మానవుడు చక్రాన్ని ఎలా ఏ పరిస్థితులలో కనుక్కొన్నాడు. చక్రం పరిణామ క్రమం ఏమిటి ?

....................................

చక్రాన్ని మానవుడు ఒక్కసారిగా కనిపెట్టలేదు.అది వేలఏళ్ల అవసరం పరిశీలన ప్రయోగాల ఫలితం. ప్రాచీన మానవుడు వేట మరియు సేకరణ దశలో ఉన్నప్పుడు బరువైన వస్తువులను ఒక చోట నుంచి మరోచోటికి తరలించడానికి అతనికో పెద్ద సమస్యగా ఉండేది. రాళ్లను మృతదేహాలను జంతువులను చెట్ల కొమ్మలను ఒకచోట నుండి మరోచోటికి తరలించడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు మానవుడు ప్రకృతిలో రెండు విషయాలు గమనించాడు. ఒకటి కొండల మీదనుంచి దొర్లుకుంటూ వచ్చే గుండ్రటి రాళ్లవేగం, నేలపై పడి ఉన్న చెట్టు దుంగను లాగితే అది గిరగిరా తిరుగుతూ ముందుకు కదలడం. దుంగపైభాగంలో భారం పెడితే లాగడం తేలిక అవుతుందని పురాతన మానవుడికి అర్థమైంది. ఇదే రోలర్ సూత్రం. 

BcE. 4000 ప్రాంతంలో మెసపొటేమియా,l సుమేర్ సింధు  నాగరికతలలో మట్టితో కుండలు చేయడానికి కుమ్మరి సారెను వాడడం మొదలైంది.ఇదే చక్రంయొక్క తొలిరూపం. బరువును లాగడానికి రోలర్ లగా వాడిన దుంగల నుండి వాటి మధ్యలో కర్ర (ఇరుసు) పెట్టె ఆలోచన వచ్చిన తర్వాతే నిజమైన చక్రం పుట్టింది.

BcE 3500 ప్రాంతంలో ఉర్ నగరంలో బండికి చక్రం తగిలించిన ఆధారాలు దొరికాయి. అప్పటికి వ్యవసాయం పెరిగి మానవుడికి స్థిరనివాసం ఏర్పడి ధాన్యాన్ని ఇతర నిర్మాణసామగ్రిని దూరప్రాంతాలకు తరలించాల్సిన అవసరం పెరిగింది. అందుకే చక్రం అవసరం మరింత ఎక్కువగా ఉండేది.

తొలిదశలో చక్రం ఒకేకర్రతో చేసిన గట్టి వృత్తంగా ఉండేది.ఇది బరువుగా ఉండి తిరగడానికి ఎక్కువ శక్తి కావాల్సి వచ్చేది.BcE. 2000 ప్రాంతంలో మెసపొటేమియా ఈజిప్ట్ లలో చక్రం మధ్యలో రంధ్రంచేసి అంచుని సన్నగా చేసి బరువు తగ్గించారు.దీన్ని సాలిడ్ డిస్క్ వీల్ అంటారు. BcE. 2000–1500 మధ్యలో మధ్య ఆసియా యూరప్ లలో స్పోక్ వీల్ అంటే ఆకులు (స్పోక్స్) గల చక్రం వచ్చింది. మధ్యలో హబ్ అంచుకు రిమ్ వాటిని కలిపే అరలతో బరువు చాలా తగ్గింది. ఇది గుర్రపు రథాలు యుద్ధరథాలకు ఎంతో ఉపయోగపడింది. 

భారతదేశంలో హరప్పా నాగరికతలో మట్టిబొమ్మలు ఇంకా ముద్రల మీద చక్రంఉన్న బండ్లు కనిపిస్తాయి.

వేదకాలంలో రథాలు గోవుల బండ్లు సర్వసాధారణం. అంతేకాక సింధు 

నాగరికతలో దొరికిన చిన్నబండ్ల మోడళ్లు ముద్రలు అప్పటికే చక్రాల రవాణా వాడకంలో ఉందని రుజుపు చేస్తాయి.ఇనుము తెలిసాకా చక్రం అంచుకు ఇనుప పట్టీలు కట్టడం మొదలైంది.దీనివల్ల బలం మన్నిక పెరిగాయి. రోమన్లు ఈ పద్ధతిని విస్తృతంగా వాడారు. మధ్యయుగంలో బండ్లు గుర్రపు బండ్లు నీటితోడే యంత్రాలు గాలిమరలు నీటి మరలు (వాటర్ వీల్స్) లో చక్రం వాడకం విస్తరించింది. 

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవంతో రబ్బరు టైర్, బాల్ బేరింగ్ వచ్చి చక్రం మరింత మృదువుగా తిరగడం మొదలైంది. 20వ శతాబ్దంలో సైకిల్, కారు రైలు విమానం (ల్యాండింగ్ గేర్) గేర్లు టర్బైన్లు కంప్యూటర్ హార్డ్ డిస్క్ వరకు చక్రం సూత్రం అన్నింటా విస్తరించింది. చక్రం లేకుండా వ్యవసాయం రవాణా నిర్మాణం పరిశ్రమలు ఆధునిక సాంకేతికత ఏదీ సాధ్యం కాదు. అందుకే చక్రాన్ని నాగరికతకు మొదటి యంత్రం మానవ మేధస్సుకు మొదటి అడుగు అంటారు.

IIసేకరణII .

............ జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ