31*05

 





మ. కో. సత్యవాక్కుల ధన్యతాభవ సామరశ్యము సంపదే

నిత్య శాంతియు విశ్వముందున నిర్మలంబగు శఖ్యతే

మత్య మందున సూక్తి భావము ముఖ్య తల్లియు తండ్రిగన్

పత్య జీవన కాపురంబున  పావనoబగు నిత్యమున్

సరళ భావం:

సత్యంగా మాట్లాడటం వల్ల మనిషికి గౌరవం, సంతోషం, మంచి సంబంధాలు లభిస్తాయి. నిత్య శాంతి ఉంటే ప్రపంచంలో స్నేహభావం, సఖ్యత పెరుగుతాయి. మంచి ఆలోచనలు, సూక్తులు తల్లిదండ్రుల వలె మనకు మార్గదర్శకంగా ఉంటాయి. కుటుంబ జీవితంలో హితమైన నడవడి, పరస్పర గౌరవం ఉంటే ఆ కాపురం ఎల్లప్పుడూ పవిత్రంగా, ఆనందంగా ఉంటుంది.

🙏🌹॥సత్యం, శాంతి, మంచి ఆలోచనలు, సద్వర్తన — ఇవే సుఖమయ జీవనానికి ఆధారాలు.॥🌹🙏

******

ఉ!!మా!


ఉ.జీవమనోమయంబుగతి చిత్తము పాసన జీవ ధర్మమున్ 

భావ సమోన్నతాభవము భారతి తత్వపు విద్యలేయగన్ 

సావధనంబుగన్ సమయసాధ్యమసాధ్యము సత్య వాక్కుగాన్ 

పావన మార్గమేబ్రతుకు పాద సు పూజ్యము తల్లి దండ్రిగన్ 

సరళ భావం

జీవితం మనస్సు, మాయ, చిత్తవృత్తుల ప్రభావంతో సాగుతుంది. జీవధర్మాన్ని సక్రమంగా అర్థం చేసుకోవడానికి ఉన్నతమైన భావాలు, జ్ఞానం, విద్య అవసరం. ఏది సాధ్యం, ఏది అసాధ్యం అన్న విషయాలను సమయోచితంగా, సత్యవాక్కుతో గ్రహించాలి. తల్లిదండ్రులను పూజ్యులుగా భావిస్తూ నడిచే పవిత్ర మార్గమే నిజమైన జీవనమార్గం.

*****మ. పతి ప్రత్యక్ష నుపాశ మందగుటయున్ పాఠ్యంబు ప్రేమ్మంబుగన్ 

సతి జీవుండుకు సాధనాకళలుగన్ సాధ్యంబు విశ్వాసమున్ 

పతిగాంచెన్ పరమాత్మలీల లగుటన్ ప్రావీణ్య తాభాగ్యమున్ 

సతి తత్త్వంబును గాంచ యీ శ్వరుని కైసంసార లౌఖ్యంబుగన్


సరళ భావం

భర్తను ప్రత్యక్ష దైవంగా భావించి సేవించడం ఒక ప్రేమపూర్వక సాధన. భార్యకు విశ్వాసమే జీవితసాధనకు ప్రధాన ఆధారం. భర్తలో పరమాత్మలీలను దర్శించగలిగినప్పుడు ఆ జీవితం మరింత సార్థకమవుతుంది. సతీతత్త్వాన్ని గ్రహించి ఈశ్వరార్పణ భావంతో సంసారాన్ని నిర్వహించినవారికి గృహజీవితమే సౌఖ్యప్రదమైన ఆధ్యాత్మిక మార్గంగా మారుతుంది.

****

బుర్ర బుర్రకు చిల్లు చిల్లుకు బూరెబూరెకు యర్ధమే 

చిర్రు బుర్రకు మోజు సంతస చిచ్చు బుడ్డికి మోక్షమే 

కర్రి యన్నను కాయమన్నను గాంచలేనిది కాలమే 

తొర్ర బుర్రయు తోడు నీడల తోలు తిత్తియు జీవితమ్

సరళ భావం

ప్రతి మనిషి తనబుద్ధి, తన అవగాహన, తనఅనుభవం మేరకే విషయాలను అర్థం చేసుకుంటాడు.

చంచల మనస్సు చిన్నచిన్న సంతోషాలకే మోజుపడుతుంది. కానీ వివేకం కలవాడు వాటిని దాటి ఉన్నతమైన లక్ష్యాన్ని అన్వేషిస్తాడు.

శరీరం బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా కాలగతిని ఎవరూ ఆపలేరు.

జీవితం క్షణికమైనది. చెట్టు తొర్ర, నీడ, తోలుతిత్తి (గాలితో నిండిన సంచి) వలె నిలకడలేని స్వభావం కలది.

****

కోయిల కూవసంతమధు కూడిక తీరుగ కూత వాక్కుగా

న్కోయిల కాలవర్ణన సపూజ్యత లక్ష్యము చెప్పగల్గగా

న్కోయిల సందడేసహన నోర్పగు గమ్యము తీర్పుగాయగన్ 

న్కోయిల కాలనీతిగను కూర్పు సమoబగు తీర్పు కోయిలే 

సరళ భావం :

వసంత ఋతువులో కోయిల కూయడం మధురమైన ఆనందాన్ని కలిగిస్తుంది. దాని కూత ప్రకృతి సందేశంలా వినిపిస్తూ కాలమార్పును తెలియజేస్తుంది. కోయిల స్వరం మనకు సహనం, సమయజ్ఞానం, నిరీక్షణ విలువలను గుర్తుచేస్తుంది. ప్రకృతిలో ప్రతి కాలానికీ ఒక క్రమం ఉన్నట్లే, జీవనంలో కూడా సముచితమైన కూర్పు, సమతుల్యత, తీర్పు అవసరమని కోయిల కూత బోధిస్తున్నట్లుగా కవి భావించారు.

****

అమితయశస్క ఆద్యయన ఇదృచి ఈశ్వర ఉగ్ర ఊర్జితక్రమ

ఋషభాంక ఋజుహర ఌస్థిత ౡస్మిత ఏకరుద్ర ఐంద్ర మహితరూప

ఓమితి పదద్యుతి ఔర్వలలాట అంబికా సమరసభావ

అఃకలివర్ణనుత బసవేశ పాహిమాం ॥


భావం :

అపారమైన యశస్సుగలవాడా!

ఆద్యస్వరూపుడా!

వేదజ్ఞానానుభూతికి గమ్యుడా!

ఈశ్వరుడా! ఉగ్రశక్తిసంపన్నుడా!

ఊర్జితక్రమంతో జగత్తును నడిపించువాడా!

ఋషభవాహనుడా! ఋజుత్వాన్ని తొలగించే దుఃఖహరుడా!

ఌకారతత్త్వములలోనూ స్థితుడా!

ఏకరుద్రస్వరూపుడా!

ఐంద్రాదిదేవతలచే మహిమనొందిన రూపుడా!

ఓంకారపద ప్రకాశస్వరూపుడా!

ఔర్వాగ్నిలా లలాటకాంతిగలవాడా!

అంబికాతో సమరసభావముగల పరమశివుడా!

అఃకారాంత పరబ్రహ్మస్వరూపుడా!

కలియుగంలో సద్భక్తులచే వర్ణింపబడువాడా!

ఓ బసవేశ్వరా! నన్ను కాపాడుము.

*****

భాషంటే మన గుండెఘోష కదిలే భాంధవ్య శబ్దంబుగన్ 

భాషంటే మన అమ్మ వాక్క గుటయున్ ప్రాణంబు గాశ్వాసగన్ 

భాషంటే మన తల్లి దండ్రులకళాప్రావీణ్య తాభావమున్ 

భాషంటే మనపాప పుణ్యములనున్ పాటించ సంసారిగన్ 

భావం :

భాష అనేది మన గుండె లోతుల్లో వినిపించే బంధుత్వధ్వని.

భాష అనేది మన తల్లి పలికిన తొలి మాట; అది మన ప్రాణానికి శ్వాససమానం.

మన తల్లిదండ్రుల కళా ప్రావీణ్యం, సంస్కారం, భావప్రపంచం భాష ద్వారానే తరలివస్తాయి.

మన పాపపుణ్యాలు, ఆచారవ్యవహారాలు, సంసారధర్మాలు—all భాష ద్వారా పాటించబడతాయి

******

విధినెంచేస్థితిలేదనేవిధముగావిశ్వాసంబు దేహంబుగా 

ఎదురైనావిధిసంఘవాళకముగన్ యేతెంచ దాహంబుగా 

మదిభావంబును చెప్పగల్గగలగన్ మర్యాద గాప్రేమయున్ 

గదికిన్ భక్తిని మ్రొక్కెగాంత గదిలో గాంతుండు హింసింపగన్

భావం :

విధి ఎలా నిర్ణయించిందో తెలియని స్థితిలో మనిషి తన శరీరాన్నే విశ్వాసానికి ఆధారంగా చేసుకుంటాడు.

ఎదురయ్యే సంఘటనల సమూహం దాహంలా మనసును వెంటాడుతుంది.

మనసులోని భావాన్ని మర్యాదతో, ప్రేమతో వ్యక్తపరచగలిగితేనే జీవితం సార్థకమవుతుంది.

అయితే గదిలో ఒంటరిగా ఉన్న మనిషి భక్తిని ప్రార్థించినా, అంతరంగంలోనే కలిగే హింస అతన్ని బాధిస్తుంది.

*****

చం. భగభగమండు నగ్నికళ పాఠ్యనరాలు సుఖంబు ప్రశ్నగన్ సెగవలెగాలి ధార్తిగనె చేష్టల నొక్కిడజేయు జుండ నా 

రగిలెడికోప తాపములురంగు విధంబుగవర్షధారలే 

సొగసుగ సేదదీర్చునటుక్షోభగ చల్లదనంబు పంచగా 

తాత్పర్యం: కోపం అగ్నిలాంటిది; అది ముందుగా తనను తాను దహింపజేసి తరువాత ఇతరులను బాధిస్తుంది. శాంతి వర్షధారలాంటిది; అది తనకూ, ఇతరులకూ ఉపశమనం కలిగిస్తుంది. అందువల్ల కోపాన్ని నియంత్రించి శాంతిని అలవరచుకోవడం జీవన సౌందర్యానికి మూలం 

*****

మ. నొక రోజే మనసంతగాయ మగుటన్ నోదార్పులేదేందుకో

నొకచింతావిధియాటగాసమరమున్ పూజ్యంబు యేకోరికో 

నొక మాయామది మర్మమేతనువుగాన్ క్షోభంబు యేదిక్కుగాన్ 

నొక కాలంబు మనోహరాయనుచునేపోరైన జీవమ్ముగాన్ 


భావం

ఒక్క రోజులోనే మనసు గాయపడిపోవచ్చు. అయితే ఆ గాయానికి ఉపశమనం ఎందుకు లభించదో అర్థం కాదు. ఒక చిన్న చింత కూడా విధి ఆడే ఆటవలె మారి, జీవన సమరంలో మనిషిని అలసటకు గురిచేస్తుంది. అయినప్పటికీ ఏదో ఒక కోరికను పూజ్యంగా భావించి దాని వెంట పరుగెత్తుతూనే ఉంటాడు.


ఈ జీవితం ఒక మాయ. మనసులోని మర్మం ఏమిటో, శరీరంలో కలిగే క్షోభకు మూలం ఏమిటో స్పష్టంగా తెలియదు. ఏ దిశలో ప్రయాణిస్తున్నామో కూడా తెలియని స్థితి ఏర్పడుతుంది.


అయినా కాలం మాత్రం తన గమనాన్ని ఆపదు. ప్రతి కాలాన్నీ మనోహరమని భావిస్తూ, ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ జీవితం ముందుకు సాగుతుంది. ఇదే జీవుని సహజస్వభావం.

*****

త. చదువు లేకను కాయ కష్టము సాక్షి తీరుగ జీవనమ్ 

అదుపులోనన ఉంచుకోకయు ఖర్చు తీరున కాలమున్ 

పొదుపు చేయక నీదువైనము భార మేయగు పోరుగన్ 

కుదుపు లుండుట బోదు కల్గియు కోర లేకయు మార్పుగన్ 

భావం

చదువు లేకపోయినా, కాయకష్టం జీవనానికి ఆధారంగా నిలుస్తుంది. శ్రమించే వానికి జీవనోపాధి లభిస్తుంది.

అయితే సంపాదన ఉన్నప్పటికీ ఖర్చులను అదుపులో ఉంచుకోకపోతే, కాలక్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

అలాగే పొదుపు అలవాటు లేకపోతే, భవిష్యత్తులో ఆర్థిక భారం పెరుగుతుంది. అవసర సమయాల్లో ఆధారం లేక కష్టాలు కలుగుతాయి.

జీవితంలో ఒడిదుడుకులు (కుదుపులు) సహజమే. వాటి గురించి తెలిసినా, మార్పు కోసం ప్రయత్నించకపోతే పరిస్థితులు మెరుగుపడవు.

******


ఉ. విఘ్నము లేనిజీవనము విజ్ఞత విస్మయ విశ్వ మార్గమున్

విఘ్నము శాంతిలేకయు సువిద్యలు గాంచని సర్వ మాయగన్

విఘ్నము గాని ధైర్యమది వింత బలంబు సహాయకొల్వుగన్

విఘ్నము గానుసాగుకళ నీకుగ నాకుగు చెప్పకల్గగన్


భావం


విఘ్నాలు లేని జీవితం ఉంటే, ప్రపంచాన్ని అర్థం చేసుకునే విజ్ఞత, అనుభవజ్ఞానం, ఆశ్చర్యపరిచే జీవన మార్గాలు పూర్తిగా తెలియకపోవచ్చు.


విఘ్నాలు లేకపోతే, శాంతి విలువ కూడా తెలియదు. కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విద్య, అనుభవం, వివేకం లభిస్తాయి. లేకుంటే జీవితం పైపై మాయగా కనిపిస్తుంది.


విఘ్నాలే ధైర్యాన్ని పెంపొందిస్తాయి. అవి విచిత్రమైన బలాన్ని ప్రసాదించి, మనిషికి సహాయకారులుగా మారుతాయి. ప్రతికూల పరిస్థితులే అంతర్గత శక్తిని వెలికితీస్తాయి.


విఘ్నాలను ఎదుర్కొంటూ ముందుకు సాగడమే ఒక కళ. ఈ జీవనకళ నీకూ, నాకూ, అందరికీ వర్తిస్తుంది; అనుభవమే దానిని నేర్పుతుంది.

మర్రిచెట్టు కొమ్మకు 60 వేల మందా అందునా తలకిందులుగానా !

.............................................

మర్రిచెట్టు కొమ్మకు 60 వేలమందా అందునా తలకిందులుగానా !

 

ఎలాగో  తెలుసువాలంటే  సమాచారం పూర్తిగా చదవల్సిందే. కాస్తా ఎక్కువగానే వుంది, అయితేనేమి బాగుంది.


తిరునెల్వేలి జిల్లాలోని తిరుక్కురుంగుడి అళగియ నంబి పెరుమాళ్ ఆలయ గోపురంపై చెక్కబడిన ఈ అద్భుతమైన శిల్పం నాయక శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది.ఇది మహాభారతంలోని గరుడపరాక్రమ ఘట్టాన్ని సజీవంగా కళ్లకు కడుతున్నది. అమృతాన్ని దేవతలనుండి సాధించి సవతితల్లి అయిన కద్రువకు దాస్యం చేస్తున్న తన తల్లి వినతను విడిపించడం కోసం గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతున్న భంగిమలో ఈ శిల్పం మలచబడింది.


గరుడుడు ధర్మానికి కట్టుబడినవాడు. అపారమైన బలంకలవాడు. ఈ శిల్పంలో గరుడుని శరీరం మానవరూపంలో ముఖం గరుడపక్షి ముక్కుతో విశాలమైన రెక్కలు పూర్తిగా విప్పార్చుకుని గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్తున్నట్లుగా అత్యంత కమనీయంగా చెక్కారు. తన కాలి పంజాల్లో ఒక ఏనుగును ఒక తాబేలును పట్టుకుని గరుడుడు ఉన్నాడు.అవి నిజానికి పూర్వజన్మలో వారసత్వ ఆస్తి కోసం దురాశతో కొట్టుకున్న విభావసుడు సుప్రతీకుడు అనే సోదరులు.వారు శాపవశాన జంతు రూపాలు పొందినవారు. ఈ కథకు మరింత ఉత్కంఠను జోడిస్తూ గరుడుడు తన ముక్కుతో ఒక పెద్దమర్రి చెట్టు కొమ్మను కూడా మోస్తున్నట్లు చెక్కబడింది.ఆ కొమ్మ అమితమైన బరువుకు విరిగిపోయే సమయంలో దానికి వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలఖిల్య ఋషులు ఉన్నారని గరుడుడు గ్రహించాడు. వారు కిందపడి మరణించకుండా కాపాడటం కోసం గరుత్మంతుడు ఒకేసారి ఆ భారీ కొమ్మను ఏనుగును తాబేలును మోస్తూ ఆకాశంలో ఎగిరాడు.ఇది అతని బలానికి కరుణకు ప్రతీక. శిల్పంలో గరుడుని అలంకారాలు నాయక కాలం వైభవాన్ని తెలియజేస్తాయి. తలపై కిరీటమకుటం రత్నాల పొదిగినట్లు సూక్ష్మమైన చెక్కడాలతో ఉంది. చెవులకు మకర కుండలాలు మెడలో మూడు వరుసల కంఠహారాలు వాటి మధ్యలో కౌస్తుభ మణి వంటి పెద్ద పతకం భుజాలపై కేయూరాలు మణికట్టుకు కంకణాలు నడుముకు రత్నాల ఒడ్డాణం కాళ్లకు గజ్జెలతో కూడిన కడియాలు ధరించి ఉన్నాడు. వక్షస్థలంపై యజ్ఞోపవీతం స్పష్టంగా కనిపిస్తుంది. నడుముకు చుట్టిన పీతాంబరం గాలికి రెపరెపలాడుతున్నట్లుగా నాజూకు మడతలతో చెక్కారు. రెక్కలపై ఒక్కో ఈకను విడివిడిగా సన్నని గీతలతో చూపడం వల్ల రెక్కలు కదులుతున్నట్లుగా వున్నాయి. ముక్కు వంపు కళ్లలోని తీక్షణత కండలు వంపులు తిరిగిన భుజాలు గరుడుని వీరత్వాన్ని పలికిస్తున్నాయి. కొమ్మకు వేలాడుతున్న వాలఖిల్య ఋషులను అతి సూక్ష్మంగా తలపై జటాజూటంతో, ధ్యానముద్రలో చూపడం శిల్పి నైపుణ్యానికి తార్కాణం. ఏనుగు తొండం తాబేలు డిప్ప మీది గీతలు కూడా సహజత్వం ఉట్టిపడేలా ఉన్నాయి.


 తిరుక్కురుంగుడి ఆలయం 108 దివ్యదేశాలలో ఒకటి. నమ్మాళ్వార్ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శిల్పాలు కేవలం అలంకారాలు కావు. యాత్రికులకు గాధలు చెప్పే దృశ్య పురాణాలు.


గరుడుని రెక్కల్లోని చలనం ఋషుల ముఖాల్లోని తపోనిష్ఠ జంతువుల వివరాలు మొదలైనవి 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు వర్ధిల్లిన మధురై నాయక రాజుల శిల్పకళా నైపుణ్యానికి పరాకాష్ఠ. నాయక రాజులు పాత ఆలయాలను పునరుద్ధరించి ఉన్నత శిల్పాలతో గోపురాలను తీర్చిదిద్దారు. తిరుక్కురుంగుడి ఆలయం పాండ్య చోళ విజయనగర నాయక శైలుల సమ్మేళనంగా ఉంటుంది. గరుడాళ్వార్ వైష్ణవ సంప్రదాయంలో విష్ణు వాహనుడిగా వేదస్వరూపుడిగా పూజలందుకుంటాడు.గరుడ మంత్రం సర్పవిషానికి భూతభయానికి విరుగుడుగా భక్తులు నమ్ముతారు. ఈ గోపుర శిల్పంలో గరుడుని అంజలి ముద్ర లేకపోయినా కర్తవ్య నిర్వహణలో ఆవేశం తల్లిపట్ల భక్తి లక్ష్యంపట్ల ఏకాగ్రత ధర్మంపట్ల నిబద్ధత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం రాతిశిల్పమే కాదు, భక్తి వీరత్వం కరుణలను ఒకేచోట ఆవిష్కరించిన గొప్పకళాఖండం.


గరుత్మంతుడు ఏనుగును తాబేలును మోస్తున్న ఘట్టానికి మహాభారతం ఆదిపర్వంలోని ఉపాఖ్యానం వుంది.


పూర్వజన్మలో విభావసుడు సుప్రతీకుడు అనే ఇద్దరు సోదరులు మహర్షులు. వీరి తండ్రి మరణించిన తర్వాత తండ్రి ఆస్తి పంపకం విషయంలో ఇద్దరికీ తగాదా వచ్చింది. విభావసుడు పెద్దవాడు సుప్రతీకుడు చిన్నవాడు. చిన్నవాడు ఆస్తిని సమంగా పంచాలని కోరగా పెద్దవాడు తనకు ఎక్కువ భాగం కావాలని పట్టుబట్టాడు. ఇద్దరూ పండితులైనా దురాశ అహంకారం వల్ల ఒకరినొకరు శపించుకున్నారు. విభావసుడు “నీవు ఏనుగువై పుట్టు” అని తమ్ముడిని శపించగా సుప్రతీకుడు “నీవు తాబేలువై పుట్టు” అని అన్నను తిరిగి శపించాడు. ఇలా శాపఫలితంగా విభావసుడు పెద్ద తాబేలుగా సుప్రతీకుడు పెద్ద ఏనుగుగా ఒకే సరస్సులో జన్మించారు. అయినా వారి పూర్వజన్మ వైరం పోలేదు. ఏనుగు నీటిలోకి దిగినప్పుడల్లా తాబేలును కొడుతూ తాబేలు ఏనుగు కాళ్లుపట్టుకుని లాగుతూ నిరంతరం పోరాడుతూ ఉండేవి.


అమృతం కోసం స్వర్గానికి వెళ్తున్న గరుత్మంతుడికి మార్గమధ్యలో విపరీతమైన ఆకలి వేసింది. తన తండ్రి కశ్యపుడు నీకు తగిన ఆహారం ఆ సరస్సులో పోట్లాడుకుంటున్న ఏనుగు తాబేలు. వాటిని భుజించి తర్వాత నీ కార్యం సాధించు. వాటి పూర్వ వైరం వల్ల అవి ఇప్పటికీ కొట్టుకుంటున్నాయి. వాటిని సంహరించడం అధర్మం కాదు పైగా వాటికి శాపవిమోచనం కలుగుతుందని సలహా ఇచ్చాడు. దాంతో గరుడుడు ఆ సరస్సు దగ్గరకు వెళ్లి తన పంజాలతో ఏనుగును తాబేలును ఒక్కసారిగా ఎత్తుకున్నాడు. వాటిని తినడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ ఎగురుతుండగా ఒక పెద్ద మర్రిచెట్టు కొమ్మ కనిపించింది. ఆ కొమ్మమీద వాలి తినబోతుండగా ఆ కొమ్మ గరుడుని బరువుకు విరిగి కిందపడసాగింది. ఆ కొమ్మకు తలకిందులా వేలాడుతూ తపం ఆచరిస్తున్న బొటనవేలంతవున్న 60 వేల మంది వాలఖిల్య ఋషులను  గరుడుడు చూశాడు. వారిని మరణం నుండి  కాపాడటానికి మర్రికొమ్మతో సహా పైకి ఎగిరాడు. చివరికి హిమాలయాల్లోని ఒక నిర్జన ప్రదేశంలో దిగి, మరో వటవృక్షంపైన వాలఖిల్య బుుషులను వదలి, ఆ ఏనుగు తాబేలును భుజించి ఋషులను సురక్షితంగా దింపి తన ప్రయాణం కొనసాగించాడు.


ఇలా గరుడుడు ఏనుగును తాబేలును మోయడం వెనుక మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది ఆకలి తీర్చుకోవడం. రెండవది తండ్రి ఆజ్ఞ పాటించడం. మూడవది శాపగ్రస్తులైన ఆ ఇద్దరు సోదరులకు శాపవిముక్తి కలిగించడం. దురాశ వల్ల సోదర ద్వేషం వల్ల మనుషులు ఎంతటి హీన స్థితికి దిగజారతారో ధర్మమార్గంలో నడిచేవాడు ఎంతటి కష్టంలోనైనా ఇతరులకు హాని చేయకుండా ఎలా ప్రవర్తిస్తాడో ఈ ఘట్టం తెలియజేస్తుంది. 


IIసేకరణII

..............జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026