విగ్రహారాధన చేయకుండానే “పరబ్రహ్మను” ఆరాధించవచ్చు. దీనినే ‘నిర్గుణోపాసన’ అంటారు. కాని నిర్గుణోపాసన సామాన్యులకు సాద్యం కానిది. ఎందువలనంటే మన ఎదుట నిలుపుకున్న ‘దైవవిగ్రహము’ మీదనే, మన దృష్టిని, మనస్సుని తదేకంగా నిలపటం కష్టము. అటువంటప్పుడు నిరాకారుడైన ఆ “పరబ్రహ్మ” పై మన మనస్సుని ఎలా నిలుపగలం. సామాన్యులకు అది సాధ్యం కాని విషయం.
మానవునికి క్షణకాలంలోనే అనేక సంకల్పాలు శరపరంపరలుగా కలుగుతుంటాయి. అటువంటి విపరీత చంచల స్వభావమైన మనస్సును కదలక నిశ్చలంగా ఉండేటట్లు చేయడం చాల కష్టం. కాబట్టి మనస్సును “విగ్రహారాధన” అనే ప్రక్రియలో నిశ్చలపరచి, “మనోనిగ్రహాన్ని” పొందటం అత్యంతావశ్యకం.
కాబట్టి, మనస్సుని నిగ్రహించి, ‘ఆత్మ జ్ఞానాన్ని’ పొందటానికి లేక ‘పరబ్రహ్మతత్త్వాన్ని’ తెలుసుకోవటానికి ‘విగ్రహారాధన’ యే మిక్కిలి ప్రయోజనకారిగా ఉంది.
తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనమః
జీవులలో మానవజన్మదుర్లభమైనది. కాని, క్షణ భంగురమైనది. కావున ఆ కొద్ది దుర్లభమైన “దైవ సాక్షాత్కారా”నికి వినియోగించుకోవలెను. ఇది ఉత్తమం. భగవదారాధన పూర్వకమైన విగ్రహారాధన కేవలం వైదికమైన పరలోకప్రాప్తికే కాక శారీరక, మానసికశాక్తులను పెంచుకోవడానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. శాస్త్రాలలో అవ్యక్తమని చెప్పబడుతున్న ‘పరమాత్మ’ను ఆరాదిన్చాదానికిగల మార్గాలలో సులభమైంది ఈ ‘విగ్రహారాధన’
తల్లిదినోత్సవం - అమ్మప్రేమ శిల్పం.
......................................
తమిళనాడులోని చెన్నై శివార్లలో ఉన్న మాడంబాక్కం ధేనుపురీశ్వర ఆలయం ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం. ఈ ఆలయంలోని ఒక స్తంభంపై చెక్కబడిన "తల్లి బిడ్డ" శిల్పం పర్యాటకులను, భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.10వ శతాబ్దానికి చెందిన సుందర చోళుని కాలంలో నిర్మితమైన ఈ ఆలయం చోళుల శిల్పకళా వైభవానికి నిదర్శనం. సుందర చోళుడు మరెవరో కాదు ప్రసిద్ధ రాజరాజ చోళునికి తండ్రి.
ఈ శిల్పం ఒక తల్లి తన బిడ్డను అక్కున చేర్చుకున్నట్లుగా ఎంతో సహజంగా, ప్రేమతో నిండిన భావాలతో చెక్కబడింది. సాధారణంగా ఈ శిల్పాన్ని మాతృత్వానికి చిహ్నంగా భావిస్తారు. మదర్స్ డే సందర్భంగా ఈ శిల్పం మరింత ప్రత్యేకమవుతుంది. రాతిలో మలచిన ఈ తల్లిప్రేమ వందల సంవత్సరాలుగా మారని మాతృ హృదయానికి నిదర్శనం. మాటలు లేకున్నా శిల్పం చెప్పే కథ ఒక్కటే తల్లిఒడే బిడ్డకు లోకం. ఈ ఆలయాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ తమ అమ్మను గుర్తు చేసుకోవడం సహజం.
ఈ ఆలయం పురావస్తు శాఖ (ASI) ఆధ్వర్యంలో సంరక్షించబడుతోంది. ఇక్కడి ప్రధాన గోపురం 'గజపృష్ట' అంటే ఏనుగు వెనుక భాగం వంటి ఆకారం శైలిలో ఉండటం ఒక ప్రత్యేకత. పురాణాల ప్రకారం కపిలమహర్షి ఇక్కడ శివుడిని ఆవు (ధేనువు) రూపంలో పూజించి తన పాపాలను పోగొట్టుకున్నారని ప్రతీతి. అందుకే ఈ స్వామికి ధేనుపురీశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడి శివలింగంపై ఆవుపాదం గుర్తు ఉండటం విశేషం. ఈ ఆలయంలో శరభేశ్వరుని శిల్పం కూడా చాలా ప్రసిద్ధి చెంది.15వ శతాబ్దానికి చెందిన అరుణగిరినాథర్ తన 'తిరుప్పుగళ్' గ్రంథంలో ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయం చోళుల మరియు తర్వాతి కాలపు శిల్పకళా రీతులకు ఒక నిధి వంటిది.
..............జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments
Post a Comment