ఈ వారం కధలు (1 to 10)
01. శ్రీ చక్రం మానవదేహం: యంత్రమంటే ఏమిటి? 02. పరమ శివునకు ఐదు ముఖాలు.....!!, 03. పదిశరీరాలుగా
4. ఒక గర్భవతైన భార్య కధ, 5. తృప్తి (గెలిచిన పందెం) కథ,6. సాలభంజిక కధలు -
7. ఆద్యాత్మిక కధ, 8. ఇది షార్టు షిలుం కధ, 9. *ఇంటికి దీపం ఇల్లాలు*
10. (చాలా చక్కటి గొప్ప నీతి కధ)
01. శ్రీ చక్రం మానవదేహం: యంత్రమంటే ఏమిటి?
ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.
యంత్రమంటే ఏమిటి:- యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.
అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.
ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.
నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే.
విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే 'ప్రకృతి' అని, 'పరాశక్తి' అని, 'అవ్యక్తం', 'శుద్ధమాయ' అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.
శ్రీ చక్ర ఆవిర్భావం:- ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్, చిత్, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.
కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను 'విమర్శ' (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు.
దీనినే "పరాబిందువు" అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.
శ్రీ చక్రం - పరాశక్తి వేర్వేరు కాదు
అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి.
1) శివశక్తులొకటిగా నున్న 'బిందువు', 2) అచేతనంగా ఉన్న 'శివుడు', 3) 'చేతనా స్వరూపమైన శక్తి'.
ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.
మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము ల
కు సమన్వయం కలుగుచున్నది.
పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.
శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.
02. 01. శ్రీ చక్రం మానవదేహం: యంత్రమంటే ఏమిటి?
ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.
యంత్రమంటే ఏమిటి:- యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.
అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.
ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.
నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే.
విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే 'ప్రకృతి' అని, 'పరాశక్తి' అని, 'అవ్యక్తం', 'శుద్ధమాయ' అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.
శ్రీ చక్ర ఆవిర్భావం:- ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్, చిత్, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.
కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను 'విమర్శ' (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు.
దీనినే "పరాబిందువు" అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.
శ్రీ చక్రం - పరాశక్తి వేర్వేరు కాదు
అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి.
1) శివశక్తులొకటిగా నున్న 'బిందువు', 2) అచేతనంగా ఉన్న 'శివుడు', 3) 'చేతనా స్వరూపమైన శక్తి'.
ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.
మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము ల
కు సమన్వయం కలుగుచున్నది.
పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.
శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.
03. ఒకేసారి పదిశరీరాలుగా తయారయ్యే యోగి
హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు.
ఉత్తర్ ప్రదేశ్ ఓడ్యానా నుండి పూర్ణంగిరి దేవి దర్శనానికి మహా అరణ్యంలో నలుగురు సాధువులం వెళుతున్నాము. అరణ్యం నుండి మాసినదేహంతో ఒక అవధూత వచ్చాడు పూర్తిగా దిగంబరంగా పొడవైన జడలతో ఉన్మత్తునివలె తనలో తాను నవ్వుకుంటూ వచ్చి ఎటువెళుతున్నారని అడిగెను. పూర్ణంగిరిదేవి వెళుతున్నామనగా ఈ దారికాదు ఆ దారిలో వెళ్ళండి నేను కూడా అక్కడికే వస్తున్నానని తెలిపెను. శారదానది ప్రక్క నుండి పొడవైన పర్వతం ఎన్నో మలుపులతో కూడిన శక్తిక్షేత్రం అది అని జవాబిచ్చిరి.
బాబా తమరితో మేము వస్తామని జవాబిచ్చాము మేము నలుగురము నాకు బాగా అనుభవం యోగులు ఏ రూపంలో వస్తారో ఎవ్వరికి తెలియదు, వారు ఎలాగైన సంచరిస్తారు వారిని నిర్లక్ష్యం చేయక సేవించాలి ఒకే దగ్గర గుహలలో, తపస్సులో ఉండవచ్చు లేదా ఎప్పుడు సంచరిస్తూ కూడా ఉండవచ్చు.
బాబా తమరి పేరు ? అవదూత్గిరి అనిరి బాబా.
మీరు జూన అఖాడ వారా ? అవును బేట. మా మడి రుద్రనాతి చౌదమడి.
బాబా నేను మీ పరివారం తేరాహ్మడిలో సన్యసించాను. మీర్జాపూర్ పరివార్ అనగా బైట చాలామంచిది. మీరు యువసాధువులు ఒకేచోట ఉండి కొంత తపస్సు చేశావు ఇంకా కొంత కాలం పాతస్థలం దగ్గరలో నీకో స్థలం ఏర్పడగలదు. మరికొంత కాలం తపస్సు చేయి నీ ద్వారా క్రియాయోగం వ్యాప్తి కాగలదు అనిరి. మీ ఆశీర్వాదం ఉండని బాబా అని సాష్టాంగంగా ప్రణమిల్లితిని. ఎంతో ప్రేమగా, అప్యాయంగా మాట్లాడిరి అవధూత గిరి మహరాజ్.
బాబా మీరు క్రియాయోగమే ఆచరిస్తారా, అవును నాయన నేను చేయని యోగములేదు అన్నీ చేసి సులువైన క్రియాయోగంలో మహా అరణ్యాలలో కూృరజంతువుల మధ్య ఎన్నో గుహలలో క్రియాతపస్సు చేశాను అని చెప్పిరి. మీరెక్కడ ఉంటారు, నేను ఎక్కడైనా ఉంటాను, ఎవ్వరికి చిక్కను, అర్థం కాను.
మీ వయస్సు ఎంత ? 130 సం||రములు
క్రియా ఎవ్వరి వద్ద తీసుకున్నారు. నేను జూన అఖాడలో సన్యసించినప్పటికి, ఒక యోగి ఆత్మకథలోని శ్యామాచరణుల శిష్యుడు ప్రణవానంద స్వామీజి నా చిన్నప్పుడే క్రియా దీక్షపొంది తీవ్ర సాధనలు చేశాను. క్రియా పూర్తిగా నేర్చుకోని జూన అఖాడలో సన్యాసం పొంది, అరణ్యాలలో, హిమాలయంలో అక్కడక్కడ క్రియాతపస్సు చేశాను. బాబా నేను కూడా జూన అఖాడలో సన్యసించాను. చమత్కార్ బాబాతో మరియు నిత్యానంద గిరి మహారాజ్ తో క్రియాదీక్ష తీసుకొని సాధన చేస్తున్నాను. తమరి దర్శనం చాలా ఆనందంగా ఉంది అన్నాను.
బాబాజీ మీ గురువుగారు రైల్వే ఉద్యోగం చేస్తూ సంసారం ఈదుతు, బాధ్యతలు తీరాక సన్యసించి, రెండు శరీరాలతో తిరిగేవారు కదా మీరు కూడా అలాగే ఏమైన తిరుగుతారా! నాయన పది శరీరాలతో కూడా తిరుగొచ్చు అది యోగికి పెద్దపని కాదు. ఆత్మజ్ఞానంకై ప్రయత్నించాలి సాధన ప్రారంభంలో సిద్దులొస్తాయి వాటిని పట్టించుకుంటే అక్కడే ఆగిపోతారు. కొత్త సాధకులైతే అహంకారంతో చెడిపోతారు.
మధ్యాహ్నం 2 గం||లవుతుంది సాధువులంతా ఆకలితో ఉన్నారు 2 రోజులైయింది అందరు భోజనం చేసి అప్పుడు బాబా కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మంచినీళ్లయిన త్రాగి వెళదాము అని ఒక సాధువు చెప్పగా అలాగే అని పురాతనమైన పెద్ద మర్రి వృక్షం కింద అరగంట కూర్చున్నాము, బాబతో మాట్లాడుతున్నాను మిగిలిన ముగ్గురు సాధువులు అలసినందున పడుకున్నారు. మర్రి చెట్టుకు ఎండిపోయి పుచ్చుపట్టిన పెద్దమండ పలపలమంటు విరిగి ముగ్గురు పడుకున్న సాధువులపై పడపోగ నేను కూడా మాటల్లో నిమగ్నమై అది గమనించలేదు. బాబా నాతో మాట్లాడుతూనే ఉన్నారు రెండో శరీరంతో కలిగింది బాబా మీరు కూడా మీ గురువు గారి వలెనె చాలా విచిత్రమైనవారు కదా అని ఆశ్చర్యపడిన అప్పుడు బాబా నీవు నానుండి లీలచూడాలని ఆశించావు సందర్భం వచ్చింది లీల జరిగింది అని బాబా జవాబిచ్చిరి. ప్రదర్శనకై ఏయోగి లీళలు చేయడు సందర్భాను సారంగా వారి నుండి లీళ జరిగిపోవును అది ఇతరులకు మేలుజేసేదిగా ఉండును, చాలా మంది అది చూసి వినోదించుదురు, ఆనంద పడుదురు అది యోగం యొక్క మహత్తు.
కొద్ది సేపులో చాలా ఆశ్చర్యం చూస్తావు అని నాతో సత్సంగంలో మాట్లాడుతూనే బాబా ఒక శరీరంతో పూర్ణంగిరి మాత దేవాలయం ముందు ఒకరు బండార అంటే అన్నదానం జరుపుతుండగా.
2వశరీరంతో అక్కడికి వెళ్ళి సాధువులు ఆకలితో ఉన్నారని నలుగురికి సరిపడ భోజనం అడగగా వారు ప్రేమతో ఇచ్చిరట బాబా తీసుకొచ్చిరి.
3వ శరీరంతో మా నుండి చాలా దూరంలో వస్తున్న ఒక మంచి భక్తుడి కారు పంక్షర్ కావడంతో చాలా స్పీడ్ లో ఉన్న కారు లోయలో పడపోగ కారును చేతితో ఆపి అందులో మహాభక్తురాలైన వృద్దురాలికి చేతి విరగడంతో వారితో సంభాషణ చేస్తుంది.
4వ శరీరంతో ఔషధంకై పోయెను.
5వ శరీరంతో కారు టైర్ పంక్చర్ చేయించుటకు వెళ్ళేను. సాధువులకు భోజనం మొదటి శరీరం వడ్డిస్తుంది.
6వ శరీరం శారదానదిలో నీరు తెచ్చుటకు వెళ్ళగా,
7వ శరీరం దారితప్పి ఇద్దరు సాధువులు అడవిలో పోతుండగా వారికి పూర్ణంగిరిదేవి యాత్రకు దారి చూపుటకు వెళ్ళింది.
8వ శరీరం అడవిలో చెంచువాని పై పులి అఘాయిత్యం చేస్తుండగా రక్షణకై వెళ్ళెను.
9వ శరీరం మర్రిచెట్టుతొర్రలో ధ్యానముద్రలో ఉంచిరి. అక్కడ ధ్యానముద్రలో ఉండి 9 సమస్యలు ఒకే సమయంలో మధ్యాహ్నం 3 గం||ల నుండి అరగంటలోపు అన్ని సమస్యలు పూర్తిజేసిరి.
అందరు చివరికి మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఈ బాబాజీయే మాకు సహాయం జేసెను అనగా నేను ఆశ్చర్యపోతిని. నలుగురి భోజనం 20 మందికి బాబా వడ్డించగా మిగిలింది. అప్పుడు బాబాజీని నేను అడిగాను బాబా మీరు నాతోనే సంభాషిస్తున్నారు ఇన్ని లీలలెలా చేయగలిగారు.? నేను మర్రిచెట్టు తొర్రలో ధ్యాననిమగ్నమై దివ్య దృష్టితో ఈ ప్రాంతంలో ఉన్న 9సమస్యలను చూస్తున్నాను. 9శరీరాలుగా మారి ఒక్కో సమస్య దగ్గరికి ఒకేసారి తొమ్మిది సమస్యలకు తొమ్మిది శరీరాలు సంకల్పం ద్వారా పంపి తొమ్మిది ఒకే సారి పూర్తి చేయించాను. ధ్యానముద్రలో ఉన్న శరీరములోని ఇచ్ఛా ప్రకారం అన్నీ కార్యాలు ఒకేసారి పూర్తయినవి. అప్పుడు అక్కడ ఉన్న సాధువులంతా బాబాని స్తోత్రాలు చేశాము.
జై అవధూతగిరి మహరాజ్ కి జై అంటు బాబా మీరు పదిశరీరాలతోనైన యోగి సంచరించగలడనే వాక్యంపై నాకు శ్రద్ద కలిగి అది చూడాలనే సంకల్పం కలగగానే మీరు తొమ్మిది మందికి సాయం జేసినట్టయింది. నేను మీ లీల దర్శించినట్టయింది అంటిని అక్కడుండే వారంతా ఎంతో సంతోషించి ఎవరిదారిన వారు వెళ్ళారు. బాబాతో మేము శారదానదిలో స్నానం చేసి ఆ రోజు రాత్రంతా పూర్ణంగిరి పర్వతంపై క్రియాధాన్యంలో తెల్లవార్లు నిమగ్నమయినాము. 12 గంIIల సేపు సా|| 6 నుండి ఉII 6 గంటల వరకు క్రియాధ్యానంలో నిమగ్నమైనాము.
అప్పుడు నాలో నేను మహాశూన్యావస్థలోకి వెళ్ళాను. అందులో ఒక చుక్కలాంటి తెల్లని కాంతి పెరుగుతూ పెరుగుతు మహాకాంతియుక్తంగా మారింది. నక్షత్రంలో చంద్రుడిలా పూర్తి తెల్లగా మారింది. అలాగే అరుణోదయ సూర్యునిలాగ ఉండి కాంతి పెరుగుతూ మధ్యాహ్న సూర్యుడిలాగ మహాకాంతియుక్తంగ మారి అందులో పూర్ణంగిరి మాత దర్శనం జరిగెను. తర్వాత పరమ శివుడు త్రిశూల దారియై కైలాసంలో తపోదీక్షలో ఉండి ఆశీర్వదించినట్టు దర్శనం జరిగి తర్వాత ఆ కాంతి రకరకాలు పెరుగుతూ ఎంతో తన్మయత్వం పొందుతూ చివరికి కోటి సూర్యుల ప్రకాశం కోటి చంద్రుల శీతలం శాంతిని ప్రసాదించేలాగ వివరించలేని బ్రహ్మానందరూప పరమ శాంతిరూప ఆనందం తన్మయత్వం కలిగెను.
అప్పుడు శరీరం తనంతగా తాను, గాలిలోకి పైకి లేచి ఉంది. శరీరం ఉన్న భావన తెలియుట లేదు. ఆ కోటి సూర్యుల తేజమొక్కటే తనను తాను చూసినట్టుగా అనిపిస్తుంది. అదే నేను అయితే, నా శరీరమేది ఇన్ని రోజులు నా శరీరం అనుకునే శరీరంను నేను కాన, అయ్యో ఎంత విచిత్రం, మాయా ప్రభావంచే ఇన్ని రోజులు ఈ శరీరమే నేననుకొంటిని శరీరానికి నేను వేరై స్పష్టంగా శరీరమును చూస్తున్నాను. ఇక ఈ శరీరంపై నాకెందుకు మోహం అనే భావనలు ఉదయిస్తున్నాయి అదే స్థితిలో ఉన్నాను. బాబాజీ నేను పూర్ణంగిరి దేవి పర్వతం ఆవల ఒక గుహలో రహస్యంగా ఉండి ధ్యానంలో ఉన్నాము. మూడు రోజులు ధ్యాన నిమగ్నంలో ఉన్నాను. మూడవ రోజు బాబాజి శారదా నది తీర్థం ఒక బిందెడు తలపై పోసి తలపై బాగా మర్దన చేసి ఓం అని నిర్వికల్ప సమాధి సే ఉటో తేరాజౄ ధన్యహే దత్తదిగంబర్ అనిరి. ఒక గంట తర్వాత నెమ్మదిగా కల్లు తెరచి చూశానట.
అప్పుడు బాబా ఇదే నిజం నాయన తక్కినదంతా మిథ్యా నీవు తప్ప ఈ సృష్టిలో నీకేది కనిపించలేదు, అదే సత్యం కనిపించేవన్నీ కల్పితాలు. అదే స్థితిలో జీవితాంతము గడుపుమనిరి. బాబా నన్నేమిచేశారు అని అడుగగా నీ ఆజ్ఞయ చక్రంలో నా బొటన వ్రేలుంచి నొక్కినాను నీవు ధ్యానావస్థలో ఉన్నప్పుడు నీకు తెలియలేదు. నా సంకల్పం నీ పూర్వ కఠోర సాధన నీ 3 సం||రాల మౌన క్రియాతపస్సు నీ చిన్న నాటి సాధనలు నీవు ఈ స్థితి చేరుటకు ప్రతి ఒక్కటి సహాయమాయెను. ఎవ్వరు ఎవ్వరికి ఏది కలిగించలేరు. వారి వారి పూర్వ సాధనలు ఉంటేనే యోగులు కొంత సహకరిస్తారు.
12 సం||రాలు శ్రీ రామక్రిష్ణులు తపస్సు చేయగా తోతాపురి దిగంబర్ నాగబాబా శక్తిపాతం చేయగ, 4 రోజులు నిర్వికల్ప సమాధిలో ఉండెను. ఆయన 12 సం||రాలు తపస్సు తోడైయింది. అలాగే ఏ సిద్ద పురుషులు శక్తిపాతం చేసినగాని వారి వారి పూర్వతపస్సు ఉంటేనే సిద్ది ప్రాప్తి లేనిచో లేదు అని అవధూతగిరి బాబా చక్కటి విషయాలు తెలిపిరి. వారికి కృతజ్ఞతలు తెలిపి సాష్టాంగ ప్రణామాలర్పించి పూర్ణంగిరి దేవికి స్తోత్రాలు, ప్రణామాలర్పించి బాబాతో మూడు రోజులు గడిపితిని. నాయన నీవు తిరిగి వెళ్ళు నీ స్థానంలో తపస్సు చేస్తూ అందరికీ క్రియా దీక్షలిస్తు నిస్వార్థంగా సమాజ సేవజేయి నా ఆశీర్వాదం నీకెప్పుడుండును అని నేనిప్పుడు బయలుదేరాలి ఎక్కడ ఇన్ని రోజులుండను నీకై ఉంటిని ధైర్యంగా ఉండి నీవు పొందిన అనుభూతిని స్మరిస్తు ఉండు ఎప్పుడూ ఇదే స్థితిలో ఉండు శుభం అనిరి.
4. ఒక గర్భవతైన భార్య కధ
ఒక గర్భవతైన భార్య, ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు..
భార్య: ఏం అనుకుంటున్నావ్..?
అబ్బాయి పుడతాడనా ?
అమ్మాయనా..??
భర్త:అబ్బాయనుకో...
వాడికి లెక్కలు నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం...
స్విమ్మింగ్ నేర్పుతా...
చెట్లెక్కడం నేర్పుతా...
అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో
నేర్పుతా... ఇంకా....
భార్య: చాలు చాలు!
మరి అమ్మాయి పుడితే..!?
భర్త: అమ్మాయైతే
ఏం నేర్పనవసరంలేదు...!
అదే నాకు నేర్పుతుంది...
నేనేం తినాలి...
ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి...
ఏం మాట్లాడకూడదు...
నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి...
ఒక రకంగా మా అమ్మ లాగా అన్నమాట...
ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది...
నన్నెవరైనా బాధపెట్టారనుకో, వాళ్ళని అస్సలు క్షమించదు...
ఎదురు తిరుగుంది...
భర్త దగ్గర కూడా నాగురించి గొప్పగా చెప్తుంది...
మా నాన్న నాకోసం అది చేసాడు...
ఇది చేసాడు అనీ...
భార్య: సో..అమ్మాయైతే ఇవన్నీ చేస్తుంది...
అబ్బాయైతే చేయడంటారు అంతేగా..??
భర్త: కాదు..
అబ్బాయైతే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు...
అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయ్...
భార్య:
అదేం శాశ్వతంగా మనతోనే ఉండిపోదు కదా..!
భర్త: ఉండదు...
కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం...
అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు..!
అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు...
కూతురంటే కూడికల, తీసివెతల లెక్క కాదు నీ వాకిట్లో పెరిగే 'తులసి మొక్క'...
కూతురంటే దించేసుకొవలసిన బరువు కాదు..
నీ ఇంట్లో వెలసిన 'కల్పతరువు'...
కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు...
నీ కడుపున పుట్టిన మరో "అమ్మ"...
కూతురంటే కష్టాలకు,కన్నీళ్ళకు వీలునామా కాదు ...
కల్మషం లేని 'ప్రేమ' కు చిరునామా...
కళ్యాణమవగానే నిన్ను విడిచివెళ్ళినా...
పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టమెచ్చినా...
తన ఇంటి పేరు మార్చుకున్న కడదాక వదులుకోదు పుట్టింటి పైన ప్రేమను...
కొడుకులా కాటి వరకు తోడురాకపోయినా...
అమ్మ అయి నీకు ప్రసాదించగలదు మరో జన్మ...
కూతురున్న ఏ ఇల్లు అయినా అవుతుంది..
దేవతలు కొలువున్న కోవెల...
కూతురిని కన్న ఏ తండ్రి అయినా
గర్వపడాలి యువరాణి ని కన్న మహారాజు లా..
🙏🙏🙏🙏🙏🙏🙏
5. తృప్తి (గెలిచిన పందెం) కథ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్ళాడు.
గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.
ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.
అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యో పాపం అని బాధపడ్డారు. "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు. "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు.
బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా.
వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.
వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు.
భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు"
వేటగాడు : "ఆవు కూడా గాడిదకు మారకం వేశా"
భార్య : "కట్టెలు అడివినుంచి మోసుకు వస్తుందిలే" అంది తృప్తిగా.
వేటగాడు : "గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకొన్నా"
భార్య : "అడవుల్లో రాళ్లు, రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా"
వేటగాడు : "అవి కూడా ఉంచుకో లేక టోపీకి మారకం వేసినా"
భార్య : "సరేలే మావా ఆ టోపితో అందంగా ఉంటావు"
వేటగాడు : "కానీ వస్తావుంటే నేను వంతెన మీద పడితే టోపి జారి నీళ్లలో పడ్డది"
భార్య : "పోతే పోయిందిలే మావా! నీవు పడిపోకుండా వున్నావు, అంతా అడవి తల్లి దయ" అని తృప్తిగా ముద్దు పెట్టుకుంది.
గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను విమర్శించకుండా, ఎత్తిపొడుపు మాటలు అనకుండా, భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంది.
ఎగతాళి చేద్దామనుకున్న బాటసారులు ఆ వేటగాడి భార్య మంచి మనసుకు సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయారు.
* * * * * *
మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార సంబంధాలుగా పరిణమిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సంభాషణ వినగలమా!
కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి చివరకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలేవి జీవితంలో జరిగే కొన్ని మంచి సందర్భాలే.
అందుకే, ఏ ఒక్కరిని తొందరపడి ఏం అనకండి. కన్ను చెదిరితే, గురి మాత్రమే తప్పుతుంది. మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పు తుంది. ఎగతాళి చేసేవారికి కాలమే సమాధానం చెబుతుంది.
ప్రతికూల సందర్భంలో కూడా పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నిద్దాం.
(తప్పకుండా చదివి ఇతరులకు పంపండి.) మంచిసందేశం....
--(())--
6. సాలభంజిక కధలు -
"చతురంగతజ్ఞ"
"32 సాలభంజికలు 32 కథలు" చెప్పి భోజరాజుని సింహాసనాన్ని అధిష్టించకుండా అడ్డుకున్నాయని చెప్పుకన్నాం కదా? ఐతే వాటిలో ఒక కథ ఇప్పుడు చెప్పుకుందాం.
విక్రమార్కుడు ఒకనాడు నిండు కొలువులో సభ తీరి ఉన్న సమయంలో అక్కడికి ఒక కవీంద్రుడు వచ్చాడు. అతడు మహా పండితుడు, సకల భాషా కోవిదుడు, సంస్కృత ప్రాకృత చతుర్విధ భాషా విశారదుడు. అందువల్ల మన విక్రమార్కుడిని నాలుగు భాషల్లో దీవించి ఆసనం మీద కూర్చుని, తనని తాను పరిచయం చేసుకున్నాడు. అదెలా అంటే?
ఓ రాజేంద్రా! నా పేరులో ఆరు అక్షరాలుంటాయి. అందులో మొదటి అక్షరం తీసివేస్తే నేను "అశ్వవేదినౌతాను"
రెండక్షరాలు వదిలిపెడితే "నాట్యకర్తనౌతాను"
మూడక్షరాలు తీసేస్తే "గతవిదుడనౌతాను"
నాలుగక్షరాలు విడిచి పెడితె "నేర్పరినౌతాను"
ఐదు అక్షరాలు వదిలిపెడితే "బుధుడనౌతాను"
అన్ని అక్షరాలు కలిపి చదివితే "బుద్ధిబలమున్న వాడినౌతాను"
ఇది కేవలం నేతిబీరకాయ చందాన చెప్పటం కాదు, నువ్వు అన్ని విద్యలలోను ఆరితేరినవాడివి గనుక నాపేరు తెలుసుకోగలవు అని విక్రమార్కుడిని ప్రశ్నించి అడిగాడు.
అందుకు సకల విద్యా పారంగతుడైన విక్రమార్కుడు నవ్వి "ఓ కవీంద్రా !మీ పేరు "చతురంగతజ్ఞుడు" అని చెప్పాడు.
అందుకు ఆ కవీశ్వరుడు విక్రమార్కుని మేధా శక్తికి అబ్బురపడి "ఓ రాజా! తారతమ్యాలు తెలియకుండా నీ ముందు ఎవరైన పండితులమని భ్రమించటం హనుమంతుని ముందు కుప్పి గంతులు వేసినట్టే అవుతుంది. అందుచేత నన్ను మన్నించు. నీ కీర్తి ప్రతిస్టలు భూనభోంతరాలల్లో ప్రతిధ్వనిస్తున్నాయి" అని వేనోళ్ళ పొగడగా అందుకు విక్రమార్కుడు సేవకులను పిలిచి ఆ పండితుని పలుకులకు, కవిత్వానికి, మాటలకు, నవ్వులకు వేలు లక్షలు కోట్ల కొలది దానధర్మాలిచ్చి పంపించాడు. ఈ విధంగా తన ఔదార్యాన్ని నిరూపించుకుని రాజ్యమేలాడు.
ఐతే మనం అతని పేరులోని ఒక్కొక్క అక్షరమే తీసేసి చూద్దాము.
మొదట "చ" తీసేస్తే "తురంగతజ్ఞ" (అశ్వవేది).
ఇప్పుడు "తు" తీసేస్తే "రంగతజ్ఞ"(నాట్య కర్త).
ఇప్పుడు "రం" తీసివేస్తే "గతజ్ఞ" (గతవిదుడు).
మళ్ళీ "గ" తీసేస్తే "తజ్ఞ" (నేర్పరి).
ఇక "జ్ఞ" అంటే బుధుడు.
అన్ని కలిపి చదివితే "చతురంగతజ్ఞ" అన్న మాట.
'ఓ భోజరాజా! నీవు విక్రమార్కుడి మేధాశక్తికి సరి సమానమయినవాడివని అనుకుంటే, ఈ సింహాసనాన్ని అధిరోహించు! "అంది. భోజ రాజు మౌనంగా వెనుదిరిగాడు.
--(())--
7. ఆద్యాత్మిక కధ
సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
యద్భావం తద్భవతి!
ఒక సన్యాసి, దేవుడి కోసం తపస్సు చేశాడు. అతడి దీక్ష ఫలించి దేవుడు ప్రత్యక్షమై- మూడుసార్లు అతను మనసులో ఏది తలచుకుంటే అదే జరుగుతుందనే వరమిచ్చాడు. వెంటనే ఆ సన్యాసి సకల సదుపాయాలతో ఒక రాజభవనం లాంటి భవంతి కావాలనుకున్నాడు. వెంటనే భవంతి ప్రత్యక్షమయింది. అందమైన యువతితో వివాహం జరగాలి అనుకున్నాడు. అదీ జరిగింది. ఒక్కసారిగా సంప్రాప్తించిన సుఖభోగాలకు తట్టుకోలేని ఆ వ్యక్తి 'కొంపదీసి ఇవన్నీ మాయమవుతాయా!' అనుకున్నాడు. అంతే, తక్షణం ఆ సన్యాసి తన పూర్వపు స్థితికి వచ్చేశాడు.
మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఫలితాలు అలానే ఉంటాయనేది ఈ కథలోని నీతి.
ఈ భావాన్నే శ్లోకం రూపంలో 'యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాతృశి' అన్నారు వేదాంతులు.
మృతుల్ని బతికించే మృత సంజీవనితోపాటు పిచ్చిమొక్కలు, విషపుమొక్కలు కూడా నేలతల్లినుంచే ఉద్భవిస్తాయి. అలాగే మంచి ఆలోచనలతోపాటు చెడుతలంపులకూ మానసిక క్షేత్రమే కేంద్రబిందువు. మంచి ఆలోచనలు ఆచరణలో పెడితే మానవాళికి మహోపకారం. చెడు ఆలోచన కలిగించే ఫలితాలతో మానవాళికి మారణహోమం. ఒక మంచి తలంపు మనిషికి జీవం పోస్తే ఒక చెడు ఆలోచన ప్రాణం తీస్తుంది. మంచి ఆలోచనల విలువ అపారం. అది వెలకట్టలేనిది.
ఒక వూళ్ళో పాపయ్య, పోచయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరిని మించి ఇంకొకరు గొప్పవాళ్ళయిపోవాలనే దురాశతో దేవుడు ప్రత్యక్షం కావడం కోసం దీక్ష చేపట్టారు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొమ్మన్నాడు, ముందుగా పాపయ్యను. తన శత్రువు పోచయ్య ఏం కోరుకుంటాడో దానికి రెట్టింపు ఇమ్మన్నాడు పాపయ్య. తరవాత దేవుడు పోచయ్యకు ప్రత్యక్షమయ్యాడు. పాపయ్య కోరుకున్నదేమిటో తెలుసుకొని పోచయ్య తన కన్ను ఒకటి తీసెయ్యమన్నాడు. అలా తన శత్రువైన పాపయ్య రెండుకళ్ళు పోగొట్టాడు పోచయ్య. మనం చెడిపోయినా ఫరవాలేదు, తోటివాడు మాత్రం బాగుపడకూడదనే పాశవిక ఆలోచనలు ఎంతటి దుష్ఫలితాలు కలిగిస్తాయో ఈ కథ తెలియజేస్తుంది. 'చెరపకురా చెడేవు' అనే సామెత ఇలాగే పుట్టింది.
మనం ఇతరులకు ఏమి ఇస్తామో, అదే మనకు దక్కుతుంది. ఆనందం ఇస్తే ఆనందం, బాధ కలిగిస్తే బాధ. ఈ లోకం నుంచి ఏది కావాలని కోరుకుంటామో అదే లోకానికి ఇవ్వాలి. మనం కోరుకున్నదే మనకు దక్కుతుంది. 'యద్భావం తద్భవతి'. మనం శుభం జరగాలని మనసా వాచా కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది. అంచేత అందరికీ మంచే జరగాలని కోరుకుందాం. సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదప్రవచనాన్ని మననం చేసుకుందాం.
సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు!
--(())--
8. ఇది షార్టు షిలుం కధ ఎవరన్నా తీస్తానికి వస్తే సహకరిస్తా (రావణా )
ఇందులో పాత్రలు తల్లి శాంతమ్మ, తండ్రి హరిశ్చంద్రుడు, కొడుకు శ్ర్రావణ కుమారుడు, కూతురు సావిత్రి, మనవుడు రావణుడు, మనవరాలు సూర్యాకాంతం
ఇక కధ చవండి
అమ్మో అమ్మో బాబు నవ్వు తున్నాడు అన్నాడు తాత, ఏమిటండి ఆమాటలు ఒకవైపు శాంతంగా ఏడుస్తుంటే, అమ్మా ఏడుపులో కూడా నీకు శాంతం కనిపించిందా, అదికాదండి ఏడుస్తున్నా డంటే భయపడు తారని, రావణుడని ఏంపేరు పెట్టారో లేదో ఒకటే అరవటం కదా
ఎవ్వరూ పెట్టని పేరు పెట్టాలని పెట్టాము కదే , అది అరుపో ఏడుపో ఇప్పుడే అర్ధం కావటంలేదు
ముందు ఏడుపు మానే మార్గం కనుక్కోవే ముందు అబ్బాయి వస్తే కష్టం, మరి ఏంచేద్దాం మీరే చెప్పండి, వీడి ఏడుపుకు ఊళ్ళో ఉన్న అందరూ వస్తారేమో, అందుకనేగా ఏడుపుకు అర్ధం కనుక్కో
వోరై ఏడుపు మానరా
ఏడుపు మానను అని గట్టిగా అరిచాడు రావణుడు
పక్కింటావిడ వచ్చి అమూల్ పట్టండి, మా అమ్మోమ్మ కాలం నుండి అమూల్ పడతారు
వీడేవన్నా చిన్నపిల్లోడా పాలు పట్టడానికి
వీడికి ఇంకా పది నిండలేదు కదా
అవునమ్మా అవును, ముందు పిల్లవాడి ఏడుపు గురించి అడగండి, కుట్టరానిచోట చీమకుట్టి ఏడుస్తున్నాడేమో
మెం మా అబ్బాయి ఏడుపును ఆపిస్తాం,
అంతగా వినలేకపోతే చెవిలో దూది పెట్టుకోండి
అంత నిష్టూరం అక్కర్లేదు, మీ అబ్బాయి ని కొట్టుకుంటారో మరేంచేస్తారో మాకెందుకు
ఆమాత్రం ఇంకిత జ్ణానం ఉన్నట్లయితే మీరెప్పుడూ రాకండి
రావణా ఏమిటిరా నీ ఏడుపుకు కారణం
ఏమీలేదు ఆ చందమామ కావాలమ్మా
అది అందని ఎత్తులోఉంది, ముందు నిద్దరపో తెల్లారిటికల్లా తీసుకొస్తా అన్నది అమ్మోమ్మా
ఇంకా ఏడుపు పెంచాడు
తాత వచ్చి కొన్ని లక్షల మైల్ల దూరంలౌ ఉంది
అది నీదగ్గరకు తేవటం కష్టం అన్నాడు
అయినా నాకనవసరం నాకు అదే కావాలి
అప్పుడే తండ్రి వచ్చి మీరందరూ ఆగండి
క్షణం లో వాడి ఏడుపు మాన్పిస్తాను
అంటు వాడి గదిలో పెట్టి లైట్లు తీయండి వెంటనే ఏడుపు మానుతాడు
గదిలో పెట్ట గానే పెద్దగా ఏడవటం మోదల పెట్టాడు
కొడుకు టార్చీ లైటు తెచ్చి చందమామ వెలుగు పడేటట్లు ఉంచి మిగతా భాగం నల్లటి గుడ్డను కప్పి వెలుగును మంచంపై వేశాడు, ఆవెలుగే చందమామని సంబరపడి నిద్దర పొయ్యాడు
ఈరోజు నిద్దుర పొయ్యాడు మరి రేపు ఏడిస్తే ఎట్లాగురా
రేపు చూద్దాం ఇప్పుడు ఆ ఆలోచన వదలండి అసలే నిద్దర వస్తుంది నాకు
సూర్య కిరణాలకు కలువ పువ్వులు విచ్చు కున్నట్లుగా రావణుడు కిల కిల నవ్వుతున్నాడు
ఓరి బడుద్దాయి ఎంత గొడవ చేసావురా రాత్రి అన్నది చెల్లెలు సూర్యకాంతం మహా చెప్పవులేవే నీవు గొడవ చేయ నట్లుగా నీలాగా ఏడ్చి సాధించుకొను నేను, నా పద్దతే వేఱు
అవునే ఒక్క నవ్వుటప్ అందరిని బుట్టలో పడేస్తావ్ నేను దానికి వ్యతిరేకత యే కదా
దానికి పెద్ద తేడా ఏముంది
ఏముందా ఈ ఏడుపు మొహానికి నవ్వు విలువ అసలు తెలిస్తేగా అప్పుడే తండ్రి రావటం మీరిద్దరు ఒక్కరిగా ఉండాలి అదెంటినాన్న అట్లా అంటావ్ నేను ఆడ పిల్లను వాడు మగాడు సరే సరే స్నేహితులుగా ఉండండి
నాన్న సెల్ కొనిపెడతానన్నావ్, ఎప్పుడు తెస్తావ్ నీ ఏడుపు మొహానికి అదికూడా దండగే
నాకు ఏడుపు చెప్పఁకుండా వస్తుంది నాన్న అది నాతప్పా తప్పా తప్పున్నరా
నాకు ఆఫీస్ పనివుందిజాగర్తగా ఆడుకో, ఎవ్వరిని కొట్టి ఏడిపించకు, నువ్వు ఏడవకు
అట్లాగే నాన్న ఏమిటిరా కన్నా ఇంకా నిద్దరపట్టట్లేదా లేదమ్మా చందమామ తేస్తేగాని నిద్ర పట్టుటలేదమ్మా ఇప్పుడెక్కడ చందమామ తేవాలిరా కావాలమ్మా నాకు చందమామ అంటూ ఏడుపు లంఖించుకున్నాడు మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు వెంటనే కొడుకు శ్రవణ కుమార్ ఆమె నివ్వేమి గాబరా పడకు వాడి ఏడుపు తగ్గిన్స్హ్ ఏర్పాటు సహసను చూడు ఎం చేసావురా కిటికీ దగ్గరా అద్దంలో చంద్రబింబం పడేటట్లు ఏర్పాటుచేసి, దానికి దగ్గరలో మంచివేసి దానిమీద రావణుని పడుకోబెట్టాడు
అంతే ఏడుపుమాని చంద్రబింబం చూస్తూనిద్రపొయ్యాడు రావణుడు ఇదేం బుద్ది రా వీడిది
ఏమోనమ్మా నాకే తెలుసు రేపటి గురించి ఆలోచించుకో ఎం చెయ్యా లో
నీకొడుకు ఏడుపు తగ్గించటానికి,
ఇంకా ఉంది
9. *ఇంటికి దీపం ఇల్లాలు*
*ప్రేమకు ప్రతి రూపం ఇల్లాలు*
*పుట్టినింటికి మెట్టినింటికి వెల్గు నిచ్చేది ఇల్లాలు*
*కోడలే అత్తింటికి అసలు కాంతి*
*కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది ధర్మం ...!!!
*ఎందుకోతెలుసా...!!!
*చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!!
*కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యన్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు...!!!
*తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!!
*తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి పచ్చిపుండులా మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే
"జీ హుజూర్" అంటూ అత్తింటి సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!!
*అందుకే కాఁబోలు సీతమ్మ అశోకవనంలో శోకిస్తున్నప్పుడు కూడా తమ వనవాసానికి కారణమైన మామ దశరథుడిని తక్కువ చేసి ఎన్నడూ మాట్లడలేదు,
పైగా మీరెవరని హనుమ అడిగిన ప్రశ్నకి దశరథుడి కోడలినని చెప్పిందే తప్ప జనకుడి బిడ్డనని చెప్పలేదు, ఇది ఉత్తమ కోడలియుక్క నిష్ఠ...!!!
*కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మకోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరిగంతులేస్తాడు ఆ కోడలి యొక్క మామ. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మయే కోడలు...!!!
*కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం "నాంది శ్రాద్ధం" పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి...!!!
*పెళ్లి అయ్యాక ఏడుస్తున్న పెళ్లికూతురిని చూసి ఇప్పుడు నీకెవరు దిక్కు మీ నాన్నయా.? అని ఎవరయినా అడిగితే "న న" (కాదు కాదు) అంటుంది. పెంచి పెద్దచేసిన నాన్న ఇప్పుడు 'నన' అయ్యాడు.
మరి ఎవరు దిక్కు అంటే , చేయి పట్టుకున్న భర్తపేరును కూడా చెప్పక "మా...! మా...! అయ్యా...!" అంటూ సమాధానమిస్తుంది. ఇదివిన్న పెళ్ళికొడుకు తండ్రికి మామయ్యా అని పిలిచినట్లనిపించి, ఎవడ్రా నాకోడలిని ఏడిపిస్తున్నది అని గర్జిస్తాడు.ఇక అప్పట్నుంచి కోడలిని బిడ్డలా కాపాడతాడు మామయ్య...!!!
*ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంది, ఎందుకోతెలుసా ...???
కోడలే అత్తింటి గృహలక్ష్మి...!!!
-(())--
10. (చాలా చక్కటి గొప్ప నీతి కధ)
రావణసంహారం
అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి
చేరుతాడు. “అమ్మా ఇకపై ఈ లంకా రాజ్యాన్పి ఏలేది విభీషణుడే. రావణ సంహారం
జరిగినది. మీరు ఇక్కడి నుండి బయలుదేరేముందు ఒక్క ఆఙ్ఞ ఇవ్వండి తల్లి..
మిమ్ములను ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరిని
సంహరిస్తాను”అంటాడు.
అప్పుడు ఆ మహాతల్లి హనుమా! నీకు ఓ కధ చెబుతా విను. ఒకానొక కాలంలో ఓ బాటసారి అడవిగుండా వెలుతున్నాడు. ఇంతలో ఆకలిగొన్న ఓ పులి తనపైకి రాబోగా తన ప్రాణాలను అరచేతబట్టుకుని పరుగులు పెడతాడు. పులికూడా వెంబడిస్తుంది. ఇంతలో ఓ చెట్టు పైకి ఎక్కి ఆ చెట్టుకొమ్మను ఆశ్రయిస్తాడు. అయితే బాటసారి వున్న కొమ్మ పై కొమ్మలో ఓ ఎలుగుబంటి వుంటుంది. అది చూసిన పులి “ఇదిగో మిత్రమా ఆ మనిషిని కిందికి తోసేయ్.. తినేసి వెల్లిపోతాను” అంటుంది.
వెంటనే ఎలుగు “ఇతడు నేను వున్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే కనుక నేను అతన్ని రక్షిస్తాను కాని కీడు చేయను” అనడంతో పులి నిరాశ చెందుతుంది. అయినా ఆ రోజంతా మనిషి దిగకపోడా అంటూ ఎదురు చూస్తుంది. రాత్రి అవుతుంది. ఎలుగు గాఢ నిద్రలో వుంది. కాని మనిషికి ప్రాణ భయం ఒకటి వుంది కాబట్టి చూసీ చూడనట్టు క్రిందనున్న పులి వైపు చూస్తాడు. పులి మెల్లగా ఇలా అంటుంది “ఇదిగో ఓ మనిషి నీకో గొప్ప అవకాశం. పైన నిద్రలో వున్న ఆ ఎలుగును తోసెయ్ నేను నా ఆకలి తీర్చుకుని ఇక్కడి నుండి వెళ్లిపోతాను” అంటుంది. అంతే మనిషి మారు ఆలోచన చేయకుండా ఎలుగును తోసేస్తాడు. వెంటనే కోలుకుని ఎలుగు వేరొక కొమ్మను ఆనుకుని కింద పడకుండా ఆపుకుంటుంది. అప్పుడు పులి.. ఎలుగుతో ఇలా అంటుంది “చూశావా ఈ మనిషి బుధ్ది ఇప్పటికైనా వాడ్ని తోసెయ్ నేను తినెల్లిపోతాను” అంటుంది.
అప్పుడు
ఎలుగు ఇలా అంటుంది “చూడు మిత్రమా.. ఇతడు నన్ను ఆశ్రయించాడు. ఇతడిని
రక్షించడం.., అపకారికి కూడా ఉపకారము చేయడమే ధర్మం” అంటూ అనడంతో ఇక లాభం
లేదని పులి అక్కడినుండి వెల్లిపోతుంది.
ఇదీ కధ..
కనుక
హనుమా మనకు వీరు అపకారము తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనులయిన ఈ జాతికి
హాని చెయ్యటం అక్కర్లేని పని మరియు అధర్మం కూడాను అనడంతో... అమ్మ మాటలకు
ముగ్ధడయిన హనుమ మోకరిల్లి నమస్కరిస్తాడు.
శత్రువులో కూడా శతృత్వాన్ని ఎంతవరకో అంతవరకే చూడాలి కాని ధర్మాన్ని వీడకూడదన్నది అమ్మ మాట. అందుకే అమ్మ మాట ఆచరిద్దాం.
--((***))--
--((***))--
Comments
Post a Comment