స్టోరీస్....01-01-2023 to 07-01-2023

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
Lord Krishna: Pencil Sketches – A MYTHOLOGY BLOG

చెరువు నీరు అన్ని పంటలకు సమానంగా అందినా కూడా
కాకర కాయ చేదుగా, చింత పండు పులుపుగా, దానిమ్మ పండు తియ్యగ ఉంటుంది .అందుకని నీటిని దోషిగా భావించకూడదు.ఇది నీటి దోషం కాదు..ఇవి అన్నీ తమ తమ కర్మఫలాలుఅదే విధంగా మనుష్యులు కూడా తమ తమ కర్మ ఫలాలు (అంటే ఇతరులు ను బాధ పడేపనులు చేయకుండ ఉండడం వల్ల మరియు మనకుసహాయం చేసే స్థితిలో ఉంటే సహాయం అవసరం అయినవారికి సహాయ పడితే మంచి కర్మ పలితం ఉంటుంది. ఇది అతి గాను,చాదస్తంగానుఉండచ్చు. ,కాని ఇది నిజం.)ఖచ్చితంగా అనుభవిస్తారు కాబట్టి మంచి కర్మలు చేయడం అనేది చాలా ముఖ్యమైనది.

        
--(())--

 పుట్టిన ప్రతి మనిషీ ఏదోనాటికి ఆధ్యాత్మిక భావనను అందిపుచ్చుకోక తప్పదు. కొందరు యుక్తవయసులో దైవం, సంప్రదాయం, మతం వంటి భావాలను అందుకుంటారు. కొందరు మధ్య వయసులో, ఇంకొందరు వృద్ధాప్యంలో పారమార్థిక జీవితం పట్ల ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక విద్య బాల్యంలోనే అబ్బిన కొద్దిమంది బాలలు మహనీయులుగా, భగవంతుడి ప్రియసఖులుగా అలరారిన వైనం మన పురాణాల్లో కనిపిస్తుంది. ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు... ఆ కోవకు చెందినవారే! ఆధునికయుగంలో ప్రసిద్ధి పొందిన మహాపురుషులు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద అలా తమ ప్రతిభ చాటినవారే! 

 నేర్పు-ఓర్పు జంటపదాలు. ఓర్పు ఉన్నవారే కాలక్రమంలో నేర్పరులు కాగలరు. లౌకిక జీవితంలో నేర్పు సంపాదించడానికి ఓర్పు ఎంత అవసరమో ఆధ్యాత్మిక కర్మాచరణలో విజేతలుగా ఎదగడానికి ఓర్పు అంతే అవసరం. ఉపవాసాలు, పూజలు, నోములు, వ్రతాలు... ఇవన్నీ ఆచరించడానికి నేర్పుతోపాటు ఓర్పూ చాలా అవసరం!
🙏🙏🙏🙏
--(())--

శరీరంలోని ప్రతి అణువుకు స్పందించే గుణం ఉంది. అన్ని స్పందనలూ ఒకేతీరుగా ఉండవు. హృదయస్పందనల ప్రభావం శరీరం, మనసులపై ఉంటుంది. శరీరం ఒక సజీవ దేవాలయమైతే, హృదయం గర్భాలయం లాంటిది. బాహ్యాంతరాల్లోని దృశ్య శ్రవణాదులకు అనుగుణంగా హృదయం స్పందిస్తుంది. మనోవాక్కాయ కర్మలకు మూలహేతువు స్పందనే. 

 శబ్దం నుంచి నాదం ఆవిర్భవించింది. శ్రావ్యమైన నాదం ఎంతో మనోహరమైన స్పందననను ఇస్తుంది. మనసును పులకింపజేస్తుంది. శరీర అలసటను సేదదీరుస్తుంది. 

 చేలగట్లమీద చెట్టుకొమ్మకు వేలాడే గుడ్డ ఉయ్యాల్లోని పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంది. పక్కనే పనిపాటల్లో మునిగిపోయిన తల్లి అక్కడినుంచే జోలపాట అందుకుంటుంది. ఆ పాటలోని మంద్ర, మధ్యమ, తారస్థాయులు, గాలితరంగాల్లో కలిసి బిడ్డ కర్ణపుటాలను తాకుతాయి. బిడ్డ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. స్పందన, ప్రతిస్పందనలకు ఇదొక అద్భుత నిదర్శనం.

🙏🙏🙏🙏
--(())--
02. డాక్టర్ శ్రీ నిశాంత్ గారు
 ఇచ్చిన సలహాలు:

 ప్రశ్న 1 : గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ? 
 జవాబు : 1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనె.
2)వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం
3)ధూమ పానం మానడం.
4)బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం.
5)బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం.

 ప్రశ్న 2. కొవ్వును కండగా మార్చుకొగలమా ?

 జవాబు : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు - కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు.
కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం.
కొవ్వు కండగా మారదు.

 ప్రశ్న 3 : ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? 

 జవాబు : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు. అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

 ప్రశ్న 4 : గుండె పోటు వంశ పారం పర్యమా?
 జవాబు : అవును 
.
 ప్రశ్న 5 : గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది?
ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )

 జవాబు : జీవితం పట్ల మీ వైఖరి మారాలి.
ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి.

 ప్రశ్న6 : ఆరోగ్యవంతమైన గుండె కోసం జాగింగ్,నడక రెండింటిలో ఏది ఉత్తమం?

 జవాబు : నడక మంచిది.
జాగింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.

 ప్రశ్న 7: మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు?

 జవాబు : మదర్ తెరెసా !

 ప్రశ్న 8: లో (low) బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందా ?
 జవాబు : చాలా తక్కువ
.

 ప్రశ్న 9 : కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా ? 
(నా వయసు 22).
30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా?

 జవాబు : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది.

 ప్రశ్న 10 : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా?

 జవాబు : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు.
ఆ ఆహారం జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి.

 ప్రశ్న 11: మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?
 జవాబు : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా.

 ప్రశ్న 12: గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది?
చెడ్డ ఆహారం ఏది?

 జవాబు : పళ్ళు , కాయగూరలూ మంచివి.
నూనెలు చెడ్డవి.

 ప్రశ్న 13: ఏ నూనె మంచిది ?
సన్ ఫ్లవర్,
వేరుశనగ నూనె,
ఆలివ్ ఆయిల్ ?

 జవాబు : అన్ని నూనెలూ చెడ్డవే.

 ప్రశ్న 14: ఏమేమి టెస్టులు చేయించుకోవాలి 
ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా?

 జవాబు :
రొటీన్ షుగర్,
బి.పి,కొలెస్టరాల్ చాలు .
ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి.

 ప్రశ్న 15 : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి?

 జవాబు : గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి.
ఒక ఆస్ప్రిన్ మాత్ర నాలుక కింద పెట్టండి .
 సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి .
వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి.
మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ . 

 ప్రశ్న : 16 : గ్యాస్ట్రిక్ నొప్పికీ - గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ? 

 జవాబు : ఈ.సి.జీ చూస్తే గానీ చెప్పలేము.

 ప్రశ్న 17: యువకులలో వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ?
( 30 - 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )

 జవాబు : యువతలో అవేర్నెస్ పెరిగింది.
అందు వలన కేసులు కనిపిస్తున్నాయి.
జీవన విధానం ( బద్ధకం ),
జంక్ ఫుడ్,
వ్యాయామం లేక పోవడం, 
పొగ తాగడం.
మన దేశం లో జెనెటికల్ గా అమెరికా యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ.

 ప్రశ్న 18 : బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా? 

 జవాబు : ఉంటారు.

 ప్రశ్న 19 : దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు.
వాస్తవమా?

 జవాబు : వాస్తవమే!
దగ్గర సంబంధాల వలన కంజెనిటల్ ఎబ్నార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు. 

 ప్రశ్న 20 : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపము నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం. 
ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?

 జవాబు : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది
ఇటువంటి అసంబద్ధ జీవిత విధానాల నుండి.
కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి.

 ప్రశ్న 21: ఆంటి హైపర్టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? 
( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )

 జవాబు : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్.

 ప్రశ్న 22 : కాఫీ/టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ? 

 జవాబు : లేదు.

 ప్రశ్న 23 : ఆస్థమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?

 జవాబు : లేదు 

 ప్రశ్న 24 : మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి?

 జవాబు : వేపుళ్ళు -- ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా దోశలు కూడా.

 ప్రశ్న 25 : భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా!

 జవాబు : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది (అనుకూలత ఉంటుంది) దురదృష్టవశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది.

 ప్రశ్న 26 : అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ?

 జవాబు : నో.

 ప్రశ్న 27 :  గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తనే ఏదైనా చేసుకోవచ్చా?

 జవాబు : వెల్లకిలా పడుకోవాలి .
నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకుని , అంబులెన్స్ వచ్చే వరకూ వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.
అంబులెన్స్ రావడం త్వరగా జరగదు.

 ప్రశ్న 28 : లో వైట్ బ్లడ్ సెల్స్ (తక్కువ తెల్ల రక్త కణాలు), హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా?

 జవాబు : కావు.
కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది.

 ప్రశ్న 29 : మా బిజీ షెడ్యుల్ వలన మేము ఎక్సర్‌సైజ్ చెయ్యడానికి టైం ఉండదు.
ఇంట్లో నడవడం,
మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సర్సైజ్ గా అనుకోవచ్చా?

 జవాబు : తప్పకుండా ! ఒకే కుర్చీలో అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా ఈ కుర్చీ లో నుండి ఇంకో కుర్చీ లోకి మారి కూర్చోవడం కూడా చెయ్యవచ్చు.

 ప్రశ్న 30 : షుగరుకూ, గుండె జబ్బులకూ సంబధం ఉందా?

 జవాబు : ఉంది.
షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ.

 ప్రశ్న 31 : గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

 జవాబు : 
ఆహారం, ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్ , బరువు , బిపీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం.

 ప్రశ్న 32 : రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి, డే షిఫ్ట్ వారికంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా?

 జవాబు : నో .

 ప్రశ్న 33 : Anti-hypertensive డ్రగ్స్ ఏమిటి?

 జవాబు :
కొన్ని వందలు ఉన్నాయి .
మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపిక చేసి చెబుతారు.
కానీ నా సలహా మందుల కన్నా ప్రాకృతిక విధానం లో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం (నడక).
ఆహారం విషయం లో జీవిత వైఖరులలో మార్పు తెచ్చుకోవడం.

 ప్రశ్న 34 : డిస్పిరిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయా ?

 జవాబు : నో 
.

 ప్రశ్న 35 : ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?

 జవాబు : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది)

 ఆఖరు ప్రశ్న : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ? 

 జవాబు :
ఆరోగ్య వంత మైన ఆహారం తినండి.
ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి.
జంక్ ఫుడ్ తినకండి.
స్మోకింగ్ మానండి

30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి ( రికమెండేడ్ )

--(())-
ఇది ఒక వాట్సప్ ఇంగ్లీష్  మెస్సేజ్ కి తెలుగు స్వేచ్చానువాదం.


రచయితకి ప్రణామాలతో..

--(())--

04. చెరువు నీరు అన్ని పంటలకు సమానంగా అందినా కూడా
కాకర కాయ చేదుగా, చింత పండు పులుపుగా, దానిమ్మ పండు తియ్యగ ఉంటుంది .అందుకని నీటిని దోషిగా భావించకూడదు.ఇది నీటి దోషం కాదు..ఇవి అన్నీ తమ తమ కర్మఫలాలుఅదే విధంగా మనుష్యులు కూడా తమ తమ కర్మ ఫలాలు (అంటే ఇతరులు ను బాధ పడేపనులు చేయకుండ ఉండడం వల్ల మరియు మనకుసహాయం చేసే స్థితిలో ఉంటే సహాయం అవసరం అయినవారికి సహాయ పడితే మంచి కర్మ పలితం ఉంటుంది. ఇది అతి గాను,చాదస్తంగానుఉండచ్చు. ,కాని ఇది నిజం.)ఖచ్చితంగా అనుభవిస్తారు కాబట్టి మంచి కర్మలు చేయడం అనేది చాలా ముఖ్యమైనది.

--(())--
04. భారీ ట్విస్ట్ : 
విశాఖలో రాజధాని వద్దు : తీవ్ర అభ్యంతరం తెలిపిన ఇండియన్ నావీ 

విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు మరింత ఆలస్యం కానుందా అంటే అవుననే సమాధానమొస్తోంది. మిలీనియం టవర్స్‌లో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వానికి నేవీ నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురయ్యాయి. దీంతో ఆ నిర్ణయాన్ని జగన్ సర్కార్ వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్‌కు నేవీ లేఖ రాసింది. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో మిలీనియం టవర్స్ ఉన్నాయని లేఖలో పేర్కొంది. విశాఖను ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించడం.. మిలీనియం టవర్స్‌లో విభాగాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడంతో నేవీ తీవ్ర అభ్యంతరాలు లేవదీసింది. రక్షణకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో జనావాసాలను ఎలా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించింది. శత్రుదేశాలకు విశాఖపట్నం ప్రధాన లక్ష్యమని..

ఇక్కడ ఎన్నో పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని తెలిపింది. కాబట్టి.. దేశభద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోకపోవడమే మేలని నేవీ అధికారులు తెలుపుతున్నారు. ఒకసారి రాజధాని ఏర్పాటైతే.. ఆ ప్రాంతమంతా జనావాసాలతో కిటకిటలాడుతుందని.. దీంతో చాలా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని.. ఇక్కడ రాజధాని ఏర్పాటుపై సాంకేతిక, భౌగోళిక అంశాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపింది. కాగా.. ఐఎన్ఎస్ కళింగ సుమారు 734 ఎకరాల మేర విస్తరించి ఉంది. తూర్పు నావికా దళానికి ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. దీనిపై నేవీ మరింత దృష్టి కేంద్రీకరిస్తోంది. మరిన్ని భూములను సేకరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 400 ఎకరాల భూమిపై నేవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమిని 1980లలో అధికారుల ఇళ్ల కోసం జిల్లా పరిపాలనా విభాగం కేటాయించింది...🧐

--(())--

_05. *🙏🌷మహా శివరాత్రి విశిష్టత...*_

భారత దేశపు ముఖ్య పండుగలలో శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

*మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం, శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది...*

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వచ్చాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతున్నాడు.. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

*బ్రహ్మ, విష్ణువుల యుద్ధం-..*

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేషశయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీ చూపులు ప్రసన్నంగా లేవేమి?" అన్నాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అన్నాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదములోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభించారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తున్నారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొన్నారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గింది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మధ్యంలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో, అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వచ్చాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకున్నాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెప్పాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడశోపచారాలతో పూజ చేసాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెప్పింది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్ష మయ్యాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరించారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదించాడు.

*బ్రహ్మకు శాపము..*

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు.ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానములో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు. అంగం దక్షిణలు ఇచ్చిన బ్రహ్మా నీవు లేని యజ్ఞము వ్యర్థము అగును.

*మొగలి పువ్వుకు శాపము..*

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉMచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీపుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీపుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.

*శివరాత్రి పర్వదినం..*

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెప్పాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

*శివరాత్రి నాడు ఏమి చేయాలి?*

"మహాశివరాత్రి" పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి.

మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా.. నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి, మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు.

*శివరాత్రి రోజున శివునికి అభిషేకం ఎలా చేయాలంటే..!?..*

శ్లో|| పుర్రె చేసిన పుణ్యమేమో! పంచ చేరి నీకు కంచమాయే !
వల్లకాటి భాగ్యమేమో ! తనకు తానే నీకు మంచమాయే ! అన్నట్లు శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు.

ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని అభిషేకిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో చూద్దాం.. కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది. వెండిధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది.

నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన, భార్యా, పుత్రలాభం, పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి. బెల్లపు పలుకులతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో జయము కలుగుతుంది.

వెదరు చిగుళ్ళతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, పాలాభిషేకం వలన కీర్తి, సిరి, సుఖములు కలుగును. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది.

ఇక పలురకాల పండ్లతో చేసే అభిషేకం జయాన్నిస్తుంది. ఉసిరికాయలతో చేస్తే మోక్షము, బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టదాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి, మణులతో, వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది. పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి. ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.
మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే..!?

శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమశ్శివాయ ||
అంటూ ముక్కంటిని స్తుతిస్తూ మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహేశ్వరుడిని మహాశివరాత్రి రోజున లింగోద్భవమూర్తిగా ఉన్న ముక్కంటిని పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయి.

అందుచేత మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానము చేయాలి. అటుపిమ్మట పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ రోజున తెల్లటి దుస్తులు ధరించడం మంచిది.

పూజకు శివుని ఫోటోగానీ లేదా, లింగాకారముతో గల విగ్రహాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే మారేడు దళములు, తెల్లపూలమాల, నైవేద్యానికి పొంగలి, బూరెలు, గారెల్, అరటి , జామకాయలు సమర్పించుకోవచ్చు.

పూజకు ముందుశివఅష్టోత్తరము, దారిద్ర్యదహన స్తోత్రము, శివారాధన, శివపురాణము, లింగోద్భవ అధ్యాయము వంటివి పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఇంకా శివరాత్రి రోజున శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం వంటి ఆలయాలను దర్శించడం ద్వారా ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

ఇంకా శివరాత్రిరోజున ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివకళ్యాణము వంటివి నిర్వహించడం శుభఫలితాలిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు పూజ చేసుకోవచ్చు. దీపారాధనకు నువ్వులనూనె, ఐదు వత్తులు ఉపయోగించాలి. పంచహారతి ఇవ్వడం మంచిది. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు శివభక్తిమాల, శివకళ్యాణము వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ఇవ్వాలి.
     

_*🙏🌷మహాశివరాత్రి పూజా ఫలం*_

శివరాత్రి రోజున ఉపవాసం .. జాగరణ .. శివపూజ ప్రధానమైనవని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజున ఎవరైతే ఉపవాస దీక్షను చేపట్టి .. బిల్వ పత్రాలతో పూజించి .. జాగరణ చేస్తారో, అలాంటివారికి నరక బాధలు లేకుండా శంకరుడు రక్షిస్తాడు .. మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎన్నో పూజలు .. వ్రతాలు .. దానాలు .. తీర్థయాత్రలు చేస్తే లభించే పుణ్యం, శివరాత్రి రోజున చేసే శివారాధన వలన కలుగుతుంది.

ఈ రోజున శైవ క్షేత్రాలను దర్శించడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. దగ్గరలోని శివాలయాలను .. పంచారామ క్షేత్రాలను .. వీలైతే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఏ ఒక్కటిని దర్శించినా ముక్తి లభిస్తుంది. శివరాత్రి రోజున 14 లోకాలలోని పుణ్య తీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువలన ఒక్క బిళ్వ దళమైనా శివార్పణ చేసి తరించాలని శాస్త్రం చెబుతోంది. శివరాత్రి రోజున ఉపవాస దీక్షను చేపట్టి, అంకితభావంతో శివయ్యను ఆరాధిస్తే, ఒక ఏడాదిపాటు అను నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు పరమశివుడే బ్రహ్మదేవుడితో చెప్పారనేది మహర్షుల మాట..

*శివరాత్రి రోజున స్పటిక శివలింగ అభిషేక ఫలితం*

మహా శివరాత్రి రోజున వివిధ రకాల శివలింగాలకు అభిషేకం చేస్తుంటారు. ఒక్కో రకం శివలింగానికి చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలా శివరాత్రి రోజున స్పటిక శివలింగానికి పూజ చేయడం వలన, విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మహా శివరాత్రి రోజున స్పటిక శివలింగానికి పూజాభిషేకాలు జరపడం వలన, ధన ధాన్య వృద్ధి కలుగుతుంది .. సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.

స్పటిక శివలింగం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని పూజించడం వలన, వ్యాధులు .. బాధలు ఆ ఇంట్లోని వాళ్ల దరిదాపులకు కూడా రావట. స్పటిక శివలింగం ఏ ఇంట్లో ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగా ఆ ఇంట్లో వాళ్లకి దారిద్ర్య బాధలు ఎప్పటికీ వుండవట. స్పటిక శివ లింగాన్ని అనునిత్యం ఆరాధించడం వలన, సమస్త పాపాల నుంచి విముక్తిని పొందుతారనీ, శివ సాయుజ్యాన్ని పొందుతారనేది మహర్షుల మాట.

*వివిధ రకాల శివలింగాలు .. పూజాభిషేకాల ఫలితాలు*

పరమశివుడు తన భక్తులను అనుగ్రహించడానికీ, ముక్తి మార్గంలో వాళ్లను నడిపించడానికి ఇచ్చిన అవకాశమే మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున ఉదయం .. మధ్యాహ్నం .. రాత్రి మూడు పూటలా శాస్త్రోకంగా శివపూజ చేయాలి. ఈ రోజున వివిధ రకాల శివలింగాలకు పూజాభిషేకాలు నిర్వహించడం వలన, వివిధ రకాల ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

ఈ రోజున బంగారంతో చేసిన శివలింగాన్ని పూజించడం వలన సిరిసంపదలు చేకూరతాయి. వెండి శివలింగాన్ని ఆరాధించినందు వలన ధనధాన్యాలు లభిస్తాయి. ఇత్తడితో చేసిన శివలింగాన్ని ఆరాధించడం వలన దారిద్య్రంతో కూడిన దుఃఖం దూరమవుతుంది. ఇక మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలనుకునేవారు, స్పటిక శివలింగాన్ని పూజించాలి. పాదరసంతో చేయబడిన శివలింగాన్ని పూజించడం వలన, ముల్లోకాల్లోని శివలింగాలన్నింటికీ పూజాభిషేకాలు జరిపిన ఫలితం లభిస్తుందట. పాదరస శివలింగ ఆరాధన వలన సమస్త పాపాలు నశించి, సంపూర్ణ సుఖాలు చేకూరతాయనేది మహర్షుల మాట..

*శివరాత్రి రోజున పుష్పార్చన ఫలితం*

మాఘమాసంలో వచ్చే బహుళ పక్ష చతుర్దశి పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది .. దీనినే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. శివరాత్రి అంటే శుభప్రదమైన రాత్రి అని అర్థం. అలాంటి మహాశివరాత్రి రోజున చేసే శివారాధన పాపాలను పటాపంచలు చేసి, శివ సాయుజ్యాన్ని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున వివిధ రకాల పుష్పాలతో స్వామిని అర్చించడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

ఈ రోజున మల్లెపూలతో పూజించడం వలన సకల భోగాలు కలుగుతాయి. జాజిపూలతో అర్చించడం వలన వాహన యోగం కలుగుతుంది. కలువలు .. గన్నేరులతో పూజించడం వలన శత్రునాశనం జరిగి, రాజ్యలాభం చేకూరుతుంది. నువ్వు పూలతో పూజించడం వలన యవ్వనం .. శిరీష పుష్పాలతో అర్చించడం వలన ఆనందం .. ఉమ్మెత్త పూలతో పూజించడం వలన సంతాన భాగ్యం కలుగుతాయి. జిల్లేడు పూలతో పూజించడం వలన శౌర్యపరాక్రమాలు లభిస్తాయి. అవిసె పూలతో అర్చించడం వలన పాపాలు నశిస్తాయి .. తుమ్మి పూలతో పూజించడం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి..

*శివరాత్రి రోజున అభిషేకాలు .. ఫలితాలు*

'ఓం నమఃశివాయ' అనే శివ పంచాక్షరీ మంత్రంలోని 'న' అనే అక్షరం బ్రహ్మను .. భూమినీ, 'మ' అనే అక్షరం విష్ణువును .. జలాన్నీ, 'శి' అనే అక్షరం రుద్రుడిని .. అగ్నినీ, 'వా' అనే అక్షరం మహేశ్వరుడుని .. వాయువుని 'య' అనే అక్షరం సదా శివుడిని .. ఆకాశాన్ని సూచిస్తుంది. ఓం కారంతో కూడిన శివ తత్త్వమే ఈ సృష్టికి మూలం. అలాంటి పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ శివరాత్రి రోజున స్వామిని అభిషేకించాలి.

పాలతో అభిషేకించడం వలన దుఃఖం దూరమవుతుంది. పెరుగుతో అభిషేకించడం వలన ఆరోగ్యం లభిస్తుంది. నెయ్యితో అభిషేకించడం వలన, గుణవంతులైన సంతానం కలుగుతుంది. తేనెతో అభిషేకించడం వలన తేజస్సు పెరుగుతుంది. పంచదారతో అభిషేకించడం వలన బుద్ధి వికాసం కలుగుతుంది. బిల్వదళాలతో అభిషేకం భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. నేరేడుపళ్ల రసంతో చేసే అభిషేకం వలన విజయాలు చేకూరతాయి. పుష్ప జలంతో చేసే అభిషేకం వలన భూలాభం కలుగుతుంది. ఇలా శివరాత్రి రోజున శివయ్యకి చేసే అభిషేకాల వలన, అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది..

*శివరాత్రి నాలుగు జాముల్లో అర్చించే పుష్పాలు*

మహాశివరాత్రి రోజున ఉపవాసం .. రాత్రి జాగారం .. శివపూజ ముఖ్యమైనవి. శివరాత్రి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి, స్నానాదికాలను పూర్తిచేసి శివాలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇంట్లో శివలింగం వున్నవారు భక్తిశ్రద్ధలతో నాలుగు జాముల్లోను శివుడిని అర్చించవలసి ఉంటుంది.

మొదటి జాములో స్వామివారిని గన్నేరు పూలతో పూజించవలసి ఉంటుంది. రెండవ జాములో తామరలతో అర్చించవలసి ఉంటుంది. మూడవ జాములో మారేడు దళాలతోను .. జిల్లేడు పూలతోను పూజించవలసి ఉంటుంది. నాల్గొవ జాములో కలువ పూలతో స్వామిని అర్చించవలసి ఉంటుంది. ఇలా శివరాత్రి రోజున ఆ సదా శివుడిని పూజించాలి. శివ గాథలతోను .. భజనలతోను జాగరణ చేయాలి. ఇలా శివరాత్రి రోజున స్వామిని ఆరాధించడం వలన సమస్త పాపాలు నశించి, అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి..

*మహా శివరాత్రి నాలుగు జాముల్లో నైవేద్యాలు*

పరమశివుడు మంగళ స్వరూపుడు .. సకల శుభాలకిp కారణభూతుడైన లోక శుభంకరుడు. అలాంటి ఆదిదేవుడిని అఠ్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పర్వదినమే మహాశివరాత్రి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ రోజున నాలుగు జాముల్లోను సదాశివుడిని అర్చించి, ఆ స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలని 'శివ పురాణం' చెబుతోంది.

మొదటి జాములో స్వామిని ఆవుపాలతో అభిషేకించి, పెసర పప్పుతో వండిన పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండో జామున పెరుగుతో అభిషేకించి, పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. మూడో జామున స్వామిని ఆవు నెయ్యితో అభిషేకించి, నువ్వుల పొడితో తయారు చేసిన తినుబండారాలను నైవేద్యంగా ఇవ్వాలి. నాలుగో జామున స్వామిని తేనెతో అభిషేకించి, అన్నం .. నేతి గారెలు .. భక్ష్యాలు నైవేద్యంగా సమర్పించాలి. మహా శివరాత్రి రోజున మహా శివుడిని ఈ విధంగా అభిషేకించి .. ఆరాధించడం వలన, ఆయన అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి..

 *శివుడికి బిల్వదళ సమర్పణ ఫలితం*

మహా శివరాత్రి రోజున ఉపవాసం .. జాగరణ .. శివపూజ ప్రధానంగా చెప్పబడ్డాయి. శివరాత్రి రోజున ఆవు పంచితం .. ఆవు పాలు .. ఆవు పెరుగు .. ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకించాలి. ' ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ స్వామిని అభిషేకించాలి. ఆ తరువాత ఉపవాస దీక్షతో శివ నామాన్ని స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున జాగరణకి ఎంతో ప్రాధాన్యత వుంది. అందువలన జాగరణ చేయాలి.

మహా శివరాత్రి రోజున 14 లోకాలలోని పుణ్య తీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతన్నాయి. అందువలన ఆ రోజున స్వామికి ఒక్క బిల్వ దళమైనా సమర్పించాలని శాస్త్రం చెబుతోంది. ఇక శివరాత్రి రోజున చేసే దానం కూడా అనేక రెట్ల పుణ్య ఫలితాలను ఇస్తుంది. అందువలన మహాశివరాత్రి రోజున క్షేత్ర దర్శనం చేయాలి. స్నానం .. ఉపవాసం .. జాగరణ .. దానం చేయడం మరిచిపోకూడదు. తనువును .. మనసును శివార్పితం చేస్తూ చేసే ఆరాధన వలన, ఆది దేవుడి అనుగ్రహం కలుగుతుంది..

06. 🌸🌼#రామకృష్ణ_పరమహంస #జ్ఞానోదయం - విశేషాలు🌼🌸

నేడు రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా  ప్రాంజలి ప్రభ విక్షకులకు కొరకు ప్రత్యేక కథనం.

రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువకాలం తీవ్రమైన భక్తునిగా జీవించాడు. ఆయన కాళిమాత భక్తుడు. ఆయనకు కాళి ఒక దేవత కాదు, సజీవ సత్యం. ఆమె ఆయన ముందు నాట్యమాడేది, ఆయన చేతులతోనే భోజనం ఆరగించేది, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేది. తరువాత ఆయనని పరమనందానుభూతిలో వదిలేసేది.

ఇది నిజంగానే జరిగేది. ఇదేదో ఊహాజనితం కాదు, ఆయన నిజంగా తినిపించేవాడు. రామకృష్ణుల చైతన్యం ఎంత స్పష్టమైనదంటే ఆయన ఏ రూపం కోరుకుంటే ఆరూపం ఆయనకి నిజంగా కనిపించేది. ఒక మనిషి ఉండగలిగిన అత్యంత అందమైన స్థితి అది. రామకృష్ణుల యొక్క శరీరం, మనస్సు మరియు భావోద్వేగాలు పరమానందంతో తడిసిపోతున్నా, ఆయన అస్థిత్వం మాత్రం ఈ పరమానందాన్ని దాటి అవతలికి వెళ్ళాలని కోరుకునేది. ఈ పరమానందం కూడా ఒక బంధనమే అని ఎక్కడో ఒక ఎరుక ఉండేది.

ఒకరోజు రామకృష్ణులు హూగ్లీ నదీ తీరాన కూర్చుని ఉండగా, తోతాపూరి అనే ఒక గొప్ప యోగి ఆ మార్గంలో వెళ్తున్నాడు. ఇలాంటి యోగులు చాలా అరుదు. రామకృష్ణుడు ఒక తీవ్రమైన మనిషిగా, జ్ఞానోదయం పొందే అర్హత కలవాడిగా ఆయన గమనించాడు. సమస్య ఏమిటంటే ఆయన భక్తిలో చిక్కుకుపోయాడు.

🌺 చాలా రకాలుగా తోతాపూరి ఉపదేశం చేయబోయాడు కాని రామకృష్ణుడు ఆసక్తి చూపలేదు. అదేసమయంలో ఆయన తోతాపూరి సమక్షంలో కూర్చోవడానికి ఆసక్తి కనబరిచేవాడు ఎందుకంటే తోతాపూరి ఉనికి అలాంటిది.🌺

తోతాపూరి రామకృష్ణుల దగ్గరకు వచ్చి "ఇంకా నువ్వు భక్తికే ఎందుకు అతుక్కుపోయావు? నీకు అంతిమ మెట్టుకు చేరుకునే శక్తి ఉంది" అని నచ్చచెప్పబోయాడు. కాని రామకృష్ణులు మాత్రం "నాకు కాళి కావాలి, అంతే!" అన్నాడు. ఆయన తల్లిని అడిగే పిల్లవాడి లాంటివాడు. అటువంటి స్థితిలో ఉన్నవారికి తర్కపరంగా నచ్చ జెప్పలేము. అది పూర్తిగా ఒక భిన్నమైన స్థితి. రామకృష్ణుడి భక్తీ, ఆసక్తీ కాళీనే. అతనిలో కాళీతత్వం అధికమైనప్పుడు ఆయన పరమానందంతో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. అతనిలో ఆ స్థితి కాస్త తగ్గగానే, అతను ఒక పసిబిడ్డలాగా ఏడ్చేవాడు. ఆయన ఇలాగే ఉండేవాడు. తోతాపూరి చెప్పే జ్ఞానోదయంలాంటి వాటి గురించి ఆయనకు అస్సలు ఆసక్తి లేదు. చాలా రకాలుగా తోతాపూరి ఉపదేశం చేయబోయాడు కాని రామకృష్ణుడు ఆసక్తి చూపలేదు. అదేసమయంలో ఆయన తోతాపూరి సమక్షంలో కూర్చోవడానికి ఆసక్తి కనబరిచేవాడు ఎందుకంటే తోతాపూరి ఉనికి అలాంటిది.

రామకృష్ణుడు ఇలాగే వ్యర్ధంగా గడిపేస్తున్నాడని తోతాపూరి గమనించాడు. అప్పుడు "ఇది చాల సులభమైనది, ఇప్పుడు నువ్వు నీ భావోద్వేగాలని ప్రబల పరుస్తున్నావు, నీ శారీరాన్ని ప్రబల పరుస్తున్నావు, నీలోని రసాయన వ్యవస్థని ప్రబల పరుస్తున్నావు, కాని నీలోని ఎరుకని ప్రబల పరచడం లేదు. నీ దగ్గర కావలసినంత శక్తి ఉంది కేవలం నువ్వు నీ ఎరుకను ప్రబలం చేయాలి, అంతే!" అని అన్నాడు.

రామకృష్ణుడు అంగీకరించి "సరే నేను నా ఎరుకని సాధికారపరచి కూర్చుంటాను" అని అన్నాడు.
కాని ఆయనకు కాళి రూపం స్ఫురిస్తే మళ్ళీ తనని తాను ఆపుకోలేని పరమానంద ప్రేమ స్థితిలోకి జారిపొయేవాడు. ఎన్నిసార్లు కూర్చున్నా సరే, ఒక్కసారి కాళి దృశ్యం కనపడగానే ఎగిరిపొయేవాడు.
తోతాపూరి "మరోసారి కాళి కనపడితే నువ్వు ఒక ఖడ్గంతో ఆమెను ముక్కలు చెయ్యి" అన్నాడు.

అప్పుడు రామకృష్ణుడు "ఖడ్గం ఎక్కడనుండి తీసుకురావాలి" అన్నాడు.
అందుకు తోతాపూరి " ఎక్కడనుండైతే నువ్వు కాళిని తెచ్చుకుంటావో అక్కడనుండి. నీకు కాళినే సృష్టించే శక్తి ఉన్నప్పుడు ఒక ఖడ్గాన్ని ఎందుకు సృష్టించలేవు? నువ్వు సృష్టించగలవు. నువ్వు ఒక దేవతని సృష్టించగలిగినప్పుడు, తనని కోయడానికి ఖడ్గాన్ని ఎందుకు సృష్టించలేవు? సిద్ధంగా ఉండు!"అన్నాడు. రామకృష్ణుడు కూర్చున్నాడు. ఏ క్షణంలో అయితే కాళి కనపడిందో, మళ్ళీ పరమానందంలో మునిగిపోయి ఆ ఖడ్గాన్ని, ఎరుకని అంతా మరిచిపోయాడు.

ఇప్పుడు తోతాపూరి ఒక గాజు ముక్కని తీసుకుని, ఇలా అన్నాడు "ఈసారి నాతో కూర్చో. కాళి వచ్చిన క్షణమే ఈ గాజుముక్కతో నువ్వు ఎక్కడైతే చిక్కుకున్నవో అక్కడ కోసేస్తాను. ఎప్పుడైతే నేను ఆ చోటుని కోస్తానో, నువ్వొక ఖడ్గాన్ని సృష్టించి కాళిని ముక్కలు చేయి" అన్నాడు.

మళ్ళీ రామకృష్ణుడు కూర్చున్నాడు, ఎప్పుడు ఆ పరమానందపు అంచుకు చేరుకున్నాడో, ఎప్పుడు కాళి కనపడిందో, తోతాపూరి ఆ గాజుతో రామకృష్ణుని నుదుట బాగా లోతుగా గాటు పెట్టాడు.

ఆ క్షణం రామకృష్ణుడు ఖడ్గాన్ని సృష్టించి కాళిని నరికేసాడు, తద్వారా తల్లినుంచి, ఆ పరమానందంనుంచి విముక్తుడయ్యాడు. ఆ సమయంలోనే ఆయన నిజంగా పరమహంస అయ్యాడు, పూర్తి జ్ఞానోదయం పొందాడు. అప్పటివరకూ అతను ఒక ప్రేమికుడు, ఒక భక్తుడు, ఆయనే సృష్టించుకున్న మాతృదేవత యొక్క పుత్రుడు.
ప్రేమాశీస్సులతో, #సద్గురు
 
    07. విఠ్ఠల విఠ్ఠల " అనే నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట!
    పుణె లోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది.
    విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది. విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పదాన్ని ఉచ్చరించేటపుడు ' ఠ్ఠ ' అనే అక్షరం నుండి వెలువడే శక్తి నేరుగా గుండె మీద అద్భుత పరిణామాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం ద్వారా తెలిసింది.
    రెండు మహాప్రాణాలు మరియు రెండు అల్ప ప్రాణాలు కలిగిన పదమైనందున గుండె మీద ప్రభావం కలుగుతుందని వేద విజ్ఞాన కేంద్ర తెలిపింది.
    పదిరోజులపాటు , రోజుకు 9 నిమిషాలు శాంత చిత్తంతో విఠ్ఠల నామజపం చేసినా హై బ్లడ్ ప్రెషర్ తో సహా గుండెకు సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయని వేద విజ్ఞాన కేంద్ర మరియు దివంగత ఇనాందార్ హార్ట్ క్లినిక్ బృందాలు వెల్లడించాయి.
    కాబట్టి ఈ రోగాలున్నవారు పదిరోజులపాటు విఠ్ఠల నామస్మరణ మొదలెట్
    పండరినాద పాండురంగ విఠల విఠల పాండురంగ

    08. ప్రశ్నించినా పోతావ్
ప్రశ్నించకున్నా పోతావ్

ప్రశ్నిస్తే పది కాలాలుంటావ్
మంది మనసుల్లో ఉంటావ్ 

ప్రశ్నించకపోతే మందిలో లేనట్లే
బందెల దొడ్డిలో ఉన్నట్లే.........!

ప్రాణం పోయినా.....,
బ్రతికుండాలంటే ప్రశ్నించు
ప్రాణమే కావాలంటే.....
బతుకంతా యాచించు

హక్కుల కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, దేశం కోసం, జనం కోసం ,స్వేచ్ఛ కోసం,
సమానత్వం కోసంప్రశ్నించే గొంతులున్నంత కాలం
                    (అంటే ప్రశ్నలు ఉన్నంత కాలం )
సమాజం జాగరూకతతోనుండు, రాజ్యం అప్రమత్తంగా ఉండు

ప్రశ్నించడం కాదయ్యో నేరం 
ప్రశ్నలను నిర్బందించడం ఘోరం

ప్రశ్నించే హక్కు.....
రాజ్య అంతర్గత కాపరి 
శ్రేయోరాజ్య మార్గ చూపరి 

పువ్వులు పరిమళించాలంటే,
మొగ్గలు తొడగాలి
జ్ఞానం వికసించాలంటే
ప్రశ్నలు బతకాలి 

గృహా సీమలకు ఆహ్లాదానందాలు
పుష్పాల పరిమళాలు 
జ్ఞానరాజ్యానికి సిరి మల్లెలు
ప్రశ్నల పరంపరలు 

నువ్వొక నిరంతర ప్రశ్నవై ఉండు కానీ,
ప్రశ్నలకు ప్రశ్నగా మాత్రం మారకు......

ఉన్నంత కాలం ప్రశ్నిస్తూనే ఉండు 
ప్రశ్నల బడిలో,
జ్ఞానపు ఓడిలో,
జవాబుల గుడిలో,
వాస్తవాల మడిలో,జీవమిచ్చె తడిలా ఉండు.

      యంబడి ఈశ్వర్ 

--(())--
09 ............ఉయ్యురువీరమ్మ తల్లి చరిత్ర.............
వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు  ఉయ్యూరు    వీరమ్మ తల్లి తిరునాళ్ళు
పుట్టి నింటి నుంచి మెట్టి నింటికి 
తిరునాళ్ళు 

వీరమ్మ తల్లి కి అయిదు వందల సంవత్సరాల  చరిత్ర వుంది .ఆ కాలమ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర  పెద కడియం అనే గ్రామం లో యాదవ కులానికి చెందిన ”బొడ్డు ”వారి ఆడ పడుచు గా ఆమె జన్మించింది .తండ్రి పరశురామయ్య ,తల్లి పార్వతమ్మ .పరమేశ్వర వర ప్రసాదం గా జన్మించి నందున ”వీర శివమ్మ ”అని పేరు పెట్టారు .చిన్న తనం నుంచి భక్తీ శ్రద్ధ లతో ,దైవ చింతన తో పెరిగింది .ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారుపూడి చలమయ్య ,చెల్లమ్మ ల పెద్ద కుమారుడు చింతయ్య తో ,ఆమె ఎనిమిదవ ఏట జ్యేష్ట శుద్ధ దశమి నాడు ,పెదకడియం లో ఆమెకు వివాహం చేశారు .కొంత కాలమ్ పుట్టింట్లో నే వుంది ,యుక్త వయసు రాగానే ఉయ్యూరు లోని మెట్టి నింటికి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించ టానికి పుట్టి నింటి వారు పంపారు .అత్త వారింట్లో అందరి అభిమానాన్ని ,ఆదరాన్ని పొందింది వీరమ్మ .తన సేవా తత్పరత తో అత్త గారైన మేనత్తను ,మామయ్యను మెప్పించింది .మరది భోగయ్య ను బిడ్డ లాగ చూసింది .చుట్టు పక్కల వారికే కాక బంధు గణానికీ అంతటికీ ఆమె ”ఉత్తమా ఇల్లాలు ”అయింది .భర్త సేవలో జీవితం ధన్యం చేసుకోంది .కాలమ్ ప్రశాంతం గా గడిచి పోతోంది .ఇంతలో కుటుంబం లో ఒక అలజడి రేగింది .మరది భోగయ్యకు అచ్చమ్మ తో వివాహ మైంది .ఆమె గర్విష్టి ,విద్యా హీన .ఆమెకు వీరమ్మ మీద అసూయా పెరిగింది .ఊరందరూ తోడి కోడలు వీరమ్మను మెచ్చు కోవటం ఆమె కు బాధ కలిగి అలిగి పుట్టింటికి చేరింది .అయితె సాధ్వి వీరమ్మ ,అత్త మామలకు ,మరిదికి నచ్చ చెప్పి ,తోడి కోడల్ని ,మళ్ళీ అత్త వారిల్లు చేరేట్లు చేసింది .ఆమె మనసు లోని అసూయా తొలగి పోయి ,తోడికోడళ్ళు అన్యోన్యం గా వుంటూ ,వూరి వారికి ఆదర్శ మైనారు .
                           భర్త మరణం -సహగమనం     
ఉయ్యూరు గ్రామం లో ,కరణం సుబ్బయ్య కు స్త్రీ వ్యామోహం ఎక్కువ .అతని కళ్ళు సాధ్వీ మణి వీరమ్మ పై పడ్డాయి .లోబరుచు కోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు .దగ్గర లో వున్న” గురజాడ ”గ్రామం లోని తన బావ మరిది ”సీతయ్య ”ను తనకు సాయం చేయమని బ్రతిమి లాడాడు .అతడు రావణాసురుడికి మారీచుడు చేసి నట్లు హిత బోధ చేశాడు .చెవి కెక్క లేదు .ఎంతైనా బావ గారు కదా తన సోదరి కాపురం ఏమవుతుందో ననే భయం సీతయ్య కు   పట్టు కొంది .మంత్ర తంత్రాలు తెలిసిన సీతయ్య మెత్త బడి చివరికి సాయం చేయ టానికి ఒప్పు కున్నాడు .మేకల ,గొర్రెల మేత కోసం చింతయ్య ,భోగయ్య సోదరులు వాటిని తోలు కోని ఉత్త రాదికి అంటే బెజవాడ అవతలి ప్రాంతాలకు వెళ్ళారు .ఇదే అదునైన సమయం అని బావమరిది సీతయ్య ను ప్రేరేపించాడు బావ సుబ్బయ్య .సీతయ్య ప్లాన్ వేశాడు .తన నౌకరుకు విషం పూసిన సొర ముల్లు ఇచ్చి ,చింతయ్య పై రహశ్యం గా ప్రయోగించమని చెప్పి పంపాడు .ముస్తాబాద్ లో గొర్రెల మందల దగ్గర నిద్ర పోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం వున్న ఆ సొర ముల్లు తో  పొడిచి హత్య చేశాడు . .చింతయ్య బాధ భరించ లేక చని పోయాడు .తమ్ముడు భోగయ్య అన్న  శవాన్ని ఉయ్యూరు చేరుస్తాడు . ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లి పోతుంది .తాను గాడం గా ప్రేమించిన భర్త తో సహ గమనం చేయాలని నిస్చ యించుకొంది .తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసు కోని ,అతని వంశం నిర్వంశం కావాలని శపించింది .సుబ్బయ్య అకస్మాత్తు గా చని పోయాడు .అతనితో అతని వంశము అంతరించింది .వీరమ్మ పుట్టినింటి వారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బల వంత పెట్టారు .ఆమె కు కోపం వచ్చి పుట్టి నింటి వారిని కూడా ”నిర్వంశం ”కావాలని శాపంపెట్టింది  .

సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు ,గోల్కొండ నవాబు ప్రతినిధి ”జిన్నా సాహెబ్ ”అంగీకరించారు .వీరమ్మ మహిమలు వెంట వెంటనే బయట పడుతూ ,ఆమె అంటే అందరి లో భక్తీ ఏర్పడింది . చింతయ్య కు  చితి ఏర్పాటు చేయించారు .వీరమ్మ కు అగ్ని గుండం ఏర్పాటు అయింది .గుండం తవ్వ టానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోక పొతే ,మాదిగ వారు వచ్చి తవ్వారట అందుకే సిడి బండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది .ముత్తైదువులు పసుపు దంచుతుంటే ,రోలు పగిలింది .వీరమ్మ తల్లి మోకాలు అడ్డు పెట్టి ,తానూ రోకటి పోతూ వేసింది .ముత్తైదువులకు పసుపు ,కుంకుమ లు పంచి పెట్టింది .ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కన్పిస్తుంది .చింతయ్య చితికి తమ్ముడు   భోగయ్య నిప్పు అంటించాడు .వేలాది ప్రజలు భోరున విల పిస్తుండగా ,అత్తా మామలు ,బంధు గణం శోక సముద్రం లో మునిగి ఉండ గా పుణ్య స్త్రీలతో, తోడి కొడాలి తో ,”పారెళ్ళు ”పెట్టించుకొని ,పెళ్లి కూతురు లా ,పుష్పాలతో శిరోజాలను అలంకరించు కోని ,సాధ్వీమ తల్లి ,పతివ్రతా శిరోమణి ,వీరమ్మ తల్లి ,భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి ,భగ భగ మండే ఆ మంటలో తానూ ,భర్త చితి పై చేరి అగ్ని గుండం లో సహ గమనం చేసింది .ఆదర్శ మహిళ గా ,మహిమ గల తల్లి గా ఆ నాటి  నుంచి ,ఈ నాటి  వరకు ప్రజల నీరాజనాలు అందు కొంటోంది

రాజ ప్రతినిధి  ”జిన్నా సాహెబ్’ వీరమ్మ నమస్కారం చేసి ,ఇంటికి వెళ్లి నిద్ర పోయాడు .ఆ రాత్రి నిద్ర లో వీరమ్మ భర్త చింతయ్య తో సహా మహా తేజో వంతం గా ,సర్వాలంకార శోభ తో ,కన్పించింది .స్త్రీలు పూజలు చేస్తున్నట్లు ,వీరమ్మ వారి కోర్కెలు తీరుస్తున్నట్లు ,గండ దీపాల కాంతి లో అమ్మ తల్లి ,ఒక దుష్ట శక్తిని కాలితో తన్నుతూ  ఉయ్యాల  ఊగు  తున్నట్లు  గుడి   పక్కనే  పెద్ద తటాకం  వున్నట్లు  ,అందులో  వికసించిన తామర పూలున్నట్లు సాహెబ్ గారికి కల లో కన్పించిందట .ఉదయం లేచి జమీందారు ను పిలి పించారు .జమీందార్ కు కూడా అలాంటి స్వప్నమే వచ్చి నట్లు చెప్పారట     చింతయ్య మరణానికి కారకు లెవరో తెలుసు కోవ టానికి వేగుల్ని పంపారు .సుబ్బయ్యే కారణం అని అమ్మ వారి సహ గమనం రోజే తీవ్ర మైన బాధ తో అతడు మరణిం చాడని  తెలుసు కున్నారు  .సుబ్బయ్య వంశం సర్వ నాశనమై చివరికి వారసులెవరు లేకుండా నిర్వంశం అయింది .

ఆలయ నిర్మాణం -తిరునాళ్ళఏర్పాట్లు
అందరూ ఆలోచించి ,వీరమ్మ అత్త మామ ల తో సంప్రదించి ,గ్రామస్తులతో సమా వేశం జరిపి ,సహగమనం జరిగిన చోటు లో ఆలయాన్ని నిర్మించారు .చెరువు తవ్వించారు .వీరమ్మ ,చింతయ్య లవిగ్రహాలను   ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు .జిన్నా గారు ,జమీందారు గార్ల సమక్షం లో భక్త జన సందోహం మధ్య వైభవం గా ప్రతిష్ట జరిగింది .ఆలయం ఉయ్యాల స్తంభాల ఖర్చును జిన్నా గారే పెట్టు కొన్నారు .చెరువును తవ్వించిన ఖర్చు ,ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుండి పదిహేను రోజులు పాటు జరిగే ఉత్సవ ఖర్చు జమీందారు భరించారు .ఆ నాటి నుంచి ముందుగా మెట్టి నింటి వారు తర్వాత జిన్నా గారు రాజు గారు తర్వాత గ్రామస్తులు అమ్మ వారి ఉత్స వాలను ప్రారంభించి కొన సాగించారు .పారు పూడి వంశం వారినీ ,జమీందారు గారినీ ,ప్రభుత్వాధి కారులని ధర్మ కర్తలు గా జిన్నా గారు నియమించారు .అంటే వీరమ్మ తల్లి తిరుణాలను ప్రభుత్వ పరం గా నిర్వ హించే ఏర్పాటు చేశారన్న మాట .అందుకే నేటికీ పోలీసు వారిచ్చే పసుపు కుంకుమ చీరే సారే లతో సంబరాలు ప్రారంభ మవటం ఆన వాయితీ గా వస్తోంది .

అమ్మ వారు ఉయ్యాల ఊగే ప్రదేశం లో ఏ కట్టడమూ వుండదు .తన భర్తనూ హత్య చేయించిన కిరాతకుడు సుబ్బయ్య ను కాలితో తన్ని,చిరు నవ్వు చిన్దిస్తున్నట్లు ఉయ్యాల ఊగటం లో అంత రార్ధం .ఆమె సహగమనం చేసిన రెండు మూడు రోజులకే మాఘ శుద్ధ ఏకాదశి రావటం అదే భీష్మ ఏకాదశి కావటం ఆ రోజూ నుంచే ఉత్స వాలు ప్రారంబించటం జరుగు తోంది . చరిత్ర కాల గర్భం లో కలిసినా ,వీరమ్మ తల్లి మహిమలు నిత్య నూతనం .నమ్మిన వారికి నమ్మి నంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ .తిరునాళ్ళు  పదిహేను రోజుల్లో  ను ,ఉయ్యూరు లో ఏ  ఇంట్లోను    పసుపు దంచరు   ,కుంకుమ తయారు చేయరు  .ముందే  సిద్ధం  చేసు  కొంటారు  .కారం కూడా కొట్టరు .ఇవి స్వచ్చందం గా అందరు పాటించే నియమాలే .తిరునాళ్ళ లో అమ్మ వారికి సాధారణం గా   అందరు చీరే పసుపు కుంకుమ పెట్టటం అలా వాటు .అంతే కాక ఆ తర్వాత ఎవరింట్లో నైనా వివాహం లాంటి శుభ సందర్భాలు వచ్చి నప్పుడు కూడా చీరా సారే పెడుతుంటారు మెట్టి నింట్లో వున్న అమ్మ వారికి  ”.అమ్మ వారి చీరలు” అని ప్రత్యేకం గా అందరికి అందు బాటైన ధరలో ప్రతి వస్త్ర దుకాణం లో ను లభిస్తాయి .ఆమె పవిత్రత ను ఇలా తర తరాలుగా పాటిస్తూ ,నేటికీ నిల  బెట్టు కొంటు న్నారు ఉయ్యూరు ,పరిసర గ్రామాల వారు .అమ్మ వారి ఊరేగింపులో జనరేటర్ తో అమర్చే విద్యుత్ బల్బుల శోభ ఆకట్టు కొంటుంది .యాదవ కులస్తులు తిరునాళ్ళ రోజుల్లో వివాహాలు చేయరు .పెళ్లి అయిన వాళ్ళు కూడా ,ఆ పవిత్ర దినాలలో బ్రహ్మ చర్యం పాటించి ,వంశ ప్రతిష్ట ను నిల బెట్టు కొంటారు .బంధువులను పిల్చుకొని విందు భోజ నాలు ఏర్పాటు చేసు కొంటారు .అంతా పెళ్లి శోభ లాగా వుంటుంది .ఇప్పటికీ పారు పొడి వంశాస్తులే ఆలయ పూజార్లు .ఆలయానికి చాలా ఎకరాల పంట పొలాలున్నాయి . ఇదే వీరమ్మ తల్లి పుణ్య చరిత్ర...సర్వేజన సుఖినోభవంతు.
--(())--

10

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ