స్టోరీస్


పాట సందర్భంపై నా విశ్లేషణ.
**********
ఆమె ఏ పోలికకు అందని అపురూప లావణ్యవతి ఆమె అరువది నాలుగు కళల ఒకటై వికశించిన  విశ్వ సౌందర్య రూపవతి ప్రకృతి తో సమానంగా సర్వ సద్గుణాల దేవతలా
 సేవ గుణవతి ఒకటేమిటి  అన్ని తానై అన్నిటా తానై నిలచి అందరు తలచి   మనసుపారేసుకునేలా చేసే  నడిచివచ్చిన స్వర్గసీమ..
సద్గుణాల సచ్చీలుడు శ్రీరాముడు లాంటి వ్యక్తిత్వం గల అతడి లో  ప్రేమకు కారణమైన అపురూపవతి..  ఆమెను చూచిన అతనిలో ఔరా ఓ సౌందర్యమా అంటు ఆమెను వర్ణిస్తు ఇలా పాడుతున్న పాట..
****************
 పల్లవి:-
**** 
అరువది నాలుగు కళలున్న ఓ ఓ ఓ రూపవతి 
విశ్వసుందరివే విశ్వాన్ని ఏలె గుణవతి 
ఇరవై వసంతాలున్న మృదు మధుర మతి 
సౌందర్య లహరివే నాన్నవహించిన సతి 
                  !!అరువది నాలుగు కళలున్న !

తొలకరి పిలుపుకు తొలి అడుగులు కదిపి
తొలిసంద్య మలుపుకు మలి అడుగులు పలికి 
వడివడి నడకల  నవ్య నాయకి  తకధిమి తకజను
నృత్య కావ్య కన్యకా స్వాగతం సుస్వాగతం.!!

నా మది దోచినా  స్వప్న సుందరిలా
మల్లెపూల తీగవల్లే జాబిల్లి వెన్నెలల్లే 
నాజూకైన నడుములో తాజా రోజా పువ్వల్లే
వికశించావే వయ్యారి!!  కలలా కవ్వించావే కావేరి!!

సుమగంధాల సౌఖ్యాల  పూలతోటల్లే
విరబూసావే 
నా కోసమేనా నా కవనమాలికలో
ప్రాణమై నిలిచిపోయినావే ప్రాణేశ్వరి!!

అరువది నాలుగు కళలున్న ఓ ఓ ఓ రూపవతి 
నీ రూపుగా  ఆవిష్కరించుకున్న విశ్వసుందరి నా mati  mati    !!
చరణం:-
****
హరివిల్లు నే ఇల్లుగా చేసుకొన్నావులే
పసిమినే పట్టు  వస్త్రంగా ధరించుకున్నావులే
ఆకాశాన్నే ఆకర్షించావులే ఆశలెన్నో కల్పించావు లే
హంస వంటి నడకలతో  హృదయంలోని హింసనే ప్రాలద్రోలిన హృదయేశ్వరి!!

ఓ అందాల అపరంజి  లావణ్యమా
నా హృదయ సౌందర్య రస రంజితమా
దాసుడనయ్యాను నేను సుమా
నా కవితాక్షరాలకు కావ్యనాయకివి నీవే ఇక 
పారిజాత పుష్పమా!!
 పల్లవి:-
****
 అరువది నాలుగు కళలన్ని కలిపి
 నీ రూపుగా ఆవిష్కరించుకున్న విశ్వ సుందరి!!!
చరణం:-
***
తుషారం హుషారమై 
మయూరం  మోహనమై
ఆడుతున్న శుభసమయం 
నా మానసం మానస సరోవరమై
స్వచ్ఛమైన నీ రూపానికి 
అంకితమై నిను కోరినా కోమలి

రమణీయ భావనకు నీ సాంగత్యం  నా సాహిత్యానికి
వరాల వర్షం హర్షమై పలుకరించగా
సరాగాల రాగాల ప్రకర్షం ప్రకటించెనే...

భూమి ఆకాశాలు ఒకే రేఖాంశానా పయనం
శుభముహూర్తం 
సంస్కృతి సమున్నతికి  సంకేతం
సూర్యోదయం నిత్యానందానికి శుభసూచకం
కళాస్రవంతి కాంతులీను సంకాల్పానికి  శుభారంభం!!

రేపటి ఆశలు నిలుపు నేడు  బ్రహ్మోత్సవమే!!
కనుపాపలలో  నిలిచినా నీ రూపం అపురూపమే
నా మది పరమానందోత్సాహం 
నీ ఒడి లో ఒదిగి పాడుతున్న పరవశమై
ప్రణయగీతమే  ప్రియ పల్లవికి లయ నీవే  
మది గీతికకీ మాధుర్యం నీవే నీవే  నే నవ నాయకీ!!
పల్లవి:-
****
 అరువది నాలుగు కళలన్ని ఒకటై అరుదెంచి
 నీ రూపుగా ఆవిష్కరించుకున్న విశ్వసుందరి !!
*************


ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని నివారెల్లి గుహలలో అనంతపద్మనాభ స్వామి అలయం

 తెలుగు గడ్డపై అనంత పద్మనాభ భగవంతుడి విగ్రహం ఇక్కడ ఉంది.  ఆలయ రెండవ అంతస్తులో ఉన్న ఆనందపద్మ నభాస్వామి విగ్రహాన్ని కట్టిపడేశారనడంలో సందేహం లేదు.  విష్ణువు, గరుత్మంతుందు తపస్సు చేసేనశిల్పాలు ఉన్నాయి.  ఈ విగ్రహం ప్రత్యేకమైనది, ఇది కొండలోని ఒకే రాతి నుండి ఎటువంటి అతుకులు లేకుండా చెక్కబడింది.

--(())--

 ప్రేమ నిండిన మనసుకే సాధన  సాధ్యమౌతుంది !

జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలకు వెరచి విరక్తితోనో.. మరింత అనుకూలత కావాలనే అనురక్తితోనో... మనసు ఎంచుకునే సాధనల్లో శాంతిరాదు. అనుకూలత, ప్రతికూలతలు జీవితంలో సహజం అని తెలుసుకొని రెంటినీ అంగీకరిస్తూ ముందుకు సాగడం ద్వారా సాధన సఫలతనిస్తుంది. ప్రేమ నిండిన మనసుకే ఇది సాధ్యమౌతుంది. భగవంతునిపై ఇష్టంతో చేసే సాధనలోనే అలాంటి ప్రేమతత్త్వం ఇనుమడిస్తుంది. కోరికతో చేసే సాధన వల్ల మనసు అతి ఉత్సాహంగానో, నిరుత్సాహంగానో... మారి సత్యాన్ని తెలియనివ్వదు !

--(())-- 


శ్రీరమణీయం -(448)
🕉🌞🌎🌙🌟🚩

"చేస్తున్న పనికి, సంబంధంలేని ఆలోచనలు వచ్చి చికాకు కలిగిస్తుంటే ఎలా ?"

మనం ఏ పనిలో ఉంటే మనసు కూడా ఆ పనిలోనే నిలిపి ఉంచటం ధ్యానంతో సమానం అవుతుంది. కానీ మన ప్రస్తుత మానసిక స్థితి అలా లేదు. అందువల్ల ఎంతో ఒత్తిడి, ఆందోళన, అశాంతి మనసును ఆవరిస్తున్నాయి. అప్పటి పనులకు అవసరంలేని ప్రతి ఆలోచన మనసుకు భారమవుతుంది. ఒక గంట సమయం కేటాయించి మనకు వచ్చే ఆలోచనలన్నీ ఒక కాగితంపై వ్రాయగలిగితే రోజులో మనం ఎన్ని పనికిరాని (అప్పటికి అవసరంలేని) ఆలోచనలు చేస్తున్నామో తెలుస్తుంది. రెండు ఆలోచనల మధ్య అడకత్తెరలో పోకచెక్క చందాన మనసు కూడా నలుగుతోంది. ఒక పని జరుగుతూ ఉండగా అప్పటికే మనసు ఆ పనికి సంబంధించిన ఆలోచనతో ఉంటుంది. అప్పుడే మనసుకు మరో ఆలోచన గుర్తుకు రావటం వలన ఘర్షణ మొదలై శాంతి దూరమవుతుంది. అవగాహనతో అనవసర ఆలోచనలను విరమించుకుంటేనే పురోగతి ఉంటుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'అవసరం లేని ఆలోచనతోనే అశాంతి !'-
 

--(())--
శ్రీరమణీయం -(447)

🕉🌞🌎🌙🌟🚩

"మనసు ఘర్షణకు లోనుకాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి ?"

అవసరంలేని ఆలోచనలతోనే మనకు అశాంతి వస్తుంది. మన నిత్యజీవితం అంతా అనేక పనులతో ముడిపడి ఉంది. ఎవరు ఏ పని చేయాలన్నా అందుకు ఆలోచన అవసరం అవుతుంది. మనం ప్రస్తుతం చేయాల్సిన పనికి అవసరంలేని ఆలోచనలు మనసును కమ్ముకొని అశాంతికి కారణం అవుతుంటాయి. జరుగవలసిన పనికి అవసరమైన ఆలోచన మాత్రమే ఉంటే మనసు ఒత్తిడి లేకుండా ఉంటుంది. అప్పుడు ఏ ఘర్షణలేని ప్రశాంత స్థితిలో మనసు ఉంటుంది. ఒకే ఆలోచనలో ఉన్న మనసు ఏ ఘర్షణ లేకుండా ఉంటుంది. కనుక అలాంటి మానసిక స్థితిని ప్రసాదించే ఆధ్యాత్మిక చింతనను మనం ఇష్టపడుతున్నాం. ఇతర ఆలోచనలు లేకుండా భగవంతునిపై ఉంచిన మనసు ప్రశాంతతను పొందుతుంది. అలాగే కర్తవ్య నిర్వహణలో ఇతర ఆలోచనలు లేకపోయినా మనసుకు అదే ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంత స్థితిని ఎల్లప్పుడూ కొనసాగించటమే దివ్యజీవనం !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'అవసరం లేని ఆలోచనతోనే అశాంతి !'-

--(())--

☘శ్రీ పుత్ర గణపతి స్తోత్రం☘


శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి)


    ‘‘సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదంబ పార్వతీ దేవిని ఆనందింప డేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వారు

      ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ  చవితి యందు పఠించి నువ్వలుబెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకేవిధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి . జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చెను. అట్టి జగదంబ సమేత పుత్రగణపతి అనుగ్రహముపొందుటకు

ఈ స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశదోషములు తొలగి శక్తియుక్తలు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము. మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెను.


  అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.

శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వా యద్‌ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వం శరీరంతు శరీరిణామ్‌ ।। 1

శ్లో।। యచ్చాపి హసితం తేన దేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణ పృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2

శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తః కుమారో భాసయన్‌ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌ రుద్ర ఇవాపరః ।। 3

శ్లో।। ఉత్పన్నమాత్రో దేవా నాం  యోషితః సప్రమోహయన్‌ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యా రూపేణచ మహాత్మవాన్‌ ।। 4

శ్లో।। తద్‌ దృష్ట్వా పరమం రూపం కుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాం తమ పశ్యతభామినీ ।। 5

శ్రీ పరమేశ్వర ఉవాచ -

శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో గణేశ నామా చ భవస్య పుత్రః ।

ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।

ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6

శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు కార్యేషుచాన్యేషు మహానుభావాత్‌ ।

అగ్రేషు పూజాం లభతేన్యధాచ వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7

శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైః సమం కాంచన కుంభ సంస్థెః ।
 
జలై స్తథా సావభిషిక్తగాత్రో రరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8
 శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతు దేవాస్తం గణనాయకం ।

తుష్టువుః ప్రయతాః సర్వే త్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9

దేవా ఈచుః - 9

శ్లో।। నమస్తే గజవక్త్రాయ నమస్తే గణనాయక ।

వినాయక నమస్తేస్తు నమస్తే చండ విక్రమ ।। 10

శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రే నమస్తే సర్పమేఖహో ।

నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం- - కురు సర్వదా ।। 11

శ్రీ పార్వత్యువాచ -

శ్లో।। అపుత్రోపి లభేత్‌ పుత్రా నధనోపి ధనం లభేత్‌ ।

యం యమిచ్ఛేత్‌ మనసా తం తం లభతి మానవః ।। 12

శ్లో।। ఏవంస్తుత స్తదా దేవైర్మహాత్మా గణనాయకః ।

అభిషిక్తస్య రుద్రస్య సోమస్యా పత్యతాం గతః ।। 13

శ్లో।। ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వా భక్త్యా గణపతిం నృప ।

ఆరాధయతి తస్యాశు తుష్యతే నాస్తి సంశయః ।। 14

శ్లో।। యశ్చైతత్‌ పఠతే స్తోత్రం యశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా ।

నతస్య విఘ్న జాయన్తే నపాపం సర్వథా నృప ।। 15

((()))

🌹శ్రీ మాత్రే నమః🌹
ఈ రోజు నుండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 26 వ తేదీ నుంచి మార్చి 7 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా… ఈ నెల 28 వ తేదీన అలంకార వేడుకలను నిర్వహిస్తారు. మార్చి 3 వ తేదీన ఎదుర్కోలు, మార్చి 4 వ తేదీన తిరుకల్యాణం, మార్చి 5 వ తేదీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం, మార్చి 7 వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవం ముగుస్తుంది. ప్రధాన ఆలయ విస్తరణ పనులు జరుగుతుండటంతో బాలాలయంలోనే ఉత్సవాలను నిర్వహిస్తారు. మార్చి 2 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు యాదాద్రిలో సాంస్కఅతిక ఉత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. యాదాద్రిలో జరిపే నిత్యపూజల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చి 7 వ తేదీ వరకు శాశ్వత, మొక్కు కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు సహకరించాలని కోరారు.

--(())--


[శ్రీ మూకశంకర విరచిత  మూక పంచశతి
🔱 శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన🔱
🌹 పాదారవిందశతకం-శ్లోకం:భావము - 24
▪▪▪▪▪▪▪▪▪▪▪
శ్లోకము:-
కృతస్నానం శాస్త్రామృతసరసి కామాక్షి నితరాం
దధానం వైశద్యం కలిత రస మానందసుధయా |
అలంకారం భూమే ర్మునిజన మనశ్చిన్మయ మహా
పయోధే రంతస్స్థం తవ చరణరత్నం మృగయతే ||25||
▪▪▪▪▪▪▪▪▪▪▪
***********
భావము:
వేదాంత శాస్త్రంలో అవగాహనం చేసిన దేవీ చరణంరత్నం స్వచ్చత కలది‌ ఆనంద రసభరితమైనది. భువనానికి అలంకారప్రాయం అయినది. అయితే అది అందరికీ సులభమైనది కాదు. మునిజన మనస్సుల్లోని జ్ఞాన సాగరాంతర్గతం. దాన్ని ప్రయత్నించి పట్టుకోవాలి.


--(())--

[* అయ్యప్పస్వామి స్వరూపాలు

నారాయణుడు, పరమశివుడు ఇద్దరూ ఒక్కరే అని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్పస్వామి పూజలో శంకరునికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే, విష్ణువుకు ఇష్టమైన హోమమూ ఉంటుంది. తలపై ధరించే చంద్రునిముడిలో శంకరునికి సంబంధించిన మూడునేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ, నెయ్యి ఉండగా, పిన్ ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులుంటాయి. విష్ణువు స్థితికారుడు కాదా మరి! శంకరుని నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుఝామున స్నానం, చెప్పులులేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా, మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను తలపిస్తుంది.

పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్పస్వామి, ఎడమచేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహీనీ అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఒంటినిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే, ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తుంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునిది అయితే, తులసిమాల శ్రీహరికి ఇష్టం అయినది. అయ్యప్పస్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీకమాసంలో ప్రారంభమై, శ్రీహరికి ఇష్టమైన మార్గశిరమాసంలో ముగుస్తుంది.

అయ్యప్పస్వామి గుడికి ఉన్న పద్దెనిమిది మెట్లు, మోక్షము అనే మేడకు ఉన్న పద్దెనిమిది మెట్లు అని శాస్త్రవచనం. ఇంకా ఈ 18 మెట్లు గురించి మన పురాణాలు ఇలా చెబుతున్నాయి. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు (8), త్రిమూర్తులు (3), వారి భార్యలు (3), ఇంద్రుడు (1), బృహస్పతి (1), ఆదిపరాశక్తి (1), సూర్యుడు (1) అంటూ మొత్తం పద్దెనిమిది మంది, దివి నుండి భువికి దిగిరాగా, దేవాలయ ప్రతిష్ఠనాడు మృదంగ, భేరి, కాహళ, దుందుభి, తుంబురు, మర్దల, వీణ, వేణు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, దవళ, శంఖ, పటహ, జజ్జరి, జంత్ర, అనే 18 వాయిద్యాలను మ్రోగించారు.

శ్రితజనప్రియం స్వామి చించితప్రదం
శృతి విభూషణం స్వామి సాధుజీవనం
శృతి మనోహరం స్వామి గీతాలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే#స్వామియే శరణం అయ్యప్ప

--(())--



చద్దన్నం అంటే ఎక్కువ మందికి చిన్నచూపు. చద్దన్నం అంటే ఆ ఏం తింటాములే అన్నట్లుంటుంది. రాత్రి పూట మిగిలిపోతే పొద్దున్నే తినేదే చద్దన్నం అన్న సాధారణ అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నం తినాలని చెపుతోంది. ఎందుకో చూడండి..

చద్దన్నం ప్రయోజనాలు...
* అన్నం పులిస్తే ఐరన్, పొటాషియ్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది.
* ఉదా.. రాత్రి 100 గ్రాముల అన్నంలో 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే తెల్లారేసరికి 73.91 మిల్లీ గ్రాములు పెరుగుతుందట.. బీ6, బీ12 విటమిన్లు కూడా బాగా లభిస్తాయి.
* శరీరాన్ని తేలికగా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.
* శరీరానికి అవసరయ్యే బాక్టీరియా బాగా పెరుగుతుంది.
* అధిక వేడితో కడుపులో ఉండే దుష్పలితాలు తగ్గుతాయి.
* పీచు అధికంగా ఉండి మల బద్దకం, నీరసం తగ్గుతాయి.
* బిపి అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది.
* దేహాన్ని త్వరగా అలసిపోనివ్వదు. ఎక్కువ సమయం తాజాగా ఉంచుతుంది.
* అలర్జీ కారకాలను, మలినాలను తొలగిస్తుంది.
* పేగుల్లో అల్సర్లను తగ్గిస్తుంది.

చద్దన్నం ఇలా చేసుకోవచ్చు..
* రాత్రి వండిన అన్నాన్ని తెల్లవార్లూ మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
* రాత్రి వండిన అన్నాన్ని ఒక చిన్న గినె్నలో తీసుకుని అది మునిగేవరకూ పాలుపోసి నాలుగు మజ్జిగ చుక్కల వేస్తేతెల్లవారేసరికి ఆ అన్నం మొత్తం తోడుకుని పెరుగులాగా అవుతుంది.
* ఈ తోడన్నం లేదా పెరుగన్నానికి తాలింపు పెట్టుకోవటం. ఉల్లిముక్కలకు, టమాటో, క్యారెట్ లాంటివి కలుపుకోవటం చేయవచ్చు.
* ధనియాలూ, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని ఒకటి లేక రెండు చెంచాల పొడిని తీసుకొని తోడన్నం లేదా చల్లన్నం నంజుకొని తింటే దోషాలు లేకుండా ఉంటాయి.
* ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టికాహారం. బక్కచిక్కిపోతున్న వారు తోడన్నాన్ని, స్థూలకాయులు చల్లలో నానిన అన్నాన్ని తినడం మంచిది.

* ఉదయాన్నే తినాలి. ఆలస్యం అయితే మరింత పులిసి కొత్త సమస్యలు వస్తాయి..

****



మరణం తరువాత ఏమిటి? ఇది చాల మందికి ఉన్న సందేహం.

 మనం మనకు  శరీరం ఉన్నంతవరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంక బతికే ఉంటాను అని అనుకొని ఊరికే ఉండిపోతాము. ఇంకా కొందరు అయితే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకొని వెళ్లి ఉంటారని ఇలా ఎన్నో ఊహాగానాలు. కాని నిజంగా ఏమో మాత్రం ఎవరికీ తెలియదు.
ఈ మరణం తరువాత ఏమిటి అన్న సందేహానికి జవాబు  'కఠోపనిషత్తు' లో తెలుపబడింది. నచికేతుడు యమధర్మరాజును మూడు వరాలు అడుగుతాడు  అందులో ఒకటి మరణం తరువాత ఏమి జరుగుతుంది. అప్పుడు యమధర్మరాజు నచికేత ఇది చాల సూక్ష్మమైన విషయం. ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకోమని అంటాడు. కాని నచికేతుడు పట్టుబడుతాడు.నాకు మృత్యువు తరువాత ఏమి జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలి అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ నచికేత నీకు సనాతనము అయిన బ్రహ్మాన్ని గురించి మరియు చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాల సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుంది ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ వుంటాడు. అయితే తను ఏమి సాధించాలి నేను ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించడు. ఎదో మంచి జీవితం మంచి భార్యా తరువాత పిల్లలు వీటితోనే సతమతమవుతూ తాను  ఎందుకు పుట్టానో కూడ తెలుసుకునేంత సమయం లేదు. కాని ఎదో ఒక రోజు నువ్వు కాదన్న ఎవరు కాదన్న మరణం మాత్రం నీ వెనకే వుంటుంది, అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడ మనం గమనించే పరిస్తితులలో ఉండము.
మరణం తరువాత ఏమి జరుగదు. నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్ములించుకొని వుంటే నీవు (అంటే ఆత్మ) పరమాత్మునిలో అంటే పరమాత్ముని సాగరంలో విలీనం అవుతావు లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు (మంచి పనులు) చేసి వుంటే స్వర్గానికి లేక దుష్కర్మలు (చెడ్డపనులు) చేసి వుంటే నరకానికి వెళతావు. దీనిని ఎవరు ఆపలేరు.
ఒకవేళ నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే కొద్దిగలో కొద్దిగా తెలుసుకొని వుంటే నీకు మరల మనిషి జన్మ వస్తుంది అది ఒక మంచి యోగుల కుటుంబంలో.ఇందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జునకు వివరించాడు. అట్లా కాక సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనస్సును బుద్దిని అదుపులో వుంచుకొని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలను తొలగించుకొని నువ్వు విముక్తడవు అయి వుంటే మాత్రం నువ్వు (ఆత్మ) ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు.ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.
కాని మనకు తెలియదు మన కర్మలు అన్నియు అయిపోయినయో లేదో. కావున మనం మన ఈ స్తూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం వుంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల జన్మలు రావు అని మనం నిశ్చింతగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని సాధన(ధ్యానం) చేసి ఆ భగవంతునిని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. ఇది చేస్తే మనకు ఇంకా ఎటువంటి సందేహాలు వుండవు. అప్పుడు నీకు తెలియని విషయము అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అంటే అప్పుడు నీవు ఎవరు, దేవుడు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, అసలు ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సు ఏమిటి అన్న ప్రతి సందేహం తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనస్సు అనేదే లేదు, మనస్సు అనేదే ఒక భ్రమ అని . అది తెలుసుకోవాలంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ వాసుదేవున్ని (పరమాత్మను) మన హృదయంలో దర్శించుకోవడమే.
ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికీ మరల యేయే జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి వుంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేసిస్తాయి.

అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతునిని పొందడం అంటే జ్ఞానాన్ని గ్రహించి అతని తత్వాన్ని అందరికి తెలియపరచి ఆయనను నిరంతరం భక్తి శ్రద్దలతో స్మరిస్తూ ఆ దేవదేవునిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇదియే గమ్యం ఇదియే శాశ్వతం. అసలు మనం పుట్టింది కూడ ఇందుకే.
--//-- 


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ