చదవడానికి ముందు చిత్రాన్ని ఒకసారి పరిశీలనగా చూడండి.

..............................................

తమిళనాడులోని పుండరీకాక్ష పెరుమాల్‌ దేవాలయం పల్లవుల కాలానికి చెందిన ప్రాచీన వైష్ణవ ఆలయం, ఈ ఆలయం దివ్యదేశాలలో ఒకటిగా విశేష ప్రాధాన్యం పొందింది. ఈ దేవాలయంలో నిర్మించాల్సిన భారీ రాజగోపురం పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రస్తుతం పునాది గోడలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ వైష్ణ్వాలయం సుమారు 72 మీటర్ల ఎత్తుతో పూర్తయి ఉంటే ఎంత వైభవంగా ఉండేదో ఊహాజనిత రూపకల్పనలు మనకు చిత్రంలో అవగతమైతున్నది. 

 కర్ణాటకలోని విజయనగరం ( హంపి ) లో ఉన్న మహనవమిదిబ్బ విజయనగర సామ్రాజ్యపు రాజరిక వైభవానికి ప్రతీకగా  నిలుస్తుంది. 14వ నుండి 16వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ మహత్తర రాతి వేదికపై ఒకప్పుడు కర్రతో చేసిన స్తంభాలమంటపం ఉండేది. దసరా వేడుకల సమయంలో చక్రవర్తులు ఇక్కడే కొలువుదీరేవారు. నేటికీ దిబ్బ గోడలపై వేట దృశ్యాలు, ఉత్సవాలు, నాట్య దృశ్యాలు కనిపించడం ఆ కాలపు సాంస్కృతిక వైవిధ్యాన్ని తెలియజేస్తుంది.

బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాత విద్యా కేంద్రంగా వెలుగొందింది. ప్రస్తుతం అక్కడ ఇటుకల శిథిలాలు గోడలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, చైనా యాత్రికుడు Xuanzang వర్ణనల ద్వారా ఆ విశ్వవిద్యాలయం ఎంత అద్భుతంగా నిర్మించబడిందో తెలుస్తోంది. అతని వివరాల ప్రకారం ఆకాశాన్ని తాకే శిఖరాలు, విస్తారమైన విహారాలు అక్కడ ఉండేవి.

 ఆధునిక కాలంలో IIT కాన్పూర్ విద్యార్థులు 3D మోడలింగ్ సాయంతో ఆ నిర్మాణాలను పునర్నిర్మించేందుకు ప్రయత్నించారు. 

12వ శతాబ్దంలో భక్తియార్‌ ఖిల్జీ దండయాత్ర కారణంగా ఈ జ్ఞాన క్షేత్రం సర్వ నాశనం అయింది.

హంపిలోనే మరో అద్భుత నిర్మాణం విజయ విఠ్ఠలదేవాలయం, ఇక్కడి రాతి రథం, సంగీత స్తంభాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. తళ్ళికోట యుద్ధంలో 5మంది ముస్లీం సుల్తానుల దాడుల్లో ఈ ఆలయం తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం కనిపించే శిథిలాలు గతంలో ఉన్న శిల్ప కౌశలాన్ని మాత్రమే సూచిస్తున్నాయి.అయితే 3D దృశ్య రూపకల్పనలు ఆ కాలపు సంపూర్ణ వైభవాన్ని మన కళ్లముందుకు తీసుకువస్తున్నాయి. 

ఈ కట్టడాల సంరక్షణకు Archaeological Survey of India సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ బెల్లం కోడి గుడ్లు సున్నం వంటి పదార్థాలతో పునరుద్ధరణ పనులు చేపడుతోంది.

నేటి చరిత్రకారులు 3D వర్చువల్ మోడలింగ్, ఫోటోగ్రామెట్రీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి ఈ పురాతన నిర్మాణాలను తిరిగి దృశ్యరూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.పాత తాళపత్ర గ్రంథాలు, విదేశీ యాత్రికుల వర్ణనలు, అలాగే William Hodges వంటి కళాకారుల చిత్రాలు ఈ పునర్నిర్మాణాలకు ఆధారంగా నిలుస్తున్నాయి. ఈ విధానాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అమలు జరుగుతున్నాయి. ఈ సాంకేతిక ప్రయత్నాల ద్వారా కాలగర్భంలో కలిసిపోయిన మన పూర్వీకుల అద్భుత నిర్మాణ ప్రతిభను నేటి తరానికి స్పష్టంగా పరిచయం చేయడం సాధ్యమవుతోంది.

॥సేకరణ॥

............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ