల్

కజ్జాలన్ గిలిగింతలన్ బురుష వర్గంబున్ జెడంగొట్టుటల్ -

తజ్జాతిన్ సరిదిద్ద మేల్సలుపరాదా ! ఆపదుద్దారిణీ !

– (శా)భావం :లజ్జలేని వారు డబ్బు కోసమే చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి, స్త్రీలను కేవలం శరీర ప్రదర్శన వస్తువుల్లా చూపిస్తూ,చూపులతో, సంకేతాలతో, అశ్లీల హావభావాలతోపురుష సమాజాన్ని దిగజార్చుతున్నారు. ఇలాంటి వికృత ధోరణులు ఒక జాతి సంస్కారాన్నే చెడగొడుతున్నాయి. అయితే— 👉 ఇలాంటి దురాచారాలను సరిదిద్దే ప్రయత్నం చేయడం తప్పు కాదే? అని ప్రశ్నిస్తూ, మళ్లీ ఆపదుద్దారిణీని ఆశ్రయించి సమాజాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాడు.

****

అలుపు జూసి జనులు హాస్యంబు జేయుట 

తెలుపు తీసి జెప్ప తెలివిలేదు 

పులుపు రొడ్డు యనుచు పుల్లవిరుపుమాట 

పలుపు తాడు విలువ పాశ మవ్వ 

పద్య భావం:ఎవరి కష్టం, శ్రమ, అలసటను చూసి జాలి పడక హాస్యంగా తీసుకునే స్వభావం లోకంలో విరివిగా ఉంది.అసలు కారణం ఏమిటో, నిజం ఏంటో తెలుసుకొని మాట్లాడే వివేకం చాలామందికి ఉండదు.కఠినమైన జీవన మార్గాన్ని కూడా తేలికగా తీసుకుని, వ్యంగ్యంగా మాట్లాడటం — మాటల కటువే కానీ అర్థం శూన్యం.తేలికగా అనిపించే పలుచని తాడే చివరికి మనిషిని బంధించే పాశంగా మారుతుంది —అంటే చిన్న మాటలు, నిర్లక్ష్య వ్యాఖ్యలు పెద్ద బంధనాలై బాధను కలిగిస్తాయి.

*****

చక్రమొకటితో శకటంబు సాగనట్లు

మారుతము లేక కట్టెలు మండనట్లు

ఱేడు చతురంగ సేనతో కూడనైన

ఏలగలడె రాజ్యంబు వ్యాపృతుడు లేక  

ఒక్క చక్రంతో బండి నడవని మాదిరిగా ఎవరైనా ఒంటరిగా ఏ పనీ చేయలేడు. అట్లానే గాలి లేకుండా కట్టేలు మండని విధంగా రాజు చతురంగ సేనతో ఎంత బలంగా ఉన్నా మంత్రి లేకుండా రాజ్యాన్ని పరిపాలించ లేడు.

******

శా.

దిగ్వీకృత్యమయానులక్ష్యముగనున్ దీనత్వ దేహంబుగన్

దృగ్వాకాలముగానుసాధ్య పరమున్ తేజస్వి సర్వర్దిగన్

వాగ్వాస్యారముయేను వాదములుగన్ వాశ్చల్య వారోత్సమున్

*వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా!

 పద్య భావార్థ విశ్లేషణ→ అన్ని దిక్కులనూ తన లక్ష్యంగా చేసుకొని, బాహ్యంగా వినయంతో, దైన్యంగా కనిపించే శరీరధారణ కలవాడై…→ చూపు, మాట—ఈ రెండింటినీ నియంత్రించి, అంతర్గతంగా తేజస్సుతో అన్ని దిశలలో వ్యాపించినవాడై…→ వాదప్రతివాదాల ఉత్సవంలో కూడా తన మాటలను అలంకారంగా కాక, వాత్సల్య ప్రవాహంగా మాత్రమే వాడువాడై…→ అనవసర వాగ్వ్యాపారానికి దూరంగా ఉండేవాడే నిజమైన బుధుడు (జ్ఞాని)గా ఖ్యాతిని పొందుతాడు కదా!

🌼

ర జ ర జ ర.. 8

విద్యయున్నచోటనే వినమ్రవిత్త ముండదే
విద్య లేనిచోటనేవిధానవిత్త ముండుటే
విద్య అత్తకోడలేవివాదవిత్త మాటలే
విద్య మూటబంధమే విధానవిత్త మౌనమే
భావార్థం: విద్య ఉన్న చోట వినయమే సంపదగా ఉంటుంది — అక్కడ ఆడంబర ధనం అవసరం లేదు. విద్య లేని చోట మాత్రం విధానాల పేరిట విత్తమే ప్రధానమవుతుంది విద్య లేని అత్త–కోడళ్ల మధ్య  వివాదాలకు మాటలే విత్తనాలు అవుతాయి. కాని నిజమైన విద్య మూటగా కట్టుకున్న శబ్దం కాదు — విధానంగా నిలిచే మౌనమే.
****
కలువలతీరుభానుకళ కాలము బట్టియు కాంతివo తమున్
వలువలుమార్చి గొప్పగను వాక్కులు సన్నుతి చేష్టలే యగున్
తులువగ వేష భాషలను తూచగ నమ్మకమాయ గాంచగన్
కలత వహించి పల్కనిటు కార్యము దుర్భరమౌను! నమ్ముడీ
భావార్థం:
కలువ తీరున ప్రకాశించే సూర్యకాంతిలా కాలానుసారంగా కాంతి, ప్రభావం మారుతుంటాయి.
వేషాలు మారినా, మాటలు గొప్పగా స్తుతులుగా వినిపించినా అవి కార్యరూపం దాల్చినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. బాహ్య వేషాలు, మాయా భాషలను గమనించి అంధంగా నమ్మకూడదు అని తెలుసుకోకపోతే, మనసులో కలత మిగిలి ఏ పని అయినా దుర్భరమవుతుంది — ఇది నిజం, నమ్మవలసిందే.
*****

ఉత్తమ విష్ణుశక్తిగను యుజ్వల దాహపు చిత్తమాయగన్
మత్తునుమార్చయుక్తిగనుమానస లక్ష్యము నమ్మ నేస్తమున్
విత్త మనస్సు కాక సమ విద్య ల తీరుగవిద్యలేస్థితీ
కొత్తవిధానవిద్యలతొ కొల్లలు నెంచ మహా సరస్వతీ
భావార్థం (సూక్ష్మంగా):ఉత్తమ విష్ణుశక్తిగా ప్రకాశించే శక్తి చిత్తంలో పవిత్రమైన జ్ఞానదాహంగా వెలుగుతుంది. ఆ దాహాన్ని మత్తుగా కాక యుక్తిగా మార్చి, మనసుకు స్పష్టమైన లక్ష్యాన్ని నమ్మకంగా నిలిపేది సత్యవిద్యే. ధనమే మనస్సు అన్న భావం కాక, సమత్వాన్ని ప్రసాదించే విద్యయే నిజమైన స్థితి అని బోధించి, పాత–కొత్త విద్యలను సమన్వయపరుస్తూ అనేక మార్గాలను చూపించేది
మహా సరస్వతీ.
****
పొత్తెము సర్వవిజ్ఞతగ
ప్రోద్బల విద్యపరంపరoబు నీ
చిత్తముచేర్చ మామదియు చిత్రవిచిత్రముగాను నిన్నుగన్
విత్తము కోరకేనిజము విజ్ఞత తెల్పుచు నేర్పు విద్యగా
కొత్తవిధానసర్వమయ కూల్చని శక్తి మహా సరస్వతీ
భావార్థం:
సర్వవిజ్ఞతకు ఆధారమైన విద్యాపరంపర నీలోనే ప్రోద్బలమై వెలుగుతోంది.
మనస్సును ఏకాగ్రపరచి, ఆ విద్యను హృదయంలో నింపినప్పుడు,
అది చిత్రవిచిత్రమైన జ్ఞానరూపంగా వ్యక్తమవుతుంది.
ధనాన్ని కోరక, నిజమైన విజ్ఞతను బోధించే విద్యగా
మనిషిని మలిచేది అదే సత్యవిద్య.
పాతదాన్ని కూల్చకుండా, కొత్త విధానాలను సమన్వయపరుస్తూ
సమస్తాన్ని పోషించే శక్తి —
అది మహా సరస్వతీ యొక్క అనుగ్రహమే.
****
*తాజా* సబ్జిగనే శుభంబు కథగన్ తాత్పర్య భావంబగన్
*ఖాజా* ఖా ణ పసంద్ల గాతరము గన్ కాలంబు మూలంబుగన్
*సోజాగానబహుత్ ఖుశీసె గమనం శోకల్లె సౌభాగ్యమున్
జాజాఅప్నె మకాన్కొ చాందితరం చాతుర్య దాహంబుగన్:
భావార్థం:
తాజా సబ్జీ వలె నూతనత్వంతో నిండిన జీవితం శుభకరమైన కథలా సాగాలి.
ఖాజా ఖాణా లాంటి రుచికరమైన అనుభవాలే కాలానికి మూలకారణమై,
జీవన ప్రయాణం సోజాగా (మేల్కొన్న స్థితిలో) ఆనందంతో, దుఃఖాలను అధిగమిస్తూ
సౌభాగ్య దిశగా ముందుకు సాగాలి.
మనసులోని కలల ఇల్లు (జాజా అప్నే మకాన్) వెన్నెలలా ప్రకాశించాలి;
అందుకు కావలసింది చాతుర్యంతో కూడిన తపన, జ్ఞానదాహమే.
సరళంగా చెప్పాలంటే—
నూతన ఆలోచనలు, రుచికరమైన అనుభవాలు, మేల్కొన్న మనసు,
చాతుర్యమైన ప్రయత్నం—ఇవే జీవితాన్ని సౌభాగ్యపథంలో నడిపిస్తాయి.
*****
భూగోళాన్ని శుబంధతత్త్వమగున్ భూక్తిస్వరారావనం
యోగామాయలుగానుపూజలగు యోగ్యంబు భక్తేయగున్
ప్రాగార్భంబుగనున్ శుభోదయముగన్ ప్రావీణ్య వి శ్వాసమున్
త్యాగంనిత్యమయంస్వరా
లయముగన్ తన్మాయ భావంబుగన్
🕊️ నాపథ్యభావం
శక్తి ఉందని సృష్టిని పట్టుకోవాలనుకునే అహంకారం
అదే సృష్టిని మోసే ధర్మబలాన్ని గ్రహించలేకపోతుంది.
రావణుడి భుజబలం ఒక క్షణం భూగోళాన్ని కదిలించాలనుకుంటుంది,
కాని భూమి నిలిచేది బలంతో కాదు — ధర్మంతో.
అధికారం కాదు సమస్య,
అధికారానికి వచ్చిన అహం సమస్య.
పట్టుకోవాలనే వాంఛ పతనానికి దారి,
కాపాడాలనే త్యాగమే శాశ్వత విజయం.
లోకాన్ని జయించాలనే బలమే రావణత్వం
లోకాన్ని నిలుపాలనే ధర్మమే రామతత్త్వం
*****
చెం.
కరువుల వల్ల బాధలగు కాల మహత్త్య మనస్సు విశ్వమున్
తరువులు భస్మమేయగుట దాహపునగ్నిగతీరు యుండగన్
చెరువులునిండగాబతుకుచిత్తముతీరుగనీరుగన్
పరువుగజీవమేబతుకుపాఠ్యమునిత్యముసత్యమేయగున్
భావార్థం:
కరువుల వల్ల కలిగే బాధలు కేవలం కాలానికి సంబంధించినవే కాక, విశ్వమంతటా మానవ మనస్సుపై ప్రభావం చూపుతాయి. దాహాగ్నితో తగులబడిన అడవులు భస్మమయ్యే విధంగా, జీవనంలో అసమతుల్యత పెరిగినప్పుడు ప్రకృతి కూడా క్షీణిస్తుంది. కానీ చెరువులు నిండితేనే జీవితం నిలుస్తుంది—అలానే మనస్సు కూడా కరుణ, సమత, జాగృతితో నిండినప్పుడు జీవితం సాగుతుంది. గౌరవంతో జీవించడం, జీవనాన్ని ఒక నిత్య పాఠంగా గ్రహించడం—అదే శాశ్వత సత్యం.
***†
చం.
పదమన వేడి నిచ్చెదియు భావము తృప్తియు వాక్కు చల్లగన్!
పదమను గమ్య తియ్యగను  భావనలన్నియు బుద్దిగా యగున్
పదపదమందు కాఫియగు బ్రహ్మమగు యుక్తము దర్శనమొంద గల్గు, ఆ
పదము పదార్థపానియము బ్రహ్మమె తృప్తిగ కాఫి నిత్యమున్
🌿 పద్య భావార్థ విశ్లేషణ
👉 సరైన పదం (వాక్యప్రయోగం) మనసుకు వేడి ఇస్తుంది — అంటే ఉత్సాహం, జీవస్పూర్తి కలిగిస్తుంది.
అదే సమయంలో ఆ పదం లోని భావం తృప్తిని ఇస్తుంది;
వాక్కు మాత్రం చల్లగా, సమతుల్యంగా, శాంతిగా ఉండాలి.
➡️ భావోద్వేగం + శాంత వాక్చాతుర్యం = సత్ప్రసంగం.
👉 పదమే గమ్యం అయితే — అంటే మాటే లక్ష్యమైతే —
అది తియ్యగా, సారవంతంగా ఉంటే
మన భావనలన్నీ బుద్ధిగా, స్పష్టంగా, వివేకంతో ప్రవహిస్తాయి.
➡️ సరైన పదప్రయోగం ఆలోచనలకు దారి చూపుతుంది.
👉 ప్రతి పదంలోనూ కాఫీ లాగా —
రుచి, వేడి, సుగంధం కలగలిసినట్లే —
ప్రతి పదంలోనూ బ్రహ్మతత్త్వం దర్శించవచ్చు
అది యుక్తితో, అవగాహనతో చూసినప్పుడు.
➡️ సాధారణ పదంలోనే అసాధారణ సత్యం.
👉 పదం = పాత్ర
పదార్థం = అర్థరసం
అదిని పానీయంగా స్వీకరించినప్పుడు
అది బ్రహ్మానుభూతిగా మారుతుంది —
నిత్యం తృప్తినిచ్చే కాఫీలా ☕
➡️ జ్ఞానం రోజూ త్రాగవలసిన అమృతం.
🌸
ఉ.
మారెడి లోకమందు గతి మాయకు చిక్కియు జీవ నంబుగన్
మూరెడు పూల తీరుయగు ముందర కాళ్లకు బంధమే యగున్
చేరియు సఖ్యతా భవము జాగృతి తీరుగ జూచు కాంత సా
కారమె కారణంబగు సుఖప్రద జీవనశైలికెప్పుడున్
భావార్థం:
ఈ మారుతున్న లోకంలో జీవితం మాయలో చిక్కి దారి తప్పే అవకాశముంది. పూదోటలో విరిసిన పువ్వు ల్లా కనిపించే ఆకర్షణలు ముందే మన కాళ్లకు బంధాలుగా మారతాయి. అలాంటి పరిస్థితుల్లో నిజమైన సఖ్యత, మైత్రీ, జాగృతి కలిసిన దృష్టి ఉన్న సద్బుద్ధి గల మార్గదర్శకుడు (కాంతసాకారం) మనకు కారణభూతుడై నిలుస్తాడు. అటువంటి చైతన్యమే కారణమై, చివరకు సుఖప్రదమైన జీవనశైలిని అందిస్తుంది.
****

మ. కో.

 లొకికంబగు జీవనంబున లోలనత్వము తప్పదే 

చాకిరేగతి మాయనందున చాకచక్యము తప్పదే 

వాకిలేవిధి కాలమందున వాక్కుతీరున తప్పదే

కాకిపిల్లను కోకిలమ్మయె కాంచె ముద్దెడి ప్రేమతో 

 పద్యం 👏

లోకజీవన సత్యాన్ని మృదువైన ఉపమతో చెప్పేశారు.

సరళ భావార్థం ఇలా చూడొచ్చు:

లోకికమైన జీవనంలో

చంచలత్వం (లోలనత్వం) తప్పదు — అది సహజం.

కార్యచరణలో, జీవన పోరాటంలో

మాయలు–మలుపుల మధ్య చాకచక్యము అవసరమే.

కాలమే విధిగా నిలిచిన ఈ ప్రపంచంలో

మన మాటల తీరు కూడా తప్పక మారుతుంది, జాగ్రత్త కావాలి.

అయితే —

కాకిపిల్లనైనా కోకిలలా చూసి

ముద్దు పెట్టే ప్రేమ ఉంటే

జీవిత కఠినత అంతా కరిగిపోతుంది.

****

: చెం.

అదుపున యున్నకాంతిగ అక్కర శాంతిగ మాట నేర్పుగన్ 

అదుపున తిండిలేనియడ ఆత్రము రోగము తీరు యేయగున్ 

అదుపున పాఠ్యమేపఠన శ్రద్ధయుజీవన సత్యమే యగున్ 

అదుపున ధైర్యయుక్తిగను ఆశ్రయమౌను సంపదే యగున్

భావార్థం / విశ్లేషణ:

అదుపున యున్న కాంతి → వెలుగు కూడా నియమంలో ఉంటేనే

అది అక్కరైన శాంతి, మాటల్లో నేర్పుగా మారుతుంది.

(అతిశయమైతే కాంతే అంధకారమవుతుంది అన్న సూచన)

అదుపులేని తిండి → ఆశ నియంత్రణ లేకపోతే

అది ఆత్రము, చివరకు రోగంగా పరిణమిస్తుంది.

అదుపుతో పాఠ్యపఠనం → శ్రద్ధతో కూడిన విద్య

జీవనానికి సత్య మార్గంగా నిలుస్తుంది.

అదుపుతో కూడిన ధైర్యం → అహంకారం కాదు,

అది జీవితానికి నిజమైన ఆశ్రయం, శాశ్వత సంపద అవుతుంది.

👉 మొత్తం పద్యం చెప్పేదొకటే:

అతిలోకమూ కాదు, అతి త్యాగమూ కాదు —

“అదుపు”నే జీవన సౌందర్యం.

***-

: చెం.

పొదలుగనేపురంబుగను పొద్దు మహత్యముగాను శోభలే 

సొదలుగనౌనుకాపురము సొమ్ముయు సోదియు చేర్చు కాలమే 

వ్యధలుగనౌను జీవనము వ్యాధిగ ధర్మము సత్య వైనమే 

కథలుగనేమనస్సుకళకావ్యపుతీరుగసర్వ మేయగున్

 భావార్థం —

పొదలు, పూలు, పట్టణాలు—అన్నీ ఉదయకాల మహిమతో శోభిస్తాయి. అలాగే గృహజీవితం కూడా సంపద, సుఖం, బంధాలతో కాలానుగుణంగా విస్తరిస్తుంది.

కానీ అదే కాలం, జీవనంలో వ్యధలను, వ్యాధులను కూడా తెస్తుంది. అయినా ధర్మం, సత్యం మాత్రం శాశ్వతమైన విలువలుగా నిలుస్తాయి. ఈ అన్ని అనుభవాలే మనస్సును కథలుగా, భావాలుగా మలిచి జీవితాన్ని ఒక కావ్యంలా తీర్చిదిద్దుతాయి— అందుకే సర్వమూ జీవనకథే.

*****

ఉ.

: హారిగ విశ్వమాయల విహారిగ సర్వ సమాన దైత్య సం 

 హారిగ శక్తి యుక్తిగను హారిగ ధర్మము సత్యమే మనో 

హారిగ సమ్మతే బలము యానతి హృద్యము సర్వ శక్తిగన్

హారిగ సమ్మతంబుగను హవ్య భవంబుగనౌను హారికిన్ 

🔹 పద్య భావార్థం

→ హరి (దైవ తత్త్వం) ఈ సమస్త విశ్వమాయలలో విహరిస్తూ,

అన్నిటినీ నియంత్రించే అంతర్వ్యాప్త శక్తిగా నున్నవాడు.

→ దేవతలకైనా, దైత్యులకైనా సమాన దృష్టితో ఉండి,

అధర్మ రూపమైన దైత్యత్వాన్ని మాత్రమే సంహరించే న్యాయమూర్తి.

→ హరిలో శక్తి, యుక్తి (వివేకం) రెండూ సమంగా ఉన్నాయి;

ఆయన ధర్మమే మనస్సుకు పరమ సత్యంగా నిలుస్తుంది.

→ హరి సమ్మతి పొందినదే నిజమైన బలం;ఆయన ఆజ్ఞ హృదయంలో స్థిరపడితే, అది సర్వశక్తిగా మారుతుంది.

→ హరి అనుమతి కలిగిన కార్యమే యజ్ఞఫలంగా, పవిత్ర ఫలితంగా సాధకునికి (హారికిన్) పరిపక్వమవుతుంది.

🔹

 ఉ.

శీలి మనోవిశాలని వశీకృత మాలిని విద్య వాహినీ

పాలికి నిర్ణయీ నళిని భావ్యత కీర్తిని భూజయుగ్మ సం 

చాలిని చిన్మయా సరళి చక్ర మయంబగు మాలికీయగున్ 

మూలిక సర్వరోగమయ ముక్తశిలా మహి తీరుయేయగున్ 

భావార్థ వివరణ:  –శీలసంపన్నమైనది, విశాలమైన మనస్సును ప్రసాదించేది ఆమె.  వశీకృత మాలిని విద్య వాహినీ – మనసును తనవశం చేసుకునే మాలిక (మంత్రశ్రేణి) రూపిణి; విద్యను ప్రవహింపజేసే శక్తిస్వరూపిణి.  –భక్తుల పక్షాన స్పష్టమైన నిర్ణయాన్ని ఇచ్చేది;నళినీ (పద్మసమాన సౌందర్యం కలది);గౌరవం, కీర్తి అనే సంపదలను పాదయుగ్మంతో ఆశీర్వదించేది. –చలనం కలది (శక్తిరూపిణి); చిన్మయ సరళిగా (జ్ఞాన ప్రవాహంగా) చక్రరూపమైన మాలికగా ప్రకాశించేది. – సర్వరోగాలకు మూలికలా ఔషధమై, బంధనాల నుంచి విముక్తి ఇచ్చే శిలలా, భూమిపై మోక్ష మార్గాన్ని ప్రసాదించేది.

*****

 ధరణీతత్త్వము ధర్మయుక్తము గనున్ ధన్యత్వ సిద్దీ నిరం

తర మాయామహిమా మహత్త్యముగనున్ స్థానంబు నిర్వార్ధ మున్ 

స్థిరసందర్భము సర్వవేళలుగనున్ శీఘ్రoబు వాత్సల్యమున్

ధరవిద్యాబల కాల ధన్యతలగున్ ధ్యానంబు ధైర్యంబుగన్ 

ఈ భూమి స్వభావమే ధర్మమయమైనది. ఆ ధర్మానికి అనుగుణంగా నడిచే జీవనమే నిజమైన ధన్యతను, సాఫల్యాన్ని ఇస్తుంది. ప్రపంచమంతా మాయామహిమతో నిండినదే. అయినా, అందులో మనిషి పొందే స్థానం—అహంకారరహితంగా, అర్థవంతంగా ఉన్నప్పుడే విలువైనది. కాలం ఏ సందర్భంలోనైనా, స్థిరత్వం మరియు వాత్సల్యం (కరుణ, ప్రేమ) ఉంటే జీవన ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది. భూమి జ్ఞానం, కాలబలం—all ఇవన్నీ ధ్యానం మరియు ధైర్యం కలిసినప్పుడు మనిషికి నిజమైన ధన్యతగా మారతాయి.

****

097,భారత రాజ్యాంగ గణ తంత్ర దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు:: అంత్యనుప్రాస భావ గీతం 

పల్లవి

గణతంత్ర రాజ్యమా… ప్రజాస్వామ్య భోజ్యమా

పవిత్ర సామ్యవాద స్వప్నమా… లేక నయావలస మోసమా

వందేమాతర నాదమా… విరిగిన పేదల శ్వాసమా

భారత దేశమా… నా దేశమా… నీ నిజరూపమెదురుమా

చరణం – 1

సహజ వనరుల సందోహమా… నమ్మ నాయకుల విద్రోహమా

శిఖరాగ్ర విష్పోటన తేజమా… జన బలహీనత దాస్యమా

ఘన చరితల సంస్కృతి దేశమా

కులమతాల ప్రకృతి భాష్యమా

సామ్యవాద విశ్వమయ రాజ్యమా

కుల మత శఖ్యతా భారత దేశమా

చరణం – 2

వీర ధీర స్వరాజ్య త్యాగమా… రక్త తర్పణ యజ్ఞమా

కార్మిక కర్షక జన ప్రగతి పథమా

జీవ అను రిక్త హస్తమా

కూడు గూడు లేని పేదల రాజ్యమా

ధన మధ కామాంధుల దాదాగిరి దేశమా

అంద చందాల స్వాతంత్ర భావమా

మంది వందేమాతర పవిత్ర గీతమా

చరణం – 3

చట్టాలంటే బాధ్యత దేశమా

శిక్షలంటే భయముగా రాజ్యమా

సత్య ధర్మాల శాంతి కపోతమా

వేద జ్ఞాన ప్రబోధాల సంకేతమా

పతాక రెపరెపలతో నినదించెనా

జై జవాన్ జై కిసాన్ కలకలలతో

బ్రిడ్జ్ (ఆవేశ భాగం)

శాంతి సహన అహింసలతో

శత్రువుల గుండెల్లో ప్రళయాగ్నితో

నిలిచిన దేశమా… నడిచిన దేశమా

ప్రశ్నించే ప్రజలే నీ ప్రాణమా

పల్లవి (పునరావృతం)

గణతంత్ర రాజ్యమా… ప్రజాస్వామ్య భోజ్యమా

పవిత్ర సామ్యవాద స్వప్నమా… లేక నయావలస మోసమా

ముగింపు (ఆహ్వానం)

నా దేశ ఘన చరితను తెలుపుమా

ఘన ప్రజాస్వామ్య భవిత నిలుపుమా

ప్రశ్నించే హక్కును కాపాడుమా

భారత దేశమా… మమ్మల్ని నడిపించుమా

****

98.

నేను ఎప్పుడు మనస్సును కాదు, 

నేను ఎప్పుడు బుద్ధిని కాదు, 

నేను ఎప్పుడు అహంకారాన్ని కాదు, 

నేను చిత్తాన్ని అంతకన్నా కాదు.


(నాకు పంచేంద్రియాలతో (వినడం, రుచి, వాసన, చూపు, స్పర్శ) సంబంధం లేదు. ఆకాశం, భూమి, నిప్పు, గాలి, నీరు వంటి పంచభూతాలూ నేను కాదు.)  నేను కేవలం సచ్చిదానంద స్వరూపుడైన శివుడిని. *శివోఽహం* (నేనే శివుడిని) *శివోఽహం* (నేనే శివుడిని)  నేను ఎప్పుడు ప్రాణాన్ని కాదు. నేను ఎప్పుడు పంచ వాయువులను కాదు. ఐదుఎప్పుడు కోశాలూ నేను కాదు. శరీరంలో గల ఏడు ధాతువులు నేను కాదు.  (మాట్లాడటం, పట్టుకోవడం, నడవడం వంటి కర్మేంద్రియాలూ నేను కాదు. నేను కేవలం మంగళప్రదమైన శివుడిని.) *శివోఽహం* (నేనే శివుడిని) *శివోఽహం* (నేనే శివుడిని


 నాకు ఎవ్వరిపై ద్వేషం లేదు, 

నాకు ఎవ్వరిపై అనురాగం లేదు. 

నాకు ఎవ్వరిపై లోభం (పిసినారితనం) లేదు,

మోహం లేదు. మదం (గర్వం) లేదు, మాత్సర్యం (అసూయ) లేదు. 

(ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలతో నాకు పని లేదు. నేను కేవలం జ్ఞాన స్వరూపుడైన శివుడిని.

*శివోఽహం* (నేనే శివుడిని) *శివోఽహం* (నేనే శివుడిని))


 నాకు ఎప్పుడు పుణ్యపాపాలతో సంబంధం లేదు, 

నాకు ఎప్పుడు సుఖదుఃఖాలతో పని లేదు. 

నాకు ఎప్పుడు మంత్రాలు, తీర్థయాత్రలు,పనిలేది

 వేదాలు, యజ్ఞాలు ఏవీ నేను కాదు. 

(నేను అనుభవించేవాడిని (భోక్త) కాదు, అనుభవించబడే వస్తువును (భోజ్యం) కాదు, అనుభవించే క్రియను (భోజనం) కాదు. నేను కేవలం ఆనంద స్వరూపుడైన శివుడిని.

*శివోఽహం* (నేనే శివుడిని) *శివోఽహం* (నేనే శివుడిని))


 నాకు ఎప్పుడు మృత్యువు లేదు, 

నాకు ఎప్పుడు జాతి భేదాలు లేవు. 

నాకు తండ్రి లేడు, తల్లి లేదు, అసలు జననమే లేదు. 

నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యుడూ లేడు.

( నేను కేవలం పరిపూర్ణమైన శివుడిని. ఇందులో ఎటువంటి సందేహము లేదు.

*శివోఽహం* (నేనే శివుడిని) *శివోఽహం* (నేనే శివుడిని))


నేను ఎప్పుడు మార్పు లేనివాడిని. 

నేను ఎప్పుడు ఆకారం లేనివాడిని.  

నేను అంతటా వ్యాపించి ఉన్న వాడిని. 

నేను అన్ని ఇంద్రియాలలోనూ

దేనికీ అంటుకోనివాడిని. 

(నాకు దేనితోనూ సంబంధం లేదు 

(Attachment లేకపోవడం). నాకు మోక్షం కావాలి అని కోరను.

నేను ఇంద్రియాలతో కొలవడానికి లేదా తెలుసుకోవడానికి వీలయ్యే ఒక వస్తువును కాదు. ఇంకా చెప్పాలంటే: "నేను అన్నిటికీ అతీతమైన, స్వయంగా ప్రకాశిస్తున్న చైతన్యాన్ని.”

*శివోఽహం* (నేనే శివుడిని) *శివోఽహం* (నేనే శివుడిని))


ఆధారం మూలరచయిత.. అదిశంకరాచార్యుల *నిర్వాణ షట్కమ్*

099.సార్థకనామ గణాక్షర వృత్తము "నవ్య" 

*

ఈవృత్తము చిత్తవిలాసితము అని పేర్కొనబడినది. 

*

చిత్తవిలాసిత (నవ్య) - III IU IUU = IIII UIUU 

*

బ్రతుకొక బాట గాదా, బ్రతికిన నాడు దేవా

వెతుకుట కేమి లేదా, వెతికిన వాడు దేవా

స్మృతులిఁక లేనివేనా, స్మృతులను జూపు దేవా

చితులను బూదియేనా, చిత్తముయు తీరు దేవా

*

నను దను మఱ్చెనేమో, నను విధి జేర్చు దేవా

మనసున నుండనేమో, మనసుయె చెండు దేవా

వనజము వాడెనేమో, వలపుల పండు దేవా

దినమిఁక చీఁకటేమో, దినమొఖ వార్త దేవా

*

సుమమున కాఱు రేకుల్, సుఖమున చేర్చు దేవా

హిమములు రాలు పూవుల్,  హిమమున జార్చు దేవా

రమణికి ముగ్గు ప్రీతుల్, రమణికి సిగ్గు దేవా

రమణము శీత రీతుల్, రమణము రమ్య దేవా

*

మనసు వసంత మెప్డో,  మనసు పసందు దేవా

మనకు వసంత మప్డే,  మనకు సుఖంబు దేవా

దినమది నవ్యమేగా,  దినమిది భవ్య దేవా

మనసది భవ్యమేగా,  మనసది దివ్య దేవా

*

విధేయుడు - మల్లా ప్రగడ రామకృష్ణ

*100..అనుష్టన్ 


శ్రీ సూర్య నారాయణ అదితి కశ్యప సంతృప్తిపుత్రన్

మునిగణ జన భువి రక్ష ప్రత్యక్ష దైవమా! రవిన్


లోలార్క దేవతా దేవ! జీవుల పోషణ కర్తన్

సంజ్ఞా ఛాయా రజనీ ప్రభలకును పతివి సూర్యగన్ 


నీ కిరణముల తోడ జీవకోటి పోషణ కర్తగన్ 

భూజన లంధకారమున్ నాశముజేసి అందమున్


నిచ్ఛాదుకొనే సూరుడన్ సర్వేశ్వరుడవై మింటన్

వెలుగుచు కాంతినిచ్చున్ అష్టైశ్వర్య ప్రదాతవున్


కాలపు సత్య పథగన్ జీవన కాంతి దర్శనన్

భాగ్య! ఆదర్శమూర్తిన్ నీవు లేకున్న సర్వమున్


జీవరాశి యల్లాడుటన్ భానుడ నీదు వెలుగుల్ 

నవ్వులజల్లుల్, సంతసమ్  కలిగించే మూర్తి సదా


నమస్కారములిడుదున్ మది యానందము కల్గున్

భక్తితో ప్రార్ధనన్  నీకున్ నిత్య సత్యమై వేడె దన్


 శ్రీ సూర్యనారాయణ లోక రక్షగా దైవ చూడామణి 

***

101.చంద్రమౌళి (గవ్య) - ర/య UIUIUU 

*

రమ్ము గవ్యనాథా రమ్ము సత్యనాథా 

రమ్ము చంద్రమౌళీ రమ్ము వేగ కాలీ 

రమ్ము విశ్వధారీ రమ్ము యోగ నేత్రా

రమ్ము ధర్మతేజా రమ్ము విశ్వ నాధా


వెన్నెలమ్మ నీవే వన్నెలమ్మ నీవే 

కన్నె లమ్మ నీవే కన్ను లమ్మ నీవే

కన్నులందు నీవే నన్ను జూడ రావే 

వెన్ను తట్టు నీవే మెన్ను జూప రావే


హంసవాహనా వి-ద్వాంస మానసాబ్జా  

సంశయమ్ము వద్దే -యంశ మొక్కటీవే 


వీణ మీటగా నా వేణు వూఁద రారా 

స్నానమాడుదా మాగానవార్ధియందే

గానమాటగా నా గీత భా వమేలే 

మౌన వేటుగా నా మౌఖ్య రాగమేలే 


*

*102

చంద్రమౌళి (గవ్య) - ర/య UIUIUU 

*

రమ్ము గవ్యనాథా రమ్ము సత్యనాథా 

రమ్ము చంద్రమౌళీ రమ్ము వేగ కాలీ 

రమ్ము విశ్వధారీ రమ్ము యోగ నేత్రా

రమ్ము ధర్మతేజా రమ్ము విశ్వ నాధా


వెన్నెలమ్మ నీవే వన్నెలమ్మ నీవే 

కన్నె లమ్మ నీవే కన్ను లమ్మ నీవే

కన్నులందు నీవే నన్ను జూడ రావే 

వెన్ను తట్టు నీవే మెన్ను జూప రావే


హంసవాహనా వి-ద్వాంస మానసాబ్జా  

సంశయమ్ము వద్దే -యంశ మొక్కటీవే 


వీణ మీటగా నా వేణు వూఁద రారా 

స్నానమాడుదా మాగానవార్ధియందే

గానమాటగా నా గీత భా వమేలే 

మౌన వేటుగా నా మౌఖ్య రాగమేలే 


*

103.

గణములు - జ,య,లఘువు,న,త ( IUI IUU IIII UUI )

యతి- 8


సుఖాలు  వినోదం అసురిగ మార్చేను 

భయమ్ము సుఖమ్మే అభయము మార్చేను

గులాబి జిలేబీ రుచులను చూడాలి

కులాలు మతాలూ మనుషుని ప్రేమించు


అలాగే  యిలాగే కలలగు పంతాలు

ఎ మాయో ఎ రోగం తెలియుట తంతూలె

నసాధ్యము గాకుండ నడుగు నీ సేవ

 అసాధ్యము ఏకంగ సమము చెయ్యాలి


సకాలము రాగాలు సుమధు రా లేలు 

ప్రమాణము గానుండు పలుకులే రాల్చు

సమానము గా నుండు సుఖములే పంచు

ప్రయాణము లో సంతసమును పెంచే ను       

                    

అకాలం మనస్సే లె మధుర రాగాలు

వికారం ఎనాడో లె వినని  భావాలు 

యుగాలలొ పాఠాల యునికి భాగాలు 

మనుష్యులలో ప్రేమ మమత బంగారు

*****

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

104..త త త గ గ 


నిన్నే కదా దల్తు నిత్యమ్ము నాలో 

కృష్ణా యనే కొల్తు సత్యమ్ము గానే

కన్నా విరాగమ్ము గాఢమ్ము నాలో 

మున్నా నిదానమ్ము మూలమ్ము గానే


పున్నాగ గంధమ్ము మోదమ్ము నాఁడే  

మన్నింపు మోహమ్ము కాలమ్ము గానే

పన్నీటి యానంద వర్షమ్ము నాలో 

కన్నీరు వైనమ్ము దాహమ్ము గానే


ఈనాటి యీరాత్రి యేకాంతమేగా

జ్ఞానమ్ము యీ ధాత్రి సాకమ్ము గానే

ఆనాఁటి యారాత్రి యందమ్ము నాలో 

ప్రాణమ్ము విశ్వాస మౌనమ్ము గానే


ఆనంద రాగాల హర్షమ్ము లేదే 

ప్రాణంబు దాహంబు మూలమ్ముగానే

కానంగ నీనాఁడు కష్టమ్ము నాలో 

వైనంబు సయ్యాట నష్టమ్ము గానే


ఈనా విషాదాభ్ర మెప్డంతమౌనో 

నూనా నిషా దాద్ర సేమమ్ము గానే


హూనమ్ము మేనే వియోగమ్ము నాలో 

జ్ఞానమ్ము మేలే నియోగమ్ము గానే


సానందమే లేని సమ్మోహనమ్మా 

ధ్యానమ్ము మూలమ్ము దమ్మేయుగానే

ఏనుంగు మేఘాల యీరమ్ము నాలో 

క్షేమ్మమ్ము మార్గమ్ము తీర్ధమ్ము గానే

*****

105..స జ స.. స జ స.. స స స స..స  జ స


మన మందు ఒప్పు మనకే దినమందు వాక్కు ప్రజకే కనువారెవరో, వినువారెవరో మన లేనివారు మనకే 


 పలు కాయ దిక్కుమనకే అలు కాయ మొక్కు ప్రజకే

 పలుకారెవరో అలుకారెవరో  పలుకేది వారు మనకే


 మన రాజధాని మనకే మన మంత్రి గీము ప్రజకే 

 వినుమీ కథనే దినమీవ్యధనే మనవాడి కాశ మనకే 


 రుణమాయ జీవి మనకే క్షణమాయ దివ్య ప్రజకే

 రుణమాయగనే క్షణమాయగనే రుణమైనవారు మనకే


*****

106.స స స స స స స స స స స స స....


కలలో దను రమ్మనె రా 

 తెలుగే యిక లేదనె రా 

 తెలుగెక్కడనో 

 వెలుగెక్కడనో 

 కలగాపులగం మని రా 


 మనమే దయచూపుము రా 

 మనసే యిక నుంచుము రా 

 మానసెక్కడనో మనమెక్కడనో 

మనమే కలిసే గదరా 


 జగమే జపహోమమురా 

 మగువే ఇక ప్రేమమురా 

 జగమెక్కడనో

 మగువెక్కడనో

 జగమే మగువే గదరా 


 కలలే భవ బంధమురా 

 వలపే సుఖ చిహ్నమురా 

 కల లెక్కడనో

 వలపేక్కడనో 

 కలలే వలపే గదరా 


 భవుడే బవ నేస్తము రా 

 దృవులే సుఖ బంధము రా 

 భవుడెక్కడనో 

దృవు లెక్కడ నో 

భవుడే దృవులే గదరా 


మీ విధేయుడు 

మల్లాప్రగడ రామకృష్ణ

107..భ భ భ భ ర స ల గ.. 12


విశ్వనిరoతర యానము విద్యవిశాల తత్త్వ శుభంబులే

విశ్వమయంబగు ప్రేమ ప్ర యాన నిదాన మార్గ శుభంబులే

విశ్వ ప్రదక్షణ గమ్యము గుర్తు వినమ్రతా కలలౌనులే

విశ్వ జయంబగు ధర్మము సత్య విభావ తత్త్వశుభంబులే


అక్షరమన్నది నేర్వగ నట్టి యనంత లక్ష్యముగానులే 

రక్షర యర్భక డైనను విద్య రకంబు దాహమనంబులే 

అక్షయ మేయనిపించువిధాన పరంబుగా జయమివ్వులే

శిక్షణ వీలుగ చిత్రము దృశ్య విభావ మౌనమయంబులే


పూలకు రంగులు గావిరబూ య పురంబుగాశుభమేనులే 

మాలల తీగల బాలలు జూపు మనస్సు మైమరపేనులే 

లాలన జేరియు భావముగా ను లయంబులౌకికమౌ నులే

పాలన జేయుచు మెచ్చిన భాగ్య పధంబు పౌర మయo బుగన్


మీ విధేయుడు 

మల్లాప్రగడ రామకృష్ణ

ఫేస్బుక్ వారు సహకరిస్తే నారచనలు ఇందు ఉంచెదను

108. మౌక్తిక - ర/య/జ/గ UIUIU . UIUIU


మాయలో సదా మానసమ్మురా

ధ్యేయమే సదా ధ్యానసమ్మురా

ప్రేయసీ సదా ప్రేమనమ్మురా

ప్రాయమే సదా పావనమ్మురా


ప్రాణమే మది యీ బద్ధకంబురా

జ్ఞానమే విధి యీ జాతకంబురా

మౌనమే నిధి యీ మానసంబురా

మానలేనిది యీ మాదకమ్మురా


కాన చున్నదే కమ్మ నవ్వురా

జ్ఞానమన్నదే జాతి నందురా

దానమన్నదే దారిచూపురా

మౌనమన్నదే మోహనమ్మురా


ఉల్లిపాయలే ఉత్తమమ్మురా 

చిల్లిపెంకులే శ్రీవరమ్మురా 

యుల్లమoదులే యున్నతమ్మురా

జల్లువానలే జాతికంతరా


ఉల్లిపాయ నీ యుల్లమౌనురా 

తల్లి పాలతో+ తద్భవమ్మురా 

నల్లి లాగనే నాన్చకుండురా

మల్లి జాజులే మానసమ్మురా 


పాయనొల్చఁగా+ పాయ వచ్చురా 

కాయనొల్చఁగా+ కాయ వచ్చురా 

ప్రాయ మివ్వగా పాసమవ్వురా

వ్రాయచుండగా వాక్యమోచ్చురా


ఒల్చ శూన్యమే యొప్పు నంతరా

మల్చ నిద్దియే మన్కి నమ్మురా 

మింట శూన్యమే మేను సున్న రా

కంట నశ్రువే కామలమ్మురా


సమ్మతమ్ము నీదే సరాగమే

నమ్మకమ్ము తోనే నమోనమో

మమ్మునమ్ము నీవే మనోప్రియా

వమ్ము చీమ్ము నీవే నమో నమో 


మీ విధేయుడు 

మల్లాప్రగడ రామకృష్ణ


🎶 వేమన జయంతి గీతం 🎶

పల్లవి:

అల్పుడెపుడు పలుకు పద్యం తప్ప

ఏమి రాని మనిషినే నేను

అక్షరమై అగ్ని జ్వాలై

సత్యమాడె వేమన నీవు

వేమన… వేమన…

వేమన జయ జయ వేమన…

చరణం – 1:

కులములేని గుణములాడే

గుడులు లేని దేవుడాడే

మాటలాడే మౌనమాడే

మనసు చదివే మహనీయుడే

చెట్టు నీడలో జ్ఞానమాడే

చేతి పనిలో ధర్మమాడే

పేదవాడి పలుకుల్లోనే

పెద్ద వేదం పెట్టినావే

పల్లవి:

అల్పుడెపుడు పలుకు పద్యం తప్ప

ఏమి రాని మనిషినే నేను

అక్షరమై అగ్ని జ్వాలై

సత్యమాడె వేమన నీవు

చరణం – 2:

పొగడలేని పువ్వులాంటి

పొగరు లేని పలుకులాంటి

నిజమొక్కటే నిలబెట్టిన

నిర్భయమైన నడక నీది

మతము కాదే మనిషి మేలు

ధనము కాదే ధర్మమూలం

అని బోధించు బాటసారే

అందరికీ ఆత్మబంధం

పల్లవి:

వేమన… వేమన…

వేమన జయ జయ వేమన…

చరణం – 3 (జయంతి భావం):

నేటి కాలం నిన్ను అడిగే

నాటి మాటే దారి చూపే

వేమన పలుకు వెలుగు దీపం

వెయ్యేళ్లకు మార్గసోపానం

అల్పుడైనా పలుకు సత్యం

అదే నీకు నివేదనం

జయంతి రోజు కాదు నాయనా

జీవితమంతా వేమనం

చివరి పల్లవి (మంగళం):

అల్పుడెపుడు పలుకు పద్యం తప్ప

ఏమి రాని మనిషినే నేను

నా మాటల్లో నీవే నడిచే

వేమన జయ జయ వేమన… 🙏

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ