***


1. స్త్రీ ఎలా ఉండాలో , 2. *మనం*  కధ, 3. 🌸 శ్రీమద్భాగవతము 🌸,4. నచ్చిన కవిత
5. “ జీవిత సత్యాలు “,  6. సుదర్శన చక్రం విశిష్టత ...7. ప్రదక్షిణ ఎందుకు చేస్తాము ?
8. "శ్రీరమణీయం"}9. ఆత్మలు,10. లోకజ్ఞానం




1. స్త్రీ ఎలా ఉండాలో 

పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚

కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

1.కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.

2. కరణేషు దక్షః :-
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

3. రూపేచ కృష్ణః:-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.

4. క్షమయా తు రామః:-
ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి

5. భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం:-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
పైన వి ఆచరించినవాడే నిజమైన పురుషుడు .

--(())_-


2. *మనం*  కధ

*మనం* *అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి* 

*యజమాని, ఇల్లు ** *ఖాళీ చేయమని ఆదేశియస్తే, వెంటనే సామను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము.** 

*ఎక్కడకు* *వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము.* 

*అలాగే* *ఈ* *శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము.* 

*ఋణం* *తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటివేయబడుతుంది.* 

*దానికి ఆ* **తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు.* 
*అప్పడు అది, తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు,* *అంతకముందు జన్మల* *పాపపుణ్యాలను* *వెంటబెట్టుకుని, వెళుతుంది.* అవే *సంచితకర్మలు* . 

*3. ప్రారబ్ధ కర్మలు* - *అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు* *ప్రయాణిస్తుంటాడు* . 

*ఏ* *ప్రాణి* *అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో,* 

*అప్పుడు* *అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఈ* 

*కర్మలు* *అయితే పక్వానికి* *వస్తాయో* , *లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి,* 

*జీవుడికి* *తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన* 

*కర్మలలో* *అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ.ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది.* 

*ప్రారబ్ధం* *ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసిందే.* 

*ప్రారబ్ధం* **తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.* 
*ప్రారబ్ధం* *ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు,* 

*బంధవులు* *మొదలైన వారంతా* *ఒక* *జన్మలో మన కర్మల* 
*ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆయ* 

*వ్యక్తులతో* *మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము.* 

ఈ *శరీరం* *ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి* 

*ఖర్చయుపోగా* , *జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయి.* 

ఈ *మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభవించడాన* ికి 

*సిద్ధమవుతాయో* , *అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. ఈ చక్రం* *ఇలానే* *కొనసాగుతుంది* . 

అందుకే *ఆదిశంకరులు* భజగోవింద స్తోత్రంలో 
**పునరపి జననం పునరపి మరణం* 
**పునరపి జననీ జఠరే శయనం"* 
అని అన్నారు. 
*మళ్ళీ* *పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లుగర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు.* 

*ఎప్పుడైనా* *కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము* , 

*అంటే* *ఇదే. మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము.* 

*అలాగే* *పాపం పండింది అనేమాట కూడా ఉపయోగిస్తాము.* 

*పాపం* *పండడమేంటి? అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తోంది.* 

*ఎప్పుడో* *చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోంది.* 

ఆ *ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే.* 



*విత్తనం* *చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు.* 

*అలానే* *చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది.*
--((*))-- 

3. 🌸 శ్రీమద్భాగవతము 🌸
🌻 ప్రజలు ధర్మబుద్ధి లేనివారైనపుడు, ప్రభుత్వములు దోపిడి కాండ్రైనపుడు యజ్ఞార్థకర్మలుండవు.

అది ఎట్లనగా పంటలను దొంగిలించువారు పొలములను సారవంతము చేయరు కదా! పండించకయే భుజించు బుద్ధికలవానికి పొలమెట్లుండునో తెలియనప్పుడు దానిని సారవంతము చేయు సద్బుద్ధి ఎట్లు పుట్టును? సారవంతము చేయుట తెలిసినవాడు కూడ భూమిపై ఆదరము కలిగియుండక, అధికముగా పండించి, అమ్ముకొనుట యందే శ్రద్ధ చూపును.

తాత్కాలికముగా భూమిని పండించునట్టి ఎరువులు, రసాయనిక పదార్థములు మున్నగు అనర్థకములైన కృత్రిమ మార్గములు అవలంబించును. దోచుకొనుట సాధ్యపడనివాడు తగులబెట్టుట మున్నగు పనులు చేసి పగదీర్చుకొనును. దోపిడికాండ్రు ప్రభుత్వాధికారులు కాగా పన్నుల రూపమున పంటలు అపహరింపబడును. దానితో పరస్పరత్వము చెడిపోవును. పరోపకారబుద్ధి తొలగిపోవును. నిష్కామ కర్మయోగము కరవైపోవును.

మేఘములు వర్షించుట మొదలగు ప్రకృతి ధర్మములు మానవుని నుండి ఏ ప్రయోజనమును కోరకయే ప్రవర్తించుచున్నవి. అనగా అవి యజ్ఞార్థ కర్మలు. ఆ బుద్ధి లేక మానవుడు ప్రవర్తించుటచే నరజాతి దొంగలై నిరంతర భీతితో జీవింపవలసివచ్చును.....✍ మాస్టర్ ఇ.కె. (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻
 --(())--
4. నచ్చిన కవిత

“పాపమయ్యేలా
సంపాదించకండి,
అప్పు అయ్యేలా
ఖర్చుచేయకండి,
అజీర్తి అయ్యేలాతినకండి,
మనస్పర్ధలొచ్చేలా మాట్లాడకండి,
ఆలస్యం చేస్తూకాలాన్ని నిందించకండి,
అర్థం చేసుకోకుండా అవమానపర్చకండి,
నాదే లోకం అనుకోకుండా  ప్రపంచాన్ని చూడండి,
ద్వేషాన్ని వదిలేసిప్రేమను ఆహ్వానించండి,
కోపంగా 10 మాటలు కాదు ప్రేమగా ఒక్క మాట చాలు,
ఎంత సీనియారిటి అన్నది కాదు
ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం,
ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు
ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం,
ఏమి సాదించామన్నది కాదు
ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం,
మరియు
ఎంతో మంది స్నేహితులన్నది కాదు
ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం”
ఎవరు పంపారా అని కాదు
సత్యమా అసత్యమా ఇది ముఖ్యం
--(())--

5. “ జీవిత సత్యాలు “

మెట్టెల విలువ వేలలో
కాని వేసేది కాళ్ళకి
కు0కుమ విలువ రూపాయలలో
కాని పెట్టుకొనేది నుదుటి పైన
విలువ ముఖ్యము కాదు
ఎక్కడ పెట్టుకు0టామనేది ముఖ్యము

ఉప్పులాగ కటువుగా మాట్లాడే వాడు నిజమైన మిత్రుడు
చక్కెరలాగ మాట్లాడి మోసగి0చే వాడు నీచుడు
ఉప్పులో యెప్పుడు పురుగులు పడ్డ దాఖలాలు లేవు
తీపిలో పురుగులు పడని రోజు లేదు

కనిపి0చని దేవుడికి ఖర్జూర పాయసం
కటిక బీద వాడికి రొట్టె ముక్కలు పాచిన బువ్వ
ఎ0త వరకు సమంజసము
హే మానవా ! ఈ జీవితమంత విలువైనదేమి
 కాదు
ఏడుస్తూ ఈ లోకంలో అడుగిడుతావు
 ఏడిపిస్తు ఈలోకాన్ని వదలి వెళ్ళి పోతావు
 రమ్మన్నా సన్మార్గములోకి యెవ్వరు రారు
 వద్దన్నా చెడు మార్గమునే యె0చు కు0టారు
 పాలు అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి
 సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరు వెళతారు
 పాలల్లో నీళ్ళు కలిపినావా అని అడుగుతారు
 ఖరీదైన సారాయిలో నీళ్ళు కలిపి తాగుతారు
 ఆహాహా యేమి ఈ లోకం

 పెళ్ళి ఊరేగి0పులో బంధుమిత్రులు ము0దు
 వరుడు వెనకాల
 శవయాత్రలో శవము ము0దు బంధు మీత్రులు
 వెనకాల
 శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు
 మూగ ప్రాణులను చంపి భుజిస్తారు
 కొవ్వు వత్తులను వెలిగి0చి చనిపోయిన వారిని
 గుర్తు చేసుకొ0టారు
 కొవ్వు వత్తులను ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు
 హే మానవా ! నీకు దక్క వలసినది నీకు దక్క
 కు0డ పోదు
 నీకు ప్రాప్తము లేనిది నీకెప్పుడు దక్కదు
 ఆకలి విలువ పేదవానికి తెలుసు
 కష్టము విలువ కర్షకునకు తెలుసు
 ఇదే పచ్చి నిజం
 పుట్టినపుడు జాతకం
 మధ్యలో నాటకం
 చావగానె సూతకం
 ఐనా ఆగదు జనుల మధ్య కౌతుకం
 సకల జీవులకు అన్నమే పరబ్రహ్మ మని   
 అన్నాడు బసవణ్ణ
 అది తెలుసకోకు0డ మూఢులైనారు చాలా
 మంది
 కళ్ళతో ఈ జగత్
తును చూస్తే కనిపి0చేవి దృశ్యాలె
హృదయంతో తిలకిస్తే జగత్తంతా సు0దర
సుమధుర నందన వనాలె.

 ( కన్నడ కవితకు నా అనువాదము )

6. సుదర్శన చక్రం విశిష్టత ...

చక్రం పూర్ణత్వానికి ప్రతీక. ఈ విశ్వమంతా చక్రమండలమయమే. ఏడేడు పద్నాలుగు లోకాలు అన్నీ చక్రాలే. వాయు, వహ్ని, గగన, జలమండలాలన్నీ చక్రాలే! ఒక్కమాటలో చెప్పాలంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే. ఆ చక్రాన్ని ధ్యానించి, అభిషేకార్చనలతో సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవరోజు ఉదయం భూదేవీ సమేత  మలయప్పస్వామివారిని సుదర్శన చక్రత్తాళ్వార్‌తో వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత శ్రీచక్రత్తాళ్వార్‌ను అంటే సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరిణిలో ముంచి, పవిత్రస్నానం చేయిస్తారు. అదే సమయంలో లక్షలమంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరఃస్నానం చేస్తారు.

ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధశక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. అందుకే ఈ చక్రస్నానం సృష్టిచక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది. దీనికే అవభృథస్నానమని కూడా పేరు. శ్రీవారి దివ్యాయుధాలలో చక్రాయుధ ప్రశస్తి ఎంత మహత్తరమో గుర్తిస్తే- చక్రస్నాన మహత్యం భక్తులకు అంతగా స్వానుభవానికి వస్తుంది.
 శ్రీనివాసుని పంచాయుధాలలో మూర్తిమంతంగా, దేవతగా, ఆళ్వార్‌గా, యంత్రరూపంగా, యంత్రాధిష్ఠానదేవతగా, దుష్టశిక్షణలో ప్రముఖాయుధంగా కీర్తింపబడేది  సుదర్శనమొక్కటే! భక్తై సుఖేన దృశ్యత ఇతి... అంటే దీనిని భక్తులు సుఖంగా చూడగలరన్నమాట. శ్రీవారి చక్రాయుధాన్ని కష్టాలు, దుష్టశక్తులు, శత్రువుల బారి నుండి రక్షించే మహాశక్త్యాయుధంగా విశ్వసించి, పూజించడం ఒక ప్రత్యేకత. దేవశిల్పి అయిన విశ్వకర్మ... సూర్యుణ్ణి సానబట్టేటప్పుడు రాలిన తేజస్సును పోగు చేసి, చక్రాకారమైన ఆయుధంగా రూపొందించి, మహావిష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడు. ఇది శ్రీహరి సంకల్పించినంతనే వచ్చి, కుడిచేతిని చేరుతుంది. ప్రయోగించగానే ఎంత బలవంతుణ్ణయినా తరిమి, సంహరించి, తిరిగి స్వస్థానానికి వస్తుంది. ఈ చక్రాయుధం వల్ల మృతినొందినవారు విష్ణుదేవుని దివ్యతేజంలో లీనమవుతారు.
 గజేంద్ర సంరక్షణకై శ్రీహరి తన చక్రాయుధాన్నే పంపాడు. భాగవతంలోని అంబరీషుని వృత్తాంతంలో... దుర్వాసునికి బుద్ధి చెప్పి, అంబరీషుని రక్షించేందుకై శ్రీహరి పంపిన చక్రం ఎంత మహత్తర ప్రభావంతో, విజ్ఞతతో ప్రవర్తించిందో గమనిస్తే, అది సాక్షాత్తూ నారాయణ రూపమే అని గోచరిస్తుంది. శివబ్రహ్మాదులైన ఏ దేవతలూ ఆ చక్రాన్ని నివారించలేకపోయారు. అప్పుడు అంబరీషుడు ఆ మునిని రక్షించేందుకు చేసిన చక్రాయుధ స్తోత్రం సుదర్శన సహస్రనామ స్తోత్రంలోని అన్ని నామాల సారాంశాన్నీ పుణికిపుచ్చుకుంది.
 
దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే, భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనమిస్తుంది. సృష్టిక్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందనేది యోగుల విశ్వాసం. శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తుంది. అందుకే దీన్ని సుదర్శనం అంటారు. ధ్వజారోహణం నాడు గరుత్మంతునితోబాటు చక్రత్తాళ్వార్‌నీ ఆహ్వానిస్తారు. అప్పుడు చక్రగద్యంతో స్వాగతం పలుకుతారు. అనంతరం... ‘అఖిల జగదభివృద్ధిరస్తు’ అని మంగళవాచకం చెప్పి, తాళ లయాత్మకంగా ఆహ్వానించి, సుదర్శన దేవతకు ప్రీతికరంగా...‘చక్రస్య షట్పితా పుత్రతాళం స్వస్తిక నృత్తకమ్ శంకరాభరణ రాగం చక్రవాద్య సమన్వితమ్’ అని పఠిస్తారు.

ఇందుకు తగినట్లే మంగళవాద్యకులు శంకరాభరణం, షట్పితా పుత్రతాళం, స్వస్తిక నృత్తం, చక్రవాద్యం కావిస్తారు. నైవేద్య నీరాజనాద్యుపచారాలతో చక్రదేవతను ఆరాధిస్తారు. ఇదే పద్ధతిని అనుసరించి, చక్రగద్యాదికం పఠించి, అర్చించి, ధ్వజావరోహణం నాడు చక్రదేవతకు వీడ్కోలు పలుకుతారు. బ్రహ్మోత్సవ సేవలలో తక్కినవన్నీ ఒక ఎత్తు... చక్రస్నానం ఒక ఎత్తు.
శ్రీమన్నారాయణాభేదశక్తిని తనలో ఇముడ్చుకున్న చక్రస్పర్శచే పవిత్రమైన పుణ్యజలంలో చక్రంతోపాటు స్నానం చేయడం బ్రహ్మోత్సవాలలో ఒక అద్భుత సన్నివేశం. చక్రస్నానం వల్ల సర్వపాప విముక్తులై, విష్ణులోకాన్ని పొందుతారని ఆగమోక్తి! ఈ స్నాన మహిమ అవాఙ్మానస గోచరం. ఆత్మైక వేద్యం.
🙏🙏🙏


7. ప్రదక్షిణ ఎందుకు చేస్తాము ?
🌹🌹🌹🌹🌹
గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకరంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేస్తాము? అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు.
ఋగ్వేదం ప్రదక్షిణ గురించి చెబుతూ దక్షిణం వైపు ముందుకు ఆర్తి తో నడవడం అని చెబుతుంది.
స్కాందపురాణం ప్రదక్షిణం లో ప్రతీ అక్షరం గురించి చెబుతూ ప్ర అంటే పాపాన్ని నివృత్తి చేస్తుంది అని, ద అంటే కోర్కెలను ఒసగేది అని, క్షి అంటే కర్మను క్షయం చేసేది అని, ణ అంటే మోక్షాన్ని అనుగ్రహించేది అని చెబుతుంది. మొదటి అచ్యుత ప్రదక్షిణ చేస్తే మానసిక పాపాలు నాశనం చేస్తుందని, రెండవ ప్రదక్షిణ చేస్తే వాచిక పాపాలు నివృత్తి అయిపోతుందని, మూడవ ప్రదక్షిణ కాయిక పాపాలు క్షయం అవుతుందని శాస్త్ర వచనం.

గుడిలోనికి వచ్చిన వారు ఎన్నో మానసిక భారాలను మోసుకు వస్తారు. పూర్వం ఒక వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు అతడిని ఒక అరగంట ప్రశాంతంగా కూర్చోబెట్టిన తరువాతనే అతడికి బీపీ వంటి ఇతర వైద్యపరీక్షలు నిర్వహించేవారు. అంటే ఒకరి భౌతిక పరిస్థితి సాధారణ పరిస్థితికి వచ్చిన తరువాత కానీ అతడి స్థితిని పట్టుకోలేరు, బాగుచెయ్యలేరు అని నిరూపింపబడిన శాస్త్రం. అలాగే గుడికి వచ్చిన వాడి మానసిక స్థితి సాధారణ స్థితి normalcy కి రావాలంటే ఆ శక్తి వలయంలో ఒక మూడుసార్లు ప్రదక్షిణ తప్పక చెయ్యాలి అని మన వాంగ్మయం చెబుతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు clock wise గా నడుస్తాము. దేవాలయం చుట్టూ మొదట దక్షిణం వైపు మొదటి అడుగు వేస్తూ నడుస్తాం. ఇలా నడవడం వలన ఎప్పుడూ మన కుడివైపు ఎప్పుడూ లోపలున్న విగ్రహం ఉంటుంది. కుడి వైపు ఎప్పుడూ మంగళకరం గా చెప్పబడుతుంది. అత్యంతమంగళప్రదమైన భగవంతుడు మనకు ఎప్పుడూ మంగళం వైపు ఉండి మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్ధిస్తూ ప్రదక్షిణ చేస్తాము.

ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా నడవమని నియమం. ఒక నిండు గర్భిణి చేత్తో ఒక నిండు కుండ పట్టుకుని నడిచినట్టు నడవాలి అని శాస్త్రం. ఒక వలయం (circle) సెంటర్ నుండి సమాంతర దూరం గా (equidistant) గా ఉన్నట్టు లోనున్న భగవంతుని సెంటర్ గా చేసుకుని జీవుడు ప్రదక్షిణ చేసినట్టు అని అర్ధం. ఆది శంకరాచార్యులు చెప్పినట్టు 10008 విశ్వాలు ఆ పరమాత్ముని చుట్టూ తిరిగినట్టు నువ్వు గుడిచుట్టూ తిరగాలి అని. 21 ప్రదక్షిణ
లు చేసిన వారు సకల సంపదలు పొందగలరని స్వయంభూ ఆగమం చెబుతుంది.
🙏🙏🙏🙏🙏


8. "శ్రీరమణీయం"} 
మనసులో వ్యక్తమయ్యే దుర్గుణాలను అధిగమించాలంటే ఏమి చెయ్యాలి ?

స్వామి వివేకానంద సూచన ప్రకారం మనసులో వ్యక్తమయ్యే దుర్గుణాలను అధిగమించాలంటే అందుకు వ్యతిరేక గుణాన్ని ఆశ్రయించాలి. అంటే పిల్లాడిపై కోపం వచ్చినప్పుడు అందుకు విరుద్ధంగా ముద్దుచేయాలని గుర్తు చేసుకుంటే కోపం ఉపశమిస్తుంది. అలా పదిసార్లు చేస్తే ఆ గుణమే పోతుంది. ఎవరిపై మనకు ద్వేషం ఉందో వారితో మాట్లాడనంత కాలం ఆ ద్వేషంపోదు. వారితో మాట్లాడితే అదీ పోతుంది. మనలోని గుణాలన్నీ అద్దంలోని ప్రతిబింబం లాంటిది. వాటిని మార్చాలంటే ఎదురుగా ఉన్న వాటిని మార్చ వలసి ఉంది. అనవసరమైన విషయాలు గుర్తుకు వస్తూ ఉండటం అనే గుణం మనని ఎక్కువగా బాధిస్తుంది. దీన్ని అధిగమించి గలిగితే అప్పటి పనికి అవసరమైన ఆలోచనలు మాత్రమే ఉండటం వలన సంతోషం, దుఃఖం అనేవి లేని ఆనందకర పరిస్థితి ఉంటుంది దీనినే రాజయోగం అంటారు !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'అవసరం లేని ఆలోచనతోనే అశాంతి !'-


9. ఆత్మలు
విశ్వంలో ఉన్న కోటానుకోట్ల ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మ స్థాయిలలో ఏదో ఒక దానికి చెంది ఉంటాయి.

1.  శైశవ ఆత్మ (అజ్ఞాని):- దేవుడు ఉన్నాడా? ఉంటే  చూపించు? 'ఆధారాన్ని' చూపించు అనేవాడు.

2. బాల ఆత్మ (విపరీత జ్ఞాని):- మేము చెప్పేదే కరెక్ట్., అని వితండవాదం చేసేవారు.

3. యువ ఆత్మ (ప్రాపంచిక జ్ఞాని):- పైకి అన్నీ చెప్తాడు. కానీ ఆచరించడు.

4. ప్రౌఢ ఆత్మ (వేదాంతి):- 'అంతా దైవమే, అంతా మాయే, మనం నిమిత్తమాత్రులం' అనేవాడు.

5. వృద్ధ ఆత్మ (యోగి):- ధ్యానం చేస్తూ, దివ్య దృష్టిని  ఉత్తేజింప చేసుకున్నవాడు. కానీ దివ్య దృష్టి మాత్రం 'మనసు చేసే ట్రిక్స్' అని అనుకునేవాడు.

6. విముక్త ఆత్మ (ఋషి/రాజర్షి):- ఎంత మాత్రం మాట్లాడకూడదు, సాధన చేయాలి అనే వాడు..... సాధన చేస్తూ దగ్గర వచ్చే వాళ్లకు ధ్యానం చేయండి అని చెప్తాడు.

7. పరిపూర్ణ ఆత్మ (బ్రహ్మర్షి):-అన్ని చోట్లకు తిరుగుతూ, ప్రతిఫలాపేక్ష లేకుండా  ఆత్మజ్ఞానాన్ని అందించేవారు.

ఎవరైతే బ్రహ్మర్షి స్థితిలో ఉంటారో-- వారు జనన మరణ చక్రమును దాటుతారు.  వారికి మరల జన్మ తీసుకునే అవసరం ఉండదు.

🕉🌞🌎🌙🌟🚩

10. లోకజ్ఞానం 

చెరువు నీరు అన్ని పంటలకు సమానంగా అందినా కూడా కాకర కాయ చేదుగా, చింత పండు పులుపుగా, దానిమ్మ పండు తియ్యగ ఉంటుంది .అందుకని నీటిని దోషిగా భావించకూడదు. ఇది నీటి దోషం కాదు..ఇవి అన్నీ తమ తమ కర్మఫలాలుఅదే విధంగా మనుష్యులు కూడా తమ తమ కర్మ ఫలాలు (అంటే ఇతరులు ను బాధ పడేపనులు చేయకుండ ఉండడం వల్ల మరియు మనకు సహాయం చేసే స్థితిలో ఉంటే సహాయం అవసరం అయినవారికి సహాయ పడితే మంచి కర్మ పలితం ఉంటుంది. ఇది అతి గాను,చాదస్తంగానుఉండచ్చు. ,కాని ఇది నిజం.)ఖచ్చితంగా అనుభవిస్తారు కాబట్టి మంచి కర్మలు చేయడం అనేది చాలా ముఖ్యమైనది.
    
--(())--

పుట్టిన ప్రతి మనిషీ ఏదోనాటికి ఆధ్యాత్మిక భావనను అందిపుచ్చుకోక తప్పదు. కొందరు యుక్తవయసులో దైవం, సంప్రదాయం, మతం వంటి భావాలను అందుకుంటారు. కొందరు మధ్య వయసులో, ఇంకొందరు వృద్ధాప్యంలో పారమార్థిక జీవితం పట్ల ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక విద్య బాల్యంలోనే అబ్బిన కొద్దిమంది బాలలు మహనీయులుగా, భగవంతుడి ప్రియసఖులుగా అలరారిన వైనం మన పురాణాల్లో కనిపిస్తుంది. ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు... ఆ కోవకు చెందినవారే! ఆధునికయుగంలో ప్రసిద్ధి పొందిన మహాపురుషులు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద అలా తమ ప్రతిభ చాటినవారే!

 నేర్పు-ఓర్పు జంటపదాలు. ఓర్పు ఉన్నవారే కాలక్రమంలో నేర్పరులు కాగలరు. లౌకిక జీవితంలో నేర్పు సంపాదించడానికి ఓర్పు ఎంత అవసరమో ఆధ్యాత్మిక కర్మాచరణలో విజేతలుగా ఎదగడానికి ఓర్పు అంతే అవసరం. ఉపవాసాలు, పూజలు, నోములు, వ్రతాలు... ఇవన్నీ ఆచరించడానికి నేర్పుతోపాటు ఓర్పూ చాలా అవసరం!
🙏🙏🙏🙏
--(())--

శరీరంలోని ప్రతి అణువుకు స్పందించే గుణం ఉంది. అన్ని స్పందనలూ ఒకేతీరుగా ఉండవు. హృదయస్పందనల ప్రభావం శరీరం, మనసులపై ఉంటుంది. శరీరం ఒక సజీవ దేవాలయమైతే, హృదయం గర్భాలయం లాంటిది. బాహ్యాంతరాల్లోని దృశ్య శ్రవణాదులకు అనుగుణంగా హృదయం స్పందిస్తుంది. మనోవాక్కాయ కర్మలకు మూలహేతువు స్పందనే.

 శబ్దం నుంచి నాదం ఆవిర్భవించింది. శ్రావ్యమైన నాదం ఎంతో మనోహరమైన స్పందననను ఇస్తుంది. మనసును పులకింపజేస్తుంది. శరీర అలసటను సేదదీరుస్తుంది.

 చేలగట్లమీద చెట్టుకొమ్మకు వేలాడే గుడ్డ ఉయ్యాల్లోని పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంది. పక్కనే పనిపాటల్లో మునిగిపోయిన తల్లి అక్కడినుంచే జోలపాట అందుకుంటుంది. ఆ పాటలోని మంద్ర, మధ్యమ, తారస్థాయులు, గాలితరంగాల్లో కలిసి బిడ్డ కర్ణపుటాలను తాకుతాయి. బిడ్డ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. స్పందన, ప్రతిస్పందనలకు ఇదొక అద్భుత నిదర్శనం.
--(())--

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ