స్టోరీస్




1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?

బ్రహ్మం

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?

దేవతలు

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?

ధర్మం

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?

సత్యం

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?

వేదం

6. దేనివలన మహత్తును పొందును?

తపస్సు

7. మానవునికి సహయపడునది ఏది?

ధైర్యం

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?

పెద్దలను సేవించుటవలన

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?

అధ్యయనము వలన

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?

తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?

మౄత్యు భయమువలన

12. జీవన్మౄతుడెవరు?

దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు

13. భూమికంటె భారమైనది ఏది?

జనని

14. ఆకాశంకంటే పొడవైనది ఏది?

తండ్రి

15. గాలికంటె వేగమైనది ఏది?

మనస్సు

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?

ఇతరులు తనపట్లఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో

అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తౄణం కంటె దట్టమైనది ఏది?

చింత

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?

చేప

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?

అస్త్రవిద్యచే

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?

యజ్ణ్జం చేయుటవలన

21. జన్మించియు ప్రాణంలేనిది

గుడ్డు

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది?

రాయి

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?

శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన

24. ఎల్లప్పుడూ వేగం గలదేది?

నది

25. రైతుకు ఏది ముఖ్యం?

వాన

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి

బంధువులెవ్వరు?

సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు

27. ధర్మానికి ఆధారమేది?

దయ దాక్షిణ్యం

28. కీర్తికి ఆశ్రయమేది?

దానం

29. దేవలోకానికి దారి ఏది?

సత్యం

30. సుఖానికి ఆధారం ఏది?

శీలం

31. మనిషికి దైవిక బంధువులెవరు?

భార్య/భర్త

32. మనిషికి ఆత్మ ఎవరు?

కూమారుడు

33. మానవునకు జీవనాధారమేది?

మేఘం

34. మనిషికి దేనివల్ల సంతసించును?

దానం

35. లాభాల్లో గొప్పది ఏది?

ఆరోగ్యం

36. సుఖాల్లో గొప్పది ఏది?

సంతోషం

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?

అహింస

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?

మనస్సు

39. ఎవరితో సంధి శిధిలమవదు?

సజ్జనులతో

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది?

యాగకర్మ

41. లోకానికి దిక్కు ఎవరు?

సత్పురుషులు

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?

భూమి, ఆకాశములందు

43. లోకాన్ని కప్పివున్నది ఏది?

అజ్ణ్జానం

44. శ్రాద్ధవిధికి సమయమేది?

బ్రాహ్మణుడు వచ్చినప్పుడు

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,

ధనవంతుడు, సుఖవంతుడు అగును?

వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో

46. తపస్సు అంటే ఏమిటి?

తన వౄత్బికుల ధర్మం ఆచరించడం

47. క్షమ అంటే ఏమిటి?

ద్వంద్వాలు సహించడం

48. సిగ్గు అంటే ఏమిటి?

చేయరాని పనులంటే జడవడం

49. సర్వధనియనదగు వాడెవడౌ?

ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు

50. జ్ణ్జానం అంటే ఏమిటి?

మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం

51. దయ అంటే ఏమిటి?

ప్రాణులన్నింటి సుఖము కోరడం

52. అర్జవం అంటే ఏమిటి?

సదా సమభావం కలిగి వుండడం

53. సోమరితనం అంటే ఏమిటి?

ధర్మకార్యములు చేయకుండుట

54. దు:ఖం అంటే ఏమిటి?

అజ్ణ్జానం కలిగి ఉండటం

55. ధైర్యం అంటే ఏమిటి?

ఇంద్రియ నిగ్రహం

56. స్నానం అంటే ఏమిటి?

మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం

57. దానం అంటే ఏమిటి?

సమస్తప్రాణుల్ని రక్షించడం

58. పండితుడెవరు?

ధర్మం తెలిసినవాడు

59. మూర్ఖుడెవడు?

ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు

60. ఏది కాయం?

సంసారానికి కారణమైంది

61. అహంకారం అంటే ఏమిటి?

అజ్ణ్జానం

62. డంభం అంటే ఏమిటి?

తన గొప్పతానే చెప్పుకోవటం

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును?

తన భార్యలో, తన భర్తలో

64. నరకం అనుభవించే వారెవరు?

ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,దానం చెయ్యనివాడు

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?

ప్రవర్తన మాత్రమే

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?

మైత్రి

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?

అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?

సుఖపడతాడు

69. ఎవడు సంతోషంగా ఉంటాడు?

అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు

70. ఏది ఆశ్చర్యం?

ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?

ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటినిసమంగా చూసేవాడు

72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు?

నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడైఎవరైఅతే ఉంటాడో వాని స్ధితప్రజ్ణ్జుడని ఆంటారు.


ఇంట్లో దీపం




రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి?
దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.
అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తిన్నేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.

ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టీ ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమా చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.) 

దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి.
ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.
తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ! మేము తమస్సు (చీకటి) నుంచి వెలుగులోకి వెళ్ళెదము గాకా.




















--(())_-

భగినీ హస్తభోజనం పర్వదినం

అపమృత్యు నివారకం( it prevents accidental deaths)
కార్తిక శుద్ధ విదియ రోజు విలక్షణ పండుగ గా జరుపుకుంటారు .యమ ద్వితీయ(భగినీ హస్తభోజనం) 


. ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. దీనినే భగిని హస్త భోజనం అంటారు.
ఈ పండగను భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకొంటారు. దీపావళి అయిన రెండో రోజు దీనిని చేసుకుంటారు. ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మిఠాయిలు తినిపించి, ఇష్తమైన పిండి వంటలతో భోజనం పెట్టి తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.

*భగిని హస్త భోజనం వెనుక కథ*

సూర్య భగవానుని కుమారుడు యముడు. ఆయన సోదరి యమి/ యమున. కార్తిక శుద్ధ విదియ పర్వదినాన యముడు యమున ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో యమున తన సోదరునికి హారతి ఇచ్చి, నుదట తిలకం దిద్ది సాదరంగా లోనికి ఆహ్వానిస్తుంది. యమునికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ వండి అన్నకి ఎంతో ప్రేమతో తినిపిస్తుంది. దీనికెంతో సంతోషించిన యుముడు ఆమెను వరం కోరుకోమనగా, ఏటా ఇదే విధంగా వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరుతుంది. అలాగే అంటూ యముడు వరమిస్తాడు. ఆ పర్వదినాన సోదరి చేతి వంట తిన్న వారికి అపమృత్యు భయం ఉండదని అభయమిస్తాడు. ఈ విధంగా *దీపావళి తరవాత వచ్చే రెండో రోజును భగిని హస్తభోజనం*
పర్వదినంగా జరుపుకొంటారు.


--((***))--


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ