[#శ్రీలలితాసహస్రనామం  #154వనామ_వివరణ

154. "నిరుపాధి:” (చతురక్షరి)
నిర్- ఉపాధిః = ఉపాధి లేనిది.

తన ధర్మమును ఇతరము నందు ఉంచినచో అటుల ఉంచేవాడు ఉపాధి సహితుడు అగును. ఆత్మ ధర్మములైన చైతన్యాదులు శరీరము నందు భాసిల్లుచున్నవి. అందుచే ఆత్మను దేహోపాధి అందురు. మాయోపాధి ఈశ్వరుడనియు, అవిద్యోపాధి జీవుడు అనియు శాస్త్రకారులు అందురు. సర్వమును అద్వితీయమై విరాజిల్లే దేవికి తన కంటే భిన్నంగా వేరే వస్తువు లేనందున "నిరుపాధి” అనబడుచున్నది. సజాతీయ, విజాతీయ, స్వగత భేద రహితమైనది. సమీపమునందు గల స్ఫటికమందు జపా పుష్పము (మంకెన పుష్పము) తన ఎరుపుతనము సంక్రమింపజేయునట్లు, అవిద్య చేత భేద బుద్ధి కల్గున కావున అట్టి అవిద్య, భేద బుద్ధి లేని నిత్య శుద్ధ ముక్త చిత్స్వరూపిణి శ్రీమాత యని గ్రహించవలయును.


           🙏   ఓం శ్రీ మాత్రే నమః 🌹


[#శ్రీలలితాసహస్రనామం  #166వనామ_వివరణ

166. "నిష్పాపా” (త్యక్షరి)

నిష్ - పాపా = పాపము లేనిది శ్రీదేవి.

నేను - నాది అనే భావములు ఉన్నప్పుడే ఆసక్తి జనిస్తుంది. అట్టియెడ చేసే కర్మలు అన్నియును బంధకములు అగును. అవి జన్మహేతువులు అగుటచే పాపములు అనబడును. పరాశక్తికి అట్టి స్థితి లేదు అని తలంపదగును. ఇట్లు సుకృత, దుష్కృత కర్మలు రెండును ఆసక్తి కారణంగా జన్మహేతువులు అగుటచే పాపములుగానే తలంపదగును. అనాసక్తితో పుణ్య కర్మలు మాత్రం చేయదగును. అవి చిత్త శుద్ధికి, జ్ఞాన సిద్ధికి హేతువులు అగును. అవిద్య, అజ్ఞానము పాపలేశము లేనిది. సుకృత, దుష్కృతము లేమాత్రము లేనిది. సృష్టిలో గల ప్రతి ప్రాణి నిరంతరము ఏదియో కర్మ చేయుచూనే యుండును.

"న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్".

ఈ పుణ్య, పాప కర్మలలో ఒకరికి బాధ కలిగించు కర్మ మరొకరికి సంతోషము కలిగించునదిగా యుండును. జీవుడు పూర్వ జన్మము నందు పుణ్య పాప కార్యముల ద్వారా కలిగిన ఫలమే దేహేంద్రియాది సంఘాతము, దృశ్య రూపమగు భవిష్య జన్మలు కలుగుచున్నవి.

పుణ్యమధికముగాయున్న దేవ, గంధర్వ, ఇంద్ర, బృహస్పతి, ప్రజాపతి, బ్రహ్మదేవాది జన్మలనూ; పుణ్య, పాప మిశ్రవర్తి ఫలము మానవ జన్మము, పాప మధికముగా యున్న పశు, పక్షి, క్రిమి, మృగ, ఓషధి, వనస్పతి మొదలగు స్థావరాది జన్మలు పొందవలసి యుండును. పుణ్య పాప మేమాత్రం లేనిది జన్మరాదు. అందుచేత దేవి పాపఫల లేశమాత్రము లేనిది. నిర్మల, సచ్చిదానంద, సర్వాధిష్టాన, ఆత్మ చైతన్యమే శ్రీలలితాంబికా అని భావము.🌹🌹🙏🙏🙏

శ్రీ లలితా సహస్రనామం 168వ నామ వివరణ

168. “నిష్క్రోదా” (త్ర్యక్షరి) నిష్క్రోదా

నిష్ - క్రోధా = క్రోధము లేనిది.

“న మే ద్వేష్యో స్తిన ప్రియః" అనగా - నాకు శత్రువు లేడు, మిత్రుడు లేడు అనే భగవద్గీతోక్తిని అనుసరించి సర్వసమమైన దేవికి ఎవరి యెడను క్రోధము లేదు. క్రోధము పాపానికి సంకేతము. క్రోధము చేత రక్తపోటు (బ్లెడ్ ప్రెషర్) పెరుగుతుంది. మెదడు నరాలు దెబ్బతింటాయి (ట్రైన్) పనిచెయ్యదు. “క్రోధాద్భవతి సమ్మోహః” క్రోధముతో పగ సాధింపబూనుట సామాన్య మానవ సహజగుణము. ఈ క్రోధము దేహేంద్రియ బుద్ధికి సంబంధించినది. కాని సర్వాధిష్ఠాన నిర్గుణ బ్రహ్మము యొక్క ధర్మము కాదు. అందుచేత శ్రీదేవి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి, అనురాగ దేవత కావున అమ్మవారికి కోపము, క్రోధం గానీ ఉండవు. కావున నిష్ణోధా అనబడును.

           🙏   ఓం శ్రీ మాత్రేనమః  🙏🙏🙏✌🌹🌹🌹🌹
#దే

289.🔱 శ్రుతిసీమంత సిందూరీకృతపాదాబ్జధూళికా

పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ' శ్రుతి సీమంత సిందూరీకృత పాదాబ్జధూళికాయైనమః' అని చెప్పాలి.

శ్రుతి = వేదములనెడు స్త్రీల యొక్క;
సీమంత = పాపిటలను,
సిందూరీ కృత : సిందూరము ధరించునట్లు చేసిన,
పాదాబ్జ = పాద పద్మము యొక్క,
ధూళికా = ధూళిని కలిగినది.

“ బాలా' - 'బాలికా' అయినట్లు, ' ధూళి' - 'ధూళికా' ఔతుంది. 'ధూళికా'  - అంటే చిన్న ధూళికణము' అని అర్థం.
ఈ నామం ఎంత అర్థవంతమైందో అంత అందమైనది గూడా !
పాపిటలో సిందూరం స్త్రీలను పుణ్య స్త్రీలు గాను, కన్యల వర్గము నుండి వేరుగా - కాంతుని గల కాంతలగాను' గుర్తింప చేస్తుంది. అందుకే పాపిటలో సిందూరం ఆడవారికి సౌభాగ్యవర్థనం. అంటే - వారి భర్తలకు ఆయుర్వర్ధనం. ఈ నామంలో వేదాలను పుణ్య స్త్రీలతో పోల్చారు వ్యాసులవారు.
ఈనామం వ్రాయడానికి ముందు వ్యాసులవారికి ఈ క్రింద తెలిపిన దృశ్యం దర్శనం జరిగి ఉంటుందని నా ఊహ.
నాలుగు వేదాలు అనే పుణ్యస్త్రీలు ఒక రోజున తమ తల్లి అయిన అమ్మ దర్శనానికి వచ్చారు. అమ్మవారు సింహాసనా రూఢి అయి ఉన్నది. అమ్మవారు పాదం మోపే  పీఠం ఎత్తుగా వుంది. ఆ పీఠం వద్దకు జేరి నలుగురు పుణ్య స్త్రీలు ఒకరి తరువాత ఒకరు అమ్మవారి పాదం పై మూర్థాన్ని ఉంచి, తలను ఒక్కసారి క్రిందకు వంచి నమస్కరించారు. అప్పుడు అమ్మవారి కాలి బొటన వేలి కున్న ఎఱ్ఱని పారాణి శ్రుతి సీమంతినుల (వేదవనితల) సీమంతాల (పాపట) గుండా స్పృశిస్తూ ఆ పాపిట్లలో సిందూరం పెట్టినట్లైంది.

ఈ దృశ్యం దర్శనం జరిగిన వ్యాసులవారికి వళ్ళు పులకరించి వెంటనే 'శ్రుతి సీమంత సిందూరీ కృతపాదాబ్దధూళికా' అని అమ్మవారిని స్తుతించారు. ఇది సహస్రనామ స్తోత్రంలో కమనీయమైన ఉపమానాలతో ఉన్న రమణీయమైన నామం. -
అమ్మవారి పాదపద్మ రజాన్ని శిరస్సు నందలి పాపిటలో ధరించినందు వలన శ్రుతి వనితలు పవిత్రవంతమయ్యారు. అంటే - అమ్మవారి పద సౌభాగ్యాన్ని (వేద వాజ్మయం) తనలో విస్తరింప చేసుకున్నందువల్లనే వేదాలు అంత పవిత్రంగా భారతీయులచే పూజింపబడుతున్నాయి అని అర్థం. (అంటే వేద వాజ్మయంలో అంతా అమ్మవారి గురించి, అమ్మవారి జగత్పరి పాలన గురించి, ఆదేశాల గురించి ఉంటుందని పరోక్షంగా చెప్పడం అన్నమాట !
శ్రుతి శీర్షాల సీమంతాలను అమ్మవారు తన పాదాంగులితో దున్ని, ఆ పాపిట్లలో పడిన తన పాదపారాణి రజస్సును సిందూరంలా స్ఫురింపచేసింది అనడంలో - ఆ శ్రుతి శీర్షాలైన ఉపనిషత్తులను జ్ఞానం అనే పంట పండటానికి సిద్ధం చేసి సిందూరం దిద్దినట్లుగా
భావించడం - మరింత మనోజ్ఞంగా ఉంటుంది. వస్తువు తయారైన తరువాత అన్నీ పరీక్షించి బాగుంది అని 'అగ్ మార్క్ లేదా IST ముద్ర వేసి విపణి వీధిలోకి పంపినట్లు, శ్రుతి శిరస్సుల (ఉపనిషత్తుల) లోని జ్ఞాన విషయాలన్నీ బాగున్నాయని అమ్మవారు తన కాలిగోటితో ముద్ర వేసి వాజ్మయ ప్రపంచంలోకి పంపించింది అనడం ఇంకా మనోహరంగా ఉంటుంది.
శ్రుతిలయ బద్దమైన జీవితం గడిపే సాధకులు ఈ నామాన్ని జపిస్తే వారి జీవితమంతా మంచితనము (సు), వెలుగు (భ) చైతన్యము (గ) నిండి 'సౌభాగ్యకరమైన, ఆహ్లాదకరమైన, వైభవోపేతమైన జీవితాన్ని గడుపుతారు.

బ్రహ్మ జ్ఞానం తెలియజేయునది  వేదములు, కర్మ జ్ఞానమును అందజేయు శాస్త్రములు, రహస్యమగు వేద మంత్రములను దిక్సూచి ఉపనిషత్తులు, పురాణాలు మొదలైనటువంటి కలిపి శృతులు అంటారు.

1) 'శ్రుతి వనితల సీమంతాలకు సిందూరము ధరించునట్లు చేసిన పాదపద్మము యొక్క ధూళిక కలిగినది'
2) శ్రుతి శీర్ష సీమంతాలను తన పాదాంగులితో దున్ని జ్ఞాన మనే పంట పండడాన్ని సిద్ధం చేసిన పాద పారాణి ధూళిక కలిగినది.
3) శ్రుతి శీర్ష జ్ఞాన విషయాలు చక్కగా ఉన్నాయని పాదాంగుళితో వాటి ‘ అనుమతి ముద్ర' ను వేసి వాజ్మయ ప్రపంచంలోనికి పంపిన పాదధూళిక కలది' అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును.

🌹ఫలస్తుతి🌹

వేద పఠనం చేయువాళ్లు, విద్యార్థుల కు, పోటీ పరీక్షల రాస్తున్నవారు ఈ నామ మంత్రమును జపించాలి.. ఏ పని అయినా సమయానికి తగిన విధాగం పూర్తి చేయగలగటం, సమయ స్ఫూర్తి కలగటం కోసం, అలాగే ప్రభుత్వ ఆమోద ముద్ర కోసం అది భూమికోసం కావచ్చు , పరిశోధించి తయారు చేసిన వస్తువు కావచ్చు, ఇలా ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నం చేస్తున్న ఏ పనికోసం అయినా ఈ నామ మంత్రం ధ్యానం చేయాలి.

🌹ఓం ఐం హ్రీం శ్రీo శ్రుతిసీమంత సిందూరీకృత పాదాబ్జధూళికాయైనమః🌹
 
--(())--

290. 🙏సకలాగమ సందోహశక్తి సంపుటమౌకికా🙏

పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు “సకలాగమ సందోహ శక్తి సంపుటమౌక్తి కాయైనమః' అని చెప్పాలి.

సకల = అన్ని,
ఆగమసందోహ = ఆగమ శాస్త్రములనెడు,
శక్తి = ముత్యపు చిప్పలచే,
సంపుటి = చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన,
మౌక్తికా : ముత్యము.

ఇంతకు ముందు నామంలాగానే ఈ నామం గూడా ఈ లలితా స్తోత్రంలో తల మానికమైనది. అమ్మవారు ముత్యం లాంటిదట ! సాధారణంగా స్వచ్ఛమైన వారిని ముత్యంతో పోలుస్తారు. ఆ ముత్యాన్ని గూడా ' కడిగిన ముత్యం' అంటారు. కాని, అమ్మవారు కడగవలసిన అవసరం లేని ముత్యం. ఎందుకంటే - ముత్యపు చిప్పలలోనే గుప్తంగా నిర్మలంగా ఉన్న ముత్యం. అమ్మవారు ముత్యం లాంటి ది అని పోలిస్తే అది అతి సామాన్యంగా చెప్పినట్లే ఔతుంది.

అమ్మవారి పంచదశాక్షరీ మంత్రంలోని 15 బీజాక్షరాలను ఆశ్వయుజ శుక్ల పక్షంలోని 15 తిదులతోను సమన్వయ పరచుకోవాలి . చంద్రుని 16 కళలను 'షోడశీ మంత్రానికి 16 అక్షరాలుగా సమన్వయ పరచుకోవాలి. అందుచేత ఈ నామంలో స్వాతి వర్షపు చినుకుల ద్వారా పరిపూర్ణస్థితిని చేరే ముత్యంతో అమ్మవారిని పోల్చడం ఎంతో చక్కని ఔచిత్యాన్ని సంతరించు కుంటుంది. (పైగా ఈ స్వాతీ నక్షత్రం వుండే తులారాశి - మానవుని నాభి ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ నాభి వద్దనే 'మణి' పూర చక్రం' ఉంటుంది).
'స్వాతి' - అనే పదాన్ని 'స్వ + అతి' అని విడదీస్తే - " అతిశయించిన 'స్వ' తత్త్వం గలది ” అనే అర్థం వస్తుంది. 'అతిశయించిన 'స్వ' తత్త్వం అమ్మవారే! అని ఆదిశంకరులు ' పుర మధితు: ఆ హోపురుషికా' - అంటే - శివుని అహంకార స్వరూపిణి గా - అంటే, శివుని వ్యక్త స్వరూపంగా) సౌందర్యలహరిలో చెబుతారు. (క్వణత్కాంచీదామా శ్లోకం) -
ఇంతవరకు ' అమ్మవారు ముత్యం లాంటిది' అనడం దాకానే చెప్పుకున్నాం

(ఈ ముత్యం అందరికీ అందుబాటులో ఉండేట్లుగా ఉండే అన్ని ముత్యాల లాంటిది కాదుట!) ముత్యం - ముత్యపు చిప్పల గుప్పిటలో నిక్షిప్తమై భద్రంగా, రహస్యంగా ఉంచబడి ఉంటుంది. మరి - అమ్మవారు అనే ముత్యం తాలూకు ముత్యపు చిప్పలు ఎలాంటివి అంటే - సకల ఆగమాల సమూహమే ! అంటే - అన్ని స్మృతులు (శాస్త్రాలు) అన్ని శ్రుతులే (వేదాలు) ఆ ముత్యపు చిప్పలట ! అలాంటి వేద శాస్త్రాల గుప్పిటలనే ముత్యపు చిప్పలలో గుప్తంగా దాచబడివుంచిన ముత్యము అమ్మవారు గాని - సామాన్యంగా అన్ని చోట్ల, బాహ్యంగా అందరికీ తేలిగ్గా లభ్యమయే, కడగవలసి వచ్చే - సాధారణ ముత్యం కాదుట! అంటే - 'సకలనిగమ ఆగమ శాస్త్రాలన్నింటి లోనూ సూక్ష్మంగా, రహస్యంగా ప్రతి పాదింపబడేది అమ్మవారి తత్త్వమే' అని దీని భావం.
ముత్యపు చిప్పలు రెండింటి మధ్యన ముత్యం నిక్షిప్తమై ఉంటుంది. ఆ రెండు ముత్యపు చిప్పలు ఏవంటే - ఒక వైపు నిగమాలు (శ్రుతలు లేక వేదాలు), ఇంకోవైపు ఆగమాలు (స్మృతులు లేక శాస్త్రాలు).

సమస్తమైన వేదాలు అనే ముత్యాలతో కూర్చబడిన నాసాభరణముగలది. నాసాభరణము మొదలైనవి ఆభరణాలను తెలుపుతాయి. అంతే కాని ఆమె స్వభావాన్ని తెలుపలేవు.

న చక్షుర్గచ్ఛతి న వా గచ్ఛతి నో మనః  అక్కడికి కనులు పోలేవు. వాక్కు పోలేదు, మనస్సు పోలేదు. అంటే ఆత్మను కనులద్వారా తెలుసుకోలేము. ఎందుకంటే అదికళ్ళకి దృష్టినిచ్చే శక్తి. చెవులద్వారా వినలేము. అది చెవులకు వినికిడి శక్తి నిచ్చేది. ఈ రకంగా అవయవాల ద్వారా, మనస్సుద్వారా ఆత్మను తెలుసుకోలేము. ఆత్మ వాగ్గోచరము కాదు. చక్షుర్గోచరము కాదు.
ఇక్కడ మౌక్తికము అంటే - మంత్రరాజము అని అర్థం. శ్రీవిద్యా మంత్రరాజము షోడశాక్షరి. ఆ షోడశాక్షర మంత్రము ఈ నామంలో చెప్పబడింది.

🕉శ్రీవిద్యలో ప్రధానమైన మంత్రం షోడశాక్షరి. దీన్నే శ్రీవిద్యా మహామంత్రము అని కూడా అంటారు. షోడశి అంటే 16 అక్షరాలు గల మంత్రం. పంచదశీ మహామంత్రానికి శ్రీం అనే బీజాన్ని గనక చేర్చినట్లైతే అది 16 అక్షరాలు గల షోడశాక్షరి అవుతుంది.

కామరాజమంక్రాంతే శ్రీ బీజేన సమన్వితా
షోడశాక్షరీ విద్యేయం శ్రీవిద్యేతి ప్రకీర్తితా

మన్మథుడు ఉపాసించిన మంత్రానికి శ్రీం బీజం గనక చేర్చినట్లైతే అది షోడశాక్షరి అవుతుంది. అనగా షోడశాక్షరి మంత్రం.
క ఏ ఈల హ్రీం | హసకహల హ్రీం | సకల హ్రీం | శ్రీం

లొల్లా లక్షీధరులు భాస్కరాచార్యులు కూడా దీన్ని సమర్ధించారు. కాని పంచదశి మహామంత్రానికి ఈం బీజం చేర్చినట్లైతే షోడశాక్షరి అవుతుంది అని ఒక సంప్రదాయం . దీనిప్రకారం షోడశాక్షరి మంత్రం.

క ఏ ఈల హ్రీం | హ సకహల హ్రీం | సకల హ్రీం | ఈం

కావ్యకంఠ గణపతి మునివర్యులు తమ మహావిద్య సూత్రగ్రంథంలో

బ్రహ్మ (క) యోని (ఏ) శాంతి (ఈ) ఇంద్ర (ల) మాయా (హ్రీం) భిః ఖ (హ) భృగు (స) బ్రహ్మ (క) ఖ (హ), ఇంద్ర (ల) మాయా (హ్రీం) భిః భృగు (స) బ్రహ్మ (క) ఇంద్ర (ల) మాయా (హ్రీం) భిశ్చ పంచదశీ రమో (శ్రీం) త్తరీయం షోడశీ

క ఏ ఈల హ్రీం | హ సకహల హ్రీం! సకల హ్రీం | శ్రీం || ఇది షోడశి మహామంత్రం అన్నారు.

అయితే కేవలము ఇది 16 అక్షరాలు గల మంత్రం. కాని బ్రహ్మవిద్య మాత్రం కాదు. బ్రహ్మవిద్య అంటే మోక్షవిద్య, జీవాత్మను పరమాత్మతో ఏకం చేసేందుకు ఉపకరించే విద్య. ఎక్కువమంది గురువులు ఉపదేశం చేసే బ్రహ్మవిద్య షోడశాక్షరికి 28 అక్షరాలుంటాయి.
అష్టా బీజాక్షరాణ్యాదౌ పశ్చాత్పంచదశీ తతః
పంచబీజాక్షరాప్యేషా శ్రీమహాషోడశీమతా

పంచదశీ మహామంత్రానికి ముందు 8 బీజాక్షరాలు తరువాత 5 బీజాక్షరాలు ఉన్నట్లైతే, దాన్ని మహాషోడశి అంటారు. అది బ్రహ్మవిద్య. అయితే ముందు ఉండే అక్షరాలేవి? తరువాత ఉండే అక్షరాలేవి?

శ్రీ బీజమాయా స్మరయోనిశక్తిః సర్వం చ మాయా కమలాత్మవిద్యా
శక్త్యాది బీజాని విలోవితాని శ్రీషోడశార్ణాపరదేవతాయాః

దీనిని బట్టి మహాషోడశికి 16 అక్షరాలే ఉంటాయి. ప్రణవము అంటే - ఓంకారము. శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనే ఐదు బీజాలను శక్తి ప్రణవాలు అంటారు ఇవే పంచప్రణవాలు. పంచప్రణవాలు, ఓం హ్రీం శ్రీం మొత్తం ఎనిమిది బీజాక్షరాలు పంచదశి మంత్రానికి ముందు, పంచదశి తరువాత మళ్ళీ పంచప్రణవాలు అయితే ముందున్న పంచప్రణవాలు అనులోమంగాను, తరువాత ఉన్నవి విలోమంగాను ఉంటాయి. ఈ రకంగా చూస్తే పంచదశి మంత్రానికి పదిహేను అక్షరాలు, ముందు ఎనిమిది, తరువాత ఐదు. వెరసి పదమూడు. మొత్తంమీద మంత్రంలో ఇరవై ఎనిమిది అక్షరాలుంటాయి. అయితే ఇక్కడ పంచదశి మంత్రంలోని మూడు కూటాలను మూడు బీజాలుగా లెక్కపెట్టాలి. అప్పుడు 8+3+5 = 16 అక్షరాలవుతాయి. ఇదే మహాషోడశి మంత్రము.

శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం | క ఏ ఈల హ్రీం | హసకహల హ్రీం | సకల హ్రీం | సౌః ఐం క్లీం హ్రీం శ్రీం

ఈ మంత్రం సకల వేదసారము. పరమేశ్వరి స్వరూపము. బ్రహ్మవిద్యా స్వరూపము. దీనిని మించిన మంత్రంగాని వేదసారంగాని లేవు.
ఈ నామంలో వేదాలన్నీ చదివినప్పటికీ ఆ పరమేశ్వరి యొక్క ముక్కెర మొదలైన ఆభరణాల గురించి తెలుస్తుంది కాని ఆమె తత్త్వము మాత్రం తెలియదు. అంటే వేదాలు పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదించలేవు. అని చెప్పబడింది.

ఆడంబరాలు, పటాటోపాలు, ప్రదర్శనాత్మకమైన ఉపాసనా విధానాలు లేకుండా, గోప్యంగా, ప్రశాంతంగా, నిదానంగా, సాధనా మార్గంలో అమ్మవారిని ఆరాధించే సాధకులు ఈ నామాన్ని జపిస్తే - "వారి ఆరాధన శుచి వంతమై, పవిత్రమై 'ముక్తి వంతు మౌతుంది. అంటే - 'ముక్తి ఫలాన్ని' పొందుతారు' - అనగా, వారు మోక్షస్థితిని పొందుతారు” అని అర్థం.

👉 (విషయ జ్ఞానం కోసం వివరంగా ఇవ్వడం జరిగింది ఉపదేశం లేని వారు పద్దతి తెలియక చేయడం మంచిది కాదు..అర్థం చేసుకుంటారు అని ప్రార్ధన).

🌹ఫలస్తుతి🌹

ఈ నామ స్మరణ వల్ల జ్ఞానం కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏ సమస్య అయినా సంకల్పమ్ చెప్పుకుని ఈ నామంతో సంపుటికరణ చేస్తే చాలా త్వరగా ఫలితం లభిస్తుంది... శ్రీ విద్య ఉపదేశం లేని వారు ఈ నామంతో ధ్యానం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహము పొందగలరు... "శ్రీ మాత "తో ఈ నామాన్ని సంపుటికరణ చేస్తే ఆరోగ్యం కుడుటపడుతుంది.

🙏ఓం ఐం హ్రీం శ్రీo సకలాగమసందోహ శక్తిసంపుటమౌక్తికాయై నమః🙏

🌹ఓం శ్రీ మాత్రే నమః🌹

🔱(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)🔱


291. 🔱🙏పురుషార్థప్రదా🙏🔱

ఆరు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు “పురుషార్థప్రదాయై నమః' అని చెప్పాలి.

పురుష = పురుషునకు కావలసిన,
అర్థ = ప్రయోజనములను,
ప్రదా = చక్కగా ఇచ్చునది.

పురుషార్థాలంటే పురుషుడై పుట్టినందుకు పొందవలసిన ప్రయోజనాలు, (Utilities) సాధించవలసిన లక్ష్యాలు - వీటినే చతుర్విధ పురుషార్థాలంటారు. (The four ends of man) అయితే, 'ఇవి పురుషులకేనా, స్త్రీలకు అక్కరలేదా' అనే అనుమానం రావచ్చు. అసలు 'పురుష' అనే పదానికి వ్యుత్పత్తి తెలిసుకోవాలి,'పురమునందు ఉండు వ్యక్తిని పురుషు' డంటారు. అయితే ఇక్కడ 'పురము' అంటే ఊరు, పట్టణము కాదు. ఈ శరీరమే పురము. అంటే శరీరం (దేహం) లో వుండి వ్యక్తిని పురుషుడు అంటారు. దేహంలో వుండేది జీవుడు కాబట్టి , 'ఆడజీవుడు, మగజీవుడు' వుండడు కాబట్టి - పురుషుడు అంటే 'జీవి' అని అర్థం చెప్పుకోవాలి. ఈ జీవి పదం ఆడవారికి, మగవారికి కూడా సమంగా వర్తిస్తుంది కాబట్టి - పుట్టిన ప్రతి జీవి జీవితంలో సాధించవలసిన లక్ష్యాలను పురుషార్థాలంటారని ముందు తెలుసుకోవాలి. లేకపోతే “ అన్నీ మగవారికే కాని - మహిళలకు ఏముంది మన శాస్త్రాల్లో' అనే ఆలోచన చెలరేగుతుంది.

పురుషార్థాలు నాలుగు. 1 . ధర్మము 2. అర్థము 3. కామము 4. మోక్షము. " ధర్మము' అన్న పదానికి సరైన ఆంగ్ల పదం లేదనే చెప్పాలి. ఏవో కొన్ని చెప్పు కోవాలంటే Righteousness, Duty, Justice, Property, Law ) ఇలా  కొన్ని పదాలు చెప్పుకోవచ్చు.
చేయవలసిన పనిని' ధర్మము అనవచ్చును. పుట్టిన ప్రతి వ్యక్తి నిర్వర్తించవలసిన బాధ్యతలు, సమాజంలో ఉంటున్నందుకు పాటించవలసిన నియమాలు - అన్నీ ధర్మం క్రిందకే వస్తాయి.
1) ధర్మం చేస్తే - 'అది మనల్ని రక్షిస్తుందిట' - అనే కారణంతో గాని,
2) ధర్మం చేస్తే - 'మనతోటి వారుకూడా మనపట్ల ధర్మంగా ఉంటారు కాబట్టి' - అనే కారణంతో గాని,
3) ధర్మం చెయ్యకపోతే - శిక్షిస్తారుట' - అనే కారణంతో గాని ధర్మం చెయ్యకూడదు.
4) 'ధర్మం చెయ్యడం ధర్మం కాబట్టి' - అనే కారణం తోనే ధర్మం చెయ్యాలి. ఇలా చేసే బుద్ధిని ప్రసాదించేది అమ్మవారు.

'అర్థం' అంటే డబ్బు అని కాదు అర్థం. • ప్రయోజనం (Utility) అనేది సరైన అర్థం .
ప్రయోజనం సిద్ధించేందుకు అవసరమయేది అర్థం. ఇది కూడా నోట్ల కట్టలు, కరెన్సీ (Money) అర్థంలో కాకుండా సంపద (Wealth) అనే అర్థంలో దీన్నే గ్రహించాలి. అంటే - తనకు, ఇతరులకు కూడా అన్ని సమయాల్లోనూ ఉపయోగపడేది. ఈ సంపదను ప్రసాదించేది అమ్మవారు.
' కామం' అంటే ప్రేమ (Love), లాలస(Lust), లైంగికానందము (sex)కాదు. ' కామం ' అంటే - ' అనుభవించగలగడం' (Accomplishment) దేనినైనా పొంది అనుభవిస్తున్నపుడు కలిగే అనుభవాన్ని - వాస్తవానికి 'కామం' అనాలి. కాని - ప్రస్తుతం దాని అర్థమే మారిపోయింది.

ఈ 'అనుభవ తృప్తిని కూడా ఇచ్చేది అమ్మవారే !
'మోక్షం' బంధమోచనం. అంటే - ఆంగ్లంలో - Salvation or Liberation అనే అర్థాలు చెప్పుకోవచ్చును. 'ముక్త సంగ స్థితిని' మోక్షం అంటారు. అంటే - దేనికీ అంటని స్థితిని (Non attachment) 'ముక్త సంగ స్థితి' అంటారు. అందరిలాగే అన్ని విధ్యుక్త ధర్మాలు నిర్వర్తిస్తూ ఉన్నా దేనికీ అతుక్కోని స్థితి ఇది. చింతకాయ - చింతగుల్లగా - లేదా, కొబ్బరికాయ - కొబ్బరి కురిడీగా అయిన స్థితి ఇది. బ్రతికి ఉండగానే సాధించే ఒక విశిష్టస్థితి ఇది. అంతే గాని చచ్చిపోయిన తర్వాత వచ్చేదిగాదు. ఈ స్థితిని గూడా ప్రసాదిస్తుంది అమ్మవారు.

మొదటి మూడింటిని - అంటే ధర్మార్థ కామాలను భార్యాభర్తలిద్దరూ కలసి సాధించవచ్చునేమో కాని, నాల్గవదైన మోక్షం మాత్రం వ్యక్తి గతమైనదే ! సాధనకు సంబంధించినది - అందుకే వివాహ మంత్రాలలో ' ధర్మేచ - అగ్గేచ - కామేచ, నాతిచరామి' - అని చెప్తారు కాని - 'మోక్షేచ' అని చెప్పించరు. ధర్మార్థాలు అనే రెండు గట్ల (Banks) మధ్య కామం అనే ప్రవాహం సాగాలి. అంటే - హద్దులను నిర్ణయించు ' ధర్మము - అర్థము' - అనే రెండు గట్లను అతిక్రమించకుండా ‘కామం' వుండాలి.  అర్థ కామాలు రెండూ ధర్మోత్తరంగా వుండాలి కాని - కామోత్త రంగా ధర్మార్థాలు, అరోత్తరంగా ధర్మకామాలు ఉండకూడదు.  ముందు ధర్మం అనేది ఉండాలి అది అర్థ, కామం లో ప్రవేశిస్తే జీవితం ఉన్నతంగా ఉంటుంది.. ధర్మం అనే పునాది గట్టిగా ఉంటే దానిపైన కట్టడం నీతి నిజాయితీ గల విలువలతో ఏర్పడుతుంది , మొత్తం మీద ఈ నామానికి అర్థాన్ని ఈ విధంగా  చెప్పుకోవచ్చు
పురుషునకు కావలసిన ప్రయోజనములను ఇచ్చునది  అని ఈ నామానికి అర్థము .

🌹ఫలస్తుతి🌹

ఈ నామ వివరణ లోనే ఫలస్తుతి కూడా ఉంది జీవుడికి కావల్సిన వన్నీ అమ్మవారు అనుగ్రహిస్తుంది అయితే ఆ కోరిక న్యాయబద్ధమై ఉండాలి..ఈ నామ స్మరణ నిత్యం చేయడం వల్ల ధర్మబద్ధమైన ఆలోచన జీవన విధానం కలుగుతుంది.. ఒకరి మీద ఆధార పడకుండా స్వశక్తితో మీ జీవితం ముందుకు సాగుతోంది.. ఆత్మ జ్ఞాన సాధన లో ఉన్న వారికి చైత్యమార్గం బోధపడుతుంది..సంతానప్రాప్తి కోసం, పిల్లల్లో తగిన మంచి ప్రవర్తన కోసం, ధన నష్టం తొలగడం కోసం, నింద తొలగడం కోసం ఈ నామ మంత్రాన్ని నిత్యం జపం చేయాలి.

🙏ఓం ఐం హ్రీం శ్రీo పురుషార్థప్రదాయై నమః🙏

🔱ఓం శ్రీ మాత్రే నమః 🔱

🌷(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)


292. 🔱🙏పూర్ణా 🙏🔱

రెండు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'పూర్ణాయైనమః' అని చెప్పాలి.

పూర్ణా = పూర్ణురాలు.

కొరత  లేనిది; మొదలు, తుదిలే నిది; క్షయ - వృద్ధులు లేనిది , ఏమన్నా వుంటే దాన్ని 'పూర్ణా' అని అనాలి. 'చోటు' కు ఈ లక్షణాలుంటాయి. అమ్మవారు సరిగ్గా అటువంటి వారు, అంటే, అన్నిటిలోనూ 'పుష్కలత్వమే' - గాని శుష్కత్వం' ఉండదు.
ప్రతిమాసం పూర్ణిమను ఇస్తున్నట్లుగానే - ప్రతిజీవికి మనస్సనే చంద్రుణ్ణి పూర్ణ చంద్రునిగా ప్రకాశింప చేసే తరుణం, అవకాశం ఇసుంది అమ్మవారు. ఆ రాజరాజేశ్వరిని ఆరాధించి ధ్యానించే వారిలో - ఎప్పుడూ ఆశాజనకంగా (optimistic & Postive thinking) జీవించే వారికే శ్రీ విద్య భాసిస్తుంది, అటువంటి వారిని పూర్ణవంతులను చేస్తుంది అమ్మవారు. దీన్నే 'పూర్ణ దీక్ష' ‘పాదుకాంత దీక్ష' అంటారు శ్రీ విద్యలో “పరిపూర్ణమైన మనస్సు, పవిత్రమైన భావాలు, నిత్య సంతృప్తి' లక్షణాలు కలవారే పూర్ణ దీక్షాపరులు, ఇవి లేకపోతే ఈ దీక్ష తీసుకున్నా ఒకటే లేకపోయినా ఒకటే!

పంచమి తిది రోజు అమ్మవారి నామం సంపూర్ణ చంద్ర కలలు తో పూర్ణ రూపంలో నిండు గా ఉండే తిది పంచమి అలాగే దశమి రోజు మరియు శుక్ల పక్ష చదుర్దశి తిది నాడు కూడా అమ్మవారి పేరు పూర్ణ..
ఆ తల్లిని ఎప్పుడూ పరిపూర్ణంగానే చూడాలి అంటే మనసులో ఆమె రూపాన్ని నింపుకుని ధ్యానం చేయాలి అప్పుడు పూర్ణత్వం అందరిలో అన్నిటా చూసే తత్వం  అలవాటు అవుతుంది. అన్ని అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉపయోగ పడే అంశాలుగానే ఉంటాయి. మనిషి మానసికంగా శారీరకంగా అమ్మవారి భావనతో నిండిపోయిన అనుభూతి కలగాలి , సర్వ జగత్తు సృష్టించి దానంతట తనే నిండిపోయిన శక్తి పూర్ణ...

'పూర్ణమదఃపూర్ణమిదం..... ' అనే ఈశావాశ్యోపనిషత్ శాంతి పాఠంలో చెప్పిన పూర్ణం - అమ్మవారే || (చోటువలె) పరిపూర్ణురాలు' అని ఈ నామానికి అర్థం.

🌹ఫలస్తుతి🌹

ఆగిపోయిన పనులు పూర్తి కావడానికి ఇది అద్భుతమైన కార్యసిద్ధి మంత్రం.. పరిపూర్ణ మైన ఫలితాలు పొందడానికి ఉపయోగ పడే మంత్ర సాధన , గర్భవతిగా ఉన్న స్త్రీలు ఈ నామాన్ని ద్యానిస్తే శుభ లక్షణాలు కలిగిన సంతానం కలుగుతుంది..

🙏ఓం ఐం హ్రీం శ్రీo పూర్ణాయైనమః🙏

🌹ఓం శ్రీ మాత్రే నమః🌹

🔱(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)🔱 


'ఓం' '... తో అలసట మాయం ...
శాస్త్రీయంగా నిరూపించిన ఇన్వెస్టిగేషన్

ఓం ... శబ్దంతో ....
శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది.

పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది .

కోల్కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది .
=========

ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు .
==========

అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన: పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్మిటర్స్తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి ...

ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ
జేసింది.

అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది .
===========
గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు . కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతున్నాయని అన్వేష నిరూపించిందని ఆయన అన్నారు.
===========
ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యుత్తర పరిశోధనలు చేపట్టలేదని ని సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్, శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.

ఇటీవలి రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో 165 విద్యార్థులను ఎంపిక చేశాడని ఆయన అన్నారు. వర్క్షాప్లో భాగంగా అన్వేషలో ఉత్తరాఖండ్ లో ప్రయాణించి నదీ బగేశ్వర్ నుండి 68 కిలోమీటర్ల దూరంలో కేదారినాథ్ కు కాలినాడకన రోజూ నీటిని తీసుకువెళ్ళడంతో కొంతమంది పజ్జరుల్లో ఎలాంటి అలసటతో ఆశ్చర్యపడింది.
ముందుకు సాగడం గుర్తించారు.

దింతో ఓంసార్ పై తన ప్రయోగాన్ని నిర్వహించాలని ఆలోచించారు.
పరిశోధించుటకు అక్కడే ఉంది. 430 హెర్జ్ల పౌనః పురుగు: పుంగాలను వెల్లడిస్తున్నట్లు గుర్తించి వివిధ లాబొరేరేటరీలలో ఐదు ప్రయోగాలను నిర్వహించారు.
============
17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది.

ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగింది, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు తెలిసింది.


296. 🔱🙏అనాదినిధనా🙏🔱

ఆరు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు "అనాదినిధనాయైనమః" అని చెప్పాలి.
అనాదినిధనా = ఆది, అంతము లేనిది.. 'ఆది' అంటే - జననమనీ, అంతము' అంటే, - మరణ మనీ అర్థం చేసుకోవాలి. జీవులకు ఉండే ఈ రెండు లక్షణాలు జీవేశ్వరి అయిన అమ్మవారికి ఉండవు.
ఈ భువనాలు ఉన్నపుడు లేనప్పుడు కూడా ఆ తల్లి ఉంటుంది.. శాశ్వతమైనది ఆ తల్లి

జననమరణాలు లేనిది' అని ఈ నామానికి అర్థం.

🙏ఫలస్తుతి🙏

ఈ నామం జపం వల్ల శాశ్వత పరిస్కారం లభిస్తుంది. పదోన్నతి కోసం ఈ నామ జపం చేయాలి క్రీడా రంగంలోని వారికి ఈ నామ ధ్యానం కార్యసిద్ధి మంత్రం గా పని చేస్తోంది... సుమంగళిగా సౌభాగ్యం కోరుకొనే స్త్రీలు  "శ్రీ మాత అనాదినిధనాయైనమః" అనే ఈ నామంతో అర్చన చేస్తే వారికి మాంగళ్య బలం కలుగుతుంది.. ఈ నామనికి అర్థం శాశ్వతమైనది అని అర్థం...పరిస్కారం లభించని ఏ సమస్యకైనా ఈ నామాన్ని ధ్యానించే వారికి పరిస్కారం లభిస్తుంది.

🌹ఓం ఐం హ్రీం శ్రీo అనాదినిధనాయైనమః🌹

🙏ఓం శ్రీ మాత్రే నమః🙏

🔱(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)🔱

297. 🙏హరిబ్రహ్మేంద్రసేవితా🙏

ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'హరిబ్రహ్మేంద్ర సేవితాయైనమః' అని చెప్పాలి.

హరి = విష్ణువు చేత,
బ్రహ్మ = బ్రహ్మ చేత,
ఇంద్ర = ఇంద్రునిచేత,
సేవితా = సేవింపబడునది.

హరి బ్రహ్మేంద్రులే కాదు - సకలదేవతలు సేవించే పరదేవత అమ్మవారని దేవీ భాగవతంలో -
బహ్మ విష్ణుస్తథా శంభుః వాసవో వరుణ్యమః వాయురగ్నిః కుబేరశ్చ త్వష్టా పూషాశ్వినౌ భగః ఆదిత్యా వసవా రుద్రా విశ్వేదేవా మరుద్గణాః
* సర్వే ధ్యాయంతి తాం దేవీం సృష్టి స్థిత్యంత కారిణీమ్*
- అన్న శ్లోకంలో చెప్పబడింది.

అమ్మవారిని సేవించే వారిని ఉపాసించడం కన్నా - వారందరూ సేవించే అమ్మవారినే సేవించడం శ్రేయస్కరమని పై శ్లోకం చదివి గ్రహించాలి. ‘హరి, బ్రహ్మ, ఇంద్రులచే సేవింపబడునది' - అని ఈ నామానికి అర్థం. ఇంద్రుడు , విష్ణువు బ్రహ్మ సదా ఆ దేవిని ఆరాధించడం ధ్యానించడం వల్ల వారు ఆ స్థానాన్ని పొందారు...

అమ్మవారు అనేక బ్రహ్మాండాలకు నాయకి అనేక కోట్ల లోకాలు వాటిని పరిపాలించే అనేక విష్ణు,బ్రహ్మ, మహేశ్వర రూపాలు, సూర్యలు.. ఉన్నారు వీటన్నిటికీ వీరందరికి ఆ తల్లి నాయకురాలు... ఉపాసనా శక్తి వల్ల జీవులు ఉత్తమ స్థానాన్ని పొందగలుగుతారు , అలా అనడం కన్నా ఉత్తమ స్థానంలో ఆ తల్లి వారి స్థానాన్ని నిర్ణయించి నియమిస్తుంది. వీరంతా చేసిన దేవి ఉపాసన వల్ల విష్ణువుగా బ్రహ్మగా ఇంద్రాది దేవతలుగా నియంచబడినారు. ఇతర దేవతా ఉపాసన వల్ల మోక్షాన్ని పొందుతారు, జ్ఞానాన్ని పొందుతారు, ఇహ లేక పర లోక సుఖాన్ని పొందుతారు... ఉత్తమలోకాలకు చేరుతారు.. కానీ దేవీ ఉపాసన వల్ల దేవతా రూపాన్ని పొందగలుగుతారు, పూజ్యునీయ స్థానాన్ని పొందగలరు దేవి ఉపాసన శక్తి వల్ల ఎదో ఒక బ్రహ్మాండానికి నాయకులుగా నియమించి బడతారు, ఆ తల్లిని ఎంతగా ఆరాధిస్తే అంత ఉన్నత స్థితికి చేరుకుంటారు , ఇటు ఇహ పర లోక సౌఖ్యాన్ని కూడా దేవీ ఆరాధనవల్ల పొందగలుగుతారు... అదే ఈ నామ అర్దమ్ లోని రహస్యం..

🌹ఫలస్తుతి🌹

ఎవరికైనా పదవి పోయే ప్రమాదం ఉన్నా,  ఉద్యోగం పోయింతుందేమో అన్న అనుమానం ఉన్నా ఈ నామ జపం వల్ల  వారికి ఆ సమస్య తీరిపోతుంది. స్థిర నివాసం కోసం ,  టెంపరరీ ఉద్యోగం పర్మనెంట్ కావడం కోసం.. ఈ నామాన్ని నిత్యం ధ్యానించాలి.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపాధి కలగని వారు వ్యాపార వృద్ధి లేని వారు ఈ నామ మంత్రాన్ని సహస్త్రనామంతో సంపుటికరణ చేస్తే ఉత్తమ ఫలితం శీఘ్రoగా లభిస్తుంది...

🙏ఓం ఐం హ్రీం శ్రీo బ్రహ్మేంద్రసేవితాయైనమః🙏



🌹ఓం శ్రీ మాత్రే నమః.🌹

🔱(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)🔱
🙏🙏🙏🙏🙏


299. 🔱🙏నాదరూపా🙏🔱

నాలుగు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'నాదరూపాయైనమః' అని చెప్పాలి.

నాద = నాదము యొక్క;
రూపా = రూపము అయినది.

అవ్యక్తం నుండి వ్యక్తమైన ప్రథమ రూపమే నాదం. నాదాఖ్యా సర్వభూతేషు జీవరూ పేణ సంస్థితా.
సర్వభూతాల్లోను నాదరూపంగా, జీవరూపంగా ఉండి, ఆది, అంతము అనేవి లేకుండా, సూక్ష్మంగా ఉంటూ, ఎప్పుడూ నాశము లేని అక్షర పర బ్రహ్మమే అమ్మవారు అని అర్థం చేసుకోవాలి. ఏది పలికి నా, ఉచ్చరించినా గొంతు నుండి వచ్చేనాదం యొక్క అవస్థా భేదాలే గదా! అందుకని అమ్మవారు - నాదరూపా .

శ్వాస విడిగా ఉన్నప్పుడు దాని ప్రజ్ఞ దానిదే, మన ప్రజ్ఞ మనదే! శ్వాస వాక్కు అయినపుడు, ఈ రెండూ కలిసి నాదమౌతుంది. (Noise with consciousness is voice).
మనలో ఏ అంగముల యందు ఒత్తిడి లేకుండా గొంతు నుండి ఉద్భవించేది నాదం. 'ఉచ్చరించడానికి కావలసిన శక్తి'ని - 'ఉచ్చరిద్దామన్న సంకల్పాన్ని - ఈ రెంటినీ ధ్యానం చేస్తూ నాదాన్ని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించినపుడు వెలువడే నాదాన్ని వింటూ ఉంటే - మనకు తెలియకుండానే ' నాదం' మనలోంచి వ్యక్తమౌతూ ఉంటుంది. అభ్యాసం చేసే వారికి ఈ విధంగా ఎంత సేపైనా నాదం వస్తూనే ఉంటుందని సాధనలో తెలుస్తుంది. నిలకడగా ఉన్న జలాశయం చిన్న రాయి తాకిడితో అలజడికి గురికాబడి అనంతమైన తరంగాలనిస్తూ- ఆ అలజడిని అంతటా ఆవరింప జేసినట్లు - అనంతమైన ఆకాశంలో వ్యక్తం కాబోయే సృష్టి యొక్క బీజ పరిమాణంలోని బిందువుగా ఉత్పన్నమై విశ్వం అంతటా తన పరిణామాన్ని నామరూపాల్లో విస్తరించే అమ్మవారిని 'నాదరూపా' అనవచ్చును.

నాధము ఉన్నంతవరకు సృష్టి ఉంటుంది, అది నిష్క్రమించినచో సృష్టి తిరోధానము చెందుతుంది. సృష్టి ఆరంభము నాదం తోనే మొదలు అవుతుంది ఇది శూన్యం నుండి వ్యక్తమైనా ఆది ప్రణవనాదం అయినా ఓంకారం ఈ ఓంకారం అమ్మవారి స్వరూపం, ఈ శబ్దం నుండి అనేక రకాల బీజంలో ఉత్పన్నమైనది వేదములు ఉత్పన్నమైనవి ,శబ్దం ఎంతో శక్తి వంతమైనది శబ్ద వైద్యం తో ఎన్నో జబ్బులకు చికిత్సలు చేస్తున్నారు శబ్దం ఆధారమైనది బీజమంత్రం బీజాలు స్పష్టంగా ఉచ్చారణ చేయడం వలన కలిగే ప్రకంపనలకు  ప్రకృతి లోని విశ్వ ప్రాణశక్తి ఆకర్షించ పడుతుంది. (మంత్ర శక్తి వ్యాసంలో నేను ఇదివరకు ఇచ్చిన వివరణ గమనించ గలరు)...

ఆ జగన్మాత శబ్ద రూపం లో ఉంటుంది మనిషికి మటుకే మాట్లాడే శక్తిని భగవతి అనుగ్రహించినది..ఇంక ఎ జీవికి ఈ శ్వాసతో అక్షర సముదాయాన్ని మేళవించి నాధ రూపంగా వ్యక్తం చేయగలగడం, ఈ తరంగాల్లోంచి వచ్చే నాదాన్ని వినగలగడం అనే అవకాశం లేదు...మనకు శబ్ద రూపంలో అంత సమీపంలో ఉన్నది ఆ తల్లి , ఆ వాక్కుని సద్వినియోగం చేసుకోవాలి.. పదే పదే ఒక శుభాన్ని పలికినా, అశుభాన్ని పలికినా అది ఫలిస్తుంది.. ఎందుకంటే పలికే ప్రతి అక్షరం బీజము పతి పదానికి స్పందనలు ఉంటుంది కొన్ని పలుకులకు దేహంలోని నాడులు కంపిస్తే కొన్ని శబ్దాలకు ప్రకృతి లో శక్తి ఆకర్షిస్తుంది అది పాస్టీవ్ ఎనర్జీ కావచ్చు నెగటివ్ ఎనర్జీ కావచ్చు మీరు పలకడం వల్లే అది మీకు దగ్గర అవుతుంది.. అందువల్ల శబ్దాన్ని స్పష్టంగా నూ పలికే పదాలు అర్ధవంతంగాను.. ఉంటే వాక్కు మహా మంత్రం మహోది అవుతుంది.. నాదం నడిపించే గురువుగా మారుతుంది..

'నాదము యొక్క రూపము' - అని ఈ నామానికి అర్థం.

🌹ఫలస్తుతి🌹

ఈ నామ మంత్రం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది.. శబ్ద రూపంలో ఆ తల్లిని ఆరాధించడం.. అందువల్ల ప్రతి ఒక్కరికి అవసరం.. అలాగే వినికిడి లోపం ఉన్నా, త్వరగా మాటలు పలకలేని పిల్లల కోసం, మానసిక ఎదుగుదల లేని వారి కోసం ఈ నామ మంత్రాన్ని వారు కానీ వారి కోసం వారి తల్లిదండ్రులు కానీ సంకల్పమ్ తో ఈ నామ మంత్రాన్ని నిత్యం జపించడం , అలా జపించిన మంత్రంతో అభిమంత్రించిన తీర్థాన్ని పిల్లలకు ఇస్తూ ఉంటే వారికి ఆరోగ్యం కుడుటపడుతుంది.

🌹ఓం ఐం హ్రీం శ్రీo నాదరూపాయైనమః🌹

🙏ఓం శ్రీ మాత్రే నమః.🙏

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ